31-08-2021, 06:29 PM
SUPER SODARA KANI KONCHEM LONG STORY IVANDI PLS
Thriller రాజతంత్రం
|
31-08-2021, 06:29 PM
SUPER SODARA KANI KONCHEM LONG STORY IVANDI PLS
31-08-2021, 09:36 PM
01-09-2021, 08:24 AM
అప్డేట్ చాలా బాగుంది ....ఎక్కడ బోర్ కొట్టకుండా ... నెక్స్ట్ ఏమవుతుందో..అని చాలా ఇంట్రెస్టింగ్ గ సాగుతోంది మీ కథ...
సూపర్
01-09-2021, 09:13 AM
01-09-2021, 09:14 AM
01-09-2021, 09:14 AM
సిద్ధార్థ polo match కోసం రెడీ అవుతున్నాడు తనతో పాటు ఈ మ్యాచ్ లో మార్కిన్, విలియమ్స్, ఇంకా ఇద్దరు వేరే దేశ ప్రతినిధుల పిల్లలు కూడా ఉన్నారు కాకపోతే అక్కడ ఉన్న వాళ్లు అందరికీ ఒక గుర్రం సొంతం గా ఉంది సిద్ధార్థ కీ సొంత గుర్రం లేదు దాంతో తనని stallion లోకి వెళ్లి ఒక గుర్రం నీ చూసుకోమని చెప్పారు అప్పుడు సిద్ధార్థ stallion లోకి వెళ్లాక అక్కడ ఉన్న గుర్రాలు అని చూస్తూ ఉన్నాడు అప్పుడు ఒక మూల నుంచి "hey stop it" అని వినిపించింది ఏంటా అని వెళ్లి చూస్తే అక్కడ విలియమ్స్, డోని నీ గోడకి ఆనించి నడుము చుట్టూ చేతులు వేసి పెదవి పైన ముద్దు పెట్టాలి అనుకుంటున్నాడు డోని పైకి వద్దు వద్దు అంటున్న తనలోని కోరిక తనని ముందుకు తోస్తుంది అప్పుడు సిద్ధార్థ లవ్ బర్డ్స్ అని పిలిస్తే ఇద్దరు కంగారు గా వెనకు జరిగారు దానికి సిద్ధార్థ "సారీ సారీ continue but focus on the game bro" అని చెప్పాడు ఆ తర్వాత సిద్ధార్థ గుర్రం కోసం వెళుతుంటే సోఫియా ఒక గుర్రం నీ మచ్చిక చేసుకుంటు దాని ముద్దు చేస్తుంది అలా తన దగ్గరికి వెళ్లి "ఇది నీదా" అని అడిగాడు సిద్ధార్థ దానికి సోఫియా "లేదు కానీ నాకూ ఇది నచ్చింది నువ్వు దీని ట్రై చేయవచ్చు కదా" అని అడిగింది దానికి సిద్ధార్థ ఆ గుర్రం మీద చెయ్యి వేయబోతే ఆ గుర్రం గట్టిగా రంకె వేసింది అయిన కూడా సిద్ధార్థ ఆ గుర్రం మెడ మీద చెయ్యి వేసి రుద్దుతు దాని మచ్చిక చేసుకున్నాడు అప్పుడు సోఫియా "నీకు గుర్రాలను అదుపు చేయడంలో చాలా అనుభవం ఉన్నట్లు ఉంది" అని ఒళ్లు విరుస్తు కొంటెగా చూస్తూ చెప్పింది కానీ సిద్ధార్థ దానికి పట్టించుకోకుండా గుర్రం ఎక్కి స్టేడియం దగ్గరికి వెళ్ళాడు.
మ్యాచ్ స్టార్ట్ అయ్యింది అడానిస్ మెరుపు స్పీడ్ లో బాల్ నీ డెనిస్ కీ పాస్ చేశాడు అప్పుడు సిద్ధార్థ కీ బాల్ ఎటు వైపు వెళ్లింది కూడా అర్థం కాలేదు కంటికి కనిపించని అంత వేగంగా ఎలా వెళ్లింది అని ఆలోచిస్తూ ఉండగానే ఇద్దరు అన్నదమ్ములు గోల్ వేశారు అప్పుడు విలియమ్స్, సిద్ధార్థ దగ్గరికి వచ్చి "బ్రో ఈ నా కొడుకులు మొదటి గోల్ కే చుక్కలు చూపించారు తరువాత ఏమీ అవుతుందో అర్థం కావడం లేదు" అని అన్నాడు దానికి సిద్ధార్థ "నేను అవుట్ ట్రాక్ లో ఉంటాను నువ్వు, మార్కిన్ బాల్ steal చేయడానికి చూడండి ఈ లోగా నేను ఏమైనా చేయగలగితే చేస్తా" అన్నాడు దాంతో విలియమ్స్ ఎటాక్ కీ వెళ్లాడు అప్పుడు సిద్ధార్థ మొత్తం ఆట గమనించడం మొదలు పెట్టాడు అప్పుడు తనకు అర్థం అయ్యింది ఒకటి అడానిస్ కీ స్పీడ్ తన గుర్రం నుంచి వస్తుంది అతని గుర్రపు స్వారీ నైపుణ్యం వల్ల గుర్రం స్పీడ్ తన బాల్ పాస్ కీ ఉపయోగ పడుతుంది, డెనిస్ వైపు చూస్తే అతని ఎత్తు అతని బలం తన చెయ్యి పొడుగు వల్ల అతను బాల్ నీ తేలిక గా సొంతం చేసుకుంటున్నాడు దాంతో వాళ్ల strategy అర్థం అయిన సిద్ధార్థ, మార్కిన్ వైపు చూసి డెనిస్ నీ block చేయమని చెప్పాడు దాంతో విలియమ్స్, మార్కిన్ ఇద్దరు డెనిస్ నీ block చేసే పనిలో ఉన్నారు అప్పుడు అడానిస్ కీ ఎదురుగా సిద్ధార్థ వేగం గా వెళ్లి అడానిస్ polo స్టిక్ కీ తన స్టిక్ అడ్డు పెట్టాడు అప్పుడు అడానిస్ వేగం కారణంగా సిద్ధార్థ గుర్రం నుంచి జారి పడ్డాడు అది foul అయ్యింది దాంతో సిద్ధార్థ టీం కీ పెనాల్టీ పాయింట్ ఇచ్చారు దాంతో స్కోర్ సమానంగా ఉంది అప్పుడే హాఫ్ టైమ్ వచ్చింది మార్కిన్ సిద్ధార్థ తో "నీకు పిచ్చి పట్టిందా పొయి పోయి వాడికి అడ్డు పడ్డావు కొంచెం ఉంటే ప్రాణం కీ ప్రమాదం" అన్నాడు కానీ సిద్ధార్థ పట్టించుకోకుండా అందరినీ దగ్గరికి రమ్మని చెప్పి తన గేమ్ ప్లాన్ చెప్పాడు. అది ఏంటి అంటే అవతలి టీం లో ఆ ఇద్దరు అన్నదమ్ములు తప్పితే మిగిలిన వాళ్ళు అంత gripping ప్లేయర్స్ కాదు దాంతో అడానిస్ వేగం కీ స్పీడ్ బ్రేకర్ వేస్తే చాలు తాము గెలవచ్చు అని చెప్పాడు అందరూ చేస్తున్న తప్పు ఏంటి అంటే అడానిస్ కీ కావాల్సిన అంత స్పేస్ ఇస్తున్నారు కాబట్టి ఆ స్పేస్ మొత్తం conjust చేయాలి వాడిని అన్ని వైపులా block చేస్తే వాడి స్పీడ్ తగ్గుతుంది అప్పుడు బాల్ నీ తేలికగా మన టీం మధ్యలో తిప్పుతూ టైమ్ వేస్ట్ చేయాలి ఆ తర్వాత నేను డెనిస్ వెనుక ఉంటా తమ్ముడూ block అయితే అన్న సహాయం కీ వస్తాడు అప్పుడు విలియమ్స్ నువ్వు ఆ బాల్ నీ Nigeria ప్రిన్స్ T chala కీ పాస్ చెయ్ అన్నాడు అప్పుడు విలియమ్స్ "వాడు పక్క టీం కదా" అన్నాడు దానికి సిద్ధార్థ ఒక నవ్వు నవ్వాడు దాంతో వాళ్లకు అర్థం అయ్యింది ఏమీ చేయాలో అప్పుడు అందరూ గేమ్ లోకి వెళ్లారు అందరూ సిద్ధార్థ చెప్పినట్లు అడానిస్ నీ నాలుగు వైపుల నుంచి block చేశారు దాంతో అడానిస్ స్పీడ్ తగ్గించాడు అదే అదునుగా భావించిన మార్కిన్ ఆ బాల్ నీ లాగే ప్రయత్నం చేశాడు అప్పుడు సడన్ గా వాళ్లు ఊహించని విధంగా డెనిస్ opposite లో వచ్చి మార్కిన్ నుంచి బాల్ లాకుని దూరం గా పాస్ చేశాడు అప్పుడు సిద్ధార్థ స్పీడ్ గా వెళ్లి ఆ బాల్ నీ తన గుర్రం నీ ఎగిరించి ఆ బాల్ నీ గోల్ కొట్టాడు తన టీం నీ గెలిపించాడు దాంతో అందరూ సిద్ధార్థ తెలివిని వేగం నీ మెచ్చుకున్నారు అప్పుడు ఒక మీడియా రిపోర్టర్ వచ్చి సిద్ధార్థ నీ question అడిగింది "Mr సిద్ధార్థ ఇప్పటి వరకు ఈ యూనివర్సిటీ లో ఒక ఇండియన్ కూడా గెలవలేదు మీరు చాలా చాకచక్యం తో గెలిచారు ఎలా ఉంది ఈ అనుభవం" అని అడిగింది దానికి సిద్ధార్థ "ఇది కొత్త ఇండియా ఈ ఇండియా తలుచుకొంటే ఏమైన చేస్తుంది ఇది నా ఒక్కడి గెలుపు కాదు మొత్తం టీం కష్టపడింది కానీ ఒకరు నను ఛాలెంజ్ చేశారు ఈ గేమ్ లో ఇండియన్ గెలవలేదు నువ్వు గెలిచి చూపించు అని నేను వాళ్లకు మళ్లీ చెబుతున్నా ఈ గెలుపు నా ఒక్కడి కోసమే కాదు నా దేశం కోసం" అని చెప్పాడు దాంతో ఇండియన్ యూత్ లో సిద్ధార్థ ఒక యూత్ ఐకాన్ అయ్యాడు అప్పుడే సంధ్య వచ్చి సిద్ధార్థ వాళ్ల అమ్మ ఫోటో తనకు తిరిగి ఇచ్చి వెళ్లిపోయింది అది ఏంటో చూసే లోపే తన భుజం మీద ఎవరో చెయ్యి వేశారు దాంతో ఉలికిపాటు తో నిద్ర లేచాడు సిద్ధార్థ ఎదురుగా హోటల్ వచ్చింది. గతం నుంచి కోలుకోని నిజం లోకి అడుగులు వేస్తూ తన రూమ్ లోకి వెళ్ళాడు సిద్ధార్థ అప్పుడు సోఫియా "సరే అయితే నేను ఇక వెళ్లతాను రేపటికి arrangements చెయ్యాలి" అని చెప్పి బయటకు వచ్చింది అప్పుడు సిద్ధార్థ సోఫియా కీ ఒక వాచి గిఫ్ట్ గా ఇచ్చాడు అప్పుడే పాకిస్తాన్ isi చీఫ్ సోఫియా కోసం వచ్చాడు అప్పుడు సోఫియా తనని silent గా ఉండు అని సైగ చేసి తనకు సిద్ధార్థ ఇచ్చిన వాచి నీ తీసి అందులో ఉన్న సీక్రెట్ మైక్ నీ పడేసి "బెలూచిస్థాన్ కీ టైట్ సెక్యూరిటీ ఉంచండి ఇలియాజ్ సిద్ధార్థ కంటే ముందు మనకే దొరకాలి జైశాక్ లష్కరే handler మూసాఫ్ నీ hideout లో ఉండమని చెప్పండి సిద్ధార్థ క్రికెట్ కోసం రాలేదు వాడి గురించి నాకూ బాగా తెలుసు his stubborn level 100%, bravery 100% madness unlimited అతని ఆలోచనలు కూడా మనం guess చేయలేము అల్లా కీ కృతజ్ఞతలు చెప్పండి ఇలాంటి వాడు ఇండియన్ ఆర్మీ లో లేనందుకు" అని చెప్పి కార్ లో ఇంటికి ప్రయాణం అయ్యింది కాకపోతే సిద్ధార్థ అసలు మైక్ సోఫియా personal బాడి గార్డ్ వాచి కీ పెట్టాడు.
01-09-2021, 11:47 AM
01-09-2021, 11:47 AM
01-09-2021, 10:21 PM
02-09-2021, 05:01 AM
02-09-2021, 01:48 PM
02-09-2021, 01:48 PM
|
« Next Oldest | Next Newest »
|