Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(16-02-2021, 02:30 AM)AB-the Unicorn Wrote: Excellent story outstanding finish

Thankyou so so sooooo much.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(23-02-2021, 10:00 AM)nar0606 Wrote: mahesh garu update super

Thankyou so much.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
                భువిపై వెలసిన దేవతలు


" శూన్యం - చీకటి .............. ఒక్కసారిగా నిండు పున్నమి వెన్నెల చుట్టూ పళ్ళు - పూలతో నిండి పచ్చదనంతో నిండిపోయినట్లు ప్రకృతి ప్రసాదించిన అందమైన అరణ్యం , ప్రతీ పచ్చని చెట్టుపై అత్యద్భుతమైన మిణుగురుల వెలుగులు - నలువైపుల నుండీ ఒకటినిమించిన మరొక సౌందర్యమైన పూల సువాసనలు - సంగీత సరిగమల్లా సప్తస్వరాల్లా వినిపిస్తున్న పక్షుల కిల కిల రావాలు , మధువనంలో చిగురించే చిగురాకులలోని వసంత కోకిల మధురమైన గానం అయితే హృదయాన్ని తన్మయత్వానికి లోనుచేస్తోంది - అక్కడక్కడా చిందులేస్తున్న బంగారువర్ణపు జింకలు , మలయమారుతమై పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలులు కనులను వీనులవిందుచేస్తున్నాయి .
నాకు కుడివైపున కాస్త దూరంలో పచ్చదనంతో నిండిపోయిన కొండల నుండి అంతే అందమైన జలపాతపు పరవళ్లు , నేరుగా సరస్సులోకి చేరుతున్నాయి - ఆ సరస్సులో రంగురంగుల కమలాలు , కమలాల మధ్యన మనసు పులకించేలా ప్రకృతి నేర్పిన శృంగారంలో విహరిస్తున్న పాలవర్ణపు హంసలు ............ ఇలా ఆ అరణ్యంలో ప్రతీ సౌందర్యం నా వొళ్ళంతా రొమాంటిక్ పరవళ్లు తొక్కిస్తున్నట్లు పెదాలపై తియ్యదనంతో చిరునవ్వులు చిందిస్తున్నాను . 

అంతలో పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలుల మధ్యలోనుండి అంతకంటే నెమలుల నాట్యం కంటే సౌందర్యమైన నడకతో - పక్షుల సరిగమలు కంటే వినసొంపైన చిరునవ్వుల రాగాలతో - దేవలోకపు వస్త్రాలు నగలు ధరించి , దివి నుండి దిగివచ్చిన అతిలోకసుందరి నావైపుకు అడుగులువేస్తున్నారు . 
ఆ దేవకన్య పాదపు స్పర్శకు భూమాత పులకించినట్లు , పచ్చని గడ్డి ఉన్నా పాదం నేలపై చేరకముందే తన నుండి పూలను మొలకెత్తేలా చేసి సుతిమెత్తని పూలపై నా దగ్గరికి చేరేలా చేసి తన రుణాన్ని తీర్చుకుంటోంది - పచ్చని అరణ్యం తన ఓడిలోని రంగురంగుల సీతాకోకచిలుకలు , చిలుకలు నా దేవకన్యపైకి చేరి తన అందమైన నవ్వులకు మేనిమిచాయకు దాసోహం అయినట్లు బుగ్గలపై ముద్దులుపెట్టడం - నేనేమి తక్కువ అన్నట్లు ఆకాశం మేఘాల ద్వారా పూలవర్షం కురిపించి పరవశించిపోయింది . 
ఆ అద్భుతాలన్నింటినీ చూసిన చంద్రుడే ఈర్ష్య అసూయలతో చిన్నబుచ్చుకోవడం చూసి నా దేవకన్య ముఖంపై ముసుగులో ముత్యాలు రాల్చేలా చిరునవ్వులు చిందించడం చూసి , ఆఅహ్హ్ ......... ఏమి నా అదృష్టం అని ఫ్లైయింగ్ కిస్ వదిలి వొళ్ళంతా పారవశ్యంతో హృదయంపై చేతినివేసుకుని అలా వెనక్కు పడిపోబోయాను .

మన్మధ మహేష్ ............ జాగ్రత్త అంటూ నా దేవకన్య పరుగునవచ్చి నాచేతిని అందుకున్నారు .
ఆ చేతిస్పర్శకే నా ఒంట్లో వెయ్యి వోల్ట్ ల కరెంట్ పాస్ అయినట్లు జలదరించిపోయాను . దేవకన్యవైపే కన్నార్పకుండా చూస్తూ వణుకుతూనే మహీ ............ నా పే.......రు మీకె...…...లా తెలు.......సు ? అని అడిగాను .
ముసుగులోపలే దేవకన్య ముత్యాలు రాల్చేలా తియ్యదనంతో నవ్వుకుని , " మీ " కాదు " నీ " ............ కొన్ని రోజులుగా కాదు కాదు కొన్ని నెలలుగా కాదు కాదు సంవత్సరాలుగా మహీ మహీ ........... అని ప్రేమ ప్రాణంలా కలవరిస్తూనే ఉన్నావుకదా - నా మన్మధుడికి నా పేరు ఎలా తెలిసిందో అలానే అని తియ్యదనంతో నవ్వడం చూసి నా హృదయం పరవశించిపోయింది . రోజూ ........... దూరంగా కనిపించి మాయమైపోయి మీరు నాకోసం పడుతున్న బాధను - తాపాన్ని మరియు నా మన్మథుడి అంతులేని ప్రేమను నాలోనేనే ఆస్వాదిస్తూ పరవశించిపోయేదాన్ని .......... , ఇక నా ప్రియాతిప్రియమైన మన్మథుడిని మరింత బాధపెట్టడం ఇష్టం లేక కాదు కాదు నా మన్మథుడు మహేష్ నుండి ఇక ఒక్క క్షణం కూడా దూరంగా ఉండటం నావల్ల కాక వచ్చేసాను అని అందమైన నవ్వులతో పాదాలను పైకెత్తినా నా పెదాలు అందకపోవడంతో , తియ్యనికోపంతో నా గుండెలపై కొట్టి ఆరడుగులు ఉన్నారా ఏడడుగులు ఉన్నారా ......... ఇలా కాదు అని నాకు ఏకమయ్యేంత దగ్గరికి వచ్చేసి ఏకంగా నా పాదాలపై తన పాదాలను ఉంచి లవ్ యు మన్మధ ........... నా సర్వస్వం నా మహేష్ కే సొంతం అని పూలను అందుకుని నాపై జల్లి చిరునవ్వులు చిందిస్తూనే నా పెదాలను తన తేనెలూరుతున్న పెదాలతో తాకించారు ..........."
*************

Mahesh hey Mahesh .............. its already 8AM , time to go ........... అన్న కేకలతోపాటు నా దుప్పటి వేరవ్వడంతో , 
Kiss kiss kiss my life my heart ........... మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ .......... నో నో నో ........... అంటూ కళ్ళుతెరిచిచూస్తే ఎదురుగా నా ఫ్రెండ్ sam , నేనున్నది నా అపార్ట్మెంట్ లో ............. హుసూరుమని ఆ వెంటనే సిగ్గుపడుతున్నాను .
Sam : what mahesh same డ్రీమ్ .......... , ఈ సారైనా నీ ఏంజెల్ కనిపించిందా అని అడిగాడు .
Yes yes .......... sam , but with మాస్క్ అని నిరాశతో బదులిచ్చాను . వెంటనే ఉత్సాహంతో sam sam .......... my heart my angel knows my name - నేనెలా అయితే నా మహికోసం ఎదురుచూస్తున్నానో తను కూడా నాకోసం నాకంటే ప్రేమ ఆరాధన ప్రాణంలా తపిస్తున్నారు కాదు కాదు తపిస్తోంది - sam .......... మహి తన అంతులేని ప్రేమను express చేసి ముద్దుకూడా ............
Sam : how was the kiss man ? అని ఆతృతతో అడిగాడు .
ఎక్కడ sam ఫీల్ అయ్యేంతలో లేపేశావు ........... but బ్యూటిఫుల్ , express చెయ్యడానికి మాటలుకూడా రావడం లేదు అని తియ్యదనంతో పెదాలను స్పృశిస్తూ మెలికలుతిరిగిపోయాను .

Sam : oh shit sorry mahesh ............ , its university time man అందుకే లేపాను - నువ్వు లేవడం , రోజూలానే ఆ రాత్రి కన్న డ్రీమ్ ను డ్రా చేసి ఫ్రెష్ అయ్యేలోపు చివరి exam టైం కూడా అయిపోతుంది అని నా ఫైల్ అందించాడు .
థాంక్స్ sam ........... అని ప్రాణంలా ఫైల్ అందుకున్నాను . మై ఫైల్ మై లైఫ్ మై ఏంజెల్ ............ అంటూ ముద్దుపెట్టి ఓపెన్ చేసాను . సంవత్సరాల ముందు తొలిసారి నా కలలో కనీకనిపించనట్లు తారసపడిన క్షణం నుండీ నా దేవకన్య రోజురోజుకూ నా దగ్గరకు చేరి ముద్దుపెట్టేంతవరకూ నాకు తోచినట్లు డ్రా చేసుకున్న ఛార్ట్స్ అన్నింటినీ చూసి పెదాలపై చిరునవ్వు ఆగడం లేదు .
నా కలల అతిలోకసుందరికి నా హృదయం పులకించిపోయి చేసిన నామకరణం " మహి " . మహీ ........... నా ప్రియాతిప్రియమైన దేవకన్య ఎక్కడ ఉన్నావు ఇప్పుడు ఏమిచేస్తున్నావు - నిన్ను చూడటం కోసం నిన్ను ప్రేమగా కౌగిలించుకోవడం కోసం ఈ హృదయం ఎంతలా ఎదురుచూస్తోందో చెప్పలేను అని నా దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టి , చార్ట్ అందుకుని చుట్టూ అరణ్యాన్ని నా ఏంజెల్ నా పాదాలపైకెక్కి మరీ ప్రేమతో పెడుతున్న ముద్దునీ డ్రా చేసాను . 
ఈ ఫారెస్ట్ ఎక్కడ ఉందో కనుక్కుంటే నా ఏంజెల్ ను చేరినట్లే ఇంతకీ ఎక్కడ ఉంది ఈ అద్భుతమైన ఫారెస్ట్ .............

Sam : దానికోసమే కదా మహేష్ గూగుల్ మొత్తం వెతుకుతూనే ఉన్నావు . ఇండియాలోని మీ పేరెంట్స్ కు తెలియకుండా ప్రతీ వీకెండ్ ఒక్కొక్క ఫాల్స్ దగ్గరికి వెళ్లి నిరాశతో వెనుతిరుగుతున్నాము . లాస్ట్ వీకెండ్ తో కలుపుకుని యూరోప్ లోని ఫాల్స్ - ఫారెస్ట్స్ , అమెరికాలోని ఫాల్స్ - ఫారెస్ట్స్ , సౌత్ అమెరికాలోని అమెజాన్ ఫారెస్ట్ ఫాల్స్ , ఆస్ట్రేలియా ఫాల్స్ - ఫారెస్ట్స్ ......... ఇలా ప్రపంచం మొత్తం మిలియన్స్ డాలర్లు ఖర్చుపెట్టి అన్నింటినీ చుట్టేసాము ఇక మిగిలినది ఇండియాలోని ఫారెస్ట్స్ - ఫాల్స్ ............ , ఎలాగో ఈరోజు చివరి exam - 10 డేస్ లో ప్రాజెక్ట్ రిపోర్ట్ యూనివర్సిటీ లో సబ్మిట్ చేసి నువ్వు ఇండియాకు నేను అమెరికా వెళ్లిపోతాము . నీ బర్త్ కంట్రీ లోనైనా నీ ఏంజెల్ ను కలుస్తావని ఆశిస్తున్నాను .
థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ sam , its time టు ఫ్రెషెన్ అప్ అని చార్ట్ ను ఫైల్ లో ఉంచాను , ఫైల్ ను జాగ్రత్తగా ఉంచి నా ఏంజెల్ పెదాల స్పర్శనే తలుచుకుంటూ బాత్రూమ్లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చాను .

Mahesh mahesh ............ getting late my friend అని బయట నుండి sam కేకలు వినిపించాయి .
Coming my friend అని రిప్లై ఇచ్చి , నా ఏంజెల్ ఫైల్ అందుకుని కొన్ని గంటల్లో మళ్లీ కలుద్దాము ఇక ఒక్క క్షణం కూడా నిన్ను నా నుంచి దూరం చెయ్యను లవ్ యు అంటూ ప్రాణమైన ముద్దుపెట్టి బెడ్ పై ఉంచాను . ఫైనల్ exam కు అవసరమైనవాటితోపాటు మొబైల్ పర్స్ అందుకుని బయటకువచ్చాను . 

LONDON - the capital and the largest city of ENGLAND , థేమ్స్ రివర్ ప్రక్కనే ఉన్న costliest అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్ నుండి నదిని మరియు సిటీ అందాలను తిలకిస్తూ లిఫ్ట్ లో కిందకు చేరుకునేసరికి sam నా స్పోర్ట్స్ కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉంచాడు . Sam ........... ? .
Sam : last days my friend , let me drive this beautiful sports car అని నేను కూర్చోగానే యూనివర్సిటీకి వేగంగా పోనిచ్చాడు . 

Yes yes గత 5 years నుండీ లండన్ లోనే ఉంటున్నాను . వైజాగ్ లో వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ మ్యాన్ యొక్క ఐదుగురు కొడుకులలో చివరి వాడినైన నేను , డాడీ కోరిక తరువాత నా ఇష్టప్రకారమే లండన్ బిజినెస్ కాలేజ్ లో నిష్నాథుడినై పట్టా పొందబోతున్నాను - ఈరోజు చివరి exam ..........
టైం కు చేరుకుంటామో లేమో , మధ్యలో ఈ ట్రాఫిక్ ఒకటి అని టెన్షన్ పడుతూనే sam సరైన సమయానికి యూనివర్సిటీ రీచ్ అయ్యాడు . 
Super driving sam asusual అంటూ హైఫై కొట్టుకుని మొబైల్స్ కారులోనే ఉంచేసి పరుగున నిమిషాలలో exam హాల్ చేరుకున్నాము .

క్వశ్చన్ పేపర్ హుషారుగా ఉత్సాహంతో అందుకుని 3 గంటల exam ను సరదాసరదాగా 2 గంటల్లో ఫినిష్ చేసి బాయ్స్ అందరమూ బయటకువచ్చి ఈవెనింగ్ పార్టీ గురించి డిస్కస్ చేసుకుంటూ పార్కింగ్ చేరుకున్నాము . Then we'll meet there అనిచెప్పి , ఏంజెల్ ......... నిమిషాల్లో నిన్ను నా గుండెలపైకి తీసుకుంటాను అని కార్ ఎక్కాను .
Sam : mahesh .......... నీ sister exam పూర్తిచేసి వచ్చేన్తవరకూ wait చేయాల్సిందే you క్యారి ఆన్ అని కీస్ అందించి మొబైల్ తీసుకున్నాడు .
OK sam , tell sarah i'll meet her at party అనిచెప్పి మొబైల్ అందుకున్నాను . 

చూస్తే షాక్ తల్లులు జాహ్నవి - వైష్ణవి నుండి వంద కాల్స్ - వీడియో కాల్స్ , బుజ్జాయిలు స్నిగ్ధ - రాము నుండి వంద కాల్స్ - వీడియో కాల్స్ మరియు అమ్మ - ముగ్గురు వదినల నుండి కాల్స్ వచ్చి ఉండటం చూసి , అయిపోయాను లవ్ యు లవ్ యు తల్లులూ - బుజ్జాయిలూ ........... అని వెంటనే నలుగురికీ గ్రూప్ వీడియో కాల్ చేసాను . 

నా కాల్ కోసమే ఎదురుచూస్తున్నట్లు ఒక్క రింగుకే ఎత్తి hi నాన్న - hi నాన్న అంటూ తల్లులు , hi డాడీ - hi డాడీ అని బుజ్జాయిలు అంతులేని ఆనందంతో పలకరించి , వెంటనే అలకతో బుంగమూతిపెట్టుకుని అమ్మ - వదినల ఒడిలోకి చేరిపోయారు . 
ముసిముసినవ్వులు నవ్వుకుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......... అలకలోకూడా మా తల్లులూ - బుజ్జాయిలు భలే ముద్దొస్తున్నారు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు ............. వంద కాల్స్ కు వంద లవ్ యు లు , ఇంకా కోపమేనా ............ అయితే గుంజీలు తియ్యనా అని చెవులను పట్టుకున్నాను .
తల్లులు - బుజ్జాయిలు .......... నవ్వడంతో , హమ్మయ్యా .......... లవ్ యు లవ్ యు అంటూ స్క్రీన్ పై ముద్దులవర్షం కురిపించాను . తల్లులూ - బుజ్జాయిలూ ......... చివరి exam కోసం మొబైల్ ను కార్ లోనే వదిలివెళ్ళాను , అందుకే .........
తల్లులు : exam ఉన్నాసరే మేము కాల్ చేసిన ఒక్కరింగుకే ఎత్తాలి , అలాంటిది మేము వంద - బుజ్జిచెల్లెళ్ళు వందకుపైనే కాల్స్ చేసినా ............ అంటే మేమంటే భయం లేదు మా నాన్నకు అన్నమాట .
అవును భయం లేదు తల్లులూ - బుజ్జాయిలూ ........... అని చిరునవ్వులు చిందించాను .

తల్లులు - బుజ్జాయిలు : చూడండి నానమ్మా - అమ్మలూ ........... మేమంటే భయం లేదంట డాడీకి .
అమ్మ - వదినలు : అవును నిజమే కదా , మీరంటే మీ డాడీకి ప్రేమ - ప్రాణం తప్ప మరొకటి ఎలా ఉంటుంది , మీకోసం ఏమైనా చేస్తాడు .
తల్లులు : మాకు తెలుసులే నానమ్మా - అమ్మలూ ........... , పెద్ద మీకే తెలిసినట్లు చెబుతున్నారు అని అమ్మ - వదినల బుగ్గలను కొరికేసి , మేము ఈ వంకతో బోలెడన్ని గిఫ్ట్స్ డిమాండ్ చెయ్యబోతున్నాము , మీరు చెడగొట్టేలా ఉన్నారే ........
అమ్మ - వదినలు : మళ్ళీనా అంటూ వెనక్కుతిరిగిచూస్తే ఆడిటోరియం లాంటి హాల్ మొత్తం ఆటవస్తువులతో నిండిపోయిఉంది . బుజ్జాయిలూ ........... వైజాగ్ లో వన్ off ద బిగ్గెస్ట్ హౌస్ మనది , అలాంటి ఇంటినే మీ బాబాయ్ ........... అంతే నలుగురూ అమ్మ బుగ్గలను - భుజాలను కొరికేసి కోపంతో చూస్తున్నారు .
అమ్మ : స్స్స్ స్స్స్ అమ్మా .......... అని రుద్దుకుని , ok ok మీ ప్రాణమైన నాన్న - డాడీ లండన్ నుండి మంత్లీ వచ్చిన ప్రతీసారీ తెచ్చిన గిఫ్ట్స్ తో ఇంతపెద్ద బిల్డింగ్ నిండిపోయింది - మీకోసం మీ గిఫ్ట్స్ కోసం మాత్రమే ఇంతకంటే పెద్ద బిల్డింగ్ తీసుకోవాలి అక్కడకు మాత్రం మేము రాము .
తల్లులు - బుజ్జాయిలు : అమ్మలూ .......... నానమ్మ మాటే మీ మాటనా ? ......... Yes yes yes  లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ నానమ్మా - అమ్మలూ ............. అక్కడ కేవలం మేము - మా డాడీ మీరెవ్వరూ వద్దు , మా నాన్న - డాడీ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము , ok నా డాడీ ........... అని స్క్రీన్ పై ముద్దులవర్షం కురిపించారు . 
వదినలు - అమ్మ : మీకు మీ డాడీ తప్ప ఎవరూ వద్దన్నమాట ......... అని తియ్యనికోపంతో చెప్పారు .
తల్లులు : yes yes ............
లవ్ టు లవ్ టు తల్లులూ - బుజ్జాయిలూ ............ 10 రోజుల్లో మీదగ్గరకే ఫ్లైట్ మొత్తం గిఫ్ట్స్ తో వచ్చేస్తున్నాను - రాగానే మా బుజ్జాయిలకు ఇష్టమైనరీతిలో మన బిల్డింగ్ ప్రక్కనే అంతకంటే పెద్ద బిల్డింగ్ కట్టిద్దాము ............
తల్లులు : 10 రోజులు కాదు నాన్న .......... మాకు రేపే మిమ్మల్ని చూడాలని ఉంది . ఇది మా ఆర్డర్ అంతే ...........

వదినలు : తల్లులూ ........... మీ బా ....... బుగ్గలను చేతులతో మూసి నవ్వుకున్నారు . మీ నాన్న - డాడీని ......... విషయం చెప్పకుండా ఎందుకు ఇబ్బందిపెడుతున్నారు , ముందు మొబైల్ ఇవ్వండి అని పెద్ద వదిన అందుకున్నారు . మహేష్ ..........
వదినమ్మా ........... అని అమ్మ తరువాత అమ్మ అన్నట్లు ప్రాణంలా పిలువగానే , 
పెద్ద వదిన కళ్ళల్లో చెమ్మ - ఆనందబాస్పాలు ........... , 
ప్రక్కనే కూర్చున్న అమ్మ .......... సంతోషపు ఆనందబాస్పాలతో పెద్ద వదిన నుదుటిపై ప్రాణమైన ముద్దు - చిన్న వదినలిద్దరూ ఆనందబాస్పాలతో పెద్ద వదినను ప్రాణంలా చుట్టేశారు .
అమ్మా అమ్మా .......... అంటూ బుజ్జాయిలు - తల్లులు అందరి వెనుక సంతోషంతో చిందులువేస్తూ చప్పట్లుకొడుతున్నారు .
Like Reply
నాకు ఊహ తెలిసిన తరువాత జరిగిన కొన్ని ఉద్వేగపూరితమైన సంఘటనల వలన ( ఆ సంఘటనలను సరైన సమయం వచ్చినప్పుడు చర్చించుకుందాము ) పెద్దవదినను " అమ్మా - వదినమ్మా " అని తొలిసారి పిలిచినప్పటినుండీ ఇలాంటి ఉద్వేగానికే లోనై ఆనందబాస్పాలతో మాటల్లో వర్ణించలేని సంతోషానుభూతికి లోనౌతున్నారు . వదినమ్మ సంతోషాన్ని అమ్మ - చిన్నవదినలు ఇలానే పంచుకుని ఆనందించేవారు . 

వదినమ్మా - వదినలూ .......... ఏదో విషయం చెబుతామని చెప్పి అలా మీలో మీరు ఎంజాయ్ చెయ్యడం ఏమైనా బాగుందా ? .
అమ్మ : కన్నయ్యా .......... నా బంగారు తల్లులను (కోడళ్లను) నువ్వు వదినమ్మా వదినమ్మా అని నన్ను అమ్మా అని పిలవడం కంటే ప్రాణంలా పిలిస్తే వాళ్ళు తట్టుకోగలరా ....... , నా పెద్దకోడలు నీ తియ్యని పిలుపు కోసమే నెలంతా వెయ్యికళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది అని నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో , లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ కన్నయ్యా .......... , నీ మధురమైన అమ్మ అన్న పిలుపుతో నెలంతా నా పెద్దకొడుకు మీ పెద్దన్నయ్య పెట్టే హింసలన్నింటినీ మరిచిపోయి ఇలా చిరునవ్వులు చిందిస్తుంది .
వదినమ్మ : అమ్మా ........... ( వదినమ్మ మా ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణమే అమ్మ ప్రేమకు పులకించిపోయి అమ్మ అని పిలుస్తున్నారు ) ...........
అమ్మ : తల్లీ ......... ( అమ్మా అన్న పిలుపుతో ఆ క్షణమే తల్లులు అయిపోయారు ) మీ మహేష్ కు అన్నీ తెలుసు - తన వదినమ్మ నవ్వితే తనూ నవ్వుతాడు , తన వదినమ్మ బాధపడితే తనూ బాధపడతాడు , తన వదినమ్మ ఏడిస్తే తనూ ఏడుస్తాడు .
వదినమ్మ : నా కన్నీళ్లను చూసి మహేష్ మహేష్ ......... తియ్యని అమ్మ పిలుపుకు సంతోషంతో వచ్చిన ఆనందబాస్పాలు అని చిరునవ్వులు చిందించారు .
వదినమ్మ హృదయంలోని బాధను నేను ఫీల్ అవుతూ కన్నీళ్లను తుడుచుకుని , వదినమ్మా - వదినలూ ........... నెలంతా ఎలా గడిచింది , ఏదో సంతోషమైన విషయం ఇంకా చెప్పనేలేదు .

అమ్మ : అంత సంతోషమైన విషయం ఏమీకాదులే కన్నయ్యా ........... , మీ చిన్న అన్నయ్యకు పెళ్లికుదిరింది అని నార్మల్ గా చెప్పారు . 
ఏంటమ్మా ........... అంత నిరుత్సాహంగా చెబుతున్నారు . అన్నయ్య పెళ్లి అంటే ఎలా ఉండాలి - ఇంతకీ పెళ్లి ఎప్పుడు ? అని ఆతృతతో అడిగాను .
బుజ్జితల్లులు - బుజ్జాయిలు : రేపే నాన్నా - డాడీ అని హుషారుగా ముందుకువచ్చి అందరి ఒడిలో కూర్చుని చెప్పారు .
లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ........... అమ్మా చూసి నేర్చుకో అదీ ఉత్సాహం అంటే ..........
అమ్మ : నీ బుజ్జాయిలు పెళ్ళినెపంతో నీ గుండెలపైకి చేరబోతున్నందుకు ఆనందిస్తున్నారు కానీ వాళ్ళ బాబాయ్ పెళ్లి అని కాదు .
అవును అన్నట్లు బుజ్జాయిలు .......... అమ్మ - వదినలను ముద్దులతో ముంచెత్తారు .
అమ్మ : నేను - మీ అమ్మలూ కూడా అందుకే ఎంజాయ్ చేస్తున్నాము బుజ్జితల్లులూ .......... అని ప్రాణంలా హత్తుకున్నారు . పెళ్లి అయ్యాకైనా మీ బాబాయ్ మంచిగా మారతాడో లేక మీ పెద్ద బాబాయ్ లలానే జూదాలు మత్తులో మునిగిపోతాడో చూద్దాము . తల్లులూ .......... క్షమి ........
అమ్మా అమ్మా అమ్మా ............ వాళ్ళు మారతారన్న ఆశలను ఎప్పుడో వదిలేసుకున్నాము - మీ కొడుకులను ఎలా తిట్టినా మాకేమీ అభ్యంతరం లేదు , మహేష్ ను చిన్న మాట అన్నా మేము తట్టుకోలేము మా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి  , మా అమ్మ - పిల్లలు - మహేష్ .......... ఆనందమే మా ఆనందం అని అమ్మను ప్రాణంలా చుట్టేశారు . 
అమ్మ : ఆనందబాస్పాలతో లవ్ యు తల్లులూ .......... అని అందరినీ చుట్టేసి ముగ్గురి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
లవ్ యు sooooooo మచ్ వదినమ్మా - లవ్ యు వదినలూ ............ గుండెల్ని పిండేసారనుకోండి .
వదినమ్మ - వదినలు : కంగారుపడుతూ మహేష్ మహేష్ మహేష్ .......... నొప్పివేస్తోందా అని అడిగారు .
బుజ్జితల్లులు : ఒసేయ్ అమాయకమైన అమ్మలూ ......... గుండెల్ని పిండేశారు అంటే నోపివేస్తోంది అనికాదు - మీ తియ్యని మాటలతో హార్ట్ టచ్ చేశారు అని అర్థం .
వదినలు : మాకు తెలుసులే , మా మహేష్ మా ఇష్టం మేమైనా మాట్లాడుతాము అని చిరునవ్వులు చిందిస్తున్నారు .
లవ్ యు వదినలూ .......... మీరు ఇలానే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని గుండెలపై చేతినివేసుకుని ఆనందబాస్పాలతో చెప్పాను .
బుజ్జితల్లులు : నాన్న నాన్న డాడీ ........... నెలరోజుల ముందు మీరు కాల్ చేసినప్పుడు చిరునవ్వులు చిందించిన అమ్మలు మళ్లీ మీరు కాల్ చేసిన తరువాతనే నవ్వడం చూసి ............
వదినలు : బుజ్జితల్లుల నోళ్ళను చేతులతో మూసేసి , మహేష్ ......... అక్కడ ఎలా ఉంది - నెల రోజులూ ఎక్కడ గడిచాయి - exams బాగా రాసి ఉంటావని మాకు ఎప్పుడో తెలుసు అని చిరునవ్వులు చిందిస్తూ అడిగారు . 
వదినమ్మ - వదినల బయటి సంతోషాలకు సంతోషిస్తూ - లోపల దాచేసుకుంటున్న బాధలను లోలోపలే బాధపడుతూ అన్నింటికీ సమాధానాలిచ్చాను . 

బుజ్జితల్లులూ .......... మా చిన్నన్నయ్య పెళ్లి రేపే అన్నారు కదా ఎక్కడ వైజాగ్ లోనేనా ? .
బుజ్జితల్లులు : నో డాడీ .......... గోవా లో డెస్టినేషన్ మ్యారేజ్ , తాతయ్య ......... మాకోసం స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి , అక్కడ ఏర్పాట్లుచేయడానికి రెండు గంటల ముందే వెళ్లారు . 
WOw బంధువులందరినీ ఫ్లైట్ లో సూపర్ డాడీ లవ్ యు , అమ్మా .......... అన్నయ్యలు కూడా వెళ్ళారా ? .
వదినమ్మ - వదినలు .......... కళ్ళల్లో చెమ్మతో తలలు దించుకోవడం , అమ్మ కన్నీళ్లను తుడుచుకుని తెలుసుకదా కన్నయ్యా .......... పెళ్ళికొడుకుతోసహా మీ అన్నయ్యలంతా నిన్న రాత్రనగా వెళ్లినవాళ్ళు క్లబ్ నుండి ఇంకా రాలేదు . మీ చిన్నన్నయ్య చేస్తున్న పనులవలన రచ్చ వలన మన బంధువులు ఒక్కరూ రామని చెప్పేసారు - నీ పెళ్లికి ఆహ్వానించకపోయినా వస్తామనిమీ డాడీకి చెప్పడంతో ఇక చేసేదేమీలేక ఇలా డెస్టినేషన్ మ్యారేజ్ ప్లాన్ చేశారు . మీ అన్నయ్యలు రావడమే ఆలస్యం ఎవ్వరికీ తెలియకుండా వెళ్లడం పెళ్ళిజరిపించడం అంతే సైలెంట్ గా వచ్చేయ్యడం అని వదినమ్మ వదినల చేతులు అందుకుని ముద్దులుపెట్టారు . ఈ పెళ్లి జరిగితే అయినా మీ చిన్నన్నయ్య మారితే హ్యాపీ ........... , అదంతా వదిలెయ్యి రేపు ఉదయం 10 గంటలకు పెళ్లి - నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు కన్నయ్యా ........... 
10 రోజుల్లో ప్రాజెక్టు సబ్మిట్ ............
బుజ్జితల్లులు : exams అయిపోయాయి కదా డాడీ .......... , వెంటనే మాకోసం గిఫ్ట్స్ తీసుకుని వచ్చేయ్యాలి - ఇక ఇలా వీడియో కాల్లో మాట్లాడటం మావాల్ల కాదు - రేపుకానీ రాకపోతే ........ మా మంచి నాన్న డాడీ వచ్చేస్తారు అంతవరకూ మాట్లాడేది లేదు అని నలుగురూ అమ్మ - వదినమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి లేచి వెళ్లిపోయారు . 
నాకు తెలుసులే మీరు బయటకువెళ్లిఉండరని వదినమ్మా - వదినలూ .......... నా మాటలు వింటూ ప్రక్కనే ఉన్నారు కదూ ...........
అమ్మతోసహా అందరూ తలలను నిలువుగా ఇరువైపులా చూసి భయపడిపోయి అడ్డంగా ఊపడం చూసి నవ్వుకుని , అమ్మా .......... నీ ముద్దుల మనవళ్లకు చెప్పు నేను రావడం లేదని .
వదినమ్మ - వదినల ముసిముసినవ్వులు , అమ్మ ష్ ష్ ష్ .......... అని నవ్వుని కంట్రోల్ చేసుకుని బుజ్జితల్లులను పిలుచుకునివచ్చారు . బుజ్జితల్లులు - బుజ్జాయిలు నలుగురూ ......... నావైపు చూడనే చూడటం లేదు . 
అమ్మో ........... అలకే , అలకలోకూడా ముద్దుగా ఉన్నారు ఉమ్మా ఉమ్మా ..........., బుజ్జితల్లులూ ......... ప్రాజెక్ట్ సబ్మిట్ చెయ్యకపోతే మీ డాడీ ఫెయిల్ అయిపోతాడు.
బుజ్జితల్లులు : నో నో నో డాడీ ......... , మా డాడీ ఎప్పుడూ ఫస్ట్ ఉండాలి - లవ్ యు లవ్ యు లవ్ యు డాడీ .......... అని ముద్దులుపెట్టి , డాడీ .......... ఏమి టిఫిన్ చేశారు అని అడిగారు .
లవ్ యు బుజ్జితల్లులూ ........... కాస్త ఆలస్యంగా లేవడం వలన తినకుండానే exam కు వెళ్ళిపోయాను .
అంతే బుజ్జితల్లులు అమ్మతోసహా అందరూ వదినమ్మ వైపుకు తిరిగి , అందుకేనా ఉదయం టిఫిన్ చేయనిది అని ప్రాణంలా చూస్తున్నారు .
వదినమ్మ అయితే సంతోషం - బాధ - కళ్ళల్లో చెమ్మ - తియ్యనికోపం కలగలిసినట్లు నావైపు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు .
ఏమైంది అమ్మా - వదినలూ - బుజ్జితల్లులూ .......... వదినమ్మా ఏంటి అలా చూస్తున్నారు .
వదినలు : మహేష్ .......... నువ్వు తినలేదని మా అక్కయ్య మనసుకు తెలిసిపోయినట్లు అందరమూ ప్రాణంలా తినిపించనా తినలేదు - ఇప్పుడు తెలిసింది ఎందుకు తినలేదో - మా అక్కయ్య ప్రాణం మహేష్ అని అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టారు - చూడు నువ్వు తినకపోవడం వలన ఎంత బాధపడుతున్నారో ............. రాత్రి మందు ఏమైనా ఎక్కువ అయ్యిందా అని అమ్మతోపాటు ముసిముసినవ్వులతో అడిగారు. 
బుజ్జితల్లులు : ఒసేయ్ అమ్మలూ ........... మా డాడీకి మందు మీనింగ్ కూడా తెలియదు తెలుసా , నానమ్మా ......... మీరు కూడానా ,

వదినమ్మా ........... లవ్ యు లవ్ యు sooooo మచ్ ఇంకెప్పుడూ ఇలా చెయ్యను , అమ్మా - వదినలూ ........ ఫుడ్ తీసుకురండి .
వదినలు : మహేష్ .......... నువ్వు తినకుండా మా అక్కయ్య ............
లవ్ యు లవ్ యు ఒక్క నిమిషం అంటూ కారులోనుండి దిగి పరుగున యూనివర్సిటీ రెస్టారెంట్ చేరుకుని ఏది రెడీగా ఉంటే అది ఆర్డర్ చేసి తీసుకుని టేబుల్ చేరుకున్నాను . వదినమ్మా .......... ఇదిగో తింటున్నాను .
వదినమ్మ : కళ్ళల్లో చెమ్మ ఆనందబాస్పాలుగా మార్చుకుని , లవ్ యు మహేష్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ అమ్మ - వదినలు - బుజ్జితల్లుల చేతిముద్దలను తిన్నారు . వదినమ్మ కడుపునిండా తినేంతవరకూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడి , చాలా పనులున్నాయి మీకు తెలుసుకదా అని వదినమ్మ వైపు సైగలుచేసి లవ్ యు అమ్మా - లవ్ యు బుజ్జాయిలూ ......... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి కట్ చేసాను .

పెదాలపై చిరునవ్వులతో లవ్ యు అమ్మా - లవ్ యు బుజ్జితల్లులూ బుజ్జాయిలూ - లవ్ యు వదినలూ - లవ్ యు సో సో sooooooo మచ్ వదినమ్మా అని తలుచుకుని మురిసిపోయాను . 
నాన్నగారు గుర్తుకురాగానే కాల్ చేసాను . Sorry dad పెళ్లి అంటే చాలా పనులుంటాయి , మీ ప్రక్కనే నేను ఉండాల్సింది , పెళ్లి అని ముందుగానైనా చెప్పాల్సింది .
Dad : థాంక్స్ మహేష్ ........... , పెళ్లి కుదిరిందే ఉదయం - మనకు అంత ఆస్తి పలుకుబడి ఉన్నాకూడా మీ అన్నయ్య గురించి తెలిసీ మన బంధువులు , తెలిసినవాళ్ళు , చుట్టూ ఉన్న ఊళ్ళల్లో ఎవ్వరూ పిల్లను ఇవ్వకపోవడంతో బ్రోకర్స్ సహాయంతో మీ అన్నయ్య గురించి తెలియనంత దూరం శ్రీకాకుళంలో ఒక నిరుపేద కుటుంబం అమ్మాయిని సెట్ చేసేసరికి నా ప్రాణం పోయిందనుకో - ఎలాగో వాళ్లకు మీ అన్నయ్య గురించి తెలియదు తెలిసేంతలోపు పెళ్ళిజరిగిపోవాలి - పెళ్లి అయిన తరువాత ఆ దేవత వల్లనైనా మీ అన్నయ్య మారుతాడని చిన్న ఆశ . నీకు exams ఉన్నాయికాబట్టి చెప్పలేదు . నువ్వేమీ కంగారుపడకు మన మేనేజర్స్ అన్నీపనులు చూసుకుంటున్నారు .
థాంక్స్ dad .......... exams అయిపోయాయి , ప్రాజెక్టు సబ్మిట్ చెయ్యడానికి 10 రోజులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇండియా బయలుదేరుతున్నాము .
ఓహ్ ......... గుడ్ news మహేష్ , హ్యాపీ జర్నీ .......... మేనేజర్ తో టికెట్ బుక్ చేయించమంటావా ? .
నో dad i'll హ్యాండిల్ గోవా లో కలుద్దాము బై అని కట్ చేసాను . నెక్స్ట్ మేనేజర్స్ కు వన్ బై వన్ కాల్ చేసి థాంక్స్ చెప్పాను . 
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ చిన్న బాస్ గారూ ......... మీ కాల్ తో మరింత ఉత్సాహం వచ్చింది రాత్రిలోపు పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యేలా రెడీ చేయిస్తాము అని సంతోషంతో బదులిచ్చారు .

గోవా కు టికెట్ బుక్ చేసుకున్నాను నైట్ 10 కు ఫ్లైట్ . Sam కు కాల్ చేసి విషయం చెప్పడంతో తన లవ్ తోపాటువచ్చి సంతోషాన్ని పంచుకున్నాడు . 
Sam : మహేష్ .......... ప్రాజెక్ట్ గురించి మరిచిపోయి హ్యాపీగా ఇండియాకు వెళ్లి బ్రదర్ మ్యారేజ్ ఎంజాయ్ చెయ్యమని చెప్పాడు . 
థాంక్స్ sam - sarah ........... , my lovely బుజ్జి ఏంజెల్స్ కు లాట్ ఆఫ్ గిఫ్ట్స్ సెలెక్ట్ చెయ్యడంలో హెల్ప్ చేస్తారా అని అడిగాను . 
Sarah : wow గిఫ్ట్స్ , లవ్ టు లవ్ టు మహేష్ ......... shall we go అని ఉత్సాహంతో చెప్పడంతో కారులో బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ చేరుకున్నాము . 

మొదట బుజ్జాయిలకు , బుజ్జితల్లులకు .......... ముగ్గురమూ కలిసి సుమారు రెండు గంటలపాటు మనసుకు నచ్చిన గిఫ్ట్స్ ను సెలెక్ట్ చేసి ఒక కొండలా పేర్చాము.
Sarah : this much గిఫ్ట్స్ లవ్లీ లవ్లీ ........... , మహేష్ .......... నాకు కూడా నీ బుజ్జి ఏంజెల్స్ లా మారిపోవాలని ఉంది .
ఇద్దరమూ నవ్వుకున్నాము . sam - sarah అంటూ జేబులోనుండి ప్లాటినం రింగ్స్ బాక్సస్ తీసి అందించాను . 
ఇద్దరూ తెరిచి చూసి సంతోషంతో చెరొకవైపు హత్తుకుని మురిసిపోయారు . నా ముందే చిరునవ్వులు చిందిస్తూ మళ్లీ లవ్ ప్రపోజ్ చేసుకుని రింగ్స్ మార్చుకున్నారు.
Sam - sarah .......... మీరు ఇలాగే కాసేపు రొమాన్స్ ఎంజాయ్ చెయ్యండి అంతలోపు నా దేవతలకు గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకునివస్తాను అని గిఫ్ట్స్ అన్నింటికీ పే చెస్ , లండన్ లోనే ఫేమస్ జ్యూవెలరీ స్టోర్ చేరుకున్నాను . 

సుమారు గంట రెండు గంటలపాటు స్టోర్ మొత్తం చూసి మొదట వదినమ్మకు - ఇద్దరు వదినలకు చూడగానే హత్తుకునే బ్యూటిఫుల్ ప్లాటినం విత్ డైమండ్ పొదిగిన చైన్స్ ను సెలెక్ట్ చేసాను , అమ్మకు గోల్డ్ చైన్ విత్ డైమండ్ డాలర్ సెలెక్ట్ చేసి కౌంటర్ కు పంపించాను .
అంతేలే డాడీ నాన్న .......... మీకు మీ వదినమ్మ - వదినలు - నానమ్మ అంటేనే ఇష్టం అని బుంగమూతిపెట్టుకున్న బుజ్జితల్లులు నలుగురూ కళ్ళముందు కనిపించడంతో , ముసిముసినవ్వులు నవ్వుకుని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కిడ్స్ సెక్షన్ చేరుకుని బుజ్జితల్లులిద్దరికీ ఒకేలా - తల్లులిద్దరికీ ఒకేలా ఉండేలా క్యూట్ ప్లాటినం - గోల్డ్ - డైమండ్స్ కలగలిసిన చైన్స్ తీసుకున్నాను .

హమ్మయ్యా .......... ఇప్పుడు సేఫ్ అని నవ్వుతూ కౌంటర్ వైపు అడుగులువేశాను . అవునూ మరి కొత్తగా ఇంట్లోకి అడుగుపెడుతున్న దేవతకోసం .......... నా బుజ్జితల్లులను - బుజ్జాయిలను 10 రోజుల ముందే చూసే అదృష్టాన్ని ప్రసాదించిన చిన్న వదినకు తీసుకోకపోతే ఎలా .......... , ల ......... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ బుజ్జివదినగారూ అని అక్కడే ఆగాను . 
అప్పుడే ఒక వ్యక్తి మిర్రర్ బాక్స్ లో జాగ్రత్తగా ఒక అద్భుతమైన జ్యూవెలరీ తీసుకువచ్చాడు - చూడగానే ఫ్లాట్ అయిపోయి చిన్న వదిన గారు soooooo లక్కీ అని మనసులో అనుకుని ప్యాక్ this one అనిచెప్పాను .

ఎస్క్యూస్ సర్ soooooo sorry , ఇది బ్రిటన్ queen కోసం స్పెషల్ గా రెడీ చేసినది నాట్ ఫర్ సేల్ ............
ఇండియా లో ఉన్న నా దేవతకోసం ఖచ్చితంగా కావాలి if not Then i dont want any of your జ్యూవెలరీ అని కార్డ్ పర్స్ లో ఉంచేసి బయటకు అడుగులువేశాను . 
స్టాఫ్ : కౌంటర్ లో ఉన్న ఓనర్ దగ్గరికివెళ్లి సర్ we made two of them , ఇండియా అంటున్నారు కాబట్టి ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఎవ్వరూ చూడలేరు .
నేను సెలెక్ట్ చేసినవాటినన్నింటినీ చూసి Owner స్వయంగా నాదగ్గరికివచ్చి చేతులుకలిపి ok అన్నారు .
No , i want both of them ...........
అంతే owner దీనంగా చూస్తూ ఉండిపోయారు . 
Say no to me sir , i'll straight walkaway అని నవ్వుని ఆపుకుంటూ చెప్పాను . ఒకటేమో కొత్తగా అడుగుపెట్టబోతున్న వదినగారికోసం మరొకటి నా డ్రీమ్ ఏంజెల్ కోసం ఇంత బ్యూటిఫుల్ జ్యూవెలరీ మళ్లీ నా మనసును గెలుచుకోగలదో లేదో అని మనసులో అనుకున్నాను - అయినా మాఇంటి దేవత వేసుకోబోతున్న జ్యూవెలరీ లాంటిది ఇక ఎవ్వరి సొంతం కాకూడదు వాళ్ళు బ్రిటన్ రాణి అయినా సరే ......... . Ok then i'll leave ........
స్టాఫ్ పరుగునవచ్చి నో నో నో సర్ ........... exactly same to same జ్యూవెలరీ both of them మీకే సొంతం ..........
ఓనర్ : నో నో ..........
స్టాఫ్ : సర్ .......... ఒక్కసారి ఆలోచించండి ఆన్లైన్ - టిక్ టాక్ - ఫేస్ బుక్ - insta ........... ఇలా చాలా ఉన్నాయి ఒకవేళ ఈ జ్యూవెలరీ వాటిలో పోస్ట్ అయ్యి ఫేమస్ అయ్యిందనుకోండి - అవ్వడం ఏంటి ఖచ్చితంగా అవుతుందిఆ జ్యూవెలరీ గొప్పతనం అలాంటిది - అలా ఇలా ......... మన బ్రిటన్ క్వీన్ ను చేరిందనుకోండి ............
ఓనర్ : నో నో నో ........... మన ప్రాణాలు . Ok ok రెండింటినీ అతడికే ఇచ్చెయ్యండి . డిజైన్ లో లోపం ఉందని బకింగ్హం నుండి కాస్త టైం తీసుకుని మరొక అద్భుతమైన డిజైన్ రెడీ చేయించండి అని వొళ్ళంతా చెమటలతో చెప్పారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ , this is real బిజినెస్ అని అన్నింటికీ పే చేసేసి చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చి స్టాఫ్ ద్వారా అన్నింటినీ కారులో పెట్టించాను . 
మొబైల్ మ్రోగడంతో చూస్తే sam , మహేష్ .......... మొత్తం గిఫ్ట్స్ వెహికల్లో తీసుకుని అపార్ట్మెంట్ చేరుకున్నాము - sarah మనకోసం లంచ్ కూడా ప్రిపేర్ చేస్తోంది త్వరగా వచ్చెయ్ అనిచెప్పాడు .
WOw లవ్లీ ......... కమింగ్ కమింగ్ అని హుషారుగా అపార్ట్మెంట్ చేరుకున్నాను . నా డ్రీమ్ ఏంజెల్ జ్యూవెలరీ మాత్రం అందుకుని కిందకుదిగి గిఫ్ట్స్ అన్నీ పెద్ద వెహికల్లో ఉండటం చూసాను .
Sam : మహేష్ .......... వచ్చేసావా , ఎయిర్పోర్ట్ కు రీచ్ అయ్యేంతవరకూ జాగ్రత్తగా ఇక్కడే ఉంటాయిలే , కమాన్ మ్యాన్ tooo హంగ్రీ అని లాక్కునివెళ్లాడు.

మా అపార్ట్మెంట్ మెయిన్ డోర్ తెరవగానే లండన్ ఘుమఘుమలు ......... wow only వన్ మినిట్ sam అంటూ ఫ్రెష్ అవ్వడానికి నా గదిలోకి పరిగెత్తాను . బెడ్ పై ఉన్న నా డ్రీమ్ ఏంజెల్ ఫైల్ పై ప్రేమతో జ్యూవెలరీ ఉంచి తనివితీరా ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి నేరుగా డైనింగ్ టేబుల్ చేరుకున్నాను .
Like Reply
డైనింగ్ టేబుల్ పై బ్రెడ్ - కేక్స్ - pies - చికెన్ రోస్ట్ - బోయిల్డ్ హాఫ్ బోయిల్డ్ ఎగ్స్ - డ్రింక్స్ ఉండటం చూసి sam .......... చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి you are very lucky - థాంక్యూ soooo మచ్ sarah .......... వన్ మినిట్ అని అన్నింటినీ ఫోటో తీసి బుజ్జాయిలకు , మీ పెద్దమ్మ అందరూ లంచ్ చేశారా ? అని సెండ్ చేసాను .
బుజ్జాయిలు : లంచ్ ? , ok ok డాడీ అక్కడ ఇప్పుడు ...........  సాయంత్రం 5 గంటలకు తిన్నారా అని నోరూరించే లండన్ ఐటమ్స్ పంపిస్తారా ? , మా డాడీ తినలేదని పెద్దమ్మ తినలేదు .......... 
మరి మీరు ? .
బుజ్జాయిలు : మాకు ఆకలి వేయడంతో చికెన్ బిరియానీ కుమ్మేసాము మాకు ఇది డిన్నర్ టైం రాత్రి 10 గంటలు అయ్యింది  . మీరు పెళ్లికి ఎలాగో రావడం లేదు కదా మీకోసం మేమెందుకు పస్తులుండాలి అని నానమ్మతోపాటు కడుపునిండా తినేసాము . పాపం మీరు ఆలస్యం చెయ్యడం వలన పెద్దమ్మ తినకుండా ఉన్నారు . 
బుజ్జాయిలూ ........... please please మీ ప్రియమైన పెద్దమ్మకు నేను తింటున్నాను అనిచెప్పి తినిపించండి .
బుజ్జాయిలు : ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ తినిపిస్తాములే డాడీ లవ్ యు , మీ అన్నయ్యలు తూగుతూ ఇప్పుడు వచ్చారు - కొద్దిసేపట్లో గోవా ప్రయాణం - వాళ్ళను చూసి నానమ్మ బాధపడ్డారు , అమ్మలు అయితే రోజూలానే ఇదీ ఒకరోజు అని ..............
బాధతో బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ .......... మీ నానమ్మ - అమ్మలను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి , హ్యాపీ జర్నీ ............. 
O ........ K ....... బై అని తియ్యనికోపంతో కట్ చేసేసారు . ఆ వెంటనే వదినమ్మకు నలుగురూ ప్రేమతో ముద్దలుకలిపి తినిపించి , అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్విస్తున్న ఫోటోలను పంపడంతో చూసి సంతోషించి లవ్ యు బుజ్జాయిలు అని బోలెడన్ని ముద్దులుపంపి , sam - sarah తోపాటు కలిసితిన్నాను .

లవర్స్ ను డిస్టర్బ్ చెయ్యకుండా సైలెంట్ గా నా గదిలోకి చేరాను . బెడ్ పైకి చేరిపోయి జ్యూవెలరీ - ఫైల్ అందుకున్నాను . ఏంజెల్ ......... 6 నెలల తరువాత ఇండియాకు వెళుతున్నాను - నో నో నో .......... బుంగమూతి పెట్టుకోకు ఏంజెల్ పెళ్లికాగానే వచ్చేస్తాను కదా అని ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను . 
నా ఏంజెల్ కు కానుకగా బ్రిటన్ క్వీన్ కోసం డిజైన్ చేయించిన జ్యూవెలరీ తీసుకొచ్చాను అని ఫైల్ లోని ఛార్ట్స్ ఒక్కొక్కటే ప్రాణంలా తిరగేస్తూ చున్నీతో దాచేసుకున్న నా ఏంజెల్ మహి మెడలో మరింత అందం తెచ్చేలా అలంకరించాను.
మహీ .......... ఈ అమాయక ప్రేమికుడిని ఒక్కసారి ఓకేఒక్కసారి కరుణించాలనిపించడం లేదా .......... , నా గుండెల్లో గూడుకట్టుకున్న దేవకన్య సౌందర్యమైన కళ్ళను చూసి తరించాలని ఆశగా ఉంది అని ఫైల్ ను గుండెలపై హత్తుకుని , నా హృదయంలో గూడుకట్టుకున్న నా దేవకన్యతో మాట్లాడుతూ సమయాన్నే మరిచిపోయాను .

టక్ టక్ ......... మహేష్ మహేష్ ......... sam పిలుపులు వినిపించడంతో సమయం చూస్తే 9 గంటలు . 
మై లవ్లీ ఏంజెల్ మహీ .......... ఫ్లైట్ టైం గాట్ టు గో , నిన్ను నాతోపాటు తీసుకెళ్లలేను ఎందుకంటే అక్కడ ఉన్నన్నిరోజులు మన ఇద్దరి దేవతలూ - బుజ్జి దెయ్యాలతో మొత్తం టైం స్పెండ్ చెయ్యాలని ఆశపడుతున్నాను . నువ్వు కూడా ఉంటే నీతోనే నీ మాయలోనే ఉండిపోతాను ఏంజెల్ అని నవ్వుకున్నాను . లవ్ యు లవ్ యు sooooooo మచ్ ఏంజెల్ రాగానే నా గుండెలపై ఊపిరాడనంతలా చుట్టేస్తాను అని ప్రాణంలా హత్తుకుని ముద్దులవర్షం కురిపించాను . జ్యూవెలరీతోపాటు ఫైల్ ను నా లాకర్ లో జాగ్రత్తగా ఉంచాను . 15 మినిట్స్ sam  అనిచెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చి బ్యాగులో రెండుజతల కొత్తబట్టలు ఉంచుకుని కావాల్సినవి తీసుకుని బయటకువచ్చాను .

అపార్ట్మెంట్ కీస్ sam చేతికి అందించి ఎంజాయ్ అన్నాను . Sarah సిగ్గుపడుతూ sam వెనుక దాచుకుంది . కిందకువచ్చి చూస్తే గిఫ్ట్స్ వెహికల్ కనిపించలేదు . కంగారుపడేంతలో ..........
Sam : మహేష్ .......... డోంట్ వర్రీ , గిఫ్ట్స్ అన్నీ ఆల్రెడీ నీ ఫ్లైట్ లోకి చేరిపోయాయి అనిచెప్పాడు . 
థాంక్స్ sam , ముగ్గురమూ కారులో ఫ్లైట్ సమయానికి ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. ప్రయాణంలో జ్యూవెలరీ బాక్సస్ అన్నింటినీ నా బ్యాగులో సర్దేసి ఉండటంతో బ్యాగు అందుకుని లోపలికివెళ్లాము . అప్పటికే ఫ్లైట్ అనౌన్సనెంట్ జరుగుతుండటంతో sam - sarah ను కౌగిలించుకుని చెక్ ఇన్ అయ్యాను . 
హ్యాపీ జర్నీ మహేష్ - ఎంజాయ్ ద మ్యారేజ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ కేకలువెయ్యడంతో నవ్వుకుని టన్నెల్ ద్వారా ఫ్లైట్లోకి చేరుకున్నాను . 
ఎయిర్ హోస్టెస్ ......... రేపు ఫ్రెష్ గా ఉండటం కోసం ఎటువంటి ఇబ్బందీ లేకుండా రెస్ట్ తీసుకోవడానికి బుక్ చేసుకున్న లగ్జరీ బిజినెస్ టికెట్ చూసి స్వయంగా నా సీట్లోకి చేర్చారు . థాంక్స్ చెప్పి బ్యాగుని జాగ్రత్తగా పైన ఉంచేసి కూర్చున్నాను . 5 నిమిషాలలో ఫ్లైట్ బయలుదేరింది .

బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ........... మరికొద్దిగంటల్లో మీ ముందు ఉంటాను , ఈ ఆరు నెలలూ వీడియో కాల్లో మాట్లాడుతున్నా ఏదో వెలితి - బుజ్జాయిలను ఎత్తుకుని బుజ్జితల్లులను ప్రాణంలా గుండెలపై హత్తుకుంటే కలిగే ఆనందమే వేరు అని తియ్యదనంతో నవ్వుకుని , మొబైల్ లో బుజ్జాయిలు స్నిగ్ధ - రాము నామకరణోత్సవం లో తీసుకున్న గ్రూప్ ఫోటోవైపు చూస్తూ మురిసిపోతున్నాను . 
చిరునవ్వులు చిందిస్తున్న అమ్మ - నాన్న , వదినమ్మ - ఇద్దరు వదినలు - బుజ్జాయిలకు చెరొకవైపు ప్రాణంలా ముద్దులుపెడుతున్న బుజ్జితల్లులు జాహ్నవి - వైష్ణవి ........... ఆ రోజు అంగరంగవైభవంతో జరిగిన ఫంక్షన్ ను తలుచుకుని పెదాలపై తియ్యదనం ఆగడం లేదు . 

ఫంక్షన్ అని నలుగురు అన్నయ్యలకు నెలరోజుల ముందుగానే మరియు ఆ నెలరోజుల్లో ప్రతీరోజూ అందరమూ పదేపదే గుర్తుచేసినా , నలుగురిలో ఒక్కరు కనీసం బుజ్జాయిల నాన్నకూడా ఫంక్షన్ కు అందుబాటులో లేకపోయారు - రెండు రోజుల ముందు వెళ్లినవారి జడనే లేదు - ఫంక్షన్ తెల్లవారుజామున నుండీ వందల కాల్స్ చేసినా కనీసం లిఫ్ట్ కూడా చెయ్యకుండా ఫంక్షన్ జరిగిన రెండురోజులకు ఒకరి తరువాత మరొకరువచ్చి ఫంక్షన్ ఎలాజరిగింది అని కనీసం ఒక మాటైనా అడగకుండా వాళ్లకు కావాల్సిన డబ్బు తీసుకుని వెళ్లిపోవడం చూసి అమ్మ మొదలుకుని బుజ్జాయిలవరకూ బాధపడిన దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ నుండి కన్నీళ్లను తెప్పిస్తున్నాయి - నేనేమైనా చెబుదామంటే చిన్నప్పటి నుండీ నలుగురు అన్నయ్యలకు నేనంటే అంతులేని కోపం - కన్నీళ్లను తుడుచుకుని అందరి సంతోషాలను చూస్తూ ముద్దులవర్షం కురిపించాను . 

ముందుగా చెప్పినట్లుగానే నాన్నగారు వైజాగ్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ బిజినెస్ మాన్ , తరతరాల నుండి వచ్చిన బిజినెస్ లను నాన్న గారు అమ్మ సహాయంతో మరింత ముందుకు తీసుకెళ్లారు - అమెరికాలో కూడా బిజినెస్ expansion చేసి తిరుగులేనిస్థాయికి చేర్చారు . ఈ ఘనత లో అమ్మ గొప్పతనం సగం పైనే అని నాన్నగారు ఎప్పుడూ చెబుతూ మురిసిపోతుంటారు - నాన్న గారి ఆనందంలోనే అమ్మ సంతోషాన్ని ఆస్వాదిస్తూ పరవశించిపోయేవారు .
తరతరాలుగా వచ్చినట్లుగానే నాన్నగారు కూడా తన నుండి మాకు బిజినెస్ లు అప్పగించాలని మా ఐదుగురినీ చిన్నప్పటి నుండీ మా బిజినెస్ ల గురించీ కంపెనీల గురించి చెబుతూ పెంచారు - మాలా డిగ్రీతో ఆగిపోకుండా మీరు ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలలో MBA ఆపై స్టడీస్ పూర్తిచేసి మన స్థాయిని మరింత పెంచేలా చెయ్యాలని ఆశపడ్డారు . 
అన్నయ్యలకయితే తరతరాలుగా కూర్చుని తిరగని ఆస్తి ఉండి కూడా ఇంకా చదువుకోవడం ఏమిటి అని కాలేజ్ కే వెళ్ళేవాళ్ళు కాదు . అంతలోనే చెడు సావాసాల వలన మొదట పెద్దన్నయ్య ఆ తరువాత నలుగురూ ఒక్కొక్కరుగా పెద్దన్నయ్యనే ఫాలో అయ్యారు . ప్రతీరోజూ కాలేజ్ నుండి కంప్లైంట్స్ - సమాజం నుండి కంప్లైంట్స్ , సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా చాలాసార్లు involve అవ్వాల్సివచ్చింది - అమ్మానాన్నల పలుకుబడి వలన సెక్యూరిటీ ఆఫీసర్లు సెల్యూట్ చేసి వెళ్లిపోయేవారు - అమ్మానాన్నలు బాధపడని రోజంటూ లేదు .

అమ్మానాన్నలను అలాచూడగానే బుజ్జాయిగా ఉన్నప్పుడే నాకూ బాదవేసేది , ఆ క్షణమే నిర్ణయించుకున్నాను అమ్మానాన్నలు సంతోషం - గర్వపడేలా ప్రవర్తించాలని , కాలేజ్ కు చేరిన మొదటిరోజునుండీ బుద్ధిగా చదువుకునేవాన్ని , కాలేజ్ - బయట అందరి ప్రశంసలు పొందేవాడిని , తొలిసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ అమ్మానాన్నలకు అందించినపుడు వాళ్ళు పొందిన సంతోషాన్ని జీవితాంతం మరిచిపోను - నన్ను అమాంతం ఎత్తుకుని వాళ్లపై కూర్చోబెట్టుకుని ముద్దులవర్షం కురిపించి మురిసిపోయారు - నేను అడగకముందే బోలెడన్ని బొమ్మలు కొనిచ్చేవారు - నన్ను చూయించి గర్వపడుతూ అన్నయ్యలకు మంచిగా ఉండాలని బాగా చదువుకోవాలని పదే పదే చెప్పి , అన్నయ్యలు వినకపోగా నాపై రోజురోజుకూ కోపాన్ని పెంచుకున్నారు మరింత చెడు మార్గాలవైపుకు వయసుతోపాటు మార్చలేనంతలా ఎదిగిపోయారు - అయినాకూడా ఎప్పుడూ అమ్మానాన్నలు అన్నయ్యలపై కోప్పడలేదు , కొడుకులపై వాళ్లకున్న ప్రేమ అలాంటిది - బంధువుల సలహా ప్రకారం పెళ్లిచేస్తే మారుతారని దేవతలను ఇంటికి కోడళ్లుగా తీసుకువచ్చారు .
మా అందరిలో పెద్దన్నయ్య వయసు ఎక్కువ , పెద్దన్నయ్య పుట్టిన తరువాత బిజినెస్ ఒడిదుడుకులకు లోనవ్వడంతో అమ్మానాన్నలు సుమారు పదేళ్ళపాటు పిల్లల్ని కనలేదు - రాత్రీపగలూ కష్టపడి ఇక మళ్లీ అలాంటి రోజులు రాకుండా ఎవరెస్టు చేరిపోయారు . 
పెద్దన్నయ్య పెళ్లినాటికి రెండవ అన్నయ్య 12th క్లాస్ , మూడవ అన్నయ్య 8th క్లాస్ , చివరి అన్నయ్య 5th ............
పెద్దన్నయ్య పెళ్లి తరువాత కూడా ఏమాత్రం మారనేలేదు , వదినమ్మకు పిల్లలు పట్టరు అన్న విషయం తెలిసిన తరువాత బయటివాళ్లే కాదు అన్నయ్య కూడా పెదాలతో పలకను మాటలతో బాధపెట్టేవాడు - హింసించేవాడు . 
ఇక మిగిలిన అన్నయ్యలంతా పెద్దన్నయ్యనే మార్గదర్శకంగా తీసుకుని రోజూ బార్లలో తాగడమే కాకుండా పొట్లాటలతో తూగుతూ ఇంటికి చేరి వదినలను బాధపెట్టేవారు . 
అమ్మ అయితే బిజినెస్ అంతటినీ నాన్నగారికి అప్పగించేసి కోడళ్లను కూతుర్లుగా ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ వస్తున్నారు .
నాన్నగారు అయితే కోడళ్ళూ ........... మీరు అడుగుపెడితే బాగుపడతారని మీ జీవితాలను నాశనం చేసినందుకు నన్ను క్షమించండి అని రెండుచేతులూ జోడించారు .
ఇది మా మెట్టినిల్లు కాదు మావయ్యగారూ పుట్టినిల్లు , మా అమ్మ ప్రేమ చాలు అని అమ్మ కౌగిలిలోకి చేరారు . రెండవ వదినకు జాహ్నవి - వైష్ణవి , మూడవ వదినకు స్నిగ్ధ - రాము పుట్టాక అందరి ప్రపంచం వాళ్లే అయ్యారు . పెద్ద వదినను వదినమ్మ అని నేను - అమ్మ అని బుజ్జితల్లులు బుజ్జాయిలు ......... పిలిచి ఆ బాధకూడా లేకుండా చేసాము .
*************

ఎయిర్ హోస్టెస్ ఫుడ్ తీసుకునిరావడంతో , కన్నీళ్లను తుడుచుకున్నాను . నో థాంక్స్ చెప్పి పంపించేసి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మా ........... అందరి దేవతవు నువ్వే అని మొబైల్లోని అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించాను . 
బుజ్జితల్లులు - బుజ్జాయిల అల్లరిని , ప్రేమను మొబైల్లోని ఫోటోలు వీడియోస్ లో చూస్తూ చూస్తూనే అలసిపోయినట్లు నిద్రలోకిజారుకున్నాను.
Like Reply
" శూన్యం - చీకటి .............. ఒక్కసారిగా నిండు పున్నమి వెన్నెల చుట్టూ పళ్ళు - పూలతో నిండి పచ్చదనంతో నిండిపోయినట్లు ప్రకృతి ప్రసాదించిన అందమైన అరణ్యం , ప్రతీ పచ్చని చెట్టుపై అత్యద్భుతమైన మిణుగురుల వెలుగులు - నలువైపుల నుండీ ఒకటినిమించిన మరొక సౌందర్యమైన పూల సువాసనలు - సంగీత సరిగమల్లా సప్తస్వరాల్లా వినిపిస్తున్న పక్షుల కిల కిల రావాలు , మధువనంలో చిగురించే చిగురాకులలోని వసంత కోకిల మధురమైన గానం అయితే హృదయాన్ని తన్మయత్వానికి లోనుచేస్తోంది - అక్కడక్కడా చిందులేస్తున్న బంగారువర్ణపు జింకలు , మలయమారుతమై పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలులు కనులను వీనులవిందుచేస్తున్నాయి .
నాకు కుడివైపున కాస్త దూరంలో పచ్చదనంతో నిండిపోయిన కొండల నుండి అంతే అందమైన జలపాతపు పరవళ్లు , నేరుగా సరస్సులోకి చేరుతున్నాయి - ఆ సరస్సులో రంగురంగుల కమలాలు , కమలాల మధ్యన మనసు పులకించేలా ప్రకృతి నేర్పిన శృంగారంలో విహరిస్తున్న పాలవర్ణపు హంసలు ............ ఇలా ఆ అరణ్యంలో ప్రతీ సౌందర్యం నా వొళ్ళంతా రొమాంటిక్ పరవళ్లు తొక్కిస్తున్నట్లు పెదాలపై తియ్యదనంతో చిరునవ్వులు చిందిస్తున్నాను . 

అంతలో పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలుల మధ్యలోనుండి అంతకంటే నెమలుల నాట్యం కంటే సౌందర్యమైన నడకతో - పక్షుల సరిగమలు కంటే వినసొంపైన చిరునవ్వుల రాగాలతో - దేవలోకపు వస్త్రాలు నగలు ధరించి , దివి నుండి దిగివచ్చిన అతిలోకసుందరి నావైపుకు అడుగులువేస్తున్నారు . 
ఆ దేవకన్య పాదపు స్పర్శకు భూమాత పులకించినట్లు , పచ్చని గడ్డి ఉన్నా పాదం నేలపై చేరకముందే తన నుండి పూలను మొలకెత్తేలా చేసి సుతిమెత్తని పూలపై నా దగ్గరికి చేరేలా చేసి తన రుణాన్ని తీర్చుకుంటోంది - పచ్చని అరణ్యం తన ఓడిలోని రంగురంగుల సీతాకోకచిలుకలు , చిలుకలు నా దేవకన్యపైకి చేరి తన అందమైన నవ్వులకు మేనిమిచాయకు దాసోహం అయినట్లు బుగ్గలపై ముద్దులుపెట్టడం - నేనేమి తక్కువ అన్నట్లు ఆకాశం మేఘాల ద్వారా పూలవర్షం కురిపించి పరవశించిపోయింది . 
ఆ అద్భుతాలన్నింటినీ చూసిన చంద్రుడే ఈర్ష్య అసూయలతో చిన్నబుచ్చుకోవడం చూసి నా దేవకన్య ముఖంపై ముసుగులో ముత్యాలు రాల్చేలా చిరునవ్వులు చిందించడం చూసి , ఆఅహ్హ్ ......... ఏమి నా అదృష్టం అని ఫ్లైయింగ్ కిస్ వదిలి వొళ్ళంతా పారవశ్యంతో హృదయంపై చేతినివేసుకుని అలా వెనక్కు పడిపోబోయాను .

మన్మధ మహేష్ ............ జాగ్రత్త అంటూ నా దేవకన్య పరుగునవచ్చి నాచేతిని అందుకున్నారు .
ఆ చేతిస్పర్శకే నా ఒంట్లో వెయ్యి వోల్ట్ ల కరెంట్ పాస్ అయినట్లు జలదరించిపోయాను . దేవకన్యవైపే కన్నార్పకుండా చూస్తూ వణుకుతూనే మహీ ........... 
ముసుగులోపలే మహి ముత్యాలు రాల్చేలా తియ్యదనంతో నవ్వుకుని , తెలుసు తెలుసు మన్మథా ........... కొన్ని రోజులుగా కాదు కాదు కొన్ని నెలలుగా కాదు కాదు సంవత్సరాలుగా మహీ మహీ ........... అని ప్రేమ ప్రాణంలా కలవరిస్తూనే ఉన్నారుకదా , ఇక నా ప్రియాతిప్రియమైన మన్మథుడిని మరింత బాధపెట్టడం ఇష్టం లేక కాదు కాదు నా మన్మథుడు మహేష్ నుండి ఇక ఒక్క క్షణం కూడా దూరంగా ఉండటం నావల్ల కాదు , నా ప్రాణమైన మన్మథుడి కోరిక తీర్చడం కంటే వేరొక అదృష్టం ............ అని అందమైన నవ్వులతో పాదాలను పైకెత్తి , ఇన్నిరోజులూ దాచేసిన ముఖాన్ని ముసుగు తొలగించి చూయించారు .
నా హృదయంలో వెలసిన నా దేవకన్య సౌందర్యానికి దాసోహం చెందినట్లు , దివి నుండి దిగివచ్చిన దేవకన్యను చూస్తున్నట్లుగా అలా కన్నార్పకుండా చూస్తూ నా హృదయమంతా నింపుకుంటున్నాను .
నేరుగా నా గుండెలపై ముత్యాలు రాల్చేలా తియ్యదనంతో చిరునవ్వులు చిందించి , మన్మథా ......... నేనంటే ఇంత ప్రేమ ప్రాణమా లవ్ యు లవ్ యు sooooooooo మచ్ అని ముద్దుపెట్టబోయి నా పెదాలు అందకపోవడంతో , మళ్లీ తియ్యనికోపంతో నా గుండెలపై కొట్టి ......... ఇలా కాదు అని నాకు ఏకమయ్యేంత దగ్గరికి వచ్చేసి ఏకంగా నా పాదాలపై తన పాదాలను ఉంచి లవ్ యు మై గాడ్  ........... నా సర్వస్వం నా దేవుడికే అంకితం అని పూలను అందుకుని నాపై జల్లి చిరునవ్వులు చిందిస్తూనే నా పెదాలను తన తేనెలూరుతున్న పెదాలతో తాకించారు ".

అప్పటికి కానీ నా డ్రీమ్ గర్ల్ సౌందర్యం నుండి తేరుకున్నట్లు , నా ఏంజెల్ ముద్దులో స్వర్గం చేరినట్లు సంతోషం పట్టలేక యాహూ యాహూ .......... నా ఏంజెల్ నన్ను కరుణించింది ఇన్నాళ్లకు నా కోరిక తీరింది అని కేకలువేశాను .........
అప్పటికే ఘాడమైన నిద్రలో ఉన్న తోటి ప్రయాణీకులు ఉలిక్కిపడి లేచి నావైపు కంగారు - కోపం కలగలిసి చూస్తున్నారు - ఫ్లైట్ లైట్స్ అన్నీ ఒక్కసారిగా వెలిగాయి - ఎయిర్ హోస్టెస్ అందరూ నాదగ్గరికి చేరుకున్నారు .
సిగ్గుపడి , వెంటనే లేచి అందరికీ sorry sorry .......... please please have a good sleep good night sweet dreams .......... నాలాగే అని నాలో నేనే అంతులేని ఆనందంతో మైమరిచిపోయాను . అందరూ .......... హుసూరుమంటూనే నిద్రలోకిజారుకున్నారు .

నా ఏంజెల్ రూపం కళ్ళ నుండి పోవడం లేదు - మళ్లీ కేకలువెయ్యబోయి కంట్రోల్ చేసుకుని కేవలం చేతులను మాత్రమే పైకెత్తి సంబరాలు చేసుకోవడం చూసి ఎయిర్ హోస్టెస్సెస్ నవ్వుకుంటున్నారు .
ఎయిర్ హోస్టెస్ : how can we help sir ? .
ఆఅహ్హ్ ............ its my life loveliest dream అంటూ గుండెలపై చేతినివేసుకుని నాలోనేనే తియ్యదనంతో నవ్వుకుంటూ కూర్చున్నాను .
ఎయిర్ హోస్టెస్ : enjoy the dream sir , have a safe journey ......... he is crazy అని గుసగుసలాడుకుంటూ వెనుతిరిగారు .
Excuse me excuse me ......... i want chart and pencil sketches its very very urgent .
ఎయిర్ హోస్టెస్సెస్ : At your service sir అంటూ క్షణాల్లో తీసుకొచ్చి ఇచ్చారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ ......... అని అందుకుని నా సీట్ లైట్ మాత్రమే వేసుకున్నాను .

చార్ట్ పై డ్రా చెయ్యడం మొదలుపెట్టగానే నిమిషాలలో నా హృదయంలో గుడికట్టుకున్న నా ఏంజెల్ ప్రతిమ అలా ముద్రపడిపోయింది . నేను ఆర్టిస్ట్ ను కాకపోయినా మహినే నా కళ్లముందు ప్రత్యక్షమై ప్రేమతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తున్నదా అన్నట్లు ఉండటం చూసి నా ప్రేమ ఎంత స్వఛ్చమైనదోనని నాలో నేనే వర్ణించడానికి వీలులేనంతలా మురిసిపోతున్నాను .
కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు soooooo మచ్ ........... చార్ట్ పై "I LOVE YOU MAHI - MY HEART , MY LIFE " అని ఒక్కొక్క కలర్ స్కెచ్ తో ఒక్కొక్క అక్షరం రాశాను . ఇక నుండీ నా జీవితం ఈ రంగులలానే కలర్ఫుల్ ........... నీ సౌందర్యాతి సౌందర్యమైన కళ్ళు - పెదాలు - బుగ్గలు .......... సిగ్గుపడి , నా కళ్ళల్లోనే చూసుకుంటూ హృదయంలో రోజురోజుకూ ప్రేమను పెంచుకుంటూ నీకోసం సంతోషంగా వెతుకుతాను . 

" మహీ " ........... నీ సౌందర్యమైన రూపంతో నన్ను పావనం చేశావని వెంటనే " వదినమ్మకు " తెలియజెయ్యాలి . ఇంతకూ చెప్పలేదు కదూ నీ గురించి నా మొదటి ప్రాణమైన వదినమ్మకు అంటే నీ ప్రాణమైన పెద్దక్కయ్యకు - బుజ్జితల్లులకు బుజ్జాయిలకు అంటే నీ ప్రాణమైన తల్లులకు మాత్రమే తెలుసు - నువ్వు నాకు కనిపించాలని ఆ ఐదుగురూ పూజలు కూడా చేస్తున్నారంటే నమ్ము - మన వదినమ్మ పూజల ప్రతిఫలం ఈరోజుకు లభించింది , మనమిద్దరం మొదటగా వదినమ్మకు లవ్ యు లు ఒకటి కాదు రెండు కాదు వందలు వేలు లక్షలు కోట్ల లవ్ యు లు ........... లవ్ యు sooooooo మచ్ వదినమ్మా మీరే నా దైవం మొదటి ప్రాణం . 
మహినా ........... ? .
తను మీ ముద్దుల " చెల్లి - కోడలు " నాకంటే బాగా మా వదినమ్మను అర్థం చేసుకుంటుందని నా హృదయం ఎప్పుడో చెప్పింది . మహీ ........... , చూసారా వదినమ్మా .......... మీ చెల్లికి కూడా మొదటి ప్రాణం మీరేనట .
లవ్ యు లవ్ యు sooooooo మచ్ మై ఏంజెల్ మహీ ........... అంటూ ముద్దుపెట్టబోయి ఆగి గుండెలపై ప్రాణంలా హత్తుకున్నాను .

ముద్దు ఎందుకు పెట్టలేదు అని గుండెలపై తియ్యని గాయమైనట్లు తెలియడంతో చూస్తే నిజమే , నా ఏంజెల్ పెదాల గుర్తు అక్కడక్కడా కలర్స్ అంటుకున్నాయి .
ఈ మాధుర్యం కోసమే ఏంజెల్ ........... లవ్ యు లవ్ యు soooo మచ్ ఆని మహి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి ఏకమయ్యేలా రెండుచేతులతో నా హృదయం పై చుట్టేసి కళ్ళుమూసుకోగానే - మహి ప్రేమగా జోకొట్టినట్లు హాయిగా నిద్రపట్టేసింది .

లాండింగ్ అంనౌన్సనెంట్ వినిపించడంతో మెలకువవచ్చి కళ్ళుతెరిచిచూస్తే ప్రయాణీకులంతా హడావిడిగా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటున్నారు . సమయం చూస్తే ఉదయం 5 గంటలు , గుండెలపై హత్తుకున్న నా ఏంజెల్ తోపాటుగా సీట్ బెల్ట్ పెట్టుకుని విండో నుండి చూస్తే సముద్రతీరం నుండి అల్లంత దూరం వరకూ గోవా సిటీ విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది . 5 నిమిషాలలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది . లండన్ నుండి హైద్రాబాద్ అక్కడ నుండి వైజాగ్ వచ్చిన ప్రతీసారీ వైజాగ్ లో వదినమ్మ మొదలుకుని బుజ్జాయిలు స్నిగ్ధ - రాము వరకూ నాకోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తూ ఘనంగా స్వాగతం పలికేవారు .
ఫస్ట్ టైం అలాంటి మధురమైన ప్రేమల స్వాగతం లేకుండా ఇండియాలో ల్యాండ్ అవ్వడం అని కాస్త నిరాశతో పైకిలేచాను . మహీ .......... నీతోపాటు ఇండియాలో ఆడుగుపెట్టబోతున్నానంటే ఎలా ఉండాలి , కానీ sor ........ లవ్ యు లవ్ యు ఇదే వైజాగ్ అయ్యివుంటే మీ అక్కయ్యలు .......... ఆ welcome వేరే ఉండేది అనిచెప్పి , చార్ట్ ను పైనుండి అందుకున్న బ్యాగులో జాగ్రత్తగా ఉంచాను .

పాపం వదినమ్మ అమ్మ అందరూ అర్ధరాత్రి గోవా చేరుకుని అలసిపోయి ఉంటారు . హాయిగా రెస్ట్ తీసుకుంటున్నవాళ్లను ఇంత తెల్లవారుఘామున వెళ్లి డిస్టర్బ్ చెయ్యడం ఎందుకు అని ఫ్లైట్ నుండి అందరూ వెళ్లిన తరువాత బ్యాగుని వెనుకవేసుకుని నెమ్మదిగా టన్నెల్ ద్వారా లగేజీ సెక్షన్ కు చేరుకున్నాను .
Sam ఇచ్చిన కార్డ్ చూయించగానే చిన్నపాటి కంటైనర్ ను ఎయిర్ పోర్ట్ వెహికల్లోకి మార్చారు .
ఎస్క్యూస్ మీ .......... కాస్త జాగ్రత్తగా ,
ఎయిర్ పోర్ట్ స్టాఫ్ : లోపల ఎమున్నాయి సర్ ? .
బుజ్జాయిలు గుర్తుకురావడంతో పెదాలపై చిరునవ్వుతో గిఫ్ట్స్ అని బదులిచ్చాను .
స్టాఫ్ : totally ? .
Yes , for my lovely cute ఏంజెల్స్ అండ్ డెవిల్స్ ........... , అయినా తక్కువ అయ్యాయని ఫ్లైట్ లో ఫీల్ అవుతూ వచ్చాను .
స్టాఫ్ .......... ఆశ్చర్యపోయి అలా నోరుతెరిచి ఉండిపోయారు . Those kids are luckiest sir ........... , డెలివరీ అడ్రస్ అని అడిగారు . 
అడ్రస్ కోసం కొద్దిసేపు wait చెయ్యాలి .
Staf : then vehical would wait outside sir అని పాసేజ్ లెటర్ అందించి welcome to గోవా అనిచెప్పారు .
థాంక్స్ చెప్పేసి బయటకు నడిచాను .

ఎయిర్ పోర్ట్ లోపల Welcome zone దగ్గర అమ్మ - చిన్న వదినలిద్దరూ ......... చిరునవ్వులు చిందిస్తూ చేతులు ఊపి కన్నయ్యా - మహేష్ మహేష్ అంటూ స్వాగతం పలికారు .
యాహూ ............ వైజాగ్ అయినా గోవా అయినా ఒక్కటే అని అంతెత్తుకు ఎగిరి , అంతులేని ఉత్సాహం హుషారుగా లవ్ యు లవ్ యు లవ్ యు ఉమ్మా ఉమ్మా ......... అంటూ పరుగునవచ్చి , అమ్మ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుని లేచి వదినమ్మా వదినమ్మా .......... అంటూ ముగ్గురి చుట్టూ రౌండ్స్ వేసినా కనిపించకపోవడంతో , అమ్మా .......... మీ ప్రాణమైన పెద్ద కూతురెక్కడ - వదినలూ .......... మీ ప్రియమైన అక్కయ్య ఎక్కడ ఎక్కడ చెప్పండి , వెంటనే చూడాలి అని ప్రాణంలా అడిగాను .

అమ్మ : తియ్యనికోపంతో అమ్మ కంటే నీకు నా పెద్దకూతురే ప్రాణమా ? , అయినా నీ గారాల వదినమ్మ ఇక్కడకు రాలేదు కన్నయ్యా ......... , నిన్ను చూడటం నీ ప్రాణం కంటే ఎక్కువైన మీ వదినమ్మకు ఇష్టం లేదేమో - ఇలా ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నామని చెప్పినా పట్టించుకోలేదు అని లోలోపలే నవ్వుకుంటున్నారు .
నేను నమ్మనంటే నమ్మను మా వదినమ్మ నాకోసం ఖచ్చితంగా వచ్చి ఉంటారు అని ఎగిరి ఎగిరి చుట్టూ చూస్తున్నాను - వదినమ్మకు నేనంటే ఇంత అంత ఇష్టం అని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు , నేనంటే విశ్వమంత ప్రాణం వదినమ్మా వదినమ్మా ............ నాకు తెలుసు వీళ్ళు నన్ను ఆటపట్టించేందుకు మిమ్మల్ని ఎక్కడో దాక్కోమని చెప్పి ఉంటారు .
అదిగో అదిగో ......... మా వదినమ్మ తియ్యని ముసిముసినవ్వులు , నా హృదయం కూడా చెబుతోంది దేవతలాంటి వదినమ్మ ఇక్కడే ఉన్నారని , వదినలూ ........... మీరైనా చెప్పొచ్చుకదా , మరొక్క క్షణంలో వదినమ్మను చూడకపోతే ఈ హృదయం తట్టుకునేలా లేదు ........ ఆఅహ్హ్ ......... వదినమ్మా ...........

అంతే స్తంభం వెనుకనుండి బేబీ బేబీ ......... ఏమయ్యింది అని కళ్ళల్లో కన్నీళ్ళతో పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయి , ఎక్కడ నొప్పి ఇక్కడేనా అని గుండెలపై ప్రాణంలా స్పృశించారు .
మా వదినమ్మను చూడటం మరొక్క క్షణం ఆలస్యం అయ్యివుంటే ఈ గుండె ఆగిపోయేది అమ్మా వదినమ్మా ..........
ష్ ష్ ......... అంటూ వెంటనే నా నోటిని మూసేసి ( ఇరువైపులా ఉన్న వదినలు కూడా ఆపడానికి చేతులను పైకెత్తారు ) ఇలా ఎప్పుడూ మాట్లాడకు బేబీ మేము .......... అంటూ మళ్లీ కన్నీళ్లను కార్చారు . 
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ వదినమ్మా - వదినలూ ...........  మా వదినమ్మను బయటకు ఎలా రప్పించాలో నాకు తెలియదా అని వదినమ్మ బుగ్గలను అందుకుని కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . వదినమ్మా .......... ఎలా ఉన్నారు అని అడిగాను . 
నా ప్రాణమైన బేబీ మహేష్ ను చూసాను - కౌగిలిలోకి చేరాను అంతకంటే ఏమికావాలి విశ్వమంత సంతోషం ఒక్కసారిగా వచ్చేసింది అని చిరునవ్వులు చిందిస్తూ నన్ను పైనుండి కిందవరకూ చూసి , బేబీ నువ్వే చూడు ఎలా చిక్కిపోయావో ............. సరిగ్గా తినడం లేదా అని తియ్యని బాధతో అడిగారు .
అవునవును అమ్మా (వదినమ్మా ) .......... 9 రోజుల్లో మావదినమ్మ దగ్గరకే వచ్చి శాశ్వతంగా ఉండిపోతాను కదా , రోజూ మూడుపూటలా మా వదినమ్మ వండిపెట్టే అద్భుతమైన వంటలు తింటూ ఉండిపోవడమే .............
వదినమ్మ : అలాగే బేబీ ........... ఇష్టమైనవన్నీ చేసి స్వయంగా మా చేతులతో తినిపిస్తాము .

అమ్మ మా ప్రేమలను చూసి ఆనందబాస్పాలతో పరవశించిపోతున్నారు . తల్లీ ఇందు ........... చిక్కిపోయినట్లున్నాడా కన్నయ్య , నేను నీకు అప్పజెప్పినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడెలా ఉన్నాడు - అమ్మా అమ్మా .......... అంటూ చిన్న టెడ్డి బేర్ లా నీ గుండెలపై హత్తుకున్నవాడు ఇప్పుడు తాటిచెట్టులా ఎత్తు - సువిశాలమైన ఛాతీ - సిక్స్ ప్యాక్స్ or 8 ప్యాక్స్ కన్నయ్యా ........... అంటూ నా ప్యాక్స్ లెక్కేయ్యడానికి షర్ట్ ను పైకెత్తుతూ .......... ఇప్పుడు నువ్వు మనమంతా కూడా కన్నయ్య కౌగిలిలో గువ్వపిల్లలం అనిపించేలా తయారుచేశావు ప్రాణంలా............
వదినమ్మా వదినమ్మా .......... గిలిగింతలు గిలిగింతలు అంటూ వదినమ్మను గట్టిగా కౌగిలించుకున్నాను .
ఎందుకో ఏమో వదినమ్మ ........... కన్నార్పకుండా ఒక కొత్త భావంతో ఆరాధనతో అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు - వదినమ్మ వొంటిలో వైబ్రేషన్స్ నాకు తెలుస్తున్నాయి . 
అమ్మ ............ అక్కడికీ ఆపకపోవడంతో వదినమ్మా వదినమ్మా సేవ్ మీ సేవ మీ అంటూ వదినమ్మ వెనుకకు చేరి దాక్కున్నాను .
వదినమ్మ : వదినలతోపాటు నవ్వుకుని , అవును బేబీ ........... సిక్స్ ప్యాక్స్ or 8 ప్యాక్స్ అని అడిగారు . 
అమ్మ : మనకైతే చూయించడు , ఇప్పుడు కన్నయ్య ప్రియమైన వదినమ్మ అడిగింది కదా ఖచ్చితంగా చూయిస్తాడు .
వదినమ్మా ........... సిగ్గేస్తోంది అని వదినమ్మ కురులలో తలదాచుకున్నాను .
వదినమ్మ : అయితే వద్దులే బేబీ ...........
లవ్ యు లవ్ యు sooooooo మచ్ వదినమ్మా , మా వదినమ్మ బంగారం వరాలిచ్చే దేవత అని ముందుకువచ్చి అమాంతం పైకెత్తి చుట్టూ తిప్పాను .
వదినమ్మ ఆనందబాస్పాలను చూసి అమ్మ - వదినలు కళ్ళల్లో చెమ్మతో , లవ్ యు లవ్ యు కన్నయ్యా - మహేష్ మహేష్ అంటూ నా బుగ్గలను చేతులతో తాకించి ముద్దులుపెట్టి ఆనందించారు . 

వదినమ్మను నెమ్మదిగా కిందకుదింపి , అయ్యో .......... కళ్ళు తిరుగుతున్నాయా వదినమ్మా నాకు బుద్ధే లేదు ఇంకా చిన్నపిల్లాడిలానే ప్రవర్తిస్తున్నాను - కూర్చోబెట్టనా అమ్మా ........... ,
వదినమ్మ : ఊహూ ........... అంటూ ప్రాణం కంటే ఎక్కువగా నా గుండెలపైకి చేరిపోయారు .
అమ్మా - వదినలూ ........... ఏమిచెయ్యాలి అని అడిగాను .
ముగ్గురూ : ఏమీ చెయ్యకు , మీ అమ్మను నీ గుండెలపై ......... అంటూ వదినమ్మ కురులను ప్రేమతో స్పృశించి , ఇలా సంతోషంగా నిన్ను - మిమ్మల్ని చూసి 6 నెలలు అయ్యింది తల్లీ - అక్కయ్యా .......... అని వదినమ్మ కురులపై - బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . లవ్ యు లవ్ యు కన్నయ్యా - మహేష్ మహేష్ అంటూ ముగ్గురూ మూడువైపులా సంతోషంతో నాకు దిష్టి తీశారు .
Like Reply
మా వదినమ్మ ఎప్పుడూ ఇలా చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉండాలి అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
అమ్మ : 10 రోజుల్లో లండన్ వదిలి వచ్చేస్తున్నావు కదా కన్నయ్యా ........... , చిన్నప్పుడు ఎలా అయితే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని ఇంతవాణ్ణి చేశారో అలా నువ్వే నీ వదినమ్మను ఇకనుండీ ప్రాణంలా చూసుకుని సంతోషపెట్టు అని అమ్మ ఆర్డర్ వేశారు . మాకే అప్పుడప్పుడూ డౌట్ వస్తుంది నువ్వేనా ఇలా దున్నపోతులా మారిపోయినది అని ,
నాతోపాటు వదినమ్మ - వదినలు కూడా నవ్వుకుని గర్వపడ్డారు . లవ్ టు లవ్ టు అమ్మా ........... , మా వదినమ్మ సేవలో తరించడం కంటే అదృష్టం మరొకటి ఏమి ఉంటుంది - వదినమ్మ పాదాలు కిందపెట్టనివ్వకుండా ప్రాణంలా చూసుకుంటాను .
వదినమ్మ : పులకించిపోతూనే , నో నో నో ........... మావయ్యగారు ఇందుకోసమేనా నా బుజ్జి బేబీ ని లండన్ లో చదివించినది - మన సామ్రాజ్యానికి రాజువి కావాలి , అమ్మ - మావయ్యాల కోరిక ప్రకారం మన కీర్తిని టాప్ లో ఉంచాలి.
మా వదినమ్మ కోరిక కూడా అదే అయితే అలానే చేస్తాను , రోజులో సగం సమయం మాదేవత వదినమ్మ సేవలో - సగం సమయం వదినమ్మ కోరిక తీర్చడం కోసం ...............
వదినమ్మ .......... అంతులేని ఆనందంతో పులకించిపోయి , నా బుగ్గలను అందుకుని బేబీ ............ అని ప్రేమతో పిలవడంతో ,
Ok ok అమ్మా .......... నా తప్పేమీ లేదు , తప్పంతా మా దేవత వదినమ్మదే , మీరు ప్రేమ - ప్రాణం పెట్టి తినిపించడం వల్ల ఇలా అయ్యాను అని తలను వదినమ్మకు అనుకూలంగా దించాను .
అమ్మ - వదినలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ నా బుజ్జి బంగారు బేబీ కాదు కాదు పెద్ద బేబీ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , బేబీ ......... ఇంకా కళ్ళుతిరుగుతూనే ఉన్నాయి అని ముసిముసినవ్వులతో మళ్లీ నా గుండెలపైకి చేరిపోయారు . 

ఆత్రం ఏమీ లేదమ్మా , మీ ఇష్టం .......... , వదినమ్మా ......... ఇంతకీ మన బుజ్జితల్లులు - బుజ్జిదెయ్యాలు ఎక్కడ , హోటల్లో హాయిగా నిద్రపోతున్నారన్నమాట - అయినా వాళ్ళను ఒంటరిగా వదిలి ఎలావచ్చారు - వదినమ్మా ........... ఎత్తుకుని వెళ్లిపోనా - లేచి చూసి కంగారుపడుతున్నారో ఏమో ............
వదినమ్మతోపాటు అందరూ నవ్వుకున్నారు .
వదినలు : నిన్న రాత్రి మన ఇంటి నుండి ఎయిర్ పోర్ట్ చేరినతరువాత నుండీ ఇప్పటివరకూ వాళ్ళను చూడలేదంటే నమ్ము మహేష్ ............ 
ఏమంటున్నారు వదినలూ ........... , చూడకపోవడం ఏంటి అని కంగారుపడుతూ అడిగాను .
అమ్మ - వదినలు మళ్లీ నవ్వుకుని , కూల్ కూల్ కన్నయ్యా - మహేష్ ............. , ఎయిర్పోర్ట్ చేరుకోగానే అదేసమయానికి లేడీ మ్యారేజ్ బ్రోకర్ మన ఇంటి కొత్త కోడలిని - మా చెల్లిని శ్రీకాకుళం నుండి పిలుచుకునివచ్చారు . నీ బుజ్జితల్లులు - బుజ్జాయిలే ........... మా చెల్లి అందానికి ఫ్లాట్ అయిపోయినట్లు అమ్మా అమ్మా ........... అంటూ ఆప్యాయంగా పిలుస్తూ వెళ్లి తమను తాము పరిచయం చేసుకున్నారు . అయ్యో ............ మా చెల్లి అందంలో ఎంత అందాలరాసినో మంచితనంలో అంత సుగుణాలరాశి - నీ బుజ్జాయిలను .......... చెబితే నమ్మవు కానీ నీకంటే - మాకంటే ప్రాణంలా చూసుకుంది . మాకే ఆనందం వేసిందనుకో ........... , అంతే అమ్మా - చిన్నమ్మా ........... అంటూ ఫ్లైట్ జర్నీ మొత్తం మా చెల్లితోనే , గోవా ఎయిర్పోర్ట్ నుండి హోటల్ చేరుకునేంతవరకూ తన కారులోనే , నిద్రకూడా తనతోనే ............ , తల్లులూ ......... అని పిలిచామా ........
తల్లులు : నానమ్మ - అమ్మలూ ........... ఇక మీరు అవసరం లేదు , ఎలాగో డాడీ - నాన్న లండన్ నుండి రావడం లేదు కాబట్టి మా చిన్నమ్మ కాదు కాదు అమ్మతోనే ఉండిపోతాము వెళ్ళండి వెళ్ళండి అని తోసేశారు తెలుసా ............ , అమ్మా అమ్మా - బామ్మగారూ - సంధ్య అక్కయ్యా - బిస్వాస్ అన్నయ్యా ......... మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టము మిమ్మల్ని అలాచూస్తూ సోఫాలోకానీ కిందకానీ పడుకుంటాము .
దానికి మా చెల్లి : తల్లులూ ........ జాహ్నవి - వైష్ణవి , బుజ్జాయిలూ ......... స్నిగ్ధ - రాము , మీ స్థానం ఇక్కడ అని ప్రాణంలా హత్తుకున్నారు - మిమ్మల్ని ప్రేమతో జోకొట్టి బెడ్ పై పడుకోబెట్టి మేము కిందపడుకుంటాము .
బుజ్జితల్లులు : లేదు లేదు అమ్మా .......... , పడుకుంటే అందరమూ బెడ్ పై వీలుకాకపోతే అందరమూ నేలపై , అమ్మో .......... మా దేవతలాంటి అమ్మ నేలపై పడుకోవడమా నోవే , తాతయ్యా తాతయ్యా ........... మాకు వెంటనే లాంగెస్ట్ బెడ్ గల లగ్జరీ సూట్ కావాలి అని ఆర్డర్ వేశారు .
మావయ్య గారు వెంటనే రిసెప్షన్ కు కాల్ చేసి చెప్పడం - స్టాఫ్ పరుగునవచ్చి ప్రక్కనే ఉన్న బిగ్గెస్ట్ లగ్జరీ రూమ్ కీస్ అందించడం నిమిషాల్లో జరిగిపోయాయి .
తల్లులు గదిని చూసి లవ్ యు తాతయ్యా ......... గుడ్ నైట్ ఇక మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి వెళ్లిపోండి అని చెల్లిని ప్రేమతో నడిపించుకునివెళ్లి లాక్ చేసేసుకున్నారు అని నవ్వుతూ చెప్పారు వదినలు . 
మహేష్ మహేష్ ........... మా చెల్లి అందాన్ని చూసి మాకే ఈర్ష్య - అసూయలు కలిగాయి తెలుసా , మా సౌందర్యవతి చెల్లి మా ప్రియమైన మహేష్ భార్యగా రావాల్సింది అని మనసులోని మాటను చెప్పేసారు . 
అమ్మకూడా .......... , అవును తల్లులూ నా మనసులోని మాటకూడా అదే , ఆ తల్లిని ముందుగానే చూసి ఉంటే ఇలా జరుగునిచ్చేదాన్నికాదు అని కళ్ళల్లో చెమ్మతో బాధపడ్డారు . ఫ్లైట్ లో మాదగ్గరికివచ్చి పాదాలకు నమస్కరించి , అమ్మా .......... క్షమించండి అత్తయ్యగారూ ......... మా చిన్నప్పుడే అమ్మానాన్నలు స్వర్గస్థులయ్యారు , నేను - చెల్లి సంధ్య - తమ్ముడు బిస్వాస్ బామ్మ తో ఉన్నాము , అమ్మ ప్రేమంటే ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగాము , ఇకనుండీ దేవతలు లాంటి మీలో - అక్కయ్యల నుండి అమ్మ ప్రేమను పొందాలని ఆశపడుతున్నాను , మీరు ఏమిచెబితే అదిచేస్తాను మీ అందరినీ ప్రాణంలా సేవించుకుంటాను అని చెబుతుంటే ఈ హృదయం ఆనందంతో పొంగిపోయింది , పాపం బామ్మ కష్టపడి ముగ్గురినీ చదివించారు చాలా చాలా పేదవారు ఇక నుండీ అన్నీ మనమే చూసుకోవాలి .

అలాగే అమ్మా , కానీ వదినమ్మా ............
వదినమ్మ : తెలుసు తెలుసు బేబీ , ఇక్కడ నీ హృదయంలో దేవకన్య మహి ఉందని , కానీ ............ అంటూ కళ్ళతోనే వ్యక్తపరిచి బాధపడుతున్నారు .
వదినమ్మా - అమ్మా - వదినలూ ........... తప్పు తప్పు లెంపలేసుకోండి అని వదినమ్మ నుదుటిపై నుదుటితో సున్నితంగా కొట్టాను , ఆమె చిన్నన్నయ్యకు సొంతం అంతే పదండి మనం హోటల్ కు వెళదాము . 
అమ్మ : ప్చ్ .......... ఒకవైపు తల్లి మన ఇంటికే వస్తోందని ఆనందం - మరొకవైపు చివరి తాగుబోతు వెధవకు ............ ఊహించడానికే నా మనసు ఒప్పుకోవడం లేదు అని నా బుగ్గను గిల్లేసి కోపం చల్లారక కొట్టేస్తున్నారు - కన్నయ్యా ......... ఇప్పటికైనా సమయం మించిపోలేదు నువ్వు ఊ ......... అను " తల్లి హిమ " ను ............ 
అమ్మా ........... తప్పే , ఇప్పటికే అన్నయ్యలు నేనంటేనే కోపంగా ఉన్నారు ఇక ఇలాకానీ చేశామో ఇక అంతే ..........
వదినలు : అవునవును అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు , ఇంట్లో యుద్ధమే ........
అమ్మ : అలా జరుగకూడదు జరుగకూడదు ...........
హమ్మయ్యా ........... నేను సేఫ్ అని లోలోపలే మురిసిపోయి , అమ్మా - వదినమ్మా పదండి వెంటనే నా బుజ్జితల్లులను - బుజ్జాయిలను చూడాలి , సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నాను .
వదినమ్మ తియ్యనికోపంతో నా నడుముపై గిల్లేసారు .
స్స్స్ .......... అని అంతెత్తుకు ఎగిరిపడి చూస్తే వదినలిద్దరూ కాస్త దూరంలో అలకతో కూర్చున్నారు .

ఆ అలకకు కారణం తెలిసినట్లు వదినమ్మ - అమ్మ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు . 
వదినమ్మా ........... మీ చెల్లి గురించా ? , sort out అయిపోయింది కదా .........
వదినమ్మ : తియ్యదనంతో నవ్వుకుని , బేబీ .......... మా చెల్లెళ్ళ దగ్గరికివెళ్ళు నీకే తెలుస్తుంది .
వదినమ్మతోపాటు అడుగులు వెయ్యబోతే , నో నో అంటూ తల ఊపి వెళ్ళమన్నారు .
వదినమ్మా ........... మిమ్మల్ని వదిలి ..........
వదినమ్మ : ష్ ష్ ష్ ........... మా చెల్లెళ్లకు మరింత తియ్యనికోపం తెప్పించేలా ఉన్నావు బేబీ , మా బుజ్జికదూ బంగారం కదూ ........... నేనెక్కడికీ వెళ్లను మా అమ్మ గుండెలపై ఉంటాను వెళ్ళు అని నుదుటిపై ముద్దుపెట్టబోయి వీలుకాక తియ్యనికోపంతో నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , అమ్మ గుండెలపైకి చేరిపోయారు .

ఇలాంటి అత్తాకోడళ్లను ,
ఇద్దరు దేవతలూ కొట్టబోతే .........
లవ్ యు లవ్ యు అత్తాకోడళ్లు కాదు తల్లీకూతుళ్ళను ఇలలో ఎక్కడా చూడలేదు - అలా చూస్తూ ఉండిపోవాలని ఉంది ఉమ్మా ఉమ్మా .......... అంటూ ఇద్దరి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , వదినలిద్దరి అలకకు కారణం ఏంటి అని వడివడిగా వెళ్లి ఇద్దరి ముందు మోకాళ్లపై కూర్చుని , goddesses ............ మీ ఈ బుంగమూతులకు కారణం ఏమిటి నావల్లనేనా అని ప్రాణంలా అడిగాను . 
వదినలు : అవును అవును అని నా బుగ్గలపై చేతులతో స్పృశించి ముద్దుపెట్టారు .
నా పెదాలపై చిరునవ్వు , అయితే శిక్షించాల్సిందే - అంతకంటే ముందు చేసిన తప్పు చెబితే మరొకసారి జరుగకుండా చూసుకుంటాను .
వదినలు : మళ్లీ ముద్దులుపెట్టి , నవ్వుని ఆపుకుంటూ కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లు నటిస్తూ ........... ఈ మాటను లండన్ నుండి వచ్చిన ప్రతీసారీ చెప్పావు అని బుజ్జాయిల్లా చేతులుకట్టుకుని కూర్చున్నారు .
వదినమ్మ - అమ్మ : అలకకు కారణం ఏంటో తెలిసిందా బేబీ - కన్నయ్యా ......... అన్ని ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .

లగేజీ పాస్ తీసుకుని అడుగులువెయ్యగానే , అమ్మ - వదినలు కనిపించారు ........ అమ్మ పాదాలకు నమస్కరించాను కానీ వదినలను .......... నేరుగా వదినమ్మ ప్రేమలో మునిగిపోయాను .
వదినలూ ........... పలకరించలేదా ? .
వదినలు : వొంగి నా నుదుటిపై ఒకేసారి చెరొకవైపు ముద్దులుపెట్టి , తియ్యనికోపాలతో కుర్చీలలో చెరొకవైపుకు తిరిగి కూర్చున్నారు .
పెద్ద తప్పు చాలా పెద్ద తప్పు ఒక్కసారి కాదు ప్రతీసారీ మళ్లీ మళ్లీ ........ , ఇది క్షమించారానిది అంటూ పైకిలేచాను . రెండుచేతులతో చెవులను అందుకుని లవ్ యు లవ్ యు వదినలూ - దేవతలూ ......... , దేవతలకే కోపం తెప్పించాను లవ్ యు లవ్ యు అంటూ ఒకసారి రెండవ వదిన ముందు వెంటనే మూడవ వదిన ముందు గుంజీలు తీసాను .
ఇంకా ఒక్కొక్కటీ కూడా పూర్తవ్వకముందే మహేష్ - మహేష్ .......... అంటూ లేచి నన్ను లేపి నా చేతులను చెవులపై నుండి తీసేసి చిరునవ్వులు చిందిస్తూ చెరొకవైపు హత్తుకున్నారు . 
లవ్ యు లవ్ యు వదినలూ ........... ఈరోజుకు తొమ్మిదవరోజు మళ్లీ వస్తానుకదా అప్పుడు మాత్రం మొదట మా వదినల ............
వదినలు : ok ok .......... ప్రతీసారీ ఇదేమాట అని సున్నితంగా బుగ్గలను గిల్లేసి తమ చేతులపై ప్రాణంలా ముద్దులుపెట్టారు .

వదినమ్మా ........... మీ ముద్దుల చెల్లెళ్లకు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అందులో ఉన్నాయి కేవలం మీ చెల్లెళ్లకు మాత్రమే తీసుకొచ్చాను ...........
అంతే ఇద్దరు వదినలూ ........... నా గుండెలపై చిరునవ్వులు చిందిస్తూ కొట్టి , ఓకేమాటను ఎన్నిసార్లు చెబుతావు మహేష్ - మహేష్ ......... అంటూ పరుగునవెళ్లి వదినమ్మ - అమ్మ చేతులను చుట్టేసి , తొందరగా మా గిఫ్ట్స్ ఇవ్వు ఇప్పటికే ఆలస్యం అయ్యింది అని బ్యాగు వైపే ఆశతో చూస్తున్నారు . 
ఒక్క నిమిషం ఒకేఒక్క నిమిషం దేవతలూ .......... మిమ్మల్ని ఇలా చూడటానికి రెండుకళ్ళూ చాలడం లేదు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ఆనందబాస్పాలతో గుండెలపై చేతినివేసుకుని మురిసిపోయాను . 
అలాగే అలాగే నవ్వుతూ ఉండండి అని వాళ్లదగ్గరకువెళ్లి బోలెడన్ని సెల్ఫీలు తీసుకున్నాను . 
వదినమ్మ : మరికొన్ని గంటలలో మా ముగ్గురి ముద్దుల అందాల చెల్లి కూడా మాలో ఇంతే ప్రాణంలా కలవబోతోంది . 

ఆ విషయం తెలిసే మీ ముద్దుల అందాల చెల్లికి , మీరు కొట్టనంటే చెబుతాను - మీ అందరికంటే అత్యద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చాను .
మొదట ముగ్గురూ ......... తియ్యనికోపంతో చూసినా , ఆ వెంటనే నిజమే నిజమే మా అందరికంటే సౌందర్యారాశికి ఆ మాత్రం కానుక ఇవ్వాల్సిందే ..........
అమ్మ : అంటే నా తల్లులకు పెళ్లికి ముందు ఆటపట్టించేందుకు ప్రపోజ్ చేసినట్లుగానా కన్నయ్యా ........... , wow నా ముగ్గురు తల్లుల కంటే అత్యద్భుతమైన కానుకతో ప్రపోజ్ అంటే మా కొత్త కోడలిదే costly ప్రపోజ్ అవ్వబోతోందన్నమాట .

వదినమ్మ : నాకు కేవలం బుడి బుడి అడుగులు వేసుకుంటూ వచ్చి బుగ్గపై ముద్దుపెట్టి ప్రపోజ్ చేసాడు నా బుజ్జి బేబీ .......... అని నా బుగ్గపై ప్రాణంలా గిల్లి నవ్వుకున్నారు .
అప్పటికి అంతే తెలుసు వదినమ్మా అని తలదించుకున్నాను .
రెండవ వదిన : నాకు కేవలం అందమైన గులాబీ పువ్వు అందించి ప్రపోజ్ చేసాడు మహేష్ అని కుడి భుజం పై గిల్లి నవ్వుకున్నారు .
అప్పటికి కాస్త సినిమాల ప్రభావం అని మరింత తలదించుకుని భుజం పై రాసుకున్నాను .
మూడవ వదిన : యాహూ ........... నాకైతే హీరోలా వచ్చి రింగు తో ప్రపోజ్ చేసాడు , ఒప్పేసుకున్నా బాగుండేది అని తియ్యదనంతో నవ్వుతూ నా చేతిని అందుకుని ముద్దుపెట్టారు .
హీరోనే కదా వదినలూ .......... అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ వెనక్కుతిరిగాను .

వదినమ్మ - వదినలు .......... ముందుకువచ్చి , రింగు కంటే costly అన్నమాట , ముందుగా మేము చూడాల్సిందే ...........
లవ్ టు లవ్ టు లవ్ టు వదినమ్మా - వదినలూ .......... అని నేలపై ఉన్న బ్యాగులోనుండి జ్యూవెలరీ బాక్సస్ అన్నింటినీ అందుకుని , మొదట నా మొదటి దేవతకు అంటూ వదినమ్మకు ...........
వదినమ్మ : నో నో నో ........ బేబీ , మా అమ్మే ..........
అమ్మ : తల్లీ ఇందు ........... కన్నయ్య మొదటి దేవతే కాదు మా అందరి ప్రాణమైన దేవత నువ్వే ........... అంటూ ముగ్గురూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని , వదినమ్మ ఆనందబాస్పాలను తుడిచి ముగ్గురూ గిఫ్ట్ అందించారు . ( అందరి ప్రాణమైన దేవత ఎలా అయ్యారో రాబోవు updates లో ) .
దేవతమ్మ : లవ్ యు అమ్మా - లవ్ యు చెల్లెళ్ళూ .......... అంటూ నావైపు ఎంత ప్రేమ ప్రాణం ఆరాధనతో చూసి ఉంటారో మీరే ఊహించుకోండి .
తెల్లారుతోంది నా బుజ్జితల్లులు - బుజ్జాయిలను చూడాలి ......... , నా రెండవ దేవత ...........
ముగ్గురూ : అమ్మకోసం అంటూ నా నుండి లాక్కుని అమ్మకు అందించారు . 
మూడవ దేవత కు ...........
ముగ్గురూ లాక్కుని అంహించారు 
చివరి దేవతకోసం ............
ముగ్గురూ లాక్కుని అందించి ముద్దులవర్షం కురిపించారు .

మూడవ వదిన జ్యూవెలరీ బాక్స్ అందుకుని ఆనందబాస్పాలతో లవ్ యు మహేష్ .......... , పెళ్ళైన తరువాత ప్రతీ ఆరు నెలలకూ నువ్వు ప్రేమతో ఇచ్చిన కానుకలను చూసుకుంటూ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు అని సంతోషంతో జీవిస్తున్నాము ......... ఈ ఆనందంలో సరిగ్గా చెప్పలేకపోయాను .
చెల్లీ చెల్లీ .......... అంటూ ఇద్దరూ కళ్ళల్లో చెమ్మతో కౌగిలించుకుని , లవ్ యు బేబీ - మహేష్ ........... అంటూ జ్యూవెలరీ బాక్సస్ ఓపెన్ చేసి చూసుకుని బ్యూటిఫుల్ లవ్లీ అంటూ మిరుమిట్లు గొలుపుతున్న కళ్ళతో అమ్మకు చూయించి ఆనందించారు.
ఒకరికొకరు కన్నీళ్లను తుడుచుకుని , అయినా చివరి దేవత మా చెల్లి కాదులే , కొత్త దేవతకోసం తీసుకొచ్చిన విలువైన కానుక చూయించు అని ఆర్డర్ వేశారు .

వదినమ్మా - వదినలూ .......... ఇప్పుడే చెబుతున్నాను , మీరు ఈర్ష్య అసూయలు చెందకూడదు ఎందుకంటే ఆ కానుకను బ్రిటన్ రాణి గారి కోసం లండన్ లోని కళాకారులందరూ రోజుల తరబడి కష్టపడి అత్యద్భుతమైన డిజైన్ ను సృష్టించారు. అదృష్టం కొద్దీ సరైన సమయానికి దానిని సొంతం చేసుకున్నాను ( అంటే మరొకటి కూడా అది నా దేవకన్యకోసం అని మనసులో అనుకున్నాను ) అని బ్యాగు నుండి అలా తీసానో లేదో ముగ్గురు దేవతలూ లాక్కున్నారు .
Like Reply
ఒకరితోమరొకరు పోటీపడిమరీ గిఫ్ట్ కవర్ ను చింపేసి ఆతృతతో ఎటువంటి అత్యద్భుతమో తిలకించాలని బాక్స్ ఓపెన్ చేశారు . 
అంతే వదినమ్మ - వదినల కళ్ళు జిగేళ్లుమన్నట్లు - ప్రక్కనే అంతే ఆతృతతో తొంగి తొంగి చూస్తున్న అమ్మ .......... నలుగురూ ఫ్లాట్ అయిపోయినట్లు , కన్నార్పకుండా జ్యూవెలరీనే చూస్తూ తమని తాము మైమరిచిపోయినట్లు కిందకు పడిపోబోతుంటే,
వెంటనే వెనక్కుచేరి జాగ్రత్తగా పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ వదినమ్మా - వదినలూ - అమ్మా ........ చెప్పానా చెబితే మీరు నమ్మలేదు ..........

దేవతలు నలుగురూ .......... తమాయించుకుని నిలబడి తియ్యనికోపాలతో నావైపుకు తిరిగి మధురాతిమధురమైన ఈర్ష్య అసూయలతో చూస్తున్నారు .
నవ్వుని ఎంత ఆపుకున్నా నా వల్ల కాకపోవడంతో నా దేవతలవైపు ఏమాత్రం చూడకుండా దిక్కులను చూస్తూ అదీ ఇదీ అటువైపు ఇటువైపు అని ..........
దేవతలకు మరింత కోపం వచ్చేసి , ఛాతీపై - రెండువైపులా భుజాలపై - వీపుపై ప్రేమదెబ్బలు వేస్తున్నారు . 

అంతలో ఎయిర్పోర్ట్ లేడీ సెక్యూరిటీ వచ్చి , ఎస్క్యూస్ మీ మేడమ్స్ .......... అతడు మీతో ఏమైనా మిస్ బిహేవ్ చేశాడా చెప్పండి , లోపలకువేసి మక్కెలు ఇరగ్గొడతాము .
దేవతలు నవ్వుకుని , అంతకంటే పెద్ద తప్పే చేసాడు మేడం .............
లేడీ సెక్యూరిటీ : అలర్ట్ అలర్ట్ సెక్యూరిటీ సెక్యూరిటీ .......... ఈవ్ టీజర్ ఈవ్ టీజర్ at గేట్ నెంబర్ 2 అని వైర్ లెస్ లో చెప్పి నా కాలర్ పట్టుకోబోయారు . 

అంతే దేవతలు నలుగురూ ........... నన్ను చుట్టేసి సెక్యూరిటీ నుండి కంచె లా నిలబడ్డారు . మా ప్రాణం కంటే ఎక్కువ మేడం ........ అని బుగ్గలపై - భుజాలపై ముద్దులుపెట్టారు - పెద్ద తప్పు అంటే మా ఫ్యామిలీలో పెద్ద తప్పు చేసాడు - మా చెల్లికి అత్యద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి మా నలుగురికీ ఆర్డినరీ గిఫ్ట్స్ ఇచ్చారు .
లేడీ సెక్యూరిటీ : ప్రాబ్లమ్ solved , i రిపీట్ ప్రాబ్లమ్ solved ............ , అయితే అది పెద్ద తప్పు మేడమ్స్ , శిక్ష పడాల్సిందే మీరు కానివ్వండి ఎవరు అడ్డువస్తారో నేను చూస్తాను all the best అనిచెప్పి నవ్వుతూ వెళ్లిపోయారు .
దేవతలందరూ ముసిముసినవ్వులు నవ్వుకుని మళ్లీ అలానే ముద్దులుపెట్టి , మా బ్యూటిఫుల్ చెల్లి - నా కొత్త కోడలు కాదు కాదు తల్లి అదృష్టవంతురాలు అని నా చేతిని చుట్టేసి బయటకు అడుగులువేశారు . వదిన బ్యాగును వారి భుజం పై వేసుకున్నారు .
నలుగురూ .......... ఒకేసారి ఆగి , మరి నీ బుజ్జితల్లులకు - బుజ్జాయిలకు ..........
దేవతలూ ........... గోవా వదిలి మళ్లీ మామూలుగా వెళ్లగలనా ? .
దేవతలు : అవునవును నిజమే , వాళ్లకు గిఫ్ట్స్ తీసుకురాకపోతే వీల్ చైర్లో లండన్ వెళ్ళాల్సివస్తుంది అని నవ్వుతూనే ఉన్నారు . 
దేవతలూ .......... నా బుజ్జి డెవిల్స్ కోసం అంటూ వెహికల్ పై ఉన్న కంటైనర్ వైపు చూయించాను .
అమ్మో అమ్మో ......... అంటూ నోరెళ్ళబెట్టి చూసి , నాపై దెబ్బల వర్షం కురిపించారు - అంతేలే మాకంటే బుజ్జి దెయ్యాలంటేనే ప్రాణం నీకు , మాకేమో ఒకొక్క గిఫ్ట్ వాళ్లకేమో కంటైనర్ కంటైనర్ మొత్తం , లవ్ యు లవ్ యు బేబీ - కన్నయ్యా - మహేష్ .......... అంటూ సంతోషంతో పొంగిపోతున్నారు .

క్యాబ్స్ వైపు విజిల్ వేసాను . రాగానే స్వయంగా డోర్ తెరిచి మొదటి క్యాబ్ లో అమ్మ - వదినలిద్దరినీ , ఎయిర్పోర్ట్ వెహికల్ ను ఫాలో అవ్వమనిచెప్పి వెనుక క్యాబ్ లో వదినమ్మతోపాటు కూర్చున్నాను .
ఒక్కనిమిషం ఒక్కనిమిషం అని వదినమ్మ కిందకుదిగి ఎయిర్పోర్ట్ లోపలికివెళ్లారు , వదినమ్మా .......... జాగ్రత్త అని వెనుకే వెళ్ళాను .
ఎయిర్పోర్ట్ లోని గిఫ్ట్ షాప్ చేరుకుని గిఫ్ట్ కవర్ మరియు లైవ్లీ రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నారు . నా ప్యాంట్ జేబులోనుండి పర్స్ అందుకుని పే చేశారు . అన్నింటినీ నా చేతులకు అందించి , నా బేబీ చివరగా చివరి దేవతకు ప్రపోజ్ చెయ్యబోతున్నాడు - గిఫ్ట్ ఎంత అద్భుతమో అంతే అద్భుతంగా ఉండాలి అని నా చేతిని చుట్టేసి నడిపించారు .
లవ్ యు sooooooo మచ్ వదినమ్మా ........... , వదినమ్మా .......... చిన్న వదినకు కోపం వస్తుందేమో - కొడతారేమో ........... అని ఒకచేతితో గిఫ్ట్ మరొకచేతితో చెంపను మూసుకున్నాను . 
వదినమ్మ : నా హీరోలాంటి బేబీ ప్రపోజ్ చేస్తే ఎవ్వరైనా ఫ్లాట్ అవ్వడమే కానీ ............
అంటే ............
వదినమ్మ : ఇప్పుడవన్నీ గుర్తుచెయ్యకు ........... , నాకు .......... వద్దులే పద బేబీ అని నా భుజం పై కొరికేసి నావైపే చూస్తూ బయటకు వచ్చి క్యాబ్ లో ఎక్కాము .

ముందు అమ్మ వదినలు , వెనుక మేము మా వెనుక బుజ్జాయిల గిఫ్ట్ వెహికల్ ఫాలో అయ్యాయి హోటల్ వైపు .
వదినమ్మ : నా చేతిలోనివన్నింటినీ అందుకుని , కొత్త వదిన కోసం తీసుకొచ్చిన జ్యూవెలరీ బాక్స్ ను అందంగా గిఫ్ట్ కవర్ తో రెడీ చేస్తున్నారు . బేబీ ......... ఇలా చెబుతున్నానని ఫీల్ అవ్వకూడదు .
వదినమ్మ మాటలకు ఫీల్ అవ్వడమా , నోవే నోవే ........... అంటూ చిరునవ్వులు చిందిస్తూ వదినమ్మవైపుకు తిరిగి కూర్చున్నాను .
వదినమ్మ : మా కొత్త చెల్లిని చూడగానే అందరితోపాటు నేనుకూడా ఫ్లాట్ అయిపోయి జీవితంలో ఎప్పుడూ లేనంతలా ఈర్ష్య - అసూయలకు లోనయ్యాను . ఎవరికోసమో కానీ దివి నుండి నేరుగా దిగివచ్చిన దేవకన్య తెలుసా .......... ఆ అందం చందం మంచితనం , ముత్యాలు రాలుతున్నాయా అన్నట్లు చిరునవ్వు , సరిగమలు పలుకులు .............. 
వదినమ్మా ..............
వదినమ్మ : కళ్ళల్లో చెమ్మతో , అయితే నేను చెప్పను అని అటువైపుకు తిరిగారు .
అమ్మా అమ్మా అమ్మా ........... లవ్ యు లవ్ యు లవ్ యు చెప్పండి చెప్పండి అని చెవులను చేతులతో పట్టుకున్నాను . 
వదినమ్మ : చెవులుపట్టుకుని గుంజీలు తియ్యడం మాత్రం బాగా నేర్చుకున్నావు అని అందమైన నవ్వులతో నా చేతులను తీసేసి , బుగ్గలను ప్రాణంలా అందుకున్నారు . నేను చెప్పేది పూర్తిగా విన్న తరువాత నీ ఇష్టం - నా బేబీ ఇష్టమే నా ఇష్టం .
సరే అన్నట్లు తలఊపాను .
వదినమ్మ : తియ్యని నవ్వులతో ఉమ్మా ....... అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి నావైపుకు తిరిగి గిఫ్ట్ రెడీ చేస్తూనే మాట్లాడారు .
అమ్మా .......... గిఫ్ట్ ను హోటల్ కు వెళ్ళాక రెడీ చెయ్యొచ్చు అని వదినమ్మ చేతులను నా రెండుచేతులతో అందుకుని నా బుగ్గలపై వేసుకున్నాను .
వదినమ్మ సంతోషపు నవ్వులు ఆగడం లేదు .
తొలిసారి నా బుజ్జిబుగ్గలపై వేసిన తియ్యని జ్ఞాపకం వచ్చింది కదా అమ్మా ........ , నాకు కూడా అని వదినమ్మ చేతులపై ముద్దులుపెట్టాను .

వదినమ్మ : ఆనందబాస్పాలతో నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , అప్పుడు నా బుజ్జి బేబీ ముద్దొచ్చే బుగ్గలు నా సగం చేతులలో ఇమిడిపోయేవి - కానీ ఇప్పుడు రెండుచేతులూ చాలడం లేదు ..........
నా త .........
వదినమ్మ : నా బేబీ తప్పు లేదంటావు , తప్పంతా నాదే అని ఇద్దరమూ చిరునవ్వులు చిందించాము . 
పో వదినమ్మా .......... అప్పుడే మేలు క్షణానికి వంద ముద్దులు పెట్టేవారు ..........
వదినమ్మ : ( ఆ రోజులు మళ్లీ రావాలని నీ కంటే ఎక్కువగా ఆశపడుతున్నాను బేబీ) ...........
వదినమ్మా ..............
వదినమ్మ : పెదాలపై చిరునవ్వులతో బుగ్గలను ప్రేమతో స్పృశిస్తూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . బేబీ ........... నాకు తెలుసు నీ హృదయంలో " నా చెల్లి - కోడలు - తల్లి మహి " గూడు కట్టుకున్నది అని - నాతల్లి మహి నా బేబీ చెంతకు చేరాలని నేను ప్రార్థించని రోజంటూ లేదు .
నాకు తెలుసు అమ్మా ...........
వదినమ్మ : ష్ ష్ ............ , 
అంతే నోటికి తాళం వేసేసాము .
వదినమ్మ : నా బంగారం అంటూ నవ్వుకుని , బేబీ ........... నా చెల్లెలు " హిమ " కోసమే తల్లి " మహి " నీకు ఇప్పటివరకూ కనిపించలేదేమో ........... , 
అమ్మా .......... అని చెప్పబోయి ఆగిపోయాను .
వదినమ్మ : నాకు తల్లి మహి అంటే కూడా ప్రాణం - ఎంత అంటే నా బేబీ అంత ఎందుకంటే నా బేబీ ప్రతీ రాత్రినీ మనోహరమైన లోకాలకు తీసుకెళ్లి మాధుర్యాన్ని పంచుతుంది - లవ్ యు మహి తల్లీ ............, డైరెక్ట్ గా చెబుతున్నాను " తల్లి మహికి " రూపం ఉంటే ఖచ్చితంగా " చెల్లి హిమ " లానే ఉంటుంది . నా చెల్లి కంటే అందమైన ఏంజెల్ ఈ భువిపైనే ఉండదు - please please please .......... బేబీ మా ప్రియమైన అందాలరాశిని ఆ తాగుబోతు సొంతం కానివ్వకు ............. , నా బేబీ హీరో .......... హీరోకు " మహి - హిమ " ఇద్దరు దేవకన్యలు ఉండటం ఏమాత్రం తప్పుకాదు - ఎవరైనా ఏమైనా అంటే మేము చూసుకుంటాము అని ప్రాణంలా బ్రతిమాలారు .

వదినమ్మా .......... మీ మాటలలో ఎటువంటి తప్పూ లేదు . ఇప్పటికే అన్నయ్యలకు నేనంటే ఇష్టం లేదు - పెళ్లిరోజు మనం కానీ ఇలా చేస్తే అన్నదమ్ముల యుద్ధం ........... , ఆ కోపంలో మా వదినమ్మ - వదినలను ఇంటి నుండి తీసుకెళితే .............
అంతే వదినమ్మ వదలనంతలా నా చేతిని చుట్టేసి కన్నీళ్లు కారుస్తున్నారు . లేదు లేదు అమ్మా .......... అని కన్నీళ్లను తుడిచి , అమ్మా ........... నిన్న రాత్రి ఫ్లైట్ నిద్రలో మీ ముద్దుల తల్లి మహి మీరు చెప్పినట్లుగానే నేరుగా దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా సాక్షాత్కరించింది .
వదినమ్మ : కన్నీళ్లను తుడుచుకుని , అంతులేని ఆనందంతో ఏదీ నా " కోడలు తల్లి" ఎక్కడ ఎక్కడ డ్రా చేసి ఉంటావు కదా వెంటనే చూడాలి చూయించు అని ప్రాణంలా అడిగారు .
లవ్ టు లవ్ టు అమ్మా ........... బ్యాగులో ఉంది . బ్యాగ్ బ్యాగ్ ........... లవ్ యు అమ్మా బ్యాగు వదినతో ముందు కారులో ఉంది - కారు ఆపితే అమ్మ - వదినలకు తెలిసిపోతుంది - మొదటగా నా ఏంజెల్ ను మా వదినమ్మ చూసిన తరువాతనే అందరూ చూడాలి .
వదినమ్మ : సంతోషంతో పరవశించిపోయి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బేబీ ............ , సరే అయితే హోటల్ కు వెళ్ళాక చూస్తాను - నా మహి తల్లి ఎలా ఉంటుందో చెప్పు నాకు తెలిసి " మా చెల్లి హిమ " కంటే అందాలరాశి అయిఉంటుంది చెప్పు చెప్పు అని ఆతృతతో అడిగారు .

లవ్ టు లవ్ టు అమ్మా .......... అంతకంటే అదృష్టమా అని సిగ్గుపడిపోయాను .
వదినమ్మ గిలిగింతలు పెట్టి నవ్వుకున్నారు - బేబీ ........... మొదట నుండీ మొత్తం చెప్పాలి , నా మహి తల్లి ఎలా నా బేబీ ముందుకు వచ్చింది - ఎలా సాక్షాత్కరించింది .

" శూన్యం - ............ మొదలెట్టి నా దేవకన్య మహి నా పాదాలపైకెక్కి ముసుగును తొలగించి అందమైన కళ్ళతోనే గుండెల్లో తియ్యని బాణాలను గుచ్చేస్తూ ముద్దుపెట్టిమరీ ప్రేమను వ్యక్తపరిచేంతవరకూ " ......... వదినమ్మ కళ్ళముందు జరుగుతుందా అన్నట్లు వివరించాను .
వదినమ్మ : wow బ్యూటిఫుల్ లవ్లీ ........... లవ్ యు లవ్ యు sooooooo మచ్ మహీతల్లీ అని పరవశించిపోయారు - వెంటనే తియ్యనికోపంతో నీ హైట్ తో నా తల్లిని కూడా ఇబ్బందిపెట్టావన్నమాట అని కొట్టబోయి లవ్ యు లవ్ యు ....... ఆ ఆ తప్పంతా నాదేలే అంటూ నవ్వుకున్నారు . 
లవ్ యు sooooooo మచ్ వదినమ్మా ........... ఇప్పటివరకూ ఎలా ప్రత్యక్షము అయ్యిందో చెప్పాను - ఇప్పుడు మీ ముద్దుల తల్లి ఎలా ఉందో చెబుతాను . అప్పుడు అప్పుడు చెప్పండి " మీ తల్లి మహి అందాలరాశినో - మీ చెల్లి హిమ అందాలరాశినో " ............

నా దేవకన్య మహి - ఏంజెల్ మహి - డ్రీమ్ గర్ల్ మహి ............
వదినమ్మ : మూడింటి మీనింగ్ ఒక్కటే కదా బేబీ .......... ఒకసారి చెప్పొచ్చుకదా అని ముసిముసినవ్వులు ..........
వదినమ్మా ............
వదినమ్మ : లవ్ యు లవ్ యు ...........

" భువికి దిగివచ్చిన దేవకన్య మహి " 
వదినమ్మ : మా చెల్లి హిమ కూడా ............
 " నెమలి హంస లాంటి నడక " 
వదినమ్మ : రాత్రి చూసాము మా హిమ నడకను అచ్చు అలానే అయిఉంటుంది .
" నుదుటన భానుడు ఉదయించేలా సౌందర్యమైన బొట్టు - కలువ రేకులలాంటి కన్నులు " 
వదినమ్మ : చూసాము చూసాము అచ్చు అలానే హిమలో చూసాము బేబీ ........
" చూడముచ్చటైన బూరెల లాంటి బుగ్గలు - చిన్న చిరునవ్వుకే సొట్టపడే బుగ్గలు కైరవాలు విచ్చుకున్నట్లు " 
వదినమ్మ : ఆఅహ్హ్ ........... చెల్లీ హిమ , ఉమ్మా ఉమ్మా .......... అలానే చూసాము బేబీ .........
" తేనెలూరుతూ వెన్నెలలో ప్రకాశిస్తున్న అధరాలు " 
వదినమ్మ : గోవా ఎయిర్పోర్ట్ బయటకు రాగానే చంద్రుడి వెన్నెలలో మా చెల్లి హిమ పెదాలు ........... ఇంకా ఇంకా ..........
" నవరత్నాలు - ముత్యాలు రాలెను చిరుమందహాసాన " 
వదినమ్మ : అయ్యో ........... మన బుజ్జాయిలు ఫ్లైట్ లో దోసిల్లలో తీసుకొచ్చి చూయించారు . ఉమ్మా ఉమ్మా లవ్ యు హిమ చెల్లీ ..........
" రంభ ఊర్వశి మేనకలైనా తమ ఓటమిని వ్యక్తపరిచి తలదించుకునేంత అందం - సొగసు " 
వదినమ్మ : చూడకుండానే సరిగ్గా చెప్పావు బేబీ - అంటే నేను మా సౌందర్యారాశి హిమ గురించి చెబుతున్నాములే కానివ్వు . " తల్లి మహి - చెల్లి హిమ " కవలలేమో ............
" మహి అందానికి పున్నమి వెన్నెల జాబిలి సైతం మబ్బు చాటుకు చేరిపోతుంది - చుక్కలు సిగ్గు ఈర్ష్య అసూయలతో మాయమైపోతాయి - కోటి దివ్వెలు కాంతుల వెలుగులు మహి ముఖారవిందాన " 
వదినమ్మ : బేబీ ........... నేను చెబితే అతిశయోక్తి అవుతుంది కానీ నిజం . " మహి - హిమ " ట్విన్స్ అయిఉంటారు లేకపోతే ఏమిటి , నా బేబీ మాటల్లో వ్యక్తపరిచిన ప్రతీ సౌందర్యాన్నీ చెల్లి హిమలో చూసాము . నేను చెబితే నువ్వు నమ్మవులే చూస్తే నీకే తెలుస్తుంది కమాన్ కమాన్ తొందరగా హోటల్ కు చేరుకోవాలి ........ , బేబీ ........ అదిగో వచ్చేసాము అని దూరం నుండే గోవా లోని బెస్ట్ luxurious హోటల్ వైపు చూయించారు .

WOw .......... , అమ్మా ......... ముందు మన బుజ్జితల్లులు - బుజ్జాయిలు ఏ ఫ్లోర్లో ఏ రూంలో ఉన్నారో చెప్పండి . 
వదినమ్మ : రూమ్ - ఫ్లోర్ ........ ఏంటి బేబీ , మావయ్య గారు టోటల్ హోటల్ నే బుక్ చేసేసారు . టాప్ ఫ్లోర్లో ఉన్న బ్యూటిఫుల్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ - ప్రస్తుతానికి మన బుజ్జాయిలు సెకండ్ ఫ్లోర్లో హాయిగా నిద్రపోతుంటారు - సమయం అయ్యింది కదా లేచి ఫ్రెష్ అవుతుంటారు .
టోటల్ హోటల్ ......... లవ్ యు నాన్న గారూ .......... 
లోపలికి చేరుకోగానే అదిగో మావయ్యగారు ......... నా బేబీ కోసం బయటే ఎదురుచూస్తున్నారు - వెళ్ళు నేను మా అమ్మ - చెల్లెళ్లతో వస్తాను అని భుజం పై ప్రాణమైన ముద్దుపెట్టారు - పర్స్ ఇవ్వు క్యాబ్ ఫేర్ .........
లవ్ యు అమ్మా ........... అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , ముందు కార్లో వదిన నుండి బ్యాగు అందుకుని నాన్న దగ్గరికి పరుగుతీసాను .

Dad : my only son who made me proud ........... welcome welcome .
Dad అంటూ పాదాలను స్పృశించి కౌగిలించుకున్నాను . 
Dad : 10 డేస్ లో మొత్తం మొత్తం నా కొడుకుకు హ్యాండ్ వోవర్ చేసి హాయిగా హాయిగా అమెరికాలో రెస్ట్ తీసుకుంటాను .
Dad .......... ఈ సంతోష సమయంలో .........
Dad : ok ok ..........
నాన్నగారూ ......... మ్యారేజ్ అంటే ఎన్ని పనులుంటాయి , మీ ప్రక్కనే ఉండాల్సింది. Sorry dad ...........
Dad : బాధపడి , నో నో నో my son ఇలాంటి మ్యారేజ్ జరిపిస్తామని కలలో కూడా అనుకోలేదు - బంధువులు ఫ్రెండ్స్ తో అంగరంగవైభవంతో జరగాల్సిన పెళ్లిని ఎవ్వరికీ తెలియకుండా చేయాల్సివస్తోంది - మొత్తం మన మేనేజర్స్ చూసుకున్నారు , వాళ్ళను కూడా పంపించేసాను - ఎంత త్వరగా పెళ్లి అయిపోతే బాగుండు అనిపిస్తోంది - మీ అన్నయ్యలే కాదు పెళ్ళికొడుకు కూడా పెళ్లిరోజు అనికూడా ఇప్పటివరకూ తాగుడు జూదాలతో గడిపి ఇప్పుడే వచ్చారు - తాగిన మత్తులో తాళికట్టబోతున్నాడు ఈ దరిద్రాన్ని మనం తప్ప ఎవరూ చూడకూడదనే అందరినీ పంపించేసాను - పెల్లవ్వగానే బయలుదేరడమే ............
నాన్నగారితోపాటు బాధపడి , పెళ్లయ్యాక ఖచ్చితంగా మారుతాడు డాడీ .......... 
Dad : ఆ చిన్న ఆశతోనే వాడు పెళ్లి వద్దు అన్నా చేస్తున్నాను .
Thats good dad .......... మీకోసం స్మాల్ గిఫ్ట్ అని బ్యాగులోనుండి తీసిచ్చాను .
నాన్నగారు చిరునవ్వులు చిందిస్తూ తీసి చూసి wow rolex ......... థాంక్స్ మై son అని చేతికి కట్టుకున్నారు .
చప్పట్లు వినిపించడంతో చూస్తే అమ్మ - వదినమ్మ - వదినలు ........... 

సంతోషించి , హోటల్ సిబ్బందిని పిలిచి మొత్తం కంటైనర్ లోని గిఫ్ట్స్ ను సెకండ్ ఫ్లోర్ కు చేర్చమని చెప్పాను .
Dad : మహేష్ .......... మొత్తం మొత్తం బుజ్జాయిలకేనా , మోసం మోసం .......... సరే ఏమిచేస్తాం దగ్గరుండి నేనే స్వయంగా పైకి చేరేలా చూస్తాను .
థాంక్స్ dad ............
వదినలు : అవును మావయ్యగారూ .......... , మాకు కూడా ఒక్కొక్క గిఫ్ట్ మాత్రమే ప్రతీసారిలా ............. అని నన్నుకొట్టారు .
నవ్వుకుని దేవతలతోపాటు లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాను . వదినమ్మా - వదినలూ ........... మన బుజ్జాయిలు ఏ రూంలో ఉన్నారో మీరు చెప్పకండి నేనే .......... అంటూ ఒక్కొక్క రూమ్ దాటుకుంటూ నడిచాను .

సరిగ్గా మధ్యలో హాల్ దగ్గర నా అడుగులు ఆగాయి . హాల్ ఎదురుగా ఉన్న గదివైపు తిరుగగానే బుజ్జితల్లులు - బుజ్జాయిలు లోపల ఉన్నట్లు నా హృదయం తెలిపింది . లవ్ యు మై హార్ట్ అని గుండెలపై ఒక చేతినివేసుకుని , వదినలూ - వదినమ్మా .......... అంటూ మరొకచేతితో ఇక్కడే అని చూయించాను .
ముగ్గురూ .......... నా చేతులను చుట్టేసి సూపర్ అంటూ బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . మహేష్ .......... వెళ్లి .........
నో నో నో వదినలూ ........... బుజ్జాయిలను డిస్టర్బ్ అనేంతలో , గది తలుపు తెరుచుకుంది . వెంటనే వదినమ్మ - వదినల వెనుకకు చేరి తొంగి తొంగి చూసాను . అమ్మకూడా వచ్చి నన్ను దాచేశారు - మా వెనుక హోటల్ సిబ్బంది గిఫ్ట్స్ ను జాగ్రత్తగా ఒకదానిపై మరొకటి పేర్చుతున్నారు .
Like Reply
మొదట బుజ్జాయిలు - వెనుకే బుజ్జితల్లులు తొంగిచూసి అమ్మలూ - నానమ్మా ........... ఎక్కడ ఎక్కడ డాడీ - నాన్న ఎక్కడ అని ఆతృత ఉత్సాహం హుషారు సర్ప్రైజ్ తో అడిగారు .
దేవతలు : మీ ప్రియమైన డాడీ - నాన్న ........ ఇక్కడ ఎందుకు ఉంటారు - లండన్ లో ఉంటారు . మీ బుజ్జి హృదయాలు తెలిపాయా ? - మేము మీ గది ముందుకు వచ్చాము కదా మా వలన అలా జరిగి ఉంటుంది .
బుజ్జాయిలు - బుజ్జితల్లులు : వదినమ్మను ........ అమ్మ అని - తమ అమ్మలను ......... పిన్నమ్మా చిన్ని పిన్నమ్మా అని పిలిచి , మీకు అంత సీన్ లేదుకానీ చెప్పండి మా డాడీ - నాన్న ఎక్కడ ? . అయినా మా బుజ్జి హార్ట్స్ కొట్టుకుంటున్నాయని మీకెలా తెలిసింది - దొరికిపోయారులే ............ డాడీ డాడీ నాన్న నాన్న అని ప్రాణం కంటే ఎక్కువగా పిలిచారు .
దొరికిపోయాను - బుజ్జితల్లులు బుజ్జాయిలు tooooooo ఇంటెలిజెంట్ అని చిరునవ్వులు చిందిస్తూ బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ అని అంతే ప్రాణంలా పిలిచాను . 

అంతే అంతులేని ఆనందంతో , దేవతలను రెండుగా వేరుచేసేసి డాడీ - నాన్న ....... అంటూ మోకాళ్లపై కూర్చున్న నా గుండెలపైకి చేరిపోయి లవ్ యు లవ్ యు అంటూ ముద్దులవర్షం కురిపించారు . 
లవ్ యు లవ్ యు sooooooo మచ్ , మిమ్మల్ని చూసేంతవరకూ కూడా నా ప్రాణం ప్రాణంలా లేదు బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ ........... ఆఅహ్హ్ .......... అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని పరవశించిపోయాను . గంటలముందే వచ్చాను బుజ్జాయిలూ .......... అదిగో మీ అమ్మ - పిన్నమ్మల వలన ఆలస్యం అయిపోయింది . నా బుజ్జాయిల దగ్గరికి వెళ్ళాలి అని పదే పదే చెప్పినా గిఫ్ట్స్ గిఫ్ట్స్ అని ఆలస్యం చేశారు . 
తియ్యనికోపంతో చూస్తున్న దేవతలను చూసి నవ్వుకున్నాను - బుజ్జాయిలు బుజ్జితల్లులు ......... బుజ్జి వేళ్ళతో వార్నింగ్ ఇచ్చారు - మేము మా డాడీ అంతే మధ్యలో ఎవరైనా వచ్చారో ఫసక్ ..........
Yes బుజ్జాయిలూ ......... ఫసక్ అని నవ్వుకున్నాము . 

డాడీ ......... గిఫ్ట్స్ ? .
లవ్ టు లవ్ టు .......... అని లేచి వెనుక అంతెత్తువరకూ పేర్చిన గిఫ్ట్స్ చూయించాను .
యాహూ యాహూ ........... లవ్ యు లవ్ యు soooooooo మచ్ డాడీ - నాన్న అంటూ హోటల్ మొత్తం వినిపించేలా సంతోషంతో కేకలువేసి ముద్దులవర్షం కురిపించారు . పరుగున వెళ్లి బుజ్జిచేతులను విశాలంగా చాపి మా డాడీ తెచ్చిన గిఫ్ట్స్ అని చుట్టేసి మురిసిపోతున్నారు .
ఒక్కసారిగా సైలెంట్ అయ్యి దేవతల వైపుకు తిరిగారు . నానమ్మా - అమ్మలూ ........... ఎన్ని అని అడిగారు ప్రతీసారీ లానే .........
దేవతలు బుంగమూతులు పెట్టుకుని ఓన్లీ వన్ అని వేళ్ళతో సైగ చేశారు .
బుజ్జాయిలు - బుజ్జితల్లులు ........... తెలిసిందా మా డాడీ - నాన్నకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో సో మా మధ్యకు రాకండి అని మళ్ళీ స్వీట్ వార్నింగ్ ఇచ్చి , లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ డాడీ - నాన్న అంటూ ముద్దులవర్షం కురిపించి తమ తమ ఎత్తులో ఉన్న ఒక్కొక్క గిఫ్ట్ అందుకుని ఓపెన్ చేసి wow wow టెడ్డీ బేర్స్ అంటూ ప్రాణంలా హత్తుకుని నా చుట్టూ చేరారు . తాతయ్యా తాతయ్యా ............ ఈ గిఫ్ట్స్ అన్నింటినీ జాగ్రత్తగా మన ఇంటికి చేర్చండి పెళ్ళైన తరువాత తీరికగా ఓపెన్ చేస్తూ ఎంజాయ్ చేస్తాము అని ఆర్డర్ వేశారు .
Dad చేతులుకట్టుకుని వొంగిమరీ అలాగే బుజ్జాయిలూ .......... అని బదులిచ్చి నవ్వుకున్నారు . హోటల్ సిబ్బందికి విషయం తెలపడంతో గిఫ్ట్స్ అన్నింటినీ తీసుకెళ్లారు . బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ......... రెండు గంటల్లో మ్యారేజ్ .
బుజ్జాయిలు : అలాగే తాతయ్యా ......... , డాడీ .......... ఇది కొత్త అమ్మ గది ప్రక్కనే మన గది - మీకోసం అమ్మలు బోలెడన్ని కొత్త డ్రెస్ లు , అమ్మలు కాదు మేము మేము సెలెక్ట్ చేసాము రండి అనిచెప్పారు . అమ్మలూ .......... మేము మా డాడీ దగ్గరే స్నానం చేస్తాము రెడీ అవుతాము బై బై ............
లవ్ యు బుజ్జాయిలూ అని అమాంతం ఎత్తుకుని , బుజ్జితల్లులూ ......... కమాన్ అంటూ సైగచేసి ఐదుగురమూ మా గదిలోకి చేరిపోయాము . బెడ్ పై పూర్తిగా కొత్తబట్టలు పరిచి ఉండటం చూసి లవ్ యు వదినమ్మా - వదినలూ .......... కాదు కాదు లవ్ యు బుజ్జాయిలూ ........ అని ముద్దులతో ముంచెత్తాను . వెంటనే డోర్స్ క్లోజ్ చేసేసి సిగ్గుపడుతూ అదీ అదీ ...........
బుజ్జితల్లులు : ఇంతలా సిగ్గుపడుతున్నారు - డోర్స్ క్లోజ్ చేశారు అంటే మా " మహి అమ్మ " ...........
అంతే మరింత సిగ్గుపడిపోయాను .
బుజ్జాయిలు : డాడీ .......... మహి అమ్మ కనిపించారా డ్రీమ్ లో .........
అవునవును అని తల ఊపాను .
బుజ్జాయిలు : డ్రా చేసిన చార్ట్ ఎక్కడ ? .
అయ్యో ........... బ్యాగ్ మీ తాతయ్య దగ్గర ఉండిపోయింది . 
పోండి డాడీ అంటూ బుగ్గలపై కొరికారు - నాన్నా ........ అంటూ ఛాతీపై కొట్టారు . మాకు మా " హిమ అమ్మలా " ఉంటే చాలు . చెప్పండి " మహి అమ్మ " గురించి ...........

తియ్యనైన సిగ్గుతో బుజ్జాయిలను ముద్దులతో ముంచెత్తుతూ సోఫాలో కూర్చున్నాను - బుజ్జితల్లులు మా ఎదురుగా మోకాళ్లపై కూర్చుని కన్నార్పకుండా చూస్తున్నారు . 
నా ఏంజెల్ మహి సౌందర్యం గురించి ఒక్కొక్కటిగా వివరించడం - బుజ్జితల్లులు బుజ్జాయిలు ........... వదినమ్మ లానే హిమ అమ్మ , హిమ అమ్మ ........ అంటూ పోల్చి చివరికి నమ్మలేరు డాడీ మీరు చెప్పినట్లుగానే ఉన్నారు " హిమ అమ్మ " అంత అందంగా ఉన్నారు . పెళ్లికి ముందు ఎలాగో ప్రపోజ్ చేస్తారు కదా అప్పుడు మీకే తెలుస్తుంది డాడీ ............ మహి అమ్మతోపాటు హిమ అమ్మ కూడా ..........
అక్కడితో ఆపేసి , బుజ్జితల్లులూ .......... సమయం లేదు ఫస్ట్ మీరు ఫ్రెష్ అవ్వండి ఆ తరువాత మేము ముగ్గురం కలిసి ఫ్రెష్ అవుతాము .
లవ్ యు నాన్న - డాడీ అంటూ నలుగురూ సంతోషంతో ముద్దులుపెట్టారు . బుజ్జితల్లులిద్దరూ .......... టవల్ - కొత్త డ్రెస్సెస్ అందుకుని చెరొక బాత్రూమ్లోకి వెళ్లారు .

బుజ్జాయిలు : డాడీ డాడీ .......... అమ్మావాళ్లకు - నానమ్మకు తాతయ్యకు - మాకు గిఫ్ట్స్ తీసుకొచ్చారు మరి హిమ అమ్మకు ? .
మీ హిమ అమ్మకు కూడా తీసుకొచ్చాను బుజ్జాయిలూ ........... , మీ ఇందు అమ్మ దగ్గర ఉంది . 
బుజ్జాయిలు : ఇందు అమ్మ అని చెప్పాల్సిన అవసరం లేదు డాడీ ........... 
లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ .......... అని ఆనందబాస్పాలతో చెవులను పట్టుకోవడం చూసి నవ్వుకున్నారు .
బుజ్జాయిలు : అమ్మతో ఉన్న గిఫ్ట్ తో హిమ అమ్మకు ప్రపోజ్ చెయ్యబోతున్నారన్నమాట లవ్ యు లవ్ యు అని గట్టిగా ముద్దులుపెట్టి , మా హిమ అమ్మకు ప్రపోజ్ అంటే మామూలు విషయం కాదు - పిన్నమ్మలకులా గులాబీ పువ్వు , రింగు సరిపోదు అమూల్యమైనదిగా ఉండాలి మా హిమ అమ్మ అందంలా ..............
Yes yes ........... మీ కోరిక తీరబోతోంది బుజ్జాయిలూ , మీ అమ్మలూ - నానమ్మ చూసి ఈర్ష్య అసూయలకు లోనయ్యారు .
బుజ్జాయిలు : అయితే పర్ఫెక్ట్ డాడీ అని ముద్దులుపెట్టారు . మరి మా సంధ్య అక్కయ్యకు - బిస్వాస్ అన్నయ్యకు - బామ్మ గారికి .............
లవ్ యు బుజ్జాయిలూ ........... నాకు తెలియదు కదా ? .
బుజ్జాయిలు : బాధపడకండి డాడీ .......... ఇంటికి వెళ్ళాక మా గిఫ్ట్స్ ఇస్తాములే .........
లవ్ యు లవ్ యు ........ మా బుజ్జాయిలు బంగారం అని ప్రాణం కంటే ఎక్కువగా చుట్టేసి ముద్దులతో ముంచెత్తి , నేను మహి గురించి - బుజ్జాయిలు హిమ గారి గురించి ఒకేలా మాట్లాడుతూ ఆనందిస్తున్నాము .

అంతలో నాన్న - నాన్న ........... we are finished అని బుజ్జితల్లులు పట్టు పరికిణీలలో వచ్చి ఎలా ఉన్నాము నాన్న - నాన్న అని చుట్టూ తిరిగి చూయించారు.
బ్యూటిఫుల్ - లవ్లీ ........... అక్కయ్యాలూ అని బుజ్జాయిలు కిందకుదిగి చెప్పారు .
Yes yes .......... బుజ్జి దేవతల్లా ఉన్నారు బుజ్జితల్లులూ అని బుగ్గలను అందుకోబోయి ఆగిపోయాను .
బుజ్జితల్లులిద్దరూ .......... ప్రాణంలా చుట్టేసి , మా నాన్న - నాన్న ఎలా ఉన్నా మాకు ok త్వరగా త్వరగా ముద్దుతో దిష్టి చుక్కలు పెట్టండి .
లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జితల్లులూ .......... అని ఇద్దరి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను . 
చిరునవ్వులు చిందించి ఇప్పుడు ఇప్పుడు మరింత బ్యూటిఫుల్ గా ఉంటాము అని పరుగునవెళ్లి అద్దం లో చూసుకుని మురిసి లవ్ యు నాన్న అని పరుగునవచ్చి హత్తుకున్నారు . నాన్న - నాన్న .......... మా చెల్లెళ్లకు స్నానం చేయించి మాకు అప్పగిస్తే మాకంటే బ్యూటిఫుల్ బుజ్జి ఏంజెల్స్ లా రెడీ చేస్తాము . 
లవ్ టు లవ్ టు బుజ్జితల్లులూ ........... , బుజ్జాయిలూ ......... are you ready అనేంతలో , 
సోఫా ఎక్కి నా గుండెలపైకి చేరిపోయారు .

బుజ్జాయిలు : డాడీ - డాడీ .......... మీరు మాకు స్నానం చేయించి 6 నెలలయ్యింది. 
అవును బుజ్జాయిలూ ........... నేను రోజూ స్నానం చేసేటప్పుడు ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని నవ్వుతూ స్నానం చేస్తాను .
బుజ్జాయిలు : మేము కూడా డాడీ అని నా గుండెలపై నుండే సింక్ ఎత్తుపైకి చేరి నాకు పెద్ద బ్రష్ - వాళ్ళు బుజ్జి బ్రష్ లు అందుకుని పేస్ట్ అంటించి బ్రష్ చేసాము . కిందకుదిగి క్షణాలలో బట్టలన్నీ విప్పేసి బుజ్జాయి నవ్వులు నవ్వుతున్నారు . 
అమాంతం ఇద్దరినీ ఎత్తుకుని వెచ్చని షవర్ కింద తడిచేలా చేసి కిందకు దించాను . మొదట కురులకు షాంపూ ఆ వెంటనే వొళ్ళంతా సబ్బుతో సున్నితంగా రుద్ది షవర్ కింద స్నానం చేయించాను . 
చలికి వణుకుతున్న బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ బుజ్జి టవల్స్ అందుకుని మృదువుగా తుడిచి , బుజ్జితల్లులకు అందించాను . 
బుజ్జాయిలు : డాడీ ......... 15 మినిట్స్ అంతే ,
లవ్ యు బుజ్జాయిలూ ........... అమ్మో అప్పుడే 10 సెకన్స్ అని లోపలిచేరి బట్టలన్నీ విప్పేసి చక చకా స్నానం చేసి టవల్ చుట్టుకుని మరొక టవల్ తో వొళ్ళంతా తుడుచుంటూ పాటలు పాడుకుంటూ వచ్చాను . 

నా వాయిస్ విని బుజ్జితల్లులు .......... బుజ్జాయిలను తమ వెనుక దాచెయ్యడం చూసాను .
ఏయ్ బుజ్జిదొంగలూ ........... నేను చూడకూడదా ? , ఈ ఈ .......... అంటూ ఏడుపు నటించాను .
బుజ్జితల్లులు : డాడీ డాడీ ......... two మినిట్స్ two మినిట్స్ , బుజ్జాయిలకు ఫైనల్ టచ్ ఇవ్వాలి కళ్ళుమూసుకోండి .
అలా చెప్పండి అని వెనక్కుతిరిగి 120 119 118 ........... కౌంట్ చేస్తున్నాను .
బుజ్జితల్లులు : డాడీ ......... స్లో గా అని నవ్వుకోవడం వినిపించింది .
నా వల్ల కాక మరింత ఫాస్ట్ గా కౌంట్ చేసాను . 5 4 3 2 1 అంటూ కళ్ళుమూసుకునే బుజ్జితల్లులవైపుకు తిరిగాను . కళ్ళుతెరిచి చూస్తే బుజ్జితల్లులు మాత్రమే చిరునవ్వులు చిందిస్తున్నారు . 
డాడీ డాడీ ........ అంటూ నా వెనుక అని సైగచేశారు .
భౌ భౌ ......... అని బుజ్జాయిలు ,
అమ్మో ......... అంటూ వెనక్కు తిరిగిచూస్తే బార్బీ డ్రెస్ లలో బెడ్ పై బుజ్జి నవ్వులతో గెంతులేస్తున్నారు . స్నిగ్ధ బుజ్జి పెదాలపై స్వీట్ లిప్స్టిక్ ఉండటం చూసి సూపర్ అంటూ ఇద్దరినీ హత్తుకుని ముద్దులుపెట్టాను . బుజ్జితల్లులూ ......... భలేగా రెడీ చేశారు తొందరగా నా డ్రెస్ కూడా సెలెక్ట్ చేస్తే బోలెడన్ని సెల్ఫీలు తీసుకోవాలి నలుగురు బుజ్జి ఏంజెల్స్ తో ..........

బుజ్జాయిలు : మేము మేము అంటూ బెడ్ పై ఉన్న డ్రెస్ లన్నింటినీ స్కాన్ చేస్తున్నారు .
జాహ్నవి ఒకవైపు - వైష్ణవి ఒకవైపు ......... 1 2 3 ....... 6 7 8 నాన్న నాన్న 8 ప్యాక్స్ అని వీణలు మీటినట్లుగా స్పృశించారు .
బుజ్జితల్లులూ .......... గిలిగింతలు అని మెలికలు తిరిగిపోయి , సిగ్గుపడుతూ బెడ్ కు మరొకవైపు చేరుకున్నాను .
బుజ్జాయిలు : ఈ డ్రెస్ - వాచ్ - బెల్ట్ - షూస్ అని అందించి అటువైపుకు తిరిగారు .
తియ్యదనంతో నవ్వుకుని నిమిషాల్లో వేసుకుని , మొబైల్ పర్స్ హ్
జేబులో పెట్టుకుని బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ ...........
హ్యాండ్సమ్ డాడీ - నాన్న అంటూ నా గుండెలపైకి చేరిపోయారు . 
లవ్ యు అంటూ ముద్దులతో సెల్ఫీలు తీసుకుని , టైం అవుతోంది వెళదాము అని బుజ్జాయిలను ఎత్తుకున్నాను . బుజ్జితల్లులూ .......... 8 ప్యాక్స్ అని మీ అమ్మలు - నానమ్మకు చెప్పకండి అని ఎయిర్పోర్ట్ లో జరిగినది వివరించాను . 
నలుగురు : అయితే మేమే లక్కీ అన్నమాట , అలాగే నాన్న అంటూ సంతోషంతో బయటకువచ్చాము .

అప్పటికే వదినమ్మ గిఫ్ట్ తో - వదినలు - అమ్మ .......... దివి నుండి దిగివచ్చిన దేవతల్లా రెడీ అయ్యి మాకోసం ఎదురుచూస్తుండటం చూసి ఆనందించాము . 
దేవతలు నలుగురూ పట్టుచీరలలో నేను ప్రేమతో తెచ్చిన జ్యూవెలరీ వేసుకుని ఉండటం చూసి లవ్ యు చెప్పి పరవశించిపోయాను .
బుజ్జితల్లులు : నానమ్మా - అమ్మలూ ......... మీరే పెళ్లికూతుళ్ళల్లా రెడీ అయితే ఇక మా హిమ అమ్మ ఎలా ఉంటారో , నాన్న - డాడీ ........ గిఫ్ట్ తో రెడీగా ఉండండి లోపల situation చూసివస్తాము అని నా బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగారు . హిమ అమ్మా హిమ అమ్మా .......... అంటూ లోపలికి పరుగుతీశారు . 
Dad : జాగ్రత్త బుజ్జాయిలూ ........ అని నా బ్యాగు అందించారు . మహేష్ ....... గిఫ్ట్స్ ఉన్నట్లుగా ఉన్నాయి ఎవరికోసం ? .

అంతలో అన్నయ్యలు నలుగురూ తమ తమ రూమ్స్ నుండి బయటకువచ్చారు . Dad చెప్పినట్లుగానే ఇంకా మత్తులోనే ఉన్నారు . 
అన్నయ్యలూ .......... అంటూ వెళ్లి ఎలా ఉన్నారు అని పలకరించాను . నన్ను పట్టించుకోకుండా అడుగులువేశారు . అదేమీ నేను పట్టించుకోకుండా చిన్నన్నయ్య దగ్గరకు వెళ్లి కంగ్రాట్స్ అన్నయ్యా ......... అని చేతిని చాపాను .
చిన్నన్నయ్య : ఎందుకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నందుకా .......... , నన్ను మరింత బాధపెట్టడానికే అడుగుతున్నావు కదరా .......... , నీకు - నాన్నకు మేమంటే లోకువ అయ్యాము . పెళ్లిచేసి ఇంట్లో కట్టిపడేయాలని అనుకుంటున్నారేమో ........... నా అన్నయ్యలే నాకు ఆదర్శం నా లైఫ్ నా ఇష్టం - మా జీవితంలో ఎంజాయ్ తప్ప మరొకటి లేదు అని మత్తులో తుళ్ళిపడి పడిపోబోతుంటే పట్టుకున్నాను . రేయ్ నన్ను పెట్టుకోకు నాకేమైనా ఎక్కువ అయ్యింది అనుకున్నావా నేను స్టడీ అంటూ మళ్లీ మళ్లీ అలాగే పడబోతున్నాడు .
రెండవ అన్నయ్య : తమ్ముడూ ......... నేనున్నాను కదా నన్ను పట్టుకో , నాకూ అలానే ఉంది - ఈ పెళ్లి ఎవడు కనిపెట్టాడో ఏమో ముహూర్తం ఒకటి తమ్ముడూ ......... తొందరగా మూడు ముళ్ళు వేసేయ్ తరువాత సంగతి తరువాత గోవా బార్స్ మనకోసం ఎదురుచూస్తున్నాయి - గోవా లో పెళ్లి సెట్ చేసి ఇదొక్క మంచిపనిచేశాడు డాడీ అంటూ నవ్వుకున్నారు .

నలుగురి నుండీ గుప్పుమంటున్న మందువాసన - అయినా అన్నయ్యలంటే నాకు ఇష్టమే , పెద్దన్నయ్య దగ్గరకువెళ్లి అన్నయ్యలూ .......... మీకోసం ప్రేమతో గిఫ్ట్స్ తీసుకొచ్చాను .
పెద్దన్నయ్య : తమ్ముడూ ......... లండన్ మందే కదా ఇవ్వు పెళ్లిలోనే తాగుతూ ఎంజాయ్ చేద్దాము , తొందరగా ఇవ్వు - ఇవేంటి ఇంత చిన్నగా ఉన్నాయి అని ఓపెన్ చేసి చూస్తే rolex వాచస్ .......... , రేయ్ తమ్ముళ్లూ ......... మొబైల్ యుగంలో కూడా మన వేస్ట్ తమ్ముడు మనకోసం ఏమితీసుకొచ్చాడో చూడండి - ఇప్పుడు ఎవడైనా వాచ్ కట్టుకుంటున్నాడా అని హేళనగా నవ్వుకుంటున్నారు . 

అమ్మా నాన్న కోపంతో ముందుకు రాబోతే , చేతి సైగలతో ఆపాను . 
పెద్దన్నయ్య : ఏంటి తమ్ముడూ .......... వీటి బదులు చిన్న మందు బాటిల్ తెచ్చినా ఆనందించేవాళ్ళము - ముష్టి వాచ్ లు గిఫ్ట్ ఇచ్చి 10 రోజుల్లో మన మొత్తం సామ్రాజ్యానికి అధినేతవు అయిపోతున్నావు - ఇప్పుడు నాన్నను అడుక్కున్నట్లు అప్పుడు నిన్ను నిన్ను అడుక్కోవాలి అలాంటి బ్రతుకు అయిపోయింది . నువ్వంటే మాకు చిన్నప్పటి నుండీ అసహ్యం - అసలు నువ్వు ఎవరో ............
Dad : గోవర్ధన్ .......... అని కోపంతో కేకెయ్యడంతో , 
అయ్యో అయ్యో డాడీ డాడీ ........ అంటూ భయం నటించి తమ్ముళ్లూ ఫంక్షన్ హాల్ ఎటువైపు చెత్త గిఫ్ట్స్ అంటూ నెలపైకి విసిరికొట్టి పైకి వెళ్లిపోయారు .
వదినమ్మ - వదినలు .......... కన్నీళ్ళతో కిందపడి పగిలిపోయిన గిఫ్ట్స్ ను అందుకుని తమ తమ హ్యాండ్ బ్యాగులలో పెట్టుకుని , నన్ను హత్తుకున్నారు . 

డాడీ డాడీ - నాన్న నాన్న .......... అంటూ సంతోషంతో కేకలువేస్తూ నలుగురూ బయటకు రావడం చూసి , అందరమూ కన్నీళ్లను తుడుచుకుని బాధను లోలోపలే దాచేసుకుని పైకి మాత్రం నవ్వుతూ , బుజ్జాయిలూ .......... అంటూ ప్రాణంలా హత్తుకున్నాను .
నా హృదయస్పందనను పసిగట్టి , డాడీ ......... ఈ గ్యాప్ లో ఏమో జరిగింది - మీ అన్నయ్యలు వచ్చారుకదూ ........... 
Dad : మీ నాన్నలు ......... మీ డాడీ ఇచ్చిన గిఫ్ట్స్ విసిరేశారు అందుకే ..........
బుజ్జాయిలు : తాతయ్యా ......... మా డాడీ ఒక్కరే , వాళ్ళను ఎప్పుడూ మేము అలా అనుకోలేదు పిలవలేదు , డాడీ ......... మిమ్మల్ని బాధపెట్టినవాళ్లను ఊరికే వదిలేశారా అని కోపంతో ఊగిపోతున్నారు .
బాధను దిగమింగుకుని , ఎంతైనా నా ప్రియమైన అన్నయ్యలు వాళ్లంటే నాకు ఎప్పుడూ ఇష్టమే ..........
బుజ్జాయిలు : కోపంతో ఊగిపోతూనే , వాళ్ళు అలా ఎప్పుడూ అనుకోలేదు డాడీ , మిమ్మల్ని ఎప్పుడూ తక్కువచేసి చూస్తారు - వాళ్ళు నలుగురూ కలిసిపోయి మిమ్మల్ని తమ్ముడిగా కాదు బంధువులానైనా చూడనేలేదు .
బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ .......... ఈ సంతోషమైన సమయంలో ఇవన్నీ ఎందుకు , అందరిలో ఉత్సాహం తీసుకురావాలని ........  మీ హిమ అమ్మకు ప్రపోజ్ చెయ్యడానికి ఈ డాడీకి సహాయం చేస్తారా లేదా చెప్పండి .
బుజ్జితల్లులు : లోపల మొత్తం సెట్ చేసేసాము డాడీ , హిమ అమ్మ సర్ప్రైజ్ అయిపోయాలి - మాకు తెలిసి మా డాడీని చూసి ఫ్లాట్ అయిపోతారేమో ..........
దేవతల పెదాలపై చిన్నగా చిరునవ్వులు పూయడంతో సంతోషించి , వదినమ్మా .......... జ్యూవెలరీ బాగుందని మీరే ఉంచేసుకుంటారా ఏంటి .
వదినమ్మ : తియ్యనికోపంతో నా చేతులకు అందించి గిల్లి తియ్యదనంతో నవ్వుకున్నారు . 

బుజ్జాయిలూ ........... ఫస్ట్ టైం భయం సిగ్గు వేస్తోంది .
మేము ఉన్నాము కదా డాడీ అంటూ నన్ను లాక్కుని లోపలికి నడిపించారు - వెనుకే దేవతలు ఫాలో అయ్యారు - dad ......... పైన ఏర్పాట్లు చూసుకోవడానికి వెళ్లారు . 

బుజ్జాయిలు : బామ్మ బామ్మ .......... మా డాడీ మా హీరో అని పరిచయం చేసారు .
బామ్మగారి ఆశీర్వాదం తీసుకున్నాను . చల్లగా ఉండు బాబు అని దీవించడంతో లవ్ యు లవ్ యు బామ్మ అని బుజ్జాయిలు ఆనందించారు .
బుజ్జితల్లులు : డాడీ ......... సంధ్య అక్కయ్య - బిస్వాస్ అన్నయ్య చెప్పాముకదా , హిమ అమ్మ ప్రియమైన చెల్లెలు - తమ్ముడు .
Hi సంధ్య - hi బిస్వాస్ .......... అని చేతులను కలిపాను .
బుజ్జాయిలు : బామ్మా .......... అమ్మను , డాడీకి పరిచయం చేస్తాము . డాడీ ........ అమ్మ లోపల బెడ్రూం లో ఉన్నారు రండి అని లాక్కునివెళ్లారు . 
సోఫాలో ........... పెళ్లికూతురి చీరలో డ్రీమ్ లో నా ఏంజెల్ మహిలానే ట్రాన్స్పరెంట్ చున్నీతో ముఖం కప్పుకుని కూర్చున్నారు . 

వైష్ణవి గిఫ్ట్ - జాహ్నవి ఫ్లవర్స్ అందించి ముసిముసినవ్వులతో ముందుకుతోసారు . 
ఎందుకో తెలియదు నా మహి కనిపించినది అనో లేక వదినమ్మ మొదలుకుని రాము వరకూ హిమ గారు తెగ నచ్చేశారు అనో లేక మరెందుకో............ అడుగులు వణుకుతూ పడ్డాయి - జై భజరంగభళీ అని వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ all the best చెబుతున్న దేవతలు - బుజ్జాయిల ఆనందాలను ఆస్వాదిస్తూ వెళ్లి పెళ్లికూతురు ముందు మోకాళ్లపై కూర్చుని , తలదించుకుని నా గురించి వివరించాను .
పెళ్లికూతురు : hi మహేష్ గారూ ......... , బుజ్జితల్లులకు - బుజ్జాయిలకు మీరంటే చాలా ఇష్టం అనుకుంటాను , ఒక్క క్షణం కూడా మిమ్మల్ని తలుచుకోకుండా ఉండలేదు .
ఒక్కనిమిషం డాడీ ......... అంటూ బుజ్జాయిలు పెళ్లికూతురు ముసుగును తొలగించి చెరొకవైపు నిలబడ్డారు .
Yes yes హిమగారూ .......... వాళ్లే నా ప్రాణం . I I ......... ఒకసారి బుజ్జాయిలవైపు చూసి అంతులేని ధైర్యంతో " I LOVE YOUహిమ గారూ " అని గిఫ్ట్స్ అందించబోయి పెళ్లికూతురిని క్షణకాలంలో చూసి హృదయంలో అగ్నిపర్వతం బద్దలైనట్లుగా వెనక్కు పడిపోయాను - కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు .

పెళ్లికూతురు కంగారుపడిపోబోతుంటే బుజ్జాయిలు బుగ్గలపై ముద్దులుపెట్టారు , ఇంతలో దేవతలంతా చుట్టూ చేరి వివరిస్తున్నారు . 
గిఫ్ట్ - ఫ్లవర్స్ నేలపై ఉంచేసి కన్నీళ్లు దేవతలు - బుజ్జాయిలు చూడకుండా బయటకు నడిచాను . 
బుజ్జాయిలు : డాడీ .......... ఫ్లాట్ అయిపోయారా ? చెబితే వినలేదు .........

బయటకు రాగానే మైండ్ బ్లాక్ అయిపోయింది - కన్నీళ్ల ధార ఆగడం లేదు - అన్నయ్యలలా తాగినట్లు అడుగులుపడుతున్నాయి - గోవా లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను కానీ పెళ్ళయ్యేంతవరకూ ఉండాలి ఎలా అని నేరుగా నా గదిలోకి వెళ్లి సింక్ మొత్తం నీటిని వదిలి ముఖాన్ని ముంచేసి బాధపడ్డాను . ఎంత కంట్రోల్ చేసుకున్నా ......... బాధ హృదయం తన్నుకొస్తూనే ఉంది . ఊపిరాడకపోయినా అలానే ఉండిపోయాను ప్రాణం పోతే బాగుండు అనిపించింది - సమయాన్ని మరిచిపోయాను .
డాడీ డాడీ - నాన్న నాన్న .......... అని ప్రాణమైన పిలుపులు వినిపించడంతో ప్రాణం లేచొచ్చినట్లు సడెన్ గా నీటిలోనుండి లేచి ఘాడంగా ఊపిరిపీల్చుకున్నాను. కన్నీళ్ళతో కళ్ళు ఎర్రబడ్డాయి . 
అమ్మలూ .......... డాడీ పైకి వెళ్లినట్లున్నారు మేము వెళుతున్నాము అని నలుగురూ ఒక లిఫ్ట్ లో పైకివెళ్లారు .
జాగ్రత్త బుజ్జాయిలూ ........... వచ్చేస్తున్నాను అని టవల్ తో తుడుచుకుని కారుతున్న కన్నీళ్లను కారినట్లుగా తుడుచుకుని గుండెను రాయిచేసుకుని పైకివెళ్ళాను . నావల్ల వదినమ్మ - బుజ్జాయిలు ఏమాత్రం బాధపడకూదురా అని మనసులో పదే పదే అనుకుంటూ అడుగులువేశాను .
Like Reply
ఫంక్షన్ హాల్ చేరుకోగానే , లోపల నేను కనిపించకపోయేసరికి డాడీ డాడీ ........ అంటూ కంగారుపడుతూ బయటకువస్తున్నారు . 
నన్ను చూసి డాడీ డాడీ నాన్న ......... ఎక్కడకు వెళ్లారు ఎంత ........ అంటూనే నా గుండెలపైకి చేరిపోయారు . daddy daddy .......... kinda room lo eppudaithe mimmalni choosaaro aa ksanam nundee kanneeru kaarusthoone unnaaru kottha amma endhuko theliyadhu ........
అన్నయ్యలు : స్నిగ్ధా - రాము ......... డాడీ - నాన్న కాదు వాడు బాబాయ్ , బాబాయ్ అని లేకపోతే ( బాస్టర్డ్  అని పిలవండి అంటూ మనసులో అనుకున్నారు ) .
బుజ్జాయిలు - బుజ్జితల్లులు : మీరు తిట్టినా కొట్టినా డాడీ - నాన్న అనే పిలుస్తాము.
అన్నయ్యలు : మిమ్మల్నీ ......... అంటూ కొట్టబోతే , 
Dad రావడంతో సైలెంట్ గా వెళ్లిపోయారు . 
బుజ్జాయిలు : లవ్ యు తాతయ్యా .......... , డాడీ ......... ఏంటి మీ హృదయం అంతులేని వేగంతో కొట్టుకుంటోంది , ఏమైంది డాడీ ........ కళ్ళు కూడా ఎర్రబడ్డాయి.
ఏమీలేదు బుజ్జాయిలూ ఏమీలేదు .......... అని ప్రాణంలా హత్తుకుని ఫంక్షన్ హల్ చివరన కూర్చున్నాను . 
పెళ్ళిమండపం వైపు చూస్తేనే చాలు కన్నీళ్లు ఆగడం లేదు - గుండె ఆగిపోతే బాగుండు అనిపిస్తోంది . అక్కడా ఉండలేను - వెల్లనూ లేను . పంతులుగారు చదువుతున్న ఒక్కొక్క మంత్రానికి ........... అంతటి బాధలో మాటలు రావడం లేదు . 

బుజ్జాయిలు : డాడీ ......... కన్నీళ్లు , మీ అన్నయ్యల వల్లనే కదా లవ్ యు లవ్ యు అంటూ తుడిచి ప్రాణమైన ముద్దులుపెట్టారు . డాడీ ......... హిమ అమ్మ మీరు ఇచ్చిన జ్యూవెలరీ వేసుకున్నారు - గిఫ్ట్ తోపాటు ఇచ్చిన పూలను కొప్పులో చుట్టుకున్నారు .
ఎందుకో తెలియదు అంతటి బాధలోనూ ........... పెదాలపై చిరునవ్వు . 

చిన్నన్నయ్య : పంతులు గారూ .......... ఇంకెన్ని మంత్రాలు చదువుతారు , చాలుకానీ పెళ్లయిపోయింది పదండి అని లేవబోయారు .
పెళ్లికూతురు కళ్ళల్లో కన్నీళ్లు - చుట్టూ నిలబడిన దేవతలు కూడా .........
పంతులు : బాబూ ......... తాళి కడితేనే పూర్తయినట్లు .
చిన్నన్నయ్య : అదేదో ముందే చెబితే తొలి మంత్రం చెప్పగానే కట్టేసేవాణ్ణి అని పంతులు గారు చెప్పకముందే తాళి అందుకుని తాగిన మైకంలో తూగుతూ ముళ్ళు వెయ్యడం కూడా రానంతలా ఊగుతూ అలాగే వదిలేసి , అన్నయ్యలూ .......... అయిపోయింది పదండి వెళదాము . 
అన్నయ్యలు : పెళ్లి మండపంలోనే తాగుతున్నట్లు మందు బాటిల్స్ పైకెత్తి సూపర్ తమ్ముడూ అంటూకేకలువేసి బయటకు నడిచారు .
డాడీ .......... చిన్నన్నయ్యకు ఆపబోయారు .
చిన్నన్నయ్య : పెళ్లి అన్నారు , తాళి కట్టాను . ఇక మీరు నన్ను ఆపలేరు మీ కోడలిని ఇంటికి తీసుకుని వెళ్లిపోండి అని జేబులోనుండి గుట్కా తీసి నోటిలోకి వేసుకుని అన్నయ్యలూ .......... అంటూ బయటకు వెళ్ళిపోయాడు .

తాళి .......... పెళ్లికూతురు ఒడిలోకి జారిపోయింది . తల్లితోపాటు కన్నీటి ధార ఆగడం లేదు .
పెళ్లికూతురు కన్నీళ్లను చూసి నాతోపాటు బుజ్జితల్లులు - బుజ్జాయిలు - దేవతలు - బామ్మ కన్నీళ్ళతో బాధపడ్డారు . 
పంతులు గారు : అపచారం అపచారం ........... 
డాడీ ......... పంతులుగారికి పెద్దమొత్తంలో అమౌంట్ అందించి , ఎక్కడా మాట్లాడకూడదు అని పంపించేశారు . జానకీ .......... ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు వైజాగ్ వెళ్లిపోతున్నాము లగేజీ ప్యాక్ చెయ్యండి అని బాధతో చెప్పారు . 
బుజ్జాయిలు : డాడీ .......... అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , పరుగున పెళ్లికూతురు పక్కన చేరి బుజ్జిచేతులతో కన్నీళ్లను తుడిచారు . అమ్మా ......... మిమ్మల్ని ప్రాణంలా చూసుకుంటాము .
ఇద్దరినీ ప్రాణంలా గుండెలపై హత్తుకుని కన్నీళ్లను కారుస్తూనే ఉన్నారు . 

పెళ్లికూతురితోపాటు దేవతలు కిందకువెళ్లి నా బ్యాగుతోపాటు మొత్తం లగేజీని ప్యాక్ చేసేసి , హోటల్ బిల్ పే చేసేసి ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .

Dad స్పెషల్ ఫ్లైట్ బుక్ చెయ్యడంతో రన్ వే దగ్గరికి చేరుకున్నాము . వదినమ్మా - వదినలూ ........... నా గురించి వదిలెయ్యండి , మీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి , బుజ్జితల్లులను - బుజ్జాయిలను ......... హిమ దగ్గర హిమ గారి దగ్గరే ఉండనివ్వండి , లండన్ వెళ్ళాక కాల్ చేస్తాను ......... సేఫ్ జర్నీ అని ఫ్లైట్ లోపలికి పంపించాను . 
Dad : మహేష్ ......... ప్రాజెక్ట్ పూర్తికాగానే వచ్చేయ్ , " యూరో - ఇండియా summit " కూడా పట్టించుకోకు వచ్చేయ్ , నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అని కౌగిలించుకుని వదిలి వెళ్లిపోయారు . నిమిషంలో ఫ్లైట్ బయలుదేరింది . 

నా హృదయం గాయపడినందుకు బాధపడాలా , దేవతలు - బుజ్జిదేవతల ప్రాణమైన హిమ హిమగారు బాధకు ( ముగ్గురు దేవతల బాధలతో కలవడం అదికూడా నా ........... ) బాధపడాలా అని కన్నీళ్ల పరవంతమవుతూనే నెక్స్ట్ ఫ్లైట్ కు లండన్ చేరుకున్నాను .

రాత్రి 10 గంటలకు లండన్ లో ల్యాండ్ అయ్యి క్యాబ్ లో అపార్ట్మెంట్ చెరుకున్నాను . ఇండియాలో ఉదయం 3 గంటలు అవ్వడం వలన దేవతలు నిద్రపోతుంటారని డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక పైకివెళ్ళాను . కాలింగ్ బెల్ నొక్కడంతో sam వచ్చి డోర్ తెరిచాడు .
నిద్రమత్తులో ఆవలిస్తున్న Sam ఆశ్చర్యపోయి మహేష్ .......... అప్పుడే వచ్చేసావా ? , కనీసం 2 -3 డేస్ ఇండియాలో ఉంటావనుకున్నాను - మ్యారేజ్ ఎలా జరిగింది ? - కాల్ చేసి ఉంటే ఎయిర్పోర్ట్ కు వచ్చేవాణ్ణి కదా ......... అని మాట్లాడుతున్నా పట్టించుకోకుండా నేరుగా నా రూంలోకివెళ్లి లాకర్ నుండి ఫైల్ అందుకుని ఒక్కొక్క చార్ట్ చింపేస్తున్నాను . 

Sam : మహేష్ మహేష్ ........... అంటూ నా నుండి అప్పటికే చింపేసిన రెండు ఛార్ట్స్ - ఫైల్ లాగేసుకున్నాడు . ఏమిచేస్తున్నావు మహేష్ ........... నీ ఏంజెల్ - నీ జీవితం . అంటే మహిని చూశావు కదా ............ may be at టఫ్ situation .

కన్నీళ్ళతో బెడ్ పై కూర్చుని yes sam yes .......... కొన్ని క్షణాలపాటు హార్ట్ పల్స్ ఆగిపోయింది - life sucks .................
Like Reply
Super story Mahesh garu heart touching
[+] 4 users Like nivasvictory's post
Like Reply
That was one hell of an emotional ride bro...

టైటిల్ మరియు ఇంట్రోలో ఇచ్చిన ఊహలోకపు వర్ణన చూసి ఫ్యాంటసీ ఏమో ఆనుకున్నా... కాని మొదటి అప్డేట్ చదివిన తర్వాత అర్థమైన విషయం ఏమంటే ఆ దేవతలు ఎవరో కాదు తన పనికిమాలిన సన్నాసులైన అన్నలను పెళ్లి చేసుకున్న వదినలే అని....

మహేష్ తినలేదని వదినమ్మ తినకపోవడం సన్నివేశంతో చెమర్చిన కళ్లు అప్డేట్ చదవడం పూర్తి అయ్యేంతవరకూ కూడా కళ్ళల్లో తడి ఆరలేదు..

తన అన్నల ప్రవర్తన చూసిన తర్వాత మహేష్ ఈ కుటుంబంలోకి ఎలా వచ్చాడో తెలుసుకోవాలని ఉంది. బ్లడ్ రిలేషన్ లేదేమో అని నా అనుమానం.... లేకపోతే బాస్టర్డ్ అని మనస్సులో అనుకోరెమో కదా????

'మహి'ని తిరగేస్తే 'హిమ' అయ్యింది. మహేష్ ని చూసిన తర్వాత హిమ కూడా ఏడుస్తూనే ఉంది అన్నారు... అంటే హిమకి కూడా మహేష్ కి లానే కలలు వచ్చాయంటారా? ఏమో చూడాలి..
తాళి కట్టకుండానే జారిపోయింది కాబట్టి పెళ్లి అవ్వనట్టేగా...?

ఓవరాల్గా మంచి ఆరంభం... అప్డేట్ అదిరింది.

I'm all ready for another roller-coaster ride of emotions.
Finally... కాకా నువ్వు కేక... yourock
[+] 5 users Like kummun's post
Like Reply
Excellent start sir feels really good with emotional
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
NO WORDS............AWESOME AND GOOD UPDATE................
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Awesome
[+] 1 user Likes Gangstar's post
Like Reply
Super super super Store bro
U r rockstar
[+] 1 user Likes Vinay smart's post
Like Reply
మొదటి అప్డేట్ లోనే ఇన్ని రకాల ఎమోషన్స్ పండించడం మీకు మాత్రమే సాధ్యం. సూపర్ స్టార్ట్
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
అమోఘం మహాకవి మీరు ఈ కథ రాయడానికి పూనుకోవడం మా అదృష్టం మీ అన్ని కథలు లగ్ ఈ కథ కూడా చాలా చాలా చాలా బాగుంది నాకైతే పిచ్చిపిచ్చిగా నచ్చింది మహేష్ గారు నాకు మీ గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు మీ ప్రతి కథ అంటే నాకు చాలా ఇష్టం మహేష్ గారు మీరు స్టోరీ లో ప్రాణం ప్రాణం అంటూ ఉంటారు అలాగే మీ కథను అంటే నాకు ప్రాణం సార్ మాకు మరో కొత్త కథ అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహేష్ గారు  Namaskar Namaskar  Namaskar
[+] 1 user Likes Durga prasad's post
Like Reply
మహేష్ గారు హృదయాన్ని పిండేశారు. మహి,హిమ ఒక్కరే అవటం చాలా బాధ కలిగించింది. అప్డేట్ చాలా చాలా అద్భుతంగా వుంది మహేష్ గారు.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Manasu Kavi doctor Mahesh emani cheppali nee kalumu nundi Mora adbhutha kavyam jaruvarthundi. Love you always dear.
Manasu Kavi nee rachanalu neti tharanaki adarasaprayamu Ga vuntayi ani anadumulo athisyokthi ledu endukante nee rachanalu lo ani samapalu Ga vuntayi and Oka vyakthi samajam lo ela vundali melagali ani teluputhavu.
మీ 
జాక్  Heart
[+] 2 users Like jackwithu's post
Like Reply




Users browsing this thread: 284 Guest(s)