20-07-2020, 03:03 PM
KIRACK UPDATE
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
|
20-07-2020, 03:06 PM
20-07-2020, 03:09 PM
20-07-2020, 05:56 PM
Perfume smell twist adhirindi .... Very interesting story bro
20-07-2020, 06:07 PM
20-07-2020, 06:08 PM
20-07-2020, 06:10 PM
20-07-2020, 06:14 PM
20-07-2020, 06:15 PM
20-07-2020, 08:00 PM
21-07-2020, 05:19 AM
21-07-2020, 05:20 AM
21-07-2020, 08:15 AM
(ఈ రోజు అప్డేట్ లో కొంచెం ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి)
శేఖర్ హైదరాబాద్ కీ తిరిగి రాగానే తన ఇంటికి వెళ్లాడు అక్కడ యాక్టింగ్ కాలేజ్ లో మొత్తం హడావిడిగా ఉంది అందరూ పిల్లలు కాస్ట్యూమ్స్ వేసుకోని లోపలికి వెళ్లడం మొదలు పెట్టారు అమ్మాయిలు అంతా ఒక చోట చేరి కోరస్ పడటం మొదలు పెట్టారు జేమ్స్ అందరి ముందు పేపర్ పట్టుకొని చెయ్యి ఆడిస్తూ పాటలు పాడిస్తున్నాడు "Forgive us, O lord, we acknowledge ourselves as type of common man, Of the women and men who shut the door and sit by the fire, Who fear the blessing of God, The loneliness of night of God, the surrender required, The depreviation inflicted" అని పాడుతూ ఉన్నారు అప్పుడు జేమ్స్ సైగ చేయగానే థామస్ ఒక చర్చి ఫాదర్ లాగా డ్రస్ వేసుకొని స్టేజ్ మధ్యలోకి వచ్చాడు అప్పుడే తన చుట్టూ కత్తులు పట్టుకుని నలుగురు సేనాధిపతులు నిలబడి ఉన్నారు. "It is not in time that my death shall be known; It is out of time that my decision is taken If you that is decision To which my whole being gives entire consent I give my life to the law of God above the law of man" అని తన డైలాగ్ చెప్పాడు థామస్ అదే సమయంలో ఆ నలుగురు తమ కత్తులతో అతని పొడిచి చంపారు ఆ తర్వాత తెర కిందకు దిగింది అప్పుడు శేఖర్ గట్టిగా విజిల్ వేసి చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చాడు శేఖర్ నీ చూసిన జేమ్స్ అందరిని వెళ్లిపోమని చెప్పాడు. జేమ్స్ దగ్గరికి వచ్చిన శేఖర్ "అబ్బ అబ్బా ఏమీ యాక్టింగ్ సార్ మీ అబ్బాయి చించేశాడు అసలు ఏమీ జరుగుతోంది సార్" అని అడిగాడు దానికి జేమ్స్ "లండన్ లో వచ్చే నెల లో ఇంటర్నేషనల్ కాలేజ్స్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్లు ప్రతి సంవత్సరం చేసే డ్రామా ఈవెంట్ కీ ఈ సారి మా కాలేజ్ నీ కూడా ఎంపిక చేశారు అందుకే నేను కాలేజీ లో చదివే రోజుల్లో చదివిన ఒక పాఠం నీ డ్రామా గా మార్చి ఇప్పుడు అక్కడ ప్రదర్శించబోతున్నాము" అని చెప్పాడు జేమ్స్, దానికి శేఖర్ "ఓహ్ కంగ్రాట్స్ సార్ మొత్తానికి అనుకున్నది సాధించారు ఇంతకీ ఈ డ్రామా పేరు ఏంటి సార్ " అని అడిగాడు దానికి ఆయన "మర్డర్ ఇన్ చర్చ్" అని చెప్పాడు అది విని శేఖర్ "అదేమి కథ సార్ " అని అడిగాడు దానికి జేమ్స్ నవ్వుతూ "ఈ కథ లో మంచికి చెడుకు మధ్య జరిగే ఆధిపత్య పోరు గురించి ఒక మంచి అనేది ఒక గది మధ్యలో ఉంటే నాలుగు దిక్కులో చెడు వేచి ఉంటుంది చావు పుట్టుక మధ్య నీ ధర్మం నువ్వు సరిగ్గా నిర్వర్తించావా లేదా అని నిన్ను ప్రశ్నించుకోక పోయిన నీ ప్రతి కదలికలు దేవుడు మాత్రం ప్రశ్నిస్తాడు" అనేది ఈ కథలో సారంశం అని చెప్పాడు జేమ్స్ ఇది అంతా తన కెమెరా లో రికార్డ్ చేస్తూ ఉన్న చందన చివరకు చప్పట్లు కొడుతూ ముందుకు వచ్చింది. "వావ్ అంకుల్ మీతో మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు ఆ జేసెస్ తో మాట్లాడినట్లు ఉంది కాస్త మీ పక్కన ఉన్న ఈ పాపిని క్షమించండి " అని శేఖర్ వైపు చేయి చూపించింది దాంతో శేఖర్ చందన పైకి లేస్తే చందన శేఖర్ రూమ్ లోకి పరిగెత్తుతూ వెళ్లింది శేఖర్ కూడా చందన చేయి పట్టుకొని లాగాడు తను వచ్చి శేఖర్ మీద పడింది అప్పుడు ఇద్దరు బెడ్ మీద పడ్డారు అప్పుడు ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటు ఉన్నారు అలా చందన శేఖర్ మీదకు వచ్చి ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసింది శేఖర్ కూడా కొంచెం ముందుకు జరిగాడు అప్పుడే తలుపు దగ్గర చప్పుడు అయితే ఇద్దరూ సర్దుకున్నారు కరెంట్ పోవడంతో ఎవరో వాళ్లు కనిపించలేదు కాకపోతే కాలి చప్పుడు బట్టి ఒక అమ్మాయి అబ్బాయి అని తెలిసింది దాంతో కింద కాలేజ్ పిల్లలు రొమాన్స్ చేస్తున్నారు అని అనుకున్నాడు కాకపోతే అప్పుడే ఆ ప్రొడ్యూసర్ perfume వాసన శేఖర్ ముక్కుకు బలంగా తగిలింది అంటే కాలేజ్ లో ఉండే పిల్లల్లో ఎవరో ఆ కుక్క కీ ట్రైనింగ్ ఇచ్చారు అని అర్థం అయ్యింది వెంటనే కిందకి వెళ్లి అబ్బాయిలు అందరినీ చెక్ చేశాడు కానీ ఎవరో తెలియలేదు అప్పుడు చందన అడిగింది "ఆ బ్రాండ్ బయట దొరకడం చాలా తేలిక ఏమో ఎవరైనా కామన్ గా వాడుతున్నారు ఏమో" అని అంది దాంతో శేఖర్ "అది మామూలు perfume కాదు sauvage దాని తక్కువ ధరే పదిహేను వేలు ఉంటుంది వీలు ఏదో చిన్నా చితక పనులు చేసుకొని ఫ్రీ గా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు కాబట్టి అది ఇంత తేలికగా వీలకు దొరికింది అంటే వాళ్లు ఖచ్చితంగా ఆ ప్రొడ్యూసర్ ఇంట్లో ఏదో ఒక పని చేస్తుండే వాళ్లే" అని అన్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఎవరికి తెలియకుండా కాలేజ్ లో నుంచి ఒక పెట్టుడు మీసం దొంగలించి షాపింగ్ కీ వెళ్లి ఒక ఫార్మల్ డ్రస్ కొనుక్కున్ని తన ఫ్రెండ్ శ్రీ కృష్ణ కీ ఫోన్ చేశాడు, శ్రీ కృష్ణ ఒక సెక్యూరిటీ అధికారి ఇన్స్పెక్టర్ తన జీప్ తీసుకోని డ్రైవర్ లేకుండా రమ్మని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి DK రావు ఇంటికి వెళ్లారు సినిమా వాళ్ళు వస్తారు కాబట్టి సెక్యూరిటీ గట్టిగా ఉంది అక్కడ "రేయ్ ఇక్కడికి ఎందుకు తీసుకోని వచ్చావు నాకూ ఇక్కడ డ్యూటీ లేదు పైగా ఇది మా ఏరియా కిందకి కూడా రాదు" అన్నాడు కృష్ణ కానీ శేఖర్ ఇది ఏమీ పట్టించుకోకుండా అక్కడ నిలబడి ఉన్న ఒక కానిస్టేబుల్ లాటి తీసుకోని కావాలి అని అక్కడ ఉన్న జనం లో ఇద్దరు ముగ్గురు నీ కొట్టాడు దాంతో కానిస్టేబుల్స్ కొంచెం భయపడి పరుగు మీద వచ్చారు "ఏమయ్యా బుద్ధి ఉందా లేదా ఇక్కడ ఇంత మంది కంట్రోల్ లేకుండా ఉంటే ఏమీ చేస్తున్నారు మొత్తం బెటాలియన్ ట్రాన్స్ఫర్ చేయిస్తా నరసింహారావు ఐపిఎస్ లోపల మా బావ చనిపోయాడు బయట ఏంటి న్యూసెన్స్" అని అరిచి లోపలికి వెళ్ళాడు శేఖర్ తన వెనకే కృష్ణ కూడా లోపలికి వెళ్ళాడు. కృష్ణ : ఏంటి మామ అలా అరిచావు శేఖర్ : భయపడవా మామ కృష్ణ : అవును మామ శేఖర్ : నేను అరిచిన అరుపుకీ నాకే పాంట్ తడిచిపోయింది రా కృష్ణ : అసలు ఏమీ చేస్తున్నావురా ఇక్కడ దాంతో శేఖర్ మొత్తం చెప్పాడు "బాబు షేరలాక్ హోల్మ్స్ నను లాగోదు ఇలాంటి వాటికి" అన్నాడు కృష్ణ దానికి శేఖర్ "షేరలాక్ కీ కూడా అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్ coward సహాయం కావాలి రా" అన్నాడు, "వాడు ఎవడు రా" అని అడిగాడు కృష్ణ "షేరలాక్ పట్టుకుంటాడు వాడు క్రెడిట్ తీసుకుంటాడు" అని అన్నాడు శేఖర్ దాంతో కృష్ణ ఓహ్ తెగ ఊహించుకోని సరే సహాయం చేస్తా అన్నాడు ఇద్దరు లోపలికి వెళ్లి కొంచెం ఇళ్లు చెక్ చేయాలి అని చెప్పి లోపలికి వెళ్లి అంతా వెతికారు 19,20 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాడు ఒక్కడు కూడా లేడు దాంతో బయటికి వస్తుంటే పని అమ్మాయి కీ పొరపాటు గా డాష్ ఇచ్చాడు కృష్ణ తన చున్ని లో దాచుకొన్ని వెళ్లుతున్న perfume బాటిల్ కింద పడి పగిలింది అది చూసి శేఖర్ తనని ఆగమని చెప్తే తను పారిపోయింది దాంతో తను మెట్లు దిగి వెళ్లుతుంటే శేఖర్ ఒకేసారి పై నుంచి కిందకు దూకి తనని పట్టుకొని వెనుక డోర్ నుంచి జీప్ దగ్గరికి తీసుకోని వెళ్లాడు, అప్పుడు తనని అడిగితే ఆ ప్రొడ్యూసర్ రోజు అసభ్యంగా ప్రవర్తించేవాడు అని అందుకే వాళ్ల ఇంటి కుక్క నీ వాకింగ్ కీ తీసుకోని వెళ్లినప్పుడు ట్రైనింగ్ ఇచ్చి అలా చేశాను అని చెప్పింది కానీ శేఖర్ నమ్మలేదు. అప్పుడే ఇంటి ముందు ఏదో గొడవ జరిగిందని అక్కడికి చూడ్డానికి వెళ్లారు కృష్ణ, శేఖర్ ఒక స్టార్ హీరో సడన్ గా పడిపోతే ఫ్యాన్స్ హడావిడి చేశారు దాంతో వీలు తిరిగి జీప్ దగ్గరికి వచ్చే సరికి ఆ అమ్మాయి లేదు సీట్ లో "ఇక్కడి తో వదిలేయి" అని రాసిన ఒక పేపర్ కనిపించింది. |
« Next Oldest | Next Newest »
|