Thread Rating:
  • 60 Vote(s) - 2.65 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
(02-09-2021, 06:07 PM)RICHI Wrote: Mahesh garu story chala bagundhi.
Jnmanichina tallikosam prayanam lo kavya mam and mahesh la chilipi sanniveshalu gudilo vunnatlu ikkada badilo petteru.
Super sir

Heartfully thankyou soooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(29-08-2021, 11:44 PM)Fuckingroll69 Wrote: Bro, mii stories chadive time lo vache feeling edaithe undo
Adi matram peruguthune undii.
Inka story ilage chadavali anipistundii kanii appude aipoinda
ani anipinchindi
Love u bro mammalni ila entertain chestunnaduku..♥️♥️♥️

Heartfully thankyou so so soooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(03-09-2021, 07:46 PM)Mahesh.thehero Wrote: రేపు 11 లోపు అప్డేట్ తో...........

Waiting bro update kosam
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
(06-08-2021, 10:49 AM)Durga prasad Wrote: మహేష్ గారు అప్డేట్ చాలా చాలా బాగుంది
Nice super Amazing Excellent
అద్భుతం మహా అద్భుతం గా ఉంది
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహేష్ గారు

Heartfully thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(05-08-2021, 08:10 AM)Mahe@5189 Wrote: ఎవరైనా కథ రాయమంటే పెన్ పట్టుకొని రాస్తారు, లేకపోతే పెన్సిల్ తో రాస్తారు...!
కానీ మహేష్ గారు ...!
ఏంటి రా చాలా శ్రద్ధగా రాసారు
ఏదో కధ మన ముందు మెదిలినట్టు,
మన మనసుతో అడుకున్నటు చాలా శ్రద్ధగా రాసారు.
ఎంతైనా వాడు మగాడు రా బుజ్జి...!

Heartfully thankyou so much .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
బామ్మ : హ హ హ ...... బుజ్జిహీరో బుజ్జిహీరో ...... నువ్వు నా ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ అని కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలతో అమాంతం నన్ను గుండెలపైకి తీసుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి పరవశించిపోతున్నారు ............
బామ్మ ......... అంతులేని ఆనందాన్ని పొందుతున్నట్లు కౌగిలిలోనే తెలిసి , దేవకన్యను చూస్తే ఎవరి పెదాలపైనైనా చిరునవ్వులు పరిమళించాల్సిందే కదా అని ఆనందించాను . బామ్మా ....... దేవత లాంటి మేడం మీకూ నచ్చినట్లున్నారు .
బామ్మ : దేవత ...... ? అంటూ ఆనందంతో పులకించిపోతున్నట్లు తెలుస్తోంది .
ఎందుకో తెలియదు బామ్మా ....... , ప్రేయర్ లో మేడం ను చూడగానే స్వర్గం నుండి దిగివచ్చిన దేవతే అని నా హృదయం తెగ ఆరాటపడిపోయింది - ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం కూడా ఆ దేవతను చూడకుండా ఉండలేకపోయాను - కనురెప్పలు సైతం ఎంజాయ్ మహేష్ అన్నట్లు కనురెప్పలు కూడా వేయకుండా నాకు సహకరించాయి అంటూ కనురెప్పలపై ముద్దులుపెట్టుకున్నాను .
బామ్మ : సంతోషంతో నవ్వుకుని , బుజ్జిహీరో ....... అంత సహాయం చేసిన కనురెప్పలకు నేనూ ఒకసారి ముద్దులు పెట్టవచ్చా please please .......... 
అడగాలా బామ్మా ....... , మీ మనవరాలి విషయంలో నన్ను అర్థం చేసుకున్న మీకోసం ఏమైనా చేస్తాను అనిచెప్పానుకదా ........
బామ్మ : థాంక్యూ థాంక్యూ soooo మచ్ బుజ్జిహీరో ....... అంటూ ఆనందబాస్పాలతో నా బుగ్గలను అందుకుని థాంక్స్ కనురెప్పలూ అని కనురెప్పలపై మరియు నుదుటిపై ఒక మధురానుభూతికి లోనయ్యేలా ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
బామ్మా ........ దేవత ఫోటో చూసిన క్షణం నుండీ క్షణక్షణానికీ మీ ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది కారణం ఏమిటి ? .
బామ్మ : దానికి ఏకైక కారణం నా బుజ్జి బుజ్జిహీరో ....... , నీ మనసులోని మాటను తెలిపి ఎంత ఆనందాన్ని - పారవశ్యాన్ని కలిగించావో మాటల్లో చెప్పలేను బుజ్జిహీరో ........ అంటూ మళ్లీ నా నుదుటిపై ముద్దుపెట్టారు - sorry బుజ్జిహీరో ........ కోటాకు మించి ముద్దులుపెట్టేస్తున్నాను కానీ ఎన్ని ముద్దులుపెట్టినా తనివితీరనంత ఆహ్లాదాన్ని పంచావు అంటూ కంట్రోల్ చేసుకోలేక మళ్లీ ముద్దుపెట్టారు .
హ హ హ ....... బామ్మా డబ్బుల్లా ఖర్చు అవుతాయా చెప్పండి , ఎన్ని ముద్దులు కావాలంటే అన్ని ముద్దులు పెట్టుకోండి నేనేమైనా వద్దన్నానా ? , బుజ్జిదేవత ఫోటోలు వెనక్కు ఇచ్చెయ్యగానే మీ కన్నీళ్లు చూసి నా బుజ్జి హృదయం చలించిపోయిందనుకోండి తట్టుకోలేకపోయాను - దేవతను వదిలి ..........
బామ్మ : లేదు లేదు లేదు బుజ్జిహీరో ........ , నా ప్రియమైన బుజ్జిహీరో ....... దేవతను ఫిక్స్ అవ్వడమే కరెక్ట్ - నా మనఃస్ఫూర్తిగా చెబుతున్నాను కదా , ఎందుకన్నది అత్యంత త్వరలోనే నా బుజ్జిహీరోకు కూడా తెలుస్తుంది అని ముఖమంతా ముద్దులవర్షం కురిపించి , తల్లీ దుర్గమ్మా ....... అంటూ సంతోషంతో ప్రార్థించారు .
నేను కూడా బామ్మ బాధపడకుండా దీవించినందుకు పెద్దమ్మకు థాంక్స్ చెప్పుకున్నాను .
బామ్మ : బుజ్జిహీరో ....... నేను దుర్గమ్మ తల్లికి మొక్కుకున్నాను మరి నువ్వు ఎవరికి మొక్కుకుంటున్నావు .
నెల ముందువరకూ మా దైవం కూడా దుర్గమ్మ తల్లినే బామ్మా ....... , రీసెంట్ గా దుర్గమ్మ అమ్మతోపాటు పెద్దమ్మ కూడా మా దైవం అయ్యారు . 
బామ్మ : పెద్దమ్మ ? ........

అంతలో లోపలినుండి బామ్మా బామ్మా ....... అంటూ వేణుగానం లాంటి పిలుపులు - బామ్మా ........ నైట్ డ్రెస్ ఎక్కడ ఉంచావు ? .
ఆ వాయిస్ ఆ వాయిస్ .......... ? .
బామ్మ : కంగారు కంగారుగా , తల్లీ ....... అక్కడే ఉంచాను సరిగ్గా చూడు .......
got it బామ్మా ....... , బామ్మా ....... వేడివేడిగా కాఫీకావాలి ? .
ఆ వాయిస్ వాయిస్ అంటూ థింక్ చేస్తున్నాను .
బామ్మ మరింత కంగారుపడి , తల్లీ ....... నాకు ముఖ్యమైన పని ఉంది నువ్వే చేసుకో ....... , బుజ్జిహీరో ....... దైవం పెద్దమ్మ అన్నావు కదూ ఎవరు ? .
వాయిస్ వాయిస్ ........ ఆ ఆ పెద్దమ్మ పెద్దమ్మ .......
బామ్మ : బుజ్జిహీరో ........ నీ దేవత గురించి కూడా తెలుసుకోవాలని ఉంది - మనం దగ్గరలోని గుడికివెళ్లి మాట్లాడుకుందాము - ఇంత సంతోషాలను పంచిన తల్లిని ..... నా బుజ్జిహీరోతోపాటు వెళ్లి వెంటనే దర్శించుకోవాలి - నీకు ఇష్టమే కదా .........
లోపలనుండి బామ్మా ....... అంటూ పిలుపు .
వాయిస్ ........ ? .
బామ్మ : అమ్మో ........ , తల్లీ ....... ముఖ్యమైన వ్యక్తితో గుడికి వెళుతున్నాను బై బై అంటూ ఆలోచిస్తున్న నా చేతిని అందుకుని వడివడిగా మా ఏరియా లోని గుడికి తీసుకెళ్లి అమితమైన సంతోషం - భక్తితో మొక్కుకుని గుడి మెట్లపై కూర్చున్నారు . 
వాయిస్ వాయిస్ అంటూనే వెళ్లి ప్రక్కనే కూర్చున్నాను .

బామ్మ : వదిలేలా లేడు అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . బుజ్జిహీరో ....... చెప్పాను కదా " పెద్దమ్మ - నీ దేవత " గురించి తెలుసుకోవాలని , నువ్వుమాత్రం పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తున్నావు , ఇలా అయితే ...... 
Sorry sorry బామ్మా ........ , ఆ వాయిస్ .......
బామ్మ : అదిగో మళ్లీ ........
Sorry sorry ....... అంటూ బామ్మ చేతిని అందుకుని , కమాన్ బామ్మా ....... ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారు ? .

బామ్మ : ఉమ్మా ఉమ్మా అంటూ నా చేతులపై ముద్దులుపెట్టి , నా బుజ్జిహీరోకు ఇద్దరు దైవాలు ఒకరు దుర్గమ్మ తల్లి నాకు తెలుసు మరి దైవం పెద్దమ్మ ఎవరు ? .
పెద్దమ్మ పెద్దమ్మ - మా కోరికలు మరియు మేము కోరుకోకముందే తీర్చడానికి మాకోసం వచ్చినవారు అంటూ చిన్న ఇంటిని " అవ్వ అనాదశరణాలయంలా " మార్చి సంతోషాలను పంచడం - అవ్వ పిల్లలు కోరినవన్నీ తీరుస్తుండటం - అప్పుడప్పుడూ నా కోరికలను కూడా ........ అంటూ సిగ్గుపడుతూ వివరించాను - బామ్మ కళ్ళల్లో కన్నీళ్లను చూసి బామ్మా బామ్మా ........ ఏమైంది ? అంటూ బాధపడుతూ అడిగాను .
బామ్మ : నా బుజ్జిహీరో భువిపైకి చేరిన క్షణం నుండీ కష్టాలు అనుభవించాడు అని ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నారు .
బామ్మా ....... ఆ రోజులన్నీ పోయాయి దైవం పెద్దమ్మ వలన - పెద్దమ్మ ఆశీర్వాదం వల్లనే చదువుకుంటూనే , ఆడుకుంటూనే జాబ్ చేస్తున్నాను - ఏదైనా అలా కోరుకోవడం ఆలస్యం ఇలా తీర్చేస్తారు , మనలోమాట అంటూ చెవిదగ్గరికివెళ్లి బామ్మా ...... అప్పుడప్పుడూ పెద్దమ్మను ఆర్డర్ కూడా వేస్తున్నాను తెలుసా ఎవ్వరికీ చెప్పకండి - రెండురోజుల ముందు అవ్వలకు ...... పెద్దమ్మ చెప్పినది నిజమైంది , ఏమిచెప్పారో తెలుసా పెద్దమ్మా ........ త్వరలోనే నిన్ను ప్రాణంలా చూసుకునే వారు - నువ్వు ప్రాణంలా చూసుకునేవారు జీవితంలోకి వస్తారు అని , అలా చెప్పారు ఇలా మా బామ్మ గారు అంటూ ప్రాణంలా హత్తుకున్నాను .
బామ్మ : ఆనందబాస్పాలతో నిజమే బుజ్జిహీరో నువ్వు నా ప్రాణం , త్వరలో ప్రాణం కంటే ఎక్కువ అని నీకే తెలుస్తుంది - ఇక మేమంటే ....... నా బుజ్జిహీరోకు ఎంత ప్రాణమో ఒక్కరోజులోనే నాకు పూర్తిగా అర్థమైపోయింది అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు - ఇదంతా విన్న తరువాత ఈ క్షణం నుండీ మాకు కూడా ఇక ఇద్దరు దైవాలు దుర్గమ్మ తల్లి మరియు పెద్దమ్మ ...........
బామ్మా ....... బామ్మతోపాటు దేవతను కూడా అని చిన్నగా చెప్పాను .
బామ్మ : నవ్వుకుని , బుజ్జిహీరో ........ నా ఇష్టం చాలా చాలా ఇష్టం అని చెప్పాను కదా , నువ్వేమి ఫీల్ అవ్వకు ....... , ఎవరిని ఎవరి దగ్గరకు చేర్చాలో మన దైవాలకు తెలియదా చెప్పు ఉమ్మా ఉమ్మా ....... అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టారు . అవును బుజ్జిహీరో ........ ఒక విషయం అడుగుతాను నువ్వు ఫీల్ అవ్వకూడదు ....... , ok నువ్వేమో ** క్లాస్ స్టూడెంట్ - మేడం sorry sorry నీ ప్రియాతిప్రియమైన దేవత ఏమో డిగ్రీ పూర్తిచేసి నీకు టీచ్ చెయ్యడానికి వచ్చింది , ఏజ్ గ్యాప్ ఎక్కువ అనిపించడం లేదూ .........
నిజమే బామ్మా ........ , కానీ ప్రేమ గుడ్డిది అంటారుకదా అలా వయసుతో సంబంధం లేదు అని ఫిలాసఫీ చెబుతున్నట్లు చెప్పాను .
బామ్మ : మురిసి , నిజమే నిజమే ........ , నా బుజ్జిహీరోపై సినిమాల ప్రభావం ఎక్కువగానే ఉందని నవ్వుకున్నాము .
నవ్వు ఆపి అవును బామ్మా ........ , నా దేవత డిగ్రీ పూర్తిచేసిందని మీకు చెప్పనేలేదు మీకెలా తెలిసింది , కరెక్ట్ గా ఎలా చెప్పారు ........
బామ్మ : కంగారుపడుతూ అదీ అదీ ........ ఆ ఆ ఆమాత్రం దానికి ఒకరు చెప్పాలా బుజ్జిహీరో - మేడం గా జాయిన్ అవ్వాలంటే డిగ్రీ పూర్తిచేసి ఉండాలికదా అని నార్మల్ గా చెప్పాను , అంతదానికి ఎంక్విరీ లు చెయ్యాలా అంటూ బుగ్గపై ప్రేమతో గిల్లారు .
Sorry sorry బామ్మా ....... అని నవ్వుకున్నాను .

బామ్మ : నెక్స్ట్ ...... , ప్రేయర్లో చూసిన దేవతను ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేను అన్నావుకదా మరి నీ దేవత వేరే క్లాస్సెస్ కు వెళ్లి ఉంటుంది కదా .......
ఇలా జరగకూడదనేనేమో పెద్దమ్మ ....... నన్ను చిన్నప్పుడే తెలుగు మీడియం govt కాలేజ్లో జాయిన్ చేశారు - ఇంగ్లీష్ మీడియం కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఒక తమాషా జరిగింది బామ్మా ...... నా ఇంగ్లీష్ పరిజ్ఞానానికి నవ్వుకుని ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్సెస్ అన్నింటికీ అటెండ్ అవ్వాలి అని రూల్ పెట్టారు కాదు కాదు పెట్టాడు ఆ హెడ్ మాస్టర్ కానీ నా దేవత రావడంతో .........
బామ్మ : ok ok పనిష్మెంట్ వరంలా మారిపోయిందన్నమాట పెద్దమ్మ వలన ....... అంటే నీ దేవత ఇంగ్లీష్ మేడం అన్నమాట ........
అవునవును బామ్మా ....... , అయినా ఇంగ్లీష్ టీచర్ అని నేను చెప్పనేలేదు .......
బామ్మ తియ్యనైన కోపంతో చూస్తున్నారు .
Ok ok వరంలా మారింది అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు కదా sorry sorry బామ్మా .........
బామ్మ : sorry లు మాత్రమే సరిపోవు అని అలక చెందారు .
తియ్యనైన నవ్వులతో బుగ్గలపై ముద్దులుపెట్టాను .
బామ్మ పెదాలపై చిరునవ్వులు పరిమళించాయి - అయితే ఇక మొదటి క్లాస్ నుండి లాంగ్ బెల్ వరకూ సైట్ కొడుతూనే ఉన్నావన్నమాట ........
అంటే సైట్ కొట్టినట్లా బామ్మా ........ 
బామ్మ : అంతా చేసి ఎంత అమాయకంగా అడుగుతున్నాడో చూడండి దేవతలూ ........ అని బుగ్గను గిల్లి నవ్వుకున్నారు . చెప్పు చెప్పు బుజ్జిహీరో ఎలా సైట్ కొట్టావు ?  , మొత్తం తెలుసుకోవాలని ఉంది .
ప్రతీ క్లాస్ లో దేవత కోపం - ఇంటర్వెల్ ముందు దెబ్బ ........
బామ్మ : నా బుజ్జిహీరోను కొట్టిందా ? , ఎంత ........
కూల్ కూల్ బామ్మా ....... , అక్కడ మీరు దెబ్బను చూస్తున్నారు - నేను ...... నా దేవత చేతి స్పర్శను ఎంజాయ్ చేసాను అని సిగ్గుపడ్డాను .

బామ్మ కూడా నవ్వుకుని , ఈ చెంపపైనేనా కొట్టినది అని ప్రాణంలా స్పృశించి ముద్దుపెట్టారు - బుజ్జిహీరో ...... గట్టిగానే కొట్టినట్లుంది ఇప్పటికీ బుగ్గ కందిపోయినట్లు కనిపిస్తోంది - నా బుజ్జిహీరోను కొట్టిన ప్రియమైన దేవతకు నాలాంటి బామ్మ ఉండాలి , ఆ బామ్మ ...... తన మనవరాలిని కూడా ఇలానే కొట్టాలి పెద్దమ్మా ....... నా తొలి కోరిక తీరుస్తారు కదూ ........
నో నో నో బామ్మా ....... , కోరుకున్నారా ఇక కోరిక తీరినట్లే - పెద్దమ్మ తప్పకుండా తీరుస్తారు , అందులోనూ మా మంచి బామ్మ తొలి కోరిక ....... , పెద్దమ్మా ...... కాస్త సున్నితంగా కొట్టండి ఎందుకంటే నా బుగ్గ కందిపోవడానికి కారణం నేను మాత్రమే కాబట్టి ........ , బామ్మా ....... దేవత చేతి స్పర్శ తగిలిందని పదే పదే చేతితో ఆశతో బుగ్గపై తాకిస్తూ ముద్దులుపెట్టుకోవడం వలన అలా ....... అంటూ సిగ్గుపడ్డాను .
బామ్మ : నా బుజ్జిహీరో పైకి కనిపించేంత అమాయకుడేమీ కాదు , ఏదీ నీ ప్రియమైన దేవత చెంపదెబ్బ రుచిని నన్నూ చూడనివ్వు అని ముద్దులుపెట్టి , తియ్యదనంతో చూసారు ఇందుకన్నమాట పదే పదే ముద్దులుపెట్టుకున్నావు అని నవ్వుకున్నారు - పెద్దమ్మా ....... అయినా కూడా దేవతకు , బామ్మా ద్వారా ఒక దెబ్బ పడాల్సిందే ..........
ప్చ్ ప్చ్ ....... దేవత అంటేనూ ఇష్టం - మా బామ్మ అంటే అంతకంటే ఇష్టం ప్రాణం కాబట్టి పెద్దమ్మే ఏది మంచినో నిర్ణయించి కోరికలు తీర్చాలి . అయినా బామ్మా ...... నాకు పెద్దమ్మ అయితే మీకు కూడా పెద్దమ్మ ఎలా అవుతుంది ? .
బామ్మ : దేవతల వయస్సు వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు అని బుజ్జిహీరోకు తెలుసనుకున్నానే ....... , అంత వయసు అయితే నాకూ పెద్దమ్మే - ఒకవేళ చిన్నదైతే ప్రేమతో తల్లీ అని పిలుస్తాను . హ్యాపీనా ....... ? .
మా బామ్మకు మనవరాలు మాత్రమే ఉన్నారు కాబట్టి , పెద్దమ్మ వయసు తక్కువగానే ఉండాలి అప్పుడు కూతురు కూడా ఉంటారు - బుజ్జిదేవత తప్పు తప్పు బామ్మ మనవరాలికి అమ్మప్రేమకూడా .........
బామ్మ : నాకు బిడ్డ - నా బుజ్జితల్లికి అమ్మ ...... ఈ మధురమైన భావనే ఎంత బాగుంది అంటూ భావోద్వేగానికి లోనై , బుజ్జిహీరో అంటూ ఆనందబాస్పాలతో ప్రాణంలా హత్తుకున్నారు - అయినా నాకు మనవరాలు మాత్రమే కాదు మనవరాలి కంటే ప్రాణమైన మనవడు కూడా ఉన్నాడు కదా ........ , అంటే నువ్వు అలా భావించడం లేదన్నమాట ........
అంతటి అదృష్టాన్ని ఏ మనవడైనా కాదనుకుంటాడా బామ్మా అంటూ బామ్మతో సమానంగా ఉద్వేగానికి లోనయ్యి సంతోషంతో నవ్వుకున్నాము . 

ఆ సంతోషంలో గంటపైనే సమయం గడిచిపోయింది . బామ్మా ....... ఇంటిలో మీ మనవరాలు ఒక్కరే ఒంటరిగా ఉన్నారుకదా ..... , భయపడుతుందేమో .......
బామ్మ : నా బుజ్జిహీరోతో ఉంటే సమయమే తెలియదు - బుజ్జితల్లి గురించే మరిచిపోయాను అంటూ పైకిలేచారు - బుజ్జిహీరో ....... భయం అంటే గుర్తుకొచ్చింది , నిన్న అర్ధరాత్రి సమయంలో భూత్ బంగ్లా నుండి ఏవో మాటలు వినిపించాయని బుజ్జితల్లి భయంతో మరింత గట్టిగా హత్తుకుని కొద్దిసేపు నిద్రకూడాపోలేదు - అమ్మా దుర్గమ్మా ...... అని కంగారుపడుతూ ప్రార్థించారు - బుజ్జిహీరో వెళదాము అని ఇంటికిచేరుకుని ఒక్కనిమిషం ఇక్కడే ఉండు అని లోపలికి పరుగునవెళ్లారు .
నా ప్రాణమైన వాళ్లనే భయపెడతావా అంటూ భూత్ బంగ్లా వైపు కోపంతో చూస్తున్నాను .
బామ్మ వచ్చి బుజ్జిహీరో ....... నీకోసం ప్రేమతో చేసిన స్నాక్స్ అంటూ అందించారు .
Wow ...... ఇవంటే నాకు చాలా ఇష్టం బామ్మా అంటూ హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టాను . మినీ గ్రౌండ్ దగ్గర నుండి ఫ్రెండ్స్ ....... క్రికెట్ ఆడటానికి పిలవడంతో బామ్మకు బై చెప్పి కాలేజ్ బ్యాగుతోనే వెళ్ళాను .
Like Reply
వినయ్ : మహేష్ ....... ఏంటి ఇంకా కాలేజ్ బ్యాగ్ - కాలేజ్ డ్రెస్ లోనే ఉన్నావు .
మురళి : వాడు ఇంకా ఇంటికి వెల్లనేలేదు , ఇక్కడే అటూ ఇటూ తిరుగుతున్నట్లున్నాడు - ఇంటికి రాకుండా ఏమిచేస్తున్నావురా .........
మురళీ సర్ అదీ అదీ ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను అందుకే గుడికి వెళ్ళాను .
మురళి : నిజమా ....... ? .
గోవర్ధన్ : చూస్తుంటేనే తెలుస్తోంది కదా మురళీ ...... , కుంకుమ కూడా ఉంది - మహేష్ బాక్స్ లో ఏమిటి అంత జాగ్రత్తగా పట్టుకున్నావు .
స్నాక్స్ ఫ్రెండ్స్ ....... , ఒక దేవతలాంటి బామ్మగారు ప్రేమతో ఇచ్చారు - టేస్ట్ చేయండి వేడివేడిగా కారకారంగా ......... అంటూ బాక్స్ ఓపెన్ చేసాను .
ఫ్రెండ్స్ : wow ...... నువ్వు చెబుతుంటేనే నోరూరిపోతోంది మహేష్ అంటూ టేస్ట్ చెయ్యడానికి పోటీపడుతున్నారు .
మురళి : రేయ్ రేయ్ స్టాప్ స్టాప్ ........ , ఎవరో అలగా జనం ఇస్తే అలా ఎగబడిపోవడమేనా , తిన్నారంటే అంకుల్ వాళ్లకు చెబుతాను .
అంతే ఎక్కడివాళ్ళు అక్కడే ఆగిపోయారు - రేయ్ మహేష్ ....... ఎవరుపడితే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మేము తినము , మా లెవల్ ఏమిటి స్టేటస్ ఏమిటి ........ వెళ్లు వెళ్లి నువ్వు మాత్రమే తిను .
మురళి మాటలకు కోపం వేసినా , మొత్తం నేనే తినబోతున్నానని కలిగిన ఆనందానికి కోపం మొత్తం హుష్ కాకి అయ్యింది - పేదవాళ్లను చులకనగా చూస్తున్నందుకు మాత్రం ప్రతీసారీ బాధవేస్తూనే ఉంది .

వినయ్ : మహేష్ ........ తొందరగా వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకునిరా మ్యాచ్ ఆడదాము.
మురళి : నో ....... , రోజూ ఈ సమయానికి మ్యాచ్ ఆడతామని తెలిసికూడా నాకు చెప్పకుండా గుడికి వెళ్ళాడు కాబట్టి ఈరోజుకు వాడికి ఇష్టమైన క్రికెట్ బ్యాట్ ముట్టుకోవడానికి వీలు లేదు అలా అని ఇంటికి వెళ్ళడానికి కూడా వీలులేదు - రేయ్ మహేష్ ....... మేము ఆడుకునేంతవరకూ అక్కడ కూర్చో ఇదే నీ పనిష్మెంట్ అని ఆర్డర్ వేసి మ్యాచ్ స్టార్ట్ చేశారు .
గుడికి వెళ్లినందుకే పనిష్మెంట్ ఇచ్చాడు , నిన్న బామ్మగారికి సహాయం చేశానని - ఇప్పటివరకూ బామ్మతోపాటే ఉన్నానని తెలిస్తే ఇక అంతే గోల గోల చేసేస్తాడు అని పెదాలపై చిరునవ్వులతో బ్యాగును ప్రక్కన ఉంచి బల్లపై కూర్చున్నాను . బాక్స్ ఓపెన్ చేసి ఆలూ స్నాక్స్ - స్వీట్ తిని మ్మ్మ్ మ్మ్మ్ ...... స్పైసీ అండ్ స్వీట్ లవ్లీ కాంబినేషన్ అంటూ కళ్ళుమూసుకుని ఎంజాయ్ చేస్తున్నాను . 
ఫీల్డింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరూ లొట్టలేస్తూ నావైపు ఆశతో చూస్తున్నారు - టేస్ట్ చెయ్యాలని ఆశ ఉన్నా మురళికి భయపడి తమను తాము కంట్రోల్ చేసుకుంటున్నారు - బాక్స్ మొత్తం ఒక్కడే ఖాళీ చేసేస్తున్నాడు అని దీనంగా చూస్తూ ఫీల్డింగ్ కూడా మిస్ చేస్తుండటం చూసి నవ్వుకున్నాను .

థాంక్యూ థాంక్యూ sooooo మచ్ బామ్మా ....... , అచ్చు అవ్వలు చేసినట్లుగానే భలే రుచిగా ఉన్నాయి , ఎదురుగా ఉండి ఉంటే గుండెలపైకి చేరి మరింత కావాలని ఆడిగేవాడిని ప్రాధేయపడేవాడిని అంటూ బామ్మ ఇంటివైపు చూసాను . 
ఆశ్చర్యం ఇంటిపైనుండి ఇప్పటివరకూ నన్నే చూస్తున్నట్లు hi బుజ్జిహీరో అంటూ చేతిని ఊపి స్నాక్స్ ఎలా ఉన్నాయి అని సైగలతో అడిగారు .
సూపర్ సూపర్ సూపర్ ....... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వధలబోయి ఇంకా అంత ఆప్యాయతకు చేరుకోలేదని ఆగిపోయాను - బామ్మా ....... ఖాళీ అంటూ బాక్స్ ను తిప్పి చూయించాను - ఆకలేస్తోంది బామ్మా ....... please please అంటూ కడుపును స్పృశించుకున్నాను .
బామ్మ పరుగున కిందకువెళ్లారు . పెదాలను తడుముకుంటూ మెయిన్ గేట్ వైపు ఆశతో చూస్తున్నాను .

5 నిమిషాలకు బామ్మనే స్వయంగా బాక్స్ తోపాటు బయటకువచ్చారు .
పెదాలపై చిరునవ్వుతో యాహూ అని కేకవెయ్యబోయి ఆగిపోయాను - ఆ వెంటనే మురళిని చూసి గుండె ధడ ధడా కొట్టుకుంది . మురళి బామ్మను ఏమైనా అంటే తట్టుకోగలనా అంటూ పైకి లేవబోతే ........
మురళి చూసి రేయ్ ఎక్కడికిరా మ్యాచ్ పూర్తయ్యేంతవరకూ కదాలకూడదు అనిచెప్పానుకదా - కిట్స్ ఎవరు తీసుకొస్తారు కూర్చో కూర్చో ........
అయ్యో ....... ఇప్పుడేమి చెయ్యడం ( బామ్మా బామ్మా ...... రావద్దు ) - అంతలో బామ్మ గేట్ క్లోజ్ చేసి రోడ్డులో ముందుకువెళ్లిపోవడం చూసి హమ్మయ్యా అనుకున్నాను - రెండు నిమిషాలకు మళ్లీ లోపలికివెళ్లిపోయారు చూస్తే చేతిలో బాక్స్ కనిపించలేదు . 
అదే బాక్స్ తో సెక్యూరిటీ అన్నయ్య వచ్చి మహేష్ డెలివరీ అని ఇచ్చి వెళ్ళిపోయాడు . 

గోవర్ధన్ : మహేష్ ....... మరొక స్నాక్స్ బాక్స్ అంటూ షాక్ చెంది బాక్స్ వైపే చూస్తున్నారు . 
వారు చూస్తుండగానే బాక్స్ ఓపెన్ చేసాను . ఉల్లిపాయ పకోడీలు విత్ పుదీన చట్నీ ప్రక్కనే లెటర్  థాంక్యూ థాంక్యూ sooooo మచ్ బామ్మా అంటూ పకోడీని చట్నీలో ముంచుకుని తిని మ్మ్మ్ ...... వాహ్ సూపర్ అంటూ దర్జాగా కూర్చున్నాను - లెటర్ ఓపెన్ చేసాను .
" బుజ్జిహీరో అంతా గమనించాను అందుకే సెక్యూరిటీ ద్వారా పంపించాను ఎంజాయ్ - పాపం మీ ఫ్రెండ్స్ కూడా తినడానికి ఆశపడుతున్నారనుకుంటాను , వారు కూడా తినేలా ఏర్పాటుచేసానులే - అయినా ఈ బామ్మకు ఫ్లైయింగ్ కిస్సెస్ వధలబోయి ఎందుకు ఆగిపోయావు - చెప్పానుకదా ఒక్కరోజులోనే ఒకరొకరం ప్రాణంలా కలిసిపోయాము అని - నువ్వూ చెప్పావుకదా పెద్దమ్మ కూడా చెప్పారని - నేను అలిగాను "
Sorry sorry బామ్మా అంటూ చూస్తే ఇంటిపైన అలకచెందినట్లు బామ్మ కోపంతో చూస్తున్నారు ...... కోపం కాదు చిరుకోపం కాదు కాదు తియ్యనైన కోపం ......

ఫ్రెండ్స్ నోరూరిపోతుండటం - మురళి వైపు కోపంతో చూస్తుండటం చూసి నవ్వుకున్నాను . 
అంతలో మరొక సెక్యూరిటీ వచ్చి మురళీ సర్ మీకోసం ఏరియా మెయిన్ గేట్ దగ్గర ఒక వ్యక్తి వేచిచూస్తున్నాడు .
మురళి : ఎవరు ? .
సెక్యురిటి : తెలియదు మురళి సర్ , లోపలికి రమ్మంటే ససేమిరా అంటున్నాడు - మహా అర్జెంట్ తొందరగా పిలుచుకునిరండి అని కాళ్లావేళ్ళా పడుతున్నాడు , అందుకే వచ్చాను మీరు వస్తారా లేక వెనక్కు పంపించెయ్యమంటారా ..... ? .
మురళి : మహా అర్జెంట్ అంటున్నాడు కదా డాడీ ఏమైనా పంపించారేమో పదా వెళదాము . 
సెక్యూరిటీ కన్ను కొట్టడంతో ...... బామ్మ ప్లాన్ అని అర్థమైపోయింది . తలదించుకుని నవ్వుకుంటున్నాను .

మురళి : హలో హీరో ....... వెళుతున్నాను కదా సెక్యూరిటీగా రావాలని తెలియదా ........ 
Sorry మురళీ సర్ అంటూ లేచి నిలబడ్డాను - ఇప్పుడెలా ....... నేను తిన్నాను కదా ఫ్రెండ్స్ ను తిననిద్దాము అని బాక్స్ ను బల్లపై ఉంచి గోవర్ధన్ - వినయ్ వైపు ఎంజాయ్ అంటూ కన్నుకొట్టాను .
అంతే వాళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి . ముసిముసినవ్వులతో మురళి వెనుకే ఫాలో అయ్యాను - బామ్మ ఇంటిదగ్గరికి చేరుకోగానే థాంక్యూ థాంక్యూ బామ్మా అంటూ బోలెడన్ని ఫ్లైయింగ్ కిస్సెస్ వదలడంతో ......
బామ్మ బుంగమూతిపెదాలు ఒక్కసారిగా చిరునవ్వులు చిందిస్తూ వదిలిన కిస్సెస్ అన్నింటినీ రెండుచేతులతో అందుకుని గుండెలపై హత్తుకుని , మా బుజ్జిహీరో అంటూ దిష్టి తీసి మురిసిపోతున్నారు .
ఆపకుండా బామ్మకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూనే వెనక్కు నడుస్తున్నాను .
ముద్దుల సౌండ్ కు వెనక్కుతిరిగి చూసినట్లు , రేయ్ మహేష్ ...... ఎవరికిరా అన్ని ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నావు అని మురళి ........
మురళీ సర్ అదీ అదీ అదిగో ఆకాశంలో వెళుతున్న పక్షులకు ....... , ఇలా ముద్దులుపెడితే అదృష్టం అని మా అవ్వలు చెప్పేవారు .
మురళి : అదృష్టమా ....... , నీ జీవితమంతా మా కింద బ్రతకాల్సిందే , అలాంటి ఆశలు పెట్టుకోకుండా మూసుకుని రా .......
మెయిన్ గేట్ దగ్గరికి వెళితే ఎవ్వరూ లేరు , ఎలా ఉంటారు బామ్మ వేసిన ప్లాన్ అయితేనూ ......... అని వెనుక నవ్వుకుంటున్నాను .
మురళి : సెక్యూరిటీ ఎవ్వరూ లేరే .......
సెక్యురిటి : ప్లాన్ ప్రకారం పెద్దయ్యా ...... ఇక్కడ ఉన్న వ్యక్తి ఏమయ్యారు అని బయటకువెళ్లి రోడ్డుకు ఇరువైపులా చూసాడు .
సెక్యురిటి పెద్దయ్య : మొబైల్ మ్రోగడంతో మళ్లీ వస్తాను అనిచెప్పి వెళ్ళిపోయాడు అని సమాధానమిచ్చాడు .
మురళి : ఈసారి వస్తే నాదగ్గరికే పిలుచుకునిరండి అని కోపంతో మినీ గ్రౌండ్ కు వచ్చేశాడు .

చేరుకున్నాడు .

ఫ్రెండ్స్ అందరూ తృప్తిగా తిన్నట్లు - స్పైసీ గా ఉన్నట్లు ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ....... అంటూ ఒకరిచేతిలోని వాటర్ బాటిల్ ను మరొకరు లాక్కుని తాగుతున్నారు .
మురళి : ఆశ్చర్యపోయి , రేయ్ ఏమైందిరా నీటికి కూడా అంతలా పోటీపడుతున్నారు .
ఫ్రెండ్స్ : ఆఅహ్హ్హ్ ఆఅహ్హ్హ్ ...... అదీ అదీ ఆడి ఆడి అలసిపోయాము కదా ఆయాసంతో తెగ దాహం వేస్తోంది రేయ్ నాకు రేయ్ నాకు అంటూ తాగుతున్నారు - అయ్యో ఎంప్టీ ....... కారం కారం కాదు కాదు దాహం దాహం ....... నాలుక కరుచుకున్నారు .
ఫ్రెండ్స్ ...... నాబ్యాగులో వాటర్ బాటిల్ ఉంది ........
వినయ్ : ఈ బాటిల్ నీ బ్యాగులోనిదే మహేష్ ఆఅహ్హ్ ఆఅహ్హ్ ........ కారం దాహం దాహం మహేష్ .......
క్షణంలో తీసుకొస్తాను అని బాటిల్ అందుకుని పరుగున బామ్మ ఇంటికి వెళ్ళాను - మెయిన్ గేట్ బయట నుండే బామ్మా బామ్మా ....... నేను బుజ్జిమహేష్ ను అర్జెంట్ గా వాటర్ కావాలి ........

ఎవరు బామ్మా ....... బుజ్జిమహేష్ అంటూ లోపలినుండి అతిమధురమైన మాటలు వినిపించాయి . ఎక్కడో విన్నాను ఎక్కడో విన్నాను .........
తల్లీ తల్లీ ....... స్టాప్ స్టాప్ నేను చూస్తాను అంటూ పరుగున బయటకువచ్చారు బామ్మ ....... - కంగారు - ఆయాసపడుతూనే ....... బుజ్జిహీరో అంటూ కౌగిలించుకోబోయారు .
బామ్మా బామ్మా ........ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ........
బామ్మ ఆగిపోయి దీనంగా ముఖం పెట్టారు .
Sorry sorry బామ్మా ....... , మురళి అనే ఫ్రెండ్ చూస్తే గోడవలైపోతాయి - అవన్నీ తరువాత చెబుతాను - మా బామ్మగారు స్పైసీ స్నాక్స్ తిని కారం కారం అంటున్నారు ఫ్రెండ్స్ - మనలా ఎక్కువ కారం తినరు వాళ్ళు కాబట్టి అంటూ వాటర్ బాటిల్ చూయించాను .
బామ్మ : నా వెనుక చూసి సడెన్ గా నా నుదుటిపై ముద్దుపెట్టి బాటిల్ అందుకుని వడివడిగా లోపలికివెళ్లి నాలుగైదు బాటిల్స్ మరియు స్వీట్స్ అందించారు .
కూల్ వాటర్ - బామ్మా ....... వింటున్నారు కదా కారపు ఆహాకారాలు got to go .......
బామ్మ : wow ఇంగ్లీష్ ........ 
తియ్యదనంతో నవ్వుకుని , చెప్పానుకదా బామ్మా ....... ఇంగ్లీష్ మేడం గా వచ్చినది నా దేవత అంటూ పరుగున వెళ్లి ఫ్రెండ్స్ కు కూల్ వాటర్ అందించాను .
ఫ్రెండ్స్ గట గటా తాగి థాంక్యూ థాంక్యూ మహేష్ కూల్ వాటర్ తెచ్చినందుకు ....... 
ఫ్రెండ్స్ ....... మన పరిస్థితిని చూసి ఆ ఇంట్లో ఉన్న బామ్మగారు స్వీట్స్ కూడా ఇచ్చారు తినండి అని అందించాను .
మురళి నో అనేంతలో ఫ్రెండ్స్ నోటిలోకి చేరిపోవడంతో ఏమీచెయ్యలేక గుర్రుగా చూస్తూ వెళ్లి బ్యాట్ పట్టుకుని మ్యాచ్ పూర్తిచేయడానికి అందరినీ పిలిచాడు .
ఫ్రెండ్స్ : థాంక్స్ మహేష్ అంటూ అందరూ ఒకేసారి హత్తుకుని ఫీల్డింగ్ నిలబడ్డారు . 
మురళి : రేయ్ మహేష్ ...... నవ్వింది చాలు వెళ్లి కూర్చో అని కోపంతో చెప్పాడు . 
అలాగే మురళి సర్ అంటూ బాటిల్స్ అందుకుని వెళ్లి కూర్చున్నాను . బాటిల్స్ లో బామ్మగారికి నేను ఇచ్చిన బాటిల్ లేదు - ఫ్రిడ్జ్ లోనుండి వారికోసం ఉంచిన బాటిల్స్ ఇచ్చారన్నమాట థాంక్స్ బామ్మా ...... - ప్రక్కనే ఖాళీ బాక్సస్ ఉన్నాయి చిన్న పకోడీ వదలకుండా కుమ్మేసారన్నమాట , కారం కారం అంటూనే చట్నీ కూడా నాకేసినట్లు తెలిసి నవ్వుకున్నాను .

ఫ్రెండ్స్ చీకటిపడేంతవరకూ ఆడుకున్నారు . రేయ్ మహేష్ మేము వెళుతున్నాము నీ బ్యాగుతోపాటు కిట్స్ కూడా తీసుకురా ఇదే నీకు చివరి పనిష్మెంట్ ........
నాకు సహాయం చేయడానికి ఫ్రెండ్స్ వచ్చారు .
మురళి : ఫ్రెండ్స్ ...... వాడికి హెల్ప్ చేశారో ఎవరో ఇచ్చిన స్వీట్స్ ముందూ వెనుకా చూడకుండా తిన్నారని అంకుల్ వాళ్లకు చెబుతాను అని వేగంగా వెళ్ళాడు .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ....... ఇది నాకు పనిష్మెంట్ కానే కాదు , మీకు తరువాత చెబుతానుకదా వెళ్ళండి వెళ్ళండి ...... అని సంతోషంతో చెప్పడంతో మురళీ రేయ్ మురళీ ఆగురా వస్తున్నాము అనివెళ్లారు .
దిక్కులకొకటి పడేసిన వికెట్స్ - బ్యాట్స్ - బాల్స్ ....... కిట్స్ బ్యాగ్స్ లో ఉంచి , బ్యాగుని వెనుక వేసుకుని - రెండు చేతులతో కిట్స్ పట్టుకుని , థాంక్స్ మురళీ ...... బామ్మను మళ్లీ కలిసే అవకాశం లభించే స్వీట్ పనిష్మెంట్ ఇచ్చావు - మాతోపాటు రా అని ఉంటే ఈ సంతోషం కలిగేది కాదు అని బామ్మ ఇంటికి చేరుకుని బామ్మా బామ్మా ....... అని ప్రేమతో పిలిచాను .

బామ్మా ....... మళ్లీ ఎవరో వచ్చారు - వెళ్లి చూస్తాను .
వాయిస్ స్వీట్ వాయిస్ ........ ఆఅహ్హ్ అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను . ఎక్కడో ....... ఎక్కడ ఎక్కడ విన్నాను అని ఆలోచనలో పడిపోయాను .
వద్దు వద్దు వద్దు నువ్వు ఏదో పనిలో అన్నావుకదా నేను వెళతాను అని మళ్ళీ కంగారుపడుతూ వడివడిగా వచ్చారు . బుజ్జిహీరో బుజ్జిహీరో ....... అక్కడే ఆగిపోయావే లోపలికిరావచ్చుకదా ........ , వద్దు వద్దు వద్దులే అంటూ బామ్మే వచ్చి నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు . ఏంటి బుజ్జిహీరో ఏమిటో దీర్ఘన్గా ఆలోచిస్తున్నాడు .
అధికాదు బామ్మా ....... సాయంత్రం నుండీ ఇంటిలోపల నుండి ఒక మధురాతిమధురమైన వాయిస్ ఎక్కడో విన్నట్లు ........ ఎక్కడబ్బా ........ , ok ok త్వరగా వెళ్ళాలి లేకపోతే ఫ్రెండ్ కోప్పడతాడు , బామ్మా ....... బాటిల్స్ - బాక్సస్ తీసుకోండి సరైన సమయానికి చల్లని నీళ్లు ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరూ మీకు థాంక్స్ చెప్పారు . 
బామ్మ : పెదాలపై చిరునవ్వులతో , విన్నాను చూసాను నా బుజ్జిహీరోను కూడా సంతోషంతో కౌగిలించుకోవడం ........
మా ప్రియమైన బామ్మ వల్లనే కదా ....... థాంక్యూ sooooo మచ్ , బామ్మా ....... మన బాటిల్ ........
బామ్మ : మన బాటిల్ ...... , సంతోషం పట్టలేక హత్తుకున్నారు - మన బాటిల్ కదా అందుకే నా ప్రాణమైన బుజ్జిహీరో గుర్తుకు వస్తూనే ఉండాలని భద్రంగా దాచేసుకున్నాను - బాటిల్ చూడగానే బుజ్జిహీరో బుజ్జినవ్వులు కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి - కావాలంటే ఈ బాటిల్స్ అన్నీ తీసుకెళ్లు ........
అయితే మా బామ్మకు గుర్తుగా ఒక బాటిల్ తీసుకెళతాను బై బామ్మా .......
బామ్మ : నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టి మురిసిపోతున్నారు . బుజ్జిహీరో ....... నీ బుజ్జిదేవకన్య పదే పదే నిన్నే కలవరిస్తోంది , ఇంటిని ఇంత చక్కగా సర్దడం - పిజ్జా తీసుకొచ్చి ఆకలితీర్చిన బుజ్జిదేవుడు ఎవరు ఎవరు నేను చూడాలి బామ్మా ....... అని - ఒకసారి లోపలికివచ్చి కనిపించు లేదా నీ బుజ్జిదేవకన్యనే పిలివనా ...... - నిన్ను చూడటం కోసం థాంక్స్ చెప్పడం కోసం వీలైతే నాకంటే ప్రేమతో ముద్దుపెట్టడం కోసం తహతహలాడుతోంది పాపం ........
బామ్మా బామ్మా ........ తప్పు తప్పు నా బుజ్జిదేవకన్య కాదు , మీ బుజ్జితల్లి ..... - చెప్పానుకదా బామ్మా ...... please please ఇక్కడ కేవలం నా దేవత మాత్రమే ఉంది - చదువుకుంటోంది అన్నారుకదా డిస్టర్బ్ చెయ్యకండి .
బామ్మ : అంతేనా బుజ్జిహీరో ........ అని బుంగమూతిపెట్టుకున్నారు - అయితే ఉండు నేనూ సర్ప్రైజ్ ఇస్తాను అన్నట్లు చూస్తున్నారు .
Please please బామ్మా ...... దేవత విషయం చెప్పగానే ఆనందంతో కౌగిలించుకున్నారు కదా , ముద్దులుకూడా పెట్టారు ....... , మీరు బాధపడితే నేను చూడలేను .
బామ్మ : సరే సరే నీ బుజ్జిదేవకన్య చదువుకుంటోంది అని నీకెలా తెలుసు .......
మీరే కద బామ్మా ....... పనిలో ఉన్నావు కదా బుజ్జితల్లీ నేను చూస్తాను అని బయటకువచ్చారు - ఈ వయసులో పని అంటే కాలేజ్ హోమ్ వర్క్ - రీడింగ్ కాకుండా ఇంకేమిటి బామ్మా ....... 
బామ్మ : హోమ్ వర్క్ - రీడింగ్ ? అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
Yes yes మా బామ్మ ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి , వెళ్ళొస్తాను బామ్మా ........ అని కింద ఉంచిన కిట్స్ అందుకున్నాను .
బామ్మ : నా బుజ్జి మనవడు ఇంత బరువు ....... , నన్ను సహాయం చెయ్యనివ్వు ఇంటివరకూ తీసుకువస్తాను ఇవ్వు ........
అమ్మో ....... నాకిష్టమైన బామ్మతో బరువును మోయిస్తానా ఇంకేమైనా ఉందా - పర్లేదు బామ్మా ....... నాకు అలవాటే , మీ మనవరాలిని ఒంటరిగా వదిలి ఎక్కడికీ వెళ్ళకండి - ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యండి నేనున్నానుకదా బామ్మా ........
బామ్మ : బుజ్జిహీరో అంటూ ఉద్వేగానికి లోనై మనసారా కౌగిలించుకున్నారు .
బామ్మా ....... వదిలితే రాత్రంతా కౌగిలించుకునేలా ఉన్నారు .......
బామ్మ : ఆ అదృష్టం కోసం ఎదురుచూస్తూ ఉంటాను - నువ్వే ....... స్వయంగా వచ్చి బామ్మా , మీ కౌగిలిలోనే ఉండిపోతాను అంటూ బ్రతిమాలే రోజు అతి త్వరలోనే వస్తుంది నువ్వే చూస్తావుకదా అని ముసిముసినవ్వులతో ముద్దుపెట్టి వదిలారు . 
బై చెప్పి ఇంటికి చేరుకున్నాను . కిట్స్ ను జాగ్రత్తగా ఔట్ హౌస్ బయట ఉంచి లోపలకువెళ్లి లైట్స్ on చేసాను - బ్యాగును బెడ్ పై ఉంచి నగ్నంగా తయారయ్యి ఫ్రెష్ గా స్నానం చేసివచ్చాను -
Like Reply
డ్రెస్ వేసుకుని , ఈరోజులా కాకుండా రేపు నా దేవత మెప్పు పొందాలి ఎలా ఎలా ? ఐడియా ........ ** క్లాస్ నుండి ** క్లాస్ వరకూ మేడం నా దేవత ఇచ్చిన హోమ్ వర్క్ చేసి చూయిస్తే ....... గుడ్ గుడ్ గుడ్ అంటూ బెడ్ పై కూర్చున్నాను . ఇంగ్లీష్ కోసమే ప్రత్యేకంగా ఉంచిన నోట్ బుక్ తీసి దేవత టీచింగ్ గుర్తుచేసుకుంటూ - దేవత నవ్వులకు పులకించిపోతూ - చెంపదెబ్బను పదే పదే తలుచుకుంటూ స్పృశిస్తూ ఉత్సాహంగా హుషారుగా చిరునవ్వులు చిందిస్తూ పూర్తిచేసాను .
Finished ....... ఇలాంటి హోమ్ వర్క్ పూర్తిచేసినవాడిని నేనే మొదటివాడిని అయి ఉంటాను - ప్రతీ క్లాస్ హోమ్ వర్క్ చూసి మేడం షాక్ అయిపోతారేమో అని నవ్వుకుని బెడ్ పై వాలిపోయాను .

అంతలో మహేష్ మహేష్ ....... అంటూ డోర్ అటువైపు నుండి చిన్నగా పిలుపులు వినిపించడంతో లేచివెళ్లి ఓపెన్ చేసాను . 
మహేష్ ....... బామ్మగారు ఇచ్చివెళ్లారు నీకు ఇవ్వమని అంటూ బ్యాగు అందించి వెళ్ళిపోయాడు సెక్యూరిటీ అన్న  ........
బామ్మనా ....... అంటూ డోర్ క్లోజ్ చేసి పెదాలపై చిరునవ్వులతో బెడ్ పై కూర్చుని ఓపెన్ చేసిచూస్తే క్యారెజీ అందులో చికెన్ బిరియానీ - చికెన్ ఫ్రై .......
Wow అంటూ బిరియానీ వాసనను పీల్చి ఉమ్మ్ ఆఅహ్హ్ ....... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ బామ్మా ....... , వెంటనే మొబైల్ అందుకుని బామ్మకు కాల్ చేసి ఎత్తగానే థాంక్స్ ముద్దులతో సంతోషాన్ని పంచుకున్నాను .
బామ్మ : హ హ హ ....... , బుజ్జిహీరో ....... నీకోసం నా బుజ్జితల్లి స్వయంగా చేసింది - ఈరోజు కూడా చూడలేకపోయాను కనీసం ఇలాగైనా ........
బామ్మా బామ్మా ....... ఇదేమీ బాగోలేదు - హోమ్ వర్క్ , చదువుకుంటున్న మీ మనవరాలితో ....... ఇంకొక్కసారి ఎప్పుడూ నాకోసం డిస్టర్బ్ చెయ్యకండి - కాలేజ్లో ఒక్కొక్క సబిజెక్టు లో ఎంతెంత హోమ్ వర్క్ ఇస్తారో ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యాక నాకూ తెలిసొచ్చింది పాపం నావలన ఎంత కష్టపడ్డారో నాతరుపున sorry చెప్పండి ........
బామ్మ నవ్వులు ఆగనే ఆగడం లేదు - సరే సరే బుజ్జిహీరో ....... ఇంకెప్పుడూ ఇలా చెయ్యను sorry sorry చెబుతూనే నవ్వుతూనే ఉన్నారు - ఇంతకీ బిరియానీ ఎలా ఉందో చెప్పనేలేదు - నీ బుజ్జిదేవకన్య ok ok నా బుజ్జితల్లి కాలేజ్ కు వెళ్ళినప్పుడు నేనే స్వయంగా వెళ్లి లెగ్ పీసస్ సెపరేట్ గా కొట్టించి తీసుకువచ్చాను .
ఇంకా టేస్ట్ చెయ్యలేదు బామ్మా ....... , ఘుమఘుమలకే నోరూరిపోతోంది అంటే నమ్మండి - రుచి చూసి కాల్ చేస్తాను థాంక్యూ బామ్మా .......
బామ్మ : బామ్మకు ....... ప్రాణమైన మనవడు థాంక్స్ చెబుతాడా ఎక్కడైనా నేను అలిగాను .
ప్రాణమైన బామ్మకు చెప్పడం తప్పే ....... మరేమి చెప్పాలి - బామ్మా ....... మీరు కోప్పడరంటే థాంక్స్ బదులు ఆప్యాయంగా ప్రాణంలా లవ్ లవ్ ....... లవ్ యు అని చెప్పొచ్చా ....... sorry sorry బామ్మా - నా ప్రాణమైన అవ్వలను అలానే .......
బామ్మ : అంటే ఇప్పటివరకూ నా ఆప్యాయత - ప్రేమ ....... మీ అవ్వల ప్రేమకు కొద్దిగా కూడా ........
లేదు లేదు బామ్మా ....... లవ్ యు లవ్ యు లవ్ యు బోలెడన్ని లవ్ యు లు బామ్మా .......
బామ్మ : నవ్వులు ....... , ఇప్పుడు సంతృప్తి చెందాను - ఇకనుండీ రోజూ పంపిస్తాను.
బామ్మా ........ మీకెందుకు శ్రమ .......
బామ్మ : నా ప్రాణమైన మనవడి కోసం ....... అంటే నేను నీ బామ్మను కాదన్నమాట .......
అలా అలా కాదు బామ్మా ....... , ok ok మీ ఇష్టం .
బామ్మ : లవ్ యు బుజ్జిహీరో ........
హమ్మయ్యా ...... బామ్మ కోపం చల్లారినట్లుంది - బామ్మా ....... ఇంత బిరియానీ ఒక్కరే తినగలరా అందులోనూ నాది బుజ్జిపొట్ట కదా ........
బామ్మ : మన దైవమైన మన పెద్దమ్మకు కూడా బుజ్జిహీరో ........
సరిపోయింది బామ్మా ....... , ఇంతవరకూ పెద్దమ్మ నాకే దర్శనం ఇవ్వలేదు ఇక నాతోపాటు కలిసి ఈ బిరియానీ తినడమూనా .........
బామ్మ : అయితే మొత్తం నువ్వే తినెయ్యి బుజ్జిహీరో - ఎంతైనా కష్టం తెలిసినవాడివికదా ........ వేడిగా ఉన్నప్పుడే తింటే ఎక్కువగా తినవచ్చు బై బై బై ........ ఉమ్మా ఉమ్మా , wait wait బిరియానీ వండిన నీ ...... నా బుజ్జితల్లికి థాంక్స్ ఏమైనా .......
లేదు లేదు బామ్మా ....... , మీరు చెప్పినట్లుగానే బిరియానీ చల్లారిపోతోంది బై బై ఉమ్మా ........
నవ్వుతూ కట్ చేశారు బామ్మ ........

ఇక్కడ నా దేవత మేడం మాత్రమేఅని గుండెలపై చేతినివేసుకుని , బిరియానీ బిరియానీ ........ , అవునూ ....... పనిమనిషి అక్కయ్య కూడా ఫుడ్ తెస్తే ఎలా ఇప్పటికే ఎక్కువగా ఉంది , వెంటనే మురళికి కాల్ చేసి మురళీ ....... సాయంత్రం స్నాక్స్ తోనే కడుపు నిండిపోయింది డిన్నర్ చెయ్యలేను ........ 
మురళి : అందుకే ఎవరుపడితే వాళ్ళు ఇచ్చినది నేను తినను అన్నది నీ ఇష్టం పనిమనిషికి చెబుతానులే - డిన్నర్ చేశాక వస్తాను నా సగం హోమ్ వర్క్స్ నువ్వే చెయ్యాలి ....... సరేనా .....
అలాగే మురళి సర్ ........
మురళి : గుడ్ అంటూ కట్ చేసాడు . 

హమ్మయ్యా ....... తృప్తిగా తినవచ్చు మ్మ్మ్ ఆఅహ్హ్ ...... అంటూ ఒకసారి బిరియానీ వాసనను పీల్చి , వాఅహ్హ్ ........ బామ్మ చెప్పినట్లు వారి బుజ్జితల్లికి ఎన్ని థాంక్స్ లు చెప్పినా తక్కువే తిని రుచిచూసి ఇంకెన్ని చెబుతానో అని తినబోయి ఆగాను - బామ్మ ....... పెద్దమ్మకోసం కూడా పంపించారు అవునవును రెండు లెగ్ పీసస్ ఉన్నాయి ముందు సగం తీసి ఉంచుదాము అని వేరుచేసి పెద్దమ్మ కాగితం ముందు హాట్ బాక్స్ లో ఉంచి , ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తిని ఆ రుచికి మళ్లీ గబ గబా ....... తిన్నాను . బామ్మా కాదు కాదు బామ్మ బుజ్జితల్లి గారూ సూపరో సూపర్ అంతే ....... - పెద్దమ్మా ....... మీకు కోపం వస్తుంది అయినా నిజం నిర్భయంగా చెప్పాలికదా - మీరు పంపిన బిరియానీ కంటే అద్భుతం అమోఘం అంతే అని పెద్దమ్మ వైపు చూడకుండా ముసిముసినవ్వులతో మొత్తం కుమ్మేసి మసాలా కూడా నాకేసి ....... అమ్మో కడుపు నిండిపోయింది ఇంత రుచిగా ఉంటే ఇదొక ప్రాబ్లమ్ అంటూ లేవడం కూడా వల్లకాక పొట్టపై నిమురుకుంటూ బెడ్ పై వాలిపోయాను .

మొబైల్ మ్రోగడంతో ఉలిక్కిపడిలేచాను . చూస్తే మురళి నుండి 9 గంటలు దాటింది. ఎత్తి హలో ........
మురళి : నిద్రపోతున్నావా ఏమిటి ? చెప్పానుకదా హోమ్ వర్క్ పూర్తిచేయాలని ........
ఇదిగో ఇప్పుడే ....... , క్యారెజీ చూసి 5 మినిట్స్ లో వచ్చేస్తాను మురళీ సర్ - లేచి చక చకా క్యారీజీ శుభ్రం చేసి బామ్మ పంపించిన బ్యాగులో ఉంచి బయటకువెళ్లను . అప్పటికే ఫ్రెండ్స్ అందరూ ఒకదగ్గర చేరి సీరియస్ గా హోమ్ వర్క్ చేసుకుంటున్నారు .
మహేష్ ....... ఇటువైపు వచ్చి కూర్చో అని కళ్ళతోనే సైగచేశాడు మురళి ....... - ఫ్రెండ్స్ ఎవరి హోమ్ వర్క్ లో వాళ్ళు బిజీగా ఉండటం చూసి సగం హోమ్ వర్క్ బుక్స్ నా ఒడిలో ఉంచాడు . 
నా ఇంగ్లీష్ హోమ్ వర్క్ ముందుగానే పూర్తిచేయ్యడం మంచిది అయ్యింది అనుకుని 30 నిమిషాలలో పూర్తిచేసి మురళికి అందించాను .
మురళి : అంతలోనే ...... గుడ్ అయితే ఈ చివరిది కూడా ఫినిష్ చేసెయ్యి అంటూ తను పూర్తిచేయ్యాల్సినది కూడా నాకే ఇచ్చాడు .
మరొక 15 నిమిషాలలో అదికూడా పూర్తిచేసి ఇచ్చేసాను .
మురళి : ఫ్రెండ్స్ ....... నా హోమ్ వర్క్ పూర్తయిపోయింది , గుడ్నైట్ చెప్పేసి బ్యాగుతోపాటు లోపలికివెళ్లిపోయాడు .
ఫ్రెండ్స్ : రోజూ ........ మనకంటే చివరగా పూర్తిచేసేవాడు రెండు రోజులుగా మనకంటే ముందుగా చేసేస్తున్నాడు అని షాక్ చెందారు అందరూ ........ , బిరియానీ టేస్ట్ గురించి బామ్మకు మరియు ఢిల్లీలో ఎంజాయ్ చేస్తున్న అవ్వా వాళ్లకు కాల్స్ చెయ్యాలని నేను కూడా వెళ్లబోతే ....... , మహేష్ ...... నీ హోమ్ వర్క్ కూడా అయిపోయిందా ? - నువ్వు కూడా వెళితే మాకు నిద్రవచ్చేస్తుంది please పూర్తయ్యేంతవరకూ ఉండొచ్చు కదా ......- కావాలంటే మా మొబైల్స్ లో గేమ్స్ ఆడుకో ......
అలాగే ఫ్రెండ్స్ - పర్వాలేదు అంటూ కూర్చున్నాను . మొబైల్ తీసి " బామ్మా ....... కాల్ చేసే పరిస్థితిలో లేను the best బిరియానీ సూపర్ అద్భుతం ....... " అంటూ మెసేజ్ చేసాను .
బామ్మ : " లవ్ యు బుజ్జిహీరో ....... , అదేదో నీకోసం ప్రేమతో బిరియానీ వండిన నీ ....... నా బుజ్జితల్లికే చెప్పొచ్చుకదా - నా బుజ్జితల్లి నెంబర్ ********** " .
" లేదు లేదు బామ్మా ....... మీరే చెప్పండి గుడ్ నైట్ గుడ్ నైట్ " .
బామ్మ : " గుడ్ నైట్ బుజ్జిహీరో ...... " 

ఫ్రెండ్స్ : థాంక్యూ మహేష్ ....... ఉదయం ఎప్పుడులేస్తామో తెలియదు , నీవలన మొత్తం హోమ్ వర్క్ పూర్తిచేసాము ఇక హాయిగా నిద్రపోతాము గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూ వెళ్లిపోయారు .
గుడ్ నైట్ ఫ్రెండ్స్ ....... , అవ్వకు వీడియో కాల్ చేసి వారి సంతోషాలను చూసి ఆనందిస్తూ ఔట్ హౌస్ కు వచ్చాను . ఆశ్చర్యం పెద్దమ్మ పేపర్ ముందు ఉంచిన బిరియానీ హాట్ బాక్స్ అక్కడ లేదు - అక్కడే పెట్టానా లేక అంటూ చుట్టూ చూస్తే బెడ్ పై ఉంది మరింత ఆశ్చర్యం తెరిచి ఉంది తెరిచి ఉండటమే కాదు బిరియానీ మొత్తo ఖాళీ ........ - గదిలోకి ఫ్రెండ్స్ ఎవరైనా ........ నాకు తెలిసి ఎవ్వరూ ఇటువైపుకు వెల్లనేలేదు - అంతలో మెసేజ్ .........
" నిజమే ప్రియమైన భక్తుడా ...... నేను వండిన బిరియానీ కంటే అద్భుతం - నాకోసం కూడా పంపించిన బామ్మకు , నీ దైవానికి సగం బిరియానీ విత్ లెగ్ పీస్ తీసిపెట్టినందుకు నా బుజ్జి భక్తుడికి బోలెడన్ని లవ్ యు లు - wait wait అసలు వ్యక్తికి చెప్పాలి ముందు మనకోసం ఇంత రుచికరమైన బిరియానీ వండిన నీ బుజ్జిదేవతకు మీకంటే ఎక్కువ లవ్ యు లు - వీలైతే నా తరుపున నీ బుజ్జిదేవకన్యకు నువ్వే వెళ్లి లవ్ యు చెప్పు " అని పెద్దమ్మ నుండి మెసేజ్ వచ్చింది.
పెద్దమ్మా ....... మీరు తిన్నారా ? , తిన్నాక కూడా తిన్నారా అని అడుగుతున్నాను ఏంటి అంటూ మొట్టికాయ వేసుకుని నవ్వుకున్నాను - ఇక్కడిదాకా రోజూ వస్తున్నారు నాకూ ఒకసారి కనిపించొచ్చు కదా పెద్దమ్మా ....... మిమ్మల్ని దైవంలా పూజించుకుంటాను , నేను అడగడం మీరు ఇగ్నోర్ చెయ్యడం మామూలైపోయింది - అయినా మీరు వచ్చారు తిన్నారు ....... అదే సంతోషం - మరొక విషయం పెద్దమ్మా ....... తను నా బుజ్జిదేవకన్య కాదు నా మనసులో ఉన్నది కేవలం దేవత అవంతిక మేడం గారు మాత్రమే అని గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను . Wait wait ....... " ఇంత రుచికరమైన బిరియానీ వండిన నీ " దేవత " మీకంటే ఎక్కువ లవ్ యు లు - వీలైతే నా తరుపున నీ " బుజ్జిదేవకన్యకు " నువ్వే వెళ్లి లవ్ యు చెప్పు " ఒకదగ్గర " దేవత " మరొకదగ్గర " బుజ్జిదేవకన్య " అని వ్యక్తపరిచారు - పొరపాటుగా పెట్టారా ... ? , దైవమైన పెద్దమ్మ పొరపాటు చేస్తారా ..... ? , ఏంటో తికమకగా ఉంది .
" హ హ హ ....... " మెసేజ్ ........ 
అయితే పొరపాటు కాదన్నమాట అంటూ ఏమీ అర్థం కాక తల గోక్కుంటున్నాను . గుడ్ నైట్ పెద్దమ్మా ........ అంటూ బెడ్ రెడీ చేసుకుని వాలిపోయి దేవతనే గుర్తుచేసుకుంటూ నాలో నేను ముసిముసినవ్వులు నవ్వుకుంటూ బామ్మ భయపడుతూ చెప్పిన మాటలు గుర్తుకువచ్చి సడెన్ గా లేచి కూర్చున్నాను - సమయం చూస్తే 11:30 ...... నాకూ భయం వేస్తున్నా పెద్దమ్మను తలుచుకుంటూ బయటకువచ్చాను - సెక్యూరిటీ అన్న కుర్చీలోనే గురకపెడుతూ నిద్రపోతున్నాడు - చిన్న గేట్ సౌండ్ చెయ్యకుండా తీసి బామ్మ ఇంటిదగ్గరికి చేరుకున్నాను - ప్రక్కనే కటిక చీకటిగా ఉన్న భూత్ బంగ్లా చూసి గుండె ధడ ధడ లాడిపోతోంది - అటువైపుకు కన్నెత్తికూడా చూడకుండా పెద్దమ్మ జపం చేస్తూ అయినా నేను భయపడితే ఎలా ....... బామ్మ వాళ్లకు నా ధైర్యమే ధైర్యం అవ్వాలి కదా అంటూ ఇంటి ఎదురుగా కూర్చున్నాను , నిన్న అర్ధరాత్రి భూత్ బంగ్లా నుండి వినిపించిన మాటలు ఏమిటో తెలుసుకోవడానికి ....... - బామ్మ సేఫ్టీ కోసం నాలో అంత ధైర్యం రావడం నాకే ఆశ్చర్యం వేసింది - థాంక్యూ థాంక్యూ sooooo మచ్ పెద్దమ్మా మీరుండగా నేను భయపడటం మీకు అవమానం ...........

అర్ధరాత్రి సమయంలో చలికి వణుకుతున్నాను - ప్చ్ ...... కనీసం దుప్పటి అయినా తెచ్చుకోవాల్సింది అని చేతులు కట్టుకుని అటూ ఇటూ కదులుతున్నాను .
 అంతలో బామ్మ ఇంటిలో లైట్ వెలగడం - బామ్మ కిటికీలోనుండి చూసి ఎవరు ?  ఎవరు అక్కడ ఉన్నది సెక్యురిటి సెక్యూరిటీ .........
బామ్మా బామ్మా ....... ష్ ష్ నేను నేను .......
బామ్మ : బుజ్జిహీరో ....... అంటూ డోర్ తీసుకుని నాదగ్గరికివచ్చి నాకంటే ఎక్కువ వణకడం చూసి నవ్వుకున్నాను . బు....జ్జి హీ.....రో ఈ సమయంలో ఇక్కడ ఉన్నావేంటి - చలి ఎక్కువగా ఉంది కోల్డ్ వచ్చేస్తుంది లోపలికి రా అంటూ చేతిని అందుకున్నారు - నేను పదే పదే భూత్ బంగ్లా వైపు చూస్తుండటం చూసి , బుజ్జిహీరో ........ మాకోసం మేము భయపడుతున్నామని అదేదో దాని అంతు చూడటానికి వచ్చావుకాదూ అంటూ సంతోషంతో అమాంతం కౌగిలించుకుని లవ్ యు లవ్ యు అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
ఆఅహ్హ్ ....... బామ్మా మీ కౌగిలిలో ముద్దులకు వెచ్చగా ఉంది అని మరింత కౌగిలించుకున్నాను . దెయ్యం అంతు చూడటమా అమ్మో నాకు మహా భయం ఏదో నా ప్రాణమైనవాళ్ళు హాయిగా నిద్రపోవాలని భూత్ బంగ్లా సంగతేమిటో చూద్దామని పెద్దమ్మను తలుచుకుంటూ గమనిస్తున్నాను - మీరు ఈ సమయంలో లేచారంటే బంగ్లా నుండి ఏమైనా ..........
బామ్మ : లేదు లేదు ఈరాత్రి అలాంటివేమీ వినిపించలేదు - బయట మేమంటే ప్రాణమైన బుజ్జిమనవడు ఉండగా ఆ దెయ్యాలు కూడా భయపడిపోయినట్లున్నాయి - దాహం వేస్తే లేచివచ్చాను - నీ బుజ్జి ........ నా బుజ్జితల్లి హాయిగా నిద్రపోతోంది , ఈ విషయం తెలిస్తే పరుగున వచ్చి నాకంటే ఎక్కువ ముద్దులు ........
నో నో నో బామ్మా ........ ఎందుకు డిస్టర్బ్ చెయ్యడం .......
బామ్మ : ప్చ్ ...... బుజ్జిహీరో నిన్నూ ...... , మాకోసం నిద్రకూడా మానుకుని ఎవ్వరూ చెయ్యనిది చేస్తున్నావు లవ్ యు sooooo మచ్ బుజ్జిహీరో ........
ఎవరికోసం చేస్తున్నాను మా మంచి బామ్మ కోసం - పెద్దమ్మ చెప్పిన నేనంటే ప్రాణమైన మీకోసం ఏమైనా చేస్తాను బోడి నిద్ర ....... కావాలంటే కాలేజ్లో పడుకుంటాను .
బామ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో అవును నువ్వే మా ప్రాణం - నాకు నా బుజ్జితల్లి కంటే నువ్వే ఎక్కువ ప్రాణం . అయినా క్లాస్ లో నీ దేవత టీచ్ చేస్తుండగా నువ్వు పడుకుంటావంటే నమ్మమంటావా ....... బుజ్జిహీరో ......
అవునుకదా ....... అని సిగ్గుపడ్డాను .

బామ్మ : నీ దేవతను కళ్ళు మూతలు పడకుండా చూస్తూనే ఉండాలన్నా - క్లాస్సెస్ లో ఆటపట్టించాలన్నా - కవ్వించాలన్నా - నీ హృదయమంతా నింపుకున్న అదే అదే వయసుతో సంబంధం లేని స్వచ్ఛమైన ప్రేమను పంచాలన్నా ........ ఇప్పుడు నిద్రపోవడం అత్యవసరం .........
టీజ్ చెయ్యడమా ...... ? అంటూ పెదాలపై చిరునవ్వులతో అడిగాను .
బామ్మ : ఆ వయసు నుండి వచ్చిన బామ్మగా చెబుతున్నాను అమ్మాయిలకు అదే అదే దేవతను ఎంత కవ్వించి అంత కోపాగ్నిని కలిగిస్తే చిరునవ్వులతో సంతోషంగా ఆస్వాదిస్తూ చివరగా తన బుజ్జిదేవుడివి నువ్వే అని తెలిసాక ఉంటుందీ ....... వద్దులే నేను చెప్పకూడదు నా బుజ్జిమనవడే స్వయంగా ఆస్వాదించాలి అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
Wow ....... బామ్మా బామ్మా వింటుంటేనే వొళ్ళంతా ఏదో తెలియని happiness ఇక దేవత కోపం - దెబ్బలు తింటుంటే ....... హబ్బా హబ్బా ఆ మాజానే వేరు - బామ్మా ........ మీరు చెప్పినట్లు నాది స్వచ్ఛమైన స్వచ్ఛమైన .........
బామ్మ : అవును బుజ్జిహీరో ....... , పిల్లలు దేవుడితో సమానం అంటారు అంటే ఈ బుజ్జిదేవుడి కల్మషం లేని మనసు నుండి ఉద్భవించిన ప్రేమ స్వఛ్చమైనది కాక ఇంకేమిటి ........ - చలి ఎక్కువగా ఉంది లోపలికి రా ........
పర్లేదు బామ్మా ....... నావలన మీ మనవరాలు ఇబ్బందిపడకూడదు మీరు వెళ్లి హాయిగా పడుకోండి , మరికొద్దిసేపు ఉండి వెళతాను .
నా మాటలకు బామ్మ కళ్ళలో చెమ్మతో , బుజ్జిహీరో ....... ఇంతటి స్వచ్ఛమైన బుజ్జిమనసు నుండి ఒక ముఖ్యమైన విషయాన్ని దాచాను - అసలు ఎందుకు దాస్తున్నానో కూడా నాకు తెలియడం లేదు ముందుగా sorry బుజ్జిహీరో ...... ఈ బామ్మను క్షమించు .......
బామ్మా ....... అక్కడితో ఆడిపోండి - అయినా మీరే చెప్పారుకదా మనమధ్యన thanks లు sorry లు ఉండకూడదు అని వెనక్కు తీసుకోండి వెనక్కు తీసుకోండి - పెద్దవారు కూడా దేవుళ్ళతో సమానం వాళ్ళు ఏమిచేసినా మామంచికోసమే అని అవ్వ చెప్పారు .
బామ్మ : ఈ వయసులోనే ఎంత గొప్ప మనసు నా బుజ్జి మనవడిది అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . బుజ్జిహీరో ....... ఒక్కసారి ఓకేఒక్కసారి నీ ....... నా బుజ్జితల్లిని చూడు pleaae please please అంటూ చేతిని అందుకున్నారు .
నో నో నో బామ్మా ...... తప్పు తప్పు మీరు వెళ్లి హాయిగా పడుకోండి - నేను నిద్రపోవడం కావాలికదా ఇప్పుడే వెళ్లి పడుకుంటాను .
బామ్మ : లోపలికి ఎలాగోలా తీసుకెళితే ఒకరినొకరు చూసుకోవచ్చు ....... సరే సరే , చలిలో ఇంటివరకూ వెళ్ళేలోపు కోల్డ్ ఆపై జ్వరం వచ్చినా వస్తుంది - అలా జరిగితే రేపు నీ దేవతను మనసారా చూసుకోలేవు కాబట్టి కనీసం హాల్లోకి వచ్చి అయినా సోఫాలో పడుకో ........
బామ్మా .........
బామ్మ : అయినా మేమేవరిమి , నీకు జ్వరం వస్తే ఈ బామ్మ బాధ నీకెలా అర్థమవుతుంది అని అలకతో మెయిన్ గేట్ దగ్గరికి వెళ్లి బాధపడుతున్నారు లేక బాధపడుతున్నట్లు నటిస్తున్నారో ........
బామ్మా బామ్మా ....... మీరు బాధపడితే నేను తట్టుకోలేను - సరే మీ ఇష్టం కానీ ఒక్క కండిషన్ ....... నేను లోపలికి వచ్చినట్లు మీ బుజ్జితల్లికి తెలియనే తెలియకూడదు మాటివ్వండి వస్తాను .
బామ్మ : ప్చ్ ...... నిన్నూ ...... సరే అంటూ చేతిలో చేయివేసి లోపలికి పిలుచుకునివెళ్లి డోర్ లాక్ చేశారు .
ష్ ష్ ....... బామ్మా , హాయిగా నిద్రపోతున్నవాళ్లను డిస్టర్బ్ చెయ్యడం మహాపాపం ......
బామ్మ : చిరుకోపం - సంతోషంతో సోఫాను రెడీ చేసి పడుకోమన్నారు . నీళ్లు తాగి నాకు అందించారు . 
బామ్మా ...... సైలెంట్ గా వెళ్లి మీ బుజ్జితల్లిని జోకొడుతూ హాయిగా పడుకోండి - భూత్ బంగ్లా విషయం ఏమిటి నేను చూసుకుంటాను అని కిటికీ ప్రక్కనే సోఫాలో కూర్చున్నాను .
బామ్మ వెళ్లి క్షణంలో వచ్చి ఇది నా బుజ్జితల్లి కప్పుకునే దుప్పటి అంటూ నాపై కప్పబోయారు .
నో నో నో బామ్మా ....... వేరే వేరే మీ దుప్పటి ఉంటే ఇవ్వండి ష్ ష్ ....... please please .......
బామ్మ : చిరుకోపం - ముసిముసినవ్వులతో ....... వెళ్లి మందమైన దుప్పటిని వణుకుతున్న నాకు కప్పి , లవ్ యు బుజ్జిహీరో ....... అంటూ నుదుటిపై ముద్దుపెట్టి గదిలోకివెళ్లారు .
లవ్ యు టూ బామ్మా ....... అంటూ గంటా గంటన్నర వరకూ బంగ్లాను గమనించి ఎటువంటి సౌండ్స్ రాకపోవడంతో దుప్పటి కప్పుకుని హాయిగా నిద్రపోయాను .
Like Reply
తెల్లవారకముందే లేచి సమయం 5:30 అవుతుండటం చూసి దుప్పటిని మడిచి సోఫాలో ఉంచాను . చప్పుడు చెయ్యకుండా అడుగులువేస్తూ డోర్ దగ్గరికి వెళ్ళాను - తాళం చెవి ఎక్కడుందబ్బా ....... అని లైట్ వేసి చుట్టూ చూస్తున్నాను .
ఎంత వెతికినా దొరకదు బుజ్జిహీరో ఎందుకంటే నాదగ్గర ఉంది అని చూయించారు బామ్మ - నాబుజ్జితల్లి లేవకముందే వెళ్లిపోదామనుకున్నావు కదూ ........ 
బామ్మా ...... అదీ కాలేజ్ కు రెడీ అవ్వాలి - ఫ్రెండ్స్ ...... జాగింగ్ కోసం కొద్దిసేపట్లో కాల్ చేసినా చేస్తారు .
బామ్మ : అవన్నీ సెకండరీ - బుజ్జితల్లి లేవకముందే తప్పించుకోవడం అన్నది నీ ఉద్దేశ్యం అని నాకు తెలుసులే - ఒక్కసారి ఓకేఒక్కసారి హాయిగా నిద్రపోతున్న నీ ........
Please please బామ్మా ....... నిద్రపోతున్నవాళ్లను ఇలా డిస్టర్బ్ చెయ్యడం భావ్యమా చెప్పండి .......
బామ్మ : ప్చ్ ...... నీ ఇష్టం - అదృష్టం నీ దగ్గరకే వస్తుందంటే కాదంటున్నావు - రేపు ఉదయం ఈ సమయానికి ఆ అదృష్టం కోసం ఈ ఇంటిచుట్టూ ప్రదక్షిణలు చేస్తావులే ....... అంటూ వచ్చి తాళం ఓపెన్ చెయ్యగానే .....
గుడ్ మార్నింగ్ చెప్పి ఔట్ హౌస్ కు పరుగులుపెట్టడం చూసి బామ్మ నవ్వుకున్నారు.

మెయిన్ గేట్ దగ్గరికి చేరేసరికి మురళి - వినయ్ మరియు నలుగైదుగురు ఫ్రెండ్స్ జాగింగ్ కు రెడీగా ఉన్నారు . బయటనుండి వస్తున్న నన్ను చూసి మహేష్ ....... ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగారు .
అంతే అర్ధరాత్రి భూత్ బంగ్లా చూసినా వేయని భయం ఇప్పుడు ఏకంగా వొళ్ళంతా చెమటలు కూడా పట్టేసాయి - అదీ అదీ ........
వినయ్ : ఆ చెమటలు చూస్తుంటే తెలియడం లేదూ మనకంటే ముందు జాగింగ్ పూర్తిచేసుకుని వచ్చాడని .......
Wow ..... అవును అవునవును ఫ్రెండ్స్ జాగింగ్ జాగింగ్ గ్రౌండ్ లో రౌండ్స్ వేశానా చెమటలు పట్టేసాయి - థాంక్స్ వినయ్ సేవ్ చేసినందుకు అని నవ్వుకున్నాను .
గోవర్ధన్ : అయితే మాతోపాటు రావన్నమాట వెళ్లు వెళ్లి కాలేజ్ కు రెడీ అవ్వు ......
అలాగే గోవర్ధన్ ........
మురళి : నో నో నో , మనకంటే ముందు వెళ్లినందుకు గానూ శిక్షగా మళ్లీ మనతోపాటు వచ్చి జాగింగ్ చేయాల్సిందే ....... , రండి వెళదాము .
మురళికి వొళ్ళంతా ఈగోనే అని మనసులో అనుకుని ఫ్రెండ్స్ తోపాటు జాగింగ్ వెళ్లి గంట తరువాత వచ్చి ఫ్రెష్ అయ్యి కాలేజ్ కు రెడీ అయ్యాను .

అప్పటికే పనిమనిషి అక్కయ్య టిఫిన్ ఉంచి వెళ్లడం కాలింగ్ బెల్ సౌండ్ కు డోర్ ఓపెన్ చేస్తే సెక్యురిటి అన్నయ్య కూడా బామ్మ ఇచ్చారు అని ఏకంగా రెండు క్యారెజీలు ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ ........
రెండు టిఫిన్స్ చెయ్యడం నా వలన అవుతుందా ? ....... ఐడియా నేను మురళి వాళ్ళ టిఫిన్ చేసి , బామ్మ ప్రేమతో పంపిన టిఫిన్ ను పెద్దమ్మకోసం ఉంచి లంచ్ బాక్స్ ను కాలేజ్ కు తీసుకెళదాము . 
టిఫిన్ చేసేసి పాత్రలను శుభ్రం చేసి బయట ఉంచాను . కాలేజ్ డ్రెస్ లో బ్యాగు అందుకుని మెయిన్ గేట్ దగ్గర ఉన్న డ్రైవర్ ను చేరుకున్నాను - అన్నయ్యా ...... నేను బయట బస్ స్టాప్ దగ్గర ఎదురుచూస్తుంటాను అక్కడ ఎక్కించుకుంటారా ....... ? .
డ్రైవర్ : అంతగా అడగాలా మహేష్ ...... , బస్ స్టాప్ మీదుగానే కదా వెళ్ళేది , ఏంటి బస్ స్టాప్ అంటున్నావు ఎవరైనా అమ్మాయికోసమా ....... sorry sorry జస్ట్ కిడ్డింగ్ వెళ్లు మహేష్ ........
థాంక్స్ అన్నయ్యా ........ ( అవును అమ్మాయి కాదు కాదు దేవతకోసం నిన్న అక్కడే కదా మాయం అయిపోయింది ) అని పరుగుతీసాను .
డ్రైవర్ : మహేష్ మహేష్ ....... బ్యాగు ఎందుకు బరువు అంటూ నాదగ్గరికే వచ్చి లంచ్ బ్యాగుతో సహా తీసుకుని కారులో ఉంచారు .
థాంక్యూ so మచ్ అన్నయ్యా ...... అంటూ మరింత వేగంతో పరుగుతీసాను .

బుజ్జిహీరో బుజ్జిహీరో ........ ఈ బామ్మ వైపు కనీసం చూడకుండా వెళుతున్నావు కదూ - నీ దేవత కోసమే కదా ....... , అంతేలే ఈ బామ్మ కంటే నీకు నీ దేవతనే ఎక్కువ ఇష్టం ప్రేమ ప్రాణం అని బుంగమూతిపెట్టుకున్నారు .
నిజమే కదా బామ్మా ....... , బామ్మ మరింత అలగటం చూసి sorry sorry అయ్యో sorry చెప్పేశానా ? , లవ్ యు బామ్మా ....... ఇది వినండి కాలేజ్ టైం అంతా మా బామ్మ కంటే దేవత అంటేనే ఎక్కువ ఇష్టం - కాలేజ్ నుండి వచ్చిన తరువాత మళ్ళీ నెక్స్ట్ డే కాలేజ్ కు వెళ్లేంతవరకూ నా దేవత కంటే మా బామ్మ అంటేనే ప్రాణం ...... are you happy బామ్మా .........
బామ్మ : సంతోషమైన నవ్వులతో చాలా అంటే చాలా హ్యాపీ అంటూ నన్ను కౌగిలిలోకి తీసుకుని ముద్దుపెట్టారు - ఈరోజుతో కాలేజ్ నుండి వచ్చిన తరువాత కూడా నీ దేవతే ఎక్కువ ప్రాణం అంటావులే అంటూ గుసగుసలాడారు ........
బామ్మా ....... ఏమైనా మాట్లాడారా అంటూ పదే పదే మెయిన్ గేట్ వైపు చూస్తున్నాను .
బామ్మ : చిరుకోపంతో వెళ్లు బుజ్జిహీరో వెళ్లు ....... పదే పదే మెయిన్ గేట్ వైపు ఎందుకు చూస్తున్నావో నాకు తెలుసులే , వెళ్లు అంటూ నన్ను వదిలారు .
బామ్మా ....... మా ఫ్రెండ్స్ కార్స్ వచ్చేలోపు దేవతను ఒక్కసారైనా చూద్దామని ఆశ - నిన్న సాయంత్రం నుండీ చూడలేదా ఇక్కడ తియ్యనైన నొప్పి ....... 
బామ్మ : అయితే చూడాల్సిందే బుజ్జిహీరో వెళ్లు త్వరగా వెళ్లు , ఏ క్షణమైనా నీ ప్రియాతిప్రియమైన దేవత ప్రత్యక్షం అవ్వవచ్చు ........ - ఒక్క క్షణం ఒక్క క్షణం ...... నిన్న నా బుజ్జిహీరో చెంపపై నీ దేవత కోపంతో కొట్టిందా మామూలుగా కొట్టిందా ? .
భద్రకాళీలా మారిపోయినట్లు కాస్త కోపంతోనే కొట్టారు బామ్మా - అయినా హాయిగా ఉందని చెప్పానుకదా ....... - ఈరోజు కనీసం రెండు దెబ్బలైనా తింటానేమో మా బామ్మ చిలిపి ఐడియా వలన ......
బామ్మ : హ హ హ ok ok వెళ్లు , కాలేజ్లో నీ దేవతను బాగా ఆటపట్టించి ఎంజాయ్ చెయ్యి .
కళ్ళల్లో చెమ్మతో బామ్మ గుండెలపైకి చేరిపోయాను .
బామ్మ : ఏమైంది బుజ్జిహీరో అని బాధతో అడిగారు .
రోజూ ....... నా ఫ్రెండ్స్ ను వాళ్ళ పేరెంట్స్ ఇలానే ముద్దులుపెట్టి కాలేజ్ కు పంపిస్తారు బామ్మా - ఫస్ట్ టైం మీరు అలా పంపించడంతో సంతోషం ఆగడం లేదు . 
బామ్మ : లవ్ యు బుజ్జిహీరో ...... ఇకనుండీ రోజూ కౌగిలించుకుని ముద్దుపెట్టి సాగనంపుతాను సరేనా అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
బామ్మా ....... సాగనంపుతాను అని కౌగిలిలోనే బంధించేశారు - అక్కడ బస్సులు వచ్చి వెళ్లిపోతున్నాను .
బామ్మ : నా బుజ్జిహీరో వెళ్లేంతవరకూ తన దేవత బస్ ఎక్కనే ఎక్కదు .......
లోపల నుండి బామ్మా ....... నా ఫోన్ - హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ ? కాలేజ్ కు ఆలస్యం అవుతోంది .
వాయిస్ ఆ వాయిస్ .......
బామ్మ : ముసిముసినవ్వులతో ........ బుజ్జిహీరో మరొక బస్ వచ్చినట్లు సౌండ్ వినిపిస్తోంది .
బై బామ్మా ...... అంటూ బుగ్గపై ముద్దుపెట్టి బయటకు ఉరికాను .

బస్ స్టాప్ లో ఆగిన బస్ ను చూసి కదులుతుందేమోనని మరింత వేగంతో పరుగుతీసి బస్ ఎక్కి ఆయాసంతో మొత్తం చూసాను - దేవత ఎక్కడా కనిపించకపోవడంతో చిన్నగా కదిలిన బస్ లోనుండి దిగేసాను - 5 నిమిషాలకు ఒకటి వస్తున్న బస్సెస్ మరియు ఆటోలలో చూసినా దేవత జాడ లేదు . 
అంతలో మా ఫ్రెండ్స్ కార్లు రానే వచ్చాయి . ప్చ్ ....... ఇక కాలేజ్లోనే దేవత దర్శనం అన్నమాట అనుకుని రోడ్డుకు మరొకవైపు ఆగిన కార్స్ దగ్గరికి వెళ్ళాను .
మురళి : డ్రైవర్ ....... డోర్ ఓపెన్ చేయవద్దు . వీడికోసం రెండు నిమిషాలపాటు నేను వేచిచూడాల్సి వచ్చింది - ఔట్ హౌస్ నుండి వస్తాడు వస్తాడు అని వేచి చూస్తుంటే నువ్వు బస్సులో వెళదాము అని ఇక్కడకు వచ్చేశావు కాబట్టి ఈరోజుకు బస్సులోనే రా డ్రైవర్ పోనివ్వు ........
డ్రైవర్ : మురళీ సర్ ....... నాకు చెప్పే వెళ్ళాడు , చెప్పాను కదా ........
మురళి : కారు నీదా ?  నాదా ? - మరొక్కసారి నా మాటకు ఎదురుచెబితే డాడీ కి చెప్పి డ్రైవర్ నుండి తీసేయించేస్తాను అని మిర్రర్ పైకెత్తుకున్నాడు . 
ఎందుకో ఏమో మురళీ పనిష్మెంట్స్ అన్నీ నాకు వరంలా మారుతున్నాయి అని లోలోపలే మురిసిపోతూ , అన్నయ్యా ...... నాకు కారులో కంటే బస్సులోనే వెళ్లాలని ఉంది - మురళి కోప్పడతాడాని మానుకున్నాను కాబట్టి మీరు ఏమాత్రం ఫీల్ అవ్వకుండా వెళ్ళండి .
డ్రైవర్ : మహేష్ ....... కాలేజ్ వైపు వెళ్లే చివరి బస్ అదే కదులుతోంది తొందరగా వెళ్లు వెళ్లు ....... 
అయితే ఖచ్చితంగా నా దేవత ఈ బుస్సునే ఎక్కి ఉంటారు అని స్టాప్ స్టాప్ స్టాప్ అంటూ పరిగెత్తి మమ్మల్ని దాటిపోతున్న బస్సును ఆపిమరీ ఎక్కడం చూసికానీ మా కార్లు కదలలేదు . 

ఇంతకుముందు రెండు మూడు బస్సులు వెళ్లిపోవడం వలన , ప్రయాణీకులంతా వాటిలోనే వెళ్లిపోయినట్లు ఫుట్ బోర్డ్ దగ్గర కానీ - సీట్స్ మధ్య దారిలోకానీ ఎవ్వరూ నిలబడటం లేదు ఎందుకంటే ఇంకా అక్కడక్కడా ఖాళీ సీట్స్ ఉన్నాయి . నా దేవత నా దేవత ....... అంటూ ఒక్కొక్క వరుసలో చూసుకుంటూ వెనకనుండి ముందుకు వెళ్ళాను - సరిగ్గా మధ్యలో పట్టుచీరలో అచ్చు దివినుండి దిగివచ్చిన దేవతలా కనిపించడం చూసి నాకు తెలియకుండానే నా చెయ్యి నా గుండెలపైకి చేరిపోయింది - ప్రక్కనే నిలబడి అలా కన్నార్పకుండా చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయాను - నా దేవత పదే పదే ఎడమ చెంపపై స్పృశించుకుంటున్నారు - తీక్షణంగా గమనిస్తే ఎవరో చెంప చెల్లుమనిపించినట్లుగా చేతివేళ్ల గుర్తులు కనిపిస్తున్నాయి , బుగ్గ ఎర్రగా కందిపోయింది రుద్దుకుని రుద్దుకుని - తీక్షణంగా ఆలోచిస్తున్నట్లుగానూ కనిపిస్తోంది .
నా దేవతను కొట్టినది ఎవరో కానీ వాళ్ళు అయిపో ........ ,అంతలో బిగ్ టర్న్ రావడం - అందులోనూ రెండు చేతులూ సపోర్ట్ గా రాడ్ ను పట్టుకోకుండా నా గుండెలపై ఉండటం వలన బ్యాలన్స్ తప్పి నేరుగా నా దేవత పక్కనున్న సీట్లోకి పడిపోవడమే కాకుండా దేవత ఒడిలోకి చేరాను .

చుట్టూ ఉన్నవాళ్ళంతా బాబూ బాబూ జాగ్రత్త జాగ్రత్త దెబ్బలేమైనా తగిలాయా ..... సీట్ ఖాళీగా ఉన్నప్పుడు కూర్చోవచ్చు కదా ....... - డ్రైవర్ ...... కాలేజ్ పిల్లలు ప్రయాణిస్తారని తెలుసుకదా కాస్త నెమ్మదిగా పోనివ్వండి అని కోప్పడ్డారు .
లేదు లేదు అంటీ దెబ్బలేమీ తగులలేదు ఈ దేవత ...... మేడం గారి వలన అడ్డుగా లేకపోయుంటే విండో మిర్రర్స్ పగిలిపోయి తలంతా గుచ్చుకునేవి తలంతా రక్తం కారిపోయేది ....... - లేడీస్ సీట్స్ కదా అని నిలబడ్డాను అంటీ ........
అమ్మో ...... ఈ అమ్మాయి వలన ఎంత ప్రమాదం తప్పింది , దేవతలా అలాంటిదేమీ జరగకుండా అడ్డుపడింది అని అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు . ఎంత మంచి పిల్లాడు - how sweet of you boy ....... జాగ్రత్త - ఎవ్వరూ లేనప్పుడు కూర్చోవచ్చు - లేడీస్ కంటే ముందు పిల్లలకోసం సీట్స్ ఉండాలి అని మాట్లాడుకుంటూ వారి వారి సీట్లలో కూర్చున్నారు .

పడగానే నా బరువుకు వొత్తుకుందేమో ఆఅహ్హ్ అమ్మా ....... అంటూ కోపంతో భద్రకాళీలా మారిపోయిన దేవత - తనపై పడింది నేనని తెలిసి ఏకంగా మూడో కన్ను తెరిచినంత కోపాగ్నితో రగిలిపోతున్నారు - నేను మిర్రర్ గుచ్చుకోవడం , రక్తం ...... గురించి చెప్పడంతో , మేడం చలించిపోయినట్లు మహేష్ మహేష్ ....... దెబ్బలేవీ తగులలేదు కదా అని తలమొత్తం చూసి హమ్మయ్యా ....... అనుకున్నారు - దెబ్బలేమైనా తగిలాయా sorry కోప్పడ్డాను అని హ్యాండ్ బ్యాగులోనుండి వాటర్ బాటిల్ అందించారు .
నా బాటిల్ లానే ఉందే - అయినా బాటిల్ పోలిన బాటిల్స్ ఉంటాయిలే అనుకుని మూత తెరిచి నోట్లోకి తీసుకునేంతలో .........
దేవత కోపంతో బాటిల్ లాక్కున్నారు - నాకైతే నవ్వు ఆగడం లేదు , అంటే నిన్న జరిగినది ఏదీ దేవత మరిచిపోలేదన్నమాట - అంటే ఇంటికి వెళ్ళాక కూడా నేను గుర్తుకొచ్చే ఉంటాను అని ఆనందంతో పొంగిపోతున్నాను .

ప్రక్కన ఉన్న అంటీ : అమ్మాయీ ...... పిల్లాడి నోటి నుండి నీళ్ళు లాక్కోవడం మంచిదికాదు .
మేడం : అధికాదు అంటీ ....... , కరుచుకుని తాగుతాడు అని నావైపు కోపంతో చూస్తున్నారు .
అంటీ : పిల్లలన్నాక అలానే తాగుతారు మరి ........
అధికాదు అంటీ ....... కదులుతున్న బస్సులో ఎవ్వరైనా అలానే తాగుతారు - కరుచుకోకుండా తాగితే వాళ్ళు మహా మహా గ్రేట్ ఎవ్వరైనా try చెయ్యవచ్చు .
బస్సులో ఉన్నవాళ్ళల్లో సగం మందికిపైగానే తమ తమ వాటర్ బాటిల్స్ తీసి కరుచుకోకుండా తాగబోయి బస్ కదళికలకు షర్ట్స్ - సారీస్ - డ్రెస్సెస్ ....... తడిపేసుకోవడం చూసి వాళ్ళతోపాటు అందరూ నవ్వుకున్నారు - నా దేవత కూడా నవ్వడం నేను చూడగానే కోపంతో విండో వైపుకు తిరిగి కంట్రోల్ చేసుకోవడం వల్లకాక చేతిని అడ్డుపెట్టుకుని ముసిముసినవ్వులలు నవ్వుకోవడం చూసి చాలా చాలా ఆనందం వేసింది .
బాబూ ....... ఆఫీస్ టెన్సన్స్ మొత్తం ఎగిరిపోయేలా నవ్వుకునేలా చేసావు థాంక్యూ థాంక్యూ అంటూ తమ తమ బాటిల్స్ అందించారు .
నో నో నో అంటీ - అంకుల్స్ ....... నాకు మా మేడం గారి నీళ్లే తాగాలని ఆశగా ఉంది - ఇస్తే తాగుతాను లేకపోతే పడటం వలన నొప్పులతో వొళ్ళంతా చెమటలు పట్టేయ్యడం వలన ఎండ వేడికి స్పృహ కోల్పోతాను .
అంటీ వాళ్ళు దేవతను రిక్వెస్ట్ చేసేంతలో....... , నా మాటలకు కొప్పుడుతూనే బాటిల్ అందించారు . 
ల ....... థాంక్యూ sooooo మచ్ మేడం అంటూ దేవతవైపు ప్రేమతో చూస్తూనే కరుచుకుని సగం తాగి soooooo టేస్టీ , ఇప్పుడు హాయిగా ఉంది థాంక్స్ మేడం - మీ స్టూడెంట్ స్పృహ కోల్పోకుండా కాపాడుకున్నారు .
రుసరుసలాడుతూ చూసి అయ్యిందా అంటూ బాటిల్ అందుకుని కర్చీఫ్ తో తుడిచి మూతపెట్టారు - మహేష్ ...... ఇలా అతుక్కుని కూర్చోవాలా అటువైపు అంత ప్లేస్ ఉందికదా ........
అవునుకదా sorry sorry మేడం ....... అంటూ కొద్దిగా ఒక ఇంచు మాత్రమే జరిగాను - దేవత మళ్లీ మూడో కన్ను తెరిచేలా చూడటం చూసి కిందకు పడిపోయేంతలా పూర్తిగా చివరకు జరిగాను .
Like Reply
అంటీ : బాబూ ....... మేడం మేడం అంటున్నావు , ముందే తెలుసా ...... ? .
తెలుసా ఏంటి అంటీ మా కాలేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ ....... ఎంత బాగా టీచ్ చేస్తారో తెలుసా ? , ఒక్కరోజుకే ఫ్యాన్ అయిపోయాను మా మేడం టీచింగ్ కు - మొన్నటివరకూ ఇంగ్లీష్ అంటే నాకు మహాభయం , నిన్న ఒక్కరోజులోనే ఇంగ్లీష్ మొత్తం నేర్చుకున్నంత ఫీల్ కలిగిందంటే నమ్మండి - ఇక ** , ** , ** మరియు ** TO ** వరకూ పిల్లలు అయితే చందమామ కథలు విన్నట్లుగా అదికూడా స్వర్గం నుండి దేవతే స్వయంగా దిగివచ్చి టీచ్ చేస్తుందా అన్నట్లు బుజ్జిబుజ్జినవ్వులతో వింటూ తెగ ఎంజాయ్ చెయ్యడం కళ్లారా చూసి నేనే ఆశ్చర్యపోయాను - నేను ** క్లాస్ ఉన్నప్పుడే మా మేడం గారు వచ్చి ఉంటే ఈపాటికి ఇప్పటివరకూ చెప్పినదంతా ఇంగ్లీష్ లో దడదడలాడించేవాడిని ప్చ్ ......, అయినా ఫీల్ అవ్వడం లేదు ఇంకా సగం year ఉందికదా ** క్లాస్ పూర్తవ్వడానికి ఈ సమయం చాలు ........ అని ఉబ్బితబ్బిబ్బవుతూ గర్వపడుతూ బదులిచ్చాను .
నా దేవత షాక్ చెంది పెదాలపై కోపం స్థానంలో చిరునవ్వులు పరిమళించాయి .
Yes yes ....... అంటూ లోలోపలే పులకించిపోతున్నాను .
అంటీ : మా పిల్లలు కూడా వాళ్ళ కాలేజ్లో ఇంగ్లీష్ టీచ్ చేసే టీచర్స్ సరిగ్గా లేదని రోజూ కంప్లైంట్ చేస్తున్నారు - ఇంతకీ ఏ కాలేజ్ బాబూ మీది ? .
******** కాలేజ్ అంటీ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోపాటు మాథ్స్ - సైన్స్ - సోషల్ ....... అన్నీ సబ్జెక్ట్స్ సూపర్ గా టీచ్ చేసే టీచర్స్ ఉన్నారు .
అంటీ : wow అంటూ ఆలోచనలో పడ్డారు .

మేడం : అబ్బాబ్బా ....... ఏమిచెప్పావు తమరెప్పుడైనా ఆ క్లాస్సెస్ కు అటెండ్ అయ్యారా సర్ ........
చిరునవ్వులు నవ్వుకుని , అటెండ్ అవ్వలేదు ఇకపై కూడా అటెండ్ కాబోను - ఫ్యూచర్ లో క్యాంపస్ ఇంటర్వూస్ లో సత్తా చాటాలంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి సో ఇంగ్లీష్ క్లాస్ తప్ప వేరే క్లాస్ అవసరమే లేదు .
మేడం : హలో హలో ....... మిగతా సబ్జెక్ట్స్ లో రాణించాడని తెలిసిన తరువాత చివరికి ఇంటర్వ్యూ లేకపోతే ఇంటర్వ్యూ గది బయటే ఆగిపోవాల్సివస్తుంది .
అయితే ఇంటర్వ్యూ కు కూడా అటెండ్ అవ్వను జాబ్ కూడా అవసరం లేదు - ఇంగ్లీష్ లో రాటుదేలి ఏకంగా ఒక కంపెనీనే ఏర్పరచి కేవలం ఇంగ్లీష్ చక్కగా మాట్లాడేవాళ్లకు మాత్రమే జాబ్స్ ఇస్తాను అని ఆ వయసులో పిల్లాడిలా మాట్లాడాను .
నా మాటలకు - కాన్ఫిడెన్స్ కు నా దేవత నోరుతెరిచి అలా చూస్తుండిపోయారు . 
మేడం మేడం ....... అంటూ తాకీతాకినట్లుగా స్పృశించి , షాక్ లతో నోరు ఆరిపోయినట్లుగా ఉన్నట్లుంది అనడం ఆలస్యం ........ 
బాటిల్ అందుకుని మిగిలిన సగం నీళ్లు గట గటా తాగేశారు .
నా ఎంగిలి నీళ్లు తాగినందుకు , ఎంజాయ్ చేస్తూ దేవతనే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
నా సంతోషానికి కారణం తెలిసి అయ్యో ...... తాగేసానా అన్నట్లు మళ్లీ నాపై కోపపు బాణాల దండయాత్ర మొదలైంది - కోపంతో కొట్టబోయి చుట్టూ నా ఫాన్స్ అయిపోయారు కాబట్టి కంట్రోల్ చేసుకోవడం చూసి నవ్వుకున్నాను - బాటిల్ కూడా బయటకు విసరబోయి ఏదో గుర్తుకువచ్చినట్లు అమ్మో ....... అంటూ చెంపపై చేతినివేసుకుని రుద్దుకుంటున్నారు - మరొకచేతితో బాటిల్ ను జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగులో దాచుకున్నారు .
బాటిల్ కు - చెంపకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది కానీ ఏమిటో అర్థం కావడం లేదు - చూస్తున్నకొద్దీ నా బాటిల్ అన్న అనుమానమూ పెరుగుతోంది .

అంటీ : బాబూ ....... మేడం అంటే భయమా ? , దూరంగా పడిపోయేలా కూర్చున్నావు .
నో నో నో అంటీ రెస్పెక్ట్ అంటూ చెంపపై చేతినివేసుకున్నాను .
చెంపదెబ్బ గుర్తుచేసుకుని నా దేవత ఒక్కసారిగా నవ్వేశారు - కంట్రోల్ చేసుకోవడానికి చేతిని అడ్డుపెట్టుకున్నా వీలుకాక నవ్వుతూనే ఉన్నారు .
అంటీ : బాబూ ....... పడితే దెబ్బలు తగులుతాయి జరిగి సరిగ్గా కూర్చో .......
అలానే అంటీ అంటూ జరగబోయి , దేవత కోపంతో చూడటంతో నో నో నో అంటూ మళ్లీ చివరికి జరిగాను . అదేసమయానికి మళ్లీ బిగ్ టర్న్ రావడంతో పడిపోబోతే నా దేవత రెండుచేతులతో పడిపోకుండా పట్టుకున్నారు - దేవత స్పర్శకు ఆ క్షణం ఏదో తియ్యని ఫీల్ తో నన్ను నేను మరిచిపోయి అలాగే ఉండిపోయాను .
మేడం : మహేష్ ....... టర్న్ తిరిగింది కదా ఇక కూర్చోవచ్చు - చేతులు నొప్పివేస్తున్నాయి . 
Sorry థాంక్స్ థాంక్స్ మేడం అంటూ మళ్లీ చివరన కూర్చున్నాను . 
మేడం : ఈసారి పడితే బస్సులో ఉన్న నీ ఫ్యాన్స్ అందరూ నన్ను తిట్టినా తిడతారు కాస్త నావైపు జరిగి కూర్చో ........
( యాహూ ....... అంటూ మనసులో సంతోషపు కేకతో ) మేడం కు హత్తుకుని కూర్చుని wow ఈ ఫీల్ కోసం ఏమైనా .........
మేడం : మహేష్ ....... జరిగి కూర్చో అన్నాను నాపై నా ఒడిలో కూర్చోమనలేదు అంటూ చురచురా చూస్తూ , చెంపపై రుద్దుకుంటున్నారు .
Sorry sorry మేడం అంటూ ముసిముసినవ్వులతో దేవతను తాకకుండా కూర్చున్నాను .

మేడం మిమ్మల్ని ఒకటి అడుగవచ్చా ........ ? .
మేడం : నేను నో అన్నా వదులుతావా చెప్పు ........
నవ్వుకుని , మేడం ....... మీ బుగ్గపై చెంప దెబ్బనే కదా ....... ? .
మేడం : నీకెలా తెలిసింది అని నాలుక కరుచుకున్నాను . కాదు కాదు ....... అని బుగ్గపై రుద్దుకోబోయి ఆగి పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటున్నారు .
అయితే చెంప దెబ్బనే ....... , ఎవరు మేడం ....... దేవతలాంటి మిమ్మల్ని కొట్టినది - ఎవరో తెలిస్తే ఊరికే వదలను చెప్పండి మేడం , వాళ్ళ అంతు చూస్తాను .
మేడం : చెప్పను - కొట్టినవారు నా ప్రాణం కంటే ఎక్కువైనవారు సో ....... - అయినా నీకేందుకు చెబుతున్నాను - చెంపదెబ్బ కాదని చెప్పానుకదా - అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతున్నావు ? .
ఎందుకంటే నిన్న మీరు కొట్టినప్పుడు కూడా ఇలానే ఎర్రగా కందిపోయింది - ఇంటికి వెళ్లేంతవరకూ రుద్దుకుంటూనే వెళ్లడం వలన నా ప్రాణమైన వారు కూడా చూసి బాధపడ్డారు .
మేడం : sorry మహేష్ ....... మీ పేరెంట్స్ బాధపడ్డారా ? .
నో నో నో మేడం నేను అందరూ ఉన్న అనాధను .
మేడం : అనాధను కొట్టానా అని ఫీల్ అవుతున్నారు కళ్ళల్లో చెమ్మతో .........
నో నో నో స్టాప్ స్టాప్ మేడం ....... చెప్పాను కదా పేరుకే అనాధను కానీ ఇద్దరు అవ్వలు - పెద్దమ్మ - బోలెడంత మంది తమ్ముళ్లూ చెల్లెళ్లు - ఫ్రెండ్స్ - కొత్తగా మరొక ప్రాణమైన బామ్మ కూడా నా జీవితంలోకి వచ్చారు - ఫుల్ హ్యాపీ ....... మరింత హ్యాపీ ఏమిటంటే ఇప్పుడు మీరు కూడా అని గుండెలపై చేతినివేసుకున్నాను - నిన్న కొట్టిన దెబ్బలాంటి దెబ్బలు ఈరోజు రెండైనా ఆస్వాదించి వస్తాను బామ్మా అని మాటిచ్చి వచ్చాను , సో ఎలాగైనా నా దెబ్బలు నాకు ఇచ్చేయ్యాలి మేడం లేకపోతే మా ప్రియమైన బామ్మ దగ్గర తలెత్తుకోలేను .
మేడం : నీపై కోప్పడాలో నవ్వాలో కూడా తెలియడం లేదు కాసేపు సైలెంట్ గా కూర్చో అని లోలోపలే నవ్వుకుంటున్నారు .
ఆఅహ్హ్ ....... దేవత సంతోషాలను చూస్తూ హృదయం పరవశించిపోతోంది - మేడం ....... please please ప్రస్తుతానికి కోప్పడండి కోప్పడండి నిన్నటి కంటే కోపంతో గట్టిగా కొట్టాలి అని చెంప రుద్దుకున్నాను .
మేడం : మహేష్ ...... నిజంగానే కోపం వస్తోంది ష్ ష్ ........
Yes yes ....... నాకు కావలసినది కూడా అదే మేడం - నా గురించి వదిలెయ్యండి , మీ చెంప దెబ్బ అదే అదే ప్రాణం కంటే ఎక్కువైన వారు ఎందుకు కొట్టారు .
మేడం : ప్చ్ ....... వదిలేలా లేవు - ఎందుకు కొట్టారో ఇప్పటికీ అర్థం కాలేదు వదిలెయ్యి ........
షేర్ చేసుకుంటే తెలుస్తుందేమో మీద ........
మేడం : మహేష్ ........ వదిలేలా లేవు - సరిగ్గా కాలేజ్ కు బయలుదేరేముందు ఈ బాటిల్ అందించి , బుజ్జితల్లీ ....... నాకు నీకంటే ప్రాణమైన వాడిని బాధపెట్టినందుకు గానూ అంటూ చెంప చెళ్లుమనిపించారు మా బామ్మ , బాటిల్ పోగొట్టుకున్నా - డ్యామేజ్ చేసినా మళ్లీ దెబ్బలుపడతాయి జాగ్రత్త ఇక వెళ్లు అని ప్రాణంలా ముద్దులుపెట్టి పంపించారు - నాకంటే నా బామ్మకు ప్రాణమైనవాళ్ళు ఎవరో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు - నేనెప్పుడు బాధపెట్టానో ఏమిటో ....... - నాకు ఊహ తెలిసినప్పటి నుండీ బామ్మ చెయ్యి చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం - కొట్టినందుకు బాధలేదు ఎందుకంటే బామ్మ దెబ్బ తియ్యగా ఉంది బామ్మే నాకు తల్లీ తండ్రి దైవం ...... - ఎందుకు కొట్టారు అన్నదే ........ ప్చ్ ప్చ్ .......
" బామ్మ - బాటిల్ - బుజ్జితల్లి ........ " అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయే అని ఆలోచిస్తుండగానే ........ 
******* కాలేజ్ బస్ స్టాప్ అని కండక్టర్ విజిల్ వెయ్యడంతో మేడం లేచి నన్ను దాటుకుని ఆలోచిస్తూ బస్సులోనే వెళ్లిపో మహేష్ అంటూ ముసిముసినవ్వులతో కిందకు దిగారు - అమ్మో నా దేవత అంటూ లేచి అంటీ వాళ్లకు బై చెప్పి వెనుకే కిందకు దిగి దేవతనే ఫాలో అయ్యాను .

నా దేవత నెమలి నడక వలన ప్రతీ అడుగుకూ బారెడు కంటే పొడవైన నా దేవత సౌందర్యమైన వాలుజడ నాట్యమాడుతున్నట్లు నడుముకు అటూ ఇటూ కదులుతుండటం ముచ్చటగా చూస్తూ వెనుకే నడుస్తున్నాను . 
నా చూపుల ఘాడత దేవత వీపును గుచ్చుకున్నట్లు సడెన్ గా వెనక్కుతిరిగిచూసారు . జడ వయ్యారాలకు అనుగుణంగా నా కళ్ళు అటూ ఇటూ కదులుతుండటం - పెదాలపై చిరునవ్వులు చూసి నేను మరేభాగమో చూస్తున్నట్లు భద్రకాళీ కోపంతో స్టూడెంట్ నా ముందు నడువు అని ఆర్డర్ వేశారు .
మీరు ఆర్డర్ వెయ్యడమూ నేను పాటించకపోవడమూనా ....... Yes మేడం అంటూ ముందుకు పరుగుతీసాను . మేడం వైపుకు తిరిగి వెనక్కు నడవసాగాను - వెనుక ఊగుతున్న జడను మేడం నడుముకు అటూ ఇటూ తల ఊపుతూ చూస్తున్నాను .
ఈసారి కూడా మరే భాగమో చూస్తున్నట్లు మరింత కోపంతో అటువైపుకు తిరుగు అని నడుముపై చీరను సరిచేసుకున్నారు - ఇంతకు ముందుకూడా నడుము చిన్న భాగం కూడా కనిపించనంతలానే ఉంది ....... నా దేవత satisfaction కోసం మళ్లీ సరిచేసుకున్నారు అంతే .........

మేడం ....... మీ బ్యూటిఫుల్ వాలుజడ నాకు తెగ నచ్చేసింది , చూడకుండా ఉండలేకపోతున్నాను - జడ చూడటం తప్పునా ....... ? .
మేడం : ( అంటే ఇంతవరకూ చూస్తున్నది జడనా ....... , అనవసరంగా అపార్థం చేసుకుని కోప్పడ్డాను , పాపం పిల్లాడు సైట్ కొట్టే వయసు ఇంకా రాలేదు కదా అని ఫీల్ అయ్యారు ) అధికాదు స్టూడెంట్ వాహనాలు వస్తున్నాయి - రాళ్లు ఉన్నాయి పడతావేమో .........
ఓహో ........ నేను పెడతానని నాకు దెబ్బలు తగులుతాయని ఫీల్ అవుతున్నారా ? , ఎంత అదృష్టవంతుడిని వెనుకా వద్దు ముందూ వద్దు మీ ప్రక్కనే నడుస్తాను మేడం అని పరుగున ప్రక్కకు చేరి వెనక్కు తొంగి తొంగి జడను చూస్తున్నాను.
మేడం : ముసిముసినవ్వులు నవ్వుకుని , స్టాప్ స్టూడెంట్ ....... ఇదేమైనా నీ జడనా అంతలా చూస్తున్నావు - నా అనుమతి లేకుండా చూడటం తప్పే ....... ఇక చాలు ఆపు .......
అయితే పర్మిషన్ ఇవ్వండి మేడం రోజంతా చూడాలని ఆశగా ఉంది please please ........
మేడం :  స్టూడెంట్ స్టూడెంట్ లా ఉండు నాకు అనవసరంగా కోపం తెప్పించకు కొడతాను అని నవ్వు - కోపం కలగలిసిన వార్నింగ్ ఇచ్చారు .
మేడం ........ ఎందుకో తెలియదు జడను చూసిన క్షణమే నా బుజ్జి హృదయం - జడతో కనెక్ట్ అయిపోయింది . జడ కదిలితేనే నా హృదయం కూడా కొట్టుకుంటాను అంటోంది లేకపోతే ఆగినా .......
మేడం : నో నో నో ....... అలా జరుగకూడదు - అయినా క్రేజీ స్టూడెంట్ మాటలు ఎలా నమ్ముతున్నాను ....... , వయసు వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి అని నా చెవిని పట్టుకుని పిండారు .
యాహూ ........ ఇందుకే ఇందుకే మేడం ఇప్పటివరకూ మిమ్మల్ని ఆటపట్టించినది ఉమ్మా ఉమ్మా అంటూ నా చెవికి ముద్దులుపెట్టుకున్నాను - నిన్న చెంప దెబ్బ ఈరోజు చెవి తిప్పడం అలాగే మరొక రెండు అంతకంటే ఎక్కువ దెబ్బలు కొడితే ఫుల్ హ్యాపీ ....... - నా ప్రాణమైన బామ్మ కూడా sooooo హ్యాపీ .......
మేడం : ఎంత అల్లరి స్టూడెంట్ వి , ఇక నిన్ను తాకనైనా తాకను - నీ మరియు నీ ప్రాణమైన బామ్మ కోరిక ఎలా తీరుతుందో చూద్దాము - నీ వల్ల కాలేజ్ కు ఆలస్యం అవుతోంది అదిగో ప్రేయర్ బెల్ కూడా మ్రోగింది అని కోపంతో వడివడిగా కాలేజ్ లోపలికి నడిచారు .
Wow ఆ వేగానికి నా దేవత వాలుజడ అంతే వేగంతో ఊగుతుండటం చూసి గుండెలపై చేతినివేసుకున్నాను - వెంటనే మొబైల్ తీసి మేడం కు తెలియకుండా వీడియో రికార్డ్ అయ్యేలా షర్ట్ జేబులో పెట్టుకుని వెనుకే వెళ్ళాను . 

ఆపాటికే పిల్లలందరూ డిసిప్లిన్ గా ప్రేయర్ కు నిలబడుతున్నారు . నా అదృష్టం కొద్దీ నా దేవత మా క్లాస్ వెనుకే నిలబడ్డారు అందరు టీచర్స్ లా .......
థాంక్స్ మేడం ........ చూసారా ప్రేయర్లో కూడా నా దైవం మీ జడను చూసే అదృష్టం కలిగించారు .
మేడం : అవునుకదా ...... , నిన్నూ ....... అంటూ కోపంతో నాకు దూరంగా వెళ్లి ** పిల్లల వెనుక నిలబడ్డారు .
పెదాలపై చిరునవ్వులతో వెళ్లి మేడం వెనుక నిలబడ్డాను జడను చూస్తూ ........
** పిల్లలు : hi అన్నయ్యా hi అన్నయ్యా ....... గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ బుజ్జి బుజ్జి చేతులను ఊపారు .
మేడం వెనుకకు చూసి అసహనంతో ప్చ్ ...... ఇంత క్రేజీ స్టూడెంట్ , నిన్నూ ...... వెళ్లు నీ క్లాస్మేట్స్ దగ్గరికి వెళ్లు ........
మేడం అంటూ నిరాశతో అడుగు వేసేంతలో ప్రేయర్ స్టార్ట్ అవ్వడంతో , స్టాప్ కదలకూడదు ఇక్కడే నిలబడు ........
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మేడం ....... , మీ మాటే నాకు శాసనం మీరెలా అంటే అలా - మీ వెనుక నిలబడమంటారా ముందు నిలబడమంటారా ........ ? .
మేడం : నిన్నూ ....... ష్ ష్ డిస్టర్బ్ చెయ్యకు - నీ వల్ల చిన్న పిల్లలు కూడా ప్రేయర్లో నవ్వుకుంటున్నారు చూడు ........
Sorry sorry మేడం ....... , కోపమొస్తే కొట్టొచ్చు కదా .........
మేడం : నో నో నో నెవర్ సైలెంట్ .........
వెనుకా వద్దు ముందూ వద్దు జడను చూస్తూ ప్రక్కనే నిలబడతాను . 
మేడం : నన్ను పట్టించుకోకుండా బుజ్జి పిల్లల అల్లరిని కంట్రోల్ చేస్తూ నవ్వుకుంటున్నారు . 

ప్రేయర్ పూర్తవగానే పిల్లలను వరుసలో లోపలికి పంపించి , ఇకనైనా మీ క్లాస్మేట్స్ తో క్లాస్ కు వెళ్లు స్టూడెంట్ ....... అని చెప్పారు మేడం .
బస్ దిగినప్పటి నుండీ చూస్తున్నాను మేడం ....... స్టూడెంట్ స్టూడెంట్ అని పిలుస్తున్నారు - ఎంచక్కా బస్ లో పిలిచినట్లుగా ప్రేమతో మహేష్ అని పిలవచ్చు కదా మేడం..........
మేడం : ప్రేమనా ........ , నువ్వేమైనా నా బంధువువా ? , నాకోసం ఏమైనా చేశావా ...... ? , అలాప్రేమతో పిలవడానికి అని వెక్కిరింతగా నవ్వుకున్నారు . వెళ్లు వెళ్లు కాలేజ్ స్టూడెంట్ వని తెలిసి పేరు పెట్టి పిలిచాను - స్టూడెంట్ అని పిలవడం నీకు ఇష్టం లేదా అయితే అలానే పిలుస్తాను . స్టూడెంట్ స్టూడెంట్ వెళ్లు నీ క్లాస్మేట్స్ తోపాటు నీక్లాస్ కు వెళ్లు ........ అని ఆర్డర్ వేశారు .
ఇష్టం లేదని ఎవరన్నారు మేడం - మీరెలా పిలిచినా నాకు ప్రేమగానే వినిపిస్తుంది నా ఫస్ట్ క్లాస్ మీదే - మీ వెనుకే నేను .........
మేడం : అదొక్కటి ఉంది కదా ....... , ఎలాగైనా క్లాస్ నుండి బయటకు పంపాలి ఎలా ? - ఐడియా ....... ఖచ్చితంగా అన్నీ క్లాస్సెస్ హోమ్ వర్క్ చేసి ఉండడు ఆ కారణంతో బయటకు పంపించి వెయ్యవచ్చు ........ అని లోలోపలే మాట్లాడుతున్నట్లు అనుకుని నాకు వినిపించేలా మాట్లాడి చిరునవ్వులతో స్టాఫ్ రూమ్ లోకి వెళ్లారు .
నేనూ లోపలికి అడుగుపెట్టేంతలో ........ , హలో ఓన్లీ ఫర్ స్టాఫ్ అని నా గుండెలపై చేతినివేసి ఆపారు .
ఆఅహ్హ్ ....... ఏమి నా అదృష్టం , బయటకు కొప్పుడుతూనే ఎప్పటికప్పుడు నన్ను తాకడానికి ఇష్టపడుతూనే ఉన్నారు థాంక్యూ sooooo మచ్ మేడం .......
అంతే సడెన్ గా చేతిని వెనక్కు తీసుకోవడమే కాకుండా చూడు అన్నట్లు సైగచేసి స్టాఫ్ రూమ్ లోని సింక్ లో ఏకంగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుని ఒక చూపు చూసారు తిక్క కుదిరిందా అన్నట్లు .........
ప్చ్ ...... అంటూ దీనంగా మేడం వైపు చూసాను .
మేడం : yes అంటూ ఆనందించడం చూసి మరింత సంతోషం వేసి నవ్వుకున్నాను .
Like Reply
నా దేవత క్లాస్ కు బయలుదేరే సమయానికి ప్యూన్ వచ్చి అవంతిక మేడం గారూ ....... మిమ్మల్ని హెడ్ మాస్టర్ గారు వెంటనే కలవాలని పంపించారు .
మేడం : క్లాస్ సమయం అయ్యిందే .......తరువాత కలువవచ్చా ? .
ప్యూన్ : లేదు మేడం హెడ్ మాస్టర్ పిలిచారంటే క్లాస్ మధ్యలో ఉన్నా వెళ్లాల్సిందే లేకపోతే కోప్పడతారు .
మేడం : అలా అయితే ఇప్పుడే కలుస్తాను , అంతవరకూ మీరు సెకండ్ క్లాస్ కు వెళ్లి పిల్లలు అల్లరి చెయ్యకుండా చూసుకోగలరా ....... ? .
ప్యూన్ : మీరు రావడానికి సమయం పడుతుంది కాబట్టి ok ....... వెళ్ళండి అని పంపించాడు - హెడ్ మాస్టర్ గారి ఖాతాలో మరొక బ్యూటీ బలి కాబోతోంది త్వరలోనే ....... అని గుసగుసలాడుకుంటూ నా ముందే వెళ్ళాడు .
ఆ మాటలకు సర్రున కోపం తారాస్థాయికి చేరిపోయింది . చుట్టూ క్లాస్సెస్ మధ్యలో ఉన్న చెట్ల నుండి పడిన బాదాం కాయను అందుకుని ప్యూన్ దిమ్మతిరిగిపోయే దెబ్బ పడేలా వీపుపై కొట్టి పిల్లర్ వెనుక దాక్కున్నాను . 
ప్యూన్ : అమ్మా ....... అంటూ కాలేజ్ మొత్తం వినిపించేలా కుయ్యిమన్నాడు - నా దేవతను ఎలాగైనా ఆపాలని వెళ్లేంతలోపు హెడ్ మాస్టర్ రూమ్ లోకి ఎంటర్ అయ్యారు . 

మేడం : సర్ ...... పిలిచారట ......
హెడ్ మాస్టర్ : ఆ ఆ అవునవును , ఒకసారి నిన్ను చూడాలనిపించి ........
మేడం : ఎస్క్యూస్ మీ సర్ ........
కోపంతో పిడికిళ్ళు బిగించాను ........
హెడ్ మాస్టర్ : అదే అదే మేడం ....... కాలేజ్ సెట్ అయ్యిందా అని అడుగుదామని పిలిచాను - అంతా ok కదా ........
మేడం : everything is fine సర్ ....... , if you ఎస్క్యూస్ మీ i have a class సర్ , may i go ....... 
హెడ్ మాస్టర్ : yes yes yes ఫస్ట్ ఇంపార్టెన్స్ క్లాస్సెస్ - నీకు ఎటువంటి అవసరం వచ్చినా ఈ హెడ్ మాస్టర్ ఉన్నారని మరిచిపోకు - అదే అదే క్లాస్సెస్ లో స్టూడెంట్స్ ఏమైనా ఎక్కువ అల్లరి చేసినా , ఇబ్బందిపెట్టినా ........
మేడం : స్టూడెంట్స్ are fine , ఒక్కడు తప్ప .........
ఆ ఒక్కడిని నేనే - నా దేవతకు ...... నాపై ఇంత కోపమా సూపర్ అంటూ మురిసిపోతున్నాను - బామ్మ చెప్పినట్లు ఇప్పుడు ఎంత కోప్పడితే భవిష్యత్తులో అంత ఇష్టం ఏర్పడుతుంది ......... అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
హెడ్ మాస్టర్ : ఆ ఒక్కడు ఎవడు మేడం , నాకు చెప్పండి TC ఇచ్చి పంపించేస్తాను - నిన్ను ఇబ్బందిపెట్టిన వాడిని కాలేజ్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వను .
మేడం : నో నో నో సర్ , I'll మ్యానేజ్ ...... may i ? .
హెడ్ మాస్టర్ : yes please అంటూ పంపించి ఆఅహ్హ్ ....... అంటూ చైర్లో కూర్చున్నాడు .
నా దేవత దగ్గరే డబల్ మీనింగ్ మాట్లాడుతున్నాడు ఇక నా వల్ల కాదు ముక్కు ముఖం ఏకమయ్యేలా ఒక్క గుద్దు గుద్దాలి అని పిడికిలి బిగించి రూమ్ లోపలికి అడుగువేశానో లేదో ....... మెసేజ్ వచ్చినట్లు జేబులో వైబ్రేట్ అయ్యింది - తీసి చూస్తే పెద్దమ్మ నుండి ....... " మై డియరెస్ట్ గ్రేటెస్ట్ బుజ్జి లవర్ మహేష్ గారూ ....... నీ దైవమైన నేనెందుకు ఉన్నాను - ఇప్పుడు వెళ్లి నువ్వు కొడితే కాలేజ్ నుండి పంపించేస్తారు - అప్పుడు నీ దేవతకు తోడుగా ఎవరుంటారు కాలేజ్లో ...... సమయం వచ్చినప్పుడు నీతోనే చేయిస్తాను కదా " 
అవునవును పెద్దమ్మ చెప్పినది నిజమే ....... కంట్రోల్ కంట్రోల్ హెడ్ మాస్టర్ ఒక ఛాన్స్ ఇస్తున్నాను మార్పుకోసం , రిపీట్ అయ్యిందా అంటూ ........ , నా దైవం ఏమన్నారు " మై డియరెస్ట్ గ్రేటెస్ట్ బుజ్జి లవర్ " హ హ హ అంటూ పులకించిపోతూ పరుగున క్లాస్ చేరుకున్నాను - ఇప్పటికీ నొప్పివలన వీపుపై రుద్దుకుంటూనే ఉన్న ప్యూన్ ను చూసి నవ్వుకుని సరిగ్గా టర్నింగ్ లో మళ్లీ కాయను విసిరాను .
చచ్చానురోయి ........
ఇంకొకసారి ...... నా దేవత తప్పుగా మాట్లాడితే తల పగిలేలా కొడతాను ప్యూన్ జాగ్రత్త ........

క్లాస్ లో మేడం : చుట్టూ చూసి హమ్మయ్యా ....... అని అటెండెన్స్ అందుకున్నారు .
నాకోసమే చూస్తున్నారు కదా మేడం - I am here , May i come in .
మేడం : లేట్ వచ్చినందుకు పనిష్మెంట్ గా బయటే ఉండు ........
Yes మేడం - sorry మేడం అంటూ అక్కడే చేతులు కట్టుకుని నిలబడ్డాను .
2nd క్లాస్ పిల్లలు : మిస్ మిస్ మిస్ ........ అన్నయ్య అంటే మాకు ఇష్టం లోపలికి రానివ్వండి మేడం please please అని ముద్దుముద్దుగా అడిగారు .
మేడం : నో ..... 
చిట్టి తల్లి లేచి అయితే మీరూ లేట్ వచ్చారు కదా అన్నయ్యతోపాటు మీరుకూడా బయటనిలబడండి అని బుజ్జికోపంతో చెప్పింది - తనకు మిగతా పిల్లలు వంత పాడారు .
మేడం షాక్ అవ్వడం చూసి నాకైతే నవ్వు ఆగడం లేదు కంట్రోల్ చేసుకోవడం కావడం లేదు .
మేడం : నన్ను హెడ్ మాస్టర్ గారు పిలిచారు అందుకే ఆలస్యం అయ్యింది బుజ్జి స్టూడెంట్స్ ......... 
పిల్లలు : మీరు రాలేదని అన్నయ్య పిలుచుకుని రావడానికి వెళ్లారు పాపం ......
మేడం : Is it మహే ....... స్టూడెంట్ ? .
పిల్లలకు నాపై ఇష్టానికి నేను షాక్ అయ్యాను . Yes - no అంటూ తలను అన్నివైపులకూ ఊపుతున్నాను .
మేడం : మీరు చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నాను . మహే ...... స్టూడెంట్ you can come in .........
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం ....... - లవ్ యు పిల్లలూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి వెనుకకు వెళ్ళి బుద్ధిమంతుడిలా కూర్చున్నాను .
మేడం : నావైపు చురచురలాడుతూ చూసి , పిల్లలందరికీ ఎందుకింత ఇష్టం మహేష్ అంటే అంత మంచివాడా ...... ? , నాకైతే అల్లరి వెధవలానే కనిపిస్తున్నాడు - అదేవిషయం మెసేజ్ వచ్చింది పెద్దమ్మ నుండి ........
మేడం ....... నా గురించి తరువాత ఆలోచించవచ్చు - నేనైతే పోకిరి వెధవనే ఫిక్స్ అయిపోండి , అటెండెన్స్ వేసి హోమ్ వర్క్ చెక్ చెయ్యండి .
మేడం : yes yes yes , అయినా నా మనసులోని మాటలు నీకెలా ........ 
పిల్లలు : అన్నయ్య పోకిరి కాదు గుడ్ అంటూ పిల్లలు ఇద్దరిద్దరుగా వచ్చి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళుతున్నారు .
మేడం : Wow ....... ఇన్ని ముద్దులా అంటూ సంతోషిస్తూనే అసూయ చెందుతున్నారు .
ఆ విషయం మెసేజ్ రూపంలో రాగానే , మేడం అలా అసూయతో చూడకండి మాకు దిష్టి తగులుతుంది - పిల్లలూ ........
పిల్లలు : అర్థమైంది అన్నయ్యా ....... అంటూ అందరూ వెళ్లి మేడం ను చుట్టేసి కూర్చోండి అని ఆర్డర్ వేశారు .
నా దేవత అర్థం కానట్లు మోకాళ్లపై కూర్చోగానే ....... మా బ్యూటిఫుల్ మేడం అంటే మాకు చాలా ఇష్టం అని బుగ్గలపై - చేతులపై ముద్దులవర్షం కురిపించడంతో , పిల్లల ఆప్యాయతకు తడిచి ముద్దయి పులకించి చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు .
జేబులో ఉన్న మొబైల్ లో మొత్తం రికార్డ్ అవుతోంది .

మేడం : థాంక్స్ థాంక్స్ థాంక్స్ ........ అంటూ ముద్దులుపెట్టి , అటెండెన్స్ - హోమ్ వర్క్ తో సమయం వృధా చెయ్యను . నాకంటే క్యూట్ అయిన పిల్లలకోసం క్లాస్ ఇక్కడ కాదు కాలేజ్ మధ్యలో ఉన్న చెట్లు - పూలమొక్కలు మధ్యన పచ్చని గడ్డిలో are you ready పిల్లలూ .......
పిల్లలతోపాటు సంతోషంతో నేనుకూడా యాహూ ....... అంటూ కేకలువేశాను .
మేడం : నావైపు కోపంతో - పిల్లలవైపు చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిచేతులను అందుకుని ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లి , ఆటపాటలతో టీచ్ చేస్తూ మధ్యమధ్యలో పిల్లలవైపు మొక్కల నుండి పూలు పీకి విసురుతున్నారు .
నాకూ చిలిపి ఆలోచన వచ్చి వెనుక నుండి మేడం వైపు పూలవర్షం కురిపించాను .
మొదట ఎంజాయ్ చేసి , ఎవరన్నట్లు కోపంతో వెనక్కు తిరిగిచూశారు మేడం ......
అమాయకుడిలా చేతులుకట్టుకుని శ్రద్ధగా వింటున్నట్లు కూర్చోవడం - నన్ను చూసి పిల్లలు పూలు అందుకుని అదేసమయానికి మేడం వైపుకు విసరడంతో లవ్ యు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
మొదట పూలవర్షం కురిపించింది నేనే కాబట్టి , ఆ లవ్ యు లు - ఫ్లైయింగ్ కిస్సెస్ నాకు కూడా చెందుతాయి అని అమితమైన ఆనందంతో గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అయ్యాను - పీరియడ్ సమయం నిమిషాల్లో గడిచిపోయినట్లు బెల్ మ్రోగింది - నాతోపాటు పిల్లలు కూడా బాధపడ్డారు .
మేడం కూడా ఫీల్ అయినట్లు నవ్వుకుని రేపు కూడా ఇక్కడే మన క్లాస్ ........
అంతే పిల్లలందరూ సంతోషంతో చిందులువేస్తూ తమ తమ క్లాస్ లలోకి వెళ్లిపోయారు .
అలా నెక్స్ట్ నర్సరీ - LKG - UKG ....... పిల్లలకు కూడా ప్రకృతి ఓడిలోనే ఆటాడిస్తూ టీచ్ చెయ్యడంతో రెండు రోజుల్లోనే పిల్లలందరి ఫేవరేట్ మిస్ అయిపోయారు నా దేవత - ఉదయం ఫోర్ క్లాస్సెస్ పూర్తయినట్లు లంచ్ బెల్ మ్రోగింది - బుజ్జి బుజ్జి పిల్లలు బుజ్జిబుజ్జినవ్వులతో మేడం బుగ్గలపై ముద్దులుపెట్టి బుజ్జిబుజ్జి పరుగులతో వెళ్లిపోయారు .

పిల్లల చిరునవ్వులు - ముద్దులు తలుచుకుంటూ లంచ్ చెయ్యడానికి స్టాఫ్ రూమ్ కు వెళ్లారు - హ్యాండ్ వాష్ చేసుకుని వారి లాకర్ ఓపెన్ చేసి చూస్తే క్యారేజీ లేదు - ఉదయం ఇక్కడే ఉంచాను కదా ........ 
టీచర్స్ అందరూ తమ తమ లాకర్స్ నుండి లంచ్ తీసుకుని ప్రక్కనే ఉన్న లంచ్ చేసే గదిలోకి వెళుతున్నారు .
మేడం : మేడం మేడం ....... నా క్యారేజీ కనిపించడం లేదు , ఉదయం ఇక్కడే ఉంచాను .
లేడీ స్టాఫ్ : మిస్ అవ్వడానికి లేదే ...... , come మేడం మనం షేర్ చేసుకుందాము అని ఆహ్వానించారు . 
మేడం : పర్లేదు మేడం ....... , నాకు ఆకలి వెయ్యడం లేదు మీరు కానివ్వండి అని బదులివ్వడంతో వెళ్లిపోయారు .

అంతలో హెడ్ మాస్టర్ వచ్చి మేడం అవాంతికా ఏంటి వెతుకుతున్నారు .
మేడం విషయం చెప్పారు .
హెడ్ మాస్టర్ : మన కాలేజ్లో దొంగతనమా ....... , ఎంతకూ సహించకూడదు నేను enquiry చేయిస్తాను , మీరు లంచ్ చెయ్యకుండా ఉంటే నేను బాధపడతాను రండి నేను ఫైవ్ స్టార్ హోటల్ కు వెళుతున్నాను , lets have lunch together ........
నా బల్బ్ వెలిగింది - అంటే ఇది ఖచ్చితంగా వీడి పనే అయి ఉంటుంది - దొంగ వీడేనన్నమాట ....... ఏమి నటిస్తున్నావురా , ఇప్పుడేమి చెయ్యాలి .
మేడం : నో నో నో సర్ ........ నెక్స్ట్ క్లాస్ ** క్లాస్ , సిలబస్ చెక్ చేసుకోవాలి , you క్యారి ఆన్ ........
హెడ్ మాస్టర్ : మేడం .........
మేడం : please బలవంతపెట్టకండి , anyway నాకు ఆకలివెయ్యడం లేదు ఇదే విషయం మన co staff కు కూడా చెప్పాను కనుక్కోండి కావాలంటే , మీరు వెళ్ళండి సర్ .........
హెడ్ మాస్టర్ : shit shit plan మొత్తం వేస్ట్ అయ్యింది అని గుసగుసలాడుతూ వెళ్ళిపోయాడు .
కోపంతో వెనుక నుండి కాలితో తన్నబోయి ఆగిపోయాను . మేడం మేడం ....... పిచ్చెక్కించారు ఉమ్మా ఉమ్మా ....... అమ్మో దేవత అనుమతి ఇవ్వకుండా ముద్దులు తప్పు తప్పు అని ఎంజాయ్ చేస్తున్నాను .

లోపలికి తొంగిచూస్తే మేడం కు బాగా ఆకలివేస్తున్నట్లు , ఏమిచెయ్యాలో తెలియక బాధపడుతూ ఒంటరిగా కూర్చోవడం చూసి చలించిపోయాను - వెంటనే నా క్యారెజీ తీసుకుని may i come in మేడం అంటూ లోపలికివెళ్లి బామ్మ ఇచ్చిన క్యారెజీని మేడం ముందు ఉంచాను .
ఆకలికి మేడం కళ్ళల్లో చెమ్మకూడా చేరినట్లు తలెత్తి క్యారెజీ చూసి పెదాలపై చిరునవ్వు చిగురించింది . చిరునవ్వులు చిందిస్తున్న నన్ను చూసి కోపంతో భద్రకాళీలా మారిపోయారు - అంటే నువ్వేనన్నమాట నా క్యారెజీ దొంగతనం చేసినవాడివి అంటూ ముందూ వెనుకా ఆలోచించకుండా లేచి చెంప చెళ్లుమనిపించారు .
దిమ్మ తిరిగిపోయింది - ఏమి జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు .
మేడం : క్లాస్సెస్ లో అల్లరి చేస్తుంటే , ఈ వయసులో స్టూడెంట్ లైఫ్ లో మామూలు అని సహించాను - అప్పుడప్పుడూ బయటకు కోప్పడినా లోలోపల ఎంజాయ్ చేసాను కూడా ......
బుగ్గపై చేతినివేసుకుని కన్నీళ్ళతో మేడం ....... నేను దొంగ ...... ఇది నా క్యారేజీ మేడం - నా ప్రాణమైన బా ........
మేడం : స్టాప్ స్టాప్ స్టాప్ your childish నాన్సెన్స్ ........ , this is my లంచ్ - my లంచ్ బ్యాగ్ ..........
మేడం ....... బస్సులో మీరే చూశారుకదా , బ్యాగుతోపాటు నాతోనే ఉంది .
మేడం : రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ఇంకా ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు , this is not good mahesh , ok ఈ లంచ్ నీది అంటున్నావు కాబట్టి ఓన్లీ వన్ క్వశ్చన్ ....... ఈ లంచ్ బాక్స్ లో ఏ ఫుడ్ ఉందో చెప్పు - సరిగ్గా చెబితే నీదే ....... నేను sorry కూడా చెబుతాను .
నో నో నో మేడం ....... మీరు నాకు sorry చెప్పడం ఏమిటి , తప్పు తప్పు .......
మేడం : tell me మహేష్ tell మీ ........
అదీ ....... ( అవునూ ఇంతకూ బామ్మ ఏమి పంపించారు ) ప్చ్ ...... తెలియదు మేడం , కానీ నిజం చెబుతున్నాను నేనంటే ప్రాణమైన నా బా .........
మేడం : చాలు చాలు ఇక నీ నాటకాలు చాలు , ఫుడ్ ఏముందో చెప్పనా వెజిటబుల్ రైస్ - మటర్ పన్నీర్ మసాలా - గోబీ - పెరుగుపచ్చడి ....... కమాన్ కమాన్ చెక్ చేసుకో మహేష్ ........
క్యారెజీ అందుకుని ఓపెన్ చేస్తే మొదటి బాక్స్ లో వెజిటబుల్ రైస్ - దానికింద బాక్స్ లో పన్నీర్ మసాలా - దానికింద గోబీ - దానికింద పెరుగుపచ్చడి ........ చూసి షాక్ అయిపోయాను .
మేడం : ఇప్పటికైనా అర్థమైందా నువ్వు లంచ్ theif అని , now get out of స్టాఫ్ రూమ్ .........
కన్నీళ్ళతో చెంపపై రుద్దుకుంటూ వెళ్లి ** క్లాస్ రూంలో కూర్చున్నాను . నా దేవత కోపానికి - చెంప దెబ్బకు కొద్దిసేపటి ముందు వేసిన ఆకలి మాయమైపోయింది - నా దేవత కరెక్ట్ గా చెప్పారు అంటే ఖచ్చితంగా వారిదే అయి ఉంటుంది అని కన్నీళ్లను తుడుచుకున్నాను , కొంపదీసి బస్సులో నాది మిస్ చేసుకుని దేవత మాయలో వారి లంచ్ బాక్స్ పట్టుకుని తిరిగే ఉంటాను అని నవ్వుకున్నాను - anyway నా దేవత ఆకలి తీరుతోంది అధిచాలు నాకు ....... అమ్మో దేవతకు తోడుగా ఉండాలని పెద్దమ్మ చెప్పారుకదా అని మళ్ళీ స్టాఫ్ రూమ్ దగ్గరికి ఉరికాను .
Like Reply
నా దేవతకు కనిపించకుండా లోపలికి తొంగిచూసాను . పిల్లలతో - నాతోకూడా హ హ హ ...... సరదాగా ఎంజాయ్ చేసి చేసి అలసిపోయి బాగా ఆకలివేస్తున్నట్లు గబ గబా తింటుండటం చూసి నవ్వుకున్నాను . ఫాస్ట్ గా తినడం వలన పొలమారినట్లు వెక్కిళ్ళు రావడంతో నీళ్లు నీళ్లు అంటూ కంగారుపడిపోయాను - లోపలికి వెళ్లబోయి దేవత కోప్పడి తినడం ఎక్కడ మానేస్తారేమోనని పెద్దమ్మను తలుచుకున్నాము - నా లంచ్ బ్యాగులోనుండి ఉదయం నుండీ నేను తాగిన బాటిల్ అందుకుని నోటిలోకి తీసుకునిమరీ తాగడం చూసి ఒక తియ్యని ఫీల్ కలిగింది . దేవత నోటిని తుడుచుకుని ఈసారి నెమ్మదిగా తినడం చూసి నా ఆకలి ఆ ఆనందంతోనే తీరిపోయింది . 
నా దేవత పూర్తిగా తినేసి బాక్సస్ శుభ్రం చేసి లంచ్ బ్యాగులో , బ్యాగుని వారి సేఫ్టీ లాకర్లో ఉంచి బుక్ చదువుకుంటున్నారు - లంచ్ రూమ్ నుండి ఒక్కొక్కరుగా స్టాఫ్ వచ్చి వారి వారి కార్యకలాపాలలో నిమగ్నులయ్యారు .

బెల్ మ్రోగడంతో అందరితోపాటు దేవతకూడా హ్యాండ్ బ్యాగ్ - బుక్స్ తీసుకుని బయటకు వచ్చేన్తలో పరుగున నా క్లాస్ చేరి ఫ్రెండ్స్ తోపాటు కూర్చున్నాను .
నా దేవత క్లాస్ లోపలికి అడుగుపెట్టగానే అందరమూ లేచి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ విష్ చేసాము .
అందమందిలో నా వాయిస్ మాత్రమే వినపడినట్లు నావైపు భద్రకాళీలా చూసి కోపంతో వెంటనే తల తిప్పుకుని టేబుల్ దగ్గరకు చేరుకున్నారు - గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ సిట్ డౌన్ .........
ఏమీ జరగనట్లు తప్పే చెయ్యనట్లు నేను చిరునవ్వులు చిందిస్తూ వారివైపే చూస్తూ కూర్చోవడం చూసి నా దేవతకు నచ్చనట్లు ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నారేమో ........ ( కోపంలో తప్పో ఒప్పో ఆలోచించము కదా ) స్టూడెంట్స్ ......... బ్రింగ్ your హోమ్ వర్క్స్ ? .
నా పెదాలపై మరింత ఆనందం వెళ్లువిరిసింది , ఇలా జరుగుతుందని ముందే తెలిసేకదా మొత్తం హోమ్ వర్క్ ను అందరికంటే ముందే ఫినిష్ చేసాను అని దర్జాగా వెళ్లి అందరితోపాటు టేబుల్ పై ఉంచాను .

దేవత కుర్చీలో కూర్చుని ఒక్కొక్క బుక్ అందుకుని చకచకా సెకండ్స్ లో చూసి స్టూడెంట్స్ ను పిలిచి గుడ్ వెరీ గుడ్ ....... అని ఇచ్చేస్తున్నారు . మురళి అని పిలవగానే వణుకుతూనే వెళ్ళాడు - మేడం ....... వెరీ గుడ్ మురళి నైస్ హ్యాండ్ రైటింగ్ అంటూ అభినందించి ఇవ్వగానే , మురళి మురిసిపోతూ వచ్చి కూర్చున్నాడు .
ఆ నెక్స్ట్ నా బుక్ అందుకుని కోపంతో నావైపు చూసారు . 
( ఆఅహ్హ్ ........ థాంక్స్ మేడం కోపంగానైనా చూసినందుకు అని గుండెలపైకి చెయ్యి దానంతట అదే చేరిపోయింది ) 
నా హోమ్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉండటం నా దేవత చూసినట్లు ముందు ఆశ్చర్యం ఆ వెంటనే ఇప్పుడెలా మొత్తం పూర్తిచేశాడు అని నావైపు ఒక లుక్ ఇచ్చారు ( sorry మేడం ........ టీచ్ చేసినది ఎవరు స్వయానా నా దేవత , నాపై కోప్పడే అవకాశం ఇవ్వలేకపోయినందుకు sorry sorry ......... అని ముసిముసినవ్వులు నవ్వుతున్నాము ) 
నా దేవత కోపంతోనే మహేష్ అని పిలిచారు .
Yes మేడం అంటూ టేబుల్ జంప్ చేసి క్షణంలో నా దేవత ముందు నిలబడ్డాను .
మేడం : నావైపు కన్నెత్తైనా చూడకుండానే గుడ్ అంటూ బుక్ అందించారు .
గుడ్ ........ wow థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం అంటూ బుక్ ను గుండెలపై హత్తుకుని , దేవతను చూస్తూనే వెనక్కు ఒక అడుగు వేశానో లేదో ......
మేడం : wait wait అంటూ లేచిమరీ నా గుండెలపై హత్తుకున్న బుక్ లాక్కున్నారు. 
నా గుండెలపై ....... దేవత చిరు స్పర్శకే , క్షణకాలం పాటు హృదయ స్పందన ఆగి కరెంట్ షాక్ కొట్టినట్లు జలదరించి ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న నా క్లాస్ గర్ల్స్ మీదకు పడిపోయాను .
అమ్మాయిలు మహేష్ మహేష్ ........ అంటూ నవ్వుకుని నన్ను పైకిలేపారు - క్లాస్ మొత్తం నవ్వులు విరిసాయి .
మేడం : బా బుక్ చెక్ చేస్తూనే సైలెన్స్ ......... , మురళీ ........ బ్రింగ్ your హోమ్ వర్క్ ? .
మురళికి విషయం అర్థమైపోయినట్లు నుదుటిపై చెమటలు పట్టేసాయి , భయపడుతూనే బ్యాగులో ఉంచేసిన బుక్ తీసుకుని వచ్చాడు .

నాకైతే దేవత తప్ప ఎవరూ కనిపించడం లేదు - దేవత మాటలు తప్ప ఏ నవ్వులూ వినిపించడం లేదు . వొళ్ళంతా బటర్ ఫ్లైస్ ....... దేవత స్పృశించిన నా ఛాతీపై చేతినివేసుకుని గాలిలో తేలిపోతున్నాను - పెదాలపై తియ్యదనం అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
మేడం :  మురళి గట్టిగాపట్టుకున్న బుక్ అందుకుని చెక్ చేసి , I know i know about you మహేష్ ......... , నీ హోమ్ వర్క్ ను కూడా మురళి చేత చేయించుకున్నావు - సేమ్ హ్యాండ్ రైటింగ్ .........
మురళి రిలీఫ్ అయ్యి , రేయ్ ........ ఒప్పుకో అన్నట్లు నావైపు చూస్తున్నాడు . 
అప్పటికి అర్థమయ్యింది మా ఫ్రెండ్స్ కు రోజూ ....... మా హోమ్ వర్క్ పూర్తికాకముందే ఎలా ఫినిష్ చేస్తున్నాడు అని , ఇంతకుముందు మేము పూర్తిచేశాక గంటకు కానీ పూర్తయ్యేది కాదు నీ హోమ్ వర్క్ అని మురళి వైపు గుర్రున చూస్తున్నారు .
నాకైతే ఎవ్వరూ కనిపించడం లేదు నా దేవత కోపం తప్ప .........

మేడం : కేవలం స్టాఫ్ రూంలో ........ ఆపేసి , కాకుండా ఇలా హోమ్ వర్క్ కూడా ఫ్రెండ్స్ తో చేయించావు , this is not not good ....... పనిష్మెంట్ ఇవ్వాల్సిందే , మహేష్ ........ బయటకువెళ్లి క్లాస్ అయిపోయేంతవరకూ గోడ కుర్చీ వెయ్యి - డబల్ హోమ్ వర్క్ for you - go outside అని వేలిని చూయించి yes yes అంటూ లోలోపలే తృప్తి చెందుతున్నట్లు నవ్వు ఆపుకుంటున్నారు .
Yes మేడం అంటూ బయటకు వెళ్లబోయి ఆగి , మేడం ....... నేను చాలాపెద్దతప్పునే చేసాను సో సో .........
మేడం : సో ........
సో ........ రెండు దెబ్బలు కూడా కొడితే , మరొకసారి ఇలాంటి తప్పు చెయ్యకుండా గుర్తుచేస్తాయి అని కుడిచేతితో బెత్తం అందించి ఎడమచేతిని చాపాను .
క్లాస్మేట్స్ అందరూ ఆశ్చర్యపోయి గుసగుసలాడుకుంటున్నారు .
మేడం : yes yes yes అంటూ మరింత సంతృప్తితో అందుకుని కొట్టబోయి నా ఆనందాన్ని చూసి , నా మాటలు గుర్తుకువచ్చినట్లు నో నో నో ....... గోడ కుర్చీ పనిష్మెంట్ చాలు వెళ్లు వెళ్లు అని మురళికి మళ్లీ ఇలా చెయ్యకు అని చెప్పి పంపి మిగతా హోమ్ వర్క్ బుక్స్ క్షణాలలో చెక్ చేశారు .

కాలేజ్ జీవితంలో ఫస్ట్ టైం గోడ కుర్చీ ........ అదికూడా నా దేవత ఇచ్చిన స్వీట్ పనిష్మెంట్ అని లోలోపలే ఎంజాయ్ చేస్తూ బయటకు మాత్రం దేవత తృప్తికోసం చిరుబాధను నటిస్తున్నాను - బామ్మా ........ ఒక దెబ్బ మాత్రమే కాదు నా దేవత నుండి ఒక పనిష్మెంట్ కూడా ....... సాయంత్రం వచ్చి అన్నీ వివరంగా చెబుతాను కదా ........
దేవత టీచ్ చేస్తూనే బయటకు చూస్తూ నవ్వుకోవడం తెలుస్తూనే ఉంది - రెండు నిమిషాలకే బయటకువచ్చి , its enough లేచి నిలబడు ఇంకెప్పుడూ ఇలా చెయ్యకూడదు అన్నారు .
నో నో నో మేడం ........ క్లాస్ అయ్యేంతవరకూ పనిష్మెంట్ స్వీకరించాల్సిందే , దెబ్బలు కూడా కొట్టి ఉంటే నా తిక్క కుదిరేదేమో ........ ఒకసారి బాగా ఆలోచించుకోండి - ఇప్పటికీ నేను రెడీ .........
మేడం : అదిమాత్రం జరగనే జరుగదు , మహేష్ ......... లేచి నిలబడు .
దెబ్బలూ లేక - గోడ కుర్చీనూ లేకపోతే రేపుకూడా అలానే చేస్తానేమో మేడం ........
దేవత : నవ్వుకున్నారు . మహేష్ ........ నీపై ఎంత కోపం ఉందో అంతే నవ్వూ వస్తోంది . చెబుతున్నాను కదా లేచి నిలబడు అని కోపంతో నా చేతులను అందుకుని పైకి లేపారు .
మేడం మేడం ........ మీరు తాకితే నాకు ఏదేదో అయిపోతోంది - పట్టుకోండి పట్టుకోండి లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందకు పడిపోతాను .
అంతే నువ్వు మారనే మారవు అంటూ మేడం కోపంతో వదిలెయ్యడంతో ఫస్ట్ ఫ్లోర్ నేలపై పడిపోయి గుండెలపై చేతినివేసుకుని దేవతవైపే చూస్తున్నాను .
దేవత : నీ వలన ప్రతీ క్లాస్ 5 - 10 మినిట్స్ వేస్ట్ అవుతోంది అని కోపంతో లోపలికివెళ్లారు .
మేడం ........ అయితే నేను లోపలికి రావచ్చా ? .
మేడం : నో , పనిష్మెంట్ ప్రకారం బయట నిలబడాల్సిందే ........ , మరొక్క మాట మాట్లాడావంటే నెక్స్ట్ క్లాస్ నిన్ను లైబ్రరీకి పంపుతాను .
నో నో నో మేడం అంటూ రెండు చేతులతో నోటికి తాళం వేసుకోవడం చూసి ఫ్రెండ్స్ అందరూ నవ్వుకున్నారు .
మేడం : సైలెన్స్ అంటూ క్లాస్ పూర్తిచేశారు .

నా దేవత నెక్స్ట్ క్లాస్ 7th కావడంతో పరుగున వెళ్ళాను . ఇంకా మా మాథ్స్ సర్ టీచ్ చేస్తుండటం చూసి may i come in సర్ ? .
ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే ఎవరని కూడా చూడకుండా yes come in అనడంతో , నవ్వుకుంటూ వెళ్లి చివరి బెంచ్ లో కూర్చున్నాను .
5 నిమిషాలు - 10 - 15 నిమిషాలు అయినప్పటికీ మాథ్స్ సర్ కంటిన్యూ చేస్తుండటం చూసి , నేనేమైనా wrong class కు వచ్చానా అన్న అనుమానంతో నా ముందున్న తమ్ముడిని అడిగాను .
తమ్ముడు : ఆవును అన్నయ్యా ...... ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాసే కానీ , మేడం ను రిక్వేస్ట్ చేసి లంచ్ నుండి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు - బుర్ర హీటెక్కిపోయింది ఏమిచేస్తాం తప్పదు అని బోర్డ్ వైపుకు తిరిగాడు .
అవసరమా ....... నా దేవత కంటే ముందే రావడం అవసరమా అని మొట్టికాయలు వేసుకున్నాను . నా దేవతను చూడకుండా ఇప్పటికే 15 నిమిషాలు ఉన్నాను - గుండె కూడా ఎలా విలవిలలాడిపోతోందో చూడు నీకు బుద్ధిలేదురా మహేష్ - గుండెను బాధపెట్టావు - మరొక 30నిముషాలు దేవతను చూడకుండా ........ అమ్మో నావల్ల కాదు ఎలాగైనా బయటకువెళ్లాలి అని బెంచ్ ప్రక్కన మోకాళ్లపైకి చేరి మొదటి బెంచ్ వరకూ ప్రాకుకుంటూ వెళ్లడం చూసి చెల్లెళ్లు - తమ్ముళ్లు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
మాథ్స్ సర్ సైలెన్స్ అంటూనే బోర్డ్ మొత్తం ప్రాబ్లమ్ నింపేస్తున్నారు .
ఇదేకదా నాకూ కావాల్సినది అంటూ సర్ బోర్డ్ వైపు తిరుగగానే లేచి బయటపడ్డాను - వెనక్కు తిరిగి థాంక్స్ అంటూ క్లాస్ లోపలికి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి పరుగున స్టాఫ్ రూమ్ కు వెళ్ళాను - లోపల చూస్తే నా దేవత లేరు . రెస్ట్ రూమ్ కు వెళ్ళారేమోనని 5 నిమిషాలు wait చేసినా జాడ లేరు - లాభం లేదు అనుకుని లోపలికివెళ్లి బయాలజీ మేడం ను అడిగాను .
బయాలజీ మేడం : అవంతిక మేడం స్టాఫ్ రూమ్ కే రాలేదు అని బదులిచ్చారు . 
ఎక్కడకు వెళ్లి ఉంటారు ఒకవేళ హెడ్ మాస్టర్ ఏమైనా పిలిపించారా ..... ?, అంతే ఆఫీస్ రూమ్ కు ఉరికెత్తాను - ముందూ వెనుకా చూడకుండా నేరుగా హెడ్ మాస్టర్ రూమ్ లోపలికి వెళ్ళిపోయాను కోపంతో ఆయాసపడుతూ ........
కేవలం హెడ్ మాస్టర్ మాత్రమే ఉన్నట్లు , yes what do you want boy ........ you are మహేష్ రైట్ ....... is everything ok మహేష్ ? .
చుట్టూ చూసి నా దేవత లేకపోవడంతో కూల్ అయ్యి , నథింగ్ నథింగ్ సర్ జస్ట్ చాక్ పీస్ box .........
హెడ్ మాస్టర్ : your english is improving good , there it is ........
థాంక్యూ చెప్పబోయి వీడికి చెప్పడం ఏమిటి అని మనసులో అనుకుని చాక్ పీస్ బాక్స్ తీసుకుని బయటకువచ్చాను . మరి నా దేవత ఎక్కడకు వెళ్లారు అని మళ్ళీ స్టాఫ్ రూమ్ దగ్గర నుండి మొత్తం క్లాస్సెస్ చుట్టేసినా కనిపించనేలేదు . మేడం కంటే ముందే వెళ్లడం అవసరమారా అంటూ కాస్త గట్టిగానే మెదడు ఉన్నవైపు మొట్టికాయ వేసుకున్నాను - అల్లరి చేస్తే నెక్స్ట్ క్లాస్ లైబ్రరీకి పంపిస్తాను అన్న నా దేవత మాటలు గుర్తుకువచ్చి , క్లాస్సెస్ మొత్తం చూసాను లైబ్రరీ ఎలా మిస్ అయ్యాను అని పరుగున గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మినీ లైబ్రరీ దగ్గరకు చేరుకున్నాను .
నా నడుము వరకూ కలప - పైభాగం అంతా మిర్రర్ గల లైబ్రరీ డోర్ బయట నుండే లోపలికి తొంగి చూసాను - బుక్స్ తిరగేస్తున్న నా దేవతను చూశాక గానీ పెదాలపై చిరునవ్వు చిగురించనేలేదు . 
లోపలికి వెళ్లేంతలో నా దేవతే లేచి బుక్స్ ను షెల్ఫ్స్ లో ఉంచేసి డోర్ వైపుకు వస్తున్నారు .

ఒక పీరియడ్ మొత్తం నా దేవత ఆగ్రహానికి గురికాలేకపోయాను - ఆ బాధను ఒక దెబ్బ ద్వారానైనా తీర్చుకోవాలి ఎలా ఎలా ఎలా ....... ? , ఐడియా అంటూ కలప - మిర్రర్ వాల్ వెనుక దాక్కుని బయట నుండి డోర్ కు గొళ్ళెం పెట్టాను . 
నా దేవత నెమలి నడక - అందమైన నవ్వులతో వచ్చి డోర్ తెరవబోతే ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో పుష్ చేస్తున్నారు , పుల్ చేస్తున్నారు - బయట నుండి నేను పట్టుకుని ఉండటం వలన ప్రయోజనం లేకపోవడంతో స్టక్ అయి ఉంటుందేమోనని లైబ్రేరియన్ సర్ దగ్గరికి వెళుతున్నారు.
చూసి నవ్వుకున్నాను .
అంతలో మరొక స్టాఫ్ డోర్ వైపు రావడం చూసి గొళ్ళెం తెరిచాను - సులభంగా డోర్ పుల్ చేసుకుని వెళ్లిపోయారు .
మేడం ముసిముసినవ్వులు నవ్వుకుని వచ్చి పుల్ చేసేంతలో గొళ్ళెం పెట్టెయ్యడం వలన ఎంత ప్రయత్నించినా ఓపెన్ కాలేదు - కోపంతో సున్నితంగా మిర్రర్ పై కొట్టి మళ్లీ లిబ్రేరియన్ ఆఫీస్ దగ్గరికి చేరుకునేంతలో ........ 
ఇద్దరు పిల్లలు లైబ్రరీకి రావడం చూసి గొళ్ళెం తెరిచి డస్ట్ బిన్ వెనుక దాక్కున్నాను . చేతిలో బుక్స్ తో డోర్ పుష్ చేసుకుని లోపలికివెళ్లారు .
ఆ సౌండ్ కు డోర్ వైపు చూసిన మేడం వడివడిగా వచ్చేన్తలో మళ్లీ గొళ్ళెం పెట్టెయ్యడంతో ఎంత ప్రయత్నించినా తెరుచుకోకపోవడం చూసి , ఏమైంది స్టాఫ్ వెళ్లారు - స్టూడెంట్స్ వచ్చారు ....... నాకు మాత్రం తెరుచుకోవడం లేదు అని అసహనంతో బలంగా కదిలించారు .
ఆ సౌండ్ కు లైబ్రరీ లో ఉన్నవాళ్ళంతా డిస్టర్బ్ అయినట్లు నా దేవతవైపు చూడటంతో sorry చెప్పివెళ్లి రీడింగ్ టేబుల్ లో కూర్చున్నారు .
Sorry మేడం తప్పడం లేదు - మరొక్క క్లాస్ మాత్రమే మిగిలింది , రెండు దెబ్బలైనా తింటానని బామ్మకు ప్రామిస్ చేసివచ్చాను .

అంతలో ఆఫ్టర్ లంచ్ ఇంటర్వెల్ మ్రోగడంతో పిల్లలు ఆడుకోవడానికి పరుగున డోర్ వైపుకు రావడం చూసి , స్టక్ అయ్యింది ఓపెన్ కాదు పిల్లలూ ....... అని నా దేవత అనేంతలో ,
ఇద్దరు పిల్లలు డోర్ పుల్ చేసి పరుగున వెళ్లిపోయారు .
నా దేవత షాక్ చెందినట్లు నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు . తెరుకునేలోపు డోర్ క్లోజ్ అవ్వడం నేను గొళ్ళెం పెట్టడంతో మళ్లీ నిరాశే ఎదురయ్యి ప్చ్ ప్చ్ ........ అంటూ కోపంతో డోర్ ను కొట్టబోయి ఆగిపోయారు డిస్టర్బ్ అవుతుందని .......
అలా మరొక 10 నిమిషాలు డోర్ దగ్గరకు రావడం - వెనుకకు వెళ్లడంతోనే సరిపోయింది .

ఫైనల్ క్లాస్ బెల్ మ్రోగడంతో , క్లాస్ కు వెళ్లాలన్న తాపత్రయంతో రావడం చూసి , ఇదే సరైన సమయం అనుకుని నా దేవతకు కనిపించేలా గొళ్ళెం పెట్టాను .
మేడం : మహేష్ ........ అంటూ అంతులేని కోపంతో వచ్చి లోపల నుండి మిర్రర్ లో తొంగిచూసి ఓపెన్ చెయ్యమని ఆర్డర్ వేశారు .
నాకోరిక - బామ్మ కోరిక తీరే సమయం ఆసన్నమయ్యింది అని తలదించుకుని ముసిముసినవ్వులు నవ్వుకుంటూ లేచి గొళ్ళెం తెరిచాను .
నా దేవత మూడోకన్ను తెరిచినట్లు ముందూ వెనుకా ఆలోచించకుండా డోర్ ఓపెన్ చేసుకుని బయటకువచ్చి , క్లాస్ కు వెళ్లనీకుండా చేద్దామనుకున్నావా అంటూ చెంప చెళ్లుమనిపించారు .
యాహూ ........ రెండు దెబ్బలు - థాంక్యూ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం - నేను అక్కడే ఉంటే మరింత కోప్పడతారని నా దేవత ఫైనల్ క్లాస్ అయిన 3rd క్లాస్ చేరుకుని బుద్ధిమంతుడిలా కూర్చున్నాను .

నిమిషంలో మేడం లోపలికివచ్చి ఎక్కడ ఎక్కడ అంటూ బెత్తం అందుకుని నాదగ్గరికి వచ్చారు .
లోలోపలే నవ్వుకుంటూ లేచి go on మేడం అంటూ రెండు చేతులనూ విశాలంగా చాపాను .
కోపంతో కొట్టబోయి , నువ్వు మారవు అంటూ బోర్డ్ దగ్గరికి వెళ్లిపోయారు .
మేడం మేడం please please .........
పిల్లలు : అన్నయ్యా అన్నయ్యా ........ మిస్ దెబ్బలు అంత స్వీట్ గా ఉంటాయా ? అయితే మాకు కూడా అంటూ బుజ్జాయిలందరూ నాలానే బుజ్జి బుజ్జి చేతులను చాపారు మిస్ మిస్ మిస్ ........ కొట్టండి కొట్టండి అంటూ .........
నాకైతే నవ్వు ఆగనేలేదు - నా కంటే గట్టిగా నవ్వులు వినిపించడంతో తలెత్తి చూస్తే  నా దేవత ఏకంగా బుజ్జాయిల అరచేతులపై ముద్దులుపెట్టి సంతోషంతో కౌగిలించుకున్నారు .
పనిలోపనిగా నాకు కూడా అంటూ అరచేతులను నా దేవతకు అతి దగ్గరికి తీసుకెళ్ళాను .
అంతే కోపంతో ఒక చూపు చూడటంతో ఎలావెళ్ళానో అలానే వెనుకకు వచ్చి కూర్చున్నాను నవ్వుకుంటూ ......... - ఈరోజుకు రెండు దెబ్బలు మరియు చిరు పనిష్మెంట్ చాలు అనుకుని నా దేవతనే చూస్తూ ఉండిపోయాను .
దేవతకూడా చివరి పీరియడ్ పిల్లలకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా ఆడిస్తూ - నవ్విస్తూ కంప్లీట్ చేశారు .
లాంగ్ బెల్ మ్రోగగానే పిల్లలంతా ఉత్సాహంతో బై మేడం బై మేడం - బై బై అన్నయ్యా ....... అంటూ బుజ్జి బుజ్జి బ్యాగులు తీసుకుని బయటకు పరుగులుతీశారు .
Like Reply
దేవత : so స్వీట్ ఆఫ్ యు చిల్డ్రన్స్ బై బై ....... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చిరునవ్వులు చిందిస్తూ వెనుకే బయటకు వెళ్లిపోతున్నారు .
ఆ ఫ్లైయింగ్ కిస్సెస్ క్యాచ్ పట్టుకుని , మేడం ........ నాకు బై చెప్పరా ? , ok ok sorry sorry మేడం -మనం ఇంకా మన స్టాప్ వరకూ బస్ లో కూడా ప్రయాణించబోతున్నాము కదా , అందుకే బై చెప్పలేదన్నమాట ..........
దేవత : నిన్నూ ........ ప్చ్ మళ్ళీనా అంటూ కోపంతో బయటకు నేరుగా స్టాఫ్ రూంలోకి వెళ్లి , బుక్స్ - లంచ్ బ్యాగ్ అందుకుని మేడమ్స్ తోపాటు మాట్లాడుకుంటూ బయటకు నడిచారు . 
దేవత వెనుకే నడుస్తూ ........ అవునూ ఇంతకూ నాలానే ఉండే నా దేవత లంచ్ బ్యాగ్ ఎక్కడ ? , పెద్దమ్మా ....... మీకేమైనా తెలుసా ? అని మొబైల్ తీసాను - నాకైతే హెడ్ మాస్టర్ మీదనే డౌట్ ......

మెసేజ్ రావడంతో చూసాను - " మహేష్ ....... కొద్దిసేపటి ముందు నువ్వు చూశావు బాగా ఆలోచించు - నాకు తెలుసు నువ్వు కనిపెడతావు - సమయం లేదు త్వరగా నీ దేవత బస్ స్టాప్ కు వెళ్లిపోతోంది - అయినా నువ్వు బస్ స్టాప్ కు వచ్చేన్తవరకూ బస్ రాదులే ......... హ హ హ " .
Wow థాంక్యూ థాంక్యూ sooooo మచ్ పెద్దమ్మా ........ , లంచ్ బ్యాగుని నేను చూశానా? ఎక్కడ ఎక్కడ అంటూ కళ్ళుమూసుకుని ఎక్కెక్కడికి వెల్లానో నెమరువేసుకున్నాను . స్టాఫ్రూమ్ - క్లాస్సెస్ - లైబ్రరీ ........ హెడ్ మాస్టర్ రూమ్ yes yes చాక్ పీస్ తీసుకునేటప్పుడు వాటి వెనుక నా దేవత లంచ్ బ్యాగును చూసాను అని పరుగునవెళ్ళాను .
చుట్టూ మరియు లోపల ఎవ్వరూ లేకపోవడం ( అయినా ఎలా ఉంటారు పెద్దమ్మ మేనేజ్ చేసి ఉంటారు ) చూసి వెళ్లి , హెడ్ మాస్టర్ మూలన దాచిన లంచ్ బ్యాగుని అందుకుని నా దేవతకు చెప్పడానికి వెళ్లబోయి ఆగిపోయాను - ఈ విషయం తెలిస్తే నన్నుకొట్టారని బాధపడతారు , దేవత బాధపడితే నేను - పెద్దమ్మ కూడా తట్టుకోలేము కాబట్టి ఈ రహస్యం నాలోనే దాచేసుకుంటాను అని లంచ్ బ్యాగును నా కాలేజ్ బ్యాగులో ఉంచేసుకుని , నా దేవత లంచ్ బ్యాగ్ దొంగతనం చేసినందుకు గానూ హెడ్ మాస్టర్ పై కోపంతో టేబుల్ పై ఉన్నవన్నింటినీ కంప్యూటర్ తో సహా కిందకు పడేసి ఎవ్వరూ చూడకుండా బయట రెండువైపులా చూసి నవ్వుకుంటూ ఫ్రెండ్స్ దగ్గరికి చేరుకున్నాను .

ఫ్రెండ్స్ అందరూ మురళివైపు ఒకరకంగా చూస్తున్నారు . 
మురళికి విషయం అర్థమై అవునురా నా సగం హోమ్ వర్క్ మహేష్ గాడే చేస్తున్నాడు - ఇక ఈ విషయం గురించి మాట్లాడకూడదంటే నేనేమి చెయ్యాలి చెప్పండి - ఇకనుండీ నా హోమ్ వర్క్ మొత్తం నేనే చేసుకుంటాను .
ఫ్రెండ్స్ : ఏ విషయాలైనా మా పేరెంట్స్ కు చెబుతానని మమ్మల్ని బెదిరించకూడదు - వారు అడిగినా అంతా ok అని చెప్పాలి - మనం మనం ఫ్రెండ్స్ మనమధ్యలో ఏమిజరిగినా మనమే పరిష్కరించుకోవాలి - దానికి ok అంటే హోమ్ వర్క్ గురించి మాట్లాడము .
మురళి : ఇక్కడే కాదు మన ఇంటి దగ్గరకూడా మాట్లాడకూడదు . 
ఫ్రెండ్స్ : డన్ డన్ ....... , యాహూ ...... అంటూ మురళిని ఆ వెంటనే నన్ను కౌగిలించుకుని , ఇక మన ఇష్టం అని సంతోషించారు .
మురళి కోపంతో వచ్చి నాలా రాయమంటే రెండింటిలో నీలా రాశావు - అటూ ఇటూ అయి ఉంటే క్లాస్ లో నా పరువు పోయేది - దొరికినందుకు గానూ ఈరోజు కూడా బస్ లోనే రమ్మని చెప్పాడు .
ఫ్రెండ్స్ : మురళీ .........
ఫ్రెండ్స్ - మురళీ సర్ ........ బస్ లో రావడం నాకు ఇష్టమే , మీరు హ్యాపీగా వెళ్ళండి - అన్నయ్యా ....... జాగ్రత్తగా తీసుకెళ్లండి డ్రైవర్స్ కు చెప్పాను .
వినయ్ : మహేష్ ....... కనీసం బ్యాగ్ అయినా ఇవ్వు తీసుకొస్తాము .
మురళి : నో నో నో బ్యాగును మోస్తూ రావాలి అదే పనిష్మెంట్ అని కారులో కూర్చున్నాడు .
ఫ్రెండ్స్ చెప్పానుకదా soooo హ్యాపీ అని మీరు వెళ్ళండి వెళ్ళండి , బస్ సమయానికి వస్తే మీకంటే ముందుగా చేరుతానేమో అని నవ్వించి పంపించాను . మురళి శిక్ష విధించినా నాకు వరంలా మారుతుంది అని మరొకసారి ప్రూవ్ అయ్యింది అంటూ నవ్వుకుంటూ బస్ స్టాప్ చేరుకున్నాను . 

నా దేవతతోపాటు కొంతమంది 15 నిమిషాలకు పైనే వేచి చూస్తున్నట్లు రోడ్ వైపు బస్ కోసం ఆశతో చూస్తున్నారు .
Sorry మేడం ......... , అంటీ అంకుల్స్ ........ నేను వచ్చేసాను కదా 5 లెక్కపెట్టేంతలోపు మన బస్ వచ్చేస్తుంది అని దేవత ప్రక్కన చేరాను .
దేవత : నో వే ........
అయితే మీరే లెక్కపెట్టండి మేడం .........
దేవత : నో .........
అయితే మీరు లెక్కపెట్టేంతవరకూ బస్ రానే రాదు - చీకటి పడినా రాదు , అర్ధరాత్రైనా రాదు . మా మేడం మీరు ఉండగా నాకేమీ భయం లేదు ఇక్కడే కూర్చుంటాను అని బస్ స్టాప్ బెంచ్ పై కూర్చున్నాను .

చుట్టూ ఉన్న వారంతా నవ్వుకున్నారు - మరొక నిమిషంలో కౌంట్ చేయకపోయినా బస్ వస్తుంది . 
నా దేవత మాత్రం నావైపు కన్నింగ్ గా చూస్తున్నారు - కాన్ఫిడెంట్ కనిపిస్తోంది కానీ ఓవర్ కాన్ఫిడెంట్ కనిపించడం లేదే అని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తూనే ఉంది .
మేడం ....... త్వరగా కౌంట్ చేశారంటే బస్ వచ్చేస్తుంది ఇంటికి వెళ్లిపోవచ్చు మీ ఇష్టం ..........
పిల్లకాకి - బచ్చా - పిల్లాడి ........ మాటలు వినడం ఏమిటి ఎవ్వరూ కౌంట్ చెయ్యకండి కొద్దిసేపట్లో బస్ వచ్చేస్తుంది అని ఒక్కొక్కరు ఒక్కొక్క నామకరణం చేశారు . 

నెక్స్ట్ 15 మినిట్స్ అయినా బస్ జాడ లేకపోవడంతో నిజమేనా అన్నట్లు అందరూ నావైపు చూస్తున్నారు .
నే చెప్పలే ...... చెప్పలే ...... అన్నట్లు expression ఇచ్చాను . అంకుల్స్ ........ మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత ఆలస్యం అవుతుంది మీ ఇష్టం ........ - మేడం ...... మీరు చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినకండి , పాపం మీ ప్రాణమైన బామ్మగారు ఎదురుచూస్తుంటారు.
మరొక 5 మినిట్స్ అయినా బస్ రాకపోవడంతో ........ మేడం మేడం పిల్లాడి మాటలు నిజమైనా కాకపోయినా కౌంట్ చేస్తే పోయేదేముంది please please అంటూ బ్రతిమాలుతున్నారు .
వద్దు అని బెట్టు చేసినవాళ్లే బ్రతిమాలుకోవడం చూసి నా దేవత ముసిముసినవ్వులు నవ్వుకుని , ok ok నాకు కూడా ఇంటికి చేరాలని ఆశగా ఉంది 5 4 3 2 1 ......... 
బస్ హార్న్ వినిపించడంతో అందరూ షాక్ చెందినట్లు నావైపు చూస్తున్నారు - బస్ వచ్చినా కదలకుండా ఉండిపోయారు .
మేడం ....... మొదట ఎక్కి ఇష్టమైన సీట్లో దర్జాగా కూర్చోండి వెళ్ళండి వెళ్ళండి ....
మేడం : ఎలా అన్నట్లు నాకొక దండం పెట్టి షాక్ లోనే బస్ ఎక్కారు .
నవ్వుకుని అంటీ - అంకుల్స్ - బ్రదర్స్ ....... ఇంకా ఎంతసేపు షాక్ లో ఉంటారు బస్ వెళ్లిపోయేలా ఉంది .
అంతే హడావిడిగా బస్ ఎక్కారు . చివరగా నేను ఎక్కాను .
నువ్వు చెప్పినదే జరిగింది బాబూ - ముందే విని ఉంటే బాగుండేది అని దారిని వదిలారు . నవ్వుకుంటూ వెళ్లి కూర్చున్న మేడం ప్రక్కనే నిలబడి రైట్ రైట్ అనడంతో బస్ కదలడం చూసి మళ్లీ ఆశ్చర్యంగా చూసారు నా దేవత .........

ఒక అంటీ : బాబూ ....... మీ మేడం ప్రక్కన సీట్ ఖాలీనే కదా కూర్చో , బ్యాగు ఎంత బరువుందో ఏమో ........
అంటీ అదీ లేడీస్ సీ ........
మేడం : హలో హలో హీరోగారూ ........ మీ హ్యుమానిటీ మళ్లీ మొదటి నుండి మొదలెట్టకండి - నన్ను అందరూ తిట్టుకోకముందే కూర్చోండి అదే దగ్గరకు జరిగే కూర్చోండి అని చివరకు జరిగారు .
Yes యాహూ ....... అంటూ లోలోపలే ఆనందంతో మురిసిపోతూ కూర్చున్నాను .
మేడం : దెబ్బలు కొట్టాను - పనిష్మెంట్ ఇచ్చాను అయినా ఈ అల్లరి తగ్గించవా .......
Sorry మేడం మళ్లీ చెయ్యను .
మేడం : సరిపోయింది ఉదయం నుండీ sorry అంటూ ఇదే చెబుతున్నావు , నెక్స్ట్ మినిట్ నుండీ మళ్లీ అదే అల్లరి చేస్తున్నావు - ఎంత కోపం వేసిందోతెలుసా ఇక లైబ్రరీ దగ్గర అయితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను , వెళ్లిపోయావు కాబట్టి కూల్ అయ్యాను లేకపోతే పెద్ద పనిష్మెంట్ ఇచ్చేదానిని .........
ప్చ్ ........ పెద్ద పనిష్మెంట్ మిస్ అయ్యానే , బుద్ధిలేదురా నీకు మహేష్ గా ,దెబ్బలు పడాలి నీకు అంటూ లెంపలేసుకున్నాను .
మేడం : ఇదిగో ఇలానే కోపం తెప్పిస్తావు - స్టాప్ వచ్చేన్తవరకూ నన్ను డిస్టర్బ్ చెయ్యకు అంటూ అటువైపుకు తిరిగారు .
Like Reply
చిరునవ్వులు చిందిస్తూ దేవత వైపుకు తిరిగి నేలపై భోజనానికి కూర్చునేలా కూర్చున్నాను - దేవతకు వారినే చూస్తున్నానన్న కోపం రాకుండా బ్యాగులోనుండి ఇంగ్లీష్ బుక్ అందుకుని చదువుకుంటున్నట్లు నటిస్తూ దేవతను కన్నార్పకుండా చూస్తూ హృదయమంతా నింపుకుంటున్నాను .
కండక్టర్ కండక్టర్ ......... అంటూ నా చుట్టూ ఉన్న అంటీ వాళ్ళు కేకలువెయ్యడంతో నాతోపాటు మేడం కూడా చూసారు . కండక్టర్ ........ పిల్లాడు చదువుకుంటున్నాడు  బస్సులో ఉన్న లైట్స్ అన్నీ వెయ్యండి .
కండక్టర్ : ఈ మాత్రం దానికి ఇంతలా కేకలు వెయ్యాలా , ఇప్పుడే వేస్తాను అని లైట్స్ on చేశారు .
బస్సు మొత్తం వెలిగిపోవడం చూసి థాంక్యూ థాంక్యూ అంటీ అంటూ నవ్వుతూ నా దేవతవైపుకు తిరిగాను .
క్లాసులలో బుద్ధిగా ఉండమంటే అల్లరి అల్లరి చేస్తావు - టైం వేస్ట్ చేయిస్తావు - ఇక్కడ మాత్రం ఎంత అమాయకమైనవాడిలా నటిస్తున్నావు అని దేవత చిరుకోపపు చూపులలోనే అర్థమయ్యి స్మైల్ ఇచ్చాను . హలో హీరో గారూ ........ అసలు ఏమిచేశావని బస్సులో ఉన్నవారంతా నీకు ఫాన్స్ అయిపోయారు - ఉదయం కూడా ఇలానే జరిగింది - ఏమి మాయ చేస్తున్నావు ? .
మాయనా ? అంటూ అమాయకుడిలా అడిగాను .........
అమ్మో అమ్మో ఏమి యాక్టింగ్ , నిన్ను అడిగాను చూడు నాకు బుద్ధిలేదు , చదువుకో చదువుకో ........ మళ్లీ నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానని నీ ఫాన్స్ అందరూ నామీదకు వచ్చినా వస్తారు అని మళ్ళీ అటువైపుకు తిరిగి బయటకు చూస్తున్నారు.
ముసిముసినవ్వులు నవ్వుకుని దేవతనే మధ్యమధ్యలో విండో నుండి వస్తున్న గాలికి అలల్లా కదులుతున్న కురుల వలన కనిపిస్తున్న మెడ ఒంపును మరియు చీర చాటున కనిపించీ కనిపించనట్లు దాక్కున్న తమన్నా కంటే వయ్యారమైన ఒంపు గల నడుము అందాన్ని చూస్తూ కనురెప్పకూడా మరిచిపోయినట్లు చూస్తూ చిన్నగా జలదరిస్తున్నాను .

నా చూపుల ఘాడత దేవత నడుముపై స్పృశించినట్లు , అనుమానంతోనే నెమ్మదిగా నావైపుకు తిరిగారు .
ఆ సమయం చాలదూ బుక్ వైపుకు కనుచూపు మార్చడానికి - poem బై హార్ట్ చేస్తున్నట్లు పదే పదే లైన్స్ చదువుతున్నాను .
అయినాకూడా నా దేవతకు డౌట్ వచ్చినట్లు నడుంఒంపుపై చీరను సరిచేసుకుని కోపంతో చూస్తున్నారు .
మేడం ........ ఏమీ తెలియని చిన్నపిల్లాడిని కదా , మీరు చెప్పినట్లుగానే వెలుగులో బుధ్ధిగా poem చదువుకుంటున్నాను .
దేవత : నీ మాటలు నమ్మడం ఉదయమే మానేసాను అంటూ లేచి హ్యాండ్ బ్యాగ్ - లంచ్ బ్యాగ్ తీసుకుని ముందు సీట్ వరకూ వెళ్లి నిలుచున్నారు .

అయ్యో నావల్ల నా కళ్ళ స్వార్థం వలన దేవత నిలబడాల్సి ......... అంతలోనే బస్ ఆగడంతో మొదటగా దేవత దిగిపోయారు .
నాపై కోపంతో అని బాధపడుతూ మేడం మేడం ........ అని విండో నుండి బయటకు చూస్తే మా బస్ స్టాప్ ........ , అందుకే దిగారా అని నెత్తిపై మొట్టికాయ వేసుకుని నవ్వుకున్నాను . బుక్ ఒకచేతితో బ్యాగ్ మరొకచేతితో ఉంచుకుని దేవత దిగిన డోర్ వైపుకు వెళ్లబోతే నిన్న అడ్డుపడిన ఆండాలమ్మే మళ్లీ అడ్డుగా ఉండటం చూసి అండాలు అంటీ మిమ్మల్నీ అంటూ కోపంతో వెనక్కువచ్చి వెనుక డోర్ ద్వారా కిందకు దిగేసరికి నిన్నలానే దేవత మాయమైపోయారు .
ప్చ్ ........ అంతా దేవత నడుమును చూసి నన్ను నేను మరిచిపోవడం వల్లనే అంటూ నన్ను నేను తిట్టుకుంటూ బస్ స్టాప్ కు అటూ ఇటూ చాలాదూరం వరకూ పరుగులుతీసి చూసినా లాభం లేకపోయింది .
దేవతను మళ్లీ ఈరోజు కూడా మిస్ అయ్యానన్న బాధతో అటూ ఇటూ పరుగులు పెడుతుండటం చూసి సెక్యూరిటీ పెద్దయ్య కంగారుపడి నాదగ్గరకువచ్చి ఏమయ్యింది మహేష్ - ఏమైనా పోగొట్టుకున్నావా ...... చెప్పు సెక్యూరిటీ మొత్తాన్ని పిలిచి సర్చ్ చేద్దాము అని అడిగారు .
( అవును పెద్దయ్యా ........ పోగొట్టుకున్నాను అని గుండెలపై చేతినివేసుకున్నాను ) ప్రక్కనే బస్ స్టాప్ కాబట్టి పెద్దయ్య ఖచ్చితంగా చూసే ఉంటారు - పెద్దయ్యా పెద్దయ్యా ....... బస్ నుండి మొదటగా దిగిన మా మేడం గారు ఎటువెళ్లారో చూసారా ? .
పెద్దయ్య : చూసాను మహేష్ ....... ఇప్పుడే వెళ్లారు .
ఎటు ఎటు వెళ్లారు పెద్దయ్యా కుడివైపుకు వెళ్ళారా - ఎడమ వైపుకు వెళ్ళారా లేక మనకెదురుగా ఉన్న దారిలో వెళ్ళారా ? ........ 
పెద్దయ్య : మూడు దారులలోనూ వెళ్ళలేదు .
What ? మరెటు వెళ్లారు .
పెద్దయ్య : ఇక మిగిలిన మార్గం ఎటువైపు ........
మూడు దారులూ కాక ఇక మిగిలినది మన ఏరియా దారినే కదా పెద్దయ్యా .......
పెద్దయ్య : అవును మన దారిలోనే వెళ్లారు .
మన దారిలోనా ఎందుకు ? .
పెద్దయ్య : ఎందుకు అంటే వాళ్ళు ఉంటున్నది లోపలే కదా ....... , భూత్ బంగ్లా ప్రక్కన ఇంటిలోకి కొత్తగా చేరినది వారే నీకు తెలియదా .........
ఏంటీ ........ అంటూ షాక్ లో ఉండిపోయాను - తేరుకుని నాకేమీ అర్థం కాక పరుగున మినీ గ్రౌండ్ దగ్గరికి చేరుకున్నాను - ఆ క్షణమే దేవత ...... బామ్మా బామ్మా వచ్చేసాను అంటూ కేకలువేస్తూ మెయిన్ గేట్ తీస్తున్నారు .

బుజ్జితల్లీ ........ ఆలస్యం అయ్యిందే అంటూ బామ్మ బయటకువచ్చి హ్యాండ్ బ్యాగ్ - లంచ్ బ్యాగ్ అందుకున్నారు .
దేవత : కాలేజ్ అంతటికీ ఒక అల్లరి పిల్లాడు ఉన్నాడు బామ్మా ....... , వాడి వలన ఆలస్యం అయ్యింది - ఇంకనూ ఆలస్యం అయ్యేదేమో .........
బామ్మ : అంతగా అల్లరి చేస్తాడా ? ...... అంతలో నన్ను చూసి hi hi అంటూ చేతిని ఊపారు .
కోపంతో కుడివైపుకు తిరిగి పదేపదే బామ్మ - దేవతవైపు చూస్తున్నాను .
బామ్మకు ....... నా అలక కారణం అర్థమై నవ్వుకున్నారు .
బామ్మా ........ స్నాక్స్ ఏమిచేశారు అని కౌగిలించుకోబోతే బామ్మ ఆపి , బుజ్జితల్లీ ....... నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఇప్పుడే వస్తాను అని బుగ్గపై ముద్దుపెట్టి పంపించి నా దగ్గరకు నడిచారు .

వెళ్ళండి వెళ్ళండి మీ ........ ప్రాణమైన ....... వెళ్ళండి , నేనెవరిని అంటూ దూరం దూరం నడుస్తూ వెళ్లి అమ్మవారి గుడిలోపల మెట్లపై కూర్చున్నాను .
బామ్మ : నవ్వుతూనే లోపలికివచ్చి నా బుజ్జి బుజ్జి బంగారుకొండ బుజ్జి హీరో ఎక్కడ ఎక్కడ .........
అంతే బుంగమూతిపెట్టుకుని మరొకవైపుకు తిరిగాను .
అమ్మో ఈ బామ్మపైనే అలకనా - ఇదంతా కోపమే ........ అంటూ నా ముందుకువచ్చి sorry కాదు కాదు లవ్ యు లవ్ యు అంటూ గుంజీలు తీస్తున్నారు .

బామ్మా బామ్మా ........ అంటూ లేచివెళ్లి ఆపి మళ్లీ బుంగమూతిపెట్టుకున్నాను . 
బామ్మ : నవ్వుకుని , లవ్ యు లు చెప్పాను కదా బుజ్జిహీరో ....... కూల్ అవ్వచ్చు కదా నా బుజ్జి కదా నా బంగారుకొండ కదా లవ్ యు లవ్ యు అని బుంగమూతి పెదాలపై - బుగ్గలపై చేతివేళ్ళతో ముద్దులు కురిపించారు . నా ప్రాణం నా బుజ్జిహీరో ........ - నాకు ........ నా బుజ్జితల్లి కంటే నా బుజ్జి హీరో అంటేనే ఎక్కువ ప్రాణం - నా బుజ్జితల్లిని కాదు కాదు నీ దేవత కమ్ బుజ్జిదేవతను కౌగిలించుకోకుండానైనా ఉండగలను కానీ తన దేవతను ఉదయం నుండీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న నా బుజ్జిహీరోను మరొక్క క్షణం నా గుండెలపైకి తీసుకోకపోతే అది ఆగిపోతు ..........
బామ్మా ......... అంటూ అమాంతం గుండెలపైకి చేరిపోయి లవ్ యు బామ్మా లవ్ యు బామ్మా ........ అని చెబుతూనే ఉన్నాను .
బామ్మ : ఇప్పటికి ఈ బామ్మ ప్రాణం నిలబడింది అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు . అంటే బుజ్జితల్లిని నీ ప్రాణమైన బుజ్జిదేవత దగ్గర అల్లరి చేసినది నువ్వే అన్నమాట , నేను చూడలేకపోయానే ........

దేవత ....... నా దేవత ........ " బుజ్జి " తల్లినా ? బామ్మా .........
బామ్మ : నవ్వుకుని , మాకు ...... మప్రాణమైన వారు ఎప్పటికీ బుజ్జిగానే కనిపిస్తారు - నా బుజ్జిహీరో ఇప్పుడే కాదు పెద్దవాడయ్యాక కూడా నాకు బుజ్జిహీరోనే ........
Wow ....... లవ్ యు soooooo మచ్ బామ్మా , ఈ మనఃస్పర్ధలు అన్నీ " బుజ్జి " అనడం వలన వచ్చాయన్నమాట ....... - నిన్న అందుకేనా మొబైల్లో నా దేవత ఫోటో చూయించగానే నన్ను ముద్దులు - కౌగిలిలో ముంచెత్తారు . Sorry కూడా చెప్పారు నేనే అర్థం చేసుకోలేకపోయాను అని మొట్టికాయ వేసుకున్నాను .
బామ్మ నవ్వడం చూసి ఆనందం వేసింది - ఎక్కడికీ అర్ధరాత్రి దేవతను అదే అదే మీ బుజ్జితల్లిని ( బుజ్జిహీరో ....... నీ బుజ్జిదేవత ) ఒకసారి చూడమని ఎంతగానో చెప్పారు నేనే విననేలేదు అని నవ్వుకున్నాను . 
బామ్మా ....... మీ బుజ్జిదేవతనే నా దేవత అని తెలిసిన క్షణం నుండీ ఇక్కడ ఇక్కడ ఎంత సంతోషం కలుగుతోందో - పారవశ్యం కలుగుతోందో .........
బామ్మ : నాకు తెలియదా బుజ్జిహీరో ........ ఇక్కడేనా ఇక్కడేనా అంటూ నా గుండెలపై ప్రాణంలా స్పృశించి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .

ఆఅహ్హ్ ....... లవ్ యు బామ్మా , బామ్మా ...... దేవత స్నాక్స్ అడుగుతూ కౌగిలించుకోబోతే ఎందుకు ఆపేశారు .
బామ్మ : చూశావన్నమాట ...... ? , చెప్పానుకదా మొదట నా బుజ్జిహీరోను కౌగిలించుకున్న తరువాతనే ఎవరైనా , అది నా బుజ్జితల్లి అయినా సరే ....... 
లవ్ యు బామ్మా ...... , అందుకేనా ఉదయం దేవత బుగ్గ ఎర్రగా కందిపోయింది .
బామ్మ : మరి నా బుజ్జిహీరోనే కొడుతుందా ఆ మేడం - అంత గట్టిగానే కొట్టిన తరువాతనే నాకు హాయిగా అనిపించింది .
హ హ హ ......, బామ్మా ....... ఈరోజు అయితే మీ కోరిక ప్రకారం ఏకంగా రెండు దెబ్బలు మరియు గోడ కుర్చీ పనిష్మెంట్ సంతోషంగా ఆస్వాదించాను .
బామ్మ : ఏమిటీ ........ పనిష్మెంట్ కూడానా ....... , బుజ్జిహీరో మోకాళ్ళు నొప్పి పుట్టాయా ?  అయిపోయింది అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి తియ్యనైన కోపంతో బయటకు అడుగులువేశారు .
బామ్మా బామ్మా బామ్మా ....... అంటూ నవ్వుకుంటూ ముందుకువెళ్లి హత్తుకున్నాను - అంతలా అల్లరి చేసాను కాబట్టే కోపం తట్టుకోలేక కొట్టారు - ఆ దెబ్బలు ఎంత తియ్యగా ఉన్నాయో మీకెలా తెలుస్తాయిలే , దేవతకు స్టూడెంట్ గా ఉంటే అర్థమయ్యేది .
బామ్మ : అంతేనంటావా అయితే ok , ప్చ్ ....... నా ప్రాణమైన బుజ్జితల్లి నా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిహీరో చిలిపి సయ్యాటలు కనులారా వీక్షించలేకపోయాను అని ఫీల్ అవుతూ నన్ను కౌగిలించుకున్నారు .
మా బామ్మకోసం వీలైనన్ని సయ్యాటలు మొబైల్లో బంధించాను కదా ........ అని మొబైల్ అందించాను .
బామ్మ : ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........ అంటూ ముద్దులుపెట్టి , నా చేతిని పట్టుకుని అమ్మవారి ఎదురుగా కూర్చున్నారు చూడాలన్న ఆతృత సంతోషంలో ...........
Like Reply
Awesome update bro, alage JTKP 2 update ivandi bro.
[+] 2 users Like Sudharsangandodi's post
Like Reply
EXCELLENT UPDATE MAHESH GARU KAANI CHINNA REQUEST PLEASE EKKUVA DAYS GAP TEESUKOKANDI
[+] 1 user Likes preeth2019's post
Like Reply
అప్డేట్ చాలా చాలా బాగుంది మహేష్ మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Wonderful update bro
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Excellent update superb
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
super mahesh garu
[+] 1 user Likes RICHI's post
Like Reply




Users browsing this thread: Bujji69, 23 Guest(s)