Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
super bro .....
[+] 1 user Likes vg786's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
గుండెల్ని పిండేలా ఇలా పద ప్రయోగం చేస్తే నిద్ర ఎలా పడతది.
బాగుంది అనే మాట సరిపోదు
అద్భుతం అని అనలేను
ఏమనాలో అర్థం కావడం లేదు
దాదా ఖలందర్ 
[+] 5 users Like ఖలందర్'s post
Like Reply
ధన్యవాదాలు మిత్రులారా
❤️❤️❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(22-07-2022, 09:15 PM)ఖలందర్ Wrote: గుండెల్ని పిండేలా ఇలా పద ప్రయోగం చేస్తే నిద్ర ఎలా పడతది.
బాగుంది అనే మాట సరిపోదు
అద్భుతం అని అనలేను
ఏమనాలో అర్థం కావడం లేదు

❤️❤️
[+] 2 users Like Pallaki's post
Like Reply
HappyNewYear 
Like Reply
Super bro.
Like Reply
Arjun
అర్జున్

1




చీకట్లో నేషనల్ హైవే మీద స్పీడ్ గా వెళ్తుంది కారు, ఆ స్పీడ్ చూస్తే ఏదో ఎమర్జెన్సీ గా వెళ్తుందని అనుకుంటారు ఎవరైనా, అంత వేగంగా వెళ్తున్న ఆ నల్ల కారుని ఒక పెద్ద వ్యాన్ పక్క నుంచి ఢీ కొట్టింది, దానితో కారు గాల్లో ఎగిరి పక్కనే ఉన్న అడవిలోకి జారుకుంటూ వెళ్లి ఆగింది, అందులోనుంచి దిగింది ఎవరో కాదు నేనే.. పేరు అర్జున్.

కళ్ళు తిరుగుతున్నాయి చేతితొ తల తడుముకుని చూసాను రక్తం కారుతుంది, అది కార్ పల్టీ కొట్టడం వల్ల తగిలిన దెబ్బ కాదు ఎవరో ఐరన్ రాడ్ తొ కొడితే తగిలిన దెబ్బ, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించే టైం లేదు అవ్వును టైం, టైం, టైం అస్సలు లేదు ఇంకో పదిహేను నిమిషాల్లో నేను చచ్చిపోతాను కార్ లో ఉన్న నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలీదు, అస్సలు ఏం జరుగుతుందో నా ఫ్యామిలీకి తెలీదు.


చిన్నగా కార్ డోర్ తెరిచి నా భార్యని బైటికి లాగాను, తన మెడ మీద కిటికీ గ్లాస్ గుచ్చుకుని రక్తం కారుతుంది కానీ చేతిలో ఉన్న పది నెలల పిల్లోడికి మాత్రం ఏం కానివ్వలేదు, ఎంతైనా తల్లి కదా ప్రాణం ఇచ్చయినా కాపాడుకుంటుంది.

పెద్దగా ఒక ఉరుము, చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి, పక్కనే ఉన్న అమ్మని కూడా బైటికి రమ్మని చెయ్యి ఇచ్చాను అమ్మని బైటికి లాగి ముందు కూర్చున్న నాన్నని చూసాను స్పృహలో లేడు కష్టపడి బైటికి తీసుకొచ్చి పక్కనే ఉన్న చెట్టుకి ఆనించాను.

జోరుగా వర్షం పడుతుంది చుట్టు పది మంది అందులో 30 ఏళ్ల లోపు వాళ్ళు ముగ్గురు 50 ఏళ్ల లోపు వాళ్ళు నలుగురు ఇక 50 ఏళ్ల పై వారు ముగ్గురు, మొత్తం పది మంది.

అందరి చేతికి ఒకే రకం వాచీలు కానీ ఎవ్వరివి పని చెయ్యడంలేదు, నాది కూడా.. పక్కనే ఉన్న అమ్మకి, నా భార్యకి ఏం అర్ధం కావట్లేదు ఎందుకంటే వాళ్ళకి నేను రక రకాలుగా కనిపిస్తున్నాను కాబట్టి.

మా అమ్మకి తను కనీ పెంచుకున్న  15 ఏళ్ల పిల్లోడు, 20 ఏళ్ల కాలేజీ పిల్లోడు, 25 ఏళ్ల కుర్రోడు మధ్యలో 30 ఏళ్ల అస్సలు కొడుకు కనిపిస్తున్నారు. నా భార్యకి కాలేజీ లో ప్రేమించిన ఒక పిల్లోడు ఒక కుర్రోడు ఒక మొగుడు కనిపిస్తున్నారు. అందుకే వాళ్లకస్సలు ఏమి అర్ధం కావట్లేదు, మీకు కన్ఫ్యూసింగ్ గా ఉందా ?

ఈ జోరు వర్షంలో ఈ చీకట్లో ఈ అడవిలో నేను.. అర్జున్.   చుట్టు నన్ను చంపడానికి వచ్చిన పది మంది అర్జున్లు. 15yrs, 19yrs, 25yrs, 34yrs, 40yrs, 46yrs, 50yrs, 55yrs, 60yrs, 65yrs.

తలకి తగిలిన దెబ్బలకి వర్షం ఒక్కొక్క బొట్టు తల మీద పడుతుంటే నాకు మైకం ఇంకా ఎక్కువవుతుంది.

ముసలి అర్జున్ వెళ్లి స్పృహ తప్పి పడిన మా నాన్న తల నరికేసాడు. తూలుతూ నాన్న దెగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాను తల లేని బాడీ చూస్తూ, ఇంతలో మా అమ్మ అరుపుకి తల తిప్పి చూసాను 40 ఏళ్ల అర్జున్ మా అమ్మని రాక్షసంగా వెనక నుంచి కత్తితో పొడిస్తే వచ్చిన అరుపు అది.

ఏడిచే ఓపిక లేదు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అమ్మ దెగ్గరికి వెళ్లి ఒళ్ళో పెట్టుకుని చూస్తున్నాను ఇంతలో నా బిడ్డ ఏడుపు వినిపించింది, తల తిప్పి చూసాను నా బిడ్డని వాళ్ళ అమ్మ దెగ్గర నుంచి లాగేసుకుంటున్నారు, నా భార్య గట్టిగా బిడ్డను పట్టుకునేసరికి ఒకడు నా భార్య పీక కోసేసాడు అది గిల గిలా కొట్టుకుంటూ నా కళ్ళలోకే కళ్ళు పెట్టి చూస్తూ పడిపోయింది.

అప్పటికే ప్రాణం లేని నా అమ్మని పక్కన పడుకోబెట్టి మోకాళ్ళ మీద నిల్చున్నాను నా పది నెలల బిడ్డ గొంతు పట్టుకున్నాడెవడో కానీ బ్లూ కాలర్ ఉండాల్సిన వాచ్ వాడి చేతికి పచ్చ రంగు వాచ్ ఉంది అచ్చు నా లాంటిదే, చెయ్యి ఎత్తాను వద్దు అన్నట్టు కానీ వాడు పసిబిడ్డ అని కూడా చూడకుండా ఒంటి చేత్తో మెడ పట్టుకుని గాల్లోకి లేపి నన్ను చూసి నవ్వుతూ మెడని పిసికేసాడు నా బిడ్డ గుజ్జు లా మారి పిండం కింద పడిపోడం చూసాను.

కళ్ళు మూసుకున్నాను నాకు తెలుసు నేను వాళ్ళని కాపాడుకోలేనని ఎందుకంటే నేనేం చేస్తానో ఏం ఆలోచిస్తానో అన్ని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల ఉన్నది కూడా నేనే కాబట్టి.

వెల్కమ్ టు ది టైమ్ లాప్స్.
వెల్కమ్ టు మై వరల్డ్.
Like Reply
(23-07-2022, 06:33 PM)Takulsajal Wrote:
©అర్జున్©

1



చీకట్లో నేషనల్ హైవే మీద స్పీడ్ గా వెళ్తున్న ఒక కార్, ఆ స్పీడ్ చూస్తే ఏదో ఎమర్జెన్సీ గా వెళ్తుందని అనుకుంటారు ఎవరైనా, అంత స్పీడ్ గా వెళ్తున్న ఆ నల్ల కార్ ని ఒక పెద్ద వ్యాన్ పక్క నుంచి ఢీ కొట్టింది దానితో కార్ గాల్లో ఎగిరి పక్కనే ఉన్న అడవిలోకి జారుకుంటూ వెళ్లి ఆగింది, అందులోనుంచి దిగింది ఎవరో కాదు నేనే పేరు అర్జున్, చిన్నగా నా కళ్ళు తిరుగుతున్నాయి చేతితొ తల తడుముకుని చూసాను రక్తం కారుతుంది, అది కార్ పల్టీ కొట్టడం వల్ల తగిలిన దెబ్బ కాదు ఐరన్ రాడ్ తొ కొడితే తగిలిన దెబ్బ, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించే టైం లేదు అవ్వును టైం, టైం, టైం అస్సలు లేదు ఇంకో పదిహేను నిమిషాల్లో నేను చచ్చిపోతాను కార్ లో ఉన్న నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలీదు, అస్సలు ఏం జరుగుతుందో నా ఫ్యామిలీకి తెలీదు.


చిన్నగా కార్ డోర్ తెరిచి నా భార్యని బైటికి లాగాను, తన మెడ మీద కిటికీ గ్లాస్ గుచ్చుకుని రక్తం కారుతుంది కానీ చేతిలో ఉన్న పది నెలల పిల్లోడికి మాత్రం ఏం కానివ్వలేదు, ఎంతైనా తల్లి కదా ప్రాణం ఇచ్చయినా కాపాడుకుంటుంది..పెద్దగా ఒక ఉరుము, చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి .....పక్కనే ఉన్న అమ్మని కూడా బైటికి రమ్మని చెయ్యి ఇచ్చాను అమ్మని బైటికి లాగి ముందు కూర్చున్న నాన్నని చూసాను స్పృహ లో లేడు కష్టపడి బైటికి తీసుకొచ్చి పక్కనే ఉన్న చెట్టుకి అనించాను.

జోరుగా వర్షం పడుతుంది చుట్టు పది మంది అందులో 30 ఏళ్ల లోపు వాళ్ళు ముగ్గురు 50 ఏళ్ల లోపు వాళ్ళు నలుగురు ఇక 50 ఏళ్ల పై వారు ముగ్గురు, మొత్తం పది మంది.

అందరి చేతికి ఒకే రకం వాచ్ లు కానీ ఎవ్వరివి పని చెయ్యవు నాది కూడా... పక్కనే ఉన్న అమ్మ, నా భార్య ఇద్దరికీ ఏం అర్ధం కావట్లేదు ఎందుకంటే వాళ్ళకి నేను రక రకాలుగా కనిపిస్తున్నాను కాబట్టి.

మా అమ్మకి తను కానీ పెంచుకున్న  15 ఏళ్ల పిల్లోడు, 20 ఏళ్ల కాలేజీ పిల్లోడు, 25 ఏళ్ల కుర్రోడు మధ్యలో 30 ఏళ్ల అస్సలు కొడుకు కనిపిస్తున్నారు.

నా భార్యకి కాలేజీ లో ప్రేమించిన ఒక పిల్లోడు ఒక కుర్రోడు ఒక మొగుడు కనిపిస్తున్నారు.

అందుకే వాళ్లకస్సలు ఏమి అర్ధం కావట్లేదు, మీకు కన్ఫ్యూసింగ్ గా ఉందా?

ఈ జోరు వర్షంలో ఈ చీకట్లో ఈ అడవిలో నేను అర్జున్ చుట్టు నన్ను చంపడానికి వచ్చిన పది మంది అర్జున్లు.

15yrs, 19yrs, 25yrs, 34yrs, 40yrs, 46yrs, 50yrs, 55yrs, 60yrs, 65yrs.

తలకి తగిలిన దెబ్బలకి వర్షం ఒక్కొక్క బొట్టు తల మీద పడుతుంటే నాకు మైకం ఇంకా ఎక్కువవుతుంది.

ఒక ముసలి అర్జున్ వెళ్లి స్పృహ తప్పి పడిన మా నాన్న తల నరికేసాడు... తులుతూ నాన్న దెగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాను తల లేని బాడీ చూస్తూ, ఇంతలో మా అమ్మ అరుపుకి తల తిప్పి చూసాను 40 ఏళ్ల అర్జున్ మా అమ్మ ని వెనక నుంచి కత్తితో పొడిస్తే వచ్చిన అరుపు అది.

ఓపిక లేదు కళ్ళు భైర్లు కమ్ముతున్నాయి అమ్మ దెగ్గరికి వెళ్లి ఒళ్ళో పెట్టుకుని చూస్తున్నాను ఇంతలో నా బిడ్డ ఏడుపు తల తిప్పి చూసాను నా బిడ్డని వాళ్ళ అమ్మ దెగ్గర నుంచి లాగేసుకుంటున్నారు, నా భార్య గట్టిగా బిడ్డను పట్టుకునేసరికి ఒకడు నా భార్య పీక కోసేసాడు అంతే గిల గిలా కొట్టుకుంటూ పడిపోయింది నా కళ్ళలోకే కళ్ళు పెట్టి చూస్తూ ఉంది.

అప్పటికే ప్రాణం లేని నా అమ్మని పక్కన పడుకోబెట్టి మోకాళ్ళ మీద నిల్చున్నాను నా పది నెలల బిడ్డ గొంతు పట్టుకున్నాడెవడో కానీ బ్లూ కాలర్ ఉండాల్సిన వాచ్  వాడి చేతికి పచ్చ రంగు వాచ్ ఉంది సేమ్ నా లాంటిదే, చెయ్యి ఎత్తాను వద్దు అన్నట్టు కానీ నా ముందే నన్ను చూసి నవ్వుతూ పసిబిడ్డ అని కూడా చూడకుండా ఒంటి చేత్తో మెడ పట్టుకుని గాల్లోకి లేపి నన్ను చూసి నవ్వుతూ మెడని పిసికేసాడు నా బిడ్డ గుజ్జు లా మారి పిండం కింద పడిపోడం చూసాను...

కళ్ళు మూసుకున్నాను నాకు తెలుసు నేను వాళ్ళని కాపాడుకోలేనని ఎందుకంటే నేనేం చేస్తాను ఏం ఆలోచిస్తాను అన్ని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల ఉన్నది కూడా నేనే కదా...

వెల్కమ్ టు ది టైమ్ లాప్స్....

వెల్కమ్ టు మై వరల్డ్.

Bro ee story malli start chesara
Ede episode okasari chadivanu then there no any other update.
Please continue this
[+] 1 user Likes Vegetarian's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Super update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
2


పొద్దున్నే ఎవరో కిటికీ కర్టెన్ ని పక్కకి జరిపారు నా నిద్ర చెడగొట్టడానికి, ఎవరో కాదు నా మీద ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామా అని ఎదురు చూసే నా గయ్యాళి చెల్లెలు. దుప్పటి తల నిండా కప్పుకుని పడుకున్నాను..

సుభద్ర : నవ్యా అన్నయ్యని లేపు. కిచెన్ లోనుంచి మా అమ్మ అరుపు 

నవ్య : నేను లేపను.. మళ్ళీ నన్ను కొడతాడు. నువ్వే లేపుకో

సుభద్ర : అబ్బబ్బ అంటూ చపాతీలు చేస్తూనే స్టవ్ ని సింలో పెట్టి అట్లకాడతొ బెడ్రూంలోకి వచ్చింది. రేయి లేస్తావా పిర్ర మీద అట్లకాడ పెట్టనా

ముసుగు తీసాను, అమ్మా ఎలాగో కాలేజ్ కెళ్ళేటప్పుడు చంపుతావు కనీసం ఈ హాలిడేస్ అయినా ఎంజాయి చెయ్యనివ్వవే, ఇంకో పది రోజులు అయితే ఎలాగో కాలేజీకి వెళ్ళాలి అప్పుడు నువ్వు చెప్పినట్టే వింటాలే అని గడగడా వాగేసి మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నాను.

సుభద్ర : వీడికి ఇవ్వాళ మనం నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళుతున్నాం అని గుర్తుందా లేదా అని నవ్యని చూసి అడిగింది.

నవ్య : మతిమరపోడు.. ఎప్పుడు గుర్తుండి చచ్చింది.. ఏది గుర్తుండి చచ్చింది, మనల్ని గుర్తు పెట్టుకున్నాడు అదే పదివేలు.

లేచి నవ్య ముడ్డి మీద తన్నాను.

నవ్య : అమ్మా చూడే...

సుభద్ర : రేయ్.. ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఇద్దరు తన్నుకోడానికి.. అర్జున్ లేచి బ్యాగులు సర్దు ఇక నవ్య నువ్వు నాతొ పాటు వచ్చి నేను చపాతీలు కాలుస్తుంటే నువ్వు వాటిని పార్సెల్ చేద్దువురా అని కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది.

మొహం మీద కొట్టుకుంటూ బద్దకంగా లేచి ముందు బ్రష్ చేసి చిన్నగా ఒక్కో బ్యాగ్లో బట్టలు సర్ధకుండా కుక్కుతుంటే ఇంతలో మా నాన్న అక్కడికి వచ్చి నన్ను, నేను చేస్తున్న పని చూస్తూ కూర్చున్నాడు.

అర్జున్ : ఏంటి నాన్నా 

రవి : సుభద్రా.. చెప్పక చెప్పక ఈ వెధవకే నువ్వు పని చెప్పావా.. నీకు డబల్ పని పెడతాడు.. రేయి అది వదిలేసి పొయ్యి ఫోన్లో గేమ్స్ ఆడుకోపో

అర్జున్ : థాంక్స్.. నాన్న

రవి : సిగ్గులేకపోతే సరి.. పొయ్యి స్టేషన్ కి వెళ్ళడానికి క్యాబ్ ని పిలుచుకు రాపో.. వెధవన్నర వెధవ

అర్జున్ అబ్బా అనుకుంటూ చెప్పులు వేసుకుని బైటికి వెళ్లి క్యాబ్ మాట్లాడి పిలుచుకుని వచ్చేలోపు అందరూ రెడీ అయ్యి గేట్ తాళం వేసి బైట నిల్చొని ఉన్నారు.

సుభద్ర : చూడండి.. వాడి అవతారం పనోడిలాగ.. స్నానం కూడా చెయ్యలేదు.. కనీసం బ్రష్ అయినా చేసాడో లేదో

రవి : వాడు అలా ఉంటేనే బాగుంటాడు

నవ్య : అయినా వాడేదో రోజు స్నానం చేసేవాడిలాగ మాట్లాడతావే.. ఒక్కో సారి నాలుగు రోజులు కూడా చెయ్యడు గబ్బు కొడుతుంది నాకు వాడి పక్కన పడుకుంటే

అర్జున్ : ఆపుతావా నా మీద చాడీలు చెప్పడం.. అమ్మా పదండి అని బ్యాగ్స్ డిక్కీలో పెట్టి వెనకాల కూర్చుంటే నాన్న డ్రైవర్ తొ మాట్లాడుతూ ముందు కూర్చున్నాడు. గంటలో రైల్వే స్టేషన్ ముందు ఉన్నాం, టిక్కెట్లు తీసుకుని ట్రైన్ కోసం ఒక అరగంట ఎదురు చూడగా వచ్చింది.

నవ్య : అమ్మా.. వాడిని వెనక్కి రమ్మను పెద్ద హీరోలా వెళ్లి పట్టాల దెగ్గర నిలబడ్డాడు.. ట్రైన్ స్పీడ్ గా వచ్చిందంటే ఆ గాలికే ఎగిరిపోతాడు

అర్జున్ : చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు..

నవ్య : అంత లేదు నీకు నాకు పది నిముషాలు మాత్రమే తేడా, అంత దానికి నువ్వు పెద్దొడిలా ఫీల్ అవ్వకు.

ఇంతలో ట్రైన్ హారన్ వినిపించి నాన్న అరిచాడు.. ఇద్దరం తగ్గి తలా ఒక బ్యాగ్ అందుకుని ట్రైన్ ఎక్కాం.. ట్రైన్ ఎక్కామో లేదో నవ్య తినడం మొదలు పెట్టింది ఉడకేత్తిన పల్లీల నుంచి వయా సమోసాలు మీదగా చనా మసాలా వరకు ఏది వస్తే అది తింటూనే ఉంది నాన్న కొనిస్తూనే ఉన్నాడు..

నవ్య : అలా చూడకపోతే.. నువ్వు కొనుక్కోవచ్చుగా

రవి : అవి ఓన్లీ ఫస్ట్ ర్యాంకర్స్ కి మాత్రమేరా తల్లీ, నువ్వు తిను

అర్జున్ : చెప్పాడుగా.. నువ్వు మెక్కు అని కోపంగా లేచి డోర్ వైపు వచ్చి నిల్చున్నాను, చల్లటి గాలి పొలాలు దాటి అడవిలోకి వెళ్తున్న కొద్ది ట్రైన్ వేగం ఇంకా పెరగసాగింది. ఇంతలో ఏమైందో ఏమో సడన్ గా ట్రైన్ ఆగింది. నేను పడిపోకుండా ఉండటానికి ఎమ్మటే ఎదురుగా ఉన్న డోర్ ని కాలితో తొక్కి పట్టాను.

అన్నీ గ్యాస్ లీక్ అయిన శబ్దాలు, పైకి ఎక్కి పడుకున్న వాళ్లు కింద పడ్డారు. కొంత మందికి దెబ్బలు తగిలాయి, నవ్యని అమ్మని పడిపోకుండా నాన్న పట్టుకున్నాడు. ముసలోళ్ళు అవసరం లేకపోయినా ఒకటే ఏడుపులు అరుపులు.

కొందరు కిందకి దిగారు, వాళ్ళతో పాటు నాన్న కూడా దిగితే తన వెనకాలే నేనూ దిగాను. అందరూ ముందు ఇంజిన్ వైపు వెళుతుంటే మేము వెళ్ళాము, చూస్తే ఇంజిన్ కి ఏదో గుద్దుకుని ఆగిపోయింది రౌండ్ గా పెద్దగా రాజుల కాలంలో యుద్ధానికి వాడే ఐనప గుండు అంత ఉంది, ఒక మనిషి మాత్రమే పట్టగలడు ముందే గుద్దుకోవడం వల్ల ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అందరూ ఏదో ఎలియన్ స్పేస్ షిప్ అని దాని దెగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు.

కొంత మంది ట్రైన్ డ్రైవర్ల దెగ్గరికి వెళ్లారు వాళ్ళకి ఎలా ఉందొ చూడ్డానికి, అస్సలు అదేంటో చూద్దామని చాలా దూరంగా ఉండే మనుషుల్ని దాటుకుంటూ దాని చుట్టూ చూస్తూ నడుస్తున్నాను సడన్గా నా కాలికి షాక్ కొట్టింది.

కాలు పక్కకి జరిపి కింద చూస్తే పసుపు రంగులో చిన్న రింగ్ రెండు ఇంచుల diameter/వ్యాసం అంత సన్నని ప్లేట్, పసుపు రంగులో కొద్దిగా మెరుస్తుందనే చెప్పాలి. ఇంతలో నాన్న కోపంగా అరుస్తుంటే దాన్ని జోబులో పెట్టుకుని ఆయన దెగ్గరికి వెళ్లిపోయాను.
Like Reply
Nice update
[+] 2 users Like maheshvijay's post
Like Reply
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice update

Waiting for the next
[+] 1 user Likes raj558's post
Like Reply
Nice update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
this is called thrilling update
amazing
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 1 user Likes The Prince's post
Like Reply
3


ఇక అక్కడనుండి నలుగురం నడుచుకుంటూ రోడ్డున పడి ఒక క్యాబ్ బుక్ చేసుకుని నాయనమ్మ ఇంటికి బైలుదేరాము, మధ్యలో జరిగిన దానికి కారణంగా సాయంత్రం నాలుగింటికి చేరాల్సిన మేము రాత్రి పదింటికి చేరాము.

ఇంట్లోకి వెళ్లి తాతయ్య నాయనమ్మని పలకరించి ఏదో తిన్నామనిపించి, వాళ్లు ట్రైన్ ఆక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటుంటే నేను వెళ్లి మంచం ఎక్కి పడుకున్నాను, పది నిమిషాలకి లైట్ వేశారు కళ్ళు తెరిచి చూసాను పక్కన నవ్య చేతిలో దిండుతొ నిల్చొని ఉంది.

అర్జున్ : ఏం కావాలి

నవ్య : జరిగితే పడుకోవాలి, అని ఆవలించింది.

అర్జున్ : ఇప్పుడు దీనితొ గొడవ ఎందుకులే అని దుప్పటి తల నిండా కప్పుకుని కళ్ళు మూసుకున్నాను.

చిన్నగా నవ్య నా దుప్పట్లోకి దూరింది. నేను గట్టిగా పట్టుకున్నా తన వైపు లాక్కొడానికి నవ్య, ఇటు నా వైపు లాక్కొడానికి నేను ఇద్దరం లాక్కుంటూ ఉంటే నా జోబు లోనుంచి చిన్న వెలుగు ఒకటి కనిపించి దుప్పటి వదిలేసాను, దెబ్బకి నవ్య దొల్లుకుంటూ కింద పడింది.

అర్జున్ జేబులో ఉన్న రింగ్ ని బైటికి తీసాడు, నవ్య కోపంగా లేచి తిడదామని తల ఎత్తి చూసి అర్జున్ చేతిలో ఏదో మెరుస్తుంటే దెగ్గరికి వెళ్ళింది.

నవ్య : అన్నయ్య ఏంట్రా అది.

అర్జున్ "ష్.." ముందు తలుపు దెగ్గరికి వేసి రా అనగానే నవ్య అలాగే అని తలుపు వేసి వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది.

అర్జున్ : ట్రైన్ ఆక్సిడెంట్ అయినప్పుడు కిందకి దిగాను కదా అప్పుడు దొరికింది, ఏంటో తెలీదు అప్పుడు కూడా ఇలానే మెరిసింది.

నవ్య : ఇటివ్వు.. చూస్తా.. అని తీసుకుని రింగ్ చుట్టు పరీక్షగా చూసి అటు ఇటు తిప్పింది.

అర్జున్ : ఎందుకే

నవ్య : మొద్దు ఇటు చూడు ఇది కంపాస్.. డైరెక్షన్ చూపిస్తుంది.. ఆ వెలుగు చూడు ఎటు తిప్పినా ఒకే డైరెక్షన్ లో ఉంది

అర్జున్ : ఏదటివ్వు.. అని మళ్ళీ అటు ఇటు తిప్పి చూసి, నవ్యా కానీ నార్త్ ఇటు వైపు కాదు కదా ఇది రివర్స్ లో ఉంది ఇది ఈస్ట్..  ఇది చూపించేది డైరెక్షన్ కాదు కో ఆర్డినేట్స్.. ఎక్కడికో లొకేషన్ సెట్ చేసి ఉంది.

నవ్య : ఇప్పుడు ఏం చేద్దాం

అర్జున్ : నన్ను ఆలోచించనీ, ఇది ఏదో డేంజర్ లాగ ఉంది దీని మీద రాసి ఉన్న లాంగ్వేజ్ కూడా నేను ఎక్కడా చూడలేదు అస్సలు ఇది భూమికి సంబంధించిన మెటలేనా అని నా డౌట్.. నవ్య ఒకసారి పొద్దున నువ్వు ట్రైన్ లో కొన్న మాగ్నెట్  సెట్ తీసుకురా

నవ్య : హ్మ్.. అని పరిగెత్తుకుంటూ వెళ్లి తెచ్చింది

అర్జున్ : చూడు ఇది మాగ్నెట్ కి అతుక్కోవట్లేదు కానీ ఇది స్టీల్ కూడా కాదు అలా అని అల్యూమినియం కూడా కాదు, ఏ మెటల్ ఇది అని కొరికి చూసాడు...?

అప్పుడే సుభద్ర లోపలికి వచ్చి "రేయి ఇంకా పడుకోలేదా మీరు, పడుకోండి" అని అరిచేసరికి అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ముసుగు తన్నారు.

నవ్య : ఇప్పుడేం చేద్దాం

అర్జున్ : నన్ను ఆలోచించనీ.. అస్సలు ఏ టెక్నాలజీ లేకుండా లైట్ ఎలా వెలుగుతుంది ఇది రేడియం కాదు, పడుకో రేపు ఆలోచిద్దాం.. ఇంకోటి ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పకు

నవ్య : అలాగే

అర్జున్ : ఇక పడుకో

తెల్లారి లేచి చూసాను, రింగ్ రాత్రి అంతగా వెలగడం లేదు కానీ ఇంకా డైరెక్షన్ చూపిస్తుంది.. చుట్టూ గీసినట్టు సన్నగా ఒక బ్లూ కలర్ లైన్ వెలుగుతుంది. మధ్యాహ్నం వరకు అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను

అర్జున్ : నవ్యా

నవ్య : ఆ.. అమ్మ అన్నం తినడానికి రమ్మంటుంది నిన్ను

అర్జున్ : ఈ లొకేషన్ చూసి వద్దామనుకుంటున్నా

నవ్య : ఏం వద్దు, లేని పోనీ రిస్క్

అర్జున్ : ఆలోచించాను ముందు దూరం నుంచి చూస్తాను, ఏ రిస్క్ లేదని కంఫర్మ్ అయితేనే ముందుకి వెళతాను, లేదంటే లేదు.

నవ్య : వద్దు.. ఫస్ట్ అది తీసేయి.. లేదంటే అమ్మ వాళ్ళకి చెపుతాను.

అర్జున్ : చిన్న పిల్ల లాగా ప్రవర్తించకు.. ఈ రాత్రికి అందరూ పడుకున్నాక వెళ్లి, ఎవ్వరు లేవక ముందే మళ్ళీ వచ్చేస్తాను

నవ్య : అయితే నేనూ వస్తాను.

అర్జున్ : వద్దు, నేనెళ్ళి వచ్చేస్తాను.

నవ్య : వెళితే ఇద్దరం వెళదాం లేదంటే లేదు

అర్జున్ : సరే రాత్రికి రెడీగా ఉండు.. ఈ లోగా ఎవ్వరికీ తెలియకుండా తాతయ్య బైక్ కీస్ తీసి పెట్టు.

నవ్య : అలాగే

అర్జున్ : నవ్యా.. నిజంగా నేనంటే అంత కేరింగా

నవ్య : అదేంట్రా అలా అంటావ్

అర్జున్ : సరే వేళ్ళు
Like Reply
NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply




Users browsing this thread: