09-06-2022, 05:16 PM
Nice update bro
ఆదిత్య ~ లవ్ పార్ట్
|
09-06-2022, 09:46 PM
great comeback bro
malli midi aina screenplay toh katti padesaru
11-06-2022, 06:20 PM
Quote:రాయలేదు మిత్రులారా ఇందులో అప్డేట్ ఉండకపోవచ్చు.
09-07-2022, 08:39 AM
Connectivity awesome
Eagerly waiting for the next updates
02-08-2022, 12:00 AM
Ee story super sir
Vikram richi rich story ki link chestu baga raasaru Prasanna
05-08-2022, 12:13 PM
ఏంటండీ 2 సస్పెన్సు లు పెట్టి కూల్ గా ఉన్నారా మాకు తొందరగా సస్పెన్సు రెవిల్ చేయండి బాస్
మీ ప్రియమైన మిత్రుడు సంజు
07-09-2022, 06:41 AM
7
అక్కడున్న రౌడీలని కొట్టి అమ్మాయిలని రక్షించిన తరువాత, మానస ద్వారా అచ్చు నాలానే ఉండే విక్రమ్ ని కలుసుకున్నాను. నా కంటే వయసు తక్కువ వాడు కానీ వాడి ఆలోచనలు చేసే పనులు మాటలు అన్ని పెద్ద వయసు వారికి మల్లె ఉన్నాయి, ఒకానొక సమయంలో అన్నా అని పిలవబోయి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అది నాకు నచ్చలేదు. అమ్మాయిలని డీసీఎం లోకి ఎక్కించి వారికి ధైర్యం చెప్పి, వారిని ఇంటికి చేర్చుతానని మాటిచ్చి బండి హైవే మీదకి ఎక్కించాను ఇంతలో ఫోన్ వచ్చింది. చూస్తే రాము. ఆదిత్య : చెప్పు రాము. రాము : అన్నా ఇక్కడ వదినకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది రేపే, దానికి వదిన ఒప్పుకుంది ఆ రమేష్ తోటి. ఆదిత్య : ఇదంతా నీకెలా తెలుసు, అస్సలు నువ్వు అక్కడ ఎందుకున్నావ్? రాము : అదీ.. నీకు సాయం చేద్దామని ఈ రమేష్ ని మభ్యపెట్టి వదిన దెగ్గర డ్రైవర్ గా చేరుదామని ప్లాన్ చేసాను, వర్కౌట్ అయ్యింది కూడా కానీ రెండు రోజుల తరువాత రమేష్ నాకు ఫోన్ చేసి ఇంటికి పిలిచి "ఇక నీ అవసరం లేదురా నాకు మీ అనురాధ మేడంకి పెళ్లి నిశ్చయం అయ్యింది" అన్నాడు, ఇప్పుడేం చేద్దామన్నా? ఆదిత్య : నేను ఆల్రెడీ బైలుదేరాను. రేపటి లోగా అక్కడుంటాను. నువ్వింకేం చెయ్యకు నేను చూసుకుంటాను. రాము : సరే అన్నా. ఫోన్ పెట్టేసి ఆలోచించాను, ఇది అమ్ములు పని కాదు నా అనురాధ దీనికి అస్సలు ఒప్పుకొని ఉండదు ఇదంతా అత్త పని, గతంలోకి వెళితే.... ఆదిత్య : అమ్మా అదీ.. ఏదో పురుగు కుట్టిందంటే చూస్తున్నా అను : అవును అత్తయ్య మంజుల : ఆపండి మీ నాటకాలు, అను నువ్వు మాతో పెళ్ళికి వస్తున్నావ్ బైలదేరు. అను : అత్తయ్యా.. మంజు : హ్మ్.. నడు.. త్వరగా, కావాలంటే బుక్స్ కూడా తెచ్చుకో. అంతే అనుని తీసుకెళ్లిపోయింది, పక్కనే ఉన్న గోడని గట్టిగా గుద్దాను, ఛ.. ఒక్క పది నిముషాలు ఓపిక పట్టుంటే అయిపోయేది, ఎందుకురా అంత ఆత్రం ఇప్పుడు చూడు, అయిందిగా బాగైంది.. ఇప్పుడు ఏడువు కూర్చుని.. అలా నన్ను నేను ఎన్ని బూతులు తిట్టుకున్నానో నాకే తెలుసు ఎంత ఏడుపు ఏడ్చానో. రాత్రి అస్సలు నిద్ర లేదు, నా మీద నాకే కోపంగా ఉంది.. దిండుని వాటేసుకుని పడుకున్నాను ఆహా లాభం లేదు రాత్రి అంతా మేలుకునే ఉన్నాను, తరువాత రెండు రోజులు అంతే పుస్తకాలు పట్టలేదు తిండి తినలేదు అస్సలు మంచం మీద నుంచి లేవలేదు, అమ్మ వాళ్లు ఫోన్ చేసి వస్తున్నామని చెప్పి పెట్టేసారు వాళ్ల మాటలు చూస్తుంటే అమ్మ అందరికీ చెప్పేసినట్టుంది. మూడు రోజులైంది మొహం కడుక్కుని,స్నానం చేసి. వాళ్లు వచ్చే లోపే లేచి రెడీ అయ్యి కూర్చున్నాను. వచ్చారు వచ్చి రాగానే అత్త నన్ను కోపంగా నవ్వుతూ చూసింది కాని ఏమనలేదు, అను వచ్చి పక్కన కూర్చుంది. అందరూ సోఫాలో కూర్చున్నారు. పెళ్లి గురించి అన్నిటి గురించి మాట్లాడారు కానీ మా ఇద్దరి గురించి ఊసే ఎత్తలేదు. అనుతో అస్సలు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు వీళ్లేవ్వరు, నాన్న మాత్రం నా వంక దీనంగా చూసాడు అందులో వెటకారం కనిపించి నాకు కోపం వచ్చింది. రాత్రికి తినేసి పడుకోడానికి వెళుతుంటే అను కూడా లేచింది. మంజుల : అనూ, అమ్మ రూంలోకి వెళ్లి పడుకో నాకు ఆదిత్యతొ పని ఉంది. అను : అలాగే.. నేనెళ్ళి మంచం మీద పడుకున్నాను అనుకి బదులు అత్త వచ్చింది. సరిత : రేయి పడుకున్నావా? ఆదిత్య : రా అత్తా సరిత : వచ్చి నా పక్కన కూర్చుని, రేయి మీ గురించి నాకు అన్నయ్య ముందే చెప్పాడు మాకేం అభ్యంతరం లేదు ఇదంతా మీ అమ్మ పనే, మేము వద్దని చెపితే మమ్మల్ని రఫ్ఫాడించేసింది, మళ్ళీ నన్ను అనుకునేవు. ఆదిత్య : లేదులే అత్తయ్య, సరే పాడుకోపో లేట్ అయ్యింది. సరిత : గుడ్ నైట్ బంగారం. ఆదిత్య : గుడ్ నైట్. లైట్ ఆపి డోర్ దెగ్గరికేసి వెళ్ళిపోయింది, రాత్రంతా రూం నుంచి బైటికి, లోపలికి ఒక పది సార్లు తిరిగుంటాను, తెల్లారి ఎగ్జామ్స్ లేచి రెడీ అయ్యాను బండి ఎక్కి స్టార్ట్ చేసాను అను వచ్చి మెలకుండా వెనక కూర్చుంది. మంజుల : అనూ బ్యాగ్ మధ్యలో పెట్టి కూర్చో ఆదిత్య : (నాకు సర్రున కాలింది) ఎందుకు నువ్వొచ్చి మధ్యలో కూర్చోవే సరిపోద్ది. మంజుల : రేయి వచ్చానంటే తన్నులు పడతాయి.. మూసుకుని పొ. బండి ముందుకు పోనిచ్చాను, అను గట్టిగా వాటేసుకుంది పక్కకి ఆపి బండి దిగాను అస్సలు నన్ను వదలటం లేదు బలవంతంగా తన తల ఎత్తాను కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆదిత్య : అమ్ములు ఇటు చూడు, ఏడవకు నేనేదో ఒకటి చేస్తాగా అలా ఏడిస్తే ఎలాగే, చూడు కళ్ళ కింద నల్లగా అస్సలు నిద్ర పొవట్లేదా నువ్వు.. పదా వెళదాం చూడు రోడ్డు మీద అందరూ మనల్నే చూస్తున్నారు పదా అని బుజ్జగించి మళ్ళీ బండి ఎక్కించి కాలేజీకి వెళ్లిపోయాను. ఇంట్లో.. సరిత : వదినా వదిలేయ్యకూడదు చూడు ఇద్దరి మొహాలు ఎలా మాడిపోయాయో. రాజు : అవునే, చూడు అస్సలు నా కోడలు నవ్వి ఇవ్వాల్టికి మూడు రోజులు. మంజుల : ఆ ఇలాగే వెనకేసుకు రండి, ఇప్పుడు వాళ్ళకి అంత వయసేం అవ్వలేదు, వాళ్లే అర్ధం చేసుకుంటారు మీరు కామ్ గా ఉన్నోళ్ళని రెచ్చగొట్టకండి.. అని లోపలికి వెళ్ళిపోయింది. ఎగ్జామ్ రాసి బైటికి వచ్చేసరికి అనూ నాకోసం ఎదురుచూస్తుంది. బండి తీసాను. అను : బావ, ఇంకెన్ని రోజులు ఇలాగా ఆదిత్య : వారంలోపు నిన్ను నన్ను వాళ్లే కలపక పోతే.. చూడు నువ్వే చూస్తావుగా అను గట్టిగా వాటేసుకుంది చిన్నగా తనతో మాటలు కలిపాను డల్ గానే ఉంది నాకంటే ఎక్కువ బాధ పడుతున్నట్టుంది, ఇద్దరం బైట ఐస్ క్రీం తినేసి ఇంటికి వెళ్లిపోయాం. ఇంటికి వెళ్ళగానే అమ్మ ఎదురు వచ్చి మమ్మల్నే చూస్తుంది, కోపంగా చూసాను. మంజుల : ఏది చేసినా మీకోసమే అని అర్ధం చేసుకోండి ఆ మూర్ఖుడికి చెప్పినా అర్ధం కాదు నువ్వైనా అర్ధం చేసుకోవే ఎప్పటికైనా మీ పెళ్లి జరగక మానేనా చెప్పండి అప్పుడు అస్సలు మీ దెగ్గరికి కూడా రాను నేను. ఈ సోది వినలేక లోపలికి వెళ్ళిపోయాను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే బ్రహ్మాండమైన ఆలోచన ఒకటి తట్టింది మంజులా కాసుకోవే నీ సంగతి చెప్తా ఇవ్వాల్టి నుంచి.
07-09-2022, 07:46 AM
అసలు అలా వుండే సరిత ఎందుకు మారిపోయింది.....ఎం జరిగుంటుంది.....చూద్దాం....ఆదిత్య నెక్స్ట్ మూవ్ ఎంటో మరి....
అప్డేట్ కి ధన్యవాదాలు |
« Next Oldest | Next Newest »
|