09-09-2022, 11:16 PM
Awesome update
సుబ్బిగాడు ≠ World Famous Lover
|
10-09-2022, 09:19 AM
enter the dragon.... Subbu alias shubash time to become a hero
11-09-2022, 04:22 PM
Thankyou all
11-09-2022, 04:22 PM
కారు వేగంగా వెళుతుంది వెనక ఫాలో అవుతున్న వాళ్ళని నా వేగంతో తొక్కేసాను, ఇక ఇలా కాదని హైవే మీద నుంచి ఊర్లోకి పోనించి నల్ల పంపు దెగ్గర ఆపాను.
మానస : ఏమైంది? సుబ్బు : ఏంలేదు కారుని గుర్తు పట్టేస్తున్నారు అందుకే స్పెషల్ డిజైన్ చేద్దామని. మానస : ఎం చేస్తావ్? సుబ్బు : నువ్వు ఆవారా సినిమా చూడలేదా? మానస : చూసాను. సుబ్బు : అదే చేస్తున్న అని నీళ్లు మొత్తం కింద పోసి ఆ బురద కారు మీద చల్లాను.. ఎర్రటి కారుని బురద రంగులోకి మార్చి.. మానసని చూసాను. మానస : నా కారు.. సుబ్బు : కారు కావాలా ప్రాణం కావాలా మానస : నాకు నా విక్రమ్ కావాలి. సుబ్బు : వాడెవడు? మానస : ఓయి రెస్పెక్ట్.. నా లవర్. సుబ్బు : లవరా... అంటే నీది లవ్ ప్రోబ్లమా? మానస : అవును.. ఓయి ఏమైంది? సుబ్బు : కళ్ళు తిరుగుతున్నాయి.. కొంచెం ఆ నీళ్లు ఇలా మొహం మీద పొయ్యి. మానస కొన్ని నీళ్లు తీసుకుని సుబ్బిగాడి మొహం మీద కొట్టింది.. సుబ్బు లేచి నిరాశగా మానసని చూసాడు. మానస : ఏమైంది? సుబ్బు : ఎం లేదు అని కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు.. మానస పక్కన కూర్చుంది కానీ, ఏదో అయ్యింది అని అనిపించింది సుబ్బిగాడి వైపు చూసి అడిగింది. మానస : ఏమైంది ఇప్పటిదాకా బానే ఉన్నావ్, బాగా మాటలు చెప్పావ్ ఇప్పుడేమో సైలెంట్ గా ఉన్నావ్ సుబ్బు : నీకు లవర్ ఉన్నాడని ముందు చెప్పుంటే అస్సలు వచ్చేవాడిని కాదు నేను.. మానస : నవ్వి ఎందుకలాగా, కొంపదీసి నన్ను లవ్ కానీ చెయ్యట్లేదు కదా సుబ్బు : ఇందాకటి వరకు చేసాను కానీ ఇక డ్రాప్, నిన్ను వదిలేసి ఇంకో అమ్మాయిని చూసుకుంటాను. మానస : ఏంటి ఇంతలోపే నన్ను ఇష్టపడ్డావ్ మళ్ళీ అంతలోపే ఇంకో అమ్మాయిని వెతుక్కుంటా అంటున్నావు.. ఎలాగో చాలా దూరం వెళ్ళాలి నీ గురించి చెప్పు. సుబ్బు : తల పైకి ఎత్తు....... Doooooooooomdeeeeeeeeeeemdaaaaaaaaamdamaaaaaal dishkiyaaam dozendozen dhoom3 dhruvaips.................. అయిపోయింది కథ తల దించు.. అది జరిగింది. మానస : హహ... హహ.. భలే ఉన్నావే విచిత్రంగా.. అయితే మీ తాతయ్య వాళ్ల చేతిలో తన్నులు తిని ఇక అక్కడ ఉండకూడదని డిసైడ్ అయ్యావ్ అన్న మాట.. సుబ్బు : కాదు, అస్సలు కథ దాని తరువాతే మొదలయ్యింది.. ఒక అమ్మాయి నన్ను దారుణంగా మోసం చేసింది, నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఏడ్చానొ నాకే గుర్తులేదు అలాంటిది నా కంట్లో నుంచి నీళ్లు తెప్పించింది. మానస : ఎవరు? సుబ్బు : శరణ్య.. నా మరదలు. మానస : ఏమైంది?
11-09-2022, 06:12 PM
సబ్బిగడినే ఏడిపించింది అంటే ఎదో గట్టిగానే చేసింది.....ఎం చేసిందో.....మీ తరువాతి అప్డేట్ కోసం వేచిచూస్తుంటాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు |
« Next Oldest | Next Newest »
|