Thread Rating:
  • 12 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మాయ
Super update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
దీనమ్మ జీవితం....ఈ సైట్ లో ఇటువంటి కథ ఒకటి రాస్తారు అని అసలు ఊహించడం... చాలా రోజులు గా మీకు thanks చెబుదామని.... అద్బుతం...అనేది నాకు తెలిసి చాలా చిన్న మాట అవుతుంది... excellent...keep it up... brother... మనస్ఫూర్తిగా చెప్తున్నాను...????????.
[+] 4 users Like vdsp1980's post
Like Reply
Nice storyline nice up date
Like Reply
Excellent update
Like Reply
Update keka..
Like Reply
చాలా బాగా ఉంది ఈ కథ, మీ కధనం...తులసి వనం లో గంజాయి మొక్కలా (సామెతను తిరగేసా) మీ కథకు, కధనానికి అడిక్ట్ అయిపోయా. కథ బావుంది, రొమాంటిక్ సన్నివేశాలు చాలా బాగా ప్రొట్రైట్ చెస్తున్నారు, మరీ బరితెగించకుండా రాసిన సమాగమపు వర్ణనలు చాలా బావున్నాయి. ఇంత మంచి కథను అందిస్తునందుకు ధన్యవాదాలు, ఇలాగే కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
కిరీటి శైలుఇద్దరు బాగా కలిసి పోతున్నారు సునయన ఎప్పుడు వస్తుందో పెంచాలపురం కి..
 Chandra Heart
Like Reply
The story is just awesome.. the thing is story is more of a thriller than a romance. But you named romance brother... I'm not degrading the story. I already told you it's good. Sailu and kireeti kalisaaru ante akkada romance ni imagine chesukovatam kante.. Danni explain chesthe.. not the body parts the love. The connection between their eyes... Responding to thoughts, kissing her passionately.. worshipping every inch of her body.. that makes romance. Believe me this is a story worth great movie. But this is not romance. It's a thriller. I'm just doing constructive criticism. Don't take it negative brother.. thank you
[+] 1 user Likes Dreamer12's post
Like Reply
e thriller genre and romance combo enti writer garu. adiripoyindi, malli last lo twist okati pettaru assalu agalekunnam tondaraga update istharani edhuru chustham brother
[+] 1 user Likes Tom cruise's post
Like Reply
Super bro pichekkinchav super em jaruguthundoo ani waiting malli vigraham annaruu.. waiting for next update broo
Like Reply
Super update
[+] 1 user Likes Reva143's post
Like Reply
ఎప్పట్లాగే మీ కామెంట్లకు థాంక్స్. సస్పెన్స్ లో వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం వుండదు. కానీ నా వర్క్ షెడ్యూల్ మారేసరికి గత రెండు రోజులుగా ఏమీ రాయడానికి టైమ్ కుదరలేదు. ఒక రెండురోజుల లోపు అప్డేట్ తో మీ ముందుంటాను.
[+] 3 users Like mkole123's post
Like Reply
మాయ - 29

ఆరోజు మొదలుకొని కిరీటికి చిత్రవిచిత్రమైన కలలు వస్తున్నాయి. మొదట్లో ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టు అనిపించినా పోనుపోనూ వచ్చిన కలలే మళ్ళీ వస్తుంటే వాడికి ముందు ఆశ్చర్యం, తరువాత కొద్దిగా భయం కలగడం మొదలైంది. Lucid dreaming అంటే కలగనేవాడు తాను కలలో వున్నాను అనే స్పృహ కలిగివుండడం. కిరీటికి దాన్నేమంటారో తెలియకపోయినా వాడికి అనుభవమౌతున్నది అదే.   


దాదాపు సెప్టెంబరు నెలవరకూ ఎవ్వరికీ చెప్పకుండా ఆ కలల్ని ఓ ప్రేక్షకుడిలా చూస్తుండిపోయాడు. కొన్ని కలలు రోజుల తరబడి వాడిని వెంటాడేవి. కొన్ని మట్టుకు పొద్దుటికల్లా మర్చిపోయేవాడు. ఒక రోజు రాత్రి చాలాసార్లు వచ్చిన కలే మళ్ళీ వచ్చింది. కలలో ప్రపంచం అంతా ఏదో సిల్కు తెర వెనుక నుంచి చూస్తున్నట్టు మసక మసగ్గా వుంది. ఐతే ఎప్పట్లా కాకుండా ఈసారి కలలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి వాడికి. 

ఎవరి కళ్ళల్లోంచో తొంగి చూస్తున్నాడు కిరీటి. వాడు అనుభవిస్తున్న దానిని ఇంకొక రకంగా చెప్పలేము. ‘నేను కిరీటి’ అని ఎక్కడో ఏదో గొంతు వాడి మస్తిష్కంలో గోల పెడుతోంది. కానీ కళ్ళతో చూస్తుంటే తను వేరెవరో అన్నట్టు ఉన్నాడు. మొద్దుబారిన చేతులవంక, కిర్రు చెప్పులేసుకున్న కాళ్ళవంక చూసుకుంటుంటే ఓ గొంతు వినిపించింది. ఒక ముసలాయన తననేదో బతిమాలుతున్నాడు. తన చేతిలోని మూటని కిరీటికి (?) ఇవ్వజూపుతున్నాడు. ‘పది తరాలపాటు సల్లంగుంటాము నాయనా, నా మాట కాదనకు’ అంటూ బతిమాలుతున్నాడు.

మూట అందుకుందామని ఆటోమాటిగ్గా సిద్ధమయ్యాడు. కానీ వాడి కాళ్ళు, చేతులు వాడి స్వాధీనంలో లేవు. ముసలాయన చేతిలో మూట కోసం వెళ్దామని అనుకుంటుంటే వాడి కాళ్ళు వేరేవైపుకి లాక్కుపోతున్నాయి. ఆ పెద్దాయన ముఖంలోని భావాల్ని చూసి వాడికి బాధేసింది. కానీ వాడున్న శరీరం వెనుతిరిగి అలా వెళ్లిపోయింది. కిరీటి మనసు మాత్రం ముసలాయన చేతిలో వున్న మూట మీదే వుండిపోయింది. అయస్కాంతంలా మనసులో ఆలోచనలు దానివైపు లాగేస్తున్నాయి.

అక్కడితో ఆ కల ఆగిపోయి మరొకటి మొదలైంది. ఇది కలలా అనిపించలేదు వాడికి. ఇందాక వచ్చిన దానిలాగా ప్రపంచం సిల్కు తెర లోంచి చూసినట్టు లేదు. చాలా క్లియర్ గా వున్నాయి వాడికి కనిపిస్తున్న దృశ్యాలు. తిరుమల కొండ మీద తను, తన ముగ్గురు స్నేహితులు వున్నారు. ఇంతలో దృశ్యం మారింది. నలుగురు స్నేహితులూ ఒక ఆఫీసు లోంచి బయటకు వస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా వున్నారు. ఆఫీసు బైట బోర్డు మీద అక్షరాలు గుర్తుపట్టలేకున్నాడు. మళ్ళీ దృశ్యం మారింది. ఈసారి ఒక రైల్వే platform మీద కూర్చోని వున్నాడు తను. చేతి వేళ్లమీద ఒక coin ను తిప్పుతున్నాడు. హఠాత్తుగా సునయన వాడిని వెనకనుంచి వాటేసుకుంది. ఆ షాక్ కి కల చెదిరిపోయింది. 

మర్నాడు నిద్ర లేచేసరికి వాడికి తలంతా దిమ్ముగా వుంది. ఎవరితోనన్నా వాడికొస్తున్న ఈ కలల గురించి చెప్పితీరాలి అనుకున్నాడు. పిచ్చాడి కింద జమ కట్టకుండా తన మాట వింటుంది అనే నమ్మకంతో చివరికి శైలుతో ఈ విషయాన్ని పంచుకుందామని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా తయారయ్యి వచ్చి చూస్తే బయట వాళ్ళ నాన్న గోరుతో మాట్లాడుతున్నాడు. ‘ఏరా, ఇంత పొద్దున్నే వచ్చేశావే? ఇంకా చాలా టైముంది కదా కాలేజీకి’ అన్నాడు.

గోరు ఎందుకో చాలా agitated గా వున్నాడు. ‘ఓ సారి నా రికార్డ్ సూద్దువు నాకూడా రా’ అంటూ తనతో తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్లకుండా రంగ ఇంటివైపుకి దారితీశాడు. నిజానికి రికార్డులు క్రితం వారమే ఇచ్చేశారు. మాట్లాడాలి అనుకుంటున్న విషయం వాళ్ళ నాన్నకి తెలియకుండా ఈ ఎత్తు వేశాడని అర్ధం చేసుకున్న కిరీటి ఎదురు ప్రశ్నలు వేయకుండా వాడితో వెళ్ళాడు. ముగ్గురు మిత్రులూ ఓ చోట చేరాక గోరు అసలు విషయం చెప్పడం మొదలెట్టాడు.

‘కిట్టి ఉత్తరం రాశాడ్రా. శానా ఇబ్బందుల్లో ఉన్నాడంట. ఇంటికొత్తే చమడాలెక్కదీస్తారని భయపడతాండు. ఏటన్నా సెయ్యకపోతే ఆడు ఏమైపోతాడో అనిపిస్తాంది’ అనేసరికి మిగతా ఇద్దరూ నోరెళ్ళబెట్టారు. ‘ఎప్పుడొచ్చిందిరా ఉత్తరం? ఎక్కడున్నాడు, ఇదివరకెప్పుడైనా రాశాడా ఇలాగ?’ అంటూ ప్రశ్నలు గుప్పించారు. గోరు అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. ఇదే మొదటిసారి ఉత్తరం రాయడం ఇలాగ అన్నాడు. 

‘ఇంతకీ ఎక్కడున్నాడ్రా వాడు’ అని రంగ అడిగితే ‘తిరుపతిలో’ అన్నాడు గోరు. ఆ మాట వినగానే కిరీటి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కిట్టి రాసిన ఉత్తరాన్ని మిగతా ఇద్దరూ కూడా చదివారు. కిట్టి నిరాశ మొత్తం ప్రతిఫలిస్తోంది ఉత్తరంలో. ఇంటిని, మిత్రులని, ఊరిని ఎంత మిస్ అవుతున్నాడో స్పష్టంగా కనిపిస్తోంది అందులో. ఎట్టి పరిస్థితుల్లోనూ తనవారికి ఈ ఉత్తరం విషయం చెప్పొద్దని బతిమాలుకున్నాడు. చెప్పినా ఉపయోగం వుండదని, ఎక్కువ రోజులు తిరుపతిలో వుండనని రాశాడు.

‘రేయ్, ఇది మనం తేల్చే ఇసయం కాదురా, ఆడి అమ్మా అయ్యలకి సెబితే తిరపతి ఇడిసే ముందే ఆడ్ని అట్టుకొత్తారు’ అన్నాడు రంగ. అందరూ కలిసి కిట్టి ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవరూ లేరు. అందరూ కొన్ని రోజులు ఊరెళ్లారని తెలిసింది. ‘ఇప్పుడెట్టరా, ఆడు తిరపతి దాటితే మల్లీ ఎప్పుడు ఉత్తరం రాయాల, మనకెప్పుడు సేరాల?’ అన్నాడు గోరు. కిరీటి అదురుతున్న గుండెతో ‘మనం తిరుపతి వెళ్దామురా. వాడిని ఏదో రకంగా నచ్చజెప్పి ఇంటికి తీసుకొద్దాము’ అన్నాడు. పొద్దున వచ్చిన కల ఎంతవరకూ నిజం అవుతుందో చూడాలి అనుకుంటున్నాడు వాడు.

బ్రహ్మోత్సవాలు చూసొస్తామని ఇళ్ళల్లో చెప్పి ఒప్పించి తిరుపతి చేరారు మిత్రులు. వచ్చేముందు శైలుతో తన కలల విషయం చెప్పాలా వద్దా అని కొట్టుకులాడి తనకొచ్చిన కల ఎంతవరకూ నిజమౌతుందో చూసిన తర్వాత మాట్లాడదాం అని వాడికి వాడే సమాధానం చెప్పుకొని వచ్చాడు కిరీటి.

ఉత్తరంలో కిట్టి ఒక సత్రం అడ్రెస్ రాశాడు. అక్కడికి వెళ్ళి కనుక్కుంటే కొద్ది రోజుల క్రితం వరకూ ఒక నాటకాల కంపెనీ వాళ్ళు ఆ సత్రంలో వున్నట్టు తెలిసింది. ఇప్పుడెక్కడున్నారో తెలీదన్నాడు వాళ్ళతో మాట్లాడిన మనిషి. డీలా పడ్డా ముందు తిరుమల కొండకి పోయి దర్శనం చేసుకొని తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అనుకున్నారు. దర్శనం అయిపోయాక వేయి స్తంభాల మండపంలో కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచించుకుంటున్నారు. పక్కగా కూర్చున్న వాళ్ళు సాయంత్రం జరిగే సాంస్కృతిక ప్రదర్శనల గురించి మాట్లాడుకుంటున్నారు. నాటకం అనే పదం వినబడగానే చెవులు రిక్కించి విన్నారు మిత్రులు ముగ్గురూ. ప్రదర్శనలు ఎక్కడ జరుగుతాయో కనుక్కుని అక్కడికి పరుగెత్తి పోయారు.

అక్కడ జరిగిన నాటక ప్రదర్శనలో ఎట్టకేలకు కిట్టిని చూశారు. దాదాపు సంవత్సరం తర్వాత మిత్రుడ్ని చూసి ఆనందించారు. కానీ అదొక్కటే ఆనందం. ద్రౌపదీ వస్త్రాపహరణం నాటకంలో మళ్ళీ చిన్న భటుడి వేషంలో చూశారు వాడిని. డైలాగులు లేవు, మనిషి పీక్కుపోయి వున్నాడు. జనంలో కూర్చుని వున్న మిత్రులని గుర్తించలేదు వాడు. నాటకమైపోయాక వాడిని కార్నర్ చేశారు. స్నేహితుల్ని చూడగానే భోరున ఏడ్చాడు కిట్టి. తనవాళ్లు ఎవరన్నా వచ్చారేమో అని భయంగా చుట్టుపక్కల చూశాడు.

వాడిని సమాధానపరిచి తమతో లాక్కెళ్లారు. ముందు కాసేపు ఇంట్లోనుంచి ఇలా వచ్చేసినందుకు చీవాట్లు పెట్టారు ముగ్గురూ. కొంత సర్దుకున్నాక మెల్లిగా వాడినుంచి జరిగిన విషయాలు రాబట్టారు. నాటకాల మోజుతోనే రాములు గ్రూపుతో కలిసి పారిపోయాడు కిట్టి. ఇంట్లో చెబితే ససేమిరా ఒప్పుకోరని ఈ పని చేశానన్నాడు. మోజు వుంది కానీ దానికి తగ్గ టాలెంటు లేకపోయేసరికి నటకుడిగా కాక extra గా మిగిలిపోయానని చెప్పుకుని వాపోయాడు.
[+] 5 users Like mkole123's post
Like Reply
మాయ - 30

‘ఇలాగ ఇంటికి రాలేనురా. ఎంత మతిలేని నాకొడుకుని కాకపోతే ఇట్టాంటి పని సేత్తానురా! ఊరోళ్ళు, బంధువర్గంలో ప్రతి వోడు అమ్మని, అయ్యని మాటలతో ఎట్టా పీక్కుతింటాండారో ఊహకి అందట్లే. ఎట్టా సూపియ్యనురా నా ముఖం ఆళ్ళకి’ అంటూ బాధపడ్డాడు. ‘సమస్తరం నుండీ స్టేజీలు, సెట్లు కట్టడానికి, మేకప్పులు ఎయ్యడానికి వాడతాండు రాములు బాబాయి నన్ను. యేసాలకి పనికిరానని తెలిసి కూడా తరిమెయ్యలేదు. అదొక్కటే సంతోసం’ అంటూ మనసులో బాధనంతా బయటకు కక్కాడు.


తమతో రమ్మని శతవిధాల బతిమాలారు, భయపెట్టారు ముగ్గురూ. ససేమిరా రానని మొండికేసాడు కిట్టి. చాలాసేపు మౌనంగా వున్న తర్వాత రంగ ఒక మాటన్నాడు. ‘రేయ్, నిన్నీ నాటకాల బాచితో ఒదిలేది లేదు. నేనోటి సెబుతా. ఇన్నావా సరే వుంది. లేకపోతే నిన్నీడనుంచి ఎట్టా లాక్కుపోవాల్నో మాకెరికే’ అనేసరికి కిట్టి ఎట్టకేలకు తలూపాడు.

‘మదరాసులో మా మాయ్య ఓ డిస్ట్రిబ్యూటరు ఆఫీసులో పనిసేత్తన్నాడు. నిన్నాడకి తోలకబోయి ఆయన సేతిలో బెడతా. ఏదో ఒక పనిలో పెడతాడు. పనిలో చేరిన తర్వాత వారం తిరక్కుండా మీ అమ్మా, అయ్యలకి ఉత్తరం రాయాల నువ్వు. నే సెప్పింది సెప్పినట్టు జరక్కపోతే నా అంత సెడ్డ మడిసి ఇంకోడుండడు’ అనేసరికి కళ్ళనీళ్లతో వాడిని వాటేసుకున్నాడు కిట్టి.

మర్నాడే బయల్దేరి మద్రాసు వెళ్లారు మిత్రులు నలుగురూ. కిట్టిని ఇక రాములు నాటకాల కంపెనీ వైపుకి పోనీయలేదు. సరాసరి వాడిని తీసుకెళ్లి రంగ వాళ్ళ మామయ్య చేతిలో పెట్టారు. ఆయన ‘ఇప్పటికిప్పుడు అంటే ఈ కుర్రాడికి ఏం పని చూడాలిరా నేను’ అని ఆలోచనలో పడ్డాడు. కిట్టికి స్టేజీలు కట్టడాలు, మేకప్పులు వెయ్యడాలు తెలుసని విని ఏదో ఒక ప్రొడక్షన్ కంపెనీలో పని వేయిస్తానని మాట ఇచ్చాడు.

ఎట్టకేలకు మళ్ళీ తమ స్నేహితుడు తమ మధ్యకు వచ్చినందుకు, వాడి జీవితం పాడైపోకుండా ఓ దారిలోకి వచ్చినందుకు చాలా సంతోషించారు మిత్రులందరూ. అన్నాళ్ల ఆకలి ఒకేసారి తెలిసినట్టుంది అర్జెంటుగా ఎక్కడన్నా భోజనానికి పోదామన్నాడు కిట్టి. ఆఫీసులోంచి నవ్వుతూ తుళ్లుతూ బయటకు వచ్చారు నలుగురూ. ఎందుకో తలతిప్పి ఆఫీసు బయటున్న బోర్డు వంక చూశాడు కిరీటి. తమిళంలో రాసున్న బోర్డు చూడగానే వాడి గుండె ఝల్లంది. కలలో చూసింది చూసినట్టు రెండోసారి జరిగింది. అర్జెంటుగా ఇంటికి చేరిపోయి వాళ్ళ నాన్నతోనూ, శైలూతోనూ ఈ విషయాన్ని పంచుకోవాలని వుంది వాడికి.
  
కిట్టిని పనిలో చేరిన వెంటనే ఉత్తరం రాయమని మరీ మరీ చెప్పి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు మిగతా ముగ్గురూ. కిరీటి గుండె దడదడలాడుతోంది. సునయన కూడా నిజంగా కనిపిస్తుందా! వాడి కళ్ళు స్టేషన్ లోని ప్రతి ముఖాన్ని వెదికేస్తున్నాయి. చివరకు తమ ట్రైన్ వచ్చే platform వద్దకు చేరుకున్నారు. అక్కడా ఇక్కడా కొంతమంది జనాలు పక్కలు పరుచుకొని పడుకుని వున్నారు. కిరీటిని సామాన్లు చూస్తుండమని చెప్పి ఏమన్నా తినడానికి తీసుకొస్తామని వెళ్లారు గోరు, రంగ.

అదురుతున్న గుండెతో ఓ స్తంభాన్ని ఆనుకొని కూర్చుని జేబులోంచి ఓ coin బయటకు తీశాడు. మెల్లిగా దాన్ని వేళ్ళ మధ్యలో నాట్యమాడిస్తున్నాడు. గుండె టాప్ స్పీడ్ లో కొట్టుకుంటోంది వాడికి. కానీ సునయన వెనకనుండి వచ్చి వాటేసుకోలేదు. కలలో జరిగిన ఆ ఒక్క విషయం మటుకు జరగట్లేదు. మెల్లిగా ‘సునయనా’ అని పిలిచాడు. ఏమీ అద్భుతం జరగలేదు. నిరాశతో మరోసారి సునయన పేరు పిలిచాడు. పక్కగా పడుకున్న కొందరు కదలటం చూసి వాళ్ళని డిస్టర్బ్ చెయ్యటం ఇష్టం లేక అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కాసేపాగి తన స్నేహితులతో కలిసి ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు.  
              
కిరీటి అక్కడినుండి వెళ్ళిన కాసేపటికి అక్కడ ముసుగుతన్ని పడుకుని ఉన్న ఒక ముసలావిడ తన తలకిందున్న బాగ్ తీసుకొని కిరీటి ఎక్కిన రైలు వైపుకి బయల్దేరింది. ఇంతలో పహిల్వానుల్లాంటి కొంతమంది మనుషులు ఆ రైలుని గమనిస్తుండడం చూసి ఆమె ముఖంలో భయం కదలాడింది. మెల్లిగా పక్క platform మీదకు వెళ్లి అక్కడున్న హైదరాబాద్ వెళ్తున్న రైలు ఎక్కింది. T.C. సీటు వుండే గూడ్సు బోగీ ఎక్కి రైలు బయల్దేరేవరకూ ఎవరికంటా పడకుండా కూర్చుంది. ఆ ముసలావిడ వేషంలో వుంది మన సునయనే.

ఆమె మనసులో ఆనందం, భయం, విషాదం అన్నీ కలగలిసి గుండెని పిండేస్తున్నాయి. కిరీటి తన పేరు పిలవగానే లేచి వాడిని హత్తుకుపోవాలని, వాడితోపాటు వెళ్లిపోవాలని కలిగిన కోరిక ఆపుకోవడానికి తన willpower అంతా వాడాల్సి వచ్చింది. ఓ అయస్కాంత శక్తి ఏదో తనని వాడివైపు లాగేస్తుంటే దాన్ని fight చెయ్యడానికి తల ప్రాణం తోకకొచ్చింది సునయనకి. వినయ్ మనుషులు రైల్వే స్టేషన్ లో లేకపోతే ఈపాటికి సునయన కిరీటితో వెళ్ళిపోయేదే.   

అసలు వాడ్ని మళ్ళీ ఈ జన్మలో కలుస్తానని కానీ, వాడిని చూడడం కానీ జరుగుతుందనుకోలేదు. తనని మర్చిపోయాడేమో అనుకున్నది ఇన్నాళ్లూ. వాడు తనదాకా ఎలా వచ్చాడో, తనపక్కనే కూర్చొని తన పేరు ఎందుకు పిలిచాడో అంతా మాయగా వుంది సునయనకి. దాదాపు సంవత్సరంన్నర క్రితం చూసిన కిరీటికి ఇప్పుడు తను చూసిన యువకుడికీ ఎక్కడా పొంతన లేదు. కొంచెం పొడుగు సాగాడు మనిషి. కాస్త బక్కపల్చగా వుండేవాడు ఇప్పుడు కండ పట్టాడు. అలసటగా వున్నా వాడి ముఖంలో ఓ తెలియరాని వెలుగుంది. 

వినయ్ గాంగ్, డిసౌజా మనుషుల రొంపిని వదిలించుకోవడానికి తన చేతిలో వున్న వజ్రాలను వదిలెయ్యాలి అనే దిశగా మొదటిసారిగా నిర్ణయం తీసుకుంది. కిరీటిని చూశాక తను జీవితంలో ఏం కోల్పోతోందో అర్ధమైంది సునయనకి. వినయ్ కి, డిసౌజాకి లంకె వేసి తను తప్పించుకోవడం ఎలా అనేదాని గురించి ఆలోచించడం మొదలెట్టింది.

అక్కడ కిరీటి పరిస్థితి చూద్దాం. తనకొచ్చిన కల నిజం అయ్యి తీరుతుంది అనే ఒక నమ్మకంతో వున్నాడు రైలు ఎక్కేవరకు కూడా. రైలు ఎక్కాక కూడా platform చూస్తూనే వున్నాడు. కలలో కనిపించిన అనేక విషయాలు నిజంగా జరిగిన దానికి సరితూగాయి. తిరుపతి వచ్చాడు, మదరాసు కూడా వచ్చాడు. అలా రావడం తన మిత్రునికి ఉపయోగపడింది. అందుకు సంతోషంగా వున్నాడు. ఐతే సునయన ఎందుకు కనబడలేదో అర్ధం కాకున్నది వాడికి. అదే ఆలోచనతో నిద్రపోయాడు. ఈసారి వాడికొచ్చిన కలలో సునయన ఒక జలపాతం ముందు కూర్చుని వుంది. మళ్ళీ తను ఆమె పక్కనున్నాడు! ఇద్దరూ నవ్వుతూ తుళ్లుతూ మాట్లాడుకుంటున్నారు. చాలా రోజులవరకూ జలపాతం, సునయన; ఈ రెండింటినీ మర్చిపోలేదు వాడు.   
  
[+] 10 users Like mkole123's post
Like Reply
Nice super update
Like Reply
Super update
[+] 1 user Likes Hemalatha's post
Like Reply
Awesome broo.. super twist lu unnayi expect cheyaledu musalavidani super... Tq fr story
Like Reply
Super update bro
Like Reply
గతం తాలూకు జ్ఞానపకాలు కిరీటి ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఇవి ఎందుకు వస్తున్నాయి ఇంతకీ తాను గత జన్మ లో ఎవరు ఇలాంటివి ఎవరు చెప్తారో చూడాలి..
 Chandra Heart
Like Reply
హిస్టరీ క్లాసులాగా అనిపించినా నా ఆనందం కోసం ఇది చదవండి.


పాశ్చాత్య చరిత్రకారులు బలవంతంగా మనకు బి.సి., ఎ.డి. అని కాలాన్ని విభజించి రాయడం అలవాటు చేశారు. నేను జీసస్ యొక్క ప్రాముఖ్యతనో, ఆయన మహిమనో శంకించటం లేదు. అనేక రకాలుగా కాలాన్ని గణించుకుంటూ వస్తున్న విభిన్న నాగరికతలు ఈ బలవంతపు రుద్దుడుతో తమ ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడుతున్నాయి. ఈజిప్ట్, చైనా, సింధు నాగరికతలు జీసస్ కంటే వేల సంవత్సరాలు పురాతనమైనవి. యేం, పాశ్చాత్యులు నేర్పకపోతే వీళ్ళకి కాలాన్ని ఎలా గణించాలో తెలీదా?

ఒక ఉదాహరణ - మన తెలుగు వారి పంచాంగం ఎంత elegant అంటే మాటల్లో చెప్పడానికి వీలు కాదు. కాలాన్ని గణించడంలో అత్యుత్తమమైన మార్గాల్లో ఇది ఒకటి. ఈ సోది అంతా ఎందుకంటే మన చరిత్రకారుల్లో కొందరికి భయం ఎక్కువ. B.C. లో జరిగిన చరిత్ర, అప్పటి సంఘటనల గురించి రాయాలంటే వీరికి నామోషీ. ఆధారాలున్నా కూడా మన దేశంలో బయటపడుతున్న చారిత్రిక కట్టడాల వయసు వందల సంవత్సరాలు ముందుకి జరిపేసి క్రీస్తు శకం 7, 8 శతాబ్దాలు అని రాసేస్తారు. సిగ్గు సిగ్గు.   

సింధు నాగరికతకూ, అంతకు ముందు వెల్లివిరిసిన నాగరికతల్లోనూ సూర్యుడికి ప్రత్యేక స్థానం వుంది. ఇక మన వేదాల సంగతి చెప్పనవసరం లేదు.
 
మనందరం పాఠ్యపుస్తకాల్లో ఓ పేరు వినే వుంటాం. హ్యూఎన్ త్సాంగ్ అని. 6వ శతాబ్దంలో అఖండ భారతదేశంలో విరివిగా పర్యటించాడు ఆయన. ముల్తాన్ (సెహ్వాగ్ triple century చేసిన చోటు) నగరంలో ఇప్పుడు శిధిలావస్థలో ఒక సూర్యుడి గుడి వుంది. హ్యూఎన్ త్సాంగ్ ఆ గుడి గురించి రాస్తూ బంగారంతో తయారు చేసిన సూర్యుడి విగ్రహం గురించి, కెంపులతో తయారైన ఆయన కనుల గురించీ, రత్నాలు, రాశులు పొదిగిన తలుపులు, బంగారం తాపడం చేసిన శిఖరం గురించీ రాశాడు. ఇది చారిత్రిక నిజం. నేను కల్పించింది కాదు. Wikipedia లో చదవండి కావాలంటే. ఈ గుడిని 5వ శతాబ్దం (B.C.) లో కట్టారన్నది ఒక అంచనా.

9వ శతాబ్దం మొదలుకొని 15వ శతాబ్దం దాకా పాశ్చాత్యులు క్రూసేడుల పేరుతో మరణహోమాన్ని జరుపుకుంటూ వుంటే మనదేశంలో అమోఘమైన రాజవంశాలు వర్ధిల్లాయి. దురదృష్టవశాత్తూ మొఘలాయిల చొరబాట్లు ఎదుర్కోవడంలో చాలా కాలాన్ని గడిపేశారు. లేకుంటే మన నాగరికత ఇంకెంత అభివృద్ధి చెంది వుండేదో.

10వ శతాబ్దంలోనో 12వ శతాబ్దంలోనో కోణార్క్ సూర్యమందిర నిర్మాణం జరిగింది. కట్టించినవారు తూర్పు గాంగేయులు. ఈ గుడి కూడా ఇప్పుడు శిధిలావస్థలో వుంది. ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాల్లో ఒకటి ఇది. దినము, వారము, మాసము, సంవత్సరము ఇవన్నీ కూడా రాతి నిర్మాణాల్లో కళ్ళకు కట్టినట్టు చూపారు ఈ గుడిలో. ఇది కూడా fact. నా కల్పితం కాదు. అయితే మొగలాయిల దాడుల్లో దెబ్బతిన్న మందిరాల్లో ఇది కూడా ఒకటి. ఈ తూర్పు గాంగేయులు పూరీ జగన్నాథ ఆలయాన్ని కూడా కట్టించారు.

శిధిలమైపోయిన మన నిర్మాణ సంపదల గురించి చదివి చదివీ విసుగెత్తిపోయి ‘ఒక్క నిర్మాణమైనా బతికి బట్టకట్టి వుంటే?’ అన్న ఊహాలోంచి పుట్టింది నా ఈ కథ. ఇలా అప్పుడప్పుడూ ఏదో ఒక సోది చెబుతూ వుంటాను, భరించండి.   

ఈ స్వస్తి అంతా రాసేవాడిని కాదు. ఐతే గిరీశం గారు మనం ఏమన్నా రాస్తే జనాలకి ఉపయోగకరంగా వుండాలి అన్నారు. వారి మాట ఫాలో అయిపోయాను. మీకేమన్నా complaints వుంటే ఆయనతో చెప్పుకోండి. [Image: devil2.gif] (joking gireesam sir, thanks for your suggestions, encouragement)

[+] 12 users Like mkole123's post
Like Reply




Users browsing this thread: 15 Guest(s)