Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
(15-06-2021, 02:39 PM)RICHI Wrote: VERY NICE STORY.
WAITING FOR
పెదరాసిపెద్దమ్మ SECOND MISSION.

Thankyou sooooooo much .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(15-06-2021, 11:12 AM)ramd420 Wrote: Updates super

Thankyou .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(17-06-2021, 03:52 PM)Ravi21 Wrote: అప్డేట్ చాలా బాగుంది అదరగొట్టేసారు ఎప్పట్లాగే అద్భుతం రెండో అంకం కోసం చూస్తూ ఉన్నాం నా కోరిక ఏంటంటే ఆడియో ఫైల్స్ సపోర్టు కూడా కావాలి మాట్లాడి మన భావాలని అద్భుతంగా తెలియజెప్పాలని ఆడియో ఫీచర్ ఇవ్వాలని నేను అడ్మిన్ ని కోరుకుంటున్నాను

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(22-06-2021, 11:29 AM)jackwithu Wrote: we are eagerly waiting for that manasu Kavi doctor Mahesh

Second mission starts tomorrow morning ..........
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply
EXECELLENT AND KIRACK UPDATE
Like Reply
(10-07-2021, 01:05 PM)Mahesh.thehero Wrote: Second mission starts tomorrow morning ..........

Alage JTKP 2  kooda update ivandi bro
Like Reply
(10-07-2021, 01:05 PM)Mahesh.thehero Wrote: Second mission starts tomorrow morning ..........

we are waiting sir
Like Reply
Good morning MAHESH sir

Wait for u r new mission
....

............
Like Reply
(17-06-2021, 03:52 PM)Ravi21 Wrote: అప్డేట్ చాలా బాగుంది అదరగొట్టేసారు ఎప్పట్లాగే అద్భుతం రెండో అంకం కోసం చూస్తూ ఉన్నాం నా కోరిక ఏంటంటే ఆడియో ఫైల్స్ సపోర్టు కూడా కావాలి మాట్లాడి మన భావాలని అద్భుతంగా తెలియజెప్పాలని ఆడియో ఫీచర్ ఇవ్వాలని నేను అడ్మిన్ ని కోరుకుంటున్నాను

Heartfully thankyou so much .
Like Reply
(16-06-2021, 01:17 PM)Mahe@5189 Wrote: Second mission load cheyyandi.
Wait chesthamu.
Update super Anna.

Thankyou .
Like Reply
             SECOND MISSION


అది వైజాగ్ శివారుప్రాంతం . ప్రభుత్వం పట్టాభూమిలో ప్రభుత్వమే నిర్మించిన చిన్న గృహం . ఆ చిన్న ఇంటిలో మోతాదుకు మించిన బుజ్జి దేవుడి బిడ్డలు ( అనాధ పాపాయిలు ) - వారిని తన స్థాయికి మించి ఆప్యాయంగా చూసుకునే అవ్వ . చెత్త కుప్పలలో - ముళ్ల పొదలలో తల్లులకు ఇష్టం లేకుండా , పెళ్లికాకుండానే కనడం వలన భువిపైకి చేరిన బిడ్డలను తన ఒడిలోకి చేర్చుకుని , దేవతలు ....... తనకు అందించిన అదృష్టం అని ఆ వయసులోకూడా పలు ఇళ్లల్లో పనులు చేసి - కొంతమంది జాలిపడి దానం చేసిన డబ్బు , గింజలతోనే వారి ఆకలి తీర్చేది . బుజ్జిపాపాయిల చిరునవ్వులలోనే ఆకలి తీర్చుకుని రోజుకు ఒక్కపూట ఒక్కొక్కసారి ఆ అవకాశం కూడా లభించకపోయినా నీళ్లే మహాప్రసాదంలా స్వీకరించేది . 

15 సంవత్సరాల క్రితం ఒక అర్ధరాత్రి అప్పుడేపుట్టిన బుజ్జాయి ఏడుపులు వినిపించడంతో మెలకువ వచ్చిన అవ్వ , చుట్టుప్రక్కల ఇళ్లల్లో గర్భవతులు ఎవ్వరూ లేరే , ఎక్కడ నుండి బిడ్డ ఏడుపులు ఎక్కడ ఎక్కడ అంటూ బయటకువచ్చింది . ఇంటి ప్రక్కనే ఉన్న ముళ్లపొదలలో ఏడుస్తున్న నన్నుచూసి చలించిన హృదయంతో గుండెలపైకి తీసుకుని మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పటికీ కొనసాగిస్తోంది అవ్వ . 
లాలిస్తూ - ముద్దులతో జోకొడుతూ ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి గుచ్చుకున్న గాయాలకు వెన్నరాసి పొత్తిళ్లలో వెచ్చగా పడుకోబెట్టి పాలసీసాతో పాలు తాగించి లాలించింది .

అమ్మా దుర్గమ్మా ........ అనాధలానే పుట్టి అనాధలానే నేను పోకుండా , నాకు తోడుగా ఈ బుజ్జాయిని పంపించావా తల్లీ , కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఈ ముసలిప్రాణానికి ఒక బాధ్యత అందించావా , నువ్వు కోరుకున్నట్లుగానే నా ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకూ జాగ్రత్తగా చూసుకుంటాను అని మురిసిపోయింది . అప్పటివరకూ బిక్కుబిక్కుమంటున్న ముసలి అవ్వ ప్రాణంలో ఉత్సాహం వచ్చింది.  నాకు మహేష్ అని నామకరణం చేసి తనతో ఉన్న కొద్దిపాటి డబ్బుతో నా అవసరాలను తీర్చి పెంచింది . నా ఐదవ ఏట బడిలో చేర్పించింది . 

నా వయసు ఇప్పుడు 15 సంవత్సరాలు - సిటీలోని govt స్కూల్లో 10 వ తరగతి చదువుతున్నాను . ఒకరోజు నేను స్కూల్ నుండి వచ్చే సమయానికి అవ్వ చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరు బుజ్జిపాపాయిలను ఊయలలో లాలిస్తోంది .
అవ్వా ........ అంటూ సంతోషంతో వెళ్లి ఆడించాను . అవ్వా ....... ఎవరు ఈ బుజ్జాయిలు ? .
అవ్వ : 15 సంవత్సరాల క్రితం నీలానే నా దగ్గరకు చేరిన దేవుడి బిడ్డలు మహేష్ . పని నుండి వస్తుండగా హాస్పిటల్ వెనుక ఏడుపులు వినిపించడంతో చూస్తే ఈ బుజ్జాయిలు . జనాలు అటూ ఇటూ వెళుతున్నారుకానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు . 
ఎంత ముద్దొస్తున్నారు అవ్వా ....... , ఈరోజు నుండీ నేనే ఆడిస్తాను అని ముద్దులుపెట్టాను . ఆరోజు నుండీ కొన్నిరోజుల్లో 10 మందిదాకా బుజ్జిపాపాయిలు మా చెంత చేరారు . మా వీధి చివరన ఉంటున్న ఒక ఇంటిలో వ్యక్తికి పెళ్లికాగానే భార్య మాటలు విని ముసలి వయసులో ఉన్న తల్లిని బయటకు గెంటెయ్యడం వలన ఏమీ చేయలేక ఎటు వెళ్ళాలో పాలుపోక చెట్టుకింద బాధపడుతున్న అవ్వను బుజ్జిపాపాయిలను చూసుకోవడానికి తోడుగా తీసుకొచ్చారు అవ్వ .
అవ్వ పనిచెయ్యడం వలన లభించే డబ్బులు బుజ్జిపాపాయిల పాలకే సరిపోక అవ్వలిద్దరూ రోజుకు ఒకే పూటతో సర్దుకునేవారు . 
ఆరోజు నుండీ మా స్కూల్లో పెట్టే మధ్యాహ్నం భోజనాన్ని తినకుండా తీసుకొచ్చి అవ్వలకు అందించేవాడిని .
అవ్వలిద్దరూ కళ్ళల్లో చెమ్మలతో నాకు వడ్డించి మిగిలినది తినేవారు . అలా కొన్నిరోజులు భారంగానే గడిచాయి - అనాధ పిల్లలు మరికొంతమంది చేరడంతో మరింత కష్టమయ్యింది .

అవ్వల మంచితనం తెలిసిన ప్రక్కింటి ఆమె , తాను ఫారిన్ లో ఉన్న తన కొడుకు దగ్గరికి వెళ్లిపోతున్నాను , ఇక మళ్లీ రావడం కుదరదేమో ఈ ఇంటిని కూడా మీరే తీసుకోండి , ఇంటితోపాటు వస్తువులు - కొన్ని నెలలకు సరిపడు ధాన్యాన్ని - పెద్ద మొత్తంలో డబ్బును అందించారు .
అవ్వలతోపాటు నేను , పిల్లలు ........ చాలా సంతోషం అని దండం పెట్టాము . 
ఆమె : ఇంతమంది పిల్లలు - పాపాయిలలో వెలుగులు నింపుతున్నారు . నా వంతు చేతనైన సహాయం - మీ దీవెనలు వలన నా కుటుంబం అక్కడ సంతోషంగా ఉంటుందన్న ఆశ అని ఇంటి తాళాలు అందించి వెళ్లిపోయారు .

అవ్వల ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి . మహేష్ ........ కొన్ని నెలలవరకూ మనం దిగులుచెందాల్సిన అవసరం లేదు .
అవ్వలూ ......... నేను ఒక నిర్ణయానికి వచ్చాను . నన్ను ఏ లోటూ లేకుండా పెంచారు ఇంత వయసు వచ్చాక కూడా ఇక్కడే ఉండి నా ప్రాణమైన వారికి భారం అవ్వడం మంచిదికాదు - నన్ను చేరదీసి ఇంతవాణ్ణి చేశారు లోకం తెలియజేసారు . నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయి చదువుకుంటూనే నా వంతు కష్టపడి పనిచేస్తూ మీకు సహాయపడాలనుకుంటున్నాను - నేను వెళితే ఈ ధాన్యాన్ని మరికొంతకాలం మీరు తినవచ్చు - నేను ఎక్కడ ఉన్నా నా ప్రాణం మాత్రం ఇక్కడే ఉంటుంది .
అవ్వలు : మహేష్ అంటూ హత్తుకున్నారు . ప్రతీ క్షణం మా గురించే పిల్లల గురించే ఆలోచించావు . వెళ్లు నాన్నా వెళ్లు ఇకనుండీ నీకోసం జీవించు అని సంతోషంతో దీవించారు .
అవ్వలూ ......... చెప్పానుకదా నా ప్రాణం ఇక్కడే ఉంటుంది . మీ - పిల్లలు - పాపాయిల సంతోషమే నా సంతోషం అని బుక్స్ - బట్టలు మూట కట్టుకున్నాను .
అవ్వలు : నాన్నా ....... అని డబ్బు ఇచ్చారు .
అవ్వలూ ........ నేను వెళుతున్నది నా ప్రాణమైన వాళ్లకు సహాయం చెయ్యడం కోసం - మీరుప్రార్థించే దుర్గమ్మే నాకు దారి చూయిస్తుంది - స్కూల్లో మూడు పూటలకూ సరిపడినంత తింటాను కదా నా గురించి ఆలోచించకండి అని డబ్బును వెనక్కు ఇచ్చేసి జీవన ప్రయాణం మొదలెట్టాను .

మూటతోనే స్కూల్ కు చేరుకున్నాను - ఆకలివేస్తున్నా శ్రద్ధతో క్లాసెస్ విన్నాను - భోజనం గంట మ్రోగగానే అన్నం పప్పు వడ్డించుకుని ఒకచోట కూర్చున్నాను - తొలిముద్ద తింటూ అవ్వలను గుర్తుకుతెచ్చుకుని కన్నీళ్ళతో , అమ్మా దుర్గమ్మా ........ ఈ అన్నం నాకు లేకపోయినా నా ప్రాణమైనవాళ్లకు ఉండేలా చూడు అని ప్రార్థించి , అన్నం పరబ్రహ్మస్వరూపంలా స్వీకరించి కన్నీళ్లను తుడుచుకున్నాను .
మధ్యాహ్నం కూడా క్లాసెస్ శ్రద్ధగా విన్నాను - స్కూల్ బెల్ మ్రోగగానే రోజూలా నాకు తెలియకుండానే అడుగులు ఇంటివైపుపడ్డాయి . కన్నీళ్ళతోనే ఇంటికి వ్యతిరేకదిశలో నడక సాగించాను . ఒకరోజు బస్ స్టాండ్ లో మరొకరోజు రైల్వేస్టేషన్ లో పనికోసం వెతికినా ప్రయోజనం లేక ( పిల్లలను పనిలో పెట్టుకోము మమ్మల్ని జైల్లో పెడతారు ) అక్కడే పడుకుని అక్కడే ఫ్రెష్ అయ్యి స్కూల్ కు వెళ్ళాను . 

ఆ తరువాతిరోజు ఆదివారం అని తెలియక స్కూల్ కు వెళితే లాక్ చేసి ఉండటం వలన తెలిసి సిటీలోని షాప్స్ లలో పనికోసం వెతికీ వెతికి అలసిపోయాను . ఇలాకాదుకానీ అవ్వలా ....... ఇళ్లల్లో పని దొరుకుతుందేమోనని ఒక ఇంటికి వెళ్లి లోపల ఉన్న అన్నను అడిగాను . 
బాబూ ........ ఇక్కడ ఉన్నవన్నీ చిన్న చిన్న ఇల్లులు , మేము కూడా పనిచేసుకుని జీవనం సాగించేవాళ్ళము , అలాంటివాళ్ళము నీకు పని ఎలా ఇవ్వగలం చెప్పు - ఒక పనిచెయ్యి ఇలాగే కొద్దిదూరం వెళితే అక్కడ govt ఆఫీసర్స్ - బిజినెస్ మెన్స్ - డాక్టర్స్ .......... ఉంటున్న costly ఏరియా ఉంది - మాలో చాలామంది అక్కడే పనిచేస్తున్నాము , బాగా డబ్బు - మిగిలిన మంచి ఫుడ్ ఇస్తారు , నీకు అదృష్టం ఉంటే పని దొరకవచ్చు . 
మధ్యాహ్నం రెండు గంటలు , ఎండ ఎక్కువగానే ఉంది , ఉదయం నుండీ ఏమీ తినలేదు , కళ్ళు మూతలుపడుతున్నాయి , పెదాలు తడి ఆరిపోతున్నాయి . ఎదురుగా ట్యాప్ లో నీళ్లు వస్తుండటం చూసి , అన్నకు థాంక్స్ చెప్పివెళ్లి కడుపునిండా నీళ్లుతాగి ముఖం కడుక్కోవడంతో కాస్త అక్టీవ్ అయ్యాను . ఆ అన్న చెప్పినట్లుగానే అటువైపుకు నడిచాను .
Like Reply
అంత ఎండ - సిటీ పొల్యూషన్ లో ఎంత నడిచినా costly ఏరియా కనిపించకపోవడంతో నీరసం - మైకం కమ్మి ఒకానొక క్షణంలో ఇంటికి వెళ్లిపోదాము అనిపించింది . నేను లేకపోవడం వలన పిల్లలకు స్పేస్ మరియు ఫుడ్ మరికొన్నిరోజులకు సరిపోతుంది , వెనక్కు వెళ్లి ఆ డ్రీమ్ ను వాళ్లనుండి దూరం చెయ్యడం మంచిదికాదు అని నీళ్లు తాగి దైవాన్ని తలుచుకుని మరికొంత దూరం నడిచాను . 
కొద్దిదూరంలో ఆ అన్న చెప్పిన పెద్దపెద్ద బిల్డింగ్స్ కనిపించగానే , పని దొరకనీ దొరకకపోనీ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు పెదాలపై చిరునవ్వులు - హుషారుదనం వచ్చేసింది . బిల్డింగ్స్ వైపు ఏకంగా పరుగుపెట్టాను ఫుల్ ఎనర్జీ వచ్చేసినట్లు ..........
బిల్డింగ్స్ నలువైపులా పెద్ద కాంపౌండ్ గోడ , గోడ వెంబడి పరుగుపెట్టి కేవలం ఖరీదైన కార్స్ మాత్రమే వచ్చి వెళుతున్న ప్రవేశద్వారాన్ని చేరుకున్నాను . నాకు పని దొరికే చోటు అని దండం పెట్టి లోపలికి అడుగులువేశాను .

సెక్యురిటి ఆపి నా వాలకం - నా మూటను చూసి , నీలాంటి వాళ్లకు లోపలికి ప్రవేశం లేదు అని తోసేశాడు . 
అన్నా అన్నా ........ పనికోసం వచ్చానన్నా , ఏపనైనా చేస్తానన్న లోపలికి వదలండన్నా అని ప్రాధేయపడ్డాను . 
సెక్యురిటి : రేయ్ బాబూ ........ నిన్ను లోపలికివదిలితే మా జాబ్ పోతుందిరా , ఇలా ఉన్న నిన్ను ఇక్కడచూసినా మమ్మల్ని తిడతారు ఈ బలిసినవాళ్ళు , మేమే సంవత్సరాలుగా పనిచేస్తున్నా గేట్ దాటి లోపలికివెళ్లలేదు , వెళ్లరా బాబూ వెళ్లు తొందరగా వెళ్లు , మా జాబ్ కే ఎసరుపెట్టేలా ఉన్నావు .

ఎంత బ్రతిమాలినా లోపలికి పంపించకపోవడం - లోపలికి వెలితేనే కానీ పని దొరకదు కాబట్టి ఇలాకాదు అని గోడ వెంబడి వెళ్లి టర్నింగ్ లో ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కడం ద్వారా గోడమీదకు చేరుకున్నాను . గోడ ప్రక్కనే పెద్ద గ్రౌండ్ - గ్రౌండ్ లో నా వయసున్న పిల్లలు నాకిష్టమైన - నేను బాగా ఆడే క్రికెట్ ఆడుతుండటం చూసి చెట్టునీడలో గోడపై కూర్చుని చూస్తున్నాను . చెట్టుపై నేరేడు పండ్లు నల్లగా నిగనిగలాడుతుండటం - గోడపైనుండే చేతికందేంతలా ఉండటంతో మాగినవాటిని తీసుకుని తింటుంటే ప్రాణం లేచొచ్చింది .
బ్యాటింగ్ టీం క్లాస్ గా ఒకేరకమైన జెర్సీ వేసుకున్నారు - ఫీల్డింగ్ టీమ్ మాస్ గా నాలాంటి పిల్లలు . 
మాస్ పిల్లలు పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ వేస్తుంటే జెర్సీ వేసుకున్న పిల్లలకు ఉచ్చపడుతున్నట్లు వొళ్ళంతా దెబ్బలు తగిలించుకుంటున్నారు , చిన్న చిన్న దెబ్బలకే అమ్మా హబ్బా అంటూ రిటైర్డ్ హార్ట్ అయ్యి కూర్చుంటున్నారు . ఫీల్డింగ్ టీమ్ నవ్వుకుంటున్నారు - వాళ్ళ ఆట చూసి నాకూ తెగ నవ్వు వచ్చేస్తోంది . ఆడటం రాకపోగా డబ్బుందనే అహంకారం చూయించి తప్పుబడుతున్నారు . ఫీల్డింగ్ టీమ్ తప్పులా నాకైతే అనిపించడం లేదు - ఫాస్ట్ బౌలింగ్ మైంటైన్ చేస్తున్నారు అంతే ........
బ్యాటింగ్ టీం డబ్బుతో మాటలు గెలిచినట్లు ఫాస్ట్ బౌలింగ్ నుండి స్పిన్ మాత్రమే వేసేలా రెస్ట్రిక్ట్ చేసినట్లు అనిపించింది . స్పిన్ బౌలింగ్ లో కూడా తడబడుతోంది బ్యాటింగ్ జట్టు - ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయ్యేంతవరకూ స్పిన్ బౌలింగ్ మాత్రమే ...... - ఫాస్ట్ బౌలర్లను స్పిన్ వెయ్యమంటే ఎలా వేస్తారో అంత సులభంగా వేస్తున్నా ఓవర్ కు 6 రన్స్ కొట్టడానికి తెగ కష్టపడుతున్నారు . ఎలాగోలా 15 ఓవర్లు కంప్లీట్ గా ఆడి 60 రన్స్ కొట్టి సూపర్ స్కోర్ అంటూ చంకలు గుద్దుకోవడం చూసి నాకైతే నవ్వు ఆగడం లేదు . 
ఇలాంటి గ్రౌండ్ ఉంటే 5 - 6 ఓవర్లలో ఫినిష్ చేసేస్తాను . అదేవిషయం ఇప్పటివరకూ ఫీల్డింగ్ చేసిన పిల్లలలో ప్రస్ఫూటంగా కనిపిస్తోంది .

Expect చేసినట్లుగానే నాలాంటి మాస్ పిల్లలు మొదలుపెట్టడమే మొదలుపెట్టడం ఫస్ట్ బాల్ కే నా మీదుగా గోడ బయటకు వెళ్ళిపడేలా సిక్స్ కొట్టి ఈజి బౌలింగ్ అంటూ బ్యాట్స్ తో హైఫై కొట్టుకున్నారు - పెవిలియన్ లో ఉన్న మాస్ పిల్లలందరూ ఈలలు కేకలు వేస్తున్నారు . రేయ్ ....... 5 ఓవర్స్ లో ఫినిష్ చేసేస్తారా ఏమిటి , ఈ బుచికి బౌలింగ్ లో ఒక్క బాల్ అయినా మాకూ ఛాన్స్ ఇవ్వండిరా ఏకంగా మన బస్తీలో పడేలా కొడతాము అని కవ్విస్తున్నారు .
క్లాస్ కెప్టెన్ : ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి ఉడికిపోతూ బ్యాట్స్ మన్ దగ్గరికివెళ్లి ఇంకొక్కసారి బాల్ బయటకు కొడితే మీరు ఒడిపోయినట్లే .........
బ్యాట్స్ మన్ : మా బాల్ మా ఇష్టం , ఇలా కొట్టి ఎంజాయ్ చెయ్యాలనే 4 - 5 బాల్స్ తెచ్చుకున్నాము . మీ బౌలింగ్ లో పస లేదు అని ఒప్పుకోక , బాల్ బయటకు వెళితే ఓడిపోయినట్లే అంటే ఎలా , ఇలా అయితే సిక్స్ ఫోర్ కొట్టినా ఓడినట్లే అనేలా ఉన్నారే అని మరొక బాల్ అందించి నవ్వుకుంటున్నారు . 

క్లాస్ కెప్టెన్ : కోపంతో ఊగిపోతూనే బాల్ బౌలర్ కు అందించి యార్కర్ వెయ్యమని సైగలుచేశాడు .
మాస్ టీం : వీళ్ళు యార్కర్ ఎప్పుడు వెయ్యాలి రేయ్ గెట్ రెడీ బ్యాట్ పిచ్ బాల్ అని గట్టిగా కేకలువేసి నవ్వుకుంటున్నారు .
క్లాస్ బౌలర్ పరుగునవచ్చి యార్కర్ వెయ్యాలనుకున్నా అనుభవం లేనట్లు టాస్ బాల్ వేసాడు . 
అంతే ఆ బంతి కూడా బయటకువెళ్లేదే జస్ట్ మిస్ , గోడ చివరన తాకి గ్రౌండ్ లోనే పడిపోయింది .
మాస్ పిల్లలు : యార్కర్ అంట యార్కర్ , కనీసం బ్యాట్ పిచ్ కూడా కాదు బుజ్జిపిల్లలకు వేసినట్లు టాస్ బాల్ వేసాడు అని కేరింతలు కొడుతున్నారు .

అంతే క్లాస్ కెప్టెన్ కు తోడుగా వాళ్ళ టీం అంతా ఒకదగ్గరిచేరి , బాల్ బయటకు వెళ్లి ఉంటే మనమే గెలిచేవాళ్ళము రేయ్ మరింత టాస్ వెయ్యాల్సింది అని కన్నింగ్ స్మైల్ నవ్వుకుంటున్నారు .
బ్యాట్స్ మన్ : రేయ్ రేయ్ ....... అలా అని మేము ఒప్పుకోలేదు . 
మా గ్రౌండ్ మా ఇష్టం రా ఇప్పుడే రూల్స్ మార్చాము - మీ బెట్టింగ్ డబ్బులు మాకు ఇచ్చారు గుర్తుపెట్టుకోండి - ఇంకొక్కసారి బయటకు కొడితే మీరు ఓడిపోయినట్లే , డబ్బులు మాకే ........
బ్యాట్స్ మన్ : డబ్బులు మీకేమి తక్కువరా , ఒక్కొక్కడూ బాగా బలిసినోళ్లు కదా ...........
క్లాస్ కెప్టెన్ : అవును మేము రిచ్ మీరు పూర్ - ఇక్కడ డబ్బు మ్యాటరే కాదు , మా costly ఏరియాలోకి అడుగుపెట్టడానికి కూడా మీకు అర్హత లేదు - అయినాకూడా ఏకంగా గ్రౌండ్ లోకి రప్పించాము ఎందుకు మాకు ఓడిపోయే ఒక టీం కావాలి కాబట్టి - ఓడిపోయిన తరువాత మీ ముఖాలను చూసి మేము ఎంజాయ్ చెయ్యాలని - ఈ బెట్ మాకు స్కూల్ ఇంటర్వెల్ బిల్ తో కూడా సమానం కాదురా అని హేళన చేస్తున్నారు .
బ్యాట్స్ మన్ : ఇందుకోసమారా మమ్మల్ని లోపలికి పిలిపించినది సెక్యూరిటీని పంపిమరీ ........ , ఫ్రెండ్షిప్ కొద్దీ పిలిచారని సంతోషంతో వచ్చాము కదరా ........ 
క్లాస్ కెప్టెన్ : ఇంకొక్కసారి రా అన్నావంటే మా సెక్యూరిటీని పిలిపించి కొట్టిస్తా ......
మరొక బ్యాట్స్ మన్ : రేయ్ ........
బ్యాట్స్ మన్ : ఆపి , రేయ్ మనం అడుగగానే బెట్ మొత్తం వాళ్లకు కలిపి తప్పుచేసామురా ....... , మనకు డబ్బు ముఖ్టం - ok ok బాల్ బయటకు కొట్టకుండా గెలిస్తే డబ్బులు ఇస్తారా ..... ? .
క్లాస్ కెప్టెన్ : ఇలా దారికి రండి , మీవాళ్ళు ఒక్కడు కూడా విజిల్స్ కేకలు వేయకూడదు .
బ్యాట్స్ మన్ : కరెంట్ బిల్ , వాటర్ బిల్ , రేషన్ డబ్బులు కడతామని తీసుకొచ్చిన డబ్బులు - అవి పే చెయ్యకపోతే మా ఇళ్లల్లో మమ్మల్ని గొడ్డును కొట్టినట్లు కొడతారు - మేము బయటకు కొట్టము , మావాళ్ళు విజిల్స్ వెయ్యరు మ్యాచ్ కంటిన్యూ చేద్దాము .

పిల్లలే అయినా బలుపు చాలానే ఉంది వీళ్లకు ఇలాంటి రూల్స్ నేనెక్కడా వినలేదు చూడలేదు అని ఆశ్చర్యపోయాను . 

నెక్స్ట్ త్రీ బాల్స్ వరుసగా నేలను తాకుతూనే మూడువైపులా మూడు ఫోర్లు వెళ్లేలా కొట్టాడు . 
పెవిలియన్ లో ఉన్న పిల్లలు విజిల్స్ - కేకలు వెయ్యబోయి రేయ్ రేయ్ ...... కరెంట్ బిల్ రా అని నోటికి తాళం వేసుకున్నారు . 
బ్యాట్స్ మన్ ఆడిన విధానం ( సులభంగా సిక్స్ కొట్టే బంతిని కూడా చాకచక్యంగా ఫోర్ గా మలిచిన ) భలే కిక్కిచ్చినట్లు నేరేడు పళ్ళ ఎనర్జీతో విజిల్ వేసాను .
బ్యాట్స్ మన్ కంగారుపడుతూ - ఫీల్డింగ్ క్లాస్ టీం కోపంతో విజిల్ సౌండ్ వైపు చూస్తున్నారు . 
నేనెలా కనిపిస్తాను చెట్టు ఆకుల మధ్యన దాక్కున్నాను కదా , నోటిని చేతులతో మూసుకుని నవ్వుకున్నాను .
బ్యాట్స్ మన్ : రోడ్డుపై వెళుతున్న కార్ విజిల్ అయి ఉంటుంది అని చెప్పడంతో అందరూ కూల్ అయ్యారు .
అప్పటికే 5 బంతులు 24 రన్స్ రావడంతో ఇలా అయితే రెండు ఓవర్ లలో మ్యాచ్ గెలిచేలా ఉన్నారు కాబట్టి గ్రౌండ్ బయటవెళ్ళిపడేలా , హైట్ నోబాల్ హైట్ లో బంతిని బలంగా విసరమని కన్నింగ్ స్మైల్ తో చెప్పాడు - బ్యాట్ బంతిని తాకగానే గోడ బయటకు వెళ్ళిపడాలి .
బౌలర్ : అర్థమైంది కెప్టెన్ ఇక గెలుపు మనదే అని మరిన్ని అడుగులు వెనక్కువెళ్లాడు రేయ్ మీ పని అయిపోయినట్లే ......... అనుకున్నట్లుగానే హైట్ నోబాల్ వెయ్యడం ఎక్కడ తగులుతుందేమోనని బ్యాట్ ఊపడంతో ఆ స్ట్రోక్ కు బంతి మొదటి సిక్స్ కంటే దూరంగా గోడ అవతల పడింది .
బ్యాట్స్ మన్ అయ్యో అంటూ నెత్తిపై చేతినివేసుకుని వెంటనే రేయ్ రేయ్ రేయ్ నో బాల్ నో బాల్ అంపైర్ నో బాల్ అంటూ గెలుపు సంబరాలలో ఉన్న కెప్టెన్ దగ్గరికి వెళ్ళాడు .
క్లాస్ కెప్టెన్ : గుడ్ బాల్ నో బాల్ ....... ఏ బాల్ అయితేనేమి గోడను దాటితే మేము గెలిచినట్లే అని చెప్పామా లేదా ....... , సో గు** నోరు మూసుకుని బయటకు దేంగేయ్యండి .
బ్యాట్స్ మన్ : రేయ్ రేయ్ ....... ఎలాగైనా తిట్టుకో మా డబ్బునైనా ఇవ్వు , బిల్స్ కట్టకపోతే ఇంట్లో మమ్మల్ని కొడతారు .
క్లాస్ కెప్టెన్ : సావ కొట్టడం కూడా మేము కళ్లారా చూసే అదృష్టం లభిస్తే భలే ఉంటుంది ప్చ్ ........ మిస్ అవుతున్నాము . అయినా ఓడిపోయినవాళ్లకు బెట్ డబ్బులు వెనక్కు ఇవ్వరు - మీరే వెళతారా లేక సెక్యూరిటీని పిలిపించి బయటకు తోసేయ్యమంటారా ........ తినడానికి తిండి లేదు కానీ మ్యాచ్ గెలవడానికి వచ్చారు ముష్టి వెధవలు ........
బ్యాట్స్ మన్ : రేయ్ మమ్మల్నే అంతమాట అంటావా అని క్లాస్ కెప్టెన్ కాలర్ పట్టుకున్నాడు .
క్లాస్ కెప్టెన్ : ఎంత ధైర్యం రా నీకు నన్ను టచ్ చేయడానికే మీలాంటి వాళ్లకు అర్హత లేదు అలాంటిది ఏకంగా నా కాలర్ పెట్టుకుంటావా అని తోసేసి కాళ్లతో తన్నాడు .
రేయ్ మావాడినే కొడతారా అని వచ్చిన మరొక బ్యాట్స్ మన్ ను కూడా కిందపడేసి ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారు , చేతులలో బ్యాట్లు లేవు కానీ వాటితోనూ కొట్టేవాళ్లే ..........

రేయ్ రేయ్ మావాళ్లనే కొడతారా అని బ్యాట్స్ - వికెట్స్ చేతపట్టుకుని కోపంతో పరుగునవచ్చారు మాస్ టీం అంతా ..........
వారిని చూడగానే క్లాస్ టీం భయపడిపోయినట్లు dad mom సెక్యురిటీ అంటూ గట్టిగా కేకలువేస్తూ వారి నుండి తప్పించుకోవడానికి నావైపుకు పరుగులు తీస్తున్నారు ఉచ్చపడినట్లు .........
గాలివాన చినికి చినికి తుఫానులా మారినట్లు చూస్తుంటే ఇక్కడ రక్తం చిందేలా ఉందని - బ్యాట్ , వికెట్ తో బలంగా కొడితే తలలు పగిలినా పగులుతాయి - అభం శుభం తెలియని అమాయకమైన వయసు చూస్తూ ఊరుకోలేను అని అంతెత్తు గోడను జంప్ చేసి పరుగునవెళ్ళాను . 
మరొకవైపు నుండి సెక్యూరిటీ పిల్లలూ పిల్లలూ ఆగండి ఆగండి అని పరుగునవస్తున్నారు . 

దొరికావురా కెప్టెన్ గా అంటూ వాళ్ళవైపుకు తిప్పుకుని అంతెత్తుకు బ్యాటుని - వికెట్స్ ఎత్తి నెత్తిపై కొట్టేంతలో ........
మధ్యలోకివెళ్లి బ్యాటు - ఒక వికెట్ ను చేతితో ఆపగలిగాను కానీ మరొక వికెట్ నా భుజంపై పెద్ద దెబ్బనే రుచి చూయించింది . 
అవ్వా ........ అంటూ నేను - భయంతో మమ్మీ అంటూ క్లాస్ కెప్టెన్ కళ్ళుమూసుకున్నాడు నన్ను పట్టుకుని - బాబూ మురళీ అంటూ దూరం నుండి పేరెంట్స్ మరికొంతమంది - సెక్యూరిటీ కంగారుపడుతూ రేయ్ రేయ్ అంటూ వచ్చి చూసి హమ్మయ్యా ........ బ్రతికిపోయాము అంటూ పిల్లల నుండి బ్యాట్స్ వికెట్స్ లాక్కుని దూరంగా పడేసి , ఎంత ధైర్యం రా మీకు కొద్దిలో ఉంటే చంపేసేవాళ్ళు , మిమ్మల్ని ఊరికే వదిలేవాళ్ళు కాదు వీళ్ళు అంటూ దూరం తీసుకెళ్లి చేతిలోని కర్రలతో కొట్టి ........ , మేడం సర్స్ ........ బాబుకు ఏమీకాలేదు అని క్లాస్ పిల్లలందరినీ సేఫ్ గా వారి పేరెంట్స్ దగ్గరికి చేర్చారు .
పేరెంట్స్ : మై బాయ్ , నాన్నా , బాబూ ........ మీకేమీ కాలేదుకదా .......
సెక్యురిటీ : ఏమీకాలేదు మేడం , ఎవరోకానీ ఆ అబ్బాయి గోడ పైనుండి కిందకు దుంకిమరీ సరైన సమయంలో అడ్డుపడ్డాడు - ఒక్క క్షణం ఆలస్యమైనా ఊహించని సంఘటన జరిగిపోయేది - ఆ అబ్బాయికి గట్టి దెబ్బే పడినట్లుంది మేడం .......
పేరెంట్స్ : థాంక్స్ బాబూ ........ దేవుడిలా వచ్చి రక్షించావు .
స్స్స్ ........ అంటూ నొప్పితో చేతిని విదిల్చాను .
ఒక పేరెంట్ : నో నో నో అలా చెయ్యకు అంటూ షర్ట్ తొలగించి చెక్ చేసి , భుజం ఎముక విరిగినట్లుగా ఉంది తొందరగా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకో బాబూ ........ వెళ్లు వెళ్లు లేకపోతే నొప్పి మరింత పెరుగుతుంది .
మేడం : మీరు డాక్టర్ కదా మన పిల్లలను ఇందులో మీ పిల్లాడు కూడా ఉన్నాడు కాపాడిన ఈ పిల్లాడికి మీరే ట్రీట్మెంట్ చెయ్యొచ్చుకదా .......
డాక్టర్ : చెయ్యొచ్చు కానీ జీవితంలో ఇప్పటివరకూ ఫ్రీ గా ట్రీట్మెంట్ చెయ్యనేలేదే ......... 
మేడం : ఇప్పుడు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా ...... , మీ ఫీజ్ మేము భరిస్తాము .
డాక్టర్ : అయితే ok నాకేమీ అభ్యంతరం లేదు . నాకు కావాల్సింది ఫీజ్ ఎవరు ఇస్తే ఏమిటి .
గుంపులో : తరాలు కూర్చుని తిన్నా కరగని ఆస్తిని సంపాదించావు - సిటీలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ ......... సొంత కొడుకు ప్రాణాలు కాపాడిన పిల్లాడికి ట్రీట్ చెయ్యడానికి కూడా ఫీజ్ అడుగుతున్నాడు మినిషా లేక .........
డాక్టర్ : ఇలాంటివన్నీ పట్టించుకునే వాడిని అయితే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు - మీ మొగుల్లేమీ తక్కువ వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ లో నాలానే ఉన్నారు . అయినా ఈ అలగాజనం పిల్లలను లోపలికి ఎవరు రానిచ్చింది - సెక్యూరిటీ ........ నిద్రపోతున్నారా ? .
సెక్యురిటి : మేము వద్దనే అన్నాము సర్ , పిల్లలే మ్యాచ్ కోసం రప్పించుకున్నారు .
డాక్టర్ : సరే సరే ముందు వాళ్ళను బయటకు గెంటెయ్యండి .
మాస్ పిల్లలు : మ్యాచ్ మేమే గెలిచేవాళ్ళము మా బెట్టింగ్ డబ్బు - వీళ్లిద్దరి ట్రీట్మెంట్ డబ్బు ఇస్తే వెళతాము లేకపోతే మీ పిల్లలను ఊరికే వదిలేది లేదు .
క్లాస్ కెప్టెన్ మురళి : డబ్బులే కాదు మమ్మల్నే కొట్టడానికి ఎత్తిన బ్యాట్స్ కూడా ఇచ్చేది లేదు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి - సెక్యురిటి అందరినీ బయటకు లాగి పడేయ్యండి . 
డాక్టర్ : మా పిల్లలనే కొడతారా కొట్టిమరీ బయటకు తోసేయ్యండి . ఇంకెప్పుడూ లోపలకు వదలకండి .
ఐదారుమంది సెక్యూరిటీ వచ్చి కర్రలతో బయటకు తోసేస్తున్నారు .

మాస్ పిల్లలు : రేయ్ మురళీ అండ్ గ్యాంగ్ ....... డబ్బుతో గుద్దబలిసి కొట్టుకుంటున్నారు . ఇప్పుడు ఇక్కడ మీ పేరెంట్స్ సెక్యూరిటీ మరియు మా అందరినీ నుండి ఒక్కడై ఆ పిల్లాడు అడ్డుపడ్డాడు - ఈ గేట్ దాటి బయటకు రారా అప్పుడు చెబుతాము మీ సంగతి , అడ్డుకోవడానికి వాడు కూడా ఉండడు - స్కూల్ లో మీరొక్కరే ఉంటారుకదా , స్కూల్ గేట్ జంప్ చేసిమరీ మీ అంతు చూస్తాము . డబ్బు పోయిందని చెబితే మా నాన్నలు ఎన్ని దెబ్బలు కొడతారో అంతకు రెట్టింపు మిమ్మల్ని సావ కొడతాము ఇదే మా ఛాలెంజ్ ........
క్లాస్ పిల్లలు : mummy - dad ........ భయమేస్తోంది . వాళ్ళు చెప్పినట్లు స్కూల్లో ........ 
మేడమ్స్ : ఇప్పుడెలా ....... , అనుక్షణం పిల్లలతో ఉండటం కుదరదు - ఈ సెక్యూరిటీ వాళ్ళను నమ్మడానికి వీల్లేదు - స్కూల్ కు పంపించకుండా ఉండలేము . 
గుంపులో ఒకరు : ఈ పిల్లాడిని మన పిల్లలతోపాటు స్కూల్ కు పంపిస్తే సరి ......
మేడమ్స్ : అవునవును , ఎవరో తెలియకుండానే ప్రాణాలకు తెగించి మన పిల్లలను కాపాడాడు . బాబూ ....... నీ పేరేంటి ? నువ్వెవరు ? మీ పేరెంట్స్ ఎవరు ? ఏమి చేస్తుంటావు ?
నా పేరు మహేష్ - అనాధను మేడం - govt స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను , చదువుకుంటూనే ఇక్కడకు పనికోసం .........
సెక్యూరిటీ : ఆ గుర్తొచ్చింది మేడమ్స్ పనికోసమని గేట్ దగ్గరకు వస్తే మేమే పంపించేసాము , లోపలికి రావడానికి గోడ ఎక్కినట్లున్నాడు .
మేడమ్స్ : 10th క్లాస్ అన్నావుకదూ ఎక్కడ govt స్కూల్ కదా , మా పిల్లలు కూడా 10th 9th 8th ....... చదువుతున్నారు . వీళ్ళతోపాటు నువ్వుకూడా చదువుకోవచ్చు , నీ ఫీజ్ మొత్తం మేమే భరిస్తాము , govt స్కూల్ నుండి మా పిల్లల ఇంటర్నేషనల్ స్కూల్ కు మార్పిస్తాము , నువ్వు చెయ్యాల్సినదల్లా మా పిల్లలు ఎక్కడకువెళ్లినా తోడుగా ఉండి జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలి . అనాధ అన్నావు కాబట్టి ఉండటానికి చోటు ఇస్తాము - మూడు పూటలా భోజనం పెడతాము - నెల నెలా పనికితగ్గ డబ్బు ఇస్తాము .

మూడుపూటలా భోజనం అని వినగానే నా కళ్లల్లో కన్నీళ్లు ధారలా కారిపోతున్నాయి .
పిల్లలు : మమ్మీ మమ్మీ ........ వీడెవడో ఇష్టం లేదు కానీ , వీడు ప్రక్కనే ఉంటే కాస్త దైర్యంగా ఉంది మమ్మీ ........ , మమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లకూడదు అని గట్టిగా చెప్పండి లేకపోతే స్కూల్ కు వెళ్ళము .
మేడమ్స్ : బాబూ ........ నీకు ఇష్టమే కదా ......
ఇష్టం ఇష్టం అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను .
మేడమ్స్ : ఏంటీ కన్నీళ్లు నొప్పివేస్తోందా ?  , డాక్టర్ ....... కాస్త తొందరగా ........
డాక్టర్ : ఇక్కడే ఎలా ట్రీట్ చెయ్యను , ఇంటి బయట ఉన్న క్లినిక్ కు తీసుకెళ్లాలి , రేయ్ ....... ఫాలో అవ్వరా అని తన కొడుకు చేతిని పట్టుకుని నడిచాడు . 
వెనుకే వెళ్లడంతో స్కాన్ చేసి భుజపు ఎముకను సరిచేసి భుజం నుండి చేతివరకూ పుత్తూరు కట్టును కట్టాడు . వారం వరకూ ఎడమ చేతిని కదిలించకు అని చెప్పి ఇంజక్షన్ టాబ్లెట్స్ ఇచ్చి అందరి నుండి ఫీజ్ తీసుకుని కానీ నన్ను బయటకు వదలలేదు మహానుభావుడు .
Like Reply
నొప్పివలన సరిగ్గా చూడలేదు కానీ స్ట్రీట్ కు ఇరువైపులా ఒకటి మించిన మరొక బిల్డింగ్స్ అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్ తో నిర్మించినట్లు ఒక విలాసవంతమైన లోకంలోకి అడుగుపెట్టాను అనిమాత్రం తెలిస్తోంది . 
నన్ను ఎవరి ఔట్ హౌస్ లో ఉంచుకోవాలి అని పోటీపడుతున్నారు ఎందుకంటే వారి అబ్బాయికి దగ్గరగా ఉంటాను అని . 
చివరికి కెప్టెన్ మురళి అమ్మగారు విజయం సాధించినట్లు , మహేష్ అన్నావుకదా ....... మహేష్ రా వెళదాము అని వారి ఇంటికి పిలుచుకునివెళ్లారు . 
సెక్యురిటి పెద్ద గేట్ తెరవగానే బిల్డింగ్ మరియు పూలమొక్కలతో గల పెద్ద కాంపౌండ్ ను అలా చూస్తూ ఉండిపోయాను .

మేడం : సెక్యురిటి ........ ఈ పిల్లాడి పేరు మహేష్ , ఈ రోజు నుండీ ఔట్ హౌస్ లో ఉంటాడు - ఎప్పుడు వచ్చినా లోపలకివదలండి . మహేష్ ....... అదిగో అదే ఈరోజు నుండి నువ్వు ఉండబోయే చోటు . భోజనం చేశావా అని అడిగారు .
తలను అడ్డంగా - నిలువునా ఊపాను .
మేడం : చూస్తుంటేనే తెలుస్తుంది . ఔట్ హౌస్ లోపలే బాత్రూం ఉంది ఫ్రెష్ అవ్వు - కట్టుకు నీళ్లు తగలనివ్వకు - పనిమనిషితో ఫుడ్ పంపిస్తాను అని కీస్ అందించారు.
థాంక్యూ soooooo మచ్ మేడం . 
మేడం : మహేష్ ....... పొరబాటున గానీ ఇంట్లోకి రావద్దు , మీ సర్ మరియు మురళికి నీలాంటివాళ్ళు అంటే ఏమాత్రం ఇష్టం లేదు , మీ సర్ ఎప్పుడు కనిపించినా తలదించుకుని వెళ్ళాలి సరేనా ........
అలాగే మేడం , మీరు ఎలా అంటే అలా .........
మేడం : రేపు ఒక్కటే స్కూల్ ఉంది నెక్స్ట్ రోజు నుండి వారం రోజులు పండగ సెలవులు - రేపు కూడా వెళ్లకూడదు అని పిల్లలు ఫిక్స్ అయిపోయారు కాబట్టి నో ప్రాబ్లమ్ , ఈ వారంలో నీ ఎముక కూడా జాయింట్ అయిపోతుందని డాక్టర్ చెప్పారు , వీలుచూసుకుని చెబితే డ్రైవర్ ను తోడుగా పంపిస్తాను govt స్కూల్ కు వెళ్లి TC తీసుకురావచ్చు . 
TC సంగతి నేను చూసుకుంటాను మేడం , అంత పెద్ద స్కూల్లో చదివే అవకాశం అదే అదే నా మొదటి కర్తవ్యం మురళీ వాళ్ళకు తోడుగా ఉండే పని దొరికినందుకు చాలా హ్యాపీ ........
మేడం : thats గుడ్ బాయ్ ....... , వెళ్లు వెళ్లి ఫ్రెష్ అవ్వు - బట్టలుకూడా చిరిగిపోయాయి , ఫుడ్ తోపాటు మురళి పాత బట్టలు పంపిస్తాను వేసుకో .......
థాంక్స్ మేడం - థాంక్స్ మురళి .........
మురళి : మురళి కాదు మురళి సర్ అని పిలవాలి గుర్తుపెట్టుకో అని పొగరుబోతులా చెప్పాడు .
మేడం : చెప్పానుకదా మహేష్ , మురళికి అన్నీ వాళ్ళ డాడీ పొలికలే వచ్చాయి - వాళ్ళు ఎలా అంటే అలా ........
అలాగే మేడం , థాంక్యూ మురళి సర్ ........ 
మురళి : నన్ను ఎప్పుడూ తాకడానికి ప్రయత్నించకు , నన్నే కాదు నా ఫ్రెండ్స్ ఎవ్వరినీ నువ్వు తాకడం వాళ్లకు గానీ - వాళ్ళ పేరెంట్స్ కు గానీ ఇష్టం లేదు అని చెప్పి మేడం తోపాటు లోపలికివెళ్లాడు .
వీళ్ళు ఎలా ఉంటేనేమి , చిన్న పని దొరికితే చాలు అనుకున్నాను కానీ ఏకంగా విలాసవంతమైన ఏరియా లో ఇష్టమైన పని దొరికింది అని మనసులో అనుకుని వెళ్లి ఔట్ హౌస్ తాళం తెరిచి డోర్ ఓపెన్ చేసి లోపలికివెళ్లి చిరునవ్వులు చిందిస్తూ చుట్టూ తిరిగి తిరిగి పదే పదే చూస్తూ ఉండిపోయాను - బహుశా ఫైవ్ స్టార్ హోటల్ లో గదులు ఇలానే ఉంటాయేమోనని నన్ను నేను మరిచిపోయాను . 
ఇంతవరకూ ఉన్న ఇంటికంటే పెద్దదైన హాల్ - హాల్ మధ్యలో బెడ్ - ఫ్రిడ్జ్ - AC - టేబుల్ చైర్ - షెల్ఫ్ - కప్ బోర్డ్స్ ......... అవసరానికి మించినవన్నీ ఉండటం చూసి నిజంగా ఇక్కడ ఉన్నానా లేక కలగంటున్నానా అని నన్ను నేను గిల్లుకుని పొందిని ఆనందానుభూతిని మాటల్లో వర్ణించనేలేను . 
మేడం గారు భోజనం పంపించేలోపు ఫ్రెష్ అవ్వాలి బాత్రూం ఎక్కడ అని చుట్టూ చూసి ఒక మూలన ఉన్న డోర్ తెరిచాను . బాత్రూమ్స్ ఇలాకూడా ఉంటాయా అని ఆశ్చర్యానికి లోనయ్యాను . షవర్ - గీజర్ - బాత్ టబ్ - మిర్రర్స్ కూడా ఉండటం చూసి కొత్త లోకంలోకే వచ్చాను . ఈ విలాసం అవ్వలకు పిల్లలకు పాపాయిలకు కూడా లభించాలి అని ప్రార్థించి , స్నానం చేయాలి అని ఉన్నా కట్టు తడవకూడదు కాబట్టి ఫేస్ వాష్ చేసుకుని హాల్ లోకివచ్చాను . 

అప్పటికే ఒకామె వచ్చింది - ఇంటి పనిమనిషి అయి ఉంటుందని అనుకున్నాను . 
మహేష్ ........ మేడం పంపించారు - ఈ పాత్రలలో ఫుడ్ ఉంది - ఈ బ్యాగులో బట్టలు ఉన్నాయి . డ్రెస్ చేంజ్ చేసుకుని చిరిగిన బట్టలను చెత్త బిన్ లో పడేయాలని చెప్పారు . భోజనం చేసి పాత్రలన్నింటినీ బయట ఉంచు నేను తీసుకెళతాను అనిచెప్పి వెళ్లబోయి ఆగారు . ఆ ....... మరిచిపోయాను పిల్లలందరినీ రక్షించినందుకు మరియు వాళ్లకు తోడుగా ఉండే పనికోసం అందరు మేడమ్స్ అడ్వాన్స్ ఇచ్చారు - అనుక్షణం అందుబాటులో ఉండటం కోసం స్మార్ట్ మొబైల్ అని టేబుల్ పై ఉంచి వెళ్ళిపోయింది .
కన్నార్పకుండా చూస్తూనే టేబుల్ దగ్గరికివెళ్లి వణుకుతున్న చేతులతో డబ్బుని అందుకున్నాను . అన్నీ 500 రూపాయల నోట్లు - చేతులు మరింత వణుకుతూనే 1 2 3 ........ 10 11 12 ........ 21 22 23 ........ 28 29 30 మొత్తం ముప్పై 500 నోట్లు అంటే పదిహేను వేలు అని కొన్ని క్షణాలపాటు అలా కదలకుండా ఉండిపోయాను . 
మొబైల్ సౌండ్ చేయడంతో తేరుకున్నాను . జీవితంలో ఇప్పటివరకూ ఒక్క 500 నోటు చూడనేలేదు - ఇప్పుడు ఏకంగా 30 నోట్లు నా చేతిలో అదికూడా నిజాయితీగా వచ్చినవి . అవ్వా ....... మీ పెంపకం వల్లనే ఇది సాధ్యమయ్యింది అని గర్వపడ్డాను .
మొబైల్ అందుకుని ఎలా use చెయ్యాలోకూడా తెలియక స్క్రీన్ పై టచ్ చేసాను మెసేజ్ ఓపెన్ అవ్వడం - స్క్రీన్ పై మేడమ్స్ నెంబర్స్ అన్నీ మెసేజ్ రూపంలో వచ్చాయి . 

ఆకలి దంచేస్తుండటంతో పాత్రలను ప్లేట్ ను వాటర్ బాటిల్ ను నేలపై ఉంచి , నేలపై కూర్చుని మూతలు తెరిచాను . ఒక పాత్రలో చికెన్ బిరియానీ - మరొక పాత్రలో చికెన్ ఫ్రై ఉండటం చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి . ఇప్పటివరకూ స్కూల్ లో స్టోర్ బియ్యంతో వడ్డించే భోజనం తప్ప ....... ఇలా పొడవైన అన్నం మెతుకుల ....... ఈ రైస్ ను ఏమో ఏమో ఆ ఆ ...... బాసుమతి రైస్ తో ఏకంగా చికెన్ బిరియానీ తినే అదృష్టం దొరుకుతుందని కలలోకూడా ఊహించలేదు అని చేతినిండా తీసుకుని తినబోయి మళ్లీ కళ్ళల్లో చెమ్మతో అవ్వా - పిల్లలూ ........ 
పదిహేను వేలు ఉందికదా రేపు TC తీసుకురావడానికి వెళతాను కదా స్కూల్లో పని పూర్తవగానే అందరికీ పెద్ద హోటల్ నుండి బిరియానీ , చికెన్ ఫ్రై మరియు పిల్లలకు ఇష్టమైన ఐస్ క్రీమ్స్ తీసుకునివెళదాము అని కన్నీళ్లను తుడుచుకుని తిని మ్మ్మ్ ....... సూపర్ అంటూ పాత్రలలో ఒక్క మెతుకు - చికెన్ ముక్క లేకుండా తృప్తిగా తినేసాను . 
ఆవ్ ........ అంటూ తృప్తిగా లేచి ఒకచేతితో కష్టమైనా పాత్రలను శుభ్రం చేసి బయట ఉంచాను - డ్రెస్ చేంజ్ చేసుకుని అద్దం లో చూసుకుని మురిసిపోయాను - మూటలో ఉన్న బట్టలతోపాటు వదిలిన బట్టలను తీసుకెళ్లి మెయిన్ గేట్ బయట ఉన్న చెత్తబుట్టలో పడేసి సెక్యూరిటీ దగ్గరకువెళ్లి తెలుసుకోవలసిన విషయాల గురించి ప్రశ్నల వర్షం కురిపించాను .

మురళి నాన్నగారు బిజినెస్ మ్యాన్ చాలా అహంకారి అని డబ్బే సర్వస్వం అనుకునేవారు అని , మురళి నాన్నగారితోపాటు ఇక్కడ ఉన్నవారంతా బిజినెస్ మెన్స్ , డాక్టర్స్ , హై govt ఆఫీసర్స్ ....... అందరూ దాదాపు ఒకేరకమైన వారేనని వారితో జాగ్రత్తగా మసులుకోవాలని లేకపోతే నిర్దాక్షన్యంగా పనిలోనుండి తీసేసి పంపించేస్తారని చెప్పారు . 
అందరి గురించి తెలుసుకుని అక్కడే కూర్చున్నాను .
సెక్యూరిటీ : బాబూ ....... ఇది మా డ్యూటీ నువ్వు లోపలికివెళ్లి హాయిగా రెస్ట్ తీసుకో ........
పర్లేదు అన్నా ....... ఇదంతా మనకు అలవాటే , రెస్ట్ అన్నది మన జీవితంలో ఉంటుందా చెప్పండి .
సెక్యురిటి : నిజం చెప్పావు తమ్ముడూ ........ 

అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే స్క్రీన్ పై మురళి సర్ అని పడింది . మురళి సర్ అని సేవ్ చేసే మొబైల్ పంపించాడన్నమాట అని నవ్వుకున్నాను . ఎంత వొత్తినా రింగ్ అవుతూనే ఉంది .......
సెక్యూరిటీ : తమ్ముడూ ........ స్మార్ట్ ఫోన్ వాడటం ఇదే తొలిసారి కదూ అని స్వైప్ చేసాడు .
మురళి : రేయ్ ........ ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు ? అని కోపం తెలుస్తోంది .
మురళీ ....... మురళీ సర్ ....... స్మార్ట్ ఫోన్ చూడటం ఇదే తొలిసారి , ఎలా వాడాలో తెలియదు సెక్యురిటి అన్న .........
మురళి : ok ok , అదీ అలా సర్ అని పిలవాలి , గ్రౌండ్ ప్రక్కనే ఉన్న ప్లే గ్రౌండ్ కు వెళ్ళాలి గేట్ దగ్గరే ఉండు .
మురళి సర్ అక్కడే ఉన్నాను .
మురళి : గుడ్ , wait చెయ్యి .........

15 నినిషాలలో ఇళ్ళల్లోనుండి పిల్లలందరూ బ్యాట్స్ బాల్ తో వచ్చిన తరువాత మురళి దర్జాగా బయటకువచ్చాడు . ఫ్రెండ్స్ ........ ఇక నుండీ వేరే ఎవ్వరితో ఆదుకునేది లేదు , మనం మనమే ఆడుకుందాము .
క్రికెట్ అంటే చాలు పిల్లల్లో ఎవరికైనా ఉత్సాహం వచ్చేస్తుంది , నేనూ ఆపుకోలేక మురళి సర్ ........ అంత పెద్ద గ్రౌండ్ లో సగం సగం ఆడటానికి ప్లేయర్స్ తక్కువపడతారు , నేనూ ఆడవచ్చా ........ ? .
మురళి ఫ్రెండ్ గోవర్ధన్ : మార్నింగ్ , మధ్యాహ్నం మాత్రమే పెద్ద గ్రౌండ్ లో మహేష్ , evenings మాత్రం బిల్డింగ్స్ చివరన గల చిన్న గ్రౌండ్ లో లగాన్ ఆడుతాము అని అక్కడికే పిలుచుకునివెళ్లారు . అయినాకూడా నిన్ను ఆడించడం కుదరదు నాన్నగారు ( డాక్టర్ ) చెప్పారుకదా చేతిని కదిలించకూడదు అని - వారం లో స్కూల్ ...... మాకు బాడీగార్డ్ గా ఉండాలంటే నువ్వు ఫిట్నెస్ సాధించాలి కాబట్టి అక్కడ కూర్చో చాలు .

మురళి మరియు గోవర్ధన్ కెప్టెన్స్ లా మారి వారి ఫ్రెండ్స్ ను సగం సగం కోరుకుని టాస్ వేశారు . గోవర్ధన్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది .
Like Reply
ఒక్క బ్యాట్స్ మన్ మినహా మిగిలినవారు వచ్చి నాతోపాటు కూర్చున్నారు . లగాన్ లో కేవలం ఫోర్స్ మాత్రమే - క్యాచ్ , వన్ పిచ్ క్యాచ్ అయినా మరియు చిన్న బౌండరీ లైన్ సిక్స్ కొట్టినా ఔట్ .........

మ్యాచ్ వీక్షిస్తూ చుట్టూ బిల్డింగ్స్ చూస్తున్నాను . ఏరియా లోని బిల్డింగ్స్ అన్నీ కొత్తగా రంగురంగుల పెయింట్స్ తో కళకళలాడుతున్నాయి కానీ , చిన్న గ్రౌండ్ కు ఎదురుగా అంటే బిల్డింగ్స్ చివరన ఒక మూడంతస్తుల బిల్డింగ్ మాత్రం ఎవ్వరూ నివశించనట్లు భూత్ బంగళాలా - కాంపౌండ్ మొత్తం ముళ్ల చెట్లు పిచ్చిమొక్కలతో నిండిపోయింది - మెయిన్ గేట్ కు వేసిన తాళం కూడా తుప్పుపట్టింది - గేట్ కు మంత్రశక్తుల తాయెత్తులు కట్టడం కాస్త ఆసక్తినే కలిగించి , గోవర్ధన్ ను అడిగాను ఇంత విలాసవంతమైన ఏరియా లో ఆ భూత్ బంగ్లా ఏంటి అని ........
అంతే గోవర్ధన్ వొళ్ళంతా చెమటలు పట్టేసాయి - భయంతో వణికిపోతున్నాడు . చుట్టూ కూర్చున్న అందరూ ఒకవైపు నవ్వుతూనే మరొకవైపు భయపడుతున్నారు. గోవర్ధన్ గోవర్ధన్ ............
గోవర్ధన్ ఫ్రెండ్ వినయ్ : మహేష్ ....... కొన్నినిమిషాలపాటు కదలనే కదలడు . గోవర్ధన్ మాత్రమే కాదు ఇక్కడ ఉంటున్న డాడీ - అంకుల్ వాళ్లందరికీ ఈ బిల్డింగ్ అంటే చాలా భయం - తెలియక అన్నా భూత్ బంగ్లా అన్నది నిజమే ....... - లోపల దెయ్యాలు ఉన్నాయని ఆ బిల్డింగ్ ను పడగొడితే దెయ్యాలన్నీ ఇక్కడ ఉన్న ఇళ్లలోకి చేరతాయని మంత్రగాడు చెప్పాడు , దెయ్యాలు బయటకు రాకుండా dad వాళ్ళు పెద్ద హోమం జరిపించి ఇలా బిల్డింగ్ చుట్టూ తాయెత్తులు కట్టారు . వీడికి ఎందుకు ఇంత భయం అంటే వీడి ఇల్లు అదిగో ఎదురుగా ఉన్నదే - ఒకటి రెండు సార్లు డాక్టర్ అంకుల్ వాళ్ళు లోపల నుండి దెయ్యాల సౌండ్స్ మరియు వెలుగులు చూసారట అప్పటి నుండీ వీడికి - అంకుల్ కు బిల్డింగ్ చూస్తేనే చాలు ఉచ్చ కారిపోద్ది అని నవ్వుకున్నారు - మేము నవ్వుతున్నాము కానీ మాకూ చాలా భయం అటువైపు దగ్గరికి వెల్లమంటే వెళ్ళము ఇప్పటికే లోపలకు చాలా బాల్స్ వెళ్ళిపడ్డాయి .
మరి బాల్స్ తెచ్చుకున్నారా ....... ? .
వినయ్ : అంత ధైర్యం ఎవరికి ఉంది వదిలేసి పరిగెత్తడమే ......... , అదిగో ఆ బిల్డింగ్ ప్రక్కన ఆనుకుని ఉన్న గోవర్ధన్ మరొక చిన్న ఇల్లు , దెయ్యాలు అని తెలిసి ఒక్కరూ ఆ ఇంటిలోకి రెంట్ కు రావడం లేదు - సంవత్సరాలుగా రెంట్ మనీ మిస్ అయిపోతోందని తెగబాధపడిపోతుంటారు . మామూలుగా అయితే ఇక్కడ రెంట్ టెన్ థౌజండ్స్ పైనే ఉంటుంది సగం వచ్చినా చాలు ఎవ్వరినైనా సెట్ చెయ్యి అని బ్రోకర్ ను రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది . ప్రక్కనే ఉన్న భూత్ బంగ్లాను చూసి తుర్రుమంటున్నారు అందరూ .........
ఇంట్రెస్టింగ్ గా ఉంది , ఇంత ఖరీదైన ఏరియా లో భూత్ బంగ్లా మిస్టరీలా మిగిలిపోయిందన్నమాట .........
వినయ్ : ఇదొక్కటే కాదు మహేష్ ........ , మన ఏరియా మరొక చివరన ఒక బిల్డింగ్ ఉంది . ఆ ఇంట్లో కొంతమంది మనుషులు చూస్తేనే చాలు భయపడేలా ఉంటారు , ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో తెలియదు ఒక్కొక్కసారి నెలలపాటు రారు - గమ్మత్తు ఏమిటంటే ఈ బిల్డింగ్ లో దెయ్యాలున్నాయని మొదట ప్రచారం చేసినది వాళ్లే , హోమం జరిపించి తాయెత్తులు కట్టించి లోపలికి ఒక్కరూ వెళ్లకుండా సీల్ చేసినదీ వాళ్లే .........
గోవర్ధన్ : వాళ్లకేమి భయం ఎప్పుడోకానీ రారు , మేము ఎదురుగా ఉంటాము , చీకటిపడితే చాలు భయం వచ్చేస్తుంది . ప్రక్కనే ఉన్న ఇంట్లోకి ఎవరైనా వస్తే మాకూ కాస్త దైర్యంగా ఉంటుంది . 
వినయ్ : భూత్ బంగ్లా గురించి తెలిసి ఎవ్వరూ అంత సాహసం చెయ్యరు రా , పోనీ మీరే ఉండవచ్చుకదా ........
గోవర్ధన్ : భయంతో కేకవేసి నా కుడిచేతిని గట్టిగా పట్టేసుకుని శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ......... అని వణుకుతున్నాడు . 
ఫీల్డింగ్ చేస్తున్నవాళ్ళు కూడా ఆటకు బ్రేక్ ఇచ్చి నవ్వుతున్నారు .
గోవర్ధన్ : రేయ్ నవ్వండి నవ్వండి ........ రాత్రిళ్ళు భూత్ బంగ్లా సౌండ్స్ వింటే మీరూ ఇంతే ........
మురళి : మేము దూరం రా ఉన్నది మాకు వినిపించవు - మేము సేఫ్ అని బాల్ వేసాడు . 
ఆ భయంలో టాస్ బాల్ రాగానే పెద్ద గ్రౌండ్ లోలా షాట్ కొట్టాడు . అంతెత్తుకువెళ్లి భూత్ బంగ్లా మెయిన్ గేట్ తాకి కొద్దిగా సౌండ్ వచ్చింది అంతే బ్యాట్లన్నీ అక్కడే వదిలేసి క్షణాలలో అందరూ తుర్రుమన్నారు . చుట్టూ చూస్తే ఒక్కరూ లేరు . 
దూరం నుండి మహేష్ మహేష్ అక్కడ ఉండకు వచ్చేయ్ వచ్చేయ్ అని కేకలు వినిపించడంతో నిజంగానే లోపల దెయ్యాలు ఉన్నాయా ...... ? అని కాస్త భయంతోనే ( ఆ వయసులో భయం లేనిది ఎవరికి ) ఒకచేతితో బ్యాట్లు అన్నింటినీ పట్టుకుని అందరి దగ్గరికి చేరుకున్నాను .
థాంక్స్ మహేష్ థాంక్స్ మహేష్ ........ ఉదయం వరకూ అక్కడే ఉండిపోయేవి అని వారి వారి బ్యాట్స్ అందుకున్నారు . మురళి మాత్రం చిటికవేసి ఇంట్లో పెట్టిరమ్మని ఆర్డర్ వేసాడు .
వెళ్ళి సెక్యూరిటీని ఎక్కడ ఉంచాలో ఆడిగిమరీ అక్కడే పెట్టివచ్చాను . 

మురళి : ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో క్రికెట్ ఎంజాయ్ చేయలేకపోయాము ఇండోర్ గేమ్స్ ఆడి స్విమ్ చేద్దాము పదండి అని ఒక ఆడిటోరియం లోకి వెళ్లారు . రమ్మని పిలవడంతో నేనూ లోపలికివెళ్ళాను . ఆటవస్తువులు చిన్న చిన్న గేమ్స్ స్విమ్మింగ్ పూల్ ...... చూసి చాలా ఆనందం వేసింది . లోపల అప్పటికే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు . అందరూ ఎవరికినచ్చిన గేమ్ దగ్గరికివెళ్లి ఆడుకుంటున్నారు . 
గోవర్ధన్ : భూత్ బంగ్లా వలన చెమటలు పట్టేసాయి అని బట్టలు విప్పి పూల్ లోకి జంప్ చేసాడు . అవునురా అంటూ ఐదారుగురు నీళ్ళల్లోకి చేరారు .
గోవర్ధన్ : మహేష్ ....... చూస్తుంటే నువ్వూ జంప్ చేసేలా ఉన్నారు . వారం వరకూ నీకావకాశం లేదు గుర్తుపెట్టుకో కావాలంటే వెళ్లి క్యారెమ్స్ - చెస్ ..... ఆడుకో ......
థాంక్స్ గోవర్ధన్ అని చిన్న పిల్లలదగ్గరికివెళ్లి నేర్చుకున్నాను . చీకటిపడేంతవరకూ అక్కడే సమయం గడిచిపోయింది .
ఇక ఇంటికి వెళదాము అని బయటకువచ్చాము . గోవర్ధన్ ఇంటి ప్రక్కనే ఆ ఏరియా కే హైలైట్ లా అన్నీ బిల్డింగ్స్ కంటే ఎత్తయిన బిల్డింగ్ చూసి సూపర్ గా ఉంది ఎవరిది గోవర్ధన్ అని అడిగాను .
గోవర్ధన్ : సూపర్ ఏమిటి మహేష్ లోపల ఆర్కిటెక్చర్ అత్యద్భుతమట డాడీ చెప్పారు సెకండ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉందట సూపర్ కదా . ఇక్కడ ఉన్నవాటికే హైలైట్ బిల్డింగ్ అని అందరూ అసూయ చెందుతున్నారు . రీసెంట్ గా పూర్తయింది - ఓనర్స్ అమెరికాలో ఉన్నారు రాగానే ఓపెనింగ్ , వాళ్లు ఎప్పుడు వస్తారో లోపలకు వెళ్లి ఎప్పుడు చూస్తామో అని ఆశతో బిల్డింగ్ వైపు చూస్తూనే ఇంట్లోకివెళ్లాడు . Wow ...... నేనూ ఇంటికి చేరుకున్నాను .

రాత్రి 9 గంటలవరకూ మరియు పనిమనిషి అక్క ఔట్ హౌస్ లో భోజనం ఉంచాక తిని మళ్లీ సెక్యురిటీ దగ్గరే ఉన్నాను . 
సెక్యూరిటీ : తమ్ముడూ ....... ఇది నీ డ్యూటీ కాదు వెళ్లి పడుకో అని చెప్పారు .
కష్టం అలవాటైపోయింది అన్నా అని బదులిచ్చి ఔట్ హౌస్ కు వెళ్లి బెడ్ పై పడుకోబోయి , అవ్వా పిల్లలు ...... నెలపైనే పడుకోవడం గుర్తుకువచ్చి దుప్పటిని నెలపైనే పరిచి కిందనే పడుకున్నాను . 
**********

సూర్యోదయం ముందుగానే లేచి కాలకృత్యాలు తీర్చుకుని రెడీ అయ్యి సెక్యూరిటీ దగ్గరకుచేరుకున్నాను .
కొద్దిసేపటికి గోవర్ధన్ - వినయ్ వాళ్ళు జాగింగ్ డ్రెస్ వేసుకుని వచ్చారు . 
మహేష్ మహేష్ ........ ఈరోజు స్కూల్ ఉన్నా వెళ్లడం లేదు అందుకే పెద్ద గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళుతున్నాము రా ........
మురళి సర్ .........
మురళి : ఎప్పుడు వచ్చాడో గుడ్ మహేష్ , నేనంటే ఈ మాత్రం భయం ఉండాలి పదా అని గ్రౌండ్ చేరుకున్నాము . 
పేరెంట్స్ నుండి బ్రేక్ ఫాస్ట్ కోసం పిలుపు వచ్చేన్తవరకూ ఆడుకుని ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు . 
సెక్యురిటి : తింటూనే తమ్ముడూ ........ నీ టిఫిన్ ఔట్ హౌస్ లో ఉంచారు వెళ్లి తిను .
సరే అన్నా అని తినేసి స్కూల్ కు రెడీ అయ్యి బయటకువచ్చాను . అన్నా ....... మేడం గారిని బయటకు వెళ్ళడానికి అనుమతి కోరాలి ఎలా ? .
సెక్యూరిటీ : డైరెక్ట్ గా డోర్ దగ్గరికి వెళ్లకుండా నన్ను అడిగి మంచిపనిచేశావు తమ్ముడూ ...... మనం వాళ్లకోసం ఎంత కష్టపడినా మనల్ని దూరంగానే ఉంచుతారు . ఒక్క నిమిషం తమ్ముడూ ....... అని సెక్యూరిటీ గదిలోకివెళ్లి బటన్ ప్రెస్ చేసి మైకులో మేడం గారూ ........ మహేష్ కు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు .
మేడం : ok మాట్లాడించు ........
సెక్యూరిటీ : మహేష్ ........ మేడం గారితో ఇక్కడినుండే మాట్లాడు .
మేడం ........ అనుమతి ఇస్తే మీరు చెప్పినట్లుగా స్కూల్ కు వెళ్లి TC తీసుకునివస్తాను .
మేడం : సెక్యూరిటీ ........ మన డ్రైవర్ కు చెప్పు తన బైకులో తీసుకెళ్లమని .......
సెక్యురిటి : అలాగే మేడం ........
పర్లేదు మేడం , అక్కడ సమయం పడుతుందేమో నేనొక్కడినే వెళ్లి TC తీసుకుని వచ్చేస్తాను .
మేడం : మేము కూడా ఫంక్షన్ కు వెళ్ళాలి డ్రైవర్ అవసరం ఉంటుంది . అయితే ఒంటరిగానే వెళ్లి వచ్చేయ్ మహేష్ ........ , వెళ్లే విషయం పైనున్న మురళికి కూడా కాల్ చేసి చెప్పు లేకపోతే కోప్పడతాడు .
అలాగే మేడం అని బదులిచ్చి మొబైల్లో మురళికి కాల్ చేసి విషయం చెప్పాను .
మురళి : గుడ్ , నువ్వు ఏమిచేసినా నాకు ఇలా చెప్పాలి లేకపోతే నా ఈగో హార్ట్ అయ్యి కోపం వచ్చేస్తుంది , త్వరగా వచ్చేయ్ .......

డబ్బును మరియు మొబైల్ ను జాగ్రత్తగా జేబులలో పెట్టుకుని చిన్న గ్రౌండ్ దగ్గర కలిసిన గోవర్ధన్ కు TC విషయం చెప్పి ఏరియా మెయిన్ గేట్ చేరుకున్నాను . 
నన్నుచూసి సెక్యూరిటీ అన్నయ్యలు ఇద్దరు వచ్చి థాంక్స్ చెప్పారు . మహేష్ ...... నువ్వుకానీ నిన్న పిల్లలను రక్షించకపోయి ఉంటే ఈపాటికి మా స్థానాలలో వేరేవాళ్ళు ఉండేవాళ్ళు - బయటకు వెళుతున్నావా అంటూ చిన్న గేట్ కాకుండా మెయిన్ గేట్ మొత్తం తెరిచారు .
నిన్న లోపలికి వదలకుండా అడ్డుపడినవాళ్లే ఈరోజు థాంక్స్ చెప్పిమరీ గేట్స్ తెరవడం చూసి చాలా ఆనందం వేసింది . 
సెక్యురిటి : మహేష్ ........ ఈ బస్తీవాళ్ళు రిచ్ కిడ్స్ తోపాటు నీపైకూడా కోపంగా ఉన్నారని సమాచారం . జాగ్రత్త , పనిచూసుకుని తొందరగా వచ్చేయ్ ........

పెదాలపై చిరునవ్వుతో బస్తీ దారి గుండానే సిటీవైపుకు నడిచాను . వెనుక ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి చూస్తే బస్తీ జనాలు ఎవరిపనివాళ్ళు చేసుకుపోతున్నారు . 
వీధి టర్న్ అయ్యి కొన్ని అడుగులువెయ్యగానే వెనకనుండి నన్ను కదలకుండా గట్టిగా పట్టేసుకున్నారు ముగ్గురు . భుజం పెయిన్ తట్టుకోలేక విలవిలలాడిపోయాను . రేయ్ ఎవర్రా ....... 
మేమేరా అంటూ మరొక ఇద్దరు పిల్లలు నాముందుకువచ్చారు . రేయ్ ....... నువ్వు నిన్న అడ్డుపడటం వలన మాఇంట్లో దెబ్బలతోపాటు వాతలుకూడా పెట్టారు చూడరా అని చూయించారు . ఈ దెబ్బలకు - వాతలకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే ........
వెనక పట్టుకున్న ఇద్దరు నా జేబుల్లోనుండి డబ్బు మరియు మొబైల్ తీసి , రేయ్ ........ మన డబ్బు దొరికేసింది - ఇక దెబ్బలు మాత్రమే తిరిగిచ్చేయ్యాలి అని ఎదురుగా ఉన్నవాళ్లకు ఇచ్చారు . 
మన డబ్బుకంటే ఎక్కువే ఉంది - సగం డబ్బు ఇంట్లో ఇచ్చేసి మిగిలిన డబ్బుతో ఎంజాయ్ చేద్దాము - ఈ స్మార్ట్ ఫోన్ అమ్మినా కొంతడబ్బు వస్తుంది .

రేయ్ రేయ్ ........ నన్ను కావాలంటే ఎలా అయినా కట్టుకోండి , ఆ డబ్బు అనాధపిల్లలకోసం please please ఇచ్చెయ్యండి అని ప్రాధేయపడ్డాను . 
ఒక్కసారి మా జేబుల్లోకి చేరిందంటే ....... ఇక మా సొంతం అంతే కుమ్మేయ్యండిరా వీణ్ణి , నెక్స్ట్ లోపల దాక్కున్న ఆ బలిసిన కొడుకులని ......... , ముందు భుజం పై నొక్కెయ్యండి ఆ పెయిన్ వలన మనమంటే ఏమిటో తెలియాలి వీడికి .
నా భుజం పై చేతిని వేసేంతలో బలం కొద్దీ ముగ్గురినీ విదిల్చి , మాట్లాడుతున్నవాడిని కాలితో తన్నాను .
బస్తీ మొత్తం వినిపించేంతలా నొప్పితో కేకవేసి నెలపైకి చేరాడు . Please please అన్నది నన్ను కొట్టకుండా ఉండటం కోసం కాదురా - మీపై ....... నా దెబ్బలు పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు అని - వినలేదు మీ ఐదుగురికి నా ఒక్క చెయ్యి చాలు - బస్తీలో పెరిగిన మీరే మాస్ అయితే slum లో పెరిగిన నేనెంత మాస్ మీ ఊహకే వదిలేస్తున్నాను . బుద్ధిగా నా డబ్బు మొబైల్ ఇచ్చేస్తే సర్ లేకపోతే మీరూ ఇలా తిన్నదంతా కక్కుకుని మట్టికరుస్తారు .
ఇంతచెప్పినా example చూయించినా నలుగురూ ఒకేసారి రెండువైపుల నుండీ నామీదకు వచ్చారు .
మీరుకూడా టేస్ట్ చెయ్యాలని ఆశపడుతుంటే ఇక నేనేమీ చెయ్యలేను అని సింగిల్ హ్యాండ్ తో ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క భాగంలో గుద్దులు గుద్ది నేలకొరిగేలా చేసాను . ఒక్కొక్కడి దగ్గరకు వెళుతుంటే భయంతో నొప్పికి అమ్మా అమ్మా అంటూ వెనక్కు జరుగుతున్నారు . బుద్ధిగా చెబితే వినలేదు slum దెబ్బ రుచిచూశాక ........ నెక్స్ట్ టైం మరింతమంది టీం మొత్తం వచ్చెయ్యండి కబడ్డీ ఆడుకుందాము , ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను నా డబ్బు మొబైల్ ........ 
నొప్పితో అల్లాడిపోతూనే జేబులోనుండి తీసి ఇచ్చి ప్రక్కకు జరిగారు . 
గుడ్ ....... మళ్లీ నెక్స్ట్ ఫైటింగ్ లో కలుద్దాము , ఆ పాటికి మరొక చెయ్యికూడా రెడీ  అయిపోయి ఉంటుంది ముందూ వెనుకా ఆలోచించకుండా కుమ్మేసుకోవచ్చు ,అప్పటివరకూ బై బై ప్చ్ ....... 15 నిమిషాలు వేస్ట్ అని ఫీల్ అవుతూ స్కూల్ చేరుకున్నాను .
Like Reply
క్లాస్సెస్ జరుగుతుండగా నేరుగా హెడ్ మాస్టర్ రూమ్ కు వెళ్లి విషయం చెప్పాను . ఆఫీస్ రూంలో అప్లై చెయ్యమనిచెప్పారు . థాంక్స్ సర్ అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ రాసి ఆఫీస్ రూంలోని సర్ కు ఇచ్చాను . 
సర్ : ఏ స్కూల్లో జాయిన్ అవుతున్నావు .
******** ఇంటర్నేషనల్ స్కూల్లో సర్ .........
సర్ : మంచి ఛాన్స్ కొట్టావు .
నాకు govt స్కూల్లోనే చదవాలని ఇష్టం సర్ కానీ పరిస్థితుల ప్రభావం వలన ట్రాన్స్ఫర్ అవ్వాల్సివస్తోంది . అక్కడ విద్యను మాత్రమే నేర్చుకోగలం కానీ ఇక్కడ జీవితాన్ని నేర్చుకోవచ్చు .
సర్ : కరెక్ట్ గా చెప్పావు ......... లెటర్ చూసి ఆ మహేష్ అని అభినందించారు . TC ప్రిపేర్ చెయ్యడానికి సమయం పడుతుంది సాయంత్రం స్కూల్ క్లోజ్ చేసేలోపు వచ్చి తీసుకో అంతవరకూ క్లాస్సెస్ అటెండ్ అవ్వు .........
థాంక్యూ సర్ ........ , ( క్లాస్సెస్ కంటే ముఖ్యమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ) అని పెదాలపై చిరునవ్వుతో బయటకువచ్చి సిటీ సెంటర్ చేరుకున్నాను .

బేకరీకి వెళ్లి కేజీ కేజీ 5 cakes ఆర్డర్ ఇచ్చాను , అక్కడే ఉన్న అన్నయ్యను ఫేమస్ బిరియానీ పాయింట్ ఎక్కడో కనుక్కుని 10 ప్యాకెట్స్ బిరియానీ చికెన్ ఫ్రై తీసుకున్నాను - ప్రక్కనే ఉన్న ఐస్ క్రీమ్ షాపులో పిల్లలందరికీ రెండు రెండు చెప్పున ఐస్ క్రీమ్స్ , చాక్లెట్ లు తీసుకుని బేకరీకివెళ్లి ఆర్డర్ చేసిన cakes తీసుకుని ఒకచేతితో పట్టుకోవడం కష్టమై ఆటోలో మా ఇంటికి చేరుకున్నాను .
ఆశ్చర్యం ......... రెండు చిన్న ఇల్లులూ రంగులువెయ్యబడి కొత్తగా మారిపోయాయి - చుట్టూ ఉన్న ముళ్లపొదలు మురికి మొత్తం శుభ్రన్గా మారిపోయింది - పిల్లలు సంతోషంగా బయట ఆడుకుంటున్నారు . 
నన్నుచూసి అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ పరుగునవచ్చారు . సంతోషపు ఆశ్చర్యంతోనే పిల్లలకు cakes - ఐస్ క్రీమ్స్ అందించాను . 
పిల్లలు మరింత సంతోషంతో అవ్వలూ అవ్వలూ ........ అంటూ లోపలికి పరుగులుతీశారు . 
ఆటో డబ్బులు ఇచ్చేసి బిరియానీ పార్సిల్స్ అందుకుని లోపలికివెళ్ళాను . మరింత ఆశ్చర్యం కరెంట్ లేక క్యాండిల్స్ ఒక్కొక్కరాత్రి అవీ లేక చీకటిలోనే ....... కానీఇప్పుడు ఇల్లుమొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది - పెద్ద ఫ్రిడ్జ్ - ఒకటి కాదు హాల్ లో ఏకంగా ఒక AC ఒక కూలర్ - వాషింగ్ మెషీన్ - కొత్త బెడ్స్ ........ ఇలా అన్నీ కొత్తకొత్తగా ఉన్నాయి - బుజ్జిపాపాయిలు అందమైన కొత్త ఊయలలో హాయిగా నిద్రపోతున్నారు , వెళ్లి నెమ్మదిగా ఊపి ఆనందించి ముద్దులుపెట్టాను - నా పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు , నేను అక్కడ ఔట్ హౌస్ లో ఏ ఏ వసతులైతే పొందానో అవన్నీ ఇక్కడ ఉండటం చూసి నా ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . ఇల్లు సగభాగం ఆటవస్తువులతో నిండిపోయింది - నాలుగు గోడలపై govt స్కూల్ క్లాస్సెస్ గోడలపై ఉండేలా అనిమల్స్ ఆల్ఫాబెట్స్ రంగురంగుల పెయింట్స్ ఉన్నాయి .

చూడండి అన్నయ్యా ......... మీరు వచ్చారంటే అవ్వలు నమ్మడం లేదు అని ఐస్ క్రీమ్స్ తింటూ పిలుచుకునివచ్చారు .
అవ్వలు : బాబూ మహేష్ అంటూ ఆనందబాస్పాలతో కౌగిలించుకోబోయి భుజం పై కట్టుని చూసి సంతోషం స్థానంలో కన్నీళ్లు వచ్చేసాయి . మహేష్ మహేష్ ...... ఏమైంది అని కంగారుపడుతూ అడిగారు .
అవ్వా అవ్వా ........ కంగారుపడాల్సిన అవసరమేలేదు అని బెడ్ పై కూర్చోబెట్టి మోకాళ్లపై కూర్చున్నాను . ఈ కట్టు వల్లనే నాకు పని దొరికింది అని జరిగినదంతా వివరించాను - వారంలో నాయమైపోతుందని డాక్టర్ చెప్పారు , ఇంటిప్రక్కనే డాక్టర్ రోజూ చెక్ చెయ్యాలి రమ్మనికూడా చెప్పాడు అని కన్నీళ్లను తుడిచాను - అవ్వలూ ......... వారంలో పెద్ద స్కూల్లో జాయిన్ చేయిస్తున్నారు .
చిన్నగా చిరునవ్వులు విరిసాయి . హమ్మయ్యా ....... అని ఇద్దరినీ కౌగిలించుకున్నాను . 
పిల్లలందరూ సంతోషంతో చిందులువేస్తూ షర్ట్స్ పైకి కార్చుకుంటూ ఐస్ క్రీమ్స్ తినడం చూసి ముగ్గురమూ నవ్వుకున్నాము . 
అవ్వలు : నువ్వు ఎలా ఉన్నావోనని వెళ్లిన క్షణం నుండీ ఒకటే బెంగ , నీ గమ్యాన్ని చేరుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అని నుదుటిపై ముద్దుపెట్టారు . 
లవ్ యు అవ్వలూ ...... , అంతా మీ ఆశీర్వాదం అని పాదాలను స్పృశించాను .
అవ్వలు : కన్నీళ్లను తుడుచుకుని ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటావు మహేష్ అని దీవించారు . 
పెదాలపై చిరునవ్వులతో పిల్లలూ ........ మీకోసం బిరియనీతీసుకొచ్చాను .
పిల్లలు : ఈరోజు కూడా బిరియానీ ........ , భలే భలే ........
అవ్వ : అవును మహేష్ ........ నిన్న జీవితంలో తొలిసారి బిరియానీ తిన్నాము . వీటన్నింటినతోపాటు మాకోసం వంట మనిషిని కూడా ఏర్పాటుచేసింది - వంటలన్నీ ఆమెనే చేస్తోంది .
అవునవును మా అవ్వలను చూసిన ఆనందంలో అడగడమే మరిచిపోయాను , ఇలా అద్భుతంగా ఎలా మారింది అవ్వలూ........
అవ్వ : నువ్వు వెళ్లిన మరుసటిరోజు నువ్వు పంపించావు అని ఒక తల్లి వచ్చి ఒక్కరోజులో మొత్తం ఇలా మార్చేసింది - మీకు ఏ అవసరం వచ్చినా నేను వచ్చేస్తాను అని అదిగో ఈ అమ్మాయిని మాకు తోడుగా ఉంచి వెళ్ళిపోయింది .
నేనా ....... ? అంటూ షాక్ లో ఉండిపోయాను . తేరుకుని లేదు అవ్వలూ నేను పంపనేలేదు .
అవ్వ : నువ్వు ఇలా చెబుతావని కూడా చెప్పింది . 
లే ....... లేదు 
అవ్వ : నీకు పెద్దమ్మ అవుతుందట , నిన్ను బుజ్జాయిగా మా దగ్గరికి చేర్చింది తనేనట - ఇక నుండీ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా పెద్దమ్మనే అని కోరిన కోర్కెలన్ని తీర్చేసింది చూశావుకదా ఎన్ని బొమ్మలున్నాయో ........ , బిరియానీ చికెన్ ఫ్రై కూడా స్వయంగా చేసింది - నీకు కూడా చేరేలా చేస్తాను అని తీసుకెళ్లింది. నీ అడ్వాన్స్ డబ్బులతో గిఫ్ట్స్ తీసుకొస్తావని చెప్పింది , మిగిలిన డబ్బులు మాకు ఇస్తావనికూడా చెప్పింది .
అవునవును అవ్వలూ ........ అంటూ మిగిలిన పదివేలను అవ్వలకు అందించాను షాక్ లోనే .........
అవ్వ : సగం తీసుకుని సగం ఖర్చులకు ఇవ్వమని చూపింది అని నా జేబులో ఉంచారు .
అవ్వలూ ........ నాకు ఖర్చులేమి ఉంటాయి , ఉండటానికి ఇలాంటి వసతులు గల చోటుని ఇచ్చారు - ఫ్రీ గా పెద్ద స్కూల్ కు వెళ్లబోతున్నాను - మూడుపూటలా భోజనం పెడుతున్నారు అని డబ్బుని మొత్తం ఇవ్వబోతే ........
అవ్వలు : మహేష్ ........ మీ పెద్దమ్మ సంవత్సరానికి సరిపడే వసతులను సమకూర్చేశారు , అవసరమైనప్పుడు వచ్చివెళతాను అనిచెప్పారు కాబట్టి ఇకనుండీ మా గురించి మాత్రమే ఆలోచించకుండా నువ్వు గొప్ప స్థాయిని చేరుకోవాలి అని నుదుటిపై ముద్దులుపెట్టారు .
కళ్ళల్లో ఆనందబాస్పాలతో ........ , మీరు పిల్లలే నాజీవితం అవ్వలూ - మీ సంతోషమే నా సంతోషం - మీరు లేకపోతే నేను ఉండేవాడినా అని హత్తుకున్నాను.
అవ్వలు : లవ్ యు మహేష్ , నువ్వు బాగా చదువుకుంటే మేము సంతోషంగా ఉంటాము .
అలాగే అవ్వలూ ....... అని కన్నీళ్లను తుడుచుకుందాము . అవ్వలూ ........ ఇంత సంతోషమైన సందర్భంలో కేక్ కోసి సెలెబ్రేషన్స్ చేసుకుందాము అని పిల్లలతో కోయించి బిరియానీ తిని ఎంజాయ్ చేసాము - పాపాయిలకు పాలు తాగించాము .
అవ్వలు : మహేష్ ........ నిన్న తిన్న బిరియానీ దీనికంటే రుచిగా ఉంది అని మైమరిచిపోతూ చెప్పారు .
అవును నేను తిన్న బిరియానీ కూడా అవ్వలు ఫీల్ అయినట్లుగానే ఉంది అని మనసులో అనుకుని , సంతోషాలన్నింటినీ నా మొబైల్ లో చిత్రీకరించాను రోజూ చూసి ఆనందించడానికి . పెద్దమ్మా ........ మీరెవరో తెలియదు కానీ ఏ సంతోషాలనైతే చూడాలని అనుకున్నానో ఆ కోరిక తీర్చారు - ఈరోజు నుండీ మిమ్మల్నే దేవతలా కొలుచుకుంటాను అని గుండెలపై చేతినివేసుకున్నాను . 

సంతోషాలను హృదయమంతా నింపుకుని ఇంటి బయటకువచ్చి , మురళికి కాల్ చేసాను TC ఆలస్యం అవుతుందని ........
మురళి : మళ్లీ గుడ్ మహేష్ అని పొంగిపోతున్నట్లు అనిపించింది .
మురళీ సర్ ........ ఒకవిషయం అడుగుతాను ఏమీ అనుకోరు కదా .......
మురళి : సంతోషంలో ఉన్నాను అడుగు మహేష్ ........
మురళి సర్ ....... నిన్న మధ్యాహ్నం నాన్ వెజ్ ........ తిన్నా.......
మురళి : నో నో నో స్టాప్ స్టాప్ సండే మాఇంటిరోజు , సండే ఎప్పుడూ నాన్ వెజ్ గురించి ఆలోచించకు . మంగళవారం కుమ్మేస్తాము - రేపు మమ్మీ బిరియానీ చేస్తుంది నీకూ పంపిస్తానులే ..........
థాంక్స్ మురళి సర్ అని ఆశ్చర్యపోతూనే కట్ చేసాను . అంటే ....... నిన్న నేను తిన్న బిరియానీ పెద్దమ్మ ........ అంటే పెద్దమ్మ నాదగ్గరికి వచ్చారన్నమాట అని ఆనందం ఆగడం లేదు . పెద్దమ్మా ....... నాకు దర్శనం ఇవ్వకుండానే వెళ్ళిపోయారా ఆ అదృష్టం ఎప్పుడు ....... డిమాండ్ కాదు రిక్వెస్ట్ మాత్రమే ఇప్పటికి ఈ సంతోషాలు చాలు అని లోపలకు వెళ్లి సాయంత్రం వరకూ సరదాగా గడిపాను .

3 గంటలకు అవ్వలూ ......... స్కూల్ వదిలే సమయం కావస్తోంది నేను వెళ్లివస్తాను  , ఎటువంటి అవసరం ఉన్నా ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి - పెద్దన్న సహాయగుణం వలన మీరు , పిల్లలు ఇలానే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి . అవ్వలూ ........ మీరు ఎలాఉన్నారోనని కాస్త కంగారుపడుతూనే వచ్చాను - వెళ్ళేటప్పుడు మాటల్లో వర్ణించలేనంత సంతోషంతో వెళుతున్నాను అని ఆశీర్వాదం తీసుకుని , పిల్లలకు టాటా చెప్పి స్కూల్ కు బయలుదేరాను . 
పెద్దమ్మా ........ మీరు నాకోసం వచ్చారు అని అవ్వలు చెప్పారు - నా గురించి ఆలోచించకండి , ఎన్ని కష్టాలు ఎదురైనా సంతోషంగా ముందుకువెళతాను - ఏ చిన్న సహాయం అయినా అవ్వలు , పిల్లలకేచెయ్యండి అని గుండెపై చేతినివేసుకుని మనసులో అనుకున్నాను - మీరే మా దేవత కాబట్టి ప్రార్థిస్తున్నాను కూడా అని వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ సగం సంతోషo , సగం భారంగా అడుగులువేస్తున్నాను .

సరైన సమయానికే స్కూల్ చేరుకున్నాను . ఆఫీస్ రూమ్ కు వెళ్లి TC పొందాను . సర్ ........ నా భవిష్యత్తుకు all the best చెప్పడంతో థాంక్స్ చెప్పేసి చిరునవ్వులు చిందిస్తూ నడుచుకుంటూనే సంతోషంగా కొత్త ప్రపంచం వైపు అడుగులువేశాను - అవ్వలు , పిల్లల సంతోషం చూశాక భారమంతా హుష్ కాకి అయిపోయింది . 
ఏరియా మై గేట్ సెక్యురిటి : ఏంటి మహేష్ ........ ఉదయం కంటే ఉత్సాహంగా ఉన్నావు .
అవును అన్నలూ ........ ఈరోజు చాలా సంతోషంగా ఉంది , కొందరిని ఎలా అయితే చూడాలని ఆశపడ్డానో అలా చూసేసాను నా దేవత ( పెద్దమ్మ ) వలన అని లోపలికి వెళ్ళాను . 

మహేష్ ....... TC తెచ్చావా అని చిన్న గ్రౌండ్ దగ్గర ఆడుకుంటున్న గోవర్ధన్ వినయ్ అడిగాడు .
మేడమ్స్ ........ కోరినట్లుగానే తీసుకొచ్చాను .
మురళి : అయితే TC ఇంట్లో పెట్టేసి వచ్చేయ్ ........
నిమిషంలో వచ్చేస్తాను మురళి సర్ , ( ఇక నా జీవితం ఇక్కడి నుండే మొదలు మీతో ఎంత అనకువగా ఉంటే అంత మంచిది నాకు ) పరుగుతీసాను .
పిల్లలు : రేయ్ మురళీ ....... నువ్వంటే మహేష్ కు చాలా భయం .
మురళి : కంట్రోల్ లో పెట్టాను మరి అమ్మ సహాయంతో అని నవ్వుకున్నారు .
ఇంటికి చేరుకుని సెక్యురిటి అన్నకు hi చెప్పి లోపలకువెళ్ళాను  - ఆ వెనుకే మేడం వాళ్ళు అప్పుడే ఫంక్షన్ నుండి వచ్చినట్లు కారులో లోపలికివచ్చారు . 
మేడం : కారు దిగి మహేష్ TC .......
తీసుకొచ్చాను మేడం అని వినయంతో చూయించాను .
మేడం : ఎవ్వరి సహాయం లేకుండా ఒంటరిగా వెళ్లి తీసుకొచ్చావు అంటే , మా పిల్లల బాడీగార్డ్ గా నువ్వు పర్ఫెక్ట్ ....... , నెక్స్ట్ సోమవారం స్కూల్ కు తీసుకెళ్లాలి అని సంతోషంతో లోపలికివెళ్లారు .
దానికి నేనే మీకు ఋణపడిఉంటాను మేడం , ఎక్కడో ఉండాల్సినవాడిని ....... అని నమస్కరించి ఔట్ హౌస్ లోకివెళ్లి TC జాగ్రత్తగాఉంచాను . ఫ్రెష్ అయ్యి పరుగున చిన్న గ్రౌండ్ కు చేరుకున్నాను . 
వినయ్ : మురళీ ....... నువ్వు చెప్పినట్లుగానే 15 నిమిషాలలో వచ్చేశాడు , నువ్వేగెలిచావురా ......... 
గెలిపించావు మహేష్ అన్నట్లు నావైపు గర్వపడుతూ చూసాడు మురళి .......
ఒక్క నిమిషం ఆలస్యమైనా , అమ్మో ........ మురళి దగ్గర
జాగ్రత్తగా ఉండాలి అనుకున్నది జరగకపోతే ఆగ్రహానికి గురికావాల్సివస్తుంది , మురళి మాటే మేడం మాట కూడా .......... 
చీకటి పడేంతవరకూ ఆడుకున్నారు . 

గోవర్ధన్ : మురళీ ....... కట్టు చెక్ చెయ్యాలని మహేష్ ను డాడీ పిలుచుకునిరమ్మన్నారు .
నాకే కాదు ఇక్కడ ఉన్నవాళ్ళందరికీ మురళి అంటే భయమే అనుకుని లోలోపలే నవ్వుకున్నాను . 
మురళి కళ్ళతోనే సైగచెయ్యడంతో గోవర్ధన్ క్లినిక్ కు పిలుచుకునివెళ్లాడు .
డాక్టర్ గారు చెక్ చేసి , చెప్పానుకదా భుజానికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు అని మరొకసారి ఇలానే చేస్తే అతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది , నా ఫీజ్ కేవలం వారం వరకు మాత్రమే ఇచ్చారు అని కోపంగానే చెప్పారు - ఇలా జరిగినా నవ్వుతూ వచ్చావు అంటే నీది ఐరన్ బాడీ అయి ఉంటుంది - గోవర్ధన్ ...... స్కూల్లో మీతోపాటు మహేష్ ఉంటే ఇక మాకు భయం లేదు .
( అంతా ఆ బస్తీ పిల్లల వలనే ) అలాగే డాక్టర్ గారూ ....... ఇకపై అలా జరగకుండా జాగ్రత్తపడతాను , ( ఎలాగో వారం రోజులు బయటకువెళ్లను కదా ....... ) 
డాక్టర్ గారు : టాబ్లెట్స్ మూడుపూటలా వేసుకో త్వరగా ఫిక్స్ అయిపోతాయి , ఇక వెళ్లు ........
గోవర్ధన్ కు గుడ్ నైట్ చెప్పి ఔట్ హౌస్ చేరుకున్నాను . లోపల ఫుడ్ రెడీగా ఉండటంతో తినేసి నేలపై పడుకోగానే అలసిపోవడం వలన హాయిగా నిద్రపట్టేసింది.

ఉదయం బెడ్ పై లేచాను - AC కూడా వేసి ఉంది . బెడ్ పైకి ఎలాచేరాను అని ఆశ్చర్యపోయాను . చేతిలో పేపర్ నోట్ ఉండటం చూసి చదివాను .
" నేలపై పడుకుంటే భుజంపై స్ట్రెస్ ఎక్కువపడి నొప్పివేస్తుంది , రేపటి నుండీ బెడ్ పైనే పడుకో మహేష్ ....... please - నీకు నొప్పివేస్తే నేను తట్టుకోలేను " .
అలాగే అంటూ తలఊపాను - ఎవరై ఉంటారు ....... పెద్దమ్మనా అంటూ చుట్టూ చూసి పరుగున బయటకువచ్చిచూస్తే సెక్యూరిటీ తప్ప ఎవరూ లేరు . 
అన్నా ........ రాత్రి ఎవరైనా లోపలికివచ్చారా ...... ? .
సెక్యూరిటీ : నాకు తెలిసి లేదు తమ్ముడూ ........ , ఎందుకు అలా అడుగుతున్నావు ? , రాత్రి ఎందుకో తెలియదు కొద్దిసేపు మైకం వచ్చినట్లు వాటంతట అవే కళ్ళుమూతలుపడ్డాయి - ఎవరైనా వచ్చినట్లు అలికిడి వినిపించిందా చెప్పు మహేష్ - సర్ వాళ్లకు తెలిస్తే నన్ను పీకేస్తారు .
లేదు లేదు అన్నా ........ ఊరికే అడిగాను అని లోపలికివెళ్ళాను . అంటే సెక్యురిటి మైకం కమ్మినప్పుడు ........ పెద్దమ్మ ........ , ఖచ్చితంగా ఎవరో వచ్చారు కాబట్టే నన్ను బెడ్ పై పడుకోబెట్టారు - మా దేవత పెద్దమ్మ అనే నమ్ముతున్నాను థాంక్స్ పెద్దమ్మా ........ మీరు చెప్పారుకదా బెడ్ పైనే పడుకుంటాను అని AC ఆఫ్ చేసి కాలకృత్యాలు తీర్చుకుని ఫేస్ వాష్ చేసుకుని బయటకువచ్చాను - మురళి కాల్ రావడంతో జాగింగ్ బయలుదేరాము .
ఆరోజు నుండీ తెల్లవారుఘామున జాగింగ్ - బ్రేక్ఫాస్ట్ - ఉదయం పెద్ద గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే చూడటం - లంచ్ - మధ్యాహ్నం రెస్ట్ - సాయంత్రం చిన్న గ్రౌండ్ లేదా ఇండోర్ ఆడిటోరియం లో గేమ్స్ - డాక్టర్ గారి చెకప్ - బిగ్గెస్ట్ బిల్డింగ్ చూస్తూ ఇంటికి చేరడం - డిన్నర్ - పెద్దమ్మ కోరిక ప్రకారం బెడ్ పై పడుకోవడం - ఉదయం లేచి చూస్తే AC on చేసి ఉండటం ......... ఇలా వారం రోజులు అలా అలా గడిచిపోయాయి . 

ఆదివారం ఉదయం డాక్టర్ గారు పిలిపించి చెక్ చేశారు - స్కాన్ చేశారు . మహేష్ ....... నీది ఐరన్ బాడీ అని చెప్పానుకదా భుజం సెట్ అయిపోయింది అని కట్టు వేరుచేసి చేతిని విదిల్చమన్నారు - ఊపమన్నారు - రౌండ్స్ వెయ్యమన్నారు ....... 
నొప్పివేస్తోందా మహేష్ ........
లేదు డాక్టర్ గారు - లేనేలేదు గోవర్ధన్ ........
డాక్టర్ గారు : హమ్మయ్యా ........ ఈరోజుతో ఫీజ్ డబ్బులు కూడా సరిపోయాయి వెళ్లు వెళ్లి రోజంతా స్నానం చేసి ఫ్రెష్ అవ్వు , వారం రోజులు అయ్యిందికదా స్నానం చేసి ........
థాంక్స్ డాక్టర్ గారూ అని చేతిని ఊపుకుంటూ ఇంటికి పరుగుతీసాను . నా అదృష్టం అప్పుడే బయటకు వెళ్ళడానికి వచ్చిన మేడం - మురళికి నయమైపోయింది అని చూయించాను .
మేడం : గుడ్ మహేష్ ........ , రేపు ఉదయం 7 గంటలకు రెడీగా ఉండు స్కూల్లో జాయిన్ చేస్తాను అనిచెప్పి కారులో బయటకువెళ్లారు . 
రేపటి నుండి మళ్లీ స్కూల్ అదికూడా పెద్ద స్కూల్ అని సంతోషంతో వెళ్లి సుమారు రెండు గంటలపాటు షవర్ కిందనే ఉండిపోయాను . తలంటు స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటకు రాగానే వొళ్ళంతా తేలికగా అనిపించింది . డ్రెస్ వేసుకుని ఆరోజంతా సంతోషంగా గడిపేసాను ఆరోజు అందరితో కలిసి బ్యాటింగ్ చేసాను ఫీల్డింగ్ చేసాను బౌలింగ్ చేసాను . సోమవారం తెల్లవారుఘామునే లేచి ఫ్రెష్ అయ్యి ఇస్త్రీ చేసిన మంచి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి బయటే వేచిచూస్తూ ఉన్నాను .
Like Reply
పనిమనిషి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి మహేష్ రెడీ అన్నమాట , కాకపోతే రెడీ అవ్వమని చెప్పమని నన్ను పంపించారు మేడం - మాంచి హుషారుగా ఉన్నావు - మొదటిరోజు పెద్ద స్కూల్ కు వెళుతున్నావు all the best ........
థాంక్స్ అక్కా అని ప్లేట్ అందుకుని ఇంట్లోకివెళ్లి తినేసి ప్లేట్ శుభ్రం చేసి బయట ఉంచి మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాను . 
8:30 సమయంలో పిల్లలందరూ వారి వారి కార్లలో బయలుదేరుతూ మహేష్ స్కూల్లో కలుద్దాము అని చెప్పారు .
కాలనీలోని మేడమ్స్ అందరూ చేతులలో డబ్బుతో వచ్చి నన్ను పలకరించి మా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అని మరీ మరీ చెప్పి లోపలకువెళ్లివచ్చి ఎవరి బిల్డింగ్ లోకి వాళ్ళు వెళ్లిపోయారు .
మురళితోపాటు మేడం గారు కూడా బయటకువచ్చి , మహేష్ కారులో వెళదాము రా నిన్ను జాయిన్ చేసి వచ్చేస్తాను అని పిలిచారు - డ్రైవర్ ....... ఈరోజు నేను తీసుకెళతానులే అని కీస్ అందుకున్నారు .
కారులో నేను ........ పెదాలపై చిరునవ్వులను లోలోపలే దాచేసుకుంటూ వెళ్లి వెనుక కూర్చున్న మురళితోపాటు కూర్చున్నాను . కూర్చోవడంలో నా వేళ్ళు మురళికి తగిలాయి .
వెంటనే మురళి నా నుండి దూరం జరిగి కూర్చున్నాడు .
Sorry మురళి సర్ అని డోర్ ప్రక్కనే అణిగిమణిగి కూర్చున్నాను . 

మేడం : నాన్నా మురళి shall we go ? .
మురళి : yes mom ........
మేడం గారు గేర్ మార్చి పోనిచ్చారు . మహేష్ ....... govt స్కూల్లోలా కాదు క్రమశిక్షణతో ఉండాలి - మా పిల్లలకోసం ఖర్చు ఎక్కువైనా సరే నిన్ను జాయిన్ చేస్తున్నాము - ఫీజ్ ఎంతో తెలుసా సంవత్సరానికి 2లక్షలు - అంత అయినా అందరమూ కలిసి భరిస్తున్నాము అంటే కారణం మా పిల్లలకు రక్షణగా ఉంటావని - నీ స్టడీస్ కంటే మాకు మా పిల్లల సేఫ్టీ ముఖ్యం , నేను ఏమి చెబుతున్నానో అర్థమౌతోందా ........ ? .
ప్రతీ మాటా మేడం గారూ ........ , అనుక్షణం మురళి సర్ మరియు పిల్లలందరి ప్రక్కనే ఉంటాను .
మురళి : ప్రక్కనకాదు వెనుక ఉండాలి .
అలాగే మురళి సర్ ......... 
మేడం : రోజూ డ్రైవర్ స్కూల్లో వదిలిన క్షణం నుండీ మళ్లీ సాయంత్రం కారులోకి చేరేంతవరకూ అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సినది నువ్వే - మురళికి ఇష్టమైతే కారులో లేకపోతే సిటీ బస్ లో ఇంటికి వచ్చేయ్ ........
మీరెలా అంటే అలా మేడం ..........
మేడం : గుడ్ అంటూ ఎలా ఉండాలో చెబుతూ కారుని ఆపారు . మహేష్ ఇదే స్కూల్ ......... 
విండో నుండి అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . పెద్ద గేట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ - పెద్ద పెద్ద బిల్డింగ్స్ - గ్రౌండ్ ........ 
మురళి బ్యాగుతీసుకుని కిందకుదిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు . నేనూ కిందకుదిగి సంతోషంతో చూస్తున్నాను " ******* ఇంటర్నేషనల్ స్కూల్ " ........

మేడం : మహేష్ ....... ఆఫీస్ రూమ్ కు వెళదాము నా వెంట రా అని లోపలిపిలుచుకునివెళ్లారు . మావెంటే మురళీ వాళ్ళు వచ్చారు .
ఇంకా క్లాసెస్ టైం కానట్లు అందరూ ప్లేగ్రౌండ్ లో ఆడుకుంటున్నారు . ప్రతీ ఒక్కరూ కార్స్ - స్కూల్ బస్ లలో స్కూల్ కు చేరుతున్నారు . 
మేడం నేరుగా హెడ్ మాస్టర్ రూంలోకి తీసుకెళ్లారు . ముందే ఇన్ఫార్మ్ చేసినట్లు వెల్కమ్ అని కుర్చీలో కూర్చోమన్నారు .
మేడం : థాంక్స్ సర్ అని కూర్చుని , నేను ఫోనులో చెప్పినది ఈ పిల్లాడి గురించే పేరు మహేష్ అని TC అందించారు .
హెడ్ మాస్టర్ : govt స్కూల్ ........ అంటూ నావైపు ఒకవిధంగా చూసి నో నో నో జాయిన్ చేసుకోవడం కుదరదు . 
మేడం : పిల్లాడి గ్రేడ్స్ గురించి అడగము అని రాసిస్తాము .
హెడ్ మాస్టర్ : Are you sure ....... ? .
మేడం : yes .
హెడ్ మాస్టర్ : అయితే జాయిన్ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు . రూల్స్ ప్రకారం స్టూడెంట్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి మా సబ్జెక్ట్స్ టీచర్స్ టెస్ట్స్ కండక్ట్ చేస్తారు కొద్దిసమయం పడుతుంది . స్టూడెంట్స్ మీరు ప్రేయర్ కు వెళ్ళండి అబౌట్ to స్టార్ట్ .........
మేడం : wait చేస్తాను సర్ ........ 
మురళి వాళ్ళు : మేముకూడా wait చేస్తాము అని ఛైర్స్ లో కూర్చున్నారు . 
హెడ్ మాస్టర్ : మేడం ఉండటం వలన ఏమీ అనలేకపోయారు . టేబుల్ పై ఉన్న బెల్ కొట్టారు - pune రాగానే ఒక లెటర్ ఇచ్చి స్టాఫ్ రూంలో ఉన్న సబ్జెక్ట్స్ - లాంగ్వేజ్ టీచర్స్ దగ్గరికి తీసుకెళ్లమన్నారు .

Pune : బాబూ ....... 
మేడం ......... వెళ్లనా ? 
మేడం : వెళ్లు మహేష్ ........ , నీ టాలెంట్ ఏమిటో అందరితోపాటు మాకూ తెలుస్తుంది .
Pune వెనుకే కింద ఫ్లోర్లోనే ఉన్న స్టాఫ్ రూమ్ కు చేరుకున్నాము . టీచర్స్ అందరూ తమ తమ క్లాసెస్ కు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు .
Pune వెళ్లి కంప్యూటర్ ముందు ఉన్న ఒకరికి లెటర్ చూయించారు . 
లెటర్ చూసి మాథ్స్ , సైన్స్ , సోషల్ , ఇంగ్లీష్ , తెలుగు , హిందీ టీచర్స్ ....... చక చకా ఈ స్టూడెంట్ నాలెడ్జ్ టెస్ట్ చేసి స్కోర్ ఇవ్వాలని హెడ్ మాస్టర్ సర్కులర్ .

బాబూ ........ ఇటురా అని ఆరుగురు టీచర్స్ పిలిచి which class అని అడిగారు.
10th క్లాస్ సర్ .........
టీచర్స్ :  ఒక్కొక్కరూ ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ అందించారు . ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ కు 10 - 10 మినిట్స్ పూర్తి చెయ్యి .....
చూస్తే ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ లో 10 - 10 ముల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి.
టీచర్స్ : స్టూడెంట్ ........ ఒక నిమిషం అయిపోయింది .
Sorry sorry సర్ అంటూ హడావిడిగా నేలపై కూర్చున్నాను .
టీచర్ : pune ....... ప్యాడ్ ఇవ్వు .
అందుకుని మొదటి పేపర్ చూస్తే మాథ్స్ ....... క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో ఉండటం చూసి బిక్కమొహం వేసాను . నెక్స్ట్ పేపర్ చూస్తే సైన్స్ ....... అదికూడా ఇంగ్లీష్ లో , ఆ నెక్స్ట్ సోషల్ ఇంగ్లీష్ లో , దానికింద ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ........ చెమటలు పట్టేసాయి . ఇంగ్లీష్ పేపర్ కింద తెలుగు క్వశ్చన్ పేపర్ కనిపించగానే ఎంత ఆనందం కలిగిందో ........ 10 ప్రశ్నలు నిమిషంలో పూర్తిచేసేసాను - దాని కింద హిందీ పేపర్ ........ 5 నిమిషాలలో పూర్తిచేసాను . 
మళ్లీ మొదటికి మాథ్స్ పేపర్ దగ్గరికి చేరుకుని మొదటి క్వశ్చన్ దగ్గరే ఆగిపోయి దిక్కులు చూస్తున్నాను . నిమిషాలు ....... క్షణాల్లా గడిచిపోతున్నాయి , క్షణక్షణానికి నా షర్ట్ చెమటతో తడిచిపోతోంది . 

టీచర్స్ ........ మాట్లాడుకుంటూనే నావైపు చూసి what happened student ? What is your name ? .
ముఖమంతా చెమటతో ఏమీ అర్థం కానట్లు మహేష్ సర్ అని బదులిచ్చాను .
టీచర్స్ : మహేష్ ఏమయ్యింది ? టైం అయిపోతోంది ....... , వొళ్ళంతా ఆ చెమటలు ఏంటి ఇటురా అని పిలిచి ప్యాడ్ అందుకుని చూసారు . తెలుగు - హిందీ తప్ప మిగతావి అటెంప్ట్ చేయకపోవడం చూసి నీ ప్రాబ్లమ్ ఏంటి అని తెలుగు - హిందీ పేపర్స్ ను ఆ ఆ టీచర్స్ కు అందించారు .
రైట్ రైట్ రైట్ ........ 10 ఔట్ ఆఫ్ 10 టీచర్స్ ........ , మా పని అయిపోయింది అని సర్కులర్ లో మార్క్స్ ఎంటర్ చేసి వెళ్లిపోయారు .
టీచర్స్ : రెండు లాంగ్వేజ్ లలో 10 - 10 మార్క్స్ అంటే సబ్జెక్ట్స్ లో కొద్దిగానైనా నాలెడ్జి ఉంటుంది . ఏదో ప్రాబ్లమ్ ఉంది , అది తెలుసుకోవడానికే హెడ్ మాస్టర్ గారు మా దగ్గరికి పంపించారు .
సర్ సర్ ........ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్ లో .........
టీచర్స్ : ఏ స్కూల్ నుండి వచ్చావు ? .
Govt school సర్ .........
టీచర్స్ : అది ముందే చెప్పొచ్చుకదా ........ , క్వశ్చన్ తెలుగులో ఉంటే సాల్వ్ చేస్తావా ? .
చేసేస్తాను సర్ అని హుషారుగా చెప్పి చెమటను తుడుచుకున్నాను . 
మాథ్స్ టీచర్ : నాకు ప్యాడ్ అందించి మొదటి క్వశ్చన్ తెలుగులోకి మార్చారు .
ప్రక్కనే ఉన్న స్పేస్ లో క్షణాలలో పూర్తిచేసి ఆన్సర్ టిక్ కొట్టాను .
టీచర్ గుడ్ అంటూ ఒక్కొక్కటీ తెలుగులోకి మార్చడం - నేను చకచకా సాల్వ్ చేసేసాను . 
అలాగే సైన్స్ - సోషల్ పేపర్స్ పూర్తిచేసాను . 
మూడు సబ్జెక్ట్స్ లో 10 - 9 - 10 మార్క్స్ వచ్చాయి . 
గుడ్ గుడ్ గుడ్ మహేష్ అంటూ తమ రివ్యూ సర్కులర్ లో ఎంటర్ చేసి వెళ్లిపోయారు .
చివరగా ఇంగ్లీష్ టీచర్ ఒక ముసలాయన మిగిలారు . Govt స్కూల్ నుండి వచ్చావుకదా తోటి స్టూడెంట్స్ తో కలిసి వేగంగా ముందుకువెళ్లడం కాస్త కష్టమే ...... , నీ పరిస్థితి తెలిసింది కాబట్టి టెస్ట్ కూడా అవసరం లేదు అని సర్కులర్ అందుకుని రాసి pune వెళ్ళండి అని అందించారు .

Pune : బాబూ ....... ఇక వెళదాము అని హెడ్ మాస్టర్ రూమ్ కు పిలుచుకునివచ్చారు .
హెడ్ మాస్టర్ : 40 మినిట్స్ లో అయిపోయిందా ....... , అయితే మంచి స్టూడెంట్ మన స్కూల్లో చేరాడు అని సర్కులర్ అందుకున్నారు .
మురళి మొదలుకుని పిల్లలందరూ అసూయతో నావైపు కోపంతో చూస్తున్నారు . మేడం ....... మౌనంగా ఉన్నారు .
Pune : 20 మినిట్స్ లో పూర్తిచేసేసేవాడు సర్ కానీ ....... , టీచర్స్ వివరణ చూస్తే మీకే తెలుస్తుంది .
హెడ్ మాస్టర్ : తెలుగు 100 - హిందీ 100 - మాథ్స్ 100 - సైన్స్ 90 - సోషల్ 100 ......... wow wow wow ......... ఇలాంటి న్యూ స్టూడెంట్ రిజల్ట్స్ ఇప్పటివరకూ చూడలేదు . 
పిల్లలంతా ఉడికిపోతున్నారు ........
హెడ్ మాస్టర్ : wait wait ....... ఇంగ్లీష్ 0 - zero ....... టీచర్స్ explanations చదివి అర్థమైంది అర్థమైంది . మేడం ........ సబ్జెక్ట్స్ లో జీరో వచ్చి ఇంగ్లీష్ లో పాస్ అయినా అడ్మిషన్ ఇచ్చేవాళ్ళము - క్లాస్ లో ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది జీరో నాలెడ్జి  అంటే కష్టం జాయిన్ చేసుకోవడం కుదరదు మేడం sorry .........
పిల్లలందరూ హేళనగా నవ్వుకుంటున్నారు . ఇంగ్లీష్ జీరో జీరో .......

మేడం : అయితే మా ఏరియా పిల్లలు 30 మంది పిల్లల TC వెంటనే ఇచ్చెయ్యండి వేరే స్కూల్ చూసుకుంటాము ఇదిగో పేరెంట్స్ సిగ్నేచర్స్ అని లెటర్ చూయించారు.
హెడ్ మాస్టర్ : దాదాపుగా 50 lakhs ....... , నో నో నో మేడం అడ్మిషన్ ఇచ్చేస్తున్నాను కానీ డైలీ ......... 4 - 5 క్లాస్సెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్సెస్ కు అటెండ్ కావాలి , ఆ 4 - 5 క్లాస్సెస్ లో LKG - UKG ఒక క్లాస్ , 1 - 5 లో ఒక క్లాస్ - 6 - 10 లో రెండు మూడు క్లాస్సెస్ అటెండ్ కావాలి . ఇంగ్లీష్ టీచర్స్ ఇద్దరు LKG - 10 th ఏ క్లాస్ లో ఉన్నా ఆ క్లాస్ అటెండ్ అయ్యి రోజుకు 4 - 5 సిగ్నేచర్స్ పెట్టించుకుని నాకు చూయించాలి అలా అయితేనే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది .
పిల్లలు : LKG UKG క్లాస్సెస్ అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
మేడం : డన్ సర్ అని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి నా కళ్లెదురుగానే పెద్దమొత్తంలో అమౌంట్ పే చేసి బయటకువచ్చారు . మహేష్ ........ అందరితోపాటు క్లాస్ కు వెళ్లు ......... , సాయంత్రం డ్రైవర్ వస్తాడుకదా దారిలో కావాల్సిన బుక్స్ అన్నీ నీ సాలరీతో కనుక్కో అనిచెప్పారు .
అలాగే మేడం .........
మురళి : mom mom ........ అంటూ ప్రక్కకు లాక్కెళ్లాడు . Mom ....... ఇదంతా అవసరమా ? .
మేడం : నాన్నా ....... అంతా మీకోసమే - మీ సేఫ్టీ కోసం ఏమైనా చేస్తాము - ఎలాగో ఇంగ్లీష్ టీచింగ్ అర్థం కాక చివరన వెళ్లి నిద్రపోతాడు .
మురళి : కదా ....... సూపర్ మమ్మీ బై బై అంటూ అందరూ తమ తమ క్లాస్ లకు వెళ్లారు . నన్ను తన క్లాస్ కు తీసుకెళ్లారు . 
వెనుకే pune వచ్చి క్లాస్ టీచర్ కు సర్కులర్ అందించారు .
టీచర్ : స్టూడెంట్స్ ......... new student మహేష్ అని క్లాస్ కు పరిచయం చేసి కూర్చోమన్నారు .
మురళి ప్రక్కన కూర్చోబోతే , నో అన్నట్లు ఒక చూపు చూడటంతో చివరన వెళ్లి కూర్చున్నాను .

ఒక్క తెలుగు వర్డ్ వాడకుండా మొత్తం ఇంగ్లీష్ లోనే సైన్స్ explain చేస్తుండటం చూసి ఏమీ అర్థం కాక బైర్లు కమ్ముతున్నాయి - ఇంతకుముందయితే govt స్కూల్లో శ్రద్ధగా విని డౌట్స్ అక్కడక్కడ clarify చేసుకుని అర్థం చేసుకునేవాడిని - ఇక్కడ టీచింగే అర్థం కావడం లేదు ఇక డౌట్స్ ఎలా వస్తాయి .
మురళి వాళ్ళు ........ వెనక్కుతిరిగితిరిగి చూస్తూ నవ్వుకుంటున్నారు . 
ఎలాగోలా రెండవ పీరియడ్ ఏమీ అర్థంకాక గడిచిపోయింది .

నెక్స్ట్ పీరియడ్ pune వచ్చి మహేష్ అంటూ పిలిచి నేరుగా గోల గోల చేస్తున్న LKG పిల్లల క్లాస్ కు తీసుకెళ్లి ఇంగ్లీష్ క్లాస్ అటూ లోపలికివెల్లమన్నాడు . 
ఈ విషయం తెలిసినట్లు మురళి వాళ్ళు వెనుకే వచ్చి నవ్వు ఆపడం లేదు .
మేడం గారికి మాట రానివ్వకూడదు అని తలదించుకుని లోపలికివెళ్లి చివరి బెంచ్ లో కూర్చున్నాను .
నేనే ఇంగ్లీష్ టీచర్ అనుకుని ( ఇంకా స్కూల్ డ్రెస్ లేకపోవడం - నా హైట్ చూసి ) బుజ్జి బుజ్జి పిల్లలందరూ సైలెంట్ అయిపోయి లేచి గుడ్ మార్నింగ్ సర్ అని విష్ చేశారు .
మురళి వాళ్ళతోపాటు pune నవ్వుకుని , పిల్లలూ ....... ఆ అన్నయ్య పేరు మహేష్ మీలానే స్టూడెంట్ అనిచెప్పడంతో షాక్ అయ్యి నావైపు చూసి నవ్వుకుని వాళ్ళ వాళ్ళ గోలలో పడిపోయారు .

ఇంగ్లీష్ టీచర్ రావడంతో మురళి వాళ్ళు నవ్వుకుంటూ వెళ్లిపోయారు . బుజ్జిపిల్లలతోపాటు నేనూ లేచి గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చున్నాను .
టీచర్ : మహేష్ ........ అనుకున్నాను ఇక్కడే కలుస్తాము అని అంటూ నవ్వుకున్నారు 80 ఏళ్ల వయసు పైనున్న సర్ ........
Pune వచ్చి సర్ ఇది మహేష్ స్పెషల్ ఇంగ్లీష్ క్లాస్సెస్ అటెండెన్స్ , అటెండెన్స్ వేసి మహేష్ కు ఇవ్వండి అనిచెప్పి వెళ్లిపోయారు .
A for Apple తో మొదలుపెట్టడం చూసి నాకు నవ్వు ఆగడం లేదు. 
టీచర్ : మహేష్ ........ A for Apple తెలుసుకదా ........
సర్ ........ 
టీచర్ : Ok ok అని నవ్వుకుని బుజ్జిపిల్లలకు అర్థమయ్యేలా సూపర్ టీచింగ్ చేశారు .
థర్డ్ పీరియడ్ పూర్తయినట్లుగా బెల్ మ్రోగగానే , ఇంటర్వెల్ ఇంటర్వెల్ అంటూ సర్ కంటే ముందుగానే బుజ్జాయిలు పరుగున బయటకువెళ్లిపోయారు .
టీచర్ : మహేష్ ........ ఇంటర్వెల్ తరువాత 7th A క్లాస్ కు వచ్చెయ్యి అనిచెప్పి వెళ్లిపోయారు .

హమ్మయ్యా ........ UKG అనలేదు సేఫ్ అనుకుని మా క్లాస్ కు వెళ్లి , మేడం ఆర్డర్ వేసినట్లుగానే మురళి వాళ్ల వెనుకే నడిచాను . అందరూ గ్రౌండ్ చేరుకుని ఆడుకుంటున్నారు .
మురళి : మహేష్ ........ ఇంగ్లీష్ లో జీరో వచ్చిన నువ్వు , మాతోపాటు ఆడితే మా పరువు పోతుంది అదిగో అక్కడ దూరంగా ఆడుకో అని పంపించారు .
ఇంటర్వెల్ కోసం వారం రోజుల నుండీ గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్న బస్తీ పిల్లలు స్కూల్ కాంపౌండ్ గోడను దూకివచ్చి మురళి గోవర్ధన్ వాళ్ళందరినీ చుట్టుముట్టారు . రేయ్ భలే దొరికారురా ఈ గోలలో మేము కొట్టే దెబ్బలకు కేకలువేసినా ఎవ్వరికీ వినిపించవు - రేయ్ ఇష్టమొచ్చినట్లుగా కుమ్మేయ్యండిరా .......... 
మురళివాళ్ళు చుట్టూ చూసి ఒకరినొకరు పట్టుకుని భయంతో వణుకుతూ సెక్యూరిటీ సెక్యూరిటీ సర్ సర్ ........ అని గట్టిగా కేకలువేశారు .
బస్తీ పిల్లలు : రేయ్ ....... చెప్పాముకదా ఈ గోలలో వినిపించదు అని , వినిపించినా మెయిన్ గేట్ దగ్గర నుండి సెక్యూరిటీ - స్టాఫ్ రూమ్ నుండి సర్ వాళ్ళు రావడానికి నిమిషం పైనే పడుతుంది - ఈ గ్యాప్ చాలు మా కసితీరా కుమ్మేసి వెళ్లిపోతాము అని గట్టిగా నవ్వుతూ ముందుకువస్తున్నారు .

గోవర్ధన్ - వినయ్ : మహేష్ ....... మహేష్ ఎక్కడ ? మహేష్ మహేష్ అంటూ భయంతో కేకలువేశారు .
అంతే మరుక్షణంలో పరుగున వారిదగ్గరికి చేరిపోయాను .
నన్ను చూడగానే నువ్వు నువ్వు ...... ఇక్కడ ...... అంటూ లాస్ట్ సోమవారం దెబ్బలుతున్న ఐదుగురు భయంతో వెనక్కు అడుగులువేస్తూనే కిందకు పడిపోయారు . 
మిగిలిన బస్తీ పిల్లలు : రేయ్ ....... ఏంట్రా ఒక్కడిని చూసి ఐదుగురు భయపడుతున్నారు . మనం 10 మందిమి ఉన్నాము కదరా .......
దెబ్బలు తిన్నవాళ్ళు : టీం మొత్తాన్ని ఇంకా వీలైతే extraa ప్లేయర్స్ ను కూడా పిలుచుకునిరమ్మని చెప్పినది వాడేరా ....... వెనక్కు రండి వెనక్కు రండి - వారం రోజులు పైకిలేవడానికే కష్టమైపోయింది ఆ దెబ్బలకు , ఒంటి చేతితోనే ఐదుగురిని కుమ్మేశాడు ఇక ఇప్పుడు ఫిట్ గా ఉన్నాడు ఎలాకొడతాడో మీరే ఊహించుకోండి అని భయంతో పరుగుపెట్టి గోడను దూకేశాడు .
మిగతావాళ్ళు కూడా భయపడిపోయి వెనుకే గోడను దూకి వెళ్లిపోయారు .
గోవర్ధన్ వినయ్ : థాంక్యూ థాంక్యూ మహేష్ ....... , నువ్వులేకపోయుంటే రక్తం వచ్చేలా కొట్టేవాళ్ళు - రేయ్ మురళీ ........ థాంక్స్ చెప్పరా ........
మురళి : భయాన్ని లోలోపలే దాచేసుకుని బయటకు మాత్రం వాడి డ్యూటీ చేసాడు , 2 లక్షలు కట్టి స్కూల్లో చేర్పించాము , ఈ మాత్రం చెయ్యకపోతే ఎలా ..... అని బిల్డింగ్ వైపుకు అడుగులువేశాడు .
గోవర్ధన్ : రేయ్ మురళీ ....... ఒంటరిగా వెళ్లకు , బస్తీ పిల్లలు చాలా కోపంతో ఉన్నారు .
అంతే ఆగిపోయి ప్రక్కనే ఉన్న బెంచిపై కూచున్నాడు . 
గోవర్ధన్ వాళ్ళు లోలోపలే నవ్వుకున్నారు . 
మురళీ సర్ ........ మీవెంటే నేనుంటాను .
మురళి : బెల్ కొట్టాకనే వెళదాము .
గోవర్ధన్ వాళ్ళు వచ్చి , మహేష్ ........ ఇంతలా వాళ్ళను ఎప్పుడు భయపెట్టావు సూపర్ చూడగానే ఉచ్ఛపోసుకున్నారు అని సంతోషంతో చెప్పారు .
TC తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అటాక్ చేశారు .........
వినయ్ : అటాక్ వాళ్ళు చేస్తే కౌంటర్ అటాక్ నువ్వు గిఫ్ట్ ఇచ్చావు అన్నమాట అని కౌగిలించుకున్నాడు . 

బెల్ వినిపించడంతో మురళి వాళ్ళను క్లాస్ లో వదిలి , నేను 7th క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ కు అటెండ్ అయ్యాను .
7th క్లాస్ స్టూడెంట్స్ అందరూ వింతగా చూస్తున్నారు .
సర్ వచ్చి నాకు స్పెషల్ అటెండెన్స్ వేసి , నానా గురించి చెప్పారు . 
అంతే పిల్లలందరూ నవ్వుకుంటున్నారు .
అయ్యో ....... లెర్నింగ్ లా లేదు పనిష్మెంట్ లా ఉంది . అందులోనూ ఈ సర్ ఒకరు వయసు పైబడింది కదా నెమ్మదిగా చెబుతారు - నిద్రవచ్చేస్తుంది అయినా తప్పదు మరి .........
క్లాస్ పూర్తిచేసుకుని మరొక నా 10th మాథ్స్ క్లాస్ పీరియడ్ అటెండ్ అయ్యాను . ప్రాబ్లమ్స్ అర్థం అవుతున్నాయి కానీ పదాలు అర్థం కావడం లేదు . ఆ తరువాత లంచ్ బెల్ ........ మురళి వాళ్ళతో కలిసి కాస్త దూరంగా కూర్చుని తిన్నాను . మధ్యాహ్నం కూడా రెండు నా క్లాస్ లు , రెండు ఇంగ్లీష్ క్లాస్సెస్ పూర్తిచేసాను . లాంగ్ బెల్ కొట్టగానే హమ్మయ్యా అనుకున్నాను .

క్లాస్ మొత్తం హుషారుగా పరుగుపెట్టినా మురళి వాళ్ళు మాత్రం నాకు ఇరువైపులా నడిచారు .
మురళి సర్ ....... ఒక్కసారి మాటిచ్చానంటే ప్రాణాలు వదిలి అయినా నిలబెట్టుకుంటాను . మీరు దైర్యంగా వెళ్ళండి ఎంత దూరంలో ఉన్నా క్షణాల్లో మీ ముందు ఉంటాను .
గోవర్ధన్ వినయ్ వాళ్ళు : అమ్మో ........ మాకు భయం అని కార్లవరకూ నా తోపాటే వచ్చారు .

మురళి : డోర్ తీసుకుని వెనుక కూర్చుని , మహేష్ ముందు కూర్చో అని ఆర్డర్ వేసాడు .
ముందు కూర్చుని , మురళి సర్ ........ మేడం చెప్పారుకదా బుక్స్ తీసుకోమని తీసుకెళతారా ? .
మురళి : డ్రైవర్ ....... ఆ సంగతి ఏమిటో చూడు అని హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు .
డ్రైవర్ : మహేష్ ఎక్కడికి ? .
థాంక్స్ మురళి సర్ , అన్నా ....... ఏదైనా బుక్ స్టోర్ కు తీసుకెళ్లండి అనిచెప్పాను .
డ్రైవర్ : సిటీలోనే బిగ్గెస్ట్ షాప్ కు తీసుకెళతాను తమ్ముడూ ........ సీట్ బెల్ట్ పెట్టుకో ........
15 నిమిషాలలో చేరుకున్నాము . కిందకుదిగి ఏ ఏ బుక్స్ అవసరమో తెలియక మురళి వైపు చూసాను . హెడ్ ఫోన్ పెట్టుకుని కళ్ళుమూసుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాడు . మురళి సర్ మురళి సర్ అని ఎంతపిలిచినా పలకడం లేదు . ఏమిచెయ్యాలో తెలియక నిరాశ చెందాను .
నా పరిస్థితిని చూసి తమ్ముడూ అంటూ కన్నుకొట్టి ఆపకుండా హార్న్ సౌండ్ చేస్తూనే ఉన్నాడు .
వినిపించినట్లు ఉలిక్కిపడ్డాడు మురళి . వెంటనే సైలెంట్ అయిపోయాడు డ్రైవర్ .
మురళి : ఏమైంది అంటూ హెడ్ ఫోన్స్ మెడ పైకి జార్చి అడిగాడు .
డ్రైవర్ : నథింగ్ మురళి సర్ ........
అంటే నేనే కాదు అందరూ మురళి సర్ అని పిలిచేలా చేసుకున్నాడన్నమాట అని మనసులో అనుకున్నాడు . ఫ్యామిలీ అంతా పనివాళ్లను ఎలా చూస్తారో అర్థమైంది.

మురళి సర్ ........ ఏ బుక్స్ తీసుకోవాలో నాకు తెలియదు సహాయం చేస్తారా ... ?.
మురళి : మొదట కోప్పడినా ........ , నేను బ్రతిమాలుకోవడం చూసి shit shit అంటూ నాతోపాటు షాప్ లోపలికి వచ్చి సేల్స్ బాయ్ కు లిస్ట్ చెప్పి బయటకువెళ్లిపోయాడు . ఎక్కడ బస్తీవాళ్ళు ఉన్నారేమోనని రెండువైపులా తొంగిచూసి పరుగున కారులోకి చేరి డోర్ క్లోజ్ చేసేసుకున్నాడు .
సేల్స్ బాయ్ తీసుకొచ్చిన బుక్స్ కు అమౌంట్ పే చేసాను . పెద్దమ్మా ........ డబ్బు అవసరం అవుతుందని అవ్వల ద్వారా సగం నాకు ఇప్పించారు థాంక్యూ soooooo మచ్ - దేవతలా నాకు దారిని చూయిస్తున్నారు అని గుండెలపై చేతినివేసుకుని తలుచుకున్నాము . బుక్స్ తీసుకుని కారులో కూర్చుని ఇంటికిచేరుకున్నాము .
Like Reply
నేరుగా కారు కాంపౌండ్ లోపలికివెళ్లి ఆగింది . గోవర్ధన్ - వినయ్ వాళ్ళతోపాటు మేడం వాళ్లంతా కారు దగ్గరికి చేరుకున్నారు .
బుక్స్ పట్టుకుని కిందకుదిగగానే , మహేష్ మహేష్ ........ మా నమ్మకాన్ని నిలబెట్టావు . వారం ముందు గ్రౌండ్ లో - ఈరోజు స్కూల్లో మా సర్వస్వమైన బిడ్డలను కాపాడావు అని థాంక్స్ చెప్పారు .
మేడమ్స్ ........ నా డ్యూటీ చేసాను అంతే అని బుక్స్ బెంచ్ పై ఉంచాను .
వినయ్ : మమ్మీ మమ్మీ ........ 8 మంది పైనే వచ్చారు మమ్మల్ని కొట్టడానికి , మహేష్ ను చూసి వెనక్కు తిరిగిచూడకుండా పరుగో పరుగు అని నవ్వుతూ చెప్పారు .
మేడమ్స్ : మహేష్ ........ ఇలానే మా పిల్లల ప్రక్కనే ఉండాలి .
అలాగే మేడం ....... , నన్ను అంతపెద్ద స్కూల్లో జాయిన్ చేశారు - అనుక్షణం ప్రక్కనే ఉండి చూసుకుంటాను .

మురళి : మమ్మీ ........ మమ్మల్ని కొట్టడానికి వచ్చినవాళ్లను కొట్టకుండా వదిలేసాడు . 
మేడం : మహేష్ .........
క్షమించండి , పట్టుకుని కొట్టడం ఎంతసేపు మురళి సర్ ........ , అలాచేస్తే మనపై మరింత పగతో రగిలిపోతారు - టైం కోసం ఎదురుచూసి ఏదో ఓకేసమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు దాడిచేస్తారు - అలాకాకుండా వదిలెయ్యడం వలన ఈ భయంతో మన జోలికి రావడమనే ఆలోచనే రాదు - మేడమ్స్ ....... మీరు ఆర్డర్ వెయ్యండి ఇప్పుడేవెళ్లి ఆ బస్తీ పిల్లలు ఎక్కడ ఉన్నా కట్టేసి మీముందు పడేస్తాను - మీకోసం ఏమైనా చేస్తాను .
మేడమ్స్ : నో నో నో ....... మంచిపనిచేశావు మహేష్ . మనమంటే ఉన్న భయమే వాళ్ళు మరొకసారి ఇలా చెయ్యడానికి సాహసం చెయ్యరు . మురళీ ......... మహేష్ చేసినదే కరెక్ట్ అని మరొకసారి థాంక్స్ చెప్పి డబ్బుని అందించారు .
వద్దు వద్దు మేడమ్స్ ....... చోటు - ఫుడ్ - సాలరీ ఇస్తున్నారు కదా ........
మేడమ్స్ : ఇష్టంతో ఇస్తున్నాము తీసుకో , చాలా బుక్స్ కొన్నట్లు ఉన్నావు . ఇంకా చాలా అవసరమవుతాయి అని అందించి వెళ్లిపోయారు . 
మేడం : అందరూ చెప్పినట్లు ఆ పిల్లలను భయపెట్టి మంచిపనిచేశావు అని భుజం తట్టారు .
అధిచూసి మురళి కోపంతో లోపలికివెళ్లిపోయాడు . 

మేడం ......... మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను .
మేడం : ఆలోచించి చెప్పు అన్నారు .
మేడం ......... మురళి అనుమతి తీసుకుని , బస్తీపిల్లల బెట్టింగ్ డబ్బు మరియు బ్యాట్స్ తిరిగిఇచ్చేస్తే మరింత మంచిది అనుకుంటున్నాను అని తలదించుకున్నాను . 
మేడం : పిల్లలను ఒప్పించడం కష్టమే అయినా ఒకసారి మీ మేడమ్స్ అందరితో మాట్లాడుతాను అని లోపలికివెళ్లారు .
బుక్స్ - కొత్త బ్యాగ్ అందుకుని ఔట్ హౌస్ లోకివెళ్లి ఫ్రెష్ అయ్యాను . గంట సమయం అయినా మురళి పిలవకపోవడంతో టెక్స్ట్ బుక్స్ కు నీట్ గా కవర్స్ వేసుకున్నాను - మేడం వాళ్ళు ఇచ్చిన డబ్బుని లెక్కవేస్తే 5 వేల దాకా ఉంది - ఈ డబ్బుని ఇలాగే ఉంచుకుని సాలరీతోపాటు మొత్తం డబ్బులతో పిల్లలకు ఏమైనా తీసుకెళ్లాలి అని ఆనందించాను .
నైట్ భోజనం చేసి బెడ్ పైకి చేరాను - జీవితంలో మొదటిసారి కార్ లో ప్రయాణించాను అని మురిసిపోతున్నాను , ఇలానే అవ్వలు - పిల్లలు కూడా కారులో చిరునవ్వులు చిందిస్తూ వైజాగ్ మొత్తం చుట్టేయ్యడం చూడాలి అని నెరవేరని కోరిక తలుచుకుంటూ నిద్రలోకిజారుకున్నాను . 

తరువాతిరోజు బ్రేక్ఫాస్ట్ తోపాటు మురళి పాత స్కూల్ డ్రెస్ ను మేడం పంపించారని పనిమనిషి అక్క అందించారు . 
స్కూల్ డ్రెస్ వేసుకుని , బ్యాగులో బుక్స్ పెట్టుకుని మెయిన్ గేట్ దగ్గరికివచ్చాను . 
మురళి స్కూల్ బ్యాగుపట్టుకుని వెనుకే వచ్చారు మేడం . మహేష్ ....... నువ్వు ఇచ్చిన ఐడియా అందరికీ నచ్చింది . సెక్యూరిటీతో బెట్టింగ్ డబ్బు - బ్యాట్స్ ...... బస్తీ పిల్లలకు అందేలా చూస్తాము .
థాంక్స్ మేడం అనిచెప్పి కారు వెనుక డోర్ తెరిచాను . మురళి దర్జాగా ఎక్కి కూర్చున్నాడు - మేడం నుండి బ్యాగు - లంచ్ బాక్సస్ అందుకుని లోపల ఉంచి ముందు కూర్చున్నాను . డ్రైవర్ ...... స్కూల్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు . 
నిన్నటిలానే అర్థం కాని ఇంగ్లీష్ టీచింగ్ - బోర్ కొట్టే రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్స్ క్లాస్ లతో పనిష్మెంట్ లా మూడు వారాలపాటు meaning less గా గడిచిపోయాయి ( evenings మరియు sundays ఆటలతో ) .

ఒక friday స్కూల్ నుండి ఇంటికిరాగానే , మహేష్ ....... ఈరోజుతో నెలరోజులు గడిచాయి - ఈ నెలరోజులూ ........ మేము చెప్పినట్లుగానే మా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నావు - ఇదిగో నీ సాలరీ అని కవర్ అందించారు .
మేడం ....... అడ్వాన్స్ కంటే ఎక్కువ ఉన్నట్లుంది . 
మేడం : నీ మేడమ్స్ అందరూ సంతోషంగా ఇచ్చారుమరి అని లోపలికివెళ్లారు .

ఔట్ హౌస్ లోకి చేరి చూసుకున్నాను . అంత డబ్బును చూసి నోటివెంట మాటరాలేదు . ప్చ్ ....... రేపే ఆదివారం అయితే ఎంతబాగుణ్ణు అంటూ పెదాలపై చిరునవ్వుతోనే డబ్బుని జాగ్రత్తగా దాచాను . ఫ్రెష్ అయ్యి చదువుకుందామంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇంగ్లీష్ లోనే ఉండటం వలన ఓపెన్ చేసేందుకు ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు .
అంతలోనే మురళి నుండి కాల్ రావడంతో సంతోషంగా చిన్న గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్ళిపోయాను . రాత్రంతా కూడా saturday అలా స్కిప్ అయిపోతే ఎంత బాగుంటుందో అని తలుచుకుంటూనే నిద్రపోయాను .

ఉదయం రోజూలానే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్ డ్రెస్ లో గేట్ దగ్గరికి చేరుకున్నాను .
మురళి బాల్ బ్యాట్ తీసుకుని కలర్ డ్రెస్ లో బయటకువచ్చి , స్కూల్ బ్యాగ్ - స్కూల్ డ్రెస్ లో ఉన్న నన్నుచూసి నవ్వుతున్నాడు . బయట నుండి సేమ్ గెటప్స్ లో గోవర్ధన్ వాళ్ళు వచ్చి మహేష్ మహేష్ ........ అంటూ నవ్వుకుంటున్నారు .
మురళి సర్ , గోవర్ధన్ ........ ఈరోజు స్కూల్ కు వెళ్లడం లేదా ? .
గోవర్ధన్ : ఈరోజు స్కూలే లేదు మహేష్ ........
ఆశ్చర్యంగా చూస్తున్నాను .
వినయ్ : మహేష్ ....... ఈరోజు సెకండ్ సాటర్డే మరిచిపోయావా ? .
కదా అంటూ సిగ్గుపడ్డాను . అందరితోపాటు నవ్వుతూనే ఔట్ హౌస్ లోకి పరుగుతీసాను . రాత్రి స్కిప్ చెయ్యమని కోరితే ఇలా కోరిక తీర్చారా దేవతలూ ....... నా దేవత పెద్దమ్మ కదా , పెద్దమ్మా ........ థాంక్యూ soooooo మచ్ అని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను . అవ్వల దగ్గరికి వెళ్ళాలి , మురళి వాళ్లేమో బ్యాట్స్ తో రెడీగా ఉన్నారు ఇప్పుడెలా ఎలాగైనా వెళ్ళాలి అని డబ్బును - మొబైల్ ను జేబులో పెట్టుకున్నాను . 

బయటకువచ్చి మురళి దగ్గరికివెళ్ళాను . మురళీ ........ ఇంగ్లీష్ టీచర్ చెప్పారు సోమవారం స్కూల్ కు వచ్చేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తీసుకురమ్మని వెళ్లి తీసుకువస్తాను .
మురళి : రేపు వెళ్ళొచ్చులే , మ్యాచ్ ఆడాలని రెడీ అయిపోయాము .
గోవర్ధన్ : రేపు ఎలా కుదురుతుంది , రేపు సెక్యూరిటీ వాళ్ళతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నాము కదా ........ 
మురళి : మరిచేపోయాను ....... , మహేష్ ....... ఒక్క బుక్ కదా తొందరగా వెళ్లి తీసుకొచ్చేయ్ ........
( ఈ కొద్దిసమయం సరిపోదు - సాయంత్రం వరకూ నా ప్రాణమైన వాళ్ళతో సరదాగా గడపాలి - చూసి మూడు వారాలవుతోంది ) ఇప్పుడెలా , మురళి సర్ .... ఇప్పటివరకూ జూ చూడలేదు , బుక్ కొనుక్కొని చూసి రావాలని చిన్నప్పటి నుండి ఆశ ...... please please నన్ను వెళ్ళనివ్వండి .

నామాటలు మేడం విన్నట్లు , నాన్నా మురళీ ........ పంపించు పాపం అన్నారు .
మురళి : మమ్మీ చెప్పింది కాబట్టి ఈసారికి ok వెళ్లు ........
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మురళి సర్ అని చేతిని అందుకోబోతే విధిలించాడు .
వినయ్ : మురళీ ....... మనం కూడా మహేష్ తో పాటు వెళితే ఎలా ఉంటుంది .
ఇప్పుడెలా ......... , ఒప్పుకోనే ఒప్పుకోడులే అని కాన్ఫిడెంట్ గా 3 2 1 .......
మురళి : మహేష్ గాడితోపాటు వెళ్లడం ఏమిటి , వాడు బస్ లో మనం కారులో వెళదాము కొత్తబట్టలు వేసుకుని రెడీ అయ్యి ........ మహేష్ నువ్వు వెళ్లు .
హమ్మయ్యా ........ థాంక్ గాడ్ నో నో నో థాంక్ పెద్దమ్మ అని మనసులోనే నవ్వుకుని ఏరియా బయటకువచ్చాను . బస్తీ గుండా వెళుతుంటే మళ్లీ ఎవర్ ఫాలో అవుతున్నట్లు అంతలోనే బస్తీ పిల్లలు నా ముందుకువచ్చి , మహేష్ ....... థాంక్యూ మా డబ్బులు వడ్డీతోసహా చేరాయి - మా బ్యాట్స్ ఇచ్చేసారు నువ్వే చెప్పావట కదా సెక్యూరిటీ అన్నలు చెప్పారు ఇకనుండీ మీజోలికి రాము వెళ్లు అని దారిని వదిలారు .
అయితే ఇకనుండీ మనం ఫ్రెండ్స్ , వీలైతే కలసి క్రికెట్ ఆడుదాము అని చేతులుకలిపి బయలుదేరాను .
సిటీ సెంటర్ చేరుకుని పిల్లలకోసం రెండు బుజ్జి సైకిళ్ళు - పాపాయిలకోసం ఆటవస్తువులు తీసుకుని లగేజీ ఆటోలో ఇంటికిచేరుకున్నాను .

ఆశ్చర్యం కాదు కాదు షాక్ ........ , క్రికెట్ గ్రౌండ్ కంటే పెద్దదైన కాంపౌండ్ గోడ నిర్మించినట్లు , సెక్యురిటి గల మెయిన్ గేట్ పై " అవ్వ అనాధశరణాలయం " బోర్డ్ తో స్వాగతం పలకడం చూసి షాక్ ఆ వెంటనే అమితమైన ఆనందం కలుగుతోంది .
సైకిళ్ళు - బొమ్మలు కిందకుదించి ఆటో కు పే చేసి పంపించి , లోపలికి వెళ్లబోతే సెక్యూరిటీ ఆపాడు .
అంతలోనే లోపల ఆడుకుంటున్న పిల్లలు చూసి , అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ అందరూ పరుగునవచ్చి నన్ను లోపలికి పిలుచుకునివెళ్లారు . సెక్యూరిటీ అన్నా ........ మా అన్నయ్య ఎప్పుడు వచ్చినా వదలాలి అని ఆర్డర్ వేశారు .
లోపల చూస్తే మరింత ఆశ్చర్యం .........
పిల్లలు : అవ్వలూ అవ్వలూ ....... అన్నయ్యలు వచ్చారు . సైకిళ్ళు బోలెడన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు అని కేకలువేశారు . అన్నయ్యా ....... ఏంటి అలా చూస్తున్నారు మన పెద్దమ్మే ఇలా చిన్న ఇళ్లను ఇంతపెద్ద అనాధ శరణాలయం లా మార్చేశారు . అదిగో అక్కడ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు ( అప్పుడే బేస్మెంట్ వరకూ పనులు పూర్తయ్యాయి ) - అన్నయ్యా ........ అదిగో అక్కడ ఉన్న కార్లు కూడా మనవే పెద్దమ్మ మనకోసం ఎక్కడికైనా వెళ్ళడానికి ........ కార్లలోనే జూ - వండర్ లా - మూవీస్ ........ ఇలా రోజూ ఒకచోటకు వెళ్ళాము తెలుసా భలే ఎంజాయ్ చేసాము - మీరు కూడా ఉండి ఉంటే బాగుండేది .
రాత్రి కోరుకున్న కోరికను ఎప్పుడో తీర్చేసారా పెద్దమ్మా ...... మా దేవతా ....... , చుట్టూ చూసి మాటల్లో వర్ణించలేనంత ఆనందం కలుగుతున్నట్లు పరవశించిపోతున్నాను . పిల్లలూ ........ మీరు ఎంజాయ్ చేస్తే నేను చేసినట్లు కాదా ....... చెప్పండి .
అంతలో అవ్వలు వచ్చి మహేష్ మహేష్ వచ్చావా నాయనా అంటూ కౌగిలించుకున్నారు . 
అవ్వల ఆనందం చూస్తే ఇక ఈ జీవితానికి ఈ సంతోషం చాలు అని అవ్వా అవ్వా ........ చాలా చాలా ఆనందం వేస్తోంది . మిమ్మల్ని ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూస్తున్నాను అని చేతులను అందుకుని శరణాలయం మొత్తం చిరునవ్వులు చిందిస్తూ రౌండ్ వేశాము .
అవ్వలు : నాయనా మహేష్ ........ ఇదంతా నీవల్లనే మహేష్ , నువ్వు కోరుకున్నావని చిన్న ఇళ్లను ఇలా మార్చేసింది పెద్దమ్మ - మేము కారులో తిరగాలని కోరుకున్నావని వెంటనే కార్లు తీసుకొచ్చేసారా .
అయ్యో ........ అలా అయితే ఈ విషయం తెలిసి ఉంటే నా అవ్వలు - పిల్లలు పాపాయిలు ఫ్లైట్ ఎక్కి ఆకాశంలో విహరించాలని కోరుకునేవాన్ని నాకు బుద్ధే లేదు.
అందరూ నవ్వుకున్నారు . అంతలో కొరియర్ బాయ్ వచ్చి మహేష్ కు కొరియర్ అంటూ కవర్ అందించి సంతకం చేయించుకుని వెళ్ళిపోయాడు .
ఆశ్చర్యపోయి ఏముందబ్బా అని ఓపెన్ చేసి చూస్తే " ఇండియన్ ఎయిర్లైన్స్ టికెట్స్ " అవ్వలూ ....... అంటూ సంతోషంతో కౌగిలించుకున్నాను - పిల్లలూ ....... ఇవి ఏమిటో తెలుసా రేపు మీరందరూ విమానం ఎక్కబోతున్నారు అని ఇద్దరిని ఎత్తుకుని ముద్దులుపెట్టాను . 
పిల్లల సంతోషాలకు అవధులు లేవు . అన్నయ్యా అన్నయ్యా ....... మరి మీరు ? .
మీరు ఎంజాయ్ చేస్తే నేను ఎంజాయ్ చేసినట్లే కదా ........ , రేపు నేను బయటకు రావడం కుదరదు - ఈరోజుకూడా అపద్దo చెప్పి వచ్చాను మిమ్మల్ని చూడటం కోసం - ఇక్కడకు వచ్చాక మరింత ఆనందం ........ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పెద్దమ్మా ఇలా కోరుకోగానే తీర్చేశారు మీరు నిజంగా దేవతే అని ప్రార్థించాను - కానీ నాకుమాత్రం కనిపించడం లేదు పర్లేదు పర్లేదు ....... పిల్లల సంతోషాలలో మిమ్మల్ని చూసుకుంటానుగా ........
అవ్వలు : నాయనా మహేష్ ........ ఇక నువ్వుకూడా ఇక్కడికే వచ్చేయ్యొచ్చు కదా , ఇంత విశాలమైన శరణాలయం ........
అంతకంటే అదృష్టమా అవ్వలూ ....... కానీ అక్కడ మాట ఇచ్చేసాను . మాట తప్పడం అంటే ప్రాణాలు వదలడమే - కష్టంలో ఉన్నప్పుడు వారే సహాయం చేసారు ఇప్పుడు వదిలి రావడం తప్పు . మీరు ఇక్కడ సంతోషంగా ఉంటే అదే చాలు నాకు అని భోజనం చేసి సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసి వెళ్ళొస్తానని చెప్పాను .
అవ్వ : నాయనా మహేష్ ........ చెప్పడం మరిచిపోయాము . పెద్దమ్మ మరొక మాటకూడా చెప్పారు - అతిత్వరలో నీ జీవితంలోకి " నువ్వు ప్రాణమిచ్చే , నీకోసం ప్రాణమిచ్చే ఆత్మీయులు " రాబోతున్నారట .........
అవునా అవ్వలూ ........ మన దేవత పెద్దమ్మ చెబితే ok అని ఆశీర్వాదం తీసుకుని తిరుగుప్రయాణమయ్యాను . " నేను ప్రాణమిచ్చే - నన్ను ప్రాణంలా చూసుకునే ఆత్మీయులు ఎవరై ఉంటారబ్బా " ..................
Like Reply
Vere level
[+] 2 users Like Sudharsangandodi's post
Like Reply
Superb excellent
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
Namaskar Namaskar  Mahesh Garu Superb No Word's Only  Iex Iex Iex Thank you very much  Namaskar
[+] 1 user Likes arkumar69's post
Like Reply




Users browsing this thread: 20 Guest(s)