Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
అప్డేట్ బాగుంది
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update please
Like Reply
Story keka
Not expected in this site
Like Reply
Super ga update istunnaru
Like Reply
ఎపిసోడ్ ~ 13

మొదటి మెట్టు మీద నా కాలు నా వెనుకే రషీద్, నేను కాపాడిన అబ్బాయి వాళ్ళ అన్నయ్య ప్రమోద్ తన పక్కనే ముద్రగడ సైన్యం కి నాయకత్వం వహిస్తున్న తమ్ముడు రాము ..... ఆ వెనుక నాలుగు వందల మంది సైన్యం.....

ఒకొక్క మెట్టు ఎక్కుతుండగానే ఎదురుగా గేట్ దెగ్గర కాపలా ఉన్న పది మంది అడ్డంగా నిలబడ్డారు....శశి దెగ్గర నేర్చుకుని చాలా రోజులయ్యింది.... నా గురి ఎలా ఉందొ చూద్దామని మొదటి బాణాన్ని ఎక్కుపెట్టాను.... హెడ్ షాట్... ఎస్ అనుకున్నాను..

సగం మెట్లు ఎక్కుతుంటేనే నాకు అర్ధం అయ్యింది ఈ పాలస్ ఈ దీవి మధ్యలో ఉంది, ముందంతా సిటీ వెనకంతా అడివి కొండలు మెట్లు ఎక్కుతుండగా పాలస్ పై కప్పు కనిపించింది ఇదే పర్ఫెక్ట్ స్పాట్ అని...

టోనీ స్టార్క్ చెప్పిన గాడ్జెట్ ని ఆక్టివేట్ చేసి బాణానికి కట్టి వదిలాను కరెక్ట్ గా పాలస్ మీద ఉన్న జండాకి గుచ్చుకుంది..

ఆ పది మందిని గేట్ దెగ్గరికి చేరుకొకముందే చంపేశారు.... ఈ లోగా పెద్ద శంఖం మోగింది....

గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాం ఎదురుగా రవి, వాళ్ళ సైన్యం దాదాపు వెయ్యి మంది పైనే ఉండుంటారు...

ధనుస్సు ని భుజానికి తగిలించి కత్తి అందుకుని ముందుకి దూకాను..

నా వెనకే అందరూ....

రషీద్ : ఎటాక్...

ప్రమోద్ : ఈ యుద్ధం శాంతి కోసమే..... పదండి...

రాము : జై భవాని
వెనక తెగ ప్రజలు : జై భవాని....

యుద్ధం మొదలయింది దొరికిన వాళ్ళని దొరికినట్టు నరక్కుంటూ పోతున్నాం అటు రవిని చూసాను ముద్రగడ వాళ్ళు చుట్టు ముట్టారు నేను ఇక్కడ చిక్కుకు పోయాను వాళ్ళని గమనిస్తూనే వీళ్ళతో కొట్లాట లో ఉన్నాను....

రషీద్ ఒక్కడే ఇద్దరిద్దరినీ చంపేస్తున్నాడు... ఇండియా డాన్ అనే పదానికి న్యాయం చేస్తున్నాడు.... అంతా గొడవ గొడవ గా ఉంది.... ఎటు చూసినా అరుపులు, కేకలు, రక్తం ఏడుపులు.... అప్పటి వరకు పుస్తకాలలో చదివిన యుద్దాలు ఎంతో ఎంటర్టైన్మెంట్ గా ఉండేవి కానీ యుద్ధం చేస్తుంటే తెలుస్తుంది అది ఎంత కష్టమో... ఎన్ని ప్రాణాలు పోతున్నాయి నేనే ఒక ముప్పై మందిని పొట్టన బెట్టుకున్నాను.... ఇంకా ఎంత మంది ఈ చేతుల్లో చస్తారో నాకు తెలీదు కానీ ఇదేది నాకు నచ్చలేదు.... మధ్యలో ఆపలేనని కూడా తెలుసు...

ఈలోగా రవి చుట్టు ఉన్నవాళ్లలో ఎనిమిది మంది గాయపడ్డారు వాళ్ళ మధ్యలోకి వెళ్లి రవి కి అడ్డంగా నిల్చున్నాను.... అందరిని వెళ్లిపొమ్మని వేలితో సైగ చేశాను...

చీకటి పడింది...

ఇటు పక్క మానస సంధ్యని కాపాడడానికి ఒంటి చేత్తో పోరాడుతుంది మానస చుట్టు శవాలు కుప్పలు గా పడి ఉన్నారు....ఎక్కువ సేపు నిలబడలేదని తనకీ తెలుసు అందుకే పక్కనే ఉన్న కిటికీ ని తన్ని సంధ్యని బైటికి పంపించేసి తను దూకేసి సంధ్య చెయ్యి పట్టుకుని బైటికి పరిగెత్తింది..

బైట గార్డెన్ లోకి వచ్చింది పది మంది చుట్టు ముట్టారు మానస వెనకాల పెద్ద కొబ్బరి చెట్టు ఉంది దానికి సంధ్యని అనించి తన ముందు నిల్చుని ఒక పక్క పెద్ద కత్తి తిప్పుతూనే కింద ఎవ్వరికి కనిపించకుండా చిన్న కత్తితో ఎటాక్ చెయ్యసాగింది.... ఆ పది మందిలో ఒకడు మానస టెక్నిక్ కనిపెట్టేసాడు అప్పటికే మానస నలుగురుని చంపేసింది... సడన్ గా ఒక కత్తి మానస చెయ్యిని చీల్చింది.... ఆ కత్తి దూసిన వాడి మెడ మీదకి చిన్న కత్తిని విసిరింది వాడు పోయాడు ఇక మిగిలిన వాళ్ళని కూడా చంపేసింది....

అందరూ పోయాక లేచి మళ్ళీ సంధ్య వెళ్లలో తన వేళ్ళు కలిపేసి గట్టిగా పట్టుకుంది.

సంధ్య : ఆయాస పడుతున్న మానస ని చూస్తూ "మానస చెయ్యి" అని బాధగా అంది.

మానస ఆయాస పడుతూనే చెయ్యి చూసుకుని కత్తి దిగిన చోట గాలి ఊదుకుంది, పక్కనే ఒకడి షర్ట్ చించి చేతికి గట్టిగా కట్టు కట్టుకుంది....

మానస : అత్తయ్య ఇక్కడ ఉండటం మంచిది కాదు, ముందు వినపడుతున్న గోల చూస్తుంటే ఏదో జరుగుతుంది.... పద వెళ్ళిపోదాం....

మానస సంధ్య చెయ్యి పట్టుకుని గేట్ వైపు వెళ్ళసాగింది.... పాలస్ లోకి ఎంటర్ అవ్వగానే మానస కళ్ళతో ఒక యుద్ధమే జరుగుతుందని గమనించింది.

ఒక పక్క రవికి విక్రమ్ కి జరుగుతున్న యుద్ధాన్ని చూస్తుండగానే దేవికి సంధ్య కనిపించింది.

సంధ్యని చూస్తూనే దేవి సైగ చేసింది మానస చుట్టూ ఇరవై మంది నిలబడ్డారు.

దేవి : మానస తప్పుకో ఇదే ఆఖరి సారి ఇక చెప్పను...

మానస : అమ్మా నీకిచ్చిన మాట ప్రకారం ఆ ఐదు ఉంగరాలు నీకు దక్కే వరకు నీ వెంటే ఉంటానని మాట ఇచ్చాను, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను... ఇక నా కర్తవ్యం నన్ను చెయ్యని...

దేవి : ఏది నీ కర్తవ్యం నాకు ఎదురు తిరగడమా?

మానస : అవన్నీ నాకు తెలీదు కానీ నా జీవితం లో మొదటి సారి నాకు నచ్చిన పని చేస్తున్నాను...

దేవి : ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావ్...

మానస : నాకు నా ప్రాణాల మీద ఆశ ఎప్పుడో పోయింది, ఈ జన్మలో ఎలాగో నాకు నచ్చినట్టు నాకు నచ్చిన వాడితో బతకలేకపోయాను.... వచ్చే జన్మలో అయినా తీరాలని కోరుకుంటాను అని కత్తి తిప్పింది యుద్దానికి నేను సిద్ధం అన్నట్టు....

ఈ లోగా ఒక సైనికుడు వచ్చి : మహారాణి, రాజవారు...... అన్నాడు.

దేవి కోపం గా మానసని చూస్తూ : "కానివ్వండి" అంటూ లోపలికి వెళ్ళింది.

ఇరవై మంది మీదకి వస్తుంటే వారి చుట్టు ఇంకో ముప్పై మంది ముద్రగడ ప్రజలు ఆ ఇరవై మంది గొంతు కోసేసారు.

మానస అయోమయంగా చుట్టు చూస్తూ సంధ్య చెయ్యి గట్టిగా పట్టుకుంది.... వాళ్లంతా వెళ్లిపోయారు...

మానస అటు ఇటు చూడటం చూసిన సంధ్య

సంధ్య : ఇంకా అర్ధం కాలేదా మానస.... అటు ఇటు కాదు అక్కడ.... అక్కడ చూడు మానస నా బిడ్డ వచ్చాడు.... అని గర్వంగా వేలు తన కొడుకు వైపు చూపించింది.

మానస విక్రమ్ ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది.... కొండంత బలంగా ఉంది...

మానస సంధ్య విక్రమ్ ని చూడసాగారు......

రవి నా మీదకి దూకాడు గట్టిగా తన్నాను గోడ పగల గొట్టుకుని లోపల పడ్డాడు.... నేను లోపలికి వెళ్ళాను వెంటనే నా మెడ పట్టుకుని స్పీడ్ గా పరిగెత్తుతూ నా తలని గోడకి గుద్దాడు.... ఇద్దరం గోడ పగిలి పడ్డాము పక్కనే గొడ్డళ్లు దొరికాయి , ఇద్దరమూ చెరి రెండు అందుకున్నాము.....


రవి వేగానికి గాల్లోనే సౌండ్స్ వస్తున్నాయి గొడ్డళ్లు ఒకటికి ఒకటి తగిలినప్పుడల్లా వచ్చిన సౌండ్ కి పక్కన ఫైట్ చేస్తున్న వాళ్ళు యుద్ధం ఆపేసి చెవులు మూసుకున్నారు మేము అక్కడనుంచి వెళ్లిపోయే దాకా.... మేము అక్కడనుంచి కొట్టుకుంటూ ఇంకొక ప్లేస్ కి వెళ్ళాక మళ్ళీ కొట్టుకోడం మొదలు పెట్టారు...

మెట్లు ఎక్కుతూ ఉన్నాము టంగ్ టంగ్ మంటూ వస్తున్న శబ్దాలు నా చెవిని ఇర్రిటేట్ చేస్తున్నాయి ఒక మిల్లి సెకండ్ గాప్ దొరికింది గుండెల మీద గట్టిగా తన్నాను రవి పై నుంచి కింద పడ్డాడు.... గొడ్డళ్లు విసిరేసి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి కిందకి దూకాను పై ఫ్లోర్ నుంచే.....

రవి కత్తి అందుకున్నాడు నేను పక్కనే పడి ఉన్న కత్తి అందుకున్నాను.... నేను అనుకున్నట్టు రవి కత్తి తీసుకుని మీదకి రాలేదు చుట్టు కింద పడి ఉన్న కత్తులు నా మీదకి విసిరేస్తున్నాడు... నా కత్తి తో వాటిని చెదరకొడుతూనే కింద పడి ఉన్న టేబుల్ ని గట్టిగా తన్నాను గాల్లోకి లేచి నాకు అడ్డుగా వచ్చింది వెంటనే టేబుల్ కింద నుంచి వంగి జారీ లేచి మోకాలు మీద ఉండగానే కుడి కాలితో రవి కత్తి తీసేలోపు గట్టిగా తొడ మీద తన్నాను....

రవి మోకాళ్ళ మీద పడ్డాడు, నా వాళ్ళు చనిపోతున్నారు కౌంట్ తగ్గిపోతుంది నాకు తెలుస్తుంది రవి తెరుకునే వరకు నాకు రెండు నిమిషాలు గ్యాప్ దొరికింది ఈ గాప్ లో మిగిలిన వాళ్ళని చంపుకుంటూ వెళ్లి.....ముద్రగడ ప్రజలని, ప్రమోద్ వాళ్ళని వెళ్లిపొమ్మన్నాను..... వాళ్ళు ఒప్పుకోలేదు... కోపంగానే చెప్పాను "ఇది నా యుద్ధం నేనే చేస్తాను మీరెవ్వరు అవసరం లేదు వెళ్లిపోండి " అన్నాను కొంచెం నిరాశ పడుతూనే వెనుతిరిగారు.....

"రషీద్ మీరు కూడా వెళ్లిపోండి" అని కత్తి కి అంటిన రక్తన్ని వేలితో తుడిచాను పక్కనే ఉన్న గట్టు మీద కూర్చుంటు.....

రషీద్ : అందరిని పంపించేస్తే.....

విక్రమ్ : ఇప్పటి వరకు నా వల్ల జరిగిన మరణాలు చాలు, ఇక నా వల్ల ఏ తల్లీ ఏడవకూడదు.....

రషీద్ అందరిని వెళ్లిపొమ్మన్నాడు....

విక్రమ్ : రషీద్ నువ్వు కూడా వెళ్ళిపో.

రషీద్ : లేదు సర్ చావైనా బత్తుకైనా మీతోటే ఇప్పుడు నేను డాన్ ని కూడా కాదు... మీ ఫ్రెండ్ ని అంతే అన్ని చెడు పనులు మానేసాను....

ఈ లోగా రవి వచ్చాడు లేచి కొంచెం కుంటుతూనే వెళ్లాను.... గట్టిగా కత్తి తో ఎటాక్ చేసాడు నా కత్తి చేతిలో నుంచి జారీ ఎగిరింది అదే టైమింగ్ లో కిందకి వొంగి బాణం దొరికితే దాన్ని అందుకుని రషీద్ మనిషిని చంపే వాడి గుండెలో దించాను.... రషీద్ మనిషికి వెళ్ళిపో అన్నట్టు సైగ చేస్తూ, "వెళ్ళేటప్పుడు ఈ ఊరి జనాలని కూడా కాళీ చేయించండి ఎవ్వరు ఉండడానికి వీల్లేదు" అన్నాను అలాగే అని వెళ్ళిపోయాడు....

ఈ లోగా దేవి తన భర్త ని చూసుకుని బైటికి వచ్చింది దాదాపు సగానికి పైగా చచ్చిపోయిన తన మనుషులని చూసి.... సంధ్య మానసని చూస్తూ కత్తి అందుకుని సంధ్య ఎదురుగా నిలబడింది.

మానస అది గమనించి వాళ్ళ అమ్మకి ఎదురుగా నిల్చుంది.... మానస ఒంట్లో బలం లేదు ఒళ్ళంతా కత్తి గాట్లు ఆల్రెడీ చెయ్యి కట్ అయ్యింది, మోకాళ్ళు కొట్టుకుపోయాయి.... ఎడమ తొడలో ఒక బాణం విరిగి దిగి ఉంది.....

దేవి : ఇది అంతా నీ వల్లేనే అని కత్తి దూసింది....

మానస వాళ్ళ అమ్మని కొట్టకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది.... కానీ దేవి బలంతో మానసని మీదకి కత్తి దూసుకుంటూనే చిన్నగా మానసని సంధ్య దెగ్గరికి తీసుకెళ్తుంది....

అప్పటికే రాత్రి పదకొండు కావొస్తుంది మానసకి ఓపిక అయిపోయింది, చీకట్లో ఏమి కనిపించటం లేదు, కత్తి అడ్డు మాత్రమే పెడుతుంది కానీ దేవి కత్తి మానస కత్తికి తగిలినప్పుడల్లా మానస చెయ్యి వణుకుతుంది..... మానస ఒక్కొక్క అడుగు తులుతూనే సంధ్య వైపు వెనక్కి అడుగులు వేస్తుంది..... సంధ్య మానసని చూస్తూనే ఉంది...

ఒక్కసారిగా మానసకి టైమింగ్ ప్రకారం మానస చెవి కి కత్తి కత్తి తగులుకున్న సౌండ్ రాలేదు కళ్ళు పెదవి చేసుకుని చూసింది వెనుక సంధ్య, దేవి కత్తి మానస వైపు కాకుండా సంధ్య వైపు తిప్పింది, మానసకి కత్తి అడ్డు పెట్టె టైం దొరకలేదు అందుకే తనని తానే అడ్డు పెట్టింది..... మానస కడుపులోకి కత్తి దిగింది....


సంధ్యా : "మనసా" అని గట్టిగా అరిచింది.... దేవి ఆగిపోయింది.... రెండు అడుగులు వెనక్కి వేసింది....

దూరం నుంచి నాకు మానస కనపడుతుంది..... తన అడుగులు తడబడుతున్నాయి, నాలో కూడా ఎనర్జీ అయిపోయింది, ఇంతకముందు నేను పొట్లాడిన రవికి ఇప్పుడు రవికి చాలా వ్యత్యాసం ఉంది పది రెట్లు బలంగా ఉన్నాడు.

ఇద్దరం పరిగెత్తుకుంటూ గాల్లోకి ఎగిరి ఇద్దరం.... రవి కత్తికి నా కత్తి సమాధానంగా గట్టిగా పైకి లేపాను....

ఈలోగా మానస అని గట్టిగా అరుపు వినిపించింది గాల్లో ఉండగానే తల తిప్పి చూసాను నా కళ్ళలో లైట్ పడింది....నా చేతిలో పట్టు తప్పింది.... నా కత్తి విరిగిపోయింది....


రవి మళ్ళీ గాల్లోకి ఎగరడానికి వెనక్కి వెళ్లి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.... నా చేతిలో ఉన్న విరిగిన కత్తి కింద పడేసాను....నాకు రవి ముందు ఒక కత్తి కనపడింది దాన్ని అందుకోడానికి పరిగెత్తాను కానీ టైమింగ్ సరిపోలేదు.... గాల్లోకి ఎగిరాను కానీ నా చేతిలో కత్తి లేదు, రవి మొహం లో ఆనందం....

ఈలోగా రాము స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద జారుతూ "అన్నా" అంటూ మేదర కత్తిని గాల్లోకి విసిరాడు.... గాల్లోనే అందుకుని ఒక్క వేటు వేసాను.... రవి కత్తి ముక్కలవడంతో పాటు తన తల కూడా ఎగిరిపడింది....


వెంటనే మానస దెగ్గరికి పరిగెత్తాను దేవి నన్ను చూస్తూనే రెండు అడుగులు వెనక్కి వేసింది.....

మానస నన్ను చూస్తూనే అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుని నా వైపు నెట్టేసింది..... నేను ఎంత స్పీడ్ గా పరిగెత్తానో అంతే స్పీడ్ లో అమ్మ నా చేతుల్లోకి వచ్చింది.

అమ్మని నెట్టేసి మానస పక్కనే ఉన్న గట్టు మీద కూర్చుంది ఇంకా తన కడుపులో ఉన్న కత్తి బైటికి తీయలేదు..... విక్రమ్ సంధ్య కలయికని చూస్తూ కూర్చుంది కొంచెం రోప్పుతూనే....

అమ్మని చూస్తూనే ఏడుస్తూ తన మొహం నిండా ముద్దులు పెట్టాను.... నన్ను చూసి ఏడుస్తూ గట్టిగా కౌగిలించుకుంది.... అలానే గట్టిగా కౌగిలించుకుని ఉండిపోయాను.....

అమ్మ : చిన్నా! మానస.....అక్కడ నా బిడ్డ అను ఎలా ఉందొ తనకీ ఇక్కడ ఉన్నప్పుడే నెప్పులు స్టార్ట్ అయ్యాయి నేను ముందు అను ని చూడాలి అంది.


రషీద్ ని పిలిచాను, రాము కూడా వచ్చాడు...

విక్రమ్ : రాము నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళిపోలేదా?

రాము : అన్నా నీకు మేము జీవితాంతం రుణ పడి ఉన్నాం అలాంటిది నిన్ను వదిలేసి ఎలా వెళ్తాను....

విక్రమ్ : రషీద్ ఒకే హెలికాప్టర్ ఉంది అమ్మని తీసుకుని మీరు వెళ్లిపోండి....

రషీద్ : మరి మీరు....

విక్రమ్ : మీరు వెళ్లిపోండి నేను వచ్చేస్తాను... అన్నాను

అందరూ వెళ్లిపోయారు ఇక ఈ దీవిలో మిగిలింది దేవి, మానస, నేనే....

వెళ్లి మానస ని రెండు చేతులతో ఎత్తుకున్నాను, దేవిని చూసాను....

దేవి నన్ను చూస్తూ : విక్రమ్ ఇప్పుడు నా దెగ్గర ఐదు ఉంగరాలు ఉన్నాయి, వీటితో అమృతం తీసుకుని నీ మానస ని బతికించుకోవచ్చు... పద వెళదాం....

నా ప్లాన్ కూడా అదే మానసని బతికించాలంటే అమృతం కావాలి....

దేవిని జాలిగా చూసాను... రాజ్యం పోయింది ఇంత మంది చచ్చారు, మొగుడు పోయాడు, కొడుకు పోయాడు, కూతురు చావు బతుకుల్లో ఉంది అయినా కూడా అమృతం మీద ఆశ చావలేదు....

దేవి వెనక నడుస్తుంటే నా చేతుల్లో ఉన్న మానస "చిన్నోడా ఇక్కడనుంచి తీసుకెళ్ళు నాకు ఈ దీవి లో చావాలని లేదు"అంది.... "అలాగే" అని ముందుకు నడుస్తున్నాను.... నా చెంప మీద ఒకటి పీకింది.... మానసని చూసాను.... నవ్వుతూ కళ్లెమ్మటి నీళ్లతో నాకు బతకాలని లేదు వెనక్కి వెళ్ళిపోదాం అంది సీరియస్ గా..... నా కళ్ళలో నీళ్లు తిరిగాయి...

వెనక్కి తిరిగి ఒడ్డుకి వచ్చాను, దేవి పిచ్చి దాని లాగ వెళ్లిపోయింది....అక్కడోక పెద్ద షిప్ కనిపించింది, షిప్ డాక్ మీద తనని పడుకోబెట్టి తన తొడ మీద గుచ్చుకున్న బాణం బైటికి లాగాను... కడుపు లో ఉన్న కత్తి బైటికి లాగాను... కత్తి లాగ గానే మానస కి ఎక్కిళ్ళు వచ్చాయి.....

టైం చూసుకున్నాను... పావు తక్కువ పన్నెండు కావొస్తుంది.... షిప్ ఆన్ చేసి ఆటో పైలట్ లో సెట్ చేసి మానస దెగ్గరికి వచ్చాను....

మానస పడుకుని ఉంది తన ఒళ్ళంతా కత్తి పోట్లు, అమ్మ మీద చిన్న గాటు కూడా పడలేదు.... నా అమ్ములు ఇంత పెద్ద ఫైటరా? అనుకున్నాను..

తన దెగ్గరికి వెళ్లి తన పక్కనే పడుకున్నాను.... ఏడుస్తూ నన్నే చూస్తుంది.... "నన్ను క్షమిస్తావా" అంది....

తన నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను...

సముద్రం మధ్యలో షిప్ లో ఆకాశం లోకి చూసాను పైన నిండు చంద్రుడు, పక్కనే అమ్ములు తనకింకా ఎక్కిళ్ళు తగ్గలేదు ... ఈ లోగా ఫోన్ సౌండ్ వస్తే జేబు లోనుంచి తీసి చూసాను మెసేజ్ వచ్చింది "HAPPY DEEPAVALI FROM TONY STARK" అని మెసేజ్ వచ్చింది వెనక్కి తిరిగి చూసాను.... దీవి మొత్తం బాంబుల తో డ్రోన్స్ తో నిండిపోయింది ఆ సౌండ్ కి అమ్ములు తల తిప్పడానికి చూస్తుంటే తనని పట్టుకుని తన కళ్ళలోకి చూసాను ఏం లేదు అన్నట్టు....

మానస : చిన్నోడా (దగ్గుతూ) నాకొక ఆఖరి కోరిక ఉంది తీరుస్తావా?

విక్రమ్ : చెప్పు అమ్ములు...

మానస : ముందు నన్ను అమ్మ లా చూడటం మానెయ్....

విక్రమ్ : సరే...

మానస : నిన్ను బావ అని పిలవనా?

విక్రమ్ : పిలు....

మానస : చిన్నగా నా మీదకి ఎక్కింది నా మీద పడుకుని నా మొహం అంతా ముద్దులు పెట్టుకుంది.... "అమ్మా" అంది....

విక్రమ్ : నొప్పిగా ఉందా అమ్ములు...

మానస : అవును బావ... ఒక ముద్దు ఇస్తావా...?

తననే చూస్తూ నవ్వుతూ తన రెండు పెదాలు అందుకున్నాను....

ఎంత సేపు పెట్టానో నాకు తెలీదు అందులో నా విశ్వమంత ప్రేమని నింపాను....

మానస : బావ ఇంకొకటి....

విక్రమ్ : తన నుదిటి మీద ముద్దు ఇచ్చి "చెప్పు అమ్ములు" అన్నాను....

మానస : "ఏం లేదు" అంది తన కళ్ళలో నీళ్లు....తన ఎక్కిళ్ళు ఎక్కువవుతున్నాయి...

విక్రమ్ : తనని చూస్తూ "నీకేం కావాలో నాకు తెలుసు బంగారం" అని నవ్వుతూ "ఐ లవ్ యూ అమ్ములు" అని తన పెదాలు అందుకున్నాను......


రెండు నిమిషాలకి మానస నోటి నుండి చలనం లేదు.... మానస నోట్లో నుంచి ఎక్కిళ్ళు రాలేదు.... తన కళ్ళు మూసుకునే ఉంది.... నా గుండెల మీద పడుకోబెట్టుకున్నాను..... తన మొహం లో నవ్వు... దీనికోసమే తన ముందు ఏడవలేదు ఎందుకంటే అమ్మ కి మొదటి సారి జరిగినప్పుడు తన మొహం చూసాను తన మొహం లో ప్రశాంతత లేదు అది మానసకి జరగడం నాకు ఇష్టం లేదు.....

ఇప్పుడు కూడా నేను ఏడవను, ఏడిస్తే మానసని మర్చిపోతానేమో అని భయం.... తనని గట్టిగా కౌగిలించుకున్నాను.... చిన్నగా వర్షం పడుతుంది...


వర్షం పెద్దది అయ్యింది....తనని కౌగిలించుకుని మానస తో పాటే తడుస్తున్నాను బహుశా నా ఏడుపు మీకెవ్వరికి చూపించడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో..... వర్షం చినుకులతో పాటే నా కన్నీళ్లు జారిపోయాయి...


చీకటి లో ఒంటరిగా షిప్ లో వెన్నెల, వర్షం లో మానస ని కౌగిలించుకుని గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాను.....



❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


మాప్తం
Like Reply
రేపు లాస్ట్ క్లైమాక్స్ తరువాత జరిగే సన్నివేశాల అప్డేట్ ఇస్తాను

ఇంకొక కొత్త కధతో మళ్ళీ కలుద్దాం

అంతవరకు సెలవు....


❤️❤️❤️❤️❤️
Like Reply
Super Update Bro.
Thank you so much.
Like Reply
సూపర్ ఎండింగ్
Like Reply
Chala chala bagundi mitrama
Nee katha kie enni likes echina thakuvey

Good narration

Keep it up

Eagerly waiting for next line up story

All the best Sodhara
[+] 1 user Likes Nautyking's post
Like Reply
Super broo assalu story adirindhi broo
Like Reply
స్టోరీ అప్పీడే అయిపోయింది అంటే కొంచం బాధ గా ఉంది బ్రో....ఎందుకంటే నువ్వు స్టోరీ ని అంత బాగా రాశావ్....కానీ ప్రతిదానికి ఒక ముగింపు ఉంటది కదా.....
లాస్ట్ ఎపిసోడ్ బాగా స్పీడ్ గా లాగించేశావ్ ఏమో అనిపించింది....
మీ ప్రీ క్లైమాక్స్ కోసం వేచిచూస్తుంటాం.... అలాగే మీ నెక్స్ట్ స్టోరీ కోసం కూడా......
ఇంత మంచి స్టోరీ తో మమ్మల్ని అలరించినందుకు....నీకు ధన్యవాదాలు...... Namaskar Namaskar Namaskar
[+] 3 users Like Thorlove's post
Like Reply
good update brother. story ni koncham munduku tisukuni vellandhi
vikram amma anu miggurini oka frame lo untey bagutundhi anipistundhii naku.
Like Reply
bro. very nice... waiting for last update..
Like Reply
Manchi story bro appude ending antene badhaga undi kani super story nijanga chala bagundi ending
Kottha story dinikanna bagundali ani koru kuntunna
Bagundi story thank you bro
[+] 1 user Likes narendhra89's post
Like Reply
Superb update  Iex Iex Iex
Like Reply
Super update broo
Like Reply
Story bagundi…  keep up the good work..
Like Reply
చాలా బాగుంది
గంధర్వ వివాహం
https://xossipy.com/thread-50446.html
Like Reply
clps Nice story fantastic mind-blowing updates happy
Like Reply
(05-05-2022, 12:00 AM)Takulsajal Wrote: రేపు లాస్ట్ ప్రి క్లైమాక్స్ అప్డేట్ ఇస్తాను

ఇంకొక కొత్త కధతో మళ్ళీ కలుద్దాం

అంతవరకు సెలవు....


❤️❤️❤️❤️❤️
Amulya chachinatlu ledu
endi bhayya part-3 planning emanna unna.
Super bro
enta cheppina takkuve avtadi ala undi story
.
Thank you for your wonderful script.
[+] 1 user Likes shekhadu's post
Like Reply




Users browsing this thread: 89 Guest(s)