08-06-2022, 10:27 PM
Beautiful romantic update bro
విక్రమ్ ~ లవ్ పార్ట్
|
08-06-2022, 10:39 PM
Nice update bro
Problems anni clear aypoyaya
08-06-2022, 10:44 PM
Nice update
Ilanti situation lo Koda update itcharu Meeru great
08-06-2022, 10:53 PM
Simple and super update bro....
మీరు మళ్ళీ form లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది..... అప్డేట్ బాగుంది బ్రో.... Waiting for Vikram and Adhitya combination
08-06-2022, 11:00 PM
Wooow awesome update
08-06-2022, 11:08 PM
Update super
08-06-2022, 11:09 PM
Super update
08-06-2022, 11:35 PM
(This post was last modified: 08-06-2022, 11:57 PM by Ak0408. Edited 1 time in total. Edited 1 time in total.)
Vikram rich rich lo vikram mother ni vethukuntu vacchina
Vikram -manasa (vikram love parts) adithya -anu(adithya love parts) stories yokka hero-heroines ani naa assumption.
08-06-2022, 11:38 PM
(This post was last modified: 08-06-2022, 11:39 PM by Saikarthik. Edited 1 time in total. Edited 1 time in total.)
Superb update
Ipudu antha ok na bro
08-06-2022, 11:40 PM
Super update bro
08-06-2022, 11:54 PM
అప్పుడే అప్డేట్ అయిపోయిందా.... ఇంకా చదువుతూ ఉండాలని..... ప్రేమాలయం మూవీ లాగా అలా........ సూపర్ గా ఉంది.
09-06-2022, 12:10 AM
Nice update sajal garu
09-06-2022, 12:21 AM
09-06-2022, 05:59 AM
Super update
09-06-2022, 12:16 PM
Nice update bro
మి మరదలు సెట్ అయ్యిందా
09-06-2022, 05:25 PM
Super update bro
09-06-2022, 05:42 PM
NICE UPDATE
09-06-2022, 06:56 PM
Update please
09-06-2022, 09:50 PM
8
అందరూ మా ముందుకి వచ్చి మమ్మల్ని ఆటపాట్టించారు మానస సిగ్గు పడి నా వెనుక దాక్కుంది, అందరి వెనకా పడ్డాను అందరూ పారిపోయారు చివరికి అమ్మ కూడా అది చూసి మానస కూడా నాతో పాటే వాళ్ళని పట్టుకోడానికి వెళ్ళింది అందరం అలా సరదాగా గడిపేసి.. అందరికి అమ్మ మిగిలిన బిర్యానీ తలా ఒక్క ముద్ద తినిపించింది, అందరికీ ముద్ద పెట్టి నాకు మాత్రం పెట్టకుండా మానసకి పెట్టింది అది చూసి అందరూ నవ్వారు.. వెళ్లి తన వెనుక మోకాళ్ళ మీద నిల్చుని వాటేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి, ఆ అని నోరు తెరిచాను నాకు పెట్టింది.. అందరిని చూసి ఇప్పుడు అన్నట్టు చూసాను. ఆ తరువాత ఇంటికి వెళ్లి లగ్గేజ్ ప్యాక్ చేసుకున్నాం, తెల్లారి టూర్ కోసం... తెల్లారి అమ్మకి నాన్నకి చెప్పి అందరం కాలేజీకి వెళ్లి అక్కడే బస్సు ఎక్కం అంతా ఎవరి జంటని వాళ్ళతొ సీట్లు ఆక్రమించేసుకున్నారు వెళ్లి సలీమా పక్కన కూర్చున్నాను. మానస కూడా బ్యాగ్ తీసుకుని వచ్చేసింది కానీ నా పక్కన కాళీ లేకపోయేసరికి నన్ను దాటుకుని వెనక్కి వెళ్ళబోతుంటే సలీమ లేచి పూజ పక్కన కూర్చుంది "మీ కోసమే సీట్ ఆపాను" అని చెప్తూ.. మానస : థాంక్స్ సలీమా. విక్రమ్ : ఏంటి మీ ఫ్రెండ్స్ రాలేదా? మానస : చిన్నగా "వాళ్ళని కావాలనే రానివ్వలేదు నేను పట్టుబట్టి వచ్చాను, ఏదో జరుగుతుంది మా నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు". ఇప్పుడేం చేద్దాం. విక్రమ్ : చూద్దాం, మన వల్ల అయింది చేద్దాం. బస్సు బైల్దేరింది, మానస వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోవడంతొ సంతోషంగా నాతో ధైర్యంగా మాట్లాడుతుంది, తను నవ్వుతూ మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోయాను.. మానస పెదాలు భలే ఉంటాయి అటు ఇటు కోరగా మధ్యలో కొంచెం షేప్ తీసుకుని.. చూస్తూ ఉండిపోవచ్చు ఒక్కసారి ఆ స్ట్రా బెర్రీ లాంటి పళ్ళని అందుకుంటే వదలలేం. మానస : ఏమైంది ఏం ఆలోచిస్తున్నావ్? విక్రమ్ : ఏం లేదు అని నా వేలితో ఒక సారి పెదాలని రాసాను.. మానస : చూస్తున్నారు అని మోచేత్తో పొడిచింది, ఎదురుగా చూస్తే పూజ, భరత్ ఇద్దరు మమ్మల్నే చూస్తున్నారు. విక్రమ్ : రేయ్ నీకు లవర్ ఉందిగా అక్కడ కార్యం ఎలాగబెట్టకుండా ఇటు చూస్తావే... నువ్వెంటే తిరుగు అటు.. పూజ : అలాగే అలాగే... కొంచెం సేపటికి మానస నిద్ర పోయింది మధ్యనానికి భద్రాచలం చేరి రాములోరి దర్శనం చేసుకుని నీళ్లలో ఆడి పాడి ఆరు గంటల కల్లా లంబసింగి చేరాము అప్పటికే చలి స్టార్ట్ అయింది. అందరం రూమ్స్ తీసుకుని లగ్గేజ్ అందులో పడేసి బైటికి వచ్చి కాళీ ప్లేస లో అందరూ టెంట్స్ బుక్ చేసుకుంటున్నారు ఇద్దరికీ కలిపి ఒక టెంట్ , మేము వెళ్లి బుక్ చేసుకున్నాం.. కొంత సేపు మానసతొ మాట్లాడి అందరితొ మాట్లాడుతూ ఉండమని చెప్పి ఆ బ్రిడ్జి ఎక్కడ ఉందొ కనుక్కోడానికి వెళ్లాను... చుట్టు పక్కల ఎంక్వయిరీ చెయ్యగా లంబసింగి నుంచి 25km దూరంలో ఉందని తెలిసింది అక్కడికి వెళ్లాలంటే బైక్ కావాలి అడిగి చూసాను కానీ ఎవ్వరు హెల్ప్ చెయ్యలేదు... ఎనిమిది గంటలకి అందరితో పాటు భోజనం చేసి నేను మానస మా టెంట్ ముందు కూర్చున్నాం. మానస : చల్లగా ఉంది రా.. విక్రమ్ : ఇలా రా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కరుచుకున్నాను... ఇప్పుడు ఓకే నా..? మానస : ఓకే అని వెనక్కి తిరిగి బుగ్గ మీద ముద్దు ఇచ్చింది. పదకొండు ఇంటి వరకు ఏం చెయ్యాలా ఎలా అని చూస్తున్న నాకు మానస .... మానస : విక్రమ్ అతన్ని చూడు... అప్పటి నుంచి తాగుతూనే ఉన్నాడు లవ్ ఫెయిల్యూర్ ఏమో... విక్రమ్ : కావచ్చు ఈ వయసులో ఇంకేం ఉంటుంది అలా తాగడానికి రీసన్. మానస : అతని బైక్ చూడు.. ఏం బైక్ అది. విక్రమ్ : నింజా 1000cc బైక్ అది నా దాని కంటే కాస్టలీ భలే ఉంటుంది దాని సౌండ్. అప్పుడే అతను తాగుతున్న బీర్ పక్కన పెట్టి ఏటో వెళ్ళాడు... విక్రమ్ : మానస బైక్ కీస్ దానికే ఉన్నాయి, ఎలాగో తాగి ఉన్నాడు నేను వెళ్లి వస్తా ఈలోగా మానేజ్ చెయ్ ఏమైనా గొడవ అయితే మన వాళ్ళని పిలు చూసుకుంటారు. మానస : అడుగుదాం ఎందుకైనా మంచిది. విక్రమ్ : వచ్చిన దెగ్గర నుంచి అందరిని అడిగాను ఎవ్వరు హెల్ప్ చెయ్యలేదు గంటలో వచ్చేస్తాగా ఈ లోగ ఏమైనా అయితే నాకు ఫోన్ చెయ్, భరత్ చందు ఉన్నారు చూసుకుంటారు. అని అటు వైపు వెళ్లాను. మానస : విక్రమ్ వెళ్లిన ఐదు నిమిషాలకి అతను వచ్చి బీర్ ఎందుకున్నాడు , ముందే ఆపి తనకి చెపుదామని తనని చూసాను ఒక్క సారి భయం వేసింది తనని చూడగానే అచ్చం విక్రమ్ లానే ఉన్నాడు... విక్రమ్ ఫుల్ స్లీవ్ టీ షర్ట్స్ వేస్తే తను హాఫ్ హాండ్స్ టీ షర్ట్ దాని మీద షర్ట్ బటన్స్ పెట్టుకోకుండా వదిలేసాడు, కొంచెం కండలు తిరిగి ఉన్నాడు.. ఎందుకైనా మంచిది అని "విక్రమ్ నువ్వింకా వెళ్లలేదా?" అన్నా... నన్ను చూసాడు.. మానస : ఏంటి నువ్వు మందు తాగుతావా? అతను : అవును ఇదే నా ఆఖరి మందు బాటిల్, ఇవ్వాల్టితొ మందు మానేస్తున్నాను. ఇంతలో విక్రమ్ బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. మానస : అతను విక్రమ్ అయితే నువ్వెవరు? అతను నన్ను చూసి "నా పేరు ఆదిత్య ఇంతకీ ఆ విక్రమ్ ఎవరు? అస్సలు నువ్వెవరు?" అని బైక్ వేసుకెళ్లిన విక్రమ్ వైపు చూస్తున్నాడు. మానస : నా పేరు మానస, నీ బైక్ తీసుకెళ్లిన వాడు నా బాయ్ ఫ్రెండ్ కానీ మీరిద్దరు చూడటానికి ఒకేలా ఉన్నారు, ఇది ఎలా సాధ్యం? ఆదిత్య : తాగింది నువ్వా నేనా? మానస : నిజం అండి కావాలంటే చుడండి అని ఫోన్ తీసాను. ఇంతలోనే రెండు సుమోల్లో ఒక పది మంది దిగి అందరిని కొట్టడం మొదలు పెట్టారు అబ్బాయిలందరిని కట్టేసి అమ్మాయిలని సుమోల్లోకి ఎక్కిస్తున్నారు.... చందు భరత్ ఇద్దరు తిరగబడ్డారు.. కానీ ఎక్కువ సేపు నిలవలేకపోయారు.. వాళ్ళని కొట్టి కట్టేసారు. ఆదిత్యని చూసాను కోపంగా ఉన్నాడు మానస : ప్లీజ్ ఏమైనా చెయ్యండి వాళ్ళని కాపాడండి. ఆదిత్య : నీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చెయ్యి ముందు నా బండి తెమ్మను నేను అర్జెంటుగా వెళ్ళాలి టైం లేదు. మానస : ఇతనితొ లాభం లేదని విక్రమ్ కి కాల్ చేసాను ఫోన్ ఎత్తలేదు.. ఇంతలో అమ్మాయిల అరుపులు వినిపించి ఆదిత్య అటు వైపు చూసి అటు నడుచుకుంటూ వెళ్ళాడు. ఒకడు కొట్టడానికి రాడ్ పట్టుకుని వచ్చాడు, వాడిని గుండె మీద తన్నాడు అంతే అలానే దోళ్లుకుంటూ వెళ్లి సుమోని గుద్దుకున్నాడు... అంతే ఒక్కసారిగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు... అందరూ ఆదిత్య చుట్టు కర్రలు రాడ్లతొ రౌండ్ అప్ చేసారు... నేనింకా అలానే నోరు తెరిచి జరగబోయేది చూడడానికి రెడీగా ఉన్నాను...... |
« Next Oldest | Next Newest »
|