Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
ఏంటి boss RRR సినిమా చూపిస్తున్నారు.... చాలా బాగుందండి అప్డేట్. on Serious note మీరు రైటర్ గా try చేయొచ్చు....
[+] 1 user Likes prash426's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super update
Like Reply
ఎపిసోడ్ ~ 28

చిన్నా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తరువాత అను ఏడుస్తూ హాల్లోనే కూలబడిపోయింది,

అను : నా వల్లే వెళ్ళిపోయాడు నా ఆవేశం వల్ల నేనే పోగొట్టుకున్నాను, మా అమ్మ చెప్పుడు మాటలు విని అనవసరంగా సంతకాలు పెట్టేసాను, వీళ్ళకంటే విక్రమ్ గురించి తెలీదు కానీ నాకు తెలుసు కదా నా కోసం నా సంతోషం కోసం ఏమైనా చేస్తాడు, నన్ను కళ్ళలోకి చూసి చెప్పమన్నాడు అప్పుడైనా అర్ధం చేసుకోవాల్సింది, అయినా ఎవరో దారిన పోయే అమ్మాయి కోసం కట్టుకున్నదాన్ని నన్ను వదిలేస్తాడా?

నాకంటే ముఖ్యమైనదా, ఇదే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా! తనకోసం నేను అన్ని వదులుకుని నన్ను ఎటైనా తీసుకెళ్లిపొమ్మని అడిగాను కదా నన్ను ఎలా వదిలేయాలనిపించింది, నా కోసం ఒక అమ్మాయిని వదలలేకపోయాడు. ఏమైనా కానీ విక్రమ్ తన జీవితం తను చూసుకున్నాడు ఇక నేను ఎందుకు ఆగిపోవాలి ఇక నా దారి నాది.

సుష్మ : ఇంకా ఎందుకే ఏడుస్తావ్ శని వదిలింది అనుకో, ఆ తాళి తెంచి అవతల పారేయ్.

నాకు మొదటి సారి మా అమ్మ నాకు నీచంగా కనిపించింది, తాళి తెంచి మా అమ్మ మొహం మీద విసిరి కొట్టాను.

పవిత్ర : ఆ పూసల దండ కూడా వాడు ఇచ్చిందే కదా తీసి పారెయ్.

పూసల దండ పట్టుకుని చూసుకున్నాను, నా జీవితం లో నాకు అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఈ దండ మాత్రమే, దీని విలువ నేను విసిరేసిన తాళి కంటే ఎంతో పవిత్రమైంది విలువైంది, మొదటి సారి నా మొగుడు ఎంతో ఇష్టం గా ప్రేమ గా తను కష్టపడి సంపాదించిన డబ్బు తో కొనిచ్చాడు.

ఇక్కడున్న అందరి మీద చిరాకు వేసింది, ప్రాణం అయినా పోగొట్టుకుంటాను కానీ ఈ దండ మాత్రం తీయను, ఎదురు చూస్తాను ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను నా ప్రాణం పోయెదాకా చూస్తాను, ఎప్పుడో అప్పుడు తన మీద ప్రేమ తగ్గాకపోదా? నేను గుర్తురాకుండా ఉండకపోనా, నాకోసం ఎప్పటికైనా రాకపోడ, బతకాలన్న డబ్బులు కావాలి కదా వాటి కోసమైనా నా కోసం వస్తాడా?

దేవుడా ఎలాగోలా ఏదోకటి చేసి డబ్బులు అవ్వగోట్టో, లేక కామం మొత్తం దీంచేసి నా మీద ఉన్న ప్రేమ గుర్తు చేసి ఏదో ఒకటి చేసి నా దెగ్గరికి పంపించేయ్ ప్లీజ్ ప్లీజ్.......

పవిత్ర : అనురాధ దండ......

అను : అమ్మా! నువ్వు నాన్నా, మీరంతా ఇక్కడనుంచి వెళ్లిపోండి, ఇక మీరు (పవిత్రని ఉద్దేశించి ) ఎందుకోచ్చారో తెలుసుకోలేనంత చిన్న పిల్లని కాను, వెళ్లిపోండి.

జయరాజ్ : (కోపంగా ) అనురాధా?

అను : గెట్ లాస్ట్ అని గట్టిగా అరిచి బెడ్ రూమ్ లోకి వెళ్లి గట్టిగా తలుపు విసిరి కొట్టింది.

అందరూ షాక్ లో అలానే స్థంబాల్లా నిలబడిపోయారు.

.......................................................................

సునీల్ :

ఎందుకు ఆదిత్య ఈ విధం గా ప్రవర్తిస్తున్నాడు అది ఒక అమ్మాయి కోసం, నిజంగా తనని అంతగా ప్రేమించాడా?

కావాలంటే మానస ని చేస్కోవచ్చు, ఆదిత్య అడగలే కానీ నా కూతురు పూజ ని కళ్ళు మూసుకుని ఇచ్చేస్తాను.

ఏ మనిషైనా ఓక వ్యక్తిని ఇంతలా ప్రేమిస్తాడా, ఇలా ఐతే ఆదిత్య మాట వినడు, వెంటనే స్టేషన్ కి వెళ్ళాలి.

సునీల్ స్టేషన్ కి వెళ్లేసరికి ఇరవై లాటీలు విరిగిపోయి ఉన్నాయ్, సెల్ లో విక్రమ్ లేడు.

సునీల్ : తను ఎక్కడ?

సెక్యూరిటీ అధికారి : సర్ ఇప్పుడే విడిపించుకుని ఒక్కరే నడుచుకుంటూ వెళ్లిపోయారు మేము వస్తామన్నా వద్దు అని చెప్పి వెళ్లారు సర్.

సునీల్ : ఒహ్హ్ అలాగా, సరే

అని బైటికి వచ్చి, ఫోన్ తీసి "గార్డ్స్ సర్ ఎక్కడున్నారో తెలీదు అన్ని చోట్లా వెతకండి దొరికితే జాగ్రత్తగా సెక్యూరిటీ ఇచ్చి ఇంటికి తీసుకురాడానికి ట్రై చెయ్యండి" అని ఆర్డర్ వేసాడు.

గార్డ్స్ వెతకడం మొదలు పెట్టారు.

.......................................................................

రవి :

విక్రమ్ అన్న ఏంటి ఇంకా రాలేదు ఈపాటికి రావాలి కదా, అయినా ఈ రెండు రోజుల్లో ఎంత బాగా కలిసిపోయాడు, ఎంత మంచి వాడు, తనకి తెలీదు కానీ అన్నకి (నా కోసం ప్రాణాలకి ప్రమాదం అని తెలిసినా వచ్చాడు, నేను అంత మందిని చంపి రక్తం తో తన ముందు నిలబడితే కనీసం పానిక్ అవ్వలేదు) ధైర్యం ఎక్కువే,(చెల్లి గురించి ఎంత బాగా ఆలోచించాడు నాకు కూడా తట్టలేదు )ముందు చూపు ఎక్కువే, తెలివి ఎక్కువే, (డోర్ తన్నిన్ది గుర్తు తెచ్చుకుని) బలము ఎక్కువే.

అన్న గురించి అన్నకే తెలీదు, అయినా తన స్నేహం చాలా గొప్పది, అస్సలు నేను రజినికి పెట్టినట్టే అన్నకి కూడా ట్రాకర్ పెట్టాను కదా ఎక్కడున్నాడో చూద్దాం అని టాబ్ తీసాడు.

ముందు చెల్లిది చూద్దాం, అదేంటి చెల్లి గోవా లో ఉందా ఎప్పుడు వెళ్ళింది అన్న నాకు కనీసం చెప్పలేదే, అన్న ఏమాలోచించిన కరెక్ట్ గానే ఆలోచిస్తాడు, ముందు అన్న ఎక్కడున్నాడో చూద్దాం.

ఒక సారి విక్రమ్ లొకేషన్ చూసి రవికి చెమటలు పట్టాయి.

అదేంటి అన్న సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో ఉన్నాడు, కొంపదీసి ఇవన్నీ చూసి భయపడి స్టేషన్ కి పోలేదు కదా, ముందు ఇక్కడనుంచి ఎస్కేప్ అవ్వాలి, లేదు సెక్యూరిటీ ఆఫీసర్లు బయల్దేరితే అన్న కూడా బైలుదేరుతాడు కదా ఈ టైం చాలు నేను తప్పించుకోడానికి, అన్న బైటికి వచ్చే వరకు చూద్దాం.

ఒక గంట కి విక్రమ్ స్టేషన్ నుంచి బైటికి రావడం ట్రాకర్ లో రవి గమనించాడు, అన్న ఇంటి రూట్లో రావట్లేదు, ట్రాకర్ ఇంత స్లో గా velthundante నడుస్తున్నాడు, అదేంటి బార్ కి వెళ్తున్నాడు అన్నకి మందు అలవాటు లేదు కదా, ఏదైతే అది అయింది ముందు అన్నని కలుద్దాం. అని టాబ్ తీస్కుని విక్రమ్ లొకేషన్ చూసుకుంటూ బైలుదేరాడు.

.......................................................................

గోవా లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక.

రజిని : అక్కా ఎక్కడ స్టే చేద్దాం.

పూజ : హోటల్ ఏ మనది మనకి ఆ ప్రాబ్లెమ్ యే లేదు పదండి.

రాజు : రజిని గారు బాగా అలిసిపోయినట్టున్నారు కూల్ డ్రింక్ ఏమైనా తీసుకు రమ్మంటారా.

రజిని : అవును రాజు గారు ఏదైనా తీసుకురండి.

రాజు : మానస నీకు? పూజ గారు మీకు?

మానస : (వెక్కిరింతగా) మాకేం వద్దులే రాజు గారూ.. మీరు వెళ్లి తెచ్చుకోండి మేము వెయిట్ చేస్తాము.

రాజు ఇబ్బందిగా మానస వైపు చూసి రజిని వైపు ఒక నవ్వు నవ్వాడు.

రజిని : పదండి రాజు గారు వెళదాం.

వాళ్ళు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే పూజ మనసాని చూస్తూ (వాళ్ల ఇద్దరినీ చూడు అన్నట్టు ) ఒక సైగ చేసి నవ్వింది.

ఇద్దరు నవ్వుకున్నారు.

హోటల్ రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి, చీకటి పడుతుండగా బోంచేసి, అందరు బీచ్ కి వెళ్లారు, రాజు కొన్ని కట్టెలు తెచ్చి మంట వేసి మానస, రజిని పూజలను పిలిచాడు, అందరూ ఆనందం గా ఎగురుతు ఆడుతూ పడుతూ ఉంటే మానస మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంది.

రజిని : వదిన ఇలా రా నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు.

మానస సైలెంట్ గా ఉంది.

అది గమనించిన రాజు పూజ మానస దెగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చున్నారు.

పూజ : ఏమైంది మానస?

మానస : ఏమో పూజ ఏదో జరుగుతుంది, నాకు మనసులో ఏం బాలేదు.

రాజు : ఏమైంది మానస?

మానస : చిన్నా గాడు ఎందుకో బాధ పడుతున్నాడు, అప్పుడు రజిని ని చూసి గోవా అన్న ఆనందం లో ఏం పట్టించుకోలేదు కానీ...
ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే నాకెందుకో తేడా కొడుతుంది రాజు.

వాడు పైకి నవ్వుతున్నాడు కానీ వాడి కళ్ళు ఇంకేదో చెప్తున్నాయి, అవును కంఫర్మ్ వాడు ఏడుస్తున్నాడు, నేను అర్జెంటు గా చిన్నా ని చూడాలి పదండి వెళ్ళిపోదాం.

పూజ : చిన్నా?

రాజు : అదే విక్రమ్, ఆదిత్య, మానస చిన్నా అని పిలుచుకుంటుంది.

పూజ : మానస అదే నీ డౌట్ ఐతే ఇప్పుడే ఆదిత్య కి కాల్ చేద్దాం అని మొబైల్ తీసింది.

Switched off, ఇంకో రెండు సార్లు ట్రై చేసినా switched off  వచ్చింది, దాని తో మానస లేచి నిలబడింది.

పూజ  మానస చెయ్యి పట్టుకుని ఉండు మానస నాన్న కి కాల్ చేద్దాం అని సునీల్ కి కాల్ చేసి స్పీకర్ లో పెట్టింది.

సునీల్ : హలో పూజ.

పూజ : నాన్నా ఆదిత్య మొబైల్ switchoff వస్తుంది నీకేమైనా తెలుసా?

సునీల్ : లేదు పూజ ఆదిత్య కోసం వెతికిస్తున్న ఇంకా దొరకలేదు.

ఆ మాటలు వినగానే మానస మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది.

పూజ : ఏమైంది నాన్నా ఆదిత్యని వెతకడం దేనికి.

సునీల్ : మీరు వెళ్లిన సాయంత్రనికి ఆదిత్య తన భార్య అనురాధ తో విడాకులు తీసుకున్నాడు సంతకాలు చేసేసి, ఎలా వెళ్ళాడో సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో సిఐ ని కొట్టి ఇందాకటి వరకు వాళ్ల తో కొట్టించుకున్నాడు నాకు తెలిసి వెళ్లేసరికి అక్కడనుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు వెతికిస్తున్నాను మీరు కంగారుపడకండి.

పూజ : అలాగే నాన్న మేము బైలుదేరుతున్నాము.

మానస ని తీస్కుని పూజ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళితే రాజు రజిని లగ్గేజ్ తీస్కుని వెనక వెళ్లారు.

.......................................................................

కొన్ని దెబ్బలు తిన్న తరువాత ఆ లాటి దెబ్బలు నా మీద ప్రభావం చూపించలేకపోయాయి నాకు బాధ ఆవేశం ఇంకా పెరుగుతున్నాయి, నేను కళ్ళు తెర్వగానే వాళ్ళు గమనించి కొట్టడం ఆపేసారు, విడిపించుకుని వాళ్ళు వదిలిపెడతామన్నా కూడా వద్దని వారించి బైటకి నడిచాను దారిలో వెళ్తుంటే ఒక తాగుబోతు నాకు ఎదురోచ్చాడు, వాడ్ని చూసాను ఆనందం గా డాన్స్ చేస్తున్నాడు.

వాడి దెగ్గరికి వెళ్ళాను "ఎందుకు ఎగురుతున్నావ్" అని అడిగాను, వాడు తులుతూ "నా బాధలన్ని మర్చిపోయి ఎగురుతున్నాను " అన్నాడు.

ఎలా ఎలా మర్చిపోయావ్

"ఇదిగో నా చేతిలో ఉందే అమృతం దీన్ని తాగి మార్చిపోతాను "

పక్కనే బార్ కనిపించింది లోపలికి వెళ్ళాను.
"నాకు అన్నిటికంటే పవర్ఫుల్ ది కావాలి "

సర్ ఇదే ఆ బాటిల్ చాలా కాస్టలీ, కార్డు గీకేసి లోపలికి వెళ్లి  ఉన్న పలంగా మొత్తం తాగేసాను.

ఒకప్పుడు నేను అసహయించుకున్న మందు ఇప్పుడు నా చేతిలో.

అలా మొత్తం తాగేసి ఇంకొకటి ఆర్డర్ చేశాను వెయిటర్ అది చూసి సర్ మీరు అదే మొత్తం తాగేసారు చాలా డేంజర్ సర్, "ఇంకొకటి తీసుకూర" అని అరిచాను నా అరుపులకి పక్కనే ఉన్న ముగ్గురు తాగుబోతులు నన్ను కొట్టడానికి వచ్చారు, ఒకే దెబ్బ ముగ్గురు లెవలేదు మళ్ళీ దాంతో వెయిటర్ భయపడి ఇంకొకటి తెచ్చాడు.

అది కూడా మొత్తం తాగేసాను, బాధ ప్లేస్ లో ఏడపు, ఆవేశం ప్లేస్ లో కోపం వచ్చాయి, అక్కడున్న చైర్స్ అన్ని విరిచేసాను అద్ధాలు అన్ని పగలకొట్టేసాను, దాని తో బౌన్సర్స్ నా మీదకి కొట్లాటకి వచ్చారు, ఒకణ్ణి కొట్టాను నా దెబ్బ చూసి మిగతా వారు ఆగిపోయారు.

బార్ మేనేజర్ దెగ్గరికి వెళ్ళాను, ఐయామ్ సారీ బిల్ వేసి చెప్పండి నేను పే చేస్తాను అన్నాడు.

లక్ష అవుతుంది సర్ అన్నాడు భయం గా, కార్డు తీసి ఐదు లక్షలు పే చేశాను.

అక్కడ నుంచి బైటికి వచ్చాను తాగింది మొత్తం కక్కుకున్నాను, నిలబడి ఆలోచించడం మొదలు పెట్టాను, అమ్మ గుర్తొచ్చింది నా మీద నాకే అసహ్యం వేసింది ఒక అమ్మాయి కోసం నేను ఇంతలా పిచ్చి వాణ్ణి అయ్యానా, ఏ అమ్మ అయినా కొడుకు దెగ్గర తాగోదు అని మాట తీస్కుంటుంది కానీ జీవితం లో ఎప్పుడు ముట్టుకోనని తెలిసి అమ్మ నన్ను ఎప్పుడు ఆ మాట కూడా అడగలేదు కానీ ఇవ్వాళ తాగాను, నాకు ఎవ్వరి మీద కోపం లేదు ఇంటికి వెళదాం అని నిర్ణయించుకుని ఇంటికి బైల్దేరాను పొద్దున్న కావొస్తుంది కానీ ఇంకా చీకటి గానే ఉంది.

ఈ లోగ ఒక ఎద్దు ఎక్కడనుంచి వచ్చిందో వెనక నుంచి గుద్ధింది ఎగిరి పడ్డాను, ఎవరో "అన్నా" అని గట్టిగా అరిచినట్టనిపించింది, లేచి ఆ ఎద్దుని చూసాను మళ్ళీ నన్ను కుమ్మడానికే స్పీడ్ గా వస్తుంది దాన్నే చూస్తున్నాను.....కళ్ళు తిరుగుతున్నాయి మత్తుగా ఉంది.

.......................................................................

ఏంటి అన్న ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఇలా కాదు అని ఇంకా స్పీడ్ గా ఎదురు ఎళ్లసాగాడు.

హమ్మయ్య మొత్తానికి కనిపించాడు, ఒక్కసారి విక్రమ్ అవతారం చూసి రవికి బాధ మరియు అనుమానం వచ్చాయి, అన్నా అనుకుంటూ ముందుకు వెళ్ళాడు.

ఈ లోగ ఒక ఎద్దు వచ్చి విక్రమ్ అన్నని కుమ్మింది "అన్నా " అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాను కానీ అన్న లేచి దాన్నే చూస్తున్నాడు, ఎద్దు కి ఎదురు పరిగెత్తాడు ఇదంతా చూస్తున్న నాకు నా అడుగులు నెమ్మదించాయి, అన్న అలాగే పరిగెత్తుకుంటూ వెళ్లి దాని తల పట్టుకుని గాల్లో ఎగిరి మెడ పక్క భాగం లో రెండు మోకాళ్ళతో గుద్దాడు(ద్ధం అని సౌండ్).

ఎద్దు మళ్ళీ లేవలేదు, నాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు, ఆ షాట్ చూస్తే ఒళ్ళు గగుర్పొడిచింది. ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉండి పోయాను.....

అంటే ఇన్ని రోజులు నాకు తెలిసిన విక్రమ్ అన్న ఉట్టి యాక్టింగ్ ఆ? అన్న అందరిలాంటి మాములు మనిషి కాదా? మరి నా దెగ్గర ఎందుకు దాచాడు, నా దెగ్గరేనా అందరి దెగ్గర కూడానా?

ఈలోగా విక్రమ్ తులుతూ కింద పడిపోయాడు, స్పీడ్ గా వెళ్లి అన్నని ఎత్తుకుని సునీల్ గారి ఇంటి వైపు నడిచాను...

గేట్ దెగ్గరికి వెళ్తుండగానే గార్డ్స్ గుర్తుపట్టి గేట్ తెరిచారు, అదే టైం లో నాకు రజిని ఇంకో అబ్బాయి అమ్మాయి వాళ్ల పక్కనే ఏడుస్తూ ఇంకో అమ్మాయిని చూసాను, తను ఎవరో కాదు మానస, అవును నా మానస ఒక్కసారి భుజం మీద ఉన్న అన్నని చూసాను... విక్రమ్? ఎవరు నువ్వు?
Like Reply
Uffff ? OmG
Like Reply
aa screenplay endi bhayya
mind blowing anthe.
Like Reply
(02-04-2022, 02:30 PM)Gollu gangunaidu Wrote: అబ్బా...స్టోరీ చాలా బావుంది బాస్...బట్...అనూకి విక్రం కి గొడవలు వచ్చే స్విచ్వేషన్ క్రియేట్ చేసారేంటి బాస్ ...ముందు ముందు ఏం జరుగుతుందో అని టెంక్షన్గా వుంది...అయినా చాలా బావుంది...ఇంకా ఇంకా ముందుకు దూసుకుపోండి...
గుడ్ ఆఫ్టర్ నూన్ బాస్

❤❤
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(02-04-2022, 05:02 PM)Ravi9kumar Wrote: హాస్పిటల్ సన్నివేశం తో మరియు కాఫీ షాప్ సన్నివేశం తో కథని మరో మలుపు తిప్పారుగా ....
పూజ , ఇందు ఈ  ఆడవారి మనసులో మాటలు నాకు నచ్చాయి.
మరి ముక్యంగా అధికారంతో , డబ్బుతో ఆదిత్యని దక్కించుకోవాలని అనుకుంటున్నా పూజ మాటలు మరియు
ఆలోచించకూడదు అని అనుకుంటూనే ఆదిత్య గురించి ఆలోచిస్తున్న ఇందు మాటలు నచ్చాయి.
థాంక్యు ఫర్ అప్డేట్ thanks

Thank u ❤❤
[+] 2 users Like Pallaki's post
Like Reply
(02-04-2022, 02:53 PM)kummun Wrote: Nice update....  clps Heart

చిన్న చిన్న గొడవలు/మనస్పర్ధలు రాకపోతే బంధం ఎలా గట్టి పడుతుంది. అందులోనూ వీళ్ళది బలవంతపు పెళ్లాయే. ఇంకెన్ని జరగాలంటారూ! సుష్మా ఎప్పుడైతే తలనొప్పి అని హాస్పిటల్ లోపలికి వెళ్ళిందో, ఈ conflict కోసమే ఎదురుచూస్తున్నా.... ఎప్పుడు వస్తదా అని.

మీకు మరియు పాఠకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత నామ సంవత్సరంలో పెట్రోలు, వంట నూనెల ధరలు తగ్గి అందరికి శుభాలు కలగాలని కోరుకుంటూ...

ధన్యవాదాలు  Namaskar yourock
Yes true ❤❤
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(02-04-2022, 09:58 PM)kummun Wrote: యాక్షన్ సిక్వెన్స్ అదిరింది..... fight 
అనూని చెంపదెబ్బ కొట్టలేదంటే, విక్రమ్ కి సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువే. Eagerly waiting for next update.... thank you   Namaskar

❤❤❤
[+] 1 user Likes Pallaki's post
Like Reply
Wow super and marvellous update
Like Reply
(03-04-2022, 09:44 PM)Rajeraju Wrote: మామూలుగా లేదూ అప్డేట్ ఇరగదీశారు సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ తో చంపేశారు కథ కాద ఇంకా ఉందా ఈరోజు అప్డేట్

Thank u❤❤
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(03-04-2022, 10:02 PM)kummun Wrote: కొంచెం భాదగానే ఉన్నా గానీ , దూరంగా ఉన్నప్పటికీ అనూపై ఈగ కూడా వాలకుండా కాపాడుకోగలిగే కెపాసిటీ విక్రమ్ కి ఉంది కాబట్టి భయం లేదు. ఇక సుష్మాకీ, మిగిలిన రెట్టపూకు మదం బ్యాచ్ కి చుక్కలు ఎలా చూపిస్తాడో చూడాలి.

Rashid seems to be good Don....
తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ.... ధన్యవాదాలు  Namaskar

Avunu ❤❤
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(03-04-2022, 10:17 PM)Kushulu2018 Wrote: ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను విక్రం విడాకుల పేపర్ మీద santhal చేస్తే ఎంత భాద పడ్డానో మాటల్లో చెప్పలేను

Thank u❤❤❤
[+] 1 user Likes Pallaki's post
Like Reply
Full emotional update.........Chala bagundhi ........ clps clps clps
Like Reply
(03-04-2022, 10:25 PM)Nivas348 Wrote: What is next ani okkate tension story vere levello pothundi motham script full planing tho unnaru. Ardham avutundi twistelu suspencelu story Loni carecter ki story chaduvutunna readers ki okkesari mind lo fuselu egiripoyela full planing tho run chestunnaru pahani premani Baga level chestunnaru super narration keep going. Small requst update endlo next update eppudu ivvagalaro date & time mention cheste next update eppudu Ane tention undadu...if my wrong pls ignore my requst. If u feel bad pls take my opologies any way nice update tq for giving....good night.

Professional ga maintain chese antha time ledhu brother , edho saradhaki rasthunnanu.

Meerantha enjoy chesthunnaru adhey chaalu

❤❤❤
[+] 1 user Likes Pallaki's post
Like Reply
yourock yourock yourock yourock yourock yourock yourock yourock yourock yourock
Like Reply
(03-04-2022, 10:34 PM)Dsprasad Wrote: Sir మీకూ ఎలా థాంక్స్ చెప్పాలో కూడా అర్దం కావడం లేదు కథలో సెక్స్ అనేది లేకుండా ఈసైట్లో ఇంత అద్భుతంగా కథ రాస్తున్నారు .మీ ధైర్యానికి  హాట్సాఫ!

Thank you
Kadhalo sex lekapoina aadharisthunnandhuku
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(03-04-2022, 10:59 PM)Ravi9kumar Wrote: కోపం , బాద , ఆవేశం,స్నేహం, ప్రేమ , తపన , ఇన్నిటినీ ఒకే అప్డేట్ లో ఇచ్చిన మీ కథ అప్డేట్ గురించి ఏమని కామెంట్ చేయాలో అర్ధం కావడం లేదు TakulSajal గారు, మాటలు లేవు . ఈ అప్డేట్ నాకు చాలా అద్బుతం గా అనిపించింది. clps clps

Thank u brother

Eagerly Waiting for ur next story
[+] 2 users Like Pallaki's post
Like Reply
(03-04-2022, 11:25 PM)gudavalli Wrote: కథను కధా గమనం లోను అద్భుతమైన ప్రతిభను చూపిస్తున్న రచయిత కు శుభాభినందనలు.

Dhanyavadhalu❤❤
[+] 2 users Like Pallaki's post
Like Reply
(03-04-2022, 11:27 PM)Nivas348 Wrote: Vallu kalisipothe story end ipoddi.mari thana paga eppudu teerchukuntadu. Andariki nyam chestunnaduga wait chettali. Hero heroin kalusraru but adi ending lone.,.

Kalupudham twaralone ❤❤
[+] 1 user Likes Pallaki's post
Like Reply




Users browsing this thread: 92 Guest(s)