Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విక్రమ్ ~ లవ్ పార్ట్
#61
update plz bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
2


రోజు కాలేజీ కి వెళ్లడం అందరితో కలిసి ఇంటికి రావడం నెలకి ఒకసారి అందరు రాకపోయినా మా పదముడు మంది కత్చితంగా కలిసి భోజనాలకి పొలం వైపు వెళ్లే వాళ్ళం.


ఈ వారం రోజుల్లోనే మా పదముడు మందిమి ఏడుగురిగా మారిపోయాం, మూడు జంటలు ఉన్నాయి అని చెప్పా కదా, కాలేజీకి వచ్చాక వాళ్ళకి ఫ్రీడమ్ బాగా దొరికింది ఇక మాకు దూరం అయిపోయారు ఇంటికి కూడా కలిసి రావట్లేదు కానీ అవసరం ఉంటే మాత్రం అందరం ఒకటై పోతాం.

అలా నేను, రమ్య, పూజ, సలీమా, సంధ్య, భరత్ , చందు మాత్రమే మిగిలాం ఇంకో వారానికి భరత్ సంధ్య కూడా లవ్ బర్డ్స్ అయిపోయి మా గ్రూప్ నుంచి ఎస్కేప్ అయ్యారు, ఏంటి లవ్ చేసుకుంటే మాతో కలిసి ఉండకూడదా అనుకున్నాం మేము.

ఇక నేను, సలీమా, చందు, రమ్య, పూజ మాత్రమే మిగిలింది, మేము ఐదుగురం మాత్రం ఏం జరిగినా విడిపోకూడదనుకున్నాం.. అయినా అది కుదరదు ఫస్ట్ నుంచి మా ఐదుగురికి బాండింగ్ ఎక్కువ.. ఒక్క భరత్ గాడు లేడు అంతే.

కాలేజీకి వెళ్లి ప్లేసులు మార్చేసాం లాస్ట్ రెండు బెంచీలు చూసుకున్నాం నేను, చందు గాడు వెనక కూర్చుంటే పూజ రమ్య సలీమా ముందు కూర్చునే వాళ్ళు.

పూజ : సలీమా నువ్వు మధ్యలో కూర్చో రోజా ఉండి ఉండి రోజు రోజు కి నీరసంగా అయిపోతున్నావ్ అవసరమా ఇన్ని కష్టాలు..

చందు : అవును పూజ ఉమ్ము కూడా మింగకూడదట పొద్దున్న ఎప్పుడో నాలుగింటికి తింటే మళ్ళీ సాయంత్రం ఆరింటి వరకు ఏం తినరట.

పూజ : ఇవన్నీ నీకెలా తెలుసు?

చందు : మనూళ్ళో కట్ట మీద రజాక్ గాడు చెప్పాడు లే.

రమ్య : ఎందుకే సలీమా అన్ని కష్టాలు మాములుగా నమాజ్ చేసుకోవచ్చు కదా..

సలీమా : అలా కాదే చిన్నప్పటి నుంచి నాన్న లేకపోయినా అమ్మీ ఒక్కటే టైలరింగ్ చేస్తూ ఇల్లు నెట్టుకొస్తుంది కానీ ఈ మధ్య తనకీ ఆరోగ్యం బాగోటంలేదు, నాకోసం డబ్బులు దాచి పెట్టాలని తను హాస్పిటల్ లో కూడా చూపించుకోవట్లేదు ఆఖరికి విక్రమ్ కూడా చెప్పి చూసాడు కానీ తను ఎవ్వరి మాట వినట్లేదు, అందుకే తన కోసం ఇలా...

ఇక ఎవ్వరు మాట్లాడలేదు..

పూజ : అయినా ఈ సారి నీ బర్తడే రంజాన్ తరువాతే లే ఈ సారి భోజనాలు మనమే ఒండుకుందామా లేక బైట రెస్టారెంట్ కి వెళదామా

సలీమా : నేను ఏ పోసిషన్ లో ఉన్నాను నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావే?

పూజ : సారీ సారీ...

ఈలోగా క్లాస్సేస్ స్టార్ట్ అయ్యాయి... అందరం శ్రద్ధాగా వింటున్నాం నాకు అమ్మ నుంచి ఫోన్ వచ్చింది అందుకే అందరికీ చెప్పి ఇంటికి వచ్చేసా.

రమ్య : ఈ విక్రమ్ కావ్యమ్మ పిలిచిందని వెళ్ళిపోయాడు మనం కూడా వెళ్తే అయిపోయేది కదా వాడు లేకపోయేసరికి బోర్ కొడుతుంది.

పూజ : పదండి అలా కాంటీన్ కి వెళ్లొద్దాం.

రమ్య : వద్దు ఓ పక్క సలీమా ఒక్క పొద్దులు ఉంటుంటే నువ్వు కాంటీన్ అని దాన్ని ఊరిస్తావ్.

సలీమా : మీరు వెళ్లి రండి నేను కొంచెం సేపు పడుకుంటా.

చందు : పదండి ఏమైనా తిని వచ్చి మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం.

అందరూ కాంటీన్ కి వెళ్లారు సలీమా బెంచ్ మీద పడుకుని ఉంది అప్పుడే మానస తన ఇద్దరి ఫ్రెండ్స్ తొ లోపలికి వచ్చి సలీమా ఒక్కటే ఉండటం చూసి తన ఫ్రెండ్స్ మానస కి సైగ చేసారు.

ముగ్గురు వెళ్లి పెన్ లో రిఫీల్ తీసి సలీమా వేసుకున్న ఎల్లో చుడిధార్ వీపు మీద కొట్టారు.. ఏదో చల్లగా తగిలిన సలీమాకి వెనక్కి తిరిగేసరికి మానస ఇంక్ చల్లడం చూసింది.

వాళ్లంతా గట్టిగా నవ్వేసరికి అవమానం తట్టుకోలేక చున్నీ మొత్తం కప్పుకుని ఏడుస్తూ కూర్చుంది, సలీమా ఏడ్చేసరికి ముగ్గురు హై ఫై కొట్టుకుంటూ నవ్వుతున్నారు.

ఈ లోగా రమ్య వాళ్ళు లోపలికి వచ్చి సలీమా ఏడుస్తుండడం చూసి వెంటనే వెళ్లి జరిగింది తెలుసుకున్నారు.

చందు కోపం గా చూస్తుంటే పూజ ఏదో అనబోయింది వెంటనే రమ్య పూజ చెయ్యి పట్టుకుని ఆపుతూ..

రమ్య : మానస గారు మీరు చాలా పెద్ద వారు మీతో పోల్చుకుంటే మేము మీకు ఎందులోనూ సరిపోము మాతో మీకు అవసరమా, మీ అంత పెద్ద వాళ్ళతో పెట్టుకోలేక భయపడి మేము చిన్న వాళ్ళం ఏమి చెయ్యలేం అని మమ్మల్ని ఏడిపిస్తున్నారా?

సలీమాని మీరు ఏడిపించడం ఇది రెండో సారి ఇక్కడ విక్రమ్ లేడు కాబట్టి సరిపోయింది లేకపోయ్యుంటే ఎంత పెద్ద గొడవ అయ్యుండేదో తెలుసా?

మానస : ఏంటి అంత పోటుగాడా మీ విక్రమ్.

పూజ : అవును పోటుగాడే, సలీమా తొ కనీసం మాట్లాడలేదు జస్ట్ ఫాలో అయ్యారని తెలిసి ఇష్ట మొచ్చినట్టు కొట్టాడు, దాని వల్ల మూడు రోజులు జైల్లో కూడా ఉన్నాడు, ఇది జరిగింది రెండేళ్ల క్రితం ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ వాడికి అస్సలు భయం లేదు, ఈ విషయం కనుక వాడికి తెలిసిందనుకో....

మానస :  ఆ ఏం చేస్తాడు చెప్పు.. చెప్పు..

రమ్య : ఏయ్ పూజ గమ్మునుండు... మానసగారు ప్లీజ్ మీరు వెళ్లిపోండి..

మానస వాళ్ళు అక్కడనుంచి వెళ్ళిపోయాక రమ్య తన చున్నీ కూడా తీసి సలీమా చుట్టు కప్పి.

రమ్య : ఈ విషయం విక్రమ్ గాడికి ఎవ్వరు చెప్పొద్దు అందరూ ఒట్టు వేయండి, అందరూ వేసినా పూజ మాత్రం ఇష్టం లేకుండానే ఒట్టు వేసింది.ఇక అక్కడనుంచి ఇంటికి వచ్చేసారు..

సోనియా : ఏంటే వాళ్ళని అలా వదిలేసావ్?

మానస : లేదే ఈ విక్రమ్ గాడి పేరు ఇంతకముందు కూడా విన్నాను సరిగ్గా వాడి మొహం కూడా ఎప్పుడు చూడలేదు, వీడ్ని వాళ్ళు తెగ మోసేస్తున్నారు వాడినే ఏడిపించాం అనుకో వీళ్ళు ఇక నోరు కూడా ఎత్తరు... ఇక పదండి సినిమాకి టైం అవుతుంది.

నేను తెల్లారి కూడా కాలేజీకి వెళ్ళలేదు ఎందుకంటే అమ్మని హాస్పిటల్ లో చూపించడానికి తీసుకెళ్లాను.

అమ్మ పుట్టుక తోనే మూగది తనకి ఇక మాటలు రావని తెలుసు కానీ నేనే మొండి పట్టు పట్టి ఇలా నెలకి ఒకసారి కొత్త హాస్పిటల్ చుట్టు తిప్పుతుంటాను ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక దారి చూపించకపోతారా అని.

నా మొండి తనం వల్ల నా మీద ప్రేమతొ అమ్మ కూడా బోర్ కొట్టకుండా నాతో తిరుగుతుంటుంది.. నాన్న మా ఇద్దరినీ పిచోళ్ళని చూసినట్టు చూస్తాడు మేము నవ్వుకుంటాం.

హాస్పిటల్ లో డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాక ఇద్దరం సినిమాకి వచ్చాము, అక్కడ మానస వాళ్ళు కనిపించారు నేను తననే చూడటం అమ్మ గమనించింది..

అమ్మ : ఏంటి మేటర్ అన్నట్టు సైగ చేసింది.

తన గురించి చెప్పాను, నేను చెప్పిందంతా విని నా మాటని కొట్టిపారేసింది..

విక్రమ్ : ఏంటి మా?

వెళ్ళతొ సైగ చేస్తూ "నువ్వు చెప్పిందంతా తప్పు ఆ అమ్మాయి చాలా మంచిది" అని

విక్రమ్ : జోక్ చెయ్యకు మా అన్నాను.

లేదు కాదు అని సైగ చేసింది సావాసాల వల్ల అలా ఉంది కానీ ఆ అమ్మాయి మంచిదే అంది.

నేను ఒక కన్ను పెద్దగా చేసి రెండు చేతులు కట్టుకుని చూసాను.. అమ్మ మళ్ళీ సైగ చేస్తుంటే ఆపి "అవునవును ఎందుకంటే నువ్వు గోల్డ్ మేడలిస్ట్ వి నీకు అన్ని తెలుసు హాపీనా?"

అమ్మ నా చెయ్యి మీద కొట్టి " కావాలంటే ఇప్పుడు చూడు మిగతా ఇద్దరు వాళ్ళ చేతిలో ఉన్న టిన్ క్యాన్స్ ని విసిరేస్తారు కానీ ఆ అమ్మాయి డస్ట్ బిన్ దెగ్గరికి వెళ్లి వేస్తుంది చూడు" అని సైగ చేసింది.

ఇద్దరం తననే చూస్తున్నాం ఎవ్వరు గెలుస్తారు నేనా అమ్మ అని, అమ్మ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

కొంచెం సేపటికి అమ్మ చెప్పినట్టే వాళ్ళు ఇద్దరు డస్ట్ బిన్ లోకి విసిరేస్తే అవి కూడా అందులో పడలేదు లెండి కానీ మానస మాత్రం వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ డస్ట్ బిన్ లో వేసి సినిమా హాల్ లోపలికి వెళ్ళిపోయింది..

నేను అమ్మ వైపు నోరు తెరిచి చూసాను, అమ్మ కాలర్ ఎగరేసినట్టు పైట దెగ్గర చెయ్యి పెట్టి అలా అంది, నేను నా రెండు చేతులతో ఒంగి దణ్ణం పెట్టాను.

అమ్మ : మనం ఎంత మారినా మనిషి నేచర్ అనేది మనలోనే ఉంటుంది అది మారదు అని సైగ చేసింది.

"యూ అర్ గ్రేట్" అన్నట్టు సైగ చేసి చూపించాను అలా నవ్వుకుంటూ వెళ్లి సినిమా చూసి ఇంటికి వచ్చేసాం.

ఆ తరువాత ఒక రెండు రోజులు ఆగితే రంజాన్ యే కదా అని నేను ఇంట్లోనే అమ్మతొ  గడిపాను..

రేపు రంజాన్ అనగా అందరూ మా ఇంటికి వచ్చారు..

అమ్మని చూడగానే సలీమా అమ్మని కౌగిలించుకుంది, అమ్మ కూడా బాగా ఉంటుంది సలీమాతొ... అందరూ అమ్మని పలకరించారు.

పూజ : ఏంట్రా అమ్మ కూచి కాలేజీ గురించి మర్చిపోయావా? అస్సలు రావట్లేదు.

విక్రమ్ : రేపు సెలవేగా ఎల్లుండి నుంచి వచ్చేస్తా లే

లేట్ అవుతుందని అక్కడ ఫాతిమా అమ్మ ఇంట్లో ఒక్కటే ఉంటుందని సలీమాని పంపించేసాను,  అందరితో సరదాగ గడిపేసి మా ఇంట్లోనే అన్నం తినేసి వెళ్లిపోయారు.

పొద్దున్నే లేచాను ఇవ్వాళ రంజాన్ పొద్దు పొద్దునే సలీమా ఇంటికి వెళ్లడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది.

త్వరగా రెడీ అయ్యి అమ్మకి చెప్పి సలీమా ఇంటికి బైలుదేరాను అప్పటికే తొమ్మిది దాటింది ఇంటి లోపలికి వెళ్లేసరికి ఆల్రెడీ నమాజ్ స్టార్ట్ అయిపోయింది.. నేను వెళ్లి చైర్ లో కూర్చున్నాను.

సలీమా ఫాతిమా అమ్మ ఇద్దరు నమాజ్ చేసుకుని బైటికి వచ్చారు నన్ను చూడగానే ఫాతిమా అమ్మ రంజాన్ విషెస్ చెప్పి మూడు సార్లు అటు ఇటు కౌగిలించుకుంది ఆ తరువాత సలీమా కూడా..

మా ఇద్దరికీ సేమ్యా తెచ్చి ఇచ్చింది నేను లోట్టలేసుకుంటూ తింటున్నా ఫాతిమా అమ్మ నన్నే చూస్తుంది..

విక్రమ్ : ఏంటమ్మా ఏమైంది...

ఫాతిమా : బేటి విక్రమ్ కి ఇంకొంచెం సేమ్యా వేసుకురా..

సలీమా లోపలికి వెళ్ళగానే ఫాతిమా అమ్మ నా చేతులు పట్టుకుని.

ఫాతిమా  : విక్రమ్ బేటా నిన్ను ఈ వయసులో అడగలేనిది, నీకు కష్టమైంది ఒక సహాయం అడుగుతాను చేస్తావా?

విక్రమ్ : తన రెండు చేతులు పట్టుకుని చెప్పమ్మా  నువ్వు అడిగింది ఏదైనా సరే దాన్ని ప్రయత్నించడం కాదు కచ్చితంగా చేస్తాను.. అది ఎంత కష్టమైనా...

ఫాతిమా : ఇప్పుడు కాదు అడగాల్సిన టైం లో కచ్చితంగా అడుగుతాను..

ఈలోగా సలీమా వచ్చేసరికి మాములుగా కూర్చున్నాం..

మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి సలీమా నేను ఇద్దరం ఫాతిమా అమ్మ చేతుల్తో బిర్యానీ తినిపించుకుని జాగ్రత్త చెప్పి ఇంటికి బైల్దేరాను...


తెల్లారే కాలేజీకి వెళ్ళాను చుట్టు చూసా మానస కనిపించలేదు అడుగుదామనుకున్నా కానీ ఆ టెక్కుమొహందానితో మనకెందుకులే అని సైలెంట్ గా కూర్చున్నా.

పూజ : అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది ఆ మానస వాళ్ళు లేకపోతే..

రమ్య : అవును రెండు రోజుల నుంచి వాళ్ళు క్లాసులకి రావట్లేదు ఏమైందో..

పూజ : రాకపోతేనే మంచిది లే..

అలా వారం గడిచింది మానస వాళ్ళ జాడ కనిపించలేదు, ఎందుకో రాగానే తనకోసం ఒక్క లుక్ వెయ్యడం అలవాటు అయ్యింది అందులో అమ్మ కంఫర్మ్ చేసి సర్టిఫై చేసింది కదా తను మంచిదని అందుకేనేమో అనుకున్నాను.



ఇవ్వాళ పొద్దు పొద్దున్నే లేచాను ఎందుకంటే ఈరోజు సలీమా బర్తడే,  ప్రతి పుట్టిన రోజుకి పొద్దున్నే వచ్చి నాతొ విషెస్ చెప్పించుకుని,  అమ్మ ఆశీర్వాదం తీసుకుంటుంది. తన కోసం రాత్రి అంతా కూర్చుని గిఫ్ట్ కూడా తయారు చేశాను.

ఇంకా రాలేదు ఈపాటికి రావాలే ఇంకా లేవలేదా ఏంటి అని చూస్తూ ఉన్నాను ఇంతలో పూజ రోప్పుతూ పరిగెత్తికుంటూ వచ్చింది.

పేపర్ చదువుతున్న నాన్న, వంటింట్లో నుంచి అమ్మ, నేను పూజ ఏం చెప్తుందా అని చూస్తున్నాం.

పూజ రోప్పుతూ "ఫాతిమా అమ్మ" అని ఏడ్చింది....

వెంటనే మేం ముగ్గురం లేచి సలీమా ఇంటికి బైలుదేరాం.......
Like Reply
#63
Fully emotional friends
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 1 user Likes The Prince's post
Like Reply
#64
super update bro...
Like Reply
#65
Super update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#66
Excellent update chala bagundi mitama super
Like Reply
#67
Superb update
Like Reply
#68
అప్డేట్ బాగుంది
Like Reply
#69
No words lit yourock
Like Reply
#70
Nice update
Like Reply
#71
Nice update
Like Reply
#72
clps Nice update happy
Like Reply
#73
Nice super update
Like Reply
#74
Super update bro
Like Reply
#75
chalaa bagundi update
నా కథ లు  ప్రియగీతం
Like Reply
#76
బాగుంది అప్డేట్
Like Reply
#77
???? ..., Plzz update fast
Like Reply
#78
Super update bro
Like Reply
#79
అందరికీ థాంక్స్ ❤️❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#80
పర్లేదు మామ కొద్దిగా బాగానే ఉంది అప్డేట్., అన్ని క్యారెక్టర్కి కరెక్ట్ గా బిల్డ్ చేస్తున్నారు.... మన హీరోకి మనసు మీద ఒక మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు.......
ఇంకా లవ్ యాంగిల్ ని స్టార్ట్ చేయండి..... కొద్దిగా స్టార్టింగ్ లో కొద్దిగా ఫైటింగ్స్ ఉండాలి ఫైటింగ్ లేకుండా లవ్ స్టార్ట్ అయితే బాగుండదు.....

ఇంకా లేట్ చేయకుండా రోమియో జూలియట్ లాగా ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని రాయండి... తొందరగా ఒక అప్డేట్ ఇవ్వండి... మీ అద్భుతమైన అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం
[+] 1 user Likes sez's post
Like Reply




Users browsing this thread: 10 Guest(s)