01-08-2019, 08:39 PM
(01-08-2019, 12:30 AM)lotuseater Wrote: ఎలా సాధ్యపడింది లింగం గారూ?
ఎక్కడ దొరికింది మీకీ నిధి?
ఓహ్!
కొన్ని దశాబ్దాలనుంచి తడుముకుంటున్న ప్రశ్నకు ఒక్కసారిగా సమాధానం దొరికినట్లయింది.
మొదటినుంచీ శృంగారసాహిత్యాభిమానులు దాదాపుగా ఖాయం చేసుకున్న విషయం సరసశ్రీగారి ఛాలెంజితో ఒకేసారి ప్రశ్నార్థకమై కూర్చుంది. సరసశ్రీగారి విశ్లేషణ వచ్చేంతవరకూ నేను కూడా కూడా ఎన్నెస్ కుసుమ, నాచర్ల సూర్యనారాయణ ఒక్కరనే నమ్ముతూ వచ్చాను. ఆ నమ్మకానికి కారణం - ఎన్ని వందల పుస్తకాల్లో కలిపేసినా ఒక్క వాక్యంతోనే ఇది ఎన్నెస్ కుసుమ లేదా నాచర్ల వారి రచనే అని పట్టిచ్చే శైలి. అది తప్ప వేరే రుజువేమీ లేదు. అయితే పుస్తకాభిమానులకు అంతకు మించిన రుజువేం అక్కర్లేదనుకుంటాను. కానీ సరసశ్రీ గారి విశ్లేషణ నా నమ్మకాన్ని పటాపంచలు చేసింది. చాలా బలమైన విశ్లేషణ అది. ఎన్నెస్ కుసుమ గారు రచయిత్రి అనీ, నాచర్లవారు రచయిత అనీ శక్తివంతంగా వాదించారు సరసశ్రీగారు. దానికి వారు ఆయా రచనల్లో తార్కాణాలు కూడా చూపించారు. ఇద్దరూ ఒక్కరేనని ఆదినుంచీ నమ్ముతూనే వస్తున్న నేను కూడా సందేహంలో పడ్డాను. అవునేమో, రెండుపేర్లూ ఒకరివి కావేమో అనిపించేంత దూరం వెళ్ళింది వ్యవహారం. అసలు విషయం తెలుసుకోవడానికి లింగంగారూ, సిరిపురపువారూ వర్సగా ఇస్తున్న నవలల్ని పరిశిలిస్తూనే వున్నాను.
ఆ రెండుపేర్లూ ఒకరివేనని లింగంగారు చెప్పినప్పుడు కూడా వారూ నాలాగే శైలినిబట్టి చెబుతున్నారేమోననే అనుకున్నాను. ఇప్పుడు తిరుగులేని రుజువుతో ముందుకొచ్చారు లింగంగారు. లింగంగారికి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే అవుతుంది.
అయినా ఒక సందేహం మాత్రం నన్నింకా పీడిస్తూనే వుంది. శైలి ఎంత ఒకటిగా వున్నా కథనంలో కొన్ని అంశాలు ఇద్దరూ ఒకటి కాదేమోననే అభిప్రాయానికి తావిస్తూనే వున్నాయి. సరశ్రీగారు చూపిన ఎన్నెస్ కుసుమగారు అభిమానులకు రాసిన 'స్వీట్ లెటర్ ' లో ('స్పేర్ బస్ ' నవల చివరలో వుంటుంది చూడండి) తాను గృహిణినని, తమ శ్రీవారి అనుమతితోనే ఈ నవలలు రాస్తున్నాననీ తెలియజేస్తున్న లేఖ అబద్ధమని అనుకోవాలా? ఎన్నెస్ కుసుమ పేరుతో వచ్చిన కొన్ని నవలల్లో నెల్లూరు భాష వాడినట్లుగా అనిపిస్తుంది. మరికొన్ని నవలల్లో ఏలూరు లేదా వైజాగు భాషతోపాటు అక్కడి ఊళ్ళు కూడా దర్శనమిస్తాయి. అది కూడా ఎన్నెస్ కుసుమగారూ నాచర్లవారూ ఒక్కరు కారేమో అనే అనుమానం కలిగిస్తాయి.
ఏది ఏమయినా లింగం గారు చూపించిన రుజువుతో ఇప్పుడా మీమాంసకంతా తెర పడింది.
కానీ, లింగం గారూ! నాచర్లవారి లెటర్ హెడ్ లో అడ్రసు కొంచెమైనా మాస్క్ చేసి చూపించాల్సింది కాదా? ఎందుకంటే ట్రాలర్స్ వారిని వేధించే అవకాశం వుంది కదా! ఒకవేళ వారిప్పుడు ఆ అడ్రసులో లేకపోయినా, వున్నవారిని ఇబ్బందిపెట్టే పరిస్థితులు వస్తాయేమో!
కానీ నాకు మాత్రం ఇది నిధే!
మరోసారి కృతజ్ఞతలు.
లింగం గారూ మరొక్క మారు ధన్యవాదాలు. నిన్నటి మీ పోస్ట్ చూసి ఒక్కసారిగా ఎంతో ఉద్వేగానికి గురయ్యాను. నాచర్ల/ కుసుమ గారి కథలను కొన్ని దశాబ్దాలుగా ప్రేమిస్తూ, ఈ మధ్య మీరు /ప్రసాద్/ సరిత్/ సిరిపురపు గార్ల పుణ్యమా అని మళ్ళీ వారి కథల పునర్దర్శనం చేసుకొనే వీలు కలిగింది. వాళ్ళిద్దరూ ఒక్కరే అనే విషయం లో నాకెప్పుడూ అనుమానం లేదు. ఒకే రచయిత అన్న విషయం వారి శైలిని బట్టి చాలా సులభం గా అర్ధం అవుతుంది. కాకపోతే ఆయన ఎంత గొప్ప రచయిత అంటే - కుసుమగారి పేరుతో రాస్తున్నప్పుడు ఎక్కువగా ఫీమేల్ పాయింటాఫ్ వ్యూ లో, అచ్చం ఒక స్త్రీ రాస్తున్నట్టుగానే ఉండటం, అలాగే నాచర్ల పేరిట వచ్చే కథలు మేల్ ఎక్స్పీరియన్సుల్లా ఉండటం వల్ల అంత ఈజీగా పట్టుబడరు.
నాకు అంచనా బట్టి ముందుగా ఆయన కుసుమ పేరుతోనే రాయడం మొదలుపెట్టారు. లింగం గారు అందించిన మన్మధ, రసిక ప్రియ పత్రికల్లో చాలా అరుదుగా నాచర్ల పేరు కనబడడమే అందుకు నిదర్శనం. బహుశా పాపులర్ అయ్యాక రెండో పేరుతో కూడా రాయాల్సిన అవసరం వచ్చి ఉంటుంది. ఈ రెండూ పేర్లే కాకుండా సౌజన్య, కుమారి మాధవి లాంటి అలియాస్ లు కూడా ఆయన వాడారని నా నమ్మకం.
అంతే కాదు తాయి, జయకర్, ప్రసన్న బాబు పేర్లు కూడా ఆయనవే అని నా అనుమానం. వారి శైలి కూడా దాదాపు నాచర్ల వారిలానే ఉంటుంది కానీ థీమ్స్ లో చాలా తేడాలు ఉండటం వల్ల నాకు చాలా కాలంగా అంతుబట్టడం లేదు. ఈ విషయం లో లోటస్ గారి అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది. తాయి రచనల్లో ఇన్సెస్ట్ ఛాయలుంటాయి. అదీ ముఖ్యంగా తల్లి కి సంబంధించినవి అయి ఉంటాయి. మచ్చిక, సీనియర్, దురద వంటి కథల్లో మనం స్పష్టం గా గమనించవచ్చు. శైలి చాలావరకూ ఒకేలా ఉంటుంది. కుసుమ కథలు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి. ఎక్కువగా కుర్రాళ్లను కోరుకొనే ఆంటీలు తగులుతారు. నాచర్ల కథల్లో పచ్చిదనం పాలు ఎక్కువగా ఉంటుంది. అంటీలను వేసుకొనే కుర్రాళ్ళు ఉంటారు. తాయి పేరుతో రాసిన వాట్లో ఎక్కువగా ఫ్యామిలీ బేస్డ్ గా ఉంటాయి గనుక, ఆ రోజుల్లో అది బాగా ఎడ్వాన్స్డ్ కనుక - ఆయన తాయి ఎట్సెట్రా పేర్లు ఎంచుకుని ఉంటారని అనుకుంటున్నాను.
లోటస్ గారూ, నేను సరసశ్రీ గారి మెసేజ్ చూడలేదు. ఉంటే ఒక్క సారి పోస్ట్ చెయ్యగలరు. ఇక నెల్లూరు భాష, గోదావరి/ వాల్తేర్ భాష అంటారా – చెయ్యి తిరిగిన నాచర్ల వారికి భాషలో ఆ మాత్రం తేడా చూపడం పెద్ద పనేమ్ కాదు అని నా ఉద్దేశ్యం. అందులోనూ ఆయన రైల్వే లో రకరకాలఊళ్లలో పని చేసి ఉంటారు కాబట్టి అన్నీ ప్రాంతాలూ పరిచయమయే ఉండాలి.
నాచర్ల గారికిప్పుడు సుమారు 75 ఏళ్ల పైనే ఉండి ఉండాలి. అద్భుతమైన తన కథల ద్వారా కొన్ని తరాలను ప్రభావితం చేసిన ఆ మహనీయుడు కనబడితే వారి పాదాలకు నమస్కరించుకొని, కాసేపు ఆ కథల గురించి, ఆ నాటి రోజుల గురించీ చర్చించే అవకాశం కుదిరితే అంతకంటే మహాద్భాగ్యం ఉంటుందా! వారి గురించి మరి కొంత సమాచారం అందిస్తారని లింగం గారిని, ఇతర మిత్రులనూ వేడుకుంటున్నాను.