Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
#41
(12-04-2022, 05:56 PM)Takulsajal Wrote: ఎపిసోడ్ ~ 2

బైట జరిగిన సంఘటనకి పెద్ద పెద్ద ఊరుముల శెబ్దానికి, లోపల ఉన్న రాధా అరుపులు ఎవ్వరికి వినిపించలేదు, బోరుమంటూ ఏడుస్తున్న పెద్దావిడ రాధకి చెపుదామని లోపలికి వచ్చి రాధా ఉన్న స్థితికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది... బిడ్డ సగం బైటకి వచ్చి ఓపిక లేక స్పృహ కోల్పోయి పడి ఉంది, తన పెద్దరికాన్ని ఉపయోగించి రాధా అవసరం లేకుండానే చిన్నగా వీలు చిక్కించుకుని బిడ్డని బైటికి లాగేసింది.

గుక్క పెట్టి ఏడుస్తున్న మగ బిడ్డని చూసి ఏడుస్తూ "ఏం అయ్యా పుడుతూనే మీ అయ్యని మింగేసినావ?" బిడ్డని రాధ పక్కన పండేసి "దేవుడా చిన్న వయసులో ఈ తల్లికి ఆ పసిబిడ్డకి ఎన్ని కష్టాలు ఇచ్చినావు తండ్రి" అని కళ్లెమ్మటనీళ్లతో బైటికి వెళ్లి విషయాన్నీ రోడ్ మీద ప్రసాద్ మృతదేహన్ని పరిశీలిస్తున్న వాళ్ళకి చెప్పింది అక్కడున్న నలుగురు ఆడవాళ్లు లోపలికి వెళ్ళగా మిగతా వారు అంబులెన్సు కి ఫోన్ చేసారు.

రాధని చూడటానికి వచ్చిన వాళ్లలో నర్స్ ఉండటంతో చెయ్యాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేసింది, ఈలోగా అంబులెన్సు వచ్చి శవం రోడ్ పక్కన పడి ఉండటం మొహం కూడా గుర్తుపట్టలేకుండా ఉండటంతో బాడీని ఎక్కించుకుని వెళ్లిపోయారు.

రాధకి స్పృహ వచ్చింది, చుట్టు పక్కన ఎవరు లేరు పక్కన ఉన్న పెద్దావిడ రాధ లేచిందని గమనించి ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది, అంతా విన్న రాధకి మళ్ళీ కళ్ళు తిరిగినట్టనిపించింది లేద్దాం అంటే ఒళ్ళు సహకరించట్లేదు, పక్కనే ఉన్న బిడ్డని చూసుకుంది కానీ దెగ్గరికి తీసుకోలేదు. ప్రసాద్ ని ఆఖరి చూపు కూడా చూసుకోలేక పోయానని అలా రాత్రంతా ఏడుస్తూనే ఉంది.

పొద్దున్నే లేచింది పెద్దావిడ సాయంతో చేతిలో బిడ్డని ఎత్తుకుని సచివాలయానికి వెళ్లి అస్థికలు తీస్కుని చెయ్యాల్సిన కార్యక్రమం చేసి ఇంటికి వచ్చి కింద కూలబడిపోయింది, చేతిలో బిడ్డని చూస్తూ.

ఇప్పుడు బిడ్డ మీద ప్రేమ చూపించడం తనకి అంత ముఖ్యమనిపించలేదు ముందు బతకడానికి ఎలా అనే ఆలోచనలో పడిపోయింది అది అప్పుడే పుట్టిన బాబు తో.....పదిహేను రోజుల్లో ప్రసాద్ కి సంబంధించిన LIC డబ్బులు వచ్చాయి, రాత్రంతా కూర్చుని లెక్కేసింది ఈ డబ్బులు జాగ్రత్తగా వాడితే మూడు నాలుగు సంవత్సరాలు సరిపోతాయ్, తరువాత చేసుకోడానికి జాబ్ చూసుకుందాం అని అనుకుంది.

అక్కడ నుంచి ఇల్లు మార్చింది, ఒక్కడినే పిల్లాడితో వేగలేవు అని పెద్దావిడ చెప్పినా వినిపించుకోలేదు, తన ఒంటరి జీవితాన్ని బాగానే నెడుతుంది కానీ బిడ్డని ప్రేమగా చూసుకోడంలో విఫలమైంది, బిడ్డకి నిద్ర, కడుపు నిండా పాలు అందాయే కానీ తల్లి ప్రేమ దొరకలేదు, ఎప్పుడు కోపంగా ఉండేది దానికి తోడు చిన్న పిల్లల తో అంత ఈజీ కాదు కదా, ఆకలేసిన ఏడుస్తారు, నిద్ర వోచిన ఏడుస్తారు అది తప్ప ఏం తెలుసు ఆ పసికందుకి...బిడ్డ ఏడుపుని సహించలేకపోయేది చిరాకు కోపం ఎక్కువ వచ్చేసేవి. ఎప్పుడైనా బిడ్డ ఏడుస్తే అప్పుడప్పుడు తన వల్ల కాక అలానే పట్టించుకోనట్టు కూర్చునేది.

స్నానం చేపించడం, పాలు ఇవ్వడం, నిద్రపుచ్చేది కూడా కాదు బిడ్డకి ఏడుపొచ్చి  ఏడ్చి ఏడ్చి అలిసిపోయి నిద్ర పొడమే.. బిడ్డ క్రమంగా పిల్లాడిగా మారాడు ఇక తాను జాబ్ చూసుకోవాలనుకుంది పక్కనే ఉన్న కాలేజ్ లో టీచర్ గా జాయిన్ అయింది. పిల్లాడికి కావాల్సిన తిండి, పాలు పక్కన పెట్టి ఇంటి కిటికీ కి చీరతో కట్టేసి ఇంట్లోనే వదిలేసి కాలేజ్కి వెళ్లిపోయేది, సాయంత్రం రాగానే కట్టు విప్పేది, పిల్లడు అక్కడే తిని అక్కడే ఏరిగేవాడు, ముడ్డి కూడా రాధ ఇంటికి వచ్చాకే కడిగేది, ఇద్దరు రోబోట్స్ లాగే ఉండేవారు పిల్లాడు కూడా తల్లి దెగ్గరికి వెళ్ళడానికి భయపడేవాడు....ఇలా వాళ్ళ ఇద్దరి జీవితాలు సాగిపోతుండగా... పిల్లాడిని కాలేజ్ లో జాయిన్ చేయించాల్సొచింది.

ఎలాగో రాధ కాలేజ్ లో పనిచేస్తుండడం వల్ల తన కొడుకు కి ఫీజు లేకుండా జాయిన్ చేసుకున్నారు, హమ్మయ్య అనుకుంది, కాలేజ్ రిజిస్టర్ లో రుద్ర అని పేరు రాపించి నర్సరీ లో వదిలేసింది.

హాయ్ రాధా మేడం తనేనా మీ బాబు హౌ క్యూట్ కం హియర్ వాట్ ఈస్ యువర్ నేమ్?

ఏంటి బాబు ఏం మాట్లాడడా?

రాధా : కొంచెం సైలెంట్ గా ఉంటాడు.

నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి.

బిక్కు బిక్కు మంటూ చుట్టూ చూసాను లోపల భయంగా ఉంది... ఎప్పుడు ఇంతవరకు బైట వాళ్ళతో మాట్లాడింది లేదు, అస్సలు ఇంట్లో ఉన్న అమ్మ తోనే మాట్లాడను ఇక బైట వాళ్ళు చాలా దూరం.

అమ్మ వెళ్ళిపోతుంది నాకు అంతగా భయం వెయ్యలేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఒంటరే, అది నాకు అర్ధంకాకపోయినా నా మనసుకి తెలుసనుకుంటా, టీచర్ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది.... వెళ్లిపోతున్న అమ్మని చూసాను వెనక్కి చూస్తుందేమో అని కానీ చూడలేదు చూడదు అని నాకు తెలుసు.

నా బుడ్డ బ్యాగ్ వేసుకుని లోపలికి వెళ్లి బెంచ్ లో కూర్చున్నాను, టీచర్ అందరికి నా పేరు రుద్ర అని పరిచయం చేసింది, మొదటి సారి నా పేరుని నేను వినడం.... మధ్యాహ్నం లంచ్ బెల్ లో అమ్మ వచ్చి టిఫిన్ బాక్స్ అందించింది, బాక్స్ మూత తీసి స్పూన్ వేసి నాకు తినిపించాలనిపించిందేమో కానీ నాకు ఆ అలవాటు లేదు కదా తన చేతిలో బాక్స్ తీసుకుని టక టక తినేసాను... అవును నాకు తినిపించమని గోల చెయ్యడం, మారం చేయడం, ఏడవటం ఇవేమి నాకు పరిచయం లేని పనులు మధ్యలో అమ్మ రుద్ర అని పిలిచింది కానీ నేను పలకలేదు అది నా పేరని నాకు తెలియదు. నా పేరు రుద్ర అని నాకు అర్ధమవటానికి ఒక నెల రోజులు పట్టింది, రుద్ర అనే పేరు నాదే అని నాకు అనిపించడానికి.

అలా మాములు మనిషిలా కాకుండా ఒక వింత ఎలియన్ లా గడుపుతూనే ఐదవ తరగతి వరకు వచ్చాను, అందరు నన్ను చూసి నవ్వుకునే వాళ్ళు కొంతమంది జాలి పడేవాళ్ళు ఇంకొంతమంది రాధా టీచర్ కొడుకునని భయపడేవారు, నేను కూడా ఎప్పుడు ఎవ్వరిని పట్టించుకునే వాళ్ళని కాదు నా లోకం నాదే.. ఒంటరిగా ఉండి ఉండి అలవాటు అయింది.

ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లలని ఎత్తుకొడం, మారం చేయడం చూస్తే నవ్వొచ్చేది నాకు కానీ లోపల ఎలాగో ఉండేది బాధ అంటే అదేనా? ఏమో...

అందరూ నన్ను వింతగా చూసే వాళ్ళు టీచర్స్ తో సహా ఎందుకంటే చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఒక జట్టుగా ఒక తోడుగా ఉండేవాళ్ళు..ఇంకోటి ఏంటంటే నా మొహం అందులో ఏ ఫీలింగ్స్ ఉండవు అవును నాకు బాధ, భయం, కోపం, ఏడుపు అవతల వాళ్ళని ఇష్టపడడం, కలుపుకుపోడం ఇవేమి తెలియవు, ఎందుకు అవసరమో కూడా నాకు తెలియవు.

రేపటి నుంచి ఫిఫ్త్ క్లాస్ అమ్మ కూడా నాకు క్లాస్సేస్ చెప్పడానికి వస్తుందని విన్నాను, పొద్దున్నే స్నానం చేయడానికి బాత్రూం లోకి వెళ్ళాను, ఇంతకముందు అమ్మ చేపించేది కానీ తను నా దెగ్గరికి వచ్చేకోద్ది నాకు భయం ఇంకేదో బాధ వచ్చేవి అది నాకు నచ్చేది కాదు అందుకే ఒక రోజు నేనే చేస్తానని చెప్పాను తను కూడా ఏమనలేదు, సాధ్యమైనంత వరకు తనకి దూరం గానే బతికేవాడ్ని, ఇంతకముందు ఒకటే రూమ్ లో ఉండే వాళ్ళం కానీ ఇప్పుడు ఇది పెద్ద ఇల్లు రెంటే కానీ బాగుంది అమ్మ స్కూటీ కూడా కొనుక్కుంది, స్కూటీ కొన్న సాయంత్రం అడిగింది వస్తావా బైటికి వెళదాం అని కానీ స్కూటీ ని తీక్షణంగా చూసి లోపలికి వెళ్ళిపోయాను, వెనక ఏదో సౌండ్ వచ్చింది నేను పట్టించుకోలేదు.

ఇవన్నీ గుర్తుచేసుకుంటూ స్నానికి వెళ్ళాను, వాటర్ హీటర్ ప్లగ్ లో నుంచి తీసి బకెట్ తీసుకుని బాత్రూం లోకి వెళ్ళాను, ఈ బకెట్ మోస్తునప్పుడల్లా నాకు ఒక డౌట్ అది డౌట్ కూడా కాదు ఎలా అంటే మా క్లాస్ లో బెంచ్ జరపాలంటేనె నలుగురు పడతారు కానీ నేను నా బొటన వేలితో దానితో ఆడుకోగలను.

ఎన్నో సార్లు మా అమ్మ స్కూటీని గేట్ కి అడ్డంగా పార్క్ చేస్తే సైడ్ లాక్ ఉన్న కూడా ఒంటి చేత్తో పక్కకి జరిపేవాడ్ని, నేను చేసే చాలా విషయాలు నా తోటి పిల్లలు చేయలేకపోడం నాకు వింతగా అనిపించేది.

అందుకే నేను వాళ్ళలా నటించడం మొదలు పెట్టాను, మార్కులు ఎక్కువ వచ్చినా ఏదైనా స్పోర్ట్స్ లో ఫస్ట్ వచ్చిన అందరి చూపు నా మీద పడుతుంది అందుకే నటించడం మొదలు పెట్టాను ఎగ్జామ్స్ లో అన్ని రాసి కావాలని ఒక మూడు నాలుగు ప్రశ్నలు వదిలేసేవాడిని, ఎవరైనా ఏదైనా సహాయానికి పిలిచినప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారో నా వయసు వాళ్ళు ఏ పని చేస్తున్నారో అది మాత్రమే చేసేవాడ్ని, ఇక ఆటల్లో కూడా గెలిచే సమయాల్లో ఏదో ఒకటి చేసి ఓడిపోవడం అంటే నాకు సరదా చూసే వాళ్ళకి బాగోదు కానీ నాకు అది నచ్చింది.

అన్ని తలుచుకుంటూ స్నానం చేసి యూనిఫామ్ వేసుకుని రెడీ అయ్యి నా రూమ్ నుంచి బైటికి వచ్చాను అమ్మ సోఫా లో కూర్చుని టిఫిన్ తింటుంది, కిచెన్ లోకి వెళ్లి అక్కడే తినేసి బైటికి వచ్చి బ్యాగ్ వేసుకున్నాను.

అమ్మ ఇంటి లాక్ గేట్ లాక్ వేసి స్కూటీ స్టార్ట్ చేసింది, ఎప్పటి లానే తనని తగలకుండా వెనక్కి జరిగి బ్యాగ్ మధ్యలో పెట్టి కూర్చున్నాను.

కాలేజ్ కి వెళ్ళాం అమ్మ స్కూటీ పార్క్ చేసి వెనక్కి తిరిగింది నాతో ఏదో మాట్లాడానికి అన్నట్టు కానీ నేను సైలెంట్ గా క్లాస్ లోకి వెళ్ళిపోయాను.

క్లాస్ లోకి వెళ్లి కూర్చుకున్నాను పాత మొహాలతో పాటు కొన్ని కొత్త మొహాలు కూడా కనిపించాయి వెళ్లి ఎప్పటిలానే చివరి బెంచ్ లో కూర్చున్నాను.

ఇంకొంత మంది కొత్త స్టూడెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ క్లాస్ లో వదిలి వాళ్ళకి ముద్దులు పెడుతున్నారు నాకు అది చూడాలనిపించింది, లోపల నా గుండెని ఎవరో చెక్కిలిగింతలు పీటినట్టనిపించింది.

కొంచెం సేపటికి ప్రేయర్ అయిపోయాక అందరం క్లాస్ కి వెళ్ళాం, అమ్మ లోపలికి వచ్చింది.

రాధ : హాయ్ స్టూడెంట్స్ మీలో చాలా మందికి నేను తెలుసు నా పేరు రాధ ఇవ్వాల్టి నుంచి నేనే మీ క్లాస్ టీచర్ ని, ఇంకా మీ మాథ్స్ టీచర్ ని.

అందరి అటెండెన్స్ తీస్కుంటూ రుద్ర అని నా వైపు చూసింది ప్రెసెంట్ మేడం అన్నాను తనని చూడకుండానే....కానీ ఎందుకో చూడాలనిపించి చూసాను నన్నే కోపంగా చూస్తుంది వెనక బెంచ్ లో కూర్చున్నా అనేమో...

అటెండెన్స్ అయిపోయాక రాధ అందరిని చూస్తూ : స్టూడెంట్స్ ఫస్ట్ డే క్లాస్ చెప్పను లే కానీ ఒకొక్కరు మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి అని చైర్ లో కూర్చుంది.

అందరూ వరసగా నిల్చొని ఒక్కొక్కరి పేర్లు వాళ్ల గురించి చెప్తున్నారు, ఒక పావుగంట తరువాత నా చెవులకి "ఐయామ్ రాజేశ్వరి, ఫ్రెండ్స్ కాల్ మీ రాజి " అని వినపడింది.. అదొక్కటే ఎందుకు వినపడిందంటే రాజి అనే అమ్మాయి నేను నర్సరీ లో ఉన్నప్పటినుంచి ఉంది తనతో నాకొచ్చిన గొడవ ఏంటంటే ఈ అమ్మాయి నన్ను చూస్తూనే ఉంటుంది ఆ విషయం నాకు తెలుసని తనకి తెలియదు, ఒక వేళ నాకు తెలుసని తనకి అనిపిస్తే వచ్చి నాతో మాట్లాడుతుందని నా భయం, అందుకే తనని నేను చూడను తను నా వైపు చూస్తుందని తెలిసిన నాకు తెలియనట్టే ప్రవర్తిస్తుంటాను, అది కాకా రాజి ఈ మధ్యనే హాస్టల్ లో జాయిన్ అయింది అని నాకు తెలుసు ఇంకా షార్ప్ గా ఆక్టివ్ గా ఉంటుంది నేను అందరిలా కాను అని తనకి తెలియకుండా ఉండటానికి ఎక్కువ కష్టపడాల్సొస్తుంది మరి ఎప్పుడు నన్నే చూస్తుంటుంది ఈ అమ్మాయి.

చివరిగా నా వంతు వచ్చింది లేచి నిల్చున్నాను అందరు ఒకసారి నవ్వారు అవును మరి నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో మా క్లాస్ వాళ్ళకి తెలుసు కదా...

"మై నేమ్ ఈస్ రుద్ర
ఐయామ్ టెన్ ఇయర్స్ ఓల్డ్
మై మదర్ నేమ్ ఈస్ రాధ".

ఇక చెప్పడం నాకు ఇష్టం లేక కూర్చున్నాను.

రాధా : రుద్ర స్టాండ్ అప్

లేచి నిల్చున్నాను.

రాధ : టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ యువర్ హాబీస్, ఫేవరెట్స్..

రుద్ర : ఐ హావ్ నో హాబీస్ నో ఫేవరెట్స్, ఐ హావ్ నో ఫ్రెండ్స్ నొథింగ్ ఐయామ్ అల్ అలొన్ అండ్ ఐ లవ్ ఇట్. అని కూర్చున్నాను.

రాధ కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యి ఏం మాట్లాడకుండా కూర్చుంది.

అలా కాలేజ్ అయిపోగానే బ్యాగ్ తీసుకుని బైటికి వస్తుంటే నా ముందు ఉన్న ఒకడు నన్ను చూపిస్తూ నవ్వుతు ఏదో చెప్తున్నాడు మిగతా వాళ్ళు అది విని నన్ను చూస్తూ నవ్వుతున్నారు, నాకు అది నచ్చలేదు ఇప్పుడే కాదు నా ఇంతక ముందు తరగతుల నుంచి జరుగుతుందే ఇది కానీ నాకు ఈసారి సైలెంట్ గా ఉండబుద్ది కాలేదు వెళుతు వెళుతు వాడి సైకిల్ వెనక టైర్ మీద నా షూ తో తొక్కాను కొంచెం సౌండ్ వచ్చింది కానీ ఎవ్వరు చూడలేదు ట్యూబ్ పగిలి ఉండాలి, సైలెంట్ గా వెళ్లి అమ్మ బైక్ ఎక్కి కూర్చున్నాను.

వెళ్లి ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి బైటకి వచ్చాను, నాకు ఆకలేస్తేనో దాహం వేస్తేనో తప్ప రూమ్ నుంచి బైటికి రాను.

నేను వెళ్లి తినేసి నా రూమ్ కి వెళ్ళిపోయాను, చీకటి పడుతుండగా అమ్మ సామాను తీస్కుని ఇంటికి వచ్చింది, నేను బైటికి రాలేదు, కొంచెం సేపటికి అమ్మ నా రూంకి వచ్చింది.

రాధ : రుద్ర తిన్నావా?

రుద్ర : తిన్నాను.

రాధా : హోమ్ వర్క్.

రుద్ర : చేసుకున్నాను.

రాధా : ఇంకేమైనా కావాలా?

రుద్ర : తన వైపు చూడనుకూడా చూడలేదు, కొంచెం సేపు చూసి కోపంగా వెళ్లిపోయింది.

ఇవి నాకు కొత్తేం కాదు, తనకి ఎందుకు కోపం వచ్చిందో నాకేం తెలుసు ఇలాంటి సంఘటనలేవి నన్ను ఇబ్బంది పెట్టవు, ప్రశాంతం గా కళ్ళు మూసుకున్నాను పడుకోడానికి.

అవును నాకు తెలిసిన ప్రశాంతత ఇదే కానీ కళ్ళు మూసుకుంటే నిద్ర రాదు, ఎందుకో నాకు తెలీదు, మా అమ్మకి నేనంటే ఎందుకు ఇష్టం లేదో కూడా నాకు తెలీదు ఏది ఏమైనా దూరమేదో దెగ్గరేదో ఎవరికీ తెలుసు, ఇక మా నాన్న తను ఎప్పుడు చెప్పలేదు నేను అడగలేదు మొదట్లో అమ్మంటే భయం ఉండేది అందుకని దెగ్గరికి వెళ్లలేకపోయేవాడ్ని ఆ తరువాత అవసరం లేకపోయింది అది కాక తను నాకోసం ఎప్పుడు ఎదురు చూసింది లేదు, నా అవసరాలని తీరుస్తుంది అంతే తప్పించి ఎప్పుడు ఐదు నిముషాలు కూడా తను నాతో మాట్లాడింది లేదు, ఇప్పుడు నేను మాట్లాడట్లేదు.

నీళ్లు తాగుదామని చూస్తే బాటిల్ కాళీగా ఉంది నింపుకుందామని బైటికి వెళ్ళాను హాల్లో సోఫా లో కూర్చుని ఎవరితోటో ఫోన్ లో నవ్వుతు మాట్లాడుతుంది, ఇది కూడా నాకు కొత్తేం కాదు గత ఆరు నెలలుగా రోజు రాత్రి ఇదే జరుగుతుంది.

నన్ను చూసి నవ్వుతున్న తన మొహం ఆగిపోయింది నా వల్ల తనకెందుకు ఇబ్బంది అని నేను ఫాస్ట్ గా లోపలికి వచ్చేసాను బెడ్ ఎక్కి కళ్ళు మూసుకున్నాను ఎలాగో నిద్ర రాదూ అని నాకు తెలుసు.

ఇంటి పక్కనే లైబ్రరీ ఒకటి కట్టారు కొత్తగా ఓపెన్ అయింది ఒక సారి వెళ్లి చూసి రావాలనుకున్నాను.

కళ్ళు మూసుకున్నాను కానీ మా అమ్మ నవ్వులు నాకు వినపడుతూనే ఉన్నాయి నేను కూడా అలా నవ్వగలనా అని అనుకున్నాను ఎంత ప్రయత్నించినా నా మొహం లో నవ్వెందుకు రాదో నాకు అర్ధం కాదు, అందరిలా నేను కూడా నవ్వగలనా అని నాకే సందేహంగా ఉండేది.... ఇలా నా బుర్ర అలిసి పోయి దానంతటా అది నిద్ర పోయే వరకు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను.....

Movie Chustunna feeling vachindi. So excited for future updates
[+] 6 users Like lovelyrao's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Nice update...

Cheeta 
Like Reply
#43
Chala baga rasaru sir keep going sir
Like Reply
#44
Story verity ga undi update estuvundandi
[+] 2 users Like Chinna 9993's post
Like Reply
#45
ఎపిసోడ్ ~ 3



పొద్దున్నే లేచి బైటికి వచ్చాను అమ్మ సోఫా లోనే పడుకుని ఉంది, బైటికి వెళ్లి మెట్ల మీద నిల్చుని కొంచెం సేపు ఆకాశం లోకి చూసాను ఎవరో కనిపించినట్టనిపించింది మళ్ళీ చూసాను కానీ ఈ సారి మామూలుగానే ఉంది.

కిందకి వచ్చి కాలేజ్ టైం అవ్వడంతో టీవీ ఆన్ చేసి సౌండ్ ఎక్కువగా పెట్టి లోపలికి వెళ్ళాను మరి అమ్మని ఎలా లేపాలో నాకు ఇంకో ఆలోచన రాలేదు.

రెడీ అయ్యి బైటికి వచ్చేసరికి అమ్మ చీర కట్టుకుని బైటికి వచ్చింది ఎందుకో తనని చూడాలనిపించింది కానీ తల దించుకునే టిఫిన్ చేశాను, ప్లేట్ తీస్కుని కిచెన్ లోకి వెళ్లే అయిదు సెకండ్స్ ఆ గ్యాప్ లో చూసి మళ్ళీ వెంటనే తల దించేసాను.

నేను తింటుంటే నా ఎదురుగా వచ్చి నిల్చుంది, తల ఎత్తి చూసాను నాకు హ్యాపీ బర్తడే విషెస్ చెప్పింది, ఏంటో ఇన్ని సంవత్సరాలకి నాకు ఈ బోనస్సులు ఇవ్వాళ నా బర్తడే అంట నాకు ఈరోజే తెలిసింది ఆ విషయం , నేను నవ్వుకున్నాను కానీ ఏమి మాట్లాడలేదు, రెండు నిముషాలు చూసి కోపంగా వెళ్ళిపోయింది.

టిఫిన్ ప్లేట్ పట్టుకుని ఆలోచిస్తున్నాను నాతో అస్సలు ప్రేమగా ఆప్యాయంగా ఉండని నా తల్లి మధ్యలో అప్పుడప్పుడు ఎందుకు నాతో మాట్లాడాలని నా దెగ్గరికి వస్తుందో నాకు అర్ధం కావట్లేదు.

ఇంటి ముందు బైక్ హార్న్ విని చక చక బైటికి వచ్చి బైక్ ఎక్కాను.....

మొదటి క్లాస్ అమ్మదే మాథ్స్ క్లాస్ నాకు ఇష్టమైన సబ్జెక్టు వెళ్లి వెనకాలే కూర్చున్నాను, చాలా బాగా చెప్పింది....మధ్యలో అందరిని ఉద్దేశిస్తూ ఇవ్వాళ బర్తడే ఉన్న వాళ్ళు ప్లీజ్ స్టాండప్ అంది.

ముగ్గురు నిల్చున్నారు నేను నిల్చొలేదు నాకు ఇష్టం లేదు కూడా... "రుద్ర స్టాండ్ అప్" అంది అమ్మ..... లేచి నిల్చున్నాను... క్లాస్ అందరిని ఉద్దేశించి "ప్లీజ్ విష్ థెం" అంది.... క్లాస్ లో ఉన్న అందరు వాళ్ళలో ఉన్న సింగెర్స్ ని తట్టి లేపి మరి బర్తడే సాంగ్ పాడారు.... రాజి నావైపే చూస్తుందని నాకు తెలుసు, నేను అస్సలు తల ఎత్తలేదు....కానీ నాకు తెలుసు.

ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత రాధ తన క్లాస్ ముగించి బైటికి వెళ్తుండగా, ప్యూన్ ఎంటర్ అయ్యి వచ్చే వారం నుంచి హోమ్ సిక్ సెలవలు అని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు.

ఎవ్వరికి కన్పించకుండా అయినా నన్ను పట్టించుకునే వారెవరు లేరు లే, రాజి గమనించకుండా తనని చూసాను.... మొహం వెళ్లడేసుకుని డల్ గా కూర్చుంది.... నేను నవ్వుకున్నాను..

ఇంటికి వెళ్తుండగా రాజి స్పీడ్ గా వచ్చి ఒక పువ్వు నా బెంచ్ మీద విసిరేసింది నేను చూడకుండా బైటికి వెళ్ళిపోయాను తను నా వెనుకే డల్ గా రావడం నేను గమనించాను, రాజి వెళ్ళిపోయాక లోపలికి వెళ్లి పువ్వు ని తీస్కుని బ్యాగ్ లో వేసుకున్నాను.


ఇంటికి వెళ్లి బ్యాగ్ తీసి రాజి ఇచ్చిన పువ్వుని చూసి టేబుల్ మీద పెట్టాను, హోమ్ వర్క్ చేసుకుని అమ్మ దెగ్గరికి వెళ్ళాను... అప్పటి వరకు నవ్వుతు మాట్లాడుతున్న అమ్మ నన్ను చూసి ఫోన్ కట్ చేసింది... ఏంటి అన్నట్టు అసహనంగా చూసింది... కొత్తగా కట్టిన లైబ్రరీ చూసి వస్తాను అన్నాను..... త్వరగా రా అంది... ఇక ఒక్క క్షణం కూడా ఆగకుండా బైటికి పరిగెత్తాను ఎందుకో ఈ మధ్య ఇల్లు నాది లా అనిపించట్లేదు అదే ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకు అది రాను రాను దూరం అవసాగింది..

ఇంటి నుంచి లైబ్రరీ రెండు కిలోమీటర్ల దూరం నేను ఎంత స్పీడ్ గా పరిగెత్తగలనో చూసుకోవాలనిపించింది.... రెడీ 1..2..3.. స్టార్ట్ అనుకున్నాను నాలుగో సెకండ్ లో లైబ్రరీ ముందు ఉన్నాను.

లోపలికి వెళ్ళా చుట్టూ చూడగానే మహాభారతం కనిపించింది కాదు నన్ను అకర్శించింది... వెళ్లి తీసుకుని చదవడం స్టార్ట్ చేశాను నాకు అందులో ఉన్న కథల కంటే ఇంకేవో బంధాలు, బాధ్యతలు ఒకొక్కరి వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళ సైకాలజీ అర్ధమవసగాయి....

రెండు గంటలు చదివితే ఇంకో గంట నేను నా మనసులో కొత్త అనుభూతులు అల్లడం స్టార్ట్ చేశాను... రోజు కాలేజ్కి వెళ్లడం ఇంటికి రావడం లైబ్రరీ లో గడపడం... చిన్న చిన్నగా నాకే అలాంటి ప్రోబ్ల్మ్స్ వస్తే నేను ఎలా డీల్ చేస్తానా అని ఆలోచించడం మొదలు పెట్టాను.. నాకు కొత్త ప్రశ్నలు ఎదురయ్యేవి....

ఒక రోజు కాలేజ్ కి వెళ్లి వచ్చాక ఆపిల్ కట్ చేద్దామని చాకు తీస్కుని కట్ చేస్తుండగా నా చెయ్యి కోసుకుంది...అదే ఫస్ట్ టైం నేను రక్తం చూడటం కానీ నాకు అర్ధం కానీ విషయం ఏంటంటే నాకు ఎంత బలముందో నేనే ఇంకా చూసుకోలేదు అలాంటిది చిన్న కత్తి కోసుకుని రక్తం రావడం ఏంటో నాకు వింతగా అనిపించింది....

ఒక్కో చుక్క రక్తం పోతుంటే నాకు నాలో ఉన్న ఎనర్జీ పోతుందా అనిపించింది వెంటనే లోపలికి వెళ్లి బాండేజ్ వేసుకున్నాను చాలా నొప్పిగా అనిపించింది కొంచెం నీరసంగా కూడా అనిపించింది, కారింది మాత్రం రెండే బోట్ల రక్తం... చెయ్యి లేవట్లేదు... అర్ధం కాక అలానే దుప్పటి కప్పుకుని పడుకున్నాను..... రాత్రి అమ్మ రూంలోకి వచ్చి "అన్నం తినలేదు" అంది... "ఆకలిగా లేదు" అన్నాను...ప్లేట్ ఇక్కడే పెడుతున్నాను రాత్రి ఆకలేస్తే తిను అని వెళ్లిపోయింది....

పొద్దున్నే లేచి చెయ్యి చూసుకున్నాను మామూలుగానే ఉంది నీరసం ఏమి లేవు, బాండేజ్ తీసేసాను ఏంటిది అనుకుని బైటికి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే పది సెకండ్స్ లో ఒక ఇరవై కిలోమీటర్ల తరువాత కాళీ గోడ కనపడింది ఆగి గట్టిగా గుద్దాను గోడ మొత్తం కూలిపోయింది... పర్లేదు అంతా నార్మల్ గానే ఉంది... మళ్ళీ పది సెకండ్స్ లో ఇల్లు చేరుకున్నాను...

అమ్మ ఎందుకో కోపంగా ఉంది... రెడీ అయ్యి కాలేజీకి వచ్చాము.... కాలేజ్ కి వచ్చాక కానీ గుర్తు రాలేదు నాకు రాత్రి హోమ్ వర్క్ చెయ్యలేదని... లోపలికి వెళ్లి కూర్చున్నాను....

అమ్మ వచ్చింది క్లాస్ లోకి వస్తూనే కోపంగా ఉన్నట్టు అనిపించింది, వచ్చి రాగానే హోమ్ వర్క్ సబ్మిట్ చెయ్యండి అంది అందరూ వెళ్లి సబ్మిట్ చేసారు, కరెక్షన్ పది నిమిషాల్లో కరెక్షన్ చేసేసి రాయని వాళ్ళని నిలబడమంది... ఇంకో ఇద్దరితో పాటు నేను నిలబడ్డాను... నేను నిల్చొడంతో కోపం ఇంకా ఎక్కువైనట్టుంది, కర్ర తీస్కుని వచ్చి మొదటి అమ్మాయి ని అడిగితే ఫీవర్ అని చెప్పింది కూర్చోమని చెప్పి రెండో వాడి దెగ్గరికి వచ్చి కర్ర తో రెండు కొట్టింది చేతి మీద, నా దెగ్గరికి వస్తూనే కర్ర ఎత్తిన్ది నేను చెయ్యి చాపాను రెండు కొట్టింది ఇంకో చెయ్యి కూడా చాపమంది ఇంకో చెయ్యి ఎత్తాను ఇంకో రెండు కొట్టింది ఆ దెబ్బలు నాకు చీపిరి పుల్లతో బర్రెని కొట్టినంత కానీ లోపల మాత్రం బాగా తగులుతున్నాయి....అలా ఇంకో ఇద్దరు సార్స్ తో దెబ్బలు తిన్నాను తరువాత మాధురి మేడం వచ్చింది మళ్ళీ రిపీట్ హోమ్ వర్క్ చెయ్యలేదుగా లేచి నిల్చున్నాను.

మాధురి మేడం నన్ను చూసి "ఎరా రుద్ర ఏమైందిరా ఎందుకు హోమ్ వర్క్ చెయ్యలేదు?" అంది నేను సైలెంట్ గా నిల్చున్నాను, "నువ్వు హోమ్ వర్క్ చెయ్యకుండా ఇలా నిల్చొడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను కూర్చో" అని కూర్చోబెట్టింది.

ఆ తరువాత లంచ్ బెల్ లో తినేసి కూర్చున్నాను నాకు కాలేజ్ లో ఉండబుద్ధి కాలేదు కళ్ళు మూసుకుని పడుకున్నాను...

మాధురి మేడం స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళింది అందరిని పలకరించింది, అక్కడ రాధ, సోషల్ సర్ శివ ఇద్దరు మాట్లాడుకోటం చూసి వాళ్ళ దెగ్గరికి వెళ్ళింది.

రాధ : హాయ్ మాధురి.
మాధురి : హాయ్ లవ్ బర్డ్స్ ఏంటి తెగ మాట్లాడుకుంటున్నారు?

ఈలోగా అందరు టీచర్స్ లోపలికి వచ్చేసరికి రాధ శివ దూరం జరిగి కూర్చున్నారు.

మాధురి : అవును రాధా ఇవ్వాళ రుద్ర హోమ్ వర్క్ చెయ్యలేదు ఇన్ని సంవత్సరాలలో ఇదే ఫస్ట్ టైం వాడు హోమ్ వర్క్ చెయ్యకపోడం ఇంట్లో ఏమైనా అయ్యిందా, ఎటైనా వెళ్ళారా?

సురేష్ : అవును మాధురి మేడం రుద్ర నేను ఇచ్చిన హోమ్ వర్క్ కూడా చెయ్యలేదు.

సతీష్ : అరే సేమ్ నా క్లాస్ లో కూడా నిల్చొనే ఉన్నాడు.

అందరూ రాధా వైపు చూసారు... రాధ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు... శివ అది గమనించి అందరం ఇలానే మాట్లాడుకుంటే లంచ్ టైం అయిపోతుంది అనగానే అందరూ వాళ్ళ వాళ్ళ కాబిన్స్ కి వెళ్లిపోయారు.

మాధురి మాత్రం అలానే నిల్చుంది ఏంటి సంగతి అన్నట్టు....

రాధ : వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఏం ఆలోచిస్తాడో నాకు అస్సలు అర్ధం అవ్వదే అన్నిటికంటే నేను అంటే అస్సలు లెక్క లేదు వాడికి, ఒళ్ళంతా పొగరే... నాకు తెలీదు నీకేమైనా తెలిస్తే చెప్పు.

మాధురి : ఇంతకీ మీ విషయం రుద్రకి చెప్పవా?

రాధ : ఏడిసావ్ వాడికి నేను చెప్పాలా, నా ఇష్టం...

మాధురి : పొగరు వాడికో నీకో నాకు అర్ధం కావట్లేదే...

రాధ : ఇవ్వాళ చెప్తాను.

మాధురి : రుద్రకి ఇష్టం లేకపోతే?

రాధ : నాకు అనవసరం, చెప్తాను అంతే వాడి ఇష్టం తో నాకు పని లేదు....

మాధురి : నీ లాంటి తల్లిని నేను ఎక్కడ చూడలేదు...రాధా

రాధ : నాకు క్లాస్ పీకడం ఐతే..ఇక ఇక్కడ్నుంచి దొబ్బెయ్.....

మళ్ళీ బెల్ మొగటం తో నిద్ర లేచాను రెండు క్లాసులు అయిపోయాయి, తరువాత శివ సర్ వచ్చాడు, రాగానే నన్ను చూస్తూ వెళ్లి కుర్చీ లో కూర్చున్నాడు...

శివ : హోమ్ వర్క్ చెయ్యని వాళ్ళు నిలబడండి...

నేను ఒక్కన్నే నిల్చున్నాను, శివ సర్ చాలా స్ట్రిక్ట్ అని విన్నాము అందుకే ఎవరు శివ సర్ హోమ్ వర్క్ ఎగొట్టరు... నేను నిల్చొడం చూసి నన్ను దెగ్గరికి రమన్నారు...

శివ : ఎందుకు హోమ్ వర్క్ చెయ్యలేదు..

రుద్ర : సైలెంట్ గా నిల్చున్నాను..

శివ : ఒంట్లో బాలేదా, క్లాస్ అర్ధం కాలేదా, ఎటైనా వెళ్ళావా? ఏం జరిగిందో నాకు తెలియాలి కదా?

నేను మౌనంగానే నిల్చున్నాను, అందరు నన్నే చూస్తున్నారు, నేను దించిన తల ఎత్తలేదు... ఒక రెండు నిముషాలు చూసి వెళ్లి కూర్చోమన్నాడు... వెళ్లి కూర్చున్నాను...

నా ముందు బెంచ్ లో నన్ను ఎప్పుడు ఏడిపించే వాళ్లలో ఒకడు "ఏంట్రా సర్ వీడ్ని ఏమానకుండా వదిలేసాడు?"
దానికి మురళి (మొన్న టైర్ పంక్చర్ చేసింది వీడిదే) : వాడికేంట్రా కింగ్, శివ సర్ రాధా మేడం లవర్స్ నీకు తెలీదా కాలేజ్ మొత్తం వాళ్ళ గురించే రా బాబు.... అలాంటిది ఇక శివ సర్ వీడ్ని ఎందుకు కొడతాడు...ముగ్గురిలో ఇంకొకడు "మరి వాళ్ళ నాన్న?" దానికి మురళి "ఏమో రా అయినా వాళ్ళు కరెక్ట్ గా ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళు కరెక్ట్ గా ఉండేది" అంటూ ముగ్గురు నన్ను చూసి నవ్వుతున్నారు.

క్లాస్ అందరికి ఇవన్నీ వినపడుతున్నాయి అందరు ముసి ముసి గా నవ్వుకోడం నేను గమనించాను, రాజి బాధగా నన్ను చూస్తుందని తెలుసు... ఈలోగా సర్ రావడం తో అందరు మాములుగా అయిపోయారు....

అలా కాలేజ్ అవ్వగొట్టి ఇంటికి వచ్చి రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టాను....నాకు ఇవ్వాళ జరిగిన ఏ సంఘటనలకి బాధగా లేదు.... ఏమో పైకి అనేశాను లోపల? అయినా నాకు బాధ అంటే ఏంటో తెలియదు కదా..... టేబుల్ మీద రాజి ఇచ్చిన పువ్వు వాడిపోయింది దానికి కొంచెం ఎలాగో అనిపించింది ఎందుకంటే నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది...అది వాడిపోడం నాకు నచ్చలేదు... పువ్వుని చేతిలోకి తీసుకుని నా నోటితో గాలిని ఊదాను పువ్వు మళ్ళీ ఫ్రెష్ గా అయింది... నా మనసులో జరిగిన అలజడికి బహుశా సంతోషం అంటే ఇదేనేమో అని వెంటనే నా మొహాన్ని అద్దం లో చూసుకున్నాను...నాకు నేను అందంగా కనిపించాను.

ఇవ్వాళ లైబ్రరీ కి వెళ్ళలేదు నిన్నటి హోమ్ వర్క్, ఇవ్వాల్టి హోమ్ వర్క్ రెండు చేస్తూ కూర్చున్నాను... చీకటి పడుతుండగా అమ్మ రూమ్ లోకి వచ్చింది.

రాధ : అన్నం తిన్నావా? నిన్న కూడా తినలేదు.

రుద్ర : తింటాను...

ఒక రెండు నిముషాలు సైలెంట్ గా కూర్చుంది నేను పెన్సిల్ తో డైగ్రామ్ గీస్తున్నాను...

రాధ : నేను పెళ్లి చేసుకుంటున్నాను....

రాస్తున్న పెన్సిల్ ములుకు ఒక్కసారిగా విరిగింది... ప్రశాంతంగా షార్ప్నర్ తీసుకుని చెక్కి మళ్ళీ గీయడం మొదలుపెట్టాను....

ఇంకో రెండు నిముషాలు చూసింది, నేను నా పని చేసుకుంటున్నాను కోపంతో విసురుగా వెళ్ళిపోయింది...

నేను నా డైగ్రామ్ గీస్తున్నాను అమ్మ వెళ్ళిపోయాక ఒక సెకండ్ నా చెయ్యి గీయడం ఆగిపోయింది కానీ మళ్ళీ గీయాసగాను, కానీ అప్పటివరకు ఎంతో అందంగా కనిపించిన డైగ్రామ్ నాకు ఇప్పుడు అది వికారంగా కనిపించింది....

హోమ్ వర్క్ మొత్తం చేసి డాబా పైకి వెళదాం అని బైటికి వచ్చాను... అమ్మ ఫోన్ లో ఏదో సీరియస్ గా మాట్లాడుతుంది నేను పట్టించుకోలేదు పైకి వచ్చి... చల్లటి గాలికి గచ్చు మీద పడుకుని ఆకాశాన్ని చూసాను.... అన్ని మసక మసకగా కనిపిస్తున్నాయి.....

కొంచెం సేపటికి కిందకి వచ్చాను అమ్మ ఇంకా ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ లో అన్నం పెట్టుకుని హాల్లోకి వచ్చి టీవీ పెట్టుకుని చూస్తూ అన్నం తింటున్నాను.... అమ్మ ఫోన్ మాట్లాడుతూ తన రూంలోకి వెళ్ళిపోయింది...

పొద్దున్నే కాలేజ్ కి వెళ్లి చేసిన రెండు రోజుల హోమ్ వర్క్ అందరి టీచర్స్ కి చూపించి గుడ్ బాయ్ అనిపించుకున్నాను, రేపటి నుంచి సెలవలు ఇవ్వాళ రాజి ఒక్క క్లాస్ కూడా వినలేదు మొత్తం నన్ను చూస్తూనే కూర్చుంది....

సాయంత్రం ఇంటికి వచ్చి ప్రతి పది నిమిషాలకి ఒకసారి గర్ల్స్ హాస్టల్ కి వెళ్లి వస్తున్నాను ఎలాగో నేను పరిగెడితే ఎవ్వరికి కనిపించదు కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగలేదు.....

రాత్రి ఎనిమిది గంటలకి మళ్ళీ ఒకసారి వెళ్లే సరికి రాజి బాగ్స్ తో బైట నిలబడి ఉంది... తనని ఫాలో అవుతూ ట్రైన్ ఎక్కి విజయవాడ వరకు వెళ్ళాను రాత్రి రెండింటికి వాళ్ళ ఇల్లు అన్ని గుర్తుపెట్టుకుని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసా.... నేను వచ్చేసరికి అమ్మ హాల్లో నాకోసం ఎదురుచూస్తూ కూర్చుంది....

లోపలికి వెళ్ళాను.
అమ్మా : ఎక్కడికి వెళ్ళావ్?

నేను సైలెంట్ గా రూంలోకి వెళ్ళాను...

వెనకే కర్ర పట్టుకుని వచ్చింది.... నీ వల్ల నాకు ఎప్పుడు సుఖం లేదు సంతోషం లేదు ఏం లేవు నా జీవితానికి శని లాగ తయారయ్యావ్ అని కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టింది.... నేను మెలకుండ నిల్చున్నాను...."చచ్చిపో నీ వల్ల అన్ని కష్టాలే నాకు" అని డోర్ గట్టిగా వేసి వెళ్ళిపోయింది....

అలాగే నేను ఇప్పుడు బతికి ఉండి చేసేది ఏముంది అని కిచెన్ లో నుండి కత్తి తీసుకుని ఒకసారి అమ్మ రూమ్ లో చూసాను.... ఏడుస్తూ కూర్చుంది....నా రూమ్ లోకి వచ్చి ఒక్కసారిగా పీక కోసుకున్నాను.......






Like Reply
#46
Nice update
Like Reply
#47
End  Iex Iex Iex
Like Reply
#48
Enti broo idhi
Like Reply
#49
nice one bro...
Like Reply
#50
what to say..... చిన్నప్పటి నుంచి టార్చర్ పెట్టిందీ తనే ఇప్పుడు ఏడుస్తుంది తనే..... selfishness at it peaks..... రాధ పెళ్లి చేసుకున్న తర్వాత రుద్రాని హాస్టల్ లో జాయిన్ చేసేస్తే హాయిగా ఉంటుందేమో.... అడ్వెంచర్స్ చేసుకోవచ్చు... రాజీని చూసుకోవచ్చు.... Namaskar
[+] 6 users Like kummun's post
Like Reply
#51
(13-04-2022, 02:51 PM)గొంతు కోసుకుని నైస్ ఏంటి సామీ Wrote: Huh Huh
Like Reply
#52
Nice update bro
Like Reply
#53
రాధ తన కన్నకొడుకుతో మొదటి నుంచి అలా అయిష్టంగా ప్రవర్తించడానికి పరిస్తితులే కారణం . చివరకి ఏడవడం కూడా.

ఇక రుద్ర తన కన్న తల్లితో ఆ విధంగా ప్రవర్తించడానికి కూడా  పరిస్తితులే కారణం.

రాధ యొక్క జీవితం మరొక కోణం లో చూస్తే బాదగా ఉంటుంది. అలాగే రుద్ర కోణంలో చూస్తే కోపంగా ఉంటుంది.

ప్రతీ ఒక్క విషయాన్ని విభిన్న కోణాలలో చూస్తే , విభిన్న రకాలుగా అర్ధమవుతుంది అని మరొక సారి ఇప్పటిదాకా ఉన్న ఈ కథని  చదివిన తరువాత నేను మళ్ళీ గ్రహించాను.

మొత్తానికి ఇప్పటిదాకా ఈ కథలో జరిగిన ప్రతి విషయాలకి మూలం పరిస్తితులు.

బహుశా ఆ పరిస్తితులని ఎదిరించలేకనే రుద్ర తన ప్రాణాలనీ తానే తీసుకోడానికి సిద్దమయ్యాడేమో .....

ఏమో రుద్రలో ఉన్న శక్తి తన ప్రాణం పోకుండా కాపాడుతుందో లేదో అని తరువాతి అప్డేట్ చదివే దాకా  ఎదురు చూస్తాను ..... 

మొత్తానికి ఇప్పటిదాకా ఉన్న ఈ కథ నా వ్యక్తిగత ఎమోషనల్ లిమిట్ ని దాటి  చాలా emotional గా ఉంది రచయిత గారు .   clps
ఇదంతా నా అభిప్రాయం మాత్రమే .
Like Reply
#54
Awesome update.....No Words...... Excellent
Like Reply
#55
Bro your writing skills are super bro
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
#56
Intha Katina thalli Ni ekada chusi undaru
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
#57
(13-04-2022, 04:27 PM)Ravi9kumar Wrote:
రాధ తన కన్నకొడుకుతో మొదటి నుంచి అలా అయిష్టంగా ప్రవర్తించడానికి పరిస్తితులే కారణం . చివరకి ఏడవడం కూడా.

ఇక రుద్ర తన కన్న తల్లితో ఆ విధంగా ప్రవర్తించడానికి కూడా  పరిస్తితులే కారణం.

రాధ యొక్క జీవితం మరొక కోణం లో చూస్తే బాదగా ఉంటుంది. అలాగే రుద్ర కోణంలో చూస్తే కోపంగా ఉంటుంది.

ప్రతీ ఒక్క విషయాన్ని విభిన్న కోణాలలో చూస్తే , విభిన్న రకాలుగా అర్ధమవుతుంది అని మరొక సారి ఇప్పటిదాకా ఉన్న ఈ కథని  చదివిన తరువాత నేను మళ్ళీ గ్రహించాను.

మొత్తానికి ఇప్పటిదాకా ఈ కథలో జరిగిన ప్రతి విషయాలకి మూలం పరిస్తితులు.

బహుశా ఆ పరిస్తితులని ఎదిరించలేకనే రుద్ర తన ప్రాణాలనీ తానే తీసుకోడానికి సిద్దమయ్యాడేమో .....

ఏమో రుద్రలో ఉన్న శక్తి తన ప్రాణం పోకుండా కాపాడుతుందో లేదో అని తరువాతి అప్డేట్ చదివే దాకా  ఎదురు చూస్తాను ..... 

మొత్తానికి ఇప్పటిదాకా ఉన్న ఈ కథ నా వ్యక్తిగత ఎమోషనల్ లిమిట్ ని దాటి  చాలా emotional గా ఉంది రచయిత గారు .   clps
ఇదంతా నా అభిప్రాయం మాత్రమే .

Thank you Ravi garu
❤❤❤❤
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#58
(13-04-2022, 07:55 PM)Praveenraju Wrote: Bro your writing skills are super bro

❤❤❤
Like Reply
#59
(13-04-2022, 03:01 PM)kummun Wrote: what to say..... చిన్నప్పటి నుంచి టార్చర్ పెట్టిందీ తనే ఇప్పుడు ఏడుస్తుంది తనే..... selfishness at it peaks..... రాధ పెళ్లి చేసుకున్న తర్వాత రుద్రాని హాస్టల్ లో జాయిన్ చేసేస్తే హాయిగా ఉంటుందేమో.... అడ్వెంచర్స్ చేసుకోవచ్చు... రాజీని చూసుకోవచ్చు.... Namaskar

❤❤❤
Like Reply
#60
(13-04-2022, 06:15 AM)lovelyrao Wrote: Movie Chustunna feeling vachindi. So excited for future updates

❤❤❤
Like Reply




Users browsing this thread: 59 Guest(s)