Posts: 231
Threads: 5
Likes Received: 686 in 207 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : శుక్రచార్యుడు విష్ణు తో ఏయ్ ప్రజల్నితే నువ్ రాక్షసులు నుండి కాపాడ్తున్నావో వాలీ కలియుగం లో రాక్షసులకంటే పాపత్ములు అవుతారు అని అంటాడు.. ఇది నిజమేనా?
రావణుడు లేనిదేయ్ రామావతారం ఉండదు?
కంసుడు లేనిదేయ్ కృష్ణవతారం ఉండదు?
అలాగేయ్ కలిపురుషుడు లేనిదేయ్ కల్కి అవతారం రాదు..
ఆంటే విశ్వానికి ముందు చివర అంతే భగవంతుడేయ్.. అయితే మరి నువ్ పాపత్ముడు నేను పుణ్యాత్ముడ్ని, మతం, కులం, జంతువు.. ఇవ్వని ఎందుకు.. ప్రతిదీ అయంది భగవంతుడి స్వరూపమే అని నా భావన...
పాపం చేసిన పుణ్యం చేసిన విజయం వోచిన ఓడినా... శ్వాస పీల్చిన ఒదిలిన ప్రతిదీ భగవత్ స్వరూపమే అని నా భావన.... Complete detachment from this world.... అని నా భావన .. మీరు ఏమంటారు...
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(10-04-2022, 12:35 PM)sez Wrote: .
మీ అపారమైన మీ మేధస్సు కి నా ధన్యవాదాలు.... ఇండియన్ మైథాలజీ ని అవపోసా పట్టారు..... Hats of to you....
నాకో చిన్న సందేహం......
1) భారతదేశంలో కొన్ని టెంపుల్స్ లో నగ్నం గానే దర్శనం కి వెళ్లాలి అని విన్నాను... అది నిజమా? ఈ విధంగా ఉన్న దేవాలయాలు ఎన్ని మన ఇండియా లో?
2)కర్ణాటకలో షిమోగా దగ్గర ఒక విలేజ్ వాళ్ళు పూర్తి నగ్నంగా కాలినడకన 5 కిలోమీటర్లు కొండ ఎక్కి ఎక్కి రేణుకమ్మ టెంపుల్ కి వెళ్లేవారట... మూడు రోజుల జాతర అదేవిధంగా చెప్పేవారట అది నిజమా?
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ sez. మీ అభిమానానికి అభినందనలకి hats ఏమిటి తలే off మిత్రమ.
1) భారత దేశములో లేని వింత లేదు. 'For everything that is true about India the converse is also true' అని ఒకప్పుడు ఎక్కడో చదివాను మిత్రమ. ఎన్నో వైవిధ్యమైన జాతుల వారు ఉన్నారు కదా. వారి వారి నమ్మకాలు అనేక విధములు. దిగంబర జైనులు చాలా మందిని చూసాను దేవాలయముకి నగ్నముగా వెళ్ళటం. పెద్ద పెద్ద వ్యాపారస్తులు సైతం ఏదైనా వ్రతం/మొక్కు ఉన్నప్పుడు ఇంటి నుండి నగ్నముగా గుడికి వెడతారు. ఐతే వారి చుట్టూ వారి బంధు జనం మూగి ఉంటారు వాహనాలు ఉంటాయి గొడుగు పట్టేవాళ్ళు ఉంటారు. కాలినడకన వస్తాను అని మొక్కుకుంటారు కొందరు, అలాగే నగ్నముగా వస్తానని మొక్కు.
2) నిజమే. ఇది ఆ ప్రాంతము వారి నమ్మకం. ప్రభుత్వం ఎన్ని విధాల ఆపాలని చూసినా రాం గోపాల్ వర్మ సినిమాలా అది ఇంకా ఇంకా ప్రబలం అవుతుంది. కోతి పుండు బ్రహ్మ రాక్షసి ఐనట్టు ఏదో మారుమూలన కొద్ది మంది నమ్మకం/ఆచారం అకస్మాత్తుగా బాగా ప్రచారం పొందుతుంది.
మీ డిప్పడు
•
Posts: 231
Threads: 5
Likes Received: 686 in 207 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : సాకలి కులం, మాదిగ కులం మధ్య ఏదయినా సంభందం ఉండేదా? పంచాసకల్లు అని ఎక్కడో విన్నాను వాళ్ళు స్మశానం లో శవాలని కాల్చేవరని? సాకలోళ్ళు జీవనశయలి ఎలా ఉండేది? సాకలి వాళ్ళు కూడా దొడ్డులు కడిగేవారా? విరభద్ర దేవుడు ని ప్రత్యేకంగా కొలుస్తారు సాకలి వాళ్లు అని వినికిడి నిజమేనా? మొత్తం తెలుసుకోవాలని నా ఆత్రుత
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(10-04-2022, 08:15 PM)బర్రె Wrote: ప్రశ్న : శుక్రచార్యుడు విష్ణు తో ఏయ్ ప్రజల్నితే నువ్ రాక్షసులు నుండి కాపాడ్తున్నావో వాలీ కలియుగం లో రాక్షసులకంటే పాపత్ములు అవుతారు అని అంటాడు.. ఇది నిజమేనా?
రావణుడు లేనిదేయ్ రామావతారం ఉండదు?
కంసుడు లేనిదేయ్ కృష్ణవతారం ఉండదు?
అలాగేయ్ కలిపురుషుడు లేనిదేయ్ కల్కి అవతారం రాదు..
ఆంటే విశ్వానికి ముందు చివర అంతే భగవంతుడేయ్.. అయితే మరి నువ్ పాపత్ముడు నేను పుణ్యాత్ముడ్ని, మతం, కులం, జంతువు.. ఇవ్వని ఎందుకు.. ప్రతిదీ అయంది భగవంతుడి స్వరూపమే అని నా భావన...
పాపం చేసిన పుణ్యం చేసిన విజయం వోచిన ఓడినా... శ్వాస పీల్చిన ఒదిలిన ప్రతిదీ భగవత్ స్వరూపమే అని నా భావన.... Complete detachment from this world.... అని నా భావన .. మీరు ఏమంటారు... సమాధానం : ఈ సంభాషణ గురించి నాకు తెలియదు మిత్రమ బర్రె. కలియుగం లో రాక్షసులు మనుషుల రూపములోనే ఈ భూలోకములో సంచరిస్తుంటారు అని ఒక నమ్మకం. నరరూపరాక్షసుడు అంటారు కదా కృరముగా బలాత్కరించిన/చంపిన వారిని.
రామావతారం కేవలం రావణుడి కోసమే కాదేమో మిత్రమ. లక్షల మంది రాక్షసులని అంతం చేసి రామరాజ్యం స్థాపించెను అంటారు. ఐతే ఒకటి, త్రేతాయుగములో ధర్మం 3 పాళ్ళు ఉన్నప్పుడే మరి అందరు రాక్షసులు ఇష్టారాజ్యం సాగించేవారా రాముడు వచ్చేవరకు. త్రేతాయుగమే అలా ఉంటే ఇంక కలియుగం గురించి వేరే చెప్పాలా.
కృష్ణుడి అవతార లీలలలో కంసుడి వధ కేవలం ఒకటి. ఇంకా ఎన్నెన్నో కార్యములు చక్కబెట్టెను కదా మిత్రమ.
కర్మ అనేది ఉంది కదా మిత్రమ. ప్రతి జీవికి కర్మ సొంతముగా చేసే అవకాశం లభిస్తుంది. ఒక మనిషి నలుగురుని హింసించి బ్రతకచ్చు నలుగురికి మేలు చేసి బ్రతకచ్చు అది అతని ఇష్టం. అందుకు situations వస్తాయి నిర్ణయం మనిషి బుద్ధి తో తీసుకోవాలి. కర్మని బట్టి ముందు ముందు ఎలాంటి situations వస్తాయి అన్నది ఉంటుంది. ఒక ఉద్యోగి బాగా పని చేస్తే పైకి పైకి promotions వచ్చి ఇంకా బాధ్యతాయుతమైన అధికారమున్న స్థానములు లభిస్తాయి అదే తప్పులు చేస్తే demotions వచ్చి తక్కువ స్థాయికి పడిపోక తప్పదు. అనేక శరీరములు ఆత్మకి రకరకాల స్థాయుల్లో company positions లాంటివి అని నా నమ్మకం మిత్రమ. నిష్కామ కర్మ వలన ఫలితం మనని ప్రభావితం చెయ్యదు మిత్రమ అని నా అభిప్రాయము.
మీ డిప్పడు
•
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(11-04-2022, 07:36 AM)బర్రె Wrote: ప్రశ్న : సాకలి కులం, మాదిగ కులం మధ్య ఏదయినా సంభందం ఉండేదా? పంచాసకల్లు అని ఎక్కడో విన్నాను వాళ్ళు స్మశానం లో శవాలని కాల్చేవరని? సాకలోళ్ళు జీవనశయలి ఎలా ఉండేది? సాకలి వాళ్ళు కూడా దొడ్డులు కడిగేవారా? విరభద్ర దేవుడు ని ప్రత్యేకంగా కొలుస్తారు సాకలి వాళ్లు అని వినికిడి నిజమేనా? మొత్తం తెలుసుకోవాలని నా ఆత్రుత సంబంధం గురించి తెలియదు మిత్రమ. వృతి బట్టి కులం ఏర్పడింది అని నా అభిప్రాయము. కులం జన్మత: కాదు కర్మత: అని నా నమ్మకం. పంచములు అని కొందరు. మహాపాతకములు చేసిన వారిని అందరు వెలి వేసేవారు వారు ఏ కులము వాళ్ళైనా సరే. అటువంటి వారిని బందిఖానాలో బంధించటం కన్నా వెలి వెయ్యటం పెద్ద శిక్ష అనుకునేవారు. వాళ్ళకి ఎవ్వరు ఆహారం నీళ్ళు ఇవ్వకపోతే అడవుల్లోకెళ్ళి నశించిపోతారు అని అనుకునేవారు. పైగా ఇలాంటి శిక్ష చూసాక మిగిలిన వారు ఆ మాహాపాతకములు చెయ్యకుండా ఉంటారని భావించేవారు. కాని కలియుగం లో అధర్మం పెరిగిపోయేసరికి ఇలా వెలివేయబడ్డవారు పెరిగిపోయారు. అడువులు నశించిపోయాయి మెల్లిగా పంచుములే ఎక్కువైపోయారేమో. కాటి కాపరి పంచముడు కాదు కదా హరిశ్చంద్రుడి కథలో. శివ/వీరభద్ర భక్తులు అన్ని కులములలో ఉన్నారు మిత్రమ.
మీ డిప్పడు
•
Posts: 11,070
Threads: 12
Likes Received: 47,591 in 9,757 posts
Likes Given: 11,982
Joined: Nov 2018
Reputation:
983
(11-04-2022, 07:36 AM)బర్రె Wrote: ప్రశ్న : సాకలి కులం, మాదిగ కులం మధ్య ఏదయినా సంభందం ఉండేదా? పంచాసకల్లు అని ఎక్కడో విన్నాను వాళ్ళు స్మశానం లో శవాలని కాల్చేవరని? సాకలోళ్ళు జీవనశయలి ఎలా ఉండేది? సాకలి వాళ్ళు కూడా దొడ్డులు కడిగేవారా? విరభద్ర దేవుడు ని ప్రత్యేకంగా కొలుస్తారు సాకలి వాళ్లు అని వినికిడి నిజమేనా? మొత్తం తెలుసుకోవాలని నా ఆత్రుత
రజకుల దైవం మడేలు మాచయ్య
ఈనాటి రజక కులం వారి మూల పురుషుడు మడేలు, అతని చరిత్రయే రజకకులపురాణం లేదా మడేలు బసవపురాణంలోని "మడివాళు మాచయ్య కథ".మడివాళు మాచయ్య బసవేశ్వరుని సమకాలికుడు, మహిమాన్వితుడైన మడివాళు మాచయ్య తన రజకవృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ, రాజు గర్వాన్ని అణచిన వీరభక్తుడు. పరమశివుని అవతారమూర్తిగా మాచయ్యను బసవేశ్వరుడు కీర్తించినాడు. బసవేశ్వరుని తదనంతరం, అతని మహత్తులు, ఇతర శివభక్తుల మహత్తులు ప్రజల నాలుకలపై తాండవించాయి. పాల్కురికి సోమన ప్రజల్లో ప్రసిద్ధిచెందిన భక్తుల కథలనే బసవపురాణంలో కూర్చినట్లుగాచెప్పుకొనినాడు. అందుకే మడేలు మాచయ్య కథ పామర సాహిత్యం నుండి పండీత సాహిత్యంలోకి ప్రవేశించిందా, పండిత సాహిత్యం నుండి పామర సాహిత్యంలోకి వచ్చిందా అని నిర్ధారణగా చెప్పలేము.
బసవపురాణంలోని మడివాళు మాచయ్య ఒక్?3;డే రజకుల మడేలు పురాణంలో ఇద్దరైనారు. మడివాళు చాకలి కులానికి మూలపురుషుడైనాడు. చాకలి వారికి ఆశ్రితకులమైన మాచయ్యల కులానికి మూలపురుషుడు మాచయ్య, మచయ్యల కులవృత్తి-చాకలివారి కులపురాణమైన మడేలు కథను గానం చేయడం, వారిచ్చిన ధనధాన్యలతో జీవితాన్ని గడపడం, బసవపురాణంలోని మడివాళు మాచయ్య కథను బట్టి ఆ రచనాకాలం నాటికి రజక కులం ఒక్కటే ఉందని విధితమవుతుంది. తర్వాత రజక కులంలోనే తక్కువ అంతస్థుకు చెందినవారికి తమ కుల కథను గానం చేసే హక్కును, భుక్తిని ప్రసాదించగా వారే మాచయ్య కులస్థులైనారని భావించవచ్చు.
మడేలు కథను మడేలు పురాణం, రజకకుల పురాణం అని పిలుస్తారు. పురాణం అంటే ప్రాచీన కాలానికి చెంది జగత్సృష్టిని, దేవతలను, దేవతాంశ సంభూతులను, వివిధ తెగల పుట్టుకను, వారి మూలపురుషులను, ఆచారవ్యవహారాలనĹ?; వివరించునది. ఈ నిర్వచనం మడేలు కథకు అక్షరాల అన్వయిస్తుంది. ఈ కథ జగత్సృష్టిని, పార్వతీదేవి, వెరభద్రుని జన్మ వృత్తాంతాలను రజకకుల మూలపురుషుడు మడివాళు మాచయ్యల మూలపురుషుడు మాచయ్యల పుట్టుకలను, కులాచార వ్యవహారాలను వివరిస్తుంది.
మడేలు కథను పటం కథ అని కూడా అంటారు. నకాషీవారు, వస్త్రాల పైన చిత్రించిన రంగుల చిత్రాలను (పటం) చూపెడుతూ కథకులు కథను చెప్పుతుంటారు. అందుకే పటం కథ అని పిలుస్తారు. మడేలు పురాణ కథలో కుల ప్రాధాన్యం, వీరశైవమత ప్రాముఖ్యం సమ్మిళితమై ఉంటుంది. రజకకుల మూలపురుషుడైన మడేలు వీరభద్రాంశ సంభూతుడు,భవుడైన బిజ్జలుని సంహరించిన వీరభక్తుడు. జంగమ పరీక్షలనెదుర్కొని శివుణ్ణి మెప్పించిన శైవభక్తుడు, మాచయ్యలకు తనకుల కథను కీర్తించే హక్కును, భుక్తిని ఏర్పరచిన దయాళువు, శివాను?5;్రహంతో బట్టలనుతికే వృత్తిని గౌరవంగా స్వీకరించిన కులాభిమాని. ఇన్ని సద్గుణాలతో, మహత్తులతో మూర్తీభవించిన మడెలయ్య కథను కథనం చేయడం వల్ల రజకులకు తమ వృత్తిపైన, తమ కులపురుషుడైన మడేలయ్యపైన భక్తి విశ్వాసాలు ఏర్పడుతాయి. శ్రోతల్లోని ఇతరకులస్థులకు కూడా రజక వృత్తిపైన, రజకకులం పైన ఆదరాభిమానాలు కలుగుతాయి. రజకులకు కూడా తమ కుల కథను గానం చేస్తూ, కథను పదిలపరుస్తూ, తమకుల ప్రతిష్ఠను పెంచుతున్న మాచయ్యలపై అభిమానం పెరుగుతుంది. రజకులు శైవమతస్థులు, వారి కులపురుషుడు శివాంశ సంభూతుడైన మడేలు. వారి కులదేవత ఈదెమ్మ ఈమె, ఏడుగురు అక్కాచెల్లెలైన గ్రామ దేవతలలో ఒకర్తి. విధిని నిర్ణయించే అమ్మ కాబట్టి విదెమ్మ, ఇదెమ్మ, ఈదెమ్మ అయ్యింది. అంతేగాక బట్టల మూటలోని బట్టలను ఇది ఫలానావారికి అని చూపెడుతుంది. కా?6;ట్టి ఇదెమ్మ అయిందని రజకుల అభిప్రాయం. ప్రతి మడేలు గుడి ముందు, ప్రతి చాకిరేవు దగ్గరి ఈదెమ్మ గుడి ఉంటుంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఈదెమ్మ పండుగను జరిపి ఈదెమ్మ కథను చెప్పిస్తారు. ఈదెమ్మ కథలో ఈదెమ్మ దేవతకు పరమశివుని భక్తుడైన మాంధాతకు మధ్య జరిగిన స్పర్ధ, పోరాటం, ఈదెమ్మ పరాజయం మొదలైన అంశాల వివరణలుంటాయి. వీరశైవ మతొద్యమ కాలంలో స్త్రీ దేవతారాధనకు, శైవమతారాధనకు మధ్య వైరుధ్యం ఏర్పడి ఉండవచ్చుననీ, రజకులు స్త్రీ దేవాతారాధనకంటే శైవారాధనకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి ఉండవచ్చుననీ, ఈదెమ్మ కథ ద్వారా వెల్లడి అవుతుంది. రజకులు వీరశైవమత్యాన్ని స్వీకరించి నా శక్తి దేవతారాధన ప్రభావం వారి విశ్వాసాల్లో, ఆచారవ్యవహారాల్లో గోచరిస్తూనే ఉంటుంది. తమ కులదేవతయైన ఈదెమ్మ అనుగ్రహంతోనే తాము ఉతికిన బట్ట?#3122;ను గుర్తుపట్టీ ఎవ్వరివి వారికివ్వగలమని రజకుల విశ్వాసం, బట్టలనుతికే వృత్తిని ఆరంభించినవాడు మడేలయినా, వృత్తి ధర్మ నిర్వహణలో సహకరించే దేవత ఈదెమ్మ అని వారి అభిప్రాయం. వీరు శివరాత్రినాడు ఉపవాసముండినా, బోనంపైన దీపం వెలిగించి జాగరణ ఉంటారు. బోనం స్త్రీ దేవతకు ప్రతీక గ్రామదేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ పండుగల్లో రజకులకు ప్రధానపాత్ర ఉంటుంది. అందుకే శైవమత ప్రాధాన్యం కలిగిన మడేలు కథ శక్తిదేవత లేదా మాతృదేవత వర్ణనతో ఆరంభమైంది. మడేలు పురాణకథకాధారమైన వీరశైవమతంలో స్త్రీ పురుషులిరువురూ సమానులే. శ్రామిక వర్గాల్లో స్త్రీ, పురుషులిరువురూ సమానంగా కష్టించి పనిచేస్తారు. అయినా అణగని శివుని పురుషాహంకారమే శిఖరాగ్రంలోని పార్వతిని క్రిందికి రప్పిస్తుంది. పరమేశ్వరుడు ఎత్తైన రాయిపైన కూĸ?;్చొని, పార్వతిని కింద కూర్చొమని ఆమెకు సొది చెప్పుతాడు.
Posts: 11,070
Threads: 12
Likes Received: 47,591 in 9,757 posts
Likes Given: 11,982
Joined: Nov 2018
Reputation:
983
రజకుల చరిత్ర
కైలాసంపైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి శివుని స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం దక్షుని గౌరవించాడు. అందుకు దక్షుడు శివుడు తనని అవమానించినట్లు భావించి, కొపగించి ప్రతికారంగా ఒక యాగాన్ని చెయ్యడానికి నిశ్చయించుకొంటాడు. దేవతలు, మునులు అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు. అయినా పార్వతి ఆ యజ్ఞగుండం వద్దకు వెళుతుంది. దక్షుడు తన కూతురైన పార్వతిని, అల్లుడైన శివుడిని తూలనాడతాడు. పార్వతి అవమాన భారంతో యజ్ఞగుండంలోకి దుమికి ఆత్మాహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు వీరభద్రున్ని దక్షయజ్ఞాన్ని నాశనం చేసి రమ్మని పంపుతాడు. దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, త్రిమూర్తుల వద్దకు వెళ్లి దక్షున్ని చంపి కాల్చి, మాడ్చి, ఊడ్చి ఉస్సోమన్నానని చెప్తాడు వీరభద్రుడు. అప్పుడు త్రిమూర్తులు యజ్ఞాన్ని నాశనం చెయ్యమంటే దానితోపాటు స్త్రీ హత్య, శిశు హత్య, బ్రహ్మహత్యలు కూడా చేసి పాప పంకిలుడైనావు. గాబట్టి నువ్వు పాలగుండంలో స్నానం చేసి మడేలయ్య అవతారం ఎత్తమంటారు. అప్పుడు వీరభద్రుడు పాలగుండంలో దుమికి భీకరించే సరికి, ఆ భీంకారానికి ఇద్దరు ప్రవాస కర్తలు పుడతారు. వాళ్లే మడేలయ్య, మాచయ్యలు. మడేలయ్య బట్టలు ఉతకడం, మాచయ్య దేవునికి పూజ చేయడం చేస్తుండేది. మాచయ్య అన్నం ఆహారం లేకుండా పూజలోనే ఉండేది. ఎవరైనా వచ్చి ఇస్తేనే తినేది. లేకుంటే లేదు. ఒకరోజు బాగా ఆకలి వేసిన మాచయ్య, మడేలయ్య అడుక్కుని తెచ్చుకున్న అన్నాన్ని ఒక్కడే తింటాడు. స్నానం చేసి భోజనానికి వచ్చిన మడేలయ్య కోపించి మాచయ్యతో పంచినదాన్ని మారుపంచుడయితే లేదు. నేను అడుక్కున్న అన్నాన్ని నువ్వు తిన్నోనిని కాబట్టి యాడాదికోసారి అర్తివాడివయ్యి నా ఇంటికి వస్తే నీకు త్యాగం ఇసా్తనంటాడు. అందుకే వీరి మధ్య మంచం పొత్తు ఉన్నప్పటికి వియ్యపు పొత్తు లేదు. చాకలి వారికి మాచయ్యలు ఆడబిడ్డలు అర్తివారు వంటివారు. అందుకే అర్తి బిడ్డ దీవెన, ఆడబిడ్డ దీవన జంగం దీవెనతో సమానం అంటారు.
Posts: 11,070
Threads: 12
Likes Received: 47,591 in 9,757 posts
Likes Given: 11,982
Joined: Nov 2018
Reputation:
983
వీరభద్రుని అవతారం అయిన మడేలయ్య సురాముప్పది కోట్ల దేవతలు విడిచిన వస్త్రాలను పాపపరిహారం చేసుకోవడానికి పన్నెండు సంవత్సరములు పిండుతాడు. పన్నెండు సంవత్సరములు పిండడం పూర్తయిన తరువాత ఒకసారి పరమశివుడు మడేలయ్యను పరీక్షించదలిచి వృత్తిపరమైన కఠినమైన కఠిన పరీక్షలకు గురిచేస్తాడు. ఆ పరీక్షల్లో నెగ్గిన మడేలయ్యకు శివుడు ప్రత్యక్షమై ఏదైన వరం కోరుకొమ్మంటాడు. అప్పుడు మడేలయ్య తనకు చాకలి వృత్తి కావాలని; వండని కూడు, వడకని బట్ట, పిండని పాడి ఇంటి ముందు తడి వస్త్రాలు పాడి వస్త్రాలు తరగకుండా ఉండాలని ఎటువంటి రాజపుంగవులు కోకలు అయినా తాము ధరించినప్పటికీ తమనేమి అనకుండా ఉండాలని కోరుకుంటాడు. అప్పుడు పరమశివుడు అలాగేనని దీవించి ముందుగా నీకు అన్నం పెట్టినవారు ముక్తి పొందుతారు. పెట్టనివారు నరకం వెళతారు. మరు జన్మలో బండకింద కప్పగా జన్మిస్తారు. ఇండ్లలో ఏ శుభకార్యం జరిగినా నీకు కట్నాలు కానుకలూ ఇస్తారని ఆశీర్వదించి మాయమవుతాడు. ఈ విధంగా జీవించే మడేలయ్య వంశం వారే చాకలివారు. మాచయ్య పటం కథ : మడేలయ్య తెచ్చుకున్న అన్నాన్ని మాచయ్య తిన్నవాడు కాబట్టి ఆయన వంశస్థులు పటం సహాయంతో చాకలివారికి స్తంభపురాణం, పార్వతీ కళ్యాణం, దక్షయజ్ఞం, మడివేలు పురాణం వంటి శివపురాణాలకు సంబంధించిన కథలు చెప్తారు. ఈ పటంని వరంగల్ జిల్లా, చేర్యాల గ్రామంలో తయారు చేస్తారు. ఈ నకాశి చిత్రకారులు నాలుగు అడుగులు వెడల్పు ఆరుగజాల నుండి ఇరవై గజాల పొడవు ఉన్న నూలుగుడ్డను తడిపి దానికి గంజి రాసి ఆరిన తరువాత తిరిగి చింతగింజల గంజి రాసి ఎండబెడుతారు. తరువాత తాము స్వయంగా స్పటికాల రాళ్ళతో మసి, పిడకల బొగ్గు, తరకి చెట్టు బంకతో కలిపి తయారు చేసుకున్న రంగులతో బొమ్మలు వేస్తారు
Posts: 314
Threads: 0
Likes Received: 402 in 240 posts
Likes Given: 821
Joined: May 2019
Reputation:
13
అనేక శరీరములు ఆత్మకి రకరకాల స్థాయుల్లో company positions లాంటివి అని నా నమ్మకం మిత్రమ. నిష్కామ కర్మ వలన ఫలితం మనని ప్రభావితం చెయ్యదు మిత్రమ అని నా అభిప్రాయము.[/size] [/align]
[/quote]
Dear Dippadu mitrama, Bhagavatham lo yenno prasnalaki samadhanamulu vunnayi.
1975 lo, naaku 20 years, mugguram friends janmala meeda athmala meeda pedda discussion pettukunnamu. Migatha yiddaru 25 years, 28 years. Andaramu B Com graduates. Science tho, vedamtho sambandham leni vallame. Yinni athmalenduku,
bhagaVanthudu okkade ayithe ani 25 years friend prasna. Bhagavanthudu mitosis kana vibhajana chendadu. Naa samadhanam. Mari dinosaurus etc. jeevulu kuda athmale kada, avi yemayi poyi vuntayi, 28 years friend prasna. Avi annee kuda cheema la nundi, manushula daka yenno janmalethi vundavachhu. Bhale chitramayina samadhanam ra yidi. Alantappudu yinka yekkuva janabha vundali kada bhoomi meeda. ani 28 years friend further enquiry. Vere . dallo, vere lokallo kuda vundi vuntaru. Anthenduku, Einstein thana theories cheppadaniki yinko galaxy lo yinko universe lo yinko solar system lo yinko planet lo puttademo. Yide mana sanathana alochana vidhanam. Vyasudu chala chala goppavadu. Dhruva lokam lo dhruvudu ane vishnu bhakthudu nirantharamga . anda sthithini anubhavisthu vuntadu ani prathipadinchadu. Alagannamata. Om Namo Narayanaya anna sanathana manthranni bhagavatham dwara cheppadu. Madhyalo raka rakala karanala valla migatha kulalu ee manthraniki dooramayithe mallee Ramanajucharyula valla vhyapthi chendidi. Naa samadhanam. Veedu anni yilage deni deni ko mudi petti matladuthadu kani, yinka dinner ki pothamu, hotel moose time ayindi ani 25 years mitrudu, akali athma ramudu matram nijam annadu. 28 years friend athmalaki kuda abdeekalani pedatharu kada, thindi andariki vundani theermaniddama annadu. Nenu navvuthu nijame ani thaloopanu, hotel vepu nadusthu.
Posts: 314
Threads: 0
Likes Received: 402 in 240 posts
Likes Given: 821
Joined: May 2019
Reputation:
13
ఈ నకాశి చిత్రకారులు నాలుగు అడుగులు వెడల్పు ఆరుగజాల నుండి ఇరవై గజాల పొడవు ఉన్న నూలుగుడ్డను తడిపి దానికి గంజి రాసి ఆరిన తరువాత తిరిగి చింతగింజల గంజి రాసి ఎండబెడుతారు. తరువాత తాము స్వయంగా స్పటికాల రాళ్ళతో మసి, పిడకల బొగ్గు, తరకి చెట్టు బంకతో కలిపి తయారు చేసుకున్న రంగులతో బొమ్మలు వేస్తారు[/b][/size][/font][/color]
[/quote]
Chala manchi visesham chepparu mitrama Stories1968. Alage padma saleelaku Markandeya maharshi aradhyudu. Jains kuda sanathana dharma parayanule kani, British vallu, vallani, veru chesi, valladi vere matham ani nirnayisthe ade continue avuthondi. Alage yellamma devatha. Ee concept maree vichithram. Thala Renukammadi, Sareeram yellammadi. Vruthiki, kulaniki okkokka aradhyudu, okko devudu/devatha vunnaru. Mee laga yilanti viseshalu panchukunte andariki thelusthayi.
Posts: 11,070
Threads: 12
Likes Received: 47,591 in 9,757 posts
Likes Given: 11,982
Joined: Nov 2018
Reputation:
983
మిత్రులు ఇంకా కొద్దిగా వివరణ అడిగారు వీరి చరిత్ర గురుంచి అనుడుకని మడెలు గురుంచి
Posts: 11,070
Threads: 12
Likes Received: 47,591 in 9,757 posts
Likes Given: 11,982
Joined: Nov 2018
Reputation:
983
అంతరిస్తున్న మడేలు పురాణం కథకులు మాసయ్యలు
తెలంగాణలో ఆయా కులాలకు కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాల వ్యవస్థ ఉన్నది. ఈ పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాలు నియమంగా తమకంటూ ఒక విశిష్టమైన సాంస్కృతిక పరంపరను అనుసరిస్తూ తమను పోషించే కులాల మౌఖిక సాహిత్యాన్ని పరిరక్షిస్తున్నాయి. వీరి మౌఖిక సాహిత్యమంతా పోషక కులాల (దాతృ కులాల) సాహిత్యమే అవుతుంది. ఇందులో పోషక కులం యొక్క పుట్టుక, కులం మూలపురుషుని ఆవిర్భావం, దేవతలకు కుల మూలపురుషునికి ఉన్న సంబంధం, వృత్తి ఆవిర్భావం, వృత్తి పరికరాల పుట్టుక, నియమాలు, నమ్మకాలు మొదలైన వృత్తి ధర్మాన్ని తెలియజేసే అంశాలు. వారి కుల దైవం ప్రస్తావనతో పాటు ఆ కులం సామాజికంగా మనుగడకు కావలసిన అనేకాంశాలు పురాణాల్లో కనిపిస్తాయి. ఆశ్రిత జానపద కళలు పటం కథలు, హరి కథలు, నాటకాలు మొదలైన ప్రక్రియలతో కుల పురాణాలను ప్రదర్శిస్తూ మనుగడ సాగిస్తున్నాయి. ఈ రకంగా కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాలు ఆయా కులాలకు ఒకటికి మించి ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఏ కులాన్ని అయితే ఆశ్రయించి కుల పురాణం కథా గానం చేస్తుందో, ఆ కులం దగ్గర మిరాశి కలిగి ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో వేరే కులాన్ని ఆశ్రయించకుండా తమకు నియమింపబడిన కులాన్ని ఆశ్రయించటం వీటి ప్రత్యేకత. అయితే రజకుల కుల పురాణమైన మడేలు పురాణాన్ని కథాగానం చేసే గంజి కూటి, మాసయ్యలు అనే రెండు ఆశ్రిత కళారూపాలు ఉన్నాయి. ఇందులో గంజి కూటి వారు హరికథ రూపంలో మడేలు పురాణం కథా గానం చేయగా, మాసయ్యలు పటం ఆధారంగా మడేలు పురాణాన్ని కథాగానం చేస్తారు. ఈ మాసయ్యలను పటమోళ్లని, పటం చాకళ్లని కూడా పిలుస్తారు. కళాకారులు చెప్పే మడేలు పురాణంలో వీరి పుట్టుకకు చెందిన ప్రస్తావన కనిపిస్తుంది.
మడేలు పురాణం:
మడేలు పురాణం కూడా సృష్టి పుట్టుకతోనే మొదలవుతుంది. త్రిమూర్తుల జననం అనంతరం పార్వతీ కల్యాణం జరుగుతుంది. పురాణం లో భాగంగా దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి శివపార్వతులను పిలవ కుండానే యజ్ఞాన్ని తల పెడతాడు. అయితే పార్వతీ దేవి పిలువని యజ్ఞానికి వెళ్లగా దక్షుడు ఆమెను అవమానిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక ఆ యజ్ఞగుండంలో నే పార్వతీదేవి ఆహుతి అవుతుంది. ఇందుకు కోపించిన శివుడు తన జటాజూటం నుండి వీరభద్రుని పుట్టించి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసి అతన్ని సంహరించి రమ్మంటాడు. ఆ ప్రకారంగా వీరభద్రుడు కార్యం ముగించుకొని త్రిమూర్తుల వద్దకు వెళ్లి విషయం చెప్తాడు. అందుకు త్రిమూర్తులు కోపంతో నువ్వు మూడు తప్పులు చేశావని, అందులో ఒకటి బాలకీ దేవుని సంహరించడం, రెండు శిశు హత్య, మూడు బ్రహ్మ హత్య చేశావని కాబట్టి నీ నీడ మాపై పడకూడదని పాల గుండంలో స్నానం చేసి పాప పరిహారంగా మడివేలయ్య అవతారం ఎత్తమంటారు. వీరభద్రుడు సరేనని పాల గుండంలో దూకేేసరికి అందులో నుండి మడివేలయ్య, మాసయ్య ఇద్దరూ పుడతారు.
వీరభద్రుని అంశతో పుట్టిన మడేలయ్య లింగాన్ని ఆరాధిస్తూ మెడలో 32 లింగాలు చేతిలో నల్లని వీర గంటతో మైల ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మాసయ్య నిత్యం శివున్ని పూజిస్తూ ఎప్పుడూ శివధ్యానం లోనే ఉండేవాడు. ఆకలిదప్పులు అనేది ఆయనకు ఉండేది కాదు. ఎవరైనా వచ్చి అన్నం పెడితేనే తినేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకలితో ఉన్న మాసయ్య, మడేలయ్య అడుక్కొని తెచ్చుకున్న అన్నా న్ని అతనికి చెప్పకుండా తింటాడు. అందుకు మడేలయ్య కు కోపం వస్తుంది. నేను తెచ్చుకున్న అన్నాన్ని నువ్వు తిన్నావు కాబట్టి త్రిమూర్తుల దగ్గరకి కోపంతో ఈ విషయమై వెళ్తారు. అక్కడ వారికి విషయం చెప్పగా “త్రిమూర్తులు 33 కోట్ల దేవతల ముందర మడేలుతో నీ అన్నం తిన్న వాడు కాబట్టి నీకు అర్థివాడై ఏడాదికి ఒకసారి మీ ఇంటికి వస్తే మీ ఇంట పుడితే పురుడు కట్నం, చస్తే చావు కట్నం, పెరిగితే పెళ్లి కట్నంమివ్వాలని నీ తమ్ముడు కాబట్టి కంచం పొత్తు ఉంటుందని, అందుకు ప్రతిఫలంగా నీ వంశాన్ని కీర్తిస్తాడని” ఒప్పందం చేస్తాడు.
ఆ తర్వాత మడేలయ్య తన యొక్క పాపపరిహారం తీర్చుకోవటానికి సుర ముప్పది మూడు కోట్ల దేవతలు మునులు విడిచిన వస్త్రాలను 12 సంవత్సరాలు శుద్ధి చేస్తాడు. ఒక రోజున శివుడు మడేలయ్య వృత్తిని పరీక్షించదలచి తన పులి చర్మంతోపాటు తాను కప్పుకునే బొంతను పిండ మని కోరుతాడు. ఆ బొంత 33 గజాల పొడవుతో అందులో చీర పేన్లు, నల్లులు 101 జంతువులు ఉన్నాయని వాటిని చావకుండా పిండటం నీ తరం కాదని చెప్తాడు. అయినప్పటికీ మడేలయ్య పిండు తానని బయలుదేరుతాడు. అప్పుడు మడేలయ్య ఏనుగు మీద బొంతను వేసుకొని నీటి కోసం లోకాలన్నీ తిరిగినా కనిపించవు. ఎందుకంటే అప్పటికే పరమ శివుడు నీటిని మాయం చేస్తాడు. అప్పుడు శీతలాదేవి పరమశివుడు పెట్టిన పరీక్షను ఎలాగైనా నెగ్గాలని మన వృత్తి ధర్మాన్ని పాటించాలని మడేలయ్యతో నన్ను సంహరించి నా అవయవాలతో బొంతను పిండి పరమశివుని కోరిక తీర్చాలని కోరుతుంది. అప్పుడు మడేలయ్య శీతలా దేవి కన్నీరు పోకుండా కట్టకట్టి నీరుగాను, కనుగుడ్లు తీసి ఉడకబెట్టే కడువలుగాను, చనుబాలను పొయ్యి రాళ్ల గాను, ఆమె ఇరవై వేళ్లు కొట్టి వంటచెరకు గాను, నరములు తీసి గాలి తాళ్లుగాను,చర్మాన్ని వడ కోక గాను, రక్తం తీసి చౌడు గాను, శీతలాదేవి డొక్కను బానగాను, కడుపుల అన్నం సున్నంగాను చేసి శివుని బొంత పిండుతాడు. అలాగే అప్పుడే ఆమె పేగులను తీసి చెరువు మీద వేయగా తూటికూరగా మొలుస్తాయి. రజకులు ఇప్పటికీ తూటికూర తినకపోవడాని కి కారణంగా ఇదే చెబుతారు. మడేలయ్య శివుని బొంత పిండిన తర్వాత శివుని కొరకు వెతుకుతుండగా ఎక్కడ శివుడు కనిపించడు. దారిలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎదురుపడి మడేలయ్యను ‘ఎవరి కోసం వెతుకుతున్నావని’ అడుగుతాడు. అతను శివుని గురించి అని చెప్పగా అయితే ‘నన్ను నీ భుజాలమీద ఎక్కించుకొని తీసుకుపోతే, నేను శివున్ని చూపిస్తా’ అంటాడు. అతన్ని భుజాలపై ఎక్కించుకొని బయల్దేరి తిరుగుతుండగా ఉన్నట్టుండి అతను బరువు పెరిగి పోతాడు. ఆ బరువు మోయలేక అతన్ని క్రిందికి దింపుతాడు. వెంటనే అతను మాయమైపోయి, అతని ఎదురుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమై నువ్వు పోయేటప్పుడు నీ భార్య నువ్వు ఇద్దరు వెళ్లారు కదా మరి ఇప్పుడు ఒక్కడివే వస్తున్నావు కారణమేమని అడుగుతాడు. అప్పుడు మడేలయ్య జరిగిన విషయమంతా ఆ వ్యక్తి కి వివరిస్తాడు. ఆ విషయం విన్న వ్యక్తి ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూడమన్నాడు. అతను వెనక్కి తిరిగి చూడగానే శీతలా దేవి కనిపిస్తుంది. ఆవ్యక్తియే శివుని రూపంలో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు మడేలయ్య ‘నాకు చాకలి వృత్తి కావాలని, వండని కూడు, వడ కని బట్ట, పిండని పాడి, ఇంటిముందు తడి వస్త్రాలు పొడి వస్త్రాలు తరగకుండా ఉండాలని, ఎవరి కోకలు అయినా కట్టుకున్నా నన్ను ఏమీ అనకూడదని’ కోరుకుంటాడు. అందుకు శివుడు దీవించి నీకు అన్నం పెట్టని వారు నరకం పోతారని అభయమిస్తాడు. అలాగే పురాణంలో చాకలి వృత్తిలోని నమ్మకాలు, వివిధ కులాల ప్రస్తావన కనిపిస్తుంది.
Posts: 231
Threads: 5
Likes Received: 686 in 207 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
(11-04-2022, 03:57 PM)dippadu Wrote: సమాధానం : ఈ సంభాషణ గురించి నాకు తెలియదు మిత్రమ బర్రె. కలియుగం లో రాక్షసులు మనుషుల రూపములోనే ఈ భూలోకములో సంచరిస్తుంటారు అని ఒక నమ్మకం. నరరూపరాక్షసుడు అంటారు కదా కృరముగా బలాత్కరించిన/చంపిన వారిని.
.. నిష్కామ కర్మ వలన ఫలితం మనని ప్రభావితం చెయ్యదు మిత్రమ అని నా అభిప్రాయము. కృతజ్ఞతలు మిత్రమా
Posts: 231
Threads: 5
Likes Received: 686 in 207 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
(12-04-2022, 03:23 AM)stories1968 Wrote: అంతరిస్తున్న మడేలు పురాణం కథకులు మాసయ్యలు
తెలంగాణలో ఆయా
..
ప్రస్తావన కనిపిస్తుంది.
కృతజ్ఞతలు మిత్రమా, అడగకుండానే ఇంతా చెప్పారు.కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నేను నా మిత్రులతో మాట్లాడినపుడు వారు అన్నపుడు ఆలోచించినవి.
1. సాకలి సదువు అంటారు... ఎందుకు ఆలా అంటారు
2. మేము అడుక్కున వాళ్లము అంటారు... దాంట్లో తప్పేం లేదు అని నా అభిప్రాయం.
3. సాకలి కూర ఆంటే ఆడుకున్న కూర అని వినికిడి...
4. మేము బర్రె, పంది, కుందేలు మాంసం తింటామని ఒక మిత్రుడు హీనంగా చూసాడు. చిన్నపుడు మా అయ్య ఎదో కూర వండి తినమన్నాడు బడి నుండి రాగానే... తింటుంటే బొక్కలు సుడిలా గుచ్చుతున్నాయి ఒక పక్క మాంసం గట్టిగ వుంది... అడిగితె.. కుందేలు, పంది డి ర అన్నాడు...
5. క్రికెట్ ఆడుతుందంగా బాల్ మోరి లో పడింది... ఒకడు అన్నాడు బాల్ తీయరా.. మీరు అండ్జ్లోనే బతికేది అన్నాడు... అపుడు కొంచెం బాధేసింది చిన్నపిల్లోడ్ని..... మళ్ళీ బడి లో ఎదో పటం చెప్తుందంగా... ఒరేయ్ కర్రోడా పెన్సిల్ ఐయిరానాడు అందరి ముందు... మళ్ళీ 16 ఎల్లపుడు కర్రోడా అని కూడా అన్నారు.... ఇపుడు అంత బాధేమ్ కలగట్లేదు...
Posts: 11,070
Threads: 12
Likes Received: 47,591 in 9,757 posts
Likes Given: 11,982
Joined: Nov 2018
Reputation:
983
(12-04-2022, 06:22 AM)బర్రె Wrote: కృతజ్ఞతలు మిత్రమా, అడగకుండానే ఇంతా చెప్పారు.కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నేను నా మిత్రులతో మాట్లాడినపుడు వారు అన్నపుడు ఆలోచించినవి.
1. సాకలి సదువు అంటారు... ఎందుకు ఆలా అంటారు
2. మేము అడుక్కున వాళ్లము అంటారు... దాంట్లో తప్పేం లేదు అని నా అభిప్రాయం.
3. సాకలి కూర ఆంటే ఆడుకున్న కూర అని వినికిడి...
4. మేము బర్రె, పంది, కుందేలు మాంసం తింటామని ఒక మిత్రుడు హీనంగా చూసాడు. చిన్నపుడు మా అయ్య ఎదో కూర వండి తినమన్నాడు బడి నుండి రాగానే... తింటుంటే బొక్కలు సుడిలా గుచ్చుతున్నాయి ఒక పక్క మాంసం గట్టిగ వుంది... అడిగితె.. కుందేలు, పంది డి ర అన్నాడు...
5. క్రికెట్ ఆడుతుందంగా బాల్ మోరి లో పడింది... ఒకడు అన్నాడు బాల్ తీయరా.. మీరు అండ్జ్లోనే బతికేది అన్నాడు... అపుడు కొంచెం బాధేసింది చిన్నపిల్లోడ్ని..... మళ్ళీ బడి లో ఎదో పటం చెప్తుందంగా... ఒరేయ్ కర్రోడా పెన్సిల్ ఐయిరానాడు అందరి ముందు... మళ్ళీ 16 ఎల్లపుడు కర్రోడా అని కూడా అన్నారు.... ఇపుడు అంత బాధేమ్ కలగట్లేదు... అన్నింటికి ఆన్సర్ చేయలేను కానీ నాకు తెలిసిన కథ ఇది
ఒకసారి ఒక గ్రామం లో పండితులు, తర్క శాస్త్రజ్ఞులు, మీమాంసకులు ఇలా అందరూ కలిసి ఓ ఇంటి అరుగు మీద సభ జరుపుకుంటున్నారు.
అటు జరిగి ఇటు జరిగి వాళ్ల చర్చ ‘వైకుంఠం ఎక్కడ ఎంత దూరం లో ఉండి ఉంటుంది?‘ అనే విషయం వైపు జరిగింది.
ఒక పండితుడేమో వైకుంఠం కొన్ని వేల కోట్ల ఖగోళాలకు అవతల నిజం గా ఉన్న ఒక పాల సముద్రం లో ఉన్నదన్నాడు. తార్కికుడేమో అలా గాదు చంద్రుడు లక్ష్మీ దేవి తో పాటే పుట్టాడు ఆయనని మనం రోజూ చూడ గలుగు తున్నాము.
తన అక్క లక్ష్మీదేవికి దూరం గా చంద్రుడు ఉండడు కాబట్టి వైకుంఠం ఎక్కడో చంద్ర మండలానికి అవతల వైపు ఉండచ్చు అని తార్కికం గా చెప్పాడు. అదే గ్రామం లో ఒక చాకలి వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు తన బట్టలను తీసుకుని చెరువుకు పోతూ ఈ పండితుల నందరినీ గమనించాడు. తన దారిన తాను వెళ్లి పోయాడు. సాయంత్రం అతడు తిరిగి వస్తూ ఆ పండితులు ఇంకా గట్టి గా వాదించు కుంటూనే ఉండడం గమనించాడు.
‘ఈ పండితులు ఉదయం నుండీ సాయంత్రం దాకా ఏం వాదించు కుంటున్నారా!‘ అని సందేహం వచ్చి వాళ్లని వెళ్లి కారణం అడిగాడు. వాళ్లు ‘మేం వైకుంఠం ఎక్కడ ఉందో వాదించు కుంటున్నాము‘ అంటే
అతడు తల గుడ్డ తీసి తన తలగోక్కుని. ‘ఇంత మాత్రం దానికి ఉదయం నుండి సాయంత్రం దాకా వాదించు కోవాలా బాబయ్యా?!‘ అని ఆశ్చర్యం గా ఆడిగాడు. దాంతో ఈ సారి ఆశ్చర్య పోవడం ఆ పండితుల వంతయింది. "అంటే ఏంటి?! నీకు వైకుంఠం ఎక్కడుందో తెలుసా?! ఇంత చదువు కున్నాము మాకే తెలియని అతి సూక్ష్మ మైన ఈ శాస్త్ర రహస్యం నీకెలా తెలుస్తుంది... పో పో నీ పనిచేసుకో..." అని ఈసడింపు గా పలికారు.
"అయ్యా! నేను తమ రంత చదువుకో లేదండీ. కానీ నాకు వైకుంఠం ఎక్కడుందో చూచాయ గా తెలుసండీ... నేను మా పంతు లోరు మొన్నీ మధ్య బాగోతం (భాగవతం) చెబుతా ఉంటే ఇన్నా నండీ బాబయ్య! మా పంతు లోరు చెప్పారు.
ఆ ఏనుగు (గజేంద్రుడు) ప్రాణంబుల్ ఠావుల్ దప్పె మూర్చవచ్చె... అని, మరంత మూర్చ వచ్చే పరిస్థితుల్లో మాటలే రావు గదా బాబయ్యా. మనం చావ బోయె మనిషి చెప్పే మాటలు వినాలంటే నోటి దగ్గర చెవి బెడితే గానీ వినబడవు గదా బాబయ్యా! మరి ఆ ఏనుగు చాలా బలహీనం గా అరిచింది గదా...
‘రావే ఈశ్వరా... రావే వరదా.... రావే గోవిందా...‘ అని అయినా గూడా ఆ ఏనుగు మాటలు ఆ వైకుంఠయ్య కు వినపడ్డాయి అంటే బహుశా ఆ వైకుంఠం ఇక్కడే ఎక్కడో మహా అయితే ఓ నాలుగిళ్ల అవతల ఉండుంటుందండీ‘ అని చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు.
ఎన్నో శాస్త్రాలను అభ్యసించి వైకుంఠం ఎక్కడ ఉందో తెలియని చదువుకున్న పండితులకంటే,
‘తన పంతులయ్య చెప్పిన భక్తి వెనుక తన దైన నమ్మకం పెట్టు కుని వైకుంఠం మా ఇంటి పక్కనే ఎక్కడో ఉంది. అని తార్కికం గా సమాధాన పడి తన రోజు వారీ పని (కర్మయోగం) చేసు కుంటున్న చాకలి వాడు కొన్ని లక్షల రెట్ల నయం‘ అని అప్పట్నించీ ‘చదువు కున్న వాని కంటే చాకలి వాడు నయం‘ అన్న నానుడి పుట్టింది.
Posts: 11,070
Threads: 12
Likes Received: 47,591 in 9,757 posts
Likes Given: 11,982
Joined: Nov 2018
Reputation:
983
మేము అడుక్కున వాళ్లము అంటారు... దాంట్లో తప్పేం లేదు అని నా అభిప్రాయం.
మీరు కథ చదివేతే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఏ కులాల ఊసులు లేవు మీరు ఎక్కువ ఊహిస్తున్నారు అనుకుతున్నాను మిత్రమా
Posts: 231
Threads: 5
Likes Received: 686 in 207 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
(12-04-2022, 03:15 PM)stories1968 Wrote: మేము అడుక్కున వాళ్లము అంటారు... దాంట్లో తప్పేం లేదు అని నా అభిప్రాయం.
మీరు కథ చదివేతే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఏ కులాల ఊసులు లేవు మీరు ఎక్కువ ఊహిస్తున్నారు అనుకుతున్నాను మిత్రమా
లేదు మిత్రమా ఆలా అన్నది... మా స్నేహితుడు అమ్మ..
ముచ్చట జరుగుతుంటే... మీరు ఏమిట్లు అనగానే నేను సమాధానం చెప్పక.. చెప్పింది వల్ల కొడుకు తో
" వీళ్ళు మనల్ని సదవునివ్వలేదు... ఆడుకునేవాళ్ళు వీళ్ళు.. అన్నలు ల మరి భూమి ని కబ్జా చేసి బతికేరు... ఏవో బట్టలు ఉతికి సంపాదించేవారు.. ఇస్త్రీ షాప్ పెట్టుకుంటారు వీళ్ళు " అని
•
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(11-04-2022, 04:11 PM)stories1968 Wrote: రజకుల దైవం మడేలు మాచయ్య
ఈనాటి రజక కులం వారి మూల పురుషుడు మడేలు,
..
కింద కూర్చొమని ఆమెకు సొది చెప్పుతాడు.
అద్భుతమైన సమాచారం అందిస్తున్నారు మిత్రమ బొమ్మల బ్రహ్మ. మీరు బొమ్మలతోనే కాదు గొప్ప ఙ్ఞానముతోనూ మమ్మల్నందరిని ఎంతగానో ప్రభావితం చేస్తున్నారు మిత్రమ. ఈ మహానుభావుడి గురించి తెలుసుకుని చాలా ఆనందముగా ఉంది మిత్రమ.
మీ డిప్పడు
Posts: 231
Threads: 5
Likes Received: 686 in 207 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : ఇంద్రుడు అహల్య కి సంభంధం? రిషులు యజ్ఞనికి ఆటంకం ఎందుకు తెస్తాడు? అందరికంటే అందగాడు అంటారు నిజమేనా?
•
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(11-04-2022, 04:40 PM)stories1968 Wrote: వీరభద్రుని అవతారం అయిన మడేలయ్య సురాముప్పది కోట్ల దేవతలు విడిచిన వస్త్రాలను పాపపరిహారం
..
తరకి చెట్టు బంకతో కలిపి తయారు చేసుకున్న రంగులతో బొమ్మలు వేస్తారు మరుగున పడిపోతున్న ఎన్నో అద్భుతమైన విషయములు మీ ద్వారా తెలుసుకుని చాలా ఆనందముగా ఉంది మిత్రమ బొమ్మల/ఙ్ఞాన బ్రహ్మ.
మీ డిప్పడు
|