04-03-2021, 11:13 PM
(This post was last modified: 04-03-2021, 11:14 PM by kamal kishan. Edited 1 time in total. Edited 1 time in total.)
మీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా అతీత శక్తులని చూశారా?
మా బంధువులు నిత్యారాధకులు. వాళ్ళకి అనుకోకుండా ఖమ్మం ట్రాన్సఫర్ అయ్యింది. అక్కడ ఒక ఇంట్లో దిగారు. అయితే ఆ ఇంటికి మేము చుట్టం చూపుగా వెళ్లాం. అప్పుడు జరిగిన సంఘటన మేము పడుకునే ముందు మా చుట్టాలు చెప్పకనే చెప్పారు. తలుపులు తీయ్యద్దు. చప్పుళ్ళకి ఇదవ్వదు అని.
సరే అని మేము అర్ధరాత్రి వరకూ మాటలాడుకుంటూ పడుకున్నాం. మా బంధువులు రెండు నవ్వారు మంచాల మీద పడుకున్నారు. ఆ ఇంటి పెద్ద వేరే ఊరు వెళ్ళాడు అందుకని వాళ్ళు మాతో పాటే మంచాలు పరుచుకుని పడుకున్నారు. ఒక మడత మంచం రెండు నవ్వారు మంచాలు.
నేను నవ్వారు మంచం మీద పడుకున్నాను. అర్ధరాత్రి మాటలు వినపడుతున్నాయి. నేను మగతగా లేచాను. మా అమ్మ నా భుజం మీద చెయ్యి వేసి పడుకో అంటూ అంది. ఆ పక్క మంచం మీద మా వాళ్ళు కూడా లేచే ఉన్నారు. నేను ఏమీ మాట్లాడకుండా ముసుగుతన్నేశాను.
ఇంతకీ ఏంటంటే ఆ ఇంట్లో ఒక సంఘటన వల్ల ఆ ఇంటి ఓనర్ చనిపోయాడు అతను ఆ రెండు మంచాల మధ్య పాతి పెట్టబడ్డాడు. అతను రెండు మంచాల మధ్య ఒక ఆకారం లేచినట్లు లేచి చెప్పిందిట నాకు మాటలు మాత్రమే వినపడ్డాయి అందుకే అట అంటున్నాను.
తనను బ్రతికుండగానే పాతిపెట్టారని చెప్పారు. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోండి. మీరూ నిత్యారాధన చేసేవారే కనుక మీకు చెబుతున్నాను. అంటూ మాయం అయ్యిందట.
ఆ తరువాత వాళ్ళు ఖాళీ చేశారు. కానీ వేరే వాళ్లకి కనపడలేదు అయితే.....వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ పెద్ద పెద్ద అనారోగ్యాలకీ., అలానే కుదిరిన పెళ్ళి కూడా తప్పిపోయింది. పెద్ద లాస్. ఇలా అన్నీ కనపడే సరికి మా వాళ్ళని పిలిచి అడిగారు. మీరు వచ్చిన రెండో నెల్లోనే ఎందుకు ఖాళీ చేశారు అద్దె కూడా తక్కువే కదా ఏం జరిగింది? అంటూ
జరిగింది అంతా చెప్పారు. ఆ మాటతో వాళ్ళు తక్కువగా వచ్చిందని ఆ ఇల్లు కొన్నారుట. తరువాత ఆ ఇంటిని వాళ్ళు అమ్మేశారు. ఇది నిజంగా నిజంగా జరిగింది. నేను అబద్దం చెప్పట్లేదు. ఇది పచ్చి నిజం.