Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
#21
Good manchi suspence pettaru super
[+] 1 user Likes narendhra89's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
nice start bro
Like Reply
#23
Nice start
Like Reply
#24
NICE UPDATAE
Like Reply
#25
Baagundhi
Like Reply
#26
నైస్ స్టార్ట్ చేశారు, కొనసాగించండి....... తరువాత భాగం రాయండి బ్రదర్
Like Reply
#27
Good start
Like Reply
#28
Nice update
Like Reply
#29
Nice update
Like Reply
#30
Nice story
Like Reply
#31
Update plz
Like Reply
#32
ఎపిసోడ్ ~ 2

బైట జరిగిన సంఘటనకి పెద్ద పెద్ద ఊరుముల శెబ్దానికి, లోపల ఉన్న రాధా అరుపులు ఎవ్వరికి వినిపించలేదు, బోరుమంటూ ఏడుస్తున్న పెద్దావిడ రాధకి చెపుదామని లోపలికి వచ్చి రాధా ఉన్న స్థితికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది... బిడ్డ సగం బైటకి వచ్చి ఓపిక లేక స్పృహ కోల్పోయి పడి ఉంది, తన పెద్దరికాన్ని ఉపయోగించి రాధా అవసరం లేకుండానే చిన్నగా వీలు చిక్కించుకుని బిడ్డని బైటికి లాగేసింది.

గుక్క పెట్టి ఏడుస్తున్న మగ బిడ్డని చూసి ఏడుస్తూ "ఏం అయ్యా పుడుతూనే మీ అయ్యని మింగేసినావ?" బిడ్డని రాధ పక్కన పండేసి "దేవుడా చిన్న వయసులో ఈ తల్లికి ఆ పసిబిడ్డకి ఎన్ని కష్టాలు ఇచ్చినావు తండ్రి" అని కళ్లెమ్మటనీళ్లతో బైటికి వెళ్లి విషయాన్నీ రోడ్ మీద ప్రసాద్ మృతదేహన్ని పరిశీలిస్తున్న వాళ్ళకి చెప్పింది అక్కడున్న నలుగురు ఆడవాళ్లు లోపలికి వెళ్ళగా మిగతా వారు అంబులెన్సు కి ఫోన్ చేసారు.

రాధని చూడటానికి వచ్చిన వాళ్లలో నర్స్ ఉండటంతో చెయ్యాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేసింది, ఈలోగా అంబులెన్సు వచ్చి శవం రోడ్ పక్కన పడి ఉండటం మొహం కూడా గుర్తుపట్టలేకుండా ఉండటంతో బాడీని ఎక్కించుకుని వెళ్లిపోయారు.

రాధకి స్పృహ వచ్చింది, చుట్టు పక్కన ఎవరు లేరు పక్కన ఉన్న పెద్దావిడ రాధ లేచిందని గమనించి ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది, అంతా విన్న రాధకి మళ్ళీ కళ్ళు తిరిగినట్టనిపించింది లేద్దాం అంటే ఒళ్ళు సహకరించట్లేదు, పక్కనే ఉన్న బిడ్డని చూసుకుంది కానీ దెగ్గరికి తీసుకోలేదు. ప్రసాద్ ని ఆఖరి చూపు కూడా చూసుకోలేక పోయానని అలా రాత్రంతా ఏడుస్తూనే ఉంది.

పొద్దున్నే లేచింది పెద్దావిడ సాయంతో చేతిలో బిడ్డని ఎత్తుకుని సచివాలయానికి వెళ్లి అస్థికలు తీస్కుని చెయ్యాల్సిన కార్యక్రమం చేసి ఇంటికి వచ్చి కింద కూలబడిపోయింది, చేతిలో బిడ్డని చూస్తూ.

ఇప్పుడు బిడ్డ మీద ప్రేమ చూపించడం తనకి అంత ముఖ్యమనిపించలేదు ముందు బతకడానికి ఎలా అనే ఆలోచనలో పడిపోయింది అది అప్పుడే పుట్టిన బాబు తో.....పదిహేను రోజుల్లో ప్రసాద్ కి సంబంధించిన LIC డబ్బులు వచ్చాయి, రాత్రంతా కూర్చుని లెక్కేసింది ఈ డబ్బులు జాగ్రత్తగా వాడితే మూడు నాలుగు సంవత్సరాలు సరిపోతాయ్, తరువాత చేసుకోడానికి జాబ్ చూసుకుందాం అని అనుకుంది.

అక్కడ నుంచి ఇల్లు మార్చింది, ఒక్కడినే పిల్లాడితో వేగలేవు అని పెద్దావిడ చెప్పినా వినిపించుకోలేదు, తన ఒంటరి జీవితాన్ని బాగానే నెడుతుంది కానీ బిడ్డని ప్రేమగా చూసుకోడంలో విఫలమైంది, బిడ్డకి నిద్ర, కడుపు నిండా పాలు అందాయే కానీ తల్లి ప్రేమ దొరకలేదు, ఎప్పుడు కోపంగా ఉండేది దానికి తోడు చిన్న పిల్లల తో అంత ఈజీ కాదు కదా, ఆకలేసిన ఏడుస్తారు, నిద్ర వోచిన ఏడుస్తారు అది తప్ప ఏం తెలుసు ఆ పసికందుకి...బిడ్డ ఏడుపుని సహించలేకపోయేది చిరాకు కోపం ఎక్కువ వచ్చేసేవి. ఎప్పుడైనా బిడ్డ ఏడుస్తే అప్పుడప్పుడు తన వల్ల కాక అలానే పట్టించుకోనట్టు కూర్చునేది.

స్నానం చేపించడం, పాలు ఇవ్వడం, నిద్రపుచ్చేది కూడా కాదు బిడ్డకి ఏడుపొచ్చి ఏడ్చి ఏడ్చి అలిసిపోయి నిద్ర పొడమే.. బిడ్డ క్రమంగా పిల్లాడిగా మారాడు ఇక తాను జాబ్ చూసుకోవాలనుకుంది పక్కనే ఉన్న కాలేజ్ లో టీచర్ గా జాయిన్ అయింది. పిల్లాడికి కావాల్సిన తిండి, పాలు పక్కన పెట్టి ఇంటి కిటికీ కి చీరతో కట్టేసి ఇంట్లోనే వదిలేసి కాలేజ్కి వెళ్లిపోయేది, సాయంత్రం రాగానే కట్టు విప్పేది, పిల్లడు అక్కడే తిని అక్కడే ఏరిగేవాడు, ముడ్డి కూడా రాధ ఇంటికి వచ్చాకే కడిగేది, ఇద్దరు రోబోట్స్ లాగే ఉండేవారు పిల్లాడు కూడా తల్లి దెగ్గరికి వెళ్ళడానికి భయపడేవాడు....ఇలా వాళ్ళ ఇద్దరి జీవితాలు సాగిపోతుండగా... పిల్లాడిని కాలేజ్ లో జాయిన్ చేయించాల్సొచింది.

ఎలాగో రాధ కాలేజ్ లో పనిచేస్తుండడం వల్ల తన కొడుకు కి ఫీజు లేకుండా జాయిన్ చేసుకున్నారు, హమ్మయ్య అనుకుంది, కాలేజ్ రిజిస్టర్ లో రుద్ర అని పేరు రాపించి నర్సరీ లో వదిలేసింది.

హాయ్ రాధా మేడం తనేనా మీ బాబు హౌ క్యూట్ కం హియర్ వాట్ ఈస్ యువర్ నేమ్?

ఏంటి బాబు ఏం మాట్లాడడా?

రాధా : కొంచెం సైలెంట్ గా ఉంటాడు.

నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి.

బిక్కు బిక్కు మంటూ చుట్టూ చూసాను లోపల భయంగా ఉంది... ఎప్పుడు ఇంతవరకు బైట వాళ్ళతో మాట్లాడింది లేదు, అస్సలు ఇంట్లో ఉన్న అమ్మ తోనే మాట్లాడను ఇక బైట వాళ్ళు చాలా దూరం.

అమ్మ వెళ్ళిపోతుంది నాకు అంతగా భయం వెయ్యలేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఒంటరే, అది నాకు అర్ధంకాకపోయినా నా మనసుకి తెలుసనుకుంటా, టీచర్ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది.... వెళ్లిపోతున్న అమ్మని చూసాను వెనక్కి చూస్తుందేమో అని కానీ చూడలేదు చూడదు అని నాకు తెలుసు.

నా బుడ్డ బ్యాగ్ వేసుకుని లోపలికి వెళ్లి బెంచ్ లో కూర్చున్నాను, టీచర్ అందరికి నా పేరు రుద్ర అని పరిచయం చేసింది, మొదటి సారి నా పేరుని నేను వినడం.... మధ్యాహ్నం లంచ్ బెల్ లో అమ్మ వచ్చి టిఫిన్ బాక్స్ అందించింది, బాక్స్ మూత తీసి స్పూన్ వేసి నాకు తినిపించాలనిపించిందేమో కానీ నాకు ఆ అలవాటు లేదు కదా తన చేతిలో బాక్స్ తీసుకుని టక టక తినేసాను... అవును నాకు తినిపించమని గోల చెయ్యడం, మారం చేయడం, ఏడవటం ఇవేమి నాకు పరిచయం లేని పనులు మధ్యలో అమ్మ రుద్ర అని పిలిచింది కానీ నేను పలకలేదు అది నా పేరని నాకు తెలియదు. నా పేరు రుద్ర అని నాకు అర్ధమవటానికి ఒక నెల రోజులు పట్టింది, రుద్ర అనే పేరు నాదే అని నాకు అనిపించడానికి.

అలా మాములు మనిషిలా కాకుండా ఒక వింత ఎలియన్ లా గడుపుతూనే ఐదవ తరగతి వరకు వచ్చాను, అందరు నన్ను చూసి నవ్వుకునే వాళ్ళు కొంతమంది జాలి పడేవాళ్ళు ఇంకొంతమంది రాధా టీచర్ కొడుకునని భయపడేవారు, నేను కూడా ఎప్పుడు ఎవ్వరిని పట్టించుకునే వాళ్ళని కాదు నా లోకం నాదే.. ఒంటరిగా ఉండి ఉండి అలవాటు అయింది.

ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లలని ఎత్తుకొడం, మారం చేయడం చూస్తే నవ్వొచ్చేది నాకు కానీ లోపల ఎలాగో ఉండేది బాధ అంటే అదేనా? ఏమో...

అందరూ నన్ను వింతగా చూసే వాళ్ళు టీచర్స్ తో సహా ఎందుకంటే చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఒక జట్టుగా ఒక తోడుగా ఉండేవాళ్ళు..ఇంకోటి ఏంటంటే నా మొహం అందులో ఏ ఫీలింగ్స్ ఉండవు అవును నాకు బాధ, భయం, కోపం, ఏడుపు అవతల వాళ్ళని ఇష్టపడడం, కలుపుకుపోడం ఇవేమి తెలియవు, ఎందుకు అవసరమో కూడా నాకు తెలియవు.

రేపటి నుంచి ఫిఫ్త్ క్లాస్ అమ్మ కూడా నాకు క్లాస్సేస్ చెప్పడానికి వస్తుందని విన్నాను, పొద్దున్నే స్నానం చేయడానికి బాత్రూం లోకి వెళ్ళాను, ఇంతకముందు అమ్మ చేపించేది కానీ తను నా దెగ్గరికి వచ్చేకోద్ది నాకు భయం ఇంకేదో బాధ వచ్చేవి అది నాకు నచ్చేది కాదు అందుకే ఒక రోజు నేనే చేస్తానని చెప్పాను తను కూడా ఏమనలేదు, సాధ్యమైనంత వరకు తనకి దూరం గానే బతికేవాడ్ని, ఇంతకముందు ఒకటే రూమ్ లో ఉండే వాళ్ళం కానీ ఇప్పుడు ఇది పెద్ద ఇల్లు రెంటే కానీ బాగుంది అమ్మ స్కూటీ కూడా కొనుక్కుంది, స్కూటీ కొన్న సాయంత్రం అడిగింది వస్తావా బైటికి వెళదాం అని కానీ స్కూటీ ని తీక్షణంగా చూసి లోపలికి వెళ్ళిపోయాను, వెనక ఏదో సౌండ్ వచ్చింది నేను పట్టించుకోలేదు.

ఇవన్నీ గుర్తుచేసుకుంటూ స్నానికి వెళ్ళాను, వాటర్ హీటర్ ప్లగ్ లో నుంచి తీసి బకెట్ తీసుకుని బాత్రూం లోకి వెళ్ళాను, ఈ బకెట్ మోస్తునప్పుడల్లా నాకు ఒక డౌట్ అది డౌట్ కూడా కాదు ఎలా అంటే మా క్లాస్ లో బెంచ్ జరపాలంటేనె నలుగురు పడతారు కానీ నేను నా బొటన వేలితో దానితో ఆడుకోగలను.

ఎన్నో సార్లు మా అమ్మ స్కూటీని గేట్ కి అడ్డంగా పార్క్ చేస్తే సైడ్ లాక్ ఉన్న కూడా ఒంటి చేత్తో పక్కకి జరిపేవాడ్ని, నేను చేసే చాలా విషయాలు నా తోటి పిల్లలు చేయలేకపోడం నాకు వింతగా అనిపించేది.

అందుకే నేను వాళ్ళలా నటించడం మొదలు పెట్టాను, మార్కులు ఎక్కువ వచ్చినా ఏదైనా స్పోర్ట్స్ లో ఫస్ట్ వచ్చిన అందరి చూపు నా మీద పడుతుంది అందుకే నటించడం మొదలు పెట్టాను ఎగ్జామ్స్ లో అన్ని రాసి కావాలని ఒక మూడు నాలుగు ప్రశ్నలు వదిలేసేవాడిని, ఎవరైనా ఏదైనా సహాయానికి పిలిచినప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారో నా వయసు వాళ్ళు ఏ పని చేస్తున్నారో అది మాత్రమే చేసేవాడ్ని, ఇక ఆటల్లో కూడా గెలిచే సమయాల్లో ఏదో ఒకటి చేసి ఓడిపోవడం అంటే నాకు సరదా చూసే వాళ్ళకి బాగోదు కానీ నాకు అది నచ్చింది.

అన్ని తలుచుకుంటూ స్నానం చేసి యూనిఫామ్ వేసుకుని రెడీ అయ్యి నా రూమ్ నుంచి బైటికి వచ్చాను అమ్మ సోఫా లో కూర్చుని టిఫిన్ తింటుంది, కిచెన్ లోకి వెళ్లి అక్కడే తినేసి బైటికి వచ్చి బ్యాగ్ వేసుకున్నాను.

అమ్మ ఇంటి లాక్ గేట్ లాక్ వేసి స్కూటీ స్టార్ట్ చేసింది, ఎప్పటి లానే తనని తగలకుండా వెనక్కి జరిగి బ్యాగ్ మధ్యలో పెట్టి కూర్చున్నాను.

కాలేజ్ కి వెళ్ళాం అమ్మ స్కూటీ పార్క్ చేసి వెనక్కి తిరిగింది నాతో ఏదో మాట్లాడానికి అన్నట్టు కానీ నేను సైలెంట్ గా క్లాస్ లోకి వెళ్ళిపోయాను.

క్లాస్ లోకి వెళ్లి కూర్చుకున్నాను పాత మొహాలతో పాటు కొన్ని కొత్త మొహాలు కూడా కనిపించాయి వెళ్లి ఎప్పటిలానే చివరి బెంచ్ లో కూర్చున్నాను.

ఇంకొంత మంది కొత్త స్టూడెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ క్లాస్ లో వదిలి వాళ్ళకి ముద్దులు పెడుతున్నారు నాకు అది చూడాలనిపించింది, లోపల నా గుండెని ఎవరో చెక్కిలిగింతలు పీటినట్టనిపించింది.

కొంచెం సేపటికి ప్రేయర్ అయిపోయాక అందరం క్లాస్ కి వెళ్ళాం, అమ్మ లోపలికి వచ్చింది.

రాధ : హాయ్ స్టూడెంట్స్ మీలో చాలా మందికి నేను తెలుసు నా పేరు రాధ ఇవ్వాల్టి నుంచి నేనే మీ క్లాస్ టీచర్ ని, ఇంకా మీ మాథ్స్ టీచర్ ని.

అందరి అటెండెన్స్ తీస్కుంటూ రుద్ర అని నా వైపు చూసింది ప్రెసెంట్ మేడం అన్నాను తనని చూడకుండానే....కానీ ఎందుకో చూడాలనిపించి చూసాను నన్నే కోపంగా చూస్తుంది వెనక బెంచ్ లో కూర్చున్నా అనేమో...

అటెండెన్స్ అయిపోయాక రాధ అందరిని చూస్తూ : స్టూడెంట్స్ ఫస్ట్ డే క్లాస్ చెప్పను లే కానీ ఒకొక్కరు మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి అని చైర్ లో కూర్చుంది.

అందరూ వరసగా నిల్చొని ఒక్కొక్కరి పేర్లు వాళ్ల గురించి చెప్తున్నారు, ఒక పావుగంట తరువాత నా చెవులకి "ఐయామ్ రాజేశ్వరి, ఫ్రెండ్స్ కాల్ మీ రాజి " అని వినపడింది.. అదొక్కటే ఎందుకు వినపడిందంటే రాజి అనే అమ్మాయి నేను నర్సరీ లో ఉన్నప్పటినుంచి ఉంది తనతో నాకొచ్చిన గొడవ ఏంటంటే ఈ అమ్మాయి నన్ను చూస్తూనే ఉంటుంది ఆ విషయం నాకు తెలుసని తనకి తెలియదు, ఒక వేళ నాకు తెలుసని తనకి అనిపిస్తే వచ్చి నాతో మాట్లాడుతుందని నా భయం, అందుకే తనని నేను చూడను తను నా వైపు చూస్తుందని తెలిసిన నాకు తెలియనట్టే ప్రవర్తిస్తుంటాను, అది కాకా రాజి ఈ మధ్యనే హాస్టల్ లో జాయిన్ అయింది అని నాకు తెలుసు ఇంకా షార్ప్ గా ఆక్టివ్ గా ఉంటుంది నేను అందరిలా కాను అని తనకి తెలియకుండా ఉండటానికి ఎక్కువ కష్టపడాల్సొస్తుంది మరి ఎప్పుడు నన్నే చూస్తుంటుంది ఈ అమ్మాయి.

చివరిగా నా వంతు వచ్చింది లేచి నిల్చున్నాను అందరు ఒకసారి నవ్వారు అవును మరి నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో మా క్లాస్ వాళ్ళకి తెలుసు కదా...

"మై నేమ్ ఈస్ రుద్ర
ఐయామ్ టెన్ ఇయర్స్ ఓల్డ్
మై మదర్ నేమ్ ఈస్ రాధ".

ఇక చెప్పడం నాకు ఇష్టం లేక కూర్చున్నాను.

రాధా : రుద్ర స్టాండ్ అప్

లేచి నిల్చున్నాను.

రాధ : టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ యువర్ హాబీస్, ఫేవరెట్స్..

రుద్ర : ఐ హావ్ నో హాబీస్ నో ఫేవరెట్స్, ఐ హావ్ నో ఫ్రెండ్స్ నొథింగ్ ఐయామ్ అల్ అలొన్ అండ్ ఐ లవ్ ఇట్. అని కూర్చున్నాను.

రాధ కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యి ఏం మాట్లాడకుండా కూర్చుంది.

అలా కాలేజ్ అయిపోగానే బ్యాగ్ తీసుకుని బైటికి వస్తుంటే నా ముందు ఉన్న ఒకడు నన్ను చూపిస్తూ నవ్వుతు ఏదో చెప్తున్నాడు మిగతా వాళ్ళు అది విని నన్ను చూస్తూ నవ్వుతున్నారు, నాకు అది నచ్చలేదు ఇప్పుడే కాదు నా ఇంతక ముందు తరగతుల నుంచి జరుగుతుందే ఇది కానీ నాకు ఈసారి సైలెంట్ గా ఉండబుద్ది కాలేదు వెళుతు వెళుతు వాడి సైకిల్ వెనక టైర్ మీద నా షూ తో తొక్కాను కొంచెం సౌండ్ వచ్చింది కానీ ఎవ్వరు చూడలేదు ట్యూబ్ పగిలి ఉండాలి, సైలెంట్ గా వెళ్లి అమ్మ బైక్ ఎక్కి కూర్చున్నాను.

వెళ్లి ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి బైటకి వచ్చాను, నాకు ఆకలేస్తేనో దాహం వేస్తేనో తప్ప రూమ్ నుంచి బైటికి రాను.

నేను వెళ్లి తినేసి నా రూమ్ కి వెళ్ళిపోయాను, చీకటి పడుతుండగా అమ్మ సామాను తీస్కుని ఇంటికి వచ్చింది, నేను బైటికి రాలేదు, కొంచెం సేపటికి అమ్మ నా రూంకి వచ్చింది.

రాధ : రుద్ర తిన్నావా?

రుద్ర : తిన్నాను.

రాధా : హోమ్ వర్క్.

రుద్ర : చేసుకున్నాను.

రాధా : ఇంకేమైనా కావాలా?

రుద్ర : తన వైపు చూడనుకూడా చూడలేదు, కొంచెం సేపు చూసి కోపంగా వెళ్లిపోయింది.

ఇవి నాకు కొత్తేం కాదు, తనకి ఎందుకు కోపం వచ్చిందో నాకేం తెలుసు ఇలాంటి సంఘటనలేవి నన్ను ఇబ్బంది పెట్టవు, ప్రశాంతం గా కళ్ళు మూసుకున్నాను పడుకోడానికి.

అవును నాకు తెలిసిన ప్రశాంతత ఇదే కానీ కళ్ళు మూసుకుంటే నిద్ర రాదు, ఎందుకో నాకు తెలీదు, మా అమ్మకి నేనంటే ఎందుకు ఇష్టం లేదో కూడా నాకు తెలీదు ఏది ఏమైనా దూరమేదో దెగ్గరేదో ఎవరికీ తెలుసు, ఇక మా నాన్న తను ఎప్పుడు చెప్పలేదు నేను అడగలేదు మొదట్లో అమ్మంటే భయం ఉండేది అందుకని దెగ్గరికి వెళ్లలేకపోయేవాడ్ని ఆ తరువాత అవసరం లేకపోయింది అది కాక తను నాకోసం ఎప్పుడు ఎదురు చూసింది లేదు, నా అవసరాలని తీరుస్తుంది అంతే తప్పించి ఎప్పుడు ఐదు నిముషాలు కూడా తను నాతో మాట్లాడింది లేదు, ఇప్పుడు నేను మాట్లాడట్లేదు.

నీళ్లు తాగుదామని చూస్తే బాటిల్ కాళీగా ఉంది నింపుకుందామని బైటికి వెళ్ళాను హాల్లో సోఫా లో కూర్చుని ఎవరితోటో ఫోన్ లో నవ్వుతు మాట్లాడుతుంది, ఇది కూడా నాకు కొత్తేం కాదు గత ఆరు నెలలుగా రోజు రాత్రి ఇదే జరుగుతుంది.

నన్ను చూసి నవ్వుతున్న తన మొహం ఆగిపోయింది నా వల్ల తనకెందుకు ఇబ్బంది అని నేను ఫాస్ట్ గా లోపలికి వచ్చేసాను బెడ్ ఎక్కి కళ్ళు మూసుకున్నాను ఎలాగో నిద్ర రాదూ అని నాకు తెలుసు.

ఇంటి పక్కనే లైబ్రరీ ఒకటి కట్టారు కొత్తగా ఓపెన్ అయింది ఒక సారి వెళ్లి చూసి రావాలనుకున్నాను.

కళ్ళు మూసుకున్నాను కానీ మా అమ్మ నవ్వులు నాకు వినపడుతూనే ఉన్నాయి నేను కూడా అలా నవ్వగలనా అని అనుకున్నాను ఎంత ప్రయత్నించినా నా మొహం లో నవ్వెందుకు రాదో నాకు అర్ధం కాదు, అందరిలా నేను కూడా నవ్వగలనా అని నాకే సందేహంగా ఉండేది.... ఇలా నా బుర్ర అలిసి పోయి దానంతటా అది నిద్ర పోయే వరకు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను.....

Like Reply
#33
Conchem confused
Like Reply
#34
Uffff...... what a tragic start..... అంత నిర్దయగా ఉండగలరా? బహుశా ఉండే ఉంటారు. తల్లి ప్రమ కొరవడితే మరమనుషులానే ప్రవర్తిస్తారనిపిస్తుంది. ఇప్పుడు రుద్ర ఉన్న మానసిక స్థితిలో, తన తల్లి వేరే వాడిని చూసుకున్నా... రుద్ర కేర్ చేయడనిపిస్తుంది... which is not in general scenario.

But i very much liked his intro in class. "I've no hobbies, no favorites, no friends nothing. I'm all alone and i love it" 
RUDRA - THE SUPERRRR MANNN.... 
Be only one Rudra of course you can join "Raji" later... Heart

ప్రియ శత్రువు ---- అమ్మేనా? Cool

ధన్యవాదాలు..... నాకు నచ్చింది  Namaskar
[+] 9 users Like kummun's post
Like Reply
#35
Superb update
Like Reply
#36
Hero intro ne adiripoindi takulsajal garu.

E story lo Rudra laga miru kuda bhale cheptaru sir, nenu story write ne kadu naku story rayadam radu ani. kani chimpestatu miru
Like Reply
#37
గుండెలు బరువు ఎక్కాయి గురు
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
#38
emotional and very nice story bro
[+] 1 user Likes Akmar's post
Like Reply
#39
Chala bagaa raseru mitrama
Most Emotional story

All the best
[+] 1 user Likes Nautyking's post
Like Reply
#40
Beautiful update bro
Like Reply




Users browsing this thread: 103 Guest(s)