Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
(10-09-2020, 10:54 AM)DVBSPR Wrote: మహేష్ గారు మీ మిగతా రెండు కథలలా కాకుండా ఈ కథను ప్రతీ శనివారం ఒక అప్డేట్ ఉండేలా చూస్తారని ఆశిస్తున్నాను. మీరు అప్డేట్ ఇచ్చిన దగ్గర నుంచి ఒక మూడు రోజులు ఆ ఫీల్ లోనే ఉంటాం, నాలుగో రోజు నుండి మల్లీ అప్డేట్ ఇవ్వమని అడుగుతూనే ఉంటాం, ఎందుకంటే మాకు ఆ ఫీల్ నుంచి అంత తొందరగా కోలుకోవాలని అనిపించదు. అందుకని మీ మిగతా రెండు కథలు ఒక బుధవారం జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం ఒక బుధవారం జీవిత గమ్యం ఉండేలా మధ్యలో శనివారం కానీ ఆదివారం కానీ పేదరాశి పెద్దమ్మ వరం అప్డేట్ ఉండేలా చూస్తారని ఆశిస్తున్నాను. దీనివల్ల మేము ఎప్పుడూ మీ అప్డేట్ యొక్క అద్భుతమైన ఫీల్ నుంచి కోలుకోకుండా ఉంటాం. ఇది నా చిన్న సలహా మాత్రమే మీకు ఎలా మంచిది అనిపిస్తే అలాగే చేయండి.

మనఃస్ఫూర్తిగా హ్రిదయపూర్వక  చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(10-09-2020, 08:02 PM)asiademouser Wrote: హలో మహేష్ గారు మీయొక్క  కొత్త రచన కు నా హృదయపూర్వక అభినందనలు.

నేను శతవిధాలా ప్రయత్నించారు మీ ఈ కొత్త కథను కొన్ని రోజులు చదవకుండా నన్ను నేను నిగ్రహించుకోవడనికి
కానీ అది నా వల్ల సాధ్యపడలేదు ఎందుకనగా మీరు మా యొక్క ప్రియమైన మనసైన రచయిత మీ రచనలు చదవకుండా ఉండటం అంటే అది అసాధ్యమనే చెప్పాలి.

ముందుగా మీ రచనల ద్వారా సమాజానికి కొన్ని ముఖ్య విషయాలు తెలియ చేయాలని మీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను

మీ రచనలను బట్టి నాకు అర్థమైన విషయం మీరు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి మీరు అదృష్టం మరియు ఉచిత ఆశ కంటే వ్యక్తి కష్టాన్ని బాగా నమ్ముతారు అని నేను అనుకుంటున్నాను.
మీరు మీ ప్రతి రచనలలో అనాధాశ్రమం లు మరియు వృద్ధాశ్రమాల గురించి చెబుతున్నారు దీనిని బట్టి మీరు ప్రతి ఒక్కరిని తోచిన మరియు సాధ్యమైన సహకారాన్ని అటువంటి పేదవాళ్ళకి అందించాలని కోరుకుంటున్నారు అనుకుంటున్నాను (మీ అంత కాకపోయినా నేను నా చేతనయిన ఒక చిరు సహాయాన్ని ఒక ఆశ్రమానికి అందిస్తున్నాము)

మీరు మీ రచనల ద్వారా  సమాజాన్ని మరియు స్త్రీలను గౌరవించాలి అని సూచిస్తున్నారు ఇది నిజంగా అభినందనీయం

మీరు మీ యొక్క రచనల ద్వారా ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా కష్టపడి ఎదగాలని సూచిస్తున్నారు. మన కష్టం ఎప్పుడూ వృధాగా పోదు అది మనకి ఎలాగైనా సహాయపడుతుందని మీరు పదే పదే గుర్తు చేస్తున్నారు.

మహేష్ గారు మీరు నాకు నచ్చిన అతిముఖ్యమైన గుణం మీరు మీ రచనలను తెలుగులో అందిస్తున్నారు. తెలుగు నాకు చాలా ఇష్టమైన మరియు నా మాతృభాష నేను నా మాతృభాషలో రచనలను చదవటం చాలా ఇష్టపడతాను. కారణం మనము ఏ భాషలో చదివిన చివరికి మన మాతృభాషలో అర్థం కోసమే వెతుక్కుంటాం అందువలన ఇతర భాషలను గౌరవించి అవసరమైన విధంగా నేర్చుకోవాలని మరియు మాతృభాషను రక్షించుకోవాలని ఆశిస్తున్నాను. కానీ ప్రస్తుతం మన గవర్నమెంటు మన ముందు తరాల కి మన ఈ మాతృభాష అయిన తెలుగును దూరం చేయాలనే చూస్తుంది అందుకు చాలా చాలా బాధపడుతున్నాను.

ఇక్కడ మనం అందరం మన మాతృభాష  వలనే కలుసుకున్నాము అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.

ఇతర రచనలు కంటే నాకు మీ రచనలు కొంచం ప్రత్యేకం. ఇతర  రచనల ద్వారా కొన్ని క్షణాల క్షణికానందం ని మాత్రమే పొందుతాను కానీ మీ రచనల ద్వారా ఆనందం మరియు  మన సంతృప్తి కలుగుతాయి.

మీ కథ నన్ను చదువు సమయంలో నన్ను నేను ఆ సందర్భం  యొక్క పాత్రలు ఊహించుకున్నాను. తద్వారా ఆ యొక్క సందర్భంలో ని ఆనందము బాధ మరియు ప్రేమ ప్రతి ఒక్క కోణాన్ని మనసారా ఆస్వాదిస్తాను.

రచన మనిషి యొక్క స్వభావాన్ని మరియు సమాజాన్ని మార్చగలదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను

మీరు సమాజాన్ని  ఆలోచింపజేసే గొప్ప పుస్తకం రాయాలని మరియు ఆ పుస్తకం ప్రచురణ అవ్వాలని తద్వారా ద్వారా మీకు కీర్తి ప్రతిష్టలను రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

మీరు మా మనసు కవి , మీరు జీవితాంతం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీయొక్క ఈ మూడో రచన కూడా  విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఒక చిన్న గమనిక మీరు ప్రతివారం ఇక్కడ ఒక అప్డేట్ తో పాటు బుధవారం మిగిలిన రెండు కథలు అప్డేట్స్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క మూడో కథ వలన మీరు మిగిలిన రెండు కథల్లో మరొక వారం అధిక సమయాన్ని తీసుకోవద్దని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను

మీరు మా విన్నపాన్ని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను

మీకు వీలైతే మీయొక్క అప్డేట్స్ విధానాన్ని మాకు తెలియపరచగలరు అని కోరుకుంటున్నాను

మనఃస్ఫూర్తిగా హ్రిదయపూర్వక  చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(10-09-2020, 10:52 PM)sweetdumbu Wrote: WOW..కొత్త స్టోరీ..మహేష్ బ్రో

ఇపుడే చూసాను...
Completed..

సూపర్ starting..
కేక అప్డేట్..

మహేష్ కావ్య..ఎలా vuntado మీ కధనం లో...మేము ఆస్వాదించాలి.. ఎప్పటిలాగా

మీ రెండు కథలు లాగా ఈ స్టోరీ కోసం మమల్ని మరింత రంజింపచేయాలి అని కోరుకుంటూ..

Thank you సో much ఫర్ న్యూ స్టోరీ and సూపర్ అప్డేట్..మహేశ్ బ్రో

మనఃస్ఫూర్తిగా హ్రిదయపూర్వక  చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(10-09-2020, 11:03 PM)raki3969 Wrote: Super story. Nice update.

Thankyou sooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(11-09-2020, 08:12 AM)Chanduking Wrote: Super starting bro we are expecting more more updates bro

Thankyou soooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(11-09-2020, 04:14 PM)luckyrockskdp Wrote: కొత్త కథ చాలా బాగుంది, ఇక నుంచి మరో మలుపు ఉంటుందా.. మీ update కోసం waiting

చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(11-09-2020, 08:13 PM)Tom cruise Wrote: kastha update ivvandi masteruuu...mi narration chala baguntundi sir

Thankyou sooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(11-09-2020, 10:34 PM)gangaraju Wrote: Super update mahesh Garu

చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(12-09-2020, 01:25 PM)Freyr Wrote: Superb update bro

Thankyou soooooo much bro .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(12-09-2020, 03:55 PM)Durga prasad Wrote: మహేష్ గారు మీ 3 కదా కూడా చాలా అద్భుతంగా ఉంది కళ్ళంట ఆనంద భాష్పాలు తెప్పించారు సార్ మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మీరు చాలా గొప్ప వ్యక్తి నేను ఇప్పటివరకు చాలా కథలు చదివాను ఆ కథలు రాయడం లో నెంబర్ 1 మీరే మహేష్ గారు మీ గురించి ఇంకా ఎలా  చెప్పాలో నాకు తెలియట్లేదు సార్ మీ కథ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మీరే ఎప్పటికీ నెంబర్ వన్ మహేష్ గారు

మనఃస్ఫూర్తిగా హ్రిదయపూర్వక  చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(05-09-2020, 06:17 PM)DVBSPR Wrote: మొదటి అప్డేట్ లోనే ఎన్నో భావోద్వేగాలను పరిచయం చేశారు చాలా బాగుంది మిత్రమా మీ అప్డేట్

మనఃస్ఫూర్తిగా హ్రిదయపూర్వక  చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
కిందపడిన మొబైల్ అందుకొని చూసి జేబులోపెట్టుకున్నాను . సెక్యూరిటీ చెప్పినట్లు కావ్యకు రోజూ దెబ్బలు అన్నమాట అని నవ్వుకుని yes అంటూ ఫోజ్ ఇచ్చాను . నా పెదాలపై నవ్వు ఆగడం లేదు . తగిన శాస్తి జరిగింది - నా ఈగో పూర్తిగా satisfy అయ్యింది యాహూ ............ అని డాన్స్ చేస్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను .

లిఫ్ట్ కోసం సర్ వేచిచూస్తుండటం చూసాను . నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన సర్ కు ఏదోవిధంగా థాంక్స్ చెప్పాలని , సర్ సర్ ........ sorry సర్ మిమ్మల్ని సర్ అని గౌరవించక తప్పుచేసాను . నా పేరు మహేష్ .......... మీ ప్రక్కింట్లోనే ఉంటాను . ఒక గొప్ప సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ ఇంటిపక్కనే ఉంటున్నందుకు చాలా గర్వపడుతున్నాను . థాంక్యూ sooooo మచ్ సర్ ...........
రేయ్ ........... ఫక్ ఆఫ్ అని వేలుని చూయించి లిఫ్ట్ రాగానే ఎక్కారు . నేను లోపలికి వెళ్లబోతే , ఆపి రేయ్ నా గురించి నీకు తెలిసినట్లు లేదు . ఇలా మాట్లాడి లాకప్ లో బొక్కలిరగకుండా ఉన్న ఫస్ట్ వ్యక్తివి నువ్వే , షూట్ చేసేస్తాను . షిట్ షిట్ ఈ CBI నాకొడుకులు రివాల్వర్ లాక్కున్నారు అని వేలితో కాల్చినట్లు సైగచేసి లిఫ్ట్ బటన్ నొక్కడంతో క్లోజ్ అయ్యింది . 
 ఈయనతో కాస్త జాగ్రత్తగా ఉండాలి , ఏమీ పర్లేదు సర్ ఉదయం ఉదయమే పిచ్చ కిక్కు ఇచ్చారు థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని సెల్యూట్ చేసి ప్రక్కనే వరుసగా ఉన్న 5 లిఫ్ట్ లనూ ప్రెస్ చేసి ఒక లిఫ్ట్ లో కిందకువచ్చి , దూరం నుండే కారు అన్లాక్ చేసి వెళ్లికూర్చుని ఆఫీస్ కు చేరుకున్నాను . 

సర్ : నాకొసమే బయటే ఎదురుచూస్తూ ......... దిగగానే కౌగిలించుకుని , మహేష్ ముందుగా sorry .......... నిన్న ఎయిర్పోర్ట్ లో నన్ను బాగా తిట్టుకుని ఉంటారే .......
నో సర్ .......... మా డ్రీమ్స్ కలలో కూడా నెరవేరుతాయని మేము అనుకోలేదు . మీ వలన నలుగురి డ్రీమ్స్ తీరబోతున్నాయి లేదు లేదు తీరాయి అని నలుగురమూ కౌగిలించుకుని ఉద్వేగానికి లోనయ్యాము . రేయ్ మామా ......... సర్ ఉన్నారనే దైర్యంతోనే వదిలి వెళుతున్నామురా అన్నారు . 
సర్ : టచ్ చేశారు మహేష్ .......... అని మళ్ళీ కౌగిలించుకున్నారు . వెంకట్ అని పిలిచి నా పే స్లిప్ తెప్పించి అందించారు . మహేష్ ........ నీకోసం ప్రత్యేకమైన రూమ్ కేటాయించాము అని స్వయంగా లోపలికి తీసుకెళ్లారు . 
లోపలికివెళ్లగానే మిగలిన సర్ వాళ్ళు చప్పట్లతో ఆహ్వానించారు . అందరూ చేతులుకలిపి all the best మరియు కంగ్రాట్స్ చెప్పారు . 
చిన్న సర్ : మహేష్ .......... ఈరోజు నుండీ నువ్వుకూడా సర్ వే ..........
సర్ ............ ఈ రూమ్ నాకువద్దేవద్దు . నేనెప్పుడూ మీకిందనే అని బయటకువచ్చేసాను .
అందరూ సంతోషించి బయటకువచ్చి , మహేష్ .......... అప్పుడూ చెప్పాము ఇప్పుడూ చెబుతున్నాము ఫ్యూచర్ లోకూడా చెబుతాము . మీరు అడుగుపెట్టాకనే మా లైఫ్ టర్న్ అయ్యింది . మీ లక్ కష్టం తొడవ్వకబోతే మేము అక్కడే ఉండేవాళ్ళము అని ఖచ్చితంగా చెప్పగలము - నువ్వు ఆ స్థాయిని వద్దంటే మేముకూడా నీతోపాటు బయటే ఉంటాము అనిచెప్పారు . 
సర్ లక్ - గాడ్ ..........లను నేను నమ్మను . మీరు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో చూసాము . మీరు హ్యాపీ అయితే సంతోషంగా ఒప్పుకుంటాను అని లోపలికివెళ్ళాను . 
అందరూ లోపలికివచ్చి చప్పట్లు కొట్టి నన్ను నా కుర్చీలో కూర్చోబెట్టారు . ఇక నుండీ ఈవెంట్స్ బుక్ చేసుకోవడం డేట్స్ అడ్జస్ట్ చేయడమే నీ డ్యూటీ ........... ఫీల్డ్ లోకివెళ్లి పనిచేయాల్సిన అవసరం లేదు - అందరినీ మ్యానేజ్ చేయడమే అని భుజం తట్టి బయటకువెళ్తుండగానే ల్యాండ్ లైన్ కు కాల్ వచ్చింది . 
హలో అని విని సంతోషించి స్పీకర్ on చేసాను . వైజాగ్ లోని వన్ ఆఫ్ ద మిలియనీర్ నుండి బిగ్గెస్ట్ ఈవెంట్ బుకింగ్ కోసం వచ్చిన కాల్ అని తెలిసి , రేయ్ రేయ్ ......... అని సర్ వాళ్ళు కౌగిలించుకుని సంతోషిస్తున్న........ నిమిషాల్లోనే 3 ఈవెంట్స్ బుక్ అవ్వడంతో , 
సర్ : మహేష్ ......... ఇప్పుడైనా నమ్ముతావా .......... ఫ్రెండ్స్ we did రైట్ థింగ్ ఇక మనకు రెస్ట్ ఉండదు స్టాఫ్ ను పెంచాలి అని సంతోషంతో బయటకువెళ్లారు . 

లేవగానే నా ఇగో సంతృప్తి చెందింది . ఇక్కడ ఆఫీస్ లో బిగ్గెస్ట్ ప్రమోషన్ విత్ బిగ్గెస్ట్ సాలరీ ......... , వరుస బిగ్ బిగ్ ఈవెంట్స్ నాతోపాటు సర్ వాళ్ళు హ్యాపీ అని ఆనందించి వెంటనే వాళ్లకు కాల్ చెయ్యాలి అనేంతలో , నా మొబైల్ మ్రోగింది చూస్తే కృష్ణగాడు . Wow .......... అని వెంటనే ఎత్తి అమితమైన ఆనందంతో రేయ్ అంతా ok కదా అని అడిగాను . 
కృష్ణ : బెంగళూరు చేరగానే నీ నిద్ర డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక మెసేజ్ పెట్టామురా - ఆఫీస్ కు వెళ్లేముంధూ మెసేజ్ పెట్టాము . రిప్లై రాకపోవడంతో అలసిపోయావు కదా ఇంకా నిద్రపోతున్నావని ఆఫీస్ లో జాయిన్ అయ్యాక కాల్ చేసాము . 
ఎలా ఉందిరా .............
సూరి : ఇంద్ర భవనం రా మామా .......... నెక్స్ట్ వీకెండ్ ఇక్కడికి వచ్చెయ్యి . నువ్వు కొరినట్లుగా కొలీగ్ ద్వారా అపార్ట్మెంట్ కూడా దొరికింది . సాయంత్రం అపార్ట్మెంట్ చూసి కాల్ చేస్తాము . 
కంగ్రాట్స్ my ఫ్రెండ్స్ ........... ఈ వీకెండ్ పెద్ద ఈవెంట్ ఉంది వీలుచూసుకుని వస్తానులే అని కావ్య మ్యాటర్ తప్ప ఆఫీస్ విషయాలను చెప్పాను . 
ముగ్గురూ : సూపర్ గుడ్ న్యూస్ చెప్పావురా మామా .......... కంగ్రాట్స్ . మనం కలవకపోయినా వీడియో కాల్లో మాట్లాడుకుందాములే సాయంత్రం చేస్తాము బై అని కట్ చేశారు . 
ఈరోజు ఒకఠితరువాత మరొక గుడ్ న్యూస్ అని పొంగిపోయాను . నా వర్క్ పూర్తిచేస్తూనే మధ్యమధ్యలో కళ్ళుమూసుకుని సాయంత్రం వరకూ పదేపదే కావ్యకు పడిన దెబ్బను తలుచుకుని లోలోపలే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను .

సర్ నా రూంలోకివచ్చి మహేష్ .......... ఈవెంట్స్ బుకింగ్ 4 గంటలవరకే , ఆరోజు ఈవెంట్ ఉంటే 4 గంటల తరువాత ఉండొచ్చు లేకపోతే వెళ్లిపోవచ్చు .
OK సర్ 10 మినిట్స్ డేటా ఎంటర్ చెయ్యాలి .
సర్ : నేను వెళుతున్నాను , వర్క్ పూర్తవగానే వెళ్లిపో అని చేతులుకలిపి వెళ్లిపోయారు .
ఇక్కడే ఉండి వేరే సర్ వాళ్లకు హెల్ప్ చెయ్యాలి అని ఉన్నా ......... కావ్య తినే మరొకదెబ్బనైనా చూడాలని 5 మినిట్స్ లో పూర్తిచేసి , కార్ కీస్ మొబైల్ అందుకుని వెంకట్ అన్నకు బై చెప్పేసి ఇంటికి బయలుదేరాను . ఫ్రెష్ అయ్యాక తినిచ్చని పిజ్జా తీసుకుని ఫ్రెండ్స్ కు కాల్ చేసి మాట్లాడుతూ అపార్ట్మెంట్ చేరుకున్నాను . కారుని పార్కింగ్ లో ఉంచి పిజ్జా అందుకుని లాక్ చేసి , అపార్ట్మెంట్ ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలను చూసి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందిస్తూ నా బిల్డింగ్ వైపు నడిచాను. 

ఇంతలో ఏడుపు వినిపించడంతో చూస్తే ఐదారేళ్లు ఉన్న బుజ్జిపాప బుజ్జి బాబు , ఇద్దరూ......... ఎండలోనే నిలబడి ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ ఏడుస్తున్నారు .
పడటం దెబ్బలేమైనా తగిలాయేమోనని అందుకే ఏడుస్తున్నారేమోనని పరుగునవెళ్లి మోకాళ్లపై కూర్చుని పిజ్జా ప్రక్కన ఉంచేసి , పాప - బాబు ......... ఏమైంది ఆడుకుంటూ పడ్డారా అని చేతులనూ కాళ్ళనూ చూసి దెబ్బలుకానీ తరుచుకోవడం కానీ ఎలాంటిదీ లేకపోవడంతో , ఎందుకు బుజ్జాయిలూ ఏడుస్తున్నారు అని ఆప్యాయంగా బుగ్గలను స్పృశిస్తూ అడిగాను . ఇద్దరూ ఎంత ముద్దొస్తున్నారో మాటల్లో చెప్పలేను - ఏడుపు ఆపేసి చిన్న నవ్వు నవ్వినా అలా చూస్తూ ఉండిపోతారు - ఇద్దరి ముఖ కవళికలు ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది .

ఎడారిలో ఒయాసిస్ కనబడితే ఎంత ఆనందం వేస్తుందో అంతలా బుజ్జాయిలకు నేనెవరో - నాకు బుజ్జాయిలెవరో తెలియకపోయినా ............
ఇద్దరూ ఒకేసారి అన్నయ్యా - అన్నయ్యా ........... అంటూ ఏడుస్తూనే చెరొకవైపు హత్తుకున్నారు . వాళ్ళు వెక్కివెక్కిఏడుస్తూ వణుకుతుండటం తెలుస్తోంది . అంటే బుజ్జాయిలిద్దరూ ఒంటరివాళ్ళు ఓదార్పు కోరుకుంటున్నారని వాళ్ళ కౌగిలింత ఘాడతాను బట్టి నా మనసుకు తెలుస్తోంది . 
ఏమైంది బుజ్జాయిలూ - ఎందుకు ఏడుస్తున్నారు ............ అన్నయ్యా - అన్నయ్యా అని ఆప్యాయతతో పిలిచారు కదా నాకు చెప్పొచ్చుకదా అని ఎంత ఓదార్చినా వదలకుండా మరింత మరింత హత్తుకుంటున్నారు .
ఆకలేస్తోందా .......... పిజ్జా తింటారా ..........
ఊహూ ...........
హమ్మయ్యా .......... మాట్లాడారు సంతోషం , అయినా ఈ అపార్ట్మెంట్ లో ఆకలి అన్న మాట అర్థ అయినా తెలుసుండదులే , కిందా పడలేదు - ఆకలీ వెయ్యడం లేదు ....... నాకు ప్రాబ్లం ఏమిటన్నది తెలిస్తేనే కదా నేనేమైనా చెయ్యగలను . Please please చెప్పండి బుజ్జాయిలూ ........... 
మాకు ఇలానే బాగుంది అన్నట్లు నా షర్ట్ చిరిగిపోయేలా కౌగిలించుకుని దుఃఖిస్తూ ఏడుస్తున్నారు . 
బుజ్జాయిలూ ......... ఈ బిల్డింగ్ లలో మీ ఇల్లు ఎక్కడో చెప్పండి తీసుకెళతాను అని పిజ్జా చేతిలోకి తీసుకుని ఎత్తుకున్నాను . 
వద్దు వద్దు అన్నయ్యా వద్దు కొద్దిసేపైనా మిమ్మల్ని కౌగిలించుకొనివ్వండి . ఇంత హాయిని సేఫ్టీ ని పొందడం ఇదే తొలిసారి please please అని ముద్దుముద్దుమాటలు ఆ మాటలలో బాధ దుఃఖం తెలిసి నేనే బాధపడ్డాను .
ఇంటికి కూడా వద్దు అంటున్నారు అంటే ఇంటిలో సమస్య అయి ఉంటుంది అని అపార్ట్మెంట్ పార్క్ లోని చెట్టుకింద ఉన్న బెంచ్ పై కూర్చుని ఓదారుస్తున్నాను . 

బుజ్జాయిలూ ......... ఎండలో ఏడ్చి ఏడ్చి స్కూల్ డ్రెస్ మొత్తం చెమటలతో తడిచిపోయింది నీళ్లయినా తాగుతారా ........ లేకపోతే స్పృహతప్పి పడిపోతారు . 
వెక్కివెక్కిఏడుస్తూ ......... తాగుతాము అన్నయ్యా ........ అనిచెప్పి మళ్లీ గట్టిగా చుట్టేశారు . 
నీళ్లు ఎక్కడ ఉంటాయో తెలియక ఎదురుగా మెయిన్ గేట్ దగ్గర కనిపిస్తున్న సెక్యూరిటీని పిలిచాను . నిన్న సహాయం చేసిన సెక్యూరిటీ పరుగునవచ్చి సర్ మీరా ........... చెప్పండి అన్నాడు . 
అన్నా .......... పిల్లలకు దాహం వేస్తోంది నీళ్లు ఎక్కడ ఉంటాయి ఈ అపార్ట్మెంట్ లో అని అడిగాను . 
సెక్యూరిటీ : ప్రతీ బిల్డింగ్ ఎంట్రన్స్ రైట్ సైడ్ పెద్ద ఫిల్టర్ వాటర్ ఫ్రిడ్జ్ ఉంది సర్ ........
థాంక్స్ చెప్పి లేవబోతుంటే , సర్ ఇక్కడే ఉండండి క్షణాల్లో తీసుకొస్తాను అని పరిగెత్తి రెండు పెద్ద గ్లాసుల్లో తీసుకొచ్చారు . 

థాంక్స్ అన్నా .......... అని అందుకొని ప్రక్కనే ఉంచి , బుజ్జాయిలూ బుజ్జాయిలూ .......... నీళ్లు తాగాక మళ్లీ ఏడవండి మిమ్మల్ని ఆపను అని వీపుపై జోకొట్టి , అన్నా ......... పిల్లలెవరో 15 నిమిషాల నుండీ ఏడుస్తున్నారు వీళ్ళ పేరెంట్స్ ఎవరో మీకు తెలుసా ........... 
బుజ్జాయిలిద్దరూ .......... ఏడుస్తూనే నా తొడలపై కూర్చుని అందించిన పెద్ద గ్లాస్ వాటర్ ను దప్పికగా ఉన్నట్లు మొత్తం తాగేసి నా చేతులలో గ్లాసెస్ ఉంచేసి మళ్లీ ఏడుస్తూ నా గుండెలపై చేరిపోయారు .

బుజ్జాయిలిద్దరినీ చూసి 15 నిమిషాలుగా కాదు సర్ .......... పాపం వీళ్ళు ఇక్కడకువచ్చి సంవత్సరం పైనే అయ్యింది . వచ్చిన రోజు నుండీ ఇద్దరి పెదాలపై చిరునవ్వు చూడలేదంటే నమ్మండి . 6 నెలలవరకూ అపార్ట్మెంట్ పిల్లలతోనైనా కాసేపు ఆడుకుని ఆనందించేవారు ఏ క్షణమైతే వీళ్ళ నాన్న గురించి పేపర్లో వచ్చిందో ఆ రోజు నుండీ ఏడుపు తప్ప నవ్వు ఆనందం దాదాపుగా మాయమైపోయాయి .

ఈఆరు నెలల్లో ఈ పిల్లలను ఆప్యాయంగా పలకరించిన మొదటివ్యక్తి మీరే సర్ అంటే నమ్ముతారా .........  

What ఏమిటన్నయ్యా ......... మీరు అనేది అని షాక్ అయిపోయాను . 
సెక్యూరిటీ : అవును సర్ ......... అంతా వీళ్ళ నాన్న చేసిన చేస్తున్న అన్యాయం అరాచకాలు వల్లనే ........... 
అన్నా .......... నాకేమీ అర్థం కావడం లేదు . బుజ్జాయిల గురించి మొత్తం తెలుసుకోవాలని ఉంది . ఈ పిజ్జా అందుకుని చెప్పండి అని ఓపెన్ చేసాను . పిజ్జా వాసన గుప్పుమనడంతో , వెక్కి వెక్కి ఏడుస్తూనే బుజ్జాయిలిద్దరూ కూడా ఒక్కొక్క ముక్కను అందుకుని మళ్లీ హత్తుకొని నా వెనుక తింటున్నారు . 
సెక్యూరిటీ వద్దన్నా అందించాను . తీసుకుని తింటూ నా ఎదురుగా ఉన్న బండపై కూర్చున్నాడు . 

సెక్యూరిటీ : వీళ్ళ నాన్న పేరు చెబితే మీకే అర్థమైపోతుంది సర్ .......... గోవర్ధన్ . 
ఎక్కడో విన్నాను కానీ గుర్తురావడం లేదు . 
సెక్యూరిటీ : సర్ .......... నిన్న కృష్ణ సర్ చెప్పారు మీరు పుట్టి పెరిగింది వైజాగ్ లోనే అని , ఇప్పుడు వైజాగ్ లో గోవర్ధన్ పేరు తెలియని - చుట్టూ చూసి వాడిని అసహ్యించుకోని వ్యక్తి అంటూ ఉండరు పరమ దుర్మార్గుడు సర్ .......... ఇంకా అర్థం కానట్లు చూస్తుంటే , సర్ మీరు పేపర్ - న్యూస్ చూడరా .......... మా స్లమ్స్ లోకూడా వాడిని తిట్టని వారుండరు . 
ఒకరి వలన చూడటం మానేసాను అన్నా .......... చెప్పండి . 
నేను చెప్పడం కంటే మీరు చూసి చదివితేనే అర్థమౌతుంది ఒక్కనిమిషం సర్ అని వెళ్లబోతోంటే మరొక పీస్ అందించాను . 
సెక్యూరిటీ : థాంక్స్ సర్ .......... సూపర్ గా ఉంది అని తింటూ పరిగెత్తాడు . 

బుజ్జాయిలూ ........... మొత్తం సెక్యూరిటీ అన్నయ్యనే తినేసేలా ఉన్నాడు అన్నానో లేదో , ఇద్దరూ మరొక పీస్ లను అందుకుని హత్తుకుని తిన్నారు . ఏడుపు ఆపడంతో ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టాను . ఎందుకో తెలియదు బుజ్జాయిలంటే అనురాగం క్షణక్షణానికీ పెరిగిపోతోంది . 6 నెలలు ఎవ్వరూ మాట్లాడలేదా ............ ఏడారిలోనే ఉన్నారన్నమాట - ఒయాసిస్ నేనే .............

 6 నెలల పేపర్ లనూ తెస్తున్నట్లు భుజంపై ఎత్తుకుని వస్తున్నాడు . 
సెక్యూరిటీ : సర్ ......... అపార్ట్మెంట్ లో సంవత్సరపు పేపర్స్ భద్రపరుస్తాము అని నా ముందు నేలపై ఉంచి , మొదటి పేపర్ అందుకుని అందించి అంతా మొదలయ్యింది ఇక్కడ నుండే సర్ ............
అందుకుని హెడ్లైన్స్ చదివాను - తిరుపతిలోలానే మళ్లీ వైజాగ్ లో మొదలైన అరాచకాలు - అన్నింటిలో CI గోవర్ధన్ హస్తం ........ అని ఫోటో కూడా ఉండటం చూసి , అన్నా ......... మా ఇంటిప్రక్కన సర్ .
సెక్యూరిటీ : నేనే మీకు ఇంటిని చూయించి నేనే మరిచిపోయాను అని నెత్తిపై కొట్టుకున్నాడు . సర్ .......... నేనుకూడా ఈ 6 నెలల్లో ఆ వింగ్ కు వెళ్ళింది నిన్ననే అందుకే గుర్తులేదు sorry సర్ .......... అయినా వాడు సర్ ఏంటి సర్ రాక్షసుడు - ఈ పేపర్ చూడండి . 

డ్రగ్స్ , అమ్మాయిల ట్రాఫికింగ్ గ్యాంగ్ లకు సహాయం అందిస్తున్నారా ? లేక గోవర్ధనే నాయకుడా ........... , ఇలాంటి ఘోరమైన తప్పులు చెయ్యడం వల్లనే రాష్ట్ర సెక్యూరిటీ అధికారి బాస్ డీజీపీ చివరి వార్నింగ్ తీసుకుని వైజాగ్ ట్రాన్సర్ అయివచ్చినా మారని గోవర్ధన్ ............ , ఇప్పటికే వందలమందిని ముంబై దుబాయ్ లకు అక్రమంగా అమాయకమైన అమ్మాయిలను చేరుస్తున్నారని ఆరోపణ - ఒకటి ఏమిటి వైజాగ్ లో జరిగిన ప్రతి నేరంలో హస్తం . వందలకోట్ల నల్లడబ్బును ఎక్కడ దాచాడు - గోవర్ధన్ పై CBI enquiry ........... సెక్యూరిటీ అధికారి కావడం వలన ఆలస్యమవుతున్న విచారణ . ఒక సెక్యూరిటీ అధికారి అయ్యుండి రౌడీలు గూండాలతో చేతులుకలిపడంతో వైజాగ్ అమ్మాయిల్లో భద్రత ఇంటిలోనుండి కాలేజ్ కు వెళ్ళడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు ...........
మరొక పేపర్ మరొక పేపర్ .......... చూస్తూ మరొక పేపర్ అందుకోబోతుంటే , 
సెక్యూరిటీ : సర్ ........... ఒక సెక్యూరిటీ అధికారి కాదు కాదు ఒక వ్యక్తి ఎలాంటి పనులైతే చెయ్యకూడదో అన్నీ చేస్తున్నాడు సర్ .......... ఇన్ని పేపర్లలో - న్యూస్ లలో చూయించినా మారడం లేదు . సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ఇంటిని మొత్తం వెతికారు ఆడబ్బంతా ఎక్కడ దాచాడో ............
బుజ్జాయిలు : ఇంటి గోడలలో అన్నయ్యా ........ అని గుసగుసలాడారు . 

ఇంతటి దుర్మార్గుడా ........... 
అవును సర్ , రోజుకొక లంజను వాళ్ళు దొరక్కపోతే పాపం ఏ ఇంటిపై కన్నుపడితే ఆ ఇంటి ముందు ఆగడం లోపలకువెళ్లి సెక్యూరిటీ అధికారి అని బెదిరించి .......... చెప్పడానికి కూడా మాటలు రావు సర్ ..........ఒక్కొక్కసారి ఇంటికి కూడా తూగుతూ అమ్మాయిలను లంజలను పిలుచుకునివస్తాడు . ఇదేమిటని ఏకంగా స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ప్రశ్నించిన అపార్ట్మెంట్ మేనేజర్ ఏమైపోయాడో తెలియదు . మొదట ఆరు నెలలు వీడు సెక్యూరిటీ అధికారి కాబట్టి దేనికైనా అవసరం అవుతుందని మాటలుకలిపిన ప్రతిఒక్కరి ఇళ్ళూ ........ CBI అండర్ లో ఉంది . అర్ధరాత్రికూడా తలుపులుతట్టి ప్రూఫ్స్ కోసం వెతకడానికి రావడంతో వాడినే కాదు వాడి పిల్లలైన పాపానికి ఈ పిల్లలను కూడా కలవద్దని వాళ్ళ పిల్లలకు దెబ్బలుకొట్టిమరీ .......... అందుకే పాపం పిల్లలు ఒంటరివారైపోయారు . 

అన్నా ......... మరి బుజ్జాయిల అమ్మ కా ..........
దేవత సర్ .......... అపార్ట్మెంట్ వచ్చినరోజు చూసాము మళ్లీ ఒకసారి చూసాము అంతే , ఒకప్పటి మిస్ వైజాగ్ సర్ ......... మీరు పేపర్ చదవరు కదా అందుకే చెబుతున్నాను . సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండిపోయారు . నాకు తెలిసి పిల్లలకోసం జీవిస్తున్నారనుకుంటాను . వాడి టార్చర్ ఎలా అనుభవిస్తున్నారో ఏంటో ఆ దేవుడే కాపాడాలి . టార్చర్ అంటే భార్యాభర్తల అపోహలు కాదు సర్ ....... వాడు ఒక సైకో ...........
అవునన్నట్లు బుజ్జాయిలిద్దరూ ......... భయంతో వణుకుతూ మళ్లీ ఏడవటం మొదలెట్టి గట్టిగా హత్తుకున్నారు . 
వాళ్ళ వైబ్రేషన్ మనసును హృదయాన్ని చలింపజేస్తోంది .
సెక్యూరిటీ : పాపం తల్లి బాధను కనులారా చూసినట్లున్నారు అందుకే తల్లికోసమ్ ఏడుస్తున్నారు - వాడిని గుర్తుచేసుకుని భయపడుతున్నారు . పిల్లలని కూడా చూడకుండా కొడతాడు సర్ - పిల్లల గురించి ఏమాత్రం పట్టించుకోడు . సర్ ........... ఇదిచెబితే మీ హృదయం బాధతో కదిలిపోతుంది - 6 నెలల నుండీ రోజూ స్కూల్ బస్ లోకూడా పిల్లలు ఎక్కించుకోవడం లేదు సర్ - ఈ పిల్లలు ఎక్కితే మా పిల్లలను దింపేస్తాము అని చెప్పడంతో , రోజూ రెండు కిలోమీటర్లు బుజ్జిపాదాలతో వెనుక బ్యాగ్ చేతిలో లంచ్ బాక్స్ లతో నడుచుకుంటూ వెళ్లి నడుచుకుంటూ వస్తున్నారు . మీ అమ్మకు ...........అని అడిగితే ,
అంకుల్ .......... వద్దు , అమ్మకున్న బాధలు కష్టాలు చాలు అని ఎంత కష్టమైనా వెళుతున్నారు సర్ .......... ఇంతలో కార్ హార్న్ వినిపించడంతో .......... సర్ ఒక్కటి మాత్రం చెప్పగలను మనిషి రూపంలో పుట్టిన నీచుడు రాక్షసుకు దుర్మార్గుడు .......... ఎన్నిపేర్లు ఉంటే అన్నీ సర్ ........ తరువాత కలుస్తాను అని మెయిన్ గేట్ దగ్గరకు వెళ్ళిపోయాడు .
Like Reply
వెంటనే బుజ్జాయిల పాదాలను చూడబోతే బొక్కలుపడిన షూస్ - చిరిగిపోయిన సాక్స్ లను వేరుచేసి చూస్తే అరి పాదాలు కందిపోయాయి - బాబు భుజం పై మోసిన బ్యాగుల చారలు - అరచేతులపై లంచ్ బాక్స్ లు మోసినందుకు ఎర్రటి గీతలు చూసి నా హృదయం చలించిపోయి కన్నీళ్ల రూపంలో వచ్చేసాయి . 
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా .......... ఏడుస్తున్నారా ? , మాకోసం ఏడ్చిన తొలివ్యక్తి మీరే లవ్ యు అన్నయ్యా ......... అని హత్తుకున్నారు . అన్నయ్యా - అన్నయ్యా ........... మా ఫ్రెండ్స్ మరియు అక్కయ్యలు అన్నయ్యలు మాతో ఆడుకోమని తోసేయ్యడంతో అమ్మకు వెళ్ళిచెబితే కన్నీళ్ళతో బాధపడి , తల్లులూ ........ మనం ఆడుకుందాము అని ఫస్ట్ టైం కిందకువచ్చారు - అది వాడు చూసి........ 
బుజ్జాయిలూ .......... వాడు అంటే మీ నా ...........
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ........... వాడితో దెబ్బలైనా తింటాము కానీ అమ్మను చేతులతో కర్రతో కొట్టి వాతలు కూడా అంటూ ఏడుస్తూ ......... వాడిని అలా ఎప్పటికీ పిలవము . అమ్మ కింద వాటిలో మమ్మల్ని ఆడిస్తుండటం చూసి , పిల్లలందరూ చూస్తుండగానే కాలితో కొట్టి అని కన్నీళ్ళతో మరింత దుఃఖిస్తూ అమ్మను కాలితో కొట్టి జుట్టుపట్టుకుని ఇంట్లోకి లాక్కునివెళ్లి కిందకు తోసేసి , పెళ్లికి ముందు నువ్వు మిస్ వైజాగ్ అవ్వవచ్చు ఇప్పుడు నా బానిసవు ...........ఇంటి నుండి అడుగు బయటపెట్టకూడదు - శోభనం రక్తం వచ్చింది ....... అని మాట్లాడాడు మాకు అర్థం కాలేదు ........ రక్తం వచ్చింది కాబట్టి నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు లేకపోతే ఎప్పుడో నా మొదటి పెళ్ళాం దగ్గరికి పంపించేవాడిని అని ఇక్కడ ఇక్కడ ఎదపై సిగరెట్ తో కాల్చాడు . పాపం అమ్మ ఆరోజంతా ఏడుస్తూనే ఉన్నారు . ఆ క్షణం వరకూ తెలియదు రెండో పెళ్లి చేసుకున్నాడని - మొదటి పెళ్ళాన్ని చంపేసాడని . 

కొన్ని నిమిషాలు ఆగకుండా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి . కావ్య .......... మనసులో నా చెంపలపై చెల్లుమనిపించుకుని నా దేవత నా దేవతను ఉదయం వాడు కొడుతుంటే ఆనందించాను - నేను అసలు మనిషినేనా .......... రేయ్ నీయబ్బా అనాధనాకొడకా జరిగిన దానిలో నీ దేవత తప్పు ఏముందిరా పగ పెంచుకున్నావు - ఊహ తెలిసినప్పటినుండీ పూజించే అమ్మవారినీ దూరం పెట్టేశావు . నీదేవత ఇలా ఉందంటే నువ్వుకూడా కారణమే - నీదేవతను కొట్టాడని ఆ దుర్మార్గుడికి థాంక్స్ చెప్పావు కదరా ............ అని కొట్టుకున్నాను . నీకూ వాడికి తేడా ఉందని నిరూపించుకో అని నా మనసు తెలిపింది .
ఒక్క చాన్స్ ఒకే ఒక్క చాన్స్ అని పిల్లల బుగ్గలపై ముద్దులుపెట్టి అమ్మవారిని ప్రార్థించాను . 
అంతే చెట్టుకు కలసిన పూలు తథాస్తు అంటూ రాలడంతో ఆనందించాను . అమ్మా .......... నాదేవత నిజంగా దేవతనే పవిత్రంగా జీవించింది . అమ్మా .......... నా ప్రాణాలైనా ఫణంగా పెట్టి నాదేవత పెదాలపై చిరునవ్వు చిగురించేలా చేస్తాను . పిల్లల పెదాలపై ఆనందం నవ్వు నింపి అందరు పిల్లలతోపాటు ఆడుకునేలా అధిచూసి నాదేవత పరవశించిపోయేలా చేస్తాను .

బుజ్జాయిలూ ........... చివరగా మూడు పీస్ లు ఉన్నాయి . ముగ్గురమూ ఒక్కొక్కటి రెడీ 1 2 ........3 అనగానే చిన్నగా నవ్వి ఒక్కొక్క పిజ్జా పీస్ అందుకుని , అన్నయ్యా అన్నయ్యా .......... ముందు మీకు అని అందించారు . 
మీ అమ్మకూడా ఇంతే బుజ్జాయిలూ పెళ్లిలోకూడా ముందు మాకు పంపించి తరువాతనే గెస్ట్స్ ............ రేయ్ ఇవన్నీ ఎలా మరిచిపోయావురా అని మనసులో నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను .
అమ్మా దేవతా ........... బుజ్జాయిల అమ్మ పెదాలపై మనసారా స్వచ్ఛమైన చిరునవ్వులు చిందింపజేసిన తరువాత నన్ను ఎలా శిక్షించాలని ఉంటే అలా శిక్షించండి కావాలంటే నా ప్రాణాలనే తీసేసుకోండి అని పశ్చాత్తాపం కోరాను . 

లవ్ యు .......... sorry sorry థాంక్స్ బుజ్జాయిలూ ......... అని ముద్దుపెట్టబోయి నా తెలివితక్కువతనానికి సిగ్గుపడి తలదించుకుని బాధపడ్డాను .
బుజ్జాయిలు : అన్నయ్యా .......... మీవల్ల చిరునవ్వు నవ్వాము . లవ్ యు అన్నయ్యా .......... అని చెరొక బుగ్గపై ముద్దుపెట్టి , మీరుకూడా లవ్ యు అనే అనాలి ముద్దులూ పెట్టొచ్చు అని నవ్వుతూ చెప్పారు . 

అంతలోనే సెక్యూరిటీ వచ్చి సర్ .......... నేను చూస్తున్నది నిజమేనా ? పిల్లలు నవ్వుతున్నారు అని ఆనందించాడు . సర్...... మేడం దేవత అయితే మీరు దేవుడు సర్ - వాడు రాక్షసుడు . 
బుజ్జాయిలు : మా అన్నయ్యవల్లనే నవ్వాము అని మళ్ళీ నవ్వి ముద్దులుపెట్టారు .
నేనూ రక్షసున్నే అన్నా ............ కానీ నా తప్పును తెలుసుకున్నాను అని మనసులో అనుకుని , ఏమనుకోకుండా బుజ్జాయిలకు మరొక్క గ్లాస్ ..........నీళ్లు .
సెక్యూరిటీ : సర్ .......... కలిసిన అర గంటలోనే పిల్లలను నవ్వించారు . మీరు అడిగితే ఏమైనా చేస్తాను అని గ్లాస్ లు అందుకొని పరుగుతీసాడు .

బుజ్జాయిలతోపాటు ఒక పిజ్జా పీస్ తిన్నాను . ఇద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకొని బుజ్జాయిలూ ........... ఆర్డర్ వెయ్యండి , ఏమిచేస్తే మీరు ఇలా సంతోషంతో నవ్వుతూ ఉంటారు . కళ్ళల్లో చెమ్మతో నేను పరాయివాణ్ణే ...........
బుజ్జాయిలిద్దరూ బుజ్జిచేతులతో నా నోటిని ఆపి కన్నీళ్లను తుడిచి , ఎందుకో తెలియదు మీరు మాకు బాగా నచ్చారు . మీరు పరాయివారు కాదు మాకు అన్నయ్య మీతో కాకుంటే ఎవరితో చెబుతాము అని నా కళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ మాకున్న కోరికలు రెండే రెండు .
ఒకటి : మా అమ్మ సంతోషంగా ఉండాలి .
రెండు : అదిగో అక్కడ ఆడుకుంటున్న మా ఫ్రెండ్స్ - అక్కయ్యలు - అన్నయ్యలతో ఆడుకోవాలి .
నా ప్రాణాలు అర్పించైనా మీ కోరికలు తీరుస్తాను బుజ్జాయిలూ అని మనసులో అనుకుని ఇద్దరి నుదుటిపై ఆప్యాయతతో చెరొకముద్దుపెట్టి , అమ్మా .......... బుజ్జాయిల కోరికలే నాకోరికలు . ఆ కోరికలకు నా ప్రాణం తీసేసుకోండి . వేరే ఎవరైనా అయ్యుంటే నేనే రంగంలోకి దిగేవాణ్ణి నాకేమీ భయం లేదు - యూనిఫామ్ +రౌడీలు గూండాల తో యుద్ధం కాబట్టి సహాయం కోరుతున్నాను . బుజ్జాయిల మరియు నాదేవత .......... కాదు కాదు దేవత అంటే " నా " కాదు మన్నించండి ముగ్గురూ సాఫీగా జీవనం కొనసాగించాలి . ఒక్కసారి ఒకే ఒక్కసారి నా కనులారా తిలకించి ప్రాణాలు పోయినా సంతోషమే అని ప్రార్థించాను . నాకోసం ప్రార్థించడం లేదు బుజ్జాయిలంటే దేవతలతో సమానం కదా వాళ్లకోసం .............అని ఇద్దరినీ ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను . 
సెక్యూరిటీ అన్న......... నీళ్లు తీసుకురావడంతో ఇద్దరూ తాగి అన్నయ్యా అన్నయ్యా ......... బుజ్జికడుపులు నిండిపోయాయి . మీరూ తాగండి అని సగం సగం అందించబోయి , ఎంగిలి వద్దులే అన్నయ్యా అని చల్లబోతే రెండుచేతులతో అందుకొని ఒకేసారి తాగేసాను . 
బుజ్జాయిలు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుని లవ్ యు అన్నయ్యా ......... అయితే ఇకనుండి ఎంగిలి అన్న పదం కూడా లేదు మన మధ్యలో అని బుగ్గలపై ముద్దులుపెట్టారు . 
బుజ్జాయిలూ .......... ఇవే నీళ్లు మా ఫ్రెండ్ బాటిల్లో తీసుకొస్తే తాగాను అంత రుచిలేదు - మీరు తాగాక మరింత తియ్యదనం లవ్ యు అని హత్తుకుని పదండి అక్కడే మీ ఫ్రెండ్స్ తో మనమూ ఆడుకుందాము . అన్నా ......... ఎంతత్వరగా వీలైతే అంత త్వరగా రెండు వేలకు పెద్ద పెద్ద చాక్లెట్ లు - ఐస్ క్రీమ్ లు తీసుకొస్తారా .........
సెక్యూరిటీ : ప్రక్కనే సర్ ........... చిటికెలో తీసుకొస్తాను అని అందుకుని పరిగెత్తాడు .

బుజ్జాయిలూ .......... నా ........ అని మనసులో నాలుగుదెబ్బలు వేసుకుని దేవత గురించి అదే మీ అమ్మగురించి చెప్పండి .

బుజ్జాయిల ముఖం విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది - పెదాలపై కళ్ళల్లో అంతులేని ఆనందం - అమ్మ అని ప్రాణం కంటే ఎక్కువగా తియ్యదనంతో పిలిచారు . అమ్మకు మేమంటే ప్రాణం - మేమే సర్వస్వం - మాకోసమే జీవిస్తున్నారని మాకు తెలుసు - మమ్మల్ని ఏలోటు లేకుండా చూసుకోవాలన్నదే ఏకైక కోరిక , కానీ పాపం ఏమీ చేయలేక బాధపడని క్షణమంటూ లేదు - కళ్ళల్లో ఎప్పుడూ కన్నీళ్లే - మేము ఉన్నంతసేపూ అన్నీ మరిచిపోయి సంతోషన్గా ఉండి లేకపోయినా నటించి అయినా మమ్మల్ని నవ్వించాలి అనుకుంటారు పాపం కానీ కన్నీళ్లు ఆగితేనేకదా అని బుజ్జాయిలు , బుజ్జాయిలతోపాటు నేనూ హృదయం చంచిపోయినట్లు కారుతున్న కన్నీళ్లను బుజ్జాయిలకు కనిపించకుండా తుడిచేసుకున్నాను . 
అమ్మకు మమ్మల్ని రోజూ బయటకు తీసుకెళ్లి బీచ్ , జూ , పార్క్స్ , టెంపుల్స్ ......... ఇలా వైజాగ్ లో ఉన్న అన్నీ ప్రదేశాలకూ తీసుకెళ్లాలని మా ఆనందాన్ని చూసి మురిసిపోవాలని కోరిక . మేము నాలుగేళ్లు తిరుపతిలో ఉన్నప్పటికీ కొండ ఎక్కి దర్శనం చేసుకోలేదు . మాకు దర్శనం చేయించి లడ్డూ ప్రసాదం ప్రేమతో తినిపించాలని కోరిక . గుమ్మం దాటితేనే కొడతాడు వాడు అని కోపంతో చెప్పారు . అమ్మను ఎలా కొట్టాడో అలా కొట్టాలని ఉంది వాడిని అది మా మూడవ కోరిక అన్నయ్యా ............ 
అమ్మ కొత్తచీర కట్టుకున్నదే చూడలేదు మేము . 
మీరుకూడా కదా బుజ్జాయిలూ ........... అని ప్రాణంలా హత్తుకుని , వైజాగ్ లో వచ్చిన లేటెస్ట్ ఫాషన్స్ అన్నీ మీ అమ్మ పాదాల దగ్గరికి చేరేవి అలాంటిది అని బాధపడ్డాను . 

పండుగల రోజున అమ్మ సంబరంలా జరుపుకోవాలనుకుంటే ఎవరెవరినో అసహ్యమైన అంటీలను వాళ్ళను పిలుచుకొనివచ్చి తాగి అమ్మతో సేవ చేయించుకుంటాడు వాడు . మాకు వచ్చే కోపానికి ......... కానీ ఏమీ చెయ్యలేకపోతున్నాము అని నా గుండెలపై చేరారు .

సెక్యూరిటీ అన్న రెండు బాక్స్ లను ఉత్సాహంతో తీసుకొచ్చాడు . థాంక్స్ అన్నా అని బుజ్జాయిలను ఎత్తుకుని లేచి అందుకోబోయాను . 
సెక్యూరిటీ : సర్ ........  మీరు బుజ్జాయిలను ఎత్తుకోండి నేను వెనుకే తీసుకొస్తానుకదా అనిచెప్పడంతో ,
మళ్లీ థాంక్స్ చెప్పి బుజ్జాయిలూ .......... పదండి ఇప్పుడు ఎందుకు మీ ఫ్రెండ్స్ మీతో ఆడుకోరో చూద్దాము అని ముద్దులుపెట్టి , అన్నిరకాల పిల్లలు సంతోషంతో ఆడుకునే ఆటస్థలంలోకి వెళ్ళాము . 

పదుల సంఖ్యలో పిల్లలు పరిగెడుతూ - దుంకుతూ - జారుతూ - ఊయలలో ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు . 
గట్టిగా hi hi hi ........... పిల్లలూ - బుజ్జాయిలూ .......... ఒక్కనిమిషం ఓకేఒక్కనిమిషం తరువాత మీ ఇష్టమొచ్చినట్లుగా ఆడుకోవచ్చు - పిల్లలు ఆడుతుంటే చూడటం అంటే నాకు చాలా చాలా ఇష్టం - నేనుకూడా పిల్లాన్నయిపోతాను . థాంక్స్ ........... for సైలెన్స్ , నా పేరు మహేష్ - ఈ ముద్దు ముద్దు బుజ్జాయిల పేర్లు ........ అవునూ my డియరెస్ట్ బుజ్జి ఏంజెల్స్ మీ పేర్లు ఏంటి అని అడిగాను . 
బుజ్జి బుజ్జినవ్వులతో ......... మహేష్ అన్నయ్యా....... నా పేరు కీర్తి - అన్నయ్య పేరు బిస్వాస్ , మహేష్ అన్నయ్యా .......నా పేరు బిస్వాస్ - అక్కయ్య పేరు కీర్తి అని ఇద్దరూ చెప్పారు . 
అర్థమైంది అర్థమైంది మీరిద్దరూ ట్విన్స్ అన్నమాట . కీర్తి - బిస్వాస్ ........ i am మహేష్ అని హైఫై చూపించాను .
తెలుసు అన్నయ్యా ..........
మీకెలా తెలుసు ? 
ఇంతకుముందే కదా మా ఫ్రెండ్స్ అన్నయ్యలు అక్కయ్యలకు చెప్పారు అని బుజ్జినవ్వులతో నా బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టారు . 

Sorr ........... లవ్ యు లవ్ యు ........ నేనే చెప్పి నేనే మరిచిపోయాను అని ఇద్దరి నెత్తిపై సున్నితంగా టచ్ చేసి నవ్వుకున్నాము . 
పిల్లలూ .......... చూడండి మీరే విన్నారుకదా మీరంటే మీ ఫ్రెండ్స్ కీర్తి - బిస్వాస్ లకు ఎంత ఇష్టమో ........... మీతోపాటు ఆడుకొనివ్వచ్చుకదా , తప్పు చేసింది వీళ్ళ నా ......... 
ఇద్దరూ నావైపు కోపంతో చూడటంతో ..........
నా...........  తోనే ఆపేసి , లవ్ యు లవ్ యు అని ఇద్దరి బుగ్గలపై ముద్దుపెట్టి నవ్వించి , సో ........... మీ ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చుకదా .......... మీతో ఆడుకోవాలంటే వీళ్లకు ఎంతిష్టమో - బుజ్జాయిలూ .......... వెళ్ళండి వెళ్లి ఆడుకోండి అని కిందకు దించేంతలో అందరూ ఆటస్థలం నుండి వెళ్లిపోతున్నారు . 
బుజ్జాయిలిద్దరూ తలదించుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ బాధపడుతున్నారు . 

పిల్లలూ పిల్లలూ ........ మీకో బంపర్ ఆఫర్ , మీ బుజ్జి ఫ్రెండ్స్ తో ఆడుకుంటే , అన్నయ్యా అని బాక్స్ లను బుజ్జాయిల ముందు ఓపెన్ చేయించి , ఇదిగో ఈ చాక్లెట్ లు మరియు ఐస్ క్రీమ్స్ వారికే , ఎంచక్కా ఒక చేతిలో చాక్లెట్ మరొక చేతితో చల్లని ఐస్ క్రీమ్ తింటూ ఆడుకోవచ్చు అని ఆక్ట్ చేస్తూ చూయించాను . 
సగం మంది వెళ్లిపోయినా సగం మంది ఆశతో వచ్చారు . కీర్తి - బిస్వాస్ రండి ఆడుకుందాము అని పిలిచారు .
బుజ్జాయిల పెదాలపై చిరునవ్వు చిగురించి లవ్ యు అన్నయ్యా .......... అని హత్తుకున్నారు . 

మోకాళ్లపై కూర్చుని , కీర్తి - బిస్వాస్ .......... మీ ఫ్రెండ్స్ అక్కా అన్నయ్యలకు ఐస్ క్రీమ్ చాక్లెట్ లు వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని ఇవ్వండి అనిచెప్పాను .
లవ్ యు అన్నయ్యా ........ అని స్వచ్ఛమైన నవ్వులతో ఒకేసారి ముద్దులుపెట్టి , అంతులేని ఆనందంతో హుషారుగా వెళ్లి కీర్తి చాక్లెట్ లు - బిస్వాస్ ఐస్ క్రీమ్ లు పంచారు . 
థాంక్స్ కీర్తి - థాంక్స్ బిస్వాస్ .........  అని ఐస్ క్రీమ్ ను మ్మ్మ్....మ్మ్మ్..... అంటూ అందరూ సంతోషంతో తినడం చూసి , అంతులేని ఆనందంతో పొంగిపోతున్న బుజ్జాయిలిద్దరినీ చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో చెరొక కోన్ ఐస్ క్రీమ్ అందించాను . 
మాకు మీ ముద్దులు చాలు అని గుండెలపైకి చేరి మురిసిపోతున్నారు . 
కీర్తి - బిస్వాస్ ....... అని ఆప్యాయంగా ఇద్దరి నుదుటిపై చెరొకముద్దుపెట్టి , మీ ఫ్రెండ్స్ తోపాటు తింటూ వాళ్ళను నాకు పరిచయం చెయ్యరా ......... అని అడిగాను . 
ఐస్ క్రీమ్ తిని చల్లగా తియ్యగా ఉంది . అని తమ ఫ్రెండ్స్ దగ్గరికివెళ్లి అన్నయ్యా ........ అని ఒక్కొక్కరినే పరిచయం చేసారు . అందరికీ థాంక్స్ మరియు hi చెప్పాను .

అంతలో వెళ్లిన సగం మంది పిల్లలు ఏకంగా చాలామంది అంటీలతో వచ్చారు . కీర్తి - బిస్వాస్ చుట్టూ నవ్వుతూ తింటున్న సగం ఐస్ క్రీమ్ లను మరియు చేతులలోని చాక్లెట్ లను లాక్కుని కిందపడేసి , చెప్పాము కదా ఆ పిల్లలిద్దరితో ఆడుకోకూడదని అని కొట్టుకుంటూ జరజరా చేతులను పట్టుకుని లాక్కుంటూ వెళ్లిపోయారు . 

అన్నయ్యా - అన్నయ్యా .......... అంటూ ఏడుస్తూ వచ్చి నా గుండెలపై చేరిపోయారు .ఇద్దరికీ మరింత దుఃఖం వచ్చేస్తోంది . ఏమిచెయ్యాలో ఇప్పుడు ఎలా ఓదార్చాలో తెలియక వాళ్ళతోపాటు నేనూ కన్నీటిని కార్చాను .
సెక్యూరిటీ : సర్ .......... ఇది ఇంతే మార్చలేము , sorry అనిచెప్పి వెళ్లిపోయాడు .
Like Reply
నా కన్నీళ్లను తుడుచుకుఞ్జ ఇద్దరి వీపులపై స్పృశిస్తూ ఓదార్చి , కీర్తి - బిస్వాస్ ......... ఈరోజు మీ బుజ్జిచేతులతో అందుకొని సగం తింటారు . త్వరలో మీతోపాటు పూర్తిగా తిని ఆడుకుంటారు . ఏడవకండి ఏడవకండి అని ఇద్దరి కన్నీళ్ళనూ తుడిచి ముద్దులుపెట్టి నాతో ఆదుకుంటారా అని అడిగాను . 
లవ్ యు అన్నయ్యా - లవ్ యు అన్నయ్యా ............ అని పెదాలపై చిరునవ్వుతో హత్తుకున్నారు . 
ముందు ఈ మిగిలిన చాక్లెట్ లను మా బుజ్జాయిలను నన్ను ఇక్కడ ఉంటున్న అందరినీ సేఫ్ గా ఉంచడం కోసం రాత్రీపగలూ మేల్కొని డ్యూటీ చేస్తున్న మన సెక్యూరిటీకి మరియు అపార్ట్మెంట్స్ maintanance బాయ్స్ కు ఇద్దామా అని అడిగాను . 

ఊ ఊ ఊ .......... అంటూ తలలు ఊపారు . 
లవ్ యు .......... మీ ఇద్దరి బుజ్జిచేతులూ మీ అమ్మలానే సహాయం చెయ్యడంలో పైననే ఉంటాయి అని సంతోషంతో ముద్దులుపెట్టి , కీర్తి - బిస్వాస్ ......... మీకు ఎంత శక్తి ఉందో చూస్తాను అని పావు వంతు పావు వంతు చాక్లెట్ మరియు ఐస్ క్రీమ్స్ ఉన్న బాక్స్ లను ఇద్దరి తలపై నెమ్మదిగా ఉంచాను . 
బుజ్జిబుజ్జినవ్వులతో పడిపోకుండా బుజ్జిచేతులతో పట్టుకుని , చూసావా అన్నయ్యా - అన్నయ్యా .......... మాకు చాలా శక్తి ఉంది అని ఉత్సాహంతో ముందుకు నడిచారు . 
ఇద్దరిపై బరువులు పడకుండా ఒక్కొక్క చేతితో కాస్త ఎత్తిపట్టుకుని , అమ్మో ........ మా బుజ్జాయిలిద్దరూ కొండనే ఎత్తగలరు అని నవ్వుకుంటూ మెయిన్ గేట్ దగ్గరికివెళ్లి రెండుచేతులతో పెట్టుకున్నాను . 
బుజ్జాయిలు తమబుజ్జిచేతులతో చెరొకటి అందుకుని సెక్యూరిటీ మరియు బాయ్స్ కు చిరునవ్వులు చిందిస్తూ అందించి వచ్చి , ఆయాసం మరియు ఆనందం కలగలిపి అన్నయ్యా అన్నయ్యా .......... అందరికీ ఇచ్చేసాము . అందరూ థాంక్స్ చెప్పి మా చేతులకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నారు - ఎంత ఆనందం వేసిందో లవ్ యు అన్నయ్యా .......... అంత ఎత్తు ఉన్నారు కాస్త వొంగండి అని బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టి చప్పట్లుకొడుతూ గెంతులువెయ్యడం చూసి సెక్యూరిటీ బాయ్స్ కళ్ళల్లో చెమ్మ చేరింది . 
కీర్తి - బిస్వాస్ ......... కొన్నిమాత్రమే మిగిలాయి , మనం తింటూ అన్ని ఆటలూ ఆడుకుందాము  . 
అన్నయ్యా - అన్నయ్యా ......... అంత బరువు మీరు మొయ్యలేరు మా తలలపై ఉంచండి అని ముసిముసినవ్వులు నవ్వడం చూసి , అమ్మో అమ్మో ........ ఈ బరువు మొయ్యడం నావల్లకాదు బుజ్జాయిలూ please please హెల్ప్ చేస్తారా అని అడిగాను . 
ఇద్దరూ మరింత నవ్వుకుని సరే సరే అని చేతులు చూయించడంతో తలలపై ఉంచాను . ఏమాత్రం బరువులేనట్లు మోస్తూ ఎవరు ఫస్ట్ అని బుజ్జిబుజ్జికాళ్ళతో పరుగులు తీశారు .
నేను ఫస్ట్ నేను ఫస్ట్ అంటూ అతినెమ్మదిగా వెనుకే పరిగెడుతూ జాగ్రత్త కీర్తి జాగ్రత్త బిస్వాస్ అని చెబుతూ వెళ్ళాను .

ప్లే గ్రౌండ్ చేరుకుని బాక్స్ లను కింద ఉంచి మేమే ఫస్ట్ మీ మీ ఫస్ట్ అని చేతులుపైకెత్తి కేరింతలువేసి , ఒక్కక్క ఐస్ క్రీమ్ అందుకున్నారు . 
అమ్మో అమ్మో ......... పరుగులో కూడా నెంబర్ వన్ అని ఇద్దరినీ అమాంతం ఎత్తుకుని చుట్టూ తిప్పాను . 
అన్నయ్యా - అన్నయ్యా ........... అని ఐస్ క్రీమ్స్ నా నోటికి అందించారు . 
ఒక్కసారిగా నా కళ్లల్లో కన్నీళ్లు రావడం చూసి బాధపడబోతుంటే , 
కీర్తి - బిస్వాస్ ఇవి కన్నీళ్లు కాదు ఆనందబాస్పాలు ఇంత ప్రేమను చూడటం ఫస్ట్ టైం అని మ్మ్మ్....మ్మ్మ్....... అంటూ సగం తిన్నాను . నేను తిన్నదే ఇద్దరూ తినబోతే ఎంగిలి అని ఆపాను . 
అన్నయ్యా - అన్నయ్యా ......... మరిచిపోయారా అని ముద్దులుపెట్టి మొత్తం తినేసి ఇంతకుముందు కంటే ఇదే బాగుంది అని నా మాటలే నాకుచెప్పి నవ్వడం చూసి , లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టి , ఇద్దరినీ ఎత్తుకొనివెల్లి ఒకరివెనుక మరొకరిని జారుడు బళ్లపై ఉంచి చేతులను పట్టుకున్నాను . 
అన్నయ్యా .......... మాకు భయం లేదు మీరు చివరన ఉండి పట్టుకోండి అనిచెప్పారు.
జాగ్రత్త జాగ్రత్త అని వెనుకకు చూస్తూనే వెళ్ళాను .
ఉమ్మా ఉమ్మా .......... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సుయ్యిమంటూ చిరునవ్వులు చిందిస్తూ పై నుండి జారి అన్నయ్యా అన్నయ్యా .......... నా గుండెలపై ఒకరి వెనుక మరొకరు చేరిపోయారు .

అన్నయ్యా .......... మీరు ఇక్కడే ఉండండి మేమే ఎక్కి జారుతాము అని iron నిచ్చెన ఎక్కుతుంటే వెళ్లి వెనుకే చేతులు రెడీగా ఉంచి నిలబడ్డాను . 
ఇద్దరూ కిందకుదిగి నా చేతులపై బుజ్జిబుజ్జిచేతులతో కొట్టి , చెప్పాముకదా అక్కడే ఉండాలని వెళ్ళండి అని ఆర్డర్ వెయ్యడంతో , జాగ్రత్త జాగ్రత్త అంటూ ఏక్షణమైనా రెడీగా ఉంటూ వెళ్లి చివరన నిలబడ్డాను .
ఇద్దరూ కోతులు ఎక్కినట్లు అక్కయ్యా - అన్నయ్యా ......... చిరునవ్వులు చిందిస్తూ ఎక్కి సర్రున కిందకు జారి , వొంగి పట్టుకోగానే నా బుగ్గలపై ముద్దులుపెట్టి మళ్లీ మళ్లీ ఎక్కి జారి తనివితీరినట్లు ఇక చాలు అన్నయ్యా .......... నెక్స్ట్ ఊయల అని నా చేతులను పట్టుకుని లాక్కునివెళ్లారు . 
ఇద్దరినీ కూర్చోబెట్టి చేతులతో గట్టి ..........
ఉమ్మా ఉమ్మా .......... మాకు తెలుసు అన్నయ్యా అన్నయ్యా ......... గట్టిగా ఊపండి ఊపండి అని ఉత్సాహంతో చెప్పారు . 
బుజ్జాయిలూ .......... చూసారా ఎవ్వరూ లేరు ఈ ప్లే గ్రౌండ్ కు మా బిస్వాస్ బుజ్జిరాజు - మా బుజ్జి కీర్తి బుజ్జిరాణీ ........... రాజు రాణి ఆడుకునే సమయంలో అందరూ ఇలా సైడ్ అవ్వాల్సిందే అని నెమ్మదిగా చెరొకచేతితో ఊపాను .

యాహూ .......... నేను రాజు - నేను రాణి అని అపార్ట్మెంట్ లోకి వెళ్లిపోయిన పిల్లలకు వినిపించేలా ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా కేకలువేశారు . 
ఇద్దరిముందుకువచ్చి అమ్మో అమ్మో ........ మా బుజ్జాయిల నోళ్లు పెద్దవే అని చెవులను మూసుకోవడం చూసి నవ్వుకుని , అన్నయ్యా అన్నయ్యా ......... గట్టిగా అని చెప్పాము కదా............
బుజ్జాయిలూ ........... నాకు భయమేస్తోంది . 
Please please అన్నయ్యా అన్నయ్యా .......... చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నామో , 
ఉమ్మా ......... అని బుజ్జి చేతులపై ముద్దులుపెట్టి మీడియం గా ఊపాను . 
యాహూ యాహూ .......... అన్నయ్యా అన్నయ్యా ......... గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది అని సంతోషంతో కేకలువేస్తూ ఎంజాయ్ చేశారు . 

నెక్స్ట్ ఏ గేమ్ అని అడిగాను . 
అన్నయ్యా ........... ఇవికాకుండా వేరే ఆడదాము . దాగుడుమూతలు ..........
అయితే నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ అని కర్చీఫ్ తీసాను . 
కిందకూర్చోండి మరి అని అందుకుని కనిపించేలా కట్టారు . ముందుకువచ్చి ఇవి ఎన్ని అని వేళ్ళను చూయించి అడిగారు . బుజ్జాయిల సేఫ్టీ ముఖ్యం కాబట్టి అపద్దo చెప్పక తప్పలేదు . ఒకటి చూపిస్తే ఐదు అని - ఐదు చూయిస్తే ఒకటి అని చెప్పాను . 
గుడ్ అని ఇద్దరూ బుగ్గలపై ముద్దులుపెట్టి లేపి నన్ను చుట్లు తిప్పి పట్టుకోండి చూద్దాము అని నవ్వుతూ అటూ ఇటూ తిరిగేస్తున్నారు .
బుజ్జాయిలూ .......... అంత గట్టిగా నవ్వితే తొందరగా దొరికిపోతారు .
వెంటనే నోటిని చేతులతో మూసుకుని నన్ను వెనుక వెనుక టచ్ చేస్తూ ఆటపట్టించారు . కొద్దిసేపు దొరకనట్లు ఆక్ట్ చేసి మళ్లీ గట్టిగా నవ్వగానే ఇద్దరినీ పట్టేసి ఎత్తుకుని , చెప్పానా చెప్పానా ......... నవ్వితే పట్టేసుకుంటాను అని . 
అయ్యో అయ్యో ......... అని ఫీల్ అయ్యారు . 
నెక్స్ట్ నేను అని కీర్తి ముద్దుపెట్టి చెప్పడంతో ఇద్దరినీ కిందకుదించి గంతలుకట్టి వేళ్ళతో పరీక్షించి చుట్టూ తిప్పి వదిలాము . 
బుజ్జిఅన్నయ్యా - అన్నయ్యా .......... ఎక్కడ ఎక్కడ అంటూ బుజ్జిబుజ్జి కాళ్లతో మా నవ్వులవైపు వస్తోంది . 
అలా వచ్చిన ప్రతిసారీ నే కీర్తి బుగ్గపై ముద్దుపెట్టడం చూసి , బస్వాస్ కూడా ముద్దులుపెడుతూ దొరికిపోయాడు . దొరికాడు దొరికాడు అని కర్చీఫ్ తీసి ఇప్పుడు  బుజ్జిఅన్నయ్య అని ఆడుకున్నాము . నెక్స్ట్ వీరివీరిగుమ్మడిపండు వీరి పేరేమిటి - దొంగ సెక్యూరిటీ అధికారి ......... మళ్లీ ప్లే గ్రౌండ్ లోని ఆటలను ఆడుతూ ఐస్ క్రీమ్స్ తింటూ సంతోషంతో ఆడుతూ బుజ్జాయిల ఆనందాన్ని చిరునవ్వులను చూసి పరవశించి సమయాన్నే మరిచిపోయాము . చీకటికూడా పడిపోయింది .

అన్నయ్యా ......... చీకటి అవుతోంది అని నాచేతికున్న వాచ్ చూసి 7 గంటలా ......... రోజూ 6 గంటలకే వెళ్లిపోతాము అమ్మ కంగారుపడుతుంటారు , వెళతాము అన్నయ్యా .......... అనిచెప్పారు .
బాక్స్ లలో చూసి అయ్యో ఐస్ క్రీమ్స్ అయిపోయాయే అని బాధపడుతున్నాను . 
అన్నయ్యా - అన్నయ్యా ......... చాక్లెట్ లు మరియు ఐస్ క్రీమ్స్ తో కడుపునిండిపోయింది ఇక మాకు చాలు ............ అని సంతోషంతో బదులిచ్చారు .
మరి మీ అమ్మకు వద్దా ......... అన్నాను .
ఇద్దరి కళ్ళల్లో చెమ్మతో , లవ్ యు అన్నయ్యా - లవ్ యు అన్నయ్యా ........... ఈ ఆనందంలో ఒక్కటికూడా ఉంచక మొత్తం మేమే తినేసాము . అమ్మ గురించే మరిచిపోయాము అని తలదించుకుని బాధపడుతున్నారు .
Like Reply
బుజ్జాయిలూ ......... త్వరగా షాప్ కు వెళ్లి తీసుకొద్దామా అన్నాను . 
అన్నయ్యా - అన్నయ్యా .......... అంటూ ఆనందంతో నన్ను గట్టిగా హత్తుకున్నారు . 
ఇద్దరినీ హుమ్మ్ ......... అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తూ బయటకు నడిచి , కీర్తి ........ మీ అమ్మకు మీరు తిన్నట్లుగానే కోన్ ఐస్ క్రీమ్ కావాలా ....... లేక స్పెషల్ ఐస్ క్రీమ్ కావాలా అన్నాను . 
మా అమ్మ వెరీ వెరీ స్పెషల్ అన్నయ్యా ..........
నాకు కూడా బుజ్జాయిలూ అని మనసులో అనుకుని ముద్దులుపెడుతూ దగ్గరలోని ఐస్ క్రీమ్ షాప్ చేరుకున్నాము . లోపలికివెళ్లి ఇద్దరినీ టేబుల్ పై కూర్చోబెట్టి మెనూ కార్డ్ అందించి , మీ అమ్మకోసం స్పెషల్ సెలెక్ట్ చెయ్యండి అని చైర్లో కూర్చున్నాను .

బుజ్జాయిలిద్దరికీ ......... ఫస్ట్ లి ఉన్న costly ఐస్ క్రీమ్స్ నచ్చినప్పటికీ రేట్ చూసి వెంటనే తక్కువ రేట్ ఐస్ క్రీమ్స్ పేజీకి వెళ్లారు .
మా బుజ్జాయిలు బంగారం అని చెరొకముద్దుపెట్టి , ఫస్ట్ పేజీ ఓపెన్ చేసి వీటిలో అన్నాను .
ఇద్దరి కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి . ఇద్దరూ ఓకేదానిపై వేలుని పెట్టి అన్నయ్యా అన్నయ్యా ......... ఇది అని చూయించారు . చాలా costly కూడా అన్నయ్యా 999/-.
బుజ్జాయిలూ .......... ఇది వద్దా ఇది వద్దా అని 1500/- 1600 /- ఐస్ క్రీమ్స్ వైపు చూయించాను .
నాకళ్ళల్లోకే ఆరాధనతో చూసి , ఏమైంది అనగానే సంతోషంతో ముద్దులుపెట్టి , మాకు ఇదే ఇదే నచ్చింది . అమ్మకు పింక్ అంటే చాలా చాలా ఇష్టం పింక్ ఐస్ క్రీమ్ అని చూయించారు .
లవ్ యు ......... హలో బాబు ....... ఇది పార్సిల్ చెయ్యండి అని రాగానే పే చేసి కీర్తి సెలెక్ట్ చేసిన బిగ్ సిల్కీ చాక్లెట్ తీసుకుని మరి మీకు - మా బుజ్జి కడుపులు నిండిపోయాయి అన్నయ్యా ......... , నవ్వుకుని కవర్ చేతిలో ఉంచుకుని ఇద్దరినీ చెరొకవైపు ఎత్తుకుని బుజ్జిమాటలను - బుజ్జిముద్దులను ఎంజాయ్ చేస్తూ అపార్ట్మెంట్ చేరుకుని లిఫ్ట్ లో బుజ్జాయిలను పైకి తీసుకెళ్లి , దేవతను చూసి తట్టుకునే ధైర్యం - తప్పుచేశానన్న గిల్టీతో లిఫ్ట్ దగ్గరే కిందకుదించి కవర్ అందించి , బుజ్జాయిలూ నాకు ముఖ్యమైన పని ఉంది వెళ్ళండి అనిచెప్పాను . 
కళ్ళల్లో చెమ్మతో మళ్లీ ఎప్పుడు అన్నయ్యా .......... 
మీరు తలుచుకోగానే మా బుజ్జి కీర్తి - బిస్వాస్ లముందు వాలిపోతాను అని ముద్దులుపెట్టి స్వీకరించి పంపించాను . వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ టాటా చెబుతూ అమ్మా అమ్మా ........ అంటూ అమితమైన ఆనందంతో కేకలువేస్తూ ఇంట్లోకి వెళ్లిపోయారు .

అదే లిఫ్ట్ అందుబాటులో ఉన్నప్పటికీ మెట్ల దారిలో కిందకుదిగి - కారు ఉన్నప్పటికీ ....... పరుగులుపెడుతూ శరణాలయానికి పరుగుపెట్టాను .

అక్కడ అమ్మా అమ్మా అమ్మా అమ్మా .......... అని సంతోషపు పిలుపులతో డోర్ తీసుకుని లోపలికివెల్లగానే , డోర్ దగ్గరే వేచి చూస్తూ ......... తల్లీ నాన్నా ఎంత కంగారుపడ్డానో తెలుసా అని ప్రాణం కంటే ఎక్కువగా ఇద్దరినీ ఒకేసారి గుండెలపై హత్తుకుని ముద్దులతో ముంచెత్తి , కొత్తగా ఇద్దరి స్వచ్ఛమైన చిరునవ్వులను మరియు సంతోషాలను అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది . 
బుజ్జాయిలు : ఎందుకమ్మా కంగారు మీ మంచితనమే మాకు రక్ష అని కన్నీళ్లను తుడిచి చిరునవ్వులు చిందిస్తూ దేవత బుగ్గలపై ఉమ్మా ఉమ్మా ........ అని ముద్దులుపెట్టి హత్తుకుని , అమ్మా అమ్మా .......... కింద మా మహేష్ అన్నయ్య కలిశారమ్మా అని అమితమైన ఉత్సాహంతో చెప్పారు . ఎంత ఎంజాయ్ చేశామో ఎన్ని ఆటలు ఆదుకున్నామో , పిజ్జా తిన్నాము , చాక్లెట్ తిన్నాము , బోలెడన్ని ఐస్ క్రీమ్ లు తిన్నాము - మాతో మా ఫ్రెండ్స్ అక్కయ్య అన్నయ్యలకు చాక్లెట్ ఐస్ క్రీమ్ లు ఇప్పించారు .............
దేవత : తీసుకున్నారా తల్లీ ......... మీతో ఆడుకున్నారా నాన్నా ........... 
బుజ్జాయిలు : మా అన్నయ్య మా అంత ఉండే రెండు బాక్స్ లలో చాక్లెట్ లు - ఐస్ క్రీమ్ లు తెప్పించి , మాతో అందరికీ ఇప్పించారు . అందరూ సంతోషంతో తీసుకుని మమ్మల్ని పలకరించి తిన్నారు - ఎంత ఆనందం వేసిందో .......... ఇక ఆడుకుందాము అనేంతలో అంటీవాళ్ళువచ్చి వీళ్ళతో ఆడుకోకూడదని చెప్పానా అని వాళ్ళను కొట్టి లాక్కుని వెళ్లిపోయారు . 
దేవత కళ్ళల్లో కన్నీళ్లను చూసి , అయ్యో అమ్మా ...........పూర్తిగా విను అని నవ్వుతూ కన్నీళ్లను తుడిచి ముద్దులుపెట్టి , అలా జరిగిన తరువాత అన్నయ్యతో ఎన్ని ఆటలు ఎన్ని జ్ఞాపకాలు ........... మాటల్లో వర్ణించలేమమ్మా .......... ఇక మా కంట కన్నీరు రానివ్వను అని మాటిచ్చారు . 6 గంటలకే వచ్చేవాళ్ళమా ......... అన్నయ్యతో సమయమే తెలియలేదు . 
దేవత : కన్నీళ్ళతోనే సంతోషించి ప్రాణంలా హత్తుకుని , తల్లీ నాన్నా ........ బాగా ఆదుకున్నారుకదా ఆకలేస్తోందా మ్యాగీ చెయ్యనా .......
బుజ్జాయిలు : అమ్మా ......... చెప్పాముకదా అని అని నెత్తితో దేవత నెత్తిపై సున్నితంగా కొట్టి , రెండు రెండు పెద్ద పిజ్జా పీస్ లు - బోలెడన్ని చాక్లెట్ లు - బోలెడన్ని ఐస్ క్రీమ్ లు ......... చూడండి అని బుజ్జి బొజ్జలను చూయించారు .
దేవత : నవ్వుకుని అమ్మో ......... నిండిపోయాయి ఇక తినాల్సిన అవసరం లేదు అని బుజ్జి బొజ్జలపై ప్చ్ ప్చ్ ........ అని ముద్దులుపెట్టారు . తల్లీ నాన్నా ........ ఎవరు మీ అన్నయ్య - మీలో కనీసం నవ్వునైనా చూస్తానా అనుకున్నాను ఏకంగా ఇంతటి ఆనందాన్ని పంచారు - మీ అన్నయ్య నాకు దేవుడితో సమానం - పేరు మహేష్ అన్నయ్య అన్నారుకదా ఎక్కడ ఉంటారు .
బుజ్జాయిలు : అయ్యో ......... ఎక్కడ ఉంటారో కనుక్కోలేదమ్మా ఆనందంలో ........
దేవత : తెలుసుకోవాలి కదా తల్లీ ......... , అయితే ఈ ఆనందం ఈరోజుతోనే ఆగిపోతుందా అని మనసులో అనుకుని కన్నీళ్లను ధారలా కారుస్తూ మళ్ళీ బాధపడింది . బుజ్జాయిలు బాధపడతారని తుడుచుకుని ఇంతకీ ఎలా కలిశారు - ఇంత ఆనందాన్ని ఆ దేవుడు ఎలా పంచారు .
బుజ్జాయిలు : మా అమ్మకు దేవుడు అయితే మాకు మా మంచి అన్నయ్య , అయ్యో ఈ కొత్తదనపు సంతోషంలో అన్నీ మరిచిపోతున్నాము . చీకటి పడటంతో మా అమ్మ కంగారుపడుతుంటుంది అని అన్నయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగున వస్తుంటే , బుజ్జాయిలూ ......... మీరు బోలెడన్ని చాక్లెట్ లు - ఐస్ క్రీమ్ లు తిన్నారు కదా ........ , మీ ప్రాణం కంటే ఎక్కువైన మీ అమ్మకు తీసుకెళ్లరా అని ఆడిగారమ్మా ......... , ఈ ఆనందంలో మా అమ్మ సంతోషం గురించి మేము మరిచిపోయినా అన్నయ్య గుర్తుచేసిమరీ మమ్మల్ని ఐస్ క్రీమ్ షాప్ కు ఎత్తుకొనివెల్లి మీకోసం మేము తిన్నవి కాకుండా మాకు మీరు స్పెషల్ అని స్పెషల్ ఐస్ క్రీమ్ కొనిచ్చారమ్మా .......... , మా అన్నయ్యలో మా అన్నయ్య ముద్దులలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా ........ ముద్దుపెడితే చాలు పెదాలపై నవ్వు వచ్చేస్తుంది . అంత ప్రేమతో ప్రాణంలా ముద్దులుపెడతారు . మా కళ్ళల్లో కన్నీళ్లను చూసి అన్నయ్య కన్నీళ్లు కార్చి బాధపడ్డారు . అమ్మా ........ ఫస్ట్ నుండి ఏమిజరిగిందో మొత్తం చెబుతాము మా అమ్మకు ఐస్ క్రీమ్ తినిపిస్తూ అని వాళ్ళ రూంలోకి పిలుచుకొనివెళ్లి బెడ్ పై కూర్చోబెట్టి , ముందుగా కవర్లోని పెద్ద చాక్లెట్ తీసి మా ప్రియమైన అమ్మకు అని అందించారు . 
దేవత పెదాలపై చిరునవ్వుతో లవ్లీ గిఫ్ట్ అని అందుకుని ముద్దులుపెట్టారు . 
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ..........ఈ ముద్దులు మీ దేవుడికే చెందుతాయి గుర్తుపెట్టుకోండి అని అమాయకంగా ముద్దుగా చెప్పారు .
దేవత : ఆరేళ్ళ తరువాత తొలిసారి సిగ్గుపడి , అలాగే అని తల ఊపారు . 
బుజ్జాయిలు : లవ్ యు అమ్మా ........ అని ఐస్ క్రీమ్ బయటకు తీసి ఓపెన్ చేసి ఇచ్చిన స్పూన్ లతో ఒకేసారి తినిపించారు . 
బుజ్జాయిల ప్రేమకు - ఐస్ క్రీమ్ చల్లదనానికి - తియ్యదనానికి .......... మైమరిచిపోయి కళ్ళుమూసుకుని నోటి నుండి మ్మ్మ్మ్మ్........ చేతివేళ్ళతో సూపర్ ..... తల్లీ నాన్నా .......... అని మళ్ళీ ఆటోమేటిక్ గా నోరు తెరిచారు . 
బుజ్జాయిలు సంతోషంతో నవ్వుకుని , లేచి తమ తల్లి ఒడిలో చెరొకవైపు కూర్చుని మళ్లీ తినిపించి మైమరచి ఎంజాయ్ చేస్తుండటం చూసి లొట్టలేస్తున్నారు . అమ్మా ....... అంత బాగుందా ..........
దేవత : మ్మ్మ్మ్మ్......... ఆరేళ్ళ తరువాత మళ్ళీ ఐస్ క్రీమ్ తింటున్నాను తల్లీ ....... మీ వలన . అమృతం లా ఉంది . 
బుజ్జాయిలు ప్రేమతో తమ్ము అమ్మ బుగ్గలపై సున్నితంగా కొరికేసి , మావలన కాదమ్మా ......... మా మహేష్ అన్నయ్య వలన . 
కదా ......... అని సంతోషంతో నవ్వడంతో బుజ్జాయిలిద్దరూ ఆనందబాస్పాలతో కన్నార్పకుండా తమ తల్లిని చూస్తూ ఉండిపోయారు . 
దేవత : ఏమైంది తల్లీ - న్నాన్నా అలా చూస్తున్నారు . 
కీర్తి పరుగునవెళ్లి మిర్రర్ తీసుకొచ్చి ఇందుకమ్మా అని చూయించి , అమ్మా నువ్వు నవ్వుతుంటే మాకు చాలా చాలా ఆనందం వేస్తోంది అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది అని ఆనందబాస్పాలతో ముద్దుముద్దుగా చెప్పారు . 
సుమారు ఆరేళ్ళ తరువాత తొలిసారి తన నవ్వుని అద్దం లో చూసుకుని కళ్ళల్లో చెమ్మతో ఇద్దరినీ ప్రాణంలా హత్తుకుని లవ్ యు లవ్ యు లవ్ యు .......... soooo మచ్ అని ముద్దులతో ముంచెత్తి అంతా మీవల్లనే అని , బుజ్జాయిలు బుగ్గలపై కొరకడంతో ఆగి మళ్లీ నవ్వుకుని ok ok ........ మీ అన్నయ్య వల్లనే మీ అన్నయ్య వల్లనే అని సిగ్గుపడి , తల్లీ ........... ఐస్ క్రీమ్ ........
లవ్ యు అమ్మా ......... అని ప్రేమతో తినిపించారు . 
దేవత అదే స్పూన్ తో బుజ్జాయిలకు తినిపించి , మీ అన్నయ్య పంపించినది అయితే మీ బుజ్జి బొజ్జలు నిండిపోయినా తింటారు కదా.......... అని బుంగమూతి పెట్టారు .
బుజ్జాయిలు : చెప్పాము కదమ్మా ......... అన్నయ్యలో ఏదో తియ్యదనం ఉందని - అన్నయ్యను చూడకుండానే నువ్వుకూడా దేవుడు అన్నావుకదా అలా ..........
దేవత నవ్వుకుని , నిజమే మీ అన్నయ్య ఆరేళ్లుగా మరిచిపోయినవి మళ్లీ మన జీవితంలోకి తీసుకొచ్చారు .మీ అన్నయ్యకు బిగ్ బిగ్ బిగ్ థాంక్స్ . 
బుజ్జాయిలు : మళ్లీ కొరికారు . 
దేవత : తల్లీ - నాన్నా .......... మీ అన్నయ్యకే కదా థాంక్స్ చెప్పినది . 
బుజ్జాయిలు : మా మధ్య థాంక్స్ లు sorry లు లేవు ........
మరి ........ఎలా 
లవ్ యు .......... అని చెప్పుకుంటాము .
దేవత : నేను చెప్పకూడదు కానీ నా బుజ్జాయిలకోసం ఏమైనా చేస్తాను . OK మీ అన్నయ్యకు బిగ్ బిగ్ బిగ్ లవ్ యు .........అని నవ్వారు .
లవ్ యు అమ్మా .......... ఇక తింటూ తినిపిస్తూ జరిగింది మొత్తం చెబుతాము అని బుజ్జిబుజ్జిమాటలతో వివారిస్తుంటే , 
దేవత కూడా ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ బాధపడుతూ చివరికి అమితమైన ఆనందంతో నవ్వి బుజ్జాయిలను గుండెలపై హత్తుకుని మీ అన్నయ్య నిజంగానే దేవుడు - అలాంటి దేవుడు ఎక్కడ ఉంటారు కూడా తెలుసుకోలేదు మీరు - నెక్స్ట్ టైం కలిస్తే మొత్తం తెలుసుకోండి అని ముద్దులుపెట్టి ఆ ........ ఐస్ క్రీమ్ అని నోరు తెరిచారు . 
బుజ్జాయిలు నవ్వుకుని ఖాళీ అమ్మా .......... 
దేవత : మాటల్లో - మీ సంతోషాన్ని చూస్తూ అంతపెద్దది తినేసామా ........ అని సిగ్గుతో తల్లీ నాకు చాక్లెట్ కూడా తినాలని ఉంది .
బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ......... అమ్మ రెండు ఆశలను తీర్చారు అని గాలిలోకి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత : నా తల్లి నాన్నకు నేనంటే ప్రాణం అని సమయం కూడా మరిచిపోయి ఎంజాయ్ చేస్తున్నారు .
************
Like Reply
సుమారు 5 కిలోమీటర్లపైనే పరిగెత్తుకుంటూ శరణాలయం చేరుకున్నాను . ఆయాసం వేస్తున్నా కూడా ఒక్క క్షణం కూడా కూర్చోకుండా లోపలికివెళ్లి ,బకెట్ తో బావిలోని నీటిని సేది తలపై పోసుకుని వొళ్ళంతా తడితోనే అమ్మవారి దగ్గరకువెళ్లి మొక్కి అమ్మవారి కుంకుమ నుదుటిపై పెట్టుకుని , కన్నీళ్ళతో రెండుచేతులూ జోడించి కళ్ళుమూసుకుని అమ్మా ......... ఈ పాపిని క్షమించండి - క్షమించమని కోరే అర్హత కూడా లేనివాణ్ణి . ఆ శిక్ష ఏదో నాకు వెయ్యండి - మీ లాంటి మనసున్న మీ దేవత జీవితాన్ని మార్చండి - తప్పంతా నాది ఎలాంటి శిక్ష అయినా నేను అనుభవిస్తాను . ఏమనిషీ కోరని కోరికను కోరాను . దేవతకు కష్టాలు కలిగించాను . అంతటితో ఆగక ఆ కష్టాలను చూసి జాలిపడక నవ్వుకున్నాను - ఏకంగా ఒక రాక్షసుడికి థాంక్స్ చెప్పాను  - క్షమార్హుడిని కూడా కాను . ఆ దేవత పెదాలపై సంతోషం నవ్వు చూడటం కోసం నా ప్రాణాలనైనా త్యాగం చెయ్యడానికి నేను సిద్ధం . నన్ను క్షమించపోయినా ......... ఆ దేవత మరియు నా ప్రియమైన బుజ్జిదేవతలు కంట కన్నీరు రాకుండా చూసుకోండి అని చెవులను పట్టుకుని ఆపకుండా గుంజీలు తీస్తూనే ఉన్నాను . 

10 నిమిషాలు - 20 నిమిషాలు - 30 నిమిషాలైనా .......... ఆపకపోవడంతో , మహేష్ మహేష్ మహేష్ ........... అంటూ పరుగునవచ్చి ఆపారు వార్డెన్ . 
వార్డెన్ : మహేష్ మహేష్ ......... చాలు చాలు .
లేదు వార్డెన్ నేను చాలా పెద్ద తప్పుచేసాను . నావలన ముగ్గురి జీవితాలు కష్టాలపాలయ్యాయి అని మళ్ళీ తియ్యబోయాను . 
వార్డెన్ : ఆపి ........నీ గురించి నాకు తెలియదా ......... ఒకవేళ నువ్వు అలా చేసి ఉంటే నీకోసం శరణాలయంలోని పిల్లలందరూ అలా నీకోసం అని చూయించారు . 
చూస్తే వందలమంది పిల్లలు నాతోపాటు నుదుటిపై చెమట కారుతున్నా షర్ట్స్ తడిచిపోయినా గుంజీలు తీస్తున్నారు . 
అందరూ అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ నా చుట్టూ చేరి హత్తుకుని మీరు తప్పు చూశారంటే మేము నమ్మము - మీరు చెయ్యరు అంతే ....... అమ్మా తల్లీ .......... అన్నయ్య ఏమికోరుకున్నారో మాకు తెలియదు - అవన్నీ వెంటనే తీరిపోవాలి లేకపోతే ఈ శరణాలయంలో ఉన్న మేమంతా మిమ్మల్ని ప్రార్థించడం మానే.......... 

తమ్ముళ్లూ ........... అని ఆపి , ఎవ్వరూ లేకపోయినా మనం ఇక్కడ జీవిస్తున్నామంటే మన అమ్మ ఆశీస్సులే కారణం - మనకు ఎప్పుడు ఏ సమయంలో కరుణిస్తే మనం సంతోషిస్తామో ఆ సమయానికి తప్పకుండా తీరుస్తారు దానికి సాక్ష్యం నేనే ........ , నేను చేసిన తప్పును మీరు అమ్మను నిందించడం తగదు - అమ్మా క్షమించండి ఏదో నాపై ఉన్న ఇష్టంతో అలా అన్నారు తమ్ముళ్లను జాగ్రత్తగా చూసుకోండి అని ప్రార్థించాను . తమ్ముళ్లూ .......... బాగా చదువుకుంటున్నారా ? 
బాగా అన్నయ్యా ..........
ఫుడ్ .........
మా నలుగురి అన్నయ్యల వలన రోజుకు రెండుపూటలైనా పరమాన్నం తింటున్నాము. చూడండి తిని ఒక్కొక్కరు ఎలా కండలు పెంచారో అని చూయించారు.
నవ్వుకుని ఆనందించాను . 
అన్నయ్యా ......... ఈరోజు చిత్రాన్నాం వంకాయ స్వీట్ ........ రండి మాతోపాటు తినండి అని ఆహ్వానించారు . 
తమ్ముళ్లూ .......... మన శరణాలయంలో గంజిఅన్నం కూడా మనకు అమృతమే కదా అని వాళ్ళతోపాటు భోజనం చేసి , వార్డెన్ ......... ఈరోజు చిన్న సంతోషం చాలా బాధలు చూసాను . ఈ డబ్బుతో పిల్లలందరికీ ఐస్ క్రీమ్స్ పంచండి అని పదివేలు అందించాను .
మహేష్ .......... ఇప్పటికే నెలకు మీ నలుగురూ కలిసి 2 లక్షల పైనే ఇస్తున్నారు . 
చెప్పానుకదా వార్డెన్ చిరు సంతోషం - నా తృప్తికోసం తమ్ముళ్లు కూడా నవ్వితే అదే ఆనందం అని తమ్ముళ్లకు గుడ్ నైట్ చెప్పాను . వైజాగ్ మొత్తం వినిపించేలా గుడ్ నైట్ అన్నయ్యా .......... త్వరలో వచ్చి మీ కోరికలు తీరాయని చెప్పకపోతే మేమేమిచేస్తామో మీకు తెలుసు - మన దేవతమ్మకూ తెలుసు ......... మీరంటే మాకు అంత ప్రాణం . 
లవ్ యు తమ్ముళ్లూ .......... అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో , దేవత మరియు బుజ్జాయిల పరిష్కారం గురించి ఆలోచిస్తూనే - మనసారా అమ్మను ప్రార్థిస్తూనే అపార్ట్మెంట్ వైపు నడిచాను .

అపార్ట్మెంట్ చేరుకునేసరికి 9:30 అయ్యింది . సెక్యూరిటీని పలకరించి పైకివెళ్ళాను . బుజ్జాయిలను ఒక్కసారైనా చూడాలని మనసు పరితపిస్తుంటే , ఇంటిలోపల నుండి చైర్ తీసుకొచ్చి బయట కూర్చుని దేవత ఇంటివైపే ఆశతో చూస్తున్నాను . లోపల నుండి చిన్న అలికిడి కూడా వినిపించకపోవడంతో సాయంత్రం ఆడిన ఆటల వలన అలసిపోయి నిద్రపోయారేమోనని , అయినాకూడా చిరుఆశతో అక్కడే కూర్చున్నాను.

10:30 సమయంలో ఫుల్ గా తాగినట్లు తూగుతూ ఇద్దరు మా వింగ్ వైపు వచ్చారు . చూస్తే వాడే ........... ప్రక్కనే అంతే తాగినట్లు తూగుతున్న స్త్రీ .
వాడు : రేయ్ ......... ఇక్కడ ఉండకూడదు వెళ్లిపో - ఓ ........ నీ ఇల్లు ఇదేకదా లోపలికివెళ్లిపో వెళ్లిపో అని వేలితో చూయించాడు . 
 కుర్చీలోనుండి లేవకుండా వాడివైపే కోపంతో చూసాను .
వాడు : రేయ్ ఏంట్రా ఆ చూపు తల దించు తల....... దించు దించు అని మహిళ నడుముచుట్టూ చేతినివేసి లాక్కుని దగ్గరకువచ్చాడు . 
నేను ఏమాత్రం భయపడకుండా మరింత కోపంతో చూస్తూ వాడు రాగానే లేచి నిలబడి పిడికిలి బిగించాను . వాడు ఏమాత్రం చెయ్యిచేసుకున్నా అనాధ పవర్ ఏంటో చూయించేవాడిని . 

డార్లింగ్ ......... గంటలో మరొక కస్టమర్ వెయిటింగ్ తొందరగా స్టార్ట్ చేద్దాము పదా అని లాగడంతో , వాడు నా ముఖం పై వేలితో బెదిరిస్తూ లోపలికివెళ్లాడు .
ఒసేయ్ ఒసేయ్ ........ ఎక్కడ చచ్చావే రాగానే చుక్క ముక్క arrange చెయ్యాలని లేదా అని కేకలువేశాడు . 
దేవత గజ్జెల చప్పుడుతో వచ్చినట్లు మాటలు వినిపించాయి . బుజ్జాయిలకు ఏది మంచి ఏది చెడో తెలుస్తోంది ఇలా ఇంటికి పిలుచుకునిరావడం ..........
నాకే ఎదురు మాట్లాడతావా అని చెంపదెబ్బ తగిలిన చప్పుడు వినిపించింది . వెనకున్న చైర్ ను కాలితో తన్ని సర్రున కోపం నషాళానికి ఎక్కేసింది . కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారసాగాయి . ఇక కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాక దేవత ఇంటివైపు అడుగువేశాను . 
డార్లింగ్ .......... వదిలేయ్ ఇప్పటికే ఫుల్ గా తాగాముకదా త్వరగా పనికానిస్తే నేను వెళ్ళాలి అణా మాటలు - దేవత గజ్జెల చప్పుడుతో ఏడుస్తూ మరొక రూంలోకి నాకు తెలిసి బుజ్జాయిల రూంలోకివెళ్లిపోయినట్లు గజ్జెల చప్పుడు ఆగిపోవడంతో ఆగిపోయాను .

దేవత ఫోటోలు గుర్తుకువచ్చి కళ్ళల్లో కన్నీళ్ళతో వెంటనే లోపలికివెళ్లి నా ట్రంక్ మాత్రమే ఏకాకిగా మూలన ఉండటం చూసి పరుగునవెళ్లి ఓపెన్ చేసి దేవత ఫోటోలున్న బాక్స్ ను హృదయానికి హత్తుకున్నాను . కన్నీళ్లను తుడుచుకుని బెడ్రూంలోకి వెళ్లి నా ప్రాణమిత్రుల ట్రంక్ లపైనా గోడమీద దేవత ఫోటోలను అందంగా అతికించి కింద దేవత అని రాసి , మళ్లీ ఈ సంతోషం ఉత్సాహం చిరునవ్వులు ఎప్పుడు చూస్తానో అసలు చూస్తానో లేదో కూడా తెలియదు అని మోకాళ్లపై కూర్చుని క్షమించమని కోరే అర్హత కూడా లేదు అని తలదించుకుని బాధపడుతున్నాను . 
గంట తరువాత దేవత ఇంటి డోర్ ఓపెన్ అవ్వడంతో పరుగున బయటకువెళ్ళాను . 
ఆమె చీరను సరిచేసుకుని నావైపు చూపుల బాణం వదిలి నవ్వుతూ వెళ్ళిపోయింది . డోర్ ఓపెన్ చేసి ఉండటంతో ధైర్యం చేసి లోపలికివెళ్ళాను . నా ఇల్లు ఎలా ఉందో అలానే ఉంది మొదటి రూంలో గురకలుపెడుతూ వాడు నిద్రపోతున్నాడు . వాడిపై కలుగుతున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరొక చివరన ఉన్న రూంలోకి తొంగిచూసాను . దేవతను చెరొకవైపున హత్తుకుని భయం భయంతో పడుకున్నట్లు చూడగానే తెలిసిపోతోంది . లైట్ ఆన్ చేసుకునే పడుకుని ఉండటం వలన దేవత కన్నీళ్ల గుర్తులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి . బాధతో చాలాసేపు ముగ్గురినీ చూస్తూ ఉండిపోయాను . ప్రక్క రూంలో అలికిడి వినిపించడంతో కన్నీళ్లను తుడుచుకుంటూ బయటకువచ్చి మెయిన్ డోర్ క్లోజ్ చేసి చైర్లోనే కూర్చుని కాపలాగా ఉంటూ అలాగే నిద్రపోయాను .

అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ చిరునవ్వులు చిందిస్తూ బుజ్జాయిలు పరుగున రావడం కనిపించి కీర్తి - బిస్వాస్ ......... అంటూ కళ్ళుతెరిచి చైర్లోనుండి లేచిమరీ ఎత్తుకోబోతే , ఎదురుగా లేకపోవడం చూసి కలలోనా అని తెలిసి నవ్వుకున్నాను . సమయం చూస్తే ఉదయం 7 గంటలు - బుజ్జాయిల చిరునవ్వులతో నిద్రలేచాను - ఉదయపు కలలు నిజమౌతాయని నమ్మకంతో , ఈరోజు మంచిరోజులా గడవాలి అని అమ్మవారిని ప్రార్థించాను . బుజ్జాయిల స్కూల్ ఎన్ని గంటలకో తెలియదు కాబట్టి ఫ్రెష్ అయ్యి కింద రెడీగా ఉందాము అని లోపలికివెళ్లి దేవత ఫోటోలను చూసి సంతోషం - బాధ కలగలిపిన ఫీల్ తో ఆర గంటలో రెడీ అయ్యి పర్స్ మొబైల్ మరియు ఆఫీస్ కు అవసరమైనవి తీసుకుని కిందకువచ్చి , సెక్యూరిటీ అన్న దగ్గరకు చేరుకుని బుజ్జాయిలు స్కూల్ కు వెళ్ళారా అని అడిగాను .
సెక్యూరిటీ : సర్ 7:45 అయ్యింది 9:30 గంటలకు స్కూల్ - స్కూల్ బస్ 9 గంటలకు వస్తుంది - అయినా స్కూల్ బస్ తో పనేంటి పిల్లలు నడుచుకుంటూ కదా వెళ్ళేది అని గుర్తుచేయ్యడంతో కళ్ళల్లో చెమ్మ చేరింది . 
 కార్లవెనుక సెక్యూరిటీ స్టాండ్ లో కూర్చున్నాము . మెయిన్ గేట్ దగ్గర అవసరమైనప్పుడల్లా అన్న వెళ్లివస్తున్నాడు . 

8:30 కావడంతో బుజ్జాయిలను ఎప్పుడెప్పుడు చూస్తానా అని లేచి లేచి చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ మా బిల్డింగ్ మెయిన్ డోర్ నుండి ఎవరువచ్చినా నా బుజ్జి ఏంజెల్స్ ఏమోనని సంతోషంతో చూసి కాదని తెలిసి నిరాశ చెందుతున్నాను . 8:45 నుండి అన్ని బిల్డింగ్ లలోని పిల్లలు తమ అమ్మల చేతులలో స్కూల్ బ్యాగ్ - లంచ్ బ్యాగ్ పట్టుకుని స్కూల్ బస్ రాకకోసం మెయిన్ గేట్ దగ్గరకుచేరి ఎదురుచూస్తున్నారు . 

క్షణక్షణానికీ బుజ్జాయిలను చూడటం కోసం నా హృదయవేగం అంతకంతకూ పెరుగుతూ వెంటనే చూసేయ్యాలనే ఆతృతగా పరితపిస్తోంది . 
మహేష్ వస్తున్నారు చూడమని నా హృదయం ప్రశాంతంగా మారిపోవడంతో తియ్యని ఆశ్చర్యంతో తలెత్తిచూస్తే తలదించుకునిభుజంపై కేజీల కేజీల బరువున్న బ్యాగు - అక్కయ్యా ........ లంచ్ బ్యాగ్ నేను పట్టుకుంటాను ఇవ్వు అని అందుకొని కీర్తి కురులపై ప్రాణమైన ముద్దుపెట్టి నడుచుకుంటూ వస్తున్నారు . థాంక్యూ soooooo మచ్ my హార్ట్ అని హృదయం పై చేతినివేసుకొని లేచి కార్ల వెనుక నిలబడి చూస్తున్నాను .
సెక్యూరిటీ : సర్ .......... వెనుకే వాడూ వస్తున్నాడు , రాక్షస నవ్వు నవ్వుతున్నాడు వెధవ .
అన్నా .......... ఈరోజు మంచి జరుగుతుందని అనుకుంటున్నాను . బుజ్జాయిలను కారులో తీసుకువెళతాడేమో ...........
సెక్యూరిటీ : భూమి బద్దలైనా అలా ఎప్పటికీ జరుగదు సర్ , వాడి గురించి ఇంకా మీకు పూర్తిగా తెలిసినట్లు లేదు .

అన్న చెప్పినట్లుగానే స్కూల్ బస్ రావడం వేచిచూస్తున్న పిల్లలందరూ బస్ ఎక్కడం - రోజూ ఒక చిన్న ఆశతో బస్ దగ్గరికివెళ్లడం - బాబూ .........ఈ ఇద్దరు పిల్లలను ఎక్కించుకుంటే మా పిల్లలందరూ వేరేలా స్కూల్ కు లేదు లేదు ఆ స్కూల్ నే మార్పించేస్తాము అనడంతో - అలా ఎప్పటికీ జరగదు మేడం అని బుజ్జాయిలిద్దరి ముందే డోర్ వేసేయ్యడం - నిన్న బుజ్జాయిలను పట్టించుకోకుండా మొదట వెళ్లిపోయిన పిల్లలు గేలి చెయ్యడం చూసి బుజ్జాయిలిద్దరూ కన్నీళ్ళతో ఏడవడం చూసి చూడనట్లు - అసలు బుజ్జాయిలిద్దరూ తన పిల్లలే కానట్లు ఆ గోవర్ధన్ గాడు కారులో దర్జాగా వెళ్లిపోవడం చూసి , 
సెక్యూరిటీ : చెప్పాను కదా సర్ వాడు అసలు మనిషినే కాదు . 
బుజ్జాయిలు ......... ఆశతో అంటీలవైపు చూసింది . 
కొంతమంది బాధపడినా .......... మాట్లాడిస్తే ఎక్కడ తమను కూడా దూరం పెడతారోనని కోపంగా వెళ్లిపోతున్న వారి వెనుకే వెళ్లిపోయారు . 
బుజ్జాయిలిద్దరూ కన్నీళ్లను తుడుచుకుని చేతులుపట్టుకొని నడుచుకుంటూ వెళ్లడం కోసం తలలు దించుకుని బుజ్జి అడుగులు వెయ్యడం చూసి హృదయం చలించిపోయి పరుగునవెళ్లి వాళ్లముందు మోకాళ్లపై కూర్చున్నాను . 

వాళ్ళ అడుగులకు అడ్డుగా ఎవరు అని కన్నీళ్ళతోనే తలెత్తిచూసి అప్పటివరకూ ఏదీ జరగలేదు అన్నట్లు అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ అంతులేని ఆనందంతో నన్ను హత్తుకుని , కన్నీళ్లను ఆనందబాస్పాలుగా మార్చేశారు . 
బిస్వాస్ చేతిలోని లంచ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుని మరియు ఇద్దరి భుజాలపై చాలా బరువున్న స్కూల్ బ్యాగులను నా భుజం పై వేసుకుని , ఇద్దరినీ ఎత్తుకుని పైకిలేచాను.
బుజ్జాయిలు : అన్నయ్యా - అన్నయ్యా ........... మిమ్మల్ని మళ్లీ చూస్తామనుకోలేదు .
అలా ఎందుకు అనుకున్నారు బుజ్జాయిలూ ......... మిమ్మల్ని చూడకుండా నేనుండగలనా అని ప్రాణమైన ముద్దులుపెట్టాను .
లవ్ యు అన్నయ్యా లవ్ యు అన్నయ్యా ........... అన్నయ్యా అన్నయ్యా బ్యాగులు బరువున్నాయి మాకు ఇవ్వండి మీరు మమ్మల్ని మాత్రం ఎత్తుకోండి చాలు అని అమాయకమైన ముద్దుమాటలతో చెప్పారు . 
లవ్ యు మై డియర్ క్యూటెస్టు బుజ్జి ఏంజెల్స్ అని బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టి , స్కూల్ కు మనం మన కారులో స్కూల్ బస్ కంటే ఫస్ట్ వెళదామా అని అడిగాను . 
 కళ్ళల్లో అంతులేని ఆనందంతో ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........... అని ముద్దులుపెట్టి సమ్మతి తెలపడంతో పరుగున కారుదగ్గరకువెళ్లి , బుజ్జాయిలను ముందుసీట్లో ప్రక్కప్రక్కనే కూర్చోబెట్టి ఇద్దరికీ కలిపి సీట్ బెల్ట్ పెట్టి డోర్ క్లోజ్ చేసి వెనుక డోర్ తెరిచి స్కూల్ బ్యాగ్స్ మరియు లంచ్ బ్యాగ్ ఉంచి అటువైపుకు పరుగునవచ్చి కూర్చుని , ఇద్దరి సంతోషాన్ని చూసి మురిసిపోయి నుదుటిపై చెరొకముద్దుపెట్టి , are you రెడీ బుజ్జి ఏంజెల్స్ అని అడిగాను . 
హుషారుగా యాహూ యాహూ ........... అన్నయ్యా అన్నయ్యా .......... బస్ వెళ్లి 5 నిమిషాలు అయ్యింది . 
పర్లేదు కీర్తి బిస్వాస్ .......... బస్ ఆగి ఆగి వెళుతుంది కానీ మనం రయ్యిన వెళ్లిపోదాము అని స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చి 5 నిమిషాలలో పిల్లలను ఎక్కించుకోవడం కోసం ఆగిన బస్ ను దాటుకుని ముందుకువెళ్లడం చూసి యే యే యే .......... మనమే ఫస్ట్ మనమే ఫస్ట్ అని ముగ్గురమూ చిరునవ్వులు చిందిస్తూ హైఫై కొట్టుకున్నాము . 

అవును బుజ్జాయిలూ ......... మళ్లీ నన్ను ఎందుకు కలవరు అనుకున్నారు . 
బుజ్జాయిలు : నిన్న మీతో ఆడుకుని సంతోషంతో లోపలికి వెళ్ళామా .......... మాకోసమే కంగారుపడుతూ ఎదురుచూస్తున్న అమ్మ మా ఆనందం నవ్వులను చూసి ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేము .
దేవ ............. మీ అమ్మ నువ్వారా? బుజ్జాయిలూ .......... అని సంతోషపు ఆత్రంతో అడిగాను .
బుజ్జాయిలు : మొదట కొద్దిగా అంటే కొద్దిగా తరువాత అని ఉత్సాహంతో చెప్పబోయి ఆపేసి , అన్నయ్యా అన్నయ్యా ........... ఫస్ట్ నుండీ మొత్తం చెబుతున్నాము కదా మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తే మరిచిపోతాము బుజ్జి మెడదులుకదా అని బుంగమూతిపెట్టుకున్నారు . 
లవ్ యు లవ్ యు ............ అని ఒక చేతితో స్టీరింగ్ తిప్పుతూనే మరొకచేతితో చెవిని పట్టుకుని లవ్ యు చెప్పాను .
కీర్తి : అన్నయ్యా ......... అని ఆపి నా చేతిపై ముద్దుపెట్టి , అమ్మ మమ్మల్ని ప్రాణంలా హత్తుకుని జీవితంలో చూడలేననుకున్న సంతోషాన్ని చూసాను ఈ జీవితానికి ఇది చాలు అని మురిసిపోయారు .  జరిగింది మొత్తం తెలుసుకుని మా పెదాలపై సంతోషాన్ని పంచిన మిమ్మల్ని దేవుడు అని పేరు కూడా పెట్టేసారు తెలుసా .........
అవునా ......... అనబోయి వెంటనే నోటికి తాళం వేసేయ్యడం చూసి నవ్వుకున్నారు . 
జరిగింది తెలుసుకుంటూ మీరిచ్చిన ఐస్ క్రీమ్ ను తెలియకుండానే మొత్తం ఖాళీ చేసేసారు .
దేవ ........... ఐస్ క్రీమ్ తిన్నారా .........
మామూలుగా కాదు అన్నయ్యా అన్నయ్యా .......... అత్యంత ఇష్టంతో తిన్నారు తెలుసా ........... అప్పుడే అయిపోయిందా అని ఫీల్ అయ్యారు కూడా ...........
అందుకే పెద్దది తీసుకోండి అంటే మీరే నామాట వినలేదు ఇప్పుడు చూడండి అని నేను బుంగమొయితిపెట్టుకున్నాను . 
బుజ్జాయిలు ముసిముసినవ్వులు నవ్వుకుని సీట్ బెల్ట్ తీసుకుని వచ్చి అవును తప్పు మాదే ప్చ్ ప్చ్ ......... అని బుగ్గలపై ముద్దులుపెట్టి లవ్ యు అన్నారు .
వెంటనే పెదాలపై చిరునవ్వు రావడం చూసి అన్నయ్య నవ్వారు అన్నయ్య నవ్వారు అని కారులోనే సంతోషంతో గెంతులేసి , అన్నయ్యా .......... అక్కడ కూర్చోవచ్చా అని నా ఒడిని చూపించింది కీర్తి . 
అంతకంటే అదృష్టమా కీర్తి తల్లీ .......... అని ఎత్తుకుని కూర్చోబెట్టుకొని షర్ట్ గట్టిగా పట్టుకో అనిచెప్పాను .
కీర్తి కళ్ళల్లో ఆనందబాస్పాలతో అన్నయ్యా ........... అమ్మకూడా ప్రాణంలా తల్లీ అని మీలాగే పిలుస్తారు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ఇప్పటి నుండి అలాగే పిలవండి pleaae అని బుజ్జిచేతులతో చుట్టేసి గుండెలపై వాలింది .
లవ్ యు తల్లీ ........... అని నుదుటిపై ముద్దుపెట్టగానే , ఒక తియ్యని వైబ్రేషన్స్ తో నన్ను మరింత చుట్టేసి లవ్ యు అన్నయ్యా లవ్ యు అన్నయ్యా ......... అని కలవరిస్తూనే ఉంది . ప్రతి కలవరింతకూ ప్రేమతో ఒక ముద్దుపెట్టాను . ప్రతి ముద్దుకూ .......... కీర్తి పెదాలపై చిరునవ్వు రెట్టింపవుతూనే ఉంది .

కీర్తి సంతోషం చూసి బిస్వాస్ ఆనందానికి అవధులు లేనట్లు మా ఇద్దరి బుగ్గలపై చెరొక ముద్దుపెట్టి సీట్లో కూర్చున్నాడు . 
బిస్వాస్ :  అన్నయ్యా ........... అమ్మకు మేము ఐస్ క్రీమ్ తినిపించాము తెలుసా ......... తొలి బైట్ కు కళ్ళుమూసుకుని మైమరిచిపోయారు . అధిచూసి ఫుల్ గా తిన్న మేము కూడా మళ్లీ అమ్మ చేతులతో తిన్నాము . ప్రతీ బైట్ కూ అమ్మ మాకు లవ్ యు చెప్పబోతే , అక్కయ్య అయితే అమ్మ బుగ్గను కిరికేసి మాకు కాదమ్మా .........ఆటల్లో పడి మీ గురించి మరిచిపోయినా గుర్తుచేసి మీకు ఐస్ క్రీమ్ చాక్లెట్ పంపించారు కాబట్టి మా మహేష్ అన్నయ్యకే చెప్పండి .
అయితే మీ మహేష్ అన్నయ్యకే బిగ్ బిగ్ బిగ్ థాంక్స్ అనగానే కీర్తి మళ్లీ కొరికేసింది .
అమ్మ .......... తియ్యని నొప్పితో స్స్స్...... అని బుగ్గపై రుద్దుకుని మీ అన్నయ్యకే చెప్పాను కదా తల్లీ ...........
మా మధ్యన థాంక్స్ లు sorry లు లేవు .
మరి 
ఓన్లీ లవ్ యు లవ్ యు లే .............
నేను చెప్పరాదు కానీ నా ప్రాణం కంటే ఎక్కువైన నా బుజ్జాయిలకు సంతోషాన్ని చిరునవ్వులను పంచారు కాబట్టి బిగ్ బిగ్ బిగ్ లవ్ అని మీకు చెప్పారు అన్నయ్యా ......... నిమిషానికొకసారి మిమ్మల్ని దేవుడు దేవుడు అని తలిచారు కూడా .........
బిస్వాస్ ప్రతీ మాటకూ నేను గాలిలో తేలిపోతున్నాను . పెదాలపై చిరునవ్వు ఆగనేలేదు . కీర్తి కురులపై కూడా ముద్దులు ఆగలేదు .
అన్నయ్యా .......... ఈరోజు కూడా మా సంతోషం చూడాలని మళ్లీ ఎప్పుడు కలుస్తారు మీ అన్నయ్య ఎక్కడ ఉంటారు బుజ్జాయిలూ అని అడిగారు అమ్మ .
మేము తెలియదు అనిచెప్పడంతో మళ్లీ మా సంతోషం చూడలేరేమోనని మళ్లీ కన్నీళ్లు కార్చారు అమ్మ . 
అయ్యో అన్నయ్య ఎక్కడ ఉండేది తెలుసుకోలేదని ఫీల్ అయ్యాము . 
కీర్తి : తలెత్తి అన్నయ్యా .......... మిమ్మల్ని చూడకుండా ఉండలేము మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి రోజూ కలవాలి అని గట్టిగా చుట్టేసింది .
బిస్వాస్ : అవును అన్నయ్యా ......... రాత్రంతా మిమ్మల్నే కలవరిస్తూ రెండుసార్లు సడెన్ గా లేచికూర్చుని , అమ్మా - అన్నయ్యా ........... రేపు అన్నయ్య కనిపిస్తారుకదూ అని అమ్మను బాధతో కౌగిలించుకుంది .
తప్పకుండా బంగారుతల్లీ .......... నేను కొలిచే అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు మన కష్టాలన్నీ తీర్చేస్తారు అని ఓదార్చి గుండెలపై పడుకోబెట్టుకుని ముద్దుచేస్తూ జోకొట్టారు .

సడెన్ బ్రేక్ వేసాను . వెనుక హోర్న్స్ కొట్టడంతో ప్రక్కకు తీసుకెళ్లి ఆపి , తల్లీ ......... నేనంటే అంత ఇష్టమా ...........
ప్రాణం అన్నయ్యా ........... నిన్ను చూడకుండా నిన్ను ఇలా హత్తుకోకుండా మీ ముద్దులు లేకుండా ఒక్కరోజుకూడా ఉండలేను అని షర్ట్ చిరిగిపోయేలా హత్తుకుంది .
లవ్ యు లవ్ యు లవ్ యు నా బంగారు బుజ్జితల్లీ అని రెండుచేతులతో ప్రాణంలా చుట్టేసి కురులపై ఆపకుండా ముద్దులుపెడుతూనే తన ఆనందాన్ని బుజ్జినవ్వులను ఆస్వాదిస్తూనే ఉన్నాను . 
రెండు నిమిషాల తరువాత అన్నయ్యా ......... స్కూల్ బస్ అని బస్వాస్ కేకేయ్యడంతో , 
బిస్వాస్ చేతిపై - నా బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి గేర్ మార్చి పోనిచ్చి నిమిషంలో బస్ దాటి స్కూల్ చేరుకుని లోపలికి పోనిచ్చాను . 

Wow బుజ్జాయిలూ ......... పెద్ద స్కూల్ అని కీర్తిని ముద్దుపెట్టాను . 
బిస్వాస్ : మేము ఈ స్కూల్లో చదివేది ఇక వారం రోజులే అన్నయ్యా ......... వారం రోజుల్లో ఫీజ్ కట్టకపోతే రానివ్వరు . దీనికోసం అమ్మ వాడిని డబ్బు అడిగినందుకు కొట్టారు . అమ్మా ......... వద్దులే మేము వారం తరువాత మీతోనే చదువుకుంటాము అని కన్నీళ్లను తుడిచి వచ్చాము . ఇంట్లో అంత డబ్బు ఉన్నా ......... అమ్మకు తాకడానికి కూడా అర్హతలేదు . అక్రమ సొమ్ము ఎందుకు అన్నందుకు చేతిపై సిగరెట్టుతో కాల్చాడు వాడు అని కన్నీళ్ళతో చెప్పారు . 
నేను బాధపడటం చూసి నా కన్నీళ్లను బుజ్జిచేతులతో తుడిచి లవ్ యు అన్నయ్యా ......... అవన్నీ చెప్పి మిమ్మల్ని ఇక ఎప్పుడూ బాధపెట్టము .
బుజ్జితల్లీ ............ అని ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని , అవన్నీ విని నేను శిక్షను అనుభవించాలి అని మనసులో అనుకుని , తల్లీ .......... నాకు తెలుసుకోవాలని ఉంది రోజూ ఇంట్లో ఏమి జరుగుతుందో చెప్పండి చెబుతారు కదూ ........
సరే అన్నయ్యా ........... అని తల ఊపి , బస్ అప్పుడు రావడం చూసి అన్నయ్యా అన్నయ్యా .......... మనమే ఫస్ట్ మనమే ఫస్ట్ అని సంతోషించారు .
లవ్ యు అని ముద్దుపెట్టి కీర్తిని ఎత్తుకుని కిందకుదిగి అటువైపుకువచ్చి డోర్ తెరిచాను . 
బిస్వాస్ కారులోనుండి దిగడం చూసి స్కూల్ బస్ నుండి దిగిన అపార్ట్మెంట్ పిల్లలు షాక్ అవ్వడం చూసి భలే భలే అన్నయ్యా .......... లవ్ యు అన్నారు . 
అన్నయ్యా .......... మీరు బ్యాగ్స్ తియ్యండి అని నా బుగ్గపై ముద్దుపెట్టి దిగింది కీర్తి . 
నా తల్లి ఆర్డర్ అని నవ్వుతున్న ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , బ్యాగులు లంచ్ బ్యాగ్ తీసుకుని భుజాలపై వేసుకుని , అన్నయ్యా అన్నయ్యా ........ ఈరోజు ఏంటో కొత్తగా అనిపిస్తోంది అని నా వేళ్ళను పట్టుకుని బిల్డింగ్ క్లాస్ వైపు నడిచారు .
అన్నయ్యా .......... ఈవారం కూడా స్కూల్ కి రావాల్సిన అవసరం లేదు - అమ్మ సిలబస్ స్కూల్ సిలబస్ కంటే చాలా చాలా ముందున్నాము . కేవలం మా అన్నయ్యను చూడొచ్చని వచ్చాము .
తల్లీ - నాన్నా ............ మీ అన్నయ్య కలిస్తే ఎంతసేపైనా సరే - ఎంత ఆలస్యమైనా సరే - ఎంత చీకటి అయినా సరే .......... తనివితీరా ఆడుకుని రండి నాకు అదే సంతోషం అని చెప్పారు అమ్మ .
మరి మీ అమ్మను చూడకుండా మీరు ఉండగలరా .......... ? 
అదే విషయం చెప్పాము . అమ్మా ......... మాకు మీతోనూ ఉండాలని ఉంది అలాగే అన్నయ్యతోనూ ఉండాలని ఉంది అని .
అంతే గాలి కూడా లేకపోయినా చెట్టుపై పూలు తథాస్తు అన్నట్లు మాపై వర్షంలా కురిశాయి .
పిల్లలు చుట్టూ తిరిగి పూలను అందుకొని నాపై జల్లి ఆనందించారు .
తల్లీ - నాన్నా .......... రాత్రంతా మిమ్మల్ని గుండెలపై హత్తుకునే ఉంటాను కదా ఉదయం అంతా మీ అన్నయ్యతో సరదాగా గడపండి ఇది ఈ అమ్మ ఆర్డర్ అంతే అని నవ్వించి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి పంపించారు . 
అన్నయ్యా అన్నయ్యా .......... సాయంత్రం రెడీగా ఉండండి మళ్లీ అన్నీ ఆటలూ ఆడుకుందాము అని బిల్డింగ్ లోపలికి క్లాస్ దగ్గరికి పిలుచుకొనివెళ్లి ఇదే అన్నయ్యా అని చూయించారు . 
ఇంతలో బెల్ కొట్టడంతో ఇద్దరి ముఖాలు డల్ అయిపోయాయి . 
మోకాళ్లపై కూర్చుని ముద్దులుపెట్టాను . 
లవ్ యు లవ్ యు అన్నయ్యా ......... అని పెదాలపై చిరునవ్వుతో ముద్దులుపెట్టి , అన్నయ్యా అన్నయ్యా .......... ఇంతకీ మీరు ఇక్కడ ఉండేది చెప్పనేలేదు అని తియ్యని కోపంతో అడిగారు .
మీ ఇంటిప్రక్కనే బుజ్జాయిలూ ...........అని ఉత్సాహంతో చెప్పబోయి ఆగి పెదాలపై చిరునవ్వుతో " సర్ప్రైజ్ " ...........అన్నాను .
సర్ప్రైజ్ అంటే ఇష్టమే అన్నయ్యా ........... కానీ కానీ .........
అర్థమైంది అర్థమైంది అని కీర్తి బ్యాగులోనుండి బుక్ తీసి నా నెంబర్ ఒక పేజీలో కాదు ఐదారు పేజీల్లో రాసి , ఒక్క కాల్ చెయ్యండి మీ ముందు వాలిపోతాను అనిచెప్పాను . 
లవ్ యు అన్నయ్యా .......... అని ఒకసారి నెంబర్ చూసి బుక్ క్లోజ్ చేసేసి టక టకా చెప్పేసి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అని నవ్వుతూ హత్తుకుని వదల్లేక వదల్లేక నావైపు తిరిగి తిరిగి చూస్తూ లోపలికివెళ్లారు . కన్నీళ్లను తుడుచుకుని కంట్రోల్ చేసుకుని లేచాను .
Like Reply
ఆఫీస్ రూమ్ ఎక్కడో తెలుసుకుని అకౌంట్ సెక్షన్ కు వెళ్లి కీర్తి - బిస్వాస్ ఫీజ్ కట్టడానికి వచ్చాను అన్నాను . 
ఏ క్లాస్ అని కూడా అడగకుండా ఆ పిల్లలా వెళ్ళిపోతారు అనుకున్నాను అని కాస్త విసుగుతోనే ఒక్కోక్కరి ఫీజ్ 1 lakh టెన్ thousand అనిచెప్పారు . 
అకౌంట్ లో లక్ష మాత్రమే ఉంది ఇప్పుడెలా అని కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ మామా లక్ష 20 వేలు కావాలి అన్నాను . కాల్ కట్ అయింది సెకెన్స్ లో ముగ్గురి నుండి లక్ష లక్ష లక్ష మూడు లక్షలు ట్రాన్స్ఫర్ అయిపోయాయి . 
లవ్ యు ఫ్రెండ్స్ అని తలుచుకుని లక్ష 20 వేలు మాత్రమే ఉంచుకుని మిగిలిన అమౌంట్ సమానంగా 60 చొప్పున ముగ్గురికీ పంపించాను . ఆ వెంటనే మళ్లీ ముగ్గురి నుండి 30 30 30 వేలు రావడంతో చూసి నవ్వుకుని లవ్ యు అని మెసేజ్ పంపాను.

అమౌంట్ పే చేసి , రిసిప్ట్ బుజ్జాయిలకు పంపించండి అనిచెప్పి , ఒకసారి మళ్లీ బుజ్జాయిలను చూడాలని ఉన్నా ఆఫీస్ కూడా ముఖ్యమని , ఇప్పుడు కట్టిన డబ్బుకూడా సర్ వల్లనే కదా ఆలస్యంగా వెళ్లకూడదు అని గుండెలపై చేతినివేసుకొని బయలుదేరాను . బుజ్జాయిలను చూడకుండా వచ్చినందుకు మనసు విలవిలలాడిపోతోంది . బుజ్జాయిల దగ్గరా ఉండాలని ఉంది - అన్నం పెడుతున్న ఆఫీస్ లో కష్టపడి పనిచేయాలని ఉంది ఇప్పుడెలా .......... బుజ్జాయిలు సిలబస్ లో ముందు ఉన్నారు ఈరోజంతా వాళ్ళను వైజాగ్ మొత్తం సరదాగా చూయించాలని ఉంది . ముఖ్యన్గా జూ మత్స్య దర్శిని వాటర్ పార్క్ ......... ఇలా అన్నింటికీ తీసుకెళ్లి ఎంజాయ్ చేయించి బుజ్జాయిల ఆనందాన్ని చూసి మురిసిపోవాలని ఉంది మరొకవైపు సర్ నమ్మకాన్ని నిలబెట్టాలని ఉంది అని సతమతమవుతూ ఆఫీస్ చేరుకున్నాను .

కారుని ఆఫీస్ పార్కింగ్ లో ఉంచి సాయంత్రం వరకూ బుజ్జాయిలకు మీరే తోడుగా ఉండాలి అని ప్రార్థించి లోపలికి నా రూంలోకివెళ్లాను . 
నా టేబుల్ ప్రక్కనే చిన్న టేబుల్ వేసుకుని ఎవరో కంప్యూటర్లో వర్క్ చేసుకుంటున్నాడు . నన్ను చూసి సడెన్ గా లేచి మహేష్ సర్ గుడ్ మార్నింగ్ నేను .......... అనేంతలో , సర్ లోపలికివచ్చి మహేష్ .......... he is రమేష్ నీ అసిస్టెంట్ నువ్వేమి చెబితే అధిచేస్తాడు .
సర్ .......... నాకు అసిస్టెంట్ , మొత్తం వర్క్ నేనే చేసేస్తాను సర్ ..........
సర్ : నీ గురించి నాకు తెలియదా మహేష్ , మీరు మన ఆఫీస్ లో అడుగుపెట్టి ఇప్పటికి 6 సంవత్సరాలు పైనే అయ్యింది , ఏ ఒక్కరోజూ లీవ్ తీసుకోలేదు . మన కంపెనీ రూల్స్ ప్రకారం సంవత్సరానికి 15 సిక్ లీవ్స్ ఉంటాయి ఆరేళ్లలో 90 సిక్ లీవ్స్ నీ ఖాతాలో ఉన్నాయి . నువ్వెలాగో తీసుకోవు అందుకే నేనే నీకు లీవ్స్ ఇస్తున్నాను వారం రోజులు గో అండ్ ఎంజాయ్ .......... నీ అసిస్టెంట్ తో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉంటే చాలు .
సర్ ...........
సర్ లేదు ఏమీ లేదు ఇది నా ఆర్డర్ అంతే వెళ్లు వెళ్లి నీ ఫ్రెండ్స్ ను మీట్ అవ్వు గోవా కు వెళ్లు ......... నీ ఇష్టం నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్లు . డబ్బు ఎంత కావాలంటే అంత మన అకౌంటర్ దగ్గర అడిగి తీసుకో .............

అమ్మా .......... నన్ను మన్నించి నా కోరిక ఆలకించావా అని మనసులో ప్రార్థించి , మీ ఇష్టం సర్ ............
డబ్బు ఎంతకావాలి మహేష్ ..........
సర్ డబ్బు ఏమీ వద్దు , ఒక లేటెస్ట్ కెమెరా ..........
వెంకట్ వెంకట్ ........... మన ఎలెక్ట్రానిక్ డిపార్ట్మెంట్ నుండి ఒక లేటెస్ట్ న్యూ కెమెరా ఇప్పించుకునిరా అన్నారు .
రెండు నిమిషాల్లో తీసుకొచ్చారు . 
సర్ : మహేష్ ......... 4k ఫొటోస్ మరియు వీడియోలు తీసుకోవచ్చు . లవర్ తో వెళుతున్నావా .......... ఎంజాయ్ అనిచెప్పి వెళ్లిపోయారు . 
థాంక్యూ soooooo మచ్ సర్ ........... రమేష్ తో పరిచయం చేసుకుని ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యి అని నెంబర్స్ మార్చుకున్నాము .

ఉత్సాహంతో బయటకువచ్చి కారులో ముందుగా శరణాలయం చేరుకుని లోపలికివెళ్ళాను . 
అన్నయ్యా అన్నయ్యా ......... అంటూ స్కూల్ కు రెడీ అయి వెళుతున్న పిల్లలు చుట్టుముట్టారు . 
పిల్లలూ........... మన అమ్మవారు నన్ను మన్నించి తొలి కోరికను తీర్చారు .
అందరూ సంతోషంతో కేకలువేసి అమ్మవారిని ప్రార్థించారు . అందరితోపాటు అమ్మవారిదగ్గరకువెళ్లి భక్తితో మొక్కాము . 
తమ్ముళ్లూ - పిల్లలూ.......... సాయంత్రం ఇద్దరు బుజ్జాయిలను తీసుకొస్తాను వాళ్ళు నాకే కాదు మన శరణాలయం కు ఎంతో సహాయం చేసిన దేవత పిల్లలు , వాళ్ళతో ఆడుకుని వాళ్ళను సంతోషపెట్టాలి .
అంతే కదా అన్నయ్యా .......... మాకు వదిలెయ్యండి అంతలా ఎప్పుడూ ఎంజాయ్ చెయ్యలేదు అనేలా చేస్తాము . బుజ్జాయిలను మా ప్రాణంలా చూసుకుంటాము . స్కూల్ వదలగానే వచ్చేస్తాము అన్నారు . 
లవ్ యు తమ్ముళ్లూ - పిల్లలూ ........... ఎంజాయ్ చేస్తూ చదువుకోండి అనిచెప్పడంతో టాటా చేసి వెళ్లిపోయారు . 
వార్డెన్ : మహేష్ ........... నువ్వు చేసిన పుణ్యం ఎవరెస్టు - చేసిన తప్పు ఒక్కటే ఒక్కటి ........... నీ కోరికలు కాకపోతే మరెవరి కోరికలు తీరుస్తుంది ఆ జగన్మాత అని మొక్కారు . సాయంత్రం వస్తున్న బుజ్జాయిలు స్పెషల్ అన్నమాట నా ఏర్పాట్లు నేనూ చేస్తాను అనిచెప్పారు .
థాంక్స్ వార్డెన్ వెళ్ళొస్తాను అనిచెప్పి అమ్మవారి కుంకుమ పువ్వులు చిన్న పేపర్లో తీసుకుని బుజ్జాయిల స్కూల్ కు బయలుదేరాను .

మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ బుక్ లో డీటెయిల్స్ రాసి నేరుగా బుజ్జాయిల క్లాస్రూం చేరుకున్నాను . క్లాస్ జరుగుతుండటంతో డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక కిటికీలోనుండి తొంగిచూసాను . నా బుజ్జాయిలు టూ ఇంటెలిజెంట్ ఖచ్చితంగా ముందు కూర్చుని ఉంటారు అనిచూస్తే లేరు , సెకండ్ రో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ .......... ఆపై ఖాళీ బెంచెస్ ఎక్కడా లేకపోవడంతో వెనుక చూస్తే , చివరన ఒక మూలన ఇద్దరూ ప్రక్కప్రక్కనే కూర్చున్నారు . మధ్యలో ఖాళీ బెంచెస్ ఉన్నా ఎందుకు అంత మూలన ......... సర్ అడిగిన ప్రతి ప్రశ్నకు సర్ సర్ నేను నేను అని చేతులెత్తి రిక్వెస్ట్ చూస్తున్నాకూడా పట్టించుకోకుండా , క్లాస్ మొత్తంలో ఒక్కరికి సమాధానం తెలియనట్లు తలదించుకుని కూర్చున్నా వారినే అడుగుతున్నారు . ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు అలానే చేస్తున్నా ........ బుజ్జాయిలను పట్టించుకోకపోవడం చూసి కన్నీళ్లను లోలోపలే ఆపేసుకుని క్లాస్ వింటున్నారు .
ఎందుకు చివరన కూర్చున్నారో .......... లేదు లేదు కూర్చోబెట్టారు - వివక్ష చూపుతున్నారు అని అర్థమై లోపలికివెళ్ళాను . క్లాస్ అంటే ఎంత ఇష్టమో ఎంత ఏకాగ్రతతో వింటున్నారో ......... క్లాస్ మొత్తం డిస్టర్బ్ అయ్యి నావైపు చూసినా , నా బుజ్జాయిలు మాత్రం సర్ సర్ ......... అని ఉత్సాహంతో అడుగుతూనే ఉన్నారు . 

ఎస్క్యూస్ మీ .......... ఎవరు కావాలి అని సర్ అడిగారు . 
అంతే అన్నయ్యా - అన్నయ్యా ......... అంటూ అంతులేని ఆనందంతో పరుగున రావడంతో ఇద్దరినీ ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను . 
సర్ : హలో mr ......... ఇలా క్లాస్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదు . 
Sorry ......... నేనూ అలాగే అనుకుని 10 నిమిషాలు బయటే ఉండిపోయాను . కానీ మీరు చేస్తున్నది చాలా చాలా తప్పు సర్ ......... పెద్దవాళ్ళు తప్పుచేస్తే కళ్లాకపటం తెలియని బుజ్జాయిలను శిక్షించడం వివక్ష చూపడం ఒక గురువుగా ..........తప్పు . స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం కు సొల్యూషన్ మీకు తెలుసా అని అడిగాను . 
అందరూ ........... తలదించుకున్నారు . కీర్తి తల్లీ - బిస్వాస్ .......... చిరునవ్వులు చిందించడంతో , ముద్దులుపెట్టి ఎత్తుకునివెళ్లి టేబుల్ పై ఉన్న రెండు చాక్ పీస్ లను ఒక్కొక్కటి అందించి బోర్డ్ దగ్గరికివెళ్ళాను . 
నా బుగ్గలపై ఒకేసారి ప్చ్ ప్చ్ ......... అని ముద్దులుపెట్టి , బోర్డ్ వైపు తిరిగి చకచకా సాల్వ్ చేసేసారు . 

 పర్ఫెక్ట్ ఆన్సర్ ........... లవ్ యు తల్లీ - బిస్వాస్ ........... అని ముద్దులుపెట్టి మొబైల్లో సొల్యూషన్స్ తోపాటు ముగ్గురమూ ఒక సెల్ఫీ - బుజ్జాయిలను బోర్డ్ ముందు నిలబెట్టి కెమెరాతో ఫోటోలు తీసుకుని , తల్లీ ......... మీరు స్కూల్ సిలబస్ తో కలవడానికి మరొక వారమైనా పడుతుందా ? 
One month అన్నయ్యా - అన్నయ్యా ...........
అయితే నాతోపాటు బయటకువస్తారా ........... మీకు ప్రపంచాన్ని చూఇస్తాను .
అడగాల్సిన అవసరం లేదు అన్నయ్యా .......... అమ్మ చెప్పింది - మీ అన్నయ్య కిడ్నప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్లినా సంతోషమే అని అంటూ చిరునవ్వులతో బదులిచ్చారు .
అవునా ......... లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెడుతూ మళ్లీ ఎత్తుకుని చివరకువెళ్లి బ్యాగ్స్ , లంచ్ బ్యాగ్ తీసుకుని సర్ కు నవ్వుతూ బై చెప్పేసి బయటకువచ్చి కారులో కూర్చోబెట్టబోతే , 
కీర్తి : అన్నయ్యా .......... నేను మీపైనే అని గట్టిగా హత్తుకుంది .
లవ్ యు తల్లీ .......... ఎక్కడ మీ అన్నయ్య ప్రక్కనే కూర్చుంటావేమో అని భయపడ్డాను అని నవ్వుతున్న బిస్వాస్ ను కూర్చోబెట్టి , కొత్త కెమెరా అందించాను . 
కీర్తి : యాహూ .......... అని కేకలువేస్తూ నా ముఖాన్ని అందుకొని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........ అని ముద్దులుపెడుతూ వచ్చి కూర్చునేంతవరకూ బిస్వాస్ ఫోటోలు తీస్తూనే ఉన్నాడు . 
నా బుజ్జాయిలు ఏదైనా క్షణాల్లో నేర్చుకుంటారు అని బిస్వాస్ కు సీట్ బెల్ట్ పెట్టి పోనిచ్చాను .

కీర్తి తల్లీ , బిస్వాస్  .......... మీకు ఏమేమి చూడాలని ఉంది అని అడిగాను .
కీర్తి : మా అన్నయ్య........... నన్ను అన్నయ్యను ఇలా హత్తుకుని ఎక్కడికి తీసుకెళ్లినా సంతోషమే , అమ్మ చెప్పినట్లు కిడ్నప్ చేసినా కేకలువెయ్యకుండా ఎన్నిరోజులైనా మీతోనే ఉండిపోతాము . ఆ కిడ్నప్ ఏదో మా అమ్మతోపాటు చేస్తే అంతకంటే సంతోషం మరొకటి లేదు అన్నయ్యా .......... అని నాకళ్ళల్లోకే చూస్తూ చెప్పి బుగ్గపై ముద్దుపెట్టింది .
లవ్ యు తల్లీ .......... ఈరోజుని మీరు పెద్దవాళ్ళు అయ్యాక కూడా గుర్తుపెట్టుకునేలా మధురమైన జ్ఞాపకాలను అందిస్తాను అని కీర్తి కురులపై ప్రాణమైన ముద్దుపెట్టాను . కీర్తి - బిస్వాస్ .......... మీరు బోర్డ్ పై సాల్వ్ చేశారు కదా నాకు కూడా రాదు తెలుసా.........
అన్నయ్యా ......... అది చిన్న ప్రాబ్లం మిమ్మల్నీ అంటూ ఛాతీపై కొట్టబోయి ఆగిపోయింది . 
అంతేలే అమ్మ క్లోజ్ కాబట్టి కొడతావు - నేను కాదు కాబట్టి కొట్టవు నేను అలిగాను బుంగమూతిపెట్టుకున్నాను .
కీర్తి : ఎన్ని దెబ్బలు కొడితే అంత క్లోజ్ అయితే అని సున్నితంగా నా ఛాతీపై కొడుతూనే ఉంది . 
యాహూ .......... నా కీర్తి తల్లికి నేనుకూడా తన అమ్మలో కొద్దిగా క్లోజ్ అని సంతోషంతో కేకలువేశాను .
కీర్తి : కొద్దిగా కాదు అన్నయ్యా .......... అమ్మకు సరిసమానం అని గట్టిగా హత్తుకుంది .
తల్లీ .......... అమ్మలతో ఎవ్వరూ సమానం కాదు అమ్మలు దేవతలతో సమానం - అమ్మ కంటే కాస్త తక్కువ ok నా..............
లవ్ యు అన్నయ్యా ........... అమ్మ అంటే ఏంటో తెలియజేసారు . మాకు అమ్మ ఉంది మరి మా అన్నయ్య అమ్మ మన ముగ్గురి కాదు కాదు నలుగురి అమ్మ ఎక్కడ ఉన్నారు - మమ్మల్ని తీసుకెళతారా ........... 
తల్లీ - బస్వాస్ .......... సాయంత్రం అక్కడికి కూడా వెళుతున్నాము . మీరన్నట్లే అందరికీ అమ్మ అని ముద్దులుపెట్టి మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తూ షాపింగ్ మాల్ చేరుకున్నాము .

కీర్తితోపాటు బిస్వాస్ ను కూడా ఎత్తుకుని లోపలికి కిడ్స్ wear దగ్గరకువెళ్లి బుజ్జాయిలిద్దరికీ డ్రెస్సెస్ చూయించండి .
బుజ్జాయిలు : అన్నయ్యా ..........
ష్ ......... అనగానే , నోటిపై వేలిని వేసుకుని సైలెంట్ అయిపోయి లోలోపలే నవ్వుకుంటున్నారు . 
మా బుజ్జాయిలు బంగారం అని చెరొకముద్దుపెట్టు టేబుల్ పై కూర్చోబెట్టాను . మీకిష్టమైనవి సెలెక్ట్ చెయ్యండి అదిగో అక్కడ మీకు ఫ్యాషన్ షూస్ తీసుకొస్తాను అనిచెప్పాను . 
ఊహూ .......... అన్నయ్యా ........ అని లేచి నన్ను హత్తుకుని మీతోనే ........
 మురిసిపోయి లవ్ యు .......... అని ముద్దులుపెట్టి కూర్చున్నాను .
బుజ్జాయిలు : అన్నయ్యా .........మీరే సెలెక్ట్ చెయ్యండి . అవే మాకు ఇష్టం అని నా ఒడిలో కూర్చున్నారు .
మరింత పరవశించి లేటెస్ట్ డ్రెస్సెస్ చూయించండి అన్నాను . నో నో నో ........అంటూ మొత్తం చూసి బిస్వాస్ కు జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ - నా బుజ్జితల్లికి పింక్ బార్బీ డ్రెస్ మరియు ఆ డ్రెస్ కు అవసరమైన అలంకరణను తీసుకున్నాను . ఎదురుగా ఉన్న సెక్షన్ లో కొత్త డిజైన్ నడిస్తే సౌండ్ వచ్చే షూస్ తీసుకుని అన్నింటినీ సేల్స్ గర్ల్ కు అందించి , బుజ్జాయిలను రెడీ చేయగలరా అని అడిగాను . 
సేల్స్ గర్ల్ : Sure సర్ , పిల్లలూ రండి అని చేతులను చాపింది .
బుజ్జాయిలు : అన్నయ్యా - అన్నయ్యా .......... మమ్మల్ని మీరే కారులో రెడీ చెయ్యండి అని షర్ట్ ను గట్టిగా పట్టేసుకున్నారు .
 నవ్వుకుని అధికాదు ........... డ్రెస్ అయితే ok , మా బుజ్జితల్లిని నేను బార్బీ ఏంజెల్ గా - బిస్వాస్ ను బుల్లి హీరోగా కాస్త కష్టం . అక్కయ్య అయితే క్షణాల్లో రెడీ చేసేస్తారు, నేను డోర్ బయటే ఉంటాను కదా .......... మా బుజ్జికదా బంగారం కదా ......... ఎక్కడ అని అడిగాను . 
సేల్స్ గర్ల్ : ట్రయల్ రూమ్స్ సర్ అని ఎదురుగా చూయించడంతో , ఆమె వెనుకే ఎత్తుకొనివెల్లి ముద్దులుపెడుతూ అందించాను . 
కీర్తి : అన్నయ్యా ......... ఇక్కడే ఉండాలి మాట్లాడుతూ ఉండాలి అని నన్నే చూస్తూ లోపలికి వెళ్లారు .
లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , తల్లీ ........ ఇక్కడే ఉన్నాను ఒకటవసారి , తల్లీ ఇక్కడే ఉన్నాను రెండవసారి ..........
సేల్స్ గర్ల్ : సర్ ......... బాబు సిగ్గుపడుతున్నాడు .
Please please కళ్ళుమూసుకుని చేంజ్ చెయ్యండి . ఒక నిమిషం తరువాత లవ్ యు అన్నయ్యా ......... అని బిస్వాస్ మాటలు వినిపించాయి .
కీర్తి : అన్నయ్యా ..........
లవ్ యు లవ్ యు ఇక్కడే ఉన్నాను మూడవసారి .......... ఇక్కడే ఉన్నాను 100 వ సారి అనేంతలో డోర్ ఓపెన్ అయ్యింది . 
బిస్వాస్ బుల్లి హీరోలా - కీర్తి తల్లి పింక్ బార్బీ డ్రెస్ మ్యాచింగ్ బుజ్జి షూస్ మరియు బార్బీ గర్ల్ లా hairs చేతులు అలంకరించి ఉండటం చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు అని మురిసిపోతున్నాను .
అన్నయ్యా - అన్నయ్యా .......... అంటూ పరుగునవచ్చి గుండెలపైకి చేరిపోయి , మీ సెలక్షన్ సూపర్ ........... ఇలా కానీ మమ్మల్ని అమ్మ చూస్తే అలా కన్నార్పకుండా మీలానే ఆనందబాస్పాలతో రోజంతా చూస్తూ ఉండిపోతారు అని ఇద్దరూ గట్టిగా నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జి ఏంజెల్స్ బుజ్జి దేవతల్లా లా ఉన్నారు నా బంగారుకొండలు , ఎక్కడికీ వెళ్లకుండా నాకుకూడా అలా చూస్తూ ఉండిపోవాలని ఉంది అంత క్యూట్ గా ఉన్నారు .
మీ ఇష్టం అన్నయ్యా ......... అని తియ్యదనంతో నవ్వుకున్నారు . 
సేల్స్ గర్ల్ కు థాంక్స్ చెప్పి పర్స్ లోనుండి పెద్ద నోటుని తీసి కీర్తి బుజ్జిచేతితో ఇప్పించాను .
సేల్స్ గర్ల్ : థాంక్స్ పిల్లలూ .......... ముద్దొచ్చేస్తున్నారు ముద్దుపెట్టుకోవచ్చా ..........
బుజ్జాయిలు : మా అన్నయ్య పర్మిషన్ ఇస్తేనే , 
సేల్స్ గర్ల్ : సర్ .........., నవ్వడంతో బుజ్జాయిలకు ముద్దులుపెట్టి థాంక్స్ చెప్పి , స్కూల్ డ్రెస్ షూస్ ను కవర్లో ఉంచి అందించింది . 
షాపింగ్ మాల్లో డెకరేషన్ చేసిన కొన్నిచోట్ల బుజ్జాయిలకు రకరకాల స్టిల్స్ లో ఫోటోలు తీసాను . 
 అన్నయ్యా .......... అందరూ చూస్తున్నారు అని సిగ్గుతో పరుగున రావడంతో ఎత్తుకుని చాలులే అన్నాను . కౌంటర్లో పే చేసి కీర్తివైపే కన్నార్పకుండా చూస్తూ కారులో కూర్చున్నాము . 
కీర్తి : బుజ్జాయి నవ్వులతో అన్నయ్యా .......... నన్నే చూస్తూ డ్రైవ్ చేస్తే ఆక్సిడెంట్ అవుతుందేమో అని ముగ్గురమూ నవ్వుకుని ముద్దులుపెట్టి బయలుదేరాము .
Like Reply
కీర్తి తల్లీ .......... నెక్స్ట్ ఎక్కడికో తెలుసుకోవాలని ఉందా అని అడిగాను .
నా బుగ్గపై ప్రేమతో కొరికి అడగనే అడగము ఎక్కడికైనా రెడీ అని ఇద్దరూ గట్టిగా కేకలువేస్తూ కీర్తి నా గుండెలపై - బిస్వాస్ నా భుజంపై కొట్టారు .
Ok ok .......... ఇక అడగను అని ముద్దులుపెట్టాను . 11 గంటలకు జూ చేరుకున్నాము .
అక్కయ్యా - అన్నయ్యా .......... జూ అని సంతోషంతో కళ్ళు వెలిగిపోయాయి . లవ్ యు అన్నయ్యా - లవ్ యు అన్నయ్యా ......... అని బుగ్గలపై ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉన్నారు . 
ఆస్వాదిస్తూ కారుని పార్క్ చేసి , మా బుజ్జాయిలకు ఇష్టమే అయితే అని ముద్దులుపెట్టి ఇద్దరినీ ఎత్తుకుని దిగి , కౌంటర్లో టికెట్స్ తీసుకుని , ఎంట్రన్స్ లో ఫోటోలను తీసి , లోపలికివెళ్లి స్నాక్స్ షాప్ లో చిప్స్ , చాక్లెట్ లు , ఐస్ క్రీమ్స్ .......... బుజ్జాయిలకిష్టమైనవన్నీ బోలెడు తీసుకుని , ఎప్పుడెప్పుడు animals పక్షులు చూద్దామా అని వాళ్ళ కళ్ళు ఉత్సాహంతో చుట్టూ చూస్తున్నాయి . 

సంతోషించి వాళ్ళ బుజ్జిచేతులను చెరొకవైపు పట్టుకుని పుయ్ పుయ్ ........ మంటూ సౌండ్ చేస్తూ మొదట ఉన్న సాఫ్ట్ అనిమల్స్ బోలెడన్ని పక్షులను చూయించి ప్రతిదాని దగ్గరా ఫోటోలు తీసాను . అన్నయ్యా మీరు అని సెల్ఫీలు కూడా తీసుకున్నాము . 
నెక్స్ట్ లయన్ ను చూసి దాని గాండ్రింపును విన్న తరువాత కొన్ని నిమిషాలు నా నుండి కిందకు దిగలేదు . వేరేవాళ్లకు కెమెరా ఇచ్చి లయన్ , టైగర్ , ఎలుగుబంటి ఇలాంటి వాటిని చూయించి భయపడితే ముద్దులతో ధైర్యం చెప్పి , స్నాక్స్ తింటూ ఫోటోలు తీసుకుంటూ ముందుకు నడిచాము . 

అక్కయ్యా - అన్నయ్యా ......... ట్రైన్ ట్రైన్ ........ అన్నయ్యా అన్నయ్యా ......... ట్రైన్ అని చూయించడంతో , మొదట టాయ్ ట్రైన్ ముందు బుజ్జాయిలకు ఫోటోలను తీసాను . టికెట్స్ తీసుకుని మొదటి పెట్టెలో ఎక్కి కూర్చున్నాము . బుజ్జాయిలిద్దరూ ఆనందంతో ఎంజాయ్ చేస్తూ నా ఒడిలో కూర్చున్నారు . ప్రక్కన కూర్చోబెట్టబోతే కొట్టిమరీ కూర్చోవడంతో లవ్ యు అని ముద్దులుపెట్టి నవ్వుకుని చాక్లెట్ అందించాను.
ట్రైన్ కదిలేముందు హార్న్ సౌండ్ మ్రోగడంతో , బుజ్జాయిలు కూడా అలానే సౌండ్ చేసి , కధలగానే చుక్ బుక్ చుక్ బుక్ ......... మంటూ ట్రైన్ లా చేతులూపి ఎంజాయ్ చేస్తున్నారు . ఇద్దరూ చెరొకవైపు చూస్తూ అక్కయ్యా - అన్నయ్యా .......... అంటూ వాళ్ళు చూసినవి చూయించి తముచుట్టూ వేసిన చేతిపై సంతోషం పట్టలేక ముద్దులుపెడుతున్నారు . వాళ్ళు చూసినవాటిని జూమ్ లో ఫోటోలు తీసి చూయించాను . ట్రైన్ లో చివరివరకూ వెళ్లి మళ్లీ స్టార్టింగ్ పాయింట్ చేరుకుని మరొకవైపు ఉన్న జంతువులను చివరన జిరాఫీని అంతెత్తుకు తలెత్తి చూసి వెనుకకు పడిపోతుంటే ఎత్తుకున్నాను . 
ఎంతపెద్దగా ఉందో బ్యూటిఫుల్ అన్నయ్యా ........... 
అయితే ఇక్కడ బోలెడన్ని ఫోటోలను తీసుకోవాల్సిందే అని తీసుకున్నామును . 

బుజ్జాయిలూ .......... ఇదే లాస్ట్ ఇక వెళదామా అని అడిగాను .
అన్నయ్యా - అన్నయ్యా ........... 
సమయం చూసి లంచ్ సమయానికి మరొక అర గంట ఉండటంతో , మరొకసారి చూద్దామా అన్నాను . 
ఉమ్మా ఉమ్మా ......... అని ముద్దులవర్షం కురిపించడంతో , ఎత్తుకుని అరగంటలో ఒక రౌండ్ వేసి అన్నింటినీ చూయించాను . Ok నా మళ్లీ చూడాలని ఉందా ........
లవ్ యు లవ్ యు అన్నయ్యా .......... చాలు ఫుల్ హ్యాపీ అని ముద్దులుపెట్టారు . 
లవ్ యు అని హత్తుకుని బోలెడన్ని స్వీట్ మెమోరీస్ తో బయటకువచ్చి కారులో కూర్చున్నాము . బిస్వాస్ కు సీట్ బెల్ట్ పెట్టి కెమెరా అందించడంతో చూస్తూ కూర్చున్నాడు .

1:30 కి .......... తొలిసారి 10th క్లాసులో అద్భుతమైన ప్రపంచంలోకి తొలిసారి అడుగుపెట్టిన దేవతను దర్శింపజేసేలా చేసిన 5 స్టార్ హోటల్ కు చేరుకున్నాము . కీర్తి తల్లీ - బిస్వాస్ లంచ్ చేద్దామా అని అడిగాను .
ఇంత పెద్ద హోటల్లోనా .......... అమ్మ లంచ్ బాక్స్ కట్టించారు అన్నయ్యా ..........
అది నేను తింటాను మీరు లోపల మీకిష్టమైనవి తినండి . మీ అమ్మ చేతితో చేసిన వంట నేను తినవచ్చా బుజ్జాయిలూ అని అడిగాను .
లవ్ టు అన్నయ్యా .......... అంతకంటే అదృష్టమా ......... మీరు తిన్నారని తెలిస్తే అమ్మ చాలా చాలా సంతోషిస్తారు , అమ్మ సూపర్ గా చేస్తుంది అన్నయ్యా .........
లవ్ యు లవ్ యు sooooo మచ్ అని ముద్దులుపెట్టి , వెనకున్న లంచ్ బ్యాగ్ తీసుకుని లోపలికివెళ్లాము . 

లోపల చూసి ఆరోజు మేము ఎలా అయితే ఆశ్చర్యపోయామో బుజ్జాయిలు కూడా అలానే ఆశ్చర్యపోవడం చూసి ఆనందించి ముద్దులుపెట్టి , మొదటగా దేవత మిస్ వైజాగ్ కిరీటం సాధించిన బిగ్గెస్ట్ హాల్ వైపు వెళ్ళాను . 
సర్ నో ఎంట్రీ అని స్టాఫ్ ఆపడంతో , మొబైల్ తీసి సర్ కు కాల్ చేసి విషయం చెప్పాను .
మహేష్ .......... ఈవెంట్ కోసం లుక్ వెయ్యడానికి వచ్చావని చెబితే హోటల్ మేనేజర్ పరిగెత్తుకుంటూ వస్తాడు . రెండే రెండు నిమిషాలు దర్జాగా లాంజ్ లో కూర్చోమనిచెప్పి కట్ చేశారు .
సర్ చెప్పినట్లుగానే మేనేజర్ పరుగునవచ్చి , sorry బాబు ......... మావాళ్లకు తెలియక ఆపారు . Please వెళ్ళండి మీకిష్టమైనంతసేపు చూడండి అని చేతితో చూయించారు . క్యూట్ పిల్లలు ........ ముద్దొచ్చేస్తున్నారు . sorry పిల్లలూ .......... మీ dad ను ఆపినందకు అన్నారు .

మేనేజర్ మాటలకు వొళ్ళంతా జిల్లుమంది . బుజ్జాయిల నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో హమ్మయ్యా ........... సంతోషంలో వినలేదన్నమాట అనుకుని , తియ్యని సిగ్గుతో ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టాను . రేయ్ తప్పు అని మనసు గుర్తుచేయ్యడంతో sorry sorry అని డోర్స్ తెరుచుకుని లోపలికివెళ్లాము . 
నిన్నొ మొన్నో ............ ఏదో ఫంక్షన్ జరిగినట్లు డెకరేషన్ అలానే ఉంది . డోర్స్ తెరవగానే మొత్తం లైట్స్ on అవ్వడంతో మరింత అద్భుతంగా కనిపించింది .
కీర్తి :  Wow .......... బ్యూటిఫుల్ , అన్నయ్యా ......... is this heaven ? అని అమాయకంగా ఆడిగినప్పటికీ , 
నాకు మాత్రం ఈ ఫంక్షన్ హాల్ స్వర్గమే - దేవతను చూసింది ఈ స్టేజీపైననే కదా అని బుజ్జాయిలను స్టేజి మీద నిలబెట్టి చుట్టూ చూస్తూ ఆ మధురమైన దృశ్యాలను గుర్తుచేసుకుంటూ తియ్యదనాన్ని ఆస్వాదించాను . కెమెరా అందుకొని నాతోపాటు చుట్టూ చూసి ఆనందిస్తున్న బుజ్జాయిలనూ మరియు చుట్టూ డెకరేషన్ ను ఫోటోలు తీస్తూ చప్పట్లు వినిపించడంతో తిరిగిచూస్తే , 
కీర్తి ............ బార్బీ డ్రెస్ లో బుజ్జిబుజ్జిఅడుగులువేస్తూ స్టేజీపై వాళ్ళ అమ్మలా క్యాట్ వాక్ చేస్తూ రావడం చూసి సంతోషంతో కేకలువేసి క్లిక్ క్లిక్ మంటూ లెక్కలేనన్ని ఫోటోలు తీస్తూనే ఉన్నాను - కీర్తి చివరకువచ్చి అచ్చు దేవతలానే నాకు ఫ్లైయింగ్ కిస్ వదిలి స్టిల్స్ ఇచ్చి మళ్లీ వెనక్కు వెళ్ళిపోయింది - కళ్ళు జిగెలుమంటూ వేలు కెమెరాను క్లిక్ మనిపిస్తూనే ఉన్నాయి . చప్పట్లుకొట్టి బిస్వాస్ మీ అక్కయ్యతోపాటు నువ్వుకూడా అనిచెప్పడంతో ఇద్దరూ చేతులుపట్టుకొని బుడిబుడి అడుగులువేస్తూ వచ్చారు . ఫోటోలు తీసి అమితమైన ఆనందంతో రెండుచేతులూ చాపడంతో పరుగునవచ్చి నా గుండెలపై చేరిపోయి ఎలా చేసాము అన్నయ్యా అన్నయ్యా ....... అని నవ్వుతూనే ఉన్నారు . 
అచ్చు మీ అమ్మను చూసినట్లే ఉంది బుజ్జాయిలూ ............. అని మనసులో పరవశించి , సూపర్ లవ్లీ వండర్ఫుల్ ........... తల్లీ , ఎక్కడ చూశావు అని అడిగాను . 
ఎప్పుడో ఒకసారి టీవీలో అమ్మ చూస్తుంటే చూసాము అన్నయ్యా .......... అని సిగ్గుతో ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
అబ్బో సిగ్గే అని గిలిగింతలుపెట్టి , టిఫిన్ కూడా తినకపోవడంతో ఆకలేస్తోంది వెళ్లి తిందాము అని ఎత్తుకొనివెల్లి టేబుల్ లో కూర్చున్నాము . 
అటువెళ్తున్న మేనేజర్ గారు చూసి hey బాయ్స్ సర్ ను స్పెషల్ గా చూసుకోండి అని చేతులుకలిపి వెళ్లిపోయారు . 

బుజ్జాయిలను టేబుల్ పై కూర్చోబెట్టాను . సర్ .......... అని మెనూ కార్డ్ అందించబోతే , బుజ్జాయిలవైపు చూయించడంతో చెరొక మెనూ కార్డ్ అందించారు .
కీర్తి తల్లీ - బిస్వాస్ ......... మీ ఇష్టం ఆర్డర్ చెయ్యండి - చూసి అన్నయ్యా చికెన్ బిరియానీ లాలీపాప్ కూల్ డ్రింక్ అని ఆర్డర్ చేశారు . 
నేనైతే దేవత వంటలు ముందు ఉంచుకుని  ఆగలేకపోతున్నాను అని లంచ్ బ్యాగ్ నుండి బాక్సస్ అందుకొని అన్నింటినీ ఓపెన్ చేసి ఆహా ....... అంటూ సువాసనను పీల్చి ఏమాత్రం ఆగలేక అన్నింటినీ ఒక్కొక్క ముద్ద టేస్ట్ చేసి మ్మ్మ్మ్మ్.......మ్మ్మ్....మ్మ్మ్......... సూపర్ అని కళ్ళుమూసుకుని మైమరిచిపోతుంటే , 
ఫ్లాష్ కళ్లపై పడటంతో చూస్తే కీర్తి నవ్వుతూ ఫోటోలు తీస్తోంది . మ్మ్మ్ మ్మ్మ్....... అంటూ నోటి నిండా తీసుకుని ఫోజ్ లు ఇచ్చాను . మొత్తం నాకే నా బుజ్జాయిలకు కూడా ఇవ్వను అని దగ్గరకు తీసుకొని తింటున్నాను . 
ఇంతలో ఆర్డర్ చేసినవి రావడంతో కెమెరా అందుకొని బిరియానీతోపాటు బుజ్జాయిలకు ఫోటోలు తీసాను . 
రుచి చూసి బాగుంది అంటూ లాలీపాప్ ను బుజ్జి నోటితో లాగేస్తుంటే చూసి నవ్వుకుని ఫోటోలు తీసాను . నాకూ ఒకటి తినిపించారు . ఆ అనడంతో లేదు లేదు మీరు రోజూ తింటారుకదా ఇవి మొత్తం నాకుమాత్రమే అని కుమ్మేస్తుండటం చూసి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నవ్వుతూ ఫోటోలు తీసుకుంటూ తృప్తిగా తిన్నాము . చివరగా ఒక పెద్ద గోల్డ్ ప్లేటెడ్ కిళ్లీ - రెండు బుజ్జి గోల్డ్ స్వీట్ కిల్లీలు ఆర్డర్ చేసాను . ప్లేటులో తీసుకొచ్చారు . గబుక్కున బుజ్జి కిల్లీలను ఒక్కొక్కటి నోట్లోకి తీసుకుని మ్మ్మ్మ్మ్.....
 Juicy ......... పెద్దది నోట్లోకి తీసుకుని సూపర్ అని వేళ్ళతో సైగచేసి బిల్ టిప్ ఫైల్ లో ఉంచి బుజ్జాయిలను ఎత్తుకుని లంచ్ బ్యాగ్ కెమెరాతోపాటు కారులోకి చేరాము . 
కీర్తి తల్లీ - బిస్వాస్ .......... మీ నాలుకలు ఎర్రగా మారిపోయాయి చూడండి ఫోటోలు తీసి చూయించాను . 
అన్నయ్యా .......... మీదికూడా అని నా నాలుక ఫోటో తీసి నవ్వుకుని బయలుదేరాము .

15నిమిషాలలో మత్స్య దర్శినికి చేరుకున్నాము .
Wow aquarium ............ అని ఇద్దరూ సంతోషంతో గట్టిగా ముద్దులుపెట్టారు. 
మా బుజ్జాయిలకు ఇదికూడా ఇష్టమే ........... లవ్ యు రా మహేష్ అని నన్ను నేను శభాష్ అనుకున్నాను .
బుజ్జాయిలిద్దరూ ........... ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . ఇద్దరినీ ఎత్తుకుని మత్స్య దర్శిని ఎంట్రన్స్ ముందు జ్ఞాపకాల కోసం ఒక ఫోటో తీసి - నాతోపాటు సెల్ఫీ తీసుకున్నాము . టికెట్స్ తీసుకుని లోపలికి పిలుచుకునివెళ్లి ఎంజాయ్ అంటూ కిందకు దించబోయాను . 
హోటల్లో ఉన్నంతసేపూ మీ కౌగిలి ఎంత మిస్ అయ్యామో మీకు తెలుసా ........ మాకు ఫోటోలు వద్దు ఏమీ వద్దు ఇలాగే హాయిగా ఉంది అని గట్టిగా పట్టేసుకున్నారు . 
పరవశించి......... లవ్ యు అని ముద్దులుపెట్టి ప్రతి అక్వేరియం దగ్గరికి ఎత్తుకొనివెల్లి రకరకాల చేపలనూ తాబేళ్లనూ నక్షత్ర తాబేళ్లనూ స్టార్ ఫిష్ గోల్డ్ ఫిష్ .......... అతిదగ్గరగా చూయించి , ప్రతిదాని దగ్గరా కిందకుదించి ఫోటోలు తియ్యగానే మళ్లీ గుండెలపైకి చేరారు . అలా అర గంటపాటు బుజ్జాయిలకు తనివితీరేంతవరకూ చూయించి ok అన్నాక , ఒక గాజు అక్వేరియం తీసుకుని బుజ్జాయిలకు ఇష్టమైన చేపలను మరియు వాటికి ఫుడ్ తీసుకున్నాను . వాటినే చూస్తూ సంతోషంతో బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చారు . కారులో జాగ్రత్తగా వెనుక కదలకుండా కట్టి ఉంచాను . బుజ్జాయిలూ ......... చేపలను చూస్తూ వెనుక కూర్చుంటారా అని అడిగాను . 
ఇంటికి వెళ్ళాక వాటితో ఆడుకుంటాములే అన్నయ్యా ......... మీతో ఉన్నంతసేపూ మీ గుండెలపైననే అని చేతులు చాపడంతో , 
నా బంగారుతల్లి అని రెండుచేతులతో ప్రాణంలా గుండెలపై హత్తుకుని ముద్దులుపెట్టి మురిసిపోయాను . బిస్వాస్ ను అటువైపు కూర్చోబెట్టి , నా కీర్తితోపాటు డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి కారుని పోనిచ్చాను .

3గంటలకు వాటర్ పార్క్ ముందు ఆపాను .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......... అని సంతోషం పట్టలేక ఏకంగా నా బుగ్గపై కొరికేసి అన్నయ్యా .......... ఒక్కరోజులో ఇన్ని సర్ప్రైజ్ లు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని బుజ్జిచేతులతో గట్టిగా చుట్టేసింది కీర్తి .
చెప్పానుకదా తల్లీ .......... ఎప్పటికీ మరిచిపోని మధురమైన అనుభూతిని ఇస్తాను అని అంటూ ముద్దులుపెట్టి , పర్సులోనుండి అవసరమైన డబ్బుని ఒక కవర్లో ఉంచి జేబులో పెట్టుకుని మొబైల్ తోపాటు లాకార్లో ఉంచి , వెనక కవర్లో ఉన్న స్కూల్ డ్రెస్సెస్ అందుకుని నీటిలో దిగాలి కాబట్టి ఈ డ్రెస్ లు వేసుకోండి నేను బయట ఉంటాను అని కీర్తిని కిందకు దించి దిగబోయాను . 
మా అన్నయ్యతో మాకు సిగ్గు ఏంటి ఇక్కడే ఉండండి అని ముద్దుపెట్టి నా ముందే డ్రెస్ మార్చుకున్నారు . షూస్ తీసేసారు .
నా లవ్లీ బార్బీ డ్రెస్ అని ముద్దుపెట్టి జాగ్రత్తగా మడిచి వెనుక ఉంచాను . 
లవ్ యు అన్నయ్యా .......... అని బుజ్జినవ్వులతో హత్తుకుంది . ఇద్దరినీ ఎత్తుకుని దిగి కారు లాక్ చేసి , హమ్మయ్యా ......... ఎండ మోస్తారుగానే ఉంది అని అమ్మవారిని ప్రార్థించి లోపల ఉన్న మొత్తం గేమ్స్ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాము . 

బుజ్జాయిలూ .......... రెడీ 1 2 3 అని పరిగెత్తుకుంటూ వెళ్లి నీళ్ళల్లోకి జంప్ చేసి హత్తుకునే పైకి లేచాను . 
బుజ్జాయిలు మొదట కంగారుపడినా నన్ను చూసి ధైర్యంతో నవ్వుకున్నారు . ఇద్దరినీ ట్యూబ్స్ లో కూర్చోబెట్టి నీళ్లు చల్లుతూ ముందుకు కదిలిస్తూ స్విమ్ ఎలా చేయాలో చూయించాను . మళ్లీ ఎత్తుకుని ఒకసారి మునిగితేలి పైకివచ్చి పైకెక్కి స్లైడ్స్ ద్వారా రయ్యిన తిరుగుతూ తిరుగుతూ వచ్చి నీళ్ళల్లోకి చేరాము . బుజ్జాయిలకు నచ్చినట్లు ఎన్నిరకాల స్లైడ్స్ ఉంటే అన్నీ స్లైడ్స్ లలో పట్టుకుని కిందకు జారీ ఎంజాయ్ చేసాము . 
అన్నయ్యా .......... సూపర్ గా ఉంది మళ్లీ మళ్లీ అని కోరడంతో లెక్కలేనన్ని సార్లు స్లైడ్స్ లో జారాము . 

నెక్స్ట్ కాసేపు రైన్ డాన్స్ , పైనుండి ఒక్కసారిగా గాలన్స్ ఆఫ్ వాటర్ కిందపడేదగ్గర మరియు పార్క్ లో ఉన్న అన్నీ గేమ్స్ 5 గంటలవరకూ ఎంజాయ్ చేస్తూ బోలెడన్ని ఫోటోలను తీసుకున్నాము . బుజ్జాయిలిద్దరూ ........... చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు . తనివితీరినట్లు నన్ను చెరొకవైపునుండి ముద్దులతో ముంచెత్తారు . పైకివచ్చి కొత్త టవల్ లు తీసుకుని ముందు బుజ్జాయిల తలలను తుడిచి కారులోకివెళ్లి మొత్తం బట్టలు విప్పేసి వొళ్ళంతా తుడిచి కీర్తి తల్లికి బార్బీ డ్రెస్ వేసేలోపు బిస్వాస్ డ్రెస్ వేసుకుని కూర్చుని ఫోటోలను చూసి నవ్వుకుంటున్నాడు . 
కీర్తి : అన్నయ్యా ......... ఎంత ఎంజాయ్ చేశామో మాటల్లో చెప్పలేము . అమ్మకూడా ప్రక్కన ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతూ నా గుండెలపైకి చేరింది . 
అది మనచేతిలో లేదు తల్లీ నన్ను క్షమించు అని మనసులో అనుకుని , రెండుచేతులతో కౌగిలించుకుని , తల్లీ కీర్తి ........... మన అమ్మ దగ్గరకు వెళ్ళడానికి రెడీనా అని అడిగాను .
ఒక్కసారిగా ఉత్సాహం పెదాలపై చిరునవ్వు చిగురించి , అమ్మదగ్గరికి అమ్మదగ్గరికి ............. అని నా బుగ్గపై ఆపకుండా ముద్దులుపెడుతూ ఎంజాయ్ చెయ్యడం చూసి , నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి లవ్ యు బుజ్జితల్లీ అని స్టార్ట్ చేసి గేర్ మార్చి పోనిచ్చాను .

దారిలో ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగి 200 కోన్ ఐస్ క్రీమ్స్ - చాక్లెట్ లు తీసుకున్నాము . 
అన్నయ్యా ......... అని ఆశ్చర్యపోతుంటే , మీరే చూస్తారుకదా బుజ్జాయిలూ అని ఎత్తుకుని అన్నింటినీ కారులో పెట్టించి , 15నిమిషాల్లో శరణాలయం చేరుకున్నాము . మాకోసమే బుజ్జాయిల కోసమే ఎదురుచూస్తున్నట్లు అందరూ కారుచుట్టూ చేరి ప్లేట్లను గరిటలతో కొడుతూ స్వాగతం పలికారు . 
బుజ్జాయిలు సంతోషం ఆశ్చర్యంతో చూస్తుంటే , బుజ్జాయిలూ ......... మిమ్మల్ని చూడటానికి - మీతో ఆడుకోవడానికి ఎంతమంది పిల్లలు ఎదురుచూస్తున్నారో చూడండి . మీ ఇష్టం వచ్చినంతవరకూ మీతో ఆడుకుంటారు అని పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ మురిసిపోతున్న బుజ్జాయిలను ఎత్తుకుని కిందకు దిగి ముద్దులుపెట్టి , కిందకు దించాను . 
అన్నయ్యా - అన్నయ్యా .......... అని నావైపు చూస్తుంటే , wow ........ ఎంత క్యూట్ ఎంత ముద్దొస్తున్నారో , బుజ్జాయిలూ బుజ్జాయిలూ ............ welcome welcome ......... అంటూ శరణాలయం లోపల ఉన్న మొక్కలలోని పూలను చేతులలో ఉంచుకున్నట్లు బుజ్జాయిలపై పూల వర్షం కురిపించారు . 
రాలుతున్న పూలను చూసి బుజ్జిబుజ్జినవ్వులతో మురిసిపోతుంటే , వొంగి ముద్దులుపెట్టి వెళ్ళండి నేను వెనుకే వస్తాను - తమ్ముళ్లూ ......... బుజ్జాయిలకు మన అమ్మను చూయించండి అనిచెప్పాను . 

పెదాలపై చిరునవ్వుతో అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా ఉన్న పిల్లలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ చేతులను పట్టుకుని లోపలికి నడిచారు . 
వార్డెన్ సహాయంతో బాక్స్ లను వెనుకే తీసుకెళ్ళాను .
తమ్ముళ్లూ - పిల్లలు ........... బుజ్జాయిలను నవ్విస్తూ పేర్లు తెలుసుకుని తమ పేర్లను చెబుతూ అమ్మవారిదగ్గరకు తీసుకెళ్లి , కీర్తి - బిస్వాస్ ............ మా అనాధలందరికీ అమ్మ అని చూయించి , బుజ్జాయిలను చల్లగా చూడు అమ్మా అని ప్రార్థించారు . 
చూడగానే బుజ్జాయిలిద్దరూ .......... రెండుచేతులతో మొక్కారు . పిల్లలు బుజ్జాయిలిద్దరికీ అమ్మ కుంకుమను నుదుటిపై ఉంచారు . 
కుంకుమతో చూస్తుంటే అమ్మ అనుగ్రహం పొందినట్లుగా అనిపించి కళ్ళల్లో ఆనందబాస్పాలతో మురిసిపోతున్నాను . 

అన్నయ్యా - అన్నయ్యా .......... అంటూ కుంకుమ తీసుకుని పరుగునవచ్చి నా నుదుటిపై ఉంచారు . 
బుజ్జాయిలూ .......... అంటూ ప్రాణంలా హత్తుకున్నాను . 
అన్నయ్యా - అన్నయ్యా ............ మీరు కూడా మీరుకూడా ..........
అవును తల్లీ .......... అనాధనే , కానీ ఇక్కడ పెరిగితే అందరూ అన్నయ్యలూ తమ్ముళ్లూ .......... ఇక ఇప్పుడు నా బుజ్జితల్లి కీర్తి ఉంది - బిస్వాస్ ఉన్నాడు - మీ అన్నయ్యలు చూడు ఎంతమంది ఉన్నారో అని అటువైపు తిప్పి చిరునవ్వులు చిందిస్తున్న తమ్ముళ్లనూ - పిల్లలనూ చూయించాను . 
బుజ్జాయిలు : అవును అందరూ మాకు అన్నయ్యలే - అమ్మలుకూడా ఇద్దరు . అన్నయ్యా .......... మాతోపాటు మీకు మన అమ్మ ఉంది - మా అమ్మకూడా ఉంది గుర్తుపెట్టుకోండి .
నా బుజ్జాయిలు ఎలా చెబితే అలా అని నుదుటిపై ముద్దులుపెట్టాను .
అన్నయ్యా ......... అమ్మకు చూయించాలి ఫోటోలు తీసారా లేదా ? 
అదిగో మా వార్డెన్ సర్ అని చూయించాను . ఏకంగా వీడియోని తీస్తున్నారు . బుజ్జాయిలూ ........... మీ అన్నయ్యలకు తీసుకొచ్చినవి ఇద్దామా ............
ఊ ఊ .......... అంటూ ఉత్సాహంతో తలలు ఊపారు . 

కీర్తి తల్లి ........... ఐస్ క్రీమ్స్ - బిస్వాస్ ......... చాక్లెట్ లు తీసుకుని స్వయంగా వాళ్లదగ్గరికే వెళ్లి పంచారు . 
అందరూ థాంక్స్ చెల్లీ - థాంక్స్ తమ్ముడూ .......... అని సంతోషంతో అందుకుని తిని సూపర్ - చల్లగా ఉంది - తియ్యగా ఉంది .......... బుజ్జాయిలూ మీరూ తినండి అన్నారు . 
మొదట వార్డెన్ కు తరువాత నాకు అందించి , మిగిలినవన్నీ కూడా అందరికీ పంచి చివరగా మిగిలివవి తినడం చూసి , అచ్చు దేవతలానే అని అనుకున్నాను .

తిన్నాక .......... థాంక్స్ థాంక్స్ థాంక్స్ బుజ్జాయిలూ అని వైజాగ్ మొత్తం వినిపించేలా కేకలువేసి , బుజ్జాయిలూ ........... ఆడుకుందాము రండి అని ఎత్తుకున్నారు . 
నావైపు చూసారు . ఎంజాయ్ అనడంతో పదండి అన్నయ్యలూ .......... అని ఉత్సాహంతో వెళ్లారు . కెమెరా అందుకొని వీడియో తీస్తూ అన్నయ్యా అన్నయ్యా .......... అని కేకలువేస్తూ అంతమందితో ఆడుకుంటున్న బుజ్జాయిల ఆనందాన్ని చూసి పరవశించిపోతున్నాము .
Like Reply
బుజ్జాయిలిద్దరూ పరుగునవచ్చి మీరు కూడా రండి అని లాక్కునివెళ్లారు . వార్డెన్ నవ్వుకుని నా చేతిలోని కెమెరా అందుకున్నారు . బుజ్జాయిలను ఎత్తుకుని పరుగుతీస్తూ ఎవరికీ దొరకకుండా చూస్తూ , చిరునవ్వులను ఎంజాయ్ చేస్తున్నాను . బుజ్జాయిలు అలసిపోయినా కూడా ఉత్సాహంతో ఒకదానితరువాతమరొక ఆట ఆడుతూనే ఉన్నారు . 
అన్నయ్యా - అన్నయ్యా .......... మీరు చెప్పినట్లుగానే నిన్న ముగ్గురం - ఈరోజు వందలం - రేపు వేలు - ఎల్లుండి లక్షలు .......... అని ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టారు . 
7:30 అవ్వడంతో తమ్ముళ్లూ ......... ఇంటిదగ్గర బుజ్జాయిల అమ్మ గారు వేచి చూస్తుంటారు వెళతాము లేదు లేదు వెళ్ళొస్తాము ........... బుజ్జాయిలూ ........ మాల్లీ వద్దాము మళ్లీ మళ్లీ వద్దాము ok నా అన్నాను .
అయితే ok అన్నయ్యా ......... అని ఉత్సాహపు ఆయాసంతోనే ముద్దులుపెట్టారు . అన్నయ్యలూ .......... మిమ్మల్ని వదిలివెళుతుంటే కన్నీళ్లు అని వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లను చూసి చేతులుచాపి వాళ్లదగ్గరికివెళ్లి , బాధపడకండి అన్నయ్య మమ్మల్ని మళ్లీ తీసుకొస్తారు అప్పుడు రోజంతా ఆడుకుందాము ok నా ok నా ......... అని కన్నీళ్లను తుడిచి , ఇంతమంది తమను ఇష్టపడటం తెలిసి నా కళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ మురిసిపోతున్నారు . 

మహేష్ ......... ఎక్కడికీ వెళ్ళేది లేదు మీకోసం ముఖ్యంగా మా బుజ్జాయిలకోసం స్పెషల్ గా భోజనం చేయించాను .
బుజ్జాయిలూ ........... మీ అన్నయ్యలతో కలిసి తిందామా ...........
యాహూ .......... లవ్ యు లవ్ యు లవ్ యు అన్నయ్యా ........... అని ముద్దులుపెట్టి ఇష్టం కాదు ప్రాణం అని తెలియజెయ్యడంతో , 
బావిదగ్గరకువెళ్లి అందరితోపాటు బుజ్జాయిల ముఖం కాళ్ళు చేతులు శుభ్రం చేసి డైనింగ్ హాల్లో అందరితోపాటు మధ్యలో కూర్చున్నాము . 
బుజ్జాయిలు లేచినిలబడి అయ్యో ......... అక్కడ నుండి మళ్లీ అక్కడ వరకూ మేమంటే ఇష్టమైన అన్నయ్యలే , ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి - వాళ్ళ ప్రేమను స్వీకరించి వడ్డించిన వంటలను ప్రసాదంలా మ్మ్మ్ ...... మ్మ్మ్...... అన్నయ్యా .......... అమ్మ వంట ఎలా ఉందో అలా ఉంది - అమ్మకు కూడా కాస్త తీసుకెళదాము అన్నయ్యా .............
లవ్ యు తల్లీ ........... ఆడి ఆడి ఎనర్జీ లాస్ అయి ఉంటుంది కడుపునిండా తినండి . 
అన్నయ్యా ............ మా అన్నయ్యలతో ఆడి మరింత ఎనర్జీ వచ్చింది థాంక్స్ అన్నయ్యలూ .......... చూడండి ఎంత శక్తి వచ్చిందోనని చేతి కండలను చూయించడంతో అందరూ సంతోషంతో నవ్వుకున్నారు . 

బుజ్జాయిలు : అన్నయ్యా - అన్నయ్యా ......... tasty tasty ...........ఈ ఫుడ్ తినే మీరు ఇంత బలంగా ఉన్నారన్నమాట అని మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని తృప్తిగా తిని , అమ్మవారి ప్రసాదమైన అమృతం లాంటి నీటిని తాగి , అందరితోపాటు బయటకు వాళ్ళతో మాట్లాడుతూనే వచ్చారు . అన్నయ్యా అన్నయ్యా ........... అన్నయ్యలందరితో - మీతో ఒక గ్రూప్ ఫోటో అని కోరడంతో .........
వార్డెన్ కెమెరా అందుకుని తీశారు . బుజాయిలు పిల్లలను కౌగిలించుకుని మళ్ళీవస్తాము అనిచెప్పి కారువరకూ వచ్చి , వార్డెన్ నుండి క్యారేజీ అందుకొని అంతులేని సంతోషంతో అనంత జ్ఞాపకాలతో టాటా బై లు చెప్పి , నన్ను గట్టిగా హత్తుకుని తలెత్తి కన్నార్పకుండా కొత్తగా చూస్తూ ఉంది .
ఏంటి తల్లీ ............
హోటల్ దగ్గర నుండి ఎందుకో మరింత కొత్తగా కనిపిస్తున్నారు అన్నయ్యా ......... నన్ను ఇలానే చూడనివ్వండి - డిస్టర్బ్ చెయ్యకండి - కావాలంటే ముద్దులు పెట్టుకోండి.
మా బుజ్జితల్లి ఎలా అంటే అలా అని నుదుటిపై ముద్దులుపెడుతూ 8:30 కి అపార్ట్మెంట్ చేరుకున్నాము . తల్లీ ......... అపార్ట్మెంట్ కూడా చేరుకున్నాము - అమ్మను కలవాలని లేదా ...........
ప్చ్ ........... మీరిద్దరినీ ఓకేదగ్గర ఎందుకు ఉంచలేదు మన అమ్మవారు అని గట్టిగా గుండెలపై హత్తుకుని బాధపడుతోంది .

బిస్వాస్ :  అన్నయ్యా .......... కెమెరా ఆగిపోయింది - అమ్మకు చూయించడం ఎలా .........
అయ్యో ........... ఛార్జింగ్ కూడా లేదే ఇప్పుడెలా ..........
కీర్తి : అన్నయ్యా ......... అమ్మకు చూయించి మొత్తం సంతోషాన్ని పంచుకోవాలని ఉంది . 
స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు బుజ్జాయిలూ .......... 
అన్నయ్యా .......... ఇంట్లో స్మార్ట్ ఫోన్ కాదుకదా చిన్న ఫోన్ కూడాలేదు . ల్యాండ్ లైన్ మాత్రమే ఉంది . 
మరి కంప్యూటర్ ........
ఊహూ .........
లాప్టాప్ ...........
ఊహూ ............ అమ్మ యూజ్ చేస్తారని ............ అంటూ బాధపడ్డారు .

కీర్తి తల్లీ ఒక పని చెయ్యండి మీరు సెక్యూరిటీ అన్నతోపాటు పైకివెళ్లండి నేను వెంటనే తీసుకొచ్చేస్తాను . 
త్వరగా వచ్చేయ్యాలి అని దిగేంతవరకూ ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉంది . 

అన్నా .......... అని పిలవడంతో పరుగున వచ్చారు . బుజ్జాయిల .......... కాదు కాదు వాడు వచ్చాడా ............ 
లేదు సర్ .......... ఈరోజుకు రాడు కూడా ........... మీరు పేపర్ చదవరు కదా ,  ఈరోజు , రేపు హైద్రాబాద్ CBI ఆఫీస్ లో అటెండ్ అవ్వాలి విచారణ కోసం వెళ్లి ఉంటారు . 
థాంక్స్ అన్నా .......... కాస్త ఈ బ్యాగులను తీసుకుని బుజ్జాయిలను పైకి వదులుతారా ...........
Oh yes సర్ ............ బుజ్జాయిలూ రండి అని బ్యాగులు పట్టుకుని ముందు నడిచారు . 
అన్నయ్యా .......... ఆ చేపలను మీ దగ్గరే ఉంచుకోండి - వాడు చూస్తే పగలగొట్టేస్తాడు - మీరు త్వరగా వచ్చేయ్యాలి . ల్యాండ్ లైన్ నెంబర్ ********** . అందుకే గుడ్ నైట్ కూడా చెప్పడం లేదు - గుడ్ నైట్ కిస్సెస్ కూడా పెట్టడం లేదు అని , ముద్దుపెట్టకుండా దిగడం ఇద్దరికీ కష్టం అయినా కంట్రోల్ చేసుకుని కిందకు దిగి , తొందరగా వచ్చేయ్యాలి అని వేలితో వార్నింగ్ ఇస్తూ సెక్యూరిటీ వెనుక వెళ్లారు .
కీర్తి తల్లీ నెంబర్ ********** అని చెప్పడంతో నవ్వింది  .
లవ్ యు బుజ్జాయిలూ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి లోపలికివెళ్లాక , ఆఫీస్ కు కాల్ చేసి వేగంగా బయలుదేరాను .

ఆఫీస్ ముందు సడెన్ బ్రేక్ వేసి , కెమెరా అందుకుని పరుగున ఎడిటింగ్ రూంలోకి వెళ్ళాను .
ఎడిటింగ్ చీఫ్ : hi మహేష్ .......... లీవ్ లో ఉన్నావని చెప్పారు . అయినా డ్యూటీ చేస్తున్నావా ? ఇదేమీ బాలేదు . వెంకట్ కు కాల్ చేశావట ఏంటి సంగతి .
Sorry సర్.......... ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నాను . ఒక సహాయం ............
చీఫ్ : మహేష్ .......... ఆర్డర్ వెయ్యి నీకోసం ఆఫీస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏమైనా చేస్తాము . కమాన్ కమాన్ ...........గుసగుసా అని ఉత్సాహంతో చెప్పారు .
థాంక్యూ soooooo మచ్ సర్ అని నవ్వుకుని , సర్ .......... ఈ కెమెరాలోని ఫోటోలు ప్రింటౌట్స్ కావాలి అని అడిగాను . 
చీఫ్ : పో మహేష్ ......... ఇంతదానికి సహాయం తోటకూర అన్నావు . నేనేదో expect చేసాను తెలుసా అని ఫీల్ అయ్యి , కెమెరాను కనెక్ట్ చేశారు . స్క్రీన్ పై ఫోటోలను స్క్రోల్ చేసి చూసి wow బ్యూటిఫుల్ లవ్లీ మహేష్ ........... మాంచి సైజ్ 4k డిజిటల్ ప్రింటౌట్స్ తీద్దాము అని ప్రింటర్ ఆన్ చేశారు . 

సర్ ........... ముందు బుజ్జాయిలు ఉన్నవి మాత్రమే ...........
మహేష్ .......... నాకు లేట్ అవుతుందని ఫీల్ అవుతున్నావు కదూ డోంట్ వర్రీ , నీకోసం ఏదైనా ఇష్టంతో చేస్తాము అదే మాకు ఆనందం - నువ్వేమి చెప్పినా నాకు మాటలు వినపడవు ఎన్ని ఫోటోలు ఉంటే అన్నీ ప్రింటౌట్స్ తియ్యాల్సిందే - ఎక్కువసేపు పట్టదు కూర్చో అని చెప్పారు . 
థాంక్స్ సర్ అని లోలోపలే సంతోషించాను . 
ప్రతీదానికీ థాంక్స్ చెప్పకు మహేష్ ............ ఇది మనది . నీకు కూడా సర్వహక్కులూ ఉన్నాయి . ఆర్డర్స్ వెయ్యడం నేర్చుకోవాలి . 
సర్ ........... నేను ఏ స్థాయిలో ఉన్నా మీరే మాకు గురువులు ......... మిమ్మల్ని గౌరవించడం మాకు ఇష్టం .
టచ్ చేసావు మహేష్ , అందుకే కదా మీరంటే మాకు చాలా చాలా చాలా ఇష్టం . అదిగో తొలి ఫోటో వస్తోంది చూడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పు . 
షాపింగ్ మాల్లో కీర్తి తల్లికి బార్బీ డ్రెస్ వేసుకున్నాక తీసిన తొలి ఫోటో అచ్చం బార్బీ ఏంజెల్ లానే ఉండటం చూసి ఆనందబాస్పాలతో మురిసిపోతున్నాను . 
చీఫ్ : మహేష్ ......... నీ ఆనందం చూస్తుంటే పర్ఫెక్ట్ అనిపిస్తోంది . అయితే సెలెక్ట్ అల్ కొట్టేస్తాను 15 నిమిషాల్లో మొత్తం వచ్చేస్తాయి . 
మీ ఇష్టం సర్ ........... 
అదిగో మళ్లీ ............ అని నవ్వుకున్నాము . 

ప్రింటర్ నుండి వస్తున్న ఫోటోలను కేవలం బుజ్జాయిలు ఉన్నవీ - నేను బుజ్జాయిలతో ఉన్నవాటిని వేరు వేరుగా ఉంచుతున్నాను . 15 నిమిషాల్లో వందల్లో ఫోటోలన్నీ వచ్చేసాయి . ఫోటోలను అందులో బుజ్జాయిల సంతోషాన్ని చిరునవ్వులను చూస్తూ మైమరిచిపోతున్నాను .
చీఫ్ : మహేష్ .......... వీడియోలు ఉన్నాయి . Cd లలో కాపీ చేసి ఇవ్వనా .........
ప్రస్తుతానికి వీడియో లలో చక్కని దృశ్యాలను ప్రింటౌట్స్ తీద్దాము సర్ ...........
చీఫ్ : అయితే ఇక్కడ ప్రక్కనే కూర్చుని షాట్స్ చూయించు అని పిలిచారు . 
వీడియో ప్లే చేశారు నచ్చిన షాట్స్ ను చూపించగానే బ్యాక్ వార్డ్ వెళ్లి ప్రింటౌట్స్ కు పంపిస్తున్నారు . 
అమ్మవారిని దర్శించుకున్న , ప్రార్థిస్తున్న , తమ్ముళ్లు బుజ్జాయిలకు అమ్మవారి కుంకుమ పెడుతున్న , నాకు కుంకుమ పెట్టిన , అందరితో ఆడుకుంటున్న , అందరితో భోజనం చేసిన , చివరికి బయలుదేరుతూ గ్రూప్ ఫోటో ప్రింటౌట్స్ మాత్రం రెండు తీసుకుని ఒక్కోదానిలో ఉంచాను . 
ఫోటోలన్నింటినీ జాగ్రత్తగా రెండు బాక్స్ లలో ఉంచి , బుజ్జాయి ఫోటోల బాక్స్ మాత్రం అందమైన గిఫ్ట్ లా మార్చేసి , పైన బుజ్జి దేవుళ్ళకు గిఫ్ట్ from మీ అన్నయ్య అని రాసి నవ్వుకుని , సర్ కు థాంక్స్ చెప్పబోయి ఆగి చేతులను కలిపి కౌగిలించుకున్నాను . 
చీఫ్ : మహేష్ వన్ మినిట్ అని మొబైల్ తీసి సెల్ఫీ తీసుకుని , నా అదృష్టాన్ని అందరికీ చూయించాలికదా అని మురిసిపోయి , మహేష్ ........... కెమెరా ......... 
సర్ .......... మన ఆఫీస్ దే ఇక్కడే ఉంచండి .
నో నో నో మహేష్ .......... సర్ నీకు గిఫ్ట్ ఇచ్చేసారు . Its yours now అని నాకే ఇచ్చేసారు .
సర్ .......... ఇంత costly గిఫ్ట్ ...........
 చీఫ్ : మహేష్ .........ఇంత విలువైన ఫోటోలు బోలెడన్ని తియ్యాలి ఎంజాయ్ అనిచెప్పి నాకొసమే ఇప్పటివరకూ ఉన్నట్లు ఫైల్స్ తీసుకుని గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు . 
సర్ కు మరియు చీఫ్ కు మనసులో థాంక్స్ చెప్పుకుని , అన్నయ్యా ........... తొందరగా వచ్చేయ్యాలి అన్న బుజ్జితల్లి వార్నింగ్ గుర్తుకొచ్చి నవ్వుతూ ఫోటోలన్నింటినీ కెమెరాను తీసుకుని పరుగున కారులో చేరి అపార్ట్మెంట్ వైపు వేగంగా పోనిచ్చాను .
*************

సెక్యూరిటీ వెనుకే బుజ్జిబుజ్జిఅడుగులు వేస్తూ , అంకుల్ అంకుల్ ........... వాడు రాడన్నమాట .
సెక్యూరిటీ : అవును పిల్లలూ ............ఈ రెండు రోజులూ రాత్రికూడా మీ ఇష్టం మీరు మీ అన్నయ్యతో ఎంజాయ్ చెయ్యొచ్చు . ఒకవేళ వాడు వస్తే మీ అన్నయ్యకు వెంటనే కాల్ చేసేస్తానులే ............
బుజ్జాయిలు : మాకు కూడా మీరు చెప్పినట్లుగానే అన్నయ్యతో గడపాలని ఉంది కానీ అన్నయ్య ఎక్కడ ఉంటారో తెలియదు .
సెక్యూరిటీ : షాక్ అయ్యి , మీ అన్నయ్య ఎక్కడ ఉంటారో మీకు తెలియదా .........
బుజ్జాయిలు : ఆడిగాము . సర్ప్రైజ్ అన్నారు .
సెక్యూరిటీ : wow .......... నిజంగా షాకింగ్ సర్ప్రైజ్ చెందుతారు మీరు . తెలిసాక మీ అన్నయ్యను కోపంతో కొట్టేస్తారేమో అని నవ్వుకున్నాడు . 
బుజ్జాయిలు : మా అన్నయ్యపై కోపమా - మా అన్నయ్యను కొట్టడమా .......... జరగనే జరుగదు . 
సెక్యూరిటీ : ఇప్పుడు ఇలానే అంటారులే .......... తెలిసిన తరువాత తియ్యని కోపంతో కొట్టేస్తారు . కావాలంటే బెట్ ...........
బుజ్జాయిలు : అంకుల్ .......... మా అన్నయ్య ఎక్కడ ఉండేది మీకు తెలుసా ? 
తెలుసు . 
ఎక్కడ ఎక్కడ please please .......... చెప్పండి అని ఆతృతతో బ్రతిమాలారు . 
సెక్యూరిటీ : మీ అన్నయ్య సర్ప్రైజ్ అన్నారుకదా , నేను చెబితే బాగోదు కానీ ఉదయం లోపు ఖచ్చితంగా ఆ సర్ప్రైజ్ ను ఫీల్ అవుతారు . మీ అన్నయ్యకు దెబ్బలే దెబ్బలు .
బుజ్జాయిలు : అవునా అంకుల్ ......... అని మురిసిపోయారు .
సెక్యూరిటీ ఆనందించి , పిల్లలూ .......... నేను డోర్ వరకూ వచ్చానని తెలిస్తే వాడు మిమ్మల్ని కొడతాడు అని బ్యాగులను ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే ఉంచి , all the best ఫర్ your బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అని విష్ చేసి కిందకువెళ్లిపోయాడు .

బిస్వాస్ : అక్కయ్యా .......... బ్యాగ్స్ నేను తీసుకొస్తాను నువ్వు వెళ్లు - అమ్మ ఎదురుచూస్తుంటారు . 
కీర్తి : లవ్ యు అన్నయ్యా .......... అని బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మా అమ్మా .......... మీ బుజ్జాయిలం బోలెడన్ని సంగతులతో వచ్చేసాము అని డోర్ పూర్తిగా ఓపెన్ చేసి రా అన్నయ్యా అని పిలిచి , డోర్ దగ్గరే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న తమ తల్లి గుండెలపై ప్రపంచాన్ని జయించినంత సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ హత్తుకుంది . 
దేవత : పరవశించి నా బుజ్జితల్లీ ........... స్కూల్ నుండి వచ్చాక తనివితీరా మీ అన్నయ్యను కలిసి ఆడుకున్నారన్నమాట అని ముఖమంతా ముద్దులతో ముంచెత్తి ప్రాణం కంటే ఎక్కువగా బ్యాగ్స్ తో లోపలికివచ్చినా బిస్వాస్ తోపాటు కౌగిలించుకుని కళ్ళల్లో చెమ్మతో ఆనందిస్తోంది .
బిస్వాస్ : అమ్మా .......... ఈరోజు స్కూల్ లు వెళ్ళలేదు కదా ..........
నాన్నా , తల్లీ  .......... స్కూల్ డ్రెస్సెస్ కూడా లేవు . Wow .......... అని ఇద్దరినీ ఆనందబాస్పాలతో చూసి ఈ డ్రెస్ లలో మరింత ముద్దొచ్చేస్తున్నారు అని ఇద్దరినీ ముద్దులలో ముంచెత్తారు .
కీర్తి : లవ్ యు అమ్మా ............, బార్బీ డ్రెస్ , అన్నయ్యది బుజ్జి హీరో డ్రెస్ - మా అన్నయ్య కొనిచ్చారు . ఈరోజు ఎలా సంతోషంతో గడిపామో - ఎంత ఎంజాయ్ చేశామో మీకు మొత్తం చెబుతాము రామ్మా .......... ముందు మీకోసం తీసుకొచ్చిన ఈ ఫుడ్ తినిపిస్తాము రండి అని తమ రూమ్ కు , నాకోసం తీసుకొచ్చారా లవ్ యు అని పరవశించిపోతోంటే , ఇద్దరూ చెరొకచేతిని అందుకుని తీసుకెళ్లారు . దేవతను కూర్చోబెట్టి , చేతులను శుభ్రం చేసుకునివచ్చి ఐటమ్స్ అన్నింటినీ ముందు ఉంచి , ఆశ్చర్యపోయి చూస్తున్న తమ అమ్మకు బుజ్జిచేతులతో తినిపించారు .

దేవత : మ్మ్మ్........ మ్మ్మ్........ నిన్నటి ఐస్ క్రీమ్ కంటే సూపర్ గా ఉంది అని కళ్ళుమూసుకుని ఆస్వాదించి మళ్లీ నోరు తెరిచారు . 
ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ తినిపించారు . 
మరి మా బుజ్జాయిలు .............
అంతే మళ్లీ తమ బుజ్జి బొజ్జలను చూయించడంతో , నవ్వుకుని , మా బొజ్జలు నిండిపోయినా మా అమ్మ చేతిముద్ద తినాల్సిందే అని ఆ అన్నారు . 
దేవత : ఏమీ కాదులే పరమాన్నం tasty గా ఉంది అందుకే తింటున్నారు అని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి తినిపించారు .
మా అమ్మకు మా గురించి మొత్తం తెలుసు అని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి ప్రాణంలా తినిపించారు . 

దేవత : బుజ్జాయిలూ ........... ఇంత రుచికరమైన ఫుడ్ ఎక్కడిది - మీ అన్నయ్య .............
బుజ్జాయిలు : ఫస్ట్ నుండి మొత్తం చెబుతాముకదా ఎందుకంత ఆత్రం అని బుగ్గలపై కొరికేశారు .
దేవత : స్స్స్ ........ అని తినిపిస్తున్న చేతులతోనే రుద్దుకుని , మా బుజ్జాయిల సంతోషాలకు కారణం తెలుసుకోవాలని చాలా ఆతృత అని ప్రాణమైన ముద్దులుపెట్టి బుంగమూతి పెట్టుకున్నారు .
అమ్మా అమ్మా .......... మీ బుగ్గలపై అన్నం - దేవత తుడుచోబోతుంటే ఇద్దరూ ఆపి బుజ్జి నాలుకలతో అందుకొని మరింత tasty అని నాకడంతో దేవత ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . 
మా అమ్మ నవ్వింది అని ముద్దులుపెట్టి , మీరు కడుపు నిండా తినండి అమ్మా ......... అంతా చెప్పే మా అమ్మ గుండెలపై నిద్రపోతాము - అంతవరకూ మాకు నిద్రకూడా రాదు అనిచెప్పారు . 
దేవత : నా బుజ్జాయిలు బంగారం అని ప్రాణంలా హత్తుకుని , ఆకలేస్తోంది ఆ ........ అని తెరిచారు .
లవ్ యు లవ్ యు అమ్మా అమ్మా ........... అని ప్రాణంలా మొత్తం తినిపించారు . 
దేవత : మైమరిచిపోయి ఆ ఆ ........ అని మళ్ళీ నోరుతెరిచారు . 
బుజ్జాయిలు : అయ్యో .......... అయిపోయిందే ,
దేవత : అమ్మో అమ్మో .......... మా బుజ్జాయిల బుజ్జిచేతుల మ్యాజిక్ వలన ఫస్ట్ టైం కడుపునిండా తిన్నాను - ఇంత తిన్నానంటే నాకే షాకింగ్ గా ఉంది ఇంకా ఇంత ఉన్నా తినేసేదాన్నేమో అని సిగ్గుపడుతూ ఇద్దరినీ హత్తుకుంది . 
అమ్మా .......... మీ పెదాలపై మెతుకు అని తమ అమ్మ పెదాలపై ముద్దుపెట్టిమరీ అందుకొని మరింత రుచి అని మళ్ళీ మళ్ళీ ముద్దులుపెట్టడంతో ప్రాణంలా హత్తుకుని బెడ్ పై వాలి చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోతున్నారు .

దేవత : చిరునవ్వులు చిందిస్తూనే , బుజ్జాయిలకు గిలిగింతలు పెడుతూ ఆనందిస్తూ , ఏదో గుర్తుకువచ్చినట్లు ఒక్కసారిగా నాన్నా తల్లీ .......... అని గుండెలపై హత్తుకుని , కళ్ళల్లో చెమ్మ కార్చింది .
బుజ్జాయిలు కూడా చెమ్మతో హత్తుకుని అమ్మా అమ్మా ......... ఏమైందమ్మా ఏమైందమ్మా ........... మీరు బాధపడితే మేము చూడలేము అని అడిగారు .
దేవత : నాన్నా .......... స్కూల్ ఫీజ్ కట్టలేదని పంపించేసారా ? .

కీర్తి : నవ్వుకుని అమ్మా .......... దానికి బాధపడుతున్నారా .......... మా అన్నయ్య మొత్తం కట్టేశారుకదా అని కన్నీళ్లను బుజ్జిచేతులతో తుడిచింది . 
దేవత : తల్లీ ...........
బిస్వాస్ : అవునమ్మా ........ ఒక్క నిమిషం అమ్మా అని పరుగునవెళ్లి బ్యాగులో ఉంచిన రిసిప్ట్స్ తీసుకొచ్చి చూయించాడు . 
దేవత : అందుకుని చూసి రిసిప్ట్స్ పై ఆనందబాస్పాలను కార్చి , నాన్నా - తల్లీ ........ మీ అన్నయ్యకు మీరంటే అంత ఇష్టమా ? .
బుజ్జాయిలు : ఇష్టం కాదమ్మా ......... ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ . ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటలవరకూ మా ఇద్దరినీ ఒక్క క్షణం కూడా కిందకు దించకుండా ఎత్తుకునే ఉన్నారు - అంత ప్రాణం మేమంటే ........... , 
దేవతకు ఏమి మాట్లాడాలో ఎలా ఫీల్ అవ్వాలో తెలియక ఒక్కసారిగా జలదరించి , అమ్మా తల్లీ .......... నా బుజ్జాయిలకోసం మీరే పంపిన దేవుడు కదూ అని బుజ్జాయిలను హత్తుకుని ప్రార్థించారు . 
అమ్మా .......... నిజంగా మీరు నిన్ననే పలికినట్లు దేవుడు అమ్మా మా అన్నయ్య . ఈ ఆనందంలోనే ఈరోజు ఎంత సరదాగా గడిపామో ఎంత ఎంజాయ్ చేశామో మీకు చెబుతాము . ఫోటోలు కూడా ఉండి ఉంటే బాగుండేది ......... అనేంతలో , కాలింగ్ బెల్ మ్రోగడంతో .............
బుజ్జాయిల ముఖం వెలిగిపోయి పెదాలపై అంతులేని నవ్వుతో , అమ్మా అమ్మా ....... మా అన్నయ్య అదే అదే మీ దేవుడు వచ్చేసారు రండి రండి అని చేతులుపట్టుకుని , మీకు మీ దేవుడిని - మా అన్నయ్యకు మా ప్రియమైన దేవతలాంటి అమ్మను పరిచయం చేస్తాము అని లాక్కుంటూ డోర్ దగ్గరికి చేరుకున్నారు . 
నాన్నా - తల్లీ .......... ఒక్క నిమిషం మన ఆనందబాస్పాలను కన్నీళ్లు అనుకుని మీ అన్నయ్య బాధపడతారేమో .........
లవ్ యు అమ్మా .......... అని ముగ్గురూ తుడుచుకుని , అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ అంతులేని సంతోషంతో డోర్ తెరిచారు .

బయట ఎవ్వరూ లేకపోవడంతో అన్నయ్యా అన్నయ్యా ........... అంటూ బయటకువచ్చి చుట్టూ చూసి , నిరాశతో అక్కయ్యా - అన్నయ్యా ........... అమ్మ దేవుడు రాలేదా అని బాధపడుతున్నారు . 
దేవత పెదాలపై చిరునవ్వుతో , తల్లీ - నాన్నా .......... అని వేలితో నేలపై లోపలి నుండే చూయించారు .
కింద గిఫ్ట్ బాక్స్ అందుకొని దానిపై ప్రాణమైన బుజ్జాయిలకోసం .......... మీ అన్నయ్య అని చదివి , అమ్మా అమ్మా .......... అన్నయ్య అని మళ్లీ చుట్టూ చూసి బాక్స్ పై సంతోషంతో ముద్దుల వర్షం కురిపించి , లోపలికివెళ్లాడాన్ని ఇంటిలోనుండి తొంగిచూసి ఆనందించాను . 

అమ్మా - అమ్మా .......... గిఫ్ట్ లో ఏముందో చూద్దాము రండి అని లోపలికివెళ్లి బుజ్జాయిల బెడ్ పై కూర్చోబెట్టి , మీ దేవుడు కదా మీరే ఓపెన్ చెయ్యండి .
తల్లీ .......... ఇదిగో చూడండి బుజ్జాయిలకోసం అంటే మీకోసం మీరే ఓపెన్ చెయ్యాలి.
సరే అమ్మా అమ్మా ........... ముగ్గురమూ కలిసి ఓపెన్ చేద్దాము అని బెడ్ పై ఉంచి చుట్టూ కూర్చుని ఓపెన్ చేశారు . ఒక లెటర్ మూడు హార్ట్ సింబల్ చాక్లెట్ లు కింద బాక్స్ ఉంది . 
దేవత ఆతృతతో లెటర్ తెరిచి కీర్తి తల్లీ - బిస్వాస్ ........... మీ ప్రాణం కంటే ఎక్కువైన అమ్మతోపాటు చాక్లెట్ లు తింటూ బాక్స్ లోనివి ఆస్వాదించండి - లవ్ యు లవ్ యు లవ్ యు soooooooooo మచ్ . తల్లీ ........... మీ అన్నయ్యకూడా తల్లీ అని ప్రేమతో పిలుస్తారా ...........
అవునమ్మా ........... మీరు ఎంత ప్రాణంలా అయితే పిలుస్తారో అంతే ప్రాణంలా నా బంగారు బుజ్జి కీర్తి తల్లీ అని పిలుస్తారు అని మురిసిపోయింది . 
దేవత కూడా పరవశించి లవ్ యు నా బంగారు బుజ్జి కీర్తి తల్లీ అని తియ్యదనంతో నవ్వుకుని , గిఫ్ట్ ఏమిటోనని ఆతృతతో ఓపెన్ చేయబోతే , కీర్తి దేవత చేతులపై కొట్టి అమ్మా ......... మా అన్నయ్య చెప్పినట్లు చాక్లెట్ ఆస్వాదిస్తూ కాబట్టి రెండూ ఒకేసారి అని కీర్తి , బిస్వాస్ ....... చాక్లెట్ లు - దేవత గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేశారు . 

Wow .......... ఫోటోలు తల్లీ నాన్నా అని దేవత - మా ఫోటోలు అమ్మా అని బుజ్జాయిలు సంతోషంతో కేకలువేశారు . 
మాకు తెలుసు మా అన్నయ్య ........ మా అమ్మ చూసి తరించడం కోసం ఖచ్చితంగా ఇస్తారని లవ్ యు లవ్ యు అన్నయ్యా ......... అని తలుచుకుంది కీర్తి .

తొలి ఫొటోలో బుజ్జాయిలు స్కూల్ డ్రెస్ తో బోర్డ్ ముందు నిలబడ్డారు . దేవత అందుకుని ఉమ్మా ఉమ్మా ......... అని ముద్దులుపెట్టి , తల్లీ - నాన్న ........ బోర్డ్ పై మీ హ్యాండ్ రైటింగ్ అని సంతోషపు ఆశ్చర్యంతో అడిగారు . 
బుజ్జాయిలు : అవునమ్మా అని గర్వపడుతూ దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి మా అమ్మ వల్లనే అని ఒడిలో కూర్చుని , వెంటనే నెక్స్ట్ ఫోటో చూడకండి అసలు ఏమిజరిగిందో చెబుతాము . 
 ఉదయం మీ తియ్యని ముద్దులు అందుకొని స్కూల్ బ్యాగ్స్ మోస్తూ కిందకువెళ్లడం - స్కూల్ బస్ ఎక్కనీయకపోవడం అక్కడ జరిగిన రభసకు మేము కన్నీళ్ళతో బాధపడుతుంటే , మీ దేవుడు ప్రత్యక్షమై నేను తీసుకెళ్లనా బుజ్జాయిలూ అని కన్నీళ్లను తుడిచి బ్యాగులు భుజం పై వేసుకుని మమ్మల్ని ప్రాణంలా ఎత్తుకుని స్కూల్ కు స్కూల్ బస్ కంటే ముందే తీసుకెళ్లారమ్మా ........... ఈరోజు నుండి రోజూ ఈ అన్నయ్యే తీసుకెళతారు తీసుకొస్తాను అని మాటిచ్చారు అమ్మా ........ ఇక అక్కడ మొదలైంది మా సంతోషం . 
తల్లీ - నాన్నా .......... అని ప్రాణంలా హత్తుకుని నిజంగా మీ అన్నయ్య దేవుడు .

అప్పుడే ఏమైందమ్మా ......... మమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చెయ్యకుండా ఊ కొట్టు కావాలంటే అన్నీ ముద్దులూ చివరికి పెట్టొచ్చు అని తమ తల్లి బుగ్గలను ప్రేమతో కొరికేశారు . 
స్స్స్....... అని రుద్దుకోవడం - నోటికి తాళం వేసుకోవడం , స్స్స్....... అని రుద్దుకోవడం - తాళం వెయ్యడం చూసి .......... బుజ్జాయిలు నవ్వుకుని కొరికిన చోట తియ్యని ముద్దులుపెట్టారు . 

బుజ్జాయిలు : అన్నయ్య నెంబర్ ఇచ్చి వెళ్లిపోయారు . దేవత నెంబర్ తెలుసుకోవాలని కళ్ళతోనే express చెయ్యడం చూసి , చకచకా ********** ఇది మీ దేవుడి నెంబర్ అని మళ్ళీ ముద్దులుపెట్టారు . క్లాస్ లో మా అమ్మ tuitions వలన స్కూల్ కంటే ముందు ఉండటం వలన ప్రతి ఆన్సర్ మాకు తెలుసని చెయ్యెత్తి సర్ కు చెబుతున్నా పట్టించుకోవడం లేదు . 
తల్లీ - నాన్నా .......... అని కళ్ళల్లో కన్నీళ్ళతో హత్తుకుంది . 
అమ్మా ......... అందుకే మొత్తం వినమని చెప్పింది అని కన్నీళ్లను తుడిచి , అంతే మళ్లీ మీ దేవుడు క్లాస్ లో ప్రత్యక్షమై ఏమి జరిగిందో వివరించారు - మమ్మల్ని ఎత్తుకుని బోర్డ్ దగ్గరికి తీసుకెళ్లి ఊ అని ముద్దులుపెట్టడంతో చకచకా సాల్వ్ చేసేసాము . క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోయింది అమ్మా ......... సర్ అయితే నోరు తెరిచి షాక్ లో ఉండిపోయారు . అన్నయ్య సర్ కు వార్నింగ్ ఇచ్చి మా బుజ్జాయిలు స్కూల్ సిలబస్ కంటే ముద్దు ఉన్నారు కాబట్టి వెళ్లిపోతున్నాము అని మాకు ఈ ఫోతో మరియు అన్నయ్యతో సెల్ఫీ కూడా లేదే .......... కింద ఉందేమో లే ........
అన్నయ్య .......... మమ్మల్ని ప్రాణంలా గుండెలపై హత్తుకుని సూపర్ అని ముద్దులుపెట్టి , నాతోపాటు వస్తారా అని అడిగారు . 
దేవత అంతులేని ఆనందంతో మరి మీరేమని బదులిచ్చారు తల్లీ - నాన్నా ........ అని మళ్ళీ నోటికి తాళం వేసుకున్నారు . 
బుజ్జాయిలు నవ్వుకుని తమ తల్లి వేలిపై ముద్దులుపెట్టి , అన్నయ్యా - అన్నయ్యా ........... మా అమ్మ చెప్పింది మీ అన్నయ్య కిడ్నప్ చేసినా సంతోషంగా వెళ్ళండి అని చెప్పేశాము . 
లవ్ యు తల్లీ - నాన్నా ..........

బిస్వాస్ : అన్నయ్య గుండెలపైనుండి ప్రక్కకు వెళ్ళలేదు అక్కయ్య .......... అమ్మా . నెక్స్ట్ షాపింగ్ మాల్ కు వెళ్ళాము ఇదిగో డ్రెస్సెస్ అని చూయించి , షాపింగ్ మాల్లో స్టిల్స్ అన్నింటినీ తమ అమ్మకు చూయించారు . 
దేవత : అమ్మో అమ్మో ....... ఎన్ని స్టిల్స్ - ఫోజస్ ......... బార్బీలానే ఉంది నా తల్లి అని ఫోటోలపై ముద్దుల వర్షం కురిసింది . 
అక్కడి నుండి అన్నయ్య ఎత్తుకుని ఇక్కడికి తీసుకెళ్లారు అని ఫోటో చూయించారు .
దేవత : వెలిగిపోతున్న కళ్ళతో జూ .......... తల్లీ - నాన్నా ......... జూ వెళ్ళారా ....... లవ్ యు లవ్ యు .......... అని జూలో దిగిన బోలెడన్ని ఫోటోలను చూసి ఆనందించారు . తల్లీ లయన్ - నాన్నా టైగర్ .......... భయం వెయ్యలేదా ..........
బుజ్జాయిలు : మా .......... మీ దేవుడు ఉండగా మాకేమీ భయం అమ్మా , కానీ లయన్ గట్టిగా గాండ్రించింది అమ్మా ......... భయంతో అన్నయ్యను కాసేపటి వరకూ వదల్లేదు అని నవ్వుకుని చెప్పారు . 
దేవత : తల్లీ టాయ్ ట్రైన్ కూడానా ...........
బుజ్జాయిలు : జూ లోఉన్నవన్నీ ఎంజాయ్ చేసామమ్మా .......... స్నాక్స్ - ఐస్ క్రీమ్స్ తింటూనే ఉన్నాము . పక్షులకు గింజలు వేసినప్పటి ఫోటో - జింకలకు క్యారెట్ అందించిన ఫోటో - జిరాఫీకి చెరుకు అందించిన ఫోటో ............. అని చూయించారు .
దేవత : అమ్మో అమ్మో ......... లవ్ యు లవ్ యు అని ముద్దులతో ముంచెత్తారు . 
బుజ్జాయిలు : ఒకసారి కాదమ్మా ......... two టైమ్స్ జూ చూసాము - మేము బాధపడుతుంటే ముద్దులుపెట్టి మళ్లీ తీసుకెళ్లారు అన్నయ్య .......కాదు కాదు మీ దేవుడు . 
దేవత : అవునా తల్లీ నాన్నా ........... మీ అన్నయ్యను చూడాలని ఉంది . ఎక్కడ ఉంటారో తెలుసుకోలేదా ...........
బుజ్జాయిలు : మీరు అడిగారని చెప్పాము అమ్మా .......... సర్ప్రైజ్ అనడంతో ........మాకూ సర్ప్రైజ్ ఇష్టమని చెప్పాము . అమ్మా - అమ్మా ......... నెక్స్ట్ లంచ్ కోసం ఈ  హోటల్ కు వెళ్లామమ్మా ........... ఎంత పెద్దదో అని ఫోటో చూయించారు .
దేవత : పెదాలపై తియ్యని నవ్వు విరిసింది . మధురమైన జ్ఞాపకాలు మెదిలాయి . 
అమ్మా అమ్మా .......... ఈ ఫంక్షన్ హాల్లోకి నో ఎంట్రీ అని వదల్లేదు . అన్నయ్య ఒక్క కాల్ చేశారు అంతే సర్ అని రెస్పెక్ట్ ఇచ్చి లోపలికి వదిలారు . లోపల ఇలా అద్భుతంగా ఉంది నాకెందుకో ఆ స్టేజీపై వాక్ చెయ్యాలనిపిస్తే అన్నయ్య నన్ను కన్నార్పకుండా అలా చూస్తూ వందల్లో ఫోటోలను క్లిక్ మనిపించారు ఇదిగో అమ్మా ........ అని భుజం కదిపింది . 
తల్లీ తల్లీ ........... అని కీర్తి ఫ్యాషన్ వాక్ ఫోటోలు - ఇద్దరూ కలిసి వాక్ చేస్తున్న ఫోటోలను చూసి కళ్ళల్లో కన్నీళ్ళతో గుండెలపై హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చారు .
అమ్మా అమ్మా ............ 
లేదు లేదు తల్లీ .......... ఆనందబాస్పాలు అని గుండెను రాయి చేసుకున్నట్లు కంట్రోల్ చేసుకుని కన్నీళ్లను తుడుచుకుని నవ్వుతూ ఫోటోలపై ముద్దులుపెట్టడం చూసి బుజ్జాయిలు ఆనందించారు .
బుజ్జాయిలూ .......... మీరే తీసుకెళ్లమన్నారా ? 
లేదమ్మా ........... మీకు అద్భుతమైన చోటుని చూయిస్తాను బుజ్జాయిలూ - ఎందుకో మీకు తరువాత తెలుస్తుందు అని మీ దేవుడే తీసుకెళ్లారు . వాక్ చేస్తుంటే చప్పట్లతో కేరింతలతో ఎంజాయ్ చేశారు మీ దేవుడు అని సంతోషంతో చెప్పారు . 
లవ్ యు తల్లీ .......... తరువాత నేనే చెబుతాను అని ముద్దులుపెట్టి మురిసిపోయారు . 
కీర్తి : అమ్మా .......... మా ముగ్గురినీ చూసి హోటల్ మేనేజర్ ఒక తియ్యని మాట అన్నారు - అదికూడా మేము మీకు తరువాత చెబుతాను అని తన తల్లి కళ్ళల్లోకే కన్నార్పకుండా చూస్తూ ముద్దులుపెట్టింది .
Like Reply
నెక్స్ట్ హోటల్లోనే రెస్టారెంట్ కు అమ్మా .......... ఇదిగో ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పటికీ , మీరు కట్టించిన మా ఇద్దరి లంచ్ ను మాకు ఒక్కముద్దకూడా పెట్టకుండా - మీరు ఇంట్లో తింటారుకదా అని మొత్తం తినేసి , మీరు ఇప్పుడు ఎలా అయితే అప్పుడే అయిపోయిందా అని ఫీల్ అయ్యారో అలా ఫీల్ అవ్వడం చూసి నవ్వుకున్నాము . మేమైతే బిరియానీ - లాలీపాప్ - డ్రింక్స్ .......... ఎలా తిన్నామో చూడమ్మా అని ఫోటోలను చూయించారు .
లెగ్ పీస్ మరియు లాలీపాప్ లను నోట్లోపెట్టుకుని మ్మ్మ్.......మ్మ్మ్........ అంటూ లాగేస్తుండటం చూసి గట్టిగా నవ్వుకుంది దేవత . తల్లీ - నాన్నా ......... అంత బాగున్నాయా అని లొట్టలేస్తూ పెదాలను తడుముకోవడం చూసి , మా అమ్మ కూడా ఉంటే ఎంత బాగున్నో అని దేవత గుండెలపై చేరారు . అమ్మా అమ్మా .......... అన్నయ్యకు చెప్పాము కిడ్నప్ చేయాలనుకుంటే మా అమ్మను కూడా కిడ్నప్ చెయ్యమని .
లవ్ యు బుజ్జాయిలూ .......... అని కన్నీళ్లను తుడుచుకుని , మత్స్య దర్శిని ఫోటోను చూసి అంతేనా అని కవ్వించారు .

లేదమ్మా - లేదమ్మా .......... నెక్స్ట్ మత్స్య దర్శిని అని ఫోటోలను ఆ తరువాత అన్నయ్య బయటకు వెళ్తానని చెప్పినా అన్నయ్య ముందే డ్రెస్ మార్చుకుని , వాటర్ వరల్డ్ లో స్విమ్ నేర్పించడం - బోలెడన్ని సార్లు వాటర్ స్లైడ్స్ ఆడటం అక్కడ ఎంత ఎంజాయ్ అని ఉత్సాహంతో చెప్పారు . 
అన్నయ్యా ......... మాకు అమ్మ ఉంది - మాకు మా అన్నయ్య అమ్మ మా అమ్మను చూడాలని ఉంది అని కోరాము . 
అవును తల్లీ - బిస్వాస్ .......... మనందరికీ అమ్మ అని అనాధ శరణాలయం కు తీసుకెళ్లి , మీరు ఎంతో భక్తితో పూజించే ఈ అమ్మవారినే అందరి అమ్మ అని చూయించారు అమ్మా ............
తల్లీ - నాన్నా ........... అయితే ,
అవునమ్మా ........... అన్నయ్య అనాధ - అన్నయ్య అంటే అక్కడి అన్నయ్యలందరికీ ప్రాణం . అన్నయ్యను చూడగానే పరుగునవచ్చి హత్తుకుని ఇక మమ్మల్ని అయితే వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు . అన్నయ్య ......... మా చేతులతో ఐస్ క్రీమ్స్ - చాక్లెట్ లు అందించారు . వాళ్ళ ఆనందం చూసి మురిసిపోయాము . మమ్మల్ని ప్రాణంలా ఎత్తుకొనివెల్లి ఎంతసేపు ఆడుకున్నామో సమయమే తెలియలేదు . మేమైతే మిమ్మల్నే మరిచిపోయాము లవ్ యు అమ్మా లవ్ యు అమ్మా ............అని హత్తుకుని ,
బుజ్జాయిలూ ............. మీ అమ్మ ఎదురుచూస్తుంటారు అని అన్నయ్య గుర్తుచేశారు . మాకు మీదగ్గరకు రావాలని ఉంది - అక్కడే ఆదుకోవాలని ఉందని ఫీల్ అవుతుంటే , తల్లీ ........... మీరు ఇప్పుడు కోరుకుంటే అప్పుడు తీసుకొస్తాను అని అన్నయ్య మాటివ్వడంతో , సంతోషించి బయలుదేరాము . 
వార్డెన్ సర్ ఆపి మీకోసం స్పెషల్ భోజనం రెడీ చేసాము తినివెళ్లండి అని కోరడంతో , ఇదిగో ఇలా తిన్నామమ్మా ..........
దేవత : wow .......... ఇంతమంది అన్నయ్యలతోపాటు కలిసి తిన్నారా .......... లవ్లీ లవ్లీ ............
అవునమ్మా ........... సందడే సందడి . ఎంత తిన్నామో మాకే తెలియదు . వడ్డిస్తూనే ఉన్నారు - తింటూనే ఉన్నాము .

ఉమ్మా ఉమ్మా .......... నా బంగారు బుజ్జి బుజ్జాయిలు ఎంత అదృష్టవంతులో అని పరవశించిపోయి , ఒక్క ఫోటోలోనూ మీ అన్నయ్య లేరు - మొత్తం మీరే ఉన్నారు . మీ అన్నయ్యను మీరు పట్టించుకోలేదు కదా .......... , నేను హార్ట్ అయ్యాను బుంగమూతిపెట్టుకున్నాను అని అటువైపు తిరిగారు . నాకు వెంటనే వెంటనే మీ అన్నయ్యను చూడాలని ఉంది.
లేదమ్మా .......... అన్నయ్యతోపాటు బోలెడన్ని ఫోటోలు దిగాము . ఉండండి చూస్తాము అని భోజనపు ఫోటోల కింద గ్రూప్ ఫోటోలో నేను ఉండటం చూసి , యాహూ యాహూ ......... అని టాప్ లేచిపోయేలా కేకలువేసి అమ్మా అమ్మా ........ ఇదిగో మా .......... మీ దేవుడు అని అటువైపుకు వెళ్లి చూయించారు . అడ్రస్ తెలిసి ఉంటే స్వయంగా చూయించేవాళ్ళము .

నన్ను చూసి పెదాలపై చిరునవ్వుతో నాకు మీ అన్నయ్య అడ్రస్ తెలుసుకదా ...........,
అమ్మా అమ్మా .......... మీకు తెలుసా ఎక్కడ ఎక్కడ ఎక్కడ ............అని ఏకంగా మీదకు ఎక్కడంతో నవ్వుతూ బెడ్ పై వాలిపోయారు దేవత .
దేవత : తల్లీ - నాన్నా ............ మిమ్మల్ని చూడకుండా మీ అన్నయ్య ఉండలేరు . నిన్నరాత్రి 11 మనం పడుకున్నాక డోర్ తెరిచి ఉందేమో మిమ్మల్ని చూడటానికి అదిగో ఈ డోర్ వరకూ వచ్చారు . మిమ్మల్ని సంతోషంతో ప్రాణంలా చూస్తూ ఉండిపోయారు. ప్రక్క రూంలో అలికిడికి మెలకువ అయ్యిచూస్తే అడుగుల చప్పుడు వినిపించడంతో , మిమ్మల్ని పడుకోబెట్టి నెమ్మదిగా వెళ్ళాను . డోర్ చాటున తొంగిచూస్తే వీరు.......... మీ సేఫ్టీ కోసం రాత్రంతా ........... బయటే కుర్చీలో కూర్చున్నారు మీ అన్నయ్య అంత ప్రాణమా మీరంటే అని పొంగిపోయారు .. సో మీ అన్నయ్య ఉండేది మన ప్రక్క ఇంట్లోనే - అదే సర్ప్రైజ్ అనిచెప్పడం ఆలస్యం తమ తల్లి బుగ్గలపై లవ్ యు అని ముద్దులుపెట్టి అన్నయ్యా - అన్నయ్యా ......... అంటూ బయటకు పరుగుతీశారు .
**************

ఆఫీస్ నుండి ఫొటోలతో ముందుగా శరణాలయం కు వెళ్లి బుజ్జాయిలతో తమ్ముళ్లు ఎంజాయ్ చేసిన మరియు గ్రూప్ ఫోటోని తమ్ముళ్లకు అందించి వారి సంతోషాన్ని చూసి మురిసి , అపార్ట్మెంట్ చేరుకున్నాను . 
ఫోటో బాక్స్ లు కెమెరా మరియు అక్వేరియం ను కష్టంగా అందుకోబోతుంటే , సెక్యూరిటీ అన్న అక్వేరియం అందుకొని , సర్ ......... ఒక్కసారి పిలిస్తే వచ్చేస్తానుకదా అన్నాడు .
అన్నా .......... ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టను .
సర్ ......... అలా ఫీల్ అవ్వకండి . పిల్లల ఆనందం చూడాలనుకున్నాను ఏకంగా వాళ్ళతో ఐస్ క్రీమ్ ఇప్పించారు . అధిచాలదా ......... అని మాట్లాడుకుంటూ , సర్ ......... పిల్లలు మీ అడ్రస్ తెలుసా అని అడిగారు . నేను చెప్పేంతలో మీరు సర్ప్రైజ్ అన్నారని చెప్పడంతో ఆగిపోయాను లేండి . మిత్తానికి తెలిసిపోతుంది పిల్లల దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి .
రెడీ అన్నా .......... కీర్తి బలంగా కొడుతుంది అని నవ్వుకుని లిఫ్ట్ లో ఫ్లోర్ చేరుకుని ఇంట్లోకివెళ్లి టేబుల్ ను హాల్ మధ్యలో పెట్టి దానిపై అక్వేరియం పెట్టించాను . Hi చేపలూ ......... మీ బుజ్జి ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చేస్తారు ఆడుకోవడానికి రెడీగా ఉండండి ఉమ్మా ......... అని ముద్దుపెట్టాను . 
సర్ .......... దెబ్బలు తినడానికి all the best గుడ్ నైట్ అని చేతులు కలిపాడు . 
పర్స్ లోనుండి డబ్బుతీసి వద్దన్నా జేబులోపెట్టాను . 
థాంక్స్ సర్ ........... మీ అన్నయ్య ఇచ్చాడని మా పిల్లలను వారు కోరుకున్నది తీసుకెళతాను అని సంతోషంతో వెళ్ళాడు . 

గిఫ్ట్ బాక్స్ ను అందుకుని బయటకు తొంగిచూసి , ఎవరూ లేకపోవడంతో ఉత్తకాళ్ళతో అడుగులో అడుగువేసుకుంటూ వెళ్లి లవ్ యు బుజ్జాయిలూ అని డోర్ ముందు కింద ఉంచి కాలింగ్ బెల్ నొక్కి పరుగున ఇంట్లోకి వచ్చేసి కొద్దిగా డోర్ తెరిచి చూస్తున్నాను . 
దేవతతోపాటు సంతోషంతో బయటకు రావడం - బాధపడటం - దేవత గిఫ్ట్ వైపు సంతోషంతో చూయించడం - కీర్తి తల్లి అందుకుని ముద్దుల వర్షం కురిపించడం చూసి ఎంజాయ్ చేసాను . బుజ్జాయిల మాటలు విన్నంతసేపూ ........... అక్వేరియం లోని చేపలు ఉత్సాహంతో ఎగరడం తెలిసి ఆశ్చర్యపోయి , అప్పుడే మీరు మీరు ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట అని ఆనందాన్ని పొందాను . 

డోర్ సగం క్లోజ్ అవ్వడం చూసి , నో నో నో .......... నా బుజ్జితల్లి ఏక్షణమైనా రావచ్చు అని పూర్తిగా తెరిచి , మరొక సెట్ ఫోటోల బాక్స్ ను నా బెడ్రూంలోకి తీసుకెళ్ళాను . దేవత ఫోటోల దగ్గరికివెళ్లి - కీర్తి తల్లి బిస్వాస్ ఫ్యాషన్ వాక్ ఫోటోలను ముందుగా తీసి చూస్తే అచ్చు దేవతలానే అనిపించి , దేవత నడకల ఫోటో ప్రక్కన బుజ్జితల్లి నడకల ఫోటో - స్టేజి చివరికివచ్చి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలిన ఫోటో ప్రక్కన బుజ్జితల్లీ కిస్సెస్ వదిలిన ఫోటోలు - దేవత ఫొటోలో నేనున్న ఫోటో ప్రక్కన బుజ్జితల్లి బిస్వాస్ ను ఎత్తుకున్న ఫోటో ........... అలా తల్లికి తగ్గ ఫోటోలను ప్రక్కనే అతికించాను . ఇక చుట్టూ రౌండ్ గా....... స్కూల్లో ఎత్తుకుని దిగిన ఒక ఫోటో - షాపింగ్ మాల్లో ఎత్తుకుని దిగిన ఫోటో - జూ ఎంట్రన్స్ లో ఎత్తుకుని దిగిన ఫోటో - అక్వేరియం లో దిగిన ఫోటో - శరణాలయం లో దిగిన ఫోటో - గ్రూప్ ఫోటోలను అందంగా అతికించి వెనక్కువచ్చి కనులారా కన్నార్పకుండా తిలకిస్తూ సమాయాన్నే మరిచిపోయేలా మైమరిచిపోయాను .
****************

దేవత ప్రక్కన ఇల్లే అని చెప్పగానే తమా ఇంటి డోర్ తీసుకుని అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ............ అంటూ పరుగునవచ్చి డోర్ తెరిచి ఉండటం ఎదురుగా అక్వేరియంలో చేపలు ఎగురుతుండటం చూసి పరుగున లోపసలికివచ్చి ముద్దులుపెట్టి , అంతులేని ఆనందంతో అక్కయ్యా - అన్నయ్యా ........... మన అన్నయ్య ఇల్లు ఇదే - మనకు చెప్పలేదు కదూ అయిపోయారు అన్నయ్య అని నవ్వుకుని , మళ్లీ గట్టిగా అన్నయ్యా అన్నయ్యా .......... అని కేకలువేశారు .

బెడ్రూంలో తేరుకుని నా బుజ్జాయిలు వచ్చేసారు అని ఫోటోలకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి , రూమ్ బయటకువచ్చి వెంటనే డోర్ క్లోజ్ చేసేసి , బుజ్జితల్లీ - బిస్వాస్ కనిపెట్టేసారా ........ అని పెదాలపై చిరునవ్వుతో మోకాళ్లపై కూర్చుని చేతులను విశాలంగా చాపి గుండెలపైకి ఆహ్వానించాను .
అన్నయ్యా - అన్నయ్యా .......... అని తియ్యదనంతో పిలిచి బుజ్జిబుజ్జికాళ్ళతో పరుగునవచ్చి నా కౌగిలిలోకి చేరిపోయారు . తనివితీరిన తరువాత కౌగిలి వదిలి తియ్యనికోపంతో చూసి నా ఛాతీపై ప్రేమతో కొట్టి , ఇక్కడే ఉండికూడా చెప్పనేలేదుకదూ అని బుగ్గలను కొరికేశారు . 
స్స్స్ ........ఆఅహ్హ్హ్....... లవ్ యు బుజ్జితల్లీ - లవ్ యు బిస్వాస్ .......... మీ ఇష్టం అని చేతులను విశాలంగా చాపాను . 
మళ్లీ కొట్టబోయి పెదాలపై చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకుని సర్ప్రైజ్ అదిరిపోయింది అన్నయ్యా ........... మన అమ్మవారిని కూడా అమ్మ - అన్నయ్య ఒకచోటనే ఉండాలని కోరుకున్నాము అని నొప్పిగా ఉందా అన్నయ్యా ......... లవ్ యు లవ్ యు .......... అని ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి అంతే ఘాడంగా హత్తుకుని , లవ్ యు అమ్మా ......... మాకోరిక తీర్చినందుకు మళ్లీ వచ్చి దర్శించుకుంటాము - మాంచి కిక్కిచ్చారు ఎంత అంటే మాటల్లో చెప్పలేము అని నా కౌగిలిని వదలడం లేదు . 

బుజ్జితల్లీ - బిస్వాస్ .......... మీ ఫ్రెండ్స్ బుజ్జిచేపలు మీకోసం ఎంతగా ఎదురుచూస్తున్నాయో ......... పాపం .
తెలుసన్నయ్యా .......... మమ్మల్ని చూడగానే పైపైకి ఎగిరాయి సంతోషంతో .........
అవునా .......... wow అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , రండి మరి మీ బుజ్జిచేపలకు ఫుడ్ వేద్దాము అని గుండెలపై ఎత్తుకుని తీసుకెళ్ళాను .

ఫిష్ ఫుడ్ చేతులోపెట్టుకుని బుజ్జాయిలకు ముద్దుపెట్టి ఊ ........ అన్నాను. బుజ్జివెళ్లతో అందుకుని చేపలకు వేశారు . వేసినవెంటనే మూతులు తెరిచి తినడం చూసి , అన్నయ్యా - అన్నయ్యా ......... తింటున్నాయి అని సంతోషంతో నా బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టి వాటికి కడుపునిండా వేసి మురిసిపోయారు . 
మా బుజ్జాయిలకోసం థాంక్స్ థాంక్స్ అంటూ పైపైకి ఎగురుతుంటే , బుజ్జాయిల చేతివేళ్ళతో తాకించగానే ముద్దులుపెట్టినట్లు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు . 

బుజ్జాయిలూ ......... పాపం వాటికి ఉదయం నుండీ మీలానే రెస్ట్ లేదు . ఇప్పటికే ఆలస్యం అయ్యింది మీరు పడుకుంటే అవికూడా హాయిగా రెస్ట్ తీసుకుంటాయి .
ఊహూ ......... మేము మా అన్నయ్యను వదిలి వెల్లనే వెళ్ళము .
మరి అమ్మ ............
అమ్మతో ఎలాగో రోజూ పడుకుంటాము కదా - ఈరోజు వాడు లేడు కాబట్టి మీ గుండెలపైనే ఇలాగే నిద్రపోతాము అంతే , వెల్లమంటే బుగ్గలను కొరికేస్తాము కొరికెయ్యమా .......... అని పెద్దగా నోటిని తెరిచారు . 
నవ్వుకుని , అమ్మో .......... బుజ్జి ఆడ సింహం నోరు - బుజ్జి బుల్లి సింహం నోరు నాకు భయమేస్తోంది . సరే సరే .......... నా బుజ్జితల్లి ఇష్టమే నా ఇష్టం అని ప్రాణంలా ముద్దులుపెట్టి జోకొట్టాను . బయట ఎవరో నవ్వినట్లు వినిపించింది . ఈ ఆనందంలో పట్టించుకోలేదు .

అన్నయ్యా అన్నయ్యా ........... అప్పుడే కాదు . మనం మాట్లాడుకోవాలా - మనం ఉదయం నుండీ ఎంత ఎంజాయ్ చేశామో తెలిసి అమ్మ ఎంత ఆనందించారో - మురిసిపోయారో - పరవశించిపోయారో - ఎన్ని ఆనందబాస్పాలు కార్చారో - ఫోటోలకు ఎన్నిముద్దులుపెట్టారో .......... ఆ సంతోషాన్ని మీతో పంచుకున్న తరువాత .............
నా బంగారు బుజ్జి తల్లీ ........... అదంతా అయ్యేసరికి తెల్లవారిపోతుందేమో ........

మళ్లీ ......... ముసిముసినవ్వులు వినిపించాయి . 
అంతలోనే బుజ్జాయిలు గట్టిగా నవ్వుకుని ముద్దులుపెట్టి , తెల్లవారి సూర్యుడు వచ్చినా సరే అమ్మ అంత సంతోషించడం ఎప్పుడూ చూడలేదు . 
నాకు కావాల్సింది కూడా అదే తల్లీ అని మనసులో అనుకున్నాను . 
లెట్స్ స్టార్ట్ అన్నయ్యా ............ ఈ బుజ్జి బార్బీ డ్రెస్ అయితే అమ్మకు చాలా చాలా చాలా నచ్చేసింది . ముద్దులే ముద్దులు ........... లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా .......... ఆ క్రెడిట్ మొత్తం మీకే చెందాలి అని వరుసగా ఒక్కొక్కటే చెబుతూ ......... ఉదయం నుండి అలసిపోవడం వలన నా భుజాలపై తలలువాల్చి హాయిగా నిద్రపొయారు . 
శరణాలయంలో నేర్చుకున్న లాలిపాటలు పాడుతూ అటూ ఇటూ తిరుగుతూ మధ్యమధ్యలో నా బుజ్జితల్లి - బిస్వాస్ లవ్ యు లవ్ యు అని ముద్దులుపెడుతూ ........... హాయిగా నిద్రపోండి మీరు సంతోషంతో హాయిగా నిద్రపోతే మీ అమ్మగారు కూడా రోజంతా జరిగినవి మరిచిపోయి పెదాలపై చిరునవ్వుతో హాయిగా నిద్రపోతారు - మీ కోసమే జీవిస్తున్నారు - మీకు కూడా మీ అమ్మ అంటే ఎంత పంచ ప్రాణాలో తెలుసుకున్నాను ఉమ్మా ఉమ్మా ......... అని జోకొడుతూ ప్రపంచాన్నే మరిచిపోయాను .

డోర్ దగ్గర అలికిడి అవ్వడంతో చూస్తే దేవత - కళ్ళల్లో ఆనందబాస్పాలతో మమ్మల్నే ఆరాధనతో చూస్తున్నారు . 
వెంటనే బుజ్జాయిలను జోకొడుతూనే , మోకాళ్లపై కూర్చుని మేడం ......... ఎప్పుడువచ్చారు చూసుకోలేదు క్షమించండి . అప్పుడే పంపించేవాడిని పిల్లలు .........
విన్నాను మహేష్ ........... నన్నుకూడా వద్దనుకుని మీతోనే ఉంటారని గోలచేసినప్పుడే వచ్చాను అని సంతోషంతో నవ్వుతూ బాస్పాలను తుడుచుకున్నారు. మహేష్ ......... నేనేమీ దేవతను కాను మోకరిల్లాడానికి లే అంటూ తాకాబోయి ఆగిపోయారు .
మాకు మీరు దేవత కంటే ఎక్కువ మేడం . మీరు సహాయం చెయ్యడం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను . మీరు మా శరణాలయానికి ఎంత సహాయం చేశారో మేము ఎప్పటికీ మరిచిపోము . మీరు సంతోషంగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిని . మేడం ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి తప్పైతే క్షమించండి శిక్షించినా సంతోషంగా భరిస్తాను .
దేవత :  సంతోషంతో కన్నీళ్లను తుడుచుకుని ఏదైనా అడుగు మహేష్ ...........
మేడం ........... ఇంత జరుగుతోంది కదా ......... మీ వాళ్లకు చెప్పొచ్చుకదా ........
దేవత : మహేష్ .......... నీలానే నేనూ అనాధను - డబ్బున్న అనాధను అంతే తేడా ఏమీ లేదు . నేను పుట్టగానే నా తల్లిదండ్రులు ఆక్సిడెంట్ లో చనిపోయారు . నన్ను మా ఆయా పెంచి పెద్ద చేశారు . పెళ్లయ్యాక నేను పడుతున్న కష్టాలను చూసి ఆమె కూడా ........... అని కన్నీళ్ళుపెట్టుకున్నారు .
అనాధనా ......... అంటూ తలెత్తి చూసి , ఓదార్చాలని ఉన్నా తరుక్కుపోతున్న హృదయంతో ఆగిపోయి కన్నీళ్ల రూపంలో వదిలాను .
మేడం వెంటనే కన్నీళ్లను తుడుచుకుని నా కీర్తికి అమ్మపేరు - బిస్వాస్ కు నాన్న పేరు పెట్టుకుని వాళ్ళను చూసుకుంటూ తల్లీ - నాన్నా .......... అని ప్రాణంలా పిలుచుకుంటూ కష్టాలను బాధలను ఎదుర్కొంటూ జీవిస్తున్నాము . వాళ్ళిద్దరే నా ప్రాణం . వాళ్ళ సంతోషమే నా సంతోషం . ఆ అమ్మ ఎన్ని కష్టాలను బాధలను అనుభవించమని శిక్షిస్తే వాటన్నింటినీ నా బుజ్జాయిలకోసం సంతోషంతో స్వీకరిస్తాను అని నా కన్నీళ్లను చూసి sor ........... తప్పుగా అనుకోవద్దు కీర్తి తల్లి మీకు sorry చెప్పడం విన్నదంటే కొరికేస్తుంది అని నవ్వుకుని లవ్ యు చెప్పారు .
ఒక్కసారిగా వొళ్ళంతా జలదరించింది . 
దేవత : ఈ రెండు రోజులూ నా కాదు కాదు మన బుజ్జాయిల అంతులేని సంతోషం - చిరునవ్వులను చూసి ఈ ఆరేళ్ళు పడిన బాధలను మరిచిపోయాను . మీకు చేతులెత్తి కృతజ్ఞత ............
మేడం ......... అంటూ లేచి చేతులను ఆపబోయి ఆగి , ఈ కష్టాలకు నేనూ కారణమే నన్ను మన్ని .......... శిక్షించండి అని మనసులో అనుకుని , మన అమ్మ జగన్మాత త్వరలోనే మీ కష్టాలను పోగొడతారు దైర్యంగా ఉండండి అనిచెప్పాను .

ఆ కష్టాల గురించి , బాధలు గురించి నేను పట్టించుకోను మహేష్ - నా బుజ్జాయిలు సంతోషంతో చిరునవ్వులు చిందిస్తుంటే చాలు ఇలా ........ నీవల్ల అని ఆనందంతో పొంగిపోతున్నారు . 
మీ కష్టాలు బాధలను కూడా పోగొట్టే శక్తి నాకు మా అమ్మవారు ఇవ్వాలని మనసులో ప్రార్థించి , మేడం ........... బుజ్జాయిలను ..........
దేవత : వద్దు వద్దు వద్దు .......... ఉదయం మీ గుండెలపై లేకపోతే నన్ను కొట్టేస్తారు - కొరికేస్తారు .......... మిమ్మల్ని ఎలానో - నన్నూ అలానే అని సంతోషంతో నవ్వుతూ గుడ్ నైట్ అని నాకు దగ్గరగా వచ్చి వొంగి బుజ్జాయిలిద్దరికీ చెరొక ముద్దుపెట్టారు . 
ఆ కొన్ని క్షణాలు నా పరిస్థితి ఏమిటో మీరే అర్థం చేసుకోండి - దేవత పరిమళానికి .......... రేయ్ తప్పు రేయ్ తప్పు అని తమాయించుకుని , మేడం జాగ్రత్త అన్నాను . 
దేవత : పెదాలపై చిరునవ్వుతో నీ నెంబర్ నా ........ మన బుజ్జితల్లి చెప్పింది . అవసరమైతే కాల్ చేస్తానులే మహేష్ గుడ్ నైట్ ......... అనిచెప్పి వెళ్లి లాక్ చేసుకున్నారు . 
ఒకవైపు బాధ - మరొకవైపు సంతోషంతో ........... బుజ్జాయిలకు ముద్దులుపెట్టి , డోర్ ను పూర్తిగా ఓపెన్ చేసే ఉంచి , సోఫాను బెడ్ లా మార్చి , బుజ్జాయిలను నా గుండెలపై పడుకోబెట్టుకొని జోకొడుతూనే జోకొడుతూనే , అమ్మా తల్లీ .......... నీ తల్లికి చిన్నప్పటి నుండే ఇన్ని కష్టాలూ బాధలా .......... చాలుతల్లీ చాలు అని ప్రార్థిస్తూనే నిద్రలోకి జారుకున్నాను .

ఉదయం నాకు మెలకువ వచ్చేటప్పటికి నా గుండెలపై బుజ్జాయిలు లేరు . కిందగానీ దొర్లారా అని కంగారుపడుతూ కీర్తి తల్లీ బిస్వాస్ అని కళ్ళుతెరిచిచూస్తే , బుజ్జాయిలిద్దరూ అప్పటికే మేల్కొని రెండు బుజ్జిచేతులను వాళ్ళ బుగ్గలపై వేసుకుని నన్నే చూస్తున్నారు .
హమ్మయ్యా .......... అంటూ లేచికూర్చుని , గుడ్ మార్నింగ్ బుజ్జాయిలూ .......... ఎప్పుడు లేచారు అని అడిగాను . 
 లవ్లీ గుడ్ మార్నింగ్ అన్నయ్యా అన్నయ్యా ........... రోజూ మాకు 6 గంటలకే మెలకువ వచ్చేస్తుంది అన్నయ్యా - హోమ్ వర్క్ చేసుకోవడానికి లేస్తాము .
సమయం చూస్తే 8 గంటలు అవుతోంది . బుజ్జాయిలూ .......... రెండు గంటలుగా ....... నన్నూ రెండు దెబ్బలువేసి లేపి ఉండొచ్చుకదా .......... 
నవ్వుకుని , నా గుండెలపై చేరి హాయిగా నిద్రపోతున్న మిమ్మల్ని అలా చూస్తూనే ఉండిపోయాము అన్నయ్యా ........... సమయమే తెలియలేదు - ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేము అని గట్టిగా హత్తుకుని ముద్దులుపెట్టారు .

నా బుజ్జాయిలకు నేనంటే ప్రాణం అని ప్రాణంలా గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టబోయి బ్రష్ చెయ్యలేదు క్రిములు అని ఆగిపోయాను .
మా అన్నయ్య క్రిములంటే కూడా మాకు ఇష్టం అని బుగ్గలను చూయించడంతో , తాకీతాకనట్లుగా ముద్దులుపెట్టాను . 
మాకు అలా కాదు ఇలాంటి ముద్దులు కావాలి అని నా బుగ్గలను కొరికేశారు .
స్స్స్ ......... స్స్స్ ......... ఉండండి మీ అమ్మకు చెబుతాను .
బుజ్జాయిలు నవ్వుకుని , అమ్మకు కూడా మేమంటే చాలా భయం తెలుసా అన్నయ్యా ...........

బయట ముసిముసినవ్వులు వినిపించడంతో , కీర్తి తల్లీ .......... మీ అమ్మ బయట ఉన్నారు . పాపం రాత్రంతా చూడలేదుకదా వెళ్ళండి .
అమ్మ ఉందా .......... ఉండండి పరిచయం చేస్తాము . 
బుజ్జాయిలూ రాత్రి కలిసాము . మీరు పడుకున్నాక పాపం మిమ్మల్ని చూడటానికి వచ్చారు . మేడం తీసుకువెళ్లండి అనిచెబితే , అమ్మో ......... భయం అని వణికిపోయారు . 
బయట మళ్లీ ముసిముసినవ్వులు మరియు అక్కడ నుండి వెళ్లిపోయినట్లు గజ్జెల చప్పుడు వినిపించింది . 
బుజ్జాయిలూ .......... వెళ్ళండి , మిమ్మల్ని చూడకుండా మీ అమ్మ మనసు శాంతించదు . నాకు ఆఫీస్ లో కాస్త పని ఉంది .

అంతే ఇద్దరూ .......... తలదించుకుని బాధపడుతున్నారు . తల్లీ కీర్తి - బిస్వాస్ ....... నేను చెప్పేది పూర్తిగా విన్న తరువాత మీ ఇష్టం . మిమ్మల్ని వదిలి నేనుకూడా వెళ్లలేను . మీరువెళ్లి ఫ్రెష్ అయ్యి మీ అమ్మను అడగండి - అమ్మా ........ స్కూల్ కి వెళ్ళాలా లేక అన్నయ్య ఆఫీస్ కు అన్నయ్యతోపాటు వెళ్ళాలా అని - మీ అమ్మ సమాధానాన్ని బట్టి మనం అక్కడికి వెళదాము .

బుజ్జాయిలూ .......... మీ అన్నయ్యతోపాటు ఆఫీస్ కే వెళ్ళండి అనిచెప్పి అప్పుడు పరిగెత్తుకుంటూ లోపలికివెళ్లిపోయినట్లు దేవత గజ్జెల చప్పుడు వినిపించింది .
యాహూ యాహూ ........... అన్నయ్య వెంట ఆఫీస్ కు - అన్నయ్య వెంట ఆఫీస్ కు అని నన్ను ముద్దులతో ముంచెత్తారు . 
లవ్ యు బుజ్జాయిలూ .......... అని వారు కోరినట్లుగానే గట్టిగా ముద్దులుపెట్టి , అయితే వెళ్లి రెడీ అయ్యి వచ్చెయ్యండి అని పంపించాను . 
అన్నయ్యా అన్నయ్యా ............. మేము తొందరగా వచ్చేస్తాము అని ముద్దులుపెట్టి అమ్మా అమ్మా .......... మమ్మల్ని తొందరగా రెడీ చెయ్యండి అని కేకలువేస్తూ పరుగుతీశారు .
జాగ్రత్త బుజ్జాయిలూ అని ఇంట్లోకి వెళ్లేంతవరకూ చూసి , లవ్ యు అని ఆనందిస్తూ నా రూంలోకివెళ్లి ఫోటోలను చూసి మురిసిపోయి , బుజ్జాయిలు తొందరగా వచ్చేస్తారేమో అని బెడ్రూం లోపల గొళ్ళెం పెట్టుకుని బాత్రూమ్లోకివెళ్ళాను .

గంటలో ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఫోటోలవైపు చూపువిసిరి పెదాలపై చిరునవ్వుతో బెడ్రూం డోర్ తెరిచాను .
అన్నయ్యా అన్నయ్యా ........... ఎంతసేపు , అయినా లోపల లాక్ ఎందుకు చేశారు . 
ఊరికే తల్లీ ............ wow లవ్లీ డ్రెస్సెస్ అని గుండెలపైకి ఎత్తుకుని ముద్దుచేస్తూ అక్వేరియం దగ్గరికి వచ్చాను . సోఫా ముందు టీ టేబుల్ పై టిఫిన్ రెడీగా ఉండటం చూసి , నాకే అని అర్థమయ్యి కళ్ళల్లో చెమ్మ చేరింది .
అన్నయ్యా ........... మీకోసమే వండి పంపించారు అమ్మ . 
ఉమ్మా ఉమ్మా .......... లవ్ యు లవ్ యు sooooo మచ్ . మా బుజ్జాయిలు తిన్నారా ? 
మా అన్నయ్య తినకుండా మేము తింటామా ? 
అంతే ఆనందబాస్పాలతో ప్రాణంలా హత్తుకుని , 9 గంటలు దాటింది అమ్మతోనే తిని ఉండొచ్చుకదా ............ఎప్పుడో రాత్రి తిన్నారు అని సోఫాలో కూర్చుని ఇద్దరికీ చెరొక ప్లేటులో వడ్డించబోతే , 
అన్నయ్యా - అన్నయ్యా .......... మీ ప్లేట్ లోనే తింటాము . 
తల్లీ .......... ఎంగిలి - అమ్మకు తెలిస్తే ............. అని నోటి నుండి వాక్యం కూడా పూర్తికాలేదు బుగ్గపై బుజ్జి పంటిగాట్లు .
లేదు లేదు లేదు .......... ఒకే ప్లేటులో తిందాము తిందాము అని వడ్డించాను .
బయట మళ్లీ నవ్వులు వినిపించాయి . 

బుజ్జాయిలూ .......... మీ అమ్మ తిన్నారా ? 
మీరు తిని సూపర్ అంటే పొంగిపోయి సంతోషంతో వెళ్లి తింటారు అమ్మ . 
అయితే తిందాము తిందాము తినండి ...........
చేతులుకట్టుకుని మీరు తినిపిస్తేనే తింటాము .
బుజ్జి రాజు రాణి ఆర్డర్ వేశాక తప్పుతుందా ......... ఆ ఆ ........ అని ప్రేమతో తినిపించాను .
బయట మళ్లీ సంతోషమైన నవ్వులు .
అన్నయ్యా ......... ఇప్పుడు మీరు .
లవ్ యు .......... బుజ్జాయిలూ అని ముద్దులుపెట్టి , తిని మ్మ్మ్మ్మ్......... మ్మ్మ్........ సూపర్ సూపర్ సూపర్ ............
కీర్తి : అన్నయ్యా .......... అమ్మ సంతోషం కోసం చెబుతున్నారుకదా .........
కీర్తి తల్లీ ...........మొత్తం నన్నే తినమన్నా తినేస్తాను - మీకు వద్దంటే చెప్పండి . 
ఊ ........ కావాలి అని నోరుతెరిచారు బుజ్జాయిలు . 
బయట ఆగకుండా ముసిముసినవ్వులు .............
మ్మ్మ్ మ్మ్మ్......... అంటూనే మొత్తం ఖాళీ చేసేసి ముగ్గురమూ ఒకేసారి ఆవ్ ........ అన్నాము . నీళ్లు తాగి కీర్తి తల్లీ .......... ఇలాంటి ఫుడ్ మధ్యాహ్నం కూడా తినాలని ఉంది .
గజ్జెల చప్పుడుతో ok అని సమాధానం వచ్చింది . 
నేను ఎంజాయ్ చేస్తుంటే ...........
కీర్తి : అన్నయ్యా .......... నన్ను అడుగుతున్నారా ? బయట ఉన్న అమ్మను అడుగుతున్నారా ? .
అదీ అదీ .......... తల్లీ తల్లీ .......... అని కంగారుపడుతుంటే , నా బుగ్గపై తియ్యని ముద్దుపెట్టి , ఖాళీ అయిన పాత్రలు ప్లేట్లు తీసుకుని , అన్నయ్యా ........... అమ్మకు తినిపించి వస్తాను ఆఫీస్ కు వెళదాము అని బయటకువెళ్లింది . 
బిస్వాస్ .......... మనం చేపలకు ఫుడ్ వేద్దాము అని ఎత్తుకున్నాను .

అరగంట తరువాత కీర్తి అన్నయ్యా అన్నయ్యా ........... అని పరుగునవచ్చి రెడీ అనిచెప్పడంతో ఎత్తుకున్నాను . 
అమ్మకు .............
కీర్తి : అమ్మకు చెప్పాను జాగ్రత్త అని , అవసరమైతే కాల్ చెయ్యమని చెప్పాను , మధ్యాహ్నం స్పెషల్ భోజనం రెడీ చెయ్యమని చెప్పాను మీకోసం . చెప్పగానే ఎంత ఉత్సాహమో అమ్మలో అని నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . 
లవ్ యు అని ముద్దుపెట్టి , బయటకువచ్చి ఇంటికి లాక్ చేసి బుజ్జాయిల ఇంటివైపు చూస్తూ లిఫ్ట్ చేరుకుని కిందకువచ్చాము . బిస్వాస్ ను కారులో కూర్చోబెట్టి కీర్తి తల్లిని గుండెలపై హత్తుకునే కూర్చుని మెయిన్ గేట్ దగ్గరకు పోనిచ్చాను .
అన్నా ......... అని పిలిచి , అప్పుడప్పుడూ పైకివెళ్లి చూస్తూ ఉండు అవసరమైతే కాల్ చెయ్యండి అనిచెప్పాను .
వాడు వస్తే వెంటనే కాల్ చేస్తాను సర్ .......... పిల్లలూ ........ ఎంజాయ్ అని టాటా చేసాడు . 

థాంక్స్ చెప్పేసి బయలుదేరాము . దారిలో బుజ్జాయిలకు తినడానికి అన్నీరకాలూ తీసుకుని 10 గంటలకు ఆఫీస్ చేరుకుని బుజ్జాయిలను ఎత్తుకుని , ఇదే మీ అన్నయ్య ఆఫీస్ అని ముద్దులుపెట్టి చెప్పాను .
ఎంత పెద్దది అన్నయ్యా .......... నిన్న వెళ్లిన హోటల్ కంటే పెద్దది అని సంతోషించారు.
లవ్ యు బుజ్జాయిలూ అని సంతోషంతో హత్తుకుని లోపలికివెళ్ళాను . 
Hi మహేష్ hi మహేష్ ......... hi సర్ .......... పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో ముద్దొచ్చేస్తున్నారు అని బుగ్గలను తాకి ఆనందించారు .
చీఫ్ : hi మహేష్ .......... ఫోటోల్లో ఉన్న బుజ్జాయిలు కదూ ........ hi hi......... మీకోసం రెండు గిఫ్ట్ లు రెడీ చేసాను - మీకే స్వయంగా ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని కీర్తికి - బిస్వాస్ కు ఒక్కొక్కటి అందించి go on పిల్లలూ అన్నారు . 

బుజ్జాయిలు సంతోషంతో అందుకుని నా బుగ్గలపై ముద్దులుపెట్టి , ఓపెన్ చేసి అలా సంతోషంతో చూస్తూ ఉండిపోయారు . 
ఒకటేమో ............ శరణాలయంలో అందరితో దిగిన గ్రూప్ ఫోటోని డిజైన్స్ తో ఫ్రేమ్ చేయించారు . 
రెండవది ............ జూ లో ఇద్దరూ ఒకేసారి చిరునవ్వులు చిందిస్తూ బుగ్గలపై కొరికేస్తున్న ఫోటో ఫ్రేమ్ . 

బుజ్జాయిలు తమ గుండెలపై హత్తుకుని , థాంక్స్ అంకుల్ ........... లవ్లీ గిఫ్ట్ అని పరవశించిపోయారు . 
Welcome బుజ్జాయిలూ ........... ఉమ్మా ఉమ్మా ........ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

ఫ్రెండ్స్ - స్టాఫ్ ........... the biggest good news అని తన రూం నుండి బయటకువచ్చారు సర్ వాళ్ళు . బుజ్జాయిలను చూసి మహేష్ .......... వచ్చేసావా , wow ఎంత ముద్దొచ్చేస్తున్నారు పిల్లలు అని దగ్గరకువచ్చి బుజ్జిచేతులను స్పృశించి థాంక్యూ థాంక్యూ థాంక్యూ ........... so so so soooooooo మచ్ పిల్లలూ .......... ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ............ సంవత్సరం నుండీ మనం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న హైద్రాబాద్ బ్రాంచ్ కు పర్మిషన్ వచ్చేసింది . సంవత్సరం నుండీ ఎదురుచూస్తున్నది . ఈ పిల్లలు అడుగుపెట్టగానే ఎటువంటి అడ్డంకులూ లేకుండా govt నుండే fax వచ్చేసింది . సీసీ ఫుటేజి ...........
Yes సర్ ............ పిల్లలు లోపలికి అడుగుపెట్టిన సమయం - fax వచ్చిన సమయం పర్ఫెక్ట్ 10:05  .............
సర్ : ఉమ్మా ఉమ్మా ఉమ్మా ............. పిల్లలూ ఎత్తుకోవచ్చా ..........
 అన్నయ్యా - అన్నయ్యా ......... అంటూ నావైపు చూసారు .
ఊ ......... అని సైగచెయ్యడంతో సర్ చేతుల్లోకి వెళ్లారు . 
సర్ : పిల్లలూ .......... మీ అన్నయ్యనే మాకు లక్ - మీరు డబుల్ లక్ తీసుకొచ్చారు అని కమాన్ ఎంజాయ్ గయ్స్ అనగానే , సంబరాలు మిన్నంటాయి . బుజ్జాయిలూ ......... మీకు ఏమికావాలి చెప్పండి ఏమైనా మీ ముందు ఉంచుతాము .
బుజ్జాయిలు : అన్నయ్య అన్నీ ఇచ్చారు సర్ - మాకు మా అన్నయ్య కౌగిలింత ముద్దులు తప్ప ఏమీ వద్దు .
అందరూ సంతోషపు షాక్ చెందారు . 
సర్ : వాహ్ ......... పిల్లలూ ఇక్కడ టచ్ చేశారు . మహేష్ ........... పిల్లలు ఎన్ని కౌగిలింతలు అడిగితే అన్ని - ఎన్ని ముద్దులు అడిగితే అన్ని ఇచ్చెయ్యి ఎంత ఖర్చయినా నేను భరిస్తాను అనడంతో అందరితోపాటు బుజ్జాయిలు కూడా సంతోషంతో నవ్వుకున్నారు .
Like Reply




Users browsing this thread: 15 Guest(s)