Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
#21
(05-09-2020, 07:10 AM)Mahesh.thehero Wrote: Heartfully thank you sooooooo much guys .

 evening 5:30 లోపు అప్డేట్ తో మీ ముందు ఉంటాను .

Thank you sir, we are waiting for your awesome first update of the story.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Hi mahesh garu
New story title bagundi pedarasi peddamma iche varam tho mana hero emi chesuthadu ani exicting ga pettaru janamanichina thalli and jevitha gamyam la e story success avvali ani korukuntunna
Janamanichina thalli story NEVER ENDING STORY adi rasuthu vellachu and a story lo sex okate kakunda relations, emotions bagunnayi nennu 3 times chadivanu a story ni eppati varaku

Short stories ani modalu pettaru new thread andulo mahesh and mahi first story title name marichipoya Pelli ayina mahi mahesh ni ela kalisaru annadi baga rasaru ika second story mahesh and mahi brother and sister valla emotions a story ki highlight first story kante second story baga nachindi
Ika third story jevitha gamyam first 2 stories kante edi chala chala baga nachindi main ga jail episode aythe fantastic jail update ayaka chala mandi comments chadivanu pettinavi andaru next emi avuthadi ani exict ayaru cheppali ante ventane update kuda adigaru andaru ofcourse nennu adiga antha baga andaru story ki connect ayala chesaru daniki me writing and me ideas handsoff ika entha cheppina takkuve andaram eppudu eppudu janaki Amma vasuthara Vasanthi tho kalisi uriki velluthara akkada celebrations mahesh urikosam cheyali anukundi Ela chala undi avi anni chudali e process lo Vasanthi and mahesh kaliyaka and taruvatha mahi, swathi, prasanna lu unnaru e story ni kuda never ending ga cheyachu but short story aythe good ending kosam waiting

Ika new story kuda janamanichina thalli and jevitha gamyam kante pedda hit kavali andaru ika e story updates eppudu eppudu istara ani wait cheyali ala undali ani korukuntunna all the best mahesh garu
[+] 4 users Like Bvgr8's post
Like Reply
#23
(05-09-2020, 03:50 PM)Bvgr8 Wrote: Hi mahesh garu
New story title bagundi pedarasi peddamma iche varam tho mana hero emi chesuthadu ani exicting ga pettaru janamanichina thalli and jevitha gamyam la e story success avvali ani korukuntunna
Janamanichina thalli story NEVER ENDING STORY  adi rasuthu vellachu and a story lo sex okate kakunda relations, emotions bagunnayi nennu 3 times chadivanu a story ni eppati varaku

Short stories ani modalu pettaru new thread andulo mahesh and mahi first story title name marichipoya Pelli ayina mahi mahesh ni ela kalisaru annadi baga rasaru ika second story mahesh and mahi brother and sister valla emotions a story ki highlight first story kante second story baga nachindi
Ika third story jevitha gamyam first 2 stories kante edi chala chala baga nachindi main ga jail episode aythe fantastic jail update ayaka chala mandi comments chadivanu pettinavi andaru next emi avuthadi ani exict ayaru cheppali ante ventane update kuda adigaru andaru ofcourse nennu adiga antha baga andaru story ki connect ayala chesaru daniki me writing and me ideas handsoff ika entha cheppina takkuve andaram eppudu eppudu janaki Amma vasuthara Vasanthi tho kalisi uriki velluthara akkada celebrations mahesh urikosam cheyali anukundi Ela chala undi avi anni chudali e process lo Vasanthi and mahesh kaliyaka and taruvatha mahi, swathi, prasanna lu unnaru e story ni kuda never ending ga cheyachu but short story aythe good ending kosam waiting

Ika new story kuda janamanichina thalli and jevitha gamyam kante pedda hit kavali andaru ika e story updates eppudu eppudu istara ani wait cheyali ala undali ani korukuntunna all the best mahesh garu

Heartfully thank you so so soooooooo much bvgr మిత్రమా.
Like Reply
#24
(05-09-2020, 02:45 PM)Joncena Wrote: Thank you sir, we are waiting for your awesome first update of the story.

Love you jon.
Like Reply
#25
(04-09-2020, 03:12 PM)Freyr Wrote: All the best for your new story bro

Love you.
Like Reply
#26
(04-09-2020, 05:28 PM)Milffucker Wrote: thanks 

మీ జీవిత గమ్యం, జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం కథల లాగా extraordinary గా ఈ కథ కూడా ఉండాలని, ఉంటుందని ఆసిస్తూ
All the Very Very Best  Namaskar Namaskar 

Heart Heart Heart Heart Heart Heart

Love you .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
#27
(04-09-2020, 04:19 PM)DVBSPR Wrote: థాంక్యూ సోమచ్ మహేష్ గారు మీ కొత్త కథ కూడా మీ మిగతా రెండు కథలలా అద్భుతం గా ఉంటుందని ఆశిస్తున్నాము.

Love you.
Like Reply
#28
(04-09-2020, 07:53 PM)Hitman7396s Wrote: Woah mahesh bro, we are happy to have another story from you.

3rd story kuda start chesaru. Apudu 3 stories update time (gap) chala avvachemo ani chinna badha bro ante. Kani me nunchi enni stories vaste anta entertain feel avtam. Waiting for this...

Love you .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
#29
(04-09-2020, 03:29 PM)krantikumar Wrote: All the best

Love you .
Like Reply
#30
Waiting for update bro
మీ
Umesh
Like Reply
#31
(04-09-2020, 04:18 PM)Samkedi23 Wrote: Bro congrats and  jeevitha gamyam update ivvagalarani anukuntunnanu

Love you .
Like Reply
#32
(04-09-2020, 07:23 PM)Vikatakavi02 Wrote: టైటిల్ వెరైటీగా వుంది. కథ ఇంకెలా ఉంటుందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది.
ప్రారంభించు బ్రో...

Love you .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
#33
నా పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఫ్రెండ్స్ అండ్ బ్రోస్ . నాకు ఊహ తెలిసేనాటికి నేను అనాధనని , వైజాగ్ లోని అతిచిన్న అనాథ శరణాలయంలో పదులమంది అనాధలతోపాటు జీవిస్తున్నానని అర్థమయ్యింది . చిన్న చిన్న గదులలో ఇరుకిరుకుగా జీవిస్తున్నా మేము బాధపడిన రోజంటూ లేదు . చుట్టూ వయసు వ్యత్యాసం అన్నయ్యలూ తమ్ముళ్లూ ......... ఉన్నప్పటికీ అందరమూ ఒక కుటుంబంగా కలిసి జీవించేవాళ్ళము . రోజుకు మూడుపూటలూ తిన్న రోజులు చాలా తక్కువ . సంవత్సరానికి రెండుసార్లు మాత్రం వైజాగ్ మొత్తం దానం చేసిన బట్టలను తీసుకొచ్చి కుప్పలా పోస్తారు - మాకు సరిపోయినవి అందుకుని కొత్తవాటిలా ఫీల్ అయ్యి మురిసిపోయేవాళ్ళము . పుట్టినరోజులు పండుగలు లేనే లేవు . మాకు తెలిసిన పండుగలు స్వాతంత్రదినోత్సవం , గణతంత్రదినోత్సవం ............ ఆ రెండు రోజులు వచ్చిన రోజులు రాజకీయనాయకులు వచ్చి జెండా వందనం చేసి పంచిన స్వీట్స్ తియ్యదనాన్ని నెక్స్ట్ ఆ రోజులు వచ్చేన్తవరకూ గుర్తుంచుకునేవాళ్ళము . ఫోటోలకు , జాలి చూపించడానికి తప్ప ఇక మా అవసరం ఎవరికైనా ఉందా అని అప్పుడప్పుడూ బాధపడేవాళ్ళము . 


మా రోజువారీ దినచర్య వచ్చేసి తెల్లవారుఘామున లేవడం స్కూల్ సమయం వరకూ ఆడుకోవడం . ( మేము రోజూ సంతోషంతో ఉత్సాహంతో వెళ్ళేది స్కూల్ కు ఎందుకంటే ప్రతి అనాథ శరణాలయంలలా స్కూల్ లోపలే ఉండకపోవడం ) మా స్కూల్ శరణాలయం నుండి ఒక km దూరంలో ఉండేది . ఒకరోజు టిఫిన్ చేసి మరొకరోజు చేయకుండానే ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ వెళ్లివచ్చేవాళ్ళము . 

స్టూడెంట్స్ మీరు అనాధలు అని బాధపడి ఇప్పుడు చదువుకోకపోతే ఇక జీవితాంతం మీరు బాధపడుతూనే ఉంటారు . జీవితంలో ఏదో సాధించాలని పట్టుదల ఉండాలి . సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు వచ్చేలా కష్టపడాలి . మిమ్మల్ని అనాధలు అనేవాళ్ళు వాహ్ ......... అనేలా జీవితంలో ఒక స్థానానికి చేరుకోవాలి అని చెప్పిన ఉపాధ్యాయుడు మాటలు మేము మా మెదడులో ముద్రించుకుని మా స్థాయికి తగ్గట్లు చదువుకునేవాళ్ళము . మధ్యాహ్నం స్కూళ్ళోనే భోజనం చేసి ఒకేసారి సాయంత్రం శరణాలయాలకు వెళ్ళేవాళ్ళము . మాతోటి పిల్లలను పేరెంట్స్ వచ్చి చాక్లెట్ లు ముద్దులిచ్చి ప్రేమతో పిలుచుకునివెళ్లడం చూసి బాధపడేవాళ్ళము . ఒక్కొక్కసారి కళ్ళల్లో కన్నీళ్ళుకూడా వచ్చేవి . సాయంత్రం సిటీ వాతావరణాన్ని చూసి హోటల్స్ - బేకరీ - మాల్స్ ............. అన్నింటినీ చూస్తూ రోజురోజుకూ పెరుగుతున్న కోరికలతో శరణాలయానికి వెళ్లి , చుట్టూ పిల్లలను చూసి అన్నీ మరిచిపోయి ఆడుకుని , పిల్లలందరమూ చిరునవ్వులు చిందిస్తూ తిని ఒకరిపై మరొకరము చేతులూ కాళ్ళూ వేసి పడుకునేవాళ్ళము .

రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఎటువంటి కొత్తతనం లేకుండా సాగిపోతున్నాయి . రోజూ ఉదయమే పేపర్ లో - స్కూల్ కి వస్తూ పోతూ కళ్ళకు కనిపించిన కోరికల లిస్ట్ ఎవరెస్టుని తాకసాగాయి . నా ఫ్రెండ్స్ అందరూ సినిమా పేపర్లలో వచ్చే హీరోయిన్ ల పేపర్ కటింగ్స్ ను తమ పుస్తకాలలో ట్రంకు పెట్టెలలో ఉంచుకుని చూస్తూ ఆనందించేవారు . ఆ వయసుకే బూతులు మాట్లాడి హీరోయిన్స్ అందాల గురించి వివరిస్తూ ఒక్క చాన్స్ ఒకే ఒక్క చాన్స్ అని తలుచుకునేవాళ్ళు . ఇప్పటికి ఉన్న కోరికలే తీరక నిరాశ చెందుతుంటే వాటికి తోడు ఎంత కష్టపడినా ఏమాత్రం తీరని ఆ కోరికలను ఆశించడం వేస్ట్ అనుకునేవాడిని . నా ఫ్రెండ్స్ రేయ్ రేయ్ అని బూతులతో ఎంత రెచ్చగొట్టినా ఒక నవ్వు నవ్వేసి సహనంతో ఉండేవాడిని. 

నా మొదటి అతిముఖ్యమైన కోరిక నేను జీవితంలో స్థిరపడాలి , అనాథ అన్న మాట నా జీవితంలో వినిపించనేరాదు . నా చుట్టూ నేనంటే ప్రాణమిచ్చేవాళ్ళు ఉండాలి . నా సంతోషం కోసం వాళ్ళు - వాళ్ళ సంతోషం కోసం నేను ఏమైనా చెయ్యాలి ఎంత దూరమైనా వెళ్లేంత ప్రాణమైనవాళ్లను సంపాదించాలి అని రోజూ వాటి గురించే కలలు కంటూ నాలో నేనే ఆనందించేవాన్ని . 
రెండవ కోరిక : మాలా శరణాలయంలోని పిల్లలు ఒక్కపూట తింటూ మరొకపూట పస్తులుండాల్సిన పరిస్థితిని కొంతైనా తగ్గించాలి . వారానికి ఒక పూటైనా పిల్లలు ఇష్టపడే కోరుకున్న వంటలు తినాలి - కొత్తబట్టలు వేసుకోవాలి - చదువుకోవడానికి కావాల్సిన వస్తువులను అందుబాటులో ఉంచాలి . వర్షాకాలంలో నీళ్లు కారకుండా మరమ్మత్తులు చేయించాలి - శీతాకాలంలో చలిని తట్టుకోవడానికి అవసరమైనవి అందించాలి . నాలాంటి అనాథ పిల్లలు రోజూ పడే బాధలను కొన్నైనా తీర్చాలి . వాటిని సాధించాలంటే నా ముందున్న ఏకైక మార్గం చదువు . అందుకే బాగా చదువుకుని జీవితం గురించి తెలుసుకునేవాన్ని . రోజూ పేపర్లలో వచ్చే సమస్యలకు బుజ్జిబుర్రతో సమస్యలకు పరిష్కారం ఎలా అయితే అందరూ ఆనందిస్తారు అని ఆలోచించేవాడిని .

అలా సంవత్సరాలు గడిచిపోయాయి . సమాజం గురించి తెలుసుకుంటూ ** క్లాస్ చేరుకున్నాము.
నా ఫ్రెండ్స్ ముగ్గురమూ వార్డెన్ దగ్గరికివెళ్లి , వార్డెన్ పనిచేస్తూ చదువుకుంటాము స్కూల్ నుండి రాగానే మేము చేయగలిగే పనులను ఇప్పించండి అని ఆడిగాము . మేమెలాగో చిరు చిరు కోరికలుకూడా ఆస్వాదించలేకపోయాము కనీసం మేము సంపాదించిన డబ్బుతో బుజ్జాయిలు పుష్టికరమైన భోజనం ఒక్కపూటైనా తింటే మాకు అదే ఆనందం అనిచెప్పాము .

వార్డెన్ : పిల్లలతో పనిచేయించడం నేరం కానీ మీ ఉద్దేశ్యం బాగుందికాబట్టి సాయంత్రం లోపు చూస్తాను . పనులలో పడి చదువును నెగ్లేక్టు చేయకూడదు . ఎలా కష్టపడతారో నాకు తెలియదు నెక్స్ట్ exams లోకూడా టాప్ రావాలి లేకపోతే నో వర్క్ అని గుర్తుచేశారు . 
వార్డెన్ .......... రాత్రిళ్ళు - ఉదయం మరింత ఉత్సాహంతో చదువుకుంటాము . బుజ్జాయిల పెదాలపై చిరునవ్వు చూస్తే అదేమాకు ఆనందం అనిచెప్పి స్కూల్ కు వెళ్లి 4 గంటలకు నేరుగా శరణాలయం చేరుకున్నాము .

మహేష్ .......... మీ నలుగురికీ పని దొరికింది . ఫ్రెష్ అవ్వండి వాళ్లదగ్గరికి తీసుకెళతాను అన్నారు . మహేష్ కాస్త మంచిగా ఉన్న బట్టలు వేసుకోండి అని చెప్పారు .
రేయ్ మామా - రేయ్ మామా ......... అని సంతోషంతో కౌగిలించుకుని , వార్డెన్ కు థాంక్స్ చెప్పి పరుగునవెళ్లి ఫ్రెష్ అయ్యి మా మా పెట్టెలలో మంచిగా ఉన్న బట్టలను వేసుకుని వచ్చాము . 
నడుచుకుంటూనే 3 km వెళ్ళాము . మహేష్ ......... ఇక నుండీ మీరు పనిచేసేది ఇక్కడే , టీవీలలో యాడ్స్ షూట్ చేస్తారు , పెద్ద పెద్ద పెళ్లిళ్ల కవరేజ్ చేస్తారు . మీరు చేయాల్సిందల్లా వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవడమే , మీరు ఇక్కడే ఉండండి సర్ ను కలిసివస్తాను అన్నారు . ఆఫీస్ రూంలోనుండి కేకలు వినిపిస్తున్నాయి . 
వార్డెన్ బయటే ఆగిపోయారు . బెల్ బాయ్ హడావిడిగా బయటకువచ్చి మొబైల్ తీసి కాల్ చేసి రేయ్ రేయ్ రేయ్ వస్తామని రాకపోతే ఎలా రా 7 గంటలకు షో స్టార్ట్ అవుతోంది .......... అవతలివైపు కట్ చేసినట్లు కోపంతో మొబైల్ పగలగొట్టబోయి ఆగి అయిపోయాను సర్ నన్ను చంపేస్తారు . ఈ నాకొడుకులు టైం చూసి హ్యాండ్ ఇచ్చారు.

వార్డెన్ : బాబు బాబు .......... ఏదో టెన్షన్ లో ఉన్నట్లున్నారు . సర్ మమ్మల్ని అదే ఆ పిల్లల్ని రమ్మన్నారు - ఏదైనా పని ఇస్తామన్నారు అని చూపించారు . 
బెల్ బాయ్ : పెద్దయ్యా .......... సరైన సమయానికి తీసుకొచ్చారు . థాంక్యూ థాంక్యూ sooooo మచ్ , పిల్లలూ రండి అని లోపలికి పిలుచుకునివెళ్లాడు . సర్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు పిల్లలు .............
సర్ : మా పేర్లను కనుక్కుని , పిల్లలూ .......... సమయం లేదు అని ఒకరిని పిలిచి ఈ అన్నయ్య మీరు ఏమిచెయ్యాలో చెబుతాడు వెళ్ళండి అనిచెప్పారు . 
వార్డెన్ : మహేష్ ........... all the best పూర్తయ్యాక జాగ్రత్తగా రండి అనిచెప్పి వెళ్లిపోయారు .
Like Reply
#34
ఆఅన్నయ్య మేము ఏమేమిచెయ్యాలో వివరించారు .
అంతేనా ఈజి అన్నయ్యా ..........
తమ్ముళ్లూ ........... ఇది మన డ్రెస్ కోడ్ 6 గంటలకు ఈవెంట్ దగ్గర మనం ఉండాలి అంతలోపు వేసుకుని రెడీగా ఉండండి . అక్కడ ఏమాత్రం పొరపాటు జరగకూడదు ఆక్టివ్ గా ఉండాలి సర్ వాళ్ళు ఏది అందివ్వమంటే అది - ఏవి తీసుకురమ్మంటే అవి చకచకా తీసుకురావాలి. సర్ వాళ్ళను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకూడదు . సర్ వాళ్ళు చేయబోతున్న ఫస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ , కమాన్ త్వరత్వరగా రెడీ అయ్యి సర్ వాళ్ళకు అందుబాటులో ఉండండి అనిచెప్పడంతో యూనిఫార్మ్ లోకి మారిపోయి ఆఫీస్ రూమ్ బయట నిలబడ్డాము . 
ఈవెంట్ కు సమయం సమీపిస్తుండగా అందరిలో టెన్షన్ తపన ఎక్కువ అవుతోంది . లోపల టేబుల్ పై గంట మ్రోగగానే బెల్ బాయ్ ......... తమ్ముళ్లూ లోపలికి రండి అని పిలుచుకొనివెళ్లారు . 
సర్ వాళ్ళు కమాన్ కమాన్ గయ్స్ ఇట్స్ టైం అక్కడ అన్నీ అనుకున్నట్లుగా మనవాళ్ళు పూర్తిచేసేశారు . వెంకట్ .......... వీటన్నింటినీ బయట వెహికల్లో ఉంచండి అని ఆర్డర్ వేశారు . వెంకట్ అన్నకు సహాయం చేసాము . చకచకా అన్నీ బస్ లోకి మార్చేసి అన్నా ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఆడిగాము .
సర్ : వెంకట్ .......... పిల్లలు చాలా అక్టీవ్ గా ఉన్నారు . వార్డెన్ గారికి థాంక్స్ చెప్పాలి సరైన సమయానికి తీసుకొచ్చినందుకు .  
మరొక సర్ : మనకు కావాల్సింది కూడా అదేకదరా , పిల్లలూ మేము నలుగురము ఉన్నాము ఒక్కొక్కరిదగ్గర ఒక్కొక్కరు ఉండండి ప్రక్కనే ఉండాలి సరేనా అని చేతిలోని ఫైల్స్ అందించారు . మీ పేర్లేంటి ..........
 మహేష్ కృష్ణ రవి సూరి సర్ , Yes సర్ అంటూ సంతోషంతో కాస్త గట్టిగానే చెప్పాము.
సర్ వాళ్ళు నవ్వుకుని లెట్స్ గో గయ్స్ అంటూ సర్ వాళ్ళు కార్లలో మేము వెనుకే పెద్ద వెహికల్లో ఒక పెద్ద హోటల్ కు చేరుకున్నాము . కిందకు దిగి రేయ్ మామా ......... ఎంతపెద్దగా ఉందొ - ఫైవ్ స్టార్ హోటల్ రా మామా .......... పేపర్లో చదివాము కదా వైజాగ్ లోనే costly హోటల్ అని - వీడి కోరికల్లో ఒకటి రేయ్ మహేష్ ......... ఎట్టకేలకు ఒక కోరిక తీరబోతోంది అని నలుగురమూ హత్తుకున్నాము . రేయ్ మామా ............వేలు లక్ష కోటి అయినా ఒకటితో స్టార్ట్ అవ్వాల్సిందే , ఇప్పుడు మనం చేయాల్సిందల్లా వార్డెన్ గారికి మాట రానీకుండా చూసుకోవాలి అని పరుగునవెళ్లి సర్ చేతులలోని బ్యాగ్స్ అందుకొని వాళ్ళు వెనుక నిలబడ్డాము . 
గుడ్ కృష్ణ మహేష్ .......... అని ఫైల్స్ అందించి అతిపెద్ద డోర్ వైపు నడిచారు .
సూరి : రేయ్ మామా ......... మనల్ని చూసి బయటకు తోసేస్తారా అని భయపడుతూ చెప్పాడు .
సర్ : వాడి చేతిని అందుకొని సూరి .......... ఈ డ్రెస్ ఉండగా మిమ్మల్ని తాకే ధైర్యం ఎవ్వరూ చెయ్యరు . హోటల్ మొత్తం ఎక్కడికైనా వెళ్లొచ్చు ఎవరైనా ఏమైనా అంటే మాదగ్గరికి తీసుకురండి . అర్ధరాత్రివరకూ మనకు ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి దర్జాగా లోపలికి పదండి అని నవ్వుతూ చెప్పారు . 
థాంక్యూ soooooo మచ్ సర్ .......... కొన్నిరోజుల ముందు వీడిని చిన్న హోటల్ వాళ్ళు తోసేశారు సర్ అందుకే భయపడుతున్నాడు . 
పిల్లలూ ........... మాప్రక్కనే రండి మాకు ఇచ్చే రెస్పెక్ట్ మీకు కూడా ఇస్తారు అనిచెప్పి లోపలకు పిలుచుకొనివెళ్లారు . 
సెక్యూరిటీ సెల్యూట్ చేసి మిర్రర్ డోర్ తెరిచారు . రేయ్ మామా - రేయ్ మామా ....... అంటూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లి విద్యుత్ కాంతులతో మిరిమిట్లుగొలుతుండటం చూసి ఆశ్చర్యంతో అలా చూస్తూ సర్ వాళ్ళతోపాటు వెళ్ళాము . 

పిల్లలూ .......... sorry మీరు అప్పుడే ** క్లాస్ కదా సో తమ్ముళ్లూ అని పిలవడం ఉత్తమం అని , తమ్ముళ్లూ ........... అని గోల్డ్ కలర్ డోర్ ముందు ఆగి ఈ డోర్ లోపలే మరొక గంటలో మనం చేయబోయే బిగ్గెస్ట్ ఈవెంట్ - మిస్ వైజాగ్ ఈవెంట్ ఎంతో కష్టపడితేనేగానీ మనకు ఈ అవకాశం లభించలేదు . The బెస్ట్ అని మనం నిరూపించుకోవాలి . ఈ ఈవెంట్ తో మనం మన కెపాసిటీ ఏంటో వైజాగ్ కు చూపించాలి అనిచెప్పారు . 
సర్ అంటూ సెల్యూట్ చేసి హోటల్ సెక్యూరిటీ డోర్ తెరిచారు . హాస్టల్లో వార్డెన్ లేనప్పుడు మిడ్నైట్ ఫ్యాషన్ షో చూసి ఎంజాయ్ చేసిన జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి. అచ్చం అలానే పొడవాటి స్టేజిని ఏర్పాటుచేశారు . అతిపెద్ద హాల్ మొత్తం అద్భుతమైన డెకరేషన్ చేశారు . షో లైట్స్ చెక్ చేస్తున్నట్లు కళ్ళు జిగేలుమన్నాయి . షో ని చిత్రీకరించేందుకు మూవీ తీసే కెమెరాలు రెడీగా ఉన్నాయి . సర్ వాళ్ళల్లో ముగ్గురు కెమెరా చైర్లలో వెళ్లి కూర్చుని మా ఫ్రెండ్స్ ముగ్గురికీ ఎలాంటి సహాయం చేయాలో వివరిస్తున్నారు . మహేష్ .......... మనం అందరూ వాళ్ళ వాళ్ళ పని చేసేలా చూడాలి . చాలా అక్టీవ్ గా ఉండాలి నా మాటలు తప్ప మరేమీ నీకు వినిపించకూడదు . 
Yes సర్ అని సర్ ఎక్కడకువెలితే అక్కడకు వెళుతున్నాను . 7 గంటలకల్లా హాల్ మొత్తం పెద్ద పెద్దవాళ్ళతో నిండిపోయింది . స్పాన్సర్ర్లు స్టేజీమీదకు వచ్చి ప్రతీ ఇయర్ లానే ఈసారికూడా మిస్ వైజాగ్ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నాము . ఈసారి ప్రత్యేకత ఏంటంటే కొత్త ఈవెంట్ ఆర్గనైజర్స్ తో చేతులు కలపడం అని సర్ ను స్టేజీమీదకు పిలిచి చేతులను కలిపారు . ఇక మీ సహనాన్ని పరీక్షించము లెట్స్ స్టార్ట్ ద షో అనగానే స్టేజీపై తప్ప అన్నీ లైట్స్ ఆఫ్ అయ్యాయి . 
సర్ .......... ఆనందానికి అవధులు లేనట్లు సంతోషంతో పొంగిపోతూ కిందకువచ్చి అన్నీ తానై చూసుకుంటున్నారు . సర్ చెప్పడం ఆలస్యం పూర్తిచేసేస్తున్నాను . 

జడ్జెస్ ప్రక్కనే మైకులో యాంకర్ మిస్ add చేసి పేర్లు పిలిచినట్లల్లా .......... ఏంజెల్స్ లాంటి అమ్మాయిలు ఒక్కొక్కరే స్టేజీ పొడవునా వాక్ చేసుకుంటూ వచ్చి తమ అందాన్ని అందరికీ మరియు జడ్జెస్ వైపు వ్యక్తపరిచి అంతే హొయలు ఒలకబోస్తూ వెనక్కు వెళ్లిపోతున్నారు . 
ఆ షో లైట్స్ వెలుగులలోనే మా నలుగురి ఫ్రెండ్స్ కళ్ళు కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు ఉత్సాహంతో చూస్తూ పనిచేస్తున్నాము . ఒక్కొక్క మోడల్ ను కళ్ళప్పగించి చూస్తూ గుటకలు మింగుతున్నారు ముగ్గురూ .......... వాళ్ళను చూసి నవ్వుకుని సర్ మాటలను అనుసరిస్తున్నాను . అలా గంటపాటు పదుల సంఖ్యలో మోడల్స్ అందాలను ప్రదర్శిస్తూ వెళుతున్నారు . నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా నేను ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాను . ఇదంతా క్షణకాలపు ఉద్వేగం అని నాకు తెలుసు . 
యాంకర్ : షో ఫైనల్ కు వచ్చేసాము the last model మిస్ కావ్య అని గట్టిగా కేకలువేస్తూ చెప్పారు .
అందరిలో మరింత ఉత్సాహం వచ్చినట్లు కూర్చున్నవాళ్ళంతా అలర్ట్ అయ్యారు . స్టేజీకి అతిదగ్గరగా సర్ ప్రక్కనే ఉన్న నాకు స్టేజీపై తొలి అడుగు వయ్యారంగా వేసిన మోడల్ ను చూడగానే నా హృదయవేగం సర్రున టాప్ లోకి దూసుకెళ్లింది . నావైపు వేస్తున్న ప్రతి అడుగుకూ నా కళ్ళు మరింత తెరుచుకుని ఆ అందాన్ని ఆస్వాదించసాగాయి . హీరోయిన్స్ - టీవీలలో బికినీలతో ర్యాంప్ వాక్ లతో నా ఫ్రెండ్స్ ను ఉత్తేజపరిచిన ఫ్యాషన్ మోడల్స్ ను చూసినా చలించని నా బుజ్జిగాడిలో వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యి జెండా కర్రలా ప్యాంటు లోపల పైపైకి లేచిపోతుండటం తెలిసి పెదాలపై తియ్యని నవ్వు మెదులుతోంది . తనేరా నీ ఆరాధ్య దేవత అని నా మనసు కవ్విస్తోంది . ఆ దేవత నాదగ్గరకు చేరి స్టేజీపైన పడిన లైట్స్ నన్ను మాత్రమే చూపిస్తుండటంతో , కప్పలా నోరుతెరిచి కళ్ళప్పగించి ఒక అద్భుతాన్ని చూసినట్లు ఉంచిన నా ఫేస్ ఫీలింగ్స్ ను చూసి ఆ దేవత ముసిముసినవ్వులు నవ్వుకుని లవ్ యు అంటూ నావైపు ఫ్లైయింగ్ కిస్ వదిలి అందమైన నవ్వుతో ముందుకువెళ్లిపోయింది . 
అంతే నన్ను నేను మైమరచి ఆఅహ్హ్హ్హ్........ goddess అంటూ వెనక్కు పడిపోయాను . ఎలాగో వెనుకనే సర్ కూర్చునే కుర్చీ ఉండటం వలన దానిలోకి చేరాను . 
నా goddess అందరిముందూ మరియు జడ్జెస్ ముందు తన సౌందర్యాన్ని ప్రదర్శించి ఒక ముద్దు వదిలింది అంతే మూడువైపులా ఉన్నవాళ్లు ఫ్లాట్ అయినట్లు లేచిమరీ చప్పట్లుకొట్టడం చూసి , నా దేవత ఆనందించి వెనక్కు వయ్యారాలను ఒలకబోస్తూ వెనక్కువచ్చి నాకోసం చూస్తూ నేను చీకట్లో ఉండటం వలన కనిపించకపోవడంతో ప్చ్ .......... అంటూ వెళ్లడం చూసి , ఏదో తెలియని ఫీలింగ్ తో అక్కడికక్కడే లేచి డాన్స్ చేయాలన్న ఫీల్ ను కంట్రోల్ చేసుకున్నాను .
Like Reply
#35
యాంకర్ స్టేజీమీదకు వెళ్లి that was awesome కదా ........... i enjoyed a lot .......... మేముకూడా అంటూ అందరూ సంతోషంతో చప్పట్లుకొట్టారు . అందరూ తమ తమ అందాలతో వైజాగ్ సౌందర్యాన్ని మరింత పెంచారు అనడంలో సందేహం లేదు . దానికి సాక్ష్యం మీ ఉత్సాహమే ............

అందరూ అందంతో ఒకరినిమించి మరొకరు పోటీపడ్డారు . అందులోనుండి మిస్ వైజాగ్ కిరీటం కైవసం చేసుకునే అర్హతగల ముగ్గురు ఏంజెల్స్ ను స్టేజీమీదకు ఆహ్వానించవలసినదిగా మిస్ వైజాగ్ స్పాన్సర్స్ ను స్టేజీమీదకు ఆహ్వానిస్తున్నాము అనిచెప్పడంతో హాల్ మొత్తం కేరింతలు . 
ఆ ముగ్గురిలో నా దేవత ఉండాలి నా దేవత ఉండాలి అని దేవుళ్లను ప్రార్థించాను . 
ఫస్ట్ మోడల్ ******** 
చప్పట్లు 
సెకండ్ మోడల్ 
చప్పట్లు , నా టెన్షన్ ఆంతకంతటికీ తారాస్తాయిని చేరుతోంది .చెమటలు పట్టేసాయి .
థర్డ్ మోడల్ థర్డ్ మోడల్ ......... మిస్ కావ్య .
అందరితోపాటు నేనుకూడా చప్పట్లుకొట్టి సంతోషంతో థాంక్స్ గాడ్ థాంక్స్ గాడ్ అని మొక్కాను . 
నాదేవత స్టేజి చివరకు వస్తూ నేనున్న ప్లేస్ లో చూస్తుంటే , వొళ్ళంతా తియ్యని జలదరింపుతో అంతులేని ఆనందంతో కనిపిద్దామని స్టేజి లైట్ వెలుగులోకి వెళుతుంటే , 
సర్ : మహేష్ ........... విన్నర్ అనౌన్స్ చేయగానే , అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా ఏర్పాట్లు రెడీగా ఉన్నాయోలేదో చూసిరమ్మని పంపించారు .
Yes సర్ అంటూ నాదేవతనే చూస్తూ పరుగునవెళ్లి ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అన్నయ్యలను కలిసి , రెడీ అని తెలుసుకుని పరుగునవచ్చి సర్ అంతా రెడీ సర్ అనిచెప్పాను . 
సూపర్ మహేష్ .......... ఇంతకీ ముగ్గురిలో ఎవరు గెలుస్తారు అని అడిగారు .
ఏమాత్రం ఆలోచించకుండా కావ్య మేడం .......... అన్నాను . 
అయితే చూద్దాము మహేష్ అని నా భుజం చుట్టూ చేతులువేశారు . 

ముగ్గురూ జడ్జెస్ ఎదురుగా నిలబడ్డారు . జడ్జెస్ అడిగిన ప్రశ్నలకు హాస్యం ఆలోచన రేకెత్తించేలా సమాధానాలిచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు నాదేవత . 
సర్ : ప్రతీ సమాధానానికి wow wow మహేష్ ............ , నీ గెస్ నిజమయ్యేలా ఉంది .
సమాజం గురించి మీ అభిప్రాయం చెప్పండి అని ముగ్గురికీ మైకులను అందించారు .
మొదటి మోడల్ సెకండ్ మోడల్ మాటలకు అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు . 
నాదేవత వంతు రాగానే , మహేష్ ......... ఇప్పుడు ఏమి మాట్లాడబోతున్నారో ఆ మాటలే నీ మోడల్ ను విజయతీరాలకు చేరుస్తుంది అనిచెప్పడంతో , 
మళ్లీ దేవుళ్లను ప్రార్థించాను . 
అందరికీ విష్ చేసి , వెనక్కు తిరిగి నేనెక్కడైతే కనిపించగానే ఆ ప్లేస్ లో ఒకసారి చూసి ఒక క్షణం నిరాశ వెంటనే ఉత్సాహంతో అనాథ సరణాలయాల గురించి , వృద్ధాశ్రమాల గురించి సమాజంలో మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి కాన్ఫిడెంట్ గా మాట్లాడటం విని మా గురించి నాదేవత ........... అని కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి . 
మిస్ వైజాగ్ కోసం భలే మాటలు నేర్చింది ఆ అమ్మాయి . వాళ్ళ గురించి మాట్లాడటం కాదు , ఒకవేళ గెలిస్తే వచ్చే 5 లక్షల ప్రైజ్ మనీని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ అనాధాలకు ఇవ్వమను అప్పుడు అప్పుడు ఇంతకంటే గట్టిగా నేను కొడతాను చప్పట్లు అని వెనుకనుండి వెటకారపు మాటలు వినిపించాయి .

యాంకర్ wow అంటూ అందరితోపాటు టాప్ లేచిపోయేలా చప్పట్లతో ముగ్గురినీ అభినందనలతో ముంచెత్తారు . ఈ ముగ్గురు సుందరీమణులలో మిస్ వైజాగ్ కిరీటం ఎవరు గెలుచుకోబోతున్నారో అనౌన్స్ చేయవలసిందిగా జడ్జెస్ ను కోరుతున్నాము . కిరీటాన్ని బహుకరించేందుకు లాస్ట్ ఇయర్ మిస్ వైజాగ్ శ్రావ్య గారిని స్టేజీమీదకు ఆహ్వానిస్తున్నాము అనడంతో , ఆర్గనైజర్లు వెళ్లి ఆమెను స్టేజీమీదకు తీసుకెళ్లారు . 

అందరూ ఉత్కంఠతో ఎవరు ఎవరు అని ఆశతో ఎదురుచూస్తున్నారు . మహేష్ ........ మళ్లీ ప్రార్ధిస్తావా అని సర్ నవ్వారు .
ఘాడంగా సర్ అని కళ్ళుమూసుకుని ప్రార్థించాను . నాదేవత విన్నర్ అనితప్ప ఇక ఏమాటలూ నాకు వినపడేలా లేవు . 
జడ్జెస్ మైకు అందుకొని మిస్ వైజాగ్ కిరీటాన్ని కైవసం చేసుకున్నవారు తన అందం అభినయంతోపాటు సమాజం పట్ల తనదైన వైఖరిని వ్యక్తపరిచి అందరి మన్ననలు పొందిన మిస్ కావ్య అనగానే , మిగతా ఇద్దరు అమ్మాయిలు ఏమాత్రం ఈర్ష్య అసూయలు లేకుండా నాదేవతను కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలపడం చూసి హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది . ఆ మాటలు వినగానే అంతులేని ఆనందంతో కళ్ళుతెరిచి లాస్ట్ ఇయర్ మిస్ వైజాగ్ నాదేవతకు కిరీటం ఉంచడం చూసి అందరితోపాటు గట్టిగా కేకలువేశాను . 
సర్ : మహేష్ .......... అంటూ సర్ రెండుచేతులతో హైఫై కొట్టి ఆనందించారు . 
యాంకర్ : ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందిగా చీఫ్ గెస్ట్ ను స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాము అనడంతో ఒక పెద్దావిడ వచ్చి శుభాకాంక్షలు తెలిపి చెక్ అందించారు .

నాదేవత మైకు అందుకుని చాలా సంతోషంగా ఉంది . ఈ విజయాన్ని నేను అలంకరణగా ఫీల్ అవ్వను . సమాజానికి నావంతు బాధ్యతను నిర్వహిస్తాను . అందులో భాగంగా ఈ ప్రైజ్ మనీని మరియు నా నుండి 5 లక్షల రూపాయలను అని ఒకరి నుండి మరొక చెక్ అందుకుని వైజాగ్ లో ఉండే అనాథ ఆంధ శరణాలయాలకు మరియు వృద్ధాశ్రమాలకు అందివ్వాల్సిందిగా ఆర్గనైజర్స్ ను కోరుతున్నాను అని వాళ్ళకే అందించారు . 
హాల్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది . సూపర్ మేడం అని మా నలుగురమూ గట్టిగా సంతోషంతో అరిచి చప్పట్లు కొట్టడం చూసి అక్కడ ఉన్న ప్రతిఒక్కరూ నాదేవతను ఆకాశానికి ఎత్తేస్తూ wow wow .......... అంటూ వైజాగ్ మొత్తం వినిపించేలా కరతాళధ్వనులతో కేకలతో వాహ్ ........ అనుకున్నారు . వెనక్కు తిరిగిచూస్తే మాట్లాడినట్లుగానే ఆ వ్యక్తి సంతోషంతో విజిల్స్ వేస్తూ ఆపకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు . 

ఆ సంతోషంలో కొంతమంది స్టేజీమీదకు ఎక్కుతుంటే , సర్ వాళ్ళు ఏర్పాటుచేసిన బౌన్సర్లు నాదేవతను ఇద్దరు అమ్మాయిలనూ సేఫ్ గా లోపలికి తీసుకుపోయారు . 
యాంకర్ : అనుకున్నదానికంటే ఈవెంట్ ను అద్భుతంగా జరిగేలా సహకరించిన అందరికీ - ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించిన ******** ఈవెంట్ వాళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు . వచ్చినవారందరూ మా ఆథిత్యాన్ని స్వీకరించి సేఫ్ గా వెళ్లాలని ఆశిస్తున్నాము అనిచెప్పడంతో లైట్స్ అన్నీ on అయ్యాయి . 

ఆర్గనైజర్స్ వచ్చి సర్ ను ప్రత్యేకంగా అభినందించి అక్కడికక్కడే చెక్ అందించారు . 
సర్ మిగతాసార్లను కౌగిలించుకుని ఫస్ట్ బిగ్ ఈవెంట్ సక్సెస్ అని ఆనందాన్ని పంచుకున్నారు . అతిథులందరూ డైనింగ్ వైపు వెళుతుంటే ఫ్రెండ్స్ ఇక డిన్నర్ ఏర్పాట్లుకూడా సక్సెస్ చేసామంటే మనగురించి వైజాగ్ మొత్తం తెలుస్తుంది లెట్స్ గో అని హైఫై కొట్టుకుని మహేష్ కృష్ణ ......... రండి అని బయట arange చేసిన దగ్గరకు పిలుచుకొనివెళ్లారు .

మహేష్ కృష్ణ ........... విజయం సాధించాము , ఇందులో మీ వంతు కూడా ఉంది , ఆకలివేస్తే వెళ్లి తినండి అంతా మనం ఏర్పాటుచేసినదే అనిచెప్పారు . అక్కడ వంటలను చూసి మాకు నోరూరిపోయింది . ఎలా రా మామా మన శరణాలయంలోని పిల్లలు లేకుండా తినడం అని బాధపడ్డాము .
10 గంటలకల్లా ......... గెస్ట్స్  అందరూ తినేసి లవ్లీ ఫుడ్ - tasty ఫుడ్ అనిచెప్పేసి వెళ్లిపోయారు . మేము తిన్నామేమో అనుకుని సర్ వాళ్ళుకూడా వెళ్లి తిన్నారు . ఎక్కువైన పర్లేదు ఒక్క వంటా మిస్ అవ్వకూడదు అని చాలా వంటలు చేయించడంతో మిగిలిపోవడం చూసాము .
నాదేవత కూడా ఇక్కడికే వచ్చి తింటారా అని ఆశతో చూసి చూసి రాకపోవడంతో నిరాశ చెందాను . 
రేయ్ .......... మిస్ వైజాగ్ కూడా మన వంటలను తృప్తిగా ఆస్వాదించారట అని ఆ ఏర్పాట్లు చూసుకున్న ఒక సర్ వచ్చి సర్ వాళ్లకు చెప్పడంతో అందరూ ఆనందించారు. అంటే నాదేవత లోపల తిన్నారన్నమాట మళ్లీ చూస్తానో లేదోనని మనసులో అనుకున్నాను . 

మహేష్ ......... రండి అని పిలిచి done a good job ఇదిగోండి అని పర్సులోనుండి నలుగురికీ కలసి పదివేలు అందించి , రేపు కూడా ఈరోజు వచ్చిన సమయానికి వచ్చెయ్యండి అనిచెప్పారు .
సర్ .......... మాకు డబ్బు వద్దు . ఎలాగో చాలా వంటలు స్వీట్స్ మిగిలిపోయాయి వాటిలో కొన్ని మాకు ఇస్తే శరణాలయంలో షేర్ చేసుకుని తింటాము . తప్పుగా మాట్లాడితే క్షమించండి .
సర్ : తింటారా ? మహేష్ ......... అయితే మీరు ఇంకా తినలేదా ? , తిన్నారు అనుకుని మేము పిలవనైనా పిలవలేదు అని సర్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు . రేయ్ రేయ్ ఫ్రెండ్స్ అందరమూ తప్పుచేసాము . ఇద్దరు వెళ్లి నాలుగు ప్లేట్లలో వడ్డించుకునివచ్చారు . 
సర్ ........... మా అన్నయ్యలు తమ్ముళ్లను వదిలి ఇంత costly ఫుడ్ తినలేము . ఏది తిన్నా మేము కలిసే తింటాము లేకున్నా కలిసే పస్తులుంటాము . 
సర్ : ఫ్రెండ్స్ మొత్తం మిగిలినవన్నింటినీ ఫైవ్ స్టార్ పార్సిల్లా ప్యాక్ చేయించండి . అలాగేరా అంటూ సర్ వాళ్ళు వెళ్లారు . తమ్ముళ్లూ ......... షేర్ చేసుకోవడం కాదు తృప్తిగా తినండి .
నలుగురమూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో చేతులెత్తి నమస్కరించాము . 
సర్ : తమ్ముళ్లూ .......... ఆపండి ఆపండి , ఈ డబ్బు మీ కష్టానికి ఫలితం అని 2500 మా జేబులలో ఉంచారు . 

రేయ్ రెడీ రా అని సర్వర్లు తీసుకొచ్చిన పెద్ద పెద్ద పార్సిళ్లను చూయించారు . మహేష్ .......... ఆలస్యం అయ్యింది మా కారులో వదులుతాము రండి అన్నారు . 
సర్ .......... ఇప్పటికే మాకోసం చాలా చేశారు . మేము నడుచుకుంటూ వెళ్లిపోతాము మీరు సక్సెస్ ను ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పాము .
సర్ : మహేష్ చాలా బరువున్నాయి చాలా ఉన్నాయి . కనీసం ఆటోలోనైనా వెళ్ళండి అని పార్సిళ్లను పట్టుకుని బయటకు నడిచాము . రెండు ఆటోలను ఆపి సర్దారు . మహేష్ .......... మీరెక్కడ కూర్చుంటారు ఆటోలు నిండిపోయాయి , అందుకే మేము వదులుతాము అన్నది . 
సర్ .......... ఇక్కడ అని ఆటో డ్రైవర్ కు ఇరువైపులా కూర్చున్నాము . 
ఆటోలకు డబ్బులు కూడా సర్ ఇచ్చారు .
సర్ ......... మాజీవితంలో ఇప్పటివరకూ చూడనంత డబ్బు ఇచ్చారు మేము ఇస్తాము లేండి .
సర్ వాళ్ళు నవ్వుకుని మహేష్ కృష్ణ జాగ్రత్త రేపు కలుద్దాము గుడ్ నైట్ .........
గుడ్ నైట్ సర్ అని కేకలువేసి బయలుదేరాము . అర్ధరాత్రి అవుతుండటంతో సిటీ మొత్తం ప్రాసాంతంగా ఉంది .

రేయ్ మామా మనవాళ్ల పెదాలపై చిరునవ్వులు చూడబోతున్నాము . 
కృష్ణ : అవునురా మామా ........... అన్నయ్యా అన్నయ్యా ........ ఇటువైపు ఇటువైపు అనిచెబుతున్నా , మరొకవైపుకు పోనిచ్చి నాకు తెలియదా అటువైపు రోడ్ బాలేదు అని ఏకంగా సిటీ దాటి పొలాల్లోకి పోనిచ్చారు . వెనుక ఆటో మమ్మల్నే ఫాలో అయ్యింది . 
మెయిన్ రోడ్ నుండి టర్న్ చేసి కొద్దిగా లోపలికి తీసుకెళ్లాడు . ఎదురుగా ఇద్దరు నిలబడిన దగ్గర ఆపి కిందకు దిగమని దిగి వాళ్ళతో చేతులుకలిపి , రేయ్ పిల్లనాయాల్లారా ...........జీవితంలో చూడనంత డబ్బా ........ అదికూడా ఫైవ్ స్టార్ హోటల్ నుండి బయటకువచ్చారు . మర్యాదగా డబ్బు ఇచ్చేసి పరిగెత్తి వెళ్లిపోండి . 
వెనుక ఆటో డ్రైవర్ వచ్చి హలో బ్రదర్ వైజాగ్ లో ఆటోవాలాకు ఒక గుర్తింపు ఉంది పాపం కష్టపడి సంపాదించినట్లున్నారు - ఆ డ్రెస్ చూస్తే తెలుస్తోంది . బ్రదర్ పాపం అనాధలు అని చెబుతుండగానే రేయ్ నీ సోధి ఆపరా ......... లేకపోతే నీకు ఆటో లేకుండా చేస్తాము అనిచెప్పడంతో సైలెంట్ అయిపోయాడు . 
Like Reply
#36
అన్నయ్యలూ ........... ఈ డబ్బు బుజ్జాయిల బుక్స్ కోసం please మమ్మల్ని పోనివ్వండి అని ఎంత బ్రతిమాలినా వినకుండా మా జేబులలోని డబ్బుని తీసుకుని చూసి మా జేబులన్నీ వెతికి ఇంతేనా ఏదో లక్షలు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు కదరా అని నెత్తిపై కొట్టి వెళ్లండ్రా వెళ్ళండి కనీసం మందు బాటిల్ కైనా ఇచ్చారు . 
థాంక్స్ అన్నయ్యలూ అని ఆటోలోని పార్సిళ్లను అందుకోవడం చూసి కొంపదీసి అందులో ఉన్నాయా అని మాచేతులలోనుండి అందుకొని చూసి ఫుడ్ రా అని కింద పడెయ్యబోయారు  . 
అన్నయ్యా ......... డబ్బు తీసుకున్నారు ok - కొట్టారు ok ......... అది ఎంతోమంది పిల్లల ఆకలి తీరుస్తుంది వద్దు వద్దు అనిచెబుతున్నా కూడా పోండిరా పోండి అని తోసేసి , రేయ్ స్వీట్స్ మనమేమిచేసుకుంటామురా అని రెండు పార్సిళ్లను కిందకుపడేసి కాళ్లతో తొక్కి మళ్లీ ఆటోలోనుండి అందుకోబోయారు . చూసి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసి కోపంగా మారి రేయ్ అంటూ నలుగురమూ చేతులుకలిపి మైకంలో ఉన్న వాళ్ళమీదకు ఎక్కేసి వెంట్రుకలు లాగి ఆకలి గురించి మీకేమీ తెలుసురా అని తలపై పిడిగుద్దులు గుద్దడంతో ముగ్గురూ కుప్పకూలారు . కన్నీళ్ళతో కిందపడిన స్వీట్స్ ను కవర్లలో ఎత్తుకుని ఆటోలోనివి తీసుకున్నాము . 

తమ్ముళ్ళూ .......... భయంతో ఎలాగో మీకు హెల్ప్ చెయ్యలేకపోయాను . డ్రాప్ చేస్తాను రండి అని అన్నింటినీ ఎలాగోలా వెనుక ఆటోలో సర్దాము . ఒక్కనిమిషం అని భయపడుతూనేవెళ్లి వాళ్ళ జేబులోని డబ్బుని తీసుకొచ్చి అందించారు . మా 10 వేలు మాత్రమే తీసుకుని అన్నయ్యా ......... మీకే అని జేబులో ఉంచేసి , నలుగురికీ సమానంగా పంచి , ఆటోని పట్టుకుని బయట నిలబడి శరణాలయం చేరుకున్నాము . లోపలకు అన్నయ్య కూడా తీసుకొచ్చారు . థాంక్స్ చెప్పడంతో నేనే థాంక్స్ చెప్పాలి అని వెళ్లిపోయారు . 

వరండాలో చెక్క మంచం పై పడుకున్న వార్డెన్ దగ్గరికివెళ్లి వార్డెన్ వార్డెన్ ........ అని నెమ్మదిగా లేపాము . 
వార్డెన్ : మహేష్ కృష్ణ .......... వచ్చారా అని లేచి లైట్ న్ చేసి మాదెబ్బలను చూసి ఏమైంది అని కంగారుపడ్డారు . 
అదేమీ లేదు వార్డెన్ అని జరిగింది వివరించాము . 
వెంటనే లోపలికివెళ్లి డెటాల్ కాటన్ తీసుకొచ్చి అందించారు . 
వార్డెన్ ఈరోజు సంపాదన అని నా 2500 /- వార్డెన్ చేతికి అందించాను . ముగ్గురూ కూడా ఇచ్చేసారు . 
వార్డెన్ : బుజ్జాయిలకు మీరే ........
వార్డెన్ అవన్నీ మాకెలా తెలుసు మాకు అన్నీ మీరే , ఆకలేస్తోంది మన అందరికోసం సర్ వాళ్ళు భోజనం పంపించారు . అన్నయ్యలూ - తమ్ముళ్లూ ......... తిన్నారా ? 
వార్డెన్ : ఉద్వేగంతో మా నలుగురినీ హత్తుకుని , భోజనంలో బల్లి పడటం వలన అందరూ నీళ్లు తాగి పడుకున్నారు . 
అవునా అంటూ పరుగున అందరిదగ్గరికీ వెళ్ళాము . ఆకలివలన అమ్మా అమ్మా ...... అంటూ నిద్రపట్టక కడుపులపై చేతులను పట్టుకుని అటూ ఇటూ కదులుతున్నారు . 

చూసి చలించి నలుగురమూ కన్నీళ్లను కారుస్తూ వెళ్లి అన్నయ్యలూ - తమ్ముళ్లూ ....... వార్డెన్ మనకోసం ఫుడ్ తీసుకొచ్చారు లేవండి అని లేపి బుజ్జాయిలను ఎత్తుకొనివెల్లి అందరి ప్లేట్లలో వడ్డించాము .
 ఒకరినొకరు వెలిగిపోతున్న కళ్ళతో చూసుకుని , వార్డెన్ ......... ఇలాంటి భోజనం తినడం ఫస్ట్ టైం అని నాన్ వెజ్ స్వీట్స్ fruits ......... మ్మ్మ్.....మ్మ్మ్...... అని ఆకలికి మించి తిన్నారు . వార్డెన్ ఈరోజుని ఎప్పటికీ మరిచిపోము లవ్ యు అని హత్తుకుని పాదాలను తాకి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లారు . 
వార్డెన్ : మహేష్ ......... నేనని ఎందుకు చెప్పారు . 
వార్డెన్ .......... మీరుకాక ఇంకెవరు రండి ముందు తిందాము అని మిగిలినవి ఆవురావురుమంటూ కళ్ళల్లో చెమ్మతో తిన్నాము .
వార్డెన్ : మాకోసం మీరుకూడా తినలేదు కదూ ......... మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు . 
మనపై ఆ దేవుడికి కరుణ లేదు వార్డెన్ , ఈరోజు జరిగిన సంఘటనలను బట్టి మన కోరికలను మనమే కష్టపడి తీర్చుకోవాలని అర్థమైంది . ఇన్ని సంవత్సరాలూ ప్రార్థించి ప్రార్థించి అలసిపోయాము అని మా ప్లేట్లను కడిగేసి అలసిపోయాము వార్డెన్ ఉదయమే లేచి చదువుకోవాలి అనివెల్లి అందరితోపాటు వాలిపోయాము . ఇంతమంది ఆకలి తీర్చినందుకు చాలా ఆనందం వేస్తోంది ఒక కిక్కు ఉంది అని పెదాలపై చిరునవ్వుతో దోమలను కొట్టుకుంటూ హాయిగా హ హ ....... పడుకున్నాము .

రాత్రంతా నాదేవత గురించే మధురమైన కలలు . తెల్లవారకముందే లేచి బుక్ తీసుకుని శరణాలయం బయటకువెళ్లి స్ట్రీట్ లైట్ కింద చదువుతూ , ఆ రోజు న్యూస్ పేపర్ రాగానే అందుకుని ఆతృతతో పేపర్ మొత్తం తిరగేసి డిస్ట్రిక్ట్ హెడ్లైన్స్ లో మిస్ వైజాగ్ అని కిరీటం తో ఉన్న నాదేవత ఫోటోచూసి పెదాలపై చిరునవ్వుతో పరవశించి , ఎవ్వరూ లేకపోవడం చూసి ఫోటో కట్ చేసుకుని , పేపర్ ను రోజూ ఉంచే స్థానంలో ఉంచేసి లోపల వరండాలో చదువుతూ కూర్చున్నాను . 
కొద్దిసేపటి తరువాత నా ఫ్రెండ్స్ లేచివచ్చి , చదువుకోవడానికైతే రోజూ లేపేవాడు కదా  ఈరోజు ఏంటి ఒక్కడే చదువుతున్నాడు అని దూరంగా గాలికి కదులుతున్న పేపర్ ను చూసి వెళ్లి పేపర్ కట్ చేసి ఉండటం చూసి , 
రేయ్ కృష్ణా ......... నిన్న నువ్వు చెప్పినది నిజమేరోయ్ , మనోడి బండి కదిలింది అని సూరి చెప్పాడు .
కృష్ణ : ష్ ష్ ష్  ............. రాత్రికి సర్ప్రైజ్ తో వాడిని ఆటపట్టిద్దాము అని ముసిముసినవ్వులు నవ్వుకుని , నాదగ్గరికి వచ్చి వాళ్ళల్లో వాళ్లే నవ్వుకుంటూ చదువుతున్నారు . 
నేనైతే దించిన తల ఎత్తనేలేదు . 

లైట్ గా ఉప్మా తినేసి స్కూల్ కు వెళ్ళాము . నిన్న రాత్రి పడుకోవడం ఆలస్యమైనా నిన్న అలసిపోయినా స్కూల్లో మరింత ఉత్సాహంతో క్లాస్సెస్ విన్నాము - ప్రతి క్లాస్ పూర్తవగానే నా దేవత ఫోటోని చూసి ఆనందించేవాడిని - ఇరువైపులా ముసిముసినవ్వులు వినిపించేవి చూస్తే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు . 4 గంటలకు శరణాలయం కు వచ్చి ఫ్రెష్ అయ్యి నా దేవత ఫోటోని ట్రంక్ లో జాగ్రత్తగా ఉంచేసి , వార్డెన్ కు చెప్పి కంపెనీకి చేరుకున్నాము . నేరుగా సర్ వాళ్ళ ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళాము . వెంకట్ అన్నయ్యా ......... సర్ వాళ్ళను కలవచ్చా అని అడిగాను . 
ఒక్కనిమిషం అని లోపలికివెళ్లివచ్చి వెళ్ళండి అని పంపించారు . 
Hi మహేష్ , కృష్ణ .......... ఈరోజు ఇక్కడే పని .
OK సర్ .......... నిన్నదానిగురించి మీకు థాంక్స్ చెబుదామని వచ్చాము అని రాత్రి అందరూ తృప్తిగా తిని హాయిగా నిద్రపోవడం గురించి చెప్పాను . 
మహేష్ .......... మాకు కూడా కాస్త పుణ్యం దక్కిందన్నమాట అని నవ్వుకున్నారు . 

వెళ్లి వర్క్స్ అలాట్ చేసే సర్ దగ్గరికివెళ్లాము . 
మహేష్ నిన్నట్లానే నువ్వు మీ సర్ దగ్గరే ఉండు - కృష్ణ , రవి , సూరి ........ మీరు లోపల నిన్నటి షో ఎడిటింగ్ జరుగుతోంది వాళ్లకు కావాల్సినవి అందించండి .
కృష్ణ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ మాకు కావాల్సింది కూడా అదేనని మురిసిపోయారు . 
సర్ : తమ్ముళ్లూ ......... ఇక నుండి మీకు నెలనెలా జీతం ఇస్తారు సర్ . ఒక్కరోజులోనే మీరు పర్మనెంట్ అయిపోయారు . మధ్యలో డబ్బు అవసరమైతే అడగండి మరియు మనం చేసే ప్రతి ఈవెంట్ కు స్థాయిని తగ్గట్లు బోనస్ కూడా వస్తుంది . 
సర్ మాటలకు సంతోషంలో షాక్ కొట్టినట్లు అలా నిలబడిపోయాము . 
సర్ : మహేష్ , కృష్ణా ......... అని భుజాలను కదపడంతో స్పృహలోకొచ్చి నలుగురమూ కౌగిలించుకుని ఎవరి పని దగ్గరకు వాళ్ళము వెళ్లిపోయాము . 

ఆరోజు 9 గంటలకే పనులు పూర్తవ్వడంతో సర్ వాళ్ళు వెళ్ళమని చెప్పారు . 
గుడ్ నైట్ చెప్పేసి బయలుదేరాము . రేయ్ కృష్ణా ......... ఏంటిరా ఆ కవర్ .
కృష్ణ : వేస్ట్ వైట్ పేపర్స్ లేరా , సర్ ఇచ్చారు అని ఉత్సాహంతో చిందులేస్తూ శరణాలయం చేరుకుని , నా దేవతను గుండెలపై హత్తుకుని మళ్లీ దాచేసి , అన్నం పప్పు తిని అందరి పిల్లలతోపాటు చదువుకోవడానికి కూర్చున్నాము . 
అన్నయ్యలు తమ్ముళ్ళంతా ఒక్కొక్కరే వెళ్లి నిద్రపొయారు . చివరగా మేము నలుగురము మిగిలాము .
కృష్ణ : రేయ్ మామా ......... పాస్ అనిచెప్పి ముగ్గురూ వెళ్లి 15 నిమిషాలకు వచ్చారు.
చదువుకుంటున్న నా పుస్తకం పై గిఫ్ట్ ఉంచారు .
ఫ్రెండ్స్ ..........
మా ప్రాణమైన మిత్రుడికోసం .......... చూడరా అన్నారు .
థాంక్స్ రా అని బాక్స్ ను చెవిదగ్గర కదిలించి ఏముందిరా అని ముగ్గురితోపాటు నవ్వుకుని , గిఫ్ట్ కవర్ చిరిగిపోకుండా వేరుచేసి బాక్స్ ఓపెన్ చేసాను . వజ్రాల యువరాణీ కిరీటం ధరించి ఆనందబాస్పాలతో చిరునవ్వులు చిందిస్తూ చేతిలో ఫ్లవర్స్ తో నిలబడిన ఫోటో , చెక్ అందుకుంటున్న ఫోటో , రెండు చెక్కులూ తిరిగి ఇచ్చేస్తున్న ఫోటో , మైకుతో మాట్లాడుతున్న ఫోటో , వజ్రాలు పొదిగిన లెహంగాలో వాక్ చేస్తున్న ఫోటో , వాక్ చేస్తున్న ఫోటో , వాక్ చేస్తున్న ఫోటో , స్టేజి చివరికివచ్చి ముద్దుపెడుతున్న ఫోటో , వెనక్కు తిరిగి వెళుతున్న ఫోటో , తిరిగి వెళుతున్న ఫోటోలు ........... అన్నీ 4k డిజిటల్ ఫోటోలు చూసి నా కళ్లల్లో ఆనందబాస్పాలతో పరవశించిపోతున్నాను . 
కృష్ణ : రేయ్ మామా .......... మాకు నిన్ననే తెలుసు మేము చూసాము . ఇక ఉదయం పేపర్ కట్ అవ్వడం చూసి ఫిక్స్ అయిపోయాము . స్కూల్లో తమరు పేపర్ చూసి మురిసిపోవడం చూసాములే , సర్ వాళ్ళు ఎడిట్ చేస్తుంటే అడిగి కాపీలు తీసుకున్నాము . ఎందుకు అని అడిగారు - ఏమి చెప్పాలో తెలియక సిగ్గుపడ్డాము . OK ok చెప్పకండి మీకోసం ఆ మాత్రం చేయలేమా ......... మీరుకూడా ఇప్పుడు కంపెనీ ఎంప్లాయిస్ మీరు ఏది కోరితే అది ఇవ్వడం మా బాధ్యత అని ఇచ్చారు . రేయ్ ఇంకా ఉన్నాయి చూడరా అని నాదేవత సైడ్ కు తిరిగిన ఫోటో వెనుకాలే , నాదేవత ప్రక్కనే నేను - నా దేవత నన్ను చూసి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన ఫోటో - నాకోసం వెనక్కు తిరిగిన ఫోటో - నేను కనిపించకపోయేసరికి నిరాసపడిన ఫోటోలను చూసి లవ్ యు లవ్ యు లవ్ యు రా అని ఫోటోలన్నింటినీ నా గుండెలపై హత్తుకుని మురిసిపోయాను . 
కృష్ణ : రేయ్ మామా ........ ఇంకా చూడు అన్నారు . 
చూస్తే పేపర్ ఉంది , ఓపెన్ చేసి చూస్తే అడ్రస్ ఉంది . రేయ్ మామా .......... నా దేవత అడ్రస్ ............ 
కృష్ణ : అవునురా ............ సర్ తో తీసుకున్నాము . దేవత .......... అని కవ్వించారు .
ఫోటోలను మళ్లీ మళ్లీ చూసి మైమరిచిపోతుండటం చూసి , రేయ్ ........ వాడు ఇక గాలిలో తేలిపోతుంటాడు మనం వాడిని డిస్టర్బ్ చెయ్యకుండా చదువుకుందాము అని నవ్వుకున్నారు . 
ఫోటోలనూ - అడ్రస్ ను పదే పదే చూస్తూ goddess goddess ......... అని ముద్దులుపెడుతూ హృదయానికి హత్తుకుని మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది - రేయ్ మామా ......... నాదేవతను వెంటనే చూడాలని ఉంది .
సూరి : ఇప్పుడా 11 గంటలు దాటింది . 
రేయ్ రేయ్ .......... చూడకపోతే పిచ్చెక్కేలా ఉందిరా - హృదయం ఆగిపోతుందేమో ..............
రేయ్ రేయ్ ......... అంటూ ఆటపట్టించి గిలిగింతలు పెట్టి , అందరూ నిద్రపోతుండటంతో ష్ ష్ ష్ ........ అని సైలెంట్ అయిపోయాము . 
కృష్ణ : ఏది అయితే అది పదరా వెళదాము అని బుక్స్ అన్నీ లోపల ఉంచేసి , గిఫ్ట్ బాక్స్ తోపాటుగా , వార్డెన్ కు తెలియకుండా గేట్ దూకాము . అరగంటలో స్ట్రీట్ చేరుకుని అడ్రస్ వెతికి పట్టుకునేసరికి అర్ధరాత్రి అయ్యింది . 
కృష్ణ : రేయ్ మామా ఇదేరా అని మా అనాథ శరణాలయం ప్లేస్ అంత పెద్ద బిల్డింగ్ ను చూసి ఆశ్చర్యపోయాము .
నాదేవత ఉండాలంటే ఈమాత్రమైనా ఉండాలి అని ఆనందించి గేట్ దగ్గర ఇద్దరు సెక్యూరిటీ ఉండటం చూసి నా దేవత సేఫ్ అనుకున్నాను . రేయ్ మామా ఎలారా ............ 
కృష్ణ : డోంట్ వర్రీ అని గోడ వెంబడి చివరకు వెళ్లి నలుగురమూ ఒకరినొకరము సహాయం చేసుకుని మా రెండింతలు ఉన్న గోడను ఎక్కి చప్పుడు చెయ్యకుండా దిగి పూల మొక్కల వెనుక దాగుతూ మెయిన్ డోర్ దగ్గరికివెలితే బయట లాక్ చేశారు .        
నేను నిరాశపడటం చూసి రేయ్ మామా .......... ఎక్కడికైనా వెల్లారేమో రా రేపు వచ్చేస్తారులే లంచ్ టైం లో వద్దాము అని ఎలా వెళ్ళామో అలా శరణాలయం చేరుకున్నాము . 
రేయ్ మామా ......... నాదేవత రేపు కనిపిస్తారుకదూ అని సిగ్గుపడి , దుప్పటిని బయటకు తీసుకొచ్చి ఆటస్థలం మధ్యలో పరిచి వాలిపోయి , బాక్స్ ను నా గుండెలపై హత్తుకుని నిండు చంద్రుడిని చూసి , చందమామా ......... నా దేవత ఎక్కడున్నా మీరు చూస్తుంటారుకదా ఎలా ఉన్నారు ఏమి చేస్తున్నారు - ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అని మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రుడిలో నా దేవత ప్రతిరూపాన్ని చూసుకుని ఆనందిస్తూ నిద్రపోయాను .
Like Reply
#37
కృష్ణ : రేయ్ మామా రేయ్ మామా ........... అని లేపి 5:30 అవుతున్నా లేవలేదంటే డ్రీమ్స్ లోకి వెళ్లిపోయావన్నమాట . 24/7 ఈ బాక్స్ ను వదిలేలా లేవు . మేము హీరోయిన్స్ తో డ్రీమ్స్ లోకి వెళితే నవ్వుకున్నావుకాదరా ఇప్పుడు తెలిసిందా .........

లవ్ యు రా మామా .......... తెలిసింది అని సిగ్గుపడ్డాను .
కృష్ణ : రా కాసేపు చదువుకుందాము యూనిట్ టెస్ట్ లు వచ్చేస్తున్నాయి కదా .........
అవునవును ఫస్ట్ అది , రేయ్ మామా .......... నా దేవత ఈరోజు ఖచ్చితంగా కనిపిస్తుంది అంటావా ............
కృష్ణ : నవ్వుకుని , వచ్చి ఉంటే తప్పకుండా చూస్తావురా అని లేపారు .
8 వరకూ చదువుకుని బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి ఆరోజుకు టిఫిన్ లేకపోవడంతో ఆకలితోనే స్కూల్ కు వెళ్ళాము . నిమిషం నిమిషానికీ గోడ గడియారం వైపు చూడటం చూసి ముగ్గురూ నవ్వుకున్నారు . 
లంచ్ బెల్ మ్రోగగానే వెళ్లాలని ఉన్నా , నాకోసం నా ఫ్రెండ్స్ ......... వద్దు అని ఆగి స్కూల్లో పెట్టే అన్నం సాంబారు గుడ్డు తిని ఎనర్జీతో నాదేవత ఇంటివైపు పరుగుపెట్టాము . 

ఎలా రా మామా ఎలా ...........
ఒక్కనిమిషం అని దగ్గరలో ఉన్న చిన్న షాప్ నుండి జేబులో ఉన్న రెండు రూపాయలతో రూపాయికి ఒకటి వచ్చే సిగరెట్లు తీసుకుని , రేయ్ మామా ఇక్కడే ఉండండి ఇప్పుడే వచ్చేస్తాను అనివెల్లి , సెక్యూరిటీలతో మాటలుకలిపి సిగరెట్లు అందించి మళ్లీ మాటలు కలిపి నిరాశతో వెనక్కువచ్చాడు . 

రేయ్ మామా మిస్ వైజాగ్ షో పూర్తయిన నెక్స్ట్ రోజు ఉదయమే వెకేషన్ కోసం ఊటీ వెళ్లారట , ఎప్పుడు వస్తారో తెలియదు - బయట గుంపులు గుంపులుగా ఫ్యాన్స్ ఉంటే మేడం వచ్చినట్లు అనిచెప్పారురా ............
బాధపడుతూ స్కూల్ వైపు వెళ్లిపోతుండటం చూసి , రేయ్ మామా రేయ్ మామా ........... రోజూ వచ్చి చూద్దామురా అని నా భుజం చుట్టూ చేతులువేసి , నీ దేవత ఎన్నిరోజులు కనిపించకపోతే నీలో అంత అంత ఇష్టం పెరుగుతుందిరా అని గిలిగింతలుపెట్టి నవ్వించారు . 
స్కూల్ వదలగానే శరణాలయం చేరుకున్నాము . 
వార్డెన్ : మహేష్ - కృష్ణా ......... మీరు చెప్పినట్లుగానే మిస్ వైజాగ్ కావ్య మేడం మన శరణాలయానికి 50 వేలు పంపించారు అని చూపించారు . మేడం ఊటీ వెళ్లారు లేకపోతే వారే వచ్చి ఆనందించేవారు అని ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు . ఈ డబ్బుతో టాప్ బాగుచేయిస్తాను అని సంతోషించారు .
కృష్ణ : రేయ్ మామా ......... నీ దేవత నిజంగా దేవతేరా ........ , నీ దేవత నీడలో ఉండబోతున్నాము అని నన్ను అమాంతం ఎత్తి సంతోషంతో తిప్పారు .
నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . Goddess .......... లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని మురిసిపోయాను .

నెక్స్ట్ రోజు నుండీ ఉదయం లేవగానే నా దేవత ఫోటోలు చూడటం - స్కూల్ కు వెళ్ళేటప్పుడు ఒకసారి - లంచ్ టైం లో ఒకసారి - స్కూల్ వదిలాక మరొకసారి నాదేవత ఇంటికి వెళ్లడం వార్డెన్ తో తీసుకున్న రెండు రెండు రెండు రూపాయలు ఖర్చు చెయ్యడం - నిరాశతో వెనుతిరగడం - సాయంత్రం కంపెనీలో ఈవెంట్స్ లలో పనిచేసి సర్ వాళ్ళు ఇచ్చిన డబ్బుని వార్డెన్ కు ఇవ్వడం - భోజనం చేసి ఆటస్థలంలో పడుకుని చంద్రుడి వెన్నెలలో నాదేవతను చూస్తూ మాట్లాడటం నా దినచర్య అయిపోయింది . అప్పుడప్పుడూ .......... నిద్రలోనే పిచికారీ కొట్టిన గుర్తులు కనిపించి నా ఫ్రెండ్స్ లేపి ఆటపట్టించేవాళ్ళు . అలా నెలరోజులు గడిచిపోయాయి . Exams రాయడం క్లాస్ మొత్తానికి నలుగురమూ టాప్ లో నిలవడం తెలిసి వార్డెన్ కూడా సంతోషించారు . 
కృష్ణ : రేయ్ మామా .......... రారా అని శరణాలయంలో ఉన్న అమ్మవారి దగ్గరకు తీసుకెళ్లి , ప్రార్థిద్దామురా .......... చిన్నప్పుడు అమ్మవారిని ప్రార్థించకుండా అడుగుకూడా వేసేవాడివికాదు , కచ్చితంగా నీ దేవతను చూపిస్తారురా అనిచెప్పడంతో , 
రేయ్ మామా .......... ఎంత ప్రార్థించాము ఎంత పూజించాము మనకు కాదు కాదు చిన్న బుజ్జాయిలకైనా మూడుపూటలా కడుపునిండా ఆకలి తీర్చారా రా .......... అందుకే రా నమ్మకం పోయింది . నువ్వు చెప్పావు కాబట్టి భక్తితో చివరిసారిగా ప్రార్ధిస్తాను అని చల్లని బావి నీళ్లతో తలస్నానం చేసివచ్చి అమ్మవారి బొట్టుపెట్టుకుని షాష్టాంగ నమస్కారం చేసి , అమ్మా ......... నాదేవత కనిపించేలా చూడు అని భక్తితో ప్రార్థించాను .

టిఫిన్ చేసేసి పరుగున నా దేవత ఇంటికి చేరుకున్నాము . ఇల్లు సర్వాంగ సుందరంగా రెడీ అవ్వడం చూసి రేయ్ మామా అని సంతోషంతో కౌగిలించుకున్నాము . 
కృష్ణ : ఒక్కనిమిషం రా మామా అని సిగరేట్స్ తీసుకునివెళ్లి మాట్లాడి , యాహూ ........ అంటూ పరుగునవచ్చి అమాంతం నామీదకు దూకి , రేయ్ మామా ........ నీ దేవత గారు రేపు వచ్చేస్తున్నారు అనిచెప్పాడు . ఊటీ లో కొన్నిరోజులు హైదరాబాద్ లో కొన్నిరోజులు ఉండి వస్తున్నారురా ......... 
లవ్ యు రా మామా అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , రేపు ఎలాగో సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే స్కూల్ ఉండదు కాబట్టి మన మకాం ఇక్కడే అని మురిసిపోయాను . రెండు రోజుల్లో ఒక్కసారైనా నాదేవతను చూడాలిరా ..........
సూరి : ఒక్కసారి ఏంట్రా ........... 48 గంటలూ ఇక్కడే ఉండి , బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అని తెలియజేసి కలిసే వెళదాము . నువ్వు తప్ప మేమెవ్వరమూ షేక్ హ్యాండ్ ఇవ్వము లేరా అని నవ్వుకుని ఉత్సాహంతో స్కూల్ వైపు నడిచాము . 
రేయ్ మామా .......... మన అమ్మవారు ఆలకించారురా , నేను వెంటనే వెళ్లి మనసారా మొక్కి ఇన్నిరోజులు తప్పుచేసాను అని గుంజీలు తీసివస్తాను రా ........
కృష్ణ : రేయ్ మామా ......... మేమూ నీవెంటే పదా , స్కూల్ బెల్ మ్రోగేలోపు వచ్చేద్దాము అని పరుగుబెట్టాము .
వొళ్ళంతా చెమటతో అమ్మ ముందు నిలబడి తప్పయింది మన్నించండి అని లెంపలేసుకుని గుంజీలు తీసి చుట్టూ ప్రదక్షిణలు చేసి షాష్టాంగ నమస్కారం చేసాను . అమ్మా .......... బుజ్జి బుర్రతో అన్న మాటలను పట్టించుకోకండి . అక్కడ నా దేవత వైజాగ్ లో అడుగుపెట్టబోతోందని సందడి సందడిగా ఉంది . ఒక్కసారి ఓకేఒక్కసారి కలిసే ఛాన్స్ ఇప్పించండి చాలు , స్కూల్ కు టైం అవుతోంది వెళ్ళాలి - సాయంత్రం వచ్చాక మళ్లీ భక్తితో ప్రార్ధిస్తాను అని మొక్కి బయలుదేరాము .

స్కూల్లో నా ఆనందాన్ని ఆపే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేదు . వరుస పేజీలలో నా దేవత ఫోటోలు ఉంచుకుని చూస్తూ నాలో నేనే ఎంజాయ్ చేస్తున్నాను . 
కృష్ణ : రేయ్ మామా ......... ఈరోజు ఫోటోలు చూసి మురిసిపోతున్నావు - రేపు డైరెక్ట్ గా కలిసి చేతులు కలిపితే ఏమైపోతావో ఏంటో కాస్త నిబ్బరంగా ఉండు అని హత్తుకున్నాడు . 

స్కూల్ వదలగానే రేయ్ తొందరగా రండి నాదేవత ప్రయాణం సాఫీగా జరగాలని ప్రార్థించాలి అని బ్యాగు వెనుక వేసుకుని పరుగుతీసాము . ఫ్రెష్ అయ్యి అమ్మను ప్రార్థించి కంపెనీకి వెళ్ళాము . 
వెంకట్ : తమ్ముళ్లూ ......... సర్ పిలుస్తున్నారు అని లోపలికి పంపారు . 
సర్ : మహేష్ , కృష్ణ.......... మీరు జాయిన్ అయ్యి నెల రోజులయ్యింది , మీ సాలరీ అని కవర్స్ నలుగురికీ అందించారు . 
సర్ ........... ప్రతి ఈవెంట్ తరువాత బోనస్ లు బోలెడన్ని ఇచ్చారు - ప్రేమతో మా అందరికీ ఫుడ్ ఇచ్చారు . ఇక సాలరీ ఎందుకు సర్ అని వెనక్కు ఇవ్వబోయాను . 
సర్ : మహేష్ ......... కష్టానికి ప్రతిఫలం ఉండాలి అప్పుడే ఉత్సాహం . ఈరోజు వర్క్ ఏమీలేదు . హ్యాపీగా శరణాలయానికి వెళ్ళండి . రేపు మాత్రం మీరు స్కూల్ కు లీవ్ పెట్టగలరా ............. బిగ్గెస్ట్ ఈవెంట్ మ్యారేజ్ చెయ్యబోతున్నాము . మీరు మా ప్రతి ఈవెంట్ కు లక్ ......... మీరు అక్కడ ఉంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతుందని మా అందరికీ ఘాడమైన నమ్మకం.
మేము నలుగురమూ నవ్వుకుని సర్ ......... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ , సర్ మీరు చదువుకునేటప్పుడు సెకండ్ సాటర్డే లీవ్ ఉండేది కాదా అని ఆడిగాము . 
సర్ : ఓహ్ shit ........... ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే చెబుతున్నాను రేపు మన ఈవెంట్ బిగ్గెస్ట్ సక్సెస్ కాబోతోంది అని హైఫై లు కొట్టుకున్నారు . 
సర్ : మాతోపాటు నవ్వుకుని , మహేష్ .......... రేపు నీకొక సర్ప్రైజ్ , తెల్లవారుఘామునే వచ్చెయ్యండి . చాలా పనులున్నాయి . సర్ప్రైజ్ తోపాటు మీకోసం సపరేట్ గా ఫుడ్ చేయిస్తాము . అందుకోసం పెళ్లి కూతురు నుండి పర్మిషన్ కూడా తీసుకున్నాము అనిచెప్పారు . 
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ ........... అందరికంటే ముందు ఉంటాము అనిచెప్పాను . 
సర్ : అయితే బాగా రెస్ట్ తీసుకోండి . రేపు అక్టీవ్ గా ఉండాలి అనిచెప్పారు . 
బై సర్ అనిచెప్పి ఒకసారి నాదేవత ఇంటిదగ్గరకువెళ్ళాము . పూలతో , లైట్స్ తో ముస్తాబవుతుండటం చూసి స్వాగతం అదిరిపోతోంది అని ఆనందించాను .

Like Reply
#38
కృష్ణ : రేయ్ మామా .......... రేపు ............
Ok రా .......... సండే నాదేవతను చూస్తాను . నెలరోజులు ఆగాను మరొక్కరోజు ఆగనా ......... , ఇక నా దేవత ఇక్కడే ఉండబోతోంది కదరా .......... సండే నుండి రోజూ వచ్చి చూస్తాను . రేపు బిగ్గెస్ట్ ఈవెంట్ మరియు మనకోసం మనం అడగకముందే సర్ వాళ్ళు మానవాళ్ళందరికీ ఫుడ్ రెడీ చేస్తున్నారు . మిగిలినది ఇస్తాను అనలేదు . సర్ మంచివారురా , మనల్ని లక్ అన్నారు ఆయన నమ్మకాన్ని వమ్ముచేయ్యకూడదు పదండి అని శరణాలయo చేరుకుని , అమ్మవారి ముందే వార్డెన్ కు సాలరీ అని మొత్తం డబ్బు ఇచ్చేసాము . 
వార్డెన్ : మహేష్ ......... సగం అయినా మీరు ఉంచుకోండి . మీకిప్పుడు 16 సంవత్సరాలు 18 ఏళ్లకు శరణాలయం నుండి వెళ్ళిపోతారు , అప్పుడు అవసరమౌతుంది అనిచెప్పారు . 
అది రూల్ కదా .......... వార్డెన్ అప్పటి సంగతి అప్పుడు చూద్దాము లేండి , కష్టాన్ని నమ్ముకున్నాము ఎక్కడైనా బ్రతికేస్తాము . జీవితంలో అన్ని బాధలను కష్టాలను ఇక్కడే అనుభవించాము , మాకు తెలిసి ఇంతకంటే ఉండవు . మావెంట అమ్మవారు ఉండనే ఉన్నారు అని ప్రార్థించాము . అప్పటివరకూ మీరే మాకు అన్నీ అనిచెప్పి ఆటస్థలంలోకివెళ్లి ఆడుకుని భోజనం చేసి 10 గంటలవరకూ చదువుకుని , చంద్రుడితో నా దేవత గురించి మాట్లాడుతూ .......... రేపు మీ ఆకాశ మార్గాననే నాదేవత వస్తున్నారు . జాగ్రత్తలన్నీ మీరే చూసుకోవాలి అని ఫోటోలను చూస్తూ చూస్తూనే నిద్రపోయాను .

రేయ్ రేయ్ మామా ........... 
సడెన్ గా లేచి కూర్చుని నాదేవత ఫోటోని కళ్ళుతెరిచి చూసి పెదాలపై చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ goddess ఈరోజు మన బ్యూటిఫుల్ వైజాగ్ లో అడుగుపెట్టబోతున్నారు - మరింత అందాన్ని తీసుకురాబోతున్నారు అని సిగ్గుతో మురిసిపోతున్నాను . 
మూడువైపులా ముగ్గురూ తియ్యని కోపంతో కన్నార్పకుండా నావైపే చూస్తుండటం చూసి నవ్వుకుని , గుడ్ మార్నింగ్ రా ......... సమయం ఎంత అని అడిగాను .
సూరి : 4 గంటలు రా ............ 
రేయ్ మామా గంటలో సర్ ముందు ఉండాలిరా అని నాదేవతను గుండెలపై హత్తుకుని , ఫోటోలన్నింటినీ బాక్స్ లో ఉంచేసి , ఒక్కనిమిషం లో వస్తానురా అని లోపలికి పరిగెత్తి నా ట్రంక్ లో ఉంచేసి లాక్ చేసాను . బట్టలన్నీ విప్పేసి టవల్ చుట్టుకొని బావిదగ్గరకు చేరి నలుగురమూ below టెంపరేచర్ లో ఉన్న నీటితోనే వణుకుతూ హుషారుగా తలంటు స్నానం చేసి రెడీ అయ్యి , అమ్మవారిదగ్గరకువెళ్లి ప్రార్థించి , వార్డెన్ కు మధ్యాహ్నం పెళ్లి బోజనంతో వస్తామనిచెప్పి హుషారుగా బయలుదేరాము . 

మాటిచ్చినట్లుగానే అందరికంటే ముందు ఆఫీస్ చేరుకున్నాము . మేము చేరుకున్న 15 నిమిషాలకు మా తోటి వర్కర్స్ వచ్చి యూనిఫార్మ్ లోకి మారి ఏమేమి అవసరమో అన్నింటినీ వెహికల్లోకి మారుస్తున్నారు . మేము కూడా మారిపోయి సహాయం చేసాము . 
కొద్దిసేపటితరువాత సర్ వాళ్ళువచ్చి మహేష్ ......... ఫస్ట్ మీరే వచ్చారట - ఇక ఈరోజు లాక్కంతా మనవైపే - ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ............. నీ సర్ప్రైజ్ ను కలవబోతున్నావు కాబట్టి మీ నలుగురూ యూనిఫార్మ్ వేసుకునే అవసరం లేదు . మీకోసం కొత్తబట్టలు తీసుకొచ్చాము లోపలికివెళ్లి వేసుకుని రెడీ అవ్వండి అని అందించారు . 

సర్ .......... జీవితంలో ఫస్ట్ టైం కొత్తబట్టలు వేసుకోబోతున్నాము అని కళ్ళల్లో చెమ్మతో థాంక్స్ చెప్పబోతే ఆపి , 
సర్ : మహేష్ - కృష్ణ .......... అక్కడితో ఆగిపోండి . ఈ బట్టలు ఇచ్చినది మేము కాదు. మనం ఎవరి మ్యారేజ్ ఫంక్షన్ అయితే ఈవెంట్ చేస్తున్నాము ఆ పెళ్లికూతురుగారు ఇచ్చారు . మీ నలుగురికే కాదు మీ శరణాలయంలో ఉన్న పిల్లలందరికీ ఇచ్చారు . లంచ్ తోపాటు తీసుకువెళ్లండి అనిచెప్పారు . 
సర్ .......... అని ఆశ్చర్యపోయాము . 
సర్ : మిమ్మల్ని ఎంత హడావిడి ఉన్నా ఒకసారి ఆ మేడం దగ్గరకు తీసుకెళతాను అక్కడ థాంక్స్ చెప్పండి . కమాన్ కమాన్ .......... గంటలో మనం అక్కడ ఉండాలి అనిచెప్పడంతో బట్టలు అందుకొని లోపలికి పరుగునవెళ్ళాము .
కృష్ణ : రేయ్ మామా .......... వైజాగ్ లో మరొక దేవత కూడా ఉందిరా ..........
అవును అని కొత్తబట్టలను చూసి మురిసిపోయి ముద్దులుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ వేసుకుని రెడీ అయ్యి పెద్ద వెహికల్లో కూర్చోబోతే , తమ్ముళ్లూ .......... అందులో కూర్చుంటే బట్టలకు దుమ్ము అంటుకుంటుంది - మేడం చూస్తే బాధపడొచ్చు. ఈరోజు మన కార్లలో వెళదాము రండి అనిచెప్పడంతో , 
సర్ వాళ్ళ మాటను కాదనలేక వెళ్లి కూర్చున్నాము . ఫస్ట్ టైం కొత్తబట్టలు - ఫస్ట్ టైం కారులో ప్రయాణం .......... నాదేవత అడుగుపెట్టబోతున్నారోజు ఇంకా ఎన్ని సర్ప్రైజ్ లు ఆస్వాదించబోతున్నామో అని నాలోనేనే ఆనందించాను . 

6 :30 కల్లా ......... ఏకంగా స్టేడియం నే పెళ్ళిమండపంలా మార్చేసిన దగ్గరకు చేరుకున్నాము . విద్యుత్ కాంతులు పూలతో అలంకరణ స్వాగతం పలకడం చూసి మరింత ఆనందించాము . 
సర్ : మహేష్ , కృష్ణ .......... ఈరోజు మీరు ఏమీ పనిచేయడానికి వీలు లేదు మా ప్రక్కనే మా అదృష్టంలా ఎంజాయ్ చెయ్యండి చాలు అని ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని తమ వెంటనే ఉంచుకున్నారు . ఈ ఆనందంలో మరియు నాదేవత అడుగుపెట్టబోతుందన్న సంతోషంలో పెళ్లి ఎవరిది అనికూడా పట్టించుకోకుండా లోపలికివెళ్లి సర్ వాళ్ళతోపాటు తిరుగుతున్నాము . 
10 -11 గంటల మధ్యన ముహూర్తం  - ఫ్యామిలీలు గిఫ్ట్స్ తోపాటు వస్తూనే ఉన్నారు. ముందు పెళ్లికి ఇంతపెద్ద స్టేడియం ఎందుకు అనుకున్నాము . కానీ 9 గంటలకల్లా నిండిపోయింది . అన్నిరకాల టిఫిన్లు ఏర్పాటుచేశారు - సర్ వాళ్ళతోపాటు తృప్తిగా తిన్నాము . అన్నీ సర్ వాళ్ళు అనుకున్నట్లుగానే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు . 

 ముహూర్తం సమయానికి పంతులుగారు పెళ్ళిమంత్రాలు మొదలెట్టగానే మహేష్ ......... మరికిద్దిసేపట్లో నీ సర్ప్రైజ్ నలుగురూ పెళ్ళిమండపం దగ్గరే ఉండమని చెప్పారు , పెళ్ళికొడుకుని పిలవడంతో వచ్చి కూర్చున్నారు . 
కృష్ణ : రేయ్ మామా ......... పెళ్ళికొడుకు తిరుపతిలో సెక్యూరిటీ అధికారి అనిచెప్పాడు .
పెళ్ళికొడుకు వచ్చిన కొద్దిసేపటికి పెళ్లికూతుర్ని తీసుకునిరమ్మని చెప్పడంతో వచ్చారు.

 సంతోషంతో నవ్వుతూ పెళ్లికూతురుగా నాదేవత నడుచుకుంటూ రావడం చూసి కొన్ని క్షణాలపాటు చుట్టూ ఏమిజరుగుతుందో తెలియడం లేదు . 
కృష్ణ : నా చేతిని అందుకొని రేయ్ మామా .......... అని బాధతో పిలువగానే ,కళ్ళల్లో ధారలా కన్నీళ్లు వచ్చేసాయి . 
సర్ : మహేష్ మహేష్ .......... ఎక్కడ ఉన్నావు రా ముందుకు అని పిలవడంతో , 
కన్నీళ్లను తుడుచుకుని సర్ అని ముందుకువెళ్లాను .
సర్ : మహేష్ ......... షాక్ అయ్యావుకదా , నువ్వు నీ లక్కీ నోటితో మిస్ వైజాగ్ కిరీటాన్ని దక్కేలా చేసిన కావ్య గారి పెళ్లి . మీ డ్రెస్ లు - భోజనం ఆమెనే arrange చేసినది . మీరెవరో తెలియకపోయినా అనాధలు అని ఇష్టంతో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు . ఫోటోలు దిగేటప్పుడు కలిసేలా చేస్తాను అన్నారు .
అవును సర్ నిజంగా షాక్ అయ్యాను.ఇలాంటి సర్ప్రైజ్ అని ఊహించలేదు అని క్షణక్షణానికి కన్నీళ్లు వాటంతట కారిపోతుంటే తుడుచుకుంటూ మాట్లాడాను . 

పెళ్లికూతురు పీఠలపై కూర్చోగానే బంధువులంతా చుట్టుముట్టడంతో నాదేవత కనుమరుగైపోయింది . అవును నిజమే నా హృదయాన్ని బాధకు గురిచేసి వెళ్లిపోతోంది అని అక్కడ నుండి వెళ్లిపోవాలని ఉన్నా ......... , సర్ కు మాట రాకూడదు అని గుండెలనుండి తన్నుకొస్తున్న బాధను దిగమింగుకుని అక్కడ నుండి చివరికువచ్చేసాను . 
కృష్ణ : సర్ పాస్ అని వేలు చూపించాడు .
 సర్ : తొందరగా వచ్చెయ్యండి .
అలాగే సర్ అని బాధతో నాదగ్గరికివచ్చి , ఆ వయసులో ఏమిమాట్లాడాలో ఎలా ఓదార్చాలో తెలియక ప్రక్కనే బాధపడుతూ నిలబడ్డారు . 
క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి . కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి . ఒక గంట తరువాత మహేష్ , కృష్ణ ........ అంటూ వెంకట్ అన్న వచ్చారు . వెంటనే అందరమూ కన్నీళ్లను తుడుచుకున్నాము . 
వెంకట్ : మహేష్ ......... సర్ పిలుస్తున్నారు . ఇంత జనంలో కూడా మిమ్మల్ని కలవడానికి కావ్య మేడం ఒప్పుకున్నారు రండి త్వరగా .........

సర్ : రండి అని స్టేజీమీదకు పిలుచుకొనివెళ్లి , మేడం ......... మీరు సహాయం చేసినది ఈ పిల్లలకే అని పరిచయం చేసారు . 
నాదేవత ........ ఈ క్షణంతో నా హృదయాన్ని గాయపరిచిన కావ్య మేడం : hi hi అని చేతులు అందించారు . 
నేను మాత్రమే తాకాను . నా ఫ్రెండ్స్ ముగ్గురూ .......... రెండుచేతులతో నమస్కరించి ఫోటో కోసం నిలబడ్డారు . 
మేడం నన్ను ప్రక్కనే రమ్మని బాబూ ......... నన్ను ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అని నా భుజం చుట్టూ చేతినివేశారు .
నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు , అలాగే ఫోటోలు దిగి భారమైన అడుగులువేస్తూ కిందకువచ్చాము . 

సర్ : మహేష్ .........  కావ్య మేడం తన పెళ్లికి వచ్చిన అతిథులకంటే మీకే ఫస్ట్ పెళ్ళిభోజనం పంపించమన్నారు . ఎన్నిరకాల వంటలు చేశారో అన్నీరకాలనూ మరియు మీ శరణాలయంలోని పిల్లలందరకూ కొత్తబట్టలను పెద్ద వెహికల్లో ఉంచాము . వెళ్లి అందరికీ పంచి తృప్తిగా భోజనం చేసి ఈరోజు సంతోషంగా గడపండి అని పర్సులోని డబ్బుని మా జేబులలో ఉంచి బయటవరకూ వచ్చి వదిలారు . 
థాంక్స్ సర్ అనిచెప్పి వెహికల్లో కూర్చున్నాము . 20 నిమిషాలలో చేరుకుని కిందకుదిగి అన్నీ లోపలకు మార్చడంలో సహాయం చేసి , పిల్లలందరి ఆనందాన్ని చూసి నవ్వుకుని లోపలకువెళ్లి బట్టలను మార్చి విసిరేసి నా బట్టలు వేసుకుని అందరికీ దూరంగా వెళ్లి కూర్చున్నాను .
Like Reply
#39
కృష్ణ : రేయ్ మామా .......... 

 బాధపడుతూనే ఇందులో నీతప్పు - మీ అమ్మవారి తప్పు లేదు లేరా ........... నేను కోరినది ఒకసారి కలవాలని - తాకాలని ఆ రెండు కోరికలూ తీరిపోయాయి అని ఏడుస్తూ - నవ్వుతూ - బాధపడుతూ చెప్పాను .
ముగ్గురూ : రేయ్ మామా ............ 
లేదురా ......... ఇక జీవితంలో అమ్మాయిలను ఇష్టపడను . ఇక కష్టం పైననే ఆధారపడతాను . ఎవరో వచ్చి ఏదో వరాలిస్తారన్నది అపద్దo . ఇక నా జీవితంలో చదువు కష్టానికి తప్ప అమ్మాయిలకు చోటులేదు అని అప్పటి వయసుకు మించిన మాటలు మాట్లాడుతూ ఏడుస్తున్నాను .
కృష్ణ : రేయ్ మామా .......... అమ్మాయిలకు చోటులేదు అంటున్నావంటే , అంటీలతో ఆ ఆ ........... అని ఆటపట్టించారు . 
 వాడిమాటలకు సూరి , రవిలతోపాటు ఒక్కసారిగా నేనుకూడా నవ్వేసాను . 
కృష్ణ : హమ్మయ్యా ......... నవ్వావా అని ముగ్గురూ హత్తుకుని , అంటీలు ఫసక్ అన్నమాట అని నవ్వించారు . రేయ్ మామా ఆకలేస్తోంది తిందాము రారా ......
రేయ్ .......... ఈ ఒక్కరోజైనా కాస్త బాధపడనివ్వండి . మీరువెళ్లి తినండి .
ముగ్గురూ : నాప్రక్కనే కూర్చుని , నువ్వు బాధపడుతుంటే వెళ్లి ఎలా తింటామురా , తింటే కలిసి తిందాము లేకపోతే పస్తులుందాము అంతే . నేను ఒకటి చెబుతాను ఆవేశం బాధతో కాకుండా వివేకంతో ఆలోచించు . రేయ్ మామా ......... నీదేవత తప్పు ఏమాత్రం లేదురా - తప్పంతా మనది . నువ్వు వెళ్లి ఆరాధిస్తున్నాను అని చెప్పాక పెళ్లిచేసుకుని ఉంటే అప్పుడు నువ్వు బాధపడాలి . నీదేవత ఊటీలో ఉందన్నప్పుడు మనం ఎలాగైనా చివరికి నడుచుకుంటూ అయినా వెళ్లి నీ హృదయంలో ఎంత పూజిస్తున్నావో చెప్పి ఉంటే బాగుండేది . అయినా ఇలా జరుగుతుందని ఎవరు ఊహించారురా ........... , నీదేవత నిజంగా దేవతేరా ........ అతిథులకంటే ముందు మనకు భోజనం పంపించారు . 
రేయ్ నువ్వెన్ని చెప్పినా ఇక నా జీవితంలో ఇక అమ్మాయిలు అనేమాట లేదురా .......
కృష్ణ : మరి మన క్లాస్ లో నిన్ను ఒరకంటితో చూసే అమ్మాయిల సంగతి . 
రేయ్ నీయబ్బా ......... అమ్మాయిలు లేరు అంతే .
సూరి : రేయ్ కృష్ణ .......... నువ్వుచెప్పినట్లు స్త్రీలు అనట్లేదు కేవలం అమ్మాయిలు అంటున్నాడు అంటే అంటీలు ......... అని రాగం తీసాడు . 
కృష్ణ : నవ్వుకుని , వద్దులేరా ఇక అమ్మాయిలే వద్దు . రాత్రివరకూ మనం బ్రతికి ఉండాలంటే తినాలికదరా .......... కావాలంటే తిన్నాక నీఇష్టం ఎంతసేపయినా బాధపడు .
మీకోసం తింటానురా ............ మనకు బాధలు కష్టాలు కొత్తవేమీ కాదుకదా , కానీ ఇది మరింత బాధిస్తోంది అంతే అని లేచివెళ్లి తిన్నాము .

ఆరోజు నుండి కావ్య మేడం ఫోటోలు తాకింది లేదు ఇంటిదగ్గరకువెళ్లింది లేదు - కావ్య మేడం ఆరోజే తిరుపతికి షిఫ్ట్ అయిపోయారు . నెక్స్ట్ రోజు ఉదయం పేపర్లో మ్యారేజ్ గురించి రావడంతో ఆరోజు నుండి పేపర్ చదవడం మానేసాను - లోపల వార్డెన్ రూంలో న్యూస్ లో కూడా మిస్ వైజాగ్ మ్యారేజ్ అని వస్తుండటం తెలిసి న్యూస్ చూడటం కూడా మానేసాను . ఆరోజు నుండి నుండి ఉదయం స్టడీస్ ఆ వెంటనే స్కూల్ సాయంత్రం రాగానే వర్క్ తొ రోజులు గడిచిపోయాయి . ప్రతిరోజూ కావ్య మేడం గుర్తుకువచ్చి ముగ్గురికీ తెలియనివ్వకుండా బాధపడేవాడిని - హృదయమంతా నింపుకున్నాను కదా .......... అంత త్వరగా మరోచిపోవడం కుదరదు .

 ఇక సర్ వాళ్ళు రోజురోజుకూ కొత్త కొత్త ఈవెంట్లతో మంచి పేరుని సంపాదిస్తున్నారు.
10th క్లాస్ లో నలుగురమూ స్టేట్ ర్యాంక్ లతో పాస్ అయ్యాము .
వార్డెన్ - సర్ వాళ్ళు అభినందించారు . ప్రతిభ అవార్డ్స్ కూడా వచ్చాయి .
 నెక్స్ట్ ఇంటర్లో కూడా నలుగురమూ govt కాలేజ్ లో MPC తీసుకున్నాము . చుట్టూ అందమైన అమ్మాయిలు ఉన్నా - ముగ్గురూ జోళ్ళుకారుస్తూ అమ్మాయిల వెంట పడినా నేనుమాత్రం పట్టించుకునేవాడిని కాదు .
ముగ్గురూ : రేయ్ మామా .......... క్లాస్ లో అంతమంది నీకు లైన్ వేస్తున్నా పట్టించుకోవెంటి రా , తెలిసీ తెలియని వయసులో ఏదో జరిగిపోయింది మరిచిపోరా ఎంజాయ్ చెయ్యరా .......... అన్నా , నేను పట్టించుకునేవాడిని కాదు .
ఇంటర్ కూడా టాప్ లో నిలిచాము . సంవత్సరానికోకసారిమా స్థాయిలు - మా సాలరీ లు పెరుగుతూనేలకు 15 వేల వరకూ తీసుకుంటున్నాము . ఆఫీస్ ను ఒకసారి మీడియం నెక్స్ట్ బిగ్గెస్ట్ బిల్డింగ్ లోకి మార్చడం జరిగింది . సిటీలో ఒక బ్రాండ్ గా వెలుగొందుతోంది . డబ్బుని వెళ్లి వార్డెన్ కు ఇచ్చేవాళ్ళము అలా ఆరోజు ,

 వార్డెన్ : మహేష్ .......... ఎక్కడెక్కడి నుండో సెక్యూరిటీ ఆఫీసర్లు అనాధలైన బుజ్జాయిలను వదిలి వెళుతున్నారు కాబట్టి ........
అర్థమైంది వార్డెన్ వారం రోజుల్లో ఇల్లు చూసుకుని వెళ్లిపోతాము అని ఉద్వేగానికి లోనౌతుంటే , 
వార్డెన్ కౌగిలించుకుని కొత్త ప్రపంచాన్ని ఆస్వాదించండి - మీరు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాను అని మాడబ్బు వెనక్కు ఇవ్వబోయారు .
వార్డెన్ .......... ఇప్పటి నుండి మేము జీవితంలో ఏమి సంపాదించినా మా ప్రాణమైన ఈ శరణాలయం కు 50% ఇస్తాము అని సగం మాత్రమే తీసుకున్నాము . 

ఇంటర్ హాలిడేస్ కాబట్టి ఉదయమే ఆఫీస్ కు వెళ్ళాము . 
సర్ : మహేష్ .......... వార్డెన్ కాల్ చేశారు . శరణాలయం నుండి బయటకు వచ్చే సమయం అయ్యింది అనిచెప్పారు . ఎక్కడో ఎందుకు మన బిల్డింగ్ పైననే రూమ్ ఉందికదా అక్కడ ఉండొచ్చు . మీరు ok అంటే కావాల్సినవన్నీ arrange చేయిస్తాము . 
సర్ ......... అడగకముందే వరం ఇస్తే కాదనగలమా అని బోలెడన్ని థాంక్స్ లు చెప్పాము . 
సర్ : మహేష్ ఇందులో మా స్వార్థ్యం కూడా ఉంది . మీరు 24/7 ఆఫీస్ లోనే ఉంటే మరింత లక్కీ మాకు , వెళ్ళండి వర్క్ చూసుకోండి సాయంత్రం లోపు నేను క్లీన్ చేయిస్తాను , వెంకట్ అన్నయ్యను పిలిచి కనీస అవసరాలు ఉండేలా మార్చేయ్యాలి అని డబ్బుని ఇచ్చారు . 
అధిచూసి చాలా ఆనందించాము . 

నెక్స్ట్ రోజు ఉద్వేగవాతావరణంలో తమ్ముళ్లను బుజ్జాయిలను కౌగిలించుకుని మనం అప్పుడప్పుడూ కలుద్దాము అనిచెప్పి ట్రంక్ లతోపాటు ఆఫీస్ బిల్డింగ్ పైకి షిఫ్ట్ అయ్యాము . ఇంటికి అవసరమైనవన్నీ ఉండటం చూసి ఆనందించి రేయ్ సర్ వాళ్లకు మనం ఋణపడిపోయామురా అని సంతోషంతో మాట్లాడుకున్నాము . ఇంటర్ తరువాత ఏమిచెయ్యాలో చర్చలు మొదలయ్యాయి .

కృష్ణ : బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చెయ్యాలిరా ......... అదేకదా మన డ్రీమ్ అని వాడు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాడు .
అవునురా ........... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వైజాగ్ వదిలి వెళ్లిపోవాలి . 
కృష్ణ : 4 ఇయర్స్ పడుతుందిరా ........., ఏరా ఇప్పటికీ మరిచిపోలేదా .........
జీవితాంతం మరిచిపోలేనోమో రా ........... , అధివదిలెయ్యి ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేలా పక్కా ప్రణాళిక చెయ్యాలి . ఎంసెట్ లో govt కాలేజ్ లో సీట్ సంపాదించాలి .nights Hardwork చెయ్యాలి అని హైఫై కొట్టుకుని కిందకువచ్చాము . 

 చిన్న సర్ వాళ్ళు ముగ్గురినీ ప్లానింగ్ రూంలోకి పిలిచారు . వెంకట్ అన్నయ్య నన్ను పెద్ద సర్ దగ్గరికి తీసుకెళ్లాడు .
సర్ : మహేష్ .......... ఇందాకే అంతా ok కదా అని తెలుసుకోవడానికి పైకివచ్చాను . మీ డ్రీమ్స్ విన్నాను . 
అవును సర్ కృష్ణ వాళ్లకు బెంగళూరులో జాబ్ చెయ్యాలని పేపర్లో - టీవీల్లో వాళ్ళ lifestyle తెలుసుకున్నప్పటి నుండి ఇష్టం అది మా 15 వ ఏడు అనుకుంటాను . నాకు కూడా వాళ్ళతోపాటు వెళ్లాలని అందరమూ ఒక్కదగ్గరే ఉండాలని ఉంది సర్ .
సర్ : all the best మహేష్ , కానీ నాకూ ఒక మాట ఇస్తావా మహేష్ ......... ,
సర్ ......... ఆర్డర్ వెయ్యండి సర్ మీ వలన ఎన్నో సంతోషాలను పొందాము , మీకోసం ఏమైనా చేస్తాము .
సర్ : మీరు మన ఆఫీస్ లో అడుగుపెట్టేంతవరకూ మా పరిస్థితి వేరు , పనిచేసేవాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి , మీరు అడుగుపెట్టబోతున్నారని తెలిసే మిస్ వైజాగ్ ఈవెంట్ మనకు లభించింది అనిమాత్రం 100% చెప్పగలను . మీరు ఈ కంపెనీకె లక్ , వేలల్లో రాబడి నుండి లక్షలకు చేరుకున్నాము - మావలన ఎన్నో కుటుంబాలు సంతోషన్గా ఉన్నాయి . మీరు మాతో ఉంటే కోట్లకు చేరుకుంటాము అని నేను విశ్వసిస్తున్నాను . మీరు వెళ్ళిపోతే మళ్లీ మొదటికి చేరుకుంటామెమో అని భయమేస్తోంది . 
సర్ ........... అలా ఎప్పటికీ జరగకూడదు . ఇప్పుడెలా ముగ్గురూ బెంగళూరు డ్రీమ్ లో జీవిస్తున్నారు . నేను నా జీవితంలో ఆశించినది ఎలాగో పొందలేకపోయాను - ఇప్పుడు నా ప్రాణమైన మిత్రులు ........... అని సతమతమవుతున్నాను . 
సర్ : మహేష్ .......... నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో అర్థమౌతోంది . నలుగురూ ఉండాల్సిన అవసరం లేదు - మీలో ఒక్కరు ఉన్నా మా కాన్ఫిడెంట్ ఇప్పుడెలా ఉందో అలా ఉంటుంది please please please ........... నా కొడుకు స్టడీస్ కోసం అమెరికా వెళ్ళాడు - నా కూతురికి పెద్దింటి సంబంధం చూసాను వాళ్లకూ పెద్దమొత్తంలో ఇవ్వాలి . ఎంత ఖర్చు అవుతుందో తెలియదు అని బాధపడుతూ చెప్పారు . 
Like Reply
#40
ఏమాత్రం ఆలోచించకుండా నేను ok నా సర్ అని అడిగాను .
సర్ : పెదాలపై చిరునవ్వుతో మహేష్ నువ్వు అయితే డబల్ ok డబల్ ok అని దేవుణ్ణి ప్రార్థించారు . 
సర్ ............ దేవుళ్లను ప్రార్థించడం వలన ఎటువంటి ప్రతిఫలం ఉండదు . మనం కష్టాన్ని నమ్ముకుందాము . సర్ .......... ఈ విషయాన్ని మనమధ్యనే ఉంచుదాము . కృష్ణ గాడికి బెంగళూరులో జాబ్ చెయ్యడం డ్రీమ్ - డ్రీమ్ కాదు ప్రాణం . ఈ విషయం తెలిస్తే నాకోసం కోరికను అనుచుకుంటారు . వాళ్ళు వాళ్ళ గోల్ ను రీచ్ అయ్యి హ్యాపీగా ఉండాలి అనిచెప్పాను .
సర్ : ప్రామిస్ మహేష్ .......... , మహేష్ .......... నా కొడుకు ఎంతో మీరూ అంతే , మీ నలుగురికి ఇంజనీరింగ్ అయ్యే ఖర్చు నేనే చూసుకుంటాను . ఏలోటూ లేకుండా చూసుకుంటాను థాంక్స్ థాంక్స్ థాంక్యూ soooooo మచ్ మహేష్ అని కౌగిలించుకున్నారు .

చాలా సంతోషం సర్ ......... , నా ఫ్రెండ్స్ ముగ్గురిని మాత్రమే ఇంజనీరింగ్ చదివించండి . నేను ఇక్కడే ఉండాలి కాబట్టి govt కాలేజ్ లో డిగ్రీ అలా అలా పూర్తిచేసేస్తాను . ఈరోజు నుండి నాకు ఈవెంట్స్ గురించి స్టడీ చేయడమే ముఖ్యం . 
సర్ : నీ ఇష్టమే మా ఇష్టం మహేష్ .......... మరి నీ ఫ్రెండ్స్ ను ఎలా కన్విన్స్ చేస్తావు .
అదినాకు వదిలెయ్యండి సర్ నేను చూసుకుంటాను . నా ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ చదవబోతున్నారు మీవలన ఆ సంతోషం చాలు నాకు అని ఆరోజు ఒక ఈవెంట్ సక్సెస్ చేసి అక్కడే భోజనం చేసి అలసిపోయి ఆఫీస్ చేరి పైకి వెళ్ళాము . సర్ మాటిచ్చినట్లుగానే మొత్తం ఇంటిని లగ్జరీగా మార్చేశారు . టీవీ ఫ్రిడ్జ్ బెడ్స్ AC ........... చూసి మా ఆనందానికి అవధులు లేవు . 
సర్ కు బిగ్ బిగ్ థాంక్స్ చెప్పాలిరా ...........
కృష్ణ : అవునవును ......... అని కళ్లపై చేతిని అడ్డుపెట్టుకుని బాత్రూమ్ రా అంటూ బయటకువెళ్ళాడు . 
రేయ్ సూరి , రవి .......... ఎంసెట్ కు నెల మాత్రమే ఉంది . మరొక గంటైనా చదివి పడుకుందాము అని బుక్స్ అందించాను . నేనుకూడా చదువుతున్నట్లు నటించాను .
కృష్ణ :ఫ్రెష్ అయ్యివచ్చి లవ్ యు రా మామా అని ఉద్వేగంతో కౌగిలించుకున్నాడు .
రేయ్ ఏమయ్యిందిరా ...........
ఏమీ లేదు ఏమీ లేదు అని బుక్ తీసుకున్నాడు .

ఎంసెట్ రోజున సర్......... వారి కారులో సెంటర్స్ కు తీసుకెళ్లారు . సర్ కు థాంక్స్ చెప్పి , సర్ అక్కడే ఉంటానంటే మేము వస్తాము సర్ అనిచెప్పి పంపించాము . ఒకరికొకరం all the best చెప్పుకుని దగ్గర దగ్గరలోని కాలేజస్ లోపలికివెళ్లాము . 
పూర్తయిన తరువాత ఒకదగ్గర కలిసి సూపర్ గా రాశాను - ఈజి - కుమ్మేసాను అని ముగ్గురూ నన్ను కౌగిలించుకున్నారు . 
కృష్ణ : రేయ్ నువ్వెలా రాసావో చెప్పలేదు . 
రేయ్ మామా ......... మళ్లీ చెప్పాలారా అని బాధను లోలోపలే దాచేసుకొని సంతోషంతో ముగ్గురినీ కౌగిలించుకున్నాను .
కృష్ణ : వాడు నావైపు డౌట్ గా చూస్తూనే ఉన్నాడు . 
రేయ్ మామా .......... ఆకలేస్తోంది పదండి . బయటే తిని వెళదామా లేక ఇంటికివెళ్లి వండుకుందామా లేక లేక లేక లేక అని అందరూ ఒకేసారి పెదాలపై చిరునవ్వుతో మనకిష్టమైన ప్రాణమైన ప్రపంచంలోనే రుచికరమైన పసందైన మన శరణాలయం భోజనం తిందామా ........... అని హైఫై కొట్టుకుని ఉత్సాహంతో చేరుకున్నాము . 

 వార్డెన్ : మహేష్ కృష్ణ సూరి రవి ........... అనిపిలవడంతో , బుజ్జాయిలు అన్నయ్యలూ .......... అని పరుగునవచ్చారు . చుట్టూ హత్తుకుని అన్నయ్యలూ ....... మీరు పంపిన కొత్తబట్టలలో ఎలాఉన్నాము అని అడిగారు .
వార్డెన్ వైపు చూసాము .
వార్డెన్ : నిన్న మీరు అకౌంట్లోకి డబ్బులు వెయ్యగానే , మీరు పంపించారని అందరికీ బట్టలు బ్యాగ్స్ బుక్స్ తీసుకొచ్చాను .
థాంక్స్ వార్డెన్ ........... అయినా మా పేరు చెప్పాల్సిన అవసరం లేదు . మేము సాయం చెయ్యడం లేదు . మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన మా ప్రాణమైన శరణాలయాన్ని చూసుకోవడం మా బాధ్యత . వార్డెన్ ఆకలేస్తోంది భోజనం చెయ్యొచ్చా ...........
వార్డెన్ : ఇదిగో మహేష్ ......... మీరుకూడా ఈ మాట ఎప్పుడూ అనకూడదు . ఈ శరణాలయం ఎప్పటికీ మీదే , బుజ్జాయిలూ ......... మీ అన్నయ్యలను తీసుకెళ్లి వడ్డించండి అనిచెప్పడంతో వెళ్లి తిని , రేయ్ మామా - రేయ్ మామా ......... ఎన్ని స్టార్ హోటళ్లలో ఎన్ని ఈవెంట్స్ లలో తిన్నాము . ఫైనల్ గా చెబుతున్నాను బెస్ట్ ఫుడ్ బెస్ట్ బూడ్ మనదే మనదే అని నవ్వుకుని ఆవురావురుమంటూ తిన్నాము .

15 రోజులకు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి . సర్ ఇచ్చిన లాప్టాప్ ఓపెన్ చేసి ఫస్ట్ సూరి నెంబర్ ఎంటర్ చేస్తే 25th ర్యాంక్ ........... కంగ్రాట్స్ రా మామా కంగ్రాట్స్ అని కౌగిలించుకున్నాము .
నెక్స్ట్ రవి నెంబర్ ఎంటర్ చేస్తే 50th ర్యాంక్ .......... వాడు గట్టిగా యాహూ అని డాన్స్ లు వేస్తుంటే చూసి ఆనందించాము . 
నెక్స్ట్ కృష్ణగాడి నెంబర్ ఎంటర్ చేస్తే 75th ర్యాంక్ .......... వాడి ఆనందానికి అవధులు లేనట్లు రెండు చేతులూ పైకెత్తి yes yes yes అని ఎంజాయ్ చెయ్యడం చూసి ముగ్గురమూ మూడువైపులా హత్తుకుని కంగ్రాట్స్ చెప్పాము .

సూరి : నాకు 25th - వీడికి 50th - వాడికి - 75th ........... మిగిలినది ఫస్ట్ ర్యాంక్ అది మనవాడిదేరా కంఫర్మ్ , రేయ్ కృష్ణా ......... త్వరగా ఎంటర్ చెయ్యరా........
కృష్ణ : ok ok గయ్స్ అని నావైపు చూసి ఏరా ........... నీకు నీ రిజల్ట్స్ ముందే తెలిసినట్లు అలా ఉన్నావు . మా రిజల్ట్స్ మాత్రం ఉత్కంఠతో చూసి ఎంజాయ్ చేసావు కౌగిలించుకుని ముద్దులుపెట్టావు .
రవి : ఎవరిది వాళ్ళది అంటే టెన్షన్ ఉంటుంది లేరా నువ్వు ఎంటర్ చెయ్యి అనిచెప్పాడు . 
కృష్ణ : నావైపు అనుమానంతో చూస్తూనే ఎంటర్ చేసాడు . ముగ్గురూ ఆతృతతో కమాన్ కమాన్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అని కళ్ళుమూసుకుని ప్రార్థిస్తున్నారు . 

రవి : నోట్ క్వాలిఫైడ్ అని రావడం చూసి , రేయ్ మామా .......... నెంబర్ తప్పుకొట్టావా అని నెత్తిపై మొట్టికాయ వేసాడు . 
సూరి : ఏమైందిరా అని కళ్ళుతెరిచిచూశారు .
కృష్ణ : నా పేరు డీటెయిల్స్ చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళుకార్చి , తలదించుకున్న నా కాలర్ పట్టుకున్నాడు .
సూరి : రేయ్.......... సరిగ్గా నెంబర్ కొట్టరా , ఉండు నేను కొడతాను రేయ్ నెట్ సరిగ్గా లేదా ఏంటి నాట్ క్వాలిఫైడ్ వస్తోంది అని బాధపడుతూ మావైపు చూసాడు .

కృష్ణ : రేయ్ మామా ఎందుకు చేశావురా , అంత తొందరగా ఎందుకు చేసావు అని చెంపలపై ప్రేమతో కొట్టాడు . 
రేయ్ కృష్ణ కృష్ణ ఆపరా ఆపరా ......... అని వచ్చారు . 
కృష్ణ : మనకోసమే వీడు క్వాలిఫై కాలేదురా ..........
సూరి - రవి : ఏమంటున్నావురా .........
కృష్ణ : అవునురా ఇది నిజం . రేయ్ మహేష్ ......... ఆరోజు సర్ మాట్లాడిన మాటలు నేను విన్నానురా ........... , చిన్న సర్ ......... పెద్ద సర్ సంతకం తీసుకురమ్మంటే అక్కడికి వచ్చాను . ఇంజనీరింగ్ అయ్యాక మనం డిస్కస్ చేద్దాము మనలో ఎవరో ఒకరము ఎవరో ఏంటి నేనే ఇక్కడ ఉండిపోవాలనుకున్నాను . ఇంత త్వరగా ఎందుకు చేశావురా ............ మేమంటే ఎందుకురా అంత ప్రాణం . మాకు ఎందుకురా చెప్పలేదు .
ప్రాణం అని నువ్వే అన్నావు కదరా అందుకే చేసాను . అయినా మీరు చేస్తే ఏంటి నేను చేస్తే ఏంటి మనం నలుగురమూ ఒక్కటిరా .......... , ప్రాణంలా కోరుకున్న డ్రీమ్ నెరవేరకపోతే కలిగే బాధ నాకు తెలుసురా ......... మీరు హ్యాపీ అయితే నేను డబల్ హ్యాపీ ..........  
రేయ్ మామా మామా ......... అని ఉద్వేగపు కన్నీళ్ళతో కౌగిలించుకుని , లవ్ యు లవ్ యు లవ్ యు రా మామా ............ , మేముకూడా ఇంజనీరింగ్ చెయ్యము కష్టమో నష్టమో నలుగురమూ పడదాము .
నా ప్రాణమైన మిత్రులారా ........... ఇలా చేస్తారనే చెప్పలేదు . మీరు బెంగళూరులో మీరు కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించాలి అంతే నా మీద ఒట్టు . 
రేయ్ రేయ్ రేయ్ .......... ఆపేంతలో ఒట్టు వేసేసాను .

కృష్ణ : రేయ్ మామా ........... నీకు వైజాగ్ లో ఉండటం ఇష్టం లేదు కదరా అని బాధతో అడిగాడు .
రేయ్ ........... అని ట్రంక్ వైపు చూసి , నా దే ........ కావ్య తిరుపతి వెళ్ళిపోయింది కాబట్టి హాయిగా ఉంటాను , మీరు మాత్రం ఇంజనీరింగ్ కష్టపడి చదివి క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవ్వాలి అదే ఈ మిత్రుడి కోరిక .
లవ్ యు రా మామా .......... అని ముగ్గురూ కళ్ళల్లో చెమ్మతో కౌగిలించుకున్నారు . 
అంతా సర్ చూసుకుంటారని మాటిచ్చారురా ......... 

సర్ : నా ప్రాణం పోయినా మాటతప్పను మహేష్ ........... ముందుగా కంగ్రాట్స్ కృష్ణ , సూరి , రవి . తప్పంతా నాది నన్ను మన్నించండి .
ముగ్గురూ : సర్ .......... అంతటి మాట అని ముందుకువెళ్లి , మీకోసం మా నలుగురమూ ఉండమన్నా ఉండేవాళ్ళము . మీరంటే మాకు అంత గౌరవం .
సర్ : థాంక్స్ కృష్ణా అని నావైపు చూసి కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , మీ అవసరాలు మొత్తం నేనే తీరుస్తాను . మీకు ఎక్కడ చదవాలి అని ఉంటే అక్కడ చదవండి .
Like Reply




Users browsing this thread: 13 Guest(s)