20-05-2020, 12:26 PM
Nice update
Romance మాయ
|
20-05-2020, 12:26 PM
Nice update
20-05-2020, 04:13 PM
బాగుంది
20-05-2020, 08:43 PM
twaraga update ivvandi writer saab . asale manchi suspenselo vadilesaru
20-05-2020, 10:01 PM
చాలా బాగుంది బ్రీ ఏమి తొందర పడకు బాగా చెక్ చేసుకున్నకే అప్డేట్ ఇవ్వు
Chandra
21-05-2020, 05:44 AM
NICE CHALA BAGA UNDI
21-05-2020, 07:09 AM
మాయ - 18
సూర్యుడు పూర్తిగా ఉదయించకముందే ఎవరో ఇంటి తలుపులు తడుతుంటే మేల్కొన్నాడు కిరీటి. ఇంకా తెరిపులు పడని కళ్ళతోనే లేచి వెళ్ళి ‘ఎవరూ’ అని అడిగాడు. ఎదురుగా ఎవరో తెలియని వ్యక్తి. చేతికి కట్టు కట్టుకొని వున్నాడు. మనిషి బాగా శుష్కించి పోయి వున్నాడు. ఒకప్పుడు బాగా పుష్టిగా వుండేవాడేమో అతను వేసుకున్న బట్టలు ఒంటి మీద లూజుగా వేళ్లాడుతున్నాయి. ‘డాక్టర్ గారున్నారా?’ అని అడిగాడు. చేతి గాయం విపరీతంగా బాధ పెడుతోందేమో ఉండుండి అతని ముఖ కవళికల్లో లో బాధ తాలూకా గుర్తులు ప్రతిఫలిస్తున్నాయి. ‘ఊళ్ళో లేరు నాన్న. మీ చేతికేమైంది’ అని అడిగాడు కిరీటి. ఒక్క చెయ్యే కాదు మనిషి శరీరం మొత్తం తేడాగా వున్నట్లు వున్నాడు ఆ వ్యక్తి. ‘రాత్రి సంతలో మా షాపులో సామాన్లు సర్దుతూ పొరపాట్న కరంట్ వైర్ పట్టుకున్నాను. బాగా కాలిపోయింది’ అన్నాడతను. ‘అరెరే, లోపలికి రండి. Dettol తో కడిగి గాజ్ క్లాత్ తో కట్టు కడతాను. ఆ మాత్రం చేయగలను నేను’ అంటూ అతన్ని లోపలికి తీసుకెళ్ళాడు. అతను కట్టుకున్న కట్టు తీసి చూస్తే చెయ్యి భయంకరంగా కమిలిపోయి వుంది. ‘అయ్యో, ఇంతలా ఎలా జరిగిందండీ? రాత్రికే రావాల్సింది మీరు’ అంటూ చేతనైనంత మేర క్లీన్ చేసి వాళ్ళ నాన్న చెప్పిన ointment ఏదో గుర్తు తెచ్చుకొని రాసి కట్టు కట్టాడు. ‘చాలా థాంక్స్ బాబు, డబ్బులు’ అంటూ జేబులో చెయ్యి పెట్టబోతుంటే ఆపి ‘మీరు పట్నంలో హాస్పిటల్ కి వెళ్ళాక ఎలాగూ అవసరం అవుతాయి, వుంచండి’ అంటూ ఆపేశాడు. ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ‘థాంక్స్ బాబూ, వస్తాను’ అంటూ లేచాడు. ‘ఇప్పుడే లేచాను నేను. మీరు కొంచెం సేపు కూర్చుంటే టీ తాగి ఏమన్నా తిని వెల్దురు’ అన్నాడు కిరీటి. ‘బాబూ నువ్వు ఆ మాట అన్నావు చాలు’ అని వెళ్తుంటే అతని నడక తీరు చూసి ఎవరో గుర్తు పట్టాడు కిరీటి సడన్ గా. ‘మీరు ధనుంజయ్ కదూ’ అన్నాడు అదురుతున్న గుండెతో. ఆ వ్యక్తి ఆగి ‘ఆ ధనుంజయ్ చచ్చిపోయాడు, ఇప్పుడు మిగిలింది ఇదిగో ఇది’ అంటూ తన బాడీ వైపు చూపించాడు. క్రితంసారి అతన్ని చూసినప్పుడు మనిషి మంచి దిట్టంగా వున్నాడు. ఇప్పుడు సగమైపోయాడు. సునయన గురించి అడగాలని ఎంత పీకుతున్నా ‘వుంటారా ఊళ్ళో? నాన్న వచ్చాక తనకి తెలిసిన డాక్టర్ ని ఎవర్నైనా రికమెండ్ చేస్తారు’ అన్నాడు. ‘లేదు బాబూ, నన్నెవరూ కాపాడలేరు. ఇది భగవంతుడు నాకు వేసిన శిక్ష’ అన్నాడు ధనుంజయ్. తప్పుగా అనిపించినా ఆపుకోలేక ‘మీకు నేను గుర్తున్నానో లేదో, నా పేరు కిరీటి. సునయన వచ్చిందా మీ కూడా’ అని అడిగాడు. ‘గుర్తున్నావయ్యా. తను రాలేదు ఈసారి. కానీ ఎప్పుడూ నీ గురించి ఏదో ఒకటి తలుచుకుంటూ వుంటుంది’ అన్నాడు. కిరీటి కొన్ని నెలలుగా తెలియకుండా అనుభవిస్తున్న ఓ బాధని ఆ క్షణంలో మర్చిపోయాడు. సునయన తనని ఇంకా మర్చిపోలేదు! ‘తను మళ్ళీ ఎప్పుడైనా ఇటు....’ అంటుండగానే ధనుంజయ్ తల ఊపి ‘తనకి ఏ మాత్రం సెన్స్ వున్నా ఇంక ఈ ఊరికి రాదు’ అన్నాడు. ఆ మాటకి కిరీటి కళ్ళల్లో కనబడ్డ హారర్ చూశాడేమో మెల్లిగా వాడి భుజంపై చెయ్యి వేసి ‘క్షమించు, తప్పుగా మాట్లాడాను. ఆమెకు ఇక్కడ ఏం పని దొరుకుతుంది? ఆమె ఇక్కడికి రాకపోయినా నువ్వు ఆమెను వేరే చోట కలవొచ్చు. నీ మాటగా ఏమన్నా చెప్పమంటావా?’ అని అడిగాడు. ఓ పుస్తకానికి సరిపడా మాటలు దాగున్నాయి వాడి మనసులో. ‘నేను కూడా తనని మర్చిపోలేదని చెప్పండి’ అని మటుకు బయటకు అనగలిగాడు కిరీటి. ‘సరే’ అంటూ వెళ్లిపోయాడు ధనుంజయ్. అలా వెళ్ళిన ధనుంజయ్ సరాసరి బెంగళూరు వరకూ ఆగకుండా ప్రయాణించాడు. అక్కడ అతన్ని పరీక్షించిన డాక్టర్లు మేమేమీ చెయ్యలేమని చేతులెత్తేశారు. బెడ్ రెస్ట్, బలమైన ఆహారం, చాలా అదృష్టం వుంటే తప్ప ఆర్నెల్లకంటే ఎక్కువ బతకడని తేల్చి చెప్పారు. తరచూ స్పృహ కోల్పోతున్నాడు ధనుంజయ్. ఒక రోజు మెలకువగా వున్నప్పుడు ఒక telegram పంపించాడు. ‘నీ కోసం బెంగళూరు లో ఎదురు చూస్తుంటాను. నన్ను కలిసేవరకూ పనిలో ముందుకు వెళ్ళొద్దు’ ఇది దాని సారాంశం. Telegram అందుకున్న వ్యక్తి ఒక రెండు వారాల్లో ధనుంజయ్ ని కలిశాడు. అతని స్థితిని చూసి షాక్ తిన్నాడా వ్యక్తి. ధనుంజయ్ చెప్పిన విషయం నమ్మశక్యంగా లేదు అతనికి. కానీ కళ్ల ఎదురుగా చావుబతుకుల్లో వున్న ధనుంజయ్ ని చూసిన తర్వాత కొంత convince అయ్యాడు. ఆచితూచి అడుగేస్తానని హామీ ఇచ్చి వెళ్ళాడు. ఇంకొక వారం రోజుల్లో ధనుంజయ్ ను మరొక వ్యక్తి కలిసింది. ఈ సారి వచ్చింది సునయన. అతడ్ని చూసీ చూడగానే అల్మోస్ట్ మూర్ఛపోయింది. సునయన నోరెత్తకముందే ధనుంజయ్ ఆమెను ఆపేశాడు. ‘మాట్లాడకుండా నేను చెప్పేది పూర్తిగా విను. మొదటి మాట, నీ boyfriend నిన్ను మర్చిపోలేదు అని చెప్పమన్నాడు’ ఈ కాస్త మాటలకే బలంగా ఊపిరి పీలుస్తున్నాడు. ‘He was so kind to me’ కిరీటి చూపిన ఆదరం గుర్తొచ్చి అతని కనుల్లోనుంచి తడి చేరింది. ‘ఆ అబ్బాయి మంచితనం చూసి కొందరమ్మాయిలు ఇప్పటికే అతనికి attract అయిపోయారు. కానీ అతను నిన్ను మాత్రం మర్చిపోలేదు. శ్వాస అందుకోవడానికి ఎగబీలుస్తున్నాడు. ‘ఎంతో లక్ వుంటే కానీ అలాంటి వ్యక్తులు మన జీవితంలోకి రారు. you are lucky.’ సునయన తన మొహాన్ని చేతుల్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఈ మాటలకి. ధనుంజయ్ మళ్ళీ మాట్లాడటానికి శక్తి కూడగట్టుకుంటున్నాడు. అక్కడ అతని భారమైన ఊపిరి, సునయన వెక్కిళ్లు తప్ప మరో శబ్దం లేదు. ‘Look at me. రెండో మాట, వినయ్ దగ్గర నుంచి నువ్వు వెళ్లిపోయే టైమ్ వచ్చింది. వాడినుంచి ఇంక నేను నిన్ను కాపాడలేను. ఇప్పుడు చేస్తున్న జాబ్ ఫినిష్ చెయ్యి. అందినంత తీసుకొని గెట్ ద హెల్ ఎవే ఫ్రమ్ హిమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచలాపురం జాబ్ లో involve అవ్వొద్దు.’ సునయన నోరు పెగల్చుకొని ‘అసలేమైంది అక్కడ’ అని అడిగింది. ధనుంజయ్ తన కాలిపోయిన చెయ్యి చూపించాడు. ‘మహిమ, దైవ మహిమ. విగ్రహం తాకినందుకు నాకు పడిన శిక్ష’ అంటూ శుష్కించిపోయిన తన బాడీ ని చూపించాడు. ఇది జరిగిన కొన్ని రోజులకి ధనుంజయ్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. చనిపోయేముందు జరిగిందంతా వివరంగా ఓ ఉత్తరంలో రాసి సునయనకిచ్చాడు. ధనుంజయ్ అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా కూడా సునయన, కిరీటి మళ్ళీ కలవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అది మన కథలో చివరి అంకం. ఈలోపు మనం చెప్పుకోవాల్సినవి చాలా చాలా జరిగాయి. Back to పెంచలాపురం.......
21-05-2020, 07:16 AM
డింగ్ డింగ్ డింగ్... ఇది interval బెల్ మిత్రులారా. ఇక్కడ్నుంచీ కథ ఇంకా బాగుండేలా రాయాలని నా తాపత్రయం. చూద్దాం ఎంతవరకూ succeed అవుతానో.
21-05-2020, 07:53 AM
(21-05-2020, 07:16 AM)mkole123 Wrote: డింగ్ డింగ్ డింగ్... ఇది interval బెల్ మిత్రులారా. ఇక్కడ్నుంచీ కథ ఇంకా బాగుండేలా రాయాలని నా తాపత్రయం. చూద్దాం ఎంతవరకూ succeed అవుతానో. Mkole గారు అద్బుతంగా రాస్తున్నారు .... ఇక రాబొయ్యేది ఆఖరి అంఖం అనేసరికి కాస్త మనస్సులో గుచ్చుకొంటుంది Otherwise సూపర్......
mm గిరీశం
21-05-2020, 08:04 AM
Super thriller . Intervel adhirindi....
21-05-2020, 09:28 AM
చాలా బాగుంది అప్డేట్
ఇంటర్వెల్ బ్యాంగ్ లో సస్పెన్స్ పెట్టారు
21-05-2020, 09:46 AM
నైస్ అప్డేట్ బ్రో
21-05-2020, 11:18 AM
Super bro
21-05-2020, 11:40 AM
Wonderful story brother.... Content mathram extraordinary inni days ee kathani enduku chadavaledu anela feel ayyettu chesaru.... Ilage konasaginchandi
21-05-2020, 03:11 PM
Suoet story.......adventure cum thriller romantic story.... Eccada haddulu datakunda chala baga rastunnaru
21-05-2020, 03:50 PM
Super chala bagundi ...
Writers are nothing but creators. Always respect them.
21-05-2020, 07:01 PM
Em rastunnarandi Babu. ?
Epic stoty ?
22-05-2020, 07:52 PM
Mkole గారు
అద్బుతంగా రాస్తున్నారు .... ఇక రాబొయ్యేది ఆఖరి అంఖం అనేసరికి కాస్త మనస్సులో గుచ్చుకొంటుంది Otherwise సూపర్...... [/quote] గిరీశం గారూ, చివరి అంకం చేరుకునేముందు ఇంకా చాలా కథ వుందండి. అయితే సైట్లో వున్న కొన్ని కథల్లా (including మీ బృహన్నల) వందల పేజీలు చేరేట్టు రాయలేనేమో... (21-05-2020, 08:04 AM)paamu_buss Wrote: Super thriller . Intervel adhirindi.... (21-05-2020, 08:16 AM)Chandra228 Wrote: ఇంటర్వెల్ అదిరింది వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తుఉంటాము (21-05-2020, 09:28 AM)Pradeep Wrote: చాలా బాగుంది అప్డేట్ (21-05-2020, 09:46 AM)DVBSPR Wrote: నైస్ అప్డేట్ బ్రో (21-05-2020, 11:18 AM)abinav Wrote: Super bro (21-05-2020, 11:40 AM)Antidote69 Wrote: Wonderful story brother.... Content mathram extraordinary inni days ee kathani enduku chadavaledu anela feel ayyettu chesaru.... Ilage konasaginchandi (21-05-2020, 03:11 PM)fasakfuck Wrote: Suoet story.......adventure cum thriller romantic story.... Eccada haddulu datakunda chala baga rastunnaru (21-05-2020, 03:50 PM)AB-the Unicorn Wrote: Super chala bagundi ... (21-05-2020, 07:01 PM)Sunny26 Wrote: Em rastunnarandi Babu. ? (21-05-2020, 07:05 PM)Ammubf@110287 Wrote: Just awesome story (22-05-2020, 06:51 AM)Mani129 Wrote: Story super కథను ఆదరిస్తున్న అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. comments చాలా encouraging గా వున్నాయి. |
« Next Oldest | Next Newest »
|