Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
వొళ్ళంతా దెబ్బలతో , తల - చేతులు - కాళ్ళ నుండి రక్తం కారుతున్న నాదగ్గరికి అదే చీకటి గదిలో ఉన్నవారు వచ్చి ఎవరు నాయనా నువ్వు ఇంతగా కొట్టేలా ఎలా సహించావు , అపద్ధం చెబితే సరిపోయేది కదా అంటూ గాయాలకు పసరు ఉంచుతున్నారు .
ఆ దెబ్బల నొప్పిలో కళ్ళు మూతలు పడటం వలన వాళ్ళెవరో కూడా కనిపించడం లేదు - దాహం దాహం అనడంతో నీటిని తాగించారు .
నాయనా ...... రేపు ఉదయానికల్లా దెబ్బలు మానిపోవాలి ఎందుకంటే కనికరం - దయా దాక్షిణ్యాలు లేనటువంటి పోటీల కోసమే కాదు కాదు బానిసలను కిరాతకంగా చంపి ఆనందించడం కోసమే తయారుచేసిన రాక్షసుల్లాంటి సైనికులతో " మల్ల యోధుల పోటీలు " మొదలయ్యేది రేపే ...... మనలాంటి అమాయకులను బానిసలుగా మార్చి వాళ్ళ ముందు చావడానికి ప్రవేశపెడతారు , రోజుకోకటి చొప్పున అటువంటి మూడు బృందాలతో పోటీపడి గెలిస్తేనే మనం ప్రాణాలతో బయటపడేది , ఇప్పటివరకూ తొలిరోజున తొలి బృందంతోనే పోటీలు ఆగిపోతున్నాయట ......
మరొక బానిస : అంటే .......
మొదటి బానిస : రేపే మన ప్రాణాలు ఊహించని ఘోరమైన రీతిలో గాలిలో కలిసిపోబోతున్నాయి , అలా మూడు పర్యాయాలు అంటే మూడు సంవత్సరాలు రాక్షసుల్లాంటి సైనికులతో గెలిస్తేనే మనకు స్వేచ్ఛను ప్రసాధిస్తారని - కోరిన కోరికలను తీర్చి రాజ్యంలో ఉన్నత బాధ్యతలు ఇస్తారని తెలిసింది .
మరొక బానిస : ఇప్పటివరకూ ఎవరైనా అలా స్వేచ్ఛను పొందారా పెద్దాయనా ........ ? .
మొదటి బానిస : మొదటి రోజునే దాటలేదు అంటుంటే స్వేచ్ఛ దగ్గరికి వెళ్లిపోయావా నువ్వు , మనమైనా కళ్లతో చావును చూసి చావబోతున్నాము ఇతగాడిని అయితే మన పైనున్న క్రీడా ప్రదేశంలోకి లాక్కెళ్లి పడేస్తారు , ఎక్కడ పుట్టాడో ఏమిటో ఇక్కడ ఇలా చావు రాసిపెట్టుంది ఏమీచెయ్యలేము - మూడు రోజులైన తరువాతైనా పెట్టుబడి ఉంటే తదుపరి పోటీలు అంటే మరొక సంవత్సరం వరకూ బ్రతికేవాడు పాపం .......
మరొక బానిస : అవును పెద్దాయనా ...... ఒంట్లోనుండి సగం రక్తం కారిపోయింది ఈ దెబ్బలను తట్టుకుని ఉదయానికల్లా స్పృహలోకి రావడమన్నది అసాధ్యం - ఈ ఒక్క రాత్రికి ప్రశాంతంగా కుటుంబాన్ని తలుచుకుంటూ నిద్రపోతాను అంటూ భయపడుతున్నారు , పెద్దాయనా ...... ఇక్కడినుండి తప్పించుకోలేమా ? .
మొదటి బానిస : అసాధ్యం నాయనా ...... , ఈ చీకటి కారాగారానికి ఉన్నది రెండే దారులు ...... ఒకటి మనల్ని తీసుకొచ్చి పడేసినది మరొకటి పైనున్న రాక్షస క్రీడా స్థలానికి , అడుగుపెడితే చాలు కాపలా కాస్తున్న సైనికుల నుండి వంద బాణాలు ఒక్కసారిగా మనలోకి దూసుకుపోతాయి అప్పటికీ ప్రాణం ఉంటే సైనికులు వచ్చి .......
మరొక బానిస : వద్దు వద్దు పెద్దాయనా చెప్పకండి చెప్పకండి , రేపు సూర్యోదయం వరకైనా బ్రతుకుతాను అంటూ గజగజవణికిపోతున్నట్లు స్వరం మారిపోయింది .
మొదటి బానిస : సైనికుల కంటే రాజు మహా క్రూరాతి క్రూరుడు , మనలాంటి వాళ్ళ చేతులు - కాళ్ళు - తలలు ఎగిరిపడి రక్తం పొంగుతుంటే చూసి తెగ ఆనందిస్తాడు - ప్రజలు కూడా అంతే , నిన్నటి సంవత్సరం పైన క్రీడా స్థలంలో ప్రజలలో ఒకడిగా చూసి బాధపడ్డాను - ఈ సారికి నేనే ఇలా బలైపోతున్నాను అంటూ కన్నీళ్ళతో మూలకు చేరాడు .
చీకటి కారాగారంలో ఉన్న అన్ని గదులలోని బానిసలలో చావు భయం ......

మూడేళ్లు ..... , మూడేళ్లు నా ప్రాణానికి - మంజరికి దూరమయ్యాను అంటూ కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు , కొరడా దెబ్బల నొప్పి ఒంటికి తెలిస్తే ఈ వార్త హృదయంలో - మనసులో అంతులేని నొప్పిని కలగజేస్తోంది . రాక్షసులతో పోటీలకు భయపడను కానీ మూడేళ్లు మూడేళ్లు ...... నా ప్రాణమైన మహికి దూరమవ్వాల్సిందేనా అంటూ బాధతో విలవిలలాడిపోతున్నాను , స్వేచ్ఛను పొందడానికి ఇదొక్కటే మార్గమైతే పోరాడతాను మహీ పోరాడతాను మహీ పోరాడతాను మహీ - గురువుగారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అంటూ కలవరిస్తూనే స్పృహకోల్పోయాను , మధ్యలో మళ్లీ ఒకసారి దాహం దాహం అనడంతో నాతోపాటు ఉన్నవారు తాగించారు - ఇక ఏదీగుర్తులేదు .
***************

చంపేయ్ చంపేయ్ అంటూ వందల మంది సంతోషపు కేకలు - భయంతో ఆర్తనాదాలు వినిపించడంతో ...... 
మహీ ...... అంటూ లేచికూర్చున్నాను - కొద్దిగా పడుతున్న సూర్యకిరణాల వెలుగులో గదిలో చుట్టూ చూస్తే ఒక్కడే ఉన్నాడు - ఒకవైపు భయంతో వణుకుతూనే ...... చావుదెబ్బలు తిన్నా ఎలా లేచాడబ్బా అన్నట్లు ఆశ్చర్యంతో చూస్తున్నాడు .
దాహం తీర్చినందుకు కృతజ్ఞుణ్ణి సోదరా ...... అంటూ లేవబోతే గొలుసులతో బంధింపబడి ఉన్నాను .
బానిస : కొద్దిసేపటి ముందు భటులు వచ్చి మనిద్దరికీ గోలుసులువేసి పెద్దాయనను లాక్కెళ్లారు .
కష్టమైనా లేచి సూర్యకిరణాలకు వందనం చేసుకున్నాను .

అంతలో ఇనుప ద్వారం తెరుచుకుని నలుగురు భటులు లోపలికివచ్చి నా పాదాలకు వేసిన గోలుసులను మాత్రమే తొలగించారు , కొద్దిసేపట్లో పైన రాజు గారు - ప్రజల సమక్షంలో భయంకరమైన చావు చావబోతున్నావు అంటూ రాక్షసానందం పొందుతున్నారు - రాజువని మిడిసిపడ్డావుకదా నీ వీరత్వం ఏమిటో క్రీడా స్థలంలో చూయించు అంటూ వెక్కిరింతగా నవ్వుకుంటున్నారు .
తోటి బానిస : భటులారా ...... అతగాడు ఇంకా మీరుకొట్టిన దెబ్బల నుండి తెరుకోనేలేదు - అతడిని వదిలి నన్ను తీసుకెళ్లండి అంటూ లేవబోతే తోసేసి కాళ్లతో క్రూరంగా కొట్టారు .
నేనెవరో తెలియకపోయినా నేనేమీ కాకపోయినా .....నాకోసం ప్రాణాలను సైతం లెక్కచెయ్యని అతడివైపు చూస్తున్నాను .
భటులు : ఏరా బానిసా ...... త్యాగం చేస్తున్నావా ? , వీడికి - నీకు చావు సమయంలో ఏమాత్రం తేడా ఉండదులే తదుపరి లాక్కెళ్లేది నిన్నే అంటూ మళ్లీ కొట్టి నన్ను తోసుకుంటూ పైకి తీసుకెళ్లారు - చేతులకు వేసిన గొలుసులను తీసేసి చేతికి సగం విరిగిపోయిన మొండి ఖడ్గాన్ని అందించి వెళ్లి చావరా అంటూ ఇనుప ద్వారం వైపుకు తోసారు .

ఎదురుగా రక్తపు మడుగులో పోరాడుతున్న మధ్య వయస్సులోని బానిస - పెద్దాయన చెప్పినట్లుగానే ఆరడుగుల రాక్షసుడి లాంటి వొళ్ళంతా కవచాలతో ఉన్నటువంటి సైనికుడు ...... ఆబానిస వొళ్ళంతా కత్తి గాట్లు పెడుతున్నాడు - తీక్షణంగా చూస్తే ఆ మధ్య వయసు వక్తి ఎవరోకాదు నిన్న నాకు వైద్యం చేసిన పెద్దాయన - పెద్దాయన వొళ్ళంతా రక్తంతో చావు కేకలువేస్తూ నావైపుకు దీనంగా చూసారు .
చుట్టూ వందల్లో కాదు వేళల్లో ప్రజలు అందులో సగం మందికిపైనే చంపేయ్ చంపేయ్ అంటూ లేచిమరీ భయంకరమైన క్రీడను ఆనందిస్తున్నారు .
పెద్దాయన కళ్ళల్లో ఏమీ చెయ్యలేనన్నట్లు ధీనపు వ్యధతో నావైపుకు చూస్తూనే కష్టంగా అడుగులువేస్తున్నారు .
పెద్దాయనా .......
అంతలో ఎదురుగా అటువైపు మందు పానీయాలలో మునిగితేలుతూ జల్సాలకు అలవాటుపడిన రాజు చేతిలో పానీయంతో లేచి చంపేయ్ అంటూ సైగలతో ఆదేశాలను ఇచ్చాడు .
అధిచూసిన సగం మంది ప్రజలు మరింతగా కేకలువేస్తున్నారు - చంపేయ్ చంపేయ్ చంపేయ్ ........
ఆజ్ఞ మహారాజా అంటూ రాక్షసుడి రూపంలోని సైనికుడు రాక్షస నవ్వులతో పెద్దాయన వైపుకు అతిపెద్ద ఆయుధంతో వస్తున్నాను .
రేయ్ వద్దు వద్దు ..... పెద్దాయనా పెద్దాయనా ...... అంటూ ఇనుప ద్వారాన్ని ముందుకూ వెనుకకు తోస్తున్నాను .
చావడానికి అంత తొందర దేనికిరా బానిస అంటూ వెనకనుండి ఇద్దరు మోకాళ్లపై కొట్టడంతో మోకాళ్లపైకి పడిపోయి పెద్దాయనా తొందరగా అంటూ విశ్వప్రయత్నం చేస్తున్నాను .
అంతే వెనకనుండి ఒక్కవేటు పడటంతో నా చేతిని స్పృశించి నాముందే నేలకొరిగిపోయారు .
పెద్దాయ ...... అంటూ అక్కడితో మాట ఆగిపోయింది .
రాజు - ప్రజల రాక్షస కేకలతో రాక్షస క్రీడా ప్రాంగణం హోరెత్తిపోతోంది . శభాష్ వీరుడా ....... అంటూ అభినందించి రాక్షసానందం పొందుతున్నాడు రాజు - చుట్టూ ఉన్నవాళ్లు ప్రభూ .... మీరు తయారుచేసిన వీళ్ళతో పోటీపడేవాళ్ళు భువిపైననే లేరు అంటూ రాజుకు తాళం వేస్తున్నట్లు మరింత సంబరాలు చేసుకుంటున్నారు - మరొక పోటీ అంటూ సంకేతం ఇచ్చాడు - సాగానికిపైనే ప్రజలు ఉర్రూతలూగిపోతున్నారు - రాజు నినాదాలతో హోరెత్తిస్తున్నారు .

మహారాజుగారూ ...... వెళ్లి మీ వీరత్వం ఏమిటో క్రీడా సంగ్రామంలో చూయించండి అంటూ లేపి ఇనుప ద్వారం తాళాలు తెరిచి తోసారు .
పెద్దాయనా పెద్దాయన అంటూ నావైపుకు తిప్పగానే నా చేతుల్లోనే ప్రాణాలను వదిలారు .
ఆ రాక్షస సైనికుడు మాత్రం తనతో సమానమైనవాడిని చంపినట్లు ప్రజల దగ్గరకువెళ్లి గట్టిగట్టిగా కేకలువేస్తూ వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు - ప్రజలు కూడా వాడికి బ్రహ్మరథం పడుతున్నారు - మరొక క్రూరమైన పోటీకోసం ఎదురుచూస్తున్నట్లు కేకలతో హోరెత్తిస్తున్నారు .
రాజు సైగచెయ్యడంతో ...... దండోరా మొదలయ్యింది . 

పెద్దాయనను రెండుచేతులతో ఎత్తుకుని వెళ్లి గోడకు ఆనించి కూర్చోబెట్టాను .
చావడానికి సిద్ధంగా ఉన్నావారా బానిస అంటూ వెనకనుండి వీపుపై కత్తివేటు పడింది .
అమ్మా ...... అంటూ మోకాళ్లపైకి చేరాను .
రక్తం చిందడం చూసి చుట్టూ ప్రజలంతా ఉర్రూతలూగిపోతున్నారు - చంపేయ్ చంపేయ్ ...... అంటూ కేకలువేస్తున్నారు .
రాజుకూడా ఆజ్ఞ ఇవ్వడంతో ........ రాక్షస సైనికుడు రాక్షస నవ్వులతో పెద్దాయనను చంపిన ఆయుధాన్ని పైకెత్తాడు .
అంతే ప్రక్కనే పడిన మొండి కత్తితో ఆయుధాన్ని ఎత్తిన రాక్షస సైనికుడి చేతులు ఆయుధంతో పాటు నేలరాలేలా చేసాను .
వాడు వేస్తున్న కేకలకు క్రీడా ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దన్గా మారిపోయింది - రాక్షసానందం పొందుతున్న రాజు మరియు పరివారం అంతా ఊహించని హఠాత్ పరిణామాన్ని అలా కళ్ళప్పగించి చూస్తుండిపోయారు .
అంతవరకూ ఇలాంటి పోటీలు నిర్వహిస్తూ అమాయకులైన వారిని హింసించి మరీ చంపుతున్నారని బాధపడుతూ నిశ్శబ్దంగా ఉన్న సగం మంది ప్రజలు ఒక్కసారిగా లేచి వీరుడా వీరుడా ...... అలాంటి రాక్షసుణ్ణి చంపేయ్ చంపేయ్ అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
రాజుకు కోపం వచ్చినట్లు నలుగురిని దించమని చేతివేళ్ళతో ఆజ్ఞ వేసాడు .

దండోరా మ్రోగడంతో ఎదురుగా ఉన్న పెద్ద ద్వారం తెరుచుకుంది , అందులోనుండి చూస్తేనే భయపడేటటువంటి ఆకారాలు గల నలుగురు రాక్షసుల్లాంటి వారు రెండు చేతులతో క్రూరమైన ఆయుధాలు - వలను పట్టుకుని నావైపుకు వస్తున్నారు .
అప్పటివరకూ నాకు మద్దతు ఇస్తూ సంతోషంతో కేకలువేస్తున్నవారు నిశ్శబ్దం అయిపోయారు - హింసను ఇష్టపడేవారు లేచి నీపని అయిపోయింది బానిసా అంటూ రకరకాల సైగలుచేస్తూ కేకలువేస్తున్నారు . 
యోధుల్లారా ...... వాడి అంతు చూడండి అంటూ రాజు కోపంతో ఊగిపోతూ సింహాసనం నుండి లేచి చివరకు వచ్చి నిలబడి వీక్షిస్తున్నాడు పానీయం సేవిస్తూ .........

రాక్షసుల్లాంటి యోధులు నలుగురూ నా చుట్టూ చేరి రాజు ఆజ్ఞకోసం ఎదురుచూస్తున్నారు ఆయుధాలను తిప్పుతూ .......
ఇంకేంటి చూస్తున్నారు ఆ బానిసను చిత్రహింసలు పెట్టిమరీ చంపేయ్యండి - మన సైనికుడి చేతులనే తెగ నరుకుతాడా అంటూ కోపంతో ఊగిపోతున్నాడు రాజు .
ఆజ్ఞ ప్రభూ అన్నట్లు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నలుగురూ చుట్టూ కదులుతూ ప్రజలకు ఉత్సాహం వచ్చేలా రాక్షస కేకలువేస్తూ ఒకడు నా ఛాతీవైపుకు బల్లెంతో దాడి చేశాడు . 
వొంగి తప్పించుకోగానే మిగిలిన ముగ్గురు గొడ్డలి - సుత్తి - ఖడ్గము లతో ఒకరితరువాత ఒకరు దాడిచేశారు .
అన్నింటినీ చాకచక్యంతో తప్పించుకోవడంతో నాకు మద్దతు తెలిపిన ప్రజలలో కొద్దికొద్దిగా ఆశలు చిగురిస్తున్నట్లు వీరుడా వీరుడా జాగ్రత్త అంటున్నారు .
రాక్షసుల్లాంటి నలుగురికి కోపం వచ్చినట్లు ఒకేసారి దాడిచేస్తూ వలతో పాదాలను లాగడంతో కిందపడ్డాను .
ఒక్కసారిగా ప్రజలతోపాటు రాజు మరియు పరివారం చంపేయ్ చంపేయ్ అంటూ ఉత్సాహంతో కేకలువేస్తున్నారు .
మొండి కత్తితో ఒకడి ఆయుధాన్ని అడ్డుపెట్టగానే వెనకనుండి మరొకడు వీపుపై కత్తితో దాడిచెయ్యడంతో రక్తం చిందింది .
ఆ ఆ ....... వాడి ఆయుధాన్ని తోయగానే మరొకడు వచ్చి కాలితో తన్నడంతో ఎగిరి దూరంగా పడ్డాను - మోకాళ్లపైకి లేవగానే ముఖంపై పిడి గుద్దు గుద్దడంతో నోటిలోనుండి రక్తం చిందిస్తూ భూతల్లి ఒడిలోకి పడిపోయాను అమ్మా అని కేకవేసి .........
నేను రక్తం చిందించిన ప్రతీసారీ రాజు - సగం మంది ప్రజలు రకరకాల హింసాత్మక సైగలతో ఉర్రూతలూగిపోతున్నారు .
మళ్లీ మోకాళ్లపైకి లెహానో లేదో వెనకనుండి సుత్తిని రెండుచేతులతో అడ్డుగాపెట్టుకుని కర్రతో తలవెనుక బలంగా కొట్టడంతో నేలకొరిగాను .
హ హ హ ...... అంటూ రాక్షసనవ్వులతో రాజువైపుకు తిరిగి విజయ నినాదాలు చేస్తున్నారు - ప్రజలను మరింత ఉద్రేకపరుస్తున్నారు .
చిత్రహింసలు పెట్టినది ఇకచాలు చంపేయ్యండి - మనల్ని ఎదురించినవాడికి ఇదే గతి అంటూ ఆజ్ఞ వేసాడు రాజు .......
అవును చంపేయ్ చంపేయ్ అంటూ క్రీడా స్థలం అంతా హోరెత్తిపోతోంది .
నాలానే తదుపరి చంపడానికి తీసుకొచ్చినట్లు నాతోటి బానిసతోపాటు బానిసలంతా ఇనుప చువ్వల ద్వారం వెనుక వద్దు వద్దు అంటూ బాధపడుతున్నారు .

నేను ఓడిపోయి చనిపోతే వారందరూ చనిపోతారు అలా జరగకూడదు , మహికి మాటిచ్చాను ఎక్కడ ఉన్నా - ఎట్టి పరిస్థితులలో ఉన్నా తనని చేరుతానని అంటూ హృదయంపై చేతినివేసుకుని గురువుగారిని తలుచుకుని - ఆధిపరాశక్తిని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకున్నాను .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
రాజాజ్ఞ అంటూ ఒకడు రాక్షసనవ్వులతో నాదగ్గరికివచ్చి తల నరకడానికి పొడవాటి ఖడ్గాన్ని రెండుచేతులతో పైకెత్తాడు .
జై ఆదిపరాశక్తి అంటూ లేచి వాడి ప్రాణం పోకుండా ఇంకెప్పుడూ ఇలాంటి పోటీలలో ఎవ్వరినీ చంపడానికి వీలుకానట్లు కడుపులో పోటువేసి చేతులు కాళ్ళ లోని నరాలు తెగిపోయేలా గాట్లుపెట్టి కదలకుండా నిలబడ్డాను .
ఆయుధాన్ని ఎత్తిన రాక్షసుడు ఎత్తినట్లుగానే చలనం లేనట్లు వెనక్కు భూమి అదిరేలా పడిపోయాడు .
మళ్లీ ఒక్కసారిగా నిశ్శబ్దం ....... , రాజు తింటున్న మాంసం గొంతులో ఇరుక్కున్నట్లు ఇబ్బందిపడిపోతూ సింహాసనం పైకి చేరాడు .
నాకు మద్దతిస్తున్న ప్రజలంతా లేచి కేకలువెయ్యడం మొదలెట్టారు .

తోటి రాక్షసుడు ఊపిరి తప్ప కదలలేని స్థితిలో పడి ఉండటం చూసి గొడ్డలి - వలతో వచ్చినవాడి దాడిని తప్పించుకునేసరికి మిగతా ఇద్దరూ వెనకనుండి దాడి చేశారు , ముగ్గురు దాడి దెబ్బలు మరియు పోట్లకు రక్తం చిందిస్తూనే ఎదురుదాడి మొదలెట్టాను .
రేయ్ అంటూ సుత్తితో నావైపుకు ఒకడు రావడం చూసి మరొక రాక్షసుణ్ణి పట్టుకుని అడ్డుగా పెట్టాను .
నా దెబ్బ వాడి తలపై బలంగా తగలడంతో భయంకరమైన కేకతో అక్కడికక్కడే నేలకొరిగాడు .
ఆ దెబ్బ రాజుకు తగిలినట్లు తలపై చేతినివేసుకుని భయపడటం చూసి నవ్వుకున్నాను .
మొండి కత్తితోనే ఇక మిగిలిన ఇద్దరినీ రమ్మని సైగచేస్తూనే వాడిముందుకు దొర్లుకుంటూ వెళ్లి కాళ్ళు పనిచేయకుండా నరాలు తెగ్గోసాను .
జూ ...... ఊ ...... అంటూ నాకు మద్దతు తెలుపుతున్నవారంతా సంతోషంతో కేకలువేస్తున్నారు .
చివరగా మిగిలినవాడు భయపడుతుండటం చూసి నవ్వుకున్నాను .
రేయ్ ...... చంపేయ్ వాడిని అంటూ రాజు కోపంతో ఊగిపోతున్నాడు .
వణుకుతూనే గొడ్డలితో నా ఛాతీమీదకు దాడిచేసినవాడి పీకపై ప్రాణాలు పోకుండా కోసి యా ...... అంటూ రాజ్యం మొత్తం వినిపించేలా గర్జించాను .
నా గర్జనకు మిత్రుడు కృష్ణ సంతోషపు ఘీంకారాలు వినిపించడంతో ఆనందం వేసింది .

సుత్తిదెబ్బ తలపై తగిలినవాడు ప్రాకుకుంటూ వెళ్లిపోతుండటం చూసి , ప్రజలంతా చంపేయ్ చంపేయ్ అంటూ కేకలువేస్తున్నారు .
రేయ్ నువ్వేకదా నన్ను కాలితో తాన్నినది అంటూ వాడి దగ్గరకువెళ్లి రాజువైపు కోపంతో చూస్తూ కాలితో ఒక్క తన్ను తన్నాను - అంతదూరం ఎగిరిపడ్డాడు .

రాజును తాన్నినట్లు ఏకంగా సింహాసనంతోపాటు వెనక్కు పడటం చూసి నవ్వుకున్నాను - విజయనినాదంతో మొండి కత్తిని పైకెత్తాను .
ప్రజలంతా లేచి వీరుడు - వీరాధి వీరుడు - యోధుడు అంటూ రాజ్యం మొత్తం దద్దరిల్లిపోయేలా నినాదాలు చేస్తున్నారు .
రాజు : పైకిలేచి కోపంతో ఊగిపోతున్నాడు - సైన్యాధ్యక్షా ...... మొత్తం సైన్యంతో చుట్టుముట్టి వాడిని వాడిని ......
పరివారం : ప్రభూ ...... ప్రజలంతా చూస్తున్నారు - ఇప్పుడు ఆ వీరుడిని ఏమైనా చేస్తే మీ గౌరవానికి దెబ్బ - ఓటమి ఎరుగని మన యోధులను మట్టికరిపించాడు - మనవాళ్లను చంపేయ్యవచ్చు అని ఆజ్ఞ ఇచ్చు ఆ వీరాధివీరుడిని ప్రస్తుతానికి వదిలెయ్యండి - ఎలాగో తదుపరి పోటీ ఉండనే ఉందికదా ...... , ఇప్పుడు ఆ వీరుడిని ఏమైనా చేస్తే ప్రజలు తిరగబడినా తిరగబడేలా ఉన్నాడు - రాక్షసుల్లాంటి మన యోధులను ఓడించిన వీరుడికి బ్రహ్మరథం పడుతున్నారు మీరూ చూస్తున్నారుకదా అంటూ ఒప్పించారు .
చంపెయ్యాలి చంపెయ్యాలి అంటూ కేకలువేస్తున్న ప్రజలవైపు ఆగమని సైగచేసి , తన ఓటమిని ఒప్పుకుంటున్నట్లు వేలితో చూయించి చంపేయ్యమని ఆజ్ఞలువేశాడు రాజు .
నీలాంటి క్రూరమైన రాజు ఆజ్ఞను ...... హ హ హ అంటూ మొండి కత్తిని కిందకుపడేసి నొప్పిని భరిస్తూ నెమ్మదిగా ద్వారం వైపుకు నడిచాను .
వీరుడు - వీరాధివీరుడు దయగలవాడు దయగలవాడు అంటూ హోరెత్తించడంతో ....... రాజుకు భంగం కలిగినట్లు కోపంతో వెళ్ళిపోయాడు .
వీరుడు - వీరాధివీరుడా ...... నీ పేరేమిటి ? ఎక్కడ నుండి వచ్చావు ? వీరుడు - వీరాధివీరుడు - యోధుడు ....... అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .

వీరా వీరాధివీరుడా ...... అంటూ నాతోటి బానిసలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ లోపలనుండే తాకడానికి ప్రయత్నిస్తున్నారు .
ఇనుప ద్వారం తాళం వేసి నన్ను లాక్కొచ్చి పడేసిన భటులవైపు చూసాను .
అప్పటికే భయపడుతున్న వారు గజగజవణుకుతూ వచ్చి తాళం తీసి ప్రక్కకుతప్పుకుని తలలుదించుకున్నారు .
వీరుడు - వీరాధివీరుడు అంటూ ప్రజలతోపాటు నినాధాలుచేస్తూ నాచేతులను భుజాలపై వేసుకుని కారాగారంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు .

వీరాధివీరా ...... మేము ప్రాణాలతో ఉన్నాము అంటే నీవల్లనే అంటూ త్రాగడానికి నీళ్లు అందించారు .
వొళ్ళంతా రక్తం - ఎంత రక్తం పోయిందో .......
తోటి బానిస : ఈరక్తం మన వీరుడుది కాదు ఆ రాక్షసులది అంటూ తడి గుడ్డలతో వొళ్ళంతా తుడిచారు - వీపుపై పడిన రెండు కత్తిగాట్లపై మరియు తలవెనుక పడిన కర్ర దెబ్బకు పసరు రాసి గుడ్డను కట్టారు - వీరుడా ..... నిన్నటి నుండీ ఏమీ తినలేదు అంటూ వాళ్ళు దాచుకున్న పళ్ళను అందించారు .
పర్లేదు సోదరులారా మీరు తినండి .
ఈరోజు మా ప్రాణాలు పోకుండా కాపాడిన దేవుడు మీరు ...... మీరు తింటే మేము తిన్నట్లే మేమంతా నిన్న రాత్రి తిన్నాము దేవుడా అంటూ చేతికి అందించారు .
తోటి బానిస : మన దేవిడిని కాసేపు విశ్రాంతి పోనిద్దాము - ఈ పొడవాటి కత్తి గాయాలు మానాలంటే రోజులుపడతాయి - రేపు మాత్రం మన దేవుడికంటే ముందు మనమే పోటీలలో పాల్గొనాలి .
అవును ఈ దేవుడి ధైర్యం చూసి మాకూ ధైర్యం వచ్చింది - భటులు ఎలా భయపడ్డారో చూసాము .
తోటి బానిస : భటులు ఏమిటి ఏకంగా రాజే భయపడి వెళ్లిపోతేనూ అంటూ నవ్వుకున్నారు .
ఈరోజే ఇంత భయంకరమైన రాక్షసులతో పోటీ అంటే ఇక రేపు ఎలా ఉంటుందో ........
అది ఎవ్వరికీ తెలియదు - ఇంతవరకూ తొలిపోటీని దిగ్విజయంగా పూర్తిచేసినది ఈ దేవుడు ఒక్కరే కదా .......
పదండి పదండి మన దేవుడికి విశ్రాంతి అవసరం .......

సోదరా ...... పెద్దాయన ......
తోటి బానిస : పెద్దాయనను తాకనివ్వలేదు సైనికులు - మరొక ద్వారం ద్వారా తీసుకెళ్లిపోయారు అంటూ బాధతో చెప్పాడు - ప్రాణమున్న మనల్నే ఘోరంగా చూస్తున్నారు ఇక .......
క్షమించండి పెద్దాయనా ...... నాకు వైద్యం చేసిన మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను.
తోటి బానిస : బాధపడకండి వీరాధివీరా ...... , పెద్దాయనను చంపిన వాళ్ళను చంపకుండా జీవితాంతం జీవచ్చవాలుగా మార్చేశారు , పైనుండి చూసి ఆనందిస్తారు , వీరాధివీరా ...... మీరు నిజంగానే మహారాజే మీ వీరత్వం చూస్తే అర్థమైపోతుంది ఈపాటికి రాజుకు కూడా తెలిసిపోయి ఉంటుంది - ఈరోజైతే నిద్రపోడు అంటూ నవ్వుకున్నాడు - క్షమించు దేవుడా ఇక మీరు విశ్రఅంతి తీసుకోండి అనిచెప్పి ద్వారం దగ్గరికివెళ్లాడు .
గురువుగారి ఆశీస్సులతో - అమ్మలగన్న అమ్మ ఆ పరాశక్తి తోడుగా తొలి గండం గట్టెక్కాను మహీ ...... , నిన్ను కలవాలన్న ఆశే నన్ను బ్రతికిస్తుంది , నువ్వు ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా - సంతోషంగా ఉండాలి , ఆదిపరాశక్తి మరియు నదీఅమ్మ నీకు తోడుగా ఉండాలి అంటూ ప్రార్థించి , మహీ మహీ మహీ అంటూ కలవరిస్తూనే కళ్ళుమూసుకున్నాను .

అదేసమయానికి రాజమందిరంలో రాజు కోపంతో ఊగిపోతూ దొరికినవాటినల్లా పగలగొడుతున్నాడు . సైన్యాధ్యక్షా ...... ఇంతకీ వాడెవడు ? - ఎక్కడ నుండి తీసుకొచ్చారు ? .
సైన్యాధ్యక్షుడు : నిన్న మన రాజ్యం చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతుంటే భటులు బంధించి తీసుకొచ్చారు ప్రభూ ....... , ఎవరని అడిగితే మధ్య భారతదేశంలో ఉండే చంద్ర రాజ్య మహారాజునని - మీరు ..... మహారాణీ గారికి బహుమతిగా ఇచ్చిన చిలుక కోసం వచ్చానని ఎలాగైనా తీసుకెళతాను అని చెప్పాడు ప్రభూ అందుకే కారాగారంలో కాక చీకటి కారాగారంలో బంధించి చావుని పరిచయం చేసేలా కొరడా దెబ్బలు కొట్టించాను అయినా సూర్యోదయానికి ఎలా కొలుకున్నాడో అర్థం కావడం లేదు ప్రభూ - ఈరోజు జరిగిన పోటీ చూస్తే రాజే అని అనిపిస్తుంది ప్రభూ ......
రాజు : రాజైతే ఏమిటి ఇప్పుడు మన కాళ్ళ కింద బానిస , బానిసలానే చూడండి ఆ ఉత్తర - మధ్య భారతదేశ రాజ్యాలు ఎప్పటికీ మనకు శత్రువులే కదా , నా ఎదురుగా నిలబడి నన్నే ఎదురించడమే కాకుండా నా ఆజ్ఞనే తిరస్కరించాడు , వాడి చావుని నేను చూడాలి , రేపటి పోటీలు సిద్ధం చెయ్యండి , అతి భయంకరమైన వారిని రంగంలోకి దించండి .
సైన్యాధ్యక్షుడు : ప్రభూ ...... మీకు తెలియనిది కాదు .
రాజు : అవునుకదా ....... ఇన్ని ఏళ్ళల్లో రెండవరోజుకు పోటీలు కొనసాగనేలేదు - తొలిరోజునే బానిసలంతా ఖతం అయిపోయేవారు - అలా అయితే సమయం తీసుకునైనా వాడిని మించిన వారిని సిద్ధం చెయ్యండి - పోటీలు మరింత రసవత్తరంగా క్రూరాతిక్రూరంగా ఉండాలి - మరొక ముఖ్యమైన విషయం వాడు రాజు అని ప్రజాలకుకానీ వాడి రాజ్యానికి కానీ తెలియనేకూడదు అని ఆజ్ఞాపించాడు .
సైన్యాధ్యక్షుడు : ఆజ్ఞ ప్రభూ .........
రాజు : చెలికత్తెలూ ...... మహారాణీ మందిరానికి వస్తామని తెలియజేయ్యండి .
అలాగే మహారాజా అంటూ చెలికత్తెలు పరుగులుతీశారు .
వెనుకే వెళ్లి మహారాణీ మహారాణీ ...... ఒకడి వలన ఒకటే తలపోటు తైలం తీసుకురా ...... , మహారాణీ ఏమిటి ఆ చిలుక పంజరంలో అలా ఎగురుతోంది .
మహారాణి : ప్రభూ ప్రభూ ...... కొద్దిసేపటి ముందు ఒక గర్జన వినిపించింది అప్పటినుండీ నిన్న మొన్నటికంటే మరింతగా పంజరం నుండీ బయటకు రావడానికి తెగ ప్రయత్నం చేస్తోంది , ఎంతకూ శాంతించడం లేదు .
రాజు : వాడి గర్జనే ...... అంటే వాడు చెప్పినది నిజమే , మహారాణీ ...... ఎట్టిపరిస్థితుల్లోనూ పంజరాన్ని తెరవకండి , తరువాతి పోటీలలో వాడు చచ్చాక మనమాట తప్పక వింటుంది .
మంజరి : మా మహారాజు దేవుడు - దేవుడికి చావు అన్నది ఉండదు - మీరే స్వయంగా మీ చేతులతో మా దేవుడి చెంతకు చేరుస్తారు .
రాజు : అలా ఎప్పటికీ జరగనే జరగదు - మీ ఇద్దరినీ ఎప్పటికీ కలవనివ్వను - తదుపరి పోటీలో నీ దేవుడు చావడం ఖాయం ....... 
మంజరి : అలాంటి ఎన్నిపోటీలు పెట్టినా విజయుడై ఈరోజులానే గర్జిస్తాడు చూస్తూ ఉండండి .
రాజు : చిలుక మాటలకు తలనొప్పి మరింత పెరిగేలా ఉంది - చెలికత్తెలూ తీసుకెళ్లి చీకటిలో ఉంచండి .
అలాగే ప్రభూ అంటూ పంజరాన్ని తీసుకుని వెళ్లిపోయారు .
తోటి బానిస చెప్పినట్లు ఆరోజంతా కలలో నేనే కనిపించనట్లు నిద్రపోలేదు రాజు .
Like Reply
నేనుమాత్రం నా అతిలోకసుందరి ఊహాలతో హాయిగా విశ్రాంతి తీసుకున్నట్లు ఆవ్ ...... అంటూ ఆవలిస్తూ లేచి కూర్చుని కళ్ళుతెరిచాను .
తొలి సూర్యకిరణాలు నేరుగా నాపై పడుతుండటం చూసి లేచి సూర్యవందనం చేసుకున్నాను .
ఎదురుగా సోదరుడు ఆశ్చర్యంతో కళ్ళప్పగించి నావైపే చూస్తున్నాడు .
సోదరా ...... సూర్యోదయం అయ్యిందికదా పోటీల దండోరా మ్రోగలేదా అని అడిగాను .
ఆ ...... అంటూ పూర్తిగా నోరుతెరిచి కదలకుండా ఉండిపోయాడు .
సోదరా సోదరా ...... అంటూ నవ్వుకున్నాను .
వీరాధివీరా ....... మొన్నేమో వందకుపైగా కొరడా దెబ్బలు కొట్టినా మరుసటిరోజుకు సిద్ధం అయిపోయారు నిన్నేమో కత్తి గాట్లు భీకరమైన పోటీలో పూర్తిగా అలసిపోయారు ..... అయినా సూర్యోదయ సమయానికి లేచి నిలబడమే కాకుండా పోటీలు ప్రారంభం కాలేదా అని అడుగుతున్నారు అంటూ ఆశ్చర్యపోతూనే లేచివచ్చి , నావీపుపై చుట్టిన గుడ్డలను తీసేసి చూసి మరింత ఆశ్చర్యపోయాడు , వీరాధివీరా ...... అందరూ దేవుడని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది - కత్తి గాట్లు నయమైపోయాయి - పక్షముల ముందు కత్తిగాట్లు పడ్డాయేమో అన్నట్లు పూర్తిగా ....... , మందు వేసుకోలేదు - కుట్లూ వెయ్యనేలేదు .......
సోదరా ...... దాహం వేస్తోంది .
వెంటనే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు . 
సోదరా ...... నీళ్లే నాకు మందు - నదీఅమ్మా అంటూ ప్రార్థించి నీటిని త్రాగాను - ఆఅహ్హ్ ...... హాయిగా ఉంది , ఇంతకూ పోటీల గురించి చెప్పనేలేదు .
భటుల సమాచారం ప్రకారం ...... మీపై రాజు చాలా చాలా కోపంతో ఉన్నాడట - రాజు ఆజ్ఞను ధిక్కరించి గర్జించిన నిన్ను ఎలాగైనా చంపాలని - ఈ రాజ్యంలో ఉన్న రాక్షసుల్లాంటి సైనికులను నువ్వు మట్టికరిపించడంతో అంతకుమించిన రాక్షసుల్లాంటి వారిని కేంద్రీకరించడం కోసం చుట్టూ ఉన్న అన్ని రాజ్యాలకు - సామంత రాజ్యాలకు వర్తమానం పంపించారట , అలాంటివారు దొరికేంతవరకూ పోటీలు తాత్కాలికంగా నిలిపివేయ్యబడ్డాయి , ఈ వీరాధివీరుడు ...... రాజు కల్లోకి కూడా వెళ్లి ఇబ్బందిపెట్టినట్లు రాత్రంతా నిద్రపోలేదని సమాచారం - కానీ ఇక్కడ మాత్రం ఈ వీరాధివీరుడు హాయిగా నిద్రపోయారు అనిచెప్పడంతో నవ్వుకున్నాము , ఇనుప ద్వారం దగ్గరికివెళ్లి మిత్రులారా ...... మన దేవుడు లేచాడు పోటీలకు సిద్ధంగా ఉన్నారు అంటూ సంతోషంతో కేకలువేశాడు .
" వీరుడు - వీరాధివీరుడు - దేవుడు ........ " అంటూ చీకటి కారాగారం దద్దరిల్లిపోయేలా నినాదాలు చేస్తున్నారు .
రాజమందిరం వరకూ వినిపించినట్లు రాజుకు మరింత కోపం తెప్పించినట్లు కొద్దిసేపటి తరువాత పెద్ద మొత్తంలో సైనికులు వచ్చి ఆపమని బెదిరిస్తూ ద్వారాలవైపు కొడుతున్న ఆపడం లేదు - సైనికులు మా ద్వారం దగ్గరకు చేరుకుని నేను సిద్ధంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయి భయపడుతూ వెనక్కు వెళ్లిపోయారు - ఈ విషయాన్ని వెంటనే మహారాజుకు చెప్పాలి అంటూ గుసగుసలాడుకుంటూ వెళ్లిపోయారు నలుగురు ....... , రేయ్ బానిసల్లారా ...... మీరు కేకలువెయ్యడం ఆపకపోతే రెండు రోజులు ఆహారం పెట్టము .
సోదరులు : రెండురోజులు కాకపోతే వారం రోజులు పెట్టకండి - ఈ చీకటి కారాగారంలోకి తోసేసిన తరువాత తొలిసారి సంతోషం కలుగుతోంది - ఈ సంబరాలలో ఆకలి అన్నమాటే కలగదు అంటూ రాజ్యం మొత్తం వినిపించేలా నినాదాలతో హోరెత్తిస్తున్నారు - తోటి సోదరుడు కూడా చిరునవ్వులు చిందిస్తూ నినాదాలు చేస్తున్నాడు .

( భటులు ...... సైన్యాధ్యక్షుడుకు , సైన్యాధ్యక్షుడు ...... రాజుకు విషయం తెలియజేశాడు .
రాజు : ఒక్కరోజులో సిద్ధం అయిపోయాడా అంటూ ఆశ్చర్యం మరొకపక్క వాణ్ణి చంపలేమా అంటూ అసహనం .......
మహారాణి ...... మంజరిని మచ్చిక చేసుకోవడం కోసం తన మందిరానికి తీసుకొచ్చినట్లు ...... , చెప్పానుకదా రాజా ...... మా మహారాజు దేవుడితో సమానం - మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టినా మరుసటిరోజుకు సిద్ధం అయిపోతారు - తప్పయిందని ఒప్పుకుని మమ్మల్ని వదిలితే మేమే వెళ్లిపోతాము - అతిముఖ్యమైన పనిపై రాజ్యాలను దాటుకుంటూ వెళుతున్నాము .
రాజు : ఏమిటీ ...... తప్పయిందని ఒప్పుకోవడమా ? , నా కంఠంలో ప్రాణం ఉండగా అలాచెయ్యను మిమ్మల్ని కలవనివ్వను ......
మంజరి : సమయమే సమాధానం చెబుతుంది - మా మహారాజు క్షేమం అని తెలియచేసినందుకు సంతోషం అంటూ పంజరంలో చిందులువేస్తోంది .
రాజు తలపట్టుకుని కోపంతో ఊగిపోతున్నాడు - చెలికత్తెలూ ...... చిలుకను తీసుకెళ్లి .......
మంజరి : తీసుకెళ్లి చీకటి గదిలో ఉంచండి - దీనిమాత్రం మీకు ధన్యవాదాలు రాజా ....... , మా మహారాజు చీకటి కారాగారంలో ఉంటూ నేను ఇలా రాజమందిరంలో ఉండటం తగదు , మా మహారాజు వచ్చి నన్ను తీసుకెళ్లేంతవరకూ చీకటి గదిలోనే ఉంచాలని మనవి .
అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు - చెలికత్తెలు ...... మంజరిని తీసుకెళ్లి చీకటి గదిలో ఉంచారు ) .

నాప్రియాతిప్రియమైన దేవకన్య ఊహాలతో రోజులు వేగంగా గడిచిపోసాగాయి . పోటీల గురించి అందరమూ మరిచిపోయాము అనుకునేంతలో ఒక ఉదయం పోటీలనగారా మ్రోగింది .
సోదరుడి ముఖంలో భయం .......
అంతలో కారాగారపు పెద్ద ద్వారం తెరుచుకుంది - భారీగానే సైనికులు లోపలికివచ్చి ఒక్కొక్క గదిలోనుండి ఇద్దరిద్దరిని బయటకు లాగారు - ఆ ఇద్దరిద్దరి ఒక్కొక్కచేతికి గోలుసులువేసి ఏకం చేశారు . 
సైన్యాధ్యక్షుడు వచ్చి ప్రజలందరి ముందు నీ చావు చూడటం కోసమే ఇలా ప్రణాళిక రచించాము - ఇప్పుడు నీ కుడిచెయ్యితో ఇంతకుముందులా సులభంగా పోరాడలేవు - రాజు ముందు మోకరిల్లి ప్రాణాలు వదులు అంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క మొండి కత్తులను మరియు బాణాల నుండి రక్షణ పొందడానికి డాలును అందించి పైన క్రీడా సంగ్రామం మధ్యలోకి తీసుకెళ్లి వదిలారు .
సోదరుడు ఎలా అన్నట్లు గజగజవణుకుతున్నాడు - సోదరుడితోపాటు మిగతావారందరూ కూడానూ ........

క్రీడా ప్రాంగణం చుట్టూ రెట్టింపు జనాలతో నిండిపోయినట్లు హోరెత్తిపోతోంది , సగం మంది చంపెయ్యాలి చంపెయ్యాలి ...... అంటూ మిగతా సగం మంది వీరుడా - వీరాధివీరుడా గెలవాలి అంటూ కేకలువేస్తున్నారు .
పోటీలు నిర్వహిస్తున్న రాజు పరివారం ముందుకువచ్చి , పోటీల చరిత్రలో రెండవరోజుకు చేరడం ఇదే ప్రథమం - రాజ్య ప్రజలకు మరింత వినోదం పంచడం కోసం మన మహారాజుగారు మన సోదర రాజ్యాలనుండి వీరాధివీరులైన యోధులను రప్పించారు .
ఒక్కసారిగా క్రీడా ప్రాంగణం నలువైపులా ఉన్న నాలుగైదు పెద్ద పెద్ద ద్వారాలు తెరుచుకున్నాయి .
అన్ని ద్వారాలు తెరుచుకున్నాయి అంటూ ప్రజలంతా ఉత్కంఠతో చూస్తూ కేకలువేస్తున్నారు .

సోదరులారా ........ మీలో ఎవరికైనా యుద్ధాలలో పాల్గొన్న అనుభవం ఉందా ? అని అడిగాను .
వీరాధివీరా అంటూ ముగ్గురు నలుగురు చేతులు పైకెత్తారు .
మీ సహాయం ముఖ్యం ......
సోదరులారా ...... ఆ ద్వారాల నుండి ఎవరు - ఏమిటి లోపలికి వచ్చినా ...... మనం ప్రాణాలతో బయటపడాలంటే మనమంతా కలిసి ఎదుర్కోవాలి అదొక్కటే మార్గం ...... మీకు అర్థం అయ్యిందా ? .
అందరూ భయంతోనే తలలుఉపారు .
మనం కలిసి పోరాడితే అందరమూ అందరమూ ప్రాణాలతో బయటపడగలం .

ప్రజలందరి వినోదం కోసం రప్పించిన చోళ సామ్రాజ్య యోధులు ....... అంటూ ఒక ద్వారం వైపు చూయించడంతో ఒక రథం అందులో నలుగైదుగురు ఆయుధాలను ఊపుకుంటూ వచ్చి మాచుట్టూ తిరుగుతున్నారు .
చోళ యోధులు చోళ యోధులు అంటూ హోరెత్తిపోయింది .
తదుపరి మైసూరు సామ్రాజ్య యోధులు ...... అంటూ మరొక ద్వారం వైపు చూయించడంతో రాక్షసుల్లాంటి యోధులు రాక్షస ఆయుధాలతో రథంలో వచ్చి చుట్టూ తిరుగుతున్నారు .
మిగతా ద్వారాలనుండి వచ్చే రాజ్యాలలో హిడుంభి రాజ్యపు యోధులు వస్తే బాగుండు అని చూసిన నాకు నిరాశనే మిగిలింది మిగతా ద్వారాలనుండి వేరు వేరు సామ్రాజ్యపు రథాలు యోధులు వచ్చి ఒకరి వెనుక మరొకరు భయకంపితం చేసేలా తిరుగుతున్నారు - అసలు అలాంటి పేరుతో రాజ్యం ఉందో లేదో ...... ఉన్నా లేకున్నా మహి సంతోషంగా ఉండాలి అంటూ హృదయంపై చేతినివేసుకుని ప్రార్థించాను .
ఒక్కొక్క రథం ప్రవేశించిన ప్రతీసారీ ప్రజలు ఉర్రూతలూగిపోతూ కేకలువేస్తున్నారు .

భయపడకండి సోదరులారా - భయమే మనల్ని సగం చంపేస్తుంది .
పోటీ ప్రారంభం అంటూ రాజు చేతితో సైగచెయ్యగానే ...... ఒక రథం మమ్మల్ని విచ్చిన్నం చెయ్యడానికి మా మీదుగా వచ్చింది .
సోదరులారా కలిసి ఉండండి కలిసి ఉండండి - ఒక్కటిగా నిలబడండి అనడంతో రథానికి దారిని వదిలి మళ్లీ గుంపుగా చేరారు .
మాపైకి రథాలనుండి బాణాలు - ఈటెల వర్షం కురుస్తోంది నలువైపుల నుండి , ఇద్దరికి చేతులలో మరొకరికి పాదాలలో బాణాలు గుచ్చుకున్నాయి .
చంపేయ్ చంపేయ్ అంటూ చుట్టూ కేకలు .......

సోదరులారా ...... డాలులను అడ్డుగా ఉంచుకోండి , నిలువు వరుసలుగా నిలబడి గోడలను నిర్మించండి .
మావైపుకు దూసుకువస్తున్న బాణాలను డాలులతో అడ్డుపెడుతూ చుట్టూ గోడను నిర్మించాము .
బాణాలు - ఈటెలను ...... డాలులు అడ్డుకుంటున్నాయి .
వీరాధివీరా - వీరులారా పోరాడండి అంటూ మాకు మద్దతిస్తూ వస్తున్న ప్రజల కేకలకు కాస్త ఊరట లభిస్తోంది .
డాలులకు గుచ్చుకున్న ఈటెలను అందుకుని రెడీగా ఉండండి అనిచెప్పడంతో సోదరులంతా దైర్యంగా తీసుకున్నారు .
బాణాలతో లాభం లేదనుకుని ఒక రథం మా గోడలను బద్ధలుకొట్టడానికి వచ్చింది .
ఒక్కటిగా నిలబడండి ........
మా బృందం కదలకపోవడంతో రథమే ప్రక్కకు వెళ్ళిపోయింది .
మాతోపాటు ప్రజలు నవ్వుకున్నారు .
అలాగే అలాగే సోదరులారా ....... , మరొక రథం వస్తోంది అలాగే ఉండండి అలాగే ఉండండి వచ్చేస్తోంది డాలులను ఏటవాలుగా ఉంచి రక్షణ కల్పించుకోండి .
అంతే రథం వైపు ఉన్న సోదరులు నాతోపాటు డాలులను ఏటవాలుగా పెట్టి రథపు చక్రాలకు అడ్డుగా పెట్టడంతో ....... రథం చుట్లు తిరుగుతూ ఎగిరిపడింది .
ప్రజలతోపాటు రాజు అలా చూస్తుండిపోయాడు .
వీరాధివీరులు అంటూ కేకలు ........
గోలుసులను భీకరమైన ఆయుధాలతో తెంపుకుని , సోదరులారా ...... చంపకండి చావుని పరిచయం చెయ్యండి చాలు అనిచెప్పడంతో నావెనుకే వచ్చి కాళ్ళు చేతులను విరిచేశారు .
వీరాధివీరుడు దయగలవాడు ........

ఒక సోదరుడి కాలికి బాణం గుచ్చుకుంది .
ఈటెను తిప్పి బాణం వదిలిన వాడివైపు విసరడంతో రథం నుండి ఎగిరి కిందపడ్డాడు .
బాణపు నొప్పితో విలవిలలాడుతున్న సోదరుడి మీదకు మరొక రథం దూసుకురాసాగింది .
పెద్దాయనను కాపాడుకోలేకపోయాను - ఒక్కప్రాణం కూడా పోకూడదని పరుగునవెళ్లి ఎగిరి ఒకప్రక్కకు లాక్కునివెళ్ళాను .
వీరాధివీరుడు వీరాధివీరుడు ప్రాణాలను సైతం లెక్కచెయ్యడు .
మమ్మల్ని వెనక్కు తిరిగి చూస్తూ ముందు వస్తున్న రథాన్ని చూసుకోకపోవడంతో చక్రాలు తగిలి కారాగారపు ద్వారంలోపలికి విచ్చిన్నం అవుతూ దూసుకుపోయింది .
సోదరుడు : రెండు ఖతం ఇక మిగిలినది రెండే ...... , వీరాధివీరా ఇక ఏమాత్రం భయపడము నువ్వు ఎలా చెబితే అలా చేస్తాము అంటూ ఒక్కటిగా జతకట్టారు .
అడ్డుగా వచ్చిన రథం పట్టు తప్పినట్లు అడ్డుగా పడిపోయి దూసుకుంటూ వెళ్లి గోడలను గుద్దుకుంది .
ఇక మిగిలినది ఒక్కటే వీరా ......... అంటూ రథం నుండి కిందపడిన వాళ్ళను లేవకుండా చేశారు .

సోదరులారా సగం సగం అటువైపు ఇటువైపు నిలువు వరుసలుగా జతకట్టండి .
అంతే పరుగునవెళ్లి చివరి రథం నా నియంత్రణలోకి వచ్చేలా నిలబడ్డారు - ముక్కలు అయిన రథాలను అడ్డుపెట్టారు .
అయినాకూడా చివరి రథం తప్పించుకోవడంతో వెనుకే పరుగులుతీసాను - ప్రయోజనం లేకపోవడంతో మిత్రమా ...... సహాయం అన్నట్లు కేకలువేశాను .
గుర్రపు శాలలో కట్టివేయబడి ఉన్నా తెంపుకుని క్రీడా ప్రాంగణంలోకి దూసుకువచ్చాడు .
మిత్రమా అంటూ పరుగునవెళ్లి ఎక్కి హత్తుకున్నాను . అటువైపు అంటూ రథం వెనుకే వేగంగా పోనిచ్చాను - నేలపై గుచ్చుకుని నిలబడిన ఈటెను అందుకుని వెనక్కు తిప్పి విసరడంతో రథం వెనకనుండి బాణాలు సంధిస్తున్న వాడు ఎగిరిపడ్డాడు .
సోదరులారా అంటూ రథం కంటే వేగంగా పోనిచ్చి రథం స్వారీ చేస్తున్న వాడిని తికమకపెట్టడంతో , సోదరులు అడ్డుపెట్టిన రథాన్ని గుద్దుకుని గాలిలో చుట్టూ తిరుగుతూ నేలకొరిగింది .
మిత్రుడికి ముద్దుపెట్టి , రాజువైపు విజయ సంకేతం చూయించి విజయానందంతో కేకలువేస్తున్న సోదరుల దగ్గరికి చేరుకున్నాను , మిత్రమా ....... నువ్వు నాతో ఉండటం చాలా చాలా ప్రమాదం - నామీద ఉన్న కోపంతో నిన్ను ఏమైనా చెయ్యొచ్చు - నీకేమైనా అయితే మహి తట్టుకోలేదు  - ఈ ఒక్కసారికీ నామాట విని వెళ్లు ......
నన్ను స్పృశించి జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు .
అంతే సోదరులంతా వచ్చి ప్రజల సంతోషాలతోపాటు కేకలువేస్తూ వచ్చి నన్ను అమాంతం ఎత్తేసి విజయ సంబరాలు చేసుకున్నారు .
రాజు అయితే పోటీ పరివారంపై కోప్పడి వెళ్ళిపోయాడు .
Like Reply
సోదరా ....... ఆయుధం కూడా పట్టుకోవడం రాని మాతో ఒక చిన్నపాటి యుద్ధమే చేయించి గెలిపించావు - దేవుడు అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు అంటూ విజయ సంబరాలు చేసుకుంటున్నారు .
మాకు మద్దతిస్తున్న ప్రజలు కిందకువచ్చి మాదగ్గరికి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను పెద్ద సంఖ్యలో భటులు అడ్డుకుని మమ్మల్ని చీకటి కారాగారంలోకి తోసేశారు .

సోదరులారా ....... ముందుగా బాణాలు - దెబ్బలు తగిలినవారికి వైద్యం చెయ్యాలి అంటూ కిందకుదిగాము .
పర్లేదు వీరాధివీరా ...... నీవలన పొందిన విజయానందంతో పోలిస్తే ఈ బాణాల నొప్పి ఏపాటివి అంటూ అందరూ నాముందు మొకరిల్లారు - మాలో ఒక్కరి ప్రాణాలుకూడా పోలేదు అంటే మీవల్లనే మాజీవితాంతం రుణపడి ఉంటాను .
సోదరులారా ...... మీ సహకారం లేకపోయుంటే మనం విజయం సాధించేవాళ్ళమే కాదని ఖచ్చితంగా చెప్పగలను - ఇది మనందరి సమిష్టి విజయం అంటూ అందరినీ లేపి కౌగిలించుకున్నాను .
ఇంతటి గొప్ప వీరాధివీరుడిని కలవడం మా అదృష్టం - రాజు అంటే మీలా ఉండాలి - చంపడానికి వచ్చిన రాక్షసుల్లాంటి సైనికులను కూడా ప్రాణాలతో విడిచిపెట్టారు .
వాళ్ళు రాక్షసులు అయినప్పటికీ వారికీ మనలానే కుటుంబం ఉంటుంది కదా ...... , ఆ కుటుంబం ...... వీరికోసం ఎదురుచూస్తూ ఉంటుంది అంటూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నాను మహిని తలుచుకుని .......
మనమెప్పుడు మన కుటుంబాన్ని చేరతామో ....... , బానిసలను చేసి లాక్కునివచ్చి ఈ చీకటి కారాగారంలో పడేసారు , ఎలా ఉన్నారో ఏమిచేస్తున్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో ....... మన కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళను మళ్లీ చేరుకుంటామో లేదో అని బాధపడుతున్నారు .
వారి ప్రశ్నకు సమాధానం తెలియక మౌనంగా ఉండిపోయాను .
భటులు వచ్చి మా అందరినీ మా మా గదులలోకి తోసేసి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు .
తోటి సోదరుడు : వీరాధివీరా ..... వొళ్ళంతా రక్తం కారుతున్నా మీకళ్ళల్లో కన్నీళ్లు చూడలేదు - ఆ కన్నీళ్లు ఎవరికోసమో కానీ వారిని తప్పకుండా చేరుతారు .

రోజులు గడిచిపోసాగాయి కానీ చివరి పోటీల దండోరా మాత్రం మ్రోగడం లేదు .
తోటి సోదరుడు : దేవుడా ....... ఇంతసమయం తీసుకుంటున్నారు అంటే పెద్దగానే ప్రణాళికలు వేస్తున్నట్లుగా ఉంది - రోజురోజుకూ భయం పెరుగుతూనే ఉంది - మీపై రాజు చాలా చాలా కోపంగా ఉన్నట్లున్నాడు నిద్రపడుతున్నట్లుగా లేదు ........
ఇద్దరమూ నవ్వుకున్నాము . మిమ్మల్ని ఎలాగైనా ......
తెలుసు తెలుసు సోదరా ....... , అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను - నాకోసం నాకంటే ఎక్కువగా ఎదురుచూస్తున్న నా ప్రాణం కోసమైనా ఇక్కడనుండి ప్రాణాలతో బయటపడాలి అంటూ మహి ఊహాలతో రోజులు గడుపుతున్నాను .

కొన్ని పక్షముల తరువాత మొదటి ఏడాది చివరి పోటీలకోసం దండోరా మ్రోగడం - పెద్ద మొత్తంలో భటులువచ్చి నన్నుమాత్రమే గోలుసులతో బయటకు తీసుకెళ్లారు .
తోటి సోదరుడు : భటులారా ...... నన్నుకూడా తీసుకెళ్లండి .
మమ్మల్ని కూడా తీసుకెళ్లండి అంటూ ఇనుప ద్వారాలను ముందుకూ వెనుకకూ కదిలిస్తున్నారు .
భటులు : వీడు ఖతం అయితే మీరెంతసేపు అంటూ రాక్షస నవ్వులు నవ్వుకున్నారు - పోటీలు అంటేనే ఉచ్చపోసుకునేవారు వీడొచ్చాక వచ్చిన ధైర్యం వీడితోనే పోతుందిలే - ఈరోజుతో వీడి కథ ముగిసిపోతుంది .
తోటి బానిస : మాదేవుడికి మరణం లేదు - వీరాధివీరా ..... మీకోసం ఎదురుచూస్తూ ఉంటాము .
భటులు : ఇక్కడెందుకు వేచి చూడటం - వీడి మీ దేవుడి చావును కళ్లారా చూసి పోయిన భయాన్ని మళ్లీ మీలో పుట్టిస్తాము వెనుకే లాక్కునిరండి అంటూ సోదరులను ద్వారం దగ్గరే ఆపి నన్ను క్రీడా ప్రాంగణం మధ్యలోకి తీసుకెళ్లారు .
వీరాధివీరుడు వీరాధివీరుడు యోధుడు ....... అంటూ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోతోంది .
సోదరులు : ఇంతమంది ప్రజలా ....... అంటూ చుట్టూ చూసి ఆశ్చర్యపోతున్నారు .
భటులు : మీ దేవుడి గురించి విని చుట్టుప్రక్కల రాజ్యాలనుండి కూడా తండోపతండాలుగా వచ్చారు .

నా ఎదురుగా రాజు రాక్షనవ్వులతో ఈరోజు పోటీ ఎదుర్కో అన్నట్లు చూస్తున్నాడు .
( మహారాజా ...... ఈరోజుతో వీడి కథ ముగిసిపోయినట్లే , ఇంతలా అభిమానిస్తున్న ప్రజలు పక్షము రోజులలో వీడి గురించి మరిచిపోతారు .
రాజు : అంతకంటే ముందుగానే మరిచిపోయేలా ఏర్పాట్లు చేసాను చూస్తూ ఉండండి ) .

ఒక భటుడువచ్చి ఇంతకుముందులానే మొండికత్తిని అందించి , చనిపోబోతున్నందుకు సంతోషం అనిచెప్పి వెనకనుండి మోకాలిపై కొట్టాడు .
మోకాళ్ళమీదకు చేరాను .
శభాష్ సైనికా అంటూ సైన్యాధ్యక్షుడు ......
భటుడు : చనిపోబోయే ముందు అయినా మహారాజుగారి శరణు కోరు - ప్రాణాభిక్ష పెట్టవచ్చు .......
గర్వంగా లేచి నిలబడ్డాను .
ప్రజలంతా నినాదాలతో హోరెత్తించారు .
భటుడు : ఇక నిన్ను ఎవ్వరూ రక్షించలేరు అంటూ చేతికున్న సంకెళ్లను తీసేసి వెళ్ళిపోయాడు .

నలువైపులా ఉన్న నాలుగు ద్వారాలు తెరుచుకోవడం - అందులోనుండి అరివీర భయంకురులు వస్తారనుకుంటే భటులు వచ్చి రెండువైపులా నేలపై ఉన్న గొలుసులను లాగడంతో నేలపై ఉన్న గోతులు తెరుచుకున్నాయి - అందులోనుండి చూస్తేనే వణుకుపుట్టేలా రెండు చిరుతపులులు బయటకువచ్చాయి .
ప్రజలందరూ భయంతో ఉసూరుమన్నారు - రాజు కళ్ళల్లో గర్వం వాటిని ఎలా ఓడిస్తావు అన్నట్లు .......
నాకైతే నవ్వు ఆగడంలేదు .
వీరాధివీరా జాగ్రత్త అంటూ ఉత్కంఠతో చూస్తున్నారు సోదరులు - ఇనుప ద్వారాన్ని బద్ధలుకొట్టి నాకు సహాయం చెయ్యడం కోసం ప్రయత్నం చేస్తున్నారు .
భటులు నావైపుకు వదిలిన చిరుతపులులు రెండువైపులా నామీదకు పంజా విసరడానికి వస్తున్నాయి - వాటి గొంతుకు గొలుసులు వేసి నియంత్రిస్తున్నారు .

రాజు సైగచెయ్యగానే గొలుసులను వదిలెయ్యడంతో నామీదకు దూసుకువస్తున్నాయి - ప్రజలందరూ భయంతో లేచిమరీ చూస్తున్నారు కంగారుపడుతూ ....... , సగం మంది చంపేయ్ చంపేయ్ అంటూ ఉద్రేకంగా కేకలువేస్తున్నారు .
పెదాలపై చిరునవ్వులతో గురువుగారిని తలుచుకుని చిరుతపులుల వైపుకు అరచేతులు ఉంచి వాటి కళ్ళల్లో కళ్ళుపెట్టి రెండింటి వైపు చూసి ఆగమని ఆప్యాయంగా ఆజ్ఞాపించాను .
అంతే నా అరచేతులవరకూ వచ్చి స్పృశిస్తూ ఆగిపోయాయి .
అంతే ఒక్కసారిగా క్రీడాప్రాంగణం మొత్తం నిశ్శబ్దం అయిపోయింది .
అప్పటివరకూ కంగారుపడుతున్న సోదరులు జయహో వీరాధివీరా - జయహో దేవుడా ...... మీకు తిరుగులేదు అంటూ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు .
రెండు చిరుతపులులను అక్కున చేర్చుకుని , మిమ్మల్ని గాయపరచగలనా మిత్రులారా అంటూ నా వశం చేసుకున్నాను .
క్షమించు కమించు అన్నట్లు నన్ను స్పృశిస్తున్నాయి .
సోదరులతోపాటు ప్రజల నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లిపోతోంది .
రాజు లేచిమరీ కోపంతో ఊగిపోతున్నాడు .
మహారాజా ఇంకా అయిపోలేదు అంటూ చిరుతపులులకు వేసిన గొలుసులను లాగి ఏవో ద్రవాలను ఎక్కించారు - మరొక రెండు గుంతల దగ్గరకు కూడా వెళ్లి ఇనుప ద్వారాల ద్వారా ద్రవాలను ఎక్కించి ఆ ద్వారాలను కూడా లాగేశారు .

రెండు చిరుతపులులతోపాటు మిగతా రెండు గుంటలనుండి రెండు పెద్ద పులులు ....... , వాటి గాండ్రింపులకే ప్రజలంతా ఉలిక్కిపడ్డారు .
ఆశ్చర్యన్గా చిరుతపులులు మరియు పెద్ద పులుల కళ్ళు ఎర్రగా మారిపోసాగాయి .
వెనుక నుండి భటులువచ్చి , నాపై రక్తాన్ని పోసి పరుగునవెళ్లిపోయారు .
రక్తపు వాసనకు నాలుగు క్రూర జంతువులు పిచ్చెక్కిపోయినట్లు గొలుసులు తెంపుకునేలా ప్రవర్తిస్తున్నాయి - గొలుసులు పట్టుకున్నవాళ్లపైకే దూకడంతో గొలుసులను వదిలేసి భయంతో గుంతల్లో ద్వారాలను మూసేసుకున్నారు .
పిచ్చెక్కినట్లు ఉద్రేకానికి లోనౌతున్న క్రూర జంతువులు ...... మిగిలిన నామీదకు ఒకేసారి దూసుకువస్తున్నాయి .
వీరాధివీరా ...... మొండికత్తి కిందపడింది అందుకో అంటూ కేకలువేస్తున్నారు సోదరులు .......
పులులకు ఏమో అయ్యింది ఇక చంపేదాకా ఆగేలాలేవు అంటూ ఉత్కంఠ - భయంతో వీక్షిస్తున్నారు ప్రజలు ........
నాలుగు జంతువుల కళ్ళల్లోకి సూటిగా చూస్తూ శాంతించమని ఆజ్ఞాపించినా ఆగకపోయేసరికి , సోదరా ...... బల్లెం అనేంతలో నాలుగు క్రూర జంతువులు ...... నామీదకు పంజావిసిరి రక్కేస్తున్నాయి - మెడను పట్టేసేంతలో ఒక్కొక్కదానిని పట్టుకుని నలువైపులకూ విసిరేసాను .
దేవుడా బల్లెం అంటూ విసిరారు - పై వస్త్రాన్ని చిరిపేసాయి - వొళ్ళంతా పంజా వేట్లకు రక్తం కారుతోంది .
భటుడి నుండి లాక్కుని సోదరుడు విసిరిన బల్లెం అందుకుని కొస్సిగా ఉన్నదానిని తీసివేసి , కర్రను రెండుగా విరిచి రెండుచేతులలో పట్టుకున్నాను .
పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తూ రక్తపు వాసనకు ఉద్రేకంతో వచ్చిన ఒక్కొక్క పులిని తప్పించుకుంటూ వాటిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది - మిత్రులారా అంటూ ఒక్కొక్కదానిని ఒంటరిదానిని చేస్తూ వాటికి  దెబ్బలువేస్తూ నేలకొరిగేలా చేస్తున్నాను - ప్రతీసారీ మరింత కోపోద్రిక్తంతో నామీదకు దాడిచేస్తున్నాయి - వొళ్ళంతా పంజాలతో రక్కేస్తూనే ఉన్నాయి - నొప్పికి కేకలువేస్తూనే ఉన్నాను .
ఇలాకాదని మన్నించమని కోరుతూ నేరుగా వాటి తలలపై దిమ్మతిరిగేలా - ద్రవాల మత్తు వదిలేలా గట్టిగానే దెబ్బలువెయ్యడంతో నోటి నుండి స్రవాలను వదులుతూ నేలకొరిగిపోయాయి - లేవడానికి ప్రయత్నించినా వీలుకాకపోవడంతో కదలకుండా ఉండిపోయాయి .
అయిపోయింది మహారాజా ...... ఈ భయంకరమైన పోటీ కూడా గెలిచేశాడు , వీరుల్లాంటి సైనికులనే కాదు మాధమెక్కించిన క్రూర జంతువులను కూడా ......
రాజు కోపంతో ఊగిపోతున్నాడు ఇక ఏమీ చేయలేమా అన్నట్లు ......

నాలుగింటినీ ఒకదగ్గరకు చేర్చి , మిత్రులారా ..... మిమ్మల్ని గాయపరిచాను మన్నించండి త్వరలోనే కోలుకుంటారు అనిచెప్పాను .
చుట్టూ ప్రజల నినాదాలు - సగం మందిలో నిరాశ ......
వారి వైపుకు తిరిగి ప్రజలారా మీకు కావాల్సినది వినోదమే కదా ....... , మీరు ఆనందించారా లేదా ....... , ఎవరు చస్తే మీకేంటి ఆనందించండి ......., ఇది ఆనందం కాదా ........
అంతే వారుకూడా వీరాధివీరుడు - దయ గలవాడు ....... అంటూ మాకు మద్దతిస్తున్నవారితోపాటు కేకలువేస్తున్నారు .
వీరాధివీరా వీరాధివీరా ...... అంటూ సోదరులంతా ద్వారాన్ని బద్ధలుకొట్టుకుని వచ్చి అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకుంటున్నారు ..........
Like Reply
( రాజు కోపంతో రాజమందిరం చేరుకుని దొరికినదానిని పగలగొట్టేస్తున్నాడు - సైన్యాధ్యక్షుడా ...... ఏమిచేస్తావో ఎంతమందితో వెళతావో తెలియదు వాడు సూర్యోదయాన్ని చూడకూడదు - వాడు బ్రతికి ఉన్నంతసేపూ నాకు మనస్సాoతి లేదు - ఆహారంలో విషం కలిపి అయినా చంపేయ్యండి ......
సైన్యాధ్యక్షుడు : చిత్తం ప్రభూ ......
అది కుదరని పని ప్రభూ ...... అంటూ మంత్రి వచ్చాడు - ఇప్పటివరకూ మనకు మద్దతిస్తున్న ప్రజలంతా కూడా వాడి వీరత్వానికి గులాం అయిపోయారు పైగా మన చుట్టుప్రక్కల రాజ్యాల నుండి వచ్చిన ప్రజలు తరువాతి పోటీలకోసం - ఆ పోటీలలో అతడి వీరత్వం చూడటం కోసమే రావాలని చర్చించుకుంటున్నారు - ఖచ్చితంగా మూడు పర్యాయాలలో పోటీలు నెగ్గి స్వేచ్ఛను మీ వరాలను పొందుతాడని అనుకుంటున్నారు .
రాజు : తదుపరి పోటీలు మలి ఏడాదికే కదా ......
మంత్రి : అవును ప్రభూ ...... , మలి ఏడాది జరిగే పోటీలలో వీడు కనుక లేకపోతే మనం నిర్వహించే పోటీలను ఎవ్వరూ నమ్మరు - వీక్షించడానికి రారు - పోటీల ద్వారామన రాజ్య ఆదాయం ఎంతో తెలుసా అంటూ ఒక సైగ చెయ్యడంతో రాజు ముందు కుప్పలు కుప్పలుగా సంపదను కురిపించారు భటులు ....... , ఈ సంపదతో మన రాజ్యం ఎంతకైనా విస్తరించుకుంటూ వెళ్ళవచ్చు - మనమే పెత్తనం కావచ్చు ........ , ఇలాంటి పరిస్థితుల్లో గనుక మనం అతడిని ఏమైనా చేస్తే మీపైననే వస్తుంది - క్షమించండి మిమ్మల్ని పిరికి రాజు అంటారు - గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్న రాజ్యాలు మనపై దండెత్తుతాయి .
రాజు : లేదు లేదు అలా జరగడానికి వీలులేదు - అయితే మనం వాడిని ఏమీచెయ్యలేమా ? - చిలుక వినలేదుకదా ...... దాని మాటలకు నిద్రకూడా రాదు .
భటులు : లేదు ప్రభూ .......
మంత్రి : ఏమిచేసినా పోటీలలోనే చెయ్యాలి ప్రభూ ...... , 12 పక్షముల సమయం ఉంది వాడి అంతుచూసే వీరాధివీరులను తయారుచేద్దాము .
రాజు : అవును తయారుచేద్దాము - అంతవరకూ వాడిని చీకటి కారాగారంలోనే చిత్రహింసలు పెట్టండి కానీ చంపకండి ) .

పెద్ద సంఖ్యలో భటులు వచ్చి మా అందరినీ కారాగారంలో వదిలి రెండుమూడు తాళాలు వేయడమే కాకుండా మూడింతల భద్రతను కట్టుదిట్టం చేశారు , బానిసలారా ...... వాడికి మద్దతు ఇచ్చి మహారాజు గారి కోపాగ్నికి లోనయ్యారు , తదుపరి పోటీలవరకూ వాడితోపాటు మీకు చిత్రహింసలే .......
ఈరోజు కలిగిన ఆనందంతో పోలిస్తే అలాంటి చిత్రహింసలు మాకు వెంట్రుకతో సమానం ....... , వీరా వీరాధివీరా ...... నినాదాలతో కారాగారం దద్దరిల్లిపోతోంది .
క్షమించండి మిత్రులారా ....... నావలన మీరుకూడా .......
అలాంటిదేమీ లేదు వీరా ...... , ఈ కారాగారంలో ఉండటంతో పోలిస్తే ఆ చిత్రహింసలేమీ మమ్మల్ని బాధించవు , అయినా ఒకసారి చుట్టూ చూడండి మహారాజు మందిరానికి ఎలాగయితే కాపలా ఉంటారో అంతకు రెట్టింపు మనకు కాపలాగా ఉన్నారు అంటే మనం మహారాజు కంటే గొప్పవారం అన్నట్లే కదా ......
మిత్రులంతా నవ్వుకున్నారు .
అందరితోపాటు నవ్వుకుని నా దేవకన్య స్మృతులలో నిద్రకు ఉపక్రమించాను , కళ్ళు మూతలుపడగానే నా ప్రియాతిప్రియమైన ప్రాణమైన దేవకన్యతో విహారానికి వెళ్లినప్పటి మధురమైన స్మృతులు మెదులుతున్నాయి - నా దేవకన్య తియ్యనైన చిలిపిపనులు పెదాలపై చిరునవ్వులు పూయిస్తున్నాయి - రోజంతా ఎంతో ఆహ్లాదంగా విహరించి  చీకటిపడేసరికి అలసిపోయినట్లు స్నానమాచరించడానికి నదీ అమ్మ ఒడిలోకి చేరాము , గంగమ్మ ఒడిలో నా దేవకన్య ..... నన్ను ముద్దుల మైకంలోకి తీసుకెళ్లి వస్త్రాలను ప్రవాహానికి వదిలేసి స్వర్గపు శృంగార డోలికలో ముంచిన మాధుర్యం మనసుకు తెలుస్తోంది - దానికి మించిన తృప్తి జననిపై లేదన్నట్లు వొళ్ళంతా పులకించి పారవశ్యం పొందుతోంది , మహీ నా హృదయదేవీ అంటూ సిగ్గుతో అంతులేని ఆనందంతో లేచాను - ముద్దుకే ఒప్పుకోలేదని నదీఅమ్మ సహకారంతో ఇంతటి తియ్యనైన ద్రోహానికి పాల్పడ్డావన్నమాట అంటూ సిగ్గుపడుతూనే ఉన్నాను - అందుకే ఆరాత్రి జరిగినది గుర్తులేదు , ఆ మాధుర్యం మళ్లీ మళ్లీ ఆస్వాదించాలన్నట్లు వెంటనే కళ్ళుమూసుకున్నాను , అలా నా దేవకన్య తొలిరేయి శోభన మాధుర్యపు ఊహాలతో కారాగార జీవితాన్ని కొనసాగించాను . 

తరువాతి రోజు నుండి శిక్షించడానికని కొండల్ని బద్దలు కొట్టడానికి గుట్టలు - చెట్లు నరకడానికి అడవికి తీసుకెళ్లినప్పుడు తప్పించుకోవడానికి చాలా సందర్భాలు ఉన్నప్పటికీ నాతోపాటు తోడుగా ఉన్న సోదరులందరికీ కూడా స్వేచ్ఛ లభించాలని ఆగిపోయాను , రోజురోజుకూ పెరుగుతున్న శిక్షలను తట్టుకుంటూ రోజులు గడపసాగాను , రోజంతా ఎంత పనిచేసినా చీకటిపడేసరికి కారాగారం చేరి నీటిని సేవించి శయనించగానే దెబ్బలు మానిపోయి ఊహల్లోకి వచ్చే మహి మధురస్మృతులలో కష్టాన్నంతా మరిచిపోయి చిరునవ్వులు చిందించడం చూసి మిత్రులంతా ఆశ్చర్యపోయేవారు .
వీరాధివీరా మేము అనుభవించే శిక్షను రెండింతలుగా అనుభవిస్తున్నావు , చీకటిపడేసమయానికి ఈ ఆనందం ఎలా ? అంటూ ఒకరోజు అడిగారు .
మనకు ప్రియమైన - ప్రాణమైనవారిని ఎన్నటికైనా కలుస్తాము అన్న ఆశ ఉంటే చాలు వారితో గడిపిన మధురానుభూతులే మన ఆనందాలు కారణం అవుతాయి -  ఆరోజంటూ వస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు ప్రయత్నించండి .
కొద్దిసేపటి తరువాత అవును అవును వీరాధివీరా హాయిగా ఉంది , సంతోషం చాలా చాలా సంతోషం , మా తల్లిదండ్రులను బార్యాపిల్లలను మళ్లీ కలవడం కంటే సంతోషం మరొకటి లేదు , వారి ఊహాలతోనే ధైర్యంగా జీవిస్తాము .

ఉదయమంతా కష్టాలు - చిత్రహింసలు , చీకటిపడగానే అందరి ముఖాలలో ఆనందంతో రోజులు గడిచిపోసాగాయి .
భటులు కూడా రోజూ కొట్టి కొట్టి అలసిపోయినా మహారాజు ఆజ్ఞల వలన ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితులలో హింస పెట్టేవారు , అలా మరొక పోటీలకాలం కూడా వచ్చినట్లు దండోరా మ్రోతతో తెలిసింది .
ఈసారి ఎలాంటి క్రూరమైన పోటీలు నిర్వహిస్తారో అన్నట్లు కారాగార సోదరులంతా కంగారుపడుతుంటే , రెండో పోటీలు వచ్చేసాయని ఇక మిగలబోయేది ఒకటే అంటూ సంతోషంలో నేనున్నాను .

ఆరోజు రానే వచ్చింది - భటులు వచ్చి మొత్తం కారాగారంలో ఉన్న వారందరినీ సంకెళ్లతో బంధించి మొండి ఆయుధాలను చేతులకు అందించి పోటీ స్థలంలోకి తీసుకెళుతున్నారు - బానిస వీరాధివీరా ఇప్పుడు ఇప్పుడు నీ సోదరులుగా భావిస్తున్న వీరందరినీ కాపాడుకుంటూ నీ ప్రాణాలను నిలబెట్టుకుంటూ ఎలా పోటీలు నెగ్గుతావో చూస్తాము - మహారాజుగారి పన్నాగం ఎలా ఉంది .
సోదరులందరినీ కాపాడుకోవడం ఎలా అంటూ కంగారు మొదలైంది - అందరివైపు చూస్తున్నాను .
వీరాధివీరా ...... మాగురించి ఆలోచించకు - నీతోపాటు జీవించిన ఈ సమయం చాలు - సంతోషంగా ప్రాణాలొదిలేస్తాము - పరులకోసం బ్రతకడం ఎలానో నేర్పించావు - మరొక జన్మ ఉంటే నీకు మిత్రులుగా జీవించాలని ఉంది అంటూ సోదరులు సంతోషంగా చెప్పారు .
మీలాంటి మిత్రులకు దూరం కావడానికి ఏమాత్రం సిద్ధంగా లేను - నా ప్రాణాలు అడ్డు వేశయినా మిమ్మల్ని రక్షిస్తాను - మిత్రులారా ...... నేను చెప్పినట్లు చేస్తే మనమంతా ప్రాణాలతో విజయం సాధించవచ్చు .
ఆజ్ఞ వీరాధివీరా అంటూ సోదరులలో ఆశ చిగురించినట్లు చిరు సంతోషాలు వెళ్లువిరిసాయి .
మీగురించి మీ ప్రాణాల గురించి కాకుండా ప్రక్కనున్న మిత్రుల ప్రాణాలకు రక్షణగా ఉంటే చాలు .
అర్థమైంది వీరాధివీరా ...... నా ప్రాణాలను ఫణంగా పెట్టైనా నా మిత్రుడిని రక్షించుకుంటాను - నేను ...... నా మిత్రుడిని - నేను ......  నా మిత్రుడిని ....... మహారాజు పన్నాగానికి మించిన ప్రణాళిక , హై హై వీరాధివీరా ...... వీరాధివీరా వీరాధివీరా వీరాధివీరా ....... అంటూ రాజ్యం నినాదాలు చేస్తూ రాక్షస క్రీడాస్థలానికి చేరాము .

మమ్మల్ని చూసినవెంటనే అదిగో మన వీరుడొచ్చాడు , వీరా వీరాధివీరా ...... నీ వీరత్వాన్ని చూడటానికే వచ్చాము , వీరాధివీరా వీరాధివీరా వీరాధివీరా ....... అంటూ రాజ్యం మొత్తం దద్దరిల్లేలా హోరెత్తించారు నలుమూలల రాజ్యాల నుండి వచ్చిన వీక్షకులు .
హోరెత్తిన ప్రతీసారీ మహారాజు కళ్ళు ఎర్రబడుతున్నాయి , ఏమీచెయ్యలేక కోపాన్ని మాత్రం వ్యక్తపరుస్తున్నాడు , నాచావును వెంటనే చూడాలన్నట్లు పోటీలకు పచ్చ జెండా ఊపాడు .

ఢమరుక శబ్దాలు మొదలయ్యాయి - భయంకరమైన కేకలతో ఏడడుగులకు పైనే ఉన్న రాక్షసుల్లాంటి పదిమంది క్రూరాతి క్రూరమైన ఆయుధాలను చేతబట్టి మాముందుకు వచ్చి నిలబడ్డారు - విచిత్రమైన కేకలువెయ్యడం చూస్తుంటేనే సోదరులందరిలో వణుకు మొదలయ్యింది - కొంతమందైతే వెనక్కు పరుగు తియ్యడానికి ప్రయత్నించి సంకెళ్ళ వలన పడిపోవడం చూసి మహారాజు నవ్వుకుంటున్నాడు .
మిత్రులారా ...... ప్రక్కనున్న మిత్రులను కాపాడండి కలిసి పోరాడండి వాళ్ళు పది మంది మనం వందమంది విజయం మనదే ........
నువ్వే మా ధైర్యం వీరాధివీరా ........ అంటూ ఆయుధాలతో సంకెళ్లను కొడుతూ పోటీకి సిద్ధం అన్నట్లు మోత మ్రోగిస్తున్నారు - దానికి తోడు వీక్షకులంతా మావైపునే ఉన్నారు .

మహారాజుకు మళ్లీ కోపం వచ్చినట్లు నరమాంస భక్షకులారా బానిసలందరినీ చంపేయ్యండి - వారి మాంసాలను తినెయ్యండి - విజయం సాధిస్తే అడవిలో ఉన్న మీ గుహల దగ్గరకే నర మాంసాన్ని పంపిస్తాను .
మహారాజు మాటలకు పిచ్చెక్కిపోయినట్లు శబ్దాలు చేస్తూ మామీదకు ఎగబడ్డారు .
సంకెళ్లు వేరుచేసే సమయం కూడా లేకపోవడంతో మాలో చాలామందిని గాయపరిచారు - నేనున్నానన్న ధైర్యంతో సంకెళ్ళ నుండి విముక్తి పొంది అదే ధైర్యంతో గుంపులు గుంపులుగా నరమాంస భక్షకులపై విరుచుకుపడ్డారు - నెత్తురు చిందిస్తూనే పట్టుదలతో ఎదురొడ్డుతున్నారు .
వీరాధివీరా ...... అందరినీ ఒడిసిపట్టేసాము అనేంతలో మళ్లీ నగారా మ్రోగింది . 
పదిమందిని మించిన ముగ్గురు నరరూపరాక్షసులు భయంకరమైన ఆయుధాలతో పరుగునవస్తున్నారు - ఇప్పుడేమి చేస్తావు బానిసా అంటూ మహారాజు రాక్షస నవ్వులు నవ్వుతున్నాడు .
అవును వాళ్ళు గనుక పదిమంది పట్టుని బెడిసికొట్టారో మాలో ఒక్కరం జీవించము అని తెలిసి రెండు కత్తులు పట్టుకుని ముగ్గురికి అడ్డుగా నిలబడి చాలాసేపు పోరాడి వొళ్ళంతా రక్తంతో చివరికి ముగ్గురినీ నేలకొరిగేలా చేసాను - ఆ ధైర్యంతో సంతోషంలో మిత్రులందరూ ఒడిసిపట్టిన వాళ్ళందరినీ నేలకొరిగేలా చేసి నరమాంస భక్షకులు బ్రతికి ఉండకూడదు అని పొడిచి చంపేసి విజయ సంతోషంలో వీరాధివీరా వీరాధివీరా ...... కేకలువేస్తూ నావైపుకు వస్తున్నారు .

ఎక్కడనుండి దూసుకువచ్చాయో ముందు నుండి రెండు బాణాలు ఛాతీలోకి దిగాయి .
ఆహ్హ్ ..........
వీరాధివీరా .......
మోసం - ద్రోహం - మహారాజు పిరికిపంద అంటూ వీక్షకులంతా అలా చూస్తుండిపోయారు .
నోట్లో నుండి కారుతున్న రక్తంతో యా ...... అంటూ కేకలువేస్తూ రెండు బాణాలను బయటకు లాగి మహారాజువైపు గర్వంగా అడుగులువేశాను .
మహారాజు భయపడిపోయినట్లు సైగ చేయగానే వెనకనుండి బాణాలు దూసుకువచ్చి వెన్నులోకి దిగాయి .
ఆహ్హ్ ...... మహీ అంటూ నేలతల్లి ఒడిలోకి చేరాను .
వీరాధివీరా అంటూ మిత్రులందరూ చుట్టూ చేరారు - బ్రతికే ఉన్నాడు వీరాధివీరుడు ఇంకా బ్రతికే ఉన్నాడు .
మహారాజు : ఇంకా బ్రతికే ఉన్నాడా ...... ? , ఈ క్షణం కోసమే సిద్ధం చేసిన చివరి నరమాంస భక్షకుడిని పంపండి , ముందు వీరుడైన బానిసను తరువాత చుట్టూ ఉన్న బానిసలను ...... , భటులారా .......
భటులు వచ్చి మిత్రులందరినీ బంధించారు .
అలాగే అన్నట్లు రాక్షస శబ్దాలతో నావైపుకు వస్తున్న మృగాన్ని సంకెళ్లు ఉన్నా అడ్డుపడుతున్న సోదరులను ప్రక్కకు లాగేస్తూ నా దగ్గరికి చేరుకున్నాడు - నా తలను నరకడం కోసం మనిషి బరువున్న రాక్షస గొడ్డలిని పైకెత్తి మహారాజువైపు చూసాడు .
మహారాజు ...... గొంతు తెగ నరకమని ఆజ్ఞాపించడం , ఆజ్ఞ అన్నట్లు చుట్టూ ఉన్న వీక్షకుల వైపుచూసి రాక్షస నవ్వులతో క్రీడామైదానం మొత్తం ఘీంకరిస్తూ సిద్ధం అయ్యాడు .

 " నా ప్రియదేవుడా ....... మీకు అపజయమా ? , మీరులేక నేను జీవించగలనా ? , నా చావు మీ కౌగిలిలో - మీ చావు నా కౌగిలిలో మాత్రమే , మీరాక కోసమే వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాను అంటూ పెదాలపై నా దేవకన్య ముద్దు " .
రాక్షసుడి గొడ్డలి నా మెడను తాకేంతలో ...... నేలకొరిగిన కత్తితో వాడి తలను నరికి విజయ గర్వంతో మహారాజు ఎదుట నిలబడ్డాను చిరునవ్వులు చిందిస్తూ ........ 
 వాడి చావు కేక రాజ్యం మొత్తం వినిపించింది - మహారాజు అవాక్కై అలా నిలబడిపోయాడు .
వీరా వీరాధివీరా అంటూ సంకెళ్లతో వచ్చి నన్ను పైకెత్తి విజయ సంబరాలు చేసుకున్నారు . 
మిత్రులందరిపై స్పృహకోల్పోయాను .
నీళ్లు నీళ్లు అందుకోండి - వీరాధివీరుడికి వెంటనే నీళ్లు కావాలి అంటూ తోటి చెరశాల మిత్రుడు కేకలువేస్తున్నాడు .
Like Reply
అవునవును వెంటనే త్రాగించడానికి నీళ్లు ఇవ్వండి , గిల గిల కొట్టుకునే ప్రాణానికి నీళ్లు త్రాగిస్తే వెంటనే ప్రాణాలొదిలేస్తాడు అంటూ మహారాజు ఆజ్ఞ వేసాడు .
మంత్రి : నాకు అలా అనిపించడం లేదు మహారాజా ...... , కారాగారపు బాధ్యతలు నిర్వహిస్తున్న భటుడు చెప్పిన దానిప్రకారం నీరు త్రాగితే ఆ వీరుడు వెంటనే ఆరోగ్యవంతుడు అయిపోతాడట , ఆరోజున నేను పట్టించుకోలేదు , బానిసల కాంక్ష చూస్తుంటే నిజమేననిపిస్తోంది .
మహారాజు : అలా అయితే చుక్క మంచినీరు కూడా ఇవ్వకండి వెంటనే కారాగారంలో ఉన్న నీటి కుండలన్నింటినీ పగలగొట్టి ఒక్క బానిస కూడా బయటకు రాకుండా కారాగారంలో బంధించండి , నీరు త్రాగక వాడే ప్రాణాలొదిలేస్తాడు అంటూ రాక్షస నవ్వులు నవ్వుతున్నాడు .
మంత్రి : ఆజ్ఞ మహారాజా అంటూ సైన్యాధ్యక్షుడికి సైగ చెయ్యడం - భటులు వెళ్లి శిరసావహించడంతో చుక్క నీరు అందుబాటులోకి లేకుండా బంధించబడ్డాము .

ఇప్పుడెలా ఇప్పుడెలా మన వీరాధివీరుడు బ్రతకాలంటే నీరు కావాలి - ఇలాంటి రాక్షస రాజుని ఎక్కడా చూడనేలేదు అంటూ నన్ను ఆకులపై పడుకోబెట్టి బాధపడుతున్నారు - మన ప్రాణాలకు అడ్డుగా నిలబడిన వీరాధివీరుడిని కాపాడుకోలేకపోతున్నాము అంటూ వారి గాయాలను సైతం పట్టించుకోకుండా నాకోసం ప్రార్థిస్తున్నారు .
కొద్దికొద్దిసేపటికే భటులు వచ్చి చూసి మహారాజుకు పరిస్థితిని తెలియజేస్తున్నారు .

ఘడియలు గడిచిపోతున్నాయి చీకటిపడసాగింది - దాహం దాహం అంటున్నా నాపెదాలపై చిరునవ్వులు చూసి ఆశ్చర్యపోతున్నారు సోదరులు , వీరాధివీరా ...... ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పటికీ మీ ముఖంలో చిరునవ్వు .......
ఒక్కసారిగా భయంకరమైన ఉరుములు మెరుపులు ఆ వెంటనే పెద్ద ఎత్తున వర్షం ....... , కొద్దిసేపటికే స్వచ్ఛమైన వర్షపు నీరు వరదలా భటులను చెల్లాచెదురు చేస్తూ చేరశాలలోకి రావడం - నన్ను అక్కున ఒడిలోకి చేర్చుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు , గంగమ్మ తల్లే స్వయంగా వచ్చింది అంటూ మొక్కుకుని దాహాన్ని తీర్చుకున్నారు సోదరులు - వెంటనే అందరూ స్పృహ కోల్పోయారు .

( గంగమ్మ ఒడిలో హాయిగా ఉపక్రమించగానే దేవకన్యతో విహారపు రెండవ రోజు జరిగిన అందమైన చిలిపిపనులు సాయంత్రానికి తల్లీబిడ్డలు ఏకమై నన్ను అమాయకుడిని చేసి ప్రకృతి జలపాతపు సమక్షంలో రెండవరోజున నన్ను బలవంతంగా అత్యాచారం చేసి నాకు తెలియకుండానే స్వర్గపు అనుభూతిని పంచడం - ఆహ్హ్ ....... నదీఅమ్మ ఒడిలో సంతృప్తిగా నా గుండెలపైకి చేరిన నా దేవకన్య పొందుతున్న మాధుర్యపు అనుభూతికి ఎలా వెలకట్టగలం జీవితాంతం అలా చూస్తుండిపోవచ్చేమో ...... , మహీ ....... నాకు తెలియకుండానే పంచిన మధురానుభూతికి చాలా చాలా సంతోషం అంటూ సిగ్గు ఆగడం లేదు ) 

ఒక్కసారిగా లేచి అంటే రెండవ రేయి కూడా శోభనం జరిగిందన్నమాట - అంతా నదీ అమ్మే చేసింది అంటూ తియ్యనైనకోపంతో సిగ్గులమొలకలవుతున్నాను .

వీరాధివీరా వీరాధివీరా ....... కలగన్నావా ? నీలో నువ్వే మురిసిపోతున్నావు .
చుట్టూ చూస్తే సూర్యకిరణాలు చేరశాలలోకి పడుతున్నాయి , మరొకవైపు ఆశ్చర్యం ...... సోదరులారా మీ గాయాలు - రక్తం అంటూ నా బాణాల గుర్తులను చూసుకుంటే పూర్తిగా మానిపోయాయి .
సోదరులు : నిజంగా ఆశ్చర్యమే వీరాధివీరా ...... , రాత్రి కురిసిన పెద్ద వర్షానికి కారాగారంలోకి ప్రవాహంగా వచ్చిన నీరు , నీ గాయాలతోపాటు మా అందరి గాయాలను మాయం చేసేసింది అంటూ గంగమ్మ తల్లికి ప్రార్థించి వీరాధివీరా వీరాధివీరా అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు - నిన్నటి పోటీల విజయ సంబరాలు చేసుకోలేదు అంటూ నన్ను అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు .
గంగమ్మ తల్లీ ...... సంతోషం - నన్నుకాదు నీ బిడ్డకు రక్షణగా ఉండి జాగ్రత్తగా చూసుకుంటే చాలా చాలా సంతోషం అంటూ భక్తితో ప్రార్థించి , సోదరులంతా క్షేమంగా ఉండటం చూసి సంతోషించాను .

ఈ విషయం భటులు ద్వారా తెలుసుకున్న మహారాజు ఎలా ఎలా ఎలా సాధ్యం మాహామంత్రీ ....... , ముందు నుండి వెనకనుండి రెండు చొప్పున విషం పూసిన బాణాలు శరీరంలోకి దిగినా ఎలా బ్రతికాడు అంటూ చేతికి దొరికివాటిని పగలగొడుతున్నాడు పిచ్చెక్కినవాడిలా ....... 
మంత్రి : వాడి గాయాలే కాదు ప్రభూ బానిసలందరి దెబ్బలు కూడా మానిపోయాయట - ఇదంతా చూస్తుంటే వాడు వీరాధివీరుడే కాదు దైవంశ సంభూతుడిలా అనిపిస్తోంది .
మహారాజు : అలాంటిదేమీ లేదులే మంత్రీ ...... 
మంత్రి : అరవీర భయంకరమైన మల్ల యోధులను అవలీలగా ఓడించాడు - క్రూర మృగాలను తన వశం చేసుకున్నాడు - చూస్తేనే ప్రాణభయం కలిగే నరమాంస భక్షకులను బానిసలలో ధైర్యం పంచి తలలు తెగ నరికించి విజయం సాధించాడు - విషాన్ని సైతం ........
మహారాజు : ఆపండి మంత్రీ ....... , వాడిని చంపే ఉపాయం చెప్పండి చాలు .
వాడిని చంపడమా ...... వాడిని చంపాలని ప్రయత్నం చేసినా రాజ్యంలోని ప్రజలంతా ఎదురుతిరిగేలా ఉన్నారు , మనం చేసిన ద్రోహానికి కొంతమంది ఆ వీరుడిని వెంటనే చూడాలని సింహద్వారం దగ్గర నినాదాలు చేస్తున్నారు - రాజ్యం ప్రజలంతా సింహద్వారం దగ్గరికి చేరుకుంటే అదుపుచెయ్యడం సైన్యం వలన కాదు ప్రభూ అంటూ సైన్యాధ్యక్షుడు విన్నవించుకున్నాడు .
మహారాజు : మరొక తలపోటు తెచ్చాడా ఆ బానిస అంటూ తలను పట్టుకుని కూర్చున్నాడు .
ప్రభూ ప్రభూ ....... సమయసమయానికి సింహద్వారం దగ్గరికి ప్రజలు పెరుగుతూనే ఉన్నారు ప్రభూ అంటూ భటులు కంగారుపడుతూ వచ్చి చెప్పారు .
మంత్రి : మహారాజా మీరు అనుమతిస్తే .......
మహారాజు : ఏదోఒకటి చెయ్యండి అంటూ కోపంతో ఆజ్ఞాపించాడు .
మంత్రి : చిత్తం మహారాజా అంటూ వెళ్లి కొద్దిసేపటి తరువాత వచ్చాడు - ప్రభూ ........ ఆ బానిస వీరుడు క్షేమం అని తెలుసుకుని ప్రజలు శాంతించారు , ప్రస్తుతానికి మాత్రమే మహారాజా ..... ఏ క్షణంలోనైనా రాజ్యం నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం లేకపోలేదు అంతలోపు మనం ఏదోఒకటి చెయ్యాలి .
మహారాజు : హమ్మయ్యా ......

ఆరోజుకు గండం తప్పిందని అనుకున్న మహారాజుకు రోజులు గడిచేకొద్దీ నలుమూలల నుండి వస్తున్న ప్రజల వలన కొత్త తలనొప్పులు మొదలవుతూనే ఉన్నాయి - మాహామంత్రీ ...... వాడిని చంపే ఉపాయం ఆలోచించారా ? .
మంత్రి : మహారాజా ...... మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ బానిస వీరుడు దైవంశ సంభూతుడు , వాడిని చంపడం కాదు కదా ఓడించేవాడు ఈ భువిపై లెనేలేడు , పోటీలనైనా సక్రమంగా నిర్వహించండి లేకపోతే వీరాధివీరుడిని విడుదల అయినా చెయ్యండి అంటూ ప్రజలు తమ భావ ప్రకటనను తెలియజేస్తున్నారు , మీకు తెలియంది కాదు ప్రజలే తిరగబడితే ఎలాంటి రాజ్యం అయినా ఉండదు .
మహారాజు : వాడిని ఏమీ చేయలేమా ? .
సైన్యాధ్యక్షుడు : ఏమీచెయ్యలేము ప్రభూ ...... , వాడి గురించి తెలిసి ఎవ్వరూ వాడితో పోటీకి దిగడానికి సాహసించడం లేదు , నాలుగు పక్షముల పాటు ప్రక్కనున్న రాజ్యాలతోపాటు చాలా రాజ్యాలలో ప్రయత్నించినా ఉపయోగం లేదు , మన బానిస వీరుడిని దేవుడని కూడా అంటున్నారు - దేవుడితో పోటీపడటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు మహారాజా ....... , వాడి గురించి ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది , ఏక్షణమైనా సింహద్వారం బద్దలు కావచ్చు .......

మహారాజు : అరవై పక్షముల సమయంలో ఆ బానిసను ఏమీచెయ్యలేకపోయాము మన రాజ్యానికే ఆపదను తీసుకువచ్చాడు .
మహారాజా మహారాజా ...... సింహద్వారామును మరొక్క రోజు మాత్రమే నిలబెట్టుకోగలం , వేలల్లో ప్రజలు చేరుతున్నారు .
మంత్రి : ప్రభూ ....... 
మహారాజు : అర్థమైంది మంత్రీ ...... కానీ నా అహం ఒప్పుకోవడం లేదు .
మంత్రి : తప్పదు మహారాజా ....... , ఇక్కడ చంపలేకపోయినా బయట మనకు అవకాశం లభించవచ్చు .
సైన్యాధ్యక్షుడు : అవును మహారాజా ఇక్కడ చంపితే రాజ్యంపై నింద - బయట హతమారిస్తే ......
మహారాజు : హ హ హ ...... వెంటనే అమలుపరచండి .
మంత్రి : చిత్తం మహారాజా , సైన్యాధ్యక్షా ...... ప్రజలందరూ చూస్తుండగానే విడుదల చెయ్యండి .

స్వయంగా సైన్యాధ్యక్షుడే వెళ్లి ప్రజలకు విషయం తెలిపి కారాగారానికి వెళ్ళాడు - విడుదల చేస్తున్నట్లుగా ఉత్తరువులను చూయించాడు .
అందరినీ కదా ......
సైన్యాధ్యక్షుడు : కేవలం నిన్ను మాత్రమే .
అయితే విడుదల కావడం ఇష్టం లేదు అంటూ చేరశాలలోనే కూర్చున్నాను , నా నేస్తాలు మంజరి - గుర్రంతోపాటు ఇక్కడ శిక్షను అనుభవిస్తున్న సోదరులందరినీ విడుదల చెయ్యాలి లేకపోతే చివరి పోటీలను నిర్వహించండి విజయం సాధించి మా హక్కుల వరాల ద్వారా మా స్వేచ్ఛను సాధించుకుంటాము .
సోదరులందరూ ఉద్వేగాలకు లోనై వీరాధివీరుడు వీరాధివీరుడు అంటూ రాజ్యం మొత్తం వినిపించేలా సంతోషాలను వ్యక్తపరుస్తున్నారు .
భటుడు : మహారాజునే ధిక్కరిస్తావా అంటూ కత్తిని తీసాడు .
సైన్యాధ్యక్షుడు : రాక్షసుల్లాంటి వారినే మట్టికరిపించాడు వెళ్ళు చూద్దాము .
భటుడు : లేదు లేదు లేదు అంటూ భయపడిపోయాడు .
కారాగారం మొత్తం నవ్వులు ......

వెంటనే సైన్యాధ్యక్షుడు వెళ్లి మహారాజుకు తెలియజేశాడు .
మహారాజు : కుదరనే కుదరదు .
సైన్యాధ్యక్షుడు : ఈ విషయం ప్రజాలదాకా వెళ్లలేదు మహారాజా , చీకటి పడుతున్నా వరదలుగా ప్రజలు చేరుతూనే ఉన్నారు , ఈ విషయం గనుక తెలిస్తే క్షణాల్లో సింహద్వారం బద్ధలుకొట్టుకుని లోపలికివచ్చేస్తారు మహారాజా .......
మహారాజు : మరొక తలపోటు తెచ్చాడుకదా ఆ కావరమైన బానిస అంటూ రగిలిపోతున్నాడు - ఉపాయం ఏమిటి మంత్రీ ......
మంత్రి : మహారాజా ...... , మీ అహం సంతృప్తి చెందాలంటే ఒకేఒక ఉపాయం - వేశ్య మందిరం .
మహారాజు : అర్థమైంది అర్థమైంది మంత్రీ సరైన ఉపాయం వెంటనే బానిసలందరినీ విడుదల చేయడానికి సిద్ధం చేసి వాడిని మాత్రం వేశ్య మందిరం దగ్గరకు తీసుకురండి - విషపు వేశ్యలను సిద్ధం చెయ్యండి - వాడి చదివి వేశ్య మందిరంలో వేశ్యల ద్వారా రాసిపెట్టి ఉంటే ఏమిచెయ్యగలం విషం ద్వారా వాడు చావగానే బానిసలందరినీ వదిలి బయట చంపేయ్యండి అంటూ రాక్షస నవ్వులు నవ్వుతున్నాడు - సైన్యాధ్యక్షా ...... దరిదాపుల్లో మంచినీరు మాత్రం అందుబాటులో ఉండకూడదు .
చిత్తం అంటూ వెంటనే మహారాజు చెప్పినట్లు సోదరులందరినీ వేశ్య మందిరం బయటివైపు - నన్ను మాత్రం వేశ్యమందిరం ప్రవేశద్వారం వైపుకు తీసుకెళ్లారు .
Like Reply
మావీరుడైన మహేశ్వరుడు ఎక్కడ ఎక్కడ అంటూ సోదరులంతా కంగారుపడుతూ భటులను అడిగారు .
భటులు : అతడు వీరాధివీరుడే కాదు శృంగార రసికుడు అంటూ హేళన చేస్తున్నారు , ఇదిగో ఈ చిలుక - గుర్రం మరియు మీ స్వేచ్ఛతోపాటు బోలెడంత మంది వేశ్యాలతో శృంగార కాంక్షను కోరుకున్నాడు .
సోదరులు : మహేశ్వరుడి మనసులో ఒక్కరికే స్థానం అని మా అందరికీ తెలుసు - ఇలాంటి కోరికలను ఎన్నటికీ కోరుకోరని మాకు తెలుసు .
భటులు : మీ వీరుడు ఎంతటి శృంగార కామికుడో ప్రత్యక్షంగా మీరే చూస్తారుగా , అదిగో వేశ్యాలయం అందులోనుండి బయటకువస్తే మీరు చెప్పినదే నిజం లేకపోతే మేమన్నదే నిజం , వేశ్యల మైకం నుండి బయటపడి మీ వీరుడు ఉదయానికి వస్తాడో లేక జీవితాంతం వేశ్యల శృంగార కేళిలో మునిగిపోతాడో చూద్దాము .
సోదరులు : వేశ్య మందిరం ఎన్ని అడుగులు ఉంటుంది భటులారా .......
భటులు : రెండు వందల అడుగులపైనే ......
సోదరులు : అయితే రెండు వందల క్షణాలలో మన ముందు ఉంటాడు చూడండి .
భటులు : చూద్దాము చూద్దాము , లోపల ఉన్నది కామసూత్రలలో ఆరితేరిన రంభ ఊర్వశి మేనకలు అంటూ ముగ్ధులైనట్లు పులకించిపోతున్నారు .

వేశ్య మందిరానికి ప్రవేశ ద్వారంవైపు నా ముసుగును తొలగించారు , కళ్లెదురుగా మహారాజు - సోదరులందరిని బానిసలుగా చూస్తున్నందుకు భయంకరమైన రాక్షస క్రీడలను నిర్వహిస్తూ రాక్షసానందం పొందుతున్నందుకుగానూ కత్తితో ఖండ ఖండాలుగా నరికేయ్యాలన్న కాంక్షను నియంత్రించుకుని కోపంతో చూస్తున్నాను .
మహారాజు సైగచెయ్యడంతో సైన్యాధ్యక్షుడు వచ్చి నా కళ్ళను దించడానికి ప్రయత్నిస్తున్నాడు .
మహారాజు : ఇదిగో ఈ వైఖరే నిన్ను చంపెయ్యాలనిపించేలా చేసింది - ప్రజల మద్దతు వలన బ్రతికిపోతున్నావు - అదిగో ఈ వేశ్యాలయం అటువైపు నీ చిలుక గుర్రం నా బానిసలు ...... నీకోసం ఆశతో ఎదురుచూస్తున్నారు , దీని ద్వారా అటువైపుకు చేరుకుంటే స్వేచ్ఛ మీ అందరి సొంతం , సంకెళ్లు తీసి లోపలికి పంపండి .
సైన్యాధ్యక్షుడు : ఆజ్ఞ ప్రభూ అంటూ నన్ను ప్రవేశ ద్వారం వైపుకు తీసుకెళుతున్నాడు .

ఇలాంటి అహంతో పరిపాలించే రాజు ఎల్లకాలం రాజ్యాన్ని కాపాడుకోలేడు అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా ప్రజల సంతోషం కోసం పరిపాలన సాగించండి , మన కలయిక ఇదే చివరిసారి అని నేనకోవడం లేదు .
మహారాజు : మంత్రీ ...... ఇతడిని ప్రాణాలతో వదలడం నాకేమాత్రం ఇష్టం లేదు .
మంత్రి : మహారాజా మహారాజా ...... లోపల మన వేశ్యలే చూసుకుంటారు , వారి శృంగార అందాలతో రెచ్చగొట్టి మీ కోపాన్ని చల్లారుస్తారుగా అంటూ శాంతిoపచేశాడు .

వేశ్యాలయం ప్రవేశద్వారం తెరిచి లోపలికి తోసేసి ద్వారం మూసేసారు .
ఒక్కసారిగా శృంగార పరిమళ సువాసనలు - మందిరం అంతా క్రొవ్వొత్తి వెలుగులు -  ప్రవేశంలో కామసూత్ర ప్రతిమలు - అడుగడుగునా శృంగారమే .......
రా శృంగారవీరా అంటూ ఒంటిపై నూలుపోగులేని శృంగార వేశ్యలు నాచుట్టూ చేరి అందాలతో రెచ్చగొడుతున్నారు . 
వెంటనే హృదయంపై చేతినివేసుకుని నా విశ్వసుందరి దేవకన్యను తలుచుకున్నాను - అంతే మరుక్షణంలో పరిసరాలన్నీ మహిమయం అయిపోయాయి - వేశ్యలు ఎంత రెచ్చగొడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు అడుగులువేస్తున్నాను .
ఆ వెంటనే చిటిక ...... నా చుట్టూ ఉన్న వేశ్యలంతా వెనక్కు వెళ్లడం - కామసూత్రలో ఆరితేరిన వేశ్యలు ఎంతలా రెచ్చగొడుతున్నారంటే ఎంతటి మగాడైనా వేశ్యల పాదాల మధ్యకు చేరాల్సిందే స్వర్గపు రుచిని ఆస్వాదించాల్సిందే ......
అయినాకూడా వాళ్ళెవ్వరినీ పట్టించుకోకుండా నా దేవకన్య అందంలో మైమరిచిపోయినట్లు అలా ముందుకు వెళ్లిపోతుండటం చూసి వాళ్లే ఆశ్చర్యపోతున్నారు .
మరికొన్ని అడుగులువెయ్యగానే గుంపులుగా వేశ్యలు ..... మగాళ్ల చుట్టూ చేరి వారిని కామసూత్ర భంగిమలలో స్వర్గంలో విహరించేలా శృంగారం చేస్తూ నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు , అలా అన్నిరకాల రెచ్చగొట్టే శృంగారాల నుండి నా దేవకన్య ప్రేమవలన పట్టించుకోకుండా వేశ్య మందిరం నుండి దిగ్విజయంగా బయటకు చేరాను .

రెండు వందలు ...... అదిగో వీరాధివీరుడైన మహేశ్వరుడు అంటూ అంతులేని ఆనందంతో పరుగునవచ్చి అమాంతం పైకెత్తేసి సంబరాలు చేసుకుంటున్నారు .
ఇతడు నిజంగానే వీరాధివీరుడు అంటూ భటులంతా తలలు దించుకున్నారు .
సోదరులు : వీరాధివీరా ...... నీగురించి ఏవేవో చెప్పారు , వాటిని పటాపంచలు చేసి మమ్మల్ని గెలిపించావు .
చాలా సంతోషం సోదరులారా మనవాళ్ళంతా స్వేచ్ఛను పొందినట్లే కదా ......
సోదరులు : వీరాధివీరా వీరాధివీరా ....... అంటూ రాజ్యం మొత్తం వినిపించేలా సంబరాలు చేసుకుంటున్నారు - దేవుళ్ళ ఆశీర్వాదం లభించినట్లు వర్షం కురవడంతో అందరూ వర్షంలో తడుస్తూ ముగ్ధులవుతున్నారు .

భటుడి చేతిలో పంజరం - ప్రక్కనే కృష్ణ ఉండటం చూసి వెంటనే కిందకుదిగివెళ్లి , మిత్రమా అంటూ హత్తుకుని భటుడి చేతిలోనుండి పంజారాన్ని అందుకుని మంజరిని ప్రేమతో అందుకుని మంజరీ మంజరీ అంటూ ముగ్గురమూ హత్తుకున్నాము .
మంజరి : ఈ క్షణం వస్తుందని తెలుసు ప్రభూ ..... అంటూ మాచుట్టూ స్వేచ్ఛగా ఎగరసాగింది .

సోదరుల నినాదాలు విని సింహద్వారం దగ్గర ఉన్న ప్రజలంతా వచ్చి మాచుట్టూ చేరారు - తల్లీతండ్రి సోదర సోదరీమనులారా ...... మీవల్లనే మేమంతా స్వేచ్ఛను పొందగలిగాను మీ రుణం తీర్చుకోలేనిది అంటూ అందరమూ చేతులు జోడించాము .
వీరుడు ...... మహానుభావుడు , రాజ్యానికి ఇలాంటి వీరాధివీరుడైన రాజు ఉండాలి అంటూ వర్షంలోనూ నినాదాలతో హోరెత్తించారు , మా ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుని సూర్యోదయం తరువాత వెళ్ళమని ఆహ్వానించారు .
చాలా సంతోషం కానీ నా గమ్యానికి ఇప్పటికే చాలా చాలా ఆలస్యం అయ్యింది వెంటనే బయలుదేరాలి మన్నించండి , మీ సహాయాన్ని మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటాను .
సోదరులు : వీరాధివీరా ...... నీ గమ్యం చేరుకోవడానికి మేమంతా సహాయం చేస్తాం - మీవెంటనే వస్తాము .
సంతోషం సోదరులారా ...... , నా ప్రాణం ...... నాకోసం ఎలా అయితే ఆశతో ఎదురుచూస్తూ ఉంటుందో అలానే మీకోసం ..... మీ ప్రియమైన వారు పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు , నావలన వారు మరింత సమయం బాధపడకూడదు వెళ్ళండి వారి చెంతకు చేరి మంచిగా బ్రతకండి సెలవు ....... 
వీరాధివీరా మహేశ్వరా వీరాధివీరా ...... అంటూ రాజ్యం నుండి ముగ్గురమూ బయటకు వచ్చేన్తవరకూ వినిపిస్తూనే ఉన్నాయి .

ప్రవాహం కనిపించగానే నదీఅమ్మా అంటూ ఏకంగా మంజరి - కృష్ణతోపాటు అమ్మ ఒడిలోకి చేరిపోయాను , దాదాపు అరవది పక్షముల తరువాత అమ్మ చెంతకు చేరే అదృష్టం కలిగింది అంటూ పులకించిపోయాను , ఇన్నాళ్లయినా మీ బిడ్డ జాడ కనిపెట్టలేకపోయానమ్మా - మహి జ్ఞాపకాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నాను అంటూ అమ్మ ఒడిలో కన్నీళ్లు కార్చాను .
అంతలో సంతోషం , మంజరీ - కృష్ణా ...... మన మహి ఇటువైపుగానే వెళ్లినట్లు అమ్మ చెబుతోంది . 
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని మంజరి - కృష్ణ ఒడ్డుకు చేరారు .
అమ్మా ...... మీ బిడ్డకు రక్షణగా ఉండండి అంటూ కృష్ణపైకెక్కి చంద్రుడి వెన్నెలలో ప్రవాహం వెంబడి సూర్యోదయం వరకూ ఎక్కడా విశ్రమించకుండా వందల మైళ్ళ దూరం ప్రయాణించాము . 

సూర్యోదయ సమయానికి అమ్మఒడికి చేరి సూర్య వందనం చేసుకున్నాను , గురువుగారు క్షేమంగా - ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాను .
మరింత సంతోషం , మంజరీ - కృష్ణా ...... అప్పటి ప్రయాణంలో ఇదిగో ఇక్కడ ఇక్కడ మహి దాహం తీర్చుకుంది , అమ్మా ...... ఆ అనుభూతిని నాకోసం ఇన్నాళ్లూ పదిలంగా ఉంచుకున్నారా అంటూ తృప్తిగా దాహం తీర్చుకుని , మంజరికి - కృష్ణకు ఫలాలు తినిపిస్తూ అమ్మ ఆనవాళ్ళతో ప్రయాణం కొనసాగించాను .

ఆశ్చర్యంగా ప్రవాహపు ఘాడత తగ్గుతూ వస్తోంది - ఒకప్పుడు నిండుగా ప్రవహించిన ఆనవాళ్లు ప్రస్ఫూటంగా తెలుస్తున్నాయి - ప్రవాహానికి తగ్గట్లుగానే ప్రవాహానికి దూరంలో ఇరువైపులా దట్టమైన అడవి కూడా పచ్చదనాన్ని కోల్పోతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి .
చీకటిపడటం - రోజంతా ప్రయాణించిన కృష్ణకు విశ్రాంతి ఇవ్వాలని ఒకచోట ఆగాము .
మిత్రమా ...... నాకేమీ అలసట లేదు వెళదాము అంటూ తెలియజేశాడు .
నీమనసు నాకు తెలియదా ..... , ఇలానే స్వారీ చేస్తూ వెళ్లామని తెలిస్తే మహి బాధపడుతుంది , నువ్వు విశ్రాంతి తీసుకో మంజరితోపాటు వెళ్లి ఆహారం తీసుకొస్తాను - దగ్గరలోనే ఉన్న చెట్ల నుండి మంజరికి తినిపిస్తూ పళ్ళు కోసుకున్నాను .
Like Reply
మిత్రుడి ఘీంకారాలు వినిపించడంతో మిత్రమా మిత్రమా అంటూ పరుగులుతీసాను , మిత్రమా మిత్రమా ...... ఏమైంది ? .
ప్రవాహానికి అటువైపుకు సైగలుచేసింది .
అటువైపునుండి ఏదో జంతువు ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు గర్జనతోకూడిన మూలుగులు వినిపిస్తున్నాయి . 
మంజరి : ఆ గర్జన ఖచ్చితంగా అడవిరాజుదే అయిఉంటుంది ప్రభూ ..... , మూలుగులు కూడా వినిపిస్తున్నాయి అంటే ఏదో ఆపదలో చిక్కుకున్నట్లుగా ఉంది పాపం .......
అయితే రక్షించాలి అంటూ నడుము లోతున మాత్రమే ఉన్న ప్రవాహం దాటుకుని అటువైపుకు చేరాము .
అప్పటికే మంజరి ఎగురుకుంటూ వెళ్లి వచ్చింది , ప్రభూ ...... అడవిరాజే - పాపం వేటగాళ్ళు ఏర్పరిచిన లోతైన గుంతలో పడింది - ఏదో గుచ్చుకున్నట్లు చుట్టూ రక్తం .......
మంజరి వెనుకే వెళ్ళిచూస్తే మనిషి లోతుకన్నా ఎక్కువున్న గుంతలో పడిపోవడం - పడిన జంతువుల ప్రాణాలు పోయేటట్టు గుంత మొత్తం చూపుగా ఉన్న గునపాలు ఏర్పాటు చేసినందువలన గుచ్చుకున్నట్లు చుట్టూ రక్తంతో విలవిలలాడిపోతోంది .

మిత్రమా - మంజరీ ...... అలానే వదిలేస్తే ప్రాణాలు పోయేలా ఉన్నాయి అంటూ దగ్గరలో ఉన్న మఱ్ఱిచెట్టు ఊడలను తీసుకొచ్చి మిత్రుడికి చుట్టి నోటికి అందించి ఏమాత్రం ఆలోచించకుండా కిందకుదిగాను .
జాగ్రత్త ప్రభూ అంటూ మంజరి గుంత చుట్టూ ఎగురుతూ కంగారుపడుతోంది - కృష్ణా గట్టిగా పట్టుకో కింద అంతా గునపాలు ఉన్నాయి - ప్రభూ ప్రభూ ...... ఎడమవైపుకు కుడివైపుకు అంటూ కిందకు దిగడంలో జాగ్రత్తలు చెబుతోంది .
ఎలాగోలా జాగ్రత్తగా నేలను చేరాను .
నన్ను చూసి భయపెట్టడానికో లేక భయపడో గర్జిస్తూ లేవడానికి తెగ ప్రయత్నిస్తోంది వల్ల కాక విపరీతమైన నొప్పితో విలవిలలాడిపోతోంది - దాని నోరే నా తల అంత ఉంది మరి నాకూ కాస్త భయం వేసింది - నన్ను వేటగాడు అనుకునేమో గింజుకుంటోంది ఎక్కడ ప్రాణాలు తీస్తానో అని - కన్నీళ్లు కార్చడం తెలుస్తోంది .
మిత్రమా ...... నిన్ను కాపాడటానికే వచ్చాను శాంతించు శాంతించు అంటూ ధైర్యంగా దగ్గరకువెళ్లి ప్రేమతో సింహం శిరస్సుపై మిత్రుడిని అని తెలిసేలా స్పృశించాను . 
ఆప్యాయత తెలిసినట్లు ఒక్కసారిగా ఉపశమనం చెందినట్లు కదలకుండా ఉండిపోయింది .
ఒక పాదానికి మరియు పొత్తి కడుపులో గుచ్చుకున్న గునపాల నొప్పితో విలవిలలాడుతున్న సింహంను కష్టమైనా దుర్గమ్మ తల్లీ అంటూ పైకెత్తి ప్రక్కన ఉంచాను నా అంత పొడవు ఉందిమరి , సింహం కన్నీళ్లను తుడిచి వీటి సహాయంతో పైకి చేరుస్తాను అంటూ ఊడలను జాగ్రత్తగా కట్టి మిత్రుడికి సైగచేసాను కిందనుండి నేనూ ఎత్తుతున్నాను .
అంతటి బరువున్న అడవిరాజును ఎత్తడం చాలా చాలా కష్టమే అయినా ఎలాగోలా పైకి చేర్చాము , భళా మిత్రమా భళా అంటూ మిత్రుడు నోటిద్వారా వదిలిన మరొక ఊడ ద్వారా సునాయాసంగా పైకిచేరాను .

మంజరీ ...... ముక్కుతో నువ్వుకూడా లాగావన్నమాట అందుకే సింహం ను పైకెత్తగాలిగాము .
మంజరి : పోండి ప్రభూ అంటూ భుజంపైకి చేరి సిగ్గుపడుతోంది .
మూలికలు మూలికలు ఔషధ మూలికలు అంటూ చంద్రుడి వెన్నెలలో కోసుకొచ్చి బండపై నూరి సింహం గాయాలపై ఉంచి కట్టు కట్టాను .

ఆకులలో నీళ్లు తీసుకొచ్చి త్రాగించాను - మంజరీ ...... గాయాలను చూస్తుంటే గుంతలోపడి రెండు రోజులకు పైనే అయినట్లు ఉంది .
మంజరి : అయితే నీటితోపాటు ఆహారం కూడా కావాలి ప్రభూ ...... , ఉండండి దగ్గరలో ఏవైనా జంతువుల కళేబరాలు ఉంటే చూస్తాను అంటూ పైకెగిరింది .
జాగ్రత్త మంజరీ .......
సింహం చుట్టూ చుట్టిన ఊడలను వేరుచేసేంతలో మంజరి వచ్చింది , ప్రభూ కాస్త దూరంలో సింహమో పులో తిని వదిలిన జింక కళేబరం ఉంది .
మంజరి వెనుకేవెళ్లి తీసుకొచ్చి సింహం నోటి ముందు ఉంచాను - తెగ ఆకలితో ఉన్నట్లు కష్టంగానే ఆవురావురుమంటూ మొత్తం తినేసింది .
నీటిని త్రాగించి విశ్రాంతి తీసుకోమని ఒక చేతితో స్పృశిస్తూ మేము ముగ్గురం పళ్ళు స్వీకరించాము .
మేము కాపాడటమే కాకుండా చూపిస్తున్న ఆప్యాయతకు మావైపు చూసిన చూపుకు చాలా సంతోషం వేసింది .
అడవిరాజా ...... నీకేమీ కాదు హాయిగా నిద్రపో అంటూ తెలియజేసి మేమూ విశ్రాంతి తీసుకున్నాము .
********************

రాత్రీ పగలూ విశ్రమించకుండా ప్రయాణించడం వలన అలసిపోయినట్లు సూర్యకిరణాలు మాపై పడేంతవరకూ ఘాడమైన నిద్రపోయాము .
సూర్యోదయ సమయం అంటూ లేచి ప్రవాహం దగ్గరకువెళ్లి సూర్యవందనం చేసుకుని వచ్చాను . 
అప్పటికే ప్రయాణానికి సిద్ధం అన్నట్లు నా భుజంపైకి చేరింది మంజరి - లేచి సిద్ధంగా ఉన్నాడు మిత్రుడు .
మోకాళ్లపై కూర్చుని , మంజరీ ...... మన అడవిరాజు ఇప్పటికీ లేవలేని పరిస్థితులలో ఉన్నట్లున్నాడు ఇప్పుడెలా ? .
మంజరి : ఇక్కడే వదిలేస్తే మూడవరోజున తప్పకుండా వచ్చే వేటగాళ్ళు చంపేసినా చంపేస్తారు - మనతోపాటు తీసుకెళదాము .
నాపైకి ఎక్కించు మిత్రమా అంటూ కృష్ణ మోకాళ్లపైకి చేరాడు . 
మీరిద్దరూ ఎలా అంటే అలా అంటూ కష్టంగానే మిత్రుడిపైకి చేర్చాను - మిత్రమా బరువుగా ఉందా ? .
లేదన్నట్లు సులువుగా పైకిలేచి నిలబడ్డాడు .
సింహం కళ్ళల్లో కన్నీళ్లు ....... , అడవిరాజా ఏమైంది నొప్పివేస్తోందా ? .
ఊహూ అంటూ తల ఊపడం చూసి , ప్రభూ ...... అవి కన్నీళ్లు కాదు ఆనందబాస్పాలు - చూస్తుంటే అడవిరాజు మనకు జీవితాంతం ఋణపడిపోయినట్లే ........
అవునన్నట్లు తలఊపింది .
అవసరం లేదు అడవిరాజా ...... , ఆపదలో ఉన్న ప్రాణిని కాపాడటం మా బాధ్యత అంటూ గాయాల పరిస్థితిని చూసి కొత్తగా మూలికలు రసం పిండి కట్టు కట్టాను .

చూట్టూ చూసి సరైన చెట్టు నుండి ధనస్సు - బాణాలను తయారుచేసుకున్నాను .
మంజరి : ప్రభూ ...... మీ ఆయుధాలంటే మీకిష్టం కదా .
అవి గురువుగారు - మన మహి ఇచ్చినవి , వాటిని ఎలా వదులుకుంటాను - ఆ రాజ్యానికి మళ్లీ వెళ్లే రోజు రానే వస్తుంది , ఇక వెళదాము ప్రయాణం సాగిస్తున్న కొద్దీ నదీప్రవాహం కాస్తా పిల్ల కాలువలా మారి రెండు రోజులకు కాస్తా పూర్తిగా మాయమైపోయింది - ఒకప్పుడు నిండుగా ప్రవహించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి - అరణ్యపు పచ్చదనం ఎప్పుడో మాయమైపోయింది - కొన్నిరోజులుగా కరువు రాజ్యమేలుతున్నట్లుగా ఎటుచూసినా ఎండిపోయిన చెట్లే దర్శనం ఇస్తున్నాయి .
చివరగా కనిపించిన పిల్లకాలవలోని నీరు ...... మహి ఆనవాళ్లను ఇటువైపుకే చూయించడంతో ప్రయాణం సాగించాము .

క్రూరమృగాలు వదిలివెళ్లిన కళేబరాలను తింటూ నెమ్మదిగా కోలుకుని మూడవరోజుకు హుషారు వచ్చినట్లు మిత్రుడి నుండి కిందకుదిగి మొదట నెమ్మదిగా కుంటుకుంటూ తరువాతి పూటకు దాదాపు కోలుకున్నట్లు మామీదకు మీదకు ఎగురుతూ కృతజ్ఞతను తెలియజేసి దర్జాగా మా ముందు నడవసాగాడు అడవిరాజు - ఆ ప్రదేశమంతా సుపరిచితమే అన్నట్లు సులువైన దారిలోకి తీసుకెళుతున్నాడు .
మాముగ్గురిలో సంతోషం , అడవిరాజా ...... చూస్తుంటే ఈ ప్రదేశమంతా తెలిసినట్లుగా ఉంది - ఇంతకూ ఆ ఉచ్చు గుంతలోకి ఎలా పడ్డావు .
ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోతోంది .
మంజరి : అడవిరాజా ..... నాకు తెలియజెయ్యి నేను , మన ప్రభువులకు చెబుతాను , వారికి కూడా నీలాంటి జంతువులతో మాట్లాడించడం వచ్చు - ఇలా అయితే ప్రయాణిస్తూనే తెలుసుకోవచ్చు అంటూ అడవిరాజు మీదకు చేరింది , "అడవికి రాజును నేనైతే ఇక నుండీ మీరే నా రాజు " ...... వింటున్నారా ప్రభూ .
వింటున్నాను వింటున్నాను మంజరీ ...... , కానీ ఆ మాటలు అడవిరాజు మనసులోనివా లేక నా ప్రియమైన అందమైన మంజరి మనసులోనివా ? .
నా మనసులోనివే అన్నట్లు అడవిరాజు నామీదకు ఎగబ్రాకాడు .
అలాగే అలాగే అడవిరాజా ......
మంజరి : అంతేలే ప్రభూ , నేను చెబితే నమ్మరు .
మన్నించు మన్నించు మంజరీ అంటూ నవ్వుతూనే గాలిలో ముద్దు వదిలాను .
మంజరి : ధన్యవాదాలు ప్రభూ అంటూ నా భుజం పైకి చేరి ముద్దుపెట్టి వెళ్లి అడవిరాజు పైకి చేరింది . " ప్రభూ ...... నేను పుట్టి పెరిగినది ఈ అడవిలోనే - కొన్నిరోజుల కింద ఈ ప్రదేశం నిండుగా ప్రవాహాలతో ఎటుచూసినా దట్టమైన పచ్చదనంతో కళకళలాడుతూ ఉండేది - ఇలా ఒక్కసారిగా కరువు సంభవించింది - నా పిల్లలకు త్రాగడానికి నీటిని తీసుకురాలేకపోయాను నాలానే అడవిలోని జంతువులన్నింటి పరిస్థితీ ఇదే ........" ఆగు ఆగు అడవిరాజా ..... నీకు పిల్లలున్నారా ? .
" భార్య - ఇద్దరు బుజ్జి పిల్లలు .... ఒకటి మగ మరొకటి ఆడ " 
మంజరి : వాళ్ళెక్కడ అడవిరాజా .......
" భార్యకు - పిల్లల దాహం తీర్చలేక చాలా బాధపడ్డాను , ఇలా కాదు అనుకుని నీటికోసం భార్య పిల్లలతో చాలాదూరం ప్రయాణించి పిల్ల కాలవ ప్రవాహం చేరుకుని సంతోషంగా దాహం తీర్చుకున్నాము , వెనక్కు తిరిగివెలితే మరలా అదే పరిస్థితి అనుకుని పిల్లలతో ఆడుకుంటూ ప్రవాహం వెంబడి ప్రయాణిస్తూ చీకటిలో గమనించక గుంతలోకి పడిపోయాను , నా కుటుంబానికి ఏమిచెయ్యాలో తెలియక నా రక్తం చూసి తట్టుకోలేక ఒకరోజంతా కన్నీళ్లతో గుంత చుట్టూ తిరుగుతూనే ఉన్నారు , నేనెలాగో వేటగాళ్లకు దొరికిపోతాను నావలన నా భార్య - పిల్లల ప్రాణాలు పోకూడదని ఒట్టు వేసిమరీ అక్కడనుండి పంపించేసాను , పిల్లల ప్రాణాలు ముఖ్యం కాబట్టి అంతులేని బాధతో వెళ్ళిపోయింది , ఆరాత్రి చిన్నగా వర్షం పడింది కాబట్టి వాళ్ళు తప్పకుండా మా అడవికే గుహకే చేరుకుని ఉంటారు " .
తప్పకుండా తప్పకుండా వారు ఎక్కడ ఉన్నా ప్రాణాలతో ఉంటారు అడవిరాజా ....... 
" అక్కడక్కడా పచ్చదనం ఉంది అంటే వర్షం పడినట్లు తెలుస్తోంది " .
అంతలో దాహం తీర్చుకోవడానికన్నట్లు అలా చినుకులు పడి ఆగిపోయింది .
" ఈమాత్రం నీరు పడితే చాలు ఈ అడవిలోని జంతువుల దాహం తీరిపోతుంది " .
కన్నీళ్లను తుడుచుకున్నాను .
మంజరి : మీ గుహ ఎక్కడ అడవిరాజా ...... ? .
" రాజ్యానికి అటువైపు " 
రాజ్యం ఉందా అడవిరాజా అంటూ ఆతృతతో అడిగాను .
" త్రాగడానికి ఏమాత్రం వీలుకాని సముద్రం తీరాన రెండు పెద్ద రాజ్యాలు మూడువైపులా చిన్న చిన్న చాలా రాజ్యాలు ఉన్నాయి ప్రభూ , ఇప్పటికే రెండు చిన్న రాజ్యాలను దాటుకుని వచ్చేసాము అడవి గుండా ........ " అంటూ అడవిరాజు మనసులోని మాటలను మంజరి పలికింది .
Like Reply
Super update
గంధర్వ వివాహం
https://xossipy.com/thread-50446.html
[+] 2 users Like nikhilp1122's post
Like Reply
Super broo nice update carry on like this
[+] 2 users Like Ghost Stories's post
Like Reply
Nice update bro challa challa bagundhi. No words to say about the update. Eepati laga ne me writings tho mind blowing update icharu
[+] 3 users Like Iron man 0206's post
Like Reply
Iex Iex Iex speechless
[+] 3 users Like maheshvijay's post
Like Reply
Super update bro no words to your story line keep going bro
[+] 3 users Like donakondamadhu's post
Like Reply
Update Latega ichina kani. ...update chimpesav bro super
[+] 2 users Like Zixer's post
Like Reply
 అసలు ఎలా వస్తాయి బ్రో మీకు ఇలాంటి ఐడియాలు....బాబోయ్ ఆ పోటీలు ఎంటో ఆ హింసించడం ఎంటో బాబోయ్.....కానీ ఒకటి ఒప్పుకోవాలి...పెద్ద పెద్ద అప్డేట్ లు ఇవ్వటం లో మీ తరువాతే ఎవరైనా......
ఇంతకీ మహి ని ఎప్పుడు కలుసుకుంటాడు బ్రో.....మళ్ళీ వాళ్ళిద్దరూ ఇంతకు ముందు లాగా ఎప్పుడు వుంటారు?????
మేము క్లైమాక్స్ వరుకు ఎదురు చూడాల్సిందేనా?????  హ్మ్మ్
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar Namaskar Namaskar
[+] 5 users Like Thorlove's post
Like Reply
Update super bro
[+] 2 users Like nunnanani's post
Like Reply
Nice update
[+] 2 users Like BR0304's post
Like Reply
Fantastic update
[+] 2 users Like DJDJDJ's post
Like Reply
సూపర్ మహేష్ గారు
[+] 2 users Like ramd420's post
Like Reply
hi ji update keka meru rasindhanike memu yepudu dasohame ji, thanks fir u r update
[+] 3 users Like Manoj1's post
Like Reply




Users browsing this thread: 27 Guest(s)