Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
?ఒక చిన్న కథ?
#1
?ఒక చిన్న కథ?

ఒక చిన్న హోటల్  చేతిలో గిన్నె  పట్టుకుని ఒక పదేళ్ళ బాబు  "  అన్న అమ్మ పది ఇడ్లిలు తీసుకురమ్మన్నారు  డబ్బులు రేపు ఇస్తాను  అన్నారు అని చెప్పాడు "

ఆ హోటల్ యజమాని  ఇప్పటికే చాలా బాకీ ఉన్నదీ 
అమ్మతో చెప్పు
ఇప్పటికి  తీసుకువెళ్ళు  గిన్నె ఇలా ఇవ్వు  బాబు  సాంబార్  పోసిస్తాను అని చెప్పాడు 

ఇడ్లి పొట్లం  కట్టి గిన్నెలో  సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు .
సరే అన్న వెళ్ళొస్తాను  అమ్మకు చెప్తాను అని చెప్పి బయల్దేరాడు

అదే హోటల్ లో అన్ని గమనిస్తున్న వ్యక్తి యజమాని  దగ్గరకు వెళ్లి అడిగాడు 
ఇప్పటికే చాల బాకీ పడ్డారు అంటున్నారు మళ్ళీ ఎందుకండీ  ఇచ్చి పంపారు అని 

ఆ యజమాని  ఆహారమే  కదండీ నేను ఇస్తున్నది .
పెట్టుబడి  వేసే నేను నడుపుతున్నది  కానీ ఇటువంటి  చిన్న పిల్లలు వచ్చి అడిగినప్పుడు  లేదని చెప్పడానికి  మనసు రావట్లేదు  .
ఈరోజు కాకపోయినా  రేపైనా  నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి 
కాస్త లేటుగా  ఇస్తారు అంతే 
అందరికి డబ్బులు అంత సులభంగా  దొరకదు.
బిడ్డ ఆకలితో  అడిగుంటుంది  అందుకే పంపారేమో  .
నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను  .
నేను కష్టపడి సంపాదిస్తున్న  డబ్బు అండి ఎలాగైనా నాకు వస్తుందండి  మోసం చేయరు .కానీ ఇప్పటికి వారి ఆకలి తీరుతుంది  కదండీ అది ముఖ్యం 

నేను ఇప్పుడు ఇవ్వను  అంటే ఆ బిడ్డ ఆ తల్లికోసం  దొంగతనం చేయొచ్చు లేదా 
ఆ తల్లి ఆ బిడ్డను బిక్షమెత్తడానికి  పంపవచ్చు  లేదా ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి  తప్పుడు  మార్గం ఎంచుకోవచ్చు  
ఇప్పటికి నేను నష్టపోవచ్చు  కానీ
సమాజంలో జరిగే  మూడు తప్పుడు ప్రయత్నాలను  నేను ఆపగలిగాను  అంతే అన్నాడు .
ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి  మనసులోనే దణ్ణం పెట్టుకున్నాడు  ఆ వ్యక్తి .
  
దేవుడు  లేడని ఎవరండీ చెప్పేది .
ఇలాంటి వారి మనస్సులో  ఉన్నాడండి
వాళ్ళు ఇచ్చేస్తారన్న  నమ్మకంలో  ఉన్నాడండి

ఒక మనిషి మనల్ని వెతుకుంటూ వచ్చారంటే  మనం కచ్చితంగా ఇస్తాము  అనే నమ్మకంతోటె  వస్తారు.

మనకు మించిన  సహాయం చేయమని  చెప్పడంలేదు.
మనకు ఉన్నదంట్లో చిన్న సాయం అయినా చాలు అంటున్నాను..??


Source:Internet/what's up.
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)