21-06-2022, 09:43 AM
nice update bro
ప్రియ శత్రువు
|
21-06-2022, 09:43 AM
nice update bro
21-06-2022, 01:14 PM
(16-06-2022, 07:12 PM)Sudharsangandodi Wrote: Raji,likhita,rudra ni adesukuntunaru,last lo twist pettaru gaThanks ❤️ (16-06-2022, 07:16 PM)తింగరోడు Wrote: Back to back updatesThanks (16-06-2022, 08:09 PM)Sachin@10 Wrote: Nice back to back updatesThank you (16-06-2022, 08:52 PM)Saikarthik Wrote: Superb updates❤️❤️ (16-06-2022, 09:26 PM)Iron man 0206 Wrote: Super ga undhi bro. Back to back updatesThanks bro❤️ (16-06-2022, 09:43 PM)maheshvijay Wrote: Superb updateThank you (16-06-2022, 09:47 PM)Bvgr8 Wrote: Welcome to season2Thanks bro (16-06-2022, 10:45 PM)Thorlove Wrote: బాగుంది బ్రో....లిఖిత కారెక్టర్ ని పూర్తిగా మార్చేసి నట్లు వున్నారు....కానీ చివరి లో ఏదో సస్పెన్సు పెట్టారు....ఆంటే పాము వల్ల రుధ్ర కి ఎమ్మానా అపాయం వస్తుందా ఏంటి బ్రో????Thanks thor❤️ (16-06-2022, 11:32 PM)Dsprasad Wrote: బ్యాక్ టు బ్యాక్ చాలా అద్భుతంగా రాశారు Thanks (17-06-2022, 12:39 AM)Ghost Stories Wrote: Matallevu broThanks bro (17-06-2022, 05:44 AM)narendhra89 Wrote: Bagundi super update eccharu Thank you (17-06-2022, 09:51 AM)sez Wrote: వావ్ .... అదరగొట్టేసారు.... చాలా రోజుల తర్వాత మీ అప్డేట్ చదివాను చాలా అద్భుతంగా రాశారు... నాకు ఒకటి అర్థం కాలేదు .... లిఖిత రుద్రా లో ఉందని మిగతా వారికి ఎలా తెలిసింది... చిన్న పిల్లలకు కూడా ఎలా తెలుసు... Sez garu chala rojula tharuvatha ❤️❤️ (17-06-2022, 12:20 PM)Sivakrishna Wrote: నైస్ అప్డేట్ Thanks bro (17-06-2022, 12:31 PM)K.R.kishore Wrote: Nice super update Thank you (18-06-2022, 01:21 AM)Venky248 Wrote: Story matram pichekkisthunnaru❤️❤️❤️ (19-06-2022, 11:41 AM)Kacha Wrote: మళ్ళీ మొదలైంది సూపర్ అప్డేట్ కృతజ్ఞతలు ❤️❤️❤️ (20-06-2022, 07:35 AM)BR0304 Wrote: Nice update Thanks❤️ (20-06-2022, 02:42 PM)saleem8026 Wrote:Thanks bro (20-06-2022, 10:31 PM)Venky248 Wrote: Koncham ikkada kuda update evvandiIsthaanu twaralone (20-06-2022, 10:52 PM)Premadeep Wrote: ఏది ఏమైనా మీకు మీరే సాటి ఒకేసారి 6 7 కథలని సమయానుకూలంగా రాస్తున్నారు హాట్స్ ఆఫ్ బ్రోThanks andi Thanku (21-06-2022, 09:43 AM)prash426 Wrote: nice update broThanks brother
21-06-2022, 01:48 PM
Update pl broo
23-06-2022, 10:55 PM
25-06-2022, 11:07 PM
Awesome broo chalaa bhagundi story mothaniki malli start chesaru... Super
05-07-2022, 03:17 AM
Awesome story
Awesome ga vundi me kadha kadhanam Eagerly waiting for your next updates
05-07-2022, 04:23 PM
Super update bro
07-07-2022, 04:03 PM
Update plz
07-07-2022, 10:56 PM
Thankyou ALL.. ❤️❤️
09-07-2022, 05:45 PM
All the best bro
14-07-2022, 09:02 PM
Super good
15-07-2022, 08:46 PM
Session 1 superb
15-07-2022, 08:46 PM
Session 2 continue cheyade ji, regular ga we are waiting
15-07-2022, 10:46 PM
Idi chala exciting ga vundi plz start session 2 start chyandi
27-07-2022, 08:45 PM
S2E3
ఇంటి బైటికి వచ్చి గాల్లోకి ఎగిరి.. భూకక్ష్య లోకి ఎగిరాను ఆ పాము చాలా వేగంగా వస్తుందని అడ్డు నిల్చున్నాను కానీ నా దెగ్గరికి వచ్చే కొంది దాని వేగం తగ్గుతుండడంతో దానికి కనిపించకుండా మాయం అయ్యాను. పాము నేరుగా కింద ఉన్న అడవిలోకి దూరి రెండు మూడు పెద్ద పెద్ద చెట్లని పడవేస్తూ ఆగిపోయింది.. రిన్ సోప్ వేసి ఉతికినట్టు తెల్లగా పదిహేను నుంచి ఇరవై అడుగుల పొడవున్న పాము సేదతీరుతుంటే.. సౌండ్ రాకుండా దాని తల దెగ్గరికి వెళ్లాను, పడుకుని ఉంది ఒక్క సారి నాలిక బైటికి అని ఇస్స్.. మని శబ్దం చేసింది.. అంత తెల్లటి పాముకి చిగురాకు పచ్చ రంగు నాలిక చూసేసరికి ఒక అడుగు వెనక్కి వేసాను. ఆకుల శబ్దానికి వెంటనే తల తిప్పి చూసింది కానీ నేనప్పటికే కొంచెం దూరంగా ఎగిరి చూస్తున్నాను.. ఒక్క నిమిషం వరకు అటు ఇటు పాకి.. ఐదడుగుల చిన్న పాముగా మారి స్పీడ్ గా వెళ్తుంటే.. దాని వెనకాలే వెంబడించాను. అది నేరుగా నా ఇంటి దెగ్గరికే వెళ్లి కాపలా కూర్చుంది, ఇంటి పక్కనే చెట్టు మీద నేను అదే చెట్టు కింద ఆ పాము ఇద్దరం ఎదురు చూస్తూ కూర్చున్నాం. రాత్రి అయ్యింది.. పాము చెట్టు ఎక్కి తొర్రలో ఉన్న చిన్న చిన్న పిట్టలని మింగేసింది.. తెల్లారే వరకు బైటికి కదల్లేదు.. తెల్లారింది ఆ పాము.. చెట్టు తొర్రలోనుంచి బైటికి వచ్చి నా ఇంటి వైపే చూస్తుంది.. పొద్దున్నే శివ గారు కాలేజ్ కి వెళ్లిపోయారు.. ఆ తరువాత పిల్లల కాలేజ్ బస్సు వస్తే లిఖిత నా శరీరంలోనే బైటికి వచ్చి పిల్లలకి చెరొక ముద్దు ఇచ్చి బస్సు ఎక్కించింది.. ఎప్పుడైతే నన్ను చూసిందో పాము ఆక్టివ్ అవ్వడం గమనించాను.. తరువాత అమ్మ గుడికెళ్లి మళ్ళీ ఇంటికి తీరగొచ్చింది కానీ పాము కదల్లేదు.. కొంత సేపటికి.. లిఖిత బండి బైటికి తీసింది వెనకాలే రాజీ కూర్చుంది.. ఈ పాము వెంటనే.. వెళ్తున్న ఆ బండిని వెంబడించింది.. నేను వెనకాలే వెళ్లాను.. అస్సలే చిరాకు పుడుతుంటే... బండి మీద లిఖితా రాజిల సరసాలు చూసి ఇంకా పిచ్చేక్కుతుంది.. కాలేజీ లోపలికి బండి వెళ్ళగానే.. పాము కాలేజీ అమ్మాయిలా మారి నన్ను అదే లిఖితని ఫాలో అవ్వడం మొదలు పెట్టింది.. నేరుగా క్లాస్ లోకి వెళ్లి కూర్చోగానే.. నన్ను(లిఖితని) చూస్తూ వెళ్లి బెంచ్ లో రాజీ పక్కనే కూర్చుని పరిచయం చేసుకుంటుంది.. నేను వెళ్లి నా(లిఖిత) బుజం మీద చెయ్యి వేసాను.. రుద్ర : వెనక్కి తిరక్కు.. నేనే.. అనుమానం రాకుండా ప్రవర్తించు.. నేను లోపలికి వస్తున్నా.. లిఖిత : అలాగే.. నా శరీరం లోకి వెళ్లిపోయాను.. ఇంతలో సర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేసాడు.. లిఖిత : ఏమైంది..? లిఖితకి జరిగిందంతా చెప్పాను.. రుద్ర : ఇప్పుడు మనతోనే ఉంది.. చిన్నగా రాజీని చూస్తాను తన పక్కనే ఉంది చూడు.. మెడలో ఏదో ఉంది చూడు.. అని చిన్నగా రాజీని చూసాను.. రాజీ నన్ను చూసి నవ్వింది.. తన పక్కనే ఉన్నది కూడా నన్ను చూసి ఒక నవ్వు నవ్వింది.. చూసి చూడనట్టుగా చూసి మళ్ళీ ఇటు తిరిగాను.. రుద్ర : ఏం గమనించావు.. లిఖిత : దాని మెడలో ఉన్నది నాగలోకపు గుర్తు అది అందరి దెగ్గరా ఉండేది కాదు, ఆ లోకపు యువరాణి అయినా అయ్యుండాలి లేదా అక్కడి రాజు బంధువు అయినా అయ్యుండాలి.. కానీ తన చెయ్యికి చూసావా నల్ల దారం అది దారం కాదు.. వెంట్రుకలు.. ఆ ముడి అలా కట్టుకునేది కంధర బానిసలు.. రుద్ర : కంధర బానిసలా వాళ్లెవరు? లిఖిత : నీకు అస్సలు ఏం గుర్తులేదా.. నువ్వు దేవుడవేగా..? రుద్ర : గుర్తుంటే నిన్నెందుకు అడుగుతానే.. లిఖిత : చెప్తా విను.. బాచీరులు అనే భయంకరమైన రాక్షసుల నాయకుడికి.. దేవతల గురువు అయిన మృదులా దేవికి పుట్టినదే ఈ కంధర.. వాళ్లిద్దరు ఎలా కలిశారు అని నన్ను అడక్కు, నాకు తెలీదు.. అయితే ఈ కంధర శరీరంలో రాక్షస గుణాలు అలానే వాళ్ల అమ్మగారి విద్యలు, సుగుణాలు రెండూ ఉన్నాయి. అయితే వచ్చిన చిక్కెంటంటే.. రాక్షసులు దేవతలు కలవడం కుదరని పని.. అటు బాచీరుల నాయకుడు ఇటు మృధుల దేవి తమ కూతురు నా దెగ్గర అంటే నా దెగ్గర అని కొట్లాటకి దిగారు. అటు దేవతలకి ఇటు బాచీరులకి కూడా కావాల్సింది యుద్ధమే అందుకే వాళ్లు దూరి యుద్ధాలు చేసుకోడం మొదలు పెట్టారు.. అది ఆపడం ఎవ్వరి వల్ల కాకా ఋషులు బ్రహ్మ దెగ్గరికి వెళ్ళగా.. బ్రహ్మ యుద్ధం ఆపించి.. కంధరని రెండు భాగాలుగా చేసాడు.. ఒక భాగం రాక్షస గుణాలున్న నలుపు కంధరని బాచీరులకి అప్పగించి.. దేవతల విద్యలు అన్నీ సుగుణాలు కలిగి తెల్లగా ఉన్న కంధరని దేవతలకి అప్పగించాడు.. ఇప్పుడు మన వెనకాల పడింది నల్ల కంధర.. నాకు అర్ధం కానిది ఏంటంటే.. తను మన వెనకాల ఎందుకు పడిందని.. అది కాక.. నాగ లోకానన్ని పాలించే అర్హతలు ఉన్న తను కంధర కింద పని చెయ్యడమేమిటి.. నాకేం అర్ధం కావట్లేదు.. ఎలా తెలుసుకోడం. రుద్ర : ఆ గుడిలో తపస్సు చేసుకునే మహర్షి ఉన్నాడుగా తనకేమైనా తెలుసేమో... ఒకసారి నేను వెళ్లి అడిగిచూస్తాను.. నువ్వు రాజీ జాగ్రత్త.. ఆ పాము.. మన రాజితో స్నేహంగా మాట్లాడుతుంది.. ఇద్దరు జాగ్రత్తగా ఉండండి.. నువ్వు అస్సలు బైట పడొద్దు.. ఏరి కోరి మనకోసం వచ్చిందంటే నా గురించి ఎంతో కొంత తెలుసుకునే ఉంటుంది.. వీలైనంత నువ్వు జాగ్రత్త పడుతూ రాజినీ జాగ్రత్తగా చూసుకో.. లిఖిత : ఇంకెన్ని సార్లు చెపుతావు.. జాగ్రత్తగానే ఉంటానులే.. రుద్ర : లేదు.. నేను ఇంతక ముందులా కాదు.. అమ్మకి నీకు రాజికి.. పిల్లలకి ఏం జరిగినా నేను తట్టుకోలేను.. నాకు ఏ యుద్ధాలు.. గొడవలు వద్దు.. అమ్మతో మీ ఇద్దరితో ప్రశాంతమైన జీవితం కావాలి అంతే.. లిఖిత : నువ్వెళ్ళిరా.. మన కుటుంబానికి నా ప్రాణం అడ్డు.. రుద్ర : నీతోనే నేనూ.... అని చెపుతూనే.. నా శరీరం లోనుంచి బైటికి వచ్చి గుడి దెగ్గరికి ఎగిరాను..
27-07-2022, 10:20 PM
|
« Next Oldest | Next Newest »
|