Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
26-10-2020, 10:31 PM
(This post was last modified: 27-10-2020, 11:52 AM by అన్నెపు. Edited 3 times in total. Edited 3 times in total.)
నాకు ‘‘హోమ్‌లాండ్’’ టీవీ సీరియల్ చాలా యిష్టం. టెర్రరిజం, గూఢచర్యం నేపథ్యంతో అల్లిన కల్పితకథ, పాత్రల మధ్య హైఓల్టేజి హ్యూమన్ డ్రామా, అనుక్షణం కలిగే ఉత్కంఠ, వాస్తవంగా జరుగుతోందనిపించే లొకేల్స్, తారల అభినయం, పెర్ఫెక్ట్ చిత్రీకరణ - దేనిలోనూ వంక పెట్టడానికి వీల్లేదు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో లభ్యమయ్యే తొమ్మిదేళ్ల కితం నాటి యీ సీరియల్ చాలామంది చూసే వుంటారు. చూడనివారి కోసం దాని కథాంశాన్ని పరిచయం చేద్దామని యీ ప్రయత్నం. పేర్లు రాసేటప్పుడు వాళ్ల అసలు పేరు (ముందు వస్తుంది), యింటిపేరు (తర్వాత వస్తుంది) రెండూ చెపుతున్నాను. తరచుగా వాడేదాన్ని బ్రాకెట్‌కు బయట, వాడనిదాన్ని బ్రాకెట్ లోపల సూచిస్తున్నాను.
ఇది నచ్చితే ఆ సీరియల్ తప్పక చూడండి. ఆ పాత్రలు మిమ్మల్ని వెంటాడతాయి. వేర్వేరు డైరక్టర్లు డైరక్ట్ చేసినా ఎపిసోడ్స్‌లో హెచ్చుతగ్గులుండవు. కానీ దిగంబర దృశ్యాలు, సంభోగ సన్నివేశాలు, బూతుమాటలు యిబ్బంది పెట్టవచ్చు, డైలాగ్సు అర్థం కాని నా బోటి వాళ్లు సబ్‌టైటిల్స్ చదవాల్సి రావచ్చు. ఈ చికాకు వద్దనుకునేవారికి యీ రచన ఉపకరిస్తుంది. ఈ సీరీస్‌లో మొదటి రెండు సీజన్లలో జరిగిన కథను చెప్తాను. పాఠకుల స్పందన బాగుంటే తక్కిన వాటి గురించి ఆలోచించవచ్చు.
నిజానికి యీ సీరీస్‌కు మూలం - ఇజ్రాయిలీ టివిలో ప్రసారమైన ‘హెతుఫిమ్’’ (ప్రిజనర్స్ ఆఫ్ వార్) అనే సీరియల్. జిడియన్ రాఫ్ సృష్టించారు. దీన్ని హోవర్డ్ గార్డన్, అలెక్స్ గాన్సా అనే వారు అమెరికన్ టివికై మలుచుకుంటూ అమెరికాలోని గూఢచారి సంస్థలో జరిగినట్లు మార్చుకున్నారు. అమెరికాలో గూఢచారి ఏజన్సీలు రెండు. ఎఫ్బిఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దేశంలో గూఢచర్యం చేస్తే, సిఐఏ (సెంట్రల్ ఇంటెలిజన్స్ ఏజన్సీ) విదేశాల్లో గూఢచర్యం నెరపుతుంది. దేశాధ్యక్షుడుండే వైట్‌హౌస్‌కు 9 మైళ్ల దూరంలో వర్జీనియా రాష్ట్రంలో ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలో ఉన్న లాంగ్లీ అనే ప్రాంతంలో జార్జి బుష్ సెంటర్లో సిఐఏ హెడ్‌క్వార్టర్స్ ఉంది. దాని విభాగాల్లో ఒకటైన కౌంటర్`టెర్రరిజం శాఖ వ్యవహారాల గురించి యీ కథ నడుస్తుంది.
మన కథానాయిక క్యారీ (ఇంటిపేరు మాతిసన్) ఆ శాఖలోనే ఎనలిస్ట్‌గా పని చేస్తోంది. దానికి డైరక్టరుగా ఉన్నతను డేవిడ్ (ఎస్టెస్) తన కొలీగ్స్ నందరినీ అత్యవసర సమావేశానికి పిలవడంతో కథ ప్రారంభమైంది. కథాకాలం నాటికి ఒసామా బిన్ లాడెన్ మరణించాడు. అతని స్థానంలో వచ్చిన ఆబు నజీర్ తన టెర్రరిస్టు కార్యకలాపాలతో అమెరికాను ఎదుర్కుంటున్నాడు. అయితే గత కొద్దికాలంగా స్తబ్దంగా ఉన్నాడు. ఎక్కడ దాగున్నాడో తెలియకుండా ఉంది. సిఐఏలో మెరికల్లాటి వారితో తయారు చేసిన డెల్టా ఫోర్స్ మధ్య ప్రాచ్య దేశాలన్నిటిలో అతని కోసం గాలిస్తోంది.
వాళ్లు యీ మధ్యే అఫ్గనిస్తాన్‌లో టెర్రరిస్టులకు చెందిన కాంపౌండుపై దాడి చేశారు. అక్కడి బిల్డింగులోని నేలమాళిగలో ఒక ఖైదీ దొరికాడు. వీళ్లను చూడగానే ‘నన్ను కాల్చకండి. నేను అమెరికన్‌ని’ అన్నాడు. అతను (నికొలస్) బ్రాడీ. యుఎస్ మెరీన్స్‌లో సార్జంటుగా పనిచేసేవాడు. 2003లో ఇరాక్‌పై యుద్ధం చేసే రోజుల్లో సిరియా సరిహద్దుల్లో సద్దాం హుస్సేన్ సేనలకు యుద్ధఖైదీగా పట్టుబడ్డాడు. ఇతనితో బాటు టామ్ (వాకర్) అనే కొలీగ్ కూడా పట్టుబడ్డాడు. వీళ్లిద్దరినీ అల్ ఖైదా కమాండర్ అయిన అబు నజీర్‌కు వాళ్లు అమ్మేశారు. అతను వీళ్లని డమాస్కస్‌లో బంధించి వుంచాడు. వాళ్లిద్దరూ చచ్చిపోయారని అమెరికా ప్రకటించడం కూడా జరిగిపోయింది. టామ్‌ను చంపేశారని, తనను మాత్రం 8 ఏళ్లగా బందీగా ఉంచారని బ్రాడీ చెప్పుకున్నాడు.
డెల్టా వాళ్లు అతన్ని రక్షించి, డీబ్రీఫ్ చేయించి, అంటే యిన్నాళ్లూ ఏం జరిగిందో ప్రశ్నలూ అవి వేసి సమాచారం రాబట్టి, వాషింగ్టన్ డిసిలో ఉన్న అతనింటికి పంపించడానికి నిశ్చయించుకున్నారు. ఆ విషయం చెప్పడానికే డేవిడ్ తన శాఖ వారందరినీ పిలిచాడు. విషయం విన్న వెంటనే సూక్ష్మగ్రాహి ఐన క్యారీకి ఓ విషయం గుర్తుకు వచ్చింది. ఎవరికీ తట్టని సంగతలు కూడా ఆమెకు తడతాయి. సాహసే కానీ దూకుడు ఎక్కువని కొలీగ్స్ అభిప్రాయం. మిడిల్ ఈస్ట్‌లో చాలాకాలం పనిచేసింది. స్థానికులలో కొందర్ని గుర్తించి వారిని తన ఇన్‌ఫార్మర్లగా (రహస్యంగా సమాచారం అందించేవారు), ఏజంట్లగా మార్చేది. తర్ఫీదు యిచ్చేది.
ఆమె ఇరాక్‌లో సిఐఏ కేస్ ఆఫీసరుగా పనిచేసే రోజుల్లో అవతలి పక్షాన బాంలు తయారీ చేసే ఒకణ్ని ఇన్ఫార్మర్గా మార్చింది. అది తెలిసిపోయి అవతలివాళ్లు అతన్ని ఉరి వేసేస్తున్నారు. ఒక ముఖ్యమైన సమాచారం చెప్తానని అతను జైలు నుంచి యీమెకు కబురంపాడు. ఈమె వెళితే ‘నా కుటుంబాన్ని కాపాడాలని షరతు విధించి ‘మీ యుద్ధఖైదీల్లో ఒకడు మా వైపు తిరిగిపోయాడు’ అని చెవిలో చెప్పాడు. ఈలోగా అతన్ని గార్డులు లాక్కుని పోయారు. ఈమె అనుమతులు లేకుండా అక్కడకి వచ్చినందుకు పెద్ద వివాదమైంది. శిక్షగా ఆమెను ఇరాక్ నుంచి వెనక్కి రప్పించి, హెడ్‌క్వార్టర్స్‌లో ప్రొబేషన్‌లో ఉంచారు.
అతను చెప్పిన ఫిరాయింపుదారు యీ బ్రాడీయేమోనని క్యారీకి అనుమానం వచ్చింది. నజీరే కావాని డెల్టా ఫోర్స్ వచ్చే సమయానికి తన నేలమాళిగలో అతను దొరికేట్లు చేసి, అమెరికాకు పంపిస్తున్నాడేమో, ఇతను యిక్కడకు వచ్చి మిలటరీ రహస్యాలన్నీ అల్ ఖైదాకు రహస్యంగా అందచేస్తాడని ఆమె సంశయం. అతనిపై కొంతకాలం రహస్యంగా నిఘా పెట్టి నిగ్గు తేల్చాలని ఆమె ఉద్దేశం. దాన్ని డిపార్టుమెంటులోనే తన గురువు, హితైషి ఐన సాల్ (బెరెన్సన్)కి చెప్పింది.
అతను మిడిల్`ఈస్ట్ (మధ్యప్రాచ్య దేశాలు) డివిజన్‌కు చీఫ్‌గా ఉన్నాడు. అక్కడ చాలా ఏళ్లు పనిచేశాడు. క్యారీని రిక్రూట్ చేసి, తర్ఫీదు యిచ్చినది అతనే. క్యారీని అర్థం చేసుకునే అతి తక్కువ మందిలో ఒకడు. సోదరిలా భావించి మాటిమాటికీ సాయపడుతూ ఉంటాడు. ప్రస్తుతం యీ శాఖలో పని చేస్తున్నాడు. అంతా విని ‘అబ్బే, దీనికి మన బాస్ డేవిడ్ ఒప్పుకోడు. బ్రాడీని పెద్ద హీరోగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నువ్విలా సందేహాలు వ్యక్తం చేస్తే పిచ్చిదానివని ముద్ర కొడతారు జాగ్రత్త.’ అన్నాడు.
దేశంలో రాజకీయ వాతావరణం ఏమిటంటే - (విలియం) వాల్డెన్ అనే అతను సిఐఏకు డైరక్టరుగా పని చేసి టెర్రరిజాన్ని అణచాడని పేరు తెచ్చుకుని వైస్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యాడు. త్వరలో రాబోయే ఎన్నికలలో అధ్యక్షుడిగా పోటీ చేద్దామని చూస్తున్నాడు. ప్రస్తుత అధ్యక్షుడికి టెర్రరిజాన్ని ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు లేవని, దానికి తనే తగునని చెప్పుకోవాలని అతని రాజకీయ ఎజెండా. అయితే నజీర్ యీ మధ్య చల్లారి వుండడంతో టెర్రరిజం పెద్ద అంశంగా చూడటం లేదు జనాలు. ఇప్పుడీ బ్రాడీ దొరికాడు కాబట్టి యితన్ని చూపించి ‘టెర్రరిజం యింకా సజీవంగానే ఉంది. దాని కోరల్లోంచి బయట పడిన యితన్ని చూడండి, ఇతను నేషనల్ హీరో. ఇతనికి తగిన హోదా కల్పించి, నజీర్‌ను పట్టుకునేవరకూ మన పోరాటం సాగుతూనే ఉండాలి. అది నా వల్లనే అవుతుంది.’ అని చెప్పుకోవాలని అతని ప్లాను.
ఈ వాల్డెన్కు క్యారీ బాస్ అయిన డేవిడ్ తొత్తు. అతను సిఐఏలో వుండే రోజుల్లో యితనికి బాగా లిఫ్ట్ యిచ్చాడు. ఒకప్పుడు సాల్కి రిపోర్టు చేసే స్థాయిలో ఉన్న డేవిడ్‌ను యిప్పుడు సాల్‌కు సీనియరుగా చేసిన ఘనుడు వాల్డెనే. డేవిడ్ అతని మాట జవదాటడు కాబట్టి, బ్రాడీపై నిఘాకు ఒప్పుకోడని సాల్ అవగాహన. క్యారీ తనంత తనే ఎవరికీ చెప్పకుండా నిఘా పెడదామనుకుంది. సిఐఏకు కాంట్రాక్టు నిఘా పనులు చేసి పెట్టే వర్జిల్ అనే అతనికి పరిమిత బజెట్‌లో బ్రాడీ యిల్లంతా వైరింగ్ చేసి, కెమెరాలు, మైకులు పెట్టి, నిరంతర నిఘా చేసి పెట్టమని కోరింది. అతను వాళ్ల తమ్ముడు మాక్స్‌ని వెంట తెచ్చుకుని బ్రాడీ కుటుంబం అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్టు వెళ్లిన టైములో ఆ ఏర్పాటు చేస్తానన్నాడు.
బ్రాడీ కుటుంబానికి వస్తే - అతను మెరీన్స్‌లో చేరడానికి ముందే జెసికా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు డానా అనే కూతురు, క్రిస్ అనే కొడుకు ఉన్నారు. ఇరాక్ వెళ్లే సమయానికి డానాకు 8, యిప్పుడు 16. తండ్రి బాగానే గుర్తున్నాడు. క్రిస్‌కు 4, యిప్పుడు 12. తండ్రి బొత్తిగా గుర్తు లేడు. బ్రాడీ యుద్ధంలో తప్పిపోయాడని తెలిసినపుడు జెసికా కలతపడింది కానీ నిబ్బరంగానే ఉంది. వేరే ఎవరితోనూ సంబంధం పెట్టుకోకుండా పిల్లల్ని పోషిస్తూ వచ్చింది. ఆరేళ్ల తర్వాత అతను పోయాడని ప్రభుత్వం ప్రకటించింది.
ఇక అప్పుడామె మైక్ (ఫెబర్) అని భర్త కొలీగ్, ఆప్తమిత్రుడుతో ప్రేమలో పడింది. శారీరక సంబంధం కూడా పెట్టుకుంది. అతను పిల్లల్ని ఒక తండ్రిలా చూసుకునేవాడు. నేడో రేపో, అతన్ని యింటికి తీసుకుని వచ్చి పిల్లల ఎదుట తన పునర్వివాహం గురించి ప్రకటిద్దామని అనుకుంటూండగా బ్రాడీ సజీవంగా ఉన్న వార్త బయటకు వచ్చింది. అతను బయటకు వస్తూనే భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. సరిగ్గా ఆ సమయానికి ఆమె మైక్‌తో శృంగారంలో ఉంది. ఎలా రియాక్టవాలో కాస్సేపు తెలియలేదు. ఎయిర్‌పోర్టుకి వచ్చి రిసీవ్ చేసుకుంటామంది. పిల్లలతో సహా వెళ్లింది.
బ్రాడీ ఏదో ఘనకార్యం చేసివచ్చినంత హడావుడి జరిగింది ఎయిర్‌పోర్టు వద్ద. ఇంటికి వచ్చాక కూడా లోపకి వెళ్లకుండా యింటి బయటే విలేకరులు చుట్టుముట్టారు. ఇన్నాళ్ల బందిఖానా ఎలా వుందని, బతికి వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నావనీ బ్రాడీని, తిరిగిరాడనుకున్నవాడు తిరిగి వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నావని జెసికాను అడిగారు. ఆమె బాధ వర్ణనాతీతం. ఆమె యీపాటికి అతన్ని మనసులోంచి తుడిచేసి మైక్‌తో వివాహానికి సిద్ధపడింది.
ఇప్పుడితను తిరిగి వచ్చాడు కాబట్టి మైక్‌తో నీ దారిన నువ్వు పో అనడం అన్యాయంగా తోచింది. పిల్లలకూ అంతే, మైక్యే వాళ్లను ఆటలకు తీసుకెళ్లి, కాలేజీ ఫంక్షన్‌కు తోడుగా వచ్చి అన్నీ చేశాడు. ఈరోజు అతన్ని వేరే వ్యక్తిగా చూడడం కష్టం. కూతురు డానాకు 16 ఏళ్లు కాబట్టి ఆమెకు తల్లి భావాలు అర్థమౌతున్నాయి. ఈ సంఘర్షణ మధ్య బ్రాడీ పునరాగమనం జరిగింది. ఈ హడావుడి అంతా జరుగుతూండగానే బ్రాడీ యింట్లో వర్జిల్ టీము కెమెరాలు, స్పీకర్లు అమర్చేసి సమయానికి బయటపడింది. నిరంతర నిఘాకు క్యారీ, వర్జిల్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రాడీ యింట్లో ఏ గదిలో ఏం జరిగినా క్యారీ యింట్లో స్క్రీన్లలో అది కనబడుతుంది, వినబడుతుంది.
క్యారీకి పెళ్లి కాలేదు. తల్లి ఎక్కడికో దూరంగా వెళ్లిపోయింది. తండ్రి దగ్గర్లోనే వేరే ఊళ్లో ఉన్న పెద్దకూతురు మ్యాగీ, ఆమె పిల్లల దగ్గర ఉంటున్నాడు. క్యారీ తన తిండితిప్పల గురించి పట్టించుకోదు. ఎప్పుడూ పని ధ్యాసే. ఇంట్లో వండుకోదు. తినడానికి ఏమీ ఉండదు. ఇదంతా చూసి వర్జిల్‌కు చికాకేసింది.
క్యారీకి కాలేజీ రోజులనుంచీ బైపోలార్ డిజార్డర్ ఉంది. అది ఆమెకు తండ్రి నుంచి సంక్రమించింది. దాని కారణంగా కొన్ని సమయాల్లో డిప్రెషన్‌కు లోనవుతుంది, మరి కొన్ని సమయాల్లో అత్యుత్సాహంగా ఉంటుంది. రెగ్యులర్‌గా మందు వేసుకోకపోతే ఆ మూడ్స్ ఉన్మాదస్థాయికి చేరతాయి కూడా. తన జబ్బు గురించి డిపార్టుమెంటులో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. సైకియాట్రిస్టుగా పని చేస్తున్న అక్క తన ఆఫీసు నుంచి దొంగతనంగా తెచ్చి యిస్తున్న మందు ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ వేసుకుంటూంటుంది. ఆ విషయం వర్జిల్ తమ్ముడు గమనించాడు కానీ ఎందుకులే అని క్యారీని అడగలేదు.
మర్నాడు బ్రాడీని సిఐఏ ఆఫీసుకి పిలిపించారు. డేవిడ్ అతని టీము అల్‌ఖైదా ఖైదీగా అతని అనుభవాల గురించి అడిగారు. అందరూ హీరోగా చూస్తున్నా క్యారీ మాత్రం అనుమానంగా చూస్తూ ‘అబు నజీర్‌ను స్వయంగా చూశారా?’ అని అడిగింది. అబ్బే లేదన్నాడతను. కానీ నిజానికి అతను నజీర్‌తో మాట్లాడివున్నాడు. (ఇలాటివన్నీఫ్లాష్ కట్ ల ద్వారా మనకు దృశ్యరూపంగా చూపిస్తారు) క్యారీకి నమ్మకం చిక్కక, మళ్లీ అడిగింది. డేవిడ్ ప్రశ్నలాపు అన్నాడు.
క్యారీ ప్రతిభ చూసి అందరూ అసూయ పడుతూంటారు - డేవిడ్‌తో సహా! డేవిడ్‌కు, ఆమెకు గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. దాని కారణంగా అతని వైవాహిక జీవితం భగ్నమై, భార్య దూరంగా వెళ్లిపోయింది కూడా. ప్రస్తుతం క్యారీకి ఏ ఘనతా దక్కకుండా చూడడమే డేవిడ్ పని. తనని వదిలేస్తే ఏదో ఒక తిక్క పని చేసి, నెత్తిమీదకు తెస్తుందని అతని భయం.
ఈ సమావేశం తర్వాత బ్రాడీ పార్కులో ఎవరినో కలవడానికి వెళ్లాడు. అల్‌ఖైదా తాలూకు మనిషినే కలుస్తున్నాడనుకుని క్యారీ, వర్జిల్, మాక్స్ అతన్ని వెంటాడారు. తీరా చూస్తే అతను కలిసినది తన తోటి ఖైదీగా ఉన్న టామ్ భార్య హెలెన్‌ను. తన భర్త మాయమయ్యాక ఎక్కువకాలం వేచి చూడకుండా వేరేవాణ్ని పెళ్లి చేసేసుకుందని జెసికాకు ఆమెపై చిన్నచూపు. అందుకని యింటికి రాకుండా పార్కులో కలవమని కబురు పెట్టిందామె. ‘మా ఆయన చనిపోయిన మాట వాస్తవమేనా?’ అని అడిగిందామె. ‘అవును, చచ్చేదాకా కొట్టేరట’ అన్నాడు బ్రాడీ. ‘అతను చనిపోయినపుడు నువ్వు ఉన్నావా?’ అని అడిగిందామె. లేదని చెప్పాడు కానీ నిజానికి అతనే నజీర్ ఆదేశాలపై టామ్‌ను చావబాదాడు.
క్యారీ యింటికి తిరిగి వెళ్లేసరికి సాల్ అక్కడున్నాడు. నిఘా సామగ్రి చూసి ‘ఏమిటిదంతా? చట్టవిరుద్ధంగా చేస్తున్నావని రిపోర్టు చేస్తాను’ అని బెదిరించి వెళ్లిపోయాడు. క్యారీ మనసు చెడిపోయింది. మతి పోయింది. ఏం చేయాలో తోచక ఓ క్లబ్‌కు వెళ్లి కూర్చుంది. అక్కడ ఓ గిటారిస్టు తీగలపై లయబద్ధంగా తన వేళ్లు కదిలించడం గమనించింది. అదే పద్ధతిలో బ్రాడీ కెమెరా ఎదుట తన వేళ్లను లయబద్ధంగా ఆడించిన సంగతి గమనించింది. అంటే అల్‌ఖైదా స్లీపర్ సెల్స్ ఎవరికో వేళ్ల కదలిక ద్వారా రహస్య సంకేతాలు అందిస్తున్నాడన్నమాట. సాల్ యింటికి వెళ్లి పేపరు క్లిప్పింగులు, వీడియోలు అన్నీ చూపించి యిప్పుడేమంటావ్ అంది. ఎవరైనా దీన్ని డీకోడ్ చేయగలిగితే మర్మం బయట పడుతుంది అంది.
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
సాల్‌కు మీరా అనే భారతీయురాలితో పెళ్లయింది కానీ యితను నిరంతరం పనిలో మునగడంతో విసిగిపోయి, ఆమె ఇండియా వెళ్లి సామాజిక సేవలో పడింది. అందువలన అతనిదీ ఒంటరి బతుకే. తామెవ్వరికీ లేని సిక్స్త్ సెన్స్ క్యారీకి ఉందని అతని నమ్మకం. ఒకవేళ క్యారీ చెప్పినది నిజమే అయితే అని సందేహం వచ్చింది. చివరకు ఒక జడ్జి దగ్గరకు వెళ్లి గతంలో అతను చేసిన వెధవపనిని కప్పెట్టడానికి తను చేసిన సాయాన్ని గుర్తు చేసి, బ్రాడీకి వ్యతిరేకంగా ఒక ఫిసా వారంటు జారీ చేయించుకున్నాడు.
దాని ప్రకారం 4 వారాల పాటు బ్రాడీపై నిఘా వేయడానికి తాత్కాలిక అనుమతి లభించింది. ఆ పత్రాన్ని క్యారీకి యిచ్చి, డిపార్టుమెంటులో ఎవరికీ తెలియకుండా పని చేయమన్నాడు. ఈ లోగా తన డిపార్టుమెంటులో క్రిప్టోగ్రాఫీ టీముకు బ్రాడీ వీడియోలు చూపించి, తన వేళ్ల కదలిక ద్వారా యిస్తున్న సందేశాలేమిటో డీకోడ్ చేసి చెప్పమన్నాడు. వాళ్లు ప్రయత్నించారు కానీ వాటిలో ఒక నియమిత పద్ధతి కనబడటం లేదని చెప్పారు.
బ్రాడీ రాత్రి సరిగ్గా పడుక్కోడు. తన స్నేహితుడు టామ్‌ను తనే గోతిలోకి తోసి కప్పెట్టిన దృశ్యం గుర్తుకు వచ్చి ఉలిక్కిపడి లేచాడు. అరబిక్ భాషలో ఏదో అంటూ భార్య భుజాన్ని గట్టిగా పట్టుకుని గాయపరిచాడు. మర్నాడు ఉదయం అతని భార్య ఆ గాయాలు చూపించి, ఏమిటిదంతా అంది. మానసికంగా సర్దుకోవడానికి నాకు కాస్త టైమియ్యి అన్నాడు. ఆమె, పిల్లలు బయటకు వెళ్లిపోయాక ఏళ్ల తరబడి ఇరాక్‌లో బందీగా ఉన్న పద్ధతిలో తన బెడ్రూమ్లోనే ఓ మూల ఒదిగి, మౌనంగా కూర్చున్నాడు. క్యారీ యివన్నీ తన కెమెరాల ద్వారా గమనిస్తోంది. సాల్కి చెపుతోంది.
క్యారీ అరబ్ ప్రాంతంలో పనిచేసే రోజుల్లోనే లిన్ (రీడ్) అనే ఒక అందమైన అమెరికన్ అమ్మాయిని సౌదీ అరేబియా రాచకుటుంబంలో యిన్ఫార్మంట్గా ప్రవేశపెట్టింది. ఫరీద్ (బిన్ అబ్దుల్) అనే ఒక యువరాజుకి అమ్మాయిల పిచ్చి అని తెలిసి అతని అంతఃపురానికి చేర్చింది. ఇక అక్కణ్నుంచి అతనికి ప్రియురాలిగా ఉండడమే కాక, అతనికి నచ్చే అమ్మాయిలను దేశదేశాల్లో యింటర్వ్యూ చేసి అంతఃపురానికి చేర్చడమే ఆమె పని. ప్రస్తుతం వాషింగ్టన్కు ఆ పని మీదే వచ్చింది. ఆమె వెంట నిరంతరం ప్రిన్స్ అసిస్టెంటు లతీఫ్ ఉంటూ వుంటాడు.
ఆమె ఒకమ్మాయిని యింటర్వ్యూ చేస్తూనే మధ్యలో ఏదో గుర్తుకు వచ్చినట్లు స్పాకు ఫోన్ చేసి రేపు ఫలానా టైముకి నాకు ఎపాయింట్మెంట్ కావాలని అడిగింది. ఆ విధంగా అక్కడ క్యారీని కలుసుకునే ఏర్పాటు చేసుకుంది. క్యారీని కలిసినపుడు ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. ఇన్నాళ్లూ స్తబ్దంగా ఉన్న అబు నజీర్ యిటీవలే స్వయంగా వచ్చి ప్రిన్స్‌ను కొద్ది నిమిషాలపాటు కలిశాడని, తన సెల్లో దాన్ని వీడియో తీశానని చెప్పి చూపించింది. దీని అర్థం నజీర్ మళ్లీ చురుకుగా కార్యకలాపాలు చేపట్టబోతున్నాడన్నమాట. దానికి బహుశా ప్రిన్స్ ధనసహాయం కోరుతున్నాడన్నమాట.
క్యారీ వెంటనే డేవిడ్‌కు యీ సంగతి చెప్పి లిన్‌కు అమెరికాలో రక్షణ కల్పించాని కోరింది. సమాచారం విలువైనదని డేవిడ్ ఒప్పుకుంటూనే లిన్‌కి రక్షణ కల్పించడం మన బాధ్యత కాదన్నాడు. అలా కావాలంటే ప్రిన్స్ ఫోన్లోంచి డేటాను ఒక పరికరంలోకి డౌన్లోడ్ చేయాలని, తద్వారా అతని ఫోన్లో ఉన్న డేటా, దాని ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ తమకు తెలుస్తాయని చెప్పాడు. అతి త్వరగా డౌన్లోడ్ చేసే పరికరాన్ని కూడా క్యారీకి యిచ్చాడు.
ప్రిన్స్ అసిస్టెంటు లతీఫ్‌తో సహా లిన్ హోటల్లోంచి బయటకు వస్తూ ఉండగా క్యారీ మనిషి ఒక టీ కప్‌తో ఆమెను గుద్దేసి, ఆమె బాత్రూమ్కి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించాడు. బాత్రూమ్లో క్యారీ ఆ పరికరాన్ని లిన్‌కు యిచ్చి ఎలా ఉపయోగించాలో చెప్పింది. ప్రిన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తే నా పని ఆఖరని ఆమె భయపడితే, నిన్ను నిరంతరం మా టీము కాపలా కాస్తోందని ధైర్యం చెప్పింది.
తర్వాతి రోజు లిన్ ధైర్యం చేసి, ప్రిన్స్ తన సెల్ బెడ్రూమ్లో విడిచి బయటకు వెళ్లిన కొద్ది క్షణాల సమయంలో గబగబా యీ పరికరంలోకి డేటాను డౌన్లోడ్ చేసేసింది. ఇంతలో ప్రిన్స్ తిరిగి వచ్చాడు. అతను గమనించాడేమోనని ఆమె గుండెలు పీచుపీచు మంటూండగానే ఇప్పటిదాకా నువ్వు అందించిన మధురానుభూతికి కానుకగా.. అంటూ ప్రిన్స్ ఒక పెద్ద డైమండ్ నెక్లెస్ ఆమె మెడలో వేశాడు.
బ్రాడీ యిన్నాళ్లదాకా సజీవంగా ఉండి, యిప్పుడే అమెరికాకు తిరిగిరావడం, నజీర్ యిప్పుడే మళ్లీ యాక్టివేట్ కావడానికి మధ్య లింకు ఉందని క్యారీకి గట్టి అనుమానం. అమెరికా జనం తనను హీరోగా చూస్తున్నారని తెలిసి బ్రాడీ ఒక ముఖ్యమైన పదవి చేజిక్కించుకుని, దాని ద్వారా నజీర్‌కు లోగుట్టు సమాచారం అందిస్తూ సాయపడతాడని ఆమె ఊహ. కానీ బ్రాడీ ఆమె అనుకున్నట్లు ప్రవర్తించటం లేదు, పబ్లిసిటీ కోరుకోవడం లేదు.
ఓ రోజు ఓ జర్నలిస్టు అతని యింటి ప్రాంగణంలో చొరబడి ప్రశ్డలడగబోతే అతని పీక పిసికివేయబోయాడు. ఆ సన్నివేశం తన కొడుకు చూడడంతో డిస్టర్బ్ అయ్యాడు. అక్కణ్నుంచి ఎటో వెళ్లిపోయాడు. ఊరంతా తిరిగి చివరకు ఓ స్టోర్స్‌లో ఓ ప్లాస్టిక్ చాప కొనుక్కున్నాడు. రాత్రి ఆస్యంగా ఇల్లు చేరి తన గరాజ్లో ఆ చాప దాచాడు. అయితే యివన్నీ క్యారీ కంట పడలేదు. ఎందుకంటే బయటకు వెళ్లినపుడు ఏం చేశాడో తెలియలేదు. గరాజ్లో ఏం దాచాడో చూద్దామంటే అక్కడ కెమెరాలు పెట్టలేదు. నువ్విచ్చిన బజెట్‌లో అవి రాలేవు అన్నాడు వర్జిల్.
ఆ రాత్రి డిన్నర్‌కి బ్రాడీ స్నేహితుడు, జెసికా ప్రియుడు ఐన మైక్ (ఈ సంగతి క్యారీ టీము గమనించారు. విడిగా వున్నపుడు వాళ్లు మాట్లాడుకున్నవి వీళ్లకు తెలిసిపోయింది) వచ్చాడు. అతను కెప్టెన్ హోదాలో ఉన్నాడు. ‘మళ్లీ మెరీన్స్‌లో చేరరాదా? ప్రమోషన్ యిస్తారు, డబ్బు యిబ్బంది కూడా ఉండదు.’ అని హితవు చెప్పాడు. బ్రాడీ అది అవమానకరంగా ఫీయ్యాడు. ‘నీచేత యీ ఆఫర్ చేయించిన పెద్దలకు నన్ను పోస్టర్‌బాయ్‌గా చూడడానికి ప్రయత్నించవద్దని చెప్పు. అమెరికన్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకునే రోజులు ముగిసిపోయాయని చెప్పు’ అంటూ అరిచాడు. ఇది విని క్యారీ, అయితే బ్రాడీ అమాయకుడన్నమాట అనుకుంది.
ఆ రాత్రే బ్రాడీకి గతం గుర్తుకు వచ్చింది. అతను ఒక రోజున చూసుకుంటే బంధనాలన్నీ విప్పేసి వున్నాయి. తన గదిలోంచి బయటకు వచ్చి ఆ కాంపౌండులో అటూయిటూ నడుస్తూ ఉన్నా ఎవరూ ఏమీ అనటం లేదు. అతను ఒక పెద్ద హాల్లోకి తొంగి చూస్తే అక్కడ అనేకమంది ముస్లిములు నేలమీద కార్పెట్లు పరిచి నమాజ్ చేసుకుంటున్నారు. ఈ దృశ్యం గుర్తుకు రాగానే బ్రాడీకి మెలకువ వచ్చేసింది. బెడ్రూమ్లోంచి సడి చేయకుండా గరాజ్‌కు వెళ్లి కొత్తగా కొన్న మ్యాట్ వేసుకుని నమాజ్ చేయసాగాడు.
అంటే బందీగా ఉన్న రోజుల్లో అతను మతం మార్చుకున్నాడన్నమాట అని మనకు అర్థమౌతుంది. అయితే యిదేమీ క్యారీకి తెలియదు. ఆమెకు తెలిసిందల్లా మర్నాడు బ్రాడీ మెరీన్ యూనిఫామ్ వేసుకుని బయటకు వెళ్లి అక్కడ తనకోసం వేచి ఉన్న మీడియాతో దేశం, దేశసేవ, కుటుంబం కూడా చేసే త్యాగం గురించి లెక్చరివ్వడం. అది చూస్తూనే క్యారీ సాల్‌కు ఫోన్ చేసి ‘అంతా మనం అనుకున్నట్లే జరుగుతోంది. అతను హీరో కార్డు ప్లే చేస్తున్నాడు’ అంది.
ఒక టీవీ ఛానెల్ వాళ్లు అతన్ని, అతని ఫ్యామిలీని యింటర్వ్యూ చేస్తామన్నారు. అతను సరేనన్నాడు కానీ, అతని భార్య జెసికాకు, కూతురు డానాకు అది యిష్టం లేదు. జెసికా తన స్నేహితురాలితో ‘మీడియా ఎటెన్షన్ పెరిగినకొద్దీ, నాకు మైక్‌తో ఉన్న అనుబంధం బయటకు వచ్చేస్తుంది. భర్తకోసం యిన్నాళ్లూ వేచివున్న పతివ్రతగా వీళ్లు బిల్డప్ చేసిన యిమేజి చెదిరిపోతుంది. ఇదంతా నాకు అవసరమా? చెఱ నుంచి బయటకు వచ్చిన బ్రాడీ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఒళ్లంతా గాయాల మచ్చలే. మేం కలిసి వుంటామో, విడిపోతామో తెలియదు. కానీ ప్రేక్షకుల చప్పట్ల కోసం కెమెరా ముందు మేం ఒక ఆదర్శప్రాయమైన కుటుంబంలా నటించాలి.’ అంటూ వాపోయింది.
డానా అయితే తన తల్లితో ‘నీకూ మైక్‌కు ఉన్న ఎఫైర్ నాకు తెలుసు. ఇప్పుడు పెద్ద విశ్వాసపాత్రమైన భార్యగా కెమెరా ముందు ఎలా నటిస్తావ్?’ అని నిలదీసింది. తన స్నేహితులతో ‘నేను టీవీ ముందు పిచ్చిపిచ్చిగా మాట్లాడి, అందరి పరువూ తీస్తాను చూడు’ అంది కూడా. ఆమెకు ఒక బాయ్‌ఫ్రెండు జాండర్ ఉన్నాడు. అతను ఆమె తమ్ముడికి ట్యూటర్. కానీ అది మానేసి యీమెతో రొమాన్సు చేస్తూంటాడు. జెసికా యిది సహించలేదు. కూతుర్ని తిడుతూంటుంది. కానీ 16 ఏళ్ల వయసు పిల్ల కాబట్టి ఊరుకో అంటాడు బ్రాడీ. డానా తన తలిదండ్రుల గురించి జాండర్తో తన మనసు విప్పి చెప్పుకుంది.
బ్రాడీ యివన్నీ వూహించాడు. నిజానికి తిరిగి వచ్చిన వెంటనే మైక్ తన స్థానంలో పాతుకుపోయిన సంగతి గమనించాడతను. భార్యకూ, మైక్‌కు రొమాన్సు నడుస్తోందని, పిల్లలూ అతనితో చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారని అర్థం చేసుకున్నాడు. కానీ దాని గురించి భార్యని నేరుగా అడగదలచుకోలేదు. కూతురు టీనేజిలో ఉంది కాబట్టి, తల్లిని ద్వేషిస్తోందని గ్రహించి, ఇంటర్వ్యూకి ముందు ఆమెను విడిగా పిలిచి ‘అమ్మ తప్పొప్పులు ఎంచకు. మనం ఒక విచిత్రమైన పరిస్థితిలో యిరుక్కున్నాం. సాధారణ స్థితి రావడానికి, మనమంతా రీఎడ్జస్టు కావడానికి కొంత టైము పడుతుంది’ అని నచ్చచెప్పాడు.
ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన టీవీ కెమెరాల వాళ్లు తమ యాంగిల్స్ కోసం సామాను అటూయిటూ జరుపుతామన్నారు. అలా జరిగితే తాము పెట్టిన కెమెరాలు బయటపడతాయని క్యారీ టీము భయపడింది. కానీ అదృష్టవశాత్తూ బ్రాడీ ఎక్కడున్నవి అలాగే ఉండనీయ మన్నాడు. టీవీ వాళ్లు మొదట బ్రాడీని యింటర్వ్యూ చేశారు. ‘యుద్ధఖైదీగా ఎలా వుండగలిగావు?’ అని అడిగారు. ‘వాళ్లు నా నమ్మకాలపై దెబ్బ కొడదామని చూశారు. మీ మెరీన్ ఫోర్స్ వాళ్లు నీ గురించి పట్టించుకోలేదు చూశావా అన్నారు. మీ ఆవిడ వేరే ఎవరితోనో కులుకుతోందని చెప్పారు. అయినా అవన్నీ నేను తట్టుకున్నాను.’ అని చెప్పాడితను.
నిజానికి అదే సమయంలో అతని మనసులో నజీర్ తనను దెబ్బల నుంచి తప్పించి, తిండి పెట్టడం మసలుతోంది. కానీ పైకి మాత్రం తను పడిన కష్టాల గురించే చెపుతున్నాడు. తర్వాత కుటుంబంతో జరిగిన యింటర్వ్యూ సజావుగా నడిచింది. డానా కూడా తగువిధంగా మాట్లాడి కుటుంబం పరువు కాపాడింది.
లిన్ క్యారీని కలిసి డేటా డౌన్లోడ్ చేసిన పరికరాన్ని వెనక్కి యిచ్చేసింది. గత ఏడాదిగా ప్రిన్స్ చెంతనే ఉన్నాననీ, అతనికి టెర్రరిస్టు లింకులు ఉన్నాయని అనుకోవడానికి వీల్లేదని, నజీర్ అతన్ని మర్యాదపూర్వకంగా కలిసి వుండవచ్చని చెప్పింది. ఆ పరికరంలోని డేటాను క్యారీ తన డిపార్టుమెంటులో శోధింపచేసినా, అతను టెర్రరిస్టులకు డబ్బు బదిలీ చేసిన దాఖలాలు ఏవీ కనబడలేదు. తర్వాత లిన్ కొత్తగా చేర్చుకున్న అమ్మాయిలతో ఓ నైట్ క్లబ్లో వుండగా లతీఫ్ వచ్చి ‘‘ప్రిన్స్ ఒక పెద్ద వ్యాపారస్తుడితో కలిసి వ్యాపారం చేద్దామనుకుంటున్నారు. నిన్ను వెళ్లి అతన్ని సుఖపెట్టమన్నారు.’’ అని చెప్పాడు. ‘‘ఇలాటిది ఎప్పుడూ చెప్పలేదే! ఏమైనా ఉంటే ఆయనే చెప్పేవాడుగా!’’ అంది. ‘‘ఎవరికి ఎలా చెప్పించాలో ఆయనకు తెలుసు.’’ అన్నాడు లతీఫ్ గుంభనంగా.
లిన్ బాత్రూమ్కు వెళ్లి అక్కణ్నుంచి క్యారీకి చెప్పింది. వాడెవడో టెర్రరిస్టు అయి వుంటాడని గెస్ చేసిన క్యారీ ‘తప్పకుండా వెళ్లు, నీకు రక్షణగా మా టీము ఉంది.’ అని ధైర్యం చెప్పింది. నిజానికి తనూ, వర్జిల్ మాత్రమే ఆమె వెనక ఫాలో అయ్యారు. లిన్ కారెక్కిన కాస్సేపటికి ఓ సందులోకి రాగానే కారు డ్రైవరే ఆమెను కాల్చి చంపేసి డైమండ్ నెక్లెస్ లాగేసుకున్నాడు. క్యారీ, వర్జిల్ వచ్చేసరికి ఆమె శవం సందులో పడి ఉంది. రక్షిస్తానని చెప్పి విఫలమైనందుకు క్యారీ చాలా బాధపడింది. ‘ఇక్కడుంటే ప్రమాదం, వెళ్లిపోదాం’ అని వర్జిల్ ఆమెను తొందరపెట్టడంతో శవాన్ని అక్కడే వదిలేసి వచ్చింది.
ఆసుపత్రిలో శవాన్ని చూడడానికి వచ్చిన ఆమె తలిదండ్రులను కలిసి బాధ పంచుకుంది. లిన్‌ను రక్షించలేకపోయిన వేదనను సాల్‌తో పంచుకుంటూ, తన డేటా డౌన్లోడ్ చేసిన విషయం తెలుసుకుని ప్రిన్స్ ఆమెను చంపించేసి వుంటాడంది. అదే సమయంలో లిన్ హత్య గురించి ప్రిన్స్‌ను సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రశ్నలడిగిన దృశ్యాలు టీవీలో వచ్చాయి. అవి చూసి ప్రిన్స్‌కి లిన్ అంటే నిజంగా యిష్టమని వీళ్లకు అర్థమైంది. అతనికి టెర్రరిస్టులతో లింకులు లేవేమో అని కూడా తోచింది.
అప్పుడు సాల్ ‘డబ్బు బదిలీ అంటే మనం బ్యాంకు ఖాతాలు మాత్రమే చూస్తున్నాం. తరతరాలుగా డబ్బు చేతులు మారే అతి సులభమైన మార్గం జ్యూవెలరీ. ఆమెను చంపి, ఆ నగ అమ్మి, ఆ డబ్బును టెర్రరిస్టులకు యిస్తూండవచ్చు. ప్రిన్స్‌కు దీనితో సంబంధం లేకపోవచ్చు. అతని వెంట ఉన్నవారెవరో అతనికి తెలియకుండా యీమెను చంపేసి వుంటారు.’ అన్నాడు. అదే సమయానికి ప్రిన్స్ అసిస్టెంటు లతీఫ్ ఆ నెక్లెస్‌ను 4 లక్షల డాలర్లకు అమ్మేస్తున్నాడు.
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
బ్రాడీని గన్నరీ సార్జంట్‌గా ప్రమోట్ చేశారు. పబ్లిక్ ఫంక్షన్స్ అనేకవాటిల్లో అతను పాల్గొంటున్నాడు. వాటిల్లో చాలా బాగా మాట్లాడుతూండడంతో అతనికి పేరొస్తోంది. వైస్ ప్రెసిడెంటు వాల్డన్ కన్ను అతనిపై పడింది. అతని పాప్యులారిటీని వాడుకుందామా అన్న ఆలోచన వచ్చింది. అతని అడ్వైజర్‌గా పని చేస్తున్న ఎలిజబెత్ (గైన్స్) డేవిడ్‌ను కలిసి బ్రాడీని కాంగ్రెస్‌మన్‌గా చేయిద్దామను కుంటున్నామని, కానీ అతను మానసికంగా స్థిరంగా ఉన్నాడా లేదా అని గమనించి చెప్పమని కోరింది. ఎందుకంటే యుద్ధం నుంచి తిరిగివచ్చినవారు, యిలా యుద్ధఖైదీలుగా ఏళ్ల తరబడి వున్నవారు గతస్మృతులతో బాధపడుతూ మెంటల్ బాలన్స్ కోల్పోతారని అందరికీ తెలిసిన విషయం.
నిజానికి బ్రాడీ విషయంలో అదే జరుగుతోంది. ఒక ఫంక్షన్ జరిగాక అతనితో బాటు కారులో మైక్ కూడా వస్తున్నాడు. తన కుటుంబం తన కంటె మైక్‌నే ఎక్కువ అభిమానిస్తోందన్న విషయం బ్రాడీని మండిస్తోంది. ‘నేను లేనప్పుడు నా స్థానంలో నా భార్యకు, కుటుంబానికి అండగా వున్నావ్’ అంటూ వెటకారంగా మాట్లాడాడు. ఇంటికి వెళ్లాక భార్యతో కూడా ‘నీకూ మైక్‌కు మధ్య వ్యవహారం నడిచిన సంగతి నాకు తెలుసులే’ అని నర్మగర్భంగా మాట్లాడాడు.
క్యారీ చేతిలో ఉన్న నాలుగువారాల వారంటు ముగిసిపోవడానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ఏమీ దొరకలేదు, మళ్లీ పొడిగించగలవా అని సాల్‌ను అడిగింది. ‘కుదరదు, నువ్వు వెంటనే ఆ నిఘా సరంజామా అంతా తొలగించాలి. ఈ బ్రాడీని వదిలిపెట్టి, ఆ నగ తాలూకు సొమ్ము ఎటు వెళ్లిందో దానిపై దృష్టి పెట్టు’ అన్నాడు సాల్. మర్నాడు బ్రాడీ కుటుంబం యావత్తు చర్చికి వెళ్లింది. ఆ సమయంలో క్యారీ, వర్జిల్, మాక్స్ వెళ్లి సామానంతా తీసేశారు.
బ్రాడీ గరాజ్‌కు తరచుగా వెళుతూండడం, దానిలో కెమెరాలు లేకపోవడం వలన అక్కడ అతన్ని గమనించ లేకపోవడం క్యారీకి బాధగా ఉంది. అందుకని ఆఖరి నిమిషంలో తను గరాజ్‌కు వెళ్లి అన్నీ క్షుణ్ణంగా చూసింది. అక్కడ నమాజ్ చేసుకునే మ్యాట్, చేతులు కాళ్లు కడుక్కునే బేసిన్ కనబడ్డాయి కానీ ఆమె వాటి గురించి ఏమీ ఆలోచించలేక పోయింది. అవి నమాజ్‌కు సంబంధించినవి అని గ్రహించి వుంటే యితను ముస్లిముగా మారాడా, టెర్రరిస్టులతో చేతులు కలిపాడా అనే కోణంలో ఓ అడుగు ముందుకు వేసేది.
క్యారీ తన ఆఫీసులో లిన్ హత్య జరిగిన 9 గంటల తర్వాత గమనించిన విషయాలు వివరించింది. ప్రిన్స్ అనుచరులందరిపై నిఘా పెడితే అతని సెక్రటరీ లతీఫ్ అనుమానస్పదుడిగా తోచాడు. అతను ఒక లాండ్రోమార్ట్ (ఇంట్లో వాషింగ్ మెషిన్లు లేనివారు అక్కడున్న వాషింగ్ మెషిన్లలో బట్టలు ఉతుక్కోవచ్చు) వద్ద కనబడ్డాడు. డబ్బు చేతులు మారే హవాలా కార్యకలాపాలకు ఆ షాపు కేంద్రమని సిఐఏకు ముందే తెలుసు. అక్కడకు వెళ్లి అతను నగ అమ్మిన డబ్బు అందించి, అల్‌ఖైదా మనుష్యులకు తలా కాస్తా పంచమని చెప్పి వుండవచ్చు.
లాండ్రోమార్ట్ దగ్గర పెట్టిన సెక్యూరిటీ కెమెరాల ద్వారా అప్పణ్నుంచి యిప్పటిదాకా 51 మంది కస్టమర్లు వచ్చి వెళ్లారని గమనించారు. వారిలో కొందరు నిజమైన కస్టమర్లు కావచ్చు, కొందరు టెర్రరిస్టులు కావచ్చు. ఎవరెవరో తెలియదు కాబట్టి యీ 51 మందిపై నిఘా పెట్టాలని నిశ్చయించుకున్నారు. ఈ 51 మందిలో రకీమ్ (ఫైజల్) అనే సౌదీ అరేబియా దేశస్తుడు క్యారీ దృష్టిని ఆకర్షించాడు. ఎందుకంటే అతను యిటీవలే మూడుసార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు.
అతను అవటానికి ప్రొఫెసరే అయినా నిజంగా అల్‌ఖైదాకు సాయపడుతున్నాడు. అతన్ని దీనిలోకి దింపినది ఐలీన్ (మోర్గన్) అనే అమెరికన్ ప్రియురాలు. వాళ్లు ఒక ఎయిర్‌పోర్టుకి దగ్గర్లోనే యీ మధ్యే యిల్లు కొన్నారు. మొత్తం డబ్బంతా ఒకేసారి చెల్లించడంతో ఏజంటు ఆశ్చర్యపడ్డాడు కూడా. విమానాల రొద మాకేమీ యిబ్బంది కాదు, యిది మాకు చాలా సౌకర్యం కూడా అన్నారు వాళ్లు. నిజానికి యింటి పైకప్పు నుంచి రైఫిల్‌తో విమానం నుంచి దిగేవాళ్లపై సులభంగా గురి పెట్టవచ్చు.
క్యారీ, ఆమెతో బాటు డేనీ (గాల్వెజ్) అనే సహచరుడు మర్నాడు రకీమ్‌ను వెంటాడి, వాళ్ల యింటికి వెళ్లి సంగతులు కనిపెట్టాలని అనుకున్నారు. అలాగే అతను కాలేజీ నుంచి బయటకు వచ్చాక కారులో వెంబడించారు. అతను వాళ్ల యింటి ముందు కారాపి వుంటే, ఎయిర్‌పోర్టు దగ్గర యిల్లెందుకు ఉంది అనే కోణంలో ఆలోచించేవారు. కానీ అతను వస్తూండగానే యింటి దగ్గర ఐలీన్‌కు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘తను వచ్చే రోడ్డు మీద ట్రాఫిక్ బాగా లేదని అతనికి చెప్పు.’’ అని.
అల్‌ఖైదాలో సిఐఏ ఏజంట్లు ఉన్నట్లే, సిఐఏలో, దాని అనుబంధ సంస్థల్లో అల్‌ఖైదా ఏజంట్లు ఉండి, యిలా సమాచారాన్ని అందించేస్తారు. దాన్ని బట్టి అవతలవాళ్లు జాగ్రత్త పడతారు. ఫోన్ రాగానే ఐలీన్ కిటికీలో అమెరికన్ జండా వేలాడదీసింది. అది ఒక సంకేతం. ఏదో ప్రమాదం ఉందని గ్రహించి రకీమ్ కారు ఆ యింటి దగ్గర ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. అతని ప్రవర్తనలో వింతగా ఏమీ తోచకపోవడంతో క్యారీ, డేనీ అతన్ని అనుమానితుల జాబితాలోంచి కొట్టేశారు.
బ్రాడీ యింట్లో పార్టీ జరుగుతోంది. మైక్ కూడా వచ్చాడు. జెసికా అతనికి యిస్తున్న ప్రాధాన్యత చూసి, బ్రాడీ తిక్కతిక్కగా అయిపోయాడు. పెద్ద గన్ తీసుకుని వచ్చి తన పెరట్లో తిరుగుతున్న లేడిని కాల్చి చంపేశాడు. అతని కొడుక్కి ఆ లేడి అంటే ప్రాణం. బ్రాడీ యింత క్రూరంగా ప్రవర్తించడం చూసి, అందరూ తెల్ల బోయారు. మెల్లగా జారుకున్నారు. ఆ రాత్రి జెసికా మొగుణ్ని దులిపేసింది. ‘నువ్వు తిరిగి వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను. మామూలు మనిషిలా లేవు. రాత్రిళ్లు కలవరిస్తూ ఉంటావు. నన్ను సుఖపెట్టే క్షణాలు లేవు. పోనీలే అని ఊరుకుంటున్నాను. ఇంత నిర్దయగా ఆ మూగజీవిని చంపేస్తావా? పిల్లలు నిన్ను చూసి భయపడరా? దయచేసి నువ్వు కౌన్సిలింగ్‌కు వెళ్లు. లేకపోతే నీతో వేగడం మహా కష్టం.’ అని. బ్రాడీ ఏమీ అనలేక తల వంచుకున్నాడు.
మర్నాడు బ్రాడీ వెటరన్స్ (యుద్ధభూమిలో గాయపడి తిరిగి వచ్చినవారు)కు సహాయపడేందుకు ఏర్పరచిన సమావేశానికి వెళ్లాడు. ఇప్పటివరకు రుజువు ఏవీ లభించకపోయినా క్యారీకి బ్రాడీమీద అనుమానం పోలేదు. అతన్ని వెంబడించి, మాటలు కలుపుకుని, సన్నిహితంగా మెలగి, అతన్నించి సమాచారం రాబట్టాలని నిశ్చయించుకుంది. బ్రాడీని వెంబడించి ఆ సమావేశస్థలానికి వెళ్లింది. అనుకోకుండా అతన్ని అక్కడ చూసినట్లు నాటకమాడింది.
ఆమెను చూడగానే ‘సిఐఏ డిబ్రీఫింగ్ సెషన్లో మనం కలిశాం కదా’ అన్నాడతను. వెంటనే ఆమె ‘అయ్యో, యిక్కడి వాళ్లకు నేను సిఐఏ అని తెలియదు. నీ ద్వారా అది బయటపడిపోతుంది. ఇక్కడకు రాకుండా ఉండాల్సింది, ఛ, ఛ’ అంటూ బయటకు వచ్చేసింది. కానీ బ్రాడీ కూడా ఆమె వెంట బయటకు వచ్చాడు. ఇద్దరూ కాస్సేపు అవీయివీ మాట్లాడుకున్నారు. ఉద్యోగధర్మంగా తనూ ఇరాక్‌లో పనిచేశానని బ్రాడీకి చెప్పింది. యుద్ధభూమిలో వుండే యిబ్బందులు మామూలు వాళ్లకు తెలియవని యిద్దరూ మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది.
ఇరాక్‌లో బ్రాడీ ఖైదీగా ఉండే రోజుల్లో గార్డుగా పని చేసిన (అఫ్సల్) హమీద్ పాకిస్తాన్ ప్రభుత్వానికి దొరికాడు. వాళ్లు అతన్ని సిఐఏకి అప్పగించారు. అతని ద్వారా నజీర్ గురించి తెలుసుకుందామని ఐడియా. అసలతను నజీర్ వద్ద పనిచేసేవాడా కాదా తెలుసుకుందామని బ్రాడీని లాంగ్లీకి పిలిపించి, పక్కనున్న అబ్జర్వేషన్ గదిలో కూర్చోబెట్టారు. అతనితో పాటు క్యారీ కూడా కూర్చుంది. వాళ్ల ఎదురుగా ఉన్న వన్‌సైడ్ అద్దాల గదిలో హమీద్‌ని కూర్చోబెట్టి సాల్ వెళ్లి అతన్ని యింటరాగేట్ చేశాడు. కానీ అతను నోరు విప్పటం లేదు.
బందీగా ఉండగా తనను చిత్రహింసలు పెట్టిన హమీద్ గురించి బ్రాడీ సాల్‌కు సీక్రెట్ మైకు ద్వారా కొన్ని వివరాలు అందించాడు. వాటి సహాయంతో అతను హమీద్‌తో ‘నీ సంగతంతా మాకు తెలుసు, నీ అంతట నువ్వే నజీర్ గురించి సమాచారమిస్తే నీ కుటుంబానికి రక్షణ కల్పిస్తాం. లేకపోతే హింసలు పెడతాం.’ అని బెదిరించాడు. అయినా హమీద్ తొణకలేదు. ఇక దానితో లైట్లు పూర్తిగా వేసి పెట్టి, విపరీతమైన శబ్దంతో మ్యూజిక్ వినిపించి అతనికి పిచ్చెక్కించారు.
ఇలా కొన్ని గంటలు గడిచాక అతను భరించలేక ‘‘నాకు పెద్దగా తెలియదు కానీ, ఒకసారి ఒక ఈమెయిల్ ఎడ్రసుకు మెసేజి పంపమంటే పంపా’’ అన్నాడు. అయితే ఆ ఈమెయిల్ ఏమిటో చెప్పమన్నారు. చెప్పాడు. అది క్యారీ, డేనీ అమాయకుడనుకుని వదిలేసిన రకీమ్ ఈమెయిల్ ఐడీయే. వెంటనే అతని యింటి ఎడ్రెస్ కూడా తెలుసుకున్నారు. క్యారీ హమీద్‌ను ‘బ్రాడీ, నజీర్ ఎప్పుడైనా ముఖాముఖీ కలిశారా లేదా చెప్పు’ అంది. ‘నా కుటుంబాన్ని రక్షించినట్లు నాకు నమ్మకం కుదిరితేనే నోరు విప్పుతా’ అన్నాడతను.
ఓ పక్క యీ ఎంక్వయిరీ జరుగుతూండగానే బ్రాడీ వచ్చి డేవిడ్‌ను కలిశాడు. ‘‘నన్ను ఒకసారి హమీద్‌ను ముఖాముఖీ కలవనివ్వండి. వాడి చేతుల్లో నేనెన్నో బాధలు అనుభవించాను. రోజులెప్పుడూ ఒకలా వుండవు, చూడు యిప్పుడు నువ్వు బందీగా ఉన్నావు. నేను స్వేచ్ఛగా ఉన్నాను అని చెప్పాలని వుంది. దీనితో నా గతంలోంచి నేను బయటకు వచ్చే అవకాశం ఉంది.’ అని బతిమాలాడు.
అలా అనుమతించడం చట్టవిరుద్ధం. కానీ యితను రేపు వైస్ ప్రెసిడెంటుకు సన్నిహితుడయితే, తనకు మేలు చేస్తాడు కదాని డేవిడ్ ఓ యిద్దరు గార్డులతో సహా బ్రాడీని గదిలోకి పంపించాడు. బ్రాడీ హమీద్‌ను తిట్టనారంభిస్తే అతను హఠాత్తుగా యితనిపై ఉమ్మేశాడు. బ్రాడీ అతనిపై కలియబడి, నేలమీదకు తోసేశాడు. వెంటనే పక్కనున్న గార్డులు వాళ్లని విడదీసి బ్రాడీని బయటకు పంపేశారు.
నిజానికి బ్రాడీ అవేళ తన కొడుకు క్రిస్‌ను దగ్గరుండి కరాటే మ్యాచ్‌లో ఆడడానికి తీసుకెళతానన్నాడు. కానీ యిలా వచ్చేశాడు. దాంతో సమయానికి మైక్ వచ్చి తీసుకెళ్లాడు. ఇంటికెళ్లాక యీ విషయం తెలిసి బ్రాడీ చికాకు పడ్డాడు. మైక్‌కు మొక్కుబడిగా థాంక్స్ చెప్పి, క్రిస్ గదిలోకి వెళ్లి చూస్తే అతను దేవుణ్ని ప్రార్థిస్తున్నాడు. ఎందుకని అడిగితే ‘నువ్వు బతికి వుండాలని ఎనిమిదేళ్లగా మేం ప్రార్థిస్తూ వచ్చాం. ఇప్పుడు నువ్వు బాగుపడాలని ప్రార్థిస్తున్నాం’ అన్నాడు. బ్రాడీ సిగ్గుపడ్డాడు.
క్యారీ రకీమ్ యింటికి వెళ్లింది. వీళ్లు వచ్చేసరికే ఆ యిల్లు ఖాళీ చేసి రకీమ్, ఐలీన్ పారిపోయారు. సిఐఏ నుంచే సమాచారం లీకై ఉంటుందని క్యారీకి తోచింది. ఇంతలో మరో విషయం తెలిసింది. హమీద్ బందీగా ఉండగానే మణికట్టు కోసుకుని చనిపోయాడు. గదిలో వెతికితే ఓ బ్లేడు ముక్క దొరికింది. అది ఎలా వచ్చింది? అతను పట్టుబడితే తన గురించి ఏమైనా చెపుతాడేమోనని నజీర్ సిఐఏలోని తన మనుష్యుల చేత అతనికి బ్లేడు అందేట్లా చేసి వుంటాడు. సిఐఏ చిత్రహింసలు పెడుతుందన్న భయంతో హమీద్ దాని సహాయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సిఐఏలో నజీర్ మనిషి ఎవరు?
క్యారీ యీ లైనులో ఆలోచిస్తూండగానే డేవిడ్ బ్రాడీని హమీద్ గదిలోకి అనుమతించిన విషయం తెలిసింది. దాని తాలూకు వీడియో కూడా చూసింది. బ్రాడీయే బ్లేడు ముక్క తనతో పాటు తీసుకెళ్లి కొట్లాట సమయంలో హమీద్‌కు అందచేసి వుండవచ్చు అని తోచింది. తమతో పాటు గదిలో కూర్చున్నపుడు సిసి కెమెరాలు కవర్ చేయని బ్లయిండ్ స్పాట్ ఏదో గుర్తించి, అటువైపు హమీద్‌ను లాక్కెళ్లి యిచ్చి వుండవచ్చు. బ్రాడీ నజీర్ నుంచి ఆదేశాలు అందుకుంటున్నాడేమో!
ఇలా ఆలోచిస్తూ సాల్ యింటికి వెళ్లి చర్చించబోయింది. సాల్ అప్పటికే పీకలోతు వ్యక్తిగత సమస్యల్లో ఉన్నాడు. అతని భార్య మీరా యితనితో మళ్లీ కలిసుందామనే ఆశతో ఇండియా నుంచి వచ్చి పదిహేను రోజులైంది. కానీ ఆమె ఉన్ననాళ్లూ యితను పనిలో తలమునకలా మునిగి వున్నాడు. ఒక్కరోజు కూడా కూర్చుని మాట్లాడుకోలేదు. ఒక్క రాత్రీ కలిసి పడుక్కోలేదు. ఇంకెందుకు యిక్కడ, నేను వెనక్కి వెళ్లిపోతాను అంటోంది మీరా. ఆ టైములో క్యారీ వెళ్లి బ్రాడీ గురించి తన అనుమానాలు చెప్పింది.
‘ఇంతమాత్రానికే బ్రాడీ టెర్రరిస్టు అని తీర్మానించలేం. దానికి యింకా ఆధారాలు కావాలి. ఆ బ్లేడు అందించినది ఎవరో తెలుసుకోవాలి ’ అన్నాడు సాల్. డేవిడ్ అతన్ని గదిలోకి అనుమతించడం తప్పు కదా, నేను నిలదీసి అడుగుతాను అంది క్యారీ. అలా అడిగితే నీ ఉద్యోగం పోతుంది జాగ్రత్త అన్నాడు, అసలే చికాకులో ఉన్న సాల్. క్యారీకి కోపం వచ్చి బయటకు వచ్చేసింది. ఆఫీసుకి వెళ్లి తన సరంజామా సర్దుకుని పక్క వూరిలో ఉన్న అక్క యింటికి వెళ్లింది. ఉద్యోగం మానేస్తే మంచిదని ఆలోచించసాగింది.
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
క్యారీ తన అక్క యింట్లో వున్నపుడు ఆమె కూతుళ్లిద్దరూ చిన్నవాళ్లయినా తీవ్రవాదు గురించి ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకుంది. ‘‘మీకేం ఫరవాలేదర్రా, నేనున్నానుగా కాపాడేందుకు’’ అని వాళ్లకు చెప్పింది. వాళ్లకే కాక తనకూ చెప్పుకుంది ` దేశం కోసమైనా, మానాభిమానాు పక్కన పెట్టి అదే వృత్తిలో కొనసాగాని. లాంగ్లీకి తిరిగి వచ్చింది. హమీద్‌కు బ్లేడ్ ఎలా వచ్చిందో తెలియాంటే అందరికీ పాలీగ్రాఫ్ టెస్టు జరిపించాని ప్రతిపాదించింది. ఎవరైనా అబద్ధం చెపితే వారి శరీరంలో కలిగే మార్పును పసిగట్టే పరీక్ష అది. స్టాఫ్‌తో బాటు బ్రాడీని కూడా రప్పిస్తారని అతని నిజస్వరూపం బయటపడుతుందని ఆమె ఆలోచన. విధిలేక డేవిడ్ దానికి ఒప్పుకోవసి వచ్చింది.
మొదట క్యారీనే పిలిచారు. అన్నీ బాగానే చెప్పింది కానీ ‘చాటుగా మందులేవైనా తీసుకుంటున్నావా?’ అని అడిగినపుడు కాస్త తడబడి చివరకు ఔనని చెప్పేసింది. అయితే అది ప్రస్తుతానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి వాళ్లు పట్టించుకోలేదు. డేవిడ్ కూడా టెస్టు చేయించుకున్నాడు. వైవాహిక జీవితం గురించి అడిగినపుడు అతను తడబడ్డాడు. ఎందుకంటే భార్య అతన్నుంచి విడిపోయి వేరే ఉంటోంది. అప్పుడప్పుడు ప్లిల్ని యితని దగ్గరకు పంపిస్తోంది.
ఇక్కడ యిది జరుగుతూండగానే సాల్ రకీమ్ యింటికి వెళ్లి చుట్టుపక్క వాకబు చేశాడు. అతనితో బాటు ఒక అమ్మాయి కూడా వుండేదని తెలిసిందతనికి. ఆ పాటికే రకీమ్, ఐలీన్ కారులో వేరే ఊరిలో ఉన్న ఒక ఖాళీ యింటికి చేరారు. అక్కడకి వెళ్లి కొన్నాళ్లు అణగిమణగి వుండమని ఐలీన్‌కు ఆదేశాు వచ్చాయి. ఇంట్లోకి వెళ్లబోతూండగానే తుపు మీద ఒక బూబీ ట్రాప్ పెట్టారని అర్థమైంది. తమ గురించి సిఐఏకు తెలిసిపోయింది కాబట్టి అల్‌ఖైదా తమనిక వద్చుకుందామని చూస్తోందని, అందుకే యిక్కడకు రప్పించి తుపు తెరిస్తే బాంబు పేలేలా ఏర్పాటు చేసి చంపేద్దామనుకున్నారని అర్థమైంది ఐలీన్‌కు. రకీమ్‌ను హెచ్చరించి, వెనక్కి లాగింది. ఇద్దరూ కారెక్కారు.
‘‘మనకిప్పుడు టెర్రరిస్టునుంచి, ప్రభుత్వాన్నుంచి యిద్దరి నుంచి ముప్పుంది. తప్పు ఒప్పుకుని లొంగిపోదాం.’’ అన్నాడు రకీమ్. అతను స్వతహాగా పిరికివాడు. కొందరు సౌదీల్లా అతనికి టెర్రరిజం మీద ప్రేమ ఏమీ లేదు. ఐలీన్మీద ప్రేమతో ఆమె చెప్పినది చేస్తున్నాడంతే. అవటానికి అమెరికనే అయిన ఐలీన్‌కు అల్‌ఖైదా అంటే సానుభూతి వుంది. ‘‘నేను నిన్ను యిందులోకి దింపినందుకు క్షమించు. కానీ యీ పరిస్థితుల్లో సిఐఏకు పట్టుబడితే వాళ్లు అల్‌ఖైదా గురించి చెప్పమని చిత్రహింసు పెడతారు. సిఐఏ లోని అల్‌ఖైదా మనుష్యు మనల్ని చంపేస్తారు. మనం మెక్సికో పారిపోయి, దాంకుందాం.’’ అంది రకీమ్‌తో. ఏం చెయ్యాలో తోచక అతను తూపాడు. కారును ముందుకి పోనిచ్చాడు.
మర్నాడు బ్రాడీతో బాటు ఖైదీగా పట్టుబడి హతుడైన టామ్ స్మారక కార్యక్రమం చర్చిలో జరిగింది. అతనితో పని చేసిన మెరీన్స్ అందరూ వచ్చారు. కుటుంబంతో సహా వచ్చిన బ్రాడీ తన ఉపన్యాసంలో టామ్‌కు ఘనమైన నివాళి అర్పించాడు. కానీ మనసులో టామ్‌ను తను చితకబాదుతున్న దృశ్యాు మెదుతూనే ఉన్నాయి. అందరూ టామ్‌ను తచుకుని కన్నీరు కార్చారు. చర్చి హాల్లోంచి బయటకు వచ్చాక క్యారీ అక్కడకు వచ్చి బ్రాడీని విడిగా కలిసి ‘నువ్వు రేపు లాంగ్లీకి రావాని చెప్పమన్నారు.’ అని చెప్పి వెళ్లిపోయింది. జెసికా అది చూసింది కానీ తనెవరో ఆమెకు తెలియలేదు.
స్మారక కార్యక్రమం తర్వాత ఆ సాయంత్రం టామ్ భార్య హెలెన్, ఆమె ప్రస్తుత భర్త విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మెరీన్సందరూ తాగుతూ పాత విషయాను నెమరేసుకున్నారు. వారిలో లాడర్ (వేక్ఫీల్డ్) అని యుద్ధంలో కాు పోగొట్టుకుని అవిటివాడైన అతనున్నాడు. పక్కా తాగుబోతు. అవేళ కూడా తాగుతూనే మీ యిద్దరూ ఎలా పట్టుబడ్డారు? అని అడిగాడు. బ్రాడీ చెప్పాడు. తర్వాత లాడర్ హఠాత్తుగా ‘‘టామ్‌ని చంపేసి, నిన్ను మాత్రం సజీవంగా ఎందుకు వదిలేశారు?’’ అని సూటిగా అడిగాడు. బ్రాడీ ఏమీ చెప్పలేక ‘నేను అదృష్టవంతుణ్న నుకుంటున్నాను. అంతకంటె నాకూ ఏ కారణమూ తోచటం లేదు’ అన్నాడు. ‘‘అవును, యిప్పుడేమిటి? మిటరీలో చేరమని అందరికీ ఉపన్యాసాలిస్తున్నావు. ప్రభుత్వానికి సాయపడడంలో ఏదైనా ఉద్దేశం ఉందా?’’ అని అడిగాడు లాడర్.
అంతటితో ఆగకుండా, ‘‘దాని సంగతి సరే, నీ భార్య చాలా అందంగా ఉంటుంది. నువ్వు పోయావు కాబట్టి మేమంతా కావాంటే ఆమె కోసం ట్రై చేసి వుండవచ్చు. కానీ ఎవ్వరం చేయలేదు ` ఒక్కడు మాత్రం చెడగొట్టేదాకా ఊరుకోలేదు...’’ అని అంటూండగానే మైక్ అతని మీద పడి కొట్టసాగాడు. జెసికా, ప్లిు, యితర మెరైన్స్, వారి కుటుంబసభ్యు అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. బ్రాడీ వెంటనే వారిద్దరినీ విడదీసి, మైక్‌ను విడిగా లాగి, ‘‘నీ పేరు చెప్పలేదుగా’’ అని అడిగాడు. మైక్ తడబడడం చూసి ‘‘నిన్ను నా స్నేహితుడనుకున్నాను చూడు, నాదీ తప్పు’’ అంటూ పిడికిలి బిగించి మైక్ మొహం మీద గుద్దాడు. మైక్ తిరగబడలేదు. దాంతో ఎడాపెడా నాుగు వాయించి, అతని ముక్కులోంచి రక్తం కారుతూండగా తన కుటుంబం పరువు యిలా బజార్న పడినందుకు బాధపడుతూ కారు వేసుకుని చర్రున ఎక్కడికో వెళ్లిపోయాడు.
మనసు బాగా లేక ఊరంతా తిరిగి, తిరిగి రాత్రికి ఒక బార్లో కూర్చుని మందు తాగడం మొదుపెట్టాడు. కాస్సేపటికి అతనికి మర్నాటి టెస్టు గుర్తుకు వచ్చింది. మనసు ఆందోళనగా వుంది, పాల్గొనలేనని చెప్పడానికి క్యారీకి ఫోన్ చేశాడు. ఆఫీసు నుంచి తిరిగి వచ్చి యింట్లో రిలాక్సవుతున్న క్యారీ ఫోన్ తీసుకుంది. బ్రాడీ చెప్పినది విన్నాక బార్లో మత్తులో ఉండగానే, అనునయంగా మాట్లాడి, నిజాు కక్కించాలి అనుకుని నేను వస్తున్నా అంటూ వెంటనే బయుదేరింది. బార్లో అనేక రౌండ్ల మద్యం తాగుతూ యిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ క్రమంలోనే బ్రాడీ ఆమెకు నచ్చాడు. తక్కిన విషయా మాట ఎలా వున్నా పెద్దమనిషే అనిపించాడు.
మైక్ గొడవ గురించి బ్రాడీ ఉన్నదున్నట్లు చెప్పేశాడు. బాగా పొద్దు పోయేదాకా వుండి యిద్దరూ లేచారు. పార్కింగ్ స్థంలో ఉన్న క్యారీ కారు దగ్గరకు వచ్చి మాట్లాడుతూండగా క్యారీకి అతనిమీద అభిమానం ముంచుకు వచ్చి ‘‘హమీద్‌కు నువ్వే బ్లేడ్ యిచ్చావేమోనని మా వాళ్ల అనుమానం. అందుకే టెస్టుకి పిలిచారు.’’ అని చెప్పేసింది. ‘‘ఓకే’’ అంటూ అతను క్యారీ కేసి అభిమానంగా చూస్తూ ముద్దాడాడు. క్యారీ స్పందించింది. చివరకు యిద్దరూ కలిసి క్యారీ కారులోనే శృంగారంలో పాల్గొన్నారు.
సిఐఏలో ఐలీన్ గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఆమె ఒక అమెరికన్ ధనవంతుని కూతురు. చిన్న వయసులో వుండగా సౌదీ అరేబియాలో ఐదేళ్లు వుంది. అప్పుడే రకీమ్‌తో స్నేహం ఏర్పడి వుండాలి. అమెరికన్ విధానాకు ప్రతిఘటిస్తూ జి4 సమ్మేళనానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న దృశ్యం కనబడిరది. వీళ్లిలా వివరాు సేకరిస్తూండగానే రకీమ్, ఐలీన్ ఒక మోటల్లో మారుపేర్లతో బస చేశారు. అయినా వారిని టెర్రరిస్టు రహస్యంగా వెంటాడుతూనే వుండి వుండాలి. ఆమె బాత్రూమ్లో ఉన్న సమయంలో ఆ గదిపైకి మెషిన్‌గన్‌తో గుళ్లు కురిపించారు. రకీమ్ చనిపోయాడు. ఐలీన్ బాత్రూమ్ కిటికీ ద్వారా బయటకు తప్పించుకుని పారిపోయింది.
సాల్ పోలీగ్రాఫ్ టెస్టు పూర్తయ్యాక క్యారీ అడిగింది ` ‘‘నిన్న చేయలేక పోయావట’’ అని. ‘‘అవును, నా భార్య నన్ను విడిచి వెళ్లిపోతానంటూండంతో ఆందోళనగా వుంది. డేవిడ్‌తో చెప్పాను, నన్ను మళ్లీ ఫ్డీులోకి పంపేయి. న్యూఢల్లీికి పోస్టు చేస్తే సంతోషిస్తాను అని. అతను ఆలోచిస్తానన్నాడు. ఈ సంగతి చెపితే మీరా సంతోషపడలేదు. నువ్వేమీ ఢల్లీికి రానక్కరలేదు, ఒంటరిగానే వెళతానులే అంది. అంటే విడాకు తీసుకుందామనే అనుకుంటోందన్నమాట. ఇవన్నీ మనసులో మెదడంతో నిన్న పరీక్షలో ఫెయియ్యాను. అసటగా వుందని చెప్పి, యివాళ్టికి వాయిదా వేయించుకున్నాను.’’ అన్నాడు. అతనూ బ్లేడు యివ్వలేదని తేడంతో వదిలేశారు.
ఇక ముఖ్య అనుమానితుడు బ్రాడీ టెస్టు తీసుకుంటూండగా క్యారీ, సాల్ అబ్జర్వేషన్ రూములో కూర్చుని చూడసాగారు. బ్రాడీ తొణక్కుండా, బెణక్కుండా సమాధానాు చెప్పేస్తున్నాడు. బ్లేడ్ యిచ్చావా అంటే లేదని చెప్పాడు. క్యారీ ప్రశ్నలేసే అతన్ని మళ్లీ అదే ప్రశ్న వేయమంది. అతను వేశాడు. అయినా అదే జవాబు. టెస్టులో అబద్ధం చెప్పినట్లు ఏమీ రాలేదు. ఈసారి క్యారీ నీ భార్య పట్ల నమ్మకద్రోహం చేశావా? అని అడగమంది. ఆ ప్రశ్నకు బ్రాడీ ‘ఎన్నడూ లేదు’ అని చెప్పాడు. ముందు రోజు రాత్రి తనతో రమించి యీ రోజు యింత నిబ్బరంగా అబద్ధమాడ గలిగేవాణ్ని బ్రేక్ చేయడం కష్టమని క్యారీకి అర్థమైంది. కానీ ఆ విషయం సాల్‌తో చెప్పలేకపోయింది. ఎందుకంటే ఒక పక్క టెర్రరిస్టు అని అనుమానిస్తున్న వ్యక్తితో పడుక్కోవడమేమిటని అతను తిట్టవచ్చు.
బ్రాడీ టెస్టు పూర్తయింది. బయటకు వెళ్లాడు. సాల్ ‘‘ఇకపైనన్నా అతను టెర్రరిస్టు అనే అనుమానించడం మానేయ్‘’’ అన్నాడు. క్యారీ ఏమీ అనలేక త వూపింది. ఆఫీసు పని ముగిసింది కాబట్టి బయటకు కారు దగ్గరకు వచ్చింది. బ్రాడీ ఆమె వద్దకు వచ్చి స్నేహపూర్వకంగా నవ్వి, నాతో పాటు కారులో రా అన్నాడు. అతని నిజస్వభావం తెలియాంటే సన్నిహితంగా మెగక తప్పదనుకుందో లేక అతనిపై యిష్టం కలిగిందో తనకే తెలియకుండా క్యారీ అతని కారు ఎక్కింది.
కారులో బ్రాడీ క్యారీని అడిగాడు ` తను పాలీగ్రాఫ్ పరీక్ష పాసయినట్లేనా అని. నువ్వు అబద్ధాలాడడంలో ఎక్స్‌పర్ట్‌వి అయినట్లున్నావ్. నా విషయంలోనే అబద్ధమాడేశావు అంది క్యారీ. నా జీవితాన్ని కాపాడుకునే ప్రయాసలో అందరికీ అబద్ధాు చెప్పిచెప్పి అలా అయిపోయాను అన్నాడు బ్రాడీ. ‘నేను చచ్చిపోయాననుకుని మా ఆవిడ దారి తప్పిందన్న విషయం అర్థమవుతున్నా, ఆ సత్యాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. పైగా అది అందరికీ తెలిసిపోయిందన్న విషయం, నన్ను చూసి నవ్వుకుంటున్నారనే విషయం నన్ను దహించి వేస్తోంది. తనను దండిరచలేను, అలా అని క్షమించలేను. అందుకే ఆమె నుంచి యీ వీకెండ్ దూరంగా ఉందామని ఎక్కడికైనా వెళదామనుకుంటున్నా’ అని చెప్పాడు.
‘నాకూ వేరే పని లేదు. ఇద్దరం కలిసే తిరుగుదాం’ అంది క్యారీ. దారిలో ఓ బార్కి వెళితే అక్కడ నియో నాజీు క్యారీని వేధించారు. ఆమె వాళ్లను తన్ని బ్రాడీ సాయంతో బయటపడిరది. ‘బయట తిరిగితే యిలాటి గొడవలే వస్తాయి. మా కుటుంబానికి ఓ పల్లెటూళ్లో అడవు మధ్య ఓ కేబిన్ ఉంది. అక్కడకు పోదాం’ అంది క్యారీ. సరేనన్నాడు బ్రాడీ. కారు అటువైపు తిప్పారు.
ఐలీన్ టెక్సాస్‌కు వెళ్లి అక్కణ్నుంచి మెక్సికోకు బస్సు టిక్కెట్టు కొనుక్కుంది. ఆ విషయం సిఐఏకు తెలిసిపోయింది. మెక్సికన్ సెక్యూరిటీ ఆఫీసర్ చేత ఆమెను అరెస్టు చేయిద్దామని డేవిడ్ అంటూంటే సాల్ ‘నేను విమానంలో మెక్సికో వెళ్లి ఆమెను కారులో వెంటపెట్టుకుని వస్తాను. 30 గంట ప్రయాణంలో ఆమెతో అనునయంగా మాట్లాడితే నోరు విప్పుతుందని నా నమ్మకం. ఆమె ప్రియుణ్ని నజీర్ చంపించాడు కాబట్టి, కసి వుండవచ్చు, భయమూ వుండవచ్చు. ఎఫ్బిఐ వాళ్లు మామూు పద్ధతుల్లో హింస పెడితే ఏమీ చెప్పకపోవచ్చు.’’ అన్నాడు. డేవిడ్ సరేనంటే బయుదేరాడు. ఇంటిగొడవ నుంచి ఈ ప్రయాణం ఒక రిలీఫ్ యిస్తుందని కూడా అతనికి తోచింది.
బ్రాడీ, క్యారీ కాబిన్ చేరారు. తాళంచెవి కనబడలేదు. క్యారీ అక్కకు ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కుని తుపు తీసి, ముందుగా లోపలికి వెళ్లి రివ్వార్ తీసుకుని దానిలో గుళ్లు లోడ్ చేసి డ్రాయర్లో పెట్టింది. తర్వాత బ్రాడీని లోపకి పిలిచి సరసాలాడసాగింది. ఇద్దరూ చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టే ఎదుటివాళ్లకు కనబడ్డారు. కాస్సేపటిలోనే సెక్స్‌లో పాల్గొన్నారు. మర్నాడు పొద్దున్న లేచి దగ్గర్లో ఉన్న చెఱువు దగ్గరకు వెళ్లారు. అవీయివీ మాట్లాడుకున్నారు. ‘నీతో ఉన్నంత కులాసాగా నా భార్యతో కూడా లేను’ అన్నాడు బ్రాడీ.
క్యారీకి కూడా అతనంటే అభిమానం పుట్టుకువచ్చింది. తన తల్లి గురించి, కుటుంబం గురించి అతనితో చెప్పింది. ఆ రాత్రి మద్యం తీసుకోకూడదని నిశ్చయించుకున్నారు. సాధారణంగా వంట చేయని క్యారీ అవేళ డిన్నర్ వండిరది. భోజనం చేసి, మళ్లీ శృంగారంలో పాల్గొన్నారు. చాలా హాయిగా అనిపించింది యిద్దరికీ. త్లెవారురaామున బ్రాడీకి పీడక వచ్చింది. ‘‘ఐసా, ఐసా’’ అని పవరించాడు. క్యారీ అతన్ని ఓదార్చి పడుక్కోబెట్టింది.
ఇతనిలా వుండగా అతని యింటి దగ్గర నానా గొడవగానూ వుంది. చెప్పాపెట్టకుండా మొగుడు మాయమై పోవడంతో, ఫోన్ తీయకపోవడంతో జెసికా కంగారుపడిరది. కూతురు డానా ‘అంతా నీ వనే జరిగింది’ అని నిందించింది. జెసికాకు కోపం వచ్చి ‘మూడు రోజు పాటు య్లిు వదిలి వెళ్లడానికి వీల్లేద’ంది. మర్నాడు డానా స్నేహితు వచ్చి వీకెండ్‌కు బయటకు వెళదామని అడిగితే కుదరదని చెప్పి యింట్లోనే వాళ్లతో కలిసి మందు కొట్టి, డ్రగ్స్ తీసుకుంది. ఆ మత్తులో ఓ గ్లాసుడోరుకి వెళ్లి కొట్టుకుని చెయ్యి గాయపరచుకుంది. తల్లి గాభరా పడిపోయి, మైక్‌కు కబురు పెట్టి, కూతుర్ని తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లింది.
అవత ఐలీన్ బస్సు దిగేసరికి మెక్సికో సెక్యూరిటీ ఆఫీసర్ సిద్ధంగా ఉన్నారు. వారితో బాటు సాల్ కూడా. నాతో పాటు వస్తే వర్జీనియాకు కారులో తీసుకెళతా. లేదంటే మెక్సికో సెక్యూరిటీ ఆఫీసర్ నిన్ను తీసుకెళ్లి ఎఫ్‌బిఐకు అప్పగిస్తారు అన్నాడు. అతని పెద్దరికం, వాత్స్యం చూసి ఐలీన్ అతనితో వెళ్లడానికి నిశ్చయించుకుంది కానీ ఎంత ఆప్యాయంగా మాట్లాడినా చాలాసేపు నోరు విప్పలేదు. సాల్ భార్యతో తనకున్న గొడమ అవీ మాట్లాడి, నీ గురించి కొన్ని వివరాు మాకు యిప్పటికే తెలిశాయి, నువ్వు ఖాళీు పూరించవచ్చు అన్నాడు.
‘మీ నాన్న వ్యాపారరీత్యా సౌదీ అరేబియాలో ఉన్నపుడు నువ్వు చిన్నప్లివి. బహుశా రకీమ్ చుట్టుపట్ల ఆడుకునే బీద కుర్రవాడై వుంటాడు. అతనితో స్నేహం చేసినందుకు మీ నాన్న తిట్టి వుంటాడు’ అని సాల్ అనగా ఐలీన్ ‘అవును, ఒక బ్రౌన్‌తో ప్రేమేమిటి?’ అన్నాడంది ఐలీన్. ‘నా భార్య కూడా బ్రౌనే. ఇండియన్.’ అన్నాడు సాల్. దారిలో ఇండియానాలో సాల్ సొంత వూరు తగిలింది. తన పాత యింటికి తీసుకెళ్లి, తనది యూదుకుటుంబమని, యింట్లో చాలా ఛాందసత్వం ఉండేదని అన్నీ చెప్పుకుని వచ్చాడు.
ఒక సెక్యూరిటీ ఆఫీసర్ అధికారిలా కాకుండా ఆత్మీయుడిగా, ఒక మేనమామలా మాట్లాడడంతో ఐలీన్ కరిగిపోయింది. రకీమ్కు సరైన ఇస్లామిక్ అంత్యక్రియు జరిపించానే షరతుపై నోరు విప్పి మాట్లాడసాగింది. చిన్నపుడు పరిచయమైన రకీమ్ పెద్దయ్యాక మళ్లీ ఎలా కలిశాడో, తన మీద ప్రేమతో టెర్రరిస్టుకు ఎలా తోడ్పడ్డాడో తనకు తెలిసున్నదంతా చెప్పింది. సెల్‌ఫోన్ ద్వారా తనకు ఆదేశాు వచ్చేవని, ఎయిర్‌పోర్టు దగ్గర ఫలానా య్లిు తీసుకోమని చెపితే తీసుకున్నానని చెప్పింది. ఓ రోజు ఒక అమెరికన్ వాళ్లింటికి వచ్చాడని, వాళ్ల యింటి కప్పు మీద ఒక గంటసేపు కూర్చుని వెళ్లాడని చెప్పింది. సాల్ వెంటనే ఆమెను స్కెచ్ ఆర్టిస్టు వద్దకు తీసుకెళ్లి ఆ అమెరికన్ బొమ్మ గీయించాడు.
ఓ పక్కన అది జరుగుతూండగానే డేవిడ్‌కు ఫోన్ చేసి ఐలీన్ చెప్పినదంతా చెప్పాడు. డేవిడ్ తన వద్ద పనిచేసే గాల్వెజ్ అనే అతన్ని ఆ యింటికి పంపాడు. ఆ యింటి కప్పు మీద నుంచి చూస్తే అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే మెరీన్ ఒన్ అనే హెలికాప్టర్ దిగే హెలిపాడ్ కనబడుతోంది. సరిగ్గా మైు దూరం. ఎక్స్పర్ట్ అయిన షూటర్ అక్కణ్నుంచి హెలికాప్టర్లో దిగే అధ్యక్షుణ్ని కాల్చేసేయవచ్చు. ఇది తెలియగానే సాల్, డేవిడ్ ఉలిక్కిపడ్డారు. సాల్‌కు గబుక్కున ఒకవేళ క్యారీ అనుకున్నది నిజమేనేమో, బ్రాడీయే ఐలీన్‌ను కలిసిన అమెరికన్యేమో అని అనుమానం వచ్చింది. అతని ఫోటో వెంటనే తనకు పంపితే, ఐలీన్‌కు చూపి నిర్ధారించుకుంటానని అన్నాడు.
Posts: 519
Threads: 0
Likes Received: 545 in 297 posts
Likes Given: 137
Joined: Nov 2018
Reputation:
16
అమ్మ దీనెమ్మా బత్తాయో..... ఇన్నిరోజులు మీరు వ్రాసిన కథలు చదివి మడ్డ (కొట్టి కొట్టి) నొప్పి పుట్టేది. ఇవ్వాళ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను... అర్జెంట్ గా హోంలాండ్ సిరీస్ 8 భాగాలు చూసెయ్యాలి
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
(27-10-2020, 07:21 AM)rocknshake Wrote: అమ్మ దీనెమ్మా బత్తాయో..... ఇన్నిరోజులు మీరు వ్రాసిన కథలు చదివి మడ్డ (కొట్టి కొట్టి) నొప్పి పుట్టేది. ఇవ్వాళ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను... అర్జెంట్ గా హోంలాండ్ సిరీస్ 8 భాగాలు చూసెయ్యాలి
thank you bro....watch the episodes...and read this also
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
క్యారీ తన అక్క యింట్లో వున్నపుడు ఆమె కూతుళ్లిద్దరూ చిన్నవాళ్లయినా తీవ్రవాదు గురించి ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకుంది. ‘‘మీకేం ఫరవాలేదర్రా, నేనున్నానుగా కాపాడేందుకు’’ అని వాళ్లకు చెప్పింది. వాళ్లకే కాక తనకూ చెప్పుకుంది ` దేశం కోసమైనా, మానాభిమానాు పక్కన పెట్టి అదే వృత్తిలో కొనసాగాని. లాంగ్లీకి తిరిగి వచ్చింది. హమీద్‌కు బ్లేడ్ ఎలా వచ్చిందో తెలియాంటే అందరికీ పాలీగ్రాఫ్ టెస్టు జరిపించాని ప్రతిపాదించింది. ఎవరైనా అబద్ధం చెపితే వారి శరీరంలో కలిగే మార్పును పసిగట్టే పరీక్ష అది. స్టాఫ్‌తో బాటు బ్రాడీని కూడా రప్పిస్తారని అతని నిజస్వరూపం బయటపడుతుందని ఆమె ఆలోచన. విధిలేక డేవిడ్ దానికి ఒప్పుకోవసి వచ్చింది.
మొదట క్యారీనే పిలిచారు. అన్నీ బాగానే చెప్పింది కానీ ‘చాటుగా మందులేవైనా తీసుకుంటున్నావా?’ అని అడిగినపుడు కాస్త తడబడి చివరకు ఔనని చెప్పేసింది. అయితే అది ప్రస్తుతానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి వాళ్లు పట్టించుకోలేదు. డేవిడ్ కూడా టెస్టు చేయించుకున్నాడు. వైవాహిక జీవితం గురించి అడిగినపుడు అతను తడబడ్డాడు. ఎందుకంటే భార్య అతన్నుంచి విడిపోయి వేరే ఉంటోంది. అప్పుడప్పుడు ప్లిల్ని యితని దగ్గరకు పంపిస్తోంది.
ఇక్కడ యిది జరుగుతూండగానే సాల్ రకీమ్ యింటికి వెళ్లి చుట్టుపక్క వాకబు చేశాడు. అతనితో బాటు ఒక అమ్మాయి కూడా వుండేదని తెలిసిందతనికి. ఆ పాటికే రకీమ్, ఐలీన్ కారులో వేరే ఊరిలో ఉన్న ఒక ఖాళీ యింటికి చేరారు. అక్కడకి వెళ్లి కొన్నాళ్లు అణగిమణగి వుండమని ఐలీన్‌కు ఆదేశాు వచ్చాయి. ఇంట్లోకి వెళ్లబోతూండగానే తుపు మీద ఒక బూబీ ట్రాప్ పెట్టారని అర్థమైంది. తమ గురించి సిఐఏకు తెలిసిపోయింది కాబట్టి అల్‌ఖైదా తమనిక వద్చుకుందామని చూస్తోందని, అందుకే యిక్కడకు రప్పించి తుపు తెరిస్తే బాంబు పేలేలా ఏర్పాటు చేసి చంపేద్దామనుకున్నారని అర్థమైంది ఐలీన్‌కు. రకీమ్‌ను హెచ్చరించి, వెనక్కి లాగింది. ఇద్దరూ కారెక్కారు.
‘‘మనకిప్పుడు టెర్రరిస్టునుంచి, ప్రభుత్వాన్నుంచి యిద్దరి నుంచి ముప్పుంది. తప్పు ఒప్పుకుని లొంగిపోదాం.’’ అన్నాడు రకీమ్. అతను స్వతహాగా పిరికివాడు. కొందరు సౌదీల్లా అతనికి టెర్రరిజం మీద ప్రేమ ఏమీ లేదు. ఐలీన్మీద ప్రేమతో ఆమె చెప్పినది చేస్తున్నాడంతే. అవటానికి అమెరికనే అయిన ఐలీన్‌కు అల్‌ఖైదా అంటే సానుభూతి వుంది. ‘‘నేను నిన్ను యిందులోకి దింపినందుకు క్షమించు. కానీ యీ పరిస్థితుల్లో సిఐఏకు పట్టుబడితే వాళ్లు అల్‌ఖైదా గురించి చెప్పమని చిత్రహింసు పెడతారు. సిఐఏ లోని అల్‌ఖైదా మనుష్యు మనల్ని చంపేస్తారు. మనం మెక్సికో పారిపోయి, దాంకుందాం.’’ అంది రకీమ్‌తో. ఏం చెయ్యాలో తోచక అతను తూపాడు. కారును ముందుకి పోనిచ్చాడు.
మర్నాడు బ్రాడీతో బాటు ఖైదీగా పట్టుబడి హతుడైన టామ్ స్మారక కార్యక్రమం చర్చిలో జరిగింది. అతనితో పని చేసిన మెరీన్స్ అందరూ వచ్చారు. కుటుంబంతో సహా వచ్చిన బ్రాడీ తన ఉపన్యాసంలో టామ్‌కు ఘనమైన నివాళి అర్పించాడు. కానీ మనసులో టామ్‌ను తను చితకబాదుతున్న దృశ్యాు మెదుతూనే ఉన్నాయి. అందరూ టామ్‌ను తచుకుని కన్నీరు కార్చారు. చర్చి హాల్లోంచి బయటకు వచ్చాక క్యారీ అక్కడకు వచ్చి బ్రాడీని విడిగా కలిసి ‘నువ్వు రేపు లాంగ్లీకి రావాని చెప్పమన్నారు.’ అని చెప్పి వెళ్లిపోయింది. జెసికా అది చూసింది కానీ తనెవరో ఆమెకు తెలియలేదు.
స్మారక కార్యక్రమం తర్వాత ఆ సాయంత్రం టామ్ భార్య హెలెన్, ఆమె ప్రస్తుత భర్త విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మెరీన్సందరూ తాగుతూ పాత విషయాను నెమరేసుకున్నారు. వారిలో లాడర్ (వేక్ఫీల్డ్) అని యుద్ధంలో కాు పోగొట్టుకుని అవిటివాడైన అతనున్నాడు. పక్కా తాగుబోతు. అవేళ కూడా తాగుతూనే మీ యిద్దరూ ఎలా పట్టుబడ్డారు? అని అడిగాడు. బ్రాడీ చెప్పాడు. తర్వాత లాడర్ హఠాత్తుగా ‘‘టామ్‌ని చంపేసి, నిన్ను మాత్రం సజీవంగా ఎందుకు వదిలేశారు?’’ అని సూటిగా అడిగాడు. బ్రాడీ ఏమీ చెప్పలేక ‘నేను అదృష్టవంతుణ్న నుకుంటున్నాను. అంతకంటె నాకూ ఏ కారణమూ తోచటం లేదు’ అన్నాడు. ‘‘అవును, యిప్పుడేమిటి? మిటరీలో చేరమని అందరికీ ఉపన్యాసాలిస్తున్నావు. ప్రభుత్వానికి సాయపడడంలో ఏదైనా ఉద్దేశం ఉందా?’’ అని అడిగాడు లాడర్.
అంతటితో ఆగకుండా, ‘‘దాని సంగతి సరే, నీ భార్య చాలా అందంగా ఉంటుంది. నువ్వు పోయావు కాబట్టి మేమంతా కావాంటే ఆమె కోసం ట్రై చేసి వుండవచ్చు. కానీ ఎవ్వరం చేయలేదు ` ఒక్కడు మాత్రం చెడగొట్టేదాకా ఊరుకోలేదు...’’ అని అంటూండగానే మైక్ అతని మీద పడి కొట్టసాగాడు. జెసికా, ప్లిు, యితర మెరైన్స్, వారి కుటుంబసభ్యు అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. బ్రాడీ వెంటనే వారిద్దరినీ విడదీసి, మైక్‌ను విడిగా లాగి, ‘‘నీ పేరు చెప్పలేదుగా’’ అని అడిగాడు. మైక్ తడబడడం చూసి ‘‘నిన్ను నా స్నేహితుడనుకున్నాను చూడు, నాదీ తప్పు’’ అంటూ పిడికిలి బిగించి మైక్ మొహం మీద గుద్దాడు. మైక్ తిరగబడలేదు. దాంతో ఎడాపెడా నాుగు వాయించి, అతని ముక్కులోంచి రక్తం కారుతూండగా తన కుటుంబం పరువు యిలా బజార్న పడినందుకు బాధపడుతూ కారు వేసుకుని చర్రున ఎక్కడికో వెళ్లిపోయాడు.
మనసు బాగా లేక ఊరంతా తిరిగి, తిరిగి రాత్రికి ఒక బార్లో కూర్చుని మందు తాగడం మొదుపెట్టాడు. కాస్సేపటికి అతనికి మర్నాటి టెస్టు గుర్తుకు వచ్చింది. మనసు ఆందోళనగా వుంది, పాల్గొనలేనని చెప్పడానికి క్యారీకి ఫోన్ చేశాడు. ఆఫీసు నుంచి తిరిగి వచ్చి యింట్లో రిలాక్సవుతున్న క్యారీ ఫోన్ తీసుకుంది. బ్రాడీ చెప్పినది విన్నాక బార్లో మత్తులో ఉండగానే, అనునయంగా మాట్లాడి, నిజాు కక్కించాలి అనుకుని నేను వస్తున్నా అంటూ వెంటనే బయుదేరింది. బార్లో అనేక రౌండ్ల మద్యం తాగుతూ యిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ క్రమంలోనే బ్రాడీ ఆమెకు నచ్చాడు. తక్కిన విషయా మాట ఎలా వున్నా పెద్దమనిషే అనిపించాడు.
మైక్ గొడవ గురించి బ్రాడీ ఉన్నదున్నట్లు చెప్పేశాడు. బాగా పొద్దు పోయేదాకా వుండి యిద్దరూ లేచారు. పార్కింగ్ స్థంలో ఉన్న క్యారీ కారు దగ్గరకు వచ్చి మాట్లాడుతూండగా క్యారీకి అతనిమీద అభిమానం ముంచుకు వచ్చి ‘‘హమీద్‌కు నువ్వే బ్లేడ్ యిచ్చావేమోనని మా వాళ్ల అనుమానం. అందుకే టెస్టుకి పిలిచారు.’’ అని చెప్పేసింది. ‘‘ఓకే’’ అంటూ అతను క్యారీ కేసి అభిమానంగా చూస్తూ ముద్దాడాడు. క్యారీ స్పందించింది. చివరకు యిద్దరూ కలిసి క్యారీ కారులోనే శృంగారంలో పాల్గొన్నారు.
సిఐఏలో ఐలీన్ గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఆమె ఒక అమెరికన్ ధనవంతుని కూతురు. చిన్న వయసులో వుండగా సౌదీ అరేబియాలో ఐదేళ్లు వుంది. అప్పుడే రకీమ్‌తో స్నేహం ఏర్పడి వుండాలి. అమెరికన్ విధానాకు ప్రతిఘటిస్తూ జి4 సమ్మేళనానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న దృశ్యం కనబడిరది. వీళ్లిలా వివరాు సేకరిస్తూండగానే రకీమ్, ఐలీన్ ఒక మోటల్లో మారుపేర్లతో బస చేశారు. అయినా వారిని టెర్రరిస్టు రహస్యంగా వెంటాడుతూనే వుండి వుండాలి. ఆమె బాత్రూమ్లో ఉన్న సమయంలో ఆ గదిపైకి మెషిన్‌గన్‌తో గుళ్లు కురిపించారు. రకీమ్ చనిపోయాడు. ఐలీన్ బాత్రూమ్ కిటికీ ద్వారా బయటకు తప్పించుకుని పారిపోయింది.
సాల్ పోలీగ్రాఫ్ టెస్టు పూర్తయ్యాక క్యారీ అడిగింది ` ‘‘నిన్న చేయలేక పోయావట’’ అని. ‘‘అవును, నా భార్య నన్ను విడిచి వెళ్లిపోతానంటూండంతో ఆందోళనగా వుంది. డేవిడ్‌తో చెప్పాను, నన్ను మళ్లీ ఫ్డీులోకి పంపేయి. న్యూఢల్లీికి పోస్టు చేస్తే సంతోషిస్తాను అని. అతను ఆలోచిస్తానన్నాడు. ఈ సంగతి చెపితే మీరా సంతోషపడలేదు. నువ్వేమీ ఢల్లీికి రానక్కరలేదు, ఒంటరిగానే వెళతానులే అంది. అంటే విడాకు తీసుకుందామనే అనుకుంటోందన్నమాట. ఇవన్నీ మనసులో మెదడంతో నిన్న పరీక్షలో ఫెయియ్యాను. అసటగా వుందని చెప్పి, యివాళ్టికి వాయిదా వేయించుకున్నాను.’’ అన్నాడు. అతనూ బ్లేడు యివ్వలేదని తేడంతో వదిలేశారు.
ఇక ముఖ్య అనుమానితుడు బ్రాడీ టెస్టు తీసుకుంటూండగా క్యారీ, సాల్ అబ్జర్వేషన్ రూములో కూర్చుని చూడసాగారు. బ్రాడీ తొణక్కుండా, బెణక్కుండా సమాధానాు చెప్పేస్తున్నాడు. బ్లేడ్ యిచ్చావా అంటే లేదని చెప్పాడు. క్యారీ ప్రశ్నలేసే అతన్ని మళ్లీ అదే ప్రశ్న వేయమంది. అతను వేశాడు. అయినా అదే జవాబు. టెస్టులో అబద్ధం చెప్పినట్లు ఏమీ రాలేదు. ఈసారి క్యారీ నీ భార్య పట్ల నమ్మకద్రోహం చేశావా? అని అడగమంది. ఆ ప్రశ్నకు బ్రాడీ ‘ఎన్నడూ లేదు’ అని చెప్పాడు. ముందు రోజు రాత్రి తనతో రమించి యీ రోజు యింత నిబ్బరంగా అబద్ధమాడ గలిగేవాణ్ని బ్రేక్ చేయడం కష్టమని క్యారీకి అర్థమైంది. కానీ ఆ విషయం సాల్‌తో చెప్పలేకపోయింది. ఎందుకంటే ఒక పక్క టెర్రరిస్టు అని అనుమానిస్తున్న వ్యక్తితో పడుక్కోవడమేమిటని అతను తిట్టవచ్చు.
బ్రాడీ టెస్టు పూర్తయింది. బయటకు వెళ్లాడు. సాల్ ‘‘ఇకపైనన్నా అతను టెర్రరిస్టు అనే అనుమానించడం మానేయ్‘’’ అన్నాడు. క్యారీ ఏమీ అనలేక త వూపింది. ఆఫీసు పని ముగిసింది కాబట్టి బయటకు కారు దగ్గరకు వచ్చింది. బ్రాడీ ఆమె వద్దకు వచ్చి స్నేహపూర్వకంగా నవ్వి, నాతో పాటు కారులో రా అన్నాడు. అతని నిజస్వభావం తెలియాంటే సన్నిహితంగా మెగక తప్పదనుకుందో లేక అతనిపై యిష్టం కలిగిందో తనకే తెలియకుండా క్యారీ అతని కారు ఎక్కింది.
కారులో బ్రాడీ క్యారీని అడిగాడు ` తను పాలీగ్రాఫ్ పరీక్ష పాసయినట్లేనా అని. నువ్వు అబద్ధాలాడడంలో ఎక్స్‌పర్ట్‌వి అయినట్లున్నావ్. నా విషయంలోనే అబద్ధమాడేశావు అంది క్యారీ. నా జీవితాన్ని కాపాడుకునే ప్రయాసలో అందరికీ అబద్ధాు చెప్పిచెప్పి అలా అయిపోయాను అన్నాడు బ్రాడీ. ‘నేను చచ్చిపోయాననుకుని మా ఆవిడ దారి తప్పిందన్న విషయం అర్థమవుతున్నా, ఆ సత్యాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. పైగా అది అందరికీ తెలిసిపోయిందన్న విషయం, నన్ను చూసి నవ్వుకుంటున్నారనే విషయం నన్ను దహించి వేస్తోంది. తనను దండిరచలేను, అలా అని క్షమించలేను. అందుకే ఆమె నుంచి యీ వీకెండ్ దూరంగా ఉందామని ఎక్కడికైనా వెళదామనుకుంటున్నా’ అని చెప్పాడు.
‘నాకూ వేరే పని లేదు. ఇద్దరం కలిసే తిరుగుదాం’ అంది క్యారీ. దారిలో ఓ బార్కి వెళితే అక్కడ నియో నాజీు క్యారీని వేధించారు. ఆమె వాళ్లను తన్ని బ్రాడీ సాయంతో బయటపడిరది. ‘బయట తిరిగితే యిలాటి గొడవలే వస్తాయి. మా కుటుంబానికి ఓ పల్లెటూళ్లో అడవు మధ్య ఓ కేబిన్ ఉంది. అక్కడకు పోదాం’ అంది క్యారీ. సరేనన్నాడు బ్రాడీ. కారు అటువైపు తిప్పారు.
ఐలీన్ టెక్సాస్‌కు వెళ్లి అక్కణ్నుంచి మెక్సికోకు బస్సు టిక్కెట్టు కొనుక్కుంది. ఆ విషయం సిఐఏకు తెలిసిపోయింది. మెక్సికన్ సెక్యూరిటీ ఆఫీసర్ చేత ఆమెను అరెస్టు చేయిద్దామని డేవిడ్ అంటూంటే సాల్ ‘నేను విమానంలో మెక్సికో వెళ్లి ఆమెను కారులో వెంటపెట్టుకుని వస్తాను. 30 గంట ప్రయాణంలో ఆమెతో అనునయంగా మాట్లాడితే నోరు విప్పుతుందని నా నమ్మకం. ఆమె ప్రియుణ్ని నజీర్ చంపించాడు కాబట్టి, కసి వుండవచ్చు, భయమూ వుండవచ్చు. ఎఫ్బిఐ వాళ్లు మామూు పద్ధతుల్లో హింస పెడితే ఏమీ చెప్పకపోవచ్చు.’’ అన్నాడు. డేవిడ్ సరేనంటే బయుదేరాడు. ఇంటిగొడవ నుంచి ఈ ప్రయాణం ఒక రిలీఫ్ యిస్తుందని కూడా అతనికి తోచింది.
బ్రాడీ, క్యారీ కాబిన్ చేరారు. తాళంచెవి కనబడలేదు. క్యారీ అక్కకు ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కుని తుపు తీసి, ముందుగా లోపలికి వెళ్లి రివ్వార్ తీసుకుని దానిలో గుళ్లు లోడ్ చేసి డ్రాయర్లో పెట్టింది. తర్వాత బ్రాడీని లోపకి పిలిచి సరసాలాడసాగింది. ఇద్దరూ చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టే ఎదుటివాళ్లకు కనబడ్డారు. కాస్సేపటిలోనే సెక్స్‌లో పాల్గొన్నారు. మర్నాడు పొద్దున్న లేచి దగ్గర్లో ఉన్న చెఱువు దగ్గరకు వెళ్లారు. అవీయివీ మాట్లాడుకున్నారు. ‘నీతో ఉన్నంత కులాసాగా నా భార్యతో కూడా లేను’ అన్నాడు బ్రాడీ.
క్యారీకి కూడా అతనంటే అభిమానం పుట్టుకువచ్చింది. తన తల్లి గురించి, కుటుంబం గురించి అతనితో చెప్పింది. ఆ రాత్రి మద్యం తీసుకోకూడదని నిశ్చయించుకున్నారు. సాధారణంగా వంట చేయని క్యారీ అవేళ డిన్నర్ వండిరది. భోజనం చేసి, మళ్లీ శృంగారంలో పాల్గొన్నారు. చాలా హాయిగా అనిపించింది యిద్దరికీ. త్లెవారురaామున బ్రాడీకి పీడక వచ్చింది. ‘‘ఐసా, ఐసా’’ అని పవరించాడు. క్యారీ అతన్ని ఓదార్చి పడుక్కోబెట్టింది.
ఇతనిలా వుండగా అతని యింటి దగ్గర నానా గొడవగానూ వుంది. చెప్పాపెట్టకుండా మొగుడు మాయమై పోవడంతో, ఫోన్ తీయకపోవడంతో జెసికా కంగారుపడిరది. కూతురు డానా ‘అంతా నీ వనే జరిగింది’ అని నిందించింది. జెసికాకు కోపం వచ్చి ‘మూడు రోజు పాటు య్లిు వదిలి వెళ్లడానికి వీల్లేద’ంది. మర్నాడు డానా స్నేహితు వచ్చి వీకెండ్‌కు బయటకు వెళదామని అడిగితే కుదరదని చెప్పి యింట్లోనే వాళ్లతో కలిసి మందు కొట్టి, డ్రగ్స్ తీసుకుంది. ఆ మత్తులో ఓ గ్లాసుడోరుకి వెళ్లి కొట్టుకుని చెయ్యి గాయపరచుకుంది. తల్లి గాభరా పడిపోయి, మైక్‌కు కబురు పెట్టి, కూతుర్ని తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లింది.
అవత ఐలీన్ బస్సు దిగేసరికి మెక్సికో సెక్యూరిటీ ఆఫీసర్ సిద్ధంగా ఉన్నారు. వారితో బాటు సాల్ కూడా. నాతో పాటు వస్తే వర్జీనియాకు కారులో తీసుకెళతా. లేదంటే మెక్సికో సెక్యూరిటీ ఆఫీసర్ నిన్ను తీసుకెళ్లి ఎఫ్‌బిఐకు అప్పగిస్తారు అన్నాడు. అతని పెద్దరికం, వాత్స్యం చూసి ఐలీన్ అతనితో వెళ్లడానికి నిశ్చయించుకుంది కానీ ఎంత ఆప్యాయంగా మాట్లాడినా చాలాసేపు నోరు విప్పలేదు. సాల్ భార్యతో తనకున్న గొడమ అవీ మాట్లాడి, నీ గురించి కొన్ని వివరాు మాకు యిప్పటికే తెలిశాయి, నువ్వు ఖాళీు పూరించవచ్చు అన్నాడు.
‘మీ నాన్న వ్యాపారరీత్యా సౌదీ అరేబియాలో ఉన్నపుడు నువ్వు చిన్నప్లివి. బహుశా రకీమ్ చుట్టుపట్ల ఆడుకునే బీద కుర్రవాడై వుంటాడు. అతనితో స్నేహం చేసినందుకు మీ నాన్న తిట్టి వుంటాడు’ అని సాల్ అనగా ఐలీన్ ‘అవును, ఒక బ్రౌన్‌తో ప్రేమేమిటి?’ అన్నాడంది ఐలీన్. ‘నా భార్య కూడా బ్రౌనే. ఇండియన్.’ అన్నాడు సాల్. దారిలో ఇండియానాలో సాల్ సొంత వూరు తగిలింది. తన పాత యింటికి తీసుకెళ్లి, తనది యూదుకుటుంబమని, యింట్లో చాలా ఛాందసత్వం ఉండేదని అన్నీ చెప్పుకుని వచ్చాడు.
ఒక సెక్యూరిటీ ఆఫీసర్ అధికారిలా కాకుండా ఆత్మీయుడిగా, ఒక మేనమామలా మాట్లాడడంతో ఐలీన్ కరిగిపోయింది. రకీమ్కు సరైన ఇస్లామిక్ అంత్యక్రియు జరిపించానే షరతుపై నోరు విప్పి మాట్లాడసాగింది. చిన్నపుడు పరిచయమైన రకీమ్ పెద్దయ్యాక మళ్లీ ఎలా కలిశాడో, తన మీద ప్రేమతో టెర్రరిస్టుకు ఎలా తోడ్పడ్డాడో తనకు తెలిసున్నదంతా చెప్పింది. సెల్‌ఫోన్ ద్వారా తనకు ఆదేశాు వచ్చేవని, ఎయిర్‌పోర్టు దగ్గర ఫలానా య్లిు తీసుకోమని చెపితే తీసుకున్నానని చెప్పింది. ఓ రోజు ఒక అమెరికన్ వాళ్లింటికి వచ్చాడని, వాళ్ల యింటి కప్పు మీద ఒక గంటసేపు కూర్చుని వెళ్లాడని చెప్పింది. సాల్ వెంటనే ఆమెను స్కెచ్ ఆర్టిస్టు వద్దకు తీసుకెళ్లి ఆ అమెరికన్ బొమ్మ గీయించాడు.
ఓ పక్కన అది జరుగుతూండగానే డేవిడ్‌కు ఫోన్ చేసి ఐలీన్ చెప్పినదంతా చెప్పాడు. డేవిడ్ తన వద్ద పనిచేసే గాల్వెజ్ అనే అతన్ని ఆ యింటికి పంపాడు. ఆ యింటి కప్పు మీద నుంచి చూస్తే అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే మెరీన్ ఒన్ అనే హెలికాప్టర్ దిగే హెలిపాడ్ కనబడుతోంది. సరిగ్గా మైు దూరం. ఎక్స్పర్ట్ అయిన షూటర్ అక్కణ్నుంచి హెలికాప్టర్లో దిగే అధ్యక్షుణ్ని కాల్చేసేయవచ్చు. ఇది తెలియగానే సాల్, డేవిడ్ ఉలిక్కిపడ్డారు. సాల్‌కు గబుక్కున ఒకవేళ క్యారీ అనుకున్నది నిజమేనేమో, బ్రాడీయే ఐలీన్‌ను కలిసిన అమెరికన్యేమో అని అనుమానం వచ్చింది. అతని ఫోటో వెంటనే తనకు పంపితే, ఐలీన్‌కు చూపి నిర్ధారించుకుంటానని అన్నాడు.
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
కూతురికి 19 కుట్లు వేయించి జెసికా ఆసుపత్రి నుంచి యింటికి వచ్చేసరికి క్రిస్‌కు తోడుగా మైక్ కూర్చున్నాడు. విరిగిపోయిన తలుపును బాగు చేశాడు. జెసికా చలించిపోయింది. కూతుర్ని తన గదిలోకి పంపి మైక్‌తో ‘చూడు, ఇంత ఉపద్రవం జరుగుతూంటే బ్రాడీ ఎక్కడికి పోయాడో తెలియదు. కబురూ కాకరకాయా లేదు. అతను తిరిగి రావడం మన అందరి జీవితాల్నీ అతలాకుతలం చేసేసింది. అతని ప్రవర్తనతో విసిగిపోయాను. నిన్నెంతో మిస్ చేస్తున్నాను, నీకెలా వుందో కానీ’ అంది. మైక్ ‘నేనూ మిస్ చేస్తున్నాను. బ్రాడీ రాక మన ప్లాన్లని అప్సెట్ చేసింది.’ అన్నాడు. ఇద్దరూ ముద్దాడసాగారు. ఇంతలో డానా హఠాత్తుగా హాల్లోకి వచ్చింది. జెసికా తత్తరపడి క్రిస్ పడుక్కున్నాడో లేదో చూస్తానంటూ అతని బెడ్రూమ్లోకి వెళ్లిపోయింది. డానా మైక్‌తో నిర్మొగమాటంగా ‘నువ్వు మా జీవితాల్లోంచి తప్పుకుంటే అదే పదిమే. నువ్వు యిక్కడిక్కడే తచ్చాడుతూంటే మా నాన్న మాకు ఎన్నటికీ దక్కడు’ అంది.
ఆదివారం నాడు పొద్దున్న క్యారీ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేస్తూ ‘నీకు టీ ఏది కావాలి? నీ ఫేవరేట్ బ్రాండ్ యార్క్‌షైర్ గోల్డ్ యిక్కడ దొరకదు మరి’ అంటూ జోక్ చేసింది. ‘నా ఫేవరేట్ బ్రాండ్ అదని నీకెలా తెలుసు?’ అని అడిగాడు బ్రాడీ చురుగ్గా. బ్రాడీ యింట్లో కెమెరాలు పెట్టి అతన్ని గమనించిన రోజుల్లో క్యారీకి ఆ విషయం తెలిసింది. పొరపాటున యిప్పుడు నోరు జారింది. అది గ్రహించుకుని ‘ఏమో అలా గుర్తుండి పోయింది. బహుశా నువ్వు లాంగ్లీకి వచ్చినపుడు తాగి వుంటావు.’ అంది. ‘నేనక్కడికి వచ్చినపుడు టీ తాగలేదే!’ అన్నాడు బ్రాడీ. వెంటనే క్యారీ మాట తప్పించాలని చూసింది.
కానీ బ్రాడీ జరిగినవన్నీ సింహావలోకనం చేసుకున్నాడు. క్యారీ తనపై గూఢచర్యం చేసిందని, దానిలో ఏదీ దొరక్కపోవడంతో యిప్పుడు యీ స్నేహం నటిస్తోందని అర్థం చేసుకున్నాడు. వెళ్లి చాటుగా వెతికితే రివాల్వర్ కనబడింది. తన దగ్గర పెట్టుకుని ‘నువ్వు మా యింట్లో కెమెరాలు పెట్టి చూశావు కదా’ అని క్యారీని అడిగాడు. గతిలేక ఆమె ‘అవును, నా వృత్తిధర్మంలో భాగంగా చేశాను.’ అని ఒప్పుకుంది. ‘నా మీద అనుమానం ఎందుకు కలిగింది?’ అని రౌద్రంగా అడిగాడు.
క్యారీ భయపడి, ఎందుకైనా మంచిదని రివాల్వర్ కోసం లేవబోయింది. వెంటనే బ్రాడీ తన జేబులోంచి రివాల్వర్ తీసి చూపించి, ఆమెను కుర్చీలో కూర్చోమన్నాడు. తను ఎదురుగా మరో కుర్చీలో కూర్చున్నాడు. ఉన్నదున్నట్లు చెప్పేస్తే మంచిదనుకుంటూ క్యారీ తన ఏజంటు అమెరికన్ యుద్ధఖైదీ తమవైపు మారిపోయాడని చెప్పాడని, అది బ్రాడీయే అని తన అనుమానమని చెప్పేసింది. ‘నేను టెర్రరిస్టునని నీ ఉద్దేశమా?’ అని బ్రాడీ ఆశ్చర్యపడ్డాడు. రివాల్వర్ తీసి మధ్యలో ఉన్న బల్ల మీద పెట్టి ‘నీకు సందేహాలేవైనా వుంటే అడుగు’ అన్నాడు.
క్యారీ ధైర్యం తెచ్చుకుంది. వరసగా ప్రశ్నలడిగింది. హమీద్‌కు బ్లేడ్ యిచ్చినది నీవేనా అని అడిగితే అతను లేదన్నాడు. మాటిమాటికీ గరాజ్‌కి ఎందుకు వెళతావు అని అడిగితే ‘ఒంటరి జీవితం గడిపేటప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు. పక్కన బైబిల్ లేదు. అందువలన నేను ముస్లిముగా మారాను. ఎవరికీ యిబ్బంది కలగకుండా అక్కడకు వెళ్లి నమాజ్ చేస్తాను అన్నాడు. వేళ్లు కదిపే అలవాటు గురించి అడిగితే జపమాల తిప్పడం వలన ఆ అలవాటు వచ్చిందని, ఎవరికీ ఏ సంకేతాలూ యివ్వటం లేదని చెప్పాడు.
‘ఐసా ఎవరు?’ అని అడిగితే ‘నా సెక్యూరిటీ గార్డుల్లో ఒకడు. హమీద్ క్రూరంగా ప్రవర్తిస్తే అతను నా పట్ల మంచిగా వుండేవాడు.’ అని చెప్పాడు. టామ్ వాకర్‌ను చంపినది నేనే, అతన్ని చంపకపోతే నిన్ను చంపుతానని నజీర్ చెప్పాడు. ఇక గత్యంతరం లేకపోయింది అన్నాడు. నజీర్‌ను కలవలేదని అబద్ధం చెప్పేవేం అంటే ‘అతను నా పట్ల దయగా ప్రవర్తించాడు. చంపలేదు. దానితో అతనంటే యిష్టం కలిగింది. నేను అతని అనుయాయిగా మారలేదు. అయినా కలిశానని, యిష్టమని చెపితే అందరూ నా గురించి చెడుగానే అనుకుంటారు. అందుకని దాచాను.’ అన్నాడు.
ఇంత చెప్పినా క్యారీ కన్విన్స్ కాలేదు. నా ఏజంటు చెప్పిన యుద్ధఖైదీవి నువ్వే అయి వుండాలి అంది. బ్రాడీకి చాలా కోపం వచ్చింది. నువ్వూ నీ ప్రేమా అంతా నటన, నీ కెరియర్లో పైకి వెళ్లడానికై నన్ను వాడుకున్నావ్ అని తిట్టిపోశాడు. క్యారీ అభ్యంతర పెట్టింది. ‘నీకు చేరువైనది వ్యూహంలో భాగంగానే. కానీ నీతో నిజంగానే ప్రేమలో పడ్డాను. మొన్న, నిన్న నీతో పొందిన సుఖం ముందెన్నడూ పొందలేదు.’ అని నిజాయితీగా చెప్పింది. కానీ బ్రాడీ నమ్మలేదు. నువ్వో బూటకపు మనిషివి, నీకూ నాకూ యింతటితో సరి అని తిట్టి, రివాల్వర్ అక్కడే వదిలేసి, దూరంగా పెట్టిన కారు దగ్గరకు వెళ్లిపోతున్నాడు. అంతలో సాల్ నుంచి ఫోన్ వచ్చింది.
ఐలీన్ సహకారంతో స్కెచ్ ఆర్టిస్టు ఆమె వద్దకు వచ్చిన అమెరికన్ టెర్రరిస్టు బొమ్మ గీశాడు. చూస్తే అది టామ్ వాకర్ బొమ్మ. అతను అద్భుతమైన షూటర్ కాబట్టి, మైలు దూరం నుంచి హెలిపాడ్‌లో దిగే దేశాధ్యక్షుణ్ని గురి చూసి చంపడానికి అతన్ని టెర్రరిస్టులు వినియోగించారన్నమాట. టామ్ కాచుకున్న రోజు ఏ కారణం చేతనో అధ్యక్షుడు అక్కడకు రాలేదు. లేకపోతే అతని హత్య జరిగి వుండేది. ఈ విషయం అర్థం కాగానే అందరూ తెల్లబోయారు. చచ్చిపోయాడని అందరూ అనుకుంటున్న టామ్ బతికుండి టెర్రరిస్టుగా మారి యింతటి ఘాతుకానికి తలపెట్టడం ఊహించలేని ట్విస్టు.
ఆ విషయం చెప్పడానికి సాల్ క్యారీకి ఫోన్ చేశాడు. టెర్రరిస్టుగా మారిన యుద్ధఖైదీ బ్రాడీ కాదు, టామ్! నీ అంచనా తప్పింది అని చెప్పాడు. వెంటనే క్యారీ నాలుక కరుచుకుంది. తన కారు వద్దకు వెళుతున్న బ్రాడీ దగ్గరకు పరిగెట్టి, ‘ఐ యామ్ సారీ, పొరబడ్డాను’ అంటూ చెప్పబోయింది. అప్పటికే అతనికి యీమెపై అసహ్యం తారస్థాయిలో ఉంది. ‘వెళ్లి దేనిలోనైనా దూకి చావు’ అని తిట్టేసి, కారులో వెళ్లిపోయాడు. క్యారీ ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ క్యాబిన్‌లోనే ఉండిపోయింది. ఇవతల బ్రాడీ కూడా యింటికి వచ్చి, నిద్రిస్తున్న భార్యాబిడ్డలను ఓసారి చూసుకుని, పెరట్లోకి వెళ్లి ఏడవసాగాడు.
నిజానికి టామ్ వాకర్ బతికే ఉన్నాడు. అతన్ని స్వహస్తాలతో చంపినట్లు బ్రాడీని నమ్మించాడు కానీ అబు నజీర్ అతన్ని ముందే తనవైపు తిప్పేసుకున్నాడు. ఎక్స్పర్ట్ షూటరైన టామ్‌ను టెర్రరిస్టుగా మార్చి, అతని ద్వారా హత్యలు చేయిద్దామని ప్లాను వేశాడు. బ్రాడీ తిరిగివెళ్లిన తర్వాత అతన్ని ఎవరైనా అడిగినా టామ్ చనిపోయాడని అతను చెప్పినది అందరూ నమ్ముతారు కాబట్టి అతని ఉనికి ఎవరూ గుర్తించలేరనుకున్నాడు. ఐలీన్ అల్‌ఖైదా దాడి నుంచి తప్పించుకుని ఉండకపోతే, సిఐఏకు పట్టుబడి వుండకపోతే, నోరు విప్పకపోతే టామ్ గురించి ఎవరూ ఊహించను కూడా ఊహించలేక పోయేవారు.
టామ్ రాజధాని మహానగరంలో ఎక్కడా స్థిరంగా ఉండకుండా రోడ్డు మీద అడుక్కుతినేవాడిలా తిరుగుతున్నాడు కాబట్టి ఎవరూ గుర్తించలేరు కూడా. సౌదీ అరేబియా రాయబార కార్యాయంలో ఉన్నతాధికారిగా పని చేస్తూ లోపాయికారీగా నజీర్‌కు సాయపడుతున్న (మన్సూర్ అల్) జహ్రానీ ద్వారా అతనికి ఆదేశాలు అందుతున్నాయి, వాటిని అతను అమలు చేస్తున్నాడు. ఆదేశాలందివ్వడానికి అతి సులభమైన మార్గం ఎంచుకున్నారు. ట్రాఫిక్ లైట్ల దగ్గర టామ్ ముష్టివాడిలా అందర్నీ డబ్బు అడుగుతూంటాడు. జహ్రానీ అతని చేతిలో ఓ డాలర్ నోటు పెడతాడు. దానిలోపల మడిచి పెట్టిన కాగితంలో ఏం చేయాలో రాసి వుంటుంది.
ఇలా జనసాగరంలో కలిసి పోయినవాణ్ని కనిపెట్టడం సిఐఏకు అతి కష్టం. అందువలన వాళ్లు అతని కుటుంబంపై దృష్టి పెట్టారు. అతని భార్య హెలెన్‌ను, వాళ్ల కొడుకు లూకాస్‌ను లాంగ్లీకి పిలిచి ప్రశ్నలు వేశారు. ఇదంతా ఆశ్చర్యకరంగా వుందని హెలెన్ చెప్పింది. లూకాస్ కాలేజీ దగ్గర తండ్రిని చూశానని చెప్పాడని, కానీ తను నమ్మలేదని చెప్పింది. ఎందుకంటే ఎనిమిదేళ్ల క్రితం నాటి తండ్రి రూపురేఖలు గుర్తుంటాయని అనుకోలేదని, ఎవర్నో చూసి నాన్న అనుకుని ఉంటాడని భావించానని చెప్పింది. టామ్ తిరిగివచ్చాక తనను కాంటాక్ట్ చేయలేదని చెప్పింది. వీళ్లనిలా అడుగుతూండగానే పక్కగదిలో టామ్ చచ్చిపోయావని ఎందుకు చెప్పావని సాల్ బ్రాడీని అడుగుతున్నాడు. అతను చచ్చిపోయాడనే నేను యీ క్షణానికీ నా నమ్మకం అన్నాడు బ్రాడీ.
బ్రాడీ బయటకు వెళిపోతూండగా క్యారీ కనబడింది. అతనామె కేసి అసహ్యంగా చూసి ‘సమాచారం లాగడానికి ఎవడితోనైనా పడుక్కునే రకం నువ్వు. మనసనేదే లేదు.’ అని తిట్టి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లగానే జెసికా కనబడింది. ఇద్దరూ గిల్టీగా ఫీలయ్యారు. జెసికా తన గోడు చెప్పుకుని ఏడ్చింది - ఆరేళ్ల పాటు నీ కోసం వేచి ఉన్నాను. ఎంతమంది వెంటపడినా చలించలేదు. కానీ ప్రభుత్వమే నువ్వు చచ్చిపోయావని చెప్పాక, నాకు, నా బిడ్డలకు అండ కావాలని తపించాను. అందుకే మైక్‌తో సంబంధం పెట్టుకున్నాను. అతనూ మన బిడ్డలకు తండ్రిగా వ్యవహరించాడు. నువ్వు తిరిగి వస్తావని, నేను దోషిగా నిలబడాల్సి చెప్పుకోవలసి వస్తుందని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాకు అప్పుడు తెలియదు.’ అంటూ ఉన్నదున్నట్లు చెప్పింది.
బ్రాడీ కరిగిపోయాడు. ‘నేను తప్పుపట్టటం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. కష్టమే అయినా తిరిగి సంసారాన్ని దిద్దుకుందాం.’ అన్నాడు. ఇద్దరూ ఊరడిల్లారు. ఇంతలో వైస్ ప్రెసిడెంటు వాల్డెన్కు సలహాదారైన ఎలిజబెత్ అనే ఆమె బ్రాడీకి ఫోన్ చేసి ‘ఓ పెద్ద పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నాను. కారు పంపిస్తాను. మీ దంపతులిద్దరూ తప్పకుండా రావాలి.’ అని ఆహ్వానించింది. దంపతులిద్దరూ కాస్సేపు తటపటాయించి సరేనన్నారు.
సిఐఏ వాళ్లు టామ్ భార్య హెలెన్ యింటి లాండ్‌లైన్ ఫోన్ రికార్డు చెక్ చేశారు. అప్పుడప్పుడు వాళ్లు యింట్లో లేనప్పుడు కాల్స్ వస్తున్నాయి. ఇంటికి వచ్చాక హెలెన్ కానీ ఆమె కొడుకు కానీ ఆన్సరింగ్ మెషిన్ ద్వారా ఆన్సర్ చేస్తే మళ్లీ జవాబు ఉండటం లేదు. సాల్ దీన్ని విశ్లేషించాడు - టామ్‌కు కుటుంబమనేది బలహీనత. అందుకే కొడుకు కాలేజీకి వెళ్లి అతన్ని చాటుగా చూశాడు. భార్యతో డైరక్టుగా మాట్లాడకపోయినా, ఆమె వాయిస్ విని తృప్తిపడదామని ఆమె లేనప్పుడు కాల్ చేస్తున్నాడు. ఆన్సరింగ్ మెషిన్లో ఆమె గొంతు, ఒక్కోప్పుడు కొడుకు గొంతు విని సంతోషిస్తున్నాడు.
అందువలన హెలెన్ యింట్లో కాపుకాసి టామ్ ఏ బూత్‌నుంచి కాల్ చేస్తున్నాడో ట్రేస్ చేసి పట్టుకోవడం మంచిదన్నాడు. టామ్ కార్యకలాపాలు దేశం లోపల జరుగుతున్నాయి కాబట్టి అది ఎఫ్బిఐ పరిధిలోకి వస్తాయి. వాళ్లూ వచ్చి కూర్చున్నారు. ఎఫ్బిఐ మనిషి ఈ పద్ధతిని అంగీకరించలేదు. టామ్ ఎప్పుడు కాల్ చేస్తాడా అని వేచి చూడడం వలన టైము వేస్టవుతుందని అతని అభిప్రాయం. డేవిడ్ అన్నీ ఆలోచించి, టామ్‌ను పట్టుకునే పనికి క్యారీయే సమర్థురాలని ఎంచి, ఆ ప్రాజెక్టు ఆమెకు అప్పగించాడు. ఆ విషయం చెప్పడానికి ఆమె సాల్ యింటికి వెళ్లింది.
ఆ పాటికి మీరా ఇండియాకు వెళ్లిపోవడానికి సామాన్లు సర్దుకుంటోంది. అమెకు ఎలా నచ్చచెప్పాలో తెలియక సాల్ సతమతమవుతున్నాడు. కనీసం ఎలిజబెత్ పిలిచిన పార్టీకి హాజరై ఆ తర్వాత వెళ్లమని నచ్చచెపుతున్నాడు. క్యారీ వచ్చి న్యూస్ చెప్పగానే మంచిది అన్నాడు. బ్రాడీపై నీకు అనుమానం పోయినట్లేనా అన్నాడు. అప్పుడు క్యారీ చెప్పేసింది. నిఘా వేసినదంతా వృథా కావడంతో బ్రాడీని విడిగా కలిసి పరిచయం పెంచుకున్నానని, కానీ యిప్పుడదంతా ముగిసిన కథ అనీ చెప్పింది. టెర్రరిస్టు అనుమానితుడితో వ్యక్తిగత స్నేహం సాగించినందుకు సాల్ ఆమెకు చివాట్లేశాడు. చివరకు సరేలే, వెళ్లిరా అన్నాడు.
ఎలిజబెత్ యిస్తున్న పార్టీకి తలిదండ్రులిద్దరూ కలిసి వాళ్లు పంపిన లిమోజాన్లో సరదాగా వెళ్లడం చూసి పిల్లలు సంతోషించారు. పార్టీలో బ్రాడీకి ఎలిజబెత్ చాలా ప్రాధాన్యత యిచ్చింది. బ్రాడీ తన యుద్ధానుభవాలు వర్ణిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అందరూ అతన్ని హీరోని చూసినట్లు చూశారు. ఇంతలో టీవీలో ఓ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఒక సెనేటర్ ఒక సెక్స్ స్కాండల్‌లో యిరుక్కున్నాడని, పార్టీ అతన్ని రాజీనామా చేయమని అడగవచ్చని వార్త. ఎలిజబెత్‌కి యీ విషయం ముందే తెలిసి వుంటుందని, ఆ పదవి బ్రాడీకి కట్టపెట్టేట్టు ఉన్నారని సాల్, తన భార్యతో అన్నాడు. పార్టీ తర్వాత కార్లో యింటికి వెళ్లేటప్పుడు జెసికా చాలా సరదాగా జోకులేసింది. ఆమెను అలా చూసి బ్రాడీకి కూడా హుషారు వచ్చింది. ఇంటికి వెళ్లి పిల్లలతో సహా అందరూ టీవీలో సినిమా చూస్తూ కూర్చున్నారు.
క్యారీ తన టీమును వెంటపెట్టుకుని హెలెన్ యింటికి వెళ్లి కూర్చుంది. పిల్లవాణ్ని తీసుకుని కాలేజీకి వెళ్లిపోయినట్లుగా నాటకం ఆడమని, మళ్లీ యింటికి చాటుగా వచ్చేయమని ఆమెకు చెప్పింది. ఆమె యింట్లోంచి బయటకు వెళ్లడం మాత్రమే గమనించిన టామ్ కాస్సేపటికి ఓ బూత్ నుంచి లాండ్లైన్కు కాల్ చేశాడు. హెలెన్ ఆన్సర్ చేసి, హలో అంది. ఫోన్ వెంటనే కట్ అయిపోయింది. కాల్‌ను క్యారీ టీము ట్రేస్ చేస్తే అది ఎక్కడో ఊరి మూల నుంచి వచ్చింది.
హెలెన్ మనసంతా అదోలా అయిపోయింది. భర్త నిజంగానే బతికి వున్నాడని, ఆ వూళ్లోనే ఓ మూల ఉన్నాడని తెలియగానే కంగారు పడింది. టెర్రరిస్టుగా మారినా, తన మీద అతనికి ప్రేమ పోలేదని, కేవలం తన గొంతు వినడానికే తాపత్రయ పడుతున్నాడని అర్థమయ్యాక అతని కోసం ఆగకుండా పెళ్లి చేసేసుకున్నందుకు ఫీలైంది. క్యారీ అవన్నీ మనసులో పెట్టుకోవద్దని, అతను మళ్లీ ఫోన్ చేసి తీరతాడని, అప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండమని, అలా అయితే తన టీము ఆ కాల్ ట్రేస్ చేసి అతన్ని సజీవంగా పట్టుకోవడానికి వీలుంటుందని నచ్చచెప్పింది.
టామ్‌కు విషయంలో అతని భార్యే అతని బలహీనత. భార్య వాయిస్ మళ్లీ వినాలనే కోరికతో క్యారీ ఊహించినట్లుగానే మళ్లీ యింకో బూత్ నుంచి ఫోన్ చేశాడు. ఈసారి హెలెన్ ‘టామ్, నువ్వేనా?’ అని అడిగింది. జవాబు రాకపోయినా మాట్లాడడం మొదలుపెట్టింది. తను, కొడుకు అతన్నెలా మిస్ చేశారో, వెయిట్ చేశారో చెప్పసాగింది. టామ్ సమాధానం చెప్పకుండా మౌనంగా వింటూ వుండిపోయాడు. ఈ లోగా సిఐఏ, ఎఫ్బిఐ టీములు అతనెక్కడున్నాడో ట్రేస్ చేసి వేగంగా అతనున్న చోటికి చేరారు.
హెలెన్ మాట్లాడుతూమాట్లాడుతూ అతనంటే తనకు ప్రేమ చావలేదని చెప్పగానే టామ్ కరిగిపోయి ‘‘హెలెన్’’ అని ఆమె పేరు ఉచ్చరించాడు. ఆమె చలించిపోయింది. తను తన భర్తను పట్టిస్తున్నాననే స్పృహ కలిగి వెంటనే ‘టామ్, యీ కాల్ ట్రేస్ చేస్తున్నారు, జాగ్రత్త’ అని అరిచేసింది. పక్కనుంచి క్యారీ వారిస్తున్నా వినలేదు. టామ్ వెంటనే ఎలర్ట్ అయ్యాడు. సరిగ్గా గూఢచారి దళాలు రాగానే చాటుగా తప్పుకుని, వారిలో ఒకణ్ని చంపేసి, అతని పిస్టల్ తీసుకుని పారిపోయాడు.
ఎఫ్బిఐ దళాలు అతన్ని వెంటాడుతూ ఓ మసీదులోకి వెళ్లాయి. అక్కడ చీకటిలో సరిగ్గా కనబడక నమాజు చేసుకుంటున్న యిద్దర్ని కాల్చేశారు. టామ్ మసీదులోంచి వేరే మార్గం ద్వారా పారిపోయాడు. అతనికి ముందు రోజే సౌదీ రాయబారి జహ్రానీ తన మామూలు పద్ధతిలోనే డాలరు నోటుతో బాటు ఒక తాళం చెవి, అడ్రసు రాసిన కాగితం యిచ్చివున్నాడు. టామ్ యిప్పుడు ఆ అడ్రసు ప్రకారం ఒక గోడౌన్‌కి చెరి అక్కడున్న ఒక పెట్టె తెరచి చూశాడు. దానిలో పెద్ద రైఫిల్ ఉంది.
మసీదులో అనుకోకుండా జరిగిన దుర్ఘటనతో సిఐఏ స్థయిర్యం చెదిరింది. ఇప్పటిదాకా టామ్ గురించి బయటి ప్రజలకు చెప్పకూడ దనుకున్నారు. చెపితే టెర్రరిస్టును పట్టుకోకుండా ఏం చేస్తున్నారన్న విమర్శలు వస్తాయని వారి భయం. ఇప్పుడిక చెప్పక తప్పని పరిస్థితి. టెర్రరిస్టులను పట్టుకునే ప్రయత్నంలో, ఎదురుకాల్పులు జరిగాయని చెప్పుకుంటే కాస్త మేలు. అందువలన టామ్ ఫోటో విడుదల చేసి, ఇతను ఎక్కడైనా కనబడితే చెప్పమని పబ్లిక్‌ను అడుగుదామనుకున్నారు.
మర్నాడుదయం క్యారీ బ్రాడీ యింటికి వెళ్లి, అతన్ని బయటకు పిలిచి ‘టామ్ సజీవంగా ఉన్నాడని నిర్ధారణ అయింది. అతన్ని పట్టుకోవడానికి నీ సహకారం కావాలి. పబ్లిక్‌కి చెప్పడానికి ముందే నీకు చెప్తున్నా’ అంది. తనను ఆ ప్రాజెక్టుకి యిన్‌చార్జి చేశారని చెప్పగానే బ్రాడీ నేను ఊహించా అన్నట్లు కళ్లెగరేశాడు. క్యారీ అది గ్రహించి ‘నిజంగా చెపుతున్నాను, క్యాబిన్లో నా ప్రవర్తనకు, నా వృత్తికి సంబంధం లేదు.’ అని చెప్పుకుంది. జెసికాకు వచ్చిన వారెవరో, ఏమిటో అర్థం కాలేదు. వచ్చి యింటి ముంగిట నిబడి యీమె కేసి అనుమానంగా చూస్తూ నిబడింది. క్యారీ చెప్పినది విని బ్రాడీ భుజాలెగరేసి, భార్యతో సహా యింట్లోకి వెళ్లిపోయాడు.
అవేళ సాయంత్రం జహ్రానీ తన యింటికి చేరేసరికి తన లివింగ్ రూము సోఫాలో ఒకతను కూర్చుని టీవీలో టామ్ గురించిన వార్తలు చూస్తూ కనబడ్డాడు. ‘‘టామ్, మతిపోయిందా? ఇక్కడకు రావద్దని చెప్పేనుగా’ అని అరిచాడతను. తీరా చూస్తే సోఫాలో ఉన్నది బ్రాడీ. కోపంతో భగభగలాడుతున్నాడు. లేచి ‘‘టామ్ చచ్చిపోయాడని మీరంతా నాకు చెప్పారు, నమ్మించారు. మరి యిప్పుడు టామ్ ఎలా వచ్చాడు?’’ అని గద్దించాడు. జహ్రానీ బెదిరిపోయి, ‘అవన్నీ నువ్వు నజీర్నే అడగాలి. నన్నడిగితే నేనేం చెప్తాను?’ అన్నాడు. ‘నజీర్‌తో మాట్లాడేదీ, గీట్లాడేదీ ఏమీ లేదు. మా వ్యవహారం ఇంతటితో స్వస్తి అని చెప్పు.’ అనేసి బ్రాడీ విసవిసా బయటకు వచ్చేశాడు.
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
సాల్ భార్య మీరా అతన్ని విడిచి ఇండియాకు వెళ్లిపోయింది. సాల్‌కు తెలుసు, ఆమె తన కోసం అంత దూరం నుంచి వచ్చినా, పని ఒత్తిడి కారణంగా టైము కేటాయించలేకపోయానని, కనీసం వరసగా 12 గంటలైనా తనతో గడపకపోవడంతో ఆమె విసిగిపోయిందనీ! తన నిస్సహాయతను తనే నిందించుకుంటూ ఆమె ఎయిర్‌పోర్టుకి టాక్సీ ఎక్కుతున్న సమయానికి రాగలిగాడు. నా వృత్తిధర్మమే నా బలహీనత అని ఒప్పుకున్నాడు. ఏ విధమైన వాగ్వివాదమూ లేకుండా యిద్దరూ విడిపోయారు. టామ్ వ్యవహారం కారణంగా విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు చెప్పే అవకాశం కూడా లేకపోయింది. టామ్ ఫోటో రిలీజ్ చేసిన తర్వాత అక్కడ చూశాం, యిక్కడ చూశాం అంటూ 2 వేల కాల్స్ వచ్చాయి, అన్నీ బోగసే.
వాస్తవానికి టామ్ సౌదీ రాయబారి జహ్రానీ అందచేసిన రైఫిల్‌తో అడవుల్లో ప్రాక్టీసు చేస్తున్నాడు. రెండు రోజులకు అక్కడకు ఓ వేటగాడు వచ్చాడు. ఇతని తుపాకీ చూసి ముచ్చటపడ్డాడు. ఏదీ చూడనీ అంటూ చేతిలోకి తీసుకుని మెచ్చుకున్నాడు. తనదీ యితనికి యిచ్చాడు. టామ్ యిదంతా సహించాడు. అడ్డు చెపితే అనుమానం వస్తుందని జంకాడు. కానీ వచ్చిన వేటగాడికి అతని మొహం ఎక్కడో చూసినట్లు అనిపించింది. సరే, వస్తా అంటూ రోడ్డు మీదకు వచ్చి ట్రక్కులో పడివున్న పేపరు చేతిలోకి తీసుకుని, దానిలోని ఫోటో పోల్చి చూసుకున్నాడు. ఇతనే టామ్ అని తోచింది. వెంటనే అక్కణ్నుంచి పారిపోబోయాడు. ఇదంతా టామ్ ముందే ఊహించాడు. అందుకే వెంటాడుతూ వచ్చి, అతన్ని చంపేశాడు. అతని శవాన్ని ట్రక్కులో పడేసుకుని, ఊళ్లోకి బయలుదేరాడు.
ఎఫ్బిఐ ఏజంట్లు మసీదులో కాల్పులు జరిపి యిద్దరు భక్తులను కాల్చేయడం పెద్ద గొడవ రేపింది. ఆ ప్రాంతంలోని ముస్లిములందరూ ఆందోళన చేస్తున్నారు. క్యారీ అక్కడకు వెళ్లి మసీదు పెద్దగా వున్న ఇమామ్‌ను కలిసింది. ఆ టామ్ ఎవడో మాకు తెలియదు. ఇటు ఎప్పుడూ రాలేదు, మాకు తెలిసినదల్లా ఎఫ్బిఐ వచ్చి అమాయకులైన భక్తులను కాల్చేసి, మసీదును అపవిత్రం చేసింది అన్నాడతను కోపంగా. అక్కడకు ఎఫ్బిఐ తరఫున హాల్ అనే స్పెషల్ ఏజంటు వచ్చాడు. హత్యాస్థలాన్ని పరిశీలించి, టామ్ మసీదుకి తరచుగా వస్తూండాలని, అతనికి మసీదు ఆనుపానులన్నీ తెలుసని చెప్పాడు. టామ్ తొలిసారిగా కాల్చాడని, ఎఫ్బిఐ ఎదురుకాల్పులు జరిపిందని, ఆ క్రమంలో అనుకోకుండా మరణాలు సంభవించాయని అతను ఇమామ్‌తో వాదించాడు.
విడిగా క్యారీతో మాత్రం మావాళ్లే ముందుగా కాల్చారు అని ఒప్పుకున్నాడు. అతనికి తెలియకుండా క్యారీ దాన్ని రికార్డు చేసి డేవిడ్‌కు వినిపించింది. ‘ఇమామ్‌కు టామ్ గురించి తెలుసు. కానీ ఎఫ్బిఐ వాళ్లు తమ తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే తప్ప అతను నోరు విప్పడు. మనం యీ టేపు సహాయంతో ఎఫ్బిఐను వంచుదాం.’ అంది. కానీ డేవిడ్ ఒప్పుకోలేదు. ఎఫ్‌బిఐతో తగవేసుకుంటే చాలా సమస్యలు వస్తాయన్నాడు. పైగా యింతా చేసి ఇమామ్ ఏమైనా చెప్తాడో లేదో గ్యారంటీ లేదన్నాడు.
ఇక గత్యంతరం లేక ఇమామ్‌ను బతిమాలడానికి క్యారీ అతని యింటికి వెళ్లింది. అతను భార్యచేత టీ యిప్పించి మర్యాదలు జరిపాడు కానీ ఎఫ్బిఐ క్షమాపణ చెప్పాకనే తక్కిన సంగతులు చూద్దామన్నాడు. టామ్ కాల్చలేదని, ఎఫ్బిఐయే కాల్చిందని సాక్ష్యం చెప్పడానికి ఏడుగురు భక్తులు సిద్ధంగా ఉన్నారని ధాటీగా చెప్పాడు. పెద్దమనిషిగానే తోచాడు, టెర్రరిజానికి వ్యతిరేకంగానే ఉన్నాడు కానీ కాల్పుల కారణంగా ఆత్మాభిమానం దెబ్బ తిని, సహకరించటం లేదని క్యారీకి అర్థమైంది. తన విజిటింగ్ కార్డు బల్ల మీద పెట్టి, సాయపడదామని ఎప్పుడైనా తోస్తే ఫోన్ చేయమని అడిగి వచ్చేసింది.
నజీర్ పట్ల తన ఆగ్రహాన్ని జహ్రానీ వద్ద వ్యక్తం చేసి వచ్చేసిన తర్వాత బ్రాడీ మనసు తేలికపడింది. గతాన్ని పాతిపెట్టి, తన కుటుంబంలోని వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచుకుందామనుకుని, యింటి పనుల్లో పాలుపంచుకోసాగాడు. భార్య యిల్లు సర్దుతూంటే తను ఆవిడ యిచ్చిన వెచ్చాల జాబితా పట్టుకుని సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. ఏదో ఒక వస్తువు గురించి అర్థం కాక యింటికి ఫోన్ చేశాడు. ఆమె తీయకపోతే వేరేది కొనేసి పార్కింగ్ లాట్‌కు వచ్చి కారులో సామాన్లు పెడుతున్నాడు. మిస్డ్ కాల్ చూసుకుని జెసికా అతనికి ఫోన్ చేయడంతో అతని దృష్టి మరలింది. సరిగ్గా అదే సమయానికి ముగ్గురు మనుషులు అతన్ని స్పృహతప్పేలా చావబాది కారులో తీసుకుపోయారు.
అతనికి గతమంతా గుర్తుకు రాసాగింది. మూడేళ్ల క్రితం బందీగా ఉన్న తనను నజీర్ మేల్కొల్పాడు. కొత్త యింటికి తీసుకెళ్లి, గడ్డం గీసుకుని, స్నానం చేయమన్నాడు. కట్టుకునేందుకు మంచి బట్టలు యిచ్చాడు. ఆహారం పెట్టాడు. ఒక చిన్న కుర్రవాణ్ని చూపించి ‘‘వీడు నా కొడుకు ఐసా. వీడికి నువ్వు ఇంగ్లీషు నేర్పాలి. ఇక్కడే వీడితో బాటు ఉంటూండు. ఇకపై ఇదే నీ యిల్లు .’’ అన్నాడు. బ్రాడీకి ఏమనాలో తెలియదు. అతనికి అరబిక్ రాదు, పిల్లవాడికి ఇంగ్లీషు రాదు. సిగ్గరి. తనకెప్పుడూ పాఠాలు చెప్పిన అనుభవమూ లేదు. ఏది ఏమైనా ఏకాకిగా, బందీగా వుండే బదులు యిది నయం కదా అనుకున్నాడు.
అమాయకంగా కనబడే ఆ పిల్లవాడు చూడగానే ముచ్చట వేస్తున్నాడు. వాడికి సాకర్ అంటే యిష్టమని గ్రహించాడు. దాని ద్వారా దగ్గరయ్యాడు. ఓ సారి అతను గాజుపాత్రలు విరక్కొట్టేస్తే నజీర్ కోప్పడబోయాడు. వెంటనే బ్రాడీ ఆ తప్పు తనమీద వేసుకుని, పిల్లవాడి ప్రేమ చూరగొన్నాడు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ పోనుపోను బ్రాడీకి కూడా అతనంటే పుత్రవాత్సల్యం కలిగింది. సొంత కొడుకు లాగే చూసుకున్నాడు. ఇంగ్లీషు నేర్పాడు. ముస్లిముగా మారి అతనితో కలిసి ప్రార్థనలు చేశాడు. ఐసాకు బ్రాడీ ఎంతో నచ్చేశాడు. ఇద్దర్నీ కలిపి బొమ్మ వేసి చూపించాడు. నజీర్ కూడా బ్రాడీని ఆప్యాయంగా చూశాడు. ఇద్దరి మధ్య ఆత్మీయత ఏర్పడింది.
ఏళ్లు గడిచాయి. నజీర్ కొడుకు ఐసాకు బ్రాడీ పెంపుడు తండ్రిలా వ్యవహరిస్తున్నాడు. ఓ రోజు అతను యితర పిల్లలతో కలిసి చదువుకోవడానికి మదరసాకు వెళ్లాడు. అంతలో అమెరికా సైన్యం ఆ కాలేజీపై డ్రోన్‌తో బాంబులు కురిపించింది. ఆ పేలుళ్లు విని బ్రాడీ అటు పరిగెట్టాడు. శిథిలాలలో ఐసా శవం కనబడింది. ఆ దాడిలో చనిపోయిన 83 మంది పిల్లలలో ఐసా ఒకడు. అది నజీర్‌ను ఎంత కలచివేసిందో బ్రాడీని యింకా అంతకంటె కలచివేసింది. అతని అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అతని చావుకి కారకులైన వారిపై పగ తీర్చుకుంటానని శపథం చేశాడు.
జరిగినదేమిటంటే సిఐఏ నజీర్కై వెతుకుతూన్నపుడు అతను ఒక మదరసాలో దాగున్నాడని వాళ్లకు కబురు వచ్చింది. దానిలో పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది కాబట్టి అమాయకులపై బాంబులు వేయకూడదని సిఐఏలో కొందరి అభిప్రాయం. రూలు ప్రకారం కూడా అలా వేయకూడదు. అయితే మాజీ సిఐఏ డైరక్టరు, అప్పటి వైస్ ప్రెసిడెంటు ఐన వాల్డెన్ బాంబులు వేసేద్దామని నిశ్చయించుకున్నాడు. ఆ ప్లానులో డేవిడ్‌ను భాగం చేశాడు కానీ, అతని కంటె సీనియర్‌గా ఉన్న సాల్‌కు చెప్పలేదు.
డ్రోన్ ద్వారా బాంబులు వేస్తే నజీర్ దొరకలేదు కానీ, 83 మంది పిల్లలు మాత్రం చనిపోయి చాలా అల్లరై పోయింది. దాంతో ప్రభుత్వం ఆ దాడి జరగలేదని బుకాయించింది.
దానికి సంబంధించిన ఫైళ్లన్నిటిని వాల్డెన్, డేవిడ్ ద్వారా సిఐఏ రికార్డుల్లోంచి మాయం చేయించాడు. పిల్లలు చనిపోయారని అల్‌ఖైదా వీడియో విడుదల చేస్తే, అదంతా అల్‌ఖైదా కల్పించిన అబద్ధపు వీడియో అని, ఓ మిసైల్ ప్రయోగిస్తే అది వెళ్లి నజీర్ కాంపౌండులో పడిందంతేనని వాల్డెన్ పబ్లిగ్గా ఓ ప్రకటనలో ఖండించాడు.
ఆనాడు సిఐఏ కౌంటర్ టెర్రరిజం శాఖలో చిరుద్యోగిగా ఉన్న డేవిడ్ యీనాడు దానికి డైరక్టరు. ఆనాడు అతనికి సీనియర్‌గా ఉన్న సాల్, యీనాడు డేవిడ్‌కు జూనియర్. ఆ శాఖలోని సాల్‌కు, క్యారీకి, మరెవరికీ యీ డ్రోన్ దాడి గురించి తెలియదు. తెలిసిన డేవిడ్ నోరు విప్పడు. ఆ ఘోరానికి మూలకారకుడైన వాల్డెన్ అతన్ని సకలవిధాలా కాపాడుతున్నాడు.
బ్రాడీకి మెలకువ వచ్చేసరికి అతను పక్క మీద పడివున్నాడు. డాక్టర్ పరీక్షిస్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి కంప్యూటర్ ఆన్ చేశాడు. దానిలో నజీర్ వీడియో కాన్ఫరెన్సింగ్‌కు వచ్చాడు. ‘టామ్ చచ్చిపోయాడని చెప్పి నన్ను ఎనిమిదేళ్లగా మోసం చేశావు.’ అని బ్రాడీ నిందించాడు. ‘అవన్నీ చిన్న విషయాలు. ఐసా దుర్మరణానికి కారకుడైన వాల్డెన్పై ప్రతీకారం తీర్చుకుంటానని నీ అంతట నువ్వే ప్రతిజ్ఞ చేశావ్. అది మర్చిపోయావా?’ అని అడిగాడు నజీర్. ఆ తర్వాత మదరసాపై దాడి జరగలేదని, అదంతా అల్‌ఖైదా ఉత్తుత్తి ప్రచారమని అప్పుడు వాల్డెన్ యిచ్చిన ప్రసంగం వీడియోను చూపించారు. చూడగానే బ్రాడీ రక్తం సలసల కాగింది.
అది గమనించి జహ్రానీ ఆ గదిలోకి వచ్చాడు. ‘వైస్ ప్రెసిడెంట్ వాల్డెన్ రాజీనామా చేసిన కాంగ్రెస్‌మన్ స్థానంలో నిన్ను నిలబడమంటాడు. ఆ ఆఫర్‌ను నువ్వు స్వీకరించాలని నజీర్ కోరుకుంటున్నాడు. అప్పుడే నువ్వు లక్ష్యానికి కట్టుబడినట్లు నమ్ముతాడు.’ అని చెప్పాడు. బ్రాడీని విడుదల చేసేశాడు. సూపర్ మార్కెట్ నుంచి హఠాత్తుగా మాయమై పోయి, ఫోన్ తీయక ఎప్పటికో గాయాలతో తిరిగి వచ్చిన అతన్ని చూడగానే భార్య ఆందోళన పడింది. బ్రాడీ, భార్యతో ఎవరో దుండగులు దాడి చేశారని చెప్పాడు. ఆమెకు నమ్మాలో, వద్దో తెలియలేదు కానీ వైస్ ప్రెసిడెంటు నుంచి అతని కోసం ఒక వాయిస్ మెయిల్ వచ్చిందని చెప్పింది.
ఇక్కడిలా జరుగుతూండగా ఇమామ్ భార్య భర్తకు తెలియకుండా క్యారీకి రహస్యంగా ఫోన్ చేసింది. ఒక సూపర్ మార్కెట్లో కలిస్తే తనకు తెలిసిన విషయం చెప్తానంది. చెప్పింది కూడా. టామ్ తమ మసీదుకు ఓ పదిసార్లు వచ్చాడని, వచ్చినపుడల్లా అతనితో ఒక వ్యక్తి వచ్చాడని, అతను ముస్లిమే కానీ, ప్రార్థనలకు తమ మసీదుకి రాడని చెప్పింది. సౌదీ రాయబార కార్యాలయానికి చెందిన కారులో వచ్చేవాడని చెప్పింది. క్యారీ ధన్యవాదాలు చెప్పి వచ్చేసింది.
ఇక ఆ సమాచారంపై సాల్, క్యారీ వర్క్ చేసి అతను జహ్రానీ అని కనిపెట్టేశారు. టామ్‌ను పట్టుకుని అతను చేయబోయే ఘోరాన్ని ఆపాలంటే జహ్రానీని నిర్బంధించి, అతని చేత నిజాలు కక్కించాలి. కానీ అతను రాయబారి కార్యాలయపు ఉద్యోగి కాబట్టి ఇమ్యూనిటీ వుంటుంది. అధికారికంగా అతన్ని ఏమీ చేయలేరు. మరెలా?
బ్రాడీ యింటికి హఠాత్తుగా సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు. ఇల్లంతా వెతుకుతామన్నారు. ఎందుకాని కంగారు పడ్డాడు బ్రాడీ. చివరకు తేలిందేమిటంటే వైస్ ప్రెసిడెంట్ వాల్డెన్ వాళ్లింటికి వస్తున్నాడు. ఇది సెక్యూరిటీ చెక్. వాల్డెన్ వచ్చాడు. అందర్నీ పంపించేసి, ఒంటరిగా బ్రాడీతో మాట్లాడాడు. ‘సెక్స్ స్కాండల్‌లో యిరుక్కున్న కాంగ్రెస్‌మన్ చేత రాజీనామా చేయిస్తున్నాం. ఆ స్థానానికి రాబోయే ఉపయెన్నికలో నిన్ను నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది. నువ్వు సరేనను. ఇది మంచి అవకాశం.’ అన్నాడు. ‘మా ఆవిణ్ని అడిగి చెపుతా’ అన్నాడు బ్రాడీ.
భార్యతో చెపినపుడు ఆమె వద్దంది. ‘ఒకసారి రాజకీయాల్లోకి వెళితే మన బతుకు బజార్న పడుతుంది. ఇన్నాళ్లూ గుట్టుగా బతుకుతున్నాం. కాంగ్రెస్‌మన్ అనగానే మీడియా వాళ్లు మన గతాలను తవ్వుతారు. పిల్లలపై నిరంతరం నిఘా పెడతారు, ఉన్నవీ లేనివీ కథనాలు వండి వారుస్తారు. నాకు, మైక్‌కు ఉన్న సంబంధం బయటకు వస్తుంది. అందరి ఎదుటా దోషులుగా నిలబడతాం. నాదే కాదు, నువ్వు ఆ సిఐఏ పిల్లతో వారాంతాలు డేటింగ్ చేసిన విషయమూ పేపర్లో వస్తుంది. ఇదంతా మనకు అవసరమా? ఉన్నంతలో హాయిగా బతకవచ్చు కదా’ అంది. సిఐఏ పిల్ల అనగానే బ్రాడీ గతుక్కుమన్నాడు. ఎలా తెలిసింది? ఎంతవరకు తెలిసింది? వంటి ప్రశ్నలు వేసే ధైర్యం చేయలేదు. ఆలోచిద్దాం అని చెప్పి వూరుకున్నాడు. ప్రజాజీవితంలోకి వెళతానని అవతల అబు నజీర్‌కు మాట యిచ్చివున్నాడు. ఎలా?
క్యారీ, వర్జిల్ కలిసి జహ్రానీపై నిఘా పెట్టి చాలా వివరాలు సేకరించారు. డిపార్టుమెంటు ద్వారా కొన్ని తెలుసుకున్నారు. అవన్నీ క్యారీ తన డిపార్టుమెంటులో అందరికీ కలిపి సెషన్ పెట్టి చెప్పింది - జహ్రానీ రాయబారి కార్యాలయంలో ఉన్నతోద్యోగి, జీతం బాగానే వస్తుంది కానీ ముగ్గురు భార్యలు. వాళ్లందరికీ కలిపి 10మంది పిల్లలు. ఇంతమంది భార్యలున్నా ఓ మసాజ్ సెంటరుకి వెళ్లి ఒక మగవాడితో రమిస్తాడు. విపరీతంగా అప్పులు చేశాడు. ఒక బ్యాంకుకు 75 వేల డాలర్లు అప్పుపడ్డాడు. అయినా అప్పుడప్పుడు ఒక స్విస్ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తూంటాడు. ఆ డబ్బు అతనిదే అయితే అప్పు తీర్చేసేవాడు కదా. దాని అర్థం అల్‌ఖైదా తరఫున దాని ఏజంట్లకు స్విస్ బ్యాంకు ద్వారా డబ్బు పంపిణీ నిర్వహిస్తూ వుంటాడు. అతని దగ్గరకు వెళ్లాలంటే దౌత్యనిబంధనలు ఒప్పుకోవు. అందువలన అతనికి ఋణాలిచ్చిన బ్యాంకు ద్వారానే అతన్ని హ్యేండిల్ చేయాలి. వాళ్లు పిలిపించినట్లు రప్పించి ప్రశ్నలడిగి బెదిరించాలి. డేవిడ్ అంతా విని మీకు తోచినట్లు చేయండి అన్నాడు.
క్యారీ బ్యాంకుకి వెళ్లి మీరు మాకు సహకరిస్తే మేం మీ దగ్గర ఖాతా తెరుస్తామని ఆశ పెట్టింది. వాళ్లు జహ్రానితో లోను గురించి మాట్లాడాలని చెప్పి పిలిపించారు. వచ్చాక స్టాఫ్ ఎవరూ లేని టాప్ ఫ్లోరుకి తీసుకెళ్లడంతో, జహ్రానీకి అనుమానం వచ్చి వెళ్లిపోతానన్నాడు. సాల్, క్యారీ అతన్ని ఆపారు. మసాజ్ సెంటర్లో స్వలింగ సంపర్కం ఫోటో చూపించి మీ రాయబారితో సహా కుటుంబంలో అందరికీ చెప్తామని చెప్పి బెదిరించారు. నా పెళ్లాలకు యిది ముందే తెలుసు, లోకం ఏమనుకుంటుందో నాకు ఖాతరు లేదు, నేనేమీ చెప్పను అన్నాడతను. అప్పుడు క్యారీ ‘నీ కూతుళ్లలో ఒకామె చాలా తెలివైనది. నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌తో యేల్ యూనివర్శిటీలో చదువుతోంది. నీకు దౌత్యరక్షణ వుంది కానీ ఆమెకు లేదు. మా దగ్గరున్న ఆధారాలు చూపించి ప్రభుత్వం చేత ఆమెను అమెరికా నుండి బహిష్కరింప చేస్తాం. యూరోప్‌లో కూడా ఎక్కడా సీటు రాకుండా చేస్తాం. ఇక ఆమె సౌదీ అరేబియాకి తిరిగివెళ్లి బురఖా వేసుకుని, తక్కిన ఆడవాళ్లలాగానే ద్వితీయశ్రేణి పౌరురాలిగా బతకాల్సి వస్తుంది.’ అంది. తన కూతురు భవిష్యత్తు పాడవుతుందనగానే జహ్రానీ వణికాడు. నోరు విప్పాడు.
క్యారీ అతన్ని ప్రశ్నలడిగింది. అబు నజీర్ తెలుసని, తనకు వచ్చిన ఆదేశాలను టామ్‌కి అందిస్తూంటానని చెప్పాడు. ‘అయితే రేపు ఫర్రాగట్ స్క్వేర్‌లో కలవమని టామ్‌కు సిగ్నల్ యివ్వమని చెప్పింది. తన యింటి కిటికిలో ఒక వస్తువు పెడితే టామ్‌కి అర్థమవుతుందని, అలా చేసి మీకు చెపుతానని జహ్రానీ ఒప్పుకున్నాడు.
ఇంతలో బ్రాడీ ‘మీ యింటికి వచ్చి కలుస్తా’నంటూ క్యారీకి ఫోన్ చేశాడు. ఈమె పొంగిపోయింది. తన ప్రేమలోని నిజాయితీని గుర్తించి వస్తున్నాడని మురిసిపోయింది. కానీ బ్రాడీ ప్లాన్లు వేరు. అతను మైక్ వద్దకు వెళ్లి ‘నీ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు క్షమించు. నేను చచ్చిపోయానని అనుకునే కదా, మీ యిద్దరూ చేరువయ్యారు. జెసికాది కూడా ఏ పొరపాటూ లేదు. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వెళతానంటూ వుంటే వద్దంటోంది. నా కంటె నీ మాటకే ఎక్కువ విలువిస్తుంది. కాస్త నచ్చచెప్పు’ అన్నాడు. తర్వాత క్యారీ యింటికి వెళ్లాడు. ఆమె యితని కోసం చాలా హడావుడి పడిపోయింది. మంచి బట్టలు కట్టుకుంది. చక్కటి వైన్ ఏర్పాటు చేసింది. డిన్నర్ వండింది. మ్యూజిక్ పెట్టింది. కానీ బ్రాడీ వస్తూనే అతి సీరియస్‌గా ‘నేను కాంగ్రెస్‌మన్‌గా పోటీ చేయబోతున్నాను. మన బంధం రహస్యంగా వుంచకపోతే యిద్దరం యిబ్బంది పడతాం. ఆ మేరకు నాకు మాట ఇయ్యి.’ అన్నాడు. ఇందుకా వచ్చింది అనుకుని హతాశురాలైన క్యారీ సరేనని మాట యిచ్చింది. థ్యాంక్స్ అంటూ అతను వెళ్లిపోయాక వైన్ బాటిల్ సింక్‌లో ఒంపేసి, తన ఒంటరి బతుకు గురించి తలచుకుని వెక్కివెక్కి ఏడ్చింది.
ఫర్రాగట్ స్క్వేర్ వద్ద ఉన్న పార్కులో సిఐఏ, ఎఫ్బిఐ తమతమ దళాలతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఎఫ్బిఐ మన సిబిఐ లాటిది. దేశంలో జరిగే ఘటనలను యిన్వెస్టిగేట్ చేస్తుంది, దోషులను పట్టుకుంటుంది, కేసు నడిపి శిక్ష పడేట్లు చేస్తుంది. టామ్‌ను పట్టుకోవడం వాళ్ల పని కూడా. అతను టెర్రరిస్టు కాబట్టి సిఐఏ సహకరిస్తోంది. క్యారీ, వర్జిల్ స్వయంగా ఫీల్డ్‌లోనే ఉన్నారు. జహ్రానీ యిచ్చిన సంకేతం అందుకుని టామ్ అక్కడకు నియమిత సమయానికి రావాలి. అతను రాగానే సజీవంగా పట్టుకుని, నజీర్ ఉనికి గురించి అడగాలని వీళ్ల ప్లాను. అనేకమంది వాకీటాకీలతో చుట్టూ తిరుగుతున్నారు. క్యారీ కూడా అక్కడక్కడే తిరుగుతూ ఆదేశాలు యిస్తోంది. జహ్రానీ వచ్చి కారు దిగాడు. పార్కులో నడవసాగాడు. కొద్ది క్షణాల్లోనే టామ్ లాగే నల్లజాతీయుడైన ఒక వ్యక్తి టోపీ పెట్టుకుని అతని వైపుగా నడుస్తున్నాడు. ఎడమ చేతిలో బ్రీఫ్‌కేస్ వుంది. టామో, కాదో తెలియాలంటే సరిగ్గా కనబడటం లేదు. వేరే ఎవరో అయితే ఏ కాలి మీదో కాలిస్తే మసీదు దగ్గర అల్లరైనట్లు యిక్కడా అవుతుంది. అందుకని అందరూ తటపటాయిస్తున్నారు.
ఇంతలో క్యారీ చూపు అతని కుడి మణికట్టుపై పడింది. అక్కడ వాచీ వుంది. అంటే యితను ఎడమచేతి వాటం వాడన్నమాట. బ్రీఫ్‌కేసు కూడా ఎడం చేత్తో పట్టుకున్నాడు. కానీ టామ్ కుడిచేతి అలవాటున్నవాడు. ఇతను టామ్ కాదన్నమాట. టామ్‌కి సంగతి తెలిసిపోయి, వేరెవర్నో పంపాడు. జహ్రానీ చేసిన మోసాన్ని గ్రహించి, అతన్ని చంపడానికి బ్రీఫ్‌కేసులో బాంబు తెస్తున్నాడేమో! ఈ ఆలోచన రాగానే క్యారీ వెంటనే అందర్నీ దూరంగా పారిపోమని అరిచింది. అప్పటికే యిదంతా దగ్గర్లో వున్న ఓ భవంతి కిటికీ నుంచి చాటుగా గమనిస్తున్న టామ్ తన చేతిలోని సెల్‌ఫోన్ ద్వారా రిమోట్ నొక్కాడు. ఆ పాటికే వచ్చినవాడు జహ్రానీని చేరుకోవడం, బాంబు పేలి జహ్రానీతో పాటు వచ్చినవాడు, కొందరు పౌరులు, సిఐఏ, ఎఫ్బిఐ సిబ్బంది చచ్చిపోయారు, గాయపడ్డారు. క్యారీ ఒక్కసారిగా వెనక్కు విరుచుకుపడింది. తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
జెసికా వద్దకు మైక్ వెళ్లి బ్రాడీకి నచ్చినట్లు చేసుకోనీ, అడ్డుపడకు అని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. బ్రాడీతో సరేనని చెప్పింది. పిల్లలు కూడా చప్పట్లు కొట్టారు. అతను వెంటనే వాల్డెన్కు తన అంగీకారం తెలిపాడు. ఆసుపత్రిలో సాల్ క్యారీని కలిసి దుర్ఘటన వివరాలు చెప్పే సమయానికి బ్రాడీ కాంగ్రెసుకు పోటీ చేస్తున్న సంగతి టీవీలో వస్తోంది. మనం అనుకున్నంతా అయింది అన్నాడు సాల్. సూట్‌కేస్ పట్టుకుని వచ్చిన ఆఫ్రో`అమెరికన్ యిల్లు లేనివాడని, టామ్ అతనికి డబ్బు ఆశ చూపించి పంపించి వుంటాడని అన్నాడు. టామ్‌కి ఎలా తెలిసింది అని క్యారీ అడిగితే ఈ ఆపరేషన్‌లో మొత్తం 16 ఏజన్సీలు పాలుపంచుకున్నాయి. ఎవరో లీక్ చేసి వుంటారన్నాడు.
•
Posts: 2
Threads: 0
Likes Received: 9 in 8 posts
Likes Given: 6
Joined: Jul 2019
Reputation:
0
•
Posts: 91
Threads: 0
Likes Received: 34 in 28 posts
Likes Given: 0
Joined: Jul 2019
Reputation:
0
•
Posts: 978
Threads: 12
Likes Received: 2,228 in 665 posts
Likes Given: 699
Joined: Feb 2019
Reputation:
83
|