Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఒక ప్రేమకథ... by sindhukumari
#21
మేము బైటకి వెళ్లి ఆవిడకోసం వినాయకుడి ఐడల్ కొన్నాం.....వుడ్ తో చేసినది.......దాని కార్వింగ్స్ అన్ని చాలా బాగున్నాయి....చూడగానే మాకు ఇద్దరికీ నచ్చేసింది........సో కోనేసాం.. ఆర్చీస్ లో కార్డు కూడా తీస్కున్నాం.......Thanks or being our mentor అని రాసుంది ఆ కార్డు లో.. మేమిద్దరం దాన్లో సైన్ చేసాం..... ప్యాకింగ్ చేయిన్చేసి రిటర్న్ బైల్దేరాం....ఒక ఆటో తీస్కుని.......

అలా ఇద్దరం ఆటో లో తిరిగి మా కాంపస్ కి వెళ్తున్నాం.....దార్లో ఒక దగ్గర మొక్క జొన్న పొత్తులు అమ్ముతున్నారు......నాకు మొక్కజొన్నపొత్తులు తినాలని అనిపించింది......స్టాప్ స్టాప్ అన్నాను వెంటనే.....ఆటో అతను స్లో చేసాడు..... అతను ఆపేలోపే ఆటో దిగేసి జొన్నపొత్తుల దగ్గరకి వేల్తంకి పరిగెడ్తున్నాను నేను.నేను దిగి పరిగెడ్తుంటే ఆర్యన్ నా పేరు బిగ్గరగా అరవడం వినిపించింది నాకు.....తనే వస్తాడులే అని తిరిగి చూడకుండా జొన్నపొత్తులు అమ్ముతున్నదగ్గరకి వెళ్లి ఆ అవ్వతో మాట్లాడుతున్నాను.అంతే నన్ను మాట్లాడనివ్వకుండా నా చెయ్యి పట్టుకుని ఆటో దగ్గిరకి ఈడ్చుకెళ్ళాడు ఆర్యన్..........

"అరేయ్.. కొనుక్కుని వస్తా " అన్నాను నేను.
"పిచ్చానీకు.. ముందు వెనక చూస్కోవ?కొంచెం సేపుంటే ఏమయ్యేదో తెల్సా అసలు"అని గట్టిగా కళ్ళు ఎర్రచేసి అరిచేసాడు ఆర్యన్.......

ఎప్పుడూ కనీసం గట్టిగా కూడా మాట్లాడని ఆర్యన్ నా మీద అలా అరిచేసేప్పటికి నా కళ్ళ లో నీళ్ళు వచ్చేసాయి.........

"ఏడవకు..తగుల్తాయింక నీకు .అంటూ చెయ్యి ఎత్తాడు.......తను ఎప్పుడు నాతో అలా behave చెయ్యలేదు...నా దుక్ఖం ఆపుకోవడం నావల్ల కాలేదు.... ఎక్కు ఆటో "అన్నాడు తను అదే సీరియస్ టోన్ తో.
"నా జొన్నపొత్తు మరి"అన్నాను ఏడుపు ఆపుకుంటూ కళ్ళ నిండా కన్నీళ్ళతో నేను ఆటో ఎక్కుతూ......
తను వెళ్లి జొన్నపొత్తు తెచ్చాడు ..నేను తీస్కోబోతుంటే,నీక్కాదు నాకు అంటూ తను నా పక్కన కుర్చుని తింటున్నాడు ......
"నీకు కావాలంటే కొనేదాన్ని గా....నాకు ఎందుకు కొనకుండా నువ్వే కొనుక్కుని తింటున్నవ్ "అన్నాను నేను కళ్ళు తుడ్చుకుంటూ..
"నీకు పనిష్మెంట్.......ఇవ్వను..నేనే తింటాను.."అన్నాడు కోపంగా......
నాకు ఒక్క గింజ కూడా ఇవ్వలేదు....మొత్తం తనే తినేసాడు......నేను అలా బిక్కమొహం వేస్కుని కూర్చున్నాను....

కాంపస్ కి వచ్చేసాం ..ఎవరి హాస్టల్ కి వాళ్ళు వేల్లిపోయం.... Asusual గా లైబ్రరీ దగ్గర కల్స్కున్నాం ఫ్రెష్ అయ్యాక..........

ఇద్దరం సైలెంట్ గా కూర్చున్నాం..
"నువ్వు మాన్స్టర్ వి ..నీకు అసలు కోపమే రాదనుకున్నాను.. కాని నువ్వు చాలా కోపిస్టివి అని అర్ధమయింది"అన్నాను నేను.
"ఇంకో సారి రన్నింగ్ వెహికల్ నుంచి ముందు వెనక చూస్కోకుండా దిగి చూడు.....నిజం గా మాన్స్టర్ ని చూస్తావ్ "అన్నాడు తను ఇంకా అదే సీరియస్ పేస్ తో....నాకు మళ్లీ నీళ్ళు తిరిగాయి....ఎప్పుడు ఎవరి చేత ఒక్క మాట కూడా పడలేదు.....ఇలా కోపంగా కూడా చూడలేదు.....ఇలా ఒక్కసారి తను నా మీద సీరియస్ అవ్తున్నాడు........
"పో.....నేను వెల్తునా.....నువ్వు ఇంకా అరుస్తున్నావు "అంటూ లేచాను నేను..
"హా వెళ్ళు..ఇది నీకోసం కొన్నాను..తీస్కుని వెళ్ళు"అంటూ నా చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి మొక్కజొన్నపొత్తు నా చేతిలో పెట్టాడు......

"హాఅయ్.....జొన్న పొత్తూ...... కొన్నావ....మరెందుకు మాన్స్టర్ లాbehave చేస్తావ్.."అంటూ అది తీస్కుని మళ్లీ తన పక్కన కూర్చున్నాను.......

"జస్ట్ లో కార్ గుద్దేసేది శిశిర నిన్ను.. లక్కీ గా ఏం అవ్వలేదు....లేదంటే..అమ్మో ఊహించడానికే కష్టంగా ఉంది"అన్నాడు తను.
నేను నా తల తన భుజం మీద పెట్టి..జొన్నపొత్తు తింటూ.. "చారీ" అన్నాను.
"చూస్కో శిశిర,మన లైఫ్ ఎప్పుడు మన ఒక్కరిదే కాదు,మన పి ఎన్నో ఆశలు పెట్టుకున్నవాలది కూడా,మనకి ఏమైనా ఐతే ఆ పెయిన్ అనుభావిన్చేవాళ్ళు ,మనవాళ్ళు అందరిదును"అన్నాడు తను నా తల మీద చెయ్యివేసి.
"అబ్బ.. సరే..సారీ అన్నాను గా .. ఈసారి నుంచి కేర్ఫుల్ గా ఉంటాను."అన్నాను నేను.
"హ్మ్మ్...అన్నాడు తను అదే సీరియస్ పేస్ తో.....
"బాబు నవ్వరా.....ప్లీజ్....నిన్ను నేను అలా చూడలేను" అన్నాను....
ఇంకా తను అలానే ఉన్నాడు....
"వెంటనే లేచి రెండు చెవ్వులు పటుకుని గుంజీలు తేయటం స్టార్ట్ చేశా.......సారీ....సారీ..."అంటూ
తను నన్ను ఆపి
"ఏం వద్దు....ఇకపయ్ ఇంకేప్డు అలా చెయ్యకు.....నీ మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళకోసం ఆలోచించి....జాగ్రతగా ఉండు" అన్నాడు.....
"సరే...అన్నాగా....ఇకనన్న నవ్వరా బాబు" అన్నాను
"హ్మ్మ్ "...అంటూ చిన్న చిరునవ్వు నవ్వాడు.....
ఆరోజు జరిగిన ఇన్సిడెంట్ నాలో ఆలోచన తెచ్చింది....ఇకనన్న నేను నా childish behaviour ని తగ్గించుకోవాలి అని..........
అలా ఇంకొంచెంసేపు అక్కడ గడిపాం......తర్వాత రూం కి వేల్పోయ..బాగ్స్ అన్ని ప్యాక్ చేస్కుని నెక్స్ట్ డే ఈవెనింగ్ తిరిగి వెళ్ళిపోడానికి తయారయ్యి .. హాయిగా నిద్ర పోయాను.తెల్లవారింది.. ఒక విధంగా ఈ రెండు నెలలు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ పొందాను అని హ్యాపీ గా ఉంది...at the same time,ఈ కాంపస్ ని వదిలేసి వెళ్ళాలి అంటే బాధగా కూడా ఉంది..రెడీ అయ్యి ఇద్దరం అక్షయ కాంటీన్ లో టిఫిన్ చేసి మా డిపార్టుమెంటు కి వెళ్ళే బస్సు ఎక్కాం...... నేను కిటికీలో నుంచి బైటకి చూస్తూ మేము ఇద్దరం ఈ కాంపస్ లో అడుగుపెట్టిన రోజునుంచి జరిగిన అన్ని మూమెంట్స్ ని గుర్తుచేస్కున్తున్నాను.." "హ్మ్మ్...ఈరోజు ఇక్కడ తుఫాను వచ్చేట్టుంది "అన్నాడు ఆర్యన్....
తన మాటలకి నా ఆలోచన ల నుంచి బయటకి వచ్చి చూసా......
"అలా అన్నవెం...బయట ఎండ గానే ఉంది గా .....తుఫాను వచ్చే సూచనలు ఏం లేవే "అన్నాను
"ఏమో మరి ..నా మేడం గారు ఎందుకో అంత సైలెంట్ గా ఉన్నారు....ఈరోజు అందుకే అలా అనిపించింది నాకు? "అన్నాడు తను.
నేను తన భుజం మీద చిన్నగా కొడ్తూ
"నేను చాల మిస్ అవ్తాను ఈ రెండు నెలల ని "అన్నాను నేను.
"నేను కూడా "అన్నాడు తను మెల్లగా..
ఇద్దరం బస్సు దిగాం..నేను తను బస్సు దగ్గర నించుని Selfiee తీస్కున్నాం .. నేను ఇక్కడ్నుంచి వెళ్ళేప్పుడు అన్ని మెమోరీస్ ని వెంట తీస్కేల్లాలి అనుకున్నాను అందుకే ఒక్కటి కూడా వదల కుండా అన్ని ఫొటోస్ తీస్కున్తున్నాను.. నా రూం నుంచి ఈ బస్సు వరకు అన్ని ఫొటోస్ తీస్కున్నాను.......


______________________________
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
ఇద్దరం మేడం దగ్గరికి వెళ్ళాం.. ఆవిడ మాకు సర్టిఫికేట్స్ ఇచ్చారు..
"Good work both of you," అని మెచ్చుకున్నారు కూడా...
మేము కొన్న గిఫ్ట్ 'n' కార్డ్ ఆవిడకి ఇచ్చాము...
"Thank you for mentoring us, madam... knowingly or unknowingly... మిమ్మల్ని ఎప్పుడైనా హర్ట్ చేసుంటే, kindly forgive us," అని చెప్పాం.
ఆవిడ నవ్వుతూ, "Forgive me if I hurted you..." అన్నారు.
"No, madam, not at all... this is a wonderful experience to work with you... you helped us alot with your suggestions, ma'am.." అన్నాను.
తను మమ్మల్ని వాళ్ళ ఇంటికి డిన్నర్ కి invite చేసారు... మేము ఈవెనింగ్ వెళ్ళిపోతున్నామని చెప్పాం... సో, లంచ్ కి రమ్మన్నారు.
మేము 'సరే' అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాం... మా labలో and మేము రోజూ లంచ్ చేసే Cafetariaలో అన్ని ప్లేసెస్ లో ఫొటోస్ తీసుకున్నాం...
లంచ్ టైం అయ్యింది కాబట్టీ మేడం వాళ్ళ స్టాఫ్ రెసిడెన్స్ కి వెళ్ళాం...
మేడం నవ్వుతూ మమ్మల్ని లోపలికి invite చేసారు... మాకు వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళారు.
మేము లివింగ్ రూంలో కూర్చున్నాం... అక్కడ షెల్ఫ్ లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి... నేను వాటి దగ్గరికి వెళ్ళి నించుని చూస్తున్నాను... ఇంతలో ఆవిడ వచ్చారు, వాటర్ తీసుకుని... "Thanks.. madam," అని గ్లాస్ తీసుకున్నాను నేను...
"పిక్స్ చాల బాగున్నాయి మేడం.. ఈ అబ్బాయి చాల అందంగా మీలానే ఉన్నాడు," అన్నాను ఒక పిక్ చూపించి...
"తను మా అబ్బాయి శిశిరా... మీ ఏజ్ నే తను కూడా... ఇప్పుడు మీలానే B. Tech చదువుతుండేవాడు," అన్నారు ఆవిడ.
"చదువుతూ ఉండేవాడు ఏంటి మేడం?" అన్నాడు ఆర్యన్, సోఫాలోంచి లేచి మా దగ్గరికు వస్తూ...
"He is no more, Aaryan... 2 years back బైక్ ఏక్సిడెంట్లో చనిపోయాడు," అన్నారు ఆవిడ.
"Sorry madam," అన్నాం ఇద్దరం.
"That's alright," అన్నారు, చిన్నగా కన్నీళ్ళు పెడుతూ...
మేము ఆవిడ దగ్గరకి వెళ్ళాం... తను మా ఇద్దరి తలపై ఆశీర్వదిస్తున్నట్టుగా చెయ్యివేసి, "అయినా... నాకు మీరంతా పిల్లలే కదా...." అన్నారు, కన్నీళ్ళు తుడుచుకుని నవ్వుతూ.
మేము కూడా నవ్వాం...
"పదండి, లంచ్ చేద్దాం," అన్నారావిడ.
అలా లంచ్ కోసం డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాం. తర్వాత చాల కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసాం అందరం కలిసి...
ఎప్పుడూ సీరియస్*గా, ప్రొఫెషనల్ గా ఉండే మేడం మొహంలో ఆరోజు నవ్వుని చూసాను. ఇంకా మాకు dishes వడ్డిస్తున్నప్పుడు చాల కేరింగ్ గా... ప్రేమతో వడ్డించారు. ఎంతైనా హోమ్ ఫుడ్ టేస్ట్ వేరు కదా...
అన్నీ ఆవిడ మాకోసం స్వయంగా చేసారు, half-day లీవ్ తీసుకుని మరీ...! ఆవిడ మామీద చూపించిన అభిమానానికి చాల ఆనందం కలిగింది నాకు...
లంచ్ తర్వాత కొంచెంసేపు కూర్చుని మాట్లాడుకున్నాం... మేడంకి తెలుగు కూడా వచ్చు కాబట్టీ ఆర్యన్ చెప్పిన కొన్ని కవితలు విని ఆవిడ ఎంజాయ్* చేసారు.
"నీకు చాలా మంచి టాలెంట్ ఉంది, ఆర్యన్... నువ్వు మంచి రైటర్ వి అవుతావ్, ట్రై చేస్తే..." అన్నారావిడ.
"Thank you, madam. కానీ, నా లైఫ్ లో వేరే goals ఉన్నాయి... రైటింగ్ నాకొక రిలీఫ్ అంతే, అదే passion కాదు," అన్నాడు తను.
"నీ goals అన్నీ నువ్వు definiteగా achieve చెయ్యాలి," అని bless చేసారు ఆవిడ. "ఇంకా మీ పెళ్ళికి నన్ను పిలుస్తారా..?" అన్నారు మేడం.
నేను ఆశ్చర్యంగా ఆవిడవైపు చూసాను... ఆవిడ నవ్వుతూ మా వైపు చూసి, "నాకు అంతా తెలుసు... Nice couple మీరిద్దరూ..." అన్నారు.
నేను కొంచెం సిగ్గు పడుతూ ఉన్నా...
ఆవిడ నా దగ్గరికి వచ్చి, "పిలుస్తారుగా...!" అన్నారు.
"హ్మ్... తప్పకుండా... మేడం," అన్నాను.
"ఇంక మేం వెళ్తాం మేడం," అన్నాం.
"సరే... మ్...ఆగండి ఒక్క నిముషం," అని లోపలికి వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత 2 packets తీసుకుని బయటకి వచ్చారు.
"ఇదిగో... ఇవి తీస్కోండీ," అన్నారు.
మేము ఆ కవర్స్ ఓపెన్ చేసి చూసాం...
ఆర్యన్ కి ఒక డ్రెస్ ఇంకా నాకు శారీ ఉన్నాయి అందులో...
కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి నాకు... "మేడం.." అని తన కాళ్ళపై పడబోయాం ఇద్దరం... ఆవిడ మమ్మల్ని ఆపి తనకు దగ్గరగా తీసుకొని, "All the best... and... I wish you all the success in your future..." అని మమ్మల్ని ఆశీర్వదించారు.
అక్కడి నుంచి ఇంక బయల్దేరుతున్నాం... తను నన్ను దగ్గరకు తీసుకుని నుదుటిమీద ముద్దుపెడుతూ, "అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి..." అని మా ఫోన్ నంబర్స్ తీసుకున్నారు.
"తప్పకుండా మేడం..." అని, 'Bye' చెప్పేసి ఆవిడ blessings ని మరోసారి తీసుకుని హాస్టల్స్ కి బయల్దేరాం...
ముందురోజు night నే మా టీం మేట్స్ తో డిన్నర్ ఎంజాయ్* చేసాం కాబట్టీ, మళ్ళీ వాళ్ళతో టైం స్పెండ్ చెయ్యడానికి అవ్వకపోయినా పెద్దగా బాధ అనిపించలేదు మాకు. మా హాస్టల్స్ నుంచి లగేజ్ అంతా తీసుకుని అక్షయ కేంటీన్ దగ్గరకి వచ్చేసరికి అజయ్ తన కార్ తో పాటు అక్కడ వెయిట్ చేస్తున్నాడు.
"నేను డ్రాప్ చేస్తా మిమ్మల్ని..." అన్నాడు తను.
"Send-off ఇవ్వడానికి వచ్చావా..?" అని అడిగాను నేను.
"హా.." అన్నాడు తను.
వన్ లాస్ట్ టైం ఇక్కడి ఫిల్టర్ కాఫీ తాగాలని అనిపించింది... కానీ, ఆల్రెడీ అజయ్ వెయిట్ చేస్తున్నాడు కాబట్టీ ఏం మాట్లాడలేదింక.
లగేజ్ అంతా కార్ లో పెట్టేసి స్టార్ట్ అవ్వబోయాం... ఇంతలో, "ఆర్యన్..." అన్న పిలుపు వినబడింది. చూస్తే మా ఇద్దరు తమిళ్ టీం మెంబర్స్ వస్తున్నారు.
"ఆర్యన్... నువ్వు చెప్పినట్టే ఫిల్టర్ కాఫీ 'n' సైకిల్ రెడీ," అని ఒకరు సైకిల్ కీస్ and ఇంకొకరు ఫిల్టర్ కాఫీ ఆర్యన్ చేతిలో పెట్టారు.
"ఏం జరుగుతోంది?" అని confused గా మొహంపెట్టి అడిగాను నేను.
వాళ్ళు స్మైల్ ఇచ్చి, "ఆర్యన్ చెప్తాడులే..." అనేసి అజయ్ తో పాటు కార్ ఎక్కి మా లగేజ్ తీస్కొని వెళ్ళిపోయారు.
"Come soon... we will be waiting at the main gate," అని అజయ్ కార్ లో నుంచి అరుస్తూ వెళ్ళిపోయాడు.
Like Reply
#23
ఆర్యన్... మన లగేజ్? అసలేం జరుగుతోంది?" అని అడిగాను నేను.
"ఇదిగో నీ ఫిల్టర్ కాఫీ, వన్ లాస్ట్ టైం ఎంజాయ్* చెయ్. మళ్ళీ ఇక్కడికి రాగలమో లేదో..!" అన్నాడు తను.
"ఒహ్హో... ఇది మనం రైల్వే స్టేషనులో కూడ కొనుక్కునేవాళ్ళం కదా..!" అంటూ తీసుకున్నాను నేను.
"రైల్వే స్టేషన్ మైలాపూర్ లో లేదు కదా మరి," అన్నాడు తను చిన్నగా నవ్వుతూ...
"ఇది మైలాపూర్ ఫిల్టర్ కాఫీనా...?" అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాను నేను.
"హా... నీకోసమే మైలాపూర్ నుంచి తెప్పించాను. పాపం సెల్వమణి! నేనడిగానని అంత దూరం వెళ్ళి మరీ తెచ్చాడు," అన్నాడు.
నేను చాల హ్యాపీగా ఫీలయ్యా... తనకి నేను మైలాపూర్ వెళ్ళి కాఫీ తాగాలి అని ఒకసారి చెప్పింది ఇంత బాగా గుర్తుపెట్టుకున్నాడని...
కాఫీ తాగేసి... "హ్మ్... ఇంక వెళ్దాం," అన్నాను.
"పద," అంటూ సైకిల్ ఎక్కాడు తను.
"సైకిల్ మీదా..?" అడిగాను నేను.
"IIT - Chennai, pollution free campus... ఇక్కడ సైకిల్స్ రెంట్ కి ఇస్తారు. నాకు నీతోపాటు సైకిల్ మీద వెళ్ళాలని ఉంది, రావా ప్లీజ్..." అన్నాడు బతిమాలుతున్నట్టు ఫేస్ పెట్టి.
"ఇది కూడ సెల్వమణే తెచ్చాడా పాపం..!" అని అడుగుతూ సైకిల్ ముందర రాడ్ మీద కూర్చున్నాను నేను.
"ఊహు.. అన్నీ తనకే చెప్తే బాగోదు కదా... అందుకే కృష్ణన్ కి చెప్పాను," అన్నాడు తను నవ్వుతూ. నేను కూడా నవ్వేసా...
"ప్రతి ఫ్రెండూ అవసరమేరా...!" అని హమ్ చేసాను.... తను కూడా నాతో హమ్మింగ్ లో జాయిన్ అయ్యాడు.
ఇద్దరం కొంతసేపయ్యాక మెయిన్ గేట్ రీచ్ అయ్యాం. తమిళ్ తంబీలకి థాంక్స్ చెప్పాను... అక్కడ్నుంచి మమ్మల్ని రైల్వే స్టేషన్ కి అజయ్ డ్రాప్ చేసాడు. ఫైనల్లీ, మా వూరు వెళ్ళే ట్రెయిన్ కోసం వెయిట్ చేస్తున్నాం... announcement విన్నాం... మరికొద్దిసేపట్లో మేమున్న ప్లాట్ఫారంకి వస్తుంది అని...
ఇది నిజంగా చాల sweetest experience నా లైఫ్ లో...'ఒక్క నిముషం కూడా ఉండలేను వీడితో' అనుకున్న వ్యక్తితో జీవితాంతం కలిసుండాలి అనేంతగా నా ఆలోచనల్ని మార్చేసిన ఈ రెండునెలలు చాల హాయిగా గడిచిపోయాయి...
మా ట్రెయిన్ వచ్చింది, మేం వెళ్ళి సెటిలయ్యాం...
అజయ్ మా ట్రెయిన్ కదిలే వరకు ఉన్నాడు...
మేం తనకి బాయ్ చెప్పాము... వచ్చేటప్పటి జర్నీలా కాదు, ఈసారి మేము క్లోజ్ అయ్యాం కాబట్టి బోల్డన్ని మాటలు మాట్లాడుకున్నాం...
క్యాంపస్ లో తీసుకున్న ఫొటోస్ అన్నీ చూస్కుని అక్కడి మెమొరీస్ అన్నిటిని తల్చుకుంటున్నామ్మేము...
"రెండు నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నాను, అప్పా నాకోసం రైల్వే స్టేషన్ కి వస్తారు, త్వరగా వెళ్ళిపోతే బాగుండును..!!!" అని అన్నాను నేను.
"మనం ఊరు వెళ్ళాక, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తా... అమ్మకి పరిచయం చేయడనికి," అన్నాడు తను.
"నువ్వు కూడ మా ఇంటికి రావాలి... అమ్మా, అప్పా, నా కిట్టు ఇంకా నా రూం అన్నీ చూద్దువుగానీ.." అన్నాను నేను.
"కిట్టు అంటే?" అన్నాడు తను.
"కిట్టు, మా కుక్క... చాల క్యూట్ గా ఉంటుంది. ఉండు చూపిస్తా..." అని ఫోన్ లో ఉన్న కిట్టూ ఫొటోని చూపించాను.
"చాలా చిన్నది... నిజంగానే క్యూట్ గా ఉంది.." అన్నాడు తను.
"హా... దానికి 4 months అంతే... నేను గొడవచేసి మరీ కొనిపించుకున్నాను... అసలు ముందు అయితే అమ్మ ఒప్పుకోలేదు... కానీ, అప్పా నా మాట కాదనరు కదా... సో, తీసుకున్నాం. ఇప్పుడైతే మా ఇద్దరికన్నా అమ్మనే దాన్ని ఎక్కువ ముద్దుచేస్తోంది.." అన్నాను నేను.
నేను చెప్పిందంతా విని తను నవ్వాడు. ఇంకొన్ని కబుర్లు, పాటలు, కవితలతో రాత్రయిపోయింది. ఇద్దరం ఎవరి బెర్తుల మీద వాళ్ళం నిద్రపోయాం...
తెల్లవారేసరికి, ఆర్యన్ ఫిల్టర్ కాఫీతో నాకు good morning చెప్తూ నిద్రలేపాడు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగాను; తనకి share ఇద్దామని అనుకున్నాను గానీ, తను 'నో' అంటాడని తెల్సు కాబట్టి ఇంక ఆఫర్ చెయ్యలేదు. జస్ట్ Thanks చెప్పాను, అంతే...
కొంచెంసేపయ్యాక మా destination వచ్చింది.. ఇద్దరం దిగాం.
అప్పా already వచ్చి నాకోసం ప్లాట్*ఫాంమీద వెయిట్ చేస్తున్నారు. ఆర్యన్ చెయ్యి పట్టుకుని ట్రెయిన్ దిగాను నేను.
అప్పాని చూడగానే, తనని, లగేజ్ ని వదిలేసి అప్పా దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాను...
"అప్పా... I am back!" అంటూ వెళ్ళి గట్టిగా పట్టేస్కున్నాను... వెళ్ళేప్పుడు ఎన్ని కన్నీళ్ళు వచ్చాయో గుర్తులేదుగానీ, అప్పా దగ్గరికి తిరిగొచ్చేసాను అనే ఆనందంతో చాలనే కన్నీళ్ళు వచ్చాయి.
ఆనందభాష్పాలు అంటారే, అవన్నమాట... అప్పాని చూసి ఆయనతో మాట్లాడుతూ ఆర్యన్ కూడ నాతో వచ్చాడనే విషయమే మర్చిపోయాను.
"ఆర్యన్ ఏడి?" అని అప్పా అడిగేదాకా గుర్తురాలేదు నాకు.
"వచ్చాడు... నా లగేజ్ తో సహా తనని వదిలేసి మిమ్మల్ని చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చేశాను," అని జవాబిచ్చాను నేను.
"పిచ్చి పిల్లా... పద," అని నా తల నిమురుతూ అన్నారు ఆయన. ఇద్దరం వెనక్కి వెళ్ళాం.
ఆర్యన్, పాపం...ఇద్దరి లగేజ్ మోసుకుంటూ నడిచి వస్తున్నాడు.
"సారీ బాబు... నేను తీసుకుంటాను, ఇలా యివ్వు," అని అప్పా నా trolly హాండిల్ తీసుకున్నారు.
"పర్లేదు అంకుల్... శిశిరకి మీరుంటే ఇంకెవరూ గుర్తురారు," అని నవ్వుతూ అన్నాడు. మాటైతే నవ్వుతూ అన్నాడు కానీ, నాకు మాత్రం తను నన్ను దెప్పినట్టు అనిపించింది... నేను నవ్వాను అంతే..
"పద తల్లీ.. అమ్మ నీకోసం ఎదురుచూస్తుంది ఇంటి దగ్గర," అన్నారు అప్పా...
"హ్మ్..." అన్నాను నేను.
"నువ్వు రేపు మాయింటికి లంచ్ కి రా బాబు," అని ఆర్యన్ని invite చేసారు ఆయన.
'వస్తాను' అన్నట్టుగా ఆర్యన్ నవ్వుతూ తల ఊపాడు... తర్వాత నేను అప్పా మా ఇంటికి, తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం.
Like Reply
#24
ఆర్యన్ తన ఇంటికి, నేను మా ఇంటికి వెళ్ళిపోయాం...
రెండు నెలల తర్వాత ఇంటికి వచ్చాను కాబట్టి అమ్మ చాల గారం చేసింది. నేను ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే, "చాలా చిక్కిపోయావే, అసలేం తినలేదా ఈ రెండు నెలలు..." అంది.
"అబ్బా... అదేం లేదు స్వీటీ... బానే ఉన్నాను నేను. కానీ, నీ చేతి వంటని మాత్రం బా... మిస్ అయ్యాను తెలుసా..." అని మా అమ్మని గట్టిగా పట్టుకుని చెప్పాను.
"అలా అనకే బాబు... నువ్వు వెళ్ళినప్పటినుంచి సరిగ్గా ఏం వండట్లేదు మీ స్వీటీ..." అని అన్నారు అప్పా.
"అవునా.. ఇప్పుడు నేను వచ్చేసానుగా.. ఇంక బావుంటుందిలే... కదా స్వీటీ!" అన్నాను నేను, మా అమ్మ వొళ్ళో తలపెట్టి మంచం మీద వాలుతూ...
తర్వాత, మా అమ్మ ఆయిల్ మసాజ్ చేసింది. జుత్తు సన్నబడిపోయిందని, అస్సలు కేర్ తీసుకోడం లేదని ఎప్పట్లాగే స్తోత్రం చదివింది. నేను కూడ ఎప్పుడు లాగె ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసాను.
తర్వాత మా అమ్మచేతి రుచికరమైన వంటలన్నీ తిన్నాను. జర్నీ చేసొచ్చాను కాబట్టీ మధ్యాహ్నం నిద్రపోయాను...
సాయంత్రం అప్పా ఆఫీస్ నుంచి వచ్చాక లేచాను... మళ్ళీ బోలెడు కబుర్లు చెప్పుకున్నాం.. తర్వాత కిట్టూతో ఆడుకున్నాను.
అలా.. రోజంతా హాయిగా గడిచిపోయింది. రాత్రి భోజనం టైం అయ్యింది. ముగ్గురం కూర్చుని చపాతీలు తింటున్నాం...
"ఆర్యన్ ఏ టైంకి వస్తాడో కనుక్కున్నావా..?" అడిగారు అప్పా.
"వచ్చినప్పటినుంచీ అస్సలు ఫోన్నే తియ్యలేదు, బేగ్*లోనే ఉండిపోయిందేమో..!" అన్నాను నేను.
"తను నీకు కాల్ చేస్తున్నాడు కదా, మరి అలా ఎలా చేసావ్?" అడిగారు ఆయన.
"I am sorry... కానీ, నాకు అస్సలు ఆ ధ్యాసే లేదు. కావాలని చేసింది కాదు," అన్నాను నేను తలదించుకుంటూ.
"తినేసాకయినా తనకి కాల్ చెయ్," అన్నారు. దానికి, "సరే," అని జవాబిచ్చాను.
అమ్మ ఆర్యన్ గురించి ఒక్క మాట కూడా అడగలేదు. కానీ, అప్పా తనకి అన్నీ చెప్పారని మాత్రం చెప్పింది. తనకి ఇష్టమో లేదో ఏం చెప్పలేదు... 'వన్స్ ఆర్యన్ ఇంటికి లంచ్ కి వస్తే అప్పుడు పరిచయం అయ్యాక అడుగుదాంలే...' అని నేను కూడా ఏం అడగలేదు.
డిన్నర్ తర్వాత, బేగ్ లో నుంచి మొబైల్ తీసాను. చార్జింగ్ లాస్ట్ పాయింట్ లో ఉంది. వెంటనే ఛార్జింగ్ పెట్టాను.
దాన్లో 120 మిస్సడ్ కాల్స్ ఉన్నాయి. అందులో 5 !dea కాల్ సెంటర్ వి, మిగతావన్నీ ఆర్యన్ వి... ఇప్పుడు కాల్ చేస్తే భగ్గుమని మండిపడతాడు అనుకుంటూ తనకి కాల్ చేసాను.
"హలో.." అన్నాడు తను.
"సారీ..!" అన్నాను నేను.
"హ్మ్.." అన్నాడు తను.
"రేపు వస్తున్నావుగా..." అడిగాను నేను.
"హ్మ్.." అన్నాడు తను.
"ఏంటి.. హ్మ్.. హ్మ్... ఏదో ఒకటి చెప్పు.." అన్నాను నేను.
"వస్తున్నాను... ఇంకేం చెప్పాలి?" అడిగాడు తను.
"కోపమా..? సారీ చెప్పానుగా.." అన్నాను నేను.
"అరే... కోపం ఏం కాదు, నాకు తెల్సు... after 2 months మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళావ్ కాబట్టీ నీకు మ్యాగ్జిమమ్ టైం వాళ్ళతోనే spend చెయ్యాలి అని ఉంటుంది... కానీ, మధ్యలో ఒక్కసారైనా నేను గుర్తొస్తానేమో అనుకున్నాను, అంతే..." అన్నాడు తను.
"అబ్బా... సారీ.. కానీ, నిజంగా గుర్తులేదు నాకు..." అన్నాను నేను.
"Thank you.." అన్నాడు తను.
"Thanks నా..? ఏంటీ వెటకారమా..?" అడిగాను నేను.
"కాదు... నువ్వు కావాలంటే మొబైల్ చార్జ్ లేదనో, నేను కాల్ చేసా.. ఎంగేజ్ వచ్చిందనో ఏదో ఒక సాకు చెప్పచ్చు. కానీ, నిజం చెప్పావ్ గా... అందుకే, thank you చెప్పాను," అన్నాడు తను.
తను నన్ను ఎంత బాగా అర్ధం చేస్కున్నాడో కదా అనిపించింది నాకు... ఇంకొన్ని 'సారీ'లు చెప్పాను.
"శిశిరా... నాకెప్పుడూ అబద్ధం చెప్పకు, ఇలానే నిజాలు చెప్పు... బాధపెట్టేదయినా నిజమే బాగుంటుంది.. అప్పటికి బాధగా ఉన్నా అదే బాగుంటుంది. అబద్ధం చెప్పి సంతోషపెట్టకు... అప్పటికి సంతోషంగా ఉన్నా.. తర్వాత అబద్ధం అని తెలిస్తే ఆ బాధని భరించడం కష్టం," అన్నాడు తను.
"హ్మ్... సరే, నువ్వు కూడా అలానే చెయ్యి," అన్నా..
"హ్మ్..." అన్నాడు తను. తర్వాత, రేపు మార్నింగ్ 10:30 కి తను మా ఇంటికి వస్తానని చెప్పాడు.
"మీ అప్పాకి అయితే నేను ఇష్టమే కానీ, మీ అమ్మగారికి ఎలా నచ్చాలో కొంచెం టిప్స్ చెప్పు," అని అడిగాడు తను.
"మా అమ్మని ఇంప్రెస్ చేయడానికి టిప్స్ అంటే.. ఏముంటాయి, నువ్వు నీలా ఉండు అంతే, నచ్చేస్తావ్.." అని చెప్పాను.
"హ్మ్.... hope so... ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా ఎక్కువ టెన్షన్ గా ఉంది నాకు," అన్నాడు తను.
"టాపర్ కి కూడా భయం వేస్తుందా..?" అడిగాను నేను.
"నువ్వు మనింటికి వస్తావ్ గా... అప్పుడు నేను కూడా అదే అడుగుతా నిన్ను..." అన్నాడు తను.
ఇద్దరం ఒకరికొకరం 'All the Best' చెప్పుకుని కాల్ కట్ చేసాము...
ఈసారి నాకేమీ టెన్షన్ లేదు. ఆర్యన్ తప్పకుండా మా అమ్మకి నచ్చుతాడు అనేది నా గట్టి నమ్మకం. సో, హ్యాపీగా పడుకున్నాను.
[size=undefined]
తెల్లవారింది, నేను లేటుగా లేచాను. అప్పటికే అప్పా మార్నింగ్ వాక్ నుంచి వచ్చేసారు.
"గుడ్ మార్నింగ్ అప్పా.." అంటూ వెళ్ళి విష్ చేసి ఆయన పక్కన కూర్చుని పేపర్ చదువుతున్నా... ఇంతలో మా స్వీటీ వచ్చి, "వెళ్ళి రెడీ అవ్వవే, ఈరోజు ఆర్యన్ వస్తాడన్నావుగా.." అంది మా అమ్మ.
"హ్మ్.. వెళ్తాలే..!" అని లేజీగా లేచి రెడీ అయ్యాను.
'వినాయకా...!!! అంతా Pleasantగా సవ్యంగా జరిగిపోవాలి. ఆర్యన్ ఇంట్లో అందరికీ నచ్చేయాలి.మిగతావన్నీ మీకు తెలుసుగా.. నాకు ఏది మంచిదో, ఏది చెడో.
. సో, అన్నీ అలా చేసేయ్యండి' అని pray చేసుకున్నాను.
అప్పా ఈరోజు ఆఫ్ తీసుకున్నాడు. నేను కిట్టూతో ఆడుకున్నాను. మాటిమాటికీ టైం చూస్తుంటే మా స్వీటీ, "వస్తాడులే... నువ్వెళ్ళి ఈ బట్టలు మేడ మీద ఆరేసి రా ఈలోపు," అని అంది.
"నేనేమీ తనకోసం చూడట్లేదు... వెళ్ళి ఆరేసి వస్తాలే," అని బకెట్ తీస్కొని మేడపైకి వెళ్ళాను. నా పని అయ్యి కిందకొచ్చానోలేదో ఆర్యన్ వచ్చాడు. నేను తనని చూసి 'గుడ్ లక్' చెప్పి లోపలికి తీసుకొచ్చాను.
"అమ్మా... అప్పా... ఆర్యన్ వచ్చాడు," అని పిలిచాను. అమ్మ వచ్చింది.
"నమస్తే ఆంటీ," అని విష్ చేసాడు తను. "అప్పా ఫోన్ మాట్లాడుతున్నారు, కొంచెంసేపట్లో వస్తారు, కూర్చోమను తనను," అని నాతో చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది మా స్వీటీ... నేను తనని హాల్లో కూర్చోమని చెప్పి నా కిట్టూని తీసుకొచ్చాను.
"Very pretty.." అని దాంతో ఆడుకోడం స్టార్ట్ చేసాడు తను.
"నేను ఇప్పుడే వస్తాను," అని స్వీటీ దగ్గరకి వెళ్ళాను.
"ఇదిగో... వాటర్ and ఫ్రూట్స్, వెళ్ళి ఇవ్వు తనకి," అంది మా అమ్మ ట్రే నా చేతిలో పెడ్తూ...
"స్వీటీ, మాట్లాడవా నువ్వేమీ? ఒక్కసారొచ్చి తనని పలకరించొచ్చుగా.." అన్నాను నేను.
" మీ నాన్న వస్తారుగా.. ఆయన, నువ్వు మాట్లాడుకోండి, నా ఇష్టంతో పనేముంది మీకు," అంది మా స్వీటీ.
"అదేంటి స్వీటీ... అలా అంటావ్! నీకు నచ్చకుండా నేనేపనైనా చేస్తానా... చెప్పు," అన్నాను నేను.
"అందుకేగా... నీ లైఫ్* డెసిషన్ గురించి ఒక్కమాటైనా నాతో అనలేదు," అంది.
నాకేం మాట్లాడాలో అర్ధంకాలేదు, మౌనంగా అలా తల దించుకొని నించున్నాను.
"వెళ్ళు, నాకు పనుంది... ఆ అబ్బాయి ఒక్కడే కూర్చున్నాడు హాల్లో.." అంది తను.
నేను ట్రే తీస్కుని వెళ్ళిపోయాను. ఆర్యన్ కి సెర్వ్ చేసాను. తను వాటర్ తాగాడు... తర్వాత మా అప్పా వచ్చారు. తను అప్పా మాట్లాడుకుంటున్నారు... నేను మాత్రం వాళ్ళ డిస్కషన్ లో పాల్గోలేదు. నా ఆలోచనలన్నీ మా అమ్మ మాటల చుట్టూనే తిరుగుతున్నాయి ఇంకా...
అలా టైం గడిచిపోయింది.
"లంచ్ వడ్డించాను, భోజనానికి రండి," అని అమ్మ వచ్చి అందరికీ చెప్పింది.
ఆర్యన్ అప్పాకి అయితే నచ్చేసాడు... వాళ్ళిద్దరూ చాల కంఫర్టెబుల్ గా మాట్లాడుకుంటున్నారు. స్వీటీ నా పక్కన కూర్చుంది. అందరం కల్సి లంచ్ స్టార్ట్ చేసాం. స్వీటీ వంటని ఆర్యన్ మెచ్చుకున్నాడు. కానీ, స్వీటీ మాత్రం ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. లంచ్ చేయడం పూర్తయ్యింది... మళ్ళీ అందరం హాల్లో కూర్చున్నాం. ఈసారి స్వీటీ కూడా మాతోపాటు కూర్చుంది.
ఏవో మాటల్లో, "శిశిర చాల మొండి బాబు," అన్నారు మా అప్పా.
"తెలుసు అంకుల్," అని నవ్వుతూ అన్నాడు ఆర్యన్.
"తెలిసి కూడా ఎందుకు ఇష్టపడుతున్నావ్ మరి?" అడిగింది స్వీటీ సడన్*గా...
"శిశిర గురించి నాకన్నా మీకు ఎక్కువ తెల్సు ఆంటీ, మీరు ఎందుకు తనని ఇష్టపడుతున్నారో, నేను కూడా అందుకే ఇష్టపడుతున్నాను," అన్నాడు తను.
స్వీటీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు అడిగింది, తను అమ్మ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ మొహమాటపడకుండా సమాధానం చెప్పాడు. కొంచెం సేపయ్యాక,
"నేనిక బయలుదేరతాను అంకుల్," అంటూ ఆర్యన్ లేచాడు.
"సరే బాబు," అన్నారు అప్పా.
"వెళ్ళొస్తాను ఆంటీ," అని స్వీటీకి చెప్పాడు.
స్వీటీ, "ఒక్క నిముషం," అని లోపలికి వెళ్ళింది. నేను ఏం జరగబోతుందో అని చూస్తున్నాను.
"ఇది తీస్కో..." అంటూ మా అమ్మ లోపల్నుంచి Haldiram's రసగుల్లా డబ్బా తీసుకొచ్చి ఆర్యన్ చేతికి అందించింది.
"అరే.. వద్దు ఆంటీ.." అన్నాడు తను.
"తీస్కో బాబు, నువ్వు మాకు నచ్చావు. అందుకే, స్వీట్ ఇస్తోంది మీ ఆంటీ," అన్నారు మా అప్పా.
స్వీటీ కూడా నవ్వుతూ, "తీస్కో బాబు," అంది.
ఇంక నా ఆనందానికి అవధుల్లేవు... స్వీటీని వెళ్ళి గట్టిగా పట్టేస్కున్నాను.
"హడలిపోయాను స్వీటీ... నీకు నిజంగానే ఆర్యన్ నచ్చలేదేమో అనుకున్నాను," అని కన్నీళ్ళతో అన్నాను.
"మీ అప్పాకి నచ్చింది ఏదైనా నాకు నచ్చకుండా ఉంటుందేంటే.! ఇంత పెద్ద డెసిషన్ నాకు చెప్పకుండా మీ అప్పాకే చెప్పినందుకు ముందు బాధ వేసింది... కానీ, అబ్బాయిని చూసాక, మాట్లాడాక నీ సెలక్షన్ బాగుంది అనిపించింది... పోనీలే, మాకు పెద్ద పని తప్పించావ్... మేరేజ్ బ్యూరోల చూట్టూ తిరక్కుండా, వాళ్ళనీ వీళ్ళనీ సంబంధాల కోసం అడక్కుండా..." అంది అమ్మ నవ్వుతూ నా తలమీద చెయ్యివేసి...
ఆర్యన్ కూడా హ్యాపీగా స్వీట్ తీస్కోని, "రేపు శిశిరని మా ఇంటికి తీసుకెళ్ళచ్చా అంకుల్?" అని అడిగాడు. అప్పా దానికి 'సరే' అన్నారు. తర్వాత తను అందరికి నమస్తే చెప్పేసి వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే అంతా సాఫీగా జరిగిపోయింది.
ఇంటికి వెళ్ళిపోయాక ఆర్యన్ కాల్ చేసాడు.
"రేపు మా ఇంటికి వద్దువ్ గానీ, నేను 11 am కి వచ్చి నిన్ను తీస్కెళ్తా.." అన్నాడు. నేను 'సరే' అన్నాను.
"నీకేమీ టెన్షన్ లేదా?" అడిగాడు తను.
"నేను నచ్చనివాళ్ళు అసలు ఉంటారా... చెప్పు," అన్నాను నేను.
తను దానికి చాల గట్టిగా నవ్వాడు.
"మరీ అంత నవ్వాల్సిందేముంది? నిజమే కదా..." అన్నాను నేను.
"నిజంగా... నిజమే... నువ్వు నచ్చనివాళ్ళు ఎవరూ ఉండరు," అన్నాడు తను.
[/size]
Like Reply
#25
Next day వెళ్ళి వాళ్ళ మమ్మీని కలిసాను. ఆంటీ చాల ఫ్రెండ్లీ... నన్ను చాల బాగ రిసీవ్ చేసుకున్నారు. అంతేకాదు, ఆవిడ కూడ నాలాగే ఫిల్టర్ కాఫీ fan..
ఇంకాతర్వాత బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాం మేము.
నేను ఆర్యన్ రూమ్ చూసాను. చాల క్రియేటివ్ గా డెకరేట్ చేసుంది... తను రాసిన కవితలన్నీ చదివాను, తను గీసిన బొమ్మలు కూడ చూసాను. ఆంటీని అడిగి తన చిన్నప్పటి విశేషాలూ తెలుసుకున్నాను.
ఆంటీ మోర్ దేన్ హ్యాపీ నన్ను చూసి... "వస్తూవుండమ్మా..." అని చెప్పారు. నేను ఆవిడకి నమస్తే చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను.
మనం ఇష్టపడే వ్యక్తిని మన వాళ్ళు accept చెయ్యడం, వాళ్ళ ఇంట్లోవాళ్ళకి మనం నచ్చడం చాల సంతోషాన్నిస్తాయి...
మేము ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లో ఉన్నాము...

Two days off తర్వాత మా కాలేజీకి మేము తిరిగి వెళ్ళిపోయాం... కానీ, ఇంతకుముందులా కాదు, ఇప్పుడు మేం ఒకరికొకరం సపోర్టుగా ఉన్నాం. డౌట్స్, డిస్కషన్స్, గ్రూప్ స్టడీ... అన్నింటిలో చాల హెల్దీ కాంపిటీషన్ ఉండేది మా ఇద్దరి మధ్యలో... అలా, హ్యాపీగా మా బీ. టెక్ కంప్లీట్ చేసాం. ఇద్దరికీ మంచి రెప్యూటెడ్ MNCలో placements కూడ వచ్చాయి...

ఆరోజు మా కాల్ లెటర్స్ వచ్చాయి.. నేను సూపర్ హ్యాపీ... ఇద్దరికీ మా ఊరిలోనే జాబ్, అన్నిటికీ మించి అప్పా, అమ్మ నా దగ్గరే ఉంటారు; నేను వాళ్ళని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఈ హ్యాపీనెస్ ని మా రెండు ఫ్యామిలీస్ వాళ్ళం సెలబ్రేట్ చేసుకోడానికి అందరం మా ఇంట్లోనే కలిసాం... హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్నాం... అమ్మా ఇంకా ఆంటీ లంచ్ ప్రిపరేషన్స్ లో పడ్డారు... ఆర్యన్ అప్పాతో తన ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు... నేను కాసేపు వాళ్ళతో మరికాసేపు వీళ్ళతో గడిపాను... తర్వాత అందరం లంచ్ చేయటానికి రెడీ అవుతున్నాం...
ఇంతలో, మా కాలింగ్ బెల్ మోగింది.
"ఆర్యన్... ఎవరో వెళ్ళి చూడవా..!" అని చెప్పాను నేను.
తను డోర్ తీయడానికి వెళ్ళాడు... మా స్వీటీ నా తలమీద ఓ మొట్టికాయ వేసి, "తనకి పనులు చెప్తావేంటే..!" అంది.
"అబ్బా.. స్వీటీ! ఏం కాదు, ఆర్యన్ కి ఓ గిఫ్ట్ ఇస్తున్నా... ప్లీజ్... సైలెంట్!" అని సిగ్నల్ ఇస్తూ అన్నా...
ఆర్యన్ డోర్ ఓపెన్ చేసాడు...
"డాడీ.....!" అంటూ అలా చూస్తూ ఉండిపోయాడు తను.
నేను వెళ్ళి ఆర్యన్ పక్కన నిలబడి, "రండి అంకుల్... లోపలికి రండి..." అన్నా...
ఆయన ఆశ్చర్యంగా మా వంక చూస్తూ లోపలికి వచ్చారు.
"నేనూ ఆర్యన్ క్లాస్ మేట్స్, అంకుల్," అని అతనికి క్లారిఫై చేసాను.
ఆయన ఒక నవ్వు నవ్వి, "కంగ్రాచ్యులేషన్స్ అమ్మా..." అంటూ ఫ్లవర్ బొకే నా చేతికి ఇచ్చారు.
"నాకేనా అంకుల్.... తను కూడా సెలెక్ట్ అయ్యాడు," అన్నాను.
అంకుల్ ఆర్యన్ వైపు తిరిగి, "కంగ్రాచ్యులేషన్స్..." అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి ఇచ్చారు...
ఆర్యన్ ఇంకా ఏం జరుగుతుందో అర్ధంకాక షాక్ లో ఉన్నాడు... వాళ్ళ నాన్నని చూసిన ఆనందంలో తనకి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి...
అప్పుడే ఆంటీ కూడా వంటింట్లో నించి వచ్చారు. అంకుల్ ని చూసి షాకై అలా చూస్తూ ఉన్నారు...
అంకుల్ కూడా ఆర్యన్ వైపు ఇంకా ఆంటీ వైపు అలా చూస్తూ ఉన్నారు, ఏమీ మాట్లాడకుండా...
అతని చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టా... స్వీటీ అంకుల్ కోసం వాటర్ పట్టుకొచ్చింది... నేను అప్పా, అమ్మ మధ్యన చేరి, వాళ్ళ భుజాలమీద చేతులు వేసి, "అంకుల్... మా అమ్మా, నాన్నా.." అని చెప్పాను.
అమ్మ అతనికి వాటర్ ఇచ్చింది... అంకుల్ దాన్ని తాగకుండా అలా మా అందరి వైపు చూస్తున్నారు...
నేను అతని దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాళ్ళపై కూచుని, "Sorry, అంకుల్... మనఫ్యామిలీ అంతా కలుసుకోవాలనే ఇలా చేసా.. అంతే తప్ప ఇంకే ఉద్దేశ్యం నాకు లేదు," అన్నా...
ఆయన నా తలపై చెయ్యివేసి నిమిరి నించున్నారు... ఆర్యన్ దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకున్నారు.
"కంగ్రాట్యులేషన్స్... my dear son..." అన్నారు.
ఆర్యన్ కూడా ఆయన్ని గట్టిగా పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చేసాడు. తర్వాత, అంకుల్ ఆర్యన్ని ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరి చేతులని పట్టుకుని, "నన్ను క్షమించండి, ఇకపై మనం అందరం కలిసే ఉందాం... ఓకేనా..!" అన్నారు.
ఆంటీ కూడా ఏడుస్తూ అంకుల్ ని పట్టేస్కున్నారు... అప్పా, అమ్మా ఆశ్చర్యంగా జరిగేదంతా చూస్తున్నారు.
ఆంటీ నన్ను దగ్గరికి తీసుకుని ఆర్యన్ పక్కన నించోబెట్టి, "వీళ్ళిద్దరినీ ఆశీర్వదించండి... ఒకర్నొకరు ఇష్టపడుతున్నారు..." అని చెప్పింది.
నేనూ, ఆర్యన్ అంకుల్ కాళ్ళపై పడ్డాం.. అంకుల్ తన చేతిని మా తలపై ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంచారు... తర్వాత మమ్మల్ని లేపి, ఆర్యన్ వైపు చూస్తూ, "ఆర్యన్... ఇప్పటి వరకూ నువ్వు సాధించింది ఒకెత్తు... కానీ, శిశిరలాంటి మంచి పిల్లని మన ఫ్యామిలీ లోకి తీసుకొస్తున్నావ్... I am proud of you, my son..." అంటూ ఆర్యన్ని దగ్గరికి తీసుకుని తన నుదుటిమీద ముద్దుపెట్టుకున్నారు.
"మీకు అసలు శిశిర ఎలా తెలుసండీ!" అని మా స్వీటీ అంకుల్ ని అడిగింది.
అందుకు అంకుల్ సమాధానం చెప్పబోతుండగా, "తర్వాత అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం.. ముందు పదండి, ఆకలేస్తుంది నాకు," అన్నా...
అందరం కలసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసాం...
వాళ్ళు బయల్దేరేముందు ఆంటీ నా రూమ్ కి వచ్చి నన్ను గట్టిగా హత్తుకుని, "ఇన్నాళ్ళ మా బాధనీ ఒక్కరోజులో తీర్చేసావమ్మా..." అని మెచ్చుకుని నా నుదుటిపై ముద్దుపెట్టి వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి అప్పా, స్వీటీ నా దగ్గరికి వచ్చారు. "ఇంకా నువ్వు చిన్నపిల్లవే అనుకున్నా.. పెద్దదానివి అయిపోయావురా..!" అన్నారు అప్పా.
"నీలో ఇంత మెట్యూరిటీ ఉందని ఇప్పుడే తెలిసింది," అంది స్వీటీ.
ఆర్యన్ని హ్యాపీగా ఉంచుదామని నేను చేసిన పని ఇంతమందిని హ్యాపీగా ఉంచుతుందని అస్సలు అనుకోలేదు నేను!!
నేనలా ఆలోచిస్తుండగా నా మొబైల్ మోగింది... ఆర్యన్ ఫోన్ చేస్తున్నాడు
Like Reply
#26
ఫోన్ లిఫ్ట్ చేయగానే, "నిన్ను కలవాలి.." అన్నాడు.
"ఎక్కడికి రావాలి..?" అన్నా.
తను, "మా ఇంటికి రా.." అన్నాడు.
నేను రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళా... అంకుల్, ఆంటీ నన్ను బాగా రిసీవ్ చేస్కున్నారు. వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పాక ఆర్యన్ వచ్చి నన్ను తన రూమ్*కి పట్టుకెళ్ళాడు... రూమ్లోకి అడుగుపెట్టగానే తను నన్ను గట్టిగా పట్టుకుని, "నా లైఫ్ లో జరుగుతుందో లేదో అనుకున్న విషయాన్ని ఇంత త్వరగా ఎలా చేయగలిగావు..?" అని కళ్ళలో నీళ్ళతో అడిగాడు.
"సారీ ఆర్యన్... ఈ విషయాన్ని నీ దగ్గర దాచాను," అని ముందుగా తనకి సారీ చెప్పి, "అయినా... నీకేనా సర్ప్రైజులు ఇవ్వడం తెలుసు, నాకు తెలుసు..." అని నవ్వుతూ అన్నాను.
"అసలు... ఇదంతా... ఎప్పుడు... ఎలా... జరిగింది?" అని తను అడిగాడు.
"అసలిదంతా మా వినాయకుని చలవ... ఆయన మహిమ వల్లనే అంకుల్ ని కలుసుకోగలిగాను... తర్వాత మిమ్మల్ని అందరినీ కలపగలిగాను..."
"అసలు ఏం జరిగింది?" అన్నాడు తను మళ్ళీ...
"రెండు నెలల క్రితం మనిద్దరినీ internship కోసం సెలక్ట్ చేసారు కదా... అది చెప్పిన రోజు నేను చాల కోపంతో ఉన్నాను... అప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదుగా... సారీ!" అన్నాను నేను.
"హ్మ్... చెప్పు," అన్నాడు తను.
"ఆరోజు కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ వినాయకుడి గుడి ముందు ఆగి, 'ఏంటి ఇలా చేసావు, స్వామీ!' అని మనసులో అనుకున్నా... అప్పుడే రోడ్ సైడ్ ఒక యాక్సిడెంట్ అయ్యింది... దగ్గరికి వెళ్తూ ఆంబ్యులెన్స్ కి ఫోన్ చేసా... అక్కడ రక్తంతో తడిసి ఉన్న ఒకతన్ని పట్టుకుని లేపి హాస్పిటల్ కి తీస్కెళ్ళి అడ్మిట్ చేసాను. అప్పాకి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పా... అవసరమైతే బ్లడ్ కూడా డొనేట్ చేసాను... కాసేపట్లో అప్పా వచ్చారు, దేవుడి దయవల్ల ఆయన 'ఔట్ ఆఫ్ డేంజర్' అని డాక్టర్ చెప్పారు. అప్పా కూడా 'I am proud of you రా... తల్లీ!' అని నా నుదుటిమీద ముద్దుపెట్టుకున్నారు.
మళ్ళీ మన ఇంటర్వ్యూకి అని నేను డ్రెసెస్ తీసుకుందామని షాపింగ్ కి వెళ్ళానా... ఆ రోజు నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆయన ఉన్నారు అక్కడ... తనే వచ్చి నన్ను పలకరించారు.. ఆరోజు తనకి హెల్ప్ చేసినందుకు thanks చెప్పారు... నేనూ casual గా అతని హెల్త్ డిటెయిల్స్* అడిగా... అలాగే నా ఇంటర్వ్యూ సంగతి కూడా చెప్పాను అతనికి.
తర్వాత ఆయన నన్ను తన ఇంటికి పిలిచారు... నేను 'తర్వాత వస్తాను' అన్నా నన్ను తన ఇంటికి పట్కెళ్ళారు...
అక్కడికి వెళ్ళాక నువ్వు ఆంటీ ఉన్న pics చూసాక అర్ధమయ్యింది, అతను మీ ఫాదర్ అని...
అయినా, ఏమీ తెలీనట్టు, 'ఈ ఫొటోలో ఉంది ఎవరు అంకుల్?' అని... 'my wife and my son' అని చెప్పారు... అలా చెప్తున్నప్పుడు ఆయన గొంతులో గర్వం తొణికిసలాడింది.
'వాళ్ళు ఎక్కడ అంకుల్... బయటకు వెళ్ళారా?' అని అడిగాను నేను. 'లేదమ్మా.. నేను.... వాళ్ళకి దూరంగా ఉంటున్నా...' అని ఆయన చెప్పారు. 'ఎందుకు అంకుల్... వాళ్ళకి మీరంటే ఇష్టం లేదా..?' అన్నాను నేను..
'నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం' అన్నారు ఆయన.
'మరి... మీకు వాళ్ళంటే ఇష్టం లేదా?' అని, 'అయినా... ఇష్టం లేకపోతే వాళ్ళ ఫొటోస్ ఉంచుకోరుగా...!' అన్నాను నేను.
ఆయన నావైపు చూస్తూ, 'ఇష్టమా...! ప్రాణం అమ్మా... వాళ్ళు నాకు. కానీ, అంతా నా ఖర్మ... నేను చేసిన తప్పుల వల్లే నాకీ గతి పట్టింది...' అని, 'చిన్నప్పుడు వాడు గొప్పవాడు కావాలని ఎన్నో కలలు కనేవాడ్ని... వాడు కూడా అలానే ఉండేవాడు. కానీ, వాడిమీద అతి ప్రేమతో.. అతి జాగ్రత్తతో... ఉండే నాతో ఎవరైనా వాడి గురించి చెడుగా చెప్తే తట్టుకోలేకపోయేవాడ్ని.. వాడు ఎక్కడ చెడిపోతాడో అనే భయంతో వాడిని కొట్టేసేవాడ్ని... తర్వాత అవన్నీ అబద్ధాలు అని తెల్సినా.. నేను వాడితో తప్పుగా ప్రవర్తించాననే గిల్టీతో వాడిని దగ్గరికి తీసుకోలేకపోయేవాడ్ని... అదే మా ఇద్దరి మధ్యా దూరం పెంచేసింది. వాడు ఫస్ట్ వచ్చాడని మెచ్చుకుంటే దానివల్ల వాడికి గర్వం పెరిగి ఎక్కడ చదువుమీద ఏకాగ్రతని కోల్పోతాడేమో అని మెచ్చుకొనేవాడ్ని కాదు... కానీ, మనసులోనే ఎంతో మురిసిపోయేవాడ్ని...
వాడికి కావల్సినవి అన్నీ అందించాలని ఎంతో తాపత్రయపడుతూ ఉండేవాడ్ని... అందుకే, హై శాలరీ జాబ్స్ కోసం వెదుకుతూ ఆ ప్రయత్నంలో వాళ్ళకు దూరముగా ఉండేవాడ్ని... నా వైఫ్ కి నేనంటే ఎంతో ఇష్టమమ్మా.. అయినా, నేను వాడి మంచి కోసం వాడ్ని హాస్టల్లో జాయిన్ చేసి తనని నాతో ఉండమని అడిగినప్పుడు తను కూడా వాడి కోసం నాకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. తనతో గొడవపడి కోపంతో అక్కడికి వెళ్ళడం మానేసాను. అదే మమ్మల్ని ఇలా దూరం చేసేసిందమ్మా...' అన్నారు అతను.
'అదేంటి అంకుల్ అలా అంటారు... మీరు చేసిందంతా తన మంచి కోసమే కదా...' అని, ' ఇప్పటికైనా వెళ్ళి వాళ్ళతో ఉండొచ్చుగా...!' అన్నా..
'గతంలో నేను వాళ్ళతో ఎంత కఠినంగా ఉన్నానో తల్చుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తోంది... ఇప్పుడు వాళ్ళ దగ్గరకి వెళ్ళటానికి నాకు మొహం చెల్లట్లేదు. అందుకే, ఇలా ఫొటోస్ తో కాలక్షేపం చేస్తూ వాటిలోనే వాళ్ళని చూస్కుంటున్నా...' అన్నారు.
అక్కడ్నుంచి వచ్చేసిన తర్వాత, 'మిమ్మల్ని ఎలా కలపాలి?' అని అనుకున్నా... మామూలుగా అంకుల్ తో 'వెళ్ళి ఓసారి వాళ్ళని కలవండి...' అంటే అతను వెళ్ళి కలుస్తారో లేక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంక ఎక్కడికైనా వెళ్ళిపోతారో అని భయమేసింది. అందుకే, మిమ్మల్ని సడన్*గా కలిపేద్దామని అనుకుని ఇంటర్వ్యూలో సెలక్ట్ అయినందుకు అన్నట్టుగా కావాలనే పార్టీ ఎరేంజ్ చేసి మా ఇంట్లో అందరం కలుసుకునేలా ప్లాన్ చేసా..." అన్నా..
"నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావ్.." అంటూ ఆర్యన్ ఇంకా ఆ షాక్ లోనే ఏదేదో మాట్లాడేస్తూ ఏడుస్తున్నాడు..
నేను తన ముఖాన్ని నా దగ్గరికి తీసుకుని తన పెదాలపై ఓ ముద్దుపెట్టాను. కాసేపు అలా ఉన్నాక తనతో, "నా పెదాలపై ఎప్పుడూ ఉండే చిరునవ్వుని నీ పెదాలపై సంతకం చేసా.. ఇక ఎప్పుడూ నువ్వు నవ్వుతూనే ఉండాలి.. అస్సలు ఏడ్వకూడదు.." అన్నా...
తను నవ్వాడు... నేను కూడా నవ్వుతూ తనని గట్టిగా పట్టేస్కున్నాను.
★★★
ఆర్యన్ కోరుకున్నట్టే వాళ్ళ డాడీ తనని దగ్గరికి తీస్కున్నారు... నేను ఎంతో ఇష్టపడ్డ వాళ్ళతో లైఫ్ లాంగ్ కలిసుండే అవకాశం నాకు దొరికింది.
లైఫ్ ఇంత పెర్ఫెక్ట్ గా ఉంటుందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. నిజంగా.. I am a gifted soul... ఈ క్రెడిట్ అంతా నేను మా అప్పాకి and బాబాజీకి ఇస్తాను... ప్రతీ సెకండ్ నాకు వెన్నంటే ఉండి నా లైఫ్ ని ఒక బ్యూటిఫుల్ world గా మార్చుకోడంలో వాళ్ళే కీ రోల్ ప్లే చేసారు...
నా ఫస్ట్ లవ్ ఎప్పటికి మా అప్పానే అవుతారని ఆర్యన్ కి కూడా చెప్పేసా... తను కొంచెం కూడా insecure అవ్వలేదు.. 'Aaryan is the best son and the best boyfriend..!!'
తెలుసా...?
ఆర్యన్ ఇప్పుడు నాతో లైఫ్ షేర్ చేస్కోడమే కాదు... నాతోపాటు ఫిల్టర్ కాఫీ షేర్ చేస్కోడానికి కూడా రెడీ అయ్యాడు.
"అంత కష్టపడి అలవాటు చేస్కో వద్దు..." అని నేను అంటే, "నీకు నచ్చినవి ఏవైనా అవి నాకూ నచ్చుతాయి..." అని చెప్పాడు...!!
So, altogether నా లైఫ్ సూపర్బ్!!
ఆ internship రెండు నెలలు నా లైఫ్ ని ఎంతలా మార్చేసాయో కదా అని ఈ రోజుకీ అనుకుంటాను నేను.
మనకి suitable కారు అనుకున్న వాళ్ళు కూడా మనకి ఎంత బాగా సెట్ అవుతారో తెల్సుకున్నాను.
మనకి కనిపించినట్టుగా అందరూ ఉండరనీ... లైఫ్ ఎప్పుడూ ఓపెన్ బుక్ లా ఉండదని తెలుస్కున్నాను.
నా లైఫ్ ని 'ఒక' అందమైన 'ప్రేమ కధ'గా మల్చిన నా ఫేవరేట్ దేవుడు వినాయకునికి ఎప్పుడూ thanks చెప్పుకుంటూ ఉంటాను.
So, ఫ్రెండ్స్.... ఇది.... నా లవ్ స్టోరీ. మీకు నచ్చుతుందని అనుకుంటూ...

మీ శిశిర ఆర్యన్.
[+] 4 users Like Milf rider's post
Like Reply
#27
  Heart THE END Heart
Like Reply
#28
Excellent, Super.
No words
Yours
Srinivasa Reddy
Like Reply
#29
chaala bagundhandi e katha. bonding ni baga vivarincharu. mi daggara marinni prema kathalu vunte upload cheyyagalaru...
Like Reply
#30
మీ లవ్ స్టోరీ చాలా అద్భుతంగా ఉంది కళ్ళ వెంట నీరు తెప్పించారు హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ బ్యూటిఫుల్ చాలా చాలా చాలా బాగుంది
Like Reply
#31
చాలా బాగుంది మీ కథనం.
Like Reply
#32
Wow just wow . Super andi... Inka ilantivi share cheyandi
.
thank u ? sir
Like Reply
#33
Superb story bro nice narration
Like Reply
#34
ఎంతో ఇష్టమైన కధ ఇది. మనసుకి ఎంతగానో హత్తుకున్న కధ.
ఇలాంటి కధలని మళ్ళీ మళ్ళీ చదువుతుంటే ఆ హాయే వేరు. మొదటిసారి ఈ కధ చదివినప్పుడు కలిగిన ఆనంధం మళ్ళీ ఇప్పుడు మీ వల్ల కలిగింది.
ఈ కధని మళ్ళీ ఇక్కడ పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు

అసలు ఈ కధ ఏ స్వాతి magazine లోనో , సినిమాలోనో ఉండాల్సిన కధ అని నా అభిప్రాయం. మీకు గాని , మన Xossipy లోని మెంబర్స్ కి సింధుకుమారి గారితో పరిచయం ఉంటే వారికి ఇంత మంచి కధ రాసినందుకు నా తరపున కృతజ్ఞతలు తెలుపగలరు.
వారిని మన site లోకి రమ్మని చెప్పగలరు. వారు వస్తే మనకి శృంగార కధలే కాక ఇలాంటి ప్రేమ కధలు కూడా దొరుకుతాయి మన మనసులు పులకించడానికి .
శృంగార ప్రియుడు 
సంజయ్
[+] 2 users Like Sanjay_love's post
Like Reply
#35
Super story
Like Reply
#36
yourock clps banana
Like Reply
#37
ఇంత మంచి కథ

ఇక్కడ మాకు అందించినందుకు

సర్వదా శతధా సహస్రధా

కృతజ్ఞతలు చెబుతూ...

వే వేల వందనాలు
Like Reply
#38
ఇంత మంచి కథ

ఇక్కడ మాకు అందించినందుకు

సర్వదా శతధా సహస్రధా

కృతజ్ఞతలు చెబుతూ...

వే వేల వందనాలు
Like Reply
#39
I need pdf of this story please send link
Like Reply
#40
The best story I ever read in these days. Speech less while reading this.

_Sree
Like Reply




Users browsing this thread: 2 Guest(s)