04-12-2020, 11:15 PM
నైస్ అప్డేట్
ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & Closed
|
05-12-2020, 11:48 AM
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
05-12-2020, 11:49 AM
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
05-12-2020, 11:49 AM
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
05-12-2020, 11:49 AM
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
05-12-2020, 11:50 AM
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
16-12-2020, 03:13 PM
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
16-12-2020, 05:03 PM
(This post was last modified: 16-12-2020, 05:04 PM by Joncena. Edited 1 time in total. Edited 1 time in total.)
కథ ఇక కొనసాగదు అందుకే చిన్నగా కథని చెప్పి ముగించేస్తున్నా.
మూడో వాడిని వాడికి వాడే చచ్చేలా చేసి, ఆ వీడియో విరాకి చూపించటంతో చిన్నపిల్లలాగ సంతోషంతో చప్పట్లు కొడుతుంటే, అది చూసి వీరూ కన్నీళ్ళు ఆపుకోలేక అంతా తన వల్లే జరిగింది అని ఏడుస్తుంటే బార్గవ్, స్వేచ్చ లకు చాలా సేపు పట్టింది వీరూని ఓదార్చటం. మోనాను కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉంచి తరువాత రెండో వాడిని చంపే ముందు తనని Singapore పంపిచేసి వీళ్ళ వల్ల చనిపోయిన అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఒక అన్నయ్య ఉండడంతో అతని ద్వారా ఒక క్లబ్‌లో బెట్టింగ్ కట్టించి రెండో వాడు ఆ అమ్మాయి అన్న చేతిలో ఓడేట్టుగా చేసి ఒక నది దగ్గరలోకి వచ్చేట్టుగా చేసి అక్కడ వాడికి వాడే చచ్చేల చేసి అది కూడా వీడియో తీసి విరాకి చూపించారు.
అలా రెండో వాడి చావు కూడా చూసిన విరాలో కొంచెం కొంచెంగా మార్పు వస్తుండడం గమనించారు వీరూ, స్వేచ్చ అలాగే బార్గవ్. అసలు వాడిని చంపటానికి సమయం కోసం చూస్తూ ఉన్నారు. వాడు వాడి ఇద్దరు మిత్రులూ చనిపోవటంతో ఎవరో కావాలని చేస్తున్నారు అని వాడికి అనుమానం వచ్చి inquiry మొదలు పెట్టించాడు వాడి అనుచరులతో. అసలు విషయం ఏమిటో తెలిసేదాకా Indiaకు రాకుండా foreign countryలో ఉండిపోయాడు. అలా వాడి గురించి, అవకాసంకోసం ఎదురుచూస్తూ ఉంటాడు వీరూ.
వీరూ అందరికీ దూరంగా ఉండేలా ఒక బంగళా కొనుక్కుని అక్కడ విరాతో కలిసి ఉంటాడు. కంపెనీకి వెళ్ళకుండా వీరూ ఎప్పుడూ విరా దగ్గరే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. విరా కూడా మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఒక పక్క వాడి అనుచరులకు ఇద్దరు ఇది అంతా చేసారు అని తెలుస్తుంది కానీ, వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఎవరూ అన్న విషయం తెలియదు. అలా ఒక సంవత్సరం తిరిగేటప్పటికి విరా ఒక పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. ఈ విషయాలు ఏమీ తెలియని పూజా ఒకసారి వీరూ దగ్గరకు వస్తుంది ప్రాజెక్ట్ పని మీద. తనకు తెలియదు విరానే వీరూ పెళ్ళి చేసుకున్నాడు అని.
పూజా వచ్చే సమయానికి మోహిని గార్డెన్‌లో ఒక పిల్లాడిని ఆడిస్తూ ఉంటుంది. పూజ మోహిని దగ్గరకు వెళ్ళి ఎవరి బాబు అని అడగ్గా, మోహిని వీరూ అన్నయ్య పిల్లాడు అని చెప్తుంది. అదే సమయానికి వీరూ కూడా ఇంటినుంచి బయటకు వస్తాడు. వెంటనే పూజా వీరూతో ఏమిటి నువ్వు చేసింది? నేను ప్రేమిస్తున్నా అంటే నువ్వు విరాని ప్రేమిస్తున్నాను అని, తనను తప్ప వేరే ఎవరినీ పెళ్ళి చేసుకోను అని చెప్పి మరి ఇప్పుడు ఎవరినో పెళ్ళి చేసుకుంటావా అని అడగ్గానే, మోహిని పూజాతో "పూజా! అన్నయ్య పెళ్ళి చేసుకుంది విరాజితనే. పెళ్ళిలో నాకే పెద్ద ట్విస్టులు ఇచ్చారు అన్నయ్య. ఈ బాబు కూడా విరా, అన్నయ్యల బాబే" అని చెప్పేసరికి; వీరూ అవును అని చెప్పి పూజాని విరా దగ్గరకు తీసుకెళతాడు.
ఇది జరిగిన కొన్ని రోజులకు పూజా అనుకోకుండా ఆ మొదటివాడిని కలుస్తుంది కంపెనీ ప్రాజెక్ట్ పని మీద. అప్పటికి తనకు తెలియదు విరా అలా అవ్వడానికి వాడే కారణం అని. ఒక రోజు అనుకోకుండా బయట కలిసినప్పుడు కొంచెం తప్పుగా ప్రవర్తిస్తే కంపేనీలో చెప్పినా పెద్దగా పట్టించుకోకపోయే సరికీ, ఆ విషయం వీరూతో చెప్తుంది. అది తెలుసుకుని వీరూ, పూజాని అతని ఫొటో పంపమని అడుగ్గా, సరే అని పంపిస్తుంది ఆఫీసులో జరిగిన ఒక పార్టీకి వాడు గెస్టుగా వచ్చినప్పటి ఫొటో. అది చూసిన వెంటనే పూజాకి జరిగింది మొత్తం చెప్పేస్తాడు వీరూ.
ఈ విషయం జరిగిన రెండు రోజులకు వాడిని ఒక farm house కొనేట్టుగా ఒక చోటూకు రప్పించి వాడిని రాహుల్‌చేత చంపించడం లైవ్‌లో చూపిస్తాడు విరాకు. అది జరిగిన మరుసటి రోజు రాహుల్ వెళ్ళి సెక్యూరిటీ ఆఫీసర్లకు లొంగిపోతాడు తన చెల్లిని మానభంగం చేసి చంపేసినందుకు గానూ ఆ ముగ్గురు స్నేహితులని తనే చంపేసాను అని. వీరూ, బార్గవ్ ఎంత చెప్పినా వినకుండా అలా చేస్తాడు. అది TVలో చూసిన రెండో వాడిని చంపటానికి వచ్చిన చనిపోయిన అమ్మాయ్యిల్లో ఒకరి అన్నయ్య అయిన అతను కూడా వచ్చి తను రాహుల్‌కు సహయం చేసాను అని, తన చెల్లి కూడా వాళ్ళా వల్లే చనిపోవటంతో ఇలా చేయాల్సి వచ్చింది అని. వీళ్ళిద్దరూ వీరూ దగ్గర మాట తీసుకుంటారు ఎట్టి పరిస్తుల్లో మాకు బెయిల్ తేవద్దు అని, మిగిలిన జీవితం అంతా ఇలా జైలులో ఉండనివ్వండి అని.
కథ సమాప్తం.
కథని ఆదరించిన అందరికీ ధన్యవాదములు
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
16-12-2020, 05:04 PM
ముందుగా నేను రాసిన ఈ కథను ఆదరించిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలూ అలాగే హృదయపూర్వక ధన్యవాదాలు.
![]() ![]() ![]() గత కొన్ని రోజుల క్రితం చెప్పిన సంఘటన వల్ల నా మనసు అసలు సరిగా ఉండడంలేదు. ఎంత ప్రయత్నించినా కథను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నా. అందుకే ఇక కథని ఆపేస్తున్నాను. కథని ఆపటానికి మనసు రావటంలేదు కానీ తప్పటంలేదు. కథ ఇంకొక మూడు లేదా ఐదు అప్డేటులు ఇవ్వటంతో అయిపోతుంది, కానీ ఎందుకో ఎంత ప్రయత్నించినా ఒక్క ఆలోచన కూడా రావటంలేదు. ![]() kummun Wrote:Hi brother..... hope u r doing good.... మిత్రుడు kummun చెప్పినట్టు నాకు కూడా అనిపించింది కానీ అలా ఎందుకు జరిగిందో అర్ధం కావటంలేదు. పైగా నేను ఇప్పుడు ఉన్న situationsలో ఇక site లోకి రాకపోవచ్చు. ఏమో కుదిరితే రచయితగా ఒక కొత్త కథతో వస్తాను లేదంటే ఎప్పటిలానే ఒక కథా చదువరిగా(reader) ఉండిపోతా. లేదంటే ఇక site లోకి మొత్తానికి రాకపోవటమే జరుగుతుంది. ఇలా చేస్తున్నందుకు అందరూ నన్ను మన్నించమని మనవి. ![]() ![]() బంధువులు అందరూ నా కుంటుంబంలోని అందరిని ఒక కార్నర్ చేసేసారు. వాళ్ళకు అవసరం పడినప్పుడు మాత్రమే మేము గుర్తుకు వస్తాం, అవసరంలేకపోతే మేము ఎందుకూ పనికిరాని వాళ్ళుగా కనిపిస్తాం వాళ్ళకు. ముఖ్యంగా నన్ను కార్నర్ చేసి నా జీవితంతో ఇంతకాలం వాళ్ళు ఆడుకున్నారు అని తెలియని స్థితిలో నేను ఉన్నా, ఎందుకంటే నేను అంతలా నమ్మాను వాళ్ళని. మొన్నీమధ్యన జరిగిన సన్నివేశాలు అన్నీ తలచుకుంటే వెనుకే ఉంటూ ఇంతా కుట్ర చేసారా అనిపించింది. నన్నూ, నా కుటుంబంలోని అందరినీ ఒక కార్నర్ చేయటానికి కారణం మేము వాళ్ళు చేసిన తప్పుని తప్పూ అని చెప్పటమే. అంతే కాకుండా వాళ్ళు చేసిన, చేస్తున్న తప్పుని కప్పిపుచ్చకపోవటమే అందుకు కారణం. మా వల్ల ఒకడు ఎప్పుడూ నష్టపోకూడదు అన్న ఒక moral value మాకు ఉండడమే వీటికి కారణం అయ్యి ఉండవచ్చు. మన చుట్టూ ఉన్న బంధువుల్లో గానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు గానీ చాలామంది ఈ క్రింద ఉన్న 5లో ఖచ్చితంగా ఉంటారు. 1. మనం బాగుపడకపోయినా పర్లేదు, మన పక్కన వాడు బాగుపడితే చాలు అనుకోవటం అతి మంచితనం లేదా ఒక విధంగా మూర్ఖత్వమే. 2. మనతో పాటూ మన పక్కన ఉన్నవాళ్ళు కూడా బాగుపడాలి అనుకోవడం మంచితనం. 3. మనం బాగుపడాలి, మన పక్కన వాడు నాశానం అవ్వాలి అనుకోవటం అవివేకం. 4. మనం బాగుపడకపోయినా పర్లేదు, మన పక్కన వాడు బాగుపడకూడదు అనుకోవటం మూర్ఖత్వం. 5. పక్కవాడిని తొక్కి అయినా మనం మాత్రమే బాగుపడాలి అనుకోవటం క్రూరత్వం. పైన చెప్పిన వాటిలో మొదటి రెండు నేను, నా కుటుంబం ఉంటే మా బంధువులు అందరూ కూడా 5వ రకానికి చెందిన వారే. అలాగని బంధువుల్లో అందరు అలా లేరు. ఒక రెండు ఫ్యామిలీలు మాత్రమే ప్రస్తుతం మా వైపు నిలుచున్నారు. ఏమో ఏమన్నా చేసి వాళ్ళని కూడా వాళ్ళ వైపు తిప్పుకున్నా ఆశ్చర్యపోనవసరంలేదు. పైన చెప్పిన 5 రకాల్లో 3,4 రకాలు ఎక్కువ ఉంటారు. 5వ రకంతో పోల్చుకుంటే అంత ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ అంతో ఇంతో ఉండొచ్చు. So, కొంచెం మీ చుట్టు ఉన్నవాళ్ళని కూడా కాస్త గమనిస్తూ జీవితంలో అందరూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ. ఇక సెలవు, మీ Joncena ![]() ![]() ![]()
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
16-12-2020, 05:28 PM
నా లాస్ట్ లాగిన్ ఎప్పుడు అన్నది నేను ఇప్పటి వరకూ హైడ్ చేసా, అది ఇప్పుడు పబ్లిక్ చేసేసా. నేను ఎప్పుడు లాగిన్ అయ్యానో మీకు తెలుస్తుంది. సో అది గమనించ గలరు.
సో ఎవరన్నా నన్ను కథ ముగుంచి నందుకు తిట్టాలి అని అనుకుంటే ముందు అది చూసి తిట్టమని ప్రార్ధన. నా లాస్ట్ లాగిన్ ఎప్పుడో మీరు చూసినట్లు అయితే నేను కథ ఆపేసి వేరే వాళ్ళ కథకు కామెంట్లు పెడుతున్నాట్టు మీకు అనిపిస్తే నిరభ్యంతరంగా నన్ను తిట్టవచ్చు. నేను ఏ విధంగాను అడ్డు చెప్పను. Once again thanks to everyone who supported me till now. By Yours Joncena Signing off
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
16-12-2020, 10:51 PM
Manchi vallaku eppudu manche jaragalani korukunta bro
16-12-2020, 10:53 PM
Meeku Mee kutumbhaniki manche jaragalani nenu koru kutunna. all the best u r bright future bro
17-12-2020, 12:58 PM
(16-12-2020, 10:51 PM)M.S.Reddy Wrote: Manchi vallaku eppudu manche jaragalani korukunta bro Thanks for your support bro. (16-12-2020, 10:53 PM)M.S.Reddy Wrote: Meeku Mee kutumbhaniki manche jaragalani nenu koru kutunna. all the best u r bright future bro Thank you so much bro
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
17-12-2020, 12:58 PM
(This post was last modified: 17-12-2020, 01:07 PM by Joncena. Edited 1 time in total. Edited 1 time in total.)
Respect everyone
![]() ![]() My first story: ప్రేమ+పగ=జీవితం
24-03-2021, 06:50 PM
(16-12-2020, 05:04 PM)Joncena Wrote: ముందుగా నేను రాసిన ఈ కథను ఆదరించిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలూ అలాగే హృదయపూర్వక ధన్యవాదాలు. ![]() |
« Next Oldest | Next Newest »
|