28-04-2022, 10:45 AM
Tq for update
Vc
|
28-04-2022, 10:45 AM
Tq for update
28-04-2022, 11:01 AM
Super upadate bro
28-04-2022, 11:02 AM
brother evng inko update expect cheyocha memu...?
28-04-2022, 11:22 AM
Nice update bro
28-04-2022, 11:38 AM
Update chala bagundi
28-04-2022, 11:44 AM
Super update bro naralu thegala unnai twistlu ku
28-04-2022, 11:44 AM
Nice update
28-04-2022, 11:54 AM
ఎపిసోడ్ ~ 6
అర్ధ రాత్రి విక్రమ్ ఫోన్ చేసేవరకి అప్పటి వరకు వాడి ఊహల్లో ఉన్న నాకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది, ఆనందంగా ఎత్తాను కానీ వాడి మాటలు విన్నతరువాత ఎందుకో భయంగా ఉంది, విక్రమ్ ఇప్పటి వరకు ఎ రోజు అలా భయంగా మాట్లాడిందే లేదు, మానసంతా ఏదో భయం భయంగా అనిపించింది, విక్రమ్ లేని ఇన్ని రోజులు ఆనందం గానే వాడి ఊహల్తో గడిపేస్తునాన్ను కానీ ఈ అర్ధ రాత్రి నాకు ఇప్పుడు భయం వేస్తుంది, మానస దెగ్గరికి వెళ్ళడానికి బట్టలు సర్దుకున్నాను.... ఇంకా సునీల్ గారు రాలేదు.... తలుపు కొట్టిన చెప్పుడు విని డోర్ తెరిచాను ఎదురుగా ఎవరో ఒక పది మంది ఉన్నారు అందరు నల్ల డ్రెస్ లోనే ఉన్నారు కొంచెం భయంగానే ఉన్నా ధైర్యంగా నిల్చున్నాను. "భయపడకండి నా పేరు రవి విక్రమ్ అన్న పంపించాడు " అను : హో రవి అంటే మీరేనా అన్నయ్య, మీరంటే విక్రమ్ కి చాలా ఇష్టం, మీ గురించి చాలా చెప్పారు, మానసకి మీకు పెళ్లి అనుకుంటున్నారట కదా... రవి : ముందు అక్కడికి వెళదాం... అను : ఒక్క నిమిషం అన్నయ్య వస్తున్నాను... రవి అనుని కార్ ఎక్కించుకుని సునీల్ ఇంటి వైపు కాకుండా వేరే దిక్కుగా వెళ్లడం గమనించి "అన్నయ్య సునీల్ గారి ఇల్లు అటు వైపు కదా?" రవి : మానస అక్కడ లేదు మానస పూజ అందరు మా ఇంటిదేగ్గరే ఉన్నారు, ఇప్పుడు మా ఇంటికే వెళ్తున్నాము. అను : (ఇంటికా కానీ మానసకి ఎవ్వరు లేరుకదా నాకు తెలియకుండా తనెప్పుడు ఇల్లు కట్టుకుంది, విక్రమ్ నాతో చెప్తాడు కదా) కార్ కాళీ స్థలం లో ఫ్లైట్ ముందు ఆగింది ఫ్లైట్ చూడగానే కొంచెం భయం వేసింది ఇది ఎక్కడికి తీసుకెళతుందో తెలీదు ఎందుకో మనసులో విక్రమ్ కి దూరంగా వెళ్తున్నట్టు ఉంది ఫ్లైట్ ఎక్కాలనిపించలేదు.. రవి అనురాధా ఇబ్బందిని గమనించి మానస కి ఫోన్ చేసి అనుకి ఇచ్చాడు. అను : హలో మానస : అను భయపడకు, నేను జాగ్రత్తగానే ఉన్నాను ఇక్కడికి రా నీకు కొన్ని నిజాలు తెలియాలి అని కాల్ కట్ చేసింది. ఎందుకో మానసతో మాట్లాడిన తరువాత కొంచెం భయం తగ్గినా మనసులో ఏదో తెలియని భయంగానే ఉంది, ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను... ఫ్లైట్ స్టార్ట్ అయింది బ్యాగ్ లోనుంచి సంధ్య అమ్మ ఫోటో తీసాను, విక్రమ్ కి ఏ పని చేసిన వాళ్ళ అమ్మని తలుచుకోడం అలవాటు, ఎందుకో అమ్మ ఫోటో తీసి చూడాలనిపించింది, విక్రమ్ ఎక్కుడున్నవ్ నువ్వు నా పక్కన ఉంటే బాగుండు అనుకుని సంధ్య అమ్మ ఫోటో మళ్ళీ బ్యాగ్ లో పెట్టి కళ్ళు మూసుకున్నాను ఎందుకో నీరసంగా ఉంది రాత్రి నుంచి, తెగ బాత్రూం వస్తుంది, వాసనా మంచి నీళ్ల టేస్ట్ అన్ని వేరేగా ఉన్నాయ్.... అక్కడనుంచి మూడు గంటల తరువాత ఒక దీవిలో ల్యాండ్ అయ్యింది.. చుట్టూ సముద్రం జన సంచారం లేదు ఎదురుగా పెద్ద కొండలు మధ్యలో మెట్లు అందరు వెళ్తున్నారు వాళ్ళ వెనకాలే వెళ్ళాను చాలా మెట్లు ఎక్కిన తరువాత పెద్ద డోర్స్ రెండూ తెరుచుకున్నాయి... లోపలికి వెళ్ళాను అన్ని ఇల్లు ఒక చిన్న రాజ్యమే ఉంది ఇక్కడ, కార్ ఎక్కి ఎదురుగా ఒక రెండూ కిలోమీటర్స్ ఉంటుందేమో పెద్ద పాలస్ లాగా ఉంది అక్కడికి తీసుకెళ్లారు... మొత్తం ఎటు చూసినా సెక్యూరిటీ లోపలికి వెళ్ళాము, స్వర్గం లా ఉంది ఆ పాలస్, ఇలాంటి ఇంత అందమైన కట్టడం నేను ఇప్పటివరకు చూడలేదు... .............................................................. మానస : అమ్మా రవి అన్నయ్య అనురాధ ని తీస్కోచాడు.. దేవి : నాకెందుకు చెప్తున్నావ్ అస్సలు అక్కడే చంపేయాల్సింది, ఇక్కడి దాకా అనవసరంగా తీసుకొచ్చారు చంపేయండి. మానస : అమ్మా ఆ విషయమే నీతో మాట్లాడాలి.. దేవి : కోపంగా "ఏంటి?" మానస : అనురాధ ని చంపడానికి నేను ఒప్పుకోను, తనని వదిలేయండి.... దేవి : నాకే ఎదురు తిరుగుతున్నావా, ఎదురు తిరిగి బతుకుదామానేనా...? మానస : రెండూ మోకాళ్ళ మీద కూర్చుని "అమ్మ నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమడగలేదు, మీకోసం నా ప్రేమని త్యాగం చేశాను, నా ప్రాణానికి ప్రాణం నేను ప్రేమించిన నా విక్రమ్ ని మోసం చేశాను, తనని చంపుకున్నాను ఇవన్నీ నేను మీకోసం చేసిన త్యాగాలుగా చెప్పట్లేదు, మీ వల్ల నేను చాలా కోల్పోయాను నేను చేసిన మోసం నన్ను నా జీవితాంతం వెంటాడుతుంది దానికి బదులుగా నేను అడిగింది ఒక్క ప్రాణం మాత్రమే " "అను చాలా సున్నిత మనస్కురాలు ఇవేమి తనకీ తెలియవు తన వల్ల ఎటు వంటి ఆపద కలుగదు నేను మాట ఇస్తున్నాను " దేవి : అలాగేలే పో ఇంతకీ నా వదిన ఎలా ఉంది? మానస : ఇందాకే అత్తని కలిసాను, విక్రమ్ చనిపోయాడని చెప్పాను, ముందు కంగారు పడ్డా విక్రమ్ చనిపోయాడంటే నమ్మట్లేదు, మొండి పట్టు మీద ఉంది చిన్నా బతికే ఉన్నాడని. దేవి : నేను నమ్మట్లేదు నా అల్లుడు చనిపోయాడంటే, మీరు చెప్పడమే కానీ కంఫర్మ్ గా కాదు వాడిది ఈ వంశపు రక్తమే కదా అందుకే నమ్మలేకపోతున్నాను. మానస : అమ్మ ఒక వేళ చిన్నా బ్రతికే ఉంటే కత్చితంగా నన్ను, అను ని వెతుక్కుంటూ కత్చితంగా వస్తాడు.. దేవి : అంత నమ్మకమా వాడంటే, వాడు కూడా నిన్ను ప్రేమించాడా? మానస : లేదు నాలో అత్తని చూసుకున్నాడు, నేనే బావని ప్రేమించాను... దేవి : ఏడుస్తున్నావా? మానస : లేదు అదీ నువ్వు నాకు నేర్పించలేదు. దేవి : నీ మొహం చూస్తూనే అర్ధమవుతుంది నువ్వు వాడి వల్ల ఎంతగా మారిపోయావో... ఇక్కడనుంచి వెళ్ళిపో... మానస మోకాళ్ళ మీద నుంచి లేచి బైటికి వచ్చింది.... అక్కడ అను కనిపించింది.... పెద్ద హాల్ లాగా ఉండే ప్రదేశానికి వచ్చాము ఎదురుగా మానస వచ్చింది తన డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది, పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాను, విడిపించుకుంది ఏమైందా అన్నట్టు చూసాను. మానస : ఎలా ఉన్నావ్ అను. అను : బానే ఉన్నాను మానస కానీ ఏంటి ఇదంతా, నీకు మేము తప్ప ఎవ్వరు లేరు కదా ఈ దీవి, ఈ పాలస్ నీ డ్రెస్ ఏంటి ఇదంతా?? మానస : అన్ని తరువాత చెప్తాను, ముందు నీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయ్ అన్ని వివరంగా తెలుస్తాయి.... అని పాలస్ వెనక్కి చాలా దూరం తీసుకెళ్ళింది. మానస : అను నువ్వు ఉండ బోయేది ఇక్కడే నువ్వు జీర్ణించుకోవాల్సిన విషయం విక్రమ్ చనిపోయాడు... ఆ మాట వినగానే నాకు నవ్వు వచ్చింది "ఏంటి మానస ప్రాంక్ హా, విక్రమ్ ఎక్కడ చూసి దాదాపు రెండు నెలలు అవుతుంది ఎక్కడ దాక్కున్నాడు నా మొగుడు ". మానస : అనురాధ నువ్వు నమ్మినా నమ్మకపోయినా విక్రమ్ ఇక మనకి లేడు, లోపల విక్రమ్ అమ్మ గారు ఉన్నారు వెళ్లి పలకరించు కానీసం నిన్ను చూస్తే అయినా తను కొంచెం కుదుట పడుతుంది అని అక్కడనుంచి వెళ్ళిపోయింది అనుని చూడకుండా కళ్ళ నిండా నీళ్లతో.... అనుకి ఒక్కసారిగా ఎం అర్ధం కాలేదు ఇప్పటి వరకు తను విన్నదంతా నిజమేనా కళ్ళు తిరిగి పడిపోయింది.... తను పడిన శబ్దానికి మానస వెనక్కి తిరిగి చూసింది వెనకే మానస అత్త సంధ్య అనురాధ ని పట్టుకుని ఉంది, తన చెయ్యి పట్టుకుని పరీక్షించి చూసింది. మానస వైపు చూసి : మానస ఈ అమ్మాయి ప్రేగ్నన్ట్, ఎవ్వరు ఈ అమ్మాయి ఇంకేంతమందిని పొట్టన పెట్టుకుంటారు మీ దూరశ కోసం, పాపం ఏ కన్న తల్లి బిడ్డో సంతోషంగా ఉండాల్సిన సమయంలో మీ వల్ల ఇక్కడ చిక్కుకుపోయింది.... మానస కళ్ళలో నీళ్లు ఆగలేదు అక్కడ్నుంచి పారిపోయింది, ఎవరో వెంటాడినట్టు ఉంది, ఎవ్వరో కాదు నేను చేసిన పాపలే నన్ను వెంటాడుతున్నాయి నాకు బతకాలని లేదు...విక్రమ్ నన్ను క్షమించు రా, వచ్చే జన్మలో అయినా నీకు పెళ్ళాం గా పుట్టి నీకు సేవలు చేసుకుంటాను..... సంధ్య కళ్ళు తిరిగి పడిపోయిన అనురాధ ని లోపలికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది..... సంధ్య ఆశ్చర్య పడిన విషయం ఏంటంటే అనురాధ విక్రమ్ పేరు కలవరించడం... ముందు ఆశ్చర్యపోయిన తరువాత అనురాధ లేచే వరకు ఓపికగా తననే చూస్తూ ఉండిపోయింది.... సంధ్య : ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు అదీ ఇప్పుడు మాములు మనిషివి కావు, ఏ సంబంధం లేకుండా నిన్ను ఎందుకు తీసుకొచ్చారు, చూస్తే మా మనిషిలా కూడా లేవు, కానీ ఎందుకో నిన్ను చూస్తుంటే నా సొంత మనిషిలా అనిపిస్తున్నావ్ ఎవరు నువ్వు, చూస్తే నీకు ఎలాంటి శక్తులు లేనట్టున్నాయ్, మాములు బాడీ ఇలాంటి కృరుల చేతిలో ఎలా చిక్కావ్..... నిన్ను ఆ దేవుడే కాపాడాలి... అనురాధ చిన్నగా కళ్ళు తెరిచింది తన కళ్ళు ఎదురుగా ఉన్న మనిషిని చూసి నమ్మలేకపోయింది ఎందుకంటే ఎదురుగా ఉన్నది సంధ్య కాబట్టి... తనని చూస్తూ అమ్మా అని పిలిచి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు ఆశ్చర్యపోవడం సంధ్య వంతు అయ్యింది....
28-04-2022, 12:02 PM
MIND BLOWING UPDATE
28-04-2022, 12:09 PM
Excellent update
28-04-2022, 12:32 PM
Excellent update story just entered a next level
28-04-2022, 12:35 PM
tq for update brother. malii suspence lo petavasavvvv....
28-04-2022, 12:41 PM
Mind blowing update bro
28-04-2022, 12:45 PM
ఏంటి అండి రైటర్ గారు...Twists మీద Twists తో సవగొడుతున్నారు....
అసలు ఏం జరుగుతుంది ఏమి అర్ధంకావాట్ల.... మీ నెక్స్ట్ అప్డేట్ కోసం వేచిచూడటమే మా పని ఇంకా......
28-04-2022, 01:00 PM
Nice super update
28-04-2022, 01:31 PM
Full exiting
28-04-2022, 01:43 PM
Super update bro
|
« Next Oldest | Next Newest »
|