Thread Rating:
  • 12 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మాయ
మాయ - 19

Back to పెంచలాపురం.......


ధనుంజయ్ కి కట్టు కట్టి పంపించాక కిరీటి తయారయ్యి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. రంగ అప్పుడే వచ్చినట్టున్నాడు గోరు వాడికేదో ఉత్సాహంగా చెప్తున్నాడు. ‘అరేయ్ మామా, రంగ మిస్ అయిండురా రేత్తిరి గలాటా. నువ్వు కూడా సెప్పు’ అంటే ‘ఏం జరిగిందిరా రాత్రి?’ అని ఎదురు ప్రశ్న వేశాడు.

‘ఓర్నీయవ్వ, ఊళ్ళో ప్రతి మడిసి లెగిసి గుడికాడకి లగెత్తుకొచ్చినారు గందా! నువ్వేడుండావు?’

‘రాత్రి పడుకున్నవాడిని ఇప్పుడే ఒక గంట క్రితం లేచానురా. ఏమన్నా విశేషం జరిగిందా.’

గోరు ఒక గొప్ప సీక్రెట్ బయటపెట్టేవాడిలా వాళ్ళని కాసేపు ఊరించాడు. ఇద్దరూ అల్మోస్ట్ మీద పడి కొట్టినంత పని చేసేసరికి ‘సెబుతా, ఆగండ్రా’ అని వాళ్ళు నోరెళ్ళబెట్టే విషయం చెప్పాడు. ‘రేత్తిరి గుళ్ళో దొంగలు పడినారు. ఎంతమందో తెలీదు. సూరీడి ఇగ్రహం ఎత్తుకెళదామని వొచ్చారు లాగుంది. కానీ సామి మహిమ. రగతం కక్కుకు సచ్చారు దొంగనాయాళ్ళు.’

కిరీటి మైండ్ లో ఏదో అలారం మోగుతోంది. ‘ఏమంటున్నావురా? దొంగలు గుళ్ళో పడి చచ్చిపోయారా? అసలు ఊళ్ళో వాళ్ళకి ఎలా తెలిసింది దొంగలు పడ్డారని?’ అంటూ ప్రశ్నలు గుప్పించాడు.

‘దొంగోళ్ళు మన సేతికి సిక్కలే. అర్ధరేత్తిరి టయంలో గుళ్ళోనుంచి కేకలు ఇనబడ్డాయి. అట్టాన్టి ఇట్టాన్టి కేకలు కాదు. మడుసులు ఎవరూ అలాగ అరవడం ఎప్పుడూ ఇన్లేదని సెప్పాడు మా అయ్య. జనాలు గుడికాడకి ఎల్లే తలికి గుడి తాళాలు బద్దలు కొట్టున్నాయంట. లోపలికి పోయిన మొనగాళ్ళు వణికిపోతా బయటికొచ్చారు. నీళ్ళ బిందిలో పట్టేతంత రగతం సాములోరి ఇగ్రహం కాడ జూసి అందరికీ మాటలు పడిపోయినయ్యి. పెసిడెంటు గారింటి కాడ రేత్తిరి నించీ పెద్ద పంచాయితీ నడుస్తాంది.’ అంటూ బాంబు లాంటి వార్త చెప్పాడు.

కిరీటి, రంగా ఆ మాట విని షాక్ లో వున్నారు. ‘ఊరు ఊరంతా రేత్తిరి నిద్దర పోలే. ఊళ్ళోకొచ్చే దార్లు మూసేసినారంట. సంత లేపేసినారు పొద్దుగాలే అంటాండారు’ చెప్పుకుపోతున్నాడు గోరు. ఇంతలో రాజన్న వస్తూ కనిపించాడు. వీళ్ళ దగర ఆగి కిరీటితో ‘అబ్బీ, నీకు కుదిరినంక ఓ తూరి పెసిడెంటు గారింటికి పో. మీ అయ్యని రమ్మని కబురంపిండు పెదబాబు. నువ్వు కానబడితే పంపియ్యమండు’ అని చెప్పాడు.

‘వెళ్తున్నా బాబాయి’ అని చెప్పి ప్రెసిడెంటు గారింటికి బయల్దేరాడు కిరీటి. అక్కడంతా కోలాహలంగా వుంది. ఎప్పుడూ రాత్రిళ్ళు ఆయన ఇంట్లో పడుకునే ఇద్దరు పాలెగాళ్ళు కాక ఇంకొక పది మంది జమాజెట్టీలు కాపలా కాస్తున్నారు అక్కడ. పెదబాబు అరుగుమీద కూర్చొని చుట్టూతా వున్న జనాలతో మాట్లాడుతున్నారు. కిరీటిని చూడగానే ‘రేయ్, మీ బాబు పనికి కావల్సిన టయంలో ఎప్పుడూ ఊళ్ళో వుండడా? ఇంత గలాటా జరుగుతాంది, ఇప్పుడా ఊరిడిసి పొయ్యేది’ అంటూ చిందులు తొక్కడం మొదలెట్టారు.

అప్పుడే టీ గ్లాసులతో బయటికి వచ్చిన ఆయన భార్య ‘చాల్లే ఊర్కోండి. ఆచారి పక్కన లేకపోతే కాళ్ళు చేతులు ఆడట్లేదు అని చెప్పాల్సింది పోయి కుర్రాడి మీద అరుస్తారా? అబ్బీ, నువ్వు లోపలికి రా అయ్యా. పంచాయితీ తెమిల్చి లోపలికి రా, ఇంత తిని పో ఊళ్ళోకి. మళ్ళీ ఇంటి మొగం ఎప్పుడు చూస్తావో’ అని పెదబాబుని కసిరి కిరీటిని లోపలికి తీసుకెళ్లింది.

‘ఏమన్నా తిన్నావా బాబూ?’ అని అడిగి కిరీటి సమాధానం చెప్పేలోపే ఓ ప్లేట్ లో ఉప్మా పెట్టి ఇచ్చింది. మంచి ఆకలి మీద వున్నాడేమో కిరీటి మారు మాట్లాడకుండా తినేశాడు. ‘అబ్బీ, రాత్రి గలాటా విన్న కాడ్నించి శైలమ్మ కంటి మీద కునుకు లేకుండా నీ పేరే కలవరిస్తాంది.’ కిరీటి గుండెల్లో రాయి పడింది. నిన్న జరిగింది శైలు ఈవిడకి ఏమన్నా చెప్పిందో ఏమో అని భయపడసాగాడు.

కిరీటి ముఖంలో భయం చూసి ‘భయపడాకు, ఈ కొన్ని నెలలుగా నువ్వు, నిక్కమ్మ లేకుంటే నా బిడ్డ ఏమైపోయేనో. ఎప్పుడు చూసినా మీ ఇద్దరి మాటలే దానికి. ఓ పాలి దాన్ని చూసిరా. అట్నే నీ సేత్తో ఏమన్నా తినిపియ్యి. నా వల్ల కాటల్లేదు దానితో ఏమన్నా కతికియ్యడం. తొరగా పోయిరా, ఆయన లోపలికొస్తే నిన్ను పనిలో ముంచేస్తాడు’ అని ఉప్మా ప్లేట్ ఇచ్చి శైలు గదిలోకి పంపింది.

గదిలో శైలు మంచమ్మీద పడుకొని ఉంది. మూడంకె వేసుకొని చేతులు కాళ్ళ మధ్య పెట్టుకొని చిన్న బాల్ లా ముడుచుకొని వుంది. కోడి నిద్రలో వుందేమో కిరీటి అడుగుల చప్పుడు వినగానే చటుక్కున తల ఎత్తి చూసింది. వాడ్ని చూడగానే లేచి కూర్చుని పెద్ద పెద్ద కళ్ళతో వాడ్నే చూస్తోంది. కిరీటి తన పక్కన కూర్చోగానే వాడ్ని తన చేతులలో చుట్టేసి మొహం వాడి ఛాతీలో దాచేసుకొని ఏడవడం మొదలెట్టింది.

ఆమెను అలాగే పొదివి పట్టుకొని ఒక రెండు నిమిషాలాగి ‘శైలూ, ప్లీజ్ ఆపు. ఎందుకేడుస్తున్నావు? చూడు’ అంటూ పైకి లేపాడు. ‘రాత్రి జనాలతో పాటు వెళ్ళావా?’ అని అడిగింది. ‘నువ్వు నమ్మవు, నేను రాత్రి నిద్ర లేవలేదు. గోరు చెప్పేవరకు ఏం జరిగిందో కూడా తెలీదు నాకు’ అన్నాడు.

‘థాంక్ గాడ్, నువ్వూ నీ మొద్దు నిద్ర.’

‘మీ అత్తయ్య నువ్వు నా పేరు కలవరించావని చెప్పారు’ కొంచెం బెరుగ్గా అన్నాడు కిరీటి. ఈసారి వాడ్నింకా గట్టిగా పట్టుకొని వుండిపోయింది. ‘నాకెంత భయమేసిందో తెలుసా నీ గురించి? దొంగలు విగ్రహం పట్టుకుని రక్తం కక్కుకున్నారని చెప్పారు. నిన్న నువ్వు కూడా విగ్రహం పట్టుకెళ్ళావు ఇక్కడ్నుంచి. నీకేమన్నా ఔతుందేమో అని రాత్రి అంతా ఎంత గాభరా పడ్డానో.’

‘నేనేమన్నా దొంగనా, నాకేమన్నా అవడానికి?’ నవ్వుతూ అడిగాడు. కానీ శైలు నవ్వే మూడ్ లో లేదు. ‘అది కాదురా, నిన్న నువ్వు చక్కగా ఊరేగింపు కోసం పవిత్రంగా వస్తే నేను...నేను... నిన్ను పట్టుకొని, ముద్దు పెట్టుకొని పిచ్చిదాన్లా behave చేశాను’ అంటూ వణికిపోసాగింది.

‘శైలూ, డోంట్ వర్రీ. నాకేమీ కాలేదు. వాళ్ళు రక్తం కక్కుకున్నారని ఏంటి గ్యారంటీ? ఏదన్నా తగిలి వాళ్ళ కాళ్ళు చేతులు కోసుకుపోయి వచ్చిన రక్తమేమో అది. అసలు జరిగింది ఎవరన్నా చూసారా? పూర్తిగా వివరం తెలీకుండా ఇలా భయపడితే ఎలా? మనకు తెలిసిందల్లా ఎవరో గుడి తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారని మాత్రమే’ అంటూ సముదాయించాడు. శైలు కొంచెం శాంతించడం చూసి మెల్లిగా ఉప్మా తినిపించాడు. ‘రెస్ట్ తీసుకుంటావా, నేను మళ్ళీ కలుస్తాను’ అని అడిగాడు.

‘కిరీటీ, వాళ్ళు నిన్ను బలవంతపెడతార్రా’ అంటూ మళ్ళీ చుట్టేసింది. ‘ఎవరు, ఎందుకు?’ మెల్లిగా ఆమె తల నిమురుతూ అడిగాడు. ‘నిన్న రాత్రి అలా జరిగిన దగ్గర్నుంచీ ఒక్కళ్ళు కూడా విగ్రహం ముట్టుకోడానికి సాహసించట్లేదు. నిన్న నువ్వు ఒక్కడివే విగ్రహం పట్టుకుని సేఫ్ గా వున్నావు. అందరూ superstitious గా ఆలోచిస్తున్నారు. నిన్ను విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి మామ తిజోరీ లో పెట్టమని బలవంతం చేస్తార్రా’ వాడి ముఖంలోకి భయంగా చూస్తూ అంది.

కిరీటి తన తండ్రి దగ్గర అనుభవించిన ప్రేమ ఒక రకం, నిక్కీ దగ్గర అనుభవించిన affection ఒక రకం. కానీ ఇలా శైలు వాడిపట్ల చూపే ప్రేమ వాడు ఎప్పుడూ అనుభవించనిది. ఇంత డీప్ గా తన క్షేమం గురించి ఆలోచించే స్త్రీ రూపం వాడికి ఇప్పటిదాకా జీవితంలో లేదు. తొలిసారి తల్లిప్రేమ లాంటి ప్రేమ, కేరింగ్ experience చేసేసరికి వాడికి కళ్ళమ్మట నీళ్లొచ్చాయి.

‘భయమేస్తోందా’ అని శైలు అడిగితే లేదని తల ఊపి ఆమెను పడుకోబెట్టాడు. ‘కొంచెంసేపు పడుకో. నేను మళ్ళీ వస్తాను’ అని చెప్పి వెళ్ళాడు. కాసేపటికి పెదబాబు లోపలకి వచ్చి ‘మీ బాబు రేపు సాయంత్రం వస్తాడ్రా. పూజారి తొరగా ఏదో శాంతి చెయ్యాలి అంటాండాడు. ఇగ్రహం అలా గుళ్ళో ఒదిలెయ్యలేము. ఆయనకి కూసింత తోడుండి ఏం సెప్తాడో అది సేత్తావా’ అని అడిగారు. అది అడిగేటప్పుడు వాడి ముఖం చూడలేకపోతున్నారు ఆయన.

కిరీటి అది గమనించనట్టే ‘అలాగే పెద్దాయనా, శాంతి చేశాక విగ్రహం నేనే తెచ్చి ఇస్తాను’ అని ఆయన అడగలేని ప్రశ్నకి జవాబు చెప్పాడు. పెద్దాయన కిరీటి చేతులు పట్టుకొని ‘ఊరు ఊరంతా గగ్గోలు పెడతాండారు. సిన్న పిల్లోనివి, నీ సేత ఇసుంటి పని... మీ అయ్య వుంటే నిన్నీ పని సెయ్యమన్నందుకు నన్ను నరికి పొగులేట్టే వాడేమో. నన్ను ఒగ్గెయ్యారా’ అంటుంటే ఆయన మాట పూర్తి కానివ్వలేదు కిరీటి. ‘పెదబాబూ, మీరు ఊళ్ళో కాపలా సంగతి చూస్కోండి, నేను వస్తాను’ అని గుడికి వెళ్ళాడు.

గుడి చుట్టూతా కాపలా ఇంకా దిట్టంగా వుంది. కిరీటి గుడి లోపలికి వెళ్ళి పూజారి గారికి గుడి శుభ్రం చేయటంలో సాయపడి ఆయన విగ్రహాలన్నిటికీ శాంతి చేస్తుంటే చెయ్యగలిగిన సాయం చేశాడు. సూర్యుడి విగ్రహానికి అభిషేకం పూర్తి చేసి ‘కిరీటీ, విగ్రహం తీసుకెళ్తావా?’ అని అడిగారు పూజారి గారు.

వాడికి ఓ క్షణం గుండె దడదడలాడింది. ఇప్పటిదాకా ఎప్పుడూ దైవత్వం, మహిమలు వంటి వాటి గురించి ఆలోచించలేదు వాడు. ఎంత కాదనుకున్నా నిన్న జరిగింది తీసి పారెయ్యలేని నిజం. గుళ్ళో పడ్డ దొంగలు అరిచిన అరుపుల గురించి పూజారి గారు కూడా చెప్పారు. తన కళ్ళతో చూశాడు ఎంత రక్తం వుందో గుళ్ళో. అది ఏమన్నా కోసుకుపోతే వచ్చే రక్తంలా అనిపించలేదు వాడికి.
[+] 10 users Like mkole123's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super update
Like Reply
మాస్టారు గారు మంచి సస్పెన్స్ లో ఆపేశారు మళ్ళీ ఇంకో అప్డేట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే
ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ సూపర్
[+] 1 user Likes Pradeep's post
Like Reply
Nice update
Like Reply
Naku matram thriller movie chustunnattu vundhi
Like Reply
అబ్బా కథ మంచి సస్పెన్స్ లో ఉండగా ఆపేశారు త్వరగా ఇవ్వండి అప్డేట్ బ్రదర్
 Chandra Heart
Like Reply
అబ్బా కథ మంచి సస్పెన్స్ లో ఉండగా ఆపేశారు త్వరగా ఇవ్వండి అప్డేట్ బ్రదర్ చాలా బాగుంది
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
Super story
Like Reply
Abbaaaa..... Malli suspense lo apesara... Enti mastaru ila rasthunnaru suspense tho chanipothe evaridandi responsibility hahaha ? jokes apart story is really awesome.... ??
[+] 1 user Likes Antidote69's post
Like Reply
Nice update
Like Reply
గిరీశం గారూ, చివరి అంకం చేరుకునేముందు ఇంకా చాలా కథ వుందండి. అయితే సైట్లో వున్న కొన్ని కథల్లా (including మీ బృహన్నల) వందల పేజీలు చేరేట్టు రాయలేనేమో...


Mkole గారు..... , 
ఎన్ని పేజిలు రాసామని కాదు..... ఏం రాసాం, ఎలా రాసామనేది ముఖ్యం.....
1 , కథలో మొదటి నుండి ఇప్పటి వరకు యాస మీద పట్టు విడవలేదు.....
2 , మొదటి పేజ్ లో మొదలు పెట్టిన సస్పెన్స్
ఇప్పుడూ మేయిన్ టేన్ చేస్తున్నారు
3,  కథ చాలా సింపుల్ గా చెపుతున్నారు ...
4 , పాత్రలను మలిచిన తీరు (కీరీటి కానివ్వండి లేదా పసిడెంటు గారి పెల్లాం కానివ్వండి) సూపర్ ......
ఒక్కో పేజి నూరు పేజీలకు సమం....
Keep writing boss....
By the way nice up date.....

mm గిరీశం
[+] 4 users Like Okyes?'s post
Like Reply
Thrill thrill , u want let's read awesome story... Sailu love care affection.... Real GA ila premenche vallanu vodulukokudhu... Sunaina oka pakka... Twaraga update kosam....
Like Reply
entandi e katha intha baaga raasaru..assalu thriller intha baga rasthaara anela vundhi mi katha...simply supperb writer garu...dayachesi updatelu konchem tondaraga pettandi..tension tho chachelaaga vunnam
[+] 1 user Likes Tom cruise's post
Like Reply
Update regularly.
Like Reply
ఎన్ని పేజిలు రాసామని కాదు..... ఏం రాసాం, ఎలా రాసామనేది ముఖ్యం.....
1 , కథలో మొదటి నుండి ఇప్పటి వరకు యాస మీద పట్టు విడవలేదు.....
2 , మొదటి పేజ్ లో మొదలు పెట్టిన సస్పెన్స్
ఇప్పుడూ మేయిన్ టేన్ చేస్తున్నారు
3,  కథ చాలా సింపుల్ గా చెపుతున్నారు ...
4 , పాత్రలను మలిచిన తీరు (కీరీటి కానివ్వండి లేదా పసిడెంటు గారి పెల్లాం కానివ్వండి) సూపర్ ......
ఒక్కో పేజి నూరు పేజీలకు సమం....
Keep writing boss....
By the way nice up date.....



Abselutely correct

take a bow!

Namaskar
సర్వేజనా సుఖినోభవంతు...
[+] 3 users Like Mohana69's post
Like Reply
Super update as always
Writers are nothing but creators. Always respect them. 
Like Reply
Suspense, thriller, sex samapallalo adbhuthanga excellent ga undi story. Please update the story
Like Reply
అందరికీ కథ ఇంత నచ్చినందుకు సంతోషంగా వుంది. పెద్ద పెద్ద మాటలతో పొగిడేస్తున్నారు. కథ రాయడం చాలా కష్టంగా వున్నా, మీ ఆదరం ముందుకు తీసుకువెళ్తోంది నన్ను.
[+] 2 users Like mkole123's post
Like Reply
మాయ - 20

పూజారి గారు మళ్ళీ పిలిస్తే ఈ లోకంలోకి వచ్చి విగ్రహం వంక చూశాడు. నిర్వికారంగా నిలబడి వున్న సూర్య భగవానుడి ముఖంలో నవ్వు కానీ కోపం గానీ ఏమన్నా కనిపిస్తుందేమో అని చూశాడు. నిన్న తీసుకొచ్చినప్పుడు విగ్రహం ముఖం ఎలా వుందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. చూడడానికి చిన్న విగ్రహం. సూర్యుడి కాంతి తగిలిన దిశను బట్టి ఉండుండి రాగి రంగులోనూ, బంగారు రంగులోనూ మెరిసిపోతోంది.


‘నిజంగా ఈ విగ్రహం అంత శక్తివంతం అంటారా పూజారి గారూ’ అని అడిగాడు. ఆయన ఓ స్తంభాన్ని ఆనుకొని కూర్చొని చెప్పసాగారు. ‘మా ముత్తాత గారి దగ్గర్నుంచీ ఈ ఊళ్లోనే ఉంటున్నాం మేము. మా ఇంట్లో కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటాము దీని గురించి. ఎప్పుడూ నేనే తీసుకొచ్చే వాడిని విగ్రహాన్ని. నిన్న ఎందుకు జరిగిందో  ఏమో స్వామి నీ చేతుల్లోకి వచ్చారు. బహుశా మరొకరి చేతుల్లోకి వెళ్లాలంటే అది నీ మూలంగానే జరగాలని రాసి వుందేమో. భగవంతుడి అనుగ్రహం, ఆవేశం మనలాంటి మానవమాత్రులకి అర్ధం కావు నాయనా. వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో పెంచలయ్య వారసులు ఈ విగ్రహాన్ని ఊరేగించి వందేళ్లు అవుతుంది. నిన్నటినుండీ జరిగిన సంఘటనలు స్వామి వారి హెచ్చరికేమో.’

నిన్న శైలు తన చెయ్యి పట్టుకొని తీసుకువెళ్లి అదుగో విగ్రహం తీసుకెళ్లు అని చెప్పిన సందర్భం గుర్తొచ్చింది. మళ్ళీ శైలు ఇక్కడ తన పక్కనే వుంటే ఎంత బాగుండు అనుకున్నాడు. అదురుతున్న గుండెతో వెళ్ళి విగ్రహం పట్టుకున్నాడు కిరీటి. నిన్నటిలాగానే మంచు ముక్కలా చల్లగా తగిలింది చేతికి. వాడికేమీ కాలేదు. కానీ ఓ క్షణం పాటు కళ్ళు బైర్లు కమ్మాయి. పొద్దున ధనుంజయ్ ఇది భగవంతుడు నాకు వేసిన శిక్ష అన్న మాట వాడి మదిలో మెరుపులా మెరిసి మాయమైంది. అసలా ఊహ వచ్చినట్టు కూడా గుర్తులేదు వాడికి మరునిముషంలో.

వాడు అలా ఆగిపోవడం చూసి పూజారిగారు కంగారుగా కిరీటీ, కిరీటీ అని పిలిస్తే తల విదిల్చి ‘ఇది ఎప్పుడూ ఇంత చల్లగానే వుంటుందా’ అని అడిగాడు. పూజారి గారు ఆశ్చర్యపోయి తల అడ్డంగా ఊపి వాడి చేతుల్లోని స్వామికి దణ్ణం పెట్టారు. ‘పద, నీ కూడా వస్తాను’ అంటూ ప్రెసిడెంటు గారింటికి బయల్దేరారు. గుడికి కాపలా కాస్తున్న పోటుగాళ్ళు వీళ్ళకి రక్షణ వలయంలా మారారు. దారి పొడుగునా జనాలు వీళ్ళకి అడ్డు తప్పుకొని నిలబడ్డారు.

ప్రెసిడెంటు గారి ఇంటికి చేరుకొనే సరికి మధ్యాహ్నం అయింది. ఆయనిచ్చిన మెత్తని పట్టు బట్టలో విగ్రహాన్ని చుట్టి ఆయన చూపించిన భోషాణంలో విగ్రహాన్ని జాగ్రత్తగా పడుకోబెట్టాడు కిరీటి. ఎప్పుడు నిద్రలేచి బయటకు వచ్చిందో మరి, అంతవరకూ ఉగ్గబట్టుకొని వున్న శైలు వాడు బయటికి రాగానే తన అత్తా, మామల ముందే వాడిని గట్టిగా చుట్టేసింది. ‘ఈడి బాబు కంటే ఈడే నయం అమ్మీ’ అంటూ కళ్ళు ఒత్తుకున్నారు పెద్దాయన కూడా.

పూజారి గారు పంచాంగం చూసి ‘ఇంకో పదహారు రోజుల్లో రథసప్తమి. లోటుపాట్లు లేకుండా ఊరేగింపు చేద్దాము. నాయనా, ఈసారి కూడా పుణ్యం కట్టుకో. వచ్చే సంవత్సరం వరకూ అందరూ కుదుటపడొచ్చు’ అని కిరీటిని ఒప్పించారు.

తరువాతి రోజుల్లో ఊరి జనాలు కాస్త సర్దుకున్నారు. కానీ జరిగిన దాని ప్రభావం వెంటనే సద్దుమణగలేదు. ఊళ్ళో కొత్త ముఖాలు కనిపిస్తే కాస్తంత అనుమానంగా చూస్తున్నారు. ప్రెసిడెంటు గారిల్లు కోటలా మారింది. ఊళ్ళోని ముసలీ ముతకా వాళ్ళ చిన్నప్పుడు విగ్రహం గురించి విన్న కథలన్నీ తవ్విపోసుకుంటున్నారు. చాలా పల్లెటూళ్ళలగానే ఏమన్నా జరిగితే సమస్య పరిష్కారం కోసం తమ బలాన్ని నమ్ముకున్నారే గానీ సెక్యూరిటీ ఆఫీసర్ల కోసం పరిగెత్తలేదు.

రమణాచారి ఊరి నుండి వచ్చాక పెదబాబు, ఆయన, పూజారి గారు కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచించటం మొదలెట్టారు. పూజారి గారు చెప్పినట్టు పెంచలయ్య వారసులు ఊరేగింపులో పాల్గొని దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడసలు వాళ్ళ వంశస్థులు ఎక్కడున్నారో ఏమిటో ఎవరికీ తెలియదు. వారిని వెదకటానికి గట్టి ప్రయత్నం చేయాలని నిశ్చయం జరిగింది. నిజానికి వాళ్ళు పెంచలాపురంలోనే వుండాలి. కానీ కాలక్రమంలో పక్క ఊళ్ళకి ఏమన్నా చేరారా అనేది కనుగొనే ప్రయత్నం మొదలైంది. విగ్రహం సంగతి ఏం చెయ్యాలో పాలుపోలేదు వాళ్ళకి. ఇది ఒకటి రెండు రోజుల్లో తేలే వ్యవహారంలా అనిపించలేదు.

ఈ సందడి ప్రభావం కిరీటి నిక్కీలను బాగా ఇబ్బంది పెట్టింది. వాళ్ళిద్దరూ ఒంటరిగా కలుసుకోవడానికి అవకాశాలు మృగ్యం అయ్యాయి. ఎప్పుడన్నా కలుసుకుంటే శైలు ఇంట్లో కలవడమే. కానీ ఇల్లంతా పాలెగాళ్లతో నిండిపోవడంతో అక్కడ కూడా ఏకాంతం అనేది అరుదుగా దొరుకుతోంది. చదువు మళ్ళీ మొదలెట్టచ్చు అన్న ఆశ, కిరీటిని వదిలి వెళ్లిపోవాలి అన్న దుఃఖం, ఈ ద్వైదీభావంలో పడి కొట్టుమిట్టాడుతోంది నిక్కి.

శైలు పరిస్థితి ఇంకా దారుణం. ఆనాటి తుఫాను వంటి కలయిక తర్వాత కిరీటి తన ముందుంటే వాడ్ని కౌగిలిలో బంధించకుండా వుండలేకపోతోంది. కానీ తన స్నేహితురాలి బాధ చూసి తనను తాను అదుపులో వుంచుకుంటోంది.  

మన మిత్రుల జీవితంలో ఇంకొక పెద్ద మార్పు కూడా సంభవించింది. సంక్రాంతి పండగ తర్వాత రోజునుండీ కొన్నాళ్ళ పాటు కిట్టి కనబడలేదు వాళ్ళకి. కాలేజీకి కూడా రావడం మానేశాడు. కొన్ని రోజులయ్యాక ముగ్గురు స్నేహితులూ కలిసి వాడి ఇంటికి వెళ్లారు. కిట్టి ఇంట్లో వాతావరణం గంభీరంగా వుంది. కిట్టి తల్లి ఎంతో బాధలో వున్నట్టు కనిపించింది. వాడి తండ్రి ఊళ్ళో లేరు. కిట్టి గురించి అడిగితే వాడి తల్లి బావురుమని ఏడ్చి వాడు రాసిన ఉత్తరం చేతిలో పెట్టింది. ఇంట్లోనుంచి వెళ్లిపోతున్నానని, తన కోసం ఎవరూ వెతకొద్దని రాశాడు కిట్టి. దాన్ని చదివిన మిత్రులు నిర్ఘాంతపోయారు.

‘ఎక్కడికి పొయ్యాడో ఏమో తెల్వదు బిడ్డ. నా పెనిమిటి వారం బట్టి కాలికి బలపం కట్టుకు తిరుగుతాండు. చుట్టపక్కాలు బుగ్గలు నొక్కుకోడం జూసి సావాలనిపిస్తాంది’ అంటూ భోరుమన్నది కిట్టి తల్లి. ముగ్గురు మిత్రులూ షాక్ లో బయటికి వచ్చారు. ‘వీడు ఇలాంటి పని చేశాడేమిటి రా’ అని తమలో తాము డిస్కస్ చేసుకుంటున్నారు. గోరు వున్నట్టుండి కిరీటి తో ‘రేయ్, మనోడు ఆ నాటకాల కంపెనీ వోళ్లతో గానీ చెక్కేసాడంటావా’ అన్నాడు. రంగ అర్ధం కానట్టు చూస్తే సంతలో వీళ్ళు చూసింది చెప్పారు. ‘మరి ఆలోచిస్తాకి ఏముందిరా ఇందులో. పాండి, ఆళ్ళకి సెబితే కనీసం ఏడ ఎతుకులాడాల్నో తెలిసిద్ది ఆడి అయ్యకి’ అంటూ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు.

జరిగింది కిట్టి తల్లికి చెప్పి ‘క్షమించండి అమ్మా, మాకు వాడు ఇంత పని చేస్తాడని అనిపించలేదు. ఏదో సరదా పడుతున్నాడు అనుకున్నామే కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్లిపోయేంత రంధిలో వున్నాడని అసలు తెలీదు’ అన్నాడు కిరీటి. ‘బాబ్బాబు.. కనీసం ఏడ వెతకాల్నో ఓ దిశ చూపించినారు. దిక్కు, దివాణం లేక తిరుగుతుండే మా వోళ్ళు’ అంటూ హడావుడిగా ఈ విషయం తన వాళ్ళతో చెప్పటానికి వెళ్లింది ఆమె.

రథసప్తమి వచ్చింది. ఊరంతా మళ్ళీ టెన్స్ గా వుంది. కిరీటిని మళ్ళీ రంగంలోకి దించారు. రమణాచారి, శైలు పెద్దాయన్ని వేరేవిధంగా ఒప్పించడానికి విడివిడిగానూ, కలిసి చాలా ప్రయత్నం చేశారు. ఇద్దరి argument ఒక్కటే. మూఢనమ్మకాలతో ఇలా ప్రవర్తిస్తే పోనుపోనూ విగ్రహం విషయంలో ఊళ్ళో చాలా ఇబ్బందులు ఎదురౌతాయని. వాడి బదులు తాము విగ్రహాన్ని తీసుకొస్తామనగానే ప్రెసిడెంటు గారు కయ్యిన లేచారు.

‘ఆడంటే నాకు ప్రేమ లేక కాదు. లచ్చ రూపాయలిచ్చినా మేము ఇగ్రహాన్ని ముట్టుకునేది లేదని ఊళ్ళో జనాలందరూ సెప్పారు నాకు. దొంగోడు అరిసిన అరుపులు మడిసి అనేవోడు ఎవడూ అంత తేలిగ్గా మర్శిపోడు. పూజారి పెళ్ళాం ఆయనకి తెలవకుండా నా కాడికొచ్చి కాళ్లా యేళ్ళా పడి ఆయనగోర్ని ఒదిలెయ్యమని బామాలింది. అది జూసి నా ఇంటి ఆడది ఏమందో మీకు జెప్పక్కర్లేదు అనుకుంటా. మనోడు ఈ ఒక్కసారికి ఈ పని సేత్తే వచ్చే యేటికి ఏటి సెయ్యాలో ఆలోచియ్యడానికి నాకు వీలు కుదురుద్ది. ఐనా కాదు కూడదంటే ఆచారీ నీ మాట నే కాదన్ను’ అనేసరికి రమణాచారి కొంత అయిష్టంగానే మెత్తబడ్డారు. 

ఎప్పటిలాగానే విగ్రహం తాకితే కిరీటికేమీ కాలేదు. ప్రెసిడెంటు గారింట్లో పోగైన జనాలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఊరేగింపు బ్రహ్మాండంగా జరిగింది. చుట్టుపక్కల ఊళ్లలోని తమ బంధువులను పిలిచారట్టుంది పెంచలాపురం వాసులు; విగ్రహాన్ని చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చారు.

ఆ రాత్రి పెద్ద గుంపు గుడి దగ్గర కాపలా కాసింది. చీమ చిటుక్కుమన్నా పోటుగాళ్ళు పరుగులెత్తారు. మర్నాటి వుదయం యధావిధిగా పూజలు చేసి కిరీటి చేతుల మీదుగా విగ్రహాన్ని జాగ్రత్త చేయించారు. అక్కడితో మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకూ గొడవ లేదనుకున్నారు. కానీ విగ్రహం మీద ఎవరిదో కన్ను వుందన్న సంగతి మటుకు మర్చిపోలేదు ప్రెసిడెంటు గారు. ఆయన ఇంటిలోకి ప్రవేశం బంద్ అయ్యింది ఊరి జనాలకి. ఎప్పుడూ తన ఇంటి అరుగుల మీదనుంచే పంచాయితీ నడిపిన పెదబాబు గారు ఇప్పుడు గ్రామ పంచాయితీ కార్యాలయానికి వెళ్తున్నారు రోజూ.
[+] 7 users Like mkole123's post
Like Reply
నైస్ అప్డేట్ బ్రో
[+] 1 user Likes DVBSPR's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)