27-05-2020, 06:24 PM
Super update
Romance మాయ
|
27-05-2020, 06:24 PM
Super update
28-05-2020, 12:01 PM
Super broo sunaina... Pedda kedi chala trilling ga undi story waiting for next update broo
28-05-2020, 01:02 PM
Good update
29-05-2020, 07:49 AM
(27-05-2020, 06:54 AM)Okyes? Wrote: వావ్ అనిపించేలా రాస్తున్నారు mkole గారు థాంక్స్ గిరీశం గారూ for your continued encouragement. ఈ తర్వాతి ఎపిసోడ్ కూడా చదివి పులిహోర కలిపేశానో, విషయం క్లియర్ గా వచ్చిందో లేదో దయచేసి చెప్పండి.
29-05-2020, 07:50 AM
(27-05-2020, 07:25 AM)paamu_buss Wrote: Pedda kedi annamata real character adhirindi... Thrilling... (27-05-2020, 08:06 AM)Chandra228 Wrote: ఈ రెండు పాత్రలు చాలా బాగున్నాయి కథ లో ఎక్కువ భాగం లీడ్ చేస్తారు ఏమో.. (27-05-2020, 12:43 PM)Pradeep Wrote: అప్డేట్ బాగుంది (27-05-2020, 01:56 PM)Pinkymunna Wrote: Kekaaa asaluu expect cheyaledu story ni ela jaruguthundni...chala bhagundi bro.. super suspension lo undi story... Kekaa undi... Waiting for next update broo (27-05-2020, 06:24 PM)lotus7381 Wrote: Super update (28-05-2020, 12:01 PM)Pinkymunna Wrote: Super broo sunaina... Pedda kedi chala trilling ga undi story waiting for next update broo (28-05-2020, 01:02 PM)abinav Wrote: Good update మిత్రులారా, మీరు ఇలాగే encouragement అందిస్తూ వుండటం చాలా ఆనందకరం. సునయన గురించి మరికొంత తెలుసుకుందాం రండి.
29-05-2020, 07:56 AM
మాయ - 24
Organized క్రైమ్, unorganized క్రైమ్ అనేవి రైలు పట్టాల్లా వుంటాయి. అవి కలవ్వు, కలవకూడదు. ఫోర్జెరీలు, బ్యాంక్ ఫ్రాడ్ వంటి పనులు చేసేవాళ్ళు వీధి గూండాలతోనూ, బందిపోట్లతోనూ క్లోజ్ గా మూవ్ అవ్వరు. ఎందుకంటే organized క్రైమ్ లో వున్నవాడికి అజ్నాతం అనేది వెలకట్టలేని రక్షణ కవచం. మరి బందిపోట్లు, రౌడీలు? బోర విరుచుకొని తిరక్కపోతే వాళ్ళకి ఎవడూ భయపడడు. 50s, 60s లో సరోద్ కాతియా, బిజ్జూ కాతియా అనే ఇద్దరు సోదరులు ఈ దారికి భిన్నంగా వెళ్దామని ఆలోచించారు. ఉత్తరప్రదేశ్ లోని ఒకానొక పరగణా ఎంచుకొని వీళ్ళ పనులు మొదలెట్టారు. సరోద్ దేశదేశాలు తిరిగి దొంగనోట్లు అచ్చెయ్యడం నేర్చుకొచ్చాడు. ఆ దొంగనోట్లను మార్చే పనిని బిజ్జూ ఎత్తుకున్నాడు. ఇద్దరు సోదరులూ కలిసి ఒక దురాలోచన చేశారు. దొంగ నోట్లను బీహార్, రాజస్థాన్ వంటి దూరదూర ప్రదేశాలకు తీసుకుపోయి వాటితో అక్కడ బందూకులు కొని తెచ్చాడు బిజ్జూ. వాటిని ఉత్తరప్రదేశ్ లోని లోకల్ బందిపోట్లకు అమ్మి బాగా డబ్బులు కూడబెట్టారు. దాదాపు ఒక దశాబ్దం పాటు నిరాటంకంగా సాగాయి వీళ్ళ ఆటలు. బీహార్లో పేరుమోసిన బందిపోటు ఒకడు వీళ్ళ దొంగనోట్లతో లంచాలు చెల్లించడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు వాడి గాంగ్ మొత్తాన్నీ కిరాతకంగా encounter చేసిపారేశారు. చనిపోయిన వాడి బంధువొకడు అసలీ తప్పు ఎలా జరిగింది అనేది కూపీ లాగడం మొదలెట్టాడు. తీగ లాగితే డొంకంతా కదిలి కాతియాల గుట్టు రట్టైంది. బీహార్ వాడు తొందర పడలేదు. ఉత్తరభారతంలోని క్రైమ్ గ్రూపులు అన్నిటికీ (organized, unorganized) వీళ్ళ మోసాన్ని చాటువేశాడు. నేరప్రపంచం పెద్దలంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. కాతియాలకు చెప్పే బుద్ధి ఎలా వుండాలంటే మళ్ళీ ఎవడూ కూడా తోటి దొంగను మోసం చేయాలన్న ఆలోచన చేయకూడదు అన్నంత బలంగా వుండాలి అని తీర్మానించారు. గొప్ప పధకం వేసి కాతియాల వంశం మొత్తం ఒకచోట పోగయ్యేదాకా వేచి చూశారు. దొంగనోట్లతో పాటు చేసిన, చెయ్యని నేరాలన్నీ వాళ్ళ మీద పోగేసి పదిమంది అప్ప్రూవర్లను సెక్యూరిటీ ఆఫీసర్ల దగ్గరికి పంపారు. సెక్యూరిటీ ఆఫీసర్లు రెచ్చిపోయి కాతియాల మీద జరిపిన మారణహోమంలో బతికి బట్ట కట్టింది వినయ్ కాతియా ఒక్కడే. ఓ రెండు లక్షలు సొమ్ము పోగేసి చావు తప్పి కన్ను లొట్టబోయి దక్షిణ భారతదేశానికి పారిపోయి వచ్చాడు. ఒకటిరెండు సార్లు వెనక్కు వెళ్దామనుకున్నాడు. కానీ ఉత్తరభారత నేర ప్రపంచం కాతియా అనే పేరు వింటేనే భగ్గుమనడం చూసి ఇక అక్కడ తనకు స్థానం లేదని తెలుసుకున్నాడు. తన surname వదిలేసి ఉత్త వినయ్ గా మిగిలిపోయాడు. ఉత్తరాది సెక్యూరిటీ ఆఫీసర్లకు, దక్షిణాది సెక్యూరిటీ ఆఫీసర్లకు వున్న భేదం తెలిసొచ్చేసరికి చేతిలోని డబ్బులు కరిగిపోయాయి. ఇక్కడ బీటు కానిస్టేబులు సైతం కింగులా వుండటం చూసి తలపట్టుకున్నాడు. బందూకులు అన్నల దగ్గర తప్ప మామూలు మనుషుల దగ్గర వుండవని తెలుసుకున్నాడు. అదుగో అప్పుడు అతన్ని ఆదుకున్నాడు ధనుంజయ్. మెల్లిగా చెయ్యదగ్గ, చెయ్యకూడని నేరాలు ఏమిటో తెలియచెప్పి ఒక స్థాయికి తీసుకొచ్చాడు. ఇక ధనుంజయ్ రిటైర్ అవుదామనుకుంటుండగా సునయనను చూశాడు. దారుణమైన పరిస్థితిలో వున్న ఆ పిల్లను చూసి జాలిపడి తన పంచన చేర్చుకున్నాడు. సునయనను కూడా తన పనులకు వాడుకుందామనుకున్న వినయ్ కు ఆమె జోలికి వెళ్లద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఐనా వినయ్ కన్ను ఆమె పైన వుండడం చూసి మెల్లిగా నేరప్రపంచం నుంచి సునయనను దూరం చెయ్యడం మొదలెట్టాడు. ధనుంజయ్ ఎప్పుడైతే పెంచలాపురం విగ్రహం పట్టుకొని చావుబతుకుల్లోకి పోయాడో అప్పట్నుంచి సునయనను కార్నర్ చేయడానికి ట్రై చెయ్యడం మొదలెట్టాడు వినయ్. ధనుంజయ్ నేర్పిన పాఠాలతో వాడికి చిక్కకుండా నెట్టుకొస్తూంది మన సునయన. ఇదిలా వుంటే అదే సమయంలో సూరత్ నుంచి పారిపోయి వచ్చిన మాలిని కపూర్ అనే ఒక కారెక్టర్ వినయ్ కు తగులుకుంది. వజ్రాల వ్యాపారకేంద్రం ఐన సూరత్ నుంచి వచ్చిన ఆ మాలిని తను అక్కడ తెలుసుకున్న కొన్ని విషయాలను వినయ్ కి నూరిపోసింది. మళ్ళీ ఉత్తరాదిన జెండా పాతాలని అతడి చెవిలో జోరీగలా పోరింది. వినయ్ గతం గురించి ఏ మాత్రం తెలియని సునయనను అనేక సంవత్సరాల తర్వాత ఆ కాతియా వంశస్థుడు నేరం చెయ్యమని ఉత్తరాదికి పంపాడు. అందినంత చేజిక్కించుకొని పారిపొమ్మని చెప్పిన ధనుంజయ్ మాటలను గుర్తు తెచ్చుకొని ఇదే తన ఆఖరు దొంగతనం అనుకుంటూ నైనిటాల్ చేరుకుంది సునయన. **************
బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోని ఎండలకు తట్టుకోలేక ఎక్కడ చల్లని ప్రదేశాలు కనిపిస్తే అక్కడ residencies డెవలప్ చేసేసుకున్నారు. అలా వాళ్ళు చేరిన ఒక ప్రదేశమే నైనిటాల్. మన పురాణాల ప్రకారం ఈ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యం వుంది. దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం. ఇంతకీ అలా బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత మిగతా యూరోపియన్ కాలనిస్టులు కట్టుకున్న కొన్ని విల్లాల్లో ఇప్పుడు చాలామంది ధనవంతులు వుంటున్నారు. అలాంటి ఒకానొక విల్లా ఈ “లా విల్లా బ్లూ” – అంటే అచ్చ తెలుగులో నీలి భవనం. ఈ నీలి భవనంలో వుంటున్న డిసౌజా చాలా వ్యాపారాల్లో వేళ్ళు పెట్టి అన్నిట్లోనూ విపరీతంగా కలిసిరావడంతో చాలా డబ్బు వెనకేసాడు. డబ్బు మదంతో సొసైటీలో మిగతా అందరూ పాటించే రూల్స్ తనకు వర్తించవు అన్నట్టు మారిపోయాడు. ఎవరన్నా సరే తనకు ఏ మాత్రం ఎదురు చెప్పినట్టు అనిపించినా వాళ్ళని డబ్బుతోనో కుదరకపోతే తన మందీ మార్బలంతోనో కొట్టే అలవాటు ఏర్పడిపోయింది. డబ్బు కట్టల్ని విసిరి వింత వింత వస్తువులు పోగెయ్యడం కూడా మొదలెట్టాడు. అతని లేటెస్ట్ మోజు వజ్రాలు. తెల్లగా ధగధగలాడే వజ్రాలే కాక అరుదైన రంగు వజ్రాలు కూడా కొంటున్నాడు ఈ మధ్య. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియకుండా సాగిస్తున్నాడు. కొన్న వజ్రాలను certify చేయించడానికి, ముడి వజ్రాలను సాన బెట్టటానికి మన దేశంలో వజ్రాల వ్యాపార కేంద్రమైన సూరత్ నుంచి experts ను కూడా రప్పిస్తున్నాడు. అలా రావాల్సిన expert సుందర్. కానీ వస్తోంది సునయన.
29-05-2020, 11:21 AM
Nice update
29-05-2020, 11:23 AM
Nice update
29-05-2020, 03:02 PM
Nice update..
29-05-2020, 06:10 PM
It’s like movie suspense
Writers are nothing but creators. Always respect them.
29-05-2020, 08:22 PM
ఇప్పటి దాకా కథ లో విలన్లు లేరు అనుకున్న కథ మరొక మలుపు ఉండబోతుంది చాలా బాగుంది
Chandra
29-05-2020, 10:57 PM
జరగబోయే అద్బుతానికి రంగం చాలా అద్బుతంగా సిద్దం చేశారు..ఏదో జరగబోతోంది బాబోయ్... ఏదో జరగబోతోంది!మనం చదవబోయేది నాకు అనిపిస్తున్నంత వరకూ ఇక్కడ న భూతో న భవిష్యత్...!
30-05-2020, 08:20 AM
మీమీ ఒక రిప్లైలో మీ కథల్లా 100 పేజిలు ఉండదు అన్నారు.... 100 పేజిలు ఏం ఖర్మ 200 పేజీలు రాయొచ్చు
ఇప్పుడు మీరు పెట్టిన మెలికతో.... రియల్లి సూపర్బ్.... ఊహించని మలుపు.... చైతు గారు చెప్పినట్లు...... ఏదో అద్భుతం జరగబోతుంది ...... మరోసారి సింప్లీ సూపర్బ్... Keep writing సర్ Iam your fan......
30-05-2020, 10:00 PM
Update కోసం ఎదురు చూసి చూసి కళ్లు వాచిపోయాయి
రచయిత గారు ప్లీజ్ కొంచెం update ఉంటే మా మొఖాన తగల పెట్టండి
31-05-2020, 03:12 PM
(29-05-2020, 08:56 AM)DVBSPR Wrote: నైస్ అప్డేట్ బ్రో (29-05-2020, 10:36 AM)paamu_buss Wrote: Interesting.... (29-05-2020, 11:21 AM)abinav Wrote: Nice update (29-05-2020, 11:23 AM)raki3969 Wrote: Nice update (29-05-2020, 03:02 PM)superifnu Wrote: Nice update.. (29-05-2020, 06:10 PM)AB-the Unicorn Wrote: It’s like movie suspense (29-05-2020, 08:22 PM)Chandra228 Wrote: ఇప్పటి దాకా కథ లో విలన్లు లేరు అనుకున్న కథ మరొక మలుపు ఉండబోతుంది చాలా బాగుంది (29-05-2020, 10:57 PM)Chytu14575 Wrote: జరగబోయే అద్బుతానికి రంగం చాలా అద్బుతంగా సిద్దం చేశారు..ఏదో జరగబోతోంది బాబోయ్... ఏదో జరగబోతోంది!మనం చదవబోయేది నాకు అనిపిస్తున్నంత వరకూ ఇక్కడ న భూతో న భవిష్యత్...! (30-05-2020, 08:20 AM)Okyes? Wrote: మీమీ ఒక రిప్లైలో మీ కథల్లా 100 పేజిలు ఉండదు అన్నారు.... 100 పేజిలు ఏం ఖర్మ 200 పేజీలు రాయొచ్చు మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు. మీ అంచనాలు చాలా ఎత్తులో ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం రండి.....
31-05-2020, 03:26 PM
మాయ - 25
సున్నితమైన సీతాకోక చిలుక తన రెక్కల్ని ఆడించడం వల్ల అంతిమంగా ఎక్కడో పెనుతుఫాను చెలరేగితే దాన్నే butterfly effect అంటారు. మన ఈ కథ దీనికి రివర్స్ అనుకోండి. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగిన అనేక సంఘటనలు చివరికి పాపం మన పెంచలాపురంలో కిరీటి జీవితాన్ని మార్చేశాయి. ఉత్తరభారతాన జరిగిన నేర ప్రపంచపు అల్లకల్లోలాలు వినయ్ అనే వ్యక్తిని మనవాడికి భౌగోళికంగా దగ్గరగా తెచ్చాయి. అలాగే ప్రపంచంలో మరోచోట జరిగిన సంఘటనలు ఈ సారి ఆ వినయ్ ను, తద్వారా సునయనను మనవాడి జీవితంలోకి డైరెక్ట్ గా తీసుకొచ్చాయి. అది చెప్పుకునే ముందు సునయన ఎదుర్కొబోతున్న disaster గురించి చెప్పుకోవాలి. ఉదయం 7:45 కు ‘లా విల్లా బ్లూ’ ముందు ఒక కారు ఆగింది. అందులోనుంచి బూడిద రంగు పాంట్, పింక్ కలర్ చొక్కా, పైన చలి ఆపటానికి కార్డిగన్ వేసుకున్న ఒక అమ్మాయి దిగింది. మనిషి మోడెర్న్ డ్రస్ వేసుకున్నా ముఖం చూస్తే నార్త్ ఇండియన్ లా వుంది. గేట్ సెక్యూరిటీ ఆమెకు సెల్యూట్ కొట్టి ఎవరు కావాలని అడిగాడు. బదులుగా ఆమె డిసౌజా కార్డ్ అతని చేతికందించింది. దాని వెనుక 8:00 am అని మాత్రం రాసుంది. ‘మీరు కావాలంటే డైరెక్ట్ గా వెళ్లొచ్చు, కానీ కారు చెక్ చేశాక మేమే లోపల పార్క్ చేస్తాము’ అని చెప్పాడు గార్డ్. తల పంకించి చిన్న హాండ్ బాగ్ తీసుకొని లోపలికి వెళ్లింది సునయన. విల్లా అత్యద్భుతంగా వుంది. సునయనకి లోపల చాలా బెరుగ్గా వున్నా ప్రస్తుతం తన కారెక్టర్ లో ఇమిడిపోవడానికి ప్రయత్నిస్తోంది. పల్లెటూరి బైతులా కళ్ళప్పగించి తను నడుస్తున్న గార్డెన్ వే ను, ఫ్రెంచ్ ఆర్కిటెక్చరు ప్రతిబింబిస్తున్న విల్లాని చూడాలని లోపల్లోపల ఉన్నా ఇలాంటి భవనాలకు రావడం తనకు కొత్తేమీ కాదన్నట్టు వెళ్ళి గెస్ట్ సిటింగ్ ఏరియాలో కూర్చుంది. 8 గంటలవగానే ఫ్రాన్స్-వా డిసౌజా పై ఫ్లోర్ నుంచి కిందకు వచ్చాడు. ‘మిస్టర్ డిసౌజా, ఐ యామ్ మాలిని కపూర్ ఫ్రమ్ జోయా కన్సల్టెన్సీ’ అంటూ పరిచయం చేసుకుంది సునయన. ఇది సునయన చేసిన మొదటి తప్పు. సొంత పేరుగానీ, తెలిసిన వాళ్ళ పేరు కానీ ఎప్పుడూ జాబ్ లో వాడొద్దు అని నూరిపోశాడు ధనుంజయ్. కానీ ఈ జాబ్ నేను చేయలేను అని చెప్పినా కూడా తనని ఇందులోకి దించిన వినయ్, మాలినిల మీద వున్న కోపం ఆమెను ధనుంజయ్ నేర్పిన పాఠాలను పెడచెవిన పెట్టేలా చేసింది. ఫ్రాన్స్-వా డిసౌజా పొద్దున్నే మంచి ఎనెర్జెటిక్ గా వున్నాడు. ‘మీ ప్రయాణం బాగా జరిగిందా మిస్ మాలిని, let’s have some coffee అంటూ మాట కలిపాడు. ‘చిన్న hiccup, బట్ పర్వాలేదు’ అంటూ servants అందించిన వేడి వేడి కాఫీ అందుకుంది. డిసౌజా చూపులతో తడిమేస్తున్నాడు సునయనని. అదేమీ పట్టనట్టు యాక్ట్ చేస్తోంది. బయట వున్నంత చలి లోపల లేదంటూ కార్డిగన్ తీసేసింది. సునయన అద్భుతమైన అందగత్తె. అవసరాన్ని బట్టి తన అందాన్ని ఎలా elevate చెయ్యాలో, ఎలా తగ్గించి చూపాలో తెలిసిన జాణ. ఆల్రెడీ టైట్ పాంట్ వేసేసరికి తన పిరుదులు, తొడలు, పిక్కలు వీటి షేపులు అన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇక కార్డిగన్ తీయగానే ఆమె ఎద సంపద షర్ట్ లోనుండి పొడుచుకొస్తూ కనిపించేసరికి డిసౌజా ఆమె అందాలపైనుంచి చూపు తిప్పట్లేదు. పొడి పొడి సంభాషణ తర్వాత అసలు విషయాన్ని కదిపింది. ‘ఈ సారి inspection కోసమా లేక polishing కోసమా సర్’ అంటూ మాటర్ లోకి దిగిపోయింది. ‘Inspection కోసమే మిస్ మాలిని. But తొందరేముంది. మనం తీరిగ్గా లంచ్ చేశాక చూసుకుందాం వర్క్ సంగతి’ అన్నాడు. సునయన గుండెల్లో రాయి పడింది. సుందర్ కు ఇంకొక మూడు నాలుగు గంటల్లో తెలివి వస్తుంది. ఇక్కడికి గానీ వచ్చాడా తన పని ఫినిష్. పనిలో అనుకోని పరిస్థితులు ఎదురైతే ఏం చెయ్యాలో backup ప్లాన్ వేసుకోకపోవడం ఆమె చేసిన రెండో తప్పు. తలకు దెబ్బ తగిలినట్టు మేకప్ వేసి, బట్టలపై కొంచెం మట్టి పూసి సుందర్ ను నైనా దేవి ఆలయం మెట్ల ముందు బిచ్చగాడిలా సెట్ చేసి వచ్చింది. అంతకంటే అతన్ని ఏం చెయ్యాలో ఆమెకు తోచలేదు. కరుడుగట్టిన దొంగలు, హంతకుల్లా అతడి గొంతు కోసేయ్యడమో, లేక ఏ లోయలోనో తోసేసో రాలేకపోయింది. ఏ హోటల్ రూమ్ లోనో పెట్టేంత సాహసం కూడా చెయ్యలేకపోయింది. మూడోకంటికి తెలియకుండా అతన్ని కొంతసేపు అడ్డు తొలగించుకోవడానికి తను చేసిన పనే కరెక్ట్ అనుకుంది. ఇప్పుడు డిసౌజా రోజంతా తనను అటకాయించాలని చూస్తున్నాడు. మరీ ఇంత సెక్సీగా డ్రస్ చేసుకుని రాకపోవలిసింది అనుకుంటూ కలవరపడుతోంది. కానీ అతని మాటకి ఎదురు చెపితే ఏం చేస్తాడో తెలీదు. అతని టెంపర్ గురించి చెవులు ఊడిపోయేదాకా చెప్పి పంపించారు వినయ్, మాలిని. ‘Certainly సర్. బట్ పని స్కోప్ ఎంతో తెలిస్తే నా day ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది’ అని చిరునవ్వుతో చెప్పింది. ‘మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. Accommodation గురించి వర్రీ అవుతుంటే ఐ హావ్ plenty ఆఫ్ రూమ్స్’ అంటూ విల్లాను చూపించాడు. ఆ క్షణమే ఏదో ఒకటి చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సింది సునయన. అలా చేయకపోవడం ఆమె చేసిన ఆఖరి తప్పు. ఈ తప్పులన్నిటికీ తోడు వినయ్, మాలినిలు తెలిసీ తెలియని ఇన్ఫర్మేషన్ తో ఆమెను ఇక్కడికి పంపడంతో ఇబ్బందుల్లో పడింది. వాళ్లలా ఎందుకు చేశారో కూడా మున్ముందు చూద్దాం. కాసేపు విల్లా అంతా తిప్పి చూపించాడు డిసౌజా. అతడి దగ్గర art, sculpture, ఇతర వస్తురూపంలోనే ఇంత సంపద వుంటే ఇక అసలు ధనం ఎంత వుండివుంటుందో అంచనా కట్టలేకపోయింది సునయన. డిసౌజా ఏదో కాస్త డబ్బున్న వెర్రిబాగులాడు అనుకొని వచ్చింది ఇక్కడికి. కానీ ఇంత సంపద వెనకేశాడంటే అతడెంత ruthless అయి వుండాలో తెలియని చిన్నపిల్లేమీ కాదు. మొదటిసారిగా తానెంత తప్పు చేస్తున్నదో ఆమెకు తెలిసొచ్చింది. ఫ్రాన్స్-వా డిసౌజా లాంటివాళ్లు తమను మోసం చేసిన వాళ్ళను ఊరికే వదిలే రకాలు కాదు. ఎంత డబ్బు ఖర్చైనా తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళ అంతు చూసే రకాలు. ఇది realize అయ్యేసరికి ఆమె ఒళ్ళు జలదరించింది. ‘మీరు ఓకే నా మిస్ మాలినీ’ అని డిసౌజా అంటే ‘రాత్రి ప్రయాణంలో చిన్న hiccup అని చెప్పాను కదా సర్. సరిగా నిద్ర పోలేదు. కొంచెం tired అంతే’ అంటూ కవర్ చేసింది. ‘గార్డెన్ లో ఫ్రెష్ ఎయిర్ బాగుంటుంది. వెళ్దాం రండి’ అంటూ బయటకు తీసుకెళ్ళాడు. గార్డెన్ లోకి వచ్చాక నిజంగానే కొంచెం మనసు తేలికపడింది సునయనకు. విల్లాను చూస్తే జైల్ లా అనిపిస్తోంది ఆమెకు. ఇప్పుడు ఇక్కడ్నుంచి సేఫ్ గా ఎలా బయటపడాలో అని ఆలోచిస్తోంది. మనసులో ఎంత భయం వున్నా ఛార్మింగ్ గా వుండడానికే ప్రయత్నం చేసింది అతడితో. కొంత సఫలీకృతం అయినట్టుంది, లంచ్ చాలా తొందరగా ముగించారు. సుందర్ అయిపు జాడ లేకపోవడంతో ఇంకొంచెం శాంతించింది సునయన. కొంతసేపయ్యాక అసలు మాటర్ లోకి వెళ్ళాడు డిసౌజా. ‘రండి, లేటెస్ట్ బ్యాచ్ చూద్దాం’ అంటూ ఆమెను తన ప్రైవేట్ స్టడీ కి తీసుకెళ్ళాడు. రూమ్ లోపలనుండి lock చేసి ఒక చిన్న బాక్స్ ను అక్కడున్న టేబుల్ పైన పెట్టాడు. సునయన తన బాగ్ లోనుండి చిన్న loupe బయటకు తీసింది. ఇక్కడ మాలిని తనకు నేర్పించిన మాటలు ఉపయోగించింది. ‘నేను చేయగలిగింది జనరల్ inspection మాత్రమే. ఫుల్ సర్టిఫికేషన్ కావాలంటే మీ items మా లాబ్ కి పంపవలసివుంటుంది తెలుసు కదా సర్’ అంటే డిసౌజా అంగీకారంగా తల ఊపాడు. లేని కాన్ఫిడెన్స్ నటిస్తూ వెళ్ళి అతను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసింది. దాదాపు 50 చిన్న చిన్న వజ్రాలు వున్నాయి అందులో. అన్నీ కూడా ధగధగలాడుతూ తెల్లగా మెరిసిపోతున్నాయి. వాటిని చూడగానే సునయన గుండె జారిపోయింది.
31-05-2020, 03:36 PM
మాయ - 26
ఈసారి బ్యాచ్ లో నీలి వజ్రాలు మాత్రమే వుంటాయి అని చెప్పి పంపింది మాలిని. Hope diamond, Blue Moon వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాలు నీలి రంగువే. డిసౌజా దగ్గరుండేవి అంత పెద్దవి కాకపోయినా రంగు అరుదైనది కాబట్టి వాటిలో ఒకటో రెండో సంపాదించగలిగినా కొన్ని లక్షలు వెనకెయ్యొచ్చు అని నూరిపోసింది. వాటిని ఎలా పరిశీలించాలో, expert లా ఎలా నటించాలో కొంత చెప్పి పంపింది. ఇప్పుడు తనకెదురుగా కూర్చున్న డిసౌజా ఎందుకు తెల్ల వజ్రాలు అవీ ఇంత చిన్నచిన్న వాటిని తనకందించాడో తెలియడం లేదు సునయనకు. వినయ్, మాలిని తనకు ఎంత తప్పుడు సమాచారం ఇచ్చారో చూసి తలతిరిగింది సునయనకు. తన అసహాయ స్థితి, stupidity చూసి తనపై తనకే కోపం వచ్చింది. ఇలా తనకు హాఫ్ నాలెడ్జ్ వున్న ఈ సిట్యుయేషన్ చాలా dangerous అని, వెంటనే బయటపడాలి అని అనుకుంది. వజ్రాలు ఆ క్షణంలో ఆమెకు secondary అనిపించాయి. కానీ అక్కడనుండి వెళ్ళాలి అంటే ఒక బలమైన కారణం కావాలి. చేవలేని దానిలా ఇప్పటిదాకా డిసౌజాను సంతోషపరచడానికి ట్రై చేసింది. ఎప్పుడైతే అతగాడినుంచి ఏమీ అవసరం లేదు అని ఫిక్స్ అయ్యిందో ఇక వేరే రూట్ లో వెళ్దామని నిశ్చయించుకుంది. ఎదురుగుండా కూర్చున్న డిసౌజా ఆమెనే తినేసేలా చూస్తున్నాడు ఇంకా. ‘నేను బాగున్నానా మిస్టర్ డిసౌజా’ అని అడిగింది. అనుకోని ప్రశ్నకు కంగుతిన్నా వెంటనే తేరుకొని పిట్ట రూట్ లోకి వచ్చేసిందేమో అనుకొని ఒక నవ్వు నవ్వాడు. ‘సెక్సీగా కూడా వున్నాను కదూ’ అంటూ టేబుల్ పై తన ఉరోజాలు ఆనించి అడిగింది. ఇక డిసౌజా pretense అంతా వదిలేసి ఆబగా చూస్తూ యెస్ అన్నాడు. ‘సో, మీరు నా లుక్స్ దాటి నన్ను ఒక ప్రొఫెషనల్ గా చూడలేక పోతున్నారన్నమాట’ అనేసరికి అతడి మొహంలో రంగులు మారాయి. తేరుకునే అవకాశం ఇవ్వకుండా సునయన ఎటాక్ కొనసాగిస్తోంది. ‘సూరత్ ఇక్కడికి దాదాపు 1500 km దూరం. కేవలం మీ పనిమీద నేను అంతదూరం ప్రయాణం చేసి వచ్చాను. మీరు చూపించిన ఈ వజ్రాలను inspect చేయించదలచుకుంటే సూరత్ నుంచి నాలాంటి వాళ్ళను రప్పించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ వజ్రాల బాక్స్ ను మూసేసింది. ‘మీ goods నాకు చూపించడం మీకిష్టంలేదని అర్ధం అయింది నాకు. As a professional, నాకు కూడా కొంత pride వుంది. దయచేసి ఇంకెప్పుడూ మా ఏజెన్సీని కాంటాక్ట్ చెయ్యకండి’ అంటూ తన loupe బాగ్ లో వేసుకొని తలుపు దగ్గరకు వెళ్ళి నుంచుంది. డిసౌజా ముఖంలో కనిపిస్తున్న భావాలు చూస్తుంటే ఆమెకు భయం వేస్తోంది. మనిషిని చూస్తే బద్దలవబోయే అగ్నిపర్వతంలా వున్నాడు. శారీరకంగా దాడి చేస్తే ఎలా కాచుకోవాలో అని లెక్కించుకుంటోంది. దేవుడే పంపించాడా అన్నట్టు ఎవరో తలుపు తట్టారు. ‘I told you not to disturb me’ అంటూ ఒక అరుపు అరిచాడు డిసౌజా. కానీ బయటనుండీ ఇంకా ఎవరో తలుపు తడుతూనే వున్నారు. సునయన కొంచెం పక్కకు తప్పుకుని నిలబడింది. ఇదొక్కటే ఇక్కడ్నుంచి బయటపడడానికి గోల్డెన్ ఛాన్స్ అని లోపల ప్రేయర్ చేసుకుంటోంది. డిసౌజా మొత్తానికి తలుపు తెరిచాడు. కానీ సునయన బయటకు వెళ్లకుండా అడ్డం నుంచుని వున్నాడు. బయటనుంచి చిన్న చిన్న మాటలు వినిపిస్తున్నాయి. మాటల్లో నీనా డిసౌజా అనే పేరు వినగానే చలిజ్వరం వచ్చినదానిలా ఊగిపోయింది ఒకసారి. సుందర్ వచ్చాడు అని అర్ధం అయింది. పూర్తిగా తెగించి లేని బింకం తెచ్చిపెట్టుకుని ‘ప్రయాణంలో hiccup అని చెప్పాను కదా. అదే మాటర్ అనుకుంటా’ అంది డిసౌజాతో. అతడామెను తేరిపార చూసి ‘come with me’ అంటూ కిందకు తీసుకెళ్ళాడు. సుందర్ నిజంగానే వున్నాడక్కడ. మనిషి ఇంకా పూర్తిగా తేరుకున్నట్టు లేదు సునయన వాడిన స్ప్రే ప్రభావం నుంచి. ఉండుండి అతడి తల వాలిపోతోంది. మధ్యలో ‘ఎటాక్’, ‘నీనా డిసౌజా’, ‘వార్నింగ్’ అంటూ పొడిపొడి పదాలు పలుకుతున్నాడు. ‘Explain’ అని ఒక్క మాట అని ఊరుకున్నాడు డిసౌజా. ‘రాత్రి ఘాట్ రోడ్డులో ఎవరో మమ్మల్ని ఎటాక్ చేశారు. వాళ్లలో ఒకామెను మిగతా వాళ్ళు నీనా డిసౌజా అని పిలిచారు. అతను నా అసిస్టెంట్. నన్ను కాపాడి తను దెబ్బలు తిన్నాడు. వర్క్ మిస్ అవకూడదని అతన్ని హోటల్ లో వుంచి నేను మీ దగ్గరికి వచ్చాను. పూర్ ఫెలో, నిద్ర లేచి నేను పక్కన లేకపోవడం చూసి ఇక్కడికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటా’ అంటూ నోటికొచ్చిన కథ అల్లేసింది సునయన. సుందర్ అవతారం, అతని బట్టలు, తల మీద వున్న కట్టు చూసి చివరకు తల పంకించాడు డిసౌజా. ‘నా డియర్ సిస్టర్ ఇంతకు తెగిస్తుందని అనుకోలేదు. నో వండర్ నువ్వంత షార్ప్ గా రియాక్ట్ అయ్యావు పైన. మనం మళ్ళీ ఈవెనింగ్ కలుద్దాం. నీ దగ్గర తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి’ అంటూ తన స్టాఫ్ కు వాళ్ళిద్దరినీ అప్పగించి కోపంగా వెళ్లిపోయాడు ఫ్రాన్స్-వా డిసౌజా. కొద్ది నిమిషాల తర్వాత విల్లాలో ఎవరూ ‘మాలిని కపూర్’ ను చూడలేదు. సునయన సుందర్ కారును అక్కడే వదిలేసి గబగబా నడుచుకుంటూ వెళ్లిపోయింది. విల్లా నుండి దూరంగా నడుస్తూ తలపైనున్న విగ్ తీసిపారేసింది. ముఖానికున్న మేకప్ చెరిపేసుకుంది. జనాలు ఎవరూ లేని చోట తను వేసుకున్న బట్టలు తీసేసి చేతిలో వున్న హాండ్ బాగ్ లోంచి ఒక పాత స్కర్ట్, టీ షర్ట్ తీసి వేసుకుంది. కళ్ళలో వున్న కాంటాక్ట్ లెన్స్ తీసి పారేసింది. బాగ్ కూడా అక్కడే వదిలేసింది. కానీ అందులోని loupe మాత్రం తనదగ్గరే అట్టిపెట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ కిరీటి ఏ అమ్మాయినైతే చూసి మోజు పడ్డాడో ఆ సునయన మళ్ళీ ప్రత్యక్షమయింది. తీరిగ్గా తన స్టడీ లోకి వెళ్ళిన డిసౌజా బాక్స్ లో ఐదు వజ్రాలు మిస్ అవడం చూసి శివాలెత్తిపోయాడు. కోపం తీరాక cold blooded గా ఆలోచించాడు. సునయన రూపాన్ని గుర్తున్నంతవరకూ వివరించి తన మనుషుల్ని ఉసిగొల్పాడు. సుందర్ తేరుకున్నాక అతడు చెప్పినదాన్ని బట్టి ఆమెకు ఒకటి కంటే ఎక్కువ రూపాలు వుండొచ్చు అని తెలుసుకున్నాడు. వజ్రాల వ్యాపారంతో సంబంధం వున్న మాలిని కపూర్ అనే ప్రతి ఒక్క మనిషినీ పట్టుకురమ్మని డబ్బు వెదజల్లాడు. దేశంలో ఎక్కడైనా సరే ఎవరన్నా అమ్మాయి వజ్రాలు అమ్మజూపితే తనకు తెలియాలని ఆర్డర్ వేశాడు. సునయన కోసం వేట మొదలైంది. వినయ్ గాంగ్ తో ఇక ఏ సంబంధం పెట్టుకోకుండా మళ్ళీ తెలుగుగడ్డకి చేరుకుంది సునయన. చేతిలో ఐదు వజ్రాలున్నా వాటిని ఉపయోగించే ధైర్యం మటుకు చేయలేదు. భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. మనం మళ్ళీ పెంచలాపురం వెళ్లాల్సిన సమయం వచ్చింది....
31-05-2020, 03:59 PM
చాలా ట్విస్ట్ లు ఉన్నాయి సునయన వజ్రాలు తనే అమ్ముతుంద లేక కిరీటి ఇస్తుందా లేదో చూడాలి పెంచాల పురం లో..
Chandra
|
« Next Oldest | Next Newest »
|