Thread Rating:
  • 12 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మాయ
#1
సరిత్, శివారెడ్డి గార్లకు ముందుగా ధన్యవాదాలు. పాత xossipలో lurker గా వుండేవాడిని. ఎంతో శ్రమపడి ఈ site ను నడుపుతున్నందుకు thanks. I will try my best to support this effort financially sooner rather than later.

నేనెప్పుడూ నా ఆనందం కోసం ఏదో ఒకటి రాసేవాడిని. నా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ తప్పితే ఎవ్వరూ నా రచనలను చూడలేదు. తొలిసారి ఒక పబ్లిక్ ఫోరంలో షేర్ చేసుకుంటున్న నా ఈ రచన మిమ్మల్ని అలరిస్తుంది అని ఆశిస్తున్నాను. There will be romantic descriptions in the story but they will not be overly sexual. పాఠకులని వుర్రూతలూగించే అలాంటి కథలు మన ఫోరంలో చాలా వున్నాయి. కొంతొక కొత్త దారిలో వెళుదామని నా ప్రయత్నం.

మాయ
“కిట్టీ, రేతిరికి వంతెన కాడ సంతెడతన్నారు. పోర్లు మస్తుగుంటరు.. పోదామా మామా?” రంగ చెప్పిన మాటకి అక్కడ కూర్చున్న నలుగురు కుర్రాళ్ళ బ్యాచ్ excite అయ్యారు.

కిట్టి, కిరీటి, రంగ, గౌరయ్య (ముద్దుగా ‘గోరు’) - ఈ నలుగురూ పెంచలాపురంలో ఒక సాధారణ కుర్రాళ్ళ బ్యాచ్. ఇళ్లన్నీ దగ్గర, ఒకే కాలేజ్లో చదువు, ఇలాంటి కామన్ factors వుండేసరికి వీళ్ళు చిన్నప్పుడే జాన్ జిగిరీ దోస్తులు అయ్యారు. ప్రస్తుతం వీళ్ళు డిగ్రీ first ఇయర్ స్టూడెంట్స్. ఊరికి 10 km దూరంలో వున్న రాణి రత్నమాంబ కాలేజీ లో వీళ్ళ చదువులు. అనుకోకుండా వీళ్ళ జీవితంలో ప్రవేశించిన కొన్ని పాత్రలు, వాళ్ళ మూలంగా వీళ్ళ లైఫ్ లో వచ్చిన మార్పుల సమాహారమే ఈ కథ.

కిట్టి నుదురు చరుచుకొని ‘రేయ్, సంత నైట్ పెట్టుకొని ఇప్పుడా చెప్పేది? ఒక రెండ్రోజుల ముందు చెప్తే కొంచెం టిప్-టాప్ గా రెడీ అయ్యి వెళ్ళి ఏదో ఒకటి చేసేవాళ్లం కదరా. ఇప్పుడు ఎడ్డి ముకాలేసుకొని పోవాల. అయినా గోరూ, నువ్వన్నా చెప్పొద్దంటారా? మీ అయ్య అంగడి పెట్టట్లేదా ఈ సారి?’ అని అడిగాడు.
‘లేదురా మామా, మా అయ్య, అమ్మ నాల్రోజుల క్రితం వూరెళ్ళారు. అక్క ఫీజుకి డబ్బులు కుదర్లే ఈ సారి. ఎట్లనో కాలేజీ వాళ్ళ కాళ్లా యేళ్ళా పడి ఇంకో రెండు నెలల్లో కడతానికి ప్రయత్నం చేస్తాండారు.’

గౌరయ్య అక్క నిక్కుమాంబ చదువుల తల్లి. ఆ వూళ్ళో అందరికీ ఆమె అంటే ప్రేమ. లక్ష్మీ, సరస్వతి ఒక చోట వుండటం చాలా అరుదు. అదే ఇక్కడ కూడా చూస్తున్నాం మనం. ఇంకొక్క సంవత్సరం చదివితే ఆమె సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి అవుతుంది. తల్లితండ్రులకి తొందరగా ఒక అండగా వుందామని ఆమె ప్రయత్నం. ఎక్కడ ఫీజు గురించి బెంగపడి చదువు నిర్లక్ష్యం చేస్తుందోనని ఆ తల్లితండ్రుల భయం.

‘పెసిడెంటు గారు ....’ అంటున్న రంగ మాటని మధ్యలోనే తుంచేసిన గోరు ‘లేదురా, ఇంక బాబు గారిని అడగలేమురా. మూడేళ్లు ఆయన అండ లేకుంటే అక్క సదువు యే కాడికే ఆగిపోయున్ద్లే.. సూద్దాం  యేటవుద్దో.’

గోరు మూడ్ మార్చాలని ‘సరిరా, ముందు నైట్ సంగతి చూడండి’ అంటూ కిరీటి టాపిక్ మార్చాడు.

కిరీటి మాట అంటే ఈ బ్యాచ్ కి వేదవాక్కు. అందరికంటే తక్కువ మాట్లాడేది కిరీటియే. మిగతా వాళ్ళు వంద మాటలు మాట్లాడితే వీడు ఒక్క మాట మాట్లాడతాడు. కానీ వాడు లేకపోతే మిగతా ముగ్గురికీ ఊసుపోదు. ఎప్పుడన్నా వాడు నవ్వే సన్నటి నవ్వే వాళ్ళకి చాలు.

సాయంత్రం ఆరున్నరకి సైకిళ్ళు వేసుకొని ఊరికి దక్షిణాన వున్న వంతెన దగ్గరికి పోదామని డిసైడ్ అయ్యారు నలుగురూ. వీళ్ళ ఊరి గోదారి దాటతానికి కట్టిన వంతెన అది. By the way, పల్లెల్లో పిల్ల కాలవని కూడా గోదారి అనే అంటారు. ఇది కూడా అలాంటి గోదారే.

వంతెన కాడ అంతా సందడి సందడిగా వుంది. పండక్కి ప్రభలు కట్టే బ్యాచ్ ఒకటి, నైటు నాటకానికి స్టేజ్ రెడీ చేసే బ్యాచ్ ఒకటి, ఇలా ఊళ్ళో కుర్రోళ్లు అందరూ కలియతిరిగేస్తున్నారు అక్కడ. రంగు రంగుల రామచిలకల్లా వోణీలు వేసుకున్న కన్నె పిల్లలు, కొత్తగా పెళ్ళయి మొగుడితో సరదాగా సంతకొచ్చిన అమ్మాయిలు ఇలా అందరినీ చూడడానికి వీళ్ళ కళ్ళు చాలడం లేదు.
[+] 5 users Like mkole123's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
katha chaala bagundi writer garu kaani konchem pedha updatelu isthe chadavadaniki baguntundi
Like Reply
#3
andharila kaakunda meerina konchem tondaraga updatelu ivvandi ..village nativity tho story ni adharagottaru
[+] 1 user Likes Tom cruise's post
Like Reply
#4
నైస్ అప్డేట్
Like Reply
#5
నచ్చిందని చెప్పిన మిత్రులకు వందనం. మీ ప్రోత్సాహం రాయాలన్న కోరికను పెంచుతుంది. పెద్ద అప్డేట్ పెట్టడంలో చిన్న చిక్కు. అందరు రచయితలు చెప్పినట్లే typing అనేది ఒక ప్రహసనం. అయినా ప్రయత్నిస్తాను.

మాయ - 2

ఈ సంబరం అంతా చూసుకుంటూ తిరుగుతున్నారు మన మిత్రులు. గోరు ఇంకా దిగాలుగా వుండటం చూసి కిరీటి వాడి భుజం పైన చెయ్యి వేసి ‘ఒరేయ్ నువ్వు ముందు కాస్త ఆ లోకం నుంచి బయటకు రారా. మీ అమ్మా, నాన్న ఎలాగో ఒకలా ఫీజు విషయం సర్దుబాటు చేస్తారులేరా’ అంటూ వాడి మూడ్ మార్చడానికి ట్రై చేస్తున్నాడు. గోరు మిగతా ఇద్దరికీ వినబడకుండా కిరీటితో మెల్లిగా ‘అది కాదురా, అక్కని కాలేజీ నుంచి ఇంటికి తెచ్చేశారురా. ఊళ్ళో బయట తిరగటం ఇష్టంలేక వారంనుంచి ఇంట్లోనే వుంది. ఇయ్యాల సంతకి వస్తానంది. కానీ అదీ ఆళ్ల కాలేజీ ఫ్రెండ్స్ ఎవరో వస్తేనే’ అన్నాడు. ఇక యే రకంగా వాడిని సముదాయించలో కిరీటికి అర్ధం కాలేదు.


‘ఒరేయ్, నేను ఒకసారి స్టేజ్ దగ్గరికి వెళ్లొస్తానురా. యవరెవరు యేసాలు కడతన్నారో చూసొత్తా’ అంటూ కిట్టి స్టేజ్ వైపు వెళ్ళాడు. ‘రేయ్, ఆ అంగళ్ళ కాడికి వచ్చేయ్. ఈ సారి యెవరో పట్నం వోల్లు మూడు కొట్లు పెట్టినారంట. ఇందాకే నాయుడుగోరి పిలగాడు చెప్తుండే’ అంటూ రంగ అరిచిన అరుపు విన్నట్లు చెయ్యి వూపాడు కిట్టి.

మిగిలిన ముగ్గురూ అక్కడ పెట్టిన షాపులు చూసుకుంటూ ముందుకు సాగారు. కొంతసేపటికి కిట్టి వీళ్లవైపు ఆదరా బాదరా గా పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆయాసంతో రొప్పుతూ ‘దుర్యోధన ఏకపాత్రాభినయం వుందిరా రేత్తిరికి. యే నా కొడుకో చెంకీల దండలు యెత్తుకుపోయినాడు. యేషమ్ కట్టే బాబాయి కంగారు పడతాండు. రాండి, యెతుకులాడితే యాదో ఒక అంగట్లో దొరుకుతాయి’ అంటూ వీళ్ళని లాక్కుపోబోయాడు.
కిరీటి అందరినీ ఆపి ‘అందరూ కలిసి ఒక్కొక్క అంగడి వెదికేబదులు విడివిడిగా వెళ్దామురా. కిట్టికి దొరికితే వాడు కొనేస్తాడు. మిగతా మనలో యెవరికన్నా కనిపిస్తే యే షాపులో చూశారో గుర్తు పెట్టుకోండి. అరగంటలో ఆ పెద్ద ప్రభ దగ్గరికి రండి. యే షాపులోనూ లేకపోతే యేం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం. నాటకానికి ఇంకా చాలా టైమ్ వుందిరా కిట్టీ, కంగారు పడకు’ అన్నాడు.

‘రేయ్, ఈడు లేకపోతే మన బుర్రలు పనిచెయ్యవురా. అట్టానే కానియ్యండి’ అంటూ నలుగురూ తలో దిక్కు బయలుదేరారు.

ఒక్కొక్క అంగడి చూసుకుంటూ ముందుకు పోతున్న కిరీటి వున్నట్టుండి ఒక అంగడి దగ్గర ఆగిపోయాడు. చుట్టూ వున్న అంగళ్ళకంటే చాలా చిన్నగా వుంది ఆ షాపు. ఒక చిన్న బోర్డు మీద ‘మ్యాజిక్’ అన్న ఒక్క పదం మాత్రం రాసివుంది అక్కడ. అంగట్లో ఒక బల్ల, కుర్చీ, ఒక చిన్న బుక్ షెల్ఫ్ వున్నాయి అంతే. అక్కడ వున్న అతను తల బల్ల మీద పెట్టుకొని నిద్రపోతున్నాడు. మెల్లిగా అంగట్లోకి వెళ్ళిన కిరీటి ఆ షెల్ఫ్ లో ఏముందో అని ఆసక్తిగా చూస్తున్నాడు.

‘30 రోజుల్లో card tricks నేర్చుకోండి’, ‘Dice లో చీట్ చెయ్యడం ఎలా’, ‘హస్త లాఘవం’ లాంటి విచిత్రమైన పుస్తకాలు, playing cards, సంకెళ్ళు, పెద్ద పెద్ద రింగులు ఇలా విచిత్రమైన వస్తువులు అన్నీ వున్నాయి అక్కడ. ‘Misdirection’ అన్న ఒక పుస్తకం బయటకు తీసి పేజీలు తిరగేస్తున్నాడు.

‘ఏమన్నా నచ్చాయా?’ అంటూ ఒక సన్న గొంతుక పలకరించేసరికి వులిక్కిపడి వెనుతిరిగి చూశాడు. బల్లమీద తలపెట్టుకొని పడుకొన్నది అబ్బాయి కాదు, ఒక అమ్మాయి! పిక్సీ కట్ తో మొదటిచూపులో అబ్బాయిలా కనిపిస్తోంది. ఆ అమ్మాయి ముఖంలో మొట్టమొదటగా కిరీటి గమనించింది ఆమె కళ్ళు. తేనె రంగు కళ్ళు జీవితంలో మొదటిసారిగా చూడటం అదే కిరీటికి. కోటేరు లాంటి ముక్కు అని ఎవరు వర్ణించారోగాని అది ఈమె ముక్కు చూసే అనుకున్నాడు. కిందిపెదవి పైపెదవి కంటే కొంచెం సన్నం, నిండైన బుగ్గలు, కొనదేలిన చుబుకం...ఈ రూపం ఒక్క సెకనులో కిరీటి మనసులో ముద్ర పడిపోయింది.

ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్దం డెవలప్ అయ్యేముందే కిరీటి తేరుకొని ‘ఇలాంటి పుస్తకాలు, వస్తువులు మా ఊరిలో చూడటం ఇదే మొదటిసారి. ఎక్కడ మొదలు పెట్టాలో, ఏమేమి నచ్చాయని చెప్పాలో అర్ధం కావట్లేదు. చూస్తే ఇవన్నీ తీసుకుపోయి చదవాలి అనిపిస్తోంది’ అన్నాడు.

ఆ అమ్మాయి నవ్వి నీకొక చిన్న సరదా ట్రిక్ చూపిస్తా రమ్మని బల్ల దగ్గరకు పిలిచింది.
[+] 6 users Like mkole123's post
Like Reply
#6
Very good story bagundhi continue
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
#7
Good start, please continue...
Like Reply
#8
మాయ - 3

Coins తోనూ, పేకముక్కలతోనూ చిన్న చిన్న ట్రిక్స్ చేసి చూపించింది ఆ అమ్మాయి. ‘ఎలా వున్నాయి?’ అని నవ్వుతూ అడిగింది. బాగానే వున్నాయి అని మొహమాటానికి చెప్పబోయి కిరీటి ఎందుకో ఆగిపోయాడు. ‘మీరేమీ అనుకోనంటే, అంత ఇంప్రెసివ్ గా అయితే ఏమీ లేవండి’ అన్నాడు మెల్లిగా.


తనేమన్నా అనుకుంటుందేమో అని apprehensiveగా తననే చూస్తున్నాడు. ఆ అమ్మాయి మటుకు అలా ఏమీ అనుకోకుండా కొంత తీక్షణంగా ఆలోచించి కిరీటి వంక చూసి ‘అయితే ఇదుగో మీకోసం ఒక నిజమైన మ్యాజిక్ ట్రిక్. A serious trick for a serious man’ అంది. కిరీటికి బుర్ర తిరిగిపోయింది. ఆ రోజుల్లో పెంచలాపురంలాంటి పల్లెటూళ్ళో అమ్మాయిలు చదువుకోవడమే ఒక గొప్ప విషయం. అలాంటిది ఈ అమ్మాయి ఇంగ్లిష్ ఇంత అలవోకగా మాట్లాడేసరికి stun అయిపోయాడు. దానితోపాటు ఇప్పుడు చేయబోయే సీరియస్ ట్రిక్ ఏమై వుంటుందా అని చూస్తున్నాడు.

ఆ అమ్మాయి చేతిలో మళ్ళీ పేకముక్కల deck వున్నది. దానిని చాలా వాటంగా shuffle చేసి బల్లపై పెట్టింది. కిరీటి కళ్ళల్లోకి చూస్తూ ‘ఈ deck లో ఒక చిన్న లోపం వుంది. అదేమిటో చూసి నాకు చెప్పు. నీకెంత టైమ్ కావాలంటే అంతా టైమ్ తీసుకో’ అని తన కుర్చీలో జారగిలబడి కూర్చుంది. ఆ అంగట్లో కిరీటి కూర్చోడానికి వేరే కుర్చీ లేదు. నిలబడే ఆ పేక ముక్కల్ని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూశాడు. ముందు ముక్కల్ని లెక్కపెట్టాడు. 53 ముక్కలు వున్నాయి అందులో. 52 ముక్కలు కాక ఒక జోకర్ కూడా వున్నదని తోచింది కిరీటికి. ఇక వెనక్కు తిప్పి ముక్కల్ని తేరిపార చూస్తే ఆఠీన్ రాణి ముక్కలో కొన్ని హార్ట్ సింబల్స్ మిస్ అయ్యాయి.

ఆ ముక్కని ఆ అమ్మాయి ముందు పెట్టి ‘ఈ ముక్కలో సింబల్స్ సరిగా లేవు’ అని చెప్పాడు. తను చిరునవ్వుతో ‘కరెక్ట్ గానే పట్టావు’ అని చెప్పి ఒక పెన్నుతో ఆ ముక్క మీద హార్ట్ సింబల్స్ గీసింది. ‘ఇప్పుడు ముక్కల్ని మళ్ళీ కలిపి బల్ల మీద పరువు ఆ deckని’ అని కిరీటికి చెప్పింది. కిరీటి కూడా కుతూహలంగా ట్రిక్ ఏమై వుంటుందా అని తను చెప్పినట్లే చేశాడు.

ఆ అమ్మాయి ఇప్పుడు కుర్చీలో కొంచెం ముందుకి కూర్చుని కిరీటి పరిచిన ముక్కల్ని తీక్షణంగా చూస్తోంది. బల్లకి ఇటువైపు నిలబడ్డ కిరీటికి గుండె ఆగినంత పనయ్యింది. కుర్చీలో తను కొంచెం ముందుకి వంగడంతో తన షర్ట్ లో వున్న ఎద సంపద కనిపించీ కనిపించనట్టు వూరిస్తోంది. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయి అందాలని అంత దగ్గరగా చూడడం అదే కిరీటికి. పల్లెటూరు కావడంతో అప్పుడప్పుడు గోదాట్లో తానాలాడే కన్నెపిల్లల్ని దొంగచాటుగా చూడడం, తడికచాటు దొంగచూపులు లాంటివి కామనే అయినా, ఒక అమ్మాయిని ఇంత నిశితంగా నింపాదిగా చూడడం ఇదే మొదలు అతనికి. తెల్లగా, మిసమిసలాడుతూ కనువిందు చేస్తున్నాయి ఆ అందాలు. ఇంకా కొంచెం ముందుకు వంగితే ముచ్చికల రంగు తెలిసేదేమో కానీ కిరీటికే చూడడానికి భయం వేస్తోంది.

ముక్కల్ని కాసేపు తేరిపారా చూసి ఆ అమ్మాయి ‘ఎడమవైపు నుంచి ఏడవ ముక్క’ అన్నది. కిరీటి గబుక్కున తన చూపు తిప్పుకొని  ‘హా..ఏంటి?’ అన్నాడు. ‘అయ్యో మాలోకమా, నేను నేను పెన్నుతో సరిచేసిన ముక్క ఎడమవైపు నుంచి ఏడవది’ అన్నది. కిరీటి ఆమె చూపించిన ముక్కని తీసి చూశాడు. కరెక్ట్ గా గెస్ చేసింది. ఇది కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు కిరీటికి.

అతడి మైండ్లో వున్న భావనని చదివేసినట్టు ఆ అమ్మాయి ‘ఈ సారి ఇంకొంచెం కొత్తగా చేద్దాము’ అని కుర్చీలో మగరాయుడిలా కాళ్ళు చెరోవైపు వేసి వెనక్కు తిరిగి కూర్చుంది. పొడవాటి జుట్టు అడ్డం లేకపోవడంతో తన మెడ, తన సన్నటి నడుము, తీరైన పిరుదుల షేప్ చూసి కిరీటికి బుగ్గల్లోనుంచి ఆవిర్లు వస్తున్నాయి. అమ్మాయిల్ని చూసి సొల్లు కార్చుకునే టైప్ కాదు అతడు. ఈ అమ్మాయిలో ఏదో తెలియని ఆకర్షణ వుంది. అది కిరీటిని వివశుడ్ని చేస్తోంది.

మళ్ళీ ఇందాకటి లాగానే ముక్కల్ని కలిపి పరచమంది. ఈ సారి వెనక్కు తిరగకుండానే ‘కుడివైపు నుంచి మూడవ ముక్క’ అని చెప్పింది. కిరీటి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కనీసం ఆ అమ్మాయి ముక్కల్ని కలపలేదు. కలిపి ముక్కల్ని పరిచాక చూడనుకూడా చూడలేదు. కరెక్ట్ గా ఎలా చెప్పిందా అని ఆలోచనలో వుండిపోయాడు. ఇంకొక మూడు సార్లు అలాగే కనీసం ముక్కల్ని చూడకుండా ఆ ట్రిక్ రిపీట్ చేసిందా అమ్మాయి.

‘ఇది చాలా బాగుందండీ, ఈ ట్రిక్ నాకు నేర్పిస్తారా?’  అని అడిగాడు కిరీటి. తను నవ్వుతూ అంగట్లోని బుక్ షెల్ఫ్ వైపు చెయ్యి జాపింది. అక్కడున్న పుస్తకాల్లో ఇలాంటి ట్రిక్స్ చాలా వున్నాయి అని చెప్పింది. ‘అలా కాదు, మీరు నేర్పిస్తారా’ అని అడిగితే ‘నేను ఈ ట్రిక్ నేర్చుకోవడానికి ఆరు నెలలు పట్టింది. ఆ తర్వాత ఇంకొక సంవత్సరం సాధన చెయ్యాల్సివచ్చింది. మరి అన్నాళ్లూ నాతో వుండిపోతావా’ అని నవ్వుతూ అడిగింది.

‘లేదండీ...ఇంకొక్కసారి ఈ ట్రిక్ చెయ్యండి. నేను మీ దగ్గర పుస్తకం కొంటాను’ అని చెప్పాడు కిరీటి. ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కు తిరిగి కూర్చుంది. ఇంకొక్కసారి తనివితీరా ఆమె షేపుల్ని చూశాడు. మళ్ళీ కరెక్ట్ గానే గెస్ చేసింది.

తను అంతకు ముందు తిరగేస్తున్న ‘Misdirection’ పుస్తకం కొంటాను అని చెప్పాడు. ఆ అమ్మాయి లేచి వెళ్ళి పుస్తకం తెచ్చిఇచ్చింది. కిరీటి డబ్బులు ఇస్తూ ‘మీ పేరు?’ అని అడిగాడు. కుడి బుగ్గలో చిన్న సొట్ట పడేలా నవ్వి ‘ఎవరి పేరన్నా అడిగేముందు మీ పేరు చెప్పాలి’ అంది. కిరీటి తన పేరు చెప్పగా ‘సునయన’ అని చెప్పింది. ‘మంచి పేరు. మీకు కరెక్ట్ గా సరిపోయిందండి. మీ కళ్ళు చాలా బాగుంటాయి’ అని కిరీటి అనేసరికి చురుగ్గా చూసింది.
ఎక్కువ మాట్లాడేశానేమో అని గబుక్కున పుస్తకం తీసుకొని ‘బై సునయన’ అని చెప్పేసి వెళ్లిపోయాడు.

కిరీటి వెళ్ళిపోయిన తర్వాత ఆ అంగట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. ‘కుర్రాడు మంచి చురుకైనవాడు’ అన్నాడు సునయనతో. ‘చూడ్డానికి కొంచెం క్యూట్ గా అయితే వున్నాడు. ఈ పల్లెటూళ్ళల్లో షార్ప్ మైండ్స్ వుండేది చాలా తక్కువ ధనుంజయ్’ అంటూ మళ్ళీ బల్ల మీద తల పెట్టి పడుకోబోయింది.

‘హా, సునయనా, నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి బేబీ. ఏదీ, నువ్వు సెట్ చేసిన కార్డ్?’ అని అడిగాడు.

సునయన ఆశ్చర్యంతో తన ముందు పరిచి వున్న ముక్కల్ని కెలికి చూసింది. నిజంగానే తన కార్డ్ అందులో లేదు. ‘నో..అతను..’ అంటుంటే, ధనుంజయ్ నవ్వి ‘నువ్వు పుస్తకం తీసుకురావడానికి వెళ్లినప్పుడు తీసుకున్నాడు’ అని చెప్పాడు.

అక్కడ కిరీటి తన స్నేహితుల్ని కలిసేముందు సునయన పెన్నుతో హార్ట్ సింబల్ గీసిన ముక్కని జాగ్రత్త చేద్దామని రెండు అంగట్ల మధ్యలో నిలబడి ఆ ముక్కని పుస్తకంలోంచి తీసి జేబులో పెట్టుకుంటుండగా ఎవరో అతని చెయ్యి పట్టుకొని గబుక్కున అంగట్ల మధ్య వున్న చీకటి సందులోకి లాగేశారు.
[+] 5 users Like mkole123's post
Like Reply
#9
సునయన బాగుంది ఇంతకీ లాగింది ఎవరు అయి ఉంటారు..
 Chandra Heart
Like Reply
#10
మాయ - 4
కిరీటి నోటిలోనుండి యే శబ్దమూ రాకముందే లేలేత పెదాలు అతడి నోటికి తాళం వేశేసాయి. మెత్తనైన చేతులు అతడి చేతుల్ని తీసుకొని పూర్ణకుంభాల వంటి ఎద ఎత్తులపైకి జరుపుకొన్నాయి. కిరీటి ఒక అమ్మాయి తనను పెనవేసుకుపోయిందని గ్రహించాడు. ఎవరో ఏమిటో తెలియట్లేదు. అడ్డు పడదామంటే ఒక్క సెకను కూడా ఆ అమ్మాయి గ్యాప్ ఇవ్వట్లేదు. పైన పెదాలతో దాడి చేస్తూ, అతడి చేతులలో తన అందాలను నలిపేసుకొంటూ, కింద కిరీటి అంగం పాంట్ పైనుంచే నొక్కడం స్టార్ట్ చేసింది.


వివేకం హెచ్చరిస్తోంది, కానీ మనసు వివశమైపోతోంది కిరీటికి. తనకు తెలియకుండానే తన చేతులు ఆమె ఎద ఎత్తులను నలిపేస్తున్నాయి. నోట్లో నాట్యమాడుతున్న ఆమె నాలుకను తన నాలుకతో పెనవేస్తున్నాడు. పూర్తిగా ఆ క్రీడలో involve అయిపోతున్నాడు. తన అంగాన్ని ఆమె పాంట్ పైనుంచే నొక్కుతుంటే అది ప్రాణం పోసుకొని పెరిగి పెద్దదౌతోంది.

ఊపిరి తీసుకోవడానికి ఆ అమ్మాయి ఒక సెకను విడివడ్డప్పుడు కిరీటికి తిరిగి బుర్ర పనిచేయడం స్టార్ట్ చేసింది. మళ్ళీ తనను చుట్టేసెలోపు కొద్దిగా resist చేశాడు. ‘ఏరా, ఇన్నాళ్లూ నిక్కీ నిక్కీ అని వెంటపడి ఇప్పుడు కావాల్సింది ఇస్తుంటే సిగ్గు పడతావే?’ అంటూ మళ్ళీ చుట్టేసింది కిరీటిని. ఈ సారి అతడి చేతుల్ని తన వంటిపైనున్న డ్రస్ లోపలికి తీసుకెళ్లి డైరెక్ట్ గా తన ఉరోజాలపై వేసుకుంది. ఆదరాబాదరాగా కిరీటి పాంట్ జిప్పు లాగేసి అతడి అంగాన్ని చేతితో సవరించడం స్టార్ట్ చేసింది. ఇక కిరీటికి వశం తప్పింది. ఏం జరుగుతోంది ఏమిటి అనే స్పృహ లేకుండా తను కూడా ఆమెను సుడిగాలిలా చుట్టేశాడు. ఇక initiation తను తీసుకున్నాడు కాబట్టి తనకు నచ్చిన విధంగా ఆమె వొంటిని ఆస్వాదించడం మొదలెట్టాడు. 

మొదటగా గమనించింది తన నోటిలోని తియ్యదనాన్ని. ఒక అమ్మాయి ముద్దులో ఇంత తీయదనం వుంటుందా! తన చేతులకింద నలుగుతున్న అందాలు ఆమెలోనూ తనలోనూ కంపనాలు సృష్టించడం గమనించాడు. మెత్తనైన ఉరోజాలు, వాటిపై నిటారుగా నుంచున్న ముచ్చికలు అతడి మగతనాన్ని రెచ్చగొడుతున్నాయి. తన అంగాన్ని సవరదీస్తుంటే పై ప్రాణాలు పైనే పోతున్నాయి కిరీటికి.

వణుకుతున్న చేతులలో ఒకదానిని ఆమె వక్షం నుండి తొలగించి ముందుగా ఆమె తలను ఇంకా దగ్గరకు లాగుకొన్నాడు. అలాగే ఆ చేతిని పొడవాటి జడపైనుండి కిందకు జార్చి తన నడుము సన్నదనాన్ని కొలిచాడు. పిరుదుల ఎత్తులు, తొడల బలుపు ఇవన్నీ కొలిచాక చేతిని ఆమె తొడల మధ్యకు చేర్చాడు. ఒక్కసారిగా ఆమె ఒళ్ళంతా ఝల్లనడం తన ఒంటితో experience చేశాడు. ఇక తన లంగా బొందు లాగేయ్యబోతుండగా కిరీటి కాలికి ఏదో తగిలింది.

పుస్తకం! తను అప్పుడే కొన్న పుస్తకం. దానికంటే విలువైన వస్తువు ఇంకేదో అక్కడ వుంది అని అతడి మస్తిష్కం గోల చెయ్యడం మొదలెట్టింది. సునయన, ఆమె కార్డ్ గుర్తుకురాగానే కిరీటికి తన మెదడుకి పట్టిన మబ్బు తెరలు తొలగిపోయాయి. మళ్ళీ ఊపిరి కోసం తన చేతిలో అమ్మాయి పెదాలను విడదీయగానే ‘నిక్కీ, నిక్కీ...’ అని తన భుజాలను పట్టుకొని ఊపి ‘క్షమించండి నేను మీరు అనుకుంటున్న అబ్బాయిని కాను. ఒక్కసారి నా మాట వినండి’ అనగానే ప్రళయంలా చెలరేగుతున్న ఆమె చల్లబడిపోయింది. చీకట్లో కిరీటి ముఖాన్ని, తలను తడిమి ‘ఓ మై గాడ్, నో’ అని ఒక్క సారిగా అతడ్ని తోసేసి అంగట్ల వెనుక వైపుకి పారిపోయింది.

జరిగిన దాన్ని గురించి ఆలోచించడం బలవంతంగా ఆపి ముందు తన కాళ్ళ దగ్గర వున్న పుస్తకాన్ని పైకి తీసుకొని చూశాడు. జేబులో పెట్టుకొంటుండగా కింద పడిపోయిన కార్డ్ కూడా వెదికి సంపాదించాడు. రెండూ కూడా మరీ ఎక్కువ డామేజ్ కాకపోవడంతో ఊపిరి పీల్చుకొని, తన బట్టలు, క్రాఫూ సరిచేసుకొని మిత్రుల కోసం వెళ్ళాడు.

పెద్ద ప్రభ వద్దకు చేరుకొనేసరికి మిగతా ముగ్గురు అక్కడ వున్నారు. కిట్టి చేతిలో చంకీల దండలు వున్నాయి. ‘దిరికినయిరా మామా. పా, స్టేజ్ కాడికి పోయి ఆ బాబాయికి ఇద్దాము’ అంటూ నాటకం జరిగే వైపునకు బయలుదేరారు.

‘ఏరా, చేతిలో ఏంటి పుస్తకం?’ అంటూ రంగ కిరీటి చేతిలోని పుస్తకం తీసుకొని చూశాడు. ఇంగ్లీష్ పుస్తకం ఎక్కడ దొరికిందిరా నీకు అని అడిగితే ‘పట్నం వాళ్ళు పెట్టిన ఒక షాపులో కొన్నానురా’ అని చెప్పాడు. ఎందుకో సునయన గురించి, తనను ముద్దు పెట్టుకొన్న అమ్మాయి గురించి అప్పుడే చెప్పాలి అనిపించలేదు కిరీటికి. ‘మిగతా అంగట్లు ఎట్లున్నయిరా ఈ సారి’ అని అందరూ discuss చేసుకుంటూ మళ్ళీ రేపు రావాలి అనుకుంటూ స్టేజ్ వద్దకు చేరుకున్నారు.

దుర్యోధనుడి మేకప్పు పూర్తి అయిపోయి ఆయన కంగారుగా తిరుగుతుంటే కిట్టి వెళ్ళి ఆయనకు దండలు ఇచ్చి వచ్చాడు. ‘ఒరేయ్ మామా కనీసం బాబాయి పాత్ర ఒక్కటి ఐనా చూడాలిరా రేత్తిరికి’ అంటూ సంత మిగతా మొత్తం కలియదిరిగారు. సునయన షాపు దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. బల్ల, కుర్చీ, ఖాళీ షెల్ఫ్ తప్ప ఆదివరకు అక్కడ వున్న నల్లబోర్డ్ కూడా లేదు. మళ్ళీ రేపు వస్తే కనిపిస్తుందో లేదో అన్న ఆలోచనలో పడి ఒక రోబోట్ లాగా మిగతా ముగ్గురితో కలిసి వెళ్తున్నాడు కిరీటి. ఎలాగూ ఎక్కువ మాట్లాడడు కాబట్టి మిగతా ముగ్గురు కూడా కిరీటి కొంచెం తేడాగా వున్నాడు అన్న విషయాన్ని పట్టించుకోలేదు.

సంతలో దొరికే తినుబండారాలన్నీ మెక్కి భుక్తాయాసంతో స్టేజ్ దగ్గరకు చేరుకున్నారు నలుగురూ. మంచి రంజైన నాటకాలు పడ్డాయి ఈ సంవత్సరం. నైటుకి హైలైట్ మటుకు దుర్యోధన ఏకపాత్రాభినయం. అప్పటివరకూ ఏవో వూహాల్లో తిరుగాడుతున్న కిరీటి సైతం ఆ నటకుడి గొంతుకీ, స్టేజ్ presenceకి అబ్బురపడి ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు. ఆ ఒక్క కార్యక్రమం పూర్తి అయ్యాక ఇంటి బాట పట్టారు నలుగురూ.    
[+] 5 users Like mkole123's post
Like Reply
#11
nice story
really enjoyed reading your story
[+] 1 user Likes maskachaska2000's post
Like Reply
#12
కథ బాగుందని కామెంట్ పెట్టిన మిత్రులకు వందనం. ముందే చెప్పినట్టు కథలో శృంగారం కొంచెం తక్కువగా వుంటుంది. ఐనా మిమ్మల్ని అలరిస్తుందని నా ఆశ.
పాత్రల సంభాషణలు, అందులోని ఉద్వేగాలు వీటి ద్వారా కథ నడపాలని నా ప్రయత్నం. కొండకచో కథాగమనం కుంటుపడితే ఓపిక పట్టండి. Perhaps I will write a fast paced story next time!
Like Reply
#13
మాయ - 5

మంచంపై పడుకొని ఆ రోజు జరిగిన విషయాలన్నీ నెమరేసుకుంటున్నాడు కిరీటి. కళ్ళు మూసుకుంటే సునయన కళ్ళముందు కనిపిస్తోంది. ఇంతలోనే నిక్కీ ఆలోచనల్లో చొరబడుతోంది. సునయన ముఖం, నిక్కీ ఒళ్ళు కలగలిసిపోయి చిత్ర విచిత్రమైన కలలన్నీ వచ్చి అది ఇది అని చెప్పలేని ఒక బాధ మనసును మాయ చేస్తోంది. ముందే చెప్పుకున్నాంగా, ఈ కథ అనుకోకుండా ఈ కుర్రాళ్ళ జీవితంలో ప్రవేశించిన వారి వల్ల జరిగిన మార్పుల గురించి అని... ఈ రోజు కిట్టి, కిరీటి జీవితాల్లో చెరగని ముద్ర వేసింది. 


మర్నాడు, ఆ తరువాతి రోజు కలిసి సంతకి పోవటం కుదర్లేదు స్నేహితులకి. కిట్టి మాత్రం ప్రతిరోజూ వెళ్ళి తన ఫేవరెట్ నటుడి ఏకపాత్రాభినయం చూసి వస్తున్నాడు. ఇంకా సంత ఒక్క రోజే వుంది. ఆ రోజు రాత్రికి ఎలాగైనా వెళ్ళి తీరాలని అనుకున్నారు నలుగురూ. చివరకు జరిగింది వేరు.

సంతకి పోవడానికి అందరూ ఒక చోట చేరాక ‘రే మామా, సచ్చిందిరా గొర్రె. Chemistry records ఇస్తానికి రేపేరా ఆకరి రోజు’ అంటూ గోరు గుర్తుచేశాడు. ‘మీరింకా రాయలేదారా?’ అన్న కిరీటిని తినేసాలా చూశారు ముగ్గురూ. ‘రాసేవోడివి ఓ మాట సెప్పాల గందా’ అంటూ ఫైర్ అయ్యాడు గోరు. చిన్నగా నవ్వి ‘నా రికార్డ్ ఇస్తానురా. చూసి జాగ్రత్తగా రాయండి. వున్నది వున్నట్టు దించేశారో ఒక్కొక్కడిని మక్కెలిరగ్గొడతా. కాపీ కొట్టామని అందర్నీ fail చేస్తారు.’ అని వార్నింగ్ ఇచ్చాడు.

‘నువ్వు దేవుడు సామీ’ అంటూ రంగా, గోరు కిరీటిని వాటేసుకున్నారు. కిట్టి మటుకు కొంచెం unhappyగా వున్నాడు. ‘నీకేటైనాదిరా, రికార్డ్ రాయాలని మాకూ లేదు. టైమ్ కి ఇయ్యకపోతే సాయిబు (chemistry లెక్చరర్) fail చేస్తాడని చెప్పినారు గంద సీనియర్లు’ అన్న గోరుతో  ‘ఔ ... నాకూ గుర్తుందిరా. నైటుకి రాములు బాబాయి, అదే, దుర్యోధన పాత్ర ఆయన ఒకసారి కల్వమని చెప్పుండే. రేపుట్నుంచి మళ్ళా కనబడ్డు గందా’ అన్న కిట్టిని ఒక ఊపు ఊపి ‘ఒరేయ్, ముందు దీని సంగతి సూడ్రా సామీ. సంకురేత్తిరికి మళ్ళా సంతెడతారు. రాములు కాదు ఈ సారి ఆయబ్బ అమ్మ మొగుడొస్తాడు’ అని గోరు అందర్నీ కిరీటి ఇంటి వైపు బయల్దేరదీశాడు.

రికార్డ్ మిత్రుల చేతిలో పెట్టి కిరీటి ఒక్కడే ఖాళీగా మిగిలాడు. కొంతసేపు ఊగిసలాడాడు కానీ చివరకు తన సైకిలుపై ఒక్కడే వెళ్ళాడు సంతకి. సంత మొత్తం తిరిగాడు కానీ ఎక్కడా సునయన కానీ ఆమె షాపుకానీ కనిపించలేదు. ఉసూరని ఇంక ఇంటికి పోదామని సైకిల్ స్టాండు వైపుకి బయల్దేరాడు.

‘ఏం హీరో, మమ్మల్ని చూడ్డానికి మళ్ళీ టైమ్ కుదర్లేదా అబ్బాయిగారికి’ అంటూ ఎవరో భుజంపై చెయ్యి వేశారు. వెనక్కు తిరగకముందే కిరీటి మైండ్ లో ఒక రకమైన విస్ఫోటనం సంభవించింది. ఆ గొంతు ఒకేఒక్కసారి విన్నాడు కానీ ఇక జీవితంలో మర్చిపోలేడు. వెనక్కు తిరిగి చూస్తే సునయన, ఆమెతోపాటు ఆజానుబాహుడైన ఒక వ్యక్తి వున్నారు.

‘hi సునయన గారూ, అదేం లేదండీ. ఏదో కాలేజీ క్లాసుల్లో కొంచెం బిజీ. ఇవ్వాళ మిమ్మల్ని... అదే మీ షాపు చూద్దామని వచ్చాను. కానీ మీరెక్కడా కనబడలేదు’ అంటూ తడబడుతూ చెప్పాడు. బుగ్గ సొట్ట పడేలా నవ్వి తన పక్కనున్న వ్యక్తి చేతిలోని పెద్ద పెట్టెని చూపించి ‘మేము అందరికంటే ముందే దుకాణం సర్దేశాము. ఇకనో ఇంకాసేపట్లోనో బస్సు వస్తే వెళ్లిపోతాము’ అని చెప్పింది.

చేతికున్న వాచ్ చూసి కిరీటి ‘సాయంత్రం బస్సు వెళ్లిపోయిందండి. మళ్ళీ పట్నం వెళ్ళే బస్సు పదిగంటలకే’ అని చెప్పాడు. సునయన తన పక్కనున్న వ్యక్తి వైపుకి తిరిగి ‘అబ్బా, ఇంకా రెండు గంటలు wait చెయ్యాలా. నాకు ఆల్రెడీ మెంటల్ ఎక్కుతోంది’ అని ‘by the way, ఈయన పేరు ధనుంజయ్, ఇతని పేరు కిరీటి’ అంటూ ఒకరికి ఒకరిని పరిచయం చేసింది.
ధనుంజయ్ కిరీటికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘నువ్వు కొంచెం మా సునయనకి కంపెనీ ఇవ్వగలవా కిరీటీ, నేను నైటు పట్నం చేరేదాకా ఆకలికి ఆగలేను. అలా వెళ్ళి ఏమన్నా తినేసి వస్తాను’ అని అడిగాడు. కిరీటికి కూడా సునయనతో ఒంటరిగా వుండాలి అని వుంది కానీ బయటపడలేక పోతున్నాడు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని question చేసే పరిస్థితిలో లేడు. ‘సరేనండి. మేము అలా బ్రిడ్జి పక్కన కాల్వ గట్టున వుంటాము. పెట్టె మా దగ్గర పెట్టి వెళ్తారా’ అని అడిగాడు.

పెట్టె చేతికి అందించబోతుంటే సునయన ఆపి ‘ఓయ్, ఒకసారి పక్కకి తిరిగితేనే card తీసుకొని వెళ్లిపోయాడు. ఇప్పుడు పెట్టె మొత్తం అయ్యగారి చేతిలో పెడతావా? నో, నువ్వే తీసుకెళ్లు’ అన్నది. తనకదేమీ పెద్ద భారం కాదన్నట్టు ధనుంజయ్ అవలీలగా పెట్టె మోసుకొని ఫుడ్ వెతుక్కుంటూ వెళ్ళాడు.

ఇవతల కిరీటి సిగ్గుతో కార్డ్ విషయం తెలిసిపోయినందుకు ఏం మాట్లాడాలో తెలీక తలవంచుకొని నిలబడిపోయాడు. సునయన అతడి ఇబ్బందిని చూసి గట్టిగా నవ్వి ‘నువ్వు కార్డ్ తీసుకెళ్లినందుకు నాకేమీ కోపం లేదయ్యా మగడా. ధనుంజయ్ అంటే బండరాముడు. కనపడదు కానీ పెట్టె చాలా బరువు. మనకెందుకు మోత బరువు అని అతగాడ్నే తీసుకుపొమ్మన్నా’ అన్నది.

ఇంకా మాట్లాడకపోయేసరికి ‘నమ్మవా, నా మీద ఒట్టు. Taking that card was a marvelous trick you pulled on me’ అన్నది. కిరీటి సిగ్గుని అతడి క్యూరియాసిటీ జయించింది. ‘మీరు ఇంత బాగా ఇంగ్లిష్ ఎలా మాట్లాడగలరు? ఎంత వరకు చదువుకున్నారు మీరు?’ అని అడిగాడు. సునయన చేతులు కట్టుకొని తన తేనె కళ్ళతో కిరీటిని పరీక్షగా చూస్తుంటే స్వతహాగా కొంచెం introvert ఐన కిరీటికి ఇబ్బందిగా వుంది. నిలబడ్డ చోటే కాళ్ళు కదిలిస్తూ మళ్ళీ అడగరానిది ఏమన్నా అడిగానా అనుకుంటూ వుండిపోయాడు.

‘hmm, నా రూల్ తెలుసు కదా, నన్ను ఏమన్నా అడిగే ముందు ఏదైతే అడిగావో నీ గురించి ఆ విషయం నాకు చెప్పాలి’

‘నేను డిగ్రీ 1st ఇయర్ స్టూడెంట్. Inter వరకు తెలుగు మీడియం. ఇంగ్లిష్ లో ఇంకా కొంచెం struggle అవుతున్నాను. మీరు ఇంత easy గా ఇంగ్లిష్ మాట్లాడుతుంటే నాకు ఎప్పటికైనా అలా మాట్లాడాలని కోరిక కలుగుతోంది’

సునయన మెత్తగా నవ్వి ‘నేను formal గా టెన్త్ వరకే చదివాను. తరువాత డబ్బులు లేక చదువు ఆగిపోయింది’ అన్నది. కిరీటి నమ్మలేనట్లు చూస్తే తలమీద చెయ్యి వేసుకొని ‘ప్రామిస్’ అన్నది. ‘మీరు చాలా గ్రేట్ అండీ. మీరు మాట్లాడినంత బాగా మా లెక్చరర్ కూడా మాట్లాడడు’ అని చెప్పాడు. ‘మునగ చెట్టు ఎక్కించకు అయ్యా’ అంటే ఈ సారి కిరీటి తన నెత్తిపై చెయ్యి వేసుకొని ‘ప్రామిస్’ అన్నాడు.

గలగలా నవ్వి సునయన ‘పైకి అస్సలు కనిపించవు కానీ నువ్వు పెద్ద కరోడా’ అంటూ తన కుడి చేత్తో అతడి ఎడమ చేతిని పెనవేసింది. ‘రెండు గంటలు నేను నీ దాన్ని. కాసేపు మీ సంత చూపించు. తర్వాత పోయి అక్కడ కూర్చుందాం’ అంటూ కిరీటిని లాక్కుపోయింది. ఇవతల మనవాడు సునయన చెయ్యి తగలగానే మైండ్ బ్లాంక్ అయ్యి తన వెంట వెళ్తున్నాడు.
[+] 7 users Like mkole123's post
Like Reply
#14
Mkole 123 గారు
మీ రచనా శైలి చాలా బాగుంది....... 
నేను మీ అభిమానినై పోయా......
mm గిరీశం
Like Reply
#15
(06-05-2020, 11:05 AM)Okyes? Wrote: Mkole 123 గారు
మీ రచనా శైలి చాలా బాగుంది....... 
నేను మీ అభిమానినై పోయా......

సేం టు సేం, నా అబిప్రాయం కూడా అదే, మీ కథలో ఒక మంచి ఫ్లో ఉంది, రాసిన దాని గురించి, రాయబోతున్న దాని గురించి, ఎక్కడెక్కడ ఎంత వరకు చెప్పాలో, ఎక్కడ ఆపాలో...బావుంది
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#16
మిత్రులు Okyes?, Uday గార్లకు ధన్యవాదాలు. పాఠకులు గోరంత ప్రోత్సాహం అందిస్తే రచయితలకు కొండంత ఉత్సాహం వస్తుంది.
[+] 1 user Likes mkole123's post
Like Reply
#17
మాయ - 6

కిరీటి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఏకైక సంతానం. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో ఇద్దరు మగవాళ్ళు. ఆడవాళ్ళతో కలవటం తక్కువ. ఇదిగో ఇప్పుడే డిగ్రీలో మొదటిసారి కో-ఎడ్ కాలేజీలో అమ్మాయిలతో కొంచెం మాట్లాడడం. తండ్రి నేర్పిన సంస్కారం, స్వతహాగా వున్న సిగ్గరితనము అమ్మాయిలని ఎప్పుడూ వక్రబుద్ధితో చూడనివ్వలేదు. ఇలాంటి ఒక కుర్రవాడికి సునయన, నిక్కీ వంటి వారు తమంతట తామే మీద పడితే ఎలా వుంటుందో ఆలోచించండి! ఇలా మొదలైన ఆడవారి సాన్నిహిత్యం అతడి characterలో ఏమన్నా మార్పులు తెచ్చిందా, అది యే రకంగా రూపాంతరం చెందింది అనేది కథాగమనంలో చూద్దాం. 


మెత్తటి సునయన వొళ్ళు హత్తుకుపోతుంటే కిరీటికి ఆమె మాటలపై గురి పెట్టడం చాలా కష్టంగా వుంది. కొంత తేరుకొని తను కూడా ఆమె కంపెనీని ఆస్వాదించడం మొదలెట్టాడు. సరదాగా సంత అంతా కలియతిరుగుతున్నారు. ‘మీకు ఆకలి వెయ్యటం లేదా? ఏమన్నా తింటారా?’ అని అడిగితే ‘చూశావా, నువ్వు కాబట్టి అడిగావు. ఆ రాతిమనిషి తన పొట్ట సంగతి చూసుకుందుకు పోయాడు కానీ నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. ఆకలి వేస్తోంది కానీ మా డబ్బులన్నీ ధనుంజయ్ దగ్గర వున్నాయి. ఇప్పుడు అతగాడిని వెదికే ఓపిక నాకు లేదు.’ అన్నది.

మారు మాట్లాడనివ్వకుండా ఆమెని తినుబండరాలు దొరికేచోటికి తీసుకువెళ్లి సునయన ఏది అడిగితే అది ఇప్పించాడు. ‘Many thanks కిరీటీ, ఇప్పుడు నేను నీకోక భోజనం బాకీ. పద ఎక్కడైనా కాసేపు విశ్రాంతిగా కూర్చుందాం’ అని చెప్పి నాటకం జరిగే స్టేజ్ వైపు వెళ్లారు. స్టేజి ఎదురుగా వున్న కుర్చీల్లో కూలబడి కాసేపు గోదారి పైనుంచి వచ్చే చల్లగాలి ఆస్వాదిస్తూ వున్నారు ఇద్దరూ.

ఎదురుగా స్టేజిపై ఏవో నాటకాలు సాగుతున్నాయి కానీ కిరీటి వాటినేవీ పట్టించుకునే స్థితిలో లేడు. భుక్తాయాసమో, అలసట వల్లనో కానీ సునయన కుర్చీలో జారగిలబడి కన్నులు మూసుకుంది. రెప్ప వాల్చకుండా కిరీటి ఆమెనే చూస్తున్నాడు. మళ్ళీ జీవితంలో ఇలాంటి అమ్మాయిని చూస్తానని కానీ ఇంత దగ్గరగా, చనువుగా వుంటానని కానీ అతడికి నమ్మకం లేదు.

‘అలా పీక్కుతినేలా చూడకోయి, సిగ్గేస్తోంది’ అని సునయన అంటే గతుక్కుమని ‘నేను మిమ్మల్నే చూస్తున్నానని ఏమిటి గ్యారంటీ. ఐనా మీరు కళ్ళు మూసుకుని వుంటే మీకెలా తెలుసు నేనేమి చూస్తున్నానో. ఇది ఇంకొక మ్యాజిక్ ట్రిక్కా?’ అన్నాడు. ‘నీలాగా వయసులో వున్న కుర్రాళ్ళు చూసేదేమిటో చెప్పడానికి మా అమ్మాయిలకి మ్యాజిక్ అక్కర్లేదు’ అని నవ్వుతూ అంటోంది. సీరియస్ గా ఏమీ లేకపోయేసరికి కిరీటి ఆమె పైనుంచి చూపు తిప్పుకోలేక పోతున్నాడు.

స్టేజ్ మీద దుర్యోధనుడు పాంచాలి మీద పగ సాధిస్తాను అని భీకరంగా ప్రతిజ్ణ చేసి జనాల చప్పట్ల మధ్య తన పాత్ర ముగించాడు. ఒకసారి స్టేజ్ వంక చూస్తే దుర్యోధనుడి పాత్రధారితో మాట్లాడే వ్యక్తి ముఖం బాగా పరిచయం వున్నట్టు తోచింది కిరీటికి. మైండ్లో బల్బు వెలిగి ‘కిట్టీ’ అంటూ సడన్ గా లేచి నుంచున్నాడు. రికార్డ్ రాయాల్సినవాడు ఇక్కడకి ఎందుకు వచ్చాడో అర్ధం కాలేదు. క్లాస్ fail అవుతామన్న జ్ణానం కూడా లేకుండా ఇలా చేసేసరికి వాడి మీద కోపం వచ్చింది.

‘ఏమయ్యింది, ఎవరికైనా దెబ్బలు తగిలయా అంత react అయ్యావు’ అని సునయన అడిగితే ‘ఇప్పుడు కాదు లెండి, రేపు తగులుతాయి వాడికి దెబ్బలు’ అంటూ మళ్ళీ కూర్చున్నాడు కానీ ఇంక restless గా అయిపోయాడు. ఓ పక్క ఇప్పుడే వెళ్ళి కిట్టిగాడిని చెడామడా తిట్టాలని వుంది. కానీ సునయన పక్కనుండి కదలాలని లేదు! కిట్టి సంగతి రేపు చూడొచ్చు అని ఫిక్స్ అయి మళ్ళీ సునయన వంక చూస్తూ కూర్చున్నాడు.

‘ఇలాగే వుంటే నువ్వు నన్ను చూపుల్తోనే తినేస్తావు. పద, ఎక్కడికైనా పోయి కాసేపు కబుర్లు చెప్పుకుందాం’ అని కిరీటిని అక్కడ్నుంచి లాక్కుపోయింది. కొంచెం జనసందడి లేకుండా ఖాళీగా వున్న చోటకు వెళ్ళి నెల మీద కూలబడ్డారు ఇద్దరూ. ‘హమ్మయ్య’ అనుకుంటూ విష్ణుమూర్తి ఫోజులో పడుకొని ఎడమ చెయ్యి మడిచి తల కింద పెట్టుకొని కిరీటినే చూస్తూ, ‘నిన్నూ, మీ ఊరినీ మర్చిపోకుండా వుండేలా ఏమన్నా విశేషమో, కథో చెప్పవోయ్’ అని అడిగితే ఏం చెప్పాలబ్బా అని ఆలోచించి ఒక పుల్ల తీసుకొని నేల మీద ఏదో గీయటం మొదలెట్టాడు.

ఏం గీస్తున్నాడా అని కొంచెం వాలుగా వంగి చూస్తోంది సునయన. ఆమెను ఆ యాంగిల్లో కన్నార్పకుండా చూడాలని వుంది కానీ చూస్తే దొరికిపోతామని డిసైడ్ అయ్యి తను గీసినదాన్ని చూపించి చెప్పడం మొదలెట్టాడు.  

‘మా వూరి పేరు ఒకప్పుడు సూరారం అట. సూర్యవరం అనే పేరుకి shortcut అనుకోండి. ఆ పేరు ఎందుకు పేరొచ్చిందంటే..’ అంటూ తను గీసిన బొమ్మ చూపించాడు. అది crudeగా గీసిన సూర్యుడి బొమ్మలా వుంది. అంటే, ఒక circle, దానినుంచి కిరణాల వలే ఏడు గీతలు గీసినట్టు వుంది. సునయన కళ్ళలో కుతూహలం చూసి కిరీటి చెప్పడం కంటిన్యూ చేశాడు. ‘ఇదిగో circleలా వుందే, ఇది మా ఊరు. ఇప్పుడు పంచాయితీలు, నియోజకవర్గాల బోర్డర్లు మార్చాక మరీ ఇంత రౌండ్ గా లేదు కానీ ఒకప్పుడు ఇలానే వుండేదిట.’

‘ఇదుగో ఈ ఏడు గీతలున్నాయే, ఇవి మా ఊళ్ళోకి వచ్చే దారులు. చూసారూ, ఇవి ఏడు దిక్కులనుంచి మా ఊరికి వచ్చే దారులు. అలాగే ఎనిమిదో దిక్కు నుంచి కూడా ఒకప్పుడు దారి వుండేదట’ అంటూ ‘ఇది ఉత్తరం దిక్కు’ అని చూపుతూ మిగతా గీతలకంటే కొంచెం సన్నగా ఒక గీత గీశాడు. ‘ఇప్పుడు ఉత్తరాన శ్మశానం తప్పితే ఇంకేమీ లేదు. అట్నుంచి ఎవరూ ఊళ్ళోకి అడుగుపెట్టరు కూడా.’

‘అన్ని ఊళ్లలాగానే ఇదీనూ. కాకపోతే మీ ఊళ్ళోకి రోడ్లు ఎక్కువ. ఇందులో విశేషం ఏముంది’ అంటూ తన ముఖంపైన పడుతున్న జుట్టు చెవి వెనక్కు తోసుకుంటూ అడిగింది సునయన.

‘మీకు impatience ఎక్కువ అండీ’

‘నోరు మూసుకుని చెప్పేది వినమని ఇంత గౌరవంగా ఎవ్వరూ చెప్పలేదయ్యా నాకు ఇన్నాళ్ళలో’

‘అహహ... అది కాదండీ నా వుద్దేశం’ అని కంగారు పడుతున్న కిరీటిని చూసి నవ్వి ‘ఆట పట్టించటానికి అన్నానోయి’ అని అతని చెయ్యి నొక్కి ‘ఇంక disturb చెయ్యనులే, చెప్పు’ అంది సునయన.

‘ఇంతకీ మా ఊరి పేరు ఎందుకు మారిందో చెప్పాలి. ఒకప్పుడు ఇక్కడ పెద్ద గుడి వుండేదిట. అలాంటి ఇలాంటి గుడి కాదండీ. చాలా పెద్ద సూర్యుడి గుడి. అంతే కాదండీ, సకల దేవతలకూ ప్రత్యక్ష స్వరూపం సూర్యుడు కాబట్టి ఆయన విగ్రహంతో పాటుగా చాలామంది దేవుళ్ళ విగ్రహాలు వుండేవి అట ఆ గుళ్ళో. అవన్నీ వెలకట్టలేని పంచలోహ విగ్రహాలు అట. దాదాపు 50 విగ్రహాలు వుండేవిట. కాలక్రమంలో గుడి శిధిలమైపోయి విగ్రహాలు అన్నీ కనుమరుగైపోయాయి.’

‘ఇలా వుంటే, ఒక రోజు పెంచలయ్య అనే పశులకాపరికి చిన్న సూర్యుడి విగ్రహం దొరికిందట. విగ్రహం దొరికిన రోజు ఆ టైమ్ లో సూర్యగ్రహణం. కానీ విగ్రహం చేతిలోకి తీసుకోగానే గ్రహణం చీకట్లో ఏదో దారి కనిపించిందట పెంచలయ్యకు. ఆ దారెమ్మట వెళ్తే, పాత గుడి అందులో విగ్రహాలు అన్నీ కనిపించాయట. గ్రహణం పూర్తి అవ్వగానే విగ్రహాలు అన్నీ తుడిచి శుభ్రం చేసి దణ్ణం పెట్టుకొని వచ్చాడుట పెంచలయ్య. అప్పట్నుంచీ ఆ పెంచలయ్య వంశస్థులు ప్రతి సంవత్సరం సూర్యగ్రహణం రోజు ఆ చిన్న విగ్రహం పట్టుకు పోయి ఆ గుళ్ళో పూజ చేసి వచ్చేవాళ్లుట. అదుగో ఆ పెంచలయ్య పేరు మీద మా ఊరు పెంచలాపురం అయ్యింది’.

‘Wow! అద్భుతం. నాకిలాంటి కథలంటే ఎంత ఇష్టమో తెలుసా! మరిప్పుడు ఆ విగ్రహం ఎక్కడుంది? ఇప్పటికీ ఆ పెంచలయ్య వంశం వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తున్నారా?’ అంటూ కుతూహలంగా అడిగింది సునయన.

కిరీటి చిన్నగా నవ్వి ‘లేదండీ, పెంచలయ్య వంశం వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. ఇది ఒట్టి కథ. ఇందులో నిజం ఎంతో ఎవ్వరికీ తెలియదు. మా ఊళ్ళో ఒక చిన్న సూర్యుడి విగ్రహం మటుకు వుందండి. ప్రతి సంవత్సరం రెండు సార్లు - సంక్రాంతి రోజు, రథసప్తమి రోజు ఊరేగిస్తారు. అది పంచలోహ విగ్రహం అనీ, గుళ్ళో వుంటే దొంగలు ఎత్తుకుపోతారని ప్రెసిడెంటు గారి ఇంట్లో భద్రంగా పెట్టి వుంచుతారు.’

‘మరి సూర్యగ్రహణం రోజు ఎప్పుడూ తీసుకెళ్లి పాత గుడి కోసం వెదకలేదా?’ చిన్నపిల్లలా కళ్ళు పెద్దవి చేసి అడిగింది సునయన.

‘అయ్యో రామ, చాలా సార్లు గవర్నమెంట్ ఆఫీసర్లు, పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి try చేశారు. గుడి కోసమని ఊళ్ళో చాలా చోట్ల తవ్వకాలు కూడా జరిపారు. ఏమీ దొరకలేదు. మా ఊరి గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎవరో ఎప్పుడో అల్లిన కథ అని చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తారు’ అంటూ చెప్పడం పూర్తి చేశాడు కిరీటి.
[+] 5 users Like mkole123's post
Like Reply
#18
Excellent... ?????
Like Reply
#19
Super
Like Reply
#20
Nice update
Like Reply




Users browsing this thread: 18 Guest(s)