28-05-2022, 10:14 PM
Nice update
ఆదిత్య ~ లవ్ పార్ట్
|
29-05-2022, 07:14 AM
Nice start
29-05-2022, 08:00 AM
బాగుంది కానీ ఈ కథలో కూడా హీరో లాస్ట్ వరకు కష్టాలు పడి చివరి లో హీరో పవర్ చూపిస్తాడా. అంతేనా బ్రదర్
29-05-2022, 11:53 AM
Good start bagundi
29-05-2022, 12:00 PM
Super start
All the best your new story bro Super update bro
30-05-2022, 04:07 PM
Hellooooo
31-05-2022, 03:40 PM
31-05-2022, 03:41 PM
(28-05-2022, 03:22 PM)Saikarthik Wrote: Nice start (28-05-2022, 03:30 PM)raja9090 Wrote: Nice update bro (28-05-2022, 03:35 PM)Ghost Stories Wrote: Nice start broo (28-05-2022, 03:50 PM)K.R.kishore Wrote: Nice super (28-05-2022, 04:25 PM)Sudharsangandodi Wrote: Vikram,Aditya,anu ,sandhya,never ending love story (28-05-2022, 05:08 PM)Iron man 0206 Wrote: New story. new concept challa bagundhi bro (28-05-2022, 06:41 PM)Bvgr8 Wrote: Nice start (28-05-2022, 10:09 PM)Praveenraju Wrote: Nice starting bro Thank you all❤️
31-05-2022, 03:41 PM
31-05-2022, 03:42 PM
31-05-2022, 06:57 PM
(This post was last modified: 31-05-2022, 07:00 PM by Pallaki. Edited 2 times in total. Edited 2 times in total.)
2
పొద్దునే లేచి చదవటం మొదలు పెట్టాను, ఎందుకంటే మాకు రోజు మర్చి రోజు ఎగ్జామ్స్... ఈ రోజంతా అస్సలు అనూ నన్ను చూడలేదు నేను కూడా దాని మొహం చూడకుండా ఉండలేకపోయాను అందుకే సరిగ్గా చదవలేదు. తెల్లారి ఎగ్జామ్ ఏదో రాసాను అనిపించి బెల్ కొట్టగానే బైటికి వచ్చేసాను, అను మొన్న కనిపించిన అబ్బాయి తోటే మళ్ళీ నవ్వుతూ వచ్చింది, నేను చూస్తున్నాను అని తెలిసి వాడికి బాయ్ చెప్పి హగ్ చేసుకుని, బుగ్గ మీద ముద్దు ఇచ్చింది, నేను కళ్ళు ఆర్పకుండా తననే చూసాను, తను నన్ను ఇప్పుడేం చేస్తావ్ అన్నట్టు ఒక వెకిలి నవ్వు నవ్వుతూ నా ముందుకి వచ్చింది. నా పక్కకి వచ్చి నిలబడింది పక్కకి జరిగాను, మళ్ళీ నవ్వుతూ నా పక్కకి వచ్చి నన్ను తొంగి చూసింది...పక్కనే ఉన్న వేప చెట్టు దెగ్గర గడ్డిలో కూర్చున్నాను, అను నా దెగ్గరికి వచ్చింది వెకిలి నవ్వుతో.. అను : ఏంటి ఇవ్వాళ ఏమనవా, కావాలంటే ఇంట్లో చెప్పుకో మహా అయితే ఇంకో రెండు దెబ్బలు ఏస్తారు అంతేగా.. ఆదిత్య : చూడు అనురాధ నీ జీవితం నీ ఇష్టం నువ్వెవరితొ అయినా తిరుగు నాకు అనవసరం, నాకు నీతో గొడవపడాలని లేదు కుదిరితే ఫ్రెండ్స్ లా ఉందాం.. ఈలోగా కార్ వచ్చింది, డోర్ తీసి ఎక్కి కూర్చున్నాను ఇవ్వాళ నాన్నే వచ్చాడు.. అను కూడా ఎక్కింది ఇద్దరం సైలెంట్ గా ఉండటం చూసి "ఏమైంది?" అన్నాడు. ఆదిత్య : ఎందుకు నాన్నా రోజు మీరో మావయ్యో రావడం మీ ఆఫీస్ లో ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు ఎవరో ఒకరిని పంపించొచ్చు కదా? నాన్న : అలాగా, సరే నీ సలహా నాకు ఇచ్చావ్ గా అలాగే మావయ్యకి కూడా ఇవ్వు. ఆదిత్య : అలా కాదు మీకు అంత కష్టం ఎందుకని. నాన్న : అది అంతే బైట పనులు మాకు ఎన్ని ఉన్నా ఇంట్లో పనులు మనమె చేసుకోవాలి.. రేపు ఒక వేళ మేమిద్దరం బిజీ అవుతే నువ్వే చూసుకోవాలి అంతే కానీ పనోళ్ళకి చెప్తా అంటే కుదరదు. ఆదిత్య : అలాగేలే నాన్నా ఇక పోనీ. ఆల్రెడీ ఎగ్జామ్ రాసి అలిసిపోయిన నేను తినేసి ఏం మాట్లాడకుండా నా రూమ్కెళ్ళి పడుకున్నాను... 000000
ఇంట్లోకి రాగానే మంజుల మంచినీళ్లు అందించింది, సరిత కూడా వచ్చి సోఫాలో వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చుంది. రాజు : వాడు ఎందుకో కోపంగా ఉన్నాడు. మంజుల : నాకేం అలా అనిపించలేదే.. సరిత : ఎందుకు, ఏమైంది? రాజు : ఏమో వాడి మనసులో ఏముందో వాడు ఎప్పుడైనా చెప్పాడా... మనమూ కనుక్కోలేం.. ఏదో జరిగింది మొత్తానికి.. అనూకి తెలుసేమో. సరిత : అనూ...అనూ... అను : గోళ్లు తీసుకుంటున్న అనూ నెయిల్ కట్టర్ తొ వచ్చి "ఏంటి మా?" సరిత : మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? అను : లేదే.. సరిత : ఏం లేదు ఆదిత్య కోపంగా ఉంటేనూ... అను : నీతో ఏం చెప్పలేదా?? సరిత : ఏంటి.. ఏమైంది మళ్ళీ ? అను : అది కాదు.. అన్నీ నీతో చెప్పుకుంటాడు కదా, దీని గురించి ఏం చెప్పలేదా? సరిత : లేదు..సరే నువెళ్ళు.. రాజు : వాడే సెట్ అవుతాడు లే, వదిలేయ్. 0000000
అనూ వచ్చి నా బెడ్ పక్కన ఉన్న తన బెడ్ మీద కూర్చుంది.. అను : ఏంటి మా అమ్మకి చెప్పి నన్ను కొట్టించవా? నేనేం మాట్లాడలేదు అటు తిరిగి పడుకున్నాను, అను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది. రాత్రి తినడానికి అందరం కూర్చున్నాం నేను సైలెంట్ గా తినడం చూసి... సరిత : ఏంట్రా ఆది ఒంట్లో బాలేదా అలా ఉన్నావ్? ఆదిత్య : లేదత్తా బానే ఉన్నాను.. కొంచెం తలనొప్పిగా ఉందంతే.. సరిత : తిన్నాక టాబ్లెట్ ఇస్తాను వేసుకుని పడుకో.. ఆదిత్య : అలాగే.. అమ్మ అందరికి గాజు గ్లాసుల్లో థంసప్ పోసింది, తినేసి తాగుతూ ఉంటే...నాన్న పిలిచారు.. రాజు : ఆది నెక్స్ట్ ఏ కాలేజీ చూసుకున్నారు ఏమైనా ప్లాన్ చేశారా, ఇద్దరు ఒకే గ్రూప్ తీసుకోండి.. సరిత : అదేంటి అన్నయ్య మళ్ళీ మొదటికొచ్చావ్ ఆల్రెడీ అనుకున్నాంగా ఇద్దరు డాక్టర్స్ అవ్వాలని.. ఇంకేం గ్రూప్ bi.pc తీస్కుంటారు అంతేగా.. అని నన్ను అనూని చూసింది... అను తల ఊపింది. ఆదిత్య : లేదు నేను mpc తీసుకుందామనుకుంటున్నా నాకు అదే ఇష్టం. అమ్మ : ఏంటి? సరిత : అదేంట్రా మొన్నటిదాకా డాక్టర్ అవుతా అన్నావ్ ఇప్పుడేంటి అలా అంటావ్, అనూ కంటే నీకే ఎక్కువ మార్కులు వస్తాయి అలాంటిది నువ్వు ఇంజనీరింగ్ కి వెళ్తావా వద్దు. మంజుల(అమ్మ) : అలా కాదు ఇద్దరు ఒకటే చదవాలి.. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తామంటే కుదరదు. రాజు : మంజులా ఊరుకో... ఆదిత్య నాకూ ఇష్టం లేదు ఒకసారి మళ్ళీ ఆలోచించు, ఆవేశంలో నిర్ణయించుకున్నట్టున్నావ్. రవి (మావయ్య ) : ఏమైంది ఆదిత్య? వీళ్లందరి మాటలు వింటుంటే నాకు కోపం వస్తుంది, ఏమైందో నాకు తెలీలేదు కానీ నా చేతిలో ఉన్న గాజు గ్లాస్ పగిలి నా చేతిలోనుంచి రక్తం కారుతుంది. ఒక్కసారిగా నా కోపం మొత్తం ఎగిరిపోయింది ఏదో మాములు గాజు గ్లాస్ పగిలింది అంటే మాములే అనుకోవచ్చు కానీ అంత మందం ఉన్న గ్లాస్ కింద పడినా పగలదు అలాంటిది ఇలా అయ్యేసరికి నాకూ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది... వెంటనే అమ్మా నాన్న అత్తయ్య ముగ్గురు లేచి నాదెగ్గరికి వచ్చారు అమ్మ బాండేజ్ తెచ్చింది, అత్తయ్య ఏడుస్తూ కట్టు కడుతుంది.. సరిత : నీకేది ఇష్టమైతే అదే చెయ్యి అంతేగాని ఇలాంటి పిచ్చి పనులు చేసి మమ్మల్ని బాధ పెట్టొద్దు అని కోపంగా చెప్పి నుదిటి మీద ముద్దు ఇచ్చింది. నేను లేచి లోపలికి వెళ్లి కూర్చున్నాను అనూ వచ్చి నా ఎదురుగా వచ్చి కూర్చుంది, ఏదో మాట్లాడబోయింది కానీ నేను వినదలుచుకోలేదు వెంటనే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫుల్ సౌండ్ పెట్టుకున్నాను. అలా పాటలు వింటూ నిద్ర పోయాను... పొద్దున లేచి చూసేసరికి నా బెడ్ మీద నా పక్కనే ఒక చేతిలో తన మొహాన్నీ పెట్టుకుని..కాళ్ళు కింద నేల మీద పెట్టి అలానే పడుకుని ఉంది.. నాకూ ఒక్కసారి అనుమానం వచ్చింది నేను ఎవ్వరికీ తెలీకుండా అనూని ప్రేమిస్తున్నట్టే తను కూడా అలా చేస్తుందేమో అని దీనికి అంత సీన్ లేదులే అనుకుని నా చెయ్యిని అనూ తల కింద నుంచి తీసి లేచి ఫ్రెష్ అయ్యాను.. ఇవ్వాల్టి నుంచి ఎలాగో హాలిడేస్ కాబట్టి హాల్లోకి వచ్చి టీవీ పెట్టుకుని కూర్చున్నా, అనూ వచ్చి నాకు టీవీ కనిపించకుండా ఉండటానికి అడ్డుగా నిల్చుంది.. నేను టీవీ ఆపేసి లోపలికి వెళ్లిపోయాను.. రెండు రోజులు అలానే జరిగింది కానీ నేను అనూతొ మాట్లాడలేదు నా ముందు జోకులు చేసింది, విసిగించింది, ఆటపట్టించింది అయినా కూడా నాకు అను వాడెవడికో ముద్దు ఇవ్వడమే గుర్తొస్తుంది అందుకే నేనస్సలు పలకలేదు. తెల్లారి అలానే కోపం కోపంగా అమ్మ వాళ్ల ముందు మాములుగా ఉండి రాత్రికి తినేసి పడుకోడానికి రూంకి వచ్చేసాను నా వెనకాలే అను వచ్చి డోర్ బోల్ట్ పెట్టేసింది, వెనక్కి తిరిగి చూసాను నన్నే చూస్తుంది, నేను నా మంచం ఎక్కాను... ఎదురుగా వచ్చి నా మంచం పక్కన మోకాళ్ళ మీద నిల్చుంది.. అను : బావా.... నాతో మాట్లాడతావా లేదా? ఆదిత్య : ఏంటి ఈ కొత్త పిలుపులు అయినా ఇప్పుడేం జరిగిందని, ఫ్రెండ్స్ లాగ ఉందామని చెప్పానుగా.. అను : మరి ఎందుకు mpc కి వెళ్తున్నావ్, నానుంచి దూరంగా పోదమనేగా.. ఆదిత్య : నీకు కావాల్సింది అదే కదా.. అప్పుడు నీకు నా బాధ ఉండదు నీ లవర్ తొ నీ ఇష్టం ఉన్నంతసేపు గడపొచ్చు అదే నేనుంటే కుదరదు నీకూ ఇబ్బంది.. ఇది మనిద్దరి మంచికే... అను : పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నిన్ను ఏడిపించడానికే అలా చేశాను అని నీకు తెలుసు. ఆదిత్య : నిజంగా నాకు తెలీదు అయినా మనిద్దరి మధ్య అంత బంధం ఏముంది నన్ను ఏడిపించడానికి ఎవరో తెలియని వ్యక్తికి ముద్దు పెట్టే అంత, చిన్నప్పటి నుంచి నీకు నాకు పడదని నీకు తెలుసు నాకు తెలుసు ఇక మనం అందరి ముందు నటించాల్సిన అవసరం లేదు... అను : అబ్బా అలా మాట్లాడకు రా.. ఇదివరకు లాగా ఉండు. ఆదిత్య : "అలాగే" అని నేను లేచి డోర్ లాక్ తీయడానికి లేచాను... అను నా కాళ్ళు పట్టుకుంది.. అను : చాలా...కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను కనికరించురా ఏదో తెలియక చేసాను ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను ప్లీజ్ బావ.. నేను ముందుకు కదలబోయాను గట్టిగా పట్టుకోడం వల్ల నాతొ పాటే ఈడ్చుకుని వచ్చింది నాకు నవ్వొస్తుంది కానీ దాన్ని కవర్ చేస్తూ ముందుకి కదిలాను కానీ నేను కింద పడ్డాను, అను నా మీదకి ఎక్కింది.. నెట్టేయ్యాలని చూసాను నా మీద పడుకుని నా గడ్డం పట్టుకుంది. అను : "ప్లీజ్ బావా నువ్వు అలా దూరంగా ఉంటే భరించడం నా వల్ల కావట్లేదు.. చచ్చిపోవాలనిపిస్తుంది" అని నన్ను హతతుకుపోయింది నా టీ షర్ట్ కి తడి తగిలింది అను తల ఎత్తాను.. ఏడుస్తుంది.. గట్టిగా వాటేసుకున్నాను... ఇద్దరం ఒకరిని ఒకరం అల్లుకుపోయాం, తన బరువు నాకు సంతోషాన్ని ఇస్తుంది.. తన జుట్టు మీదే ముద్దు పెట్టుకున్నాను.. అను తల ఎత్తి నా కళ్ళలోకి చూసింది తన నుదిటి మీద ముద్దు పెట్టాను.. అలానే నా కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నన్ను ఇంకా గట్టిగా వాటేసుకుని నా కింద పెదవిని తన రెండు పెదాలతో అందుకుంది.. ఒక రెండు నిమిషాలు మా ఇద్దరి తొలి ముద్దు కాదు కాదు చిన్నప్పుడు ఒకటి పెట్టాను కదా.... మా రెండవ తొలి ముద్దును అస్వాదించాము... ఇద్దరం మా పెదాలను వీడి ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాం.. అను చిన్నగా నవ్వింది, వెంటనే లేచి అనూని పక్కన నిల్చోపెట్టి రూమ్ బైటికి వెళ్లి చూసాను అందరూ పడుకోడానికి వెళ్లారు నేను లోపలికి వచ్చి అనూకి సైగ చేసాను అనూ తన బెడ్ ఎక్కి దుప్పటి కప్పుకుని నిద్రపోయింది.. నేను కూడా నా మంచం మీద పడుకున్నాను.. కొంచెం సేపటికి అత్తయ్య మా రూమ్ కి వచ్చి అనూకి ముద్దు పెట్టి నా దెగ్గరికి వచ్చి నా చెయ్యి చూసి నా నుదిటి మీద కూడా ముద్దు ఇచ్చి డోర్ దెగ్గరికి వేసి వెళ్ళిపోయింది రెండు నిమిషాల తరువాత బెడ్ చెక్క మీద మూడు సార్లు కొట్టాను... అనూ లేచి నన్ను చూసి చిలిపిగా నవ్వుతూ చిన్నగా సౌండ్ రాకుండా వెళ్లి డోర్ లాక్ చేసింది, ఈలోగా మా రెండు బెడ్స్ ని కలిపేసాను.. రెండు సింగల్ కాట్స్ ఇప్పుడు ఒక డబల్ కాట్ అయిపోయింది..నేను మంచం మీద పడుకుని దిండ్లు సెట్ చేసాను, అనూ స్పీడ్ గా వచ్చి నా కౌగిలిలో నన్ను హత్తుకు పోయింది.. అను : బావా.. ఆదిత్య : ఏంటే ఇది కొత్తగా? అను : చాలా బాగుంది నిన్ను అలా పిలుస్తుంటే, నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను బావ అని పిలుస్తుంటే.. ఆదిత్య : అలాగే పిలువులే నాకూ బాగుంది ఈ కొత్త పిలుపు, కానీ మనం ఇద్దరం ఉన్నప్పుడు మాత్రమే.. అనూ : ఎందుకలా మనం ఇద్దరం కలిసిపోయాం అని తెలిస్తే అమ్మ వాళ్లు ఎంత సంతోష పడతారు.. ఆదిత్య : ముందు సంతోష పడతారు ఆ తరువాత మనల్ని దూరం చెయ్యటానికి విశ్వ ప్రయత్నలు చేస్తారు.. అను : ఎందుకలా? ఆదిత్య : నేను చెప్పింది చెయ్యి, అందరి ముందు బైట మనం ఇంతకముందు ఎలా దూరంగా ఉండేవాళ్ళమో అలానే ఉందాం, అలా కాకుండా ఇద్దరం కలిసిపోయాం అని ఎవరికైనా తెలిసిందనుకో మనకి ఇలా ప్రైవసీ దొరకదు..నిన్ను ఇలా ముద్దు పెట్టుకోవడం కూడా కుదరదు (అని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను) మనం ఇద్దరం పక్క పక్కన కూర్చుంటే ఎవరో ఒకరు మనకి కాపలాగా కూర్చుంటారు.. అను : (నా బుగ్గ మీద ముద్దు ఇస్తూ) అర్ధమైంది... నీకెన్ని తెలివితేటలు బావా.. సూపర్ నువ్వు... బావా మరీ.... ఇంతలో ఏదో జీప్ సౌండ్ అయ్యింది, ఎవరో అరుస్తున్నారు మెలుకువ వచ్చి లేచాను.. అది పక్కనే ఉన్న సంధ్య ఫౌండేషన్ నుంచి, టైం చూసుకున్నాను అర్ధరాత్రి రెండు అవుతుంది...టేబుల్ మీద ఉన్న బాటిల్ లో ఆఖరి మందు తాగేసి (ఇదే లాస్ట్ అనుకుని) బాటిల్ డస్ట్ బిన్ లో వేసి బార్ వెనుక డోర్ తీసి బైటికి వెళ్లాను......
31-05-2022, 07:31 PM
అందరికి నమస్కారం
పాఠకులకి అందరికి ఒక చిన్న విన్నపం
విక్రమ్ లవ్ పార్ట్
ఆదిత్య లవ్ పార్ట్
రెండు అప్డేట్స్ ఒకేసారి ఇస్తాను.
రెండు ట్రైన్ పట్టాలలా సాగుతుంటాయి
కావున మీరు కూడా అలానే చదవాలని కోరుకుంటూ...
31-05-2022, 08:02 PM
(31-05-2022, 07:31 PM)Takulsajal Wrote:అంటే ఆదిత్య లవ్ పార్ట్, విక్రమ్ లవ్ పార్ట్ రెండు కలిపి విక్రమ్ రిచి రిచ్ లో కోల్పోతున్నారు అన్నమాట super
Sudha
31-05-2022, 08:06 PM
Super update
31-05-2022, 08:19 PM
Super update ❤️❤️❤️ bro two stories okate story ..❤️ super bro
31-05-2022, 08:56 PM
Nice update
31-05-2022, 09:21 PM
Nice update
31-05-2022, 09:24 PM
Nice update bro.....
కానీ లాస్ట్ లో మాత్రం ఏదో ఒక సస్పెన్స్ పెడతావ్ నువ్వు భలేగా.....
31-05-2022, 09:30 PM
Nice super update
|
« Next Oldest | Next Newest »
|