Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
#1
Heart 
ఇది సెక్స్ స్టోరీ కాదు, దయచేసి సెక్స్ స్టోరీ అనుకుని చదివి నిరాశపడొద్దు.

నేను రాస్తున్న విక్రమ్ రిచి రిచ్ కదని అందరిస్తునట్టే ఈ కద కూడా మీకు నచుతుందని ఆశిస్తూ....

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

[+] 7 users Like Pallaki's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఇండెక్స్ :
[+] 7 users Like Pallaki's post
Like Reply
#3
ఎపిసోడ్ ~ 1


రేడియో: విశాఖపట్టణం ప్రజలంతా అలెర్ట్ గా ఉండండి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ తుఫాన్ విశాఖపట్నం తీరానికి దక్షిణంగా.. గోపాల్‌పుర్‌కు ఆగ్నేయంగా కేంద్రీకృతమైందని తెలిపారు.తుపాను ఒడిశాలోని పూరీ జిల్లాలో ఆదివారం తీరం దాటి, తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందంటున్నారు. మరి తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులు వీస్తాయంటున్నారు, భయపడకుండా ఈ రోజుకి షోలో లాస్ట్ పాట ఫ్రొం శంకర్ దాదా ఎంబిబిఎస్, వింటూ అలెర్ట్ గా ఉండండి మీ సూపెరహిట్ షో వెన్నల రాత్రి, 93.5 fm భజాతే రహో! మస్త్ మజా మాది. సైనింగ్ ఆఫ్ మీ RJ శివ.

కరెక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు
లైలా మజ్నులకు తెలుసు
పారు దేవదాసులకు తెలుసు
ఆ తరువాత తమకే తెలుసు.....

చిన్నగా రేడియో సౌండ్ తగ్గిస్తూ రాధా తన భర్తని కేకవేసింది "ఏవండీ" అని.

రాధ: ఏవండీ బైట బట్టలు తీయండి మళ్ళీ పెద్ద పెద్ద ఉరుములు, ఇదురు గాలి అబ్బబ్బ చిరాకు గా ఉంది. ఏంటో ఈ తుఫాను పొయ్యేదేదో అటు పోవచ్చు కదా మధ్యలో మన దెగ్గరికి ఎందుకట రావడం.

ప్రసాద్ : రాధా నీకెన్ని సార్లు చెప్పాలి ఇది తుఫాన్ కాదని ఏదో జరుగుతుంది అదేంటో అర్ధం కావట్లేదు, గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఆరు నెలలకొకసారి ఇలాగే జరుగుతుంది రెండు రోజులు ఉరుములు ఒక రోజు ఈదురు గాలులు ఒకరోజు పిడుగులు, నాకు తెలిసి ఇవ్వాళా పిడుగులు పడాలోయ్ భార్యామణి.

రాధ : చాల్లెండి మీ చాదస్తం, దిగొచ్చాడు మరి సైన్టిస్ట్ ఎవరు కనిపెట్టలేనివి కనిపెట్టడానికి ముందు బట్టలు తీస్తారా లేక నన్నే తీస్కోమంటారా అని మంచం మీద నుంచి లేవబోయింది.

ప్రసాద్ : రాధా ఎన్ని సార్లు చెప్పాలి నీకు లేవోద్దని, ఎల్లుండే కదా నీకు డాక్టర్ డేట్ ఇచ్చింది నువ్విలా చీటికి మాటికీ లేచావంటే ఇప్పుడే హాస్పిటల్ లో అడ్మిట్ చేసేస్తాను.

రాధా : నువ్వు రెండు రోజుల ముందు అడ్మిట్ చేస్తే నీ కొడుకు రెండు రోజుల ముందు పుట్టడు పుట్టాల్సిన టైం కె పుడతాడు, నాకు కొడుకు నాకు కొడుకు అంటావ్ కదా ఇంకో వారం లో తెలిసిపోద్ది కొడుకో కూతురో.

ప్రసాద్ : మరి ఆ డాక్టర్ కి ఇరవైవేలు ఇస్తే చెపిద్ధి గా కొడుకో కూతురో నువ్వే ఒప్పుకోలేదు.

అని తీగ మీద బట్టలు తీస్కుని తల మీద చిన్న చిన్న చినుకులతో లోపలికి అడుగు పెడుతూ చల్ల గాలికి వణుకుతూ డోర్ పెట్టాడు.(వర్షపు సెబ్దం కొంచెం తగ్గింది) (ఉరుములు కాదు)

రాధా : ఇలా రా

బట్టలన్నీ పక్కన కుర్చీలో వేసి వెళ్లి రాధా ముందు మోకాళ్ళ మీద కూర్చుని "ఆజ్ఞ రాణి వారు" అన్నాడు.

ప్రసాద్ గడ్డం పట్టుకుని చిన్నగా వంగి పెదాల మీద ముద్దు పెట్టి చీర కొంగుతో మొగుడి తల తుడిచింది.

రాధ : సరే నువ్వు చెప్పినట్టే ఇరవైవేలు ఇచ్చి చూస్తాము కూతురు అని తెలిస్తే ఎం చేస్తావ్?

ప్రసాద్ : అది....అది....

రాధ : ప్రసాద్ బుగ్గలు పట్టుకుని "అందుకే వద్దన్నాను ఎవరికీ ఏది ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు, అది దేవుడి ప్రసాదం ప్రసాదు, నువ్వెవరు నేనెవరు డిసైడ్ చెయ్యడానికి ఎవరు పుట్టిన ఇంత తేడా కూడా ఉండదు".

ప్రసాద్ చిన్నగా బుంగ మూతి పెట్టుకుని "కొడుకే" అని చిన్నగా గోనిగాడు.

రాధ : సరే బాబు కొడుకే ఇంతకీ ఎం పేరు అనుకున్నావ్?

ప్రసాద్ : రుద్ర మన మాష్టారు గారి పేరు.

రాధ : హో! నువ్వేమైనా పెట్టుకో కొడుకు పుడితే చిన్నా అని కూతురు పుడితే అమ్ము అని పిలుచుకుంటా.

ఈలోగా చిన్నగా రాధ కి నొప్పులు స్టార్ట్ అయ్యాయి "ఏవండీ నొప్పి అమ్మా????" అని ప్రసాద్ ని చూసింది.

ప్రసాద్ : అర్ధమైనట్టు " రాధా ఓర్చుకో నేను వెళ్లి ఆటో ని పిలుచుకు వస్తా" అని డోర్ వెనక ఉన్న గొడుగు ని తీసుకుని బయటకి వెళ్ళాడు.

పెద్ద పిడుగు రాధా ఇంటి బయట పడింది, పెద్ద కాంతి కిరణం ఒకటి రాధ కడుపు మీద పడింది, రాధకి నొప్పులు ఎక్కువయ్యాయి బెడ్ మీద పడిపోయింది, బయటి నుంచి ఇంటి పక్కన ముసలమ్మ " అయ్యో ప్రసాదు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా అయ్యో ఆఖరి చూపు చూడ్డానికి కూడా లేకుండా పోయిందే అని గట్టిగ ఏడుస్తుంది".

ఇదంతా వినే పరిస్తుతుల్లో రాధ లేదు మాములుగా కంటే ఓర్చుకోలేనంత నొప్పి అనుభవిస్తుంది తను, సరిగ్గా ఐదు నిమిషాలకి కింద అంతా రక్తం ఒక పేగు దానికి అనుకుని ఒక తల మాత్రమే బైటికి వచ్చింది, ఇంకా బాడీ బైటికి రాలేదు, రాధ స్పృహ తప్పి పడిపోయింది.



టక్కుల సాజల్
Like Reply
#4
Nice narration. keep going...
[+] 1 user Likes vg786's post
Like Reply
#5
Nice start....... welcome welcome clps clps clps thanks
[+] 1 user Likes Naga raj's post
Like Reply
#6
Nice continue
Like Reply
#7
బాగుంది
Like Reply
#8
Nice writing super
Like Reply
#9
చాలా చాలా బగుంది ❤❤ thanks
Like Reply
#10
Superrrrr story excellent anthe
Like Reply
#11
nice start
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
#12
అద్భుతంగా స్టార్ట్ చేశారు.... కొంపదీసి సూపర్ మాన్ స్టోరీ రాస్తున్నారా ఏంటి?...
పిడుగుపాటు, పిల్లలు పుట్టడం సూపర్ పవర్స్ రావడం.....
అది ఏదో రీసెంట్ గా వచ్చిన మలయాళం మూవీ అనుకుంటా...
లేదా క్రిష్ నీ ప్లాన్ చేస్తున్నారా....
ఏదో ఒకటి చెయ్యండి అని.... అద్భుతంగా రాయండి,,,, కింకినేస్... సస్పెన్స్, పారానార్మల్, దయ్యాలు, త్రిల్లింగ్ ఉ wildness... ఇలా కొద్దిగా ఉండేటట్లు చూడండి... కానీ మధ్యలో మాత్రం ఆపకండి ఒక అద్భుతమైన నావెల్ గా రూపొందించండి...
థాంక్స్ you
[+] 6 users Like sez's post
Like Reply
#13
Start a chala existing gaa ra saru sir keep going sir
[+] 1 user Likes nari207's post
Like Reply
#14
clps Nice start happy
Like Reply
#15
Beautiful start bro
Like Reply
#16
Super story' all the best
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#17
Nice start the story
Like Reply
#18
Nice start.
Like Reply
#19
Ho my god what a start
Like Reply
#20
Nice start
Like Reply




Users browsing this thread: 1 Guest(s)