Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
తరువాతిరోజు గురువుగారు లేవకముందే లేచి అన్నయ్యలందరితోకలిసి గురుకులం పనులు చేస్తున్నాను .
గురువుగారు సూర్యోదయానికి కొద్దిసేపు ముందు లేచారు - నేను కనిపించకపోవడంతో మహేష్ మహేష్ ...... అంటూ కంగారుపడుతూ బయటకువచ్చి , అందరితోపాటు కలిసి చిరునవ్వులు చిందిస్తూ పనులు పూర్తిచేస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు .

గురువుగారు గురువుగారు అంటూ అందరూ వినయంగా నమస్కరించడం చూసి నేనూ నమస్కరించాను . 
గురువుగారు నవ్వుకుని , రమ్మని కళ్ళతోనే సైగచెయ్యడంతో బుజ్జిబుజ్జిపరుగుతో వెళ్ళాను . మహేష్ ...... ఈరోజు ఏమిటి నాకంటే ముందుగా లేచావు - అందరితోపాటు కలిసి పనులు చేస్తున్నావు .......
మీరే చెప్పారుకదా గురువుగారూ ....... ఈరోజు నుండీ నా విద్యాభ్యాసం అని అందుకే అందరితోపాటు నేనూ జతకలిసాను - ఈరోజు నుండీ నేనూ శిష్యుడినే .... - ఇకనుండీ అందరితోపాటు మా గురువుగారిని సేవిస్తూ విద్య నేర్చుకుంటాను .
గురువుగారు : మంచిది మంచిది ....... అంతలోనే ఎన్ని మాటలు నేర్చావు , విద్యాభ్యాసం కంటే ముందు మా బుజ్జిమహేష్ తెలుసుకోవాల్సినవి ఉన్నాయి , ఈ గురువుతోపాటు వస్తావా ...... ? .
మీతోపాటు ఎక్కడికైనా వస్తాను గురువుగారూ అంతకంటే అదృష్టమా అంటూ పాదాలను స్పృశించాను .
గురువుగారు : సంతోషించి దీవించారు , మహేష్ ...... నువ్వు ఏమిచేసినా నాకు మిక్కిలి సంతోషం కలుగుతోంది అంటూ లేపి వారితోపాటు తీసుకెళ్లారు .

( ఇలా ఎప్పుడైనా మమ్మల్ని తీసుకెళ్లారా అంటూ యువరాజులు లోలోపలే కోపాన్ని ప్రదర్శిస్తున్నారు ) 

అరణ్యంలో కొద్దిసేపు నడిపించుకుంటూ అరణ్యం గురించి వివరిస్తూ నది ఒడ్డుకు తీసుకెళ్లారు . నీళ్ళల్లోకి మోకాళ్ళవరకూ తీసుకెళ్లి , నాయనా మహేష్ ...... ఈ నదీ దేవతనే నిన్ను నా చెంతకు చేర్చింది - నీకు ఏకష్టం వచ్చినా నదీ దేవతతో పంచుకోవచ్చు .
అమ్మలా అన్నమాట ........
గురువుగారు : అవును మహేష్ , నీతల్లితండ్రులేవరో తెలియదు కాబట్టి నీకు ..... తల్లీ తండ్రి ఈ నదీ దేవతనే .......
నాకు తల్లీ తండ్రి గురువు దైవం అన్నీ మీరే గురువుగారూ ....... , అయినా మీ దగ్గర ఉంటే కష్టమే తెలియదు .
గురువుగారు మురిసిపోయారు - నాయనా మహేష్ ...... ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి సూర్యనమస్కారం చేసుకోవడం ఆరోగ్యం , రోజూ నాతోపాటు వస్తావా ? .
గురువుగారూ ...... నేను మీ శిష్యుడిని ఆజ్ఞ వెయ్యండి , అన్నయ్యలతో అన్నీ తెలుసుకున్నాను , ఇకనుండీ విద్యను అభ్యసిస్తూనే గురువుగారిని సేవించుకోవడమే నా కర్తవ్యం అంటూ నమస్కరించాను .
గురువుగారు : విద్యాభ్యాసం మొదలుకాకముందే అన్ని విషయాలూ తెలుసుకున్నావు , ఎంతైనా బుజ్జిదేవుడివి కదా .......
నేనెప్పటికీ మా గురువుగారి శిష్యుడినే .......
గురువుగారు : గురువుగారినే మునగచెట్టు ఎక్కిస్తున్నావు , నీ ఒక్కొక్క బుజ్జి పలుకుకు ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేను - అదిగో సూర్యోదయం అంటూ సూర్య వందనం ఎలా చేయాలో నేర్పించారు .
గురువుగారితోపాటు నదీ దేవత అమ్మ ఒడిలో స్నానమాచరించి అరణ్యం గురించి తెలుసుకుంటూనే గురుకులం చేరుకున్నాము .

అప్పటికే విద్యాభ్యాసానికి ఏర్పాట్లు పూర్తిచేసి ఉండటంతో శివుడి పూజ జరిపించారు . గురువుగారు ముందుగా గురుకులంలో కొత్తగా అడుగుపెట్టిన శిష్యబృందానికి ఓనమాలు దిద్దిన్చి చివరగా నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని విద్యాభ్యాసం చేయించారు .
గురుకులంలో ఉన్నన్ని రోజులు గురువుగారు చెప్పినట్లుగా నడుచుకుంటాము అని అందరమూ ఒకేసారి గురువుగారి ఆశీర్వాదం తీసుకుని దేవుడిని మొక్కుకున్నాము .
చిన్న గురువులు : చూసారా యువరాజులూ ...... మొదట కొత్తగా వచ్చిన మీ తమ్ముళ్లకు చేయించి చివరన బుజ్జి మహేష్ కు విద్యాభ్యాసం చేయించారు , గురువుగారి దృష్టిలో అందరూ సమానమే .....
యువరాజులు : అందరూ సమానం అన్నదే మాకు ఇష్టం లేదు , మేము పాలించేవాళ్ళము - మీరంతా పాలించబడేవారు , ఇక్కడ ఉన్నంతవరకే వినయంగా ఉంటాము ఎందుకంటే ఇలాంటి గురువుగారు దొరకడం అదృష్టం అనిచెప్పారు మా నాన్నగారు , అన్ని విద్యాలూ నేర్చుకుని మా ఇష్టప్రకారం పరిపాలన చేస్తాము . మాకు నీతులు చెప్పడం మానేసి తొందరగా అన్ని విద్యలూ నేర్పించండి .......
చిన్న గురువులు : ఏ విద్యలు ఎప్పుడు నేర్పించాలో గురువుగారే నిర్ణయిస్తారు .

వినాయక స్తోత్రంతో బుజ్జాయిలందరికీ బోధన మొదలుపెట్టారు . 
మహాశివరాత్రి కావడంతో సూర్యాస్తమయం వరకూ పళ్ళ రసాలతోనే ఆకలితీర్చుకుని , సాయంత్రం మహాశివరాత్రి ఘనంగా జరుపుకుని పానకం స్వీకరించి రాత్రంతా శివుడి భజనలతో జాగారం చేసాము .

తరువాతి రోజునుండీ గురుకులం అన్నయ్యలందరితోపాటు గురువుగారికంటే ముందే లేచి పనులు పూర్తిచేసి , గురువుగారితోపాటు వెళ్లి సూర్య నమస్కారం మరియు నదీ అమ్మ ఒడిలో స్నానమాచరించి గురుకులం చేరుకోవడం , విధ్యనభ్యసిస్తూనే గురువుగారిని సేవించుకోవడం - అరణ్యం నుండి గురుకులంలో అందరికీ ఆహారం తీసుకురావడం - గురుకులాన్ని శుభ్రం చెయ్యడం - పనులు చెయ్యడం - పడుకునేముందు గురువుగారి పాదాలను స్పృశిస్తూ వారు నిద్రపోయిన తరువాత నిద్రపోవడం ........
ఆ చిన్న వయసుకే విద్యతోపాటు అరణ్యంలో ఉండే ప్రతీ మొక్క ఒక ఆయుర్వేదంగా ఎలా పనిచేస్తుందో నేర్చుకోవడం - కర్రసాము - మళ్ల యుద్ధం - విలు విద్య - కత్తిసాము ....... ఇలా యుద్ధవిద్యలన్నీ నెమ్మదిగా నేర్పించేవారు .

గురువుగారు అప్పుడప్పుడు అందరినీ దట్టమైన అరణ్యంలోకి తీసుకెళ్లి సాధు జంతువులతో మచ్చిక మొదలుకుని క్రూర జంతువుల నుండి ఎలా చాకచక్యంగా తప్పించుకోవడం గురించి వివరించేవారు మరియు ఆచరణాత్మకంగా చూయించేవారు .
అదేసమయానికి సింహం గాండ్రిoపు వినిపించింది దూరంగా చూస్తే మనిషి ఎత్తున్న సింహం , అందరూ గజగజావణికిపోతున్నాము .
గురువుగారు నేనున్నాను నేనున్నాను అని ధైర్యం ఇస్తున్నా శిష్యులందరూ కేకలువేస్తూ గురుకులం వైపుకు పరుగులుతీశారు . గురువుగారు నవ్వుకుని చిన్న గురువులందరికీ జాగ్రత్తగా తీసుకెళ్లమని పంపించారు . మహేష్ ...... నువ్వెంటీ ఇక్కడే ఉన్నావు అంతపెద్ద సింహం చూసి భయం వెయ్యడం లేదా ? .
మా గురువుగారు ఉండగా నాకు భయమేల అంటూ వణుకుతున్నా దైర్యంగా ప్రక్కనే ఉన్నాను .

గురువుగారు : శివుడి వర ప్రసాదం అయిన మా బుజ్జిమహేష్ భయపడతాడు అనుకోవడం నాదీ తప్పు అంటూ నన్ను ఎత్తుకుని నేరుగా సింహం దగ్గరికి చేరారు .
ఆశ్చర్యం తమను - అరణ్యాన్ని వందల ఏళ్లుగా రక్షిస్తున్నారు అన్నట్లుగా గురువుగారికి నమస్కరించి వెనుతిరిగింది .
ప్చ్ ప్చ్ .......
గురువుగారు : మహేష్ ...... సింహాన్ని తాకాలని అనుకున్నావుకదూ నాకు తెలిసిపోతోందిలే అంటూ , సింహంతో మాటలు కలిపారు గురువుగారు .
గురువుగారి మాటలను గౌరవించి మావైపుకు తిరిగింది . 
గురువుగారు తాకేలా చెయ్యడమే కాకుండా సింహంపై కూర్చోబెట్టారు .
అంతే బుజ్జి హృదయం ఆగినంత పని అయ్యింది - వణుకుతూ ఉండిపోయాను .
గురువుగారు నవ్వుకుని అరణ్యంలో ఒక కొద్దిదూరం నడిపించి , సంతోషమేనా బుజ్జిమహేష్ అంటూ ఎత్తుకున్నారు .
అంతే గురుకులం చేరేంతవరకూ గురువుగారిని వదిలితే ఒట్టు గట్టిగా కరుచుకుపోయాను .

సింహంపై స్వారీని కొంతమంది అన్నయ్యలు ...... చిన్న గురువులు ఇచ్చిన ధైర్యంతో దూరం నుండీ చూసినట్లు , గురువుగారి నుండి నన్ను కాస్త కష్టపడే ఎత్తుకుని భయం వెయ్యలేదా అని అడిగారు .
అంతలోనే నా పాదాలవెంబడి తడిని చూసి యువరాజులు నవ్వుకున్నారు . 
అన్నయ్యలు : బుజ్జి మహేష్ నువ్వు కేవలం తడిపేశావు - మా ప్రాణాలైతే పోయేవే నువ్వు చాలా ధైర్యవంతుడివి అంటూ భుజం తట్టారు .
యువరాజులు కోపంతో వెళ్లిపోయారు .

అంతలో ఒక అన్నయ్య వచ్చి గుడ్డ అందించాడు . తెరిచి చూస్తే సింహంపై స్వారీ చేస్తున్న నా బొమ్మ ....... , సంతోషంతో ధన్యవాదాలు తెలిపి గురువుగారూ గురువుగారూ అంటూ పరుగునవెళ్లి చూయించాను .
గురువుగారు : చాలాబాగుంది అంటూ కుటీరంలో గోడకు తగిలించారు . 
గురువుగారికి నేనంటే ఎంత ఇష్టమో మరింత బాగా తెలిసింది .

ఏడాది మొత్తం అందరితోపాటు గురువుగారిని సేవిస్తూ అంతకుమించి గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో విద్య మరియు జీవనానికి అవసరమైన విద్యలను అభ్యసించాను .
ప్రతీ ఏడాది చివరన నిర్వహించే నా వయసు పిల్లల పోటీలన్నింటిలో ప్రథమంగా నిలిచి గురువుగారు గర్వపడేలా చేసాను .
ఆ క్షణం గురువుగారు పొందిన ఆనందాన్ని చూసి చాలా సంతోషం వేసింది ఇక జీవితాంతం అందివ్వాలని ధృడంగా నిశ్చయించుకుని ముందు ఏడాది కంటే మరింత ఇష్టంతో కష్టపడుతూ గురువుగారికి ఆ ఆనందాన్ని పంచుతూనే ఉన్నాను. 
అధిచూసి యువరాజుల అసూయ ఈర్ష్యలు పెరుగుతూనే అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి .

యువరాజుల గురించి ఆనోటా ఈనోటా గురువుగారి చెవికి చేరింది . పదిహేనవ ఏట నుండీ యువరాజులకు నేర్పించే యుద్ధవిద్యలను వారితో సమానంగా నాకు కూడా నేర్పించడం మొదలుపెట్టారు . గుర్రపు స్వారీతో మొదలుపెట్టి యుద్ధ విద్యలు - రాజ్య పాలన ....... 
యువరాజులకు మాత్రమే నేర్పించే విద్యలను ఒక సామాన్యుడికి తమతో సమానంగా తమతోపాటు కలిపి నేర్పించడం మరింత ఆగ్రహాన్ని కలిగించింది . కానీ గురువుగారి ఆజ్ఞలను కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు . 
ఆ ఏడు మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందేలేచి గురువుగారి దగ్గరకు చేరుకుని నది దగ్గరికి చేరుకున్నాము .

అక్కడ నది ఒడ్డున ఒక అందమైన గుర్రం నీళ్లు తాగుతోంది . మమ్మల్ని చూడగానే మాదగ్గరికి వచ్చింది - నా చుట్టూనే తిరుగుతోంది .
గురువుగారు : ధైవేచ్చ ....... , మహేష్ ....... నీకోసం మన దైవమే నీ చెంతకు ఇంతటి శక్తివంతమైన అశ్వాన్ని దరి చేర్చారు , ఇక నుండీ నీ సొంతమైన అశ్వంతో శిక్షణ తీసుకోవచ్చు .
నా ఆనందానికి అవధులు లేవు - అశ్వాన్ని ఆప్యాయంగా హత్తుకున్నాను . 
గురువుగారు : ఇద్దరూ ఒక్కటైపోయారన్నమాట , నీ ప్రాణ స్నేహితుడి పేరు ఏమిటి మహేష్ .......
అర్జునుడికి దారిని చూయించేది కృష్ణుడు కదా గురువుగారు .......
గురువుగారు : కృష్ణ అన్నమాట - చాలా బాగుంది మహేష్ .......

అశ్వంతో గురుకులానికి చేరాము . అంతటి అద్భుతమైన అశ్వాన్ని చూసి యువరాజులే ఆశ్చర్యపోయారు . 
ఆరోజు నుండీ ఇద్దరమూ ఒక్కటిగా శిక్షణను ప్రారంభించి చాలా చాలా దగ్గరయ్యాము ఒకరిని విడిచి మరొకరం ఉండలేనంతలా ........

అలా మూడేళ్ళ చివరకు చేరుకుంది - పోటీలకు రంగం సిద్ధమైంది .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
పోటీల రోజున శిష్యులందరూ పోటీలకోసం సిద్ధమవడానికి వ్యాయామాలు చేస్తుంటే యువరాజులు మాత్రం గురుకుల ద్వారం వైపుకే చూస్తున్నారు .
సరిగ్గా పోటీలు ప్రారంభమయ్యే సమయానికి చుట్టుప్రక్కల రాజులందరూ గురుకులం చేరుకున్నారు . నేరుగా గురువుగారి దగ్గరకువెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు .
గురువుగారు : మీ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి అంటూ దీవించారు - సరైన సమయానికే వచ్చారు మీ వారసుల పోటీలను ఆసక్తికరంగా వీక్షించండి - చిన్న గురువులు శిష్యులకు ఆ ఏర్పాట్లు చెయ్యమని చెప్పారు .
రాజులు : చాలా సంతోషం గురువుగారూ ........ , మీకోరిక ప్రకారం పోటీలను వీక్షించాలంటే మా అందరి నుండి ఒక మనవి - మీకు తెలపకుండా ఆకస్మికంగా ఇక్కడకు రావడానికి కారణం కారణం ..........
రాజులందరూ ...... గురువుగారిపై గౌరవంతో వచ్చిన కారణం చెప్పడానికి సంసయిస్తుండటం - యువరాజులు తమ అభిలాష తీరబోతోందన్న సంతోషంతో గుసగుసలాడుకోవడం చూసిన గురువుగారికి విషయం మొత్తం అవగతమైపోయింది .

గురువుగారు : ఈ ఆకస్మిక సందర్శన వెనుక కారణం ఇప్పుడే అర్థమైంది , ఒక్కవిషయం అడుగుతాను జవాబివ్వండి - మీ వారసులు బలహీనమైన రాజులుగా ఉండాలని ఆశపడుతున్నారా ? .
రాజులు : గురువుగారూ గురువుగారూ .......
గురువుగారు : మీరు ఇలానే కోరుకుంటే మీ ఇష్టం - ఈ పోటీలు మా శిష్యుడైన మహేష్ గొప్పతనం కోసం నిర్వహిస్తున్నవి కావు - ఒక్కటి మాత్రం సత్యం ఇక్కడ విధ్యనభ్యసించిన యువరాజులంతా గొప్ప రాజులు కాబోతున్నారు , మీ రాజ్యాలకు గొప్పతనం తీసుకురాబోతున్నారు - ఒకవిషయం గుర్తుపెట్టుకోండి ఒక వీరుడిని తలదన్నేవాడు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాడు అదే జీవన పయనం - అలాంటి వీరుడే నా శిష్యుడు మహేష్ , అతడితో పోటీపడి విజయం సాధించినా - చివరిదాకా పోరాడి ఓడినా ఒక మంచి గుణపాఠం యువరాజులకు బోధపడుతుంది , భవిష్యత్తులో ఎప్పుడైనా రాజ్యానికి అలాంటి అపాయం ఎదురైనప్పుడు ఈ పోటీ ఒక విశ్వాసాన్ని కలిగించి దైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం వస్తుందన్నదే ఉద్దేశ్యం , ఈ పోటీలు మహేష్ కోసం కాదు యువరాజుల శక్తిసామర్ధ్యాలను తెలుసుకోవడం కోసం , చివరగా ఒకటి ఈ గురుకులంలో రాజు పేద అని తేడాలేకుండా అందరికీ ఓకేవిధమైన విద్యను నేర్పించబడుతుందని మీకు తెలిసిందే - ఈ పోటీలలోనే కాదు మహేష్ ను ఓడించే వీరుడు ఈ ప్రపంచంలోనే లేడు ....... 

రాజులంతా ఆగ్రహానికి లోనై వారి యువరాజులవైపు చూసారు .
అదే నిజం అన్నట్లు యువరాజులంతా వ్యక్తపరచడం - గురువుగారు చెప్పినది అక్షర సత్యం కాబట్టి తమను తాము తమాయించుకున్నారు . 
గురువుగారు : ఇలాంటి వీరుడితో పోటీపడి గెలవడం అసాధ్యం కానీ యువరాజులంతా ఒక ఆత్మవిశ్వాసంతో రాజ్యానికి చేరుతారు అనిమాత్రం ఖచ్చితంగా చెప్పగలను .
రాజులు : గురువుగారూ ...... మీరు చెప్పారంటే అది నిజం - గురువుగారు ఇలా పొగడటం మేమిప్పటివరకూ చూడలేదు - వీరుడా నీజన్మ ధన్యం ....... , కానీ గురువుగారూ ....... ఒక అనామకుడితో మా యువరాజులు ఓడిపోయి రాజ్యానికి చేరడం భావ్యం కాదు - అయినా ఇప్పటివరకూ గురుకులంలో యువరాజులతో ఒక యువరాజు మాత్రమే పోటీపడుతూ .......
గురువుగారు : రాజా ......
రాజు : గురువుగారూ తప్పుగా మాట్లాడితే క్షమించండి కానీ దయచేసి మాట్లాడనివ్వండి , తరతరాలుగా మిమ్మల్ని కాదని ఏరాజు ముందుకువెళ్లలేదు ఈ ఒక్కసారికి మా కోరిక మన్నించండి - యువరాజులకు మాత్రమే పోటీలు నిర్వహించండి , తోటి యువరాజులతో గెలిచినా ఓడినా మాకు గౌరవమే ....... , యువరాజుల కింద భ్రతకాల్సిన ఒకడి చేతిలో ఓడిపోవడం మేము జీర్ణించుకోలేము , మీరు మన్నిస్తున్నారు మాటిస్తున్నారు ........
గురువుగారు మౌనంగా ఉండిపోయారు .

యువరాజులంతా సంబరాలు చేసుకుంటున్నారు - అందరూ వెళ్లి తమ తమ రాజులను కౌగిలించుకున్నారు - మాదగ్గరికివచ్చారు .
రేయ్ మహేష్ ...... యువరాజులతో పోటీపడటానికి ఒక అర్హత కావాలి . తండ్రి ఎవరో తల్లి ఎవరో ఏ ఊరో కూడా తెలియదు నదిలో ప్రవాహానికి కొట్టుకొచ్చిన నువ్వు మాతో పోటీపడగలవని ఎలా అనుకున్నావు , మేము రాజులం అయ్యాక నీ సంగతి చెబుతాము నిన్ను మా పాదాలకింద తొక్కేస్తాము ఎంతటి వీరుడివో అప్పుడు తెలుస్తుంది అంటూ ఘోరంగా అవమానించి రాక్షసానందం పొందుతున్నారు .
రాజులు : యువరాజులూ ....... మేమొచ్చిన పని ముగిసింది , మీ తోటి యువరాజులతో సంతోషంగా పోటీలు ఆస్వాదించండి త్వరలోనే గురువుగారికి గురుదక్షిణ సమర్పించి మిమ్మల్ని ఘనంగా రాజ్యానికి తీసుకెళతాము అనిచెప్పి గురువుగారి ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయారు .

గురువుగారు : మహేష్ ........
గురువుగారూ అంటూ పరుగునవెళ్ళాను .
గురువుగారు : క్షమి .......
గురువుగారూ ...... మీ నోటి నుండి ఆ మాట ఎన్నటికీ రాకూడదు , నాకైతే అస్సలు రాకూడదు అంటూ పాదాలను స్పృశించాను .
గురువుగారు : లేపి కన్నీళ్లను తుడుచుకున్నారు , వెళ్లు మహేష్ వెళ్లు వెళ్లి నదీ దేవతతో బాధను పంచుకో ......
బాధనా ...... లేనేలేదు గురువుగారూ , మా గురువుగారి మాటే నాకు వేదం , సంతోషంగా పోటీలలో నా వంతు సహాయం చేస్తాను ఆజ్ఞ ఇవ్వండి గురువుగారూ అంటూ నవ్వుతున్నాను .
గురువుగారు : నిన్ను చూసి గర్వపడుతున్నాను మహేష్ అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు .
ఇంతకంటే అదృష్టం ఏముంటుంది గురువుగారూ ...... , గురువుగారే స్వయంగా గర్వపడుతున్నాను అనడం - మురిసిపోతూ కౌగిలించుకోవడం , ఒక శిష్యుడికి ఇంతకంటే ఏమికావాలి , సమయం మించిపోతోంది ఆజ్ఞ ఇవ్వండి గురువుగారూ ........
గురువుగారి పెదాలపై చిరునవ్వు చూసి సంతోషంతో గురువుల దగ్గరికివెళ్లి యువరాజుల పోటీలలో నావంతు సహాయం చేస్తూనే నా మనసులో పోటీలను ఆస్వాధిస్తున్నాను . ఆ విషయాన్ని గురువుగారు గమనించకపోలేదు మధ్యమధ్యలో నావైపు చూసి నవ్వడం తెలుస్తూనే ఉంది . 
వారం రోజులపాటు అట్టహాసంగా జరిగిన పోటీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యాయి .

గెలుపొందిన యువరాజులు సంతోషంతో - ఓడిన యువరాజులు బాధతో గురువుగారి దగ్గరకు చేరుకున్నారు .
గురువుగారు జయాపజయాల గురించి చక్కటి సందేశాన్ని ఇచ్చి జీవితంలో అందరూ తమ తమ రాజ్యాలను గొప్పగా పరిపాలించాలని చెప్పారు , రేపే మీ మీ రాజ్యాలకు ప్రయాణం కావున ఆ ఏర్పాట్లు చేసుకోవాలని పంపించారు .

గురువుగారు విశ్రాంతి తీసుకోవడానికి కుటీరంలో ఏర్పాటుచేస్తున్నాను .
గురువుగారు వచ్చి మహేష్ ...... అన్నీ పోటీలలో అందరినీ గెలిచేశావుకదూ ......
గురువుగారితో ఏదీ దాచను కాబట్టి అవునన్నట్లు సిగ్గుపడి , మోకాళ్లపై కూర్చుని గురువుగారి పాదాలను వొత్తుతున్నాను .
ఒక్కొక్క పోటీ ఎన్ని క్షణాలలో గెలిచేసావో కూడా నేను చెబుతాను అంటూ చాలాసేపు సంతోషంతో ముచ్చటించాము .
మహేష్ మహేష్ ...... పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్లాలికదా .....
గురువుగారు : ఇక చాలు మహేష్ , తోటి స్నేహితులు పిలుస్తున్నారు కదా వెళ్లు .....
అలాగే గురువుగారూ ...... ఆహారం తీసుకొచ్చి మా గురువుగారిని సేవించుకుంటాను అనిచెప్పి బయటకువెళ్ళాను .
Like Reply
బయటకువెళ్ళిచూస్తే యువరాజులు ....... , స్నేహితులకోసం చుట్టూ చూస్తున్నాను.
యువరాజులు : వీరాధివీరా పిలిచింది మేమే .......
ఆహారం తీసుకురావడానికే కదా పదండి స్నేహితులూ .......
యువరాజులు : స్నేహితులా ....... అంటూ నవ్వుతున్నారు , మేము కాబోయే రాజులం - నువ్వు మా కాబోయే బానిస , నేటితో మా గురుకులం పూర్తయ్యింది , మేము అరణ్యం వెళ్లి ఆహారం తీసుకురావడం ఏమిటి ...... , చూశావా నిన్ను పోటీల నుండి ఎలా తప్పించామో ...... అదీ మా అధికారం , మమ్మల్ని గెలిచే ఏ వీరుడూ ఈ భువిపై ప్రాణాలతో ఉండడు , మేము రాజులం అయిన వెంటనే ఇక్కడికి వస్తాము గురువుగారి ఆశీర్వాదం తీసుకోవడానికి కాదు నిన్ను బానిసగా లాక్కెళ్లడానికి , మా అధికారానికి గురువుగారు కూడా అడ్డురాలేరు అదీ మా అధికారం ....... , ఉన్న ఈ కొన్నిరోజుల మీ గురువుగారిని భక్తిశ్రద్ధలతో పూజించుకో ....... , ఆ కొన్నిరోజులు ఎందుకంటే ఈరోజు నుండి పదిహేనవ రోజున ఈ భువిపైననే అందమైన అతిలోకసుందరి స్వయంవరం జరగబోతోంది - ఆమె అందాన్ని వర్ణించడం కవులకు కూడా సాధ్యం కావడం లేదట - స్వయంవరం వరకూ ఆమె గురించిన ఆలోచనలు తప్ప మరొకదానికి ఆస్కారం ఇవ్వడం మాకిష్టం లేదు ,  స్వయంవరానికి కేవలం యువరాజులు మాత్రమే అర్హులు - నువ్వు మాకంటే ఎంత వీరాధివీరుడైనా సరే నిన్ను రాజ్యంలోకి కూడా అడుగుపెట్టనివ్వరు కాబట్టి ఎవరి అర్హతలో వాళ్ళు బ్రతకాలి ....... , నువ్వెప్పుడూ మా కాళ్ళ క్రిందనే అంటూ రాక్షసానందం పొంది హెచ్చరించి వెళ్లారు .

మహేష్ భయం వేస్తోందా అంటూ అప్పటివరకూ జరిగిన సంభాషణ విన్నట్లు చిన్న గురువులు వచ్చి అడిగారు .
భయపడటం అన్నది గురువుగారు ఎన్నడూ నేర్పించలేదు - భయపడితే గిడితే గురువుగారికి మాత్రమే భయపడతాను - గురువుగారిని సేవించుకోవడం నుండి దూరం చెయ్యడం ఒక్కటే నన్ను బాధపెడుతుంది భయపెడుతుంది ....... 
చిన్న గురువులు : అధికాదు మహేష్ ...... , రేపు యువరాజులు తమ తండ్రుల సమక్షంలో గురుదక్షిణ సమర్పించిన తరువాత గురువుగారిని కోరిక కోరడం సంప్రదాయం , ఈసారి ఖచ్చితంగా నిన్ను బానిసగా తీసుకెళతామని కోరిక కోరతారు - కాదు అంటే రాజులంతా కలిసి గురుకులాన్ని లేకుండా చేస్తారు .
అలా జరగనేకూడదు - వేలాది మందికి విద్యాభ్యాసం చేస్తున్న ఈ గురుకులం నా ఒక్కడి వలన - నేను సంతోషంగా వెళతాను - గురువుగారి మాట నెగ్గాలి .
చిన్న గురువులు : మరి గురువుగారిని వదిలి ........
అంతే నా కళ్లల్లో చెమ్మ .......
మహేష్ మహేష్ అంటూ అందరూ ఉద్వేగానికి లోనయ్యారు .
గురువులూ గురువులూ ...... ష్ ష్ ష్ గురువుగారు విశ్రాంతి తీసుకుంటున్నారు భంగం కలిగించకూడదు అంటూ దూరం తీసుకెళ్లబోయాను .

మహేష్ అందరూ ....... లోపలికి రండి అంటూ కుటీరం గుమ్మం దగ్గరనుండి గురువుగారు పిలిచారు .
వెంటనే కన్నీళ్లను తుడుచుకుని గురువులూ ...... ఈ విషయం గురువుగారికి తెలియకూడదు బాధపడతారు అంటూ అందరితోపాటు లోపలికివెళ్ళాను .
మహేష్ ...... నువ్వు నిజంగా మహేశ్వరుడివే అంటూ కౌగిలించుకున్నారు గురువుగారు .
గురువుగారూ ...... ఏమిటీ సంతోషం ......
గురువుగారు : సంతోషం కాదు మహేష్ ప్రియమైన శిష్యుడిపై మమకారం , ఇక నటించకు నీతో ..... యువరాజుల మాటలన్నీ విన్నాను - నువ్వు ...... గురువులతో మాట్లాడిన మాటలు విన్నాను , నా జీవితకాలంలో నీలాంటి గొప్ప శిష్యుడిని చూడలేదు , ఈ గురువునే గర్వపడేలా చేసావు - మీ గురువులు చెప్పినది నిజమే యువరాజులు కోరితే నిన్ను పంపించడం కంటే మరొక మార్గం లేదు .
గురువుగారితోపాటు నా కళ్లల్లో చెమ్మ ...... తుడుచుకుని , సంతోషంగా వెళతాను గురువుగారూ ......
గురువుగారు : ఏమిచ్చి ఈ శిష్యుడి .......
గురువుగారూ ...... అంటూ పాదాలను స్పృశించాను - నేనెప్పటికీ మీ సేవకుడినే , నా జీవితాంతం మిమ్మల్ని సేవించుకున్నా రుణం తీరదు , అంత ఇష్టంతో ఈ శిష్యుడిని ఇంతటివాడిని చేశారు .

మహేష్ అంటూ లేపి హత్తుకుని ఉద్వేగానికి లోనౌతున్నారు గురువుగారు .
చిన్న గురువులు : గురువుగారూ ....... వేరొక ఉపాయం లేదంటారా ? , ఇంతటి వీరాధి వీరుడు - శివుడి వరప్రసాదం ...... ఈ యువరాజుల కింద బానిసగా ఉండాల్సిందేనా ....... ? .
గురువుగారు : అలా ఎన్నటికీ జరగనివ్వను అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు . రాజులు - యువరాజులు అన్న అధికారబలంతోనే కదా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు , మన మహేష్ ...... వాళ్ళకంటే గొప్ప రాజు అయితే అప్పుడు వీళ్లే బానిసలు అవుతారు . ఈ గురుకులం ఈ రాజులకు తరతరాలుగా మంచి గుణాలు నేర్పి పంపుతుంటే ఒక్కసారి రాజులు అయ్యాక అధికారమదంతో ప్రజలను ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు - ఇలా జనం నుండి రాజు అయితే ప్రజలు సంతోషాలతో జీవిస్తారు .
చిన్న గురువులు : వాళ్ళ కంటే గొప్ప రాజు ...... ? ఎలా గురువుగారూ ? .
గురువుగారు : వాళ్ళ నుయ్యి వారే తవ్వుకున్నట్లు స్వయంవరం గురించి యువరాజులే చెప్పారుకదా అలా ........
చిన్న గురువులు : స్వయంవరం జరిగే రాజ్యం ఇక్కడికి వేల మైళ్ళ దూరంలో కదా గురువుగారూ ........ , మహేష్ ఇప్పటివరకూ గురుకులం కూడా దాటి వెల్లనేలేదు ఎలా సాధ్యం .......
గురువుగారు : అదే మార్గం అని మీరు నమ్ముతున్నారు అదే సంతోషం ......
లేదు లేదు గురువుగారూ ...... మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెల్లనంటే వెళ్లను , గురువుల పాదసేవ కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు , నేను వెళితే ఆగ్రహించి మిమ్మల్ని ఏమైనా చేస్తారు ...... నేను ఒప్పుకోనే ఒప్పుకోను .
గురువుగారు : వయసు మళ్ళిన నాకు ఏమైతే ఏమిటి మహేష్ - ఒక మనిషి రెండు జీవితాలు చూసేంత చూసేసాను , నన్ను చూసుకోవడానికి ఇంతమంది గురువులు శిష్యులు ఉండనే ఉన్నారు - నీ గమ్యం ఈ గురుకులంతో ఆగిపోకూడదు - నువ్వు గొప్పవాడివి కావాలి - వీలైనంత మందికి సంతోషాలను పంచాలి నాయకుడవ్వాలి - ఇక బయట ప్రపంచం గురించి మనం తెలియచేద్దాము . 
గురువుగారూ ........
గురువుగారు : ఇదే శిష్యుడిగా ..... ఈ గురువుగారికి ఇచ్చే గురుదక్షిణ , నా కోరిక తీరుస్తావా మహేష్ ........
గురువుగారూ అంటూ మోకాళ్లపై చేరాను - మీరు అర్థించడం ఏమిటి ఆజ్ఞ వెయ్యండి .

గురువులందరిలో సంతోషం - గురువుగారూ ...... మహేష్ ను రాజ్యంలోపలికే అడుగుపెట్టనివ్వరు ఇక స్వయంవరానికి ఎలా ? .
గురువుగారు : లోకాకళ్యాణం కోసం ఏమిచేసినా తప్పులేదు - మహేష్ అర్థమైంది కదా - నీకు ఎల్లప్పుడూ మన దైవం పరమ శివుడు మరియు ఈ గురువుల ఆశీస్సులు వెన్నంటనే ఉంటాయి దైర్యంగా ముందుకువెళ్లు , మూడురోజులలో నీ ప్రయాణం - ఈ మూడురోజులు మనకు నిద్రాహారాలు లేవు , ఇప్పటివరకూ ఎవ్వరికీ నేర్పించని యుద్ధ వ్యూహాలు - బహుబాణ సంధింపు నైపుణ్యం ....... లాంటివన్నీ నీకు నేర్పుతాను - బయటి ప్రపంచం గురించి తెలియజేస్తాము , ఈ రాత్రికి సాధనను అరణ్యంలోని రహస్యమైన గుహలోకి మార్పు చెయ్యమని గురువులకు ఆదేశాలిచ్చారు , స్వయంవరం పూర్తయ్యేంతవరకూ మహేష్ గురించి పట్టించుకోము అన్నారుకదా , ఆ అతిలోకసుందరి మనసు గెలిచి ఆ రాజ్యానికి రాజై గురుకులానికి చేరిన మన శిష్యుడిని చూసి ఈ రాజులంతా బెదిరిపోవాలి - అది చూసి నేను ఆనందించాలి , ఇదే నువ్విచ్చే గురుదక్షిణ మహేష్ .......
నా దైవమైన గురువుగారి కోరిక తీర్చడం కంటే అదృష్టం మరొకటి ఏముంటుంది గురువుగారూ అంటూ పాదాలను స్పృశించాను .
సంతోషంగా ఆశీర్వదించి ఆయుధాలతోపాటు నన్ను గుహలోకి తీసుకెళ్లి రాత్రంతా నిద్రపోకుండా కష్టతరమైన విద్యలను నేర్పించారు .

సూర్యోదయ సమయానికి ఏమీజరగనట్లు నదికి చేరుకుని సూర్యవందనం - స్నానమాచరించి గురుకులానికి చేరుకున్నాము .
యువరాజులను సాంప్రదాయంగా తీసుకెళ్లడానికి రాజులు రావడం - నావైపు అవహేళన చేస్తూనే యువరాజులు గురుదక్షిణ కార్యక్రమం పూర్తిచేయ్యడం - చివరగా అనుకున్నట్లుగానే చుట్టుప్రక్కల రాజ్యాలలో పెద్ద రాజ్యం రాజు ...... నన్ను తమ రాజ్యంలో భటుడిగా పంపమని గురువుగారిని కోరారు .
ప్రణాళిక ప్రకారం గురువుగారు ఏ అనుమానం రాకుండా ఒప్పుకున్నట్లు నటించారు - ఇలాంటి తప్పుడు కోరికలకు మూల్యం త్వరలోనే అనుభవిస్తారు అంటూ మనసులో అనుకున్నారు .
రాజు : మా యువరాజు ఒక స్వయంవరానికి వెళ్లి వచ్చిన తరువాత వచ్చి తీసుకెళతాము - మహేష్ ...... భటుడిగా బాధ్యతలు నిర్వర్తించడం స్వయంగా చూడాలని ఆశపడుతున్నాడు .
గురువుగారు : ఊ అన్నారు . 

గురుదక్షిణ పూర్తిచేసుకుని మేళ తాళాలతో యువరాజులు వెళుతూ నాదగ్గర ఆగి , పదిహేను రోజుల్లో కలుస్తాము , నీ వలన మేమిక్కడ ఎంత ఇబ్బందిపడ్డామో అంతకుమించి నిన్ను ....... వద్దులే ఇప్పుడే చెబితే బాగోదు .
యువరాజులూ ...... నేను మొదటనుండీ మిమ్మల్ని స్నేహితులుగానే చూసాను .
యువరాజులు : అదే నువ్వు చేసిన తప్పు - నువ్వు స్నేహితుడివి ఏమిటి - మేము మేము యువరాజులు మాత్రమే స్నేహితులం , నువ్వు ఎప్పటికీ మా బానిసవే అంటూ కోపంతో నేల తల్లిపైకి తోసేసి అహంకారంతో వెళ్లిపోయారు .
మహేష్ మహేష్ ...... అంటూ వచ్చి చిన్న గురువులు వచ్చారు .
గురువుగారు వచ్చి ఇక రెండు రోజులే , ఏ ఒక్క నిమిషం కూడా వృధా కానివ్వరాదు అంటూ రెండు రోజులపాటు నిర్విరామంగా శిక్షణ కొనసాగింది .
గురువుగారు గర్వంగా భుజం తట్టడం చూసి , మహేష్ ...... ఒక శిష్యుడు ఈ విద్యలలో నైపుణ్యం సంపాదించడానికి ఏళ్ళు పడుతుంది నువ్వు మూడురోజుల్లో నేర్చుకున్నావు అంటూ ఆనందించారు .
అంతా గురువుగారి ఆశీర్వాదం అంటూ పాదాలను స్పృశించాను .
గురువుగారు : మహేష్ ....... రేపు సూర్య వందనం కాగానే అటునుండి ఆటే నీ ప్రయాణం .
గురువుగారూ అంటూ బాధతో హత్తుకున్నాను .
గురువుగారు : నీ గురించి నాకు తెలియదా మహేష్ - పదిహేను రోజులే కదా ......
గురువుగారూ ...... ఈరాత్రంతా మీ పాదసేవలోనే తరించనివ్వండి .
గురువుగారు మురిసిపోయారు , నీ ప్రాణ స్నేహితుడు కృష్ణ ఉండగా నీకు - నువ్వు ఉండగా కృష్ణకు , మేమిక్కడ దైర్యంగా ఉండవచ్చు . బయట ప్రపంచంలో అన్నిరకాల మనుషులు - రాక్షసులు ఉంటారు కాబట్టి నీ ఆయుధాలన్నింటినీ ఇప్పుడే రెడీ చేసుకో ....... , ఏ రాజ్యం కంటపడకుండా ప్రయాణం సాగించాలి .
మీ ఆశీర్వాదం గురువుగారూ ........
*************
Like Reply
Super bro
[+] 1 user Likes donakondamadhu's post
Like Reply
జనం మెచ్చిన రాజు super mahesh garu
[+] 1 user Likes ramd420's post
Like Reply
Mythic item bro e story line
[+] 1 user Likes Rao@Rao@116's post
Like Reply
Good story next update eppudu bro
[+] 1 user Likes kr96262015's post
Like Reply
Nice story bro. New concept
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Super update bro update konchem chinnaga anipinchindi,kani super
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
yourock సూపర్ మహేశ్ గారు.... జానపత కథ 
                            waiting for new update 
                                         Namaskar Namaskar Namaskar
[+] 3 users Like jwala's post
Like Reply
Maheshgaru emi cheppanu adbutham anthe
[+] 2 users Like Rapaka saikumar's post
Like Reply
No comment
Just chadhuvuthuu
Enjoy cheyyadame
❤️❤️❤️
[+] 3 users Like Takulsajal's post
Like Reply
Really waited for you to start a new story in this thread......
అసలు ఎలా రాస్తారు అండి బాబు మీరు....ఇంత పెద్ద పెద్ద భారీ అప్డేట్ లు.....(ఇది కొంచం చిన్నదే అనుకోండి)....
స్టోరీ ప్రారంభం చాలా బాగుంది....ఈసారి రాజులు కాళ్ళని తీసుకుని స్టార్ట్ చేశారు చాలా బాగుంది మీ ఐడియా......
ధన్యవాదాలు Namaskar Namaskar Namaskar
[+] 5 users Like Thorlove's post
Like Reply
మహేశ్ గారు...కొత్త కధని ప్రారంభించారు.వైవిధ్యభరితమైన ఈ కధ మొదటి భాగాన్ని అందించినందుకు ధన్యవాదాలు....ఇలాగే కధను కొనసాగించగలరని మనవి.
[+] 1 user Likes Taylor's post
Like Reply
Different ga untadi antey ento anukunna chala Baga start chesaru superb
[+] 2 users Like Saikarthik's post
Like Reply
Good start

Different story line tho start chesaru bagundi
[+] 1 user Likes Bvgr8's post
Like Reply
Good start bro
[+] 1 user Likes The_Villain's post
Like Reply
Wonderful update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Wonderful start Anna.
Keka pettinchav.
Next yuva rajulaki keka puttali.
[+] 2 users Like Mahe@5189's post
Like Reply
New aura 
New flavour 
Excellent start to one more new story anna
Writers are nothing but creators. Always respect them. 
[+] 3 users Like AB-the Unicorn's post
Like Reply




Users browsing this thread: 27 Guest(s)