Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
 పెద్దయ్యా పెద్దయ్యా ...... కళ్ళు మూసుకోకండి నన్ను చూడండి నన్ను చూడండి మీకేమీ కాదు మీకేమీ కాదు హాస్పిటల్ కు వెళుతున్నాము అంటూ బుగ్గలను స్పృశిస్తూ కళ్ళు మూతలుపడకుండా ప్రయత్నిస్తున్నాను .
పెద్దయ్య : తల్లి నా తల్లి తల్లి బాబూ ...... నా తల్లి అంటూ కలవరిస్తున్నారు .
ఏమిటో అర్థం కాక పెద్దయ్యా ...... ఇలానే స్పృహలో ఉండండి అంటూ అరచేతిలో చేతినివేసి ధైర్యాన్ని ఇస్తున్నాను .
చెప్పినట్లుగానే నిమిషానికొక కిలోమీటర్ దాటినట్లు 15 నిమిషాలలో హాస్పిటల్ చేరుకుని నేరుగా తీసుకెళ్లి బస్సుని అత్యవసర విభాగం దగ్గర ఆపాడు .
ప్రయాణీకులు సహాయం చెయ్యడంతో జాగ్రత్తగా ఎత్తుకుని కిందకుదిగి స్ట్రెచర్ పై పడుకోబెట్టాము .
హాస్పిటల్ స్టాఫ్ ...... వేగంగా ICU కు తీసుకెళ్లారు . వెనుకే వెళ్ళాను - కొంతమంది తోడుగా వచ్చారు .
కండక్టర్ వచ్చి నా బ్యాగు అందించి ప్రయాణీకులంతా వేచిచూస్తున్నారు వెళ్లక తప్పదు బాబూ , పెద్దాయనకు ఏమీకాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని వెళ్లారు - తోడుగా వచ్చిన ప్రయాణీకులు కూడా భుజం తట్టి వెళ్లిపోయారు . 

డాక్టర్ బయటకువచ్చి ఆక్సిడెంట్ అయ్యి చాలాసేపు అయ్యింది రక్తం చాలా పోయింది హాస్పిటల్లో *** గ్రూప్ బ్లడ్ ఒక్కటే ఉంది మరొక ప్యాకెట్ అయినా అవసరమౌతుంది లేకపోతే ప్రాణాలకే ప్రమాదం .
డాక్టర్ గారూ ....... నాదీ అదే బ్లడ్ తీసుకోండి .
డాక్టర్ : please come in అంటూ లోపలికి పిలుచుకునివెళ్లి ఖాళీగా ఉన్న బెడ్ చూయించి బ్లడ్ తీసుకున్నారు . ప్రక్కనే తల్లీ తల్లీ ...... అంటూ కలవరిస్తున్న పెద్దాయనకు ఒకవైపు బ్లడ్ ఎక్కిస్తూనే తగిలిన గాయాలను శుభ్రం చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు . 
" ( వీడెవడండీ బాబూ ....... ప్రతీ స్టోరీలో లీటర్ల లీటర్ల బ్లడ్ ఇచ్చేస్తున్నాడు అని కోప్పడకండి - మనం బ్లడ్ ఇవ్వడం వలన ఒక ప్రాణం నిలబడుతుంది . ఇలా ప్రతీసారీ గుర్తుచేయ్యడం వలన xossipy ఫ్రెండ్స్ రక్తదానం చేస్తారని చిరు ఆశ - నేను ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాను , వాళ్ళు థాంక్స్ చెప్పిన క్షణం కలిగిన ఫీలింగ్ అలాంటిది మరి , లవ్ యు గయ్స్ ........ మీ మహేష్ ) " .
బ్లడ్ ఇచ్చి బయటకువచ్చి కూర్చున్నాను . 
గంట తరువాత డాక్టర్ బయటకువచ్చి సరైన సమయానికి తీసుకొచ్చారు - సరైన సమయానికి బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణం కాపాడావు - కాసేపట్లో స్పృహలోకి వస్తారు వెళ్లి చూడవచ్చు .
థాంక్ గాడ్ ....... థాంక్యూ డాక్టర్ .......
డాక్టర్ : ఇంతకీ నీకు ....... పెద్దాయనకు ఏమౌతారు .
నో డాక్టర్ ...... బస్సులో వెళుతుంటే అంటూ జరిగింది వివరించాను .
డాక్టర్ : గుడ్ అంటూ చేతులు కలిపారు . ఎవరోకూడా తెలియని పెద్దాయన ప్రాణాలు కాపాడావు .
ఆ క్షణం కలిగిన ఫీలింగ్ ......., డాక్టర్ గారూ ....... పెద్దాయన దగ్గర మొబైల్ ఏమైనా ........
డాక్టర్ : నర్స్ ...... చూసుకోండి , sorry రౌండ్స్ కు వెళ్ళాలి .
నో నో నో , మీరు sorry చెప్పడం ఏమిటి ...... క్యారి ఆన్ డాక్టర్ ....... 
పెదాలపై చిరునవ్వులతో వెళ్లారు డాక్టర్ గారు .

నర్స్ వచ్చి విషయం తెలుసుకుని , నో సర్ ...... వారి దగ్గర ఎటువంటి మొబైల్ లేదు . 
అవునా ...... , బహుశా అక్కడే పొదల్లో పడిపోయి ఉంటుంది - ఇప్పుడెలా ........
నర్స్ : సర్ ...... లోపల తల్లీ తల్లీ ...... అంటూ కలవరిస్తూనే ఉన్నారు అని పిలుచుకునివెళ్లారు .
తలకు - చేతులకు - కాళ్లకు ....... కట్లు కట్టి ఉండటం చూసి చాలా దెబ్బలు తగిలాయని బాధవేసింది . ప్రక్కనే వెళ్లి నిలబడ్డాను .
సగం కళ్ళతోనే నన్ను గుర్తుపట్టి బాబూ ...... అంటూ కన్నీళ్ళతో చేతిని అందుకోబోయారు .
పెద్దయ్యా పెద్దయ్యా ........ కదలకండి అంటూ చేతిని అందుకుని అరచేతిలో చేతినివేసి బెడ్ పై ఉంచాను .
పెద్దయ్య : నా ప్రాణాలు కాపాడావు , నీ రుణం .......
పెద్దయ్యా ....... కాసేపు మాట్లాడకుండా రెస్ట్ తీసుకోండి అని కన్నీళ్లను తుడిచాను . పెద్దయ్యా ...... మీవాళ్ళు ఎక్కడ ఉంటారు .
పెద్దయ్య : మొబైల్ మొబైల్ ....... అంటూ తలెత్తి స్స్స్ స్స్స్ .......
కదలకండి పెద్దయ్యా నొప్పివేస్తుంది . చూసాము మీ మొబైల్ లేదు ఆక్సిడెంట్ అయినప్పుడు అక్కడే పడిపోయిందేమో .........
పెద్దయ్య : నెంబర్ నెంబర్ ....... నా కొడుకుది **********
ఇదిచాలు పెద్దయ్యా ....... ఇక మీరు ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అని కాల్ చేసాను . బ్రదర్ కంగారుపడకండి మీ నాన్నగారికి చిన్న ఆక్సిడెంట్ అయ్యింది - కంగారుపడకండి సరైన సమయానికి హాస్పిటల్ కు తీసుకెళ్లడం వలన సేఫ్ గా ఉన్నారు . 
ఏ హాస్పిటల్ ఏ హాస్పిటల్ సర్ .......
వైజాగ్ ******** హాస్పిటల్ - కంగారుపడకండి బ్రదర్ ....... సేఫ్ అని డాక్టర్స్ చెప్పారు .
సర్ ....... వెంటనే వచ్చేస్తాను - అప్పటివరకూ నాన్నగారు జాగ్రత్త please please సర్ ........
ప్రక్కనే ఉన్నాను బ్రదర్ .......
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ , ఇప్పుడే వచ్చేస్తాను .
నర్స్ : సర్ ...... బ్లడ్ ఇచ్చారుకదా నీరసంగా ఉంటుంది , మీరుకూడా కూర్చోండి అని బెడ్ ప్రక్కనే ఛైర్ వేసింది - ఆపిల్ కూడా ఇచ్చారు .
థాంక్స్ చెప్పాను .

అర గంటలో ఒక తమ్ముడు ICU లోపలికివచ్చి పెద్దయ్యను చూసి , నాన్నగారూ నాన్నగారూ అంటూ కన్నీళ్ళతో ప్రక్కన చేరారు . 
అప్పటికే పెద్దయ్య కొద్దికొద్దిగా మాట్లాడుతున్నారు . కృష్ణా ...... నాకేమీ కాలేదు కంగారుపడకు - ఈ బాబు వల్లనే నేను ప్రాణాలతో ఉన్నాను .
తమ్ముడు కన్నీళ్లను తుడుచుకుని థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ అంటూ రెండు చేతులతో నమస్కరించాడు .
నాకు చేతనైనది చేసాను - అంతదానికి .......
పెద్దయ్య : దేవుడిలా వచ్చావు బాబూ ....... 
పెద్దయ్యా ...... థాంక్స్ చెప్పారు కదా చాలు పెద్దయ్యా ....... , మీరు సేఫ్ గా ఉన్నారు అంతకంటే సంతోషం ఇంకేమి కావాలి .
పెద్దయ్య : మంచి మనసు బాబూ నీది , కృష్ణా ....... అక్కయ్య ? .
తమ్ముడు : నిన్న సంతకు వెళ్లిన పిన్నీ వాళ్ళతోపాటు ఆటోలో వచ్చారు నాన్నగారూ ........ 
( సంతకు వెళ్లిన పిన్ని వాళ్ళతోపాటు ...... దేవత అయి ఉండరులే ) 
పెద్దయ్య : హమ్మయ్యా ...... , కృష్ణా ...... ఆక్సిడెంట్ విషయం తల్లికి చెప్పలేదు కదా ........
కృష్ణ : కంగారుపడతారని అక్కయ్యకు - అమ్మకు చెప్పలేదు నాన్నగారూ ...... - బుజ్జితల్లికి తెలిస్తే ఏడ్చేస్తుంది .
( బుజ్జితల్లి ....... నా బుజ్జితల్లి అయి ఉండదులే ) 
పెద్దయ్య : అవునవును తాతయ్య అంటే ప్రాణం నా బుజ్జితల్లికి - నన్ను ఇలా చూస్తే ఏడ్చేస్తుంది . కానీ బుజ్జితల్లిని వెంటనే చూడాలనిపిస్తోంది కృష్ణా .......
( ప్రయాణమంతా తాతయ్య తాతయ్య ..... అంటూ కలవరిస్తూనే ఉంది - నా బుజ్జితల్లినేనా ...... ) 
కృష్ణ : నాన్నగారూ ....... ఒకరోజైనా రెస్ట్ తీసుకోవాలి .
పెద్దయ్య : ఒకరోజంతానా ...... ? , మన బుజ్జితల్లిని చూడకుండా ఉండటం నావల్లకాదు - కృష్ణా ...... తనను తన బుజ్జినవ్వులను చూశానంటే వెంటనే కోలుకుంటాను .
నిజమే పెద్దయ్యా ...... ప్రాణమైనవాళ్ళతో ఉంటే హాస్పిటల్స్ - మందులు అవసరం లేదు కానీ ట్రీట్మెంట్ కోసం మీకిచ్చిన మత్తు ఇంజక్షన్ పవర్ తగ్గేవరకైనా ఇక్కడే ఉండాలి లేకపోతే కదులలేరు .
పెద్దయ్య : నువ్వు చెబుతున్నావు కాబట్టి సరే బాబూ ........

హాస్పిటల్ స్టాఫ్ ఒకరు లోపలికివచ్చి ట్రీట్మెంట్ బిల్ సర్ అంటూ రిసిప్ట్ ఇచ్చి కౌంటర్ లో పే చెయ్యండి అనిచెప్పి వెళ్ళిపోయాడు .
తమ్ముడు జేబులన్నీ వెతికి కంగారులో డబ్బు మరిచిపోయాను అంటూ మెడలో ఉన్న చైన్ తియ్యబోయాడు .
తమ్ముడూ ...... ఆగు నేను పే చేస్తాను .
కృష్ణ : సర్ ...... ఇప్పటికే మీరు ......
పర్లేదు తమ్ముడూ , నువ్వు ...... నాన్నగారి దగ్గర ఉండు పే చేసి వస్తాను కావాలంటే ఇంటికివెళ్లాక ఇవ్వు ( ఆ బుజ్జితల్లి ...... నా బుజ్జితల్లి ఏమో చూడాలికదా - చూసి ఇప్పటికే గంట పైనే అయ్యింది , ఈ హృదయం ఎలా తట్టుకొంటోందో ఏమిటో ) అని లేచాను .
పెద్దయ్య ..... చేతులకు కట్లు ఉన్నా దండం పెట్టడానికి ప్రయత్నించారు . పెద్దయ్యా ....... మీరు పెద్దవారు , మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలా చెయ్యకూడదు అని ఆపి వెళ్లి కౌంటర్ లో పే చేసివచ్చి ICU బయటే కూర్చున్నాను .
10 నిమిషాల తరువాత కృష్ణ బయటకువచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు సర్ అని ప్రక్కన కూర్చున్నాడు . సర్ ....... ఆక్సిడెంట్ ఎలా జరిగింది .
జరిగింది వివరించాను . 
కృష్ణ : సర్ ....... మీరు నిజంగా దేవుడు - మీరు చూడకపోయుంటే మరింత ఆలస్యం అయ్యేది - నాన్నగారికి ఏమైనా జరిగిఉంటే అమ్మ - అక్కయ్య - బుజ్జితల్లి అంటూ కన్నీళ్లు కారుస్తున్నాడు .
అంతా దైవేచ్చ కృష్ణా ....... , బాధపడకు త్వరలోనే కోలుకుంటారు అని ధైర్యం చెప్పాను .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
కృష్ణ మొబైల్ మ్రోగడంతో తీసి చూసి , సర్ ...... అక్కయ్య చేస్తోంది ఖచ్చితంగా బుజ్జితల్లినే చేయించి ఉంటుంది తాతయ్యను అడుగుతుంది అని మరింత కంగారుపడిపోతున్నాడు .
భుజంపై చేతినివేసి మాట్లాడమని ధైర్యం చెప్పాను .
కృష్ణ : సరే సర్ అంటూ ఎత్తాడు . " మావయ్యా ...... " స్పీకర్ మూసి బుజ్జితల్లే సర్ ...... , బుజ్జితల్లీ ...... అమ్మకు ఇవ్వు - తాతయ్యనా ...... తాతయ్య తాతయ్య ఇక్కడే నాదగ్గరే ఉన్నారు - మాట్లాడాలా ...... ? అదీ అదీ పనిలో ఉన్నారు బుజ్జితల్లీ ....... అమ్మకు ఇవ్వు బంగారూ ....... , అక్కయ్యా ...... మీరు టిఫిన్ తినండి ఆలస్యం అవుతుంది వచ్చేస్తాము కదా ....... , సరే సరే వీలైనంత తొందరగా వచ్చేస్తాము అని కట్ చేసి హమ్మయ్యా ...... అనుకున్నాడు . 
మంచిపనిచేశావు కృష్ణా ...... లేకపోతే పెద్దయ్యను చూసేంతవరకూ కంగారుపడతారు . 
కృష్ణ : అదే భయంగా ఉంది సర్ ....... అక్కయ్య - బుజ్జితల్లి - అమ్మ - ఊరి జనం .... చెప్పనేలేదు కదూ మా ఊరి పెద్ద మా నాన్నగారే సర్ , నాన్నగారి మాటంటే అందరికీ గౌరవం , సర్పంచి కూడా నాన్నగారు చెప్పినట్లే వింటారు .
అందరి ఆశీస్సులు ఉండటం వల్లనే మీ నాన్నగారికి ఏమీకాలేదు . ఆయన ఇక్కడ హాస్పిటల్లో ఉండటం కంటే అంతమంది ఆత్మీయుల మధ్యనే త్వరగా కోలుకుంటారు .

10 గంటల సమయంలో నర్స్ బయటకువచ్చి సర్ ...... మిమ్మల్ని పిలుస్తున్నారు .
లోపలికివెళ్లాము .
పెద్దయ్య : నాన్నా కృష్ణా ....... హాస్పిటల్ నాకు పడదని తెలుసుకదా , మత్తు మొత్తం పోయినట్లుంది - నన్ను తొందరగా నా బుజ్జితల్లి దగ్గరకు తీసుకెళ్లు చూడు చేతులు - కాళ్ళు కదిలిస్తున్నాను అని పిల్లాడిలా బ్రతిమాలుతున్నారు - లేవడానికి ప్రయత్నిస్తున్నారు .
నాకు - కృష్ణకు మరియు నర్సుకు కూడా నవ్వు వచ్చేసింది . పెద్దయ్యా ....... ఒక్క నిమిషం ఆగండి డాక్టర్ ను పిలుచుకునివస్తాను , వారు పర్లేదు అంటే మరుక్షణమే తీసుకెళ్లిపోతాము ( బుజ్జితల్లి ఎవరో చూడకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళేది లేదు ) .
నర్స్ : సర్ ..... ఆగండి నేను పిలుచుకునివస్తాను అని వెళ్ళి డాక్టర్ తోపాటు వచ్చారు .

డాక్టర్ గారిని ఆడిగేలోపు ...... , డాక్టర్ డాక్టర్ ...... నేను బానే ఉన్నాను , నొప్పులేమీ లేవు - నన్ను ఇంటికి పంపించేయ్యండి ఇక్కడ భయం వేస్తోంది అంటూ అటూ ఇటూ కదులుతున్నారు పెద్దయ్య .
కృష్ణ : నాన్నగారూ ....... సైలెంట్ గా ఉండండి , ఆ విషయం చెప్పాల్సినది డాక్టర్ గారు . డాక్టర్ గారూ ...... 
డాక్టర్ : త్వరగానే కోలుకున్నారు పెద్దయ్యా ...... . పొలం పనులు చేసినవాళ్ళు కదా చూస్తేనే తెలిసిపోతోంది - పేషెంట్ కు ఎక్కడ ఇష్టమో అక్కడికే తీసుకెళ్లండి .
కృష్ణ : డాక్టర్ గారూ .......
డాక్టర్ : కంగారుపడాల్సిన అవసరమే లేదు , కావాల్సినది రెస్ట్ తీసుకోవడం అదేదో ఆయన ఇష్టప్రకారం ఇంటిలోనే తీసుకోవచ్చు , అలా అయితేనే ఆత్మీయుల మధ్యన మరింత త్వరగా కోలుకుంటారు - మందులు రాసిస్తాను , డ్రెస్సింగ్ కోసం రెండు రోజులకొకసారి పిలుచుకునివస్తే సరిపోతుంది - డిశ్చార్జ్ చేస్తున్నట్లు సంతకం చేశారు . 

కృష్ణ : థాంక్యూ డాక్టర్ గారూ ........
డాక్టర్ : థాంక్స్ మీ నాన్నగారిని సేవ్ చేసినవారికి చెప్పండి - ట్రీట్మెంట్ చేసినందుకు మేము ఫీజ్ తీసుకున్నాము కదా ........
డాక్టర్ గారూ ...... అవన్నీ అయిపోయాయి - ఇప్పుడు మళ్లీ మొదటికి వస్తారు కృష్ణా ....... స్టార్ట్ చెయ్యకు .
కృష్ణ : అలాగే సర్ అంటూ పెదాలపై నవ్వుతూ ...... , నాన్నగారూ ...... సంతోషమే కదా , మీ ఇష్టప్రకారమే ఇంటికి వెళదాము - అంబులెన్స్ ను సెట్ చేస్తాను .
పెద్దయ్య : అంబులెన్స్ లో వెళితే మీ అక్కయ్య - అమ్మ - మన బుజ్జితల్లి భయపడిపోతారు , బండి తెచ్చావుకదా వెనుక కూర్చుంటాను .
భలేవారు పెద్దయ్యా ....... ఇంకేమైనా ఉందా , కృష్ణా ...... మందుల రిసిప్ట్ ఇవ్వు , మందులు తీసుకుని క్యాబ్ తీసుకొస్తాను - అంతలోపు నాన్నగారిని వీల్ చైర్ లో బయటకు తీసుకురా ........
కృష్ణ : అలాగే సర్ అంటూ రిసిప్ట్ ఇచ్చాడు . 
హాస్పిటల్లోని మెడికల్ షాప్ లో మెడిసిన్ తీసుకుని , బయటకువెళ్లి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను .
కృష్ణ : చూడండి సర్ ...... వీల్ చైర్ వద్దు నడుస్తాను అన్నారు . బ్రతిమిలాడి వీల్ చైర్లో తీసుకురావాల్సి వచ్చింది .
పెద్దయ్యా ...... త్వరగా కోలుకోవాలంటే తప్పదు అని జాగ్రత్తగా వెహికల్లో కూర్చోబెట్టాను . 
పెద్దయ్య : అదికాదు బాబూ ...... ఇంటిదగ్గర చాలా పనులున్నాయి . ఇంతకీ చెప్పనేలేదు కదూ మావాడి పెళ్లి , ఈపాటికి పెళ్ళికొడుకుని చేయాల్సింది ....... అందరూ కంగారుపడుతుంటారు .
కృష్ణ : పర్లేదు నాన్నగారూ ...... కావాలంటే పెళ్లిని పోస్ట్ ఫోన్ చేయిద్దాము - మీరు కోలుకోవడం ముఖ్యం - అమ్మ అక్కయ్య నుండి ఈపాటికి 100 పైనే కాల్స్ వచ్చాయి - వస్తున్నాము అని మెసేజ్ పెడుతున్నాను కానీ మాట్లాడే ధైర్యం లేదు .
పెద్దయ్య : వద్దు వద్దు కృష్ణా ...... , నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా , అయినా నాకేమైంది - కట్లు విప్పి పెళ్ళిపనులు చెయ్యడానికి రెడీగా ఉన్నాను - మనసులో ఏమీ పెట్టుకోకు , నిన్ను ఎంత ప్రేమించింది ఆ పిల్ల నా కోడలు , నా వలన పెళ్లి ఆపడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు , మన ఇంటికీ మంచిదికాదు - ఏదీ మొబైల్ ఇవ్వు అని కాల్ చేశారు , అయ్యో ....... వచ్చేస్తున్నాము తల్లీ ...... మీరు మొదలుపెట్టండి 15 నిమిషాలలో అక్కడ ఉంటాము . కృష్ణా ....... ఏర్పాట్లన్నీ రెడీ పదా వెళదాము .
( బుజ్జితల్లి - పెళ్లి ....... యాహూ ...... నా దేవత దగ్గరకే వెళుతున్నాము ) కృష్ణా ...... బైక్ ఎక్కడ నేను ఫాలో అవుతాను .
కృష్ణ : నో నో నో సర్ ...... , బండి ఎక్కడికీ వెల్లదు మీరు కారులో కూర్చోండి అని ముగ్గురమూ బయలుదేరాము .

పెద్దయ్యను ఏ మెయిన్ రోడ్డులోనైతే వైజాగ్ హాస్పిటల్ కు చేర్చానో అదే రోడ్డులో వెనక్కువచ్చి ఆక్సిడెంట్ అయిన ప్లేస్ కు 100 అడుగుల దూరంలో రైట్ సైడ్ మట్టి రోడ్డు ద్వారా లోపలికి పోనివ్వమని డ్రైవర్ కు చెప్పాడు కృష్ణ .
కృష్ణా ....... అదిగో అక్కడే మీ నాన్నగారిని చూసాను - మొబైల్ అక్కడే పడి ఉంటుంది . 
కృష్ణ : డ్రైవర్ ...... అక్కడికి పోనివ్వండి .
పెద్దయ్య : కృష్ణా ...... నాకు మళ్లీ చూడాలని లేదు - నువ్వు వెళ్లు - బండిని కూడా అక్కడే వదిలేసెయ్యి - ఇక జీవితంలో ఆ బండిని చూడకూడదు .
కృష్ణ : అలాగే నాన్నగారూ అంటూ కిందకుదిగాడు .
వెనుకే వెళ్లి ఆ ప్రాంతమంతా వెతికినా - రింగ్ చేసినా ఉపయోగం లేకపోయింది . వదిలెయ్యండి సర్ వెళదాము , ఈ బుల్లెట్ బండి అంటే నాన్నగారికి చాలా ఇష్టం - ఎప్పుడూ ఇలా జరగలేదు అని బాధపడుతూ కారులోకి చేరాము .

పెద్దయ్యా ....... బుల్లెట్ ను బాగా నడుపుతారని కృష్ణ చెప్పాడు , ఇంతకీ ఎలా జరిగింది .
పెద్దయ్య : ఉదయం 5 గంటలకు నా బిడ్డ - మనవరాలు బెంగళూరు నుండి వస్తున్నారని తెలిసి తీసుకెళ్లడానికి సంతోషంగా బస్ స్టాండ్ కు బయలుదేరాను . మట్టి రోడ్డు నుండి ఇక్కడ టర్న్ అవ్వగానే రాంగ్ రూట్ లో వస్తున్న లారీని తప్పించబోయి చివరన ఢీకొట్టాను - ఎలా కిందపడ్డానో తెలియదు , దేవుడిలా వచ్చి పెద్దయ్యా పెద్దయ్యా అంటూ నన్ను పలకరించి కాపాడటమే గుర్తు అంటూ మళ్లీ దండం పెట్టారు .
పెద్దయ్యా ....... కృష్ణ ...... నువ్వుకూడానా ? , మొదలెట్టేశారా ..... ?  అంటూ నవ్వుకున్నాము . 

పెద్దయ్యా - కృష్ణా ....... మిమ్మల్ని రక్షించిన బస్సులోనే మీ అమ్మాయి మహి - బుజ్జితల్లి కీర్తీ బెంగళూరు నుండి వచ్చారు .
పెద్దయ్య : మహి - కీర్తీ ....... మీకెలా? , అంటే ట్రైన్ మిస్ అవ్వడంతో బెంగళూరు నుండి మా వాళ్ళను క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు కూడా మీరేనా ? .
షాక్ - మీకెలా తెలుసు పెద్దయ్యా ....... 
పెద్దయ్య : నా కూతురు కాల్ చేసిన ప్రతీసారీ చెప్పింది మీ గురించి , నాన్నగారూ ..... మీరేమీ కంగారుపడకండి దేవుడి లాంటి వ్యక్తి తోడుగా వస్తున్నారని .
మరొక స్వీట్ షాక్ , పెద్దయ్యా ....... మహి గారు నిజంగానే దేవుడు అన్నారా ...... ? లేక మీరు ........
కృష్ణ : నాతో కూడా చెప్పారు సర్ - దేవుడు అనలేదు కానీ ఇంచుమించు అదే అర్థం వచ్చేలా చెప్పారు . అప్పటికి కానీ మాకు కంగారు తగ్గలేదు - అంతదూరం నుండి ఒంటరిగా అంటే చాలా చాలా భయం వేసింది . అక్కయ్య - మా ప్రాణమైన బుజ్జితల్లిని క్షేమంగా తీసుకొచ్చినందుకు గానూ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ ....... , సర్ ...... ఇదే మా చిన్న ఊరు - ఊరు చిన్నదే అయినా ప్రేమ , ఆప్యాయతలలో చాలా చాలా పెద్దది . మేమిద్దరు దేవుడు అని దండాలు పెడితేనే ఇబ్బందిగా ఫీల్ అయ్యారు - నాన్నగారిని కాపాడారని తెలిస్తే ఊరంతా ....... చెప్పను మరొకనిమిషంలో మీరే చూస్తారుకదా అని పెద్దయ్యతోపాటు నవ్వుతున్నాడు . అంతలోనే క్యాబ్ పెళ్లి పందిరి - తోరణాలు - షామియానా మరియు చిరునవ్వులు చిందిస్తున్న జనాలు గల ఇంటి ముందు ఆగింది .
పెద్దయ్య : కృష్ణా ...... ఆక్సిడెంట్ అని చెప్పకు తట్టుకోలేరు , బుల్లెట్ నుండి కిందపడ్డాను అని చెప్పు - బాబూ ...... నువ్వుకూడా .......
నిజం చెప్పి అంతమందిని బాధపెట్టడం నాకూ ఇష్టం లేదు పెద్దయ్యా - జరిగినదేదో జరిగిపోయింది , మంచి నిర్ణయం తీసుకున్నారు .
Like Reply
నా గుండె వేగంగా కొట్టుకోవడంతో నా దేవత - బుజ్జి ఏంజెల్ కోసం కళ్ళు ఆతృతతో వెతకసాగాయి - అదిగో నా బుజ్జి ఏంజెల్ ....... బుజ్జి బుజ్జి పిల్లలతో చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిబుజ్జిపరుగుతో ఆడుకోవడం చూసి మనసు శాంతించింది .
అంతలో వెనుక పెద్దయ్య ప్రక్కన కూర్చున్న కృష్ణ ..... క్యాబ్ దిగగానే నేనూ దిగాను పెద్దయ్యను పట్టుకోవడానికి .......
బయట బుజ్జిబుజ్జి పిల్లలతో ఆడుకుంటున్న బుజ్జి ఏంజెల్ చూసి మమ్మీ - అమ్మమ్మా ....... తాతయ్య వచ్చారు అంటూ సంతోషంతో పరుగునవస్తూ , తన తాతయ్య వొళ్ళంతా కట్లను చూసి మమ్మీ - అమ్మమ్మా ...... అంటూ ఏడుస్తూ కేకలువేసింది .

ఆ పాటికే పెళ్ళికొడుకు శాస్త్రం కోసం వచ్చిన ఊరిజనం చూసి కంగారుపడుతూ అయ్యా - పెద్దయ్యా - అన్నా ....... ఏమైంది అంటూ తలా ఒకచెయ్యివేసి లోపలికి నడిపించుకుపోతుంటే ........ 
పెద్దయ్య ఆపి నాకేమీ కాలేదులే ఇప్పటికే పెళ్లి పనులు ఆలస్యం అయ్యాయి బయటే కూర్చోబెట్టమన్నారు .
నిమిషంలో చెక్క మంచం మెత్తగా రెడీ చేసి కూర్చోబెట్టి , ఏమైంది ఏమైంది చాలా దెబ్బలు తగిలాయి అంటూ బాధపడుతూ చుట్టూ చేరారు .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ...... ఏడుస్తున్న బుజ్జితల్లిని పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకోబోతుంటే .......
బుజ్జితల్లి : వద్దు తాతయ్యా ....... మీకు నొప్పివేస్తుంది .
పెద్దయ్య : నా బంగారం తాతయ్య అంటే ప్రాణం అంటూ ప్రక్కన కూర్చోబెట్టుకుని కన్నీళ్లు తుడిచారు .
బుజ్జితల్లి : తాతయ్యా ....... ఏమైంది అంటూ బుజ్జి కన్నీళ్ళతో అడిగింది .
అంతలో దేవత - దేవత అమ్మగారు వచ్చి చూసి కన్నీళ్ళతో ప్రక్కన చేరారు .
పెద్దయ్య : బుజ్జితల్లీ - తల్లీ - శ్రీమతిగారూ ....... ఏమీకాదు చూడండి నవ్వుతున్నాను .
దేవత : కన్నీళ్ళతో తమ్ముడూ ఏమైందిరా ...... ? .
జనాలు : కృష్ణా ఏమైంది ఏమైంది .........
కృష్ణ : తెల్లవారుఘామున బస్ స్టాండ్ కు వెళుతూ ...... లారీ ......
అందరూ : లారీనా ....... అంటూ మరింత కంగారుపడిపోతున్నారు .
కృష్ణ : లేదు లేదు మన రోడ్ టర్నింగ్ లో లారీ లైట్స్ సడెన్ గా పడటంతో పట్టుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న గడ్డిలో పడ్డారు .
పెద్దయ్య : అంతే అంతే పొదల్లోకి వెళ్లిపోవడం వలన చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే ........
కృష్ణ : నాన్నగారు స్పృహకోల్పోయి పడి ఉండటం , బస్సులో వెళుతున్న ఈ అన్నయ్య చూసి సమయానికి హాస్పిటల్ కు తీసుకెళ్లి బ్లడ్ ఇచ్చి కాపాడారు .

బుజ్జితల్లి : అంకుల్ ....... అంటూ పరుగునవచ్చి హత్తుకుంది .
కీర్తీ తల్లీ ...... అంటూ ప్రాణంలా ఎత్తుకోగానే , థాంక్యూ థాంక్యూ అంకుల్ అంటూ ముద్దులుపెడుతూనే ఉంది .
కృష్ణ చెప్పినట్లుగానే దేవత అమ్మగారు - చుట్టూ జనమంతా థాంక్యూ థాంక్యూ బాబూ - తమ్ముడూ ....... అంటూ దండాలు పెడుతున్నారు .
దేవత అయితే నావైపు ఆరాధనతో చూస్తున్నారు - కన్నీళ్ళతో రెండు చేతులు జోడించి నమస్కరించారు .
పెద్దయ్య ....... దేవత నుదుటిపై ముద్దుపెట్టి , చూస్తున్నావుగా బాబూ ...... మేము చెప్పినదే నిజమైంది కదూ అంటూ నవ్వుతూ చెప్పారు .
వీరి ఆప్యాయతలలో మీ మంచితనం తెలుస్తోంది పెద్దయ్యా ...... , వీరంతా మీ చుట్టూ ఉండగా మీకేమీ కాదు .

సర్ సర్ ...... క్యాబ్ ఫేర్ ఇస్తే వెళతాను అని డ్రైవర్ అడగలేక అడిగాడు .
Sorry sorry బ్రదర్ ...... అంటూ బుజ్జితల్లిని ఎత్తుకునే పర్సు తీసేంతలో - కృష్ణ లోపలికివెళ్లి డబ్బు తీసుకొచ్చేన్తలో ....... 
ఎంత బాబూ ఎంత అంటూ ఊరిజనం పోటీపడుతూ ఇచ్చి పంపించారు . బాబూ ....... ఎంతసేపని నిలబడతారు కూర్చో ...... - మా పెద్దయ్యను కాపాడిన మీరు , మాకు దేవుడితో సమానం అంటూ కుర్చీలు వేశారు . 
పర్లేదు అండీ ఇక నేను వెళతాను అని దేవత రియాక్షన్ కోసం చూసాను .
అంకుల్ అంటూ బుజ్జితల్లి బుజ్జిచేతులతో నా నోటిని మూసింది - దేవత కళ్ళల్లో రెండు భావాలు ( వెళ్లిపో - ఉండిపో ) - బాబూ ...... పెళ్లి చూసుకుని వెళ్లు అని ఊరిజనం - అవును బాబూ ....... పెళ్లి చూసుకుని మా ఆతిథ్యం స్వీకరించి మీకిష్టమైనన్ని రోజులు ఉండండి , మిమ్మల్ని సేవించుకుని కాస్తయినా రుణం తీర్చుకునే అవకాశం కల్పించు బాబూ అంటూ పెద్దయ్య వారి శ్రీమతి కోరారు .
కృష్ణ : నాన్నగారూ ...... ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం .......
పెద్దయ్య : నాన్నా ...... కృష్ణా ....... పెళ్లి అంటే మనవైపు నిర్ణయం మాత్రమే కాదు - ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్న ఆ అమ్మాయిని బాధపెట్టకూడదు . ఇప్పటికిప్పుడు లేచి పెళ్ళిపనులు చెయ్యడానికి నేను రెడీగా ఉన్నాను . 
కృష్ణా ...... సహాయం చేయడానికి మేమూ ఉన్నాము కదా .......
పెద్దయ్య : ఇంకేమిటి కృష్ణా ........ , ఇంతమందికి ఆదర్శప్రాయమైన మనమే ఇలా చెయ్యకూడదు .
కృష్ణ : అయితే మీ ఇష్టం నాన్నగారూ .......
పెద్దయ్య : శ్రీమతి గారూ - తల్లీ ....... పెళ్ళికొడుకుని చెయ్యడానికి అన్నీ సిద్ధమేకదా .........
దేవత కన్నీళ్లను తుడుచుకుని , రెడీ చేసాము నాన్నగారూ ........
పెద్దయ్య : ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకండి , గుడికి వెళ్లి పెళ్లి పందిరి కోసం ఉంచిన వాటికి పూజచేసి తీసుకొచ్చి నీ తమ్ముడిని పెళ్ళికొడుకుని చెయ్యి తల్లీ ......
కృష్ణ : అన్నయ్యా ....... మీరెక్కడకూ వెళ్ళడానికి వీలులేదు , నాన్నగారు చెప్పినట్లు పెళ్లి - ఆతిథ్యం స్వీకరించాల్సిందే ........
బుజ్జితల్లీ ...... వెళ్ళిపొమ్మన్నావు కదా .......
బుజ్జితల్లి : మళ్లీ నోటిని మూసేసి ప్రాణంలా ముద్దుపెట్టి sorry అంకుల్ అంటూ గట్టిగా హత్తుకుంది .
దేవత ....... నాదగ్గరికివచ్చి , ఉండండి మహేష్ గారూ అనిచెప్పి లోపలికి వెళ్లిపోయారు . 
యాహూ ....... అంటూ లోలోపలే సంతోషంతో కేకలువేసి , బుజ్జితల్లిని ఎత్తుకుని పెద్దయ్య దగ్గరకువెళ్లి , పెద్దయ్యా ...... కంఫర్ట్ గా ఉందా అని నొప్పిలేకుండా కూర్చునేలా చేసాను .
థాంక్యూ అంకుల్ అంటూ బుజ్జితల్లి సంతోషంతో పదేపదే ముద్దులుపెడుతోంది - ప్రాణంలా హత్తుకుంటోంది .

బుజ్జితల్లి అమ్మమ్మ గారు వచ్చి , బాబూ ..... రాత్రంతా ప్రయాణం - ఉదయం నుండీ హాస్పిటల్లోనే ఉన్నావట కదా లోపలికివచ్చి స్నానం చెయ్యి బాబూ ....... 
పెద్దమ్మా ...... ఎవరు చెప్పారు ? .
పెద్దమ్మ : నా కూతురు చెప్పింది బాబూ ...... నా కూతురిని జాగ్రత్తగాతీసుకొచ్చావు - నా భర్తను కాపాడి పెళ్లి జరుగుతోంది అంటే నీవల్లనే - మా దేవుడితో సమానం , ముందు లోపలికి రా బాబూ నీ ఇల్లే అనుకో , పై గదికి వెళ్లు ఎవ్వరూ ఉండరు అంటూ బుజ్జితల్లిని అందుకోబోయారు .
బుజ్జితల్లి : ఊహూ ...... అంకుల్ తోనే ఉంటాను - పైకి నేను తీసుకెళతాను అని ముద్దుముద్దుగా ముద్దులుపెట్టి గట్టిగా హత్తుకుని చెప్పింది . అంకుల్ స్నానం చేసేవరకూ బెడ్ పైననే బుద్ధిగా కూర్చుంటాను .
బుజ్జితల్లి నా బుజ్జితల్లి మాటలకు ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను .
పెద్దమ్మ : మా బుజ్జితల్లి ఒక్కసారి ఇష్టపడితే ఇంతే వదలనే వదలదు - బంగారుకొండ అని చేతితో ముద్దుపెట్టి సరే నువ్వే తీసుకెళ్లు మీ అంకుల్ ను - బాబూ ...... ఏమనుకోకు కాస్త తొందరగా వస్తావు కదూ , ఎందుకంటే నువ్వు వస్తేనేకానీ పెళ్ళికొడుకు కదలడు - మా బుజ్జితల్లి అమ్మ గుడికి కదలడు - బుజ్జితల్లి తాతయ్య ...... ఇక సరే సరి .
పెద్దమ్మా ...... నాకోసం .......
పెద్దమ్మ : ఆ దేవుడే వచ్చి చెప్పినా ఇప్పుడు విననే వినరు - నువ్వంటే అంత ఇష్టం అయిపోయావు - స్టార్ట్ చేస్తే నేనూ ఊరుకోను .
పెద్దమ్మా ....... నా అదృష్టం , సరే వెంటనే వచ్చేస్తాను - బుజ్జితల్లీ ఎటువైపు అని అడిగి పైకివెళ్ళాను .

కీర్తీ తల్లీ ...... కింద ఉద్వేగ వాతావరణంలో నీ బుజ్జి బార్బీ డ్రెస్ సరిగ్గా చూడలేదు , sooooo క్యూట్ అంటూ బెడ్ పై కూర్చోబెట్టాను . చుట్టూ చూసి ఇల్లు కూడా బాగుంది - మినిట్స్ లో ఫ్రెష్ అయ్యివచ్చేస్తాను అంటూ హైఫై చూయించాను .
బుజ్జితల్లి బుజ్జిచేతితో హైఫై కొట్టి అంతేనా అంకుల్ అని బుంగమూతితో అడిగింది .
మా బుజ్జితల్లి బుంగమూటలో కూడా ముద్దొచ్చేస్తోంది .
బుజ్జితల్లి : ఆ ఆ ముద్దులే అడుగుతున్నాను - ముద్దొస్తోంది అంటున్నారు కానీ వచ్చినప్పటి నుండీ ఎంతో ఆశతో చూస్తున్నాను ఒక్క ముద్దైనా పెట్టారా ...... ? - మా మంచి అంకుల్ కు నేనెన్ని ముద్దులుపెట్టాను .
ఓ ఓ ...... ఆదా సంగతి , sorry sorry బుజ్జితల్లీ ...... ఒక్క ముద్దుతో తనివితీరదు - తెల్లవారుఘామున 5 గంటలకు నా బుజ్జితల్లిని వదిలి వెళ్లిపోయానా 6 గంటలు 7 గంటలు 8 గంటలు 9 10 .... 11 గంటలు అంటే దాదాపు 6 గంటల తరువాత నా ప్రాణాన్ని చూశాక గానీ నా ప్రాణం నిలబడలేదు - నిన్ను చూశాకనే ఈ గుండె నార్మల్ గా కొట్టుకుంది - నీకు దూరంగా ఉన్న ఆ 6 గంటలు నేను నేనులా లేను - అంకుల్ అంటూ పరుగునవచ్చి హత్తుకోగానే ఆ 6 గంటల్లోని ప్రతీ నిమిషం కాదు కాదు ప్రతీ క్షణానికొక ముద్దుపెట్టాలని ఉన్నా ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా ........ ? , ఇప్పటికి కూడా .......
బుజ్జితల్లి : అంకుల్ అంటూ లేచి నామీదకు జంప్ చేసి బుగ్గలపై ముద్దుపెట్టి , అడ్డు ఎవరు అంకుల్ మీకు కానివ్వండి .
నా బుజ్జితల్లీ ..... నా కీర్తీ తల్లీ ...... నా బుజ్జి ఏంజెల్ ...... నిన్ను మనసారా గుండెలపై హత్తుకున్నాకే నేను శ్వాసిస్తున్నానని తెలిసింది అంటూ నిమిషం పాటు ముద్దులవర్షం కురిపించి , రోజంతా ముద్దులుపెడుతూనే ఉండాలని ఉంది .
బుజ్జితల్లి : నేను రెడీ అంకుల్ .......
కానీ మనం కిందకు వెలితేనే కానీ పెళ్ళిపనులు మొదలుపెట్టరట అంటూ ప్రాణం లా హత్తుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ....... నిన్నటివరకూ మమ్మీ వస్తేనే కానీ అమ్మమ్మా - తాతయ్య వాళ్ళు పెళ్ళిపనులు మొదలెట్టము అన్నారు - ఇప్పుడు మీరు వెలితేనే ....... , అంటే మమ్మీ కంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం అందరికీ - మిమ్మల్ని దేవుడు అన్నారుకదా ...... , ఇప్పుడు నేనూ చెబుతున్నాను మా అంకుల్ నిజంగా దేవుడే ........ లవ్ యు అంకుల్ .......
లవ్ యు అన్నావా బుజ్జితల్లీ నా బుజ్జితల్లీ ....... లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ అంటూ మళ్లీ ముద్దులు కురిపిస్తున్నాను .
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులు చిందిస్తూనే , అంకుల్ ....... కిందకు వెళ్లాలన్నారు అని గుర్తుచేసే నవ్వుతోంది .
నా ముద్దుల కీర్తీ తల్లి మాయలో పడి మరిచేపోయాను అంటూ ముద్దులుపెడుతూనే వదల్లేక వదల్లేక బెడ్ పై కూర్చోబెట్టి , గేమ్ ఆడుతూ ఉండు ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని మొబైల్ ఇచ్చి , బ్యాగుతోపాటు బాత్రూమ్లోకి వెళ్ళాను .

బ్యాగులోనుండి బ్రష్ పేస్ట్ తీసుకుని కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ గా తలంటు స్నానం చేసి బ్యాగులోని డ్రెస్ వేసుకుని బయటకువచ్చాను .
బుజ్జితల్లి : నో నో నో అంకుల్ ...... , మమ్మీ ...... అమ్మమ్మ చేత మావయ్యకోసం కొన్న కొత్త డ్రెస్ మీకోసం పంపించారు .
మావయ్య పెళ్ళికోసం కొన్న డ్రెస్ కదా ....... , ఇష్టంతో తీసుకుని ఉంటాడు కృష్ణ పర్లేదులే .......
బుజ్జితల్లి : ఈ కొత్త డ్రెస్ వేసుకోకపోతే మొదట మమ్మీ ఆ వెంటనే అమ్మమ్మ - మావయ్య చివరగా కాదు కాదు ముఖ్యంగా నేను ఏడుస్తాను .
అమ్మో అమ్మో ....... న బుజ్జితల్లి కంట కన్నీళ్లు చూస్తే ఈ అంకుల్ తట్టుకోగలడా వెంటనే మార్చేసుకుంటాను . 
బుజ్జితల్లి : గుడ్ బాయ్ అంటూ అందించి అటువైపుకు తిరిగింది .
హ హ హ ...... ఉమ్మా ఉమ్మా ...... అంటూ డ్రెస్ మార్చుకుని బుజ్జితల్లిని రెండుచేతులతో అమాంతం ఎత్తుకుని ముద్దుచేస్తూ కిందకువచ్చాను - దేవత కనిపించగానే ముద్దులు ఆపేసాను .
బుజ్జితల్లి : మమ్మీ అంటే అంత భయమా అంకుల్ .......
చాలా అంటే చాలా అంటూ చిలిపినవ్వులతో తలదించుకుని బయటకు నడిచాను .
బుజ్జితల్లి : వెనుకకు చూసి అంకుల్ ...... మమ్మీ కూడా మీలానే నవ్వుతోంది - డ్రెస్ సూపర్ అంటున్నారు .
వెంటనే వెనక్కు తిరిగిచూస్తే నవ్వడం ఆపేసి కోపంతో చూస్తున్నారు .
ప్చ్ .........
Like Reply
కృష్ణ : అన్నయ్యా ....... సూపర్ గా ఉన్నారు , నాకంటే మీకే డ్రెస్ బాగుంది అని నా ప్రక్కన చేరారు .
పెద్దయ్య : మా ఇంటి దేవుడు వచ్చాడు , పెళ్ళిపనులు మొదలెట్టండి - భాజా భజంత్రీలు మ్రోగించండి - తల్లీ మహీ శ్రీమతిగారూ ........
దేవత : రెడీ నాన్నగారూ అంటూ పూజాసామాగ్రితో బయటకువచ్చారు .
లోపల చూడలేదు కానీ కొత్త పట్టుచీరలో ముత్తైదువుల మధ్యన అందమైన నవ్వులతో దివినుండి భువిపైకి దిగివచ్చిన దేవతలా ఉండటం కన్నార్పకుండా చూస్తున్నాను .
బుజ్జితల్లి : ఏమిటి అంకుల్ చూస్తున్నారు ? , మమ్మీ ...... బ్యూటిఫుల్ కదా ...... కనురెప్ప కూడా వెయ్యడం లేదు .
అవునవును ....... లేదు లేదు బుజ్జితల్లీ అలాంటిదేమీ లేదు .
అంతలో నా ప్రక్కనుండి దేవత ముసిముసినవ్వులతో ముందుకువెళ్లారు . రోడ్డుపై ఆగి నావైపు చూస్తున్నట్లు చూస్తూ తమ్ముడూ రారా అని పిలిచి నవ్వుతూ వెళ్లారు .

కృష్ణ : నాన్నగారూ జాగ్రత్త వెళ్ళొస్తాము అని పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకున్నాడు . 
కృష్ణా ...... మాలో కొంతమంది ఇక్కడే ఉంటారులే , వాళ్ళు చూసుకుంటాము కదా పదా గుడికి వెళదాము .
కృష్ణ : సరే , అన్నయ్యా ...... రండి అని నా గుండెలపై ఉన్న బుజ్జితల్లి బుగ్గపై చేతితో ముద్దుపెట్టాడు .
దేవత మరియు ఊరి ఆడాళ్లందరి వెనుక బుజ్జితల్లిని ముద్దుచేస్తూ దగ్గరలోని గుడికి వెళ్ళాము .

గుడిలో దేవత చేతులమీదుగా పందిరి కొమ్మలకు పూజ జరిగింది . మేళ తాళాలతో పందిరి కొమ్మలను తీసుకుని ఇంటికి చేరుకున్నాము . శాస్త్రం ప్రకారం నిమిషాలలో పందిరి నిర్మించడంతో కృష్ణ పంచె కట్టుకునివచ్చి పందిరి కింద కూర్చున్నాడు . 
ఇక అక్కడున్న అందరి చూపూ బుజ్జితల్లిపైనే పడింది . పెద్దమ్మ వచ్చి బుజ్జితల్లీ ....... తోడు పెళ్లికూతురు తమరే మేడం , కొద్దిసేపు మీ అంకుల్ ను వదిలి మీ మావయ్య దగ్గరికి చేరాల్సిందే .......
బుజ్జితల్లీ ....... తోడు పెళ్లికూతురు ? ప్రాణంలా ముద్దుపెట్టబోయి దేవతను చూసి ఆగిపోయి పెద్దమ్మకు అందించాను .
దేవత ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
బుజ్జితల్లి : చూసి నవ్వి , అంకుల్ ....... స్నానం పూర్తవగానే వచ్చేస్తాను అంతవరకూ మీరు ఇదిగో ఇక్కడే నా ఎదురుగానే ఉండాలి అని ముద్దుముద్దుమాటలతో ముద్దుపెట్టి అమ్మమ్మా ...... అంటూ వెళ్ళింది .
పెద్దమ్మ : మా బుజ్జి బంగారానికిమా అందరికంటే అంకుల్ అంటేనే ఇష్టం అన్నమాట , మీ అంకుల్ ....... నిన్ను వదిలి ఎక్కడకూ వెళ్లకుండా మేము చూసుకుంటాములే అని ముద్దుచేస్తూ కృష్ణ ప్రక్కన కూర్చోబెట్టారు .

చూడటానికి ముచ్చటెయ్యడంతో కెమెరామెన్ ఫోటోలు తీస్తున్నా , నా మొబైల్ తీసి ఫోటోలు తియ్యడం చూసి బుజ్జితల్లి ముద్దుముద్దుగా నవ్వుతోంది .
పెళ్ళికొడుకు - తోడు పెళ్లికూతురికి పసుపు పూసే కార్యక్రమం దేవతతో మొదలయ్యింది . వారి తమ్ముడి ముఖం - చేతులు - ఛాతీ - పాదాలకు మొత్తం పసుపు పూసి , నావైపు చూసి చిరునవ్వులు చిందిస్తూ బుజ్జితల్లి ముఖానికి - మెడకు - బుజ్జి చేతులకు - బుజ్జిబుజ్జి పాదాలకు పూసి లవ్ యు రా అంటూ కురులపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . ఇద్దరికీ హారతి ఇచ్చి నుదుటిపై కుంకుమ పెట్టి ఇద్దరు వెనుక చేరి అమ్మా కానివ్వు అని పిలిచారు .
బుజ్జితల్లి : అమ్మమ్మా ...... ఆగు , మమ్మీ తరువాత ఫస్ట్ అంకుల్ ఆ తరువాత మీ ఇష్టం అలా అయితేనే మావయ్య ప్రక్కన కూర్చుంటాను .
కృష్ణ : లవ్ యు బుజ్జితల్లీ ...... , నా కోరికనే నువ్వు చెప్పావు అని బుజ్జిచేతిని అందుకుని ముద్దుపెట్టాడు .
అందరూ సంతోషంతో నవ్వుతున్నారు .
బుజ్జితల్లీ ....... ముందు పెద్దవారు అని బుజ్జితల్లి ప్రేమకు ప్రాణంలా చూస్తున్నాను .
బుజ్జితల్లి : తాతయ్య - అమ్మమ్మ - మావయ్య - మమ్మీ ....... అందరూ చెప్పారుకదా మీరు దేవుడని కాబట్టి మీరు ఫస్ట్ , అలా అయితే లేకపోతే ........
అందరితోపాటు పెద్దయ్య కూడా సంతోషంతో నవ్వుతున్నారు బుజ్జితల్లి ముద్దుమాటలకు ........
పెద్దమ్మ : సరే బుజ్జి మేడం గారూ ...... , తమరెలా చెబితే అలా ...... , బుజ్జిదానివైనా సరిగ్గా చెప్పావులే ...... ఉమ్మా ఉమ్మా ...... 
బుజ్జితల్లి : ముద్దులుకూడా అంకుల్ తరువాతనే అంటూ బుజ్జిచేతితో ఆపడం చూసి సంతోషపు నవ్వులు విరిసాయి . 
పెద్దమ్మ తియ్యదనంతో బుంగమూతిపెట్టుకుని , బాబూ ...... రండి అని పిలిచారు .
పెద్దమ్మా ....... ఏదో చిన్నతనం పెద్దవారు ముందు .
పెద్దమ్మ : నువ్వు కాకుండా మరొకరు దగ్గరకు వెళితే కొట్టేలా ఉంది బాబూ ...... ( నవ్వులు ఆగడం లేదు ) , చిన్నదైనా సరిగ్గా చెప్పింది - ఇలా సంతోషాలు పరిమాలిస్తున్నాయి ఆటే కారణం నువ్వు - మొదట నువ్వు పసుపు రాయడమే కరెక్ట్ అంటూ చేతిని పట్టుకుని పందిరి కిందకు చేర్చి పసుపు అందించారు .

Sorry మేడం అంటూ దేవతవైపు చూసాను . 
దేవత : తియ్యదనంతో నవ్వుతూ కానివ్వండి అంటూ అందమైన కళ్ళతో సైగచేశారు .
బుజ్జితల్లీ ........ మీ మమ్మీ పర్మిషన్ ఇచ్చేసారు అంటూ సంతోషంతో దేవత చేసినట్లు ముందు కృష్ణ ముందుకువెళ్ళాను .
బుజ్జితల్లి బుంగమూతిపెట్టుకోవడం చూసి , అన్నయ్యా ...... మొదట బుజ్జితల్లికి పసుపు రాయండి లేకపోతే నన్ను కూడా కొట్టేలా ఉంది . 
అధికాదు బుజ్జితల్లీ ..... శాస్త్రం ప్రకారం , మమ్మీ కూడా మొదట ........
బుజ్జితల్లి : మమ్మీకి ...... నాకంటే వాళ్ళ తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం .
దేవత : అవును నిజమే నాకు నా తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం అంటూ బుజ్జి బుగ్గను గిల్లేసారు . 
చుట్టూ సంతోషాల నవ్వులు చూసి పెద్దయ్య ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు .
బుజ్జితల్లి : అంకుల్ ...... మమ్మీలా మీకు కూడా మావయ్య అంటేనే ఇష్టం కదా అంటూ బుంగమూతి పెట్టుకుంది .
లేదు లేదు లేదు మీ తాతయ్యకు - అమ్మమ్మకు - మమ్మీకు - మీ మావయ్యకు ...... నాకు మా బుజ్జితల్లి అంటేనే ప్రాణం అంటూ సంతోషంతో మొదట బుజ్జితల్లికి సున్నితంగా పసుపు రాసి హ్యాపీనా అంటూ కృష్ణ ముందుకు వెళ్ళాను . 
లవ్ యు అంకుల్ అంటూ లేచి , కృష్ణకు పసుపు రాయడానికి వొంగిన నా బుగ్గపై తియ్యనైన ముద్దుపెట్టింది .
దేవత : మొదట పసుపు రాసింది నేనుకదా బుజ్జితల్లీ ....... , నాకు పెట్టలేదే ముద్దు . 
బుజ్జితల్లి : నాకు మమ్మీకంటే అంకుల్ అంటేనే ఇష్టం కాబట్టి , ఆ మాత్రం తెలియదా మమ్మీ .........
దేవత ఈ ఈ ...... అంటూ ఏడుపు నటించడం చూసి , సరే సరే ఏడవకు మమ్మీ ... అంటూ దేవతకు ముద్దుపెట్టి కూర్చుంది .
దేవత : ఇప్పుడు హ్యాపీ ....... , లవ్ యు బంగారూ ...... అంటూ ముద్దుపెట్టబోతే ........
మమ్మీ స్టాప్ ....... అంకుల్ ఇంకా ముద్దుపెట్టలేదు అంటూ నోటికి అడ్డంగా బుజ్జిచేతిని అడ్డుపెట్టింది .
మహీ మహీ ....... అవునుకదా , కాస్త కంట్రోల్ చేసుకో లేకపోతే కీర్తితో దెబ్బలు తింటావు అని చుట్టూ ఉన్న ఆడవాళ్ళంతా నవ్వుతున్నారు .
దేవత ......నావైపు చిరుకోపంతో చూస్తున్నారు .
Sorry sorry మేడం అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తూ కృష్ణకు పసుపు పూసి బుజ్జితల్లి కురులపై ప్రాణమైన ముద్దుపెట్టి వెనక్కువచ్చాను .
దేవత : ఆగండాగండి ఎంతైనా మా ఇంటి దేవుడు , హారతి కూడా ఇవ్వాలి .
అవునవును బాబూ అంటూ పెద్దమ్మ ...... నా చేతికి అందించడంతో హారతి తీసి ఇద్దరికీ బొట్టుపెట్టి చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జితల్లి కురులపై ముద్దుపెట్టి వెనక్కువచ్చాను .
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ ........
చుట్టూ ఆడవాళ్లు : ఇక నీ బుజ్జితల్లికి ముద్దుపెట్టుకో మహీ ....... అంటూ ఆటపట్టించి నవ్వుతున్నారు .
దేవత : తియ్యనికోపంతో ....... ఇప్పుడైనా ముద్దుపెట్టొచ్చా బుజ్జిమేడం గారూ అని అడిగారు .
బుజ్జితల్లి : లవ్ యు మమ్మీ అంటూ ముద్దుపెట్టింది .
దేవత : హ హ హ లవ్ యు బంగారూ అంటూ కురులపై ముద్దుపెట్టి బుజ్జి బుగ్గను గిల్లేసారు .
బుజ్జితల్లి : స్స్స్ ....... చూడండి తాతయ్యా - అంకుల్ అంటూ రుద్దుకోవటం చూసి చాలా చాలా ఆనందం వేసింది .
పెద్దయ్య : నొప్పివేస్తోందా బుజ్జితల్లీ ...... , స్నానం అయిన తరువాత ఇద్దరమూ కలిసి మీ మమ్మీ బుగ్గలను గిల్లేద్దాములే సరేనా .......
బుజ్జితల్లి : థాంక్యూ తాతయ్యా .......
దేవత ....... బుజ్జితల్లివైపు తియ్యనైన కోపంతో చూడటం చూసి నవ్వుకున్నారు . 
నెక్స్ట్ పెద్దమ్మతో కంటిన్యూ అయిన కార్యక్రమం ముత్తైదువులందరూ పూయడంతో పూర్తయ్యింది . ఆ వెంటనే చిన్నా పెద్దా మొదలుకుని అందరూ తడి పసుపును చేతుల్లోకి తీసుకుని వారికిష్టమైన వారికి పరుగులుపెట్టించి మరీ పూసే కార్యక్రమం బహు ముచ్చటగా జరిగింది . పెద్దమ్మ ...... పెద్దయ్యకు - ఆడవాళ్లు ...... వారి వారి భర్తలకు .......
బుజ్జితల్లి ....... నాదగ్గరికి పరుగునవచ్చి రెండుచేతులూ చాపడంతో లవ్ యు లవ్ యు అంటూ ఎత్తుకోగానే , అంకుల్ ...... అంటూ రెండుచేతులతో నా ముఖం మొత్తం పూసేసి నవ్వుతోంది .
అమ్మ దొంగా ...... ఉండు నీకూ పూస్తాను .
బుజ్జితల్లి : నా వొళ్ళంతా పసుపే కదా అంకుల్ ఇంకెక్కడ పూస్తారు అంటూ కిందకుదిగి పరుగుతీసింది . 
బుజ్జితల్లీ బుజ్జితల్లీ అంటూ పసుపు అందుకుని వెనుకే పరుగుతీసాను . బుజ్జితల్లి వెళ్లి దేవత వెనుక దాక్కుంది - అంతే చేతులుకట్టుకుని కదలకుండా తలదించుకున్నాను .
దేవత : నాకు పూయడానికే వచ్చారా ? .
భయంతో నో నో నో అన్నట్లు తలఊపాను . 
దేవత రెండుచేతులతో నా బుగ్గలపై పూసి పరుగున వారి అమ్మ దగ్గరకు చేరారు .
స్వీట్ షాక్ చెంది , దేవతకు పసుపు పూయాలన్న కోరికను కంట్రోల్ చేసుకుని , బుజ్జితల్లీ ....... దొరికావు అంటూ ప్రాణంలా హత్తుకున్నాను . 
దేవత ...... ఆరాధనతో చూడటం గమనించలేకపోయాను .

పెద్దమ్మ వచ్చి పందిరి స్నానానికి వేలయ్యింది బుజ్జితల్లీ - బాబూ ...... , ఇప్పటికే ఆలస్యం అయ్యింది అందరికీ ఆకలివేస్తుంటుంది అని బుజ్జితల్లిని ఎత్తుకునివెళ్లి కృష్ణ ప్రక్కన కూర్చోబెట్టి జల్లెడ ద్వారా మొదట దేవత నీళ్లు పోశారు .
పెద్దమ్మ : బాబూ ...... నెక్స్ట్ నువ్వే పొయ్యి లేకపోతే గోల గోల చేసేస్తోంది బుజ్జి రాక్షసి అంటూ ఆహ్వానించారు .
మరింత ఆలస్యం చెయ్యడం ఇష్టం లేక దేవతతోపాటు నీళ్లుపోసి , అందరూ పంచుతున్న ఆప్యాయతకు పరవసించిపోయాను . 
తరువాత ముత్తైదువులంతా నీళ్లుపోసి బుజ్జితల్లి ఒంటిపై పసుపు పూర్తిగా పోయేలా చేసి బుజ్జిబుజ్జిగా వణుకుతున్న బుజ్జితల్లిని - కృష్ణను లోపలికి తీసుకెళ్లారు . 
అంకుల్ ........ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను . 
పెద్దమ్మ : అప్పుడే మీ అంకుల్ దగ్గరికి వెళ్ళడానికి లేదే బుజ్జి రాక్షసి , బట్టలు మార్చుకున్నాక లోపల కూడా పూజ ఉంది . కావాలంటే మీ అంకుల్ ...... నీ ఎదురుగానే కూర్చుంటాడులే ....... 
బుజ్జితల్లి : ఇంకెంతసేపు అమ్మమ్మా ...... 
Sorry బుజ్జితల్లీ ....... త్వరగా పూర్తి చేస్తాములే అని అందరూ నవ్వుకున్నారు .

అందరూ పసుపును శుభ్రం చేసుకుని లోపలికి వెళుతున్నారు .
పెద్దమ్మ వచ్చి పెద్దయ్య కు అంటించిన పసుపును తడిగుడ్డతో శుభ్రం చేసి , బాబూ ....... లోపలికివచ్చి నీకిష్టమైన గదిలోకివెళ్లి శుభ్రం చేసుకో - బుజ్జితల్లి వచ్చే సమయానికి ఎదురుగా కనిపించకపోతే మాపై కోప్పడుతుంది .
Sorry పెద్దమ్మా ....... , నా వలన ......
పెద్దమ్మ - పెద్దయ్య : లేదు లేదు బాబూ ...... , మాకు చాలా సంతోషం - చూశావుకదా ఆలస్యమైనా మీ ఇద్దరివలన ఎంత సంబరంలా జరిగింది - అందరూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూనే ఉండటం చూసి చాలా చాలా ఆనందం వేసింది - అందుకు మేమే కృతజ్ఞతలు చెప్పుకోవాలి - మాకోసమే వచ్చిన దేవుడు బాబూ ....... నువ్వు .
పెద్దమ్మా ........
పెద్దయ్య : చెప్పాముకదా బాబూ ...... ఇక నువ్వు అలవాటు పడాల్సిందే అని నవ్వుకున్నారు - వెళ్లు బాబూ .......

లోపలికివెళ్లి పైకివెళ్ళాను . నేను స్నానం చేసిన గదిలోకివెళ్ళాను . 
లోపల దేవత ...... బుజ్జితల్లి తడిచిన డ్రెస్ ను విప్పుతున్నారు . Sorry sorry మేడం - బుజ్జితల్లీ ....... ఎవ్వరూ లేరు అనుకున్నాను అని వెనుతిరిగాను .
పర్లేదు అంకుల్ ....... బుజ్జితల్లి నవ్వుతోంది .
అక్కడే ఆగండి మహేష్ గారూ ...... , ఎంత ధైర్యం నా గదిలోకి రావడానికి ...... అని కాస్త కోపంతోనే అడిగారు . 
అదీ అదీ ..... ఇంతకుముందు ఇక్కడే ఫ్రెష్ అయ్యాను మేడం అని వణుకుతూ బదులిచ్చాను .
ముసిముసినవ్వులు వినిపించడంతో వెనక్కుతిరుగబోతే .......
దేవత : స్టాప్ ...... , డ్రెస్ చేంజ్ చేసుంటున్నామని తెలిసికూడా చూడబోతున్నారు , నాకు తెలుసు మీరు బ్యాడ్ బాయ్ అని మళ్ళీ ముసిముసినవ్వులు .......
బుజ్జితల్లి : నాకైతే ఇష్టమే మమ్మీ ........
దేవత : కీర్తీ ..... ష్ ష్ ...... , ఎంత ధైర్యం నా గదిలో స్నానం చేయడానికి .......
అదీ అదీ బుజ్జితల్లి ....... sorry sorry
బుజ్జితల్లి : అవును మమ్మీ ...... నేనే పిలుచుకునివచ్చాను అంకుల్ ను .
దేవత : ష్ ష్ ....... కీర్తీ , వెళ్ళండి ప్రక్కగదిలోకి వెళ్ళండి .
బ్యాగ్ లో టవల్ .......
దేవత : మీకోసం ప్రక్కగదిలో ఉంచాను వెళ్ళండి .
Sorry అంటూ తుర్రుమన్నాను .
గట్టిగా నవ్వుకున్నట్లు దేవత - బుజ్జితల్లి నవ్వులు వినిపించాయి . ప్రక్క గదిలోకివెళ్ళిచూస్తే బెడ్ పై టవల్ తోపాటు మరొక జత కొత్తబట్టలు కూడా ఉండటం చూసి ఆశ్చర్యం వేసింది . దేవత నవ్వుతోంది - కవ్విస్తోంది - వెంటనే కోప్పడుతోంది ఏమీ అర్థం కావడం లేదు . అందుకే అన్నారు కాబోలు " ఆడువారిమాటలకు అర్థాలేవేరు " అని నవ్వుకుని శుభ్రం చేసుకునివచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకువచ్చేసరికి , కృష్ణను - బుజ్జితల్లిని ప్రక్కప్రక్కనే కూర్చోబెట్టి కార్యక్రమం జరిపిస్తున్నారు .
అంకుల్ ...... మీకోసమే సోఫా కూర్చోండి అని బుజ్జితల్లి ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
లవ్ యు బుజ్జితల్లీ ..... పర్లేదులే ......
దేవత : కూర్చోండి అని ఆర్డర్ వెయ్యడంతో ........ బుద్ధిగా కూర్చోవడం చూసి నవ్వుకున్నారు .
పూజా కార్యక్రమం పూర్తవగానే , అయిపోయింది అంటూ కృష్ణ బుగ్గపై ముద్దుపెట్టి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది .
దేవత ...... అసూయతో చూడటం చూసి వారి ఫ్రెండ్స్ తోపాటు నాకూ నవ్వువచ్చేసింది .
అప్పటికే 2 గంటలు అవ్వడంతో బయట భోజనాలు మొదలుపెట్టారు . తృప్తిగా భోజనాలు చేసి పెళ్లిలో కలుద్దాము అని ఊరిజనమంతా వెళ్లిపోయారు .
Like Reply
బుజ్జితల్లి : అంకుల్ ఆకలివేస్తోంది కదూ .......
లేదు లేదు బుజ్జితల్లీ .......
బుజ్జితల్లి : అంకుల్ మీరు అపద్ధం చెబుతున్నారు , మీ కళ్ళు - స్పర్శ ద్వారా నాకు తెలిసిపోతోంది , నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు నిజం చెప్పండి అని ముద్దుపెట్టింది .
అవును బుజ్జితల్లీ ....... ఉదయం కూడా తినలేదు - బ్లడ్ కూడా ఇచ్చానుకదా బాగా ఆకలివేస్తోంది - బయట నుండి అధిరిపోయినట్లు వంటల ఘుమఘుమలు కూడానూ ........ అని దీనంగా ముఖం పెట్టి అడిగాను .
బుజ్జితల్లి : sorry అంకుల్ ...... - తాతయ్యను రక్షించే క్రమంలో మీగురించి ఒక్కక్షణం కూడా ఆలోచించనేలేదన్నమాట - లవ్ యు లవ్ యు sooooo మచ్ అంకుల్ . అంతే మమ్మీ - అమ్మమ్మా - మావయ్యా ...... అంటూ బుజ్జికోపంతో గట్టిగా కేకలువేసింది .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ కీర్తీ ........ అంటూ ముగ్గురూ పరుగునవచ్చారు . 
బుజ్జితల్లి : ఇంటి దేవుడు అని పిలవడం కాదు ........
ష్ ష్ ష్ బుజ్జితల్లీ ...... అంటూ నవ్వుతూ బుజ్జి నోటిని చేతితో మూస్తున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ఆగండి please please అంటూ నా చేతిపై - చేతిని తియ్యగానే బుగ్గపై ముద్దుపెట్టింది లవ్ యు అంటూ . మమ్మీ - అమ్మమ్మా ...... తాతయ్యకోసం హాస్పిటల్లో ఉన్నారు - బ్లడ్ ఇచ్చారు - తాతయ్యను జాగ్రత్తగా తీసుకొచ్చి ఫంక్షన్ జరిగేలా చూసారు , బ్లడ్ ఇచ్చాక ఎంత నీరసమైపోతారో తెలుసుకదా ....... , పాపం అంకుల్ బ్లడ్ ఇచ్చిన తరువాత టిఫిన్ కూడా తినలేదు కాదు కాదు మనమే కనీసం అడగనేలేదు - ఇప్పుడు భోజనం కూడా ........
బుజ్జితల్లీ ........
బుజ్జితల్లి : ఆగమని చెప్పానుకదా అంకుల్ నోటిపై వేలుని వేసుకోండి .
అమ్మో ......భయమేస్తోంది అంటూ నోటికి తాళం వేసాను . 
దేవత - పెద్దమ్మ - కృష్ణ ...... ముగ్గురూ నవ్వుకుని హడావిడిగా బయటకువెళ్లి పెద్దపెద్ద పాత్రల నుండి ప్లేట్స్ లో వడ్డించుకునివచ్చారు . 
పెద్దమ్మ : sorry బాబూ ...... ఆయన దెబ్బలు చూసి - ఈ హడావిడిలో మరిచేపోయాము .
కృష్ణ : బుజ్జితల్లీ ....... మాపై మరింత కోప్పడాల్సింది - బ్లడ్ ఇచ్చిన అన్నయ్య గురించి ఆలోచించనేలేదు - మోకాళ్లపై కూర్చుని అన్నయ్యా ...... మీవల్లనే ఈ సంతోషాలు , భోజనం చెయ్యండి .
కృష్ణా ...... నాన్నగారు భోజనం చేశారా ? .
కృష్ణ : మందులు వేసుకోవాలికదా పూజ జరిగేటప్పుడే తిని పడుకున్నారు .
గుడ్ కృష్ణా .......
కృష్ణ : ఇప్పుడు కూడా మా గురించే ఆలోచిస్తున్నారా అన్నయ్యా ....... , నిజంగా మీరు దేవుడు .
మళ్లీ మొదలెట్టావా ..... ? .
దేవత : నవ్వుకుని , మహేష్ గారూ ...... అమ్మ చెప్పింది కదా మీ ఇల్లే అనుకోబాబూ అని ఆకలివేస్తే మాకు ఆర్డర్ అయినా వెయ్యాలి లేకపోతే దర్జాగా వెళ్లి తినాలి , ఇలా చెయ్యడం ఏమైనా బాగుందా ...... ? - మీ బుజ్జితల్లితో తిట్టిస్తారా ...... ? .
Sorry sorry మేడం ....... , పెదాలపై చిరునవ్వుతో కృష్ణ నుండి అందుకున్నాను . కృష్ణా - మేడం - పెద్దమ్మా ....... ఇప్పటికే ఆలస్యం అయ్యింది మీరూ భోజనం చెయ్యండి .
పెద్దమ్మ : కృష్ణ చెప్పినట్లు అనుక్షణం మా గురించే ఆలోచిస్తున్నారు - బాబూ ....... నువ్వు అతిథివి కావు ఇంటి మనిషివి కాదు కాదు మా దేవుడివి , ఇంట్లో ఎక్కడికైనా వెళ్లే అధికారం నీకుంది - బుజ్జితల్లిలా మాపై కోప్పడే అధికారం కూడా ఉంది .
పెద్దమ్మా ....... , ఏ జన్మలో చేసుకున్న అదృష్టమే బుజ్జితల్లికి ...... నేనంటే ఇష్టమయ్యాను - పెద్దవారంటే నాకు అపారమైన గౌరవం , మేడం గారికి కూడా తెలుసు ........
దేవత : ఆ ఆ తెలుసు తెలుసు అని ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
నేనూ నవ్వుకుని బుజ్జితల్లీ తిను , నువ్వూ తినలేదు కదా ........
బుజ్జితల్లి : మీరే తినిపించండి .
మేడం ...... తినిపించడానికి స్పూన్ అని అడిగాను తలదించుకుని .......
బుజ్జితల్లి : మమ్మీ నో ........ , అంకుల్ మీరు తింటున్న చేతితోనే తినిపించండి .
బుజ్జితల్లీ ....... ఎంగిలి , మమ్మీకి కోపం వచ్చేస్తుంది .
బుజ్జితల్లి : అయినా పర్లేదు కోప్పడితే కోప్పడనివ్వండి - మా అంకుల్ దేవుడు కదా దేవుడి చేతితో తినాలంటే అదృష్టం ఉండాలి . మమ్మీ - మావయ్య ....... ఎలా చూస్తున్నారు చూడు ఈ అదృష్టం కోసం .
అప్పటివరకూ ఆశతో చూస్తున్నట్లు దేవత తలదించుకున్నారు . కృష్ణకు ప్లేట్ ఇచ్చి మరొక ప్లేట్ లో వడ్డించుకునివచ్చి మాతోపాటు కలిసితిన్నారు .

నవ్వుకుని , కృష్ణా ....... వంటలు భలే రుచిగా ఉన్నాయి - పెళ్లికి కూడా ఈ వంటవారేనా ...... ? .
కృష్ణ : తింటూనే ....... , లేదు అన్నయ్యా ..... వంట చేసినది ఊరిలో ఉన్న పెద్దయ్య - వయసైపోయింది అయినాకూడా కృష్ణా ...... మీ ఇంటి సంబరంలో వంట చేసే అదృష్టం ఇవ్వాలి లేకపోతే ఊరుకునేది లేదు అనడంతో ఈరోజు మన ఊరు వాళ్లే కాబట్టి వద్దు వద్దు ఇబ్బందిపడతారు అన్నాకూడా ఉత్సాహంతో చేశారు - పెళ్లికి జనం డబల్ అవుతారు ఇబ్బందిపడతారు , సిటీ నుండి పిలిపిస్తాను అన్నారు  నాన్నగారు - అక్కయ్య వచ్చేన్తవరకూ పెళ్ళిపనులు మొదలుపెట్టకూడదు అని అనుకున్నాము , అక్కయ్య - బుజ్జితల్లి అంటే అంత ప్రాణం అందరికీ మీకు తెలియంది కాదు - అందుకే ఏదీ ఆర్రేంజ్ చెయ్యలేదు , ఇకపైనా అన్నింటినీ ........

దేవత : తమ్ముడు పెళ్లి అంటే ఏ అక్క అయినా నెల రోజులముందే ఉంటుంది నాలా గెస్ట్ లా ఒకరోజుముందు రాదు అని బాధపడుతోంది .
కృష్ణ : అక్కయ్యా ....... బాధపడకండి , నాన్నగారు లేవగానే సిటీకి వెళ్లి ఒక్కరోజులో అన్నీ సెట్ చేసేస్తాను .
బుజ్జితల్లి : అంకుల్ ....... మమ్మీ రెండు నెలల ముందే రావాలని ఆశపడింది కానీ ఆ మాన్స్టర్ పంపించనేలేదు - మమ్మల్ని ఒంటరిగా వదిలి నెలలు నెలలు ఎక్కడికో వెళ్ళిపోతాడు .
దేవత కన్నీళ్ళతో వంట గదిలోకి వెళ్లిపోయారు . 
ఈ కన్నీళ్లు అలవాటైపోయాయి బాబూ అంటూ పెద్దమ్మ బాధపడుతూ దేవత దగ్గరికి వెళ్లారు .
దేవత కన్నీళ్లను చూసి నా కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి . 

వెంటనే దేవత బయటకువచ్చి అనుకున్నాను మీరు తినడం ఆపేస్తారని , ప్లేట్ ను కిందపెడితే నాకు కోపం వచ్చేస్తుంది మహేష్ గారూ , మీకు కావాల్సినది నేను తినడమే కదా ఇదిగో తింటున్నాను అని మరొక సోఫాలో కూర్చుని తిన్నారు . బుజ్జితల్లీ ....... మీ అంకుల్ కు తినిపించు అని నవ్వుతూ చెప్పారు .
బుజ్జితల్లి : అంకుల్ ...... తినకపోతే నీరసం వచ్చేస్తుంది అని బుజ్జిచేతులతో తినిపించి ముద్దుపెట్టింది . 
కన్నీళ్లను తుడుచుకుని తింటూ బుజ్జితల్లికి తినిపించాను .

పెద్దమ్మ : బుజ్జితల్లి చెప్పినట్లు బ్లడ్ ఇచ్చినవాళ్లు కొద్దిసేపైనా రెస్ట్ తీసుకోవాలి , మాకు ఇబ్బంది కలిగించకుండా ఇంతవరకూ పండుగలా జరిగేలా చూసారు - ఇక రేపటివరకూ మీరు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు , పైకి వెళ్లిపోండి - బుజ్జితల్లీ తీసుకెళ్లు .
బుజ్జితల్లి : ఆ సంగతి నాకు వదిలెయ్యండి అమ్మమ్మా ....... - అంకుల్ కు జోకొడుతూ హాయిగా నిద్రపుచ్చుతాను అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . అంకుల్ వెళదామా ....... ? .
Ok బుజ్జితల్లీ ...... అంటూ ప్రాణంలా హత్తుకుని పైకిలేచాను .

అంతలో పెద్దయ్య ...... నాన్నా కృష్ణా కృష్ణా ...... అంటూ ఇబ్బందిపడి నడుస్తూ లోపలికివచ్చారు .
నాన్నగారూ - పెద్దయ్యా ...... అంటూ బుజ్జితల్లిని ఎత్తుకునే వెళ్లి పెద్దయ్యను రెండువైపులా పట్టుకుని నడిపించుకుంటూ వచ్చి సోఫాలో కూర్చోబెట్టాము .
కృష్ణ : నాన్నగారూ ....... పిలవచ్చు కదా .......
పెద్దయ్య : ఇంట్లోకి కూడా నడవకపోతే , పెళ్ళికోసం ఏర్పాట్లుపూర్తిచేయడానికి ఇప్పుడు సిటీకి ఎలా వెళతాను చెప్పండి 
కృష్ణ : నాన్నగారూ ....... మీరు కోలుకునేంతవరకూ ఎక్కడికీ వెళ్లకూడదు , ఎక్కువగా నడవకూడదు , రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారుకదా ........
అవును పెద్దయ్యా ....... 
పెద్దయ్య : ఇలాంటివి ఎన్ని చూడలేదు కృష్ణా ...... , బాబూ ..... పెళ్లికి ఒక్కరోజే ఉందికదా ఈరోజే అన్నీ చూసుకోవాలి లేకపోతే కష్టం . నేనేకదా చెయ్యాల్సినది కష్టమైనా తప్పదుమరి .......
కృష్ణ : నాన్నగారూ ....... నేనున్నాను కదా , సిటీకి వెళ్లి .......
పెద్దయ్య : ఒక్కసారి పెళ్ళికొడుకుని చేశాక పొలిమేర దాటకూడదు నాన్నా .......
పెద్దమ్మ - దేవత : అవునవును , వెళ్లకూడదు కృష్ణా - తమ్ముడూ ..... ప్రమాదం అంటూ ఇద్దరూ కృష్ణ చేతులను పట్టుకున్నారు .
కృష్ణ : మరెలా అక్కయ్యా - అమ్మా ...... , నాన్నగారిని ఈ పరిస్థితులలో పంపించడం అంతకంటే ప్రమాదం . నేనే వెళతాను - నాకేమి జరిగినా .......
దేవత : తమ్ముడూ ....... కొడతాను అంటూ గట్టిగా చేతిని చుట్టేశారు .
కృష్ణ : అయితే ఇప్పుడెలా అక్కయ్యా ....... , అందుకే పెళ్లిని పోస్ట్ .......

కృష్ణా ...... పోస్ట్ ఫోన్ అన్నమాటను అని అందరినీ బాధపెట్టకు - పెళ్ళిపనులు పూర్తిచేయడానికి నేను లేనూ ........
బాబూ - అన్నయ్యా ....... నో నో నో మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం .
అంటే నేను ఈ ఇంటివాడిని కాదన్నమాట - ఈ ఇల్లు మీదే , మా ఇంటి దేవుడు , మాపై అధికారం చాలాయించవచ్చు అన్నది ఉత్తిత్తినే అన్నమాట . నా బుజ్జితల్లి వలన మీరంతా ...... నా ఫ్యామిలీ అని ఉదయమే ఫిక్స్ అయిపోయాను - మీరు ఔనన్నా కాదన్నా ఇంటి నుండి గెట్ ఔట్ ........
దేవత - పెద్దమ్మ :లేదు లేదు ఆ మాటను ........
నవ్వుకుని , లేదులే పెద్దమ్మా - మేడం ...... ఊరికే అన్నాను . మీరు ఔనన్నా - కాదన్నా ...... పెళ్లి ఏర్పాట్లన్నీ చెయ్యబోతున్నాను అంతే ......
బుజ్జితల్లి : అంకుల్ కు తోడుగా నేను కూడా ........
హైఫై హైఫై బుజ్జితల్లీ ...... లవ్ యు లవ్ యు soooo మచ్ అంటూ ముద్దులుపెట్టాను . బుజ్జితల్లీ ....... లెట్స్ గో ....... , కృష్ణా - పెద్దయ్యా ...... పెళ్ళికొడుకు శాస్త్రం కాకుండా ఏదీ ఆర్రేంజ్ చెయ్యలేదు కదా ఇక మా ఇద్దరికీ వదిలెయ్యండి అని మళ్ళీ హైఫై కట్టుకున్నాను .
దేవత : నేను కూ ......... అని ఎందుకో ఆగిపోయి మావైపు ఆశతో చూస్తున్నారు .
మేడం ........ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ? .
దేవత : లేదు లేదు , థాంక్యూ soooo మచ్ మహేష్ గారూ అంటూ ఆనందబాస్పాలతో నమస్కరించారు .
పెద్దమ్మ : బాబూ ...... నువ్వు రెస్ట్ .......
పెళ్లి పనుల ఉత్సాహం ఉంటే ఇంకా రెస్ట్ ఏమిటి పెద్దమ్మా ........
పెద్దమ్మ : నువ్వు నిజంగా మా దేవుడే బాబూ .......
బుజ్జితల్లీ ....... ఇక్కడే ఉంటే ఇలానే దేవుడు దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు మనం వెళదాము పదా ....... అంటూ ముద్దుపెట్టాను .

కృష్ణ : అన్నయ్యా ....... అంటూ ఉద్వేగానికి లోనౌతూ బుజ్జితల్లితోపాటు కౌగిలించుకున్నాడు . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా ....... - మేమంతా మీకు ఋణపడిపోయాము . మీకు తోడుగా మీరు చెప్పినవన్నీ చెయ్యడానికి మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు అని డబ్బు ఇచ్చాడు .
అయితే మంచిదే కదా ....... , వద్దు ఆనబోయి బాగోదు అని డబ్బు అందుకున్నాను.
కృష్ణ : నిమిషంలో వస్తారు అన్నయ్యా ......
Like Reply
బయటకువచ్చిన కొద్దిసేపటికి కృష్ణ ఫ్రెండ్స్ వచ్చారు - వినయ్ , గోవర్ధన్ లుగా పరిచయం చేశాడు . 
ఇద్దరూ : అన్నయ్యా ....... ఇంతకుముందే కలవాల్సింది హడావిడిలో కుదరలేదు - మా ఊరి పెద్దయ్య ప్రాణాలు కాపాడిన దేవుడుమీరు - మాకే కాదు ఊరిలో అందరికీ పెద్దయ్య అంటే గౌరవం - అంతటివారిని కాపాడిన ........
దేవుడిని అంతేకదా ....... ఉదయం నుండీ .......
బుజ్జితల్లి - కృష్ణ ....... నవ్వేస్తున్నారు . వెనకనుండి అందమైన నవ్వులు వినిపించడంతో చూస్తే గుమ్మం దగ్గర నిలబడిన దేవత .......
నవ్వుతున్న బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకుని దేవతవైపు కన్నార్పకుండా చూస్తున్నాను .
కృష్ణ ఫ్రెండ్స్ : రేయ్ కృష్ణా ...... ఎందుకురా నవ్వుతున్నారు ? .
కృష్ణ - బుజ్జితల్లితోపాటు దేవత ...... మరింతగా నవ్వుతున్నారు . వెంటనే ఏంటి అలా చూస్తున్నారు అని వేలు చూయించి కోప్పడటంతో , నో నో నో అంటూ తల అడ్డంగా ఊపి తలదించుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ....... మీరు దేవుడుకదా , మమ్మీ కోపంతో చూడగానే భయపడిపోతారే ....... - మమ్మీ అంటే అంత భయమా ...... ? .
చాలా అంటే చాలా బుజ్జితల్లీ ....... అంటూ ముద్దుపెడుతూనే దేవతవైపు చూసి నవ్వుకుని , కృష్ణా ...... ఇంతకూ పెళ్లి ఎక్కడ గుడిలోనా లేక ఫంక్షన్ హాల్ లోనా ....... ? .
కృష్ణ : మన ఊరిలో ఫంక్షన్ హాల్ లేదు అన్నయ్యా ....... , ప్రతీ ఇంటి పెళ్ళీ ..... గుడి ప్రక్కనే ఉన్న స్కూల్ గ్రౌండ్ లోనే జరిపించాలని పెద్ధలు ఎప్పుడో నిర్ణయించారు - దేవుని సమక్షంలో అక్కడ జరిగిన పెళ్లిళ్ల కుటుంబాలు సుఖసంతోషాలతో ఉంటారని , భార్యాభర్తలు బంధం మరింత బలపడుతుందని నమ్మకం . అక్కయ్య పెళ్లి ఇక్కడే చేద్దామని బావకు ....... ( బుజ్జితల్లి ..... కృష్ణ చెంపపై కోపంతో కొట్టింది ) ఆ మాన్స్టర్ కు ( ఉమ్మా ...... మావయ్యా ) ఎంతచెప్పినా వినలేదు - వైజాగ్ ఫంక్షన్ హాల్లో ........ అందుకే అంటూ బాధపడ్డాడు .
దేవత అటువైపుకు తిరిగారు - బాధపడుతున్నారని అర్థమైంది .

టాపిక్ మార్పించాలని , కృష్ణా ....... అంతటి శుభకరమైన ప్లేస్ ను ఒకసారి చూడాలని ఉంది . 
కృష్ణ : ఉదయం వెళ్లిన గుడి ప్రక్కనే అన్నయ్యా ...... రండి వెళదాము .
బుజ్జితల్లి : నేను నేను చూయిస్తాను అంకుల్ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి ఆతృతతో కిందకుదిగి త్వరగా రండి అంకుల్ అంటూ బుజ్జిబుజ్జిగా పరుగుతీసింది .
బుజ్జితల్లి బంగారూ ....... జాగ్రత్త .......
దేవత : మా దేవుడైన మీరుండగా మీ బుజ్జితల్లికి ఏమౌతుంది మహేష్ గారూ ..... 
అంతలో మట్టిరోడ్డుపై వర్షాలకు పైకి తేలిన రాళ్లు ..... బుజ్జిపాదాలకు అడ్డు తగిలినట్లు , అమ్మా ...... అంటూ బుజ్జితల్లి కిందకుపడింది .
అంతే బుజ్జితల్లీ - కీర్తీ తల్లీ ....... అంటూ నలుగురమూ పరుగుతీసాము . మోకాళ్లపై కూర్చుని బుజ్జితల్లీ బుజ్జితల్లీ ....... అంటూ అప్పటికే లేచి ఏమీకాలేదు అంకుల్ అంటున్న బుజ్జితల్లిని గుండెలపై ప్రాణంలా హత్తుకున్నాను . మోచేతులు - మోకాళ్లపై దెబ్బలేమైనా తగిలాయేమోనని కంగారుపడుతూ చూసి హమ్మయ్యా ........ అంటూ ముద్దులవర్షo కురిపించాను .
బుజ్జితల్లి : మమ్మీ చెప్పారుకదా , దేవుడైన మా అంకుల్ ఉండగా నాకేమి అవుతుంది - ఇంతదానికే కళ్లల్లో కన్నీళ్లు వచ్చేసాయి మీకు - నేనంటే అంత ప్రాణం అన్నమాట ఉమ్మా ....... అంటూ గట్టిగా ముద్దుపెట్టింది .
అధిచూసి దేవత ఆరాధనతో నావైపు చూస్తున్నారు .

కృష్ణ ఫ్రెండ్స్ : ఎప్పుడో 20 - 30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు - నడవడానికే కాదు వెహికల్స్ కూడా కిందపడి దెబ్బలు తగులుతున్నాయి అని MLA - MP గారికి సర్పంచ్ - పెద్దయ్యతోపాటు ఊరిజనమంతా వెళ్లి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు . ఉదయం నుండీ కీర్తినే పడటం ఇది రెండోసారి - తోటి పిల్లలతో ఆడుకుంటూ పడటం చూసాను .
నిజమా ...... కృష్ణా ...... , బుజ్జితల్లీ బుజ్జితల్లీ ...... ఎక్కడైనా నొప్పివేస్తోందా అని కంగారుపడుతూ అడిగాను .
కృష్ణ : మూడోసారి అన్నయ్యా ...... ఉదయం ఆటోలోనుండి దిగి తాతయ్యా - అమ్మమ్మా ...... అంటూ సంతోషంతో పరుగుతీస్తూ కూడా ఒకసారి పడింది .
బుజ్జితల్లి : మావయ్యా ...... దెబ్బలేమీ తగలలేదులే , ఒక్కసారి అని తెలిస్తేనే అంకుల్ కళ్ళల్లో కన్నీళ్లు వాచ్చేసాయి - అంకుల్ అంకుల్ మా మంచి అంకుల్ కదూ దేవుడు కదూ ...... మీ బుజ్జితల్లికి ఏమీ కాలేదు - ఎక్కడా నొప్పివేయ్యడం లేదు అని బుగ్గలను స్పృశిస్తూ బుజ్జగిస్తోంది .
అధిచూస్తూ నవ్వు వచ్చేసింది . లవ్ యు బుజ్జితల్లీ ...... అంటూ పైకిలేచాను . బుజ్జితల్లీ ...... మమ్మీకి బై చెప్పు వెళదాము .
బుజ్జితల్లి : మమ్మీ బై .......
దేవత : లవ్ యు బుజ్జితల్లీ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు .
ఎగిరి క్యాచ్ పట్టి నా హృదయానికి అందించబోయి , దేవత కోపాన్ని చూసి బుజ్జితల్లి బుగ్గపై తాకించి వెనక్కు తిరిగిచూడకుండా గదివైపుకు నడిచాను . నవ్వులు వినిపించినా వెనక్కు తిరుగనేలేదు .

ఉదయం గమనించలేదు కానీ రోడ్డుపై ముందుకు వెళుతున్నకొద్దీ రోడ్డు మరీ ఘోరంగా ఉంది అక్కడక్కడా వర్షపు నీళ్లుకూడా నిలబడ్డాయి . గుడిప్రక్కనే ఉన్న విశాలమైన govt గ్రౌండ్ కు చేరుకున్నాము . Wow ..... కృష్ణా ఎంతమందైనా ప్రశాంతంగా పెళ్లి చూసేంత విశాలంగా ఉంది . చుట్టూ చూస్తూ కాస్తదూరంలో వందలమంది స్కూల్ పిల్లలు చెట్టుకింద కూర్చుని పాఠాలు వింటుండటం చూసాను - చెట్టునీడ కొద్దిమంది పిల్లలపై మాత్రమే పడింది , 40% పిల్లలు మిట్టమద్యాహ్నం ఎండలోనే కూర్చుని టీచర్ చెబుతున్న పాఠాలు వింటూ చెమటను తుడుచుకుంటున్నారు .
కృష్ణా ...... స్కూల్ బిల్డింగ్ లేదా పిల్లలంతా బయట కూర్చున్నారు .

అంతలో భయంకరమైన శబ్దం . 
స్కూల్ పైకప్పు పడిపోయినట్లుంది అన్నయ్యా అంటూ కృష్ణ - ఫ్రెండ్స్ పరుగుపెట్టారు . 
బుజ్జితల్లిని జాగ్రత్తగా పట్టుకుని వెనుకే పరుగుతీసాను . చెట్టుకింద కూర్చున్న పిల్లలంతా భయంతో మావైపుకు పరుగులుతీశారు . చూస్తుండగానే మిగిలిన పైకప్పు కూడా కుప్పకూలిపోయింది . 
ఎంత ప్రమాదం తప్పింది ఇలా జరుగుతుందని ఉదయమే అనిపించడంతో పిల్లలందరినీ చెట్టుకిందకు చేర్చాము అని స్కూల్ టీచర్ చెప్పడంతో అందరమూ ఊపిరిపీల్చుకున్నాము .
అయినా సరే కృష్ణ ...... ఆ టీచర్ ను పదే పదే అడిగాడు అందరూ ఇక్కడే ఉన్నారుకదా - ఎవ్వరూ లేరుకదా అని .......
టీచర్ : లేదు కృష్ణా ...... , ఉదయం నుండీ పిల్లలనే కాదు ఎవ్వరినీ అటువైపు పంపలేదు .
కృష్ణ : మంచిపనిచేశారు సర్ , మీవలన ...... తలుచుకుంటేనే భయం వేస్తోంది .
ఊరిజనమంతా అక్కడకుచేరి ఏడుస్తున్న వారివారిపిల్లలను అక్కున చేర్చుకుని దేవుడికి - టీచర్ కు థాంక్స్ చెప్పుకున్నారు .
కృష్ణ : రొడ్డయినా 20 - 30 ఏళ్లది అన్నయ్యా ...... , స్కూల్ అయితే బ్రిటిష్ కాలం నాటిది . ఎంత కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు . 
కృష్ణా - హెడ్ మాస్టర్ గారూ ....... పిల్లలకు ఏమీకాలేదు కదా , ఓట్లకు మాత్రం వచ్చేస్తారు - మా కష్టాలు చెప్పుకోవడానికి వెళితే కనీసం కలవను కూడా కలవరు . పుట్టిన ఊరికి ఏమీచెయ్యడానికి వీలులేని ఈ సర్పంచ్ పదవి ఉంటే ఎంత లేకపోతే ఎంత వెంటనే వదిలేస్తాను .
ఊరిజనం : సర్పంచ్ గారూ ...... మీ గురించి మాకు తెలియదా ? , పెద్దయ్యతో కలిసి మీ మీ సొంత డబ్బుతో ఎన్ని మంచిపనులు చేశారు - పదవిలో ఉంటేనే పట్టించుకోవడం లేదు ఇక వదిలేస్తే ...... అని బాధపడుతున్నారు .
కృష్ణ : అన్నయ్యా ...... మనూరి సర్పంచ్ - నాన్నగారి స్నేహితుడు . ఉన్నడబ్బంతా ఊరికోసమే ఖర్చు చేశారు - ఉంటున్న ఇల్లుని కూడా అమ్మేసి నష్టపోయిన రైతులను ఆదుకున్నారు - కోనేరులో స్నానం చేస్తారు గుడిలోనే పడుకుంటారు . అందుకే అందరికీ గౌరవం .
కృష్ణా ...... మరి మనం ఉంటోన్న ఇల్లు ? .
కృష్ణ ఫ్రెండ్స్ : సర్పంచ్ కంటే ముందే అమ్మేసి , ఆ డబ్బుతో చాలామందిని పైచదువులకోసం సిటీకి పంపించారు - ఉన్న ఇంట్లోనే బాడుగకు ఉంటున్నారు - ఆ డబ్బే ఇద్దరి దగ్గర ఉండి ఉంటే ఎప్పుడో స్కూల్ కట్టించేసేవారు అని కృష్ణ భుజాలపై గర్వపడుతూ చేతులువేశారు .

హెడ్ మాస్టర్ - సర్పంచ్ చుట్టూ పిల్లలుచేరి రేపటి నుండి ఎక్కడ చదువుకోవాలి అని ఏడుస్తూ అడుగుతున్నారు . 
ఆ దృశ్యాన్ని చూసి బుజ్జితల్లి కంటిలోనుండి బుజ్జి కన్నీళ్లు - అంకుల్ అంటూ నన్ను గట్టిగా హత్తుకుంది . బుజ్జితల్లి కన్నీళ్లను చూసి నా గుండె చలించిపోయింది . ఒకరేమో ....... ఉన్నదంతా తమకోసం కాకుండా పిల్లల చదువులకు ఖర్చుపెట్టారు - మరొకరేమో ....... రైతులకోసం సర్వస్వం దానం చేసి గుడిలో ఉంటున్నారు . ఇకపై కూడా సంతోషంగా సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు . మొబైల్ తీసి నా అకౌంట్ బ్యాలన్స్ చూసుకున్నాను కోట్లకు కోట్లు బ్యాంకులలో మూలుగుతోంది - నా డబ్బు బడాబడా వ్యాపారులకు ఉపయోగపడుతోంది , వాళ్లేమో ....... IP పెట్టి దర్జాగా విదేశాలకు పారిపోతున్నారు - నా డబ్బు వాళ్ళు ఎంజాయ్ చెయ్యడం ఏమిటి ? - నాకు ఊరికోసం సహాయం చేసి ఆనందిస్తున్న పెద్దయ్య - సర్పంచ్ ఆస్వాధిస్తున్న పొందుతున్న ఆనందం కావాలి - నా డబ్బు పేదవారికి , రైతులకు , కష్టాలలో ఉన్నవారికి ఉపయోగపడాలి . బుజ్జితల్లీ ....... రేపు ఈ సమయానికి ఈ కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలు నింపుతాను - నీ బుజ్జి కన్నీళ్ళతో నా కళ్ళు తెరిపించావు , సంపాదించడంలో కాదు అవసరమైనప్పుడు సరైన సమయంలో కష్టాలలో ఉన్నవారికి తోచినంత సహాయం చేసినవాడే మనిషి - శ్రీమంతుడు అని నుదుటిపై ముద్దుపెట్టాను . 
ఏడుస్తున్న స్కూల్ పిల్లలకు ఏమిచెప్పాలో - ఎలా ఓదార్చాలో తెలియక బాధపడుతున్న సర్పంచ్ దగ్గరకువెళ్లి , సర్పంచ్ గారూ ...... సమాధానం నాదగ్గర ఉంది నాతోపాటు వస్తారా ? .
సర్పంచ్ : పిల్లలకోసం ఎక్కడికైనా వస్తాను పదండి .
కృష్ణా ..... పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చి నాన్నగారి దగ్గరకువెల్లు - పెళ్లికి సంబంధించినది ఏది గుర్తొచ్చినా కాల్ చెయ్యి - పిల్లల గురించి ఏమీ టెన్షన్ తీసుకోకు , తమ్ముళ్లూ ....... రండి వెళదాము అని సర్పంచ్ గారితోపాటు షేరింగ్ ఆటోలో సిటీకి బయలుదేరాము .

సర్పంచ్ గారూ ...... మీకు తెలిసిన మంచి కాంట్రాక్టర్ ను వైజాగ్ HDFC మెయిన్ బ్రాంచ్ దగ్గరకు రమ్మని పిలవగలరా ........ ? .
నా కళ్లల్లో - మాటల్లో ....... నమ్మకం చూసినట్లు ఎందుకు ? - ఏమిటీ ? అని అడగకుండా మొబైల్ తీసి కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు . బాబూ ...... సిటీలోనే ఉన్నారట , కొద్దిసేపట్లో వస్తానని చెప్పారు .
మంచిది సర్పంచ్ గారూ ...... , నాపై నమ్మకం ఉంచినందుకు కూడా ....... , బుజ్జితల్లీ ....... ఏంటి ఏమీ మాట్లాడటం లేదు .
బుజ్జితల్లి : అంకుల్ ...... స్కూల్లో ఆక్కయ్యలు - అన్నయ్యలు ఏడ్చారు కదా అని మళ్ళీ బుజ్జికన్నీళ్ళతో నా షర్ట్ ను గట్టిగా పట్టుకుంది .
నా బుజ్జితల్లి కన్నీళ్లకు చలించిపోయాను కాబట్టే మీ ఆక్కయ్యలు - అన్నయ్యల కన్నీళ్లను తుడవడానికే వెళుతున్నాము . నా ముద్దుల బుజ్జితల్లి కన్నీళ్లను చూస్తే నేను తట్టుకోగలనా చెప్పు అని తుడిచి ప్రాణంలా హత్తుకున్నాను .
Like Reply
డీజిల్ ఆటోలో నేరుగా HDFC మెయిన్ బ్రాంచ్ చేరుకున్నాము .
సర్పంచ్ : బాబూ ....... కాంట్రాక్టర్ మనకంటే ముందే వచ్చేసారు వారే అంటూ వెళ్లి చేతులుకలిపారు .
కాంట్రాక్టర్ : ఏంటి సర్పంచ్ గారూ ....... ఇంత అర్జెంట్ గా రమ్మని పిలిచారు ? ఏంటి విషయం ? .
సర్పంచ్ : పిలవగానే వచ్చినందుకు థాంక్స్ కాంట్రాక్టర్ గారూ ...... 
కాంట్రాక్టర్ : ఎంతమాట సర్పంచ్ గారూ ...... మీపై - మీ స్నేహితుడు నాకు అపారమైన గౌరవం , మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తాను , చెప్పండి విషయం ఏమిటి ? .
సర్పంచ్ గారు నావైపుకు తిరిగి , కాంట్రాక్టర్ గారూ ...... కొద్దిసేపటి ముందు ఉన్నట్టుండి స్కూల్ పైకప్పు కుప్పకూలిపోయింది - గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని బాధపడుతూ చెప్పారు .
కాంట్రాక్టర్ : పిల్లలకు ఏమీజరగలేదు కదా ......
సర్పంచ్ : మా అదృష్టం బాగుండి ఏమీ జరగలేదు .
కాంట్రాక్టర్ : థాంక్ గాడ్ ....... , ఎన్నిసార్లు ఆ విషయమై అధికారులను కలిశారో నాకు తెలుసు , నన్ను ఇంత అర్జెంట్ గా పిలిపించారంటే స్కూల్ బిల్డింగ్ కోసం అమౌంట్ ..........
సర్పంచ్ : లేదు లేదు కాంట్రాక్టర్ గారూ ........
కాంట్రాక్టర్ : మరి నన్ను పిలిపించిన విషయం ........

కాంట్రాక్టర్ గారూ ....... ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న గోడలను పూర్తిగా నేలమట్టం చేసి , అదే స్థలంలో స్కూల్ పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాయిలో కొత్త బిల్డింగ్స్ నిర్మించడానికి ఎంత అవుతుంది సర్ ? .
కాంట్రాక్టర్ : ఇతను ....... ఎవరైతే ఏంటీలే , నువ్వు చెప్పినట్లుగా చేయాలంటే కోటిన్నర రెండు కోట్ల దాకా ......... కానీ అంత డబ్బు ఇక్కడనుండి అని అతను కూడా ఫీల్ అవుతున్నారు .
Please నాతోపాటు లోపలికిరండి అని అందరినీ పిలుచుకువెళ్ళాను . అమౌంట్ డ్రా బ్రోచర్ అందుకుని బుజ్జితల్లిని టేబుల్ పై కూర్చిబెట్టి బుజ్జితల్లి బుజ్జిచేతులతో " 100000000 " ........ రాయించాను - ప్రతీ జీరోకు ఒక ముద్దుపెట్టాను. 
వినయ్ - గోవర్ధన్ : 1 2 3 .... 8 జీరోస్ ఎంతరా ఎంతరా ....... 10 కోట్లు ? అంటూ షాక్ లో ఉండిపోయారు .
సర్పంచ్ గారు - కాంట్రాక్టర్ కూడా ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు .

ఒక్కనిమిషం సర్పంచ్ గారూ అంటూ బ్రోచర్ ను కౌంటర్ లో ఉన్న క్లర్క్ కు ఇచ్చాను.
క్లర్క్ కూడా 1 2 3 4 ....... 8 జీరోస్ ..... this much అంటూ నావైపు గుటకలు మింగుతూ చూసాడు . కామెడీ ఏమైనా చేస్తున్నాడేమో అనుకుని నా అకౌంట్ చెక్ చేసి sorry సర్ sorry సర్ అంటూ సడెన్ గా పైకిలేచి ఆఫీస్ రూమ్ కు రండి అని ఆహ్వానించాడు .
సర్పంచ్ గారూ - కాంట్రాక్టర్ గారూ - తమ్ముళ్లూ ...... రండి అని బ్యాంక్ మేనేజర్ రూమ్ కు చేరుకున్నాము .
క్లర్క్ : సర్స్ ...... pleaae please కూర్చోండి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను - మేనేజర్ గారూ అంటూ బ్రోచర్ అందించారు .
మేనేజర్ : అకౌంట్ చెక్ చేశావా ...... ? ఇంత అమౌంట్ ఉందా ...... ? .
క్లర్క్ : హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ సర్ ....... - బెంగళూరు బ్రాంచ్ .
అంతే మేనేజర్ గారు క్లర్క్ కంటే వేగంగా లేచి welcome సర్ అంటూ చేతులుకలిపాడు - క్లర్క్ ....... వెంటనే ఆర్రేంజ్ చెయ్యండి .
క్లర్క్ : వితిన్ మినిట్స్ సర్ అంటూ వెళ్ళిపోయి ముందు డ్రింక్స్ పంపించారు . అందుకుని తమ్ముళ్లకు ఇవ్వబోతే ఇద్దరూ ...... హండ్రెడ్స్ హండ్రెడ్స్ క్రోర్స్ అంటూ పెదాలను కదిలిస్తూ ఎప్పుడో షాక్ లోకి వెళ్లిపోయినట్లు కదలడం లేదు - నవ్వుకుని తమ్ముళ్లూ ...... అంటూ కదిల్చి అందరికీ ఇచ్చాను .
మేనేజర్ : సర్ ...... మీరు మా బ్రాంచ్ లో అడుగుపెట్టడం మా అదృష్టం - ఇకనుండీ నేరుగా నా రూమ్ కే వచ్చెయ్యండి .
Sure మేనేజర్ గారూ ........

డ్రింక్స్ ఫినిష్ చేసేంతలో కోటికొక బ్యాగ్ చెప్పున 10 బ్యాగులను లోపలికి తీసుకొచ్చి ఓపెన్ చేశారు .
తమ్ముళ్లు నోరుతెరిచి అలా చూస్తుండిపోయారు .
నవ్వుకున్నాను . సర్పంచ్ - కాంట్రాక్టర్ గారికి ఏమిజరుగుతోందో అర్థం కావడం లేదు.
అంకుల్ ...... అంటూ అంతే షాక్ లో చూస్తున్న బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించాను - నువ్వు నీ బుజ్జిచేతితో రాసినదే కదా బుజ్జి ఏంజెల్ ఎందుకంత ఆశ్చర్యం .
మేనేజర్ : సర్ ....... 5 కౌంటింగ్ మెషిన్స్ కౌంట్ చేసుకోండి .
మేనేజర్ గారూ ....... అవసరం లేదు నమ్మకం ఉంది - మేనేజర్ గారూ ...... కొద్దిసేపు మీ బ్యాంక్ ప్రైవేసి రూమ్ .......
మేనేజర్ : అయ్యో ఎంతమాట సర్ ...... , నా రూమ్ నే use చేసుకోండి అని బయటకువెళ్లారు .
థాంక్స్ మేనేజర్ గారూ ........

సర్పంచ్ గారూ ...... ఈ డబ్బు మీకోసమే ఇక మీ ఆధీనంలోనే ఉంటుంది - ఇదేకాదు ఎంత అవసరమైతే అంత అలా చిటికె వెయ్యండి మీ ముందు ఉంటుంది . 
కాంట్రాక్టర్ గారూ ....... ఈ డబ్బుతో స్కూల్ బిల్డింగ్ పనులు మొదలెట్టొచ్చు కదా .....
కాంట్రాక్టర్ : ఎంతమాట బాబూ ...... సర్ సర్ , ఇంత అమౌంట్ అవసరం లేదు .
కాంట్రాక్టర్ గారూ ........ ఉదయం నుండీ నా ప్రాణం కంటే ఎక్కువైన ఈ బుజ్జి ఏంజెల్ ను ...... గుంతలుపడిన రోడ్డు మూడుసార్లు పడేసింది . ఎంత ధైర్యం ఆ రోడ్డుకు ....... అందుకే నా బుజ్జితల్లి రేపు ఉదయం రోడ్డుపై అడుగుపెట్టేలోపు ఫ్లాట్ రోడ్డుగా మారిపోవాలి . రాత్రికి రాత్రి హైవే నుండి ఊరి వరకూ ....... వేసేయ్యాలి .
బుజ్జితల్లి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది .
మరి నా బుజ్జితల్లినే పడేస్తుందా ఉదయానికల్లా ...... మొత్తం మార్చేద్దాము బుజ్జితల్లీ ...... అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
కాంట్రాక్టర్ : రాత్రికిరాత్రి ? .
అవును కాంట్రాక్టర్ గారూ ....... మీరుమాత్రమే చేయగలరని సర్పంచ్ గారు నమ్మకంతో చెప్పారు . ఎంతమంది వర్కర్స్ నైనా పిలిపించండి సూర్యోదయం లోపు రోడ్డు ఫినిష్ అయిపోవాలి - ఈ డబ్బు సరిపోదంటే చెప్పండి డబల్ అమౌంట్ డ్రా చేద్దాము కానీ రాత్రికిరాత్రి please pleaae ........
కాంట్రాక్టర్ : షాక్ నుండి తేరుకుని అక్కడికక్కడే మొబైల్ తీసి రేయ్ వెంటనే అవును వెంటనే అర్జెంట్ గా వేలల్లో ఎంతమంది దొరికితే అంతమంది మేస్త్రీలు - కూలీలు కావాలి ...... ఆ అవును గంటలోపే , వందల లారీల సిమెంట్ - వందల లారీల కంకర్ - వందల లారీల ఇసుకు - వందల్లో వాటర్ టాంక్స్ - కౌంట్ లెస్ స్టీల్ - రోలర్ మెషీన్స్ ఎన్ని ఉంటే అన్నీ వీలైతే మరికొన్ని ....... మొత్తం మొత్తం తీసుకుని గంటల్లో ****** విలేజ్ రోడ్డువెంబడి స్టాక్ చేసి వర్క్ స్టార్ట్ చేసేయ్యాలి - అవును నైట్ మొత్తం డబల్ కూలీ అనిచెప్పండి - బాబూ ....... on the way .
థాంక్యూ sooooo మచ్ కాంట్రాక్టర్ గారూ ....... , అలాగే స్కూల్ బిల్డింగ్స్ కూడా నెల - రెండు నెలల్లో పూర్తయిపోవాలి .
కాంట్రాక్టర్ : నెలలోనా ....... ? .
కోవిడ్ అని తెలియగానే 14 రోజులలో బిగ్గెస్ట్ హాస్పిటల్ నిర్మించారు ఆ చైనా నాకొడుకులు - వారికంటే మనం ఎందులో తక్కువ కాంట్రాక్టర్ గారూ ...... - పాపం స్కూల్ పిల్లలు ఎండలో కూర్చున్నారు సర్ - చూడగానే నా హృదయం ...... కాదు కాదు నా బుజ్జి ఏంజెల్ బుజ్జి హృదయం చలించిపోయింది . వారికోసమైనా పూర్తిచేయ్యలేరా ........
కాంట్రాక్టర్ : తప్పకుండా తప్పకుండా బాబూ ....... , పిల్లల కోసం ఈ యజ్ఞాన్ని పూర్తిచేసేలా నావంతు కృషిచేస్తాను .
కాంట్రాక్టర్ గారూ ....... మీ అడ్వాన్స్ గా ఒక బ్యాగు తీసుకోండి .
కాంట్రాక్టర్ : నాకుకూడా నీపై నమ్మకం ఉంది బాబూ ...... , ప్రస్తుతానికి కూలీలకోసం - కావాల్సినవాటికి మాత్రమే సర్పంచ్ గారి దగ్గరనుండి తీసుకుంటాను . నేను ఆ ఏర్పాట్లన్నీ చూసుకుని అటునుండి అటు వచ్చేస్తాను - బాబూ ....... ఎవరివో తెలియదు , ఎక్కడ నుండి వచ్చావో తెలియదు పిల్లలకోసం మీ చేస్తున్నారు చాలా చాలా సంతోషం నా మనసుపెట్టి పూర్తిచేయిస్తాను అని వెళ్లిపోయారు .

సర్పంచ్ గారూ ....... స్కూల్ - రోడ్డు మాత్రమే కాదు మీ ఊరికోసం మీరేమి చెయ్యాలనుకుంటున్నారో అన్నీ చేయించండి , ఎంత డబ్భైనా సరే - డబ్బుని తీసుకుని ఇంటికివెళ్లండి - పెళ్ళిపనులు పూర్తిచేయాలి కదా ఆర్రేంజ్ చేసి వస్తాము , వినయ్ ..... సర్పంచ్ గారితోపాటు వెళ్లు .
సర్పంచ్ : బాబూ ...... అంటూ చేతులు జోడించడమే కాకుండా పాదాలను కూడా స్పృశించబోయారు .......
సర్పంచ్ గారూ ....... ఇంకెప్పుడూ ఇలా చెయ్యకండి మీరు పెద్దవారు అని ఆపాను ,  మీరు - పెద్దయ్య చేసినదానితో పోలిస్తే నేనెంత .......
సర్పంచ్ : ఇప్పుడే వెళ్లి ఊరందరికీ ఈ విషయాన్ని చెబుతాను - ఒక మంచి మనిషి మన కష్టాలు తీర్చడానికి వచ్చారు అని చెబుతాను , బాబూ ...... మీ పేరు ? .
సర్పంచ్ గారూ ....... ఇదంతా మీరు - పెద్దయ్య చేసినట్లుగానే ఉండాలి , ఊరుకోసం సర్వస్వం త్యాగం చేశారు - ఏదో నాతో డబ్బు ఉందికాబట్టి చేసాను , మీరు లేకపోయినా చేస్తూనే ఉన్నారు , నా బుజ్జితల్లి పెదాలపై చిరునవ్వులు చూడటం కోసం చేస్తున్నాను అంతే , ఊరంతా మిమ్మల్ని - పెద్దయ్యనే దేవుళ్ళలా కొలవాలి .........
సర్పంచ్ : బాబూ ....... ఇది మహాపాపం .
ప్రామిస్ చేస్తున్నారు అంతే .........
బుజ్జితల్లి : అంకుల్ ....... లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు ...... soooooo మచ్ అంటూ ముద్దులవర్షం కురిపించి ప్రాణంలా హత్తుకుంది .
బాబూ - అన్నయ్యా అన్నయ్యా ........ ఉదయం అన్నట్లుగా మీరు మా ఊరికోసం వచ్చిన దేవుడు అంటూ ఆనందబాస్పాలతో దండం పెట్టారు .
బుజ్జితల్లీ ....... మళ్లీ మొదలెట్టేశారు అయ్యో ...... వదిలిపెట్టరా ? .
బుజ్జితల్లి ముద్దుముద్దుగా నవ్వుకుని , అవును మా అంకుల్ దేవుడు కాబట్టి ఆపనే ఆపరు అంటూ బుజ్జిచేతులతో దండం పెట్టింది.
నవ్వుకుని , లవ్ యు లవ్ యు అంటూ కలిపిన చేతులపై ముద్దులవర్షం కురిపించాను .
సర్పంచ్ గారూ ....... ఉదయం లోపు నా బుజ్జితల్లి అడుగు బయటపెట్టెలోపు రోడ్డు పూర్తవ్వాలి కమాన్ కమాన్ దండాలు పెట్టినంతవరకూ చాలు చాలు please please .......
ముగ్గురూ నవ్వుకున్నారు - కీర్తీ తల్లీ ....... నా ఆయుష్షు కూడా పోసుకుని సంతోషంగా ఉండాలి అని బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టారు . బ్యాంక్ స్టాఫ్ సహాయంతో బ్యాగులను బయటకు తీసుకువచ్చాము . 
మేనేజర్ : సర్ ...... బ్యాంక్ సేఫ్టీ వెహికల్లో తీసుకుపోండి . డ్రైవర్ ...... ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లు .
థాంక్యూ మేనేజర్ గారూ ....... , ఇకనుండీ చెక్స్ వస్తూనే ఉంటాయి - ఎవ్వరు వచ్చినా ........
మేనేజర్ : క్షణాల్లో పంపిస్తాము సర్ .......
థాంక్యూ అంటూ చేతులు కలిపాను .
సర్పంచ్ : బాబూ ...... నీకోసం ఎదురుచూస్తూ ఉంటాము - ఇంతకూ పేరు .......
సర్పంచ్ గారూ ప్రామిస్ చేశారు గుర్తుపెట్టుకోండి ........ , నా పేరు ........
బుజ్జితల్లి : మహేష్ ....... అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
లవ్ యు ....... మై లవ్లీ ఏంజెల్ ....... 
సర్పంచ్ : మహేష్ - ఇకనుండీ మీ పేరు మా ఊరి జనం గుండెల్లో ఉంటుంది బాబూ ........ అని నమస్కరించి బ్యాంకు వెహికల్లో వెళ్లారు .

బ్యాంకు మేనేజర్ కు మళ్లీ కలుద్దాము అనిచెప్పి తమ్ముడు గోవర్ధన్ తోపాటు మెయిన్ గేట్ బయటకువచ్చాను . 4 గంటలు అవుతున్నా ఎండ ఎక్కువగానే ఉండటంతో బుజ్జితల్లి ఇబ్బందిపడుతోంది . బుజ్జితల్లీ ...... ఐస్ క్రీమ్ ? .
ఉమ్మా ....... 
ఎదురుగా ఉన్న షాప్ లో బుజ్జితల్లికి కోన్ ఐస్ క్రీమ్ కొనిచ్చి , చాక్లెట్ లు - కూల్ డ్రింక్ తీసుకున్నాను . 
వాకబుల్ డిస్టన్స్ లో కార్స్ షోరూం కనిపించడంతో నడుచుకుంటూ వెళ్ళాము . లోపలికివెళ్లి బుజ్జితల్లీ ....... నీకిష్టమైన కార్ సెలెక్ట్ చెయ్యి ఇక AC లో హాయిగా వెళదాము అని చుట్టూ ఒక రౌండ్ వేసాను .
అంకుల్ అంటూ పెదాలపై చిరునవ్వులతో రెడ్ రేంజ్ రోవర్ చూయించింది . 
నా బుజ్జితల్లికి రెడ్ అంటే ఇష్టమన్నమాట ......
బుజ్జితల్లి : మమ్మీకి ఇష్టం అంకుల్ - మమ్మీకి ఏది ఇష్టమో నాకూ అదే ఇష్టం .
లవ్లీ అంటూ పెదాలపై తియ్యదనంతో , ఇకపై నాకు కూడా ........
బుజ్జితల్లి : అంకుల్ ..... ? , విన్నట్లు చూస్తోంది .
చిలిపిదనంతో నవ్వుకుని Wow wow సూపర్ కార్ బుజ్జితల్లీ ...... , నాకు కూడా బాగా నచ్చింది ఇదే తీసుకుంటున్నాము అని ముద్దుపెట్టి సేల్స్ బాయ్ ను పిలిచాను . స్పాట్ లో మనీ ట్రాన్స్ఫర్ చేసి బుజ్జితల్లిని ఎత్తుకునే కూర్చుని స్టార్ట్ చేసి AC వేసాను . 
బుజ్జితల్లి : చల్లగా ఉంది అంకుల్ అంటూ చుట్టేసి ముద్దులుపెడుతోంది .
హ్యాపీ బుజ్జితల్లీ ....... , తమ్ముడూ ...... ఎక్కి కూర్చో అంటూ సైడ్ డోర్ అన్లాక్ చేసాను . కూర్చోగానే బయలుదేరాను .

తమ్ముడూ ....... వైజాగ్ లోనే the best అండ్ ఫేమస్ మ్యారేజ్ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ తెలిస్తే తీసుకెళ్లు .
తమ్ముడు : అన్నయ్యా ...... చిన్న ఊరిలో ఉన్న నాకెలా తెలుస్తుంది కానీ వైజాగ్ లోనే బిగ్గెస్ట్ ఫంక్షన్ హాల్ లో జరిగేవన్నీ VIP మ్యారేజస్ అన్నయ్యా - వాళ్లకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది .
ఫంక్షన్ హాల్ ఎక్కడ ? .
తమ్ముడు : దగ్గరలోనే అన్నయ్యా ....... అంటూ తీసుకెళ్లాడు . అన్నయ్యా ...... మీరు కారులోనే కూర్చోండి వెళ్లి కనుక్కునివస్తాను అని 5 నిమిషాలలో వచ్చాడు . అన్నయ్యా ...... అడ్రస్ - ఇక్కడికి దగ్గరలోనే అని కూర్చున్నాడు . 
15 నిమిషాలలో చేరుకున్నాము . బుజ్జితల్లిని ఎత్తుకుని లోపలికివెళ్లి మేనేజర్ ను కలిసి ఎల్లుండి మ్యారేజ్ - అన్నీ ఏర్పాట్లూ మీరే చూసుకోవాలి ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని రీతిలో జరిపించాలి అని కృష్ణ ఇచ్చిన అమౌంట్ ను అడ్వాన్స్ గా ఇచ్చాను - ప్లేస్ చెప్పాను .
మేనేజర్ : సర్ ...... రెండు రోజులు అంటే .......
నాతో ఉన్న డబ్బునంతా ఇచ్చి ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే , ఇప్పటివరకూ మీరు మాక్సిమం ఎంత కాస్ట్ లో అయితే ఒక మ్యారేజ్ జరిపించి ఉంటారో అంతకు డబల్ అమౌంట్ ఇస్తాను , సమయం తక్కువ అని ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు . 
మేనేజర్ : ముఖం వెలిగిపోయింది . ఈరోజు - రేపంతా సమయం ఉంది కద సర్ మీరు కోరుకున్నట్లుగానే అయిపోతుంది అని ఏమేమి చేస్తామోనని వివరించారు . 
మొత్తం మొత్తం డెకరేషన్ - సెట్టింగ్స్ కావాలి ఎంత ఖర్చైనా పర్లేదు . 
మేనేజర్ : డన్ సర్ ..... అంటూ రిజిస్టర్ చేసుకుని , లాప్టాప్ లో పెళ్లి మండపం స్టేజి డెకరేషన్స్ చూయించారు స్క్రోల్ చేస్తూ ........
నాకు కాదు నా బుజ్జితల్లికి నచ్చాలి , బుజ్జితల్లీ ....... ఫస్ట్ మొత్తం చూడు తరువాత నీ బుజ్జి మనసుకు నచ్చినది సెలెక్ట్ చెయ్యి . మేనేజర్ గారూ ...... టాప్ నాచ్ డెకరేషన్స్ చూయించండి . 
బుజ్జితల్లీ ...... టేబుల్ పై కూర్చుని నెమ్మదిగా చూడు .
బుజ్జితల్లి : ఊహూ ...... అంటూ మరింత గట్టిగా హత్తుకుంది .
ఆ ఫీలింగ్ ....... , లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ...... లవ్ యు అంటూ ముద్దుపెట్టి గుండెలపై హత్తుకునే చూసేలా చేసాను . అర గంటపాటు మొత్తం చూసి సెకండ్ రౌండ్ లో అద్భుతమైన డెకరేషన్ చూయించింది . పెళ్లి మండపపు స్టేజీకి మూడు వైపులా ఇంద్రలోకం అన్నంతలా ఉంది . 
బ్యూటిఫుల్ - wow అంటూ తమ్ముడితోపాటు ఒకేసారి అని నవ్వుకున్నాము .
మేనేజర్ : సర్ ...... వన్ డే లో అన్నీ పనులతోపాటు ఈ డెకరేషన్ అంటే - మామూలుగా అయితేనే 4 -5 డేస్ పడుతుంది .
నా బుజ్జితల్లి సెలెక్ట్ చేసింది ఫిక్స్ అంతే ...... , డబల్ త్రిబుల్ ...... ఎంతమంది కళాకారులనైనా రప్పించండి వారి ఖర్చు మొత్తం మేమే భరిస్తాము ఎంతకావాలో స్వైప్ చేసుకోండి అని కార్డ్ ఇచ్చాను .
మేనేజర్ : అయితే ok సర్ ....... మర్నాడు సూర్యోదయం లోపు డెకరేట్ చేసేస్తాము . వెంటనే మేము ప్లేస్ చూడాలి .
చాలా విశాలమైన స్థలం - తమ్ముడు గోవర్ధన్ పిలుచుకునివెళతాడు . ఇక ఫుడ్ దగ్గరికి వద్దాము - మన రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్నీ ఫేమస్ వంటలు ఉండాలి . చెప్పానుకదా ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేదిలేదు .
మేనేజర్ : మీరు ఎలా అంటే అలా సర్ ....... మిమ్మల్ని wow అనిపించే బాధ్యత మాది . 
Thats గుడ్ మేనేజర్ ........ , తమ్ముడూ ....... డ్రైవింగ్ వచ్చుకదా అని కీస్ ఇవ్వబోతే సిగ్గుపడ్డాడు .
మేనేజర్ : పర్లేదు సర్ మా వెహికల్లో వెళతాము అని నలుగురైదుగురు వెళ్లారు .
Like Reply
బుజ్జితల్లి : పెళ్లి అంటే చాలా పనులుంటాయని మమ్మీ చెప్పింది - మనవల్లనే ఆలస్యం అయ్యాయని మమ్మీ బాధపడుతోంది - అన్నీ పనులను మీరొక్కరే ఎలా పూర్తిచేస్తారని కూడా అనుకున్నాను - ఒక్కదగ్గరే అన్నీ సెట్ చేసేసారు లవ్ యు soooooo మచ్ అంకుల్ ...... ఇక ఇంటికే కదా .......
నా బుజ్జితల్లికి ....... మమ్మీని చూడాలనిపిస్తోందన్నమాట , ఇంకా కొన్ని ముఖ్యమైన పనులున్నాయి - నిన్ను ...... మమ్మీ దగ్గరికి వదిలేసి వచ్చి పూర్తిచేస్తాను , ఇంటికి వెళదాము .
బుజ్జితల్లి : నో నో నో ....... మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెల్లనంటే వెళ్లను , మమ్మీ దగ్గరికి కూడా వెళ్లను - నేను చెప్పానా ...... మమ్మీ గుర్తొచ్చిందని అంటూ తియ్యనికోపంతో వదలనంతలా గట్టిగా పట్టేసుకుంది .
నవ్వుకుని , చాలాసేపయ్యింది కదా బుజ్జితల్లీ ...... మమ్మీని - అమ్మమ్మను చూడాలనిపించడం లేదా ? , వాళ్ళు కూడా ఇంత కంగారుపడుతున్నారో ........
బుజ్జితల్లి : మా అంకుల్ దగ్గర ఉన్నంతసేపు నాకెవ్వరూ గుర్తుకురారు , చివరికి మమ్మీ కూడా ........ , ఇక వాళ్ళ కంగారు అంటారా ....... మీరు ఎలా చూసుకుంటారో మమ్మీకి తెలియదా ? , అందుకే కనీసం నేనెలా ఉన్నానని కాల్ కూడా చేయలేదు - అంత నమ్మకం మీరంటే , ఇక అమ్మమ్మా - తాతయ్యకైతే మీరు దేవుడితో సమానం , నేను ...... మా అంకుల్ తోనే ఉంటాను - ఎత్తుకుని ఉండటం కష్టమైతే చెప్పండి మీ చేతిని పట్టుకుని నడుచుకుంటూ వస్తాను అంటూ ముద్దుముద్దుగా ఒక ఉపన్యాసమే ఇవ్వడం చూసి .......
షాక్ చెందినట్లు అలా చూస్తుండిపోయాను , నా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జితల్లిని జీవితాంతం ఎత్తుకోమన్నా సంతోషంగా ఎత్తుకునే ఉంటాను అని ముద్దులుపెట్టాను.
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ - నాకు తెలుసుకదా ....... , మీకు ...... మమ్మీని చూడాలనిపిస్తే మావయ్య మొబైల్ కు వీడియో కాల్ చేసి చూసుకోండి .
( చూడాలనిపించడం ఏమిటి ? , మీ మమ్మీని నా దేవతను జీవితాంతం చూస్తూనే ఉండిపోవాలని ఆశ ) .
బుజ్జితల్లికి ...... నా మనసులో అనుకున్న మాటలు కూడా వినిపించినట్లు , అయితే కాల్ చేసి చూసుకోండి అని బుజ్జిబుజ్జిగా నవ్వుతోంది .
ఏంటీ ఏంటీ ...... లేదు లేదు అంటూ తడబడుతూ ఎత్తుకుని బయటకువచ్చాను . ప్రక్కనే పిజ్జా షాప్ ఉండటం చూసి లోపలికివెళ్లి టేబుల్ పై బుజ్జితల్లిని కూర్చోబెట్టి కూర్చుని మెనూ కార్డ్ అందించాను . 
బుజ్జితల్లి : ఏ ఏ పిజ్జా ...... తినేంతవరకూ మాత్రమే ఇక్కడ కూర్చుంటాను అంకుల్ అంతే .......
ఉమ్మా ఉమ్మా ...... అంటూ బుజ్జిచేతిపై ముద్దులుపెట్టాను - నా బుజ్జితల్లి ఇష్టమే నా ఇష్టం - నచ్చిన పిజ్జా - బర్గర్ - సాండ్ విచ్ - మిల్క్ షేక్ ........ ఆర్డర్ చెయ్యి బుజ్జితల్లీ ...... 
బుజ్జితల్లి : యాహూ ...... అంటూ మెనూ కార్డ్ లోని పిక్స్ చూసి ఆర్డర్ చేసింది . 
అంతవరకూ ఈ చాకో బార్ తిను కీర్తీ ...... 
బుజ్జితల్లి : ఓపెన్ చేసి మీరు కొరికి ఇస్తేనే తింటాను .
ఉమ్మా ఉమ్మా ....... 

15 నిమిషాలకు ఆర్డర్ చేసినవన్నీ వచ్చాయి . సగం టేబుల్ నిండిపోయాయి .
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులతో చూసి , అంకుల్ అంకుల్ ...... మావయ్యకు వీడియో కాల్ చేసి ఇవ్వండి .
ఉదయం హాస్పిటల్లో పెద్దయ్య చెప్పిన నెంబర్ కు వీడియో కాల్ చేసి ఇచ్చాను .
కృష్ణ : బుజ్జితల్లీ .......
బుజ్జితల్లి : మావయ్యా ...... ముందు మమ్మీ - అమ్మమ్మకు ఇవ్వు .
కృష్ణ : సరే .......
దేవత : బుజ్జితల్లీ ...... ఇప్పటికి మమ్మీ గుర్తుకువచ్చిందా ..... ? , ఉమ్మా ఉమ్మా .......
బుజ్జితల్లి : నిజం చెబుతున్నాను మమ్మీ ....... , ఇప్పటికి కూడా గుర్తుకురాలేదు .
దేవత : తియ్యనైన కోపం - నాకు తెలుసులే ....... , మీ అంకుల్ ఉంటే మేమెవ్వరమూ గుర్తుకురాము అని ఇప్పుడే మీ అమ్మమ్మతో మాట్లాడుతున్నాను - ఇంటికివచ్చి మమ్మీ మమ్మీ ...... అంటూ కౌగిలింత మరియు రాత్రిపూట హత్తుకుని పడుకుంటావు కదా అప్పుడు చెబుతాను .
బుజ్జితల్లి : అవసరం లేదులే మమ్మీ ...... , నేను ...... అంకుల్ తోనే ఉంటాను - పడుకుంటాను .
దేవత : విన్నావా అమ్మా , నేనవసరం లేదంట మీ బుజ్జితల్లికి ( పెద్దమ్మ నవ్వులు వినిపించాయి ) , అవసరం లేనప్పుడు ఎందుకు వీడియో కాల్ చేసావే బుజ్జి రాక్షసి .........
బుజ్జితల్లి : ముద్దుముద్దుగా నవ్వుకుని , మమ్మీ - అమ్మమ్మా ....... ఎందుకు చేశానో చూడండి ఇది పిజ్జా - ఇది చీజ్ బర్గర్ - ఇది సాండ్ విచ్ - ఇవి రోల్స్ - నూడిల్స్ - మిల్క్ షేక్స్ - ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్ ....... నోరూరిపోతోందా మమ్మీ ..... ? . అంకుల్ చూడండి అంటూ మొబైల్ నావైపుకు తిప్పింది .
దేవతకు నోరూరిపోతున్నట్లు లొట్టలేస్తూ పెదాలను తడుముకోవడం చూసి బుజ్జితల్లితోపాటు నవ్వుకున్నాను .
బుజ్జితల్లి : మమ్మీ ...... బై బై వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి అంటూ మొబైల్ నాకు ఇచ్చింది .
దేవత ఆనందబాస్పాలతో థాంక్స్ చెప్పింది - దేవతనే చూస్తూ ఉండిపోయాను , దేవతకూడా ........
బుజ్జితల్లి : తింటూనే మమ్మీని ఎంతసేపైనా చూడవచ్చు అంకుల్ ...... యమ్మీ యమ్మీ .......
What what ...... అంటూ మొబైల్ ను జేబులో పెట్టుకుని , పిజ్జా స్లైస్ అందుకున్నాను . హృదయం పై ముద్దుపెట్టిన ఫీలింగ్ కలగడంతో మొబైల్ తీసిచూసాను అంతే వెంటనే దేవత కట్ చేసేసింది - చివరగా సిగ్గుపడినట్లు కనిపించింది . కానీ కొన్ని క్షణాల ముందు కలిగిన ఫీలింగ్ కు వొళ్ళంతా జివ్వుమంది - ఆ ఫీలింగ్ కు కారణం నేననుకున్నదేనా ....... నోవే అని చిరు నిరాశతో మొబైల్ ను టేబుల్ పై ఉంచి ఇద్దరమూ చిరునవ్వులు చిందిస్తూ పోటీపడుతూ కుమ్మేసాము - మిల్క్ షేక్స్ , కూల్ డ్రింక్ , వాటర్ తాగి చివరగా బేవ్ - బేవ్ అని గ్యాస్ వదిలి నవ్వుకున్నాము . బుజ్జిచేతులను కడుక్కుని మరుక్షణంలో నా గుండెలపైకి చేరింది బుజ్జితల్లి . 
బుజ్జిపొట్ట నిండిపోయినట్లుందే అంటూ ముద్దుపెట్టి , బిల్ పే చేసి , మొబైల్ అందుకుని బయటకువచ్చాను.

బుజ్జితల్లి : అంకుల్ ....... నెక్స్ట్ ఎక్కడికి వెళుతున్నాము .
పెళ్లిలో మా బుజ్జితల్లి అందరికంటే బ్యూటిఫుల్ గా కనిపించాలికదా షాపింగ్ ....... , అవును బుజ్జితల్లీ ...... మమ్మీని చూశాక కూడా మమ్మీ దగ్గరికి వెళ్లాలనిపించడం లేదా ? - ఇంటికి తీసుకెళ్లనా ...... ? .
బుజ్జితల్లి : నో ....... , పెళ్ళిపనులు పూర్తయ్యేదాకా మా అంకుల్ కు తోడుగా ఉంటాను - వదిలి వెళ్లను అని మమ్మీ - అమ్మమ్మ - తాతయ్యకు ఇంటిదగ్గరే చెప్పేసాను అంతే .......
నా గుండెలపైననే ఉన్నావుకదా ఎప్పుడు చెప్పావు బుజ్జితల్లీ ...... అని నవ్వుతున్నాను .
బుజ్జితల్లి : కళ్ళతోనే సైగలు చేసాను , మీరు గమనించలేదు అని బుజ్జికోపంతో చూస్తోంది .
Sorry లవ్ యు లవ్ యు ...... అంటూ బుజ్జికోపం తగ్గేవరకూ ముద్దులుపెడుతూనే కారులో షాపింగ్ మాల్ చేరుకున్నాము . 

కారు పార్క్ చేసి , బుజ్జితల్లిని ఎత్తుకుని నేరుగా kids wear కు చేరుకున్నాము . సిస్టర్ ...... పట్టు డ్రెస్ - బార్బీ డ్రెస్ - గౌన్ ....... ఇలా ఎన్నిరకాలుంటే అన్నీ చూయించండి , లేటెస్ట్ డిజైన్స్ అయి ఉండాలి ....... బుజ్జితల్లీ ...... సెలెక్ట్ చెయ్యి అంటూ టేబుల్ పై కూర్చోబెట్టాను .
బుజ్జితల్లి : ఊహూ ...... మా అంకుల్ సెలెక్ట్ చెయ్యాలి అని చేతులుకట్టుకుని బుద్ధిగా కూర్చుంది .
ఉమ్మా లవ్ యు అంటూ కురులపై ముద్దుపెట్టి , మోడల్ - డిజైన్ కు ఒకటి చెప్పున పాతిక డ్రెస్ లకు పైనే తీసుకున్నాను . ఇంకా సెలెక్ట్ చేయబోతే అంకుల్ అంకుల్ ....... please please చాలు చాలు - చాలు అన్నా మీరు వినరని నాకు తెలుసు కానీ వాటిని రోజుకొకటి వేసుకునేలోపు హైట్ పెరిగిపోతాను సరిపోవు .
నవ్వుకుని , నా బుజ్జితల్లి tooo ఇంటెలిజెంట్ అని ముద్దుపెట్టాను . 
సిస్టర్ ....... సెలెక్ట్ చేసినవన్నింటినీ కౌంటర్ కు పంపించండి అనిచెప్పి Mens wear దగ్గరికి వెళ్ళాము .

బుజ్జితల్లీ ....... ఉదయం మీ మావయ్య ఇష్టంతో తెచ్చుకున్న కొత్త డ్రెస్ లు నేను వేసుకున్నాను కదా కాబట్టి 20 అయినా సెలెక్ట్ చెయ్యాలి , నా బుజ్జితల్లే సెలెక్ట్ చెయ్యాలి . 
లవ్ టు అంకుల్ ....... , ప్రతీ డ్రెస్ రెండు రెండు సెలెక్ట్ చేసి వేరువేరుగా ఉంచమని ఆర్డర్ వేస్తోంది బుజ్జితల్లి - అలా ఎందుకు అని అడిగాను .
బుజ్జితల్లి : మరి మా అంకుల్ కు , ఇవి మావయ్యకు - ఇవి మా అంకుల్ కు .......
లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ మురిసిపోతున్నాను . మరి తాతయ్యకు ? .
బుజ్జితల్లి : అయ్యో ...... మరిచేపోయాను అంటూ వైట్ షర్ట్స్ - వైట్ పంచెలు తీసుకుంది .


వాటన్నింటినీ కౌంటర్ కు పంపించి పట్టుచీరల సెక్షన్ కు చేరుకున్నాము .
బుజ్జితల్లి : ఇక్కడకు ఎందుకు అంకుల్ ........
మనం ( నువ్వు , నేను , మీ మావయ్య , మీ తాతయ్య ) తీసుకుని , మమ్మీకు ...... అదే అదే మీ మమ్మీకు - అమ్మమ్మకు తీసుకోకపోతే బాగోదు .
బుజ్జితల్లి : Ok ok అంటూ ముసిముసి బుజ్జినవ్వులు నవ్వుకుంది - అంకుల్ ...... చీరలు అంటే ఆలస్యం అవుతుంది కాబట్టి నేను ...... అమ్మమ్మకు సెలెక్ట్ చేస్తాను - మీరు ....... మమ్మీకి సెలెక్ట్ చెయ్యండి .
లోలోపలే పులకించిపోతున్నాను - దేవతకు ....... నేను అంటూ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయి గుండెపై చేతినివేసుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ...... హార్ట్ ఉండేది ఎడమవైపు - ఆత్రంలో కుడివైపు పెట్టుకున్నారు . ఇలా అయితే మరింత ఆలస్యం అవుతుంది .
నవ్వుకుని , సిస్టర్స్ ...... ఒక దేవతకు - దేవత అమ్మకు ఇక్కడున్నవాటిలో అద్భుతమైన - costliest పట్టుచీరలను చూయించండి .
బుజ్జితల్లి : అంకుల్ ....... ఆ దేవత మమ్మీనేకదా .......
నోరు జారేశానా ....... ? , ఇప్పుడెలా ....... దేవతకు తెలిసిపోతే అంటూ కంగారుపడుతున్నాను - AC లోకూడా చెమటలు పట్టేస్తున్నాయి .
బుజ్జితల్లి : నవ్వుతూనే బుజ్జిచేతులతో చెమటను తుడిచి , మా అంకుల్ గుండెల్లో మమ్మీ దేవత అన్నమాట ఉమ్మా ....... ముద్దుపెట్టి నా మీద నుండే టేబుల్ మీదకు చేరి , దేవత కోసం చీరలను మా దేవు ....... మా అంకుల్ కు చూయించండి - దేవత అమ్మకోసం ..... నాకు చూయించండి . అంకుల్ ...... ఏంటి కదలకుండా ఉండిపోయారు త్వరగా సెలెక్ట్ చెయ్యండి ఇంకా చాలా పనులున్నాయి కదా ....... అంటూ నవ్వుతూనే ఉంది .
బుజ్జితల్లి నవ్వులు చూసికానీ కంగారు తగ్గలేదు . బుజ్జితల్లివైపు ఓర కంటితో చూస్తూనే దేవతకోసం షాప్ లోనే అత్యంత ఖరీదైన మనసుకు నచ్చిన పట్టుచీరలను ప్రేమతో సెలెక్ట్ చేసాను . ప్రతీ చీరనూ స్పృశించిన ప్రతీసారీ ...... ఆ చీరలలో దేవత ఎలా ఉంటారోనని ఊహించుకునే వాడిని .......
బుజ్జితల్లి నావైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుని , అంకుల్ ....... మీలానే 20 చీరలే కదా ..... ? .
అంతేకదా ........ , మాబుజ్జితల్లి ఆర్డర్ చేస్తే అంతకంటే ఎక్కువ సెలెక్ట్ చేస్తాను .
బుజ్జితల్లి : నో నో నో ....... , నా అంకుల్ ...... నాకోసం సెలెక్ట్ చేసినవే ఎక్కువ ఉండాలి - నావే ఎక్కువ ఉండాలి .
అవునవును నా బుజ్జితల్లివే ఎక్కువ ఉండాలి అని తియ్యదనంతో ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
సిస్టర్స్ ....... మొత్తం కౌంటర్ కు పంపించండి .
సిస్టర్ : సర్ ...... ఇంత costly చీరలు తీసుకుంటున్నారు పెళ్ళికోసమే కదా .......
అవును సిస్టర్స్ తమ్ముడి పెళ్లి ...... , బుజ్జితల్లీ ...... పెళ్లికి సిస్టర్స్ ను ఆహ్వానిద్దామా ..... ? . మంచి పట్టుచీరలను చూయించారు . 
బుజ్జితల్లి : అక్కయ్యలూ ....... మా మావయ్య పెళ్లికి తప్పకుండా రావాలి . 
నేను అడ్రస్ చెప్పాను .
సిస్టర్స్ : థాంక్యూ సర్ - పాపా ........ , సర్ పెళ్ళికోసం అంటున్నారు కాబట్టి , పెళ్లికి వచ్చిన ముత్తైదువులకు - అమ్మాయిలకు ఇవ్వడానికి తక్కువ కాస్ట్ లో మంచి చీరలు కొత్తగా వచ్చాయి చూయించమంటారా ? .
Sorry సిస్టర్స్ పెళ్లి గురించి నాకు తెలియదు - పెళ్లికి వచ్చిన వారికి ఇవ్వడం .......
సిస్టర్స్ : సంప్రదాయం సర్ .......
అయితే తక్కువ కాస్ట్ కాదు పట్టుచీరలే ఇవ్వండి . ఊరిలో 200 ఇల్లు ఉంటాయి - ఇంటిలో ఇద్దరు చొప్పున 400 చీరలు మరియు పెళ్లికూతురి తరుపున 400 చీరలు ....... మొత్తం 800 ....... ఇక 200 కలిపి 1000 చీరలు గిఫ్ట్స్ లా ప్యాక్ చేసేసి రెడీ అయిన తరువాత ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి వచ్చేస్తాము .
సిస్టర్స్ : 1000 పట్టుచీరలా ...... ? , మా షాప్ లో కూడా అన్ని లేవు సర్ - గోడౌన్ నుండి తెప్పించాలి .
తెప్పించండి , అంతలోపు మరొక షాపింగ్ పూర్తిచేసుకునివస్తాము . బుజ్జితల్లీ ........ లెట్స్ గో అంటూ కౌంటర్ లో 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి దగ్గరలోని జ్యూవెలరీ షాప్ కు వెళ్ళాము .
Like Reply
బుజ్జితల్లి : అంకుల్ ....... ఇప్పటికే చాలా .......
బుజ్జితల్లీ ....... మావయ్య ఇచ్చిన డబ్బుతోనేకదా ......
బుజ్జితల్లి : మావయ్య ఇచ్చిన డబ్బు ఈవెంట్ ఆర్గనైజర్ కు ఇచ్చేసారు కదా - మావయ్య ఇచ్చిన డబ్బుతో అంట , నేనేమైనా బుజ్జిపాపాయి అనుకున్నారా ...... ?.
అమ్మో ...... మా బుజ్జితల్లి toooo ఇంటెలిజెంట్ , ఆ సంగతే మరిచిపోయాను - నా బుజ్జితల్లికోసం తీసుకుంటున్నాను , అయినా అడగటానికి నువ్వెవరు అని ముద్దుపెట్టి , సిస్టర్ ...... నా బుజ్జితల్లికి టాప్ టు బాటమ్ జ్యూవెలరీ చూయించండి - బుజ్జితల్లీ ....... సెలెక్ట్ చెయ్యి  , బుజ్జితల్లి తియ్యనైన బుజ్జికోపం చూసి ok ok నేనే సెలెక్ట్ చెయ్యాలికదా అని బుజ్జి బుజ్జి కమ్మలు - బుజ్జి బుజ్జి చైన్స్ - బుజ్జి బుజ్జి గాజులు - బుజ్జి వడ్డాణం - బుజ్జి బుజ్జి పట్టీలు ....... రెండు రెండు మూడు మూడు తీసుకున్నాను . 

బుజ్జితల్లీ ....... ఇప్పుడు నీవంతు , మావయ్యకు ...... చైన్ - బ్రేస్ లెట్ సెలెక్ట్ చెయ్యి.
బుజ్జితల్లి : అక్కయ్యా ....... అందమైన చైన్ - బ్రేస్ లెట్స్ చూయించండి అని రెండు రెండు సెలెక్ట్ చేసింది . ఒకటి మావయ్యకు - ఒకటి అంకుల్ కు అంటూ ముద్దుపెట్టింది .
లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ ...... మరీ మరీ .......
బుజ్జితల్లి : అర్థమైంది అర్థమైంది ....... , మనం తీసుకున్నాము మీ దేవతకు కూడా అంటారు అంతేకదా ........
బుజ్జితల్లీ ....... అంటూ తలదించుకుని ఎంజాయ్ చేస్తున్నాను . 
బుజ్జితల్లి : అంకుల్ ....... మమ్మీకి అదే మీ దేవతకు , నాకంటే ఒకటి తక్కువగా ఉండాలి అని బుజ్జి వేలితో స్వీట్ వార్నింగ్ ఇచ్చింది .
అంతే అంతేకదా ...... , అందరికంటే నా బుజ్జితల్లికే ఎక్కువ అని ముద్దుపెట్టి మురిసిపోతున్నాను .
బుజ్జితల్లి : మురిసిపోయింది చాలులే అంకుల్ ...... మీ దేవతకు , మీరే సెలెక్ట్ చెయ్యండి . అమ్మమ్మ వయసైపోయింది కదా జ్యూవెలరీ వద్దులే ........
అమ్మో ...... ఇంకేమైనా ఉందా బుజ్జితల్లీ ....... , తల్లీకూతుళ్ళ మధ్యన పొట్లాట పెట్టేలా ఉన్నావు - వయసు పెరిగేకొద్దీ జ్యూవెలరీ పైన కూడా ఆశ ఎక్కువ అవుతుందని ఎక్కడో విన్నాను - మీ మమ్మీకి మాత్రమే తీసుకుంటే మీ అమ్మమ్మ ఈర్ష్య అసూయలతో ........
బుజ్జితల్లి : నో నో నో ...... నా వలన వద్దు బాబోయ్ వద్దు , మీరు ...... మీ దేవతకు - నేను ....... మీ దేవత మమ్మీకు అంటూ లేటెస్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ టాప్ టు బాటమ్ తీసుకుని బిల్ వేయించాము . పే చేయబోయే సమయంలో బుజ్జితల్లిలో చిరు నిరాశ కనిపించింది . బుజ్జితల్లీ ....... నాతో ఏదో చెప్పాలని లోలోపలే దాచేసుకుంటున్నావు కమాన్ చెప్పు ....... మా బంగారం కదా మా బుజ్జి కదా ...... నా బుజ్జితల్లి కోరిక కోరడమే నాకు ఇష్టం - ఆర్డర్ వెయ్యి బంగారూ .......
బుజ్జితల్లి : ఇప్పటికే చాలా ఖర్చు చేయించాను - ఇలా అడగడం అత్యాశే అవుతుంది . ఇంటికి రాబోవు అత్తయ్యకు .........
ఉమ్మా ఉమ్మా ...... గుర్తుచేసే మంచిపనిచేశావు బుజ్జితల్లీ - మా బుజ్జితల్లి టూ టూ ఇంటెలిజెంట్ , ఇంటికి వెళ్ళాక తెలిసి ఉంటే ఫీల్ అయ్యేవాళ్ళము లవ్ యు లవ్ యు లవ్ యు ....... ఇంకెందుకు ఆలస్యం నీకు ఇష్టమైనవి తీసుకో అని అన్నీ తీయించాను . 
నలుగురికీ మరియు మాకు ...... వేరువేరుగా ప్యాక్ చేయించి బుజ్జితల్లితో వాటిపై వారి వారి పేర్లు రాయించాను . పే చేసేసి ఇద్దరమూ రెండు రెండు చేతులతో పట్టుకుని కారులో వెనుక ఉంచి కూర్చున్నామో లేదో షాపింగ్ మాల్ సిస్టర్నుంది కాల్ వచ్చింది అన్నీ రెడీ అంటూ .......
పెదాలపై చిరునవ్వుతో బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి షాపింగ్ మాల్ చేరుకున్నాము - బుజ్జితల్లీ ...... మీ అత్తయ్యకు పట్టుచీరలు ? .
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ అని ముద్దుపెట్టి మరొక 20 costliest చీరలను సెలెక్ట్ చేయించి . బిల్ చూసి మిగతా అమౌంట్ స్వైప్ చేసాము . 
ఫ్రీ డెలివరీ అనిచెప్పడంతో బుజ్జితల్లి డ్రెస్సెస్ తప్ప అన్నింటినీ షాపింగ్ మాల్ వెహికల్లో సెట్ చేయించి ఫాలో అవ్వమన్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ...... నావి మాత్రమే ......
నాకు స్పెషల్ కాబట్టి , మన కారులో తీసుకెళదాము .
అంతే అంతులేని ఆనందంతో ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉంది - ప్రతీ ముద్దుకూ ....... నా పెదాలపై ఆనందం పెరుగుతూనే ఉంది . బుజ్జితల్లీ ....... ఈ షాపింగ్ తో పెళ్ళిపనులన్నీ దాదాపుగా పూర్తయినట్లే - ఇంకా ఏమైనా ఉంటే రేపు వద్దాము , ఇక ఇంటికి మమ్మీ దగ్గరికి వెళదామా ...... ? .
బుజ్జితల్లి : మీ దేవత దగ్గరికి అనిచెప్పండి అని ముసిముసినవ్వులు నవ్వుతోంది .
బుజ్జితల్లీ ...... అంటూ సడెన్ బ్రేక్ వేసాను . బుజ్జితల్లీ ........
బుజ్జితల్లి : కంగారుపడకండి అంకుల్ ...... మమ్మీ ఉన్నప్పుడు అలా మాట్లాడనులే 
........
లవ్ యూ బంగారూ ...... అంటూ ముద్దులుపెట్టి , మమ్మీ ...... అంటే గుర్తుకువచ్చింది - పిజ్జా , బర్గర్ వైపు ఆశతో చూసారు - తీసుకెళదామా ...... ? .
బుజ్జితల్లి : ఇందుకే కదా మా అంకుల్ అంటే చాలా చాలా ఇష్టం అంటూ గట్టిగా హత్తుకుంది .
సేమ్ షాప్ ముందు ఆపి కిందకుదిగి , వెనకున్న వెహికల్ వైపు 10 మినిట్స్ అని సైగచేసి , బుజ్జితల్లితో కలిసి తిన్నవే పార్సిల్ ఆర్డర్ చేసాను . 15 నిమిషాలలో రావడంతో పే చేసి కారులోకి చేరాము - వేడి తగ్గేలోపు ఇంటికి చేరాలి అని వేగంగా పోనిచ్చాను .

హైవే నుండి మట్టిరోడ్డులోకి టర్న్ అవ్వగానే పదుల సంఖ్యలో లారీలు ...... మట్టిరోడ్డు వెంబడి ఇరువైపులా మెటీరియల్స్ అన్లోడ్ చేస్తుండటం చూసి , బుజ్జితల్లీ ........ రోడ్డు పనులు మొదలైపోయాయి అంటూ సంతోషించాము .
గుంపుగా ఉన్న జనాల మధ్యలోంచి అన్నయ్యా - అన్నయ్యా ....... అంటూ పిలుపులు వినిపించడంతో కారు ఆపాను .
తమ్ముళ్లు వినయ్ - గోవర్ధన్ వచ్చి అన్నయ్యా  ....... పనులు మొదలైపోయాయి . కాంట్రాక్టర్ గారు - సర్పంచ్ గారు మీకోసమే ఎదురుచూస్తున్నారు , మీతో పూజ జరిపించి మొదలుపెట్టాలని ఆశపడుతున్నారు అని వినయ్ , అన్నయ్యా ....... పెళ్లి జరిగబోవు ప్లేస్ చూయించాను నైట్ కావాల్సినవన్నింటినీ సిద్ధం చేసుకుని రేపు ఉదయమే వచ్చి పనులు మొదలుపెడతామని చెప్పి వెళ్లారు అని గోవర్ధన్ ఉత్సాహంతో చెప్పారు .
తమ్ముళ్లూ ...... కారులో - వెనకున్న వెహికల్లో షాపింగ్ ఉన్నాయి . అన్నింటినీ ఇంటిలోకి చేర్చి వద్దాము కారులో కూర్చోండి . 
వెనుక బుజ్జితల్లి షాపింగ్ తో నిండిపోవడంతో ఇద్దరూ ముందుసీట్లోనే ఒకరిపై మరొకరు కూర్చోవడం చూసి బుజ్జితల్లి నవ్వుకుంది .

వినయ్ : అన్నయ్యా ....... ఇక్కడి నుండి ఊరివరకూ సరిగ్గా 10km - కిలోమీటర్ కు నాలుగు మెషిన్స్ చెప్పున అక్కడక్కడా ఒకేసారి ఒకే సమయంలో రోడ్డు వేసేలా పర్ఫెక్ట్ గా సెట్ చేశారు కాంట్రాక్టర్ గారు - మీరు ఆశించినట్లుగానే సూర్యోదయానికి ముందే రోడ్డు రెడీ అయిపోయేలా ఉంది అని సంతోషంగా చెప్పాడు . 
చూస్తే దారి వెంబడి మెటీరియల్స్ మరియు కాంక్రీట్ మిక్సింగ్ మెషిన్స్ కనిపిస్తున్నాయి . 
వినయ్ :విషయం తెలిసి ఊరిజనమంతా సర్పంచ్ గారిని - పెద్దయ్యను కలిసి సంతోషాలను పంచుకున్నారు - మన ఊరి దేవుళ్ళు అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు . 
గుడ్ గుడ్ తమ్ముళ్లూ ....... , నిజమే కదా .......
వినయ్ : నిజమే అన్నయ్యా ....... కానీ మీరని కేవలం సర్పంచ్ గారికి మాత్రమే తెలుసు - మీరు చెప్పకండి అని ప్రామిస్ వేయించుకోవడం వలన పెద్దయ్యకు ...... ఎవరో అజ్ఞాతవ్యక్తి అని మాత్రమే తెలుసు .
కానీ లేదు ఏమీ లేదు తమ్ముళ్లూ ....... , వారిద్దరూ అర్హులు ...... , ఈ విషయం ఇక్కడితో మరిచిపోండి . ఊరికి జరిగే మంచిని ఎంజాయ్ చెయ్యండి .
తమ్ముళ్లు : మీరు నిజంగా దేవుడే అన్నయ్యా ....... , మొత్తం చేసి ప్రతిఫలం ఆశించడం లేదు .
ప్రతిఫలానిది ఏముంది తమ్ముళ్లూ ....... , జరగబోవు పనులవలన ఊరికి మంచిజరిగి అందరూ సంతోషం అయితే అంతకంటే సంతృప్తి మరొకటి ఏముంటుంది చెప్పు అని మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాము .
డోర్ తెరిచి బుజ్జితల్లీ ....... ఎంత కంగారుపడుతున్నారో ఏమో మమ్మీ - అమ్మమ్మ దగ్గరికి వెళ్లు ........
బుజ్జితల్లి : ఊహూ ....... 
మురిసిపోతూనే కిందకుదిగాను . బుజ్జితల్లీ ...... కనీసం పిజ్జా - బర్గర్ ..... అయినా తీసుకెళ్లి మమ్మీకు ఇవ్వు చల్లారిపోతే టేస్ట్ తగ్గిపోతుంది . 
బుజ్జితల్లి : ఇచ్చేసి వచ్చేస్తాను . 
కొద్దిసేపు బుజ్జితల్లీ ....... చీరలన్నింటినీ లోపలికి చేర్చాక నీ ఇష్టం .
బుజ్జితల్లి : సరే అంటూ కిందకుదిగి , ఫుడ్ కవర్ అందుకుని మమ్మీ - అమ్మమ్మా ...... అంటూ పరుగున వెళ్ళింది .
బుజ్జితల్లీ ...... జాగ్రత్త అంటూ లోపలికి వెళ్లేంతవరకూ చూసాను .

కృష్ణ బయటకువచ్చి అన్నయ్యా ...... మిమ్మల్ని చాలా చాలా ఇబ్బందిపెట్టాము .
కృష్ణా ....... నేనైతే ఎంజాయ్ చేసాను . కావాలంటే బుజ్జితల్లిని - తమ్ముళ్లను అడుగు . 
కృష్ణ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా అంటూ కౌగిలించుకున్నాడు. అన్నయ్యా ....... మీరు వచ్చిన వేళా విశేషం ఊరికి రోడ్డు వస్తోంది - కొత్త స్కూల్ బిల్డింగ్ - హాస్పిటల్ - పండిన పంటను స్టోర్ చెయ్యడం కోసం గోడౌన్స్ ....... ఇంకా చాలా చాలా నిర్మిస్తున్నారని ఒక దేవుడిలాంటి వ్యక్తి డబ్బు సహాయం చేశారని సర్పంచ్ అంకుల్ నాన్నకు చెప్పారు . ఊరిజనమంతా ........ నాన్నగారు - సర్పంచ్ అంకుల్ వల్లనే అని కలిసివెళ్లారు , నాన్నగారు - సర్పంచ్ అంకుల్ అయితే చాలా చాలా హ్యాపీ .........
గుడ్ న్యూస్ చెప్పావు కృష్ణా ....... , మన బుజ్జితల్లిని పడేసిన రోడ్డుకు తగిన శాస్తి జరగబోతోంది అన్నమాట . 

సర్ ....... లోడ్ ఎక్కడకు చేర్చాలి అని షాపింగ్ మాల్ వర్కర్స్ అడిగారు .
కృష్ణా ...... పెళ్లికి వచ్చిన లేడీస్ కు గిఫ్ట్స్ , ప్లేస్ చూయిస్తే దించేసి వెళ్ళిపోతారు , ఒక పెద్ద గది అయితే బెటర్ ........
కృష్ణ : పెద్ద లగేజీ వెహికల్ నిండా గిఫ్ట్స్ ఉండటం చూసి ఆశ్చర్యపోయి , అన్నయ్యా .........
ముందు గదిని చూయించు పాపం వాళ్లకు ఆలస్యం అవుతుంది .
కృష్ణ : కన్ఫ్యూజ్ అవుతూనే కింద రైట్ సైడ్ రూమ్ ఖాళీనే అన్నయ్యా ....... 
బ్రదర్స్ ...... లోపలికి తీసుకురండి - గిఫ్ట్స్ మాత్రమే రూమ్ లో ఉంచండి మిగిలినవాటిని హాల్లో సపరేట్ సపరేట్ గా ఎలా ఉన్నాయో అలానే ఉంచండి .
అలాగే సర్ అంటూ నిమిషాల్లో లోపలికి చేర్చారు . 
వారికి పర్సులో చివరగా మిగిలిన క్యాష్ ఇచ్చాను .
థాంక్యూ సర్ ...... అంటూ సంతోషంగా వెళ్లిపోయారు .

కృష్ణా ...... కారులో బుజ్జితల్లి షాపింగ్ - జ్యూవెలరీ ఉన్నాయి లోపలికి తీసుకెళదాము అని బాక్స్ లు బాక్స్ లు అందించాను .
మరింత కన్ఫ్యూజ్ తో ఆడిగేంతలో బుజ్జితల్లి డ్రెస్సెస్ మొత్తం భుజం పై ఎత్తుకుని లోపలికివెళ్ళాను .
అప్పటికే బుజ్జితల్లి ..... దేవత - పెద్దమ్మ - పెద్దయ్యకు పిజ్జా స్లైసెస్ అందించి తనూ తింటూ ...... మమ్మీ ఇవి నీ కోసం కొన్న చీరలు - అమ్మమ్మా ..... ఇవి మీకోసం - తాతయ్యా ....... ఇవి మీకోసం , మావయ్యా ....... వచ్చారా ఇవి మా మావయ్య కోసం - ఇవి వచ్చేసి కొత్తగా రాబోవు అత్తయ్యకోసం . అలాగే మీరు తెచ్చిన జ్యూవెలరీ కూడా ఇలానే అందరికీ ఉన్నాయి .
బుజ్జితల్లి డ్రెస్సెస్ కిందకుదించి , లవ్ యు బుజ్జితల్లీ ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .

కృష్ణ : అన్నయ్యా ....... ఇవన్నీ ? .
ఇవన్నీ ....... నువ్విచ్చిన డబ్బుతోనే కొన్నాను కృష్ణా ...... కావాలంటే బుజ్జితల్లిని అడుగు .
అందరూ బుజ్జితల్లివైపు చూసారు .
బుజ్జితల్లి తలను నిలువునా - అడ్డుగా ఊపడం చూసి నవ్వుకున్నాను . 
కృష్ణా ....... వీటన్నింటినీ కొనగా మిగిలిన డబ్బు అంటూ పర్స్ తీసిచూస్తే ఖాళీ ..... ఉండాలికదా ఎక్కడకు పోయింది అని జేబులలో వెతుకుతున్నాను .
బుజ్జితల్లి నవ్వుకుని , అంకుల్ ....... ఆ డబ్బుతోనే కదా పిజ్జా కొన్నది .
అవునవును మరిచేపోయాను - పిజ్జా పిజ్జా ...... బుజ్జితల్లికి అన్నీ గుర్తుంటాయి - పిజ్జా కొనగా మిగిలిన చివరి డబ్బును ఇందాక డెలివరీ వాళ్లకు ఇచ్చేసాను . Sorry కృష్ణా ...... మొత్తం ఖర్చు పెట్టినందుకు .
కృష్ణ తల గోక్కోవడం చూసి బుజ్జితల్లి నవ్వులు ఆగడం లేదు . దేవతకు అర్థమైనట్లు నావైపు ఆరాధనతో చూస్తున్నారు .

అందరి డౌట్స్ తీరినట్లే కదా ........ , పెద్దయ్యా ...... మీకోసం మీతో పనులకు శంకుస్థాపన చేయించాలని అక్కడ అందరూ ఎదురుచూస్తున్నట్లు తమ్ముళ్లు చెప్పారు - మీకోసం కారు తీసుకొచ్చాను - మీరు నడవగలను మీకు ఇష్టమైతే తీసుకెళతాము .
పెద్దయ్య : నీకు ఇబ్బంది లేకపోతే వెళదాము బాబూ .......
పెద్దయ్యా ....... ఊరందరికీ దేవుడు మీరు - మీకు సహాయం చేయడంలో satisfaction ఉంది , కృష్ణా ....... ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు రా నాన్నగారిని పట్టుకో .......
కృష్ణ : లెక్కలువేస్తూనే వచ్చాడు .

దేవత : మహేష్ గారూ ...... భోజనం చేసి వెళ్ళండి - అక్కడ ఎంత సమయం అవుతుందో ........
బుజ్జితల్లి వలన కడుపునిండా తినేసాను - ఖాళీ లేదు మేడం - ఆకలివేస్తే నేరుగా వంట గదిలోకి వెళ్లి వడ్డించుకుని తింటాను మీరేమీ కంగారుపడకండి . పెద్దయ్యను జాగ్రత్తగా పట్టుకుని కారులో వెనుక కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి నెమ్మదిగా డోర్ వేసాను . తమ్ముళ్లూ ...... ఒకరు వెనుక కూర్చోండి . వినయ్ ...... పెద్దయ్య ప్రక్కన - గోవర్ధన్ ...... ముందుసీట్లో కూర్చున్నాడు .
అటువైపుకువెళ్లి కూర్చునేంతలో ........ అంకుల్ అంటూ బుజ్జితల్లి బుజ్జికోపంతో పిలిచింది - చూస్తే బుజ్జి కళ్ళను పెద్దవిగా చేసి కోపంతో చూస్తోంది .
Sorry లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ...... అంటూ చేతులుకట్టుకుని వెళ్లి బుజ్జితల్లి ముందు మోకాళ్లపై కూర్చున్నాను . 
బుజ్జితల్లి వెనుక గుమ్మంలో ఉన్న దేవత నవ్వులు వినిపించాయి .
బుజ్జితల్లీ ....... మధ్యాహ్నం నుండీ మమ్మీకి - అమ్మమ్మకు దూరంగా ఉన్నావుకదా , మిమ్మల్ని మళ్లీ ....... దూరం చేస్తే , మేడం గారి కోపానికి నాకు భయం వేస్తుంది .
మళ్లీ దేవత నవ్వులు వినిపించాయి .
బుజ్జితల్లి : వెనక్కు తిరిగి , చెప్పు మమ్మీ - అమ్మమ్మా ........
దేవత : నీ సంతోషమే నా సంతోషం తల్లీ ...... అని ఫ్లైయింగ్ కిస్ .
పెద్దమ్మ : నాకు కూడా అంటూ ఫ్లైయింగ్ కిస్ .
బుజ్జితల్లి : విన్నారా ...... ఎత్తుకోండి అంటూ బుజ్జిచేతులను చాపింది .
బుజ్జితల్లీ ...... చలి ఎక్కువగా ఉంటుంది , స్వేటర్ అయినా వేసుకో .......
దేవత : మమ్మీ - అమ్మమ్మ ఇద్దరం ఉన్నాము ఏమిలాభం అని తిట్టుకుంటూ వెళ్లి స్వేటర్ తీసుకొచ్చి వేశారు . 
మేడం ...... శాలువా లాంటిది కూడా ఉంటే బెటర్ - చలి పెరుగుతుంది , పెద్దయ్యకు కూడా .......
దేవత : అయ్యో ....... నేనసలు అమ్మనేనా అంటూ మొట్టికాయలు వేసుకుంటూ వెళ్లి , పెద్దమ్మ తీసుకొచ్చినవి అందించింది . 
బుజ్జితల్లి : మమ్మీ ....... మీరు చెప్పినట్లు , మీ కంటే జాగ్రత్తగా చూసుకుంటారు అంకుల్ , గుడ్ నైట్ మీరు పడుకోండి , నేను ...... అంకుల్ తోనే పడుకుంటాను అని నా గుండెలపైకి చేరింది .
మేడం ...... నా ప్రాణం కంటే .......
దేవత : నాకు తెలుసు , గుడ్ నైట్ ......
గుడ్ నైట్ మేడం అంటూ శాలువాలు అందుకుని బుజ్జితల్లిని ఎత్తుకుని కారులో కూర్చున్నాము . బుజ్జితల్లి సంతోషంతో టాటా చెయ్యడంతో పనులు మొదలుపెట్టే ప్లేస్ కు చేరుకున్నాము .

బుజ్జితల్లితోపాటు కిందకుదిగివెళ్లి పెద్దయ్య డోర్ తెరిచాను .
తమ్ముళ్లు : అన్నయ్యా ...... మీరు కీర్తిని ఎత్తుకున్నారుకదా - కిందకు దించితే కొట్టినా కొడుతుందేమో ...... - పెద్దయ్యను జాగ్రత్తగా మేము తీసుకొస్తాము అని నెమ్మదిగా దించారు .
బుజ్జితల్లి నవ్వుతూ ముద్దుపెట్టింది .
ఎప్పుడు కొడుతుందా అని ఆ క్షణం కోసం నిన్న మధ్యాహ్నం నుండీ ఎదురుచూస్తున్నాను తమ్ముళ్లూ - ఆ అదృష్టం ఎప్పుడో ఏమో ....... , తొందరగా కొట్టొచ్చుకదా బుజ్జితల్లీ .......
బుజ్జితల్లి : ఊహూ ఊహూ ...... అంటూ బుగ్గపై ముద్దులుపెడుతోంది .
పెద్దయ్య కిందకుదిగగానే శాలువా ఇవ్వడంతో తమ్ముడు ..... పెద్దయ్యకు కప్పాడు .

ఊరి సగంపైనే జనాల మధ్యన పెద్దయ్య - సర్పంచ్ గారు పూజ జరిపిస్తూ , బాబూ ...... నీచేతులమీదుగా అన్నట్లు నావైపు చూసారు సర్పంచ్ గారు .
ఇదే ఆనందం అంటూ గుండెలపై చేతినివేసుకుని బుజ్జితల్లికి ముద్దుపెట్టి కానివ్వండి అంటూ కళ్ళతో సైగచెయ్యడంతో పూజ జరిపించారు - ఆ వెంటనే పనులు మొదలవ్వడంతో ...... ఊరి జనమంతా సంతోషంతో ఆకాశం - ఊరి వరకూ వినిపించేలా కేకలువేశారు ..........
Like Reply
What a wonderful update bro ???
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
What a wonderful update bro ???
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Super Update
[+] 1 user Likes Hydguy's post
Like Reply
Lovely and beautiful update bro
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Lovely update... next kuda ekkade update evali Mahesh garu.. devatha ni Mahesh ela pelli cheskuntado telsukovalani anxious ga vundi


Blood donation gurinchi chadivinapudu tittukunna mimmalni... Kani Ventane kinda me explanation chusi ascharyam, navvu, na meda asahyam venta Ventana vachayi... me motive telsukoni mimmalni appreciate cheyakunda vundalekapotunna.. we know u r great writer... now u r a great person too...
[+] 3 users Like sandycruz's post
Like Reply
Lovely update bro. Appude ipoyinda anipinchindi.
[+] 2 users Like Hitman7396s's post
Like Reply
(06-11-2021, 05:30 PM)sandycruz Wrote: Lovely update... next kuda ekkade update evali Mahesh garu.. devatha ni Mahesh ela pelli cheskuntado telsukovalani anxious ga vundi


Blood donation gurinchi chadivinapudu tittukunna mimmalni... Kani Ventane kinda me explanation chusi ascharyam, navvu, na meda asahyam venta Ventana vachayi... me motive telsukoni mimmalni appreciate cheyakunda vundalekapotunna.. we know u r great writer... now u r a great person too...

SUPER UPDATE
[+] 3 users Like keerthi sanapala's post
Like Reply
chaalaa bagundi update
నా కథ లు  ప్రియగీతం
[+] 1 user Likes niranjan143's post
Like Reply
Super update Mahesh garu mind blowing story Mahesh garu
[+] 1 user Likes donakondamadhu's post
Like Reply
Nijame chepparu mahesh garu oka pranam manam icche blood tho save avutunte aa feeling veru
[+] 2 users Like M.S.Reddy's post
Like Reply
Superb update mahesh garu really awesome update.
[+] 1 user Likes M.S.Reddy's post
Like Reply




Users browsing this thread: 29 Guest(s)