Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జి అక్కయ్యను ఆడిస్తూనే అమ్మ చేతులతో ముగ్గురమూ తిన్నాము.
తల్లీ కృష్ణ ............ మీ అన్నయ్యకు తినిపించాలని మీ బుజ్జి అక్కయ్యకు తెలుసా అని సునీతమ్మ అడిగింది .
అమ్మా ........... ఈ 6 నెలలూ చెప్పిందే అధికదా , తన తమ్ముడి గురించి A to Z తెలుసు మా బుజ్జి అక్కయ్యకు , అడుగులు ఒక్కటీ పడనివ్వండి తనే స్వయంగా తన దున్నపోతులాంటి తమ్ముడికి ప్రాణంలా గోరుగోరుముద్దలు కలిపి తినిపిస్తుంది అని బదులిచ్చాడు కృష్ణగాడు .
లవ్ యు చెల్లీ అని మోచేతితో వాడి డొక్కలో కొట్టాను .
అన్నయ్యా ............. నెమ్మదిగా , 
కృష్ణకు దెబ్బతగిలితే మన తల్లి తట్టుకోలేకపోతోంది అని అమ్మ లవ్ యు .......... అనేంతలో ,
అమ్మా ........... నాకు దెబ్బ తగులుతుంది అనికాదు , వాళ్ళ అన్నయ్య కుట్లు ఎక్కడ ఊడిపోతాయోనని అంతే అని నవ్వుతూ నా షర్ట్ పైకెత్తి చూసి హమ్మయ్యా ........ ఏమీకాలేదు లేకపోతే నేను అయిపోయేవాన్ని అని ఒకటే నవ్వులతో సమయం తెలియకుండా మా బుజ్జి అక్కయ్యతో ఎంజాయ్ చేస్తూ , నా చేతులలోనే నిద్రపోవడంతో లేచి ఊయలలో వేసి ఊపుతూ నాలోనేనే పరవశించిపోవడం చూసి అందరూ మురిసిపోతున్నారు .

 డాక్టర్ గారు వచ్చి డిశ్చార్జ్ అవ్వడానికి రెడీనా అంటూ లోపలికివచ్చి మా బుజ్జి అక్కయ్యను , చెల్లినీ చూస్తున్నారు .
రేయ్ మామా .......... అప్పుడే సాయంత్రం 5 గంటలు అయ్యిందిరా , మా బుజ్జి అక్కయ్య చిరునవ్వులను చూస్తూ సమయమే తెలియలేదు అని కృష్ణగాడు చెప్పాడు.
మేడం ......... మా అన్నయ్య చెయ్యి ..........
ఓహ్ .......... sorry ఉదయం చూడకుండా వెళ్ళిపోయాను అని కట్టు తీసి dettol తో శుభ్రం చేసి కృష్ణవేణి మీ అన్నయ్య స్ట్రాంగ్ అని అయింట్మెంట్ రాసి కొత్త కట్టు కట్టారు . కొద్దిరోజుల్లోనే నాయమౌతుంది సంతోషంగా పాపతో వెళ్ళండి , అన్నీ తెలిసిన ముగ్గురు అమ్మావాళ్ళు ఉన్నట్లున్నారు వారు ఎలా చెబితే అలా పాపను చూసుకోండి చాలు అని డిశ్చార్జ్ పై సంతకం చేశారు .

అన్నయ్యా .......... మన బుజ్జి అక్కయ్యను ఎత్తుకోండి అని సునీతమ్మ చేతినిపట్టుకొని లేచింది .
అమ్మావాళ్ళు ఉన్నారుకదా ........... అమ్మలూ డాక్టర్ గారు చెప్పారుకదా , అన్నీ మీకే తెలుసు అని మీరే ఎత్తుకోండి అనిచెప్పాను .
మహేష్ మమ్మల్ని ఆటపట్టించడానికే అలా చెబుతున్నావుకదా , ప్రాణంలా బుజ్జి వాసంతిని ఎత్తుకుంటాము , అదేమో నాకు నా ప్రాణమైన తమ్ముడే ఎత్తుకోవాలని ఏడుస్తుంది . 
నీ చెల్లి మమ్మల్ని చూసి నవ్వుతుంటే నువ్వు ప్రాణంలా మా నుండి నీ బుజ్జి అక్కయ్యను అందుకోగానే , నీ స్పర్శకే దానిలో సరిగమలు మీటినట్లుగా ఆపకుండా ముసిముసినవ్వులు నవ్వడం - అధిచూసి నువ్వు మురిసిపోవడం - మేమంతా మీవైపు తియ్యని కోపంతో చూస్తుంటే , నీ చెల్లి మరింత గట్టిగా నవ్వడం ........... అలాగే కానివ్వు నీ ఆనందం ఎందుకు కాదనాలి అని మెత్తని దుప్పటితో సహా ఊయలలోనుండి వాళ్ళ నానమ్మ ఎత్తుకుంది .
కళ్ళు పెద్దవిగా చేసి రాగం తియ్యడంతో , అమ్మల మాటలు గుర్తుకువచ్చి అందరమూ నవ్వేసాము .
వెళ్లమ్మా వెళ్లు .......... మీ తమ్ముడి దగ్గరకే వెళ్లు అని బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టి అందించారు .
లవ్ యు అమ్మా ............ , రెండు రోజుల్లో స్నానం చేయించమని మీదగ్గరకు రావాల్సిందే కదా అని , నా గుండెలపై హత్తుకున్నాను .
అమ్మావాళ్ళు ........ చెల్లిని నెమ్మదిగా నడిపించుకుంటూ బయటకువచ్చేసరికి కృష్ణగాడు , అంకుల్ రెండు కార్లను తీసుకొచ్చారు . దుమ్ము తగలకుండా వెంటనే కృష్ణగాడి ప్రక్కన కూర్చుని విండో క్లోజ్ చేసేసాను . చెల్లి ......... అమ్మా కృష్ణఅమ్మతో వెనుక కూర్చుంది . మిగిలినవాళ్ళు మరొక కారులో , పెద్దయ్యా అన్నయ్య గోపి అన్న వెహికల్లో వెనుకే అపార్ట్మెంట్ చేరుకున్నాము .

అప్పటికే అక్కడికి ఊరి జనమంతా చేరుకుని బుజ్జి అక్కయ్య వాసంతిని చూడటానికి ఆతృతతో ఎదురుచూస్తున్నారు . కారులోనుండి దిగి బాహుబలి రేంజ్ లో గర్వపడుతూ వాళ్ళ బుజ్జి వాసంతిని పైకెత్తి చూపించాను .
 తల్లీ వాసంతి తల్లీ వాసంతి తల్లీ వాసంతి .......... అని అపార్ట్మెంట్ మొత్తం మారుమ్రోగిపోతోంది . రేయ్ చెల్లిని జాగ్రత్తగా పీలుచుకొనిరా అని అమ్మావాళ్లదగ్గరికి వెళ్ళిమరీ వాళ్ళ ఆరాటానికి మురిసిపోతూ చూపిస్తూ అపార్ట్మెంట్ లోపలికి వెళుతుంటే ,
Not so fast మహేష్ ......... అంటూ సర్ వాళ్ళు అపార్ట్మెంట్ ఫంక్షన్ హాల్లోకి పిలుచుకొనివెళ్లి అందరినీ గౌరవిస్తూ లోపలికి ఆహ్వానించారు . 
స్టేజి మొత్తం అందమైన decoration తో టేబుల్ పై కేక్ arrangement చేశారు , మరొకవైపు వంటల ఘుమఘుమలు . వెళ్ళమని చెప్పి మేడం వాళ్ళు చెల్లినీ , కృష్ణగాడినీ , అమ్మావాళ్లను పిలుచుకునివచ్చారు .
ఆ హడావిడిని చూసి మేము సంతోషిస్తుంటే మమ్మల్ని చూసి మా బుజ్జి అక్కయ్య బుజ్జి బుజ్జి నవ్వులతో మురిసిపోతోంది .
అక్కయ్యా ............ కేవలం మిమ్మల్ని చూడటానికే మన ఊరు చాలాదూరం నుండి వచ్చారు . అందరికీ మీరంటే ప్రాణం , చూడు అక్కయ్యా .......... అందరి కళ్ళూ మీపైనే మీ సంతోషాన్ని చూసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడు అక్కయ్యా అని చూపించాను .

అన్నయ్యా ......... అని నన్ను మధ్యలో ఉంచుకుని చెల్లీ , కృష్ణగాడు కేక్ కొయ్యడంతో,   మాపై పూలవర్షం కురవడం చూసి అందరూ సంతోషంతో హోరెత్తించారు . మహేష్ పైకివెళ్లండి మేము చూసుకుంటాము అని సర్ వాళ్ళు చెప్పడంతో , అమ్మలూ అందరూ పైకిరండి అని చెల్లి ఊరి నుండి వచ్చిన అమ్మావాళ్ళందరినీ పైకి ఆహ్వానించింది .
ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ మా బుజ్జి అక్కయ్యకు ఘనస్వాగతం లభించింది అని సంతోషంతో మాట్లాడుతూ ముద్దుచేస్తూ లిఫ్ట్ లో మా ఫ్లోర్ చేరుకున్నాము . లిఫ్ట్ తెరుచుకోగానే పూలదారి అడుగుపెట్టగానే పూలవర్షం కురిసింది . కృష్ణ మహేష్ మరియు బుజ్జి వాసంతి రండి అని పూలదారి వర్షంలోనే మేడం వాళ్ళు లోపలికి పిలుచుకొనివెళ్లారు .
ఇల్లుమొత్తం కొత్తగా మారిపోవడం చూసి ఆశ్చర్యపోతుంటే , కృష్ణా ...... వెళ్లి మీరూం చూడండి అనిచెప్పింది . మేడం వాళ్ళు అంతలా చెబుతున్నారంటే ఎలా ఉంటుందోనని ఉత్కంఠతో లోపలికివెళ్లి చుట్టూ చూసి అలా చూస్తుండిపోయాము . మా బుజ్జి అక్కయ్యకోసం గోడలుమొత్తం అందమైన బొమ్మల పెయింటింగ్స్ మరియు అప్పుడే పుట్టిన పాపాయికి అవసరమైనవన్నీ ఏర్పాటుచేశారు . కొత్త బెడ్ కొత్త ఊయల .............,
మేడం ........... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని చెల్లి ఎంజాయ్ చేస్తుంటే ,
ఇదంతా మీ అన్నయ్య ఐడియా కృష్ణా , మేము జస్ట్ ఇష్టంతో చేయించాము అంతే .........
లవ్ యు అన్నయ్యా ...........బుజ్జి అక్కయ్యతోపాటు నన్ను చుట్టేసి గుండెలపై వాలిపోయింది . 
నుదుటిపై ముద్దుపెట్టి , థాంక్స్ మేడం అనిచెప్పి అమ్మలూ .......... మా బుజ్జి అక్కయ్యకు దిష్టి తీసి కాసేపు పడుకోబెట్టండి అని చెల్లికి అందించాను .
వెళ్లొద్దు అన్నట్లు చూస్తుంటే , అధికాదు అక్కయ్యా ........... మనకోసం అంతదూరం నుండి వచ్చారుకదా వాళ్లకు ఏలోటూ లేకుండా చూసుకోవాలి కదా ......... మా బంగారు బుజ్జి అక్కయ్య కదూ అని బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టి కిందకువచ్చాము .

పెద్దయ్యా .............మీ బుజ్జి వాసంతి చాలా చాలా హ్యాపీ అని అమాంతం కౌగిలించుకుని పంటలు ఎలా పండుతున్నాయో తెలుసుకుని సంతోషించాను .
మహేష్ .......... మళ్లీ ఇన్ని సంవత్సరాలకు నీలో మునుపటి ఆనందాన్ని చూస్తున్నాను , మా బుజ్జి వాసంతి వచ్చిన ఆనందమనుకుంటాను అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నారు .
పెద్దయ్యా .......... అక్కయ్యకు దగ్గరగా వచ్చేసాము , త్వరలోనే అక్కయ్యతోపాటు ఊరిలో అడుగుపెడతాము అనిచెప్పాను .
ఆ క్షణం కోసమే ఊరుఊరంతా ఎదురుచూస్తోంది మహేష్ . అన్ని సంవత్సరాల జాతర ఆ రోజే ఘనంగా జరుపుకుందాము అని ఆనందాన్ని వ్యక్తం చేశారు .

వాళ్ళ బుజ్జి వాసంతికోసం తెచ్చిన గిఫ్ట్స్ పైన అమ్మావాళ్ళు చెల్లికి అందించి దగ్గరకువెళ్లి ఎత్తుకోబోతుంటే , కృష్ణఅమ్మ ఆపి విషయం చెప్పడంతో , అమ్మో ....... అంత ప్రాణమా , అయితే మాకు ఇప్పటికి నిరాశే అన్నమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వదలము అని దూరం నుండే ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చి మురిసారు .
డిన్నర్ అవ్వగానే ముందు పైకి పంపించి తరువాత ఊరిజనమంతా తిన్నారు.
అన్నయ్యా ........... బుజ్జి అక్కయ్య ఏడుస్తోంది అని పైకిపిలిచింది . పరుగునవెళ్లి చూస్తే హాయిగా ఊయలలో నిద్రపోతుండటం చూసి మురిసిపోతుంటే , నన్ను బెడ్ తనప్రక్కనే కూర్చోబెట్టుకొని మీరు తినరా .........., అందరి సంతోషాన్ని చూసి అలాగే ఉండిపోతారా , అమ్మా కానివ్వండి అని చెప్పడంతో అమ్మావాళ్ళు మారిద్దరికీ తినిపించారు . బుజ్జి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి కిందకువచ్చి పెద్దయ్యా , అంకుల్ , ఊరిజనంతో మాట్లాడుతూ సమయమే మరిచిపోయాము . అర్ధరాత్రి దాటాక మహేష్ , కృష్ణ వెళ్ళొస్తాము అనిచెప్పారు .
పెద్దయ్యా ............ కొన్నిరోజులు ఉండి వెళ్ళొచ్చుకదా ..........
లేదు మహేష్ కోతల సమయం అందుకే , ఎలాగో నామకరణం కు రావాలికదా అని కౌగిలించుకుని వాళ్ళ బుజ్జి వాసంతిని మరొకసారి పైకివచ్చి చూసి అందరూ బస్ లలో వెళ్లిపోయారు . 
కృష్ణగాడితోపాటు పైకివెళ్లి ఊయలకు చెరొకవైపు కూర్చుని మా ప్రాణాన్ని చూసి మురిసిపోతుంటే , బాబు మహేష్ రెండురోజుల నుండీ నిద్రపోలేదు పాప ఊయల ప్రక్కనే పడుకో అని నేలపై బెడ్ arrange చేశారు అమ్మావాళ్ళు .
లవ్ యు అమ్మా .........., గుడ్ నైట్ అక్కయ్యా అని బుజ్జి బుజ్జి బుగ్గలను స్పృశించి ఒక చేతితో నెమ్మదిగా ఊయల ఊపుతూనే అక్కయ్యనూ తలుచుకుంటూ పెదాలపై అంతులేని ఆనందంతో హాయిగా నిద్రపోయాను .

తమ్ముడూ తమ్ముడూ .......... నీ బుజ్జి అక్కయ్యను అదే నా ప్రతిరూపాన్ని నువ్వే ముందు చూడాలి , అందరూ నీకోసమే ఎదురుచూస్తున్నారు అని అక్కయ్య రూపం కళ్ళముందు మెదిలింది .
 Ok ok అక్కయ్యా ........ అంటూ కళ్ళుమూసుకునే ఊయల తాకుతూ లేచి , మా బుజ్జి అక్కయ్య లేచిందా అంటూ పెదాలపై చిరునవ్వుతో కళ్ళుతెరిచి , అందమైన నవ్వుతో చేతులు కాళ్ళు ఆడిస్తున్న మా బుజ్జి అక్కయ్యను చూసి పరమానందంతో లవ్లీ గుడ్ మార్నింగ్ అక్కయ్యా అంటూ ఎత్తుకుని ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .

హమ్మయ్యా ......... ఇక మేము చూడొచ్చు అని చెల్లీ , కృష్ణగాడు మరియు అమ్మావాళ్ళు నా చుట్టూ చేరి విష్ చేశారు .
సమయం చూస్తే 7 గంటలు అయ్యింది . చెల్లెమ్మా ......... ఎంతసేపయింది లేచి అని అడిగాను .
చాలాసేపు అయ్యింది అన్నయ్యా ........., అక్కయ్య కలలో కనిపించి చెల్లీ ......... ఫస్ట్ మీ అన్నయ్యనే చూడాలి అని ఆర్డర్ వేశారు అందుకే మా అన్నయ్య ఎప్పుడు లేస్తారా అని ఎదురుచూస్తున్నాము .

అమ్మలూ ......... పాలు తాగుతుందా అని అడిగాను .
ఏ బుజ్జాయి అయినా నిద్రపోయి లేచినవెంటనే ఆకలి వలన ఏడుస్తుంది అప్పుడు ఆ బిడ్డకు వెంటనే పాలు పడుతుంది ఆ తల్లి కానీ ఇక్కడ మీ బుజ్జి బుల్లి అక్కయ్య నీతో ఉంటే రోజంతా కూడా ఏడ్చేలా కనిపించడం లేదు . ఇదిగో ఇలానే నవ్వుతూనే ఉంటుంది ఎలా తెలుసుకోవడం అని బుజ్జి బుజ్జి బుగ్గలను తాకి ముద్దులతో ముంచెత్తారు . 
అక్కయ్యా ........ ఆకలి వేస్తోందా , అమ్మదగ్గరికి వెళతావా అని అడిగాను .
మహేష్ నువ్వు అలా అడిగితే వెల్లననే అంటుంది అని నవ్వుకున్నారు .
అక్కయ్యా ......... నువ్వు కడుపునిండా పాలుతాగేలోపు స్నానం చేసి వచ్చేస్తాను . స్నానం చేసి రెండు రోజులవుతోంది అని దీనంగా ముఖం పెట్టి చెప్పడంతో , అక్కయ్య నవ్వడం చూసి చెల్లికి అందించాను .
ప్రాణంలా గుండెలపై హత్తుకుని అన్నయ్యా ......... అంటూ మొబైల్ చూపించి వచ్చి మూడురోజులయ్యింది .......... అని నా గుండెలపై వాలిపోయింది .
చెల్లెమ్మా .......... నెలకూడా సమయం లేదు ఫైనల్ exams కు ..........
అవునన్నయ్యా ............
చెల్లీ ......... నాకు తెలుసు క్లాస్ లో వింటేనే రాసేస్తావు అని , రిజల్ట్ పట్టించుకోవద్దు .
నేను మీ చెల్లిని అన్నయ్యా ..........
అయితే టాప్ ప్లేస్ అలాగే ఉంటుంది .
Yes ......... అన్నయ్యా , 

రేయ్ మామా .......... అంటూ వాడు కూడా exam షెడ్యూల్ చూపించాడు . చెల్లి చివరి exam పూర్తవగానే వాడి ఫైనల్ ఇయర్ exams ..........
అక్కయ్యా ........... ఇక మనకు మీ అమ్మ (చెల్లి ) , మీ dad ఇద్దరూ అడ్డురారు మనకు , ఎప్పుడు ఆకలౌతుందో అప్పుడు మాత్రమే పాలుతాగిన తరువాత హాల్లో ఇక మన ఇష్టం , యాహూ .......... అంటూ ముద్దుపెట్టి ఎంజాయ్ చేస్తూ నా రూంలోకివెళ్లి , అక్కయ్యా ............ త్వరలోనే మమ్మల్ని చేరి మరింత ఆనందాన్ని పంచుతారు కదూ అంటూ ఫోటోపై చేతితో ముద్దుపెట్టి స్నానం చేసి అక్కయ్య ఫోటోతోపాటు మా బుజ్జి అక్కయ్య దగ్గరకు చేరుకున్నాను .

 చెల్లి ఒడిలో చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జి అక్కయ్యను చూసి ఆనందించి , మీ అమ్మకు నాన్నకు exams ఉన్నాయికదా వాళ్ళు చదువుకుంటారు మనం ఆడుకుందాము అని , అక్కయ్య ఫోటోని నోటితో పట్టుకుని మా బుజ్జి అక్కయ్య తలకింద ఒకచేతినివేసి జాగ్రత్తగా ఎత్తుకున్నాను . 
లవ్ యు అన్నయ్యా ......... అంతులేచి నా గుండెలపై హత్తుకొని ఇక మీ ఇష్టం అని టవల్ అందుకొని బాత్రూమ్లోకి వెళ్ళింది . మేము హాల్లోకివచ్చి నా ప్రాణాన్ని మ్యూజిక్ ఊయలలో పడుకోబెట్టి ప్రక్కనే సోఫాలో కూర్చున్నాను .
బుజ్జిఅక్కయ్యా .......... ఇదిగో ఈ ఫొటోలో ఉన్న అక్కయ్య ఆశీర్వాదమే మీరు , మన అందరి ప్రాణం వాసంతి అక్కయ్య అని చూపించాను .
ఫోటోవైపు ముసిముసినవ్వులు నవ్వుతోంటే ,
రేయ్ మామా ........... మన బుజ్జి అక్కయ్యకు అభిమాన్యుడి లానే నీ చెల్లి కడుపులో నీగురించి అక్కయ్య గురించి మొత్తం తెలుసు , ఇప్పుడు నువ్వు అక్కయ్య ఫోటోకూడా చూపించావు . ఇక మాదగ్గరికి ఏమివస్తుంది అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి ప్రక్కనే కూర్చుని చదువుతున్నాడు . చెల్లి ఫ్రెష్ అయ్యివచ్చి మా బంగారం అంటూ మా బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి నాకు మరొకప్రక్కన కూర్చుని పెద్ద బుక్ చదువుతుండటం చూసి , కృష్ణగాడితోపాటు ఆనందించాను .

9 గంటలవరకూ చెల్లి , కృష్ణగాడు ఏకాగ్రతతో చదువుకోవాలనేమో మా బుజ్జిఅక్కయ్య హాయిగా నిద్రపోయింది . తననే చూస్తూ అక్కయ్యను గుర్తుచేసుకుంటూ నాలోనేను మురిసిపోతున్నాను .
అమ్మావాళ్ళు టిఫిన్ తీసుకురావడంతో చెల్లి తినిపించి తనూ తిని మళ్లీ స్టడీస్ లో మునిగిపోయారు .
11 గంటలకు మొదట మేడం వాళ్ళు , ఆ వెంటనే రమేష్ ఫ్యామిలీ వచ్చారు .
హాయిగా నిద్రపోతున్న మా బుజ్జిఅక్కయ్యను చూసి బుజ్జి బుజ్జి డ్రెస్ లు , బొమ్మలు చెల్లికి అందించారు. అన్నయ్యా .......... షాప్ అంతా వెతికి ఈ అందమైన బుజ్జి టెడ్డీ బేర్ ను నా piggy బ్యాంక్ డబ్బుతో కొన్నాను అని నా బుజ్జి గర్ల్ ఫ్రెండ్ చూపించింది .
Wow లవ్లీ స్నిగ్ధ ఏంజెల్ ............ నువ్వే స్వయంగా ఇవ్వు అని చెప్పడంతో , నిద్రపోతున్న పాపాయి ప్రక్కనే ఉంచి చేతి వేళ్ళను ప్రేమతో స్పృశించి , అన్నయ్యా .......... సాఫ్ట్ గా ఉన్నాయి అని సంతోషంతో మురిసిపోయింది .

పాప దగ్గరే ఉండు ఇప్పుడే వస్తాను అని రమేష్ తోపాటు బయటకువచ్చి మేనేజర్ గారు , సహాయం చేసిన రౌడీ ......... కాదు కాదు మన ఫ్రెండ్స్ ........
మహేష్ ......... మేనేజర్ గారు ఫాస్ట్ గా కొలుకుంటున్నారు . అందరినీ చైర్మన్ గారు స్పెషల్ ఫ్లైట్ లో వైజాగ్ తీసుకొచ్చారు . వాళ్ళ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు . ఇక మన 150 మంది ఫ్రెండ్స్ ను చైర్మన్ గారు పిలిపించి ఈ కంపెనీ సెక్యూరిటీ బాధ్యత మీదే .......... మీ మహేష్ సర్ నెలరోజులు లీవ్ లో ఉన్నారు తరువాత కలుస్తారు అని అందరినీ ఈక్వల్ గా డివైడ్ చేసి వర్క్ జరుగుతున్న అన్ని సైట్ లకూ పంపించారు . అంతపెద్ద కంపెనీలో పనిచెయ్యబోతున్నాము అని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి , నువ్వు కానీ అక్కడ ఉండి ఉంటే నీకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు అని సంతోషంతో బదులిచ్చాడు రమేష్ ..........
Keep me అప్డేట్ రమేష్ ............
నో నెవర్ మహేష్ ........... నెలరోజులపాటు నీకు కంపెనీకి ఎటువంటి సంబంధం లేదనీ , ఎంత క్లిష్టపరిస్థితులు ఎదురైనా ఎవ్వరూ నిన్ను డిస్టర్బ్ చేయరాదని మేడం వాళ్ళ ఆర్డర్ . అసలు ఈ విషయాలు కూడా చెప్పకూడదు అని చెప్పారు మేడం వాళ్ళు . మహేష్ .......... మేము చూసుకుంటాము కదా , అరటిపండు వొలిచి ఏకంగా నోటికి అందించావు , ఫ్యామిలీతో ఎంజాయ్ చెయ్యి అని కౌగిలించుకుని చెప్పాడు .

రమేష్ .......... కరెక్ట్ గా చెప్పావు అని సర్ వాళ్ళు మెట్లదగ్గర మామాటలను విన్నట్లు వచ్చి , మహేష్ ......... మంగళూరు సహా అన్నిదగ్గరా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సాఫీగా పనులు సాగిపోతున్నాయి . ప్లాన్స్ వివరించడానికి రమేష్ ,భరద్వాజ్ ఉన్నారుకదా ........... ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ తల్లి కృష్ణవేణికి మాటిచ్చాము నెలరోజులు అని సో అధిపాటిస్తే మంచిది అని కోపంగా చెప్పి వెంటనే నవ్వుకుని , మీ బుజ్జిఅక్కయ్య ఏమిచేస్తోంది అల్లరి చేస్తోందా అని లోపలికివచ్చాము.

సాయంత్రం అన్నయ్యా , అన్నయ్యా  ............ అక్కయ్యకు ఆకాలేస్తోందేమో అని నాచేతిని చుట్టేసి అడిగింది . 
బుజ్జిఅక్కయ్యా ......... కడుపునిండా తాగు అని బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టి చెల్లికి అందించాను .
చెల్లి ఎత్తుకుని ముద్దుచేస్తూ మా బంగారం , మా బుజ్జిఅక్కయ్య అంటూ రూంలోకివెళ్లింది . 
చెల్లి కాలేజ్ వదలగానే చెల్లి క్లాస్మేట్స్ కవితతోపాటు అందరూ స్కూటీలలో మా బుజ్జిఅక్కయ్యను చూడటానికివచ్చారు .
అన్నయ్యా.......... ఎక్కడ అని అడిగారు . 
సంతోషించి రూంవైపు చూపించాను , థాంక్స్ అన్నయ్యా ........ అంటూ కృష్ణ , కృష్ణ ............ బుజ్జిపాపాయి ఏమిచేస్తోంది అని సంతోషంతో కేకలువేస్తోఈ రూంవైపు పరుగలుపెట్టారు . 
బుజ్జిఅక్కయ్యకు పాలుతాగిస్తూనే కవిత .......... అంటూ అందరినీ చూసి మురిసిపోతూ రండి అనిపిలిచింది .
చెల్లిచుట్టూ కూర్చుని how క్యూట్ , how బ్యూటిఫుల్ ............ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , తెచ్చిన గిఫ్ట్స్ అందించి పాలు తాగడం పూర్తవగానే ఎత్తుకున్నారు. 
అంతే తియ్యని రాగం అందుకోవడంతో , చెల్లి ఆపకుండా నవ్వుతూనే ఉంది .
లేదు లేదు .......... అని ముద్దులతో ముంచెత్తినా , మళ్లీ చెల్లికే అందించినా ఏడుపు ఆపకపోవడంతో , మా బుజ్జి పాపాయిని ఎవరైనా ఎత్తుకోవాలంటే ముందు మా అన్నయ్య పర్మిషన్ కావాలి చివరికి నేను వీళ్ళ నాన్న కూడా అన్నయ్య పర్మిషన్ తీసుకున్నాకే ఎత్తుకున్నాము తెలుసా.......... అని , మా బుజ్జిఅక్కయ్య ఈ ప్రపంచంలోకి అదిగుపెట్టిన దగ్గరనుండీ జరిగిన సంఘటనలను వివరించింది .
అన్నయ్య ............ గొప్పతనం అదేకదా , కన్నతల్లి ఎత్తుకున్నా అదికూడా ఆకలి తీరిన తరువాత కూడా ఏడుపు ఆపడం లేదు , ఒసేయ్ ఒసేయ్ ......... కృష్ణ ....... పాపకు మన అన్నయ్య ఎంత ఇష్టమో మాకూ చూడాలని ఉంది అని అడిగారు .
అయితే రండి అని ఏడుస్తున్న బుజ్జిఅక్కయ్యను ముద్దుచేస్తూ సోఫాలో కూర్చుని కృష్ణగాడు తీసిన బుజ్జి అక్కయ్య వీడియో లను చూసి మురిసిపోతున్న నా చేతికి అందించగానే ,

తియ్యని నవ్వులతో కాళ్ళుచేతులనూ ఉత్సాహంతో కదిలించడం చూసి అందరూ అవాక్కైపోయారు . అన్నయ్యా .......... అద్భుతం పాపాయికి మీరంటే ఇంత ప్రాణమా అంటూ కవిత నాప్రక్కనే కూర్చుని , అన్నయ్యా అన్నయ్యా ........ ఒక్కసారి ఈ అందమైన బుజ్జిదేవతను మాకూ ఎత్తుకుని పరవశించిపోవాలని ఉంది అని ఆశపడటంతో ,
అలాగే చెల్లీ అని ఆనందించి అక్కయ్యా .......... అని అందరినీ చూపించి చెవిలో గుసగుసలాడి బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి కవితకు అందించాను .
ఎక్కడ ఏడుస్తుందోనని డౌబ్ట్ తోనే అతిజాగ్రత్తగా అందుకుంది . 
కవిత చేతిలో నవ్వడం చూసి ఏకంగా తన కళ్ళల్లో ఆనందబాస్పాలతో అన్నయ్యా అన్నయ్యా ........... అంటూ అంతులేని ఆనందంతో ప్రక్కనే కూర్చున్న చెల్లితో సంతోషాన్ని పంచుకుని మురిసిపోయింది . అలా అందరూ ఎత్తుకుని ఆనందంతో పొంగిపోయి , రేయ్ కృష్ణా ......... నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పారు.
అవును మా అన్నయ్య , మా బుజ్జిఅక్కయ్య , మా వారు .............అని సంతోషంతో పొంగిపోయి లేచివెళ్లి వాడి చేతిని చుట్టేసింది .
అమ్మావాళ్ళు స్నాక్స్ తీసుకురావడంతో అందరూ తిని సమయమే మరిచిపోయి పాపతో ఆడుకుంటున్నారు . 
ఒసేయ్ కవితా ......... 8 గంటలు అయ్యిందే అని చెల్లి గుర్తుచేయ్యడంతో , చూసి ఆశ్చర్యంతో నీ బుజ్జిదేవతతో ఉంటే సమయమే తెలియలేదు అని చెల్లికి అందించి ముద్దులతో ముంచెత్తి వెళ్ళొస్తాము అని చెప్పారు .
చెల్లి ......... నావైపు చూడటంతో , లైవ్ యు అంటూ కృష్ణగాడితోపాటు లేచి వాళ్ళ వెనుకే కార్లలో వెళ్లి అందరూ వాళ్ళ ఇంటికి చేరేలా చూసాము .
థాంక్స్ అన్నయ్యా ........ అని ఇంటిలోకి ఆహ్వానించారు .
ఎక్కడమ్మా బుజ్జిఅక్కయ్య వెయిటింగ్ చెల్లీ .......... గుడ్ నైట్ అనిచెప్పి ఎక్కడా ఆగకుండా బుజ్జిఅక్కయ్యను చేరి నవ్విస్తూ చెల్లి చేత తిని , చెల్లీ పాలుపట్టి ఊయలలో వేసి అర్ధరాత్రివరకూ చదువుతుంటే బుజ్జిఅక్కయ్య ఊయలను ఊపుతూ పడుకున్నాను .
చెల్లి బుక్స్ టేబుల్ పై ఉంచి నా భుజాలవరకూ దుప్పటికప్పి బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి కృష్ణగాడి గుండెలపై వాలిపోయి హాయిగా పడుకుంది .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
తరువాతిరోజు మళ్లీ 5 గంటలకే లేచి చెల్లి చదవడం స్టార్ట్ చేసింది . లేచి ఫ్రెష్ అయ్యి మా బుజ్జిఅక్కయ్యని ఎత్తుకుని హాల్లోకివెళ్లి అమ్మావాళ్ళతోపాటు ఎంజాయ్ చేస్తున్నాను .
అమ్మావాళ్ళు స్నానం చేయించాలి ఇప్పుడు మాదగ్గరికి ఎలారాదో చూస్తాము అని సవాల్ విసిరారు .
అక్కయ్యా ............ అమ్మావాళ్లకు ఒక చిన్న చిరునవ్వు విసిరావంటే వాళ్ళు కరిగిపోతారు అని అమ్మకు అందించాను . 
అమ్మో ......... నీ తమ్ముడి మాట నీకు శిలాశాసనం అన్నమాట లవ్ యు లవ్ యు లవ్ యు soooo మచ్ అని ముద్దులతో బాత్రూమ్లోకివెళ్లి మోకాళ్లపై నిలవునా పడుకోబెట్టుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయించి రూఓమ్ మొత్తం నిండిపోయిన తన కొత్త డ్రెస్ లలోనుండి టెడ్డీ bear డ్రెస్ వేసి కుందనపు బొమ్మలా అందంగా రెడీ చేసి నాకు అందించారు . 
ముగ్గురమూ చూసి wow ..........అని పోటీపడిమరీ ఎత్తుకోబోతే , అమ్మా నా ప్రాణం అని జాగ్రత్తగా ఎత్తుకొనివెల్లి సోఫాలో కూర్చుని మా బుజ్జిదేవత అని గుండెలపై హత్తుకొని పరవశించిపోయాను .
రేయ్ కృష్ణ .......... కాలేజ్ లైబ్రరీ నుండి బుక్స్ కావాలి అనిచెప్పడంతో వాడు వెళ్లి కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని కలిసి పర్మిషన్ లెటర్ ద్వారా బుక్స్ తీసుకురావడానికివెళ్లాడు. చెల్లి ఆన్లైన్ ద్వారా క్లాస్సెస్ వింటోంది రూంలో ........
అలా రోజూ పాలిచ్చి మాకు అప్పజెప్పి ఆన్లైన్ క్లాస్సెస్ వింటూ exams కు ప్రిపేర్ అవుతోంది . వారానికి ఒకసారి వెళ్లి డాక్టర్ ను కలిసాము . ప్రతిసారీ డాక్టర్ గారు సంతోషాన్ని వ్యక్తం చేయడం - అమ్మావాళ్లను పొగడటం , ఇంటికివచ్చి ఇంటినిండా బొమ్మలతో ఆటాడిస్తూ నెలరోజులు అలా అలా గడిచిపోయాయి . 
చెల్లి exams స్టార్ట్ అయ్యాయి . రెండు కార్లలో ముగ్గురు అమ్మలూ , వదినగారితోపాటు కాలేజ్ చేరుకున్నాము . చెల్లి మా బుజ్జిఅక్కయ్యకు సరిపడా పాలు తాగించి , రేయ్ , అన్నయ్యా , బుజ్జిఅక్కయ్యా .......... వెళ్ళొస్తాను అని ముద్దుపెట్టి వెనక్కు తిరిగితిరిగి చూస్తూ తన ఫ్రెండ్స్ తోపాటు లోపలికివెళ్లింది .
కృష్ణగాడిని అక్కడే ఉండమనిచెప్పి ఒక కారులో అమ్మావాళ్ళతోపాటు దగ్గరలోని పార్క్ కు వెళ్ళాము . 

కారులోనుండి బేబీ హగ్ స్ట్రోలర్ తీసి ఎండ తగలకుండా బుజ్జిఅక్కయ్యను అందులో  కూర్చోబెట్టి బుల్లి టెడ్డీ బేర్ అందించి పార్క్ లో నెమ్మదిగా తిప్పుతూ తన సంతోషాన్ని చూసి అందరమూ ఆనందిస్తూ , చెట్టుకింద నీడలో పచ్చని గడ్డిలో అమ్మావాళ్ళతోపాటు కూర్చుని కృష్ణఅమ్మ ఒడిలో ఉన్న బుజ్జి అక్కయ్య చుట్టూ బోలెడన్ని బొమ్మలు ఉంచి మురిసిపోయాము . 
15 నిమిషాల ముందుగానే కాలేజ్ చేరుకుని పరుగున వచ్చిన చెల్లిచేతికి సునీతమ్మ బుజ్జిఅక్కయ్యను అందించింది .
అక్కయ్యా ......... మిమ్మల్నే తలుచుకుంటూ exam బాగారాసాను అని ప్రాణంలా హత్తుకొని ముద్దుపెట్టి , ఆకాలేస్తోందా ........... మరి ఏడవటం లేదు . అయినా నా పిచ్చికానీ మీ తమ్ముడూ , అమ్మమ్మా వాళ్ళు ఉండగా నేను గుర్తుకే రాలేదేమో నిన్నూ .......... అని నుదుటితో బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రేమతో తాకి పాలుపెట్టింది .
ఇంటికి చేరుకోగానే చెల్లి ప్రేమతో నాకు తినిపించి చదువుకోవాలి బై అని రూంలోకివెళ్లిపోయింది . అలా చివరి exam వరకూ same ప్రాసెస్ కంటిన్యూ అయ్యింది . Exam పూర్తిచేసివచ్చి నా బంగారు exams అయిపోయాయి , అన్నయ్యా ........ బాగా రాశాను , మా అన్నయ్య గర్వపడతారు అనిచెప్పి మురిసింది.

రేయ్ మామా .......... రేపటి నుండి నా exams రా , మా బుజ్జి అక్కయ్య ప్రేమను అందుకొని లోపలికివెళ్లాలి రా అని కోరిక కోరాడు .
అయితే రేపటి నుండి మీ కాలేజ్ దగ్గర వేచిచూడాలన్నమాట , డన్ అంటూ ఇంటికిచేరుకున్నాము .
నెక్స్ట్ రోజు నేను చెల్లి వాడు మా ముగ్గురి ప్రాణమైన బుజ్జిఅక్కయ్య మాత్రమే కృష్ణగాడి కాలేజ్ చేరుకున్నాము .
బెల్ మ్రోగగానే ........ అక్కయ్యా ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని బుగ్గపై ప్రాణంలా ముద్దులుపెట్టారు .
All the best ........... నాన్న ( తమ్ముడూ ) అన్నట్లు చేతితో వాడి వెంట్రుకలను లాగేసాడు .
రేయ్ మామా ........... అంటూ ముగ్గురమూ హత్తుకొని all the best చెప్పాము . రేయ్ మామా పార్క్ లో ఉంటాము అక్కడికే వచ్చెయ్యమనిచెప్పాను .
అలా రోజూ మా బుజ్జిఅక్కయ్య విషెస్ తో వాడుకూడా exams పూర్తిచేసి , అక్కయ్యా , రేయ్ మామా , కృష్ణా .......... డిగ్రీ కంప్లీట్ ఇక కేవలం IPS ప్రిపరేషన్ అంటూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని , పార్క్ లో ఆడుకున్నావా అక్కయ్యా ........... అని ముద్దుచేస్తూవచ్చి చెల్లితోపాటు వెనుక కూర్చోవడంతో ఇంటికిచేరుకున్నాము .

మహేష్ .........మా తల్లీ , కృష్ణ exams కూడా పూర్తయ్యాయి , మీ బుజ్జిఅక్కయ్యకు మా అవసరం కూడా లేదనుకుంటాము నామకరణం కు రావాల్సిందే కదా ఇక వెళ్లిస్తాము అనిచెప్పారు .
అక్కడ అంకుల్ వాళ్ళు నెలరోజులుగా మాకోసం ఒంటరిగా ఉన్నారుకాబట్టి ఇష్టం లేకపోయినా సరే అమ్మలూ అని నెక్స్ట్ రోజుకు ఫ్లైట్ టికెట్స్ వేసి , ఆరోజు సాయంత్రం బుజ్జిఅక్కయ్యతోపాటు చెల్లీ కృష్ణగాడు నేను షాపింగ్ కు వెళ్లి అమ్మలకోసం పట్టుచీరలు తీసుకుని ఇంటికివచ్చి , బుజ్జిఅక్కయ్య చేతులతో అందించాము .
బుజ్జి వాసంతి ........... ఇది మాజీవితంలో గొప్ప కానుక అని రమ్మని చేతులుచాపారు. నవ్వుతూ ముగ్గురిదగ్గరకూ వెళ్ళింది . మా బుజ్జి వాసంతి బంగారుకొండ అని ముద్దులతో ముంచెత్తి , ఆరోజు రాత్రికి వాళ్ళ రూంలోనే ఊయలలో పడుకోబెట్టుకున్నారు . తరువాతిరోజు ఎయిర్పోర్ట్ చేరుకునేంతవరకూ ప్రాణంలా చూసుకున్నారు .
ఒకవైపు ఆనందబాస్పాలతో , మరొకవైపు వదిలివెళుతున్నామని కళ్ళల్లో చెమ్మతో ముద్దుల వర్షం కురిపించి , వాసంతి ఎక్కడ ఉన్నా తొందరలోనే మీ తమ్ముడి చెంతకు చేరి మన ఊరికి వచ్చెయ్యి అని ప్రార్థించి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ వెళ్లిపోయారు .
కళ్ళల్లో చెమ్మతో బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని తన ఆనందాన్ని చూసి మురిసి కారులో చెల్లికి అందించి రెండు కార్లలో ఇంటికిచేరుకున్నాము .

అన్నయ్యా ......... రేపటి నుండీ ఆఫీస్ కు వెళ్లాలనుకుంటే వెళ్లు అని కృష్ణగాడితోపాటు ముసిముసినవ్వులతో చెప్పారు .
 చెల్లెమ్మా .......... మా బుజ్జిఅక్కయ్యను వదిలి సడెన్ గా వెళ్లాలంటే కాస్త కష్టమే , సాయంత్రం వరకూ అక్కయ్యను చూడకుండా ఉండటం నావలన అవుతుందా .......,

నీవల్ల కానే కాదు మహేష్ ......... అంటూ సర్ వాళ్ళు లోపలికివచ్చారు .
సర్ , మేడం ......... రండి అని లోపలికి ఆహ్వానించాము . 
టీ చేస్తాను అని చెల్లి వంట గదివైపు వెళుతుంటే , నా చేతులలోని బుజ్జిఅక్కయ్యను జానకి మేడం ఎత్తుకుని వెనుకే వెళ్లారు .
మహేష్ ........... మేము నీకు ఎప్పుడో చెప్పాము - మళ్లీ చెబుతున్నాము . నువ్వు రోజూ ఆఫీస్ కు రావాల్సిన అవసరం లేదు అని , ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు . వీలుకుదిరినప్పుడు , అత్యవసర పరిస్థితుల్లో వస్తే సరిపోతుంది . కానీ రేపు మాత్రం బుజ్జిపాపతోపాటు అందరూ ఒక గంటసేపు ఆఫీస్ కు రావాల్సిఉంటుంది అనిచెప్పారు .
Yes సర్ .......... మీరు ఎలాచెబితే అలా అని మేడం వాళ్ళు చెల్లీ కలిసి అక్కడే వంట చెయ్యడంతో అందరమూ కలిసితిన్నాము .
కృష్ణా ........... డిగ్రీ పూర్తయ్యింది , ఇక IPS ప్రిపరేషన్ అన్నమాట ఎలా ఉంది అని సర్ అడిగారు .
గోయింగ్ వెల్ సర్ ........... అక్కయ్య కోరిక కూడా నేను IPS అవ్వాలని ,బుజ్జి అక్కయ్య కూడా all the best చెప్పింది . నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాను .
All the best కృష్ణా .......... అని విష్ చేసి , ఉదయం రెడీగా ఉండండి గుడ్ నైట్ లిటిల్ ఏంజెల్ అనిచెప్పివెళ్లారు .

ఆరోజు నుండీ చెల్లి ఫ్రీ అయ్యింది , కృష్ణగాడి ప్రిపరేషన్ పీక్స్ చేరింది .
తరువాతి రోజు ఉదయం తెల్లవారకముందే చెల్లీ చెల్లితోపాటు మా బుజ్జిఅక్కయ్య కూడా రెడీ అయ్యి , నన్ను లేపి అన్నయ్యా .......... బుజ్జి అక్కయ్య వాళ్ళ వాసంతి అక్కయ్యను వెతకడానికి వస్తుందట చూడండి ఎలా రెడీ అయ్యిందో అని ఏంజెల్ ను చూపించింది .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అక్కయ్యా ............. క్షణాల్లో రెడీ అయ్యివచ్చేస్తాను అని గుడ్ మార్నింగ్ కిస్ పెట్టి బాత్రూమ్లోకివెళ్లి హాల్లోకివచ్చాను . కృష్ణగాడు బుక్స్ క్లోజ్ చేసి రెండు కార్ తాళాలు అందుకొని ఒకటి నావైపు విసిరాడు . జేబులో ఉంచుకుని ఏంజెల్ లా రెడీ అయిన మా బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని లిఫ్ట్ లో కిందకువచ్చి కృష్ణగాడి ప్రక్కనే కూర్చున్న చెల్లికి అందించి వాళ్ళవెనుకే చాలా దూరం వెళ్లి వీధులన్నీ వెతుకుతూ , చెల్లి అక్కయ్య గురించి బుజ్జిఅక్కయ్యకు వివరిస్తూ కారులోని ఫోటోని చూపిస్తూ నిరాశతో 9 గంటలకు ఇంటికిచేరుకున్నాము .
పైకివెళ్లి చెల్లి చేసిన టిఫిన్ తిన్నాము .

మహేష్ లోపలికి రావచ్చా అని మేనేజర్ గారి మాటలు వినిపించాయి . 
సర్ ........... ఎలా ఉన్నారు అని చేతులుకలిపి లోపలికి ఆహ్వానించాను . 
I am fine మహేష్  , పూర్తిగా కోలుకుని రెండువారాలపైనే అయ్యింది . మిమ్మల్ని స్వయంగా పిలుచుకురమ్మని సర్ వాళ్ళు పంపించారు .
నేను మా బుజ్జిఅక్కయ్య ఎప్పుడో రెడీ అని ఊయలలో హాయిగా నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టాను . 
రేయ్ మామా , అన్నయ్యా ........... మేముకూడా రెడీ అని చెల్లి పట్టుచీరలో వచ్చింది.
మా చెల్లి దేవత , మా బుజ్జి అక్కయ్య బుజ్జి దేవత అని ఎత్తుకుని , చెల్లీ బుజ్జిఅక్కయ్యకు కావాల్సినవన్నీ తీసుకున్నారు కదా అని అడిగాను . 
Oh yes అన్నయ్యా .......... అని కృషగాడి చేతిని చుట్టేసింది .

మేనేజర్ గారు వెళదామా అని చెప్పానూ .
  మహేష్ ......... ఇలాకాదు అని చిటికె వెయ్యగానే అసిస్టెంట్ మేనేజర్ ఒక బాక్స్ తీసుకొచ్చి నాకు అందించారు .
ఓపెన్ చేసి చూస్తే అందులో సూట్ ఉండటంతో ఆశ్చర్యపోయాను .
చెల్లీ , కృష్ణగాడు వచ్చిచూసి wow ...........అన్నయ్యా ఇందులో ఎలా ఉంటావో మాకు మీ బుజ్జిఅక్కయ్యకు కూడా చూడాలని ఉంది కదా అక్కయ్యా అని నా చేతులలోనుండి అందుకుంది .
నవ్వడంతో ......... see తొందరగా వెళ్లి వేసుకునిరండి అనిచెప్పింది .

మేనేజర్ గారు ఏమిటి విషయం అని అడిగాను .
చైర్మన్స్ ఆర్డర్ వేశారు నేను తీసుకునివచ్చాను , ఈ ప్రశ్నను నేను చైర్మన్స్ కు వెయ్యలేనుకదా ........... , మహేష్ ......... తొందరగా అక్కడ అందరూ .......
అందరూనా ...........
 నవ్వుకుని అదే సర్ , మేడం వాళ్ళు ఎదురుచూస్తుంటారు అని తడబడుతూ సమాధానం ఇచ్చారు . 
10 మినిట్స్ సర్ అని లోపలకువెళ్లి సూట్ లో వచ్చాను .
లవ్లీ లవ్లీ ......... అన్నయ్యా , రేయ్ సరిగ్గా సరిపోయిందిరా , సూపర్ గా ఉన్నావు ఒక సెల్ఫీ అని బుజ్జిఅక్కయ్యతోపాటు తీసుకున్నారు .
 రేయ్ కేవలం నాకు మన బుజ్జి అక్కయ్యకు ఫోటోలు తియ్యరా అని చెల్లినుండి ఎత్తుకున్నాను .
అన్నయ్యా , రేయ్ రేయ్ ద్రోహి ........... అంటూ ఫోటోలు తీసి మురిసిపోయాడు .
అక్కయ్యా ........... నువ్వు వచ్చాక అన్నయ్యకు మాపై ఏమాత్రం ప్రేమలేకపోయింది మొత్తం నువ్వే అనుభవిస్తున్నావు అని బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టింది .

కంపెనీ చైర్మన్ లా ఉన్నావు మహేష్ ..........
మేనేజర్ గారు sorry ఇంకెప్పుడూ అలా పిలవకండి ,నేను నా తల్లిలాంటి కంపెనీలో ఎప్పటికీ కార్మికున్నే ............
సాల్యూట్ యు మహేష్ ........... అని సెల్యూట్ చేసి ఆఫ్టర్ యు మహేష్ , కృష్ణ ..... అంటూ దారిని చూపించారు .
అక్కయ్యా ........... మన ఆఫీస్ కు వెళుతున్నాము . చాలాపెద్దగా ఉంటుంది . మన మేడం వాళ్ళు సర్ వాళ్ళు వందలలో స్టాఫ్ ఉంటారు అని లిఫ్టులో కిందకువచ్చి వరుసగా నిలబడిన కార్లను చూసి ఆశ్చర్యపోయి , మేనేజర్ గారు ..........
మహేష్ , మేడం , కృష్ణ ........... కూర్చోండి అని మధ్యలోని కార్ డోర్స్ తెరిచారు    ఆశ్చర్యపోతూనే చెల్లీ , రేయ్ కూర్చోండి అని వెనుక డోర్ వేసి నేను బుజ్జిఅక్కయ్యతోపాటు ముందు కూర్చున్నాను . మేనేజర్ గారు డోర్ క్లోజ్ చేసి ముందు కార్లో కూర్చున్నారు  
గుడ్ మార్నింగ్ మహేష్ సర్ ........... పోనివ్వమంటారా అని అడిగాడు డ్రైవర్ .
తేరుకుని yes అన్నాను .
అన్నయ్యా ........... 10 కార్లపైనే ఉన్నాయి ఏమిజరుగుతోంది అని అడిగింది చెల్లి .
ఏమో చెల్లీ ........... ఆఫీస్ కు వెళ్ళాక తెలుస్తుంది ఉండు రమేష్ కు కాల్ చేసి కనుక్కుంటాను అని అక్కడకూడా రమేష్ ఫ్యామిలీ మొత్తాన్ని 10 కార్లలో ఆఫీస్ కు పిలుచుకునివెళుతున్నారని చెప్పడంతో మరింత ఆయాశ్చర్యపోయాను .

 రమేష్ కాన్వాయ్ తోపాటు ఆఫీస్ చేరుకున్నాము . మేము ఉన్న కార్లు రెండు మాత్రమే లోపలికి ప్రవేశించాయి . అక్కయ్యా ........ ఇదే మన ఆఫీస్ అని గర్వపడుతూ చూపిస్తూ మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే , అక్కడి నుండి బిల్డింగ్ వరకూ స్టాఫ్ మొత్తం రెండువైపులా నిలబడి చప్పట్లతో స్వాగతం పలుకుతూ మా కార్లపై పూలవర్షం కురిపిస్తున్నారు . 
అన్నయ్యా , రేయ్ .......... అంటూ వెనుక ఇద్దరితోపాటు నేనుకూడా ఒకవైపు సంతోషంతో మరొకవైపు ఆశ్చర్యంతో బిల్డింగ్ ముందు చేరుకున్నాము . 
ఎంట్రన్స్ మొత్తం అద్భుతంగా decorate చేశారు . 
మేనేజర్ గారు మారు డోర్స్ , అసిస్టెంట్ మేనేజర్ గారు రమేష్ వాళ్ళ కారు డోర్ తెరిచి మహేష్ ......... అని చేతితో సైగచేశారు .
బుజ్జిఅక్కయ్యతోపాటు దిగి వెనక్కువెళ్లి డోర్ తెరిచి చెల్లి చెయ్యి అందుకున్నాను .
కృష్ణగాడితోపాటు కిందకుదిగి ముగ్గురమూ " welcome our new chairmans " మహేష్ - రమేష్ ............అని చూడగానే , స్టాఫ్ అందరూ మహేష్ రమేష్ , మహేష్ రమేష్ ............ అంటూ నినాదాలతో హోరెత్తించారు .

సర్ ,మేడం వాళ్ళు వచ్చి heartfully welcome మహేష్ , రమేష్ ........... అంటూ కౌగిలించుకుని మాచేతులను పైకెత్తడంతో మరింత కోలాహలం నెలకొంది .
మా బుజ్జి వాసంతిని ఇటివ్వు అంటూ మేడం వాళ్ళు ఎత్తుకుని , నీ తమ్ముడు ఈ పెద్ద కంపెనీకే చైర్మన్ వాసంతి నీకు ఇష్టమేనా అని ముద్దుచేస్తూ అడిగింది . 
అప్పటివరకూ చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిఅక్కయ్య సైలెంట్ అయిపోయింది .
అదేసమయానికి  చెల్లివైపు , కృష్ణవైపు చూస్తే , నో నో అన్నట్లు తలఊపి నా గుండెలపై వాలిపోవడంతో , ok చెల్లీ .............

సర్ , మేడం.......... మీకోరికను రిజెక్ట్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి . నాకు , చెల్లికీ, కృష్ణకూ ఇష్టం లేదు . రమేష్ కు ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు సంతోషంగా అతడికింద పనిచేస్తాను . 
స్టాఫ్ మొత్తం సైలెంట్ అయిపోయారు .
మహేష్ ......... నేనెప్పుడూ నీవెంటనే my ఫ్రెండ్ అనివచ్చి రమేష్ నా మరొకచేతిని అందుకున్నాడు .
శివరాం , నారాయణ .......... నిజమే బుజ్జి వాసంతికి కూడా ఇష్టం లేదు అని మేడం వాళ్ళు చెప్పారు.
Yes మేడం ......... అక్కయ్యకు నేను గొప్ప ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరిక , మీలాంటి నిజాయితీ చైర్మన్స్ కింద వర్క్ చేయడమే నా అదృష్టం ........ నన్ను ఫోర్స్ చేయకండి. మీరు బ్రతిమాలినా , భయపెట్టినా నా సమాధానం అదేనని చెప్పాను .
ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ , రమేష్ .......... అంటూ కౌగిలించుకుని ఆనందబాస్పాలతో లోపలికి ఆహ్వానించారు .
వాసంతి ......... నీ కోరికనే తీరబోతోంది , స్మైల్ please అనగానే ,
ముసిముసినవ్వులు నవ్వుతూ కాళ్ళుచేతులు ఆడించడంతో , 
లవ్ యు ........... అంటూ ముద్దుచేస్తూ చెల్లినీ , సునీత గారిని , స్నిగ్ధాను తమ రూంలోకి పిలుచుకొనివెళ్లి సోఫాలో కూర్చున్నారు .
మేడం ......... నాకు ఇవ్వండి అని స్నిగ్ధ అందుకొని సోఫాలో జాగ్రత్తగా ఒడిలో కూర్చోబెట్టుకొని ఆడించి మురిసిపోతోంది .

మహేష్ ........... ప్రతీ విషయంలోనూ నువ్వు మా అంచనాలను మించుతూ అద్భుతాలను ఆవిష్కరిస్తూ మాకు అమితానందాన్ని కలిగిస్తూనే ఉన్నావు . మీ మేడం వాళ్ళ విషయంలో నువ్వు మా కుటుంబంలో వ్యక్తివి అయిపోయావు . నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను చైర్మన్ బాధ్యతలు అప్పగించాలి అనుకున్నాము . 
సర్ .........
OK మహేష్ , నేను అర్థం చేసుకోగలను . నువ్వు జీవిస్తున్నదే మీ అక్కయ్య కోసం అని , నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరిద్దరూ మా partners , ప్రతి ప్రాజెక్టు ద్వారా వచ్చిన లాభం మన నలుగురికీ సమానంగా షేర్ చేసేస్తున్నాను . ఇవి మీ బ్యాక్ అకౌంట్స్ అని అందించారు . 
నేను తీసుకోకపోవడంతో రమేష్ కూడా తీసుకోలేదు . సర్ ఎక్కడో ఉన్న మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచారు మాకు అదిచాలు సర్ ............
 మహేష్ ......... మేము ఎక్కడో తెలుసుకదా , పైన అంటూ సర్ వాళ్ళతోపాటు నవ్వుకున్నాము . అక్కడ ఉండాల్సిన మమ్మల్ని సౌత్ ఇండియా కే నెంబర్ వన్ చేశారు . మినిస్టర్స్ ను నేరుగా వెళ్లి కలవగలిగేంత గౌరవాన్ని కల్పించారు . నాకు తెలుసు మీరు తీసుకోరని , మేము మాత్రం మీ షేర్ ను వీటిలోకి జమ చేస్తూనే ఉంటాము . మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడే తీసుకోండి అని మరొకసారి మనసారా కౌగిలించుకుని , మా కోసమే మా కంపెనీ కోసమే మిమ్మల్ని ఆ దేవుడు సృష్టించారు . ఒకసారి చైర్మన్ సీట్లలో కూర్చుంటే ఆనందిస్తాము అని కోరారు .
సర్ ......... తిరిగి తిరిగి మీరు అక్కడికే వస్తున్నారు . సీట్ కాదుకదా మీ రూంలోనే అడుగుపెట్టను అని నవ్వుకుని , డోర్ కొద్దిగా తెరిచి my dear girlfriend కమాన్ అని పిలిచాను .
బుజ్జి అక్కయ్యను ఎత్తుకుని రావడంతో , అక్కయ్యా ........ అది మన రూమ్ కానే కాదు అని మారూంలోకి పిలుచుకొనివెళ్లి సోఫాలో కూర్చుని ఇద్దరమూ నవ్వించాము .
స్నిగ్ధా ......... వెళ్లి మీ అక్కయ్యలను కూడా పిలుచుకునివచ్చెయ్ అనిచెప్పాను .
అలాగే అన్నయ్యా ........ అంటూ వెళ్లి అక్కయ్యలూ ఈ రూంలోకి అడుగుపెట్టారాదని అన్నయ్య ఆర్డర్ అంటూ చేతులు అందుకొని లాక్కునివచ్చారు .
మేడం వాళ్ళు బయటకువచ్చి ఏమైంది అని సర్ వాళ్ళను అడిగారు . 
జరిగినదంతా వివరించడంతో , మహేష్ డైమండ్ శివరాం మన ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో , మీరు మీ చైర్మన్ సీట్లలో కూర్చోండి . మేము బుజ్జి వాసంతి దగ్గరకువెళతాము అని మారూంలోకివచ్చారు .
మేడం వాళ్ళు రాగానే తలదించుకున్నాను . 
నవ్వుకునివచ్చి నా ప్రక్కనే కూర్చుని మేము ఇక ఆ విషయం గురించి చర్చించము , మేము వచ్చినది మా వాసంతి కోసం please please .........అని చేతులను చాపారు . 
అక్కయ్యా ......... మేడం వాళ్లదగ్గరికి వెళతారా అని అడిగాను .
చేతులు కదిలించడంతో , మేడం వాళ్ళు సంతోషం పట్టలేక యాహూ.......... అంటూ గట్టిగా కేకలువేసి ప్రాణంలా ఒడిలో పడుకోబెట్టుకొని , మన ఇంటికి ఇంకా ఒక్కసారి కూడా రాలేదు కదూ కొద్దిసేపట్లో వెళదాము అని ముద్దుపెట్టారు . 
కృష్ణగాడు నా సీట్లో కూర్చుని సైలెంట్ గా చదువుకుంటున్నాడు .

చెల్లీ .......... మీరు మేడం వాళ్ళతోపాటు ఇంటికివెళ్లండి . వర్క్ ఎలా జరుగుతుందో చూసుకుని అటునుండి ఆటే వచ్చేస్తాను అనిచెప్పాను .
అన్నయ్యా ........మాకెందుకు చెబుతున్నారు .మీ ప్రాణమైన వాళ్లకు చెప్పండి లేకపోతే కంట్రోల్ చెయ్యడం మావల్లకాదు అని మేడం వాళ్ళతోపాటు నవ్వుతోంది .
మేడం వాళ్లముందు మోకాళ్లపై కూర్చుని అక్కయ్యా ....... చిన్నపని ఉంది చూసుకునివస్తాను . మీరు మేడం వాళ్ళతో వెళ్ళండి please please.......... లంచ్ సమయానికి వచ్చేస్తాను అనిచెప్పాను .
ముందు అలిగినా వెంటనే నవ్వడంతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని బుగ్గపై ముద్దుపెట్టి , రమేష్ మేనేజర్ గారితోపాటు వర్క్ జరుగుతున్న ఐదు చోట్లకు వెళ్లి ప్లాన్ ప్రకారం జరుగుతుండటం చూసి సంతోషించి , సెక్యూరిటీ ఫ్రెండ్స్ పరుగున చుట్టుముట్టి సర్ ....... మీరు చెప్పినట్లే మేము ఎటువంటి భయం లేకుండా ప్రశాంతతో జీవిస్తున్నాము సర్ , మాపై కేసులన్నింటినీ కొట్టేశారు , మా కుటుంబ సభ్యులు మిమ్మల్ని తలుచుకోని రోజంటూ లేదు సర్ , పిల్లలంతా బ్యాగుతో కాలేజ్ కు వెళుతోంటే కలుగుతున్న ఆనందాన్ని వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు సర్ , మా దేవుడు మీరే అని ఉద్వేగంతో పాదాలను తాకాబోతుంటే ఆపగానే అమాంతం పైకెత్తేసి పండగ చేసుకున్నారు .
మీరు హ్యాపీ అయితే అదే సంతోషం అని హత్తుకొని మళ్లీ కలుద్దాము అని మేడం ఇంటికి చేరుకున్నాను .
Like Reply
కారు సౌండ్ రాగానే స్నిగ్ధ పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్యా .......... మన బుజ్జి అక్కయ్య అలిగింది ఒకసారి టైం చూసుకోండి అనిచెప్పింది .
2 దాటడంతో అయిపోయాను అంటూ స్నిగ్ధ చేతిని అందుకొని పరుగున లోపలికి వస్తూ ఏడవలేదు కదా అని అడిగాను .
ఏడ్చింది అన్నయ్యా ......... వెంటనే అక్కయ్య పాలు ఇవ్వడంతో అప్పటి నుండీ చిన్న చిరునవ్వుకూడా నవ్వకుండా అక్కయ్య ఓడిలోనే హాయిగా నిద్రపోయింది .
అన్నయ్యా ......... వచ్చావా అని ప్రక్కనే కూర్చోబెట్టుకుంది .
అక్కయ్యను ఎత్తుకుని లవ్ యు అక్కయ్యా .......... ఆలస్యం అయ్యింది . మీరు చూపించిన దారిలో వెళుతూ చాలలామందికి సహాయం చేస్తున్నానా ........ వాళ్ళు అభిమానం చూపిస్తుంటే కాసేపు మాట్లాడి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది . వాళ్ళ ఆశీర్వాదాలన్నీ మా బుజ్జిఅక్కయ్యకే చెందాలి అని ప్రాణంలా ముద్దుపెట్టి హత్తుకున్నాను . 
లవ్ యు అన్నయ్యా ........... అంటూ నాచేతిని చుట్టేసి ఆనందించింది .
ఇంతలో సర్ వాళ్ళుకూడా రావడంతో అందరమూ కలిసి భోజనం చేస్తూ , మహేష్ ........ నువ్వు కోరిన కోరికవల్లనే మీ మేడం వాళ్ళ చేతివంట తింటున్నాము ఆహా ...... అద్భుతం ఉమ్మా ........ లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు .
అధిచూసి అందరమూ సంతోషంతో కేకలువెయ్యడంతో , మేడం వాళ్ళు సిగ్గుతో మురిసిపోయి మహేష్ , కృష్ణ .......... ఎలా ఉన్నాయి అని అడిగారు . 
సర్ వాళ్ళు చెప్పినట్లు అమృతమే అంటూ కుమ్మేసి కాసేపు సర్ వాళ్ళతో ప్రాజెక్ట్స్ గురించి చర్చించి ఇంటికి చేరుకున్నాము . 
తరువాతి రోజు నుండి ఇంటి నుండే వర్క్ చేస్తూ బుజ్జిఅక్కయ్యతోనే సమయం గడుపుతూ , కృష్ణగాడు ప్రిపేర్ అవుతూ నెలరోజుల తరువాత చెల్లి రిజల్ట్స్ వచ్చాయని మొబైల్ కు కాలేజ్ నుండి మెసేజ్ రావడం ఆవెంటనే congratulations అని wishes ఆపకుండా వస్తూనే ఉండటంతో , చెల్లి ఆనందంతో మాఇద్దరి మధ్యన కూర్చుని లాప్టాప్ ఓపెన్ చేసి బుజ్జి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి రిజల్ట్స్ చూసి , లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ......... మీ చెల్లి మళ్లీ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది అనిచెప్పగానే ,
బుజ్జిఅక్కయ్యతోపాటు ఇద్దరమూ అంతులేని ఆనందంతో , ఒక్కొక్కచేతితో చెల్లిని అమాంతం పైకెత్తేసి మాకు ముందే తెలుసు మా చెల్లి గురించి అని పండగ చేసుకున్నాము . కృష్ణగాడు స్వీట్స్ తీసుకొచ్చి చెల్లికీ నాకు తినిపించి బుజ్జిఅక్కయ్య బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టాడు .
మా ఆనందాన్ని చూసి మా బుజ్జిఅక్కయ్య కాళ్ళుచేతులనూ కదిలించి ఆపకుండా నవ్వుతూనే ఉంది .

 15 రోజుల తరువాత చెల్లి కాలేజ్ స్టార్ట్ అవ్వడంతో బుజ్జిఅక్కయ్యతోపాటు ముగ్గురమూ కాలేజ్ చేరుకున్నాము . బుజ్జిఅక్కయ్య కోసం వాకింగ్ చైర్ , పడుకోవడం కోసం కారులో వెనుక సీట్ తీయించి ఒక ఊయల arrange చేయించాము , చెల్లితోపాటు క్లాస్ కు వెళితే అక్కడ పడుకోవడానికి , ఆడుకోవడానికి కావాల్సినవన్నీ తీసుకుని ముందుగా ప్రిన్సిపాల్ రూమ్ వైపు వెళుతోంటే , చెల్లికి ప్రతి ఒక్కరూ కంగ్రాట్స్ చెబుతున్నారు .
ప్రిన్సిపాల్ మేడం కూడా లేచివచ్చిమరీ కౌగిలించుకుని కంగ్రాట్స్ చెప్పి , ఇలాంటి సమయంలో కూడా .......... సాధించావు కృష్ణ చాలా సంతోషం . ఒక స్టూడెంట్ వరుసగా త్రీ ఇయర్స్ యూనివర్సిటీ టాప్ లో రావడం కాలేజ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ప్రౌడ్ ఆఫ్ యు my గర్ల్ ............
థాంక్స్ మేడం , మావారు మరియు మా అన్నయ్య వల్లనే నేను సాధించగలిగాను లవ్ యు both అని మా ఇద్దరి చేతులనూ చుట్టేసి ఆనందించి , ఇప్పుడు మరొక ఇన్స్పిరేషన్ కూడా my baby గర్ల్ ......... my హార్ట్ , our హార్ట్ , our లైఫ్ అంటూ నా చేతులలోని అక్కయ్య చేతులను స్పృశించి మురిసిపోతోంది .

మేడం ........ పాప అని విషయం చెప్పేంతలో , 
మహేష్ ........ పాప తల్లితోనే ఉండాలి కాబట్టి , పాప కంఫర్ట్ ముఖ్యం , నేనూ తల్లినే కదా అర్థం చేసుకోగలను అని పాప క్యాంపస్ , క్లాస్ ......... లలో చెల్లితోనే ఉండేలా పర్మిషన్ ఇచ్చి , సంతోషంతో దగ్గరకువచ్చి can i అని అడిగారు .
అక్కయ్యా .......... ప్రిన్సిపాల్ అంటూ అందించాను .
క్యూట్ , బ్యూటిఫుల్ .......... కృష్ణా ...... you are very lucky అని ముద్దుపెట్టి అందించారు . 
కృష్ణా ......... స్టాఫ్ రూంలో లెక్చరర్స్ అందరికీ ఒకసారి ముందుగానే లెటర్ చూపించి ఇంఫార్మ్ చెయ్యి , so that ...........ok ,
Yes మేడం sure అని స్టాఫ్ రూమ్ కు వెళ్ళాము . అందరూ ఫస్ట్ క్లాస్ కు వెళ్ళడానికి రెడీ అవుతుండటంతో వారి పర్మిషన్ కూడా తీసుకున్నాము .

తరువాతి రోజు నుండీ మళ్లీ బిజీ షెడ్యూల్ ........... తెల్లవారకముందే లేచి అక్కయ్యకోసం వెళ్లడం - టిఫిన్ చేసి బుజ్జిఅక్కయ్య సంతోషాన్ని చూసి మురిసిపోతూ రెండు కార్లలో చెల్లి కాలేజ్ చేరడం - అక్కయ్యా ........లంచ్ లో కలుస్తాను అని ప్రామిస్ చేసి ముద్దులతో ముంచెత్తి ఆఫీస్ కు వెళ్లడం - చెల్లి క్లాస్ లో ఉన్నంతసేపూ అక్కయ్యను తనదగ్గరే ఉంచుకుని చూసుకోవడం - చెల్లికి lab ఉన్నప్పుడు క్యాంపస్ చల్లని చెట్టునీడలో కార్లో కూర్చుని ప్రిపేర్ అవుతున్న కృష్ణగాడికి అందించడం , వాడు కొద్దిసేపు ఆడించి నవ్వించి కారులో వెనుక ఊయలలో పడుకోబెట్టి మళ్లీ చదువుతూ అక్కయ్యను జాగ్రత్తగా చూసుకోవడం - అవసరమైనప్పుడు చెల్లిని కానీ , నన్ను కానీ పిలిపించేవాడు . అలా రోజులు సంతోషంగా సాఫీగా రోజులు , వారాలు , నెలలు సాగిపోతున్నాయి . మా ముగ్గురికీ ఉన్న ఒకే ఒక బాధ - అక్కయ్య ఎక్కడ అని ...........

ఒకరోజు ఆఫీస్ లో సర్ , మేడం వాళ్ళు మా రూమ్ కు వచ్చి మహేష్ ........ బెంగళూరులో సౌత్ ఇండియా ప్రైవేట్ constructions కంపెనీల చైర్మన్స్ మీటింగ్ జరుగుబోతోంది . నువ్వు రమేష్ కూడా మాతోపాటు వస్తున్నారు ఎల్లుండి ప్రయాణం రెండు రోజులు అక్కడే అనిచెప్పారు .
నో నో నో ........ అది చైర్మన్స్ మీటింగ్ , అంటే మమ్మల్ని ఏదోలాగా ......... అమ్మా ఆశ దోస అప్పడం . నేనైతే అస్సలు రాను కావాలంటే రమేష్ ను తీసుకెళ్లండి . రెండు రోజులా .......... మా బుజ్జి అక్కయ్యను చూడకుండా నేను ఉండలేను . మీరు ఫ్లైట్ ఎక్కేంతవరకూ నేను ఆఫీస్ కు కూడా రాను . మీరు ఎమోషనల్ గా బ్లాక్మైల్ చేసినా చేస్తారు . ఇదిగో ఇప్పుడే వెళ్లిపోతున్నాను నాకు కాల్ కూడా చేయకండి happy journey and enjoy the మీటింగ్ .
భలే ప్లానింగ్ వేసి ఎలాగోలా తీసుకెళ్దామనుకున్నారు , నేనేమీ అంత అమాయకుణ్ణి కాదు .............
మహేష్ మహేష్ మహేష్ .......... అని ఎంతపిలిచినా పట్టించుకోకుండా కారులో నేరుగా కాలేజ్ కు బయలుదేరాను . 
సర్ , మేడం వాళ్ళు నవ్వుకుని లవ్ యు soooooo మచ్ మహేష్ ........... నువ్వు ఇక్కడ ఉంటావు అని గుండెలపై చేతులువేసుకుని గర్వపడుతూ రమేష్ .........నువ్వు ఒక్కమాట కూడా మాట్లాడటానికి వీల్లేదు we are going thats ఫైనల్ అని ఆర్డర్ వేసి పొంగిపోతూ ఆఫీస్ రూంలోకివెళ్లారు .

అమ్మో ......... ఎంత ప్లాన్ వేశారు . ఎలాగోలా చైర్మన్ చేయాలనుకుంటున్నారు . నో నెవర్ మా అక్కయ్య కోరిక తీర్చడం కంటే ఇక దేనిపైనా నాకు ఆశలేదు అని అక్కయ్యను తలుచుకుంటూ , ప్రిన్సిపాల్ గారు మాకు ఇచ్చిన కార్డ్ ద్వారా కాలేజ్ లోపలికి వెళ్లి , మా బుజ్జిఅక్కయ్య కృష్ణగాడితో లేకపోవడం చూసి నేరుగా చెల్లి క్లాస్ కు వెళ్లి , లెక్చరర్ కు అపాలజీ చెప్పి వీల్ చైర్ కం స్మాల్ బెడ్ పైచెల్లిని , క్లాస్ ను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా తనకు తానే ఆడుకుంటున్న మా బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా ఎత్తుకుని , ఇద్దరమూ చెల్లికి బై చెప్పి చిరునవ్వులు చిందిస్తూ చెట్టుకింద స్టోన్ బెంచ్ పై చదువుకుంటున్న కృష్ణగాడి ప్రక్కనే కూర్చున్నాను .
Hi మామా.......... ఆఫీస్ అంటూ బుజ్జిఅక్కయ్య బుగ్గలను స్పృశించి లవ్ యు అంటూ ముద్దుపెట్టాడు .
ఆఫీస్ డ్రామా వివరించి రెండు రోజులు నో ఆఫీస్ 48 hours మన బుజ్జి అక్కయ్యతోనే అంటూ ప్రాణంలా గుండెలపై హత్తుకొనివెళ్లి కారులోని టాయ్స్ బాక్స్ అందుకొని వాడి ఎదురుగా గడ్డిలో కూర్చుని మాలోకంలో మేము విహరించాము .
కృష్ణగాడు చూసి పరవశించిపోతూ ప్రిపరేషన్ లో మునిగిపోయాడు .

లంచ్ బెల్ కొట్టగానే చెల్లి తన ఫ్రెండ్స్ తోపాటు పరుగునవచ్చి మమ్మల్ని చూసి దూరం నుండే ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , my lovely లవ్లీ లవ్లీ ఏంజెల్ అంటూ వచ్చి నా చేతిని చుట్టేసి కూర్చుని ముద్దులతో ముంచెత్తి , మీ పెద్ద తమ్ముడితో ఆడుకుంటున్నారా అక్కయ్యా .......... పాలు కావాలా అని అడిగింది .
Yes yes ......... అన్నట్లు బుజ్జి బుజ్జి నవ్వులతో చేతులను కదిలించడంతో , ఫ్రెండ్స్ .......... ఇప్పుడే వచ్చేస్తాను లవ్ యు అన్నయ్యా ......... అని కారులోపలికివెళ్లి పాలు ఇచ్చింది .
కొద్దిసేపటి తరువాత కృష్ణగాడువెళ్లి చెల్లితోపాటు లంచ్ బ్యాగ్ తీసుకొచ్చాడు . అప్పటికే తిన్న చెల్లి ఫ్రెండ్స్ మాప్రక్కనే కూర్చుని పాపను ఆడిస్తూ నవ్వించారు .
చెల్లి ఆఫీస్ విషయం తెలుసుకుని గ్రేట్ అన్నయ్యా .......... రెండు రోజులు మన బుజ్జిఅక్కయ్య ఫుల్ హ్యాపీ అయితే అంటూ తినిపించింది . ఆరోజు సాయంత్రం వరకూ మరియు మరుసటి రోజు కూడా మా బుజ్జిఅక్కయ్యతోనే ఎంజాయ్ చేసాను . ఈ సమయంలో సర్ , మేడం వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేశారో లెక్కేలేదు . నో నో నో ........... హ్యాపీ జర్నీ అని రిప్లై మాత్రం ఇస్తున్నాను .

రెండురోజుల తరువాత ఉదయం లేచి బుజ్జిఅక్కయ్యకు విష్ చేసి మొబైల్ చూస్తే మేడం నుండి we reached in బెంగళూరు అని మెసేజ్ వచ్చాక , పెదాలపై చిరునవ్వుతో వెంటనే కాల్ చేసాను .
మహేష్ .......... నిన్నూ అని నవ్వి , కొద్దిసేపటి ముందే బెంగళూరులో ల్యాండ్ అయ్యాము , హోటల్ కు వెళుతున్నాము అనిచెప్పారు మేడం .
హ హ .......... ఎంజాయ్ ద మీటింగ్ మేడం , have a good day ......... బై బై అని కట్ చేసి ఫ్రెష్ అయ్యివచ్చి , అప్పటికే బేబీ డాల్ లా ముద్దొచ్చేలా రెడీ అయిన బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని సోఫాలో చదువుకుంటున్న కృష్ణగాడి ప్రక్కనే చేరాను .
గుడ్ మార్నింగ్ రా ......... ఏంటి ల్యాప్ పెట్టుకున్నావు అని అడిగాను .
గుడ్ న్యూస్ రా మామా .......... మన బుజ్జిఅక్కయ్య రెడీ అయ్యాక అందరికీ చెబుదామని ఎదురుచూస్తున్నాను అని అక్కయ్యను ఎత్తుకుని ప్రాణంలా హత్తుకొని బుగ్గపై ముద్దుపెట్టి ,

అక్కయ్యా , రేయ్ మామా , రేయ్ కృష్ణ ............ నోటిఫికేషన్ పడింది అనిచెప్పాడు .
Wow .......... ఇంకేంటిరా మామా , బుజ్జిఅక్కయ్య బుజ్జి చేతితో స్టార్ట్ చెయ్యి అని చెప్పాను . చెల్లి సంతోషంతో కృష్ణగాడి ప్రక్కనే కూర్చుని చేతిని చుట్టేసి భుజం పై ముద్దుపెట్టి , రేయ్ ........ ఇక exam వరకూ నిన్ను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము . కాన్సంట్రేషన్ మొత్తం exams మీదనే ఉంచు ......... అక్కయ్య కోరిక తీరాలి ఏమంటావు అన్నయ్యా .........
As you say చెల్లీ ......... అని బదులివ్వడంతో , 
సోఫాలో కాళ్లుమడిచి కూర్చుని బుజ్జిఅక్కయ్యను పడుకోబెట్టుకొని మాఇద్దరినీ సంతోషంతో తనవైపుకు లాక్కుని ఉక్కిరిబిక్కిరిచేసి , బుజ్జిఅక్కయ్య ఫారం ఫిల్ చేద్దామా అని చిరునవ్వులు చిందుస్తుండటంతో , మా అక్కయ్య కూడా go అనిచెప్పింది అని ముద్దులతో ముంచెత్తి , వాడి పేరుని బుజ్జిఅక్కయ్యతో టైప్ చేయించాడు .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని అక్కయ్య ఫోటోవైపు చూస్తూ గుండెలపై చేతినివేసుకొని మీకోరిక తీర్చడమే నా ఏకైక లక్ష్యం అని బుజ్జిఅక్కయ్యను నాకు అందించి నోటిఫికేషన్ పూర్తిచేశాడు . 
బుజ్జిఅక్కయ్యతోపాటు ఆనందించి all the best రా మామా , all the best రా అని మేము , బుజ్జిఅక్కయ్య ముసిముసినవ్వులతో చెప్పింది . 
ఆరోజు నుండీ బుజ్జిఅక్కయ్య చిరునవ్వులను చూస్తూ మురిసిపోతూ లక్ష్యం వైపు అడుగులువేశాడు . ఇంట్లో , పబ్లిక్ లైబ్రరీలో ప్రిపేర్ అయ్యేవాడు .
చెల్లి టైం టేబుల్ స్టడీ చేసి లాబ్స్ సమయానికి ఆఫీస్ నుండి కాలేజ్ చేరుకుని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని క్యాంపస్ పార్క్స్ లో ఎంజాయ్ చేసేవాళ్ళము .

రెండు రోజుల తరువాత సర్ నుండి కాల్ .........
ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లున్నారు రెండురోజులు కాల్ కూడా లేదు అని అడిగాను .
అదొక్కటే తక్కువ hectic షెడ్యూల్ ......... మేము construction ఫీల్డ్ లోకి దిగినప్పటి నుండీ ఇప్పటివరకూ కలిసిన ఫ్రెండ్స్ , other కంపెనీ చైర్మన్స్ తోనే చీకటిపడిపోతోంది . ఈరోజు నైట్ హైద్రాబాద్ రావాల్సింది కానీ మరొకరోజు పట్టేలా ఉంది .
ఓహ్ గ్రేట్ ......... పాతవాళ్లందరినీ కలిసారన్నమాట అంతకంటే హ్యాపీనెస్ మరొకటి ఉండదు ........మొత్తం పూర్తిచేసుకునే రండి ఇక్కడ మేము చూసుకుంటాము అని బదులిచ్చాను . 

మహేష్ ........ అధికాదు , సుమారు 2 సంవత్సరాల తరువాత మా ప్రాణానికి ప్రాణమైన కూతుర్లు స్వాతి ( జానకి మేడం ) , ప్రసన్నా ( భువనేశ్వరి మేడం ) స్టడీస్ కంప్లీట్ చేసుకుని లండన్ నుండి వచ్చేస్తున్నారు . రేపు ఉదయం 4 గంటలకు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నారు . వాళ్లకు మీటింగ్ విషయం చెప్పాము . 
ఆల్రైట్ dad .......... రాగానే సెలబ్రేట్ చూసుకుందాము అని ఒప్పుకున్నారు . 
వాళ్ళను పిక్ చేసుకోవడానికి ఒక డ్రైవర్ ను పంపడానికి మా మనసు ఒప్పుకోవడం లేదు .
సర్ ........ can i ? అని అడిగాను .
Thank god మహేష్ ......... 
సర్ ......... నేను మీ సేవకుణ్ణి anytime ఆర్డర్ వెయ్యొచ్చు అనిచెప్పాను .
నో నో నో ......... dont ever say that word again మహేష్ ........ మా తరువాత కంపెనీని చూసుకోవాల్సింది నువ్వే ........
సర్ కట్ చేసేస్తున్నాను , మీరు ఏమీ కంగారుపడకండి చిన్న మేడం వాళ్ళను స్వయంగా నేనే రిసీవ్ చేసుకుంటాను బై బై ......... 
సర్ వాళ్ళు స్పీకర్ on చేసినట్లు మేడం వాళ్ళతోపాటు నవ్వుకుని , హమ్మయ్యా ....... ఇక మహేష్ చూసుకుంటాడు శ్రీమతి గారు .........
విన్నాము శ్రీవారూ ......... అని మేడం వాళ్ళు చిలిపినవ్వుతో కౌగిలించున్నారు .

అసిస్టెంట్ మేనేజర్ కు కాల్ చేసి మీకు తెలిసే ఉంటుంది సర్ డాటర్స్ వస్తున్నారు ఉదయం 4 గంటలలోపు స్వాగతం పలికేలా చూసి వాళ్ళు సంతోషంతో మైమరిచిపోయేలా ఇంటిని decorate చెయ్యాలి అనిచెప్పాను 
Sure మహేష్ .......... మాకు వదిలెయ్యి మేము చూసుకుంటాము గుడ్ నైట్ చెప్పారు .
 రాత్రి డిన్నర్ చేస్తూ చెల్లికి విషయం తెలిపి , బుజ్జిఅక్కయ్య పాలు తాగిన తరువాత చెల్లి రూంలో పడుకునేంతవరకూ ఊయల ఊపి , అక్కయ్యా........ రేపు మీరు లేచేలోపు నేను బయటకు వెళ్లుంటాను , పని పూర్తిచేసుకును వచ్చేస్తాను అని గుడ్ నైట్ కిస్ పెట్టి నారూంలోకి వచ్చి అక్కయ్య ఫోటోని చూస్తూ బెడ్ పై వాలాను . అక్కయ్యా .......... మీ మరొక తమ్ముడూ , మీరంటే మరొక ప్రాణమైన మీరు చూడని చెల్లి తమ గోల్స్ సాధించేంతవరకూ కనిపించరా , మా బాధను చూడలేకనే మా సంతోషం కోసం బుజ్జిఅక్కయ్యను మా చెంతకు చేర్చారా ........ , మీ ఇష్టం మీరు ఎలా కోరుకుంటే అలా ముందుకువెళతాము . మీరు గర్వపడేలా గొప్ప స్థాయికి చేరుకుంటాము లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని గుండెలపై చేతినివేసుకొని అక్కయ్య అందమైన నవ్వుని తలుచుకుంటూ నిద్రపోయాను .
***********

అలారం చప్పుడు వినిపించడంతో లేచి ఫ్రెష్ అయ్యేలోపు 3 అయ్యింది . చెల్లి గదిలో లైట్ వెలుగుతుండటం - డోర్ తెరిచి ఉండటం - కృష్ణగాడు హాయిగా నిద్రపోతున్న చెల్లి కురులను స్పృశిస్తూ చదువుతుండటం చూసి లవ్ యు రా మామా అని గుసగుసలాడి , మా బుజ్జిఅక్కయ్య ఊయల దగ్గరకువెళ్లి చూసి ఆనందంతో గుడ్ మార్నింగ్ కిస్ పెట్టి వెళ్ళొస్తాను అని కార్ కీస్ అందుకున్నాను . 
రేయ్ మామా చలి ఎక్కువగా ఉంటుంది జాకెట్ వేసుకో అని కప్ బోర్డ్ వైపు సైగచెయ్యడంతో వాడిది వేసుకుని మెయిన్ డోర్ తీసి క్లోజ్ చేసి చీకటిలోనే ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి 3:45 అయ్యింది .
Display చూసి కరెక్ట్ టైం కే ల్యాండ్ అవ్వబోతోంది అని ఒక ప్లకార్డు అందుకొని పేర్లు పేర్లు .......... ఆ ఆ ప్రసన్నా , స్వాతి కరెక్ట్ అని రాసి చాలామందితోపాటు నిలబడ్డాను.
ఆఫ్టర్ two ఇయర్స్ తరువాత ఇండియా కు వస్తున్నారు ఫ్లవర్స్ తో స్వాగతం పలుకుదామని రెండుచేతులతో పట్టుకునేంత బొకే లు రెండు తీసుకున్నాను .

15 నిమిషాలకు ఫ్లైట్ లాండింగ్ అనౌన్స్మెంట్ జరగడంతో అందరితోపాటు నేనూ అలెర్ట్ అయ్యి ప్లకార్డు పైకెత్తిపట్టుకున్నాను .
ప్లకార్డు చూసి నా వయసున్న ఇద్దరు అమ్మాయిలు , మేడం వయసున్న వారు నావైపు రావడంతో , ఖచ్చితంగా వారేనని ప్లకార్డు ప్రక్కన ఉంచి వెనుక కుర్చీలో ఉంచిన లాట్ ఆఫ్ ఫ్లవర్స్ అందుకొని welcome to your లవ్లీ అండ్ బ్యూటిఫుల్ ఇండియా మేడం అని అందించాను .
Roses ......... wow wow లవ్లీ ........ థాంక్యూ సో సో soooooo మచ్ అని గుండెలపై హత్తుకొని మురిసిపోతున్నారు . వాసన పీల్చి పిన్నీ ........ఇండియన్ రోజెస్ లో ఉండే పరిమళం ప్రపంచంలో ఎక్కడా ఉండదు . ఆఫ్టర్ sooooo many మంత్స్ అంటూ అమ్మాయిలిద్దరూ చేతివేళ్ళతో పెనవేసి , థాంక్యూ soooooo మచ్ అని మరొకసారి చెప్పి , and your sweet name అని సంతోషంతో అడిగారు .
మ.......... అనేంతలో ,
స్వాతి , ప్రసన్నా ......... డ్రైవర్ అని పిలవండి ఇక పేరు ఎందుకు అనిచెప్పి , డ్రైవర్ వెళ్లి లగేజీ తీసుకురా అని ఆర్డర్ వేశారు .
Yes మేడం అంటూ వెళుతోంటే , 
ఎస్క్యూస్ మీ ......... పిన్నీ అక్కడ లండన్ లో ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళము కదా , ఇండియాకు రాగానే బద్దకం వచ్చేసిందా మీకు అని చెరొకవైపు ప్రేమతో హత్తుకొని బుగ్గలపై ముద్దులుపెట్టి , welcome to india అని ఫ్లవర్స్ అందించి wait చెయ్యండి లగేజీ తీసుకొస్తాము అని నాతోపాటు వచ్చారు .
Sorry ........ మా పిన్ని చాలా చాలా మంచివారు . లాంగ్ జర్నీ వలన అలసిపోయారు అందుకే కోపం , రెస్ట్ తీసుకుంటే కూల్ అయిపోతారు . 
Never mind మేడం ............

ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నారు .........
Welcome అన్నపదం ఎవరైనా మాట్లాడగలరు మేడం అని ఇద్దరితోపాటు నవ్వుకుని one two three four five......... పెద్దపెద్ద లగేజీ బ్యాగులను చూసి ఆశ్చర్యపోతుంటే , two ఇయర్స్ తరువాత వచ్చాము ఫర్దర్ స్టడీస్ కు వెళితే వెళతాము లేకపోతే mom and dads తోనే అని రెండుచేతులతో లగేజీ అందుకున్నారు . 
మేడం ........ please లెట్ మీ అని అన్నింటినీ పెద్ద ట్రాలీ పై పెడుతున్నాను .
 థాంక్స్ చెప్పి వెనక్కు తిరిగి , పిన్నీ ........ కొద్దిసేపు అక్కడే కూర్చుని ఉండొచ్చుకదా మేమే వచ్చేవాళ్ళము అని ఇద్దరూ ఆమె చేతులను చుట్టేశారు .
కారులో వెనుక ముగ్గురూ కూర్చున్న తరువాత డోర్ వేసి 5 మినిట్స్ మేడం అని ట్రాలీతోపాటు వెనుక ఉన్న క్యాబ్ దగ్గరకువెళ్లి ఫాలో అవ్వాలి అనిచెప్పి అతని సహాయంతో లగేజీని క్యాబ్ మొత్తం నింపేసి బయలుదేరాము .

స్వాతి : ఫ్రెండ్ ........
పిన్ని :  డ్రైవర్ ........
ప్రసన్నా : పిన్నీ మీరు టైర్డ్ అయ్యారు నా భుజం పై పడుకోండి , కావాలంటే ఇంటికి చేరుకున్నాక మేమే ఎత్తుకుని లోపలికివెళ్లి బెడ్ పై పడుకోపెడతాము అని నవ్వుకున్నారు .
పిన్ని : exams పూర్తయ్యాయో లేదో నన్ను ఫ్లైట్ ఎక్కించేశారు . మీ ఫేర్ వెల్ పార్టీ చూద్దామని , వీడియో తీసి మా అక్కయ్యకు చూపిద్దామని ఎంత ఆశపడ్డానో తెలుసా.......... 
 Soooo sorry పిన్నీ లవ్ యు sooooo మచ్ అంటూ చేతులపై ముద్దులుపెట్టి , పిన్నీ ......... మేము ఇంత సడెన్ గా బయలుదేరాడానికి కారణం చెప్పలేదు కదూ .
What .......... ఏంజెల్స్ .......
మహేష్ కోసం ........ అని ఇద్దరూ ఒకేసారి చెప్పి సిగ్గుతో వాళ్ళ పిన్ని గుండెలపై తలదాచుకొని మురిసిపోతున్నారు .
అంతే సడెన్ గా బ్రేక్ వేసాను . 
ఫ్రెండ్ ఏమైంది అని అడిగారు .
పిన్ని : స్వాతి , ప్రసన్నా ......... డ్రైవర్ ను డ్రైవర్ అనే పిలవాలి అని కాస్త కోపంతో చెప్పారు అండ్ మహేష్ ......... నో వే స్వాతి , ప్రసన్నా ......... , he is జస్ట్ an employee , అతడి పని అతడు చేసాడు ఇందులో అతడి గొప్పతనం ఏముంది . మీ ప్రతి బుక్ పై " M " దానిచుట్టూ లవ్ గుర్తు ఉన్నప్పుడే డౌబ్ట్ వచ్చింది .
బుక్స్ లో ఏంటి పిన్నీ మా హృదయాల నిండా మహేష్ నిండిపోయాడు. మమ్మీ వాళ్ళు ఫోటో పంపించమంటే డైరెక్ట్ గా వచ్చి థాంక్స్ చెప్పండి అనిచెప్పారు కాబట్టి సరిపోయింది లేకపోతే మా రూమ్ నిండా మహేష్ ఫొటోలతో నింపేసేవాళ్ళము అంత ప్రేమిస్తున్నాము మేము . మహేష్ ను తప్ప మా లైఫ్ లో ఎవరినీ ఊహించుకోలేము , మనం ఇప్పుడు ఇలా నవ్వుతున్నామంటే కారణం మహేష్ నే , అమ్మావాళ్ళు దేవుడు అని పిలుస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు , ఇప్పుడు చెబుతున్నాము మేమిద్దరమూ మా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాము . మహేష్ ఎలా ఉన్నా ......... డ్రైవ్ చేస్తున్న ఫ్రెండ్ లో 0.1% ఉన్నా మేము అతని సొంతం అని ఫిక్స్ అయిపోయాము . అమ్మావాళ్ళు అడ్డుపడితే లేపుకెళ్లిపోతాము అని చిలిపిదనంతో వాళ్ళ పిన్నిని చుట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు .
మీ ఇష్టం , మీ అమ్మా నాన్నల ఇష్టం నాకు నిద్రవస్తోంది అని ఒకరి భుజంపై వాలిపోయి కళ్ళుమూసుకున్నారు .
వెనుక ఇద్దరి మాటలకు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు .

హలో ఫ్రెండ్ .......... మహేష్ ను నువ్వు చూసావా ఎలా ఉంటాడు హీరో లా ఉంటాడా అని అడిగారు .
 హమ్మయ్యా ........ మేడం వాళ్ళు ఫోటో పంపించకుండా మంచిపని చేశారు . వెంటనే మహేష్ అంటే వీళ్లకు అసహ్యం పుట్టేలా చేసి , కలవకుండా ఉండిపోతే సరిపోతుంది , ఇద్దరి మనసూ సర్ మేడం వాళ్ళలానే , కంపెనీని వాళ్ళలానే ముందుకు తీసుకువెళ్లగలరని నమ్మకం ఉంది అని నాలో నేను ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను .
ఫ్రెండ్ ఫ్రెండ్ .......... మహేష్ ను చూసారా , are you alright అని అడిగాను .

 మహేష్ తెలియకుండా మన ఆఫీస్ లో ఎవ్వరూ ఉండరు .
ఎలా ఉంటాడు ......... నీలో ......
 మేడం ......... sorry మీ మాటలు విన్నాను . మీరేమో స్వర్గం నుండి దిగివచ్చిన దేవకన్యల్లా ఉన్నారు . కానీ మహేష్ ఏమో నల్లగా , బక్కగా , పొట్టిగా చూస్తేనే అసహ్యం పుట్టేలా ఉంటాడు . మీకు వాడికీ 0.1 %  కూడాసెట్ అవ్వదు. కంపెనీ కోసం మొదట చాలా కష్టపడ్డాడు ఒప్పుకుంటాను కానీ మీకు తెలియదేమో కొద్దిరోజుల ముందు వేరే కంపెనీలకు అమ్ముడుపోయాడు , ఈ విషయం ఇంకా మీ పేరెంట్స్ కు తెలియదు. తెలియగానే కంపెనీ నుండి తోసేయ్యడం గ్యారంటీ........., నాకు తెలిసి అందుకేనేమో మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా ఫోటో పంపించలేదు .

ఫ్రెండ్ ......... నో నో  డ్రైవర్ ....... మహేష్ గురించి ఒక్కమాట కూడా అలా మాట్లాడకు , మా చేతిలో గన్ ఉండి ఉంటే ఈపాటికి నిన్ను చంపేసేవాళ్ళము . అతడు ఎప్పటికీ అలాచెయ్యడు అని ప్రతి విషయం mom వాళ్ళు చెప్పారు మాకు . పిన్ని లేకపోయి ఉంటే ఈపాటికి ఈ కారు దిగేసేవాళ్ళము . తొందరగా మమ్మల్ని ఇంటిలో వదిలి ఇక జీవితంలో మాకు కనిపించకు . మహేష్ ........ ఎలా ఉన్నా మేమిద్దరమూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాము , ఆరాధిస్తున్నాము . మా జీవితం అతడితోనే ...........
మేడమ్స్ అదీ .........
ఇక ఒక్కమాటకూడా మాట్లాడొద్దు , పిన్ని చెప్పినా వినకుండా నిన్ను ఫ్రెండ్ అనిపిలిచి పెద్దతప్పుచేసాము అని కన్నీళ్ళతో ఉండిపోయారు .

ఇది ఎక్కడికీ దారితీస్తుందోనని 5 గంటలకు ఇంటికి చేరుకున్నాము . సెక్యూరిటీ సెల్యూట్ చేసి మెయిన్ గేట్ తెరిచాడు . 
స్వాగతం అని పెద్దగా రాసి ఇల్లుమొత్తం రంగురంగుల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుండటం , స్వాతి ,ప్రసన్నా ఎలా ఉన్నారు అని అసిస్టెంట్ మేనేజర్ కొంతమంది స్టాఫ్ వచ్చి కారు డోర్ తెరిచారు .
కన్నీళ్లను తుడుచుకుని పెదాలపై చిరునవ్వుతో కిందకు అడుగుపెట్టగానే పూల వర్షం కురవడంతో , wow .......... స్వాతి - ప్రసన్నా అంటూ పరవశించిపోతూ థాంక్స్ మేనేజర్ గారు రెండు సంవత్సరాలు అయ్యింది మిమ్మల్ని చూసి ,
ఆ అదృష్టం మాది నేను ఇప్పటికీ గుర్తున్నందుకు , థాంక్స్ నాకు కాదు చెప్పాల్సింది .............
మేనేజర్ గారు .......... అనేంతలో
మహేష్ కు ఉదయం 4 గంటలలోపు ఏమిచేస్తారో తెలియదు చిన్న మేడం వాళ్లకు ఘనస్వాగతం ఏర్పాట్లుచేయ్యండి అనిచెప్పారు మేము చేసాము అంతే . 

మేనేజర్ గారు ........ మహేష్ ఎక్కడ లోపల ఉన్నారా అని అంతులేని ఆనందంతో ఒకరినొకరు హత్తుకొని ఉబ్బితబ్బిబ్బైపోతూ అడిగారు .
ఇక్క ..........
ష్ ష్ ........ అని సైగచెయ్యడంతో , 
ఇక్కడ లేడు , ఎక్క......డ ఉన్నా.......డో తెలియదు అని తడబడుతూ బదులిచ్చి నిద్రవస్తోంది స్వాతి మేము వెళ్లవచ్చా అని అడిగారు .
మాకోసం రాత్రంతా కష్టపడ్డారు థాంక్యూ sooooo మచ్ మేనేజర్ గారు . వెళ్లి రెస్ట్ తీసుకోండి . అలాగే ఈ డ్రైవర్ ను కూడా తీసుకువెళ్లండి . ఇక మాకు ఎప్పటికీ కనిపించకూడదు .
స్వాతి తల్లీ..........
సర్ ......... అని సైగతో ఆపి , తెల్లవారేంతవరకూ సేఫ్ గా చూసుకుంటాను అని సర్ వాళ్లకు మాటిచ్చాను . సో ఇక్కడే ఉంటాను అనిచెప్పాను .
వెనుకే వచ్చిన క్యాబ్ లోని లగేజీలను సెక్యూరిటీ లోపలికి తీసుకువెళుతోంటే , ఆపి అయితే మొత్తం లాగేజీని నువ్వొక్కడివే లోపల ఉంచు అని వాళ్ళ పిన్నితోపాటు లోపలికి వెళుతూ , స్వాతి ప్రసన్నా ......... సరైన పనిష్మెంట్ ఇచ్చారు . డ్రైవర్ ను డ్రైవర్ లానే చూడాలి . 
పిన్నీ ........ డ్రైవర్ అని కాదు , మా ప్రాణమైన మహేష్ ను అలా అన్నందుకు ఈ పనిష్మెంట్ ఇచ్చాము అంతే అని పైన ఉన్న తమ రూంలోకి వెళ్లిపోయారు .
మొత్తం లాగేజీని హాల్లోకి తీసుకొచ్చి ఎంత బరువున్నాయి అంటూ సోఫాలో వాలిపోగానే నిద్రపట్టేసింది .
Like Reply
నా ముఖంపై నీళ్లు పడటంతో సడెన్ గా మెలకువవచ్చి కూర్చుని చేతులతో తుడుచుకుంటుంటే ,
ఆఫ్ట్రాల్ డ్రైవర్ వి లోపలికిరావడమే కాకుండా సోఫాలో దున్నపోతులా నిద్రపోతావా అని కోపంతో ఏకంగా గ్లాస్లోని నీళ్లను మొత్తం నా ముఖంపై విసిరింది .
పిన్నీ .......... అందుకే మరికొంతసేపు పడుకోమనిచెప్పింది . నాన్నవాళ్లకు నమ్మకస్తుడు అయి ఉంటాడు అందుకే రోజూలానే పడుకునిఉంటాడు . డ్రైవర్ అని మాత్రం చిన్నచూపు చూడకండి . మనకోసం వాళ్ళ కుటుంబాన్ని ముఖ్యంగా పిల్లలనూ వదిలి పనిచేస్తారు , కావాలంటే మహేష్ పై నిందలు వేసినందుకు కావాలంటే మరొక గ్లాస్ ముఖం పై పొయ్యండి , మహేష్ ను ఎవ్వరు ఏమన్నా మా హృదయాలు తట్టుకోలేవు అని ఫీల్ బాధపడుతూ చెప్పారు .
ఏంజెల్స్ మీకు మహేష్ పిచ్చిపట్టింది ఉండండి మీ అమ్మానాన్నలు రాగానే చెబుతాను అని వాళ్ళ పిన్నిగారు ఇద్దరికీ ప్రేమతో మొట్టికాయలు వేశారు .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ పిన్నీ అని చెరొకవైపు హత్తుకొని , హమ్మయ్యా ......... mom dad కు ఎలాచెప్పాలో అని ఆలోచోస్తున్నాము ఇక మీరు చెప్పబోతున్నారు కదా మేము ఫుల్ హ్యాపీ ..........
మేడం టైం ఎంత ......... గడియారం 8 గంటలు అవ్వడం , అయ్యో అయిపోయాను బుజ్జిఅక్కయ్య మేల్కొని ఉంటుంది అని లేచి sorry sorry అని టీ టేబుల్ పై కార్ కీస్ అందుకుని బయటకు పరిగెత్తాను .

అర గంటలో అపార్ట్మెంట్ చేరుకుని పరుగున పైకిచేరుకున్నాను .
చెల్లి నాకొసమే ఎదురుచూస్తున్నట్లు అన్నయ్యా .......... మన బుజ్జిఅక్కయ్య అలిగింది . కనీసం పాలుకూడా తాగడానికి ఊయలలోనుండి రావట్లేదు అని సంతోషంతో చెప్పింది .
 చెల్లి భుజం చుట్టూ చేతినివేసి బెడ్రూంలోకి వెళ్ళాము . నన్ను చూడగానే నవ్వి వెంటనే ఆపేసింది . అమ్మో......... అలకే అంటూ నవ్వుతూ ప్రక్కనే కూర్చున్నాము .
లవ్ యు లవ్ యు ........... soooooo మచ్ అక్కయ్యా , చిన్న మేడం వాళ్ళను సేఫ్ గా చూసుకోమను సర్ వాళ్ళు ఆర్డర్ వేశారుకదా అని సోఫాలో అలా వాలిపోయానోలేదో మా బుజ్జిఅక్కయ్య అందమైన నవ్వులు కనిపించేసరికి కళ్ళు తెరవడానికి ఇంతసమయం పట్టింది , తప్పంతా నీదే అక్కయ్యా ......... లవ్ యు లవ్ యు మా బుజ్జి బంగారం కదూ అని ఎత్తుకోవడానికి చేతులు చాపాను .
ముసిముసినవ్వులతో నా గుండెలపై చేరిపోయింది .
ఆఅహ్హ్హ్......... జీవితాంతం ఈ ఆనందం చాలు అని ప్రాణంలా హత్తుకొని ముద్దులుపెట్టి , పాలు తాగకపోతే ఎలా అక్కయ్యా ....... తాగి రెడీ అయితే కాలేజ్ కు వెళదాము . ఈరోజంతా నీతోనే అనిచెప్పాను .
Wow లవ్ యు అన్నయ్యా .......... అని మాఇద్దరినీ సంతోషంతో హత్తుకొని , అక్కయ్యను అందుకొని పాలుపట్టింది .
అంతలోపు నేను ఫ్రెష్ అయ్యివచ్చి , సోఫాలో ప్రిపేర్ అవుతున్న కృష్ణగాడి ప్రక్కనే కూర్చుని ఏరా ఎలా ఉంది అని అడిగాను .
గుడ్ రా ......... లైబ్రరీకి వెళ్ళాలి అనిబదులిచ్చాడు .

ఇంతలో మా బుజ్జిఅక్కయ్య కొత్త డ్రెస్ వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ వచ్చింది . సూపర్ అంటూ అందుకొని చెల్లీ కూర్చో అందరమూ ఒక సెల్ఫీ తీసుకుందాము అని తీసుకున్నాము . 
అన్నయ్యా .......... గంటలో టిఫిన్ చేస్తాను అని అక్కయ్య బుగ్గపై , కృష్ణగాడి పెదాలపై ముద్దుపెట్టింది . వాడు మరింత ఎనిర్జీతో బుక్ లో లీనమైపోయాడు .
అక్కయ్యా .......... మీ నాన్న చూడు ఎలా మురిసిపోతున్నాడో అని బొమ్మలతో కాసేపు ఆడించి , మీ అమ్మతో రెండే రెండు నిమిషాలు మాట్లాడివస్తాను నువ్వు వినకూడదు కాసేపు మీ నాన్న మీ రెండో తమ్ముడితో ఉండు అని ఊయలలో పడుకోబెట్టి బుజ్జి బుజ్జి చేతులకు బొమ్మ అందించి వంటింట్లోకి వెళ్ళాను .

అన్నయ్యా ........ ఆకాలేస్తోందా , ఇదిగో అయిపోతోంది .
లవ్ యు చెల్లీ అంటూ ఎయిర్పోర్ట్ దగ్గర నుండీ సర్ వాళ్ళ ఇంటికి చేరేంతవరకూ చిన్న మేడం వాళ్ళ మాటలను , నేను తప్పించుకున్న విధానాన్ని వివరించాను .
అన్నయ్యా ........ కాస్త నెమ్మది మన బుజ్జిఅక్కయ్య విన్నదంటే అయిపోతాము. మ్యాటర్ నేరుగా అక్కయ్యకు చేరిపోతుంది . కానీ మిమ్మల్ని చూడకుండానే ,మీరు ఎలా ఉంటారో , ఎలా ఉన్నాకూడా ప్రాణం అన్నారు చూడండీ అక్కడ నేనేకాదు ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే , ఇధికాస్త సున్నితమైన సమస్య బాగా ఆలోచించాలి . ఒక్కటిమాత్రం నిజం వాళ్ళ నుండీ మీరు తప్పించుకుని ఎక్కడికీ వెళ్లలేను ఈరోజు కాకపోతే రేపు ఎల్లుండైనా మిమ్మల్ని చూస్తారు . మీలో 0.1% ఉంటేనే చాలనుకున్నారు మీరే 100% అని తెలిస్తే ............. నా ఊహకే అందడం లేదు అన్నయ్యా ........, చాలా మంచి అమ్మాయిలు అనికూడా అంటున్నారు .
అవును చెల్లీ ..........అని ఫీల్ అవుతోంటే ,
అన్నయ్యా .......... అంటూ గుండెలపైకి చేరి , మనకు మార్గం చూపిస్తున్నది అక్కయ్య , అమ్మవారు ......... ఈ విషయం కూడా వాళ్లే చూసుకుంటారు మీరు నిర్భయంగా ఉండండి , 10 నిమిషాలలో దోసెలు వేసుకొస్తాను మీరువెళ్లి మీ బుజ్జిఅక్కయ్యతో మరొక బుజ్జాయిలా ఆడుకోండి అని నవ్వుతూ చెప్పడంతో ,
లవ్ యు చెల్లీ .......... ఇప్పటికి మనసు కాస్త కుదుటపడింది అని పరుగున మా బుజ్జిఅక్కయ్య దగ్గరకు చేరి ఎంజాయ్ చేస్తుంటే , 
ఏంట్రా మ్యాటర్ అనిఅడిగాడు .
అక్కయ్య వినకూడనిది తరువాత చెబుతాము అని చెల్లీ చేత టిఫిన్ తిని , బై రా నువ్వు చదువుకో మేము ఎంజాయ్ చేస్తాము అని వాడిచేతిలోనుండి మా బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని కాలేజ్ కు వెళ్ళాము .

అక్కయ్యా ......... మీ చెల్లి వెంట క్లాస్ కు వెళతారా , నాతోనే ఉంటారా అని అడిగాను.
అన్నయ్యా ......... కావాలనే అడుగుతున్నారు కదా , మీతోనే ఉంటాను అనిచెబుతుంది అని తియ్యనికోపంతో అందించి అక్కయ్య బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టి క్లాస్ కు వెళ్ళింది . 
బుజ్జిఅక్కయ్యను మూవింగ్ చైర్లో కూర్చోబెట్టి ఎండ ఏమాత్రం తగలకుండా arrange చేసి , క్యాంపస్ పార్క్ లో - గ్రౌండ్ లో - నిద్రవచ్చినప్పుడు కారులోని ఊయలలో ....... ఇలా మధ్యాహ్నం వరకూ అక్కయ్యతో ఎంజాయ్ చేసాను . 
లంచ్ బెల్ మ్రోగడంతో చెల్లి చెల్లితోపాటు ఫ్రెండ్స్ వచ్చి చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్యను ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తుతోంటే , కృష్ణగాడికి కాల్ చేసి లైబ్రరీకి దగ్గరలోని బిరియానీ పాయింట్ లో ఉండమని చెప్పాను . 
చెల్లి కారులోకి వెళ్లి పాలు అందించింది .
చెల్లీ ........ మీ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన ఆవకాయ పెరుగన్నం ఏమితింటారు . మనతోపాటు వస్తే బిరియానీ అనిచెప్పానోలేదో , అన్నయ్యా .......... మెమెప్పుడో రెడీ అని లంచ్ బ్యాగులను ప్రక్కన ఉంచేశారు .
 నవ్వుకుని 10 మందికి పైనే ఉండటంతో 4 క్యాబ్స్ ను పిలిచి అందరమూ చేరుకున్నాము . చూసి మూడు గంటలయ్యింది అంటూ కృష్ణగాడు అక్కయ్యను ఎత్తుకుని మురిసిపోతున్నాడు .
చెల్లికి సైగచెయ్యడంతో .........
ఒసేయ్ మీ ఇష్టం ఏమైనా , ఎన్నైనా ఆర్డర్ చెయ్యండి మా బుజ్జిఅక్కయ్య ట్రీట్ అనిచెప్పింది . 
లవ్ యు లవ్ యు లవ్ యు ........ అంటూ అక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , సంతోషంతో మెనూ కార్డ్స్ అందుకొని గుసగుసలాడి ఆర్డర్ చేస్తూనే ఉన్నారు . సర్వర్ రాసుకోవడానికే ఆయాసపడిపోయాడు . 
నవ్వుకుని వచ్చినవన్నీ కుమ్మేసి , గోల్డ్ పూతగల పాన్ తిన్నాము .
అన్నయ్యా ......... థాంక్..........
సిస్టర్స్ ......... పార్టీ నాదికాదు , చెల్లిదీ కాదు ......... మా బుజ్జి అక్కయ్యది అనిచెప్పాను .
కదా ......... అని అక్కయ్యను ఎత్తుకుని థాంక్స్ థాంక్స్ థాంక్స్ సూపర్ ట్రీట్ అంటూ ముద్దులతో ముంచెత్తి నా కారులో కూర్చున్న చెల్లికి అందించారు . కృష్ణగాడు ముద్దుతో బై సాయంత్రం కలుద్దాము అని చెప్పి లైబ్రరీ వైపు వెళ్ళాడు . 
కాలేజ్ చేరుకుని చెల్లి అక్కయ్యను అందించి క్లాస్ కు వెళ్ళింది .
అక్కయ్యా .......... కొద్దిసేపు పడుకుంటారా అని ఊయలలో పడుకోబెట్టి లాలిపాటపెట్టి ఊపడంతో హాయిగా నిద్రపోయింది . బుజ్జి చేతులను స్పృశిస్తూ అక్కయ్యనే సంతోషంతో చూస్తూ ఉండిపోయాను . మొబైల్ రింగ్ అవ్వడంతో సైలెంట్ లో పెట్టి బయటకువచ్చాను . 
మహేష్ ........ మేము 5 గంటలకు బయలుదేరుతున్నాము . ఏమీ అనుకోకుండా మా ప్రాణమైన ఏంజెల్స్ ను ఎయిర్పోర్ట్ కు పిలుచుకునివస్తావా .......... చూసి చాలా రోజులయ్యింది కదా వెంటనే చూడాలని ఆశ...........
సర్ ........ అదీ , ok సర్ .......... అని కట్ చేసాను .

5 గంటలకు చెల్లి తన ఫ్రెండ్స్ తోపాటువచ్చి పాపను నవ్వించి బై అన్నయ్యా ........ అని వెళ్లిపోయారు . చెల్లి ......... అక్కయ్యను ఎత్తుకుని మా అన్నయ్యతో మీ పెద్ద తమ్ముడితో ఎంజాయ్ చేశారా అక్కయ్యా అని ముద్దుపెట్టి బయటకువచ్చాము . అప్పటికే కృష్ణగాడు వేచిచూస్తుండటంతో ఆపి వెళ్ళమని చెప్పాను .
లవ్ యు అన్నయ్యా ......... అనివెళ్లి వాడిప్రక్కనే కూర్చుంది . 
అక్కయ్యా ......... మీ అన్నయ్యతో ఎంతసేపు ఉన్నా బోర్ కొట్టదు కదూ అని నవ్వుతూ ముద్దుపెట్టి ఇంటికిచేరుకున్నాము .
పైకివెళ్లి ఫ్రెష్ అయ్యి అక్కయ్యా .......... మరొక చిన్నపని ఇలావెళ్లి అలా వచ్చేస్తాను అని ముద్దుపెట్టాను . నవ్వడంతో లవ్ యు అక్కయ్యా అని ప్రాణంలా హత్తుకొని కృష్ణగాడికి అందించి సర్ ఇంటికి చేరుకున్నాను .

Dad మళ్లీ ఇతన్నే పంపించాడా , మేము ఆ కారులో వెళ్ళము డ్రైవర్ అంటూ కేకవేసి పిన్నీ ......... నేను రాను వెళ్ళిరండి అనిచెప్పడంతో సర్ కారులో ఎయిర్పోర్ట్ బయలుదేరారు . వాళ్ళ వెనుకే ఎయిర్పోర్ట్ చేరుకుని కనిపించేంత దూరంలో పార్క్ చేసి కారులోనే కూర్చున్నాను .
వాళ్ళు ఉత్సాహంతో లోపలికివెళ్లారు . 15నిమిషాలలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం సర్ మేడం వాళ్ళు బయటకువచ్చి దూరం నుండే తల్లీ , mom dad అంటూ అంతులేని ఆనందంతో పలకరించుకుని వడివడిగా వచ్చి మనసారా కౌగిలింతలు తరువాత లాగేజీతోపాటు కారుదగ్గరికి చేరుకున్నారు . మేనేజర్ గారు , రమేష్ బై చెప్పి క్యాబ్ లలో వెళ్లిపోయారు .
తల్లీ .......... ఈ కారులో వచ్చారు ఏంటి , మహేష్ ను పంపించానే .
మహేష్ ను పంపించారా ......... ఎక్కడ dad ఆఫీస్ కు వెళ్ళాము అక్కడ లేడు , ఇంటికి రాలేదు . మీరు పంపించిన డ్రైవర్ మాకు నచ్చలేదు dad అందుకే ఈ కారులో వచ్చాము . అతడు ఇంటిదగ్గరే ఉండి ఉంటాడు .
 అతడు డ్రైవర్ కాదు తల్లీ ......... మీరు ప్రతిరోజూ కాల్ చేసి అడిగే మీరు ఎవరికోసమైతే ఇంత త్వరగా వాచ్చారో ఆ మహేష్, మీ అమ్మావాళ్ళ దేవుడు  అయినా ఇలా మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఉండడే అదిగో వెళుతోంది చూడండి మహేష్ కార్ ......... ఒక్కసారి మాటిచ్చాడంటే ప్రాణం పోయినా తప్పడు . తల్లీ తల్లీ స్వాతి , ప్రసన్నా .......... ఏమిటా కన్నీరు అని అడిగారు.
Dad ........ అంటూ ఇద్దరూ సర్ వాళ్ళ గుండెలపై వాలిపోయారు .
ఏమైంది తల్లీ ........ 
Dad mom ......... మహేష్ అని తెలియక కారులో , ఇంటిలో బాధపెట్టాము అని బాధతో బోరున విలపిస్తున్నారు .
తల్లీ ......... మహేష్ అలాంటివి పట్టించుకోడు , అంత మంచివాడు .
అందుకేనమ్మా we love మహేష్ ప్రాణం కంటే ఎక్కువగా , 
తల్లీ ........... 

MOm mom ........... మహేష్ లేకపోతే మేము బ్రతకలేము అని మేడం వాళ్ళ గుండెలపై వాలిపోయారు .
తల్లీ ........ తీరని కోరిక కోరుతున్నారు .
Dad .......... మీ దేవుడు అన్నారు , మీకు అల్లుడు అయ్యే అర్హత మహేష్ కు లేదంటారా అని ఇద్దరూ ఒకేసారి అడిగారు .
తల్లీ ....... దేవుడే స్వయంగా అల్లుడయితే అంతకంటే అదృష్టవంతుడు ఎవరు ఉంటారు చెప్పు కానీ .......
కానీ ఏంటి dad .
చెబుతాను కారు ఎక్కండి అని శివరాం సర్ ఇద్దరినీ చెరొకవైపు కూర్చోబెట్టుకొని , రేయ్ నారాయణ నువ్వు నీ చెల్లీ నాచెల్లితో క్యాబ్ లో వచ్చెయ్యండి అనిచెప్పి ఇంటికి చేరుకున్నారు .
అందరూ తోటలో కూర్చుని తల్లీ ........ మీరే కాదు ఇద్దరు దేవతలు కూడా మహేష్ ను గెలవాలని కోరుకున్నారు వాళ్ళవల్లే కాలేదు మీరిద్దరూ దేవకన్యలు మాత్రమే అని మేడం వాళ్ళవైపు కన్నులు కొట్టారు .
శివరాం , నారాయణ ...........
జస్ట్ saying .........
Dad .......... మా హృదయంలో మొత్తం మహేషే నిండిపోయాడు . చూడకుండానే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాము . 
తల్లీ ....... మీ హృదయంలో మహేష్ ఉన్నట్లుగానే మహేష్ హృదయంలో ఒక దేవత ఉంది తల్లీ , ఆ దేవతతో తన హృదయం నిండిపోయి స్థానం కోసం ఆశతో ఎదురుచూస్తోంది . ఆ దేవత పేరు వాసంతి తన ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్య . ఆ దేవతకోసం 12 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాడు అని మొత్తం వివరించాడు . మన కంపెనీ చైర్మన్ పదవిని కూడా తేలికగా తిరస్కరించాడు తల్లీ ......  వాళ్ళ అక్కయ్య కనిపించిన మరుక్షణం ఇంతటి లగ్జరీ లైఫ్ ను వదిలేసి ఆ దేవతతోపాటు వాళ్ళ ఊరు వెళ్ళిపోయి , మహేష్ అంటే ప్రాణమిచ్చే ఊరిజనాలతో వ్యవసాయం చేయాలన్నదే అతని కోరిక. ఆ క్షణం మహేష్ ను ఆపే శక్తి ఆ భగవంతుడికి కూడా లేదు .

Dad , dad .......... అంటూ సర్ వాళ్ళ గుండెలపై వాలిపోయి బాధపడుతున్నారు .
మా మనసులోనుండి తన పేరుని చేరిపివేయ్యాలనే , మమ్మల్ని బాధపెట్టకూడదు ఆనేనేమో అమ్మా .......... తన గురించి తానే చాలా నిందలు వేసుకున్నాడు . మేముచేసిన అవమానాలను భరించాడు అని ఆపకుండా కన్నీళ్లను కారుస్తూ విలపిస్తూ , dad ........ మహేష్ లేకుండా మేము ఉండలేము , మాకు కంపెనీ ఈ లగ్జరీ లైఫ్ .......... ఏమీ వద్దు . మహేష్ తో ఉంటూ వాసంతి అక్కయ్యను సేవచేసుకుంటూ హాయిగా జీవించాలని ఉంది . మేము కూడా తన వెంటే వెళ్లిపోతాము , మహేష్ మమ్మల్ని టచ్ చేయకపోయినా పర్లేదు అనిచెప్పారు .
వాళ్ళ బాడీ వైబ్రేషన్ ను బట్టే మహేష్ ను ఎంత ఆరాధిస్తున్నారో సర్ వాళ్లకు తెలిసిపోతోంది . 
తల్లులూ ......... మీ కోరిక తీర్చడానికి మేము ఏమీచెయ్యలేము . మహేష్ హృదయంలో చోటుని సాధించడం అసాధ్యం . ఇప్పటికే మనం అతడికి చాలా ఋణపడిపోయాము . మీరు అతడితోపాటు ఉంటే దేవాలయంలో ఉన్నట్లే మాకు అంతకంటే ఏమికావాలి చెప్పండి . మీరే ఎలాగైనా మహేష్ హృదయంలో చిన్న అతిచిన్న స్థానం సంపాదించాలి . మీ ప్రేమతో ........... అయినాసరే కుదరనే కుదరదు అని సర్ వాళ్ళు స్వాతి , ప్రసన్నాలను గుండెలపై ప్రాణంలా హత్తుకున్నారు .
మేడం వాళ్ళు కన్నీళ్లను తుడుచుకుని తల్లీ ........ మీ ప్రాణమైన మహేష్ కు వాసంతి అక్కయ్యతోపాటు చెల్లి కృష్ణ మరియు కొన్ని నెలల ముందు కృష్ణకు జన్మించిన పాపాయిని బుజ్జిఅక్కయ్య వాసంతిగా తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు . వాళ్లకోసం ఏదైనా చేస్తాడు , వాళ్ళు కోరిన కోరికను ధాపాటిస్తాడు కాబట్టి ............
Moms .......... అర్థమయ్యింది కృష్ణకు తోడుగా , బుజ్జి అక్కయ్యను ప్రాణంలా చూసుకుంటే మహేష్ సంతోషించడం అయినా చూడొచ్చు . దేవుని ఆశీస్సులతో మా స్వచ్ఛమైన ప్రేమతో బుజ్జిఅక్కయ్యను గెలుచుకుంటాము అని చెప్పి లవ్ యు dad లవ్ యు mom అని మాటల్లో చెప్పలేని ఆనందంతో కౌగిలించుకుని పరవశించిపోతోంటే ,
ఏంటి స్వాతి , ప్రసన్నా.......... చాలా సంతోషంగా ఉన్నారు . మీ అమ్మానాన్నలు అంత విలువైన గిఫ్ట్ ఇచ్చారా అని పిన్నిగారు బయటకువచ్చారు .
అంతకన్నా విలువైనది పిన్నీ ......... పిన్నీ ఉదయం మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్ ఎవరో కాదు అని పేరు చెప్పడానికే సిగ్గుపడిపోతున్నారు .
ఎవరు తల్లీ .........
మేము ఎవరికోసమైతే వచ్చామో .......... ఆ దేవుడే మహేష్ ........
ఆ డ్రైవరా ......... 
పిన్నీ ........
మీ ఇష్టం మీకు మీ అమ్మానాన్నలకు దేవుడు కావచ్చు కానీ నాకు మాత్రం ఒక పనివాడు మాత్రమే , 
నెమ్మదిగా పిన్నీ లేకపోతే మీ అక్కయ్య కొట్టినా కొడుతుంది అని నవ్వుకున్నారు .
ఏంజెల్స్ .......... ఏమిజరిగినా మీరు ఎటువంటి నిర్ణయాలూ తీసుకోము అని మాకు మాట ఇస్తేనే , 
Dad మీరే చెప్పారుకదా అది దేవాలయం అని మన దేవుడు అన్నీ చూసుకుంటాడులే అని మురిసిపోయారు .
చెల్లీ ........ ప్రయాణం ఎలా జరిగింది అని అందరూ ఆమెను సంతోషంతో పలకరించారు .

ఒక కారు లోపలికిరావడం నలుగురు కిందకు దిగగానే పూజిత , రమ్య , శుభశ్రీ , శైలజా అంటూ పరుగునవెళ్లి కౌగిలించుకుని రెండు సంవత్సరాలు అయ్యిందే మిమ్మల్ని చూసి అని సంతోషంతో పలకరించుకుని సర్ మేడం వాళ్లదగ్గరికి పిలుచుకొనివెళ్లారు . క్షేమసమాచారాలు తరువాత వారం రోజులయ్యింది మీరు కాల్ చేసి మీ వాట్సాప్ స్టేటస్ చూసాము కాబట్టి మీరు ఉదయం వచ్చారని తెలిసి వచ్చేసాము .
స్వాతి , ప్రసన్నా .......... పూజిత marriage ఫిక్స్ అయ్యింది . ఈ నైట్ పబ్ లో బ్యాచిలర్స్ పార్టీ మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు .  కరెక్ట్ సమయానికి ల్యాండ్ అయ్యారు . అక్కడ మొత్తం రెడీ అయిపోయింది , తొందరగా పార్టీ డ్రెస్లోకి రెడీ అయిపోతే బయలుదేరడమే , అంకుల్ అంటీ ......... మిమ్మల్నీ పిలవచ్చు కానీ ఓన్లీ బ్యాచిలర్స్ సో ..........అని శైలజ చెప్పింది .
ఏంజెల్స్ లవ్ యు ఎంజాయ్ the పార్టీ హ్యాపీగా వెళ్ళండి అని పర్మిషన్ ఇచ్చేసారు .
ఏంటీ ఒంటరిగానా నేను ఒప్పుకోను , అక్కడ నా ఏంజెల్స్ కు ఏమైనా అయితే అమ్మో నావల్ల కాదు , అక్కయ్యా ......... ఒక నలుగురు బౌన్సర్లు ఉంటే పిలిపించండి నేను టెస్ట్ చేసి అప్పుడు పంపిస్తాను ఇది ఫైనల్ అని పిన్ని గారు చెప్పారు .
లవ్ యు చెల్లీ అని మేడం పిన్నిగారిని కౌగిలించుకుంది .

పూజితా ........ sorry వే మేము గుడికి వెళుతున్నాము , రేపు ఇంటికివచ్చి కలుస్తాము మీరు కానివ్వండి అని స్వాతి బదులిచ్చింది .
ఏంటీ మీరు హైద్రాబాద్ వచ్చికూడా రాలేదని తెలిస్తే నన్ను కొట్టినా కొట్టేస్తారు మన ఫ్రెండ్స్ , పార్టీకి రావే అంటే గుడికి అంటావేంటే లవ్వా ........ , మీరు రాకపోతే పార్టీ క్యాన్సిల్ మేము ఇక్కడి నుండి కదలము అంటూ వెళ్లి కుర్చీలలో కూర్చున్నారు .
Dad .........
తల్లీ ......... మహేష్ మీకు బాడీగార్డ్ గా వస్తే ok నా అని అడిగారు .
బుజ్జిఅక్కయ్యను వదిలి ఎలా రమ్మంటారు dad , అది మాకు కూడా ఇష్టం లేదు . 
అదీ నిజమే తల్లీ ......... మీ moms వల్లనే వీలౌతుంది . 
శివరాం , నారాయణ .......... మిమ్మల్నీ , 
మామ్ , మామ్ ......... please please ...........
సరే మీరు రెడీ అయ్యిరండి అనిచెప్పడంతో , వాళ్ళ ఫ్రెండ్స్ ను పిలుచుకొని లోపలికి ఉత్సాహంతో వెళ్లారు .
ఒసేయ్ అక్కయ్యా .......... నేను నలుగురు అన్నానంటే డబల్ త్రిబుల్ అని అర్థం మీరేంటి ఓకేఒక్కడితో , నాకు ఏమాత్రం ఇష్టం లేదు .
చెల్లీ ........ ఆ ఒక్కడే నువ్వు చెప్పినంత మందితో సమానం . నీకు నమ్మకం లేకపోతే నువ్వుకూడా తోడుగా వెళ్లు పార్టీ డ్రెస్ ఉందిగా అని గుసగుసలాడింది . 
అక్కయ్యా ......... అవన్నీ అప్పుడు , మళ్లీ గుర్తుచేయ్యకు చీరలోనే వెళతానులే అని లోపలికివెళ్లి అందరూ బయటకువచ్చారు . పూజితా మా చెల్లిని కూడా ఈ ఒక్క రాత్రికి యూత్ అనుకోండి అని మేడం కోరడంతో , 
Ok అంటీ ........ కానీ మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అని ఒకేఒక రూల్ కోరారు .
డన్ అంటూ సర్ మేడం వాళ్ళు ఒక కారులోకి ఎక్కి మమ్మల్ని ఫోలో అవ్వండి అని అపార్ట్మెంట్ చేరుకుని , తల్లులూ మహేష్ హోమ్ వస్తారా అని అడిగారు .

Mom .......... దేవాలయానికి తొలిసారి ఈ పార్టీ డ్రెస్ లోనా , ముందే చెప్పొచ్చుకదా పట్టుచీరలలో దేవకన్యల్లా రెడీ అయ్యేవాళ్ళము అని సంతోషంలో తడబడుతూ మాట్లాడారు . 
OK తల్లీ ఎలాగోలా మహేష్ ను ఒప్పించి మీతోపాటు పంపిస్తాము అని సర్ మేడం వాళ్ళు పైకివచ్చారు . 
సర్ , మేడం ........ రండి అని సోఫాలో కూర్చోబెట్టాము .
కృష్ణ ఎక్కడ అని మేడం వాళ్ళు బెడ్రూం వైపు నడిచారు .
ఏంటి కృష్ణ ఎలా ఉంది ప్రిపరేషన్ అని అడిగారు .
గోయింగ్ గుడ్ సర్ అని డ్రింక్స్ తీసుకొచ్చాము .
మేడం వాళ్ళు బెడ్రూంలోకి వెళ్లి బుజ్జిఅక్కయ్యకు పాలు ఇస్తుండటం చూసి , మూడురోజులయ్యింది బుజ్జివాసంతిని చూసి అని ప్రక్కనే కూర్చుని , వాసంతి సమయం లేదు మీ తమ్ముడు కొన్నిగంటలపాటు మా అమ్మాయిలకు తోడుగా పబ్ కు వెళ్ళాలి ......... please please ......... అంటూ బుజ్జి బుజ్జి చేతులను స్పృశిస్తున్నారు .

మేడం ......... స్వాతి , ప్రసన్నా వచ్చారా ఎక్కడ హాల్లో ఉన్నారా అని సంతోషంతో చెల్లి లేవబోతుంటే , 
ఇక్కడ లేరు కృష్ణ వాళ్ళు పార్టీ డ్రెస్ లో ఉన్నారు . ఈ ఇల్లు వాళ్లకు డేవాలయంతో సమానం తొలిసారి ..........
అర్థమైంది మేడం , మీలానే వాళ్ళది కూడా మంచి మనసు .
అయినా వాళ్ళ పేర్లు , గుణం .......... నీకెలా తెలుసు కృష్ణ ,
ఒక్క క్షణం అని కృష్ణగాడిని పిలిచి బుజ్జిఅక్కయ్యను హాల్లోకి తీసుకువెల్లమని ఊయలలో పడుకోబెట్టమని క్షణాల్లో నిద్రపోవాలి అన్నయ్యకు చెప్పు .
 వెళ్ళాక అన్నయ్య చెప్పాడు మేడం , వాళ్ళ ప్రేమ గురించి కూడా తెలుసు కానీ ఏమీ చేయలేను మేడం , బుజ్జివాసంతితో అన్నయ్య దాచిన తొలి విషయం . తెలిస్తే ......
తెలుసు కృష్ణ .......... వాళ్లకు కూడా అదేవిషయం చెప్పాము . గుండెలనిండా మహేష్ నే నింపుకున్నారు ............
మేడం .......... మాలానే అక్కయ్య , మా ఊరి అమ్మవారిపై నమ్మకం ఉంచండి అంతా మంచే జరుగుతుంది . పార్టీ కదా ........ అంటూ బయటకువచ్చి బుజ్జిక్కయ్య నిద్రపోతుండటంతో , అన్నయ్యా ......... మేడం వాళ్లకు నేను , బుజ్జిఅక్కయ్య మాటిచ్చాము పార్టీకి వెళ్ళాలి అని మొత్తం వివరించింది .
రేయ్ నెమ్మదిగా ఊపు అనిచెప్పి చెల్లిచేతిని అందుకొని కాస్త దూరం వెళ్లి , చెల్లెమ్మా .......... ఎలా ,
ఏమో అన్నయ్యా , నాకు తెలియకుండానే అదిగో మీ బుజ్జిఅక్కయ్య మాటిచ్చేసింది మేడం వాళ్లకు ఇక నీ ఇష్టం . 
నిద్రపోతున్న అక్కయ్య దగ్గరకువెళ్లి వెళ్ళాల్సిందేనా ........., నిన్నూ అని చెల్లికి మొట్టికాయవేసి రెఢీఅయ్యివచ్చాను .
మేడం , చెల్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . చెల్లీ ......... అక్కయ్యను వదిలి వెళ్లేవాటికి ఇక ఎప్పుడూ మాటివ్వద్దు అనిచెప్పు అని కారు తాళాలు అందుకొని , బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి వదల్లేక వదల్లేక కిందకువచ్చాను .
Like Reply
అదిగోనే అతడే మా హీరో మహేష్ అని తియ్యని జలదరింపులతో సిగ్గుపడుతూ చెప్పారు .
ఏంటే అలా ఉన్నాడు marriage ఫిక్స్ అయిన నాకే ........,
ఒసేయ్ ......... నీ వుడ్ బీ ఈ మాటలు వింటే ఇక అంతే , నీకు ఆ ఛాన్స్ లేదు అని మిగతా ముగ్గురూ దిగి పోటీపడుతూ కౌగిలించుకోవడానికి రావడంతో , వెంటనే కారుపైకి ఎక్కేసి ఎస్క్యూస్ మీ ..........
మేము స్వాతి , ప్రసన్నా ........ బెస్ట్ ఫ్రెండ్స్ , నిన్ను ఒక్కసారి కౌగిలించుకోకపోతే జీవితం వృధా అనిపిస్తోంది . Please please please మహేష్ ఓకేఒక్కసారి ఓన్లీ వన్ టైం అని నన్ను తాకడానికి ఎగురుతున్నారు .
ఓ ఓ ఓ .......... కూల్ కూల్ , thats ఇంపాజిబుల్ మీరు కారులో ఎక్కి కూర్చునేంతవరకూ నేను కిందకు దిగను . 
పార్టీకి అందరూ వచ్చేసిఉంటారు . ఎక్కడికీ వెళతావు నీ సంగతి తరువాత చెబుతాము అని వెళ్లి వాళ్ళ కారులో కూర్చున్నారు .
ఒసేయ్ మీరు tooo lucky , మహేష్ గురించి చాలా తక్కువ చెప్పారు . అతన్ని చూస్తే మన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హుస్బెండ్స్ మరియు లవర్స్ ను వదిలేయడం పక్కా అని నవ్వుకున్నారు .
పిన్నిగారు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే అటునుండి ఆటే ఇంటికి పిలుచుకునివెళ్ళేవారు .

పిన్నీ ........ మేము ఆ కారులో వస్తాము అని సైగచేసి నాదగ్గరకువచ్చారు . 
కన్నార్పకుండా చూస్తూ గుండెల్లో నింపుకొని పెదాలపై చిరునవ్వుతో తియ్యని జలదరింపులతో పడిపోకుండా ఒకరినొకరు పట్టుకుని మాట్లాడకుండా అలా ఉండిపోయారు .
నేను వెళ్లి కారులో కూర్చున్నాను .
 మహే.....ష్ ......... మ.......మ్మల్ని క్షమిం.......చు , నీ కా......రులో రావా.......చ్చా.......... అని అడిగారు .
ఇది మీ కారు , నేను మీ ఎంప్లాయ్ ని , మీ సేవకు ..........అనేంతలో ,
ఇద్దరూ ఒకేసారి నా నోటిని మూసేసి , ఆ స్పర్శకే నిలువెల్లా కరిగిపోయి మాటల్లో చెప్పలేని అనుభూతితో , ఆ మాటను మేము విని తట్టుకోలేము , నన్ను అమాంతం కౌగిలించుకోవాలన్న కోరికను బలవంతంగా కంట్రోల్ చేసుకుని వల్లకాక వెనక్కు తిరిగి ఘాడమైన ఊపిరి పీల్చి వదులుతూ ఒకరిచేతినిమరొకరు నొప్పిపుట్టేలా నొక్కేస్తున్నారు .
 మేడమ్స్ ......... are you ok , లోపల కూర్చోండి అని వెనుక డోర్ తెరిచాను .
ల.......... థాంక్స్ మహేష్ అని వెనుక కూర్చుని ఒకరిచేతిలో మరొకరు పెనవేసి నావైపే చూస్తున్నారు .
ఎక్కి కూర్చుని మేడం పార్టీ ఎక్కడ అని అడిగాను .
మహేష్.......... స్వాతి , ప్రసన్నా అని ప్రేమ.......... మనం ఎయిర్పోర్ట్ లో ఫ్రెండ్స్ అయ్యాము కదా అనిచెప్పారు .
మేడం అని పిలవడమే నాకు కంఫర్ట్ మేడమ్ .........
నీ ఇష్టమే మాఇష్టం మహేష్ అని నాతో మాట్లాడుతున్నామని మురిసిపోతున్నారు . 
ఇద్దరూ ప్రేమతో చూస్తుంటే , మిర్రర్ ను వెనక్కు తిప్పేసి , మేడం పార్టీ ఎక్కడ అని అడిగాను .
Costliest పబ్ పేరు చెప్పడంతో ఒక్కమాటకూడా మాట్లాడకుండా చేరుకున్నాము . వెనుకే మేడం వాళ్ళ ఫ్రెండ్స్ పిన్నీ గారు వచ్చారు .

పబ్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది . సిటీలోని ఖరీదైన కార్లన్నీ అక్కడే ఉన్నట్లున్నాయి . 
కారుదిగి వెనుక డోర్ తెరిచాను . స్వాతి ప్రసన్నా దిగగానే కొంతమంది మోడరన్ డ్రెస్సులతో స్వాతి - ప్రసన్నా ......... అంటూ వచ్చి కౌగిలింతలతో సంతోషాన్ని పంచుకుని , ఒసేయ్ ......... ఏంటే మీ డ్రైవర్ అంత మ్యాన్లీ , స్ట్రాంగ్ , రొమాంటిక్ , సెక్సీగా .......... ఉన్నాడు మేము try చేసుకోవచ్చా అని అడిగారు .
ష్ ష్ ష్ .......... అతడు మా ప్రాణం , దగ్గరికి వెళ్లారో చంపేస్తాను అని గుసగుసలాడి పిన్నీ అంటూ చేతిని అందుకొని మహేష్ లోపలికిరా అని పిలిచారు .
మేడం you go ahead .......... నేను ఇక్కడే ..........
అంతలో లోపల ముందు మేము బుక్ చేసుకున్నాము , మేము బుక్ చేసుకున్నాము అని మేడం ఫ్రెండ్స్ మరియు కొంతమంది బాయ్స్ పబ్ మేనేజ్మెంట్ తో వాదులాడుతున్నారు . 
పూజిత లోపలికివెళ్లి మేనేజర్ ను పిలవండి ఆయనతోనే మాట్లాడుతాము అని పిలిపించారు .
మేడం చిన్న mistake వలన ఒకేసారి ఇద్దరికి ఇచ్చేసారు మావాళ్ళు , వాళ్ళు ఎంజాయ్ చేయడానికే వచ్చారు - మీరుకూడానూ సో సగం సగం అడ్జస్ట్ చేసుకోండి . Dj సంగతి మేము చూసుకుంటాము అని రిక్వెస్ట్ చేశారు .
సెక్సీ అమ్మాయిలు కదా మాకు ok అని అబ్బాయిలు సంతోషంతో హైఫై , హగ్స్ తో వీళ్ళవైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నారు . 

How dare you అంటూ పూజిత వాళ్ళవైపు కొప్పుడుతుంటే , అప్పటికే ఫుల్ గా తాగిన ఒకడు వాడిని బ్యాచిలర్ అని ఎవ్వడూ అనరు భూమి పుట్టినప్పుడు పుట్టాడు వాడు పూజిత మీదకు వస్తుంటే , స్వాతి వెళ్లి చెంపచెల్లుమనిపించింది .
మామీదే చెయ్యివేస్తావా అని అందరూ మీదకు వస్తుంటే , అడుగు వేసేంతలో మొత్తం బౌన్సర్స్ రెండు గ్రూప్ లకూ అడ్డుగా నిలబడ్డారు . 
మేడం అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు . మీరు వద్దు అనుకుంటే మీ అడ్వాన్స్ మొత్తం వెనక్కు ఇచ్చేస్తాము . 
అలా ఎలా కుదురుతుంది మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు .
అయితే అడ్జస్ట్ చేసుకోండి చూశారుగా 50 మందికిపైగా బౌన్సర్స్ ఉన్నారు ఎటువంటి ఇబ్బందీ లేకుండా మేము చూసుకుంటాము అనిచెప్పడం - పూజితా ఇంట్లో ఒప్పించి రావడానికి చాలా కష్టపడ్డాము మళ్లీ మరొకరోజైతే కష్టం వే , అవునే అవునే అని చాలామంది చెప్పడంతో , సరే ఎటువంటి ఇబ్బంది కలిగినా మొత్తం అందరమూ పబ్ పై స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాము తరువాత ఏమిజరుగుతుందో తెలుసుకదా అని పార్టీ మొదలెట్టారు .
మేడం వాళ్ళ ప్రొటెక్షన్ కోసం లోపలివెళ్లక తప్పలేదు . లోపల చూస్తే కళ్ళు జిగెలుమంటున్నాయి . ఫారిన్ లోనే అనుకున్నాను హైద్రాబాద్ లో wow అనుకుని మేడం వాళ్లకు దగ్గరలో కూర్చున్నాము .
పూజిత marriage బ్యాచిలర్ పార్టీ అని అనౌన్స్మెంట్ చేయడం , అందరూ సంతోషంతో కేకలువెయ్యడం మందు ఏరులై పారుతూ ఎంజాయ్ చేస్తున్నారు .

స్వాతి , ప్రసన్నా ........ పిన్నిగారితో కూర్చుని సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుండటం చూసి చప్పట్లతో encourage చేస్తున్నారు .
రమ్య వచ్చి ఒసేయ్ ఇక్కడ ఇంటర్ వరకూ ముట్టలేదు , ఫారిన్ కు వెళ్లారు కదా అక్కడైనా మారలేదా మీరు అని అడిగింది .
హలో పెంపకం నాది , నా ఏంజెల్స్ బంగారం అంటూ చేతులను అందుకొని ముద్దులుపెట్టింది .
వాళ్ళవైపే ఆశ్చర్యంతో చూస్తున్న నావైపు ఇద్దరూ కన్ను కొట్టడంతో , వెంటనే తలదించేసుకున్నాను . ఎంతైనా వాళ్ళ బ్లడ్ లోనే ఉంది అనుకుని గర్వపడ్డాను .

స్వాతి చెంపపై కొట్టినవాడు ఒక బౌన్సర్ కు డబ్బు ఇచ్చి నలుగురితోపాటు అమ్మాయిల ఫ్లోర్ మీదకు చేరుకుని అందరినీ చూస్తున్నాడు . నాకు తెలిసి స్వాతి మేడం కోసం అనుకుంటాను . ఫ్లోర్ పై ఎక్కడా కనిపించకపోవడంతో పూజితవైపు అడుగులు వేసాడు . 
అందరిలో కలిసిపోయి వాడి వెనుకే చేరుకున్నాను . 
 వాడు ఫుల్ గా తాగిన పూజిత వెనుకకు చేరి తన బ్యాక్ జిప్ అందుకొని నన్నే కొట్టిస్తావా ఇప్పుడుచూడు నిన్ను ఎలా అల్లరి పెట్టిస్తానో అని కిందకు లాగేసాడు . 
తనలో ఎటువంటి రియాక్షన్ లేదు . ప్రక్కనే ఉన్న వాడి ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నారు .
అంతే వాడి మెడ చుట్టూ చేతినివేసి వీపుపై ఒక్క గుద్దు గుద్దిపట్టుకుని ఎవ్వరూ గమనించేలోపు జిప్ పైకి లాగాను . 
పూజిత వెనక్కు తిరిగి యు ఇడియట్ అని చెంపచెల్లుమనిపించింది . 
నామీద డౌబ్ట్ తో నన్నే గమనిస్తున్న అంటీ వచ్చి నాకు తెలుసు నువ్వు ఇలాంటివాడివేనని అని మరొక చెంపపై కొట్టింది . 
పిన్నీ ......... మహేష్ అలా ఎప్పటికీ ప్రాణం పోయినా చెయ్యడు , మహేష్ నిజం చెప్పు అని నా నడుముదగ్గర చేతితో మెడను చుట్టేసిన వాడిని చూసి అంతా వాడివల్లనే అయి ఉంటుంది అని పూజిత జిప్ సరిచేశారు .
అవును స్వాతి వాడే నేను చూసాను అని శుభశ్రీ చెప్పింది .
మేడం ఎవ్వరూ గమనించలేదు ఏమీ జరుగనట్లు పార్టీ కంటిన్యూ చెయ్యండి .
మహేష్ ......... వాళ్ళు ఐదుమంది వచ్చారు , వీడియో తీశారు . 
నేను చూసుకుంటాను అని వాడి మెడను తిప్పి ఒకమూలన పడేసి , బౌన్సర్ దగ్గరకువెళ్లి మూతిపళ్ళు రాలునట్లు మూతిపై గుద్దుగుద్ది , ఎవరెవరు అని కోపంతో అడిగాను . 
పార్టీ డిస్టర్బ్ అవ్వకూడదు సరేనా ......... అని వాళ్ళల్లో కలిసిపోయి చూపించిన ఒక్కొక్కడి బొక్కలు విరిచేసి మొబైల్స్ లాక్కుని , మీ వాళ్ళ సహాయంతో బయట చెట్టుకి కట్టెయ్యి అనిచెప్పడంతో ఎత్తుకొనివెళ్లారు .

బాధపడుతున్న పిన్నిని ఓదారుస్తున్న స్వాతి , ప్రసన్నా దగ్గరకువెళ్ళి వాళ్లముందే మొబైల్స్ ఒక పెద్ద jar లోకివేసి కొద్దిగా మందుపోసి అంటించి కాస్త దూరం వెళ్లి కూర్చున్నాను .
రమ్య , శుభశ్రీ ........ బాధపడుతున్న పూజితను నావైపు తీసుకువస్తోంటే , వెళ్లి మేడం ......... ఏమీ జరగలేదు మొత్తం destroy చేసేసాను వెళ్లి ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పాను .
మహేష్ ......... అంటూ రెండుచేతులతో నమస్కరించి ఇప్పుడు తాగేసి ఉన్నాము రేపు వచ్చి కలుస్తాము అని వెళ్లారు .
రమ్య వచ్చి కౌగిలించుకోబోయి sorry అని చేతిని కలిపి , మరొక్క కోరిక కొరవచ్చా .............మాటివ్వాలి .
Ok ..........
పిన్ని నిన్ను కొట్టినందుకు బాధపడటం , ఆమెను ఓదారుస్తూ మీ ప్రియమైన మేడం వాళ్ళు బాధపడటం చూడలేకున్నాము అని చెవిలో గుసగుసలాడారు .
నో ..........
మహేష్ మాటిచ్చావు . మాటిస్తే ప్రాణాలైనా వదిలేస్తావు అని మీ మేడం వాళ్లే చెప్పారు. అయితే అపద్దo అన్నమాట నన్ను ఆపితే అదే నిజం అని కూల్ డ్రింక్ లో మందు కలిపి వద్దు వద్దు అంటున్న నావైపు చూస్తూ చిరునవ్వుతో ముగ్గురికీ అందించడమే కాకుండా మూడు నాలుగు గ్లాస్ లు తాగించి ఫ్లోర్ మీదకు పిలుచుకొనివెళ్లి డాన్స్ కూడా చేయించారు . మొత్తం మరిచిపోయినట్లు ఫ్రెండ్స్ తోపాటు ఎంజాయ్ చేశారు .

తరువాత రమ్య , పూజిత మరియు మా మేడం లిద్దరితోపాటువచ్చి నేను వద్దంటున్నా నన్ను లాక్కుని వెళ్లారు ఫ్లోర్ మీదకు . ఇక ఏనాకొడుకూ ఇటువైపు రాకుండా నాలుగువైపులా చూస్తూ అలెర్ట్ గా ఉన్నాను . అందరూ అలసిపోయేంతవరకూ డాన్స్ , ఎంజాయ్ చేసి పబ్ రెస్టారెంట్ లో ఏర్పాటుచేసిన డిన్నర్ చేసి , మేడం పిన్నీవాళ్లను నా కారులో కూర్చోబెట్టి అందరూ వాళ్ళ వాళ్ళ వెహికల్స్ లో వెళ్లేంతవరకూ వేచి చూసి , రెండు మూడుసార్లు మొత్తం చెక్ చేసి మేనేజర్ ను కలిసి ముందు ఇలాంటి పొరపాటు ఎప్పటికీ జరగకుండా చూసుకోమని , కాస్త నిజాయితీగల బౌన్సర్లను ప్రొటెక్షన్ గా ఉంచుకోవాలని చెప్పి కారు స్టార్ట్ చేయగానే నా కారు ఎదురుగా ఉన్న చెట్టుకు ఐదుగురు కట్టివేయ్యబడి ఉండటం మొదట పిన్నీ మేడం వాళ్ళు తరువాత వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్లి కట్లువిప్పి ఎవర్రా ఎవర్రా అని అడిగినా వాళ్ళు ఇప్పట్లో స్పృహలోకి వచ్చేలా లేరు .
మా మహేష్ , మా హీరో అని మేడం వాళ్ళతోపాటు పిన్నిగారు కూడా తొలిసారి తాగిన హ్యాంగోవర్ లో కేకలువేస్తున్నారు .

మహే.......ష్ ........ పూజి.....తను అల్లరి చేశారు కాబట్టే ఇంతలా కొట్టావు మరి పూజిత స్థానంలో స్వాతికానీ , ప్రసన్నా కానీ ఉండి ఉంటే ఏమి.......... అనేంతలో,
వాళ్ళ బాడీలు కూడా దొరికేవి కాదు మేడం అని స్టార్ చేసి పోనిచ్చాను .
అందుకే కదా మహే....ష్ నువ్వం.....టే మాకు ప్రాణ.......ము . నువ్వు లేని జీవితం మేము ఊహించుకోలేము లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ , నిన్ను కౌగిలించుకోకుండా ఉండటానికి ఎంత కంట్రోల్ అది ఎంత కష్టమో నీకు తెలుసా ......., జీవితాంతం వాసంతి అక్కయ్యను సేవచేసుకుంటూ నిన్ను చూసుకుంటూ జీవిస్తాము అని కళ్ళుమూతలు పడుతుంటే నా పేరునే కలవరిస్తూ వాళ్ళ పిన్ని భుజాలపై వాలిపోయారు .
 మహేష్ ........... మా అక్కయ్య చెప్పినట్లు దేవుడిని కొట్టాను నన్ను క్షమించు , నీ ముఖంపై నీళ్లుపోసాను దానికి క్షమించమనే అర్హతకూడా లేదు నాకు , నా ప్రాణమైన తల్లులు ఎప్పుడూ నేను గర్వపడేలానే చేస్తారు . My ఏంజెల్స్ మీ సెలక్షన్ పర్ఫెక్ట్ ఇటువంటి ధీరుడిని ఇద్దరేంటి ఎంతమంది మగువలైనా దాసోహం అనాల్సిందే అని ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టి , కళ్ళుమూసుకుని మహేష్ .......... ఇప్పుడు ఇలా హ్యాంగోవర్ ఇంటికివెలితే నా పరువు పోతుంది . లండన్ లో ఉన్నప్పుడుకూడా ఇలాంటి పరిస్థితి రాలేదు . కూల్ డ్రింక్ అనిచెప్పి మందు తాగించేశారు తలపట్టేస్తోంది అని కలవరిస్తున్నారు .
నావల్లనే కదా ........... ఇదంతా ,  సమయం 11 గంటలు దాటింది . ఇంటికి వెళితే మేడం రేపు సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది . పెద్ద మేడం వాళ్ళుకూడా బాధపడతారు అని మాఇంటివైపుకు తిప్పాను . దారిలో లేడీ డాక్టర్ క్లినిక్ దగ్గర ఆపి డాక్టర్ మేడం ను పిలుచుకొనివచ్చి తొలిసారి తాగారు అనిచూపించాను . 
కళ్ళు పరీక్షించి నిజమే అని ఈ టాబ్లెట్స్ తాగించి పడుకోబెట్టండి , ఉదయం లేవగానే పెద్ద గ్లాస్ నిండా మజ్జిగను మించిన మందులేదు . కంగారుపడాల్సిన అవసరం లేదు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనిచెప్పారు . 
థాంక్స్ చెప్పి ఫీజ్ ఇచ్చేసి దగ్గరలోని మెడికల్ స్టోర్ లో టాబ్లెట్స్ తీసుకుని , శివరాం సర్ కు కాల్ చేసి ఆలస్యం అయ్యిందికదా మా ఇంట్లోనే పడుకుని రేపు ఉదయమే పిలుచుకొనివస్తాను అనిచెప్పాను .
మాకు కావాల్సింది కూడా అదేకదా మహేష్ ..........
సర్ ..........
మహేష్ .......... మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు . నీ ఇష్టం అని సంతోషంతో కట్ చేసి , యాహూ ......... అంటూ కౌగిలించుకుని రూమ్ నుండి బయటకువచ్చి నారాయణ సర్ తలుపుకొట్టిమరీ విషయం చెప్పి ఎంజాయ్ చేశారు .

అపార్ట్మెంట్ చేరుకుని కృష్ణగాడిని కిందకు పిలిచాను . రేయ్ మామా పైకి ఎత్తుకునివెళ్లాలి . 
రేయ్ మామా ......... నా చెల్లెళ్ళు వీళ్ళు నేను బాగుండదు . 
ఏంట్రా అన్నావు ...........
ఏమీలేదు రేయ్ నిద్రవస్తోంది తొందరగా కానివ్వరా అనిచెప్పాడు . 
మొదట ప్రసన్నాను నా బెడ్రూం లో పడుకోబెట్టాను . 
చెల్లి చూసి అన్నయ్యా ......... తాగారా ........
చెల్లీ రేపు నువ్వే నన్ను రక్షించాలి , పర్మిషన్ నేనే ఇచ్చాను అని రమ్య మాట తీసుకోవడం దగ్గర నుండి చెప్పాను .
నవ్వుకుని అన్నయ్యా ......... ఈ విషయం వీళ్లకు తెలిస్తే వాళ్లకు మీరు దొరికేసినట్లే ,
అవును చెల్లీ ......... జేబులోని టాబ్లెట్స్ తీసి నీటిలో కలిపి తాగించమనిచెప్పి కిందకువెళ్లి స్వాతిని ఎత్తుకుని రేయ్ మరొకరు ఉన్నారు నీ అకౌంట్ అనిచెప్పాను .
రేయ్ ......... నావల్ల అవుతుందా అని ఎలాగోలా ఎత్తుకుని డోర్ క్లోజ్ చేసి పైకివచ్చి బెడ్ పై ప్రక్కప్రక్కనే పడుకోబెట్టాము . చెల్లి టాబ్లెట్స్ డ్రింక్ తాగించి AC on చేసి భుజాలవరకూ దుప్పటి కప్పి , బెడ్ ప్రక్కనే టేబుల్ పై 3 వాటర్ బాటిల్స్ ఉంచి లైట్స్ ఆఫ్ చేసివచ్చి , చెల్లి బెడ్రూం లో హాయిగా నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్యకు గుడ్ నైట్ కిస్ ఇచ్చి హాల్లోకివచ్చి చెల్లి అందించిన కూల్ వాటర్ తాగి గుడ్ నైట్ చెప్పి సోఫాలో వాలిపోయాను .

తెల్లవారకముందే చెల్లి లేచి కృష్ణగాడు చదువుతుంటే లవ్ యు అని బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్యను ఎత్తుకునివచ్చి నా ప్రక్కనే ఉన్న ఊయలలో పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి గెస్ట్స్ కోసం మజ్జిగ రెడీ చేసి మాంచి టిఫిన్ రెడీ చెయ్యసాగింది .
మా బుజ్జిఅక్కయ్య కాలి గజ్జెల చప్పుడుకు నిద్రలేచి ప్రక్కనే ఊయలలో ఉండటం చూసి పెదాలపై చిరునవ్వుతో బుగ్గపై ముద్దుపెట్టి , రేయ్ మామా ......... అక్కయ్య లెచేంతలో స్నానం చేసొస్తాను సోఫాలో చదువుకో అనిచెప్పాను .
రేయ్ మామా ......... లేచేసమయం అయ్యింది . రాత్రి కూడా ఒకసారి లేచింది నువ్వు లేవని తెలుసుకుంది ఇప్పుడు కనిపించకపోతే రణరంగమే తొందరగా అనిచెప్పాడు . 
15 మినిట్స్ రా మామా అని గెస్ట్ రూంలోకివెళ్లి ఫ్రెష్ అయ్యి రావడం , బుజ్జిఅక్కయ్య ఏడుపు వినిపించడంతో పరుగునవచ్చి గుడ్ మార్నింగ్ అక్కయ్యా ......... అంటూ ఎత్తుకుని ముద్దుపెట్టగానే నవ్వడంతో , కృష్ణగాడు హమ్మయ్యా అనుకున్నాడు . చెల్లి వంట గది డోర్ దగ్గర నుండి చూసి నవ్వుతూ లోపలకువెళ్లిపోయింది .

గదిలో లేచినట్లు పిన్నీ బెడ్ కాఫీ ........ అని ఇద్దరి కేకలూ మరియు నేనూ ఇక్కడే ఉన్నాను ఏంజెల్స్ అని పిన్నిగారి మాటలు వినిపించడంతో , అన్నయ్యా ......... నేను చూసుకుంటాను అని మూడు గ్లాస్ ల మజ్జిగతో రూంలోకివెళ్లింది . గుడ్ మార్నింగ్ స్వప్న , ప్రసన్నా , మిమ్మల్ని మేడం అని పిలుస్తాను........... ఇప్పుడు మీకు కావాల్సింది కాఫీ కాదు అని గ్లాస్ లు అందించి నవ్వుతోంది చెల్లి .
ఒకరినొకరు చూసుకుని అంటే రాత్రి మేము అంటూ ముఖమంతా చెమటలు పట్టేసాయి . 
స్వాతి......... మీకు తెలియకుండా తాగారు , ఇందులో మీ తప్పేమీ లేదు .
మీరు .......... కృష్ణ అక్కయ్య కదూ ,
జస్ట్ కృష్ణ అని పిలవండి చాలు , ముందు మజ్జిగ తాగండి అనిచెప్పడంతో తాగి చుట్టూ చూస్తుంటే , 
అవును మీరు మా ఇంట్లోనే ఉన్నారు . మీ పిన్నిగారి పెంపకాన్ని వేలెత్తిచూపకూడదు అని మా అన్నయ్య మిమ్మల్ని ఎత్తుకునివచ్చి పడుకోబెట్టారు .
అక్కయ్యా .......... కృష్ణ ........ అంటూ లేచివచ్చి చెల్లి చేతులను ఇద్దరూ అందుకొని , మాకు మందు అలవాటు లేదు మాకున్న ఒకేఒక మంచి మరియు చెడ్డ వ్యసనం మహేష్ మాత్రమే ...........
నాకు , అన్నయ్యకూ కూడా తెలుసు స్వాతి , ప్రసన్నా .......... ఇప్పుడెలా ఉంది అని బుగ్గలపై స్పృశిస్తూ అడిగింది .
లవ్ యు కృష్ణ అని ఇద్దరూ చెరొకవైపు చెల్లిని చుట్టేసి , కృష్ణా .......... ఈ ఇంట్లోకి అదే మా దృష్టిలో దేవాలయం లోకి ఇలానే అడుగుపెట్టాలని కోరిక ఉంది అని చెవిలో గుసగుసలాడారు .
లవ్లీ ......... ఇప్పుడే తీసుకొస్తాను అని చెల్లి తన రూంలోకి వెళ్లి కొత్త పట్టుచీరలనూ , నగలనూ మరియు కావాల్సినవన్నింటినీ తీసుకొచ్చి ఇచ్చింది . 
అక్క .......... కృష్ణా , నువ్వూ పిన్నీనే కట్టించాలి అనిచెప్పారు .
మీరు తలంటు స్నానం చేసి ఒక కేకవెయ్యండి వచ్చేస్తాను అని వంట గదిలోకి వెళ్ళింది.

గంట తరువాత స్వాతి స్నానం చేసి బాత్రూమ్లోనే లంగా జాకెట్ వేసుకుని బయటకువచ్చి కృష్ణా అని పిలవడంతో స్టవ్ ఆఫ్ చేసి వెళ్లి పట్టుచీర కట్టించేలోపు ప్రసన్నా వచ్చింది తనకూ కట్టించి లైట్ మేకప్ నగలతో దేవకన్యల్లా రెడీ అయ్యి బయటకువచ్చారు .
అన్నయ్యా , రేయ్ ......... ఎలా ఉన్నారు . చెప్పలేదు కదా మా వారు కృష్ణ అని పరిచయం చేసింది చెల్లి .
రాత్రి మోడరన్ గా వచ్చి ఇప్పుడు దేవకన్యలైపోయారు చెల్లెమ్మలూ సూపర్ అన్నాడు.
రేయ్.......... 
ఎస్క్యూస్ మీ చదువుకోవాలి బై అని రూంలోకివెళ్లిపోయాడు .
నేను వాళ్ళవైపు చూడను కూడా చూడకుండా బుజ్జిఅక్కయ్యను నవ్విస్తున్నాను .
కృష్ణా ......... అంటూ నిరాశతో తలదించుకున్నారు . 
బుజ్జి అక్కయ్య అని హింట్ ఇచ్చి , నాకూ వంట గదిలో పని ఉంది అని చెల్లీ , కృష్ణా నేను సహాయం చేస్తాను అని పిన్ని గారు వెళ్లారు .

బుజ్జిఅక్కయ్యను ఎలా మరిచిపోయాము అని ఒకరికొకరు బుగ్గలపై సున్నితంగా కొట్టుకుని నా ఎదురుగావచ్చి నిలబడ్డారు . 
ఇద్దరినీ చూసి కొన్నిక్షణాలు కళ్ళు కొట్టుకోలేదు . వెంటనే బుజ్జిఅక్కయ్య వైపు దించేసాను . 
ఇద్దరూ నవ్వుకుంటుంటే ,
మేడం కూర్చుంటారా అని లేవబోయాను .
నో నో .......... మహేష్ అంటూ నాకు చెరొకవైపు కూర్చున్నారు . స్వచ్ఛమైన వాళ్ళ పరిమళం నన్ను ముగ్ధున్ని చేసేస్తుంటే , ఇద్దరూ నవ్వుకుని మహేష్ ........... నువ్వు చెబితేకానీ బుజ్జి బంగారు అక్కయ్య ఎవ్వరిదగ్గరకూ వెల్లదట కదా , మాకు మా బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా ఎత్తుకోవాలని ఆడించాలని ఆశగా ఉంది please మహేష్ ..........
అక్క......య్యా ......... ఇద్దరూ చిన్న మేడం వాళ్ళు , 
మహేష్ ......... మా పేర్లు కూడా చెబితే , అదే బుజ్జిఅక్కయ్యకు తెలియాలి కదా అని లోలోపలే మురిసిపోతూ చెప్పారు .
అక్కయ్యా ......... స్వాతి మేడం , ప్రసన్నా మేడం అని అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి స్వాతికి అందించాను .
స్వాతి కన్నుకొట్టడం ఆలస్యం స్వాతి ప్రక్కనవెళ్లి కూర్చుని నేను ముద్దులుపెట్టిన చోటనే అక్కయ్య బుజ్జి బుజ్జి బుగ్గలపై ముద్దులుపెడుతూ నా కళ్ళల్లోకే చూస్తున్నారు .
అమ్మా ......... ఇలా దొరికేసాను ఏంటి అని అటువైపు తిరిగాను . 

అక్కయ్యా ........... మేము నచ్చామా అని అడిగారు . అక్కయ్య కాళ్ళూచేతులూ కదిలించడంతో స్వాతి ...... ప్రసన్నా ....... యాహూ అని ముద్దులతో ముంచెత్తి , అక్కయ్యా ఈరోజు నుండీ మీతోనే ఉండిపోవాలని ఉంది . రోజూ ఉదయమే లేచాక గుడ్ మార్నింగ్ - స్నానం చేయిస్తాము - మీ అమ్మ అదే మీ పెద్ద అక్కయ్యతోపాటు కాలేజ్ కు వస్తాము - కాలేజ్ లో ఆడిస్తాము - ఇంటికివచ్చాక ఎంజాయ్ చేద్దాము - మీ మమ్మీ అలసిపోయినప్పుడు రాత్రంతా మాతోనే పడుకోబెట్టుకొని కంటికి రెప్పలా చూసుకుంటాము ........... ఇంకా ఇంకా రోజూ ఒక గిఫ్ట్ , బొమ్మ , టెడ్డీ బేర్ ......... మీ పెద్ద తమ్ముడి కంటే లేదు లేదు అంతలా కాదు try చేస్తాము మా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని గుండెల్లో దాచుకుంటాము . మీకు ఇష్టమైతే చిన్న నవ్వు నవ్వమని గుండెలపై హత్తుకొని బుజ్జిఅక్కయ్య కళ్ళల్లోకే చూస్తూ నేనంటే ఎంత ప్రాణమో తెలియజేస్తున్నారు .
బుజ్జిఅక్కయ్య సమాధానం కోసం వంట గది డోర్ దగ్గర చెల్లీ , పిన్ని గారు - బెడ్రూం దగ్గర కృష్ణగాడు మరియు మెయిన్ డోర్ దగ్గర 8 కళ్ళు , 8 చెవులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి .
అక్కయ్య వైపు తిరిగి వద్దు అనేంతలో , అక్కయ్య ........... చిరునవ్వు కాదు ఏకంగా గట్టిగా నవ్వుతూ కాళ్లు చేతులూ కదిలిస్తూ స్వాతి , ప్రసన్నా చీరలను టచ్ చెయ్యడంతో , 
ఇద్దరి కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అని ప్రాణం కంటే ఎక్కువగా ఇద్దరూ ముద్దులతో ముంచెత్తి తమకు ఊహతెలిసినప్పటినుండీ అనుభవించనంత సంతోషాన్ని ఆఆస్వాధిస్తుంటే , 
చెల్లీ , పిన్ని గారు , కృష్ణగాడు సంతోషంతో కేకలువేస్తూ చప్పట్లు కొట్టడం , నేను చూడగానే లోపలకు తుర్రుమన్నారు .
మెయిన్ డోర్ దగ్గర సర్ మేడం వాళ్ళు సంతోషంతో చప్పట్లు కొట్టి 8 పెద్ద పెద్ద లగేజీలను లాక్కుని లోపలికివచ్చి , స్వప్న - ప్రసన్నా ......... మీరేనా నమ్మలేకపోతున్నాను . 
Yes dad ......... కృష్ణ ఇలా రెడీ చేసింది అని బుజ్జిఅక్కయ్యతో లేచి మేడం వాళ్లదగ్గరికి వెళ్లారు .
లేచి సర్ ......... గుడ్ మార్నింగ్ కూర్చోండి అనిచెప్పాను .
జీవితంలో మరిచిపోలేని గుడ్ మార్నింగ్ ఇచ్చిన మా మొదటి కూతురు కృష్ణ థాంక్స్ తల్లీ ......... అని నా చేతిని అందుకొని వాళ్ళమధ్యలో కూర్చోబెట్టుకున్నారు .

మహేష్ ........ముందుగా నిన్ను అడగాలి , నువ్వు కాదనవని లగేజీ తెచ్చేసాము . స్వాతి - ప్రసన్నా ..........
సర్ అర్థమైంది చెల్లికి , బుజ్జిఅక్కయ్యకు ఇష్టమే ......... తొంగి తొంగి దొంగలా చూస్తున్నాడే వాడికి ఇష్టమే అనగానే , ఏరా మామా పిలిచావా hi సర్ గుడ్ మార్నింగ్ అంటూ జేబుల్లో చేతులుపెట్టుకుని వచ్చాడు . వాళ్ళ ముగ్గురికీ ఇష్టమైతే నాకూ ఇష్టమే ,
నా మాటలకు అందరూ మురిసిపోతున్నారు .
కానీ నామీద ఆశపడటం సమయాన్ని వృధా చేసుకోవడం మాత్రమే , చిన్న మేడం వాళ్ళు మన కంపెనీని మరింత ఎత్తుకు తీసుకెళ్లగల సమర్థులు . ఒక్కరోజులోనే వారి గురించి తెలుసుకున్నాను . సో .........ఏది మంచో ఏది చెడో మాకంటే మీకే బాగా తెలుసు , వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అనిచెప్పాను .

సర్ ......... బదులిచ్చేలోపు , మేడం ముందు టిఫిన్ చేద్దాము అని వాళ్ళవైపు కన్నుకొట్టి అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్లింది చెల్లి . స్వాతి ప్రసన్నాను వంట గదిలోకి తీసుకెళ్లి ఇప్పుడు చెప్పండి మా అన్నయ్యను గెలుస్తాము అని నమ్మకం మీకుందా అని అడిగింది .
కృష్ణా ......... అక్కయ్య , బుజ్జిఅక్కయ్య సేవచేసుకోవడం కోసమా మాత్రమే వచ్చాము అని బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , ఇక అంతా పైవాడి దయ . మహేష్ ఆ పర్నిషన్ ఇచ్చేసారు అదిచాలు మాకు ,బయటకు చెప్పడం లేదుకానీ ఫుల్ హ్యాపీ కృష్ణా అని చెరొకవైపు హత్తుకున్నారు . ఆ దృశ్యాన్ని చూసి మేడం వాళ్ళు ఆనందబాస్పాలతో మొదట బుజ్జిఅక్కయ్యకు తరువాత నలుగురిని హత్తుకొని పొంగిపోయారు .
అన్నయ్యా , సర్ వాళ్ళు టిఫిన్ కోసం ఎదురుచూస్తుంటారు అని అన్నింటినీ తీసుకువచ్చారు . కృష్ణా ........ మాకు తెలుసులే తినిపించు మేము వడ్డిస్తాము అని అందుకున్నారు .
మహేష్ .......... నన్ను క్షమించావు కదూ అని పిన్నిగారు అడిగారు . 
చిరునవ్వుతో సమాధానం ఇవ్వడంతో , థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అని సర్ వాళ్లకు వడ్డించారు .
ఆరోజు నుండీ మా బుజ్జిఅక్కయ్యను వాళ్ళుచెప్పినట్లుగానే కంటికి రెప్పలా చూసుకున్నారు . నేను ఆఫీస్ కు , కృష్ణగాడు లైబ్రరీ మరియు ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు వాళ్లే చెల్లితోపాటు కాలేజ్ కు వెళ్ళేవాళ్ళు .
Like Reply
అలా రోజులు గడిచిపోతున్నాయి . అమ్మావాళ్ళు ఒకరోజు కాన్ఫరెన్స్ కాల్ చేసి మీ బుజ్జిఅక్కయ్య నామకరణ సమయం ఆసన్నమయ్యింది మహేష్ అని చెప్పారు . 
అమ్మలూ ఇలా ప్రతి సాంప్రదాయాన్ని గుర్తుచేస్తూ ఉండండి , నెక్స్ట్ మంత్ అక్కయ్య పుట్టినరోజు కదా ......... ఆ రోజు ఫంక్షన్ పెట్టుకుందాము . బస్ లో వస్తారా లేక ట్రైన్ బుక్ చెయ్యమంటారా అని అడిగాను .
ప్రతిసారీ బస్ లో వచ్చాము , ఈసారి ట్రైన్ మహేష్ అని అమ్మావాళ్ళు సంతోషంతో చెప్పడంతో , చెల్లికి కృష్ణగాడికి విషయం చెప్పాను . 
అన్నయ్యా మీ ఇష్టం అమ్మావాళ్ళ ఇష్టం అని సంతోషించారు .
  ఆరోజే చెల్లినీ స్వాతి ప్రసన్నాలను కాలేజ్ లో వదిలి బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి మీకు మీ పేరుని పెట్టాలని మీ అమ్మావాళ్ళు ( అమ్మమ్మా వాళ్ళు ) కాల్ చేశారు . మన అక్కయ్య పుట్టినరోజు నాడే మా బుజ్జిఅక్కయ్య నామకరణోత్సవం అని నవ్వించి , రైల్వేస్టేషన్ కు వెళ్లి ఊరిజనమంతటికీ బల్క్ రిజర్వేషన్ చేయించాను .

స్వాతి - ప్రసన్నా .......... అక్కయ్య పుట్టినరోజు నాడే మీ ప్రియమైన మహేష్ పుట్టినరోజు కూడా కానీ అక్కయ్యను చేరేంతవరకూ జరుపుకోను అని శపథం చేశారు. ఆరోజు విష్ కూడా చేయకండి గుర్తుపెట్టుకోండి అనిచెప్పింది .
రోజులు పరుగులు తీయడం ఫంక్షన్ రోజున అమ్మావాళ్ళు , విశ్వ సర్ వాళ్ళు , పెద్దయ్యా మరియు ఊరిజనమందరి సమక్షంలో మా బుజ్జిఅక్కయ్యను నా ఒడిలో పడుకోబెట్టుకొని సాంప్రదాయబద్ధంగా నామకరణోత్సవం ఘనంగా నిర్వహించాము .
తరువాత రోజు నుండి కూర్చోవడం బుజ్జిబుజ్జి కేకలు వెయ్యడం 11 నెలలో తొలిసారి చెల్లి చేతులతో లేచి నిలబడటం . తన ఫస్ట్ బర్త్డే రోజున సొంతంగా నిలబడి బుడి బుడి అడుగులు వెయ్యడం . తొలి పుట్టినరోజును అంగరంగవైభవంతో అందరి సమక్షంలో జరిపించడం , అమ్మావాళ్ళు అమ్మా అమ్మా ......... అని పలుకమని చెప్పిస్తుంటే ......
అత్తా అనికాక , అమ్మా అని కాక తమ్ము.........అనడంతో , అందరూ సంతోషమైన ఆశ్చర్యంతో నావైపు చూడటం . అమ్మ ఓడిలోనుండి బుడి బుడి అడుగులు వేస్తూ వచ్చి నా గుండెలపై వాలిపోవడంతో , నాకు తెలియకుండా కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేసాయి . నేను ఏడుస్తున్నాను అని బుజ్జి బుజ్జి చేతులతో తుడవటం చూసి అందరూ చప్పట్లతో పరవశించిపోవడం . మా బుజ్జి అక్కయ్యకు నేనంటే ప్రాణం అని గుండెలపై హత్తుకొని మురిసిపోవడం ఇలా ప్రతి జ్ఞాపకాన్ని చెల్లీ , స్వాతి , ప్రసన్నా ఫోటో వీడియోలతో చిత్రీకరించి ఉంచారు .

చెల్లి ఫైనల్ ఇయర్ exams మరియు కృష్ణగాడి ప్రిలిమ్స్ పూర్తయ్యాక కారులో ఇంటికి వెళుతుంటే బయటకు చూస్తూ ఎంజాయ్ చేసేది . పార్క్స్ , ఫిల్మ్ సిటీ , wonderland .......... ఇలా వారానికొకదానికి వెళ్లి మా బుజ్జిఅక్కయ్య సంతోషాన్ని చూసి మురిసిపోయేవాళ్ళము.

చెల్లి రిజల్ట్స్ రావడం ఫైనల్ ఇయర్ కూడా యూనివర్సిటీ టాప్ రావడం , యూనివర్సిటీ వాళ్ళు గోల్డ్ మెడల్ తో సత్కరించటం - మా అన్నయ్య అండ్ my హస్బెండ్ గర్వపడుతుండటం చూడటం కోసం  సంవత్సరాలు ఎదురుచూసాను లవ్ యు ......... పేదవాళ్లకు ఖర్చులేని ఖరీదైన వైద్యం అందించడమే లక్ష్యం అంటూ మొదలెట్టిన స్పీచ్ కు అందరూ నీరాజనాలు పలకడం జీవితంలో మరిచిపోలేని రోజు.
కృష్ణగాడి మెయిన్స్ ప్రిపరేషన్ చెల్లి డిస్టెన్స్ లో MD లలో మళ్లీ బిజీ అయిపోయాము .

కృష్ణగాడి మెయిన్స్ exam రోజున రెడీ అయ్యి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని అక్కయ్య ఫోటో దగ్గరికివెళ్లి , అక్కయ్యా ........ మీ కోరికను తీర్చే రోజు వచ్చింది అనిచెప్పి , బుజ్జిఅక్కయ్యను స్వాతికి అందించి , రేయ్ మామా కృష్ణ అని ఇద్దరినీ హత్తుకున్నాడు .
All the best రా మామా , కృష్ణ , all the best అన్నయ్యా .......... అని స్వాతి , ప్రసన్నా కూడా చెప్పాడు . అందరమూ రెండు కార్లలో సెంటర్ చేరుకుని సంతోషంతో పంపించాము .
వాడు రాత్రీ పగలూ తేడాలేకుండా కష్టపడి ప్రిపేర్ అయ్యాడు . ఇక మీరే చూసుకోవాలి అని అక్కయ్యనూ అమ్మవారినీ ప్రార్థించి , వాడి పెదాలపై చిరునవ్వు చూడటం కోసం బుజ్జిఅక్కయ్యతోపాటు ఆశతో ఎదురుచూస్తున్నాము . బుజ్జిఅక్కయ్య చిరునవ్వే మాకు ఊరటనిస్తోంది .
లాంగ్ బెల్ మ్రోగడం అందరితోపాటు కృష్ణగాడు పరుగునవచ్చి నామీదకు ఎగరడం చూసి బుజ్జిఅక్కయ్య ఆపకుండా నవ్వుతూనే ఉంది . బుజ్జిఅక్కయ్యా ......... ఇది కేవలం నీ సక్సెస్ అని ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి , రేయ్ మామా ఇక ఇంటర్వ్యూ రా అని ఆరోజు చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకున్నాము .

కంపెనీ సౌత్ ఇండియా నెంబర్ వన్ స్థానానికి చేరి లెక్కలేనన్ని అవార్డులతో అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదుగుతోంది. 

మెయిన్స్ రిజల్ట్స్ రావడం అక్కయ్యా , రేయ్ మామా ....... ఢిల్లీ లో ఇంటర్వ్యూ అనిచెప్పడంతో ,  బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్నా వాడిని అమాంతం పైకెత్తేసాను .
అక్కయ్యా ,  చెల్లెమ్మా ......... ఫ్లైట్ లో అని సైగచేసాను .
అన్నయ్యా ........ స్వాతి ప్రసన్నా కూడా , 
అయితే అందరమూ వెళుతున్నాము అని రెండు రోజుల ముందే చేరుకునేట్లు , కృష్ణగాడు ఫ్రెష్ గా ఉండాలని టికెట్స్ బుక్ చేసాను .
లవ్ యు లవ్ యు sooooo మచ్ కృష్ణ అని హత్తుకొని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తారు .

సర్ మేడం వాళ్ళు ఎయిర్పోర్ట్ కు వచ్చిమరీ కృష్ణగాడికి all the best చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చారు . సర్ ......... చెల్లెళ్లను కలవడమే తగ్గించేశారు . 
దేవుడు ఉన్న దేవాలయంలో , ప్రాణంలా చూసుకునే మా పెద్దకూతురు ఉండగా , అయినా వాళ్ళు మా పిల్లలు కాదు మీ చెల్లెళ్ళు అంతే , చుట్టపు చూపు చూసిపోతాము మేము . 
రేయ్ వింటున్నావా ......... , 
లేదు రా మామా అని పెదాలపై చిరునవ్వుతో , అక్కయ్యా ......... వాళ్ళు రారంట మనమే వెళదాము పదా అని లోపలికివెళ్లిపోయి ఫ్లైట్ లో కూర్చున్నాను . 
కృష్ణా ......... మహేష్ నవ్వాడు అని మురిసిపోయారు .
సర్ , మేడం వాళ్లకు బై చెప్పి , స్వాతి ప్రసన్నా .......... తొలిసారి కదా భయం వేస్తోంది.
కృష్ణా .......... మా అన్నయ్యను గట్టిగా పట్టేసుకోండి , ఒక్కసారి గాలిలోకి ఎగిరిందంటే తేలిపోతున్నట్లు హాయిగా ఉంటుంది .
చెల్లెళ్ళూ ......... నాకూ ఫస్ట్ టైం , నాకు కూడా భయం వేస్తోంది . 
అన్నయ్యా ....... అలా అయితే కృష్ణను గట్టిగా పట్టుకోండి అని నవ్వుతూ చెక్ ఇన్ అయ్యి చెల్లీ , కృష్ణగాడు ఒకదగ్గర ......... ప్రసన్నా వచ్చి నాచేతిలోని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని మహేష్ ఇటువైపు వస్తావా ....... నేను విండో లోనుండి చూపిస్తాను అనిచెప్పడంతో లేచి చివరి సీట్లో కూర్చోబోతుంటే , 
మహేష్ ఈ సీట్ నాది ..........
మరి నేను ........
మధ్యలో కూర్చో అని నవ్వుతూ ఇద్దరూ ఒకేసారి చెప్పారు .
మరి మీరు భయపడుతున్నట్లు నటించి నన్ను నలిపెయ్యరాదు .
అన్నయ్యా ........ అక్కయ్య స్వయంగా వచ్చి మిమ్మల్ని టచ్ చెయ్యమని చెప్పేంతవరకూ మిమ్మల్ని తాకనైనా తాకమని ప్రామిస్ చేశారు . మీరు దైర్యంగా కూర్చోవచ్చు అని చెల్లి చెప్పడంతో , స్వాతికి sorry చెప్పి కూర్చున్నాను .
మహేష్ ........ నువ్వు sorry చెప్పినా ఇష్టమే - థాంక్స్ చెప్పినా ఇష్టమే - లవ్ యు చెబితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు - తిట్టినా ఇష్టమే - కొట్టినా ఇష్టమే .........
ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది .
కృష్ణ , అన్నయ్యా ......... ఎలా ఉంది అని అడిగారు .
లవ్లీ లవ్లీ స్వాతి , ప్రసన్నా ..........సూపర్ experiance .

స్వాతి ప్రసన్నా ......... అక్కడ ఆఫీస్ లో మీకు మంచి భవిష్యత్తు ఉంది . ఏమీలేని ఇక్కడ ఎందుకు వృధా చేసుకుంటారు .
మహేష్ ........నువ్వు ఇలా చెప్పినా ఇష్టమే , మనిషి ఏమిచేసినా సంతోషం కోసమే కదా ,
అవును ........
మీతో , మా బుజ్జిఅక్కయ్యతో గడిపిన ప్రతీ క్షణం ఇప్పటివరకూ గడిపిన సంతోషానికి వంద వెయ్యి రెట్లు ........ మాకు ఈ సంతోషమే కావాలి . దేవాలయాన్ని మా దేవుణ్ణీ వదిలి వెళ్లడం అంటే మా ప్రాణాలను వదిలెయ్యడమే ..........
స్వాతి , ప్రసన్నా ......... please ఇంకెప్పుడూ అలా మాట్లాడకండి , మీరు సంతోషంతో ఉంటే మాకూ సంతోషమే .......
సూపర్ గా చెప్పారు అన్నయ్యా ......... లవ్ యు sooooo మచ్ అని ఫ్లైయింగ్ కిస్ వదిలి కృష్ణగాడి చేతిని చుట్టేసింది .

బుజ్జిఅక్కయ్యను స్వాతి , ప్రసన్నాలు అటూ ఇటూ మార్చుకుంటూ నవ్విస్తూ మేఘాలను చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . ఢిల్లీ చేరుకోగానే సర్ వాళ్ళు మొత్తం ఏర్పాట్లు చేసినట్లు రిసీవ్ చేసుకుని సర్ మీరు ఢిల్లీ లో ఉండేంతవరకూ మీ దగ్గరే ఉంటాను ఎక్కడికీ తీసుకువెల్లమంటే అక్కడకు తీసుకెళతాను అని నెంబర్ ఇచ్చి హోటల్ కు తీసుకువెళ్లారు . అక్కడకూడా మహేష్ , కృష్ణ ......... అంటూ స్వాగతం పలికి how many rooms సర్ అని అడిగారు .
నేను త్రీ అని చెల్లీ two అని నవ్వుకుంది . Ok three రూమ్స్ with attached డోర్స్ అని ప్రసన్నా చెప్పడంతో , 
లవ్లీ ఐడియా ప్రసన్నా అని చుట్టేసి వెళ్లి వేరు వేరు రూంలలో ఫ్రెష్ అయ్యాము . 
Attached డోర్ తీసుకుని చెల్లి రూంలోకివెళ్లి కుందనపు బొమ్మలా రెడీ అయిన అక్కయ్యను ఎత్తుకుని , రేయ్ మామా .........ఇంటర్వ్యూ కు ప్రిపేర్ అవ్వాలా అని అడిగాను .
లేదురా ......... డైరెక్ట్ వెళ్లడమే , నేనెప్పుడో రెడీ ప్రశాంతంగా మా బుజ్జిఅక్కయ్యతో ఎంజాయ్ చేయడమే అనిబదులివ్వడంతో , అయితే సిటీ మొత్తం చుట్టేయ్యడమే అని ఇండియా గేట్ , లోటస్ టెంపుల్ , కుతుబ్మినార్.......... ఇలా రెండు రోజులు ఎంజాయ్ చేసాము .

ఇంటర్వ్యూ రోజు సమయానికి రెడీ అయ్యి అక్కడకు చేరుకున్నాము . అందరూ all the best చెప్పారు .
రేయ్ మామా అంటూ కౌగిలించుకుని హత్య గురించి అడిగితే నిజం చెప్పు ఏమీ పర్లేదు , నిన్ను IPS గా చూడాలి అనిచెప్పాను .
రేయ్ మామా ........ నా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ అక్కయ్య మీద నిందపడనివ్వను , అలా వచ్చే IPS నాకు వద్దురా ......... అక్కయ్య కోరిక నన్ను సెక్యూరిటీ అధికారి గా చూడాలని ఇది రాకపోతే SI exam రాస్తాను అదీ రాకపోతే కానిస్టేబుల్ అవుతానురా అని ఉద్వేగంతో చెప్పి , లవ్ యు రా మామా అని కౌగిలించుకుని , స్వాతి గుండెలపై ఉన్న బుజ్జిఅక్కయ్య నుండి ముద్దు అందుకొని , నా పర్సులోని అక్కయ్య ఫోటోని చూసి పెదాలపై చిరునవ్వుతో లవ్ యు బుజ్జిఅక్కయ్య , లవ్ యు రా , లవ్ యు కృష్ణ , లవ్ యు చెల్లెళ్ళూ .........అని అందరినీ ఒకేసారి విశాలంగా చేతులను చాపి కౌగిలించుకుని ఉత్సాహంతో వెళ్ళాడు .

 గంట తరువాత కృష్ణగాడిని లోపలికి పిలిచారు . హుందాగా లోపలికివెళ్లి 10 మంది ఆఫీసర్స్ ముందు నిలబడ్డాడు . ఫార్మాలిటీస్ తరువాత you have selected for IAS IPS IFS ......... which one you choose అని అడిగారు .
నా గోల్ నా aim IPS ........ అని బదులిచ్చాడు .
ఇక ప్రశ్నల వర్షం కురిపించారు . 
రేయ్ మామా ......... నీ గురించే , నువ్వు మన ఊరికి చేసిన మంచి గురించే , village పరిస్థితుల గురించే అడుగుతున్నారురా అని తలుచుకుని చకచకా సమాధానాలు చెప్పాడు .
గ్రేట్ ..........
 కృష్ణగాడి స్ట్రేంగ్త్ మరియు వీక్ నెస్ అంచనా వేయడానికి నేరుగా పాయింట్ కు వచ్చేసారు 9 years జైల్లో ఉన్నావు ఆ హత్య నువ్వే చేశావా అని అడిగారు .
Yes సర్ .......... నేనూ నా ఫ్రెండ్ కలిసి చేసాము అని ఏమాత్రం వణకకుండా బదులిచ్చాడు .
We know everything ఒకరు ఇంటర్వ్యూ కు సెలెక్ట్ అయ్యాడు అంటే అతడు పుట్టిన దగ్గర నుండీ మొత్తం డీటెయిల్స్ మాకు వచ్చేస్తాయి . 
We are asking again ........... who killed him .
Me and my ఫ్రెండ్ సర్ .........
If you lie you wont క్వాలిఫై అండ్ జైల్ జీవితం అనుభవించిన వారికి IPS అయ్యే అర్హత లేదు అనిచెప్పారు .
మేమే చేసాము సర్ అని స్ట్రెయిట్ గా చూస్తూ బదులిచ్చాడు .
నీకు శిక్ష వేసిన జడ్జిగారు ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి , we have everything we need ....... నువ్వు వెళ్లొచ్చు అనిచెప్పారు . 
థాంక్యూ సర్ అనిచెప్పి బయటకువచ్చాడు . మాదగ్గరికివచ్చి రేయ్ మామా అంటూ కౌగిలించుకున్నాడు . 
మొత్తం విషయం అర్థమై రేయ్ మామా ........ నీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మన అమ్మవారు ఇస్తారు . రిజల్ట్స్ వచ్చేన్తవరకూ దీని గురించి ఆలిచించకు అని బుజ్జిఅక్కయ్యను అందించి ఈరోజు నుండీ రిజల్ట్స్ date వరకూ హాయిగా అక్కయ్యతో ఎంజాయ్ చెయ్యి , ప్రిపరేషన్ లో పడి ఒక్కరోజు కూడా అక్కయ్యతో స్పెండ్ చెయ్యలేదు అని ఆరోజు నైట్ వరకూ ఢిల్లీలో ఎంజాయ్ చేసి అర్ధరాత్రి హైద్రాబాద్ చేరుకుని హాయిగా నిద్రపోయాము .

కృష్ణగాడు బుజ్జిఅక్కయ్య మాయలో పడిపోయి ఇంటర్వ్యూ గురించి మరిచిపోవడం చూసి ఆనందించాము . రేయ్ మామా ........ బుజ్జిఅక్కయ్యతోపాటు , మేడం వాళ్ళతోపాటు రోజుకొక స్పాట్ కు వెళ్లి ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పాను . 
నువ్వు .........
నేను లేకుండానా అదికూడా బుజ్జిఅక్కయ్యను చూడకుండానా ......... ఆఫీస్ చూసుకుని అటునుండి అటు వచ్చేస్తాను అని బుజ్జిఅక్కయ్య నుండి ముద్దు అందుకున్నాను .
మేము అపార్ట్మెంట్ లోకి వచ్చినప్పటి నుండీ ప్రక్కనే ఖాళీగా ఉన్న ఇంటిలోకి నిన్నొ మొన్నో ఎవరో చేరుకున్నారని , తెల్లవారక ముందు నుండీ ఎవరో పెద్దావిడపై కోపంగా అరుస్తూనే ఉన్నారు అన్నయ్యా చెల్లి చెప్పింది .
ప్రతి ఇంట్లో మామూలే కదా చెల్లీ అని చెల్లి చేతితో టిఫిన్ తింటుంటే మాకు ఆ ఛాన్స్ ఎప్పుడు ఇస్తావు మహేష్ ......... అని నావైపే కన్నార్పకుండా చూస్తున్నారు మేడం వాళ్ళు .
నో నో నెవర్ మేడమ్స్ .......... ఆ ఆలోచనే రానివ్వకండి అనిచెప్పాను .
అయినా మాకు ఇష్టమే మహేష్ అంటూ చెల్లి చేతిలోని ప్లేటులోకి వడ్డించారు .

చెల్లీ గంటలో ఎక్కడ ఉన్నారో కాల్ చెయ్యండి జాయిన్ అయిపోతాను అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్నాను . 
మహేష్ ........ కావాలంటే కిందవరకూ అక్కయ్యతో వెళ్లు మేము వెనుకే వస్తాము అని స్వాతి చెప్పింది .
థాంక్స్ అంటూ బుజ్జిఅక్కయ్యతో మాట్లాడుతూ ముద్దులుపెడుతూ లిఫ్ట్ లో కిందకువెళ్లి సీఆయారు దగ్గర ప్రసన్నాకు అందించాను . 
తమ్ముడూ ......... అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో , కళ్ళల్లో ఆనందబాస్పాలతో దిగి మళ్లీ ఎత్తుకుని గుండెలపై ప్రాణంలా హత్తుకుని , థాంక్స్ స్వాతి థాంక్స్ ప్రసన్నా ....... అక్కయ్యా ......... ఎంజాయ్ చేస్తూ ఉండండి , రాగానే బోలెడన్ని బొమ్మలు తీసుకుందాము అనిచెప్పాను .
లవ్ తమ్ముడూ అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
నాకు రోజూ ఇలాంటి ముద్దులే కావాలి , మాక్కూడా అని స్వాతి , ప్రసన్నాలు నవ్వుతూ చెప్పారు .
లవ్ యు అక్కయ్యా ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను బై అని ముద్దుపెట్టి స్వాతికి అందించి, వాళ్ళు పొంగిపోతూ లోపలికి వెళ్లేంతవరకూ ఉండి ఆఫీసుకు వెళ్లి వర్క్ చూసుకుని చెల్లి కాల్ చేయగానే వండర్ లా చేరుకున్నాను .
తమ్ముడూ .......... అంటూ బుడి బుడి అడుగులు వేస్తూ రావడంతో గుండెలపై హత్తుకొని ఏమేమి ఆడావు అని అడిగాను .

ఎక్కడ అన్నయ్యా ......... మీరు వస్తేనే కానీ ఏదీ వద్దు తమ్ముడు తమ్ముడూ అని ప్రాణంలా అడుగుతూనే ఉంది . 
లవ్ యు అక్కయ్యా ........... ఇక పదా అంటూ ఎత్తుకుని స్లైడ్స్ , పూల్స్ వాటర్ గేమ్స్ ఆడిస్తుంటే , రేయ్ మామా అక్కయ్య మనల్ని ఇలా ఆడించిన రోజులు గుర్తుకువస్తున్నాయిరా - ఇప్పుడు మనం బుజ్జిఅక్కయ్యను ఆడిస్తున్నాము . అక్కయ్యను ఎప్పుడురా కలిసేది అని ఉద్వేగానికి లోనయ్యాడు .
నా.....న్న , తమ్ము.....డూ ......... అంటూ వెళ్లి వాడి కన్నీళ్లను తుడవటం చూసి రేయ్ మామా ........ త్వరలోనే నువ్వు IPS అయిపోతావు . నెక్స్ట్ ఇయర్ చెల్లి డాక్టర్ అయిపోతుంది ఆరోజు అక్కయ్య గర్వపడేలా చేసినరోజు అందరమూ తప్పకుండా కలుస్తాము అనే నమ్మకం ఉందిరా అని చెల్లితోపాటు నలుగురమూ హత్తుకున్నాము .
స్వాతి , ప్రసన్నా కళ్ళల్లో కూడా చెమ్మ చేరింది .

లంచ్ సమయానికి దగ్గరలోని హోటల్ కు చేరుకున్నాము . చెల్లీ ప్రసన్నా స్వాతి బుజ్జిఅక్కయ్యకు పాలు ఇవ్వడానికి కారులోనే ఉన్నారు . రెండు నిమిషాలకే బయటకువచ్చి రేయ్ పాలు తాగడం లేదు . 
కృష్ణా ......... బుజ్జిఅక్కయ్య పెద్దది అయ్యిందికదా , మనతోపాటు చికెన్ బిరియానీ తింటుందేమో అని కృష్ణగాడు ఎత్తుకుని చెప్పడం - అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వడంతో రేయ్ మామా ......... అక్కయ్యకు బిరియానీ కావాలంట అని అందరూ సంతోషిస్తూ లోపలికివెళ్లాము .
అక్కయ్యను నా ఒడిలో కూర్చోబెట్టుకొని ఫస్ట్ ఐస్ క్రీమ్ తెప్పించి తినిపిస్తూ , అందరూ ఆర్డర్ చేసాము .
చెల్లి నాకు తినిపిస్తుంటే చూసి ఆ ......... అని నోరుతెరిచింది . అన్నాన్ని మెత్తగా చేసి కొద్దిగా తినిపించింది .
అందరమూ అక్కయ్య వైపు చూస్తుంటే మ్మ్మ్....మ్మ్మ్......ఆ ...... అని మళ్ళీ నోరుతెరిచింది .
సంతోషంతో కేకలువేస్తూ ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చి మురిసిపోయాము .
చెల్లి చేతిలోని ప్లేటులోకి బుజ్జిచేతిని తీసుకెళ్లి చికెన్ ముక్క అందుకొని నావైపు తిరిగి తమ్ముడూ ..........అని తినిపించింది .
నా కళ్లల్లో ఆనందబాస్పాలతో అక్కయ్యే తినిపించినట్లు తిని ప్రాణంలా బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్నాను .

అక్కయ్యా ........ నాకు నాకు అని కృష్ణగాడు , చెల్లి , స్వాతి ప్రసన్నాలు లేచివచ్చిమరీ నోళ్లు తెరిచారు .
నెమ్మదిగా మరొక ముక్క అందుకొని మళ్లీ నాకే తినిపించడంతో , తియ్యని కోపంతో నువ్వు మీ తమ్ముడు అంతేకదా ఇంకెవరూ వద్దు నీకు అని బుగ్గలపై సున్నితంగా గిల్లేసారు .
కోపంతో వాళ్ళవైపు చూస్తూ తమ్ముడూ ....... అని ముద్దుముద్దుగా పిలుస్తూ నా గుండెలపై దాచుకుంది .
అమ్మను , నాన్నను , మేడం వాళ్ళను కొడదాములే నాకు మాత్రమే తినిపించు అని బుజ్జిఅక్కయ్య బుజ్జి బుజ్జి చేతులతో తింటూ , చెల్లి చేతితో ఇద్దరమూ తింటూ అంతులేని ఆనందంతో పరవశించిపోయాము . 
ఆరోజు నుండి చెల్లి తినిపించిన ప్రతిసారీ బుజ్జిఅక్కయ్య వచ్చి నా ఒడిలో కూర్చుని తింటూ కొద్దికొద్దిగా తినిపించింది .
రాత్రిళ్ళు ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గర , మరొకరోజు నా గుండెలపై , తరువాతి రోజు స్వాతి ప్రసన్నా లతో హాయిగా నిద్రపోయేది .

అన్నయ్యా ......... ప్రక్కింట్లో పెద్దమ్మ ఉంది రోజూ కొడుకు కూతురు భోజనం కూడా సరిగ్గా పెట్టకుండా అనరాని మాటలు అంటూ బాధపెడుతున్నారు . సొంత తల్లిమీదనే చెయ్యి చేసుకున్నాడు అన్నయ్యా ........ చూడగానే చాలా బాదవేసింది . కొన్నిరోజులుగా రాత్రిళ్ళు బయటే పడుకుంటున్నారు అన్నయ్యా ........ , నిన్న వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోకి పిలుచుకునివచ్చాను . ఆకలితో విలవిలలాడిపోతున్నారనుకో , వెంటనే తినేలా చూసాము . పెద్దమ్మకు తన మనవడు మనవరాలు అంటే ప్రాణం , పిల్లలకు కూడా వాళ్ళ నానమ్మ అంటే ప్రాణం ........ వాళ్లకోసం జీవిస్తున్నాను అనిచెప్పింది . అంత బాధలో కూడా కొడుకుని కోడలిని ఒక్కమాటకూడా అనలేదు అన్నయ్యా ...........,
అదేకదా చెల్లీ కడుపుతీపి అంటే , నేనూ రోజూ చూసి కొన్నిరోజులుగా మాట్లాడిస్తున్నాను పెద్దమ్మా ......... ఏమైనా సమస్య ఉంటే నాతో చెప్పండి అని చాలాసార్లు అడిగాను . పెదాలపై చిరునవ్వుతో ఈ వయసులో మతిమరుపుతో చిన్న చిన్న తప్పులు చెయ్యడం మామూలే , దానికి నా పిల్లలు కొప్పాడటంలో తప్పులేదు బాబు అని సమాధానమిచ్చేవారు . అప్పుడప్పుడూ చూసుకోండి . ప్రపంచంలో ఏ తల్లీ ఆకలితో బాధపడకూడదు అనిచెప్పి బుజ్జిఅక్కయ్యతోపాటు వెనుకే చెల్లీ , స్వాతి , ప్రసన్నా లతో ఆఫీస్ కు వెళ్ళడానికి బయటకువచ్చాను .

నాన్నతోపాటు అప్పుడే పోకుండా ఉండి మమ్మల్ని రోపిస్తున్నావు . నా మొగుడు పిల్లలతో సంతోషంగా ఉందామంటే నువ్వొకదానివి ముండమోపిలా అని ఏకంగా చెయ్యిచేసుకుని బయటకు తోసేశారు . నానమ్మ .........నానమ్మ ........ అంటూ పిల్లలిద్దరూ కన్నీళ్ళతో చేతులుచాపి ఏడుస్తుంటే , రేయ్ మీరు లోపలికి వెళ్ళండి తీసుకెళ్లి మళ్లీ వచ్చి ఎక్కడైనా వెళ్లి చావచ్చుకదా అని బలంగా తోసేశాడు .
ఆఅహ్హ్హ్........ అంటూ మెట్లపై పడిపోయేవారే , బుజ్జిఅక్కయ్య చేతిలో ఉండగానే పట్టుకున్నాను . 
అన్నయ్యా , మహేష్ ...... అంటూ ముగ్గురూ వచ్చి పెద్దమ్మా పెద్దమ్మా ........ మీకేమీ కాలేదు కదా అని కుర్చీతీసుకొచ్చి కూర్చోబెట్టి గ్లాస్ లో నీళ్లు అందించారు .
బాధతో , భయంతో నీళ్లుకూడా తాగడం లేదు , వణుకుతుండటం చూసి రేయ్ అంటూ కొట్టడానికి వెళ్లి పిల్లలను చూసి ఆగిపోయి ,
చూడండీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు వాళ్ళు వెళ్లిపోయిక తెలిసినా ప్రయోజనం ఉండదు బాధపడటం తప్ప .........
పిల్లల కోసమైనా .......... అనేంతలో ,
వచ్చాడండీ లోకొద్దారకుడు అంత ఉద్ధరించేవాడివి అయితే నువ్వే బాగోగులు చూసుకో , చెప్పేవాడికేమి వంద చెబుతారు . 
ఏమండీ మనకు పట్టిన దరిద్రం వెళ్ళిపోయింది పిల్లలను తీసుకుని లోపలికి రండి అని సంతోషంతో చెప్పింది ఆమె . పిల్లలు నానమ్మ నానమ్మ ......... మేము నానమ్మ దగ్గరే ఉంటాము అని పరిగెత్తుకువచ్చి పెద్దమ్మను గట్టిగా పట్టుకున్నారు . ఇద్దరూ వచ్చి లాక్కుని లోపలికివెళ్లిపోయి గట్టిగా తలుపులు వేసేశారు .

పిల్లలూ ........అంటూ పెద్దమ్మ కళ్ళల్లో కన్నీళ్ళతో లేచి కిందకు వెళ్లిపోతోంటే , 
పెద్దమ్మా .........మాకు పెద్దగా మా ఇంట్లో ఉంటారా , ఏలోటూ లేకుండా చూసుకుంటాము అని చెల్లితోపాటు అడిగాను .
వద్దు తల్లీ ........ ఎక్కడో ఒకదగ్గర చివరి ఊపిరి వరకూ ఎలాగోలా జీవిస్తాను అని గుండెల నుండి వస్తున్న కన్నీళ్ళతో చెప్పింది .
మా హృదయం చలించిపోయి పెద్దమ్మా ......... మీ ప్రాణమైన పిల్లలను చూడకుండా ఉండగలరా అని అడిగాను .
అందుకే కదా బాబు పిల్లలకు దూరమైన రోజున అంటే ఇప్పుడే నా ప్రాణాలను వదిలేస్తాను . వాళ్లకు దూరంగా వాళ్ళను చూడకుండా నేను ఉండలేను అనిచెప్పారు.
 చెల్లి కళ్లల్లో చెమ్మతో పెద్దమ్మా ........మాతో ఉంటే రోజూ మీ పిల్లలను చూడొచ్చు ఒక్కసారి ఆలోచించండి . ఒక్కరోజు ఉండండి మీకు ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఆపము అని చెల్లీ స్వాతి ఏకంగా పెద్దమ్మ చేతులను అందుకొని లోపలకు పిలుచుకొనివెళ్లి టిఫిన్ తినేలా చూసారు . 
చెల్లీ ......... షాపింగ్ వెళ్లి పెద్దమ్మకు మరియు పెద్దమ్మ రోజూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పిల్లలకు గిఫ్ట్స్ , చాక్లెట్ లు , ఐస్ క్రీమ్స్ ఇచ్చేలా చూసి నేను సాయంత్రం వచ్చేలోపు పెద్దమ్మ పెదాలపై చిరునవ్వుని చూడాలి అనిచెప్పాను .
తమ్ముడూ ........ ఉమ్మా ....... అని బుజ్జిఅక్కయ్య ముద్దుపెట్టడంతో , అంతా నువ్వు పంచిన మంచితనం అక్కయ్యా అని కృష్ణగాడికి అందించి ఏంట్రా అలా ఉన్నావు అని అడిగాను .
Nothing రా మామా ........ have a good day అనిచెప్పాడు . 
అందరినీ జాగ్రత్తగా షాపింగ్ తీసుకెళ్లి తీసుకురా అని కౌగిలించుకుని అక్కయ్యకు ముద్దుపెట్టి చేతిని ఊపుతూ కిందకువెళ్ళాను .

సాయంత్రం వరకూ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ దగ్గరకువెళ్లి వర్క్ చూసుకుని సర్ చాలారోజులయ్యింది మేడం వాళ్ళను చూడటానికి రండి లేకపోతే నేనే పిలుచుకునిరానా అని అడిగాను .
మహేష్ రేపు ఎలాగో కృష్ణకు కంగ్రాట్స్ చెప్పడానికి రావాలికదా .........
సర్ .........
రేపే రిజల్ట్స్ .........
ఓ ఓ ......... అందుకేనా వాడు ఉదయం మూడీగా ఉన్నది అని వెంటనే ఇంటికిచేరుకున్నాను .
పెద్దమ్మను పూర్తిగా మార్చేశారు . పెద్దమ్మ రెండు చేతులతో నమస్కరించడంతో థాంక్యూ sooooo మచ్ అంకుల్ అంటూ పిల్లలిద్దరూ వచ్చి నా పాదాలకు నమస్కరించబోతుంటే ఆపి , పెద్దమ్మా ......... మీరు ఆశీర్వదించాలి అని పాదాలను తాకాను . 
అంకుల్ ......... నానమ్మ ఇంత సంతోషంతో నవ్వడం మేము ఇప్పటివరకూ చూడలేదు అని సంతోషంతో పెద్దమ్మ ప్రక్కనే కూర్చుని నవ్వుతున్నారు .
మీ నానమ్మ ఇచ్చిన గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి అని అడిగాను .
చాలా అంటే చాలా బాగున్నాయి అంకుల్ ......... లవ్ యు నానమ్మా అని చెరొక బుగ్గపై ముద్దులుపెట్టి హత్తుకున్నారు .
మీ సంతోషమే తన సంతోషం పిల్లలూ ......... మీరు ఎప్పుడైనా ఇక్కడకు రావచ్చు , ఏమైనా చెయ్యొచ్చు . 
అంకుల్ వాసంతితో చాలాసేపు ఆడుకున్నాము ఇందాకనే పడుకుంది . వాసంతికి నానమ్మ అంటే కూడా చాలా ఇష్టం , నానమ్మ ఒడిలో కూర్చుని ఆపకుండా నవ్వుతూనే ఉంది .
పెద్దమ్మా ........ ఈ ఇంటికి పెద్దవారు మీరే మమ్మల్ని తిట్టొచ్చు , కొట్టొచ్చు , కొప్పడొచ్చు ఏమైనా చెయ్యొచ్చు .......... మేమంతా మీ పిల్లలే అనిచెప్పాను .

అన్నయ్యా ......... పెద్దమ్మ మధ్యాహ్నం వంట చేశారు అబ్బాబ్బా ........ అమృతం అంతే ,
చెల్లీ ......... అప్పుడే పనులు ........అని మొట్టికాయవేశాను .
బాబు .......... నేనే ఇష్టంతో చేసాను . నువ్వే చెప్పావుకదా నేనే పెద్ద అని నా పిల్లలకోసం ఆ మాత్రం చెయ్యకూడదా .........
పెద్ద హీరోలాగ తిట్టొచ్చు , కొట్టొచ్చు ......... అన్నావుకదా అన్నయ్యా అని చెల్లి నా గుండెలపై వాలిపోయి , పాయసం ఉందీ ........ నోట్లో కరిగిపోయింది అన్నయ్యా , అక్కయ్య అయితే మిమ్మల్ని కూడా మరిచిపోయి తినేసింది అని స్వాతి ప్రసన్నాలతోపాటు నవ్వుతోంది .
చెల్లీ చెబుతుంటేనే నోరూరిపోతోంది ఇంకా ఉందా అని అడిగాను . 
మా ప్రాణమైన అన్నయ్యకు ఉంచకుండా ఉంటామా , ఉండు తెస్తాను అని వంట గదిలోకి వెళుతోంటే , 
తల్లీ కృష్ణా .......... వేడివేడిగా మళ్లీ చెయ్యనా మీ అన్నయ్యకోసం అని పెద్దమ్మ అడిగింది .
పెద్దమ్మా ......... ఈ ఇంటికి పెద్ద మీరేనని అన్నయ్య చెప్పారుగా మీఇష్టం , కాస్త ఎక్కువ చెయ్యండి మాకుకూడా అని ప్రేమతో చెప్పడంతో , 
అలాగే తల్లీ అని స్వాతి ప్రసన్నాలతోపాటు వంట గదిలోకివెళ్లారు . పిల్లలు పడుకున్న బుజ్జిఅక్కయ్యను చూస్తూ నవ్వుతున్నారు .

చెల్లీ ......... మీ ఆయన ఎలా ఉన్నాడు . 
ఉదయం నుండీ మూడీగా ఉన్నారు అన్నయ్యా ........ షాపింగ్ నుండి వచ్చాక బెడ్ పైనుండి లేవలేదు . ఒళ్ళు కూడా కాలిపోతోంది . డాక్టర్ దగ్గరికి వెళదామంటే బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి నన్ను ప్రాణంలా హత్తుకొని తగ్గిపోతుందిలే అని వెళ్లి పడుకున్నాడు .
చెల్లెమ్మా ......... రేపే రిజల్ట్స్ .
అందుకేనా ..........
అవును అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని పిల్లలూ 5 మినిట్స్ గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి అనిచెప్పి చెల్లితోపాటు బెడ్రూం లోకి వెళ్ళాను .
రేయ్ మామా ......... అంటూ వచ్చి బుజ్జిఅక్కయ్యతోపాటు కౌగిలించుకున్నాడు .
రేయ్ మామా .......... నీ కష్టానికి ప్రతిఫలం అక్కయ్యా , అమ్మవారు ఖచ్చితంగా ఇస్తారు . అక్కయ్య కోరికను తీరుస్తావు అని కూర్చోబెట్టి బుజ్జిఅక్కయ్యను అందించాను .
బుజ్జిఅక్కయ్య బుగ్గను పెదాలతో అధిమేసి అక్కయ్య ఫోటో దగ్గరికివెళ్లాడు . 
బుజ్జిఅక్కయ్య బుజ్జి చేతితో అక్కయ్యను తాకి కృష్ణగాడి బుగ్గపై ముద్దుపెట్టింది . 
పెదాలపై చిరునవ్వుతో లవ్ యు అక్కయ్యా ......... మీ ఆశీర్వాదాలు ఉంటే చాలు అని నవ్వడం - అందరూ బయటకువచ్చి పెద్దమ్మ చేతి పాయసం చెల్లి తినిపించింది . 
పెద్దమ్మా ......... అమ్మ గుర్తుకువచ్చింది . చెల్లీ అమ్మకూడా ఇలానే చేస్తుంది తెలుసా అనిచెప్పాను .
కృష్ణగాడి బుగ్గపై ముద్దుపెట్టి నాదగ్గరికివచ్చి నా పై కాకుండా పెద్దమ్మ ఒడిలో కూర్చుని ఆ అని నోరు తెరిచింది . 
షాక్ లో ఉన్న నన్ను చూసి నవ్వుకుని లేచి గట్టిగా గుండెలపై వాలిపోయింది . 
లవ్ యు అక్కయ్యా ......... అని ఆరోజు సోఫాను మినీ బెడ్ గా మార్చి నా గుండెలపైనే పడుకోబెట్టుకున్నాను .
చెల్లీవాళ్ళు పెద్దమ్మ వస్తువులన్నింటినీ గెస్ట్ రూంలోకి మార్చి , పెద్దమ్మా ........ ఈరోజు నుండీ ఇదే మీ గది హాయిగా నిద్రపోండి అని AC on చేసి గుడ్ నైట్ చెప్పి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్లిపోయారు .
కృష్ణ .......... అంటూ వెనుక నుండి హత్తుకొని ముద్దులుపెడుతూ రేపు అక్కయ్య కోరికను తీరుస్తావు అని నిద్రపోయింది చెల్లి .
Like Reply
రిజల్ట్స్ డే కాబట్టి చెల్లీ కృష్ణగాడి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి మరియు స్వాతి ప్రసన్నా లు తెల్లవారుఘామునే లేచి తలంటు స్నానం చేసి హాల్లోకివచ్చి నా గుండెలపై హాయిగా నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్యను చూసి ముగ్గురూ నవ్వుకుని పూజచేసి , మెయిన్ డోర్ తెరిచి పాలప్యాకేట్స్ అందుకొని కాఫీ చేస్తున్నారు .
మా బుజ్జిఅక్కయ్యకు ఎవరో చెప్పినట్లు నామీదనే లేచి కిందకు దిగి బుడి బుడి అడుగులతో మెయిన్ డోర్ దగ్గరకువెళ్లి పేపర్ అందుకునివచ్చి తమ్ముడూ తమ్ముడూ ........... అని పిలుస్తూ లేపుతోంటే , 
స్వాతి మురిసిపోయి మొబైల్ తీసుకొచ్చి వీడియో తీస్తోంది . 
అక్కయ్యా ........ అంటూ లేచి గుడ్ మార్నింగ్ కిస్ గట్టిగా పెట్టాను .
కిందపడిన పేపర్ అందుకొని నాకు అందించింది .
స్వాతి మేడం .......... బయట నుండి నువ్వు తీసుకొచ్చావా అని సంతోషంతో అడిగాను .
మహేష్ ..........లేదే , నీమీద నుండి దిగి మేము డోర్ తెరిచి ఉంటే తీసుకొచ్చినట్లుంది. వాళ్ళ పెద్ద తమ్ముడికోసం ఏమైనా చేస్తుంది అక్కయ్య అని ప్రేమతో ముద్దుపెట్టింది స్వాతి . 

లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మా అక్కయ్య బంగారం అని ఎత్తుకుని నా ఒడిలో కూర్చోబెట్టుకొని హెడ్లైన్స్ చూసి , యాహూ .......... రేయ్ మామా సాధించావురా , చెల్లీ , ప్రసన్నా మేడం రండి అని సంతోషంతో కేకలువేస్తూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని పరుగున వాడి బెడ్రూంలోకి వెళ్లి , రేయ్ రేయ్ ....... ఇంకా దున్నపోతులా నిద్రపోతున్నావా అని లేపాను .
మామా ......... అక్కయ్యా ...........
రేయ్ నీయబ్బా .......... ఓహ్ ........ ఇప్పుడు మీరు IPS కదూ సర్ మమ్మల్ని మన్నించండి అంటూ చెల్లిని వాడిప్రక్కనే కూర్చోబెట్టి , బజ్జుఅక్కయ్య చేతులతో పేపర్ అందించాను .
సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజం టాప్ ర్యాంక్ సాధించి తెలుగు కీర్తిని జాతీయస్థాయిలో నిలబెట్టిన కృష్ణ అని హెడ్లైన్స్ , IAS కు సెలెక్ట్ అయినా law and order కాపాడటం కోసం IPS సెలెక్ట్ చేసుకున్నారు అని చెల్లి చదువుతోంటే , చెల్లితోపాటు కృష్ణగాడి కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యతోపాటు హత్తుకొని లేచివెళ్లి అక్కయ్యా .......... నా తొలి సెల్యూట్ మీకే అని చేసి , మీ కోరిక తీర్చగలనో లేనో అని భయపడ్డాను అక్కయ్యా ......... , మీరు ఇక్కడ ఉన్నా మా తోడుగా ఉన్నారని మరొకసారి ఋజువుచేశారు అని సంతోషాన్ని పంచుకున్నారు .

అన్నయ్యా ........ కంగ్రాట్స్ అని స్వాతి , ప్రసన్నా వాళ్ళు అమితానందంతో చెప్పారు . థాంక్యూ చెల్లెళ్ళూ   ...........
రేయ్ మామా .......... ఇప్పటివరకూ చెప్పలేదు . ఇంటర్వ్యూ లో నిన్ను ఆవహించుకునే నువ్వు చేసిన మంచిపనులనే వివరించానురా .........., నిన్నకూడా ఎవరోకూడా తెలియని పెద్దమ్మలో సంతోషాన్ని నింపావు . పెద్దమ్మా ......... మీ దీవెనలు కూడా ఫలించాయి . నిన్న కాస్త టెన్షన్ లో ఉన్నాను అని పాదాలకు నమస్కరించి , రేయ్ మామా ......... నువ్వు లేకపోతే మేము లేమురా ....... ఈ గౌరవం నీదిరా లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ప్రాణంలా కౌగిలించుకున్నాడు .
మమ్మల్ని చూసి బుజ్జిఅక్కయ్య చప్పట్లు కొడుతుంటే , కృష్ణగాడు ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తాడు .
అన్నయ్యా ......... ఒకసారి వీడియో చూడమని చూపించింది .
చూసి ఆశ్చర్యపోతుంటే..........
అవునురా అక్కయ్యే బుజ్జిఅక్కయ్యతో పేపర్ నాకు చూపించింది . కంగ్రాట్స్ రా మామా .......... అంత కష్టపడిన నీకు రాకుండా ఎవరికి వస్తుందిరా ........
చెల్లి వాడి గుండెలపై వాలిపోయి లవ్ యు రా అని ఏకంగా పెదాలపై ముద్దుపెట్టి సిగ్గుపడుతోంటే ,
మొదట బుజ్జిఅక్కయ్య వెంటనే మేము చప్పట్లతో అభినందించాము .

IPS కృష్ణ congratulations అని సర్ మేడం వాళ్ళు ఏకంగా స్వీట్స్ తో వచ్చేసి తినిపించారు . మాకు ముందే తెలుసుకదా మహేష్ అందుకే మీ మేడం వాళ్ళు స్వయంగా లడ్డూలు చేశారు . 
మేడం వాళ్ళా .......... అంటూ అందుకొని బుజ్జిఅక్కయ్యకు తినిపించి నేనూ తిన్నాను . 
కృష్ణా ......... నీకోసం బయట స్టేట్ , నేషనల్ మీడియా ఎదురుచూస్తోంది త్వరగా ఫ్రెష్ అవ్వు , మహేష్ నువ్వుకూడా ........... మా పెద్దకూతురు తన చెల్లెళ్ళు పట్టుచీరలు కట్టుకుని పూజకూడా పూర్తిచేసినట్లున్నారు అని తలపై సంతోషంతో ఆశీర్వదించివచ్చి సోఫాలలో కూర్చున్నారు .
కృష్ణగాడు రెడీ అయ్యి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని అక్కయ్య ఫోటో ముందువెళ్లి ఆనందంతో బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి రారా మామా సర్ అని కిందకువెళ్లాము .
కృష్ణ కృష్ణ కృష్ణ ........... అంటూ అపార్ట్మెంట్స్ మొత్తం దద్దరిల్లిపోయింది . అన్ని మీడియా ఛానెల్స్ ముందుకూ వెళ్లి సంతోషాన్ని పంచుకుని ఇదంతా నా ప్రాణమైన వీడి వల్ల మరియు మాకు సపోర్ట్ గా నిలిచిన ******* construction కంపెనీ చైర్మన్స్ శివరాం గారు , నారాయణ గారివాళ్లనే అని చెప్పడంతో , వాళ్ళకళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగలేదు . ఆరోజు సాయంత్రం వరకూ మీడియాతోనే సరిపోయింది. చెల్లీవాళ్ళు టీవీలో లైవ్ చూస్తూ పెద్దమ్మా కూర్చోండి అని మధ్యలో కూర్చోబెట్టుకొని మీరు మా జీవితంలో పెద్దదిక్కుగా వచ్చారు . మరింత సంతోషాన్ని పంచారు అని పరవశించిపోయారు .
నేను మళ్ళీ జీవితంలో ఇలా నవ్వుతాను అనుకోలేదు కృష్ణ , స్వాతి , ప్రసన్నా ....... అని చేతులను అందుకొని ముద్దులుపెట్టింది .

 సంతోషంలో ఆ రోజు సాయంత్రం బిర్లా మందిర్ కు వెళ్లివచ్చాము . 
ప్రక్కింటి వ్యక్తి మమ్మల్ని చూసి భయపడుతూ తలదించుకొని వెళుతున్నాడు . హలో బ్రదర్ ......... మావాడి గురించి అన్నీ న్యూస్ ఛానెల్లో చూసి ఉంటారు . సో ఈ క్షణం నుండీ పిల్లలు ఆశపడినవెంటనే వాళ్ళ నానమ్మ దగ్గరికి సంతోషంతో పంపించాలి . రోజుకు కనీసం రెండుసార్లైనా పంపించాలి . పెద్దమ్మకు చూడాలనిపించి పిల్లలూ అని కేకవేసిన మరుక్షణం మా ఇంట్లో ఉండాలి . 
కృష్ణగాడు పిల్లలూ మీ నానమ్మ పిలుస్తోంది రండి అని కేకవేశాడు . 
అంతే ఆయన లోపలికి తుర్రుమని పిల్లలను పంపించాడు .
నానమ్మా ......... అంటూ పరుగునవచ్చి హత్తుకున్నారు . గుడికి వెళ్ళారా అని అడిగారు .
మీ అంకుల్ ........ బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరారు కదా సంతోషంలో గుడికివెళ్లాము అని ప్రసాదం అందించి ముద్దులుపెట్టారు .
అంకుల్ ......... ఏ న్యూస్ ఛానెల్ చూసినా మీరే , కంగ్రాట్స్ అనిచెప్పారు . 
థాంక్స్ పిల్లలూ ......... వాసంతి మా బుజ్జి అన్నయ్యలు ఎక్కడ అని అడిగింది అనిచెప్పాడు .
ఇద్దరూ జాగ్రత్తగా ఎత్తుకుని ఇంట్లోకివచ్చి బొమ్మలతో ఆడించారు . 

రేయ్ మామా ........ వారంలో డెహ్రాడూన్ లో ట్రైనింగ్ 6 నెలలు అనగానే బాధపడుతుంటే , రేయ్ నేనొక్కడినే వెళ్లాలిరా మన బుజ్జిఅక్కయ్య నీతోనే ఉంటుంది అనిచెప్పగానే ,
లవ్ యు రా మామా అని అమాంతం ఎత్తేసి చుట్టూ తిప్పి దించి వెళ్ళి డ్రెస్ తో తిరిగిరా అనిచెప్పాను .
రేయ్ మామా .......... సండే ఉదయం మీరంతా డెహ్రాడూన్ లో ఉండాలి అలా అయితేనే వెళతాను అనిచెప్పాడు . 
శనివారం సాయంత్రమే ఉంటే నీకేమైనా ప్రాబ్లమా అని ఇద్దరమూ సంతోషంతో కౌగిలించుకుని వాటికోసం డెహ్రాడూన్ కు ఫ్లైట్ టికెట్ ఆ వచ్చే శనివారం రోజున స్వాతి, ప్రసన్నాలతోపాటు అందరికీ అప్పుడే బుక్ చేసేసాను . హ్యాపీనా అని వారం రోజుల పాటు సంబరాలు చేసుకున్నాము . అమ్మావాళ్ళు పెద్దయ్య విశ్వ సర్ వాళ్ళు టీవీ పేపర్లో చూసి కృష్ణగాడిని అభినందనలతో ముంచెత్తారు .
వారం తరువాత అందరమూ ఎయిర్పోర్ట్ కు వెళ్ళాము . బుజ్జిఅక్కయ్య చెల్లెమ్మను గుండెలపై హత్తుకొని కూర్చున్న వాడికి వారం రోజులకు సరిపడినన్ని ముద్దులను దారిపొడుగునా ఇవ్వడంతో వాడి ఆనందానికి అవధులు లేవు .

రేయ్ మామా .......... ట్రైనింగ్ ఎంజాయ్ చెయ్యి జాగ్రత్త అనిచెప్పాను . 
లవ్ యు రా మామా .........., బుజ్జిఅక్కయ్య ........ మీ తమ్ముడూ ముగ్గురు చెల్లెళ్ళూ పెద్దమ్మను మీరే చూసుకోవాలి అని ప్రాణమైన ముద్దులుపెట్టి చెల్లికి అందించి బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి వెళ్ళొస్తాను అని ఇద్దరినీ గుండెలపై హత్తుకొని బుజ్జిఅక్కయ్య టాటా చెబుతుంటే మురిసిపోతూ లోపలికివెళ్లాడు .
డెహ్రాడూన్ చేరుకోగానే కాల్ చేసి రేయ్ మామా ప్రయాణం బాగా జరిగింది ఇక్కడ చలి ఎక్కువగా ఉంది , మీరు వచ్చేటప్పుడు వెచ్చదనం కోసం కావాల్సినవన్నీ తీసుకుని రండి అని చలికి వణుకుతూ మాట్లాడాడు . 
రేయ్ మామా .......... accomadation ఎలా ఉంది అని అడిగాను . 
టాప్ స్టాండర్డ్స్ రా మామా .......... నా గురించి ఆలోచించకండి అవసరమైనవన్నీ తీసుకున్నాను అనిచెప్పాడు . 
నైట్ ఇంకా ఎక్కువ చలి ఉంటుంది నీ దేవతతో రొమాంటిక్ గా మాట్లాడు చలి దానికదే ఎగిరిపోతుంది అని చెల్లికి అందించాడు . 
పో అన్నయ్యా ........ అని భుజం పై కొట్టి మొబైల్ అందుకొని బెడ్రూంలోకి తుర్రుమంది.
అక్కయ్యా ......... ఎయిర్పోర్ట్ నుండి వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను మేడం వాళ్ళతోనే ఉన్నావు నా దగ్గరికి రావా అని అడిగాను .
ఊహూ ......... అంటూనే ముసిముసినవ్వులతో రాగానే ఎత్తుకుని నా బంగారం అంటూ గుండెలపై హత్తుకొని మీ నాన్నను పంపించేసాను అని అలిగావా ....... , నాలుగురోజుల్లో వెళతాము కదా , నిన్ను జీవితాంతం సేఫ్ గా చూసుకోవడానికి సెక్యూరిటీ అధికారి డ్రెస్ సాధించి అడుగుపెడతాడు అనిచెప్పాను . 
ఉమ్మా ......... అని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టడంతో , లవ్ యు అక్కయ్యా ........ అని మురిసిపోయాను .

శనివారం ముందురోజు పెద్దమ్మా ......... మీరూ వస్తారా అని అడిగాను .
మహేష్ ......... చలి నావల్ల కాదు అనిచెప్పడంతో , వెంటనే ప్రక్కింటికివెళ్లి మీకు మరొక అవకాశం వచ్చింది . రెండు రోజులు మేము ఊరికివెళుతున్నాము మీ అమ్మవారిని అప్పుడప్పుడూ మాఇంటికివచ్చి పలకరిస్తూ జాగ్రత్తగా చూసుకివాలి . రేపు సండే కాబట్టి పిల్లలు వాళ్ళ నానమ్మ దగ్గరే ఉండాలి ఇందులో ఎటువంటి తేడా జరిగినా ఏమవుతుందో నీకు మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు అనిచెప్పాము .
పెద్దమ్మ దగ్గర పిల్లలను తోడుగా ఉంచి షాపింగ్ వెళ్లి మొదట మా బుజ్జిఅక్కయ్యకు అక్కడ చలి అనేదే తెలియకుండా ఉండటం కోసం చెల్లీ , స్వాతి ప్రసన్నా షాపింగ్ చేసి తరువాత మాకోసం తీసుకున్నారు . 
నెక్స్ట్ రోజు మధ్యాహ్నం పెద్దమ్మకు , సర్ వాళ్లకు వెళ్ళొస్తామనిచెప్పి సాయంత్రానికి డెహ్రాడూన్ చేరుకున్నాము . ఒకటే చలి ఎయిర్పోర్ట్ లోనే స్వేటర్స్ , జర్కిన్స్ వేసుకున్నాము . ఇక్కడ కూడా సర్ వాళ్ళు మాకోసం అన్నీ ఏర్పాట్లూ చేసేసారు . హోటల్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి నేరుగా ట్రైనింగ్ సెంటర్ కు చేరుకున్నాము . 
వాడు బయటకు రావడానికి వీలు లేకపోవడంతో మా అందరినీ పూర్తిగా చెక్ చేసి పంపించడంతో లోపల ఒక హాల్లో కలిసాము . 

మిలిటరీ కటింగ్ టైట్ డ్రెస్ వేసుకుని రావడం చూసి అందరమూ నవ్వుకున్నాము . బుజ్జిఅక్కయ్యను కిందకు దింపగానే నాన్న ........ అంటూ వెళ్ళింది .
నా బంగారుకొండ do you like my hairstyle అని అడిగాడు . 
బుజ్జిఅక్కయ్య నవ్వడంతో , ఏమిచెయ్యమంటావు అక్కయ్యా ........ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదిగో ఇలా తయారుచేసేశారు అని నవ్వి నవ్విస్తూ ముద్దులతో ముంచెత్తుతూ వచ్చి చెల్లిని అమాంతం కౌగిలించుకుని పెదాలపై ముద్దుపెట్టాడు . 
ఎలా ఉంది శ్రీవారు ఇక్కడ ......... 
దేశం కోసం సిద్ధం కావాలికదా కాస్త కష్టమే కానీ ఇష్టంతో చేస్తున్నాను . ఇది మా అక్కయ్య కోరిక అంటూ బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , రేయ్ మామా ....... అని కౌగిలించుకున్నాడు . చిప్ప కటింగ్ సూపర్ గా సెట్ అయ్యిందిరా అని సెల్ఫీ తీసుకున్నాను . అక్కయ్యా ........ you also , చెల్లీ you టూ , మేడమ్స్ మీరు కూడా  అంటూ అందరమూ కలిసి సంతోషంతో జ్ఞాపకాలను తీసుకున్నాము . అన్నింటినీ అక్కయ్యకు చూపించాలికదా ..........
చెల్లెళ్ళూ ఎలా ఉన్నారు అని పలకరించి టేబుల్ చుట్టూ కూర్చుని గంటసేపు సంతోషన్గా మాట్లాడి మళ్లీ రేపువచ్చి కలిసాము . 
అప్పటికే వాడు పర్మిషన్ తీసుకుని ఉండటంతో క్యాంపస్ మొత్తం మరియు కొత్త ఫ్రెండ్స్ ను పరిచయం చేశాడు . మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే చేసాము .
సాయంత్రం కాస్త బాధతోనే హైద్రాబాద్ వచ్చాము . మళ్లీ శనివారం ఎప్పుడు వస్తుందా అని ఆతృతతో ఎదురుచూస్తూ ప్రతివారం వెళ్లి కలుస్తూ 6 నెలలు గడిచిపోయాయి .

రేయ్ మామా రెండురోజుల్లో హైద్రాబాద్ బ్యాచ్ మొత్తం ట్రైన్లో వస్తున్నాము అని కాల్ చెయ్యడంతో అందరి ఆనందాలకు అవధులు లేవు . 
రెండురోజుల తరువాత సర్ , మేడం వాళ్ళతోపాటు స్టేషన్ కు వెళ్ళాము . ట్రైన్ వచ్చి ఆగడం ఒక భోగీలోనుండి సెక్యూరిటీ అధికారి డ్రెస్ లతో బ్యాచ్ దిగడం అందులోనుండి హీరోలా కృష్ణగాడు IPS ట్యాగ్ తో సింహంలా సెక్యూరిటీ అధికారి డ్రెస్ వేసుకుని సెక్యూరిటీ అధికారి అంటే ఇలానే ఉండాలి అన్నట్లు నడుచుకునివస్తుంటే అందరమూ గర్వపడ్డాము . అక్కయ్య మాతోపాటు ఉండి చూసుంటే ఆనందబాస్పాలతో గర్వపడేది .
రేయ్ మామా ......... అక్కయ్య ఇలానే కదరా చూడాలనుకుంది . 
అవునురా మామా ......... అని సంతోషంతో కౌగిలించుకున్నాను .
అక్కయ్యా ......... అంటూ అందుకొని పైకెగరేసి పట్టుకుని ఎలాఉన్నాను అని అడిగాడు . 
అంతే సూపర్ అన్నట్లు వాడి బుగ్గను కొరికేసింది .
అక్కయ్యకు నచ్చింది అని బుజ్జిఅక్కయ్యతోపాటు స్టేషన్ లోనే ఆనందం పట్టలేక డాన్స్ చేసాడు .
My లవ్లీ goddess అంటూ చెల్లిని అమాంతం పైకెత్తేశాడు .
అధిచూసి సర్ మేడం వాళ్ళు సంతోషంతో చప్పట్లుకొట్టి కంగ్రాట్స్ కృష్ణ అని కౌగిలించుకుని అభినందించారు .

రేయ్ మామా .......... ఎలాచెప్పాలో తెలియడం లేదు రెండురోజుల్లో వైజాగ్ ప్రక్కనే ఉన్న ఒక టౌన్ లో డ్యూటీ వేశారు జాయిన్ అవ్వాలి నెలరోజులు మాత్రమే తరువాత మన ఇష్టం ఎక్కడైనా డ్యూటీ వేసుకోవచ్చు అనిచెప్పాడు .
అర్థమైంది అక్కయ్యను తీసుకెళ్లిపోతాను అంటావు . కానీ నీ ఇష్టం 6 నెలలు దూరంగా ఉన్నావు , నేను నెలరోజులు ఉండలేనా .......... ఈ రెండు రోజులూ అక్కయ్యను ఒక్క క్షణం కూడా వదిలి ఉండను అని వాడి నుండి అందుకున్నాను . 
నెలరోజులే కదా తమ్ముడూ ......... నేను కూడా ఉండలేను అయినా తప్పదు పాపం నాన్న 6 నెలలు ఉన్నాడు అని నాకళ్ళల్లోకే చూస్తోంది .
లవ్ యు అక్కయ్యా అని గుండెలపై హత్తుకొని ఇంటికివెళ్లి రెండురోజులపాటు అక్కయ్యతోనే ఎంజాయ్ చేసాను . షాపింగ్ వెళ్ళాము , వండర్ లా వెళ్ళాము , కార్టూన్స్ చూస్తూ నవ్వుకున్నాము .

బయలుదేరే రోజు అక్కయ్య నన్ను విడవనంతలా చుట్టేసింది . 
అక్కయ్యా ......... అంటూ పెద్ద టెడ్డీ బేర్ గిఫ్ట్ గా ఇచ్చాను . ఇది మీ దగ్గర ఉంటే నేను ప్రక్కనే ఉన్నట్లే రోజూ వీడియో కాల్లో మాట్లాడదాము .
లవ్ యు తమ్ముడూ అని ముద్దుముద్దుగా మాట్లాడి ముద్దులతో ముంచెత్తింది .
మహేష్ ........... మేముకూడా కాసేపు అని స్వాతి , ప్రసన్నా బుజ్జిఅక్కయ్యను అడగడంతో అందించాను .
చెల్లి నా గుండెలపై వాలిపోయి అన్నయ్యా ........ 
చెల్లెమ్మా ......... అర్థమైంది , వీడియో కాల్ చేస్తాను తినిపించు . నెలరోజులు భరిస్తే జీవితాంతం కలిసి ఉండవచ్చు అనిచెప్పాను.
రేయ్ మామా ...........
నాకు తెలుసురా అక్కయ్య కోరిక తీర్చడానికి వెళుతున్నావని , నేను చాలా చాలా హ్యాపీ అని పెద్దమ్మ పిల్లలతోపాటు ఎయిర్పోర్ట్ చేరుకున్నాము . 
స్వాతి , ప్రసన్నా , పెద్దమ్మా ....... అన్నయ్యను చూసుకోండి అని కౌగిలించుకుని చెప్పింది .
కృష్ణా .......... మా ప్రాణం అని బదులిచ్చారు .
అక్కడ స్వాతి ప్రసన్నా వాళ్ళు కూడా క్యూట్ బొమ్మలను బుజ్జిఅక్కయ్యకు ఇచ్చారు .
వాళ్లకు ముద్దులుపెట్టి నావైపు చేతులను చూపించడంతో ఎత్తుకున్నాను .
తమ్ముడూ .......... మేము తిరిగి హైద్రాబాద్ వచ్చేలోపు నేను అక్కయ్యను చూడాలి మాట ఇవ్వు అని అడిగింది .
అక్కయ్యా ...........
తమ్ముడూ ప్రామిస్ అంతే .......... అని చెల్లిదగ్గరకు చేరి టాటా చెబుతూ లోపలికివెళ్లిపోయారు . 

నెలరోజుల్లోనా ........... 17 సంవత్సరాలుగా కనిపించని అక్కయ్య ఈ నెలరోజుల్లోనా సాధ్యమేనా , చెల్లి ప్రామిస్ తీసేసుకుంది .
మహేష్ ........... కోరిక కోరింది ఎవరు బుజ్జిఅక్కయ్య , మనందరి అక్కయ్యకోసం అంటే తనకోసం తానే ........... ఖచ్చితంగా కలుస్తావు అని స్వాతి , ప్రసన్నాలు చెప్పారు .
థాంక్స్ మేడం అని ఇంటికివచ్చి ఆఫీస్ కు లీవ్ పెట్టేసి ఆ క్షణం నుండీ అక్కయ్యను వేతకడమే పనిగా పెట్టుకున్నాను . స్వాతి ప్రసన్నా పెద్దమ్మా కూడా నాకు సహాయం చేసారు. రోజూ చెల్లీ బుజ్జిఅక్కయ్యతో మాట్లాడుతూ పార్క్స్ , టెంపుల్స్ , టూరిస్ట్ places , థియేటర్స్ , షాపింగ్ మాల్స్ , బస్ స్టాండ్ , రైల్వే స్టేషన్ , ఎయిర్పోర్ట్ ....... ఇలా ఏ ఒక్కటీ వదలకుండా మూడువారాలపాటు అలుపులేకుండా వెతికినా ప్రయోజనం లేకపోయింది .
Like Reply
నిరాశతో ఇంటికిచేరుకుని పెద్దమ్మ భోజనానికి పిలిచినా , ఆకలిగా లేదు అనిచెప్పి చెల్లి బెడ్రూంలోకి వెళ్లి అక్కయ్య ఫోటోని అందుకొని గుండెలపై హత్తుకొని కళ్ళల్లో నీళ్లతో బెడ్ పై వాలిపోయాను . 
స్వాతి , ప్రసన్నా........... ప్లేటులో వడ్డించుకొని రూంలోకి వచ్చి నేను బాధపడుతుండటం చూసి లోపలికి రావడానికి ధైర్యం చేయక , కళ్ళల్లో చెమ్మతో నేరుగా పూజ గదిలోకివెళ్లి , అమ్మా ......... మహేష్ కు ఇంకెన్నాళ్లు ఈ బాధ అని ప్రార్థించారు .

అక్కయ్యా .......... మీరు కొరినట్లుగానే నేను ఆర్కిటెక్ట్ అయ్యాను , కృష్ణ IPS సాధించాడు . స్వర్గంలో ఉన్న అమ్మ కోరిక ప్రకారం చెల్లి రెండు నెలల్లో డాక్టర్ కాబోతోంది ఇంకా ఎందుకీ విరహం . 
అమ్మా మిమ్మల్నే మా దేవతగా కొలుస్తున్నాము మా అక్కయ్య ఎక్కడ ఉందో ఇప్పటికైనా చూపించలేవా ..........
మరొక వారంలో బుజ్జి దేవతలాంటి బుజ్జిఅక్కయ్య హైద్రాబాద్ వచ్చేస్తోంది . తను కోరిన తొలికోరిక అక్కయ్యను చూడాలని , అదికూడా తీర్చకపోతే నేను జీవించి ఏమి లాభం . 
సుమారు 17 సంవత్సరాలు అక్కయ్యకోసం వెతుకుతూనే ఉన్నాము . మేము చేసిన తప్పు ఏంటి . ఎవ్వరికీ ఎటువంటి అన్యాయం చెయ్యలేదు . ఇక మా జీవిత గమ్యం ఏమిటి అని అక్కయ్యను తలుచుకుంటూ ఎప్పుడో తెల్లవారుఘామున నిద్రపోయాను.

 ఎవరో ఒక వ్యక్తి మహిళ చెంపపై కొట్టడంతో రేయ్ అంటూ సడెన్ గా లేచికూర్చున్నాను . 
చుట్టుచూసి కల అనుకుని ముఖం తాకితే మొత్తం షర్ట్ తోపాటు చెమటతో తడిచిపోయింది .

ఫేస్ వాష్ చేసుకుని నీళ్లు తాగడానికి హాల్లోకివచ్చాను .
స్వాతి , ప్రసన్నా .......... సోఫాలో పెద్దమ్మ ఒడిలో చెరొకవైపు నిద్రపోవడం , పెద్దమ్మ ఇద్దరినీ జోకొడుతూ నిద్రపోవడం చూసి ముగ్గురినీ ఒకరితరువాత మరొకరిని ఎత్తుకుని వారి బెడ్ పై పడుకోబెట్టాను . 
చెంపలపై కన్నీరు కారిన ఆనవాళ్లు కనిపించడంతో నాతోపాటు ముగ్గురూ కూడా బాధపడ్డారు . అంటే ముగ్గురూ కూడా భోజనం చేయలేదని వంట గదిలో చూస్తే అన్నం కూరలు అలానే ఉన్నాయి .
నాలుగు ప్లేట్లలో వడ్డించుకొని రూంలోకివెళ్లి ముగ్గురినీ లేపి sorry పెద్దమ్మా ......... నేను తినకపోతే మీరూ తినరని తెలిసికూడా foolish గా ప్రవర్తించను తిని పడుకోండి అని అందించి నేనూ స్పూన్ తో తినడంతో లవ్ యు మహేష్ అని నవ్వుకుని తిని , మేమూ ఇక్కడ ............ నువ్వేకదా అని సంతోషంతో పొంగిపోయి ప్లేట్లు వంటగదిలో ఉంచి పడుకున్నారు .
గుడ్ నైట్ చెప్పి లైట్స్ ఆఫ్ చేసి నారూమ్లోకివెళ్లి పడుకున్నానో లేదో తాగడానికి డబ్బులు ఇమ్మంటే లోపల దాచేసి లేవు అంటావా అని అదే చెంపదెబ్బ కొట్టడం , ఆమె కన్నీళ్ళతో కిందపడిపోయి , అవి అమ్మాయి కాలేజ్ కోసం మీకు దండం పెడతాను తీసుకెళ్లకండి అని ప్రాధేయపడుతున్నా వినకుండా బీరువాలో చీరలకింద ఉన్న మొత్తం డబ్బుతీసుకుని వెళ్ళిపోతుంటే , కాళ్ళను పట్టుకుని బ్రతిమాలుతున్నా విదిల్చి వెళ్ళిపోయాడు . ఆ విధుల్పుకు నుదురువెళ్లి గోడకు కొట్టుకోవడంతో దెబ్బతగిలి రక్తం కారుతొంది .
రేయ్ ......... ఆగరా అంటూ కేకవేస్తూ లేచి చుట్టూ చూసి , మళ్లీ వొళ్ళంతా చెమట పట్టడం తెలిసి ఎవరు ఆమె , ఆమెకోసం నేను ఇంతలా పరితపిస్తున్నాను ఏంటి అని పడుకున్నాను . పదే పదే అదే కల వస్తూనే ఉండటం , నేను సడెన్ గా లేచి వొళ్ళంతా చెమటను చూసి నీళ్లు తాగి పడుకోవడం ..........

అలా మూడు రోజులూ అదే కల వస్తుండటంతో ఉదయం లేవగానే పెద్దమ్మ దగ్గరికివెళ్లి విషయం చెప్పాను .
ముఖమంతా చెమట , ఒళ్ళు వేడిగా ఉండటం , చిన్నగా వణుకుతుండటం చూసి ........ బాబు మహేష్ ఒకసారి వస్తే నిద్రలో కలలు మామూలేనని వదిలేయ్యొచ్చు . కానీ మూడురోజుల్లో 15 సార్లు పైనే అంటున్నావు కాబట్టి సీరియస్ గా తీసుకోవాల్సిందే , అమ్మాయిలకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేవు కలలో ఏకంగా ఒక వ్యక్తివలన రక్తం కారుతూ బాధపడుతున్న మహిళను చూసి ఎలా రియాక్ట్ అవుతావో మాకు తెలియదా ........... మూడురోజులుగా నిద్రకూడా పోయినట్లు లేవు కళ్ళుచూడు ఎలా ఎర్రగా మారిపోయాయో , నా పై తల ఉంచి పడుకో మహేష్ అని పడుకోబెట్టుకొని జోకొట్టింది .
స్వాతి ప్రసన్నాలు కంగారుపడుతూ ప్రక్కనే కూర్చున్నారు .

కొద్దిసేపటికే వొళ్ళంతా చెమటతో సడెన్ గా లేచి చుట్టూ చూసి తలదించుకున్నాను .
మహేష్ .........నీళ్లు తాగు అని స్వాతి అందించింది .
మేడం ........... ఆమె ఎవరో తెలియదు కానీ తన ఒక్కొక్క రక్తపు చుక్క , కన్నీటి చుక్కను చూస్తుంటే హృదయం తట్టుకోలేకపోతోంది . వాడిని అక్కడికక్కడే నరికెయ్యాలనిపిస్తోంది . ఆమెకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు వాళ్ళ చదులకోసం ఇంట్లోనే tuitions చెప్పి దాచుకున్న డబ్బుని కొట్టిమరీ లాక్కెళ్లిపోయాడు . తనకు దెబ్బతగిలినదానికంటే తన పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే బాధతో విలవిలలాడిపోతున్నారు . 
మహేష్ .......... ఇంకా ఏమి కనిపించింది అని పెద్దమ్మ అడిగింది .
చిన్న ఇంటిలో ఉంటున్నారు . ప్రక్కనే మరొక ఇల్లు చుట్టూ ఒకటే కాంపౌండ్ .......అంతలో మెలకువ వచ్చేసింది పెద్దమ్మా ..........

మహేష్ ఒక్కటిమాత్రం నిజం పదే పదే ఇదేకల నీకు వస్తోందంటే ఎక్కడో ఒకచోట జరిగింది . అదే నీకు తొలిసారి వచ్చినరోజున జరిగింది . మన వీధిలోనా, హైద్రాబాద్ లోనా లేక మన స్టేట్ లోనా లేక దేశంలోనా ...........ఎక్కడ అనేది నువ్వే దానిపై మరింత దృష్టిపెట్టాలి . నువ్వు తెలుసుకోకపోతే ఇలా కలలు వస్తూనే ఉంటాయి , నువ్వు బాధపడుతూనే ఉంటావు అని చీరతో చెమటను తుడిచింది .
ఎలాగైనా తెలుసుకోవాలని పెద్దమ్మ ఒడిలో మళ్లీ మళ్లీ పడుకున్నాను . రెండురోజులైనా అక్కడితోనే మెలకువ వచ్చేస్తోంది . 

ఉదయం 10 గంటలకు లేచి  గంటగంటకూ మెలకువ రావడం వల్లనే కదా తెలుసుకోలేకపోతున్నాను ఇప్పుడే వస్తాను అమ్మమ్మా అని బయటకు పరుగుతీసాను . స్వాతి ప్రసన్నా అపార్ట్మెంట్ గేట్ వరకూ వెనుకేవచ్చి కంగారుపడి చెల్లికి కాల్ చేశారు . కృష్ణ రాగానే హైద్రాబాద్ వచ్చేస్తాము అనిచెప్పారు . 
మెడికల్ స్టోర్ కు వెళ్లి స్లీపింగ్ పిల్స్ తీసుకుని వచ్చి , మేడమ్స్ మీరేంటి ఇక్కడ నాకోసమేనా రండి అని ఇంటికివచ్చి , పెద్దమ్మా ......... స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకుంటాను అనిచెప్పాను .
మహేష్ .......... ఏమీ తినలేదు , టాబ్లెట్స్ ఒట్టి కడుపుతో వేసుకోరాదు కడుపు నొప్పిస్తుంది అని పెద్దమ్మ తినిపించారు . టాబ్లెట్స్ వేసుకుని పెద్దమ్మ తొడపై తలవాల్చగానే నిద్రపట్టేసింది .
వెంటనే చెల్లికి కాల్ చేసి కృష్ణ ......... కంగారుపడాల్సిన విషయం ఏమీలేదు , అన్నయ్యకు చెప్పలేదుకదా ఇప్పుడే వచ్చేస్తారు అని కలల గురించి వివరించి , దాన్ని చేధించే పనిలో ఉన్నాడు మీ అన్నయ్య , నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను అని నవ్వుతూ చెప్పడంతో చెల్లి శాంతించింది .
ఒకసారి మన బుజ్జిఅక్కయ్యకు ఇవ్వండి అని ఇద్దరూ మాట్లాడారు . 

కొన్నిరోజుల నుండీ వైజాగ్ నుండీ కాల్ చేస్తున్నా , మహేష్ లీవ్ లో ఉన్నారని చెప్పడంతో చంద్ర రమేష్ లు నేరుగా కలవాలని అధిరోజు హైద్రాబాద్ చేరుకున్నారు . 
మధ్యాహ్నానికి ఆఫీస్ చేరుకుని మేనేజర్ ను కలిశారు . 
ఇలా చిన్న చిన్న వాటికి అంటే మహేష్ లీవ్ పూర్తిచేసుకునివచ్చినతరువాతనే అనిచెప్పారు . అప్పాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని నాదగ్గరకు ఎవరు రానిచ్చారు . 
సర్ .......... 10 రోజుల నుండీ కాల్స్ చేస్తూనే ఉండటం , వైజాగ్ నుండి రావడంతో నేనే పంపించాను సర్ sorry అని ఒక స్టాఫ్ చెప్పారు . మహేష్ సర్ పేరుకూడా నేనేచెప్పాను సర్ ......... , నాదీ వైజాగ్ అందుకే ........
 మహేష్ ......... లీవ్ లో ఉన్నాడు కలవడం కుదరదు , Please ఇక మీరు వెళ్ళవచ్చు అనిచెప్పారు మేనేజర్ గారు .
ఈరోజు మహేష్ ను కలవకుండా వెళ్ళేది లేదు . మీకు ఎక్కడ నుండి కాల్ వస్తే మహేష్ దగ్గరికి తీసుకువెళతారో మాకు తెలుసు అనిచెప్పాడు చంద్ర .

 ఒక కాల్ చేసిన తరువాత వచ్చేస్తుంది , ఐదే ఐదు నిమిషాలు కూర్చోవచ్చా అని అడిగాడు చంద్ర .
చూద్దాము ఎక్కడినుండి కాల్ వస్తుందో కూర్చోండి అని మేనేజర్ గారు తనపనితాను చేసుకుపోతున్నారు .
రెండే రెండు నిమిషాలలో ఏకంగా చైర్మన్ శివరాం గారు మేనేజర్ రూమ్ కు వచ్చి చంద్ర , రమేష్ ......... అని చేతులుకలిపి మీకేమైనా ఇబ్బంది కలిగించిఉంటే క్షమించండి అని మాట్లాడుతుండటం చూసి , మేనేజర్ గారు లేచి నిలబడ్డారు .
నా ఆఫీస్ రూంలో కూర్చుని మాట్లాడదాము రండి అని స్వయంగా పిలుచుకొనివెళ్లి నారాయణ మనకు అప్పట్లో ఎంతో సపోర్ట్ చేసిన " ఇందు ఇండస్ట్రీస్ " నుంచి ఇన్ని సంవత్సరాలకు మన రుణం తీర్చుకునే అవకాశాన్ని కల్పించడానికి వచ్చారు అని చంద్ర , రమేష్ ను పరిచయం చేసారు .
మా రెండు కంపెనీల అనుబంధం మళ్లీ మొదలవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ముందు కూర్చోండి అని కూల్ డ్రింక్స్ తెప్పించారు . 
మేనేజర్ గారికి అర్థమై చంద్రకు sorry చెప్పారు .
మేనేజర్ గారు its alright అని చేతులు కలిపారు .

చంద్ర మీ రాకకు కారణం అని శివరాం అడిగారు .
ఇందు ఇండస్ట్రీస్ ఏకైక వారసుడు మా అందరి ప్రాణమైన మహేష్ .......... yes yes మీ కంపెనీ saviour ఆర్కిటెక్ట్ పేరే .......... తనకు ఇష్టమైన వారికోసం ఒక బిల్డింగ్ తీసుకున్నారు వైజాగ్ లో ఫ్యాషన్ వరల్డ్ కోసం , దానిని మీ మహేష్ అద్భుతంగా......
We got it చంద్ర .......... , అది మా అదృష్టం . ఇప్పుడే మిమ్మల్ని మహేష్ దగ్గరకు తీసుకెళతాము అని నేరుగా ఇంటికి చేరుకుని , స్వాతి ప్రసన్నాల నుండి కలల గురించి , దానిని చేధించడానికి నిద్రమాత్రలు వేసుకుని ఉదయం అనగా పడుకున్నాడు dad ఇప్పుడు 4 గంటలు అవుతోందని కంగారుపడుతూ చెప్పారు .
తల్లీ మహేష్ కు ఏమీకాదు అని వెంటనే తమ ఫ్యామిలీ డాక్టర్ కు కాల్ చేశారు  .
అర గంటలో డాక్టర్ వచ్చి విషయం తెలుసుకుని నా వొళ్ళంతా చెమటలు పట్టి ఉండటం కళ్ళు కదిలిస్తుండటం చూసి శివరాం he is seeing everything కొద్దిసేపు నిశ్శబ్దన్గా ఉండండి , మేడం టచ్ చేయకండి అని కంగారుపడుతున్న పెద్దమ్మకు సైగచేసి ప్రక్కనే సోఫాలో కూర్చున్నారు .

గంట తరువాత నిద్రలోనే వినయం సాధించినట్లు చేతులను పైకెత్తి ఎంజాయ్ చేస్తుంటే, తల్లీ స్వాతి వాటర్ తీసుకురామ్మా అని డాక్టర్ గారు అందుకొని నా ముఖం పై చిలకరించారు .
పెద్దమ్మా , మేడమ్స్ .......... ఎక్కడో కనుక్కున్నాను యాహూ అని డాన్స్ చేస్తూ కళ్ళుతెరిచి సర్ వాళ్ళు , డాక్టర్ మరియు మరొక ఇద్దరినీ చూసి పెద్దమ్మా ......... అని చీరకొంగు అందుకొని దాచుకున్నాను .
డాక్టర్ గారు ఒక టాబ్లెట్ అందించి వేసుకోమన్నారు . పెద్దమ్మ తన చీర కొంగుతో నా చెమటను తుడిచింది .

మహేష్ అందరినీ కాసేపు హడలెత్తించావుపో వీళ్ళ ముగ్గురూ ఎంత కంగారుపడిపోయారు . తల్లీ మీరైనా ఒక్క కాల్ చెయ్యొచ్చుకదా అని చెప్పారు .
సర్ నేనే వద్దన్నాను . ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికి ఒక దేవత ఇద్దరు దేవకన్యలు ఉన్నారు కదా .
డాక్టర్ గారు నేను ok కదా ........., వెంటనే చాలాదూరం వెళ్ళాలి అని అడిగాను .
నీది iron బాడీ మహేష్ ........ అనవసరంగా వీళ్ళు కంగారుపడి నన్ను కంగారుపెట్టి పిలిచారు ఎక్కడికైనా వెళ్లొచ్చు ......... ఇక నేను వెళతాను అక్కడ చాలామంది పేషెంట్స్ వెయిటింగ్ అని డోర్ దగ్గరకువెళ్ళిమరీ వెనక్కు సిగ్గుపడుతూవచ్చి మహేష్ వాళ్ళ అడ్రస్ ఏంటి అని అడిగారు .
సర్ , స్వాతివాళ్ళు ........నవ్వుకున్నారు .
డాక్టర్ గారు , పెద్దమ్మా , మేడమ్స్ ............ ******స్ట్రీట్ వైజాగ్ అనిచెప్పాను .

చంద్ర , రమేష్ ........ సంతోషంతో కౌగిలించుకుని మనతోపాటు ఖచ్చితంగా వస్తారు మహేష్ అని గుసగుసలాడుకున్నారు .
హమ్మయ్యా ......... ఇప్పుడుకానీ తెలుసుకోకుండా వెళ్లి ఉంటే హాస్పిటల్లో టెన్షన్ తో పోయేవాణ్ణి శివరాం అని నవ్వుతూ తరువాత కలుద్దాము అనివెళ్లిపోయారు .

వైజాగ్ కు టికెట్ బుక్ చేస్తుంటే ,  మహేష్ .......... మేమూ వస్తాము అని స్వాతి , ప్రసన్నా అడిగారు .
మేడం .......... రేపు పనిచూసుకుని , ఎల్లుండితో మీ అన్నయ్య డ్యూటీ అయిపోతుంది కలిసి వచ్చేస్తాము కదా , అంతలోపు చాలాకాలం నుండి పోస్ట్ ఫోన్ చేసుకుంటున్న ప్రోగ్రాం అదే లండన్ నుండి సర్టిఫికెట్స్ తీసుకురావడం .........
పెదాలపై చిరునవ్వుతో మహేష్ నీకెలా తెలుసు ...........
మా పెద్ద మేడం వాళ్ళు చెప్పారు . అందరిపని రెండు రోజుల్లో ముగించుకుని ఒకేసారి ఎయిర్పోర్ట్ లో కలుద్దాము ........ మీకు హ్యాపీనే కదా మేడమ్స్ అని అడిగాను.
నువ్వు ఎలాచెబితే అలా మేము పాటిస్తాము మహేష్ , ఆర్డర్ వెయ్యి , నీ మాటే మాకు  దైవంతో సమానం అని సంతోషించారు .

మహేష్ గారు టికెట్ బుక్ చెయ్యొద్దు అని చంద్ర మాట్లాడాడు .
మీరు ..........
మహేష్......... మనకు చాలా కావాల్సినవాళ్ళు , నీకోసం వచ్చారు .......
సర్ ........ విన్నారుకదా నేను అర్జెంట్ గా వైజాగ్ వెళ్లి మా బుజ్జిఅక్కయ్యను చూసి కలలో కనిపించిన వాళ్లకు నావంతు సహాయం చెయ్యాలి లేకపోతే నా మనసు కుదుటపడేలా లేదు .
సర్ సర్ .......... మేము కూడా వైజాగ్ నుండే వచ్చాము . మీ కాళ్ళావెళ్ళాపడైనా స్వయంగా వైజాగ్ తీసుకువెళ్లడానికే వచ్చాము అని విషయం చెప్పారు . టికెట్స్ కూడా బుక్ చేసేసాము ఉదయం 3 గంటలకు ఫ్లైట్ అనిచెప్పారు . 
క్యాన్సిల్ చెయ్యండి అంతకుముందే వెళ్లిపోదాము అనిచెప్పాను .
అంటే మీరు మాకు సహాయం చేస్తున్నారన్నమాట అని ఇద్దరూ మాటల్లో చెప్పలేని ఆనందంతో హైఫై కొట్టుకుని , మహేష్ గారు ఆ టికెట్స్ క్యాన్సిల్ చేస్తే ఎల్లుండి వరకూ లేవు , వైజాగ్ లో ఇంటర్నేషనల్ సదస్సు జరుగుతోంది ఫ్లైట్స్ మొత్తం రిజర్వ్ అయిపోయాయి అనిచెప్పాడు . 
అవును ........ sorry మీ పేరు ........
నేను చంద్ర , he is రమేష్ ......... అని చేతులు కలిపారు .

పెద్దమ్మా , స్వాతి మేడం ఆకలి దంచేస్తోంది ..........
అయ్యో  మహేష్ ......... ఉదయం నుండే ముగ్గురమూ ఇక్కడే కూర్చున్నాము . అలా dad వాళ్ళతో మాట్లాడుతూ కూర్చో రెడీ చేసేస్తాము అని హడావిడిగా వెళుతోంటే , 
తల్లీ......... ఇంటికి వెళదాము అని మేడం వాళ్లకు కాల్ చేసి విషయం చెప్పారు . 
మహేష్ ......... ఫ్రెష్ అవ్వు వెళదాము అనిచెప్పారు . 
తల్లీ మీరుకూడా అనిచెప్పడంతో పెద్దమ్మా ......... మన ఇల్లు చూడలేదు కదూ వెళదాము రండి అని మరొక రూంలోకివెళ్లి ఫ్రెష్ అయ్యారు . 

తల స్నానం చేసి చిన్న బ్యాగులో రెండు జతల బట్టలూ , జర్కిన్ పెట్టుకుని రెడీ అయ్యి హాల్లోకి వచ్చాను . 
మహేష్ ......... అంతవరకూ జ్యూస్ తాగు అని నాతోపాటు అందరికీ అందించింది ప్రసన్నా .......... 
తాగి సర్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము . స్వాతి మేడం ........ మన బుజ్జిఅక్కయ్యకు గిఫ్ట్స్ అనిచెప్పాను . 
Yes yes ......... మాతరుపున కూడా డ్రైవర్ టాయ్స్ స్టోర్ కు పోనివ్వమని చెప్పింది .
నేను కొన్ని , స్వాతి ప్రసన్నాలు కొన్ని , పెద్దమ్మా మీ తరుపున కొన్ని ...........అని గిఫ్ట్ ప్యాక్ చేయించాము .
తల్లీ ......... మాతరుపున మీ moms తరుపున అని బుంగమూతిపెట్టి చెప్పారు శివరాం సర్ , అందరూ నవ్వుకుని ఒక పెద్ద బాక్స్ నింపేసి ప్యాక్ చేయించము . 
Like Reply
స్వాతి , ప్రసన్నా మేడం , పెద్దమ్మా ......... నేను వైజాగ్ వస్తున్నట్లు చెల్లి కృష్ణకు మీ అన్నయ్య కృష్ణకు కాల్ చెయ్యొద్దు సర్ప్రైజ్ ఇస్తాను అనిచెప్పాను .
లవ్లీ లవ్లీ .......... మహేష్ అని మురిసిపోయారు .
సర్ ఇంటికి చేరుకుని లోపలకు అడుగుపెట్టగానే ఘుమఘుమలు ముక్కుని తాకడంతో , నేరుగా వంట గదిలోకి వెళ్ళిపోయి ఆ ........ అని నోటిని తెరిచాను . నీకోసమే మహేష్ అంటూ వేడి వేడి లెగ్ పీస్ తినిపించారు .
Soooo yummy .......... అంటూ కళ్ళుమూసుకుని ఆస్వాదించాను .

పిన్నిగారు నవ్వుకుని అన్నింటినీ డైనింగ్ టేబుల్ పైకి షిఫ్ట్ చేశారు .
చంద్ర , రమేష్ my boss జానకి అని శివరాం గారు , my boss భువనేశ్వరి అని నారాయణ గారు .......... శ్రీమతి గారు చంద్ర , రమేష్ మనకు ఆత్మీయులైన ఇందు ఇందు ఇండస్ట్రీస్ నుండి మహేష్ కోసం వచ్చారు .
ఇన్ని సంవత్సరాలకు ......... చాలా సంతోషం బాబు , మేడం గారు ఎలా ఉన్నారు అని అడిగారు . 
నమస్తే మేడం ......... మేడం ప్రాణమైన వాళ్లంతా ఒక్కదగ్గరికి చేరారు . మేడం ను మేము అమ్మమ్మా అని పిలుస్తాము , ఇక ఆ సంతోషం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి .
అంటే చెల్లి ఇందు ..........
తల్లిదగ్గరికే చేరారు మేడం .......
సర్ వాళ్ళు , మేడం వాళ్ళు ఆనందబాస్పాలతో గుడ్ న్యూస్ చెప్పారు . అయ్యో అందరినీ నిలబెట్టే మాట్లాడిస్తున్నాను కూర్చోండి అని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటినీ స్వాతి ప్రసన్నా అందరూ వడ్డించారు . 
మేడం , పిన్ని గారు ......... soooo tasty , మహేష్ ఆకలిగా ఉండటం వలన అలా అనిపిస్తోంది , మా అక్కయ్య చేసి ఉంటే ఇంకా రుచిగా ఉండేవి అని పెద్దమ్మ భుజాలపై వాలారు మేడం వాళ్ళు .
తృప్తిగా తినేసి నిద్రపోకుండా సర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉదయం 2 గంటలకు బాధపడుతున్న స్వాతి ప్రసన్నాల దగ్గరికివెళ్లి వెళ్ళొస్తాను అని ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాము . 

బుజ్జిఅక్కయ్య కోసం తీసుకెళ్తున్న టాయ్స్ బాక్స్ ను సబ్మిట్ చేసి చెక్ ఇన్ అయ్యాము. సమయానికి ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది . 
మహేష్ గారు .........
చంద్ర ......... మహేష్ అని పిలు , ఫ్రెండ్స్ అని చేతులుకలిపాను .
నవ్వుకుని మహేష్ ......... నువ్వు ఇక్కడ ఎలానో వైజాగ్ లో మా బావ ...... ఇంతకీ మా ప్రాణం కంటే మాకు ఎక్కువైన మా బావ పేరు చెప్పలేదు కదూ , మీకోసం మమ్మల్ని పంపించిన మా బావ పేరు కూడా మహేష్ ........, మీలానే అందరూ సంతోషన్గా ఉండాలని నా అనుకున్నవాళ్లకు ఎంత దూరమైనా వెళతారు . 
మరొక విషయం .......... మా బావ చెల్లి పేరు కృష్ణవేణి తను ప్రాణంలా ప్రేమిస్తున్నది మీ ఫ్రెండ్ లానే , మా బావ ఫ్రెండ్ కృష్ణని .......... మీకు కృష్ణ - కృష్ణవేణి ఎంత ప్రాణమో మా బావకు వాళ్లంటే అంత ప్రాణం . ఇంకా మీకు మా బావకు చాలా పోలికలు ఉన్నాయి ఒకసారి మీరిద్దరూ కలిసారంటే మీకే అర్థమౌతుంది కాసేపు రెస్ట్ తీసుకోండి అనిచెప్పాడు .
అయితే వెంటనే కలవాలని ఉంది చంద్ర ........
ఇప్పుడు మీరు ఒక కుటుంబాన్ని ఎలాగైతే కాపాడటానికి ఇంత దూరం వస్తున్నారో , అలాగే మా బావ నిన్న ఒక కుటుంబం కోసం మీలానే మంచినీళ్లు కూడా తాగకుండా వాళ్ళలో సంతోషాన్ని నింపడానికి వెళ్ళాడు . అన్నీ అనుకూలిస్తే ఎయిర్పోర్ట్ లోనే మీట్ అవ్వొచ్చు అనిచెప్పి , sorry రెస్ట్ తీసుకోండి అని సైలెంట్ అయిపోయాడు .

ఉదయం 5 గంటలకు ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .
బయటకు రాగానే మహేష్ ........ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా బావే వచ్చాడు అని పిలుచుకునివెళ్లాడు .
బావ ........ మహేష్ , మహేష్ ....... బావ అనేంతలో ,
ఆపి ........ మహేష్ కదా తెలిసిపోతోంది అని చేతులు కలిపాను .
వైజాగ్ మహేష్ ఆశ్చర్యపోతుంటే , చంద్ర మీ గురించి మొత్తం చెప్పాడు . మిమ్మల్ని కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని సంతోషంతో చెప్పాను .
నేను కూడా మహేష్ ........ మాకోసం వైజాగ్ వచ్చినందుకు చాలా చాలా థాంక్స్ , ఎందుకో మిమ్మల్ని ఒకసారి కౌగిలించుకోవాలని ..........
కమాన్ మహేష్ అంటూ అమాంతం కౌగిలించుకున్నాను .

సంతోషంతో మురిసిపోయి మీకు సంతోషం అయితే మా ఇంటికి పిలుచుకునివేళతాము కాదు అంటే హోటల్ ......... అనిచెప్పాడు వైజాగ్ మహేష్ .
Sooooo థాంక్స్ , మా చెల్లీ వాళ్ళ ఇల్లు ఉంది అనిచెప్పాను . కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ను కలవడానికి పనిచూసుకుని ఇప్పుడే వెళదాము అనిచెప్పాను . మీ పేరు మహేష్ - నా పేరు మహేష్ , మీ ప్రాణమిత్రుడి పేరు కృష్ణ - నా ప్రాణమిత్రుడి పేరు కృష్ణ , మీ ప్రాణమైన చెల్లెమ్మ పేరు కృష్ణవేణి - నా ప్రాణమైన చెల్లెమ్మ పేరు కృష్ణవేణి ............ అని చెప్పాను .
మహేష్ ......... మీకు ........ఎలా .......
బావోయ్ ........ నేనే అని చంద్ర కాలర్ ఎగరేశాడు . 
ఇదొక అద్భుతం మహేష్ ......... అని ఆశ్చర్యపోతున్నాడు వైజాగ్ మహేష్ .

మహేష్ .......... అక్కడ నా చెల్లి ఇంట్లో మా బుజ్జిఅక్కయ్య వెయిటింగ్ , ముందుగా నేను ఏమిచెయ్యాలో అక్కడకు తీసుకెళ్లండి అనిచెప్పాను .
మహేష్ ......... ప్రయాణం వలన అలసిపోయి ఉంటారు కాస్త రెస్ట్ తీసుకుని ........
నాకు అలవాటే మహేష్ ......... ఫస్ట్ వర్క్ దగ్గరకువెళ్లి ఆ వెంటనే మీకు ఇష్టమైతే మీ ఇంటికివెళ్లి , మా బుజ్జిఅక్కయ్య లేచేలోపు తన ముందు ఉండాలి గిఫ్ట్స్ తో ,........ , చంద్ర ..........
మహేష్ ......... రమేష్ తీసుకొచ్చేస్తున్నాడు అనిచెప్పాడు .
మహేష్ ......... మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం అని , welcome to బ్యూటిఫుల్ సిటీ వైజాగ్ అని బయటకు దారి చూపించి , బాక్స్ కారుపై ఉంచుకుని మాట్లాడుతూ బిల్డింగ్ తీసుకెళ్లారు .
లోపలికివెళ్లి మొత్తం చూసి పర్ఫెక్ట్ ఫర్ ఫ్యాషన్ వరల్డ్ అని వైజాగ్ మహేష్ , చంద్ర , రమేష్ సహాయంతో డేటా సేకరించి రేపటిలోపు మోడరన్ స్వర్గంలా ఉండే ప్లాన్ మీముందు ఉంచుతాను అనిచెప్పాను .
Thats it ..........
అంతే చంద్ర .......... 
గ్రేట్ మహేష్ అర గంటలో wow ..........
వైజాగ్ మహేష్ సంతోషించి , మహేష్ ఇంటికి వెళదామా అని పిలుచుకొనివెళ్లారు .

లోపలికి అడుగుపెట్టగానే అమ్మమ్మా , అమ్మా , అత్తయ్యా , అక్కయ్యా , చెల్లీ , పిల్లలూ ........... అంటూ ఆప్యాయతలతో పిలుపుల కోలాహలం - ఒకరంటే మరొకరికి ప్రాణం అన్నట్లు నేను చేస్తాను నేను చేస్తాను అని తియ్యని కోపాలు , అలకలూ ........ చూసి మనసు పరవశించిపోయింది .
మహేష్ ......... రా అని వైజాగ్ మహేష్ ఆహ్వానించాడు .

బావోయ్ ........ నేనుచూసుకుంటాను అనిచెప్పి , మహేష్ ....... సోఫాలో అందరినీ ప్రాణంలా చూస్తూ అందరి సేవలతో మురిసిపోతున్నారే ఆమెనే మా బావ అమ్మమ్మ ఇందు ఇండస్ట్రీస్ అధిపతి అనిచెప్పాడు . 
వెంటనే వెళ్లి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాను . 
బంగారు , చంద్ర ఎవరు అని పైకిలేచారు .
చంద్ర మొత్తం వివరించాడు . చాలా సంవత్సరాలు అయ్యింది బాబు కూర్చో అని చెప్పింది .
మహేష్ ఒక్కనిమిషం కృష్ణను పిలుచుకొనివస్తాను అని పరిచయం చేశాడు . 
ఇక మహేష్ అయితే తన అమ్మ దగ్గర నుండి పిల్లల వరకూ అందరినీ పరిచయం చేసారు . 
లేచి అందరికీ నమస్కరించి అమాంతం వైజాగ్ మహేష్ ను కౌగిలించుకుని , నువ్వు నిజంగా అదృష్టవంతుడివి మహేష్ ......... అంటూ కళ్ళల్లోని ఆనందబాస్పాలను తుడుచుకున్నాను .
ఒకరు కాఫీ తెచ్చి ఇచ్చారు . 
మహేష్ ....... she is కృష్ణవేణి - కృష్ణ ప్రేమ పక్షులు అని చంద్ర చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు .

చెల్లెమ్మా అంటూ ఇద్దరి భుజాలపై చేతులనువేసి , నాకు మీరు ఎలానో తనకూ asitis మీలానే మీ పేర్లతోనే ఫ్రెండ్ చెల్లి ఉంది . మిమ్మల్ని చూడటానికే వచ్చారు అని వైజాగ్ మహేష్ చెప్పారు .
Wow ........ అద్భుతం కదా అన్నయ్యా అని నమస్కరించి , వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని నన్ను అడిగారు .
ఇక్కడే వైజాగ్ లో ఉన్నారు , వీలుచూసుకుని పిలుచుకొనివస్తాను మీ అందరినీ ఇలా చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తోంది ఒకేఒక్క సెల్ఫీ అనిఅడిగాను .
కృష్ణ పరుగునవెళ్లి రెండు సెల్ఫీ స్టిక్స్ తీసుకొచ్చారు .
మహేష్ ........ మాకు ఒకటి అని నవ్వి అందరూ ఒకదగ్గరకు చేరడంతో సెల్ఫీలు తీసుకున్నాము . 
మహేష్ , కృష్ణ , చంద్ర , రమేష్ .......... వెళ్ళొస్తాను అనిచెప్పాను .
బాబు .......... బ్రేక్ఫాస్ట్ చేసివెల్లు అని చాలామంది ఆహ్వానించారు . 
ఇంకా బ్రష్ కూడా చెయ్యలేదండీ , చెల్లీ మా బుజ్జిఅక్కయ్యతోపాటు వచ్చి ఏకంగా డిన్నర్ చేస్తాముకదా , మిమ్మల్ని కలవడం నా అదృష్టం అనిచెప్పి వైజాగ్ మహేష్ , చంద్రతోపాటు బయటకువచ్చాము . 

మహేష్ ........ మీ కుటుంబం లా కాకపోయినా నాకూ ఒక చిన్న కుటుంబం ఉండేది 17 ఏళ్ల క్రితం విడిపోయాము . వాళ్లకోసం ......... అంటూ కళ్ళల్లో చెమ్మతో బాధపడుతుంటే , 
వైజాగ్ మహేష్ , చంద్ర కౌగిలించుకుని మహేష్ ....... నీ బాధను అర్థం చేసుకోగలము అతి తొందరలోనే నువ్వు నీ కుటుంబాన్ని చేరుకుంటావు అని చెప్పారు .
అదేనిజమైతే ఈ జీవితానికి ఇంకేమీ వద్దు , sorry ........ నా బాధను చెప్పి మిమ్మల్ని బాధపెట్టాను .
మనం ఫ్రెండ్స్ అయిపోయాము కదా మహేష్ ......... ఫ్రెండ్స్ అర్థం ఒకరి బాధను మరొకరు పంచుకుని సహాయం చేసుకోవడమే అని చెప్పారు . 
థాంక్స్ మహేష్ , చంద్ర ........ మీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని సంతోషం కలుగుతోంది వెళదామా అని చెల్లి ఇంటికి చేరుకున్నాము .
లగేజీ దించి మహేష్ , చంద్ర లోపలికి రండి అని ఆహ్వానించాను . 
మహేష్ ......... ఒక చిన్న సమస్య వలన రెండురోజులు కాలేజ్ కు వెళ్ళలేదు సో ......... వెళ్ళాలి , ఇల్లు తెలుసుకదా సాయంత్రం మీరు ఆహ్వానించకున్నా తప్పకుండా వస్తాను ..........అని వైజాగ్ మహేష్ నవ్వుతూ అన్నాడు .
ఇదికూడా మీ ఇల్లే ఎప్పుడైనా రావచ్చు ........
అయితే తరువాత కలుద్దాము మహేష్ అని కారు డోర్ తెరిచి మళ్లీ వెనక్కువచ్చి మహేష్ ........ అంటూ అమాంతం కౌగిలించుకుని , మేము చెబుతున్నాము కదా మీ కుటుంబం అతి త్వరలోనే కలుస్తారు అనిచెప్పి వెళ్లిపోయారు .

థాంక్స్ మహేష్ ........ అని మనసులో అనుకుని పెద్ద బాక్స్ ను తలపై మోసుకుని గేట్ తీసుకుని లోపలికివెళ్ళాను .
మెయిన్ డోర్ తెరుచుకోవడం , మా బుజ్జిఅక్కయ్య బయటకువచ్చి నన్నుచూసి అంతులేని ఆనందంతో నోటివెంట మాటరానట్లు షాక్ లో అలానిలబడిపోయింది .
సర్ప్రైజ్ అంటూ బాక్స్ కిందపెట్టివెళ్లి అమాంతం ఎత్తుకుని గుండెలపై ప్రాణంలా హత్తుకొని లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ముద్దుల వర్షం కురిపించాను . 
తమ్ముడూ ......... అని ముద్దొచ్చే కోపంతో గుండెలపై ప్రేమతో కొట్టి గట్టిగా నామెడను చుట్టేసింది .
లవ్ యు అక్కయ్యా .......... వారం వారం రావాల్సింది కానీ తమరే కదా నేను హైద్రాబాద్ వచ్చేలోపు అక్కయ్యను చూడాలి అనిచెప్పింది . అందుకే మా బుజ్జిఅక్కయ్య కోరిక తీర్చడం కోసం నిద్రాహారాలు మానుకుని హైదరాబాద్ వెతుకున్నకొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది .
నేను అలా అన్నాకూడా రావాలి ........ అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి లవ్ యు తమ్ముడూ అని గట్టిగా హత్తుకుంది .

మీకోసం మా బుజ్జాయి కోసం స్వాతి మేడం , ప్రసన్నా మేడం , పెద్దమ్మా , సర్ వాళ్ళు బోలెడన్ని బొమ్మలు పంపించారు అని బాక్స్ వైపు చూపించాము .
నోటికి తన బుజ్జి బుజ్జి చేతులను అడ్డుపెట్టి బాక్స్ మొత్తం అని సంతోషంతో ఆశ్చర్యపోతుంటే మురిసిపోయి , లోపలివేళదామా బొమ్మలన్నీ చూడొచ్చు అనిచెప్పాను .
ష్ ష్ ష్ ......... తమ్ముడూ లోపల లోపల లోపల ....... అని బుజ్జిఅక్కయ్య నవ్వుతోంది .
ఏమిటి అక్కయ్యా అని కళ్ళతో సైగచేసాను .
లోపల వంట గదిలో నాన్న వంట చేస్తున్న అమ్మను వెనుక నుండి కౌగిలించుకుని ముద్దులుపెడుతున్నారు . రోజూ ఇదే వరస అది చూడలేకే బయటకు వచ్చేస్తూ నా తమ్ముడిని చూసింది అని నవ్వుతూ చెప్పింది .
అంటే లోపల మా బుజ్జిఅక్కయ్యకు మరొక బుజ్జి తమ్ముడిని పుట్టించడానికి ప్లాన్ చేసేస్తున్నారన్నమాట , డిస్టర్బ్ చేయకూడదు అయితే ఇక్కడే కూర్చుందామా అనిఅడిగాను .
తమ్ముడూ పైన కూడా మనదే .........
అయితే అక్కడ ఫ్రెష్ అవుదాము అని బ్యాగుని భుజంపై , బాక్స్ ను దారిన వెళుతున్న ఒకరి సహాయంతో తలపై ఉంచుకుని ,మా బుజ్జిఅక్కయ్యకు అప్పుడే చాలావిషయాలు తెలిసిపోయాయి , మాటలు కూడా బోలెడన్ని మాట్లాడేస్తోంది అని ముద్దులుపెడుతూ పైకివెళ్లి , బుజ్జిఅక్కయ్యను సోఫాలో కూర్చోబెట్టి బాక్స్ దించి ఓపెన్ చేసి ఎంజాయ్ అక్కయ్యా ......... ఇలా వెళ్లి అలా ఫ్రెష్ అయ్యివచ్చేస్తాను అని టవల్ బట్టలు అందుకొని స్నానం చేసి బట్టలువేసుకునివచ్చాను .

అన్నయ్యా , రేయ్ మామా ........ అని ఇద్దరూ చెరొకవైపు హత్తుకొని సర్ప్రైజ్ ఎప్పుడు వచ్చావు అని అడిగారు . మా బుజ్జిఅక్కయ్యకు బుజ్జితమ్ముడిని ఇచ్చే పనిలో ఉన్నారుగా అప్పుడు , ఆ విషయం మా బుజ్జిఅక్కయ్య చెప్పడంతో ఇంట్లోకి కూడా అడుగుపెట్టనీకుండా ఇక్కడకు పిలుచుకొనివచ్చింది .
అన్నయ్యా ....... అని వాడి చేతిని గిల్లేసి , ఎలా ఉన్నారు ఏదో కల అని స్వాతి కాల్ చేసింది . 
అక్కడికే వెళ్ళాలి , చెల్లీ ఆకలేస్తోంది తినేసి ఆ సమస్యను తీర్చి , రాత్రికి ఒక ప్లాన్ వెయ్యాలి వేసి , మనమంటే ఇష్టపడే పెద్ద కుటుంబాన్ని కలిసి ఎల్లుండి మా బుజ్జిఅక్కయ్యతోపాటు అందరమూ హైద్రాబాద్ వెళ్లిపోవడమే అని సంతోషంతో చెప్పాను .

రేయ్ మామా ......... నిన్న రాత్రి మెసేజ్ వచ్చింది . మరికొన్నిరోజులు extend చేశారు అని తలదించుకొని చెప్పాడు .
ఏంట్రా ......... , కృష్ణా .......అని నేనూ చెల్లి ఆడిగాము .
మరికొన్నిరోజు......... 
అంతే బొమ్మలతో ఆడుకుంటున్న బుజ్జిఅక్కయ్య పరుగునవచ్చి నా కాలిని చుట్టేసింది.
బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ప్రాణంలా గుండెలపై హత్తుకొని , రేయ్ నెలరోజులు అన్నావు అయిపోయింది . ఇక మావల్ల కాదు . నావల్ల కూడా కాదు తమ్ముడూ ........, 
రేయ్ మామా , కృష్ణా ......... నాకు తెలియదా , ఇక్కడి పని పూర్తవగానే మీరు హైద్రాబాద్ వెళ్ళండి డ్యూటీ పూర్తిచేసుకుని నేనెవస్తాను అనిచెప్పాడు .
ఇలా అన్నావు బాగుంది . లేకపోతే అయిపోయేవాడివి అని అందరమూ నవ్వుకున్నాము .
అన్నయ్యా ......... నా చేతులతో తినిపిస్తాను రా అని కిందకు పిలుచుకునివేలుతూ , బుజ్జిఅక్కయ్యకోసం ఇన్ని బొమ్మలా ........, అక్కడ ఎయిర్పోర్ట్ లో పర్మిషన్ ఇవ్వలేదు చెల్లీ లేకపోతే షాప్ మొత్తం తీసుకొచ్చేవాన్ని అని బుజ్జిఅక్కయ్య నవ్వుని చూసి ఎంజాయ్ చేస్తూ , స్వాతి ప్రసన్నా కూడా వస్తామని చెప్పారు . చిన్న పని లండన్ వెళ్లారు అని వివరించాను .
నెలరోజుల తరువాత చెల్లీ , బుజ్జిఅక్కయ్య చేతులతో తింటుంటే కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేసాయి . బుజ్జిఅక్కయ్య చెల్లి చీరకొంగు అందుకొని తుడిచి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి తనూ తినింది .
Like Reply
సమయం 8:30 రేయ్ మామా ......... కార్ or బైక్ అని అడిగాడు .
తమ్ముడూ నేనూ వస్తాను అని బుజ్జిఅక్కయ్య నా గుండెలపై వాలిపోయింది . 
కార్ or బైక్ ..........అక్కయ్యా .
బుల్లెట్ అని సంతోషంతో బదులిచ్చింది .
మన బుజ్జిఅక్కయ్యకు బుల్లెట్ లో వెళ్లడమంటే చాలా ఇష్టం అన్నయ్యా .......రోజూ ఉదయం సాయంత్రం రౌండ్స్ వెయ్యాల్సిందే .
అయితే మనం బుల్లెట్ లోనే వెళుతున్నాము అని గట్టిగా హత్తుకొని బై చెప్పి బుజ్జిఅక్కయ్యకు క్యాప్ ఉంచి నేను జర్కిన్ వేసుకుని మొబైల్లో స్ట్రీట్ ఎక్కడుందో గూగుల్ చేసి , ముందు కూర్చోబెట్టుకొని నా కలలోని వ్యక్తులు నిజమో కాదో నిజం అయితే వాడి బొక్కలు విరవడానికి బయలుదేరాము .

ఈ నెలరోజులూ సిటీ మొత్తం చుట్టేసినట్లు మా నాలుగేళ్ళ బుజ్జిఅక్కయ్య టెంపుల్స్ , బీచ్ , పార్క్స్ ......... గురించి చెబుతోంది .
లవ్ యు అక్కయ్యా అని కురులపై ముద్దుపెట్టి 20 నిమిషాలలో ఏరియా చేరుకుని , అక్కయ్యా ........ టర్న్ అయ్యే వచ్చే స్ట్రీట్ అని బుల్లెట్ తిప్పాను . 

తమ్ముడూ ........ అక్కయ్య స్టాప్ స్టాప్ అని మా ప్రక్కనే వెళుతున్న బస్ వైపు చూస్తూ , బస్ లో అక్కయ్య ఉంది అనిచెప్పగానే , 
ఏమాత్రం ఆలోచించకుండా బుజ్జిఅక్కయ్య చుట్టూ ఒకచేతినివేసి బుల్లెట్ వదిలేసి ఎగిరి కిందకుదిగాను . బుల్లెట్ వెళ్లి ఒక ఇంటి కాంపౌండ్ గోడను గుద్దుకుంది . 
బస్ లోనా ......... అంటూ బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకొని వేగంగా వెళుతున్న బస్ వెనుకే అంతే వేగంతో పరుగుతీసాను . చూస్తే అది కాలేజ్ బస్ ....... మెయిన్ రోడ్ చేరుకోగానే మరింత వేగంతో వెళుతోంది .
బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో కన్నీళ్ళతో తమ్ముడూ ఫాస్ట్ ఫాస్ట్ ........అక్కయ్యా అక్కయ్యా  అని బస్ వైపు చేతిని చూపిస్తోంది .
అంతే మరింత వేగంతో బస్ వెనుకే పరుగుతీసాను . బస్ మాకంటే వేగంతో సెకను సెకనుకూ దూరం దూరం వెళ్లిపోతోంది . అధిచూసి బుజ్జిఅక్కయ్య మరింత ఏడుస్తోంది .
నా హృదయం చలించిపోయి కన్నీళ్లుగా కారుతూ ఆయాసం వస్తున్నా , వొళ్ళంతా చెమటపట్టినా , దాహం వేస్తున్నా ఎక్కడా ఆగకుండా బస్ ఏ రూట్ లో వెలితో అటువైపు వెనుకే పరుగుతీసాను .
20 నిమిషాల తరువాత ఒకదగ్గర ఆగడంతో శక్తినంతా పాదాలలోకి తీసుకుని పరుగుపెట్టాను .
ఇంజనీరింగ్ కాలేజ్ ముందు బస్ ఆగింది . అందులోనుండి గర్ల్ స్టూడెంట్స్ ఒక్కొక్కరే దిగుతున్నారు , దిగి లోపలికివెళుతున్నవారిని ఆయాసంతో చూసి కనిపించకపోవడంతో బుజ్జిఅక్కయ్య కన్నీళ్లను చేతితో తుడిచి బస్ డోర్ వైపే కన్నార్పకుండా చూస్తూ అతివేగంతో కొట్టుకుంటున్న గుండె చప్పుడు అక్కయ్యా అక్కయ్యా అక్కయ్యా........ అని మారిపోతుంటే కాస్త దూరంలో నిలబడ్డాను .

తమ్ముడూ తమ్ముడూ ......... అదిగో అక్కయ్య అక్కయ్య అని స్టెప్స్ దిగుతున్న అక్కయ్యవైపు చూపించి , అక్కయ్యా అక్కయ్యా ......... అని గట్టిగా పిలుస్తోంది .
అక్కయ్య కాలేజ్ రోజుల్లో ఎలా ఉండేవారో అలాగే అచ్చుగుద్దినట్లు ఉన్న స్టూడెంట్ భుజం పై బ్యాగు వేసుకుని కిందకు దిగింది .
తనను చూస్తుంటే నా హృదయం పారవశ్యానికి లోనై , వొళ్ళంతా తియ్యదనం అనువణువుకీ చేరుతోంది . ఆమెను అలా కన్నార్పకుండా చూస్తూ కదలకుండా ఉండిపోయాను .
బుజ్జిఅక్కయ్య మాత్రం తమ్ముడూ అక్కయ్య , అక్కయ్యా అక్కయ్యా ........ అని ప్రాణంలా పిలుస్తోంది . వందల్లో స్టూడెంట్స్ కాలేజ్ గేట్ దగ్గర చేరి కోలాహలంతో మాట్లాడుతూ నవ్వవుకుంటూ వెళుతుండటం వలన బుజ్జిఅక్కయ్య పిలుపు ఆమెవరకూ వెళ్లడం లేదు .

 " మహి " కాలేజ్ బస్ లోకూడా చదువుతూ రావాలా ఇదిగో పెన్ సీట్లో మరిచిపోయావు . చదువుల రాణివే నువ్వు లవ్ యు అంటూ కురులపై ముద్దుపెట్టి చేతులుపట్టుకొని లోపలికి నడిచారు . 
మహి ........... బ్యూటిఫుల్ name , నాకు తెలియకుండానే పాదాలు ఆమెవైపు పడ్డాయి . ఎవరో ఛాతీపై చేతినివేసి ఆపినట్లు అనిపించడంతో తేరుకున్నాను . బుజ్జిఅక్కయ్య ఇంకా అక్కయ్యా అక్కయ్యా ......... అని కేకలువేస్తూనే ఉంది .
ఐడెంటిటీ కార్డ్ చూపించమని సెక్యూరిటీ అడిగాడు .
నేను స్టూడెంట్ కాదు అన్నా ఒకరికోసం వచ్చాను అనిచెప్పాను . 
లోపలికి వెళ్లడం కుదరదు బాబు అని వెనక్కు పంపించారు .

ఆమెను మహిని ఎగిరిగిరిచూస్తూనే డ్రెస్ కలర్ .......... 
బ్లూ తమ్ముడూ .........
లవ్ యు అక్కయ్యా అని బుగ్గపై ముద్దుపెట్టి రెండువైపులా చూసి , బస్ కు అటువైపు వెళ్లి ఎవరూ లేకపోవడం గమనించి కాంపౌండ్ గోడపై బుజ్జిఅక్కయ్యను కూర్చోబెట్టి ఎక్కి క్రికెట్ గ్రౌండ్ లోకి దిగి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని మెయిన్ గేట్ నుండి బిల్డింగ్ వైపు నడుస్తున్న అమ్మాయిల దగ్గరకు వెళ్లి బ్లూ డ్రెస్ బ్లూ డ్రెస్ అని గ్రూప్స్ గ్రూప్స్ గా చిరునవ్వులు చిందిస్తున్న స్టూడెంట్స్ ను మరియు చాలా స్టూడెంట్స్ బ్లూ డ్రెస్ వేసుకునిరావడంతో వాళ్ళ దగ్గరకువెళ్లి చూసి నిరాశ చెందుతున్నాము .
ఇంతలో కాలేజ్ బెల్ కొట్టడంతో నిమిషాల్లి అందరూ బిల్డింగ్ లోపలికి వెళ్లిపోయారు .

అక్కయ్యా .......... లంచ్ సమయం వరకూ వేచిచూడాల్సిందే బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గరకూడా సెక్యూరిటీ ఉన్నారు . కనిపించామంటే అందరూ కలిసి బయటకు తోసేస్తారు అని చెట్లవెనుక దాచుకుని బాధపడుతుంటే , 
తమ్ముడూ .......... అక్కయ్య అక్కడ అని గ్రౌండ్ ప్రక్కనే ఉన్న చెట్టుకింద స్టోన్ బెంచ్ పై కూర్చున్న కొంతమంది అమ్మాయిల మధ్యన బ్లూ డ్రెస్ అమ్మాయిని చూపించి మురిసిపోతోంది .
వాళ్లకు మరియు సెక్యూరిటీకి కనిపించకుండా కాస్త దగ్గరకు వెళ్లి పొదల వెనుకనుండి తొంగిచూస్తున్నాము .

మహి ఏంటి ఇక్కడే ఆగిపోయావు రా ........
డ్యూ అమౌంట్ కడితేనే క్లాస్ కు రమ్మని ప్రిన్సిపాల్ గారు చెప్పారు . అమ్మ బాధపడుతుందని వచ్చాను అని కళ్ళల్లో నీళ్లతో చెప్పింది .
అయితే లైబ్రరీకి వెళదాము పదా మహి అనిచెప్పారు .
లైబ్రేరియన్ కూడా ఇదేవిషయం చెప్పారు .........
అయితే నీతోపాటే మేముకూడా ఇక్కడే ఉంటాము అనిచెప్పారు .
లావణ్య , స్వాతి ......... please క్లాస్ కు వెళ్ళండి . I am హ్యాపీ ........ నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలియదా , బుక్స్ అన్నీ తీసుకొచ్చాను . ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే చదువుతూ ఉంటాను . మన కాలేజ్ సెక్యూరిటీ బెస్ట్ అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు . 
మహి నువ్వు ఎన్ని ..........
మీరు వెళ్ళకుంటే నామీద .......
మహి స్టాప్ అని ఆపి , నువ్వు అంటీ మాకు ప్రాణమే ......... నీకోరిక ప్రాకారమే వెళతాము పీరియడ్ పీరియడ్ కూ ఒక మెసేజ్ పెట్టు అనిచెప్పారు .
ఒసేయ్ మరిచిపోయారా ...........
తెలుసమ్మా దేవకన్యా తెలుసు కాలేజ్ అందగత్తెవు కదా అందుకే మా భయం . ఇదిగో నా మొబైల్ అని ఒకరు అందించి చదువు మాత్రమే కాదు సాంగ్స్ విను , యూట్యూబ్ చూడు .......... క్లాస్ అయిపోగానే మెసేజ్ రాకపోతే మేమంతా ఇక్కడకువచ్చేస్తాము అని హత్తుకొని ముద్దులుపెట్టి , ఎప్పుడో ఒకప్పుడు నిన్ను అందరమూ కలిసి రేప్ చేసేస్తాము అని వెళ్లారు .
బుజ్జిఅక్కయ్యకు ఏమి అర్థమైందో ఏమో నోటికి చేతిని అడ్డుపెట్టుకుని నవ్వడం చూసి నవ్వుకుని గుండెలపై ప్రాణంలా హత్తుకొని మహివైపు చూస్తూనే ఉన్నాము .

అక్కయ్యా ......... తను మన అక్కయ్య కాదు కానీ same to same అలాగే ఉంది. ఆమె పేరు మహి నువ్వూ విన్నావుకదా అని గుసగుసలాడాను .

తమ్ముడూ కొద్దిరోజుల ముందు సినిమాకు వెళ్ళాము అందులో హీరోయిన్ కంటే మహి అక్కయ్య అందంగా ఉంది . వాళ్ళు చెప్పినట్లు దేవకన్యనే , కాలేజ్ అందగత్తె ........... అని సంతోషించాము .
గంట గంటకూ మెసేజ్ పంపించే సమయం లో మొబైల్ చేతిలో తీసుకుంటోంది తప్ప మిగతా సమయం మొత్తం ఏకాగ్రతతో స్టడీస్ లో మునిగిపోయింది .
అక్కయ్యా .......... అందగత్తే కాదు బస్ దగ్గర విన్నమాట నిజమే చదువుల రాణి కూడా .......... బ్యూటీ విత్ బ్రైన్స్ ........ అని చెప్పాను .

మూడు గంటల తరువాత లంచ్ బెల్ మ్రోగడం నిమిషాల్లో మహి ఫ్రెండ్స్ వచ్చి మా ఏంజెల్ ను ఎవ్వరూ ఎత్తుకెళ్లలేదు అని కవ్వించి లవ్ యు రా మహి అని ఇద్దరు చెరొకవైపు హత్తుకొని , మొబైల్ అందుకొని రీసెంట్ apps చూసి , నిన్నూ ........ చెప్పానుకదే ఇది బుక్స్ తప్ప మొబైల్ గురించి పట్టించుకుని ఉండదని , మెసేజ్ తప్ప ఇంకేమీ ఓపెన్ చెయ్యలేదు . ఏమమ్మా చదువుల రాణి బుక్ మొత్తం అయిపోగొట్టేసావా ఇక చాలు అని లాక్కుని బుక్స్ మూసేసారు .
అందరూ లంచ్ బాక్స్ లు ఓపెన్ చేశారు , ఘుమఘుమలు మావరకూ చేరాయి . మహి బాక్స్ ఓపెన్ చేసి పెరుగన్నం తింటోంది . 
మహి పెరుగన్నం ఆవకాయ మాకు ఇవ్వు అని అందరూ తమ లంచ్ బాక్స్ లను అందించారు .
ఆనందబాస్పాలతో మీరు నా ఫ్రెండ్స్ గా దొరకడం నా అదృష్టం అని చేతులను అందుకొని ముద్దుపెట్టింది .
అంతేలేదు దేవకన్యతో ఫ్రెండ్షిప్ దొరకడం మా అందరి అదృష్టం అని షేర్ చేసుకుంటూ తిన్నారు .

బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో నీళ్ళు చూసి తుడిచాను . తమ్ముడూ నీ కళ్ళల్లో కూడా కన్నీళ్లు అని పెదాలపై చిరునవ్వుతో తుడిచింది .
అక్కయ్యా ........ ఆకలేస్తోందా అని అడిగాను . 
ఊ ........ అంది .
క్యాంటీన్ కు వెళదాము నీకు ఇష్టమైనవి తినొచ్చు అనిచెప్పాను .
అంతకంటే ముందు మహి అక్కయ్య చేతితో ఒక ముద్ద తినాలని ఆశగా ఉంది అని నానుండి కిందకు దిగి బుడి బుడి అడుగులు వేసుకుంటూ వెళ్లి , మహి అక్కయ్యా ....... ఆ తినిపించు అని ఆర్డర్ వేసింది .
నాకు నవ్వు వచ్చేసింది .
క్యూట్ గర్ల్ .......... మీ పేరెంట్స్ ఎక్కడ మహి తనపై కూర్చోబెట్టుకొని ముద్దుపెట్టి అడిగింది .
ముందు ఆ ........ అని నోరుతెరిచింది .
ఉమ్మా .......... అంటూ మరొకముద్దుపెట్టి తినిపించింది . 
 తిని కిందకుదిగి లవ్ యు మహి అక్కయ్యా బై మళ్లీ కలుద్దాము అని పరుగున నాదగ్గరికివచ్చింది .
పాప పాప .......... అని లేచి చూస్తే గుంపులో ఎక్కడా కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు .

తమ్ముడూ అక్కయ్య చేతిముద్ద రుచి తెలియదు కానీ మహి అక్కయ్య చేతిముద్ద అమృతంలా ఉంది అని పొగడ్తలతో ముంచెత్తుతూ నా ముద్దులను ఆస్వాదిస్తూ కాలేజ్ క్యాంటీన్ చేరుకున్నాము . 
తమ్ముడూ అది అది అది ........ అని చూపించడం , చూపించినవన్నీ కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ తీసుకుని ఒక టేబుల్ పై బుజ్జిఅక్కయ్యను కూర్చోబెట్టి కుర్చీలో కూర్చున్నాను . బుజ్జిఅక్కయ్య ఒక్కొక్కటే టేస్ట్ చేసి కూల్ డ్రింక్ తాగుతూ తమ్ముడూ బాగుంది అని నాకు అందించింది . లవ్ యు అక్కయ్యా ........ tasty అని తిన్నాను .
మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే చెల్లి నుండి ..........
బుజ్జిఅక్కయ్య మొబైల్ అందుకొని ఎత్తి అమ్మా ......... మేము తింటున్నాము సాయంత్రం వరకూ రావడం కుదరదు ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాము బై అని కట్ చేసేసింది .
Ok ok ......... డిస్టర్బ్ చెయ్యము లవ్ యు అని బోలెడన్ని స్మైలీ లు పంపించడం బుజ్జిఅక్కయ్యకు చూపించి నవ్వుకున్నాను .
బుజ్జిఅక్కయ్య తిని వాటర్ తాగి మిగిలిన కూల్ డ్రింక్ నాకు పెట్టుకోమని అందించి , cone ఐస్ క్రీమ్ అని అడిగింది .
బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని కోన్ ఐస్ క్రీమ్ తీసుకుని అందించాను .
తమ్ముడూ .......... మహి అక్కయ్యదగ్గరికి తీసుకెళ్లు అని కోరడంతో మళ్లీ మా స్పాట్ లో చేరిపోయాము .

మహి తన ఫ్రెండ్స్ తో అక్కయ్యలా అందమైన నవ్వుతో ఎంజాయ్ చేస్తుంటే అలా చూస్తుండిపోయాము . బెల్ కొట్టగానే మహి ......... బుక్స్ మొత్తం తీసుకెళ్లిపోతున్నాము . ఓన్లీ మొబైల్ అని ఏకంగా ఇద్దరు తమ మొబైల్స్ అందించారు . ఒకటి ఛార్జింగ్ అయిపోతే మరొకటి . లాంగ్ బెల్ కొట్టేలోపు రెండు మొబైల్స్ స్విచ్ ఆఫ్ అయిపోవాలి . ఏ ఒక్క మొబైల్లో ఛార్జింగ్ ఉన్నా ఏమిచేస్తామో తెలుసుకదా నీ బట్టలు చింపేసి రేప్ చేసేస్తాము జాగ్రత్త .......... లవ్ యు లవ్ యు లవ్ యు రా మహి అని కురులపై నలుగురూ ముద్దులుపెట్టి , మహి చేతిలోని పెన్ కూడా లాక్కుని నవ్వుతూ ఒసేయ్ మహికి వాట్సాప్ లేదు , facebook లేదు , insta లేదు , టిక్ టాక్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు .........అందుకే కాదే అదంటే మనకు ప్రాణం అని సంతోషంతో వెళ్లారు .
బుజ్జిఅక్కయ్య కాసేపు ఆపకుండా నవ్వుతూనే ఉంది .
లవ్ యు ఫ్రెండ్స్ అని ఫ్లైయింగ్ కిస్ వదిలి కాసేపు headphones పెట్టుకుని పాటలు, కొద్దిసేపు యూట్యూబ్ , అవేమీ ఇష్టం లేనట్లు మొబైల్స్ చేతిలోపట్టుకుని క్యాంపస్ పచ్చదనం , పూల చెట్లను ఆస్వాదిస్తూ అలా నడుచుకుంటూ క్యాంపస్ మొత్తం కొద్దిసేపు సంతోషంతో , కొద్దిసేపు కళ్ళల్లో చెమ్మతో బాధపడుతూ సమయం చూసి పరుగునవచ్చి same ప్లేసులో కూర్చుని అప్పటివరకూ సాంగ్స్ వింటున్నట్లు చెవిలో headphones పెట్టుకుంది . 
నిమిషానికే లాంగ్ బెల్ కొట్టడంతో సమయం చూస్తే 4:30 అయ్యింది .

స్టూడెంట్స్ అందరితోపాటు మహి ఫ్రెండ్స్ వచ్చి మొబైల్స్ చూసి ఇప్పటివరకూ చేసిన యాక్టింగ్ చాలు 10% కూడా ఛార్జింగ్ తగ్గలేదు , నిన్నూ ......... అని బుగ్గలనూ నడుమునూ గిల్లేసి ఎంత మెత్తగా ఉన్నావురా మహి , రాత్రికి ఇంటికి వచ్చేస్తాము , ఫ్రెండ్స్ రేప్ చెయ్యడానికి రెడీ అవ్వండి అని అందరూ నవ్వుకుని కాసేపు మాట్లాడుకుని బయటకువచ్చి రెడీగా ఉన్న కాలేజ్ బస్ ఎక్కారు .
మమ్మల్ని ఆపిన సెక్యూరిటీకి hi చెప్పి వాడు ఆశ్చర్యపోతుంటే నవ్వుకుని బయటకువచ్చి , ఒక ఆటోలో కూర్చుని ఆ బస్ ను ఫాలో అవ్వమని చెప్పాను . 
అక్కయ్యా ....... ఆకలేస్తోందా ........
లేదు తమ్ముడూ ......... మధ్యాహ్నం చాలా తిన్నాము కదా అని నవ్వుకున్నాము .
వేడిగా ఉంది అని జర్కిన్ విప్పాను . తమ్ముడూ నేను పట్టుకుంటాను అని అందుకుంది .
బస్ కదలగానే అన్నా ........ బస్ ఎక్కడైనా ఆపితే ఆటోని బస్ డోర్ కనిపించెదగ్గర ఆపు అని 200 నోట్ అతడికి అందించాను . 
అలాగే సర్ ........ అని బస్ ఆగిన చోట ఆగుతూ ఏరియా ఏరియా లు తిరుగుతూ గంట తరువాత ఉదయం వెళ్లిన ఏరియా కు చేరుకుంది . తమ్ముడూ ......... బుల్లెట్ లేదు .
బుజ్జిఅక్కయ్యా ......... కీస్ దానికే ఉందికాబట్టి ఎవరైనా తీసుకెళ్లి ఉంటారు లేకపోతే సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకువెళ్ళిఉంటారు . దానిసంగతి మీ నాన్నకు అప్పగిద్దాము మనం ఇంటికివెళ్ళేలోపు తీసుకొస్తాడు అని కాల్ చేసి విషయం చెప్పాను . Thats it అక్కయ్యా ........ అని గట్టిగా చుట్టేసి తలపై ప్రాణమైన ముద్దుపెట్టాను . 

కొద్దిగా ముందుకువెళ్లిన తరువాత చిన్న బస్ స్టాప్ దగ్గర బస్ ఆగడం , అందులోనుండి  దిగి మహి చేతిని అందుకొని ఆటో స్టాండ్ దగ్గరికి చేరుకున్నారు .
లావణ్య , స్వాతి ........ అమ్మకు చెప్పకుండా ఎక్కడికూ వెళ్ళను అని మీకు తెలుసుకదా ,
అదేనా నీ ప్రాబ్లం ........ , ఉదయం కాలేజ్ కు వెళ్ళేటప్పుడే అంటీతో పర్మిషన్ తీసేసుకున్నాము నెక్స్ట్ వీక్ కాలేజ్ ఫంక్షన్ కోసం షాపింగ్ వెళతామని కావాలంటే కాల్ చేస్తాను నువ్వే మాట్లాడు అని చేసి అందించారు .
అమ్మా ........ అని ఏదో విని లవ్ యు అమ్మా , సంతోషంతో ok అని ఆటోలో బయలుదేరారు .
అన్నా ........ ఆటోని ఫాలో అవ్వండి అనిచెప్పాను .
15 నిమిషాలలో ఒక మాల్ ముందు ఆగి లోపలకువెళ్లారు . 
ఆటో డ్రైవర్ కు మరొక వంద అందించి దిగి అక్కయ్యను ఎత్తుకుని లోపలకువెళ్లాము.

 వాళ్ళు సారీస్ , డ్రెస్ లు చూస్తుంటే అక్కయ్యా ........ వాళ్ళ సెలక్షన్ ఇప్పట్లో అవ్వదు, వాళ్ళు ఎక్కడికీ వెళ్ళరు మనం ఏమైనా తిందాము అనిచెప్పాను . 
తమ్ముడూ పిజ్జా తీసుకొనివచ్చి ఇక్కడే తిందాము , నాకు మహి అక్కయ్యను చూస్తూనే ఉండాలనిపిస్తోంది అని మాల్ ఎదురుగా ఉన్న పిజ్జా హట్ కు వెళ్లి ఒకటి ఆర్డర్ చేసాను .
తమ్ముడూ మూడు ..........మహి అక్కయ్యకూ మరియు తన ఫ్రెండ్స్ కు , ఎవరు ఇచ్చారో వాళ్లకు తెలియకూడదు అని కోరిక కోరింది . 
అలాగే అక్కయ్యా ........ అని పిజ్జా డెలివరీ బాయ్ ను పిలిచి మాల్ లో ఐదుగురు షాపింగ్ చేస్తూ ఉంటారు అందులో ఇద్దరి పేర్లు మహి , లావణ్య ........, వెళ్లి ఇచ్చేసి ఎవరంటే తెలియదు అనిచెప్పేసి వచ్చేయ్యాలి అని 500 ఇచ్చాను . 
Yes సర్ అని రెండు పిజ్జా బాక్స్ లతో వెళ్లి ఇచ్చివచ్చాడు . థాంక్స్ చెప్పి అక్కయ్యను ఎత్తుకుని మరొకచేతిలో పిజ్జా పట్టుకుని మాల్ వైపు నడిచాను .
బుజ్జిఅక్కయ్య ఒక పీస్ అందుకొని నాకు తినిపిస్తూ తనూ తింటూ పైకివెళ్లి వాళ్లకు కనిపించకుండా కాస్త దూరం లో కూర్చుని అక్కయ్య చేతితో పిజ్జా తిన్నాను . 
బుజ్జిఅక్కయ్య స్తంభం వెనుక దాక్కుని మహివాళ్ళవైపు చూసి తమ్ముడూ తింటున్నారు అని సంతోషంతో వచ్చి నాపై కూర్చుంది .

అక్కయ్యా ......... నీకు కూడా షాపింగ్ చేద్దామా అని అడిగాను .
ఇప్పటికే నా బట్టలతో రూమ్ నిండిపోయింది అని అమ్మ మిమ్మల్నే తలుచుకుంటూ నవ్వుతుంది . మళ్లీ తీసుకెళితే కొట్టినా కొట్టేస్తారు అని నవ్వుకుని , మా బుజ్జిఅక్కయ్య బంగారం అని గుండెలపై హత్తుకొని నుదుటిపై ముద్దులుపెడుతూనే ఉన్నాను .
పిజ్జా తిన్నాక కాస్త దగ్గరకువెళ్లి కూర్చున్నాము .
గంట తరువాత ఇద్దరు చీరలూ , ఇద్దరు డ్రెస్ లు సెలెక్ట్ చేశారు . 
మహి .......... నువ్వు ఈ రెడ్ కలర్ లెహంగాలో ఏంజెల్ లా ఉంటావు అని చూపించారు . 
బాగుంది లావణ్యా ......... నాకు అవసరం లేదు మీరు తీసుకోండి అని సంతోషంతో బదులిచ్చింది .
కాలేజ్ ఫంక్షన్ లోపు మేమంతా డబ్బు జతచేసి నీకు గిఫ్ట్ గా మేమే ఇస్తాము అని కౌగిలించుకుని , వాళ్ళు నలుగురూ సెలెక్టచేసిన వాటి price అడిగారు . 
వాడు చెప్పగానే అందరికీ చుక్కలు కనిపించినట్లు బర్గైన్ చెయ్యడం - fixed రేట్స్ అని బదులివ్వడంతో నిరాశతో వెనుతిరిగారు .

ఆటోలో మళ్లీ అదే బస్ స్టాప్ దగ్గర దిగి డబ్బు ఇచ్చి ముందుకు నడిచారు .
వెనుకే మరొక ఆటోలో మేమూ దిగి బస్ స్టాప్ పేరు చూసి అక్కయ్యా ......... నా కలలో కనిపించిన same స్ట్రీట్ అంటే కొద్దిగా ముందుకువెలితే నాకు నిద్రలో కనిపించిన ఇల్లు కనిపిస్తుంది అన్నమాట అని మహి అండ్ ఫ్రెండ్స్ వెనుకాలే వెళ్ళాను .
తమ్ముడూ ......... ఉదయం నుండీ ఎత్తుకున్నావు , చేతులు నొప్పిస్తాయి కిందకుదించు నడుచుకుంటూ వస్తాను అనిచెప్పింది .
మా బుజ్జిఅక్కయ్య బంగారాన్ని ఇలా ఎన్నిరోజులైనా ఎత్తుకుంటాను నాకేమీ కాదు .
అదికాదు తమ్ముడూ నాకు నడవాలని ఉంది అని కోరడంతో , అలాగే అక్కయ్యా జాగ్రత్త అని రోడ్ కు మరొకవైపు చేతినిపట్టుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళాను . జర్కిన్ బరువుగా ఉన్నాకూడా ఇటివ్వమని అడిగినా మరొక చేతితో పట్టుకుంది .

అక్కయ్యా ......... ఈ పరిసరాలన్నీ నా కలలో చూసాను . ఇక్కడే ఎక్కడో ఇల్లు అనేంతలో , 
తమ్ముడూ మహి అక్కయ్య వాళ్ళు కాంపౌండ్ లోపలికి వెళుతున్నారు అని చెప్పింది .
కలలో కనిపించిన కాంపౌండ్ , ఇల్లు అదే ......... అంటే కలలో జరిగిన సంఘటన కూడా నిజం . ఆ ఐదుగురు ఫ్రెండ్స్ లలో ఆ ఇల్లు ఎవరిదై ఉంటుంది . అక్కయ్య రూపమైన మహి ఇల్లు మాత్రం కాకూడదు అని అమ్మవారిని ప్రార్థిస్తూ అక్కడే ఆగిపోయాను . 
తమ్ముడూ ........ నేను వెళుతున్నాను అని బుడి బుడి అడుగులతో ఆ ఇంటివైపు నడిచింది .
అక్కయ్యా ....... జాగ్రత్త అని అడుగువేశానో లేదో ఒకరి కాలు తగిలి కిందపడిపోయాను .
దుమ్ము దులుపుకుని వెనక్కుతిరిగిచూసాను . 
 నలుగురు స్టూడెంట్స్ వయసున్న కుర్రాళ్ళు విద్యుత్ స్థంభం వెలుగులో క్యారెమ్స్ ఆడుతూ పర్ఫెక్ట్ షాట్ రా మామా అని నవ్వుకున్నారు .
ఎస్క్యూస్ మీ ........... అని వాళ్లదగ్గరకువెళ్ళాను .
లేకపోతే మా ఏరియా సిస్టర్స్ వెంట పడితే మేము ఊరికే ఉంటామా , మా ఏరియా లో ఏ అమ్మాయికి కష్టం రానివ్వము అని కోపంతో చెప్పారు .
సిస్టర్స్ అన్నారు కాబట్టి కూల్ అయిపోయి హలో hi బ్రదర్స్ నేను ఆ ఇంటిపైన ఉన్న పోర్షన్ లో ఉండటానికి వచ్చాను అనిచెప్పాను .

ఓ ........ అలాగా , మా ఏరియా లోని అందరమూ , ప్రతి ఒక్క ఇల్లూ గౌరవించే వాసంతి మేడం ఇంటిపై ఉన్న పోర్షన్ కోసం వచ్చావా ........ 
వాసంతి .......... అని పేరు వినిపించగానే నా వొళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లు బాడీ విదిల్చి , వాసంతి అన్న పేరు లోకంలో ఎంతమందైనా పెట్టుకోవచ్చుకదా అని తెలిసి నిరాశ చెందాను .
బ్రదర్ ......... ఆ పోర్షన్ ఎక్కడికీ వెల్లదు ఒక గేమ్ ఆడండి అని వారిస్తున్నా బలవంతంగా ఒకడు లేచి కూర్చోబెట్టాడు .
స్ట్రైక్ అందుకొని కొట్టేలోపు లేచినవాడు వెనుక నా షర్ట్ పట్టుకుని పైనుండి కిందవరకూ సర్రున చింపేశాడు .

తమ్ముడూ .......... అంటూ పరుగునవచ్చింది అక్కయ్య .
లేచి బటన్స్ ఒక్కొక్కడిపై ఎగిరిపడేలా షర్ట్ రెండువైపులకూ లాగేసి నానుండి వేరుచేసి క్యారెమ్ బోర్డ్ పై పడేసాను .
నా ఛాతీ నెంబర్ ప్యాక్స్ చూసి మిగితా ముగ్గురూ భయంతో లేచి రెండు అడుగులు వెనక్కువేశారు .
బుజ్జిఅక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకుని , తమ్ముడూ నీ బాడీని చూసే భయపడిపోయారు పాపం చిన్నపిల్లలు వదిలెయ్యి అని జర్కిన్ అందించడంతో వేసుకున్నాను . 
వెనుక షర్ట్ కోసినవాడు నోరుతెరిచి అలా చూస్తుంటే నవ్వుకుని బ్రదర్స్ పోర్షన్ చూసుకోవాలి తరువాత కలుద్దాము అని బుజ్జిఅక్కయ్యకు లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి చేతిని అందుకోగానే , బుజ్జిఅక్కయ్య సర్ప్రైజ్ అంటూ లాక్కునివెళ్లింది .

రేయ్ వాడు ఒక్కడు మనం నలుగురమూ భయపడటం ఏంటి అని నామీదకు వస్తుంటే , మరొకడు నుదుటిపై రక్తంతో పరుగునవచ్చి ఆ గోవర్ధన్ గాడు రౌడీలతో వచ్చి నన్నుకొట్టాడురా బైకు కూడా తగలబెట్టేశారు అనిచెప్పడంతో పదరా వాడి సంగతి చూద్దాము , వీడు ఎలాగో ఇక్కడే ఉంటాడు కదా అని బైకులలో వెళ్లారు .
అక్కయ్యా ......... ఎందుకు అంత సంతోషంతో నన్ను లాక్కునిమరీ వెళుతున్నారు అనిఅడిగాను .
తమ్ముడూ .........నువ్వు ఊహించని సర్ప్రైజ్ , the best best గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని ఆ ఇంటి మెయిన్ గేట్ దగ్గరకు లాక్కునివెళ్లి అదిగో అని చూపించింది .

తల్లీ మహీ ........... మీ ఫ్రెండ్స్ కు గులాబీ పూలు ఇవ్వు అని కాంపౌండ్ లోని మొక్కల నుండి అందమైన గులాబీ పూలు కట్ చేస్తున్న నా ప్రాణం కంటే ఎక్కువైన గులాబీ పూలకంటే సౌందర్యమైన నా అక్కయ్యను 17 సంవత్సరాల తరువాత చూసాను . అంటే వాళ్ళు చెప్పిన వాసంతి మేడం ఎవరో కాదు నా ప్రాణమైన , ప్రియమైన దేవత నా సర్వస్వం వాసంతి అక్కయ్యే ......... అని ఫ్రీజ్ అయిపోయాను ...........
Like Reply
Good morning Mahesh sir
Thank you
[+] 2 users Like RICHI's post
Like Reply
Awesome update bro

Aso I am waiting for next update bro
మీ
Umesh
[+] 2 users Like Umesh5251's post
Like Reply
SUPER MAHESH SIR
[+] 2 users Like RICHI's post
Like Reply
Super bro keka adhurs fantastisk I have no words to pride you
[+] 2 users Like Silaka143's post
Like Reply
భయ్యా మాట్లాడటానికి చాలా తక్కువ భయ్యా ఈ అప్డేట్ తో అంతా లాగించేశావ్ కదా ఇంకా మాట్లాడటానికి ఎమ్ వుంది మిమ్మల్ని పొగడటం తప్ప ఇంకేమి లేదు

ఇలా అడగటం మా అత్యాశే కానీ అడుగుతున్న మళ్ళీ ఇక్కడే అప్డేట్ ఇస్తారు అని వేడుకుంటున్నా

మీ
నిక్123
[+] 4 users Like Nick 123's post
Like Reply
Super store sir,
[+] 1 user Likes KRISHNA1's post
Like Reply
Super bro  banana banana banana yourock Bro  inka next update kosam wait cheyali antey chalakastam bro koncham thondhara send cheya Va leaka pothey mind blast ayidhi every situation rock weekly four days ayina four times chadhuvutha
[+] 2 users Like Traju's post
Like Reply
Mahesh Garu adbutam Andi em cheppalo matalu levu...
[+] 1 user Likes shafihuseni242's post
Like Reply
(05-06-2020, 08:06 AM)Nick 123 Wrote: భయ్యా  మాట్లాడటానికి చాలా తక్కువ భయ్యా ఈ అప్డేట్ తో అంతా లాగించేశావ్ కదా ఇంకా మాట్లాడటానికి ఎమ్ వుంది మిమ్మల్ని పొగడటం తప్ప ఇంకేమి లేదు

ఇలా అడగటం మా అత్యాశే కానీ అడుగుతున్న మళ్ళీ ఇక్కడే అప్డేట్ ఇస్తారు అని వేడుకుంటున్నా

మీ
నిక్123

Na vinaapam kuda same bro malli ekkade update evvalani plz sir plz .........

❤️❤️❤️❤️❤️❤️

@madhu97
[+] 3 users Like ravali.rrr's post
Like Reply
మహేష్ గారు అప్డేట్ని చాలా చాలా అద్భుతంగా రచించారు, కానీ లాస్ట్ లో వాసంతి గారిని చూపి నెక్స్ట్ అప్డేట్ కోసం మా మహేష్ గారు ఎప్పుడు ఇస్తారా అని వేయి కళ్లతో ఎదురు చూసేలా చేశారు.
[+] 4 users Like Kasim's post
Like Reply




Users browsing this thread: 362 Guest(s)