Thread Rating:
  • 12 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మాయ
నమస్తే,ముందుగా మీకు నా ధన్యవాదాలు. ఇంతటి చక్కని కథని మాకు అందించినందుకు. కథలో Crime scenes దగ్గర, కిరీటి పాత్రని elevate చేయటం దగ్గర నాకు యండమూరి గారి style కనపడిoది.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Baboyee idem story sir...
Chaduvutunte ventrukalu nikkapoduchukuntunnai...
Unbelievable fentastic story... Keep going..
Like Reply
Superb story
[+] 2 users Like Rajdarlingseven's post
Like Reply
WOW......
వావ్ అనిపించారు
ఊపిరి బిగపెట్టి మరీ చదివించారు.....
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
Awasome story
Like Reply
Excellent awesome what a surprise package.... Kriti Ki malli valapu vala vestunda sunayana... Waiting
Like Reply
Super broo chala pedda talakayaluu unnayi ekkada super... Inka action episode lu chala unnayi waiting for next update broo
Like Reply
update ivvandi writer garu...chala intresting ga vundi
Like Reply
Superb..
Like Reply
Super .... Update tondaraga ivvandi sir
Like Reply
ఇంత ఆదరణ అస్సలు ఊహించలేదు. సీనియర్ రచయితలు మొదలుకొని ఫోరం లో తొలిసారిగా ఈ thread లోనే పోస్ట్ పెట్టినవారివరకూ అందరికీ కథ నచ్చిందంటే సంతోషంగా వుంది. పేరుపేరునా థాంక్స్.
[+] 1 user Likes mkole123's post
Like Reply
మాయ - 27

‘అమ్మీ, నువ్విట్టా తినకుండా కూకుంటే మేమెట్లా సుఖానుండేది. అడిగడిగి నోరు పడిపోతుండే నాకు. ఏటైనాదో ఓ మాట సెప్పు. ఇయ్యాలంటే ఆదివారం. రేపు కాలేజీకి పోవాల గందా. ఓ ముద్ద కతుకే అమ్మీ’ అంటూ శైలుని బతిమాలుతోంది తన అత్త రుక్కు. ‘పోనీ కిరీటి బాబుని పిలిసి నే మాట్టాడనా’ అని అడగ్గానే మంచం మీద ముఖం దిండులో దూర్చేసి పడుకున్న శైలు ఇంకా ముడుచుకుపోయింది. ‘ఎవరు చెప్పినా వాడింక నాతో మాట్లాడడు’ అని దిండులో గొణుగుతోంది.


రుక్కు నిట్టూర్చి ‘ఇగో, కంచం ఈడ పెడతాండా. పదేను నిమిశాల్లో ఖాలీ కంచం తెచ్చి నాకివ్వాల’ అంటూ పెదబాబుని వెతుక్కుంటూ వెళ్లింది. శైలుకి భోరున ఏడవాలనుంది. కిరీటిని చంపేయ్యాలి అన్నంత కోపంగా కూడా వుంది. రెండు భావాలూ కొట్టుమిట్టాడుతూ restless గా మంచంలో పడి దొర్లుతోంది.

కాలేజీ మొదలయ్యి ఒక వారమే అయింది. బుధవారం రోజున మంచి ఉత్సాహంగా కిరీటి క్లాసుకి వెళ్లింది శైలు. అదిగో అక్కడ్నుంచీ అంతా రచ్చ రచ్చ అయిపోయింది. అప్పట్నుండీ కిరీటి శైలుతో మాట్లాడట్లేదు. ఆదివారం రాత్రయ్యింది. రేపు మళ్ళీ వాడి ముఖం చూడాలి కాలేజీలో. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు శైలుకి.

అక్కడ కిరీటి ఇంకా మాచెడ్డ మూడ్ లో వున్నాడు. ఇప్పటిదాకా వాడిని ఎవరూ ఎప్పుడూ కోపంలో వుండగా చూడలేదు. ఇప్పుడు వాడికున్న మూడ్ కోపమా, ఇంకోటా తెలియక తలపట్టుకుంటున్నారు ఆచారి గారు. ఎప్పుడో ఒకసారి నోరువిప్పి ఏదో ఒక మాటన్నా అనేవాడు. ఈ రెండు మూడు రోజులనుండి మరీ మూగాడిలా కూర్చుని వుంటున్నాడు. గోరు, రంగా కూడా వాడిని కదిలించడానికి భయపడుతున్నారు.

ఆరు రోజుల క్రితం కిరీటి డిగ్రీ రెండవ సంవత్సరం క్లాసులు మొదలయ్యాయి. మన మిత్రుల గాంగ్ లో కిట్టి లేకపోవడం వాళ్ళకి పెద్ద లోటుగా తెలుస్తోంది. చిన్నప్పటినుండి తమతో కలిసి వున్న కిట్టి హఠాత్తుగా ఇలా మాయమవడం జీర్ణించుకోలేకున్నారు. అయినా కాలేజీ కొత్త సంవత్సరం మొదలైన రంధిలో ఆ లోటు కొంత మరుగున పడింది. బుధవారం నాడు శైలు తొలిసారిగా కిరీటి క్లాసుకి వచ్చింది. Attendance తీసుకుంటుంటే కుర్రాళ్ళంతా ఆమెను దొంగచూపులు చూస్తున్నారు. అమ్మాయిలు ఆమె చీరకట్టు, hair style లేజర్ కళ్ళతో స్కాన్ చేస్తున్నారు.

శైలుని అందరూ విప్పారిన కళ్ళతో అలా చూస్తూ వుంటే కిరీటికి ఇబ్బందిగా వుంది. తనువులు దగ్గరైన తర్వాత కిరీటి, శైలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే విధానం మారిపోయింది. రాజా గారి ఎస్టేట్ నుండి తిరిగొచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏకాంతం లభించడం గగనం అయింది. కేవలం రెండంటే రెండు సార్లు ఎవరి కంటా పడకుండా కలవగలిగారు ఇద్దరూ. అప్పుడు కూడా వేడివేడి ముద్దులు, కౌగిళ్లు తప్పించి ముందుకు వెళ్ళే అవకాశం రాలేదు.

మొదటి క్లాసు కాబట్టి శైలు పాఠమేమీ చెప్పదులే అనుకుంటున్న స్టూడెంట్స్ కి నిరాశ కలిగిస్తూ ఈ సంవత్సరంలో సిలబస్ లో ఏముందో ఏమిటో చెప్పుకుపోతోంది శైలు. ‘Prose, poetry తో పాటు మీరు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సి వుంటుంది. One of them is public speaking’ అంటూ ‘ఇప్పుడు మీరు ఏ లెవెల్ లో వున్నారో నాకు తెలియాలి అని క్లాసులో ఒక నలుగురైదుగురు స్టూడెంట్లను ముందుకు వచ్చి వాళ్ళకి తోచినది ఒక రెండు నిమిషాలు మాట్లాడమంది.

Of course, కిరీటిని సెలెక్ట్ చేసింది. తనను రమ్మని పిలవనందుకు గోరు దేవుళ్లందరికీ దండాలు పెడుతున్నాడు. ఒక నలుగురు స్టూడెంట్లు వాళ్ళకి వచ్చిందేదో మాట్లాడి వెళ్లారు. కిరీటి చాలా ఇబ్బందిగా వచ్చి నుంచున్నాడు. ఇంతమంది తనకేసి చూస్తుంటే వాడికి నోట్లోనుండి మాట పెగలట్లేదు. ‘ఊ, మాట్లాడరా ఏమన్నా’ అంది శైలు. ఎంతో కష్టం మీద ఏదో కొంచెం మాట్లాడాడు కిరీటి. వాడికున్న anxiety లో తప్పులు మాట్లాడుతున్నాడా ఏమిటి అనేదేమీ పట్టించుకోవట్లేదు.

శైలు వాడి introvert స్వభావం గురించీ, మాట్లాడడంలో వాడికుండే ఇబ్బంది ఏమీ ఆలోచించకుండా వాడి మీద అరిచేసింది. ‘ఏంట్రా నసుగుతున్నావు? లాస్ట్ ఇయర్ నేను, నిక్కీ చెప్పిందంతా ఎక్కడికి పోయింది. ఏంటి అంతా గాలికొదిలేశావా’ అంది. మామూలుగా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఎలా అయితే వాడ్ని బెల్లిస్తుందో అలానే అంది. తనకు వాడితో వున్న చనువుతో ఎంత మాట వస్తే అంతా అనేయడం అలవాటైపోయింది శైలుకి. క్లాసులో మిగతా స్టూడెంట్లు ఎవరూ లేకపోతే కిరీటి కూడా మామూలుగానే react అయ్యేవాడేమో.

తను, వాడు ఎక్కడ వున్నారో, అందరి ఎదుటా ఇప్పుడు తనన్న మాటలు వాడికి ఎంత గుచ్చుకున్నాయో వాడి కళ్ళలో కనిపించిన hurt చూసి  ఆమెకు తలపుకొచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ‘సారీ మేడమ్’ అంటూ వెళ్ళి కూర్చుండిపోయాడు కిరీటి. క్లాసంతా వాడినే చూస్తుంటే ఇంకా ముడుచుకుపోయాడు. ఆ రోజు కలిగిన ఏకైక లాభం శైలు పెద్ద కరోడా అని స్టూడెంట్ల మదిలో ముద్ర పడడం. కిరీటి లాంటి మంచి స్టూడెంట్ మీదే అరిచేసిందంటే మేడమ్ చాలా స్ట్రిక్ట్ అని ఫిక్స్ అయ్యారు అందరూ. దొంగచూపులు చూస్తూ దొరికిపోతే ఇంకేం చేస్తుందో అని భయపడి అబ్బాయిలు తల దించుకొని వెళ్లిపోతున్నారు ఆమె పక్కనుండి.

కాలేజీ అయిపోయాక వాడిని పట్టుకొని సారీ చెబుదామని చాలా ప్రయత్నించింది శైలు. వాడి ఫ్రెండ్స్ ఇద్దరితోనూ వుండడంతో ఒంటరిగా చిక్కలేదు వాడామెకి. వాడి ఇంటికి వెళ్ళి వెయిట్ చేసింది చాలాసేపు. ‘ఇలా ఎప్పుడూ లేట్ గా రాడమ్మా. ఎందుకో మరి ఇవాళ ఇంతాలస్యం చేస్తున్నాడు. చీకటి పడకముందే ఇంటికి పో. నిన్ను రేపు కలవమని చెప్తాను’ అని రమణాచారి ఆమెను పంపించేశాడు.

మరుసటి మూడు రోజులూ ఆమె కంటబడకుండానే తిరిగాడు కిరీటి. ఇదుగో ఆదివారం రాత్రికొచ్చేసరికి వాళ్ళ తొలి కలహం ఈ స్థాయికి చేరింది. పెదబాబుని పిలిచి రుక్కు ‘ఆచారి గారి పిలగాడు, మన అమ్మి గొడవ పడతాండారు లాగుంది. ఇదేమో మూడంకె యేసుకు కూకుంది. ఇయ్యాల ముద్ద కూడా మింగలేదు. రేపు ఆచారిని కలిసినప్పుడు ఏమైనాదో అడుగు. అరుపులు కాదు, మాటలతో అడుగు’ అంటే యే కళనున్నాడో ప్రెసిడెంటు గారు సరేనన్నారు.

మర్నాడు ఆచారి వచ్చినప్పుడు విషయం కదిపి చూశారు పెదబాబు. రమణాచారి నిట్టూర్చి ‘రాజన్న కొడుకునడిగితే చెప్పాడు. శైలమ్మ క్లాసులో ఏదో అందట కిరీటిని. వాడు కూడా మూడ్నాలుగు రోజుల్నుంచీ మాటామంతీ లేకుండా కూర్చున్నాడు’ అన్నారు. ‘ఛస్, ఆడి అలక కబుర్లు ఎవడడిగాడు ఎహె. పంతులమ్మ అన్నాక ఓ మాట అంటది. దానికే ఆడు ఇంత బెట్టు చేస్తాడా? రేపొచ్చి ఆడు అమ్మితో మామూలుగా మాట్టాడాల అంతే’ అని తేల్చి చెప్పారు.

రమణాచారి నవ్వుతూ ‘నా కొడుకు మామూలు మనిషి ఐతే నేను కూడా అదే చెబ్దును వాడికి’ అన్నారు. ఇంతలో ఆయన ముఖంలో నవ్వు మాయమైంది. ‘వాడి విషయంలో చాలా తప్పు చేశానురా. సవతి తల్లి బాధ పెడుతుందేమో అనే ఆలోచించాను కానీ ఓ ఆడతోడు లేకపోయేసరికి వాడు బయటకు చెప్పాల్సినవి అన్నీ లోపల్లోపల దాచేసుకోవడం గమనించలేకపోయా. రేపు ఉద్యోగం, పెళ్లి ఇవన్నీ ఎలా సంభాళిస్తాడో అని భయం వేస్తోంది’ అంటూ బాధపడ్డారు.

ఎంతో అరుదుగా తప్పించి వాళ్ళ పిలుపులు అరేయ్, రా ల దాకా వెళ్ళదు. రమణాచారి నిజంగానే బాధలో వున్నాడని తెలుసుకున్న పెదబాబు ఆయన్ని ఓదార్చి ‘అన్నీ మంచిగానే జరుగుతాయి, బాధపడాకు ఆచారీ. ఈ కాలం పిలగాళ్లలా కాదాడు. మంచి మనసుంది. అది సాలు’ అన్నారు. ‘ఐనా మీవోడి పెళ్లి గురించి ఇప్పుడప్పుడే తొందర్లేదు కదా నీకు. ఈ ముచ్చట ఇను. శైలమ్మను ఓ అయ్య సేతిలో పెడదామని సూస్తాండా. అదేమో పెళ్లి మాటంటేనే ఎగిరెగిరి పడతాంది. బాబ్బాబు, కాస్త మంచి కుర్రాడు దొరికితే ఓ కన్నేసి వుంచరా సామీ, దాని మనసు నే మారుత్తా’ అన్నారు. శైలు ఈ మాటలన్నీ వింది. తనతో ఎలాగోలా మాట్లాడకపోతే కిరీటిని పీక పిసికెయ్యాలని నిశ్చయించుకుంది.
[+] 7 users Like mkole123's post
Like Reply
మాయ - 28

మొదటి పీరియడ్ అవగానే రెండో పీరియడ్ మాథ్స్ లెక్చరర్ వచ్చే ముందు శైలు కిరీటి క్లాస్ రూమ్ లోకి వచ్చింది. అందరూ దెబ్బకి సైలెంట్ అయిపోయారు. గోరు కిరీటి డొక్కలో పొడిచి గుమ్మం వైపు సైగ చేశాడు. కిరీటి తలెత్తి చూస్తే శైలు వాడ్నే చూస్తోంది. తల దించకుండా వాడు కూడా ఆమెనే చూస్తున్నాడు. ‘కిరీటీ, బ్రేక్ లో స్టాఫ్ రూమ్ కి రా’ అని ఒక మాట చెప్పి వాడి సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోయింది. అందరూ మళ్ళీ వాడివైపు చూస్తుంటే బెంచ్ మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు కిరీటి.


‘రేయ్, ఆయమ్మికి నీమీద ఎందుకురా అంత కోపం’ అంటూ గోరు కదిపి చూశాడు వాడ్ని. ‘ఇవాళ వెళ్ళి కనుక్కుంటాను’ అని ఒకమాట చెప్పి ఊరుకున్నాడు కిరీటి. బ్రేక్ టైమ్ లో స్టాఫ్ రూమ్ కి వెళ్తే చాలామంది లెక్చరర్లు వున్నారక్కడ. శైలు ఓ మూలన కూర్చుని ఉంది. దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు కిరీటి. ‘కూర్చోమని స్పెషల్ గా చెప్పాలా నీకు’ అంటే ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు. లోగొంతుకలో ఒకటే ప్రశ్న అడిగింది వాడిని.

‘ఏరా, కనీసం సారీ చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వవా?’

‘మేడమ్’ అంటూ మొదలెడితే చురుగ్గా చూసింది వాడివంక. ‘అలా చూడొద్దు. ఇక్కడ నిన్ను బైట ట్రీట్ చేసినట్టు చెయ్యలేను. ఆ హద్దు లేకపోతే నాకు చాలా కష్టం’ అన్నాడు. ‘ఏమన్నా మాట్లాడాలంటే ఇక్కడ వద్దు. సాయంత్రం మా ఇంటికి రండి. నేను మంచి టీ పెడతాను’ అని చెప్పి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వచ్చేశాడు. నమిలి మింగేయ్యాలన్నంత కోపంలో వున్న శైలు వాడు అలా కామ్ గా చెప్పేసరికి ఐస్ అయిపోయింది. పోనీలే మాట్లాడుతున్నాడు అదే చాలు అనుకుంది.

ఇంటికి వెళ్ళిన తర్వాత కిరీటి ఆచారితో ‘శైలుని టీ కి రమ్మని పిలిచా నాన్నా’ అని చెప్పాడు. రమణాచారి తల పంకించి ‘మంచిది, ఏమన్నా వుంటే మాట్లాడుకొని తేల్చుకోండి. ఐనా మనింటి పిల్లలాంటిదేరా తను. చిన్నచిన్నవి చూసీ చూడనట్టు వదిలెయ్యాలి. నేను పెదబాబు దగ్గరుంటాను. మాట్లాడుకున్నాక శైలుని నువ్వే తీసుకొచ్చి ఇంటి దగ్గర వదులు. పెదబాబు కూడా సంతోషిస్తాడు’ అని చెప్పి వెళ్ళాడు.

సాయంత్రం ఇంటికి వెళ్తూ దారిలో కిరీటి దగ్గర ఆగింది శైలు. బైట వరండాలోనే కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు వాడు. శైలుని చూడగానే పుస్తకం పక్కన పడేసి వచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. ‘ఒక్క నిముషం కూర్చో, టీ తీసుకొస్తా’ అంటూ వంటగదిలోకి వెళ్ళాడు. అలా కూర్చుందో లేదో ఇక ఆత్రం ఆపుకోలేక వాడి వెనకాలే వెళ్లింది. స్టౌ ముందు నుంచుని టీ గిన్నెలోకి దీక్షగా చూస్తున్నాడు. వెనకనుండి వాడ్ని వాటేసుకొని మునివేళ్ళమీద నిలబడి గడ్డం వాడి భుజంపై ఆనించి తను కూడా చూస్తోంది. వాడేమీ రియాక్షన్ చూపించకపోయేసరికి మెల్లిగా చెవిలో గాలి ఊదింది. విదిలించుకోవడం లాంటివి ఏమీ చెయ్యకపోయేసరికి ఇంకొంచెం బోల్డ్ గా వాడికి నొక్కుకుపోయింది. గిన్నెలో పాలు పోసి శైలుని వెనుకనుంచి లాగి తన పక్కన నిలబెట్టుకొని నడుం చుట్టూతా చెయ్యి వేసి పట్టుకున్నాడు.

వెయ్యి మాటల్లో చెప్పలేనివి ఒక్కోసారి ఒక స్పర్శతో తెలియచెప్పవచ్చు. నాలుగు రోజుల్నుంచీ ఆమెలో వున్న బాధ అలా తీసిపారేశాడు ఆ ఒక్క చర్యతో. తల వాడికి ఆనించి అలా వుండిపోయింది. జాగ్రత్తగా టీ రెండు కప్పుల్లో పోసాడు. వదిలేస్తే మళ్ళీ పట్టుకోడేమో అన్నంత ఇదిగా తన నడుం చుట్టూ వున్న వాడి చేతిని lock చేసేసింది. ‘శైలూ, ఇలా వుంటే ఇద్దరిమీదా వొంపేసుకుంటాం టీ అంతా’ అన్నాడు. వాడిని తనవైపుకి తిప్పుకొని సూటిగా కళ్లలోకి చూసింది. అదివరకు ఎప్పుడైనా అలా చూస్తే వెంటనే ఇబ్బందిగా తల తిప్పేసుకునేవాడు. ఇప్పుడు వాడు కూడా సూటిగా తననే చూస్తుంటే కొత్తగా వుంది శైలుకి.

‘సారీ’ అనబోతుంటే ముందుకు వంగి పెదవులతో పెదవులను పెనవేశాడు. విడివడ్డాక ఆమె గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు అయిపోయింది. మాట రావట్లేదు. కానీ మనసు మాత్రం దూదిపింజలా తేలిపోతోంది. టీ కప్పు చేతిలో పెట్టి మెల్లిగా నడిపించుకుంటూ ముందుగదిలోకి తీసుకెళ్ళాడు. టీ తాగేసి మళ్ళీ వాడిని పట్టుకొని వుండిపోయింది.

‘ఏం చేశావురా నన్ను? నిన్ను చూస్తే మిగతా ప్రపంచం కళ్ళకి కనబడదు. క్లాసులో నీమీద అరిచినప్పుడు మనిద్దరం మా ఇంటి మేడ మీద నుంచుని వున్నామని అనుకున్నా. ఎంత పిచ్చిదానిలా చేశాను! బయట అందరూ నన్ను చాలా dignified అంటూ పొగిడేస్తున్నారు. నీ దగ్గర మటుకు చిన్న పిల్లలు మారాం చేసినట్టు చేస్తుంటే ఏమీ అనకుండా నువ్వే అలవాటు చేశావు నాకిదంతా’ అంటూ తన ముఖాన్ని వాడి మెడవంపులో దాచేసుకుంది.

‘అందుకే నీకీ నాలుగు రోజులు punishment’ అంటే చప్పున తలెత్తి చూసింది. సీరియస్ గా లేడు, నవ్వుతున్నాడు. కోపంగా ఏదో అనబోతుంటే వేలితో పెదవులను మూసేశాడు. శైలుకి కొత్తగా వుంది వాడిలోని ఈ కోణం. ఐనా చాలా బాగుంది వాడిలా అథారిటీ చూపిస్తుంటే. లోపల్నుంచీ తెలియని కోరికలు ఎగదన్నుకొస్తున్నాయి. ‘ఎక్కడికన్నా వెళ్లిపోదామా కిరీటీ’ అని అడిగింది. ఎందుకన్నట్టు చూస్తే ‘ఇక్కడుంటే నిన్ను ఎదురుగుండా పెట్టుకొని నేను చేతులు కట్టుకొని వుండలేను’ అంది.

ఆమె మనసులో ఏదో వుందని తెలుసుకున్నాడేమో ‘ఏమైంది’ అని అడిగాడు. ‘మామ నా పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు’ అంటూ చాలరోజుల్నుంచీ తను పెళ్లిమాట దాటవేస్తున్న సంగతి చెప్పింది. ‘భయమేస్తోందిరా. నిన్ను ఇబ్బంది పెట్టనని మొదటే చెప్పాను. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు’ అంటుంటే ఆమె కళ్లలోనుంచి నీళ్ళు జలజలా కారుతున్నాయి.

ఆమె ఏం కోరుతున్నదో వాడికి తెలుసు. కానీ తిండికి ఠికాణా లేని వాడు ఆమెకు ఏం మాట ఇవ్వగలడు? ఇదొక్కటే ఆలోచన తిరుగుతోంది వాడి మస్తిష్కంలో. అనవసరమైన ఆశలు కల్పించలేక మౌనంగా వుండిపోయాడని ఆమెకీ తెలుసు. ఇదివరకైతే భయపడ్డ జింకపిల్లలా బెదిరి మౌనంగా వుండేవాడు. ఇప్పుడు వాడి మౌనం వెనక ఆలోచన వుంది. అది పసిగట్టి శైలు మళ్ళీ ఆశ్చర్యపోయింది.

వాడి గడ్డం పట్టుకొని ‘నువ్వింత పెద్ద తరహాగా ఎప్పుడు మారిపోయావురా’ అని అడిగింది. ‘ఏం, ఇలా వుంటే నీకు నచ్చట్లేదా’ అన్నాడు నవ్వుతూ. ‘లేదు, ఇంకా ఎక్కువ నచ్చేస్తున్నావు’ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. కాసేపు తమచేతిలో లేని విషయాల గురించి ఆలోచించడం మానేసి ఊసులు కలబోసుకున్నారు.

వాడి రూమ్ లో మంచం మీద చేరి శైలు మొత్తం బరువంతా వాడి మీద వేసేసి పడుకుంది. ఏం మాట్లాడకుండా వాడు కూడా శైలు వీపు నిమురుతున్నాడు. ‘నామీద బాగా కోపం వచ్చింది కదూ’ తలెత్తి వాడి ముఖంలోకి చూస్తూ అడిగింది. ‘నీ మీద కోపం కాదు, నా మీద నాకే చిరాకు’ అన్నాడు. ‘నాక్కూడా అందరితో confident గా మాట్లాడాలని వుంటుంది. కానీ లోపల ఏదో అడ్డం పడుతుంది. ముందు నీతో మొదలుపెడతా మామూలుగా మాట్లాడటం. మిగతా జనాల సంగతి తర్వాత’ అన్నాడు. ‘ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడావు, మళ్ళీ నాలుగు రోజులు కామ్ గా వుంటే నేనొప్పుకొను’ అంటే చిన్నగా నవ్వాడు. కొంతసేపటి తర్వాత శైలుని ఇంటికి తీసుకువెళ్లి దిగబెట్టి తన తండ్రితో కలిసి వెనక్కి వచ్చాడు.

పడుకునే ముందు పక్క సర్దుతుంటే దిండు కిందనుంచీ సునయన కార్డ్ బయట పడింది. కార్డ్ చేతిలోకి తీసుకొని కాసేపు దాన్ని వేళ్ళమీద విచిత్రంగా తిప్పి చేతిని ముందుకు జాపాడు. కార్డ్ చేతిలో లేకుండా మాయమైంది. మళ్ళీ చేతిని విదిలిస్తే అది వాడి అరచేతిలోకొచ్చి పడింది. ఇప్పటిదాకా ఎవ్వరికీ, కనీసం శైలుకి కూడా చూపించలేదు వాడు ఈ ట్రిక్. మిమ్మల్ని ఏ వూళ్ళో చూడొచ్చు అని తనడిగితే ‘నా పాత జీవితం వదిలేసి నిన్ను వెతుక్కుంటూ నేనే వస్తాను’ అని సునయన తనకి చెవిలో చెప్పిన మాట గుర్తొచ్చింది.

ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ఎవరో దూరంగా పెద్ద గంట మోగించినట్లు గుండె ఝల్లనేది. ఇప్పుడు ఆ ఝల్లింత intensity తగ్గుతోంది. కారణం కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. శైలు గుర్తొస్తే ఇంక మనసులో వేరే ఆలోచనకి చోటు లేకుండా ప్రళయంలా కమ్మేస్తుంది వాడిని. ఇప్పుడు సునయన ఎదురుగా వస్తే ఏం చేస్తానో అనుకున్నాడు.

కిరీటి కూడా అందరిలాంటి కుర్రాడే. ఈ వయసులో బరువైన ఆలోచనలు నిజానికి రాకూడదు. అయితే తన ప్రాణమిత్రుల్లో ఒకరు దూరమవడం, ఇప్పుడు శైలుతో ప్రణయం ఇవన్నీ వాడికి జీవితంలో ఫన్ ఒక్కటే కాదు బాధ్యతలు కూడా వుంటాయి అని చాలా త్వరగా తెలియచెప్పాయి. శైలుకి, తనకి ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు వుంటే బాగుండు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిద్ర పోయాడు. ఆ రోజు వాడికి పంచలోహ విగ్రహం తాలూకా మొదటి కల వచ్చింది.
Like Reply
Nice update bro
Like Reply
నమస్తే,
బాగుంది బ్రదర్.. కథని మీరు ఒక  దీక్షలా రాస్తున్నారు. అంతకంటే ముందుగా మీకు కథ మీద ఉన్న పట్టు అద్భుతం.. keep it up..
[+] 1 user Likes nandurk's post
Like Reply
Very very nice story good update bro
Like Reply
Super update
Like Reply
చాలా ఇంట్రెస్టింగ్ గా రాసారు అద్బుతం మీ తర్వాతి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నాం
Like Reply
Very Interesting... Kriti mature thinking... Super....
Like Reply
అబ్బా...! మీకు కథ ఎక్కడ ఆపాలో ఇంతలా... మరీ ఇంతలా తెలియకపోతే బావుండు!
మీరు ఆపే ముందు వాక్యం మిగతా వాటిల్లానే మామూలుగా ఉంటుంది, తరువాత వాక్యం కనిపించనుపుడు అప్పుడు,....తరువాత ఎలా అనేదాని కన్నా అసలు ఇక్కడ ఆపితే కూడా ఇంత ఆత్రుత కలిగించగలిగిందా అన్న ఆశ్చర్యం ఎక్కువైపోతాంది!
*నా మొదటి వాక్యం మరొక్కసారి ఇక్కడ కూడా *
[+] 3 users Like Chytu14575's post
Like Reply




Users browsing this thread: 11 Guest(s)