Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజమా లేక భ్రాంతా
#1
ఒక చోట నలుగురు గుమ్మి గూడి ఉన్నారు. అక్కడ చలి మంట వేసుకుని కూర్చున్నారు. ఆ పక్కనే ఒక వ్యక్తి పరిగెడుతూ వెళ్తున్నాడు. అతను జాగింగ్ చేస్తున్నాడు. వెళ్తున్నవాడు కాస్తా ఎందుకో ఆ చలి మంట చూసి ఆగిపోయాడు. ఆ చలి కాచుకు కూర్చున్నవారు., అతను ఆగిపోవడంతో ఏంటా అని చూశారు. అతను ఆగి ఆ మంటల్లో తేడాని గమనించాడు. అక్కడ కృష్ణ సర్పం ఒకటి తగలబడుతోంది. వీళ్ళెవరికీ అది తెలియలేదు.
ఈ పెద్దమనిషి అది గమనించి ఆ సర్పాన్ని చేతుల్లో తీసుకున్నాడు. తల కాల్లేదు చాలా వరకూ శరీరం కాలుతోంది. ఆ సర్పాన్ని చేతుల్లో తీసుకున్నాడు. అది అనుకోకుండా కదిలింది.
అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. తాను కనే కల ఆ సర్పం అప్పటికే అతణ్ణి కాటేసింది. అతను చనిపోయాడు. ఆ పాము కూడా కాలిపోయింది అనుకోండి అది తరువాత విషయం.
ఇక్కడ మనసులో మెదులుతున్న విషయం ఏంటంటే ఆ పెద్దమనిషికి తనకు వచ్చే కలలన్నీ ముఖ్యంగా తాను ఆ కలల్లో ఉండగా జరుగుతున్నవన్నీ నిజమవుతున్నాయి. కానీ ఇది అతనికి రూఢీగా తెలియదు. అది అతని భ్రాంతి అనుకున్నాడు. ఇప్పుడు నిజం అయ్యింది. 
ఈ విషయాన్ని ముందే నమ్మి ఉంటె ఆ పాముని పట్టుకునే వాడు కాదేమో? ప్రారబ్దం అంటే ఇదేనేమో?!.

మహాభారతంలో అనుకుంటాను.(సరిగా జ్ఞాపకం లేదు) రాజగురువు తన తపస్సుతో రాజుని రక్షిస్తాను. అని 
రాజు గెలవకపోతే తాను ప్రాయోపవేశం చేస్తాను అని శపధం చేశాడు. 
వెంటనే మృత్యువు అతని ఇంట నిలబడింది. ఎందుకంటే రాజు గెలవడం అనే అవకాశం లేదు కాబట్టి.

ఒక మిత్రుని ఫేట్ మారుద్దామనుకున్నాడు. అతనికి ఒక లక్కీ స్టోన్ పెడదామనుకున్నాడు. కానీ అనుకోకుండా ఇతని జాతకం మారిపోయింది. అంతా తలక్రిందులు అయ్యింది మిత్రునికి ఉంగరం పెట్టి లక్కీ స్టోన్ పెడదామనుకున్న అతని పరిస్థితి తలక్రిందులయింది.
ఆ పై ఆ మిత్రుడు పడుతున్న అష్ట కష్టాలు చూడటం మినహా ఏమీ చెయ్యలేకపోయాడు.

శ్రీ కృష్ణుడు స్వయంగా ఈశ్వరుడు, ఆయన మూడో గుప్పిట కూడా అటుకులు త్రిని ఉంటే......?!!!!!
ఆ పైన మన ఊహకు అందదు.
[+] 1 user Likes kamal kishan's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
what is 2+2=?
what is 4-2=?
what is 2*2=?
what is 4/2=?
what is square root of 4 =?

ఇవి అన్నీ సాధించడానికి కొంత మేధస్సు సరిపోతుంది.
కానీ ఇన్నాళ్లూ మాట్లాడని నాన్న గారు ఈ రోజు మాట్లాడుతారనిపిస్తోంది. మా ఆవిడా నేను ఇంటికి వెళ్ళగానే సినిమా చూద్దామంటుంది.
అదేంటి నేను అనుకున్నవన్నీ ఇలా జరుగుతున్నాయి?!

ఈ రోజు పొద్దున్నే రుద్రాభిషేకం నిర్లక్ష్యం చేశాను. ఆ ఒక్క రోజు రుద్రాభిషేకం చెయ్యకపోతే ఈశ్వరుడు వచ్చి అడుగుతాడా ఏంటి? లైట్ తీసుకో...

....పార్కులో ముందుకు ఎగ్గిరి పడ్డాను. అనుకున్నాను..., ఈ రోజు అభిషేకం చెయ్యలేదుగా....
Like Reply
#3
తొక్కలే మాటలు వంద కాకపొతే 2 వందలు చెబుతారు. అన్నీ నమ్ముతూ పొతే ఒక కాలు కావేరిలో ఇంకో కాలు తుంగభద్రలో పెట్టాలి.
ఉంగరాలకీ, జాతి రాళ్ళకీ, కనపడ్డ నల్ల రాళ్ళకీ మ్రొక్కుట సమస్యలు తీరిపోతాయా ఏంటి?
పూర్వజన్మలో ఎదో పాపం చేసామాట దానం ఇవ్వాలట. ఆ పంతులు గాడుతిండికి లేక వంద చెబుతడు. నేను ఇంట మంచిగున్నా....నన్ను చూసి ఎంత మంది అసూయ పడతా ఉంటరు. నాకు శని మహర్దశ వచ్చే తయానికి బట్ట నెత్తి వస్తదంట. గప్పటికీ నాకు 40+ వస్తాయి.., ఇంకేంది, గప్పటికీ బట్టనెత్తి వస్తే ఏమయితది.

ఛీ నియ్యమ్మ 40+ character ఆర్టిస్ట్  గూడ వస్తా  లేదు. ముసలోని వేషం తప్ప.

గురూ ధ్యానం చేస్తే.....నల్లగా అవుపడుతుంది ఎందుకట్లా 
నాకు తెల్లగానే అవుపడుతున్నదిరా....గదేమున్నది నువ్వు మల్ల మల్ల చెయ్యి నీకే ఎరికయితది.

గురూ ధ్యానం చేస్తే...ఇంద్ర ధనుస్సు లేక, kaleidoscopic కలర్స్ కనపడుతున్నాయి. ఎందుకట్లా?!
చెయ్యి మాట్లాడకు.
గురూ గారూ అనంతమైన నల్లని వలయాలు ఆ చివర సన్నని వెలుగు కనపడుతోంది దీనికి కారణం ఏమిటి? గురూ గురూ మాట్లాడు.
నేను నీ అంతర్వాణిని మాట్లాడుతున్నాను., నీవు మూలాధారమునూ, స్వాధిష్టానమునూ, మణిపూరమునూ చేరినావు. నీకు "ఐమ్" మంత్రమును ఉపదేశించుచున్నాను. 
క్రియా యోగమునకు నీవు అర్హుడవయినావు.

ధ్యానించుము. నీకు సందేహం కలిగినప్పుడు నేను ఇచ్చిన మంత్రమును సేవింపుము.

పరమేశ్వరా.......నా చిత్తములో ఉన్న అపూర్వమైన శక్తి ఏది, అది శక్తియా? లేక శివమా....ఆ శక్తిని నేనుచూడగలుగుతున్నాను.

శిష్యా, శిష్యా, శిష్యా 4 రోజులుగా ధ్యానంలోనే ఉన్నావ్....నిద్ర పొవట్లేదు కదా?! లే లే.

మన్నించండి గురుదేవా.......నిద్ర పట్టేసింది.

ఏం బాషరా అది నీకేదో అయ్యింది. 
ఏమో గురు నిద్ర పట్టేసింది ఏడున్నానో ఏమో.....(మాయ మళ్ళీ తనలోకి తీసేసుకుంటుంది) 
Like Reply
#4
శ్రీ దత్త స్తవం
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం | 
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు || ౧ ||

దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం |
సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు || ౨ ||


శ్రీ దత్తుడు ఆత్రేయస గోత్రం వాడు మహాన్ ఆత్మ కలిగినవాడు ఆయన వరములు గుప్పించడంలో వరదుడు; భక్తులయందు తండ్రివలే వాత్సాలయము కలిగినవాడు.
ప్రపన్న ఆర్తిని హరించి రక్షించేవాడు; ఆయనకు నమస్కారం. ఆయన స్మర్తృ గామి అనగా మన స్మృతి పథంలోకి ఆయన రాగానే మన ముందుకు వచ్చేస్తాడు. అంతటి కృపా సముద్రుడు.
దీనులకు బంధువు, కృప చూపడంలో చాలా ఉన్నతుడు. సర్వ కారణములకు కారణం అనగా అన్ని మూలములకు ఆయనే మూలం.
సర్వ రక్షాకరం అయినా ఆ స్వామిని స్మరిస్తున్నాను ఎందుకంటే ఆయన స్మృతి పథంలోకి రాగానే మన ముందుకు వస్తాడు కాబట్టి.
శరణాగతదీనార్త పరిత్రాణపరాయణం |
నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు || ౩ ||

సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం |
సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు || ౪ ||

శరణాగతి అన్న నామం శ్రీ రామునికి ఉంది. దీనులను, ఆర్తి అన్న వారి, పరితపించే పరాయణులని రక్షించేవాడు.
నారాయణుడు అనగా మనకు ఉన్న బంధములన్నీ తుడిచేసేవాడు అనగా మాయ నుండీ రక్షించే విభుడు, అటువంటి వానిని స్మరిద్దాం ఎందుకంటే స్మరించగానే వచ్చేవాడు ఆయనే కాబట్టి. 
అనర్థాలు సర్వం హరించేవాడు దివ్యుడు. సర్వ అమంగళములను మంగళం చేయువాడు.
సర్వ అనారోగ్య, బాధలూ హరించే ఆ దేవునికి వందనము. ఆయనని స్మరిద్దాం.

బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం |
భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు || ౫ ||

శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః |
తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు || ౬ ||

బ్రహ్మలకు హితమైనవాడు, ధర్మతత్వమును తెలిసినవాడు, భక్తుల కీర్తి తత్వములను తెలిసినవాడు.
భక్తుల అభీషములను నెరవేర్చేవాడు, ఆయనకు వందనం.
పాపాలను శోషింపచేసేవాడు, జ్ఞానతేజస్సుకు దీపం వంటి వాడు.
తాపములను ప్రశమనం చేసేవాడు ఆయనకు వందనములు.

సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం |
విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు || ౭ ||

జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం |
నిశ్శ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు || ౮ ||

అన్ని రోగములనూ శమింపచేసేవాడు, అన్ని పీడలను నివారించేవాడు 
విపత్తులో ఉన్నవారిని ఉద్దరించేవాడు; ఆయనకు వందనములు, ఆయనను స్మరిద్దాం.
జన్మ, సంసార బంధనములను చిన్నం చేసేవాడు ఆయనకు నమస్కారం. ఆయనను స్మరిద్దాం 
ఆయనే  ధరించిన  ఈశ్వరుడు ఆయనకు వందనం. ఆయనను స్మరిద్దాం 

జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవం |
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ||౯ ||

ఇతి శ్రీ దత్తస్తవమ్ |
జయము, లాభమూ, యశ: అనగా కీర్తి కోరు వారిని ఉద్ధరించే వాడు ఆయన స్తవం 
భోగము, మోక్షము, ప్రసాదిస్తుంది. శ్రద్ధతో మళ్ళీ చదివితే సుకృతములు కలుగుతాయి.
ఇది శ్రీ దత్తాత్రేయ స్వామి వారి స్తవము. సర్వ శుభములనూ చేకూరుస్తుంది.
Like Reply
#5
శ్రీ దత్త స్తవం
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం |
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు || ౧ ||

దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం |
సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు || ౨ ||


శరణాగతదీనార్త పరిత్రాణపరాయణం |
నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు || ౩ ||

సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం |
సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు || ౪ ||


బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం |
భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు || ౫ ||

శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః |
తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు || ౬ ||


సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం |
విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు || ౭ ||

జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం |
నిశ్శ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు || ౮ ||

జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవం |
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ||౯ ||

ఇతి శ్రీ దత్తస్తవమ్ |
Like Reply
#6
నిన్న ఒక మిత్రుడు కనపడ్డాడు; అతడు నన్ను నృసింహ క్షేత్రానికి తీసుకు వెళ్ళాడు. నాకు చాలా సంతోషం వేసింది.
ఆ మిత్రుడు మళ్ళీ కనపడలేదు.
సరేలే మన రోజూ తిరిగే ఫ్రెండ్ గాడు ఉన్నాడుగా వానితో పాటూ వెళదాం. అబ్బా ఇదేంటి నేను వాగుతూనే ఉన్నాను. నాకు నేనే నచ్చట్లేదు.
వీడేంటి నీది గవర్నమెంట్ జాబ్, పొద్దున్న కూర్చుంటే నీ పనులు అన్నీ నెరవేరుతాయి. అన్ని సౌకర్యాలూ నీకు ఉంటాయి. వీడి ఏడుపు ఏంటి?
వీడికి మాటకి మాట చెపుదామని ఉంది. మాటకి మాట చెబుతూనే ఉన్నాను. ఎందుకో .......మనసు మనసులో ఉండటం లేదు. మంచి అందమైన అమ్మాయిని చూసినప్పుడల్లా....మనసుకి హ్యాపీ గా ఉంటుంది. అసూయతో వీడు బాధపడుతూ..నేనూ మాటేరియలిస్టిక్ గా తయారవుతానా?!

ఎంత మాటేరియలిస్ట్ గా మారాలి. 
ఏమో?! ఎంత అంటే అంత మాటేరియలిస్ట్ గా మారుతాను.
నా నవ్వు కూడా కృత్రికమైంది.
శాడిస్ట్ గా మారాను.
నర రూప రాక్షసుడిగా మారాను.
రాక్షుడినా? రక్కసుడినా? రాక్షసమా?!
అమ్మవారు చెప్పినట్లు నా ధ్యానంలో నాకు కలిగిన ప్రకంపనలు నా శిరస్సుకి చేరి, బ్రహ్మ రంధ్రాన్ని చేరలేక నా ముఖం మీద దోబూచులాడుతూ....నా ముఖ వర్చస్సు పెంచుతున్నాయి. అంటే నేను సిద్ది సాదించినట్లేనా?
మరి నా ముఖం మాత్రం ఎందుకు వర్చస్సు పొందింది. నా బ్రహ్మ రంధ్రం ఎందుకు తెరుచుకోలేదు.

శివుడు యోగ పురుషుడై ఆయన తప్పస్సు బ్రహ్మ రంధ్రముద్వారా బయటికి రాగలుగుతోంది. ఆ తపస్సు అనలము అందుకే ఆ గంగమ్మ శిరస్సుపై కొలువై ఆయనకు చల్లని చల్లదనాన్ని, అలానే అమృత ప్రాయుడైన చంద్రుడు చల్లతనాన్ని ఇస్తున్నాడు. 
మరి అమృతంతో శివుని కంఠంలో హాలాహలం అమృతంగా మారుతుందా?!

ఆజ్ఞయా చక్రం  తెరుచుకుని శివుడు  త్రినేత్రుడయ్యాడా? తపస్సు ఆయనను ఆజ్ఞాచక్రం తెరుచుకునేలా చేసిందా?

ఇంకొక మాట: 
నా చేతులతో ఏది తాకినా జీవం పొందుతోంది ఎందుకు?
నేను అడుగుపెట్టినప్పుడు అక్కడ అంటా హరియాలీ ఉంటోంది; కానీ అది నావల్లే ఎందుకు అవుతోంది. 
నేను తాకితే జీవం పొందిందో లేక జీవి నాకే అమృతత్వాన్ని ఇస్తోందో....

ఎలాగంటే పక్షులు కొన్ని మన చేతికి గాయమైతే అవి చేతి మీద పురుగులు మాత్రమే తింటాయి. అలాగ అవి మనకి అమృతాన్ని చేకూరుస్తున్నాయి.

ప్రకృతి తనకు తానే మనల్ని ఎంచుకుంటుంది. అది రాముడైనా.., కృష్ణుడైనా ఆయా పనులకి ఎంచుకుంటుంది. ఆ ప్రకృతికి నీవు ఒక సాధనం మాత్రమే.
నేను కేవలం ఒక సాధనాన్ని మాత్రమే సాధించేది ప్రకృతి., ఆ ప్రకృతికి ఒకే ఒక్క లక్ష్యం శివ అనే రెండు అక్షరాలు;
ఆ రెండు అక్షరాలకు ఒక నమస్సు అనగా నమ: శివాయ.
శివునికి ఒక లక్ష్యము ఈశత్వము, సత్యము.

మనం అందరం ప్రకృతిలో ఒక భాగమే....సత్యాన్ని నీవు అనుకరించబోయినా సత్యమే నిన్ను తనలో భాగంగా చేసుకుంటుంది.
మనకు మంచి అందమైన అమ్మాయిని చూడగానే కలిగే కోరికని తీర్చడానికి మనలో కోరికలను రేకెత్తిస్తుంది. అందుకు మన భోజనాదులు కారణం.
ఈ భోజనాదులు అన్న పానీయాలు అనుకుంటే., ఆకలికి కారణం పింగళ నాది అందువల్ల తిన్న ఆహారం శరీరాదులలో. 
ప్రాణ, అపాన, వాయు, ఉదాన, సమాన అను ఐదు పదార్ధములుగా కావడానికి కారణం ఇడ నాది 
ఇవి అనుసంధానించి ఆ జ్ఞానేన్ద్రియములను పోషిస్తూ సరస్వతీ నది అంతర్వాహినివలే ప్రహింపచేసేది సుషుమ్న నాడి.
ఈ సుషుమ్న నాటికి ఆధారములు షడ్రుచులు ఇవి అన్నిటికీ అతీతమైనది ఆత్మ.

ధ్యానంలో నీకు ఏమీ కనపడకేపోతే నువ్వు సమాధి స్థితిలో ఉన్నావు అని అర్ధం. 
సమాధిలో ఉన్నవారికి ఏమైనా కనపడితే ప్రకృతే మనల్ని ఆదేశిస్తోంది అని అందువల్ల మనం కర్తవ్యంలోకి మారవలసినదని అర్ధం. 
అలాంటి వారు శ్రీ వివేకానందులు.
నిద్రాణమై ఉన్నవారు. అనగా ధ్యాన స్థితిలో శివుని చూడగలిగిన వారు శ్రీ రామకృష్ణులు. శివ శివానీ భవ భవానీ ఈశ ఈశ్వరి
నీ శ్వాస మాత్రమే నీకు జీవమును అందించగలదు. 
Like Reply
#7
నీ యాంకమ్మ 
భ్రాంతీ  కాదు బ్రాన్దీ కాదు. బుడ్డి పగిలిపోయింది.
Like Reply
#8
శ్రీ దత్త స్వామి చిన్న వయసులో తండ్రి అత్రి మహర్షి అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్లిపోవడానికి కూడా భలే కారణం వెతుక్కున్నాడు. 
సహజంగా గాయత్రి ఉపదేశంలో వటువుని భిక్షాటనకు పంపిస్తారు. ఆ బిక్షతోనే వేదం, వేదాంగములను నేర్చుకోమని, ఇదే అదును అనుకోని స్వామి బిక్ష ఎత్తుకోవడానికి వెళ్ళిపోయాడు. భలే చిలిపివాడు కదా....

ఆయన ఎంత గొప్పవాడంటే.....ఆయన తత్వాన్ని అర్ధం చేసుకోవడం వల్ల కానిది అందుకే ఆయనను అందరూ అనుసరించేవారు. ఆయన తపస్సును చెయ్యడానికి ఈ ఎవ్వరికీ కనిపించకుండా ఉండటానికి నీళ్ళలోతుల్లో తపమాచరించేవాడుట...కానీ శిష్యులు ఆయన కోసం అలానే నది ఒడ్డున కూర్చునే వారుట. దాంతో ఆయన కనపడకుండా ఉండటానికి వెళ్లి ఔదుంబర వృక్షం (మేడి చెట్టు) మొదట్లో దాచుకున్నాడుట. 
ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. 
ఆయన ఎప్పుడూ ఆనంద రూపుడే 
ఆనందం ఎలా ఉంటుంది? (తొక్కలో కొశ్చన్లు ఎందిరాబాయ్)
ఆనందం ఆనందం లానే ఉంటుంది ఇంకెలా ఉంటుంది?
మరి చిదానందం అంటే ఏమిటి?
బ్రహ్మానందం అంటే ఏమిటి?
బ్రహ్మానందం అంటే స్టార్ బ్రహ్మానందం 
చిదానందం అంటే పోస్ట్ మాన్ పేరు ఇంకేంటి?

అదీ నిజమేలే.........
చిత్తంలో ఒరిగే లేక ఒదిగే ఆనందం.
చిత్తం కల్లోలంలో లేకపోతె దానిని చిత్త శాంతి అంటారు చిట్టా కాదు.
మరి బుద్ధి అనగా నేమిటి? బుద్ధికీ చిత్తానికి గల భేదం ఏమిటి?
బుద్ధి ఉన్నవాడు ఎవ్వడూ ఇన్ని కొశ్చన్లు వెయ్యడంటారా?! బుడ్డి కాదండీ బుద్ది
బుద్ది అనగా తెలివి అనగా తెలివి తేటలు 
ఆ అనుభవాల్లోని విచక్షణయే శివుడు ఆ చోటే చిత్తం.

మీరు ఏ పనైనా చెయ్యలేననుకున్నారు అనుకోండి లేదా పని చెయ్యలేక గుంజాటన పడుతూ ఉంటె రెండు నాసికా రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుని శరీరమంతా నిమ్పుకోండి. అప్పుడు మీ గాలి ప్రయాణిస్తూ గుండె కవాటాలని తాకి కిడ్నీలూ గర్భ కుహరాల్లోకి వెళ్లి వెన్ను పాములో ప్రాణవాయువుని రక్తంలో నింపుకొని ముఖంలోకి రక్తం ప్రవహించి చెవుల వెనుక నరాల్లోకి ప్రయాణించి మళ్ళీ గుండె కవాటాల్లో దమనుల్లోకి చేరుతుంది. 
ఆ సమయంలో నీ బుద్ది చేసే నిర్ణయం యొక్క జడ్జిమెంట్ చిత్తం అవుతుంది. అనగా ఆ ప్రదేశం ఒక కైలాసమే........
మన బాధ చట్టంలో కొలువు తీరితే..........మనిషి పిరికితనానికి బానిస అవుతాడు. ఆ పిరికి తనానికి రూపమే మద్యం, మగువ, అది ఒక వాగాబొందఁ 
అందుకే ఆనందం అనేది నీ సొంతం చేసుకో చిన్న పిల్ల వాడు నవ్వుతాడే...ఏ కష్టమూ వాని మనసుకు చేరాడు అదే చిట్టా శాంతి ఆ చిట్టా శాంతి సదా ఉండాలి చిన్నతనమైనా పెద్దరికమైనా....
అదే చిదానందం.
Like Reply
#9
ఈశ్వరుడిని ఉపాసన చేసినవానికి అన్ని ఐశ్వర్యాలూ చేకూరుతాయి.
అదే ఈశ్వరుడు తిరోధానం చేయగలిగినవాడు., అనగా భూమినే కాదు సర్వమునూ త్రిప్పి యధాతధంగా చేసేవాడు అని, అలాగే జీవి పుట్టి మాయలో తెలిమరలా ఈశ్వరుడిలో కలిసిపోగల్గాలి అదే తిరోధానం. అంటే మళ్ళీ పుట్టుక అనేది ఉండదు. ఈ ఈతి బాధలు ఉండవు. 

బాధ ఎలా ఉంటుందంటే.....మా ఇంటి దగ్గర ఒక కుక్క పిల్ల ఈతలు తీసింది. దానికి పిల్లలు కలిగినా అవి చలికి తట్టుకోలేక చచ్చిపొయ్యాయి. ఆ కుక్క కన్నీళ్లు పెడుతూ ఆ పిల్ల కోసం దాన్ని తన మూతితో కదుపుతూ నోటా కరుచుకుని అటూ ఇటూ తిరుగుతోంది. దాన్ని చూస్తే....కళ్ళు ద్రవించిపోయ్యాయి. ఇప్పుడు కూడా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఇది బాధ కానీ ఇదే మాయ;
మాయకి ఎవ్వడూ అతీతుడు కాదు.
ఈ తిరోధానాన్ని ఇచ్చే ఏకాదశ రూపాన్ని అనగా 11th రూపాన్ని రావణుడు పూజించలేదు. 
దానితో మోహాన్ని పొందాడు అలా అహంకారం పది తలలైంది.
ఆ అహంకారాన్ని సత్వగుణ ప్రధానుడైన శ్రీ రాముడు అణచవలసి వచ్చింది.
మొహాన్ని అణచడానికి సత్వ గుణమే ధనువు తమో, రజో గుణముల కతీతంగా సత్వ గుణము అంతకన్నా శుద్ధ సత్వగుణము కావాల్సి ఉంటుంది అందుకే సూర్య భగవానుని ఆదిత్య హృదయాన్ని అగస్త్యుల వారు ఉపదేశించారు. శుద్ధ సత్వ గుణము శ్రీ సూర్య నారాయణుడు. 
ఇక్కడ ఇంకో మాట ఉంది. సూర్యుని సదా అర్చించే అనగా త్రికాలములూ అర్చించే బ్రాహ్మణుడు రావణుడు అయిననూ మొహానికి తోడైన అహాన్ని అణచడానికి స్త్రీ మొహాన్ని జయించిన వాడు కావలసినది.
ఇక్కడ ఇంకో విశేషం ఉంది. స్త్రీని జయించడమంటే సెక్స్ లోనా, లేదా అసలు ఆడవాళ్ళని కోరుకోపోవడమేనా? 
కాదా...మరి ఏమిటి?
స్త్రీని చూసినా., ఒక మగవాడిని చూసినా, ఒక కుక్కనో, కోడినో చూసినా ఎటువంటి కామ ప్రకోపములు లేక, శమమూ, దమము కలిగిన గుణములు కలిగినవాడయి ఉండవలసినది.
ఇక్కడ ఇంకో విశేషం గుణములు లేని వాడా? ఉన్నవాడా? 
గుణం మాత్రం కోరికల నుండే పుడుతుంది కదా?!
మరి గుణ రహితుడు ఎవ్వడు. కీర్తి కాంక్ష లేనివాడు ఎవ్వడు. 
అంటే అమ్మాయిల అంగాంగాలతో ఆడుకున్ననూ వాటిలో ఎటువంటి ఆసక్తి లేని వాడు అందుకే భగవంతుడు శ్రీ కృష్ణ అవతారం ఎత్తాడు. వివాహమైననూ బ్రహ్మచారే........
Like Reply
#10
ఇన్ని మాటలు చెప్పినా మళ్ళీ బుద్ది వంకర మొబైల్ లో సెక్స్ చూడటం.
Like Reply
#11
లోకంలో భగవంతుని గురించి అపోహలూ సందేహాలూ., 
శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం. ఆ శ్రీ దేవిని నిరసిస్తే తీరని ద్రోహం.

లక్ష్మి ఎప్పుడు రాణిస్తుందంటే ఆ సరస్వతి అనుగ్రహం తోడైతే అంతటి సంపదని కాపాడుకోగలిగితే అందుకు నీకు శక్తి తోడవ్వాలి. అంటే మహాలక్ష్మీ, మహా సరస్వతి, మహాకాళి తోడయితేనే.....
పిచ్చివాడి కంటే ధైర్యవంతుడు ఎవ్వడూ ఉండడు. పిచ్చివాని చేతిలో లక్ష రూపాయలు ఉన్నా అది సత్తు రూపాయే, పిచ్చి వానికంటే మొండివాడూ.., బలవంతుడూ ఎవ్వరూ ఉండరు.
కానీ పిచ్చి వాని యొక్క పిచ్చి సారస్వతమూ, బుద్ది, తెలివీ అనే సరస్వతి అనుగ్రహం లేకపోవడమే....

మహా లక్ష్మి అనే పదంలో మహా అనగా మహాన్ అనే గొప్ప లక్ష్మి.,  
పిచ్చివాడి యొక్క ఆరా లేక వాడి రేపో లేదా వాడి వైబ్రేషన్స్ చాలా వేరియంట్ గా ఉంటాయి. అటువంటి వైబ్రేషన్స్ తీవ్రత ఎంతగా ఉంటుందంటే.............ఆ వైబ్రేషన్స్ ని మనం ఒక పద్దతిలో చూడవచ్చు., ముఖ్యంగా పంచ లోహాలతో చూసినప్పుడు., అది ఒక పద్దతి ఇక్కడ ఎక్ష్ప్లైన్ చేయలేము. అలా చూసినట్లయితే ఆ వైబ్రేషన్స్ లో ఒక అర్ధంకాని మెలిక కనిపిస్తుంది.

అలానే ఒక అహంకారంతో కూడినవాని వైబ్రేషన్స్ కూడా అష్ట భుజములో కనపడతాయి. 
ఇంకా కొన్ని తాంత్రిక పూజల్లో కూడా....వాటిని నిర్వహించేవారిలో కూడా వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి.
Like Reply
#12
ఒక చిన్న మాట 
మాట చిన్నదే కానీ విషయం పెద్దది. ఎందుకంటే మనకు అర్ధం కాకపోవడం వల్ల.
మన బ్రెయిన్ కి రెండు పార్ట్శ్ ఉంటాయని అందరికీ తెలుసనుకుంటా.....
ఒకటి పెద్ద మెదడు, ఇంకొకటి చిన్న మెదడు.
చిన్న మెదడులో మస్తిష్కం, ఆ మస్తిష్కం లో చిత్తం; అలాగే ఇంటలిజెన్స్ అండ్ అనాలిసిస్ in core....అయితే ఈ మెదడు స్పందించే విధానం చాలా keen గా ఉంటుంది.
ఎలాగంటే ఉదాహరణకి ఒక దోమని మనం చంపాలనుకుంటే ఆ దోమ మనకు దొరకాలి. కానీ మెదడు తీవ్రత ఎంత ఉంటుందంటే......ఆ దోమ మన ఆలోచనలకి దీటుగా స్పందిస్తూ మనదగ్గరకు వస్తుంది. 
అది ఎలాగంటే గుర్రాన్ని అధిరోహించే రైడర్; అశ్వాన్ని అధిరోహించే వాడు అశ్వం యొక్క గుణాన్నీ ముఖ్యంగా దాని మనసుని తెలిసుండాలి. అప్పుడే గుఱ్ఱాన్ని చక్కగా దౌడు తీయించగలడు. ఎప్పుడైతే ఆ మనసు తెలుస్తుందో అప్పుడు గుఱ్ఱం అలసిపోయినా తెలుస్తుంది. అలానే ప్రతి ప్రాణి మనసూ మనకు తెలుస్తుంది 
చివరకు అది దోమ అయినా ఏదన్నా.....ఈ విశేషం కేవలం ప్రాణమున్నవాటికే కాదు ప్రాణం లేని వాటికి కూడా తెలుస్తుంది. దీన్ని telepathyకి ప్రారంభ దశ అనవచ్చు.

మనిషి మెదడు ఎంత powerful అంటే.....అనుభవంలో మాత్రమే తెలుస్తుంది. 
ఈ అనుభవం చాలా తీవ్రమైనది అది మంచినీ చెడునీ విశ్లేషించగలదు.
వీటిని ఉదాహరణ సహితంగా చెప్పాలంటే ఒక్క మెదడు చాలదు. ఇవి నా అనుభవంలోకి వచ్చాయి.
వీటిని ఎలా measure చెయ్యాలి అనేది నాక్కూడా ప్రశ్నార్థకమే.....
Like Reply
#13
ఓం శ్రీ గురుభ్యోనమః 
అహంకారం అణిగిపోవాలి 
అహంకారి చావాలి.

భగవత్ శ్రీ ఆది శంకరాచార్యులు వారి జీవితాన్ని మనమందరం చదివే ఉంటాం. అయితే 
ఒక వ్యక్తి గురించి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఆయన కూడా కాలడి, కేరళాలో పుట్టారు. ఆయన కాశ్మీరంలో సరస్వతీ పీఠానికి పోటీ పడ్డారు. ఆసేతు అనగా అనగా దాటి వెళ్ళలేనిది ఎలాగంటే సేతువు ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతంతో కలుపుతుంది. అలాంటి సేతువు కానిదే ఆసేతువు అనగా మన వ్యవహారికంలో సాధ్యం అంటే అవుతుంది అన్న అర్ధం ఉంటె అసాధ్యం అనగా కానిది అని అర్ధం. అటులనే ఆసేతు హిమ 
ఇక్కడ హిమ అనగా మంచు 
ఆ సేతు హిమాచలం; ఇక్కడ అచలం అనగా చలనము లేనిది అనగా చాలించేది దానికి వ్యతిరేక అర్ధం అచలం
ఆ సేతు హిమాచలం అనగా ఎవ్వరూ కూడా దాటడానికి సాధ్యం కానీ ఉన్నతి.
అటువంటి ఉన్నతి నీ ముందు నిలుస్తే.....
అంతటి లక్ష్యం నీ ముందు నిలుస్తే....?!
ఆమ్మో అంతటి లక్ష్యమా?!
అలా అనుకుంటే అటువంటి లక్ష్యాన్ని అలక్ష్యం చేసిన వాళ్ళమే అవుతాము.
ఒక వ్యక్తి సాధించగలిగే లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే అది ఈ రోజో రేపో అయిపోతుంది. అతని లక్ష్యం నెరవేరుతుంది. కానీ 
నెరవేర్చగలిగే లక్ష్యం ఆసేతు హిమాచలం వంటి పెట్టని కోట అయితే 
అందుకే ఆ వ్యక్తి అది నెరవేర్చగలిగే వారిని అన్వేషించి ఆయనకి శిష్యుడయ్యాడు.
ఆయనే శ్రీ శంకర భగవతపాదులు.
శ్రీ శంకరులు కాశ్మీర పీఠానికి వెళ్ళినప్పుడు తన లక్ష్యం పీఠాన్ని అధిరోహించడమా ? లేక సరస్వతీ అమ్మవారిని దర్శించడమా?
Like Reply
#14
శ్రీ సరస్వతీ మాతని దర్శించడమే అయితే ఆ తల్లిని గుడిలో దర్శించడమా?!
గుడి అనగా ఏంటి?! నీ మది అనే మందిరంలో అమ్మవారిని దర్శించితే....?! మరి మనో మందిరంలో దర్శిస్తే....?!
నువ్వు రోజూ ఆలయంలో దర్శించేది ఎవ్వరిని? ఈ ప్రశ్న మిగిలిపోతుంది.
అంతా బానే ఉంది కానీ గుడిలో సరస్వతీ మాతని దర్శించాం సరే.....మరి బ్రహ్మ దేవుడు ఆవిడ భర్త కదా....ఆయన కనపడడే....?!!!!!
ఓహో ఆయనకీ గుడిలేదు కదా?! మరిచిపోయాను అని డ్రమెటికల్ గా అనుకోవాలా.....?!
అసలు బ్రహ్మకి గుడి ఎందుకు లేదు. 
బ్రహ్మకి ఎందుకు గుడి కట్టరాదు?!
అబ్బా...ఇది కూడా తెలియదా?! సోది కాకుంటే...... చచ్చినోడి చేత తన్నించుకున్న మహారాజా?!
ఆయనకీ శాపం కదా.......భృగువు ఇచ్చిన శాపం వల్ల గుడి లేదు. అది కూడా తెలియదు.
మరి గుడి అంటే ఆగమ శాస్త్రం ప్రకారం కట్టే గుడేనా?! ఆగమాలూ, వాస్తు శాస్త్రమూ ఇవ్వన్నీ ఏమిటి?
ఈ కమల్ గాడికి పని లేదు. కిషన్ గాడికి పాటు లేదు.
Like Reply
#15
ఓం శ్రీ గురుభ్యోనమః 
ఉపాసనలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. వారి ఉపాసన ఎంత గొప్పదంటే సాక్షాత్ విశ్వరూపుడైన భగవంతుడే ఆ ఉపాసన దాతగా ప్రత్యక్షం అవుతాడు. 
ఉదాహరణకి శ్రీ శంకర భగవత్పాదులను కాపాలికుడు ఒకడు బలి ఇవ్వడానికి ఆయనను తీసుకుని వెళ్ళాడు. అప్పుడు అది తెలిసి ఆ కాపాలికుడిని ఎదుర్కొనడానికి శంకరుల శిష్యుడు శ్రీ నృసింహస్వామిని ఆవాహన చేసుకొన్నాడు. అంతే భక్తుల ఆవేదనకు శ్రీ మహావిష్ణువు ఉపాసన దేవతగా అనగా నృసింహ స్వామిగా అవతరించారు. ఆ కాపాలికుని సంహరించారు.
ఆ కాపాలికుని సంహరించిన తరువాత నృసింహుని ఉగ్రత్వం తగ్గడానికి శ్రీ శంకరులు శ్రీ నృసింహ స్తుతి చేశారు. 

అంతటి గురువుకు ఎంతటి శిష్యుడు లభించాడో చూడండి.
 
భక్త తుకారాం జీవితంలో జరిగిన సంఘటన ఇక్కడ ఒకటి చూద్దాం.

భక్త తుకారాం భగవత్ భక్తుడు ఆయన అభంగాలను వినడానికి విఠోభా తుకారాం ఎక్కడ ఉంటె అక్కడకు వెళ్ళేవాడుట., ఒకసారి ఇలానే భగవానుడు తుకారాం అభంగాలను వింటూ మైమరచిపోయాడుట.
అప్పుడు అక్కడ ఒక దీపం నూనె ఎగజిమ్మి చూరు అంటుకుందిట. 
అక్కడికి దాపున ఉన్న ఊరిలో ఒక భక్తుడు ప్రార్ధన చేసుకుంటున్నాడు ఆభక్తునికి ఈ దృశ్యం అంటే పక్క ఊరిలో చూరు అంటుకున్న దృశ్యం కనపడింది ఈ భక్తుడు వెంటనే నీళ్ళు చల్లాడుట....అది ఆరిపోయింది. 
ఇది దారిన పోతున్న ఒక వ్యక్తి ఇతనేంటి గాల్లో నీళ్ళు చల్లుతున్నాడు అనుకోని అడిగాడు. జరిగిన విషయం అంతా చెప్పాడు ఈ భక్తుడు. ఆశ్చర్యపోయిన ఈ దారిన పోతున్న దానయ్య వెళ్ళి చెక్ చేసుకున్నాడు. 

ఇవన్నీ నమ్మాలా?!
సరే నమ్మవద్దు. 
కానీ నా జీవితంలో జరిగాయి. కావున నేను నమ్ముతాను.
Like Reply
#16
పంచభూతాలకు చేసిన అపరాధం కూడా అంత త్వరగా పోదు.
పంచ భూతాలూ పృథ్వీ, తేజ, ఆప, వాయురాకాశాదులు
ఆప అనగా నీరు 
కేవలం నీటికి చేసిన అపరాధం ఒక్కటి చాలు మనిషిని నిరుత్తరుణ్ణి చెయ్యడానికి, 

ఒక జాతకం చూడటం వల్ల చూసే ఆస్ట్రాలజర్ కి దానివల్ల మంచీ చెడూ రెండూ వాటాయి. ఎలాగంటే నిన్న ఒక జాతకం చూశాను అందులో ఒక వ్యక్తి 1987 లో పుట్టాడు కానీ కాల సర్ప దోషం లేదు. అలాఅని చూస్తే...స్పర్శా మాత్రంగా ఉంది. అందువల్ల అతను వైరాగ్యం పొందవలసి ఉంటుంది. అటువంటి వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే....అతడు భార్యని కాదనుకుంటే తల్లీ తండ్రీ అతని శ్రేయస్సు కొరకపోతే............
అలా అతని జాతకంలో ఉన్న మంచీ చెడూ జాతకం చూసే వాడికి కూడా అబ్బుతుంది.
అందుకే జాతకాలు చూసేవాళ్ళు నిత్యాగ్నిహోత్రమూ లేదా నిత్య రామాయణపారాయణము లేదా నిత్య గాయత్రీ లేదా నిత్యా రుద్రభేషేకమూ చెయ్యవలసి ఉంటుంది. 
ఈ పైన చెప్పిన నిత్యా కార్యక్రమాల్లో అందరూ చెయ్యవలసినది గాయత్రి.
సామవేదాన్ని అనుసరించి సిటీగా పారాయణము, యజుర్వేదాన్ని అనుసరించి నిత్యాగ్ని హోత్రమూ, ఋగ్వేదాన్ని అనుసరించి గాయత్రీ ఉపాసన చెయ్యవలసి ఉంటుంది.
వీటన్నిటిలో నీరు ముఖ్యమైనది.
అటువంటి నీటిని తెలిసి కానీ తెలియక కానీ అవమానిస్తే..............??!!
ఇక if & but లు ఉండవు.
Like Reply
#17
What is the most complicated machine in the known world?

the answer is man 

the God has created all animals birds insects and green world but more than he has created human being.,
Like Reply
#18
Namaskar భగవంతునికి నమస్కారం.
రుచి చూసేది నాలుక కానీ తినలేదు. తినేవి పళ్ళు కానీ రుచి తెలియదు. అయినా ఆకలి తీరదు. అటువంటి ఆకలి అనే అగ్నిని గర్భ కుహరంలో పెట్టినవాడు విధాత.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రయా:
విష్ణువు: "నేను వైశ్వానరుడు అని పిలవబడే అగ్నిని భూతములందు అనగా ప్రాణమున్న దేహములందు ఆశ్రయించి ఉన్నాను"
ఆకలి కడుపులో కలిగితే అది మెదడుకి తెలుస్తుంది. 
ఆ మెదడు ఆహారాన్ని తినమంటుంది. నోటికి ఇంపైన ఆహారం నాలుక రుచి చూస్తుంది ఆ రుచి మనసుకి తెలుస్తుంది.
ఇంత mechanism ఉన్నది శరీరం. 
ఏ మహానుభావుడూ సృష్టించలేని ఈ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్నవి పంచ భూతములు. 
అటువంటి శరీరం కర్మతో కూడినది; అటువంటి కర్మ పరిపక్వము కావలనన్న శరీరములో ఓంకారం పలకవలసి ఉంటుంది.
అది ఎలాగంటే ఆత్మ సమర్పణ భావం. 
వాయువు ఎన్ని రకాలుగా ఉంటుంది .....?
ప్రాణ వాయువు 
నిజంగా తప్పస్సులో తపింపబడేది ప్రాణవాయువు.
Like Reply
#19
మహా కవి కాళిదాసు సినిమా చూసే ఉంటారు అందులో ఉజ్జయినీ కాళీమాత అనుగ్రహంతో కాళీదాసుడు గొప్ప కవి అయినాడు.
తెనాలి రామలింగనికి కూడా కాళీ అనుగ్రహం లభించింది. 
మన సంస్కృతిలో త్రిశక్తులకు మూల దేవతలు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి 
ఈ మహాకాళి ఎవరు ఆ మాత ఎలా అనుగ్రహిస్తుంది. ఈవిడ ఎవరు? ఎవరు ఈ తల్లి?.
గౌరి అనగా ఎవ్వరు? మరి ఈ కాళి ఎవరు?
గౌరవర్ణంలో ఉండే తల్లి గౌరి ఆ అమ్మయే భగవంతుడైన శంకరుని పత్ని, ఆమెనే మనము రోజూ కొలుస్తూ ఉంటాము. 
ఆవిడని సగుణ రూపంలో కాక లింగంలో ఒక భాగంగా కొలుస్తూ ఉంటాము. పానవట్టం లో ఉమామహేశ్వరులు కొలువు తీరి ఉంటారు. అయితే లింగం పరమేశరుడు అయితే పానవట్టం గౌరి. ఈ పుణ్యదంపతులనే మనం అభిషేకిస్తూ ఉంటాం.
సంకల్పంలో గౌరీశంకర దేవతాభ్యోనమోన్నమః అంటూ చెబుతుంటామే.................ఆ పరమేశ్వరుడు 
మరి కాళి ఈవిడ ఎవ్వరు? నల్లని శరీరం కలది.
నల్లని కేశాలు., కపాల మాల, వెయ్యి చేతులు, వెయ్యి తలలు, వెయ్యి నాలుకలు., వెయ్యి కన్నులు., 
ఇక్కడ వెయ్యి కన్నులు అంటే ఇంకో మాట ఉంది. సహస్ర శీర్షా పురుష: సహస్రాక్ష, సహస్రపాధ్  అన్న పురుష సూక్తంలో 
పరమాత్మకు సహస్ర శిరస్సులు ఉంటే ఒకో శిరస్సుకూ ఎన్ని కన్నులు ఉంటాయి అన్న మీమాంస వస్తే 2000 కన్నులుండాలి కదా మరి సహస్రాక్ష అంటూ ఎలా?
పరమాత్మకు జ్ఞాన చక్షువులు సహస్రం.
ఆయన అగ్నిలో అగ్ని, ఆదిత్యులలో ఆదిత్యుడు అలాంటి అగ్నికి కన్నులూ, నాలుకలూ అనేకం.
ఇక ఆ తల్లి మహాకాళి., శరత్ కాలంలో మనల్ని అనుగ్రహించడానికి మూలమంత్రంలో ఉంటుంది.
శరత్ కాలంలో వచ్చే నవరాత్రులని శరన్నవరాత్రులు అనడం ఆనవాయితీ.....
అయితే మూలాల నక్షత్రంలో పంచమి నాడు., పూజించే అమ్మ సరస్వతి యొక్క మూలమంత్రంలో మహా ఉండదు.
కానీ దసరా నాడు పూజించే మంత్రంలో ముగ్గురూ త్రిశక్తి స్వరూపములు ఆ ముగ్గురమ్మలూ మహాకాళీ, మహాలక్ష్మీ మహాసరస్వతి.
వీరి ముగ్గురికీ ఒకే మూల మంత్రం ఉన్నది. అది అందరికీ విధితమే 
నా తల్లి శారదా మాత సదా నన్ను రక్షించును గాక నా వల్ల తప్పు జరగకుండా చూచునుగాక, 
నాకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు.

ఈ మాసంలో ఎవ్వరినీ నిందించరాదు అంటూ ధర్మం చెబుతోంది. కానీ మనసు ఊరుకోవట్లేదు.
Like Reply
#20
Have you Experienced any Paranormal activity in your life?

మీ జీవితంలో దెయ్యాన్ని కానీ అటువంటి వస్తువుని కానీ లేదా అటువంటి చర్యని కానీ చూశారా?!
మా డ్రైవర్ వాళ్ళు నల్లగొండ వాసులు; అక్కడ ఫ్లోరైడ్ పడటంతో వ్యవసాయం మానేసి ఇక్కడకు వచ్చాడు. అతని జీవితంలో జరిగిన విశేషాన్ని మాతో పంచుకున్నాడు.
వ్యవసాయం చేసే సమయంలో పొలంలో విత్తులు వేసిన తరువాత సాయంత్రమయిపోయింది. ఎడ్లను బావి దగ్గరకు తీసుకెళ్లి కడగటానికి తీసుకుని వచ్చాడు. అయితే అక్కడే ఒక తెల్లని దుస్తుల్లో ఒక అందమైన అమ్మాయి కనపడిందిట. 
ఎడ్ల కాడి వదిలించి, బావి దగ్గరకు తీసుకొచ్చాడు. వెంటనే ఆ ఆకారం వాటిని దూరంగా పెట్టు అంటూ అడిగిందిట. ఎవ్వరు నువ్వు అని అడిగాడు ఇతను. 
నేనెవరైతే నీకెందుకు అవి నా మీద రుసరుస మంటున్నాయి. పక్కకి తీసుకెళ్ళు అంటూ ఉరిమిందిట.
మా డ్రైవర్ "ఇవి బసవన్నలు వాటిని కడిగి తీస్కపోవాలి; రోజు నేను ఈడ్నే కడుక్కుంటా, మా బసవన్నలకు కూడా అలవాటే" అంటూ ససేమిరా అన్నాడు. 
అయినా వినలేదుట. వాటిని ఒక వంక చూస్తూనే ఇతనితో మాట్లాడుతోందిట., ఇతనికి అర్ధమయింది. ఇదేదో పారానార్మల్ ఆక్టివిటీ అని వెంటనే ఆ బసవన్నల్ని ఆమె మీదకు తీసుకొచ్చాడుట. వెంటనే ఒక పొగలా మారి గాల్లో కలిసిపోయిందిట
Like Reply




Users browsing this thread: 3 Guest(s)