Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అంకుల్ : మహేష్ మహేష్ .......... మన కంపెనీ లోగో ఉన్న సూట్ వేసుకునిరా its must ఫర్ ఫోటో ............
అంకుల్ .......... మిమ్మల్నీ .......... అని మళ్ళీ అపార్ట్మెంట్ వైపుకు పోనిచ్చాను . అపార్ట్మెంట్ చేరుకుని లోపలికి పరుగుతీసాను లిఫ్ట్ ఎంత ప్రెస్ చేసినా ఇంకా పైనే ఉండటంతో స్టెప్స్ ద్వారా చేరుకుని , డోర్ దగ్గర నుండే డ్రెస్ తీసి విసిరేసి బెడ్ పై గల " red- white mixed " సూట్ ధరించి చెమటలతోనే కిందకువచ్చి సమిట్ చేరుకునేసరికి 2 గంటలు అయ్యింది . 

చెప్పినాకూడా అంకుల్ వాళ్ళు నాకోసం ఎంట్రన్స్ దగ్గరే ఎదురుచూస్తున్నారు . వెళ్లి అదే అడిగాను .
అంకుల్ : మా ఫ్యూచర్ బాస్ లేకుండా మేమెలా అని లోపలకు పిలుచుకునివెళ్లారు సమిట్ మొత్తం గెస్ట్స్ తో కిటకిటలాడుతోంది .
నా కళ్ళు మాత్రం దేవతకోసం నలువైపులా స్కాన్ చేస్తున్నాయి . 
ఒక అంకుల్ వచ్చి hi మహేష్ అంటూ సంతోషంతో పలకరించారు . మహేష్ ........ మా ఫ్యూచర్ చైర్మన్ లేకుండా ఫోటోలు ఎలా ........ - తీసుకున్నా వేస్ట్ , ఐదే ఐదు నిమిషాలు తరువాత నీ ఇష్టం ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము - its our turn , లెట్స్ go మహేష్ .......... , చైర్మన్ కాకముందే కలిసి తీయించుకున్న ఫోటో అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాము అని స్టేజీపైకి తీసుకెళ్లారు . సమిట్ కు ఒక ఫోటో కంపెనీకి ఒక ఫోటో అంకుల్ వాళ్లంతా తమ తమ మొబైల్స్ లో సెల్ఫీలు తీసుకుని ఎంజాయ్ చేశారు . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ అని కౌగిలించుకుని ఆనందించారు . 
Wish you the same అంకుల్స్ ......... అని స్టేజీపైనుండే దేవతకోసం కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి . 
అంకుల్స్ : మహేష్ మహేష్ ......... లెట్స్ have లంచ్ అని కిందకుదిగారు .
అలాగే అంకుల్ I'll join you అని బదులిచ్చి , నిన్న నా దేవత కనిపించిన టేబుల్ దగ్గరికి ఉత్సాహంతో పరుగుతీసాను - ఆ టేబుల్ పై ఒకకంపెనీ స్టాఫ్ లంచ్ చేస్తుండటం చూసి నిరాశచెందాను - లోపల మొత్తం అణువణువూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది , నాలానే ఆలస్యంగా ఇప్పుడేమైనా వచ్చి ఉండొచ్చు అని ఎంట్రన్స్ దగ్గర స్టార్ట్ చేసి మొత్తం మొత్తం మళ్లీ మళ్లీ వెతికినా నిరాశనే ఎదురయ్యింది - అలా సాయంత్రం 4 గంటలవరకూ బయట లోపల , లోపల బయట లంచ్ కూడా చెయ్యకుండా దేవతకోసం వెతుకుతూనే ఉన్నాను - సీసీ కెమెరాలలో ఏమైనా దేవత కనిపిస్తారేమోనని ఉదయం నుండీ రికార్డ్ అయిన ఫుటేజీ మొత్తం చెక్ చేసినా కనిపించలేదు .

అంతలో సమిట్ సైన్ ఔట్ చేసినట్లు ప్రకటించడంతో అందరూ లేచి చప్పట్లతో - కౌగిలింతలతో సెండ్ ఆఫ్ చెప్పుకుని బయటకు అడుగులువేశారు . సెక్యూరిటీ చెకప్ డోర్ దగ్గరకు చేరుకుని దేవత జాడకోసం చూసినా లాభం లేకపోయింది . 5 గంటలకల్లా సమిట్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది . 
కళ్ళల్లో కన్నీళ్లు ఆగనేలేదు . కనీసం దేవత నడిచి పునీతం చేసిన ఈ ప్రదేశంలోనైనా కాసేపు సెదతీరుదాము అని లోపలికి అడుగులు భారంగా పడ్డాయి. నిన్న నైట్ దేవత డిన్నర్ చేసిన టేబుల్ దగ్గరకుచేరుకుని దేవత కూర్చున్న కుర్చీ ప్రక్కనే కూర్చుని స్పృశించాను . నిన్న రాత్రి ఆకలివలన నేను ఆర్డర్ చెయ్యగానే వచ్చిన ఐటమ్స్ ను భయం భయంగా దిక్కులుచూస్తూ ఆతృతగా తినడం గుర్తుకువచ్చి పెదాలపై చిరునవ్వు చిగురించింది - అంతలా తినడంతో వెక్కిళ్ళు రావడంతో నా హృదయం చలించి బాయ్ బాయ్ వాటర్ అని కేకలువేస్తూ దేవత ఎదురుగా పోల్ పై సీసీ కెమెరా ఉండటం చూసి పెదాలపై మరింత చిరునవ్వుతో లేచివెళ్లి సీసీ కెమెరా నెంబర్ నోట్ చేసుకుని సెక్యురిటి రూమ్ వైపు పరుగుతీసాను . 
సమిట్ ఐడెంటిటీ చూయించి నిన్నటి ఫుటేజీ కావాలని అడిగాను . 
సెక్యురిటి లోపలికి తీసుకెళ్లి , సర్ టైం అని అడిగాడు .
డిన్నర్ టైం - కెమెరా నెంబర్ 12 ......... 
సెక్యురిటి : నిన్న రికార్డ్ అయిన మెమోరీ కార్డ్ ను సేఫ్టీ బాక్స్ నుండి తీసి ఫాస్ట్ ఫార్వార్డ్ లో డిన్నర్ టైం కు తీసుకెళ్లి ప్లే చేసాడు .
ఫార్వార్డ్ ఫార్వార్డ్ .......... thats it స్టాప్ స్టాప్ .......... కొద్దిగా బ్యాక్ బ్యాక్ .......
సెక్యురిటి బ్యాక్ వచ్చి ప్లే చేసాడు .
అన్నీ స్క్రీన్స్ పై నా దేవత బిక్కుబిక్కుమంటూ సైలెంట్ గా కూర్చుని ఉండటం చూసి పెదాలపై చిరునవ్వు ఆగలేదు . గుండెలపై చేతినివేసుకుని అలా చూస్తుండిపోయాను . 
సెక్యురిటీ సెక్యూరిటీ .......... అని మాటలు వినిపించడంతో , సర్ ........ టచ్ చెయ్యకండి అనిచెప్పి బయటకువెళ్లాడు .
వెంటనే మొబైల్ తీసి దేవత వచ్చి టేబుల్ లో కూర్చోవడం దగ్గర నుండి తన మాన్స్టర్ హస్బెండ్ పరాయివాళ్లకే సపోర్ట్ ఇస్తూ కట్టుకున్న భార్యను బయటకు చూయించి గెట్ ఔట్ అనడం - దేవత ఏడుస్తూ కన్నీళ్ళతో అడుగులువెయ్యడం వరకూ కాపీ చేసుకుని దేవుడా ......... చివరికి ఈ చిరు సంతోషాన్నైనా ఇచ్చినందుకు థాంక్స్ అని తలుచుకుంటూ బయటకువచ్చాను . సెక్యురిటీ ఎదురుగా రావడంతో థాంక్స్ చెప్పి పర్సులోనుండి అమౌంట్ తీసి చేతికి అందించి అక్కడ నుండి బయలుదేరాను .

మొబైల్ ను స్టీరింగ్ పై సెట్ చేసి వీడియో ప్లే చేసాను.  పట్టుచీరలో దేవత సౌందర్యమైన అమాయకపు చూపులు - అటువైపు ఎవరైనా వస్తేచాలు భయపడటం - మోడరన్ డ్రెస్సెస్ వేసుకున్న ఫారిన్ అమ్మాయిలను చూసి సిగ్గుపడి తలదించేసుకోవడం - ఒక్కరైనా తనలాంటివారు లేరే అని దిక్కులుచూస్తూ బుంగమూతిపెట్టునుకోవడం .......... లాంటి దేవత అందమైన ఫీలింగ్స్ చూస్తుంటే ముచ్చటేసి హృదయం పులకించిపోసాగింది - అంతకంటే ముఖ్యమైనది నా దేవత వదినమ్మ వదినలు అమ్మ కనిపిస్తుండటం ........... చూస్తూ నన్ను నేను మైమరిచిపోయి తియ్యదనంతో చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాను . 
లవ్ యు లవ్ యు .......... sorry sorry గాడెస్ , ఆ ఫీలింగ్స్ నోటి నుండి కాదు హృదయం నుండి వచ్చినది , మిమ్మల్ని బాధపెడితే మన్నించండి - శిక్షించినా సంతోషమే ఒక్కసారి ఓకేఒక్కసారి దర్శనం ఇస్తే చాలు ............. ,
అంకుల్ నుండి కాల్ ......... దేవత దర్శనం లేకపోయినా అంకుల్ వల్లనే ఈ ఫుటేజీ లభించినది కాబట్టి థాంక్స్ చెప్పాలి అని ఎత్తాను . మహేష్ .......... నిన్ను కలవకుండానే బయటకు వెళ్లిపోయాము ఆ జనంలో ......... sorry sorry .
Its ఆల్రైట్ అంకుల్ ........... , నేనుకూడా మిమ్మల్ని కలవాల్సింది వీలుకుదరలేదు - ఎక్కడ ఉన్నారో చెబితే వచ్చేస్తాను .
అంకుల్ : ఓహ్ sorry మహేష్ , ఎయిర్పోర్ట్ లో ఉన్నాము 15 మినిట్స్ లో ఫ్లైట్ అమెరికా వెళ్లిపోతున్నాము - ప్రీ ప్లాన్డ్ ........... , మేమే కాదు సమిట్ కు వచ్చిన గెస్ట్స్ అందరూ ఆల్మోస్ట్ ఈరోజే బయలుదేరిపోతున్నారు .
గుడ్ అంకుల్ ......... మనం మళ్లీ కలుస్తూనే ఉంటాము హ్యాపీ జర్నీ ......... , మీకు ఒక విషయంలో థాంక్స్ చెప్పాలి థాంక్యూ so మచ్ అంకుల్ .........
అంకుల్ : థాంక్స్ మహేష్ , తప్పకుండా తప్పకుండా కలవాల్సిందే బై బై అని  సంతోషంతో కట్ చేశారు .

సమయం 5:30 పెదాలపై చిరునవ్వుతో వీడియోలో దేవతను మళ్లీ మళ్లీ చూస్తూ ,  దేవతకోసం హోటల్స్ - హాస్పిటల్స్ లో సెర్చింగ్ మొదలెట్టాను . గంట రెండు గంటలపాటు లండన్ లోని ముఖ్యమైన వన్నింటిలో వెతికినా దేవత జాడ లేదు .
మెసేజ్ రావడంతో చూస్తే గంటలో నా ఇండియా ఫ్లైట్ అని గుర్తుచేసింది . అంతలో .......... అంకుల్ మాటలు గుర్తుకువచ్చాయి - మహేష్ ......... మేమే కాదు సమిట్ కు వచ్చినవారంతా ఈరోజే బయలుదేరిపోతున్నారు అని .
Shit shit అంటూ వెంటనే వెనక్కుతిప్పి అపార్ట్మెంట్ చేరుకున్నాను . మిగిలిన వస్తువుల సంగతి తరువాత చూసుకుందాములే అని sam - sarah లతోపాటు ప్యాక్ చేసిన లగేజీ మాత్రమే తీసుకున్నాను . బెడ్ పై దేవత బ్లడ్ అంటుకున్న కవర్స్ ఉండటం చూసి , మిస్ అయిపోయేవాణ్ణి అని గుండెలపై హత్తుకుని బ్యాగులో జాగ్రత్తగా ఉంచుకుని అపార్ట్మెంట్ లాక్ చేసుకుని దేవత వీడియో చూస్తూనే వేగంగా ఎయిర్పోర్ట్ చేరుకున్నాను .

స్పోర్ట్స్ కారుని ప్రస్తుతానికి పర్మనెంట్ గా పార్కింగ్ లో పార్క్ చేసాను . Hunk త్వరలోనే కలుద్దాము అంతవరకూ గుడ్ బై అనిచెప్పి పార్కింగ్ లో మరియు బయట చుట్టూ చూస్తూ లగేజీతోపాటు లోపలికి పరుగుపెట్టాను . 
ఎంట్రన్స్ దగ్గర మొదలుకుని అడుగడుగూ వదలకుండా దేవత దర్శనం కోసం వెతుకుతూ ఎయిర్పోర్ట్ లోని వెయిటింగ్ రూమ్స్ - షాప్స్ - రెస్టారెంట్స్ - గేమ్స్ స్టోర్స్ ......... ఆఖరికి లేడీస్ టాయిలెట్ బయట లోపలికి వెళ్లినవారంతా వచ్చేన్తవరకూ వెయిట్ చేసాను . Each and every ఎయిర్లైన్స్ టికెట్స్ కౌంటర్ దగ్గరకు వెళ్లి చూసినా జాడ లేదు . 45 మినిట్స్ లో నా ఫ్లైట్ అని arrivals - departures బోర్డ్స్ పై display అయినదగ్గర నుండీ క్షణక్షణం గడుస్తుంటే ఇక దేవతను జీవితంలో చూడలెనేమోనని వొళ్ళంతా చెమటలు పట్టేసాయి , breakfast - lunch చేయకపోవడం వలన కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి , గుండె వేగం నార్మల్ గా కాకుండా ఎక్కువా తక్కువా అవుతూ కన్నీళ్ల రూపంలో తన బాధను వ్యక్తపరుస్తోంది . 
అప్పుడే 5 మినిట్స్ అయిపోయింది అని కంగారుపడుతూ మళ్లీ బయటకువచ్చి దేవత దేవత అని తలుచుకుంటూనే స్కాన్ చేసి , ఎంట్రన్స్ దగ్గర నుండీ టోటల్ ఎయిర్పోర్ట్ మొత్తం వెతికి నిరాశతో వొంటిపైనున్న బ్రేజర్ తీసేసి వెయిటింగ్ చైర్ లోకి విసిరేసి కన్నీళ్ళతో ప్రక్క చైర్లో కూర్చున్నాను .

హాస్పిటల్ కు వచ్చి దేవతను తీసుకెళ్లిపోయాడు ఆ మాన్స్టర్ - సమిట్ కు రాలేదు అలా అని సిటీలోని హోటల్స్ - హాస్పిటల్స్ లోనూ లేరు , అంటే ఉదయమే ఇండియాకు వెళ్ళిపోయి ఉంటారా ? ........, అయితే ఇక జీవితంలో దేవతను కలవలేనా ? ........., ఉదయం నుండీ ఇండియాకు పదుల సంఖ్యలో ఫ్లైట్స్ టేకాఫ్ అయిఉంటాయి - దేవత ఏ ఫ్లైట్ లో వెళ్లి ఉంటుందో ఎలా కనిపెట్టేది - కనీసం ఏ ఫ్లైట్ అని తెలిస్తే ఇండియాకు వెళ్లిన తరువాత dad పవర్ ఉపయోగించి ఆ ఫ్లైట్ లో ప్రయాణించిన మొత్తం లిస్ట్ తెప్పించుకుని దేవత జాడను కనుక్కోవచ్చు , ఆ ఫ్లైట్ కనుక్కోవడం ఎలా .......... 
సీసీ ఫుటేజీ yes yes సీసీ ఫుటేజ్ ........... , ఎయిర్పోర్ట్ లో సీసీ ఫుటేజీ సంపాదించడం కాదు కదా చూడటం కూడా అసాధ్యం ఇప్పుడెలా ? , లండన్ లో నాకు తెలిసినవారు ఒక్కరే ఒక్కరు మా ప్రొఫెసర్ గారు అని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కాల్ చేసి విషయం చెప్పాను .
ప్రొఫెసర్ : మహేష్ ......... what you are asking is national security issue , no one will going to help you but me , because you are my favourite , give me 2 minuits అని కట్ చేశారు .

థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ , సెకండ్ సెకండ్ కు టెన్షన్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది . కుర్చీలో కూర్చోవడం నా వల్ల కావడం లేదు కూర్చుంటూ లేస్తూ వాచ్ చూసుకుంటూ రెండు నిమిషాలు రెండు యుగాలుగా గడిపాను - సమయం పూర్తయ్యాక మొబైల్ వైపు చూస్తే ఎటువంటి మెసేజ్ లేదు సర్ సర్ సర్ .......... please please .......... 
Are you mister మహేష్ ? అని ఎయిర్పోర్ట్ ఆఫీసర్ నా ముందుకు వచ్చి నిలబడ్డారు .
Yes yes సర్ అంటూ లేచి నిలబడ్డాను . 
ఆఫీసర్ : ఫాలో మీ , your ప్రొఫెసర్ మై ఫ్రెండ్ , thats why you are going to see the ఫుటేజ్ but not entire airport , only ఎంట్రన్స్ అండ్ ఇండియన్ ఎయిర్లైన్స్ టన్నెల్స్ .
Thats more than enough for me సర్ , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని ప్రక్క చైర్లో ఉన్న బ్రేజర్ మరియు లగేజీ అందుకున్నాను .
ఆఫీసర్ : మహేష్ .......... లగేజీతో అయితే కష్టం అర్థం చేసుకో .......... సెక్యురిటి ఇష్యూ .
Sorry sorry సర్ , give me one మినిట్ అంటూ లగేజీతోపాటు పరుగునవెళ్లి నా ఫ్లైట్ లోకి చేరేలా సబ్మిట్ చేసి , చేతిలో బ్రేజర్ తోపాటు పరుగున సర్ దగ్గరకు చేరాను . 
ఆఫీసర్ : ఫాలో me మహేష్ , don't do anything other than what you want ok . 
Sure sir and once again thankyou sooooooo much . 
Officer : నేరుగా రెస్ట్రిక్టెడ్ ఏరియా ఓన్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ అన్న గదిలోకి తీసుకెళ్లారు . లోపలికి అడుగుపెట్టగానే ఇద్దరు సెక్యూరిటీ టాప్ టు బాటమ్ మరియు బ్రేజర్ సెర్చ్ చేసి క్లియర్ సర్ అంటూ అడుగడుగునా సెక్యురిటి - మెటల్ డిటెక్టర్స్ ద్వారా మరింత లోపలికి తీసుకెళ్లారు .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ఆఫీసర్ : here it is మహేష్ .......... అంటూ చివరి మెటల్ డిటెక్టర్ ద్వారా బిగ్గెస్ట్ డోర్ ఓపెన్ అయ్యింది . 
ఆశ్చర్యంతో అలాచూస్తూ ఉండిపోయాను . ఎయిర్పోర్ట్ పార్కింగ్ దగ్గర నుండి ఎయిర్పోర్ట్ చుట్టూ మరియు ఎయిర్పోర్ట్ లోపల ఏ మూలన ఏమి జరిగినా రికార్డ్ అవుతున్న ఆడిటోరియం లాంటి బిగ్గెస్ట్ గదిలో నలువైపులా ఉన్న స్క్రీన్స్ చూసి wow అనకుండా ఉండలేకపోయాను . 
ఆఫీసర్ : మహేష్ this way please అంటూ పిలుచుకునివెళ్లి స్క్రీన్స్ పై కన్నార్పకుండా అలర్ట్ గా చూస్తున్న ఒక ఆఫీసర్ అప్పచెప్పి చెవిలో గుసగుసలాడి వెళ్లిపోయారు .

Officer 2 : have a seat mister ......... మీ ప్రొఫెసర్ నాకు కూడా ప్రొఫెసరే - ****** బ్యాచ్ - we love our ప్రొఫెసర్ ...........
Yes సర్ we too respected a lot , గ్రేట్ ప్రొఫెసర్ ............
ఆఫీసర్ 2 : మహేష్ .......... now tell me what do you want ? .
మొబైల్ తీసి వీడియోలోని దేవతను చూయించి సర్ మార్నింగ్ నుండీ ఈ గాడెస్ ఎయిర్పోర్ట్ కు వచ్చారో లేదో చూడాలి .
ఆఫీసర్ 2 : ఇండియన్ goddess లానే ఉన్నారు మహేష్ , ఫోటో ఉంటే నిమిషాలలో కనిపెట్టవచ్చు అని ఒక పరికరం అందుకుని మొబైల్లోని దేవత ఫోటోను స్కాన్ చెయ్యగానే స్క్రీన్ పైకి చేరింది . కీబోర్డ్ ను రోబోట్ లా ఫాస్ట్ గా టైప్ చెయ్యగానే ఒక స్క్రీన్ పై ఉదయం నుండీ రికార్డ్ అయిన ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ సీసీ ఫుటేజీ మరియు మరొక స్క్రీన్ పై ఇండియన్ టన్నెల్స్ దగ్గర రికార్డ్ అయిన సీసీ ఫుటేజీ అంతా మోడరన్ టెక్నాలజి ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ లో ఫాస్ట్ ఫార్వార్డ్ లో దూసుకుపోతోంది . 12 గంటల ఫుటేజీ కేవలం రెండే రెండు నిమిషాల్లో పూర్తయిపోయి లైవ్ రికార్డింగ్ ప్లే అవుతున్నాయి . Sorry మహేష్ ......... this indian goddess never been entered in airport damn sure .
నేను బాధపడటం చూసి , మహేష్ ........ for you i'll check once again , నేషనల్ సెక్యూరిటీ విషయం అయినాకూడా ప్రొఫెసర్ గారు రిక్వెస్ట్ చేశారంటే నువ్వంటే ప్రొఫెసర్ గారికి ఎంత ఇష్టమో తెలుస్తోంది అని ఎయిర్పోర్ట్ మొత్తం మొత్తం సీసీ కెమెరాలో ఉదయం నుండీ రికార్డ్ అయిన ఫుటేజీ మొత్తాన్ని ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ లోకి తీసుకొచ్చి on చేశారు - అంతే ఆడిటోరియం మొత్తం మొత్తం అన్నీ స్క్రీన్స్ లో స్కాన్ చేస్తుండటం చూసి చాలా చాలా ఆనందించాను .

ఆఫీసర్ 2 : Told you so మహేష్ .......... never been entered , shall i check yesterday ఫుటేజ్ .
నో నో సర్ .......... i want only todays , anyway thankyou thankyou so much sir ఎవ్వరూ చెయ్యని సహాయం చేసారు , i'll leave ..........
ఆఫీసర్ 2 : మహేష్ deleting your goddess picture అని నా కళ్ళముందే delete చేశారు . అన్నీ స్క్రీన్స్ పై లైవ్ సీసీ ఫుటేజ్ రికార్డ్ అవుతోంది . ఆఫీసర్ ........ work done .
ఆఫీసర్ 1 : yes I am coming అంటూ డోర్ తీసుకుని లోపలికివచ్చారు . 

అంటే దేవత లండన్ లొనే ఉన్నారు - నేనే సరిగ్గా వేతకలేదు - may be సీసీ ఫుటేజీ చూయించని ఆ రెండు హోటల్లోనే ఉండి ఉండొచ్చు - ఆ హోటల్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాల్సింది అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుంటూనే స్క్రీన్స్ వైపు చూసి , సర్ సర్ సర్ ........... there she is my goddess ........
ఆఫీసర్ 2 : మహేష్ ......... this is live recording , now she is at entrance ...........
థాంక్యూ so much sir అని ఇద్దరినీ కౌగిలించుకుని చేతిలో బ్రేజర్ తో సెక్యురిటి రూమ్స్ నుండి బయటకుపరుగులుతీసాను . నా వెనుకే ఆఫీసర్ వచ్చి its alright its alright అంటూ సెక్యూరిటీకి తెలియజెయ్యడంతో అందరూ డోర్స్ తెరిచిమరీ బయటకు దారిని వదిలారు .

సెక్యురిటి ఆఫీస్ నుండి బయటకువచ్చి ఎంట్రన్స్ దగ్గరికి మరింత వేగంతో పరుగుతీసాను . రెడ్ కలర్ పట్టుచీర వొళ్ళంతా అవసరమైనన్ని నగలతో దివినుండి దిగివచ్చిన దేవతలా - భారతీయ సాంప్రదాయానికి నిలువుటద్దంలా లోపలికి అడుగుపెట్టి చుట్టూ జనాలను చూసి బిక్కుబిక్కుమంటూ అమాయకమైన చూపులతో డోర్ ప్రక్కనే కదలకుండా ఉండిపోయారు . 
దేవతకు కొన్ని అడుగులదూరంలో ఆగి నుదుటిపై చెమట - ఆయాసంతో గుండెలపై చేతినివేసుకుని పెదాలపై చిరునవ్వులు చిందిస్తూ , వేగంగా శ్వాసను పీల్చివదులుతూ అలా చూస్తుండిపోయాను . నుదుటిపై గాయం మానిపోయినట్లు కేవలం చిన్న బ్యాండ్ ఎయిడ్ మాత్రమే వేసుకోవడం చూసి హమ్మయ్యా అనుకున్నాను . నా మనసు హృదయం ......... నార్మల్ గా ఉండలేకపోతున్నాయి - ఆనందంలో ఎవరెస్టు కంటే ఎక్కువగా పరవసించిపోతున్నట్లు నన్ను గాలిలో తేలిపోతున్న ఫీల్ కలిగిస్తున్నాయి . దేవతవైపు కన్నార్పకుండా చూస్తున్నాను - అందరిలానే నన్నూ చూస్తున్నారు అంతే .......... , అయినా ఎలా గుర్తుపడతారు చేతి స్పర్శ తప్ప హాస్పిటల్లో మొత్తం స్పృహలోనే లేరు కదా అని నాలో నేను నవ్వుకున్నాను .

అంతలోనే ఎయిర్పోర్ట్ ట్రాలీలో లగేజీ ఉంచుకుని దేవత హస్బెండ్ ఎంటర్ అయ్యి , మాట్లాడటం మాట్లాడటమే దేవతలాంటి భార్యను ఎవ్వరూ అన్నంత మాట " బిచ్ " మొత్తం లగేజీ నేనే తీసుకురావాలా ? .
సర్రున కోపం నరణరానికీ చేరిపోయింది -  కంట్రోల్ చేసుకున్నాను - అందుకేనేమో దేవత వాడికి మాన్స్టర్ అని నామకరణం చేశారు - తప్పులేదు గాడెస్ ఇంకా భయంకరమైన పేరు పెట్టినా తప్పులేదు .
దేవత : తమరే కదా వింతగా చూస్తున్నారు , నా పరువు పోతోంది నాకు కాస్త దూరంగా ఉండమని చె ..........
మాన్స్టర్ : నాకే ఎదురుచెబుతావా అని అంతమంది జనాలముందే కొట్టబోయి , పట్టుచీర - నగలలో ఎయిర్పోర్ట్ కే మరింత కలర్ఫుల్ ను పంచుతున్న దేవతను చూసి సంతోషిస్తున్న జనాలను - సీసీ కెమెరాలను చూసి ఆగిపోయాడు . కోపం తగ్గినట్లు అయినా జనాల మధ్యకు నగలతో రావద్దని ఆర్డర్ వేసాను కదా గంగిరెద్దులా ఉన్నావు తీసేయ్ తీసేయ్ మొత్తం తీసేసి నా బిజినెస్ సూట్ కేస్ లోకి వేసేయ్ ఒక్కటి పోయినా లక్ష అని కోపంతో అరుస్తున్నాడు .
అయినా దున్నపోతుకు ఏమితెలుసు దేవత సౌందర్యం ..........

దేవత : కళ్ళల్లో చెమ్మతో చేసేదేమీ లేక ఒక్కొక్కటే నెమ్మదిగా తీసి సూట్ కేస్ లో వేస్తున్నారు .
మాన్స్టర్ : ఇందుకు కాదూ నిన్ను గంగిరెద్దు అన్నది , మనకు రోజంతా సమయం లేదు 15 నిమిషాల్లో ఫ్లైట్ త్వరగా తియ్యి , చెవిలో కమ్మలు - ముక్కుపుడక -  గాజులు కూడా ........... తొందరగా తొందరగా ..........
దేవత : చుట్టూ చూసి బాధపడుతూనే తాళి తప్ప ఒంటిపై వేసుకున్న నగలన్నింటినీ తీసి సూట్ కేస్ లోకి వేసేసారు - కాస్త భయపడుతూనే ఒకే ఒక్క జ్యూవెలరీ మాత్రం ఆ మాన్స్టర్ కు తెలియకుండా పట్టిచీర కొంగు చివరన మూసివేసి దాచేసుకుని హమ్మయ్యా అనుకున్నట్లు గుండెలపై చేతినివేసుకున్నారు.
నాకు అంతులేని curiosity కలిగింది . 
మాన్స్టర్ : మెడలో ఉన్న అది కూడా తీసెయ్యి .........
దేవత : మెడపై చూసుకుని , ఇది తాళి ...........
మాన్స్టర్ : లండన్ లో తాళి గీలి ఏంటి అని అందుకుని లాగేసి కేస్ లో వేసుకున్నాడు , టికెట్స్ ఎక్కడ ......... నిన్నే బిచ్ టికెట్స్ ఎక్కడ పెట్టావు ? .
దేవత : తా .......ళి , మీ దగ్గరే .......... స్స్స్ ........ అని చూసుకుంటే తాళిబొట్టు లాగడం వలన మెడపై గీసుకుంది .
ఒక్కసారిగా వొళ్ళంతా జిల్లుమంది - గాడెస్ ......... అంటూ ఏమీచెయ్యలేక అక్కడికక్కడ ఆగిపోయాను .
మాన్స్టర్ : జేబులో చెక్ చేసుకుని టికెట్స్ ఉండటం చూసి , త్వరగా చెక్ ఇన్ దగ్గరకు వచ్చెయ్యి అని సూట్ కేస్ మాత్రమే తీసుకుని దేవతను వదిలేసి వెళ్ళిపోయాడు .

దేవత : మాన్స్టర్ ముందు ముందుకు వేగంగా వెళ్లిపోవడం చూసి కన్నీళ్లను తుడుచుకుని , లగేజీ ట్రాలీని ముందుకు తోసినా కదలడం లేదు - ఎన్ని సార్లు అన్నీ విధాలుగా పైన - ప్రక్కన - కింద పట్టుకుని తోసినా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది - ఎలానో తెలియక కంగారు భయంతో దిక్కులు చూస్తున్నారు .
దేవత అమాయకత్వం చూసి అంత బాధలోనూ నా పెదాలపై చిన్న చిరునవ్వు విరిసింది . దేవత దగ్గరకు చేరుకుని , let me help ఫారిన్ ఎయిర్పోర్ట్ థింగ్స్ - గాడె .......... మేడం మీరు ప్రక్కకు జరగండి నేను సహాయం చేస్తాను - very సింపుల్ గాడె ....... మేడం జస్ట్ ప్రెస్ this bar అండ్ పుష్ ట్రాలీ అని కదిలించి thats it అని చూయించాను . 
దేవత : కన్నీళ్లను తుడుచుకుని నావైపు అలా చూస్తుండిపోయారు . పరాయి మగాడిని ఎరుగనట్లు భయపడిపోయి సాంప్రదాయమైన తెలుగు ఇల్లాలిగా దిక్కులు చూస్తూ కంగారుపడుతున్నారు . ఆ కదలికలకు ఒక బ్యాగు ట్రాలీ నుండి కిందపడటంతో ..........
ఇద్దరమూ ఒకేసారి వొంగడం వలన తలలు నెమ్మదిగా ఢీ కొన్నాయి - ఒకేసారి అందుకోబోయి షాక్ కొట్టినట్లు దేవత స్స్స్ ........ అంటూ చేతిని లాగేసుకుని ఏదో ఫీల్ అయినట్లు క్షణాలపాటు కళ్ళు మూసుకున్నారు .
యాహూ .......... నన్ను చూడకపోయినా నా స్పర్శను దేవత హృదయం పసిగట్టింది అని లోలోపలే యాహూ యాహూ ......... అంటూ కేకలువేస్తూ సంతోషం పట్టలేక గెంతులు వేస్తున్నాను - వొళ్ళంతా సరిగమలు పలికినంత హాయిగా అనిపించింది - ఈ ఫీలింగ్ కు అర్థం ఏమిటో అప్పటికి తెలియలేదు .
దేవత : వెంటనే తేరుకుని , కంగారు - భయంతో లేచి నిలబడి మళ్లీ కూర్చుని బ్యాగు అందుకోబోతే ..........
 గాడె ......... మేడం మేడం మీరు కంగారుపడకండి నేను నేను అని ఎత్తి మరొకసారి కిందపడకుండా సెట్ చేసి ఒకరి కళ్ళల్లోకి మరొకరము కన్నార్పకుండా చూసుకుంటూ పైకిలేచాము . ( దేవత కళ్ళల్లో కంగారు - అమాయకత్వం - చిరు సంతోషం - భయం ) . కొన్ని క్షణాలపాటు ఇద్దరి మధ్యన సైలెన్స్ ..........
క్షణక్షణానికీ దేవత ఫీలింగ్స్ అంతుచిక్కనట్లు మారిపోతున్నాయి . దేవతను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక , గాడె .......... మేడం ఒకసారి మీరూ try చెయ్యండి అని లగేజీ ట్రాలీ వైపు కళ్ళతో సైగచేసి లోలోపలే ఆనందిస్తున్నాను .
Like Reply
అప్డేట్ కి ఇంకా ఎంత సమయం పడుతుంది మిత్రమా. వారాల తరపునుంచి వేచిచూస్తునాము. దయచేసి కాస్త త్వరగా ఇవ్వడానికి ప్రయత్నించు మిత్రమా మహేష్.....
[+] 1 user Likes Kumar_guha's post
Like Reply
దేవత : కంగారులో నేను ఇంతకుముందు కొద్దిసేపటి ముందే చూయించినది మరిచిపోయినట్లు మళ్లీ ముందులానే విఫలమయ్యి నావైపు దీనంగా చూస్తున్నారు.
దేవతను అంత దగ్గరగా .......... వాహ్హ్ దేవతలో నా దేవతలు కనిపించి ఆనందం ఆగడం లేదు - నేనూ ......... నన్ను మైమతిచి కన్నార్పకుండా అలా చూస్తూ ఉండిపోయాను - వదినమ్మా , వదినలూ , అమ్మా .......... రేపు ఉదయానికల్లా మీ ముందు ఉంటాను - మీ ఆశీర్వాదం వల్లనే ఒకరోజు ముందే మిమ్మల్ని చూడాలన్న నా కోరిక తీర్చడానికే మళ్లీ ఈ దేవత సాక్షాత్కరించారు అని పరవశించిపోతున్నాను .
దేవత : ట్రాలీని కదిలించడానికి ప్రయత్నం చేయడం చూసి ...........
స్పృహలోకొచ్చి , sorry sorry మేడం .......... జస్ట్ ప్రెస్ this బార్ అండ్ పుష్ అని ట్రాలీకి ఇరువైపులా ఉన్న దేవత చేతులను టచ్ చెయ్యకుండా మధ్యలో ప్రెస్ చేసి చూయించాను .
దేవత : హ్హ్హ్ ........ నా వైపు ఉన్న చేతిని తీసేసారు .
నో నో నో మేడం .......... మీ అనుమతి లేకుండా టచ్ చేసేంత మాన్స్టర్ ను కాదు అని లోలోపలే నవ్వుకున్నాను - నేను బారతీయుణ్ణి అచ్చ తెలుగు వాడిని .

దేవత : కంగారుపడుతూనే రెండుచేతులనూ ప్రక్కప్రక్కనే బార్ పై వేసి బలమంతా ఉపయోగించి ప్రెస్ చేసి పుష్ చెయ్యగానే వేగంగా ముందుకు కదిలింది .
గాడె ......... మేడం కూల్ కూల్ slowly slowly అని స్లైడ్ అవుతున్న ట్రాలీని స్టాప్ చేసాను .
దేవత : sorry అన్నట్లు నావైపు దీనంగా చూసి నెమ్మదిగా ప్రెస్ చేసి ముందుకుతోయ్యగానే , నెమ్మదిగా కదిలింది - హ హ హ .......... నాకూ వచ్చేసింది అన్నట్లు దేవత పెదాలపై అందమైన నవ్వులు ..........
ఆ నవ్వులలో నా దేవతల సంతోషం కనిపించింది , అలా జీవితాంతం చూస్తూ ఉండిపోవాలనిపించి ఆశతో అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
ఆ చూపులకు అర్థం తెలియనంత అమాయకురాలు ఏమీకాదు దేవత , హి హి ......... అంటూ దగ్గి చిరుకోపంతో థాంక్స్ చెప్పేసి ముందుకు నడిచారు . 

ఆఅహ్హ్ .......... హంస - నెమలి కలగలిసిన సౌందర్యాత్మకమైన నడక - అంతకుమించి రెడ్ కలర్ పట్టుచీరలో బ్యాక్ సౌందర్యం దగ్గర నా కళ్ళు ఆగిపోయాయి . వెంటనే తమాయించుకుని రేయ్ రేయ్ ......... దేవతలు కొలువై ఉన్న దేవత అలా చూడకూడదు అని లెంపలేసుకున్నాను - అయినా కూడా కళ్ళు అక్కడికే చేరుతున్నాయి ఆ సౌందర్యాన్ని చూడని జన్మ వృధా అన్నట్లు ............
దేవత ఉత్సాహంతో పెదాలపై హస్కీ నవ్వులతో ట్రాలీని తోసుకుంటూ వెళ్లిపోతున్నారు . 

అంతలో సెక్యూరిటీ వచ్చి స్టాప్ అని చేతితో సైగచేసి బాంబ్ డిటెక్టర్ తో లగేజీ స్కాన్ చేస్తున్నారు .
అంతదానికే ట్రాలీని వదిలేసి దేవత అటూ ఇటూ చూస్తూ భయపడిపోతున్నారు .
పెదాలపై చిరునవ్వుతో దేవత ప్రక్కన చేరగానే ఒక్కసారిగా నార్మల్ అయిపోవడం చూసి , దేవత దిక్కులు చూసినది నా కోసమేనా అని లోలోపల చాలా ఆనందం వేసింది .
గాడె .......... మేడం ......... కంగారు దేనికి its ఫార్మాలిటీ , మీ లగేజీ మాత్రమే కాదు అందరి లగేజీ చెక్ చేస్తారు అని చుట్టూ చూయించాను - మీరూ టీవీలో చూసే ఉంటారు టెర్రర్ అటాక్స్ గురించి ముందు జాగ్రత్త ............
దేవత చుట్టూ అక్కడక్కడా సెక్యురిటీ లగేజస్ చెక్ చేస్తుండటం చూసి మళ్లీ నవ్వుకుని , నాకూ తెలుసు నేనంత అమాయకురాలేమీ కాదులే ......... అని బదులిచ్చారు . చుట్టూ కూర్చున్నవాళ్ళు - అటూ ఇటూ వస్తూ వెళుతున్నవాళ్ళు దేవతనే చూస్తుండటం చూసి వెంటనే తలదించుకుని వేగంగా ముందుకు కదిలారు.
గా ....... మేడం ........ అందరూ మిమ్మల్నే .........
దేవత : అవును వింతగా చూస్తున్నారు అని ఫీల్ అవుతూ చెప్పారు .
నో నో నో ........ మేడం , వాళ్ళ ఫేసస్ చూస్తుంటే మీకలా అనిపించిందంటే మీరెంత అమాయకులో అర్థమౌతోంది . భారతీయ సాంప్రదాయాలను కట్టుబాట్లను చూస్తున్నారు - చూసి సంతోషిస్తున్నారు - ఎయిర్పోర్ట్ మొత్తానికి మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారంటే నమ్మండి . లండన్ ఎయిర్పోర్ట్ లో భరతమాత - తెలుగుతల్లిని చూసి ఆనందిస్తున్నారు , మీరు మరికొద్దిసేపు ఇక్కడే ఉంటే సెల్ఫీల కోసం ఎగబడినా ఎగబడవచ్చు మీకు ఇష్టమైతే కాస్త ధృడంగా ఉండాలిమీరు . 
దేవత : లోలోపల నా మాటలను ఎంజాయ్ చేస్తూనే బయటకుమాత్రం లేదు లేదు వాళ్లంతా మాన్స్టర్ ........ నాలుక కరుచుకుని నా భర్తచెప్పినట్లు ఒక గంగిరెద్దులా చూస్తున్నా .........రూ .........

ఫారిన్ అమ్మాయిలు - బుజ్జాయిలు ......... చాలామంది దేవత చుట్టూ చేరి , మేడం మేడం ......... you are so beautiful - pretty - lovely , are you from India ? . అని సంతోషాలతో అడిగారు .
దేవత కంగారుపడటం చూసి , yes yes ......... Indian goddess with traditional saree ........... , గా ........ మేడం మగవాళ్ళు అయితే భయపడవచ్చు మీ చుట్టూ ఉన్నది అమ్మాయిలు - పిల్లలు దైర్యంగా బదులివ్వండి.
అమ్మాయిలు : Indian goddess ......... sooooo beautiful , goddess ........ shall we take selfee please please please .
దేవత : నావైపు చూసి పెదాలపై చిరునవ్వులతో అలాగే ....... yes yes yes .
అమ్మాయిలు : Thank you goddess , mom aunt ........ we got permission అని సంతోషంతో వాళ్ళ వాళ్ళను పిలిచి సెల్ఫీలు తీసుకుని చేతులుకలిపిమరీ థాంక్స్ చెప్పి , Are you going to india - happy journey ...........
దేవత : ఆనందాలకు అవధులు లేనట్లు థాంక్స్ థాంక్స్ మీకు కూడా ........ wish you the same happy journey అని బదులిచ్చి పులకించిపోతున్నారు . 

దేవత ఆనందాలను అలా చూస్తూ ఎంజాయ్ చేసాను . గా ........ మేడం నాకూ ఒక సెల్ఫీ ఇస్తారా ? .
దేవత : ముసిముసినవ్వులతో లగేజీ పుష్ చేస్తూ ముందుకువెళ్లిపోతున్నారు .
Please please మేడం .......... అంతమంది ఫారినర్స్ కు సంతోషంగా ఇచ్చారు - బారతీయుణ్ణి అందులోనూ మీ తోటి తెలుగువాడిని నాకు ...........
దేవత : మీరే కదా చెప్పారు మగవాళ్ళకు భయపడొచ్చు అని కాబట్టి నో అంటూ ముందుకువెళ్లిపోతున్నారు .
పంచ్ .......... please please please మేడం అంటూ వెనుకే ఫాలో అవుతూ దేవత బ్యాక్ చూసి ఆఅహ్హ్హ్ ........ రేయ్ నో నో అంటూ ముందుకువెళ్ళాను కళ్ళు మాత్రం మళ్లీ వెనక్కు వెళ్ళమని ఆజ్ఞ వేయడంతో వెనుకకూ ముందుకూ వెళ్లి బ్యాక్ ఎంజాయ్ చేస్తున్నాను . 
దేవత : నా పరిస్థితిని చూసి జాలిపడి నవ్వుకుని , ok అనేంతలో ............
Like Reply
క్షమించు మిత్రమా ఇచ్చావని చూసుకోలేదు
[+] 2 users Like Kumar_guha's post
Like Reply
మాన్స్టర్ రావడంతో , పరాయి వ్యక్తులతో మాట్లాడుతోందని దేవతపై కోప్పడటానికి అవకాశం ఇవ్వనీకుండా అలా వెనుకకు నడుచుకుంటూ వెళ్లిపోయి వెనుక కుర్చీలో కూర్చున్నాను .
మాన్స్టర్ : ఎంట్రన్స్ దగ్గర నుండి ఇక్కడకు రావడానికి ఇంతసేపా ......... , ఫ్లైట్ ....... రైట్ టైం అయి ఉంటే ఎప్పుడో టేకాఫ్ అయిపోయి ఉండేది - one hour delay అయ్యింది కాబట్టి సరిపోయింది - నేను లగేజీ సబ్మిట్ చేసేసి ఒక ముఖ్యమైన పని చూసుకునివస్తాను అంతవరకూ ఇక్కడే సైలెంట్ గా కూర్చో - ఇది నీ టికెట్ జనరల్ టికెట్ , బిజినెస్ టికెట్స్ ఫుల్ అవ్వడంతో కేవలం నాకుమాత్రమే తీసుకున్నాను - అదికూడా ఒకందుకు మంచికే అయ్యింది నీ ప్రక్కన కూర్చుని ప్రయాణం చేస్తే నా పరువు మొత్తం పోతుంది అని లోలోపలే దేవతను తన దరిద్రంలా తలుచుకుంటూ లగేజీ తీసుకుని వెళ్ళిపోయాడు . 

ఆ ముఖ్యమైన పని ఏమిటో దేవతకు తెలిసినట్లు కళ్ళల్లో కన్నీళ్ళను తుడుచుకున్నారు - మూడువైపులా చూసి కాస్త నిరాశతో నా ముందు కుర్చీలో కూర్చుని బాధపడుతున్నారు . నిజంగానే అల్లంత దూరంలో అతడు ఒక ఫారిన్ అమ్మాయి నడుము చుట్టూ చేతినివేసి రెస్టారెంట్ లోపలికివెళ్లాడు .
ఎదురుగా ఫుడ్ కార్నర్ కనిపించడంతో దేవతకు ఆకలివేసినట్లు కన్నీళ్లను తుడుచుకుని పైకిలేచి వెళ్లారు . ఫుడ్ ఆర్డర్ ఇస్తున్న మిగతా ప్రయాణీకుల వెనుక నుండి ఎస్క్యూస్ మీ ఎస్క్యూస్ మీ please take my order ....... ఎస్క్యూస్ మీ ఎస్క్యూస్ మీ please take my order brother ......... అని అటూ ఇటూ వెళ్లి ఎస్క్యూస్ మీ brother ........ " one veg సాండ్ విచ్ , కాఫీ అండ్ కూల్ డ్రింక్ " ........ brother brother అని రిక్వెస్ట్ చేస్తున్నా షాప్ కీపర్ పట్టించుకోకుండా వెనుక వచ్చినవాళ్లకు సర్వ్ చేస్తున్నాడు - దేవతకు అడిగీ అడిగి మరింత దుఃఖం వచ్చేస్తోంది .
How dare he అంటూ లేచి పరుగునవెళ్ళాను . దేవత వెనుక నిలబడి ఎస్క్యూస్ మీ hey hey ......... do you want me to broke your nose ? , take our order first you ...........
వాడు భయపడిపోయి sorry sir sir sir .........
వెజ్ సాండ్ విచ్ , hot కాఫీ అండ్ which కూల్ డ్రింక్ ......... అని అప్పటికే ఆశ్చర్యపోయి నావైపు చూస్తున్న దేవతవైపు చూస్తూ అడిగాను .
దేవత : pepsi ..........
మేడం .......... ప్రపంచం భయపడేవాళ్లను ఇలానే వెనక్కు తోసేస్తుంది - ఇలాంటి పరిస్థితులలో తెలుగు పౌరుషం ఏమిటో ఇలాంటి వాళ్లకు చూయించాలి . You are from ? .
దేవత : విజయవాడ .........
కనకదుర్గమ్మ తోడు నీడలో పెరిగిన తెలుగుబిడ్డ ఎలా ఉండాలి , go on try again అన్నాను .
దేవత : దుర్గమ్మను తలుచుకుని హలో హలో ......... brother , రెస్పెక్ట్ ఇచ్చి అడిగితే చులకనగా చూస్తున్నావు . ఇప్పుడే చెప్పినట్లుగా ముక్కు ముఖం ఏకం చెయ్యమంటారా ? .
షాప్ బాయ్ : sorry sorry మేడం ......... , వన్ మినిట్ అని చక చకా బాక్స్ లో ప్యాక్ చేసి అందించాడు .
దేవత : చిరునవ్వులు చిందిస్తూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్  , మరి మీకు అని నావైపు చూసారు .

Ok ....... , దేవ ....... మేడం కోరిక మేరకు take my order also brother ......... మేడం ఆర్డర్ చేసిన వెజ్ సాండ్ విచ్ - కాఫీ - pepsi తోపాటుగా one చికెన్ సాండ్ విచ్ - వన్ వెజ్ బర్గర్ వన్ చికెన్ బర్గర్ - వన్ వెజ్ రోల్ వన్ చికెన్ రోల్ అండ్ ఫైనల్లీ అంటూ షాక్ లో చూస్తున్న దేవతవైపు చూసి లార్జ్ పిజ్జా ......... అండ్ అండ్ అండ్ 2 లీటర్స్ వాటర్ బాటిల్ .
షాప్ బాయ్ : సర్ ......... takes 15 మినిట్స్ .
Ok ........

దేవత : గుండెలపై చేతినివేసుకుని అమ్మో .......... అని నోరుతెరిచి అలానే చూస్తుండిపోయారు .
సిగ్గుపడి , అదీ అదీ ....... మీలాంటి దేవ ........ మీలాంటి ఒక మేడం కోసం ఉదయం నుండీ సిటీ మొత్తం సెర్చ్ చేసే పనిలో నిద్రాహారాలను మరిచిపోయాను - ( ఆ దేవతను చూసేసాను కదా ) ఇప్పుడు భయంకరమైన ఆకలి వేస్తోంది మీరు తప్పుగా అనుకోలేదు కదా ...........
దేవత : నో నో నో .......... sorry sorry అని తన ఆర్డర్ తీసుకుని ముసిముసినవ్వులతో వెళ్లిపోతున్నారు . 

షాప్ బాయ్ : మేడం మేడం బిల్ ..........
దేవత : ఓహ్ ........ sorry sorry అని ఆంధ్రా లోలా నెత్తిపై మొట్టికాయ వేసుకున్నారు . 
అంతలో మరొక ఆర్డర్ రావడంతో షాప్ బాయ్ అటువైపు వెళ్ళాడు - పర్స్ తీసి మనీ పే చెయ్యబోయి దేవత అపార్థం చేసుకుంటే మొదటికే మోసం అవుతుందని - మరింత బాధపెట్టడం ఇష్టం లేక ఆగిపోయాను . 
దేవత : వారి భుజం పై హ్యాండ్ బ్యాగ్ లేదని తెలుసుకుని కంగారుపడుతున్నారు . మన దేవతలూ దేవకన్యలు ......... ప్రతీదగ్గరికీ హ్యాండ్ బ్యాగ్ పర్స్ తీసుకునివెళ్లలేక దాచుకునే సేఫ్టీ ప్లేస్ ఒకటి ఉందికదా - దేవత కూడా చేతితో ఛాతీపైభాగాన స్పృశించుకుని వెంటనే అటువైపు తిరిగారు .
గా ....... మేడం , ఇటువైపు అయితే నేనొక్కడినే - అటువైపు అయితే ప్రపంచం మొత్తం .......... అని ముసిముసినవ్వులతో దేవత ముందుకువెళ్లి అడ్డుగా నిలబడి చుట్టూ నాలుగువైపులా ఉన్న సీసీ కెమెరాలవైపు చూయించాను . దేవత కంగారు బింకం చూసి ఎందుకో ఏమిటో దేవతను కాస్త ఆటపట్టించాలని అనిపించింది - నాపై కోప్పడితే కోప్పడితే ఎలా ఉంటుందో ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలన్న చిలిపి కోరిక కలిగింది - ఎలాగో ఇంట్లోని నా దేవతల కోపాన్ని ఎన్నటికీ రుచిచూడలేను కనీసం ఈ దేవత కోపాన్నైనా .......... అని లోలోపలే మురిసిపోయాను .

దేవత : చుట్టూ తననే చూస్తున్న సీసీ కెమెరాలవైపు చూసి వెంటనే అక్కడ నుండి చేతిని తీసేసి , మీరు అటువైపు తిరిగితే ..........
నేను వార్న్ చెయ్యకపోతే ప్రపంచం మొత్తం ఫ్రీ షో చూసేవారు , నేనొక్కడినే చూస్తే తప్పయిపోయిందా ..........
అంతే భద్ర కాలీలా నా చెంప చెళ్లుమనిపించి sorry sorry అని కోపం - బాధ కలగలిసి కళ్ళల్లో చెమ్మతో తలదించుకున్నారు దేవత .
సాంప్రదాయబద్ధమైన తెలుగు ఇల్లాలిని ఎవ్వరు ఈ మాట అన్నా రిప్లై ఇలానే ఉంటుంది - sorry sorry మేడం ......... తెలుగువారైన మీరు కన్నీళ్లు కారిస్తే నేను తట్టుకోలేను వెనక్కు తిరుగుతున్నాను కళ్ళు కూడా మూసుకుంటున్నాను మీరు నాకు కాస్త దగ్గరకు జరిగి safest ప్లేస్ లో దాచుకున్న నిధి నుండి ఎవ్వరూ చూడకుండా కట్టలు కట్టలు డబ్బును బయటకు తియ్యండి .
దేవత : ముసిముసినవ్వులతో జాకెట్ లోపల దాచుకున్న డబ్బును తీసి పూర్తయ్యింది అని నా భుజం పై స్పృసుంచారు . 
ఆ స్పర్శకే వొళ్ళంతా తియ్యటి షాక్ తగిలింది . పెదాలపై చిరునవ్వులతో తడబడుతూ హమ్మయ్యా ......... దుర్గమ్మ కోపాన్ని పరులపై చూయించమని చెబితే ఏకంగా నాపైనే చూయించారు - పర్లేదు హ్యాపీ అదృష్టంలా భావిస్తాను అని వెనక్కు తిరిగాను .
దేవత కూడా నాతోపాటు చిరునవ్వులు చిందిస్తూ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ కరెన్సీ ని టేబుల్ పై ఉంచారు .
గాడెస్ ......... ఇంత అమాయకులు అని అనుకోలేదు ఎవరైనా చూస్తే నవ్వేస్తారు అని వెంటనే నోటుని చేతిలోకి తీసేసుకుని ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ........ ఎక్కడ నుండి తీశారండీ కాలిపోతోంది అని నోటి నుండి గాలి ఊదాను .
దేవత : మొదట సిగ్గుపడి ఆ వెంటనే కోపం ఆ వెంటనే ముసిముసినవ్వులతో మళ్లీ కొట్టడానికి చేతిని ఎత్తి ముఖాన్ని చేతులతో దాచేసుకున్నారు .
ఆఅహ్హ్ .......... దేవత ఒక్కొక్క ఫీలింగ్స్ చూస్తుంటే హృదయం సంతోషంతో పరవళ్లు తొక్కుతోంది - నా షర్ట్ బటన్ కు సీక్రెట్ కెమెరా ఉంటే ఎంత బాగున్నో అని బాధపడ్డాను .
Like Reply
షాప్ బాయ్ : సర్ ........ మీ ఆర్డర్ కూడా రెడీ . 
అయితే రెండు బిల్లులూ కలిపి ఇవ్వు అన్నాను . 5 హండ్రెడ్ నోటుని గుండెలపై గల షర్ట్ జేబులో ఉంచుకున్నాను .
షాప్ బాయ్ : 8 ప్లస్ 40 డాలర్స్ సర్ ......... టోటల్ 48 డాలర్స్ .
పర్సులోనుండి తీసి అందించి , మేడం ......... సిగ్గుపడింది చాలు మన ఫుడ్ చల్లారిపోతాయి .
దేవత : ఇంకా సిగ్గుపడుతున్నట్లు చేతులను వేరుచేసి మరి బిల్ అని అడిగారు .
పే చేసేసాను మేడం . 
దేవత : నా డబ్బు నుండే పే చేశారుకదా - మీ డబ్బు అయితే నేను ఒప్పుకోను - మరి నా చేంజ్  .........
ముచ్చటేసి , ok ok మేడం ......... మీ డబ్బు ద్వారానే పే చేస్తాను - చేంజ్ మన ఇండియన్ కరెన్సీ కావాలా డాలర్స్ కావాలా ? .
సుమారు నిమిషం పాటు ఆలోచించి డాలర్స్ ......... , నా మాన్స్ట ......... నా హస్బెండ్ ఎలానో డాలర్స్ ఎలా ఉంటాయో కూడా చూయించలేదు కనీసం మీరు ఇచ్చేవైనా నా ప్రాణమైన నా కొడుకుకి చూయిస్తాను please please డాలర్స్ ఇవ్వగలరా .........
So స్వీట్ ఆఫ్ యు , మీకోసం కాకపోయినా మీ కొడుకు కోసమైనా ఇస్తాను ఇది వన్ డాలర్ - ఇది two డాలర్ - ఇది 5 డాలర్ నోట్ ......... అని నా దగ్గర ఉన్న వేరు వేరు డాలర్స్ నోట్స్ ఒక్కొక్కటీ అందించాను .
దేవత : ఈ డాలర్స్ అన్నీ నా 5 హండ్రెడ్ నోటుకే కదా ఎందుకంటే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోదు అని అందం అమాయకత్వంతో చెప్పారు .
తియ్యదనంతో నవ్వుకుని , yes yes మేడం ....... ఆకలేస్తోంది వెళ్లి తిందామా ? .
దేవత : sorry sorry అని తన ఆర్డర్ అందుకుని ఛైర్స్ వైపు నడిచారు .
అమౌంట్ పే చేసి నా ఆర్డర్ తీసుకుని , దేవత బ్యాక్ చూసి ఎంజాయ్ చేస్తూ ....... దేవతను మరింత కవ్వించాలని డిసైడ్ అయ్యి ఆర్డర్ చేతులతో పట్టుకుని చిలిపినవ్వులతో వెళ్లి దేవత ప్రక్కనే కూర్చున్నాను .

అవునూ .......... దేవత ఫ్లైట్ వన్ hour delay అయ్యింది - మరి నా ఫ్లైట్ సంగతే మరిచిపోయాను దేవత కనిపించిన ఆనందంలో అని సడెన్ గా లేచి display వైపు చూస్తే నా ఫ్లైట్ కూడా one hour delay - అయినా delay కాకపోయినా దేవతకోసం దేవత ఫ్లైట్ లొనే వెళ్ళేవాడిని అని సంతోషంతో కూర్చున్నాను .
ఆకలివేస్తున్నట్లు దేవత సాండ్ విచ్ ఓపెన్ చేసి తిన్నారు .
నా ఐటమ్స్ తీసుకుని లేచి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని same veg సాండ్ విచ్ ఓపెన్ చేసి తిన్నాను .
దేవత : నవ్వుకుని కాఫీ సిప్ చేశారు .
నేనూ కాఫీ అందుకుని సిప్ చేసి , దేవత నెక్స్ట్ ఏమిచేస్తారోనని కన్నార్పకుండా చూస్తున్నాను . మేడం ........ నెక్స్ట్ pepsi నే కదా ? .
దేవత : పెదాలపై చిరునవ్వులతో నో నో అని సాండ్ విచ్ పూర్తిగా తిన్నారు మధ్యమధ్యలో కాఫీ సిప్ చేస్తూ ........
దేవతను చూస్తూనే ఆకలి వలన గబగబా మొత్తం సాండ్ విచ్ తినేసాను . 

పేపర్ - కాఫీ కప్ బాక్స్ లో ఉంచేసి , now pepsi అని అందమైన నవ్వులతో అందుకున్నారు .
Me too గాడెస్ అని pepsi అందుకున్నాను . దేవత సగం వరకూ తాగడంతో నేనూ తాగి మింగేసాను కానీ దేవత మాత్రం నోటిలోనే ఉంచుకున్నట్లు మళ్లీ గ్లాస్ లోకి చేర్చి కళ్ళతో ఫ్లాట్ అయిపోయేలా సైగలుచేశారు .
అంతే అవాక్కవ్వడం " ధగా ........ ధగా......... మోసం " అని ఎయిర్పోర్ట్ నలువైపులా ప్రతిధ్వనించడంతో , నా షాకింగ్ ఫేస్ ను చూసి దేవత జీవితంలో నవ్వనంతలా నవ్వినట్లు ఏకంగా వెక్కిళ్ళు వచ్చేసాయి . 
గాడెస్ ........ మేడం మేడం అంటూ లేచి వాటర్ బాటిల్ అందించాను . 
తాగుతూనే నవ్వుని ఆపడం లేదు - దేవతతోపాటు నవ్వుకుని కూర్చున్నాను . ఓడిపోయానని ముసిముసినవ్వులు నవ్వుకుంటూనే బాక్స్ లోని ఒక్కొక్క ఐటమ్ అందుకుని సౌండ్స్ చేస్తూ నిమిషాలలో ఖాళీ చేసేసి ఆవ్ ఆవ్ ......... అంటూ నిట్టూర్పులతో pepsi మొత్తం ఖాళీ చేసేసి ఇప్పుడు హాయిగా ఉంది అని పొట్టపై స్పృశించుకుంటూ కూర్చున్నాను .
దేవత : ఆ ........ మొత్తం ఖాళీ అంటూ కింద ఉంచిన ఖాళీ బాక్సస్ వైపు ఆశ్చర్యపోయి చూస్తున్నారు . 

అప్పటివరకూ గమనించలేదు కానీ , దేవత కూలర్ ప్రక్కనే కూర్చున్నట్లు చీర కొంగు గాలికెగురుతూ దేవత పాలమీగడలాంటి నడుము కళ్ళకు కనువిందు చేసింది .
ఆఅహ్హ్ .......... అంటూ తియ్యదనంతో జలదరించి పెదాలను తడిచేసుకుని లొట్టలేస్తూ అలా చూస్తుండిపోయాను .
దేవత : నా చూపుల భావాన్ని - గాలికెగురుతున్న చీరను పసిగట్టి వెంటనేసరిచేసుకుని తలదించుకున్నారు .
 yes yes దేవతను కవ్వించే సమయం ఆసన్నమయ్యింది పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆ దేవుడికే వదిలేసాను . ప్చ్ ......... ఏమి నడుము , ఆ కనిపించేదేదో బొడ్డు కూడా కనిపించి ఉంటే ఆఅహ్హ్ ........ ఆ ఊహకే వొళ్ళంతా ఏదేదో అయిపోతోంది - జీవితంలో ఇప్పటివరకూ ఆస్వాదించని అనుభూతి ప్చ్ ......... ఎలాగైనా చూడాలి - దేవత కోపాగ్నికి దగ్ధం అయిపోయినా సంతోషమే ఎలా ...... ఐడియా అని లేచి ఐటమ్స్ బాక్సస్ అన్నింటినీ అందుకుని దేవతదగ్గరికి వెళ్ళాను - నా అడుగులు దగ్గరవుతున్నకొద్దీ దేవతలో కంగారు ఎక్కువవుతోంది .
మేడం .......... wasteges ఇస్తే డస్ట్ బిన్ లో పడేస్తాను .
దేవత : తలదించుకుని వణుకుతూనే బాక్స్ అందించారు . 
అందుకోబోయి నా చిటికెన వేలితో దేవత చిటికెన వేలిని తాకీ తాకించకుండా స్పృశించి వదిలాను .
దేవత : హ్హ్హ్ ........ అంటూ అధిరిపడ్డారు . తలెత్తి నా కళ్ళల్లోకి చూసి వెంటనే తలదించుకున్నారు . 
నవ్వుకుని , బాక్సస్ అన్నింటినీ డస్ట్ బిన్ లో పడేసివచ్చి , కూలర్ వైపు దేవత నుండి ఒక చైర్ గ్యాప్ ఇచ్చి ప్రక్కనే కూర్చుని నడుమువైపే చూస్తున్నాను .

ఇప్పటివరకూ ఎదురుగా కూర్చున్నవారు ప్రక్కనే కూర్చున్నారు ఏంటి అని క్యాజువల్ గా అటు నుండి నావైపుకు తిరిగిచూసి వెంటనే నడుముపై చీరను సరిచేసుకున్నారు . 
ప్చ్ ........... ప్రక్కనే మ్యాగజైన్స్ ఉండటం చూసి అందుకుని గాడె మేడం ........ ఇందులో లండన్ traditional foods - ఫెస్టివల్స్ ........ ఇంకా ఇంకా చాలా ఉంటాయి బోర్ కొడుతోంది కదా తిరగేస్తారేమో అని నడుమువైపే చూస్తున్నాను . 
దేవత నో నో ........ అన్నాకూడా please please అంటూ బలవంతపెట్టడంతో అందుకున్నారు . అలా చీరపై చేతిని వదిలారో లేదో ఒక్కసారిగా వచ్చిన గాలికి బొడ్డుతోపాటు వయ్యారాలన్నీ కనువిందు చేసేటప్పటికి ఆ అంటూ నోటిని పూర్తిగా తెరిచి గుడ్లప్పగిచ్చి అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . నార్మల్ కంటే డబల్ హార్ట్ బీట్ - నుదుటిపై చెమట - వొళ్ళంతా జలదరింత - వేడితో జ్వరం వచ్చేస్తుందేమో అనిపించి నన్ను నేను మైమరిచిపోయాను .

నా కన్నింగ్ నెస్ కనిపెట్టి , మ్యాగజైన్ ప్రక్కన ఉంచేసి భద్ర కాలీలా కోపంతో గట్టిగా నా చెంప చెళ్లుమనిపించేశారు . నాకు మళ్లీ కనిపించకండి అంటూ కొంగును వొళ్ళంతా చుట్టుకుని కళ్ళల్లో చెమ్మతో లేచి వెళ్లిపోయారు . 
చెంప దెబ్బ సమయానికి ఏదో ఫ్లైట్ అనౌన్స్మెంట్ జరగడంతో ఎవ్వరూ మమ్మల్ని చూడలేదు . దేవత ఎంత పవిత్రమైనవారో ఈ చెంపదెబ్బతో మరింత గౌరవం పెరిగింది - ఆఅహ్హ్ ........ దేవత దెబ్బ తియ్యదనం , కోపపు మాధుర్యం కేక అంతే అని చెంప దెబ్బపై చేతివేళ్ళతో ముద్దులవర్షం కురిపించుకుని ఆనందించాను . ఒక్కటే బాధ దేవత కళ్లనుండి కన్నీళ్లను తెప్పించాను లవ్ ......... sorry sorry గాడెస్ , మీ సేఫ్టీ నే నాకు తొలి ప్రాధాన్యం మిమ్మల్ని ఎలా వదులుతాను మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను - వైజాగ్ చేరుకునేంతవరకూ నా ప్రాణమైన దేవతలు వదినమ్మ వదినలు అమ్మను మీలోనే కదా చూసుకోవాల్సింది అని ఎదురుగా చైర్లో ఉంచిన బ్రేజర్ అందుకుని దేవతకు కనిపించకుండా వెళ్లి , భయపడుతూ కూర్చున్న దేవత వెనుకే సైలెంట్ గా కూర్చున్నాను . Sorry sorry గాడెస్ .......... మీ పెదాలపై సంతోషంతోపాటు కోపాన్ని చూడాలని అలా చేసానే తప్ప మనసులో ఏ ఉద్దేశ్యమూ లేదు కానీ యువరక్తం కదా చూడకుండా ఉండలేకపోయాను - ఎంజాయ్ చేశానని ఒప్పుకుంటున్నాను మీరు ఎలాంటి శిక్ష విధిస్తారో మీ ఇష్టం అని చెప్పబోయి ఆగిపోయాను .
Like Reply
10 నిమిషాల తరువాత లండన్ to హైద్రాబాద్ ఫ్లైట్ at పొజిషన్ - ప్రయాణీకులంతా టన్నెల్ నెంబర్ 5 ద్వారా ఫ్లైట్ లోకి చేరాల్సిందిగా కోరుతున్నాము అని అనౌన్స్మెంట్ జరగడంతో కంగారుపడుతూ దేవతకూడా లేచారు .
అంటే దేవతకూడా నేను ప్రయాణిస్తున్న ఫ్లైట్ లొనే అన్నమాట అని లేచిమరీ చిందులువేశాను సంతోషం పట్టలేక .
అందరితోపాటు దేవత చెక్ ఇన్ వరకూ వెళ్లి తన హస్బెండ్ కోసం ఎదురుచూస్తున్నారు . దేవతకు కనిపించకుండా కాస్త దూరంలో నిలబడ్డాను . నిమిషం 5 నిముషాలు 10 నిముషాలు 15 నిమిషాలు అయినా మాన్స్టర్ జాడలేకపోవడం - అనౌన్స్మెంట్ ల మీద అనౌన్స్మెంట్ లు రావడంతో కంగారు అంతకంతకూ పెరుగుతున్నట్లు నుదుటిపై చెమట పట్టేసింది - ఫైనల్ అనౌన్స్మెంట్ కూడా రావడంతో కళ్ళల్లోనుండి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి .

నాకు తెలిసి ఆ మాన్స్టర్ ఖచ్చితంగా ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయి కూర్చునిఉంటాడు అని 100% అనిపిస్తోంది . ఒక లుక్ వేసివద్దాము అంటే ఇదేమీ రైల్వేస్టేషన్ కాదు ఒక్కసారి చెక్ ఇన్ అయ్యాక మళ్లీ బయటకు రావడం అసంభవం , ఏదైతే అది అయ్యిందని ఎయిర్పోర్ట్ స్టాఫ్ ద్వారా దేవతకు ఒక అపద్దo చెప్పించాను ఆ మాన్స్టర్ ఫ్లైట్ లోపలికి వెళ్లాడని ..........
దేవతకు కోపం వచ్చేసింది . కన్నీళ్లను తుడుచుకుని సెక్యురిటి డిటెక్టర్స్ ద్వారా చెక్ ఇన్ అయ్యారు . 
దేవుడా ......... దేవత బాధను చూడలేక అపద్దo చెప్పేసాను - ఎలాగైనా ఆ మాన్స్టర్ లోపల ఉండేలా చూడమని ప్రార్థిస్తూ దేవత వెనకాలే టన్నెల్ ద్వారా ఫ్లైట్ చేరాము .

ఎయిర్ హోస్టెస్సెస్ : welcome on board మేడం , may i see your ticket ? 
బయట కంగారులో పిడికిలిలో నలిపేసినట్లు ఒక ఉండను అందించారు .
నాకైతే నవ్వు ఆగలేదు .
ఎయిర్ హోస్టెస్ : షాక్ తోనే అందుకుని సరిచేసి చూసి , సీట్ నెంబర్ 25 మేడం this way అని లోపలికి పంపించారు . 
దేవత : Where is బిజినెస్ క్లాస్ ? .
ఎయిర్ హోస్టెస్ : furthur inside మేడం అని లోపలికి వేలితో చూయించారు .
దేవత బిక్కుబిక్కుమంటూనే వడివడిగా అటువైపుకు అడుగులువెయ్యగానే , ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయ్యి మొబైల్లో టికెట్ చూయించాను .
ఇద్దరు ఎయిర్ హోస్టెస్సెస్ సెల్యూట్ చేసిమరీ రెస్పెక్ట్ ఇస్తూ welcome చెప్పారు .
Why so much respect ? .
ఎయిర్ హోస్టెస్సెస్ : ఎంటైర్ ఫ్లైట్ లో ఇలాంటి పాసెంజర్స్ కేవలం 10 మంది మాత్రమే సర్ అందులోనూ the best క్యాబిన్ మీకు దక్కింది - you are the luckiest - this way to రీచ్ అని స్టెప్స్ వైపు చూయించారు పైకి వెళ్ళమని . 
కింద చిన్న పని ఉంది ఫినిష్ చేసుకుని పైకి వెళతాను - నా క్యాబిన్ కు వెళతానో లేక దేవతతోపాటు జనరల్ సీట్ లొనే ప్రయాణిస్తానో కాలమే నిర్ణయించాలి అనిచెప్పి దేవత వెనకాలే లోపలికివెళ్లాను .

దేవత : ఎకానమీ క్లాస్ నుండి కర్టైన్స్ అటువైపు ఉన్న బిజినెస్ క్లాస్ లోకి కంగారుపడుతూనే ఎంటర్ అయ్యి లగ్జరీ గా ఒక్కొక్క సీట్స్ వరుసలలో ఒక్కొక్కరినే చూసుకుంటూ ముందుకువెళుతున్నారు . బిజినెస్ క్లాస్ ఫుల్ అయిందని చెప్పాడు ఇక్కడ చూస్తే సగానికి సగం ఎంప్టీ ..........
కర్టైన్స్ ప్రక్కనే ఉన్న బాత్రూం వెనుక దాచుకుని దేవతనే చూస్తున్నాను . చివరి వరుసకు రెండు వరసల ముందు మాన్స్టర్ కనిపించడంతో హమ్మయ్యా థాంక్స్ గాడ్ అని ఊపిరిపీల్చుకున్నాను . ప్రక్కనే ఉన్న ఫారిన్ అమ్మాయితో సరసాలాడుతున్నాడు - అయినా వాడిని చూస్తే ........ డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే - అధికాదు నా బాధ దేవత చూస్తే ఎంత బాధపడతారోనని ..........

అంతలోనే మూడు వరసల దూరం నుండే ఒకరినొకరు చూసుకున్నారు , అదేసమయానికి వాడు ఫారిన్ అమ్మాయి చేతిపై ముద్దుపెడుతున్నాడు . 
దేవత కళ్ళల్లో కన్నీళ్ళతో అక్కడే ఆగిపోయారు . నన్ను ఒంటరిగా బయట వదిలేసి ఫ్లైట్ ఎక్కడమే కాకుండా ఫారిన్ అమ్మాయితో ........... అని కోపంతో చూస్తున్నారు.
వాడి తప్పును కప్పిపుచ్చుకోవడానికి లేచివచ్చి ఎక్కడకు వెళ్లిపోయావు చెప్పానుకదా అనౌన్స్మెంట్ కాగానే సైలెంట్ గా వచ్చి ఎకానమీ క్లాస్ లో కూర్చోమని , నీతోపాటు నన్ను చూశారంటే అందరూ ఎంత చీప్ అనుకుంటారు వెళ్ళు వెళ్లి డోర్ కు అటువైపు కూర్చో హైద్రాబాద్ లో కలుస్తాను అని ఏకంగా తోసేస్తున్నాడు . ఒక్క నిమిషం .......... నీ కొత్త హ్యాండ్ బ్యాగ్ కూడా నేనే మొయ్యాలా తీసుకో , అయినా ఇంత బరువుంది ఏమి దాచావు చూద్దామంటే లాక్ ఉంది అని తనమీదకు విసిరాడు .
దేవత కన్నీళ్ళతో వెనుతిరిగారు . 
మాన్స్టర్ : హమ్మయ్యా ......... ఇక హైద్రాబాద్ వరకూ దీని బాధ ఉండదు అని చేతులు కళ్ళ సైగలతో రాక్షస నవ్వులు నవ్వుకుంటూ వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు.
ఫారిన్ women : డార్లింగ్ who is that ? .
మాన్స్టర్ : she she ...... she is my సెక్రటరీ , don't think about her we'll enjoy అని చేతిని అందుకుని దేవతకు వినిపించేలా ముద్దుపెట్టాడు .
దేవత చలించిపోయి మైకం కమ్మినట్లు అడుగు ముందుకుపడక పడబోయి సీట్ పట్టుకుని కంట్రోల్ చేసుకున్నారు . ఆగని కన్నీళ్లు బాధ కోపంతో ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని వేగంగా వచ్చి టాయిలెట్ లోకి చేరారు . 
ప్రక్కనే ఉన్న నాకు లోపల నుండి దేవత వెక్కి వెక్కి ఏడుపులు వినిపించి గుండె కొట్టుకోవడం ఒక్క క్షణం ఆగిపోయింది . దేవత బాధను కొద్దిగానైనా తగ్గించాలి ఎలా ........ ఉన్న ఏకైక మార్గం నా చిలిపిపనులు కవ్వింతలతో చిలిపి కోపాన్ని కలిగించి ఆ బాధను మరిచిపోయేలా చెయ్యడమే అని దేవత సీట్ నెంబర్ 25 దగ్గరకు చేరుకున్నాను - ప్రక్కన సీట్లో window సైడ్ ఫారినర్ కూర్చుని ఉండటం చూసి ఎలాగైనా అతడిని వేరే సీట్లోకి చేర్చాలని , ఫ్లైట్ డోర్ క్లోజ్ చేసి instruction ఇవ్వబోతున్న ఎయిర్ హోస్టెస్ ను పిలిచాను . 
ఎయిర్ హోస్టెస్ : yes sir , how may i help you ? .
పర్సులోఉన్న టోటల్ డాలర్స్ ను ఎవ్వరికీ కనిపించకుండా ఎయిర్ హోస్టెస్ చేతిలో ఉంచి , ఏమిచేస్తారో నాకు తెలియదు ఆ సీట్ నాకు కావాలి అనిచెప్పాను .
ఎయిర్ హోస్టెస్ : అంత డబ్బుని చూసి అవాక్కై థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ ...........
ఈ హెల్ప్ చేస్తే నేనే థాంక్స్ చెబుతాను ...........
ఎయిర్ హోస్టెస్ : పెదాలపై చిరునవ్వుతో , దేవత ప్రక్కనే కూర్చున్న వాడి చెవిలో గుసగుసలాడింది .
ఆశ్చర్యo .......... లేవడమే కాకుండా పైనున్న తన లగేజీ తీసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు .
Within seconds ........ how ? .
Air హోస్టెస్ : బిజినెస్ సీట్ ఆఫర్ చేసాను సర్ అంతే అలా పరుగుపెట్టేస్తున్నాడు .
థాంక్యూ so మచ్ , అండ్ వన్ more స్మాల్ హెల్ప్ ........... , 
ఎయిర్ హోస్టెస్ : dont hesitate just tell me sir , you gave this much happy అని డబ్బువైపు చూసి నవ్వుకుంది .
ఈ ప్రక్కసీట్లో వచ్చి కూర్చోబోతున్న మేడం సీట్ మార్చమని కోరితే ...........
ఎయిర్ హోస్టెస్ : sir sir sir , మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు సర్ I'll handle everything . Oh ....... Indian girl beautiful you like her .......
నో నో నో i adore her ఆరాధిస్తున్నాను , she is my goddess అని గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అయ్యాను .
ఎయిర్ హోస్టెస్ : how lovely , if i am outside విజిల్స్ వేసేదాన్ని all the best sir .......... ఎటువంటి హెల్ప్ కావాలన్నా i am at your service , got to go అనిచెప్పి వెళ్లిపోయారు .  
పెదాలపై చిరునవ్వుతో విండో ప్రక్కనే కూర్చుని , దేవత సీట్ శుభ్రం చేసి టాయిలెట్ వైపే చూస్తున్నాను .

టాయిలెట్ డోర్ తెరుచుకుని దేవత తన చీర కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ తన సీట్ వైపు అడుగులువేశారు . 
ఆశ్చర్యం - షాక్ - అంతులేని సంతోషం ఏమిటంటే , దేవత దేవత ......... నా బ్లూ బ్రేజర్ ( JIM లోగో గల ) వేసుకుని రెండుచేతులతో గట్టిగా హత్తుకుని రావడం - అధిచూసి నా హృదయం పరిస్థితి ఏమిటో ఊహించడానికే .......... ఆనందం పట్టలేక వెక్కిళ్ళు వచ్చేసాయి .
ఎయిర్ హోస్టెస్ : వాటర్ బాటిల్ తో పరుగునవచ్చారు .
నో నో నో .......... goddess అని దేవతవైపు చూయించాను .
ఎయిర్ హోస్టెస్ : ok ok understood understood అని ముసిముసినవ్వులతో సైలెంట్ గా వెనక్కు వెళ్లిపోయారు .

కూల్ కూల్ my heart ......... ఇప్పుడే ఇలా అయిపోతే ఇక దేవత ప్రక్కనే వచ్చి కూర్చుంటే ఏమైపోతావో అని నవ్వుకుని , ఏమీతెలియనట్లు ఎదురుగా ఉన్న మ్యాగజైన్ అందుకుని చదువుతూ కూర్చున్నాను .
దేవత : నన్ను చూసి , కోపంతో మీరా ........ 
Wow మేడం , how coincidence ......... భూమి గుండ్రంగా ఉంటుంది అని చెబితే నమ్మలేదు , మిమ్మల్ని చూశాక నిజమే అయితే ......... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ గాడ్ అని చేతులు జోడించిమరీ ప్రార్థిస్తున్నాను .
దేవత : నో అంటే నో , మీ ప్రక్కన కూర్చోనంటే కూర్చోను , మీ ముఖం చూడటమే నాకు ఇష్టం లేదు .
నాకైతే చాలా చాలా ఇష్టం , మీకు ఇష్టం లేకపోతే వేరే సీట్లోకి వెళ్లి కూర్చోండి .
దేవత : మీ ప్రక్కన కూర్చోవడం కంటే కింద నేలపై కూర్చోమన్నా కూర్చుంటాను .
అంత తప్పు నేనేమి చేసాను గా ........ మేడం అని బ్రేజర్ - చీర చాటున కొద్దిగా అంటే కొద్దిగా కనీ కనిపించకుండా కవ్విస్తున్న అందమైన నడుమువైపు లొట్టలేస్తూ చూస్తున్నాను .
దేవత : నా చూపులకు మరింత కోపంతో చీర - బ్రేజర్ సరిచేసుకుని , ఇందుకే ఇందుకే మీ ప్రక్కన కూర్చినన్నది . ఎయిర్ హోస్టెస్ ను పిలిస్తే మనదగ్గరికే వస్తారని తెలియని అమాయకమైన దేవత చేతిలో హ్యాండ్ బ్యాగుతో స్వయంగా మరొక ఎయిర్ హోస్టెస్ దగ్గరకువెళ్లి , ఎస్క్యూస్ మీ నా సీట్ మార్చండి అక్కడ ఏమాత్రం కూర్చోలేను please please .......... 
నా ఎయిర్ హోస్టెస్ : let me handle అని ఆ ఎయిర్ హోస్టెస్ ను పంపించేసి , see medam ......... ఎకానమీ క్లాస్ సీట్స్ are ఫుల్ , you must sit at your seat అని నావైపు చూసి నవ్వుతోంది .
దేవత : please please .......... , i'll sit anywhere చివరికి కింద అయినా పర్లేదు అని బ్రతిమాలుతున్నారు .

దేవత బాధనంతా మరిచిపోయి నాపైగల కోపంతో నావైపు కోపంగా చూడటం చూసి ముచ్చటేసి నవ్వుకున్నాను .
దేవత : please please ........ ఇక్కడ కింద కూర్చోమన్నా కూర్చుంటాను .
ఎయిర్ హోస్టెస్ : మేడం అలా కూర్చుంటే ఫ్లైట్ కే ప్రమాదం , అదిగో టేకాఫ్ అనౌన్స్మెంట్ please please వెళ్లి మీ సీట్లో కూర్చోండి అని స్వయంగా నాదగ్గరకు వదిలి , ఎంజాయ్ సర్ అని పెదాలను కదిల్చి వెళ్ళిపోయింది . 

థాంక్స్ అని మనసులో అనుకుని , మేడం అనౌన్స్మెంట్ ....... తొందరగా కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోండి లేకపోతే ప్రమాదం .
దేవత : మీ ప్రక్కన కూర్చోవడం కంటే ప్రమాదం జరిగినా సంతోషమే ..........
అలా కోరుకోకండి మేడం , తథాస్తు దేవతలు రెడీగా ఉంటారు - తథాస్తు అన్నారంటే ఇక అంతే - మీరు జీవితంలో అన్నీ చూసేసి ఉంటారు - నేను జస్ట్ ఇప్పుడే నిజ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాను జల్సాలు పార్టీలు ప్రేమ పెళ్లి పిల్లలు ......... 
దేవత : నా మాటలకు ఒక్కసారిగా నవ్వేసి వెంటనే మళ్లీ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు .
నాగురించి వదిలెయ్యండి మీ బాబు కోసమైనా ............
దేవత: అవునుకదా , మీపై కోపంలో నా ప్రాణమైన బాబు గురించే మరిచిపోయాను ఇందుకే ఇందుకే ( మీ ప్రక్కన ఉంటే అన్నీ అన్నీ ........ నన్నే మైమరిచిపోతున్నాను ) కూర్చినన్నది - తథాస్తు దేవతలూ .......... ఏదో అమాయకత్వంతో మాట్లాడాను క్షమించండి క్షమించండి ఇదిగో లెంపలేసుకుంటున్నాను . నన్ను ........ నా బాబు దగ్గరికి - ఫ్లైట్ లో ఉన్నవారందరినీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి జాగ్రత్తగా చేర్చండి .
దేవత దేవతనే అని మురిసిపోయాను . గా ........ మేడం అందరితోపాటు నేను కూడానా ? .
దేవత : yes yes , కానీ ఎలాంటి తప్పులూ చెయ్యకుండా ఉంటేనే ........... 
ల ........ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మేడం , మీ వలన ఇండియా సేఫ్ గా చేరుకుని పైన చెప్పినవన్నీ ఎంజాయ్ చేస్తాను కూర్చోండి కూర్చోండి అని సీట్ శుభ్రం చేసాను . 
దేవత : క్రేజీ guy అని నవ్వుకుని , హ్యాండ్ బ్యాగుని పైన పెట్టడానికి చేతులను ఎత్తారు .
అంతే అతిదగ్గరగా స్వర్గపు సొరంగం అన్నట్లు అతి సౌందర్యమైన బొడ్డు కనిపించేసరికి , ఒక తియ్యనైన నిట్టూర్పును వదిలి పెదాలను తడుముకుంటూ అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . 
దేవత : నానిట్టూర్పు శబ్దానికి కిందకుచూసి కోపం కంట్రోల్ చేసుకోలేక ఏకంగా హ్యాండ్ బ్యాగుతో కొట్టేసి , ఎయిర్ హోస్టెస్ దగ్గరికి అడుగువేసేంతలో ...........
ఫ్లైట్ కదిలినట్లు జర్క్ ఇవ్వడంతో భయపడి వెనక్కు పడబోయారు .
వెంటనే లేచి నా వీపుని అడ్డుపెట్టాను , are you ok medam అని నిలబడేలా చేసాను . please please మరింత ప్రమాదం జరగకముందే కూర్చోండి మేడం అని కిందపడిన హ్యాండ్ బ్యాగును పైన ఉంచాను .
దేవత : చిరుకోపంతోనే సీట్లో కూర్చున్నారు .
మేడం .......... సీట్ బెల్ట్ .
నాపై కోపంతోనే సీట్ బెల్ట్ పెట్టుకుని నాకు అటువైపు చూస్తూ కూర్చున్నారు - పెదాలపై చిరునవ్వుతో లోపలికివెళ్లి కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోబోయి , గా ....... మేడం నైట్ లైట్స్ లో లండన్ మరింత అద్భుతంగా ఉంటుంది , చూడాలనుకుంటే విండో ప్రక్కన వచ్చి కూర్చోవచ్చు .
సైలెంట్ ............
మళ్లీ లండన్ వస్తారో లేదో , నాపై కోపంతో ఒక అద్భుతాన్ని వదులుకోకండి please please please ........ మీకు ఇష్టమని తెలుస్తోంది కావాలంటే ఒకటి కాదు వంద వేలు లక్షలు కోట్ల sorry లు చెబుతాను sorry sorry అంటూ చెవులను పట్టుకుని గుంజీలు కూడా తీస్తున్నాను .
దేవత : లోలోపలే నవ్వుకుని సీట్ బెల్ట్ తీశారు . One కండిషన్ నన్ను ఏమాత్రం టచ్ చెయ్యకూడదు రండి బయటకు రండి అటువైపు అటువైపు ఏమాత్రం తాకకూడదు .
నన్ను మన్నించినందుకు థాంక్యూ soooooo మచ్ మేడం అని ఎదురు సీట్ కు అతుక్కుపోయిమరీ బయటకువచ్చాను . 
దేవత .......... ముసిముసినవ్వులతో లేచి విండో ప్రక్కన కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుని లండన్ అందాలను తిలకించి ఆనందిస్తున్నారు .
Like Reply
ఫ్లైట్ నెమ్మదిగా మూవ్ అయ్యింది . గా ........ మేడం , ఇంకా ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు ఇంకా రన్ వే మీదనే ఉన్నాము కాస్త ఓపికపట్టిండి .
దేవత : అతిదగ్గరగా ఉన్న నన్ను చూసి , అనుకున్నాను వెళ్ళండి వెళ్ళండి అటువైపు వెళ్ళండి డిస్టన్స్ డిస్టన్స్ ......... yes yes ఈ మాత్రం డిస్టన్స్ మైంటైన్ చేస్తే మంచిది .
అదికాదు మేడం ......... నాకు టేకాఫ్ అలర్జీ , లాస్ట్ టైం ఇలానే టేకాఫ్ అవుతుంటే నాప్రక్క పాసెంజర్ మీద వొమిట్ చేసేసుకున్నాను . వ్యాహ్ ......... అంటే పీకల్లోతు మెక్కి ఫ్లైట్ ఎక్కానుకదా వాడు వర్షంలో తడిచినట్లు నా వాంతులతో తడిచిపోయాడు కాబట్టి నిమ్మకాయలైనా కావాలి లేకపోతే ........... అని మాట్లాడుతుంటే ,
దేవత మాత్రం గుడ్లప్పగించి గుటకలుమింగుతూ అలా చూస్తుండిపోయారు - మే బీ ........ నేను ఎయిర్పోర్ట్ లో మెక్కిన ఐటమ్స్ గుర్తొచ్చినట్లున్నాయి పాపం .
మేడం మేడం ........... అంటూ పొట్టపై చేతితో స్పృశించుకుని బేవ్ బేవ్ ......... అన్నాను .
దేవత : అయితే వెంటనే నిమ్మకాయలు తెప్పించుకోండి , ఎయిర్ హోస్టెస్ ఎయిర్ హోస్టెస్ ...........
పరుగునవచ్చి yes మేడం .......... 
దేవత : He wants lemons urgent , he has takeoff alargy ఫాస్ట్ ఫాస్ట్ టేకాఫ్ అవుతోంది అని ఆతృతగా అడిగారు .
ఎయిర్ హోస్టెస్ : నావైపు చూడటం - నేను నో అనడంతో ......... నవ్వుకుని , we have no lemons medam , its టేకాఫ్ టైం have to sit and సీట్ బెల్ట్ అనిచెప్పి వెళ్ళిపోయింది .

దేవత : నేను వాంతి వచ్చేలా యాక్ట్ చేస్తుండటం చూసి , అయ్యో ........ ఇప్పుడెలా నిమ్మకాయలు లేకపోతే ఏదో చెప్పబోయారు .........
బేవ్ బేవ్ .......... చెబితే మీరు కోప్పడతారు వద్దులెండీ అని woh woh ........
దేవత : చెబితేనే కదా తెలిసేది నేను కొప్పాడతానో లేదో ...........
లేదండీ మీరు కోప్పడటమే కాదు ఇంతకుముందులా కొట్టినా కొడతారు , అడిగారు కాబట్టి చెబుతాను - టేకాఫ్ అయ్యేంతవరకూ మీరు మీ చేతితో నా చేతిపై ప్రేమతో నిమారాలి .
దేవత : what , నోవే ......... అని కోపంతో అటువైపుకు తిరిగారు .
ఇందుకే చెప్పను అన్నది అదిగో టేకాఫ్ బేవ్ బేవ్ ........ అంటూ దేవతవైపుకు తిరిగి , అలా చేస్తే వొమిటింగ్ ఫీలింగ్ పోతుంది woh ........ please please మేడం లేకపోతే మీఇష్టం నా వాంతితో తడిచిపోతారు ఉమ్మ్ వోవ్ ........ అని దేవతమీదకు మరింత ఒరిగాను .
ఫ్లైట్ టేకాఫ్ అవ్వడం - దేవతకు ఇష్టం లేకపోయినా అటువైపుకు తిరిగి చేతిపై సున్నితంగా నిమురుతున్నారు .
బేవ్ బేవ్ బేవ్ .........ఆఅహ్హ్ ఉఫ్ఫ్ ...... హ్హ్హ్ ఇప్పుడు హాయిగా ఉండండి అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
ఫ్లైట్ పూర్తిగా టేకాఫ్ అయ్యి ఆకాశంలోకి ఎగిరినా కూడా దేవత అలానే స్పృశిస్తుండటం చూసి లోలోపలే గెంతులేస్తున్నాను - మళ్లీ ఫ్లైట్ లాండింగ్ అయ్యేంతవరకూ ఈ మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఉన్నా దేవతను మరింత కవ్వించాలనుకున్నాను .
గా ......... మేడం మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ కాస్త మీ చేతిని తీస్తారా , ఎవరైనా చూసి సోషల్ మీడియాలో పెడితే బాగోదు , అసలే నాకింకా పెళ్లికూడా కాలేదు రోజులు కూడా బాలేవు అని బాధపడుతున్నట్లు యాక్ట్ చేసాను .
దేవత : మరింత కోపంతో స్పృశించిన చోట గట్టిగా గిల్లేసి ఇడియట్ అంటూ అటువైపుకు తిరిగి విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న లండన్ మహానగరాన్ని వీక్షిస్తున్నారు .
గా ........ మేడం ........ అదే లండన్ eye , ప్రపంచంలోనే అతిపెద్ద జైంట్ వీల్ ............
దేవత : హి హి హి .......... నాకు తెలుసు , మీరు కాస్త కాదు కాదు పూర్తిగా డిస్టన్స్ మైంటైన్ చేస్తే మంచిది లేకపోతే కొట్టడం గిళ్లడం కాదు రక్తం వచ్చేలా కొరికేస్తాను . 
Wow .......... వింటుంటేనే ఎంత బాగుంది , కొరికేస్తారా కొరికేస్తారా కొరుక్కుని తినెయ్యండి అంతకంటే అదృష్టమా .........
దేవత : what ? .
అదే అదే మీరు కొరికితే ఊరికే ఉంటానా , గట్టిగా కేకలువేసేస్తాను .
దేవత : క్రేజీ అని ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .

మీరెప్పుడూ ఇలా చిరునవ్వులు చిందిస్తూనే , హైద్రాబాద్ లో ల్యాండ్ అయ్యేంతవరకూ నా దేవతలు నా ప్రక్కనే ఉన్న ఫీల్ కలిగించండి చాలు - ఇప్పటివరకూ జరిగిన మధురమైన ఇన్సిడెంట్స్ తలుచుకుంటూ నాలో నేనే ఎంజాయ్ చేస్తున్నాను - ఇష్క్ మూవీ ఫ్లైట్ scene నా జీవితంలో కూడా జరుగుతుందని అస్సలు ఊహించలేదు - థాంక్స్ విక్రమ్ కుమార్ ...........

అంతలో ఎయిర్ హోస్టెస్సెస్ ఇద్దరు ఎదురెదురుగా ట్రాలీని తోసుకుంటూ ప్రతిఒక్కరికీ ఫుడ్ అందిస్తూ మాదగ్గరికి వచ్చారు .
ఎయిర్ హోస్టెస్ : everything ok sir ? .
Thanks .......... , క్యారి on .........
ఎయిర్ హోస్టెస్ : మేడం ......... హలో మేడం ........ food ? .
దేవత : hi hi ......... yes yes , very hungry .
ఎయిర్ హోస్టెస్ : సీట్ నెంబర్ 25 25 ........ ట్రాలీ నుండి ఫుడ్ బాక్స్ అందించారు.
దేవత : థాంక్స్ అని అందుకుని చూస్తే నాన్ వెజ్ , ఆ ........ I am vegetarian .
ఎయిర్ హోస్టెస్ : sorry మేడం ......... this seat was ordered non veg - ordered by బిజినెస్ సీట్ 55 .
దేవత : మాన్స్టర్ .........
గా ....... మేడం మీ హస్బెండ్ నాన్ వెజ్ తింటారా ? .
దేవత :  దున్నపోతులా ......... ఆహా ...... తింటారు తింటారు .
మీరు నాన్ వెజ్ తినరని తెలిసికూడా ............. 
దేవత : అవును కావాలనే ఆర్డర్ చేసి ఉంటాడు అని కళ్ళల్లో చెమ్మతో బాధపడ్డారు.
ఎస్క్యూస్ మీ ......... can you replace order ? .
ఎయిర్ హోస్టెస్ : sorry sir .......... వెజ్ ఆర్డర్స్ are ఫుల్ అండ్ ఎంప్టీ . 
దేవత : do one thing , take this one also and give it to బిజినెస్ సీట్ నెంబర్ 55 మాన్స్టర్ అని ఇచ్చేసారు .

గా ...... మేడం మీకు సలహా ఇస్తున్నానని తప్పుగా అనుకోవద్దు - మీరే దైర్యంగా వెళ్లి ............
దేవత : yes అంటూ సీట్ బెల్ట్ తీసుకుని లేచి , ఫుడ్ అందుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ బిజినెస్ క్లాస్ వైపుకు వెళ్లారు .
ఎయిర్ హోస్టెస్ : సర్ ......... మీ ఫుడ్ పైన మీ స్పెషల్ క్యాబిన్ లో ఉంచాము .
వెజ్ కూడా కదా ..........
ఎయిర్ హోస్టెస్ : వెజ్ - నాన్ వెజ్ - సాఫ్ట్ డ్రింక్స్ - ఐస్ క్రీమ్స్ - cakes .......... all ఐటమ్స్ సర్ , told you స్పెషల్ క్యాబిన్స్ అండ్ you are the luckiest అని ముందుకు వెళ్లారు .
థాంక్స్ .......... 

జంక్షన్ కర్టైన్ వరకూ వెళ్లిన దేవత చూడకూడనిది చూసినట్లు ఫుడ్ ను బాత్రూం ప్రక్కనే ఉన్న డస్ట్ బిన్ లో పడేసి వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చి విండో ప్రక్కన కూర్చుని బాధపడుతున్నారు . 
మేడం మేడం .......... బాధకు కారణం ఏమిటో అడగబోయి , మరింత బాధపెట్టడం ఇష్టం లేక , కారణం ఏమిటో తెలుసుకోవాలని లేచి బిజినెస్ క్లాస్ లోకి ఎంటర్ అయ్యాను . 
దేవత హస్బెండ్ ......... ఫారిన్ అమ్మాయితో ముద్దులలో మునిగితేలుతున్నాడు . దేవత చూసారన్నమాట - అయినా తెలిసి కూడా ఇంతలా బాధపడటం ( అంటే ఈ దేవత పరిస్థితి కూడా నా దేవతలు లానే - పైకి సంతోషాన్ని ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం అంతులేని బాధ ......... ఒక్కసారిగా కళ్ళల్లోనుండి కన్నీరు ఆగడం లేదు - వదినమ్మ వదినలు .......... రోజూ ఈ బాధను లోలోపలే అనుభవిస్తున్నారన్నమాట - ఇకనుండీ అమ్మతోపాటు నేనూ నా దేవతల ప్రక్కనే ఉండి కంట కన్నీరు రాకుండా చూసుకోవాలి చూసుకుంటాను ) అని కన్నీళ్లను తుడుచుకుని గుండెలపై చేతినివేసుకునివచ్చి కూర్చున్నాను - దేవత బాధను తగ్గించే ఉపాయం తట్టక తన బాధను నేనూ అనుభవిస్తూ సైలెంట్ గా కూర్చున్నాను .

నావల్ల కాక గా ...... మేడం , నా ఫుడ్ పైన రూంలో ఉంది ఇద్దరమూ షేర్ చేసుకోవచ్చు అన్నాను - మొత్తం కావాలన్నా కూడా మీరే తినవచ్చు - చూసారు కదా పొట్ట నిండిపోయేలా తిన్నాను - please please మేడం ........
దేవత : ఊహూ ........ అని బదులిచ్చి , విండో కు తలవాల్చి ఏడుస్తూ ఏడుస్తూనే అలసిపోయి నిద్రలోకిజారుకున్నారు . 
పైనున్న మా లైట్స్ ఆఫ్ చేసి , పైనుండి దేవతకు చల్లటి AC తగిలేలా సెట్ చేసి ఆరాధనతో చూస్తూ ఉండిపోయాను . 

సుమారు గంట తరువాత ఏమీ తినకపోవడం వలన నిద్రలోనే మూలుగుతూ కడుపుపై చేతులను వేసుకుని అటూ ఇటూ కదులుతున్నారు - అంతటి చల్లదనంలోనూ ఆకలి వలన దేవత నుదుటిపై చెమటపట్టడం చూసి చలించిపోయాను . రాను రానూ ......... దేవతకు మరింత నొప్పివేస్తున్నట్లు మూలుగులు ఎక్కువ అవుతున్నాయి .
గాడెస్ ......... మేడం మేడం ......... అని నా కర్చీఫ్ తో నుదుటిపై పట్టిన చెమటను తుడిచాను .
దేవత : కళ్ళుతెరిచి కంగారుపడ్డారు .
Sorry sorry గా ......మేడం , మీ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాను అందుకే - కావాలంటే మీకోపం తగ్గేంతవరకూ కొట్టండి - కొట్టడానికైనా శక్తి కావాలి కదా please please దయచేసి పైకివచ్చి ఫుడ్ తీసుకోండి - ఆకలికి తట్టుకోవడం మీవల్లనే కాదు ఎవ్వరి వల్లా కాదు -  రాత్రంతా ప్రయాణించాలి ప్రయాణంలో నిద్రపోవాలన్నా తినాలి లేకపోతే నొప్పితో కష్టమైపోతుందండీ ఇంతకూ ఫ్లైట్ లో డాక్టర్ ఉన్నారోలేదో - ఇప్పటికే మీ నుదుటిపైభాగాన మెడపై దెబ్బల తాలూకు ........... అని కన్నీళ్ళతో కేరింగ్ గా చెప్పాను . 
మేడం ......... మిమ్మల్ని ఇబ్బందిపెట్టను - తాకను - మీ అందమైన నడుమును మరియు బొ .......... ఆహా ......... చూడనే చూడను please please please ప్రయాణంలో కలిసిన ఒక స్నేహితుడిగా మీ సంతోషాన్ని కోరుకునే వ్యక్తిగా అడుగుతున్నాను బ్రతిమాలుతున్నాను ఆర్థిస్తున్నాను - నన్ను మన్నించడానికి మీ పాదాలను పట్టుకోమంటారా చెప్పండి రెడీ .......... నో నో నో వద్దులేండి అందుకోసమైన తాకాలి కదా అని చేతులుకట్టుకుని please please please .............. 
దేవత : నా మాటలకు - చేష్టలకు ఒక్కసారిగా నవ్వేశారు . 
యాహూ ........... దే ....... మేడం నన్ను మన్నించారు యే యే యే ......... అని ఫ్లైట్ మొత్తం దద్దరిల్లిపోయేలా కేకలువేసి మాస్ స్టెప్పులు వేస్తున్నాను .

ఉలిక్కిపడి లేచిన తోటి ప్రయాణీకులతోపాటు లైట్స్ అన్నీ on అయ్యాయి . నా కేకలకు మొదట కోప్పడినా నా డాన్స్ చూసి సంతోషంతో లేచిమరీ విజిల్స్ - చప్పట్లతో హోరెత్తిస్తున్నారు . 
దేవత : నో నో నో చాలు చాలు వచ్చి కూర్చోండి అని నవ్వుతూ బ్రతిమాలడంతో కూర్చున్నాను .
ఎయిర్ హోస్టెస్సెస్ వచ్చి నార్మల్ అయ్యేలా అందరినీ కూర్చోబెట్టి నాదగ్గరకువచ్చారు . నా ఎయిర్ హోస్టెస్ మిగతావారందరినీ పంపించేసి జస్ట్ మిస్ సర్ అని నవ్వుకుంటున్నారు . 
దేవత : చిరునవ్వులు చిందిస్తూనే చిరుకోపంతో మీకు సిగ్గు భయం ఏమీలేవు అని నా చేతిపై దెబ్బల వర్షం కురిపించారు .
గా ......... మేడం మీరు నవ్వారు అదిచాలు నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతోంది - డిన్నర్ చెయ్యడానికి వెళదామా .........
దేవత : నో అంటే మళ్లీ ఇలానే చేస్తారేమో పదండి అని నా చేతిపై గిల్లేసారు .
స్స్స్ ......... పైకి అమాయకంగా కనిపించే అందాలరాక్షసి మీరు .
ఎయిర్ హోస్టెస్ : సర్ ........ మీ ఆర్డర్ ప్రత్యేకంగా ఏర్పాట్లుచేస్తాము అని వెళ్ళింది .
అలాగే ఒక బ్యాండ్ ఎయిడ్ కావాలి .
ఎయిర్ హోస్టెస్ : సర్ మీ క్యాబిన్ లో ఫస్ట్ ఎయిడ్ ఉంది .
థాంక్యూ ..........
దేవత : ఏదో కొద్దిగా గిల్లాను దానికే బ్యాండ్ ఎయిడ్ కావాలా తమరికి ........
బ్రేజర్ తీసుకుని నవ్వుతూ పైకిలేచి ప్లీస్ గా ....... మేడం అని చేతిని చూయించాను.
దేవత : అంతకుందు నేను అంటూ చిటికెన వేలిని చూయించారు సిగ్గుపడుతూ ...........
దానిని ప్రపంచంలో ఎవ్వరూ ఆపుకోలేరు please please ........ నన్నూ రమ్మంటారా ? .
దేవత : ఇలా చేస్తే నేను రానంటే రాను అని చేతులుకట్టుకుని కూర్చున్నారు .
Sorry sorry .......... ఎందుకో తెలియదు మిమ్మల్ని ఆటపట్టించి కోపతాపాల్ని కలిగించి మరిన్ని దెబ్బలు తినాలని ఆశగా ఉంది , sorry sorry అని చెవులను పట్టుకుని గుంజీలు తీసాను .
దేవత : అలా చెప్పొచ్చు కదా కుమ్మేస్తాను అని నవ్వుతూ లేచి వీపుపై పిడిగుద్దులు గుద్ది , నేను వచ్చేన్తవరకూ ఇక్కడే ఉండాలి అని ఆర్డర్ వేసి టాయిలెట్ కు వెళ్లారు . టాయిలెట్ తోపాటు ఫేస్ వాష్ చేసుకున్నట్లు కొంగుతో ముఖం తుడుచుకుంటూ వచ్చారు . 
దేవత : " టఫ్ గా కనిపిస్తారు కానీ మాట వింటారు " పర్లేదు పర్లేదు . 
ఎన్టీఆర్ స్మైల్ ఇచ్చి వెంటనే చిరుకోపంతో దేవతవైపే చూస్తున్నాను .
దేవత : ఏమైనా తప్పుగా మాట్లాడానా sorry ...........
గా ........ మేడం , నాకు పట్టుచీరలు అంటే చాలా చాలా ఇష్టం - పట్టుచీరలు మీలాంటి వారిని దేవతలను చేస్తాయి - అలాంటి విలువైన పట్టుచీరతో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటారా ........ i hurt .
దేవత : కొంగు తడిచిపోయి ఉండటం చూసి , sorry sorry ......... పట్టుచీరలంటే నాకూ అంతే ఇష్టం - కర్చీఫ్ పైన హ్యాండ్ బ్యాగులో ఉండిపోవడం వలన తప్పలేదు sorry .......... sorry ..........
ఇంకెప్పుడూ అలా చెయ్యకండి , హ్యాండ్ బ్యాగ్ మీరు తీసుకుంటారా లేక నన్ను ఇమ్మంటారా ? .
దేవత : మిమ్మల్నీ ........ అంటూ నా వెనక్కువచ్చి మళ్లీ కొట్టారు . 
ఆ ఉద్దేశ్యంతో కాదు గా ....... మేడం , మిమ్మల్ని తాకను అని ప్రామిస్ చేసాను కదా హ్యాండ్ బ్యాగ్ కూడా .......... అబ్బా కుమ్మేశారు - తినకుండానే ఇలా కొడితే తిన్నాక ఫుడ్ దెబ్బలు పడతాయేమో ........
దేవత : నవ్వుకుని , నా హ్యాండ్ బ్యాగ్ అని ఆర్డర్ వేశారు . 
పైనున్న హ్యాండ్ బ్యాగ్ అందుకుని , మేడం ........ కూలీలా మోసుకుని రమ్మంటారా - అదృష్టం లా భావిస్తాను .

దేవత : ఆపకుండా నవ్వి , ఇందుకే ఇందుకే మిమ్మల్ని కొడుతూనే ఉండాలనిపిస్తోంది అని భుజం పై గిల్లేసి , నా చేతిలోని హ్యాండ్ బ్యాగ్ అందుకుని పదండి అన్నారు .
After you మేడం - always లేడీస్ ఫస్ట్ అని స్టెప్స్ వైపు చూయించాను .
దేవత : చేతిపై కొట్టి , చిరునవ్వులు చిందిస్తూ ముందు నడిచారు .
ప్రామిస్ చేసినా దేవత బ్యూటిఫుల్ బ్యాక్ చూడకుండా ఉండలేకపోయాను , దేవత వేసుకున్న బ్రేజర్ నడుమును పూర్తిగా కవర్ చేసేయ్యడంతో తిట్టుకున్నాను . స్టెప్స్ ఎక్కుతుంటే ఆ కదలికలకు హృదయం జిల్లుమంటోంది . నా చూపులు దేవతను తాకినట్లు సడెన్ గా ఆగి వెనక్కుచూశారు . నా కళ్ళు తన బ్యాక్ పై - చెయ్యి గుండెలపై ఉండటం చూసి భద్ర కాళీ అవతారం ఎత్తేంతలో ........ నా మాటల గారడీతో దేవతను నవ్వించాను . మీరే ముందు .........
OK అని కొన్ని స్టెప్స్ వేసి సడెన్ గా ఆగి , అబ్బాబ్బా ........ మీకో న్యాయం నాకో న్యాయమా .......... 
దేవత : నవ్వుకుని , అయితే ఇద్దరమూ ప్రక్కప్రక్కనే నడుద్దాము అని చిరునవ్వులు చిందిస్తూ ఒక్కొక్క క్యాబిన్ occupied occupied అని చూస్తూ ముందుకువెళ్లాము .
ఎయిర్ హోస్టెస్ బయటకువచ్చి sir here లాస్ట్ క్యాబిన్ అని పిలిచింది .
దేవత : మీ రూమ్ మీకే తెలియదా ? .
ప్రతీసారీ బిజినెస్ క్లాస్ లోనే వెళ్ళేవాడిని , చాలా కష్టపడి స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు వస్తున్నాడని dad ......... బుక్ చేశారు - నేనూ ఫస్ట్ టైం . 
ఎయిర్ హోస్టెస్ : All arrangements are done సర్ - మేడం ......... , have a good time అని విష్ చేసి వెళ్ళిపోయింది .
Like Reply
After you గా ..... మేడం .
దేవత : కళ్ళు పైనే ఉండాలి - కిందకు చేరాయో దెబ్బలు పడతాయి ఇలా అని గుండెలపై కొట్టి లోపలకువెళ్లారు . బెడ్ - సోఫా - డైనింగ్ టేబుల్ - బాత్రూం ........ ఇంత లగ్జరీ వదిలేసి ఇప్పటివరకూ ఎకానమీ జర్నీ చేశారా ? ఎందుకు ? .
మీకోసం గాడె ....... మేడం , మీ పెదాలపై చిరునవ్వులు పూయించడం కోసం - ఆ చిరునవ్వులు చూసి పొందే ఆత్మ సంతృప్తికోసం అని పెదాలపై చిరునవ్వుతో లోపలికివచ్చి చుట్టూ చూసాను . ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుకుని ఫుడ్ ప్రక్కనే ఉంచి ఓపెన్ చేసాను . 
మేడం .......... కూర్చోండి అనిచెప్పి , తాళి లాగడం వలన అప్పటికి కనిపించకపోయినా ఇప్పుడు ఎర్రగా కనిపిస్తుండటం చూసి కళ్ళల్లో చెమ్మతో ........ కాటన్ పై dettol పోసి సున్నితంగా శుభ్రం చేసి బ్యాండ్ ఎయిడ్ వేసాను .

దేవత : నావైపే కన్నార్పకుండా చూస్తూ , బ్యాండ్ ఎయిడ్ మీకోసం కాదా నాకోసమా ..........
ఫ్లాట్ అయిపోయారా గా ....... మేడం అంతలా చూస్తున్నారు అని డోర్ వెనకున్న హ్యాంగర్ కు బ్రేజర్ తగిలించి డోర్ వేసేంతలో ..........
దేవత : మిమ్మల్ని నమ్మలేను మీరు ఎలాంటివారో ........., డోర్ ఓపెన్ చేసే ఉంచండి - కింద తాకను అనిచెప్పి ఇప్పుడు రెండుసార్లు తాకారు .
నేను నేను ......... ఇప్పుడే కదా మేడం అంతలా చూసారు అప్పుడే అనుమానిస్తున్నారా ? - dettol తో క్లీన్ చెయ్యడం , బ్యాండ్ ఎయిడ్ వెయ్యడం కూడా తప్పేనా .........
దేవత : పెదాలపై చిరునవ్వులతో , మాన్స్టర్ ........ నా హస్బెండ్ వలన మగాళ్లందరూ నా దృష్టిలో ఒక్కటే ......... 
మీఇష్టం గా ....... మేడం , ఆకలి తీర్చడానికి తీసుకొచ్చాను - మాట నిలబెట్టుకుంటాను ఈ వెజ్ ఐటమ్స్ - ఐస్ క్రీమ్స్ - జ్యూస్ ........ అన్నీ మీకోసమే కుమ్మేయ్యండి .
దేవత : ఇన్ని ఎవరైనా తింటారా ? .
చూసాను చూసాను కానీ తినండి , బ్రేజర్ ఇవ్వండి హ్యాంగర్ కు తగిలిస్తాను వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు .
దేవత : నో నో నో ....... నన్ను తాకితే దెబ్బలతో ఆగుతాను - ఈ బ్రేజర్ తాకితే చంపేస్తాను - నా ప్రాణం ......... ఊహూ నా ప్రాణం కంటే ఎక్కువ .
నా ఆనందానికి అవధులు లేవు - సంతోషపు షాక్ లో అలా ఉండిపోయాను - ఎవరెస్టు శిఖరాన్ని చేరి ప్రపంచం మొత్తానికీ వినిపించేలా కేకలువేస్తున్నాను లోపల .......... 
దేవత : హలో హలో .......... ఎక్కడికి వెళ్లిపోయారు అని చేతిపై గిల్లేసారు .

స్స్స్ .......... , అయినా అంత స్పెషాలిటీ ఏముంది మేడం ఇందులో ...........
దేవత : అదీ అదీ ........ అని మాటల్లో వర్ణించలేనంత ఉత్సాహంతో చెప్పబోయి , అయినా మీకెందుకు చెప్పాలి ఫుడ్ తినడానికి పిలుచుకుని వచ్చారు ముందు ఆ సంగతి చూడండి అని బ్రేజర్ ను ఏకమయ్యేలా హత్తుకుని కాలర్ పై లవ్ యు అంటూ ముద్దుపెట్టారు .
ఆ ముద్దు నా మెడపై పెట్టినట్లు - దేవత నన్నే ఏకమయ్యేలా హత్తుకున్నట్లు గాలిలో తెలిపోయి డైనింగ్ టేబుల్ చైర్లోకి కూలబడ్డాను . 
దేవత: నెమ్మదిగా ........ ఏమయ్యింది .
నో నో నో గా ...... మేడం అని వెజ్ ఐటమ్స్ అన్నింటినీ దేవత ముందు ఉంచి అలా చూస్తూ ఉండిపోయాను .
దేవత : మీరూ తినండి .
లేదు లేదు ......... ఎయిర్పోర్ట్ లో తిన్నదే ఇంకా అరగలేదు - ఆకలి వేసినప్పుడు తింటాను తినండి అని తింటున్న దేవత కళ్ళకు తన hairs అడ్డుగా వస్తుండటం చూసి ప్రక్కకు జరపబోయాను .
అంతే ఎడమచేతితో వేళ్ళను విరిగిపోయేలా తిప్పేసి , నొప్పికి విలవిలలాడిపోవడం చూసి వదిలారు - ఇంకొక్కసారి టచ్ చెయ్యాలని ప్రయత్నిస్తే భోజనం మధ్యలో వదిలేసి వెళ్లిపోతాను .
అమ్మో అమ్మో ......... అందాల రాక్షసి అండీ మీరు అంటూ నొప్పితో చేతిని విదిల్చి , గా ........ మేడం ఇంతకూ బ్రేజర్ పై ఉన్న లోగో అర్థం ఏమిటి ? .
దేవత : sorry .........
గా ....... మేడం , అది చెప్పడానికి కూడా .......
దేవత : sorry అంటే నాకు కూడా తెలియదని అర్థం - తెలుసుకోవాలని మీకంటే నాకు ఎక్కువ ఆసక్తి .......... , దానికోసం నా హస్బెండ్ కు తెలియకుండా ఉదయం నుండీ క్యాబులో సిటీ మొత్తం చుట్టేసాను .
What ......... నాకోసం నాలానే సిటీ మొత్తం ..........
దేవత : నీకోసం ....... అదే అదే మీకోసం ఎందుకు సెర్చ్ చేస్తాను .
అదే అదే ఎవరికోసమో అన్నారుకదా వాడికోసం .........
దేవత : ఆ దేవుడిని వాడు అంటే నేనిప్పుడే లేచి వెళ్లిపోతాను - నా దేవుడు .
 దేవుడినా ........ నిమిషం నిమిషానికీ దేవత నన్ను ఎవరెస్టుని మించి పైకి తీసుకెళ్లిపోతున్నారు - కలుగుతున్న సంతోషానికి ఇప్పటివరకూ పేరు కానీ కొలత కానీ కనిపెట్టనేలేనంత ........... ఆఅహ్హ్ ........ ఏమిటీ మాధుర్యం అని గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
దేవత : వెళ్లిపోతాను .
Sorry sorry మేడం వాడు కాదు వారు .........
దేవత : ok ok నా దేవుడు అని నాలానే ఫీల్ అవుతున్నారు .
ఇంతకూ ఆ దేవుడు - మీ దేవుడు కనిపించారా ? .
దేవత : ప్చ్ ........ కళ్ళల్లో చెమ్మతో తినడం ఆపేశారు .
Please please గా ..... మేడం , ఆ బాధను తిండిపై చూయించకండి అని లేచిమరీ గుంజీలు తీస్తున్నాను .
దేవత : ఒక్కసారిగా నవ్వుకుని , నా ప్రాణం పోయేలోపు ఒక్కసారైనా చూయించమని దుర్గమ్మను మొక్కుకున్నాను లేకపోతే నేనే ఒక భద్ర కాళీని అయిపోతాను .
నిజమే నిజమే నేను ఐదారుసార్లు రుచిచూసాను - ఆ కోపాన్ని భరించడం కంటే మీ దేవుడిని మీ ముందు ప్రత్యక్షము చెయ్యడమే మంచిది అని కోరిక తీరుస్తారు లేండి.
దేవత : థాంక్స్ - థాంక్యూ soooooo మచ్ అని సంతోషంతో తిన్నారు . అవునూ ......... నన్ను పిలిచిన ప్రతీసారీ గా ..... గాడె ....... దే ...... దేవ ........ మేడం అంటున్నారు ఏమిటి దానర్థం . 
నేను చెప్పనేరాదు కానీ మీరే తెలుసుకోవాలి గా ........ మేడం అనడంతో ........
దేవత : ముత్యాలు రాల్చున్నట్లు సంతోషంతో నవ్వుకున్నారు - ఆ నవ్వడంలో వెక్కిళ్ళు పట్టడంతో ..........
వాటర్ బాటిల్ - కూల్ డ్రింక్ - జ్యూస్ ......... మూడింటిని ఓపెన్ చేసి దేవత ముందు ఉంచి , ఆప్యాయంగా నెత్తిపై స్పృశించబోయి ఆగిపోయాను .
దేవత : నీళ్లు తాగి , అదీ అలా మాటపై నిలబడాలి ........ థాంక్స్ అని మొత్తం ఐటమ్స్ తినేసి ఐస్ క్రీమ్ అందుకున్నారు .
నో అనిచెప్పి ఇంతలా తింటున్నారు ఇక ఇష్టంతో తింటే ఇంకెంత తింటారో ..........
దేవత: దిష్టి పెట్టకండి , మొత్తం బిల్ పే చేసేస్తాను .
ఎక్కడ నుండి అండీ , అక్కడ నుండేనా ...........
దేవత : మళ్లీ మొదటికొచ్చారు అని తిన్న చేతితోనే నా చేతిపై గిల్లేసారు .

స్స్స్ ఆఅహ్హ్ ........ wow దే ....... మేడం తిన్న ఫుడ్ అని నన్ను నేను మరిచిపోయి చేతిపై అంటుకున్న మెతుకులను తిని , మ్మ్మ్ ఆఅహ్హ్......... అంటూ నాలుకతో నాకుతూ అమృతం అని ఫీల్ అయ్యి కొన్ని క్షణాల తరువాత కళ్ళు తెరిచాను . దేవత కోపం చూస్తేనే కానీ తెలియలేదు ఎంతపెద్ద తప్పు చేశానో ....... , shit shit ఇప్పటివరకూ చేసినదంతా వృధా , దేవత ఖచ్చితంగా వెళ్లి .........
దేవత : భద్ర కాళీలా లేచి , కోపంతో ఊగిపోతూ మీ మగాళ్లంతా ఒక్కటే అని హ్యాండ్ బ్యాగుతో కొట్టి తృప్తి చెందక వెంట్రుకలను నొప్పికలిగేలా లాగేసి బయటకు వెళ్లేంతలో .............

ఫ్లైట్ జర్క్ ఇచ్చింది . కొన్ని క్షణాలపాటు ...... ఫ్లైట్ సముద్రంలో కొలాప్స్ అయిపోతుందేమో అన్నంతలా ఒడిదుడుకులకు లోనయ్యింది . దేవత పట్టుతప్పి కిందపడేంతలో ఒక చేతితో డైనింగ్ టేబుల్ పట్టుకుని మరొకచేతితో దేవత నడుమును చుట్టేసి గట్టిగా పట్టుకున్నాను కిందపడకుండా ...........
కొన్ని క్షణాలకు సాఫీగా వెళుతోంది - అంతలో పైలట్ మాటలు వినిపించాయి sorry for the disturbence - సడెన్ థండర్ వలన ఇలా సంభవించింది - problem solved have a nice sleep and safe journey పాసెంజర్స్ ......... sign out .

దేవత : ఎక్కడ ఉన్నారో చూసుకుని మరింత కోపంతో నానుండి వేరయ్యి , నన్ను అమాంతం సోఫాలోకి తోసేసి , మళ్లీ నన్ను కలవడానికి గానీ మాట్లాడటానికి గానీ ప్రయత్నించారో ........ అని కళ్ళల్లో చెమ్మతో బాధపడుతూ బయటకు వెళ్లబోయి ఏదో చూసినట్లు ఆగిపోయారు .
దేవత ఎందుకు ఆగారో చూస్తే , ఫ్లైట్ కుదుపులకు డోర్ వెనుక హ్యాంగర్ కు తగిలించిన బ్రేజర్ కిందపడినట్లు - సరిగ్గా ఎలా పడిందంటే " JIM " లోగో క్లియర్ గా కనిపించేలా ............ 
దేవత : కన్నీళ్లను తుడుచుకుని వణుకుతున్న చేతులతో బ్రేజర్ అందుకుని చూసి గుండెలపై ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నారు . నావైపుకు తిరిగి ఆనందబాస్పాలతో మై గాడ్ అంటూ క్షణంలో నా ఒడిలోకి చేరిపోయి sorry sorry ......... ఇంకా sorry ఏంటి లవ్ యు so మచ్ గాడ్ అని నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి కౌగిలించుకున్నారు .
Like Reply
కెకో కేక అప్డేట్
[+] 1 user Likes Nick 123's post
Like Reply
THANK YOU VERY MUCH SIR
[+] 1 user Likes RICHI's post
Like Reply
Mahesh garu update clps
Like Reply
Isq movie chupincharu , chivaraku devudu evaro reveal chesaru , ika modalindhi hero gari good time. Super update mahesh garu.
[+] 3 users Like Mahe@5189's post
Like Reply
మహేష్ మిత్రమా అప్డేట్ అద్భుతంగా వుంది.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Excellent keka update, appude ayipoinda annattu undi, 
as usually emotions ni present cheyadamlo mee tharvthe anna evaraina 

Thank you Mahesh anna for entertaining us
Writers are nothing but creators. Always respect them. 
[+] 2 users Like AB-the Unicorn's post
Like Reply
ఈ అప్డేట్ చదువుతున్న రెండు గంటలు నేను పొందిన ఆనందానుభూతిని అక్షర రూపంలో ఎలా వ్యక్తపరచాలో తెలియట్లేదు మహేష్ గారు. లాస్ట్ ఆప్డేట్తో ఎంతగా ఏడిపించారో, ఈ అప్డేట్ అంతకుమించి ఆనందాన్ని పంచింది.

భారతదేశంలో మూడు ప్రధానమైన వినోదాత్మక అంశాలు ఏమైనా ఉన్నాయంటే 1.పాలిటిక్స్ 2.క్రికెట్ 3.సినిమా. ఈ మూడింటిని మీ కథలలో మిళితం చేసి ప్రెసెంట్ చేసే తీరు చాలా బాగుంటుంది. కొంచం అతిశయోక్తి అనిపించినా "అద్భుతం" అనే మాట చక్కగా నప్పుతుంది.

ఈ ఎపిసోడ్లో మీరు "ఇష్క్" సినిమాలోని ఎయిర్పోట్ సన్నివేశాన్ని ఇంప్రువైజ్ చేసినా తీరు సూపర్. చాలా బాగా ఎంజాయ్ చేసా. 
మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా బోలెడన్ని మొమెంట్స్ క్రియేట్ చేశారు ఈ ఎపిసోడ్లో. Thank you so much for that.

అప్డేట్ ఇవ్వడం ఆలస్యం అయినప్పటికిన్నీ చాలా మంచి అప్డేట్ ఇచ్చారు. thanks yourock
[+] 7 users Like kummun's post
Like Reply
Wow wow wow wow
Matallu levu mataladukovatam ledhu
Super ante super update bro
Thank you so much
[+] 2 users Like Vinay smart's post
Like Reply
Update chaala bagundhi superb
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
Thank you Mahesh garu manchi romantic update tho mood ni change chesaru
[+] 1 user Likes Saradhi41's post
Like Reply




Users browsing this thread: 31 Guest(s)