Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రేయ్ కృష్ణా ........ అక్కయ్య దేవతలా రెడీ అయ్యేలోపు మనం కూడా భక్తులుగా రెడీ అవ్వాలి కదా , అన్నయ్యా ......... మేము వచ్చేన్తవరకూ మీరు ఇక్కడే........ కావాలంటే బస్ లోనే స్నానం చెయ్యండి , ఇంకా చూస్తున్నావే కారు తియ్యి అని తియ్యని కోపం ప్రదర్శించింది చెల్లి .
చెల్లి ఆనందం చూసి చాలా సంతోషం వేసింది .
అమ్మా .......... నేనుకూడా తమ్ముడితోపాటు ఇక్కడే ఉండి ఇక్కడే స్నానం చేస్తాను అని బుజ్జిఅక్కయ్య నావైపు చేతులను చాపింది .
బుజ్జిఅక్కయ్యా .......... మన అక్కయ్య దేవతలా రెడీ అవుతోంది కదా కాబట్టి మీరూ ఇంటికివెళ్లి అన్నీ అన్నీ కొత్తవి వేసుకుని బుజ్జిదేవకన్యలా రెడీ అయివస్తేనేకదా మన అక్కయ్య చూసి పరవశించిపోయేది ఒకసారి ఆలోచించండి అనిచెప్పాను .

నాన్నా ......... ఎత్తుకో , పదండి వెళదాము ఇలావెళ్లి అలా వచ్చేయ్యాలి అమ్మా ........ నాకు పట్టు గౌన్ వేసుకోవాలని ఉంది . బుజ్జితల్లీ నీకోసం మా అన్నయ్య తీసుకొచ్చాడు కదా అని సంతోషంతో బదులివ్వడంతో , బస్ దిగుతూనే లవ్ యు లవ్ యు లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి . తమ్ముడూ .......... నీ బ్యాగుకూడా తీసుకొస్తాము అని వెళ్లారు . 
లవ్ యు అంటూ గుండెలపై చేతినివేసుకొని , కాసేపు ఇంటీవైపే చూస్తూ అక్కడే కూర్చున్నాను .
 నెమ్మదిగా తెల్లవారుతోంది 15 నిమిషాల తరువాత మహి ఫ్రెండ్స్ ఉరుకులు పరుగులతో చిరునవ్వులు చిందిస్తూ రావడం , అంటీ కూడా అక్కయ్య వాళ్ళింట్లోనే ఉండటం వలన తొందరగా స్నానం చేసివచ్చేద్దాము అని కప్ బోర్డ్ నుండి కొత్త టవల్ షాంపూ షవర్ జెల్ అందుకొని కొత్త బ్రష్ పేస్ట్ కూడా ఉండటం చూసి థాంక్స్ మహేష్ అని వైజాగ్ మహేష్ ను తలుచుకుని  బాత్రూమ్లోకివెళ్ళాను .
**********

బుజ్జిఅక్కయ్య , చెల్లి వెల్లకముందు అంటీ గిఫ్ట్స్ తీసుకుని లోపలికివెళ్లి మహి తొందరగా మీ ఫ్రెండ్స్ కు కాల్ చేసి రమ్మను . గిఫ్ట్ బాక్స్ లలో ఎమున్నాయో చూడాలని నాకైతే భలే ఆత్రంగా ఉంది .
నాకు కూడా అంటీ .......... ఎవరు ఉంచారు అంటీ , మా పేర్లు తప్ప ఇచ్చినవారెవరో కూడా మెన్షన్ చెయ్యలేదు . 
ఎవరనేది , వాళ్లకు మీరంటే ఎంత ఇష్టమో , ప్రేమో , ప్రాణమో ........ ఏమో ఎవరికి తెలుసు త్వరలోనే తెలుస్తుందిలే మహి ........ నాకైతే ముందు లోపల ఎమున్నాయో చూడాలని ఉంది తొందరగా మొబైల్ తీసుకో అని మహిని తోసేసింది అంటీ ........,
అంటీ ........ ఆ గిఫ్ట్స్ వచ్చినది మాకు అని నవ్వుకుంటూ వెళ్లి జియో ఫోన్ తీసుకొచ్చి ముందుగా లావణ్యకు కాల్ చేసి గుడ్ మార్నింగ్ వన్ మినిట్ వే అంటూ మిగతా ముగ్గురినీ కాన్ఫరెన్స్ కాల్ లోకి తీసుకుని , ఫ్రెండ్స్ ఎవరో మనకోసం పెద్ద పెద్ద గిఫ్ట్స్ వాటి ఒక్కొక్కదానిపై మన ఒక్కొక్కటి పేరుని రాసి మా ఇంటి డోర్ ముందు ఉంచివెళ్లారు . 
What , what , ఏంటీ , నిజమా ........... అంటూ షాక్ లో ఉండిపోయారు . 
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ......... గిఫ్ట్ లోపల ఏముందో చూడకుండానే పోయేలా ఉన్నారే తొందరగా వచ్చెయ్యండి అని చిరునవ్వుతో చెప్పింది మహి . 
మహి మహి మహి .......... పోలేదు ఇంకా ఉన్నాము , అర గంటలో ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాము లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ నలుగురూ ఒక్కొక్క ముద్దుపెట్టి సంతోషంతో బాత్రూములలోకి దూరిపోయారు .
అంటీ వాళ్ళు రావడానికి అర గంటపైనే పడుతుంది . అంతలోపు నేనుకూడా రెడీ అయ్యి టిఫిన్ చేస్తాను అనిచెప్పింది మహి .
మహీ .......... టిఫిన్ సంగతి నేనుచూస్తాను , మీ బుజ్జిఅమ్మతోపాటు నీ హృదయాన్ని ఆక్రమించేసిన హీరోకోసం దేవకన్యలా రెడీ అవ్వు అని నుదుటిపై ముద్దుపెట్టింది .
అంటీ ..........అని మహి సిగ్గుపడిపోతుంటే ,
నాకు అంతా తెలుసు ........... అతడు పుట్టినదే ఈ దేవకన్యకోసం అని ప్రాణంలా కౌగిలించుకుని , దేవకన్యలా రెడీ అవ్వడం కోసం ఏమి అవసరమో మన రెండు ఇళ్లల్లో ఉన్నవి తీసుకో అని సంతోషంతో చెప్పారు అంటీ . మహి ......... అక్కయ్య రాగానే బాత్రూమ్లోకి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంది . 
అంటీ .......... తన ఇంటిలోనుండి కూరగాయలను మొత్తం అక్కయ్య ఇంటిలోకి తీసుకెళ్లి మాకోసం కూడా వంట మొదలెట్టారు .
అర గంట అంటే అర గంట తరువాత మహి ఫ్రెండ్స్ ఉత్సాహంతో గేట్ దగ్గర నుండే మహి మహి మహి మహి ........... అంటూ సంతోషంతో కేకలువేస్తూ లోపలికివెళ్లి దేవతలా మారిపోయి పూజచేస్తున్న అక్కయ్యను చూసి అంతులేని సంతోషంతో అమ్మా ......... మీరేనా అని షాక్ లో ఉండిపోయారు .
 లవ్లీ గుడ్ మార్నింగ్ ఏంజెల్స్ అని తియ్యదనంతో విష్ చెయ్యడంతో , 
అందరూ మరింత సంతోషంతో కౌగిలించుకోబోయి పూజ అని ఆగిపోయి , ఎవరికోసం అమ్మా ...........అని ఉత్సుకతతో అడిగారు.
నా బుజ్జిచెల్లి వస్తోంది .......... కొద్దిసేపట్లో మీరే చూసి షాక్ అయిపోతారు . సర్ప్రైజ్ అంటూ అందమైన నవ్వుతో పూజ చేసింది అక్కయ్య .

లావణ్యా .........మహి స్నానం చేస్తోంది టేబుల్ పై గిఫ్ట్స్ ఉన్నాయి కావాలంటే ఓపెన్ చేసి చూడండి అని వంట గదిలోనుండి కేకవేశారు అంటీ .......
మమ్మల్ని తొందరగా రమ్మని ఇదిమాత్రం ఇంకా స్నానం చేస్తోందా ......... బయటకు రానీ దాని సంగతి సంగతి చూస్తాము అని నలుగురూ నవ్వుకుని , అంటీ ......... మహి వచ్చాకే ఓపెన్ చేస్తాము అని నలుగురూ వంట గదిలోకి వెళ్లి wow .......... ఇంత పెద్ద పాత్రలో వంటనా .............మా కోసమేనా అంటీ అని వంటలో సహాయం చేసారు .
అవును లావణ్య .......... మీకోసం మరియు మీ అమ్మ చెప్పారే ఆ బుజ్జిచెల్లికోసం ...........
ఎవరు అంటీ అమ్మ బుజ్జిచెల్లి , అంత స్పెషలా ........... 
చాలా చాలా చాలా ............ ఇలా కోటిసార్లు చాలా చాలా .......... స్పెషల్ లావణ్యా ............ ఒక్కసారి మీరు చూశారంటే మీరే చెబుతారు కోటిసార్లు కాదు కోటి కోటిసార్లు అని ............
అంటీ అంటీ ఎప్పుడు వస్తున్నారు .......... మాకు వెంటనే వెంటనే చూసేయ్యాలని ఉంది . 
సర్ప్రైజ్ ........... తను ఇక్కడ లేదు . ఏక్షణం అయినా రావచ్చు . 
అయితే .......... ఆ బుజ్జి ఏంజెల్ వచ్చేలోపు వంట రెడీ చేసేద్దాము . ఒసేయ్ ఇద్దరు వెళ్లి హాల్ మొత్తం నీట్ గా ఉంచండి అని పంపించింది లావణ్య .
మీకు మహి మరియు అమ్మ అంటే ఎంత ప్రేమ లవ్ యు ......... అని మురిసిపోయింది అంటీ .
లవ్ యు అంటీ ......... అంటూ చకచకా చేసుకుంటూ పోయారు .

మహి లంగా ఓణీలో దేవకన్యలా రెడీ అయ్యివచ్చి హాల్లో ఇద్దరు , వంట గదిలో ఇద్దరు కష్టపడి పనిచేస్తుండటం చూసి మురిసిపోతుంటే ,
మహీ .......... సూపర్ ......... ఇంట్లోకి రాగానే తొలిసారి పట్టుచీరలో అమ్మను ఇప్పుడు నువ్వు మా మతులను పోగొట్టేశారు తెలుసా .......... ఇలా మీ ఇద్దరినీ చూడటానికి మాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేము , ఎంత అందంగా ఉన్నావే ముద్దొచ్చేస్తున్నావు అంటూ నలుగురూ కౌగిలించుకుని బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టేసి , బుజ్జి ఏంజెల్ కోసం ఇంతగా రెడీ అవ్వాలా .........
ఆ బుజ్జి ఏంజెల్ ను నేను బుజ్జిఅమ్మా అని ప్రాణంలా పిలుస్తాను కాబట్టి తనకోసమూ మరియు ఆ బుజ్జిఅమ్మ మావయ్య కోసమూనూ .........
అంటే ఆ హీరో ...........
Yes .........అంటూ సిగ్గుపడిపోయి లావణ్య గుండెలపై వాలిపోయింది .

అమ్మా అమ్మా ......... అనిపిలిచి మహిని చూపించారు నలుగురూ ........
అక్కయ్య దేవతలా మరియు మహి దేవకన్యలా ......... ఒకరినొకరు చూసుకుని ఆనందబాస్పాలతో కౌగిలించుకొన్నారు . 
అమ్మా , మహి .......... మీఇద్దరికీ మా దిష్టి నే తగిలేలా ఉందని కాటుక చుక్కలు పెట్టారు .
అమ్మా .......... ఈ పట్టుచీర ఎక్కడిది ఎప్పుడూ చూడనేలేదు అని మహి అడిగింది .
ఇది నా ప్రాణం కంటే ఎక్కువ తల్లీ .......... 17 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను . ఎలా ఉంది ...........
ఎలా ఉండటమేంటి అమ్మా ........... దివి నుండి దిగివచ్చిన దేవతలా ఉన్నారు . మీ అందం చూసి మాకే ఈర్ష్య కలుగుతోంది . ఈరోజు మాత్రం మీరు మాకు కాస్త దూరంగా ఉండాలి లేకపోతే ........... అని చెవిలో గుసగుసలాడారు .
మీకు సిగ్గులేదు అని ఒక్కొక్కరికీ ప్రేమతో ఒక్కొక్క దెబ్బవేసి , ఘుమఘుమలకు పెదాలపై చిరునవ్వుతో వంట గదిలోకివెళ్లి అక్కయ్యా ............
వస్తున్నది ఎవరు నా ప్రాణమైన చెల్లి యొక్క బుజ్జిచెల్లి ఈ మాత్రమైనా లేకపోతే ఎలా ........... నాలుగు వంటకాలు ......... అని అంటీ బదులిచ్చారు .
థాంక్యూ అక్కయ్యా .......... అని పూరీలు తిక్కడం స్టార్ట్ చేసింది అక్కయ్య . 
వాసంతి నేను చూసుకుంటాను ట్యూషన్ పిల్లలు వచ్చే సమయం అయ్యింది కదా నువ్వేళ్ళు ..........
అక్కయ్యా .......... రేపు ఎలానో సండే కదా ఈరోజు ట్యూషన్ హాలిడే ఒకేసారి monday వచ్చెయ్యండి అని అందరికీ మెసేజ్ పంపించేసాను . సో సో .......... ఈ రెండురోజులూ మా బుజ్జిచెల్లితోనే అని అంతులేని ఆనందంతో చెప్పింది అక్కయ్య .

తల్లీ మహీ ......... గిఫ్ట్స్ మరిచిపోయారా అని అంటీ కేకవెయ్యగానే ఐదుగురూ గిఫ్ట్స్ చుట్టూ చేరిపోయారు . 
గిఫ్ట్ ప్యాకింగే ఇంత అందంగా ఉంది ఇక లోపల ఏమి ఉన్నాయో ......... ఇంతకీ ఎవరూ అయి ఉంటారే అని అందరూ ఆలోచనలో పడిపోయి ప్చ్ ప్చ్ ప్చ్ .......... అన్నారు . 
ఒసేయ్ మహి .......... గిఫ్ట్ ఎవరు ఇచ్చారో మనలో ఎవరికీ తెలియదు కాబట్టి కొద్దిసేపట్లో రాబోవు మీ బుజ్జిఅమ్మనుండి గిఫ్ట్స్ అందుకుంటే ఎలా ఉంటుంది , అధిచూసి అమ్మ మరింత సంతోషిస్తారని నా నమ్మకం అని ఒక రాయి వేసింది లావణ్య .
అంతే మహి కళ్ళల్లో ఆనందబాస్పాలతో అమాంతం లావణ్యను చుట్టేసి లవ్ యు sooooo మచ్ వే ........... సూపర్ గా ఉంది ఐడియా ......... ఫ్రెండ్స్ మీరేమంటారు .
అమ్మ సంతోషిస్తుంది అంటే మాకు అంతకంటే ఏమికావాలి అని వంట గదిలోకివెళ్లి ఒక్కొక్కరూ ఒక్కొక్క వంటలో సహాయం చేసారు .
కాలేజ్ కు వెళ్లాల్సిన అవసరం లేదుకాబట్టి అప్పుడే లేచిన బుజ్జిజానకిఅమ్మ మరియు బుజ్జి మహేష్ ను మహి ఫ్రెష్ అవ్వడానికి పిలుచుకొనివెళ్లి బ్రష్ కు పేస్ట్ అందించి ఒకరి తరవాత మరొకరు స్నానం చేశాక మంచి బట్టలు వేసుకోమని అందించి బుజ్జి ఏంజెల్స్ లా తయారుచేసి హాల్లోకి పిలుచుకొనివచ్చింది . 
తల్లీ అని జానకిఅమ్మ , మహి అని బుజ్జిమహేష్ .......... మహిని చెరొకవైపు హత్తుకొని బుజ్జిఅమ్మ ఎప్పుడువస్తుంది అని అడిగారు . 
మన బుజ్జిఅమ్మకోసం అన్నీ రెడీ చేసేసాము ఈరోజు మనకు పండుగ అమ్మ ఎంత సంతోషంగా ఉందొ తెలుసా కావాలంటే వెళ్ళిచూడండి అని పంపించింది . 
తల్లీ , అక్కయ్యా ........... అంటూ ఇద్దరూ వంటగధిలోకివెళ్లి ఎప్పుడూ చూడనంతలా మురిసిపోతున్న అక్కయ్యను చూసి అంతే ఆనందంతో ఇద్దరూ హత్తుకున్నారు . బుజ్జిఅమ్మకోసం మా బొమ్మలన్నీ బయటకు తీస్తాము అని రూంలోకివెళ్లి ఎక్కడెక్కడ దాచారో అన్నింటినీ తీసి శుభ్రం చేస్తున్నారు .
అధిచూసి మహి మరింత ఆనందించి ఇద్దరి కురులపై ప్రాణమైన ముద్దులుపెట్టింది .

స్నానం ముగించి నడుముకు టవల్ చుట్టుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను .
7 గంటలకు ఇంటికివెళ్లిన చెల్లీవాళ్ళు కారులో వచ్చారు . కారుని బస్ వెనుకాలే ఆపేశారు . నెమ్మదిగా తమ్ముడూ తమ్ముడూ అంటూ కృష్ణగాడు బస్ డోర్ తెరవగానే ఎక్కి నాకు బ్యాగు అందించి , ఎంతసేపటి నుండి ఇలా కూర్చున్నావు తమ్ముడూ అని నవ్వుతోంది .
పట్టు గౌన్ లో మా బుజ్జిఅక్కయ్య బుజ్జిదేవతలా ఉంది అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , నాకూ అని బుగ్గను చూపించాను . 
బుజ్జిఅక్కయ్య కొరికేసి 5 మినిట్స్ అంతే ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెల్లూ వెల్లూ .......... అని లోపలికి సైగచేసింది .
అన్నయ్యా .......... మన బుజ్జిఅక్కయ్య వల్లనే ఆలస్యం అయ్యింది . మా అక్కయ్య దగ్గరికి వెళుతున్నది అలా అలంకరించు ఇలా అలంకరించు అని మొత్తం 4 - 5 రకాల హెయిర్ స్టైల్ లు మార్చింది . అక్కయ్యావాళ్ళు నగలు వేసుకునేంతవరకూ నాకు వద్దేవద్దు అని చెవిలో రంగులు తప్ప మొత్తం తీసేసింది . నన్నుకూడా అలానే రెడీ అవ్వమనిచెప్పింది . మన అక్కయ్యకోసం తన బరువుండే పూల బొకేను తీసుకునేంతవరకూ రోడ్ ప్రక్కనే ఉంచిన షాప్ లో తనకు నచ్చినట్లుగా రెడీ చేయించారు అని ప్రాణంలా హత్తుకుంది చెల్లీ .
 రంగురంగుల పూలను చూసి ఆనందంతో లవ్ యు లవ్ యు బుజ్జిఅక్కయ్యా .......... 5 మినిట్స్ కాదు రెండే రెండు నిమిషాలు అంతే ...........అని మళ్ళీ ముద్దుపెట్టిచెప్పాను .
మూడో నిమిషం లోపల రాకపోతే , నావల్ల కాకపోయినా ఎలాగోలా పూలను తీసుకుని మా అక్కయ్య దగ్గరకు వెళ్లిపోతాను అంతే అని 1 2 3 ......... అని కౌంటింగ్ మొదలెట్టడంతో చెల్లీ , కృష్ణగాడు నవ్వుతుంటే బ్యాగుతోపాటు లోపలికిపరిగెత్తి చకచకా వేసుకుని వెంట్రుకలను చేతులతో దువ్వుకుంటూ నేను రెడీ బుజ్జిఅక్కయ్య .......... అని చేతులుచాపగానే పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది .

నాన్నా ........ ఫ్లవర్స్ పట్టుకోండి అని కృష్ణగాడికి ఆర్డర్ వేసి బుజ్జిఅక్కయ్య నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి బస్ దిగి , అమ్మా మనందరి ప్రాణమైన అక్కయ్యను పరిచయం చేస్తాను అని చెల్లి చేతిని అందుకొని రంగోలి దగ్గర ఆగి రంగురంగుల ముగ్గుతో welcome అని రాసి స్వాగతం పలుకుతున్న దగ్గరికి చెల్లిని పికుచుకునివెళ్లి , అమ్మా......... ఎవరికోసమో మీకు తెలుసుకదా అని ముసిముసినవ్వులతో ఎంజాయ్ చేస్తోంది బుజ్జిఅక్కయ్య .
అమ్మా , నాన్నా .......... are ......... మీ వెలిగిపోతున్న కళ్ళే చెబుతున్నాయి అక్కయ్యను దగ్గర నుండి చూడటానికి , మాట్లాడటానికి మీరు ఎప్పుడో రెడీ అని నాకు తెలుసు అని అక్కడి నుండే అక్కయ్యా అక్కయ్యా ........... అని ప్రాణంలా కేకేవేసింది బుజ్జిఅక్కయ్య .

అంతే గేట్ దగ్గరికి మొదట అక్కయ్య పరుగున చేరుకుని బుజ్జిచెల్లీ ........ అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో ప్రాణంలా పిలవడం చూసి ,
మా హృదయాలు పులకించిపోయాయి . నేను అక్కయ్య పట్టుచీరను అలా కళ్ళల్లో చెమ్మతో చూస్తుండిపోయాను .
రేయ్ మామా ........... అంటూ నా చెమ్మను చూసి పట్టరాని ఆనందంతో , రేయ్ కృష్ణా ........... అక్కయ్య కట్టుకున్న చీర 17 సంవత్సరాల క్రితం రాఖీ పండుగరోజు తమ్ముళ్ళుగా మేమిచ్చిన ప్రాణమైన గిఫ్ట్ అని చెల్లీ చెవిలో గుసగుసలాడాడు .
అన్నయ్యా ........ అంటూ సంతోషంతో నాచేతిని చుట్టేసి భుజం పై వాలిపోయింది చెల్లి .
అక్కయ్య వెనుకే వచ్చిన మహి  ఫ్రెండ్స్ బుజ్జిఅక్కయ్యను చూసి అక్కయ్యా ........ ఇప్పుడే మీచిన్ననాటి ఫోటోని మహి చూపించింది , ఇక్కడ ఆ బుజ్జి ఏంజెల్ ప్రత్యక్షమయ్యింది నిజంగా ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అంటూ షాక్ లో లంగావోణీలో నావైపు చూస్తూ సిగ్గుపడుతూ వచ్చిన మహిని చుట్టేసి ఆశ్చర్యపోతున్నారు .

బుజ్జిఅమ్మా ......... పట్టు గౌన్ లో సూపర్ గా ఉన్నారు అని సైగచేసింది మహి .
 బుజ్జిఅక్కయ్య :  మీరంతా కాదు మా ప్రాణమైన అక్కయ్యకు నచ్చాలి , అక్కయ్యా .......... అక్కడే ఆగిపోయారే ఈ welcome ఎవరికోసం అని ముద్దుముద్దుగా అడిగింది .
అక్కయ్య : ఆనందబాస్పాలను తుడుచుకుని పరుగునవచ్చి అమాంతం బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని , నా బుజ్జిచెల్లిని బుజ్జిదేవకన్యలా చూసేటప్పటికి నన్ను నేను మరిచిపోయాను బుజ్జిచెల్లీ , ఎంత ముద్దొస్తున్నావో .......... ముద్దుపెట్టొచ్చా అని అడిగింది .
బుజ్జిఅక్కయ్య : ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో నా ప్రాణమే మీది అక్కయ్యా ......... ఈరోజు నుండీ నేను మీ దాసీని , మీ సేవ చేసుకోవడానికే వచ్చాను . ఒక్క ముద్దు ఏంటి ఎన్ని ముద్దులుపెడితే అంత సంతోషం నాకు అని అక్కయ్య బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టింది.
బుజ్జిఅక్కయ్య మాటలకు అక్కయ్య కళ్ళల్లోనే కాదు మాకళ్ళల్లోనూ బాస్పాలు ఆగడం లేదు . మేము ముగ్గురమూ అయితే గర్వపడుతున్నాము .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ........ ఇంకెప్పుడూ అలామాట్లాడకు ఈ హృదయం తట్టుకోలేదు . నీ స్థానం ఇక్కడ తెలుసా అని బుగ్గలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టింది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య కన్నీళ్లను తుడిచి , గురువును సేవించుకోవడం శిష్యుల బాధ్యత కదా అక్కయ్యా .........., ఈరోజు నుండే మా అక్కయ్య దగ్గర విద్యాభ్యాసం మొదలెట్టబోతున్నాను . నన్ను ట్యూషన్ లో చేర్చుకుంటారా అని ముద్దుముద్దుగా అడిగింది .
అక్కయ్య : నా అదృష్టం బుజ్జిచెల్లీ .......... అయితే మా బుజ్జిచెల్లి రోజుకు రెండుమూడుగంటలైనా నాదగ్గర ఉంటుంది అని సంతోషిస్తుంది .
బుజ్జిఅక్కయ్య : అంటే నేను మీకు రెండు మూడు గంటలు మాత్రమే ఇష్టమేనా అక్కయ్యా ......... అని బుంగమూతిపెట్టుకుంది . 
అక్కయ్య : బుజ్జిచెల్లీ ........ నాకు అర్థం కాలేదు .........నిన్ను బాధపెట్టానా ........ నన్ను క్షమి..........
చెల్లి : అక్కయ్యా .......... అని తొలిసారి ప్రాణంలా పలకరించి , ఆ పిలుపుకే పరవశించిపోయి , పెదాలపై అంతులేని ఆనందంతో అక్కయ్యా అక్కయ్యా ........ మీరు ఎప్పటికీ క్షమించు , sorry అనిమాత్రం చెప్పకండి , మేము తట్టుకోలేము నా తల్లి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి . వాటి స్థానంలో లవ్ యు అనిచెప్పండి అని అక్కయ్యతో మాట్లాడుతూ మురిసిపోతోంది .
అక్కయ్య : మీరు ........
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... మా అమ్మ కృష్ణవేణి కానీ నేను ప్రేమతో అక్కయ్యా ...... అని పిలుస్తాను . అలా పిలిస్తేనే వాళ్లకు ఆనందం . అక్కయ్యా ........ పూలు పట్టుకుని ఉన్నారే మా నాన్న కృ కృ ........ కృనాల్ కానీ నేను ప్రేమతో తమ్ముడూ అనిపిలుస్తాను . నాన్నా ....... పూలు తీసుకునిరండి అని అందుకొని అక్కయ్యకు అందించింది . అక్కయ్య ....... నాకొసమే లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిచెల్లీ ......... ఇలాంటి గిఫ్ట్ అందుకొని సుమారు 17 సంవత్సరాలు దాటిపోయింది అని మాఇద్దరినీ తలుచుకుని కన్నీటిపర్యంతమై వెంటనే తేరుకుంది . 
కృష్ణ : రేయ్ మామా ......... అక్కయ్య మనల్నే తలుచుకుంటున్నారు అని నా భుజం చుట్టూ చేతినివేసి పొంగిపోతున్నాడు .
బుజ్జిఅక్కయ్య : మహి ఇటురా ........ పూలు బరువున్నాయికదా మా అక్కయ్య చేతులు నొప్పిపుడతాయి పట్టుకో అని అందించింది . 
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ .........అని బుగ్గపై చిరునవ్వులు చిందిస్తూ ముద్దుపెట్టి, బుజ్జిచెల్లీ ......... మీ అమ్మగారిని మరి నేనెలా పిలిస్తే నీకు సంతోషం .
బుజ్జిఅక్కయ్య : అమ్మను ప్రేమతో చెల్లీ అని పిలవండి , నాన్నను తమ్ముడూ అనిపిలిస్తే నాకంటే ఆనందించేవారు ఇంకెవరూ ఉండరు . మా అమ్మానాన్నల పరిచయం అయ్యిందికదా వాళ్ళు నాకు మూడవ నాలుగవ ప్రాణాలు ఇక నా రెండవ ప్రాణం మా మావయ్య మ మ మ ......... మనోజ్ , మా అమ్మ ప్రాణమైన అన్నయ్య - నాన్నకు ప్రాణమిత్రుడు , నిన్ననే మీరు చూసారు మాట్లాడారు అని నావైపు చూపించి , కానీ ఇప్పటివరకూ నేను అలా పిలిచిందే లేదు . తమ్ముడూ ........ అని పిలుస్తాను . అలా పిలిచిన ప్రతిసారీ ముగ్గురూ సంతోషంతో గాలిలో తేలిపోతారు .
మహి : బుజ్జిఅమ్మా .......... నాల్గవ ప్రాణం నాన్న , మూడవ ప్రాణం అమ్మ , రెండవ ప్రాణం మావ ......... అదే మీ ప్రాణమైన తమ్ముడు . వీళ్ళకంటే మించినవాళ్ళు ఇక ఉండరనేది నా గట్టినమ్మకం . మరి ఆ మొదటి ప్రాణం ఎవరు ...........
బుజ్జిఅక్కయ్య : మహి నీకు ఇంకా తెలియలేదా .......... అంటీకి తెలిసింది అంటీ ......
అంటీ : నాకు నిన్ననే తెలిసిపోయింది .
బుజ్జిఅక్కయ్య : లావణ్య అక్కా మిగతా ముగ్గురి పేర్లు నాకు తెలియవు , ఇప్పటివరకూ చూసారు కదా నా మొదటి ప్రాణం ఎవరో మీకు తెలిసిందా........
లావణ్య : మా బుజ్జిఅమ్మకు నా పేరు తెలుసు అని సంతోషంతో నలుగురూ వచ్చి చుట్టేసి , బుజ్జిఅక్కయ్యకు ఒక్కొక్క ముద్దుపెట్టి , మాకు కూడా తెలుసు ........కానీ దీనిని మహి అని ప్రేమతో పిలిచి మమ్మల్ని మాత్రం లావణ్యా అక్కా అని పిలిచి దూరం చెయ్యడం ఏమీ బాలేదు అని బుంగమూతిపెట్టుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని అందమైన నవ్వుతో ........ అంటీ , లావణ్యా చెప్పండి నా మొదటి ప్రాణం ఎవరో , మావాళ్లకు నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే తెలుసు అని గుసగుసలాడి నావైపు కన్నుకొట్టింది .
మా బుజ్జివాసంతి , మా బుజ్జిఅమ్మ మొదటి ప్రాణం తన అక్కయ్యే అని సంతోషంతో కేరింతలువేస్తూ మహి , అక్కయ్యా , బుజ్జిఅక్కయ్యను చుట్టేశారు అందరూ ........
ఉద్వేగంతో చూస్తున్న అక్కయ్యవైపు అవును నా మొదటి ప్రాణం మా అక్కయ్యే అని బుజ్జిఅక్కయ్య ప్రాణమైన ముద్దుపెట్టి చెప్పగానే , 
అక్కయ్య , మహి కళ్ళల్లో కన్నీళ్లు మరియు ఆనందబాస్పాలు ఒకేసారి ఆపకుండా కారుతున్నాయి . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... రెండు మూడు గంటలు కాదు మీకు ఇష్టమైతే 24/7 మా అక్కయ్య గుండెలపైనే ఉండిపోతాను . నాకు మీ తరువాతనే వాళ్లుముగ్గురూ ........... అని గట్టిగా హత్తుకుంది.
బుజ్జిఅక్కయ్య మాటలకు తెరుకోవడానికి అక్కయ్యకు చాలాసమయమే పట్టింది . బుజ్జిఅక్కయ్యను తన ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకొని ముద్దులవర్షం కురిపిస్తుంటే, అక్కయ్య గుండెలపై నేనున్నట్లు ఫీల్ అవుతున్నాము . ఆరోజులు కళ్ళముందు మెదులుతున్నాయి .
కృష్ణవేణి గారు , బాబు ......... 
అక్కయ్యా .......... మీరేమీ చెప్పబోతున్నారో మాకు తెలుసు , మా బుజ్జిఅక్కయ్య మాటలకు మేమెంత పరవశించిపోయామో మీకు తొందరలోనే తెలుస్తుంది . తనకు ఏదైతే ఇష్టమో అధిమాకు ప్రాణం . మమ్మల్ని కూడా చెల్లీ తమ్ముళ్లూ .......... అని పిలిస్తే ........... అంతకంటే కోరిక మరేదీ కోరుకోము అని ప్రాణంలా మాట్లాడింది చెల్లి .
 అక్కయ్య అంతులేని ఆనందంతో బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , చెల్లీ ......... అని చెల్లిని పిలువగానే , సంతోషం పట్టలేక అన్నయ్యా ......... అక్కయ్య నన్ను చెల్లీ అని ప్రేమతో పిలిచింది ఇక జీవితంలో ఇంకే కోరికా నాకులేదు అని నా చేతులను గట్టిగా చుట్టేసి పరవశించిపోతోంది . అక్కయ్యా ........ అని ప్రాణం కంటే ఎక్కువైన పిలుపుతో ఒక్కసారి మిమ్మల్ని కౌగిలించుకోవచ్చా అని కోరిక కోరింది చెల్లి .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ఒక చెల్లి ఇంత ప్రాణంలా కోరిక కోరితే ఏ అక్కయ్య మాత్రం కాదంటుంది అందులోనూ మా బుజ్జిఅక్కయ్య అమ్మ మరియు చెల్లి నా అదృష్టం అని ఒకచేతితో బుజ్జిఅక్కయ్యను హత్తుకొని మరొకచేతితో చెల్లిని కౌగిలిలోకి ఆహ్వానించింది .
అన్నయ్యా ..........
అక్కయ్య కౌగిలిలోని మాధుర్యాన్ని ఆస్వాదించు చెల్లీ అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . 
చెల్లి తన జీవితంలో అమూల్యమైన అత్యంత ఇష్టమైనది పొందబోతున్నట్లు వొళ్ళంతా తియ్యదనంతో జలదరిస్తూ అక్కయ్యనే ప్రాణంలా చూస్తూ వెళ్లి ప్రాణంలా కౌగిలించుకుని ఆఅహ్హ్హ్........ అక్కయ్యా ........ ఎంత హాయిగా ఉంది , జీవితాంతం ఇలాగే ఉండిపోవాలని ఉంది అని చెప్పగానే , అక్కయ్య తనకు తెలియకుండానే చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి కాస్త కంగారుపడుతోంటే ,
అక్కయ్యా ......... మరొక్కటి మరొక్కటి మరొక్కటి అంటూ బోలెడన్ని ముద్దులు ఆస్వాదిస్తూ అంతులేని ఆనందంతో కళ్ళల్లో ఆనందబాస్పాలతో పారవశ్యం పొందుతోంది .
అక్కయ్యా , అక్కయ్యా .......... ఇక చాలు , ఒసేయ్ అమ్మా ........ అవన్నీ నాముద్దులు వెళ్లి మీ శ్రీవారు , మీ అన్నయ్య గుండెలపై వాలిపోయి వాళ్ళ ముద్దులను  అందుకో అని తియ్యనికోపంతో చెప్పడంతో ,
అందరూ నవ్వుతోంటే , బుజ్జిఅక్కయ్యా - తల్లీ ......... చివరిది ఓకేఒక్కటి ఓకేఒక్కటి అని మరొక 5 - 6 ముద్దులు స్వీకరించి లవ్ యు అక్కయ్యా ......... అని ప్రాణంలా ఇద్దరినీ కౌగిలించుకుని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ఏకంగా కొరికేసింది .
స్స్స్......... అక్కయ్యా ........ అమ్మకు ఒకదెబ్బవెయ్యి దెబ్బవెయ్యి దెబ్బవెయ్యి అని గోలగోల చెయ్యడమే కాకుండా , అక్కయ్య చేతిని అందుకొని చెల్లి బుగ్గను కొట్టేలా తాకింది . 
చెల్లీ ........... 
అక్కయ్యా .......... కాస్త గట్టిగా కొడితే మీచేతులేమైనా అరిగిపోతాయా ......... ఇక ఇక్కడే ఉంటాము కదా మా అక్కయ్య ఒక్కదెబ్బయినా రుచిచూడాల్సిందే లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ........ అని మరొకసారి ప్రాణంలా హత్తుకొని , నెరుగావచ్చి మాఇద్దరినీ అమాంతం కౌగిలించుకుని అన్నయ్యా , రేయ్ .......... మీ అక్కయ్య కౌగిలింతను ఆస్వాదించండి అని గుసగుసలాడింది .
ప్రాణంలా చుట్టేసి ఆఅహ్హ్హ్......... లవ్ యు చెల్లీ అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .

అక్కయ్య అంటీ దగ్గరకువెళ్లి అక్కయ్యా ........ ఇది కలా నిజమా మా బుజ్జిఅక్కయ్యతోపాటు అందరూ నాపై విశ్వమంత ప్రేమను కురిపిస్తున్నారు . ఇలాంటి అనుభూతిని ఆస్వాదించి 17 సంవత్సరాలు అయ్యింది ఒక్కసారిగా అంటే ఈ హృదయం తట్టుకోగలదో లేదో అని కళ్ళల్లో చెమ్మతో మురిసిపోతోంది .
బుజ్జిఅక్కయ్య కన్నీళ్లను తుడిచి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టడం చూసి , తన కన్నీళ్లను తుడుచుకుని వాసంతి అన్నిరోజులూ ఒకేలా ఉండవు . నీకోసమే వీళ్ళు ............ఆగిపోయి , వాసంతి ........... నీ ప్రాణమైన బుజ్జిచెల్లి వచ్చి ఎంటగసేపయ్యింది బయటే నిలబెట్టి మాట్లాడేస్తున్నావు . నీకు వీళ్ళను మీఇంట్లోకి పిలుచుకునివెళ్లడం ఇష్టం లేకపోతే చెప్పు మాఇంటికి సంతోషంతో పిలుచుకువెళతాను . బుజ్జివాసంతి రామ్మా .......... మాఇంటికి వెళదాము అని చేతులుచాపింది .
క్షమించండి అంటీ ........... మా అక్కయ్యే మా ప్రాణం . మా అక్కయ్య తిట్టినా , కొట్టినా , బయటకు తోసేసినా ........... మా అక్కయ్య మెయిన్ డోర్ పట్టుకుని వేలాడుతూ ఇక్కడే ఉండిపోతాము .ఈ జీవితం మా అక్కయ్యకు అంకితం ........ నేను పుట్టినదే .............. అక్కయ్యా ....... ఆకలి మిమ్మల్ని కొరుక్కుని తినెయ్యనా .......... 
 అక్కయ్య : మా బుజ్జిచెల్లికోసం ఎప్పుడైనా ఆహారమైపోతాను అని అందరితోపాటు నవ్వుకుని , మా బుజ్జిచెల్లికి ఏది ఇష్టమో తెలియక ఇడ్లీ , వడ , పూరీ , దోస .......... చేసాము , నీకు ఏది ఇష్టమో అది తినవచ్చు . 
బుజ్జిఅక్కయ్య :  ఆ నాలుగింటిలో మీరు ఏ ఐటమ్ చేశారు అక్కయ్యా ..........
పూరీ అని అంటీ సంతోషంతో కేకవేశారు .
బుజ్జిఅక్కయ్య మాముగ్గురివైపు తియ్యని నవ్వుతో చూసి అయితే నాకూ పూరీనే , మా అమ్మానాన్నలకూ , తమ్ముడికీ పూరీనే అని అక్కయ్య బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టిచెప్పింది . అక్కయ్యా .......... అప్పటినుండి ఎత్తుకున్నారు చేతులు నొప్పివేస్తున్నాయా ..........., 
అమ్మా అమ్మా అమ్మా.......... నేను నేను నేను అని మహి మరియు మహి ఫ్రెండ్స్ పోటీపడుతున్నారు .
అక్కయ్య :   బుజ్జిఅక్కయ్యకు ఇష్టం లేనట్లు ముఖం చూసి , నా బుజ్జిచెల్లిని ఎవ్వరికీ ఇవ్వను , ఎంతసేపు ఎత్తుకుంటే అంత ఉత్సాహం నాకు అని ప్రాణంలా గుండెలపై హత్తుకుంది .
 బుజ్జిఅక్కయ్య : లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ......... మనం లోపలకువెళ్లి కూర్చుందాము అక్కయ్యా ........... అని ధీర్ఘం తీస్తూ ముద్దుముద్దుగా చెప్పింది .

అక్కయ్య చెల్లిదగ్గరకువచ్చి , చెల్లీ .......... నా తమ్ముళ్లను తప్ప మరెవ్వరినీ తమ్ముడూ అని పిలువలేను నన్ను క్ష...........
అక్కయ్యా ............
Sorry sor............
అక్కయ్యా ...........
లవ్ యు లవ్ యు ...........
చెల్లి : మాఇద్దరివైపు చూసి ఆనందబాస్పాలతో మీ ఇష్టం అక్కయ్యా ......... మ మ మనోజ్ , కృనాల్ అని పేరుపెట్టి పిలవండి . 
అక్కయ్య : చెల్లీ , కృనాల్ , మహే.......... sorry మనోజ్ అంటూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని లోపలికి ఆహ్వానించింది .
మమ్మల్ని తమ్ముళ్లూ అని పిలవలేదని బాధపడుతుంటే ,
చెల్లి అక్కయ్య మాటలను చెవిలో చెప్పగానే ఎవరెస్టు ఎక్కినంత ఆనందంతో అక్కడికక్కడే మాస్ డాన్స్ వేయాలనే ఊపుని కంట్రోల్ చేసుకుని , అత్యంత సంతోషంతో కౌగిలించుకున్నాను .
అంటీ , మహి ఫ్రెండ్స్ : ఒసేయ్ మహీ వెల్లవే వెళ్లి స్వయంగా పీలుచుకొనిరా అని నావైపు తోసారు .
 మహి :  అంతే తియ్యని జలదరింపుతో నెమ్మదిగా మావైపు అడుగులువేసి నాకళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ మ...... మనోజ్ లో...పలికి రండి అని ఆహ్వానించింది . అక్కయ్యా ........... రండి అని చెల్లిచేతిని అందుకుంది .
చెల్లి : మహీ ........... అంటూ రెండుచేతులతో చేతిని పట్టుకుని , అచ్చు మా అక్కయ్యలానే అదే మీ అమ్మలానే ఉన్నావు .......... అవును కృష్ణా ........ అక్కయ్య ఎవరికోసం కన్నదో అని కృష్ణగాడు చెప్పాడు .
వాడివైపు చూడటంతో .......... 
రేయ్ మామా నాకైతే ఆకలివేస్తోంది రారా .......... అక్కయ్య పూరీలు అనగానే వాడి భుజం చుట్టూ చేతినివేసి లోపలికివెళ్లిపోయాను .
చెల్లి : మహీ ........... ఒకటి చెబుతున్నాను . నీకు ఏ అవసరం వచ్చినా , ఎటువంటి ఇబ్బంది కలిగినా , మనసులో ఏమున్నా ......... నాకు చెప్పవచ్చు . ఒక్క కాల్ చేసినా చాలు మేము చూసుకుంటాము . బాగా గుర్తుపెట్టుకో ......... 
అక్కయ్యా ......... అంటూ అమాంతం కౌగిలించుకుంది మహి .........
ఈ కౌగిలింత కోసమే మహి ఇప్పటివరకూ వేచిచూస్తున్నాను . 
అక్కయ్యా ......... దానితో మొబైల్ లేదు , ఇంట్లో ఉన్నది ఒకేఒక మొబైల్ అదికూడా చిన్నది అని మహి ఫ్రెండ్స్ చెప్పారు . 
మొబైల్ అవసరం నాకిప్పటివరకూ అయితే రాలేదు అక్కయ్యా .........., మా అమ్మతో ఉంటే చాలు ప్రపంచమే నా దగ్గర ఉన్నట్లు అని గర్వపడుతూ చెప్పి చెల్లిని లోపలికి పిలుచుకునివచ్చారు .

 అక్కయ్య : బుజ్జిచెల్లీ ........ టేబుల్ పై కూర్చో వేడివేడిగా పూరీ తీసుకొస్తాను .
బుజ్జిఅక్కయ్యకు అక్కయ్య చేతితో వండిన పూరీలే , అక్కయ్య చేతితో తినాలని కోరిక వలన అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పంపించి , బుజ్జిజానకి అమ్మచేతిని గుండెలపై హత్తుకుంది .
అలా అక్కయ్య వెళ్లడం ఆలస్యం మహి ఫ్రెండ్స్ బుజ్జిఅక్కయ్యను చుట్టుముట్టి , ఎంత క్యూట్ గా ఉన్నావు బుజ్జిఅమ్మా ......... మేమూ ముద్దులుపెట్టచ్చా ........అని అడిగారు .
రండి అని అందరినీ పిలిచి ఆ రైట్స్ మా అక్కయ్యకు ఇచ్చేసాను , అక్కయ్య దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మీరు అని చెవుల దగ్గర చెప్పింది .
అయితే ఒక్కనిమిషం అని అమ్మా అమ్మా ......... అంటూ ఇద్దరు వంటగదిలోకివెళ్లారు.

Wow గిఫ్ట్స్ నాకోసమేనా అని చెల్లితోపాటు లోపలికివచ్చిన మహిని , మహి ఫ్రెండ్స్ ను అడిగింది . 
అంటీ నవ్వుకుని బుజ్జివాసంతి తల్లీ ......... ఎవరో అజ్ఞాతవ్యక్తులు మహి మరియు మహి ఫ్రెండ్స్ కోసం ఈ గిఫ్ట్స్ ను రాత్రి ఇంటి డోర్ ముందు ఉంచేసి వెళ్లారు .
 బుజ్జిఅక్కయ్య :  మరి అయితే ఇంకా ఓపెన్ చెయ్యలేదే , లోపల ఎమున్నాయో నేనైతే ఇంతసేపు ఆగలేను . నా తమ్ముడు ఏదైనా గిఫ్ట్ తీసుకురావడం ఆలస్యం క్షణాల్లో చూసేయ్యాల్సిందే ..........
అంటీ : నీ చేతులతో అందుకోవాలని అందరూ ఆశపడుతున్నారు తల్లీ ........
బుజ్జిఅక్కయ్య : కానీ ఈ గిఫ్ట్స్ నేను తీసుకురాలేదు కదా .......
అంటీ : ఎవరిచ్చారో కూడా తెలియదు కదా తల్లీ ....... , కనీసం వాళ్ళ పేరు కూడా లేదు . అందుకే వాళ్ళ ప్రియమైన వాళ్ళతో అందుకోవాలని ఆశపడుతున్నారు తప్పా ..........
బుజ్జిఅక్కయ్య : తప్పే కాదు అంటీ ......... , అక్కయ్యా అక్కయ్యా ....... ఇదిగో వడ్డించుకొని వస్తున్నాను బుజ్జిచెల్లీ అని ప్లేటులో వేడివేడి పూరీలు పళ్ళెం చట్నీ తీసుకొచ్చింది అక్కయ్య . ఆకలేస్తోంది అన్నావు కదా అని అందించబోయింది .
 బుజ్జిఅక్కయ్య :  అంతే రెండుచేతులనూ కట్టుకుని బుంగమూతిపెట్టుకుంది .
అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... అమ్మ తినిపించాలా ? 
బుజ్జిఅక్కయ్య : ఊహూ .........
అక్కయ్య : కృనాల్ , మనోజ్ తినిపించాలా ? 
బుజ్జిఅక్కయ్య : ఊహూ ..........
అక్కయ్యకు బుజ్జిఅక్కయ్య కోరిక అర్థమై సంతోషంతో మురిసిపోతోంది .
వాసంతి ......... తెలిసికూడా అలా అడుగుతున్నావు కదా , నీ బుజ్జిచెల్లికి తినిపించి పావనం చెందు అని సంతోషంతో చెప్పింది అంటీ .
అక్కయ్యా ........... yes yes ........ ఈరోజు నుండీ మూడుపూటలా మా అక్కయ్య తినిపిస్తేనే తినేది లేకపోతే పస్తులుంటాను మా అమ్మ తినిపించినా తినను , నా తమ్ముళ్లు తినిపించినా అంతే అని నోటిని పెద్దగా తెరిచింది బుజ్జిఅక్కయ్య .
కళ్ళల్లో ఆనందబాస్పాలతో చిన్నగా పూరీ విరిచి పళ్ళెం చట్నీ అద్దుకుని బుజ్జిఅక్కయ్యకు తినిపిస్తోంటే చెల్లితోపాటు నేనూ కృష్ణగాడు కూడా నోటిని తెరిచి ఒకరినొకరు చూసుకుని , చెల్లి మాఇద్దరి చేతులనూ చుట్టేసి త్వరలోనే ఆ కోరిక కూడా తీరుతుంది అని మురిసిపోయాము .
 బుజ్జిఅక్కయ్య :  అక్కయ్యా ......... ముందు మా బుజ్జిజానకిఅమ్మకు అని తన చేతిపై ముద్దుపెట్టింది .
జానకి : లవ్ యు sooooo మచ్ బుజ్జిఅమ్మా - తల్లీ ......... అని ప్రేమతో పిలువగానే, బుజ్జిఅక్కయ్య సంతోషించడంతో ఇలా పిలవడం ఇష్టం కదూ అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , ముందు మా బుజ్జిఅమ్మకే ...... తల్లీ వాసంతి తినిపించు అని చెప్పింది .
ముందు జానకి అమ్మకే - లేదు బుజ్జిఅమ్మకే .......... అని ప్రేమతో వాదులాడుతుంటే బుజ్జిమహేష్ వెళ్లి అక్కయ్య చేతిలోని పూరీ తినేసి యమ్మీ ........ అంటూ టేబుల్ ఎక్కి బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాడు .
అక్కయ్యా ......... తొలిముద్ద ఎవరికి చేరాలో కరెక్ట్ గా చేరింది , మీ బుజ్జిచెల్లి బుజ్జిమహేష్ కే దక్కాలి నెక్స్ట్ బుజ్జిఅమ్మకు అని బుజ్జిజానకిఅమ్మ నోటిని తెరిచిపట్టుకుంది బుజ్జిఅక్కయ్య . 
అందరూ సంతోషంతో నవ్వుతోంటే , మా ప్రాణమైన బుజ్జిచెల్లి ఎలా ఆర్డర్ వేస్తే అలా అని బుజ్జిజానకిఅమ్మకు తినిపించి ఇప్పుడు మా బుజ్జిచెల్లికి , బుజ్జిఅమ్మకు , బుజ్జివాసంతికి , బుజ్జిఅక్కయ్యకు , బుజ్జితల్లికి అని అందరూ ఆ దృశ్యాన్ని చూడటమే కాదు ఏకంగా వీడియో లలో బంధించడానికి రెడీ అయిపోయారు మహి ఫ్రెండ్స్ .
అక్కయ్య ......... తొలిసారి నాకు తినిపించేటప్పుడు ఎంత పరవశించిపోయారో అంతే సంతోషంతో చిన్న పూరీ విరిచి పళ్ళెం , చట్నీ అద్దుకుని ఆ ఆ ....... అంటూ నోరుతెరిచిన బుజ్జిఅక్కయ్యకు తినిపించింది .
అంతే మురిసిపోయి ఫీల్ అవుతూ తిని కళ్ళల్లో చెమ్మతో నా వైపే చూస్తూ లేచి అమాంతం అక్కయ్య గుండెలపైకి చేరిపోయి , మా అక్కయ్య ప్రాణమైన చేతిముద్దకోసం ప్రపంచంతో యుద్ధం చెయ్యొచ్చు . అతిత్వరలోనే మన తమ్ముడికి కూడా ఇలాగే తినిపించాలి అక్కయ్యా ........ అని మాకుమాత్రమే తెలిసేలా కళ్ళతోనే వ్యక్తపరిచింది .

బుజ్జిమహేష్ , బుజ్జిఅక్కయ్య , బుజ్జిజానకిఅమ్మ ఒకరితరువాతమరొకరు అక్కయ్య చేతిముద్దలను ఆవురావురుమంటూ కడుపునిండా తిన్నారు . అక్కయ్య ముగ్గురికీ నీళ్లుతాగించి పట్టుచీరతో తుడవబోతుంటే , 
అక్కయ్యా ........ పట్టుచీర అంటూ ఆపి , చెల్లి తన పట్టుచీరతో ముగ్గురి నోటినీ తుడిచింది . కృష్ణగాడు , నేను గుండెలపై చేతినివేసుకొని హమ్మయ్యా ....... అనుకున్నాము .
చెల్లీ ......... నువ్వుకట్టుకున్నది కూడా పట్టుచీరనే కదా , 
అయ్యో చూసుకోలేదు అక్కయ్యా ......... అని మావైపు కన్నుకొట్టింది చెల్లి .
లవ్ యు రా , లవ్ యు చెల్లీ అని శాంతించాము .
మా బుజ్జిచెల్లి మాయలో ఈ చీర గొప్పతనాన్ని కూడా మరిచిపోయాను అంటే , నా బుజ్జిచెల్లి అంటే నాకు ఎంత ప్రాణమో మీరు అర్థం చేసుకుని మేము ఎప్పుడూ కలిసుండేలా చెయ్యాలి అని ఉద్వేగంతో చెల్లిని అర్థించింది అక్కయ్య .
పూర్వకాలంలో తమ పిల్లల విద్యాబ్యాసం కోసం గురువుల దగ్గర గురుకులంలో , ఆశ్రమాలలో వదిలేవారు తల్లిదండ్రులు . అలా మా ప్రాణమైన తల్లిని తన ప్రాణమైన అక్కయ్య దగ్గర వదిలేసి చాలాసమయం అయ్యింది అక్కయ్యా ........ ఇక మీ బుజ్జిచెల్లిపై సర్వహక్కులూ మీవే , మీరు పర్మిషన్ ఇస్తేనే మేమూ చూడటానికి వస్తాము . మీరు నో అంటే మరింత సంతోషంతో వెళ్లిపోతాము .
చెల్లీ .......... అంటూ అమాంతం కౌగిలించుకుని , ఏమి మాట్లాడాలో నాకు మాటలు రావడం లేదు అని అక్కయ్య పొంగిపోతోంది .
అక్కయ్యా ......... టిఫిన్ కేవలం మీ బుజ్జిఅక్కయ్యకు మాత్రమేనా ......... 
చెల్లీ ......... నిమిషాల్లో పూరీలు తీసుకొస్తాను అని ఆనందబాస్పాలను తుడుచుకుని , బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి బుజ్జిఅమ్మ , బుజ్జితమ్ముడితో ఆడుకుంటూ ఉండు ఇప్పుడే వచ్చేస్తాను అని వంట గదిలోకి వెళ్ళింది అక్కయ్య . వెనుకే చెల్లికూడా వెళ్ళింది .

 బుజ్జిఅక్కయ్య :  అక్కయ్యా అక్కయ్యా ........, అమ్మా ......... wait wait wait ఆకలివలన గిఫ్ట్స్ సంగతే మరిచిపోయాను . ఎవరో వేరెవరో ఇచ్చిన గిఫ్ట్స్ ను నాచేతులతో అందుకోవాలని ఆశపడుతున్నారు మహి , లావణ్య వాళ్ళు ......... అని ముసిముసినవ్వులతో మాముగ్గురివైపూ చూసింది .
అంటీ : శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు అలా ......... గిఫ్ట్స్ ఎవరు ఇవ్వాలో వారిచేతనే అందించేలా చూసారు ఆ దేవుడు అని అంటీ బుజ్జిఅక్కయ్యను సంతోషంతో హత్తుకుంది .
 బుజ్జిఅక్కయ్య :  బుజ్జిమహేష్ తమ్ముడూ , బుజ్జిజానకిఅమ్మా .......... మీరు ఎవరివో సెట్ చేసి ఇవ్వండి వాళ్లకోరికప్రకారం నాచేతులతో అందించాను . 
ఇంద్రజ అక్కయ్యా , కారుణ్య అక్కయ్యా  ........ రండి అని బుజ్జిజానకి అమ్మ పిలిచి నా చేతికి చెరొక గిఫ్ట్ అందించారు .
అందుకును ఈ గిఫ్ట్ మీకోసం అని అందించింది బుజ్జిఅక్కయ్య .
ఇద్దరూ అందుకొని పెదాలపై చిరునవ్వుతో థాంక్యూ sooooo మచ్ అని బుగ్గలపై ముద్దులుపెట్టారు .
నెక్స్ట్ లాస్య , లావణ్య అక్కయ్యలూ ...........రండి .........
ఇద్దరికీ చెరొక రెండు రెండు గిఫ్ట్స్ అందించాను . 
మిక్కిలి సంతోషంతో థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని ఏకంగా బుగ్గలను కొరికేశారు . 
బుజ్జిఅక్కయ్య :  లావణ్య .......... చెప్పానుకదా , ఏదైనా మా అక్కయ్య పర్మిషన్ తీసుకోవాలని , 
బుజ్జిఅమ్మా ...........
లేదు లేదు అక్కయ్య పర్మిషన్ ఇచ్చినది కేవలం ముద్దులకు మాత్రమే , చూడండి ఎలా కొరికేసారో స్స్స్...........అక్కయ్యా ........అంటూ చేతులుచాపి అక్కయ్య గుండెలపైకి చేరిపోయింది .
అక్కయ్యా :   అందరమూ సంతోషంతో నవ్వుతోంటే , ఎక్కడ నొప్పివేస్తోంది బుజ్జిచెల్లీ ఇక్కడా ...... అని ప్రాణమైన ముద్దులుపెట్టింది .
నొప్పి మాయమైపోయిందీ ........ లవ్ యు అక్కయ్యా ....... అని ప్రాణంలా గుండెలపై వాలిపోయింది .
ఇక మిగిలింది మహి ........ మహీ ....... అంటూ ప్రేమతో పిలిచి బుజ్జిజానకిఅమ్మనుండి గిఫ్ట్స్ అందుకొని మా అక్కయ్య ప్రతి కష్టంలోనూ పాలుపంచుకుని అక్కయ్యను ప్రాణంలా చూసుకుంటున్నందుకు అని మహి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి అందించింది .
లవ్ యు బుజ్జిఅమ్మా ........... కళ్ళల్లో చెమ్మతో అని ముద్దులవర్షం కురిపించింది మహి .
అంటీ : తొందరగా తొందరగా ......... ఓపెన్ చెయ్యండి ఎంత విలువైనవి ఉన్నాయో , మా బుజ్జివాసంతి చేతితో అందుకున్నారు కాబట్టి మీకు అత్యంత ఇష్టమైనవే ఉంటాయి చూసుకోండి అని ఉత్కంఠతో అడిగింది .
అందరూ బుజ్జిఅక్కయ్య వైపుచూసి ఓపెన్ చెయ్యమా అని అడిగారు . 
ఊ ........ అని సైగచెయ్యడం ఆలస్యం ఎప్పుడెప్పుడా అన్నట్లు క్షణాల్లో ఓపెన్ చేసి ఒకదానిలో వాళ్లకు ఇష్టమైన డ్రెస్ , మరొక గిఫ్టులో గోల్డ్ చైన్ ఉండటం చూసి సంతోషంలో స్పృహతప్పినట్లు ఒకరిపై మరొకరు వాలిపోయారు , ఒకరినొకరు ఒసేయ్ ఒసేయ్ .......... నిన్న మనం షాప్ లో సెలెక్ట్ చేసిన అత్యంత ఖరీదైన డ్రెస్సెస్ అని పరవశించిపోయారు . ముందు మహిది చూద్దాము మనం నలుగురూ ఇష్టపడి తనకోసం సెలెక్ట్ చేసిన డ్రెస్ అనేంతలో మహి షాక్ తో వాళ్లకు లెహంగా చూపించింది . వాళ్ళు ఆశ్చర్యంతో సంతోషంలో ఒకరినొకరు కౌగిలించుకుని మురిసిపోతున్నారు . ఇంత విలువైన గిఫ్ట్స్ .......... మాజీవితంలో అందుకోలేదు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మా అని అక్కయ్యతోపాటు చుట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు .

మహి , లావణ్య ........... నేనుకాదుకదా ........
మీచేతులతోనే కదా అందుకుంది . అంటీ చెప్పినట్లు మీచేతులతో అందుకోవడం వల్లనే మాకు ఇష్టమైన డ్రెస్సెస్ ఉన్నాయి అని ముద్దులతో ముంచేశారు .
అన్నీ మీ ఐదుగురికేనా ......... ఇంకా ఈ ఇంటిలో మా అక్కయ్య , మా బుజ్జిజానకిఅమ్మ , మా బుజ్జితమ్ముడూ ......... ఉన్నారని ఆ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్లకు తెలియదా .........కనీసం బుద్ధి ఉందోలేదో అని మావైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుంది బుజ్జిఅక్కయ్య .
 చెల్లి :  అందులో ఆ బుద్ధిలేనివాళ్ళలో మీరూ ఉన్నారేమో అని చెల్లి చిలిపినవ్వుతో బదులిచ్చి , అదే అదే ......... వాళ్ళింట్లో నీలాంటి బుజ్జిదేవత కూడా ఉండి ఉంటుంది, తనైనా ఆర్డర్ వేసి ఉంటే తెచ్చేవాళ్లేమో పాపం ......... అంటే తప్పంతా ఆ బుజ్జితల్లీదే అని తియ్యనికోపంతో బుజ్జిఅక్కయ్యవైపు చూసింది .
లావణ్య :  బుజ్జిఅమ్మా ........ మాకు ఈ డ్రెస్సెస్ చాలు జ్యూవెలరీ మా ప్రియమైన అమ్మా పిల్లలకే ఇచ్చేస్తాము .
అక్కయ్య  : తల్లులూ .......... మేము ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన గిఫ్ట్ అందుకున్నాము మా బుజ్జిచెల్లి రూపంలో ..........అని అక్కయ్య ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుతో మురిసిపోతోంది . అవును అక్కయ్యలూ నా బుజ్జితల్లి అని బుజ్జిజానకిఅమ్మ , బుజ్జిఅక్కయ్య అని బుజ్జిమహేష్ ......... బుజ్జిఅక్కయ్య చేతులు అందుకొని ముద్దులుపెట్టి , ఇంతకంటే విలువైన గిఫ్ట్ - వాళ్ళ అక్కయ్యను ఇంత సంతోషపెట్టడానికే వచ్చింది అదిచాలు మాకు అని ఆనందబాస్పాలతో చెప్పారు .
అక్కయ్య ఉద్వేగంతో మోకాళ్లపై కూర్చుని ముగ్గురినీ ఒకేసారి గుండెలపై హత్తుకొని నా ప్రపంచం మీ ముగ్గురే మొదట నా తమ్ముడూ లేదు లేదులే మొదట నా బుజ్జిచెల్లి తర్వాత నా తమ్ముడూ , అమ్మ అని ముగ్గురి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి మురిసిపోతుంటే , చూసి మేము ముగ్గురమూ ఒకరిచేతుల్లో మరొకరు పెనవేసి ఆనందబాస్పాలతో మురిసిపోయాము .
బుజ్జిఅక్కయ్య :  అక్కయ్యా ........ మొదట మనకు మన తమ్ముడూ , అమ్మ తరువాతనే నేను మీబుజ్జిచెల్లిని అంతే ఇంకేమీ మాట్లాడకండి ఇదే ఫైనల్ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి లవ్ యు soooooo మచ్ అక్కయ్యా .......... అని ముగ్గురికీ ప్రాణమైన ముద్దులుపెట్టింది. అక్కయ్య తియ్యదనంతో నవ్వుతోంటే ......... అక్కయ్యా ........ ఇలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి మీరు . మనం ఇలా ఇంకా మాట్లాడితే మా అమ్మకు కోపం వచ్చినా వచ్చేస్తుంది పాపం మా అక్కయ్య చేతివంట తినాలని ఎలా చూస్తున్నారో చూడమని చూపించి నవ్వుకుంది . అక్కయ్యా ........ నాకుకూడా పూరీలు తిక్కడం వచ్చు పదండి అని అందరూ వంటగదిలోకి వెళ్లారు . 
అన్నయ్యా ........ మనం ఆశపడినవన్నీ మనబుజ్జిచెల్లి మాత్రమే ఆస్వాధిస్తోంది అని చెల్లి అసూయతో ఆనందిస్తుంటే , నవ్వుకుని చెల్లీ , రేయ్ ....... మాకైతే రెండుకళ్ళూ చాలడం లేదు అని ఆనందబాస్పాలను తుడుచుకుని ఒకేసారి చెల్లి కురులపై ముద్దుపెట్టి , 17 సంవత్సరాల తరువాత అక్కయ్య చేతివంటను తినబోతున్నాము అని సంతోషంతో చెల్లిని అమాంతం ఎత్తేసి తిప్పేసాము .

వంట గదిలో ...........
అంటీ :  బుజ్జివాసంతి తల్లీ ........ మహి మరియు ఫ్రెండ్స్ కు వాళ్లకు ఇష్టమైన గిఫ్ట్స్ , మీ అక్కయ్యా - బుజ్జిఅమ్మా - బుజ్జి తమ్ముడికి వెలకట్టలేని అపురూపమైన నిన్నే గిఫ్ట్ గా సమర్పించుకున్నావు మరి నాకులేదా గిఫ్ట్ అని బుంగమూతిపెట్టుకున్నారు .
బుజ్జిఅక్కయ్య :   నేలపై అక్కయ్య ఒడిలో కూర్చుని అక్కయ్యతోపాటు పూరీలు తిక్కుతూ , అంటీ చెవిలో మరికొద్దిసేపట్లో మీ గిఫ్ట్ వచ్చేస్తుంది అని గుసగుసలాడింది . 
కాసేపు అంటీ అలా కదలకుండా ఉండిపోవడం చూసి పూరీలు తిప్పేస్తున్న మహివాళ్ళతోపాటు అందరూ నవ్వుకున్నారు .

అంటీ :  15 నిమిషాల తరువాత  కృష్ణవేణి .........ఇడ్లీ , వడ , దోస , పూరీ ......... అన్నీ రెడీ అని కూర్చోమనిచెప్పి ఏవి వడ్డించమంటారు అనిఅడిగారు .
 బుజ్జిఅక్కయ్య :  మా అమ్మకు కూడా మా అక్కయ్య చేసిన పూరీలే వడ్డించండి అంటీ ....... 
 అంటీ :  అయితే వాసంతి చేతితో చేసినవి వాసంతి వడ్డించడమే కరెక్ట్ .......
బుజ్జిఅక్కయ్య : yes ........ అంటూ కిందకు దిగింది .
అక్కయ్యే స్వయంగా మా ముగ్గురికీ పూరీలు వడ్డిస్తుంటే , ముగ్గురమూ ఆనందబాస్పాలతో అక్కయ్యనే చూస్తూ తరించాము . 
అన్నయ్యా ...........
అవును చెల్లీ ......... అక్కయ్య tooo షార్ప్ , కనిపెట్టేస్తారు .
బుజ్జిఅక్కయ్య , అంటీ అలర్ట్ అయిపోయి , అక్కయ్యా ........నాకు తమ్ముడు ఉండబోయే పై పోర్షన్ చూడాలని ఉంది . పైకివేళదాము ......... 
 అంటీ :  మహి ,లావణ్య ........... మీ అమ్మకు , మీకూ టిఫిన్ తీసుకుని పైకిపదండి .
అక్కయ్య : బుజ్జిచెల్లి నీచేతులతో తినాలని ఉంది అని సిగ్గుపడుతూ అడిగింది .
బుజ్జిఅక్కయ్య :  యాహూ......... జింగ్ జింగ్ జింగ్ ......... అక్కయ్యా ........ రోజూ ఒకరికే తినిపించి తినిపించి బోర్ కొట్టేసింది ఇకనుండి మీకుమాత్రమే అని నావైపు ఫ్లైయింగ్ కిస్ వదిలి అంటీ తప్ప అందరూ వెళ్లిపోయారు .

అన్నయ్యా ........ అక్కయ్య స్వయంగా చేసిన పూరీలు అంటూ ప్రాణంలా తినిపించింది చెల్లి . 
కృష్ణగాడితోపాటు తిని మమ్మల్ని మేము మరిచిపోయి , చెల్లీ ........ ముందు తినాల్సింది నువ్వు అనిచెప్పాము .
లవ్ యు రా ,లవ్ యు అన్నయ్యా........ అని తిని ఆనందబాస్పాలతో కళ్ళుమూసుకుని ఫీల్ అయ్యి మాతోపాటు మైమరిచిపోయి ఆతృతతో ఆ ఆ ....... అంటూ చెల్లిచేతితో తిని మళ్లీ మళ్లీ అంటీతో వడ్డించుకొని పూరీలు మొత్తం తినేసాము . అంటీ ............పూరీ అని ముగ్గురమూ ఒకేసారి కేకవేశాము .
ఇంకెక్కడ పూరీలు మహేష్ , కృష్ణ ......... మీ అక్కయ్య చేసినవన్నీ లాగించేశారు అని నెమ్మదిగా చెప్పారు అంటీ .
ముగ్గురమూ నవ్వుకుని కడుక్కుని పైకిలేచాము . 
మహేష్ ......... పైకివెళ్లి మీ అక్కయ్యను కనులారా వీక్షించు అని చిరునవ్వులతో సిగ్గుపడుతూ చెప్పారు అంటీ .
అంటీ ...........
మగాడి చూపులను బట్టి మేము కనిపెట్టేస్తాము ......... అని చిలిపినవ్వుతో ప్లేట్లను వంట గదిలోకి తీసుకువెళ్లారు . 
అన్నయ్యా ......... మీరువెళ్లండి అని పంపించి , అంటీ మీరు తినండి అని వడ్డించి , అంటీ వద్దంటున్నా ఇది మన ఇల్లు మన కుటుంబం మేము వచ్చినదే మా అక్కయ్యను సేవించుకోవడానికి అని పాత్రలను శుభ్రం చేసి ఇంటిని మొత్తం చూసి అంతా తెలుసుకుంది చెల్లి .
పైకివెళ్లిన మేము బుజ్జిఅక్కయ్య బుజ్జిబుజ్జిచేతులతో అక్కయ్యకు తినిపిస్తుంటే చూసి మురిసిపోయి , ఆ చేతులతో చివరికి ఒక ముద్ద అని బుజ్జిఅక్కయ్యవైపు సైగచెయ్యడం - నాకు తెలియదా తమ్ముడూ అని తియ్యనికోపంతో చూడటంతో మా బంగారం అంటూ దిష్టి తీసి ఎంజాయ్ చేస్తున్నాను . 
ప్రక్కనే నేను మా అక్కయ్యను చూసే ఘాడతకన్నా ఎక్కువ ప్రేమతో మహి నావైపు చూస్తుండటంతో తన ఫ్రెండ్స్ ఆటపట్టిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . 
రేయ్ మామా ..........
ఏంటి ......... అని కోపంతో అడుగగానే వాడు నోటిపై వేలు వేసుకుని ఉండిపోయాడు.

బుజ్జిచెల్లీ ........... నువ్వు ఉండబోతున్న ఈ ఇంటినిమొత్తం ఏమాత్రం డస్ట్ లేకుండా చేసిస్తాను అనిచెప్పింది అక్కయ్య .
పో అక్కయ్యా .......... అని అలకతో నేను ఉండబోయేది మీతోనే అంటే కింద మాత్రమే , ఈ ఇంటి సంగతి ఇక్కడ ఉండబోయే మా తమ్ముడు చూసుకుంటాడు . మనకూ దీనికీ ఏ సంబంధమూ లేదు ముందు కిందకు పోదాము పదండి , ప్లేట్ నాకు ఇవ్వండి నేను తీసుకొస్తాను అని మెట్లవరకూ వచ్చి ,తమ్ముళ్లూ ........ మా అక్కయ్య దగ్గరే పనిచేయించుకుందాము అనుకున్నారా ......... నేను ఉండగా ఆ పప్పులుడకవు, అక్కయ్యా , మహి మీరు వెళ్ళండి వీళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసివస్తాను ......... 
బుజ్జిచెల్లీ ............
క్షణాలలో మీ గుండెలపై ఉంటాను ప్రామిస్ అంటూ ముద్దుపెట్టి , అక్కయ్య వెనుకకు తిరిగి తిరిగి చూస్తూ కిందకు దిగడం ఆలస్యం . 
బుజ్జిఅక్కయ్య ముందు మోకాళ్లపై కూర్చుని , అక్కయ్యకు తినిపించిన చేతివేళ్ళను నా నోటిలోకి తీసుకుని ఆతృతతో ప్రాణంలా చప్పరిస్తుంటే , 
నేనేమీ చూడలేదు అని కృష్ణగాడు అటువైపు తిరిగాడు . బుజ్జిఅక్కయ్య ......... నాకు అంటూ అంటూ నా నోటిలోనుండి లాగేసి జుర్రేసింది . ఇద్దరమూ చేతిని లాక్కుని లాక్కుని జుర్రేసి , ప్లేట్ లో ఉన్న చిన్న ఇడ్లీ ముక్కవైపు ఆశతో చూసాము .
తమ్ముడూ ......... నేను అప్పుడే తిన్నానులే అని తన బుజ్జిచేతితో నాకు తినిపించింది . 
అమృతం అంటూ తిని బుజ్జిఅక్కయ్యను అమాంతం పైకెగరేసి అందుకొని గుండెలపై ప్రాణంలా హత్తుకున్నాను .
చాలు తమ్ముడూ .......... అక్కయ్య ఎదురుచూస్తూ ఉంటుంది అని నాకూ , వాడికి బుగ్గలపై ముద్దులుపెట్టి పడిపోతానని తెలిసినా మా అక్కయ్యపై ప్రేమతో పరుగున కిందకువెళ్లిపోతుంటే , జాగ్రత్త ............అని మురిసిపోయాము .
Like Reply
కింద వరుసగా కొన్ని వాహనాలు వచ్చి ఆగి అందులోనుండి ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ తోపాటు చాలా మంది ఆఫీసర్స్ మరియు ఖద్దరు బట్టల్లో ఒక రాజకీయనాయకుడు కూడా వచ్చారు . సర్ .......... ఒక్కనిమిషం అంటూ మేనేజర్ గారు గేట్ తీసుకుని లోపలికివచ్చి శ్రీధర్ గారూ శ్రీధర్ గారూ అంటూ అంటీ ఇంటి కాలింగ్ బెల్ నొక్కారు . 
ఎవరూ ....... అంటూ అంటీ ఆ వెనుకే అక్కయ్యా మహివాళ్ళు వచ్చారు .
అంటీ :  మేనేజర్ గారూ .........
 మేనేజర్ : మేడం .......... మిమ్మల్ని కలవడానికి , జరిగిన తప్పుకు క్షమించమని అర్థించడానికి స్వయంగా కంపెనీ చైర్మన్ గారే వచ్చారు . శ్రీధర్ గారు ........
అంటీ : శ్రీకాకుళం లో పనిచేయిస్తున్నారు .
మేనేజర్ : శ్రీధర్ గారికి కాల్ చేసి తరువాత మాట్లాడతాను అనివెల్లి చైర్మన్ గారిని పిలుచుకునివచ్చారు .
చైర్మన్ :  మేడం .......... క్షమించండి . శ్రీధర్ గారి గురించి మా అందరికీ తెలుసు , మీరు నేరుగా మేనేజర్ గారికి ఒక కాల్ చేసి ఉంటే మొత్తం వారే చూసుకునేవారు . కంపెనీ తరుపున క్షమించమని కోరుతున్నాము అని రెండుచేతులనూ జోడించారు . మీతో అస .......... అలా ప్రవర్తించినవారినీ వాడికి సహాయం చేసేవారినీ , అలాంటి నేరాలు చేసేవారినీ కంపెనీ నుండి పీకేసి ఇక ఎవ్వరికీ అలా జరగకుండా సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పగించాము .మీవలన ఎంతోమంది కుటుంబాలు సంతోషంగా ఉండబోతున్నాయి. మేనేజర్ ........ అంటూ ఫైల్ అందుకొని రాత్రి మీరు మొత్తం పే చేసినట్లుగా రిసిప్ట్స్ ఇందులో ఉన్నాయి . మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేసుకోలేదు అనుకుంటున్నాము . ఎలాంటి అవసరం వచ్చినా ......... మీకోసం సహాయం చేయడానికి మా ఫైనాన్స్ ఎప్పుడూ తెరిచే ఉంటుంది . శ్రీధర్ గారికి మా క్షమాపణలు తెలియజేయ్యండి అని రెండుచేతులతో నమస్కరించి వెళ్లిపోయారు . 
మేనేజర్ గారు వెనుకే వెళ్లి కారు డోర్ తెరుస్తూ పైనున్న మాఇద్దరినీ చూపించి చెప్పాను కదా సర్ వారిద్దరే సర్ మన కంపెనీ కోలాప్స్ అవ్వకుండా కాపాడినది , వీడియోని destroy చేసేసారు అనిచెప్పారు .
మొత్తం పే చేసేసారా ఎవరు అంటూ అంటీ ఆలోచిస్తూ , చైర్మన్ మరియు మేనేజర్ గారు మావైపు సంతోషంతో చేతులను జోడించి నమస్కరించి వెళ్లిపోవడం చూసి , అంటీ బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి ఇదేకదా నా గిఫ్ట్ అంటూ కన్నీళ్లు కారుస్తున్న కళ్ళతోనే సంతోషాన్ని వ్యక్తం చేసి , అయ్యో .......... ఎండ అంటూ తన చీరకొంగును బుజ్జిఅక్కయ్యపై వేసి వాసంతి లోపలికిపదా అని తీసుకువెళ్లి , పరుగున పైకివచ్చి ,
మహేష్ ........... నిన్న నా మానాన్ని కాపాడావు - ఈరోజు ఆత్మాభిమానాన్ని కాపాడావు . ఏకంగా చైర్మన్ తో క్షమాపణలు ........... నీ రుణం తీర్చుకోలేనిది అంటూ పాదాలపై పడిపోబోతే ఆపి , 
అంటీ .......... 17 సంవత్సరాలుగా మా అక్కయ్యకు తోడుగా ఉండి చూసుకుంటున్నదానితో పోలిస్తే ఇది ఏపాటిది .......... ఇంకా మేమే మీకు 16 సంవత్సరాల 364 రోజులు ఋణపడిఉన్నాము అనిచెప్పడంతో వెనుకే వచ్చిన చెల్లితోపాటు అంటీ కూడా నవ్వేశారు .
ఇంతలో అంటీ మొబైల్ రింగ్ అవ్వడం , అంతులేని సంతోషంతో అవునండీ అని జరిగినది మొత్తం వివరించింది . స్పీకర్ on చెయ్యడంతో ........ మహేష్ , కృష్ణ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పని పూర్తిచేసుకుని త్వరలోనే వచ్చికలుస్తాను , మీ డబ్బుని ...........
అంటీ కట్ చెయ్యండి ముందు కట్ చెయ్యండి అనిచెప్పి నవ్వుకున్నాము . 
కృష్ణా ........... అంటూ ఆనందబాస్పాలతో అంటీ చెల్లి కౌగిలిలోకి చేరిపోయింది .
అంటీ ......... మాబుజ్జిఅక్కయ్య అందరికీ తొలి గిఫ్ట్స్ అందించేసింది అని అంటీతోపాటు సంతోషించి , 

అన్నయ్యా ......... అంటూ నా గుండెలపై చేరిపోయి , చాలా మార్చాలి ....... మొదట ఇంటిని మార్చాలి ఎలా ఉండాలంటే అక్కయ్యను మీరు ఎలా అయితే దేవలోకంలో ఉంచాలనుకున్నారో అలా ఈ ఇల్లు మినీ దేవలోకంగా మారిపోవాలి - అక్కయ్య చేతులతో బట్టలు ఉతుకుతోంది అని కళ్ళల్లో చెమ్మతో చెప్పి మార్చేయ్యాలి - టీవీ లేదు కాబట్టి వైజాగ్ లో ఎవరి ఇంట్లోనూ అంతటి టీవీ లేనంతలా - AC ఫ్రిడ్జ్ ......... ఇలా ఒక్కటి కాదు సర్వ వసతులూ ఉండాలి . కాంపౌండ్ మొత్తం మరింత అందంగా మారిపోవాలి రంగురంగుల పూలమొక్కలతో చూసినవెంటనే పెదాలపై తియ్యని నవ్వు పరిమళించాలి . ట్యూషన్ వచ్చే పిల్లలకు అన్నీ వసతులూ ఉండాలి అవసరమైతే ఇదిగో ఇక్కడ కూడా ఏర్పాట్లు చేసెయ్యి ......... అంటీ .......
 అంటీ: ఇది మీఇల్లు కృష్ణా ...........
లవ్ యు అంటీ .......... ఇంకా ఇంకా మహి కాలేజ్ , పిల్లల కాలేజ్ , వాళ్ళు వెళ్ళడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ విత్ డ్రైవర్ సెక్యూరిటీ - ఇంటికి సెక్యూరిటీ ....... అవసరం లేదనుకుంటాను ఎందుకంటే మీరిద్దరూ ఉన్నారుగా అని అందమైన నవ్వుతో , మహికి మరియు పిల్లలకు కంప్యూటర్స్ ,లాప్టాప్స్ , స్మార్ట్ మొబైల్స్ ...... అక్కయ్యకు కూడా అని సంతోషించాము . ఇలా ఒకటేమిటి అన్నయ్యా ......... మొత్తం మొత్తం ఒక్కరోజు రెండురోజులలో మార్చేయ్యాలి అంతే ......... కానీ అక్కయ్యకు ఆత్మాభిమానం ఎక్కువ అన్నయ్యా ......... చూసాను కదా ఉదయం గిఫ్ట్ నే పట్టించుకోలేదు ఇప్పుడెలా .........

ఐడియా చెల్లీ ......... అంటీ మీరు సహాయం చెయ్యాలి .
నా ప్రాణాలు కావాలా కావాలా ......... చెప్పండి సంతోషంతో అని ముందుకు రావడం చూసి అంటీతోపాటు నవ్వుకున్నాము .
అంటీ .......... మేమే మీకు ........
అంటీ : ok ok 16 సంవత్సరాల 364 రోజుల రుణం ........ అంటారు అంతేకదా అని నవ్వుకుని , మహేష్ ఏమిచెయ్యమంటావో చెప్పు .
ఏమీలేదు అంటీ .......... అక్కయ్యదగ్గరకువెళ్లి , వాసంతి ఇన్ని సంవత్సరాలకు నువ్వు క్లోజ్ చేసిన ఇంటి సగభాగంలోకి మా బంధువులలోనే రిచెస్ట్ మా పెద్దమ్మ వైజాగ్ లో కొన్నిరోజులు ఉండటానికి వస్తున్నారు . తనకోసం మన రెండు ఇళ్ళనూ కొద్దిగా మార్చాలి నేనూ మీతోపాటువస్తాను కాబట్టి రెండురోజులు మనమంతా వేరేదగ్గర ఉండాలి సాయంత్రమే వెళ్ళాలి కావాల్సిన ముఖ్యమైనవి మాత్రమే తీసుకోండి అనిచెప్పండి . 
వేరేదగ్గరా ..............
ఎక్కడోకాదు అంటీ మాఇంటిలో దేవతలా .......... అని చెల్లి పరవశించిపోతూ చెప్పి , wow అంటే అన్నయ్యా .......... ఆ ప్లేస్ లోకి పెద్దమ్మ రాబోతున్నారు అన్నమాట . సూపర్ ఐడియా అంటూ అంతులేని ఆనందంతో కృష్ణగాడినే ఎత్తబోయి వీలుకాక సిగ్గుపడుతూ వాడి గుండెలపై కొట్టి వాలిపోయింది . సమయం చూసి 9 గంటలు అవుతుండటంతో , చెల్లీ అంతలోపు కాస్త మహి కాలేజ్ లో పని ఉంది చూసుకునివస్తాను రేయ్ మామా జాగ్రత్త అని కార్ కీస్ అందుకొని ఒకసారి అక్కయ్యను చూసి హృదయమంతా నింపుకొని బయలుదేరాను .

మొబైల్ తీసి స్వాతికి కాల్ చేసాను . 
మహేష్ , మహేష్ ......... అంటూ స్వాతి - ప్రసన్నా అమితమైన ఆనందంతో లవ్ యు లవ్ యు sooooo మచ్ కాలింగ్ , ఎంత మురిసిపోతున్నామో మాటల్లో చెప్పలేము .  ఉదయం నుండీ ఈ కాల్ కోసమే వేచిచూస్తున్నాము . 
మహేష్ .......... ఫ్లైట్ టైం అవుతున్నా టిఫిన్ కూడా చేయలేదు అని పిన్నిగారు చెప్పారు .
స్వాతి - ప్రసన్నా ......... నాతో మాట్లాడుతూ కూడా తినవచ్చు .
లవ్ యు మహేష్ , లవ్ యు మహేష్ .......... పిన్నీ కాలేస్తోంది అని సంతోషంతో నవ్వుతూ చెప్పారు .
ఇదిగో తల్లులూ నిమిషంలో తీసుకొస్తాను అనిచెప్పారు .
మహేష్ .......... మా బుజ్జివాసంతితో మాట్లాడి 11/2 డే అవుతోంది . ఎలా ఉంది ఏమిచేస్తోంది మమ్మల్ని మరిచిపోయిందా ............
మిమ్మల్ని తలుస్తూనే ఉంది , నిన్న నా కలలో కనిపించిన వారిని కలిసాము . అక్కడే సమయం సరిపోయింది .
మా మహేష్ వెళ్ళాడు కదా .......... మాకు తెలిసి వాళ్లకు దేవుడివి అయిపోయి ఉంటావు అని సంతోషించారు .
లేదు దేవతను కలిసాము ........... ఇంతకీ స్వాతి - ప్రసన్నా .......... మళ్లీ ఎప్పుడు వస్తారు అని అడిగాను . 
ఒక్కరోజు మహేష్ , ఓకేఒక్కరోజు ......... సర్టిఫికెట్స్ తీసుకోవడం పిన్నీ ఇంటికికూడా వెళ్లకుండా ఎయిర్పోర్ట్ కు చేరుకుని వచ్చెయ్యడమే . మా బుజ్జివాసంతి హైద్రాబాద్ లో ఉంటే హైద్రాబాద్ లో ల్యాండ్ - వైజాగ్ లో ఉంటే నేరుగా వైజాగ్ కే వచ్చేస్తాము అనిచెప్పారు .
స్వాతి - ప్రసన్నా .......... మీరు రాగానే మీరు సంబరపడిపోయే విషయం చెబుతాను హాయిగా వెళ్లి వచ్చెయ్యండి హ్యాపీ జర్నీ అని విష్ చేసాను .
What what .......... అంటూ నేను ఖచ్చితంగా I Love You అని చెబుతానని షాక్ లో లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని పరవశించిపోయారు .
మహేష్ ......... పెద్దమ్మ గురించి నిన్నకూడా అడగలేదూ...........
మీదగ్గర ఉంటే ఎలా చూసుకుంటారో నాకు తెలియదా స్వాతి - ప్రసన్నా..........
Wow .......... ఈరోజు one by one హ్యాపీనెస్ ఇస్తూనే ఉన్నావు లవ్ యు లవ్ యు soooooo మచ్ . లండన్ కు బాధతో వెళతామేమో అనుకున్నాము . హ్యాపీగా వెళ్లి పనిచూసుకుని నువ్వు చెప్పబోవు మాటలకు అంతులేని ఉత్సాహంతో వస్తాము లవ్ యు లవ్ యు లవ్ యు ........... అని తింటూనే ఆపకుండా చెబుతూనే ఉన్నారు.
చాలు చాలు .......... స్వాతి - ప్రసన్నా ......... నామాయలో పడి పిన్నిగారిని ఇబ్బంది పెడతారేమో .........
అవును మహేష్ పరిస్థితి అలానే ఉంది చూస్తుంటే అని అందరమూ నవ్వుకుని ముగ్గురికీ హ్యాపీ జర్నీ ..........సర్ వాళ్ళతో మాట్లాడాలి బై అనిచెప్పాను . 
మహేష్ మహేష్ ........... dad వాళ్ళు ప్రక్కనే ఉన్నారు అని అందించారు .

సర్ .......... ఒక 100 మంది ఫాస్ట్ వర్కర్స్ మధ్యాహ్నం లోపు వైజాగ్ చేరుకోవాలి , రమేష్ కు కూడా కాల్ చేసి చెబుతాను . రమేష్ కు ఇష్టమైతే అతడూ వైజాగ్ రావాల్సి ఉంటుంది ఒక మీడియం ఇంటిని ఒక్కరోజులో ఇంద్ర భవనంలా మార్చాలి .
లైన్లో ఉండగానే నారాయణ .......... 100 మంది ద బెస్ట్ వర్కర్స్ అర గంటలో ఎయిర్పోర్ట్ లో ఉండాలి , ఫ్లైట్ టికెట్స్ దొరకకపోతే ఛార్టర్డ్ ఫ్లైట్ బుక్ చెయ్యండి అనిచెప్పారు శివరాం సర్ . అంతే నారాయణ గారు మేనేజర్ కు కాల్ చేసి విషయం చెబుతున్న మాటలు వినిపించి సంతోషించాను .
 అలాగే నాకు పెద్దమొత్తంలో అమౌంట్ కావాలి సర్ ........... నా జీవితా...........
మహేష్ .......... అక్కడితో మాటలు ఆపెయ్యి , నువ్వేమి చెబుతావో నాకు తెలుసు , మేము నీకు అమౌంట్ ఇవ్వడం ఏంటి నువ్వు one of the చైర్మన్............ నీ ప్రాఫిట్ మొత్తం నీపేరుపై ఉన్న అకౌంట్ లోనే ఉంది . ఎలాగైనా వాడుకో ఒక్కరోజులోనే ఖర్చు చెయ్యి మరుసటి రోజే నీ షేర్స్ ప్రాఫిట్ వచ్చి పడుతూనే ఉంటుంది . రమేష్ ద్వారా బ్యాంక్ డీటెయిల్స్ కార్డ్స్ పంపిస్తున్నాను ఎంజాయ్ ......... నీకు మాట్లాడే అవకాశం ఇవ్వనే ఇవ్వను ........... ఇస్తే మమ్మల్నే ఒప్పించేస్తావు , ఇప్పుడు 9 అయ్యింది 11 లోపు అందరూ వైజాగ్ లో ఉంటారు , అవసరమైతే చెప్పు మేముకూడా వచ్చేస్తాము బై ఎంజాయ్ ............ ఒక్కనిమిషం ఒక్కనిమిషం మీ మేడం వాళ్ళు మాట్లాడతారు .
మహేష్ ........... చెల్లీ , బుజ్జివాసంతి ఎలా ఉంది . తొందరగా వచ్చేస్తారని ఆశిస్తున్నాను .
మీరు పంపించిన గిఫ్ట్స్ చూసి ఎంజాయ్ చేశారు మేడం ......... 
Wow ........ మాబుజ్జివాసంతికి వంద ముద్దులు అని ఎంజాయ్ చేశారు . డ్రైవ్ చేస్తూ కొద్దిసేపు మాట్లాడి , ఆ వెంటనే రమేష్ కు కాల్ చేసి చిన్న సహాయం అన్నాను . మహేష్ ........... విషయం తెలిసింది . ఇప్పుడే అందరితోపాటు బయలుదేరుతాను ఎంతపెద్ద సహాయమైనా ఆర్డర్ వెయ్యి సంతోషంగా నీ వెనుకే ఉంటాను , మరొక విషయం గోవర్ధన్ కూడా ఇంటరెస్ట్ చూపుతున్నారు ........ వైజాగ్ లో కలుద్దాము బై ..........

కారుని చూసి లెక్చరర్ అనుకునేమో సెల్యూట్ చేసి కాలేజ్ లోపలికి పంపించారు సెక్యూరిటీ ...........ఇంకా కాలేజ్ టైం కాకపోవడం వలన అక్కడక్కడా మాత్రమే కొంతమంది స్టూడెంట్స్ కనిపిస్తున్నారు .
నావెనుకే వచ్చిన ఒక బెంజ్ నన్ను దాటుకుని వేగంగా వెళ్లి పార్కింగ్ లో ఆగి అందులోనుండి ఒక మాంచి కోట్ వేసుకుని ప్రొఫెసర్ రేంజ్ లో దిగి వడివడిగా ఆఫీస్ బిల్డింగ్ వైపు పరుగుతీశారు .
బెంజ్ ప్రక్కనే పార్క్ చేసి ఒక స్టూడెంట్ దగ్గరకువెళ్లి అమౌంట్ పే ........ అనేంతలో స్ట్రెయిట్ అండ్ లెఫ్ట్ అనిచెప్పి గ్రౌండ్ వైపు పరిగెత్తాడు .
థాంక్స్ బ్రదర్ అనిచెప్పి కౌంటర్ చేరుకున్నాను . కౌంటర్ ముందు ఎవరికోసమో అన్నట్లు వేచిచూస్తున్నారు . వచ్చిపోయేవాళ్ళు మరియు స్టాఫ్ అందరూ ఆయనకు గుడ్ మార్నింగ్ చెబుతూ వెళుతున్నారు . కౌంటర్ దగ్గరకు వెళ్ళగానే మహేష్ ........ అంటూ ఆయనే పలకరించడంతో ఆశ్చర్యపోవడం నావంతు అయ్యింది .
Yes ......... అని ఆశ్చర్యపోతూనే బాదులివ్వగానే ,
నేను ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ ని రండి నా రూంలో కూర్చుని మాట్లాడుకుందాము , మీరొస్తున్నారని కమీషనర్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది మీరు ఎలా చెబితే అలా నడుచుకోమని అందుకే పరుగున వచ్చేసాను.
లవ్ యు రా మామా అని తలుచుకుని వెనుకే వెళ్లి అతని ఆఫీస్ రూంలో కూర్చోబెట్టి మర్యాదలు చేశారు . 
మహి డ్యూ అమౌంట్ కట్టడానికి వచ్చాను ప్రిన్సిపాల్ గారూ ......... 
ఇక్కడికే పిలిపిస్తాను మహేష్ .......... మమ్మల్ని క్షమించండి నిన్న మహిని క్లాస్ లకు allow చెయ్యలేదు . మీ తాలూకా అని మాకు తెలియదు , i am extremely sorry for what happenned ........... నేనే స్వయంగా వెళ్లి స్టూడెంట్ మహిని క్లాస్ లకు లైబ్రేరియన్ కు ఇంఫార్మ్ లైబ్రరీకి అటెండ్ అయ్యేలా చూస్తాను . ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను అన్నారు .
 ఒక వ్యక్తి లాప్టాప్ తీసుకునిరావడంతో టోటల్ ఫోర్ ఇయర్స్ అనిచెప్పి అమౌంట్ పే చేసేసి , కాలేజ్ టైం లో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి . ఈ రిసిప్ట్స్ మహికే ఇచ్చెయ్యండి ఎవరువచ్చారో తెలియనివ్వకండి టాప్ సీక్రెట్ అని చేతులుకలిపి థాంక్స్ చెప్పి బయటకు నడిచాను . ఆయన పార్కింగ్ వరకూ వచ్చారు.
బై ప్రిన్సిపాల్ గారూ అనిచెప్పి కారు స్టార్ట్ చేసి రేయ్ మామా .......... నిమిషాల్లో పని పూర్తయ్యేలా చేశావురా అని కాల్ చేసి లవ్ యు చెప్పాను .
రేయ్ మామా ......... అదేకాదు మహి మరియు తన ఫ్రెండ్స్ కాలేజ్ బస్ లో కాలేజ్ కు పంపించి ఇప్పుడే అందరమూ అక్కయ్య అంటీతోపాటు క్యాబ్స్ లో ఇంటికిచేరుకున్నాము ..........  అక్కయ్య ఇంటి తాళాలు బస్ లోని ఫ్రిడ్జ్ పై ఉన్నాయి.
సూపర్ రా .......... మామా , ముందు మహేష్ గారి ప్లాన్ రెడీ చేసి అందించి ఆ వెంటనే అక్కయ్య ఇంటి రెనోవేషన్ స్టార్ట్ చేసేస్తాను అని ఇంటిముందు కారుని ఆపాను .

కారుదిగి బస్ లోని అక్కయ్య ఇంటి తాళాలను తీసుకుని ఇంటిని ఓపెన్ చేసి లోపలికి వెళుతోంటే , ఒక వీడియో రావడం చూసేలోపు ఆవెంటనే బుజ్జిఅక్కయ్య కాల్ చేసి , తమ్ముడూ .......... ఒక వీడియో పంపించాను , ఇక అక్కయ్య వీడియోస్ వస్తూనే ఉంటాయి చూసి ఎంజాయ్ చేస్తూ దేవలోకంలా మార్చెయ్యి అని గట్టిగా ముద్దుపెట్టింది . చెల్లి మొబైల్ అందుకొని మాట్లాడుతూ అన్నయ్యా .......... మీకోసం అక్కయ్య కట్టుకున్న పట్టుచీరను అదే మీ ప్రాణమైన గిఫ్ట్ ను రూంలోని బెడ్ పై ఉంచాను . ఆ చీరపై చిన్న డస్ట్ కూడా పడటం అక్కయ్యకు ఇష్టం లేదు అందుకే విప్పి వేరే చీర కట్టుకుంది . ఇక ఏమిచెయ్యాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అక్కయ్య ఊహాలతో స్వర్గంలో విహరించు అని చిలిపినవ్వుతో కట్ చేసింది . 
అంతే రూంలోకి పరుగుపెట్టి డోర్ దగ్గర నుండే చీరను చూస్తూ వెళ్లి రెండుచేతులతో ప్రాణంలా గుండెలపై హత్తుకొని కళ్ళల్లో చెమ్మ , ఆనందబాస్పాలు ఒకేసారి కారుస్తూ .......... లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా ........ అని చెల్లి మాటలను గుర్తుచేసుకుని పెదాలపై చిరునవ్వుతో చీరలోని అక్కయ్య పరిమళాన్ని ఆస్వాదించగానే , అక్కయ్య ఊహాలతో బెడ్ పై ధడేల్ మంటూ పడిపోయి చిలిపిదనంతో చీరను గట్టిగా హత్తుకొని కళ్ళుమూసుకున్నాను . అక్కయ్య ఒంటి పరిమళాన్ని మనసారా హృదయమంతా నింపుకొని తనను కౌగిలించుకున్నట్లుగానే ఫీల్ అయ్యి కొద్దిసేపు నన్ను నేను మరిచిపోయి స్వర్గంలో విహరించాను . 
ప్రతీ నిమిషం ముఖ్యమైనది కాబట్టి అక్కయ్య వస్తువులను చేతితో స్పృశిస్తూ పరవశించిపోతూ , చీరల మధ్యన అమ్మ ఫోటో కనిపించింది . అమ్మా ........ అంటూ అందుకొని చూస్తే actual గా అది అమ్మానాన్న దిగిన ఫోటో , అక్కయ్య నాన్న ఫోటోని చింపేసి అమ్మ భాగాన్ని మాత్రమే ఉంచుకుంది . 
అమ్మా .......... దుబాయ్ లో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏమిచేస్తున్నారు , నేను గుర్తున్నానా లేదా ......... మా అమ్మకు నేనెందుకు గుర్తుకు ఉండను నేనంటే ప్రాణం కళ్ళల్లో చెమ్మతో కృష్ణగాడికి కాల్ చేసి ఎక్కడ అని అడిగాను .
రేయ్ మామా ........... అమ్మ కోసం enquiry మొదలుపెట్టానురా ......... ఆఫీస్ లో ఉన్నాను . 
లవ్ యు రా ............ మరి ఇంటిదగ్గర అని కంగారుపడుతూ అడిగాను . 
రేయ్ ఇద్దరిని సెక్యూరిటీ ఉంచాను . 15 నిమిషాలకొకసారి పెట్రోలింగ్ వెహికల్ తిరిగేలా ఏర్పాటుచేసాను . మన అక్కయ్యా - బుజ్జిఅక్కయ్య ......... ఎంజాయింగ్ లైక్ anything రా కావాలంటే నువ్వుకూడా వెళ్లి చూడు . 
సంతోషంతో నవ్వుకుని బుజ్జిఅక్కయ్య 10 నిమిషాలకొక వీడియో పంపిస్తోంది . బుజ్జిఅక్కయ్యతో అక్కయ్య కూడా బుజ్జాయిలా మారిపోయారురా , రెండుకళ్ళూ చాలడం లేదు అని అంతులేని ఆనందంతో చెప్పాను . 
పని స్టార్ట్ చెయ్యకుండా ఇంటికివెలితే చెల్లి కొట్టినా కొడుతుంది అని నవ్వుకుని . రేయ్ మామా ........ అమ్మను చూడాలని ఉందిరా .........
రేయ్ మామా నీ ఫ్రెండ్ IPS ......... నువ్వే చూస్తావుకదా దుబాయ్ మొత్తం వెతికించయినా అమ్మను నీ ముందు ఉంచుతాను . కొద్దిగా సమయం ఇవ్వు అంతే ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్ కు కాల్ చెయ్యబోతున్నాను బై ........ రేయ్ స్వర్గంలా ఉండాలి ఇల్లు ...........
రేయ్ మామా నీ ఫ్రెండ్ ఆర్కిటెక్ట్ రా ........ నువ్వే చూస్తావుకదా స్వర్గాన్ని భువి8పైకి తీసుకొస్తాను బై 1 1/2 డే సమయం ఇవ్వు చాలు అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
Like Reply
బుజ్జిజానకిఅమ్మ , బుజ్జిమహేష్ ........... స్టడీ ఐటమ్స్ నుండి ఛార్ట్స్ పెన్సిల్స్ మరియు స్కెచెస్ అందుకొని అక్కయ్య చీరతోపాటు హాల్లోని టేబుల్ దగ్గరికివచ్చి చీరను ఒక చివరన ఉంచాను . మధ్యలో మొదటి చార్ట్ పరిచి స్టార్టింగ్ లో V - V - K  గుర్తు ఉంచి చీర స్థానంలో అక్కయ్యనే ఊహించుకుని చిరునవ్వులు చిందిస్తూ అక్కయ్యతో మాట్లాడుతూ ఒక గంటలోనే మొబైల్లోని బిల్డింగ్ వీడియో పిక్స్ చూస్తూ కలెక్ట్ చేసిన డేటా సహాయంతో వైజాగ్ మహేష్ కోరినట్లుగా మూడు ఫ్లోర్స్ మూడు ప్లాన్స్ రెడీ చెయ్యడం నాకే ఆశ్చర్యం వేసింది . 
నెక్స్ట్ ఎవరి కోరిక ప్రాకారం ఆర్కిటెక్ట్ అయ్యానో మా ప్రాణమైన అక్కయ్య ఉంటున్న ఇంటిని మార్చడం అనే ఆలోచనకే గాలిలో తెలిపోతున్నట్లుగా ఉంది . ఇంత సంతోషం కలగడం ఇదే తొలిసారి . నాకు తెలియకుండానే నా మైండ్ మరియు హార్ట్ నా చేతులను తమ కంట్రోల్ లోకి తీసుకుని చార్ట్ పరిచి V - V - K సింబల్ రాసి అక్కయ్యకు ఇష్టమైనట్లుగా హాల్ చకచకా మారిపోతోంది . ఇంతత్వరగానా........... మా అక్కయ్యే ఇక్కడ ఉంది అని చీరను అందుకొని గుండెలపై ప్రాణంలా హత్తుకుని పరవశించిపోయాను .
ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి 45 మినిట్స్ మాత్రమే ఉండటంతో వైజాగ్ మహేష్ ఛార్ట్స్ అందుకొని , అక్కయ్య చీరను వదిలి ఒక్కనిమిషం కూడా ఉండటం నావల్ల కాదు అని వదిలివెళుతోంటే గుండెవేగం అమాంతం పెరగడంతో , వెనక్కు తిరిగి లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా .......... నాతోనే ఉంటారా అని చీరను అందుకొని ప్రక్కనే ఉన్న ఒక గిఫ్ట్ బాక్స్ లో ఉంచుకుని ఇంటికి తాళం వేసి వైజాగ్ మహేష్ ఇంటికి చేరుకున్నాను .
ఇంటిబయటే చంద్ర కనిపించడంతో కారుదిగి పలకరించాను . మహేష్ ......... 
చంద్ర :  Exams కదా .......... మళ్లీ సాయంత్రమే వస్తాడు లోపలికిరా మహేష్ ........
నేను : ఇంట్లోకి వస్తే ఫ్యామిలీతోనే చంద్ర , అదీకాక హైద్రాబాద్ నుండి ఫ్రెండ్స్ వస్తున్నారు , ఎయిర్పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకోవాలి . అర గంట మాత్రమే ఉంది . మీరు కోరిన ప్లాన్స్ అని ఛార్ట్స్ అందించి ఏ కాంట్రాక్టర్ కు చూపించినా వెంటనే పని మొదలెట్టేస్తారు . 
చంద్ర : ఒక్కరోజులోనే wow .........అంటూ తెరిచి చూసి అద్భుతం అని పొగడ్తలతో ముంచాడు .
నేను : చంద్ర ఇది ఏ ఫ్లోర్ ప్లాన్ చెప్పు అని అడిగాను .
చంద్ర : మహేష్ .......... అదీ .......... అని తల గోకున్నాడు .
నాపై ఉన్న అభిమానానికి థాంక్యూ థాంక్యూ soooooo మచ్ చంద్ర , మహేష్ ను అడిగినట్లు చెప్పు , ఎటువంటి డౌట్ వచ్చినా కాల్ చెయ్యి any టైం అని చంద్రను కౌగిలించుకుని మళ్లీ కలుద్దాము అని కారులో కూర్చుని బాక్స్ తెరిచి చీరను ప్రేమతో స్పృశించి వొళ్ళంతా తియ్యని జలదరింపుతో హుషారుగా కారుని పోనిచ్చాను . రేయ్ మహేష్ ............ అక్కయ్య చీరకే ఇలా అయిపోతే ఇక అక్కయ్యను తాకి కౌగిలించుకుంటే అన్న ఊహకే ......... చెప్పారాదు కానీ నా బుజ్జిగాడు గోలగోలచేస్తున్నాడు . రేయ్ ......... అన్నా నామాట వింటేగా , తియ్యని సిగ్గుతో చిలిపినవ్వులతో ఎయిర్పోర్ట్ వైపు పోనిచ్చాను .
***********

నేను మహి కాలేజ్ అమౌంట్ పే చెయ్యడానికి బయలుదేరగానే , మరికొద్దిసేపట్లో కాలేజ్ బస్ వస్తుందనగా మహి అక్కయ్య గుండెలపైనుండి దిగకుండా బుజ్జిజానకిఅమ్మ , బుజ్జిమహేష్ తో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ మధ్యమధ్యలో అక్కయ్య ముద్దులను ఆస్వాదిస్తూ అక్కయ్యకు ప్రాణమైన ముద్దులుపెడుతున్న బుజ్జిఅక్కయ్య దగ్గరకువెళ్లి , బుజ్జిఅమ్మా .........నాకు కాలేజ్ కు వెళ్లాలని లేదు అని బుజ్జిఅక్కయ్య బుజ్జిచేతిపై ముద్దుపెట్టి చెప్పింది .
నాకూ నా మహితోనే ఉండాలని ఉంది కానీ క్లాస్సెస్ మిస్ అవ్వకూడదు నీకోసం లావణ్య వాళ్ళుకూడా వెళ్ళరు . మనకోసం వాళ్ళను ఇబ్బందిపెట్టరు .
బుజ్జిఅమ్మా ......... కాలేజ్ కు వెళ్లినా బయటే ఉండాల్సిందే .........
మహి వెంటనే ష్ ష్ ........ అనేలోపు అక్కయ్యకు మొత్తం అర్థమైపోయి కళ్ళల్లో చెమ్మతో బాధపడుతోంది . 
లావణ్య కూడా బాధపడుతోంటే , మహి చేతితో చుట్టేసి ఇక్కడే ఉంటే అమ్మ మరింత బాధపడతారని , బుజ్జిఅమ్మా .......... కాలేజ్ సమయం అయ్యింది రెడీ అవుతాను అని అక్కయ్యతోపాటు బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా కౌగిలించుకుని లవ్ యు మా, లవ్ యు బుజ్జిఅమ్మా అని ఇద్దరికీ ప్రాణంలా ముద్దులుపెట్టింది .
మహి ........... నువ్వు కాలేజ్ కు వెళ్ళాక జరిగే మ్యాజిక్ నువ్వే చూస్తావుకదా సంతోషంగా వెళ్లు అని బుజ్జిఅక్కయ్య తన మనసులోనే అనుకుని ,నేను పైనే ఉన్నాను అనుకుని మహి అంతా పైనున్నవారు చూసుకుంటారు హ్యాపీగా వెళ్లు అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .

అంతలో అంటీ వెనుకే చెల్లి ఇంట్లోకివచ్చి వాసంతి ......... ఇన్ని సంవత్సరాలు లాక్ చేసిన ఈ ఇంటి మిగతా సగభాగం లోకి మా దూరపు బంధువైన పెద్దమ్మ ఉండాలని ఆశపడుతున్నారు . నీకు ok నా అని అడిగారు .
చాలా సంతోషం అక్కయ్యా ..........రెంట్ ఇస్తారుకదా అని నవ్వుకున్నారు .
బాగా రిచ్ చెల్లీ .......... వాళ్ళ పిల్లలంతా ఫారిన్ లో సెటిల్ అయ్యారు . ఆమెకు అదే పెద్దమ్మకు మన అందమైన సిటీలో కొన్నిరోజులు ఉండి తన సొంత ఊరికి వెళ్లిపోవాలని ఆశ ఒక్కరే ఉండాలంటే భయపడుతున్నారు అందుకే మనతోపాటు ఉండమని మా బంధువులు చెప్పడంతో రేపుకానీ ఎల్లుండి కానీ వస్తున్నారు .
మనఃస్ఫూర్తిగా స్వాగతం పలుకుదాము అక్కయ్యా ..........
వాసంతి పెద్దమ్మ ఇక్కడ ఉండటానికి కొన్ని రూల్స్ పెట్టింది . తను చెప్పినట్లు నడుచుకోవాలి తన మాటకు ఎదురుచేప్పకూడదు లేకపోతే ఇక్కడనుండి వెళ్ళిపోతారు మా బంధువుల నుండి నాకు మాటోస్తుంది . నీకు తెలుసుకదా ఇప్పుడిప్పుడే మేము వాళ్ళను మళ్లీ కలుస్తున్నాము . 
నీకు సంతోషమైతే నాకు చాలా సంతోషం అక్కయ్యా ........
మరికటి వాసంతి ......... పెద్దమ్మ కోసం ఇంటిని కాస్త మార్చాలి దానికి ఒక రెండురోజులైనా పడుతుంది . ప్రక్క ఇంట్లో ఉండమని చెబుదామంటే నేను ఆ ఇంట్లోకి రావాలంటే ఆ ఇల్లు కూడా నాకు నచ్చినట్లుగా మారాలి అని ఆర్డర్ వేశారు అందుకే రెండింటినీ రెనోవేషన్ చేయించాలి కాబట్టి మనం రెండు రోజులు ఎక్కడైనా హోటల్లో ఉండాలి .
అమ్మా ......... మన పెద్దమ్మనేనా అని బుజ్జిఅక్కయ్య కళ్ళతోనే సైగచేసి నవ్వుకుని , హోటల్లో ఎందుకు అంటీ మాఇల్లు ఉందికదా కాదు కాదు మన ఇల్లు ఉందికదా ....... చెప్పవే అమ్మా .......... మా అక్కయ్య మనందరి ఇంటికి రాబోతోంది అన్న సంతోషంలో మాటలు రావడం లేదు బుజ్జితల్లీ ......... శ్రీవారూ అని కేకవేయ్యడం ఆలస్యం 5 మినిట్స్ లో క్యాబ్స్ రెడీ అని కృష్ణగాడు వెళ్ళిపోయాడు .

అక్కయ్య : బుజ్జిఅమ్మా ........ అదీ .......
బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో అగ్నిగోళాలతో చూడగానే లవ్ యు లవ్ యు ......... మా బుజ్జిచెల్లి ఆర్డర్ అంతే .......
వాసంతి నీకు ఇలాచెబితేనే వినేది నువ్వు అని నవ్వుకుని , మహి , జానకి ......... రెండురోజులకు అవసరమైనవన్నీ ప్యాక్ చేసేయ్యండి అని అంటీ చెప్పడంతో నిమిషాల్లో తీసుకొచ్చారు . 
బుజ్జిచెల్లీ .......... ఈ చీరంటే నాకు ప్రాణం , 17 ఏళ్లుగా చిన్న దుమ్ముకూడా పడకుండా ప్రాణంలా కాపాడుకుంటువస్తున్నాను మార్చుకోనా అనికోరింది . 
మా అక్కయ్యకు ఏది ఇష్టమో మాకూ అదే ఇష్టం అనిరూమ్లోకివెళ్లారు . బుజ్జిఅక్కయ్యను బెడ్ పై కూర్చోబెట్టి చీరను తీసేసి జాకెట్ లంగాతోనే చీరను మడుస్తోంటే , అక్కయ్య నడుమువైపే కన్నార్పకుండా చూస్తూ తమ్ముడూ అని తలుచుకుని సిగ్గుపడుతోంది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిచెల్లీ ......... ఏంటి అలాచూస్తున్నావు అని తియ్యని సిగ్గుతో అడిగింది . 
నడుమువైపు వేలు చూపించి సూపర్ ......... అని సైగచేసింది .
17 సంవత్సరాల క్రితం ఇదేమాటను రోజూ ఒకరు అనేవారు బుజ్జిచెల్లీ అని మురిసిపోతూ ఊహల్లోకి వెళ్ళిపోయింది . 
తమ్ముడూ ... ....... అక్కయ్య నిన్నే గుర్తుచేసుకుంటోంది అంటూ నడుముపై వేళ్ళతో బుజ్జిఅక్కయ్య స్పృశించగానే , అక్కయ్య తియ్యని జలదరింపుతో బుజ్జిఅక్కయ్యను అమాంతం కౌగిలించుకుని అదే స్పర్శ అని తియ్యదనంతో పరవశించిపోయింది .వెంటనే తేరుకుని సిగ్గుపడి లవ్ యు బుజ్జిచెల్లీ అని పెదాలపై చిరునవ్వుతో చీరమార్చుకుని , నా బంగారుకొండ అని గుండెలపై ప్రాణంలా హత్తుకొని బయటకు రావడం , మహి కాలేజ్ బస్ రావడంతో వాళ్ళు వెళ్లిపోయారు .
అక్కయ్యా , అంటీ రండి అని క్యాబ్స్ లో ఇంటికి చేరుకున్నారు . అక్కయ్యా , జానకిఅమ్మ , బుజ్జి మహేష్ అన్నయ్యా ....... లోపలిరండి ఇదే మనఇల్లు అని పిలుచుకొనివెళ్లారు , బుజ్జిఅమ్మా , బుజ్జిఅన్నయ్యా .......... మీఇష్టం ఎక్కడైనా ఉండొచ్చు . అంటీ తప్ప ముగ్గురూ ఇబ్బందిపడుతోంటే ........
నాన్న ......... మాకు ఇబ్బందిగా ఉంది రెండు నిమిషాల్లో మీరు డ్యూటీకి వెళ్లిపోండి అని ఆర్డర్ వేసింది బుజ్జిఅక్కయ్య . 
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ......... ఒక్కనిమిషంలో వెళ్ళిపోతే ఏమైనా ఇబ్బందా , మీ అక్కయ్యకు ఏలోటూ రాకుండా చూసుకో ఏమి అవసరమైన ఒక్క కాల్ చెయ్యి అని ఫ్లైయింగ్ కిస్ వదిలి యూనిఫామ్ వేసుకునివచ్చాడు .

 అక్కయ్య :  బుజ్జిచెల్లీ ...........
 బుజ్జిఅక్కయ్య:  అవునక్కయ్యా ........... నాన్న IPS , తన ప్రాణమైన వారి కోరిక . ఏమిటక్కయ్యా ........ కళ్ళల్లో నీళ్ళు , 
లేదు చెల్లీ ......... ఏవో తియ్యని జ్ఞాపకాలు అని బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా గుండెలపై హత్తుకుంది అక్కయ్య .
కృష్ణగాడు ఆనందబాస్పాలతో వంట గదిలోకివెళ్లి చెల్లిని అమాంతం వెనకనుండి చుట్టేసి చెప్పబోతే ,
వెనక్కు తిరిగి అంతే ఆనందబాస్పాలతో విన్నానురా ........ అని గుండెలపై వాలి పరవశించిపోయింది .

బుజ్జిఅక్కయ్య ఆర్డర్ త్వరగా వెళ్ళాలి , అలాగే అమ్మ ఎక్కడుందో సెర్చ్ మొదలెట్టాలి దేవతలా చూసుకో అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి ఇద్దరూ హాల్లోకి వచ్చారు .
అక్కయ్యా .......... ఇంకా ఇబ్బందిగా ఉంటే చెప్పండి అమ్మను కూడా పంపించేసి మనం ఎంజాయ్ చేద్దాము . పంపించేద్దామా ...........అని బుజ్జిఅక్కయ్య మాట్లాడింది.
తల్లీ తల్లీ .......... please please .......... ఎక్కడో మూలన కీముక్కుమనకుండా అక్కయ్యను సేవించుకుంటాను అని నోటిపై వేలు వేసుకుంది చెల్లి .
అక్కయ్యా ...........
లవ్ యు చెల్లీ ......... అని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకోవడంతో , 
అమ్మా అక్కయ్య ok అన్నారు ఉండవచ్చు అనడంతో అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .

నేను ఇంటిలో అక్కయ్య చీరను గుండెలపై హత్తుకునే సమయానికి మహి మరియు మహి ఫ్రెండ్స్ కాలేజ్ చేరుకుని నిన్న ఏదైతే ప్లేస్ లో కూర్చున్నారో అక్కడికే చేరుకున్నారు . లావణ్య , లాస్య , కారుణ్య , ఇంద్రజ ........... ఇక 10 నిమిషాలే క్లాస్సెస్ స్టార్ట్ అవ్వడానికి సమయం  మీరు వెళ్ళండి నిన్నకూడా నాకోసం ఆలస్యంగా వెళ్లారు అనిచెప్పింది మహి . 
ఆలస్యం అయినా , అటెండెన్స్ shortage వచ్చినా ఈరోజు నుండి మా ప్రియమైన మహిని ఒంటరిగా వదిలి క్లాస్సెస్ కు వెళ్ళేది లేదు అని మహిప్రక్కనే గట్టిగా కూర్చుండిపోయారు .
లా ............
మహీ .......... నువ్వేమి చెప్పినా , ఎమోషనల్ గా try చేసినా వెళ్ళేది లేదు అంతే అని మహి చేతులను చుట్టేసి , నిన్న వెళ్ళాము కదా .......... రాత్రంతా నిద్రలేదు తెలుసా , అసలు మీరు ఫ్రెండ్సేనా .......... బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే సరిపోదు , ఒక బెస్ట్ ఫ్రెండ్ ని ఒంటరిగా వదిలి ఎలావెళ్లారు అని మా హృదయాలు మమ్మల్నే ఎలా తిట్టాయో తెలుసా ......... నువ్వైతే వినలేవు అని బుగ్గలపై , చేతులపై ముద్దులుపెట్టారు .

స్టూడెంట్స్ ..........మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు . మీ ఫ్రెండ్ కూడా క్లాస్ కు వెళ్ళవచ్చు . మహి .......... నీకోసం క్యాంపస్ మొత్తం చుట్టేసాము నేను , లైబ్రేరియన్ గారు ఇప్పటికి కనిపించారు హమ్మయ్యా అని ఆయాసంతో చెప్పారు . మహీ .......... నిన్ను క్లాస్ కు రానీకుండా చూసినందు నేనే స్వయంగా క్షమాపణలు చెబుతున్నాను . నిన్ను ఇబ్బందిపెట్టినందుకు స్టూడెంట్స్ స్టూడెంట్స్ అని అందరినీ పిలిచి , స్టూడెంట్ మహిలాగా ఏ స్టూడెంట్ ఇబ్బంది పడకుండా ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాను ఏమిటంటే ఇలా ఫీజ్ కట్టడంలో ఇంట్లో ఇబ్బందులు ఉంటే నేరుగా నన్ను కలవండి , క్లాస్ లకు వెళ్లకుండా మాత్రం మిమ్మల్ని ఆపే అధికారం ఎవ్వరికీ ఉండదు మన కాలేజ్ లో చేరేవాళ్ళంతా 500 ర్యాంక్ లోపువాళ్లే కాబట్టి ప్రతి క్లాస్ మీకు ఎంతో ముఖ్యం అని నాకు తెలుసు అనిచెప్పగానే , 
స్టూడెంట్స్ అందరూ సంతోషంతో కౌగిలింతలతో కేరింతలువేసి థాంక్స్ మహి , థాంక్యూ sooooo మచ్ మహి , మహి మహి మహి మహి ........... అంటూ క్యాంపస్ మొత్తం దద్దరిల్లిపోయేలా నినాదాలతో హోరెత్తించారు .
మహి ఫ్రెండ్స్ , classmates అయితే సంతోషం పట్టలేక మహిని చుట్టుముట్టి అమాంతం పైకెత్తేశారు . 
ఇంతలో కాలేజ్ బెల్ వినిపించడంతో స్టూడెంట్స్ స్టూడెంట్స్ now please go to your క్లాస్సెస్ అని ప్రిన్సిపాల్ గారు చెప్పడంతో థాంక్యూ sooooo మచ్ మహి అని చివరగా కేకలువేస్తూ క్లాస్సెస్ కు వెళ్లారు .
మహి నీ కాలేజ్ ప్రెమెంట్స్ మొత్తం కట్టడం జరిగింది మరొకసారి క్షమాపణలు చెబుతున్నాను క్లాస్ , లాబ్ , లైబ్రరీ ........... ఎక్కడికైనా వెళ్లొచ్చు అని రిసిప్ట్స్ ఫైల్ అందించి వెళ్లిపోయారు .

లావణ్య ఫైల్ అందుకొని చూసి టోటల్ ఫోర్ ఇయర్స్ .......... మహీ మొత్తం నాలుగేళ్లకు కాలేజ్ అమౌంట్ కట్టేశావు ఇక నాలుగేళ్ళూ నువ్వు అటువైపు వెళ్లాల్సిన అవసరమే లేదు . మహి అందుకొని చూసి షాక్ నుండి తేరుకుని ప్రిన్సిపాల్ వైపు పరిగెత్తి సర్ .......... ఇదంతా ఎవరుచేసారో తెలుసుకోవచ్చా అని అడిగింది .
సీక్రెట్ గా ఉంచమనిచెప్పారు సో ...........
సర్ male or female ........... please సర్ please .........
Male.......... మహి అంతకంటే చెప్పరాదు అని మాట తీసుకున్నారు . మీరు కూడా క్లాస్ కు వెళ్ళండి , మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా స్వయంగా నాదగ్గరకు రావచ్చు. ఈరోజు నుండీ నువ్వు మా కాలేజ్ ఫేవరెట్ all the best తల్లీ అని విష్ చేసి మెయిన్ బిల్డింగ్ లోపలికివెళ్లారు .
మహీ .......... ఇంటిదగ్గర గిఫ్ట్స్ , ఇప్పుడేమో ఫోర్ ఇయర్స్ huge అమౌంట్ ........ ఒక్కరోజులోనే గంటల వ్యవధిలోనే రెండు షాకింగ్ అండ్ బ్యూటిఫుల్ సర్ప్రైజెస్ ....... ఇచ్చిన ఆ దేవుడు ఎవరో , ఇంకా పోను పోనూ ఏవేవి సర్ప్రైజ్ లు ఉంటాయోనని లావణ్య మహిని సంతోషంతో సైడ్ నుండి చుట్టేసి , మేడం గారూ ఇక మిమ్మల్ని ఆపే అధికారం ఆ దేవుడికైనా లేదు క్లాస్ కు వెళదాము పదా అని క్లాస్ లోకి అడుగుపెట్టగానే , లెక్చరర్ పర్మిషన్ తీసుకుని అందరూ లేచిమరీ చప్పట్లతో స్వాగతం పలకడంతో , మహి లావణ్యాల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . ఇక క్లాస్ లు ఎక్కడ వింటారు ఆ దేవుడు ఎవరోనని ఆలోచిస్తూ ఉండిపోయారు .

ఎయిర్పోర్ట్ చేరుకుని పార్కింగ్ లో కారుని పార్క్ చేసి మొబైల్ తీసి చూస్తే బోలెడన్ని చిన్న చిన్న వీడియోస్ రావడం చూసి పెదాలపై చిరునవ్వుతో లవ్ యు బుజ్జిఅక్కయ్యా అని స్క్రీన్ పై అక్కయ్య బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేస్తున్న పిక్ పై ప్రాణమైన ముద్దులుపెట్టి ఒక్కొక్క వీడియో చూస్తూ వాళ్ళ సంతోషంతో పాటు నేనూ ఎంజాయ్ చేస్తూ చీరను గుండెలపై హత్తుకొని కాలాన్నే మరిచిపోయాను . 
మధ్యాహ్నం 12 గంటలకు రమేష్ నుండి కాల్ .......... మహేష్ వైజాగ్ వచ్చేసాము అడ్రస్ చెబితే వచ్చేస్తాము అనగానే , స్క్రీన్ పై మరొకముద్దుపెట్టి పరుగునవెళ్ళాను.
అందరూ అప్పటికే బయటకు వచ్చేసి మహేష్ అంటూ రమేష్ గోవర్ధన్ , మహేష్ సర్ అంటూ ఫ్రెండ్స్ అందరూ సంతోషంతో కేకలువేశారు .
రమేష్ , గోవర్ధన్ ను కౌగిలించుకుని నాకోసం వచ్చినందుకు ..........
మహేష్ .......... ఎక్కడికైనా వస్తాము అని హత్తుకున్నారు  . మహేష్ ........ చైర్మన్ గారు ఇచ్చారు అని కార్డ్ , పాస్ బుక్ అందించాడు రమేష్ .
ఫ్రెండ్స్ రెండురోజుల్లో పని పూర్తిచేయాలి , ఇంత అర్జెంట్ గా పిలిచినందుకు నన్ను క్షమించండి .
మహేష్ సర్ ..........మీరు మమ్మల్ని ఫ్రెండ్స్ అన్న ప్రతిసారీ మీకోసం ఏదైనా చేసేయ్యాలనిపిస్తుంది . మా 100 మంది చాలా అదృష్టవంతులం . మిగతావారైతే మావైపు ఆశతో చూస్తుంటే భలే నవ్వు వచ్చేసింది . ఎక్కడ సర్ పని మాకు ఉత్సాహం ఆగడం లేదు అనిచెప్పారు .
థాంక్యూ sooooooo మచ్ ఫ్రెండ్స్ అని చేతులుకలిపి కౌగిలించుకుని ఎన్ని క్యాబ్స్ ఉంటే అన్నింటిలో అక్కయ్య ఇంటికి చేరుకున్నాము . ఈరెండు ఇళ్ళనూ పైన అంటూ మొత్తం అక్కడే వివరించాను . 

రమేష్ సగం మందిని , గోవర్ధన్ సగం మందిని సెలెక్ట్ చేసుకున్నారు . రమేష్ కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగానే , కావాల్సిన వస్తువులను తీసుకురావడానికి సగం మందితో వెళుతూ గ్రూప్స్ గ్రూప్స్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పజెప్పాడు .
అప్పటికే వచ్చిన బాక్సస్ మరియు వైట్ క్లోత్స్ తో ఇంట్లోని వస్తువులన్నింటినీ వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసి వైట్ క్లోత్స్ కప్పాము . వెళ్లినవాడు పెద్ద పెద్ద వెహికల్స్ లో కావాల్సినవి తీసుకురావడంతో వర్క్ మొదలెట్టేసాము .
మామీద ఉన్న అభిమానంతో 100 మందీ నేను , రమేష్ , గోవర్ధన్ ఆధ్వర్యంలో మరింత ఉత్సాహంతో చకచకా చేసుకుంటూ పోతున్నారు . 
థాంక్యూ sooooo మచ్ ఫ్రెండ్స్ .......... అంటూ ఇంట్లోని ప్రతి ప్లేస్ మార్పుకు ప్రతీది హృదయం నుండి వస్తున్న ఊహాలతో స్కెచెస్ వేస్తూ రమేష్ కు , గోవర్ధన్ కు అందించడం కావాల్సినవి తెప్పపించి దగ్గరుండి చూసుకుంటున్నారు .

మధ్యాహ్నం 2 గంటలకు హోటల్ నుండి ఎవరెవరికి ఏమేమి కావాలో తెప్పించి తిన్నాము . కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ అక్కయ్యావాళ్లను అలా బయటకు తీసుకెళ్లు ముందు వైజాగ్ మహేష్ ఇంటికి , గుడికి .......... నీ ఇష్టం .........
రేయ్ మరి నువ్వు ........... రేపటివరకూ అడుగుబయటపెట్టినట్లు తెలిస్తే బుజ్జిఅక్కయ్య కొట్టేస్తుంది అని నవ్వుకుని ఎంజాయ్ అనిచెప్పాను . నేను చెప్పినట్లే అందరూ వెళ్లారు .

కృష్ణగాడు డ్యూటీ ఆఫ్ తీసుకుని అర గంటలో బులెట్ లో వచ్చి , రమేష్ గోవర్ధన్ ను పలకరించి జరుగుతున్న పని చూసి సంతోషించి , వైజాగ్ మహేష్ అడ్రస్ కనుక్కుని కారుని తీసుకువెళ్లాడు . ఇంటికి చేరుకోగానే పైన బుజ్జిఅక్కయ్య చిరునవ్వులు వినిపించడంతో సంతోషించి పరుగున పైకివెళ్లి అక్కయ్యా బుజ్జిఅమ్మ బుజ్జి మహేష్ తో ఎంజాయ్ చేస్తుండటం చూసి మురిసిపోతూ చూస్తూ అలానే ఉండిపోయాడు . చెల్లి చూసి సంతోషంతో వాడి గుండెలపైకి చేరిపోయింది .

అక్కయ్యా , బుజ్జిఅమ్మ , నా బుజ్జి ఫ్రెండ్ భోజనం చేశారా ......... 
అక్కయ్యకు ఇష్టమైనవన్నీ ప్రేమతో వండాను , మన బుజ్జిఅక్కయ్యతోపాటు తృప్తిగా భోజనం చేసి ఇదిగో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు . అన్నయ్యకు కూడా ఈ సంతోషాల వీడియోలను పంపిస్తున్నాము .
అక్కయ్య , బుజ్జిఅమ్మ ఆనందాలను తనివితీరా తిలకించి కిందకువచ్చి భోజనం చేస్తూ మీ అన్నయ్య ఫ్రెండ్ ఇంటికి వెళదాము రెడీ అవ్వండి అనిచెప్పాడు . 
చెల్లి పైకివెళ్లి అక్కయ్యను హత్తుకొని అలా బయటకువెళదామని ఒప్పించి రెడీ అయ్యి కారులో వైజాగ్ మహేష్ ఇంటికి చేరుకున్నారు . 
చంద్ర రమేష్ .......... సంతోషంతో స్వాగతం పలికి లోపలికి పిలుచుకొనివెళ్లారు . చంద్రకు ముందే కాల్ చేసి అక్కయ్య గురించి విషయం చెప్పడం - చంద్ర ఇంట్లోని దేవతలందరికీ చెప్పినట్లు అలానే ప్రవర్తిస్తూ అందరూ పరిచయం చేసుకుని ప్రేమతో మర్యాదల్లో ముంచేశారు . మహి ........ కాలేజ్ నుండి వచ్చే సమయం వరకూ అక్కడే ఉండి , లావన్యకు కాల్ చేసి ఇంటి అడ్రస్ కు రమ్మని చెప్పి అంతలోపు ఇంటికి చేరుకున్నారు .
మళ్లీ ఫ్రెష్ అయ్యి అందరూ దగ్గరలోని గుడికి నడుచుకుంటూ వెళ్లి అన్నీ అనుకున్నట్లు జరిగి అక్కయ్యను మా ఊరికి సంతోషంతో తీసుకెళ్లేలా ఆశీర్వదించమని బుజ్జిఅక్కయ్య - చెల్లి - కృష్ణగాడు భక్తితో ప్రార్థించారు .
ఇంటికి చేరుకుని మహి పైన మీ ఇష్టం అని ఫ్రెండ్సతోపాటు పంపించి , చెల్లి .......... ఎంత వద్దన్నా , మన ఇల్లు అన్నావుకదా చెల్లీ అని అంటీతోపాటు వంటలో సహాయం చేసారు అక్కయ్య . అందరూ కలిసి భోజనం చేసిన తరువాత కృష్ణగాడు చెల్లి ఫ్రెండ్స్ ను వాళ్ళ ఇంటిదగ్గర వదిలి నాదగ్గరకువచ్చాడు . అక్కయ్యా , బుజ్జిఅక్కయ్యను వదిలివచ్చావా అని రెండు దెబ్బలు వేసి పంపించాను . మేము నిద్రకూడా పోకుండా ఉత్సాహంతో సమయం లోపు పూర్తిచేయాలని కంకణం కట్టుకున్నాము .

అర్ధరాత్రి సమయంలో చెల్లి మొబైల్ నుండి కాల్ ..........
చెల్లీ ...........
తమ్ముడూ .......... నేను అని అతినెమ్మదిగా చెప్పింది . 
బుజ్జిఅక్కయ్యా ......... ఇంకా నిద్రపోలేదా అని అడిగాను . 
అమ్మావాళ్ళ బెడ్ పై అక్కయ్య గుండెలపై అప్పుడే ఒక హాయి నిద్రను ఆస్వాదించాను. మా తమ్ముడు కలలో కనిపించడంతో లేచాను . అదేసమయానికి తమ్ముడూ తమ్ముడూ .......... అంటూ అక్కయ్య ఘాడనిద్రలో నన్ను ప్రాణంలా హత్తుకొని మిమ్మల్నే కలవరిస్తోంది . వెంటనే వచ్చెయ్యండి అని గుసగుసలాడింది .

మా అక్కయ్యకు నేనంటే అంత ప్రాణం అని తియ్యని జలదరింపుతో పరవశించిపోయి , ఇక్కడ అందరినీ వదిలిపెట్టి రాలేను బుజ్జిఅక్కయ్యా ......... రాత్రన్తా నిద్రపోకుండా పూర్తిచేయలనుకున్నాము . 
అయితే రావా .......... ఎలారావో చూస్తాను అని చిలిపినవ్వుతో కట్ చేసి 5 నిమిషాలకు ఒక వీడియో పంపించింది .
ప్లే చేస్తే అక్కయ్య హాయిగా నిద్రపోతోన్నట్లు ముఖం దగ్గర నుండి కిందకు తీసుకొచ్చి నడుముదగ్గర ఆపి బొడ్డుని కవర్ చేస్తున్న చీరను ప్రక్కకు తప్పించడం............. పెదాలను తడుముకుంటూ చూస్తున్నాను . అంతే అక్కడకు వీడియో ఆగిపోయింది .
కిందనే తియ్యని స్వీట్ కావాలా తమ్ముడూ అయితే వచ్చెయ్ అని స్మైలీ లు పంపించడం చూసి నావల్లకాక , మా బుజ్జిఅక్కయ్యకు నన్ను ఎలా రప్పించాలో తెలుసు అని తియ్యదనంతో నవ్వుకుని , రమేష్ ముఖ్యమైన పని చూసుకునివచ్చేస్తాను అని బుల్లెట్ మీదకు ఎగిరి కిక్కు కొట్టి 100 వేగంతో అక్కయ్య తియ్యనైన నడుము దగ్గరికి పోనిచ్చాను ................
Like Reply
Awesome update bro
మీ
Umesh
[+] 1 user Likes Umesh5251's post
Like Reply
Kekooo kekaa ee update varshalu leka endi poyina beedu bhumilo tolakari chinukai maa prardhana kannu alakinchina mahesh bhayya neeku hats off
[+] 2 users Like Nick 123's post
Like Reply
హాయ్ మహేష్ గారు

వాసంతి మహేష్ దగ్గరకు ఎందుకు వెళ్లలేదు రీసన్ ప్రామిస్ బ్రేక్ అయింది అని

ఈ స్టోరీ లో వాసంతి కి తాగుబోతు భర్త , ఇద్దరు అమ్మాయిలు ఒక కొడుకు ఇలానే జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం స్టోరీ లో మహి వల్ల అమ్మ కి తగ్గుబోతు భర్త ఇద్దరు అమ్మాయిలు ఒక కొడుకు

ఆ స్టోరీ లో మహి వల్ల అమ్మ తో సెక్స్ చేసాడు ప్రేమ తో ఇక్కడ వాసంతి తో chesuthadu అది 1st a ఎప్పుడు అన్నది తెలియదు సో నెక్స్ట్ ఎలా ఉంటది చూడాలి స్టోరీ ఆల్మోస్ట్ బాధ నుండి సంతోషం వైపు జర్నీ స్టార్ట్ అయింది చూడాలి నెక్స్ట్ ఏమి అవుతాది అని
[+] 3 users Like Bvgr8's post
Like Reply
super update bro awesome
[+] 1 user Likes Deepakraj's post
Like Reply
update keko keka

awesome no words to explain
[+] 1 user Likes royale248's post
Like Reply
Awesome update bro....
[+] 1 user Likes SVK007's post
Like Reply
Awesome, marvelous, fabulous, fantastic, mind-blowing update. Sorry, if I forgot any words about describing your update. It's almost 3 hours to complete for reading your update. I'm getting sleep. I'll sleep happily now as I read the update. Thank you so much for your excellent update. We are eagerly wait for your next update as what happen next.
Can we expect next update in next saturday??
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 4 users Like Joncena's post
Like Reply
clps clps clps clps clps
పాఠకులందరి కోరిక మేరకు Update ఇచ్చినందుకు Mahesh గారికి పాఠకులందరి తరపున ధన్యవాదలు.

Update అదిరిపోయింది.
Heart Heart Heart Heart Heart
[+] 4 users Like Milffucker's post
Like Reply
వావ్ నిజంగా అద్భుతం మీ అప్డేట్. ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.
మహికి  మనోజే తన తల్లికి ప్రాణమైన తమ్ముడు తన మామయ్య మహేష్ అనేే నిజం ముందే చెప్పటం మంచిదేమో అని అనిపిస్తుంది. నిజం తెలియక మహేష్ ని మనోజ్ గా ఘాడంగా ప్రేమించి తను మనోజ్ కాదు మహేష్ అని తను వచ్చింది తనకోసం కాదు తన తల్లికోసం మాత్రమే అని తెెలిసినప్పుడు  తను ఎలా స్పందిస్తుందో తెలియక బాధపడే కంటే ముందే చెపితే తనుకూడా మహేష్ కు సహాయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది అని నా అభిప్రాయం. కొద్దిగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను
[+] 4 users Like DVBSPR's post
Like Reply
ఇంత పెద్ద అప్డేట్ చదివిన తరువాత కూడా ఇంకా అప్డేట్ ఉంటే బాగుండేది అని అనిపించింది. చాలా చాలా చాలా పెద్ద మరియు రేమోషల్ అప్డేట్ ఇచ్చావు Mahesh బ్రో.

చాలా చాలా చాలా థాంక్స్. తొందరగా నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారో డేట్ కానీ ఎన్ని రోజులు పడుతుంది అనికాని చెప్పండి.


ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd
[+] 1 user Likes Rohan-Hyd's post
Like Reply
Mahesh garu meru asalu em anukuntunaru mahesh garu. Meru me chethullo em petukunaru, asalu meku aa brahma brain ye petara? Leka pradhyanamlo aa brahma thala petesara?

Intha peda update aa 9:30 ki start start chesa chadavadam, night 2:30 aindi time ye theliyaledu, ponies madyalo oka sari chuse api repu continue chedam anukunte agalemu. Meru manisha leka kompany thisi as manmadhudi avatharama naku aithe doubt ye mahesh garu.

Next update konchem thodanraga ivandi mahesh garu akani kalisela cheyandi konchem suspense thatukolekapothunam
[+] 5 users Like priyashlovely's post
Like Reply
Meeku meere saati meekevvaru sarikaaru. mimmalani yentha pogidina thakkuve Sir intha manchi peddha update ichinandhuku. Intha abduthamaina kathanu chadhive adhrustam maaku ichinandhuku thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks.............. Konni Vela vela vela thanks thanks thanks sir
[+] 3 users Like sisusilas1@'s post
Like Reply
అద్భుతం మహేష్ గారు
[+] 1 user Likes గోపీచంద్ గోపి's post
Like Reply
Thank you so so much sir for giving update surprisely
Okati matram baga nachiindhi sir
previous update (jail episode) 9-year dhi one update lo chesaru
Kani e episode just two days ke mugincharu malli entha pedhaa update
miku followers tension pettadam chala intrest anukunta sir(just funny)
Vasanthi garini kalasi ela vuntadho full tension lo vunnam miru ela chesthe ela sir
Kani Naku baga nachiindhi sir
Endhukante inka chala episode extend avuthayi kadha
Inka characters Madhya chala conservation scenes vasthayi full happy dhaniki

Pedhaama character first endhuku vachindho ardham kale kani me thinking great sir

Eppati lane update full peaks and full emotional sir
Tears vasthunayi sir
Mamalni miru weak chesthunaaru sir mentally

Inka inka chala vundhi

Livelong @Mahesh.thehero❤️❤️❤️

@madhu98
[+] 5 users Like ravali.rrr's post
Like Reply
Doctor Manasu kavi Mahesh mind blowing awesome update  yourock clps Heart

మితమ నీను పొగడి పొగడి మాకు మాటలు కరువయై  thanks మమలిని ఇలనె అలరిిిిిిిస్తునె వుండలి అనిి కొరుకుంటునను.
మీ 
జాక్  Heart
[+] 2 users Like jackwithu's post
Like Reply
(20-06-2020, 01:15 AM)DVBSPR Wrote: వావ్ నిజంగా అద్భుతం మీ అప్డేట్. ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.
మహికి  మనోజే తన తల్లికి ప్రాణమైన తమ్ముడు తన మామయ్య మహేష్ అనేే నిజం ముందే చెప్పటం మంచిదేమో అని అనిపిస్తుంది. నిజం తెలియక మహేష్ ని మనోజ్ గా ఘాడంగా ప్రేమించి తను మనోజ్ కాదు మహేష్ అని తను వచ్చింది తనకోసం కాదు తన తల్లికోసం మాత్రమే అని తెెలిసినప్పుడు  తను ఎలా స్పందిస్తుందో తెలియక బాధపడే కంటే ముందే చెపితే తనుకూడా మహేష్ కు సహాయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది అని నా అభిప్రాయం. కొద్దిగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాన
నిజం చెప్పరు మిత్రమ నెను కుడ అలనె అనుకుంటునను మహి కి ముందుగా మనొజ్ తన మవయ్య మహెశ్ అని తెలిస్తె వసంతి అకయ్య కు దగరవడం మహి దవర ఇంక సులువుగ వుంతుంది అనుకుంటునను అలనె మహి మహెశ్ ల ప్రెమ కవయము కుడా చుదం మన మనసు కవి ఎమి చెయబొతునరొ  Smile
మీ 
జాక్  Heart
[+] 4 users Like jackwithu's post
Like Reply




Users browsing this thread: 120 Guest(s)