Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
Happy Ugadi takulsajal garu
[+] 1 user Likes mohanchandra's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Happy ugadi.. nice update bro...
[+] 1 user Likes vg786's post
Like Reply
(02-04-2022, 01:35 PM)Takulsajal Wrote: అందరికి ఉగాది శుభాకాంక్షలు❤️
ఉగాది శుభాకాంక్షలు బ్రో..  Heart

ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఎలా ఉన్నారో బాగా వివరించావు. సుష్మ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి..  Angel

అప్డేట్ కి చాలా థాంక్స్..  thanks yourock
[+] 2 users Like DasuLucky's post
Like Reply
Super update
[+] 1 user Likes Veerab151's post
Like Reply
అబ్బా...స్టోరీ చాలా బావుంది బాస్...బట్...అనూకి విక్రం కి గొడవలు వచ్చే స్విచ్వేషన్ క్రియేట్ చేసారేంటి బాస్ ...ముందు ముందు ఏం జరుగుతుందో అని టెంక్షన్గా వుంది...అయినా చాలా బావుంది...ఇంకా ఇంకా ముందుకు దూసుకుపోండి...
గుడ్ ఆఫ్టర్ నూన్ బాస్
[+] 2 users Like Gollu gangunaidu's post
Like Reply
good update brother...
[+] 1 user Likes Kingzz's post
Like Reply
Nice update....  clps Heart

చిన్న చిన్న గొడవలు/మనస్పర్ధలు రాకపోతే బంధం ఎలా గట్టి పడుతుంది. అందులోనూ వీళ్ళది బలవంతపు పెళ్లాయే. ఇంకెన్ని జరగాలంటారూ! సుష్మా ఎప్పుడైతే తలనొప్పి అని హాస్పిటల్ లోపలికి వెళ్ళిందో, ఈ conflict కోసమే ఎదురుచూస్తున్నా.... ఎప్పుడు వస్తదా అని.

మీకు మరియు పాఠకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత నామ సంవత్సరంలో పెట్రోలు, వంట నూనెల ధరలు తగ్గి అందరికి శుభాలు కలగాలని కోరుకుంటూ...

ధన్యవాదాలు  Namaskar yourock
[+] 6 users Like kummun's post
Like Reply
Nice updates
[+] 2 users Like Vvrao19761976's post
Like Reply
What a spense episode
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
(02-04-2022, 01:35 PM)Takulsajal Wrote: అందరికి ఉగాది శుభాకాంక్షలు❤️

Thank you and Same to you andi Takulsajal garu....
అప్డేట్ చాలా బాగుంది అండి .....కానీ నాది ఒక చిన్న విన్నపం దయచేసి అను ని విక్రమ్ ని విడదీకండి.....ప్లీస్....ప్లీస్
Like Reply
Woow adirindi update super
[+] 1 user Likes narendhra89's post
Like Reply
Excellent
[+] 1 user Likes rajusatya16's post
Like Reply
హాస్పిటల్ సన్నివేశం తో మరియు కాఫీ షాప్ సన్నివేశం తో కథని మరో మలుపు తిప్పారుగా ....
పూజ , ఇందు ఈ ఆడవారి మనసులో మాటలు నాకు నచ్చాయి.
మరి ముక్యంగా అధికారంతో , డబ్బుతో ఆదిత్యని దక్కించుకోవాలని అనుకుంటున్నా పూజ మాటలు మరియు
ఆలోచించకూడదు అని అనుకుంటూనే ఆదిత్య గురించి ఆలోచిస్తున్న ఇందు మాటలు నచ్చాయి.
థాంక్యు ఫర్ అప్డేట్ thanks
[+] 4 users Like Ravi9kumar's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
I think real story will begin in next update

Huge response on the story
[+] 1 user Likes Kishore129's post
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Tq for update
[+] 1 user Likes Ravanaa's post
Like Reply
ఎపిసోడ్ ~ 25

పొద్దున్నే లేవగానే పక్కన అను కనిపించలేదు చుట్టూ చూసాను బాత్రూమ్లో నీళ్ల చప్పుడు విని, నవ్వుకుంటూ లేచాను సుష్మ ఎదురు వచ్చింది, ఎంటివ్వాల లేవగానే ఇది ఎదురోచ్చింది శకునం బాలేదే అనుకుంటూ బైటికి వచ్చి ఒళ్ళు విరిచా, ఇంతలో రవి గుర్తొచ్చాడు బైటికి వెళ్లి సామాను తీసుకొచ్చి అను కి టిఫిన్ ప్రిపేర్ చేసి దాని మీద లెటర్ రాసి పెట్టి రవి దెగ్గరికి బైల్దేరాను.

అను స్నానం చేసి బైటికి వచ్చి విక్రమ్ కనిపించక పోయేసరికి కిచెన్ లోకి వెళ్ళింది టిఫిన్ ప్లేట్ పై లెటర్ చూసి తీసి చదివింది.

అర్జెంటు పని మీద బైటికి వెళ్తున్నాను, లవ్ యూ అని చదివి అను రెండు కళ్ళు ఎగరేసి నా కంటే ఇంపార్టెంట్ పని ఏమైయుంటుందబ్బా అనుకుంటూ రెడీ అయ్యి ఫైల్స్ తీస్కుని పూజ ని కలవడానికి వెళ్ళింది.

నేను రవి దెగ్గరికి వెళ్ళాను, రవి నాకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు వెళ్లి తనకి టిఫిన్ అందించాను, రవి తింటూ "చెప్పు అన్న నీ గురించి".

చిన్నా : నా దెగ్గర ఏముంటాయి తమ్ముడు, నీ గురించి చెప్పు నిన్ను నీకు తగిలిన దెబ్బలు చూస్తుంటే నాకు భయం గా ఉంది, నీకు ఎందుకు హెల్ప్ చేస్తున్నానో కూడా నాకు తెలియడం లేదు.

రవి : చిన్న ఎటాక్ జరిగింది అన్న, ఇప్పుడు పర్వాలేదు కానీ నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను, నాకు సహాయం కావాలి.

చిన్నా : అదేంటి తమ్ముడు ఆలా అంటావ్, నువ్వు పోలీసోడివే కదా?

రవి : అవును నేను సెక్యూరిటీ అధికారి నే కానీ ఇప్పుడు నన్ను చంపాలని చూస్తుంది కూడా వాళ్ళే.

చిన్నా : భయం గా ఉంది తమ్ముడు, ఎందుకు నిన్ను సెక్యూరిటీ ఆఫీసర్లు చంపాలని చూస్తున్నారు? ఏమైనా తప్పు చేసావా?

రవి : నవ్వుతూ భయపడకు అన్న నన్ను నమ్ముకున్నోళ్ళకి నా ప్రాణం ఇచ్చి అయినా కాపాడుకుంటాను, అలాంటిది నువ్వు నాకు ప్రాణం పోసావ్.

ఫ్రెండ్స్ అని రవి చెయ్యి చాపాడు, నేను చెయ్యి కలిపాను.

చిన్నా : తమ్ముడు నీకోసం ప్లేస్ చూస్తాను కానీ నువ్వు నాకు ఎం జరిగిందో చెప్పాలి.

రవి : అన్న నాకు ప్లేస్ కంటే ముందు రెండు గన్నులు వాటికి పది మ్యాగజైన్స్ రెండు కత్తులు ఒక అస్సాల్ట్ డ్రెస్ కావాలి, డబ్బులు నేను ఇస్తాను, ఎక్కడ అమ్ముతారో కూడా చెప్తాను తెస్తావా?

చిన్నా : ఏంటి తమ్ముడు నువ్వు మాట్లాడేది, ఎందుకు తమ్ముడు అవన్నీ?

రవి : నవ్వుతు "ఇవ్వాళ రాత్రికి వంద మందిని చంపుతున్నా అందుకు."

చిన్నా : వామ్మో తమ్ముడు నా మీద ప్రాంక్ చేస్తున్నావా కెమెరా ఏమైనా పెట్టావా?

రవి : ప్రాంక్ లేదు ఎం లేదు ముందు నేను చెప్పిన లిస్ట్ తెస్తే నువ్వు చెప్పిన సేఫ్ ప్లేస్ కి వెళ్లి అన్ని తీరికిగా చెప్తా.

చిన్నా : భయం గా ఉంది తమ్ముడు ఆ! మర్చిపోయా ఇదిగో నీకు ఫోన్ తెమన్నావ్ కదా అందులో నా నెంబర్ ఫీడ్ చేశాను అవసరమైతే కాల్ చెయ్.

రవి : అన్నా భయపడకు ఎంత భయమేసిన లోపలే దాచుకో నేను ఉన్నంత వరకు నీకేం కానివ్వను.

చిన్నా : నువ్వు బయటికి రాడానికే భయపడుతున్నావ్ మళ్ళీ ప్రాణానికి ప్రాణం అంటున్నవ్.

రవి : నవ్వుతు "అన్నా నువ్వు తెలివైనోడివే".

చిన్నా : అంటే వామ్మో!

రవి : అన్నా డబ్బులు కావాలన్నావ్ ఎంత కావాలంటే అంత ఇస్తా.

చిన్నా : ఒప్పుకున్నాక చస్తానా.

అక్కడనుంచి బైటికి వచ్చాను.

రాజు కాల్ చేసాడు.

చిన్నా : చెప్పు రాజు.

రాజు : విక్రమ్ సుష్మ కాల్స్ లొకేషన్స్ ట్రేస్ అయ్యాయి గత వారం రోజులనుంచి నీ సిగ్నల్స్ ఎక్కడెక్కడ టచ్ అవుతున్నాయో సుష్మ సిగ్నల్స్ కూడా అదే ఏరియా లో టచ్ అవుతున్నాయి, నిన్ను వారం రోజులనుంచి ఫాలో అవుతుంది.

చిన్నా : ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ యే నా లేక లాంగ్ రూట్స్ కూడా నా?

రాజు : లేదు ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో మాత్రమే, ఓల్డ్ గౌడౌన్స్ అటు వైపు నిన్ను ఫాలో అవ్వలేదు.

చిన్నా : ఏమైనా కాల్స్ ట్రేస్ అయ్యాయా?

రాజు : లేదు కాల్స్ లో ఏమి లేవు జస్ట్ నిన్ను ఫాలో చేస్తుంది అంతే.

చిన్నా : "సరే నేను చూసుకుంటా" అని ఫోన్ పెట్టేసాను.

ఇది మళ్ళీ ఏదో ఎలాగైబెడుతుంది అనుకుని అక్కడన్నుంచి రవి రాసిచ్చిన అడ్రస్ కోసం చూసా దాన్ని తీసి రషీద్ కి ఫార్వర్డ్ చేశా, వెంటనే రషీద్ కాల్ చేసాడు.

రషీద్ : సర్ ఇది మీకు ఎందుకు సర్ నాకు చెప్పండి ఎవర్ని ఎంతమందిని ఎక్కడ లేపేయ్యాలో నేను చూసుకుంటాను.

చిన్నా : లేదు రషీద్ నాకు ఆ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ కావాలి నేనే వెళ్లాలా ఎవరు వెళ్లిన ఇస్తారా?

రషీద్ : సర్ అది నా అడ్డా, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్, డాన్ రషీద్ ఎవరో కాదు నేనే.

చిన్నా : మరి నా దెగ్గర ఎందుకు పని చేస్తున్నావ్.

రషీద్ : సునిల్ సర్ మీకోసం నన్ను రప్పించారు, మీ అవసరాలని చూసుకోడానికి, మీరు ఇవేమి ఆలోచించకండి జస్ట్ ఆర్డర్ వేయండి మిగతాది నేను చూసుకుంటాను.

చిన్నా : లిస్ట్ లో ఉన్నవి?

రషీద్ : అరగంట లో మీ ముందుంటాయి.

చిన్న : అలాగే అని కాల్ కట్ చేశాను.

ఈలోగా అను నుంచి కాల్ వచ్చింది.

చిన్నా : హలో అను.

అను : ఎక్కడున్నావ్ (ఏడుస్తూ)

చిన్నా : అను ఏమైంది నువ్వు ఎక్కడున్నావ్ ఎందుకు ఏడుస్తున్నావ్?

అను : (కోపం తో ) "ఎక్కడున్నా ఇంటికి రా ముందు" అని కాల్ కట్ చేసింది.

నేను ఇంటికి పరిగెత్తాను ఏమైందో అని.

ఇంటికి వెళ్లేసరికి హాల్లో సుష్మ నన్ను చూసి నవ్వుతు ఉంది, అను ఒకపక్క సోఫా లో కూర్చుని ఏడుస్తూ ఉంది, తన పక్కనే ఇందు నన్ను అసహ్యం గా చూస్తుంది.

స్పీడ్ గా వెళ్లి అను పక్కన కూర్చుని తన మొహం పట్టుకుని "అను ఏమైంది?" అన్నాను.

అను నా చెయ్యి విదిల్చికోట్టింది, నాకు ఆశ్చర్యం వేసింది ఏమైంది అన్నట్టు చూసాను, ఇందు చేతిలో ఉన్న ఫొటోస్ తీస్కుని నా మొహం మీద కొట్టింది.

కింద పడ్డ ఆ ఫొటోస్ చూసి నాకు మతిపోయింది, మానస నేను కలిసిన్నవి, హాగ్ చేసుకున్నవి తన నుదిటి మీద ముద్దు పెట్టినవి, ఇంకొన్ని నిన్న పూజ ని హాగ్ చేసుకున్నవి పూజ తో మాట్లాడుతున్నవి.

నేను అను ని చూసాను, నా చెంప మీద ఒక్కటి పీకింది నాకు దుఃఖం తన్నుకొచ్చింది.

ఇందు : సిగ్గు లేదు ఇంత మంచి భార్యని పెట్టుకుని వేరే వాళ్ళతో కులకడానికి. ఛీ

అను ఏడుస్తూనే ఉంది.

చిన్నా : అను నేను నీతో మాట్లాడాలి....

సుష్మ : ఏంట్రా నువ్వు మాట్లాడేది అని నా మీదకి వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురిని మోసం చేస్తావ్. పూజ గారితో చ్చి చ్చి....

చిన్నా : అనూ పూజ స్టేటస్ ఎక్కడ నేను ఎక్కడ నిన్న కలిసింది తను నీకు ఇస్తున్న సపోర్ట్ కి థాంక్స్ చెప్పాను అంతే.

అను : మరి ఇంకో అమ్మాయి ఎవరు?

చిన్నా : నేను నీకు అన్ని వివరం గా చెప్తాను నాతో రా.

సుష్మ : ఎక్కడికి రా వచ్చేది తీసుకెళ్లి చంపేస్తావా దాన్ని, ఒసేయ్ అను నేను చెప్పానా నీకు ఇలాంటి సిట్యుయేషన్ వస్తుంది అని.

ఆలా నన్ను తిడుతూ అను ని కౌగిలించుకుంది, అను వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడుస్తుంది.

సుష్మ : నా ముందుకి వచ్చి "పోరా ఇంట్లో నుంచి కుక్కా పొయ్యి ఆ లంజ్......." అని అనబోతుంటే ఆటోమేటిక్ గా నా చెయ్యి తన చెంప మీద పడిపోయింది హాల్ మొత్తం ఫట్ అని రీసౌండ్ వచ్చింది.

దాని తో అను షాకింగ్ గా చూస్తూ నా ముందుకి వచ్చి "అంటే మా అమ్మ, ఇందు మేడం చెప్పింది నిజమేనా? నేను ఎంతగా ప్రేమించాను నిన్ను ఎప్పుడు పని చేయమని కూడా బలవంత పెట్టలేదు నీకు ఇలా చెయ్యాలని ఎలా అనిపించింది?"

అని గట్టిగా ఏడుస్తూ "పో పొయ్యి దానితోనే కులుకు".

చిన్నా : అనూ...మాటలు

అను : ఏంటి మాటలు ఇంకా నా మీదకే వస్తున్నావా ప్రాజెక్ట్ ఓకే అయిందని, కంపెనీ పెట్టడానికి ఫండ్స్ ఒకే అయ్యాయి అని ఎంతో ఆనందం గా నీకోసం వస్తే నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది.

చిన్నా : అను... నేను చెప్పేది విను.

అను : ఇంకేం మాట్లాడకు నీ ఇష్టం వచ్చింది చేసుకో దాని దెగ్గరికి కాకపోతే ఇంకో దాని దెగ్గర పడుకో...

చిన్నా : అనూ (కోపంతో )

అను : కోపం వస్తుందా, పో పొయ్యి ఆ లంజ తోటే ఉండు.

చిన్నా : "అనూ...." (నా చెయ్యి లేచి అను చెంప దెగ్గరికి వెళ్లి ఆగిపోయింది)

దాని తో అను సోఫా లో కూలబడింది, నేను బైటికి వచ్చేసాను కోపంలో.

పిచ్చ కోపం గా ఉంది స్పీడ్ గా నడుచుకుంటూ వెళుతాన్నా, రోజు పలకరించే వాళ్ళు పలకరించినా నాకు అవేం వినబడట్లేదు.

ఈలోగా రషీద్ ఫోన్ చేసాడు.

కోపం గానే ఫోన్ ఎత్తి : చెప్పు రషీద్.

రషీద్ : సర్ చెప్పిన పని అయిపోయింది సర్.

ఓకే నేను ఫోన్ చేస్తాను అని పెట్టేసి వెళ్లి కాఫీ షాప్ లో కూర్చున్నాను వెయిటర్ వచ్చి నా మొహం చూసి నా కళ్ళలో నీళ్లు కారడం చూసి నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్లిపోయింది.

నాకు అమ్మ మాట్లాడిన చివరి మాటలే గుర్తొస్తున్నాయ్ పాపం అను తప్పు ఎం లేదు నా పరిస్థితులే బాలేవు, అను ఎంత బాధ పడిందో, ఆలా ఆలోచించుకుంటూ సాయంత్రం వరకు అలానే కూర్చున్నాను.

రవి ఫోన్ చేసాడు.

చిన్నా : చెప్పు తమ్ముడు.

రవి : అన్నా చెప్పిన పని అయ్యిందా?

చిన్నా : "అయిపోయింది వస్తున్నాను" అని అక్కడనుంచి లేచి వెళ్ళాను.

రషీద్ దెగ్గర సరుకు తీస్కుని రవి దెగ్గరికి వెళ్ళాను.

రవి : సూపర్ అన్న ఇవి సరిపోతాయి గ్రనేడ్స్ కూడా ఉన్నాయ్.

చిన్నా : తమ్ముడు నేను వస్తాను.

రవి : వద్దు నేనొక్కడినే వెళ్తాను.

చిన్నా : లేదు నిన్ను డ్రాప్ చేసి పని అయిపోయాక మళ్ళీ కార్ దెగ్గరికి రా పిక్ చేసుకుంటాను ఒకవేళ నువ్వు పడిపోతే ఎవరో ఒకరు ఉండాలి కదా?

రవి : నన్ను కొట్టె వారెవరన్నా?

చిన్నా : ఆల్రెడీ మంట మీద ఉన్నా నాకు ఆ ఓవర్ కాంఫిడెన్స్ మాటలు వినగానే చిర్రత్తుకొచ్చింది, "మొన్న పడిపోతే ఎత్తుకొచ్చింది నేనే, నిన్న ఒకడు కుక్కని కొట్టినట్టు కొట్టి పోయాడు మర్చిపోయావా నేను వస్తాను పద" అన్నాను.

నా మాటలకి రవి ఆశ్చర్యపోయి ఇంకేం మాట్లాడకుండా వెళ్లి కార్ ఎక్కడు.

అప్పటికే చీకటి పడింది.

అక్కడనుంచి రవి చెప్తుంటే లొకేషన్ కి రీచ్ అయ్యాము దాదాపు తొమ్మిది కావొస్తుంది.

రవి : అన్నా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి వస్తాను అరగంట లో రాకపోతే నువ్వు ఇక్కడనుంచి వెళ్ళిపో.

చిన్నా : అలాగే.

రవి పరిగెత్తుకుంటూ ఒక పెద్ద కోట లాంటి ఇంటి ముందుకు వెళ్ళాడు దానికి రెండు ఎంట్రన్స్ లు.
గేట్ దెగ్గర పది మంది కాపలా గన్స్ లేవు కానీ బిల్డింగ్ మీద ఉన్న అందరి చేతులో గన్స్ ఉన్నాయ్. రవి కుడి వైపు నుంచి గోడ దూకి లోపలికి వెళ్ళాడు ఫైరింగ్ స్టార్ట్ అయింది గేట్ ముందు ఉన్న వాళ్ళు అలెర్ట్ అయ్యారు నాకు ఇక ఆగాలనిపించలేదు పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఆలా పరిగెడుతూనే రోడ్ పక్కన చెట్టుకి ఒక గొడ్డలి అనుకుని ఉంది అది ఎందుకుని జారుకుంటూ ఆ పది మంది మధ్యలోకి వెళ్లి గొడ్డలి ని అడ్డం గా తిప్పాను ముగ్గురు అవుట్, ఆలా గొడ్డలి తిప్పుతూనే కాలితో ఒకడి గుండెల పై ఎడమ చేయి తో వాడి మెడ పట్టుకుని విసిరేసాను.

ఇంకో ఐదుగురుని పది సెకండ్స్ లో ఫినిష్ చేసేసి లోపలికి వెళ్ళాను రవి కుడి వైపు వెళ్ళాడు కాబట్టి నేను ఎడమ వైపు వెళ్ళాను బుల్లెట్స్ నా వైపు దూసుకొస్తున్నాయ్ ఆలా నే వెళ్లి ముందున్న వాడి ముందుకి జారీ అదే స్పీడ్ లో వంగి గొడ్డలి వేటు వాడి తొడ పై వేసి ఎమ్మటే మెడ మీద వేసాను, రక్తం నా మొహం మీద పడింది, వెంటనే ఇంకొ ఇద్దరు రూమ్ నుంచి గన్స్ తో బైటికి వచ్చారు, ఆ గొడ్డలిని ఒకడి మీదకి విసిరాను వాడి గుండెల్లో దిగింది, నా ముందు ఉన్న వాడి గన్ వాడి చేతుల్లోనుంచి కింద పడకముందే అందుకుని ఇంకొకడి తలలో కాల్చేశాను, అలానే గన్ పడేసి స్పీడ్ గా వెళ్లి గుమ్మం దెగ్గర పడ్డవాడి గుండెల్లో నుంచి గొడ్డలి గట్టిగా లాగాను, ఆ ఎర్రటి గొడ్డలి ఆ రూమ్ లో ఉన్న ఇరవై మంది కి దిగింది విత్ బుల్లెట్స్, అక్కడ్నుంచి మళ్ళీ గొడ్డలి అందుకుని చిన్న సందులగా ఉంది ముప్పై మంది పైనే ఉండొచ్చు ఆ సందులో నుంచి అందరూ కత్తులు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు, గొడ్డలి కింద పడేసి పక్కనే ఉన్న ఏకే - 47 తీసుకున్నాను మొత్తం వాడేసాను 30 బుల్లెట్స్ ముందు గా వస్తున్న పదిహేనుమందిని చంపేసింది.

ఇక గొడ్డలి అందుకుని నా స్టైల్ లో విజరుంభించాను నాలుగు నిముషాలు పట్టింది అక్కడ నుంచి మళ్ళీ పెద్ద హాల్ వచ్చింది ఎవడో వైట్ సూట్ లో కూర్చుని ఉన్నాడు భయం భయం గా, వాడి ముందు పది మంది ఆడ పిల్లలు కాలేజీ యూనిఫామ్ లో ఉన్నారు బిక్కుబిక్కు మంటూ అంత మందిలో ఒక అమ్మాయి ఏడుస్తూ నన్ను చూసింది తనని చూడగానే వాడి మీద ఇంకా కోపం పెరిగిపోయింది అంతే గొడ్డలి వాడి మీద విసిరేసాను నేరుగా వాడి తలలోకి దూసుకెళ్ళింది నా గొడ్డలి, అందరూ షాక్ వాళ్ళ బాస్ బాడీ ని చూసి వాడి తెల్ల కోటు ఎర్రగా మారుతుండగా చూసి అందరూ గన్స్ తో నా వైపు రావడం మొదలు పెట్టారు పక్కనే అన్నా అంటూ ఇందాక నేను చుసిన అమ్మాయి నాకు సైగ చేసింది పక్కకి చూస్తే గ్రానేడ్ బాక్స్ తీసి వరుసగా వాళ్ళ మీద విసిరేసాను అందరూ ఫినిష్ కొంతమందికి బుల్లెట్స్ తప్పలేదు, కొంచెం నా లోని ఆవేశం తగ్గినట్టనిపించింది, నా ముందు అద్దం లోనుంచి కింద స్విమ్మింగ్ పూల్ కనిపించింది, పాపం ఆ ఆడబిడ్డలు నాకు అంటిన రక్తాన్ని చూసి భయపడుతున్నారు పరిగెత్తుకుంటు వేళ్ళి అద్దం పగలకొట్టి స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసాను. రెండు నిమిషాల్లో మొత్తం కడుక్కుని ఒక ఐదు నిముషాలు కళ్ళు మూసుకున్నాను ఈ లోగ బుల్లెట్స్ అండ్ బాంబు సౌండ్స్ ఆగిపోయాయి లేచి కార్ దెగ్గరికి వెళ్లి బట్టలు మార్చుకుని కారులో కూర్చున్నాను.

రవి హాల్ లోకి వచ్చేసరికి ఆ డాన్ తల మీద గొడ్డలి అక్కడ పడి ఛిద్రమై ఉన్న బాడీ లని చూసి ఆశ్చర్యం లో ఉన్నాడు ఇంతలో "అన్నా" అంటూ ఒక అమ్మాయి వచ్చి రవి ఒడిలో పడిపోయి స్పృహ కోల్పోయింది.

రవి అక్కడనుంచి అమ్మాయిలందరిని కాబ్స్ లో పంపించేసి తన చెల్లిని తీస్కుని కార్ దెగ్గరికి వచ్చాడు.

రవి : "అన్నా పోనీ ఇక్కడ పని అయిపోయింది, చెప్పడం మర్చిపోయా తాను నా చెల్లెలు రజిని" అన్నాడు.

తనని చూసాను స్పృహ లో లేదు తనెవరో కాదు ఇందాక నాకు గ్రనేడ్ బాక్స్ గురించి సైగ చేసిన అమ్మాయి.

కార్ స్టార్ట్ చేసి రయ్యిమాంటూ ముందుకి దూకిచ్చాను.

Like Reply
Tq for update
[+] 2 users Like Ravanaa's post
Like Reply




Users browsing this thread: 102 Guest(s)