Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
నెక్స్ట్ రోజు ఉదయం కూడా చెల్లి 3 గంటలకే లేచి 5 వరకూ చదివి మమ్మల్ని లేపింది . ముగ్గురమూ ఒకరితరువాత మరొకరము తేదీ అయ్యి బయటకువస్తే కార్తీక సంతోషమైన చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ స్వాగతం పలకడంతో , ముగ్గురమూ ఆనందించి గుడ్ మార్నింగ్ చెప్పి అక్కయ్య దర్శనానికై బయలుదేరాము .
దగ్గరలో ఉన్న చుట్టుప్రక్కల వీధులన్నీ ప్రతి ఇంటినీ వెతకడం పూర్తవ్వడంతో , కొన్ని కిలోమీటర్లు చెల్లి కార్తీక వెనుకాలే సైకిల్ తొక్కుతూ రావడం చూసి బాధతో అన్నయ్యా , రేయ్ ........... మీరు బైకులో రండి మేము సైకిల్ తొక్కుతూ వస్తాము . అవునన్నయ్యా .......... అని కార్తీక కూడా చెప్పింది .
చెల్లెమ్మా ......... మరికొంత దూరమే కదా వెళ్లి ఇక నెమ్మదిగా వీధులన్నీ వేతకడమే , నా చెల్లెళ్లతో సైకిల్ తొక్కిస్తే ఈ హృదయం తట్టుకోగలదా , మీ అన్నయ్యా నీ ప్రియుడుకి ఈ కష్టం అలవాటే చెల్లీ .......... అందులోనూ మన అక్కయ్యను వెతికే కష్టంలో ఉత్సాహం మాటల్లో చెప్పలేము ఏరా .........
అంతే మామ్స్ .......... అంటూ హైఫై కొట్టుకుని వేగంతో తొక్కుతూ నవ్వుతూ చెల్లీ స్కూటీని దాటేసి నవ్వుతూ చెల్లీ మేమే ముందు అంటూ ముందుకువెళ్లిపోయాము .
చెల్లి లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ......... అంటూ ఆనందిస్తుంటే , అక్కయ్యా ......... అన్నయ్యల కంటే మనమే ముందుకువెళ్లాలి అని చెల్లిని వెనుక నుండి గట్టిగా హత్తుకొని చెప్పింది .
చెల్లికి ఇలాగే బాగుంది అని అనిపించినా , కార్తీక కోరిక తీర్చాలని అంతేనంటావా కార్తీక అని ఆక్సిలేటర్ తిప్పుతూ వేగం అందుకొని క్షణాల్లో మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయింది .
అన్నయ్యలూ .......... మేమే ఫస్ట్ మేమే ఫస్ట్ అంటూ కార్తీక ఒకచేతిని ఎత్తి సంతోషించడం చూసి నవ్వుకుని , చెల్లీ రేయ్ జాగ్రత్త అని ఇద్దరమూ కంగారుతో సడెన్ గా వేగం తగ్గించాము .
చెల్లి మిర్రర్ లో చూసి వేగం తగ్గించి మా దగ్గరకు చేరుకుని లవ్ యు అన్నయ్యా , కృష్ణ ......... కార్తీక ఆశపడితేనూ ......... ,
అయితే మేమే ఫస్ట్ అంటూ ఇద్దరమూ చేతులు కొట్టుకుని వేగం అందుకున్నాము .
అక్కయ్యా .......... అన్నయ్యలు కంగారుపడతారు నెమ్మదిగానే వెళ్లు , అన్నయ్యలే ఎప్పుడూ ఫస్ట్ ఉండాలి అని చెప్పింది .
లవ్ యు కార్తీక ఉమ్మా ........ అని అద్దం లో ముద్దుపెట్టింది .
నిన్న ఎక్కడయితే ఆపామో ఆ వీధిని చేరుకునేసరికి అరగంట పట్టింది . ఇక రెండుగా విడిపోయి అక్కయ్య కోసం ఫొటోలతో వేట ప్రారంభుంచాము . 9 గంటలవరకూ ఆ ఏరియా వీధులన్నీ తిరిగినా ఎక్కడా అక్కయ్య జాడ లేకపోవడంతో రోజూలానే అలవాటైపోయిన నిరాశతోనే ఇంటికి చేరుకునేటప్పటికి 10 గంటలు అయ్యింది .
సైకిల్ తొక్కడం వలన ముఖమంతా చెమట పట్టి ఉండటం , ఆఫీస్ కు వెళ్లడం కోసం కారు ఎక్కుతూ చూసిన అంకుల్ , మహేష్ ............ రోజూ సైకిల్లో వెళుతున్నారని మీ అంటీ చెప్పింది , చాలా దూరం వెళ్లినట్లున్నారు , రోజూ ఇలాగే వెళతారు కదూ , కారు కొన్న తరువాత నా ఫేవరేట్ బుల్లెట్ అదిగో అక్కడ కవర్ కప్పబడి కదలకుండా ఉండిపోయింది . మీరెందుకు use చేయరాదు తల్లీ బుల్లెట్ కీస్ తెచ్చి మీ అన్నయ్యలకు ఇవ్వు అనిచెప్పగానే ,
Dad ........... లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ నేనే మిమ్మల్ని ఇదేవిషయం అడుగుదామని లోపలికి వస్తున్నాను . ఇంతలో మీరే సంతోషమైన మాట చెప్పారు అని హత్తుకొని పరుగున లోపలికివెళ్లి కీస్ తీసుకొచ్చి ,
అంకుల్ ...........
అన్నయ్యా .......... నాన్నే ఇష్టంతో ఇచ్చారు అని చేతిలో ఉంచేసివెళ్లి బుల్లెట్ కవర్ తీసేసి , అన్నయ్యా ......... దుమ్ముపట్టింది కొద్దిసమయం ఇచ్చావంటే కొత్తగా మారిపోతుంది అని పాత గుడ్డలు తీసుకొచ్చి ప్రక్కన ఉంచి వైపుతో బుల్లెట్ మొత్తం ఫోర్స్ తో నీటిని కొట్టి , గుడ్డలతో శుభ్రం చెయ్యడం మొదలెట్టింది కార్తీక ,
ఆనందబాస్పాలతో చెల్లి కూడా వెళ్లి లవ్ యు soooooo మచ్ కార్తీక అని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి మరొక గుడ్డ అందుకొని చెరొకవైపు నుండి చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంతో శుభ్రం చేస్తున్నారు .
మహేష్ .......... ఆఫీస్ టైం అయ్యింది , ఇక ఆ బుల్లెట్ మీదే అనుకోండి అనుకోవడమేంటి మీదే , తల్లీ లోపల 5 లీటర్స్ పెట్రోల్ ఉంది మీ అన్నయ్యలకు తెచ్చివ్వు బై అనిచెప్పి వెళ్లారు .
తల్లీ కృష్ణ , కార్తీక .......... టిఫిన్ చేసి క్లీన్ చెయ్యొచ్చు కదా , ఇప్పటికే ఆలస్యం అయ్యింది .
ఉండమ్మా .......... కృష్ణ అన్నయ్య జాబ్ కు వెళతారు కదా అంతలోపు శుభ్రం చేసేస్తాము . అన్నయ్యలూ మీరు వెళ్లి తినండి అని ఇద్దరూ మరింత ఉత్సాహంతో నీళ్లు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు .
మీరు తినకుండా మీ అన్నయ్యలు తింటారు అంటే నేను నమ్ముతాను అనుకున్నారా ......... కానివ్వండి అని అంటీ కూడా చెయ్యివేసింది .
మేమూ సహాయం చేయబోతే అన్నయ్యలూ ........ మీరు దర్జాగా కాలుమీద కాలువేసుకుని కూర్చోండి అయిపోతుంది అనిచెప్పి అంటీపై ఒకేసారి నీళ్లు చల్లి సంతోషంతో నవ్వుతూ నిమిషాల్లో కొత్తగా తయారుచేసేసి , ముగ్గురూ ఫోజ్ ఇచ్చారు.
ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని కృష్ణగాడు వెళ్లి ఫోటోలు తీస్తుంటే , చెల్లెళ్ళు సిగ్గుపడుతున్న అంటీని వెళ్లకుండా పట్టేసుకొని బోలెడన్ని ఫోటోలు దిగి , మా ఇద్దరినీ కూడా లాక్కెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు . మీతోపాటు నన్నుకూడా తడిపేశారు అని చెల్లి కార్తీక బుగ్గలపై ప్రేమతో కొట్టి తొందరగా చేంజ్ చేసుకుని రండి టిఫిన్ తిందురు అని అంటీ పరుగున లోపలికి వెళ్లిపోయారు .
చెల్లెళ్ళు డ్రెస్ మార్చుకుని వచ్చాక టిఫిన్ తినేసి , కార్తీక అందించి పెట్రోల్ పోసి కృష్ణగాడు స్టార్ట్ చేయగానే లవ్లీ బుల్లెట్ సౌండ్ రావడంతో ఒకరినొకరు హత్తుకొని జాగ్రత్తగా వెళ్ళిరారా అని బయటవరకూ వాడివెనుకే వెళ్ళాను .
రేయ్ మామా ..........ఇప్పుడు వచ్చే శనివారం నీ హార్ట్ birthday .......,
అంతే పట్టరాని ఆనందంతో బుల్లెట్ దిగి అమాంతం నన్ను కౌగిలించుకుని నీ చె.... ల్లి..... పుట్టినరోజు ......... అని సంతోషంలో మాటలు రానట్లు , రేయ్ రెండు రోజుల్లోనా........ ఈ శనివారం కదా అని ఏదో చెప్పబోయి వెంటనే ఆగిపోయి , రేయ్ మామా .......... ప్లాన్ ఏంటి అని ఉత్సాహంతో అడిగాడు .
రేయ్ ........... నువ్వు నా ప్రాణంరా , నీ birthday మరిచిపోతానా అమ్మతో ఎప్పుడో తెలుసుకుని గుండెల్లో దాచుకున్నాను అయితే నీకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే అని ఆ ఊహకే ఆనందం రెట్టింపైంది .
రేయ్ చెల్లికి సర్ప్రైజ్ ఇద్దాము . ఎవరెవరు వస్తున్నారో తెలుసా అని మొత్తం వివరించాను . నువ్వు ఏమిచేస్తావంటే వర్క్ కాస్త ముందుగానే పూర్తిచేసి decoration వాళ్ళను కలిసి పైన వరండా మొత్తం అందంగా అలంకరించేలా మాట్లాడు అనిచెప్పాను .
అమ్మావాళ్ళు వస్తున్నారా ......... లవ్ యు లవ్ యు sooooo మచ్ రా మామా అని కౌగిలిలో నలిపేసి , అది నాకు వదిలేయ్ రా నేను చూసుకుంటాను . నీ చెల్లి....... నా ప్రేమ దేవత జరుపుకోబోతున్న తొలి పుట్టినరోజు సంబరాన్ని ఎలా జరిపిస్తావో తలుచుకుంటేనే హృదయం పరవశించిపోతోందిరా మామా ......... ఊహకే అందడం లేదు , వెళ్ళొస్తానురా ......... అని డాన్స్ చేస్తూ బుల్లెట్ ఎక్కి వెళ్ళిపోయాడు .
ముందు అంకుల్ పర్మిషన్ తీసుకోవాలని వెంటనే కాల్ చేసాను .
మహేష్ .........
అంకుల్ ......... మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అని అడిగాను .
ఇప్పుడే ఇంటికి రమ్మంటావా అని చెప్పారు .
థాంక్స్ అంకుల్ .......... అంకుల్ అని చెల్లి పుట్టినరోజును జరుపుకోవాలని అనుకుంటున్నాము . కొంతమంది గెస్ట్స్ ఊరినుండి వస్తున్నారు . కాస్త హడావిడి ఉంటుంది . ముందుగా మీకు తెలిపి పనులు మొదలుపెడదామని ...........
మీరు వద్దు అన్నాకూడా ఏమాత్రం బాధపడము .
మహేష్ నా పెద్ద కూతురు birthday ఫంక్షన్ ను ఆపే దమ్ము ఎవరికి ఉంది . Dj పెడతావా , బ్యాండ్ తో ఏరియా మొత్తం టాప్ లేపుతావా ......... ఇంకా ఏమైనా చేసుకో , ఇల్లుపీకి పందిరివేసి ఎంజాయ్ చెయ్యండి . డిస్టర్బ్ అని చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేనుచూసుకుంటాను . ఏమైనా పనులుంటే నాకుచెప్పండి నేనూ ఉత్సాహంతో చేస్తాను .
పండగ జరపడానికి నా పర్మిషన్ కోసం కాల్ చేస్తావా ......... ఉండు ఇంటికివచ్చాక నీసంగతి చూస్తాను అని సంతోషన్గా నవ్వుకుని మీ ఇష్టం మహేష్ ........ తొలిరోజే చెప్పానుకదా మీ ఇంటిలా ఫీల్ అవ్వమని ఎంజాయ్ .......... దేవుడా ఈరోజు రేపు తొందరగా గడిచిపోయేలా చూడు స్వామి అని ప్రార్థించారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అంకుల్ ............ అని ఆనందబాస్పాలతో చెప్పాను .
అమితమైన ఆనందంతోపైకి వెళ్ళేసరికి చెల్లి ఏకాగ్రతతో చదువుతుండటం చూసి ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా లాప్టాప్ అందుకొని కిందకువచ్చి కాంపౌండ్ లో చెట్టుకింద కూర్చుని ఆన్లైన్ లో వర్క్ మొదలెట్టాను .
కార్తీక వచ్చి అన్నయ్యా .......... మీకు టీ , అక్కయ్యకు ఎనర్జీ కోసం బూస్ట్ ఇచ్చోస్తాను అని పైకివెళ్లి వెంటనే వచ్చేసి , అన్నయ్యా ......... అక్కయ్య ఎంట్రన్స్ అయ్యేంతవరకూ మీరే డౌట్స్ క్లియర్ చెయ్యాలి , అక్కయ్యను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేదు అని స్టడీ చైర్ తీసుకొచ్చి నాప్రక్కనే కూర్చుని ఫస్ట్ ఇయర్ లో డౌట్స్ ను అడుగుతోంటే , వర్క్ మధ్యలో సాఫీగా అర్థమయ్యేట్లు టీచ్ చేస్తుండటం చూసి అంటీ లోలోపలే మురిసిపోయారు . మధ్యాహ్నం లోపు రెండుసార్లు fruit జ్యూస్ ను చెల్లికోసం పంపించి మాకు అందించింది .
మధ్యాహ్నం ఒంటి గంటకు ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న కృష్ణగాడి నుండి కాల్ రానే వచ్చింది . కార్తీక ఒక్కనిమిషం అని లేచివెళ్లి చెప్పరా ........ అన్నాను .
రేయ్ మామా ........... ఇక్కడ birthday decoration కే lakhs అడుగుతున్నారు .
వాడు decorations చూపిస్తుంటే ప్రక్కనే ఆర్కిటెక్ట్ ను పట్టుకుని వీడికెందుకు ఇవ్వాలి అంతడబ్బు అని ఆలోచించాను .
లవ్ యు రా మామా ........ యు sure కదా అని అడిగాను .
రేయ్ మామా ........... వీటిని తలదిన్నెలా చెయ్యగలవు , ఇప్పుడు కాదు నీ తొలి స్కెచ్ వేసినప్పుడే నాకు తెలుసురా ......... , సాయంత్రం నీ చెల్లికి తెలియకుండా సిటీలోకివెళ్లి decoration కోసం ఏమేమి అవసరమో అన్నింటినీ తీసుకొచ్చి సమయానికి నీ టాలెంట్ తో అద్భుతమైన decoration చేద్దామురా ....... నిద్రకూడా పోయేదిలేదు .
అయితే వచ్చేయ్ రా ........ అని చెప్పాను .
అన్నయ్యా ......... ఏంటి సర్ప్రైజ్ , decoration అని మాట్లాడుతున్నారు అని కార్తీక అడిగింది .
ష్ ష్ ........ కార్తీక మీ అక్కయ్య వింటుంది . మర్నాడు మీ అక్కయ్య తన జీవితంలో తొలి birthday జరువుకోబోతోంది . బిగ్గెస్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాము . ఇందులో నువ్వుకూడా మాకు సహాయం చెయ్యాలి .
అక్కయ్య birthday .......... wow .......... ఆర్డర్ వెయ్యి అన్నయ్యా .......... ఏమైనా చేస్తాను అని అంతులేని ఆనందంతో బదులిచ్చింది .
కార్తీక ఈరోజు సాయంత్రం నుండి మీ అక్కయ్య పైకి వెళ్లకూడదు . ఏమిచేస్తావో ఏమో నీ రూమ్ నుండి బయటకు రాకూడదు అనిచెప్పాను . ఇక్కడ మరొక సర్ప్రైజ్ నాకుమాత్రమే తెలిసినది ఏమిటంటే ఆరోజే మీ కృష్ణ అన్నయ్య birthday కూడా ...........
అద్భుతం అన్నయ్యా .......... అంటే ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారు అన్నమాట , అంటే కృష్ణ అన్నయ్య దృష్టిలో ఒక్క సర్ప్రైజ్ , మన దృష్టిలో రెండు సర్ప్రైజెస్ ........ సంబరాలు అంబరాన్ని దాటాలి అన్నయ్యా ..............
అలాగే కార్తీక ........... నెక్స్ట్ నువ్వేమిచెయ్యాలో నీకు తెలుసుకదా అని అడిగాను .
మీరే చూస్తారుకదా మా అన్నయ్య నా సహాయం అడిగారు అదిచాలు నాకు అని సంతోషంతో పొంగిపోయింది .
లవ్ యు కార్తీక ........ అని తలపై స్పృశించి పైకివెళ్లి చార్ట్ , పెన్సిల్ , కలర్ పెన్స్ మరియు ప్యాడ్ తీసుకుని అక్కయ్యల ఫొటోకు మరియు చదువుకుంటున్న చెల్లికి ఎదురుగా గోడకు ఆనుకుని కూర్చుని ,
ప్రాణంలా ఫోటోని , చెల్లినీ చూసి గుండెలపై చేయివేసి కళ్ళుమూసుకుని అక్కయ్యా .......... మీ చెల్లి పుట్టినరోజు decoration స్కెచ్ ను మీరే నాకు చూపించాలి అని కళ్ళుతెరిచి చూస్తే ,
అందమైన నవ్వుతో అన్నయ్యా .......... ప్లాన్ గీస్తున్నారు కదూ అక్కయ్యను తలుచుకుని అని అడిగింది .
మన ప్రాణమైన అక్కయ్యతోపాటు , అక్కయ్యకు తెలియని ఒక ప్రాణమైన చెల్లిని కూడా తలుచుకుని మొదలుపెడుతున్నాను చెల్లీ ..........
లవ్ యు soooo మచ్ అన్నయ్యా ......... మా అన్నయ్య అనుకున్నట్లు ప్లాన్ వెయ్యాలి ఇది మీ అక్కాచెల్లెళ్లుగా నేనే చెబుతున్నాను అని తియ్యని నవ్వుతో మాట్లాడుతుంటే ,
చెల్లిలో అక్కయ్య కూడా కనిపించినట్లు పెన్సిల్ చార్ట్ పై అలా అలా వెళ్లిపోతోంది . కృష్ణగాడు వచ్చేలోపు కలర్ఫుల్ decoration ప్లాన్ రెడీ అయిపోవడం చూసి నాకే ఆశ్చర్యమేసింది . వెంటనే లేచి ఫోటోలోని అక్కయ్య బుగ్గపై మరియు చెల్లి కురులపై ముద్దుపెట్టాను .
ఏంట్రా మామా .......... అంత ఆనందం అని అడిగాడు .
చెల్లీ ......... ఆకాలేస్తోంది , వర్క్ సమయం కూడా అవుతోంది అని చెప్పడం ఆలస్యం .........,
కిందకు పరుగుతీసింది .
చెల్లెమ్మా .......... నెమ్మది అని మెట్లదగ్గరికివచ్చి చెల్లి అంటీ ఇంట్లోకి వెళ్లేంతవరకూ చూసి , రేయ్ మామా ..........అని చార్ట్ చూపించాను .
వాడి ముఖం వెలిగిపోయి ఇది వరండా అంటే మనం నిలబడిన ఖాళీ ప్లేస్ , ఒకే ఒక్క మాట రా మామా ........... అద్భుతం . రేయ్ వాడు 100 కు పైనే డిజైన్స్ చూపించాడురా వాడికి సవాల్ విసురుతున్నాను , ఫంక్షన్ తరువాత పిక్ తీసుకెళ్లి చూపించి వాడి నోరుమూయిస్తాను అని సంతోషం పట్టలేక నన్ను అమాంతం పైకెత్తి గిరగిరా తిప్పేసాడు .
రేయ్ నీ చెల్లికి తెలియకుండా ఎలారా .......... decorate చెయ్యడం అని కంగారుపడిపోతున్నాడు .
రేయ్ కూల్ రా మామా ......... మొత్తం ప్లాన్ చేసేసాను . ఈరోజు రాత్రి నుండే వర్క్ స్టార్ట్ చేస్తున్నాము అనిచెప్పాను . రేయ్ పెన్ పేపర్ తీసుకురా ఏమేమికావాలో చెబుతాను అలాగే ల్యాప్ తీసుకురా అని birthday డిజైన్స్ చూసి decorate చెయ్యడానికి ఏమేమి అవసరమో చెబుతుంటే వాడు నోట్ చేసాడు .
అన్నయ్యా ......... లంచ్ రెడీ అంటీ మీకోసం పాయసం చేసింది , అమృతంలా ఉంది త్వరగా రండి అని కిందనుండే కార్తీకతోపాటు పిలిచింది .
ఇదిగో వచ్చేస్తున్నాము చెల్లీ ........., రేయ్ సాయంత్రం వచ్చేటప్పుడు దొరికినవి తెచ్చేస్తాను , మిగతావి మనిద్దరమూ వెళ్లి సిటీ మొత్తం గాలించయినా తీసుకొద్దాము అని చెప్పి ఉత్సాహంతో కిందకు దిగి తినేసి చెల్లీ వెళ్ళొస్తాను అని పర్సులో కార్డ్ ఉందో లేదో చూసుకుని బయటకు వచ్చాను.
రేయ్ మామా ........ కీస్ అంటూ విసిరి పర్ఫెక్ట్ కండిషన్ రా అంకుల్ బాగా మైంటైన్ చేశారు అనిచెప్పాడు .
నవ్వుకుని బయలుదేరాను . 4 గంటలకు వర్క్ పూర్తిచేసి మొబైల్లో ఏవేవి ఎక్కడ దొరకుతాయో సెర్చ్ చేసి అక్కడిక్కడే దగ్గరలోనే ఉండటంతో 75% తీసుకుని లగేజీ వెహికల్ కోసం రోడ్ ప్రక్కనే వేచిచూస్తుంటే నా అదృష్టానికి గోపి అన్నయ్యే వెహికల్లో వచ్చారు .
మహేష్ ..........అంటూ దిగివచ్చి కౌగిలించుకుని , వెహికల్ కావాలా ఎంతసేపటి నుండి వేచిచూస్తున్నావు . నీకు ఆరోజే చెప్పానుకదా ఒక్క కాల్ చేస్తే ఎక్కడ ఉన్నా వచ్చేస్తాను అని , మన బంధం గట్టిది అందుకే పైవాడు నన్ను సమయానికి ఈదారిలో పంపించాడు . ఏదీ లగేజీ ఎక్కడ అని అడిగారు . చాలానే ఉన్నాయి అన్నా .......చాలా షాప్ లకు వెళ్లి రెడీగా ఉంచినవి పే చేసి తీసుకువెళ్లాలి .
అయితే పదా ........ నా డ్యూటీ కూడా అయిపోయింది అని ఎక్కించుకుని ఒక్కొక్కటే లాగేజీలో ఎక్కిస్తూ వెళుతూ , shit shit .........ఇక మిగిలినవి ఎక్కడ దొరుకుతాయి అని మొబైల్లో సెర్చ్ చేస్తుండటం చూసి , తమ్ముడూ ఏంటి విషయం అని అడిగారు . అన్నయ్యా ........ కావాల్సినవన్నీ తీసుకున్నాను కొన్ని మాత్రం ఎక్కడ దొరకుతాయో తెలియదు .
ఏదీ చూపించు అన్నారు . చూసి నేనున్నాను కదా తమ్ముడూ అని ముందు అన్నింటినీ వెహికల్లోకి ట్రాన్స్ఫర్ చేసి , పదా వెళదాము అని పోనిచ్చారు .
సంతోషంతో కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ మామా ......... గోపి అన్నయ్య కలిసాడురా , మరొక గంటలో అన్నింటినీ తీసుకుని వచ్చేస్తున్నాను ........ మనం మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదు .
రేయ్ ఆలస్యం అయినప్పుడే అనుకున్నాను . ఇలాంటి ఘనకార్యం తమరు చేస్తుంటారని అందుకే నీ చెల్లి ......... రేయ్ అన్నయ్య బుల్లెట్ జాయిన్ అవుతారు మనం ముగ్గురూ స్కూటీలో అక్కయ్యను వెతుకుదాము పదా అంటేనూ ఉదయం ఆగినదగ్గరనుండీ మొదలెట్టేసాము .
లవ్ యు చెల్లీ .......... అని చెప్పి మురిసిపోయాను .
అంతేరా ......... మీ అన్నాచెల్లెల్లే అన్నీ ఇలా పూర్తిచేసేయ్యండి అని ఫీల్ అవుతోంటే ,
పోరా ....... చెల్లినీ , కార్తీకను జాగ్రత్తగా చూసుకో అని నవ్వుకుని కట్ చేసాను .
మహేష్ ......... సిటీలో అన్ని decorate షాప్ లకు సప్లై చేసే గోడౌన్ కు తీసుకెళతాను నీకు కావాల్సినవన్నీ ఓకేదగ్గర దొరుకుతాయి కొనవచ్చు లేకపోతే రెంట్ కు కూడా తీసుకోవచ్చు .
ఇవి కాస్త costly మరియు పెద్దవి అన్నా .......... రెంట్ కే తీసుకుందాము . ఫంక్షన్ తరువాత ఎలాగో మనకు ఉపయోగపడవు అనిచెప్పాను .
నాకు తెలిసినవారు ఉన్నారులే మహేష్ ......... నీకు ఏమేమి కావాలో తీసుకో నేను హామీ ఉంటాను అని మాట్లాడుతూ అక్కడికి చేరుకుని లోపలికివెళ్లాము .
ఏమేమి కావాలో పనిచేసే వ్యక్తికి చూపించడంతో , అన్నీ ఉన్నాయి కొనడానికా రెంటా అని అడిగాడు .
రెంట్ అని గోపి అన్న బదులిచ్చారు .
తెలియనివారికి ఎలా ఇచ్చేది అని డౌబ్ట్ పడుతోంటే ,
గోపి మనకు తెలిసినవాడేలే , ఇంతకు ముందు మన ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేవాడు అని ఓనర్ చెప్పడంతో అన్నింటినీ వెహికల్లో ఎక్కించారు . బిల్ చూసి ఇంత తక్కువనా థాంక్స్ అన్నా ........ ఈపాటి దానికి వాక్కు lakhs అడిగారు అని అడ్వాన్స్ ఇచ్చేసి 8 గంటలకల్లా ఇంటికిచేరుకున్నాము .
అన్నా ........తొందరగా అన్నింటినీ పైకి షిఫ్ట్ చెయ్యాలి అని ఇద్దరమూ నిమిషాల్లో పైకి మార్చేసి అన్నింటిపై పెద్ద పెద్ద కవర్లను కప్పేసాము .
అన్నయ్యా ......... అని డబ్బుతీసి జేబులో ఉంచేసి థాంక్యూ అంటూ కౌగిలించుకుని మీరు రాకపోయుంటే చాలా ఇబ్బందిపడేవాళ్ళము . గోపి అన్నా మర్నాడు చెల్లెమ్మ పుట్టినరోజు ఫ్యామిలీతోపాటు తప్పకుండా రావాలి ఆరోజు సాయంత్రం ఫంక్షన్ ఉంటుంది అనిచెప్పాను .
కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని మహేష్ ......... తప్పకుండా వస్తాము శనివారం సాయంత్రం కదూ అని తన బుక్ లో రాసుకుని సంతోషంతో వెళ్లిపోయారు .
బయటకువచ్చి వాడికి కాల్ చేసి ఎదురువెళ్లాను . మధ్యలో కలిసి ఇద్దరిద్దరమూ ఇంటికి చేరుకున్నాము .
చెల్లి ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళుతోంటే , తల్లీ కృష్ణ ......... కింద కామన్ బాత్రూమ్లో నీళ్లు రావడం లేదు మీ అంకుల్ రిపేర్ చేయిస్తారు రెండురోజులు పడుతుందట , ఈ రాత్రి నుండే పని మొదలుపెడతారు పనివాళ్ళు , నీకు చదువుకోవడానికి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈరెండు రోజులూ కార్తీక రూంలోకి షిఫ్ట్ అయిపో అని అంటీ చెప్పారు .
సరే అంటీ బుక్స్ తీసుకొస్తాను అని పైకి వెళుతోంటే ,
చెల్లీ ......... మేము తెస్తాము కదా అని ఇద్దరమూ సంతోషంతో అంటీకి థాంక్స్ చెబుతూ పైకివెళ్లి బుక్స్ అన్నింటినీ తీసుకొచ్చాము .
అన్నయ్యా ......... ఇంత బరువు మేము మొయ్యలేము మీరే వెళ్లి నారూంలో పెట్టండి అని కార్తీక చెల్లి చేతిని చుట్టేసి నవ్వుతూ చెప్పింది .
తలతో కార్తీక తలపై కొట్టి లోపల ఉంచాము .
మహేష్ , కృష్ణ ........ డిన్నర్ చేసి వెళ్ళండి అనిచెప్పడంతో తినేసి , బయట కృష్ణగాడు చెల్లి బుగ్గలను అందుకొని రాత్రన్తా నువ్వే గుర్తుకువచ్చేలా ఏదైనా ప్రేమతో ఇవ్వమని అడిగాడు .
అంటే ..........నేను కాకుండా వేరెవరో నీ ఊహల్లోకి వస్తున్నారన్నమాట , నేను ప్రక్కన ఉంటేనే నేను లేకపోతే ..........అని చిరుకోపంతో వాడి గుండెలపై వాలిపోయింది .
My dear lovely హార్ట్ .......... నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు తప్ప ఇక్కడ ఎవ్వరికీ స్థానం లేదు అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాడు .
చెల్లి లోలోపలే నవ్వుకుని లవ్ యు రా ........ అంటూ గట్టిగా హత్తుకొని బుగ్గపై కొరికేసింది .
స్స్స్........ లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ రా , ఇకచూడు పైన ఉత్సాహంతో......... అని ఆగిపోయాడు .
ఉత్సాహంతో.......... ఏంటి రా ........
అదే అదే ఉత్సాహంతో నిన్నే కలవరిస్తూ హాయిగా నిద్రపోతాను అని బదులిచ్చాడు .
గుడ్ నైట్ రా , గుడ్ నైట్ అన్నయ్యా ..........
గుడ్ నైట్ ......... అనిచెప్పి , వాడి భుజాలను నొక్కేస్తూ నవ్వుతూ పైకివెళ్లడం చూసి , చెల్లి సంతోషంతో కార్తీకతోపాటు రూంలోకి వెళ్ళిపోయి బుక్స్ ఓపెన్ చేసింది .
The following 21 users Like Mahesh.thehero's post:21 users Like Mahesh.thehero's post
• 9652138080, AB-the Unicorn, Bangaru, Fuckingroll69, Jack789, Joncena, Kumarmb, kummun, Mahe@5189, maheshvijay, Milffucker, Naagu nag, nkp929, RAANAA, Rajeev j, Sachin@10, sandycruz, Shaikhsabjan114, sisusilas1@, sri7869, SS.REDDY
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
శ్రీమతి గారూ .......... పైకివెళ్లి వాటర్ పైప్స్ దగ్గరుండి రిపేర్ చేయిస్తాను అని కార్తీక రూంలో ఉన్న చెల్లికి వినిపించేలా అంకుల్ మాట్లాడారు .
ఎంతసమయం అయినా పర్లేదు వాళ్లకు హెల్ప్ ........ కాదు కాదు ఆర్డర్స్ వేస్తూ పనిచేయించండి అని లోలోపలే నవ్వుకుని బదులిచ్చింది అంటీ .
కార్తీక ......... లైట్ ఉంటే నిద్రపట్టదా ఆఫ్ చెయ్యి నేను తరువాత చదువుకుంటానులే అని చెల్లి చెప్పింది .
బెడ్ పై పాటలు వింటున్న కార్తీక చెల్లి దగ్గరకువెళ్లి లైట్ ఉంటే నిద్రపట్టకపోయినా , అక్కయ్యా ......... నాకు లైట్ ఆఫ్ చేస్తే చాలా భయం నేనెప్పుడూ లైట్ on చేసుకునే పడుకుంటాను కాబట్టి మీరు ఏమాత్రం బాధపడకుండా హాయిగా చదువుకోవచ్చు . నాకు నిద్రపట్టేంతవరకూ హాయిగా పాటలు వింటాను . నిద్రవచ్చినప్పుడు మీ ఒడిలో తలవాల్చి పడుకోవచ్చా అక్కయ్యా ........ అని ప్రేమతో అడిగింది .
చెల్లి ఒకచేతితో కార్తీక బుగ్గను స్పృశించి నుదుటిపై ముద్దుపెట్టింది .
యాహూ ........... లవ్ యు అక్కయ్యా , ఇక మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను అని వాటర్ బాటిల్ తీసుకొచ్చి చెల్లిప్రక్కనే ఉంచి , అమ్మ కొద్దిసేపటి తరువాత పాలు తీసుకొస్తుంది ఇంకా ఏమైనా అవసరం అయితే ఆర్డర్ వెయ్యండి అని చెల్లి కురులపై నవ్వుతూ ముద్దుపెట్టి బెడ్ పై పాటలు వింటూ కూర్చుంది .
అంకుల్ పైకివచ్చి మహేష్ , కృష్ణ ......... నాకూ ఏదైనా పనిచెప్పండి అని అడిగారు .
అంకుల్ ......... రండి అని లోపలికివెళ్లి చైర్ తీసుకొచ్చి , మీరు కూర్చుని మేము ఎలా చేస్తున్నామో , సరిగ్గా బ్యాలన్స్ చేస్తున్నామో లేదో చెప్పండి మేము అన్నీ పూర్తిచేస్తాము అనిచెప్పాము .
మహేష్ ......... నాకు వయసైపోయింది కూర్చో అంటున్నావు కదూ.........
మీవయసులో ఏమేమిచేసేవాల్లమో మీ ఊరిలో ఉన్న మీ అంకుల్ ని అడగండి అని కుర్చీ ప్రక్కనపెట్టేసి మాకు సహాయం చేస్తున్నారు .
నవ్వుకుని అంకుల్ కు decoration స్కెచ్ చూపించి వివరించాను.
మహేష్ .......... ఇలాంటి decoration ఇంతవరకూ చూడలేదు , సూపర్ అంతే ఎక్కడిది అని అడిగారు .
అంకుల్ ........ మీకు చెప్పలేదు కదూ మహేష్ born ఆర్కిటెక్ట్ అని కృష్ణ గర్వపడుతూ చెప్పాను .
Wow మహేష్ .......... అని భుజం తట్టి ఇప్పుడు నీలాంటి వాళ్లకు బయట మాంచి డిమాండ్ ఉంది , ఎంతో గొప్ప స్థాయికి చేరుకుంటావు అని సంతోషించారు .
రేయ్ లైట్స్ మరియు ఫ్లవర్స్ రేపు సెట్ చేద్దాము మిగతావి తీసుకురా అని అంకుల్ 11 గంటలవరకూ సహాయం చేసారు .
అంకుల్ మీకు నిద్రవస్తున్నట్లు ఉంది అని చేతినిపట్టుకొని కిందవరకూ వదిలేసి అంటీ పైకి తీసుకొస్తున్న టీ అందుకొని గుడ్ నైట్ అంటీ మీరు నిద్రపోండి అనిచెప్పి పైకివచ్చి టీ తాగగానే నిద్రమబ్బు మొత్తం ఎగిరిపోయి ఉత్సాహంతో సగం పనిని పూర్తిచేసి ఉదయం ఎప్పుడో లోపలికివెళ్లి హాల్ లోనే పడుకుండిపోయాము .
రేయ్ చెల్లి బట్టలకోసం పైకి వస్తుందేమోరా .......... అని కృష్ణగాడిని లేపాను .
అంతే లేచి రెండురోజులకు తనకు కావాల్సిన బట్టలను తీసుకెళ్లి గుమ్మం ప్రక్కనే ఉన్న టేబుల్ పై ఉంచి , చెల్లికి మెసేజ్ చేసి కాసేపు పడుకున్నాము .
చెల్లికి ఎక్కడా అనుమానం రాకుండా రోజూలానే 6 గంటలలోపు రెడీ అయ్యి నలుగురమూ అక్కయ్యకోసం ఈసారి సైకిళ్ళల్లో కాకుండా బుల్లెట్ లో వెళ్ళాము . రోజూలానే నిరాశతో ఇంటికి చేరుకుని టిఫిన్ చేసి చెల్లిని అక్కడే వదిలేసి కృషగాడు వరుసగా రెండురోజులు సెలవు పెట్టినా part టైం జాబ్ కు వెళుతున్నట్లు చెల్లికి చెప్పి , రేయ్ మామా ........ ఈరోజు బుల్లెట్ అవసరం లేదు అనిచెప్పి , కార్తీక మీ అక్కయ్య బయటకు రాకూడదు అని సైగచేసి ఇద్దరమూ పైకివెళ్లి సాయంత్రం లోపు లైట్స్ , ఫ్లవర్స్ అలంకరణ తప్ప మిగిలిన decoration మొత్తం పూర్తిచేసాము . మధ్యలో చెల్లికి తెలియకుండా నేనూ కృష్ణగాడు వెళ్లి ఒక కేక్ ........... చెల్లికి , వాడికి తెలియకుండా నేనూ కార్తీక వెళ్లి మరొక కేక్ ఆర్డర్ ఇచ్చి , రేపు సాయంత్రం బిగ్గెస్ట్ కేక్ రెడీ చెయ్యమని చెప్పి అడ్వాన్స్ ఇచ్చాను .
రేయ్ మామా అదిరిపోయింది రా ........., నువ్వు కోరుకున్నట్లుగానే మన సంపాదన ఈ చివరి రూపాయితో అన్నీ పూర్తిచేసాము .
రేయ్ మామా ......... ఆమాట నేను ఊరికే చెప్పానురా , ఇంకా ఖర్చుపెట్టాల్సింది చాలా ఉంది , మనం వెళ్ళిరాగానే వెళ్లి ఎన్నిరకాల పూలు ఉన్నాయో అన్నిరకాల పూల బుట్టలు తీసుకొచ్చేయ్ . చివరి అలంకరణ కూడా 12 గంటలలోపు పూర్తిచేసేద్దాము అనిచెప్పాను .
కనీసం ఈ పనైనా నాకుచెప్పావు మంచిది , ఇప్పుడే ఇలా ఉంది ఇక పూలతో , లైటింగ్స్ తో ........... ఊహకే అందడం లేదురా ........ అని భుజం చుట్టూ చేతినివేసి మురిసిపోతున్నాడు .
అవును మహేష్ ......... చూస్తుంటే నాకే birthday జరుపుకోవాలన్నంత ఆశ కలుగుతోంది .
అంకుల్ ఇంకా పూర్తవ్వలేదు లైట్స్ , ఫ్లవర్స్ తో టచప్ ఇచ్చామంటే మమ్మల్ని కిందకు తొసైనా మీ పుట్టినరోజు జరుపుకుంటారు అని చెల్లీ , కార్తీక బయటకు రావడం చూసి అంకుల్.......... అక్కయ్య కోసం వెళ్ళొస్తాము అనిచెప్పాను .
Sorry మహేష్ .......... ఇంత టెక్నాలజీ ఉన్నా మేము , హైద్రాబాద్ లోని ఆఫీస్ లలో పనిచేసేవాళ్ళు మీ అక్కయ్య ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోయాము అని బాధతో చెప్పారు .
అంకుల్ మీరు ఎంత try చేశారో చేస్తున్నారో మాకు తెలుసు , అక్కయ్య తన ఐడెంటిటీ మార్చుకుని ఉండవచ్చు లేదా పెళ్లయ్యాక అత్తామావయ్యలు పేరు మార్చి ఉండవచ్చు ........... ఇలా ఎన్నో కారణాలు . మీరు బాధపడకండి అక్కయ్యను ఇప్పుడు కాకపోతే మా ప్రాణం పోయేలోపైనా చేరుకుంటాము అని మాకు నమ్మకం ఉంది అని బదులిచ్చాను .
కృష్ణగాడు నా భుజం చుట్టూ చేతినివేసి త్వరలోనే కలుస్తామురా ......... అని ఉత్సాహాన్ని ఇచ్చాడు .
అంకుల్ బుల్లెట్ ఇచ్చారు .......... వెతకడం ఇంకా సులభతరం అయ్యింది మాకు , మీరు కూర్చుని ఏమైనా పొరపాట్లు ఉంటే రాగానే చెప్పండి సెట్ చేసేద్దాము .
చెల్లీ .......... వచ్చేస్తున్నాము అని వాళ్ళతోపాటు మరొక ఏరియా లో వెతకడం మొదలెట్టాము . మళ్లీ నిరాశతోనే ఇంటికి చేరుకున్నాము .
అన్నయ్యా ........అని నా గుండెలపై వాలి చెల్లి బాధపడుతోంటే ,
మరికొద్దిసేపట్లో పుట్టబోతున్న చెల్లి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించడం ఇష్టంలేక , చెల్లీ ....... అని నవ్వుతూ నుదుటిపై ముద్దుపెట్టి కృష్ణగాడికి సైగచేసాను .
రేయ్ మామా ......... చిన్న పని ఉంది ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని చెల్లి కురులపై ముద్దుపెట్టి బుల్లెట్ లో వెళ్ళాడు .
తల్లీ ......... మీ స్వచ్ఛమైన మనసుకు ఆ దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు . ఇప్పటివరకూ మీ అక్కయ్య కనిపించలేదంటే దానికి ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది అని నా నమ్మకం . ఏదీజరిగినా మనమంచికే అని ఓదార్చి లోపలికి పిలుచుకొనివెళ్లారు . మహేష్ .........కృష్ణ రాగానే మీ అంకుల్ తోపాటు భోజనం చెయ్యడానికి రండి అనిచెప్పారు .
పైకివెళ్లి decoration చూసి ఆనందిస్తున్న అంకుల్ ని చూసి , అంకుల్ anything not right అని అడిగాను .
రెండు గంటలుగా భూతద్దంలో వెతికినా ఎక్కడా అలాంటిది కనిపించలేదు పర్ఫెక్ట్ మహేష్ ......... అని భుజం పై చేతినివేశారు .
నాకోసం అలాచెబుతున్నారు అంకుల్ మీరు థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అని చుట్టూ చిన్న డస్ట్ కూడా లేకుండా శుభ్రం చేసాను .
గంట తరువాత లగేజీ వెహికల్ తోపాటు కృష్ణగాడు వచ్చి విజిల్ వేయడంతో కిందకువెళ్లి అన్నింటినీ పైకి మార్చేసి రేయ్ ఇక 3 గంటల సమయం మాత్రమే ఉంది అనిచెప్పాను .
ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు మొదలుపెట్టేద్దామురా ...........
ఓ ఓ ఓ .......... ముందు కడుపునిండా తినేసి తరువాత మీఇష్టం రండి అని కిందకుపిలుచుకునివెళ్లి శ్రీమతిగారూ అని కేకవేశారు .
అంటీ , చెల్లెమ్మ , కార్తీక ........ రూంలోనుండి బయటకువచ్చారు . చెల్లి చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ఇద్దరమూ సంతోషించి , అంటీకి కార్తీకకు థాంక్స్ చెప్పేసి తృప్తిగా చెల్లి చేతితో తినేసి పైకివెళుతూ అంకుల్ పైకి అని సైగచేసాను .
బయటకువచ్చి మహేష్ , కృష్ణ .......... మీరు ఎవరికోసమైతే అంత కష్టపడ్డారో మొదటగా తనే చూడటం భావ్యం ......... , మీ మనసులో కూడా అదే ఉంటుందని నాకు తెలుసు ........
అంకుల్ ............
I am soooooo happy మహేష్ .......... వేరే ఏదైనా పని ఉంటే చెప్పండి చేసేస్తాను.
Dad .......... మనం వెళ్లి అన్నయ్యా వాళ్ళు ఆర్డర్ చేసిన కేక్ తీసుకొద్దాము అని కార్తీక గుర్తుచేసింది .
ఈ హడావిడిలో కేక్ సంగతే మరిచిపోయాము గుర్తుచేయాలని తెలియదా అని వాడి వీపుపై గుద్ది ......... కార్తీక నువ్వు సూపర్ లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నాను .
చచ్చానురోయి అంటూ వీపు రాసుకుంటుంటే నవ్వుకుని లవ్ యు రా మామా .......అని భుజం చుట్టూ చేతినివేశాను .
తల్లీ కారు తాళాలు తీసుకురా వెళ్ళొద్దాము అని వెళ్లారు . కార్తీక లోపలకు పరిగెత్తి అక్కయ్యా ........ మీరు చదువుతూ ఉండండి , నాన్నకు బయట చిన్న పని వెళ్ళేసి వస్తాము అమ్మా జాగ్రత్త అనిచెప్పి వెల్8ది .
రేయ్ లెట్స్ ఫినిష్ ఇట్ అంటూ ఉత్సాహంతో పైకివెళ్లి ఫ్రెష్ రంగురంగుల పూలను చూసి సంతోషించి మొదట decoration సెట్ మొత్తం లైట్స్ మరియు పూలతో చూడగానే మనసు పులకించేలా అందంగా అలంకరించి , సెట్ లోపలకు అడుగుపెట్టగానే పూల కమ్మటి సువాసనకు మరియు లైటింగ్ అందాలకు కృష్ణగాడు తనను తాను మైమరిచిపోయి రేయ్ మామా నాకే స్వర్గంలో అడుగుపెట్టినట్లుగా ఉంది, ఇక నీ చెల్లి చూసిందంటే అన్నయ్యా ......... ఇందుకోసమే ఈ సంతోషం కోసమేనేమో నేను పుట్టినప్పటి నుండి పుట్టినరోజు జరుపుకోలేదు అని తనను తాను మరిచిపోయి పారవశ్యంలోకి వెళ్లిపోతుందిరా ..........
ఇదంతా చేసింది నువ్వేనని చెబుతానులేరా .........
ఇక అంతే తన సర్వస్వాన్ని ..........వద్దులే నాకు సిగ్గేస్తోంది . అయినా నీ చెల్లి నేను చేశానంటే నమ్మదులేరా ..........
నవ్వుకుని నువ్వు ఆ రెండు క్రాకర్స్ బాక్సస్ మరియు ఫ్లైయింగ్ క్యాండీల్స్ ........ చెల్లి మెట్లు ఎక్కి ఇక్కడ నిలబడుతుంది కాబట్టి మన decoration వెనుక కింద నుండి మూడువైపులా అలా ఆకాశంలోకి ఎగిరేలా కిందకువెళ్లి సెట్ చెయ్యి , ఇక ఇంటి ముందుభాగం మొత్తం లైటింగ్స్ వేసి , మిగిలిన సగం పూలతో ఏమిచెయ్యాలో నాకు తెలుసు .......... రేయ్ ఇంకా చూస్తున్నావేంటి ........
లవ్ యు రా మామా .......... ఒకటి తరువాత మరొక సర్ప్రైజ్ తో నీ చెల్లికి ఊపిరాడనీయకుండా చేసేస్తావా ఏంటి అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి హాల్లో ఉంచినవి కిందకు తీసుకెళ్లాడు .
సమయం చూసుకుంటూ ఇంటికి ఎదురుగా నిలబడి చూస్తే అన్నిరకాల లేటెస్ట్ సీరియల్ లైట్స్ తో ఇల్లు మొత్తం వెలిగిపోయేలా సెట్ చేసి , పూలు మొత్తం ఒక్కటీ మిగలకుండా వాడి బుట్టలను లోపల హాల్లో ఒకదానిపై మరొకటి ఉంచి , మొబైల్ తీసి రేయ్ మామా గేట్ దగ్గర నిలబడమనిచెప్పి ప్లగ్ పెట్టి స్విచ్ on చేసాను .
అంతే ఇల్లుమొత్తం విద్యుద్దీపాలతో వెలిగిపోవడం , అధిచూసి వాడి ముఖం తెరుచుకున్న నోటితో కళ్ళతో వెలిగిపోవడం చూసి నవ్వుకుని , రేయ్ రేయ్ ........ ఉన్నావా లేక .......... అని గట్టిగా నవ్వాను .
మామా ............ స్వర్గాన్ని నేలపైకి తీసుకొచ్చావు కదరా .......... అని పైకి పరిగెత్తుకుంటూ వచ్చి పూలను చూసి నెమ్మదిగా వచ్చి గట్టిగా కౌగిలించుకుని ఫ్లాట్ రా నీ చెల్లిచూసి కొన్నిక్షణాలపాటు ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు అని నన్ను అమాంతం పైకెత్తేసి తిప్పుతూనేఉన్నాడు .
కార్తీక ఒక కేక్ తీసుకొచ్చి మొత్తం చూసి షాక్ లో కదలకుండా చివరి మెట్టు దగ్గరే ఉండిపోయింది .
కార్తీక , కార్తీక ......... అని భుజం తాకగానే , అన్నయ్యలూ ....... అంటూ పడిపోబోతుంటే పట్టుకున్నాము .
అన్నయ్యలూ .......... ఇది మన ఇళ్లేనా లేక నేనేమైనా ఒక కొత్త అబ్దుతమైన లోకానికి వచ్చేసానా .......... అని అడుగువెయ్యబోయి , పాదాలకు మెత్తగా తాకగానే చూసి వద్దు వద్దు మా అక్కయ్యే తొలి అడుగుపెట్టాలి అని కేక్ క్యాండీల్స్ అందించి , అన్నయ్యా .......... అక్కయ్య ఎందుకో ఈరోజు 11 :30 అయినా చదువుతూనే ఉంది సరిగ్గా రెండు నిమిషాల ముందు పైకి పిలుచుకొనివస్తాను , ఎటువంటి సర్ప్రైజెస్ ఇస్తారో మీఇష్టం చూసి తరించడానికి పరవసించిపోవడానికి అక్కయ్య సిద్ధం అని అమితమైన ఆనందంతో కిందకువెళ్ళింది .
సరైన సమయానికి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా రెండు మూడుసార్లు లైట్స్ ఆఫ్ చేసి on చేసి పర్ఫెక్ట్ అని కృష్ణగాడిని పట్టారానిసంతోషంతో హత్తుకొని 15 నిమిషాలముందు decoration మధ్యలో టేబుల్ ఉంచి దానిపై కొత్త దుప్పటి కప్పి లైట్స్ పూలతో అందంగా అలంకరించి కేక్ ఉంచి , రేయ్ మామా మా బుజ్జి చెల్లి ఫస్ట్ birthday కాబట్టి ఒకే ఒక క్యాండిల్ మరియు కేక్ మధ్యలో ఫ్లవర్ స్పార్కిల్ క్యాండిల్ ఉంచాను . కేక్ పై happy birthday from లవర్ అండ్ బ్రదర్ అని చదివి లవ్లీ రా మామా అని వెనుక నుండి హత్తుకొని మురిసిపోయాడు . దీనికే ఇలా అయితే రియల్ సర్ప్రైజ్ చూసి నన్ను వీడు ఏమిచేస్తాడో భయమేస్తోంది అని గుటకలు మింగుతూ వాడివైపుచూసాను .
ఏంట్రా మామా అలాఉన్నావు ..........
రేయ్ నీకు నాపై అభిమానాన్ని ప్రేమను కాస్త కంట్రోల్ చేసుకుంటాను అని మాటివ్వరా అని అడిగాను .
రేయ్ ఏంట్రా మామా అదెలా కంట్రోల్ చేసుకుంటాను కిందకు దించరా చెయ్యి అని చేతిపై దెబ్బవేశాడు .
అయిపోయాను .......... అని మనసులో అనుకుని నవ్వుకున్నాను .
బయటకువచ్చి ok నా రా అని అడిగాను .
OK ఏంటిరా .......... కళ్ళు జిగెలుమంటుంటేనూ అంటూ మళ్లీ ఎత్తేశాడు .
రేయ్ ఇందుకేరా మామా .......... కాస్త కొద్దిసేపు కంట్రోల్ చేసుకోరా అన్నది అంటూ గడ్డాన్ని పట్టుకుని బ్రతిమాలను .
ఇంతలో కార్తీక నుండి కాల్ అన్నయ్యా .......... 5 నిమిషాల్లో అక్కయ్య వచ్చేస్తుంది అని కాల్ చేసి చిన్నగా చెప్పింది .
సమయం చూసి రేయ్ నీ ప్రియురాలు వచ్చే సమయం అయ్యింది కింద ఎలా సెట్ చేసావో చూసొస్తాను అని కిందకువెళ్లి చూసి రేయ్ సరైన సమయంలో వెలిగించడానికి ఒకరు ఇక్కడే ఉండాలి నేనిక్కడే ...........
రేయ్ మామా .......... అవసరం లేదు రిమోట్ ఇచ్చారు , నువ్వు ముందు పైకిరారా అని రాగానే కొట్టి నువ్వు కింద ఉంటే ఎలారా ......... అని ఉద్వేగంతో కౌగిలించుకున్నాడు .
లవ్ యు రా మామా .......... its టైం అంటూ స్విచ్ ఆఫ్ చేసేసాను అంతే మొత్తం చిమ్మచీకటి అయిపోయింది .
12 గంటలకు రెండు నిమిషాలముందు coming అన్నయ్యలూ get రెడీ అని కింద గేట్ తెరుచుకున్న చప్పుడు వినిపించగానే అలెర్ట్ అయిపోయాము .
కార్తీక ఎక్కడికి ......... ఇప్పటికే నీకు ఆలస్యం అయ్యింది రోజూ 10 గంటలకే పడుకుంటావు కదా , ఇంత చీకటిలో పైకి ఎందుకు అన్నయ్యా , కృష్ణా హాయిగా నిద్రపోతుంటారు ఎందుకు డిస్టర్బ్ చెయ్యడం రా మనం కూడా వెళ్లి పడుకుందాము .
ష్ ష్ ......... అక్కయ్యా .........
నాకు చీకటి అంటే భయం చెల్లీ ..........
కార్తీక నవ్వుకుని భయం వేస్తే నన్ను గట్టిగా పట్టుకోండి . మా అన్నయ్యలు ఉన్న ఇంటిలో ఎంత చీకటి ఉన్నా నాకేమీ భయం లేదు అని కార్తీక చెల్లి చేతిని పట్టుకుని చివరిమెట్టువరకూ వచ్చేసారు .
My డియర్ లవ్లీ హార్ట్ ........... ఒక్క స్టెప్ వేసి అక్కడే ఆగిపో అని కృష్ణగాడి వాయిస్ ..........
రేయ్ ........ ఇంత చీకటిలో ఏమిచేస్తున్నావురా అని పైకెక్కి , కార్తీక పాదాలకింద మెత్తగా ఉంది అనిచెప్పింది .
30 29 28 27 ..........
అడుగుతుంటే నంబర్స్ కౌంట్ చేస్తున్నావు ........... ఇక్కడ మూడువైపుల నుండి పూల పరిమళం వొళ్ళంతా గిలిగింతలుపెడుతోంది అని కార్తీకను గట్టిగా హత్తుకొని చిలిపినవ్వులు నవ్వుతోంది .
అక్కయ్యా .......... ఈ రొమాంటిక్ వాసనలో నన్నుకాదు మీ ప్రియుణ్ణి కౌగిలించుకుంటే అందం ఆనందం అని ఇద్దరూ ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
కృష్ణగాడు అప్పకుండా 8 7 6 5 4 3 2 1 ............. ఒకేసారి ముగ్గురమూ పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణా ........, పుట్టినరోజు శుభాకాంక్షలు చెల్లెమ్మా అని అక్కయ్యను కూడా తలుచుకుని మీ శుభాకాంక్షలు కూడా నేనే తెలుపుతున్నాను అక్కయ్యా ......., కార్తీక హ్యాపీ birthday అక్కయ్యా ........... అంటూనే నేను లైట్స్ స్విచ్ , కృష్ణగాడు రిమోట్ నొక్కగానే , ఇల్లుమొత్తం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోవడం - ఎదురుగా birthday సెలబ్రేషన్ decoration - దానివెనుక సుయ్ సుయ్ సుయ్ మంటూ క్రేకర్స్ ఆకాశంలోకి వెళ్లి పేలి అద్భుతమైన స్పార్కిల్స్ తో ఆకాశంలో అందాలను ఆవిష్కరించడం ఆ వెంటనే ఫ్లైయింగ్ క్యాండీల్స్ మూడువైపులా నెమ్మదిగా గాలిలోకి ఎగరడం చూస్తూ చేతులనూ తన బుగ్గలపై వేసుకుని అంతులేని ఆశ్చర్యపు సంతోషంతో కన్నార్పకుండా అలా చూస్తూనే ఉండిపోయింది . కార్తీక అయితే మైమరిచిపోయి చెల్లిని సైడ్ నుండి హత్తుకొని భుజం పై తలవాల్చి ఆ దృశ్యాలను చెల్లితోపాటు ఎంజాయ్ చేస్తోంది .
చేతినిపైకెత్తి దారం లాగాగానే , ఇద్దరిపై పైనుండి పూల వర్షం కురిసింది .
Wow ............. అంటూ చెల్లి చుట్టూ తిరిగి పూలను చేతితో అందుకొని ఎగరేసుకుంటూ అంతులేని ఆనందంతో పూలుపరిచిన నేలపై పరుగునవచ్చి ఇద్దరినీ ఒకేసారి హత్తుకొని లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ..........అని వాడి పెదాలపై ముద్దుపెట్టేసింది .
వాడు మైమరిచిపోతోంటే పుట్టినరోజు శుభాకాంక్షలు చెల్లీ ......... నా నుండీ మరియు మన అక్కయ్య నుండి అనిచెప్పి వాడివైపు చూస్తే ఇంకా అలానే ఉండటంతో రేయ్ మామా అని భుజం కదిలించాను .
లవ్ యు ......... కాదు కాదు పుట్టినరోజు శుభాకాంక్షలు my loveliest ఏంజెల్ అని ఒకేసారి ఇద్దరమూ చెల్లీ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాము .
మా ముగ్గురిపై పూల వర్షం కురవడంతో ఆశ్చర్యంతో చూస్తే ఎదురుగా అంటీ అంకుల్ కార్తీక ముగ్గరూ మాపై పూలు చల్లుతూ హ్యాపీ birthday తల్లీ కృష్ణ అని విష్ చేశారు.
ఆనందబాస్పాలతో వాళ్ళవైపు తిరిగి మా ఇద్దరి చేతులనూ చుట్టేసి భుజం పై చెరొకముద్దుపెట్టి , లవ్ యు అంటీ థాంక్స్ అంకుల్ లవ్ యు కార్తీక అని మురిసిపోతూ మావైపు మార్చి మార్చి ప్రాణంలా చూస్తోంది.
The following 21 users Like Mahesh.thehero's post:21 users Like Mahesh.thehero's post
• 9652138080, AB-the Unicorn, Bangaru, Jack789, Joncena, Kumarmb, kummun, lucky81, Mahe@5189, maheshvijay, Milffucker, Naagu nag, nkp929, RAANAA, Rajeev j, Sachin@10, Shaikhsabjan114, sisusilas1@, sri7869, SS.REDDY, sweetdumbu
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
హ్యాపీ birthday రా ........ అని కృష్ణగాడు కళ్లపై ముద్దులుపెట్టి , నీ ప్రాణమైన వాళ్ళు కలిసిన తరువాతనే , జైల్ నుండి స్వేచ్ఛగా బయటకు వచ్చిన తరువాట్జ్ పుట్టినరోజు జరుపుకుంటానని నీకోరిక ఈరోజుతో తీరబోతోంది రా , వచ్చి కేక్ కట్ చెయ్యి అని నావైవు సైగచేసి decoration లోపలికి పిలుచుకునివెళ్లాడు .
చుట్టూ రంగురంగుల పూలు , లైట్స్ ను తిరిగిచూసి పరవశించిపోతూ పెదాలపై చిరునవ్వుతో వెలిగిపోతున్న కళ్ళతో లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ......... అని ఇద్దరి చేతులనూ చుట్టేసింది .
కృష్ణా ........ birthday గర్ల్ , మీ అన్నయ్య నీకోసం ప్లాన్ గీసి రెండురోజుల్లో ఇద్దరమూ కాదు కాదు అంకుల్ కూడా సంతోషంతో ............
అన్నయ్యా ......... ఆరోజు స్కెచ్ వేసింది నాకోసమేనా , లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా .......... దేవలోకంలో ఉన్నట్లుగా ఉంది అని మైమరిచిపోతోంది .
కృష్ణగాడు క్యాండిల్ వెలిగించబోతుంటే ............
రేయ్ మామా కేక్ ఇధికాదు .......... కార్తీక అని సైగచేసాను .
పరుగున కిందకువెళ్లి మరొక కేక్ తీసుకొచ్చి అందించి దానిని తీసేసి లోపల ఉంచింది .
చెల్లెమ్మా ......... స్వయంగా నీ చేతులతో కేక్ ప్ చెయ్యమనిచెప్పాను .
మరొక సర్ప్రైజ్ ........... wow లవ్ యు లవ్ యు లోబ్ యు sooooooo మచ్ అన్నయ్యా .......... అంటూ అతినెమ్మదిగా ఓపెన్ చేస్తుంటే ,
నాకు తెలియకుండా మరొక కేక్ వీడు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చాడు ........ ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి అని కన్నార్పకుండా బాక్స్ వైపే చూస్తున్నాడు .
చెల్లి ఓపెన్ చేసి Happy birthday to మ్యాచ్ మేడ్ ఇన్ బ్రహ్మలోకం కృష్ణ - కృష్ణ both , from వాసంతి అక్కయ్య , మహేష్ , కార్తీక అని చదివి ఆనందబాస్పాలతో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని అమాంతం ఏకమయ్యేలా కౌగిలించుకుని , రేయ్ my లవ్ happy birthday అని ముఖమంతా ముద్దుల వర్షం కురిపించింది .
ఇద్దరూ మైమరిచిపోయి ఒకరి భుజాలపై మరొకరు వేసుకుని ప్రాణంలా కన్నార్పకుండా చూసుకుంటూ happy birthday my లవ్ - happy birthday my హార్ట్ ........... అని చిరునవ్వులు చిందిస్తూ కొన్ని క్షణాలపాటు చెప్పుకుంటూనే ఉన్నారు .
వాడిచేతిలోని రిమోట్ అందుకొని బయటకువచ్చి మరొక దారం లాగి రిమోట్ బటన్ నొక్కి వెళ్లి కార్తీక వెనుక దాచుకుని వారి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాను .
ఇద్దరిపై పూల వర్షం , పైన ఆకాశంలోకి క్రాకర్స్ మరియు ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఎగరడం ఇద్దరూ హత్తుకొని చూసి పరవశించిపోయి ,
కృష్ణ .......... నీతోపాటు నాకు తెలియకుండా నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చాడు మీ అన్నయ్య , రేయ్ అంటూ చుట్టూ చూసి కనిపించకపోవడంతో , ఇందుకేనారా కాస్త కంట్రోల్ లో ఉండమన్నావు . ముందు నువ్వెక్కడ దాక్కున్నావో బయటకురా ....... నన్ను ఆపడం ఇప్పుడు ఎవరివల్లా కాదు .
హ్యాపీ birthday కృష్ణ అన్నయ్యా .......... నా గిఫ్ట్ ఇదిగో అంటూ ప్రక్కకు తప్పుకుంది.
The బెస్ట్ గిఫ్ట్ కార్తీక అంటూ చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి అమాంతం నన్ను ఎముకలు విరిగిపోయేంతలా హత్తుకొని లవ్ యు రా మామా అంటూ పైకెత్తి గిరగిరా తిప్పాడు .
అందరూ సంతోషంతో నవ్వుకుని తల్లీ ........ మీ అన్నయ్య చెప్పినట్లు మీరు ఆ బ్రహ్మలోకంలోనే ఒకటిగా సృష్టింపబడ్డారు అని హ్యాపీ birthday కృష్ణ అని విష్ చెయ్యడంతో కిందకు దింపాడు .
థాంక్స్ అంకుల్ , అంటీ , కార్తీక .......... అంటూ సిగ్గుపడిపోతున్నాడు .
థాంక్స్ అంకుల్ ఒళ్ళు హూనం అయిపోయింది ..........
లవ్ యు అన్నయ్యా , లవ్ యు రా మామా ....... అని ఇద్దరూ చెరొకవైపు హత్తుకొని బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పుట్టినరోజు శుభాకాంక్షలు my హార్ట్స్ అని వాణ్ణి హత్తుకొని చెల్లీ నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాను .
రేయ్ నా పుట్టినరోజు decoration నాతోనే చేయించావు కదా ..........
మరి నిన్న చెల్లి పుట్టినరోజు అని చెబితే , నువ్వు చెప్పబోయి ఆగిపోతావా , నా ప్రాణం రా నువ్వు నీ birthday నాకు గుర్తుండదా .......... అందుకే ఈ అందమైన శిక్ష వేసాను అని అందరమూ మొత్తం decoration ను చూసి మురిసిపోయాము .
లవ్ యు రా ........ మామా అదీ అదీ , మన birthday లు మనం చెప్పుకోకూడదు కదా , నీ చెల్లి పుట్టినరోజే నేను పుట్టాను అని తెలిసినా క్షణం నుండి నా పాదాలు నేలపై నిలవటం లేదురా , అలా అలా గాలిలో తెలిపోతున్నట్లుగా ఉంది .
మీరు పుట్టినదే ఒకరికోసం మరొకరురా ఈరోజుతో ఆ దేవుడే మా అందరికీ తెలిసేలా చేసాడు అని పరవశించిపోయి రండి కేక్ కట్ చేసి సంబరాన్ని మొదలుపెట్టండి అనిచెప్పాను .
అంటే అన్నయ్యా ........... ఇక్కడితో ఆగలేదా ,
హ హ హ .......... అని నవ్వుకుని ఇద్దరినీ కేక్ ముందు నిలబెట్టాను.
లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అని , అక్కయ్య పేరుపై స్పృశించి క్యాండిల్ వెలిగించి ఇద్దరూ కత్తి అందుకొని ఒకరినొకరు ప్రాణంలా చూసుకుని నావైపు చూస్తూ కట్ చేశారు . మళ్లీ పూల వర్షం కురిసింది . అందరమూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి చప్పట్లతో సంతోషించాము .
ఇద్దరూ కేక్ తీసుకొచ్చి నాకు తినిపించగానే , ఒక్కసారిగా ఆనందబాస్పాలతో హత్తుకొని కేక్ తినిపించి విషెస్ తెలిపి , చెల్లీ మీ అన్నయ్య నుండి లవ్లీ గిఫ్ట్ అని చిన్న బాక్స్ అందించాను .
రేయ్ నీ చెల్లికి మాత్రమేనా .........
నీకు నా ప్రాణమైన చెల్లిని ఎప్పుడో ఇచ్చాను కదరా .......
వాడు సిగ్గుతో తలదించుకొని లవ్ యు రా మామా , ఇంతకంటే బెస్ట్ గిఫ్ట్ ఈ విశ్వంలోని ఉండదు అని చెల్లి బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి I LOVU YOU my లవ్లీ హార్ట్ అనిచెప్పాడు .
చెల్లి మురిసిపోయి గిఫ్ట్ ఓపెన్ చేసి చూసి వాడికి చూపించి ఆనందబాస్పాలతో నావైపే ప్రాణంలా చూస్తున్నారు .
అన్నయ్య ఏమిచ్చారు అని కార్తీక ముందుకువచ్చి చూసి dad mom లవ్లీ ప్లాటినం రింగ్స్ ........ అక్కయ్యా అన్నయ్యా మా ముందే మార్చుకోండి అని కోరిక కోరింది .
ఇద్దరూ నావైపు చూసారు .
అందికోసమే కదా తెచ్చినది ..........
అమితానందంతో ఇద్దరూ వచ్చి నన్ను రెండువైపులా చుట్టేసి నా ముందే రింగ్స్ ఒకరికొకరు వేలికి మార్చుకున్నారు . లవ్ యు రా లవ్ యు soooooo మచ్ అన్నయ్యా అని మాటల్లో కూడా చెప్పలేని సంతోషంతో నా గుండెలపై వాలిపోయింది .
ఈ ఆనందం చూడటం కోసం ఏమైనా చేస్తాము చెల్లీ మేము అని ఇద్దరమూ సంతోషంతో చేతులను పైకెత్తి మళ్లీ రిమోట్ కలిసి నొక్కాము . మళ్లీ ఆకాశం లోకి బాణాసంచా పేలి సంబరాలను మరింత ఎత్తుకు తీసుకెళ్ళాయి .
అంకుల్ మా ఆనందాలను మొత్తం వీడియో తీస్తున్నారు .
అన్నయ్యా , అక్కయ్యా ........ a small గిఫ్ట్ అని కార్తీక అందించింది .
లవ్ యు కార్తీక అని అందుకొని కేక్ అందుకొని అంటీతోపాటు తినిపించారు .
Dad ఇటు ఇవ్వండి అని మొబైల్ కార్తీక అందుకుంది .
అంకుల్ విషెస్ తెలిపి కేక్ తినిపించారు . థాంక్యూ sooooo మచ్ అంకుల్ అని కేక్ తింటూ పండుగలా జరుపుకున్నాము . బోలెడన్ని సెల్ఫీలు , ఫోటోలు తీసుకున్నాము.
కొద్దిసేపటి తరువాత అంటీ అంకుల్ మరొకసారి విష్ చేసి కిందకువెళ్లిపోయారు .
అన్నయ్యా .......... అక్కయ్యను కొరుక్కుని తినేసేయ్ అని , అక్కయ్య పేరుమొత్తం కట్ చేసి కేక్ నాకు అందించింది .
అక్కయ్యను కలిసిన తరువాత కూడా మొదటగా చేసేది ఇదెచెల్లీ ఇన్ని సంవత్సరాల విరహం ......... అని కసితో చెల్లి చెవిలో గుసగుసలాడి . ప్రాణంలా కేక్ ను నోటిలోకి తీసుకుని లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ........ అని తినేసి soooo స్వీట్ ,
అన్నయ్యా .......... మన అక్కయ్య మరింత స్వీట్ గా ఉంటుంది అని గుసగుసలాడి ఇద్దరమూ సంతోషంతో నవ్వుకున్నాము .
Birthday కపుల్ ఉదయం సెలెబ్రేషన్స్ చాలా ఉన్నాయి , ఒకరి కౌగి......... అయినా మీకు చెప్పాలా ఏంటి ఎంజాయ్ అని సిగ్గుపడుతూ చెప్పాను .
చెల్లి వాడి గుండెలపై వాలిపోయి ఏకమయ్యేలా చుట్టేసింది .
లవ్ యు రా ........ మామా , మరి నువ్వు .
పదే పదినిమిషాలు చిన్న పని ఉంది కింద పూర్తిచేసి పడుకోవడమే అనిచెప్పాను .
అయితే పదా పూర్తిచేసే అందరమూ ఒకేసారి పడుకుందాము .
రేయ్ మామా ......... తొలి birthday , చెల్లి మనకోసం - నువ్వు నాకోసం సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోలేదు . ఆ తియ్యని ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలియదా ........ చెప్పాను కదా పదేపది నిమిషాలు అని కార్తీక నాకు సహాయం చేస్తుంది please please ......... చెల్లి కోరికలన్నీ తీర్చు , రేయ్ ఆర్డర్ వేస్తున్నాను .
అన్నయ్యా ......... మేమూ సహాయం చేస్తాము .
చెల్లీ ఇప్పుడు నువ్వూ స్టార్ట్ చేశావా ......... మిమ్మల్ని ఇలాకాదు అని ఇంటిలోకి వదిలి బయట గడియ పెట్టేసాను . చెల్లీ ......... ఈరోజును జీవితంలో మరిచిపోలేనంతలా ఆస్వాదించండి , రేయ్ మామా ఓన్లీ ముద్దులవరకే ..........
లవ్ యు sooooo మచ్ అన్నయ్యా .........
పెద్ద దీనికి వీడు శోభనం గదిలాగా బయట నుండి గడియ పెట్టాడు . సరే ఏమిచేస్తాం నా హార్ట్ అన్నయ్య ఆర్డర్ అని సంతోషంతో నవ్వుకుని నాకు వినిపించేలా ముద్దుపెట్టాడు .
ఇద్దరమూ ఒకేసారి లవ్ యు మామా , లవ్ యు మామా అని గడియ తీసేసి సిగ్గుపడుతున్న కార్తీకతోపాటు కిందకువచ్చి , కార్తీక వెళ్లి హాయిగా నిద్రపో గుడ్ నైట్ అనిచెప్పాను .
అన్నయ్యా ......... పైన హెల్ప్ అన్నారు .
అలాచెప్పకపోతే వాళ్ళుకూడా కిందకు వచ్చేస్తారు . చిన్నపనే వెళ్లు కార్తీక గుడ్ నైట్ అనిచెప్పి పంపించాను .
అన్నయ్యా ........ ఇప్పుడు మార్నింగ్ అనిచెప్పి ముసిముసినవ్వులతో వాటర్ బాటిల్ నాకు అందించి వెళ్లి అన్నయ్యా ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యండి అని తలుపేసుకుంది .
రేపు సాయంత్రం అందరూ ప్రియమైనవాళ్ళు వచ్చాక జరుపుకునే birthday సెలబ్రేషన్ కోసం కాంపౌండ్ లో ఉంచిన వస్తువులతో పని మొదలెట్టాను . రెండు నిమిషాలకే బయట మొత్తం లైట్స్ వెలిగి any help అని అంకుల్ వచ్చారు .
అంకుల్ మీరు పడుకోలేదా నేను చూసుకుంటాను .........
ఒక్కడివే అయితే సమయం సరిపోదు మహేష్ , నా చేతనైన సహాయం నెనుచేస్తాను . ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమీ కాదు నువ్వు ఏకంగా ఇది మూడో రోజు . నీకు సహాయం చెయ్యకుండా లోపలికివెలితే మీ అంటీ చెల్లి కోపాగ్నికి దహనం అయిపోతాను అని చెబుతుండగానే , అంటీ కార్తీక నవ్వుతూ వచ్చి టీ అందించారు .
లవ్ యు అంటీ , లవ్ యు కార్తీక అని చిరునవ్వుతో టీ తాగి ఉదయం 5 గంటలలోపు ఫ్లవర్స్ , లైటింగ్స్ మొత్తం పని ఫినిష్ చేసేసి ఇద్దరమూ అలసిపోయి అక్కడికక్కడే గడ్డిలో వాలిపోయాము.
రోజూలానే చెల్లి వాడి గుండెలపై తెలీకవారకముందే కళ్ళుతెరిచి happy birthday my లవ్ అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి స్నానం చేసి నాకోసం హాల్లోకి వచ్చి చూసి లేకపోవడంతో కృష్ణ కృష్ణ .......... అన్నయ్య నాకు తెలిసి పడుకున్నట్లు లేరు అని లేపింది .
హ్యాపీ birthday డార్లింగ్ ..........
Ok ok ......... అన్నయ్య లేరు అని చేతిని పట్టుకుని లేపింది .
అవునా ......... అంటూ కిందకువచ్చి అంకుల్ తోపాటు గడ్డిలో పడుకుని ఉండటం చూసి పైకివెళ్లి మీ అన్నయ్య కింద హాయిగా నిద్రపోతున్నాడు గడ్డిలో అనిచెప్పాడు.
గడ్డిలోనా ....... అంటూ కంగారుపడుతూ కిందకువచ్చి , రాత్రంతా కష్టపడి చేసిన decoration ను చూసి కళ్ళల్లో చెమ్మతో అన్నయ్యా ........ అని ప్రక్కనే కూర్చుంది.
అంకుల్ కు మెలకువ వచ్చి లేచి తల్లీ నేనూ హెల్ప్ చేసాను కానీ నేను నుద్రపోయాక కూడా మొత్తం పూర్తిచేసి పడుకున్నాడు మహేష్ , చాలాబాగుంది కదా తల్లీ హ్యాపీ birthday ......... నీ సంతోషం కోసం మీ అన్నయ్య ఏమైనా చేస్తాడు . ప్రాణంలా చూసుకునే ఇద్దరు నీ ప్రక్కనే ఉండటం నీ అదృష్టం తల్లీ , మీ అన్నయ్య మరికొంతసేపు పడుకొనివ్వు అని సంతోషంతో లేచి వెళ్లిపోయారు .
కళ్ళల్లో చెమ్మతో నా తలను తన ఒడిలో నెమ్మదిగా ఉంచుకుని లవ్ యు sooooo మచ్ అన్నయ్యా .......... అని ప్రాణంలా కురులను నిమురుతూ జోకొట్టింది . కృష్ణ గాడు దుప్పటి తీసుకొచ్చి కప్పడంతో ఉమ్మా ......... అంటూ వాడికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది .
చెల్లి కన్నీటి చుక్క నా బుగ్గపై పడటంతో మెలకువవచ్చి చూస్తే చెల్లి ఒడిలో పడుకున్నాను . చెల్లి బాధపడటం చూసి మొత్తం అర్థమైపోయి , చెల్లెమ్మా అర గంట పనిచేశానా బాగా నిద్రవచ్చేసింది .
రేయ్ ......... అర గంటలో ఇదంతా నమ్మమంటావు అని కొట్టడానికి వచ్చి చేతిని అందుకుని లవ్ యు రా మమా అని ఉద్వేగానికి లోనయ్యాడు .
మీరు బాధపడటానికా ఇదంతా ఇష్టపడి సంతోషంతో చేసింది అని లేచి చెల్లి కన్నీళ్లను తుడుచి , ఈరోజు మాత్రం నాచెల్లి చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి . కావాలంటే రేపు ఎంతసేపైనా ఏడువు అనిచెప్పాను .
అంతే చెల్లి మూసిముసినవ్వులు నవ్వడం చూసి లవ్ యు చెల్లీ , ఇద్దరికీ నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఇద్దరి చేతులనూ నా గుండెలపై హత్తుకున్నాను .
అన్నయ్యా ......... పైకివచ్చి బెడ్ పై కాసేపు హాయిగా పడుకో , ఈరోజు మేమిద్దరమూ అక్కయ్యను వేతకడానికి వెళతాము అనిచెప్పింది .
అక్కయ్య కనిపించకపోతే నిరాశపడతారని ........ చెల్లీ ఈరోజు మనం వెళ్లడం లేదు ఎందుకో తరువాత చెబుతాను . కొత్త లంగా ఓణీలో దేవకన్యలా ఉన్నావు చెల్లీ ....... , రేయ్ నువ్వు ఇంకా ....... తొందరగా వెళ్లి రెడీ అవ్వు గుడికి వెళ్ళొద్దాము అనిచెప్పాను.
అన్నయ్యా ......... విశ్వ సర్ మేడం అమ్మ ఇష్టంతో ఇందులో బాగుంటావు తల్లీ అని వారే సెలెక్ట్ చేశారు .
నీ ఫ్రెండ్ చూసికూడా ఎలా ఉన్నానో చెప్పనేలేదు .
అధికాదు ఏంజెల్ నువ్వు మీ అన్నయ్య కనపడలేదనే కంగారులో ఉన్నావు . నేను దివి నుండి దిగివచ్చిన అప్సరసలా ఉన్నావని చెప్పాననుకో ,నేను ఇంత టెన్షన్ లో ఉంటే నీకు రొమాన్స్ లా ఉందా అని కొట్టినా కొడతావు అని చెప్పలేదు .
ఇద్దరమూ నవ్వుకుని పైకి వెళ్ళాము .
కృష్ణగాడి తరువాత తల స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని పూజ సామాగ్రి తీసుకుని కిందకువచ్చాము .
హ్యాపీ birthday అక్కయ్యా , అన్నయ్యా .......... గుడికి కదా నేను కూడా రెడీ అనిచెప్పడంతో ,
లవ్ యు చెల్లీ అని చెల్లి కార్తీకను హత్తుకుని స్కూటీ , బుల్లెట్ లో గుడికి చేరుకున్నాము .
పూజారి గారు కృష్ణ - కృష్ణవేణి ఇద్దరి పుట్టినరోజు ఈరోజు , వారి పేర్ల మీద అర్చన అభిషేకం అష్టోత్తరాం........ ఇలా ఎన్ని పూజలు ఉంటే అన్నీ జరిపించండి అని సంతోషంతో చెప్పాను .
పూజారి గారు అలాగే మా అక్కయ్య వాసంతి ఎక్కడ ఉన్నా క్షేమంగా , సంతోషంగా ఉండేలా ....... ప్రతిక్షణం ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండేలా పూజ జరిపించండి . మా అన్నయ్య మహేష్ , చెల్లి కార్తీక పేరుమీద కూడా అని చెప్పింది .
అలాగే తల్లీ అని పూజ బుట్టీ అందుకుని పూజ జరిపిస్తున్నారు .
లవ్ యు చెల్లీ అని తలపై చేతితో స్పృశించాను .
మా అక్కయ్యకు అక్కచెల్లెళ్ళు అంటే ప్రాణం అని హత్తుకుంది కార్తీక .
పూజారిగారు చాలాసేపు పూజ జరిపించి మీ కోరికలన్నీ తీరుతాయి తల్లీ అని హారతి అందించారు .
చాలా సంతోషం పూజారిగారు అని పెద్ద నోటుని చెల్లి చేతుల ద్వారా హారతి పళ్ళెంలో వేయించాను .
తీర్థం ప్రసాదం అందుకుని కాసేపు ప్రశాంతంగా ఆలయ ప్రాంగణంలో కూర్చుని కృష్ణగాడు అందించిన కొబ్బరి ముక్కను తినేసి ఇంటికి చేరుకున్నాము.
తల్లీ కృష్ణ నీకోసం ఒకరు వచ్చారు ...........
ఎవరు అంటీ అని చెల్లి అడిగింది .
మీ అమ్మ అని చెప్పారు . చాలా సంతోషంతో మన ఇంట్లోనే సోఫాలో కూర్చోబెట్టాను .
అమ్మ వచ్చిందా .......... ,రేయ్ కృష్ణ , అన్నయ్యా అంటూ మా చేతులను పట్టుకుని గుమ్మం దగ్గరకువెళ్లి చూసి , ఆనందబాస్పాలతో అమ్మా ........ అని పరుగునవెళ్లి ప్రక్కనే కూర్చుని చేతిని చుట్టేసింది .
చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి లేచి నేరుగా మాదగ్గరకువచ్చి , మాఇద్దరి బుగ్గలను స్పృశించి , దాని ఆనందం చెబుతోంది ......... అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని happy birthday కృష్ణ ......... , కాంపౌండ్ మరియు పైన చూసాను మీ పుట్టినరోజులు నా బిడ్డ ఎంత సంబరంలా జరిపించాడోనని అని నావైపు చూసి , నన్ను ఆహ్వానించినందుకు లవ్ యు మహేష్ చల్లగా ఉండండి అని దీవించింది .
ఇప్పుడు రా తల్లీ ......... అని బుంగమూతిపెట్టుకున్న చెల్లిని చూసి నవ్వుకుని , అవును నిజమే నా బంగారుతల్లిని ఇంత ప్రాణంలా చూసుకుంటున్న మీ అన్నయ్య , లవర్ అంటేనే నాకు చాలా ఇష్టం అని ప్రక్కనే కూర్చుని , నా బంగారుతల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి చెప్పింది .
లవ్ యు అమ్మా .......... మీమాటలు వింటుంటే హృదయం పులకించిపోతోంది . అన్నయ్యకు నా పుట్టినరోజు ఎలా తెలుసు అనుకున్నాను . మీరిద్దరూ టచ్ లో ఉన్నారన్నమాట .
అవును తల్లీ వారం ముందే కాల్ చేసి తెలుసుకుని అమ్మా ........చెల్లి సంతోషం కోసం మీరు తప్పకుండా రావాల్సిందే అనిచెప్పారు , ఆ మాట కోసమే నువ్వు పుట్టిన క్షణం నుండి ఎదురుచూస్తున్నానా అలా వైజాగ్ చేరుకుని ఉదయం ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను .
నా తల్లి కోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను అని జ్యూవెలరీ బాక్స్ అందించింది .
ఓపెన్ చేసి చూసి అమ్మా .......... నేను తీసుకోలేనమ్మా ,
నువ్వే తీసుకుంటావు , నా బంగారుతల్లి మనసు నాకు తెలియదా ......... నీ లవర్ కోసం కూడా తీసుకొచ్చానులే అని అందించబోతే వాడు వద్దన్నాడు . కృష్ణ నువ్వు కూడా బ్రతిమిలాడి తీసుకుంటావు , తల్లీ మీ అన్నయ్య కోసం కూడా తీసుకొచ్చానులే అంటూ జ్యూవెలరీ బాక్స్ అందించింది .
లవ్ యు sooooo మచ్ అమ్మా అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
మహేష్ అని పిలవడంతో అమ్మ ముందు మోకాళ్లపై కూర్చున్నాను .
తల్లీ ఓపెన్ చెయ్యి అనిచెప్పడంతో తీసి లవ్లీ బ్రేస్ లెట్ wow .........
తల్లీ నువ్వే మీ అన్నయ్య చేతికి ............
లవ్ to అమ్మా అని , అమ్మా ........ నాకెందుకు ,
వెంటనే చెల్లి నా నోటిని వేలితో మూసేసి , చేతిని అందుకుని తగిలించింది .
తల్లీ మీరిద్దరూ ఎలాగో వద్దన్నారు కదా వెనక్కు తీసుకెళ్లిపోతాను అని అమ్మ నావైపు చూసి నవ్వుకుని బ్యాగులో పెట్టేస్తోంది .
అమ్మా .........ముందే ముగ్గురికీ తెచ్చాను అని చెప్పకుండా .......... please please అమ్మా ........, రేయ్ నువ్వు రా అని కృష్ణగాన్ని పిలిచింది .
వాడు వచ్చి నవ్వుతున్న నా ప్రక్కనే కూర్చుని అమ్మా ..........
మీ ముగ్గురినీ చూస్తుంటే నా హృదయం సంతోషంతో నిండిపోతోంది అని దీవించి కృష్ణగాడికి చెల్లి బ్రేస్ లెట్ వేస్తే , కృష్ణగాడు చెల్లి మెడలో చైన్ వేసాడు .
కార్తీక దూరం నుండి సంతోషంతో చప్పట్లు కొట్టడం అమ్మ చూసింది .
అమ్మా ........ చెల్లి కార్తీక అని పరిచయం చేసింది .
అమ్మా ....... అంటూ కార్తీక వచ్చి అమ్మ పాదాలను తాకింది .
మహేష్ మరొక చెల్లికూడా ఉందని చెప్పొచ్చుకదా అని మెడలోని చైన్ తియ్యబోతే , అమ్మా ........ మీ ఆశీర్వాదం చాలు అని చెల్లిప్రక్కనే కూర్చుంది .
అమ్మా ......... అన్నయ్య ఇచ్చిన లవ్లీ గిఫ్ట్స్ అని ఇద్దరి వేళ్ళనూ చూపించింది .
అయితే ఇద్దరూ చాలా ఫాస్ట్ గా ఉన్నారన్నమాట , మీ అన్నయ్య సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు అని సంతోషంతో , సిగ్గుపడుతున్న చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .
అక్కయ్య గారూ టిఫిన్ చేద్దురు రండి అని అంటీ పిలిచారు .
ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు అక్కయ్య గారు , మేము బయట తింటాము అని బదులిచ్చారు అమ్మ .
మీ పిల్లలు ముగ్గురూ నాకు నా తల్లితో సమానం ఎంతమంది అయినా రానివ్వండి అందరికీ వండిపెడతాను . నా కూతురు కూడా వారం నుండీ వంట నేర్చుకుంటోంది .
అమ్మా ........ఇంకెవరు వస్తున్నారు .
మీ అన్నయ్య సర్ప్రైజ్ ప్లాన్ చేసాడు తల్లీ నాలానే మరికొందరు వస్తారు . నువ్వు అలా ఎంజాయ్ చేస్తూ ఉండు . అందరమూ కలిసే ఫ్లైట్ లో వచ్చాము . వాళ్ళు లగేజీ తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంటే నా తల్లినీ , కొడుకులనూ వెంటనే చూడాలని వచ్చేసాను అనేంతలో బయట వెహికల్ ఆగిన సౌండ్ రావడంతో తల్లీ వెళ్ళిచూడు అని ముద్దుపెట్టి పంపించింది .
అన్నయ్యా ......... ఎవరు అని నా నుదుటిపై ముద్దుపెట్టి బయటకు పరుగుతీసింది .
The following 21 users Like Mahesh.thehero's post:21 users Like Mahesh.thehero's post
• 9652138080, AB-the Unicorn, Bangaru, Jack789, Joncena, Kumarmb, kummun, Mahe@5189, maheshvijay, Milffucker, Naagu nag, nkp929, RAANAA, Rajeev j, Sachin@10, sandycruz, Shaikhsabjan114, sisusilas1@, sri7869, SS.REDDY, sweetdumbu
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
విశ్వ సర్ , మేడంలిద్దరూ మరియు బుజ్జి మహేష్ రాము క్యాబ్ దిగడం చెల్లి చూసి , లవ్ యు soooo మచ్ అన్నయ్యా అని బయట నుండే కేకవేసి ,
అమ్మా , తమ్ముళ్లూ .......... అని పరుగునవెళ్లి మోకాళ్లపై కూర్చుని పిల్లలిద్దరినీ హత్తుకుంది .
Happy birthday అక్కయ్యా .......... అని ముద్దుముద్దుగా ఇద్దరూ చెప్పడంతో ,
లవ్ యు తమ్ముళ్లూ ......... అని మళ్ళీ కౌగిలించుకుని లేచి అమ్మలూ , సర్ అని పట్టరాని ఆనందంతో పలకరించింది .
ముగ్గురూ happy birthday అని విష్ చేశారు . నా తల్లి నేను సెలెక్ట్ చేసిన లంగా ఓణీనే వేసుకుంది అని గుండెలపై హత్తుకుని మురిసిపోయింది మేడం.
లవ్ యు అమ్మా అనిచెప్పి లోపలికి ఆహ్వానించింది .
కృష్ణగాడితోపాటు బయటకువచ్చి మేడం వాళ్ళను విష్ చేసి సర్ ని కౌగిలించుకున్నాను .
Happy birthday కృష్ణ .......... ఎంత అదృష్టం మీఇద్దరిదీ ఒకరికోసం ఒకరు పుట్టారు అని సంతోషించారు .
మహేష్ , రాము ఎలా ఉన్నారు అని ఇద్దరమూ పిల్లలను ఎత్తుకున్నాము.
తల్లీ కృష్ణ , మహేష్ .......... బయటే నిలబెట్టి మాట్లాడుతున్నారు లోపలికి పిలుచుకునిరండి అని అంటీ చెప్పారు .
అమ్మలూ .......... అంటీ , అంకుల్ మరియు చెల్లి కార్తీక మమ్మల్ని ప్రాణంలా చూసుకుంటున్నారు అని చెల్లి పరిచయం చేసింది .
ఒకరికొకరు నమస్కరించుకుని లోపలికి పిలుచుకునివెళ్లి సోఫాలలో కూర్చోబెట్టారు .
అంటీ అందరికీ టీ తీసుకొచ్చి అందించారు .
చెల్లి ఆనందానికి అవధులు లేనట్లు మేడం , అమ్మలిద్దరి మధ్యన కూర్చుని రెండుచేతులతో చుట్టేసి సంతోషంతో మాట్లాడుతూనే ఉండటం చూసి , మురిసిపోయి అంకుల్ దగ్గరకువెళ్లి , అంకుల్ క్యాటరింగ్ వాళ్ళు అని అడుగుతుండగానే ,
అదిగో మహేష్ వచ్చేసారు అని వెళ్లి వారికి స్థలం చూపించగానే , టిఫిన్ ఏర్పాట్లు చేసేస్తున్నారు .
మా మొబైల్స్ తీసుకుని , కార్తీక ద్వారా అంకుల్ మొబైల్ తెప్పించి రాత్రి సర్ప్రైజ్ సంబరాలను అందరికీ చూపించింది .
అంతే మేడం విశ్వ సర్ చేతిని గిల్లెసీ అందుకే నిన్ననే వద్దాము విశ్వ అనిచెప్పింది . చూడండి ఎలా ఎంజాయ్ చేశారో ......... మీవలన మిస్ అయిపోయాను .
అంటీ ......... మిస్ అయినందుకు బాధపడకండి , మీకిసం అనే సాయంత్రం వీటికి మించి సంబరాల కోసం అన్నీ ఏర్పాట్లు చేశారు అన్నయ్య అని కార్తీక చెప్పింది .
అందరూ decoration , లైటింగ్ మరియు పూల గురించే మాట్లాడుతోంటే .......
అంటీ ఇంకా అలానే ఉంది decoration పైన ........
అంతే మేము చూడాల్సిందే అని అందరూ సోఫాలలో నుండి పైకి లేవడంతో చెల్లెల్లు పైకి పిలుచుకునివెళ్లారు.
పైకి వెళ్లి పాదాల కింద పూలను చూసి , మన బంగారు తల్లి పాదాలు కూడా కందిపోకుండా చూసుకుంటున్నారు అక్కయ్యా , చెల్లీ అని అమ్మా మేడం వాళ్ళు సంతోషించి సిగ్గుపడుతున్న చెల్లిని ప్రాణంలా హత్తుకుని , పూలతో అలంకరించిన సెట్ చూసి wow ......... అని ఆశ్చర్యపోయారు .
అంటీ .......... ఇంకా దీని అందం మరింత చూడాలనుకుంటే చీకటిపడాలి అని కార్తీక చెప్పింది . లైటింగ్స్ అందాలు చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు .......
అవునమ్మా .......... అని చెల్లికూడా సంతోషంతో చెప్పింది .
మహేష్ .......... decoration సూపర్ అని పైనుండే సంతోషంతో చెప్పారు .
లవ్ యు అమ్మా , మేడం అని బదులిచ్చి , చెల్లెమ్మా పిల్లలకు కోయకుండా ఉంచిన కేక్ ఇవ్వు 15 నిమిషాల్లో వేడి వేడి పూరీలు అవ్వగానే అందరికీ పైకి తీసుకొస్తాను అనిచెప్పాను .
చెల్లి అందరినీ ఇంటిలోకి తీసుకెళ్లి తమ్ముళ్లూ మీఇష్టం ఎంతకావాలంటే అంత తినండి అని అమ్మకు , మేడం వాళ్లకు కొద్దికొద్దిగా ప్లేట్ లో ఇచ్చింది .
విశ్వ సర్ ........... సాయంత్రం ఇక్కడే చెల్లీ , వాడి birthday జరుపుకుందాము అని కాంపౌండ్ లో చూపించాను .
మహేష్ పైన అద్భుతం కింద మరింత అద్భుతంలా ఉండబోతోంది అనుకుంటున్నాను.
అవును విశ్వ గారు రాత్రంతా నిద్రపోకుండా ఒక్కడే చేసాడు .
అన్నయ్య గారు విశ్వ అని పిలవండి చాలు అనిచెప్పారు .
విశ్వ సర్ ......... అంకుల్ కూడా నిద్రపోకుండా నాతోపాటు ఇష్టంగా కష్టపడ్డారు , మమ్మల్ని చాలా చాలా బాగా చూసుకుంటున్నారు అని ఒకరొకరి జాబ్స్ గురించి మరియు చిన్నప్పుడు జరిగిన సంఘటన అలాగే ఐదేళ్ల ముందుగానే జైల్ నుండి ఎలా రిలీజ్ అయ్యామో అంకుల్ కు వివరించాను .
అన్ని సంవత్సరాలు మహేష్ ను మరిచిపోలేదంటే తమ్ముడూ విశ్వ మీరు చాలా గొప్పవారు ఒకసారి కౌగిలించుకోవచ్చా అని అడిగారు .
హైద్రాబాద్ లో మహేష్ వాళ్ళు ఎంత కష్టపడతారో అన్నీ సెట్ చేసుకోవడానికి అని కంగారుపడ్డాను . వచ్చినరోజే మీగురించి చెప్పాడు . ఆ క్షణం నుండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎదురుచూస్తున్నాను . మహేష్ కాల్ చేసి కృష్ణలిద్దరి birthday అనగానే మిమ్మల్ని కూడా కలవాలి అని వచ్చేసము . నేనే మిమ్మల్ని కౌగలించుకుని తరించాలి అని సంతోషంతో కౌగిలించుకుని క్లోజ్ అయిపోయినట్లు మాటల్లో పడిపోయి నవ్వుతూనే ఉన్నారు .
8 గంటలకు రేయ్ మామా పూరీలు రెడీ అని కృష్ణగాడు చెప్పడంతో చకచకా అంకుల్ విశ్వ సర్ కు అందించి , అమ్మా మేడం అంటీ పిల్లలకోసం పైకి తీసుకువెళ్ళాము . వాళ్ళు తినేంతవరకూ పైన ఒకరు కింద ఒకరము ఉంది సర్వ్ చేసాము .
బయటకువెళ్లి పెద్దయ్యా , అంకుల్ , కృష్ణగాడి అన్నయ్యకు కాల్ చేస్తే ఒకరికి తగిలింది . అన్నయ్యా ......... ఎక్కడ ఉన్నారు అని అడిగాను . ఇక్కడ టిఫిన్ రెడీ అనిచెప్పాను .
తమ్ముడూ .......... నిన్ను ఇబ్బందిపెట్టరాదని 3 గంటలకే ........ ప్రక్కన ష్ ష్ ........ అనే సౌండ్స్ వినిపించాయి . అలాగే అలాగే అని అన్నయ్య మాటలు వినిపించాయి .
అన్నయ్యా ............
తమ్ముడూ మీకో సర్ప్రైజ్ అదే చెప్పొద్దు అని పెద్దయ్యా , అంకుల్ సైగలు చేస్తున్నారు.
అన్నయ్యా ........ అంకుల్ వాళ్ళతోపాటు కలిసి వస్తున్నారా , చాలా సంతోషం అయితే మీకోసం టిఫిన్ రెడీ చేయిస్తాను అనిచెప్పాను .
తమ్ముడూ ఇప్పుడే తిని మళ్లీ బయలుదేరాము . అదే చెప్పబోతున్నాను మీకు అక్కడ ఇబ్బంది కలగకూడదని ఉదయం 2 గంటలకే లేచి వంట చేసుకుని బయలుదేరాము . అందరమూ ఒకతోట కనిపిస్తేనూ ఆగి తిని ఇప్పుడే బయలుదేరాము 9 గంటలకల్లా వచ్చేస్తాము నువ్వు కంగారుపడకు అని బదులిచ్చారు .
అయితే మధ్యాహ్నం భోజనం రెడీ చేయిస్తాను అని చెప్పాను .
తమ్ముడూ మధ్యాహ్నానికి కూడా వండుకుని తీసుకొస్తున్నాము . మీకు .......
మాకు ఇబ్బంది కలగకుండా .......... లవ్ యు అన్నయ్యా ........ పెద్దయ్య అంకుల్ వాళ్ళ ప్లాన్ కదూ ప్రక్కనే ఉన్నారా ........స్పీకర్ on చేసాను తమ్ముడూ .......
పెద్దయ్యా , అంకుల్ థాంక్యూ sooooo మచ్ . అమ్మలూ జాగ్రత్తగా రండి కనీసం టీ అయినా రెడీ చేయిస్తాను .
అతి తొందరలోనే మీరు మాకు ఇబ్బంది లేదు చాలా పెద్ద స్థాయికి చేరుకున్నావు అంతా నువ్వే ఖర్చుపెట్టాలి అనేలా కష్టపడతాను అమ్మా , అంకుల్ , పెద్దయ్యా ....... లవ్ యు sooooo మచ్ అని ఉద్వేగంతో చెప్పాను.
క్యాటరింగ్ అన్నయ్య దగ్గరకువెళ్లి టిఫిన్ చాలు ఇక నైట్ ఏమిచెయ్యాలో ఎంతమంది వస్తారో చెబుతాము ఇప్పటికి టీ కాఫీ స్నాక్స్ చెయ్యండి చాలు అనిచెప్పాను .
సర్ .......... సాయంత్రానికి కూడా ఇంత తక్కువ మంది అయితే మాకు ఉత్సాహం ఉండదు సర్ , మీకు కూడా మినిమం 100 ప్లేట్స్ బిల్ పడుతుంది .
మీ రూల్స్ ఎలా ఉంటే అలా అన్నయ్యా ........, అన్నయ్యా రేయ్ అని చెల్లి పైకి పిలిచింది .
సర్ .........
మహేష్ .......... మేము క్లోజ్ అయిపోయాము ఇక నువ్వు ప్రక్కన ఉండాల్సిన అవసరం లేదు అని ఇద్దరూ సంతోషంతో నవ్వుకుని , తినిపించడానికే అనుకుంటాను వెళ్లి టిఫిన్ చెయ్యండి పూరీలు tasty గా ఉన్నాయి అని పంపించారు .
తల్లీ రోజూ నువ్వే తినిపిస్తున్నావు కదా నీ పుట్టినరోజు నాడు ముందు మేము తినిపిస్తాము అని మేడం వాళ్ళు ఆశపడటంతో , ప్లేటులో వడ్డించి ఇచ్చింది .
మేడం వాళ్ళు మాకు , జైలర్ అమ్మ చెల్లికి తినిపించారు .
మేడం , అమ్మా ఫంక్షన్ సాయంత్రం కదా అంతలోపు బిర్లా మందిర్ , ట్యాంక్ బండ్ , చార్మినార్ చూసిరావచ్చు అనిచెప్పాను .
మీరు కూడా వస్తేనే .............
అమ్మా ......... నేను ఖచ్చితంగా ఉండాలి కాబట్టి చెల్లిని పిలుచుకునివెళ్లండి రేయ్ అన్నీ ఏర్పాట్లు చూడమనిచెప్పాను .
మాంచి కంఫర్ట్ వెహికల్ బుక్ చేస్తాను కృష్ణా సరదాగా వెళ్లి ఎంజాయ్ చేసిరండి అని కృష్ణగాడు బదులిచ్చాడు .
రేయ్ మామా ......... ఇక్కడ నేను చూసుకుంటాను తోడుగా నువ్వుకూడా వెళ్లు అవసరం పడొచ్చు అనిచెప్పాను .
రేయ్ మామా ......... ఇప్పటికే రాత్రన్తా కష్టపడ్డావు , ఏమిచెయ్యాలో నాకుచెప్పు నేను ఇక్కడే ఉండి పూర్తిచేస్తాను నువ్వు అమ్మా నీ చెల్లితోపాటు వెళ్లి ఎంజాయ్ చెయ్యి అనిచెప్పాడు .
సరిపోయింది చెల్లీ , అక్కయ్యా .......... ఇక మనం వెళ్లినట్లే , మీరిద్దరూ రాకపోతే మా బంగారుతల్లికూడా రాదు అని అమ్మా , మేడం వాళ్ళు మా ప్రేమకు సంతోషించారు .
సరిగ్గా చెప్పారమ్మా ........... అని అమ్మల చేతులను చుట్టేసి తింటోంది .
అలా కడుపునిండా తిన్న తరువాత కూడా నువ్వు వెళ్లు నువ్వు వెళ్లు అని వాదులాడుకుంటూనే ఉన్నాము .
ఇంతలో బయట వరుసబెట్టి బస్ లు ఆ వెనుకే ట్రాక్టర్లు మా వీధిమొత్తం వరుసగా నిలబడ్డాయి . ట్రాక్టర్లు అంటేనే పెద్దయ్యావాళ్ళు అని అర్థమైపోయినా 1 2 3 4 బస్ లు మరియు దూరం వరకూ ట్రాక్టర్లను చూసి అలా ఆశ్చర్యంతో నిలబడిపోయాము .
ట్రాక్టర్లలో నుండి ఊరిజనాలు , ఇంటిముందు ఆగిన బస్ నుండి అమ్మావాళ్ళు , పెద్దయ్య , అంకుళ్ళిద్దరూ , అన్నయ్య దిగి పైన షాక్ లో ఉన్న మమ్మల్ని చూసి మహేష్ అని చేతిని ఊపి , happy birthday తల్లీ , కోడలు పిల్లా , కృష్ణ అని సంతోషంతో చెప్పారు .
అంతే ముగ్గురమూ అంతులేని ఆనందంతో కిందకు దిగి పరుగునవెళ్లి గేట్ తీసుకుని బయటకువెళ్లి చెల్లి అమ్మ మరియు వాళ్ళ అత్తయ్య పాదాలకు నమస్కరించింది .
చల్లగా ఉండు తల్లీ అని లేపి ఒకేసారి గుండెలపై హత్తుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు .
బస్ లలోనుండి ఊరిలోని అమ్మావాళ్ళు , పిల్లలు ........ ట్రాక్టర్లలోనుండి ఊరిజనం దిగివచ్చి వీధిమొత్తాన్ని ఆక్రమించేసి , కృష్ణ - కృష్ణవేణి ఇద్దరికీ మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని సంతోషంతో చెప్పడంతో వీధిమొత్తం మారుమ్రోగిపోయినట్లు వీధిలో ఇళ్లల్లో ఉండేవాళ్ళంతా వచ్చి ఆశ్చర్యపోతున్నారు .
చెల్లీ , కృష్ణగాడు ఆనందంతో పరవశించిపోయి అమ్మావాళ్లకు లవ్ యు , ఊరి జనమందరికీ చిరునవ్వుతో థాంక్స్ చెబుతుంటే , మాటల్లో వర్ణించలేని అనుభూతితో పెద్దాయ్యా , అంకుల్ .........మాకోసం అని చుట్టుచూసాను .
నువ్వు కాల్ చేసి పుట్టినరోజు పండుగకు ఆహ్వానించగానే , మీ అంకుల్ ఊరికివచ్చి మహేష్ కాల్ చేసి ఉంటాడు ఎవరెవరు వస్తున్నారు వెహికల్లో వెళదాము అని అడిగారు . సర్ మీరు ఇంట్లో కూర్చోండి కృష్ణ పేరెంట్స్ ను అడగడానికి వెళ్ళానా ....... ప్రక్క ఇంటి మీ అమ్మ అక్కడే ఉండటంతో మామాటలు విన్నది అంతే సంతోషంతో బయటకువెళ్లి నిమిషాల్లో ఆ వార్త ఊరందరికీ తెలిసిపోయినట్లు , పెద్దయ్యా ........ మెమోస్తాము మెమోస్తాము మహేష్ ను , కృష్ణను మరియు వాళ్ళిద్దరినీ ప్రాణంలా చూసుకుంటున్న మా తల్లిని చూసి వారం రోజులు అవుతోంది ఎంత ఖర్చయినా పర్లేదు అని కుటుంబాలు కుటుంబాలు ఉత్సాహం చూపడంతో , నీ పై ప్రేమను ఆరాటాన్ని వారి నుండి దూరం చెయ్యలేక , వెంటనే మీ అంకుల్ ని కలిసి మీ అమ్మలకోసం బస్ లు , మేము ట్రాక్టర్లలో బయలుదేరాలని నిర్ణయించుకుని రెండు గంటలకు లేచి ట్రాక్టర్లలో వెళ్ళేవాళ్ళను పంపించేసి , మేము అందరికోసం పెద్ద పెద్ద పాత్రలలో టిఫిన్ , భోజనం వీధిలోనే వంట వండేసి తీసుకొచ్చి మధ్యలో కలిసాము అని చెప్పారు .
పెద్దయ్యా.......... ఇంత డబ్బు ,
మహేష్ నువ్విచ్చిన డబ్బుతో పొలం పనులు మొదలెట్టగానే , మన పంటకు ఉన్న డిమాండ్ వలన దళారులు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేసారు మరియు మీరు హైద్రాబాద్ వచ్చిన మరుసటిరోజే కలెక్టర్ గారు పొలాల కోసం బ్యాంకు నుండి రుణాలు ఇప్పించారు . అందరూ మిమ్మల్నే తలుచుకుని ఎంతగా ఆనందించారో మాకు ఆ అమ్మవారికే తెలుసు . మహేష్ డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించకు మూడే మూడు పంటల్లో అందరి కష్టాలు తీరిపోయి ఇక నెక్స్ట్ నుండి డబ్బులు దాచిపెట్టుకోవడమే అని సంతోషంతో హత్తుకొని పెద్దయ్యా , అంకుల్ వెళ్లి ఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి , తల్లీ .......... ఇష్టంతో తెచ్చిన కానుకలు అదే అదే గిఫ్ట్స్ ఇప్పుడే ఇవ్వాలా లేక సాయంత్రం కేక్ కోసినతరువాత ఇవ్వాలా అని అడిగారు.
పెద్దయ్యా , అంకుల్ .......... దేవతల కన్నా ఎక్కువైన అమ్మావాళ్ళందరినీ పిలుచుకునివచ్చారు అంతకంటే విలువైన కానుక ఏముంటుంది అని ఆనందబాస్పాలతో ఒక అమ్మ గుండెలపై ఉన్న బుజ్జాయిని ఎత్తుకుని , మీ అక్కయ్యకు విషెస్ చెప్పడానికి అంత దూరం నుండి వచ్చేసావా నా బుజ్జితల్లీ లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ముద్దుపెట్టి మురిసిపోతోంది .
రేయ్ ......... అని అంకుల్ చిరుకోపంతో పిలిచారు .
రేయ్ ప్రక్కనే ఉన్నావా ...........ఎన్నిరోజులయ్యిందిరా నిన్నుచూసి నీకోసమేరా నేను వచ్చినది అని సంతోషంతో కౌగిలించుకోబోతే ,
ఆపరా నీమాటలు ......... వచ్చినప్పటి నుండి నీప్రక్కనే నిలబడ్డాను మన మహేష్ , కృష్ణని , తల్లినీ తప్ప నేనొకడిని ఇక్కడ ఉన్నానని గుర్తుందారా నీకు , ఇప్పుడు మళ్లీ నాకోసం అన్నట్లు బిల్డప్ ఇస్తున్నావు అని అమాంతం కౌగిలించుకున్నాడు .
అంటీ ఎవరూ ఇంతమంది అని బయటకువచ్చి అక్కయ్యా , అక్కయ్యా ....... అంటూ సునీతమ్మ అంటీ ఒకరినొకరు అంతులేని ఆనందంతో కౌగిలించుకుని ఎన్నిరోజులయ్యింది మనం కలిసి , నీ రెండో కూతురు పెళ్లిలో కలిసిందే ......... తల్లీ కృష్ణ .......... ఇంతమంది మీకోసమే వచ్చారా ......... అమ్మో రెండు కళ్ళూ చాలడం లేదు , తల్లీ కృష్ణ ......... ఇంకొక్కసారి ఇలా మన ఆత్మీయులను బయటే నిలబెట్టావంటే కొట్టేస్తాను అని నుదుటిపై ప్రేమతో కొట్టి , ఫస్ట్ ఫ్లోర్ లో కింద ఉన్నంత ఇల్లు ఉంది అందరినీ పిలుచుకునివెళ్లు అని ఆర్డర్ వేసింది .
అత్తయ్యా అమ్మలూ అంటీ ......... మాకు ఏలోటూ లేకుండా చూసుకుంటున్నారు .
సంతోషంతో ఆనందబాస్పాలతో చేతులెత్తి నమస్కరించారు .
అయ్యో ఇంతదానికే ముందు మీరు లోపలికి రండి , తల్లీ ......... అమ్మలూ రండి అని అంతులేని సంతోషంతో అందరినీ లోపలకు పిలుచుకొని వెళ్ళింది .
అంటీ అమ్మావాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ కు పంపించి ఫ్రెష్ అవ్వండి టిఫిన్ చేద్దురు అనిచెప్పింది .
అక్కయ్యా , చెల్లీ ......... మేము తిన్నాము .
అయితే మీకోసమే అనుకుంటాను టీ స్నాక్స్ చేయిస్తున్నాడు మహేష్ వెళ్ళండి అని సునీతమ్మను , కృష్ణగాడి అమ్మను ఇంట్లోకి పిలుచుకొనివెళ్లింది .
మహేష్ , కృష్ణా ........ అని విశ్వ సర్ సంతోషమైన ఆశ్చర్యంతో అందరినీ చూస్తున్నారు .
పెద్దయ్యా , అంకుల్ .......... విశ్వ సర్ చెప్పానుకదా అని పరిచయం చేశాను .
విశ్వ సర్ విశ్వ సర్ మన పిల్లలను రిలీజ్ చేయించిన దేవుడు అని ఊరి జనమంతా గుసాగుసలాడుతూ , పెద్దయ్య అయితే మీరు మాకు దేవిడితో సమానం అని పాదాలను తాకపోతే ,
అయ్యా ......... మీరు పెద్దవారు మమ్మల్ని ఆశీర్వదించాలి అని కౌగిలించుకొన్నారు .
అందరూ సంతోషంతో విశ్వ సర్ విశ్వ సర్ ......... అని సంతోషంతో కేకలువేశారు .
మహేష్ , కృష్ణ .......... ఇంతమంది అభిమానాన్ని పొందిన మీ జీవితం ధన్యం అని గర్వపడ్డారు .
మహేష్ , కృష్ణ .......... అందరినీ లోపలికి ఆహ్వానించు ..........
సర్ ......... లోపల సరిపోదులెండి సంతోషం అని బదులిచ్చారు .
ఎంతమంది పడితే అంతమంది రండి , ఇంటిలోపల పైన కూడా స్థలం ఉంది చాలాదూరం ట్రాక్టర్లలో ......... మీ ప్రాణమైన పిల్లలకోసం అస్సలు నా ఊహకే అందడం లేదు అని పెద్దయ్యా , అంకుల్ వాళ్ళ చేతులనూ అందుకొని రండి అని సంతోషంతో పిలిచారు .
ఈ ఆనందం చాలు మన దేవుడిని సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు సర్ అని కృష్ణని చేతులుకలిపి హత్తుకొని birthday విషెస్ తెలిపి సంతోషంతో లోపలకువచ్చారు .
అంకుల్ అప్పటికప్పుడు కాల్ చేసి అందరికీ నీడ కోసం కాంపౌండ్ మొత్తం షామియానాలు కుర్చీలు వేయించారు .
క్యాటరింగ్ అన్నయ్య దగ్గరికి వెళితే అప్పటికే ఉత్సాహంతో టీ కాఫీ స్నాక్స్ అందరికీ చేస్తున్నానని బదులిచ్చారు .
నవ్వుకుని అలాగే రాత్రికి హైద్రాబాద్ ధం బిరియానీతోపాటు ఇంకా ఏమేమి బాగుంటాయో చెయ్యండి అని పాతికవేలు అడ్వాన్స్ ఇచ్చాను .
ఇక చూసుకోండి ........... అని మొబైల్ తీసి ఏమేమి తేవాలో లిస్ట్ చెప్పారు .
థాంక్స్ అన్నయ్యా .......... అని అందరినీ కూర్చునేలా చేసి , అమ్మావాళ్లకు కూడా టీ కాఫీ స్నాక్స్ పంపించాను .
చెల్లి కార్తీక అమ్మావాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ కు పిలుచుకొనివెళ్లి ఫ్రెష్ అవ్వమని మూడు బాత్రూమ్లు సింక్స్ చూపించి , పైకి వెళితే ఇంకా షాక్ లో ఉన్న అమ్మను మరియు మేడం వాళ్ళను ముందుగా కిందకు పిలుచుకొనివచ్చి సునీతమ్మ , అత్తయ్య ను పరిచయం చేసింది .
తల్లీ ......... ఇంత జనాన్ని చూసి మేము ఇంకా కొలుకోవడానికి సమయం పట్టేలా ఉంది , మా బంగారుతల్లిని విష్ చెయ్యడానికి ఇంతమంది వచ్చారా ...........
అక్కయ్య గారు మేము ఒక ఊరివాళ్ళము మాత్రమే , ఇంకా మరొక ఊరికి తెలుపలేదు .......... కొద్దిగా అలా తెలిసినా మన మహేష్ , కృష్ణ కోసం ఇంతకు రెండింతల జనం వచ్చేవాళ్లే ............
రెండు ఊళ్ల జనాలా ......... నా తల్లి అదృష్టవంతురాలు అని మేడం వాళ్ళతోపాటు సంతోషించి పరవశించిపోయింది .
అమ్మా ........... అందరినీ పరిచయం చేస్తాను రా అని పైకిపిలుచుకునివెళ్లింది .
అక్కడ చెల్లిపై ఒక్కొక్క అమ్మ చూపిస్తున్న ప్రేమను చూసి కృష్ణ , మహేష్ ......... నా తల్లికి ఎంతటి స్థానాన్ని ఇచ్చారు అని పొంగిపోయింది .
The following 23 users Like Mahesh.thehero's post:23 users Like Mahesh.thehero's post
• 9652138080, AB-the Unicorn, Bangaru, Fuckingroll69, HitmanA007, Jack789, Joncena, Kumarmb, kummun, lucky81, Mahe@5189, maheshvijay, Milffucker, nkp929, RAANAA, Rajeev j, Sachin@10, sandycruz, Shaikhsabjan114, sisusilas1@, sri7869, SS.REDDY, sweetdumbu
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
కొద్దిసేపు అందరితో సంతోషంగా మాట్లాడిన తరువాత , పెద్దయ్యా .......... సాయంత్రం వరకూ బోర్ కొడుతుంది సిటీలోని ఫేమస్ ప్రదేశాలను చూసి రండి అనిచెప్పాను .
ఆ ప్రదేశాలను చూసి కలిగే ఆనందం కంటే మా దేవుడితో కాలక్షేపం వలన మరింత సంతోషం మాకు అనిబదులిచ్చారు .
అయితే అమ్మావాళ్లను అయినా పంపిస్తాను . అన్నయ్యలూ మీలో ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు రెడీ అవ్వండి అనిచెప్పి పైకివెళ్లి అమ్మలూ రెడీ అవ్వండి వీడు , చెల్లీ గుడికి తీసుకెళతారు అనిచెప్పాను .
రేయ్ మామా , అన్నయ్యా ..........
రేయ్ , చెల్లెమ్మా ....... ఇక ఏమీ మాట్లాడకండి ఇక్కడ కొద్దిగా పని ఉంది సంతోషన్గా వెళ్ళిరండి అని బ్రతిమాలి ఒప్పించి అంటీవాళ్ళతో సహా బస్ దగ్గరకు చేరుకున్నాము .
మా తల్లి మా బస్ లో ఎక్కాలి మా బస్ లో ఎక్కాలి అని అమ్మావాళ్ళు ఒకటే పట్టుపట్టారు .
చెల్లి ఏ బస్ ఎక్కాలో తెలియక అన్నయ్యా .........అని గుండెలపై వాలి నాకు అందరితోపాటు వెళ్లాలని ఉంది అనిచెప్పింది . నవ్వుకుని డ్రైవర్ల దగ్గరకువెళ్లి అన్నా ........... గంటకొకసారి బస్ లను ఆపి వీరిద్దరినీ ఒక్కొక్క బస్ లో మార్చి తీసుకెళ్లగలరా అని అడిగాను .
తమ్ముడూ మహేష్ .......... ఆర్డర్ వెయ్యి అని బదులివ్వడంతో థాంక్స్ చెప్పాను .
లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ......... ఐడియా సూపర్ వెళ్ళొస్తాము అని కృష్ణగాడి గుండెలపై వాలిపోయి కార్తీక చేతినిపట్టుకొని అమ్మా అంటీవాళ్ళతోపాటు వెళ్లి ఫస్ట్ బస్ లో ఎక్కారు .
ఆ బస్ లోని అమ్మావాళ్ళంతా మా బంగారానికి మీరంటేనే ప్రాణం అని సంతోషంతో మిగతా బస్ లోని అమ్మలను ఎగతాలిచేస్తూ కేకలు వేస్తుంటే ,
చెల్లి నవ్వుకుని మీలోమీకు పోటీనా అని ఆపి మిగతా బస్ లోని అమ్మావాళ్లకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మొదటగా బిర్లామందిర్ వెళ్ళండి అన్నా అని కృష్ణగాడు చెప్పాడు .
రైట్ తమ్ముడూ కృష్ణ .........అని పోనిచ్చారు .
అన్నా నా పేరు ....... మీకు .........
మీ ఊరివాళ్ళంతా బస్ ఎక్కిన దగ్గరనుండి మీ గురించే మాట్లాడుతూనే ఉన్నారు హైద్రాబాద్ వచ్చేన్తవరకూ ..........అని నవ్వుతూ సమాధానమిచ్చాడు .
కృష్ణగాడు మురిసిపోయి వెళ్లి చెల్లి ప్రక్కనే కూర్చున్నాడు .
కృష్ణా ........... మా తల్లి బస్ లో ఉండబోయేది గంటసేపే అప్పుడే 5 నిమిషాలు అయిపోయింది . నువ్వు రోజూ ప్రక్కనే ఉంటావుకదా ......... ఈ గంటసేపు మాకు వదిలెయ్యి అని ముసిముసినవ్వులు నవ్వుతూ కోరారు .
చెల్లి నవ్వుకుని వెల్లనా ........ అని అడిగి , సరే అనడంతో , బుగ్గపై తియ్యని ముద్దుపెట్టి వెనుకకు వెళ్ళింది .
అంతే అమ్మావాళ్ళంతా తమ తమ బ్యాగులలో నుండి స్వీట్స్ తీసి పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లీ అని చెల్లిముందు ఉంచారు . మా ప్రాణమైన మీకోసం ఇష్టంతో ఇంట్లోనే చేసాము అని అన్నిరకాల స్వీట్స్ ముందు ఉంచారు .
చెల్లి కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు soooooo మచ్ అమ్మలూ ........... అందరి అమ్మల స్వీట్ రుచి చూడాలి కాబట్టి కొద్దికొద్దిగా తింటాను అనిచెప్పి తినింది .
కృష్ణ నీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అని విష్ చేసి వాడితోపాటు అమ్మా , మేడం , అంటీ వాళ్లకు అందించారు .
మొదటి గంటసేపు అమ్మావాళ్ళతో కబుర్లు , ముచ్చట్లతో ఆపకుండా నవ్వుతూనే క్షణంలో గడిచిపోయినట్లు బస్ ఆగింది . అయ్యో అప్పుడే గంట అయిపోయిందా అని అమ్మవాళ్ళు బాధపడుతుంటే ,
అవును అమ్మలూ ......... కానీ ఇప్పుడే పంపాల్సిన అవసరం లేదు బిర్లామందిర్ చేరుకున్నాము . దర్శనం చేసుకునివచ్చాక ఇక తప్పదు అని బదులిచ్చాడు .
అందరూ చెల్లిని మధ్యలో ఉంచుకుని దిగారు .
మిగతా బస్ లోని అమ్మావాళ్ళు మీకు అలా కలిసొచ్చింది అని అసూయతో వాళ్లవైపు చూస్తోంటే , వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తూ బిర్లామందిర్ దర్శించుకున్నారు .
తల్లీ ........ మాలానే అంతసేపు ప్రార్థించావు ఏమి కోరిక కోరుకున్నావు అని అడిగారు.
అమ్మలూ మీ మనసులోనిదే , మీరు భక్తితో కోరుకున్నదే .......... మా వాసంతి అక్కయ్య ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అతి త్వరలోనే అన్నయ్యకు కనిపించాలని , ఇద్దరూ కలిసి మనఊరిలో అడుగుపెట్టాలి అనిచెప్పింది .
అందరి కళ్ళల్లో చెమ్మతో ఒకేసారి చుట్టేసి హత్తుకొని ప్రక్కనే ఉన్నవాళ్లు నుదుటిపై ముద్దుపెట్టి పరవశించిపోయి మళ్లీ మొదటి బస్ లోనే ఎక్కించబోతుంటే ,
అంతేలేదు ......... ఏదో ఉద్వేగంతో మళ్లీ ఎక్కించుకోవాలని భలే ప్లాన్ వేశారు . ఇక్కడ చూడండి అని వాళ్ళవైపు చూస్తే అప్పటికే అమ్మావాళ్ళు , మేడం వాళ్ళు , కృష్ణగాడిని ఈ గ్యాప్ లో హైజాక్ చేసేసారు .
చెల్లి నవ్వుని ఆపుకొని అమ్మలూ .......... మాటంటే మాటే , లేకపోతే అన్నయ్యకు మాటోస్తుంది అని ఇద్దరు ముగ్గురు అమ్మల బుగ్గలపై ముద్దులుపెట్టి రెండవ బస్ దగ్గరకు వెళ్ళింది .
ఇప్పుడు మా టైం అని మొదటి బస్ మరియు వెనుక బస్ లను వెక్కిరించి చెల్లినీ అమ్మావాళ్లను ఎక్కించుకుని , same మాటలు కృష్ణగాడికి అని అందరూ అమ్మలూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ తీశారు .
అంటే వెనుక బస్ లోని అమ్మావాళ్ళు కూడా స్వీట్స్ అని కొద్దికొద్దిగా టేస్ట్ చేసింది .
తల్లీ బాలేవా ..........
చాలా రుచిగా ఉన్నాయమ్మా ......... కానీ మొదటి బస్ లోనే బాగా తినేసాము మరియు నెక్స్ట్ బస్ లలో కూడా తినిపించడానికి అమ్మావాళ్ళు రెడీగా ఉన్నారు అందుకే ,
అంటే వాళ్లకోసం ......... మేము అలిగాము , బుంగమూతిపెట్టుకున్నాము . మా వాసంతి తల్లి సేవ చేసుకునే భాగ్యం మాకు ఎలాగో లేదు . మా మహేష్ రెండో ప్రాణమైన మా బంగారు తల్లినైనా సేవించుకుందాము అంటే ...........
లవ్ యు లవ్ యు అమ్మా ......... తింటానులే అని సగం లడ్డూ తినేసి మరొక అమ్మ స్వీట్ అందుకోబోతుంటే చాలులే తల్లీ .......... , వెనుక ఉన్న బస్ వాళ్ళు కూడా మా అక్కాచెల్లెల్లే కదా తినకపోతే బాధపడతారు . అన్నీ మీకోసమే రోజూ తినండి అని చల్లగా ఉండు తల్లీ అని దీవించారు .
లవ్ యు అమ్మా ......... అని ఒక అమ్మ గుండెలపై వాలిపోయి నెక్స్ట్ ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం విహారయాత్ర సందర్శించి మరొక బస్ ఎక్కారు .
ట్యాంక్ బండ్ దగ్గరలోని ముఖ్యమైన ప్రదేశాలను వీక్షించి మధ్యాహ్నం రెండు గంటలకు ఒక పార్క్ లో ఊరి నుండి తీసుకొచ్చిన భోజనం తినేసి , అక్కడ చెల్లి మరొక బస్ లో గోల్కొండ ఫోర్ట్ చేరుకుని రెండు గంటలపాటు మొత్తం వీక్షించి , అటునుండి మరొక బస్ లో చార్మినార్ దర్శించి 6 గంటలకు చివరి బస్ లో అమ్మావాళ్ళు ప్రేమతో విషెస్ తెలిపి అందించిన స్వీట్స్ తినేసి 7 గంటలకు ఇంటికి చేరుకున్నారు .
బస్ లోనుండే విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇల్లు మరియు కాంపౌండ్ ను చూసి ఆశ్చర్యపోయి కిందకు దిగి లోపలికివచ్చి decoration చూసి సంతోషమైన షాక్ లో కన్నార్పకుండా అలా గేట్ దగ్గరే నిలబడిపోయారు .
అక్కా , చెల్లీ ......... మేముకూడా చూడాలికదా అని ముందుకు తోసి లోపలికి వస్తున్న అమ్మావాళ్లను చూసి వారి భర్తలు నవ్వుకుని , శ్రీమతి గార్లూ.......... మన దేవుడే సృష్టించాడు . మేమంతా చిన్న చిన్న సహాయం చేసాము తెలుసా అని గర్వపడుతూ చెప్పి పొంగిపోయారు .
స్టేజి స్క్రీన్ పై " పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ - కృష్ణ " అని రాసి స్టేజీపై step wise కేక్ పూలతో లైటింగ్స్ తో అద్భుతంగా arrange చేసి ఉండటం , అందరమూ చప్పట్లతో విషెస్ తెలుపుతూ ఆహ్వానిస్తుండటం చూసి ఇద్దరూ పరవశించిపోయు అన్నయ్యా ......... అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది . మరొకవైపు బిరియానీ ఘుమఘుమలు పిచ్చెక్కిస్తున్నాయి
రేయ్ , చెల్లెమ్మా .......... పైకి వెళ్లి రెడీ అయ్యిరండి . మీకోసం అక్కయ్యను తలుచుకుని బెడ్ పై గిఫ్ట్స్ కొన్నాను అనిచెప్పాను .
Wow .......... అని సంతోషంతో మరింత గట్టిగా హత్తుకొని పొంగిపోయింది .
అమ్మలూ ......... మీరుకూడా వెళ్లి ఫ్రెష్ అయ్యిరండి అనిచెప్పడంతో , అంటీ ఇంటిలో ఉన్న అన్ని బాత్రూములలోకి దారించి చూపించారు .
అన్నయ్యా ......... వెంటనే వచ్చేస్తాము . కొత్త డ్రెస్ సూపర్ అని చెప్పి పైకివెళ్లారు .
బెడ్ పై from వాసంతి అక్కయ్య అని ఉన్న గిఫ్ట్ ఓపెన్ చేసి చెల్లికోసం పింక్ లెహంగా, చైన్ రంగులు గాజులు పట్టీలు, కృష్ణగాడికి కొత్త బట్టలు చూసి సంతోషంతో లవ్ యు sooooo మచ్ అక్కయ్యా అని పేరుని గుండెలపై హత్తుకొని ఫ్రెష్ అయ్యి ఒకరిచేతులను మరొకరు పట్టుకుని కిందకువచ్చారు .
ఇద్దరినీ చూడటానికి రెండుకళ్ళూ సరిపోవడం లేదు . బ్యూటిఫుల్ లవ్లీ సూపర్ ........ అంటూ అప్పటికే వచ్చిన అమ్మావాళ్ళు సంతోషించి దిష్టి తీశారు .
అన్నయ్యా .......... అక్కయ్య గిఫ్ట్ హృదయాన్ని పరవశింపజేసింది లవ్ యు soooo మచ్ అని మురుసిపోతోంది .
చెల్లీ , రేయ్ ......... అందరూ ఎదురుచూస్తున్నారు వెళ్లి కేక్ కట్ చెయ్యండి అనిచెప్పాను .
అన్నయ్యా ......... మీరుకూడా రండి అని చేతిని అందుకుంది .
అమ్మలూ , మేడం ......... అని చెల్లిచేతిని అందించాను .
అమ్మావాళ్ళు స్వయంగా స్టేజీపైకి తీసుకెళ్లి ప్రాణంలా ముద్దులుపెట్టి ఇద్దరితో కేక్ కట్ చేయించగానే , వారిపై పూల వర్షం , ఆకాశంలో క్రేకర్స్ , బయట బాణాసంచా , అందరమూ చప్పట్లతో birthday విషెస్ తెలిపాము .
అమ్మావాళ్ళు చెల్లి బుగ్గలపై , చెల్లి వాళ్ళ బుగ్గలపై క్రీమ్ పూసుకుని ఎంజాయ్ చేస్తుండటం చూసి మురిసిపోయాను . కార్తీకతోపాటు చాలా మంది ఆ సంబరాన్ని తమ ఫోన్లలో బంధిస్తున్నారు .
చెల్లి కేక్ తీసుకుని మొదట నాకు తినిపించడానికి వస్తుంటే , నేనే వెళ్లి అమ్మావాళ్లకు మేడం వాళ్లకు తినిపించేలా చేసాను . అమ్మావాళ్ళ నుండి కింద ఉన్న అమ్మావాళ్ళు ఊరిజనం వెళ్లి విషెస్ తెలిపి బస్ లో ఉంచిన గిఫ్ట్స్ ఫ్యామిలీతోపాటు వచ్చి అందించారు . ఆ గిఫ్ట్ లతో ఒక రూమ్ మొత్తం నిండిపోయేలా ఉంది .
ఆవెంటనే dj లైట్స్ తో సౌండ్ రాగానే కృష్ణగాడు చెల్లిచేతిని అందుకొని అందరి మధ్యలోకివచ్చి డాన్స్ మొదలెట్టాడు . చుట్టూ వాళ్లకు తెలియకుండానే ఉత్సాహం వచ్చేసి సిగ్గుపడుతున్న అమ్మావాళ్ళ మరియు వాళ్ళ పిల్లల చేతులు అందుకొని జీవితంలో తొలిసారి డాన్స్ చేస్తూ మరింత సిగ్గుతో , తమ ప్రక్కనే అక్కా చెల్లెళ్ళు కూడా డాన్స్ చేస్తుండటం చూసి నవ్వుకుని ఎంజాయ్ చేశారు .
అంకుల్ వాళ్ళు అమ్మా , అంటీ చేతులను అందుకొని ప్రేమతో ముద్దులుపెట్టి డాన్స్ చెయ్యడం , విశ్వ సర్ ను కూడా పిలవడంతో మేడం చేతిని అందుకొని అలా అలా ప్రతి ఒక్కరూ డాన్స్ ఎంజాయ్ చేశారు .
పెద్దయ్యా , అన్నయ్యతోపాటు చప్పట్లు కొడుతూ చూసి ఎంజాయ్ చేస్తుంటే , జైలర్ అమ్మ వచ్చి నాన్నా మహేష్ నాకు కూడా డాన్స్ చెయ్యాలని ఉంది అని చెయ్యి చెప్పడంతో ,
Love to అమ్మా ........ అని చేతిపై తియ్యని ముద్దుపెట్టి , చెల్లిదగ్గరకు పిలుచుకొనివెళ్లి , అమ్మను చుట్లు తిప్పుతూ డాన్స్ చేయించడం చూసి లవ్ యు అన్నయ్యా ......... అమ్మా లవ్లీ డాన్స్ అని అమ్మను చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టి మళ్లీ కృష్ణగాడి చేతులను అందుకొని dj లైటింగ్ dj మ్యూజిక్ తగ్గట్లు తనివితీరేంతవరకూ డాన్స్ చేసి డిన్నర్ హైద్రాబాద్ బిరియానీ చికెన్ ఐటమ్స్ కుమ్మేసారు .
అర్ధరాత్రివరకూ సంబరాలలో మునిగితేలి , నాన్నా మహేష్ నా బంగారు తల్లి ఆనందం చూసి ఈ హృదయం పులకించిపోయింది అని అమ్మా , మేడం వాళ్ళు అంతులేని ఆనందంతో ఈరోజును మా జీవితాంతం గుర్తుంచుకుంటాము ఫ్లైట్ సమయం అవుతోంది వెళ్ళొస్తాము అనిచెప్పగానే ,
చెల్లీ కళ్ళల్లో నీళ్లతో అమ్మను , మేడం చేతులనూ గట్టిగా చుట్టేసింది .
ఇలా బాధపడతావనే తల్లీ అర్ధరాత్రి తరువాత ఫ్లైట్ బుక్ చేసాము . నీ పుట్టినరోజు నాడు కన్నీళ్లు తెప్పించలేదు అని గుండెలపై హత్తుకొని , ఎక్కడకు వెళుతున్నాము . ఒక్క కాల్ చేస్తే గంటల్లో నీముందు వాలిపోమూ.......... అయినా మేము వెళ్ళిపోయాక నీ అన్నయ్యా , ప్రియుడి ప్రేమలో మెమసలు గుర్తుకే రాము అని అందరితోపాటు చెల్లికూడా నవ్వడంతో ,
అయితే నిజమే చెల్లీ మనం గుర్తుకు కూడా రాము అని చెల్లి నుదిటిపై ముద్దులుపెట్టి వెళ్ళొస్తాము తల్లీ అని కౌగిలించుకున్నారు .
చెల్లి లోపలికివెళ్లి రెండు గిఫ్ట్స్ తీసుకొచ్చి పిల్లలిద్దరికీ అందించి ముద్దులు ఇచ్చిపుచ్చుకుని మురిసిపోయింది .
మహేష్ .......... ఎటువంటి సహాయం కావాలన్నా ఒక్క కాల్ చెయ్యమని విశ్వ సర్ కౌగిలించుకుని క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కు వెళ్లిపోయారు .
తరువాత చాలా ఉద్వేగాల మధ్య సునీతమ్మ , చెల్లి అత్తయ్య , అమ్మావాళ్ళంతా చెల్లిని కౌగిలించున్నారు .
పెద్దయ్యా , అంకుల్ , అన్నయ్యా , ఊరిజనమంతా ......... మహేష్ ఇంత సంతోషాన్ని మళ్లీ 9 సంవత్సరాల తరువాత రుచి చూసాము అని ఆనందంతో చెప్పారు .
అంకుల్ వాళ్ళు , అమ్మా అంటీ సంతోషాలతో విడిపోయి ఊరికి పయనమయ్యారు .
ట్రాక్టర్లలో వెళ్లే అన్నయ్యలకు జాగ్రత్త అని మరీ మరీ చెప్పి వీడ్కోలు పలికాము .
వాళ్ళు వెళ్ళిపోయాక చెల్లి మామూలుస్థితికి రావడానికి గంట పైనే పట్టింది .
రేయ్ మామా పైకి తీసుకెళ్లు అనిచెప్పి , అంకుల్ తోపాటు వెళ్లి క్యాటరింగ్ వాళ్లకు ఆడిగినమొత్తాన్నీ సంతోషంతో పే చేసి పంపించాము .
అన్నయ్యా , రేయ్ మామా ......... అంటూ చెరొకవైపు హత్తుకొని ఒక్కమాట లవ్ యు sooooooo మచ్ అని మాటల్లో వర్ణించలేని ఆనందంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టేశారు .
కరెక్ట్ సమయానికి కార్తీక ఫోటోతీసి dad mom .......... చూడండి అన్నయ్య ఎలా సిగ్గుపడుతున్నాడోనని చూపించి నవ్వుతున్నారు .
ఏదీ ఏదీ కార్తీక నాకు చూపించు అని చూసి సంతోషంతో నవ్వుతోంటే , అక్కయ్య ఆనందమే కనిపించి అలా చూస్తుండిపోయాను .
కృష్ణగాడు వెళ్లి గేట్ కు తాళం వేసి , అంకుల్ అంటీ ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి పడుకోండి మేము శుభ్రం చేసేస్తాము అనిచెప్పాడు .
గుడ్ నైట్ బాయ్స్ , కృష్ణ అనిచెప్పి అంటీ కార్తీకతోపాటు లోపలికి వెళుతోంటే , ముందుకువెళ్లి అమాంతం అంకుల్ ను కౌగిలించుకుని థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అంకుల్ , ఈ సెలబ్రేషన్ మీరు లేకపోయుంటే లేదు అని ఉద్వేగంతో చెప్పాను .
మహేష్ ఏంటిది మీరు నా బిడ్డలు ......... అంటే మీరు మమ్మల్ని పరాయివాళ్ళలా చూస్తున్నారు కదూ ........ శ్రీమతి గారూ నేను హార్ట్ అయ్యాను .
బాగా హార్ట్ అయ్యారు పాపం అని అంటీ , కార్తీక నవ్వడంతో ........
నాతోపాటు అంకుల్ కూడా నవ్వేశారు .
అంకుల్ లవ్ యు ..........
ఇప్పుడు నేను హ్యాపీ అని పరక తీసుకుని శుభ్రం చెయ్యడం మొదలెట్టారు .
అంకుల్ .........
మళ్లీ ........
లేదు లేదు అని అందరమూ కలిసి కొన్ని నిమిషాల్లో మొత్తం శుభ్రం చేసి డస్ట్ బిన్స్ నింపేసి finshed అంటూ చేతులెత్తి కొట్టుకుని గుడ్ నైట్ చెప్పుకుని , బాబు మహేష్ ఉదయం వరకూ ఈ లైటింగ్స్ అలాగే ఉండనీ ......... మన కృష్ణ - కృష్ణ ల సంతోషం లాగా వెలిగిపోతూనే ఉండాలి అనిచెప్పారు .
అలాగే అంకుల్ అని చెల్లీ కృష్ణగాడి చేతులను అందుకొని ఇల్లుమొత్తం పడేలా చివరి సెల్ఫీ తీసుకుని పైకి నడిచాము .
అన్నయ్యా ......... అక్కయ్య పుట్టినరోజును దీనికి 100 రెట్లుగా సెలబ్రేట్ చేసుకోవాలి మనం అని చెల్లి మాట్లాడుతోంటే ,
అప్పుడు గుర్తొచ్చాయి అంటీ చెప్పిన మాటలు " ఏది జరిగినా అంతా మన మంచికేనని " నిజమే చెల్లిచెప్పినట్లుగా సంబరం జరుపుకోవాలంటే చాలా డబ్బులు అవసరం . అక్కయ్యను నేలమీద పాదం ఉంచకుండా ప్రాణంలా చూసుకోవాలంటే హృదయాంలో అంతులేని ప్రేమతోపాటు జేబులో డబ్బుకూడా ఉండాలి . Yes yes ............ అక్కయ్యను చేరుకునేలోపు అక్కయ్య కోరిక ప్రకారం గొప్పస్తాయికి చేరుకోవాలి . అక్కయ్యను ........ సునీతక్కయ్యకు ఒక బాబు కాబట్టి అక్కయ్యకు కూడా పిల్లలు ఉంటారు వారిని కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి అని ఆలోచిస్తున్నాను .
అన్నయ్యా , అన్నయ్యా ........ అక్కయ్య గురించి మాట్లాడుతోంటే ఏమిటి ఆలోచిస్తున్నారు , ఎవరి గురించి ఆలోచిస్తున్నారు .
మన అక్కయ్య గురించే చెల్లీ ......... అని గుండెలపై హత్తుకొని నుదుటిపై ప్రాణం లా ముద్దుపెట్టి , మీ అక్కయ్య పుట్టినరోజు నువ్వు కోరినట్లుగా జరపాలంటే మన అక్కయ్య కోరినట్లుగా మనం చాలా సాధించాలి చెల్లీ ..........
అలాగే అన్నయ్యా ............ మన అక్కయ్య గర్వపడేలా కష్టపడదాము అని ఇంట్లోకివెళ్లి ముగ్గురమూ సంతోషంతో హత్తుకొని గుడ్ నైట్ చెప్పేసి చెల్లీ రేపు ఆదివారం మధ్యాహ్నం వరకూ లేచేది లేదు మీ అక్కయ్యకోసం సాయంత్రం వెళదాము అనిచెప్పాను .
సరే అన్నయ్యా ......... గుడ్ నైట్ అని చెబుతుండగానే వాడు అమాంతం ఎత్తుకుని బుగ్గపై ముద్దుపెడుతూ బెడ్రూం లోకి వెళ్ళిపోయాడు .
రేయ్ ........ కాస్త ఆగు అక్కయ్య డ్రెస్ నలిగిపోతుంది అని దిగి వాడిని అటువైపు తిరగమనిచెప్పి నైట్ డ్రెస్ లోకి మారిపోయి , డ్రెస్ ను జాగ్రత్తగా మడిచేసి వాడి గుండెలపై వాలిపోయింది .
లవ్ యు both అని కూలర్ on చేసుకుని అక్కయ్యల ఫోటో అందుకొని బెడ్ పై వాలిపోయి అక్కతో మాట్లాడుతూ మా మధ్య జరిగిన చిలిపి సంఘటనలను గుర్తుచేసుకుంటూ తియ్యని జలదరింపులతో పెదాలపై చిరునవ్వుతో ఫోటోని గుండెలపై ఉంచుకుని హాయిగా నిద్రలోకిజారుకున్నాను.
తరువాతి రోజు నేను లేచేసరికి 12 గంటలు అయ్యింది . చెల్లి నా ప్రక్కనే కూర్చుని నా కురులను స్పృశిస్తూ చదువుతోంది .
గుడ్ మార్నింగ్ .......... కాదు కాదు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్యా అని , అన్నయ్యా ......... కాఫీ వేడిచేసుకొస్తాను అని లేచి వంట గదిలోకివెళ్లింది .
ఒళ్ళు విరుస్తూ లేచి కూర్చున్నాను . ఎదురుగా కార్తీక ముసిముసినవ్వులతో అన్నయ్యా ........ గుడ్ mor........ కాదు కాదు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పింది .
కార్తీక మీ అక్కయ్య ఎప్పుడు లేచింది అని కళ్ళు నలుపుకుంటూ అడిగాను .
ఉదయం 6 గంటలకే .........
కార్తీక ......... అంటూ ఆపడానికి బయటకువచ్చింది .
అంతలోపే , అక్కయ్య 6 గంటలకే లేచి రోజూలానే అక్కయ్యకోసం వెళ్లి 9 గంటలకు వచ్చారు ఇద్దరూ , మీకోసం టిఫిన్ కూడా చెయ్యకుండా చదువుకుంటూ మిమ్మల్ని జోకొడుతున్నారు మీరేమో బుజ్జిపిల్లాడిలా హాయిగా నిద్రపోతున్నారు .
అన్నయ్యా .......... అక్కడ రెండు ఊళ్లకు మీరు బుజ్జి దేవుడు అంట కదా ........ అని సంతోషంతో నవ్వుతోంది .
అవును కార్తీక .......... అక్కయ్యతో ఉంటేనే నాకు ఆ స్థానం లేకపోతే సున్నా ........ , నా జీవితమే వ్యర్థం అని బాధపడుతోంటే ,
చెల్లి పరుగునవచ్చి మోకాళ్లపై కూర్చుని తన గుండెలపై హత్తుకుంది .
అక్కయ్యా ......... నావల్లనే అని కార్తీక కళ్ళల్లో నీళ్ళు చూసి , వెంటనే నా కన్నీళ్లను తుడుచుకుని , చెల్లెమ్మా కాఫీ అని అడిగాను .
కార్తీక కన్నీళ్లను తుడిచి తలపై ప్రేమతో ముద్దుపెట్టి , కార్తీక మీ అన్నయ్యకు నీచేతులతోనే అందివ్వు అని కాఫీ ఇచ్చింది .
అన్నయ్యా .......... అని బాధపడుతూనే అందించింది .
లవ్ యు కార్తీక , అక్కయ్య గురించి ఆలోచన వస్తేనే ఎమోషనల్ అయిపోతాను నీకు తెలుసుకదా అని నవ్వించి చదువుకోమని చెప్పి , కాఫీ తాగుతూ బయటకువచ్చాను.
కృష్ణగాడు , గోపి అన్న decoration మొత్తం వేరుచేసి రెంట్ కు తీసుకున్నవాటిని వెహికల్లోకి చేరుస్తున్నారు . కాఫీ తాగేసి నేనూ ఒకచెయ్యి వెయ్యబోతే ,
మహేష్ .......... మేము చూసుకుంటాము నువ్వు ఫ్రెష్ అవ్వు అనిచెప్పారు .
అవునురా మామా ......... అని కృష్ణగాడూ చెప్పాడు .
గోపి అన్నా ......... నిన్న రాలేదు .........
Sorry తమ్ముడూ ....... ఉదయం పనిమీద కరీంనగర్ వెళ్ళానా , వెహికల్ హ్యాండ్ ఇచ్చేసింది . ఇక్కడేమో మీ వదిన పిల్లలు రెడీ కూడా అయిపోయారు అని బాధతో చెప్పాడు .
సరే అన్నా ........ త్వరలో మళ్లీ కలుద్దాము అయితే అని వెహికల్లోకి షిఫ్ట్ చేసి రేయ్ అక్కడ దించేసి డబ్బు ఇచ్చెయ్ అనిచెప్పాను . వాడు వెహికల్ వెనుకే బుల్లెట్ లో వెళ్ళాడు .
పైకివచ్చి ఫ్రెష్ అయ్యి , లవ్ యు soooo మచ్ చెల్లీ .......... మీ అక్కయ్య ఎక్కడా కనిపించలేదు కదూ ........ ఎందుకో మన అమ్మవారు మనకు కఠిన పరీక్షలు పెడుతున్నారు అని బెడ్ పై కూర్చుని ఆల్బమ్ తిరగేస్తున్నాను.
ఏమి బాదులివ్వాలో తెలియక చెల్లి మౌనంగా ఉండిపోయింది.
The following 20 users Like Mahesh.thehero's post:20 users Like Mahesh.thehero's post
• AB-the Unicorn, Fuckingroll69, Jack789, Joncena, Kumarmb, kummun, Mahe@5189, maheshvijay, Milffucker, Naagu nag, nkp929, RAANAA, Rajeev j, Sachin@10, sandycruz, Shaikhsabjan114, sisusilas1@, sri7869, SS.REDDY, sweetdumbu
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
ఉదయం సాయంత్రం అక్కయ్యను సిటీ నలుమూలలా గాలిస్తూ , పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ , చెల్లి రోజురోజుకీ తన ప్రిపరేషన్ పెంచుకుంటూ పోతూ , 24/7 అక్కయ్య గురించే ఆలోచనలతో రాత్రిళ్ళు అక్కయ్యతో రొమాంటిక్ ఊహాలతో రోజులు వేగంగా గడిచిపోయాయి . చెల్లి మెడికల్ ఎంట్రన్స్ exam date రానే వచ్చింది .
ఆరోజు ముగ్గురమూ రోజూలానే తెల్లవారకముందే లేచి తలస్నానం చేసి గుడికివెళ్లి అమ్మా చెల్లి బాగా ప్రిపేర్ అయ్యింది . ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి అని చెల్లిని ఒకదగ్గర కూర్చోబెట్టి ఇద్దరమూ మాత్రమే గుడిచుట్టూ ప్రదక్షణలు చేసాము.
అన్నయ్యా ........... ఆ అమ్మవారికి కాకా పట్టాల్సిన అవసరం లేదు . మీ చెల్లి గురించి నీకు తెలియదా అని నవ్వుతోంది .
దాని గురించి కాదు చెల్లెమ్మా ......... ఇంటి నుండి బయలుదేరి exam పూర్తయ్యి వచ్చేవరకూ ఎటువంటి అడ్డు కలగకూడదని అని రెండు నిమిషాలు చెల్లిప్రక్కనే కూర్చుని సంతోషంతో నవ్వేలా నవ్వించాము .
ఇంటికి చేరుకోగానే అంటీ ,చెల్లికోసం exam ముందు ఏమేమి తినాలో అన్నింటినీ రెడీ చేసి ఉంచింది .
అన్నయ్యా , రేయ్ ............ ఈరోజు మాత్రం మీరిద్దరూ కలిసి నాకు తినిపించండి అని కోరడంతో , నవ్వుకుని ఇద్దరమూ తినిపించాము . రోజూ అలవాటుపడింది కాబట్టి చెల్లికూడా మా నోటికి అందించి అయ్యో ......... అని సిగ్గుపడుతూనే తినిపించి తినింది .
పైకివెళ్లి హాల్ టికెట్ తోపాటు కావాల్సినవన్నీ తీసుకుని , అక్కయ్య ఫోటో ముందుకువెళ్లి గుండెలపై చేతులువేసుకుని , అక్కయ్యా ....... నేనెవరో మీకు తెలియకపోయినా , గొప్ప స్థానానికి చేరుకోవాలి అని అన్నయ్యకు ప్రాణంలా చెప్పినమాటనే మేము ముగ్గురమూ దైవంగా భావిస్తున్నాను . ఆది సాధించడానికి తొలి అడుగు వెయ్యబోతున్నాను మీ ఆశీర్వాదాలు మాతోనే ఉంటాయని మాకు తెలుసు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా అని ఫోటోపై ప్రాణంలా ముద్దుపెట్టింది.
లవ్ యు రా , లవ్ యు చెల్లీ ......... అని ఇద్దరమూ చెల్లి బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టాము .
Wow ......... నా ప్రాణానికి ప్రాణమైన ముగ్గురూ ఒకేసారి ముద్దులతో కొండంత శక్తిని ఇచ్చారు అక్కయ్యా వెళ్లిస్తాను అని మా ఇద్దరి భుజాలపై చేతులువేయడంతో కిందవరకూ చిరునవ్వులు చిందిస్తూనే కిందకు ఎత్తుకునివచ్చేసాము .
అధిచూసి అంటీ , కార్తీక సంతోషంతో చప్పట్లు కొట్టి చెల్లిని కౌగిలించుకుని all the best చెప్పారు .
థాంక్స్ అంటీ ,కార్తీక .........అంటీ అంకుల్ ఎక్కడ అని చెల్లి అడిగింది .
ఇదిగో వచ్చేసాను కృష్ణ .......... all the best నువ్వనుకున్నది సాధిస్తావు అని దీవించారు . బాబు మహేష్ exam సెంటర్ చేరుకోవడానికి గంట పడుతుంది . బైకులో వెళితే నీ ప్రాణమైన చెల్లి కళ్ళల్లో దుమ్ము ధూళి పడొచ్చు ఇదిగో కారులో వెళ్ళండి అని కీస్ అందించారు .
కృష్ణగాడివైపు చూసాను .......... సడెన్ గా తలదించుకోవడంతో నవ్వుకుని అంకుల్ మా ఇద్దరికీ కారు నడపడం రాదు.
Shit shit ......... ఇదంతా నాతప్పే ఇన్నిరోజులనుండీ ఒక్కసారీ ఈ ఐడియా రాలేదు. రేపటి నుండి చెల్లి results వచ్చేన్తవరకూ ఖాళీనే కదా సాయంత్రం రాగానే నేను మీ ఇద్దరికీ నేర్పిస్తాను మీరు కృష్ణవేనికి , కార్తీకకు నేర్పించండి . ఈరోజుకు నేనే స్వయంగా exam సెంటర్ కు వదిలివస్తాను అన్నారు .
లవ్ యు soooo మచ్ dad నేనుకూడా అక్కయ్యతోపాటు వస్తాను అని కార్తీక చెల్లి చెయ్యి అందుకొని కారు దగ్గరకు పిలుచుకునివెళ్తోంటే మావైపు చూసింది .
చిరునవ్వు నవ్వడంతో సంతోషంతో ఇద్దరూ వెనుక కూర్చున్నారు . కారు వెనుకే బుల్లెట్ లో ఇద్దరమూ బయలుదేరి exam సెంటర్ కు సరైన సమయంలో చేరుకున్నాము .
అప్పటికే అక్కడికి వందల్లో స్టూడెంట్స్ చేరుకుని తమ రూమ్ ఏదో చూసుకుని వేచి చూస్తున్నారు .
చెల్లి వాడితోపాటు వెళ్లి రూమ్ ఏదో తెలుసుకునివచ్చింది .
అక్కయ్యా ......... ప్రశాంతంగా కారులో కూర్చో అని కూర్చుని మీరు బాగా రాస్తారు మా అందరికీ తెలిసు అని ప్రేమతో హత్తుకొని బుగ్గపై ముద్దుపెట్టి నవ్వించింది .
10 నిమిషాల తరువాత బెల్ మ్రోగడంతో ఏమేమికావాలో అన్నీ ఉన్నాయో లేదో అందుకొని కారు దిగి అన్నయ్యా ....... అని గుండెలపై వాలింది .
All the best చెల్లీ ......... కూల్ గా రాసి వచ్చేయి అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాను .
తరువాత వాడిని గట్టిగా కౌగిలించుకుని వాడు all the బెస్ట్ చెప్పగానే పెదాలపై సడెన్ గా ముద్దుపెట్టేసి లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా , కార్తీక అని తియ్యని నవ్వుతో చెప్పి లోపలికి వెళ్ళింది .
వాడు సిగ్గుపడుతోంటే ఒక దెబ్బవేసి , రేయ్ మామా ......... నువ్వు ఇవ్వాల్సిన ముద్దు ఇవ్వకపోవడంతో పాపం చెల్లే తీసేసుకుంది అనిచెప్పాను .
రేయ్ మామా ......... ఈ విషయం ముందే చెప్పొచ్చు కదరా ,
అంకుల్ నవ్వుతోంటే , అన్నయ్యా .......... ఇలాంటివి కూడా ఎవరైనా చెబుతారా , మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి అని ముగ్గురమూ నవ్వుకున్నాము .
స్టూడెంట్స్ అందరూ లోపలివెళ్లాక అంకుల్ కార్తీకతోపాటు మీరు జాగ్రత్తగా ఇంటికివెళ్లండి , మేము ఇక్కడే ఉండి చెల్లిని పిలుచుకునివస్తాము అనిచెప్పాము .
మహేష్ ......... exam అయిపోయేది ఎప్పుడు అంతలోపు వచ్చేస్తాను అనిచెప్పారు.
పర్లేదు అంకుల్ ఇక ఫ్రీనే కదా బైకులో వచ్చేస్తాము లెండి అని ఒప్పించి లవ్ యు అంకుల్ మీకు రోజురోజుకీ ఋణపడిపోతున్నాము .
మహేష్ మళ్లీ స్టార్ట్ చేశావా ........ నేను హార్ట్ exam అయ్యి వచ్చేన్తవరకూ నీతో మాట్లాడాను అని కారు ఎక్కారు .
Dad ........... ఎలాగో అన్నయ్య ఇక్కడ ఉంటాడు అనేకదా అని నవ్వుకుని అన్నయ్యా ........ బై మీరు వచ్చేలోపు బిరియానీ చికెన్ ఫ్రై చేసి ఉంచుతాము అనిచెప్పింది కార్తీక .
అంతే నోరూరిపోవడం చూసి నవ్వుకుని వెళ్లిపోయారు .
సుమారు 3 గంటలపాటు అందరి స్టూడెంట్స్ పేరెంట్స్ తోపాటు మేముకూడా చెల్లి బాగా రాయాలని ఆశిస్తూ , ప్రార్థిస్తూ వేచి చూస్తున్నాము .
బెల్ కొట్టిన కొద్దిసేపటికి చెల్లి ఉత్సాహంతో బయటకు రావడం చూసి మామా - మామా అని సంతోషంతో కౌగిలించుకున్నాము .
రేయ్ , అన్నయ్యా ............ అని చిరునవ్వులు చిందిస్తూ వచ్చి కౌగిలించుకున్న ఇద్దరినీ హత్తుకుంది .
చెల్లెమ్మా , రేయ్ ......... ఇక ఇంటికి వెళదామా అక్కడ ఇంటిలో బిరియానీ రెడీ అయ్యి ఉంటుంది అని లొట్టలేస్తూ చెప్పాము .
రేయ్ , అన్నయ్యా .......... అని ఇద్దరినీ కొట్టి కనీసం ఎలా రాశావు రా అనికూడా అడగకుండా బిరియానీ గురించి ఆలోచిస్తున్నారు అని తనుకూడా లొట్టలేస్తూ లోలోపలే నవ్వుకుంటోంది .
ఇంత సంతోషాన్ని కూడా అడగాలా చెల్లీ , కృష్ణ అని ఇద్దరమూ అమాంతం పైకెత్తేసాము .
చుట్టూ అందరూ మా సంతోషాన్ని చూసి నవ్వుతూ వెళ్లిపోతున్నారు .
అన్నయ్యా ......... పదండి మరీ అని చెప్పడంతో , కృష్ణగాడు స్టార్ట్ చేయగానే చెల్లిని మధ్యలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ నవ్వుతూ ఇంటికి చేరుకున్నాము .
మాకోసం అంటీ , కార్తీక , అంకుల్ గేట్ దగ్గరే ఎదురుచూస్తూ మా సంతోషం చూసి , శ్రీమతి గారు నీ ప్రియమైన కూతురు డాక్టర్ కాబోతోంది అని సంతోషించి లోపలకు పిలుచుకొనివెళ్లారు .
బిరియానీ ఘుమఘుమలు తెలియగానే ఇద్దరమూ పరుగునవెళ్లి డైనింగ్ టేబుల్ లో కూర్చుని అంటీ ఆకలి అని దీనంగా ఆడిగాము .
అందరూ నవ్వుతూ చెల్లికి వడ్డించిన ప్లేట్ అందివ్వడంతో మాకు తినిపించి తరువాత అంటీతోపాటు చెల్లెళ్ళు తిన్నారు .
తరువాతి రోజు నుండి చెల్లి ఫ్రీ అవ్వడంతో అంటీకి సహాయం చేస్తూ , పార్ట్ టైం జాబ్ లలో ముగ్గురమూ కష్టపడ్డాము . అంకుల్ సాయంత్రం రాగానే మా అందరినీ కారులో ఎక్కించుకుని దగ్గరలోని గ్రౌండ్ కు తీసుకెళ్లి నేర్పించడం మొదలెట్టారు . సాయంత్రం క్రికెట్ ఆడుతుండటం చూసి నెక్స్ట్ ఆదివారం చెల్లీ గ్రౌండ్ కు వెళ్లిస్తాము జాగ్రత్త అని అంటీ కార్తీక దగ్గర వదిలాము .
ఆదివారం కాబట్టి గ్రౌండ్ మొత్తం నిండిపోయింది . నలువైపులా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఆడేస్తున్నారు .
క్రికెట్ పై మక్కువ వలన మా వయసున్న వాళ్లదగ్గరికివెళ్లి మేము ఆడుతాము చివరన బ్యాటింగ్ బౌలింగ్ ఇచ్చినా పర్లేదు అని ఆడిగాము .
Sorry బ్రో ......... పెద్ద బెట్టింగ్ ఆడుతున్నాము వేరే వీధివాళ్ళతో సో .......కుదరదు అనిచెప్పడంతో ,
ఆలాగేనని కాస్త తక్కువ వయసున్న వాళ్లదగ్గరికి వెళితే అదే సమాధానం ఇవ్వడం అలా వయసు తగ్గించుకుంటూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది . ఒక చివరన 10 9 ఏళ్ల చిన్నపిల్లలు ఆడుతుండటం చూసి వెళ్లి పిల్లలూ మేమూ మీతో ఆడొచ్చా మీకు 10 నిమిషాలకొకసారి ఐస్ క్రీమ్ కొనిస్తాము అందరికీ అని ఆడిగాము .
పై నుండి కిందవరకూ చూసి పిల్లలంతా గుమికూడి ఐస్ క్రీమ్ రా అంటూ లొట్టలేసుకుని , మీరు మాదగ్గరకు వచ్చారంటే క్రికెట్ ఆడటం రాదని అర్థమైంది , మిమ్మల్ని మా గ్రూప్ లో చేర్చుకుంటాము కానీ ఎలా ఆడాలో నేర్పిస్తాము అంతవరకూ మేము కొట్టిన బంతిని తీసుకురావాలి అదే ఫీల్డింగ్ మాత్రమే చెయ్యాలి అని ముద్దుముద్దుగా చెప్పారు .
మీరు ఒప్పుకున్నారు అదిచాలు మాకు అని ఐస్ క్రీమ్ బండిని పిలిచి అందరికీ కప్ ఐస్ క్రీమ్ కొనిచ్చాము .
Wow థాంక్స్ అన్నయ్యలూ ......... ఇంతకూ మీ పేర్లు అని అడగడంతో ఒకరినొకరము పరిచయం చేసుకున్నాము .
Ok ఇప్పుడు టీం సెలక్షన్ , రేయ్ మీ ప్రక్కన వాళ్లిద్దరూ బాగా ఆడతారు కాబట్టి ఆడటం రాని అన్నయ్యలను మీవైపే తీసుకోవాలి అనగానే , ఎలా కుదురుతుంది రా అని కాసేపు సీరియస్ ఫైటింగ్ తరువాత ఇద్దరమూ ఫీల్డింగ్ టీం వైపు సెలెక్ట్ చేసుకున్నారు .
ఫ్రెండ్స్ ........ మ్యాచ్ స్టార్ట్ చెయ్యబోయేముందు ఒక సెల్ఫీ అని చెప్పడంతో అందరూ చుట్టుచేరారు . కృష్ణగాడు సెల్ఫీ తీసి మన టీం రా అని చెల్లికి పంపించాడు .
లవ్లీ రా ........అని రిప్లై ఇచ్చింది .
ఫ్రెండ్స్ ......... ఒకరు లాంగ్ on మరొకరు లాంగ్ ఆఫ్ వెళ్ళండి అని చూపించారు .
రేయ్ మామా రేయ్ మామా ........ మనకు బ్యాటింగ్ రావాలంటే స్కోర్ ఎక్కువ ఉండాలి కాబట్టి అని ఒకేసారి ఇద్దరమూ నవ్వుకుని మావైపు వచ్చిన ప్రతీ బాల్ ను ఫోర్ పోయేలా మేమే తప్పులుచేస్తున్నాము .
ఫ్రెండ్స్ , ఫ్రెండ్స్ ......... స్కోర్ పెరిగిపోతోంది ఒక్క బాల్ అయినా పట్టుకోండి 10 రూపాయల బెట్ అని ఫోర్ వెళ్లిన ప్రతిసారీ అయ్యో అయ్యో అంటూ మమ్మల్ని ఫీల్డింగ్ నలువైపులా తిప్పేసారు .
ఒకవైపు పూర్తయ్యేసరికి బ్యాటింగ్ టీం 8 ఓవర్లకు 70 పరుగులు చేశారు . మా కెప్టెన్ రేయ్ ఇక మనం ఒడిపోయినట్లే 8 ఓవర్లకు 40 కూడా కొడతామో లేదోనని మావైపు కోపంతో చూసి బెట్ ను ముందే ఇచ్చేసాడు .
అవతలివైపు ఇద్దరు పిల్లలు బౌలింగ్ సూపర్ గా వేస్తుండటంతో 4 ఓవర్లకు 20 రన్స్ చేసి అన్ని వికెట్స్ పడగొట్టేశారు . ఇక 4 ఓవర్లకు 51 కొట్టాల్సిన సమయంలో కృష్ణగాడు వెళ్ళాడు రన్నింగ్ వైపు . మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి చివరి బుజ్జి ఫ్రెండ్ కూడా ఔట్ అవ్వడంతో కృష్ణగాడు స్ట్రైకింగ్ వైపు నేను రన్నింగ్ వైపు నిలబడ్డాము .
రేయ్ కనీసం ప్రక్కన ఆడుతున్న అన్నయ్యల మ్యాచ్ అయినా చూద్దాము నెక్స్ట్ బంతికే బోల్డ్ అయిపోతాడు అని అందరూ అటువైపు తిరిగారు . ఫీల్డింగ్ టీం మొత్తం మాకు అతిదగ్గరలో వచ్చి రేయ్ కాస్త నెమ్మదిగా వెయ్యరా అని నవ్వుతున్నారు .
అప్పటికే 5 వికెట్లు తీసిన బౌలర్ కాస్త దగ్గరలోనే ఆగి బౌలింగ్ వేసాడు .
దాదాపు 9 సంవత్సరాల కసి అన్నట్లు బలమంతా ఉపయోగించి ఫ్రంట్ వెళ్లి షాట్ కొట్టాడు అంతే గ్రౌండ్ బయట రోడ్ కు అవతలివైపు పడింది .
బుజ్జి ఫ్రెండ్స్ అందరూ అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు . మా టీం mates ఔట్ అయిపోయారా నెక్స్ట్ మ్యాచ్ మాకీ అన్నయ్యలు వద్దు అని తిరిగి బాల్ కోసం రెండు పిచ్ ల అవతలివైపుకు పరుగుపెడుతున్న ఫీల్డర్ ను చూసి విషయం తెలుసుకుని నమ్మనట్లు నిలబడ్డారు .
నెక్స్ట్ బంతి మరొకవైపు అంతే దూరంలో వెళ్ళిపడింది .
మా బుజ్జి ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండిపోయారు . ఇద్దరమూ కలిసి మూడు ఓవర్లలోనే మ్యాచ్ పూర్తిచేసేసాము .
రేయ్ గెలిచేసాము అంటూ మా కెప్టెన్ పరుగునివెళ్లి బెట్టింగ్ డబ్బులు తీసుకొచ్చి sorry అన్నయ్యలూ ........
ఫ్రెండ్స్ అన్నారు .
Sorry ఫ్రెండ్స్ ........... అని తలదించుకున్నారు .
మాకు బ్యాటింగ్ ఇచ్చినందుకు మేమే మీకు థాంక్స్ చెప్పాలి అని రెండు టీమ్స్ ను పిలిచి మళ్లీ అందరికీ ఐస్ క్రీమ్స్ ఇప్పించి , అయిపోతే మళ్లీ తెప్పించండి అని అతనికి చెప్పాము .
థాంక్స్ అన్నయ్యా ....... అని అందరూ మమ్మల్ని హత్తుకొని , ఫ్రెండ్స్ ........ ప్రతి వారమూ అదిగో అక్కడ ఆడుతున్న అన్నయ్యలు మేము ఆ పిచ్ పై ముందువచ్చినా పిల్లనాయల్లారా ......... వెళ్లి ఆ మూలన ఆదుకోండి . మీకు ఈ పిచ్ కావాలంటే మాతో బెట్ ఆడి గెలవాలి అప్పుడు మీ ఇష్టం అని తోసేశారు . ఇప్పుడు మీరున్నారు కదా వెళ్లి సవాల్ చేయమా ......... అని అడిగారు .
మీకు ఏది ఇష్టమో అధిచేయ్యండి మీవెనుక మా కెప్టెన్ చెప్పినట్లు వింటాము అనిచెప్పాము .
మా కెప్టెన్ వెళ్లి పిచ్ కోసం ఛాలెంజ్ విసిరారు .
బెట్ 200 అయితే రండి అని నవ్వుకుని పంపించారు .
కెప్టెన్ వచ్చి రేయ్ అందరి దగ్గర ఉన్న డబ్బంతా తియ్యండి అని రూపాయి రూపాయి తీసి 100 రూపాయలు సేకరించారు . ఇప్పుడెలా అని ఫీల్ అవుతోంటే నేను 50 , కృష్ణగాడు 50 కలిపాము .
యాహూ .......... థాంక్స్ అన్నయ్యలూ అని పరుగునవెళ్లి మ్యాచ్ సెట్ చేసుకునివచ్చాడు .
టాస్ వేసి ఓడిపోవడంతో ఫ్రెండ్స్ ......... బౌలింగ్ 10 ఓవర్ల మ్యాచ్ అంటూ వచ్చాడు.
కెప్టెన్ ఎక్కడ ఫీల్డింగ్ చెయ్యాలి ..........
ఫ్రెండ్స్ అప్పుడు తెలియదు కాబట్టి అలా ,
మేము మా కెప్టెన్ ఎలా చెబితే అలా టీం లో అందరమూ సమానమే ఆర్డర్వెయ్యండి అని చెప్పాము .
థాంక్స్ ఫ్రెండ్స్ అని ఒకరిని మిడ్ on మరొకరిని మిడ్ ఆఫ్ పంపించారు .
మొదటి 6 ఓవర్లు బుజ్జి ఫ్రెండ్స్ బౌలింగ్ వేసి స్కోర్ ఓవర్ ఓవర్ కు పెరుగుతోంటే ఎదురెదురుగా ఉన్న ఇద్దరమూ చప్పట్లు కొడుతూ ఏమ్ పర్లేదు ఏమ్ పర్లేదు అని ఉత్సాహపరిచాము .
ఫ్రెండ్స్ 6 ఓవర్లకు 70 రన్స్ ఒక్క వికెట్ కూడా లేదు ఇప్పుడెలా మీకు బౌలింగ్ కూడా వచ్చా అని బాల్ అందించాడు మా కెప్టెన్ , నాకంటే వాడే సీనియర్ అని కృష్ణగాడి చేతికి బాల్ అందించాను .
వాడు ఫీల్డింగ్ సెట్ చేసుకుని మొదటి బంతికే బోల్డ్ చేసేసాడు . బుజ్జి ఫ్రెండ్స్ లో ఉత్సాహం అంతా ఇంతా కాదు . నెక్స్ట్ నెక్స్ట్ హ్యాట్రిక్ తీసేసాడు . పిల్లలు ఏకంగా చిందులు వేసేశారు . నెక్స్ట్ ఓవర్ నాకు అందించడంతో మరొక రెండు వికెట్స్ పడ్డాయి . మిగతా 4 ఓవర్లకు 15 రన్స్ మాత్రమే కొట్టి 8 వికెట్స్ కోల్పోయారు .
పిల్లలందరికీ మళ్లీ ఐస్ క్రీమ్స్ మరియు వాటర్ తెప్పించాము . ఫ్రెండ్స్ మొదట మీరే ఆడండి అని ఏ బ్యాట్ కావాలో అన్నింటినీ చూపించారు .
నో నో కెప్టెన్ మీరు ఆడండి మిగిలిన కొద్దిపరుగులు మాకు ఇవ్వండి అని బదులివ్వడంతో ,
థాంక్స్ చెప్పేసి బాగా ఆడే ఇద్దరిని మొదట పంపించాడు .
Same 6 ఓవర్లకు 32 రన్స్ కొట్టి 4 వికెట్స్ కోల్పోయారు . ఫ్రెండ్స్ 4 ఓవర్లకు చాలా రన్స్ కొట్టాలి మాకు బ్యాటింగ్ రాకపోయినా పర్లేదు పిచ్ మన సొంతం కావాలి please please అని బ్రతిమాలడంతో వెళ్లి 3.5 ఓవర్లలో ఫినిష్ చేసేసాము .
యే యే యే ........... అని పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని చుట్టేసి కెప్టెన్ దగ్గరకువెళ్లి రేపటి ఆదివారం నుండి పిచ్ మాది అని కాలరేగరేసి చెప్పి బెట్ తీసుకొచ్చి అందరికీ పనిచేశారు .
ఫ్రెండ్ ......... నాకైతే సంతోషం లేదు అని ఒక బుజ్జి ఫ్రెండ్ అన్నాడు .
ఎందుకురా ........ మనం గెలిచాము కదా.......
రేయ్ అదిగో గ్రౌండ్ మధ్యలోనున్న పిచ్ మన సొంతమవ్వాలి , మనల్ని ఎన్నిసార్లు వాళ్ళ టీమ్ లో పిలుచుకుంటామని ఆ పిచ్ పై ఆడనిస్తామని ఉదయం నుండీ సాయంత్రం వరకూ ఎండలో ఫీల్డింగ్ చేయించి కనీసం పిచ్ పై అడుగుకూడా పెట్టనివ్వలేదు అని అందరిలో ఉద్రేకాన్ని రగిలించేశాడు .
అవును ఫ్రెండ్ మాకు ఐస్ క్రీమ్ వద్దు ఏమీ వద్దు మాకు ఆ పిచ్ ను గిఫ్ట్ గా ఇస్తారా అని అడిగారు .
అంతలోనే ఒకడు రేయ్ అక్కడిదాకా పెద్ద బెట్ లేకుండా వెళ్లలేము . వాళ్ళు వేలల్లో ఆడతారు . వాళ్ళ ఈగో బయటకు తీస్తే బెట్ లేకుండానే పిచ్ బెట్ వేసి ఆడొచ్చు నాతో ఒక ఉపాయం ఉంది అని మా కెప్టెన్ ఇప్పుడు గెలిచిన వయసు వాళ్ళ కంటే కాస్త పెద్ద వయసున్న వాళ్ళతో 500 హండ్రెడ్ బెట్ కాసి వచ్చాడు . ఫ్రెండ్స్ మనది బ్యాటింగ్ ఓపెనింగ్ ఇద్దరిలో ఒకరు వెళుతున్నారు ఇది కెప్టెన్ గా నా ఆర్డర్ ఈ మ్యాచ్ గెలిచామంటే , మనమంటే ఏంటో తెలుస్తుంది .
రేయ్ మామా నువ్వేళ్ళు ఓపెనింగ్ నేను అంతవరకూ పెద్ద పిచ్ లో వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూస్తాను అన్నాడు .
OK అని కెప్టెన్ తోపాటు ఓపెనింగ్ వెళ్ళాను. వికెట్ పడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అవతలివైపు వికెట్స్ పడుతున్నా సిక్స్ లు ఫోర్లతో 5 ఓవర్లకు 50 కొట్టాము . ఇక నెక్స్ట్ కృష్ణగాడు వచ్చాడు . ఇద్దరమూ కలిసి10 ఓవర్లకు 130 కొట్టాము .
బౌలింగ్ బాధ్యతలు కూడా మాకే ఇవ్వడంతో 9 ఓవర్లలో 88 పరుగులు అల్ ఔట్ అయిపోయారు .
రేయ్ పిల్లకాయలతో ఒడిపోయామురా ....... 500 బెట్ రా .........
అంటే ఆ పిల్లలతో 1000 రూపాయలు ఉందా అని పెద్ద పిచ్ వాడు ఫీల్డింగ్ చేస్తూ విని పరుగునవెళ్లి రేయ్ మామా 10 బీర్లు సులభంగా గెలిచే అవకాశం రా ఆ పిల్లనాయాళ్లతో 1000 రూపాయలు ఉన్నాయిరా ...........అని చెప్పాడు .
మా కెప్టెన్ ప్లాన్ అమలుచెయ్యకుండానే ఆ కెప్టెన్ వచ్చి ఈ వేస్ట్ నాయాళ్లతో రెండు మ్యాచ్ లు గెలవడం కాదు మాతో ఆది గెలవండి 1000 కి రెండు వేలు ఇస్తాము అన్నారు .
మాకు డబ్బు అవసరం లేదు ........... మీరు గెలిస్తే 1000 రూపాయలు మరియు ప్రతీవారం మీరు ఇక్కడ ఫీల్డింగ్ చేయమంటే అక్కడ చేస్తాము . కూల్ వాటర్ తెచ్చిస్తాము . మీ బ్యాట్లు పట్టుకుని సాయంత్రం వరకూ కూర్చుంటాము . కానీ ఒకవేళ మేము గెలిస్తే ఎటువంటి డబ్బు ఇవ్వనక్కరలేదు మేము గ్రౌండ్ లోకి అడుగుపెట్టగానే పిచ్ మాకు సొంతం చేసి వెళ్లిపోవాలి . మేము వచ్చేన్తవరకూ మీరు ముందుగానే వచ్చి ఎవ్వరూ ఆడకుండా రెడీ చేసి ఉంచాలి . మేము మీతో మ్యాచ్ కు రెడీ అని పిచ్ పై 1000 రూపాయలు ఉంచి వచ్చేశాడు మా కెప్టెన్ .
డన్ అని బదులిచ్చాడు . మిమ్మల్ని మేము నమ్మము గ్రౌండ్ లో ఉన్న అందరినీ పిలిచి మన బెట్ సంగతి వివరించండి అని సవాల్ విసరడంతో అలాగే చేసాడు వాళ్ళ కెప్టెన్. ఇదేదో ఇంటరెస్ట్ గా ఉందని గ్రౌండ్ లోనివారంతా మా మ్యాచ్ చూడటానికి ఉత్సాహం చూపించారు.
ఇంతలో చెల్లెమ్మ కాల్ ......... రేయ్ రెండు గంటలు అయ్యింది . లంచ్ కు రారా ....... గ్రౌండ్ లోనే ఉండిపోతారా .........
సమయం చూసి పిల్లలూ ఫ్రెండ్స్ మీకు ఆకలి వెయ్యడం లేదా అని అడిగాడు .
మాకు ఆ పిచ్ లంచ్ కావాలి ఇంకేమీ వద్దు .
రేయ్ ఎవర్రా ..........
చెల్లికి ఉదయం నుండీ జరిగినది వివరించాడు .
OK నాకు ఏమిచెయ్యాలో తెలుసు ఎంజాయ్ the గేమ్ అని , ఎలాగైనా పిల్లలకు పిచ్ కానుకు ఇవ్వాలి అని నాతోకూడా మాట్లాడింది.
రేయ్ మామా.......... వాళ్ళ క్రికెట్ చూసి గెలవడం చాలా కష్టమే అనుకున్నాను . కానీ పిల్లలు డబ్బువద్దు అని ఇప్పుడు నీ చెల్లిదాకా వెళ్ళిపోయింది కాబట్టి గెలవాల్సిందే రా లేకపోతే రాత్రికి నాకు ముద్దులు ఉండవురా .......... అని చెవిలో గుసగుసలాడాడు .
నవ్వుకుని మన కెప్టెన్ ఉండగా మనకెందుకురా భయం ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడదాము , ఎన్ని రన్స్ కొట్టమంటే అన్ని కొడదాము అని అందరమూ కెప్టెన్ చుట్టూ చేరాము .
ఫ్రెండ్స్ నాకు భయమేస్తోంది . ఎందుకు కెప్టెన్ ఇదికూడా ఇప్పుడు రెండు మ్యాచ్లలో ఒకటి అనుకోండి . వాళ్ళల్లో కొన్ని మైనస్ లు గమనించాను . చాలామందికి కోపం ఎక్కువ . అలాంటప్పుడు మనం ఏమిచెయ్యాలో తెలుసా ........
వాళ్ళు మరింత కోప్పడేలా చెయ్యాలి .......... మీరు వాళ్ళ వికెట్ పడిన ప్రతిసారీ , మనం ఫోర్ కొట్టినా ప్రతిసారీ ఓవర్ యాక్టింగ్ రెస్పాన్స్ ఇవ్వండి ఇక తరువాత జరుగబోయేది చూడండి . కెప్టెన్ మీరు రెడీ కదా వెళ్లి టాస్ వేసి రండి అని చప్పట్లతో పంపించాము .
ఫ్రెండ్స్ టాస్ ఓడిపోయాను sorry మనది ఫీల్డింగ్ ..........
రేయ్ మొదటి మ్యాచ్ గుర్తుచేసుకోండి గెలుపు మనదే అని బుజ్జి ఫ్రెండ్స్ మా చేతులు అందుకొని గుమికూడి పిచ్ మనది అని గ్రౌండ్ మొత్తం వినిపించేలా కేకలు వేశాము .
వాళ్ళ కెప్టెన్ అందరినీ రమ్మని పిలిచాడు . రేయ్ మామా పిల్లకాయలు రా ఇంతే అని వేలితో సైగచేసి నవ్వుకుని గర్వానికి పోయారు .
సరేరా అని నవ్వుకుని కెప్టెన్ స్వయంగా ఓపెనింగ్ వచ్చాడు .
రేయ్ మామా ........ అంటూ వాడి మైనస్ లు చెప్పి , తొలి ఓవర్లోనే వాళ్ళ కెప్టెన్ ను ఫసక్ చేసామంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని పిచ్ లో కలిపేయ్యొచ్చు అని బంతిని అందించాడు .
వాడు చెప్పినట్లుగా ఫీల్డింగ్ సెట్ చేసాను . తొలి బాల్ కే చాలా ఫ్రంట్ వచ్చి సిక్స్ కొట్టాడు .
పిల్లలంతా నిరాశతో కృష్ణగాడు మాత్రం గుడ్ రా మామా అని కృష్ణగాడు కీపింగ్ వచ్చాడు . నెక్స్ట్ సమ్మె బాల్ కాస్త స్లో వెయ్యగానే ఫ్రంట్ రావడం బాల్ మిస్ అవ్వడం కృష్ణగాడు పెదాలపై చిరునవ్వుతో బైల్స్ అంతెత్తుకు ఎగిరిపడేలా స్టంప్ చేసి how is that అని లెగ్ అంపైర్ వైపు అడిగాడు . ఔట్ అని వేలు చూపించగానే గ్రౌండ్ మొత్తం షాక్ రేయ్ మన సెహ్వాగ్ నే ఔట్ చేసేసారు అదికూడా రెండో బంతికే ........ ఇక మా బుజ్జి ఫ్రెండ్స్ అయితే అంతులేని ఉత్సాహంతో ఎగిరెగిరి చేతులు కొట్టుకుని థాంక్స్ అన్నయ్యా , sorry ఫ్రెండ్ ఇక మీరు ఫోర్ ఇచ్చినా సిక్స్ ఇచ్చినా ఇదిగో ఇందుకోసమేనని అర్థమై అయ్యింది అని ఎంజాయ్ చేశారు .
అందరూ బ్యాటింగ్ టీం వైపు తిరిగి పిచ్ మాది , ఇప్పటికైనా సీరియస్ గా ఆడండి మేము పిల్లలము కాదు పిడుగులం మా శక్తి ఇదిగో అని నలుగురు ఫ్రెండ్స్ మా చేతి కండలను చూపించి వ్రేలాడారు .
నెక్స్ట్ batsman మేము అనుకున్నట్లుగానే కోపంతో వచ్చాడు .
కృష్ణగాడు ......... ఎలావెయ్యాలో చెవిలో చెప్పి అందుకు ఆపోజిట్ గా సైగలు చేసాడు.
వాడు చూసి నవ్వుకుని నెక్స్ట్ బంతికే పాయింట్ లో ఉన్న మా కెప్టెన్ కు క్యాచ్ ఇచ్చేసాడు . అద్భుతమైన డైవ్ తో క్యాచ్ పట్టేసాడు .
అందరూ వెళ్లి మా కెప్టెన్ ను పైకెత్తేశారు. కిందకు దించి రేయ్ మీ నాన్నరా అనగానే భయంతో వెళ్లి నాన్న నాన్న తరువాత ఎలాగైనా కొట్టండి ఇదొక్క మ్యాచ్ అని చేతులుకట్టుకుని కళ్ళల్లో నీళ్లతో అడిగాడు .
ఫ్రెండ్ మ్యాచ్ ఆగుపోయింది . వాళ్ళ నాన్నకు క్రికెట్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు . వాడు డైవ్ వేసినప్పుడు చేతికి గాయం అయ్యిందికూడా ఇక అంతే అనేంతలో ........
అమాంతం ఎత్తుకుని ముద్దుపెట్టి , నువ్వు క్యాచ్ పట్టినప్పుడు గ్రౌండ్ మొత్తం అభినందించింది . నన్ను క్షమించు రాము ......... నీఇష్టాన్ని ఇన్నిరోజులూ అడ్డుపడుతూ వస్తున్నాను అని చేతితో మోచేతిపై గాయాన్ని తుడిచి కర్చీఫ్ తీసి కట్టు కట్టి వేళకు వెళ్లి హ్యాపీగా ఆడు నేనుకూడా చూస్తాను అని నుదుటిపై ముద్దుపెట్టాడు.
రేయ్ మామా ......... గెలుపు మనదే అని వాళ్ళు ఎగురుతోంటే , ఇలా గెలిచేవాళ్లను ఏమంటారో నాకు తెలియదు . అన్నయ్యలూ మీకేమయినా తెలుసా అని గ్రౌండ్ చుట్టూ ఆసక్తితో తిలకిస్తున్న అందరినీ గట్టిగా అడిగాడు .
ఒక్కొక్కరూ ఒక్కొక్క సమాధానం ఇస్తూ నవ్వుతూ కేరింతలు వేస్తూ మాకు చప్పట్లతో సపోర్ట్ ఇచ్చారు . అందులో మా కెప్టెన్ నాన్నగారు కూడా ఉండటం చూసి తన ఆనందానికి అవధులు లేవు .
అన్నయ్యా ...........నెక్స్ట్ ఓవర్ నేను వెయ్యనా అని అడిగారు .
నువ్వు మా కెప్టెన్ నీ ఇష్టం , నీకిష్టమొచ్చినట్లుగా ఫీల్డింగ్ సెట్ చేసుకో అని నెక్స్ట్ ఎవరొచ్చారో చూసి వాడిలో కోపాన్ని మరింత పెంచేలా చేసి అందరమూ నవ్వుకుని , కృష్ణగాడు ఎలా వెయ్యాలో చెప్పాడు .
మొదటి బాల్ ఫోర్ , రెండో బాల్ సిక్స్ ఇచ్చాడు .
ఏమీ పర్లేదు కెప్టెన్ you can do it .......... మీ నాన్న చూస్తున్నారని కాదు . మీ టీం గెలుపు కోసం పిచ్ కోసం వెయ్యమని ఎలా వెయ్యాలో చెప్పి రేయ్ మామా లాంగ్ on అని వాడు మిడ్ ఆఫ్ వెళ్ళాడు .
కృష్ణగాడు దూరం నుండి సైగ చేయగానే కెప్టెన్ రైట్ రైట్ సైడ్ అని batsman కు వినపడేలా అరిచాను . వాడు కృష్ణగాడు చెప్పినట్లుగానే లెగ్ సైడ్ కదులుతుంటే ఆఫ్ సైడ్ వైడ్ గా బంతిని విసిరాడు . వొంగి బలమంతా తీసుకుని కొట్టాడు . మిడ్ ఆఫ్ లో కృష్ణగాడు ఎగిరి పట్టుకుని కెప్టెన్ ......... అంటూ పరుగునవచ్చి అమాంతం పైకెత్తేశాడు . గ్రౌండ్ మొత్తం వాళ్ళ నాన్నతోపాటు సంతోషంతో కేరింతలు వేస్తున్నారు .
నెక్స్ట్ కూడా కృష్ణగాడు చెప్పినట్లే వేయడంతో ఏకంగా మిడిల్ వికెట్ బౌల్డ్ అయిపోయాడు .
అలా వాళ్ళ వీక్ నెస్ మీద దెబ్బకొడుతూ పిల్లలతోపాటు డైవ్ ల మీద డైవ్ లు వేస్తూ 10 ఓవర్లకు కేవలం 60 రన్స్ మాత్రమే ఇచ్చి 7 వికెట్స్ పడగొట్టడం అందరికీ నిజంగా షాక్ .......... ఓవర్లు అప్పుడే అయిపోయాయా అని బ్యాటింగ్ వాళ్ళు కూడా షాక్ చెందారు .
మధ్యాహ్నం భోజనానికి రాలేదని ప్రతి పిల్లాడి తండ్రి కోపంతో వచ్చి వాళ్ళ పిల్లల టాలెంట్ ను మరియు పెద్దపెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తుండటం చూసి ఆనందబాస్పాలతో కూల్ అయిపోయి సపోర్ట్ చేస్తున్నట్లు ఒకవైపు అయిపోయాక తెలిసింది .
పిల్లలు భయం భయంగా ......... వాళ్ళ పేరెంట్ దగ్గరికి వెళ్లారు .
లవ్ యు కన్నా , బుజ్జి అంటూ ఎత్తుకుని ముద్దుచేయ్యడంతో వాళ్ళ ఆనందానికి అంతేలేకుండా పోయింది .
ఒక దగ్గర అంకుల్ కారు కనిపించడంతో వెళితే కారులోనుండే సూపర్ అన్నయ్యా ......... పిల్లలతో wow అని చెల్లెళ్ళిద్దరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు . అంకుల్ అని పిలవడంతో చప్పట్లు కొడుతూ వచ్చారు . మీరు బాగా ఆడతారని , కృష్ణ కూడా చూడాలని కోరడంతో వచ్చేసాము . మీకు మరియు పిల్లలకు ఎనర్జీ ఫుడ్ , ఫ్రూట్ డ్రింక్స్ , కూల్ డ్రింక్స్ తెచ్చేసాము అని కారు వెనుక నిండిపోయిన బాక్స్ లను చూపించారు .
హలో my dear ఫ్రెండ్స్ అని పిలిచాము . వాళ్ళ పేరెంట్స్ తో వచ్చారు . సమయం లేకపోవడంతో చకచకా వడ్డించి అందరికీ అందించాము .
థాంక్స్ అన్న......... ఫ్రెండ్స్ అని ఆకలితో ఉన్నట్లు ఒకటా రెండా ఏకంగా నాల్గవ మ్యాచ్ .......... కుమ్మేసి ఫ్రూట్ జ్యూస్ తాగి ఒక్కొక్క కూల్ డ్రింక్ చేతిలో పట్టుకున్నారు .
బాబు ......... మీరెవరో తెలియదు చాలా చాలా థాంక్స్ చెప్పారు .
చెల్లెళ్ళూ ఎండ ఎక్కువగా ఉంది కారులోనుండే చూడండి అని మేము కూర్చునే ప్రక్కనే కారుని పార్క్ చేశారు అంకుల్ .
రేయ్ మామా తక్కువ స్కోర్ కానీ బౌలింగ్ బాగుంది .
The following 22 users Like Mahesh.thehero's post:22 users Like Mahesh.thehero's post
• 9652138080, AB-the Unicorn, Bangaru, Fuckingroll69, Jack789, Joncena, Kumarmb, kummun, Mahe@5189, maheshvijay, Milffucker, Naagu nag, nkp929, RAANAA, Rajeev j, Sachin@10, sandycruz, Shaikhsabjan114, sisusilas1@, sri7869, SS.REDDY, sweetdumbu
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
రేయ్ మామా ఎంత బాగున్నా కానీ పిల్లల పేరెంట్స్ కోసమైనా సగం స్కోర్ పిల్లల చేతనే కొట్టించాలిరా , బాల్ to బాల్ .......... వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపి సింగిల్స్ మాత్రమే కాదు ఫోర్స్ కూడా కొట్టించాలిరా ముందు నువ్వు కెప్టెన్ వెళ్ళండి అని డిస్కస్ చేసుకున్నాము .
న్యూ చెల్లి వచ్చింది కదరా తను ఫ్లైయింగ్ కిస్ ఇచ్చినందంటే నన్ను ఎవ్వరూ ఆపలేరు, నేను కూడా ఆపను కానీ వెళ్లరా వెళ్లు అని గుర్తుండేలా వీపుపై దెబ్బ వేసాను .
ఫస్ట్ బాల్ సింగిల్ తీసి కెప్టెన్ కు స్ట్రైక్ ఇచ్చాడు . రెండు బాల్స్ డాట్ అయ్యాయి . కెప్టెన్ ఇప్పుడు మాత్రం మీ నాన్న కోసం మీ నాన్న గర్వపడేలా మీ నాన్న పెదాలపై చిరునవ్వు చిగురించాలి అని హైఫై కొట్టగానే , ఉత్సాహంతో వెళ్లి నెక్స్ట్ బాల్ ఏకాగ్రతతో ఫోర్ కొట్టాడు . అందరూ సంతోషంతో కెప్టెన్ కెప్టెన్ అని కేరింతలు వేస్తుంటే, పరుగునవెళ్లి కృష్ణ గాడిని హత్తుకొని లైవ్ యు ఫ్రెండ్ అని మరొక 5 రన్స్ చేసి ఔట్ అయ్యాడు .
ఏమాత్రం ఫీల్ అవ్వక రేయ్ అన్నయ్య చెప్పినట్లు ఆడి మీనాన్న పెదాలపై మా నాన్నలానే చిరునవ్వు చిగురించాలి అని ఛాతీ ఛాతీ కొట్టుకున్నారు .
కెప్టెన్ బాగా ఆడావు అని అందరూ కౌగిలించుకొన్నారు .
అలా ఒక్కొక్కరితో కానీసమొక ఫోర్ అయినా కొట్టించి కానీ కృష్ణగాడు పంపించడం లేదు . వాడు సింగిల్స్ తీసి బుజ్జి ఫ్రెండ్స్ కు స్ట్రైక్ ఇస్తున్నాడు . బాల్స్ మింగినా పర్లేదు అని ఉత్సాహం నింపుతున్నాడు .
చివరగా నాలుగు బంతులకు 13 రన్స్ అవసరం లా స్కోర్ కార్డ్ మారిపోయింది . నెక్స్ట్ బంతికి 9 వ వికెట్ కూడా పడిపోయింది . వాళ్ళు ఎంజాయ్ చేస్తుండటం మా కెప్టెన్ టెన్షన్ పడటం చూసి , కెప్టెన్ కూల్ అని కురులను స్పృశించి వెళ్ళాను .
అక్కడ స్ట్రైక్ నాదంటే నాదని మా ఇద్దరికీ గొడవ ఎవడికి వదిలితే వాడు ఫినిష్ చేస్తాడని ............
మేము బ్యాట్లు ఎత్తిమరీ కొట్లాడుకోవడం చూసి చెల్లెళ్ళు నవ్వుతూ మిగతావాళ్ళంతా కంగారుపడుతున్నారు .
అంపైర్స్ జోక్యం చేసుకుని స్ట్రైక్ నాకు ఇప్పించారు .
విజయపు సంబరాలను చూపించి వాడి ముందు డాన్స్ చేసాను . రేయ్ మామా ....... నీ చెల్లి చూస్తోందిరా ......... కనీసం ఒక్క బాల్ ఇవ్వరా , చూశావు కదా పిల్లల కోసం అని ఒక్క ఫోర్ కూ కొట్టలేదు .
అయితే కాళ్ళు మొక్కరా ......... ఆలోచిస్తాను అని చెప్పాను .
అరే మామా ........నీకు కాకపోతే ఇంకెవరికి మొక్కుతానురా అని తాకాడు .
తథాస్తు అని దీవించి హత్తుకొని మొదటి బాల్ ను సునాయాసంగా సిక్స్ కొట్టాను . పిల్లలు అందరూ ఉత్సాహంగా ఎంజాయ్ చేశారు . నెక్స్ట్ బాల్ సింగిల్ తీసాను .
లవ్ యు రామమా ......... అంటూ కారులో ఉన్న చెల్లికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు . వాళ్ళు 11 మంది డిస్కస్ చేసుకుని బౌలింగ్ వేశారు . వాడికి చెల్లి అందించబోయే ముద్దు బాల్ తప్ప ఏమీకనిపించనట్లు జైల్ కూడు గుర్తుకుతెచ్చుకుని ఊపాడు . ఆ బాల్ ఇక మళ్లీ తిరిగిరాలేదు ఎక్కడో గ్రౌండ్ బయట ముళ్ళకంపల్లో పడింది . వాళ్ళు అంతా తలలు పట్టుకుంటే , పిల్లలు పరుగున వచ్చి ఈరోజు నుండి పిచ్ మాది అని అంతులేని ఆనందంతో డాన్సులతో ఎగిరి గెంతులు వేశారు .
వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఆనందాన్ని పంచుకున్నారు . అంకుల్ కారుని మా దగ్గరకు తీసుకొచ్చారు .
చెల్లి దిగి పరుగునవచ్చి రేయ్ పాపం నీ శక్తినంతా ఆ బంతిపై చూపించాలా , నాకు తెలియదా అని గుండెలపై కొట్టి ప్రేమతో హత్తుకొని గుండెలపై గట్టిగా ముద్దుపెట్టింది.
ఈ ముద్దుకోసం ఏమైనా చేస్తాను డార్లింగ్ అని నుదుటిపై ముద్దుపెట్టి , పిల్లల సంతోషాన్ని వీక్షించి ఫ్రెండ్స్ మళ్లీ నెక్స్ట్ వీక్ కలుద్దాము అని చెల్లితోపాటు సెల్ఫీ తీసుకున్నాము .
ఫ్రెండ్ మనకు పోటీ ఇచ్చేవాళ్ళు ఎవరూ మిగలలేదు కాబట్టి ఈ పిచ్ లో మనం మనమే పోటీ అని హత్తుకొని వాళ్ళ పేరెంట్స్ తో వెళ్లిపోయారు .
కారులో అందరమూ ఇంటికి చేరుకుని ఫ్రెష్ అయ్యి మళ్లీ సాయంత్రం అక్కయ్య కోసం చాలాదూరం వెళ్లివచ్చాము .
డైలీ రౌటీన్ , సాయంత్రం కార్ డ్రైవింగ్ , హాలిడేస్ లో బుజ్జి ఫ్రెండ్స్ తో క్రికెట్ .......... అలా మూడువారాల తరువాత చెల్లి ఎంట్రన్స్ results రోజు రానే వచ్చింది .
ఆరోజు అంకుల్ ఆఫీస్ కు హాఫ్ డే లీవ్ పెట్టిమరీ పైకివచ్చి ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు . 11 గంటలకు టీవీలో విడుదల చేయగానే చెల్లిముందు లాప్టాప్ ఉంచాము .
అక్కయ్య ఫోటో తీసుకొచ్చి గుండెలపై హత్తుకొని హాల్ టికెట్ తీసి టైప్ చేసి కళ్ళుమూసుకుని అక్కయ్యనే తలుచుకుంటోంది .
అల్ ఇండియా 5th ర్యాంక్ రా మామా ........ అని కృష్ణగాడు సంతోషంతో చెప్పగానే, చెల్లి నుదుటిపై ఇద్దరమూ ఒకేసారి ముద్దుపెట్టి లవ్ యు లవ్ యు soooooo మచ్ అని మురిసిపోతుండటం చూసి చెల్లి ఆనందబాస్పాలతో లవ్ యు అక్కయ్యా ....... అని ముద్దుపెట్టి లేచి మాఇద్దరినీ హత్తుకుంది .
కంగ్రాట్స్ కృష్ణ , కంగ్రాట్స్ అక్కయ్యా ......... అని అంకుల్ , కార్తీక చేతులు కలిపి అభినందించారు .
అంటీ పరుగున కిందకువెళ్లి స్వీట్స్ తీసుకొచ్చి , నాకు ముందే తెలుసు నా తల్లి ఏదైనా సాధిస్తుంది అని అందుకే ఉదయమే స్వీట్స్ చేసేసాను అని చెల్లికి తినిపించి అందరికీ ఇవ్వమని చెప్పింది .
ఇద్దరమూ స్వీట్స్ అందుకొని చెల్లికి తినిపించి మేమూ తిన్నాము .
చెల్లెమ్మా .......... ఢిల్లీ , ముంబై , బెంగళూరులోని గొప్ప గొప్ప కాలేజ్ లలో నువ్వు కోరుకున్న దగ్గర సీట్ దొరుకుతుంది .
అన్నయ్యా .......నేను అక్కయ్యకు దూరంగా ఎక్కడికీ వెళ్ళను , హైద్రాబాద్ govt మెడికల్ కాలేజ్ లో చేరుతాను , మనం హార్డ్ వర్క్ చేస్తే ఎక్కడ చదివినా ఒక్కటే కదా అన్నయ్యా అని ఇద్దరిచుట్టూ చేతులనువేసి ఉద్వేగంతో please రా , please అన్నయ్యా .........అని చెప్పింది .
రేయ్ మామా ..........,
రేయ్ మామా ........ నువ్వు ఎదిచెబితే అదేరా ఫైనల్ అని కృష్ణగాడు లవ్ యు రా ........ అని చెల్లి నుదుటిపై ముద్దుపెట్టాడు .
వెంటనే లాప్టాప్ ఓపెన్ చేసి హైద్రాబాద్ మెడికల్ కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తూ , అంకుల్ మీరేమంటారు అని అడిగాను . నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ లలో ఒకటి కానీ ఒకే ఒక సమస్య ............ఫస్ట్ ఇయర్ కాస్త ర్యాగింగ్ ఫేస్ చేయాల్సి వస్తుంది . మా సీనియర్ కూతురు అక్కడే చదివింది ఇప్పుడు స్టేట్స్ లో ఉంది . ఆయన అప్పుడు రోజూ అదే మాట్లాడేవారు , కాస్త బాధపడేవారు కూడా అంటే ఏ రేంజ్ లో ఉందొ మీరే ఊహించుకోండి . Govt కాలేజ్ లలో స్టాఫ్ ర్యాగింగ్ గురించి అంతగా పట్టించుకోరు అదే సమస్య అయ్యింది .
చెల్లివైపు చూసాను . అన్నయ్యా ......... మనం ఇలాంటివి ఎన్ని చూడలేదు , 18 సంవత్సరాలు ఎన్ని కష్టాలకు ఎదురొడ్డానో మీకు తెలుసుకదా అని దైర్యంగా చెప్పడంతో , చెల్లెమ్మా ......... ఒకరోజు సమయం ఇవ్వమని చెప్పి అంకుల్ తోపాటు కాలేజ్ ను చూడటానికి కూడా వెళ్ళాము . క్లోజ్ చేసి ఉండటంతో అంకుల్ govt ఎంప్లాయ్ అని కార్డ్ చూపిస్తే లోపలకు వదిలాడు . లోపల వాతావరణాన్ని బిల్డింగ్స్ బిగ్గెస్ట్ లైబ్రరీ ను చూడగానే అందరికీ నచ్చేసింది . అంకుల్ వాళ్ళ సీనియర్ ద్వారా స్టేట్స్ లో ఉన్న ఆమెతో మాట్లాడించారు .
ముందుగా చెల్లికి కంగ్రాట్స్ చెప్పారు . చిన్న చిన్న సమస్యలు తప్ప బెస్ట్ కాలేజ్ అని సర్టిఫై చెయ్యడంతో చెల్లెమ్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాము .
లవ్ యు అన్నయ్యా ,లవ్ యు రా........అని అప్లై చేసింది , అన్నయ్యా .........స్టై ఫండ్ అర్హత కూడా govt నుండి వచ్చింది కాబట్టి కాలేజ్ బైల్స్ అన్నింటికీ సరిపోతాయిన్ని సంతోషంతో చెప్పింది . కాలేజ్ జాయినింగ్ 10 రోజులే ఉండటంతో సిటీకి వెళ్లి చెల్లికి అవసరమైనవి తీసుకున్నాము .
కాలేజ్ వారం రోజుల ముందే ఓపెన్ అవుతుంది అన్నయ్యా .......... అని చెల్లి చెప్పడంతో , మూడవరోజు అన్ని పనులను క్యాన్సిల్ చేసుకుని చెల్లెమ్మా ముఖ్యమైన పని ఉంది వెళ్ళొస్తాము , అంటీతోనే ఉండమని చెప్పిరెయ్ బండితియ్యరా అని కాలేజ్ చేరుకున్నాము .
ఏంట్రా మామా ర్యాగింగ్ గురించే కదా .........
అవునురా .........
లవ్ యు రా మామా ......... అని సంతోషంతో గట్టిగా హత్తుకున్నాడు .
రేయ్ మామా ......... మనకు సెకండ్ ఇయర్ స్టూడెంట్ కావాలిరా , ఎందుకంటే రీసెంట్ గా సంవత్సరం ముందు వాళ్ళేకదా ర్యాగింగ్ బారిన పడి ఉంటారు .
అయితే ఆపు మామా ........ వాళ్ళను వెంటబెట్టుకొస్తాను అని ఏకంగా ఇద్దరినీ male female తోపాటు వచ్చి లవర్స్ అని వెనుక నుండి సైగచేశాడు .
బ్రదర్ , సిస్టర్ ......... క్యాంటీన్ ఉంటే అక్కడ మాట్లాడుదామా అని అడిగాను .
Ok అని ఇద్దరూ చేతులుపట్టుకొని క్యాంటీన్ వైపు నడిచి కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసాము.
బ్రదర్ మా సిస్టర్ కొన్నిరోజుల్లో జాయిన్ అవుతోంది . కాలేజ్ గురించి .........
మెడికల్ ఎంట్రన్స్ లో తను 200 ర్యాంక్ నాది 250 ర్యాంక్ బెస్ట్ కాలేజ్ ఫాకల్టీ , క్లాస్సెస్ , లాబ్స్ , లైబ్రరీ .......... ఇలా అన్నీ the best ........... sorry ముందుగా మీ సిస్టర్ కు కంగ్రాట్స్ అని చెప్పారు .
థాంక్స్ బ్రదర్ ..........మరి ర్యాగింగ్ అనగానే ,
సిస్టర్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి .
Sorry .......సిస్టర్ ........
ఇయర్ ఇయర్ ......... ఎక్కువ అవుతోంది బ్రదర్ , క్లాస్ లో అంత బాగా టీచ్ చేసే ఫ్యాకల్టీ ర్యాగింగ్ గురించి ఎందుకు పట్టించుకోరో తెలియదు . వన్ ఇయర్ సఫర్ అయ్యామంటే ఇక త్రీ ఇయర్స్ మన ఇష్టం మన గోల్స్ రీచ్ అవ్వడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి .
నాకు తెలిసి ర్యాగింగ్ చేసేది బాగా బలిసినవాడు ...........
అవును బ్రదర్ కొద్దిమంది ఉన్నారు వాళ్ళు చదవనే చదవరు , freshers ఎప్పుడు జాయిన్ అవుతారా అని ఎదురుచూస్తుంటారు . వాళ్ళు కాలేజ్ కు వచ్చేదే ఎంజాయ్ చెయ్యడానికి , క్లాస్సెస్ నిన్నే స్టార్ట్ అయ్యాయి అప్పుడే వేరే కాలేజ్ వాళ్ళతో మ్యాచ్ పెట్టుకుని గ్రౌండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు అనిచెప్పాడు .
బ్రదర్ మాకు వాళ్ళను ఒకసారి చూడాలని ఉంది అని అడిగాను .
రండి చూపిస్తాను అని పచ్చని గడ్డితో ఉన్న గ్రౌండ్ కు పిలుచుకొనివెళ్లి చుట్టూ చూసి , బ్రదర్ బ్యాటింగ్ ఆడుతున్నాడే వాడే మెయిన్ కెప్టెన్ కూడా వాడు ఏది చెబితే వీళ్లంతా కేరింతలు వేస్తున్నారే వాళ్ళు చేస్తారు అని చెబుతుండగానే రన్నర్ రన్ ఔట్ అయ్యాడు .
రేయ్ 5 lakhs బెట్ రా ......... నీయబ్బా అని కోపంతో అరిచారు .
5 లక్షలా ....... అని కృష్ణగాడు ఆశ్చర్యపోతుంట ,
అది మామూలే బ్రదర్ ఒక్కనిమిషం అనివెల్లి వచ్చి 5 lakhs పోయినట్లే , 2.3 ఓవర్లకు కు 50 రన్స్ కొట్టాలి ఇక మూడు వికెట్స్ మాత్రమే మిగిలాయి అని చెబుతుండగానే , మరొక వికెట్ పడటం ........ నెక్స్ట్ batsman లేచి బ్యాట్ విసిరేసి వాడు ఎలా విసురుతున్నాడో చూడు మడ్డకు తగిలిందంటే నేను ఔట్ నేనుమాత్రం వెళ్ళను అని మిగిలిన ఇద్దరూ గ్రౌండ్ నుండి వెళ్లిపోయారు .
రేయ్ రేయ్ వెళ్లకపోతే పరువు పోతుందిరా వెళ్లి ఔట్ అయినా అయ్యిరా అని బ్రతిమాలుతూ వెనుకే వెళ్లారు .
రేయ్ మామా ......... 2.2 ఓవర్లు 50 రన్స్ ....... ఊ అని సైగచేసాను . వాడు చకచకా ప్యాడ్స్ , గ్లౌసెస్ , షూస్ ఉంటే వాటినీ వేసుకుని మూతికి కర్చీఫ్ చుట్టుకొని హెల్మెట్ పెట్టుకుని బ్యాట్స్ టెస్ట్ చేసి ఒకటి అందుకొని కాళ్ళు చేతులూ ఆడిస్తూ వెళ్ళాడు . కెప్టెన్ వచ్చి ఏదో మాట్లాడుతుంటే తలదించుకొని ఊ కొట్టాడు .
కృష్ణగాడు బుల్లెట్ లా వచ్చిన బంతిని డిఫెన్సె చేసి సింగిల్ తీసాడు . ఓవర్ చివరి బంతికి కెప్టెన్ బోల్డ్ అయిపోయాడు . వికెట్స్ ను బ్యాటుతో కొట్టేసి కోపంతో వచ్చేస్తున్నాడు .
బ్రదర్ చివరి batsman ఎవరూ లేరు వాళ్ళను బ్రతిమిలాడుతూ అందరూ వెళ్లిపోయారు అనగానే , నేనూ రెడీ అయ్యి బ్యాటు అందుకొని పరుగున వెళ్లి రేయ్ మామా ......... వాడితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే ఇదొక్కటే మార్గం . ఆ అమ్మవారి ఆశీష్షులు , అక్కయ్య ప్రేమ వలనే మనకు ఈ ఛాన్స్ లభించింది అని హెల్మెట్స్ కొట్టుకుని 2 ఓవర్లు 50 రన్స్ అని గుర్తుచేసుకుని బ్యాటింగ్ మొదలెట్టాము .
( ఫ్రెండ్స్ JTKP లోని కాలేజ్ ఫస్ట్ డే experiance గుర్తుచేసుకుంటారని ఆశిస్తూ )
బాల్ బాల్ కు స్కోర్ ను చిన్నదిగా చేసేస్తుంటే ......... గ్రౌండ్ నుండి వెళ్లిపోయిన కెప్టెన్ మిగిలిన ఇద్దరూ batsman లు చాయ్ సమోసా తింటూ ఉండటం చూసి రేయ్ మరి అక్కడ ఆడుతున్నది ఎవరురా అని పరుగునవచ్చి పరుగుల వరద పారుతుండటం చూసి సంతోషంతో ఎంజాయ్ చేస్తూ గెలవగానే పరుగునవచ్చి మాఇద్దరినీ అమాంతం ఎత్తుకుని , రేయ్ మా గ్రౌండ్ మేము తప్ప ఎవర్రా గెలిచేది అని డబ్బు తీసుకుని వాళ్ళను పంపించేసిన తరువాత ,
ఎవరు బ్రదర్స్ మీరు సముద్రాన్ని అవలీలగా దాటించేశారు .
హెల్మెట్స్ తియ్యగానే కౌగిలించుకుని మీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు . డబ్బు కోసమా ........ ఇదిగోండి అంటూ సగం డబ్బు ఇవ్వబోయాడు .
ఆపి మన కాలేజ్ ఓడిపోకూడదు .........
మన కాలేజ్ .......... ఫ్రెషర్స్ ?
కాదు బ్రదర్ , మా గురించి త్వరలోనే తెలుస్తుంది అని వచ్చేస్తోంటే ,
బ్రదర్ బ్రదర్ .......... మా పరువు కాపాడిన మిమ్మల్ని ఇలా పంపించడం మాకు ఇష్టం లేదు .
మాకు కావాల్సింది కూడా అదే అని లోలోపలే అనుకుని పైకిమాత్రం ఇంతదానికి పార్టీ ఎందుకు బ్రదర్ .........., అయినా మీ గెస్ట్ హౌస్ లో చాలామంది ఉంటారు మాకు సిగ్గు అని బాలదులిచ్చాను .
బ్రదర్ వీళ్ళ పేరెంట్స్ ఢిల్లీ లో ఉంటారు కేవలం వీడు మేము మాత్రమే అక్కడ ఉంటాము అనిచెప్పడంతో ,
కృష్ణగాడివైపు చూసి నవ్వుకుని ok అనిచెప్పాను .
బ్రదర్ చాలా సంతోషం , పార్టీ అదిరిపోయేలా ఉంటుంది , మీకోసం వెహికల్ ఎక్కడకు పంపించమంటారు అడ్రస్ ఇవ్వండి అని అడిగాడు .
అవసరం లేదు బ్రదర్ అడ్రస్ వాట్సాప్ చెయ్యండి సండే evening అక్కడ ఉంటాము అనిచెప్పి చేతులు కలిపాము .
రేయ్ ............ మ్యాచ్ నుండి పారిపోయిన ఈ నాకొడుకులను పార్టీకి పిలవకండి అని కోపంతో కొట్టబోయాడు .
రేయ్ మామా ......... మేము వెళ్లిపోయినందుకే కదరా వీళ్ళు వచ్చి గెలిపించింది . మేము కానీ ఆడి ఉంటే డకౌట్ అయ్యేవాళ్ళము 10 లక్షలు దొబ్బేది .
కెప్టెన్ ఆలోచనలో పడ్డాడు .
అవును బ్రదర్ వీళ్ళ వల్లనే కదా మనం కలిసింది . వీళ్ళను కూడా పిలవండి మీ బ్యాచ్ ఎవ్వరూ మిస్ కాకూడదు అని మనసులో అనుకున్నాను .
మీరు చెప్పారు కాబట్టి ok అన్నాడు .
థాంక్యూ sooooo మచ్ బ్రదర్ .......... అని సంతోషంతో చేతులు కలిపారు .
OK ఫ్రెండ్స్ వెళ్ళాలి అని వాట్సాప్ నెంబర్ ఇచ్చి మీ గ్రౌండ్ మాత్రం కేక అని హత్తుకుని గ్రౌండ్ గేట్ దగ్గరకు వచ్చాము.
Hi బ్రదర్ .......... సిస్టర్ ఎక్కడ అని అడిగాను .
మీపై కోపంతో వెళ్ళిపోయింది బ్రదర్ ......... నేనుకూడా , వాళ్ళ వల్లనే ర్యాగింగ్ సఫర్ అయ్యాము . సోమవారం నుండి తన చెల్లెలు కూడా జాయిన్ అవుతోంది . తన చెల్లెలు కూడా మాలానే ర్యాగింగ్ అనుభవిస్తుందని అప్పుడు బాధపడింది అందుకే , అలాంటివారిని మీరు గెలిపించారు . మీకు హెల్ప్ చేశానని కోపంతో వెళ్ళిపోయింది .
బ్రదర్ ......... సోమవారం వరకూ ఓపికపట్టమని చెప్పు తన చెల్లెలు , నా చెల్లెలే కాకుండా చాలామంది అమ్మాయిలు సంతోషపడేలా చేస్తాను , అప్పుడు వచ్చి థాంక్స్ చెబితే చాలు అని భుజం తట్టి కలుద్దాము బ్రదర్ ఇది నా నెంబర్ అని ఇచ్చి ఇంటికి చేరుకున్నాము .
అన్నయ్యా , రేయ్ .......మీకోసం వెరైటీ స్నాక్స్ చేసాము యూట్యూబ్ లో చూసి అని చెల్లి తినిపించింది.
Tasty చెల్లీ అని తిని ఆరోజంతా సరదాగా గడిపాము .
సండే రోజు ఉదయం 9 గంటలకు వాట్సాప్ లో అడ్రస్ ఆ వెంటనే కాల్ బ్రదర్ సాయంత్రం తప్పకుండా రావాలని ,
మీకంటే ఉత్సాహంగా ఉన్నాము షార్ప్ అక్కడ ఉంటాము అని చెప్పాము .
అన్నయ్యా ........ బ్యాగ్ బుక్స్ కావాలి అని అడిగింది .
అన్నయ్యా ......... dad కార్ తాళాలు కూడా ఇచ్చారు అని కార్తీక చూపించింది .
ఇద్దరమూ పోటీపడి చివరికి తాళాలు నాచేతికి దక్కాయి .
చెల్లీ వాడు వెనుక , నేను కార్తీక ముందు కార్ స్టార్ట్ చేసి ఉత్సాహంతో సిటీలోని మాల్ కు చేరుకున్నాము . చెల్లీ మేము బ్యాగు తీసుకొస్తాము మీరు కాలేజ్ కోసం డ్రెస్ లు తీసుకోండి అనిచెప్పాను .
మధ్యాహ్నం వరకూ షాపింగ్ చేసి ఇంటికి చేరుకుని చెల్లి చేతులతో లంచ్ చేసి కాసేపు అందరమూ సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాము . బ్రదర్ ఖచ్చితంగా రావాలి అని గంటకొకసారి కాల్ చేస్తూనే ఉన్నారు .
సాయంత్రం 5 గంటలకు చెల్లీ కొత్త ఫ్రెండ్స్ కలిసారు పార్టీ చేసుకొస్తాము అనిచెప్పి , కార్తీక జాగ్రత్త .........
మహేష్ కారులో వెళ్ళొచ్చుకదా ..........
లేదు అంకుల్ ఇటువంటి పార్టీలకు బులెట్ పర్ఫెక్ట్ అని ఇద్దరమూ పైకివెళ్లి రెడీ అయ్యి గంటలో గెస్ట్ హౌస్ చేరుకున్నాము .
మాకోసం ఎదురుచూస్తున్నట్లు బయటే విష్ చేసి లోపలికి పిలుచుకునివెళ్లారు .
పెద్ద భవంతి తల్లిదండ్రులు కష్టపడి సంపాధిస్తుంటే వీడు ఎంజాయ్ చేస్తున్నాడు అని సోఫాలో కూర్చున్నాము .
బ్రదర్ అల్ టైప్స్ బాటిల్స్ బ్రాందీ , విస్కీ , రమ్ , బీర్ ......... మీ ఇష్టం ఫుడ్ 10 నిమిషాలకొకసారి వస్తూనే ఉంటుండి ఫైవ్ స్టార్ హోటల్ నుండి అని చెప్పాడు .
డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేస్తాము బ్రదర్ ......... మేము మీ ఆతిథ్యం స్వీకరించాలంటే మీరంతా మరియు కాలేజ్ లో ఉండే సీనియర్స్ అంతా ఒక పని చేయాలి కష్టమేమీ కాదు అని చెప్పాను .
బ్రదర్ మీరు ఆరోజు మా పరువు కాపాడారు , డబ్బు ఎంతపోయినా పర్లేదు ....... ఆ కాలేజ్ వాళ్ళు కనపడితే తలెత్తుకునేవాళ్ళం కాదు . కష్టం కాదు అంటున్నారు కాబట్టి ఆలోచిస్తాము చెప్పండి అని అడిగారు .
అయితే అందరూ సోఫాలలో కూర్చోమని చెప్పి , ok రేపు ఫ్రెషర్స్ రాబోతున్నారు కదా అమ్మాయిలను మాత్రం మీరు మీతోపాటు సీనియర్స్ అందరూ ర్యాగింగ్ కాదు కదా వాళ్ళను పట్టించుకోకుండా వాళ్ళ దారిన వాళ్ళను వదిలెయ్యాలి . అబ్బాయిలను ఎలాగైనా ర్యాగింగ్ చేసుకోండి అనిచెప్పాను .
కొన్ని క్షణాల సైలెన్స్ తరువాత కెప్టెన్ తోపాటు అందరూ కొద్దిసేపు ఆపకుండా నవ్వేసి , మేము కాలేజ్ కు వెళ్లేదే ఆ ఎంజాయ్మెంట్ కోసం బ్రదర్ దాన్నే ఆపేయమంటే ఎలా కుదరనే కుదరదు .
అయితే ఈ గెస్ట్ హౌస్ నుండి ఒక్కడు కూడా అన్ని పార్టులతో బయటకు వెల్లడు అని సోఫాలో ఆనుకుని కాళ్ళమీద కాళ్ళు వేసుకుని చెప్పాను .
బ్రదర్ ........ ఇలాంటి వార్నింగ్ లకు మేము భయపడేవాళ్ళం కాదు . ఏదో సహాయం చేశావని పార్టీ కి పిలిచాము అంతే ,
మేమైతే పార్టీకి రాలేదు బ్రదర్ వచ్చిందే ఈ ఒక్క పనిమీద అని కాస్త కోపంతో చెప్పాను.
కుదరదు బ్రదర్ అది తప్ప వేరే ఏదైనా కోరు బ్రదర్ ఆలోచిస్తాము అని చెప్పాడు .
కుదురుతుంది , కుదిరేలా మేము చేస్తాము కదా అని కృష్ణగాడు బదులిచ్చాడు .
అయితే ఏమిచేసుకుంటారో చేసుకొంరి గెట్ ఔట్ అని లేచి కోపంతో వేలిని చూపించాడు .
మీరు హామీ ఇచ్చేన్తవరకూ ఇక్కడ నుండి కదిలేది లేదు .
మల్లన్న , యాదన్నా ........... అని కేకవేయ్యగానే నలుగురు లోపలికివచ్చి అయ్యా ........అన్నారు .
వీరిద్దరినీ రక్తం వచ్చేలా కొట్టి వీళ్ళ బుల్లెట్ కు నిప్పుపెట్టండి మాకే ఆర్డర్స్ వేస్తున్నారు అని కోపంతో చెప్పాడు .
వాళ్ళు మా ముందుకు రావడం క్షణాల్లో దిక్కుకొకరు మూతిపళ్ళు రాల్చుకుని కింద పడిపోయి నొప్పితో గింజుకుంటుండటం చూసి అందరి ముఖాలు చెమటపట్టేసాయి .
బ్రదర్ ఇప్పుడు చెబుతున్నాము వినండి సాటి స్టూడెంట్స్ అనే దయతో మిమ్మల్ని కొట్టడం లేదు . మేము హత్య చేసి 9 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చాము . రేపు గనుక ఏ అమ్మాయి అయినా ర్యాగింగ్ వల్ల బాధపడటం కాదు అలా ఫీల్ అయినా కూడా మిమ్మల్ని చంపేసి మళ్లీ జైల్ కు వెళ్ళడానికి మాకు ఎటువంటి భయం లేదు .
ప్రక్కనే ఉన్న వాడు వణుకుతుంటే వాడి చెమటను వేలితో అందుకుని ఈ భయం మైంటైన్ చేస్తే మీకూ మంచిది మాకూ మంచిది . అందరికీ అర్థమైంది అనుకుంటాను ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి కింద పడ్డారు కదా వాళ్లకు అర్థమైనట్లే క్లియర్ గా చెబుతాము . అయ్యో చేతి వేళ్ళకు రక్తం అంటిందే ఇప్పుడెలా ...........
ఒకడు వణుకుతూ వాటర్ బాటిల్ తీసుకొచ్చి స్వయంగా శుభ్రం చేసాడు .
అన్నా ......... మీ బ్రాండ్ అని అడిగాడు .
జైల్ నుండి వచ్చి రెండు నెలలే అయ్యింది తమ్ముడూ ఇంకా అలవాటు చేసుకోలేదు . చేసుకోము కూడా .......... , ఇంట్లో ఉన్న మా ప్రాణానికి మరియు మా హృదయంలో ఉన్న అక్కయ్యకు అని ప్రాణాంలా గుర్తుచేసుకుని తెలిస్తే మేము కూడా వీళ్ళలా కోమాలోకి వెళ్లేలా కొడతారు .
నిజమే మామా అని కృష్ణగాడు చెప్పి నవ్వుకున్నాడు .
చివరి నవ్వు మనదైతే ఆ కిక్కే వేరు రా మామా ......... అందరికీ క్లియర్ గా అర్థమైంది , పార్టీకి వచ్చి ఏమీ తాగకపోతే ఫీల్ అవుతారు కాబట్టి రెండు కూల్ డ్రింక్స్ అందుకో , వీళ్ళు తగలబెట్టాలనుకున్న బుల్లెట్ లో సరదాగా తాగుతూ వెళదాము బై కెప్టెన్ గుడ్ నైట్ అని భయంతో వణుకుతుంటే కౌగిలించుకుని , నా మాట వింటే కాలేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది లేకపోతే ఇంత డబ్బు మదర్ థెరిస్సా ఆశ్రమానికి వెళ్ళిపోతుంది , ఎందుకో పూర్తిగా వివరించాల్సిన పనిలేదనుకుంటాను అని , ఫ్రెండ్స్ తొందరగా వీళ్ళను హాస్పిటల్ కు తీసుకువెళ్లండి లేకపోతే ఫసక్ అనగానే మా ముందే కారులో తీసుకుని వెళ్లిపోయారు .
మామా ........ ఇంత త్వరగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు పదా ఇంటికి వెళ్లి తొందరగా తిని తొందరగా పడుకుందాము . రేపు చెల్లిని ఫస్ట్ డే కాలేజ్ కు పిలుచుకునివెళ్లాలి కదా అని ఉత్సాహంతో చేరుకున్నాము.
The following 22 users Like Mahesh.thehero's post:22 users Like Mahesh.thehero's post
• 9652138080, AB-the Unicorn, Anamikudu, Bangaru, Jack789, Joncena, Kumarmb, kummun, Mahe@5189, maheshvijay, Milffucker, Naagu nag, nkp929, RAANAA, Rajeev j, Sachin@10, sandycruz, Sha82, Shaikhsabjan114, sisusilas1@, SS.REDDY, sweetdumbu
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
ఇంటిబయటే బుల్లెట్ దిగి ఒక్క నిమిషం రా మామా అని మొబైల్ తీసి కెప్టెన్ కు కాల్ చేసాను . కట్ అయ్యే చివరి క్షణంలో ఎత్తాడు . స్పీకర్ on చెయ్యమని చెప్పి ఫోన్ ఎత్తడానికి ఆ భయం ఉంది చూడు మీకిప్పుడు చాలా అవసరం అని నవ్వేసి , హలో బ్రదర్ చెప్పుంటాను మళ్లీ గుర్తుచేస్తున్నాను , మీరుకాకుండా కాలేజ్ లో ఏ సీనియర్ ర్యాగింగ్ చేసినా నేనుమాత్రం మీదగ్గరికే వస్తాను ఎందుకో తెలుసుకదా ............, అలాగే మ్యాచ్ ఉంటే పిలవండి మీవైపే వచ్చి ఆడతాము . ఎందుకంటే మీ గ్రౌండ్ మాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది . సో ర్యాగింగ్ గురించి వదిలేసి మిగతా ఎంజాయ్మెంట్ చూసుకోండి అందరికీ మంచిది . ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యము పార్టీ ఎంజాయ్ చెయ్యండి రేపు కాలేజ్ లో కలుద్దాము బై గుడ్ నైట్ ............
రేయ్ మామా ........ మ్యాచ్ కు పిలుస్తారంటావా అని అడిగాడు .
రేయ్ నీయబ్బా ......... నేనేదో సరదాకి అడిగాను రా అని వీపుపై కొట్టి భుజం చుట్టూ చేతినివేసి చిరునవ్వులు చిందిస్తూ పైకి వెళ్ళాము .
పార్టీ ఎంజాయ్ చేసారా ....... బాగా మెక్కారా అని చెల్లి ఫీల్ అవుతూ అడిగింది . ఇక్కడ మాత్రం నేను తినిపిస్తే తింటారు ...........
రేయ్ ........ ఇప్పుడు కూడా మీ అన్నయ్య నీ చేతితో తినడానికే వచ్చాడు .
మరి పార్టీలో ..........
ఓన్లీ కూల్ డ్రింక్స్ అని చూపించాడు .
అన్నయ్యా .......... మీకు అక్కయ్య చేతితో తినిపించలేదని , తను కూడా తినలేదు పాపం అని ఫుడ్ పైకి తీసుకొచ్చింది కార్తీక .
చెల్లెమ్మా ......... లవ్ యు అని నెత్తిపై ప్రాణంలా కొట్టి ఆకలేస్తోంది .
లవ్ యు sooooo మచ్ అన్నయ్యా ........ అని ప్లేటులో వడ్డించుకొనివచ్చి మాకు తినిపించబోతే , ముందు నువ్వు అనిచెప్పాము .
ఆనందబాస్పాలతో తిని తినిపించింది . అక్కయ్యా ....... నాకు అని కార్తీక పెద్ద నోరు తెరువడంతో నవ్వుకున్నాము . అందరికీ చెల్లే తినిపించి మురిసిపోయింది .
కాసేపు బయట చల్లటి గాలిలో సేదతీరి బెడ్ పై వాలిపోయాము . అక్కయ్యా ....... మీ ప్రియమైన చెల్లికోసం అనెను ఏర్పాట్లు చేసేసాము . చెల్లిని మేము లేని సమయంలో మీరే చూసుకోవాలి అని అమ్మవారిని ప్రార్థించి అక్కయ్యనే తలుచుకుంటూ నిద్రపోయాను .
తెల్లవారుఘామునే లేచి అందరమూ రెడీ అయ్యి గుడికి వెళ్లిచ్చాము . అంటీ మాకిష్టమైన టిఫిన్ చేసింది . తినేసి అంటీ ఆశీర్వాదం తీసుకుని అక్కయ్య ఫోటోని బ్యాగులో ఉంచుకుని బయటకు వస్తుంటే , అంటీ లంచ్ బాక్స్ అందించారు .
అంతే కళ్ళల్లో చెమ్మతో నా గుండెలపై వాలిపోయింది .
చెల్లీ ......... మధ్యాహ్నం ఒక్కపూట అలవాటు చేసుకుంటాను . నీ భవిష్యత్తు ముఖ్యం అని నుదిటిపై ముద్దుపెట్టి కన్నీళ్లను తుడిచి , చెల్లీ వాడు స్కూటీలో (చెల్లి డ్రైవింగ్) నేను బుల్లెట్ లో కాలేజ్ చేరుకున్నాము .
Welcome freshers ......... అని బ్యానర్లతో స్వాగతం పలికింది కాలేజ్ . సెక్యూరిటీ అడ్మిషన్ లెటర్ చూసి స్టూడెంట్స్ ను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు . పేరెంట్స్ ను బయటే ఆపేస్తున్నారు .
అన్నయ్యా , రేయ్ ........మొదటిరోజు కాస్త భయంగానే ఉందిరా ..........
రేయ్ మేము ఈరోజంతా ఇక్కడే ఉంటాము కదా జాబ్స్ కు లీవ్ ఇచ్చేసాము . ర్యాగింగ్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా వెళ్లు , కొద్దిగా ఇబ్బందిపడినా చాలు missed కాల్ ఇవ్వు మరుక్షణంలో నీ ముందు ఉంటాము అని బుగ్గలను స్పృశించాడు .
అయినా మీరు ఉండగా నాకెందుకు భయం అని ఇద్దరినీ హత్తుకొని చుట్టూ చూసి వాడి పెదాలపై ప్చ్ ........ అంటూ ముద్దుపెట్టి ముసిముసినవ్వులతో వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ స్కూటీలో లోపలికివెళ్లింది .
రేయ్ మామా ........ ఛాన్స్ మళ్లీ మిస్ చేసుకున్నాను రా అని ఫీల్ అవుతోంటే , మెడ చుట్టూ చేతినివేసి నలిపేసాను . పాపం ప్రతిసారీ నా చెల్లే ..............
ఇంతలో మాకు నిన్న సహాయం చేసిన లవర్స్ స్కూటీ , బైకులలో వచ్చారు . Hi బ్రదర్ అని ఆగాడు , కానీ సిస్టర్ మాత్రం మావైపు కోపంతో లోపలికివెళ్లిపోయింది .
Sorry బ్రదర్ చెప్పానుకదా అని మాట్లాడి లోపలికివెళ్లాడు . Freshers అందరూ తొలిరోజు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ తోపాటు వచ్చి కాస్త భయపడుతూనే లోపలికివెలుతున్నారు .
అర గంట అయినా మెయిన్ బ్యాచ్ రాకపోవడం చూసి , రేయ్ మామా భయపడి రాలేదేమోరా అని నవ్వుకున్నాము .
కానీ అమ్మాయిలను ఎవరైనా సెకండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కొంపదీసి ర్యాగింగ్ చేస్తారేమోనని కాలేజ్ కు గంట ముందుగానే వచ్చేసారు . మామూలుగా అయితే ప్రిన్సిపాల్ ఫ్రెషర్స్ కు ఆడిటోరియం లో వెల్కమ్ స్పీచ్ ఇస్తారు . ఆ స్పీచ్ కు కూడా వీళ్ళు ఫ్రెషర్స్ ను పంపించకుండా ర్యాగింగ్ చేసేవాళ్ళు . కానీ ఈ ఇయర్ మాత్రం దగ్గరుండి అమ్మాయిలను ఎవ్వడూ టచ్ చెయ్యకుండా స్వయంగా వీళ్లే ఆడిటోరియం వైపు పంపించి , అబ్బాయిలను మాత్రం గ్రౌండ్ లో wait చెయ్యమని పంపిస్తున్నారు .
ఏంటన్నా ........ ఈ సంవత్సరం కొత్తగా అని కొంతమంది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చి అడిగారు .
రేయ్ నాకొడకల్లారా మాకు తెలియకుండా అమ్మాయిలను ఎవడైనా ర్యాగింగ్ చేసినట్లు తెలిసిందా అంటూ చెంపలపై ఒక్కొక్క దెబ్బ వేసి , గుద్ద నోరు మూసుకుని క్లాస్ లకు వెళ్ళండి , అబ్బాయిలను కావాలంటే మీ ఇష్టం గ్రౌండ్ లో ఉన్నారు వెళ్ళండి అని లాగేసి , sorry సిస్టర్స్ sorry సిస్టర్స్ మిమ్మల్ని ఏనాకొడుకూ టచ్ చెయ్యకుండా చూసుకునే బాధ్యత మాది అని అక్కడ white గులాబీ పూలు ఉన్నాయి తీసుకునివెళ్లండి అని కెప్టెన్ ముందుండి చూసుకుంటున్నాడు .
మొదట చెల్లి సంతోషంతో పువ్వు అందుకొని ఆడిటోరియం వైపు వెళ్ళింది . క్లాస్ లకు వెళుతూ లవర్స్ ఇద్దరూ చూసి షాక్ తో ఈ సంవత్సరం అమ్మాయిలకు ర్యాగింగ్ లేదు అని విషయం తెలుసుకుని , ఏంజెల్ తియ్యి తియ్యి ......... తొందరగా ఇంటికి కాల్ చేసి నా మరదలిని కాలేజ్ కు రమ్మనిచెప్పు , బయటున్న బ్రదర్ చెప్పినట్లుగానే చేసాడు . ఎంతచెప్పినా నువ్వు వినలేదు కోపంతో లోపలికి వచ్చేసావు , వాళ్ళు ఎంత బాధపడిఉంటారో .
వెంటనే వాళ్ళ నాన్నకు కాల్ చేసి నాన్నా ......... చెల్లిని ఇక ఏమాత్రం భయపడొద్దు అనిచెప్పు అని వివరించింది .
చాలా సంతోషం తల్లీ అర గంటలో నీ చెల్లి కాలేజ్ లో ఉంటుంది అని ఉత్సాహంతో చెప్పడంతో , ఆనందంతో పొంగిపోయి తన లవర్ ని కౌగిలించుకుని చేతినిపట్టుకొని పరుగున మాదగ్గరికివచ్చి , తలదించుకొని నిలబడింది .
ఏంటి బ్రదర్ ........... లోపల ర్యాగింగ్ ఉధృతంగా జరుగుతున్నట్లుందే ........
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ బ్రదర్ అని చేతులను కలిపి , కాలేజ్ హిస్టరీలో తొలిసారి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ముందుండి ఫ్రెషర్స్ అమ్మాయిలను కనీసం కన్నెత్తైనా చూడకుండా పంపించేస్తున్నారు .
అవునా ......... రేయ్ మామా , కెప్టెన్ మనకంటే ముందే వచ్చేసారురా అని కౌగిలించుకున్నాము .
మరి సిస్టర్ ఇలా మౌనంగా నిలబడిపోయారు .
అన్నయ్యలూ .......... sorry , మీ వలన నా చెల్లి ఈరోజు కాలేజ్ కు రాబోతోంది థాంక్యూ sooo మచ్ అని ఆనందంతో చెప్పింది .
సిస్టర్ ........ ఈ ఆనందం చాలు అని సంతోషంతో మాట్లాడుతుండగానే బైకులో వచ్చినవాళ్లను నాన్న , చెల్లీ అని కౌగిలించుకుని , ఈ అన్నయ్య వల్లనే నాన్న అని చెప్పింది .
థాంక్స్ బాబు ........ నా చిన్నకూతురు ర్యాగింగ్ కు భయపడి కాకేజ్ కు వెళ్ళను అని రూంలోనే ఉండిపోయింది. ర్యాగింగ్ లేదని కాల్ చెయ్యడంతో రెడీ అయ్యి ఉత్సాహంతో వచ్చేసింది .
అన్నయ్యా .........ప్రిన్సిపాల్ స్పీచ్ స్టార్ట్ అవ్వబోతోంది అని చెప్పింది .
Go ahead సిస్టర్......... all the best అని చెప్పడంతో , థాంక్స్ అన్నయ్యా ...... అని లోపలికివెళ్లారు .
గులాబీ పువ్వు అందుకొని సీనియర్లను చూస్తూ నవ్వుకుని దర్జాగా ఆడిటోరియం లోకివెళ్లి అందరూ ర్యాగింగ్ గురించే మాట్లాడుతూ మురిసిపోతూ ఉండటం చూసి , చెల్లిప్రక్కనే కూర్చుని చాలా ఆనందపడుతుంటే ,
చెల్లి సంతోషంతో నవ్వుకుని i am కృష్ణవేణి అని చేతిని చాపింది , i am సౌమ్య అని ఒకరికొకరు పరిచయం చేసుకుని ఫ్రెండ్స్ అయిపోయారు .
ప్రిన్సిపాల్ , ఫ్యాకల్టీ వెల్కమ్ స్పీచ్ ఇచ్చి ఈరోజు క్లాస్సెస్ జరగవు , మీ ఇష్టం కాలేజ్ లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి . ఇప్పుడే విషయం తెలిసింది అమ్మాయిలకు ర్యాగింగ్ లేదని కంగ్రాట్స్ అనిచెప్పి వెళ్లిపోయారు .
చప్పట్లతో మారుమ్రోగించి లేచి అందరూ ఒకరినొకరు చేతులు కలిపి పరిచయం చేసుకున్నారు .
కృష్ణ ......... అసలు నేనైతే ఈరోజు ర్యాగింగ్ కు భయపడి కాలేజ్ కు రాకూడదు అని ఇంట్లోనే నా రూంలో ఉండిపోయాను . మేము కూడా మేము కూడా అని చాలామంది అన్నారు .
మా అక్కయ్య ఇందుమతి ఇక్కడే సెకండ్ ఇయర్ చదువుతోంది . వెంటనే కాల్ చేసి విషయం చెప్పడంతో మాటల్లో చెప్పలేని ఆనందంతో వచ్చేసాను . ర్యాగింగ్ జరగకుండా చూసిన అన్నయ్యలను కూడా నాకు పరిచయం చేసింది .
ఇందు ......... ఎవరు ఎవరు ఆ అన్నయ్యలు అని అడిగారు .
బయట కలిశాను ఫ్రెండ్స్ , ఈపాటికి వెళ్ళిపోయి ఉంటారు . ఎమున్నారు హీరోల్లా ............. అన్నయ్యలూ అని పిలవబుద్ధి అవ్వలేదు నాకు అనిచెప్పడంతో ,
చెల్లికి 50% అనుమానం కలిగింది .
అవునా అవునా ......... shit shit మాకు ఆ అదృష్టం లేదు , కనీసం నెంబర్ అయినా ఉన్నా థాంక్స్ చెప్పేవాళ్ళము . కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పటి నుండి ఎంత భయపడ్డామో తెలుసా , అలా ఎంటర్ అవ్వగానే మొత్తం పోగొట్టేశారు అని ఫీల్ అవుతుంటే,
ఫ్రెండ్స్ నాదగ్గర నెంబర్ ఉందిగా మా అక్కయ్య ఫ్రెండ్ దగ్గర ఉండటంతో తీసుకున్నాను అనగానే , ప్రతి అమ్మాయి చుట్టుముట్టేసి please please ............ అని నలిపేస్తూ అడిగారు .
సరే సరే ఫ్రెండ్స్ ఒక్కనిమిషం మన సంతోషానికి కారణమైన అన్నయ్యలకు మనం హృదయపూర్వకంగా థాంక్స్ చెప్పాలి వీలైతే చిలిదనంతో ఒక ఆటపట్టిద్దాము అని అందరూ సంతోషంతో యాహూ అని కేకలువేసి , ఫ్రెండ్ ముందు నెంబర్ చెప్పమని మొబైల్స్ బయటకు తీశారు .
సగం నెంబర్స్ చెప్పగానే వాడు , అన్నయ్యనే ......... అని కళ్ళల్లో చెమ్మతో వెంటనే తుడుచుకుని నాకోసం ఇంతమంది పెదాలపై చిరునవ్వు అని మురిసిపోతోంది .
అందరూ ఒకేసారి కాల్ చెయ్యడంతో బిజీ బిజీ అని వస్తుండటంతో వాట్సాప్ లో సేవ్ చేసుకుని థాంక్స్ ......... అని మెసేజ్ లు పంపించారు .
కృష్ణ ......... అందరూ తీసుకున్నారు నీకు వాళ్లకు థాంక్స్ చెప్పాలని లేదా అని అడిగింది .
చిలిపినవ్వుతో ఇందు ........ ఇలా రా అని మీదగ్గర కేవలం నెంబర్ ఉంటే నా హృదయంలో వాళ్లే ఉన్నారు అని చెవిలో గుసగుసలాడి , నేను కృష్ణగాడు చెల్లీ బుగ్గలపై ముద్దులుపెడుతున్న పిక్ తీసి అన్నయ్య , వీడు నా హీరో అని చూపించింది .
అంటే కృష్ణ .......... నీకోసం మొత్తం అందరు అమ్మాయిల పెదాలపై చిరునవ్వు , గుండెల్లో ధైర్యం నింపారన్నమాట , ఎంత అదృష్టవంతురాలివే నువ్వు థాంక్యూ soooooo మచ్ అని అందరికీ చెప్పబోతుంటే ,
నా అన్నయ్య ఏమిచేసినా ఒక కారణం ఉంటుంది కాబట్టి చెప్పకు అని ప్రామిస్ తీసుకుంది .
ఆ అన్నయ్యలలో మీ అన్నయ్య ఎవరన్నావు ......... ఇదిగో అని మళ్ళీ పిక్ చూపించి, ఈ క్షణం నుండి నీ ప్రియుడు మాత్రమే నాకు అన్నయ్య , మీ అన్నయ్య ........ అని సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతోంది .
ఇందు ......... sorry to say this , మా అన్నయ్య హృదయం ఒక దేవతతో నిండిపోయింది . ఇంత ఇంత అంటే కూడా స్థానం లేదు అక్కడ , ఎంత ప్రయత్నించినా వేస్ట్ అని హత్తుకొని చెప్పింది .
మీ అన్నయ్య సంతోషన్గా ఉండాలి ........... అని కన్నీళ్లను తుడుచుకుని , నువ్వు మాత్రం చెప్పకు ఆటపట్టించైనా సంతోషిస్తాము please please please ...... కృష్ణ అని గడ్డం పట్టుకుని బ్రతిమాలింది .
మీ ఇష్టం అని నవ్వుకుని కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ ఈరోజు క్లాస్సెస్ లేవు లంచ్ కు ఇంటికివెళ్లిపోవచ్చు అనిచెప్పి అన్నయ్యకు ఇలా మెసేజ్ లు వస్తూనే ఉంటాయని చెప్పడంతో , వాడు గట్టిగా నవ్వుకుని అయితే మీ అన్నయ్య అయిపోయాడు అని బదులిచ్చి బయట వేచిచూస్తుంటాము రా లవ్ యు అని ప్రేమతో ముద్దుపెట్టాడు .
ఏంట్రా అని అడిగాను .......... మొదటిరోజు కదరా నీ చెల్లికి క్లాస్సెస్ లేవు అని లంచ్ కు ఇంటికి వెళ్లిపోదాము అనిచెప్పింది .
అయినా ఏంటి నీ మొబైల్ కు మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి అని భుజం పై చేతినివేశాడు .
ఏంటో రా ......... థాంక్స్ అన్నయ్యా , లవ్ యు హీరో ......... అని చాలా నెంబర్స్ నుండి మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి . అందరూ అమ్మాయిలే అనిచెప్పాను .
ఏదీ చూడనీ అని మొబైల్ అందుకొని చూసి రేయ్ మామా ......... లవ్ మెసేజ్ లుకూడా , హార్ట్ కూడా పంపించారు .
ఇగ్నోర్ రా మామా ......... నా హృదయం అక్కయ్యకు , చెల్లికి మాత్రమే తెలుసుకదరా ........ అని కట్ చేసేసి , ఇక తమరు ఎప్పుడు కాలేజ్ కు అని అడిగాను .
సిగ్గుపడుతూ ......... అదిగో నా కాలేజ్ అని ప్రక్కనే ఉన్న govt డిగ్రీ కాలేజ్ వైపు వేలిని చూపించాడు . రేపే నీ చెల్లిని ఇక్కడ వదిలి జాయిన్ అయిపోతాను .
నా చెల్లికి దగ్గరలోనే ......... పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నావు , లవ్ యు రా మామా ఇక రోజూ ఇద్దరూ వెళ్లొచ్చు రావచ్చు హమ్మయ్యా ........అనుకున్నాను .
మరి నీ కాలేజ్ ...........
ఇంకా నెలరోజుల సమయం ఉందిరా ........ అని బదులిచ్చాను . IPS అవ్వాలంటే ఫస్ట్ ఇయర్ నుండే ప్రిపేర్ అవ్వాలిరా కాబట్టి కాలేజ్ జాయిన్ అయ్యాక పార్ట్ టైం జాబ్ వదిలేసి కేవలం అదే లక్ష్యంతో ముందుకువెల్లు .
మరి డబ్బు ఎలారా ......... రేయ్ ఉన్న డబ్బుతో జాగ్రత్తగా ఖర్చు చేసుకువెళ్లడమే , మన లక్ష్యాలకు తప్ప మనం ఇక దేనికి ఖర్చు చేస్తామురా ........ కానీ చెల్లికిమాత్రం ఏలోటూ రానివ్వకూడదు అడగకముందే మనమే తెలుసుకుని తీర్చాలి , నేనున్నాను కదా అని ధైర్యం చెప్పాను .
లవ్ యు రా మామా అని ఉద్వేగంతో కౌగిలించుకున్నాడు .
లంచ్ బెల్ కొట్టగానే చెల్లి తన ఫ్రెండ్ ఇందుతోపాటు బయటకువచ్చి స్కూటీ ఆపివచ్చి అమాంతం మాఇద్దరినీ కౌగిలించుకుని లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని గుండెలపై వాలిపోయింది .
ఏంటి చెల్లీ ఏమైంది ....... అని తెలిసినా నవ్వుతూ ఆడిగాము .
నన్ను వదిలి పార్టీకి వెళ్లినప్పుడే అనుకున్నాను ఇలాంటిదానికోసమే అని అంటూ మా గుండెలపై కొట్టింది .
చెల్లీ ........ అంటే అందరికీ ..........
లేదులే అన్నయ్యా ......... మాఇద్దరికి మాత్రమే తెలుసు కానీ మిమ్మల్ని మాత్రం అందరూ దేవుల్లాగా కొలుస్తున్నారు . మెసేజ్ లు కాల్స్ వచ్చే ఉంటాయి అన్నయ్యా ..........
లేదే .........
ఏదీ అన్నయ్యా ........ మొబైల్ ఇవ్వు అని చూసి నవ్వుకుని నా అన్నయ్య గురించి నాకు తెలుసులే , ఇదిగో ఇదికూడా మీకు ఫ్లాట్ అయిపోయింది . మీ హృదయంలో అక్కయ్యకు తప్ప స్థానం లేదు అని చెప్పాను . మీరు హ్యాపీగా ఉంటే చాలని అర్థం చేసుకుంది .
చెల్లీ ......... అక్కయ్య మాత్రమే కాదు మరొకరు కూడా ఉన్నారు ........
ఎవరన్నయ్యా ......... ఆ అదృష్టవంతురాలు అని తలబధించుకుని నేను కాకుండా ఇంకెవరు అని ఫీల్ అవుతోంటే ,
నా ప్రియ మిత్రుడి హార్ట్ అని చెప్పాను .
లవ్ యు అన్నయ్యా .......... వేరే పేరు చెప్పి ఉంటే , బ్యాగులోని పెప్పర్ స్ప్రే కొట్టేసేదాన్ని అని తియ్యదనంతో నవ్వుకుని , లవర్స్ ను కూడా కలిసి ఇంటికి చేరుకున్నాము .
ఈరోజు కూడా నా చెల్లి చేతితో తినే అదృష్టం ఉంది అంటీ అని చెప్పాను.
నెక్స్ట్ రోజు తెల్లవారుఘామున నుండి 8 గంటలవరకూ అక్కయ్యకోసం కేటాయించి తరువాత కృష్ణగాడు రెడీ చేసుకున్న సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళొస్తామురా అని చెల్లిని కాలేజ్ లో వదిలి , ర్యాగింగ్ లేకపోవడంతో సంతోషించి డిగ్రీ జాయిన్ అవ్వబోతున్నాను ఏంజెల్ అని ఈసారి వీడే పెదాలపై ముద్దుపెట్టి , ఇందుమతితోపాటు లోపలకు వెళ్లినతరువాత , కాలేజ్ కు వెళ్లి ఆర్ట్స్ లో జాయిన్ అయ్యి ఇద్దరికీ కాల్ చేసి చెప్పాడు . ఆ తరువాతి రోజు నుండీ ఇద్దరినీ కేవలం స్టడీస్ లో మాత్రమే involve అయ్యేలా చేసాను . నెలరోజులూ మార్నింగ్ మధ్యాహ్నం కూడా నేనే జాబ్ చేస్తూ వెళ్ళాను .
ఇక నా జాయినింగ్ date రావడంతో , ముందురోజే అన్నింటినీ రెడీ చేసుకున్నాను . ఉదయమే మాఇద్దరినీ గుడికి తీసుకెళ్లివచ్చి ఫైల్ అందించి all the best అన్నయ్యా ......... ఈరోజు నుండీ ముగ్గురమూ స్టూడెంట్స్ అయిపోయాము అని సంతోషంతో నవ్వుకున్నాము . అక్కయ్య ఫోటో ముందు నిలబడి మీరు ఆశించిన గమ్యం వైపు తొలి అడుగు వెయ్యబోతున్నాను అని గుండెలపై చేతినివేసుకొని కళ్ళుమూసుకున్నాను . అంటీ , అంకుల్ కు వెళ్ళొస్తామని చెప్పి ముగ్గురమూ బయలుదేరాము .
ఇద్దరినీ వాళ్ళ కాలేజ్ ల దగ్గర వదిలేసి బుల్లెట్ లో సెంట్రల్ యూనివర్సిటీ చేరుకుని ఆఫీస్ రూంలో ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తిచేసి అమౌంట్ పే చేసి , మా బిల్డింగ్ ఎక్కడో తెలుసుకుని సరైన సమయానికే క్లాస్రూం లో అడుగుపెట్టాను . కేవలం 8 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు . వెళ్లి ఒక స్టూడెంట్ ప్రక్కన కూర్చుని పరిచయం చేసుకున్నాము . మహేష్ - రమేష్ అని .
అంతలోనే ఒక 65 - 70 ఏళ్ల లెక్చరర్ వచ్చారు . కళ్ళు కూడా సరిగ్గా కనపడనట్లు అందరినీ తీక్షణంగా చూసి గుడ్ మార్నింగ్ I am నారాయణ ....... మీరంతా నన్ను ఎందుకు అలా చూస్తున్నారో నాకు అర్థమయ్యింది . నేను రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది . మీకు కొత్త ప్రొఫెసర్ అపాయింట్ అయ్యేంతవరకూ యూనివర్సిటీ నన్ను aaproach అవ్వడంతో తప్పలేదు . నేనేదో క్లాస్ లో నేర్పిస్తాను అని ఆశించి వచ్చినవాళ్ళు వెంటనే మీ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్లి ఎక్కడైనా వేరే కాలేజ్ లలో చేరిపోండి . Yes .......... ఈ కోర్స్ ఎంచుకున్నారంటే మీలో టాలెంట్ ఉంటేనే అని నాకు తెలుసు . రేపటి నుండి క్లాస్ కు కూడా రావాల్సిన అవసరం లేదు . నా మెయిల్ ఇస్తాను ఎటువంటి డౌట్స్ ఉన్నా మెయిల్ చెయ్యవచ్చు అని బోర్డ్ పై రాశారు . మీరు మీలో ఉన్న సృజనాత్మకతను మీరే బయటకు తీసుకురావాలి . అందుకు మీరు సిటీలోని అత్యద్భుతమైన కట్టడాలను , బిల్డింగ్స్ కు వెళ్లడం . దాని స్కెచ్ గీయడం ......... ఏవైనా తప్పులుంటే గుర్తించడం . దానికి మీరు ఎలా సొల్యూషన్ స్కెచ్ గీస్తారో గీసి నాకు మెయిల్ చెయ్యడం అంతే , మీరు సిటీలో ఏ బిల్డింగ్ గమనించాలనుకుంటారో నాకు తెలిపితే క్షణాల్లో యూనివర్సిటీ ఇంకా అవసరమైతే govt నుండి పర్మిషన్ ఇప్పిస్తాను . మొదటగా నా సలహా బిర్లా మందిర్ , బుద్ధ విగ్రహం , గోల్కొండ ఫోర్ట్, సాలర్ జంగ్ మ్యూజియం , చార్మినార్ ప్రక్కనే ఉన్న మక్కా మసీదు ....... ఇలా హిస్టారికల్ places నుండి మొదలెట్టి న్యూ టెక్నాలజీ తో నిర్మించిన బిగ్గెస్ట్ బిల్డింగ్స్ రీసెర్చ్ చెయ్యవచ్చు . 24/7 మీకు అందుబాటులో ఉంటాను స్టూడెంట్స్ all the బెస్ట్ thats it సైనింగ్ ఆఫ్ అనిచెప్పి ఎలా వచ్చారో అలా వెళ్లిపోయారు .
మహేష్ మనం ఇక క్లాస్ లో కలవలేమేమో అని రమేష్ చెప్పాడు .
అయితే ఫీల్డ్ లో కలుద్దాము ఫ్రెండ్ నేను ఈరోజు సాయంత్రం బిర్లా మందిర్ రేపు గోల్కొండ ఫోర్ట్ వెళ్తున్నాను అని నా పెరుతోపాటు సర్ కు మెసేజ్ పెట్టిన 10 నిమిషాలకే , హలో మహేష్ all the best అని గ్రాంటెడ్ లెటర్ మెయిల్ చేశారు .
అధిచూసి రమేష్ కూడా సర్ కు మెయిల్ పంపించి లెటర్ రాగానే సంతోషంతో హైఫై కొట్టి , సాయంత్రం గుడిలో కలుద్దాము క్యాంటీన్ కు వెళదామా అన్నాడు .
Sure అని వెళ్లి కలిసి కాఫీ తాగి నెంబర్స్ ఎక్స్చేంజి చేసుకుని కాస్త పని ఉంది ఫ్రెండ్ అని hug చేసుకుని యూనివర్సిటీ నుండి బయటకువచ్చేసి స్టడీ కోసం కావాల్సిన ఐటమ్స్ తీసుకుని చెల్లి కాలేజ్ చేరుకున్నాను .
లంచ్ టైం లో ముగ్గురమూ కలిసాము . అన్నయ్యా , రేయ్ మామా ...... కాలేజ్ ఎలా ఉంది ఎలా ఉంది అని ఉత్సాహంగా అడిగారు .
రేయ్ మామా , చెల్లీ ......... ఇక కాలేజ్ కు వెళ్లాల్సిన పనిలేదు .
అన్నయ్యా ..........
చెల్లీ ఆకలేస్తోంది తినిపిస్తూ ఉండు చెబుతాను అని తింటూ కాలేజ్ ఎంటర్ అయ్యింది దగ్గర నుండి మొత్తం చెప్పి , ఫస్ట్ రీసెర్చ్ బిర్లా మందిర్ నుండి మొదలేదదామని అనుకుంటున్నాను . మీ కాలేజ్ అయిపోగానే ఇంటికివచ్చెయ్యండి ఫ్రెష్ అయ్యి వెళదాము అనిచెప్పాను .
ఇదేదో సూపర్ గా ఉంది అన్నయ్యా .......... హైద్రాబాద్ మొత్తం యూనివర్సిటీ పర్మిషన్ తో హ్యాపీగా చుట్టేస్తూ వర్క్ తోపాటు ఎంజాయ్ కూడా చెయ్యొచ్చు . సండే సండే మేముకూడా రావచ్చా .........
రెండు రోజుల్లో సండే కాబట్టి గోల్కొండ వెళదాము . నేను రేపు వెళ్లి మాక్సిమం స్టడీ చేసేస్తాను . సండే ఎంజాయ్ చేద్దాము అని చెప్పాను .
లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ......... అని ముగ్గురమూ హత్తుకొని , తినేసి నేను మాత్రమే ఇంటికి చేరుకున్నాను .
సాయంత్రం చెల్లివాళ్ళు రాగానే ఫ్రెష్ అయ్యి చెల్లి పట్టు లంగావోణీతో , మధ్యాహ్నం తీసుకున్న వస్తువులను ఒక బ్యాగులో ఉంచుకుని కిందకు వచ్చాము .
మేము కూడా రెడీ అని అంకుల్ కూడా పూజ వస్తువులతో బయటకువచ్చారు .
మహేష్ నువ్వు చెప్పకపోతే , మా తల్లి చెప్పదనుకున్నావా మధ్యాహ్నమే కాల్ చేసి చెప్పింది , ఇదిగో రెడీ అయిపోయాము . మేమంతా కారులో వస్తాము మీరిద్దరూ బైకులో వెనుకే రండి అదే పనిష్మెంట్ అని చెల్లిని పిలిచారు .
అక్కయ్యా ........ అంటూ చేతిని చుట్టేసి కార్తీక , చెల్లిని లాక్కునివెళ్లి వెనుక కారులో కూర్చున్నారు .
నవ్వుకుని ఇద్దరమూ వెనుకే ఫాలో అయ్యాము . టెంపుల్ చేరుకునేసరికి 6 గంటలు అయ్యింది . టెంపుల్ మొత్తం విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది .
మహేష్ ఈరోజు చాలా మంచిరోజు అని ఏదో చెప్పారు అంకుల్ .........., అన్నయ్యా ......... పండగ లాంటి రోజున పని మొదలుపెడుతున్నారు. అంతా అక్కయ్య ఆ అమ్మవారి ఆశీర్వాదం అని సంతోషంతో వెళ్లి దర్శనం చేసుకున్నాము .
చెల్లీ ......... మీరు ప్రదక్షణలు చేసి ప్రశాంతంగా కూర్చోండి , ఆలస్యం అవ్వవచ్చు వెళ్లాలనిపిస్తే కారులో వెళ్లిపోండి అనిచెప్పాను .
మహేష్ పవిత్రమైన రోజున నీవలన గుడికి వచ్చాము . ఎంత ఆలస్యం అయినా పర్లేదు ఇంత ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది . ఒక్కొక్కరమూ ఒక్కొక్కసారి ప్రసాదం తీసుకొచ్చి తింటూ కూర్చుంటాము నువ్వు వెళ్లు అనిచెప్పారు .
రేయ్ నేనూ ..........
ఇద్దరమూ టెంపుల్ ఈవో ను కలిసి లెటర్ చూపించి పర్మిషన్ తీసుకుని , ఒకసారి గుడిచుట్టూ తిరిగొచ్చి , పొడవులను కొలిచే ఎలక్ట్రానిక్ ఐటమ్ బయటకు తీసాను . ఎదురుగా గోడపైకి లైటింగ్ వేస్తే ఎన్ని అడుగులు ఉందొ డిజిటల్ మీటర్లో చూపిస్తుండటం చూసి కృష్ణగాడు ఆశ్చర్యపోయాడు .
రేయ్ మామా ......... ఎక్కడిదిరా , ఆన్లైన్లో చూసానురా ఇంట్రస్టింగ్ గా అనిపించడంతో ఉదయం తీసుకున్నాను . ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి పని సులభతరం అవుతుంది అని సుమారు 3 గంటలపాటు గుడి సౌందర్యాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆనందించాను . 9 గంటలకు చెల్లీవాళ్ళు ఎక్కడ ఉన్నారు అనిచూస్తే దేవుడి ముందు భజన చేస్తుంటే భక్తిలో మునిగితేలుతున్నారు .
మేముకూడా కొన్ని నిమిషాలు కూర్చుని పూర్తయిన తరువాత ఇంటికి చేరుకుని భోజనం చేసి గుడ్ నైట్ చెప్పేసి పైకివెళ్లాము.
The following 21 users Like Mahesh.thehero's post:21 users Like Mahesh.thehero's post
• 9652138080, AB-the Unicorn, Bangaru, Fuckingroll69, Jack789, Joncena, Kumarmb, kummun, Mahe@5189, maheshvijay, Milffucker, Naagu nag, nkp929, RAANAA, Rajeev j, Sachin@10, Shaikhsabjan114, sisusilas1@, sri7869, SS.REDDY, sweetdumbu
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
బయట లైట్స్ వేసి ఛార్ట్స్ , పెన్సిల్ , స్కెచెస్ మరియు స్టాండింగ్ స్టాండ్ తీసుకుని బయటకువచ్చి అన్నీ arrange చేసి అక్కయ్య ఫోటో ప్రక్కనే పెట్టుకుని ఉమ్మా ........ లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అని ముద్దుపెట్టాను . చెల్లీ వాడు వెనుకే ఉన్నట్లు నవ్వుకుని నేనుకూడా లవ్ యు అక్కయ్యా అని బుగ్గపై ముద్దుపెట్టి అక్కడే చదువుకుంటున్నారు .
టెంపుల్ మొత్తం డ్రా చేసి నాకు అర్థమైనవన్నీ గుర్తిస్తూ 100 ఇయర్స్ ముందే టెక్నాలజీ లేకున్నా అద్భుతమైన సృష్టికి , కళలకు మైమరచి ఆ ఇంజినీర్లకు హ్యాట్సాఫ్ చేసి పర్ఫెక్ట్ అని మొబైల్లో పిక్ తీసి ఇదేవిషయాన్ని సర్ కు మెయిల్ చేసి , లాప్టాప్ అందుకొని గోల్కొండ ఫోర్ట్ ఆర్కిటెక్చర్ గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అందరమూ ఒకేసారి నిద్రపోయాము .
తరువాతి రోజు 9 గంటలవరకూ అక్కయ్యను గాలించి ఇంటికి చేరుకుని టిఫిన్ చేసి ముగ్గురమూ బయలుదేరి కాలేజ్ దగ్గర వదిలేసి , మొబైల్లో gps ద్వారా గోల్కొండ వైపు పోనిచ్చాను . దారిలో నాకు ఇంటరెస్ట్ అనిపించిన మాల్స్ , హోటల్స్ , అపార్ట్మెంట్స్ , బిల్డింగ్స్ ను మొబైల్లో ఫోటోలు తీస్తూ గోల్కొండ చేరుకున్నాను . నేరుగా ఆఫీస్ రూమ్ కు వెళ్లి లెటర్ చూపించి పర్మిషన్ తీసుకున్నాను .
All the best ........... మహేష్ అని టెంపరరీ ID కార్డ్ ఇచ్చారు . అంతలో రమేష్ వచ్చి sorry మహేష్ నిన్న రావడం కుదరలేదు 5 మినిట్స్ అని లోపలకువెళ్లి Id కార్డ్ తోపాటు రావడంతో ఇద్దరమూ ఫస్ట్ టాప్ చేరుకుని పెద్ద గోడపై నిలబడి చుట్టూ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయి , రమేష్ అప్పటి ఆర్కిటెక్ట్ ఇప్పుడు చేయలేకపోతున్నారు అని సాయంత్రం వరకూ ఒక చివర నుండి ముందుకువెళుతూ గొప్పతనాన్ని , అక్కడక్కడా కొన్ని తప్పులనూ గుర్తించాము .
క్లోజింగ్ సమయానికి బయటకువచ్చి ok రమేష్ రేపు కలుద్దాము అని ఇంటికి చేరుకున్నాను .
అన్నయ్యా ....... టైర్డ్ అయినట్లున్నారు ఫ్రెష్ అయ్యిరండి మ్యాగీ చేసిస్తాను అని వచ్చేటప్పటికి కాఫీ మ్యాగీ చేతిలో పట్టుకుని రెడీగా ఉంది . నేను వచ్చేన్తవరకూ కూడా ఆగకుండా నోట్లో ఇంత తురుక్కుని tasty రా మామా ........ , డార్లింగ్ మీ అన్నయ్యకు తిని......పించు అని చెప్పాడు .
ఇద్దరమూ నవ్వుకుని తిని , నిన్నలానే పూర్తయినంతవరకూ చార్ట్ ప్రిపేర్ చేసాను .
కార్తీక ఉత్సాహంతో పైకివచ్చి అక్కయ్యా .......... అమ్మా నాన్న రేపు ఉదయమే 5 గంటలకు బెంగళూరు వెళుతున్నారు పెళ్లికి ఉదయమే వాళ్ళను ఎయిర్పోర్ట్ లో వదిలేసి మనం ఫోర్ట్ కు కారులో వెళ్లొచ్చు అని సంతోషంతో చెప్పింది .
ఉదయం 5 గంటలకు అంకుల్ పిలువగానే నాతోపాటు వస్తున్న కృష్ణగాన్ని ఆపి చెల్లెళ్ళకు తోడుగా ఎవరుంటారురా మూసుకుని ఇక్కడే ఉండు కావాలంటే మరికొద్దిసేపు దున్నపోతులా నిద్రపో అనిచెప్పి ఒక్కడినే వెళ్లి ఎయిర్పోర్ట్ లో వదిలేసివచ్చాను . వచ్చేలోపు అక్కయ్యను వెతకడానికి వెళ్లారని తెలిసి ఫ్రెష్ అయ్యాను . 10 గంటలకు నలుగురమూ కారులో వెనుక చెల్లిని అక్కడా ఇక్కడా తాకుతూ గిల్లుతూ ఎంజాయ్ చేస్తుంటే కార్తీకతోపాటు నవ్వుకుని ష్ ష్ ...... అంటూ మిర్రర్ వెనక్కు తిప్పేసాను .
రేయ్ ఘాడమైన ముద్దుఇస్తాను సైలెంట్ గా కూర్చో అని ముద్దుపెట్టి , లవ్ యు రా అంటూ వాడి గుండెలపై వాలిపోయింది .
ముద్దు అదిరిపోయింది కృష్ణ అని రెండు చేతులతో గట్టిగా చుట్టేసి డ్రైవర్ కాస్త AC పెంచవయ్యా .......... వొళ్ళంతా ఏదో అయిపోతోంది అని ఆర్డర్ వేసాడు .
సరే సర్ ..........
మా అన్నయ్యనే డ్రైవర్ అంటావా అని వాడి బుగ్గపై కొరికేసింది .
లవ్ యు లవ్ యు డార్లింగ్ , అంటాను మళ్లీ అంటాను మళ్లీ కొరికేయ్యి i loved it అని ఏకమయ్యేలా చుట్టేసి నుదుటిపై పెదాలను తాకించి పరవశించిపోతున్నాడు .
పార్కింగ్ లో నాకోసమే ఎదురుచూస్తున్న రమేష్ ను చేరుకుని hi hi అంటూ అందరినీ పరిచయం చేశాను .
Id కార్డ్స్ చూపించి అందరమూ నేరుగా లోపలికి వెళ్లిపోయాము . చెల్లెమ్మా ......... ఎక్కడికైనా వెళ్లే పర్మిషన్ మనదగ్గర ఉంది అని నా id కార్డ్ కృష్ణగాడికి అందించి ముగ్గురూ వెళ్లి ఫోర్ట్ మొత్తం చుట్టేయ్యండి మేము పనిచూసుకునివస్తాము అని చెరొకవైపు వెళ్లి మధ్యాహ్నం లోపు పూర్తిచేసి చెల్లివాళ్ళతో జాయిన్ అయ్యి లంచ్ చేసి సాయంత్రం వరకూ ఫోటోలు సెల్ఫీలతో పిచ్చెక్కిపోయేలా ఎంజాయ్ చేసి పూర్తిగా అలసిపోయినట్లు , అందరమూ ఫేమస్ హోటల్లో బిరియానీ తిని , రమేష్ కు మళ్లీ మరొకచోట కలుద్దాము అనిచెప్పి 9 గంటలకు ఇంటికిచేరుకున్నాము .
కాసేపు రెస్ట్ తీసుకుని గోల్కొండ ఫోర్ట్ మా రివ్యూ ని , సలహాలను సర్ కి పంపించి , అక్కయ్యా ........ ఈరోజు చాలా ఎంజాయ్ చేసాము మీరు ఎలాగైతే నన్ను గుంటూరు మొత్తం చూపించడానికి వెళ్ళాము కదా అలా అని అక్కయ్య ఆల్బమ్ తిరగేస్తూ అలసిపోయి నిద్రపోయాను .
తెల్లవారకముందే లేచి టైం కోసం మొబైల్ చూస్తే సర్ నుండి మెయిల్ .........వెల్డన్ మహేష్ , keep it up , నన్ను కూడా ఆలోచనలో పడేసింది నీ టోటల్ రివ్యూ , ఇలాగే ఇష్టంతో ముందుకువెల్లు ఎటువంటి హెల్ప్ అయినా చేస్తాను అని రిప్లై చదివి అప్పుడే స్నానం చేసివచ్చిన చెల్లికి చూపించాను .
మా అన్నయ్య గురించి మాకు ఎప్పుడో తెలుసు అని నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టి గుడ్ మార్నింగ్ చెప్పింది .
గుడ్ మార్నింగ్ చెల్లీ అని వాడు ఫ్రెష్ అవ్వగానే బాత్రూమ్లోకి దూరిపోయాను .
ఇక ఆరోజు నుండి ఉదయం హిస్టారికల్ , లేటెస్ట్ బిల్డింగ్స్ కు వెళ్లి రోజురోజుకూ కొత్తకొత్త విషయాలను తెలుసుకుంటూ , నెట్ నుండి గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్స్ గురించి తెలుసుకుంటూ రోజులు వేగంగా గడిచిపోయాయి .
చెల్లి ఫస్ట్ ఇయర్ exams అవ్వడం యూనివర్సిటీ టాప్ రావడం , ముందు వెళ్లి అక్కయ్యకు చెబుతోంటే విని సంతోషం పట్టలేక చెల్లిని అమాంతం ఎత్తేసి చుట్టూ తిప్పేసాము .
అంటీ same డైలాగ్ తో నా తల్లి గిరించి నాకు తెలుసు అందుకే ఉదయమే స్వీట్స్ చేసేసాను అని తినిపించడంతో అందరమూ సంతోషంతో నవ్వుకున్నాము .
కొన్నిరోజులకు ఒకేసారి పది వేల , 15 వేలు , 20 వేలు .........5 వేలు , 10 వేలు ...... ఇలా నా అకౌంట్లోకి 10 నిమిషాలపాటు అమౌంట్స్ పెడుతూనే ఉన్నాయి చెక్ చేస్తే ఊరిజనమందరూ పంపిస్తున్నారు . పెద్దయ్యకు కాల్ చేసేంతలో పెద్దయ్యే కాల్ చేసి మహేష్ ......... వరుస మూడు పంటలతో బ్యాంక్ రుణాలను మొత్తం తీర్చేసాను . ఇక మిగిలిన లాభం మొత్తం మీ అవసరాలకోసం పంపించాము సంతోషంతో అనిచెప్పారు.
పెద్దయ్యా ......... చాలా సంతోషం . కానీ అవసరమైనప్పుడు నేనే అడుగుతాను కదా అప్పటివరకూ లాభాలను జాగ్రత్తగా సేవ్ చేసుకోండి , మీకు మళ్లీ ముందులాంటి పరిస్థితులు రాకూడదు అని ఎవరి అమౌంట్ వారికి పంపించేసాను .
అలా పంట చేతికొచ్చిన ప్రతిసారీ మొత్తం లాభాన్ని మాకు పంపించడం , నేను వెంటనే వెనక్కు పంపించడం మాకు అలవాటైపోయింది .
చెల్లి స్టీడీస్ లో మరింత బిజీ అవ్వడం , కృష్ణగాడు IPS కోసం సామాజిక పరిస్థితులను అధ్యయనం చెయ్యడం , నేను ప్రతి బిల్డింగ్ రివ్యూ సర్ కు పంపిస్తూ రోజూ ఏదో ఒక కొత్తదనాన్ని తెలుసుకోవడంతో బిజీ బిజీ అయిపోయాము . నా ఊహాలతో కొత్తవాటిని ఆవిష్కరిస్తూ సర్ మన్ననలు పొందుతూ , కలవమని చెప్పడంతో అప్పుడప్పుడూ కలుస్తూ డిస్కస్ చేసేవాళ్ళము . రెండవ సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వడం ....... చెల్లి ఆ సంవత్సరం కూడా టాప్ వచ్చింది . చివరి ప్రాజెక్ట్ పూర్తిచేయ్యడంతో నా కోర్స్ పూర్తయ్యి సర్టిఫికెట్ చేతికి రావడం , సర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని జాబ్స్ వేటలో పడ్డాను . మాదగ్గర ఉన్న డబ్బంతా అయిపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యినా ముందుకు నడిచాము . తప్పని పరిస్థితుల్లో అంకుల్ కు కాల్ చేసి కాస్త అమౌంట్ తీసుకున్నాను .
మహేష్ ఎంత అవసరం అయినా మోహమాటపడకుండా అడగమని లక్ష రూపాయలు పంపించారు .
మరుక్షణమే అంకుల్ పైకివచ్చి మహేష్ నా ఇజ్జత్ మొత్తం పోయింది వాడు కాల్ చేసి మహేష్ కు డబ్బు అవసరం నువ్వేమి చేస్తున్నావురా అని బండ బూతులు తిట్టాడు.
ఇంకొక్కసారి ఇలా జరిగితే బాగుండదు చెబుతున్నాను . ఎంత కావాలంటే అంత డ్రా చేసుకో , మీరు సెటిల్ అయ్యాక వడ్డీతోపాటు ఇవ్వొచ్చులే అని నవ్వుతూ చెప్పారు .
అంకుల్ నెక్స్ట్ ఖచ్చితంగా ఇప్పించుకుంటాము అనిచెప్పాము .
మహేష్ మరొకవిషయం మీ చెల్లికి డాక్టర్ సంబంధం వచ్చింది వారంలో చూసుకోవడానికి వస్తున్నారు అంతా మీరే చూసుకోవాలని , ఈ పెళ్లి చేసేసి మా సొంత village కు వెళ్ళిపోయి నువ్వు చెప్పినట్లుగా ప్రశాంతంగా జీవించేస్తాము అని చెప్పారు .
అంతే ఆనందం పట్టలేక ముగ్గురమూ కిందకు పరిగెత్తి కాబోయే పెళ్లికూతురు ఎక్కడ అని అంటీ గుండెలపై సిగ్గుపడుతున్న కార్తీకను ఆటపట్టించాము .
పైకివచ్చి లాప్టాప్ అందుకొని అన్ని జాబ్స్ వెబ్సైట్ లలో నా resume ఉంచి కాల్స్ కోసం ఎదురుచూస్తున్నాను . నేరుగా ఆఫీస్ లకు కార్తీక పెళ్లిచూపులు తరువాత వెళ్లాలని నిర్ణయించుకున్నాను .
నెక్స్ట్ రోజు నుండే బెంగళూరు , ముంబై కంపెనీల నుండి కాల్స్ వచ్చాయి , హైద్రాబాద్ లో ఉండి వెతుకుతుంటేనే అక్కయ్య జాడ కనిపించడం లేదు ఇక సిటీ వదిలితే శాశ్వతంగా దూరమైపోతాను అని ఇగ్నోర్ చేసాను .
కార్తీక పెళ్లిచూపుల ముందురోజు ఇల్లు కాంపౌండ్ అందంగా కనిపించాలని ముగ్గురమూ శుభ్రం చెయ్యడం చూసి అంటీ అంకుల్ ఆనందంతో పొంగిపోయి చేతులు కలిపారు .
అంకుల్ , మేమిద్దరమూ వాళ్లకోసం బయటే నిలబడి ఎదురుచూస్తూ వచ్చాక పెళ్ళికొడుకుని చూసి , కార్తీక you are lucky అని మనసులో అనుకుని సాదరంగా ఆహ్వానించాము .
అంకుల్ మాఇద్దరినీ కొడుకులుగా పరిచయం చేసారు .
బావగారు డాక్టర్ అనితెలిసి మరింత ఆనందించాము . అంకుల్ అందరినీ లోపలికి పిలుచుకొనివెళ్లి సంప్రదాయాల ప్రకారం ఆథిత్యాన్ని అందించారు .
పెళ్ళికొడుకు హీరోలా ఉన్నాడని లోపల రెడీచేస్తున్న చెల్లికి మెసేజ్ పంపాను .
కార్తీక ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఇక్కడ ఆతృతతో ఎదురుచూస్తోంది అని మెసేజ్ వచ్చేన్తలో , అమ్మాయిని పిలిపించండి అని చెప్పడంతో ,
చెల్లీ , అంటీ పిలుచుకొనివచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చోబెట్టి , లోపలకువెళ్లి టీ తీసుకొచ్చి కార్తీక పెళ్ళికొడుకు వారి బంధువులకు అందించింది . కాసేపు మాటలా తరువాత పెళ్ళికొడుకు మాట్లాడాలి అనిచెప్పడంతో బయట పూల మొక్కల దగ్గరికి వెళ్ళమని అంకుల్ చెప్పారు .
కొన్ని నిమిషాలు మాట్లాడిన తరువాత , పెళ్ళికొడుకు మాత్రమే లోపలికివచ్చి బావలూ , సిస్టర్ అని మాముగ్గురినీ పిలిచారు .
ఆ పిలుపుకు సంతోషించి బయటకువెళ్లాము .
కార్తీక మా ముగ్గురినీ తన ప్రాణం అని పరిచయం చేసింది . బావగారు మీరు బావ అని పిలువగానే ఇక్కడ తాకింది అని సంతోషంతో మాటల్లో పడిపోయి చిరునవ్వులు చిందిస్తూనే , కార్తీక నువ్వు నాకు నచ్చావు I love you అని చెప్పేసారు .
చెల్లిపెదాలపై తియ్యని సిగ్గుతో చెల్లి గుండెలపై వాలిపోయింది .
కార్తీక మరి నీకు అని అడిగింది చెల్లి .........
చెల్లివైపు , మాఇద్దరివైపు చూసి మా ఆనందాన్ని చూసి నాక్కూడా అని చిన్నగా చెప్పి సిగ్గుపడుతోంది .
అంతే కృష్ణగాడు నన్ను చుట్టేసి బావగారు థాంక్స్ అని పైకివెళ్లి 1000 వాలా తీసుకొచ్చి బయట పరిచి అంటించేశాడు .
ఆ సౌండ్ కు అందరూ బయటకు రావడంతో , అంకుల్ ఇద్దరికీ ఒకరికొకరు నచ్చేశారు అని సంతోషంతో చెప్పాము .
నా తల్లే అని అంటీ వచ్చి కార్తీక నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోయింది .
ఇక లోపల అంకుల్ కట్న కానుకలు మాట్లాడటానికి మాఇద్దరినీ కూడా పిలిచి ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు .
మాకున్నదంతా మా చిట్టి తల్లికే ............
ఈ ఇల్లు కూడానా అని అడిగారు .
మీరు కోరితే ఇదికూడా మా అల్లుడి పేరుమీద రాసిచ్చేస్తాను అని చెప్పగానే ,
మీతో సంబంధం మాకిష్టమే త్వరలోనే వచ్చి ఇల్లు చూసుకోండి ముహూర్తాలు పెట్టుకుందాము అని సంతోషంతో వెళ్లిపోయారు .
అంకుల్ .......... బావగారు డాక్టర్ well సెటిల్డ్ అని సంతోషంతో అందరికీ నచ్చేసాడు వెంటనే చకచకా పూర్తిచేసేయ్యండి లేకపోతే కార్తీక ఇలా సిగ్గుపడుతూనే ఉంటుంది అని ఆటపట్టించాము .
నెక్స్ట్ రోజు క్లాసిఫైడ్స్ చూసి ఫైల్ రెడీ చేసుకుని చెల్లి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , అక్కయ్యను తలుచుకుని జాబ్ వేటకై బయలుదేరాను . నాకంటే ముందే చాలామంది నిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చారు .
నన్ను పిలువగానే ఉత్సాహంతో లోపలికివెళ్ళాను . నా టాలెంట్ టెస్ట్ చెయ్యకముందే సర్టిఫికెట్స్ అడిగారు . సర్ ఒకసారి నా ప్లాన్స్ చూడమని ............
నెక్స్ట్ చూస్తాము అని సర్టిఫికెట్స్ ఫైల్ అందుకొని చూసి ఇంటర్ వరకూ జైల్లో చదివినట్లు అడిగి ముందూ వెనుకా ఆలోచించకుండా sorry you may go అని బయటకు చూపించారు .
సర్ .......... ఒకసారి .........
జస్ట్ లీవ్ 9 ఇయర్స్ జైల్లో ఉన్నావంటే నీ కండక్ట్ ఎలాంటిదో మాకు అర్థమైపోయింది అని చెప్పడంతో , ఏమీమాట్లాడలేక బయటకు వచ్చేసాను .
అలా ఏ ఆఫీస్ కు వెళ్లినా ఆ ఒక్కటి ఎత్తిచూపిస్తూ బయటకు పంపించేస్తున్నారు . దాని గురించి నేను బాధపడను కాబట్టి మళ్లీ మళ్లీ try చేస్తూనే వెళ్ళాను .
ఒకరోజు బావగారి ఇంటిని చూడటానికి వెళ్ళాము . అంకుల్ వాళ్ళకంటే డబల్ ఉంది.
బయటనే మాకు నచ్చేసింది . అంకుల్ లానే ఆతిధ్యం ఇవ్వడంతో మంచివారేనని పంతులుగారిని పిలిపించి నిశ్చితార్థం మరియు పెళ్లిని ఫిక్స్ చేసి ఫారిన్ లో ఉన్న కార్తీక అక్కయ్యలు వాళ్ళ బంధువులను రమ్మని ఆహ్వానించారు . రాగానే కార్తీక అంటీ మమ్మల్ని అలా ఇలా అంత ఇంత అని పరిచయం చేసారు . నిశ్చితార్థానికి సునీతమ్మ అంకుల్ కూడా వచ్చారు . ఇంటిలోనే నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించి రెండువారాల్లో మంచి ముహూర్తం ఉంది ఏళ్లకోకసారి వచ్చే ముహూర్తం అని చెప్పడంతో సమయం సరిపోకున్నా రెండువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు .
అన్ని ఊర్లకూ కార్డ్స్ ఇవ్వడం కుదరదు కాబట్టి కాల్స్ , మెయిల్స్ ద్వారా పెళ్లికి ఆహ్వానించారు , మహేష్ మీరు కళ్యాణమండపం సంగతి పెళ్లికి అవసరమైనవన్నింటినీ చూసుకోండి అనిచెప్పారు .
అలా ఆర్డర్ వెయ్యండి అంకుల్ మీరు ఏమీ టెన్షన్ పడకండి బావగారు సూపర్ కార్తీక హాయిగా ఉంటుంది అని ఒక్కొక్కటే అన్నింటినీ బుక్ చేసేసాము .
బంధువుల కోసం హోటల్స్ బుక్ చేసేసాము , ముత్తైదువులతో ఇల్లుమొత్తం కళకళలాడిపోతోంది .
పెళ్లిరోజు రానే వచ్చింది . హడావిడిగా ఇత్సాహంతో అటూ ఇటూ తిరుగుతూ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా కళ్యాణం అంగరంగవైభవంతో జరిగింది .
అప్పగింతలప్పుడు కార్తీక కన్నీళ్లు చూసినా ........ అంకుల్ కళ్ళల్లో ఒకవిధంగా సంతోషం .
బావగారు ప్రాణంలా చూసుకుంటారు కార్తీక అని ముగ్గురమూ ప్రాణంలా హత్తుకొని కారులో కూర్చోబెట్టి , బావగారు ..........
మహేష్ , కృష్ణ .......... మీ చెల్లి వెంట కన్నీరు రాకుండా చూసుకుంటాను . రేపు ఉదయమే హనీమూన్ కు పారిస్ వెళుతున్నాము . అత్తామావయ్యలను ఎయిర్పోర్ట్ కు తీసుకురమ్మని చెప్పడంతో ,
లవ్ యు బావగారు అని సంతోషంతో ఇద్దరమూ చెరొకవైపు హత్తుకొని చెల్లి ప్రక్కనే కూర్చోబెట్టి , చెల్లీ ఎంజాయ్ the హనీమూన్ అని చెప్పాము.
పో అన్నయ్యా ........ అని బావగారి గుండెల్లో తలదాచుకుంది .
కారు వెళ్ళిపోయాక అంటీ కన్నీళ్ళతో బాధపడుతుంటే చెల్లీ , కార్తీక అక్కయ్యలు ఓదార్చి లోపలికి పిలుచుకొనివెళ్లారు .
ఉదయం బావగారు కొరినట్లుగానే అంకుల్ అంటీని కార్తీక అక్కయ్యలను ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళాను .
అక్కడ సంతోషాల తరువాత వెళ్లిపోయారు .
ఆరోజు సాయంత్రమే dad మీ అల్లుళ్లకు ఫుల్ వర్క్ వెళ్ళాలి అని వెళ్లిపోయారు .
పెళ్లి హడావిడి అయిపోవడంతో అంకుల్ ప్రశాంతంగా కాంపౌండ్ లోని చెట్టు కింద కూర్చుని మమ్మల్ని పిలిచి మహేష్ .......... వారంలో వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి మేముకూడా గుంటూరు వెళ్లిపోతాము అని చెప్పారు .
మీ పిల్లల కోసం అలుపు లేకుండా కష్టపడ్డారు ఇక హాయిగా ఉండండి అంకుల్ all the best ఫర్ న్యూ ఇన్నింగ్స్ ........... అనిచెప్పాము .
మేము వెళ్లిపోయినా అల్లుడు గారు మీరు ఇక్కడే ఉండవచ్చు అనిచెప్పారు ఏమీ పర్లేదు డబ్బు అవసరం అయితే ఒక్క కాల్ చెయ్యండి అని వారంలో మొత్తం పూర్తిచేసుకుని ఉద్వేగాల నడుమ వెళ్లిపోయారు .
The following 21 users Like Mahesh.thehero's post:21 users Like Mahesh.thehero's post
• 9652138080, Anamikudu, Babu ramesh, Bangaru, Jack789, Joncena, Kumarmb, kummun, lucky81, Mahe@5189, maheshvijay, Manavaadu, Milffucker, Picchipuku, RAANAA, Rajeev j, Sachin@10, sisusilas1@, sri7869, SS.REDDY, sweetdumbu
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
అన్నయ్యా .......... మళ్లీ ఒంటరి అయిపోయాము . నాకు తెలిసి ఇక్కడ ఉండటం బాగుండదు అని చెల్లి చెప్పింది .
అవునురా మామా ......... నీ చెల్లి చెప్పినది కరెక్ట్ , ఇప్పుడు ఈ ఇల్లు అంకుల్ వాళ్ళది కాదు వేరే ఎక్కడికైనా వెళ్లిపోదాము .
అన్నయ్యా ......... డబ్బు లేదని తెలుసు అని తన నగలను తీసుకొచ్చింది .
చెల్లెమ్మా .......... అని కళ్ళల్లో నీళ్లతో ముగ్గురమూ హత్తుకుని , నా ప్రాణాలు ఉండగా అలా ఇప్పటికీ చెయ్యను అని ప్రాణంలా నుదుటిపై ముద్దుపెట్టాను .
రేయ్ మామా .......... అయితే మా రింగ్స్ తాకట్టుపెడదామురా , డబ్బు ఉన్నప్పుడు విడిపించుకుందాము నువ్వేమీ మాట్లాడకు అని మా ఇద్దరి చేతులనూ పట్టుకుని గోల్డ్ ఫైనాన్స్ కు వెళ్లి రేయ్ కృష్ణ నువ్వు ఇక్కడ ఉంటావు అని చెప్పాడు .
లవ్ యు రా అని రింగ్ తీసి ఇచ్చింది . వెళ్లి తాకట్టుపెట్టి నాచేతిలో డబ్బులు ఉంచాడు .
రేయ్ మామా .......... ఇంకేమీ ఆలోచించకు అని ఇద్దరూ చేతిని చుట్టేశారు .
వెంటనే గోపి అన్నకు కాల్ చేసి ఒక చిన్న ఇల్లు కావాలి , రెంట్ తక్కువగా ఉండాలి అని అడిగాను .
మహేష్ సాయంత్రం లోపు చక్కని ఇల్లు సెట్ చేస్తాను అని ఒకదగ్గరికి రమ్మని చెప్పాడు .
సిటీకి చాలా దూరంలో ఒక చిన్న ఇంటిని చూపించాడు . మహేష్ అర్జెంట్ అన్నారు లేకపోతే .......... కొన్నిరోజుల్లో మరొక కొత్త ఇంటిని చూద్దాము . సరుకులైతే నన్ను నమ్ముతారు కానీ ఇల్లులకు నన్ను నమ్మడం లేదు అని బాధతో చెప్పాడు .
గోపి అన్నా ......... మాకు సరిపోతుంది . రెంట్ కూడా కంఫర్ట్ లో ఉంది రేపు ఉదయమే షిఫ్ట్ అయిపోతాము అని ఓనర్ తో మాట్లాడి అడ్వాన్స్ , రెంట్ ఇచ్చేసి మిగిలిన కొద్దిడబ్బుతో ఇంటికి వెళుతోంటే ,
మహేష్ ........... షిఫ్టింగ్ సంగతి నాకు వదిలెయ్యి ,
అన్నా .......... మహేష్ మీ పరిస్థితి అర్థమౌతోంది , ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ......... అని చేతులు కలిపి మూదు ఇల్లుల తరువాత ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి , భార్యకు పిల్లలకు పరిచయం చేసి విషయం చెప్పాడు .
చాలా సంతోషం బాబు అని కాఫీ ఇచ్చారు .
మహేష్ ఉదయమే షిఫ్ట్ చేసేద్దాము అని హత్తుకున్నారు .
ఇంటికి చేరుకుని చెల్లీ చిన్న ఇల్లు అనిచెప్పాను .
అన్నయ్యా .......... మీతోపాటు పూరి గుడిసెలో ఉన్నాకూడా నాకు ఆనందమే , అమ్మావాళ్లకు తెలిసి బాధపడకుండా చూసుకోవాలి అని చెప్పింది .
లవ్ యు చెల్లీ .......... నిన్ను బాధపెడతామేమో ఆ క్షణం , మేము బ్రతి..........
అన్నయ్యా , రేయ్ ........ అంటూ మాఇద్దరి నోళ్ళను మూసి మాఇద్దరినీ హత్తుకుంది .
తరువాతి రోజు ఉదయం గోపి అన్న వెహికల్ తీసుకురాగానే , గోపి అన్నా పెద్ద వెహికల్ ...........
నా ఫ్రెండ్ ది మహేష్ ధీంట్లో అయితే ఒకేసారి షిఫ్ట్ చెయ్యొచ్చు అని అడిగి తీసుకొచ్చాను అని ఒక్కొక్కటే అన్నింటినీ మార్చేస్తున్నాము .
ఇంతలో కార్తీక మావయ్య గారు వచ్చారు .
అంకుల్ ఎలా ఉన్నారు అని గౌరవించాము.
వెళ్లిపోతున్నారా , హమ్మయ్యా ........ మీకెలా చెప్పడం అని తెగ ఆలోచించాను . మీరే వెళ్లిపోతున్నారు మంచిది . మొత్తం కూల్చేసి అపార్ట్మెంట్స్ లేపాలని కాంట్రాక్టర్ తోపాటు వచ్చాను . బుల్లెట్ కూడా మా వియ్యంకుడి గారిదే అనివిన్నాను .
అవును అంకుల్ అని కృష్ణగాడు పైకివెళ్లి కీస్ తీసుకొచ్చి అందించాడు .
మేము షిఫ్ట్ చేసేంతవరకూ అక్కడే ఉండి ఇంటికి , గేట్ కు లాక్ వేసుకుని పట్టించుకోకుండా వెళ్లిపోయారు .
చెల్లెమ్మా ......... మన గౌరవాన్ని కాపాడావు తల్లీ అని ఇద్దరినీ వెహికల్లో కూర్చోబెట్టి వెనుక స్కూటీలో ఫాలో అయ్యాను .
అక్కడ గోపి అన్న వైఫ్ మరియు పిల్లలు కూడా మాకు సహాయం చేసారు .
అన్నయ్యా ........ ఇంతకంటేనా నాకు బాగా నచ్చింది , అంటీ కూడా క్లోజ్ అయిపోయారు . మనం ఎప్పుడూ ఒంటరివాళ్ళం కాదు అని సంతోషించింది .
ఇద్దరమూ గుండెల నుండి నవ్వలేకపోయాము . రేయ్ మామా సాయంత్రం లోపు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటానురా .......... కొన్ని రోజులు జాబ్ స్టడీస్ అడ్జస్ట్ చేసుకుంటానురా అని సాయంత్రం అడ్వాన్సుతో పాటు ఇంటికి సరుకులు తీసుకువచ్చాడు .
నెక్స్ట్ పదిరోజులు నిద్రలేకుండా , రోజుకు రెండు మూడు ఆఫీస్ లు తిరుగుతూనే ఉన్నాను . అయినా ఎక్కడికి వెళ్లినా మా ఆఫీస్ reputation పోతుంది నీలాంటి వాణ్ణి తీసుకుంటే అని నా టాలెంట్ టెస్ట్ కూడా చెయ్యకుండా నో అంటున్నారు .
సడెన్ గా ఒకరోజు కార్తీక మరియు బావగారు చెల్లి కాలేజ్ దగ్గరకువచ్చి , అక్కయ్యా ఉదయం రాగానే చూసాము ఇంటిదగ్గర లేరు . సిస్టర్ అంకుల్ కు చెప్పాము కదా మీరు అక్కడే ఉండొచ్చని , ఎక్కడికి వెళ్లారు అని అడిగారు .
వెంటనే కృష్ణగాడిని , నన్ను పిలిపించి చెల్లీ కార్తీక ఇప్పుడున్న ఇల్లు మరింత బాగుంది . మా ముగ్గురికీ అందుబాటులో ఉంటుందని షిఫ్ట్ అయ్యాము అంతే , మీరు బాధపడకండి మన బంధం ఎప్పటికీ ఇలానే ఉంటుంది అని చెల్లెల్లు కౌగిలించుకున్నారు .
నన్ను చీఫ్ డాక్టర్ గా తిరుపతి హాస్పిటల్ కు మార్చేశారు బావ సాయంత్రం వెళ్లిపోతున్నాము .
కంగ్రాట్స్ బావగారు అని మధ్యాహ్నం అందరూ హోటల్లో లంచ్ చేసి , సాయంత్రం ఎయిర్పోర్ట్ కు వెళ్లి సెండ్ ఆఫ్ కూడా ఇచ్చాము .
వాళ్ళు వెళ్లిపోగానే కార్తీకకు అపద్దo చెప్పాను అన్నయ్యా ........ అని బాధపడింది . ఏమని ఓదార్చాలో తెలియక గుండెలపై వాల్చుకుని ఇంటికి చేరుకున్నాము .
సంవత్సరాల నుండి వెతికినా అక్కయ్య జాడ లేదు , ఇప్పుడు జాబ్ దొరకడం లేదు అని ఆరోజు నిద్రపోకుండా హైద్రాబాద్ బిజినెస్ పోర్టల్ ఓపెన్ చెసి స్క్రోల్ చేస్తూనే చేస్తూనే అక్కయ్యను తలుచుకుని కళ్ళుమూసుకున్నాను .
బాధ ఎక్కువ అవుతోందే తప్ప తగ్గడం లేదు అని లాప్టాప్ షట్ డౌన్ చెయ్యబోతూ ఒక న్యూస్ చూసి ఆగిపోయి క్లిక్ కొట్టాను .
వేలకోట్ల నష్టాల్లో కూరుకుపోయిన టాప్ కంపెనీ అని హెడ్లైన్ ........ ఒకప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ , బిల్డింగ్స్ , గ్రౌండ్స్ .......... నిర్మించి వెలుగు వెలిగిన construction కంపెనీ దివాళా స్థితికి చేరువలో ఉంది . కంపెనీ నిలబడాలంటే govt పేదల కోసం నిర్మించబోతున్న 3500 కోట్ల ప్రాజెక్ట్ ఎలాగైనా దక్కించుకోవాలని ఇప్పుడు టాప్ 10 కంపెనీ లతో పోటీపడుతోంది . ఆ కంపెనీ ఆశలన్నింటినీ తన చీఫ్ ఆర్కిటెక్ట్ అయిన భరద్వాజ్ మీదనే పెట్టుకోవడం గమనార్హం .
కంపెనీ సాలరీ లు తగ్గించేయ్యడంతో జాబ్ వదిలి వెళ్లిపోయిన వారి స్థానాలను భర్తీ చెయ్యడానికి భరద్వాజ్ కు కొంతమంది అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ కావాలని యాడ్ ఉండటం చూసి వెంటనే అప్లై చేసి , ఎంత తక్కువ ఇచ్చినా పర్లేదు జాయిన్ అయిపోవాలి అని ఉదయం ఎప్పుడెప్పుడు అవుతుందా అని నిద్రకూడా పోకుండా , అక్కయ్యా ......... నా అడుగు అక్కడ నుండేనా అని ఫోటోని గుండెలపై హత్తుకుని గోడకు ఆనుకుని అలాగే నిద్రపోయాను .
చెల్లి వచ్చి అన్నయ్యా , అన్నయ్యా ......... సరిగ్గా పడుకోవచ్చు కదా అనిచెప్పింది .
చెల్లీ టైం .......... 5 గంటలు అన్నయ్యా .........,
చెల్లెమ్మా అప్పుడే రెడీ అయిపోయావు , లవ్ యు చెల్లీ మంచి కిక్కిచ్చావు ముఖ్యమైన పని మీద వెళుతున్నాను . ఎదురు రావాలి అనిచెప్పాను .
నేను వచ్చేలోపు చెల్లి టిఫిన్ కూడా రెడీ చేసేసింది .
తినిపించి all the best అన్నయ్యా .......... అంటూ ఎదురువచ్చింది , కావాల్సిన వాటిని తీసుకుని అక్కయ్య వైపు లవ్ యు అనిచూసి సిటీ బస్ లో ఆఫీస్ చేరుకునేసరికి 10 గంటలు అయ్యింది .
నాలాంటి నిరుద్యోగులు చాలా మందే ఉన్నారు . అందులో రమేష్ కూడా కినిపించాడు .
తన పరిస్థితి కూడా నాలానే అని బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాము .
ఆఫీస్ చూస్తే చాలా పెద్దది . ఈ ప్రాజెక్ట్ కానీ రాలేదంటే ఆఫీస్ లోని మొత్తం స్టాఫ్ రోడ్డున , చైర్మన్స్ ఇద్దరికీ ఉరే గతి అని మాట్లాడుకుంటుంటే విన్నాము .
అవును మహేష్ ఈ కంపెనీని మొత్తం బ్యాంకు ఆక్రమించేస్తుంది . మరుసటి క్షణం నుండి ఇక్కడ ఈ ఆఫీస్ ఉందని కూడా ఎవ్వరికీ తెలియదు . Govt ప్రాజెక్ట్ మొత్తం సంపాదించాను అని ఫైల్ చూపించాడు .
ఆఫీస్ లోని స్టాఫ్ మొత్తం హడావిడిగా తిరుగుతోంది . ఎక్కువ సమయం లేకపోవడం వలన ఇంటర్వ్యూ కూడా చెయ్యకుండా ఫస్ట్ వచ్చిన కొంతమందిని తీసేసుకుని అయిపోయింది వెళ్ళమని చెప్పారు .
అంతే ఆశతో వచ్చిన అందరూ నిరుత్సాహంతో వెళ్లిపోయారు . మా ఇద్దరమూ తెరుకోవడానికి కాస్త సమయమే పట్టింది .
అదిగో మహేష్ ఆయనే మేనేజర్ ...........
సర్ ఇంటర్వ్యూ అని పిలిచి ఇలా చెయ్యడం అని బాధతో ఆడిగాము .
Sorry బ్రదర్స్ ........... ఇప్పుడు కంపెనీ పరిస్థితులు వేరు అర్థం చేసుకొండి . మా జాబ్స్ కూడా గారంటీ లేదు ఈ ప్రాజెక్టు రాకపోతే అని మాకంటే ఎక్కువ బాధపడుతూ వెళ్లిపోయారు .
అక్కయ్య చూపించిన దారి , ఇలా కానే కాకూడదు అని అక్కడే స్టెప్స్ సై కూర్చుని ఆలోచనలో పడ్డాను .
రమేష్ ఇంతకీ ఆ ఫైల్ ఎక్కడ అని అందుకుని చూసి , ప్లేస్ ఎక్కడో తెలుసా అని అడిగాను .
సిటీ ఔట్ స్కర్ట్స్ లో మహేష్ .......... నాకు చూపిస్తావా అని అడిగాను .
పదా అంటూ బస్ లో రెండు గంటలపాటు ట్రాఫిక్ దాటుకుని చేరుకున్నాము . బస్ లో ఫైల్ మొత్తం స్టడీ చేసాను . వారంలో ప్రాజెక్ట్స్ ప్లాన్ మరియు అమౌంట్ కోట్ govt తెలపాలి.
అప్పటికే చాలా కంపెనీలు ప్రాజెక్ట్ సాధించడం కోసం govt కు ఎంత కోట్ చెయ్యాలో అంచనా వేయడం కోసం కొలతలు తీసుకుంటున్నారు . అందులో మాతో మాట్లాడిన మేనేజర్ కూడా తమ వర్కర్స్ తో అదేపనిలో ఉన్నారు .
రమేష్ ........... మొత్తం సైట్ కొలతలు కావాలి అని అంత ఎండలో ఇద్దరమే రెండేళ్లపాటు నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టి ఆరోజు సాయంత్రం వరకూ మరియు నెక్స్ట్ రోజు కూడా ప్లేస్ లో కష్టపడ్డాము.
భరద్వాజ్ కోసం చాలా కంపెనీలు పెద్ద పెద్ద ఆఫర్స్ ఇస్తామని ఆశ చూపిస్తున్నా , నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే ఈ కంపెనీ వల్లనే , ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వదిలి రాలేను అని చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి .
రమేష్ ఈ 4 రోజులు మనకు ముఖ్యమైనవి , మనం ఇందులో లాభపడటానికి ఏమీలేదు . నా అంతరాత్మ మా అక్కయ్య దారిని చూపిస్తుంది అని నమ్మకంతో చేస్తున్నాను . నువ్వు నాతోపాటు ఉంటావా అని అడిగాను .
మహేష్ .......... ఇన్ని నెలలు జాబ్ లేకుండా ఉన్నాను . ఇష్టంతో ఏదో సాధిద్దామని ఇటువైపు అడుగులు వేసాను . కనీసం కొద్దిగైనా ఎటువంటి లాభం ఆశించకుండా మన ఎఫర్ట్ పెడదాము . పోతే ఆ రోజులతోపాటు మరొక వారం రోజులు అని చేతులు కలిపి ఇంటిపైకి చేరుకుని చిన్న డేరా కట్టుకుని ఛార్ట్స్ సెట్ చేసి ఛార్ట్స్ స్టార్టింగ్ లో VK రాసి అక్కయ్యను తలుచుకుంటూ నాలుగు రోజులపాటు నిద్రాహారాలు పట్టించుకోకుండా కిందకు దిగకుండా ఇద్దరమూ కలిసి ప్లాన్స్ గీస్తూ చివరికి ఒక ప్లాన్ రెడీ చేసి చెల్లి నుదుటిపై అక్కయ్య బుగ్గపై ముద్దులుపెట్టి, govt టెండర్ ఆఫీస్ కు సరైన సమయానికి చేరుకున్నాము .
ఒక్కొక్క కంపెనీ తమ మేనేజర్ మరియు ఆర్టిటెక్ట్ తోపాటు వెళ్లి ప్లాన్ మరియు టెండర్ బాక్స్ లో వేస్తున్నారు .
సిటీలో no 1 కంపెనీని టెండర్ వేయడానికి పిలిచారు . అంతే ఆ కంపెనీ చైర్మన్ , మేనేజర్ సైగ చేయగానే భరద్వాజ్ లేచి వాళ్లదగ్గరకు వెళ్ళిపోయాడు .
భరద్వాజ్ ......... అంటూ మాతో మాట్లాడిన మేనేజర్ తన చేతిలోని ఛార్ట్స్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఖాళీ , చుట్టూ ఉన్నవాళ్ళంతా నవ్వుకున్నారు .
మేనేజర్ .......... they offerred 25 crores ఎవరైనా రిజెక్ట్ చేయగలరా ........., నామీద ఆధారపడిన మీరు నాకు సాలరీ ఇస్తున్నారు . ఈ ప్రాజెక్ట్ మీకు వస్తే ok రాకపోతే నా పీరైస్థితి కూడా మీలానే , మీరు ఎంతకు టెండర్ వెయ్యబోతున్నారో కూడా చెప్పేసాను దానికి ఒక్కరూపాయి తక్కువ మేము వేస్తున్నాము అని పొగరుతో నవ్వుతూ చెప్పి వాళ్ళతోపాటు వెళ్లి టెండర్ వెయ్యబోయారు .
అది చూసి దివాళా తియ్యబోతున్న చైర్మన్లలో ఒకరికి హార్ట్ అటాక్ రావడంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లిపోయారు .
భరద్వాజ్ ......... ఎంతో మంది వీధిన పడతారు నీ నిర్ణయం వలన మరొక్కసారి ఆలోచించు అని మేనేజర్ గారు ప్రాధేయపడుతోంటే ,
నన్ను కూడా ఇలా అడుక్కోమంటారు , అయినా ఇప్పుడు నా మేనేజర్ మీరు కాదు అని గర్వంతో తోసేసి టెండర్ వేశారు .
మరొక చైర్మన్ కళ్ళల్లో కన్నీళ్ళతో తలదించుకుని వెళ్లిపోయారు .
సర్ సర్ ......... ఏదో ఒక మార్గం ఉంటుంది మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి ఒకసారి మీ పిల్లల గురించి ఆలోచించండి అని చెప్పారు .
మేనేజర్ .......... అని ఏదో చెప్పబోయి ఆగి కారులో వెళ్లిపోయారు .
అయిపోయింది ఎంతోమంది పేదలకు సహాయం చేస్తున్న ఇద్దరిలో ఒకరికి హార్ట్ అటాక్, మరొకరు ఆవేశంతో బాధలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అని ఎండలో స్టెప్స్ పై కూలబడి పైకి దేవుడివైపు చూస్తున్నారు .
లోపల ఆ కంపెనీ వారిని పిలుస్తోంటే , ఇంకెక్కడ వస్తారు అని అందరూ నవ్వుకుంటున్నారు .
మేనేజర్ గారు ఏమీ చేయలేకపోయారు , దేవుడా వాళ్లకు ఏమీకాకుండా చూడు స్వామి అని ప్రార్థిస్తుంటే ,
ఇద్దరమూ వెళ్లి మేనేజర్ గారు రెండు నిమిషాలు మేము చెప్పేది వినండి అని లేపి చెట్టుకిందకు తీసుకువెళ్లాము . లోపల మాత్రం పిలుస్తూనే ఉన్నారు . ఇక కేవలం 15 నిమిషాలు మాత్రమే టెండర్ల ప్రక్రియ అన్నట్లు అలారం కూడా మ్రోగింది .
మేనేజర్ గారు ఇప్పుడు పరిచయాలు కూడా అనవసరం .......... మిమ్మల్ని బాధపెట్టాలని కాదు . మీకు ఇప్పుడు వేరే సొల్యూషన్ లేదు కాబట్టి మీరు మమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మేము ఒక ప్లాన్ రెడీ చెసాము ఎలా అన్నది చెప్పే సమయం కూడా లేదు . మీరు ఎంతకు అమౌంట్ వెయ్యబోతున్నారో వాళ్ళు ఒక్క రూపాయి తగ్గించారు . ఇప్పుడు మనకు వాళ్ళు ఎంతకు వెయ్యబోతున్నారో తెలుసు కాబట్టి ...........
మనం ఒకే ఒక్క రూపాయి తగ్గించి వెయ్యొచ్చు అని మేనేజర్ గారు ఆలోచనలో పడ్డారు .
మా వైపు చూస్తుంటే చివరి 5 నిమిషాలు మాత్రమే అని గంటలు కూడా మ్రోగిస్తున్నారు . ప్లాన్ చూసే సమయం కూడా లేకపోవడంతో , ఆ దేవుడిపై భారం వేసి వెళ్లిపోతున్నాను అని అసిస్టెంట్ ను పిలిచి లాప్టాప్ లో అమౌంట్ కోట్ మార్పించేసి govt ఆఫీస్ లొనే ప్రింటౌట్ తీయించి , మనకు వస్తుందో రాదో తరువాత పరువు నిలబెట్టారు బ్రదర్స్ అంటూ కాస్త సంతోషంతో మా ఇద్దరినీ కౌగిలించుకుని పరుగున లోపలికి వెళ్లి కొన్ని క్షణాల ముందు టెండర్ వేసి అందరి నోళ్ళూ మూయించారు .
రమేష్ మన పని అయిపోయింది వెళదాము పదా అని మాటల్లో చెప్పలేని ఆనందంతో లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ......... అని గుండెలపై చేతినివేసుకున్నాను .
మహేష్ టెండర్ ......... కనీసం మన పేర్లు కూడా వాళ్లకు తెలియవు , ఒకవేళ మనదే ......... అని చిన్నగా గుసగుసలాడి , అనౌన్స్మెంట్ వరకూ ఉందాము అని చెప్పాడు.
రమేష్ మనం ఇక్కడిదాకే వచ్చాము ......... మన కష్టం మనం పడ్డాము , ఇక అంతా మా ఊరి అమ్మవారు చూసుకుంటారు అని సంతోషంతో భుజం చుట్టూ చేతినివేశాను.
నువ్వు ఎలా చెబితే అలా మహేష్ అని ఉత్సాహంతో బస్ లో ఇంటికి బయలుదేరాము .
మేనేజర్ బయటకువచ్చిచూసి ఎక్కడా కనిపించకపోవడంతో లోపలకు వెళ్లి టెండర్ అనౌన్స్మెంట్ సమయం కోసం ఎదురుచూస్తూ , దేవుడా మా చైర్మన్లకు ఎటువంటి హానీ కలగకుండా చూసుకో అని ప్రార్థిస్తున్నాడు .
సుమారు 4 గంటల తరువాత GHMC చైర్మన్ గారు బయటకువచ్చి టెండర్ ******* construction కంపెనీకు కేటాయించినట్లు అనౌన్సమెంట్ చేసి వారిని లోపలికి రావాల్సిందిగా కోరారు .
అంతే మేనేజర్ గారు కొన్ని క్షణాలపాటు షాక్ లోకి వెళ్లిపోయారు .
టాప్ 10 కంపెనీలు మరింత షాక్ లో తలదించుకుని వెళ్లిపోయారు .
సర్ ముందు చైర్మన్ గారికి అని అసిస్టెంట్ గుర్తుచేయ్యగానే ఇద్దరూ ఒక్కొక్కరికి కాల్ చేశారు .
హాస్పిటల్లో ఉన్న చైర్మన్ వైఫ్ ఎత్తి విషయం తెలుసుకుని రెస్ట్ తీసుకుంటున్న వారికి తెలియజేసారు .
డాక్టర్ i am fine నేను వెళ్ళాలి వెంటనే డిశ్చార్జ్ చెయ్యండి అనిచెప్పారు.
మరొక చైర్మన్ మొబైల్ రింగ్ అవుతున్నా ఎత్తకపోవడంతో , అసిస్టెంట్ నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళమని , ఇంటి ల్యాండ్ లైన్ కు కాల్ చేశారు .
పనివాళ్ళు ఎత్తడంతో భయంతో తడబడుతూ వెంటనే సర్ దగ్గరకువెల్లు ప్రాజెక్టు మన కంపెనీకి వచ్చిందని చెప్పు తొందరగా వెళ్ళు మీ సర్ అపాయంలో ఉన్నారు అని చెప్పడంతో , చైర్మన్ గారి రూమ్ వైపు పరిగెత్తి తలుపు కొట్టినా తెర్వకపోవడంతో , వెంటనే తలుపు బద్దలు కొట్టి బెడ్ పై నురగతో కదలకుండా పడి ఉన్న చైర్మన్ ను ఎత్తుకుని కిందకు రావడం చూసి ఆయన వైఫ్ కంగారుతో కారు వెనక్కు తీసుకురావడంతో దగ్గరలోని హాస్పిటల్ కు పిలుచుకునివెళ్లారు ........... to be continued..............
The following 28 users Like Mahesh.thehero's post:28 users Like Mahesh.thehero's post
• 9652138080, AB-the Unicorn, Anamikudu, Babu ramesh, Bangaru, Jack789, Joncena, Kumarmb, kummun, Mahe@5189, maheshvijay, Milffucker, Naani., Nivas348, nivasvictory, nkp929, Nmrao1976, Picchipuku, RAANAA, Rajeev j, Sachin@10, sandycruz, Saradhi41, Sha82, Shaikhsabjan114, sisusilas1@, sri7869, SS.REDDY
Posts: 476
Threads: 0
Likes Received: 202 in 166 posts
Likes Given: 38
Joined: Mar 2019
Reputation:
1
Awesome update bro
మీ
Umesh
Posts: 200
Threads: 9
Likes Received: 223 in 94 posts
Likes Given: 71
Joined: Dec 2018
Reputation:
6
Bale vundi broo vegamgaa ikkade update ivvu bro
Posts: 193
Threads: 0
Likes Received: 145 in 116 posts
Likes Given: 74
Joined: Mar 2019
Reputation:
1
Awesome update bro superb narration
Posts: 882
Threads: 1
Likes Received: 443 in 360 posts
Likes Given: 215
Joined: Nov 2018
Reputation:
1
Mahesh emani cheppanu , story super. , Chadhivinata sepu vundadu update appude iipoindhi
Posts: 1,026
Threads: 0
Likes Received: 604 in 421 posts
Likes Given: 7,598
Joined: Dec 2018
Reputation:
5
addiripoindi
Hats off to your effort
Chadavadaniki 2-3 hours pattindi , ika meeku enni rojulu Patti untundo..
great Mahesh Anna
Update chaduvuthunte screen meeda movie laage undi , antha detailed antha fast
Super waiting for next update with 1000000 eyes
love you and thank you
Writers are nothing but creators. Always respect them.
Posts: 310
Threads: 0
Likes Received: 201 in 141 posts
Likes Given: 278
Joined: May 2019
Reputation:
2
You are really hero mahesh garu asalu matalu ravatam ledhu hats off mahesh garu supperrr supppeerrrrr love you brother...... Stay safe be happy .......
Posts: 970
Threads: 0
Likes Received: 463 in 401 posts
Likes Given: 699
Joined: May 2019
Reputation:
6
Posts: 189
Threads: 0
Likes Received: 123 in 96 posts
Likes Given: 5
Joined: Sep 2019
Reputation:
0
Abba Abba emi undi bhaya update,
Chala thanks bhaya mamalani anadam lo munchutunavu thanks bhaya,
You are rockstar bhaya
Posts: 222
Threads: 0
Likes Received: 212 in 126 posts
Likes Given: 1,016
Joined: Jan 2019
Reputation:
1
మహేశ్ బ్రో..అప్డేట్ awesome.... నో words to say..
పిచ్చెక్కించేసారు update తో..
Posts: 3,753
Threads: 0
Likes Received: 2,433 in 1,977 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
18
అప్డేట్ చాలా చాలా బాగుంది మిత్రమా.
|