Thread Rating:
  • 12 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మాయ
Liked your way of narration bro manchi future vundi meeku
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
Like Reply
Next update eppudu bro ?
Like Reply
మాయ - 33

ధనుంజయ్ గురించిన కల వచ్చిన రోజు నుంచీ కిరీటి చాలా మూడీగా వుంటున్నాడు. వాడలా ఎందుకు వున్నాడో తెలుసుకుందామంటే శైలుకి ఊళ్ళో వాడితో ఏకాంతంగా మాట్లాడటం కుదరట్లేదు. కాలేజీలో ఎన్నిసార్లు అడిగినా వాడు నోరువిప్పి ఇది విషయం అని చెప్పట్లేదు. చివరికి తన ప్రపంచం తల్లకిందులయ్యే ఒక విషయం శైలు చెప్పేసరికి వాడా మూడ్ లోంచి బయటకు వచ్చాడు.


ఆ వివరం తెలుసుకోవడానికి కొన్ని రోజులు వెనక్కు వెళ్దాము.............
      
రాణి రత్నమాంబ కాలేజీలో ఆడిట్ మొదలైంది. రాజావారి దగ్గర్నుంచి వచ్చే డబ్బుల్లో ఏ కాస్త తగ్గినా తమ జీతాలకే ఎసరు కాబట్టి లెక్చరర్లు అందరూ టెన్షన్ తో ఆడిటర్ గారికి ఏం కావాలంటే అవి సమకూరుస్తున్నారు. వచ్చిన ఆడిటర్ పేరు శేఖర్ అని తెలుసుకుంది శైలు. క్రితంసారి రాజా గారి దగ్గరకు వెళ్లినప్పుడు చూడటమే అతన్ని. మళ్ళీ ఇన్నాళ్లకు కాలేజీలో కనిపించాడు. అతడికి సహాయం చెయ్యమని ప్రసాదవర్మ గారు అడగటం గుర్తొచ్చి మాట కలిపింది.

‘నేను సోమ, బుధ వారాల్లో మధ్యాహ్నం పూట ఖాళీగా వుంటాను. మీకేమన్నా హెల్ప్ కావాలంటే అడగండి’ అంది. ‘తప్పకుండా, థాంక్స్’ అని ఒక మాట అని ఊరుకున్నాడు. శేఖర్ తన పని తాను చేసుకుపోతున్నాడు. ప్రిన్సిపాల్ గారి గదిలో కాలేజీ అక్కౌంట్ పుస్తకాలు ముందేసుకొని కుస్తీ పడుతున్నాడు. అప్పుడప్పుడూ క్లాస్ రూముల్లోకి వచ్చి విద్యార్ధుల హాజరు శాతం ఎలా వుందో నోట్ చేసుకొని వెళ్తున్నాడు.

మంచి కుర్రాడిలానే వున్నాడు శేఖర్. కాలేజీ స్టాఫ్ అందరితోనూ polite గా, కాకపోతే కొంచెం పొడిపొడిగా మాట్లాడుతాడు మనిషి. పోనీ అది కిరీటి లాగా సహజంగా వున్న సిగ్గు వల్లా అంటే అలా అనిపించట్లేదు శైలుకి. శైలుకి ఎందుకో తేడాగా వుంది ఆ అబ్బాయిని చూస్తే.

ఓ రోజు చాలా అందంగా ముస్తాబయ్యి వచ్చింది కాలేజీకి. స్వతహాగా అందగత్తె కాబట్టి ఎలా వున్నా చూపు తిప్పుకోలేరు కుర్రాళ్ళు. అవాళ ఎందుకో కొంచెం శ్రద్ధ పెట్టి తయారయింది. కిరీటి వున్న క్లాసులో పాఠం చెప్పి స్టాఫ్ రూమ్ కి వెళ్తోంది. ఓ కారిడార్ లో ఎవరూ లేనిచోట సడన్ గా కిరీటి వెనకనుంచి వచ్చి ‘చాలా బాగున్నారు మేడమ్, ఇలా వస్తే క్లాసులో లెసన్ ఏం వింటారు పిల్లలు’ అని ఆమె నడుముని నొక్కి ఆమె పెదాలను తన పెదాలతో అలా స్పృశించి వెళ్లిపోయాడు.

ఒళ్ళు జలదరించింది శైలుకి. చాలా రోజుల తర్వాత వాడి చెయ్యి తగిలెసరికి తిమ్మిరిగా వుంది వంట్లో. సరిగా చేతికంది వుంటే వాడి పెదాల్ని కొరుక్కు తినేసేది. అలా అగ్గి రాజేసి వెళ్లిపోయేసరికి పిచ్చి కోపం వచ్చింది. ‘రేయ్ పోకిరి వెధవా, ఎంత ధైర్యంరా నీకు’ అని శైలు అరిస్తే ఒక సన్నటి నవ్వు నవ్వి వెళ్లిపోయాడు. తర్వాత కాసేపు గాల్లో తేలిపోయింది శైలు. ఎలా స్టాఫ్ రూమ్ కి వచ్చి పడిందో, తర్వాత ఏం చేసిందో గుర్తు లేదు తనకి.

కొంతసేపటి తర్వాత అటెండర్ వచ్చి శేఖర్ పిలుస్తున్నాడు అని చెబితే ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్లింది. ‘శైలు గారూ, రిపోర్ట్ సగం పైగా పూర్తి అయింది. మీరు కొంచెం నా నోట్స్ చూసి అక్కడక్కడా వున్న గాప్స్ ఫిల్ చేస్తారా? మీకేమన్నా సహాయం కావాలంటే నేనిక్కడే వుంటాను’ అన్నాడు శేఖర్.

అలాగేనని చెప్పి యాంత్రికంగా తన పని తాను చేసుకుపోతోంది శైలు.
కొంతసేపాగక ఎందుకో తలెత్తి చూస్తే శేఖర్ తనవైపే చూస్తూ దొరికిపోయాడు. తానది గమనించినట్టు బయటపడలేదు శైలు. ఇంకొక రెండు మూడు సార్లు అలాగే చూసిన తర్వాత అప్పుడు వెలిగింది శైలుకి ఈ అబ్బాయి ఎందుకు తేడాగా అనిపిస్తున్నాడో. కాలేజీకి వచ్చిన దగ్గర్నుంచి తనను ఎన్నోసార్లు ఇలాగే దొంగచాటుగా గమనించడం ఇప్పుడు జ్ఞప్తికి వచ్చింది. మిగతా విషయాల్లో ఎక్కడా ఒక్క అడుగు కూడా తప్పుగా వెయ్యడు కాబట్టి తను దాన్ని పట్టించుకోలేదు ఎప్పుడూ.
                
మొత్తానికి తను రాస్తున్న రిపోర్ట్ పూర్తిచేసి అతని దగ్గరికి వెళ్ళి దాన్ని అందించింది. తలెత్తకుండానే ‘థాంక్స్ శైలు గారూ. మిగిలిన పని నేను చూసుకుంటాను’ అన్నాడు. గట్టిగా ఊపిరి పీల్చి ‘ఒకసారి ఇలా చూడండి’ అంది. తలెత్తి ఆశ్చర్యం నిండిన కళ్ళతో శైలు వంక చూశాడు అతను. ‘మీరు నాతో డైరెక్ట్ గా ఏమన్నా చెప్పాలంటే చెప్పొచ్చు. దొంగచూపులు చూడకండి’ అంది.

‘ఉఫ్..’ అంటూ చేతిలోని పెన్ టేబుల్ మీద పడేసి కణతలు రుద్దుకుంటున్నాడు శేఖర్. ‘కూర్చోండి శైలు గారూ, ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడాలి’ అన్నాడు. ఏం చెప్తాడో విందామని కూర్చుంది. ‘ముందుగా మీకు సారీ చెప్పాలి. మా నాన్నకి ఎన్నోసార్లు చెప్పాను, ఇలా అప్రోచ్ అవటం కరెక్ట్ కాదు అని. But ఒప్పించలేకపోయాను. ఇక ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు’ అంటుంటే guarded గా వింటోంది శైలు.

‘నా పేరు చంద్రశేఖర్ వర్మ’ అంటూ చెయ్యి జాపాడు. అసంకల్పితంగా షేక్ హాండ్ ఇచ్చింది. ‘రాజా ప్రసాద వర్మ గారు మా నాన్న. మిమ్మల్ని మా ఎస్టేట్ లో చూసిన దగ్గర్నుంచీ వారు మీ మీద మంచి అభిప్రాయంతో వున్నారు. అసలెప్పుడోనే మీ పెద్దవాళ్లతో మన పెళ్లి విషయం మాట్లాడాల్సింది. నేనే మీ మనసు తెలుసుకోకుండా అలా చెయ్యడం బాగోదు అని చెప్పాను’ అంటుంటే శైలుకి బుర్ర తిరిగిపోతోంది.

‘కాలేజీ ఆడిట్ మీ కోసమే చేశాను అనుకొనేరు. కాదు, ఇది ఎప్పట్నుంచో నా లిస్ట్ లో వున్న పని. ఇదొక్కటే కాదు, మా ఆస్తులన్నిటినీ ఆడిట్ చేస్తున్నాను’ అని చెప్పుకుపోతున్నాడు. ‘రాజులు, రాజ్యాలు ఎప్పుడో పోయాయి. మా నాన్నగారిని అందరూ రాజా వారు అని పిలుస్తున్నారు అంటే అది ఆయన చేసిన మంచి పనులకి ఇచ్చే గౌరవం. ఆ టైటిల్ ఆయనతో ఆగిపోతే బాగుంటుంది అని నా వుద్దేశం.’

‘మా అమ్మ చాలా ముందుచూపు గల మనిషి. మా కుటుంబాన్ని, మా ఆస్తులని ఒక మంచి దారిలో నడిపించింది. అలాగే నాకు కాబోయే భార్య కూడా responsible పర్సన్ అయి వుండాలనేది నాదీ, మా నాన్నగారిదీ కోరిక. మీ చదువు, ఒద్దిక చూసి వారు ఇష్టపడ్డారు. ముందే చెప్పానుగా, నేనే అడ్డం పడ్డాను’ అని చిన్నగా నవ్వాడు.

శైలుకి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. రాజా వారు కబురంపితే తన మామ ఇంకో మాటకి అవకాశం లేకుండా పెళ్లి జరిపించేస్తాడు. మరి కిరీటి? అని ఒక చిన్న వాయిస్ ఆమె మదిలో మెదిలింది. ఒక్కసారి తుళ్లిపడింది. ఆమె మౌనాన్ని ఎలా అర్ధం చేసుకున్నాడో శేఖరే మళ్ళీ మాట కలిపాడు. ‘కాలేజీలో నా పని అయిపోయాక సావధానంగా మీతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ మీరు extraordinarily beautiful. అప్పుడప్పుడూ తొంగి చూడకుండా వుండలేకపోయాను. ఇవాళ మరీ బాగున్నారు’ అంటే స్త్రీ సహజమైన సిగ్గుతో శైలు బుగ్గలు ఎర్రబడ్డాయి.

‘నేనింకొక రెండు మూడు రోజుల్లో వెనక్కి వెళ్లిపోతాను. మళ్ళీ రాను. మీక్కావల్సినంత టైమ్ తీసుకోండి. ఒకవేళ మీకు మా కుటుంబంలో భాగం అవడం ఇష్టం ఐతే కబురంపండి. మనం కొన్నిసార్లు కలుద్దాం. నేనెలాంటి వాడినో మీకుకూడా తెలియాలి కదా’ అంటే శైలు మూగగా చూసింది. ‘ఈ విషయం డైరెక్ట్ గా చెప్తాను అన్నాను. మా నాన్న మిమ్మల్ని కొన్నాళ్లు observe చేసి తర్వాత ఈ విషయం ఎత్తమన్నారు. మీకిబ్బంది అయి వుంటే సారీ’ అన్నాడు.
[+] 4 users Like mkole123's post
Like Reply
మాయ - 34

ఆ తర్వాత శైలు ఏం చేసిందో ఎలా వచ్చిందో తెలీదు కానీ కిరీటి ఇంటికి వచ్చింది. వాడు ఇంకా ఇంటికి చేరినట్టు లేడు. ఆచారి గారు ఒక్కళ్లే వున్నారు. ‘రామ్మా, కులాసాయేనా’ అంటూ పలకరిస్తూ ఆమె ముఖం చూసి ఆందోళనగా ‘శైలూ, వంట్లో బాలేదా? అలా ఉన్నావేం?’ అంటూ కూర్చోబెట్టి నాడి పట్టుకొని చూశారు. జ్వరం వచ్చినదానిలా ముఖమంతా ఉబ్బరించి పోయింది శైలుకి.


‘నాకు ఏదోలా వుంది ఆచారి గారూ, కాసేపు పడుకోవాలి’ అంటే ‘నిన్ను మీ ఇంటి దగ్గర నేను దిగబెట్టి వస్తా, దామ్మా’ అన్నారు. ‘లేదు, ఒక్క పది నిమిషాలు’ అంటూ సోలిపోయింది. ‘ఇక్కడొద్దు. రా, లోపల పడుకుందువు’ అని కిరీటి గదిలోకి తీసుకెళ్లారు. వాడి మంచం మీద పడుకోగానే వాడి ఒళ్ళో పడుకున్న ఫీలింగ్ వచ్చి దిండు కరుచుకొని పడుకుంది శైలు.

మళ్ళీ ఎవరో నుదుటి మీద చెయ్యి వేస్తే మెలకువ వచ్చింది. కిరీటి తడిగుడ్డ తన నుదుటిపై వేస్తున్నాడు. వాడిని చూడగానే లేచి చుట్టేసింది. ‘ఓయ్ పిల్లా, ఏమైంది నీకు. మధ్యాహ్నం వరకూ బాగానే వున్నావు కదా’ అంటే ఇంకా గట్టిగా వాటేసుకొని వుండిపోయింది. ‘పడుకో శైలూ, నాన్న మీ అత్తమ్మని పిలుచుకురావడానికి వెళ్లారు’ అని తనని పడుకోబెట్టడానికి ట్రై చేశాడు.

శైలు వాడిని తనతో పాటు లాగేసి పక్కనే పడుకోబెట్టుకుంది. ‘శైలూ, ఇకనో ఇప్పుడో వాళ్ళు వచ్చేస్తారు. ప్లీజ్, నీకసలే ఓపిక లేదు’ అంటూ సముదాయిస్తున్నాడు. కొంచెంసేపు వాడిని మాట్లాడనివ్వకుండా ఉండుండి ముద్దులు పెడుతూ, కౌగిలించుకుంటూ వాడిని ఒళ్ళంతా తడిమేసి గువ్వలా వాడిలో ఒదిగిపోయింది.

'ఏమైందో చెప్తావా శైలూ' అని అడిగితే గడగడా శేఖర్ తో జరిగింది అంతా చెప్పేసింది శైలు. మొత్తం ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా విన్నాడు కిరీటి. మనసులోదంతా కక్కేస్తుంటే లోపల తేలికైపోతోంది ఆమెకు. వింటున్నంతసేపూ వాడు మెల్లిగా వీపు నిమురుతుంటే చాలా సుఖంగా వుంది.

కిరీటి ఏదో చెప్పబోతుంటే నోరు మూసేసింది. ‘నిన్ను ఏమీ అడగట్లేదు. జస్ట్ విను. ఒక సంవత్సరం వరకూ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నిన్నైనా సరే’ అంటూ సూటిగా వాడి కళ్లలోకి చూసింది. వాడు అర్ధమైందన్నట్టు తల ఊపాడు. ‘ఈలోగా మనం కలిసుండటానికి ఏమన్నా మార్గం వుందేమో చూద్దాం. తర్వాత దేవుడిదే భారం’ అంటూ లేచి కూర్చుంది.

‘నీ ముందు వీక్ గా వుండటం ఇదే ఆఖరుసారి. ఇంకెప్పుడూ ఇలా ఏడుపు ముఖం చూపించను. నిన్ను బాగా చూసుకుంటాను. ఐనా నీకు నాకంటే అందమైన, మంచి అమ్మాయి దొరకదు. మనం కలిసుండటానికి ఏమన్నా దారి వెతకరా’ అని వాడికి ముద్దు పెట్టింది. కిరీటి అబ్బురంతో అలా చూస్తుండిపోయాడు.

కొంచెం fresh up అయి వచ్చి ‘రా, నన్ను ఇంటి దగ్గర దిగబెట్టు’ అని వాడిని తీసుకెళ్లింది. దారిలోనే ఎదురైన వాళ్ళ అత్తమ్మను సముదాయించి అంతా బాగానే వుందని ఒప్పించి తన ఇంటికి వెళ్లిపోయింది శైలు. తిరిగి ఇంటికొచ్చిన కిరీటి పడుకునే వరకూ శైలు గురించే ఆలోచిస్తూ వుండిపోయాడు. మంచం మీద పడుకుంటే ఆమె పరిమళం చుట్టేసింది వాడిని. ఎలా దక్కించుకోగలడు శైలుని? ఇంకా చదువుకునే కుర్రాడు తను. ఇద్దరికీ వయసు, ఆస్థి అన్నిట్లోనూ భేదమే. బుర్ర వేడెక్కిపోయి పడుకున్నాడు. ఒక రాత్రి వేళ ఎవరో లీలగా ‘సమస్య గురించి కాదు, సమాధానం గురించి ఆలోచించు’ అని చెవిలో చెప్పినట్టు అనిపిస్తే దిగ్గున లేచి కూర్చున్నాడు.

ఈ మధ్య వస్తున్న కలలు, ఇప్పుడు వినిపించిన మాటలు ఇవన్నీ తలచుకుంటే భయం వేసింది వాడికి. దీని గురించి శైలుకి చెబితే ఇప్పుడున్న తలనొప్పులు చాలవన్నట్టు కొత్తవి ఆమె మీద రుద్దినట్టు అవుతుంది అనుకున్నాడు. తన తండ్రితో ఈ విషయం చెప్పి తీరాలి అనుకున్నాడు. కానీ ఆ స్వరం చెప్పినట్టు సమస్య గురించి కాక సమాధానం గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు. ఒక ఊహ తట్టింది వాడికి. దానిని అమలుపర్చాలి అని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ సునయన జలపాతం వద్ద కనిపించింది. నిద్రలో కూడా మనసు భారమైపోయింది వాడికి.

ఒక రెండురోజుల తర్వాత శేఖర్ వెళ్లిపోతుంటే స్టాఫ్ రూమ్ లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు ప్రిన్సిపాల్ గారు. శైలు శేఖర్ తో తనకు కొంత సమయం కావాలని చెప్పింది. సరేనన్నాడు అతను. పార్టీ అయిపోయాక అందరూ వెళ్లిపోతుంటే కాలేజీ గ్రౌండ్ లో శేఖర్ ను కలిశాడు కిరీటి. చాలాసేపు మాట్లాడినా ఓపిగ్గా వాడడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాడు శేఖర్.

ఇదంతా చూసిన శైలు వాడు ఒంటరిగా చిక్కగానే ‘ఏరా, ఏంటి అతనితో గుసగుసలు? ఏం మాట్లాడావు?’ అని అడిగితే ‘కొన్నాళ్లయ్యాక చెప్తాను’ అని మెరుపులా పట్టు విడిపించుకొని పారిపోయాడు. తనకిబ్బంది కలిగించే మాటలు ఏమీ మాట్లాడడు అని నమ్మకం శైలుకి. అలాంటి నమ్మకమే లేకపోతే అసలు ప్రేమకి అర్ధం ఏముంటుంది? కానీ అడిగినా చెప్పలేదనే చిరాకు మటుకు వుండిపోయింది.        
[+] 9 users Like mkole123's post
Like Reply
Interlude

కాలం - ?????


ప్రదేశం – xxxxx రాజ్యం

స్థలం – మూడొంతులు నిర్మాణం పూర్తయిన ఒక దేవాలయం

చిన్మయ స్థపతి తన మనసులోని ఆవేదనను ఎవరితో పంచుకోవాలో తెలియక డోలాయమాన స్థితి లో వున్నారు. కనులెదురుగా మూడొంతులు నిర్మాణం పూర్తి చేసుకున్న దేవాలయం కనిపిస్తోంది. కొంచెం దూరంలో వరుసకట్టి ప్రయాణం సాగిస్తున్న అనేక కుటుంబాలని చూసిన ఆయన హృదయం బద్దలవుతోంది. అలా వలసపోతున్న వారిలో ఆయన దేశదేశాలూ తిరిగి గాలించి తెచ్చిన శిల్పులు, వడ్రంగులు, కంసాలులు వున్నారు.

ప్రపంచంలోకెల్లా అత్యద్భుతమైన దేవాలయ నిర్మాణం చేద్దాము రమ్మని వారందరినీ బ్రతిమాలి తన రాజ్యానికి తీసుకువచ్చారు చిన్మయ స్థపతి. ఇప్పుడిలా వారందరూ తరలిపోతుంటే ఆయన హృదయం వేయి వ్రక్కలవుతోంది. మూడు సంవత్సరాల క్రితం వరకూ కూడా మహారాజు గారు స్థపతికి పూర్తి సహకారం అందించారు. తమది సుసంపన్న దేశం. ధనం లేకపోవడం సమస్యే కాదు, అప్పుడూ, ఇప్పుడూనూ. కొంతకాలం క్రితం వరకూ కూడా కళలను, సాంస్కృతిక పురోగతిని ప్రోత్సహిస్తూ వస్తున్న మహారాజు గారు ఉన్నట్టుండి తన వైఖరిని మార్చుకున్నారు.

చిన్మయుల వారి మనసు మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలపైకి మళ్ళింది. ఎలా మర్చిపోగలరు ఆ సమయాన్ని? తన కలకు, జీవితాశయానికీ సంకెళ్ళు పడ్డ రోజులవి. కాశ్మీర దేశం నుండి వచ్చిన ఒక పండితుడు రాజుగారికి ఒక ఉద్గ్రంధం బహూకరించాడు. దానిపేరు ‘కామసూత్ర’ అని తెల్పి ఆ గ్రంధ సంకలనం తన జీవితకాల కృషి ఫలితం అని నిరూపించి రాజుగారి వద్దనుండి భారీ బహుమానం పొందాడా పండితుడు. (నిజంగా కామసూత్ర ఒక వ్యక్తి కూర్చుని రాసింది కాదు. అనేక కామ గ్రంధాలనుంచి ఎన్నిక చేసిన విషయాలను ఏర్చి కూర్చినది అని చరిత్రకారుల భావన) 

ఏ ముహూర్తాన ఆ కామసూత్ర గ్రంధం మహారాజు వద్దకు చేరిందో కానీ, ఆ క్షణం నుంచి ఆయన మనసంతా ఒకటే ధ్యాసతో నిండింది. ఐహిక సుఖాలను అనుభవించడమే తన జీవిత పరమార్ధం అన్నట్టు మారిపోయారు మహారాజు గారు. చతుర్విధ పురుషార్ధాల్లో కేవలం కామం మీదే దృష్టి పెట్టి మిగతా వాటిని పక్కకు నెట్టారు.

మహారాజు వద్దకు చేరిన ఆ గ్రంధం చిన్మయుల వారు కూడా చూశారు. రాజాస్థానం లోని ఆంతరంగికులు ప్రతి ఒక్కరూ దానిని ఆసాగ్రమూ చదివారు. ఆ కామసూత్ర గ్రంధంలో ప్రతిపాదించబడిన సుఖాసనాలు, శృంగార క్రీడలు ఆజన్మ బ్రహ్మచారి అయిన చిన్మయుల వారి మనసులో సైతం కాసేపు కలకలం రేపాయి. ఐతే తన జీవితాన్ని ఇంకొక కార్యానికి అంకితం చేసిన చిన్మయుల వారు ఆ ప్రభావం నుంచి త్వరగానే బయటపడ్డారు. కానీ మహారాజు ఆ సుఖసాగరం నుండి బయటకు రావడానికి ఇష్టపడట్లేదు.

కళలకు, ఇతరత్రా ప్రోత్సాహకాలకూ అందజేసే ధనాన్ని కామసూత్రలో ప్రతిపాదించిన నాలుగు జాతుల స్త్రీలను వివిధ దేశాలనుంచి రప్పించడానికి మళ్లించారు. చిన్మయ స్థపతి చేపట్టిన దేవాలయ నిర్మాణం చివరి దశలో ఆగిపోయింది.

అదిగో ఆ చిన్మయుడు కట్టించిన దేవాలయమే మన పెంచలాపురంలోని సూర్యుడి గుడి. మహారాజు తన సుఖాల మోజులో ఏదో ఒక రోజు ధనం కోసం అతి విలువైన పంచలోహ విగ్రహాలను ఎక్కడ కరిగించివేస్తారో అని భయపడ్డారు ఆ స్థపతి. ప్రభు ద్రోహమైనా సరే గుడికి దారి మంత్రశక్తితో దాచివేశారు. తన జీవశక్తి అంతా ఒక చిన్న సూర్యుడి విగ్రహంలో నిక్షిప్తం చేసి అది చేతిలో వున్న వారే దేవాలయానికి దారి తెలుసుకునేలా చేశారాయన. ఈ కార్యంకోసం తన ప్రాణాలు ధారపోశారు ఆయన.

అయితే మనుషుల జీవశక్తి అల్పము. వందల సంవత్సరాల కాలం గడిచాక సూర్య విగ్రహంలోని చిన్మయుని జీవశక్తి సన్నగిల్లుతోంది. పశులకాపరి పెంచలయ్యకు తన మహిమ చూపినప్పుడు ఆ విగ్రహంలోని శక్తి కొంత ఖర్చయింది. ధనుంజయ్ ను శిక్షించడంతో అది దాదాపుగా కొడగట్టింది. ఒకవేళ విగ్రహం పరుల చేతిలో పడితే ధనుంజయ్ లా వాళ్ళను శిక్షించే శక్తి ఇక లేదా విగ్రహంలో మరి. సమయం మించిపోకముందే చివరిసారిగా తనను మంచి మనసుతో తాకిన కిరీటిని కలల ద్వారా చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నదా జీవశక్తి.

ఇంకొక నెలరోజుల్లో సంక్రాంతి పండగ వుందనగా ప్రెసిడెంటు గారు వాడిని, ఆచారిని ఓ రోజు సాయంత్రం తనదగ్గరికి పిలిపించుకున్నారు. ‘ఆచారీ, మీవోడికి ఇగ్రహం ఇసయం సెప్పాల. ఇంక ఆగే టైము లేదు నా కాడ’ అన్నారు.
 
[+] 10 users Like mkole123's post
Like Reply
Author’s notes అనగా రచయిత ప్రేలాపనలు – నిజానికి ఈ చిన్మయుడి కథను మన కిరీటి కథతో పాటుగా రాద్దామనుకున్నాను. ఇక్కడ చెప్పిన పాయింట్ తో ఒక పెద్ద కథ రాయొచ్చు. ప్రజారంజకంగా పరిపాలిస్తున్న రాజు కామమోహంలో పడి కొట్టుకులాడితే ఆ రాజ్యం గతి ఏమయ్యింది అనేది main plot. కామసూత్ర మీద బేస్ అయింది కాబట్టి కావలసినంత శృంగారం రాసుకోవచ్చు. నాల్గు జాతుల స్త్రీలతో రాజు శృంగారం, వివిధ క్రీడలు అబ్బో, చాలా రాయొచ్చు. తలచుకుంటే కొన్ని రంజైన sub-plots కూడా నడపొచ్చు. రాజు ఇలా చేస్తుంటే రాణి ఊర్కుందా? ఆ గ్రంధం చదివి ఆమె కూడా స్త్రీలు, పురుషులు ఇరువురితో శృంగార క్రీడలు మొదలెడితే? చిన్మయుడు కాక రాజ్యంలో ఇంకెవరు దీనివల్ల నష్టపోయారు?

అయ్యబాబోయ్ ఇక్కడితో ఆపేస్తాను... ఇప్పుడింక వేరే కథ రాసే టైమ్ లేదు నాకు. ఔత్సాహిక రచయితలు ఎవరన్నా ఈ కథ రాయదలచుకుంటే రాసేయ్యండి. ఒకవేళ నాకు ఎప్పుడన్నా సమయం కుదిరి ఈ కథ రాస్తే ఈ genre లోని కథ చదువుతారో లేదో ఓ కామెంట్ పెట్టండి.

అలాగే కథ చదివి కామెంట్లు పెడుతున్న ప్రతి ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు. సమయాభావం వల్ల రాయడం కుదరట్లేదు. ఐనా maximum సమయానుకూలంగా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
[+] 7 users Like mkole123's post
Like Reply
కిరీటి కి కలలు రావడం ఆగటం లేదు ఇప్పుడు శైలు చెప్పిన దానికి ఏమి చేస్తాడో మరి
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
(13-06-2020, 07:00 AM)mkole123 Wrote: Author’s notes అనగా రచయిత ప్రేలాపనలు – నిజానికి ఈ చిన్మయుడి కథను మన కిరీటి కథతో పాటుగా రాద్దామనుకున్నాను. ఇక్కడ చెప్పిన పాయింట్ తో ఒక పెద్ద కథ రాయొచ్చు. ప్రజారంజకంగా పరిపాలిస్తున్న రాజు కామమోహంలో పడి కొట్టుకులాడితే ఆ రాజ్యం గతి ఏమయ్యింది అనేది main plot. కామసూత్ర మీద బేస్ అయింది కాబట్టి కావలసినంత శృంగారం రాసుకోవచ్చు. నాల్గు జాతుల స్త్రీలతో రాజు శృంగారం, వివిధ క్రీడలు అబ్బో, చాలా రాయొచ్చు. తలచుకుంటే కొన్ని రంజైన sub-plots కూడా నడపొచ్చు. రాజు ఇలా చేస్తుంటే రాణి ఊర్కుందా? ఆ గ్రంధం చదివి ఆమె కూడా స్త్రీలు, పురుషులు ఇరువురితో శృంగార క్రీడలు మొదలెడితే? చిన్మయుడు కాక రాజ్యంలో ఇంకెవరు దీనివల్ల నష్టపోయారు?

అయ్యబాబోయ్ ఇక్కడితో ఆపేస్తాను... ఇప్పుడింక వేరే కథ రాసే టైమ్ లేదు నాకు. ఔత్సాహిక రచయితలు ఎవరన్నా ఈ కథ రాయదలచుకుంటే రాసేయ్యండి. ఒకవేళ నాకు ఎప్పుడన్నా సమయం కుదిరి ఈ కథ రాస్తే ఈ genre లోని కథ చదువుతారో లేదో ఓ కామెంట్ పెట్టండి.

అలాగే కథ చదివి కామెంట్లు పెడుతున్న ప్రతి ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు. సమయాభావం వల్ల రాయడం కుదరట్లేదు. ఐనా maximum సమయానుకూలంగా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

మీ రచనా శైలి అద్బుతం...... కానీ ఒక చిన్న సందేహం ...... పశువుల కాపరి పెంచలయ్య ఎవరు ...... నేను ఎక్కడన్న చదవకుండా వదిలిపెట్టనా
Like Reply
Nice update
Like Reply
Niko dandam sami, mammalni Normal ga vunchali ani anukovstam leda miru.... Elanti suspence lo pettesaru....
Super ga rastunnaru miru.... Chala chala bagundhi
[+] 1 user Likes fasakfuck's post
Like Reply
రచయిత గారు మీ కథలో పాత్రల చిత్రణ అద్భుతం. వాటిని మీరు ఒక అందమైన ఖజురహో శిల్పాల తీర్చిదిదుతున్నారు. కథనం కూడా చక్కగా రాస్తున్నారు.
శివ నారాయణ వేదాంత 
[+] 1 user Likes Siva Narayana Vedantha's post
Like Reply
దైవశక్తి, మానవవుని ఐహిక కోరికల మధ్య కలబోసిన ఒక అద్భుత కథా గ్రంధం ఈ కథ. ఈలాగే కొనసాగించండి.


ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd
[+] 1 user Likes Rohan-Hyd's post
Like Reply
Super update brother.... Flow miss avakunda bale rasthunnaru ilage continue cheyandi.
Like Reply
(13-06-2020, 07:00 AM)mkole123 Wrote: Author’s notes అనగా రచయిత ప్రేలాపనలు – నిజానికి ఈ చిన్మయుడి కథను మన కిరీటి కథతో పాటుగా రాద్దామనుకున్నాను. ఇక్కడ చెప్పిన పాయింట్ తో ఒక పెద్ద కథ రాయొచ్చు. ప్రజారంజకంగా పరిపాలిస్తున్న రాజు కామమోహంలో పడి కొట్టుకులాడితే ఆ రాజ్యం గతి ఏమయ్యింది అనేది main plot. కామసూత్ర మీద బేస్ అయింది కాబట్టి కావలసినంత శృంగారం రాసుకోవచ్చు. నాల్గు జాతుల స్త్రీలతో రాజు శృంగారం, వివిధ క్రీడలు అబ్బో, చాలా రాయొచ్చు. తలచుకుంటే కొన్ని రంజైన sub-plots కూడా నడపొచ్చు. రాజు ఇలా చేస్తుంటే రాణి ఊర్కుందా? ఆ గ్రంధం చదివి ఆమె కూడా స్త్రీలు, పురుషులు ఇరువురితో శృంగార క్రీడలు మొదలెడితే? చిన్మయుడు కాక రాజ్యంలో ఇంకెవరు దీనివల్ల నష్టపోయారు?
Mkole 123 garu...

ఒక రోమాంటిక్ కథలో కామసూత్రాలు గురించి రాయడానికి అవకాశము ఉండి దాన్ని వాడుకోకపోవడం చూసి కథ చదువుతూ నేను ఆశ్చర్యపోయా ....
అయినా మీ శైలి మీదీ...
కామసూత్ర అనే గ్రంథాన్ని రాసింది వాత్సాయనుడు ....
 గుప్తుల కాలం  క్రీ.శ.2 - 3
శతాబ్దం మద్యలో పాటలీ పుత్ర (ఇప్పటి పట్నా , బిహార్ ) లో జీవించాడనే అంచనా
పేరుపొందిన తత్వవేత్త, రచయిత.  కామశాస్త్రము నభ్యసించి లోకోపకారార్ధము సంభోగం గురించిన కామ సూత్రాలు  రచించాడు
ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే నాలుగు ప్రాథమిక అంశాలను  పొందుపరిచి ఒక సంతులిత కుంటుబ జీవితానికి గైడ్ లా రాసిన ఈ గ్రంథాన్ని ఇప్పుడు కేవలము శృంగారానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. 
ఉత్సవ్ అనే హిందీ సినిమా (మృచ్చకటికము కథ పై ఆధారితము ) లో ఈ కథను సైడ్ ప్లాట్ గా వాడుకొన్నారు
ఈ వాత్సాయనుని పాత్రను అమ్జద్ ఖాన్ నటించడం జరిగింది
(రేఖా,శశికపూర్, శేఖర్ సుమన్ ఇతర నటులు)
కథ మాత్రంఅద్బుతంగా రాస్తున్నారు... సూపర్.. 

 
mm గిరీశం
[+] 5 users Like Okyes?'s post
Like Reply
Waiting for update
Like Reply
Update sir
Like Reply
Waiting for your update brother
Like Reply
Waiting for update brother
Like Reply
Excellent story bro
Like Reply




Users browsing this thread: 19 Guest(s)