Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
Chela santhosham mahesh garu may be update undachu ane asha. Repu update undacha.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(18-06-2020, 10:20 AM)paamu_buss Wrote: So  update to ready ayyaru anukuntu repu untada chinna clarification ivvandi doctor garu? Vasanthi garini ekkuva roojulu waiting lo pettadam bavyam kadhu.... We are so so sooooo eagerly awaiting.... Awesome ( actually  no words) for ur update....



కరెక్టుగా చెప్పారు బ్రో 10 రోజుల నుండి అప్డేట్ గురించి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాము త్వరగా మా మెడిసిన్ (అప్డేట్)తో కనికరించి మా ఈ విరహ భాధనుండి విముక్తి ప్రసాదించండి. 

వెయిటింగ్ ఫర్ యూవర్ ప్రిసీఎస్ అప్డేట్ ఫ్రెండ్.


ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd
[+] 3 users Like Rohan-Hyd's post
Like Reply
Waiting for your update bro superb story ???????? still waiting
Like Reply
Waiting for update bro
మీ
Umesh
Like Reply
మహేష్ గారు అప్డేట్ త్వరగా ఇవ్వండి అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్ మీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నాము సార్ ప్లీజ్ ప్లీజ్ రిప్లై సార్
Like Reply
Update gurinchi ayithe full waiting sir
Update gurinchi information esthe peace full ga wait chestham sir
Endhukante worth to wait for u r update

@madhu97
Like Reply
Bro update please
Like Reply
good morning mahesh sir. mi work busy tagginda?
e roju update vuntadani asistunnanu. oka vela e roju lekapote kanisam sundy rendu stories lo kuda update ivvandi sir. rendu stories ni kuda manchi rasavathara sanni veselalo apesaru. andharu chala rojula nunchi yeduru chustunnam. e sunday ni matram disappoint cheyyodhu sir.
pls..... rendu stories lo kuda updates ivvandi yevvarini kuda nirasaparachodhu.
thank you sir.
[+] 4 users Like RICHI's post
Like Reply
Update please bro
Like Reply
Meru andharu okati gamaninchara mahesh garu Busy Ayaka peda kadhalu rase vallu evaru update ivaledu, p3, na autograph sweet memories, mahesh gari 2 stories meda Benga anukunta papam e telugu stories thread main ga mahesh gari made depend aindi manam andharam ayana abhimanulam ani garvamga chepukovachu e site lo,

Kodiga update ivandi mahesh garu papam site lo rase vallu chadive vallu benga petukunaru me meda
[+] 7 users Like priyashlovely's post
Like Reply
(19-06-2020, 11:46 AM)priyashlovely Wrote: Meru andharu okati gamaninchara mahesh garu Busy Ayaka peda kadhalu rase vallu evaru update ivaledu, p3, na autograph sweet memories, mahesh gari 2 stories meda Benga anukunta papam e telugu stories thread main ga mahesh gari made depend aindi manam andharam ayana abhimanulam ani garvamga chepukovachu e site lo,

Kodiga update ivandi mahesh garu papam site lo rase vallu chadive vallu benga petukunaru  me meda

That's quite right what you said bro.

మీరు చెప్పింది అక్షరాల సత్యం priyashlovely గారు


ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd
[+] 1 user Likes Rohan-Hyd's post
Like Reply
(19-06-2020, 11:46 AM)priyashlovely Wrote: Meru andharu okati gamaninchara mahesh garu Busy Ayaka peda kadhalu rase vallu evaru update ivaledu, p3, na autograph sweet memories, mahesh gari 2 stories meda Benga anukunta papam e telugu stories thread main ga mahesh gari made depend aindi manam andharam ayana abhimanulam ani garvamga chepukovachu e site lo,

Kodiga update ivandi mahesh garu papam site lo rase vallu chadive vallu benga petukunaru  me meda

That's quite right what you said bro.

మీరు చెప్పింది అక్షరాల సత్యం priyashlovely గారు

ఈ xossipy రాజ్యానికి రాజు, రారాజు మన Maheshthehero.


ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd
[+] 3 users Like Rohan-Hyd's post
Like Reply
Waiting for your update Mahesh garu
Like Reply
Update eppudu undachu mahesh garu
Like Reply
అక్కయ్యను చూసేసాను ఇప్పుడు ఎలా కలవాలి , ఏమి మాట్లాడాలో కూడా మైండ్ పనిచెయ్యక మెయిన్ గేట్ పై చేతులను వేసి ఆనందబాస్పాలతో ప్రాణం కంటే ఎక్కువగా కన్నార్పకుండా అక్కయ్యను చూస్తుండటం , ఇన్ని సంవత్సరాల విరహ వేదన మొత్తం గాలిలో కలిసిపోయినట్లు కలుగుతున్న అమితమైన ఆనందాన్ని కవులు సైతం వర్ణించనంతగా పరవశించిపోతుండటం చూసి , బుజ్జిఅక్కయ్య ఆనందానికి అవధులు లేనట్లు నాతో సమానంగా అంతులేని ఆనందాన్ని ఆస్వాధిస్తున్నట్లు నా కాలిని రెండుచేతులతో చుట్టేసి సంతోషంతో గట్టిగా హత్తుకుంది . 
బుజ్జిఅక్కయ్యా ........స్ట్రీట్ లైట్ సరిగ్గా కాంపౌండ్ లో పడి మన అక్కయ్య దేవతలా నిండు చంద్రుడి వెన్నెలలా వెలిగిపోతోంది అని మురిసిపోతున్నాను . 
అవునన్నట్లు బుజ్జిఅక్కయ్య మరింత గట్టిగా హత్తుకొని ఎంజాయ్ చేస్తోంది .

అంటీ ......... wow బ్యూటిఫుల్ మాకోసమేనా , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని మహి చేతిలోని గులాబీ పూలను లావణ్య మరియు మిగతా ముగ్గురు అమ్మాయిలూ అందుకొని సువాసనను పీల్చి మైమరిచిపోయి తమ కురులలో ఉంచుకుని లవ్ యు రా మహి అంటూ నలుగురూ హత్తుకుని , మేమంటే మా అంటీకి నీకంటే ప్రాణం అంటూ ఒక గులాబీ పువ్వుని మహి కురులలో ఉంచి  ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

మన అక్కయ్య ఎక్కడున్నా చుట్టూ ప్రేమలతో నిండిపోతుంది బుజ్జిఅక్కయ్యా........ ఇదొగో ఇలానే అని బుజ్జిఅక్కయ్యవైపు తిరగడంతో గేట్ కదిలి చప్పుడు అవ్వడంతో ,
అందరూ నావైపు చూసి మహి తప్ప నలుగురూ ఎమున్నాడే హాలీవుడ్ హీరోలా , ఆ height చూడు , ఆ ఛాతీ చూడు జర్కిన్ లోనే అలా ఉంటే ఒసేయ్ నేను ఫ్లాట్ అయిపోయానే , చేసుకుంటే ఇలాంటివాన్నే చేసుకోవాలి అని నలుగురూ ఒకేసారి తమ మనసులోని మాటను ఎక్స్ప్రెస్ చేసి ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని పెదాలను పళ్ళతో బిగిపెట్టి మ్మ్మ్మ్మ్........ నాకు ఏదేదో అయిపోతోందని ఒకరు , నాకైతే అతడు సరే అంటే కొరుక్కుని తినేయ్యాలని , నాకైతే ఇప్పుడే ముద్దుపెట్టేయాలని ఉందని , మరొకరు అతడు ఆశపడితే చాలు ముద్దు ఏంటి ఏకంగా ........... అనేంతలో ,
మా దేవతలాంటి అక్కయ్య సిగ్గుతో ష్ ష్ ష్ ......... లావణ్య ఏంటి సిగ్గులేకుండా అని రెండుచేతులతో వాళ్ళ నోటిని మూసేస్తున్నారు . 
అంటీ మమ్మల్ని ఆపకండి ఇలాంటి పోటుగాడి కోసం పుష్పవతులు అయినప్పటినుండీ వెతుకుతున్నాము ఇప్పటికి దర్శనమిచ్చాడు , ఇలాంటి వాడికోసమే ఇంటర్లో మరియు బీటెక్ లోకూడా కో ఎడ్యుకేషన్ కాలేజ్ లలో చేరాము ఈ రేంజ్ కాదుకదా దరిదాపుల్లో కూడా ఎక్కడా తగలలేదు , చూడు అక్కయ్యా వీళ్ళిద్దరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నాకూడా నుదుటిపై చెమటపట్టి కొరుక్కుని తినేసేలా కామంతో ఎలా చూస్తున్నారో అని నవ్వుకున్నారు . మహికి కూడా ఇలా ఎక్స్ప్రెస్ చెయ్యాలని ఉన్నట్లు నావైపు కన్నార్పకుండా చూస్తుంటేనే అర్థమైపోతోంది కానీ ఎంతైనా మా అక్కయ్య పెంపకం కదా .........
ఆ మాటలను వింటున్న బుజ్జిఅక్కయ్య నవ్వుతున్నట్లు అనిపించింది .
మీకు దెబ్బలు లేవు అని ముసిముసినవ్వులతో చిరు దెబ్బలు వేసి ముందు మీరు లోపలికివెళ్లండి అని నలుగురినీ లోపలికి పంపించి తలుపులు వేసేసింది . 
అక్కయ్య నవ్వుకి నా హృదయం సంతోషంతో పులకించిపోతోంది . నన్ను చూడటం - తమ్ముడూ అని పిలుపు వినిపించగానే గేట్ తీసుకుని పరుగునవెళ్లి ప్రాణంలా నా గుండెలపై హత్తుకొని లేక అక్కయ్య గుండెలపై వాలిపోయి మాటల్లో చెప్పలేని ఆనందంతో ఎత్తి గిరగిరా తిప్పేయాలని మనసు పరవళ్లు తొక్కుతోంది .
అంటీ please please ........ మా దేవత కదూ , మా బంగారం కదూ ,మా మంచి అంటీ కదూ అని కిటికీలలో తలలను దూర్చేసి చూస్తున్నారు . 

ఇంతసేపటి నుండీ చూస్తున్నా అక్కయ్య నన్ను తమ్ముడూ అని ప్రాణంలా పిలవలేదేంటి , స్ట్రీట్ లైట్ మరియు ఇంటి బయట ఉన్న లైట్ వలన బానే కనిపిస్తున్నానే అనుకునేంతలో ,
 మిమ్మల్నీ ......... అంటూ అక్కయ్య అందమైన నవ్వుతో వాళ్ళను ప్రేమతో కొట్టడానికి చెయ్యెత్తి, బాబు ......... sorry , ఎవరు కావాలి అని అడిగింది .
అంతే మా ఇద్దరి కళ్ళల్లో కన్నీరు మాకు తెలియకుండానే కారిపోతున్నాయి . గుండె ఆగినంత పని అయ్యింది . నా వొళ్ళంతా చెమటలు పెట్టేసి చిన్నగా కంపిస్తున్నాను . 
బుజ్జిఅక్కయ్య అయితే గుండెలనుండి తన్నుకొస్తున్న కన్నీళ్ళతో నన్ను వదిలివెళ్లి , క్యారెమ్స్ ఆడుతూ వదిలివెళ్లిన ఒక కుర్చీలో కూర్చుంది .

బాబు , బాబు ......... ఎవరు కావాలి , మీ బాబు పాప ఎవరైనా ట్యూషన్ కు వచ్చారా ........ వారికోసం వచ్చావా అని అడుగుతూనే ఉంది అక్కయ్య . 
అమ్మా ......... ఎందుకో బాధపడుతున్నట్లున్నారు అని మహి మాటలు వినిపించి , వెంటనే కన్నీళ్లను తుడుచుకుని ఆక్............. నో నో .......... మేడం పై పోర్షన్ కోసం వచ్చాను అనిచెప్పి , హృదయం నుండి పొంగుతున్న కన్నీళ్లను కళ్లలోపలే ఆపేసుకున్నాను , అక్కయ్యను చేరుకొని ఈ ప్రాణం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని తలదించుకుని బాధపడుతున్నాను .
బాబు ఇంటి ఓనర్ అక్కయ్య ఆ ఇంటిలో ఉంటారు వెళ్లి మాట్లాడు అని బదులిచ్చింది అక్కయ్య . 
మహి అయితే నా బాధకు కారణం ఏంటోనని నావైపే చూస్తూ అక్కయ్య గుండెలపై వాలిపోయి లోపలకువెళ్లారు .
పై పోర్షన్ కోసం వచ్చాడా ........ యాహూ యే యే యే అంటూ లోపల నుండి సంతోషమైన కేకలు వినిపించాయి . ఆ వెంటనే అతడు వింటాడు ష్ ష్ ష్ ......... అని అక్కయ్య గుసగుసలూ వినిపించాయి .

 కళ్ళల్లో కన్నీటితో అలకతో బాధపడుతున్న బుజ్జిఅక్కయ్య దగ్గరకువెళ్లి మోకాళ్లపై కూర్చుని బుజ్జిఅక్కయ్య బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి గుండెలపై హత్తుకున్నాను . 
నా వెనుక జేబులోని పర్సు అందుకొని అక్కయ్య నా బుగ్గపై ముద్దుపెడుతున్న ఫోటోని నన్నూ మార్చి మార్చి చూసి , పెదాలపై చిరునవ్వుతో అసలు నువ్వు నా , మా అక్కయ్య తమ్ముడివి మహేష్ వేనా ...........
బుజ్జిఅక్కయ్యా ..............
ఈ ఫొటోలో చూడు తమ్ముడూ , మొబైల్ అందుకొని కెమెరా ఓపెన్ చేసి ఇప్పుడు చూడు ......... ఏమైనా పోలికలు ఉన్నాయా , పెద్దయిన నా తమ్ముడిని చూసి ఇదిగో ఇక్కడ క్యారెమ్స్ ఆడుతున్న నలుగురు భయపడ్డారంటే ఎంతలా మారిపోయావో అర్థమైపోతోంది అని తియ్యని నవ్వుతో ఇంతలా మారిపొమ్మని ఎవరుచెప్పారు నీకు అని ఫిన్ , పర్స్ పక్కన పెట్టేసి నా బుగ్గలను బుజ్జిచేతులతో నొప్పిపుట్టేలా గిల్లేసింది .
స్స్స్........ అంటూనే మా బుజ్జిఅక్కయ్యతోపాటు నవ్వుకుని , పర్సు - కెమెరా ప్రక్కప్రక్కనే ఉంచుకుని మా బుజ్జిఅక్కయ్య చెప్పినది నిజమే , మీ నాన్న కూడా ఇలాగే మారిపోయాడు ......... వాణ్ణి చూస్తే క్యారెమ్స్ ఆడేవాళ్ళు ఏంటి నేనే భయపడిపోతాను అలా దిట్టంగా పెరిగాడు అని ఇద్దరమూ నవ్వుకుని ఒకరి కన్నీళ్లను మరొకరము తుడుచుకున్నాము . మీ నాన్నకు పెద్దయ్యాక IPS బ్రెయిన్ వచ్చింది - మా బుజ్జిఅక్కయ్యకు మా చెల్లి కడుపులోనే ఆ తెలివితేటలు వచ్చేసాయి లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ముద్దులతో ముంచెత్తి నా గుండెలపై ప్రాణంలా హత్తుకున్నాను .

మన ప్రాణమైన అక్కయ్య నన్ను గుర్తుపట్టలేదు సరే , అక్కయ్య ఎక్కడుందో మనకు తెలియదు కానీ మన ఊరికి అతిదగ్గరలోనే ఉంటూ మనకోసం ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా మన ఊరు రావాలనిపించలేదంటే ఏదో గట్టి కారణం ఉంటుంది . నేను లేకుండా నన్ను చూడకుండా మన అక్కయ్య ఒక్క క్షణం కూడా ఉండలేదు , అలాంటిది ఏకంగా ఇన్ని సంవత్సరాలు నన్ను చూడకుండా ఉందంటే ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి . 
ఎలా తెలుసుకుంటావు తమ్ముడూ .........., నేనే మీ ప్రాణమైన తమ్ముడిని ఇన్ని సంవత్సరాలు నన్ను ఎందుకు కలవాలనిపించలేదక్కా అని నేరుగా వెళ్లి ఆడిగానుకోండి , 
కారణం గుర్తుకువచ్చి , నాకు దూరంగా ఉన్న బాధతో కలిపి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి బుజ్జిఅక్కయ్య .
అధిచూసి నువ్వు , నేను తట్టుకోగలమా తమ్ముడూ నావల్ల అయితే కాదు . అక్కయ్యను నేను ఎప్పుడూ అలా చూడలేను . మా అక్కయ్య పెదాలపై ఎల్లప్పుడూ చిరునవ్వులు ఉండాలి .
నో నో అక్కయ్యా ..........నావల్ల కూడా కాదు . 
 మీ కలలో కనిపించిన వారు అక్కయ్యే అయితే , ఆ బాధను ........ తమ్ముడూ అంటూ నన్ను కళ్ళల్లో నీళ్లతో హత్తుకుంది . అక్కయ్య కళ్ళు చూసారా కొన్నిరోజులుగా సరిగ్గా నిద్రపోయినట్లు కూడా లేదు తమ్ముడూ , గుండెల్లో బాధను దాచేసుకొని బయటకు అందరితో సంతోషన్గా ఉంటున్నారు .
బుజ్జిఅక్కయ్యతోపాటు నా కళ్ళల్లోకూడా కన్నీళ్లు రాసాగాయి . అక్కయ్యను బాధపెట్టకుండా చేయాలంటే ...........
ముందు అక్కయ్యను రాణిలా చూసుకోవాలి , మనం ఎవరన్నది తెలియకూడదు , అక్కయ్యను ఎలా అయితే చూడాలనుకున్నామో అలా మనమే మార్చేసిన తరువాత, ఆ సంతోషమైన సమయంలో మనం ఎవరన్నది చెబితే అక్కయ్య అంతులేని ఆనందంతో మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకోవాలి అని ఇద్దరమూ ఒకేసారి మాట్లాడి , ఆ ఊహకే మా పెదాలపై చిరునవ్వులు చిగురించాయి .

బుజ్జిఅక్కయ్య గారూ ........... అలా మా అక్కయ్యను త్వరలోనే చూడాలంటే నన్నేమి చేయమంటారో చెప్పండి నా ప్రాణాలైనా అర్పించేస్తాను అనిచెప్పాను .
వెంటనే నా నోటిని మూసేసి తమ్ముడూ ......... ఇంకెప్పుడూ ఆ మాట అనకు అని హత్తుకొని , ముందు మన ఐడెంటిటీ మార్చేయ్యాలి . 
అంటే ముందు మనపేర్లను మార్చేయాలన్నమాట . 
నా పేరుని మాత్రం మార్చుకోను , ఆ పేరు లేకుంటే నేను లేను తమ్ముడూ .........
అక్కయ్యా ........... లవ్ యు లవ్ యు soooooo మచ్ అని మురిసి , అయితే నా కొత్త పేరుని నువ్వే పెట్టు అక్కయ్యా అని చిరునవ్వుతో అడిగాను .
మన అక్కయ్యకు ఆ పేరుని పలికితే మహేష్ అని గుర్తుకురావాలి కాబట్టి " మ " అనే అక్షరంతోనే మ మ మా........... ఆ మనోజ్ - తమ్ముడూ కొద్దిరోజులు నీ పేరు మనోజ్ ఎలా ఉంది .
 అప్పుడు మా అక్కయ్య మహేష్ అని - ఇప్పుడు ఆ అక్కయ్య పెదాలపై చిరునవ్వు పూయించడం కోసం మా బుజ్జిఅక్కయ్య మనోజ్ అని నామకరణం చేసింది . లవ్ యు soooooo మచ్ అని గుండెలపై హత్తుకొని లేచి నిలబడ్డాను .
మనోజ్ ఫిక్స్ నెక్స్ట్ ..........
నెక్స్ట్ మనం అక్కయ్యకు అతిదగ్గరలో ఉండాలి , అంటే ఎలాగైనా సరే పై పోర్షన్ లో మనం ఉండాలి . 
అయితే పదా అక్కయ్యా ......... ఓనర్ గారిని కలుద్దాము . 
తమ్ముడూ ........... అంతకంటే ముఖ్యమైనది అక్కయ్య హ్యాపీగా ఉండాలంటే , అక్కయ్యకు ప్రాణమైన వాళ్ళు మొదట హ్యాపీగా ఉండాలి .
అర్థమైంది బుజ్జిఅక్కయ్య గారూ ............ మహినే కదా.........
Yes yes .............లవ్ యు తమ్ముడూ .......... నా అంత కాకపోయినా మా తమ్ముడు తెలివైనవాడే అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
రేపు మహి కాలేజ్ లోకి ఎంటర్ అయ్యేలోపు కాలేజ్ ప్రిన్సిపాల్ స్వయంగా వెళ్లి మహిని క్లాస్ కు రమ్మని స్వాగతం పలికేలా చేస్తాను .
లైబ్రేరియన్ కూడా అని ఇద్దరమూ నవ్వుకున్నాము . 
తమ్ముడూ .......... నా తరుపున మహికి చిరుకానుక ఇవ్వాలని ఆశపడుతున్నాను . సాయంత్రం షాపింగ్ మాల్ లో మహి మరియు తన నలుగురు ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ తెల్లవారేలోపు అక్కయ్య డోర్ ముందు ఉండాలి . 
మా బుజ్జిఅక్కయ్య అప్పుడే స్టార్ట్ చేసేసిందన్నమాట ..........అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టాను .
అన్నయ్యా .......... ఇది కేవలం శాంపిల్ మాత్రమే ఇక్కడ ఒక పెద్ద లీస్టే ఉంది అని తన మైండ్ వైపు వేలితో సైగచేసింది . 
మా బుజ్జి ఐన్స్టీన్ నాతో ఉందికాబట్టి సరిపోయింది లేకపోతే అంతే అని పైకి ఎగరేసి పట్టుకుని గుండెలపై ప్రాణంలా హత్తుకొని గేట్ తీసుకుని లోపలకువెళ్లాము .

బుజ్జిఅక్కయ్య బుగ్గపై ఆపకుండా ముద్దులుపెడుతూ కలలోలానే ప్రక్కప్రక్కనే ఉన్న రెండు ఓకేవిధమైన హౌస్ లలో ఓనర్ ఇంటి డోర్ దగ్గరకు వెళుతోంటే , తమ్ముడూ ......... అక్కయ్య ఏమిచేస్తున్నారో ఒకసారి కిటికీలలోనుండి తొంగి చూడాలని ఉంది అని కోరడం - నాకూ మా అక్కయ్యను చూడాలని , నా అదృష్టం కొద్దీ అక్కయ్య సౌందర్యమైన నడుము అంతకంటే అందంగా కవ్వించే బొద్దు ఏమైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో , సరే అక్కయ్యా అని చుట్టూ చూసి ఎవ్వరూ లేకపోవడంతో ,నెమ్మదిగా అడుగులువేసుకుంటూ కిటికీ దగ్గర గోడకు ఆనుకుని నిలబడి , 
అక్కయ్యా ........మీ అక్కయ్య కనిపిస్తుందో లేదో ముందు మీరు చూడండి తరువాత నేను అని చిలిపినవ్వుతో , బుజ్జిఅక్కయ్యకు లోపల కనిపించేలా చేతులతో ముందుకు పట్టుకున్నాను .
తమ్ముడూ ........ చాలామంది పిల్లలు ఆటలాడుకుంటూ చదువుకుంటున్నారు అక్కయ్య వాళ్ళమధ్యలో కూర్చుని నా అంత బుజ్జాయిని ఒడిలో కూర్చోబెట్టుకొని స్లేట్ లో దిద్దిస్తున్నట్లున్నారు , రేపటి నుండీ నేనూ ట్యూషన్ కు వెళతాను అక్కయ్య ఒడిలో కూర్చుంటాను అని సంతోషంతో చెప్పింది , తమ్ముడూ ......... పాపం పిల్లలందరికీ కూర్చోవడానికి తగిన స్థలం కూడా లేదు అయినా కూడా పొట్లాడకుండా ఎవరి ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు . మహివాళ్ళు కనిపించడం లేదు . 
మహి గురించి వదిలెయ్యి అక్కయ్య కిటికీ వైపుకు తిరిగిందా లేక సైడ్ కు తిరిగి కూర్చుందా అని అడిగాను .
సైడ్ కు అనడం ఆలస్యం .......... 
బుజ్జిఅక్కయ్యతోపాటు లోపలికి తొంగిచూసి , ప్చ్ ప్చ్ ప్చ్ ......... అంటూ కిటికీ నాలుగువైపుల నుండీ చూసి నిరాశ చెందుతుంటే , 
తమ్ముడూ .......... దేనికోసం చూస్తున్నావో నాకు తెలుసులే , అమ్మ ........ నేను తన ఒడిలో నిద్రపోతున్నానని అక్కయ్య ఫొటోతో మాట్లాడుతుంటే విన్నాను . అక్కయ్య చీరతో కప్పేసుకుంది అని ముసిముసినవ్వులు నవ్వి వెంటనే చేతితో నోటిని మూసేసింది . 
అవును బుజ్జిఅక్కయ్యా .......... ఇంత అంటే ఇంతకూడా కనిపించడం లేదు . ఆ పార్ట్ అంటే నాకు పిచ్చిప్రాణం అని బుజ్జిఅక్కయ్య బుగ్గను కొరికేసాను . 
స్స్స్......  అని రుద్దుకుంటూ ఇద్దరమూ నవ్వుకుంటుంటుంటే , 

ఎవరక్కడ అని వెనుక నుండి మాటలు వినిపించాయి .
 దొరికిపోయాము అంటూ కాస్త కంగారుపడుతూ వెనక్కు తిరిగి తలదించుకుని నిలబడ్డాను . 
ఎవరికోసం లోపలికి తొంగిచూస్తున్నారు , ఇంతకీ ఎవరుకావాలి అని అడిగింది .
Tolet బోర్డ్ చూసి వచ్చాము అంటీ , ఓనర్ ఎవరో తెలియక లోపల నుండి పిల్లల మాటలు వినిపించడంతో చూస్తున్నాము అని బుజ్జిఅక్కయ్య ముద్దుముద్దుగా మాట్లాడటంతో , 
ఎంత ముద్దొస్తున్నావో పాప , నిన్ను ఎక్కడో చూసినట్లుంది అని చేతులను చెప్పడంతో.
బుజ్జిఅక్కయ్యను కిందకు దించడం , ఆమె ఎత్తుకుని ముద్దుచేయ్యడం క్షణాల్లో జరిగిపోయాయి .
పాప నీ పేరేంటి అని అడిగారు .
ఎప్పుడు ఎవ్వరు ఈ ప్రశ్న బుజ్జిఅక్కయ్యను అడిగినా అంతులేని ఆనందంతో గర్వపడుతూ వాసంతి అని బదులిస్తుంది బుజ్జిఅక్కయ్య .
అదీ సంగతి , నాకు అత్యంత ఇష్టమైనవాళ్ళల్లో వాసంతిదే మొదటిస్థానం . ఇదిగో మా ఇంటిలోనే రెంట్ కు ఉంటున్నారు , మా బంధం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది . అచ్చు వాసంతిలానే ఉన్నావు బుజ్జిపాప అందుకే చూడగానే అలానే ఉన్నావు అనిపించి అడిగాను . 
ఇక నా పేరు రాధ ఓనర్ ని అని నవ్వుతూ చెప్పారు . 

ఐస్ క్రీమ్ తింటావు కదూ అని వాళ్ళ ఇంటిలోపలికి పిలుచుకునివెళుతూ లోపలికి రండి మాట్లాడదాము అని లోపలికి ఆహ్వానించి హాల్లోని కుర్చీలో కూర్చోమన్నారు . బుజ్జిఅక్కయ్యను లోపలకు పిలుచుకొనివెళ్లారు . 
అక్కయ్య అంటే ఇక్కడ నివసించే అందరికీ చాలా అభిమానం , గౌరవం అని పొంగిపోయాను . మా అక్కయ్య ఎక్కడ ఉన్నా అందరికీ దేవతనే .........
ఆమె చేతిలో ఐస్ క్రీమ్ తో బుజ్జిఅక్కయ్యకు తీసుకోమని అందిస్తుంటే , వద్దు అంటీ అని వారిస్తోంది .
మీపాప మీరు పర్మిషన్ ఇస్తేకానీ తినేలా లేదు అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , నాకూ ఇంతేవయసు మనవరాలు (కూతురు కూతురు ) ఉంది పేరు ఇందు బెంగళూరులో ఉంటారు , మా వాసంతి వల్లనే నా ప్రాణమైన మనవరాలు ఈ భువిపైకి అడుగుపెట్టింది . నాకూతురు కాన్పుకు ఇంటికివచ్చింది 9 వ నెలలో ప్రక్కనే పల్లెటూరిలో ఖచ్చితంగా వెళ్లాల్సిన పెళ్లి , అమ్మా ........ డెలివరీ date ఇంకా వారం రోజులు ఉందికదా వెళ్ళిరండి లేకపోతే బంధువులతో మాటవస్తుంది . అంటే నేను అప్పటికే లవ్ మ్యారేజ్ చేసుకోవడం వలన మా బంధువులందరికీ దూరమయ్యాను , ఇప్పుడూ వెళ్లకపోతే శాశ్వతంగా దూరం అయిపోతాము అని నా తల్లి ఫోర్స్ చెయ్యడంతో వెళ్లక తప్పలేదు . ముహూర్తం చూసుకుని చూసుకుని వచ్చేద్దామని మావారితోపాటు వెళ్ళాను . 
ముహూర్తం అవ్వగానే భయలుదేరేంతలో ఉరుములూ పిడుగులతో వర్షం ..........

నేను , ఆమె ఒడిలో ఉన్న బుజ్జిఅక్కయ్య ఉత్కంఠతో వింటున్నాము .
క్షమించండి .......... మీరేదో రెంట్ కోసం వస్తే నేను ఏదేదో చెబుతున్నాను మీకు బోర్ కొట్టిస్తున్నాను . ఏంటో మా వాసంతిని తలుచుకుంటే చాలు నాకు ఆనందం అందుకే తను చేసినవి నాకు తెలియకుండానే ఇలా మాటలుగా వచ్చేస్తాయి .
 అక్కయ్య గొప్పతనం గురించి చెబుతుంటే నా రోమాలు సంతోషంతో నిక్కపొడుచుకుంటున్నాయి . మేడం ......... please కంటిన్యూ , అంటీ మీరు మొత్తం చెబితే ఇష్టంతో మీరిచ్చిన ఐస్ క్రీమ్ తింటాను అని బుజ్జిఅక్కయ్య చెప్పడంతో ,
నాకూ అదేకావాలి వాసంతి , ఆమె తెలిసి అన్నదో తెలియక అన్నదో ........ నీ గురించి ( వాసంతి పేరుతో వాసంతిలానే ఉన్న ) నువ్వే తెలుసుకోవాలనుకుంటున్నావా అని రెండుచేతులతో హత్తుకొని కురులపై ముద్దుపెట్టి కంటిన్యూ చేశారు .

సముద్రంలో అల్పపీడనం వలన అతివేగమైన గాలులతోపాటు ఉరుములూ మెరుపులతో భయంకరమైన తుఫాను . మేము వెళ్ళాలి అనిచెప్పినా ప్రమాదం అని మా బంధువులు ఆపేశారు .
ఆ భయంకరమైన ఉరుములూ పిడుగులకు నా తల్లి భయపడటం అదేసమయంలో నొప్పులూ రావడంతో విలవిలలాడిపోతోంది . 
గంటగంటకూ వాసంతి నా కూతురు దగ్గరకు వచ్చి చూసివెళ్ళేది . వర్షం భయంకరంగా మొదలవ్వగానే ఎక్కడ భయపడుతుందోనని తడుస్తూ డోర్ దగ్గరికివచ్చి నొప్పులకు కేకలువేస్తున్న నా తల్లి దగ్గరికి సంజనా తల్లీ సంజనా .........అయ్యో నొప్పులు మొదలయ్యాయే అంటూ మహిని పిలిచి చూసుకోమనిచెప్పి , వర్షంలోనే రోడ్ లోకివెళ్లి వెహికల్ కోసం చూస్తే ఒక్కరూ ఆపడం లేదు . అమ్మా అమ్మా ......... అక్కయ్య తట్టుకోలేకపోతోంది అని మహి పిలవడంతో , లోపలకువచ్చి పరిస్థితి విషమించేలా ఉందని రెండుచేతులతో ఎత్తుకుంది . మహి గొడుపట్టడంతో వర్షాన్ని లెక్కచెయ్యక జారుతాయని చెప్పులు కూడా వదిలేసి రోడ్ లోకి వచ్చింది . వాళ్ళ బాధలను చూడలేకనేమో ఆ దేవుడు సమయానికి ఆటో పంపించినట్లు అతనే ఆపి ఎక్కించుకుని హాస్పిటల్ లో వదిలారు . 
గంటలో బుజ్జాయిని వాసంతి చేతిలో ఉంచి కొద్దిసేపు ఆలస్యం అయి ఉంటే తల్లీ బిడ్డా ........... అని డాక్టర్ గారు చెప్పారు . 
ఆరోజంతా వర్షం ఆగలేదు . ఫోన్ చేద్దామంటే టవర్ లు సైతం డ్యామేజి అయిపోయాయి . నెక్స్ట్ రోజు తెల్లవారుఘామున వర్షం తీవ్రత తగ్గడంతో బైకులో తడుచుకుంటూ వచ్చాము . రెండు ఇల్లులూ ఓపెన్ లోనే ఉన్నాయి నా తల్లీ లేదు వాసంతి కూడా లేకపోవడంతో కంగారుపడుతోంటే , చుట్టుప్రక్కల వాళ్ళు వాసంతి తపనను వివరించారు . వెంటనే హాస్పిటల్ కు చేరుకుని ఊయలలో మహితో ఆడుకుంటున్న మా పాపను , బెడ్ పై పడుకుని వాసంతితో మాట్లాడుతున్న నా తల్లిని చూసి అప్పటికి మా హృదయం మామూలుస్థితికి చేరుకుంది . పాపను చూసి ఆనందబాస్పాలతో వాసంతిని కౌగిలించుకున్నాను . మా వారు అయితే రెండు ప్రాణాలను కాపాడిన దేవత మీరు అని వాసంతికి రెండుచేతులతో నమస్కరించారు ...........
బుజ్జిఅక్కయ్య గర్వపడుతూ చప్పట్లు కొట్టింది . అక్కయ్యా ......... లవ్ యు soooooo మచ్ అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నాను . అంటీ కూడా .......
అంటీ ......... మా ఆక్ ......... వాసంతి మేడం గొప్పతనం వింటుంటే మాకు చాలా చాలా ఆనందం వేస్తోంది ఐస్ క్రీమ్ అని అడిగాను . 
బుజ్జివాసంతి ఇది కరిగిపోయింది ఫ్రిడ్జ్ లోనుండి మరొకటి తీసుకొస్తాను అని ఎత్తుకొనివెళ్లి , ఇద్దరూ ఒక్కొక్క ఐస్ క్రీమ్ తింటూ వచ్చారు . 
మేడం ........ మా ఆక్......... ఇలాంటి గొప్పవారితో మంచివారి మధ్యన ఉండాలని ఆశపడుతున్నాము , మీరు మాకు పై పోర్షన్ రెంట్ కు .........
Like Reply
మీరు వచ్చిన సంగతే మరిచిపోయాను . మీకు పెళ్లి అయ్యింది కదా ......... అయ్యో నేనొకదాన్ని అని తలపై మొట్టికాయ వేసుకుని , ఏకంగా మీ బుజ్జివాసంతితో వచ్చినాకూడా పెళ్లైందా అని అడుగుతున్నాను . క్షమించండి ఏమీ అనుకోకండి బ్యాచిలర్స్ కు రెంట్ కు ఇవ్వనే ఇవ్వను tolet బోర్డ్ కింద కూడా రాయించాము చీకటిలో మీకు కనిపించి ఉండదు . ఓన్లీ ఫర్ ఫ్యామిలీ మరియు కాలేజ్ గర్ల్స్ కు మాత్రమే ఎందుకంటే నా చెల్లి వాసంతికి నేను ప్రేమతో అలానే పిలుస్తాను . 
నాకు బుజ్జిఅక్కయ్యకు చాలా సంతోషం వేస్తోంది .
నా చెల్లి వాసంతికి ఇద్దరు బ్యూటిఫుల్ ఏంజెల్స్ .......... తల్లికి తగ్గ దేవకన్యలు ఒకరంటే మరొకరికి ప్రాణం , తల్లిమాట జవదాటరు , తల్లి బాధపడితే అసలు ఏ ఒక్కరి కంట కన్నీరు చూసినా తట్టుకోలేరు ........... అని గర్వపడుతూ ఆపకుండా చెబుతూనే ఉన్నారు .

ఇద్దరా ......... ఇద్దరు అని బుజ్జిఅక్కయ్య నన్ను - నేను బుజ్జిఅక్కయ్యను చూసి అమితానందంతో ............ మురిసిపోతున్నాము .
అవును ఇద్దరు ఒక అమ్మాయి మహి బీటెక్ చేస్తోంది , మరొక అమ్మాయి జానకి వాసంతి తల్లి పేరునే చిన్న కూతురికి పెట్టుకుంది 9th క్లాస్ చదువుతోంది . వీళ్ళిద్దరితోపాటు ...........
అమ్మ ............ అని సంతోషంతో కేకవేశాను . అదే మా ఆక్......... వాసంతి గారి అమ్మగారు...........
ఆమెను నేనింతవరకూ చూడనేలేదు , వాసంతి నాన్న ఆమెను దుబాయ్ తీసుకెళ్లిపోయారని చెప్పింది . ఇక్కడకు వచ్చిన కొత్తలో కొన్ని సంవత్సరాలు ఫోనులో మాట్లాడుకునేవారు , ఆ తరువాత వాడుకలో లేదు అని రావడంతో ఆ ఫోన్ నెంబర్ కు ఇప్పటికీ చేస్తూనే తన తల్లిని తలుచుకుని బాధపడుతూనే ఉంటుంది . 

తమ్ముడూ .......... అంటూ బుజ్జిఅక్కయ్య ఏడుస్తూ వచ్చి నా గుండెలపై చేరిపోయింది . బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని నుదుటిపై ముద్దుపెట్టి , నా కన్నీళ్లను తుడుచుకుని నేనున్నాను , మీ నాన్న ఉన్నారుకదా అక్కయ్యా ......... అమ్మను ఇండియా తీసుకొస్తాము అని మాటఇవ్వడంతో , లవ్ యు తమ్ముడూ అని నవ్వింది .
మహి , జానకీలతోపాటు ..........
ఆ ఆ ........ మహి , జానకిలకు ప్రాణం సర్వస్వం వాళ్ళ బుజ్జి తమ్ముడు మహేష్ ........., 
 మేమిద్దరమూ ఒకరినొకరము చూసుకుని తియ్యదనంతో నవ్వుకున్నాము . మరి వాసంతి మేడం కు అని బుజ్జిఅక్కయ్య అడిగింది .
చెప్పనవసరం లేదు అదేంటో తన కొడుకు కన్నా మహేష్ పేరంటేనే తనకు ప్రాణం . మహేష్ అని పేరు పెట్టుకుని పిలుచుకోవడం కోసమే ముగ్గురిని కనింది .
అంటే ............
తొలి బిడ్డ మహి బదులు మహేష్ అయ్యి ఉంటే మహి జానకిలు జన్మించేవారు కాదు అని అర్థం . ఈ నిజం నాకు మాత్రమే తెలుసు ........... మహేష్ తన ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడి పేరు . వాసంతి ఇక్కడ జీవిస్తోంది అంటే జీవిస్తోంది అంతే తన పంచప్రాణాలన్నీ తన ప్రాణమైన తమ్ముడు మహేష్ తోనే ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను . వాసంతికి తన తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలుసు అయినాకూడా మహేష్ దగ్గరికి వెళ్లకుండా తన పిల్లలు పడుకోగానే రాత్రన్తా నిద్రపోకుండా బాధపడుతూనే ఉంటుంది . ఇలా నిద్రపోని రాత్రులు ఎన్నో ........ అని బాధపడుతూ కారుతున్న కన్నీళ్లను చీరకొంగుతో తుడుచుకుంది  
తమ్ముడూ అంటూ పట్టరాని ఆనందంతో నా జర్కిన్ ను చింపేసేలా లాగేస్తూ నాతోసమానంగా ఆమె మాటలను ఎంజాయ్ చేస్తోంది బుజ్జిఅక్కయ్య . ఆమె కానీ ఎదురుగా లేకపోయుంటే ఇద్దరమూ సంతోషం పట్టలేక టాప్ లేచిపోయేలా కేకలతో ఎంజాయ్ చేసేవాళ్ళము . చివరన చెప్పిన మాటలకు ఒక్కసారిగా హృదయం చలించిపోయింది.

అంటీ మా ఆక్ ........... వాసంతిమేడం తన తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలిసికూడా ఎందుకు వెళ్లి కలవలేదు అని అడిగింది బుజ్జిఅక్కయ్య .
ఎందుకో............. అమ్మో అమ్మో ........ చూడటానికి బుజ్జివాసంతినే కానీ CID ఆఫీసర్ , వాసంతిపై నాకున్న అభిమానాన్ని ఇంతలా ఎవరూ క్యాష్ చేసుకోలేదు . అవునూ బుజ్జివాసంతి గారూ మీరువచ్చినది ఎందుకు తెలుసుకుంటున్నది ఏమి అని బుజ్జిఅక్కయ్య బుగ్గను గిల్లారు .
అంటీ అంటీ ......... please please .......... ఇదొక్క విషయం చెప్పను ఇంకేమీ అడగము అని నాదగ్గరనుండి వెళ్లి చేతులనూ అందుకొని మీరేమీ చెప్పినా చేస్తాను . మీ ఇల్లంతా శుభ్రం చెయ్యమన్నా చేస్తాను please please అంటీ ......... అని ప్రాధేయపడుతోంటే ...........
బుజ్జివాసంతి ........... ఎందుకో మీరు ......... సరే సరే వాసంతి మొదట తన ప్రాణం కంటే ఎక్కువైన మహేష్ నుండీ తరువాత తన తల్లిదండ్రుల నుండి ఎలా విడిపోయిందో చెప్పింది కానీ , ఎందుకు విడిపోయిందో మాత్రం ఇప్పటికీ చెప్పలేదు . తన బాధను చూడలేక తన తమ్ముడు ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుని నేనే స్వయంగా వెళ్లి పిలుచుకువద్దామని అడ్రస్ , ఎందుకు విడిపోయారో కారణం చెప్పమని అడగని రోజంటూ లేదు .
అక్కయ్యా .......... ఈ రెండూ మాత్రం అడగొద్దని క్షమించమని బాధపడుతూ వెళ్ళిపోతుంది . తన బాధను ఆ బాధతోపాటు పిల్లల చదు.............తన బాధలు అంతులేనివి , ఆ దేవుడికి ఎప్పుడు కనికరం కలుగుతుందో ......... తన తమ్ముడు ఎప్పుడు తనను చేరి కష్టమనేది లేకుండా చూసుకుంటాడో అని కళ్ళల్లో కన్నీళ్ళతో బాధపడింది .

బుజ్జివాసంతి .......... రేపే వచ్చి గృహప్రవేశం చేసుకోండి అనిచెప్పింది .
మేడం ......... మీతో అపద్దo చెప్పి ఇంటిలోకి చేరలేము . నాకు పెళ్లికాలేదు బుజ్జివాసంతి నా చెల్లెమ్మ కూతురు అనిచెప్పాను . 
బాబు ఇలా మాట్లాడుతున్నానని క్షమించు నువ్వు ఒక్కడివే ఉండేటట్లయితే .........
తెలుసు మేడం ............
మా వాసంతి పిల్లలు అంటే నా పిల్లలతో సమానం . నా పిల్లలతోపాటు చుట్టుప్రక్కల ఉన్న ఇంటర్ అమ్మాయిలు వాసంతి దగ్గరికి ట్యూషన్ కు వస్తారు . నాకు రెంట్ డబ్బు కంటే వాళ్ళ సేఫ్టీ నే ముఖ్యం అర్థం చూసుకుంటావని ఆశిస్తున్నాను . 
అంటీ మా అమ్మావాళ్లను పిలుచుకునివస్తే అని బుజ్జిఅక్కయ్య అడిగింది .
పిలుచుకునిరావడమే కాదు బుజ్జివాసంతి ఇక్కడే ఉండాలి అలాగయితేనే...........
మీరు మా ఆక్ ........... వాసంతి గారి గురించి వారం పిల్లల గురించి ఆలోచిస్తున్న తీరుకు రెండుచేతులతో నమస్కరిస్తున్నాను . మీపై గౌరవం మా ప్రాణం ఉన్నంతవరకూ ఉంటుంది .

సమయం 8 గంటలు దాటడం చూసి రేపు ఉదయం మా చెల్లితోపాటు వస్తాము మేడం అని లేచి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ఆకాలేస్తోందా అని ముద్దుపెట్టి అడిగాను.
అక్కయ్యను చూసిన ఆనందంలో నాకు ఆకలీ వెయ్యడం లేదు , నిద్రా రావడం లేదు అని చెవిలో గుసగుసలాడి , బై అంటీ ........ , బై బుజ్జివాసంతి రేపు మీరు రాగానే పెద్ద వాసంతిని పరిచయం చేస్తాను నీకు . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అంటీ అని డోర్ దగ్గరకు వచ్చాము .
అదేసమయానికి రేయ్ ఒక్కత్తే ఉంటుందీ అనిచెప్పారు మరి వీడెవడు ........., బిజినెస్ అయ్యుండొచ్చు సర్ అని నవ్వుతూ ఇద్దరు లోపలికి ఎంటర్ అవ్వడంతో అక్కడే ఆగిపోయాను . వాళ్ళు ఫుల్ గా తాగినట్లు బుజ్జిఅక్కయ్య ముక్కుమూసుకుంది , అడుగులు కూడా తడబడుతున్నాయి .

ఏంటి రాధ మేడం ........... డబ్బు రెడీ చేశారా ......... మీ పేరు పలికితేనే చాలు నా వొళ్ళంతా జలదరించిపోతుంది అని ఇద్దరూ వాళ్ళల్లో వాళ్లే నవ్వవుకున్నారు .
ఎవరు మీరు ఇంత రాత్రిపూట లోపలికి వచ్చేసారు అని కోపంతో ముందు బయటకు వెళ్ళండి అని వేలిని చూపించారు మేడం .
కోపమే ........... డబ్బు తీసుకునేటప్పుడు ఎంత వినయంగా అడుగుతారు , రికవరీకి వచ్చినప్పుడు మాత్రం కోపంతో ఊగిపోతారు . అవన్నీ అనవసరం రెండు నెలల డ్యూ కట్టేస్తే మా దారిన మేము ఎలావచ్చామో అలా వెళ్లిపోతాము .
నిన్ననే కదా ఇద్దరువచ్చి నెలరోజులు టైం కావాలని అడిగితే ఇచ్చారు . 
అది నిన్న మేడం అని ఇద్దరూ హైఫై కొట్టుకుని నవ్వుకుని , వాళ్ళు మా కంపెనీలో బచ్చాలు , వాళ్ళు చెప్పారంట ఈమెగారు నెలరోజులు తకిట తదిమి అంటూ డాన్స్ చేస్తుందట ...........

సరిగ్గా మాట్లాడండి జేసీబీ కోసం ఫైనాన్స్ తీసుకున్నప్పటి నుండీ అదికూడా మేము బ్యాంక్ లో తీసుకోబోతుంటే మా ఆయన కాళ్లావేళ్ళా పడి మీరు మా ఫైనాన్స్ లోనే తీసుకోవాలి same వడ్డీ అని బ్రతిమిలాడి ఇంటికి అమౌంట్ తెచ్చి ఇచ్చారు . మొదట నెల నుండీ సమయానికి కట్టేసాము . ప్రభుత్వం మారడంతో రెండు నెలలుగా బిల్స్ పడకపోయినా సొంతడబ్బును పనివాళ్లకు ఇచ్చి శ్రీకాకుళం లో జేసీబీ తో ప్రభుత్వం పనులు చేయిస్తూనే ఉన్నారు . బిల్స్ పడగానే ఈ రెండు నెలల extra వడ్డీతోపాటు కట్టేస్తాము . ఇదిగో నెలరోజులు మీవాళ్లే స్వయంగా ఇచ్చిన పర్మిషన్ అని లెటర్ చూపించారు .
తాగిన మత్తులో లెటర్ లాక్కుని చింపేసి , ఏదీ మీ నెలరోజుల పర్మిషన్ , సర్ ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయాయి అని వెటకారంతో నవ్వుతున్నారు . 
ఆ దృశ్యాలను మొత్తం బుజ్జిఅక్కయ్య నా మొబైల్ లో వీడియో తీస్తోంది .

అలా చింపేశారేంటి ............అని మేడం కంగారుపడుతున్నారు .
అలాగే చింపుతాము మా ఇష్టం ........ ఇప్పుడు అడుగుతున్నాము డ్యూ అమౌంట్ కడితే తీసుకుని వెళ్లిపోతాము .
డబ్బు లేదనే కదా నెలరోజులు సమయం తీసుకుంది . ఇంత రాత్రిపూట వద్దు నేను కావాలంటే రేపు ఆఫీస్ కే వస్తాను అని బ్రతిమాలుకుంది . 
తమ్ముడూ .............
బుజ్జిఅక్కయ్యను డోర్ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టేలోపు , 
డబ్బు అయినా కట్టు లేకపోతే మా శారీరకవాంఛను అయినా తీర్చు , మాంచి కసిమీద వచ్చాము . రికవరీ స్టాఫ్ మీ గురించి చెబుతుంటే ......... రాధ నా మదిలో బాధ ...... వొళ్ళంతా తీటగా ఉంది , మా కోరిక తీర్చు నెలరోజులు ఏంటి రెండునెలల పర్మిషన్ ఇస్తాను అని మాట్లాడగానే , మేడం వాడి చెంపను వాయించింది .
న్యాయంగా , ధర్మబద్ధంగా డ్యూ రికవరీకి వచ్చిన ఆఫీసర్స్ పై చెయ్యిచేసుకోవడం ఎంతపెద్ద నేరమో తెలుసా......... రేపే మీ ఆస్తులను మొత్తం జప్తు చేయించి జేసీబీ అప్పుకు సరిపోక మీ సెక్సీ అందాలను రోజూ దోచుకునే నీ భర్తను జైలుకు పంపిస్తాము . మీకు తెలిసే ఉంటుంది మా ఫైనాన్స్ కంపెనీ స్టాండింగ్ మినిస్టర్ గారిది , ఆయన ఒక్క సంతకం పెట్టారంటే నువ్వు ర్పడ్డుపై బిచ్చమెత్తుకుని రాత్రిళ్ళు పైట జార్చి వచ్చేపోయేవాళ్ళ సుఖం తీర్చి జీవితం గడపాల్సివస్తుంది . బాగా ఆలోచించుకో ఒకే ఒక్కరోజు నా కింద ఆ తరువాత నా అసిస్టెంట్ కింద నలిగిపోయి మా కోరిక తీర్చావంటే చాలు హ్యాపీగా ఉండొచ్చు మీ ఆయనకు బిల్స్ పడగానే ప్రతినెలలానే కట్టెయ్యొచ్చు అని మేడం వెనుకకూ వెనుకకు వెళుతోంటే వాడు చెయ్యి వేయడానికి ముందుకువెళుతున్నాడు .

దానికంటే నా ప్రాణాలను సంతోషంగా వదిలేస్తాను అని కత్తి అందుకున్నారు .
మేడం ........... ఓకేఒక్కనిమిషం అని ఆపి వాళ్ళవైపు వెళుతోంటే ,
తమ్ముడూ వీళ్ళకేకలు విని మన అక్కయ్య డిస్టర్బ్ అవ్వకూడదు , పిల్లలతో సంతోషన్గా ట్యూషన్ ఎంజాయ్ చేస్తున్నారు .
లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా .......... అని మెయిన్ డోర్స్ వేసి గడియ పెట్టేసాను . అక్కయ్యా .......... నేను కొట్టే దెబ్బలకు వాళ్ళ నోటి నుండి ఒక్క అరువు కూడా బయటకు రాదు . కానీ నెలరోజులు హాస్పిటల్లో ఉంటారు . ఇక ఇలా కాల్ మనీ పేరుతో ఎవరినీ ఇబ్బందిపెట్టరు అనిచెప్పాను .
ఏంట్రా ......... అరుపులు రానివ్వకుండా కొడతావా.......... మేము కొట్టామంటే నువ్వు వైజాగ్ మొత్తం వినిపించేలా నొప్పితో కేకలువేస్తావు అని ముందుకువచ్చాడు .
ఎత్తిన చేతిని పట్టుకుని వెనక్కుతిప్పి విరిచేసి , అదేసమయంలో గొంతుచుట్టూ మరొకచేతినివేసి మెడ ఎముక విరిగిపోయేలా తిప్పగానే , అరుపు గొంతు దగ్గరే ఆగిపోయింది . చేతిని వదిలి డొక్కలో ఒక గుద్దు , మోకాలితో ఆయువుపట్టుపై ఒక దెబ్బ వేసి రెండుచేతులనూ విశాలంగా చాపి నిలబడ్డాను . ధడేల్ మంటూ నేలపై పడిపోయి సింహాద్రి మూవీలో సింగమలై దెబ్బలకు ఎలా అదురుతూ ఉంటాడో అలా కదులుతూ ఉన్నాడు .
ఉమ్మా .......... తమ్ముడూ అని ఫ్లైయింగ్ కిస్ వదిలి చప్పట్లు కొట్టింది .
ఆఫీసర్ గాడు చూసి డోర్ వైపు పరిగెడుతూ హెల్ప్ అని కేకవేసేంతలో భారతీయుడి కమలహాసన్ లా వేళ్ళను పెనవేసి మొదట మెడపై ఆ తరువాత కడుపులో మెలితిప్పి ఆయువుపట్టుపై మోకాలితో దెబ్బవెయ్యగానే , ఎంత అరవాలనుకున్నా నోటినుండి అరుపు బయటకు రాక అసిస్టెంట్ పక్కనే పడిపోయి గిలాగిలా గింజుకుంటున్నాడు . 

ఈసారి మేడం కత్తిని కిందపడి చప్పట్లుకొట్టి పరుగునవెళ్లి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ అని ముద్దుల వర్షం కురిపించింది . 
తమ్ముడూ .......... నిమిషంలో నాకు వీళ్ళిద్దరూ కనిపించకూడదు , రెడీ 1 2 3 ........అని కౌంటింగ్ మొదలెట్టింది . 
అసిస్టెంట్ ను భుజం పై వేసుకుని బయటకువెళ్లి కారు అందులో డ్రైవర్ ఉండటం చూసి ఫైనాన్స్ రికవరీ ఆఫీసర్ కారే కదా .........
అవును సర్ అని కారు దిగాడు . 
గుడ్ డోర్ తెరవమని చెప్పి లోపల పడేసాను . మరొకడు లోపల ఉన్నాడు జరజరా లాక్కునివచ్చి కారులోవేసుకుని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లు లేకపోతే బ్రతకరు అనిచెప్పడంతో , డ్రైవర్ కూ ఆఫీసర్ పై కోపం ఉన్నట్లు రెండు దెబ్బలు వేసిమరీ లాక్కునివచ్చి కారులో వేసుకుని మంచిపనిచేశారు సర్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు .

మెయిన్ గేట్ లోపలికి వస్తుంటే ట్యూషన్ పిల్లలు భుజాలపై బ్యాగులతో మహి చేతులను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కోలాహలంతో బయటకువచ్చారు . ఇరువైపులా మహి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఒక్కరూ నావైపు చూడకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది . నన్ను గమనించి మహి చెవిలో ఏదో చెప్పడం , మహి వెలిగిపోతున్న కళ్ళతో గేట్ దగ్గర ఉన్న నన్నుచూసి అందమైన సిగ్గుతో తియ్యని నవ్వుతో మధ్యమధ్యలో నన్ను చూస్తూ పిల్లలతో మాట్లాడుతూ , నన్ను దాటుకుని బయటకువెళ్లారు . 
వెనుకే అమ్మా అమ్మా .......... అప్పుడే వెళ్లిపోవాలా ఇంకాసేపు ఉంటాము అని బుజ్జిఅక్కయ్య వయసున్న కొంతమంది పిల్లలు అక్కయ్య చేతులను పట్టుకుని నడవడం కోసం పోటీపడటం చూసి ముచ్చటేసింది . 
అక్కయ్యను కన్నార్పకుండా చూస్తూ హృదయమంతా నింపుకొని పరవశించిపోతున్నాను .
అమ్మో ........ ఇప్పటికే 8:30 అవుతోంది . మీ అమ్మావాళ్ళు కంగారుపడుతూ ఉంటారు . రేపు ఉదయమే మళ్లీ వస్తారుకదా ......... మీకు ఆకలెయ్యడం లేదా తృప్తిగా తిని అమ్మానాన్నలతో కాసేపు సరదాగా గడిపి అమ్మలను హత్తుకొని హాయిగా పడుకోండి , మా అమ్మ దగ్గర ఉంటే ఇక ఎవ్వరూ , ఆకలి కూడా గుర్తుకురాదు . మా అమ్మావాళ్ళు సీరియల్ మాయలో పడిపోయి ఉంటారు .

చూడక్కా , చెల్లీ ......... వీళ్లకు మనం అక్కర్లేదంట , వాసంతి అక్కయ్యా మహి జానకితో ఉంటే చాలు ప్రపంచాన్నే మరిచిపోతారు అని లోపలికివచ్చి అక్కయ్యను హత్తుకోవడానికి వాళ్ళూ పోటీపడటం చూసి పిల్లలు నవ్వుకుంటున్నారు . 
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అక్కయ్యా ..........పిల్లలు చెప్పినది నిజమే మీవలన రోజూ 4 సీరియళ్లు ఏ ఆటంకం లేకుండా చూస్తాము . పిల్లలకు మాకంటే మీరంటేనే ప్రాణం . ఈ సమయానికి ఇంటికివస్తారా తిని పడుకునేంతవరకూ అమ్మా నాన్న అమ్మమ్మా ............ అమ్మ అలా అమ్మ ఇలా అని సంతోషంతో ఆపకుండా చెబుతూనే ఉంటారు . మేము ఊ ......... కొట్టాలి అంతే ,
చెల్లెళ్ళూ ........... రోజూ పిల్లలను పిలుచుకునివెళ్ళేటప్పుడు ఇలా నన్ను పొగడ్తలతో ముంచెయ్యాలా ......... నాకైతే బోర్ కొడుతోంది .
మాకు ఇంకా ఇంకా ఉత్సాహం వస్తుంది అక్కయ్యా ..........., my లవ్లీ ఏంజెల్స్ ఇక మీ మేడం అమ్మను వదిలేసి అమ్మలమైన మా చేతులనూ కాసేపు పట్టుకోండి అని ప్రేమతో అడిగారు .
సీరియళ్లు అన్నీ అయిపోయాక మేము గుర్తుకువస్తాము మీకు అందుకే మా మేడం అమ్మతోనే అమ్మచేతులను పట్టుకునే ఇంటికివస్తాము . భోజనం చెయ్యాలి కాబట్టి ఇంటికివస్తున్నాము లేకపోతే ఇక్కడే మా అమ్మతో ఉండిపోయేవాళ్ళము అని నన్ను దాటుకుని అందరూ బయటకువెళుతోంటే , అక్కయ్య పరిమళాన్ని ఆస్వాదిస్తూ నన్ను నేను మైమరిచిపోయాను . 
సరిగ్గా నన్ను దాటే సమయంలో అక్కయ్య జలదరించి హృదయం పై చేతినివేసుకొని చుట్టుచూస్తుండటం చూసి నా ప్రెజెన్స్ అక్కయ్యకు తెలుస్తోందని మరింత పరవశించిపోయాను .
అంటీ .......... సాయంత్రం నుండీ చూస్తున్నాను ఏదో కొత్తగా ప్రవర్తిస్తున్నారు , కొత్తగా అంటే మీ ముఖంలో ఏదో ఆనందం వెలుగు ......... నాకు సరిగ్గా చెప్పడం రావడం లేదు ఆ ఆ ........ ఎప్పుడూ లేని ఉత్సాహం ధైర్యం........ ఇంకా ఇంకా . మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ఆనందం వేస్తోంది . మీరు ఇలానే ఉండాలి అంటీ అని లావణ్య అక్కయ్యను ఆనందబాస్పాలతో కౌగిలించుకుంది .
అవును లావణ్య ......... తమ్ముడి వల్ల కాకపోతే ఈ ఆనందం ఎలా కలుగుతుంది అని పెదాలను మాత్రమే కదపడం తెలిసి అక్కడికక్కడే ఎగిరి గెంతులెయ్యాలనిపించింది. 
నాకూ నాకూ నాకు కూడా అలానే అనిపిస్తోంది అమ్మా .......... మీ ఆనందం చూస్తుంటే , అందుకే మరికాసేపు మా అమ్మతోనే ఉండిపోవాలని ఉంది మీరేమో బయటకు తోసేస్తున్నారు అని ముద్దుముద్దుమాటలతో ఫీల్ అవుతుంటే , 
అక్కయ్య మోకాళ్లపై కూర్చుని నోటి నుండి మాటలు రాక సంతోషంతో పిల్లలను మనసారా గుండెలపై హత్తుకొని , ఇప్పటికిగానీ మీరు మీ అమ్మలతో ఇంటికివెల్లకపోతే మీ నాన్నలూ మరియు ఇంట్లో ఉన్నవాళ్ళంతా నాపై దండయాత్రకు వచ్చేస్తారు అని పిల్లలతోపాటు నవ్వుకుని వాళ్ళ వాళ్ళ అమ్మలకు పిల్లలను అందించి గుడ్ నైట్స్ అందుకొని , మిగతా ఇద్దరిచేతులను పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్లి కొద్దిదూరంలో ఉన్న చిన్న అపార్ట్మెంట్ వరకూ వదిలి , వాళ్ళు చేతులతో సైగచెయ్యడంతో వొంగగానే ఇద్దరూ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్లలేక వెళ్లడం చూసి ఆనందం రెట్టింపైంది .
ఆ మాటలను వింటూ , అక్కపై పిల్లలు చూపించే ప్రేమకు నా కాళ్ళు భూమిపై నిలువనీయడం లేదు . పిల్లల ముద్దులకు మురిసిపోతూ వస్తున్న అక్కయ్యను అలా చూస్తూ ఉండిపోయాను . 

అంటీ , మహి , జానకి డార్లింగ్ అండ్ హీరో మహేష్ .......... మేముకూడా వెళ్లి ఉదయమే వస్తాము అని కౌగిలింతలతో , ముద్దులతో ముంచెత్తి మహి నావైపే తియ్యదనంతో చూస్తుంటే ఒసేయ్ ......... మేంఉన్నాము కదా లోపలికివెళ్లి అంటీ పిల్లలకు వడ్డించు , ముందు అంటీ కడుపునిండా తిన్నాకే నువ్వు తినాలి సరేనా వెళ్లు అదిగో మెమెందుకు ఉన్నాము వెల్లూ .......... అని ఇంటివరకూ తోసుకుంటూ వెళ్లి వదిలారు . మెయిన్ డోర్ దగ్గరవరకూ వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ కళ్ళల్లో చెమ్మతో వెళ్ళిపోయింది .
హలో బ్రదర్ ........ పై పోర్షన్ లోకి చేరినట్లేనా అని లావణ్య అడగడంతో ,
షాక్ లో అలా తనవైపే చూస్తుండిపోయాను .
లావణ్య మిగతా ముగ్గురూ నవ్వుకుని అవును ఈ క్షణం నుండి మీరు మాకు బ్రదర్ తో సమానం ............మా నలుగురి ప్రాణమైన దేవకన్యకోసం త్యాగం చెయ్యాల్సివచ్చింది . ఇక నువ్వు తనకు మాత్రమే సొంతం ....... ఆ విషయం మేముచేప్పకూడదు గుడ్ నైట్ బ్రదర్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది ఇక ఇక్కడే ఉంటారు కదా .......... గుడ్ నైట్ ......... ఇలా ఉంటే వదులుకోవడం కాస్త కష్టమే ఎవరు ఎవరు మిమ్మల్ని ఇలా ఉండమన్నారు అని నలుగురూ చిలిపినవ్వులతో ఎవరికో sorry చెబుతున్నట్లు కళ్ళుమూసుకుని ప్రార్థించి ఒకేసారి నలుగురూ ఏకమయ్యేలా హత్తుకొని వదిలి ఇప్పుడు హ్యాపీ ఇక నెక్స్ట్ మినిట్ నుండి you are our బ్రదర్ బై బై .......... అని నవ్వుకుంటూ దగ్గరలోని అపార్ట్మెంట్ మరియు ఇళ్లలోకి వెళ్లిపోయారు .
Like Reply
లావణ్య మాటలేవీ నాకు లెక్కలేదు . ఇప్పుడు నా ముందున్న ఏకైక కోరిక నా జీవిత గమ్యం మా ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్య అంతే అని పెదాలపైచిరునవ్వుతో బుజ్జిఅక్కయ్యా ......... అని రాదా మేడం ఇంటి డోర్ దగ్గరికివెళ్ళాను .
మహేష్ ......... లోపలికి రావచ్చు అని వినిపించడంతో , మరొక షాక్ తో లోపలికివెళ్ళాను . నాతోపాటు బుజ్జిఅక్కయ్య కూడా షాక్ లో ఆమెను చూస్తోంది . 
నాకెలా తెలుసు అనుకుంటున్నారా ..........నేను కంగారుపడుతుండటం చూసి వెంటనే బుజ్జిఅక్కయ్యతోపాటు లేచివెళ్లి డోర్ వేసేసి , అయితే నువ్వే మా అందరి ప్రాణమైన వాసంతి , వాసంతి ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడు మహేష్ .......... దేవుడా ఇప్పటికి కరుణించావా తండ్రీ ........ ఇక మా వాసంతి బాదలన్నీ తీరిపోయినట్లే ......., మా బుజ్జివాసంతి పేరు తెలుసుకున్నప్పుడు ఇంత డౌట్ - వాసంతి గురించి చెబుతుంటే మీ ఉత్కంఠ , సంతోషం , కళ్ళల్లో ఆనందబాస్పాలు చివరగా కన్నీళ్లు నాకంటే ఎక్కువ కారుస్తుంటే సగం - ఇక నన్ను రక్షించే ముందు బుజ్జివాసంతి మా వాసంతిని అక్కయ్య అని పిలిచినప్పుడు మూడవ వంతు - ఇప్పుడు నువ్వు కంగారుపడుతున్నావంటే నువ్వే మహేష్......... అని 100% నమ్మకం వచ్చేసింది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు .

అంటీ ...........
అర్థమైంది బుజ్జివాసంతిగారూ ............ ఆ ఎందుకు అని తెలుసుకునేంతవరకూ నేనెవ్వరికీ చెప్పను . నేను చెప్పడం ఏంటి అప్పుడే వాసంతికి తన తమ్ముడు దగ్గరలోనే ఉన్నాడని అర్థమైపోయి ఉంటుంది . తన మనసు ఎప్పుడో చెప్పేసి ఉంటుంది .........
బుజ్జిఅక్కయ్యా ........... yes అనిచెప్పాను . 
తమ్ముడూ ......... అంటూ నా గుండెలపైకి చేరింది . అవును అక్కయ్యా........... మనం ఇక్కడ అడ్డుపెట్టినప్పటి నుండీ ఆక్కయ్యలో సంతోషమైన మార్పుని గమనించామని మహి ఫ్రెండ్స్ అక్కయ్యకు తెలిపితే పెదాలపై తమ్ముడూ అని తలుచుకుంది . నావైపు అడుగులుపడుతున్నకొద్దీ ఆ ఆనందం మరింత పెరుగుతూ గుండెలపై చేతినివేసుకొని మురిసిపోతున్నారు . నాకైతే గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది అని బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులవర్షం కురిపిస్తుంటే , లవ్ యు తమ్ముడూ అని గట్టిగా కౌగిలించుకుంది .

మహేష్ ...........
అంటీ మనోజ్ అని పిలవండి , నేనే తమ్ముడి పేరు మనోజ్ అనిపెట్టాను .
ఉమ్మా ........... " మహేష్ అని పెద్ద వాసంతి - మనోజ్ అని బుజ్జివాసంతి " ఇద్దరి ప్రాణమైన ఒకే తమ్ముడికి నామకరణం చేసారన్నమాట ...........
మహే........... అయ్యో అంటూ చెంపపై కొట్టుకుని మనోజ్ మాబుజ్జివాసంతి కోసం మ్యాగీ చేసాను , తమ్ముడికి తినిపించకుండా నేను తినను అంటీ అనిచెప్పింది . బుజ్జివాసంతి నిజంగా బంగారమే అని దిష్టి తీసి లోపలికివెళ్లి రెండు గిన్నెలలో తీసుకొచ్చి , మనోజ్ ..........ఇప్పటికీ తినిపించాల్సిందేనా .........
Yes అంటీ ...........
లవ్లీ లవ్లీ ..........అంటూ ఒకే బౌల్ లోకి వేసేసి మనోజ్ వచ్చి సోఫాలో కూర్చోండి అని ముసిముసినవ్వులతో చెప్పారు .
బుజ్జిఅక్కయ్య కోసం ఇద్దరమూ కూర్చున్నాము . అంటీ ఇటు ఇవ్వండి అని అందుకొని నాకు తినిపించి తానూ తినింది . మనోజ్ అతిత్వరలోనే మీ ఇద్దరికీ మీ ప్రాణమైన అక్కయ్య తినిపిస్తుంటే చూడాలని ఉంది . ఆ సంతోషాన్ని ఆస్వాదించడం కోసం నేను మీకు ఎటువంటి సహాయాన్నైనా చేస్తాను . 

అంటీ అంటీ .......... అని పిలుపు వినిపించడంతో , 
మనోజ్ , బుజ్జివాసంతి ........... మహి వచ్చింది అనివెల్లి తలుపుతెరిచింది అంటీ. 
అంటీ .......... అప్పుడే తినేసి నిద్రపోతున్నా...........రా ......... అంటూ మమ్మల్ని చూసి సిగ్గుపడిపోయి , అంటీ అంటీ ........ అమ్మ స్పెషల్ గోబీ వండింది అనిచెప్పగానే,
ఇద్దరమూ ............ ఆ పాత్ర వైపు ఆశతో పెదాలను తడుముకుంటూ చూస్తుండటం చూసి , అంటీ నవ్వుకుని ........... మహి మన పై పోర్షన్ లో కొత్తగా దిగబోయేవారిని పరిచయం చేస్తానురా అని చెయ్యి అందుకొని పిలుచుకొనివచ్చి , ఇతను మ ........ మా ......... మనోజ్ , ఇక ఈ బుజ్జి ఏంజెల్ పేరు చెబితే ఇక్కడే ఎగిరిగేంతేస్తావు ఇద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ చెప్పుకో చూద్దాము అని అడిగింది . 
ఇక్కడ ఉన్నది ఇద్దరే ఇద్దరు మా అమ్మ వాసంతి మరియు మా అమ్మమ్మ చెల్లి జానకి .............. ,వాసంతి .........
Yes yes ........... మహి ఈ బుజ్జి ఏంజెల్ పేరు వాసంతి వాళ్ళ........... అదే మీ అమ్మ పేరే .........
బుజ్జిఅమ్మ అన్నమాట అనగానే బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేసాయి.
పాపా .......... ఏమైనా తప్పుగా మాట్లాడానా ..........అని బాధపడుతూ అడిగింది .
మహీ తల్లీ ......... అవి ఆనందబాస్పాలురా , 
అవునన్నట్లు బుజ్జిఅక్కయ్య తల ఊపి నావైపు చూసి పరవశించిపోతోంది . 
అయితే నిన్ను బుజ్జిఅమ్మ అని పిలవడం నీకిష్టమేనా .............
అంతకంటే అదృష్టమా అన్నట్లు ఎత్తుకోమని చేతులను చాపింది . 
లవ్ టు బుజ్జిఅమ్మా .......... అని ఆప్యాయతతో ఎత్తుకుని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి, బుజ్జిఅమ్మా ........... మిమ్మల్ని ఎక్కడో చూసాను . ఆ ఆ ......... గుర్తుకువచ్చింది ఈరోజు లంచ్ టైం లో నాచేత ముద్ద తినింది . ఎంత అదృష్టం నాదీ మా బుజ్జిఅమ్మకు తినిపించాను . మా అమ్మ అదే మీ పెద్ద అక్కయ్య .........
అంతే మళ్లీ బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలు ..........
బుజ్జిఅమ్మా .......... ఆనందబాస్పాలే కదా , మీరు బుజ్జిఅమ్మవు అయితే అమ్మ మీకు అక్కయ్యే కదా అయ్యేది అని నుదుటిపై ముద్దుపెట్టి , ఎందుకో కలిసింది ఇప్పుడే అయినా మీ కళ్ళల్లో కన్నీళ్లను చూస్తే మా అమ్మ కన్నీళ్లే గుర్తుకువచ్చి ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను , ఒక్కసారి ఓకేఒక్కసారి నవ్వవా ప్లీస్ అని ప్రేమతో అడగడం ఆలస్యం .
లవ్ యు మహి ........... అని తియ్యని నవ్వుతో మహి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
బుజ్జిఅమ్మా .......... అచ్చు అమ్మలానే పిలిచావు , ఇకనుండి కూడా మహి అనే పిలవాలి , లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని అంతే ఘాడమైన ముద్దుపెట్టి మురిసిపోయింది .

మహి ......... నువ్వు తిన్నావా ? 
ఇంకా లేదు బుజ్జిఅమ్మా , అంటీకి గోబీ ఇచ్చివేళదామని వచ్చాను .
నాకూ ఆకలివేస్తోంది మహి ...........
బుజ్జిఅమ్మా .......... అన్నం చారు గోబీ మాత్రమే అని తలదించుకునిచెప్పింది .
చారు అన్నం అంటే నాకు ప్రాణం మహి ........
ఉమ్మా ..........  నాతోపాటు మాఇంటికివస్తావా , నాచేతులతో తినిపిస్తాను .
మా పెద్ద అక్కయ్య కూడా తినిపిస్తేనే వస్తాను . 
మిమ్మల్ని కానీ మీ అక్కయ్య చూసిందంటే , కాలు నేలపై పెట్టనీకుండా ప్రాణంలా చూసుకుంటుంది , తినిపిస్తుంది అని బుగ్గను కొరికేసింది మహి . అంటీ ........ సరిగ్గా చూడండి మా బుజ్జిఅమ్మ తన అక్కయ్యాలానే లేదూ ..........
నాకూ అలానే అనిపించింది మహీ , మీ అమ్మకూడా అలా ఫీల్ అయితే అప్పుడు నమ్ముతాను పదా తొందరగా వెళదాము అని ఆతృత చూపింది .
మహి ఒక్కనిమిషం ఆ గోబీ పాత్ర ఇటు ఇవ్వు అని నా ఎదురుగా టేబుల్ పై ఉంచి ఒకటి అందుకొని నాకు తినిపించి ఇక అక్కయ్య చేతి గోబీ ఎంజాయ్ చెయ్యి తమ్ముడూ , నేను ఏకంగా మన అక్కయ్య దగ్గరికివెళ్లి అక్కయ్య చేతితో తింటాను అని అంతులేని ఆనందంతో నా బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టింది . 
అక్కయ్య చేతిముద్ద తియ్యదనాన్ని మాటల్లో వర్ణించలేము బుజ్జిఅక్కయ్య ఎంజాయ్ అని ఇద్దరమే గుసగుసలాడి గుండెలపై హత్తుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . 
మహి ఎత్తుకో అని చేతులను చాపింది బుజ్జిఅక్కయ్య . 
నాకళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ అందమైన నవ్వు నవ్వి, బుజ్జిఅక్కయ్యను అందుకొని గుండెలపై ప్రాణంలా హత్తుకుంది . బుజ్జిఅక్కయ్యతో మాట్లాడుతూ డోర్ దాటి వెళ్లేంతవరకూ రెండుమూడుసార్లు నావైపు ఆరాధనతో చూడటం బట్టి లావణ్య వాళ్ళు మహికోసమే త్యాగం చేసారన్నమాట అని అర్థమైపోయింది . మహి నువ్వంటే నాకు ప్రాణం కానీ నేను వచ్చినది మా అక్కయ్య అదే మీ అమ్మకోసం నన్ను క్షమించు అని మనసులో అనుకున్నాను .
మ మ ....... మనోజ్ అంటూ గోబీ వైపు సైగచేసి ఎంజాయ్ అనిచెప్పి మహి వెనుకాలే వెళ్ళిపోయింది . 

వెంటనే మొబైల్ తీసి మా ప్రాణమైన అక్కయ్య చేసిన గోబీని ఫోటోతీసి చెల్లికి పంపించాను . పెదాలపై చిరునవ్వుతో మొబైల్ ప్రక్కన పెట్టేసి సంతోషంలో వణుకుతున్న చేతులతో దేవత ప్రసాదంలా అతీసున్నితంగా అందుకొని నా పై ఉంచుకుని , అక్కయ్యను కళ్ళల్లో నింపుకొని గోబీ అందుకొని తిని మ్మ్మ్మ్మ్......... లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అంటూ ఆత్రం పట్టలేక క్షణాల్లో నోటిలో బుక్కుకున్నాను . మనసారా అక్కయ్య వండిన గోబీతోనే కడుపు నింపుకున్నాను .

రాధ మేడం వెనక్కు పరుగునవచ్చి మహేష్ మహేష్ ......... ముఖ్యమైన విషయం చెప్పనేలేదు . నిన్ను ఎలాగో ఇక కలవలెనేమో అనేమో నిన్నే స్వయంగా తన కడుపున కని నీపేరే పెట్టుకుంది మహేష్ . నువ్వు ఎలాగైతే మీ చెల్లెలి కూతురికి వాసంతి అని పెరుపెట్టుకుని బుజ్జిఅక్కయ్య అని ప్రాణంలా పిలుచుకుంటారో , same to same అలానే మీ అక్కయ్య బుజ్జిమహేష్ ను తన ప్రాణం కంటే ఎక్కువైన పిలుపు - తమ్ముడూ అని పిలుచుకుంటూ ఏదో కొంత సంతృప్తి చెందుతోంది . మహి , జానకి వాళ్ళు పుట్టిన బిడ్డదగ్గరకువెళ్లి తమ్ముడూ అని పిలవకముందే , తల్లులూ ......... మీరు తమ్ముడూ అనికానీ , మహేష్ అనికానీ పిలవరాదు ........ ఏమని పిలవమని చెప్పిందో తెలుసా మహేష్ ...........
మామయ్యా .............
అవును మహేష్ మావయ్యా ........ అని పిలవాలని , మనముగ్గురమూ ఎన్ని కష్టాలనూ , ఎన్ని బాధలనూ అనుభవించినా నా తమ్ముడు మీ మావయ్యను మాత్రం సంతోషన్గా ఉంచేలా చూసుకుంటామని మాట ఇవ్వండి అని ప్రామిస్ కూడా చేయించుకుంది . 
కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు అక్కయ్యా ......... , అంత ప్రాణమైన నన్నువదిలి ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావు . మన ఊరికి ఒక్కసారి వచ్చి ఉంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఏ కష్టం లేకుండా చూసుకునేవాళ్ళము . ఊరంతా మిమ్మల్నే తమ దేవతగా చూసుకునేవారు . మన అమ్మవారు తన ఆలయంలో మీ అడుగుల సవ్వడికే పులకించిపోయేవారు అని గుండెలపై చేతినివేసుకుని అక్కయ్య గురించే ఆలోచిస్తూ కళ్ళుమూసుకున్నాను .
మహేష్ అటువైపు ఆనందాలను నా కళ్లతో వీక్షిస్తేనే నాకు తృప్తి అంటూ పరుగున వెళ్లిపోయారు .

మహి ....... బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకొని ముద్దుచేస్తూ ఇంట్లోకివెళ్లి చెల్లీ , మావయ్యా .......... అని పిలిచి , బుజ్జిఅమ్మా .......చెల్లి జానకి , మహేష్ మావయ్య ...... అమ్మ మమ్మల్ని అలానే పిలవమని కోరింది . అమ్మ మాత్రం తమ్ముడూ అని ప్రాణంలా పిలుస్తుంది తనను అక్కయ్యా అని అంతే ప్రాణంలా పిలిస్తేనే పలుకుతుంది.
బుజ్జిఅక్కయ్య సంతోషంతో రాధమేడం వైపు చూడటం , ఆమె ఆనందబాస్పాలతో అవునని సైగచెయ్యడంతో , బుజ్జిఅక్కయ్య కళ్ళల్లోకూడా ఆనందబాస్పాలు కారడం ఎవరికీ కనిపించకుండా వెంటనే తుడిచేసుకుంది . 
మహి........ అయితే నేనుకూడా జానకి , తమ్ముడూ అనే పిలుస్తాను . 
నీ ఇష్టం బుజ్జిఅమ్మా ...........చెల్లీ మనకు బుజ్జిఅమ్మ కాబట్టి మావయ్యకు బుజ్జిఅక్కయ్య అని పరిచయం చేసింది .
జానకి : బుజ్జిఅమ్మ ............ ఆ పిలుపే ఎంత తియ్యగా ఉంది . అక్కయ్యా ......... బుజ్జిఅమ్మా same to same అమ్మలానే లేదూ ......... 
మహి : అవును చెల్లీ ......... అందుకేనేమో బుజ్జిఅమ్మా అని నా నోటిలోనుండి నాకు తెలియకుండానే వచ్చేసింది . అమ్మకు తన ట్విన్ సిస్టర్ ను చూపిద్దామని తీసుకొచ్చాను .
జానకి లోపలికి పరిగెత్తి పాత ఆల్బమ్ తీసుకొచ్చి మా అక్కయ్య చిన్నప్పటి ఫోటోను తీసి అక్కయ్యా ...........ఈ ఫోటో చూడు అమ్మ , బుజ్జిఅమ్మ వయసున్నప్పటి ఫోటో అని చూపించింది . 
బుజ్జిఅక్కయ్యనూ , బుజ్జిఅక్కయ్య వయసున్నప్పటి అక్కయ్య ఫోటోని ప్రక్కప్రక్కనే ఉంచి అందరూ ఆశ్చర్యంతో షాక్ లో అలా కదలకుండా ఉండిపోయి , అచ్చుగుద్దినట్లు అమ్మలానే ఉంది మా బుజ్జిఅమ్మ అని ముద్దులతో ముంచెత్తి ప్రాణంలా హత్తుకొని మురిసిపోతున్నారు .

తమ్ముడూ , తల్లులూ ......... ఇదొగో గోబీ వెయ్యడం దాదాపు పూర్తయిపోయింది . 5 నిమిషాలలో మీకు వడ్డిస్తాను కూర్చోండి అని అక్కయ్య ప్రేమతో చెప్పింది . 
అలాగే అక్కయ్యా , అమ్మా ......... అని బదులిచ్చి , అక్కయ్యా ........అమ్మను బుజ్జిఅమ్మనూ ఎలా కలపాలో ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది అని అందరికీ చిన్నగా చెప్పింది .
సూపర్ చెల్లీ అని బుజ్జిఅక్కయ్యను రూంలోకి తీసుకెళ్లి ఫొటోలో ఉన్నట్లుగా చకచకా అలంకరించి , జానకికి అందించి ఆల్బమ్ ఒకచేతితోపట్టుకుని మహి , బుజ్జిమహేష్ , రాధ మేడం ఒకరిచేతులను మరొకరుపట్టుకుని వంటింట్లోకి అడుగులువేశారు , వాళ్ళ వెనుకే దాచుకుని బుజ్జిఅక్కయ్యను ముద్దుచేస్తూ లోపలికివెళ్లింది జానకి .

అమ్మా ......... గోబీ వెయ్యడం అయ్యిందా , ఇంకా ఉంటే నేనువేస్తాను కానీ ముందు స్టవ్ ఆఫ్ చెయ్యమని మహినే ఆఫ్ చేసింది . 
ఏంటి తల్లీ అంత సంతోషంతో ఉన్నారు నా దిష్టి నే తగిలేలా ఉంది నా అందాలరాసి మహికి అని కాటుక చుక్కను పెట్టింది . 
మహి : అమ్మా .......... మీకెప్పుడూ నేను అందంగానే కనిపిస్తాను , ఏ తల్లికైనా తన కూతురు అందంగా కనిపిస్తుంది  .
మహీ......... విశ్వసుందరి పోటీలకు కానీ నిన్ను పంపించి ఉంటే విశ్వకిరీటం చేజిక్కించుకునే అందం , తెలివి , నిజాయితీ ఉంది తల్లీ నీకు అని రాధ మేడం కూడా చెప్పడంతో సిగ్గుతో పోండి అంటీ అని ఆమె గుండెలపై వాలిపోయింది .
అక్కయ్య : దివి నుండి దిగివచ్చిన దేవకన్యవిరా నువ్వు అని మహి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , తల్లీ గోబీ చెయ్యడం పూర్తయ్యింది తిందామా అని అడిగింది .

అమ్మా .......... తినేముందు అద్భుతమైన మా అమ్మ కూడా ఆశ్చర్యపోయేలా ఒక మ్యాజిక్ చేస్తాను అని మహి కోరింది .
నా బంగారు తల్లి కోరిక నేనిప్పుడు కాదన్నాను . అయినా నా తల్లి తన తల్లి బాధపడే ఖరీదైన కోరికలు ఎప్పుడూ కోరలేదు .
లవ్ యు మా .......... అని గుండెలపై హత్తుకుంది . ఆల్బమ్ తెరిచి అక్కయ్య బుజ్జి ఫోటోను చూపించగానే , అక్కయ్య పెదాలపై తియ్యని చిరునవ్వు చిగురించింది . 
మహి :  అమ్మా ......... బుజ్జాయిలా ఎంత ముద్దొస్తున్నారో , ఇప్పటికీ అంతే ముద్దొస్తున్నారనుకోండి అని బుగ్గపై ముద్దుపెట్టింది . 
పో తల్లీ ......... అని అక్కయ్య సిగ్గుపడుతోంది . 
 మహి : అమ్మా ....... సిగ్గుపడుతోంటే మరింత అందంగా , సెక్సీగా ఉన్నారు . 
అవును అని బుజ్జిఅక్కయ్య జానకితోపాటు నవ్వుకున్నారు .
తల్లీ ........ నిన్నూ , మ్యాజిక్ అని నన్ను పొగడ్తలతో ముంచేస్తున్నావు అని మరింత సిగ్గుపడుతోంది అక్కయ్య .

సరే సరే మ్యాజిక్ .......... అమ్మా మిమ్మల్ని ఈ ఫొటోలో ఉన్నట్లుగా మార్చేస్తాము . 
 అక్కయ్య : తల్లీ , రాధ అక్కయ్యా ......... మీరుకూడానా , 
 రాధ మేడం : నేను నమ్ముతున్నాను వాసంతి ...........
మహి : అమ్మా .......... please please please ......... ఒక్కసారి ఓకేఒక్కసారి ఫోటోని కనులారా వీక్షించి మనసంతా నింపుకుని , దీర్ఘమైన శ్వాసను పీలుస్తూ వదలండి  .
అక్కయ్య : సరే సరే ..........అని కొన్నిక్షణాలపాటు తన బుజ్జాయి ఫోటోను పెదాలపై నవ్వుతో వీక్షించి కళ్ళుమూసుకుని మహి చెప్పినట్లే చేసింది .
భూమ్ భూమ్ అబ్రకదబ్రా చెట్టుకింద దెయ్యం నీకేమి భయ్యం............ అని అందరికీ నవ్వు వచ్చేలా మంత్రాలు బోలెడన్ని చదివి , అమ్మా .......... నేను తెరవమని చెప్పినప్పుడు మాత్రమే కళ్ళుతెరవాలి సరేనా .......... not yet not yet అంటూనే ముందు ఉన్న ముగ్గురూ తప్పుకుని బుజ్జిఅక్కయ్యను మహి రాధమేడం అక్కయ్య కళ్ళుతెరువగానే కనిపించేలా ఎత్తుకున్నారు . 
అమ్మా ......... రెడీ 3 2 1 ......... నెమ్మదిగా కళ్ళుతెరిచి చూడండి అని అక్కయ్య రియాక్షన్ కోసం ఉత్కంఠతో కన్నార్పకుండా చూస్తున్నారు అందరూ .

అక్కయ్య ముసిముసినవ్వులతో తల్లీ నిన్ను నమ్మి కళ్ళుతెరుస్తున్నాను అని నెమ్మదిగా తెరిచి ఎదురుగా బుజ్జిఅక్కయ్యను చూసి సంభ్రమాశ్చర్యంతో షాక్ లో కన్నార్పకుండా కదలకుండా ఉండిపోయారు . 
అందరూ సంతోషంతో నవ్వుతూ అమ్మా , అమ్మా , అక్కయ్యా , వాసంతి అని కదిల్చారు .
షాక్ కొట్టినట్లుగా తేరుకుని మైండ్ బ్లోయింగ్ మహీ నమ్మలేకపోతున్నాను . ఎవరు పాప అచ్చు నా పసివయసులో నేనెలా ఉన్నానో అలానే ఉంది అని ఆతృతతో ఎత్తుకొనివెల్లి అద్దం ముందు నిలబడి అయ్యో .......... అంటూ బుజ్జిఅక్కయ్యను ముద్దుచేస్తూ పరవశించిపోతోంది అక్కయ్య . ( ఎందుకు ఉండదూ ........ మా బుజ్జిఅక్కయ్య చెల్లికడుపులో పడిన క్షణం నుండీ అక్కయ్యనే నా కడుపున పుట్టాలి - అక్కయ్యలానే ఉండాలి అని 6 నెలలూ అక్కయ్యనే తలుచుకుంటూ అక్కయ్య ఫోటోని చూస్తూ బుజ్జిఅక్కయ్యకు చూపిస్తూ అమ్మవారిని ప్రార్థించింది కదా )
ఇక బుజ్జిఅక్కయ్య అయితే తొలిసారి అక్కయ్య ఎత్తుకున్న ఆనందంలో కన్నార్పకుండా అక్కయ్యనే చూస్తూ కళ్ళల్లో చెమ్మ చేరినవెంటనే తుడుచుకుని , మిమ్మ......ల్ని అక్కయ్యా .......... అని ప్రాణం.....లా పిలి......చి అంతకంటే ప్రాణం.......లా ముద్దు....పెట్టొ....చ్చా అని పారవశ్యంలో తడబడుతూ అడిగింది .
ఆ మాటలు , బుజ్జిఅక్కయ్య వైబ్రేషన్స్ నేరుగా హృదయాన్ని చేరినట్లు , అక్కడి నుండే ఆనందబాస్పాలు కళ్ళల్లోకి చేరి , తనకు తెలియకుండానే నోటిలోనుండి చెల్లీ అన్న ప్రాణమైన పిలుపు మరియు బుగ్గపై తియ్యని ముద్దు గుర్తు పడిపోయింది .
 బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........... అని హృదయం నుండి తన్నుకొస్తున్న ప్రేమతో ప్రాణంలా పిలిచి బుగ్గపై అంతకంటే ప్రాణంలా ముద్దుపెట్టి , కళ్ళల్లో చెమ్మతో ఏకమయ్యేలా గుండెలపై వాలిపోయి , అక్కయ్యా .......... నాకు నిమిషం , 10 నిమిషాలు , అర గంట , గంటసేపు , రోజు , వారం , నెలరోజులు , సంవత్సరం , 10 సంవత్సరాలు ......... మీకు ఇష్టమైతే జీవితాంతం ఇలాగే మా అక్కయ్య గుండెలపై ఉండిపోవాలని ఉంది అని కోరిక కోరింది.
ఆ క్షణంలో అక్కయ్యకు కూడా అలానే అనిపించినట్లు బుజ్జిచెల్లీ ......... ఆ అదృష్టం నాది అని రెండుచేతులతో ప్రాణంలా హత్తుకుంది .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అక్కయ్యా .........., మీరు భోజనం చెయ్యండి నేను ఇలానే హత్తుకొని ఎంజాయ్ చేస్తాను అనిచెప్పింది .
ఊహూ ........... మా బుజ్జిచెల్లి తింటేనే నేనూ , మేమంతా తినేది . 
ఈ మాటకోసమే ఎదురుచూస్తున్నాను అక్కయ్యా ........... మహి , మన అమ్మ జానకి, మన ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడు మహేష్ తో కలిసి తినే క్షణం కోసం నేను భూమిపై పడిన క్షణం నుండీ ఎదురుచూస్తున్నాను అక్కయ్యా ..........

తమ్ముడూ , జానకి అమ్మ.......... అని మురిసిపోతూ బుజ్జిఅక్కయ్య ముఖమంతా ముద్దుల వర్షం కురిపించి అక్కయ్య ఆలోచనలో పడేలోపు , 
  వాసంతి ............ నీ బుజ్జిచెల్లి పేరు ఏంటో తెలుసా ..........అని రాధమేడం అడిగారు .
ఇంకెవరి పేరు అక్కయ్యా ....... నా పేరే అయి ఉంటుంది , నాలా ఉన్న మా బుజ్జిఅక్కయ్య పేరుకూడా వాసంతినే అయిఉంటుంది .
అందరూ చప్పట్లు కొట్టి అవునమ్మా , అక్కయ్యా ........... బుజ్జిఅమ్మ , బుజ్జిఅక్కయ్య పేరు వాసంతి అని ఇద్దరినీ అంతులేని ఆనందంతో చుట్టేసి ముద్దులవర్షం కురిపించారు . అక్కయ్య అయితే సాయంత్రం నుండీ ఎందుకో తెలియదుకానీ మనసు అతి ప్రశాంతంగా ఉండటం , ఇప్పుడు తనలాంటి బుజ్జిచెల్లిని కలవడం వల్లనేమో ఎప్పుడూ లేనంత సంతోషంతో అందరికంటే ఎక్కువ ముద్దులే పెట్టేసి , బుజ్జిఅక్కయ్యా ............ sorry ........ నిన్ను అడగకుండా ముద్దులతో ముంచేసాము ........... 
అక్కయ్యా .......... ఇంకొక్కసారి నాకు sorry చెప్పను అని మాటివ్వండి . నన్ను ముద్దులుపెట్టుకోవడమే కాదు , కోపం వస్తే తిట్టే , కొట్టే అర్హత మీకు ఉంది . నేను పుట్టినప్పటి నుండీ మా అమ్మానాన్నలు మరియు మా చెల్లి అన్నయ్య నాపై అంతులేని ప్రేమను మాత్రమే చూపించారు . ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క దెబ్బా నన్ను కొట్టలేదు తిట్టలేదు . మీరు మా మేడం అక్కయ్య కదూ ఆ రుచి ఎలాఉంటుందో నాకు పరిచయం చెయ్యాలి అని కోరిక కోరాను . 
అందరితోపాటు అక్కయ్య కూడా సంతోషంతో నవ్వుతూ మా బుజ్జిఅక్కయ్యను , మా బుజ్జిఅమ్మను , మా బుజ్జిఅక్కయ్యను .......... మేము కొట్టడమా ......... ఈ జీవితంలో జరుగదు . 
ఇప్పుడు కాదు అక్కయ్యా , మహి , అమ్మా , బుజ్జితమ్ముడూ .......... ఎప్పుడైనా నాపై కోపం వస్తే , అలా కోపం వచ్చినప్పుడు తిడతాము కొడతాము అంటేనే పై పోర్షన్ లో ఉంటాము లేకపోతే ............ అమ్మో మా అక్కయ్యను వదిలి నేను ఎక్కడికీ వెళ్ళను , please please please అక్కయ్యా ............ కొడతాను అని మాటవరసకైనా చెప్పండి చాలు , ఆకాలేస్తోంది .......... అని కడుపుపై చేతినివేసుకొని చూపించింది .
లవ్ యు ........... బుజ్జిచెల్లీ అలాగే కొడతాములే ముందు తిందాము , బుజ్జిచెల్లీ ............ నువ్వేమి తింటావో చెప్పు షాప్ దగ్గరే తీసుకొచ్చి చిటికెలో వండేస్తాను అని ప్రాణమైన ముద్దుపెట్టిచెప్పింది .

అక్కయ్యా .......... నాకు ఏమి ఇష్టమంటే , ఏమేమి ఇష్టమంటే గోబీ , అన్నం , చారు మరియు నా ఫేవరేట్ ఆవకాయ .
అంతే అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో చెల్లీ అంటూ గుండెలపై ప్రాణంలా హత్తుకుంది .
బుజ్జిఅమ్మా ........... ఉమ్మా ........ అంటూ బుజ్జిఅక్కయ్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టి, నాపై కూర్చోబెట్టుకొని తినిపిస్తాను రా అని అందుకోబోయింది .
ఊహూ ........... మా అక్కయ్య ఓడిలోనే కూర్చుని అక్కయ్య చేతితోనే తింటాను . కావాలంటే మీరు ఒక్కొక్క ముద్ద తినిపించొచ్చు , అంతకంటే పర్మిషన్ లేదు . 
బుజ్జిఅమ్మా ........... 
అంతే ఫైనల్ .......... అంటూ అక్కయ్యను గట్టిగా చుట్టేసింది . 
లవ్ యు ......... అంటూ మరొకముద్దుపెట్టి వంట పాత్రలన్నీ తీసుకొచ్చింది మహి . అక్కయ్య చేతులను కడుక్కునివచ్చి బుజ్జిఅక్కయ్యను తన ఒడిలో కూర్చోబెట్టుకొని అన్నం చారు కలిపి ముద్దపై గోబీ ఉంచి తినిపించింది .
బుజ్జిఅక్కయ్య కళ్లల్లో ఆనందబాస్పాలతో మొత్తాన్ని కిటికీలోనుండి చూసి మురిసిపోతున్న నావైపు చూసి ఎంజాయ్ చేస్తూ , అక్కయ్యా ......... మీ చేతి ముద్ద అమృతం .......... ఆ ఆ ........అంటూ మళ్లీ మళ్లీ తిని అక్కయ్యా మీరూ తినండి , గోబీ తినండి అని మ్మ్మ్మ్మ్......మ్మ్మ్......tasty అంటూ తింటోంది . మహి తినిపించబోతే .......... ముందు మా అక్కయ్య తరువాత నా కడుపులో ఎక్కడైనా ఖాళీగా ఉంటే అప్పుడు ఆలోచిస్తాను , అక్కయ్యా ........ ఇప్పుడు మీరు తినండి అని బుగ్గపై ముద్దుపెట్టి , ఇప్పుడు నాకు అని పెద్దగా నోరుతెరిచింది .
అమ్మో ........... డాల్ఫిన్ నోరు అని ప్రేమతో తినిపించి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
ఆ దృశ్యాలను చూసి హృదయం పారవశ్యంతో నిండిపోయి , లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅక్కయ్యా .........అని మురిసిపోతున్నాను .
మహి తియ్యని కోపంతో చూస్తుంటే , లవ్ యు మహి అని ఫ్లైయింగ్ కిస్ వదిలి ఆ ...... అని నోరుతెరిచింది .
కోపం మాయమై లవ్ యు బుజ్జిఅమ్మా ......... అని ప్రేమతో తినిపించి పరవశించిపోయింది మహి .
బుజ్జిఅమ్మా .......... నా ముద్ద ఎలా ఉంది ..........
మా అక్కయ్య తొలిముద్దలో సగం ...........అంతే ,
బుజ్జిఅమ్మా ..........అని బుజ్జిఅక్కయ్య చేతిని అందుకొని కొరికెయ్యబోతే , 
కమాన్ కమాన్ ......... మహి కొరుక్కుని తినెయ్యి , కావాలంటే కొట్టు అని మరొకచేతిని కూడా అందించింది . 
ఉమ్మా ఉమ్మా ......... అంటూ రెండిచేతులపై చెరొకముద్దూ పెట్టి నవ్వుకుంది .
అక్కయ్యా , అక్కయ్యా .......... మీరైనా కొడతారు కదూ అని అడిగింది .
లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ అని మళ్లీ మళ్లీ మళ్లీ వడ్డించుకొని గోబీ ఆవకాయ నంజుకుంటూ కడునిండా ప్రాణంలా తినిపించి తనూ కడుపునిండా తినడం చూసి , 
అమ్మా , వాసంతి ............ నువ్వు ఇలా కడుపునిండా తిని ఎన్నిరోజులయ్యింది , ఎన్ని నెలలయ్యింది , సంవత్సరాలయ్యింది  అని మహి సంతోషంతో వెళ్లి బుజ్జిఅక్కయ్యతోపాటు చుట్టేసింది .
బుజ్జిఅక్కయ్య ,నాకళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు . 
అవును తల్లీ మా బుజ్జిచెల్లి వల్లనే అంటూ చెయ్యి కడుక్కుని , బుజ్జిఅక్కయ్యకు నీళ్లు తాగించి చీరకొంగుతో మూతిని తుడిచి బుగ్గలను అందుకొని ఈరోజు ఎందుకో మరిచిపోలేని రోజుగా మిగిలిపోతోంది లవ్ యు sooooooo మచ్ బుజ్జిచెల్లీ అని నుదుటిపై పెదాలను తాకించి గుండెలపై ప్రాణంలా హత్తుకుంది .
Like Reply
అమ్మా ......... మాకు మీ ఆనందాన్ని ఆపాలని లేదు బుజ్జిఅమ్మతోపాటు అక్కడ కూర్చుని ఎంజాయ్ చెయ్యండి . నేను పాత్రలన్నీ శుభ్రం చేస్తాను అని బుజ్జిజానకి అమ్మ సహాయంతో అన్నింటినీ ఒకటి తరువాత మరొకటి వంటగదిలోకి తీసుకెళ్లింది మహి .
మహి .......... లవ్ యు sooooo మచ్ అని బుజ్జిఅక్కయ్య ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి , అక్కయ్యా ......... మహి ఈరోజు మాత్రమేనా లేక రోజూ .........
కాలేజ్ నుండి వచ్చిన తరువాత నన్ను ఒక్కపనీ చెయ్యనియ్యదు బుజ్జిచెల్లీ ........, నేను నవ్వితే చాలు దానికి ఆరోజంతా సంబరమే , 
ఒక్కనిమిషం అక్కయ్యా ........ అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగున వంట గదిలోకివెళ్లి మహి డౌన్ అని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి లవ్ యు soooo మచ్ అని అదేపరుగుతో వచ్చి అక్కయ్య గుండెలపై వాలిపోయింది .

బుజ్జివాసంతిగారూ ........... నేనుకూడా అప్పుడప్పుడూ సహాయం చేస్తుంటాను , మహి వచ్చి పాత్రలు తోమనా అని అడిగారు రాధమేడం . 
బుజ్జిఅక్కయ్య నవ్వుకుని ok ok అంటీ ........ మా అక్కయ్య అంటే ఎంతప్రాణమో ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కంగారుపడకండి అని తల చూపించింది .
అంటీ .......... లవ్ యు , మా సంగతి వదిలేసి ముందు ఇంటికి వచ్చిన హీరో అదే అదే గెస్ట్ సంగతి చూడండి పాపం భోజనం చేశారో లేదో . 
ఆ సంగతే మరిచిపోయాను మహీ .......... బుజ్జివాసంతిగారూ మీరు మీ అక్కయ్యతో ఎంజాయ్ చేస్తూ ఉండండి వెళ్లివస్తాను అని వడివడిగా బయటకువచ్చి కిటికీ ప్రక్కనే నిలబడి మురిసిపోతున్న నన్నుచూసి మహే........ మనోజ్ , అక్కయ్య ఫ్యామిలీని చూసి సంతోషిస్తున్నావా అని అడిగారు .

రాధమేడం ............
మ........ మనోజ్ , ఇంకా మేడం ఏంటి మేడం ......... మహిచెప్పినట్లు హీరోలా క్షణాల్లో నా ప్రాణమానాలను కాపాడావు . మనం ఫ్రెండ్స్ అయిపోయాము కదా ......., పై పోర్షన్ ఎప్పుడో మీకు ఇచ్చేసాను .......... పైన కేవలం హాల్ రూమ్ మాత్రమే ఉన్నాయి , మీరు కావాలంటే నా ఇంట్లో ఉండొచ్చు సో అంటీ అని పిలువు ఇంకా ఇష్టమైతే రాధ అని పిలువు అని ఫీల్ అవుతూ చెప్పారు . 
అంటీ మీతో కాసేపు మాట్లాడాలి . 
ఇప్పుడు హ్యాపీ ........... లోపల సోఫాలో కూర్చుని మాట్లాడుకుందాము అని పిలుచుకొనివెళ్లి వాటర్ , జ్యూస్ అందించి ఎదురుగా కూర్చున్నారు .

మా అక్కయ్య కోసం 17 సంవత్సరాలు నేను , నా ఫ్రెండ్ , నా చెల్లీ , బుజ్జిఅక్కయ్య మరియు మా ఊరి జనం.......... హైద్రాబాద్ మొత్తం వెతుకుతూనే ఉన్నాము . అయినా అక్కయ్య జాడ కనిపించలేదు . నెలరోజుల ముందు నా బుజ్జిఅక్కయ్య ..... తమ్ముడూ నెలలోపల నన్ను మా అక్కయ్య చెంతకు చేర్చు అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు . అక్కయ్యకోసం ఈ నెలమొత్తం జాబ్ కు లీవ్ పెట్టి వీధివీధి అపార్ట్మెంట్స్ గుళ్ళూ గోపురాలూ .......... ఇలా ఏవీ వదలకుండా 24/ 7 వెతుకుతున్నా రోజులు గడిచిపోతున్నాయి కానీ అక్కయ్య జాడ కనిపించలేదు . వారం ముందు మా ఊరి దైవమైన అమ్మవారిని తలుచుకుని మా అక్కయ్య ఆశించిన స్థాయికి చేరుకున్నాము , అక్కయ్య లేని జీవితం వ్యర్థం మాకు మా జీవిత గమ్యాన్ని చూపించు తల్లీ అని ప్రార్థించి నిద్రపోయానోలేదో ఒక కల వరుసగా ఎప్పుడు నిద్రపోతే అప్పుడు వచ్చేది అని కళ్ళల్లో చెమ్మతో కలమొత్తం వివరించాను . 
అంటీ కళ్ళల్లో కన్నీళ్ళతో ......... ఏ ఒక్క స్త్రీ బాధపడటం చూడలేని నువ్వు కలలో కనిపించిన కుటుంబాన్ని సంతోషపెట్టేందుకు ఇక్కడకు వచ్చావు . ఆ కుటుంబం తన కుటుంబమే అనితెలుసుకున్నావు అంతేకదా మహేష్ ...........
ఈరోజు ఉదయం ఒక అద్భుతమైన కుటుంబాన్ని కలిశాను వాళ్ళను చూస్తే దేవతలే భువిపై నివాసిస్తున్నారా అనిపించింది . నేను మా అక్కయ్యను అతిత్వరలోనే కలుస్తావు మహేష్ అని దీవించారు , బుజ్జిఅక్కయ్య కోరిక వాళ్ళ ఆశీర్వాదం వలన అక్కయ్యను చేరుకున్నాను . కానీ కలలో కనిపించిన కుటుంబమే , కష్టాలు పడుతున్న కుటుంబమే అని ఊహించలేకపోయాను .

అంటీ మీరుచెప్పినట్లు నా కల వాస్తవమేనా ..........బావగారు.........
గారు కూడానా ఆ వెధవకు , వాడివల్లనే కదా మహేష్ మీ అక్కయ్యకూ , పిల్లలకూ ఇన్ని బాధలు . ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువులకోసం రోజులో ఉదయం 6 గంటల నుండీ చూశావుకదా రాత్రి 8 , 8:30 వరకూ చిన్న బుజ్జాయిల దగ్గర నుండీ ఇంటర్ అమ్మాయిలవరకూ రెస్ట్ తీసుకోకుండా ట్యూషన్స్ చెబుతూ నెలంతా కష్టపడి దాచుకున్న డబ్బంతా ఒకరోజు దొంగలా వచ్చి దోచుకునివెళ్లిపోతాడు వాడు , వాడూ ఒక మనిషేనా ..........., మీ అక్కయ్యకు తోడు అవసరమే లేదు కానీ పిల్లలకోసం , నాకోసం ఇక్కడే ఉంటూ కష్టాలను అనుభవిస్తూనే ఉంది . 
నెలనెలా ...........నాకుమాత్రం రెంట్ పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తుంది . నేను అక్కడితో ఆగుతానా ఆ డబ్బుకు మా ఆయన పంపించిన డబ్బుకూడా నా ఖర్చులకు పోనూ add చేసి , వద్దన్నా మహి చేతిలో పెడతాను . నేను మా చెల్లితో రెంట్ తీసుకుంటానా వాళ్ళు ఇక్కడ ఉంటారు అని హృదయాన్ని చూపించారు . రెండురోజుల ముందు ఫీజ్ కడితేనే స్కూల్ కు రండి అని ఇంటికి పంపించడమే కాక వాసంతికి కాల్ చేసి రెండు నెలలుగా ఫీజ్ కట్టలేదు , డబ్బు లేనివాళ్లకు ప్రైవేట్ స్కూల్ ఎందుకు govt స్కూల్లో పడేయొచ్చు కదా పైసా ఖర్చు ఉండదు అని మరింత బాధపెట్టారు.

ఈరోజు మహిని కూడా క్లాస్ లకు allow చెయ్యలేదని లావణ్య ....... మహి క్లోజ్ ఫ్రెండ్ చెప్పి బాధపడింది . మహికి నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఏరియా లోనే ఉంటున్నారు . ఒకరికి ఒకరంటే చాలా చాలా ఇష్టం సిస్టర్స్ లా ఉంటారు . 10th క్లాస్ నుండీ ఫ్రెండ్స్ . మరొక విషయం మహేష్ ........ మహి ఆ నలుగురి ఫ్రెండ్స్ కంటే మూడేళ్లు చిన్నది . మహి చదువులో ఎప్పుడూ నెంబర్ వన్ 7th క్లాస్లోనే 10 th పూర్తిచేసింది . అప్పటి నుండీ ఒకే కాలేజ్ ..........

అంటీ .......... అక్కయ్య ఇక్కడికి ఎప్పుడు వచ్చింది అని అడిగాను .
నాకు తెలిసి పెళ్ళైన కొన్నిరోజులకే వచ్చింది మహేష్ ..........
అంటీ .......... అక్కయ్య గురించి మొత్తం మొత్తం ప్రతీ చిన్న విషయమూ తెలుసుకోవాలని ఉంది . మీకు తెలిసాదంతా చెప్పండి please అన్నాను.
మీ అక్కయ్యను గత 17 సంవత్సరాలుగా చూస్తున్న నాకంటే ఇంకెవరికి తెలుసు , మొత్తం చెబుతాను మహేష్ ....... కానీ ఆ 17 సంవత్సరాలూ బాధతప్ప సంతోషం జాడ కనిపించదు . నువ్వు గుండె రాయిచేసుకోవాలి అని కన్నీళ్లను తుడుచుకుంది .

వాడి పేరు మురళి ఒక అనాథ అనాధశరణాలయం నుండి బయటకువచ్చి ఈజీ మార్గాలలో డబ్బుని ఎలా సంపాదించాలో ట్రైనింగ్ అయ్యిన మోసగాడు . అప్పటికే రెండు మూడు సార్లు జైల్ కు వెళ్ళొచ్చాడు కూడా . వైజాగ్ లో బ్యాచిలర్ అని వాడికి ఎవ్వరూ రెంట్ కు ఇవ్వకపోవడంతో , మేము అప్పుడే కొత్తగా కట్టుకున్న ఈ houses గురించి తెలుసుకుని ఒక ఫేక్ పేరెంట్స్ ను పిలుచుకొనివచ్చి మా ఆయనను నమ్మించి పెద్దమొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి చేరిపోయాడు . ఆ తరువాత ఒక్కసారీ వాడి పేరెంట్స్ ను చూడలేదు . వాడు కూడా వారానికో నెలకో ఒకసారి కనిపించేవాడు తాగి తూగుతూ ఎవరెవరితోనో వచ్చేవాడు , మా బంధువులు ఊరి నుండి వచ్చారు అని మమ్మల్ని నమ్మించేవాడు . ఏమిచేసేవాడో ఎవ్వరికీ తెలియదు . డబ్బుని మాత్రం విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవాడు . మా ఆయన ఫ్రెండ్స్ వాడిగురించి చెప్పడంతో ఇంటిని ఖాళీ చేయించాలని చూస్తే వాడు ఏకంగా 3 4 నెలల వరకూ అడ్రస్ లేడు . ఒకేసారి ఏకంగా పెళ్ళిచేసుకుని వాసంతితోపాటు వచ్చేశాడు . వాసంతిని చూడగానే కోపంతో ఉన్న మా ఆయనను ఆపేసాను . 
ఆరోజు సాయంత్రమే తనను వదిలి వెళ్లినవాడు నెలలైనా రాలేదు . వాసంతి కడుపుతో ఎన్ని కష్టాలను చూసిందో నాకు తెలుసు . చేతిలో డబ్బు లేదు ప్రక్కనే వాడు లేడు తన తల్లిదండ్రులూ లేరు . ఆ పరిస్థితులలో కడుపుతో ఉన్న అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే ........... అలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు అని దేవుడిని ప్రార్థించని రోజంటూ లేదు . 
కడుపుతో ఉండగానే అన్నిపనులనూ చేసుకుంటూ ఉదయం సాయంత్రం ట్యూషన్స్ చెబుతూ .......... మహేష్ నా వల్ల కావడం లేదు అని గుర్తుచేసుకుని బాధపడుతుంటే, నా హృదయం బద్దలైనట్లు కన్నీరు కాకుండా రక్తం కారినట్లు అనిపిస్తోంది . కళ్ళముందు అక్కయ్య పడిన బాధ మెదులుతుంటేనే నా వొళ్ళంతా జలదరించి చెమటతో తడిచిపోయింది . 

 చుట్టుప్రక్కల ఉన్న ముసలివాళ్ళ సహాయంతో ఇంట్లోనే పురుడుపోసుకుంది అప్పుడుకూడా వాడి జాడలేదు . మహిని చూసిన ఆనందంలో పురుడు తరువాత కొన్నిరోజులు వాసంతి పడిన బాధ , కష్టాలను గుర్తుచేసుకోవడం అంటే ప్రాణాలను వదిలెయ్యడమే సులభం మహేష్ .......... నిన్ను బాధపెట్టడం ఇష్టం లేదు నాకు .
అంటీ ......... please చెప్పండి , మా అక్కయ్య పడిన కష్టం విని ఏమీచెయ్యలేకపోయిన ఈ తమ్ముళ్ల కళ్ళల్లోనుండి బాధతో రక్తం రావాలి అదే మాకు శిక్ష అని వేడుకున్నాను .
మహేష్ ఇందులో మీ తప్పు ఏమి ఉంది , మీ అక్కయ్య ఎక్కడుందో తెలియక ఇంతకంటే నరకం అనుభవించి ఉంటారని మీ అక్కయ్యకూ తెలుసు . 
లేదు లేదు అంటీ .......... ఈ 17 ఏళ్ళూ మేము కేవలం హైద్రాబాద్ లోమాత్రమే వెతుకుతూ , అక్కయ్యకోసమే బ్రతుకుతున్నట్లు ఫీల్ అయ్యాము . తప్పంతా మాదే అని కన్నీరుమున్నీరు అయ్యాను . 
మహేష్ ........... అంటూ లేచివచ్చి నాప్రక్కనే కూర్చుని చెయ్యి అందుకొని ఓదార్చారు అంటీ ...........
ఇలా బాధపడతావనే చెప్పడం లేదు మహేష్ .........
లేదు అంటీ నాకు ఈ శిక్ష పడాల్సిందే please please చెప్పండి అని ప్రాధేయపడ్డాను.
అంటీ ఒక్కొక్కటే చెబుతుంటే నావల్ల కాకపోయినా చలించిపోతున్న హృదయంతో వింటూ అంటీ చెప్పినట్లుగానే గుండెను రాయిచేసుకున్నాను .

మహేష్ .......... మహి బుడి బుడి అడుగులు పడిన తరువాత పురుడు పోసిన ముసలివాళ్లను స్వయంగా వెల్లికలిసి , ఆరోజు నుండీ వాళ్ళ కుటుంబానికి చేతనైన సహాయాన్ని చేస్తూ , వాళ్ళ ప్రతి ఫంక్షన్ లలో సిటీలో ఎము తెలియని వాళ్ళ కొడళ్లకు తోడుగా ఉంటూ అన్ని పనులనూ చేసేది . సిటీలలో ఇరిగుపొరుగు ఉన్నవారు ఎలా ఉన్నారో పట్టించుకోరు అలాంటిది వాసంతికి వాళ్ళు చేసిన చిన్న సహాయానికే అన్నింటా ముందు ఉండేది . కొన్నిరోజులకే వాసంతి అంటే చుట్టుప్రక్కల ఉన్న అందరికీ మంచి అభిమానం ఏర్పడింది . తను లేకుండా ఎటువంటి చిన్న పెద్దా ఫంక్షన్ కానీ చేసుకోరు . అందరికీ చాలా చాలా ఇష్టం . అలా ఉన్నంతలో మహిని సంతోషన్గా చూసుకుంటూ పిల్లలకు ట్యూషన్స్ చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తుంటే , ఇంట్లోకి వదిలి మాయమైపోయినవాడు మహి 5 ఏళ్లకు వచ్చాడు . తరువాత తెలుసుకుంటే అక్రమ మార్గంలో సంపాదించబోయి 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడని తెలిసింది . 
అక్కయ్య బాధపడ్డారా ...........
వాసంతి అసలు వాడిని తన భర్తలా ఒక్క క్షణం అయినా కన్సిడర్ చేస్తేనేకదా బాధపడటానికి , తన మనసు , హృదయం ఎప్పుడో తన ప్రియమైన ప్రాణమైన తమ్ముడికి ఇచ్చేసింది కదా .......... మహేష్ అర్థమవుతోందా ......... నువ్వు లేక మీ అక్కయ్య జీవిస్తోంది అంటే జీవిస్తోంది అంతే ...........
ఆరోజు రాత్రి తను తాగే టీ లో మత్తుమందు కలిపి మహిని హాల్లో పడుకోబెట్టి రేప్ అత్యాచారం చేస్తే పుట్టినది జానకి .......ఆ తరువాత నీ అంశ అయిన మహేష్ కూడా.........
ఆ విషయం మూడు నెలల తరువాత తెలిసింది మాకు .
మహి విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పింది వాసంతి . పెళ్ళికే ఒప్పుకోని వాసంతిని రేప్ చెయ్యమని తరువాత నువ్వుచెప్పినట్లు వింటుందని స్వయానా తన తండ్రి కూతురు తాగే పాలలో విషం కలిపి శోభనం చేయించాడట అంతటి దుర్మార్గపు తండ్రిని నేను ఇంతవరకూ చూడలేదు . ఉదయం లేచి చూస్తే ఒక లెటర్ నేనూ మీ అమ్మ దుబాయ్ వెళ్లిపోతున్నాము నీ జీవితం ఇక మురళి దగ్గరే అని రాసి రాత్రికి రాత్రే కనుమరుగైపోయారు . ఇక్కడకు వచ్చిన వారానికి దుబాయ్ నుండి మీ అమ్మగారు కాల్ చేసి చాలా బాధపడ్డారు . తల్లీ జాగ్రత్త జాగ్రత్త .......... నీ తమ్ముడి దగ్గరకు వెళ్లిపో అని ఎంత ప్రాధేయపడ్డా , అమ్మా .......... మాట తప్పాను ఇక ఈ జీవితం ఇంతే నన్ను మన్నించు అని బదులిచ్చేది .

వాసంతి నెల నెలా గంట గంటా ట్యూషన్ చెప్పే సమయం పెంచుకుంటూ పోతూ అవసరమైన డబ్బుని సంపాధిస్తూ పిల్లలను ప్రాణంలా చూసుకునేది . ట్యూషన్ కు వచ్చే పిల్లలకు మీ అక్కయ్య అంటే చాలా చాలా ఇష్టం నువ్వే చూశావుకదూ .......... ఎంత బాధలో ఉన్న తన మనసులోనే దాచేసుకొని పిల్లలకు సంతోషన్గా నేర్పించేది . 
ఈ సంవత్సరమే మహి స్టేట్ ర్యాంకుతో వైజాగ్ లోనే ద బెస్ట్ కాలేజ్ లో చేరింది . ముగ్గురి చదువులకోసం దాచుకున్న డబ్బుని .......... ఇక నీకు తెలిసిందే మహేష్ నీ కలలో కనిపించిందే జరిగింది ........... 
మహేష్ ......... నువ్వు ఇలా బాధపడతావనే జరిగినదాంట్లో ఇంతే ఇంత చెప్పాను . మీ అక్కయ్య తన జీవితంలో అనిభవించిన కష్టాలను చెప్పుకుంటూ పోతే ఒక సెల్ఫ్ బుక్స్ అయినా సరిపోవు . తల్లికి తగ్గ తనయులు పిల్లలు ......... స్కూల్ నుండి పంపించగానే వాళ్ళ అమ్మదగ్గరకువెళ్లి అమ్మా ........ మీరేమీ బాధపడకండి , మా స్కూల్లో మిమ్మల్ని మించిన టీచర్ ఒక్కరూ లేరు స్కూల్లో కంటే మా అమ్మ దగ్గర చదువుకోవడమే మాకు ఇంకా ఇంకా ఆనందం అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు.
లవ్ యు అమ్మా , లవ్ యు తమ్ముడూ .......... అని ప్రాణంలా గుండెలపై హత్తుకొని మురిసిపోయింది ఆ తల్లి . మహికి 17 ఏళ్ళు , మీ బుజ్జిఅమ్మ జానకికి 13 ఏళ్ళు , నీ ప్రతిరూపమైన మహేష్ కు 8 ఏళ్ళు ........... అయినా వాళ్ళు ఇప్పటివరకూ ఒక పుట్టినరోజు ఫంక్షన్ జరుపుకోలేదు , ఒక పండుగ ఘనంగా జరుపుకోలేదు , ఇల్లు - స్కూల్ - ఇల్లు తప్ప ప్రపంచాన్ని ఎరుగనేలేదు . అంతెందుకు వైజాగ్ లో బీచ్ కు కూడా వెళ్లలేదంటే అర్థం చేసుకో మహేష్ ........... తల్లి సంతోషమే వాళ్ళ సంతోషం - పిల్లల సంతోషమే తల్లి సంతోషం ........... 

ఇంతలో మహి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకునివచ్చింది . కిందకుదిగి నా గుండెలపైకి చేరిపోయి మహి ......... రేపు ఉదయం కలుస్తాము కదా వెళ్లి హాయిగా పడుకో ఇప్పటికే 10 గంటలు అయ్యింది గుడ్ నైట్ ...........
బుజ్జిఅమ్మా .......... 
మహి .......... మా అక్కయ్యనూ మిమ్మల్ని వదిలి ఒక్కక్షణం కూడా ఉండటం నావల్ల కూడా కాదు . ఈ ఒక్కరోజు ....... కాదు కాదు ఈ ఒక్క రాత్రి మాత్రమే మనం దూరంగా ఉండేది , రేపు నువ్వే చూస్తావు కదా , నామాట మీద నమ్మకం ఉంటే వెళ్లి మా అక్కయ్యకు పరుపు పరిచి చివరిసారి కాళ్ళను ప్రాణంలా వొత్తుతూ పడుకోబెట్టు, ఎందుకంటే రేపటినుండి ఆ అదృష్టం నాది అని పెద్దపెద్ద మాటలు మాట్లాడేస్తోంటే , 
మహి సంతోషంతో ఆశ్చర్యపోయి , మా బుజ్జిఅమ్మను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను . నా భయం అల్లా ఒకటే అమ్మకు మా బుజ్జిఅమ్మ పిచ్చపిచ్చగా నచ్చేసింది . రాత్రంతా కలవరిస్తారేమోనని , 
మహి ........... అయితే నేను రాత్రంతా ఇక్కడే ఉంటాను . అక్కయ్య కలవరించగానే ఒక్క కాల్ చెయ్యి పరుగున వచ్చేస్తాను అని పేపర్ పెన్ అందుకోబోయి వద్దులే ఇందులోనుండి కాల్ చెయ్యి అని నా జేబులోని మూబైల్ అందించింది .

నా నెంబర్ కూడా తెలుస్తుంది అనేమో మహి ఆనందానికి అవధులు లేనట్లు అందుకొని missed కాల్ ఇచ్చింది . 
అయ్యో మహి నేను మా అక్కయ్యతో మాట్లాడాలి అని నానుండి కిందకుదిగి , మహిచేతిని అందుకొని కొరికేసి మొబైల్ అందుకుంది .
స్స్స్స్.......... బుజ్జిఅమ్మా ......... 
మహి please please కొట్టు అని చేతులను విశాలంగా చాపగానే , 
మా బుజ్జిఅమ్మను కొడతానా అని అమాంతం ఎత్తుకుని ప్రాణమైన ముద్దుపెట్టింది .
ప్చ్ ........... మళ్లీ నిరాశనే అని మళ్ళీ అదేనెంబర్ కు కాల్ చేసి నావైపు కన్నుకొట్టి స్పీకర్ on చేసింది .
హలో అని అక్కయ్య మాటలు వినిపించడం - అక్కయ్యా నేను అని బుజ్జిఅక్కయ్య చెప్పగానే , అంతులేని ఆనందంతో బుజ్జిచెల్లీ .......... నువ్వు ప్రక్కన లేకపోతే నాకు ఏదోలా ఉంది . రేపు ఉదయం వరకూ అంటే నావల్ల కావడం లేదు . నాకు నిద్రకూడా పట్టడం లేదు . లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ముద్దులుపెడుతూనే ఉండటంతో , నాకు చాలా చాలా ఆనందం వేసింది .
అక్కయ్యా ......... మీరు ఎంత త్వరగా హాయిగా పడుకుంటే అంత త్వరగా ఉదయం అవుతుంది . నేను మీ ముందు ఉంటాను సరేనా మళ్లీ ఒకసారి గుడ్ నైట్ అని ముద్దుపెట్టడంతో అక్కయ్య లవ్ యు బుజ్జిచెల్లీ .......... నువ్వు చెప్పినట్లుగానే ఇప్పుడే ఇప్పుడే పడుకుంటాను అని ప్రాణమైన ఘాడమైన ముద్దుపెట్టింది . 

మహీ ........... నీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వు ..........
బుజ్జిఅమ్మా .......... అమ్మదీ , నాదీ , బుజ్జి జానకిఅమ్మదీ , మావయ్య మహేష్ దీ ........... మా నలుగురిదీ ఒకటే మొబైల్ జియో ఫోన్ అని బదులిచ్చింది . 
మహి ......... వెళ్లు వెళ్లి పడుకో గుడ్ నైట్ అని బుగ్గపై ముద్దుపెట్టి నా గుండెలపై బాధపడుతూ వాలిపోయింది . 
బుజ్జిఅక్కయ్యను వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళిపోయింది .
తమ్ముడూ ...........
అర్థమైంది బుజ్జిఅక్కయ్యా .......... ఒకే ఒక్కరోజు సమయం ఇవ్వు అని కళ్ళల్లో చెమ్మతో నుదుటిపై పెదాలను తాకించి ప్రాణంలా కౌగిలించుకున్నాను .

ఇక మా వాసంతి ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడూ , బుజ్జిచెల్లీ ...........వచ్చేసారు . ఇక వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినట్లే అని అంటీ తెగ సంబరపడిపోతున్నారు . 
అంటీ ఒక్కరోజులో మొత్తం మార్చేస్తాము మీరు ఆశించినట్లుగానే చేస్తాను . సమయం అయ్యింది పడుకోండి అని బుజ్జిఅక్కయ్యతోపాటు పైకిలేచాను . 
మహేష్ ..........ఈ సమయంలో ఎక్కడికీ వెళుతున్నారు . ఇక్కడే పడుకోవచ్చు అని చెప్పారు .

ఉదయం అనగా మా బుజ్జిఅక్కయ్యను వీళ్ళ అమ్మానాన్నల దగ్గర నుండి తీసుకొచ్చేసాను . ఇంత సమయం అయినా ఒక్క కాల్ చేసి ఎక్కడ ఉన్నామో చెప్పలేదు . అదీకాక మా అక్కయ్య కనిపించిన విషయమూ చెప్పలేదు . అక్కయ్యను చూసింది సాయంత్రం ......... ఇప్పుడు సమయం 10 దాటేసింది . విషయం చెప్పగానే ముందు మాకంటే ఎంజాయ్ ఎగిరి గెంతులేస్తారు కొన్ని నిమిషాలు ఇంకా గంటలు సంతోషంలో ఎక్కడికో వాళ్ళను మరిచి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు , అంతవరకూ ok తెరుకోగానే ఎక్కడ ఎక్కడ అని అడుగుతారు . ఇప్పటివరకూ మేము వాళ్ళతోనే ఉండి ఎంజాయ్ చేసాము హాయిగా నిద్రపోతున్నారు , మిమ్మల్నే మరిచిపోయాము అనిచెప్పడం ఆలస్యం ,
 కళ్ళల్లో అగ్నిగోళాలతో మాకు ఇప్పుడా చెప్పేది అని ఎన్ని నిమిషాలు అయ్యుంటే అన్ని దెబ్బలు వేస్తారు తమ్ముడూ ........., వాళ్ళ ముందుకు వెల్లెలోపు నాకేమీ తెలియదు అన్నట్లు నిద్రపోయినట్లు నటించేస్తాను అని తియ్యని నవ్వుతో చెప్పింది బుజ్జిఅక్కయ్య .
అయితే నేను అయిపోయాను దొంగా అని బుజ్జిఅక్కయ్య బుగ్గను కొరికేసాను .
Like Reply
తమ్ముడూ .......... 10 గంటలు అంటే గుర్తుకువచ్చింది . మహికి ఉదయమే అందించాల్సిన చిరు కానుక ఎక్కడ అని దిమ్మతిరిగిపోయేలా అడిగింది బుజ్జిఅక్కయ్య .
అక్కయ్య మాయలోపడి మరిచేపోయాను బుజ్జిఅక్కయ్యా ......... ఐడియా ఓకేదెబ్బకు రెండుపిట్టలు , చెల్లికీ వాడికి ........ ఎలా చెప్పాలా అని భయపడ్డాను అని మొబైల్ తీసి వాడికి కాల్ చేసి రేయ్ మామా ......... ఏమిచేస్తావో ఎలా తీసుకొస్తావో నాకు తెలియదు , ******* షాపింగ్ మాల్ లో ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఐదుగురు అమ్మాయిలు ఒక్కొక్క డ్రెస్ సెలెక్ట్ చేశారు , వాటిని తీసుకుని *******అడ్రస్ కు వచ్చెయ్యి అనిచెప్పాను .
రేయ్ మామా ......... 10:10 అయ్యిందిరా , మాల్ క్లోజ్ చేసే సమయం అయ్యింది . 
రేయ్ నీకిప్పుడు ప్రతీ నిమిషమూ ముఖ్యమే షాప్ క్లోజ్ చేసి ఉంటే నీ పరపతిని ఉపయోగించి తెరిపించిమరీ తీసుకురావాల్సిందే ,
రేయ్ మాల్ అంటే వందల్లో అమ్మాయిలు వస్తూ ఉంటారురా ........ 
రేయ్ మామా 6 - 6:30 మధ్యలోని అమ్మాయిల డ్రెస్ సెక్షన్ footage చూడండి మీకే అర్థమైపోతుంది ఆ ఐదుగురు సెలెక్ట్ చేసిన డ్రెస్ లు ఏవో .
స్పీకర్ on చేయరా ......... చెల్లెమ్మా ......... మీ ఇద్దరికీ ద బిగ్ బిగ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ............. footage చూస్తే మీకే అర్థమైపోతుంది . నన్నూ బుజ్జిఅక్కయ్యను మాత్రం కొట్టను అని మాటివ్వాలి మీరు . అమ్మా నాన్నా ప్రామిస్ చెయ్యండి అని బుజ్జిఅక్కయ్య ముద్దుముద్దుగా అడిగింది .
చెల్లి నవ్వుకుని మా అన్నయ్యనూ తన ప్రాణమైన బుజ్జిఅక్కయ్యనూ కొట్టేంత ధైర్యం మాకెక్కడిది .
అయితే ప్రామిస్ చేసినట్లే హమ్మయ్యా .......... , చెల్లీ ఆ ఐదు డ్రెస్ లలో ఒక డ్రెస్ అతిముఖ్యమైనది .
మాకెలా తెలుస్తుంది అన్నయ్యా .......... కలర్ , డ్రెస్ టైప్ అయినా చెప్పండి .
చెల్లెమ్మా ......... చెప్పానుకదా ,
చెల్లి : footage చూస్తే అర్థమైపోతుంది అంటారు ok .......... అవును అడగడం మరిచిపోయాను అన్నయ్యా ........ ఆ గోబీ ఎక్కడిది అని అడిగింది .
అమ్మా , పెద్ద చెల్లీ ........... ఆ గోబీ టేస్ట్ ఉందీ , జీవితాంతం కష్టపడినా అంత అద్భుతంగా నువ్వు చేయలేవు . మా కడుపునిండా తినేసాము మీకు ఒక్క గోబీ ముక్కా వదలలేదు . ప్రామిస్ చేశారు కొట్టము అని బాగా గుర్తుపెట్టుకోండి అని బుజ్జిఅక్కయ్య లొట్టలేస్తూ నవ్వుతూ బదులిచ్చింది  .
నేను నవ్వుకుని చెల్లెమ్మా ......... footage చూస్తే ........ఆ డ్రెస్ లను గిఫ్ట్ ......... మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో ,
అర్థమైంది అన్నయ్యా ........... అన్నింటి ఆన్సర్స్ అన్నీ footage లో ఉన్నాయన్నమాట , డార్లింగ్ తొందరగా పదండి అని ఇంటికి లాక్ వేసి 15 నిమిషాలలో షాపింగ్ మాల్ చేరుకుని , ఇంకా ఓపెన్ లో ఉండటం చూసి పెదాలపై చిరునవ్వుతో లోపలికివెళ్లారు .

సెక్యూరిటీ షాప్ క్లోజింగ్ టైం ఎంత .........
 మామూలుగా అయితే 10 గంటలు మాక్సిమం సర్ ........లోపల ఎవరో పెళ్లికోసం షాపింగ్ కు వచ్చారు . వాళ్ళ షాపింగ్ పూర్తయ్యేంతవరకూ ఓపెన్ చేసి ఉంటుంది . ఇలా extraa టైం డ్యూటీ చేసినప్పుడు మాకు డబల్ సాలరీ ఇస్తారు అని సంతోషంతో చెప్పారు . 
థాంక్స్ అన్నా ......... అని కృష్ణగాడు కౌగిలించుకుని , అమ్మాయిల డ్రెస్ లు ఎక్కడ దొరుకుతాయి అని అడిగి నేరుగా అక్కడకు చేరుకుని చాలామంది  సీసీ కెమెరా ఉండటం చూసి ఒకరినొకరు చూస్తూ నవ్వుకుని , సేల్స్ మ్యాన్ దగ్గరకువెళ్లి 6 - 6:30 మధ్యలో ఐదుగురు ఒక్కొక్క డ్రెస్ ను సెలెక్ట్ చేసి డబ్బులు తక్కువగా ఉండటం వలన వెనక్కువెళ్లిపోయారు . ఆ డ్రెస్సెస్ కావాలి అని అడిగాడు కృష్ణగాడు . సీసీ టీవీ footage చూస్తే మీకే అర్థమైపోతుంది అనిచెప్పాడు .

అవసరం లేదు సర్ .......... వాళ్ళు ఇష్టపడటం చూసి ఖచ్చితంగా వస్తారని , ముందుకురండి అని చెవిలో ఈ పెళ్ళివాళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసేస్తారోనని ప్రక్కన దాచేసాను అని గుసగుసలాడాడు . 
థాంక్యూ sooooo మచ్ బ్రదర్ ........... ప్యాక్ చేసి బిల్ వెయ్యండి అనిచెప్పాడు .
చెల్లి వాడిచేతిని గిల్లేసి , అన్నయ్య ఏమిచెప్పాడు footage లోని అమ్మాయిలను చూడమన్నాడా లేదా ...........
Sorry రా ........... బ్రదర్ ఈ డ్రెస్ లను వాళ్ళు సెలెక్ట్ చేస్తున్న footage చూడాలి అని అడిగాడు .
అదిమాత్రం కుదరదు సర్ .......... మా షాప్ అంటే జనాలకు నమ్మకం .........ఇలా ఎవరికిపడితే వాళ్లకు చూపించము .
అంతేవాడు పర్సు తీసి ID కార్డ్ చూపించాడు .
సర్ ......... అంటూ సెల్యూట్ చేసి sorry సర్ ముందే చూపించి ఉంటే నేను extraa లు చేసేవాణ్ణి కాదు అని మొదట ఓనర్ దగ్గరికి అక్కడి నుండి ప్రైవేట్ రూంలోకి పిలుచుకొనివెళ్లి , సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తున్న సెక్యూరిటీకి ఈరోజు 6 - 6:30 వీడియో ప్లే చెయ్యనిచెప్పి , సర్ డ్రెస్ లు టేబుల్ పైనే ఉంచాము , పెళ్ళివాళ్ళు చూశారంటే అంతే అని పరిగెతి నిమిషంలో సేఫ్ అంటూ వచ్చాడు .

 సెక్యూరిటీ ఒక కంప్యూటర్ దగ్గరకువెళ్లి బ్యాక్ వార్డ్ కొట్టి 6 గంటల నుండి ప్లే చేసాడు. అన్నా ఫార్వార్డ్ ఫార్వార్డ్ ......... స్టాప్ ,  సర్ వీరే అని చూపించాడు . నలుగురు సెలెక్ట్ చేస్తున్నారు ఒక అమ్మాయి మాత్రం ఏమీ పట్టించుకోకుండా ప్రక్కన నిలబడి ఉండటం చూసి , కృష్ణగాడు చెల్లెమ్మ ........... ఆతృతతో ప్రక్కన నిలబడిన అమ్మాయిని జూమ్ చెయ్యండి అని ఒకేసారి చెప్పారు . 
జూమ్ చెయ్యడంతో ఇద్దరి కళ్ళల్లో ఆనందబాస్పాలతో అక్కయ్య ........... అక్కయ్యనే sorry sorry ఆ అమ్మాయినే ఫాలో అవ్వండి అని చెల్లెమ్మ చెబుతోంటే , 
కృష్ణగాడు సెక్యూరిటీని లేపి 5 మినిట్స్ అనడంతో వాళ్ళు బయటకువెళ్లిపోయారు . ఇద్దరూ సంతోషం పట్టలేక కౌగిలించుకుని కూర్చుని మొత్తం వీడియో ని చూసి రేయ్ - రేయ్ ........... అచ్చు అక్కయ్యలానే ఉంది అని ఇద్దరూ సంతోషాన్ని వ్యక్తపరిచి , ఆ అమ్మాయి నలుగురు ఫ్రెండ్స్ చూపించిన డ్రెస్ చూసి సంతోషించడం తెలిసి ,
రేయ్ - రేయ్ ........... అన్నయ్య చెప్పినట్లు ఆ లెహంగా ముఖ్యం అని క్షణాల్లో సేల్స్ మ్యాన్ దగ్గరకు చేరుకుని డ్రెస్ లలో లెహంగాని చూసి హమ్మయ్యా ......... అంటూ పెదాలపై చిరునవ్వుతో గుండెలపై చేతినివేసుకొని , బ్రదర్ గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా ఉండాలంటే చూడగానే మనసు దోచెయ్యాలి అని ఉత్సాహంతో చెప్పాడు కృష్ణగాడు . 
సర్ బల్క్ గానా సింగిల్ సింగిల్ గానా అని అడిగాడు సేల్స్ మ్యాన్ .........
సింగిల్ సింగిల్ గా గిఫ్ట్ ప్యాక్ చేసి ఫైనల్ గా అన్నింటినీ పెద్ద గిఫ్ట్ గా రెడీ చెయ్యండి అని చెల్లి అంతులేని ఆనందంతో బదులిచ్చింది . 

అంతలోపు footage దగ్గరకువెళ్లి ఆ మొత్తాన్ని తన పెన్ డ్రైవ్ లోకి ఎక్కించుకుని డిలీట్ చేయించేసి కౌంటర్ దగ్గరకు వెళ్ళేసరికి సేల్స్ మ్యాన్ చెల్లి చెప్పినట్లుగానే గిఫ్ట్ లా రెడీ చేసి పెద్ద కవర్లో ఉంచాడు . అమౌంట్ కార్డ్ ద్వారా పే చేసి కవర్ అందుకోబోతుంటే , సర్ వెహికల్ ఉందా అని తనే స్వయంగా తీసుకొచ్చి కారులో వెనుక ఉంచాడు .
బ్రదర్ .......... ఈ డ్రెస్సెస్ గనుక సేల్ అయిపోయి ఉంటే చాలా బాధపడేవాళ్ళము , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని చేతులను కలిపి జేబులో ఒక పెద్ద నోటుని ఉంచాడు . 
థాంక్యూ సర్ అంటూ సెల్యూట్ చేసి ఆనందంతో లోపలికివెళ్లిపోయాడు .

ఇద్దరూ కారులో కూర్చుని రేయ్ తొందరగా పోనివ్వు అని వాడిచేతిని చుట్టేసి పెన్ డ్రైవ్ మొబైల్ కు కనెక్ట్ చేసి ఆనందంతో అచ్చం అక్కయ్యాలానే ఉన్న అమ్మాయిని చూస్తూ మురిసిపోతూ , రేయ్ అక్కయ్య ఇలానే దేవకన్యలా ఉండేదా అని అడిగింది చెల్లి .
దేవకన్యలా ఏంటి కృష్ణా ........... దేవతే మన అక్కయ్య . 
రేయ్ కాస్త వేగంగా వెళ్లు అక్కడికి వెళ్ళాక బిగ్ బిగ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇస్తాను అన్నారు అన్నయ్య , ఏమై ఉంటుందీ ........... అన్నయ్యకూ , బుజ్జిఅక్కయ్యకూ , నాకూ , నీకు ........... ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ........... ఇంకెవరూ అక్కయ్యే అని ఇద్దరూ ఒకేసారి చెప్పి షాక్ లో కృష్ణగాడు సడెన్ బ్రేక్ వేసి , ఒకరినొకరు ఆనందబాస్పాలతో చూసుకుని అక్కయ్యనా .......... నిజంగా అక్కయ్యేనా ........... అమ్మా అక్కయ్యే అయ్యుండాలి అని అమ్మవారిని ప్రార్థించి , రేయ్ అక్కయ్యే అయి ఉండాలిరా అని కళ్ళల్లో చెమ్మతో గుండెలపై వాలిపోయి , అక్కయ్యే అవ్వాలి , అక్కయ్యే అవ్వాలి .......... అని వణుకుతూ పదేపదే తలుచుకుంటూ ఉండటంతో , 
రేయ్ కృష్ణా ........... మన ప్రార్థనను మన తల్లి ఇప్పటికైనా తప్పకుండా తీరుస్తుంది అని చెల్లి కురులపై ముద్దుపెట్టి , నిర్మానుష్యమైన రోడ్డులో వేగంగా పోనిచ్చాడు .

ఇక్కడ అంటీ ........... మా చెల్లీవాళ్ళు వచ్చేస్తుంటారు మీరు డోర్ వేసుకుని పడుకోండి . అంటీ గుడ్ నైట్ ఉదయం కలుద్దాము అని నవ్వుతూ చెప్పింది బుజ్జిఅక్కయ్య . 
లవ్ యు బుజ్జివాసంతిగుడ్ నైట్ అని బుగ్గపై ముద్దుపెట్టి డోర్ వరకూ వచ్చారు . 
మెయిన్ డోర్ దాటుతూ ఆగిపోయి అంటీ ......... లోన్ పేపర్స్ ఒకసారి నేను చూడొచ్చా అనిఅడిగాను . 
ఒక్కనిమిషం మహేష్ ......... అని లోపలికివెళ్లి ఫైల్ తీసుకొచ్చి అందించారు .

అంటీ రెండు ఇల్లులూ ఓకేవిధంగా ఉండాలికదా .......... మరి అక్కయ్య ఇల్లు ఇందులో సగం మాత్రమే ఉంది ఎందుకు అని బుజ్జిఅక్కయ్య అడిగింది .
అవును బుజ్జివాసంతి ........... రెండూ ఒకేలా కట్టించాము , అక్కయ్యా ......... మేము రెంట్ తక్కువగా ఇస్తున్నాము కాబట్టి సగం ఇంటిలోనే ఉంటాము కావాలంటే ఎవరైనా స్టూడెంట్స్ కు ఇవ్వండి అని నేనెంత చెప్పినా వినకుండా అలాగే ఉంటున్నారు .
ఇక వాసంతి బుజ్జిచెల్లి వచ్చింది కదా తనే చూసుకుంటుంది అని మరొక ముద్దునిపెట్టి గుడ్ నైట్ చెప్పి , మేము అక్కయ్య ఇంటి డోర్ దగ్గరకువెళ్లి గుండెలపై చేతినివేసుకొని ఆశతో చూసి బయటకువెళ్లి , అక్కయ్య ఇంటివైపు క్యారెమ్స్ చైర్లలో కూర్చుని , బుజ్జిఅక్కయ్యా ......... ఎంత సంతోషంతో ఉందొ తెలుసా అంతా నీవల్లనే అని గిలిగింతలుపెడుతూ ముద్దులుపెడుతూ బుజ్జిఅక్కయ్య చిరునవ్వులకు మురిసిపోతూ ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను . 
తమ్ముడూ ఇంతవరకూ చలివేసింది , ఇప్పుడు నీ గుండెలపై వెచ్చగా ఉంది లవ్ యు sooooo మచ్ అని గట్టిగా ముద్దుపెట్టింది .
అంటీ బుజ్జిఅక్కయ్యకోసం బుజ్జి స్వేటర్ తీసుకొచ్చి నా మనవరాలు ఇందూది అని బుజ్జిఅక్కయ్యకు తొడిగింది . తలను కూడా కప్పెయ్యడంతో లవ్ యు అంటీ వెచ్చగా ఉంది అని సంతోషంతో చెప్పడంతో , మురిసిపోతూ ఆమ్మో చాలా చలి లోపలికి రావచ్చు కదా .......... 5 నిమిషాలు అంటీ మీరు లోపలికివెళ్లండి వణుకుతున్నారు అని బుజ్జిఅక్కయ్య నవ్వడంతో , 
గుడ్ నైట్ బుజ్జివాసంతి , గుడ్ నైట్ మహేష్ .......... అని లోపలికి వెళ్లిపోయారు .

లోన్ ఫైల్ ను ప్రక్కనే ఉన్న కుర్చీలో ఉంచేసి నా ఒడిలో వెచ్చగా కూర్చుని మొబైల్లో వీడియో ప్లే చేసింది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిచెల్లీ ............. ఎందుకో తెలియదు నిమిషాల్లో నువ్వు మహి , జానకి అమ్మ కంటే ప్రాణంలా , నా తమ్ముడు మహేష్ తో సమానంగా , నువ్వు ఒక్కనిమిషం కనిపించకుంటే ఈ హృదయం తట్టుకోలేకపోతోంది అని రెండుచేతులతో ప్రాణంలా చుట్టేసింది అక్కయ్య .

బుజ్జిఅక్కయ్యా .......... అక్కయ్య మన మొబైల్లో .........
తమ్ముడూ .......... మరి మొబైల్ ను ఊరికే తీసుకెళ్ళాను అనుకుంటున్నావా , నా తమ్ముడికోసం బుజ్జిజానకి అమ్మకు అందించి వీడియో తీయించాను . 
లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ బుజ్జిఅక్కయ్యా అని వెనకనుండి నాగుండెలపై ఏకమయ్యేలా హత్తుకొని , వేళ్ళతో మొబైల్ లోని అక్కయ్యను స్పృశిస్తూ మురిసిపోతున్నాను . 
తమ్ముడూ ......... నాతో ఉన్నంతసేపు అక్కయ్య ఎలా సంతోషంతో నవ్వుతున్నారో చూడు , నన్ను తనతోపాటే మరికాసేపు ఉండమని చెప్పలేక ఎంత విలవిలలాడిపోయారో అక్కయ్యను హత్తుకున్నప్పుడు తెలిసింది . రేపటి నుండీ నేను నీతో ఉండను , అమ్మానాన్నలతోకూడా ఉండను . మా అక్కయ్యతోనే ఉండిపోతాను. రేపు ఉదయమే ట్యూషన్ కు జాయిన్ అయిపోతాను .
మన దేవత దగ్గరికి వెళ్లి అక్కడే ఉండిపోతాను అంటే , అంతకంటే ఆనందం మాకు ఏముంటుంది బుజ్జిఅక్కయ్యా ............ మీఇద్దరి ఇష్టమే నాఇష్టం . అక్కయ్యతోనే ఉంటూ ఏమేమిచెయ్యాలో ఆర్డర్ వెయ్యి చిటికెలో చేసేస్తాను అని బూగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టాను . 
యాహూ ........... లవ్ యు soooooo మచ్ తమ్ముడూ స్వామి .......... వెంటనే తెల్లారిపోవాలి అని ప్రార్థించింది .
అమ్మో .......... ఇక మా బుజ్జిఅక్కయ్యకు మేము గుర్తుంటామో లేదోనని గిలిగింతలు పెట్టి , మా బుజ్జిఅక్కయ్యకు నిద్ర రావడం లేదా అని అడిగాను . 
ఉదయం ఒకేసారి మా అక్కయ్య గుండెలపై నిద్రపోవడమే అని వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నాము .

ఇంతలో హెడ్ లైట్స్ వెలుగు , కారు సౌండ్ పెరుగుతూ మా దగ్గరకు వచ్చేన్తలో ........, అమ్మో అమ్మానాన్నలు వచ్చేసారు నేను కోమా అంటూ నా గుండెలపై వెనక్కువాలిపోయి కళ్ళుమూసుకుంది . 
నాకైతే నవ్వు ఆగడం లేదు .
తమ్ముడూ ........... ఇలా నవ్వితే అమ్మ కనిపెట్టేస్తుంది కంట్రోల్ అని కదలకుండా ఉండిపోయింది . నేను వీడియోని హోల్డ్ లో ఉంచి ఫైల్ పై పెట్టాను మొబైల్ .
చెల్లి కారుదిగి పరుగునవచ్చి మోకాళ్లపై కూర్చుని అన్నయ్యా ............ మీరు ఇవ్వబోయే బిగ్ బిగ్ బిగ్ బిగ్ బిగ్ బిగ్............ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అక్కయ్యే అని చెప్పండి please please please తొందరగా చెప్పండి . నేను మా అన్నయ్య నోటిలోనుండి " అవును అక్కయ్యే " అనే మాటను తప్ప మరొకటి వినధలుచుకోలేదు అని కళ్ళల్లో చెమ్మతో ఆతృతతో ఉత్కంఠతో నా చేతులను అందుకొని అడిగింది . వెనుకే కృష్ణగాడు ఆ మాటకోసమే ఎదురుచూస్తున్నట్లు టెన్షన్ టెన్షన్ పడుతున్నాడు .

 నాకళ్ళల్లో చెమ్మతో చెల్లెమ్మా ...........అంటూ మొబైల్ వైపు చూపించాను . 
ఆతృతతో మొబైల్ అందుకొని వీడియో ప్లే చెయ్యడం - బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెడుతున్న అక్కయ్యను చూసి , ఏకంగా గుండె నుండి ఆగకుండా కారుతున్న ఆనందబాస్పాలతో ........... అన్న...య్యా ....... అక్క....య్య , ఆ......క్క.....య్య ........... రేయ్ మన అక్కయ్యరా అని అంతే జలదరిస్తున్న కృషగాడిని ప్రక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకొని వాడి ఒడిలో తల ఉంచి ,నా చేతిని అందుకొని తన బుగ్గపై వేసుకుని అంతులేని ఆనందంతో రేయ్ కృష్ణా , అన్నయ్యా ........... మన అక్కయ్య అని వాడిచేతిపై నా చేతిపై మరియు నిద్రపోతున్నట్లు నటిస్తున్న బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , ఏమి మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలియక మొత్తం వీడియోని రెండు మూడుసార్లు చూసి , మన బుజ్జిఅక్కయ్య అక్కయ్యతో , అక్కయ్య ప్రాణంలా బుజ్జిచెల్లీ అని పిలు ......పిలుస్తోంది అని పరవశించిపోతోంది . బుజ్జిఅక్కయ్యా ......... కోమా నాటకం ఆపొచ్చు నేను కారులో దూరం నుండే చూసానులే అని అంతులేని ఆనందంతో నవ్వుకుంది . బుజ్జిఅక్కయ్య మాత్రం యాక్టింగ్ ఆపడం లేదు .
 అన్నయ్యా ........... అక్కయ్య ఎక్కడ ఉంది వెంటనే చూసేయ్యాలి అని సంతోషంలో వణుకుతూ చెప్పింది . 
చెల్లెమ్మా , రేయ్ మామా .......... కాంపౌండ్ లోపల కుడివైపు ఉన్న ఇల్లే మన దేవాలయం అనిచెప్పాను .
మన అక్కయ్య 17 సంవత్సరాల తరువాత ఇప్పుడే సగం హాయితో పడుకుంది . ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు , అందుకే కదా నేనూ అక్కయ్య దగ్గర నుండి వచ్చేసింది అని మాట్లాడి , అయ్యో నేను కోమాలో ఉన్నాను కదా మాట్లాడకూడదు అని నావైపు తిరిగి గుండెలపై వాలిపోయింది బుజ్జిఅక్కయ్య . 
ముగ్గురమూ నవ్వుకున్నాము . బుజ్జిఅక్కయ్యా - తల్లీ .........అక్కయ్యను డిస్టర్బ్ చెయ్యము . కిటికీలోనుండి కనిపిస్తుందేమోనని తొంగిచూస్తాము అంతే అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , కృష్ణా గాడి చేతిని అందుకొని లేచివెళ్లి నెమ్మదిగా గేట్ తెరిచి కిటికీ దగ్గరకువెళ్లి లోపల చీకటిగా ఉన్నప్పటికీ తొంగి తొంగి చూసి , గుండెలపై చేతినివేసుకొని హాయిగా నిద్రపోండి అక్కయ్యా అని మనసులో అనుకుని నాదగ్గరకువచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు.

 చెల్లి వాడిచేతిని చుట్టేసి భుజం పై వాలిపోయి మొబైల్లోని వీడియోని మళ్లీ మళ్లీ చూసి మురిసిపోతూ , అన్నయ్యా ........... మరి ఈ అమ్మాయి ఎవరు అని షాపింగ్ మాల్లోని అమ్మాయిని చూపించింది .
అమ్మా .......... తను మహి అక్కయ్య పెద్ద అమ్మాయి అని నిజంగానే నిద్రపోయినట్లు కలవరించింది బుజ్జిఅక్కయ్య .
అన్నయ్యా , రేయ్ మామా ............ 
అవును చెల్లెమ్మా , అవునురా మామా ............ అందుకే అనుకుంటాను . మనకు ఇంత దగ్గరలో ఉన్నప్పటికీ అక్కయ్య మనల్ని కలవడానికి ఇష్టపడలేదు . కానీ మనం అంటే ఇప్పటికీ ప్రాణం రా ...........
చెల్లీ .......... నా కలలో కనిపించిన ఫ్యామిలీ ఎవరో కాదు అక్కయ్య ఫ్యామిలీనే అని మోచేతులతో కన్నీళ్లను తుడుచుకునిచెప్పాను .
అన్నయ్యా ........... అంటూ వణుకుతున్న నా చేతులను అంతే వణుకుతున్న చేతులతో అందుకొని బాధపడుతూ , మరి పిల్లల స్టడీస్ స్కూల్ కాలేజ్ ..........
ఆగిపోయాయి చెల్లీ .
కళ్ళల్లో కన్నీళ్ళతో అన్నయ్యా , రేయ్ ............ ఇక మనం జీవించి ఉపయోగం ఏమిటి అని వాడిగుండెలపై బాధతో విలవిలలాడిపోతోంది .
రేయ్ కృష్ణా ............ రేపు మనం కలిసిన తరువాత మన అక్కయ్యను ఎలా చూసుకోవాలో మనకు తెలియదా అని చెల్లి నుదుటిపై ముద్దుపెట్టిచెప్పాడు . 

అన్నయ్యా ........... అక్కయ్యను కలిసి ఎంతసేపు అయ్యింది అని బాధపడుతూనే అడిగింది .
చెల్లెమ్మా , రేయ్ .......... ఇద్దరూ కొట్టము అని ప్రామిస్ చేశారు అది గుర్తుపెట్టుకోండి సాయంత్రం చెల్లీ ..........
అంతే చెల్లి కళ్ళల్లో మరింత ధారలా కన్నీళ్లు కారిపోతున్నాయి . 
ఒకచేతితో బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకొని మరొకచేతితో చెల్లి చేతిని అందుకొని , నీకు తెలుసు కదరా మీ అక్కయ్యను చూశాక మనలో ఎవరికీ ఎవరూ గుర్తుకురారని , ఇక అక్కయ్య కళ్ళల్లో బాధను చూశానా ఇక్కడ హృదయం బద్దలైపోయినట్లు ఆ బాధకు కారణం ఏంటో తెలుసుకునేసరికి సమయమే తెలియలేదురా ............, ఇక మనబుజ్జిఅక్కయ్య ఆనందం చూశావుగా మన అక్కయ్య దగ్గరికివెళ్లి , 17 సంవత్సరాల ముందు సంతోషాన్ని అక్కయ్యకు అందిస్తుంటే చూస్తూ పరవశించిపోవడం తప్ప మరేమీ చేయలేకపోయాను . లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లీ ........... మీలానే నేను దూరం నుండి చూడటం తప్ప అక్కయ్యను తాకనైనా తాకలేదు . 
అన్నయ్యా ............ అక్కయ్యను చూసిన తరువాత కూడా గుండెలపై కౌగిలించుకోకుండా ఎలా తట్టుకోగలుగుతున్నారు ...........
అక్కయ్యను ఎదురుగా చూస్తూ , అక్కయ్యా ......... నేనే మీ ప్రాణమైన తమ్ముడిని అనిచెప్పలేక ప్రాణం పోతున్నట్లుగా ఉంది చెల్లీ ..........అక్కయ్యా ....మాదగ్గరకు ఇన్ని సంవత్సరాలూ రాకుండా ఎలా ఉన్నారు అని అడిగి మరింత బాధపెట్టడం ఇష్టం లేక , మన అక్కయ్య బాధను తనతో సమానంగా అనుభవిస్తున్నాను చెల్లీ .......
అన్నయ్యా , రేయ్ మామా అంటూ ఇద్దరూ వచ్చి చెరొకవైపు నన్ను హత్తుకున్నారు .
అన్నయ్యా ........... మీ ఇద్దరి వల్ల అక్కయ్యకు సంతోషం కలగాలే తప్ప ఇంతంటే ఇంత బాధ కలిగినా అధిచూసి ముగ్గురమూ కఆదు కాదు నలుగురమూ తట్టుకోలేము అన్నయ్యా .........  
ఆ కారణంతోనే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను చెల్లీ ............., 
కానీ మనం అక్కయ్యను ఎలా అయితే సంతోషపెట్టాలనుకున్నామో అలా మన బుజ్జిఅక్కయ్య ఎప్పుడో తన కర్తవ్యాన్ని మొదలెట్టేశారు . మీరే చూశారుకదా ......... బుజ్జిఅక్కయ్యను బుజ్జిచెల్లీ అని ఎంత ప్రాణంలా గుండెలపై హత్తుకుందో ......... ఇంత బాధలోనూ సంతోషం ఇదొక్కటే ....... లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅక్కయ్యా .......... అని గట్టిగా హత్తుకొని బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టాను.
ల.....వ్ యు soooooo మచ్ తమ్ముడూ ......... ఉమ్మా ........ ముందు మా అమ్మానా.....న్నలు ........ మహికోసం గిఫ్ట్ తెచ్చారోలేదో అని నిద్రలోనే ఆవలిస్తూ కలవరించింది .
చాలాసేపటి తరువాత చెల్లి పెదాలపై చిరునవ్వుతో మా బుజ్జిఅక్కయ్య ఆర్డర్ వెయ్యడమూ మేము తీసుకురాకపోవడమూనా .......... తల్లీ కారులో ఉంది తీసుకురావాలా అని అడిగింది . 
తెల్లవారకముందే లేవాలి గుడ్ నైట్ , స్వామి తొందరగా తెల్లవారేలా చూడు . అమ్మా .......... గట్టిగా మాట్లాడి నా నిద్ర డిస్టర్బ్ చెయ్యకు ఎంత ఘాడమైన నిద్రపోతే అంత తొందరగా తెల్లవారుతుంది అంత త్వరగా అక్కయ్య కౌగిలిలోకి చేరిపోవచ్చు . అన్నయ్యా .......... అక్కయ్య రోజూ 4 గంటలకే లేస్తుంది కాబట్టి మనం 3 గంటలకే లేవాలి అలారం పెట్టండి అని నన్ను అల్లుకుపోయింది .
మేము రాగానే ఎంత నటించావు తల్లీ బుజ్జిఅక్కయ్యా ......... నిద్రపోయినట్లు అని నవ్వుకుని , మీ తమ్ముళ్లకు కలగని అదృష్టం నువ్వు ఆస్వాదించేస్తున్నావు మన అక్కయ్య స్పర్శతో , అక్కయ్యకు అంతలోనే ప్రాణం అయిపోయావా బుజ్జిఅక్కయ్యా ............. ఎంత సంతోషం వేస్తోందో తెలుసా , సంవత్సరాల మా అందరి బాధను పోగొట్టేస్తున్నారు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని మురిసిపోతూ ఇద్దరూ ముద్దులతో ముంచెత్తారు . 
బుజ్జిఅక్కయ్య కళ్ళుతెరిచి ఇక చాలు నన్ను  నిద్రపోనివ్వండి అని చెల్లి , వాడి బుగ్గపై తియ్యని కోపంతో ముద్దుపెట్టి మళ్లీ నా గుండెలపై నిద్రపోయింది .
ముగ్గురమూ సంతోషంతో నవ్వుకుని లవ్ యు లవ్ యు లవ్ యు ........ అంటూ ముద్దుపెట్టబోయి బుజ్జిఅక్కయ్య స్వీట్ వార్నింగ్ గుర్తుకొచ్చి తియ్యని నవ్వుతో ఆగిపోయాము . 

 బుజ్జిఅక్కయ్యతోపాటు నా గుండెలపై వాలిపోయి , అన్నయ్యా ......... అక్కయ్య గురించి ఏమితెలుసుకున్నారో చెప్పండి నాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగింది .
చెల్లీ .......... నువ్వు తట్టుకోలేవురా ...........
అందుకే అడుగుతున్నామురా ........... ఆ శిక్ష మాకూ పడాలికదా , ఆ బాధను మేమూ అనుభవించాలి . మన ప్రాణమైన అక్కయ్య ఇక్కడ బాధలు పడుతోంటే మనం హైద్రాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నాము అని కళ్ళల్లో చెమ్మతో నేను అంటీతో పలికిన మాటలే కృష్ణగాడూ చెప్పడంతో , 
చెల్లీ , రేయ్ ......... ప్రక్క ఇంటిలో రాధ అంటీ ఉంటున్నారు ఆ ఇళ్లకు ఓనర్ అని ఆమెకు చుట్టుప్రక్కల ఉన్నవారందరికీ అక్కయ్య అంటే ఎంత ఇష్టమో చెప్పి , అక్కయ్య ఈ 17 సంవత్సరాలూ ఎన్ని కష్టాలు , ఎన్ని బాధలు పడ్డారో గంటసేపు చెప్పాను .
ఆ గంటసేపు మా ముగ్గురి కళ్ళల్లో , నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్య కళ్ళల్లోనూ కన్నీరు ఆగనేలేదు ఇద్దరూ నా జర్కిన్ చిరిగిపోయేలా పట్టుకుని చలించిపోతున్న హృదయంతో విలవిలలాడిపోయారు . అన్నయ్యా ......... వాడు అక్కయ్య జీవితంలోకి ఇక అడుగుపెట్టకూడదు. రేయ్ మామా ఆర్డర్ వెయ్యి ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అని కట్టలు తెంచుకున్న కోపంతో చెప్పాడు .
చెల్లీ .......... ఆమాట మన అక్కయ్య నోటి నుండి రావాలి , అక్కయ్యే సంతోషంతో మన వెంట రావాలి ........... ఈరెండూ తప్పో ఒప్పో నాకు తెలియదు , మన అమ్మవారే మనల్ని ముందుకు నడిపిస్తుంది అంతవరకూ మనం ఇక్కడే ఉండబోతున్నాము అనిచెప్పాను .
రేయ్ మామా ........... ఇంకా వాడి గురించి తప్పూ ఒప్పు అని ఆలోచిస్తున్నావా ........ , ఈ విషయం మన పెద్దయ్యకూ ఊరివాళ్లకు తెలిసిందంటే వాడితోపాటు క్షమించు మీ నాన్నకానీ నాన్నను కూడా వదిలిపెట్టరు . రేపు ఉదయమే అమ్మ జాడను కనిపెట్టడం మొదలెడతాను ఆ సంగతి నాకువదిలెయ్యి .
రేయ్ మామా ........... అక్కయ్యను వాళ్ళు ఇలాచూస్తే తట్టుకోలేరు నేను చెప్పేంతవరకూ , అక్కయ్య పెదాలపై స్వచ్ఛమైన ఏ చిన్న బాధాలేని నవ్వుని చూసేంతవరకూ ఆ బాదని మనం మాత్రమే అనుభవిద్దాము అనిచెప్పాను .
నీ ఇష్టమే మా ఇష్టం రా .......... కానీ వాడుకానీ నాకు ఈ చుట్టుప్రక్కల కనిపిస్తే కసబ్ గాడు కనిపిస్తే ఎలా కాల్చిపడేస్తామో అలా కాల్చిపడేస్తాను అని ఉద్వేగంతో చెప్పాడు.

రేయ్ మామా ........... ఏంట్రా ఏమీ మాట్లాడవు , అక్కయ్యా మరియు పిల్లలు కూడా ఏమాత్రం బాధపడరు అని అంటీనే చెప్పారన్నావు కదరా ........, రేయ్ అలాంటివాడు అక్కయ్య జీవితంలో పిల్లల జీవితంలో ఉండనే కూడదు . సరే అక్కయ్య మాటకోసం ఎదురుచూస్తాను . అక్కయ్యను ఏమాత్రం బాధపెట్టకూడదు అనే కదా ........ నీ ఇష్టం రా మామా .......... 
లవ్ యు రా , లవ్ యు చెల్లీ అని అక్కయ్య నోటి నుండి చిన్న మాట రానివ్వరా .......... వాడికి గన్ ఎందుకురా .......... కేవలం వాడివల్లనే 90% కష్టాలను అనుభవించింది ఇప్పటికీ అనుభవిస్తూనే ఉంది అక్కయ్య అని ఉద్రేకంతో బదులిచ్చాను . 
ఈ మాట అన్నావురా చాలు .......... రేయ్ కృష్ణా అక్కయ్య మనసులోని మాటను బయటకు పెట్టించే బాధ్యత నీదే , 
నాధికూడా నాన్న ............ మీరు వాడిని కొట్టేటప్పుడు నన్నుకూడా పిలవండి . అక్కయ్యనూ మరియు మహిని బుజ్జిఅమ్మ జానకిని బుజ్జితమ్ముడు మహేష్ ను చాలాసార్లు కొట్టాడంట ........ ఈ విషయం తమ్ముడికి కూడా తెలియదు మరింత బాధపడతాడని అంటీ చెప్పలేదు . నాకు బుజ్జిఅమ్మ చెప్పి బాధపడింది . ఒకసారి తోసినప్పుడు తల గోడకు తగిలి రక్తం కూడా వచ్చిన గుర్తుని చూపించింది . నాన్నా ............ వాడిని ఏదో ఒకటి చెయ్యాలి , అన్నయ్యకు ఈ విషయం తెలిస్తే గుండె పగిలిపోతుంది అని నిద్రలోనే కన్నీళ్లను కారుస్తూ బాధతో కలవరించింది .
నేను బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని టేబుల్ పై ఉన్న క్యారెమ్ బోర్డ్ ను కాలితో తంతే అల్లంత దూరంలో ముక్కలుముక్కలై పడిపోయింది . కుర్చీలను ముక్కలుముక్కలు చేసేసాను .
కృష్ణగాడు కోపం తట్టుకోలేక కాంపౌండ్ గోడను కొడితే మొత్తం బీటలువారిపోయింది . మా ఇద్దరి కోపం చల్లారడానికి చాలా సమయమే పట్టింది . 
చెల్లి అయితే మేమిద్దరమూ వాడిపై అంతే కోపంతోనే ఉండాలని ఏమాత్రం ఓదార్చకుండా భద్రకాళీలా కోపాన్ని ప్రదర్శిస్తోంది .

ఇంతలో సెక్యూరిటీ అధికారి పెట్రోలింగ్ వెహికల్ రావడం అందులోనుండి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి రోడ్ పై చిందరవందర అయి ఉండటం చూసి కోపంతో మావైపు వచ్చారు . కృష్ణగాడిని చూసి సెల్యూట్ చేసి సర్ ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు . 
నథింగ్ ......... we' ll take care అని బదులివ్వడంతోపాటు వాడే స్వయంగా రోడ్ ను శుభ్రం చేయబోతే కానిస్టేబుల్స్ సహాయం చేసారు . 
సర్ .......... బుల్లెట్ ట్రేస్ చేసి ఇప్పుడే ఇంటి కాంపౌండ్ లోపల ఉంచాము అనిచెప్పి ముందుకు వెళ్లిపోయారు . 
రేయ్ మామా ......... అంటూ బుజ్జిఅక్కయ్యతోపాటు నన్ను కౌగిలించుకుని , వాడిని చూసిన నెక్స్ట్ మినిట్ నన్ను ఎవరూ ఆపలేరురా ........ అని ఉద్వేగంతో చెప్పాడు .
ఈ మాటలు విన్నాక మనం ఏంటిరా చెల్లి కూడా ఆగదు అని అందరమూ కోపంతో ఊగిపోయాము .

అన్నయ్యా .......... నాకుకూడా అక్కయ్యను , మహి మరియు పిల్లలను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది . ఇలా మేల్కొని అక్కయ్యను చూడకుండా నేను ఉండలేను . నేను నిద్రపోతాను 4 గంటలవరకూ నన్ను డిస్టర్బ్ చేయకండి అనిచెప్పింది .
చెల్లీ .......... ఇంటికి ..........
నో వే ......... అక్కయ్యను చూసేంతవరకూ నేను ఇక్కడ నుండి కదిలేది లేదు కారులోనే పడుకుంటాను అనిచెప్పింది . 
పెదాలపై చిరునవ్వుతో కృష్ణగాడికి సైగచెయ్యడంతో కారుని స్ట్రీట్ లైట్ కింద పార్క్ చేసి , కారులో వెనుక ఉన్న గిఫ్ట్ ను ముందు ఉంచి కాళ్ళు ఉంచెదగ్గర మొత్తం ఎయిర్ బెడ్ తో పడుకునేలా ఏర్పాట్లుచేశాడు .
లవ్ యు రా ......... అని కారులో పడుకుని , అన్నయ్యా మా బుజ్జిఅక్కయ్యను ఇటివ్వు ఎంతసేపు అలానే ఎత్తుకుంటారు అని చేతులను చాపింది .
బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , అందించబోతే జర్కిన్ ను గట్టిగా పట్టేసుకొని , నేను నా తమ్ముడితోనే పడుకుంటాను అని మరింతగా అతుక్కుపోయింది . 
అమ్మ అవసరమే లేదు మా బుజ్జిఅక్కయ్యకు అని బుగ్గపై గిల్లేసింది .
చెల్లీ .......... నేనుకూడా ఈ రాత్రివరకే అవసరం , రేపటి నుండి వాళ్ళ అక్కయ్యను వదిలి ఎవ్వరిదగ్గరకూ రాను అని తెగేసి చెప్పేసింది మా బుజ్జిఅక్కయ్య . ఉదయం 4 వరకే నా గుండెలపైన కూడా ఉండబోయేది , మా బంగారం బుజ్జిఅక్కయ్యా నువ్వు అంటూ ముద్దుల వర్షం కురిపించబోయి .........
అన్నయ్యా ...........
I know i know ........ అని ఒకే ఒక ప్రాణమైన ముద్దుని పెట్టి , స్వేటర్ సరిచేసి గుండెలపై హత్తుకొని కృష్ణగాడితోపాటు కారులో కూర్చోబోయి ఒక్కనిమిషం రా అని వైజాగ్ మహేష్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి గర్వపడుతూ చెప్పి , ఈ సంతోషాన్ని తనకు వెంటనే తెలపాలి అని డోర్ వేసి కారు ఇంజిన్ పై కూర్చుని కాల్ చేసి , ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు రియల్లీ రియల్లీ sooooo sorry మహేష్ అని అక్కయ్యను చూసాము అన్న అమితమైన సంతోష విషయం చెప్పి మా ఆనందం కోసం దేవతల్లాంటి అమ్మావాళ్ల ప్రార్థనలు దీవెనలు ఒక్కరోజులోనే ఫలించినందుకు మాటల్లో చెప్పలేని సంతోషం కలుగుతోంది మహేష్ .......... ఉదయం వచ్చి స్వయంగా చెబుదామనుకున్నాను అంతవరకూ నీకు చెప్పకుండా ఆగలేకపోయాను . మా చెల్లీ నా ప్రాణమిత్రుడి తరువాత నీకే తెలుపుతున్నాను . నీ మాటలే నిజమయ్యాయి థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ..........1000 సార్లు థాంక్యూ sooooooo మచ్ అనిచెప్పాను . అతడు కూడా చాలా చాలా ఆనందించాడు . త్వరలోనే మా కుటుంబంతోపాటు వచ్చి కలుస్తాను మహేష్ గుడ్ నైట్ అని సంతోషంతో చెప్పాను.
మహేష్ మహేష్ .......... ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అడ్రస్ ఎక్కడ అని వైజాగ్ మహేష్ అడిగారు .
మహేష్ మా అక్కయ్య ఇంటిముందు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు మళ్లీ చూస్తామా అని కళ్ళల్లో వొత్తులేసుకుని వేచిచూస్తున్నాము . అడ్రస్ వచ్చేసి  *********** చెప్పగానే కాల్ కట్ అయిపోయింది .
Like Reply
పెదాలపై చిరునవ్వుతో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకొనివెల్లి కారులోకూర్చుని జోకొడుతున్న 20 నిమిషాలకు ఒక కారువచ్చిఆగింది . అందులోనుండి చంద్ర మరియు వైజాగ్ మహేష్ దిగడం చూసి , 
రేయ్ మామా ........... నేను చెప్పానే మహేష్ చంద్ర అని వాళ్లే అని ఇద్దరమూ కారుదిగి ఎదురువెళ్లాము .
మహేష్ ........... ఎంత పెద్ద సంతోషాన్ని చెప్పారు . స్వయంగా మీ సంతోషాన్ని చూడకుండా ఉండలేకపోయాను అందుకే వచ్చేసాము . మీరు ఇప్పుడు గాలిలో తెలిపోతున్నారనుకుంటాను అని చంద్రతో హైఫై కొట్టుకుని వైజాగ్ మహేష్ ఆనందిస్తుంటే ,
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ , చంద్ర ...........అని బుజ్జిఅక్కయ్య ఉండగానే ఇద్దరినీ అమాంతం కౌగిలించుకున్నాను . ఉదయం మీ దేవతలు దీవించారు అతిత్వరలోనే అక్కయ్యను కలుసుకుంటారు అనిచెప్పారు . సాయంత్రం లోపు మా జీవిత గమ్యాన్ని చేరుకున్నాము . ఈ మొత్తం క్రెడిట్ మా బుజ్జిఅక్కయ్యకూ, మీకే చెందాలి అని సంతోషంతో చెప్పాను .

మీ మనసు స్వఛ్చమైనది మహేష్ .......... పైనున్న దేవుడు మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని కరుణిస్తారు . మీ ప్రాణమైన బుజ్జిఅక్కయ్య ఈ బుజ్జి ఏంజెల్ గారేనా ....... may i అని అడిగారు వైజాగ్ మహేష్ .
కాస్త కంగారుపడుతూనే అందించాను . 
నా జర్కిన్ వదిలేసి వైజాగ్ మహేష్ గుండెలపై గువ్వపిల్లలా వొదిగిపోయి పడుకోవడం చూసి షాక్ తో ఇద్దరమూ చేతులను పైకెత్తి కొట్టుకుని కౌగిలించుకున్నాము .

మహేష్ గారూ మీరు చాలా చాలా అదృష్టవంతులు తెలుసా ........ సొంత తండ్రిని వదిలెయ్యండి వాళ్ళ అమ్మ పిలిస్తేనే ఘాడమైన నిద్రలో ఉన్నప్పటికీ వెళ్ళలేదు . మీదగ్గరికి అలా వచ్చేసింది . రేయ్ మామా .......... వైజాగ్ మహేష్ గురించి ఇక ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు , మహేష్ గారు మీరు కేక గ్రేట్ అంతే అని కృష్ణగాడు ఆకాశానికి ఎత్తేస్తున్నాడు .
నేను : మహేష్ ........ చెప్పలేదు కదూ వీడు నా ప్రాణమిత్రుడు ..........., కారులో నా. ప్రాణమైన సిస్టర్ పడుకున్నారు . వాళ్ళ అక్కయ్యను చూడందే ఇక్కడ నుండి కదలమని అలా .........
వైజాగ్ మహేష్ :  కృష్ణ .......... కృష్ణగారూ IPS .........అని చేతులను కలిపాను . 
కృష్ణ : చంద్ర గారూ ......... అని చేతులు కలిపాడు .
వైజాగ్ మహేష్ : కృష్ణ ......... విశ్వ సర్ ను మీట్ అయ్యారా ....... 
కృష్ణ : మహేష్ ......... వారే ఇక్కడ నాకు చీఫ్ , చాలా మంచివారు .
చంద్ర : విశ్వ సర్ కు మేమంటే ప్రాణం , ఈసారి మాట్లాడి చూడండి అనిచెప్పాడు .

 కారులో పడుకున్నారా అంటూ వైజాగ్ మహేష్ చంద్ర వైపు సైగచెయ్యగానే మొబైల్ తీసి మాట్లాడుతూ అలా ముందుకువెళ్లాడు .
మేము ఆనందాన్ని పంచుకుంటుండగానే బస్ వచ్చి ఆగింది . అందులోని డ్రైవర్ ను రమేష్ అని పరిచయం చేసి , రమేష్ .......... ఇక్కడ సైడ్ కు నిలబెట్టమని సైగచేశారు వైజాగ్ మహేష్ .......... 
మహేష్ , కృష్ణ .......... ఇది బస్ కాదు మినీ హౌస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి . మీదగ్గరే ఉంటుంది అని తాళం అందించి , ఇక్కడే ఉండేవాళ్ళము కానీ రేపటి నుండి exams ఇంకా చదవడమే మొదలెట్టలేదు అని అందరమూ నవ్వుకుని గుడ్ నైట్ చెప్పేసి వైజాగ్ మనదే ఎటువంటి సహాయం కావాలన్నా ఒక్క కాల్ చెయ్యండి మీ ముందు వాలిపోతాము అని ముగ్గురూ వెళ్లిపోయారు .

బస్ కీస్ కృష్ణగాడికి అందించి వాడివెనుకే బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని మరొకచేతితో అంటీ లోన్ ఫైల్ ఉంచుకుని బస్ ఎక్కాము . లైట్స్ లైట్స్ ........ అంటూ మొబైల్ టార్చ్ వెలుగులో చూసి అన్నీ స్విచ్స్ on చేసాడు . బస్ లోపల లైట్స్ అన్నీ వెలుగడంతో చూసి ఆశ్చర్యపోయాము . టీవీ , ఫ్రిడ్జ్ , AC , సోఫాస్ ......... కాస్త లోపలికివెలితే 10 మందికిపైగా పడుకునే వీలుండే బెడ్స్ ఇంకా ముందుకువెలితే బాత్రూమ్ ......... ఇలా ఒక ఇంటికి కావలసిన అన్నివసతులూ ఉండటం చూసి థాంక్స్ మహేష్ అని తలుచుకున్నాము . రేయ్ మామా .......... అని సైగచెయ్యడం ఆలస్యం .......
పరుగునవెళ్లి కారులో హాయిగా పడుకున్నా చెల్లిని ఎత్తుకునివచ్చి లోపల బెడ్ పై పడుకోబెట్టి కప్ బోర్డ్ నుండి దుప్పటి అందుకొని భుజాలవరకూ కప్పాడు . 
ఎక్కడ ఉన్నానో తెలియనప్పటికీ లవ్ యు రా ......... ఇప్పుడు హాయిగా ఉంది అని వాడిచేతిని గుండెలపై హత్తుకొని ముడుచుకుని పడుకుంది చెల్లి .
ఫ్రిడ్జ్ లోని కూల్ డ్రింక్ తీసుకుని తాగుతూ అక్కయ్య ఇల్లు కనిపించేలా విండో దగ్గర కూర్చుని జోకొడుతూ లోన్ ఫైల్ చూసాను . 55 lakhs జేసీబీ కోసం ఫైనాన్స్ కంపెనీ నుండి 40 lakhs లోన్ తీసుకున్నారు . తాకట్టుగా ఇంటిపత్రాలను ఉంచారు . ఇప్పటివరకూ 15 lakhs నెలనెలా 50వేలు చొప్పున ఒక్క నెలకూడా వదలకుండా సమయానికి కట్టేశారు . 
అక్కయ్యను అప్పుడప్పుడూ ఆదుకుంటూ , ధైర్యం ఇస్తూ 17 సంవత్సరాలుగా తోడుగా ఉంటున్న రాధ అంటీకి ఈమాత్రం సహాయం కూడా చేయకపోతే ఎలా రా మనం అని చెల్లిని పడుకోబెట్టి వచ్చిన కృష్ణగాడితో డిస్కస్ చేసాను .
రేయ్ మామా ........... మనం చెయ్యాల్సినది అంటీ చేసారురా ఏమిచ్చినా రుణం తీరనిది ఇక ఏమాత్రం ఆలోచించకుండా మొత్తం కట్టెయ్యరా అని వాడి అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చెయ్యడంతో 30 lakhs అవ్వడంతో , ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ వాట్సాప్ కు వాళ్ళ రికవరీ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ చేసిన భాగోతపు వీడియో ని అంటీ ముఖం కనిపించకుండా బ్లర్ చేసి పంపించి అర్ధరాత్రి సమయంలో కాల్ చేసాను . 

హలో .......... ఈసమయంలో ఎవరురా డిస్టర్బ్ చేసేది అని విసుక్కున్నాడు . 
మేనేజర్ ........... ఇప్పుడే ఒక వీడియో పంపించాను చూసి కాల్ చెయ్యండి అని కట్ చేసాను .
5 నిమిషాలకే వాడి నుండి రిటర్న్ కాల్ వచ్చింది . రేయ్ మామా వాడికి వీడియో స్టార్టింగ్ లోనే మొత్తం అర్థమైపోయినట్లు ఉందిరా అని లిఫ్ట్ చేసాను .
సర్ ..........ఈ వీడియో బయటకువస్తే మా ఫైనాన్స్ కంపెనీ మూతపడిపోతుంది సర్ , అలాంటి ఇద్దరు నీచుల వలన ఎంతోమంది స్టాఫ్ రోడ్డున పడతారు సర్ ..........,మీకేమీ కావాలి అనిఅడిగారు . 
వెంటనే *********అడ్రస్ కు రావాలి అనిచెప్పాను . 
రేయ్ మామా........... జనాలతో వస్తాడేమో అని కృష్ణగాడు షర్ట్ మడతపెట్టుకున్నాడు.
అలా రౌడీలతో వస్తే ఉదయానికల్లా వాడి ఫైనాన్స్ కంపెనీ రోడ్డుమీద ఉంటుంది . మన స్టైల్ లో వచ్చినవారంతా హాస్పిటల్లో పడతారు అని నవ్వుకున్నాము .
సర్ దగ్గరే 15 నిమిషాలలో వస్తాను అని కారులో ఒక్కడే వచ్చాడు . కృష్ణగాడు డోర్ దగ్గరకువెళ్లి లోపలికి పిలిచాడు . 
సర్ ........ ఎంతోమంది కంపెనీపై ఆధారపడి బ్రతుకుతున్నారు . మా ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ పదవిలో ఉన్నారని ఏమిచేసినా చెల్లుతుంది అని ఇలాంటి ఒకరిద్దరి వలన అంతమంది జీవితాలు నాశనం అవ్వకూడదు . మీకాళ్ళు పట్టుకుంటాను సర్ please please please ఇప్పుడు నన్ను ఏమిచెయ్యమంటారో చెప్పండి . మా చైర్మన్ గారు చాలా మంచివారు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు , ఈ వీడియో బయటకువస్తే ఆయన పరువు మొత్తం పోయి సూసైడ్ అట్టెంప్టు చేసుకున్నా చేసుకుంటారు . ఇప్పుడే వాళ్ళిద్దరినీ డిస్మిస్ చేస్తున్నాను . ఇంకా అలాంటివారు ఎంతమంది ఉన్నారో సీక్రెట్ గా ఎంక్విరీ చేయించి మా కంపెనీ నుండి పంపించేస్తాను . మా కంపెనీ నుండి మరెవ్వరూ కాల్ మనీ బారిన పడకుండా నేనే స్వయంగా చూసుకుంటాను అని మాట ఇచ్చారు .

ఈ మేనేజర్ ఇలా మాట్లాడుతుంటే నాకు మా మేనేజర్ గారే గుర్తుకువచ్చారు . మా కంపెనీనే గుర్తుకువచ్చింది . మా స్టాఫ్ గుర్తుకువచ్చారు . మా చైర్మన్స్ గుర్తుకురావడంతో కూల్ అయిపోయాను .
కృష్ణగాడు గూగుల్లో సెర్చ్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్ ఇదే ఫస్ట్ రా మామా అనిచెప్పాడు.
ఎవరో ఇద్దరు తప్పు చెయ్యడం వలన కంపెనీ తప్పుగా చూడకూడదు కాబట్టి వదిలేస్తున్నాము . ఫైల్ అందించి మొత్తం ఇప్పుడే పే చేసేస్తున్నాము . మొత్తం క్లోజ్ చేసేయ్యండి అనిచెప్పాను .
ఫైల్ చూసి శ్రీధర్ గారికా ఇలా జరిగింది . నా తరుపున extremely sorry సర్ ఆయన గురించి తెలుసుకుని మేమే ఇంటికివెళ్లి బ్రతిమిలాడి లోన్ ఇచ్చాము సర్ .....
...., నేరుగా నాకే తెలిపి ఉంటే రెండు నెలలు ఏంటి సర్ ఎన్ని నెలలైనా సమయం ఇచ్చేవాళ్ళము . సర్........... ఆయన మా కంపెనీలో ఫైనాన్స్ తీసుకోవడం వలన జనాలకు నమ్మకం ఏర్పడి చాలా పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీలతో పోటీపడటం స్టార్ట్ అయ్యింది . అటువంటి వారికి మా తరుపున బాధకలగడం క్షమించరాని నేరం . వారిని స్వయంగా కలిసి కంపెనీ తరుపున క్షమాపణలు చెబుతాము . మామూలుగానే రూల్స్ ప్రకారం నెలనెలా కట్టుకుంటూ రండి అని చెప్పారు .
మేము మొత్తం అమౌంట్ పే చేస్తున్నట్లు ఆయనకూ తెలియదు . ఆయన కుటుంబం మాకు 17 సంవత్సరాలుగా చేస్తున్న సహాయానికి ఇలా రుణం తీర్చుకోవాలని ఆశపడుతున్నాము అని వివరించడంతో , 
మీ ఇష్టం సర్ అని తన కారులోనుండి లాప్టాప్ తీసుకొచ్చి క్లియర్ చేసేసి మా మెయిల్ కు పంపించారు . 
సర్ ......... 5 lakhs ఇంట్రస్ట్ తీసేయాలి కాబట్టి 20 lakhs కడితే సరిపోతుంది అనిచెప్పాడు .
వెంటనే అకౌంట్ నెంబర్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేసాను .  
సర్ రేపు ఉదయమే క్లియరెన్స్ ఫార్మ్స్ తీసుకొచ్చి కంపెనీ తరుపున మేడం గారికి క్షమాపణలు చెబుతాను అంతవరకూ వీడియో డిలీట్ చేయకండి . ఇలాంటి వీడియోలు దొరికితే బ్లాక్మెయిల్ చేసి కోట్లు డిమాండ్ చేస్తారు , కానీ మీరు మాకే డబ్బులు పే చేశారు సెల్యూట్ సర్ ............ మిమ్మల్ని మా కంపెనీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది అని వెళ్లిపోయారు .
ఆ సమయంలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే స్వాతి , ఎత్తి చెవిదగ్గర పెట్టుకున్నాను .
Hi మహేష్ .......... ఎలా ఉన్నావు ఉదయం నుండీ ఇప్పటివరకూ వందకుపైనే మెసేజెస్ పెట్టాము ఇద్దరమూ రిప్లై లేదు......... నిన్ను చూడకపోతే కనీసం నీతో మాట్లాడకపోతే మాకు .......... బాధతో ....... నిద్రకూడా రావడం లేదు .
స్వాతి అదీ .........  
 అయినా ఏమీ పర్లేదు బిజీగా ఉండి ఉంటావు నువ్వు ఏమిచేసినా మాకు ఇష్టమే . సాయంత్రం కృష్ణ అక్కయ్యకు కాల్ చేస్తే బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ఉదయం అనగా వెళ్లి సాయంత్రం అయినా రాలేదు అని తెలిసింది . ముఖ్యమైన పనే అయిఉంటుంది అని మేము డిస్టర్బ్ చెయ్యలేదు . మెసేజెస్ వలన ఇబ్బంది పడి ఉంటే లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ .
మహేష్.......... రేపు ఉదయం 11 గంటలకు లండన్ వెళుతున్నాము . సర్టిఫికెట్స్ తీసుకుని వచ్చేస్తాము .
స్వాతి ఎవరెవరు వెళ్తున్నారు .
 లవ్ యు మహేష్ .........ఇందుకే కదా నువ్వంటే పిచ్చి మాకు లవ్ యు లవ్ యు soooooo మచ్ , భయపడకు మా డేరింగ్ అండ్ డాషింగ్ పిన్నితోపాటు వెళుతున్నాము . అక్కడెలాగో మా బాబాయ్ ఉన్నారుకదా అని సంతోషంతో బదులిచ్చింది .
 స్వాతి ........... ప్రసన్నా కూడా ప్రక్కనే ఉందా ........... స్వాతి , ప్రసన్నా ......... హ్యాపీ జర్నీ , రేపు ఫ్లైట్ సమయానికి నేనే స్వయంగా కాల్ చేస్తాను ఇప్పుడు హాయిగా నిద్రపోండి అనిచెప్పాను .
మహేష్ లవ్ యు ......... బుజ్జిఅక్కయ్య నీ గుండెలపైనే ఉండి ఉంటుందే అని ప్రసన్నా మురిసిపోతూ అడిగింది .
అవును ప్రసన్నా .......... ఉదయం నుండీ తిరిగి తిరిగి అలసిపోయి వాళ్ళ అమ్మ ఎత్తుకుంటానన్నా నో అని నా దగ్గరే హాయిగా పడుకుంది .
మా బుజ్జి ఏంజెల్ కు బోలెడన్ని లవ్స్ ......... అంటూ మురిసిపోతున్నారు . 
ఇప్పటికే ఆలస్యం అయ్యింది గుడ్ నైట్ - గుడ్ మార్నింగ్ అని ఇద్దరూ నవ్వుతూ చెప్పి కట్ చేశారు .

 అయ్యో గిఫ్ట్స్ కారులోనే మరిచిపోయానురా ........... మొత్తం వాల్యూ 14 లక్షలు రా అని ఒక పెద్ద కవర్ మరియు ఒక చిన్న కవర్ తీసుకొచ్చాడు .
రేయ్ మామా .......... ఒక్కొక్క డ్రెస్సే కదరా ..........
మన అక్కయ్యలాంటి అమ్మాయి అదే ఇప్పుడు తెలిసింది కదా ఆ అమ్మాయి ఎవరో కాదు మన మహి అని , తన మెడ బోసిగా ఉండటం చూసిన నీ చెల్లి దారిలోని జ్యూవెలరీ షాప్ ముందు ఆపింది . ఐదుగురూ బెస్ట్ ఫ్రెండ్స్ అందులోనూ మహి అంటే మిగతా నలుగురికీ ఎంత ప్రాణమో తెలిసి , మహితోపాటు ఆ నలుగురికీ ఒకే రకమైన బంగారు చైన్స్ తీసుకున్నామురా ఒక్కొక్కదాని బరువు నాలుగు నాలుగున్నర  తులాలు . ఇంకా బరువున్నవే తీసుకునేది నీ చెల్లి , ఇప్పుడు లేవు మేడం ఆర్డర్ ఇస్తే రేపు సాయంత్రం లోపు రెడీ చేస్తాము అనిచెప్పారు . 
నో నో నో .......... ఇప్పుడే కావాలి అని అవే గిఫ్ట్ ప్యాక్ చేయించి ఒక్కొక్క జ్యూవెలరీ బాక్స్ పై వాళ్ళ వాళ్ళ పేర్లను రాయించింది .
లవ్ యు రా మామా అని హైఫై కొట్టుకున్నాము .
రేయ్ మామా ......... ఈ ఐడియా నాదికాదు మీ చెల్లిది అని తలదించుకున్నాడు . 
లవ్ యు sooooo మచ్ చెల్లీ అని అరువబోయి , నిద్ర డిస్టర్బ్ అయితే బుజ్జిఅక్కయ్య కొట్టేస్తుందేమోనని నోటికి తాళం వెయ్యడం చూసి కృష్ణగాడు నవ్వుకున్నాడు .

రేయ్ మామా 2 గంటలు అవుతోందిరా ........... ఉదయం నుండీ ఇద్దరూ తీరికాలేకుండా ఉన్నారు , నువ్వు ఆ కలల వలన కొన్నిరోజులుగా సరిగ్గా నిద్రకూడాపోయిఉండవు , నిన్న రాత్రి ప్రయాణం కూడా చేసావు . 3:30 కి అలారం పెట్టుకుని ఈకొద్దిసేపైనా బుజ్జిఅక్కయ్యలా లోపలికివెళ్లి రెస్ట్ తీసుకోరా అనిచెప్పాడు కృష్ణగాడు .
ఈరోజే కాదురా ఇక 24/7 అక్కయ్యను కంటికిరెప్పలా మనలో ఎవరో ఒకరు కంటికి రెప్పలా చూసుకోవాలిరా అనిచెప్పాను . 
అయితే నేను నిద్రపోకుండా చూసుకుంటానురా నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోరా ........., రేపటినుండి అక్కయ్య సంతోషాన్ని చూసేంతవరకూ ఎలాగో నిద్రపోవు .
నువ్వుకూడా ఉదయం నుండీ డ్యూటీ చేసావు కదరా , సరిగ్గా చూస్తే నాకంటే నువ్వే రెస్ట్ తీసుకోవాలి . 
రేయ్ మామా ......... రేపు సాటర్డే , మర్నాడు సండే నాకు లీవ్ కాబట్టి రెండు రోజులూ ఫ్రీ రా కాబట్టి నువ్వు పడుకోరా .........
లేదు నువ్వు .......
లేదు నువ్వే ........ అని ఇద్దరమూ సౌండ్ రాకుండా నవ్వుతూ వాదులాడుకుని , రేయ్ మామా ఐడియా నువ్వొక గంట నేనొక గంట రెస్ట్ తీసుకుందాము సరేనా ........ ఎవరు ముందు అనేది టాస్ వేద్దాము అని కృష్ణగాడు చెప్పడంతో సరే అన్నాను .
కాయిన్ అందుకొని వాడి టెక్నీక్ తో గాలిలోకి ఎగరేసి చేతిలోనే దాచేసి అడిగాడు . 
వాడి నవ్వుని చూస్తుంటే ఎదిచెప్పినా వాడే గెలిచేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూనే హెడ్ చెప్పాను . తీసిచూస్తే వాడే గెలిచాడు .
Yes ......... అంటూ చేతినిపైకెత్తి గో మ్యాన్ గో అని పిలుచుకొనివెళ్లి చెల్లి ప్రక్కనే మరోజా పడుకోమని చెప్పి లైట్ ఆఫ్ చేసి వచ్చి అక్కయ్య ఇల్లు కనిపించే విండో ప్రక్కన కూర్చున్నాడు .
బుజ్జిఅక్కయ్యను గుండెలపై పడుకోబెట్టుకొని కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది . 
రేయ్ ..........3:30 వరకూ నిన్ను లేపేది లేదు అని నవ్వుకున్నాడు వాడు .
************

ఉదయం అలారం మ్రోగకముందే బుజ్జిఅక్కయ్య మేల్కొంది . అంత ప్రాణం అక్కయ్య అంటే మా బుజ్జిఅక్కయ్యకు . నా గుండెలమీదనుండే ప్రక్కనే ఉన్న మొబైల్ లో 3:25 అవ్వడం చూసి , తన అమ్మ నిద్ర డిస్టర్బ్ కాకుండా తమ్ముడూ తమ్ముడూ .......... అక్కయ్య మేల్కొనే సమయం అయ్యింది అని చెవిదగ్గర గుసగుసలాడింది. 
అంతే అక్కయ్యను రెండుచేతులతో చుట్టేసి బస్ బెడ్రూం నుండి బయటకువచ్చి మ్రోగడం మొదలెట్టిన అలారం ను వెంటనే ఆఫ్ చేసేసాను .
కృష్ణగాడు మేల్కొనే ఉన్నాడు . మమ్మల్ని చూసి hi మామా , గుడ్ మార్నింగ్ బుజ్జిఅక్కయ్యా ..........అనిలేచివచ్చి ముద్దుపెట్టాడు . చిరుకోపంతో వాడివైపు చూస్తుంటే , లవ్ యు ......... రేయ్ మామా హాయిగా నిద్రపట్టిందా ఇక నీఇష్టం ఎంతసేపైనా మేల్కొనే ఉండు .
తల్లీ ........ అక్కయ్య లేవడానికి ఇంకా అర గంట సమయం ఉంది . అంతవరకూ మీ అమ్మను వెచ్చగా కౌగిలించుకుని పడుకుంటాను , మీరువెళ్లి గిఫ్ట్స్ సంగతి చూడండి అని లోపలికివెళ్లి నా ప్రేమదేవతా ......... చలి చంపేస్తోంది అని దుప్పటిలో దూరిపోయి వెనకనుండి చుట్టేసాడు .
లవ్ యు రా ......... ఉమ్మా ........ వెచ్చగా ఉంది . ఇంతకీ టైం ఎంత అయ్యింది అని అడిగింది చెల్లి .
సరైన సమయానికి నిన్ను ఎత్తుకెళ్లయినా సరే మన అక్కయ్యను చూపిస్తాను నేనూ చూసి ఆనందిస్తాను అని ఇద్దరూ ఏకమయ్యేలా హత్తుకున్నారు .

తమ్ముడూ ........ ఒకటి పెద్ద గిఫ్ట్ మరొకటి చిన్న గిఫ్ట్ అని ఆశ్చర్యపోతోంది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిఅక్కయ్యా .......... నీ మహి మరియు మహి ఫ్రెండ్స్ కోసం మీ అమ్మానాన్నలు జ్యూవెలరీ కూడా తీసుకొచ్చారు .
Wow ...........
నేనూ ఇలానే సంతోషించాను బుజ్జిఅక్కయ్యా ......... అని బుగ్గపై గట్టిగా గుడ్ మార్నింగ్ ముద్దుపెట్టాను .
మా అమ్మ బంగారం ........... అని మురిసిపోయింది బుజ్జిఅక్కయ్య .
నా నుండి కిందకుదిగి తమ్ముడూ నువ్వు పెద్ద గిఫ్ట్ పట్టుకో , నేను ఈ చిన్న గిఫ్ట్స్ కవర్ పట్టుకుంటాను అని ఇద్దరమూ అందుకొని బస్ దిగివెళ్లి చప్పుడుచెయ్యకుండా మెయిన్ గేట్ తీసుకుని మెయిన్ డోర్ దగ్గరకువెళ్లి , పెద్ద గిఫ్ట్ కవర్ పై చిన్న గిఫ్ట్ కవర్ ఉంచి , మొక్కల నుండి పూలు కోసుకుని అందంగా అలంకరించి లోపల అలికిడి అవ్వగానే , సమయం చూసి ఇట్స్ టైం అంటూ చేతులు చాచిన బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని చప్పుడుకాకుండా గడియపెట్టేసి బస్ లోకి చేరిపోయి లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసేసాము . 

చెల్లెమ్మ అప్పటికే డ్రైవింగ్ సీట్ ప్రక్కనే ఉన్న సీట్లో కూర్చున్న కృష్ణగాడి ఒడిలో కూర్చుని అక్కయ్యను ఎప్పుడెప్పుడు చూస్తానా అని వెయ్యికళ్ళతో ఎదురుచూస్తోంది.
గుడ్ మార్నింగ్ అమ్మా - చెల్లీ ......... అంటూ వెళ్లి చెల్లిమీద కూర్చుని తన గుండెలపై వాలిపోయి , అమ్మా ......... జ్యూవెలరీ కూడా తెచ్చినందుకు లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టింది . నాన్నా - తమ్ముడూ....... మీకు కూడా ఉమ్మా ఉమ్మా ........... గుడ్ మార్నింగ్ అని ముద్దులుపెట్టి , మురిసిపోతున్న ఇద్దరికీ , అమ్మా నాన్నా ......... అక్కయ్య లేచినట్లున్నారు లోపల నుండి సౌండ్ వచ్చింది ఏక్షణం లోనైనా రావచ్చు అనిచెప్పింది.
అన్నయ్యా ........ అక్కయ్యను చూడబోతున్నాను అని అంతులేని ఆనందంతో నా చేతిని అందుకొని ప్రక్కనే కూర్చోబెట్టుకొని , కన్నార్పకుండా అక్కయ్య డోర్ వైపు చూస్తోంది .

 అంతలో అక్కయ్య ఇంటిబయట లైట్ వెలుగడంతో చెల్లి , బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ఏకంగా పెద్ద అద్దం దగ్గరకువెళ్లిపోయింది . కృష్ణగాడు చెల్లిప్రక్కనే చేరిపోయాడు . మెయిన్ డోర్ ఓపెన్ అవ్వడం - పెదాలపై చిరునవ్వుతో అక్కయ్య బయటకు రావడం చెల్లి చూసి , బుజ్జిఅక్కయ్యా - రేయ్ - అన్నయ్యా ........... మన అక్కయ్య అని ముఖంలో మాటల్లో వర్ణించలేనంత వెలుగుతో ఆనందబాస్పాలతో కన్నార్పకుండా కృష్ణగాడితోపాటు అలాచూస్తుండిపోయారు .
అక్కయ్య ఎందుకో ఆతృతతో ముందుకురావడం వలన గిఫ్ట్స్ కాలికి తగిలినా చూసి పట్టించుకోకుండా అంటీ ఇంటి డోర్ దగ్గరకుచేరి , అక్కయ్యా అక్కయ్యా ........ అని తలుపుతట్టింది .
అంటీ డోర్ తెరిచి వాసంతి ఏమైంది అని అడిగారు .
అక్కయ్యా ........ ఇంత ఉదయమే డిస్టర్బ్ చేసినందుకు sorry ........ నా బుజ్జిఅక్కయ్య ఉందా అని ఇంటిలోకి తొంగితొంగిచూస్తోంది .
వాసంతి నిన్ను ఇంతలా ఇంత సంతోషంతో ఏరోజూ చూడనేలేదు . ఇక్కడ ఎంత హాయిగా ఉందొ తెలుసా అని అమాంతం కౌగిలించుకుని , నీ బుజ్జిఅక్కయ్య రాత్రే వెళ్లిపోయారు కదా ..........
అంతే అక్కయ్య కళ్ళల్లో కన్నీరు ధారలా కారిపోతోంది . అధిచూసి మా అందరి సంతోషానికి అవధులు లేకుండాపోయాయి . బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచేసి హత్తుకొని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాము .
నేను మా అక్కయ్య అంతే అని బుజ్జిఅక్కయ్య ఎంజాయ్ చేస్తోంది .

వాసంతి వాసంతి .......... అని బుగ్గలను అందుకొని కన్నీళ్లను తుడిచి , వెళ్లిపోయారు అంటే వాళ్ళ బంధువుల ఇంటికివెళ్లారని అర్థం . ఏక్షణానైనా పై పోర్షన్ లో చేరడానికి వచ్చేస్తారు అనిచెప్పగానే , 
నా బుజ్జిచెల్లి వచ్చేస్తుందా వచ్చేస్తుందా ........... అయితే మొత్తం శుభ్రం చేసేసి రంగురంగుల రాంగోలీతో స్వాగతం పలుకుతాను అని చీపురు అందుకుంది .
వాసంతి నేనేమైనా ...........
వద్దు అక్కయ్యా ..........నా బుజ్జిచెల్లికోసం చేసే పనిలో నాకు అంతులేని సంతృప్తి అని పరవశించిపోతూ చకచకా పనులను పూర్తిచేస్తోంది .
రేయ్ కృష్ణా , అన్నయ్యా ........... నేనువెళ్లి అక్కయ్యను మహారాణిలా కూర్చోబెట్టి , ఆ పనులన్నీ ఉత్సాహంతో చేసేస్తాను అని చెల్లి వెళ్లబోతోంటే , 
అమ్మా .......... ఈ కొద్దిసేపూ ఆగు ఆ తరువాత ఆ పనులు ఏంటి అక్కయ్య ఇంటిపనులన్నీ నువ్వే చెయ్యాలి అని నవ్వుతూ బుజ్జిఅక్కయ్య చెప్పడంతో ,
లవ్ యు బుజ్జిఅక్కయ్యా .......... నువ్వు ఏది ఆర్డర్ వేస్తే అది మన అక్కయ్యకోసం సంతోషంగా చేస్తాను అని అని బుజ్జిఅక్కయ్యను గట్టిగా చుట్టేసి , అన్నయ్యా ......... మీరుచెప్పినట్లుగానే ఇక మనం ఎవ్వరమూ గుర్తురాము మన బుజ్జిఅక్కయ్యకు అని ముద్దులవర్షం కురిపించింది చెల్లి .
వాసంతి .......... ఈ కవర్స్ ఏంటి అనిచూసి లోపల గిఫ్ట్స్ ఉండటం వాటిపై మహి మరియు మహి ఫ్రెండ్స్ పేర్లు ఉండటం చూసి ఖచ్చితంగా మహేష్ , బుజ్జివాసంతేనని చుట్టుచూసి ఎదురుగా బస్ ఆగి ఉండటంతో నవ్వుకుని , మహి మహి ........ అంటూ లోపలికివెళ్లి నిద్రమబ్బులో ఉన్న మహిని ఏకంగా బయటకు పిలుచుకొనివచ్చి గిఫ్ట్స్ చూపించింది అంటేీ .
ఇంతవరకూ గిఫ్ట్స్ ఎరుగని మహికి నిద్రమొత్తం ఎగిరిపోయినట్లు ఉత్సాహంతో ఆశ్చర్యపోయి గిఫ్ట్స్ ను తాకి వాటిపై ఉన్న పేర్లను చూసి , అంటీ ఇక్కడ నా ఫ్రెండ్స్ పేర్లుకూడా ఉన్నాయి వాళ్ళు వచ్చాక ఓపెన్ చేద్దాము అని గిఫ్ట్స్ అక్కడే వదిలేసి అక్కయ్యకు సహాయం చేసింది .

అప్పుడప్పుడే కాలనీలో అక్కడక్కడా ఇంటిబయట ఉన్న లైట్స్ వెలిగి ఆడవాళ్లు ఇంటిపనులూ , మగవాళ్ళు షూస్ తో జాగింగ్ వెళుతున్నారు .
అక్కయ్యా , మహి ........మొత్తం ఊడ్చి నీళ్లతో శుభ్రం చేసి లెక్కపెట్టలేనన్ని చుక్కలతో అతిపెద్ద ముగ్గువేసి కలర్స్ తో అందంగా మార్చేసి , రంగురంగులతో welcome అని రాసి ఇద్దరూ సంతోషంతో కౌగిలించుకుని , మహి నా బుజ్జిచెల్లి ఎన్ని గంటలలోపు వస్తుంది అనిఅడిగింది అక్కయ్య .
అమ్మా ......... మా బుజ్జిఅమ్మకు కూడా తన అక్కయ్య అంటే ఇంతే ప్రాణం కాబట్టి ఏక్షణమైనా రావచ్చు , అంతలోపు తలంటు స్నానం చేసి దేవతలా తయారయ్యి రెడీగా ఉండాలికదా అని అక్కయ్యను లోపలికి పిలుచుకునివెళ్లేంతవరకూ చెల్లి ఆనందబాస్పాలతో చూసి పరవశించిపోయింది . అన్నయ్యా ........ ఈరోజు నాజీవితంలోనే అత్యంత సంతోషమైన రోజు అని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచేసి నా గుండెలపై వాలిపోయింది . 
అంటీ గేట్ క్లోజ్ చేసి బస్ వైపు సంతోషంతో చేతులను ఊపి స్వాగతం అంటూ చేతితో  సైగచేసి గిఫ్ట్స్ ను లోపలికి తీసుకువెళ్లారు .
రేయ్ మామా ........... అక్కయ్యను చూసాము ఇక అక్కయ్య కోల్పోయిన జీవితాన్ని అక్కయ్య పాదాల దగ్గరికి చేర్చాలి . చాలా మార్చాలి అక్కయ్యను అలా చూసి తట్టుకోలేకపోతున్నాను అని మా అందరినీ ఒకేసారి హత్తుకున్నాడు krishna .
 ఇక మన ఏకైక గమ్యం అదేకదరా ...............
Like Reply




Users browsing this thread: 24 Guest(s)