04-09-2021, 11:30 PM
Sooper thread bro.. please continue..????
గ్రీకు పురాణ గాథలు
|
04-09-2021, 11:39 PM
గ్రీకు పురాణ గాథలు 8
ఈడిపస్ విషాద గాథ గ్రీకు పురాణ గాథలలో ఈడిపస్ (Oedipus) కథ పేరెన్నికగన్న కథ. సంస్కృతంలో కాళిదాసు శాకుంతలమ్ ఎంత పేరు పొందిందో గ్రీకు భాషలో సొఫొక్లీస్ (Sophocles) రచించిన ఈడిపస్ రెక్స్ (Oedipus Rex) అనే నాటకం అంత చెప్పుకోదగ్గది. చిఱుతప్రాయంలో పిల్లలు ఎదుర్కొనే ఒక విచిత్రమైన మనోస్థితిని వర్ణించడానికి ఆధునిక మానసిక శాస్త్రవేత్త సిగ్మున్డ్ ఫ్రాయ్‌డ్ ఈడిపస్ కాంప్లెక్స్ అనే పదబంధాన్ని ప్రవేశపెట్టి ఈడిపస్ కథకి ఒక రకం ప్రాచుర్యం తీసుకొచ్చేడు; అంతే కానీ ఈడిపస్ ఈ రకం మనోస్థితిని ఎదుర్కొనలేదు. ఈడిపస్ కథ ఈడిపస్ పుట్టక మునుపే మొదలయింది. థీబ్స్ (Thebes) రాజ్యానికి రాజైన లైయస్‌కు (Liaus) పుత్ర సంతతి లేకపోవడంతో డెల్ఫైలో (Delphi) ఉన్న ఒరాకిల్‌ని సంప్రదించడానికి భార్యాసమేతంగా వెళతాడు. ‘మీ ఇద్దరికి పుట్టబోయే సంతానమే నీ చావుకి కారకుడవుతాడు. కనుక ఆ కోరిక విరమించుకో’ అని ఒరాకిల్ లైయస్‌కు సలహా చెబుతాడు. ఒరాకిల్ సలహా తు.చ. తప్పకుండా పాటించడానికి లైయస్ నిశ్చయించుకొని భార్య పట్ల అతి జాగరూకతతో ఉంటాడు. కానీ వసంతఋతువు విజృంభించిన ఒక వెన్నెల రాత్రి, మధుపానపు మత్తులో నిగ్రహాన్ని కోల్పోతాడు. రాణి యొకాస్టా (Jocasta) గర్భవతి అవుతుంది. నెలలు నిండగానే పండంటి మగబిడ్డను కంటుంది. ఒరాకిల్ చెప్పిన జోస్యపు బారినుండి తప్పించుకోడానికి శిశువు చీలమండలు రెండింటికి సూదులు గుచ్చెయ్యమని భటులకి ఆదేశాలు ఇస్తాడు రాజు. అలా చేస్తే శిశువు పాకడం, నడవడం వంటి పనులు చెయ్యలేడు కనుక తన చావుకి కారకుడు కాలేడని రాజు ఊహ. రాజాజ్ఞ శిరసావహించేరు సేవకులు. ‘ఎందుకైనా మంచిది, శిశువుని హతమార్చడమే శ్రేయస్కరం!’ అని మంత్రులు సలహా ఇవ్వగా శిశువుని కొండలలోకి తీసికెళ్ళి చంపెయ్యమని తన భటుడికి ఆదేశాలిచ్చాడు రాజు. పసివాడి ప్రాణాలు తియ్యడానికి మనసు ఒప్పక ఆ భటుడు కోరింత్ రాజ్యపు గొర్రెల కాపరి చేతులలో ఆ బిడ్డను పెడతాడు. కోరింత్ (Corinth) రాజ్యపు రాజు పోలిబస్ (Polibus), రాణి మెరోపి (Merope)లకి పిల్లలు లేరు. అందుకని ఈ గొర్రెల కాపరి పసివాడిని రాజుకి కానుకగా ఇచ్చేడు. సూదిపోట్ల వల్ల పసివాడి చీలమండలు రెండూ వాచి ఉండడం చూసి పోలిబస్ పసివాడికి ఈడిపస్ అని పేరు పెట్టేడు. ఈడిపస్ అంటే ‘వాచిన పాదం’ అని అర్థం. వైద్య పరిభాషలో ఎడీమా (edima) అంటే వాపు అని అర్థం ఉంది కదా! ఈడిపస్ పెద్దవాడైన తరువాత ఒక తాగుబోతు మైకంలో ఉన్నప్పుడు, ‘రాజు పోలిబస్, రాణి మెరోపి నీ పుట్టుతల్లిదండ్రులు కారు తెలుసా?’ అని అంటాడు. ఈ వదరుబోతు మాటలలో నిజం ఎంతో, ప్రేలాపన ఎంతో తేల్చుకుందామని ఈడిపస్ డెల్ఫై వెళ్లి అక్కడ ఒరాకిల్‌ని సంప్రదించేడు. అడిగిన ప్రశ్న ఏమిటో కానీ ఒరాకిల్ ఇచ్చిన సమాధానం ఈడిపస్‌ని కలవరపరస్తుంది: ‘నువ్వు నీ తండ్రిని చంపేసి నీ తల్లిని వివాహం చేసుకుంటావు.’ ఈ జోస్యం విన్న ఉత్తరక్షణంలో ఈడిపస్ కోరింత్ రాజ్యపు పొలిమేరలు దాటి ఎంత దూరం వీలయితే అంత దూరదేశాలకి వెళ్ళిపోదానికి నిశ్చయించుకుని, ఉత్తర దిశగా ప్రయాణంచేసి, చిట్టచివరికి, విధి వెంట తరమగా, థీబ్స్ రాజ్యం పొలిమేరలకి చేరుకుంటాడు! థీబ్స్ రాజ్యపు పొలిమేరలలో, ఒక మూడు బాటల మొగలో, ఈడిపస్ దారికి ఒక రథం అడ్డుపడుతుంది. ఆ రథ సారథి ‘పక్కకి తప్పుకో, దారి విడు’ అని అరుస్తాడు.’నేను ముందొచ్చాను. నేనెందుకు తప్పుకోవాలి? నువ్వే తప్పుకో’ అని ఈడిపస్ అంటాడు. మాట మీద మాట పెరిగి, పోరాటంలోకి దిగగా రథసారథినీ, రథారూఢుడైన రాజునీ ఈడిపస్ చంపేస్తాడు. ఒక భటుడు మాత్రం తప్పించుకుని పారిపోతాడు. ఆ రథంలో ఉన్న వ్యక్తి థీబ్స్ రాజ్యపు రాజన్న విషయం కాని, ఆతను తన కన్నతండ్రే అన్న విషయం కాని, ఈడిపస్‌కి తెలియదు. ఈ విధంగా ఒరాకిల్ చెప్పిన జోస్యంలో మొదటి భాగం నిజం అయింది! థీబ్స్ రాజ్యపు పొలిమేరలు దాటుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించేసరికి ఈడిపస్‌కి స్ఫింక్స్ రూపంలో మరొక సమస్య ఎదురవుతుంది. ఈ స్ఫింక్స్ (Sphinx) అనే శాల్తీ ఒక రకం కంచర ‘నరసింహ’ రూపం! ఈ శాల్తీ తల మానవాకారంలోను, సింహపు శరీరంతోనూ ఉండడమే కాకుండా దీనికి డేగ రెక్కలు కూడా ఉంటాయి! ఏకచక్రపురాన్ని బకాసురుడు వేధించుకుతిన్నట్లు థీబ్స్ రాజ్యాన్ని కొంతకాలంబట్టి ఈ స్ఫింక్స్ వేధించుకుతింటోంది. ఈ స్ఫింక్స్ ఊరి పొలిమేరలో ఉన్న ఒక రాతితిన్నె మీద తిష్ఠవేసి ఊళ్లోకి వెళ్ళేవాళ్లందరినీ పొడుపుకథ లాంటి ఒక కఠిన ప్రశ్న అడుగుతుంది. ఆ ప్రహేళికకి సరి అయిన సమాధానం చెప్పలేనివారిని చంపుకుతింటుంది. ఊరి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించే ఈడిపస్‌ని స్ఫింక్స్ అడ్డుకుని అందరినీ అడిగే ప్రశ్ననే అడిగింది: ‘ఉదయం నాలుగు కాళ్ళతోటి, మధ్యాహ్నం రెండు కాళ్ళతోటి, సాయంత్రం మూడు కాళ్ళతోటీ నడచేది ఏది?’ అప్పటివరకు ఈ ప్రహేళికకి సరి అయిన సమాధానం చెప్పినవారు లేరు. ఈడిపస్ ఆలోచించి, తర్జనభర్జనపడి, చిట్టచివరికి, ‘మనిషి: బాల్యంలో నాలుగు కాళ్ళ మీద పాకుతాడు, నడివయస్సులో రెండు కాళ్ళ మీద నడుస్తాడు, ముసలితనంలో చేతికర్ర పట్టుకుని మూడు కాళ్ళతో నడుస్తాడు’ అని చెపుతాడు. ఇలా గర్వభంగం చెందిన స్ఫింక్స్ జరిగిన పరాభవాన్ని తట్టుకోలేక తను కూర్చున్న ఎత్తుగా ఉన్న రాయి మీంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. థీబ్స్ రాజ్యానికి పీడ విరగడ అవడంతో, ప్రజల సంతోషానికి అవధులు లేవు. వారు ఈడిపస్‌కి బ్రహ్మరథం పట్టేరు. వారి రాజు లైయస్ బందిపోట్ల బల్లేలకి ఆహుతి అయిపోయాడని నమ్మి, ఇప్పుడు ఆ రాజు లేని లోటు తీరిందని సంతోషంతో ప్రజలు ఈడిపస్‌కి పట్టం కట్టేరు. అప్పటి ఆచారం ప్రకారం భర్తని కోల్పోయిన లైయస్ భార్య యొకాస్టా ఈడిపస్‌కి పట్టమహిషి అయింది! తను చంపినది తన తండ్రినే అనిన్నీ, తను వివాహం చేసుకున్నది తన తల్లినే అనిన్నీ ఈడిపస్‌కి కానీ అనుచరులకి కానీ ఊహామాత్రంగానైనా తెలియలేదు. విధి వైపరీత్యం! ఈడిపస్-యొకాస్టాల దాంపత్యానికి ఫలితంగా నలుగురు పిల్లలని కంటారు: ఇటైయాక్లిస్, పొలినైసిస్, ఏంటిగోనీ, ఇస్మీనీ (Eteocles, Polynices, Antigone, Ismene). కొన్ని ఏళ్ళు గడచిన తరువాత థీబ్స్ నగరానికి మహామ్మారి ప్లేగు పట్టుకుంటుంది. ప్రజలని పీడిస్తున్న ఈ వ్యాధి పట్టునుండి విముక్తి కలిగించడానికి తరుణోపాయం ఏదైనా ఉందేమో కనుక్కుని రమ్మని బావమరిది క్రియోన్‌ని డెల్ఫైలో ఉన్న ఒరాకిల్ దగ్గరకి సంప్రదింపులకి పంపుతాడు, ఈడిపస్. ‘థీబ్స్ రాజైన లైయస్‌ని అన్యాయంగా చంపిన వ్యక్తి తాను చేసిన దుష్కృత్యానికి ప్రాయశ్చిత్తం పొందలేదు కనుక ప్రజలకి ఈ ఇక్కట్లు వస్తున్నాయి.’ అని ఒరాకిల్ చెబుతాడు. ఈ వార్త విన్న తరువాత లైయస్‌ని అన్యాయంగా చంపిన వ్యక్తిని దండించి తీరుతానని ప్రతిన పడతాడు, ఆ వ్యక్తి తానేనన్న ఊహ లేశమాత్రమైనా లేని ఈడిపస్! లైయస్‌ని చంపిన వ్యక్తి ఎవ్వరో తెలుసుకోవడం ఎలా? ఈడిపస్ తన ఆస్థాన జ్యోతిష్కుడు టైరీసియస్‌ని (Tiresias) సంప్రదిస్తాడు. పుట్టుగుడ్డి అయిన టైరీసియస్ నేరస్తుడు ఎవ్వరో ఈడిపస్ వైపు వేలు పెట్టి చూపిస్తాడు. ఇదేదో బావమరిది క్రియోన్, జ్యోతిష్కుడు టైరీసియస్‌తో కలసి తనని పదవీభ్రష్టుడిని చెయ్యడానికి చేసిన కుట్ర అని వారిరువురి మీద నింద మోపుతాడు ఈడిపస్. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు కథనం ఇలా మలుపు తిరిగేసరికి రాణి యొకాస్టాకి అసలు ఏమి జరిగిందో తేల్చుకోవాలనే దుగ్ధ పెరిగి ఈడిపస్‌ని జరిగిన పాత సంఘటనలు అన్నిటిని కాలక్రమానుగతంగా చెప్పమని అడిగింది. ఈడిపస్ చెప్పిన ఉదంతంతో తనకి తెలిసినవాటితో పోల్చి చూసుకునేసరికి ఆమె అనుమానాలు పెనుభూతాలై కూర్చున్నాయి. నిజం తేలాలంటే థీబ్స్ రాజ్యపు సరిహద్దులలో, మూడు వీధుల మొగలో, ఈడిపస్ రథాన్ని ఎదుర్కొని యుద్ధంచేసిన వ్యక్తులు ఎవ్వరో నిర్ధారించాలి. ఆ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసి, యుద్ధరంగం నుండి ప్రాణాలతో పారిపోయిన వ్యక్తి ఒక భటుడు. ఆ భటుడి కోసం వేట మొదలయింది. ఈ వేట ముగిసేలోగా కోరింత్ రాజు, పోలిబస్ చనిపోయాడని ఒక వార్తావహుడు ఈడిపస్ కొలువులోకి వార్త తీసుకువచ్చాడు. తన తండ్రి చనిపోయాడన్న విచారం ఒక పక్క, తన తండ్రి మరణానికి తను కారణం కాలేదన్న ఉపశమనం మరొక పక్క పోటీపడుతున్నాయ్ ఈడిపస్ మనోఫలకంలో. తండ్రి అంత్యక్రియలు చెయ్యడానికి వెళితే తన తల్లిని చూడవలసి వస్తుంది. అప్పుడు ఒరాకిల్ చెప్పిన జోస్యంలో రెండవ భాగం నిజం ఆయే ప్రమాదం ఉంది. ఇలా ఆలోచించి ఈడిపస్ తన తండ్రి పార్థివదేహాన్ని కడసారి చూడ్డానికి కూడా వెళ్ళనంటాడు.’మీకా భయం అక్కరలేదు. కోరింత్ రాజ్యపు రాజు పోలిబస్, రాణి మెరోపికి పిల్లలు లేరు. నేనే అడవిలో దొరికిన ఒక పసిబాలుడిని వారికి కానుకగా ఇచ్చేను’ అని చావు కబురు తీసుకువచ్చిన వార్తావహుడు అశనిపాతం లాంటి వార్త మరొకటి చెబుతాడు. రాణి యొకాస్టాకి కావలసిన ఋజువు దొరికింది. తన కొడుకునే భర్తగా స్వీకరించిన అఘాయిత్యానికి నిష్కృతి కనిపించలేదు. ఆమె వెంటనే రాజప్రాసాదపు అంతర్భాగంలోకి వెళ్లిపోతుంది. మూడు వీధుల మొగలో, ఈడిపస్‌తో జరిగిన యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసి, యుద్ధరంగం నుండి ప్రాణాలతో పారిపోయిన భటుడు చిట్టచివరికి దొరుకుతాడు. అతని సాక్ష్యంతో ఈడిపస్‌కి జరిగిపోయిన కార్యక్రమం అంతా అర్థం అవుతుంది. పరుగుపరుగున యొకాస్టా కోసం అంతఃపురంలోకి వెళతాడు. అక్కడ ఉరి పోసుకుని ప్రాణాలు విడిచిన రాణిని చూసి నిర్విణ్ణుడవుతాడు. నోట మాట రాదు. రాణి వస్త్రాలకి సూదితో గుచ్చి ఉన్న ఆభరణాన్ని తీసుకుని తన కళ్ళు రెండూ పొడిచేసుకుని గుడ్డివాడయిపోతాడు. థీబ్స్ సింహాసనాన్ని క్రియోన్ అధిష్టించి ఈడిపస్‌ని రాజ్యం నుండి బహిష్కరిస్తాడు.
04-09-2021, 11:41 PM
సిగ్మున్డ్ ఫ్రాయ్‌డ్ వ్యాఖ్యానం
తెలుగు సినిమా కథలా ఉన్న ఈ కథని ఆధారంగా చేసుకుని ప్రాచీనకాలంలోనే గ్రీకు భాషలో సొఫొక్లీస్, ఈడిపస్ రెక్స్ అనే నాటకం రచించేడు. జెర్మనీ, ఫ్రాన్స్ దేశాలలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నాటకాన్ని సా. శ. 1880లలో మానసిక శాస్త్రవేత్త సిగ్మున్డ్ ఫ్రాయ్‌డ్ (Sigmund Freud) చూసి ప్రభావితుడయ్యాడు. ‘మూడు నుండి ఏడు సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న పిల్లల మానసిక వికాసపు సమయంలో ఆడపిల్లలు తండ్రిని, మగపిల్లలు తల్లిని లైంగిక దృష్టితో చూసి వారిని తమ జీవిత భాగస్వాములుగా చేసుకోవాలని కోరుకుంటారు’ అనే విప్లవాత్మకమైన వాదాన్ని ప్రవేశపెట్టేడు. ‘అమ్మే అందరిలోకీ అందమైనది, మంచిది, ఉన్నతమైనది అనే భావం కొడుకుకి ఉండడం సహజం. కాని పిన్న వయస్సులో ఆ భావం ప్రేమగా మారినప్పుడు కొడుకుకి, తండ్రికీ మధ్య ఒక రకం వైరభావం ఏర్పడుతుంది’ అంటాడు ఫ్రాయ్‌డ్. అప్పుడు ఆ తండ్రి ‘ఈమె నాది. నువ్వు నీ ఈడుకి సరిపోయే జోడీని మరొకరిని చూసుకో’ అనే పరిష్కార మార్గం చూపిస్తాడు. ఈ రకం మానసిక సంక్షోభానికే ఫ్రాయ్‌డ్ ఈడిపస్ కాంప్లెక్స్ అని పేరు పెట్టేడు. ఈ రకం మానసిక సంక్షోభం మగ పిల్లలు తమ ఆడ టీచర్ల యెడల ప్రదర్శించడం మనం చూస్తూనే ఉంటాం. అమెరికాలో ఈ విషయాన్ని కథాంశంగా తీసుకుని ఏన్డీ గ్రిఫిత్ (Andy Griffith) తన పేరుమీదే ఉన్న టి.వి. కార్యక్రమంలో ఒక మనోహరమైన సన్నివేశం చూపిస్తాడు. ) ఇదే రకం మానసిక సంక్షోభం ఆడపిల్లలు తమ తండ్రి యెడల, మగ గురువుల యెడల కూడ చూపిస్తూ ఉంటారు అంటారు ఫ్రాయ్‌డ్. అప్పుడు దానిని ఎలక్ట్రా కాంప్లెక్స్ (Electra Complex) అంటారు.
04-09-2021, 11:46 PM
ప్రొమీథియస్: మానవుల శ్రేయోభిలాషి
ప్రొమీథియస్ (Prometheus) కథ ఈ ఆధునిక సాంకేతిక యుగానికి చాల పొంతన కల కథ. ఎందుకంటే మానవుల హితవు కోరి ప్రొమీథియస్ దేవలోకం నుండి అగ్నిని దొంగిలించి మానవులకి బహుమానంగా ఇచ్చేడు. నిప్పు లేకుండా ఉండి ఉంటే మనం ఇంకా అడవుల్లో చెట్ల మీద మన ముత్తాతలతో మనుగడ సాగిస్తూ ఉండేవాళ్ళం కదా! సాంకేతిక ప్రగతికి నిప్పుని మచ్చిక చేసుకోవడం మొదటి మెట్టు అని మన అందరికి తెలిసిన విషయమే! ప్రొమీథియస్ (ముందుచూపు అని అర్థం) టైటనుల ప్రవరలో పుట్టిన వ్యక్తి. టైటను అయినప్పటికీ టైటనులకి ఒలింపియనులకి మధ్య జరిగిన మొదటి మహా సంగ్రామంలో ప్రొమీథియస్ ఒలింపియనుల పక్షం కాసి దేవతల రాజైన జూస్ గెలుపుకి సహాయపడ్డాడు. ఈ యుద్ధంలోనే జూస్ తన తండ్రి క్రోనస్‌ని చంపి ఒలింపియనులకి అధిపతి అయేడు. అంతే కాదు. ఎథీనా జూస్ శిరస్సు చీల్చుకుని బయటకి వచ్చినప్పుడు ప్రొమీథియస్ దగ్గరే ఉండి ఆ కార్యక్రమం సజావుగా జరగడానికి తోడ్పడ్డాడు. కనుక ప్రొమీథియస్ అంటే జూస్‌కి అభిమానం ఉండాలి. మొదట్లో వీరిరువురి మధ్య సత్సంబంధాలే ఉండేవి. కానీ క్రమేపి మానవ సంతతి భూమి మీద పెరిగి వర్ధిల్లడం మొదలయే వేళకి ప్రొమీథియస్ మానవ పక్షపాతం చూపించి వారికీ సాంకేతిక విద్యలు నేర్పడం, వారికి అగ్నిని ఇవ్వడం వంటి ప్రాపక చర్యలు చేయడం జూస్‌కి నచ్చలేదు. స్వతహాగా జూస్‌కి మనుష్యులు బలవంతులు అవడం అంటే ఇష్టం ఉండేదికాదు. ఈ కారణాల వల్ల ప్రొమీథియస్‌కి తరచు జూస్‌తో భేదాభిప్రాయాలు వచ్చి ఘర్షణపడుతూ ఉండేవాడు. ఇలా అంతర్గతంగా రగులుతూన్న కోపం ఒక్కసారి పెల్లుబికి పైకి రావడానికి కారణం ప్రొమీథియస్ చేసిన ఒక కొంటెపని. దేవతలు చేసిన ఒక యజ్ఞంలో ఒక మహిషాన్ని బలి ఇస్తారు. ఆ యజ్ఞఫలంగా ఆ ఎనుబోతు దుమ్ములని ఒక పెద్ద పళ్ళెంలో అమర్చి, వాటి మీద ఒక పొర కొవ్వుని పరచి, వాటి మీద పువ్వుల వంటి అలంకారాలు జతపరచేడు, ప్రొమీథియస్. వేరొక చిన్న పళ్ళెంలో ఆ ఎనుబోతు మాంసాన్ని వెగటు పుట్టించే పేగులతో కప్పి, రెండు పళ్ళేలని జూస్ ముందు ఉంచి ప్రథమ ప్రసాద భక్షకుడిగా ఒక పళ్ళెం ఎంచుకోమంటాడు ప్రొమీథియస్. పైకి అందంగా కనిపిస్తూన్న పెద్ద పళ్ళేన్ని జూస్ ఎంచుకుంటాడు. ప్రొమీథియస్ రెండవ పళ్ళేన్ని పట్టుకెళ్లి ఆకలితో అలమటిస్తున్న మానవులకి ఇచ్చేస్తాడు. తనని మోసంచేసి తనకి బొమికలు ఉన్న పళ్లెం అంటగట్టడం మొదటి తప్పు. తనకి ఇష్టంలేని మానవులకి మంచి మాసం ఉన్న పళ్లెం ఇవ్వడం రెండవ తప్పు. ఇలా రెండు విధాలుగా జూస్ అహం దెబ్బతింది కాబట్టి జూస్ ప్రొమీథియస్ మీద కక్ష కట్టేడు. రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కొదువా? కాకేసస్ (Caucausus) పర్వతాలలో ఒక రాతికి ప్రొమీథియస్‌ని గొలుసులతో కట్టి అతనిని కాలం అంతరించే వరకు చిత్రవధ చెయ్యమని ఆజ్ఞాపించేడు, జూస్. ఎలా? ప్రొమీథియస్‌కి చావు ఒకేసారి రాకుండా, పగటి పూట ఒక డేగ వచ్చి, అతని కాలేయాన్ని నెమ్మది నెమ్మదిగా పొడుచుకుని తింటూ ఉండాలి. ఆ కాలేయం రాత్రిపూట తిరిగి పుంజుకుని పెరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి రోజు సూర్యచంద్రనక్షత్రాదులు ఉన్నంత కాలం బాధ అనుభవిస్తూ ఉండమని ఆజ్ఞాపించేడు (శపించాడు) జూస్. మానవకోటి మనుగడకి, పురోభివృద్ధికి ముఖ్యంగా కావలసిన నిప్పుని దేవతల దగ్గర నుండి దొంగిలించి మానవులకి ఇచ్చినందుకు ప్రొమీథియస్ ఇలా యమయాతన అనుభవించేడు. తన శరీరాన్ని డేగ పొడుచుకుని తింటూ ఉంటే ఆ బాధకి అతను పెట్టే పెనుబొబ్బలు గ్రీసులో ఉన్న ఒలింపస్ పర్వతం వరకు వినిపించేవిట. ఆ బొబ్బలు విని జూస్ ఆనందపడేవాడట. మరెవరైనా తనని ధిక్కరించి ప్రవర్తిస్తే వాళ్ళ గతి కూడా ఇలాగే ఉంటుందని హెచ్చరించేవాడుట. మహా బలశాలి హెర్క్యులిస్ ఆ డేగని చంపి, ప్రొమీథియస్‌కి విముక్తి కలిగించి ఉండకపోతే ఇప్పటికీ ఆ కాకేసస్ పర్వతాలలో ప్రొమీథియస్ పెట్టే పెడ బొబ్బలు మనకి వినిపిస్తూ ఉండేవి! (సశేషం)
05-09-2021, 12:03 AM
గ్రీకు పురాణ గాథలు 9
ప్రథమ స్త్రీ పాన్డోరా కథ క్రైస్తవ పురాణ గాథల ప్రకారం ఈవ్ (Eve) మొట్టమొదటి స్త్రీ అయితే గ్రీసు సంప్రదాయంలో పాన్డోరాకి (Pandora) ఆ గౌరవం దక్కింది. సా. శ. పూ. 8వ శతాబ్దంలో హేసియాడ్ రాసిన థియాగనీ (Theogony) అనే గ్రంథంలో మొట్టమొదట ఈ పాన్డోరా దర్శనం ఇస్తుంది. ఈ కావ్యం ప్రకారం పాన్డోరా ప్రస్తావన టైటనులకి ఒలింపియనులకి మధ్య జరిగిన మొదటి మహా సంగ్రామం తరువాత కనిపిస్తుంది. తమాషా ఏమిటంటే మనందరికీ చిరపరిచితమైన పాన్డోరా పేటిక (Pandora’s Box) అనే పదబంధం 16వ శతాబ్దంలో థియాగనీని అనువదించిన ఇరాస్మస్ (Erasmus) ప్రవేశపెట్టే వరకు వాడుకలోకి రానేలేదు. గ్రీకు దేవుళ్ళంతా సమావేశం అయిన ఒక సందర్భంలో ఈ కథ మొదలవుతుంది. ఆ సమావేశానికి టైటనులు, ఒలింపియనులు హాజరవుతారు. ధర్మరాజులవారు రాజసూయయాగం చేసినప్పుడు ప్రథమ తాంబూలం అందుకోడానికి ఎవ్వరు అర్హులు అని తర్జనభర్జనలు పడ్డట్లే ఈ దేవుళ్ళంతా వారు చేస్తున్న ‘యాగం’లో ఒక ఎనుబోతుని బలి ఇచ్చిన తరువాత ప్రథమ ప్రసాద భక్షణకి ఎవ్వరు అర్హులు అని తర్జనభర్జనలు పడతారు. అప్పుడు ప్రొమీథియస్ (Prometheus)–ఇతనే దేవగణాల నుండి అగ్నిని దొంగిలించి మానవులకి ఇచ్చినవాడు–యుక్తియుక్తంగా ప్రసాదాన్ని రెండు అసమాన భాగాలుగా చేసి, ఒక భాగం ఎంచుకుని ప్రప్రథమంగా స్వీకరించమని దేవతల రాజైన జూస్ ముందు ఉంచేడు. జూస్ స్వర్గలోకానికి అధిపతి, దేవతల రాజే కాకుండా మోతాదుకి మించిన ‘అహం’ కలవాడు కనుక సహజంగా సింహభాగం తీసుకుంటాడు. నిజానికి ఆ పెద్దభాగం పైపైకి చూడ్డానికి పెద్దగా, అందంగా అలంకరించబడి ఉన్నా అడుగున అంతా బొమికలవంటి శాకాంబరీదేవీ ప్రసాదాలే! ‘అసలు వంటకాలు’ అన్నీ చిన్నభాగం లోనే ఉన్నాయి. జూస్‌కి ఒళ్ళు మండిందంటే మండదూ మరి? రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదువా? దేవతల కళలకి కంసాలి అయిన హఫేస్టస్‌ని (Hephaestus) పిలిపించి ఒక అత్యద్భుతమైన అందగత్తెని సృష్టించమని జూస్ ఆదేశిస్తాడు. దేవతలైనా సరే, మానవులైనా సరే ఆమె అందానికి దాసులు అయిపోవాలని కోరతాడు జూస్. ఈ పని చెయ్యడానికి ఏఫ్రొడైటి (Aphrodite) నమూనాగా నిలబడడానికి ఒప్పుకుంటుంది. హఫేస్టస్ మట్టిని, నీటిని కలిపి జీవకళ ఉట్టిపడేలా ఒక ప్రతిమని తయారుచేసి, నాలుగు దిక్కుల నుండి వాయువులని సమీకరించి ఆ ప్రతిమకి ప్రాణం పోస్తాడు. అప్పుడు ఒలింపియను దేవతలంతా అప్పుడే ప్రాణం పోసుకున్న ఆ బొమ్మకి తలొక బహుమానం ఇస్తారు. ఏఫ్రొడైటి ఆమెకి అసమానమైన అందాన్ని, ఆకర్షణని ఇస్తుంది. కలహభోజనుడు, వార్తావాహకుడు అయిన హెర్మెస్ కపటత్వం, టక్కులు, తంత్రజ్ఞానం, జిత్తులు, ఆమెకి ఆభరణాలుగా ఇస్తాడు. ఎథీనా ఆమెకి అందమైన దుస్తులు ఇచ్చి హస్తలాఘవత్వం నేర్పుతుంది. నీళ్ళల్లో ములిగిపోకుండా రక్షణకని పొసైడన్ ఒక ముత్యాల హారాన్ని ఇస్తాడు. తంబురా మీటుతూ పాట పాడడం అపాలో నేర్పుతాడు. జూస్ ఆమెకి తుంటరితనం, పెంకితనం, అల్లరి చేసే స్వభావం వరాలుగా ఇస్తాడు. చిట్టచివరికి హేరా కుతూహలం అనే లక్షణాన్ని వరంగా ఇస్తుంది. ఈ విధంగా మొట్టమొదటి మానవ స్త్రీ స్వర్గంలోని హఫేస్టస్ కార్ఖానాలో మలచబడుతుంది. ఆమె దివి నుండి భువికి దిగి రాగానే ఆమెకి పాన్డోరా–అనగా ప్రసాదం అని అర్థం–అని పేరు పెట్టి ఆమె చేతికి నగిషీలు చెక్కిన అందమైన పెట్టెని బహుకరిస్తాడు హెర్మెస్: ‘ఈ పేటికని జూస్ నీకు ప్రత్యేక బహుమానంగా పంపేడు. ఎటువంటి పరిస్థితులలోను ఈ పెట్టె మూతని మాత్రం తెరవకూడదు సుమా!’ అని మరీమరీ హెచ్చరించి ప్రొమీథియస్ సవతి అన్నదమ్ముడైన ఎపిథీమియస్‌కి పాన్డోరాని బహుమానంగా ఇచ్చి హెర్మెస్ వెళ్ళిపోతాడు. జూస్ టక్కరి బుద్ధులు బాగా ఎరిగిన ప్రొమీథియస్ జూస్ ఎటువంటి బహుమానం పంపినా అంగీకరించకుండా తిప్పికొట్టమని ముందుగానే తన సవతి అన్నదమ్ముడైన ఎపిథీమియస్‌ని హెచ్చరించేడు. కానీ ఏమి లాభం? పాన్డోరా అందచందాలు, ఆకర్షణ చూసి, ముగ్ధుడై మరొక భావం మనస్సులో చోటు చేసుకునే లోపున ఎపిథీమియస్ ఆమెని పెండ్లి చేసేసుకున్నాడు. ఎపిథీమియస్-పాన్డోరాల వైవాహిక జీవితం సజావుగా సాగిపోతూ రోజులు నిమిషాలలా దొర్లిపోతున్నాయి కానీ పాన్డోరా అంతరాంతరాలలో ఒక కుతూహలం కుమ్మరి పురుగులా దొలిచేస్తోంది. జూస్ బహుమానంగా పంపిన పెట్టెలో ఏముంది? బంగారు నగలా? నాణేలా? పట్టు బట్టలా? చూడడానికి పెట్టె ఎంతో విలువైనదిగా కనిపిస్తోంది. లోపల ఇంకా విలువైనది ఏదో ఉండి ఉంటుంది. ఎన్నిసార్లో ఆ పెట్టె తెరవడానికి వెళ్ళడం, మూత చేత్తో పట్టుకోవడం, వెనకాడడం. పెట్టె ఎన్నడూ తెరవద్దని హెర్మెస్ పదేపదే హెచ్చరించేడు. తెరవకూడని పెట్టెని బహుమానంగా ఇవ్వడంలో అంతరార్థం? కానీ హేరా ఇచ్చిన కుతూహలం అనే వరం హెర్మెస్ హెచ్చరిక కంటే బలవత్తరమైనది. లోపల ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలం చివరికి నెగ్గింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేని సమయంలో పాన్డోరా పెట్టెని సమీపించింది. ఇటు, అటు ఎవ్వరూ చూడడం లేదని రూఢి పరచుకుని, పెట్టె మూతని లేశమాత్రం, ఒక్క క్షణం పాటు, తెరచింది. అంతే! పెట్టేలోంచి బుస్సుమని శబ్దం వచ్చింది. ఆ శబ్దంతోపాటు ముక్కుపుటాలు అదిరిపోయేటంత దుర్వాసనతో ఆ గది అంతా నిండిపోయింది. పాన్డోరా పెట్టె మూతని గభీమని మూసేసింది. కానీ అప్పటికే జరగవలసిన హాని జరిగిపోయింది. ఇహ ఏమి చేసినా అది గతజలసేతుబంధనమే! జూస్ ఆ పెట్టెలో దాచిపెట్టినవి ఏమిటిట? మానవలోకానికి కీడు కలుగజేసేవి: అరిషడ్వర్గాలు అయిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతోపాటు కొంటెతనం, కుత్సితపు నడవడి, దుర్మార్గం, ద్రోహభావం, ద్వేషం, ఘర్షణ, జుగుప్స, ఈర్ష్య, కరవు, కాటకం, అనారోగ్యం, వగైరాలు ఆ పెట్టెలో ఉన్నవి. కానీ అంతా చెడు కాదు; ఉద్దేశపూర్వకంగానో, కాకతాళీయంగానో ఆశావహం అయిన నమ్మకాన్ని కూడా జూస్ ఆ పెట్టెలో పెట్టేడు. జూస్ భార్య హేరా కుతూహలం అనే వరాన్ని అప్పటికే ఇచ్చి ఉంది కదా. ఆశావహం అయిన నమ్మకాన్ని కుతూహలంతో జోడించేసరికి అది మానవజాతికి ఎనలేని విలువ గల వరంగా పరిణమించింది. రేపు నేటి కంటే మెరుగ్గా ఉంటుందన్న నమ్మకమే మానవుడి ప్రగతికి ప్రథమ సోపానం. దానికి కుతూహలం జోడించేసరికి అది సత్యాన్వేషణకి మూలస్తంభం అయింది. ఈ కథలో ప్రముఖంగా కనిపించే అంశం ఏమిటంటే గ్రీసు దేవతలు మానవుల వలెనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకి అతీతులు కాకపోవడమే కాకుండా కుత్సిత బుద్ధితో మానవుల జీవితాలలో కలుగజేసుకుని వాటితో చెలగాటాలు ఆడడం. ప్రొమీథియస్ మీద పగతో జూస్ చేసిన పని ఇది. ఈ కథ చదివిన తరువాత పాన్డోరా ద్వారా ఆ పగ ఎలా తీరిందో అర్థంకాదు. తర్కబద్ధంగా లేని ఈ పాన్డోరా కథ అంతా కల్పితం! ఈ కథని ఆధారంగా చేసుకుని రకరకాల వ్యక్తులు అనేక వ్యాఖ్యానాలు చేసేరు. పాన్డోరా ఆ పెట్టె తెరవకపోతే ఈ ప్రపంచం అంతా, సుభిక్షంగా, శాంతియుతంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండేదేమో అన్న భావం ఈ కథలో అంతర్లీనంగా కనిపించింది కొందరికి. కానీ పాన్డోరా పెట్టె తెరచింది. కనుక ఈ నాడు మనం ఈ ప్రపంచంలో ఎదుర్కుంటున్న ఈతి బాధలన్నిటికి పాన్డోరాయే కారణం అని వీరి వాదం. ఈ కోణంలో ఆలోచించి మన పూర్వులది పురుషాధిక్య భావంతో స్త్రీలని ద్వేషించే సమాజం అని తీర్మానించడం తొందరపాటే అవుతుంది. ఈ కథలో పనికొచ్చే నీతి ఏదైనా ఉందా అంటే ఉంది. పెట్టెలో ఏముందో చూద్దామనే కుతూహలం, ఆ ఉన్నదేదో మనకి ఏదో ఒక విధంగా పనికొస్తుందేమో అనే ఆశాజనక దృక్పథం లేకపోతే ఆధునిక విజ్ఞానశాస్త్రం ఇంతగా పురోభివృద్ధి చెందేది కాదు. ప్రయోగం చేసి చూడాలి. చేసిన ప్రయోగం విజయవంతం అవాలని లేదు. పెట్టె తెరచి చూడాలి. పర్యవసానాన్ని ఎదుర్కోవాలి. ఈ కోణంలో చూస్తే పాన్డోరా మన మొట్టమొదటి ‘సైంటిస్టు!’
05-09-2021, 12:14 AM
కేసియోపియా కథ
పూర్వం ఎథియోపియాని (నేటి ఇథియోపియా) సెఫియస్ (Cepheus) అనే రాజు పాలించేవాడు. అతని రాణి కేసియోపియా (Cassiopeia) తనంత అందగత్తె ఈ భూలోకంలోనే కాదు, స్వర్గలోకంలో కూడా లేదని విర్రవీగుతూ ఉండేది. ఒకనాడు సముద్రపుటొడ్డున కెరటాలతో జలకాలాడుతున్న ఒక జలకన్యని (nymph) చూసి, ‘అందంలో ఈమె నా కాలి గోటికి కూడా సరిరాదు’ అంటూ ఈసడించుకుంది. ఈ మాటలు సముద్రాలకి అధిదేవత అయిన పొసైడన్ (Poseidon) చెవిని పడ్డాయి. అయన ఉగ్రుడై సీటస్ (Cetus) అనే ఒక జలరక్కసిని సృష్టించి ఇథియోపియా మీదకి వదిలేడు. తిమింగిలాన్ని పోలిన ఆ రాక్షసి ఆ రాజ్యాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రజలు భయంతో తమ రాజు దగ్గర మొర పెట్టుకున్నారు. కర్తవ్యం బోధపడక రాజు ఒరాకిల్‌ని సంప్రదించేడు. పొసైడన్ కోపం చల్లారాలంటే రాజు తన అందాల కూతురైన ఆండ్రోమిడాని (Andromeda) ఆ జలరక్కసికి బలి ఇవ్వాలసిందే అని చెబుతారు. తన కూతురుని ఇలా బలి ఇవ్వడం రాజుకి ఇష్టం లేకపోయినా మరొక మార్గం కనిపించక రాజు సీటస్‌కి ఆహారంగా తన కూతురుని ఒక బండరాతికి గొలుసులతో కట్టేసి సముద్రపు ఒడ్డున వదిలేసేడు. ఇది ఇలా ఉండగా మెడూసాని (Medusa) చంపి ఆమె తలకాయని ఎథీనాకి (Athena) అప్పగించే పని మీద పెర్సియస్ (Perseus) అనే వీరుడు బయలుదేరేడు. (ఈ పెర్సియస్ తండ్రి జూస్, తల్లి ఒక మానవ వనిత.) మెడూసా కూడా కేసియోపియా చేసిన తప్పులాంటి తప్పే చేసి శాపగ్రస్తురాలయింది. ‘నా బంగారు జుత్తు కూడా ఎథీనా జుత్తులా అందంగా మెరుస్తూ ఉంటుంది!’ అని మెడూసా అన్నదని ఎథీనాకి కోపం వచ్చి మెడూసాని ఒక అసహ్యకరమైన శాల్తీగా మార్చేసింది. ఈ శాల్తీ జుత్తులో వెంట్రుకలకి బదులు పాములు ఉంటాయి. ఈ శాల్తీని ఎవరు చూస్తే వారు రాయిగా మారిపోతారు. మెడూసా ఉంటున్న గుహ చుట్టూ శిలలుగా మారిపోయిన వీరుల విగ్రహాలెన్నో పడివున్నాయి! మెడూసా తల నరకడానికి బయలుదేరిన పెర్సియస్‌కి కూడా అదే గతి పట్టి ఉండేదే కానీ అతనికి దైవ సహాయం లభించింది: ఎథీనా అద్దం లాంటి కవచాన్ని ఇచ్చింది . పెగసస్ (Pegasus) అనే రెక్కలగుర్రాన్ని హెర్మీస్ ఇచ్చేడు. ఎవరి తల మీద పెట్టుకుంటే వారు అదృశ్యం అయిపోయే మహిమ కల కిరీటాన్ని హేడీస్ ఇచ్చేడు. అద్దం లాంటి కవచంలో ప్రతిబింబాన్ని చూస్తూ ఒకే ఒక కత్తి వేటుతో మెడూసా తల నరికేడు పెర్సియస్. ఆ తల పట్టుకుని రెక్కలగుర్రం మీద సవారి చేస్తూ సముద్రం మీదుగా వెళుతూ దారిలో ఇథియోపియా సముద్రతీరంలో గొలుసులతో రాయికి కట్టేసి పడి ఉన్న ఆండ్రోమెడాని చూసేడు. ఆమె ఉదంతం ఆమె చెప్పగా విన్నాడు. ఇంతలోనే సీటస్ రాక్షసి ఆకలితో ఈదుకుంటూ వచ్చింది. పెర్సియస్ తన ఖడ్గంతో ఆ జలరాక్షసిని చంపేసి ఆండ్రోమెడాని పెళ్లి చేసుకున్నాడు. మెడూసా తలని ఎథీనాకి ఇచ్చేడు. (ఈ ఉదంతంతో క్లాష్ ఆఫ్ ది టైటన్స్ అని 1981లో ఒక సినీమా కూడా వచ్చింది.) ఈ కథలోని ప్రధాన పాత్రలన్నీ నక్షత్రాలుగా మారి ఆకాశంలో ప్రకాశిస్తున్నాయి. కేసియోపియాని ఆకాశంలో గుర్తించడం చాల సులభం. ఉత్తరకాశంలో, సప్తర్షి మండలానికి ఎదురుగా, ధ్రువ నక్షత్రం నుండి సమాన దూరంలో, కాసింత సొట్టగా ఉన్న ఇంగ్లీషు అక్షరం W ఆకారంలో ప్రకాశవంతమైన అయిదు చుక్కలతో ఏర్పడ్డ రాశియే కేసియోపియా. కేసియోపియా అని గ్రీసు దేశస్తులు పిలిచిన నక్షత్ర మండలాన్ని వివిధ సంస్కృతులలో ప్రజలు వివిధమైన పేర్లతో పిలిచేరు. ఈ గుంపులో ఉన్న నక్షత్రాల గురించి అరబ్బులకి తెలుసు, చైనీయులకి తెలుసు, వేదకాలపు భారతీయులకి తెలుసు. వారివారి పురాణ గాథలలో ఇటువంటి కథలు వారికీ ఉన్నాయి. కనుక గ్రీసు పురాణాలలో ఉన్న కథలు అన్నీ గ్రీసు కథకుల స్వకపోలకల్పితాలు కాకపోవచ్చు. వేదకాలపు భారతీయులు కేసియోపియా నక్షత్ర మండలాన్ని అప్సరసలు అనిన్నీ, కాశ్యపీయులు అనిన్ని అన్నారు. దీనికి ఆధారం ఏమిటి? కశ్యప ప్రజాపతికి ప్రధాదేవి వలన అప్సరసలు పుట్టేరని సంస్కృత భారతం, ఆదిపర్వం (35, 50, 51) చెబుతోంది. కశ్యప ప్రజాపతికి సురభి వల్ల మేనకాది ఆప్సరసలు పుట్టేరని కూడా చెబుతోంది. కనుక కేసియోపియా అనే మాట కశ్యప పదోద్భవమేమో అని మహీధర నళినీమోహన్ అభిప్రాయపడ్డారు. ఇంతటితో అవలేదు. ఆకాశంలో కేసియోపియా నక్షత్ర మండలానికి పశ్చిమముగాను ఉత్తరంగాను సెఫియస్ (Cepheus) మండలము; దక్షిణంగాను, పశ్చిమముగాను ఆండ్రోమెడా (Andromeda) మండలము, నైరుతి దిశలో పర్సియస్ (Perseus) మండలము కనిపిస్తాయి. ఇవన్నీ పాశ్చాత్యులు ఈ నక్షత్ర మండలాలకు పెట్టిన పేర్లు. అరబ్బులు పెట్టుకున్న పేర్లు వేరు, భారతీయులు పెట్టుకున్న పేర్లు వేరు. వారి వారి కథలు వేర్వేరు. పర్సియస్ మండలములో పెర్సియస్ వీపు మీద నక్షత్రాల వరస వంపు తిరిగినట్లు ఉంటుంది. అందుకని వాటిని పర్సియస్ చాపం (Perseus Arrow) అంటారు. అతడి నడుము పటకా నుండి వేళ్ళాడుతూ మెడూసా శిరస్సు కనిపిస్తుంది. ఆ శిరస్సు నుదిటి మీద ఒక విచిత్రమైన నక్షత్రం కనిపిస్తుంది. దాని కాంతి పెరుగుతూ, తరుగుతూ కనిపిస్తుంది. అందుకని దానిని అరబ్బులు అల్‍గోల్ (Algol) అని పిలిచేవారు. అరబ్బీలో అల్‍గోల్ అంటే దయ్యపు నక్షత్రం. దరిమిలా ఈ వింత ప్రవర్తనకి కారణం తెలిసింది. ఇది ఒక జంట నక్షత్రం అవడం, అందులో ఒకటి నల్లటి నక్షత్రం అవడం. ఈ రెండూ అమ్మాయిలు ఒప్పులగుప్ప ఆడినట్లు ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయనిన్నీ, మన దృక్పథంలో నల్లటి తార అడ్డు వచ్చినప్పుడల్లా వాటి కాంతి తగ్గుతుందనిన్నీ 1782లో హాలండ్ దేశపు (చెవిటి, మూగ అయిన) 18 ఏళ్ల గుడ్రిక్ అనే కుర్రాడు కనిపెట్టేడు! ఇప్పుడు హిందూ పురాణ గాథలలో ఆండ్రోమెడా కథ ఎలా ఉందో చూద్దాం. అల్‍గోల్ నక్షత్రాన్ని హిందువులు పులోమ రాక్షసుడు అన్నారు. భృగు మహర్షి (Perseus) భార్య పేరు పులోమ. ఆమె నిండు చూలాలు. భృగుడు స్నానం చెయ్యడానికి నదికి వెళ్లిన తరుణంలో పులోముడు అనే వింత రాక్షసుడు ఇంట ప్రవేశించి, ‘నేను పులోముడను. నువ్వు పులోమవు. నువ్వు నా భార్యవి’ అని పులోమని అపహరించేడు. ఆమె గర్భస్థ శిశువు తల్లి కన్నీరు చూడలేక గర్భచ్యుతుడు అవుతాడు. అతడే చ్యవనుడు (Triangulum). చ్యవనుడు బహుకాలం తపస్సు చేయగా అతని శరీరం పుట్టలు పట్టిపోయింది. కళ్ళు మాత్రం మిణుగురు పురుగుల్లా మెరవసాగేయి. అప్పుడు శర్యాతి అనే రాజు కూతురు సుకన్య ఆ ప్రాంతంలో ఆటలాడుతూ, మిణుగురు పురుగులని భ్రమపడి పుల్లతో చ్యవనుని కళ్ళు పొడిచింది. ఆ కళ్ళ నుండి వచ్చిన రక్తాన్ని చూసి సుకన్య భయపడింది. తెలియక చేసిన తప్పు కనుక క్షమించమని శర్యాతి వేడుకున్నాడు. సుకన్యని తనకిచ్చి పెళ్లిచేస్తే క్షమిస్తానని చ్యవనుడు అన్నాడు. సుకన్య ఒప్పుకుంది. అశ్వినులు చ్యవనునికి కళ్ళని వరంగా ప్రసాదించేరు. అంతవరకు హవిర్భాగాలకి (యజ్ఞఫలాలకి) నోచుకోని అశ్వినులకి చ్యవనుడు హవిర్భాగాలని ప్రసాదించేడు. అందుకు కోపించి చ్యవనుని మీదకి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించేడు. చ్యవనుడు అగ్నిహోత్రుడు నుండి మద అనే రాక్షసుడిని పుట్టించి ఇంద్రుడి మీదకి వదిలేడు. ఇంద్రుడి మదం అణిగింది. అశ్వినులకి హవిర్భాగం ఇవ్వడానికి అంగీకరించేడు. ఇంద్రుని మదము అణచి వేయడానికి కారణభూతురాలైన చ్యవనుని తల్లిని (అనగా భృగుపత్నిని) ఇంద్రమద అన్నారు. అదే పాశ్చాత్యుల ఆండ్రోమెడా అని మహీధర నళినీమోహన్ వ్యాఖ్యానించేరు (మహీధర నళినీమోహన్, నక్షత్ర వీధులలో భారతీయుల పాత్ర, 1997. అవంతీ పబ్లికేషన్స్). పులోమ రాక్షసుడు చావు తప్పి కన్ను లొట్టపోయి చ్యవన నక్షత్రరాశికి ఎదురుగా పులుకు పులుకూ గుడ్లు మిటకరిస్తూ భృగుపరశు గుంపులో రెండవ చుక్కగా (Beta Perseus) మనకి కనబడుతున్నాడు. దీనినే అల్‍గోల్ ది బ్లింకింగ్ డీమన్ అంటారు.
05-09-2021, 12:27 AM
గ్రీకు పురాణ గాథలు 10
రాజుగారివి గాడిద చెవులు నేను చిన్నప్పుడు పత్రికలలో (చందమామ, బాల, బాలమిత్ర) చదివిన కథలన్నిటిలోను నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉన్న కథ ‘రాజుగారివి గాడిద చెవులు’ కథ అంటే అది అతిశయోక్తి అవదు. ఇది గ్రీకు పురాణ కథలలో ఒకటన్న విషయం నాకు ఈనాడే తెలిసింది! గ్రీకు పురాణ కథలలో పేరెన్నికగన్న కథ ఫ్రిజియా (Phrygia) అనే రాజ్యానికి రాజు అయిన మైడస్ (Midas) కథ. గ్రీకు పురాణ కథా చక్రాలలో మైడస్ గురించి రెండు విభిన్నమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒవిడ్ (Ovid) రాసిన మెటమార్ఫసిస్ (Metamorphosis)లో మైడస్ గురించిన కథలు మనకి కనిపిస్తాయి. ఆ రెండు కథలు ఇక్కడ చెబుతాను. గ్రీకు పురాణ కథలలో కనిపించే సేటర్ (satyr) అనేది ఒక నరాశ్వం. అనగా కొంత భాగం మనిషి రూపం, కొంత భాగం గుర్రం రూపం. ఇలాంటి స్వరూపాలనే మన పురాణాలలో కిన్నరులు (అశ్వ ముఖము, నర శరీరము కలవారు), కింపురుషులు (నర ముఖము, అశ్వ శరీరము కలవారు) అని వర్ణించేరు. సిలెనస్ (Silenus) అనే పేరు గల ఒక నరాశ్వం గ్రీకు దేవుడు డయోనిసస్ (Dionysus) సహచర్యంలో కనబడుతూ ఉంటాడు. ఒక రోజు సిలెనస్ తప్పతాగేసి రాజుగారి తోటలో పడిపోతాడు. రాజభటులు అతనిని రాజు దగ్గరకి తీసుకెళతారు. మైడస్ సిలెనస్‌ని గుర్తుపట్టి పది రోజులపాటు సపర్యలు చేస్తాడు. మైడస్ చేసిన సహాయానికి ముగ్ధుడైన డయోనిసస్ ప్రతిఫలంగా మైడస్‌ని ఒక వరం కోరుకోమని చెబుతాడు. దూరాలోచన లేకుండా తాను పట్టిందల్లా బంగారం అయిపోవాలి అని కోరుకుంటాడు మైడస్. ఇక్కడ నుండి కథని ఎవరికి నచ్చిన విధంగా వారు నడిపించవచ్చు. నథేనియల్ హాతోర్న్ చెప్పిన కథలో, మైడస్ స్పర్శ వల్ల ఉద్యానవనంలో గులాబీలు పరిమళం లేని పసిడి పువ్వులుగా మారిపోయాయని, అందువల్ల మైడస్ కూతురు ఏడిచిందని, ఏడుస్తున్న కూతురుని సముదాయించడానికి మైడస్ ఆమెని చేరదీసేసరికి ఆ అమ్మాయి బంగారు విగ్రహంగా మారిపోయిందని ఉంది. మరొక కథనంలో పళ్లెంలో ఉన్న భోజన పదార్థాలు ముట్టుకునేసరికల్లా భోజనం బంగారం అయిపోతుంది. మైడస్ ఆకలితో అలమటించిపోతాడు. కారణం ఏదయినా చేసిన తప్పు తెలుసుకుని మైడస్ పశ్చాత్తాపపడతాడు. డయోనిసస్ కనికరించి పాక్టోలస్ నదిలో గ్రుంకులిడితే వరం యొక్క ప్రభావం సడలిపోతుందని ఉపశమన మార్గం చెబుతాడు. (ఈ నది టర్కీలోని సార్డిస్ దగ్గర ఉంది.) మైడస్ ఆ నదిలో ములిగేసరికల్లా ఆ వరం యొక్క ప్రభావం మైడస్ నుండి నదిలోని నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఆ నదిలోని ఒండ్రుమట్టిలో బంగారం నలుసులు కనబడుతూ ఉండడానికి కారణం ఆనాటి మైడస్ స్పర్శే అని ప్రజలలో ఒక నమ్మకం ఉంది. మైడస్‌కి సంబంధించిన కథ మరొకటి ఉంది. సువర్ణ స్పర్శ వల్ల జరిగిన పరాభవానికి ఒకింత చింతించి మైడస్ కోటగోడలు దాటి బయట ఉన్న పచ్చిక బయళ్లలో తిరుగుతూ ఉంటాడు. అడవులకి, కొండలకి, పచ్చిక బయళ్ళకి అధినేత అయిన పాన్ (Pan) అనే ఒక నరమేషం వాయిస్తున్న పిల్లనగ్రోవి సంగీతానికి మైడస్ ముగ్ధుడవుతాడు. ఒకసారి అపాలోకి పాన్‌కి మధ్య సంగీతం పోటీ జరుగుతుంది. ఈ పోటీలో గెలుపెవరిదో నిశ్చయించడానికి నియమించబడ్డ నిర్ణేతగణంలో మైడస్ ఒక నిర్ణేత. మిగిలిన నిర్ణేతలంతా అపాలో సంగీతమే గొప్పగా ఉందంటే మైడస్ మాత్రం వ్యతిరేకంగా వెళ్లి పాన్‌ని సమర్థించడంతో అపాలోకి కోపం వచ్చింది. ‘సంగీత జ్ఞానం లేని మైడస్ చెవులు గాడిద చెవులుగా మారిపోవాలి!’ అని శపిస్తాడు. ఇంకేముంది, మైడస్‌కి మాములు చెవుల స్థానంలో గాడిద చెవులు వస్తాయి. ఎంత అప్రతిష్ట! ప్రజలకి తెలిస్తే పరువు గంగలో కలసిపోతుంది కదా! మైడస్ తలపాగా ధరించడం మొదలుపెట్టేడు. ఎంత రాజైనా తలకాయని మంగలి చేతులలో పడకుండా దాచలేడు కదా. రాజుగారివి గాడిద చెవులు అని మంగలికి తెలిసిపోయింది. మూడో కంటివాడికి ఈ రహస్యం తెలిసిందంటే తల తీయించేస్తానని మైడస్ మంగలిని బెదిరించేడు. రాచరహస్యం! రచ్చకెక్కితే కొంపలంటుకుపోవూ? కడుపులో దాచుకోలేక మంగలి కడుపు ఉబ్బిపోతోంది. ఏమిటి చేస్తాడు? ఏమిటి చెయ్యగలడు? ఎవ్వరికో ఒకరికి చెప్పాలి. తనకి తెలిసిన రహస్యాన్ని ఒక పుట్టలో ఊదేశాడు! కొన్నాళ్ళకి ఆ పుట్ట మీద వెదురు బొంగులు పెరగడం మొదలెట్టేయి. అవి గాలికి ఇటు అటూ ఊగినప్పుడల్లా, పిల్లనగ్రోవిలో గాలి ఆడినట్లు అయి, అవి ‘రాజుగారివి గాడిద చెవులు’ అని పాట ప్రసారం చెయ్యడం మొదలెట్టేయి! ఇంతకీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మైడస్ అనే రాజు నిజంగా 3000 సంవత్సరాల క్రితం (అనగా, సు.సా.శ.పూ. 800లో) ఫ్రిజియా (Phrygia) అనే రాజ్యాన్ని పరిపాలించేడనడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ ఫ్రిజియా రాజ్యం ప్రస్తుతం టర్కీ ఉన్న ప్రదేశంలో ఉండేది. ఇటీవల, అనగా సా. శ. 1957లో, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంవారు గోర్డియన్‌లో (Gordion) జరిపిన తవ్వకాలలో మైడస్ తండ్రి గోర్డియోస్ (Gordios) యొక్క శ్మశానవాటిక కనబడింది. అక్కడ శవపేటికలో కనిపించిన అస్థిపంజరం, దానిచుట్టూ ఉత్తరక్రియలకి సంబంధించిన విందుభోజన సామాగ్రి కనిపించేయిట. మరయితే మైడస్ పట్టినవన్నీ నిజంగా బంగారం అయిపోయేవా? ఆనాటి దుస్తుల్ని విశ్లేషించి చూస్తే వాటన్నిటికీ ఎరుపు డాలు ఉండడాన్ని బట్టి అవి మూడొంతులు అయోభస్మం (తుప్పు లేదా oxide of iron) రంగు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ రంగుని చూసి బంగారం అనుకుని ఆ కథ సృష్టించి ఉండవచ్చు. మరి గాడిద చెవుల మాట? ఈ సంశయాన్ని తీర్చటానికి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం సరిపోదు. ఈ కథ ముగించేలోగా మైడస్ తండ్రి గోర్డియోస్ గురించి చిన్న పిట్టకథ ఒకటి అప్రస్తుతం కాదు. ఫ్రిజియా రాజ్యానికి ఒకప్పుడు రాజులేకుండా అయిపోయింది. అప్పుడు టెల్మిసస్‌లో (Telmissus) ఉన్న ఒరాకిల్, ‘రాజ్యంలోకి ఎవరైతే మొట్టమొదట ఎడ్లబండిని తోలుకుంటూ వస్తారో వారే ఫ్రిజియా రాజ్యానికి రాజు’ అని జోస్యం చెప్పింది. గోర్డియోస్ అనే పేరు గల ఒక రైతు ఎడ్లబండిని తోలుకుంటూ ఊళ్లోకి రాగానే అతనికి పట్టాభిషేకం చేసేసేరు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి కృతజ్ఞతగా మైడస్ ఆ బండిని ఆ ఒరాకిల్ ఆలయంలో ఒక స్తంభానికి పెద్ద మోకుతో గట్టిగా ముడివేసి కట్టేసేడు. ముడి మీద ముడివేసి ఎంత గట్టిగా కట్టేడంటే దానిని విప్పడానికి ఎవ్వరి తరంకాలేదు. నాలుగు వందల సంవత్సరాల తరువాత, సుమారు సా.శ.పూ. 400లో, అలెగ్జాండర్ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ బ్రహ్మముడి ఇంకా అలానే ఉంది. ఆ ముడి ఎవ్వరు విప్పుతారో ఆ వ్యక్తి ఆసియా అంతటికి సార్వభౌముడు అవుతాడని అక్కడ ఒరాకిల్ జోస్యం చెప్పింది. ఈ మాట విని అలెగ్జాండర్ ఆ ముడిని విప్పడానికి ప్రయత్నించి మొదట విఫలం అవుతాడు. అప్పుడు ‘ముడి విప్పడం ముఖ్యం కానీ ఎలా విప్పేమన్నది ప్రధానం కాదు’ అంటూ తన కరవాలం తీసుకుని ఒక్క వేటులో ఆ ముడిని రెండు ముక్కలు చేసి విప్పేడుట. ఎప్పటికీ పరిష్కారం దొరకకుండా ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యని ఎవరైనా ఒక్క వేటులో పరిష్కరిస్తే ‘గోర్డియన్ ముడిని విప్పినట్లు’ (untying the Gordian knot) అనే నుడికారాన్ని వాడతారు.
05-09-2021, 12:42 AM
హెరాక్లీస్ కథ
గ్రీసు పురాణ గాథలలోని హెరాక్లీస్ (Heracles) అనే మహా యోధుడే రోమనుల హెర్క్యులిస్‌గా రూపాంతరం చెందేడు. హెర్క్యులిస్ (Hercules) అనే పేరు ప్రపంచవ్యాప్తంగా పరిచితం అయిన పేరు. ఆ మాటకి వస్తే గ్రీసు యోధులలో ఒక్క హెరాక్లీస్ శిల్పమే – శిథిలావస్థలో – భారతదేశంలో, మధుర దగ్గర దొరికింది. ఇది ఇప్పుడు కొల్‌కతా లోని పురావస్తు ప్రదర్శనశాలలో ఉందిట! హిందూ పురాణాలలో భీముడితో తులతూగగల బలశాలులు మరో అయిదుగురు ఉన్నారు: బకాసురుడు, హిడింబాసురుడు, జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు. కానీ గ్రీకు పురాణాలలోను, రోమను పురాణాలలోను హెరాక్లీస్ (లేదా హెర్క్యులిస్)తో ఉజ్జీ అయిన అరివీరభయంకరుడైన బలశాలి మరొకడు లేడు. హెరాక్లీస్ దైవాంశ సంభూతుడు; సాక్షాత్తు జూస్‌కి (Zeus) ఒక మానవ వనిత ఆల్కిమెనీకి (Alcmene) పుట్టిన కొడుకు అవడం వల్ల తండ్రి నుండి కొన్ని దైవ లక్షణాలు, తల్లి నుండి కొన్ని మానవ లక్షణాలు అబ్బేయి. ఈ ఆల్కిమెనీ ఎవరు? ఈమె ఎలక్ట్రియాన్ (Electryon) కూతురు. ఈ ఎలక్ట్రియాన్ ఎవరు? ఇతను పెర్సియస్‌కీ ఆండ్రోమెడాకి పుట్టిన కొడుకు. పెర్సియస్ ఎవరు? జూస్‌కీ డనాఎకి (Danaë) పుట్టిన కొడుకు. అనగా, జూస్ కొడుకు పెర్సియస్, అతని కొడుకు ఎలక్ట్రియాన్ కాబట్టి వరసకి జూస్‌కి ఆల్కిమెనీ మునిమనవరాలు అవుతుంది. హెసియోడ్ చెప్పిన కథనం ప్రకారం ఆల్కిమెనీ అంతటి అందమైన మానవ వనిత మరొకతె లేదు. సన్నటి నడుము, సంపెంగ ముక్కు, నల్లటి కళ్ళతో ఆమె అందం ఆఫ్రొడీటీ అందాన్ని తలదన్నేలా ఉండేదని హెసియోడ్ వర్ణిస్తాడు. ఒకనాడు ఆల్కిమెనీ తన స్నేహితుడు, ప్రియుడు, అయిన ఏంఫిట్రియాన్‌తో (Amphitryon) కలసి యుద్ధరంగంలోని విడిదికి వెళుతుంది. ఏంఫిట్రియాన్ రణరంగంలో ఉన్న సమయంలో ఏంఫిట్రియాన్ వేషంలో జూస్ ఆల్కిమెనీ మందిరంలోకి ప్రవేశించి, తన మునిమనవరాలితో రమిస్తూ మూడు రాత్రులు గడపడం వల్ల హెరాక్లీస్‌తో ఆమె గర్భవతి అవుతుంది! నాలుగవ రోజు రణరంగం నుండి ఏంఫిట్రియాన్ రాకతో జరిగిన మోసం ఆల్కిమెనీకి అవగతం అవుతుంది. రణరంగం నుండి తిరిగి వచ్చిన ఏంఫిట్రియాన్ భార్యతో రమించడం వల్ల ఆల్కిమెనీ గర్భంలో ఇఫిక్లెస్ (Iphicles) పిండం పెరగడం మొదలవుతుంది. ఇలా ఇద్దరు పురుషులకి చెందిన బిడ్డలు ఒకేసారి తల్లి కడుపులో పెరగడం సాధారణంగా జరగదు కానీ అసంభవం కాదు. (దీనినే ఇంగ్లీషులో heteropaternal superfecundation అంటారు.) కనుక ఏంఫిట్రియాన్‌కి ఇఫిక్లెస్ సొంత కొడుకు, హెరాక్లీస్ సవతి కొడుకు అవుతారు. జూస్ పట్టమహిషి హేరాకి జూస్ ఒక మానవ వనితతో నడుపుతున్న వ్యవహారం నచ్చలేదు. ఆల్కిమెనీ గర్భంలో పెరుగుతున్న హెరాక్లీస్ మీద ద్వేషం పెంచుకుంది. ఇలా రగులుతున్న ద్వేషం తన కడుపులోనే దాచుకుని అవకాశం కోసం ఎదురుచూడసాగింది. హోమర్ ఇలియడ్‌లో చెప్పిన కథనం ప్రకారం ఆల్కిమెనీ మరునాడు ప్రసవిస్తుందనగా జూస్ – హేరా ప్రోద్బలంతో – ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేసేడు. ఏమని? మరునాడు పుట్టబోయే బాలుడే దేవలోకానికి అధిపతి అవుతాడని! హేరా హుటాహుటి ఒలింపస్ పర్వతం నుండి దిగివచ్చి పెర్సియస్ పెద్ద కోడలు నెలలు నిండకుండానే ప్రసవించేటట్లు చేసింది. అదే ఊపులో నెలలు నిండిన ఆల్కిమెనీ మరునాడు ప్రసవించకుండా మంత్రశక్తితో ఆపుచేసింది. ఈ కుతంత్రం వల్ల హెరాక్లీస్‌కి చెందవలసిన రాజ్యం పెర్సియస్ పెద్ద మనుమడు, నెలతక్కువవాడు అయిన యురీస్టియస్‌కి (Eurystheus) దక్కింది. హేరా వేసిన ఎత్తుకి పైయెత్తు అన్నట్లు ఒకనాడు ఎథీనా ఆకలితో ఉన్న చిరుతప్రాయపు హెరాక్లీస్‌ని తీసుకెళ్లి అనాథ బాలుడని చెప్పి హేరా అక్కున చేర్చింది. హేరా తన చన్నులని కుడవడానికి అందించింది. పాలు తాగుతున్న హెరాక్లీస్ ఆ చనుమొనలని కొరికేడు. హేరా రొమ్ముల నుండి ప్రవహించిన పాలే ఆకాశంలో మనకి కనిపిస్తున్న పాలపుంత! అంతేకాదు, దైవాంశ ఉన్న హేరా పాలు తాగడం వల్ల హెరాక్లీస్ బలం ఇనుమడించింది, రవంత దైవాంశ కూడా ప్రాప్తించింది. ఈ సంఘటనతో హేరాకి హెరాక్లీస్ మీద ద్వేషం కూడా ఇనుమడించింది. ఒకనాడు చంటిబిడ్డ ఉయ్యాలలో పడుక్కుని ఉండగా వాడిని చంపడానికి రెండు పాములని పంపించింది. ఆ పాముల్ని చంటివాడు చేతులతో నలిపి చంపేశాడు. ఇంతటితో హెరాక్లీస్ ఇడుములు అంతం కాలేదు. హేరా పగకి పట్టపగ్గాలు లేకుండాపోయాయి. హేరా పెడుతున్న బాధలు భరించలేక హెరాక్లీస్ తన భార్యని పిల్లలని చంపేస్తాడు. తరువాత పశ్చాతాపంతో కుంగిపోతాడు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా యురీస్టియస్ కొలువులో ఉండి అతను ఆదేశించిన పనులు చెయ్యడానికి ఒప్పుకుంటాడు. వీటినే హెరాక్లీస్ చేసిన పన్నెండు సాహస కృత్యాలు అంటారు. నిజానికి ఈ పన్నెండింటిని మించి మరెన్నో సాహసాలు చేసేడు. ఈ పన్నెండింటిలో కొన్ని మాత్రమే ఈ దిగువ చెబుతాను. కత్తులకూ, బరిసెలకూ, బాణాలకూ లొంగని ఒక భయంకరమైన సింహం ఆ ప్రాంతాలని బాధిస్తుంది. దానిని చంపాలి. హెరాక్లీస్ దాని పీకని చేతులతో నలిపి చంపేసి, దాని చర్మాన్ని ఒలిచి అంగవస్త్రంగా ధరించి, దాని శరీరాన్ని గిరగిరా తిప్పి ఆకాశంలోకి విసిరేసేడు. అదే ఇప్పుడు మనకి ఆకాశంలో కనిపించే సింహ రాశి(Leo). హెరాక్లీస్ విగ్రహాలలో ఈ సింహపు తోలు తరచు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతాలలో తొమ్మిది తలకాయల మహాసర్పం ఒకటి ఉండేది. ఈ పాముని సాక్షాత్తూ హేరా పెంచి పెద్దచేసింది; హెరాక్లీస్ మీద కసి తీర్చుకునే నిమిత్తం! ఆ పాము తల ఒకటి నరికితే మరొకటి పుట్టుకొస్తూ ఉండేది. దానిని చంపాలి. హెరాక్లీస్ దాని తొమ్మిది తలలూ ఒకే వేటులో నరికేసి, తిరిగి తల మొలవకుండా కాలుతున్న శలాకతో వాతలు పెట్టి, చంపేసేడు. అదే ఇప్పుడు ఆకాశంలో అజగరం (Hydra) అనే నక్షత్ర రాశిగా మనకి కనిపిస్తుంది. హెరాక్లీస్ సాధించిన ఘనవిజయాలు చూసి యురీస్టియస్, హేరా సహించలేకపోయారు. ఈమారు ఒక మృగాన్ని చంపడానికి బదులు ప్రాణాలతో పట్టి తెమ్మని ఆదేశించారు. అది డయానా దేవతకి చెందిన లేడి. అతి వేగంగా పరిగెత్తగల, బంగారు కొమ్ములు ఉన్న లేడి. ఆ లేడిని గాయపరచకుండా పట్టుకుని, తెచ్చి, రాజుకి ఇవ్వాలి. హెరాక్లీస్ ఒక ఏడాదిపాటు ఆ లేడిని వెంటాడి చిట్టచివరికి పట్టుకున్నాడు. యురీస్టియస్ ఏమనుకున్నాడంటే అడవిలో తిరుగాడే లేడిని బంధిస్తే వనదేవత ఆర్టెమిస్‌కి కోపం వస్తుంది. అప్పుడు ‘కాగల కార్యాన్ని ఆర్టెమిస్ తీరుస్తుంది’ అనుకున్నాడు. కానీ లేడిని పట్టుకుని వస్తూవుంటే ఆర్టెమిస్, ఆమె కవల సోదరుడు అపాలో హెరాక్లీస్‌కి ఎదురయ్యారు. వారికి తన కథ చెప్పి లేడిని పట్టుకున్నందుకు క్షమాభిక్ష వేడుకున్నాడు. ఏ కళనుందో ఆర్టెమిస్ సరే అంది. హెరాక్లీస్ బతికిపోయాడు! ఆర్కేడియాలో పంట భూములని నాశనం చేస్తున్న అడవిపందిని ప్రాణాలతో పట్టుకోవాలి. ఖైరాన్ సహాయంతో హెరాక్లీస్ ఆ అడవిపందిని పట్టుకుంటాడు. వెయ్యి పశువులు ఆక్రమించి, ముప్ఫయ్ ఏళ్లుగా సంరక్షణ లేకుండా పడి ఉన్న లెజియన్ రాజుగారి పశువులసాలని శుభ్రం చెయ్యాలి. రెండు నదీప్రవాహాలని మళ్లించి, పశువులసాల గుండా ప్రవహింపజేసి, ఒక్కరోజులో ఆ సాలను శుభ్రపరుస్తాడు. కంచు ముక్కులు, లోహపు రెక్కలతో బాటసారులను వేధించి తింటున్న రాక్షసి పక్షులని చంపాలి. ఎథీనా సహాయంతో వీటిని ఎదుర్కొని పారదోలుతాడు. అవి చెల్లాచెదరు అయిన తరువాత వాటిలో కొన్నింటిని చంపి కొన్నింటిని తరిమికొడతాడు. అలా పారిపోయిన పక్షులే మరల అర్గోనాటులని ఎదుర్కోడానికి జేసన్-అర్గోనాట్‌ల కథలో వస్తాయి. ముక్కులోంచి మంటలు చిమ్ముతూ, బుసలుకొడుతూ, క్రీట్ ద్విపాన్ని ధ్వంసం చేస్తున్న పోసైడన్ దేవుడి ఆంబోతులని అదుపులో పెట్టాలి. ఇలా మొత్తం పన్నెండు సాహసకృత్యాలు చేసేడు. అంటారు కానీ నిజానికి మరెన్నో సాహసాలు చేసేడు. సొఫోక్లిస్ చెప్పిన కథనం ప్రకారం రకరకాల జంతువుల రూపాలలోకి, పక్షుల రూపాలలోకి మారిపోగలిగే అకెలూస్ (Achelous) అనే జలదేవుడుతో యుద్ధంచేసి డియనీరా (Deianira) అనే అందగత్తెని పెళ్లి చేసుకున్నాడు. చివరికి పరోక్షంగా ఆమె వల్లనే అతనికి చావు మూడింది. అదెలా అంటే వీరిరువురు ఒక పడవలో ఒక నదిని దాటుతూ ఉండగా నెసస్ (Nessus) అనే పేరు గల ఒక నరతురంగం (centaur) డియనీరాని ఎత్తుకుపోయింది. హెరాక్లీస్ దానిని వెంబడించి చంపుతాడు. అది ప్రాణాలు విడచిపెడుతూ డియనీరాకి తన రక్తాన్ని కొద్దిగా బహుమానంగా ఇస్తుంది. ఇచ్చి, ‘నీ భర్త నిన్ను గాక మరొకరిని చేరదీస్తున్నాడని అనుమానం వస్తే అతను కట్టి విడిచిన బట్టని ఈ రక్తంలో ముంచినట్లయితే నీ భర్త నీవాడవుతాడు’ అని చెబుతుంది. ఒకసారి హెరాక్లీస్ ఒక బానిసపిల్ల ప్రేమలో పడతాడు. డియనీరాకి ఆ విషయం తెలిసింది. అప్పుడు తన భర్త కట్టి విడిచిన బట్టలని ఆ నరతురంగం ఇచ్చిన రక్తంలో ముంచింది. నిజానికి ఆ రక్తం ప్రమాదకరమైన విషం. ఆ విషం హెరాక్లీస్‌ని చంపింది. అప్పుడు జూస్ మెరుపులు పిడుగులతో కూడిన తన వజ్రాయుధాన్ని హెరాక్లీస్ శరీరం మీదకి విసురుతాడు. హెరాక్లీస్ ఆత్మ ఒలింపస్ పర్వతం మీద ఉన్న ఇతర దేవగణాలని చేరుకుంది. హెరాక్లీస్ భౌతిక శరీరం మీద మంటలు లేచాయి. ఆ మంటలు ఎగసి స్వర్గందాకా వెళ్ళేయి. ఆకాశం ఎర్రబడింది. హెరాక్లీస్ నక్షత్ర లోకంలో చిరస్థాయిగా నిలచిపోయేడు. చీకటిరాత్రి తలెత్తి ఆకాశం వైపు చూస్తే హెర్క్యులిస్ నక్షత్ర మండలాన్ని గుర్తించడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఆ రాశిలో పేరెన్నికగన్న నక్షత్రాలు ఏవీ లేవు. ఈ రాశి బూటెస్ (భూతేశ), లైరా (వీణ) మండలాలకు మధ్యస్థంగా, అఫియాకస్‌కి తల తగులుతోందా అన్నట్లు తలకిందులుగా కనిపిస్తుంది. హెర్క్యులిస్ నక్షత్ర మండలాన్ని జాగ్రత్తగా చూస్తే ఒక తెల్లని మచ్చ కనిపిస్తుంది. దీనిని దుర్భిణిలో చూస్తే ఇది ఒక నక్షత్రాల గుత్తి (star cluster) అని తేలింది. దీనిని వేదకాలపు భారతీయులు గుర్తించి ఋగ్వేదం 1-154-5వ మంత్రంలో, విష్ణోః పదే పరమే మధ్య ఉత్సః అన్నారు. అంటే, విష్ణుపద మండలంలో గొప్ప తేనెపట్టు వంటి చక్కని దృశ్యం అని అర్థం! హెరాక్లీస్ గ్రీకు యోధులందరిలోకి ఎక్కువ కీర్తిప్రతిష్ఠలు గడించేడు. ప్రపంచవ్యాప్తంగా ఇతనికి ఉన్నన్ని విగ్రహాలు మరే గ్రీకు యోధునికి లేవేమో! ఇతని విగ్రహాలన్నిటిలోను గడ్డం లేని ముఖం, కండలు తిరిగిన శరీరం, చేతిలో విల్లమ్ములకు బదులు దుడ్డుకర్ర ఉండడం, సింహపు చర్మం వీపు మీద వెళ్ళాడుతూ ఉంటే సింహపు పంజాలు మెడ కింద ముడేసినట్లు ఉండడం సర్వసాధారణం. హెరాక్లీస్ చేసిన వీరవిహారాలలో భారతదేశపు పొలిమేరలలోకి కూడా వచ్చేడని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి ఋజువుగా మధురలో దొరికిన తల లేని హెరాక్లీస్ విగ్రహం ఒకటి కొల్‌కతాలోని ఒక సంగ్రహాలయంలో ఉంది!
05-09-2021, 12:46 AM
గ్రీకు పురాణ గాథలు 11
పంకజ ప్రాదుర్భావం The basic theme of mythology is that the visible world is supported and sustained by an invisible world. – Joseph Campbell
ఎన్నో గ్రీకు పురాణ గాథలలో కొన్నింటిని మాత్రమే ఇంతవరకు మచ్చు చూసేం. ఇక్కడ ప్రస్తావించకుండా దాటేసిన కథలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ కథలు అన్నిటిలోను ఉమ్మడిగా కనిపించే అంశాలు: సృష్టి జరిగిన విధానం, ఆ సృష్టిలో మూడు తరాల అమరులు అధికారం కోసం ఒకరితో మరొకరు పోటీ పడడం. ఈ పోటీలో కేవలం ఒక ఆటవస్తువుగా మానవుడి స్థానం. అమరులలో మొదటితరంవారు ప్రకృతి శక్తులకు అమూర్త్యప్రతీకలుగా (amorphous symbols) కానీ అపరావతారాలుగా (personified concepts) కానీ మాత్రమే కనిపిస్తారు. ఇవే భూమి, ఆకాశం, వాటి కలయిక వల్ల పుట్టిన సముద్రాలు, కొండలు, వింతప్రాణులు, వగైరా. క్రమేపి మూడవ తరానికి వచ్చేసరికి ఒలింపస్ పర్వతం మీద స్థిరనివాసం ఏర్పరచుకున్న అమరులకు అతీంద్రియ శక్తులతోపాటు మానవ ఆకారాలు, మానవ బలహీనతలు వస్తాయి. ఇలా పురాణ గాథల మీద ఆధారపడ్డ తత్త్వజ్ఞానంతో మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇలానే ఎందుకు ఉందో చెప్పడానికి ప్రయత్నం చేసింది అలనాటి ఆ సమాజం. అంటే, ఎదురుగా జరుగుతున్న కార్యానికి వెనకనున్న కారణం ఏమిటో విశదీకరించడానికి ప్రయత్నం చేసింది. ఈ కారణం మానవాతీత శక్తుల ప్రభావం కూడా అయి ఉండవచ్చనే గట్టి నమ్మకం ఒకటి వారిలో ఉండేది. అనగా ప్రతి కర్మ వెనక కర్త ఒకటి ఉంటుందనిన్నీ, ఆ కర్త మానవుడైనా కావచ్చు, అమరలోకంలోఉన్న దేవుడైనా కావచ్చనిన్నీ. ఉదాహరణకి సముద్రాలకి అధిదేవత అయిన పొసైడన్ (Poseidon) సంగతి చూద్దాం. పెద్ద సముద్రతీరం ఉన్న ప్రాంతం కనుక గ్రీకులకి సముద్రదేవుడు చాల ముఖ్యుడు. ఈ ప్రాముఖ్యత చూపడానికి పొసైడన్ ఆయుధం త్రిశూలం. పొసైడన్‌కి కోపం వచ్చినప్పుడు ఆ త్రిశూలం పట్టుకుని నేలని గట్టిగా గుద్దుతాడు. ఆ తాకిడికి భూమి కంపిస్తుంది. అదే భూకంపం. గ్రీకుల కార్య-కారణ చయనికలో దేవుళ్ళ పాత్ర ఇలా ప్రవేశిస్తుంది. కనుక గ్రీకుల దృక్పథంలో పొసైడన్ సముద్రదేవుడు అవడమే కాకుండా భూకంపాలకి కారకుడు కూడా! ఈ కోణంలో చూస్తే ప్రాచీన కాలపు గ్రీసు దేశస్థులకి ఎదుట కనిపిస్తున్న దృగ్విషయం వెనుక ఏదో కారణం ఉండాలనే నమ్మకం ఉండబట్టే ఆ కారణం ఏదో తెలియక కంటికి కనపడని దేవుడిని ఆశ్రయించారు. ఈ సందర్భంలో హోమర్ తత్త్వజ్ఞానం గురించి మరికొంచెం తెలుసుకుందాం. హోమర్ రచించిన ఇలియడ్, ఆడెసి గ్రంథాలు ప్రాచీన గ్రీకు సంస్కృతికి అద్దం పడతాయి కనుక ఈ రెండింటిని అధ్యయనం చేయడం గ్రీకుల ఆలోచనావిధానాన్ని అర్థంచేసుకోవడానికి కీలకం; ఆ మాటకి వస్తే పాశ్చాత్య నాగరికతని, సృష్టిలో మానవుని స్థానం గురించి వారి ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకోవడానికి కూడా కీలకం. భారతీయ విలువలకి, సంస్కృతికి రామాయణ మహాభారతాలు ఎలాంటివో పాశ్చాత్య విలువలకి, సంస్కృతికి ఇలియడ్, ఆడెసిలు అలాంటివి అంటే అతిశయోక్తి కాదు. ఇలియడ్ లోని ఒకటి, రెండు ముఖ్యమైన అంశాలని తీసుకుని ఆ రోజులలో సృష్టి యొక్క నిజ స్వరూపం వారికి ఎలా అర్థం అయిందో చూద్దాం. ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ట్రోయ్ యోధుడు హెక్టర్ ఎందుకు చచ్చిపోయాడు? ఏఖిలిస్ చంపేడు కనుక హెక్టర్ చచ్చిపోయాడు! ఏఖిలిస్ ఎందుకు చంపేడు? స్థూలంగా చెప్పుకోవాలంటే గ్రీసు దేశానికీ ట్రోయ్ దేశానికి మధ్య యుద్ధం జరిగింది కనుక. ప్రత్యేకించి కారణం కావాలంటే పట్రోక్లస్ మరణానికి ప్రతీకారంగా ఏఖిలిస్ హెక్టర్ని చంపేడు. ఇలా వెతుకుతూ పోతే ప్రతి సంఘటనకి, ప్రతి కార్యానికి వెనక ఒక కారణం కనిపిస్తుంది. లేదా, ఒక కార్య-కారణ చయనిక కనిపిస్తుంది. మరొక మెట్టు పైకి వెళ్లి చూద్దాం. గ్రీసు దేశం, ట్రోయ్ దేశం ఎందుకు యుద్ధం చెయ్యవలసి వచ్చింది? పేరిస్, హెలెన్ ప్రేమలో పడ్డారు కనుక. తన భార్య మరొకని యెడల అనురాగం చూపుతున్నదని ప్రతీకార జ్వాలలతో మెనలౌస్ మండిపడుతున్న కారణంగా. ఆగమెమ్నాన్ అధికారదాహం ఎక్కువ అయిన కారణంగా. ఏఖిలిస్‌కి కీర్తి కాంక్ష ఎక్కువయి. ఇలా ఈ జాబితాని పొడిగించుకుంటూ పోవచ్చు. హోమర్ దృక్‌క్షేత్రంలో మానవుడు చేసే కృత్యాలకి ప్రేరణ కారణాలు అనేకం: ప్రేమ, ప్రతీకారం, అధికారదాహం, కీర్తి. పైన ఉదహరించిన కార్య-కారణ చయనిక మానవ ప్రపంచంలో సహజం అని మనం సంతృప్తి పడవచ్చు. ఒక సంక్లిష్టమైన అంతర్నాటకంలో మానవుల కోరికలు, వాటి ప్రేరేపణలు, తద్వారా జరిగే చర్యలు, ప్రతిచర్యలు కారణంగానే ట్రోయ్ యుద్ధం లాంటి సమరాలు, హెక్టర్ మరణం లాంటి సందర్భాలు ఎదురవుతాయి. కానీ హోమర్ చెప్పిన కథ ఇంత సజావుగా సాగదు; ఎందుకంటే ఆ కథ అల్లికలో దేవుళ్ళకి కూడా ప్రముఖమైన పాత్ర ఉంది. హెక్టర్‌కి ఏఖిలిస్‌కి మధ్య భీకరపోరాటం జరగబోయే ముందు హోమర్ కథాగమనాన్ని దేవుళ్ళ వైపు తిప్పుతాడు. వారంతా జరుగుతున్న కార్యక్రమాన్ని స్వర్గంలో కూర్చుని చూస్తూ ఉంటారు, ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న చదరంగపు పోటీని బయట నుండి ప్రేక్షకులు చూస్తున్నట్లు. కానీ తటస్థంగా ఉండరు; ఇరు పక్షాలని సమర్థిస్తూ, వాళ్ళకి సలహాలు ఇస్తూ, వారి ఆటలలో కలుగజేసుకుంటూ ఉంటారు. హెక్టర్‌ని తరుముతున్న ఏఖిలిస్‌ని చూసి జూస్ ఒక పక్క ఏఖిలిస్ ధైర్య సాహసాలని మెచ్చుకుంటూ, మరొక పక్క ప్రేమానుబంధంతో హెక్టర్‌ని సమర్థిస్తూ ఉంటాడు. తాను ఎవరి పక్షం కాయాలి? తన్యతని భరించలేక ఇతరులని సలహా ఇమ్మని కోరతాడు. Quote:“Come you immortals, think this through. Decide.ఎథేనా సలహా మేరకు హెక్టర్ చావుకే సమ్మతిస్తాడు, జూస్. Quote:“Go. Do as your own impulse bids you. Hold back no more.” ఇలా గ్రీకు దేవతలు మానవులని చదరంగంలోని పావులలా వాడుకుని ఆటలు ఆడుకున్నారు. వారికి శక్తియుక్తులు ఉన్నాయేమో కాని శీలసంపద ఉన్నట్లు కనిపించదు. అటువంటి దేవతలకి సహజాతీతమైన, ఆధిదైవిక (supernatural) శక్తులు ఉన్నాయని నమ్మి, వారిని ఆరాధించిన గ్రీకు ప్రజానీకానికి మంత్రమహిమల మీద, దేవుళ్ళు ఇచ్చే వరాల మీద, శాపాల మీదా నమ్మకం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ కాలపు ఆధునిక వైజ్ఞానిక, హేతువాద దృక్పథంతో చూస్తే వారిది చాల వెనకబడ్డ సమాజంలా అనిపిస్తుంది. ఇటువంటి ‘వెనకబడ్డ’ సమాజం అకస్మాత్తుగా సా. శ. పూ. 5వ శతాబ్దం వచ్చేసరికి ఒక్కసారి ఉలిక్కిపడి మేలుకున్నదా అనిపిస్తుంది. ఎందుకంటే నేడు ప్రపంచం నలుమూలల ప్రజ్వరిల్లుతున్న ఆధునిక, శాస్త్రీయ, తార్కిక దృక్పథానికి పునాదులు గ్రీసు దేశంలోనే పడ్డాయి. పంకిలమైన బురద భూమిలో ఈ పద్మం ఎలా పుట్టుకొచ్చింది? ఈ మార్పు ఏ పరిస్థితులలో జరిగిందో ఇటుపైన విచారిద్దాం.
05-09-2021, 01:06 AM
గ్రీకు తత్త్వవేత్తల ప్రాదుర్భావం
బురద లోంచి తామర పువ్వు పుట్టుకొచ్చినట్లు పురాణగాథలలో ములిగి తేలుతున్న గ్రీసు సమాజంలో అకస్మాత్తుగా విప్లవ వీచికలు తెరలు తెరలుగా తలెత్తడం మొదలయింది. ముందస్తుగా గ్రీసు చరిత్రలో కాలరేఖని ఒకసారి సమీక్షిద్దాం. గ్రీకు దేవతలు అస్తవ్యస్తత నుండి ఎప్పుడు పుట్టుకొచ్చేరో, ఒలింపస్ పర్వతం మీద ఎప్పుడు స్థిరపడ్డారో మనకి తెలియదు. కానీ ట్రోయ్ యుద్ధం జరిగేనాటికి (ఉరామరికగా సా. శ. పూ.1100) ఆ సమాజంలో ఆ దేవతల కథలు, ఆ నమ్మకాలూ స్థిరపడిపోయాయి. ఆ నమ్మకాలని ఆధారంగా చేసుకుని హోమర్ తన ఇలియడ్, ఆడెసి గ్రంథాలని మౌఖిక ధోరణిలో (ఉ. సా. శ. పూ. 800లో) రచించి ఉంటాడు. ఈ మౌఖిక సాహిత్యం గ్రంథరూపం దాల్చేసరికి మరికొంత కాలం పట్టి ఉండొచ్చు. వీటన్నిటిని ఆధారంగా చేసుకుని హెసియోడ్ తన చరిత్రని (ఉ. సా. శ. పూ. 700లో) రాసి ఉంటాడు. డెల్ఫైలో ఉన్న ఒరాకిల్ మీద నమ్మకాలు అలెగ్జాండర్ కాలం వరకు ఉన్నట్లు దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఈ కథలు, ఈ నమ్మకాలు అలెగ్జాండర్ (ఉ. సా. శ. పూ. 350) కాలం వరకు ప్రచారంలో ఉన్నాయని మనం తీర్మానించవచ్చు. ఇలాంటి వాతావరణపు నేపథ్యంలో మేఘాలు లేని ఆకాశం నుండి మెరుపులు మెరిసినట్లు, పిడుగులు పడ్డట్లు గ్రీకు సమాజంలో పెనుమార్పు చోటుచేసుకోవడం మొదలయింది. వీటిని అర్థం చేసుకోవాలంటే గ్రీసు దేశపు చరిత్రని కొన్ని యుగాలుగా విభజించి అధ్యయనం చెయ్యడం సంప్రదాయకంగా వస్తున్న ఆచారం. ఈ యుగాలని ఈ దిగువ పట్టికలో చూపెడుతున్నాను. ఇక్కడ BCE అంటే Before the Common Era లేదా లేదా క్రీస్తు శకానికి పూర్వం (క్రీ. శ. పూ.) అని అర్థం. (చూపిన సంవత్సరం పెద్దది అయినకొద్దీ కాలరేఖ మీద వెనక్కి వెళుతున్నామని గుర్తు పెట్టుకోవాలి.)
చరిత్రలో చాలాకాలంపాటు ప్రపంచం నలుమూలల సత్యాన్వేషణ, భగవదాన్వేషణ అన్నవి పర్యాయపదాలుగా వాడడం జరిగింది. భగవంతుని ప్రస్తావన తీసుకుని రాకుండా కేవలం ప్రకృతి సత్యాలని గురించి తెలుసుకోవాలనే కుతూహలం పుట్టేసరికి కొంతకాలం పట్టింది. అది గౌతమ బుద్ధుని కాలం. ఎందువల్లనో ప్రపంచంలో పలుచోట్ల తార్కికమైన చింత బాగా పెరిగింది. దేవుడనే భావం మీద ఆధారపడకుండా కంటికి ఎదురుగా ఉన్న సృష్టి విచిత్రాన్ని అవగాహన చేసుకుందుకి మానవుడు ప్రయత్నించేడు. భారతదేశంలో గౌతమ బుద్ధుడు, చైనాలో కన్ఫూషియస్, గ్రీసు దేశంలో థేల్స్, అనాక్సిమేండర్ మొదలైనవారు సమకాలికులవడం గమనార్హం! భారతదేశంలో బౌద్ధధర్మం కార్య-కారణ వాదానికి విత్తులు నాటడం మొదలుపెట్టింది. ‘ఇది కీలకమైన సంఘటన. ప్రకృతికి అతీతమైన దానిని తిరస్కరిస్తూ బుద్ధుడు మూడు విధానాలు చెప్పాడు. మానవుడిని హేతువాద దృక్పథం వైపు నడిపించడం మొదటిది. మానవుడిని సత్యాన్వేషణ వైపు స్వేచ్ఛగా పయనింప చేయడం రెండవది. మూఢనమ్మకాలను అనుసరించడం ద్వారా మానవుడు అన్వేషణా శక్తిని కోల్పోతాడు అని చెప్పడం మూడవది. దీనినే కర్మ లేదా కార్యకారణ సిద్ధాంతం అంటారు. బౌద్ధ ధర్మంలో కార్యకారణ సిద్దాంతం అత్యంత కీలకమైంది. ఇదే సమయంలో చైనాలో కన్ఫూషియస్ (Confusius) మరొక దారి చూపేడు. పెద్దల యెడల, కుటుంబ సభ్యుల యెడల, దేశం యెడల గౌరవ ప్రపత్తులతో మెలగాలి అన్నది మొదటి సూత్రం. నేటికీ పెద్దల యెడల, అధికారుల యెడల చైనావారు చూపే గౌరవ మర్యాదలు శ్లాఘనీయం. కుటుంబాభిమానం వారిలో ఎక్కువ. కలిసికట్టుగా సంఘశ్రేయస్సు కోసం పాటుపడడం అనేది కన్ఫూషియస్ ఆలోచనకి మూలస్తంభం. కుటుంబం కోసం, సంఘం కోసం, దేశం కోసం సమష్టిగా పనిచెయ్యాలి. వ్యష్టిగా ఎవరి మోక్షం కోసం వారు విద్యార్జన, ధనార్జన చేస్తే సరిపోదు; సంఘశ్రేయస్సు కోసం సమష్టిగా కూడా పని చెయ్యాలి. ఈ రకం ధర్మ సూక్ష్మాలు హిందువులకి తెలియనివి కావు. ఉదాహరణకి Quote:ఒరులేయవి యొనరించిన హిందూ దృక్పథంలో ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న సూక్తి కేవలం ప్రచారం కోసం బేనర్ మీద రాసుకుందుకే! ‘మనం ఉండే సంఘం బలంగా ఉంటే అదే మన బలం’ అనే ఆలోచన మనలో తక్కువ. ‘ఎవరి కర్మ వారిది’ అనే వేదాంత ధోరణిలో ఉన్నవారికి సంఘంతో పనేమిటి? మన నుదుటి రాత బాగులేకపోతే ఆ రాసినవాడి దగ్గరకే వెళ్లి వాడికే కాసింత లంచం ఇస్తే సరిపోలేదూ? రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ సంపర్కం ఉన్నప్పటికీ అది సంఘానికీ వ్యక్తికీ మధ్య ఉన్న పరస్పరాధారబంధంపై మన దృక్పథాన్ని మార్చలేకపోయింది. కానీ ఇదే దేశంలో తరతరాలబట్టి స్థిర నివాసం ఏర్పరచుకున్న పార్శీలు వితరణ శీలానికి, సంఘాభ్యుదయనికీ మధ్య ఉండే లంకె బాగా అర్థం చేసుకున్న వ్యక్తులు. అభివృద్ధి అనేది వ్యష్టిగా కాక సమష్టిగా జరగవలసిన కార్యక్రమం అని వారు గుర్తించేరు. ఈ అభ్యుదయ దృక్పథంతో వారు మన దేశపు పునర్నిర్మాణానికి అవసరమైన సంస్థలు ఎన్నో స్థాపించేరు. ఈ తర్జనభర్జనలని పక్కకి పెట్టి, బుద్ధుడి కాలానికి తిరిగి వెళదాం. ఆ కాలంలో ఆధునిక వైజ్ఞానిక దృక్పథానికి ఆద్యుడు అనదగ్గ గ్రీకు తత్త్వవేత్త థేల్స్ (Thales) ‘ఈ ప్రపంచం దేనితో తయారయింది?’ అని ఒకసారి ప్రశ్నించేడు. మేఘాలు, మృగాలు, వృక్షాలు, ఇలా వివిధ రూపాలలో కనిపిస్తూన్న ఈ స్థూలప్రపంచం అంతా సూక్ష్మరూపంలో ఒక్కటేనా? మనకి దృగ్గోచరమయే బహుళత్వంలో ఏకత్వం ఉందా? సృష్టి అంతా మన మేధకి అందనంత క్లిష్టమైనదా లేక విశ్లేషించి అధ్యయనం చేస్తే అర్థం అవుతుందా? ఇటువంటి ప్రశ్నలతో ఆయన చాలకాలం కుస్తీపట్టేడు. మట్టితో ఇటుకలు చేసి, ఆ ఇటుకలని మూలపదార్థంగా వాడి రకరకాల ఆకారాలలో గోడలు, ఇళ్లు, గుడులు, గోపురాలు కట్టినట్లే సృష్టిలో మనకి కనిపించేవన్నీ – అంటే, మేఘాలు, మృగాలు, వృక్షాలు, వగైరాలు – ఒక మూలపదార్థంతో తయారయి ఉండాలని ఆయన వాదించేవాడు. ఆ మూలపదార్థం ఏమయి ఉంటుంది? ఆయన సముద్రపు ఒడ్డున నివసించేవాడు. రోజూ ఎదురుగా ఉన్న మహాసాగరాన్ని చూసి, చూసి సృష్టికి మూలం నీరు అన్నాడు. అంటే, ప్రపంచంలోని పదార్థాలన్నీ నీటితో తయారు చెయ్యబడ్డాయని ఆయన ఆలోచన. సృష్టికి మూలం జలం. సర్వవ్యాప్తమయిన జలం నుండే సృష్టి మొదలయి ఉండాలి. ఇదీ ఆయన ప్రవచనం. ఈ కొత్త దృక్కోణంలో భగవంతుని ప్రస్తావన లేదు, మానవాతీత శక్తులకు స్థానం లేదు. థేల్స్ ప్రవచనం అందరికీ ఆమోదయోగ్యం కాలేదు. అందరి వరకు ఎందుకు? ఆయన దగ్గర శిష్యరికం చేస్తూన్న అనాక్సిమేండర్ (Anaximander) గురువుగారితో ఏకీభవించలేదు. ఇసుకలో నీళ్లు లేవు. నీటి కంటె సర్వవ్యాప్తమైనది భూమి. కనుక సృష్టికి మూలం భూమి అన్నాడు అనాక్సిమేండర్. నీటి కంటె, భూమి కంటె సర్వవ్యాప్తమైనది గాలి కనుక, సృష్టికి మూలం గాలి అవాలి అని అనాక్సిమెనెస్ (Anaximenes) వాదించేడు. సర్వవ్యాప్తం అయినంత మాత్రాన సరిపోదు, శక్తిమంతమై ఉండాలి కనుక సృష్టికి మూలం అగ్ని అయితే బాగుంటుందని హెరాక్లిటస్ (Heraclitus) ముచ్చటపడ్డాడు. ఇంతకీ ఈ నాలుగింటిలో దేనికి అగ్రస్థానం ఇవ్వాలి? ఈ తగువు తీర్చడానికి ఎంపెడాక్లెస్ (Empedocles) అనే తత్త్వజ్ఞుడు మధ్యవర్తిత్వం వహించేడు. అన్ని పక్షాలవారి వాదనలని పూర్వపక్షం చేస్తూ, ‘సృష్టికి మూలం నీరు, నిప్పు, గాలి, మట్టి’ అంటూ తుని తగవులా తీర్పు చెప్పేడీయన. సృష్టికి మూలం నీరు, మట్టి, గాలి, నిప్పు అనగానే సరిపోతుందా? వీటిల్లో దేనికి పెద్దరికం ఇవ్వాలన్న సమస్య ఎదురయింది. ఈ సమస్యని అరిస్టాటిల్ (Aristotle) అనే తత్త్వవేత్త పరిష్కరించేడు. విశ్వానికి మధ్యలో భూమి ఉందన్నాడు ఆయన. ఈ భూగోళం చుట్టూ ఆవరించుకుని జలగోళం ఉందన్నాడు. భూమి మీద మనకి కనిపించే చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాలే ఈ జలగోళం అంటే. ఈ జలగోళం చుట్టూ వాయుగోళం ఉందన్నాడు. భూమిని ఆవరించుకుని ఉన్న వాతావరణమే ఈ వాయుగోళం. ఈ వాయుగోళం చుట్టూ అగ్ని గోళం ఉందన్నాడు. అప్పుడప్పుడు వాయుగోళానికి చిల్లుపడితే, ఆవల ఉన్న అగ్ని గోళమే మనకి మెరుపుల రూపంలో కనిపిస్తుందని అరిస్టాటిల్ వాదించేడు. అగ్ని గోళానికి బయట ఏమి ఉంది? ఏమీలేదు. ఏమీ లేకపోవడమేమిటి? శూన్యం ఉంది కదా! ఆ ఏమీ లేని ఖాళీ ప్రదేశాన్నే – సున్నాతో పరిచయం ఉన్న మనవాళ్లు – ఆకాశం అన్నారని నా అభిప్రాయం. ఇలా గ్రీసు దేశంలో థేల్స్, సోక్రటీస్, అరిస్టాటిల్, ఆర్కిమెడిస్ ప్రభృతులు తరతరాలుగా ప్రజలలో పాతుకుపోయిన మూఢనమ్మకాలని, ఆచార వ్యవహారాలని ప్రశ్నించడం మొదలుపెట్టేరు. అయితే, ఈ వాదనలన్నిటిని పూర్వపక్షం చేసింది ఆధునిక భౌతికశాస్త్రం అన్నది వేరే విషయం. థేల్స్ సాధించినది అప్పటివరకు కరడుకట్టుకుపోయిన సహజాతీతమైన, ఆధిదైవిక శక్తుల మీద నమ్మకాన్ని తోసిపుచ్చడం! (సమాప్తం)
06-09-2021, 07:39 AM
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
06-09-2021, 01:00 PM
[size=large][b]పాశ్చాత్యులు హోమర్ రాసిన ఇలియడ్ (Iliad), ఆడిస్సిలతో (Odyssey) వ్యాసుడు రాసిన భారతాన్ని పోలుస్తారు. కేవలం ఉపరితలం మీద కనిపించవచ్చేమో కానీ లోతుగా పరిశీలిస్తే ఈ పోలిక సరికాదు. హోమర్ రాసిన ఇలియడ్, ఆడిస్సిలు రెండింటికంటే భారతం రెట్టింపుకి మించి పొడుగు ఉంటుంది! అంతే కాదు; భారతంలో ఆద్యంతం ఒక కథ ఉంది. ఆ కథ వెనుక ఒక బందుకట్టు ఉంది. భారత యుద్ధం మానవుల అత్యాశ వల్ల జరిగితే ట్రాయ్ యుద్ధం దేవతల చెలగాటాల వల్ల జరుగుతుంది. ట్రాయ్ యుద్ధంలో మానవులు దేవతల చేతిలో కేవలం పావులు. భారతం మీద వ్యాఖ్యానాలు చేసిన అనేక పాశ్చాత్యులు గ్రీకు పురాణ గాథల వల్ల ప్రభావితులై గ్రీకు పురాణ కాలపు పట్టకం ద్వారా చూస్తూ చేసేరు తప్ప స్వతంత్రమైన దృక్పథంతో చేసినవారు కారని నా అభిప్రాయం.
meeru raasthunna theeru chusthe meeru professor ga retire ayi vuntarani voohisthunna. mee presentation excellent. Vyasa bhagavanudu maha bharathaanni oka thesis la raasaaru. Satya lokam loni Mahabhishudu Sura ganga la vaancha, maanava sareeraalu leka poyina, brahma lokamlo sambhavinchindi. Santanudi ga puttina Mahabhishudu bhuloka vanchalu theeraka Satyavathini pelli chesukuni mahabharatha yudhaniki karakudayyadu. Mahabhagavathamayithe, purthiga chinnappatinunche Dhruvudi la Prahladula Vishnu bhakthilo tharinchamani siddhanthareekarinchadu. Alexander dandayathra ki vachhe varaku greekula tho sambandham lekapothe mana itihaasaalu mana puranalu vere adhyathmika alochanalani, thadanugunamayina prayathnalani, achievements ni propose chesayani, nenu bhavisthanu.
27-11-2021, 01:10 PM
(This post was last modified: 27-11-2021, 04:21 PM by Roberto. Edited 3 times in total. Edited 3 times in total.
Edit Reason: భావవ్యక్తీకరణ మెరుగు పరచుట కొరకు
)
(04-09-2021, 08:06 PM)WriterX Wrote: వే.వేం గారు, మీరు ప్రపంచ కావ్యాలను అందింపదలచడం ఇక్కడి పాఠకుల అదృష్టం... మన సాహిత్యమే కాకుండా, ముఖ్యంగా మనలో చాలా మంది ఎక్కువగా పాశ్చాత్య పోకడలు, అవలంబించి అనుసరిస్తున్న తరుణంలో మీరు ప్రపంచ సాహిత్యాన్ని ఈ ఫోరంలో మాకు పరిచయం చేయడానికి సాహసించడం ఎంత ప్రశంసించినా తక్కువే... ఈ రోజు మనం అక్షరాస్యులై, వాడే లిపి క్యూనీఫార్మ్ లిపి నుండి, గ్రీకు లిపి ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఆవిర్భవించింది. అట్టి గ్రీకు చరిత్రా, సాహిత్యాలను తెనుగీకరించుట స్లాఘనీయము... . ఇట్ ఈజ్ ఎ ఫెధర్ ఇన్ యువర్ కేప్... ఆ తదుపరే, మన లిపులన్నీ కాలక్రమేణా ఆవిర్భవించాయి... అలంకారాలలో ఈ ఫోరం లో అత్యంత మధురానుభూతి నిచ్చే శృంగార అలంకారం మన ముద్దు తెలుగు లిపిలో వ్రాయబడి, మన శృంగార వీరన్స్ (మనం ఇష్టపడే...ఆర్గన్ రెయిౙర్స్ - Organ raisers - రచయితలు) మనలను అలరిస్తున్నారు... ఒక్క క్షణం లిపి లేని శృంగారం ఎలా ఉంటుందో ఊహించుకోండి... చిత్రములంటారా...హ్మ్...హా...న్గ్...ఊం...ఉమ్హ్...ఆ శబ్దాలుంటేనే...మౙా... ఇక్కడి కొంత మంది పెద్దలతో (ఏ సాహిత్య పరంగానైనా సరే) కలసి, మరొక గొప్ప రచయిత ఇక్కడ వెలవడం మా సుకృతము భాషాధోషములుంటే హితులు మన్నించాలని మనవి... |
« Next Oldest | Next Newest »
|