07-07-2022, 07:39 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Romance శృంగార కథామాళిక
|
07-07-2022, 07:39 PM
07-07-2022, 07:40 PM
07-07-2022, 07:45 PM
(24-06-2022, 05:18 PM)Thorlove Wrote: Really waited for you to start a new story in this thread...... మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు ......
07-07-2022, 07:45 PM
07-07-2022, 07:45 PM
07-07-2022, 07:46 PM
07-07-2022, 07:46 PM
07-07-2022, 07:46 PM
07-07-2022, 07:47 PM
07-07-2022, 07:47 PM
07-07-2022, 07:47 PM
07-07-2022, 07:47 PM
07-07-2022, 07:48 PM
07-07-2022, 09:39 PM
07-07-2022, 10:45 PM
08-07-2022, 06:41 AM
We r Waiting for your update Mahesh bro
08-07-2022, 10:06 AM
రాత్రంతా గురువుగారి పాదసేవలో తరించి పాదాల దగ్గరే నిద్రపోయాను . తెల్లవారుఘామున లేచిచూస్తే నాకంటే ముందుగానే గురువుగారు లేచి జోకొడుతుండటం జీవితంలో మరిచిపోలేని అనుభూతి .
గురువుగారు వెంటనే చెమ్మను తుడుచుకున్నారు . వెంటనే లేచి గురువుగారి పాదాలదగ్గరకు చేరాను . పాదాలను స్పృశిస్తూ గురువుగారూ ....... మహేష్ వెళ్లకు అని ఒక్కమాట చెప్పండి ఆగిపోతాను , నాకు రాజ్యంపై - ఆ అందాలరాశిపై ఎటువంటి ......... గురువుగారు : లేదు లేదు లేదు అలా కానే కాదు మహేష్ , అయినా నా ఇష్టమైన శిష్యుడి గురించి ఈ గురువుకు తెలియదా చెప్పు , ఇవి నువ్వు దూరం వెళుతున్నావన్న బాధతో వచ్చిన కన్నీళ్లే అయినా నువ్వు గొప్పస్థాయికి చేరబోతున్నావన్న ఆనందబాస్పాలు కూడా అంటూ ఆనందంతో చెప్పారు , మహేష్ ....... రాజ్యం ఎలాగో నీ పాదాల చెంతకు చేరక తప్పదు అంతటి వీరుడు నా శిష్యుడు కానీ ఆ అందాలరాశి నీకోసమే పుట్టి నీ గురించే కలలు కంటూ ఆశతో జీవిస్తోంది . గురువుగారూ ...... అంటూ సిగ్గుపడ్డాను . గురువుగారు : అంటే నా శిష్యుడికి ఇష్టమే అన్నమాట చాలా సంతోషం - అంతటి అతిలోకసుందరి ...... ఈ వీరాధి వీరుడి సొంతం కావాల్సిందే , దిగ్విజయుడివై విరాజిల్లు మహేష్ ....... మీ ఆశీర్వాదం ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంతో సాధిస్తాను గురువుగారూ ....... గురువుగారు : ఆనందించి , ప్రయాణపు సమయం ఆసన్నమైనది మళ్లీ వచ్చి పరమశివుడి అనుగ్రహం పొందాలికదా అంటూ నదికి చేరుకున్నాము . సూర్య వందనం చేసుకుని , నదీ దేవత అమ్మ ఒడిలో ప్రేమను పొందుతూ స్నానమాచరించాను . అమ్మా ...... వెళ్ళొస్తాను , అంతవరకూ గురువుగారిని జాగ్రత్తగా చూసుకుంటూ సమాచారం ఇవ్వాలి , ఇది మీ బిడ్డగా కోరుతున్న తొలి కోరిక అంటూ నీటిని త్రాగాను . గురువుగారు ఆనందించి , నదీ దేవతా ...... నీబిడ్డను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ప్రార్థించారు . గురుకులం చేరుకున్నాము . గురువుగారూ ...... కృష్ణ కూడా దేవిడి చెంతకు . గురువుగారు : ఎంతమాట నాకు కావాల్సినది కూడా అదేకదా మహేష్ - శివుడి అనుగ్రహం ఇద్దరికీ ఉండాలి . ప్రయాణంలో - కర్తవ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అనుగ్రహించమని భక్తితో ప్రార్థించాము . గురువుగారు ...... మా ఇద్దరికీ వీరతిలకం దిద్ది హారతిని అందించారు . గురువుగారూ మహేష్ ...... శుభవార్త అంటూ చిన్నగురువులు పరుగునవచ్చారు , గురుకులపై అపార నమ్మకం ఉండే ముఖ్యమంత్రి నుండి స్వయంవరం గురించిన సమాచారం సేకరించాము , ప్రయాణ దూరం 900 మైళ్ళు ...... ఆ దారిని చూయించే దిక్సూచి - పటం ఇదిగో మహేష్ , అతికష్టమైన ప్రయాణం ....... గురువుగారి కోరిక తీర్చడంలో గురువుగారి ఆశీర్వాదంతో ఆ కష్టాలన్నీ సునాయాసంగా చేధించుకుంటూ గమ్యం చేరుకుంటాను . చిన్న గురువులు : అంతటి వీరుడువని మాకు తెలుసులే ...... , ఇదిగో ఇది ఆ పెద్ద రాజ్యానికి దగ్గరలో ఉన్న అతిచిన్న సామంత రాజ్యం - నువ్వు ఇక్కడ నుండే అనుకున్నది సాధించే వ్యూహాలు పన్నాలి ఎందుకంటే రాజ్యంలోకి వెళితే ఎవరైనా గుర్తుపట్టే ప్రమాదం ఉంది . అవసరమైన గొప్ప సమాచారం గురువులూ ....... చిన్న గురువులు : అయినాకూడా జాగ్రత్తపడాల్సినవి దృష్టిలో ఉంచుకోవాల్సినవి ఉన్నాయి మహేష్ ...... , ఆ రాజ్యాన్ని ఎలాగైనా తమ గుప్పిటలోకి తీసుకోవాలని చాలా ఏళ్లుగా భయంకరమైన రాక్షసుల్లాంటి అడవి మనుషులు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు వాళ్ళతో జాగ్రత్త - పరాయవ్యక్తి అని తెలిస్తే చిత్రహింసలు పెట్టి చంపేస్తారు . అలాంటివాళ్లకు భయపడితే నేను .... గురువుగారి ప్రియతమ శిష్యుడిని ఎలా అవుతాను . చిన్న గురువులు : ఆ ధైర్యం మాకూ ఉందిలే కానీ కాస్త జాగ్రత్త , ఇక అతిముఖ్యమైంది ఏమిటంటే ఏమిటంటే ....... ఆ రాజ్యపు రాజుకు మన రాజులలానే అహంకారం , అలా అని చెప్పలేము కానీ తన కూతురిని యువరాజుకే ఇవ్వాలని రాజులే గొప్పవారన్న నమ్మకం ....... గురువుగారు : మన శిష్యుడు అంతకన్నా గొప్పవాడు , సరైన సమయానికి వాళ్లకు తెలుస్తుందిలే , ఇక ఆలస్యం చెయ్యడం మంచిదికాదు మహేష్ ...... , ఈ విషయం యువరాజులకు తెలిస్తే అపాయం . గురువుగారూ ....... అంటూ హత్తుకుని , తప్పదు కాబట్టి ఆశీర్వాదం తీసుకున్నాను. గురువుగారు : దిగ్విజయుడివై అతిలోకసుందరిని రాజ్యాన్ని పొందాలి అంటూ ఆశీర్వదించారు . చిన్న గురువులు : రాజువై వచ్చి ఈ యువరాజులను ఓడించి అహంకారాన్ని అణిచివెయ్యాలి . గురువుగారు : యువరాజులను గురుకులం పోటీలలోనే ఓడించాడు - తోటి స్నేహితుడిని పోటీలో లేకుండా చేశారు అంటే ఎంత భయపడ్డారో తెలిసిందే - మహేష్ ....... నీ గమ్యం ఈ యువరాజులు కాదు , రాజువై రాజ్యాన్ని - వీలైనంతమంది ప్రజలను సంతోషపెట్టడం అది గుర్తుపెట్టుకో ...... , ఇక వెళ్లు ...... అలాగే గురువుగారూ అని ఆశీర్వాదం తీసుకుని , పరమశివుడిని మొక్కుకున్నాను . ఆయుధాలతో స్వారీకి సిద్ధంగా ఉన్న కృష్ణగాడిపైకి ఎక్కి బయలుదేరాను . దాదాపు పద్దెనిమిది ఏళ్ల తరువాత గురుకులం - గురుకుల అరణ్యం నుండి బయట ప్రపంచానికి ప్రయాణం సాగించాను . గురుకులానికి చుట్టూ ఉన్న రాజ్యాలలో రెండు మూడు రాజ్యాల ద్వారా కాకుండా రాజ్యం చూట్టూ కష్టమైన దారిలో జాగ్రత్తగా బయటపడ్డాను . గురువుగారి గురుదక్షిణ కోరిక తీర్చడం కోసం కాస్త తగ్గడంలో బాధ ఏమాత్రం అనిపించలేదు . కొద్దికొద్దిసమయానికే కృష్ణ నుండి కిందకుదిగి నడక సాగించాను . అంతదానికే కృష్ణకు కోపం వచ్చేసేది , నేనున్నది ఎందుకు ఎక్కు అంటూ ఎక్కి స్వారీ చూసేంతవరకూ వదిలేవాడు కాదు , నవ్వుకుని ఇద్దరమే మాట్లాడుకుంటూ వేగంగా ముందుకువెళ్లాము . ఆరోజుకు చీకటి పడటం - ఉదయం నుండీ దాదాపు వంద మైళ్ళకు పైగా ప్రయాణించడం వలన కృష్ణకు విశ్రాంతి కావాలి కాబట్టి అరణ్యంలో చిన్న కొలను ప్రక్కన ఆగాము . కృష్ణతోపాటు నీటిని సేవించి , విశ్రాంతి తీసుకోమనిచెప్పి ఆహారం తీసుకొచ్చాను , కృష్ణకు తినిపించబోతే గుర్రుగా ఉన్నాడు . ఎందుకో అర్థమై నవ్వుకున్నాను - నేనొక్కడినే వెళ్ళాను నాకేమైనా అవుతుందనా ....... నా ప్రాణ స్నేహితుడు ఉదయం నుండీ దున్నపోతులా ఉన్న నన్ను మోసాడు కదా ...... ఈమాత్రం కూడా చేయకపోతే ఎలా , తినవా ....... నువ్వుమాత్రమే కాదు నేనుకూడా జాగ్రత్తగా చూసుకోమని గురువుగారు చెప్పారుకదా అంటూ బుజ్జగించడంతో తినింది , మా మంచి కృష్ణ అంటూ ఇద్దరమూ తిన్నాము , నేలపై పడుకున్న కృష్ణపై తలవాల్చి గురువుగారిని సేవించుకునే సమయం అంటూ మాట్లాడుతూనే హాయిగా నిద్రపోయాము .
08-07-2022, 10:07 AM
రోజూలానే సూర్యోదయానికి ముందే లేచాను .
కృష్ణ ...... నాకంటే ముందుగా లేచి చుట్టూ జాగ్రత్తగా చూస్తున్నాడు . కృష్ణా ....... అసలు నిద్రపోయావా లేదా అంటూ హత్తుకున్నాను . క్షమించు ఇకనుండీ వంతులవారీగా ....... ఊహూ ....... అంటూ స్పృశించాడు . ఇదేమీ బాలేదు కృష్ణా ....... నేనంటే నీకు ఎంత ప్రాణమో నువ్వుకూడా నాకు అంతే ప్రాణం కదా ....... నామాటలేమీ పట్టించుకోకుండా కొలనులోకి వెళ్ళాడు . నిన్నూ అంటూ నవ్వుకుంటూనే వెళ్లి సూర్య వందనం చేసుకుని స్నానమాచరించి , ఆయుధాలు - వస్తువులన్నింటినీ తీసుకుని ప్రయాణం సాగించాము . నిన్నటి కంటే మరింత ఉత్సాహం వచ్చినట్లు కృష్ణ మరింత వేగం పెంచాడు . అరణ్యంలో అక్కడక్కడా ఆగి ఆగి వెళుతూ చీకటిపడ్డాక నీటి ప్రవాహం ప్రక్కన విశ్రాంతికి ఆగాము . బరువులన్నీ దింపి కృష్ణా ...... హాయిగా విశ్రాంతి తీసుకో , నేను సాధన చేసుకోవాలి అన్నాను . మంచి ప్రాణాళికనే పన్నావు మహేష్ అన్నట్లు ఒకచూపు చూసాడు కృష్ణ ....... నవ్వుకుని బహు బాణాల విలు విద్య - కత్తిసాము ...... సాధన చేసి పడుకున్నాను. అలా దాదాపు వారం రోజులపాటు పటం సహాయంతో దట్టమైన అరణ్యాలు - కొండలు - ప్రవాహాలు - చిన్న చిన్న రాజ్యాలు దాటుకుని చిన్న గురువులు చెప్పిన సామంత రాజ్యం చేరుకున్నాము . కృష్ణా ...... నీవల్లనే కేవలం నీవల్లనే అనితరసాధ్యమైన ప్రయాణాన్ని సాగించి గమ్యాన్ని చేరుకున్నాము అంటూ మెడను చుట్టేసి ముద్దుపెట్టాను . కృష్ణ ఆనందం అవధులులేనట్లు గెంతులువెయ్యడం చూసి ముచ్చటేసింది . దట్టమైన అరణ్యపు కొండలు - కొండల పాదాలదగ్గర ఈ సామంత రాజ్యం - రాజ్యం ముందు మైదానం - అల్లంత దూరంలో పెద్ద లోయ ....... చూడముచ్చటగా ఉంది . రాజ్యం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ బయట అంటే మైదానంలో జనాల హడావిడి కనిపిస్తోంది - అందరూ సంబరాలు చేసుకుంటున్నారు - ఎక్కడ చూసినా పూలతో అలంకరణ కనివిందు చేస్తోంది . ఈ ఆనందాలకు కారణం ఏమిటో తెలుసుకోవాలని జనాల మధ్యలోకివెళ్ళాను . ఒకవైపున బుజ్జి బుజ్జి పిల్లలు సంతోషంగా ఆడుకోవడం చూసి వాళ్ళ దగ్గరికివెళ్ళాను . అరణ్యం నుండి ఆహారం కోసం తీసుకొచ్చిన పళ్ళను పిల్లలకు అందించాను . ధన్యవాదాలు ధన్యవాదాలు అన్నయ్యా చాలా తియ్యగా ఉన్నాయి అంటూ ఇష్టంగా తింటున్నారు . సంతోషించి , పిల్లలూ ...... ఏమిటీ కోలాహలం - సంబరాలు ? . పిల్లలు : అమ్మవారి జాతర అన్నయ్యా ...... అవునా ....... అందుకేనా ఇంతమంది జనం ...... ఇప్పుడేమి చూసారు సాయంత్రానికి ఇసుక వేస్తే రాలనంత జనం చేరుతారు - కోరికలు తీర్చే అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి చుట్టుప్రక్కల రాజ్యాల ప్రజలు తండోపతండాలుగా రాబోతున్నారు , నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే జాతరను రాజుగారు అంగరంగవైభవంతో జరిపిస్తారు , నీకూ కొరికలుఉంటే వెళ్లి కోరుకో నాయనా అమ్మ తప్పకుండా తీరుస్తుంది అంటూ ఒక బామ్మ చెప్పింది . ఉంది బామ్మా ఒకేఒక కోరిక మా గురువుగారి కోరిక - ఇప్పుడే వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటాను అంటూ జనాలను దాటుకుంటూ అమ్మవారి మందిరం చేరుకున్నాను . కృష్ణను చెట్టుకింద ఉండమని చెప్పి మందిరంలోపలికివెళ్ళాను - అందమైన రెండు కళ్ళు నన్ను గమనిస్తున్నాయని అప్పటికి నాకు తెలియదు . ఆదిపరాశక్తి అవతారంలోని అమ్మవారిని చూడగానే ధైర్యం - పరాక్రమం - శక్తి రెండింతలు అయ్యింది , అచ్చు నదీ దేవత అమ్మనే చూసినట్లు చాలా చాలా సంతోషం వేసింది , అమ్మా ...... నీ బిడ్డకు ఇలా దర్శనం ఇచ్చారా అంటూ భక్తితో మొక్కుకున్నాను , అమ్మా ....... నాకోరిక ఏమిటో తెలిసిందే కదా అతి తొందరగా తీరేలా ఆశీర్వదించండి అంటూ అమ్మ ముందు మోకరిల్లాను , అమ్మవారి హారతి - తీర్థ ప్రసాదాలు స్వీకరించాను , బయట ప్రాణ స్నేహితుడు ఉన్నాడని ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాను . బయట జనాల పరుగులు కేకలు ....... అటువైపు చూస్తే జాతరలో అమ్మవారిని ఊరేగించే ఏనుగు జనాలవైపుకు భయంకరంగా దాడిచేస్తోంది . చాలా మంచి ఏనుగు - అమ్మవారి ప్రతిరూపంలా ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది - ఎందుకు ఇలా చేస్తోంది పరిగెత్తండి పరిగెత్తండి అంటూ కేకలువేస్తున్నారు . చేతిలోని ప్రసాదాన్ని గుడిలోపల ఉంటూ భయంతో వనికిపోతున్న ఒకరికి ఇచ్చి , మధమెక్కిన ఏనుగును ఎలా దారిలోకి తీసుకోవాలో తెలుసుకాబట్టి పరుగులుతీస్తున్న జనాలకు వ్యతిరేకంగా మీదకు దూసుకొస్తున్న ఏనుగు దగ్గరకే వెళ్ళాను . చేతిని ముందుకు చాచి దూరంగా వస్తున్న ఏనుగు కళ్ళల్లోకి చూస్తూ ఏనుగు బాష మాట్లాడుతూ శాంతిపచెయ్యడానికి ప్రయత్నించాను . ఏనుగు తన తలను విధిలిస్తూ దూసుకొచ్చి నామీదకు ఎక్కేయ్యబోతుంటే ప్రక్కకు ఎగిరాను . ఏనుగు తినరానిదేదో తిన్నదని అగ్ని గోళాలుగా మారిన కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోయింది . ఈ పరిస్థితులలో ఏనుగును నియంత్రించలేము ప్రక్కకు తప్పుకోండి ప్రక్కకు తప్పుకోండి అంటూ ఏనుగు వెంబడి పరుగులుతీస్తూ కేకలువేస్తున్నాను . జనాలందరూ ప్రక్కకు తప్పుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు . అంతలోనే పిల్లలు పిల్లలు అంటూ తల్లులు కేకలువేస్తున్నారు . చూస్తే నేను పళ్ళు ఇచ్చిన పిల్లలు - బుజ్జాయిలు ...... ఏనుగు పరిస్థితి గురించి తెలియక భలే భలే ఏనుగు అంటూ పరుగులుతీస్తున్న ఏనుగు దారిలోనే సంతోషంతో గెంతులేస్తున్నారు . పిల్లలూ పిల్లలూ ప్రక్కకు వెళ్ళండి అంటూ కేకలువేస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో , ఏనుగు వెనుకే వేగంగా పరుగులుతీస్తూ కృష్ణా ...... అంటూ కేకవేసాను . నా ప్రక్కకు రాగానే కృష్ణపైకి - కృష్ణపై సంచీలో ఉన్న ఆయుర్వేద మూలికలు అందుకుని ఏనుగుపైకి ఎగిరాను . ఏనుగు విధిల్చడంతో పట్టుతప్పి పడిపోబోయి ఆ అమ్మవారి ఆశీస్సుల వలన ఏనుగుపైకి చేరి మూలికల రసం పిండి ముందుకు వీలైనంత వొంగి రెండు కళ్ళల్లోకి చేరేలా చేసి , ఏనుగుపై వాలి తనకు తెలిసేలా స్పృశిస్తున్నాను . మూలికలు మరియు ఆప్యాయతకు ఏనుగు వెంటనే నియంత్రణలోకివచ్చి సరిగ్గా పిల్లల ముందు ఆగిపోయింది . పిల్లల తల్లిదండ్రులు పరుగునవచ్చి పిల్లలను తమ గుండెలపైకి తీసుకున్నారు - నాకు దండాలు పెడుతున్నారు , జనాలంతా చుట్టూ చేరి జయజయనాదాలు చేస్తున్నారు . ఏనుగును పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చి , అమ్మవారి దయవలన ఎవ్వరికీ ఏమీ కాలేదు అని సంతోషించి , ఏనుగుపై లేచినిలబడి అమ్మవారికి మొక్కుకున్నాను . ఒక అపాయం తప్పింది అనుకునేంతలో రాజ్యం ప్రహరీగోడను సైతం పడగొట్టి వందల్లో దున్నపోతులు - ఆవులు ....... జనాలవైపుకు మధమెక్కిన ఏనుగులానే అగ్ని గోళాలైన కళ్ళతో అడ్డుగా ఉన్న జాతర అంగళ్లను నాశనం చేసుకుంటూ జనాలవైపుకు పరుగులుతీస్తున్నాయి . వెంటనే అందరినీ తప్పుకోమని కేకలువేస్తూ కిందకుదిగాను . ఆ దున్నపోతుల వేగానికి భూతల్లి సైతం కంపిస్తోంది . జనాలంతా మరింత భయంతో కేకలువేస్తున్నారు . ఆపడానికి ఒకటీ రెండు పశువులు కాదు వందలుగా మీదకు వస్తున్నాయి . వెంటనే కృష్ణపై ఉన్న విల్లు - బాణాలను అందుకుని ఒకేసారి రెండు బాణాలను కోణంలో జాతర కోసం అమ్మవారి గుడి ముందు పెద్దమొత్తంలో ఉంచిన పసుపు కుంకుమ వైపుకు వదిలాను . దారివెంబడి కుంకుమ పసుపు దట్టంగా కమ్ముకోవడం - అమ్మవారి తిలకమైన కుంకుమ పశువుల కళ్ళల్లో పడగానే అన్నీ ఖాళీగా ఉన్న దారిలోకి మరిలాయి , చివరగా ఉన్న నాలుగైదు దున్నపోతులకు దారి స్పష్టంగా కనిపించడంతో మావైపుకు పరుగులుతీస్తున్నాయి . జనాలంతా కేకలువేస్తూ ప్రక్కకు తప్పుకున్నారు - ముసుగులో ఉన్న ఒక అమ్మాయి తప్ప ........ మహీ మహీ ....... అంటూ ప్రక్కకు జరిగిన అమ్మాయిలు కేకలువేస్తున్నప్పటికీ ఆ అమ్మాయి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నావైపుకే చూస్తున్నట్లు అనిపించింది . అంతలో దున్నపోతులు కొమ్ములు విధిలిస్తూ దగ్గరికి వచ్చెయ్యడంతో మహి మహి అంటూ అమ్మాయిలు ...... ఆ అమ్మాయి దగ్గరికి చేరుకోబోయారు . వద్దు వద్దు అంటూ చేతితో సైగలుచేస్తూ పరుగునవెళ్లి ఆ అమ్మాయి చేతిని అందుకుని నామీదకు లాక్కుని ప్రక్కకు ఎగిరాను . అదృష్టవశాత్తూ గడ్డిపై పడటంతో అమ్మాయికి ఎటువంటి దెబ్బలు తగల్లేదు . అంత జరిగినా ....... ముసుగులోపలనుండి నన్నే చూస్తున్నట్లు కదలకుండా నాపైనే ఉండిపోయింది . క్షమించండి క్షమించండి అంటూ లేవబోయినా ప్రక్కకు కదలనే కదలకపోవడం చూసి ఆశ్చర్యపోయాను . మహీ మహీ ...... అంటూ అమ్మాయిలు వచ్చి దెబ్బలేమీ తగల్లేదు కదా అంటూ లేపారు . లేపమని అన్నానా అంటూ చుట్టూ అమ్మాయిలను కొట్టడం చూసి నవ్వుకున్నాను .
08-07-2022, 10:08 AM
దారి మరలిన వందల దున్నపోతులు దూలాలతో నిర్మించిన కంచెను సైతం పడగొట్టి దూసుకుపోతున్నాయి .
పశువులన్నీ లోయవైపుకు వెళ్లిపోతున్నాయి ఎవరైనా కాపాడండి అంటూ కేకలువినిపిస్తున్నాయి . వెంటనే విల్లుని వెనుకవేసుకుని జాగ్రత్త అంటూ అమ్మాయి చేతిలోని ఎర్రని గుడ్డను అందుకుని కృష్ణా అంటూ ఎగిరి దున్నపోతులవైపుకు వేగంగా వెళ్ళాను - నావెనుకే జనమంతా పరుగులుతీశారు . పశువులు లోయవైపుకు వెళ్లకుండా బాణాలు వేస్తున్నా ప్రయోజనం లేకపోయింది . రాత్రిపూట జనాలకు అపాయమైన లోయ ఉందని తెలుసుకోవడానికి రగిలించిన అగ్నిగోళంలో గుడ్డకు అంటించుకుని , కృష్ణా ఊ ...... అంటూ దున్నపోతులకంటే ముందుకు వేగంగా వెళ్లి లోయ వెంబడి పెరిగిన గడ్డిని అంటించడం - మధమెక్కిన దున్నపోతులకు దిసానిర్ధేశం చేస్తున్న దున్నపోతు అగ్నిని చూయించడంతో మరొకవైపుకు తరిలాయి - లోయ వెంబడే కిందకు తీసుకెళ్లి లోయలో ప్రాహిస్తున్న నదీ ప్రవాహంలోకి చేర్చడంతో శాంతించాయి . అధిచూసిన జనాలంతా పైనుండి జయజయనాదాలు చేస్తున్నారు . సంతోషంతో కేకలువేస్తూ కిందకువస్తున్నారు . కృష్ణా ...... సాధించాము సాధించాము అంటూ ముద్దుపెట్టాను . అవునూ ...... మన పని పూర్తయ్యేంతవరకూ ఎవరి దృష్టిలో పడకూడదు ఇక్కడికి ఆ రాజ్యం దగ్గరే కదా అనుకుని ప్రవాహం దాటుకుని అటువైపు అరణ్యంలోకి వెళ్లిపోయాము . ( జనాలతోపాటు లోయ దగ్గరికి చేరుకున్న ఆ అమ్మాయి , నేను వెళ్లిపోవడం చూసి తన స్నేహితుల గుండెలపైకి చేరింది . మహీ ...... ఎలాంటి బహుమతి ఆశించని వీరాధివీరుడు అంటూ ఓదార్చారు - మహీ ...... అందరూ నీకోసమే వస్తున్నారు పదా వెళదాము అంటూ తీసుకెళ్లారు . ఆ అమ్మాయి మాత్రం పదే పదే వెనక్కు చూస్తూనే వెళ్ళింది ) . చీకటి పడేంతవరకూ అరణ్యంలోనే సేదతీరాము - వొళ్ళంతా ఏదో తెలియని మాధుర్యం నాపెదాలపై తియ్యదనాన్ని కలిగిస్తోంది . సమయం వేగంగా గడిచిపోయింది - కృష్ణ అయితే నావైపు కాస్త తేడాతో చూస్తున్నాడు . అవును నిజమే వొళ్ళంతా వేడిగా ఉంది . క్షణక్షణానికీ పెరుగుతూనే ఉండటంతో చల్లని కొలనులోకి చేరి వేడిని చల్లార్చుకున్నాను కానీ కలుగుతున్న మాధుర్యానికి ఆనందం రెట్టింపవుతూనే ఉంది , నీళ్ళల్లోనుండి బయటకురాగానే మళ్లీ వేడి ..... ప్చ్ ఏమైందో ఏమో ....... కృష్ణమాత్రం అధోవిధంగా నావైపు చూస్తున్నాడు . బట్టలు మార్చుకుని , నన్ను గుర్తుపట్టకుండా తలపై ముసుగు మరియు కృష్ణను గుర్తుపట్టకుండా కొన్ని మార్పులు చేసుకుని , ప్రవాహం గుండా అమ్మవారి జాతరకు చేరుకున్నాము . మధ్యాహ్నం బామ్మ చెప్పినట్లు ఇసుకేస్తే రాలనంత జనంతో జాతర అంగరంగవైభవంతో జరుగుతోంది - జనాలంతా నా వీరత్వం గురించే గొప్పలు గొప్పలుగా చెప్పుకుంటున్నారు . కృష్ణ ఆనందాలకైతే అవధులులేవు . జనాలతోపాటు గుడిలోపలికివెళ్లి అద్భుతంగా అలంకరించిన అమ్మవారి దర్శనం చేసుకుని బయటకువచ్చాను . ఈసారి మొత్తం ప్రసాదాన్ని కృష్ణకే తినిపించాను , నా కళ్ళు - మనసు మాత్రం ఎవరికోసమో ఆశగా వెతకడం నాకే ఆశ్చర్యం వేసింది . మరింత ఆశ్చర్యం ....... ఎదురుగా నన్నుకూడా రెండు కళ్ళు జాతర మొత్తం వెతుకుతున్నాయి . మధ్యాహ్నం రక్షించిన అమ్మాయి ముఖంపై ముసుగుతో చుట్టూ అమ్మాయిలతో నాకంటే ఘాడంగా నాకోసం వెతుకుతున్నట్లు తెలిసిపోతోంది . ఆ క్షణం కలిగిన ఆనందం ...... ఆఅహ్హ్హ్ ...... తాళపత్ర గ్రంథాలలో వివరించిన స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇదేనేమో అనిపించి పులకించిపోతున్నాను - వొళ్ళంతా వేడి తాపాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి . కృష్ణ ....... ఆమె వైపుకు నన్ను తోసాడు - నాకు తెలియకుండానే అడుగులు అమ్మాయివైపుకు కదులుతున్నాయి . ఒక్కసారిగా జాతరలో తప్పెట్లు మ్రోగడంతో అమ్మాయి మైకం నుండి స్పృహలోకొచ్చాను . లేదు లేదు మన గమ్యం వేరు కృష్ణా ...... అంటూ అమ్మాయివైపు చూస్తూనే వెనక్కు అడుగులువేశాను , కృష్ణా ...... మన ఇద్దరినీ ఓకదగ్గర చూశారంటే కనిపెట్టేస్తారు నేను ఇటు - నువ్వు అటు అన్నాను . కృష్ణకు కోపం వచ్చినట్లు నన్ను తోసేసి వెళ్ళిపోయాడు . ఆ అమ్మాయినుండి అడుగులు మాత్రం దూరంగా పడటం లేదు , నేను వద్దంటున్నా మనసు - కళ్ళు మాత్రం వెనుకే వెళ్ళమని గోల చేస్తున్నాయి , అడుగులు కూడా ఆమె వెనుకే పడుతున్నాయి . జాతర మొత్తం నాగురించే వెతకడం - వాళ్ళ స్నేహితులతో నాగురించే మాట్లాడుతూ కనిపించకపోయేసరికి బాధపడుతుండటం చూస్తూ పొందిన ఆనందం ఇంతవరకూ కలగని మధురానిభూతిని కలిగిస్తోంది . ఒప్పు - తప్పు అన్న భావనాలతో సతమతమైపోతున్నాను , చివరికి తప్పుగానే నిర్ణయించుకుని కష్టమైనా దూరంగా వచ్చేసాను - ఆమె మాత్రం ఆపకుండా మళ్లీ మళ్లీ తిరుగుతూ వెతుకుతూనే ఉంది . జాతర పూర్తయ్యేంతవరకూ ఉండి అందరితోపాటు జాతరలో వడ్డించిన ఆహారం స్వీకరించి , వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే ( అందరూ వెళ్లిపోతున్నా ఆ అమ్మాయిమాత్రం బాధతో ఆశతో ఇంకా వెతుతూనే ఉండటం ) భారమైన హృదయంతో వచ్చేసాను . నేను చేసినది ఏమాత్రం ఇష్టం లేనట్లు కృష్ణ అలకతో ముందు ముందుకు వెళ్ళిపోతున్నాడు . పరుగున ప్రక్కకువెళ్లి , నీకే అలా ఉంటే నాకింకెలా ఉంటుందో అర్థం చేసుకో కృష్ణా ...... , ఆ అమ్మాయి నుండి దూరంగా వెళుతున్నకొద్దీ లోలోపల ఎంత బాధపడ్డానో ....... , గురువుగారి కోరిక తీర్చడమే మన ఏకైక కర్తవ్యం నన్ను మన్నించు అంటూ మధ్యాహ్నం సేదతీరిన ప్రదేశానికి చేరుకుని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చల్లని నీళ్ళల్లోకి చేరిపోయాను . ఇంతటి మధురమైన విరహతాపం ఉంచుకుని చాలాపెద్ద తప్పు చేస్తున్నావు అంటూ కృష్ణ నావైపే చూస్తున్నాడు . నావల్ల కూడా కావడం లేదు కృష్ణా ...... , కళ్ళు - మనసు నిండా ఆమెనే అందుకే గంగమ్మ ఒడిలోకి చేరాను - అమ్మకూడా నీలానే గుర్రుగా ఉన్నట్లున్నారు - తాపం చల్లార్చడం లేదు , నేనే తప్పుచేస్తున్నానా ...... ? లేదు లేదు నాకు గురువుగారి మాటే ముఖ్యం - అమ్మా మన్నించు అంటూ తనివితీరా అమ్మ ఒడిలో సేదతీరి అలసిపోయినట్లు కృష్ణపై తలవాల్చి కళ్ళు మూసుకున్నాను . కళ్ళు మూసినా తెరిచినా కనులముందు ఆ అమ్మాయి ....... వొళ్ళంతా వేడి సెగలు , ఏమైందిరా నీకు ...... ఒక్కసారి స్పర్శకే ఇలా అయిపోతే ఎలా ...... మరి జీవితంలో తొలిసారి అమ్మాయి స్పర్శ ...... , " మహీ " ...... ఆఅహ్హ్హ్ పేరు తలుచుకుంటేనే పెదాలపై అందమైన నవ్వులు - వొళ్ళంతా తియ్యదనం . తప్పు తప్పు పరాయి అమ్మాయిని కలవరించడం - పేరుతో పిలవడం ....... అయినా ఆ పేరులో " మహి " ఆఅహ్హ్ ...... ఏదో మాయ ఉంది . " మహేష్ - మహి " ...... అంటూ నా మనసులోనుండి వచ్చిందా లేక అరణ్యం నుండి వినిపించిందా అన్నట్లు ఆశ్చర్యంతో లేచి చూసాను . అక్కడక్కడ కిలకిలారావాలు తప్ప అరణ్యం నిర్మానుష్యంగా అనిపించింది - ఆ పిలుపుకే వొళ్ళంతా తియ్యనైన జలదరింపులు మరొకవైపు వేడిసెగలు ....... ఆ వేడిసెగలు ...... కృష్ణను తాకినట్లు నన్ను తోసేసి దూరంగా వెళ్లి వాలిపోయింది . నవ్వుకుని ఇక నావల్ల కూడా కాక గంగమ్మ ఒడిలోకి చేరిపోయాను . ఆఅహ్హ్ ...... చల్లగా హాయిగా ఉంది - పద్దెనిమిదేళ్ల తరువాత మొదటిసారి అమ్మాయి స్పర్శ కదా విలవిలలాడిపోతున్నాను , అమ్మా ...... మీకు అభ్యంతరం లేకుంటే ఈ పూటకు మీ ఒడిలోనే విశ్రమిస్తాను . అమ్మకు అంతకంటే ఆనందమా అన్నట్లు నాపైకి అలలు ఎగిసాయి . మా గంగమ్మకు ...... నేనంటే చాలా ఇష్టం అంటూ నీటి ఉపరితలంపై తేలుతూ నిద్రపోయాను . ఒకవైపు మహి వలన తియ్యనైన వేడిసెగలు - ఆ వెంటనే అమ్మ చల్లదనం ....... నిద్రలోనే చిరునవ్వులు చిందిస్తూ హాయిగా నిద్రపోయాను . |
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 359 Guest(s)