Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
అందరికి రంజాన్ శుభాకాంక్షలు
EID MUBARAK

❤️❤️❤️❤️❤️
[+] 2 users Like Pallaki's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Broo Ramzan special update broo
Like Reply
ఎపిసోడ్ ~ 11


ఇంటికి వెళ్లేసరికి నా ఇంటి చుట్టూ దాదాపు రెండు వందల మంది దాకా ఉన్నారు మా ఏరియా లో అడుగు పెట్టకముందే ప్రెస్, సెక్యూరిటీ అధికారి అందరు ఆగిపోయారు వీళ్ళకి గవర్నమెంట్ ని కంట్రోల్ చేయగలిగే అంత పవర్ ఎక్కడ నుంచి వచ్చిందో నాకు అర్ధం కాలేదు..... నా ఇంటి గేట్ ని కూల్చేశారు, మొత్తం ఇంటి చుట్టు ఉన్నారు , అను కోసం చూసాను ఎక్కడా కనిపించలేదు.... నా ఎదురుగా ఎవరో వస్తున్నారు నా దెగ్గరికి వస్తూనే మాస్క్ తీసేసాడు.... ఎవడో కాదు వాడు రవి.... వెంటనే ఫోన్ తీసి రషీద్ కి మెసేజ్ పెట్టాను "start" అని..అది చూసి నా ఫోన్ లాక్కున్నారు

రవి : విక్రమ్ విక్రమ్ ఎన్నాళ్ళకి మళ్ళీ కలుసుకున్నాం ఎలా ఉన్నావ్, చాలా గట్టిగా తన్నాను దెబ్బలేం తగల్లేదు కదా?

విక్రమ్ : హా వెన్ను పోట్లు కదా, కొంచెం గట్టిగానే తగిలాయ్ ఇప్పుడు తగ్గిపోయాయి లే.

రవి : నువ్వేం మారలేదు, ఒక్కడివే ఉన్నావ్...చుట్టు రెండు వందల మంది ఆల్రెడీ నా చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా అదే ధైర్యం.... ఏం చూసుకుని...

విక్రమ్ : అదంతా ఇప్పుడు అనవసరం ముందు సునీల్, రాజు ని ఎందుకు చంపావో చెప్పు....

రవి : సునీల్ నేను నా చెల్లి మానస మాట్లాడుకుంటుంటే వినేసాడు అందుకే లేపేయ్యాల్సొచింది....

"నా చెల్లి మానస" అనగానే నాకు మాట పడిపోయింది కానీ పానిక్ అవ్వలేదు, ఇంత మోసమా?

రవి : ఇక ఆ రాజు వాడు మా అందరి ఫోన్స్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తున్నాడు, మా గురించి తెలిసిపోయింది నీకు చెప్పేస్తాడేమో ప్లాన్ ప్లాఫ్ అవుద్దని లేపేశా.... చచ్చే అప్పుడు కూడా నీ గురించి మాములుగా ఎలివేషన్ ఇవ్వలేదు ఏమన్నాడు ఏమన్నాడు "మీలో ఎ ఒక్కరిని వదలడు అందరిని చంపేస్తాడు" నువ్వంటే ఎంత నమ్మకమో వాడికి... చచ్చే అప్పుడు కూడా వాడి కళ్ళలో నాకు భయం కనిపించలేదు అందుకే ఇంకో రెండు పోట్లు ఎక్కువగానే పొడిచారు మా వాళ్ళు....

విక్రమ్ : మరి పూజ?

రవి : పూజ పూజ..... సూపర్ ఫిగర్ అది.... అది నిన్ను ప్రేమించినా నీ కంటే నీ డబ్బునే ఎక్కువగా ప్రేమించింది దురాశ ఎప్పటికైనా చేదే కదా? అది కూడా పోయింది...

విక్రమ్ : దూరసా తనకైనా నీకైనా ఒకే లాగ పనిచేస్తుంది.... మరి నీ చెల్లెలు అని పరిచయం చేసిన రజినీ?

రవి : అదో పెయిడ్ ఆర్టిస్ట్ పాపం రాజు ని ప్రేమించిన కారణం గా కొంచెం ఎక్సట్రా గా ఇన్వాల్వ్ అయ్యింది కధలో దాన్ని కూడా ఫసక్....అని గొంతు కోసేసినట్టు సైగ చేశాడు...

విక్రమ్ : ఎందుకు ఇదంతా ఎవరికోసం దేని కోసం???

రవి : అదిగదిగో నీ మెడలో ఉందే ఆ ఉంగరం కోసం... నీకేమైనా మాలాగ ఎక్సట్రా పవర్స్ ఉన్నాయేమో అని తెలుసుకోడానికే నీ దెగ్గరికి వచ్చింది మానస కానీ అది చెప్పినవి చేయటం మానేసి నీతో చెట్టా పట్టాలెసుకుని తిరిగింది... ఆ తరువాత మాకు నీ డబ్బు కూడా కావాల్సొచింది లే... నీతో ఈ యుద్ధం ఇవన్నీ తప్పించడానికే నిన్ను బైటకి పంపించాం మొదటి సారి మనం ఇద్దరం వెళ్ళినప్పుడు వీళ్ళకి టైం సరిపోలేదు అందుకే నిన్ను కొన్ని రోజులు పంపించేయాలనీ మా అత్త అమూల్య ని వాడాము.... కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది....

విక్రమ్ : ఓహో అమూల్య కూడా ఇదే గ్రూపా....మీకు డబ్బు కావాలంటే నేను ఇవ్వనా మానస అడిగితే ప్రాణాలే ఇస్తాను ఈ డబ్బోక లెక్కా నాకు, ఆ విషయం మానస కి కూడా తెలుసు ఎక్కడుంది మానస?

రవి : ఇంటి లోపలే ఉన్నారు లే... ఎమోషనల్ అవ్వకు... నువ్వు మమ్మల్ని నమ్మినంత మేము నిన్ను నమ్మలేము కదా విక్రమ్... నీకు ఏసు ప్రభువుకి ఉన్నంత కరుణ ఉంది మాకు అస్సలు అది అంటేనే ఎలర్జీ....


విక్రమ్ : ఇప్పుడు నీకేం కావాలి?

రవి : ఆ ఉంగరం.... అది ఇచ్చేసి నీ భార్యని తీసుకుపో సారీ మేమే వదిలేసి వెళ్ళిపోతాము, అస్సలే నీ భార్య కాన్పు కి ఎప్పుడెప్పుడా అని ఉంది.

అవును అను ప్రేగ్నన్ట్ అయినప్పుడు తన పక్కనే ఉండి సేవలు చెయ్యాలని ఎంతో అనుకున్నాను కానీ ఒంటరిగా ఎన్ని కష్టాలు పడిందో పాపం...

విక్రమ్ : ఇందాకటి నుంచి మేము, చేసాము, చూసాము అంటున్నవ్ ఇంకా మీ టీం లో ఎవరెవరున్నారేంటి?

రవి : టీం ఏంటి బావ? మనదంతా ఒకే ఫ్యామిలీ, మీ అమ్మ సంధ్య నాకు మేనత్త... ఇన్ని రోజులు నిన్ను నమ్మిస్తూ మోసం చేసిన నా బంగారు చెల్లి నీ దెగ్గర ఈ విషయాలన్నీ దాచింది చూడు దానికి హాట్సోఫ్...

ఇవన్నీ చెప్పి నన్ను కన్ఫ్యూషన్ లో పెట్టాలని చూస్తున్నాడు నాకు అర్ధం అవుతుంది.... ఇక నాకు ఓపిక నశించింది, నా ఒంట్లో ఉన్న విషం కూడా నా బాడీ లోకి ఎక్కడం నాకు తెలుస్తుంది, నాకు ఎక్కువ టైం లేదు.... ముద్రగడ ప్రజలు ఇచ్చిన మందు ఎప్పుడు పని చేస్తుందో అస్సలు పని చేస్తుందో కూడా నాకు తెలియదు దాన్ని నమ్ముకోలేను.... కొంచెం నీరసంగా ఉంది కానీ నాకొచ్చే కోపానికి ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరి గా ఉంది, అన్ని తట్టుకున్నాను కానీ మానస చేసిన మోసాన్ని తట్టుకోలేక పోతున్నాను, సొంత అమ్మే కూతురిని వ్యభిచారానికి అమ్మేసినట్టుంది....

విక్రమ్ : నీకు చెప్పినట్టే ఉంగరం ఇస్తాను డబ్బులు ఇస్తాను కానీ నాకు నువ్వు మానస ఇద్దరు కావాలి...

రవి : గట్టిగా నవ్వాడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందనే అనుకుంటున్నావా?

విక్రమ్ : నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు.... నీ వల్ల చాలా కోల్పోయాను చాలా మంది జీవితాలని సంపూర్ణం గా నాశనం చేసావ్....

రవి : ఇక లాభం లేదు అని వాళ్ళ సోల్జర్స్ నాయకుడికి సైగ చేసాడు...

అందరు మీదకి వస్తున్నారు కానీ నాకు అంత టైం లేదు అందుకే "అందరిని ఒకేసారి రమ్మన్నాను", ముందు నవ్వినా తరువాత సీరియస్ గా తీసుకున్నారు.... నాకు కావాల్సింది కూడా అదే...

అందరు నా మీద పడ్డారు కుప్పలు కుప్పలు గా మొత్తం చీకటి నాకు ఏం కనిపించట్లేదు, కత్తి మాత్రం ఊపుతున్నాను ముక్కు చెవులు కళ్ళు కాళ్ళు చేతులు అన్ని తెగుతున్నాయి....నేను పెంచుకున్న పూలన్నీ ఎర్రటి రక్తం తో తడిసిపోతున్నాయి, మొదటి సరిగా నా నోట్లో నుంచి కొంచెం రక్తం బైటికి వచ్చింది....

ఇప్పుడు నాకు కావాల్సింది పూల కుండీ అవును ప్రతి పది అడుగుల దూరం లో ఒక పూల కుండీ పెట్టించాను, ఇప్పుడు అదేందుకు అనుకుంటున్నారా రండి చూద్దురు....

ఇందాకటి నుంచి నరకటం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది పాక్కుంటూ కుండీ దెగ్గరకి వెళ్ళాను ఒక ఫీట్ గ్యాప్ ఉంది కుండీ కొమ్మ పట్టుకున్నాను దాని ముళ్ళు గుచ్చుకున్నాయి అలానే ఒకడి తల మీద కొట్టాను.... కుండీ పగిలి అందులోనుంచి మూడు గ్రనేడ్స్ బైట పడ్డాయ్ చీకట్లో నే పిన్ పీకి ఒకడి షర్ట్ లో వేసి ఒక్కటి తన్నాను పక్కన పడ్డాడు అలానే మూడు సెకండ్స్ గ్యాప్ లో ఇంకో ఇద్దరినీ అలానే తన్ని పక్క కుండీ మీదకి దూకాను అందరు తెరుకొని నా పైకి వచ్చే లోపే మూడు గ్రనెడ్స్ పెళ్లిపోయాయి....

చూస్తున్న రవికి అందరికి ఏం అర్ధం కాలేదు రవి నేను ఇంకో కుండీ పగలగొట్టడం చూసాడు అందులో గన్ దొరికింది తలలు నరుకుతూనే గన్ తో కాల్చాను....

నేను రవిని గమనించే లోపే రవి ఇంకో కుండీ పగలగొట్టి గన్ తీసి కాల్చాడు, అప్పటికే రవి కనిపించడం తన చేతిలో గన్ చూసి వెంటనే పక్కకి దూకాను ఈ లోపే ఒక బుల్లెట్ నా కుడి భుజం కింద తగిలింది.... నా చెయ్యి పైనుంచి కింద దాకా రక్తం....

రవి గన్ లో ఉన్న 12 బుల్లెట్స్ అయిపోయేదాకా నేను జాగ్రత్త పడ్డాను దాని వల్ల నా చుట్టు ఉన్న వాళ్ళ చేతిలో కత్తి గాట్లు తప్పలేదు.

ఇంకొకడు ఇంకో కుండీని పగలగొట్టి గ్రనెడ్ నా మీదకి విసిరాడు గుంపులో పడింది పక్కనే ఉన్న శెవాన్నీ అడ్డు పెట్టుకున్నాను అయినా కానీ తల పగిలినట్టు అనిపించింది.... అక్కడున్న పది కుండీలు అందరం కలిసి అవ్వగొట్టేసాం...

అందరు చనిపోవడం తట్టుకోలేని వాళ్ళ నాయకుడు పెద్ద నింజా కత్తి తో ముందుకి వచ్చాడు, వాడి తల నరకడానికి నా ఒంటి మీద మూడు కత్తి గాట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది.... పర్లేదు బాగా లోపలికి కోసుకుపోయాయి మంట తెలుస్తుంది.....

అప్పటికే అందరు అయిపోవచ్చారు కొందరు ఇంటి వైపు వెళ్లడం గమనించాను వెంట వెళ్ళబోతుంటే కరెక్ట్ గా నా గుండె కి మధ్యలో కరెక్ట్ గా పేగులు స్టార్ట్ అయ్యే దెగ్గర ఒక బాణం దిగింది ఎవరా ఎక్కడ నుంచి అని తల ఎత్తి చూసాను అమూల్య బాణం పట్టుకుని యూనిఫారం లో ఉంది.... నా దెగ్గర ఉన్న మెదర కత్తిని....నా బాలన్నంతా కుడగట్టుకుని విసిరేసాను తన కడుపులో దిగింది అమూల్య కింద పడిపోయింది అది చూసిన రవి నా మీదకి వస్తున్నాడు....

చిన్నగా కింద కూర్చుని బాణాన్ని బైటికి లాగాను చీల్చుకుని వచ్చింది నా కండని... ఈ లోగ ఒకడు కత్తి తో నా తొడ మీద నరికాడు నా ఇంటి గడప ముందు నా రక్తమే చిల్లుతుందని ఎప్పుడు అనుకోలేదు పక్కనే పడి ఉన్న ఇంకొక కత్తి తో వాడిని నరికేసాను....

ఈ లోగా ఐదుగురు ఇంట్లోకి వెళ్లారు, వెంటనే పక్కన వాడి డ్రెస్ చించి తొడకి గట్టిగా కట్టు కట్టి కత్తి తీసుకుని లోపలికి వెళ్ళాను ఈ లోగా లోపలికి వెళ్లిన ఐదుగురు కింద పడ్డారు ఇద్దరి తలలు తెగి ఉన్నాయి తల ఎత్తి చూసాను.... మానస ఎదురుగా కత్తి పట్టుకుని ఉంది, వెనుక మూలకి అను కింద కూర్చుని ఉంది పెద్ద పొట్ట తో, తన మొహం బాడీ అన్ని ఉబ్బినట్టు చాలా లావు అయిపోయింది.... నొప్పి గా కడుపుని పట్టుకుని ఉంది అను పరిస్థితి చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి..... కోపం గా మానసని చూసాను ఇంకో ఇద్దరు లోపలికి వచ్చారు వాళ్ళని నరికేసింది నా కళ్ళలోకి చూడట్లేదు కానీ తన కళ్ళలో నీళ్లు చూసాను.... తన ఎదురుగా నిల్చున్నాను తల దించుకుని ఉంది..

ఈ లోగా నా బాడీ వణకడం స్టార్ట్ అయింది నోట్లోనుంచి రక్తం కారింది, అది చూసి అను గట్టిగా అరిచింది.... మానస తల ఎత్తి నా నోట్లో రక్తం కారడం చూసి నన్ను పట్టుకుంది తన కళ్ళలోకి చూసాను..... ఏడుస్తూనే ఉంది ఈ లోగా మానస "రవి" అని అను "విక్రమ్" అని గట్టిగా అరిచారు, వెనక నుంచి ముందుకి కత్తి దిగింది..... కిందకి చూసాను కత్తి బైటికి వెళ్లడం గమనించాను వెనక్కి తిరిగేలోపే ఇంకొకసారి పొడిచారు.... కిందకి పడిపోయాను.

సడన్ గా పది మంది ముద్రగడ వాళ్ళు ఆయుధలతో లోపలికి వచ్చారు, అందరు చుట్టు ముట్టారు, అనుకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి కింద పడిపోయి అలానే అను ని చూస్తూ ఉన్నాను, అను నా దెగ్గరికి వచ్చింది తన చెయ్యి పట్టుకున్నాను ఇక్కడ నుంచి వీళ్ళతో వెళ్ళిపో అన్నాను.... ఒకతను నా రక్తం ముట్టుకుని వేళ్ళతో నలిపి... "బాపు ఒంటి కొమ్ము విషం దీనికి విరుగుడు లేదు" అన్నాడు గట్టిగా.... అను గట్టిగా ఏడవటం మొదలుపెట్టంది.

ఎవరో బైట గుంపు గా వస్తున్న శబ్దలు ఇంకా రవి కళ్ళలో ఆనందం చూసి......అను నుదిటి పై ముద్దు ఇచ్చాను నా నోట్లో రక్తం తన నుదిటి పై అంటుకుంది, నా చేతులు కాళ్ళు అన్ని చచ్చుబడిపోయాయి.... అను నన్ను చూస్తూ విక్రమ్ అమ్మ బతికే ఉంది వీళ్ళ దెగ్గర బంధీగా ఉంది ఈ తొమ్మిది నెలలు అమ్మ దెగ్గరే ఉన్నాను.... నువ్వు అమ్మ కోసమైనా లే. లే ... అంటూ ఏడ్చింది.....నాకు ఆశ్చర్యం మరియు ఆనందం వేసింది అమ్మా అనుకున్నాను నా పెదాల పై నవ్వు వచ్చే ముందే నా నోట్లోకి రక్తం మరింత ఎక్కువగా వచ్చింది దగ్గాను....తెగ వాళ్ళని ఉద్దెశించి వెళ్లిపొమ్మని సైగ చేశాను, నా చెయ్యి పట్టుకుని ఏడుస్తున్న అను ని బలవంతంగా ఎత్తుకుని వాళ్ళు వెళ్లిపోయారు..... మానస కత్తి పట్టుకుని తెగ వాళ్ళు వెళ్లిపోయేవరకు కాపలా కాచింది.... తనని చూసాను దీనంగా కళ్ళలో నీళ్లతో నన్నే చూస్తుంది .....ఈ లోగా రవి వాళ్ళ సైన్యం లోపలికి వచ్చారు మానస ఇంకా కత్తి పట్టుకునే ఉంది రవి సైగ చేసాడు..


మానసని పట్టుకున్నారు కత్తి లాగేసుకున్నారు గట్టిగా విదిలించి వాళ్ళని విడిపించుకుని నా దెగ్గరికి వచ్చింది మోకాళ్ళ మీద కూర్చుని నన్ను మొత్తం చూసుకుంది..... నా నుదిటి మీద ఒక ముద్దు ఇచ్చి, నా కళ్ళు మూస్తూ "చినప్పటి నుంచి అన్ని కష్టాలు బాధలే నీ జీవితం లో ప్రశాంతత అనేదే లేదు ఇవ్వాల్టి తో అన్ని పోతాయ్ ఇక ప్రశాంతంగా నిద్ర పో" అని నా పెదాల పై ముద్దు ఇచ్చింది, నాకు ఆ స్పర్శ తెలుస్తుండగానే నా మొహం మీద మానస కన్నీటి బొట్లు వర్షం లా పడ్డాయి.....

మానసని లక్కెళ్లారేమో నాకు ఏం కనిపించట్లేదు అంతా మసక మసకగా ఉంది, రవి నా దెగ్గరికి వచ్చి నా మెడలో ఉన్న ఉంగరం తాడు ని గట్టిగా లాగాడు ఎగిరి తన కాళ్ళ దెగ్గర పడ్డాను.... తను వెళ్లిపోతుంటే రవి కాలు గట్టిగా పట్టుకున్నాను మనసులో "అమ్మా" అమ్మ ని వదిలేయమని చెపుదాం అంటున్నాను కానీ నోట్లోనుంచి రక్తం తప్ప మాట రావట్లేదు.... కొంచెం దూరం ఈడ్చాడు అలానే కానీ నేను ఎంతకీ రవి కాలు వదలకపోయేసరికి గట్టిగా ఒక తన్ను తన్నాడు, ఎగిరి అవతల పడ్డాను....

కొంచెం సేపు అలానే కళ్ళు మూసుకున్నాను చిన్నగా పడిపోయిన నా కాళ్ళు చేతులు చూసుకున్నాను అన్ని నరాలు కట్ అయి బైటకి వచ్చేసాయి నా చుట్టు రక్తం చిన్న చిన్న ఈగల్లాంటి పురుగులు నా చుట్టు చేరాయి.... మైండ్ మొత్తం బ్లాక్ కలర్ లోకి మారుతుంది..... చిన్నగా కళ్ళు మూసుకున్నానూ...





తెగ వాళ్ళు అను ని ఎత్తుకుని కార్ లో కూర్చున్నారు కార్ బైల్దేరింది, అను వాళ్ళని ఉద్దెశించి.

అను : నా భర్త ఆఖరి చూపు చూసుకోనివ్వండి, నేను తన దెగ్గరే ఉంటాను ఆ తరువాత నా భర్త మాట ప్రకారం మీతోటే వస్తాను ఏడుస్తుంది.

ఎంత చెప్పినా వినకుండా గోల చెయ్యడం తో కార్ పక్కకి ఆపారు....

అందులో ఉన్న పెద్దాయన : తల్లీ నీ భర్తకి ఏమి కాదు ఇప్పుడు నీ భర్త దెగ్గర నువ్వు ఉంటేనే ప్రమాదము... అన్నాడు.

అను : ఏమిటి మీరు అనేది ఇందాక తను చెప్పాడు కదా విషం అని మా అయన ఒంటి నిండా నోట్లో రక్తం.... అని మాట్లాడుతుంటే...

నీ భర్తకు ఏమి కాదు అతని ఒంట్లో మా పవిత్ర జలం మమేకమైయి ఉంది నీ భర్త ఒక సారి ప్రాణం పోయిన మళ్ళీ బతుకగలడు అని చెప్పి ఇక కార్ తీయమన్నాడు.... అను అయోమయంగా కడుపు నొప్పికి ఇక ఏం మాట్లాడలేకపోయింది..... అను బాధని గుర్తుంచి "సుబ్బడు వేగిరముగా పోనీరా ఈ అమ్మకి నొప్పులు వచ్చేలా ఉన్నాయి" అన్నాడు కార్ స్పీడ్ అందుకుంది.


❤️❤️❤️❤️❤️


















కొంచెం సేపటికి విక్రమ్ బాడీ లో చలనం లేదు, శ్వాస అన్ని ఆగిపోయాయి.... రక్తం కారడం ఆగిపోయింది....చిన్నగా ఒకొక్క కత్తి గాటు అతుక్కోడం మొదలయ్యాయి.... ఒక పది నిమిషాలకి విక్రమ్ కాలు కదిలింది..... గట్టిగా ఒక శ్వాస...... విక్రమ్ కళ్ళు తెరిచాడు....


కళ్ళు తెరిచాను, నోట్లో ఉన్న మిగిలిన రక్తాన్ని ఊసేసాను దూరం గా హెలికాప్టర్ సౌండ్ వినపడుతుంది..... కాళ్ళు చేతులు పైకి లేపి చూసుకున్నాను.... అంతా బానే ఉన్నాయి.... నా కళ్ళలో ఆనందం(మందు పనిచేసింది, అలాగే అమ్మని చూడాలి అన్న ఉత్సకత).



కళ్ళు మూసుకుని చిరునవ్వుతో "అమ్మా వస్తున్నాను" అనుకుని కళ్ళు తెరిచాను ......

Like Reply
yourock yourock yourock
Like Reply
What a thriller and action episode broo
Like Reply
Chimpesav Bro... Ababababababababababababa matalu lev.. next level lo undhi..
Like Reply
Next episode kuda evala post cheyandi please.. asalu aapukolekapothunna
Like Reply
Marvelous brooo???
Like Reply
you rocks bro super update
Like Reply
Nice super update
Like Reply
Amma ni kapadutada kachitanga kapadathadu ane anukuntuna sandhya brathakali so update matram chimpesav bro
Like Reply
Excellent update bro Vikram tana amma kalusukune update ipatikini rabotindi waiting for that...
Like Reply
Nice update
Like Reply
clps Fantastic mind-blowing update happy
Like Reply
Mind blowing update
గంధర్వ వివాహం
https://xossipy.com/thread-50446.html
Like Reply
Excellent sir
Like Reply
Next update thodaraga pettandi
Like Reply
ఈ కథను పెట్టి మూవీ తెస్తే ఒక సెన్సేనల్ మూవీ అవుతుంది
[+] 2 users Like Sivakrishna's post
Like Reply
Nice update
Like Reply
అరాచకం.
Like Reply




Users browsing this thread: 82 Guest(s)