Thread Rating:
  • 12 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మాయ
#21
మాయ - 7

కాసేపు మౌనంగా వుండి కథ గురించి తలుచుకుంటున్నారు ఇద్దరూ. ‘చాలా బాగుంది కిరీటి. నేనైతే నమ్మేస్తాను ఇలాంటివి ఈజీగా. జీవితంలో కొంచెం మ్యాజిక్ లేకపోతే మజా ఏముంటుంది చెప్పు’ అంటూ వీపుపై పడుకొని ఆకాశంలో నక్షత్రాలు చూస్తోంది సునయన.

కాసేపాగి ‘మీ ఊరి గురించి మర్చిపోలేని విషయం చెప్పావు. నీ గురించి కూడా ఏమన్నా చెప్పవా. ఇంతే interestingగా వుండాలి’ అని అడిగింది.

‘నా లైఫ్ లో అంత interesting విషయాలు ఏమీ లేవండి. ఏదో నేనూ, మా ఫ్రెండ్స్ సర్కిల్. అందరు కుర్రాళ్లలానే నేనూ, అవే  సరదాలు.’

‘కొయి కొయి కోతలు. నువ్వు పెద్ద ముదురు. బయటపడవు అంతే’ అంటూ అతనివైపు తిరిగి చిలిపిగా నవ్వింది.

ఎంత introvert కైనా ఎవరితోనైనా కుదిరితే సరదాగా మాట్లాడాలి అనిపిస్తుంది. కిరీటికి కూడా సునయనతో అలాంటి కనెక్షన్ ఏదో కుదిరింది. ఎవ్వరితోనూ చెప్పకూడదు, చెప్పలేను అనుకున్న విషయాలు ఫ్రీగా ఈ అమ్మాయితో చెప్పుకోవచ్చు అనిపిస్తోంది అతనికి. కొంచెం ఆలోచించి ‘మీ దగ్గర కార్డ్ తీసుకున్న రోజు చాలా లక్కీ అండి. కార్డ్ తీసుకున్న పది నిమిషాలకి నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ నేనొక అమ్మాయిని kiss చేశాను’.

సునయన గబుక్కున లేచి కూర్చుంది. ‘ha! నాకు తెలుసు నువ్వు పెద్ద జాదూ అని. చెప్పు చెప్పు, ఏ ఒక్క డీటైల్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం చెప్పు’ అంటూ కిరీటి భుజాల్ని పట్టుకుని ఊపేసింది. మొత్తం డీటైల్స్ కాదు కానీ ఎవరో అమ్మాయి తనని అంగట్ల మధ్యలోకి లాగి ముద్దు పెట్టుకోవడం, చివరకు కిరీటి తను అనుకుంటున్న వ్యక్తి కాదని తెలిసి పారిపోవటం గురించి టూకీగా చెప్పాడు.

‘నువ్వు ఇంకా సత్యకాలంలో వున్నవోయి. అడగకుండా అమ్మాయి ముద్దు పెడితే నేను నీ ప్రియుడ్ని కాదు అని ఎలా చెప్పబుద్ధి అయ్యింది నీకు. వచ్చిన బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నావు కదా!’

కిరీటి కొంచెంసేపు ఏమీ మాట్లాడకుండా కాళ్ళు దగ్గరికి తీసుకొని గడ్డం మోకాళ్ళపై పెట్టి మౌనంగా వుండిపోయాడు. సునయన కూడా అతడ్ని ఆనుకొని గోదాటి మీదనుంచి వస్తున్న చల్లగాలి ఆస్వాదిస్తూ వుండిపోయింది. కాస్సేపటి తర్వాత కిరీటి నోరు పెగల్చుకొని ఇలా చెప్పాడు. ‘ఆ అమ్మాయి ముద్దు నేను అడక్కుండానే నాకు దక్కింది. అదొక్కటీ చాలు అనిపించింది. ఇంకా ఎక్కువ ఆ అమ్మాయి దగ్గర్నుంచీ తీసుకునేవాడినేమో కూడా. ఇంతలో మీ దగ్గర కొన్న పుస్తకం అడ్డు పడింది. మీరు గుర్తొచ్చి ఆగిపోయాను.’ ఈ చివరి మాటలు కొంచెం నవ్వుతూ చెప్పాడు.

సునయన అతడ్ని ఇంకా గట్టిగా హత్తుకుపోయింది ఈ మాట విని. కిరీటి తల తిప్పి చూస్తే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వున్నాయి. ‘సునయనా..’ అని ఏదో అడగబోతుంటే అతడి నోటిపై వేలు వేసి ‘నువ్వు పూర్తిగా పప్పుసుద్దవి కాదు. అలా అని పూర్తిగా జల్సారాయుడివి కూడా కాదు. రెండూ కరెక్ట్ పాళ్లలో కలగలిసిన మంచి అబ్బాయివి.’

‘ఇది నీలోని చిలిపితనానికి’ అంటూ రెండు బుగ్గలపైనా ముద్దులు పెట్టింది. ‘ఇది నీలోని innocenceకి’ అంటూ అతడి పెదవులను తన పెదవులతో పెనవేసి గాఢమైన ముద్దు పెట్టింది. ఆ ముద్దు కిరీటిలో సెక్సువల్ ఫీలింగ్ కలిగించలేదు. అది ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఇచ్చిన ముద్దు. అందులో కామం లేదు, ఒక ఆర్తి మాత్రమే వున్నది.

‘సునయనా, నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. నేను మీకు ఏమి ఇవ్వగలను?’

ఆమె అతడి గుండెపై చెయ్యి వేసి ‘నీ innocenceని ఇక్కడ పెట్టి తాళం వెయ్యి. ఆ తాళం ఎక్కడైనా పారెయ్యి. నీ దగ్గర ఆ innocence వున్నంత కాలం నా ముద్దు నీ దగ్గర వుంటుంది. అది కోల్పోయావో, నువ్వు నాలా అవుతావు. నాలాగా ఎప్పటికీ తయారవకు’ అంటూ అతడ్ని కరుచుకుపోయింది.

కిరీటిది చాలా చిన్న పరిధి. వేనవేల పల్లెటూళ్ళల్లో ఓ పల్లెటూరు ఈ పెంచలాపురం. అందులో శతకోటి లింగాల్లో మానవాడొక బోడి లింగం. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఈ అమ్మాయి అంతటి కాంప్లికేటెడ్ మనిషిని ఎప్పుడూ చూడలేదు. కొంతసేపటి క్రితం వరకూ కూడా ఆమెపై ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే వుంది. కానీ ఇప్పుడో... ఇప్పుడు సునయన అతని హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంది. ఇట్లాంటి అమ్మాయితో ఈ అనుభవం తర్వాత మామూలు ఆడపిల్లలు ఇక జీవితంలో నచ్చలేదు అతనికి. ఇది అతనిలో వచ్చిన మొదటి మార్పు.

ఆమె గురించి ఎంతో తెలుసుకోవాలని వుంది కిరీటికి. ఆమె మూలాలు ఎక్కడ వున్నాయి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చదువు, ఇష్టాయిష్టాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో అడగాలని వుంది. కానీ పర్సనల్ డీటైల్స్ అడిగితే వేటగాడ్ని చూసిన జింకపిల్లలా పారిపోతుంది అని ఒక బలమైన నమ్మకం మటుకు కుదిరింది అతనికి. బలవంతాన అడిగేకంటే తనంతట తను చెప్పిన దాంట్లో ఏమన్నా సమాచారం దొరుకుతుందేమో చూద్దాం అని డిసైడ్ అయ్యాడు.

‘ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు. మళ్ళీ ఎప్పుడైనా ఇటు వస్తారా?’ అని కిరీటి అడిగితే ‘తెలీదు. ప్రస్తుతానికి నా నుంచీ ఏమీ ఆశించకుండా నా మానప్రాణాల్ని కాపాడేది ధనుంజయ్ ఒక్కడే. అందుకే అతను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను’ అంది.

మళ్ళీ కాసేపు మౌనం రాజ్యమేలింది అక్కడ. ‘నాక్కూడా ఇదే మొదటి ముద్దు తెలుసా?’ అని ఆమె అంటే కిరీటి ఆమె భుజాలపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఈ సారి వారి ముద్దులో గాఢత ఇంకాస్త ఎక్కువగా వుంది. ఇద్దరూ మాటలతో చెప్పలేని భావాల్ని ఇలా పెదాలతో పంచుకున్నారు.

‘ఎప్పటికైనా ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీరు ఎక్కువగా ఏ వూళ్ళో వుంటారో కనీసం అదొక్కటైనా చెప్పండి’ అన్నాడు. ఆమె అతని చెవిలో ఒక మాట చెప్పింది. విని మౌనంగా తల ఊపాడు.

ఇద్దరూ ఒకరిని ఒకరు వీడి పోవటానికి సిద్ధంగా లేరు. కానీ సమయం ఎవరి కోసమూ ఆగదు కదా. ఎవరి దారిన వారు పోయే సమయం వచ్చింది. ‘పాడు పిల్లడా, నన్ను ఏడిపించావు. చూడు నా ముఖమంతా అసహ్యంగా తయారయ్యింది. ముఖం కడుక్కోవాలి, నీళ్ళెక్కడుంటాయో చెప్పు. కాస్త జనం లేని చోట సుమా’ అంటే ‘బస్టాండ్ దగ్గర పంచాయితీ కుళాయి వుంది రండి. నాకు తెలిసి ఈ రాత్రి బస్సులో మీ ఇద్దరే ప్రయాణికులు’ అంటూ ఆమెను అక్కడకు తీసుకుపోయాడు.

కుళాయి దగ్గర ముఖం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ధనుంజయ్ కోసం వేసి చూస్తున్నారు ఇద్దరూ. ‘నేను wait చేస్తానులే ఇక్కడ. చీకటి పడిపోయింది. నువ్వు ఇంటికి పోవా?’ అంటే ‘మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తాలెండి. దార్లన్నీ నాకు కొట్టిన పిండే’ అన్నాడు.

‘నువ్వేమన్నా నా చుట్టానివా? నేను పండక్కి మీ ఊరోస్తే సాగనంపినట్టు ఏమిటి ఇదంతా, పో పో’ అని నవ్వింది సునయన. ‘అలాంటిదే అనుకోండి. అదుగో మీ ఫ్రెండ్ ఎలాగూ వచ్చేస్తున్నాడు’ అంటూ పెట్టె మోసుకొస్తున్న ధనుంజయ్ ను చూపించాడు.

‘నువ్విక్కడుంటే నేను బస్ ఎక్కేటప్పుడు మళ్ళీ ఏడుస్తాను. వెళ్లిపోవా ప్లీజ్’ అని అడిగింది సునయన. 

ఇక ఆ మాటకి ఎదురు చెప్పలేకపోయాడు కిరీటి. ‘గుడ్ బై’ అని షేక్ హాండ్ ఇచ్చి ఆమె చెయ్యి మెల్లగా నొక్కి మరి వెనుతిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. వెళ్ళేటప్పుడు ఎదురుపడ్డ ధనుంజయ్ కి చెయ్యి ఊపి సైకిల్ స్టాండ్ వైపు వెళ్ళాడు.

‘కుర్రాడు special అని ఇప్పటికైనా ఒప్పుకుంటావా?’ అని ఆమె పక్కన కూలబడుతూ అడిగాడు ధనుంజయ్. ‘జరిగిందంతా నక్కి నక్కి చూసేసి ఇప్పుడు మళ్ళీ నన్ను అడగటం ఎందుకు? He is a gem. ఎక్కువ రోజులు బతకలేడు ఊరు దాటి వెళ్తే. ఇంత మంచి వాళ్ళని లోకం పీక్కుతినేస్తుంది’ అంది సునయన. ఆమె కళ్ళల్లోంచి మళ్ళీ నీళ్ళు కారిపోతున్నాయి.

ధనుంజయ్ ఆమె భుజం తట్టి ఓదార్చాడు. ‘Control yourself Sunayana… నీకు తెలుసు కదా, మన line of work లో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోకూడదు. ఎడారిలో నడిచేవాడికి దగ్గర్లో ఒయాసిస్ వుందన్న ఊహే కొండంత బలం. ఈ కిరీటి నీ మనసుకి ఒయాసిస్ లాంటివాడు అనుకో. లోకం మరీ దారుణంగా అనిపించినప్పుడు ఈ అబ్బాయిని గుర్తు తెచ్చుకో. He will be a source of strength for you. అలాగే ఎడారిలో బతకాలంటే ఒయాసిస్ లో నీళ్ళు తాగాలి. మన పనిలో ఒకవేళ అవసరం ఐతే ఈ అబ్బాయిని వాడుకుంటావు కదా?’ అని అడిగాడు.

సునయన కళ్ళల్లోంచి ఉబుకుతున్న నీటిని తుడుచుకుంటూ ‘ఊ’ అని చెప్పింది.

‘మనం ఈ ఊరు వచ్చిన పని పూర్తి అయినట్లేనా’ అడిగాడు ధనుంజయ్. ‘ఆ, అనుకోకుండా పరిచయం ఐనా మనకు కావాల్సిన చాలా డీటైల్స్ కిరీటే చెప్పాడు. మిగతా వాళ్ళ దగ్గర విన్నట్లే ఈ ఊళ్ళో పంచలోహ విగ్రహం వున్నది నిజం. అన్నిటికంటే ముఖ్యమైన detail. పండుగ టైమ్ లో కాక మిగతా రోజుల్లో విగ్రహం ప్రెసిడెంట్ గారి ఇంట్లో పెట్టి వుంచుతారుట’ అని చెప్పింది సునయన.

‘గుడ్, గుడ్. మన పని మనం చేశాం. మిగతా అంతా వినయ్ చేతిలో వుంది. విగ్రహం దొంగిలించడం ఎలా అన్నది అతగాడికి వదిలిపెడదాం’.
[+] 5 users Like mkole123's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
నైస్ అప్డేట్
Like Reply
#23
Its nice..
[+] 1 user Likes bhargavi.flv's post
Like Reply
#24
ఎమ్కోల్ 123 గారు,

అద్బుతంగా రాస్తున్నారు సార్ పంచలోహవిగ్రహం.... దొంగతనం....అనేది సస్పెన్స్ అయితే...  
సునయన పాత్ర అనేది మహా సస్పెన్స్ 
Superb keep it up sir...
mm గిరీశం
Like Reply
#25
(09-05-2020, 10:00 PM)DVBSPR Wrote: నైస్ అప్డేట్
ధన్యవాదాలు

(10-05-2020, 03:59 AM)bhargavi.flv Wrote: Its nice..
థాంక్స్

(10-05-2020, 07:51 AM)Okyes? Wrote: ఎమ్కోల్ 123 గారు,

అద్బుతంగా రాస్తున్నారు సార్ పంచలోహవిగ్రహం.... దొంగతనం....అనేది సస్పెన్స్ అయితే...  
సునయన పాత్ర అనేది మహా సస్పెన్స్ 
Superb keep it up sir...

గిరీశం గారూ ధన్యోస్మి. మీవంటి సీనియర్ రచయిత నాలాంటి కొత్తవాడ్ని ప్రోత్సహిస్తూ ఓ మాట అనటం నాకు నూతనోత్తేజాన్ని ఇస్తోంది.
Like Reply
#26
మాయ - 8

సునయన నుండి విడివడ్డాక కిరీటి మామూలు మనిషి కావడానికి కొన్ని రోజులు పట్టింది. ఆ తర్వాత ఆమెను మర్చిపోయాడు అని కాదు, ఎప్పటికైనా తనని కలవాలి అన్న ఒక లాంగ్ టర్మ్ గోల్ అంటూ వుంది కాబట్టి తన జ్ఞాపకాల్లో పడి కొట్టుమిట్టాడకుండా మిగతా విషయాలపై దృష్ఠి పెట్టాడు. ఇలా చులాగ్గా ఒక మాటలో తేల్చేసానని వాడు పడ్డ బాధని తక్కువ అంచనా వెయ్యకండి.


అంతేకాదండోయ్, ఓ తుఫానులా ఇతని జీవితంలో ప్రవేశించి వెళ్ళిపోయిన సునయన లానే ఇంకొన్ని పాత్రలు అతడి routineను అల్లకల్లోలం చేసేశాయి.

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు అని చెప్పుకున్నాము కదా మన బ్యాచ్. కిరీటి సునయనతో చెప్పుకున్నట్టు వీళ్ళందరికీ ఇదే మొదటి సారి ఇంగ్లీష్ మీడియంలో చదవటం. Quarterly పరీక్షలు వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ లో చాలామంది పిల్లలు విపరీతంగా struggle అవడం కాలేజీ యాజమాన్యం గమనించింది. అంత క్రితం సంవత్సరం వరకూ ఆ కాలేజీలో పనిచేసిన అద్భుతమైన ఇంగ్లిష్ లెక్చరర్ తనకు రైల్వే competitive పరీక్షల్లో ర్యాంక్ రావటం వల్ల ఈ వుద్యోగం వదిలేసి రైల్వేలో జాయిన్ అయిపోయాడు. కొత్తగా వచ్చిన లెక్చరర్ hopeless కావడంతో ప్రిన్సిపాల్ తలపట్టుకు కూర్చున్నాడు.

రాణి రత్నమాంబ కాలేజీ government కాలేజీ కాదు. ఓ రాజా వారు తన భార్య పేరుమీద చుట్టుపక్కల వున్న పల్లెటూరి పిల్లలు చదువుకోవడం కోసం దాన్ని కట్టించారు. పిల్లల చదువు, పాస్ పర్సెంటేజ్ వంటి వాటిపై ఆయన ఒక కన్ను వేసి వుంచుతారు. అందుకే ప్రిన్సిపాల్ గారు టెన్షన్ టెన్షన్ గా వున్నారు.  

అది సెప్టెంబర్ మాసం. half yearly పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను యే రకంగా గట్టెక్కించాలో తెలీక అవస్థలో వున్న ప్రిన్సిపాల్ రూమ్ కి ఓ కుర్రాడు వచ్చాడు.

May I come in sir అంటూ ఆయన డోర్ పై knock చేశాడు. లోపలికి రమ్మని పిలిచిన ప్రిన్సిపాల్ ఆ కుర్రాడితో ఒక అరగంట మాట్లాడారు. ఆయన ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ suggest చేసి వెళ్ళాడు ఆ కుర్రాడు.

ఆ వచ్చిన కుర్రాడు మన కిరీటే. ఏమిటా సొల్యూషన్, ఏమా కథ అని తెలుసుకోవాలంటే ఒక మూడు నెలలు వెనక్కు వెళ్ళాలి.
                                         
                   ********** మూడు నెలల క్రితం ***********

Misdirection is the heart of magic. Unless the magician truly has supernatural powers (spoilers: they do not!), any magic trick he/she shows you has an element of misdirection in it.

సునయన దగ్గర కొన్న పుస్తకంలో మొదటి పేజీ మొదటి లైన్స్ చదవగానే కిరీటికి తానీ పుస్తకం చదివి అర్ధం చేసుకోవడం జరగని పని అని డిసైడ్ అయ్యాడు. పుస్తకం తీసి పక్కన పడేద్దామంటే మనసొప్పట్లేదు. కానీ చదివి అర్ధం చేసుకొనే శక్తి లేదు. Frustration పెరిగిపోయి పుస్తకాన్ని జాగ్రత్తగా తన క్లాస్ పుస్తకాల మధ్య పెట్టి స్నేహితులతో కలిసి ఊరి మీద పడి తిరుగుదామని బయల్దేరాడు.

ముందే చెప్పుకున్నాంగా బ్యాచ్ అంతా పక్క పక్క వీధుల్లో వుంటారని. కిరీటి ఇంటికి మూడు నాలుగిళ్ళ పక్కన ఆ వీధిలోనే వుంది గౌరయ్య ఇల్లు. గోరు ఇంటి దగ్గరికి వెళ్తూనే ఏదో తేడా గమనించాడు. వాడి ఇంట్లోనుంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. గోరు, వాళ్ళ నాన్న రాజన్న ఇంటికప్పు ఎగిరిపోయే రేంజులో అరుచుకుంటున్నారు.

వడివడిగా ఇంట్లోకి వెళ్ళిన కిరీటికి ఆ ఇంట్లో ఎప్పుడూ చూడని దృశ్యం కనిపించింది. రాజన్న చేతిలో గొడ్లని కట్టేసే పలుపుతాడు వున్నది. గోరు వంటిమీద ఆల్రెడీ రెండు మూడు చోట్ల కమిలిపోయిన గుర్తులున్నాయి. మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తగానే ఇక ఆలస్యం చేయకుండా రాజన్న మీద పడ్డాడు కిరీటి. ‘బాబాయ్, ఆగు బాబాయ్’ అంటూ రాజన్నని ఒడిసి పట్టుకొని ‘పిన్నీ, పిన్నీ’ అంటూ కేకేసాడు. లోపల్నుంచీ ఇద్దరు ఆడవాళ్ళ ఏడుపులు వినిపిస్తున్నాయి.

‘వదల్రా బిడ్డా. ఈ నా కొడుకు ఇయ్యాల నా సేతిలో సచ్చాడే. ఓరుగల్లు వింజినీరింగ్ కాలేజీ సదువుల రాణిరా నా అమ్మి. దాని సెప్పులు తుడుస్తాకి కూడా పనికిరాడు ఈ నా కొడుకు, దాని మీద కూకలేస్తాడా’ అంటూ ఊగిపోతున్నాడు. విప్పసారా వాసన గుప్పున కొడుతోంది అతని దగ్గర. రాజన్నకు తాగుడు అలవాటు లేదు.

ముందు పరిస్థితి ఒక గాడిలో పెట్టాలని డిసైడ్ అయ్యి ‘గోరూ, నువ్వు ముందు పోరా ఇక్కడ్నుంచి’ అని వాడ్ని గదిమాడు. గోరు కదలకపోయేసరికి గొంతులోని బలమంతా ఉపయోగించి ‘గోరూ, నువ్వు ముందు రంగ ఇంటికి పోరా, అక్కడికొస్తాను’ అంటూ అరిచాడు. ఎప్పుడో కానీ నోరెత్తని కిరీటి అంత గట్టిగా అరిచేసరికి రాజన్న స్థాణువయ్యాడు. గోరు షాక్ తిన్నవాడిలా అక్కడ్నుంచి వెళ్ళాడు.

అదే అరుపు గొంతుతో ‘పిన్నీ’ అంటూ ఇంకో పొలికేక పెట్టాడు. లోపల్నుంచీ ఏడుపుల శబ్దాలు ఆగి గోరు తల్లి నరసు కళ్ళు ఒత్తుకుంటూ బయటకు వచ్చింది. ‘ఇంద, బాబాయిని పడుకోబెట్టు. నాన్న రాగానే పంపిస్తా’ అంటూ రంగ ఇంటికేసి బయల్దేరాడు. 
[+] 7 users Like mkole123's post
Like Reply
#27
Nice update
Like Reply
#28
నైస్ బాగుంది
 Chandra Heart
Like Reply
#29
Update plzz
Like Reply
#30
Good story basu. Janalu reply ivvatam ledu ekkuva ani matram apaku madhyalo plz.
[+] 2 users Like Thiz4fn's post
Like Reply
#31
Nice update
Like Reply
#32
(11-05-2020, 09:01 AM)DVBSPR Wrote: Nice update

(13-05-2020, 02:07 PM)Chandra228 Wrote: నైస్ బాగుంది

(13-05-2020, 04:07 PM)Satensat005 Wrote: Update plzz

(13-05-2020, 05:03 PM)Thiz4fn Wrote: Good story basu. Janalu reply ivvatam ledu ekkuva ani matram apaku madhyalo plz.

(13-05-2020, 06:55 PM)Hemalatha Wrote: Nice update


మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోత్సాహం కోసమే మేము రాసేది. ఒక పెద్ద అప్డేట్ ఇస్తున్నాను.
Like Reply
#33
మాయ - 9

కిరీటి రంగ ఇంటికి వెళ్ళేసరికి గోరు కొంచెం విశ్రాంతిగా కూర్చుని వున్నాడు. రంగ వాడికి ఆల్రెడీ ointment ఏదో రాసినట్టున్నాడు. ‘చెప్పరా, ఏమైంది? బాబాయిని ఎప్పుడూ ఇంత కోపంగా చూడలేదు’ అన్నాడు.


‘నాదేరా తప్పు. అయ్య, అమ్మ వారం కితం ఊరికి బోయి వచ్చినకాడ్నించి ఇంట్లో శానా గోరంగా వుందిరా. అక్క ఈ సమస్తరం కాలేజీకి ఎల్తలేదు. డబ్బులు కుదర్లే. అమ్మ పేర్న ఏదో పొలం చెక్క వుంటే అదికూడా అమ్మాజూపింరు. ఐనా కాణీ పుట్టలే. అక్క రోజూ భోర్న ఏడుస్తంది. ఇయ్యాలే కూసింత తేరుకుని మాట్లాడతాంది. నేనెట్టా సదూతున్నానా అని నన్నేదో అడుగుతాంది. నాకు అసలే quarterly అయినకాడి నుంచి తిక్క లేస్తాంది. ఏదో సురుక్కున ఓ మాటంటిని. అయ్య ఇయ్యాల తాగొచ్చిండు. అక్క మీద కూకలెయ్యటం జూసి గొడ్ల తాటితో బాదిండు’.

అందరూ నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఇది రియాలిటీ. మనందరికీ అన్నీ సవ్యంగా జరిగిపోతే బాగుండు అనే వుంటుంది. కష్టాలు అనేవి మంచివాళ్ళకి కూడా వస్తాయి. గోరు అక్కలాంటి బ్రిలియంట్ పేద విద్యార్ధులు ఎంతోమంది డబ్బులేక చదువు ఆపేస్తున్నారు.

‘మా నాన్న వచ్చేదాకా ఇంటికి పోకురా. రంగా, చూస్కోరా’ అని చెప్పి బయల్దేరాడు కిరీటి. తన తండ్రిని వెదకటానికి వెళ్తున్నాడు కానీ మనసు మనసులో లేదు. తెలిసిన రోడ్లన్నీ ఓ యంత్రంలా తిరుగుతున్నాడు.

‘రేయ్, ఆచారి కొడకా! ఇట్రారా’ అన్న పిలుపు విని ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు. చూస్తే ప్రెసిడెంటు గారి ఇంటి ముందు వున్నాడు. ఆయన అరుగుమీద కూర్చొని చుట్ట లాగిస్తున్నాడు. ‘ఏం బలాదూరు తిరగబట్టివి ఇయ్యాల’ అని అడిగాడు ఒక దమ్ము లాగి.

కిరీటి మొహంలోకి అనుకోకుండా చిరునవ్వు వచ్చింది. పంచాయితీ ప్రెసిడెంటు గారు మంచి colorful పర్సనాలిటీ. ఏ మాట మాట్లాడినా వ్యంగ్యం ప్రతిధ్వనిస్తుంది. ‘మా నాన్నని వెదుకుతున్నా పెద్దాయనా. ఎక్కడున్నాడో తెలుసా’ అని అడిగాడు.

కిరీటి తండ్రి రమణాచారి ఆ ఊరిలో RMP డాక్టరు. ఐదు సంవత్సరాల క్రితం ప్రెసిడెంటు గారికి కాలు విరిగితే ముందుగా కట్టు కట్టి పట్నం తీసుకువెళ్లాడు. ఇది compound ఫ్రాక్చర్, మా వల్ల కాదని వాళ్ళు చేతులెత్తేస్తే అక్కడ్నుంచి కింగ్ జార్జి హాస్పిటల్ కి, ఆ పైన వచ్చిన ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ కోసం Delhi AIIMS వరకూ తోడుండి ఆయన కాలు కాపాడాడు. ట్రీట్మెంట్ కోసం మూడు ఎకరాల పొలం కరిగిపోయినా కుంటు లేకుండా మళ్ళీ మామూలుగా నడిచేలా చేశాడని ఆయనపై పిచ్చి అభిమానం ప్రెసిడెంటు గారికి. కిరీటి అన్నా కూడా అదే ప్రేమ. కానీ బయటపెట్టడు.

‘ఆడు కనపడితే ముందు ఈడకి ఈడ్సుకురావో. పొయ్యిన ఐదు ఎకరాలు ఎట్టాగూ పోగొట్టాడు. కనీసం రోజుకోపాలి మొగమన్నా సూపియ్యడారా మీ బాబు?’

‘సర్లే, కనబడగానే మీ ఇంటికే పంపుతాలే. ఐనా పోయినసారి ఏడు ఎకరాలు అన్నావు’ అంటూ నవ్వి బయల్దేరబోయాడు కిరీటి.

‘ఆగరా, పెద్దమడిసి ఎందుకు పిలిశాడు, ఏటి కత అనేదేమీ లేదా? ఓ లేసిందే లేడికి పరుగా?’

ఇక తప్పదని అరుగు మీద కూర్చుని ‘ఊ చెప్పు పెద్దాయనా’ అన్నాడు. ‘మా మేనకోడలు ఏదో పూజ చేసిందంట. బాపన కుర్రోడికి బోయనం పెట్టి కానీ తను తిననని సెప్పింది. లోనకి బోయి కడుప్పగలా పరమాన్నం తినిరా పో’ అని పంపించాడు.

లోపలికి వెళ్తే పూజ గది ముందు ఒకావిడ తలుపుకు జారగిలబడి కూర్చుని వుంది. ఎవరో పెద్దావిడ అనుకున్న కిరీటి దగ్గరకు వెళ్ళి చూస్తే తనకంటే మహా అయితే ఒక ఐదేళ్లు పెద్ద వయసున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ‘ఏవండీ’ అంటూ రెండు మూడు సార్లు పిలిస్తే కళ్ళు తెరిచి చూసింది. నేను ఫలానా అని చెప్పగానే ‘హమ్మయ్య, వచ్చావా! పొద్దుట్నుంచి wait చేస్తున్నానోయి ఎవరన్నా బ్రాహ్మణ కుర్రాడు వస్తాడా అని. ఇదిగో, మడి బట్ట కట్టుకొని వచ్చేస్తా కూర్చో’ అని పెరట్లోకి వెళ్లింది.

పది నిమిషాలు, పదిహేను నిమిషాలు వెయిట్ చేసినా రాకపోయేసరికి అలా పెరట్లోకి వెళ్ళిన కిరీటి షాక్ కొట్టినవాడిలా bathroom వైపు పరిగెట్టాడు. బాత్రూమ్ తలుపు తెరిచే వుంది. ప్రెసిడెంటు గారి మేనకోడలు స్పృహ తప్పి తల మీద గాయంతో సగం లోపల, సగం బయట పడివుంది అక్కడ. అన్నిటికంటే పెద్ద షాక్ ఆమె పూర్తి నగ్నంగా వుంది.

కిరీటి ఒకసారి గట్టిగా తల విదిలించి ఆలోచనల్ని ఓ దారిలోకి తెచ్చుకున్నాడు. తలకు తగిలిన గాయాలు వెంటనే ట్రీట్ చేయకపోతే చాలా ప్రమాదం అన్న తండ్రి మాటలు గుర్తు తెచ్చుకొని ముందు పక్కనే పడివున్న మడి చీర చింపి రక్తం తుడిచేసి కట్టు కట్టాడు.

అతను ప్రవరాఖ్యుడేం కాదు. కనులముందు ఒక అజంతా శిల్పంలాంటి అమ్మాయి నగ్నంగా వుంది. Of course, ఆమె నగ్నత్వాన్ని గమనించాడు. చక్కని ముఖం, పొడుగాటి మెడ, దాటి కిందకు రాగానే ప్రతి మగాడికీ ఒక primal లెవెల్ లో ఆకర్షణ కలిగించే చనుకట్టు, వాటిపై లేత గులాబీ రంగు areola, చల్లటి నీళ్ళతో స్నానం చేసిందేమో బిర్రబిగుసుకుపోయిన ముచ్చికలు ఇవన్నీ కలకలం రేపాయి మనవాడికి. చూడకూడదు అనుకుంటూనే ఆమె మర్మాంగాన్ని కూడా కంప్లీట్ గా చూసేశాడు. చలిజ్వరం వచ్చినవాడిలా ఓ క్షణం ఊగిపోయాడు.

చెంపలపై గట్టిగా చరుచుకొని తన ఆలోచనలపై తనకే సిగ్గు, అసహ్యం కలిగి ముందు ఆమె విడిచిన బట్టలు మళ్ళీ ఆమెకే తొడిగాడు. బ్రా, పాంటీ, జాకెట్, చీర ఇవన్నీ ఓ మరమనిషి లాగా తొడుగుతూ పోయాడు కానీ తన శరీరంలో నుంచి వస్తున్న వేడి ఆవిర్లు, వణుకుళ్ళు, involuntary erection వీటినేవి ఆపలేకపోయాడు. ఆ వణుకుడికి బ్రా వేసేటప్పుడు తన గోరు తగిలి ఆమె areolaపై ఒక గాయం కావటం చూసి మళ్ళీ తనను తాను తిట్టుకున్నాడు.
డాక్టర్లకి ఎంత డిఫరెంట్ mindset వుంటుందో మొదటిసారి ఒక అంచనా కట్టగలిగాడు.

‘పెద్దాయనా’ అంటూ కేకలేసినా బయటకు వినపడలేదేమో ఎవరూ రాలేదు. ఇక తనే ఆమెను ఎత్తుకొని జాగ్రత్తగా హాల్లో దివాన్ మీద పడుకోబెట్టి ఒక్క గంతులో బయటకొచ్చి పడ్డాడు. ‘చస్, నీ కంగారు ..’ అంటూ ఏదో అనబోతూ కిరీటి గాబరా ముఖం చూసి ప్రెసిడెంటు గారి ముఖం కూడా పాలిపోయింది. ‘ఏటైనాదిరా’ అంటే జరిగింది టూకీగా చెప్పి (బట్టలు వెయ్యటం తప్ప) ‘నాన్న ఎక్కడున్నా వెతుక్కొస్తా, ఆవిడ్ని కదిలించకు. తల అస్సలు ముట్టుకోవద్దు’ అని చెప్పి పరుగెత్తబోయాడు.

‘రేయ్, మీ అయ్యని మా పాలేరు గంగారామ్ ఇంటికి నేనే తోలినానురా ఆడికేదో జొరం అంటే. నువ్వు బయటకొస్తే సెప్దామని ఈడ్నే కూకుండా. బండేసుకు పో’ అంటూ TVS బండి తాళాలు వాడికిచ్చాడు.

కిరీటి ఆఘమేఘాల మీద వెళ్ళి వాళ్ళ నాన్నను తీసుకొచ్చాడు. ఆమె కట్టు పరీక్షించి కళవళలాడిపోతున్న పెద్దాయన్ని శాంతపరిచి ‘ఏదో గీసుకొని రక్తం వచ్చింది తప్ప తలకు దెబ్బ తగల్లేదు’ అని ఆయన్ని శాంతపరిచాడు రమణాచారి.
[+] 2 users Like mkole123's post
Like Reply
#34
మాయ - 10

‘చాలా నీరసంగా వుంది ఏమన్నా తిన్నదా లేదా పొద్దుట్నుంచి’ అని అడిగితే ప్రెసిడెంటు గారు వ్రతం సంగతి చెప్పారు. ‘ఏ దేవుడయ్యా స్వామీ కడుపు మాడ్చుకోమని చెప్పింది? ఒరేయ్ ముందు కొంచెం glucose, అది కనిపించకపోతే పంచదార నీళ్ళో  కలుపుకురా పో’ అని రమణాచారి కిరీటిని కిచెన్లోకి పంపాడు.


‘ఇందా glucose నీళ్ళు’ అంటూ మానవాడు బయటకి వచ్చేసరికి రమణాచారి ఒక్కడే వున్నాడు. ‘ఆయన వాళ్ళావిడకి telegram ఇవ్వడానికి వెళ్లాడ్రా. ఇలా వచ్చి శైలూకి ఓ స్పూన్ తో మెల్లిగా ఆ నీళ్ళు పట్టించు’ అని చెప్పాడు. ఈవిడ పేరు శైలు నా అనుకున్నాడు కిరీటి.


వాళ్ళ నాన్న శైలు తలకింద కొన్ని తలగళ్ళు పెట్టి ఎత్తు చెయ్యగా వచ్చి ఆమెకు మెల్లిగా నీళ్ళు అందించడం మొదలెట్టాడు. ఇంతలో రాజన్న విషయం గుర్తొచ్చి చెపితే రమణాచారి బాధతో తల పంకించాడు. ‘నే వెళ్ళి చూస్తాలే. అమ్మాయి కళ్ళు తెరిచేవరకు వుండి ఏమన్నా తినిపించు’ అని చెప్పి వెళ్ళాడు.

కొంతసేపటికి శైలు అటూ ఇటూ కదుల్తూ కళ్ళు తెరిచింది. ఎదురుగుండా వున్న కిరీటిని చూసి ‘ఏమైంది’ అని హీనస్వరంతో అడిగింది. ‘మీరు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారండి. ఇప్పుడు ఏమన్నా తినాలి’ అంటే ‘పరమాన్నం’ అని ఒక మాట అని మళ్ళీ కళ్ళు మూసుకుంది.

దేవుడి గది వైపు వెళ్ళి చిన్న గిన్నెలో పరమాన్నం వేసి తీసుకొచ్చాడు కిరీటి. ఈ లోగా శైలు కొంచెం సర్దుకుని కూర్చుని వుంది. ఆ కాస్త పనికే మళ్ళీ భారంగా ఊపిరి పీలుస్తోంది. గిన్నె తన చేతికి ఇచ్చేద్దామ్ అనుకున్న వాడు కాస్తా కుర్చీ ఆమె పక్కకు జరుపుకొని ‘శైలూ గారూ, ఇందా కొంచెం తినండి ఓపిక వస్తుంది’ అని ఆమె నోటికి స్పూన్ తో అందించబోయాడు.

‘ముందు నువ్వు’ అంటూ తల ఊపింది. ‘కళ్ళు తిరిగి పడిపోయింది మీరండీ. ఇంద’ అంటూ మళ్ళీ అందించబోతే మట్టి బుర్ర అన్నట్టు ఒక చూపు చూసి ‘వ్రతం’ అని ఒక మాట అని మళ్ళీ ఊపిరి ఎగబీలుస్తోంది.

ఓర్నాయనో అనుకోని తను ఒక స్పూన్ తిని ఆమెకు తినిపించడం మొదలెట్టాడు. ఆ టైమ్ లో అది ఎంగిలి స్పూన్ అన్న ధ్యాస కూడా లేదు ఇద్దరికీ. కొంచెం పరమాన్నం తిని ఇంకొంచెం glucose నీళ్ళు తాగిన తర్వాత శైలు తేరుకుంది. మాగన్నుగా ఒక కునుకు వేసి ఈసారి కొంచెం తేరుకొని alert గా కూర్చుంది. నాన్న కానీ ప్రెసిడెంటు గారు కానీ రాకపోతారా అని ముళ్ళ మీద కూర్చున్నట్టు వున్నాడు మనవాడు. ఎందుకంటే తన ఒంటి మీదకు బట్టలు ఎలా వచ్చాయి అని శైలు అడిగితే ఏం చెప్పాలో ఆ టాపిక్ ఎలా మాట్లాడాలో ఏమీ తెలియక కంగారులో వున్నాడు.

కానీ ఆ రోజు టైమ్ బాగున్నట్టు లేదు వాడికి. ‘అవునూ, ఎలా జరిగింది ఇది అసలు’ అని తనలో తానే మాట్లాడుకుంటోంది శైలు. మొత్తం సంఘటన నెమరేసుకున్న తర్వాత ఆమె ముఖం కోపంతోనో సిగ్గుతోనో ఎర్రగా కందిపోవటం గమనించాడు. ‘ప్రెసిడెంటు గారు ఎక్కడున్నారో చూసొస్తానండి’ అంటూ తప్పించుకోబోతే చెయ్యి పట్టుకొని ఆపేసింది శైలు.

‘ఏం చేశావ్, ఏం చూశావ్’ అని ఒక్క మాటతో వాడి నోటికి, కాళ్ళకి తాళం వేసేసింది. నీళ్ళు నముల్తూ అక్కడే నిలబడిపోయాడు. ‘నాంచకు, చెప్పు’ అని గద్దించింది. ఇంకా నీరసంగానే వుందేమో కోపంగా బదులు కీచుగా ఫన్నీగా వచ్చింది ఆమె వాయిస్. అనుకోకుండా ఒక నవ్వు ఎగదన్నుకొచ్చింది కిరీటికి. ఆపాలనుకున్నా ఆపలేకపోతున్నాడు. వాడి అవస్థ చూసి శైలు కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. కాసేపట్లో ఆ నవ్వు ఆమె కళ్ళల్లో కన్నీరైంది.

కిరీటి ఆమె పక్కన మోకాళ్ళ మీద కూర్చొని ‘శైలు గారూ, నేనేమీ తప్పుగా చూడలేదండీ. ఆ టైమ్ లో ఇంక ఏమీ చెయ్యడానికి ఛాన్స్ లేదు’ అని నచ్చచెపుతున్నాడు. ‘మరి నాకు ఇక్కడ ఎందుకు మంట పుడుతోంది? పట్టుకున్నావా?’ అంటూ తన ఎద సంపద వైపు vague గా వేలు చూపించింది. గుటకలు మింగి ‘మీకు బట్టలు వేసేటప్పుడు నా గోరు గీరుకుందండి’ అన్నాడు.

‘ఇక్కడే వుండు మామ వచ్చేదాకా’ అని కూర్చోపెట్టింది. కిరీటి ముఖం పాలిపోవటం చూసి అనునయంగా బుగ్గ మీద చెయ్యి వేసి ‘నేనేమీ చెయ్యను. ఇబ్బంది పడకు. ఇప్పటిదాకా నాకు హెల్ప్ చేసినందుకు థాంక్స్ కూడా చెప్పలేదు, థాంక్స్’ అంది. ఆడవాళ్ళ చేతులు ఇంత మెత్తగా ఎలా వుంటాయి అనుకున్నాడు కిరీటి. ఆ స్పర్శతో ఆమె ఏం చెబుతోందో కూడా వినట్లేదు.

ప్రెసిడెంటు గారు ఆదరాబాదరగా పరిగెట్టుకొచ్చి వాడ్ని ఇంకా uncomfortable కాకుండా కాపాడాడు. ‘Telegram ఇచ్చేసినాను. మీ అత్త ఓ మూడ్రోజుల్లో ఈడుంటాది. ఏరా మళ్ళీ కాళ్ళకు చక్రాలు కట్టుకుపొయ్యాడా మీ బాబు’ అంటూ సుడిగాలిలా లోపలికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు.

‘ఓ గంటలో మళ్ళీ వస్తాడు పెద్దాయనా. మీకు పరావాలేదంటే నేను వెళ్తానండి శైలు గారు’ అంటూ బయల్దేరబోయాడు. ‘పర్వా వుంది అంటే ఏం చేస్తావు’ అని నవ్వుతూ అడిగింది. ప్రెసిడెంటు గారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి ‘నా బిడ్డతోటా నీ ఆటలు, కూకోరా’ అంటూ మళ్ళీ ఆపేశారు.

‘ఈ కుర్రాడు మంచి వాడేనా మామా’ అని అడిగితే ‘థూ, ఈ నాయాలు వట్టి గాలి నా కొడుకు. అచ్చోసిన ఆంబోతల్లే ఊరి మీద పడి తిరుగుతుంటాడు. ఈడికో ఎదవ బాచి. ఈడి బాబు ఇంకా మాయగాడు. మనకి పది ఎకరాలు బాకీ’ అంటూ మళ్ళీ నవ్వుతున్నాడు.

‘సరే ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రేపు రావోయి, నీతో మాట్లాడాలి’ అని శైలు అంటే బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు కిరీటి. ఇల్లు దాటకముందే ప్రెసిడెంటు వచ్చి వాడ్ని వాటేసుకున్నారు. ‘అది నా ముద్దుల మేనకోడల్రా. ఏతన్నా ఐతే నా పానం పోయేది. లేకుంటే మా ఇల్లాలు నా పానం తీసేసేది. ఇంటి పనిమనిషి ముసిల్దిరా, నా బిడ్డకి తోడుగా ఓ మూడ్రోలు ఎవరన్నా సూడమను మీ అయ్యని. పనిమనిషిగా కాదు, ఓ తోడు అంతే’ అని వాడ్ని భుజం తట్టి పంపారు.

ఇంటికి వెళ్తుంటే కిరీటికి గోరు అక్క గుర్తుకు వచ్చింది. ఒక రెండు మూడు రోజులు ఇంట్లోనుంచి బయటకు వచ్చి వుంటే ఆమెకు కూడా మనశ్శాంతి కలుగుతుందేమో అడిగి చూద్దాం అని వాడి ఇంటి వైపు వెళ్ళాడు.
[+] 5 users Like mkole123's post
Like Reply
#35
Nice update
Like Reply
#36
We want quick Update bro.
Like Reply
#37
నైస్ బాగుంది
 Chandra Heart
Like Reply
#38
Good one boss
Like Reply
#39
Waiting for update
Like Reply
#40
Nice update
Like Reply




Users browsing this thread: 21 Guest(s)