19-03-2022, 11:54 AM
Good update
Vc
|
19-03-2022, 03:24 PM
Nice update super kekaaa update Chala bagundhi excellent update
19-03-2022, 04:39 PM
అందరికి లాట్స్ అఫ్ ❤❤❤❤❤
ఇప్పటివరకు రాసినదాంత నేను సొంతగా రాసింది ఇక్కడి నుంచి కొంచెం మన సినిమాల నుంచి వేరే కథల నుంచి copy కాదు inspire అయ్యి రాస్తున్నాను ఫాస్టర్ అప్డేట్స్ అంటే కొన్ని తప్పవు అలా అని కథనం మొత్తం దించేయను ఐడియాస్డి & ఐడియాలజీ మాత్రమే. ఎక్కడైనా మీకు చదివినట్టు అనిపించినా కంపరిజన్ మీ బుర్రలో తట్టినా lite తీస్కోండి. థాంక్యూ ఈవెనింగ్ అప్డేట్ లో కలుద్దాం.
19-03-2022, 04:40 PM
పైన చెప్పిన inspire విషయం 3 రోజుల తరువాత మిత్రులారా అప్పటివరకు మొత్తం నా ఓన్ క్రియేషన్ ❤❤❤❤
19-03-2022, 05:03 PM
Chala bagundi please continue to write
19-03-2022, 06:58 PM
Baagundi bro mee story...
అత్యాశే లే కానీ... ఇంకా త్వరగా update వస్తే బాగుండు అనిపించింది...
19-03-2022, 07:00 PM
(This post was last modified: 11-11-2022, 01:36 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
S1E9
పొద్దున్నే లేచి మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కావలసిన సరుకులు తీసుకోచ్చి పనులన్నీ ముగించి కాలేజ్ కి వెళ్ళాను. చివరి బెంచి లో మానస హాయ్ అని చెయ్యి ఎత్తింది, హాయ్ అన్నాను.
మానస : ఎం చిన్నా ఏంటి సంగతులు?
చిన్నా : (ఆశ్చర్యంతో) నా పేరు నీకెలా తెలుసు
మానస : ఏమో అలా పిలవాలనిపించింది, వద్దా?
చిన్నా : లేదు అలాగే పిలువు అని మాట్లాడుతూ నా బెంచ్ లో కూర్చున్నాను.
తను చిన్నా అని పిలిచినప్పుడల్లా అమ్మ నన్ను పిలిచినట్టు ఉంది. మనసుకి చాలా సంతోషంగా అనిపించింది ఈలోగా మాథ్స్ టీచర్ ఎంట్రీ ఇచ్చింది. ఇవ్వాళ రాజు కనిపించలేదు.
మాథ్స్ టీచర్ : రేయి ఇవ్వాళ ఎగ్జామ్ పెడతా అన్నాను కదా ప్రిపేర్ అయ్యారా, ఒక్కడికి చదువు రాదు అంతా చవటలు, మానసా... దీనికి చదువు వచ్చినా రెస్పాండ్ అవ్వదు. ఈలోగా మానస లేచి ప్రిపేర్డ్ టీచర్ మీదే ఆలస్యం అంది. ఒక్కసారిగా అందరు మానసని చూస్తూ అవాక్కయ్యారు, మేడం కూడా షాక్ అయింది ఇందులో ఏముంది అని ఇంత షాక్ అవ్వడానికి అని నేను లైట్ తీసుకున్నాను, ఇంతలో రాజు క్లాస్ గుమ్మం దెగ్గరికి వచ్చి మె ఐ కమిన్ మేడం అన్నాడు టీచర్ తేరుకొని కమిన్ అని రాజుకి కొన్ని తిట్ల దండలు వేసి పంపించింది. రాజు వచ్చి నా పక్కనే కూర్చుని : ఏంట్రా విక్రమ్ క్లాస్ అంతా వేడి మీద ఉంది ఏంటి.
చిన్నా : ఎం లేదు రాజు మేడం ఎగ్జామ్ గురించి అడిగితే మానస ఆన్సర్ చెప్పింది అంతే అన్నాను
రాజు : ఏంటి, మానస ఆన్సర్ చెప్పిందా! ఏంట్రా నిన్నటినుంచి ఈ వింతలు.
చిన్నా : ఇందులో ఏముంది. ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నారు?
రాజు : లేదు విక్రమ్ నీకు తెలీదు మానస క్లాస్ లో మాట్లాడటం ఇదే మొదటి సారి, అయితే నేను మిస్ అయ్యాను అనమాట, ఛా.
ఒకసారి మానసని చూసాను నన్ను చూస్తూ చిన్నపిల్లలా సిగ్గుపడుతుంది. ఈ లోగ ఎగ్జామ్ క్వశ్చన్స్ మేడం బోర్డు మీద రాస్తుంది అవన్నీ నేను 2nd క్లాస్ లో సాల్వ్ చేసిన ప్రోబ్లమ్స్.
మనస : చిన్నా వచ్చా అవి
చిన్నా : క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాను.
మానస : ఎం కాదు నేను చూపిస్తా రాసేయి
చిన్నా : అలాగే
మానస : రేయి నిజం చెప్పు నీకవన్ని వచ్చు కదా?
చిన్న స్మైల్ ఇచ్చాను
మానస: హ్మ్మ్ ఇంట్రెస్టింగ్. మాథ్స్ బాగా చేస్తావా?
చిన్నా : అది నాకు పుట్టుకతోనే వచ్చింది.
అలా ఎగ్జామ్ రాస్తూ మధ్యలో మానసతో మాట్లాడటం మేడం చూసింది.
పీరియడ్ అయిపోయాక మేడం వెళ్తూ విక్రమ్ ఒక సారి నన్ను స్టాఫ్ రూంకి వచ్చి కలువు అని వెళ్లిపోయింది. లంచ్ బెల్ లో మానస నేను టిఫిన్ బాక్స్ సగం సగం తినేసి స్టాఫ్ రూంకి వెళ్ళాను.
మేడం : హ... రా విక్రమ్ ఏంటి క్లాస్ లో తెగ ముచ్చట్లు పెడ్తున్నావ్ ఏంటి విషయం?
చిన్నా : అలా ఎం లేదు మేడం.
మేడం : చూడు విక్రమ్ మానసాను గత కొన్ని రోజులుగా చూస్తున్నాను తను పక్కనే ఉన్న అనాధాశ్రమం నుంచి వస్తుంది వాళ్ళ అమ్మ నాన్న సూసైడ్ చేసుకున్న తరువాత తను షాక్ లోకి వెళ్లిపోయిందని విన్నాను, తను వచ్చి పది రోజులు దాటింది అప్పటినుంచి ఇప్పుడే నేను తను మొదటి సారిగా నవ్వడం చూసింది మీ ఫ్రెండ్షిప్ కి నేను అడ్డు రాను కానీ మళ్ళీ తను బాధ పడేలా మాత్రం నడుచుకోకు
చిన్నా: అలా ఎప్పటికి జరగదు మేడం అని చెప్పి బైటికి వచ్చేసాను.
తనగురించి ఆలోచిస్తూ క్లాస్ లోకి వచ్చాను అప్పుడే రాజు వచ్చి ఏరా తిన్నావా అన్నాడు, హా ఇప్పుడే అయింది అన్నాను.
చిన్నా : నీ హాకింగ్ ఎంత వరకు వచ్చింది.
రాజు : నాకు అస్సలు రాదు విక్రమ్ అది నా ఎయిమ్ మాత్రమే, దానికి పెద్ద పెద్ద బుక్స్ కావాలి లక్షల్లో ఖర్చు అవుద్ది చిన్న చిన్న ఫోన్స్ వరకు మాత్రమే హాక్ చెయ్యగలను అన్నాడు.
చిన్నా : మరి హాక్ చెయ్యాలంటే నీ దెగ్గర కంప్యూటర్ లేక లాప్టాప్ కావాలి కదా అన్నాను.
రాజు: విక్రమ్ నీ గురించి తక్కువ అంచనా వేసాను నువ్వు ఇక్కడున్న వాళ్ళతో పోలిస్తే చాలా గ్రేట్, మన క్లాస్ లో చాలా మందికి హాకింగ్ అంటే ఏంటో కూడా తెలీదు, అందుకే నన్ను చూసి అందరూ నవ్వుతుంటారు. పాత కంప్యూటర్ మన కాలేజ్ ది కొట్టేసా దానితో హాకింగ్ చెయ్యలేను కానీ నేర్చుకోడానికి ఉపయోగ పడుతుంది.
చిన్నా : రాజు నాకు ఒక హెల్ప్ కావాలి చేస్తావా?
రాజు : చెప్పు విక్రమ్ నా వాల్ల అయ్యే పని అయితే కచ్చితంగా చేస్తాను.
చిన్నా: గ్రీన్ హోటల్స్ ఈ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి.
రాజు : కష్టమే కానీ కనుక్కుంటాను. ఇంటర్నెట్ కావాలంటే మా పక్కింటోడి వైర్ వాడికి తెలియకుండా అందరూ పడుకున్నాక లాగాలి.
చిన్నా : వీలైతేయ్ ట్రై చెయ్ కష్టపడకు.
రాజు : నువ్వు చెప్పాలా.
అలా రోజూ ఇంటికి రావడం పనులు చేయడం,కాలేజ్ కి వెళ్లడం ఇలా ఒక నెల రోజులు గడిచిపోయింది, ఈ నెల రోజుల్లో నేను అనుని చూసింది ఒక్క సారె, తను నన్ను చూసి చూడనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయేది.
ఈ నెల రోజుల్లో మానస గురించి నేను, నా గురించి తాను అన్ని తెలుసుకున్నాము. మానసకి తన చినప్పుడే తల్లీదండ్రులు ఆత్మహత్య చేసుకోడం వల్ల షాక్ కి గురవ్వడం ఆ తర్వాత తెరుకున్నా పట్టించుకునే వాళ్ళు లేక ఒంటరి జీవితానికి అలవాటుపడిపోయింది అందుకే ఎవ్వరితో మాట్లాడేది కాదు, తనకి నా గురించి మొత్తం చెప్పేసాను అమ్మ గురించి, స్వాతి మేడం, పల్లవి, అనురాధని నాకు ఇచ్చి పెళ్లిచేస్తా అనడం, షేర్ పేపర్స్ అన్ని. క్లాస్ లో మానస నేను మాట్లాడుకుంటుంటే రాజు వచ్చాడు.
మానస : చిన్నా నీ బర్త్డే ఎప్పుడు?
చిన్నా : జనవరి 1st ఏ?
మానస : ఆశ్చర్యం తో నోటి మీద చెయ్యి వేసుకుంది.
చిన్నా : ఏమైందే! కొంపదీసి నీది కూడా అప్పుడేనా ఏంటి?
మానస : అవును చిన్నా!
చిన్నా : గ్రేట్ బలే కలుస్తున్నాయి నీకు నాకు మై ఫ్రెండ్
మానస : బెస్ట్ ఫ్రెండ్ అని నా భుజం పై వాలింది.
రాజు ఏదో చెప్పాలని మా దెగ్గరికి వచ్చాడు కానీ మేమిద్దరం మాట్లాడుకుంటుంటే రాలేక అలానే ఉండిపోయాడు అది మానస గమనించింది.
మానస : చిన్నా రాజు? అని సైగ చేసింది.
చిన్నా : రాజు ఇలా రా.
రాజు : విక్రమ్ నువ్వు చెప్పిన గ్రీన్ హోటల్స్ గురించి ఇన్ఫో కనుక్కున్నను అది ఐదేళ్ల క్రితామే స్ప్లిట్ అయింది దాన్ని గ్రీన్ లోటస్ గా మార్చారు ఇప్పుడు ఆ కంపెనీ కింద ఉన్న మినీ కంపెనీ గ్రీన్ హోటల్స్, దానితో పాటు ఇంకో 15 కంపెనీలుకి గ్రీన్ లోటస్ ఓనర్, కంపెనీ ఓనర్ Mr. ఆదిత్య, ఇప్పటివరకు ఆయనని ఎవ్వరు చూడలేదు దాని వాల్యూ గురించి కూడా ఎం తెలియలేదు కానీ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ అండ్ నెంబర్ వన్ కంపెనీ. రాజు చెప్పేది అంత వింటున్న నేను మానస అస్సలు నమ్మలేక పోయాము. ఆశ్చర్యం, ఆనందం...
రాజు : ఇంకేమైనా తెలియాలా విక్రమ్
మానస : రాజు గ్రీన్ లోటస్ కంపెనీ సీఈఓ mr. ఆదిత్య కాకుండా వారి కింద ఎవరైతే ఉంటారో వారి పేరు తన నెంబర్ దొరికిద్దేమో ట్రై చేయగలవా.
రాజు : ఎందుకు మీకు ఇవన్నీ?
చిన్నా : చెయ్యగలవా లేదా?
రాజు : ఓకే ఓకే కూల్ రా ట్రై చేస్తా, అన్ని మీరే మాట్లాడుకోండి నాకేం చెప్పకండి నన్ను మీ పనోన్ని చేసుకున్నారు అంతే లే.....
చిన్నా : రాజు నీకు చెప్పాల్సిన టైంలో అన్ని నేను చెప్పనవసరం లేదు నీకే ఒక్కొకటి అర్ధమవుతాయి అంత వరకు నాకు తోడుగా ఉండు చాలు ఈ జీవితానికి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ముగ్గురం ఫ్రెండ్స్ ఇది మార్చలేము ఇక ముస్కుని చెప్పిన పని చెయి.
రాజు : నన్ను జైలులో వేసే ప్లాన్స్ ఏం చెయ్యట్లేదు కదా, మా అమ్మకి నేను ఒక్కణ్ణే కొడుకుని ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పండి పారిపోతా
మానస : రాజూ..
రాజు : సారీ, ఓకే నేను ఆ పని మీద ఉంటా, బాయి రేపు కలుద్దాం.
8 నెలలు గడిచాయి ఇంత వరకు మాకు కంపెనీ వివరాలు ఏమి తెలీలేదు, కంపెనీ మెయిన్ బ్రాంచ్ ముంబై లోనే ఉంది, అస్సలు కంపెనీ లో ఇంకా సునీల్ గారు ఉన్నారా? పేరు మారింది, నా పేరు మీద ఉందా లేదా? సడన్ గా వెళ్లి నేనే విక్రమాదిత్య అంటే నమ్ముతారా? రమ ఆంటీ ని తీసుకెళదాం అంటే ఇక్కడ అందరికి తెలిసిపోద్ది, నాకు నేనుగా వెళ్ళలేను, నాకు మానసకి ఎన్నో ప్రశ్నలు, నాకు లెక్క లేనన్ని అవమానాలు.
మధ్యలో రాజు బర్త్డే కి రాజు వాళ్ళ అమ్మ పాయసం చేసి పంపింది మా ముగ్గురి కోసం. ఆ తరువాత మా ఇద్దరి బర్త్డేలకి రాజు వాళ్ళ అమ్మ తో చికెన్ చేపించుకొచ్చాడు చాలా టేస్టీ గా ఉంది ముగ్గురం కుమ్మేసాము.
చిన్నా : మానస ఇక నుంచి రాజు అమ్మ మనకి కూడా అమ్మే.
దానికి రాజు గాడి కళ్ళలో చెమ్మ మానస గమినించింది. ఇక పద్మ, జయరాజ్, సింధు, భద్ర ఈ నలుగురు వాళ్ళ శాడిజం మొత్తం నా మీద తీర్చుకునే వారు, నన్ను అవమానించడం అంటే వాళ్ళకి పండగ తెల్లారే సండే వచ్చినంత ఆనందం. అనురాధా మాత్రం నాకు దూరంగా ఉండేది.
రాజు విపరీతం గా ట్రై చేస్తున్నాడు వాడు ఎంత కష్టపడుతున్నా ఒక్కసారి కూడా ఇవన్నీ నాతో ఎందుకు చేపిస్తున్నారు అని అడగలేదు, బహుశా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఇదే కాబోలు అనుకున్న, బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ అమ్మా నువ్వు లేకపోయినా నాకు ఇద్దరు ప్రాణ స్నేహితులు దొరికారు థాంక్స్ మా.. అని కళ్ళుమూసుకున్నాను నిద్రని బలవంతంగా రప్పిస్తూ.
రోజులు సాగుతూనే ఉన్నాయి రెండు ఏళ్ళు గడిచిపోయాయి మానస నా ప్రాణం నా అమ్మ అయిపోయింది, తనని ఇప్పటివరకు కామంతో చూసింది లేదు అమ్మ మీద పడుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేదో మానసతో ఉన్నప్పుడు కూడా అంతే ప్రశాంతంగా ఉండేది.. అంత పవిత్రమైన ఫ్రెండ్షిప్ మాది. పదో తరగతి పరీక్షలకి పది రోజులు ఉండగా ఒక రోజు పల్లవికి కాళ్ళు పడుతుంటే.
పల్లవి : రేయ్ రాజు నీకు అను కి వారం లో పెళ్లి ముస్కుని చేస్కో, పెళ్లి అయినంత మాత్రాన నీ పనులు ఏవి మారవు, పెళ్లి తరువాత నుంచి మా అందరితో పాటు దానికి కూడా బానిసవే అని తన కాలి బొటన వేలు నా నోట్లో పెట్టింది, నేను అలాగే ఉండిపోయాను చలనం లేకుండా.
సాయంత్రం
పవిత్ర : ఇప్పుడు ఆ కుక్క కి పెళ్లి కావాల్సొచ్చిందా?
పల్లవి : అమ్మా! నేను చెప్పేది విను RAVEN కంపెనీ వాళ్ళు గ్రీన్ లోటస్ కంపెనీ నుంచి ప్రాజెక్ట్ ఓకే చేపించుకున్నారు మనము RAVEN కంపెనీ తో పార్టనర్షిప్ పెట్టుకుంటే ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే వాళ్ళతో సమానంగా ఎదుగుతాము, అప్పుడు మనం కూడా చిన్నగా గ్రీన్ లోటస్ కంపెనీ నుంచి ఆర్డర్స్ తీస్కోవచ్చు, దీనికి ఈ పెళ్లి వేదిక మాత్రమే కానీ పెళ్లిచూపులు పద్మకి మరియు RAVEN గ్రూప్ అఫ్ కంపెనీ సీఈఓ సుందర్ కొడుకు సురేష్కి, ఈ పెళ్లి చూపులు కనుక సెట్ అయితే మన కంపెనీ 100 కోట్ల కంపెనీగా పేరు తెచ్చుకుంటుంది.
ఇదంతా విన్న పవిత్ర ఉత్సాహం ఆపుకోలేక మా తల్లే కంపెనీని నువ్వు ఎక్కడికో తీసుకెళ్తున్నావ్, ఇప్పటినుంచి నేను నీకు ఏ విషయంలో అడ్డుచెప్పను నీకు ఏది అనిపిస్తే అది చేసేయి. ఈ మాటలకి పల్లవి విజయగర్వం తో పొంగిపోయింది.
రాత్రి బెడ్ మీద అమ్మ ఫోటో చూస్తూ అమ్మా నా జీవితం ఎటు పోతుందో ఏమో నాకు తెలీదు డబ్బులు రాని రాకపోని, కంపెనీ ఉండని లేకపోని కానీ నాకంటూ ఉన్నది నీ ఫోటో నా ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమె, ఇవి మాత్రం దూరం కాకుండా చూసుకో అని బతిమిలాడుకుంటు నిద్రపోయా.
19-03-2022, 07:59 PM
I think the owner of green lotus named Mr Adithya, non other than Vikramaditya super narration bro
19-03-2022, 08:34 PM
19-03-2022, 08:36 PM
19-03-2022, 08:37 PM
|
« Next Oldest | Next Newest »
|