Posts: 11,312
Threads: 13
Likes Received: 49,554 in 10,021 posts
Likes Given: 12,734
Joined: Nov 2018
Reputation:
997
జూన్ 15-16 అర్థ రాత్రి పూట గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇందులో 20మంది భారతీయ సైనికులు మరణించారు. ఇనుప మేకులున్న రాడ్‌లతో చైనా సైనికులు భారత సైనికుల మీద దాడి చేశారు. సరిహద్దుల్లో భారత సైనికులను కొట్టి చంపారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ప్రకటించారు. అయితే చైనా సైనికులతో ఘర్షణ సందర్భంగా భారత సైనికులు తుపాకులు వాడలేదన్న విషయం బయటపడింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.
"అసలు ఆయుధాలు లేకుండా వారిని సరిహద్దులకు ఎందుకు పంపారు'' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అయితే గతంలో చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్లే ఆయుధాలను వాడలేకపోయామని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు.
సరిహద్దులో పోస్ట్ చేసిన సైనికులందరి దగ్గరా ఆయుధాలున్నాయని జయశంకర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. పోస్ట్ నుంచి దూరంగా వెళ్లేటప్పుడు వారు ఆయుధాలను తప్పకుండా తీసుకెళతారని, జూన్ 15న గాల్వాన్ లోయలో పోస్ట్ చేసిన సైనికుల దగ్గర ఆయుధాలున్నాయని ఆయన తెలిపారు, 1996, 2005లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇండో-చైనా సైనికులు ముఖాముఖి తలపడినప్పుడు తుపాకులను ఉపయోగించకూడదని విదేశాంగ మంత్రి వెల్లడించారు
విదేశాంగమంత్రి చెప్పిన ఆ ఒప్పందంలో ఏముంది?
"ఇరుపక్షాలు ఒకదాని మీద మరొకటి ఎలాంటి బలాన్ని ప్రయోగించవు. సైనిక ఆధిపత్యాన్ని సాధించడం కోసం ఇతరులను బెదిరించవు'' అని 1996లో కుదిరిన ఒప్పదంలో ఉంది. అందులోని మొదటి పేరాలో "రెండు దేశాలు ఏవీ మిలటరీ శక్తిని మరొక దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించవు. ఎల్‌ఎసి (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) రెండువైపులా మోహరించిన ఏ సైన్యం, దాని సైనిక సామర్ధ్యంతో మరొక సైన్యంపై దాడి చేయదు. అలాంటి సైనిక కార్యకలాపాల్లో పాల్గొనదు. అలా చేసేలా మరోదేశంపై ఒత్తిడి చేయదు. తద్వారా ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలు కొనసాగుతాయి'' అని రాసి ఉంది.
విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రస్తావిస్తున్న ఒప్పందంలోని ఈ భాగం ఆర్టికల్ 6లో ఉంది. దీని ప్రకారం "ఎల్‌ఎసికి రెండు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఏ దేశమూ కాల్పులు జరపదు. జీవరసాయన ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, తుపాకులతో దాడులకు దిగదు.''
1993లో కూడా చైనాతో ఒక ఒప్పందం కుదిరింది. ఇందులో "భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం శాంతియుతంగా, స్నేహపూర్వక చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఇరుపక్షాలు నమ్ముతున్నాయి. ఏ దేశమూ బలప్రయోగానికి దిగదు'' అని ఉంది. 1993, 1996 నాటి ఒప్పందాలలోని అనేక అంశాలు 2005 ఒప్పందంలో పునరావృతమయ్యాయి.
ఈ ఒప్పందం ఆయుధాలను పూర్తిగా నిషేధించిందా ?
ఆయుధాలను ఉపయోగించడానికి ఏ దేశానికి అనుమతిలేదని ఒప్పందాలను బట్టి అర్ధమవుతోంది. అయితే పరిస్థితులు పరస్పర దాడి వరకు వచ్చినప్పుడు ఈ నియమాలు వర్తిస్తాయా? ఈ సందర్భంలో భారత సైన్యం చేస్తున్న వాదనలు సరైనవేనా? రిట్రీట్ మేజర్ జనరల్ అశోక్ మెహతాతో ఈ విషయంపై బీబీసీ మాట్లాడింది.
''మనపై మెరుపు దాడి జరుగుతుంటే, అనూహ్యంగా రాళ్లతో దాడికి దిగితే మీరు మీ దగ్గరున్న ఆయుధాలను వదిలేయలేరు. ఆత్మరక్షణ కోసం ఒప్పందాలను ఉల్లంఘించాలా వద్దా అని అక్కడున్న కమాండర్ నిర్ణయించాలి. కమాండర్ లేకపోతే సెకండ్-ఇన్-కమాండ్ ఆదేశించాలి. ఆత్మరక్షణ కోసం ఆయుధాన్ని ఉపయోగించడంలో తప్పులేదు" అన్నారు మెహతా. జయశంకర్ చెబుతున్న ఒప్పందాన్ని చైనా అప్పటికే ఉల్లంఘించిందని అంటారు మెహతా. "సాధారణంగా సరిహద్దు వివాదాలు సమయంలో బ్యానర్లను తొలగిస్తారు. ఇక్కడ కూడా బ్యానర్ లేదు. వారు సాయంత్రంపూట అకస్మాత్తుగా దాడికి దిగారు. అంటే సరిహద్దు ఒప్పందాన్ని అప్పటికే వారివైపు నుంచి ఉల్లంఘించారు" అన్నారాయన.
"అయితే అక్కడ పరిస్థితులు ఏమిటో మనకు తెలియదు. అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతికి ఉన్నారు, ఎంతమంది కాల్పులు జరపగలిగే స్థితిలో ఉన్నారో తెలియదు. ముందుగా దాడి చేసిన వారిదే సాధారణంగా పై చేయి అవుతుంది" అన్నారు మెహతా.
అంతర్జాతీయ వ్యవహరాల నిపుణులు ఎస్.డి. మున్షి ''పూర్తి వివరాలు తెలిసే వరకు రెండువైపులా ఎవరు ఎలాంటి బలప్రయోగం చేశారు, ఎవరు ఒప్పందాన్ని ఉల్లంఘించారో చెప్పడం కష్టం. కానీ చాలామంది సైనికులు మరణించడం మామూలు విషయం కాదు. ప్రాణాలను కాపాడుకోడానికి ఆయుధాలు వాడవచ్చనేది నిజం. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, ఆయుధాలను ఉపయోగించవచ్చని అంతర్జాతీయ ప్రోటోకాల్ చెబుతోంది'' అని అన్నారు.
ఈ ఒప్పందాల భవిష్యత్తు ఏమిటి?
"ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారని భారత ప్రభుత్వం నమ్మితే, చైనాతో ఈ ఒప్పందాల గురించి మళ్లీ మాట్లాడాలి, ఇరుదేశాల మధ్య విశ్వాసాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా? అని భారత ప్రభుత్వం చైనాను అడగాలి" అన్నారు ఎస్.డి. మున్షి. అంతేకాదు చైనాకు సంబంధించిన ఇతర సమస్యలను భారతదేశం అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Posts: 112
Threads: 3
Likes Received: 763 in 88 posts
Likes Given: 42
Joined: Aug 2019
Reputation:
18
Very useful interesting article..
Posts: 11,312
Threads: 13
Likes Received: 49,554 in 10,021 posts
Likes Given: 12,734
Joined: Nov 2018
Reputation:
997
(20-06-2020, 05:41 PM)bumchick0 Wrote: Very useful interesting article..
ఇంత మంది కాముకల మధ్య ఒక్క ప్రశంస సంతోషం
•
Posts: 11,312
Threads: 13
Likes Received: 49,554 in 10,021 posts
Likes Given: 12,734
Joined: Nov 2018
Reputation:
997
బిబిసిభారతీయులు అనేక కారణాల రీత్యా నియంత్రణ రేఖని (ఎల్ఓసీ) తొందరగా గుర్తిస్తారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య 740 కి.మీ.ల పొడవున్నఈ నియంత్రణ రేఖ చుట్టూ యుద్ధాలు జరిగాయి. సినిమా షూటింగులు జరిగాయి. ఈ రేఖ ఎప్పుడూ వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది.
అయితే, భారతదేశాన్ని చైనా భూభాగంతో విభజించేది వాస్తవాధీన రేఖ. దీన్నే ఎల్ఏసీ అంటున్నారు.
చైనాతో భారత భౌగోళిక సరిహద్దు పొడవు 3,488 కి.మీ.లు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ల గుండా ఇది వెళ్తుంది.
ఈ సరిహద్దును మూడు సెక్టార్లుగా విభజించారు. ఒకటి పశ్చిమ సెక్టార్, అంటే జమ్మూకశ్మీర్. మరొకటి మిడిల్ సెక్టార్, అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. మూడోది తూర్పు సెక్టార్, అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్.
భారత్, చైనాల మధ్య ఇంకా పూర్తి స్థాయిలో సరిహద్దుల నిర్ణయం జరగలేదు. కొన్ని ప్రాంతాల విషయమై ఇంకా రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి.
భారతదేశం ఈ వాస్తవాధీన రేఖను ఎలా కాపాడుకుంటుంది?
భారత హోమ్ మంత్రిత్వ శాఖ 2004 సంవత్సరంలో వాస్తవాధీన రేఖను సంరక్షించే బాధ్యతను ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ అధికారి (ఐ టి బి పి) దళానికి అప్పగించింది. వీరికి అంతకు ముందు అస్సాం రైఫిల్స్ సహాయం అందించేవారు. 1962 లో ఇండియా చైనా యుద్ధం జరుగుతున్నసమయంలో ఐటీబీపీ ఏర్పాటయింది.
జావిర్ చౌదరి ఐటీబీపీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గా పని చేసి 2010 లో పదవీ విరమణ పొందారు.
ఆయన 37 సంవత్సరాల పదవీ కాలంలో వాస్తవాధీన రేఖ వెంబడి అన్ని ప్రాంతాలలోనూ పని చేశారు.
భారతదేశం ఈ వాస్తవాధీన రేఖను ఎలా సంరక్షించుకోవాలనుకుంటుందో ఆయన వివరించారు.
వాస్తవాధీన రేఖ వెంబడి భారత దేశం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన విషయం చెబుతూ మేం ఒక దళాన్ని(ఐటీబీపీ) ఏర్పాటు చేశాం, కానీ దాని అవసరాలను మేం సరిగ్గా అందుకోలేకపోయాం. మాకు అవసరమైనదానికి, సరిహద్దుల దగ్గర కాపలా కాస్తున్న మాకు అందుతున్నదానికి చాలా పెద్ద తేడా ఉంది.
కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ 2018-19 లో విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఐటీబీపీలో ఉన్న 32 బెటాలియన్ లను భారత చైనా ల మధ్య నియంత్రణ రేఖ వద్ద కాపలాగా నియమించారు.
అధికారికంగా ప్రతీ బెటాలియన్ లో 1000 మంది సిబ్బంది ఉండాలి. ఈ మాట వినగానే చౌదరి నవ్వారు.
ప్రతి బెటాలియన్ 110 కిలోమీటర్ల మేర నియంత్రణ రేఖను సంరక్షించాలి. ఎల్ఏసీ వద్ద 9000 అడుగుల నుంచి 18750 అడుగుల ఎత్తులో మంచు పర్వతాలు, హిమనీనదాలు, మంచు ఏడారులు ఉన్నాయి.
"అధిక సంఖ్యలో దళాలను పంపారని నాకు తెలుసు. కానీ ఇంకా చాలా అంతరాలు ఉన్నాయి. నియంత్రణ రేఖ దగ్గర సమర్ధవంతమైన పర్యవేక్షణ చెయ్యాలంటే ఇప్పుడున్న దానికి మూడు రెట్లు అధికంగా దళాలను నియమించాల్సి ఉంటుందని” ఆయన అన్నారు.
3488 కిలోమీటర్ల మేర విస్తరించిన 178 బోర్డర్ అవుట్ పోస్టులలో రెండు పోస్టుల మధ్య ఉన్న దూరం సుమారుగా 20 కిలోమీటర్లు ఉంటుంది. దీనర్ధం ఏమిటి?
“మంచు లోయల్లో 100 మీటర్ల దూరం కూడా ఒక్కొక్కసారి కనిపించదు. ఈశాన్య ప్రాంతపు అడవుల్లో అయితే రెండు అడుగుల దూరంలో కూడా ఏముందో కనిపించదని” నవ్వుతూ అన్నారు.
కొన్ని సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ విధానాలు అవలంభించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.
ఈ విషయం పై గృహ మంత్రిత్వ శాఖ స్పందించలేదు.
"ప్రభుత్వానికి ఈ విషయాలు తెలుసు, అయితే, నిధుల కొరతని ఈ పరిస్థితికి కారణంగా చెబుతూ ఉంటుందని” ఆయన అన్నారు.
ఇందుకు ఉదాహరణగా ముందు 10 వాహనాలు అందుకు తగిన ఇంధనం కొనుక్కోవడానికి నిధులు లభిస్తాయి. తర్వాత మరో 5 వాహనాలు సమకూరుస్తారు, కానీ వాటికి ఇంధనం ఉండదు. ఆ 5 వాహనాలతో మనం ఏమి చేయగలమని ప్రశ్నించారు.
2009 - 10 మధ్యలో 1,134.05 రూపాయిల కోట్లు ఉన్న ఐటీబీపీ బడ్జెట్ 2018-19 లో 6190.72 కోట్ల రూపాయలకు పెరిగింది.
కానీ, దళంలో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. ఇది కేవలం బడ్జెట్ కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఆ నిధులను ఎలా వినియోగిస్తున్నారో కూడా తెలుసుకోవలసిన అవసరం ఉందని అన్నారు.
ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది.
"మేము గృహ మంత్రిత్వ శాఖకి, సైన్యానికి కూడా రిపోర్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి సైన్యంతో సంయుక్తంగా నియంత్రణ రేఖ వెంబడి కాపలా కాస్తాం. నియంత్రణ రేఖ దగ్గర అవలంభించాల్సిన విధానాల గురించి గృహ మంత్రిత్వ శాఖ చార్టర్ రూపొందించింది. కేవలం సరిహద్దు రేఖల గురించి పని చేసేందుకు ఒక మంత్రిత్వ శాఖ ఎందుకుండకూడదు అని ఆయన ప్రశ్నించారు. అలా ఉన్నప్పుడు మరింత సమర్ధవంతంగా విధానాలను శాస్త్రీయంగా అమలు చేసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
నియంత్రణ రేఖ దగ్గర చైనా ఎప్పుడు దళాలను పంపినా వారితో పాటు ఒక రాజకీయ ప్రతినిధి కూడా ఉంటారు. ఆ దళాలు ఆ ప్రతినిధి సూచనలకు అనుగుణంగా పని చేస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో వారికి స్వతంత్రత లేకపోవడమే వారి బలహీనత.
అయితే, వారు మౌలిక సదుపాయాల విషయంలో సమర్ధవంతంగా ఉన్నారు.
వారికున్న మౌలిక సదుపాయాల కారణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రైలు ద్వారా 12 గంటల లోపు దళాలను పంపించగలిగే అవకాశం ఉంది. అదే పనిని భారతదేశం చెయ్యాలంటే కొన్ని వేల వాహనాలు అవసరం అవుతాయి.
చైనా పరికరాలను, మౌలిక సదుపాయాలను, అభివృద్ధి చేసుకుంది. వారి హై వే ల మీద జెట్ విమానాలను, రైళ్లను కూడా నడపగలిగే సమర్ధవంతమైన సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. మనం వాళ్ళతో పోల్చుకోవడానికి లేదు. మనం కూడా కొన్ని పనులు మొదలు పెట్టాం. కానీ, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. చైనాతో పోలిస్తే మన సదుపాయాలు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్లే సదుపాయాలూ చాలా తక్కువ"
ఉన్న దాంట్లో ఉత్తమమైనది ఎంచుకునే అలవాటు మనకి ఉంది. కానీ, ఇది సరైన విధానం కాదు. ప్రతీ దళానికి తగిన పరిశోధన , అభివృద్ధి విభాగం ఉండటం చాలా అవసరం. వారు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతానికి కావల్సిన అవసరాలను చూస్తూ అందుకు అనుగుణంగా పరిస్థితులను అభివృద్ధి చేస్తే కొన్ని అవసరాలు తీరుతాయి. మన ఆలోచనా విధానమే మారాలి.
“క్షేత్రస్థాయిలో మా సమన్వయం చాలా బాగుంటుంది. సాధారణ పరిస్థితుల్లో దళం చాలా స్వేచ్ఛగా ఫీలయ్యేలా చేస్తాం. ఎక్కువ సమాచార వనరులు ఉండడం వల్ల దేశానికి ప్రయోజనం ఉంటుంది” అని చౌధరి చెప్పారు.
ఆ ప్రాంతంలోని ఐటీబీపీపై చాలా మంది ఆర్మీ అధికారులు ఆపరేషనల్ కంట్రోల్ కోరుకుంటున్నారనే విషయంలో నిజమెంత అని నేను అడిగాను.
ఆయన “నేను ఏకీభవించను. వన్-అప్‌మన్‌షిప్ మంచిది కాదు. ప్రతి దళానికీ ఒక పాత్ర ఉంటుంది. వారు ఏం చెప్పినా అంగీకరించాలి అనేలా, పెద్దన్నలా వ్యవహరించకూడదు. ఈరోజు, పెద్దన్నగా ఉండడానికి వరుస ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా, మేం మంచి సమన్వయంతో ఉన్నాం. ఈ దళాన్ని ఒకరి అదుపులోకి ఉండేలా బలవంతం చేయడమనేది లక్ష్యంగా మారకూడదు” అని సమాధానం ఇచ్చారు.
Posts: 309
Threads: 1
Likes Received: 632 in 118 posts
Likes Given: 25
Joined: Jan 2019
Reputation:
55
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(22-06-2020, 06:15 AM)stories1968 Wrote: బిబిసిభారతీయులు అనేక కారణాల రీత్యా నియంత్రణ రేఖని (ఎల్ఓసీ) తొందరగా గుర్తిస్తారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య 740 కి.మీ.ల పొడవున్నఈ నియంత్రణ రేఖ చుట్టూ యుద్ధాలు జరిగాయి. సినిమా షూటింగులు జరిగాయి. ఈ రేఖ ఎప్పుడూ వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది.
అయితే, భారతదేశాన్ని చైనా భూభాగంతో విభజించేది వాస్తవాధీన రేఖ. దీన్నే ఎల్ఏసీ అంటున్నారు.
చైనాతో భారత భౌగోళిక సరిహద్దు పొడవు 3,488 కి.మీ.లు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ల గుండా ఇది వెళ్తుంది.
ఈ సరిహద్దును మూడు సెక్టార్లుగా విభజించారు. ఒకటి పశ్చిమ సెక్టార్, అంటే జమ్మూకశ్మీర్. మరొకటి మిడిల్ సెక్టార్, అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. మూడోది తూర్పు సెక్టార్, అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్.
భారత్, చైనాల మధ్య ఇంకా పూర్తి స్థాయిలో సరిహద్దుల నిర్ణయం జరగలేదు. కొన్ని ప్రాంతాల విషయమై ఇంకా రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి.
భారతదేశం ఈ వాస్తవాధీన రేఖను ఎలా కాపాడుకుంటుంది?
భారత హోమ్ మంత్రిత్వ శాఖ 2004 సంవత్సరంలో వాస్తవాధీన రేఖను సంరక్షించే బాధ్యతను ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ అధికారి (ఐ టి బి పి) దళానికి అప్పగించింది. వీరికి అంతకు ముందు అస్సాం రైఫిల్స్ సహాయం అందించేవారు. 1962 లో ఇండియా చైనా యుద్ధం జరుగుతున్నసమయంలో ఐటీబీపీ ఏర్పాటయింది.
జావిర్ చౌదరి ఐటీబీపీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గా పని చేసి 2010 లో పదవీ విరమణ పొందారు.
ఆయన 37 సంవత్సరాల పదవీ కాలంలో వాస్తవాధీన రేఖ వెంబడి అన్ని ప్రాంతాలలోనూ పని చేశారు.
భారతదేశం ఈ వాస్తవాధీన రేఖను ఎలా సంరక్షించుకోవాలనుకుంటుందో ఆయన వివరించారు.
వాస్తవాధీన రేఖ వెంబడి భారత దేశం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన విషయం చెబుతూ మేం ఒక దళాన్ని(ఐటీబీపీ) ఏర్పాటు చేశాం, కానీ దాని అవసరాలను మేం సరిగ్గా అందుకోలేకపోయాం. మాకు అవసరమైనదానికి, సరిహద్దుల దగ్గర కాపలా కాస్తున్న మాకు అందుతున్నదానికి చాలా పెద్ద తేడా ఉంది.
కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ 2018-19 లో విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఐటీబీపీలో ఉన్న 32 బెటాలియన్ లను భారత చైనా ల మధ్య నియంత్రణ రేఖ వద్ద కాపలాగా నియమించారు.
అధికారికంగా ప్రతీ బెటాలియన్ లో 1000 మంది సిబ్బంది ఉండాలి. ఈ మాట వినగానే చౌదరి నవ్వారు.
ప్రతి బెటాలియన్ 110 కిలోమీటర్ల మేర నియంత్రణ రేఖను సంరక్షించాలి. ఎల్ఏసీ వద్ద 9000 అడుగుల నుంచి 18750 అడుగుల ఎత్తులో మంచు పర్వతాలు, హిమనీనదాలు, మంచు ఏడారులు ఉన్నాయి.
"అధిక సంఖ్యలో దళాలను పంపారని నాకు తెలుసు. కానీ ఇంకా చాలా అంతరాలు ఉన్నాయి. నియంత్రణ రేఖ దగ్గర సమర్ధవంతమైన పర్యవేక్షణ చెయ్యాలంటే ఇప్పుడున్న దానికి మూడు రెట్లు అధికంగా దళాలను నియమించాల్సి ఉంటుందని” ఆయన అన్నారు.
3488 కిలోమీటర్ల మేర విస్తరించిన 178 బోర్డర్ అవుట్ పోస్టులలో రెండు పోస్టుల మధ్య ఉన్న దూరం సుమారుగా 20 కిలోమీటర్లు ఉంటుంది. దీనర్ధం ఏమిటి?
“మంచు లోయల్లో 100 మీటర్ల దూరం కూడా ఒక్కొక్కసారి కనిపించదు. ఈశాన్య ప్రాంతపు అడవుల్లో అయితే రెండు అడుగుల దూరంలో కూడా ఏముందో కనిపించదని” నవ్వుతూ అన్నారు.
కొన్ని సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ విధానాలు అవలంభించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.
ఈ విషయం పై గృహ మంత్రిత్వ శాఖ స్పందించలేదు.
"ప్రభుత్వానికి ఈ విషయాలు తెలుసు, అయితే, నిధుల కొరతని ఈ పరిస్థితికి కారణంగా చెబుతూ ఉంటుందని” ఆయన అన్నారు.
ఇందుకు ఉదాహరణగా ముందు 10 వాహనాలు అందుకు తగిన ఇంధనం కొనుక్కోవడానికి నిధులు లభిస్తాయి. తర్వాత మరో 5 వాహనాలు సమకూరుస్తారు, కానీ వాటికి ఇంధనం ఉండదు. ఆ 5 వాహనాలతో మనం ఏమి చేయగలమని ప్రశ్నించారు.
2009 - 10 మధ్యలో 1,134.05 రూపాయిల కోట్లు ఉన్న ఐటీబీపీ బడ్జెట్ 2018-19 లో 6190.72 కోట్ల రూపాయలకు పెరిగింది.
కానీ, దళంలో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. ఇది కేవలం బడ్జెట్ కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఆ నిధులను ఎలా వినియోగిస్తున్నారో కూడా తెలుసుకోవలసిన అవసరం ఉందని అన్నారు.
ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది.
"మేము గృహ మంత్రిత్వ శాఖకి, సైన్యానికి కూడా రిపోర్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి సైన్యంతో సంయుక్తంగా నియంత్రణ రేఖ వెంబడి కాపలా కాస్తాం. నియంత్రణ రేఖ దగ్గర అవలంభించాల్సిన విధానాల గురించి గృహ మంత్రిత్వ శాఖ చార్టర్ రూపొందించింది. కేవలం సరిహద్దు రేఖల గురించి పని చేసేందుకు ఒక మంత్రిత్వ శాఖ ఎందుకుండకూడదు అని ఆయన ప్రశ్నించారు. అలా ఉన్నప్పుడు మరింత సమర్ధవంతంగా విధానాలను శాస్త్రీయంగా అమలు చేసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
నియంత్రణ రేఖ దగ్గర చైనా ఎప్పుడు దళాలను పంపినా వారితో పాటు ఒక రాజకీయ ప్రతినిధి కూడా ఉంటారు. ఆ దళాలు ఆ ప్రతినిధి సూచనలకు అనుగుణంగా పని చేస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో వారికి స్వతంత్రత లేకపోవడమే వారి బలహీనత.
అయితే, వారు మౌలిక సదుపాయాల విషయంలో సమర్ధవంతంగా ఉన్నారు.
వారికున్న మౌలిక సదుపాయాల కారణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రైలు ద్వారా 12 గంటల లోపు దళాలను పంపించగలిగే అవకాశం ఉంది. అదే పనిని భారతదేశం చెయ్యాలంటే కొన్ని వేల వాహనాలు అవసరం అవుతాయి.
చైనా పరికరాలను, మౌలిక సదుపాయాలను, అభివృద్ధి చేసుకుంది. వారి హై వే ల మీద జెట్ విమానాలను, రైళ్లను కూడా నడపగలిగే సమర్ధవంతమైన సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. మనం వాళ్ళతో పోల్చుకోవడానికి లేదు. మనం కూడా కొన్ని పనులు మొదలు పెట్టాం. కానీ, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. చైనాతో పోలిస్తే మన సదుపాయాలు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్లే సదుపాయాలూ చాలా తక్కువ"
ఉన్న దాంట్లో ఉత్తమమైనది ఎంచుకునే అలవాటు మనకి ఉంది. కానీ, ఇది సరైన విధానం కాదు. ప్రతీ దళానికి తగిన పరిశోధన , అభివృద్ధి విభాగం ఉండటం చాలా అవసరం. వారు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతానికి కావల్సిన అవసరాలను చూస్తూ అందుకు అనుగుణంగా పరిస్థితులను అభివృద్ధి చేస్తే కొన్ని అవసరాలు తీరుతాయి. మన ఆలోచనా విధానమే మారాలి.
“క్షేత్రస్థాయిలో మా సమన్వయం చాలా బాగుంటుంది. సాధారణ పరిస్థితుల్లో దళం చాలా స్వేచ్ఛగా ఫీలయ్యేలా చేస్తాం. ఎక్కువ సమాచార వనరులు ఉండడం వల్ల దేశానికి ప్రయోజనం ఉంటుంది” అని చౌధరి చెప్పారు.
ఆ ప్రాంతంలోని ఐటీబీపీపై చాలా మంది ఆర్మీ అధికారులు ఆపరేషనల్ కంట్రోల్ కోరుకుంటున్నారనే విషయంలో నిజమెంత అని నేను అడిగాను.
ఆయన “నేను ఏకీభవించను. వన్-అప్‌మన్‌షిప్ మంచిది కాదు. ప్రతి దళానికీ ఒక పాత్ర ఉంటుంది. వారు ఏం చెప్పినా అంగీకరించాలి అనేలా, పెద్దన్నలా వ్యవహరించకూడదు. ఈరోజు, పెద్దన్నగా ఉండడానికి వరుస ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా, మేం మంచి సమన్వయంతో ఉన్నాం. ఈ దళాన్ని ఒకరి అదుపులోకి ఉండేలా బలవంతం చేయడమనేది లక్ష్యంగా మారకూడదు” అని సమాధానం ఇచ్చారు. చాలా బాగుంది మిత్రమ. చాలా విషయాలు తెలుసుకున్నాను. నియంతల పాలిస్తున్నప్పుడు సరిహద్దు దేశాలకి చాలా ఇబ్బందే. అదే ప్రస్తుతం చైనా సరిహద్దున ఉన్న అన్ని దేశాల పరిస్థితి. ఐతే నియంతలు నియతృత్వం ఎప్పుడో ఒకప్పుడు కూలక తప్పదు. అప్పటి వరకు వేచి చూస్తే చాలు. చైనా కుప్పకూలినప్పుడు టిబెట్ తో సహా ఎన్నో స్వతంత్ర దేశాలు వస్తాయి. చైనా బలహీనముగా ఉన్నప్పుడు భారత దేశముని పరిపాలిస్తున్న బ్రిటీషు వారు గీసిన సరిహద్దులని బలపడ్డాక చైనా గుర్తించనవసరం లేదు. రాజ్యం వీరభోజ్యం అన్నారు కదా పెద్దలు.
మీ డిప్పడు
|